ఎనిమిది ఏండ్ల క్రితం ‘శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రిక’ ద్వారా తెలుగు సాహిత్య సేవకు శ్రీకారం చుట్టింది అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో నెలకొని ఉన్న టాగ్స్ సంస్థ. ఇది మనందరి పత్రిక. మనదైన అచ్చ తెనుగు పత్రిక. ఈ తెలుగు భాషా సేవా యజ్ఞంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా భాగస్వాములు కావాలి.
ఈ సందర్భంగా పాఠకుల నుండి, పత్రిక సంపాదకత్వంలో స్వచ్చందంగా పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారి నుండి, రచనలు చేయడంలో అనుభవం ఉన్నవారి నుండి అభిప్రాయ సేకరణకు టాగ్స్ సంస్థ ఉపక్రమించింది. మీరు చేయవలసినదల్లా, మీ అమూల్యమైన సమయంలో 5-10ని. వెచ్చించి
క్రిందనున్న అభిప్రాయ సేకరణ ప్రశ్నావళి పూరించి "Submit" బటన్ నొక్కగలరు.