అమౌర్ - క్వీర్ (LGBTIQA+) వ్యక్తుల partner (ల) అన్వేషణకి ఒక వేదిక
For other language forms visit(ఇతర భాషల కోసం క్లిక్ చేయండి): http://amourqueerdating.blogspot.in/

అమోర్(Amour), దీర్ఘకాలిక భాగస్వామి(లు)/long term partner(s) వెతికే క్వీర్ (Queer - LGBTQIA+) వ్యక్తుల కోసం రూపొందించబడిన ఒక వేదిక. ఇది హూకుప్స్/సెక్స్ కోసం కాదు (ఎందుకంటే వాటి కోసం పేరొందిన వేదికలు ఆల్రెడీ ఉన్నాయి). అమోర్(Amour) గురించి మరిన్ని వివరాలకొసం click చేయండి : http://amourqueerdating.blogspot.in/

అమోర్ profile డేటాబేస్ access చేయాలంటే, క్రింది ఫారం నింపి మీరు కూడా ప్రొఫైల్ create చేయాల్సి ఉంటుంది. దయచేసి అన్ని వివరాలు నిజాయితీ గా పూరించండి. ఇంకా, వివరణాత్మక ప్రశ్నల్లో మీ ప్రాధాన్యతలను వివరించేటప్పుడు, ఇతరుల భావాలను కించపరచని విధముగా జవాబులు ఇవ్వవలెనని మనవి. మీ ప్రోఫైల్ లో, ద్విలైంగికసంపర్కుల గురించి(Bi-sexual) కానీ , స్త్రీ లక్షణాలున్న(effeminate)పురుషుల గురించి కానీ, లింగనిర్బద్ధుల (trans) గురించి కానీ, చర్మరంగు గురించి కానీ,శరీరాక్రుతుల గురించి కానీ దూషిస్తే మీ ప్రోఫైల్ delete చేయబడుతుంది. మీ గూగుల్/gmail ID ద్వారా ఎప్పుడైనా మీ పూరించిన ప్రోఫైల్ లో సవరణలు/మార్పులు చెసుకోవచ్చును. ఏదైన వివాదం విషయంలో, నిర్వాహకుల(admins) దే తుది నిర్ణయం.

మీరు ఈ form ని మీకు నచ్చిన ఏ భాషలోనైన నింపవచ్చును.ఏవైనా ప్రశ్నలు లెదా ఎంపికలు(options) అర్థంకాకపొతే నిర్వాహకుల(admins)ను సంప్రదంచండి.

ఉదాహరణల కోసం ఈ లింక్ చూడొచ్చును:
https://docs.google.com/spreadsheets/d/1mJgcoTgYkQ42XRzduQKDNJQn182xW2Ntn62oBSYy1U4/edit?usp=sharing

అమోర్ ప్రోఫైల్ ID
నిర్వాహకులు(admins) మీకు ఇచ్చిన అమోర్ ఐ.డి ఇక్కడ నింపండి. మీకు ప్రోఫైల్ ID, లేనట్లైతే form నింపే ముందే నిర్వాహకుల(admins) ను ఈ-మెయిలు (amour.queer@gmail.com) లేదా Amour ఫేసుబుక్కు పేజీ ద్వారా సంప్రదించగలరు.
లింగం (Gender/Gender Identitiy)
దయచేసి మిమ్మల్ని మీరు అత్యంత ఎక్కువగా గుర్తించే లింగము(Gender)ను ఇక్కడ ఎన్నుకోండి. మీ gender క్రింది జాబితా లో లేకపోతె గనక, " Other/ఇతర" ద్వారా మీకు నచ్చిన పరిభాష లో వివరించండి.
లింగ భావశైలి (Gender Expression)
ఐచ్ఛికము(Optional). మీ కాబొవు భాగస్వాములకు తెలియాలి అనుకొంటే మాత్రమే జవాబు ఇవ్వండి .1-5 ప్రమాణికము మీద ఏ మేరకు మీ లింగ భావశైలి (వెషధారణ,అలవాట్లు,మాటతీరు ఇతరత్ర లాంటివి ) సాంప్రదాయిక ప్రత్యాశలకు ఎంత విరుద్ధమో గుర్తించగలరు. ఇందులో మీ భావశైలి 1 అత్యంత సాంప్రదాయకం (Traditional or straight acting as some call it) ఐతే, 5 అత్యంత ప్రత్యేకం (very different) అని లెక్క .
Traditional (సాంప్రదాయకం)
Very Different (అత్యంత ప్రత్యేకం)
భాగస్వామి ఎన్నిక-లింగము (Person(s) of interest)
మీ భాగస్వామి ఏ లింగమునకు చెందివుండాలి అని ఆశిస్తున్నారో ఇక్కడ ఏన్నుకోండి.మీ ఎన్నిక క్రింది జాబితాలో లేకపోతె గనక " Other/ఇతర" ద్వారా వివరించండి.
పుట్టిన సంవత్సరం
దయచేసి మీ పుట్టిన సంవత్సరం(ఉదాహరణ .1994) ఇక్కడ పూరించండి. తెలియచేయకూడదనుకునట్లయితే "తెలియపరుచుట ఇష్టము లేదు" అని రాయగలరు.
వృత్తి
దయచెసి మీ ఉద్యొగ వివరలు ఇక్కడ పూరించండి. తెలియచేయకూడదనుకునట్లయితే "తెలియపరుచుట ఇష్టము లేదు" అని రాయగలరు..
ప్రదేశము
మీరు ప్రస్తుతం ఉంటున్న నగరం/ప్రదేశము పేరు తెలుపగలరు . మీరు ఉంటున్న ప్రదేశమును తెలియచేయకూడదనుకునట్లయితే "తెలియపరుచుట ఇష్టము లేదు" అని రాయగలరు. ఇంగ్లీష్ లో రాస్తే గనక అందరు వాడే స్పెల్లింగ్ వాడగలరు. Eg. Bengaluru, Mumbai, Chennai, New Delhi, Hyderabad, Kolkata, Pune, Kochi, Coimbatore, Thiruvananthapuram, Guwahati etc.
భాగస్వామి(ల) - ప్రదేశము
దయచేసి మీ కాబోవు భాగస్వామి(లు) ఏ ఏ ప్రాంతం నుంచి ఉండాలని ఆశిస్తున్నారో ఇక్కడ పేర్కొనగలరు. మీ సమాధానం "Any/ఎక్కడైనను", "Coastal Andhra/కోస్తాంధ్ర" ,"Anywhere in South India/దక్షిణ భారతదేశమునందు ఎక్కడైనను", లేదా "తెలియపరుచుట ఇష్టము లేదు" లాంటివి అయినా పరవా లేదు.
భాషలు
దయచేసి మీ కాబోవు భాగస్వామి(లు) ఏ భాష మాట్ట్లాడ గలిగి ఉండాలని ఆశిస్తున్నారో ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పేర్కొనగలరు లేదా "భాష ప్రాధాన్యత లేదు" అని కూడా పూరించొచ్చు.
సాంగత్య స్వభావము(Nature of Relation)
మీరు ఆశించే సాంగత్యం/సంబంధం ఎటువంటి స్వభావము కలిగినదై ఉండాలని ఆశిస్తున్నారో ఇక్కడ ఎన్నుకోగలరు. క్రింది జాబితా లో మీ ఎన్నిక లేకపోతె గనక, " Other/ఇతర" ద్వారా మీకు నచ్చిన పరిభాష లో వివరించండి.
ఏ రకమైన బంధం? (Type of Relation)
దయచేసి, మీకు అత్యంత ఆసక్తి ఉన్న భాగస్వామ్యం/బంధం / సంబంధం గురించి వివరించగలరు . మీ ఎంపిక క్రింద జాబితా లో లేకపొతే గనక, " Other/ఇతర" ద్వారా మీకు నచ్చిన పరిభాష లో వివరించండి.
ఎవరు మిమ్మల్ని డేట్ చేయచ్చు?
మీరు ఎటువంటి వారంటే మక్కువ చుపుతారో లేక ఎటువంటి వారు మీ మీద మక్కువ చుపితే సంతోషిస్తారో దయచేసి వివరంగా తెలుపగలరు. మీకు సాధారణంగా నచ్చే వ్యక్తిత్వ లక్షణాలు వర్ణించవచ్చు .(ఉదాహరణకు :నెమ్మదైన వినయ విధేయతలున్న వ్యక్తి అంటే నాకు ఇష్తం. దయచేసి అప్రియమైన, అసభ్యకర పదాలు ఉపయోగించకండి)
మీలోని ఆకర్షణాత్మక లక్షణాలు ?
మీరు మీలో కాబొవు భాగస్వాములను ఆకర్షించగల ఏమేమి లక్షణాలు ఉన్నాయని అనుకుంటున్నారో , వాటిని వివరించండి. మీలోని దీర్ఘకాలంలో మీ బంధానికి సహాయపడే, నిర్దిష్ట, స్థిరమైన వ్యక్తిత్వ లక్షణాలు వివరించటం మంచిది. దయచేసి అప్రియమైన అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించకండి.
మిమ్మల్ని డేట్ చెసే ముందు,వారికి మీ గురించి ఏం తెలియాలి?
మీలో ఆశక్తి చూపువారికి మీ గురించి మీరు ఎమి చెప్పాలనుకుంటున్నరో ఇక్కడ వివరించగలరు. మీ గురించీ, మె స్వభావం లొ ఉన్న సుగునాల గురించీ అలాగే ప్రతికూలల గురించీ, మీ లైంగిక వాంఛలు గురించీ , ఈ భాగస్వామ్యం నుంది మీ ఆశలు, ఆశక్తుల గురించీ, మీకు ఆవశ్యకమైన విలువలు గురించీ నిజాయితీగా ఇక్కడ తెలుప గలరు. అలాగే మీ (అంగ)వైకల్యం, హెచ్.ఐ.వి స్టేటస్, జన్మతహా లింగము, ఉభయలింగత్వము, ప్రతిబందకములు లాంటి వాటి గురించి కూడా కావాలంటే వ్రాయొచ్చు. దయచేసి అసభ్యపదజాలమును వాడకండి, సూటిగా మర్యాదపూర్వకమైన మాటలతో వివరించగలరు.
మీ ఆశక్తులు / Passion(s)
మీ అప్పుడప్పుడు సరదాలు కాకుండా మీ స్వభావానికి అద్ధం పట్టే మీ చిరకాల ఆశక్థుల గురించి ఇక్కడ తెలుపగలరు. విహార యాత్రలు , దేశ పర్యటనలు, యోగా, వంట చేయడం, క్రీడలు, గానం, నాట్యం, సాహసక్రుత్యాలు, కొన్ని ఉదాహరణలు. చెప్పటం ఇష్టం లేకపోతె 'ఏమీ లేవు' అని రాసినా పర్వాలేదు.
ఏదైనా ప్రొఫైల్ లింక్/ Any profile link?
మీకు సరైయిన భాగస్వామి తో జొడీ కుదరడానికి సహాయపడే ఏదైనా అధిక సమాచారముని ఇక్కడ పంచుకోగలరు. మీకు ఇష్టమైయితే మీ సోషల్ మీడియా, బ్లాగు లింకులను PR/FB/Instagram/Okcupid లేదా వేరే IDలను ఇక్కడ పంచుకోగలరు. మీకు ఎప్పుడు కావలంటే అప్పుడు ఈ సమాచారన్ని గూగుల్ ఐ.డి ద్వారా సవరించుకోగలరు.
జీమెయిల్ ఐ.డి / Gmail or Google ID
ఇది కేవలం అడ్మిన్స్ కోసం మాత్రమే, ఎక్కడా బహిరంగముగా కనపడదు. ఈ ID ద్వారా admins మీకు ప్రొఫైల్ డేటాబేస్ కి access ఇస్తారు.
(amour.lgbtq.co.in లో ఉన్న) అమౌర్ guidelines కి నేను పూర్తి సమ్మతి తెలుపుతూ, నా ఫేస్బుక్/ఇమెయిల్ ID క్రింది వారికి షేర్ చేయటానికి నేను ఒప్పుకొంటున్నాను.
మీ ఫోటోను అప్లోడ్ చేయాలనుకుంటే ...
మీరు అనుచితమైన లేదా వేరొకరి చిత్రాన్ని అప్లోడ్ చేస్తే నిర్వాహకులు మీ ప్రొఫైల్ను తొలగించవచ్చు.
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Additional Terms