ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ చరరాశులు మరియు స్థిర రాశుల లబ్ధం తో పదాలు ఏర్పడును. కొన్ని పదాల సంకలనం(+) లేదా వ్యవకలనం(-) లేదా రెండింటి చే సమాసాలు ఏర్పడును. సమాసంలో ఒకే ఒక పదం ఉంటే ఏక పది అనీ, రెండు పదాలుంటే ద్వి పది అనీ, మూడు పదాలుంటే త్రి పది అని అంటారు.