కొత్త సభ్యులకు స్వాగతము
తెలుగు వికీపీడియా శిక్షణా కార్యక్రమం
ఏవైనా సందేహాలు లేదా సమాచారం కోసం 9014120442, (WhatsApp) లేదా
tewiki@iiit.ac.in ను సంప్రదించండి.
ఈ ప్రదర్శన క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్-షేర్‌అలైక్ 4.0 అంతర్జాతీయ లైసెన్సు క్రింద లైసెన్స్ పొందింది. దీనిని మీరు స్వేచ్ఛగా పంచుకోవచ్చు, అభివృద్ధి చేయవచ్చు
వికీపీడియా మరియు వికీమీడియా లోగోలు లాభాపేక్షలేని సంస్థ అయిన వికీమీడియా ఫౌండేషన్ ఇంక్ యొక్క కాపీరైట్ మరియు రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌లు.
వికీమీడియా లోగోలు మరియు ట్రేడ్‌మార్క్‌ల ఉపయోగం వికీమీడియా ట్రేడ్‌మార్క్ విధానం మరియు దృశ్యమాన గుర్తింపు మార్గదర్శకాలకు లోబడి ఉంటుంది మరియు దీనికి అనుమతి అవసరం కావచ్చు.
మొదటి రోజు
01. తెలుగు వికీపీడియా పరిచయం ,
02. మూల స్తంభాలు ,
03. మొబైల్ లో వికీపీడియా
Wikipedia is a multilingual, web-based, free encyclopedia based on a model of openly editable content. It is the largest and most popular general reference work on the Internet. [Wikipedia] is supported by the Wikimedia Foundation, a non-profit organization
which operates on money it receives from donors.
Wikipedia is an excellent resource for self-learning, as it is an online encyclopedia with millions of articles on various topics Type your topic into the search bar on the Wikipedia homepage. You may find a comprehensive article related to your topic, or a more general article that can lead you to more specific articles.
వికీపీడియా
వికీపీడియా, ఒక బహుభాషా, అంతర్జాల (వెబ్) - ఆధారిత,ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము
.ఇక్కడ సమాచారం గురించి తెలుసుకోవటమే కాదు, ఉన్న సమాచారం లో అవసరమైన మార్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్నికూడా చేర్చవచ్చు.
ప్రతి మనిషీ సమస్త మానవ జ్ఞానాన్ని స్వేచ్ఛగా పొందగల ప్రపంచాన్ని ఊహించుకోండి! - అదే వికీపీడియా చేస్తున్నది !!
వికీపీడియా - తమ స్వంత వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి కంటెంట్ ను జోడించడం మరియు నవీకరించడానికి సభ్యులను అనుమతించే ఒక వెబ్ సైట్
ఎన్‌సైక్లోపీడియా అనగా సర్వ విజ్ఞాన సర్వస్వం.
వికీ అనగా అనేక మంది సభ్యుల సమిష్టి కృషితో సులభంగా వెబ్ సైటు ను సృష్టించగల ఒక సాంకేతిక పరిజ్ఞానం. ఎన్‌సైక్లోపీడియా అనగా సర్వ విజ్ఞాన సర్వస్వం. వికీపీడియా అనేపదం ఈ రెండు పదాల నుంచి ఉద్భవించింది
ఏమిటి వికీపీడియా గొప్పతనం ?
వికీపీడియా ను మహోన్నతంగా తీర్చిదిద్దడానికి మీ తోడ్పాటు కావాలి!
అందరికీ అన్నీ విషయాలు తెలియక పోవచ్చు, కాని ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశం పై కొంత విషయ జ్ఞానం కలిగి ఉంటారు. అలా అందరికీ తెలిసిన విశేష జ్ఞానమును ఒక చోట చేర్చటం వలన విజ్ఞాన సర్వస్వం తయారవుతుంది. అలా కూర్పు చేయబడిన విజ్ఞానసర్వస్వం ఉచితం గా, స్వేచ్చగా అందించటమే వికిపీడియా లక్ష్యం.
వికీపీడియా 329+ భాషలలో !
వికీపీడియా ఒక ఆన్ లైన్ బహుభాషా ఎన్సైక్లోపీడియా. 2001 లో జిమ్మీ వేల్స్ అనే అమెరికనుకు వచ్చిందీ స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ఆలోచన.
ఇది ఒక వికీ-ఆధారిత ఎడిటింగ్ వ్యవస్థ ను ఉపయోగించి స్వచ్చందంగా పని చేసే సంపాదకుల ద్వారా నిర్వహించబడుతుంది వీళ్లని వికీ ఎడిటర్స్ గా వ్యవహరిస్తారు : ఎడిటర్స్ అంటే వ్యాసాలు రాసేవారు, సరిదిద్దేవారు,ఇతర వికీపీడియా సంబంధిత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు
వికీపీడియా పుట్టిన 20 సంవత్సరాలలో, 55 మిలియన్లకు పైగా ఆర్టికల్స్ తో ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి విలువైన మరియు ప్రియమైన జ్ఞాన గమ్యస్థానంగా ఎదిగింది.
List of official Wikipedias https://meta.wikimedia.org/wiki/List_of_Wikipedias
తెలుగు వికీపీడియా
వికీపీడియా వివృత సహకార విధానంలో పనిచేసే ప్రాజెక్టుల్లో అతి పెద్ద వాటిలో ఒకటిగా చరిత్రకెక్కింది. వికీపీడియాలో వందలాది భాషల్లో ఉన్న లక్షలాది వ్యాసాలను నిత్యం కోట్లాది మంది చదువుతూంటారు.2003 డిసెంబరు 10 న తెలుగు వికీపిడియా ఆవిర్భావించినది
తెలుగు వికీపీడియాలో ఇప్పటికే పలు వ్యాసాలు ఉన్నా, ముఖ్యమైన అంశాల పై వ్యాసాలు తక్కువగా వున్నాయి.
తెలుగు వికీపీడియాలో వివిధ అంశాల పై వ్యాసాలను సృష్టించడం, ప్రాధమిక (మొలక) స్థాయి వ్యాసాలను పూర్తిస్థాయి వ్యాసాలుగా మార్చేందుకు, వ్యాసాలను నిర్దుష్టంగా ఉంచడానికి ప్రస్తుత సమాచారంతో ఆధునీకరించుటం, వికీపీడియాలో లేని అంశాలను చేర్చటం, వంటి రచనా సహాయం మీ నుంచి ఆశిస్తున్నాము.
తెలుగు వికీపీడియా మొదటిపేజీ - డెస్క్టాప్
తెలుగు వికీపీడియా మొదటిపేజీ - మొబైల్
మొబైల్ వీక్షణ చదవటానికి సులువుగా ఉంటుంది , అయితే మొబైల్ లోనే సవరణలకు డెస్కుటాప్ వీక్షణకు మారాలి అంటే పేజీ అడుగున ఉన్న డెస్కుటాప్ ను ఎంచుకోవాలి
వికీపీడియా మొబైల్ ఆప్
అధికారిక వికీపీడియా అనువర్తనంతో, మీరు 329+ భాషల్లో 55+ మిలియన్ ఆర్టికల్స్ ను శోధించవచ్చు మరియు అన్వేషించవచ్చు .మీకు ఇష్టమైన వ్యాసాలను సేవ్ చేయవచ్చు ఇంకా వికీపీడియాను "నా జాబితాలు" తో ఆఫ్ లైన్ లో చదవండి.
వికీ యూజర్ ఇంటర్ ఫేజ్ పరిచయం
వికీపీడియా ఐదు మూలస్తంభాలు
వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం.
వికీపీడియా ఒక తటస్థ దృక్కోణం నుండి వ్రాయబడింది
వికీపీడియా ఒక అంశం పై పక్షవాదమును, చర్చను ప్రోత్సహించదు. బహుళ దృక్కోణాలను వివరిస్తుంది. సమాచారాన్ని ఖచ్చితంగా, సందర్భోచితంగా ఒక తటస్థ దృక్పదంతో ప్రచురిస్తుంది.
అన్ని వ్యాసాలు ధృవీకరించదగిన ఖచ్చితత్వం కోసం ప్రయత్నించాలి, నమ్మదగిన, అధికారిక వనరులను ఉటంకిస్తూ, ప్రత్యేకించి అంశం వివాదాస్పదంగా ఉన్నప్పుడు లేదా జీవించి వున్న వ్యక్తి గురించి తెలుపుతున్నపుడు సంపాదకులు తమ వ్యక్తిగత అనుభవాలు, వ్యాఖ్యానాలు లేదా అభిప్రాయాలు వికీపీడియాలో ప్రచురించకూడదు.
వికీపీడియా ఉచిత కంటెంట్ ను ఎవరైనా ఉపయోగించవచ్చు, సవరించవచ్చు మరియు పంపిణీ చేయవచ్చు
వికీపీడియా సంపాదకులు పరస్పరం గౌరవంతో, నాగరికతతో వ్యవహరించాలి
వికీపీడియాకు స్థిరమైన నియమాలు లేవు.
తరచుగా అడిగే ప్రశ్నలు
రెండవ రోజు
ముఖ్యమైన తెలుగు వికీపీడియా సోదర ప్రాజెక్టులు
వికీపీడియా అంతర్వరి అవగాహన, చర్చా పేజీలు మరియు వీక్షణ జాబితాలు
వికీపీడియాలో వ్యాసం అన్వేషణ ,వికీపీడియా విధానాలు
This set of modules helps students get started with English Wikipedia.https://dashboard.wikiedu.org/training/students
వికీమీడియా కామన్స్ః https://commons.wikimedia.org/ ఉచితంగా అందుబాటులో ఉండే చిత్రాల మరియు చలనచిత్రాల సంకలనం -- ఇక్కడ మీరు అందరితో పంచుకునే విధంగా ఎటువంటి కాపీరైటులేని క్రియేటివ్ కామన్స్ మరియు ఇతర సంబంధిత లైసెన్స్ లలో అనేక చిత్రాలు(ఫోటోలు), పుస్తకాలు,దస్త్రాలు పెట్టుకోవచ్చు.
వికిసోర్స్ : http://te.wikisource.org/ ఎవరైనా అభివృద్ధిపరచగల స్వేచ్ఛా విజ్ఞాన మూలములు మూలరూపాల సమాహారం -- మనం నిత్యం చదువుకునే ఏ స్మృతి-శృతి సంహిత అయినా, మన శతకకారులు రచించిన శతకములు, వేద-వేదాంగాలు,పురాణ-ఇతిహాసాలు ఇక్కడ వాటి మూల రూపంలో పొందుపరుచవచ్చు. మీ వద్ద ఉన్ప ఏదైనా పుస్తకం స్కాన్ కాపీ,PDF వంటీవి కూడా ఇక్కడ పంచుకోవచ్చు , OCR వంటి సౌకర్యం వలన అక్షర రూపంలో మార్చుకోవచ్చు
వికీడేటా అనేది మానవులు మరియు యంత్రాలు కూడా చదవగల మరియు సంకలనం చేయగల ఒక ఉచిత సహకార, బహుభాషా, ద్వితీయ డేటాబేస్ ఓపెన్ నాలెడ్జ్ బేస్. నిర్మాణాత్మకమైన డేటాకు కేంద్ర నిల్వగా వ్యవహరిస్తుంది ఇది వికీమీడియా కామన్స్ మీడియా ఫైళ్ళకు నిల్వ ప్రాజెక్టులాగా అన్ని వికీమీడియా ప్రాజెక్టుల కోసం జ్ఞాన భాండాగారం.
ముఖ్యమైన తెలుగు వికీపీడియా సోదర ప్రాజెక్టులు:
విక్షనరి : నిఘంటువు - http://te.wiktionary.org : విక్షనరీ ఎవరైనా పాల్గొనదగిన ఒక స్వేచ్ఛా బహు భాషా పదకోశం ఇందులో మనమంతా సంకల్పిస్తే సంవత్సరం లో మన అన్ని మాండలిక మరియు మౌఖిక పదాలను వాటి అర్థ-స్వరూప-ఉదాహరణ సహితంగా చేర్చి ఉపయోగించుకోవచ్చు .
వికికోట్ : http://te.wikiquote.org/ : వికీవ్యాఖ్య ఒక ఉచిత ఆన్లైను వ్యాఖ్యల భాండాగారము. ఇందులో అన్ని భాషల ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు, వాటి అనువాదాలు కూడా లభిస్తాయి .
వికిబూక్స్: http://te.wikibooks.org/ : ఇది స్వేచ్ఛానకలుహక్కులతో సమిష్టిగా తయారు చేయగల పుస్తకాల జాల స్థలి పుస్తకాల నెలవు, ఇక్కడ మనమే ఒక పుస్తకం రాయవచ్చు , ఇక్కడ మీ సొంత అభిప్రాయాతో ఏవిధమైన అంశం, సాహిత్యం, కధలు, కవిత్వం గురించి పుస్తకం రాయవచ్చు, ఇతరుల సహకారం కూడా తీసుకోవచ్చు
మన తెలుగు సమాచారాన్ని విజ్ఞానాన్ని భావితరాలకు అందించడానికి వికీపీడియా మంచి మార్గం. సమస్త మానవ జ్ఞానాన్ని ఒకచోట భద్రపరది అందరికి ఉచింతంగా అందుబాటులోకి తేవడం అనే ఊహతో వికీపీడియా మరియు ఇతర సోదర ప్రకరణాలు రూపొందాయి.
వికీపీడియా విధానాలు
వికీపీడియాలో రాసేది ఎవరో ప్రముఖ విద్యావంతులో, ప్రత్యేకంగా అందుకోసం నియమితులైన రచయితలో కాదు. మనలాంటి వారంతా అక్కడ రాస్తున్నారు. వికీపీడియాలో ఎవరైనా రాయవచ్చు,
ఏ విషయం గురించైనా రాయవచ్చు. కొన్ని నిబంధనలకు, కట్టుబాట్లకు లోబడితే చాలు
మౌలిక పరిశోధనలు నిషిద్ధం: వికీపీడియాలో మౌలిక పరిశోధనా వ్యాసాలకు చోటు లేదు. తేలికగా చెప్పాలంటే, వికీపీడియా మూల ఆలోచనలు చేర్చుటకు తగిన స్థలం కాదు. ఇతరులు విషయాన్ని గురించి విశ్వసనీయమైన మూలాలలో పేర్కొన్న వాటిని సంగ్రహం రూపంగా వికీపీడియా లో వ్రాయలి. వ్యాసాలలో కొత్తగా విశ్లేషణలు చేర్చకూడదు మరియు ఇప్పటికే ముద్రించిన వివరాలను కలపట మరియు విశ్లేషణం ఆధారంగా మూలవనరులు చెప్పేసారాంశం కంటే విస్తరిత సారాంశానికి చేరువయ్యేటట్లు రాయకూడదు.మీరు వ్రాసేది పరిశోధనా వ్యాసం కాదు అని నిర్ధారించే ఏకైక విధానం సమాచారాన్ని సూచించడానికి నమ్మకమైన వనరులను ఉపయోగించడం
రచనలో తటస్థ దృక్కోణం ప్రతిఫలించాలి. దీన్నే ఇంగ్లీషు వికీలో NPOV (Neutral Point Of View) అంటారు.తటస్థ దృక్కోణం వికీపీడియాలో వ్రాసేవన్నీ నిష్పక్షపాత దృష్టితో వ్రాయాలి. ఏపక్షం ప్రధానంగా భావించక, పక్షపాతం లేకుండా మరియు ఖచ్చితమైన విశ్వసనీయమైన మూలాలు ఆధారంగా విషయం పై అన్ని దృక్కోణాలు వివరించాలి. పిడివాదనలు లేక ఒక దృక్కోణాన్ని సమర్థించేలా వ్రాయడం వికీపీడియా వ్యాసాల్లో ఉండదు. తటస్థ దృక్కోణంతో ఉండటమే తెవికీ వ్యాసాల ప్రత్యేకత !
మరిన్నివివరాలకు: https://te.wikipedia.org/wiki/వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ_పాఠ్య_ప్రణాళిక/విధానాలు,_మార్గదర్శకాల_పేజీల_సూచిక చూడగలరు
రచనలు కాదు, రచనల "గురించి వ్రాయండి"'
వికీలో వ్యాసము ప్రసిద్ధ మైనది లేదా ముఖ్య విషయమై ఉండాలి ఇందుకోసం ప్రాముఖ్యత కలిగిన స్వతంత్ర మూలాల నుండి తీసుకొనాలి మీరు వాడే వనరుల సమాచారాన్ని వ్యాసంలో పేర్కొనాలి. అలాఅయితే ఇతరులు వాటిని తనిఖీ చేసుకోగలుగుతారు. నిజనిర్ధారణకు పేరు ప్రతిష్టలు కలిగిన అయిన మూడవ పక్షం వనరులు అనగా విద్యా విషయాల ముద్రణలు, సహపరిశోధకులచే సమీక్షింపబడిన విద్యావిషయక పత్రికలు, జాతీయ అంతర్జాతీయ పత్రికలు, ప్రాధాన్యమున్న దృక్కోణాలన్నిటిని ప్రచురించే వనరులను వాడితే మంచిది. ఎప్పుడో ఒక విషయాన్ని ప్రచురించే లేక అంచులలోవున్న వనరులను వాడవద్దు, విషయం గురించి ఉన్నత నాణ్యతగల మరియు విశ్వసనీయమైన వనరుల కోసం అన్వేషించండి.
వైరుధ్యాసక్తులు
మీరు పనిచేయుచున్న సంస్థలేక మీకు ఉపాధి కల్పించిన వారి గురించిన విషయాలపై మీకు వైరుధ్యాసక్తులున్నప్పుడు, వాటి గురించి వ్యాసాలను వ్రాయవద్దు.
వికీ సభ్యులు తమకు ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చిన సమయాల్లో, ఇష్టం వచ్చిన వ్యాసాలలో
మార్పులు చేయవచ్చు. “వెనకాడవద్దు, చొరవ చెయ్యండి” అనేది వికీపీడియా విధానాల్లో ఒకటి.
వికీపీడియా వ్యాసాల నాణ్యత
మంచి వికీ ఆర్టికల్ లో గద్యం స్పష్టంగా, సంక్షిప్తంగా చదువరులకు అర్థమయ్యేవిధంగా సరైన స్పెల్లింగ్ మరియు వ్యాకరణం దోషాలు లేకుండా , ఉదాహరణలు చిత్రములతో, విశ్వసనీయ మూలాలను కలిగి ఉంటాయి
అధిక నాణ్యత రచనలు ఈ లక్షణాలు కలిగి వుంటాయి:
• ప్రవేశికలో సులభంగా అర్థమయ్యే వ్యాస సారాంశం,
• ఒక స్పష్టమైన నిర్మాణం,
• విషయం గురించి సమతుల్యత
• తటస్థ దృక్కోణం,
• విశ్వసనీయమైన మూలాలు
ఏది వికీపీడియా కాదు
కాపీరైటు / రచనాస్వామ్యం
వికీపీడియా ఒక క్రియేటివ్ కామన్స్ అట్ట్రిబ్యూషన్ -షేర్ లైక్ లైసెన్సు మరియు GNU ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్సు క్రింద ఓపెన్ లైసెన్సింగ్ ను ఉపయోగిస్తుంది. కాపీహక్కులు గల వనరుల నుండి కొన్ని క్లుప్త వ్యాఖ్యలు తప్పించి వికీపీడియాలో చేర్చకూడదు. నేరుగా కాపీ చేయడం కానీ చాలా పోలికలున్న రీతిలో చేర్చటం, గ్రంథ చౌర్యం, కాపీ హక్కుల ఉల్లంఘన వికీపీడియా కృషిని చెడగొడతాయి, స్వచ్ఛంద సభ్యులు శుద్ధి చేయడానికి చాలా సమయం పట్టేటట్లు చేస్తాయి. వికీపీడియాలో చేర్చవలసిన సమాచారం మీ స్వంత పదాలలో వ్రాయాలి. (ప్రజోపయోగ పరిధి, స్వేచ్చగా లైసెన్స్ గల విషయాలు వికీపీడియాలో సరియైన మూలాలను పేర్కొంటూ వాడవచ్చు)
వికీపీడియాపై విషయ పరిజ్ఞానం, అట్ట్రిబ్యూషన్ ఇచ్చినంత కాలం వాటిని ఉపయోగించవచ్చు తిరిగి ఉపయోగించవచ్చు; భవిష్యత్తులో తిరిగి యూజర్ల అందరూ కూడా అదే పని చేయ ఉన్నంతకాలం దీనిని సవరించవచ్చు మరియు లాభం కోసం ఉపయోగించవచ్చు.
ప్రతి సంపాదకుల సహకారం వికీపీడియా యొక్క లైసెన్సులకు అనుకూలంగా ఉండాలి.
ఐదు నిమిషాల్లో - తెవికీ
వికీపీడియా మనందరిదీ. ఇక్కడ ఎవరైనా వ్రాయవచ్చు, ఇతరులు వ్రాసినవి సరిదిద్దవచ్చు. అలాగే మీరు వ్రాసినవి ఇతరులు సరిదిద్దుతారు. ఇక్కడ అందరూ సమానమే! సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉంటాయి
మీరూ వికీపీడియాలో చేరండి. మీ స్నేహితులనూ చేర్పించండి. భావి తరాల వారికి ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి.
వికీపీడియా:టైపింగు సహాయం
లిప్యంతరీకరణ (ఇంగ్లీషు అక్షరాల కీ బోర్డు), ప్రామాణిక ఇన్‌స్క్రిప్ట్ ,ఇన్‌స్క్రిప్ట్2,ఆపిల్,మాడ్యులర్ లేఅవుట్ లు వేరే సాఫ్టువేర్ స్థాపించనవసరము లేకుండా తెలుగు టైపు చేసే విధానము.
https://te.wikipedia.org/wiki/వికీపీడియా:టైపింగు_సహాయం
మొబైల్ ద్వారా
వికీపీడియా ను మొబైల్ ద్వారా సవరిస్తున్నపుడు Gboard ద్వారా నేరుగా తెలుగులో టైప్ చేయవచ్చు ఈ ( గూగుల్ కీబోర్డ్ ) అనేది Android మరియు iOS పరికరాల కోసం Google చే అభివృద్ధి చేయబడిన ఇన్పుట్ పద్ధతి ప్రోగ్రామ్.ఇది గ్లైడ్ ఇన్పుట్ మరియు మాట్లాడటం ద్వారా టైపు చేయటం ( వాయిస్ ఇన్పుట్ లేదా text to speech) వంటి విధులను అందిస్తుంది,
దిద్దుబాట్లు
వికీపీడియా లో పేజీలను ఎవరైనా సరిదిద్దవచ్చు ,పేజీ లోని సమాచారాన్ని సరిదిద్దవలసిన అవసరం ఉందని మీరు భావిస్తే, పేజీకి పైనున్న మార్చు అనే లింకును నొక్కి (సంరక్షించిన పేజీలు(ఆంగ్లం) తప్ప) సరిదిద్దవచ్చు. దీని కోసం ప్రత్యేకించి ఏమీ అవసరం లేదు; మీరు లాగిన్ అయి ఉండవలసిన అవసరము కూడా లేదు. ఇదెలా పని చేస్తుందో (పేజీని చెడగొట్టకుండా) చూద్దామనుకుంటే, ప్రయోగశాల లో తనివితీరా ప్రయోగాలు చెయ్యండి
వికీపీడియాకి నేనెలా తోడ్పడవచ్చు
తెలుగులో విజ్ఞాన సర్వస్వాలు చాలా అరుదు. అందునా ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా లాంటి బృహత్తర విజ్ఞాన సర్వస్వం అసలు లేనేలేదు. ప్రతీ సందేహానికి పుస్తకాలు కొని వెతకాలన్నా,కొన్ని కోట్ల పేజీలు వున్న ఇంటర్నెట్ లో సమగ్రం గా వెతకాలి అన్నా , ఎవరినైనా అడగాలన్నా చాలా సమయం పడుతుంది. ఇది ఒకోసారి సాధ్యంకాకపోవచ్చు. కాని నిమిషాల్లో వీకీపీడియా ద్వారా ఈ సమాచారం తెలుసుకోవచ్చు. అది కూడా మన మాతృభాష తెలుగులో.
మీరూ వికీపీడియాలో చేరండి. మీ స్నేహితులనూ చేర్పించండి. చరిత్ర సంస్కృతి, ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, ఆహారం, పురాణాలు, పద్యాలు, సంగీతం, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు..ఇలా ఎన్నో విషయాలపై భావితరాల వారికి ఒక ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి. వికీపీడియాలోని సమాచారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు , వ్యాపార ప్రయోజనాలకు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు
ఇంత శ్రమపడి, అష్టకష్టాలు పడి తయారుచేసేది, ఊరికినే ఎవరికిబడితే వాళ్ళకు ఇచ్చెయ్యడానికేనా?
అవును, సరిగ్గా అందుకే!! లోకంలో లభించే విజ్ఞానాన్నంతా ప్రజలందరికీ ఉచితంగా అందించాలనే సదాశయంతోనే వికీపీడియా మొదలయింది. వికీపీడియా స్థాపనకు ప్రాతిపదికే అది. అన్నట్టు అష్టకష్టాలు ఏమిటో మీకు తెలుసా? తెలియకపోతే తెలుగు వికీపీడియాలో ఆ పదాన్ని వెతుకు పెట్టెలో వ్రాసి వెతకండి. విజ్ఞానాన్ని అందరికి ఉచితంగా అందుబాటులో వుంచాలనేదే వికీపీడియా ఉద్దేశము గదా.
ఈ ప్రదర్శన క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్-షేర్‌అలైక్ 4.0 అంతర్జాతీయ లైసెన్సు క్రింద ఉన్నది. ఇది వికీపీడియా అధీకృత పాఠ్యము కాదు, ఏమైనా సూచనలు సలహాలనుసంప్రదించండి, ఇది వికీనిపరిచయం చేయటానికి మాత్రమే ఉద్దేశించినది, దీనిని మీరు స్వేచ్ఛగా పంచుకోవచ్చు, మెఱుగు పరచవచ్చు .వికీపీడియా మరియు వికీమీడియా లోగోలు లాభాపేక్షలేని సంస్థ అయిన వికీమీడియా ఫౌండేషన్ ఇంక్ యొక్క కాపీరైట్ మరియు రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌లు.
వికీమీడియా లోగోలు మరియు ట్రేడ్‌మార్క్‌ల ఉపయోగం వికీమీడియా ట్రేడ్‌మార్క్ విధానం మరియు దృశ్యమాన గుర్తింపు మార్గదర్శకాలకు లోబడి ఉంటుంది మరియు దీనికి అనుమతి అవసరం కావచ్చు.
మూడవ రోజు
07.వాడుకరి ప్రయోగశాల పరిచయం,
08. మొబైల్ లో ఎలా సవరించాలి
09. డెస్కుటాప్ విజువల్ ఎడిటర్
10.వికీ మార్కప్
• Your username – links to your personal user page
• My Preferences – allows you to customise your personal settings for using Wikipedia.
• My Watchlist - allows you to bookmark pages you wish to edit or contribute to.
• My Talk – links to a page you can receive and respond to messages from other Wiki contributors.
• My Contributions – details all the edits you have made to Wikipedia since you created your account.
• Log Out – the log out button for when you wish to leave your Wiki account (recommended to do when
వాడుకరి ప్రయోగశాల పరిచయం
మొబైల్ లో ఎలా సవరించాలి
స్మార్ట్‌ఫోన్లో వికీపీడియాను మొబైలు సైటు గానే కాకుండా, డెస్క్‌టాపు సైటును కూడా చూడవచ్చు. స్మార్ట్‌ఫోనులో వికీపీడియాను రెండు విధాలుగా చూడవచ్చు: మొబైల్ సైటు ఒకటి కాగా, వికీపీడియా యాప్ ద్వారా చూడడం రెండో విధానం.
వికీపీడియా యొక్క మొబైల్ వెర్షన్: మొబైల్ పరికరాల్లో ఎడిటింగ్
వికీపీడియా యొక్క డెస్క్‌టాప్ వెర్షన్: మొబైల్ పరికరాల్లో ఎడిటింగ్
వికీపీడియాలో వ్యాసం ఎడిటింగ్
కొత్త వ్యాసం / ఆర్టికల్ రాయటం / పేజీ సృష్టించుట
పేజీకీ, కొత్త పేజీకి తేడా ఒక్కటే - పేజీకి పేజీ చరిత్ర ఉంటుంది, కొత్తపేజీకి ఉండదు. కొత్తపేజీ ప్రారంభించడం అంటే మరేమీ కాదు, ఓ ఖాళీపేజీలో మొదటి వాక్యాలు రాయడమే! ఒక్కోసారి కొత్తపేజీ ఖాళీగా కాక, ముందే నిర్ధారించిన కొన్ని వాక్యాలు ఉండవచ్చు. మీతో సహా ఎవరైనా, వికీపీడియాలో రాయవచ్చు! కింద ఉన్న పెట్టెలో ఏదో ఒక పేరు రాసి, "వ్యాసాన్ని సృష్టించు" ను నొక్కండి. ఇక్కడ ఏమి రాస్తారో అదే ఆ పేజీ పేరు అవుతుంది. మీరు ఒక వేళ లాగిన్ కాకపోయినా వ్యాసం రాయవచ్చు కానీ మీ పేరు చరిత్రలో రికార్డు కాదు , వాటిని ఎవరైనా దిద్దుబాటు చేసినా మీకు హెచ్చరిక రాదు ,
ఉదాహరణ:
https://te.wikipedia.org/w/index.php?action=edit&preload=Template:New_page&editintro=&title=ఒక_కొత్త_పేజీ&create=వ్యాసాన్ని సృష్టించు
URL ద్వారా పేజీ ని ప్రారంభించడం: ఇప్పటికే ఉన్న పేజీ URL ను నొక్కినపుడు పేజీ ఎలా వస్తుందో, లేని పేజీ కూడా అలాగే వస్తుంది. బ్రౌజరు అడ్రసుపెట్టెలో మీరు సృష్టించదలచిన పేజీ URL ను రాయండి. ఉదాహరణకు, http://te.wikipedia.org/wiki/కొత్తపేజీపేరు. ఎంటరు నొక్కినపుడు, సదరు పేజీ దిద్దుబాటు పేజీకి వెళ్తుంది. ఇక అక్కడ మీరు రాయదలచిన విషయం రాసేసి పేజీని భద్రపరచండి. URLను సృష్టించే సులభమైన విధానం - ఒక పేజీ URL లోని చివరి భాగాన్ని మార్చి కొత్త URL తయారు చెయ్యడమే.
వెతుకుపెట్టె నుండి: మీరు సృష్టించదలచిన వ్యాసం పేరును వెతుకు పెట్టెలో రాసి, "వెళ్లు" గానీ "వెతుకు" గానీ నొక్కండి. ఆ పేరుతో వ్యాసం లేకపోతే, ఫలితాల్లో పేజీ పేరుతో ఎర్ర లింకు కనిపిస్తుంది. ఆ లింకును నొక్కితే సదరు పేజీ యొక్క దిద్దుబాటు పేజీకి వెళ్తుంది. ఇక అక్కడ మీరు రాయదలచిన విషయం రాసేసి పేజీని భద్రపరచండి. మీరు సృష్టించదలచిన పేజీ సిద్ధం!
వేరే పేజీ నుండి వికీలింకు ద్వారా: ఏదో ఒక పేజీ మార్చు లింకును నొక్కండి. దిద్దుబాటు పెట్టెలో మీరు సృష్టించదలచిన పేజీ పేరును రాసి, వికీలింకు ఇవ్వండి. సరిచూడు మీటను నొక్కండి. "పేజీ భద్రపరచు" మీటను నొక్కరాదు. దిద్దుబాటు పెట్టెకు పైన కనిపించే మునుజూపులో కొత్తపేజీ లింకు ఎర్రగా కనిపిస్తుంది. ఆ లింకును నొక్కి పేజీని సృష్టించండి
మీరు ఏదైనా మార్పు చేయబోయే ముందు ఈ తెర వస్తే Start editing ని ఎంచుకొండి.వికీపీడియా మీకు ఎడిటింగ్ కోసం రెండు ఎంపికలను ఇస్తుంది. విజువల్ ఎడిటర్ ఇతర వర్డ్ ప్రాసెసింగ్ అనువర్తనాలు వెబ్‌సైట్‌ల మాదిరిగానే వికీపీడియా పేజీలో కనిపించే విధంగా స్క్రీన్‌పై వచనాన్ని సవరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. HTML ను పోలి ఉండే అంతర్లీన వికీకోడ్‌ను చూడటానికి సోర్స్ ఎడిటింగ్ మిమ్మల్ని అనుమతిస్తుంది ..
వికీ కోడ్ (మార్కప్) తో సవరణ
వికీపీడియా వ్యాసాలను సాంప్రదాయకంగా దిద్దుబాటు చేయడానికి వాడే రూపమే వికీ కోడ్(మార్కప్) .వికీపీడియా లో మొదట ఈ మార్కప్ కోడ్ తోటే సవరణలు చేసే వారు , కాకపోతే ఇందులో కొన్ని కోడ్ లు గుర్తుపెట్టుకొనవలసిన అవసరం వల్ల ప్రాధమిక వినియోగదారులకు మరింత సౌలభ్యంగా ఉండటం కోసం విజువల్ ఎడిటర్ను తయారుచేశారు. ఇది కింది విధంగా ఉంటుంది , ఒకేవేళ్ళ మీరు విజువల్ ఎడిటర్ కు మారాలని అనుకొంటే ఎడమ వైపున ల పెన్ సింబల్ ను ఎంచుకోవటం ద్వారా మారవచ్చు వికీ మార్కప్ సోర్స్ ఎడిటర్ అంతర్లీన పేజీ సోర్స్ కోడ్‌ను చూపిస్తుంది సాదా టెక్స్ట్ ఫైల్ లాగా పనిచేస్తుంది. ఇలాంటి సాధారణ కోడ్‌ను ఉపయోగించి లింకులు ఇతర అంశాలు సూచించబడతాయి: [[భూమి]].
విజువల్ ఎడిటర్ తో సవరణలు
విజువల్ ఎడిటర్ తో మీరు సవరణలు చేయవచ్చు . కొత్తగా వికీపీడియాలో రాసేవారికి ఇదిసులువైన ఎడిటింగ్ సాధనం , ఇప్పడు ఇది అప్రమేయంగా మీకు కనిపిస్తుంది లేకపోతే https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:అభిరుచులు సైట్ కు వెళ్ళి చేతనం చేసుకోవచ్చు. విజువల్ ఎడిటర్ వర్డ్ ప్రాసెసర్ లాగా పనిచేస్తుంది అంతర్లీన సోర్స్ కోడ్ ను
దాచిపెడుతుంది. టూల్ బార్ పాప్-అప్ ఇంటర్ఫేస్లను ఉపయోగించి లింకులు ఇతర అంశాలు సవరించబడతాయి.
వికీ కోడ్ (మార్కప్) తో సవరణ
ఎడిటింగ్ / సవరణ చేసే ముందు గుర్తుంచుకోవలసిన అంశాలు
రిఫరెన్స్ , నోటబిలిటీ
విషయం గుర్తించబడకపోతే, సరిగా ప్రస్తావించబడకపోతే లేదా కాపీరైట్‌ను ఉల్లంఘిస్తే మీ వ్యాసం తిరస్కరించబడుతుంది.
కాపీరైట్
మూలాల నుండి విషయాన్ని కాపీ –పేస్ట్ చేయవద్దు , లేదా దగ్గరగా పారాఫ్రేజ్ చేయవద్దు. మీ స్వంత మాటలలో మూలం చెప్పేదాన్ని సంగ్రహించండి.
వికీపీడియా
వ్యాసం అంశం ఇప్పటికే విశ్వసనీయమైన మూలాల్లో ఉండాలి. వీటిలో అకడమిక్ జర్నల్స్, బుక్స్, న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు, ఫ్యాక్ట్ చెకింగ్ కొరకు పేరు ప్రఖ్యాతులున్న వెబ్ సైట్ లులో ఉండాలి. సోషల్ మీడియా, ప్రెస్ రిలీజ్ లు లేదా కార్పొరేట్ / ప్రొఫెషనల్ ప్రొఫైల్స్ కు అర్హత లేదు
.
Editing Basics - Visual Editor
ఎడిటింగ్ బేసిక్స్ - విజువల్ ఎడిటర్
Adding titles and subtitles, Bold, Italic, Links, Referencing, discuss (Visual Editor)
విజువల్ ఎడిటర్ (VE) అనేది వికీ కంటెంట్ కోసం ఒక ఎడిటింగ్ విధానం. ఈ విధానం లో మార్పులు నేరుగా మనకు కనిపిస్తాయి.
2016 నుండి, లాగిన్ అయినా లేదా లాగిన్ కాకపోయినా వినియోగదారులందరికీ విజువల్ ఎడిటర్ అప్రమేయంగా సక్రియం చేయబడింది. ఎంపిక పెట్టె ద్వారా వినియోగదారులందరూ విజువల్ ఎడిటర్‌ను సక్రియం చేయవచ్చు. మీరు విజువల్ ఎడిటర్ ఉపయోగిస్తున్నప్పుడు, కుడివైపుపైన ఉన్న పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా ఎడిటింగ్ విధానాన్ని మార్చుకోవచ్చు
విజువల్ ఎడిటర్ బటన్లు
పేరాగ్రాఫ్: మీ వచనం రూపలావణ్యాలు సెట్ చేయవచ్చు . ఉదాహరణకు, హెడ్డింగ్ లేదా సాదా పేరా గ్రాఫ్ టెక్ట్స్
మార్చుకోవచ్చు
A : మీ వచనం హైలైట్ చేయండి, దానిని ఫార్మెట్ చేయడం కోసం ఈ టాబ్ వాడుకోవచ్చు
లింకులు: వచనాన్ని హైలైట్ చేసి, ఈ బటన్‌ద్వారా లింక్‌గా మార్చుకోవచ్చు
ఉల్లేఖించండి : ఇది విజువల్ ఎడిటర్ లోని సైటేషన్ టూల్ , ఇది పాఠ భాగానికి మూలం తెలుపుతాయి. మూలాల వివరాలు వ్యాసం చివరలో మూలాల విభాగంలో పాదసూచికలుగా కనబడతాయి.
బుల్లెట్లు: బుల్లెట్ పాయింట్లు లేదా సంఖ్యాజాబితా జోడించడానికి దోహదం చేస్తుంది
చొప్పించు: మీడియా, ఇమేజ్ లు లేదా పట్టికలను జోడించడానికి ఈ టాబ్ అనుమతిస్తుంది.
Ω: తెలుగు లేదా ఇతర భాషా పదాలు, సైంటిఫిక్ నోటేషన్లు , ప్రత్యేక క్యారెక్టర్లను జోడించడానికి ఈ ట్యాబ్ వినియోగిస్తాము .
విజువల్ ఎడిటర్ తెరవండి
విజువల్ ఎడిటర్‌తో పేజీని సవరించడానికి, పేజీ ఎగువన ఉన్న "సవరించు" టాబ్‌పై క్లిక్ చేయండి
ప్రతి విభాగం శీర్షికలోని "సవరించు" లింక్‌ని క్లిక్ చేయడం ద్వారా మీరు విజువల్ ఎడిటర్‌ను తెరవవచ్చు.
విజువల్ ఎడిటర్‌తో సవరించేటప్పుడు టూల్ బార్ స్క్రీన్ పైభాగంలో కనిపిస్తుంది.
ఇక్కడ మనం చేసే మార్పులను అన్డు , పునరావృతం చేయండి టాబ్ వాడి పూర్వపు స్థితికి వెళ్ళవచ్చు
శీర్షిక మెను:
మీరు టెక్స్ట్ ఆకృతిని మార్చవచ్చు.
ఒక విభాగం శైలిని మార్చడానికి, కర్సర్‌ను విభాగం పైకి తరలించి, మెను నుండి తగిన శైలిని ఎంచుకోండి
(మీరు వచనాన్ని ఎంచుకోవలసిన అవసరం లేదు). శీర్షికలు - కొన్ని సార్లు ఉపశీర్షికలు వ్యాసాన్ని విభాగాలుగా విభజిస్తాయి వాటిని వాడుకొని విషయసూచిక తయారవుతుంది
విభాగం శీర్షికలు
"శీర్షిక",
"ఉప శీర్షిక 1",
"ఉప శీర్షిక 2" తో ఉపవిభాగ శీర్షికలు ఆకృతీకరించబడతాయి.
ఆకృతీకరణ:
మీరు " A " పై క్లిక్ చేస్తే , మెను తెరుచుకుంటుంది." A " పై క్లిక్ చేయడానికి ముందు ఒక బటన్‌పై ఎటువంటి వచనం ఎంచుకోకపోతే, మీ కర్సర్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నా, దిగువ నమోదు చేసిన వచనం కర్సర్ ప్రస్తుత స్థానం నుండి ఫార్మాట్ చేయబడుతుంది.బోల్డ్ బటన్ ( A) ఎంపిక టెక్స్ట్ ను బొద్దుగా చేస్తుంది.
ఇటాలిక్ బటన్ ( A ) వచనాన్ని వాలుగా చేస్తుంది.
సూపర్‌స్క్రిప్ట్ బటన్ (x I ) చుట్టుపక్కల వచనంతో పోలిస్తే ఎంచుకున్న వచనాన్ని చిన్నదిగా మరియు సూపర్‌స్క్రిప్ట్‌గా చేస్తుంది.
సబ్‌స్క్రిప్ట్ బటన్ (x I ) చుట్టుపక్కల వచనంతో పోలిస్తే చిన్నదిగా సబ్‌స్క్రిప్ట్ లా ఉంటుంది .
స్ట్రైక్‌త్రూ బటన్ ( ఎస్ ) ఎంచుకున్న వచనాన్ని కొట్టివేస్తుంది.
"కంప్యూటర్ కోడ్ బటన్" (కర్లీ బ్రాకెట్స్:) { } ఎంచుకొంటే టెక్స్ట్ ఫాంట్‌ను అనుపాతరహిత ఫాంట్‌గా మారుస్తుంది,
అండర్లైన్ బటన్ ( యు ) ఎంచుకొంటే వచనాన్ని క్రీగీత అండర్లైన్ చేస్తుంది.
భాషా బటన్ (文 A) ఎంచుకొంటే వచనం భాష (ఉదా. జపనీస్) దిశను (ఉదా. కుడి నుండి ఎడమకు) సెట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
పెద్ద గావున్నది లేదా చిన్నగా ఉన్న A ను ఎంచుకొంటే వచనం పెద్దగా లేదా చిన్నగా మారుతుంది , దాన్ని మరల వాడటం ద్వారా ఇంకా పెద్దది గా లేదా చిన్నదిగా చేయవచ్చు
విజువల్ ఎడిటర్ మీడియావికీ థీమ్ క్లియర్ ఐకాన్-తీసివెయ్యి అని పిలువబడే చివరి బటన్ ( ), లింక్‌లతో సహా ఎంచుకున్న టెక్స్ట్ ఏదైనా ఆకృతీకరణను తొలగిస్తుంది.
లింకింగ్: అనుసంధాన సాధనం .
మీరు దానిపై క్లిక్ చేస్తే సాధారణంగా టెక్స్ట్ విభాగాన్ని ఎంచుకున్న తర్వాత లింక్ డైలాగ్ తెరుచుకుంటుంది .
ఇక్కడి నుండి వికీలోపలి వ్యాసాలకు, లేదా బయట వ్వాసాలకు, ఇది గొలుసు అనుసంధాన సాధనం దీనిని వ్యాసంలో ఉన్న విషయానికి పొడిగింతగా వాడవచ్చు,
మూలాలు
మూలాలు వ్యాసంతో పాటుగా వరుసలో మూలాల గుర్తులు, ఆ పాఠ భాగానికి మూలం తెలుపుతాయి. మూలాల వివరాలు వ్యాసం చివరలో మూలాల విభాగంలో పాదసూచికలుగా కనబడతాయి
మూలాలు చేర్చటం:
టూల్‌బార్‌లోని "ఉల్లేఖించండి" బటన్ పై క్లిక్ చేయండి. ఇది ఆటోమేటిక్, మానవికంగా ( మాన్యువల్) , ఉన్నదాన్నే మళ్ళీ రీ-యూజ్ అనే మూడు ట్యాబ్‌లతో డైలాగ్ బాక్స్‌ను తెరుస్తుంది.ఆటోమేటిక్ ఫీల్డ్‌లో మీరు ఉదహరించదలిచిన పుస్తకం లేదా ఇతర మూలం గురించి సమాచారాన్ని నమోదు చేయవచ్చు సైటేషన్ టెంప్లేట్ స్వయంచాలకంగా ఉత్పత్తి అవుతుంది. మానవికంగా ట్యాబ్ నుండి ఫుట్‌నోట్‌లను జోడించడానికి రెండు మార్గాలు ఉన్నాయి: ప్రామాణిక సైటేషన్ టెంప్లేట్‌ను ఉపయోగించడం లేదా ప్రాథమిక రూపాన్ని ఉపయోగించడం.
మూలాలను ఎందుకు ఉదహరించాలి
వికీపీడియా సాధికారికతను, నిబద్ధతను మెరుగుపరచేందుకు., సమాచారపు శ్రేయస్సును మూలానికే చెందేలా చేసి, కాపీ కొట్టారన్న అపవాదు రాకుండా చేసేందుకు., మీ రచన మౌలిక పరిశోధన కాదని తెలియ జేసేందుకు. , వ్యాసంలోని విషయాలు నమ్మదగినవని ఏ పాఠకుడికైనా లేదా నిర్వాహకుడికైనా తెలియజేసేందుకు, ప్రజలకు వ్యాసంలోని విషయానికి సంబంధించిన మరింత విశ్వసనీయమైన సమాచారం తెలియజేసేందుకు, వ్యాసంలో దిద్దుబాట్లకు సంబంధించిన వివాదాలు నివారించడం కోసం లేదా ఏదైనా వివాదాలు వస్తే పరిష్కరించడం కోసం మనం మూలాలను చూపాలి
ప్రామాణిక సైట్ టెంప్లేట్‌లను ఉపయోగించడం
విజువల్ ఎడిటర్ లో “పుస్తకం" అనే ఐకాన్ పై క్లిక్ చేస్తే, ఆ సైటేషన్ టెంప్లేట్ కోసం మిమ్మల్ని టెంప్లేట్ మినీ ఎడిటర్‌లోకి తీసుకెళుతుంది. అవసరమైన సమాచార క్షేత్రాలు నక్షత్రంతో గుర్తించబడతాయి. ఇందులోని జాలస్థలి లో ఏదైనా వెబ్సైట్ URL వివరాలు ,పుస్తక వివరాలు ISBN , వికీ సోర్సు , పత్రిక వివరాలు గా ఇవ్వవచ్చు లేదా ప్రాధమిక రూపంలో అయినా ఇవ్వవచ్చు.
పేజీ ఇప్పటికే మీరు సోర్స్ చేయదలిచిన వచనానికి వర్తించే ఒక మూలం కలిగి ఉంటే, అప్పుడు మీరు ఇప్పటికే ఉన్న మూలపత్రాన్ని తిరిగి ఉపయోగించుకోవటానికి ఉన్నదాన్నే మళ్లీ ఎంచుకోవచ్చు.
చొప్పించు : వ్యాసంలో చొప్పించగలిగే అన్ని ఎంపికల జాబితా ఇక్కడ ఉంటుంది .
మీడియా : ఈ బటన్ ద్వారా చిత్రాలు మీడియా జోడించవచ్చు
మూస : ఈ బటన్ (పజిల్ భాగం) టెంప్లేట్‌లను సవరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది .
పట్టిక : పట్టిక ( టేబుల్) ను చొప్పించడానికి ఈ బటన్ మిమ్మల్ని అనుమతిస్తుంది.
వ్యాఖ్య: ఈ బటన్ ద్వారా పాఠకులకు కనిపించని వ్యాఖ్యలను చొప్పించడం సాధ్యం.
ఆశ్చర్యార్థక గుర్తు గుర్తుపై క్లిక్ చేస్తే వ్యాఖ్యను సవరించడానికి లేదా తొలగించడానికి వీలు కల్పిస్తుంది.
చిత్రలిపి బటన్ (Hieroglyph- ☥) చిత్రలిపిని చొప్పించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది .
Musical notations: ఇది సంగీత స్వర లిపిని నమోదు చేయడానికి ఉపయోగపడుతుంది
Gallery: ఈ బటన్ (కొన్ని ఫోటోలు) చిత్రాల గ్యాలరీని చొప్పించడానికి
Chemical Formula : ఈ బటన్ రసాయన సమీకరణాలు ( సూత్రాలు ) చొప్పించడానికి
Maths Formula (Σ) : ఈ బటన్ గణిత సూత్రాలను చొప్పించడానికి
MAP : ఈ బటన్ భూగోళ పటము చొప్పించడానికి వీలు కల్పిస్తాయి .
<> కోడ్ బ్లాక్ : ఈ బటన్ మిమ్మల్ని కోడ్ నమోదు చేయడానికి అనుమతిస్తుంది.
Your Signature : ఈ బటన్ మీరు ప్రాజెక్ట్‌లో ఉపయోగించే సంతకాన్ని చొప్పిస్తుంది. మీరు వ్యాసాలు వంటి పేజీ రకాన్ని (నేమ్‌స్పేస్) సవరించినట్లయితే ఈ బటన్ నిలిపివేయబడుతుంది (ఎంచుకోలేనిది), ఇక్కడ సంతకాలు చేర్చబడవు.
Graph : బటన్ రేఖాచిత్రాలను సృష్టించడానికి రేఖాచిత్ర బటన్‌ను ఉపయోగించవచ్చు.
మూలాల జాబితా : (మూడు పుస్తకాలు) బటన్ వ్యక్తిగత రికార్డుల ప్రదర్శన స్థానాన్ని పేర్కొనడానికి మిమ్మల్ని అనుమతించే డైలాగ్‌ను తెరుస్తుంది. ఇది సాధారణంగా పేజీకి ఒకసారి మాత్రమే చేయాలి.
ప్రత్యేక అక్షరాలను చొప్పించడం: చొప్పించు మెనులోని ప్రత్యేక అక్షరాల బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా వివిధ రకాల ప్రత్యేక అక్షరాలను చొప్పించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది . మీరు అవసరమైన అక్షరాలలో ఒకదానిపై క్లిక్ చేస్తే, అది వచనంలో చేర్చబడుతుంది. ఈ ప్రత్యేక అక్షరాలు కొన్ని ప్రామాణిక చిహ్నాలు, గణిత చిహ్నాలను కలిగి ఉంటాయి.
ప్రశ్నర్ధకం ( ? ) ఈ బటన్ విజువల్ ఎడిటర్ లో ఏదైనా సహాయం కోసం
ఇందులో కీబోర్డు అడ్డదారులు, keyboard shortcuts ఉంటాయి, అంతే కాక ఏదైనా సాంకేతిక ఇబ్బంది ఉంటే ఉనటీ ఉంటే వికీపీడియాకు నివేదించవచ్చు.
పేజీ ఎంపికలు: మెను ( మూడు అడ్డగీతలు ) ఈ మెనూలో ఎంపికల డైలాగ్‌ను తెరవడానికి ఒక బటన్ ఉంది
ఎంపికలు : ఈ మెను కు వెళ్ళగానే వర్గాలు, పేజీ అమరికలు , నిశిత అమరికలు , భాషలు వంటి అదనపు టాబ్ లు వస్తాయి
వర్గాలు : వర్గాలను జోడించడానికి పేజీని ఎలా క్రమబద్ధీకరించాలో సర్దుబాటు చేయడానికి ఈ టాబ్ వాడతాము
పేజీ అమరికలు: పేజీని దారిమార్పుగా మార్చడానికి మరియు దారిమార్పు ఎంపికలను సర్దుబాటు చేయడానికి, సెట్టింగులను సర్దుబాటు చేయడానికి, విషయ పట్టిక ప్రదర్శనకు సంబంధించి, ప్రతి శీర్షిక పక్కన ఉన్న సవరణ లింక్‌లను నిలిపివేయడానికి పేజీని అయోమయ పేజీగా నిర్వచించడానికి అనుమతిస్తుంది.
నిశిత అమరికలు: సెర్చ్ ఇంజన్ల ద్వారా పేజీకి సంబంధించిన సెట్టింగులను సర్దుబాటు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది, క్రొత్త విభాగాన్ని జోడించడానికి ట్యాబ్‌ను చూపిస్తుంది
భాషలు: ఆ పేజీకి లింక్ చేసే ఇతర భాషలలో పేజీల జాబితాను చూపటానికి
Templates Used ఈ పేజీలో ఉపయోగించిన ప్రతి టెంప్లేట్‌కు లింక్‌ల జాబితాను చూపుతుంది .
Syntax highlighting: బటన్ వ్యాసంలో ఏదైనా వాక్యరచనా లక్షణాన్ని చూపిస్తుంది
View as Right-to-left: ఈ బటన్ పేజీ ఎంపికల మెనులో బటన్ కుడి నుండి ఎడమకు చూడటానికి
ఉదాహరణకు : ఉర్దూ, అరబ్బిక్ వంటి భాషల ఎంపికను సహాయపడుతుంది
వెతికి, మార్చు : ఈ బటన్ మీరు వెతుకుతున్న అక్షరాలు, నిబంధనలు లేదా రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్‌ను వాటిని భర్తీ చేయాల్సిన డైలాగ్‌ను తెరిచే బటన్‌ను కనుగొని, భర్తీ చేయటానికి ఉపయోగ పడుతుంది
ఈ బటన్ మీరు ఎడిటిండ్ సాధనం మార్చుకోవటానికి ఉపయోగ పడుతుంది
[[ ]] Source Editng ఎడిటింగ్ బటన్ మెను తెరిచిన తరువాత దీని ద్వారా సవరణలు చేయటానికి , ఎడిటింగ్ మోడ్ మారడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇదే బటన్ ఎంపిక చేయటంద్వారా తిరిగి Visual Editing కు మారవచ్చు.
మార్పులను ప్రచురించండి
మీరు సవరించడం పూర్తయిన తర్వాత, టూల్‌బార్‌లోని నీలి రంగు మార్పులను ప్రచురించు బటన్‌ను క్లిక్ చేయండి. మీరు ఏ మార్పులు చేయకపోతే, బటన్ నిష్క్రియం చేయబడుతుంది (అందువల్ల బూడిద రంగులో ప్రదర్శించబడుతుంది). మీ అన్ని సవరణలను విస్మరించడానికి, బ్రౌజర్ విండోను మూసివేయండి లేదా టూల్‌బార్ పైన ఉన్న "చదవండి" టాబ్ క్లిక్ చేయండి.
మీరు "మార్పులను ప్రచురించు" అనే నీలి బటన్‌ను నొక్కితే, డైలాగ్ విండో తెరుచుకుంటుంది. ఇక్కడ మీరు మీ మార్పుల సంక్షిప్త సారాంశాన్ని నమోదు చేయవచ్చు,మీరు "Review your changes" నొక్కితే మీ సంస్కరణకు పాత సంస్కరణకు మధ్య వ్యత్యాసాన్ని చూడవచ్చు. మీరు చిన్న మార్పునే నమోదు చేసినట్లు అయితే “ ఇది ఒక చిన్నసవరణ ను ఎంపికచేయండి
“ ఈ పుట మీద కన్నేసి ఉంచు” ను ఎంపిక చేసుకోవటం ద్వారా
ఈ పేజీలో ఎలాంటి మార్పు జరిగినా మీకు నోటిఫికేషన్ వస్తుంది
తరువాత “ మార్పులను ప్రచురించు” ను క్లిక్ చేయటం ద్వారా ప్రచురించ వచ్చు.
మూస
మూసను ఆంగ్లంలో template అంటారు సమాచారాన్ని ప్రామాణికంగా ప్రదర్శించడానికి , వ్యాస సమస్యలను వీక్షకులను హెచ్చరిక సూచన ద్వారా తెలుపుటకు వాడతారు.
ఏదైనా ఒక సమాచారం అనేక పేజీలకి కావలసి ఉంటే , సదరు సమాచారాన్ని ప్రతి పేజీలో రాయకుండా చేసే ఏర్పాటును మూస అంటారు .
ఉదాహరణకు మనం ఏదైనా వ్యాసం అసంపూర్తిగా ఉంటే దీనిని ఎవరైనా విస్తరించాటానికి మన వ్యాసంలో “ మొలక” అన్న మూస పెడితే వ్యాసము పై భాగంలో ఇలా కనబడుతుంది.
వర్గాలు
ఒకే లక్షణాలు కలిగిన పేజీలను ఒక సమూహంగా చేర్చటానికి వర్గాల మూసను వాడతారు. వ్యాసంలో వర్గాలు చేర్చటానికి
మెను ( మూడు అడ్డగీతలు ) దగ్గర వర్గాలు అన్నబటన్ ఎంచుకొండి
ఒక పేజీల్లో ఎన్ని వర్గాలు అయినా చేర్చవచ్చు అయితే ఒకే వ్యాసం చాలా వర్గాలకు సంబంధించి ఉండవచ్చు. వ్యాసంలోని వర్గాల సంఖ్య పరిమితంగా ఉండాలి. వ్యాసం ఒక వర్గంలోను, దాని ఉపవర్గంలోను రెండింటిలోను ఉండరాదు
వీటి వలన సంబంధిత పేజీల శోధన సులువు అవుతుంది
ఇవి పేజీలో అన్నిటి కన్నా చివర ఉంటాయి
పట్టిక చేర్చటం:
పట్టికలు డేటా జాబితాల ప్రత్యేకమైన, నిర్మాణాత్మక రూపంతో తయారుచేయటానికి ఉపయోగపడతాయి.
"అదృశ్య వ్యాఖ్య" అంశం ("!" తో స్పీచ్ బెలూన్) పాఠకులకు కనిపించని వ్యాఖ్యలను చొప్పించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది; ఈ వ్యాఖ్యలను సవరణ మోడ్‌లో ఉన్నప్పుడు మాత్రమే చూడవచ్చు , తరువాత ఆశ్చర్యార్థక గుర్తు చిహ్నం ద్వారా సూచించబడుతుంది.
మామూలుగా సవరణలో
గ్యాలరీ : "Gallery" చిహ్నం (ఫోటోల సమితి) పేజీకి గ్యాలరీని చొప్పించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
చిహ్నం (Σ) ఫార్ములా ద్వారా గణిత ఫార్ములాను వ్యాసంలో ప్రవేశ పెట్టవచ్చు
పేజీకి క్రొత్త మ్యాప్‌ను జోడించడానికి, విజువల్ ఎడిటర్ సాధనం మెనులో "చొప్పించు" ఎంచుకోండి. మ్యాప్ ఎంపికను చూడటానికి "మరిన్ని" లింక్‌ను నొక్కండి. "మ్యాప్" ఎంచుకోండి. మీ కర్సర్ ఉన్నచోట మ్యాప్ జోడించబడుతుంది.
ఇప్పటికే ఉన్న మూలాలను సవరించడం
ఇప్పటికే ఉన్న సూచనను సవరించడానికి, వచనంలో కనిపించే చోట దానిపై క్లిక్ చేయండి (సాధారణంగా బ్రాకెట్ చేసిన సంఖ్యగా). ఈ సూచనను సృష్టించడానికి ఉపయోగించిన టెంప్లేట్ కోసం మీరు " టూల్టిప్" ఐకాన్ (బుక్‌మార్క్) లేదా మూలం చూస్తారు. ఈ చిహ్నంపై క్లిక్ చేస్తే మీరు సూచనను సవరించగల డైలాగ్ తెరవబడుతుంది.
చర్చ పేజీ :
వ్యాసంలోని విషయం గురించిన చర్చ జరిగే ప్రత్యేక వికీపీడియా పేజీని చర్చా పేజీ అంటారు. వ్యాసపు చర్చా పేజీని చూడటానికి చర్చ అనే లింకును (డిఫాల్టు తొడుగులో ఇది పేజీకి పై భాగంలో ఉంటుంది) నొక్కితే చాలు.
చర్చాపేజీ ముఖ్యోద్దేశం ఏమిటంటే, దానికి సంబంధించిన వ్యాసం పేజీలోని అంశాలను మెరుగు పరచడమే. ప్రశ్నలు, సవాళ్ళు, పాఠ్యాల మార్పుపై వాదాలు, వ్యాస పేజీపై వ్యాఖ్యానాలు అన్నీ ఈ పేజీలో చెయ్యవచ్చు.
.
చర్చా పేజీలో వ్యాఖ్య రాసినపుడు,
కింద ఇచ్చిన విధంగా సంతకం చెయ్యాలి
ఇలా మూడు టిల్డెలు టైపుచేస్తే మీ సభ్యనామం వస్తుంది:
: ~~~
లేదా నాలుగు టిల్డెలు టైపుచేస్తే మీ సభ్యనామం, తేదీ,
సమయం వస్తాయి:
: ~~~~
లేదా ఐదు టిల్డెలు టైపుచేస్తే తేదీ, సమయం వస్తాయి:
: ~~~~~
అనుబంధాలు , పాదసూచికలు
వ్యాసంలో ముఖ్య భాగాల తరువాత , అదనపు సమాచారంగా సంబంధిత ఇతర వ్యాసాల లింకులు (ఇవీ చూడండి) , మూలాలు వివరాలు( మూలాలు) మరింత సమాచారానికి అనే పేరుతో జాబితా చేర్చవచ్చు
ఫుట్‌నోట్ వెలుపల ఒక మూల పత్రాన్ని జోడించటం
మీరు సైటేషన్ టెంప్లేట్‌లను ఫుట్‌నోట్స్‌లో ఉంచకుండా నేరుగా వ్యాసంలో చేర్చవచ్చు, మీరు "మరింత చదవడానికి" జాబితాను సృష్టించాలనుకుంటే ఇది సహాయపడుతుంది కాకపొతే ఆ చేర్చిన మూలాలను ఉల్లేఖన (సైటేషన్ టెంప్లేట్) పీజీ అడుగున ఉన్న మూలాలు శీర్షిక కింద ఆటోమేటిక్ గా రాదు .మూలాలను ఉదహరించే ఫార్మాటు మీకు తెలియని పక్షంలో మూలాల గురించి మీకు తెలిసిన సమాచారాన్ని రాయండి. ఇతర వికీపీడియన్లు దానిని తగిన ఫార్మాటులో పెడతారు.
రిఫరెన్స్
సాధారణంగా ఆమోదయోగ్యమైన స్వతంత్ర వనరులను రిఫరెన్స్ లుగా ఉపయోగించాలి.
ప్రాథమిక వాస్తవాలను మాత్రమే ధృవీకరించడానికి స్వతంత్ర వనరులు (కంపెనీ వెబ్‌సైట్లు లేదా పత్రికా ప్రకటనలు వంటివి) ఉపయోగించబడతాయి.
మీరు వ్యాసంలో రిఫరెన్సు గా ఇవ్వటానికి వ్యక్తిగత బ్లాగులు, సోషల్ మీడియా , టాబ్లాయిడ్ జర్నలిజం సాధారణంగా ఆమోదయోగ్యం కాదు.
సాధారణ తప్పులు
చిత్తుప్రతులతో సాధారణ తప్పులు చాలా ఉంటాయి . వాటిని చూసుకోవాలి
మీ గురించి లేదా మరొకరి గురించి / మీకు దగ్గరగా ఉన్న ఏదో గురించి రాయడం వికీ విధానం కాదు
మీ గురించి మీ స్వంత వ్యాసం అయినా కుటుంబ సభ్యుడు, స్నేహితుడు, యజమాని, గురువు / వ్యాపార భాగస్వామి, లేదా మీకు దగ్గరగా ఉన్న విషయాల గురించి రాయడం వికీ నియమాలకు విరుద్ధం , ఎందుకంటే మీరు సృష్టించే వ్యాసం తటస్థంగా ఉండకపోవచ్చు.
వేరే మూలాల నుండి కాపీ-పేస్ట్ లు�
మెటీరియల్ ని వ్యాసాలలో కాపీ-పేస్టింగ్ చేయకూడదు , మీరు ఆర్టికల్ ని మీకు ఉన్న వనరుల ఆధారంగా మీ స్వంత పదాల్లో రాయాలి, అలా కాకుండా రాసిన వ్యాసాలను నిర్వాహకులు వికీపీడియా నుండి తొలగించటం చేయవచ్చు.
మీరు రాసిన ఆర్టికల్ లో మూలాలను పేర్కొనకపోవడం లేదా స్వతంత్ర విశ్వసనీయ మూలాలు లేని వ్యాసాలు సాధారణంగా రోజుల్లో తొలగించబడతాయి.
మితిమీరిన ప్రచార భాష వాడకూడదు
ఒక ఉత్పత్తిని ప్రమోట్ చేసేటప్పుడు "ప్రముఖ నిపుణుడు" "గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీ" వంటి పదాలు గొప్పగా ఉంటాయి అయితే అవి వికీపీడియాలో వాడకూడదు..
కొత్త వ్యాసాన్ని మొబైల్ లో రాయడంsearch bar లో రాయాలి అనుకున్న పేరును టైప్ చేయండి.
డెస్కుటాప్ విజువల్ ఎడిటర్
విజువల్ ఎడిటరు అనేది వికీపీడియాను సవరించే "దృశ్య" పద్ధతి.
వికీ మార్కప్ నేర్చుకోకుండానే ప్రజలు వికీలో రాసే సదుపాయాన్ని ఇది కలుగ జేస్తుంది.
ఇది డిఫాల్టుగా 76% భాషల వికీపీడియాల వినియోగదారులకు అందుబాటులో ఉంది. మిగిలిన వాటికి, విక్షనరీ, వికీసోర్స్ మినహా చాలా వికీపీడియాయేతర ప్రాజెక్టులతో పాటు, ఆప్ట్-ఇన్ బీటా లక్షణంగా అందుబాటులో ఉంది.
వికీ మార్కప్
వికీపీడియా వ్యాసాలను దిద్దుబాటు చేయడానికి తొలినుంచీ వాడే రూపం వికీ కోడ్(మార్కప్) . కొన్ని బ్రౌజర్లలో ఇదొక్కటే పనిచేస్తుంది . ఒక వ్యాసానికి వికీ మార్కప్ క్రింద చూపించబడింది. దీనిలోని కనబడే ఆప్షన్లు ఎన్ని విజువల్ ఎడిటర్‌లో కనబడతాయో చూడండి.
బొమ్మ
వికీ కామన్స్ లో కానీ, స్థానికంగా కానీ ఉన్న ఫొటో పేరుకు ఇరువైపులా రెండు స్క్వేర్ బ్రాకెట్లు పెట్టి వ్యాసంలో చేరిస్తే బొమ్మ చేరుతుంది. పైప్ చిహ్నం (|) ఉపయోగించి బొమ్మ ప్రదర్శితమయ్యే తీరుని మార్చవచ్చు. సామాన్యంగా thumb అని వాడితే బొమ్మల చిన్నరూపంలో, క్రింద ఒక వివరంతో ప్రదర్శితమవుతాయి. [[File:Example.jpg|thumb|వివరం]]
బొద్దు పాఠ్యం
పాఠ్యానికి ముందు, తరువాత మూడు సింగిల్ కొటేషన్ మార్కులు పెడితే బయటకు బొద్దుపాఠ్యం కనిపిస్తుంది. వ్యాస ప్రారంభంలో వ్యాసం పేరుకి సాధారణంగా బొద్దు పాఠ్యం వాడుతారు. '''బొద్దు పాఠ్యం'''
వాలు పాఠ్యం
పాఠ్యానికి ముందు, తరువాత రెండు సింగిల్ కొటేషన్ మార్కులను పెడితే బయటకు వాలుపాఠ్యం కనిపిస్తుంది. కొన్ని ప్రత్యేక పదాలను చూపించడానికి వాలుపాఠ్యం వాడతారు ''వాలు పాఠ్యం''
అంతర్వికీ లింకులు
ఒక పదబంధం ముందు వెనక రెండు స్క్వేర్ బ్రాకెట్లు పెడితే ఆ పేరుతో ఉన్న వ్యాసానికి లింకు ఏర్పడుతుంది. మూసే స్క్వేర్ బ్రాకెట్ ముందు పైప్ పెట్టి తరువాత పదబంధం చేరిస్తే లింక్ కనబడే పాఠ్యం మారుతుంది. [[ వ్యాసం పేరు| లింకుగా కనబడే పాఠ్యం]]
మూస
మూసలను వాడేందుకు రెండు బ్రేసులను మూస పేరుకి ముందు వెనుక వాడతారు. తిరిగి తిరిగి వాడే భాగాలు, విస్తృత ప్రయోజనాలకు మూసలు ఉపయోగం. మూసపేరు తరువాత పైప్ తో వేరు చేస్తూ పరామితులను ప్రవేశ పెట్టవచ్చు. వీటిని వాడితే మూస పనిచేసే విధానం లేక ప్రదర్శించే సమాచారాన్ని మార్చుతుంది. {{మూస పేరు|పరామితి}}
శీర్షిక
రెండు ఈక్వల్ టూ చిహ్నాల మధ్య ఉన్న పదబంధం రెండవ స్థాయి శీర్షిక అవుతుంది. మూడు ఈక్వల్ టూ చిహ్నాల మధ్య ఉంటే దానికి ఉపశీర్షిక అవుతుంది. ==రెండవ స్థాయి శీర్షిక==
మూలాలు (Citation)
<ref></ref> టాగ్ ల మధ్య మూలాలు చేరుస్తారు. అప్రమేయంగా వరుససంఖ్యతో ఇది పై సూచికలాగా కనబడుతుంది. మూలాల విభాగంలో వివరం కనబడుతుంది. <ref> మూలం</ref>
మూలాలజాబితా
మూలాల జాబితా టాగ్ లేదా సమానమైన మూస ఈ పాద సూచికలు కనపడాల్సిన చోట పెట్టాలి. సాధారణంగా వ్యాసం చివరిలో గమనికలు లేక మూలాల విభాగంలో వుంటుంది. <మూలాలజాబితా/>
వెలుపలి లింకులు
తెరిచే ఒక స్క్వేర్ బ్రాకెట్ తర్వాత యు.ఆర్.ఎల్(URL) చేర్చి తరువాత ఖాళీ అక్షరం మరియు సూచించేపాఠ్యం మరియు మూసే ఒక స్క్వేర్ బ్రాకెట్ సాధారణ హైపర్ లింకు తయారవుతుంది. సాధారణంగా వ్యాసంలో ముఖ్య భాగాలలో వాడరు. పాదసూచికలలో గాని బయటి లింకులు విభాగంలో వాడతారు. [http://www.example.com సూచించే పాఠ్యం]
వర్గాలు
వ్యాసానికి చివరగా వర్గం: తో ప్రారంభమయ్యే పదబంధం చుట్టూ రెండు స్క్వేర్ బ్రాకెట్లను చేర్చితే వ్యాసం ఆ వర్గంలోకి చేరుతుంది. ఒక విషయానికి సంబంధించిన వ్యాసాలను సమితులుగా నిర్వహించడానికి ఇవి ఉపకరిస్తాయి. [[వర్గం:వర్గం పేరు]]
తరచుగా అడిగే ప్రశ్నలు
నాలుగవ రోజు
11. ప్రయోగశాలలో నమూనా వ్యాసం రాయటం
12.మూలాలు వర్గాలు చేర్చటం , మూల్యాంకనం చేయడం
Creating your User Page
One of the first things you may wish to do is create your own user page. You can add as much or as little information as you wish - generally it is recommended that you do not include personal information, but you might consider adding some general information about yourself.
1. Click on your Wiki username link on the top right corner of your screen.
My sandbox is a feature which gives you a place to practice editing, either to build a draft for later publication in the main encyclopedia, or just to practice formatting with wiki markup syntax. If you have an account, you will see a link in the upper right corner of the screen that says "Sandbox"; this will take you to your sandbox.
వికీపీడియాలో వ్యాసం ఎడిటింగ్
వాడుకరి ప్రయోగశాల
వాడుకరి ప్రయోగశాల శాండ్‌బాక్స్ వంటి వి వికీ సింటాక్స్ మరియు విజువల్ ఎడిటర్‌తో పరీక్షించడం మరియు ప్రయోగాలు చేయడం కోసం రూపొందించబడిన పేజీలు .
వీటిలో వికీపీడియాలోని ఇతర పేజీల కంటే తక్కువ నియమాలు విధానాలతో కూడిన ప్రదేశం కావున ఇందులో వికీశైలి , వ్యాసనిర్మాణం నేర్చుకోవటానికి చాలాఅనువుగా ఉంటుంది .
https://en.wikipedia.org/wiki/Wikipedia:About_the_sandbox
ఒక కొత్త వ్యాసాన్ని రాయండి
ఇక్కడ https://te.wikipedia.org/wiki/వికీపీడియా:కొత్త_పేజీని_ఎలా_ప్రారంభించాలి
కొత్త వ్యాసం / ఆర్టికల్ రాయటం / పేజీ సృష్టించుట
పేజీకీ, కొత్త పేజీకి తేడా ఒక్కటే - పేజీకి పేజీ చరిత్ర ఉంటుంది, కొత్తపేజీకి ఉండదు. కొత్తపేజీ ప్రారంభించడం అంటే మరేమీ కాదు, ఓ ఖాళీపేజీలో మొదటి వాక్యాలు రాయడమే! ఒక్కోసారి కొత్తపేజీ ఖాళీగా కాక, ముందే నిర్ధారించిన కొన్ని వాక్యాలు ఉండవచ్చు. మీతో సహా ఎవరైనా, వికీపీడియాలో రాయవచ్చు! కింద ఉన్న పెట్టెలో ఏదో ఒక పేరు రాసి, "వ్యాసాన్ని సృష్టించు" ను నొక్కండి. ఇక్కడ ఏమి రాస్తారో అదే ఆ పేజీ పేరు అవుతుంది. మీరు ఒక వేళ లాగిన్ కాకపోయినా వ్యాసం రాయవచ్చు కానీ మీ పేరు చరిత్రలో రికార్డు కాదు , వాటిని ఎవరైనా దిద్దుబాటు చేసినా మీకు హెచ్చరిక రాదు ,
ఉదాహరణ:
https://te.wikipedia.org/w/index.php?action=edit&preload=Template:New_page&editintro=&title=ఒక_కొత్త_పేజీ&create=వ్యాసాన్ని సృష్టించు
కొత్త వ్యాసంరాసే వివిధ పద్ధతులు
వెతుకు పెట్టె నుండి
సృష్టించదలచిన వ్యాసం పేరును పేజీలో పైనున్న వెతుకు పెట్టెలో రాయండి. టైపు చేస్తూండగానే ఆ అక్షరాలతో వచ్చే పేజీల జాబితాను చూపిస్తుంది. పేరు పూర్తిగా రాసి ఎంటరు నొక్కగానే, సరిగ్గా అదే పేరుతో పేజీ ఉంటే నేరుగా ఆ పేజీకి తీసుకెళ్తుంది. లేకపోతే, వెతుకులాట ఫలితాలను చూపిస్తుంది. ఆ ఫలితాల్లో, మీరిచ్చిన పేజీ పేరు ఇలా ఎర్రలింకుతో కనిపిస్తుంది. ఆ లింకును నొక్కితే ఆ పేరుతో ఖాళీ పేజీ తెరుచుకుంటుంది. ఇక అక్కడ మీరు రాయదలచిన విషయం రాసేసి పేజీని ప్రచురించండి. మీరు సృష్టించదలచిన పేజీ సిద్ధం!
ఎర్రలింకు ద్వారా
మీరు రాయదలచిన వ్యాసానికి సంబంధించి వికీలో ఇతర వ్యాసాల్లో ఎక్కడైనా ప్రస్తావన ఉందేమో గమనించండి. ఉదాహరణకు హైదరాబాదు నగరం లోని "సాలార్‌జంగ్ మ్యూజియం" గురించి వ్యాసం రాయదలిస్తే, హైదరాబాదు పేజీలో దాని ప్రస్తావన ఉందేమో వెతకండి. ఉంటే, ఆ ప్రస్తావన ఉన్న పదానికి/పదాలకు మీరు తలపెట్టిన వ్యాసం పేరు లింకు ఇవ్వండి. "హైదరాబాదు" వ్యాసంలో "నగరంలో ప్రపంచ ప్రసిద్ది గాంచిన సాలార్‌జంగ్ మ్యూజియం ఉంది" అనే వాక్యం ఉందనుకోండి. అందులో "సాలార్‌జంగ్ మ్యూజియం" కు ఎర్రలింకు ఈసరికే ఉంటే సరే, లేకుంటే ఇచ్చి, పేజీని ప్రచురించండి. ఆ తరువాత ఆ ఎర్రలింకును నొక్కి పేజీని సృష్టించండి.
కొత్త వ్యాసంరాసే వివిధ పద్ధతులు
వేరే పేజీ నుండి వికీలింకు ద్వారాఏదో ఒక పేజీ మార్చు లింకును నొక్కండి. దిద్దుబాటు పెట్టెలో మీరు సృష్టించదలచిన పేజీ పేరును రాసి, వికీలింకు ఇవ్వండి. మునుజూపు చూడండి. "మార్పులను ప్రచురించు" మీటను నొక్కరాదు. అప్పుడు, దిద్దుబాటు పెట్టెకు పైన కనిపించే మునుజూపులో కొత్తపేజీ లింకు ఎర్రగా కనిపిస్తుంది. ఆ లింకును నొక్కి పేజీని సృష్టించండి.
వ్యాసార్హమైన అంశాలు
వికీపీడియాలో మీకు ప్రాముఖ్యత గలది అనిపించిన ఏవిషయం గురించైనా వ్రాయొచ్చు.
కొన్నిసార్లు జీవిత చరిత్రకు సంబంధించిన వ్యక్తిని (వ్యాస విషయం అన్నమాట) లేదా సంస్థ వ్యాసమైతే దాని ప్రతినిధినీ సంప్రదించడం వలన స్వతంత్ర మూలాలు లభించవచ్చు. అయితే మనం వాటి స్వతంత్రతను గమనించి, అంచనా వేయడంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాస విషయానికి సంబంధించి వికీపీడియా ప్రాజెక్టు ఏదైనా ఉందేమో చూసి అక్కడ, సహాయం కోసం అడగవచ్చు.
ఇవీ చూడండి
వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (రచయితలు)
వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (పుస్తకాలు)
వికీపీడియా:విషయ ప్రాముఖ్యత
వికీపీడియాలో ఓ విషయానికి ప్రత్యేకంగా వ్యాసం ఉండొచ్చో లేదో నిర్ణయించడానికి పనికివచ్చే పరీక్ష, విషయ ప్రాముఖ్యత. వికీపీడియాలో ఉన్న సమాచారం నిర్థారించుకోదగినదిగా ఉండాలి; విషయానికి సంబంధించి విశ్వసనీయమైన, స్వతంత్రమైన వనరులు దొరక్కపోతే, ఆ విషయానికి వ్యాసం ఉండకూడదు. వికీపీడియాలో విచక్షణారహితంగా వ్యాసాలను చేర్చకుండా ఉండటానికి ఈ మౌలిక సూత్రాన్ని వర్తింపజేస్తుంది. వ్యాసాలు, జాబితా వ్యాసాల విషయాలకు తప్పనిసరిగా విషయ ప్రాముఖ్యత ఉండాలి. కీర్తి, ప్రాముఖ్యత లేదా ప్రజాదరణ వంటివి విషయపు ప్రాముఖ్యతను పెంచుతాయేమో గానీ పూర్తిగా వాటిపై అది ఆధారపడి ఉండదు.
తెలుగు వికీపీడియాలో ఒక వ్యాసం ఉండదగినదా లేదా అన్న విషయం బేరీజు వేయడానికి
ఏదైనా విషయం ఇక్కడ చూపిన మార్గదర్శకాలకు సరిపోయినంత మాత్రాన, దానికి ప్రత్యేకంగా ఒక పేజీ ఖచ్చితంగా ఉండొచ్చని అర్థం కాదు. విషయ ప్రాముఖ్యత సముచితమైన మూలాలు ఉన్నాయా అనే దానిపై ఆధారపడి ఉంటుంది, వ్యాసంలో మూలాలను ఉల్లేఖించారా లేదా అనేదాన్ని బట్టి కాదు మరో వ్యాసంలో భాగంగా రాసేందుకో, లేదా మరేదైనా విషయంతో కలిపి ఒకే వ్యాసంగా రాసేందుకో వాడుకరులు చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు
మరింత సమాచారం: https://te.wikipedia.org/wiki/వికీపీడియా:విషయ_ప్రాముఖ్యత
URL ద్వారా పేజీ ని ప్రారంభించడం: ఇప్పటికే ఉన్న పేజీ URL ను నొక్కినపుడు పేజీ ఎలా వస్తుందో, లేని పేజీ కూడా అలాగే వస్తుంది. బ్రౌజరు అడ్రసుపెట్టెలో మీరు సృష్టించదలచిన పేజీ URL ను రాయండి. ఉదాహరణకు, http://te.wikipedia.org/wiki/కొత్తపేజీపేరు. ఎంటరు నొక్కినపుడు, సదరు పేజీ దిద్దుబాటు పేజీకి వెళ్తుంది. ఇక అక్కడ మీరు రాయదలచిన విషయం రాసేసి పేజీని భద్రపరచండి. URLను సృష్టించే సులభమైన విధానం - ఒక పేజీ URL లోని చివరి భాగాన్ని మార్చి కొత్త URL తయారు చెయ్యడమే.
వెతుకుపెట్టె నుండి: మీరు సృష్టించదలచిన వ్యాసం పేరును వెతుకు పెట్టెలో రాసి, "వెళ్లు" గానీ "వెతుకు" గానీ నొక్కండి. ఆ పేరుతో వ్యాసం లేకపోతే, ఫలితాల్లో పేజీ పేరుతో ఎర్ర లింకు కనిపిస్తుంది. ఆ లింకును నొక్కితే సదరు పేజీ యొక్క దిద్దుబాటు పేజీకి వెళ్తుంది. ఇక అక్కడ మీరు రాయదలచిన విషయం రాసేసి పేజీని భద్రపరచండి. మీరు సృష్టించదలచిన పేజీ సిద్ధం!
వేరే పేజీ నుండి వికీలింకు ద్వారా: ఏదో ఒక పేజీ మార్చు లింకును నొక్కండి. దిద్దుబాటు పెట్టెలో మీరు సృష్టించదలచిన పేజీ పేరును రాసి, వికీలింకు ఇవ్వండి. సరిచూడు మీటను నొక్కండి. "పేజీ భద్రపరచు" మీటను నొక్కరాదు. దిద్దుబాటు పెట్టెకు పైన కనిపించే మునుజూపులో కొత్తపేజీ లింకు ఎర్రగా కనిపిస్తుంది. ఆ లింకును నొక్కి పేజీని సృష్టించండి
మీరు ఏదైనా మార్పు చేయబోయే ముందు ఈ తెర వస్తే Start editing ని ఎంచుకొండి.వికీపీడియా మీకు ఎడిటింగ్ కోసం రెండు ఎంపికలను ఇస్తుంది. విజువల్ ఎడిటర్ ఇతర వర్డ్ ప్రాసెసింగ్ అనువర్తనాలు వెబ్‌సైట్‌ల మాదిరిగానే వికీపీడియా పేజీలో కనిపించే విధంగా స్క్రీన్‌పై వచనాన్ని సవరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. HTML ను పోలి ఉండే అంతర్లీన వికీకోడ్‌ను చూడటానికి సోర్స్ ఎడిటింగ్ మిమ్మల్ని అనుమతిస్తుంది ..
కొత్తగా చేరిన నాలాంటి ఔత్సాహికులు ఏమి చేయవచ్చు
ముందుగా వికీపీడియా లో మీ ఖాతా తెరవండి
https://te.wikipedia.org/
మీకుండాల్సింది తెలుగు వారందరికీ తెలుగులో విజ్ఞానం అందించాలి అన్న సంకల్పం వ్రాయాలనే ఉత్సాహమే ముఖ్యం . విషయ పరిజ్ఞానము గాని, టైప్ చేయడం రాదనే విషయాలు అతి చిన్నవి. ఉత్సాహంతో ప్రయత్నించండి. దోషాల గురించి మీకు చింత అక్కరలేదు. వాటిని అందరం సరిచేద్దాం
“వెనకాడవద్దు, చొరవ చెయ్యండి” అనేది వికీపీడియా విధానాల్లో ఒకటి.
వికీపీడియా:కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి
పేజీకీ, కొత్త పేజీకి తేడా ఒకటే - పేజీకి పేజీ చరిత్ర ఉంటుంది, కొత్తపేజీకి ఉండదు. కొత్తపేజీ ప్రారంభించడం అంటే మరేమీ కాదు, ఓ ఖాళీపేజీలో మొదటి వాక్యాలు రాయడమే
https://te.wikipedia.org/wiki/వికీపీడియా:కొత్త_పేజీని_ఎలా_ప్రారంభించాలి
వికీ వాలంటీర్లు ఏవిధంగా కంట్రిబ్యూట్ చేస్తారు
ప్రస్తుతం ఉన్న వ్యాసాలను సంకలనం చేస్తూ వ్యాసాలు వ్రాయడం
కాపీయింగ్ ఫార్మాటింగ్ మరియు ' ' వికీకరించడం '
రిఫరెన్సులు , మూలాలు వ్యాసానికి జోడించటం
క్రొత్త వినియోగదారులకు సహాయం చేయడం చిత్రాలను సృష్టించడం మరియు జోడించడం
విషయ నైపుణ్యాన్ని అందించడం
వివాదాలకు మధ్యవర్తిత్వం
వికీపీడియా గురించి ప్రచారం చేయటం
మీ పనులన్నీ వదిలేసి, అక్కడ రాయనవసరం లేదు. మీ తీరిక సమయంలోనే రాయండి. అక్కడ రాసే సభ్యులంతా అలా రాసేవాళ్ళే ఇందులో ప్రవేశించి ఎవరెవరు ఏమేమి వ్రాస్తున్నారో గమనించండి, చదవండి. అలా చూస్తే మీకు అర్థం అయిపోతుంది.
కొత్తగా చేరిన నాలాంటి ఔత్సాహికులు ఏమి చేయవచ్చు
ముందుగా వికీపీడియా సాండ్ బాక్స్ లో మీ ఖాతా తెరవండి
ఇది వికీపీడియాలో రాయబోయే ముందు
ఇందులో మొదట మీరు రాయాలి అనుకొంటున్న వ్యాసాన్ని మొదట వికీ లో ఉందో లేదో వెతకండి, ఒకవేళ ఉంటే ఉన్న వ్వాసాన్ని అప్డేట్ చేయండి, లేకపొతే కొత్త వ్యాసంసృష్టించండి.
మీకుండాల్సింది తెలుగు వారందరికీ తెలుగులో విజ్ఞానం అందించాలి అన్న సంకల్పం వ్రాయాలనే ఉత్సాహమే ముఖ్యం . విషయ పరిజ్ఞానము గాని, టైప్ చేయడం రాదనే విషయాలు అతి చిన్నవి. ఉత్సాహంతో ప్రయత్నించండి. దోషాల గురించి మీకు చింత అక్కరలేదు. వాటిని అందరం సరిచేద్దాం
“వెనకాడవద్దు, చొరవ చెయ్యండి” అనేది వికీపీడియా విధానాల్లో ఒకటి.
4 వ రోజు శిక్షణా తరగతిలో కొత్త పేజీ సృష్టింపు, మూలాలు కూర్పులో భాగంగా సృష్టించిన కొత్త పేజీలు. https://te.wikipedia.org/wiki/ప్రభల_తీర్థం_(ఆంధ్రప్రదేశ్_శకటం), https://te.wikipedia.org/wiki/కందరెడ్డి
తరచుగా అడిగే ప్రశ్నలు
తెలుగు వికీపీడియాలో ఏమేం రాస్తున్నారు, మేము ఏమి రాయవచ్చు
చరిత్ర, సంస్కృతి, ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు.. ఇలా ఎన్నో విషయాలపై రాస్తున్నారు , మీరు కూడా భావితరాల వారికి ఒక ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి.
కానీ నాకున్న భాషా పరిజ్ఞానం పరిమితం. తప్పులు దొర్లుతాయేమో!?
నిజమే, మొదట్లో తప్పులు దొర్లవచ్చు. కానీ రాసుకుంటూ పోతుంటే ఆ తప్పులన్నీ సద్దుమణిగి, మీ భాష వికసిస్తుంది. వికీపీడియా సభ్యులకిది అనుభవమే. అంతేగాక, మీ రచనలోని భాషా దోషాలను సరిదిద్దడానికి ఇతర సభ్యులు సదా సిద్ధంగా ఉంటారు. కాబట్టి దోషాల గురించి మీకు చింత అక్కరలేదు. “వెనకాడవద్దు, చొరవ చెయ్యండి” అనేది వికీపీడియా విధానాల్లో ఒకటి. చొరవ చేసి రచనలు చెయ్యండి. అనుభవజ్ఞులైన సభ్యులు మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీకు అవసరమైన సాయం చేస్తారు.
వ్యాసంలో ఎక్కడా సభ్యుల పేరు, సంతకం తగవు. ఎవరు ఏమి వ్రాశారో వ్యాసం 'చరిత్ర'లో ఆటోమాటిక్‌గా నమోదు అవుతుంది. (మీరు లాగిన్ చేసి ఉన్నట్లయితే). చర్చా పేజీలలో మాత్రం సంతకం పెట్టవలెను ఇలా(--~~~~).
గూగుల్ సెర్చిలో కనిపించేటట్లు ప్రత్యేకంగా ఏమీ చేయనక్కరలేదు , గూగుల్ ఆటోమేటిక్ గా వికీపీడియా వ్యాసాలను సంబందిత చర్చిలో చూపుతుంది.
అవును ఉపయోగించవచ్చు . దీని కోసం మీరు అన్ని వికీమీడియా ప్రాజెక్టుల ఖాతాలను ఏకీకృతం చేయాలి. మరింత సమాచారం కోసం http://meta.wikimedia.org/wiki/SUL ని సందర్శించండి
మీరు వికీపీడియా కథనాలను ఇంటర్నెట్‌లోని విశ్వసనీయ వనరులతో సులభంగా లింక్ చేయవచ్చు అలా లింక్ చేయటానికి ఆ లింక్ యజమానుల అనుమతి అవసరం లేదు.
బహుళ అర్ధాల కోసం ఉపయోగించగల శీర్షికలను బహుళ ఎంపిక పదాలు అంటారు. ఉదాహరణకు చూడండి: సరస్వతి , సరస్వతి అనే శీర్షిక హిందూ మతం ప్రధాన దేవత, ఒక నది పత్రికను సూచిస్తుంది. అటువంటి శీర్షికలను వేరు చేయడానికి, అన్ని వ్యాసాల శీర్షికలను వివరంగా వివరించాలి, అవి: సరస్వతి దేవి , సరస్వతి నది సరస్వతి పత్రిక . అయోమయ పదం పేజీలోని మూస: అయోమయ పదాన్ని ఉపయోగించండి
వ్యాసంలో మూడు కంటే ఎక్కువ విభాగాలు ఉన్నప్పుడు, సూచిక స్వయంచాలకంగా సృష్టించబడుతుంది.
వ్యాసాలకు లింక్ ను జోడించడం ఏదైనా పేజీని మరింత ఉపయోగకరంగా చేస్తుంది, మీరు వికీపీడియాలో రాస్తూవున్నప్పుడే అవసరం అయినచోట మూలాలను జోడిస్తూ వెళ్ళండి . అయితే ఇచ్చే మూలాలు విశ్వసనీయమైనవిగా ఉండాలి
మూస అనేది "పునర్వినియోగ భాగం", ఇది వివిధ వ్యాసాలలో పదేపదే ఉపయోగించబడుతుంది. ఒక పదం లేదా పదబంధాన్ని అనేక వ్యాసాలలో ఉపయోగించినప్పుడు, వికీపీడియాకు అదే మూసను ఆ వ్యాసాలన్నిటిలోనూ వ్రాయకుండా మూసను చేర్చవచ్చు
ఉదా: మూస: స్వాగతం . కొత్త సభ్యులందరికీ తెలియజేయడానికి ఇది రూపొందించబడింది. క్రొత్త సభ్యుల చర్చా పేజీలో {{స్వాగతం}}. టెంప్లేట్‌లోని పూర్తి సమాచారం టెంప్లేట్ ఉపయోగించిన పేజీ నుండి వచ్చింది.
వ్యాసం చివర ఈ పంక్తిని జోడించండి. [[వర్గం: వర్గం పేరు ]]
మీరు సృష్టించిన కథనాలను ఇతర వ్యక్తులు సులభంగా కనుగొనగలిగేలా మీరు వ్యాసాలపై సరైన వర్గాలను ఉంచడం చాలా ముఖ్యం. దీనికి ఉత్తమ మార్గం- మీ వ్యాసానికి సంబంధించిన ఇతర కథనాలను కనుగొనడం మీ వ్యాసానికి వాటి వర్గాలను కూడా ఉపయోగించడం. మీరు ఒక పండుపై వ్రాస్తుంటే, మీకు తగిన కొన్ని వర్గాలను ఇవ్వగల అదే రకమైన ఇతర పండ్లపై కథనాలను కనుగొనడానికి ఉపయోగ పడుతుంది
లేదా [[వర్గం: వర్గం పేరు ]], ఉదా: [[ వర్గం: సాహిత్యం ]]
మీరు ఎన్ని వర్గాలను అయినా జోడించవచ్చు. దీనికి గరిష్ట పరిమితి లేదు. వర్గం చేర్చే ముందు , వ్యాసం సంబంధిత వర్గంలోకి వస్తుందో లేదో నిర్ణయించుకోండి.
వికీపీడియాపై ఒక వ్యాసం రాయడానికి, మనకు తగినంత సమాచారం ఉండాలి అనేది చాలా మందిలో ఒక అపోహ. వికీపీడియాపై ఏదైనా వ్యాసం రాయడానికి లేదా సవరించడానికి మీరు ఏ రంగంలోనైనా నిపుణులు కానవసరం లేదు. వికీపీడియాపై ప్రతి వ్యాసం వందలాది మంది సహకారులు చేసిన సమిష్టి కృషి ఫలితం. రేపు మీరు చాలా తక్కువ సమాచారంతో ఒక వ్యాసాన్ని ప్రారంభించినా , ఇంకొకరు క్రొత్త సమాచారాన్ని జోడించడం ద్వారా దాన్ని పెంచుతారు, తరువాత ఇంకొకరు ఆ వ్యాసానికి స్వరూపాన్ని ఇచ్చే అవకాశం ఉంది
వ్యాసం విజ్ఞాన శైలికి అనుగుణంగా ఉందని మీరు భావిస్తే దానిని వికీపీడియాలో రాయవచ్చు
వికీపీడియా వ్యాసాలు ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినవి కావు, కానీ ఇది చాలా మంది సభ్యుల సహకార సామూహిక ఫలితం. మీరు సృష్టించిన వ్యాసంలో మరే ఇతర సభ్యుడు తప్పు సమాచారాన్ని నమోదు చేస్తే, మీరు దాన్ని తీసివేయవచ్చు లేదా నిర్వాహకుల సహాయంతో ఆ అనవసరమైన కంటెంట్‌ను తొలగించవచ్చు. ఒక సభ్యుడు దానిని వ్యాసం చర్చా పేజీలో చేర్చిన వాస్తవాన్ని మీరు చర్చించవచ్చు, ఇతర నిర్వాహకులు , సభ్యులు కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు , మెజారిటీ ఆధారంగా, వాస్తవం నిజమని అనిపిస్తే వ్యాసంలో మాత్రమే ఉంచబడుతుంది.
మీరు ఆంగ్లంలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి మీ స్థానిక భాషలో ఇవ్వవచ్చు, ఇది ఆంగ్ల భాష తెలియని లేదా వారి మాతృభాషలో వ్యాసం చదవడానికి ఇష్టపడే చాలా మందికి సహాయపడుతుంది. ఇంగ్లీషులో ప్రావీణ్యం లేని, మాతృభాషలో ప్రావీణ్యం లేని భారతీయులు చాలా మంది ఉన్నారు. ఆంగ్లంలో ప్రావీణ్యం లేకపోవడం లేదా వారి మాతృభాషలో జ్ఞానాన్ని పంచుకోవడం లో భాష అడ్డంకి కాకూడదు .
మీరు నమోదు చేసిన సమాచారం లేదా మీరు సృష్టించిన వ్యాసం నాలెడ్జ్ బేస్ శైలికి అనుగుణంగా ఉంటే అది ఖచ్చితంగా సురక్షితంగా ఉంటుంది. ఏదైనా ఇతర సభ్యుడు ఈ సమాచారాన్ని లేదా మీ కథనాన్ని తొలగిస్తే లేదా పాడుచేస్తే, మీరు దానిని మునుపటి దశకు తీసుకురావచ్చు, లేకపోతే వికీ నిర్వాహకుల లేదా క్రియాశీల సభ్యులు సహాయం తీసుకోవచ్చు
నిష్పాక్షికమైన ధృవీకరించబడిన సమాచారాన్ని అందించటం వికీపీడియా లక్ష్యం , వ్యక్తిగత అభిప్రాయాలు పక్షపాతం వివాదాలకు దారితీస్తాయి. మీరు వికీపీడియా వ్యాసంలో సమాచారం ఇస్తారు, మీ అభిప్రాయం కాదు. ఉదాహరణకు, ఒక చిత్రంలో ఎన్ని పాటలు ఉన్నాయో మీరు వ్రాయవచ్చు. కానీ ఏ పాటలు మంచివి, ఏ పాటలు తగనివి అనే వ్యక్తిగత ఆలోచనలు రాయకండి. మీకు ఇష్టమైన కొన్ని పాటల్లో మీకు నచ్చని పాటలు కావచ్చు. అదేవిధంగా, వ్యక్తిత్వ వ్యాసంలో మీరు వారి రచనలు ఏమిటో వ్రాయవచ్చు, కాని ఆ రచనలపై మీ అభిప్రాయాన్ని ఇవ్వరాదు
రచన మొత్తం వచనాన్ని ఉటంకించడం కాపీరైట్ చట్టం పరిధిలోకి వస్తుంది. అందువల్ల వ్యాసానికి అవసరమైన విధంగా 4-5 పంక్తులను కోట్ చేయడం చట్టబద్ధం. గరిష్టంగా ఎన్ని పంక్తులను కోట్ చేయవచ్చనే దానిపై మార్గదర్శకం ఉంది
ఇంత శ్రమపడి, అష్టకష్టాలు పడి తయారుచేసేది, ఊరికినే ఎవరికిబడితే వాళ్ళకు ఇచ్చెయ్యడానికేనా?
అవును, సరిగ్గా అందుకే!! లోకంలో లభించే విజ్ఞానాన్నంతా ప్రజలందరికీ ఉచితంగా అందించాలనే సదాశయంతోనే వికీపీడియా మొదలయింది. వికీపీడియా స్థాపనకు ప్రాతిపదికే అది. అన్నట్టు అష్టకష్టాలు ఏమిటో మీకు తెలుసా? తెలియకపోతే తెలుగు వికీపీడియాలో ఆ పదాన్ని వెతుకు పెట్టెలో వ్రాసి వెతకండి. విజ్ఞానాన్ని అందరికి ఉచితంగా అందుబాటులో వుంచాలనేదే వికీపీడియా ఉద్దేశము గదా.
ఈ ప్రదర్శన క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్-షేర్‌అలైక్ 4.0 అంతర్జాతీయ లైసెన్సు క్రింద ఉన్నది. ఇది వికీపీడియా అధీకృత పాఠ్యము కాదు, ఏమైనా సూచనలు సలహాలనుసంప్రదించండి, ఇది వికీనిపరిచయం చేయటానికి మాత్రమే ఉద్దేశించినది, దీనిని మీరు స్వేచ్ఛగా పంచుకోవచ్చు, మెఱుగు పరచవచ్చు .వికీపీడియా మరియు వికీమీడియా లోగోలు లాభాపేక్షలేని సంస్థ అయిన వికీమీడియా ఫౌండేషన్ ఇంక్ యొక్క కాపీరైట్ మరియు రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌లు.
వికీమీడియా లోగోలు మరియు ట్రేడ్‌మార్క్‌ల ఉపయోగం వికీమీడియా ట్రేడ్‌మార్క్ విధానం మరియు దృశ్యమాన గుర్తింపు మార్గదర్శకాలకు లోబడి ఉంటుంది మరియు దీనికి అనుమతి అవసరం కావచ్చు.
ఐదవ రోజు
13.వ్యాసాన్ని మెరుగుపరచటం సమాచార పెట్టె
14.తెలుగు డిజిటల్ వనరులు
An infobox is a digital or physical table used to collect and present a subset of information about its subject, such as a document. It is a structured document containing a set of attribute–value pairs, and in Wikipedia represents a summary of information about the subject of an article.
Infobox templates contain important facts and statistics of a type which are common to related articles
వ్యాసాన్ని మెరుగుపరచటం
ఆరు మంచి వ్యాసం ప్రమాణాలు
1.చక్కగా రాసినదై ఉండాలి
2.మౌలిక పరిశోధన లేకుండా నిర్ధారించదగి ఉండాలి
3.విస్తృత పరిధి కలిగి ఉండాలి:
4.తటస్థం: నిష్పాక్షికంగా ఉంటూ, వివిధ దృక్కోణాలకు తగు విలువను ఇస్తూ చూపించాలి..
5.స్థిరత్వం: దిద్దుబాటు యుద్ధాల వలన గాని, పాఠ్య సంబంధ వివాదాల వలన గానీ వ్యాసంలో అనునిత్యం మార్పుచేర్పులు జరుగుతూ ఉండరాదు
6.సచిత్రం: వీలైనంతవరకు బొమ్మలు, వీడియో (en), ఆడియో (en) వంటివి వాడాలి.
వ్యాసాన్ని మెరుగుపరచటం
ఒక వ్యాసం నిర్మించాక దానిని మంచి వ్యాసంగా పరిగణించేందుకు అవసరమైన దిద్దుబాట్లు చేయడం ఉత్తమం.
ఉదాహరణకి:
వ్యాస పరిమాణం పెంచటం , మూలాలు చేర్చటం, లంకెలు చేర్చటం, వ్యాసంలో భాషని సవరించటం, మరింత సమాచారం చేర్చటం ,ఇతర భాషలలో ఉన్నవ్యాసాలకు అనుసంధానం చేయటం, సమాచార పెట్టె చేర్చటం వంటివి చేయవచ్చు.
సమాచార పెట్టె - Infobox
సమాచార పెట్టె లేదా విషయాల పట్టిక అనేది స్థిర-ఫార్మాట్ పట్టిక సాధారణంగా కథనాల సారాంశాన్ని ప్రదర్శించడానికి వ్యాసం యొక్క కుడి ఎగువ మూలకు జోడించబడుతుంది, ఇది కొన్నిసార్లు ఇతర పరస్పర సంబంధం ఉన్న కథనాలకు పరివర్తనలను మెరుగుపరుస్తుంది.ఇదిముఖ్యమైన వాస్తవాలు మరియు గణాంకాలను కలిగి ఉంటాయి .
ఒక ఆర్టికల్‌లో ఇన్‌ఫోబాక్స్‌ని ఉపయోగించడానికి, ఎడిటర్ దాని పేరు, పారామీటర్‌లు మరియు ఆ పారామితులను ఎలా ఉపయోగించాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఇన్ఫోబాక్స్‌లు వికీపీడియా:నేమ్‌స్పేస్‌లో వ్యాసాల నుండి వేరుగా ఉంచబడినందున, ఇన్ఫోబాక్స్‌ని పేరుతో గుర్తించడానికి కొంత ప్రయత్నం అవసరం
https://en.wikipedia.org/wiki/Help:Infobox
Infobox – సమాచార పెట్టె
వ్యాసంలో సమాచార పెట్టెను చేర్చటానికి ముందు కర్సర్ ఆర్టికల్ మొదటి భాగం లో ఉండాలి తరువాత విజువల్ ఎడిటర్ మెనూ లో చొప్పించు వద్ద మూస ఎంపిక చేసుకోవాలి
సరి అయిన infobox ఎంపిక చేసుకోవటం
కొత్త మూస లో మీకు కావాల్సిన ఇన్ఫో బాక్స్ పేరు ఎంచుకోవాలి, సమాచార పెట్టెలో ఒక సాధారణ పట్టిక ఉండవచ్చు లేదా చిత్రాలు మరియు టెక్స్ట్ వంటి విభిన్న విషయాలను కలిగి ఉండవచ్చు.
ఉదాహరణల కోసం జతపరచిన వివిధ పేర్లు
(Infobox Names) చూడండి
ఇన్ఫో బాక్స్ ఉంచదగిన వ్యాసాలు
• నిర్దిష్ట వ్యక్తులు
• నిర్దిష్ట స్థలం / ప్రదేశం
• నిర్దిష్ట సమాజం మరియు సాంఘిక శాస్త్రం
• నిర్దిష్ట శాస్త్రం మరియు ప్రకృతి
• నిర్దిష్ట టెక్నాలజీ మరియు అప్లైడ్ సైన్స్
• నిర్దిష్ట కళలు మరియు సంస్కృతి
వివిధ ఇన్ఫోబాక్స్ (సమాచార పెట్టె లు)
Infobox
Indian politician
Infobox
deity
Infobox
film
Infobox Person /
సమాచారపెట్టె వ్యక్తి
Infobox
Officeholder
Infobox
Book
Infobox Settlement
Infobox
sportsperson
ఇన్ఫోబాక్స్ లో ఏమి ఉండాలి?
ఇన్ఫోబాక్స్ లో ఏమి ఉండకూడదు?
ఒక ఇన్ఫోబాక్స్ మూసలో మరిన్ని వివరాలు , చేర్చదగిన అంశాల కోసం సంబంధిత డాక్యుమెంటేషన్ చూడండి , ఉదాహరణకు : మూస:Infobox Settlement/sandbox
https://te.wikipedia.org/wiki/మూస:Infobox_Settlement/sandbox
ఇప్పటికే ఉన్న ఇన్ఫోబాక్స్ లో కొత్త సమాచారం చేర్చటం
సమాచార పెట్టె (ఇన్ఫోబాక్స్) వున్న వ్యాసంలో సవరించు క్లిక్ చేసి అందులో ఆ బాక్స్ మీద ఒక సారి క్లిక్ చేస్తే
మార్చు అన్న బటన్ ద్వారా సమాచారం చేర్చవచ్చు ఉన్న సమాచారం సరిదిద్ద వచ్చు
ఇన్ఫోబాక్స్ సవరించటం –మూలపాఠ్యాన్ని సవరించు (సోర్స్ ఏడటర్ లో ) – మరొక పద్దతి ఇక్కడ = తరువాత సమాచారం క్లుప్తం గా చేర్చవచ్చు , ఇలాంటి విషయం గలిగిన వేరే ఆర్టికల్ లో కూడా ఈ కోడ్ కాపీ చేసుకొని అందులో సమాచారం మార్చవచ్చు , అయితే పాత ఆర్టికల్ సమాచారం జాగ్రత్తగా తీసివేయాలి .
{{సమాచారపెట్టె వ్యక్తి�| name =మంగళంపల్లి బాలమురళీకృష్ణ �| residence = [[చెన్నై]] , [[తమిళనాడు]]�| other_names = మంగళంపల్లి�| image =M. Balamuralikrishna 01.jpg�| imagesize = 200px�| caption = '''ఒడిషా, భువనేశ్వర్ లో నిర్వహించిన రాజారాణి సంగీత మహోత్సవంలో బాలమురళీకృష్ణ'''�| birth_name = మంగళంపల్లి బాలమురళీకృష్ణ�| birth_date = [[జూలై 6]], [[1930]]�| birth_place = [[శంకరగుప్తం]], [[రాజోలు]] తాలుకా, [[తూర్పు గోదావరి]] జిల్లా�| native_place = [[శంకరగుప్తం]]�| death_date = [[నవంబర్ 22]], [[2016]]�| death_place = �| death_cause = �| known = కర్ణాటక సంగీత విద్వాంసులు�| occupation = కర్ణాటక సంగీత విద్వాంసులు�| title = పద్మ విభూషణ�| salary = �| term =�| predecessor = �| successor = �| party = �| boards =�| religion = హిందు�| wife = �| spouse= �| partner = �| children = �| father = మంగళంపల్లి పట్టాభిరామయ్య�| mother = సూర్యకాంతమ్మ�| website =�| footnotes = �| employer =�| height = �| weight =�}}�
ఇన్ఫోబాక్స్ ఖాళీ" టెంప్లేట్‌ను కలిగి ఉంటుంది, వీటిని నేరుగా లక్ష్య కథనానికి కాపీ చేయవచ్చు. టెంప్లేట్‌లో ఓపెన్ ( {{) మరియు క్లోజింగ్ ( }}) డబుల్ బ్రేస్‌లు ఉంటాయి, ఇందులో ఇన్‌బాక్స్ పేరు మరియు విలువలు లేని పారామితుల జాబితా ఉంటుంది. ఒక ఎడిటర్ సంబంధిత సమాన చిహ్నం యొక్క కుడి వైపున ఉన్న ప్రతి పారామితుల విలువను పూరిస్తుంది.
వికీపీడియా వ్యాసం
వికీపీడియా వ్యాసం పేజీ రూపం ఎలా ఉండాలనేది ఈ కింద ఉన్న లింకుని చూడండి
తెలుగు డిజిటల్ వనరులు
GOOGLE లెన్స్ - DOWNLOAD LINK
ఏ భాషా వచనాన్ని అయినా స్కాన్ చేయండి & తెలుగు ను, తెలుగులోకి అనువదించండి.
మీరు చూసిన పదాలను అనువదించండి, మీ కాంటాక్ట్‌లకు వ్యాపార కార్డ్‌ను సేవ్ చేయండి, ఒక పోస్ట్ నుండి ఈవెంట్‌లను మీ క్యాలెండర్‌కు జోడించండి, సమయాన్ని ఆదా చేయడానికి క్లిష్టమైన కోడ్‌లు లేదా పెద్ద పేరాగ్రాఫ్‌లు మీ ఫోన్‌లోకి కాపీ చేసి, అతికించండి. మొక్కలు & జంతువులను గుర్తించండి
మీ స్నేహితుని అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఆ మొక్క ఏమిటో లేదా పార్కులో మీరు చూసిన కుక్క ఏ రకమైనదో కనుక్కోండి.
మీ చుట్టూ ఉన్న స్థలాలను అన్వేషించండి,ల్యాండ్‌మార్క్‌లు, రెస్టారెంట్లు, స్టోర్ ముఖ భాగాలను గుర్తించి తెలుసుకోండి. రేటింగ్‌లు, పని చేయు సమయాలు, చారిత్రక వాస్తవాలు, మరిన్నింటి గురించి చూడండి.మరిన్ని వివరాల కోసం g.co/help/lensకు వెళ్లండి. కొన్ని లెన్స్ ఫీచర్‌లకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం.
తెలుగు యూనీకోడ్
యూనికోడ్ (సర్వ సంకేత పద్ధతి) అనునది కంప్యూటర్ రంగ అక్షర సంకేత లిపి పద్ధతి.ఇప్పుడు తెలుగు భాషలో మంచి యూనీకోడు ఫాంట్లు అభివృద్ధి చేశారు. అందమైన అక్షరాలు రకరకాల పరిమాణాల్లో రూపొందించారు. వీటిలో చాలా వరకు ఉచితంగా లభిస్తాయి
మన తెలుగు ఫాంట్ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చే ఉద్దేశమే https://telugufonts.in/ , ఇంకొన్ని ఏకరూప ఖతులు https://fonts.siliconandhra.org/ నుండి మీ కంప్యూటర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు వీటి ద్వారా అందమైన ఫాంట్ ల లో డాక్యుమెంట్స్ చేసుకోవచ్చు వాటిని ముద్రించు కోవచ్చు.
వెబ్ పేజీలలో తెలుగు కోసం గూగుల్ వెబ్ ఖతులు : ఇవిగూగుల్ డాక్స్ లోకూడా పనిచేస్తాయి https://fonts.google.com/?subset=telugu
యూనికోడ్ కాని ఫాంట్ నుండి యూనికోడ్ కన్వర్టర్
అను2యూనికోడ్ :అను 6లో గానీ 7లో గానీ టైప్ చేయబడి, టెక్స్ట్ ఫార్మాటులో ఉన్న ఫైళ్ళను ఇది యూనీకోడులోకి మారుస్తుంది
ఈమాట - Non-Unicode Font to Unicode Converter
http://eemaata.com/font2unicode/index.php5
Unicode to Non-Unicode Font Converter
http://kolichala.com/font2unicode/Encoder/unicode2font.php�
గమనిక: తెలుగు వారికి ఉపయోగపడటానికి ఇవి సూచనలు మాత్రమే ఆంగ్ల భాషలోను, అను లాంటి యూనీకోడేతర ప్రొప్రైటరీ ఫాంట్లను ఉపయోగిస్తూ అంగ్లేతర భాషలలోనూ కలిపి ఒకే ఫైలులో టైపు చెయ్యవచ్చు. కానీ నోట్‌పేడ్ లాంటి టెక్స్ట్ ఎడిటర్‌లలో ఒక ఫైలులో ఒక్క ఫాంటుని ఉపయోగించి మాత్రమే టైపు చెయ్యగలం. కాబట్టి వర్డు, పేజ్‌మేకరు లలో టైప్ చేసిన టెక్స్ట్‌ని నోట్‌పేడ్‌లోకి కాపీ చేసినట్టయితే, అప్పుడు ఎంచుకున్న ఫాంటులో ఉన్న టెక్స్ట్ మాత్రమే సరిగ్గా కనబడుతుంది. మిగిలిన ఫాంట్లలో ఉన్న అక్షరాలు, ఎంచుకున్న ఫాంటులోకి రూపాంతరం చెంది అర్థం కావు.అను 6లో గానీ 7లో గానీ టైప్ చేయబడి, టెక్స్ట్ ఫార్మాటులో ఉన్న ఫైళ్ళను మాత్రమే ఇది యూనీకోడులోకి మారుస్తుంది
వికీ:టైపింగు సహాయం
వికీలో ఏ ఇతర సాధనాలు లేకుండా నేరుగా టైప్ చేయవచ్చు అవి లిప్యంతరీకరణ (ఇంగ్లీషు అక్షరాల కీ బోర్డు), ప్రామాణిక ఇన్‌స్క్రిప్ట్ ,ఇన్‌స్క్రిప్ట్2,ఆపిల్,మాడ్యులర్ లేఅవుట్ లు .
మీరు కర్సర్ పెట్టిన మరుక్షణం మీకు కుడివైపున టైపింగ్ ఎంపిక కనిపిస్తాయి
లిప్యంతరీకరణ
లిప్యంతరీకరణ అంటే, ఇంగ్లీషు లిపిలో టైపు చేస్తూ ఉంటే దానంతట అదే తెలుగు లిపి లోకి మారిపోవడం. ఉదాహరణకు "telugu" అని రాస్తే అది "తెలుగు" అని మారిపోతుంది. ఇది రైస్ ట్రాన్స్‌లిటరేషన్ స్టాండర్డ్ పై ఆధారపడిన పద్ధతి.
కొన్ని క్లిష్టమైన పదాలు
కొన్ని ఉదాహరణలు
dESa bhAshalaMdu telugu lessa -
దేశ భాషలందు తెలుగు లెస్స
telugulO vrAyaDam ippuDu kashTaM kAdu - తెలుగులో వ్రాయడం ఇప్పుడు కష్టం కాదు
viSvadAbhirAma vinuravEma - విశ్వదాభిరామ వినురవేమ
కొన్నిడిజిటల్ వనరులు
Google ఇన్‌పుట్ సాధనాలు వెబ్‌లో ఎక్కడైనా మీరు ఎంచుకునే భాషలో టైప్ చేయడాన్ని సులభం
https://www.google.com/intl/te/inputtools/try/
మైక్రోసాఫ్ట్ ఇండిక్ లాంగ్వేజ్ ఇన్ పుట్ టూల్ ( offline ) ఇంటర్నెట్ లేక పోయినా పనిచేస్తుంది - Download లింకు
GOOGLE లెన్స్ - DOWNLOAD LINK
భాషా వచనాన్ని స్కాన్ చేయండి & తెలుగు లో అనువదించండి.
ఉపకరణాలు
మైక్రోసాఫ్ట్ ట్రాన్స్ లేటర్ - DOWNLOAD LINK
మైక్రోసాఫ్ట్ ట్రాన్స్ లేటర్ అనువర్తనాలను, అనుబంధాలు, కార్యాలయం, మరియు అజ్యూరే కాగ్నిటివ్ సర్వీసెస్ ద్వారా తెలుగులో అనువాదం చేయవచ్చు , ఇప్పుడు ఉన్న అనువాద ఉపకరణాలలో వీటి నాణ్యత బాగున్నది
టెక్స్ట్-టు-స్పీచ్ Text-to-Speech , బహుళ-వ్యక్తి సంభాషణ అనువాదం ,మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ప్లగ్-ఇన్ ఉపయోగించి 90 భాషలు పైగా విదేశీ భాషా వెబ్ పేజీలను మన భాషలో చూడవచ్చు.
MICROSOFT TRANSLATOR APP - DOWNLOAD LINK
మైక్రోసాఫ్ట్ ట్రాన్స్ లేటర్ అనేది 70 కి పైగా భాషలకు అనువదించడానికి. ఉచిత, వ్యక్తిగత అనువాద అనువర్తనం, ఇది వచనం , వాయిస్, సంభాషణలు, కెమెరా ఫోటోలు మరియు స్క్రీన్ షాట్ లను అనువదించడానికి. ప్రసంగాన్ని అనువదించడానికి వాయిస్ అనువాదం, బహుళ-వ్యక్తి సంభాషణ అనువాదం ,ప్రయాణించినప్పుడు విదేశీ భాషలలో ముఖ్యమైన పదబంధాలను నేర్చుకోవడానికి సహాయపడటానికి అనేక భాషల్లో 100 మంది వరకు వ్యక్తిగత సంభాషణలు విదేశీ భాషలలో ముఖ్యమైన పదబంధాలను నేర్చుకోవడంలో సహాయపడటానికి పదబంధం గైడ్ లు మొదలైన సదుపాయాలు ఉన్నాయి.
ఇక్కడ మీరు సహకరించవచ్చు
Google ఇన్‌పుట్ సాధనాలు
ఆన్‌లైన్‌లో( వెబ్ బ్రౌజర్, సోషల్ మీడియా) ఆఫ్‌లైన్‌లో(వర్డ్, PPT)తెలుగులో టైప్ చెయటానికి Google ఇన్‌పుట్ సాధనాల వాడుక బాగా సులభతరం అయ్యింది.
మీ దిద్దుబాట్లను గుర్తుంచుకుంటాయి మరియు కొత్త లేదా అసాధారణ పదాలు మరియు పేర్ల కోసం అనుకూల డైరెక్టరీని నిర్వహిస్తాయి.
Chrome, Android పరికరాలు మరియు Windows కోసం ఈ సాధనాల్లు అందుబాటులో ఉంది.
"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
Google ఇన్‌పుట్ సాధనాలు
Google ఇన్పుట్ సాధనాలు ఇన్స్టాల్ చేసుకోవడానికి మీ క్రోమ్ బ్రౌసర్ లో ఈ క్రింది విధంగా టైప్ చేయండి
google input tools telugu
ఇక్కడ https://www.google.com/intl/te/inputtools/ క్లిక్ చేసి chrome లో అన్న మెనూ క్లిక్ చేయండి
Google ఇన్‌పుట్ సాధనాల Chrome పొడిగింపు
Google ఇన్‌పుట్ సాధనాలను ఇన్‌స్టాల్ చేయండి
పొడిగింపు చిహ్నం ను క్లిక్ చేసి, “పొడిగింపు ఎంపికల”ను ఎంచుకోండి
"పొడిగింపు ఎంపికల" పేజీలో, మీకు నచ్చిన ఇన్‌పుట్ సాధనాన్ని ఎడమవైపు నుండి కుడివైపుకు ఎంచుకోండి.
ఇన్‌పుట్ సాధనాన్ని జోడించడానికి ఎడమవైపున రెండుసార్లు క్లిక్ చేయండి. ఎంపికను తీసివేయడానికి కుడివైపున రెండుసార్లు క్లిక్ చేయండి.
కుడివైపున ఇన్‌పుట్ సాధనంపై క్లిక్ చేసి, ఎగువకు బాణం మరియు దిగువకు బాణం చిహ్నాలపై క్లిక్ చేయడం ద్వారా ఎంచుకోబడిన ఇన్‌పుట్ సాధనాలను క్రమబద్ధీకరించండి.
లింకు : https://www.google.com/inputtools/chrome/
బాష ఉపకరణాలు ఎంచుకోవటం ఎలా ?
క్రింది బాణం గుర్తు పై క్లిక్ చెయ్యండి
మీరు ఎంచుకున్న తెలుగు బాష ఉపకరణాలు.
తెలుగు కోసం “ ఆ “ ను ఎంచుకొనండి
ఇన్‌పుట్ సాధనాన్ని ఉపయోగించడానికి, పొడిగింపు చిహ్నంపై క్లిక్ చేయండి. కనిపించే డ్రాప్-డ్రౌన్ మెనులో, కావల్సిన తెలుగు ఇన్‌పుట్ సాధనాన్ని ఎంచుకోండి. ఇన్‌పుట్ సాధనం ప్రారంభించబడితే, పొడిగింపు బటన్ వలె రంగులతో కూడిన చిహ్నంగా మారుతుంది. ఇన్‌పుట్ సాధనం ఆపివేయబడినప్పుడు, బటన్ బూడిద రంగులోకి మారుతుంది. “ఆపివేయి” క్లిక్ చేస్తే, ఇన్‌పుట్ సాధనం ఆపివేయికి టోగుల్ అవుతుంది. మీరు ఎంచుకున్న ఇన్‌పుట్ సాధనాలపై క్లిక్ చేయడం ద్వారా కూడా వాటిని ప్రారంభించడం/ఆపివేయడం మధ్య టోగుల్ చేయవచ్చు. ఇప్పుడు మీరు ఇన్‌పుట్ సాధనాన్ని ప్రారంభానికి టోగుల్ చేసారు, వెబ్ పేజీని తెరిచి, కర్సర్‌ను ఇన్‌పుట్ పెట్టె వద్దకు తరలించి ఆపై టైప్ చేయడాన్ని ప్రారంభించండి. ఇది పని చేయకపోతే, పై క్లిక్ చేయడం ద్వారా వెబ్ పేజీని రీఫ్రెష్ చేయండి.
Gboard మొబైల్లో తెలుగులోరాసేగూగుల్ఉపకరణము
Gboard అనేది స్థానిక Android మరియు iOS పరికరాల కోసం Google చే అభివృద్ధి చేయబడిన వర్చువల్ కీబోర్డ్ అనువర్తనం.
మొబైల్ లో
మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో playstore ద్వారా , Gboard ని ఇన్‌స్టాల్ చేయండి.
ఒక వేళ మీ ఫోన్ లో ఇప్పటికే Gboard వుండి ఉంటే దానికి enable చేయండి
కొన్ని Android పరికరాల్లో, Gboard ఇప్పటికే డిఫాల్ట్ కీబోర్డ్ గాఉంటే. మీ పరికరం ఇటీవలి సంస్కరణను కలిగి ఉందని నిర్ధారించుకోవడానికి, నవీకరణల కోసం తనిఖీ చేయండి.
కీబోర్డ్ ఎంపికలను సెట్ చేయండి
పద్దతి- 1
మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Gmail లేదా Keep వంటి మీరు టైప్ చేయగల ఏదైనా అనువర్తనాన్ని తెరవండి.
మీరు వచనాన్ని నమోదు చేయగల చోట నొక్కండి.
కీబోర్డ్ ఎగువ ఎడమ వైపున, ఫీచర్స్ మెను తెరువు నొక్కండి ఫీచర్స్ మెను తెరవండి
తెలుగు భాషను ఎంపిక చేయటం
సిస్టం లో languages & Input దగ్గర Gboard ఎంచుకోండి
కీబోర్డ్ ఎగువ ఎడమవైపు, ఫీచర్స్ మెనూ తెరువు నొక్కండి ఫీచర్స్ మెనూ తెరువు.
మరిన్ని నొక్కండి, ఆపై సెట్టింగులు మరియు తరువాత భాషలు.
మీకు కావలసిన భాషలను (తెలుగు) ఎంచుకోండి.
మీరు ఉపయోగించుకుంటున్న లేఅవుట్ ని ఎంచుకోండి.
Gboard లో ఉన్న పద్ధతులు
Google అనువాదం — కీబోర్డ్‌లో మీరు తెలుగుని ఇంగీష్ లో టైప్ చేస్తున్నప్పుడు తెలుగు అక్షరాలలో లో అనువాదం చేస్తుంది
తెలుగు కీబోర్డు - మీ వేలితో తెలుగు అక్షరాలు తాకుతూ వేగంగా టైప్ చేయడం
వాయిస్ టైపింగ్ — సులభంగా వచనాన్ని డిక్టేట్ చేయడం
చేతిరాత* — కర్సివ్, ప్రింటెడ్ అక్షరాలలో రాయడం
Gboard లో వాయిస్ టైపింగ్
తెలుగు లో వాయిస్ టైపింగ్ చెయ్యడం కోసం కీబోర్డ్ మూలన ఉన్న మైక్ ఐకాన్ ఓపెన్ చేసి వాయిస్ సెట్టింగ్ లో తెలుగు ని ఎంపిక చేసుకోవాలి , ఇక్కడ తెలుగు ఎంచుకోబోయే ముందు ఇప్పటికే డిఫాల్ట్ ఉన్న English ని ఆన్ చెక్ చేయాలి
తెలుగు సాధనాలు - ఎంఎస్ ఆఫీసు
తెలుగు ఆధారంగా అదనపు ప్రదర్శన, సహాయం లేదా పరిశీలన సాధనాలను ఉపయోగించవచ్చు.
https://www.microsoft.com/te-IN/download/details.aspx?id=51200
https://www.microsoft.com/te-IN/download/details.aspx?id=35400
క్రోమ్ లో మాటల ద్వారా వచనం టైపు చేయటం
Voice In Voice Typing - ఇది వాయిస్-టు-టెక్స్ట్ ఉపయోగించి బ్రౌజర్‌లో టైప్ చేయడాన్ని సులభతరం చేస్తుంది.
https://chrome.google.com/webstore/detail/voice-in-voice-typing/pjnefijmagpdjfhhkpljicbbpicelgko
చిట్కాలు
ఎల్లవేళలా సంఖ్యల అడ్డు వరుస అందుబాటులో ఉండేలా చేయండి (సెట్టింగ్‌లు → ప్రాధాన్యతలు → సంఖ్యల అడ్డు వరుస ఎంపికను ఎనేబుల్ చేయండి)
• సంకేతాల సూచనలు: ఎక్కువ సమయం నొక్కి ఉంచడం ద్వారా సంకేతాలు యాక్సెస్ చేయడానికి మీ 'కీ'లపై త్వరిత సూచనలను చూపుతుంది (సెట్టింగ్‌లు → ప్రాధాన్యతలు → సంకేతాల కోసం ఎక్కువ సేపు నొక్కి ఉంచు ఎంపికను ఎనేబుల్ చేయండి)
• సంజ్ఞ తొలగింపు: పలు పదాలను త్వరగా తొలగించడానికి 'డిలీట్ కీ' నుండి ఎడమ • సంజ్ఞ కర్సర్ నియంత్రణ: కర్సర్‌ను జరపడానికి స్పేస్ బార్ మీదుగా మీ వేలిని జరపండి స్లైడ్ చేయండి.
మీరు ఎక్కువగా Gboard వాడుతూ ఉంటే దానికి ఉన్న కుత్రిమ మేధస్సు ద్వారా మరింత చక్కగా పనిచేస్తుంది.
ఇవి కాక చాలా మొబైల్ లో తెలుగు రాయడానికి చాలా అనువర్తనాలు (Apps) అందుబాటులో ఉన్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు
వికీపీడియాలో వ్యాసంఎడిటింగ్ చేయడం
కొత్త వాళ్ళుసవరించాలి అంటే ఏ పద్ధతి సులువైనది.
కొత్తవారికి విజువల్ ఎడిటర్ తో సవరణలు చేయటం సులువైన పద్దతి , విజువల్ ఎడిటర్ తో మీరు చేసే సవరణలు చేసేటప్పుడే కనబడతాయి కాబట్టి వ్యాసం పూర్తి అయిన తరువాత దాని రూపం ఎలా ఉంటుందో అన్న విషయంలో ఆందోళన పడకుండా , వ్యాస విషయం పై ధ్యాస పెట్టవచ్చు.
నేను వ్యాసం ప్రయోగ శాలలోనే ఎందుకు మొదలు పెట్టాలి
మీరు రాయదలచు కొన్న వ్యాసాన్ని మీ ప్రయోగశాల లో రాయటం వలన వ్యాసం పూర్తిగా తయారు అయ్యేముందు ఏమైనా పొరపాట్లు జరిగినా మీరే సరిదిద్దు కోవటానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే సాధారణముగా మీప్రయోగశాల పేజీలో ఉన్న విషయమును ఇతరులు మార్పు చేయరు.మీకు వికీ శైలి బాగా అలవాటు అయిన తరువాత నేరుగా వికీపీడియాలోనే వ్యాసం రాయవచ్చు.�ఒక పాత పుస్తకంలో ఉన్న విషయం ఆధారంగా , వికీ వ్యాసం రాసాను , ఈ పుస్తకానికి ఇంటర్నెట్టు లో వివరాలులేవు నేను వాటికి మూలాలుగా ఎక్కడ పేర్కొనాలి ?
ఉల్లేఖన లో మానవనీయ బటన్ ద్వారా పుస్తకాన్ని ఉదహరించండి ఈ టెంప్లేట్లో అందించిన గ్రంథ సమాచారం (రచయిత మరియు శీర్షిక వంటివి) అలాగే వివిధ ఆకృతీకరణ ఎంపికలను ఉపయోగించి మూలంగా ఇవ్వవచ్చు.
వేరే భాషవికీ లో ఉన్న మూస ను టెంప్లేట్ ను తెలుగు పీజీలో దింపుకోవచ్చా?
చేయవచ్చు , అయితే అందులో వున్న పదాలను సాధ్యమై నంత వరకు తెలుగీకరించాలి
నేను చదువుతున్న ఒక వ్యాసం లో కొన్ని దోషాలు వున్నాయి, నేను “ సవరించు” ఎంపిక చేసుకొని మార్చ వచ్చా.
ఆ సవరణ విలువైనది , అత్యంత అవసరము ( ఉదా: ప్రముఖ వ్యక్తి మరణం) అయితే నేరుగా మార్చవచ్చు . సాధారణముగా కొత్తగా వికీ చూసేవారు వ్యాసంలో ఏదన్నా సవరణలు ఆ వ్యాసం చర్చా పేజీలలో సూచించవచ్చు.
విజువల్ ఎడిటర్ తో చేసిన సవరణలను వికీ కోడ్ (మార్కప్) తో సవరణ చేయవచ్చా
చేయవచ్చు,
నా బ్రౌజర్‌తో సవరించడంలో నాకు సమస్యలు ఉన్నాయి!
వికీపీడియాను చూడటానికి సరైన బ్రౌజర్ లేదు.ఆయితే చాలా బ్రౌజర్ లను అప్డేట్ చేయటం ద్వారా కొన్ని సమస్యలు పరిష్కరించవచ్చు .
నేను మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ లో రాసి ఉంచుకొన్న సమాచారం వ్యాసం లోనికి నేరుగా కాపీచేయవచ్చా
మీరు అలా మైక్రోసాఫ్ట్ వర్డ్ రాసిన టెక్స్ట్ ను ను మొదట నోట్ పాడ్ లో కాపీచేసి తరువాత వ్యాసంలో పేస్ట్ చేయటం ద్వారా రూపంలో ( బోల్డ్ , పేరాగ్రాఫ్, లైన్ బ్రేక్) లు వంటివి నివారించ వచ్చు. ఆలా కాపీ చేసిన ప్లైన్ టెక్స్ట్ ను ఎడిటర్ తో సరిదిద్దవచ్చు .
నేను పొరబాటున రామాయణము, రామాయణం అను పేర్లతో రెండు వ్యాసాలు సృష్టించాను. రెండిటి పాఠము ఒక్కటే. మరియు నేను సృష్టించిన పేజీలు సెర్చ్ బాక్స్ లో టైప్ చేసి "వెళ్ళు" క్లిక్ చేస్తే కనబడుట లేదు.�� పొరపాటున అలా తప్పు పేరుతో పేజీ సృష్టించినప్పుడు మీరు రెండు పనులు చేయవచ్చు. మొదటిది మీరు దానిని సరైన పేజీకి తరలించవచ్చు. లేదా కొత్తపేజీలో పాత సమాచారము అతికించవచ్చు. కానీ మొదటి విధానమే సరి అయినది ఎందుకంటే రెండవ విధానములో పేజీ చరిత్ర కోల్పోతాము. వెళ్ళు నొక్కితే ఆ పేరుతో పేజీ ఉంటేనే అక్కడికి నేరుగా వెలుతుంది. అన్వేషణ నొక్కితే అన్ని పేజీలలో ఆ పదాన్ని వెతికి చూపిస్తుంది.
ఆదర్శవంతమైన వ్యాసం ఎంత పొడవు ఉండాలి?
ఆదర్శ వికీపీడియా వ్యాసం 500 పదాల కన్నా ఎక్కువగా 5000 పదాల కంటే తక్కువగా ఉంటుంది, ఈ విషయం లో, నిజంగా చాలా విశ్లేషణ అవసరం అయినా. ఏదేమైనా, సంక్లిష్టమైన ఒక విషయం కోసం అయితే తప్ప వికీలో పొడవైన వ్యాసాలు రాయటం అభిలాషణీయం కాదు , ఒకరు పేజీ నుండి పేజీకి లింక్ చేయగలరు కాబట్టి, అలాంటి పెద్ద వ్యాసాన్ని విడదీసి చిన్నవ్యాసాలుగా రాసి అనేక వ్యాసాలను ఒకదానితో ఒకటి కలుపుతూ, హబ్ పేజీని ఉపయోగించి అన్ని వ్యాసాలను ఒకదానితో ఒకటి కలుపవచ్చు
వ్యాస పరిమాణం నేను ఎలా గుర్తించగలను?
వ్యాసం పేరును “వికీపీడియాలో వెతకండి” అన్న బాక్స్ లో టైప్ చేయడం ద్వారా ఆసక్తి ఉన్న పేజీ పేరు కోసం శోధించండి. జాబితాలోని సరిపోలిన వ్యాస పరిమాణం కిలోబైట్లలో , అందులోని పదాల సంఖ్య చూపబడుతుంది.
ఒక సారి ఏదైనా లింక్ చేస్తే దానిని మార్చుకోవచ్చా ?
మార్చుకోవచ్చు సవరించు అనే పదం యొక్క లింకింగ్ మరియు టెక్స్ట్ డిజైన్‌ను తొలగించడానికి క్లిక్ చేయండి - లింక్ లక్ష్యాన్ని సవరించడానికి కొత్త డైలాగ్ బాక్స్‌ను తెరుస్తుంది .
ఈ సైటులో నేను వ్రాసిన వ్యాసాన్ని గూగుల్ సెర్ఛ్ ఇంజను లొ పొందడం ఎలా?
గూగుల్ల్ సెర్చిలో కనిపించేటట్లు ప్రత్యేకంగా ఏమీ చేయనక్కరలేదు, మీరు వికీలో రాసిన కొద్ది సేపటికి గూగుల్ ఆటోమేటిక్ గా ఆవిషయం మీద వికీ లో మీరు రాసిన పేజీ వివరాల్ని సెర్చ్ రిజల్ట్ లలో చూపిస్తుంది .
నేను రాసిన వ్యాసం నాపేరు మీద ఉన్నది అని ఎలా తెలుస్తుంది ?
వికీపీడియాలో రాసిన ప్రతి విషయం మీ వాడుకరి పేరు లేదా , మీరు లాగిన్ ఆవ్వకపోతే మీ IP అడ్రస్సు మీద రికార్డు అవుతుంది , అలా మీరు పేరు ఆ వ్యాసపు చరిత్రలో రికార్డు అవుతుంది . అలా ఆవ్యాసం సృష్టికర్త మీరే నని తెలుస్తుంది ఈ రికార్డును సాధారణ వాడుకదారులు మార్చలేరు.
నా వ్యాసం ఎందుకు తొలగించబడింది?
వికీ మూల స్తంభాలకు అనుగుణంగా పేజీలు , మీడియా లేకపోతే వికీపీడియా నిర్వాహకులు తొలగింపు విధానానికి అనుగుణంగా తొలగిస్తారు . ఒక నిర్దిష్ట పేజీ లేదా ఫైల్ ఎందుకు తొలగించబడిందో తెలుసుకోవడం, తొలగింపు నిర్వాహకుడు అందించిన తొలగింపు సారాంశంతో పాటు తొలగింపు లాగ్‌లో ఇది రికార్డ్ చేయబడుతుంది. దీనికి మీరు అంగీకరించకపోతే తొలగింపు గురించి మీరు ఏమి చేయగలరో ఈ పేజీ వివరిస్తుంది. అయితే సరియిన చర్చ చేయటం ద్వారా "తొలగించబడిన" పేజీలోని సమాచారం ఏదీ వాస్తవానికి కోల్పోదు .
నేను చేసిన సవరణ ఎందుకు తొలగించబడింది?
రకరకాల కారణాలు ఉన్నాయి (కొన్ని సాధారణ కారణాలు వేరే సైటు నుండి కాపీ పేస్టు , అసంబద్దమైన రచన , పక్షపాత కంటెంట్, వివరణ లేకుండా, పనికిరాని కంటెంట్ ). మీరు చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే, మీరు సవరించిన వ్యాసం కోసం చరిత్ర పేజీని చూడండి. ఇది ఎవరు మార్చారో, వారు మార్చినప్పుడు మరియు వారు దానిని ఎందుకు మార్చారో అన్న కారణం ఇది మీకు తెలియజేస్తుంది.మీరు సంతృప్తికరంగా ఉన్న కారణాన్ని కనుగొనలేకపోతే, మీ ప్రతిపాదిత మార్పు గురించి వ్యాసం యొక్క చర్చా పేజీలో మర్యాదగా అడగండి మీరు చేయగలిగే మార్పుల గురించి సలహాలను మీరు పొందవచ్చు, తద్వారా మీ మార్పు వ్యాసం లోకి వెళ్తుంది
ఆరవ రోజు
15.వ్యాసాలను అనువదించడం
16.బొమ్మలు , మీడియా చేర్చటం
16.తదుపరి కార్యాచరణ పరిచయం
అనువాదం
వ్యాసాల అనువాదం అనేది పేజీలను మీ భాషలోకి త్వరగా అనువదించే పరికరం. వాడి చూడండి!
విషయ అనువాదం (కంటెంట్ ట్రాన్స్లేషన్)
విషయ అనువాదం (కంటెంట్ ట్రాన్స్లేషన్) ఉపకరణం అసలు వ్యాసం పక్కనే అనువాదాలను సృష్టించడానికి అనువాదకులను అనుమతిస్తుంది. ఇంకా వచనాన్ని కాపీ చేయడం, సంబంధిత లింక్‌లు, వర్గాల కోసం వెతకడం మొదలైన ఆసక్తిలేని పనులను సులభతరం లేక అప్రమేయంగా చేస్తుంది. మరింత సరళమైన అనుభవం ద్వారా, అనువాదకులు వారి విలువైన సమయాన్ని మెరుగుగా వాడడం ద్వారా వారి భాషలో సహజంగా చదివే అధిక-నాణ్యత విషయాలను సృష్టించడానికి తోడ్పడుతుంది.
ఈ ఉపకరణం, క్రియాశీల అభివృద్ధిలో వున్నది.
యాంత్రిక అనువాద పరిమితి
తెవికీలో యాంత్రిక అనువాదం 70% కన్నా తక్కువ వుండాలన్న పరిమితి అమలులో వున్నది. కావున మీరు ప్రచురించు నొక్కినపుడు, మీ వ్యాసం ప్రచురించకుండా నిరోధించబడవచ్చు. అప్పుడు పేరా వారీగా మీ అనువాదాన్ని పరిశీలించి ఏమైనా మెరుగుచేయగలిగితే చేయండి.ఈ ఉపకరణాన్ని తెలుగు వికీలో వాడుటకు మంచి పద్ధతులు, చిట్కాల వంటి మరింత సమాచారం కోసం
సూచనలు
అనువదించవలసిన పదాల సహాయం
చూడండి నిఘంటువు, విక్షనరీ, విక్షనరీ లో వెతకండి. కోరిన పదాలు లో కొత్తపదాల సహాయానికై చేర్చండి.
ఇమేజి , వీడియో లు వికీపీడియా వ్యాసంలో చేర్చటం
Media - Image usage,Audio usage, Embedded video, Linking to a video (Visual Editor) Technical limitations
బొమ్మలు ఇతర ఫైళ్లను ఎక్కించుటకు వికీపీడియా:ఫైల్ ఎక్కింపు విజర్డు వాడితే ప్రశ్నలసహాయంతో వాడుకరికి మార్గదర్శనంచేసి తగిన లైసెన్స్ తో ఫైల్ ఎక్కించటానికి సహాయపడుతుంది. సంబంధిత వివరాల మూసను, ఉచితం కాని ఫైళ్లకు తగిన హేతువుల మూసను చేర్చుతుంది
వికీపీడియా:ఫైల్ ఎక్కింపు విజర్డు
అంతర్జాలంలో మీకు కనిపించ్వే బొమ్మల్లో చాలావరకు కాపీహక్కులు కలిగి ఉంటాయి. అవి వికీపీడియా లోకి అప్లోడు చేసేందుకు అనుకూలమైనవి కావు. మీరు అప్లోడు చెయ్యదలచిన బొమ్మ మీరు సృష్టించింది కాకపోయినా, లేక ఆ బొమ్మ కాపీహక్కుల స్థితి మీకు తెలియకున్నా, ఆ బొమ్మను అప్లోడు చెయ్యకండి.
అంకం 1: మీ ఫైల్ ఎంపికచెయ్యండి
ఫైల్:
మీ కంప్యూటర్ నుండి ఫైల్ ఎంపికచెయ్యండి. గరిష్ట ఫైల్ పరిమాణం:100మెగాబైట్లు.
అనుమతించబడిన ఫైల్ తీరులు: png, gif, jpg, jpeg, xcf, pdf, mid, ogg, ogv, svg, djvu, tiff, tif, oga.
అంకం 2: మీ ఫైల్ ని వివరించండి
అంకం 3: మూలము మరియు నకలుహక్కుల సమాచారం ఇవ్వండి
విజువల్ ఎడిటర్ ద్వారా నేరుగా వ్యాసంలో చేర్చటం
ఒక కొత్త ఇమేజ్ అప్ లోడ్ చేయడం కొరకు, ఆర్టికల్ యొక్క పైన "ఎడిట్" క్లిక్ చేయడం ద్వారా విజువల్ ఎడిటర్ ని యాక్టివేట్ చేయండి.
VE టూల్ బార్ కనిపించిన తరువాత, మీడియావికీ వెక్టర్ స్కిన్ యాక్షన్ యారో.png మెనూ మీద క్లిక్ చేయండి మరియు "Media" ఆప్షన్ ఎంచుకోండి. ఇది ఇమేజ్ లను అప్ లోడ్ చేయడానికి మరియు ఉపయోగించడానికి అనుమతించే డైలాగ్ బాక్స్ ని తెరుస్తుంది.
విజువల్ ఎడిటర్ ద్వారా మార్పులు చేయవచ్చు.
ఫోటోలకు JPEG, ద్రాయింగులకు SVG, వెక్టర్ గ్రాఫిక్స్ కాని ఇకను బొమ్మలకు PNG, ధ్వనికి Ogg Vorbis, వీడియోకు Ogg Theora వాడాలి. సందిగ్ధత లేకుండా ఫైళ్ళకు వివరమైన పేర్లు పెట్టండి. బొమ్మను వ్యాసంలో ఇమిడ్చేందుకు, కింది పద్ధతిని వాడండి [[బొమ్మ:ఫైలు.jpg]] లేదా [[బొమ్మ:ఫైలు.png|వ్యాఖ్య]] లేదా [[Media:File.ogg]] -ధ్వనికి.
బొమ్మను థంబ్ నెయిల్ గా ఇలా చూపించాలి: [[బొమ్మ:Apublicaffaircover.gif?|thumb|వ్యాఖ్య]].
వీడియో ఫైళ్ల ఎక్కింపు
వికీమీడియా కామన్స్ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న వీడియో ఫైళ్లను కోరుతుంది, అవి ఎడ్యుకేషనల్ వీడియోలు, మరియు ఇవి ఉచిత ఫైల్ ఫార్మాట్ లో ఉన్నాయి, ప్రస్తుతం అంటే కేవలం WebM మరియు Ogg Theora (మరియు WebM ప్రాధాన్యత).
అయినప్పటికీ, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న లేదా రికార్డింగ్ పరికరాల ద్వారా ఉత్పత్తి చేయబడిన చాలా వీడియోలు ఇతర ఫార్మాట్లలో ఉన్నాయి, అందుకే మార్పిడి అవసరం. ఉచిత మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ వాడకాన్ని ప్రోత్సహించాలని వికీమీడియా సంఘం కోరుకుంటుంది. వీడియో మార్పిడి కోసం ఉపయోగించగల కొన్ని ప్రోగ్రామ్‌లు (మరియు ఎడిటింగ్ కూడా) మిరో వీడియో కన్వర్టర్, ఎట్యూబ్ క్యాచర్ మరియు అవిడెమక్స్ వంటివి.
Video2commons https://video2commons.toolforge.org/
వీడియో 2 కామన్స్ అనేది ఒక url నుండి వికీమీడియా కామన్స్‌కు వీడియోలను అప్‌లోడ్ చేయడానికి ఒక సాధనం, ఇది స్వయంచాలకంగా వీడియోను కామన్స్ అనుకూల ఆకృతికి మారుస్తుంది. ఇది ఆడియో, ఉపశీర్షికలు, వీడియోను తొలగించడం వంటి విధులను కలిగి ఉంటుంది. సాధనం లాగిన్ చేయడానికి OAuth ని ఉపయోగిస్తుంది.టూల్ లోనికి లాగిన్ చేయండి "Add Task..." ప్రెస్ చేయండి.
మీరు కన్వర్ట్ చేయాలని అనుకుంటున్న వీడియోని ఎంచుకోండి
ఫైలు వివరణ కొరకు టెంప్లెట్ నింపండి మరియు కేటగిరీలను జోడించండి.
మీరు కన్వర్ట్ చేయాలని అనుకుంటున్న వీడియోని ఎంచుకోండి
మీరు భాగస్వామ్యం చేయదలిచిన వీడియో ఫైల్‌ను ఎంపిక చేయండి
మీరు వీడియోకు కాపీరైట్‌ను కలిగి ఉన్నారని మరియు దానికి ఉచిత లైసెన్స్‌ను వర్తింపజేయడానికి సిద్ధంగా ఉన్నారని, లేకపోతే వీడియోకు ఇప్పటికే ఉచిత కాపీరైట్ లైసెన్స్ ఉందని నిర్ధారించండి
వీడియో కామన్స్ అంగీకరించే పరిధిలో ఉందని నిర్ధారించండి
క్లౌడ్ లో కన్వర్షన్ ప్రారంభం అవుతుంది:
మొదటి దశ లోడింగ్ బార్ ని చూపిస్తుంది
మీ అవసరం బట్టి keep అన్న ఎంపికను uncheck చేయటం ద్వారా మీరు ఎక్కించిన వీడియో ,ఆడియో , సబ్ టైటిల్స్ ను ఎంచుకోవచ్చు
ఉదాహరణకు మీరు ఎంపిక చేసిన వీడియోలో ఆడియో వద్దు అనుకుంటే uncheck చేయండి
మీ ఫైల్ ని వికీపీడియాలో ఏ పేరుతో వాడదలచుకొన్నారో స్పష్టమైన వివరణాత్మకమైన పేరు ప్రవేశపెట్టండి.
ఈ పేరు వికీపీడియామొత్తములో విశిష్టతగావుండాలి. అందుకని వివరమైనదిగా సులభంగా గుర్తుపెట్టుకోగల వీలున్నదిగా చేయండి.
పొడుగుగా వున్న పేరుతో ఇబ్బందేమిలేదు. దీనిలో ఖాళీలు, కామాలు మరియు ఇతర విరామ సంజ్ఞలు వుండవచ్చు.
ఫైళ్లు పేరులు ఆంగ్లములోనున్నట్లైతే మొదటిఅక్షరము తప్పించి పెద్ద చిన్న బడుల అక్షరాలు వేరుగా పరిగణించబడతాయి.
మంచిది: "City of London, skyline from London City Hall, Oct 2008.jpg".
చెడ్డది: "Skyline.jpg", "DSC0001234.jpg".
రెండో దశ పురోగతి బార్ ని చూపిస్తుంది, మిగిలిన శాతం యొక్క సూచన
కన్వర్ట్ చేయబడ్డ వీడియో ఆటోమేటిక్ గా కామన్స్ కు అప్ లోడ్ చేయబడుతుంది.
మీరు అప్లోడ్ చేసిన వీడియో మీద క్లిక్ చేస్తే , వికీపీడియా కామన్స్ చేర్చిన వీడియో వివరాలు
కనిపిస్తాయి.
అప్లోడ్ చేసిన వీడియో
వ్యాసం లో చొప్పించటానికి విజువల్ ఎడిటర్ మెనూ లో ఉన్న చొప్పించు ఎంచుకోండి.
మీరు అంతకుముందు ఎక్కించిన దస్త్రాలు ఇక్కడకనిపిస్తాయి , లేకపొతే Search వద్ద commons.wikimedia.org లో వెతకవచ్చు
మీకు కావాల్సిన ఇమేజ్ ఎంచుకొని Use this Image ద్వారావ్యాసంలోప్రవేశపెట్టవచ్చు
ఇతర వికీ పేజీల్లాగానే మీరు అప్లోడు చేసిన బొమ్మను లేదా వీడియో వికీపీడియా విధానాలకు అనుగుణంగా ఇతరులు సరిదిద్దవచ్చు, తొలగించనూ వచ్చు. అప్లోడు పద్ధతిని దుర్వినియోగపరిస్తే మిమ్మల్ని నిషేధించవచ్చు
బొమ్మ పేరు తెలుగులోనైనా, ఇంగ్లీషులోనైనా పెట్టవచ్చు. పేరు ఇంగ్లీషులో పెడితే.. అది కేస్ సెన్సిటివ్ అని గమనించండి. ఫైలు ఎక్స్టెన్షను మాత్రం తప్పనిసరిగా ఇంగ్లీషులోనే ఉండాలి
ఇలా చేర్చిన వీడియో , వ్యాసంలో ఇలా కనిపిస్తుంది , ఇక్కడ మార్చు ని క్లిక్ చేయటం ద్వారా వీడియో పరిమాణం మార్చుకోవచ్చు
పునఃశ్చరణ అంశాలు
కొత్త వ్యాసం ఎలా రాయాలి
వికీపీడియాలోని ముఖ్యాంశాల గురించి మీరీ పేజీలో చూడవచ్చు.https://te.wikipedia.org/wiki/వికీపీడియా:5_నిమిషాల్లో_వికీ
కొత్త వ్యాసాన్ని రాయాలి అంటే ముందుగా మనం ఏదోక అంశాన్ని ఎంచుకోవాలి . ఆ ఎంచుకున్న అంశం ఇదివరకే వికిపీడియాలో ఉందా లేదా అని cross check చేయాలి.
ఇదివరకే ఆ అంశం గురించి వ్యాసం ఉన్నట్లైతే ఇంకో అంశాన్ని ఎంచుకోవాలి .
ఒక అంశం గురించి వ్యాసం రాయాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాల గురించి తెలియాలంటే వికీపీడియా:శైలి అనే వ్యాసాన్ని చదవండి
కొత్త వ్యాసం ఎలా రాయాలి
Account సృష్టించుకోవడం పూర్తి అయ్యింది అంటే దాని అర్థం మీరు కొత్త వ్యాసాన్ని రాయడం లేదా ఇదివరకే ఉన్న వ్యాసాలలో మార్పులు , చేర్పులు చేయడం మొదలు పెట్టొచ్చు అని అర్థం.
కొత్త వ్యాసాన్ని రాయాలి అంటే ముందుగా మనం ఏదోక అంశాన్ని ఎంచుకోవాలి . ఆ ఎంచుకున్న అంశం ఇదివరకే వికిపీడియాలో ఉందా లేదా అని cross check చేయాలి.
ఇదివరకే ఆ అంశం గురించి వ్యాసం ఉన్నట్లైతే ఇంకో అంశాన్ని ఎంచుకోవాలి .
ఒక అంశం గురించి వ్యాసం రాయాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాల గురించి తెలియాలంటే వికీపీడియా:శైలి అనే వ్యాసాన్ని చదవండి
కొత్త వ్యాసాన్ని మొబైల్ లో రాయడం
search bar లో రాయాలి అనుకున్న పేరును టైప్ చేయండి.
మీరు టైప్ చేసిన పేరుతో వ్యాసం ఉన్నట్లైతే మీకు నీలం రంగులో ఆ పేరుతో ఉన్న వ్యాసాల పేర్లు కనిపిస్తాయి .
ఒకవేళ మీరు టైప్ చేసిన పేరుతో వ్యాసం లేనట్లయితే ఎరుపు రంగులో కనిపిస్తుంది . అలా ఎరుపు రంగులో కనిపించిన దాని పై కిక్ చేస్తే కొత్త పేజీ క్రియేట్ అవుతుంది .
కొత్త పేజీ
మీరు రాసిన వ్యాసానికి తప్పనిసరిగా మూలాలు , వర్గాలు , ఇతర లింక్ లు ఇవ్వాలి .
ముందుగా మీరు రాయదల్చుకున్న వ్యాసాన్ని మీ మొబైల్ లో నోట్స్ అనే appలో సులభంగా Gboard లో ఉన్న లిప్యంతీకరణ సహాయంతో కానీ , వాయిస్ టైపింగ్ టూల్ సహాయంతో కానీ రాసి , ఆ తరువాత ఆ వ్యాసాన్ని copy చేసుకుని మీరు కొత్త వ్యాసం పేరుతో క్రియేట్ చేసిన పేజీలో paste చేసి ప్రచురించవచ్చు .
అలా కొత్త పేజీ క్రియేట్ అయినట్లయితే ఇక మీరు వ్యాసాన్ని రాయడం మొదలు పెట్టొచ్చు అని అర్థం.
మొబైల్‌లో అనుకూలత – పరిమితులు
మొబైల్‌లో అనుకూలత పరిమితం. మొబైల్ వీక్షణలోని వికీపీడియా వర్గాలను లేదా చాలా టెంప్లేట్‌లను చూపదు. మొబైల్ సైట్‌లోని విజువల్ ఎడిటర్ ఐప్యాడ్ యొక్క డిఫాల్ట్ బ్రౌజర్‌తో పనిచేయదు
స్మార్ట్‌ఫోన్లో వికీపీడియాను మొబైలు సైటు గానే కాకుండా, డెస్క్‌టాపు సైటును కూడా చూడవచ్చు. స్మార్ట్‌ఫోనులో వికీపీడియాను రెండు విధాలుగా చూడవచ్చు: మొబైల్ సైటు ఒకటి కాగా, వికీపీడియా యాప్ ద్వారా చూడడం రెండో విధానం.
ఇక్కడ ఒక్కోసారి వికీలో లేని వ్యాసం ఎరుపు రంగులో కనపడక పోవచ్చు అప్పుడు పేజీ కింద ఉన్న మొబైల్ వీక్షణ నుండి డెస్కుటాప్ కు మారాలి ఆప్పుడు వ్యాసం సృష్టించటానికి ఎరుపు రంగులో లింక్ కనిపిస్తుంది
మొబైల్ స్కిన్ మినర్వా న్యూ కొత్త పాఠకుల కోసం ఆప్టిమైజ్ చేయబడింది
మొబైల్ పరికరాల్లో మౌస్లేదు, మరియు కొన్నిటూల్ బార్ ఐకాన్ లను ఎంచుకోవడానికి అనుమతించే టచ్ స్క్రీన్ ఇంటర్ ఫేస్ ను కలిగి ఉండకపోవచ్చు
కానీ ప్రాథమిక వికీ మార్కప్ లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి.
వికీపీడియా అనేది పాఠకులే సామూహికంగా రాస్తున్న ఒక విజ్ఞాన సర్వస్వము. ఈ సైటు ఒక వికీ.. అంటే, ఎవరైనా — మీతో సహా — ఏ వ్యాసాన్నయినా మార్చవచ్చు అని. కానీ, అది చెయ్యబోయే ముందు ఈ వ్యాసాన్ని చదవండి,వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.
ఈ ప్రదర్శన క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్-షేర్‌అలైక్ 4.0 అంతర్జాతీయ లైసెన్సు క్రింద ఉన్నది. ఇది వికీపీడియా అధీకృత పాఠ్యము కాదు, ఏమైనా సూచనలు సలహాలనుసంప్రదించండి, ఇది వికీనిపరిచయం చేయటానికి మాత్రమే ఉద్దేశించినది, దీనిని మీరు స్వేచ్ఛగా పంచుకోవచ్చు, మెఱుగు పరచవచ్చు .వికీపీడియా మరియు వికీమీడియా లోగోలు లాభాపేక్షలేని సంస్థ అయిన వికీమీడియా ఫౌండేషన్ ఇంక్ యొక్క కాపీరైట్ మరియు రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌లు.
వికీమీడియా లోగోలు మరియు ట్రేడ్‌మార్క్‌ల ఉపయోగం వికీమీడియా ట్రేడ్‌మార్క్ విధానం మరియు దృశ్యమాన గుర్తింపు మార్గదర్శకాలకు లోబడి ఉంటుంది మరియు దీనికి అనుమతి అవసరం కావచ్చు.
శిక్షణా తరగతులు - సమాప్తం - ధన్యవాదములు
వికీపీడియాలో వున్న ప్రతి విషయం ప్రపంచ వ్యాప్తంగా వున్న మీలాంటి వారు వ్రాస్తున్నదే. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా వున్న ఇలాంటి వికీపీడియన్లు విషయాలను, వ్యాసాలను, బొమ్మలు మొదలగు విజ్ఞాన విషయాలను చేర్చక పోతే ఈ వికీపీడియా అంతర్జాలంలో ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞాన భాండాగారంగా అవిర్భవించేది కాదు వికీపీడియాలో పాల్గొంటున్న వారిలో అత్యధికులు ఇది వినోదాన్ని, విజ్ఞానాన్ని కానుకగా అందించే అద్భుతమైన అనుభవాన్ని పొందుతారు. సామాజిక దృష్టిలో ఒక లక్ష్యం కొరకు పనిచేయడం వింత అయినప్పటికీ క్రియాశీలక వికీపీడియన్లు తమకు తెలిసిన పరిమిత విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడానికి సంతోషిస్తున్నారు. వికీపీడియాలో ఏదైనా వ్రాయడానికి మొదటగా చేయ వలసిన మంచి పని వాడుకరి ఖాతా తెరుచుకోవటం. ఖాతా తెరచినవారు వికీపీడియాలో క్రొత్త వ్యాసాలు వ్రాయవచ్చు. బొమ్మలను ఎక్కించవచ్చు, వ్యాసాలకు కొత్త పేర్లను సూచించవచ్చు. అంతేగాక, వారి వీక్షణా జాబితాలోకెళ్ళి తాము ఇదివరకు వ్రాసిన వ్యాసాలలో జరుగుతున్న సవరణలు చూడవచ్చు.
ఏమైనా సందేహాలు లేదా మరింత సమాచారం కోసం 9014120442 or tewiki@iiit.ac.in ను సంప్రదించండి.