1 of 7

వృత్తపద్యాలు – లక్షణ సమన్వయం

Dr.L.Rajeev babu�Department of Telugu

VSR & NVR College�Tenali, Guntur.

2 of 7

వృత్తపద్యాలు �ఉత్పలమాల �చంపకమాల�శార్దూలం �మత్తేభం

3 of 7

ఉత్పలమాల

  • ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి. ఒక్కొక్క పాదంలో 20 అక్షరాలుంటాయి.
  • ప్రతి పాదంలో భ,ర,న,భ,భ,ర,వ అనే గణాలుంటాయి.
  • ప్రాసనియమం వుంటుంది.
  • 10 వ అక్షరం యతిస్థానం.
  • ప్రాసయతి వుండదు.

ఉదా:-

భ ర న భ భ ర వ

UII UIU I I I U I I U I I U I U IU

ఆనర నాథుడి ట్లుచని యాయుధ మొక్కటి తోడుగా బ్రతీ

(శాలివాహనవిజయము, కొఱవి గోపరాజు,36 వ పద్యం )

4 of 7

చంపకమాల

  • చంపకమాల పద్యంలో నాలుగు పాదాలుంటాయి. ఒక్కొక్క పాదంలో 21 అక్షరాలుంటాయి.
  • ప్రతి పాదంలో న,జ,భ,జ,జ,జ,ర అనే గణాలుంటాయి.
  • ప్రాసనియమమం వుంటుంది.
  • 11 వ అక్షరం యతిస్థానం.
  • ప్రాసయతి వుండదు.

ఉదా:-

న జ భ జ జ జ ర

I I I I U I U I I I U I I U I I U I U I U

అవని నిపాత్ర నీయెదు రనాడి ననిద్ద ఱలోన దీనిచే

(శాలివాహనవిజయము, కొఱవి గోపరాజు, 5వ పద్యం )

5 of 7

శార్దూలం

  • శార్దూల పద్యంలో నాలుగు పాదాలుంటాయి. ఒక్కొక్క పాదంలో 19 అక్షరాలుంటాయి.
  • ప్రతి పాదంలో మ,స,జ,స,త,త,గ అనే గణాలుంటాయి.
  • ప్రాసనియమం వుంటుంది.
  • 13 వ అక్షరం యతి స్థానం.
  • ప్రాసయతి వుండదు.

ఉదా:-

మ స జ స త త గ

U U U I I U I U I I I U UUI U U I U

శుండాలా దిబలం బులిట్ల రిగినన్ క్షోణిశ్వ రుండొక్క డుం

(శాలివాహనవిజయము, కొఱవి గోపరాజు,49 వ పద్యం )

6 of 7

మత్తేభం �

1. మత్తేభ పద్యంలో నాలుగు పాదాలుంటాయి. ప్రతిపాదంలో 20 అక్షరాలుంటాయి.

2. ప్రతిపాదంలో స,భ,ర,న,మ,య,వ, అనే గణాలుంటాయి.

3. ప్రాసనియమం వుంటుంది.

4. యతి స్థానం 14వ అక్షరం.

5. ప్రాసయతి వుండదు.

ఉదా;

స భ ర న మ య వ

I I U U I U U I U I I U U U U I U U I U

హరిమ ర్దింతుమో? బ్రహ్మబు ట్టుదుమో? యింద్రాద్య ష్టదిక్పా లురన్

(దక్షయజ్ఞం, నన్నెచోడుడు కుమారసంభవం, ద్వితీయాశ్వాసం, 54వ పద్యం. )

7 of 7

మప్పిదాలు�THANK YOU