ప్రవక్తలు

గ్రంథకర్త : శేఖర్‌రెడ్డి వాసా

www.FaithScope.com

నీ మరణానంతరము నీ ఆత్మ ఎక్కడ వుండబోవుచున్నదో నీకు తెలుసునా?

మూలము

రెడ్డిపాళెం గ్రామములోని నా ప్రభువు తల్లి ఉపదేశములు మరియు ఆమెను ఆవరించిన పరిశుద్ధాత్మయొక్క జ్ఞాన సహాయమే ఈ పుస్తక రచనకు మూలాధారము.

అంకితము

ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించి నన్ను ప్రేమించిన క్రీస్తు ప్రభువుకు అంకితమిస్తున్నాను. -  వాసా శేఖర్‌రెడ్డి

గ్రంథపరిచయ వాక్కులు

        ప్రియపాఠకులారా!  పాతనిబంధన కాలములోని ప్రవక్తలు అనేక గ్రంథములు వ్రాయుట జరిగింది.  ఇందులో ప్రత్యేక గుర్తింపు గలిగిన గ్రంథము ప్రతి ఒక్కరు మరల మరల చదివే గ్రంథము యెషయా వ్రాసిన గ్రంథము.  ఈ గ్రంథము చాలా సులభ రీతిగా వ్రాయబడినను అక్కడక్కడ ప్రత్యేక మర్మములను పెంపొందింప చేసాడు.  ఉదాహరణకు బాలకులు బాల చేష్టలు చేసి జనులను ఏలడమేమిటో?  సర్పబీజము విషనాగు ఎగురు సర్పము ఇవియేగాక మకరము అను పేరుతో తీవ్రసర్పము వంకర సర్పము సముద్ర మార్గమందున్న సర్పము మరియు తూర్పున నుండి రప్పించు క్రూరపక్షి ఇవి ఏమిటో మానవ జ్ఞానమునకు వాని ఊహలకు అందనట్టి జ్ఞానము ఈ పుస్తకములో అనేకములున్నవి.  ఈ మర్మములను ప్రతి ఒక్కరు తెలుసుకొనుట మంచిది అన్న ఉద్ధేశ్యముతో ఈ పుస్తకమును వ్రాయుట జరిగినది.  కనుక యెషయా గ్రంథమును ఆమూలాగ్రముగ చదివి అర్థము చేసుకోవాలనుకొన్నవారికి ఈ పుస్తకము ఒక గొప్ప అవకాశము.  ఇందులో వివరించబడిన అంశములతోబాటు యెషయా గ్రంథమును వరుసగా చదువుచూ - ఆ భాగమునకు వచ్చుసరికి ఈ అంశములను జోడించి చదివిన మరింత ఎక్కువగా నేర్చుకొను అవకాశమున్నది.  అంటే మొదట బైబిలు గ్రంథమును తీసుకొని యెషయా గ్రంథములో వాక్యములను చదవాలి.  ఈ గ్రంథములో వ్రాసిన అంశము యొక్క రెఫరెన్స్‌ వచ్చుసరికి ఆ రెఫరెన్స్‌ చదివి, వెంటనే ఈ పుస్తకములోని అంశము చదివిన యెషయా వ్రాసిన ఉద్ధేశ్యములను బహు ఖచ్చితమైన రీతిలో మనకు సులభముగా అర్ధము అగునని గుర్తించాలి.

        ఈ అంశములు వ్రాస్తూ నేను ఎంతగానో ఆనందించాను.  మీరు కూడా చదివి తమ జీవితాలను సరిజేసుకొని మీ పొరుగువారికి కూడా అందించి ఆనందించాలని ఈ పుస్తక రూపములో వెలువరించుట జరిగింది.

    నెల్లూరు.                                                      ఇట్లు

తేది :                                                             గ్రంథకర్త.

                                                           

1.  పుత్రశోకము

        యెషయా 1:2, ''యెహోవా మాటలాడుచున్నాడు  ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. - నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని  వారు నా మీద తిరగబడి యున్నారు.''  

        ప్రియపాఠకులారా! ఈ వేద భాగములో దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుచూ తన బిడ్డలమైన మన విషయములో పుత్రశోకము పొందినట్లు ఈ వాక్యము ద్వారా తెలియుచున్నది.  అసలు పుత్రశోకమంటే ఏమిటి?  పుత్రశోక దు:ఖమను గుణము భూమిపై ఈ క్రింది విధముగా క్రియ జరిగిస్తున్నట్లు మనకు తెలియగలదు.  పుత్రులు పుట్టలేదని తల్లి దండ్రులు దేవునికి జేయు విజ్ఞాపన ప్రార్థనలు, హోమములు, బలియాగములు నేటికిని భూమి మీద జరుగుచున్నవి. ఎంత సిరిసంపదలున్నను ధనధాన్య కనకవస్తు వాహనము లున్నను, భోగభాగ్యమున్నను, రాజ్యాలు, రాణి వాసాలున్నను, రాజమందిరాలు, రాజ దర్భారులున్నను రాజ్యాలేలునట్టి రాజులకు తమ తదనంతరము తమ వంశ వారసత్వమునకు వారసులు లేరనునట్టి కొరత ప్రతి రాజుకును, ప్రతి సర్దారుకును, ప్రతి కోటీశ్వరునికిని, లక్షాధికారికిని తీవ్ర సమస్యను సృష్టిస్తున్నది.  అయితే గర్భమున పుట్టి పెరిగి పెద్దవారై తండ్రియొక్క సకల ఐశ్వర్యములను పొంది, అనుభవిస్తూ తండ్రిపై తిరుగుబాటు చేయుచున్న బిడ్డలను గూర్చి తండ్రి అంగలార్చినట్లుగా సృష్టికర్తయైన దేవుడు యావద్‌ నరసృష్టికి తండ్రియై యుండి, తన సృష్టియైన నరులు అనగా తన బిడ్డలైనట్టి జనకోటి తన సృష్టియొక్క సంపదలననుభవిస్తూ-తనపై తిరుగుబాటు జేయుచున్న మనలను గూర్చి పై వేద భాగములో యెషయా గ్రంథములో పుత్రశోకమును పొందినట్లుగా మనము చదువగలము.

        అసలు పుత్రశోకమనునది పాత నిబంధన నుండి నూతన నిబంధన వరకును ఏయే విధములుగా క్రియ జరిగించిందో ఈ క్రింది రెఫరెన్సుల ద్వారా చదివి తెలుసుకో గలము. నరులలో పుత్రశోకమేర్పడుటకు బీజము వేసినది అబ్రాహాము భార్య శారా (ఆదికాండము 21:11-12).  అటుతర్వాత అబ్రాహాము దాసియైన హాగరు పొందిన (ఆదికాండము 21:16) పుత్రశోకము భూమిపై దినదిన ప్రవర్థమానమై ఏశావు యాకోబులను ఆశీర్వదించు విషయములో ఇస్సాకు పుత్రశోకము పొందినట్లును, అటుతర్వాత యాకోబు కుమారులైన బెన్యామీను యోసేపులను గూర్చి యాకోబు పొందిన పుత్రశోకము.  అటుతర్వాత దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయుల విషయములో దేవుడు పొందిన పుత్రశోకము.  సమూయేలు 1:10-11 హన్నా బహు దు:ఖాక్రాంతురాలై మగ సంతాన విషయమై యెహోవా సన్నిధిలో అంగలార్చెను.  దావీదు మహారాజు ఊరియా భార్యకు తనకు పుట్టిన బిడ్డ విషయములోను మరియు తన కుమారుడైన అబ్షాలోము తనపై తిరుగుబాటు చేసి యుద్ధమునకు బయలుదేరి మస్తకి వృక్షపు కొమ్మలకు తగుల్కొని వ్రేలాడబడి బాణములచే కొట్టబడి, హతమార్చబడినప్పుడు దావీదు పొందిన పుత్రశోకము.  నూతన నిబంధన కాలములో లూకా 2:35లో సుమెయోను మరియమ్మతో-నీ హృదయము లోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని దేవుని ప్రవక్త ద్వారా పలుకబడిన రీతిగా-యేసు ప్రభువు సిలువ మరణ కాలములో తల్లియైన మరియమ్మయొక్క సప్త వ్యాకులములతో కూడిన పుత్రశోకమును మత్తయి 2:16-18లో వివరించబడి యున్నది.  లోకములో పుత్ర శోకమునకు మూలకారకురాలు స్త్రీయని ఇందునుబట్టి తెలియుచున్నది.  ఎట్లనగా దేవుని కుమారుడైన ఆదామును కూడా ఆదిలో సర్పపు మాటలకు లోనై దేవునికిని ఆయన కుమారుడైన ఆదామునకును, వారి స్వాస్థ్యమైన ఏదెను వనమునకును కలతలు పెట్టి దేవుని బిడ్డయైన ఆదాముపై వున్న దైవప్రేమ నుండి నరుని దూరపరచి, దైవపుత్రుడైన నరునికి కళంకము అంటగట్టినది.  

        ఇందునుబట్టి దైవత్వమునకు అతనిని దూరునిగా జేసినందున దేవుడు కూడా ఆదికాండము 6:5-6 నరులను సృష్టించినందుకు పుత్రశోకము పొందినట్లుగ విదితమగుచున్నది.  ఇందునుబట్టి చూడగా భూమి కూడా ప్రభువుయొక్క రెండవ రాకడలో తన బిడ్డలైన దేహ సంబంధులైన నరులను గూర్చి పుత్రశోకమును పొందుచూ-తన కుమారులైన నరులను బట్టి తనకు సంభవించబోవు నాశనకరమైన శిక్షను బట్టి భయకంపితురాలై, శిక్ష నుండి తప్పించుకొనుటకు యుక్తితో కూడిన క్రియలను భూమి జరిగిస్తున్నట్లు మనము గ్రహించగలము.  ఎట్లనగా ఆది నుండి ఆది మానవుని ద్వారా ఏవిధముగా శాపము లోకములో ప్రవేశించెనో, అదే విధముగా దైవశాపము వల్ల ఆదిలోని స్త్రీ నుండి పుత్రశోకమను గుణము లోకములో ప్రవేశించినట్లు తెలియుచున్నది.  ఈ పుత్రశోకమన్నది నరకోటి లోక ప్రవేశము అనగా జ్ఞాన వికసింపు గల్గినది లగాయతు మరణ పర్యంతరమును ఉన్నట్లును, ఇది గొడ్రాలికిని, సంతానవతికిని, ఉన్నట్లు ఈ క్రింది వేద భాగముల ద్వారా తెలిసికోగలము.  యెషయా 54:1, ''గొడ్రాలా, పిల్లలు కననిదానా, జయగీతమెత్తుము, ప్రసవవేదన పడనిదానా, జయకీర్తన నెత్తి ఆనందపడుము.''  అనగా సంతానము లేదని పుత్రశోకముతో ప్రలాపించుదానా అని అర్థము.  న్యాయాధిపతుల గ్రంథము 11:34-40లో యెప్తా తన కుమార్తెను దేవునికి అర్పణను చేయు విషయములో కూడా పుత్రశోకము పొంది, దేవునికి తాను జేసిన వాగ్దాన నెరవేర్పును జరిగించినట్లు మనము వేదములో చదువగలము.

        ఈ పుత్రశోకమనునది మృగపక్షి సముదాయములలో సైతమున్నట్లు తెలియు చున్నది.  ఉదా:- కాకులు తమ పిల్లలు కానరానప్పుడు గోల జేయుట.  ఎలుగుబంటి, ఏనుగు, పులి, సింహము, ఆవు, గేదె, కోతులు వగైరా జంతు జాలములు అప్పుడప్పుడు తమ పిల్లలను కోల్పోయి పుత్రశోకము పొందుచున్నట్లుగా మనము చూస్తుంటాము.  అయితే ఈ పుత్ర శోకమనునది జంతువులలో ఒకరోజు రెండు రోజులు మాత్రమే అనగా కొలది కాలము మాత్రమే క్రియ జరిగించి వాటిని మరపింపజేయును.  అయితే నరులలో మరపురాని దు:ఖమునకు ఇది మూలకారములై బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకును బంధుకోటికిని నిద్రాహారములు లేకుండా బహు తీవ్రమైన వేదనకు మూలమగుచున్నది.  ఇందుకు ఉదాహరణగా యేసు ప్రభువు చెప్పిన లూకా 15:12లోని తప్పిపోయిన కుమారుని కథలో తండ్రి తన కుమారుడు తన కన్నుల యెదుటనే తన ఆస్థితో బయలుదేరి దూరదేశము వెళ్ళిన కుమారుడు తనను వదలి వెళ్ళినందుకు ఆ తండ్రి పొందిన పుత్రశోకమును గూర్చి మనము చదువగలము.        కనుక భూమి మీద విలయ తాండవమాడుచున్న ఈ పుత్రశోకమను గుణము ఎంతో కాలము సాగదు.  ఎందుకనగా మన బిడ్డలకు మనము తండ్రులము గావచ్చు.  

        మన మనవళ్ళకు మన బిడ్డలు తండ్రులుగావచ్చును.  మన తరములన్నిటికిని దేవుడైన తండ్రి యొకడున్నాడు.  1 కొరింథీ 4:16లో వలె ఆయన మన విషయమై మన కొరకు ఆయన దాచియున్న స్వాస్థ్య విషయమై, ఆ స్వాస్థ్యమును మనము పొందుటకు యోగ్యతను సంపాదించుకొను నిమిత్తము మనలను గూర్చి ఆయన దినమెల్ల పుత్రశోకము పొందు చున్నాడు.  ఎందుకనగా మనమనేక విషయములలో ఆయన నిబంధనల నుండి తొలగి, తుచ్ఛమైనదియు, అనిత్యమైనదియు, అస్థిరమైనదియు అయిన ఈ లోకాన్నే అంటిపెట్టుకొని జీవిస్తున్నాము.  కాని స్థిరమైనదియు, శాశ్వతమైనదియు, నరులచే కట్టబడనిదియునైన నిత్య రాజ్యముయొక్క వారసత్వమునకు మరియు ప్రకటన 21:1లో వలె నూతనాకాశము, నూతన భూమిని పొందుటకు మన పాపముల నిమిత్తము పశ్చాత్తాప్తులమై శోకించవలసిన యుగములో మనమున్నాము.

        ఇప్పుడు మనము పొందవలసిన పుత్రశోక మొకటున్నది.  మనము కనిన బిడ్డలు పాప జీవితములో కొట్టుమిట్టాడక ఆత్మ దేవునియొక్క ఆదరణ, సావాసము, అనుగ్రహము, దైవదాసుల సాంగత్యము వగైరాలను గూర్చి బిడ్డలకు నేర్పి, వారి జీవితమును భ్రష్టత్వము పట్టించక, వారి నిమిత్తమై ప్రతి నిత్యము ఉదయ సాయంత్రములు పరలోక దేవుని సన్నిధిలో పుత్ర శ్రేయస్సు కోరి, ప్రలాపించి, ప్రార్థించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవ కుటుంబమునకును ఉన్నదని గ్రహించాలి.  ఆదికాండము 49:1, ''యాకోబు తన కుమారులను పిలిపించి యిట్లనెను-మీరుకూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసెదను.''  అంతిమ విషయములనుగూర్చి యాకోబు బోధించెను.  యోబు తన కుమారుల విషయములో బలులర్పించుచు వారేదైన దైవ వ్యతిరేకమైన పాపములో పడుదురేమోనని జాగ్రత్త వహించెను.

        నేటి క్రైస్తవులమైన మనము మన బిడ్డల విషయములో మన పుత్రశోకమెట్లున్నది?  దేవునికి ప్రీతికరముగా మన బిడ్డలను జేయుటకు శోకమును పొందియున్నామా?  వారిని లోకాశలకు బలిజేసి, లోకసంబంధులుగా జేసి, వారిచేత తిరుగుబాటు జేయించుకొని వారి ద్వారా అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, నిరాదరణ, అలక్ష్యము, విమర్శలకును గురియగుచు మన జీవితాలను నిరర్థకము జేసికుంటున్నామా?  మనమే జాబితాలో వున్నాము?  ప్రియపాఠకులారా,  ఇప్పుడే మనము మన పుత్ర శోకమును గూర్చి జాగ్రత్త పడుదుముగాక!

2.  నమ్మకమైన నగరము వేశ్య ఆయెనే!

        యెషయా 1:21, ''అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయెనే!  అది న్యాయముతో నిండియుండెను  నీతి దానిలో నివసించెను.  ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు.''

        ప్రియపాఠకులారా!  ఇంతకి నమ్మకమైన నగరము ఏది?  అన్నదానిని గూర్చి తెలుసుకోవలసి యున్నది.  ప్రకటన 17:14, ''వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచ బడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.''  ఇందునుబట్టి క్రీస్తు ప్రభువుతో వుండువారు నమ్మకమైనవారు.  వీరే పిలువబడినవారును, యేర్పరచబడిన వారుగా వున్నారు.  దేవుడు ఆదికాలము నుండి అనేకులను పేరుపేరున పిలిచి వారిని రాజులుగాను, న్యాయాధి పతులుగాను, ప్రవక్తలుగాను, మొదలైనవారిగా నియమించాడు.  

        ఉదా :-        1.  దావీదు :-  ఇతను గొఱ్ఱెల కాపరి.  కాని ఇశ్రాయేలు జనమునకు రాజుగా సమూయేలు ప్రవక్తచే దేవుడు పిలిపించాడు.  

                2.  పౌలు :-  నూతన నిబంధనలో ఇతను క్రైస్తవులకు కంటకునిగా వున్నవాడు.  కాని క్రీస్తు ప్రభువు - ''సౌలా, సౌలా,'' అని పిలిచాడు.  ఇలా అనేకులను పేరుపేరున దేవుడు పిలిచి వారిని తనవారిగా వుంచుకొని క్రియ జరిగించాడు.

        అలాగే యేర్పరచబడినవారు అనగా దేవునిచే ఎన్నికయైనవారు.  దేవుడు ఇశ్రాయేలీయ జనాంగమును అన్ని జనాంగాలలోకల్లా తన జనాంగముగా  ఏర్పరచు కొన్నాడు.  కనుక ఇశ్రాయేలీయులు  యేర్పరచబడినవారు.  క్రైస్తవులమైన మనము క్రీస్తు ప్రభువు ద్వారా క్రైస్తవులుగా రక్షణలోనికి పిలువబడితిమి.  ఈ రెండు విభాగములకు చెందినవారు దేవునికిని, గొఱ్ఱెపిల్లకును నమ్మకమైనవారుగా వుండి విజయమును చేకూర్చుదురు.

        దేవునిచే యేర్పరచబడినవారు మరియు పిలువబడినవారు, ఇద్దరును నమ్మకమైన వారుగా వుండి యుగాంతములో ఒక నగరమును ఏర్పరచుదురు.  అదే పరమ యెరూషలే మను పరిశుద్ధ నగరము.  

        ప్రకటన 21:2, ''మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవునియొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.''  ప్రకటన 19:8, ''మరియు ఆమె ధరించు కొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమె కియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.''

        ఈ పరమ యెరూషలేమను పరిశుద్ధ నగరమును దేవుడు ఎన్నుకొని దానిని మాదిరిగా భూమిపై ఇశ్రాయేలీయులను పేరుతో ఎన్నిక చేయుట జరిగింది.  ఈ ఇశ్రాయేలీయులపై దేవుని నమ్మకము అపారము.  అందుకే అన్ని జనాంగాలలోకి ఇశ్రాయేలీయులను తన జనాంగముగా ఎన్నుకొన్నాడు.  కనుక ఈ ఇశ్రాయేలీయులు నివసించు నగరము నమ్మకమైన నగరముగా పేరు పొందినది.  ఈ నమ్మకమైన నగరము వేశ్య ఆయెనే అని దేవుడు తన బాధను ఇందులో వ్యక్తపరుస్తున్నాడు.

        ఈ నమ్మకమైన నగరము దేవుని క్రియలతోను, సత్యదేవుని ఆరాధనతో నమ్మకముగా ఉండి వధువు సంఘముగా మారి గొఱ్ఱెపిల్లకు భార్యగా వెళ్ళవలసి యున్నది.  అయితే ఈ నమ్మకమైన నగరములోని వారు వేశ్యలుగా మారి ఈ నమ్మకమైన నగరమును కూడా గొప్ప వేశ్యగా మార్చారు.  ఎలా?  

        ఇశ్రాయేలీయులను పేరుతో పరిశుద్ధులుగా, నమ్మకమైనవారుగా దేవుడు పరమ యెరూషలేము నగరమును ముందుగా భూమిపై నిర్మించాడు.  అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, మోషే మొదలైనవారు దేవునికి యోగ్యరీతిగా జీవించిరి.  కాబట్టి వారు గొఱ్ఱెపిల్లకు వధువుగా మారుదురు.  ప్రకటన 19:8 మరియు ప్రకటన 21వ అధ్యాయము.  అయితే, మిగిలిన అనేకులు నమ్మకమైన నగరములో జీవిస్తున్నను విగ్రహారాధన, అన్యదేవతల పూజలు మొదలైన వాటిలో సాతానుకు అనుచరులైరి.  కనుక వారు సాతానుకు వధువులుగా మారిరి.  నిజానికి వీరు గొఱ్ఱెపిల్లకి వధువు.  అయితే సాతాను అనుచరులుగా మారి గొఱ్ఱెపిల్లకు వధువుగా వుండుటకు బదులు సాతానుకు వధువుగా వున్నారు.  కనుక గొఱ్ఱెపిల్లయైన క్రీస్తుకు వధువుగా వుండవలసిన నగరము అనగా నరులు సాతానుకు వధువుగా వున్నారు.  అంటే వీరు వేశ్యలుగా మారారు.  దీనికి కారణము యెహెజ్కేలు 16:17, అన్యదేవతా విగ్రహారాధనయే అని గుర్తించాలి.

        కనుక నమ్మకమైన నగరము వేశ్యగా మారిన తరువాత అందులో నీతి, న్యాయముతో వుండవలసిన వారు నరహంతకులతో నిండిపోయి ఉన్నట్లుగా చెప్పబడినది.

        ఉదా :-  ఆహాబు రాజు ఇశ్రాయేలుకు రాజు.  అయితే యెజెబేలు అను స్త్రీని మోహించి, ఆమె కోరిక మీద నాబోతుయొక్క ద్రాక్ష తోటను లాక్కోవటమే గాక అతనిని హత్య చేయించుట జరిగింది.  ఇలా నమ్మకమైన నగరము దేవునిలో వుండి, నీతి, న్యాయము, నిజమైన ఆరాధనలో ఉండుటకు బదులుగా సాతానుకు ప్రియమైన స్థితిలో జీవించుట చేత అది వేశ్యగాను, నరహంతకిగాను మారింది.

3.  బాలకుల అధికారము

        యెషయా 3:4, ''బాలకులను వారికి అధిపతులనుగా నియమించెదను  వారు బాలచేష్టలుచేసి జనులను ఏలెదరు.''

        ప్రియపాఠకులారా!  బాలుడైన దావీదు బాలకుడు, బాలుడైన సంసోను బాలకుడు, బాలుడైన సమూయేలు బాలకుడు, బాలుడైన అబ్షాలోము బాలుడే.  ''వారు బాలచేష్టలు జేసి జనులను ఏలెదరు,'' అనుటలో ఇశ్రాయేలు జనాంగమునకు నాయకుడైన మోషే విషయములో మోషే బాలుడై యుండి దేవునిచే ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించుటకు ఎన్నిక చేయబడెను.  ఒకానొక దినమున ఒక ఐగుప్తీయుడు, ఒక హైబ్రీయుడు జగడమాడు సందర్భములో - మోషే ఐగుప్తీయుని చంపి పారిపోయెను.  ఈ సందర్భములో జరిగిన సంఘటన గూర్చి వేదములో మనకు తెలుసును.  

        అక్కడ నుండి తన మామ మందను కాయుచుండగా దైవస్వరము విని, దైవాజ్ఞానుసారము దేవుని జనాంగమునకు నాయకుడైనట్లు వేదములో చదువగలము.  అదే విధముగా సంసోను బాలుడుగా వుండి ఇశ్రాయేలు జనాంగమునకు దేవుని చేత న్యాయాధిపతిగా దీర్చబడి, దైవ జనాంగ పక్షముగా న్యాయ వైఖరిలో జీవించాల్సిన బాధ్యతను విస్మరించి కొంటెచేష్టగా దైవ జనాంగమునకు విరోధులైన ఫిలిష్తీయులతోను, వారి కన్యలతోను సావాసము జేసెను.  ఇశ్రాయేలు జనాంగమునకు న్యాయకర్తగా నిలువవలసిన తన బాధ్యతను విస్మరించి, నవ్వులపాలై మరణించాడు.  అదే విధముగా, బాలుడైన సమూయేలు పెద్దల దయయందును, సంఘముయొక్క దయయందు, దేవుని దయయందును వర్థిల్లినట్లు 1 సమూయేలు 1:1లో మనము చదువగలము.  ఈయన రాజులకును, ప్రవక్తలకును తలయై యున్నట్లు వేదములో చదువగలము.

        దావీదు విషయములో బాలుడైన దావీదుయొక్క బాలచేష్టలను గూర్చి తెలుసుకొందము. - అతిరథులు, మహారథులు, శూరులు, యోధులు, రాజులు పరిపాల కులుగా ఉండిన ఇశ్రాయేలు అశక్తులుగా ఉండి ఫిలిష్తీయ వీరుడైన గొలియాతుయొక్క ప్రగల్భాలకు భయపడి అయోమయ స్థితిలో ఉన్నారు.  దేవుడు బాలుడైన దావీదు చేత ఫిలిష్తీయ వీరునికి మరణమును, ఫిలిష్తీయ సైన్యమునకు అపజయము, దైవ జనాంగమైన ఇశ్రాయేలుకు విజయము కల్గించెను.  ఇందుకుగాను దావీదు 5 రాళ్ళు, ఒక చిన్న కర్రముక్కను ఎన్నుకొనెను.  దావీదుయొక్క బాలచేష్టలకు ఇది మంచి ఉదాహరణ.  ఈ సందర్భములో గొలియాతు మాట్లాడిన మాటలు చదివినట్లైతే - 1 సమూయేలు 17:43, ''ఫిలిష్తీయుడు-కఱ్ఱ తీసికొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా?  అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను.''  దేవునికి ప్రీతికరముగా జీవించాల్సిన దావీదు - లోక పాశములకు తగుల్కొని స్త్రీలోలుడై, అవినీతి క్రియ జరిగించి తన రాజరికములో కళంకాన్ని తెచ్చుకొన్నాడు.  అయితే దైవ సన్నిధిలో పాప క్షమాపణ కీర్తనల ద్వారాను, ప్రార్థనల ద్వారాను, దైవ విధేయత ద్వారా పొందెను.  దైవసన్నిధికి ఒక ప్రత్యేకతనిచ్చి తన్ను తాను తగ్గించుకొని అనేక క్రియలను జరిగించెను.  ఈ జరిగించిన కార్యములను బట్టి నాటి నుండి నేటి వరకు దావీదుయొక్క నామధేయము చిరస్థాయిగా భూమిపై హెచ్చించబడి యున్నది.  

        దావీదు కుమారుడైన అబ్షాలోము తన దేహ సౌందర్యానికి తనకు తానే ఆకర్షితు డయ్యెను.  దేవునిని, పెద్దలను మరియు సంఘమును లెక్కజేయక, తనకు తానే సాటియని అతిశయించి తండ్రిపై తిరుగుబాటు జేసి, తండ్రియొక్క పత్నులను అపవిత్రపరచి తండ్రి సింహాసనాన్ని కాజేయాలని సన్నిద్ధుడై సైన్యములతో, రథములతో తండ్రిని తరిమి మరణాన్ని తెచ్చుకున్నాడు.  యోసేపు ఐగుప్తులో ఫరో యింటి మీద అతని రాజ్యమంతటి మీదను ఆధిపత్యము వహించి ఐగుప్తు రాజ్య పరిపాలన జేయుటన్నది యోసేపు బాలుడుగా ఉన్నప్పుడు ఇష్మాయేలులకు బానిసలుగా అన్నల చేత అమ్మబడుట, ఇష్మాయేలీయులు బాల యోసేపును పోతిఫరోకు విక్రయించుట, పోతిఫరో యోసేపును ఫరోకు అప్పగించుట.  ఇవన్నియుదైవ చిత్తాను సారముగా ప్రణాళికానుసారముగా జరిగినట్లు మనము గ్రహించ వలసియున్నది. యేసుక్రీస్తు ప్రభువు చిన్నపిల్లలను గూర్చి ఏమి చెప్పుచున్నాడో తెలుసు కొందము.  మార్కు 10:13-16, ''తమ చిన్నబిడ్డలను ముట్టవలెనని కొందరాయనయొద్దకు వారిని తీసికొని వచ్చిరి; అయితే శిష్యులు (వారిని తీసికొని వచ్చిన) వారిని గద్దించిరి.  యేసు అది చూచి కోపపడి-చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు; దేవునిరాజ్యము ఈలాటివారిదే.  చిన్నబిడ్డవలె దేవునిరాజ్యము నంగీకరింపనివాడు అందులో నెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను.''  ప్రకటన 2:26లో వలె ఎవరైతే ఈ లోకమును జయించి ప్రభువు చెప్పినట్లు చిన్న పిల్లలవలె పరలోక రాజ్యమును స్వతంత్రించు కొందురో వారు జనులపై అధికారమును పొంది యున్నారు.  ఇందునుబట్టి, చిన్నపిల్లల మనస్తత్వము కలిగియున్నవారు జనులను ఏలుటకు ఎన్నిక చేయబడుదురు.  ఇది యెషయా ప్రవచనముయొక్క నెరవేర్పు.

4.  బోధకుల పాట్లు

        యెషయా 4:1, ''ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని  -మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకొందుము,  నీ పేరుమాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయుమని చెప్పుదురు.''

        ప్రియపాఠకులారా!  ఈ వాక్య భాగమును మనము ఆత్మ దృష్టితో ధ్యానిస్తే యెషయా వ్రాసిన లేఖనము లోక సంబంధమైనవి గావుగాని ప్రతియొక్కటి ఆత్మ సంబంధమే యని గ్రహించాలి.  ఆయన రచించిన ఈ వాక్య భాగములోని 'స్త్రీ' సంఘమునకు సాదృశ్యమై యున్నది.  ఇట్లు యెషయా వ్రాసిన లేఖనము పౌలు పట్ల క్రియ జేసినట్లు మనము ఈ క్రింది రెఫరెన్సుల ద్వారా తెలిసికోగలము.  పౌలు కూడా ఏడు సంఘములకు అపొస్తలుడుగా వున్నట్లు మనము గ్రహించగలము.  

        ఇందులో . . .

        1.  రోమా,          2.  కొరింథీయులు,          3.  గలతీయులు,  

        4.  ఎఫెసీ,          5.  ఫిలిప్పీ,                  6.  థెస్సలొనీక,  

        7.  కొలొస్సయులకు.  

        ఈ విధముగా ఏడు సంఘములు అను స్త్రీలకు కొలువు జేసినట్లును, శుభమని లేఖలు వ్రాసినట్లును తెలియుచున్నది.  మరియు ఆయన అధికముగా ప్రేమించిన ప్రియ మిత్రులు తిమోతి, తీతు, ఫిలోమోను వగైరా జత పనివారికి అనేక విన్నపాలు చేసినట్లు గ్రంథములో వున్నది.  అయినా ఈ పై ఏడుగురు స్త్రీలు అను ఏడు సంఘములు ఆయనను పోషించలేక పోయినందున పౌలు డేరాలు కుట్టి జీవించాడు.  అదే విధముగా నేటి సువార్తీకుల బ్రతుకులు కూడా తయారై బస్‌ ఛార్జీలు లేక ఇబ్బంది పడుచున్నప్పుడు సువార్తీకుని పోషణ మాటేమిటి?  ఇక్కడ కూడా యెషయా 4:1లో వలెనే నేటి సంఘములు ప్రవర్తిస్తున్నట్లు సంఘ క్రియల మూలమును బట్టి విదితమగుచున్నది.

        ప్రియపాఠకులారా!  దేవుడు తన సందేశములను తన జనాంగమున కెరిగించుటకు, తన భక్తులైన ప్రవక్తలుగా ఎన్నుకోబడినవారి చేత ఆత్మీయార్థములతో తన జనులకు వివరింపబడినవే ఈ లేఖనములయొక్క సారాంశము.  ఆ దినములలో ఏడుగురు స్త్రీలు అనగా ఏడు సంఘములు ఒక్క పురుషుని పట్టుకొనును.  అనగా ఒక్క ఫాస్టరో లేక ఫాదరో లేక సువార్తీకుడోయని అర్థము.  అట్లు ఏడు సంఘములు ఒక్క బోధకుని ఏర్పరచుకొని మా అన్నము మేమే తిందుము, మా బట్టలు మేమే ధరించుకొందుము.  నీవు నీ అన్నము తిని నీ బట్టలే తొడుగుకొని నీవే బస్‌ ఛార్జీ లేదా రైలు ఛార్జీ పెట్టుకొని, ఆలయానికి వచ్చి దేవుని వాక్యాన్ని విన్పించి మాకు ఫాస్టరు లేడని చెప్పే నిందను పోగొట్టవలసిన బాధ్యత నీదే యన్నట్లుగా దీని అర్థమున్నది.  ఈ లేఖనాన్ని ఈ వాక్యాన్ని పౌలు నెరవేర్చినట్లు గ్రంథములో చదువగలము.  పౌలు పై వివరించినట్లు ఏడు సంఘాలకు దేవుని చేత అపొస్తలుడుగాను, బోధకుడుగాను క్రొత్త నిబంధనకు, కొన్ని పత్రికలకు రచయితగాను దేవుని చేత నియమింపబడినాడు.  

        ఆ ఏడు సంఘాలు పౌలును పోషించలేక పోయినందున డేరాలు కుట్టుకున్న విధముగా నేటి యుగములో కూడా సువార్తీకుని బ్రతుకు తయారైనది.  నేను వ్రాసే పుస్తకాలకు నా డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రెస్‌ ఖర్చులు భరిస్తూ వెలువరించిన వేద సత్యాలను గతములో ఆదరించక పోవడము, ఏడు సంఘముల అపొస్తలుడైన పౌలునకు ఏ సన్మానము జరిగిందో అదే సన్మానము నాకు జరుగుచున్నదని నేను చింతించవలసి వస్తున్నది.  అయినను పౌలు వలెనే సువార్తీకునిగా, ఉపాధ్యాయునిగా ంటూ నేను సేవ చేస్తున్నాను.  నేను ప్రయత్నించి అనేక సంఘాలకు వ్రాసిన ఈ పత్రికలవలె ఈ సువార్త వ్యాపక పత్రులకు సంఘముల ఆదరణ కరువగుచున్నది.  ఇది శోచనీయము.  అన్య జీవితములో అన్యునిగా వుండి ప్రభువుతో మొత్తబడి నిజ దైవత్వ మెరింగి, అన్య సన్యాసుల ఆశ్రయములో జేరి వారిచే మొత్తబడి శారీరకముగాను, ఆత్మీయముగాను సాతాను చేత చావు దెబ్బలు తిని, నిజ దైవ వెలుగును కనుగొని, క్రీస్తే తప్ప మరి ఎవడును బలమైనవాడును, రక్షకుడును లేడని ఎరింగి, ఆయన నేర్పిన వేద మర్మమును, సువార్త ప్రతుల రూపముగా విరచించి, అనేక సంఘములలో తిరుగుచూ సేవ చేస్తున్న శేఖర్‌ రెడ్డి అను నా పట్ల సంఘాలు దృష్టించి, ఆదరణ చూపి, దైవసేవలో భాగస్వాములై దేవుని సన్నిధికిని, సంఘముయొక్క ఔనత్యమునకును శ్రమపడు బిడ్డలుగా జీవించగలరని సమస్త సంఘములకును శుభమని చెప్పి వ్రాయుచు, నేను ఆత్మ ప్రేరేపణతో రచిస్తున్న ఈ ప్రతులను ఆదరించి, నాతో ఆత్మీయముగను, లోకరీతిగను సహకరించి, చేయూత నియ్యవలసినదిగా మీకు తెలియ జేయుచున్నాను.  

        కాబట్టి ఏడు సంఘాల్లో ఒక సంఘమైన మీరు యెషయా 4:1లో వలె ఇప్పుడు మాట్లాడుదురా?  దైవ సువార్తను ఆదరిస్తారా?  ఆ సంఘాల్లో ఒక సంఘముగా మాట్లాడుదురా?  ఈ సువార్త పత్రికలను ఆదరిస్తారా? చిత్రమేమిటంటే పౌలు పత్రికలు వ్రాసిన సంఘాలు ఏడు.  ఈనాడు క్రీస్తును ప్రేమిస్తున్న సంఘాలు అనేకమైయున్నవి.  నన్ను పిలుపించుకొని నా సాక్ష్యాన్ని విన్న సంఘాలు కూడా అనేకమున్నవి.  ఆనాడు పౌలు శుభవచనములు వ్రాసిన సంఘాలు క్రీస్తును సరిగా ఎరుగకుండి, అపొస్తలుడైన పౌలును ఆదరించక పోయినవి.  ఈనాడు క్రీస్తు నెరింగిన మన సంఘాలు యెషయా 4:1 వచనములో అన్నట్లు గాక నాకు చేయూత నిచ్చి నన్ను పోషిస్తాయని భావిస్తున్నాను.  ప్రభువు మిమ్ము దీవించుగాక!  ఆమేన్‌.

5.  బైబిలులో మద్యపాన నిషేధమును గూర్చిన ఆజ్ఞ

        యెషయా 5:1-7, ''నా ప్రియునిగూర్చి పాడెదను వినుడి  అతని ద్రాక్షతోటనుబట్టి నాకిష్టుడైనవానిగూర్చి పాడెదను వినుడి.  సత్తువ భూమిగల కొండమీద నా ప్రియుని కొక ద్రాక్షతోట యుండెను  ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించెను  దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్షతొట్టిని తొలిపించెను.  ద్రాక్షపండ్లు ఫలింపవలెనని యెదురు చూచుచుండెనుగాని అది కారుద్రాక్షలు కాచెను  కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్షతోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్ము వేడుకొనుచున్నాను.  నేను నా ద్రాక్షతోటకు చేసినదానికంటె మరేమి దానికి చేయగలను?  అది ద్రాక్షపండ్లు కాయునని నేను కనిపెట్టినపుడు అది కారుద్రాక్షలు కాయుటకు కారణమేమి?  ఆలోచించుడి, నేను నా ద్రాక్షతోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను  నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టి వేసెదను.  అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసెదను  అది శుద్ధిచేయబడదు పారతో త్రవ్వబడదు  దానిలో గచ్చపొదలును బలురక్కసి చెట్లును బలిసియుండును  దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చెదను.  ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము.  ఆయన న్యాయము కావలెనని చూడగా బలాత్కారము కన బడెను  నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను.''

        ప్రియపాఠకులారా!  ఈ అధ్యాయములో ద్రాక్ష చెట్టు పుట్టుక, దానియొక్క మంచి చెడు గుణములు, దైవసన్నిధిలో దానికి ఉన్న ప్రాధాన్యతను బైబిలు గ్రంథమునుండి తెలుసుకొందము.  ఇందుకు సాదృశ్యముగా ప్రభువు చెప్పిన ఉపమానము లూకా 13:6-9.  పై ఉపమానముయొక్క వివరణ ఏమిటి అంటే దేవుని జనాంగమైన ఇశ్రాయేలు యొక్క జీవితమునకు మాదిరిగా ద్రాక్షతోట దేవుని చేత ప్రవచింపబడింది.  పై ప్రవచనమును గూర్చి ధ్యానించుటకు పూర్వము ద్రాక్షచెట్టుయొక్క పుట్టుపూర్వోత్తరాలు, దానియొక్క మంచిచెడు అనుభవాలను గూర్చి తెలిసికొందము. ద్రాక్షచెట్టుకు జన్మనిచ్చినవాడు దేవుడే.  ఎలాగంటే తూర్పు దిక్కున వేసిన ఏదెను వనములో ఈ ద్రాక్షచెట్టు ఉండిందేగాని దీనిని గూర్చిన పరిజ్ఞానము నరునికి లేదు.  ఇది ఏదెనులో ఉండినను ఆది నరులకు మరుగు పరచబడినట్లుగా అనగా దీనియొక్క గుణగణాలు ఆదాము తెలిసికొన్నట్లుగా లేదు.

        ఆదాము జ్ఞానహీనుడు కాదు.  దైవాంశ సంభూతుడు, దైవజ్ఞాని. అట్టివానికి ద్రాక్ష చెట్టుయొక్క గుణగణాలను దేవుడు మరుగు పరచినాడు.  ఆదాము దైవ జ్ఞానమందు జీవించినను, సకల జీవరాసుల వలెనే సమైక్యముగా జీవిస్తూ, తోటలోని అన్ని వృక్షాల ఫలాలతోబాటు ద్రాక్షఫలాలు కూడా భుజించి ఉంటాడు, ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు.  ఆయన సృష్టిలో నరునికి సంపూర్ణ స్వాతంత్య్రము అనుగ్రహించి తనతో సమానముగా ప్రేమించాడు.  అందునుబట్టి దేవుడు నరుని భుజించమన్న ప్రేమపూరిత ఫలాదులలో నరునియొక్క ఆహార పదార్థాలలో ద్రాక్ష ఒక్కటియై యుండాలి.  కాని ఆది కాండము ఒకటవ అధ్యాయము నుండి ఎనిమిదవ అధ్యాయము వరకును ద్రాక్షచెట్టుయొక్క పేరుగాని, దాని ఫలములను గూర్చిగాని వేదములో వ్రాయబడకుండుటకు కారణము - దేవుడు నరజ్ఞానమునకు, వాని అభివృద్ధికి, వాని మనుగడకు, వాని ఆత్మీయ జీవితమునకు కళంకము తెచ్చేటటువంటిది, శరీరయుతముగా ఆరోగ్యవంతమైనను - ఆ ద్రాక్షఫలరస మన్నది వికటించి, వక్రించి, కృతిమముగా దాని విలువను అది ప్రభావితమై, రౌద్రమై, ఉగ్రరూపమును దాల్చి నరునియొక్క శారీర ఆత్మీయ జీవితాలను పాడు చేసే ప్రమాద మున్నదన్న విషయాన్ని దేవుడు నరునికి మరుగుపరచుచు, సాధారణ ఆహార పదార్థాలలో వాడబడేటటువంటి చెట్టు ఫలముల వరుస క్రమములో ఈ ద్రాక్షాఫలములను కూడా నరుడు భుజించుటకు అనుగ్రహించాడు.  అంటే ఆదికాండము రెండవ అధ్యాయము నుండి ఎనిమిదవ అధ్యాయము వరకు ఆనాడు విస్తరించియున్న జనాభాలో కూడా ద్రాక్ష ఫలములలో దాగియున్న మద్యమును గూర్చిగాని, దాని వలన కలుగు కీడును గూర్చిగాని, దానిని మద్యపానముగా వాడుటకు, తయారు చేయుటకు తగు జ్ఞానమునుగాని ఎరుగనివారై అనగా మద్యపానాసక్తులు గాక కేవలము శారీర సంబంధ కామేచ్ఛలతోను, క్రోధాది గుణములతోను దైవత్వమును త్యజించి, దేవునిపై తిరుగుబాటు జేస్తూ దేవుడు నరుడు అనిన వావి వరుసలు మరచి, పాపము జరిగించి దేవుని దృష్టికి అయోగ్యులుగా ఎంచబడినారు.  కాని మద్యపానాసక్తులుగా ఉండినట్లు ఈ ఎనిమిది అధ్యాయాలలోను వ్రాయబడలేదు.

        అయితే ఏదెను వనములో దేవుడు నిషేధించిన ఫలము ఆహారమునకు యోగ్యమైనదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనదిగా ఉండినట్లు స్త్రీకి కనబడినందున, ఆ స్త్రీ పురుషులు ఇరువురును దానిని తిని దైవాతిక్రమము జేసి పాపములో పడినారు.  ఇది ఏదెను తోటలో జరిగిన క్రియ.  ఇక తోటలోని ఫలము ద్వారా వచ్చిన పాపము దినదిన ప్రవర్థమానమై ఫలముయొక్క ప్రభావము - ఆ ఫలము ద్వారా విస్తరించిన జన సంఖ్యయొక్క విస్తరణ దేవునికే కోపమును, ఉగ్రతను పుట్టించి, యావద్‌ సృష్టి వినాశనానికి దారి తీసింది.

        మొదటి నరజంట కొరకు దేవుడు తానే ఒక తోటను నిర్మించి దానిలో ఉంచినాడు.  అయితే దైవ వ్యతిరేక క్రియ ద్వారా నరుడు దేవుని అనుగ్రహము పోగొట్టుకొన్నప్పుడు, దేవుడు నరుని పట్ల నికరించి తాను జరిగించబోవు జలప్రళయ మారణహోమ కార్యక్రమమునకు తాను నిర్మించబోవు ఓడ నిర్మాణ కార్యక్రమములో తానే సూత్రధారిగా వ్యవహరించి, ఓడ నిర్మాణ కార్యక్రమమంతయు నరుని చేతనే చేయించాడు.  ఈ విధముగా ఓడ నిర్మాణ కార్యక్రమము పూర్తియైంది.  చిత్రమేమిటంటే దేవుని పరిశుద్ధమైన వనములో సర్పము ద్వారా సాతాను ప్రవేశించాడు.  అంటే నోవహు ఓడ అరారాతు కొండల మీద నిలిచిన తర్వాత దైవాత్మానుసారముగా దేవుడు నోవహును, అతని కుటుంబాన్ని బయటికి రప్పించుకొని వారితో నిబంధన చేసాడు.  ఆదికాండము 9:10-17 వరకు మనము చదివితే మనకు వివరముగా తెలియగలదు.  ఇట్టి నిబంధనతో ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాపెతు అనువారు.  హాము కనానుకు తండ్రి.  ఈ ముగ్గురు నోవహు కుమారులు.  వీరి సంతానము భూమియందంత వ్యాపించెను.

        దైవానుగ్రహము చేత ఆదికాండము 7:1, ''యెహోవా-ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటి వారును ఓడలో ప్రవేశించుడి.''  దేవునిచేత నీతిమంతుడుగ తీర్చబడిన నోవహు నీతిమంతుని కుటుంబముగా ఆశీర్వదింపబడి, దైవ సన్నిధిలో, దైవజ్ఞానముతో ఓడను నిర్మించి, దైవ నమూనాలో ఓడయొక్క నిర్మాణము చేసి, దేవుడు జరిగించిన జలప్రళయ మారణ హోమములో అనగా యావద్‌ సృష్టి గొప్ప పర్వతాలతో సహా ముంచి వేయబడిన చీకటి వాతావరణములో ఆ ఓడ దేవుని మహిమను చాటుతూ, యంత్రము, చుక్కాని, తెడ్డు లేకుండా నడిచింది.  దేవుడు తన ఉగ్రతను శాంతింప జేసుకొని, తాను నీతిమంతునిగ నిర్థారించిన నరుని కుటుంబమును జ్ఞాపకము చేసుకొని జలములు ఇంకిపోయిన తర్వాత నోవహును, అతని కుటుంబాన్ని, అతనితోబాటు ఓడలో వున్న సమస్త జీవరాసులతో దేవుడు తన పున:సృష్టి కార్యక్రమానికి వాడుచూనే, దేవుడు తన నిబంధనను స్థిరపరచుచు, వారిని ఆశీర్వదించి పున:సృష్టికి మూలకర్తలుగా దీవించెను.  అట్టి దీవెనలతో దేవునికి ఫలభరితమైన, యోగ్యకరమైన, మహిమకరమైన విధములో జీవించవలసిన నరుడు, ఈ రెండవ సృష్టిలో కూడా చెట్టు ఫలము ద్వారానే దేవునికి వ్యతిరేకియై, మద్యానికి మూలపురుషుడు, మద్యపానము అను వ్యసనానికి మూలకారకుడైనాడు.

        ఆదిలో ఏదెనులోని దైవ నిషేధఫలము అన్నది సకల మానవాళికి పాపము, మరణము అనేటటువంటి తరతరములు తీరని సుదీర్ఘమైన, వేదనకరమైన, దైవత్వమునకు విరుద్ధమైన జాడ్యములు కల్గించి నరునియొక్క జీవిత మనుగడకే ముప్పు వాటిల్ల చేసింది.  అయితే ఆదికాండము 8:20-22లో వ్రాయబడిన వేద వాక్యముల ప్రకారము, ఏదెనులో వలె సర్పము, సాతాను వగైరా ఇతర జీవులతోగాక నోవహు తన స్వజ్ఞానముతోనే వ్యవసాయము చేయనారంభించి ద్రాక్షతోటను వేసినట్లును, ద్రాక్షతోట ఫలములైన ద్రాక్షాఫలములయొక్క రసమును త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా పడియున్నట్లును, అప్పుడు అతని కుమారులు నోవహుయొక్క దిగంబరత్వాన్ని చూచి తాను చేసినటువంటి త్రాగుడు నేరమునకు సిగ్గుపడుటకు బదులు తాను వస్త్రహీనుడై యున్నప్పుడు, తన దిసమొలను కప్పిన కుమారులను శపించుటన్నది మనము గమనించ వలసిన ముఖ్య విషయమై యున్నది.

        ఆదిలో ఆదాము దైవాజ్ఞ మీరి దేవునికి సంతాపము పుట్టించినప్పుడు దేవుడు ఆదామును శపించాడు.  దేవుడు నిషేధించిన ఫలమును భుజించిన ఆదాము శాపగ్రస్థుడై దేవుడు విధించిన శాపము, మరణము అను శిక్షను అనుభవించాడు.  అయితే అదే ఆదికాండము 9:20-25లో దైవచట్టమునకు వ్యతిరేకమైన త్రాగుడు వ్యసనానికి లోనై, చిత్తుగా త్రాగి మైకములో వస్త్రహీనుడుగా ఉన్నట్టి నోవహు, తాను చేసిన తప్పునకు పశ్చాత్తాపము పొందుటకు బదులు తనకు మాన సంరక్షణ చేసిన కుమారులను శపించెను.  ఈ విధమైన క్రియ ద్వారా నోవహు చరిత్రహీనుడై, అతనికి ఎలాంటి ప్రాధాన్యత దైవత్వములో కలుగక పోవుటయేగాక, నేటి క్రైస్తవ ఆరాధనలలో, మందిరాలలో, ప్రసంగాలలో ఆదామును గూర్చి, ఆదాముయొక్క చరిత్ర వాడబడుచున్నదిగాని, నోవహును గూర్చి మాట్లాడే ప్రసక్తి ప్రసంగాలలో వాడబడుటన్నది అరుదైంది.  వాస్తవానికి నోవహు సంతు నుండియే జన విస్తరణ జరిగింది.  అయితే నోవహు జరిగించిన మద్యపాన క్రియను బట్టి, ఏదెనులో ఆదామును తోట నుండి వెళ్లగొట్టబడినను దేవుడు అతనికి చర్మపు చొక్కాయిలను రక్షణార్థముగా తొడిగినాడు.  అయితే నోవహు విషయములో అతడు దేవుని సన్నిధిలో అయోగ్యముగా ప్రవర్తించినప్పుడు దేవుడు అతనికి ఎలాంటి రక్షణాయుతమైన క్రియ అతని పట్ల జరిగించలేదు.

        ఈ విధముగా దైవత్వము పట్ల కృతజ్ఞత లేకుండా మద్యపానాసక్తుడై, దిగంబరిగా జీవించిన నోవహునకు త్రాగుడును బట్టి మంచి సాక్ష్యమును కోల్పోయాడు. తన చరిత్రను సార్థకము చేసుకోలేకపోయాడు. అయితే తండ్రి దిసమొలను కప్పిన కుమారులను తండ్రి శపించినప్పటికిని, వారి సంతానము బహుగా విస్తరించి, ఆదికాండము 10:32లో వలె వీరు భూమి మీద జనమును విస్తరింపజేశారు. అయినను వీరి తండ్రిని వెంటాడిన మద్య పానము వీరలను వెంటాడుతూ వచ్చింది.  ఈ విధముగా విస్తరించిన జనాభా నుండి భూఫలములలో అనగా గోధుమ యవల అంజూరము ఒలీవ పంటతోబాటు అతి ముఖ్యమైన పంటగా ఈ ద్రాక్షఫలముల పంట ప్రాధాన్యతను పొందింది.  ఆ దినములలో ద్రాక్షరసమును వాడనటువంటి, చవిచూడనట్టి నరుడు అరుదు.  ఎందుకంటే ద్రాక్ష మధ్యములో ఉన్నట్టి మత్తు, నరుని ఆత్మీయ స్థితిని, వాని మనస్సాక్షిని, వాని జ్ఞానమును, వాని మానసిక స్థితిని తుదకు దేహాన్ని కూడా పాడు చేసేటటువంటి ప్రమాదమున్నది.  కనుక దేవుడు తన పరిచర్యకు వాడుకొనే వ్యక్తియొక్క జీవితములో ఈ మద్యపానమును బహు కఠినముగా నిషేధించి యున్నాడు.  ఈ విధముగా తల్లి గర్భము నుండి, తుదకు గర్భము ధరించిన తల్లి కూడా ఈ మద్యపానమును అంటకుండునట్లు దేవుడు న్యాయాధిపతులు 13:2-14.  తన దూత ద్వారా మానోహ దంపతులకు విధించిన నియమాలలో ద్రాక్షా-మద్యపాన నిషేధమన్నది బహుముఖ పాత్ర వహించి యున్నది.

        ఇక్కడ నుండి సర్పము ఏ విధముగా రూపాంతరము పొంది అనేక జాతులుగా, అనేక నామధేయాలతో, అనేక రూపాలతో, నానావిధ పరిణామములతో భూమి మీద విస్తరించి, ఈ జన బాహుళ్యములో జీవిస్తున్నదో, అలాగే ఈ మద్యపానమన్నది ద్రాక్షారసము తయారీతో ప్రారంభమై, నానావిధములైన నామధేయాలతో ప్రబలి యున్నది.  నేటి ఆధునిక యుగములో ఈ మద్యపానమన్నది వక్రించి, గంజాయి అని, పొగాకుగా మారి ధూమపానమని, నల్లమందు అని మాదకద్రవ్యముగా మనిషిని మత్తెక్కించి, వానిని అచేతనునిగా చేయుటయేగాక, నానా జాడ్యములకు నరదేహమును గురిజేసి, వాని ఆయు:పరిమితిని హరింపజేస్తున్నది.  ఈ ద్రాక్షరస ప్రభావమన్నది ఒక్క ద్రాక్ష చెట్టుకే పరిమితముగాక కొబ్బరి, ఈత, తాటి చెట్లకు కూడా ప్రాకి, తాటికల్లు, కొబ్బరికల్లు, ఈతకల్లు వగైరా మద్యములకు దారి తీయుటయేగాక నరునియొక్క జీవితమును దిగంబరత్వములోను, వాని సంసారిక జీవితమునకు దావాగ్నిగా తయారై, కుటుంబ కలహాలకును, ఆత్మహత్యలకును దారి తీస్తూ లోకములో నరునికి శాంతి, సమాధానము, ఆరోగ్యము మనుగడ అన్నది లేక అల్పాయుష్కునిగా నరుని చేసి అంతమొందిస్తున్నది.  సామెతలు 23:29-32, ''ఎవరికి శ్రమ?  ఎవరికి దు:ఖము?  ఎవరికి జగడములు?  ఎవరికి చింత?  ఎవరికి హేతువులేని గాయములు?  ఎవరికి మంద దృష్టి?  ద్రాక్షా రసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా  కలిపిన ద్రాక్షా రసము రుచిచూడ చేరువారికే గదా.  ద్రాక్షా రసము మిక్కిలి ఎఱ్ఱబడగను  గిన్నెలో తళతళలాడుచుండగను  త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము.  పిమ్మట అది సర్పమువలె కరచును  కట్లపామువలె కాటువేయును.''

        ఇంతవరకు వ్రాయబడిన వేదభాగాన్ని గూర్చి ధ్యానించుకొందము.  ఆదిలో దేవుడు ఆది నరునికి తినవద్దని ఆజ్ఞాపించిన చెట్టుఫలములు కూడా ఈ ద్రాక్షారస మద్యమునకు సమానములే!  ఎలాగంటే దేవుడు నిషేధించిన ఫలము ఏ విధముగా చూపునకు రమ్యమైనదియు, ఆహారమునకు మంచిదియు  కన్నులకు అందమైనదియు వివేకమిచ్చునదిగా ఉండిందో - అలాగే ఈ ద్రాక్షా మద్యము కూడ కన్నులకు ధగధగ మెరయు బంగారమువలె రాజులు, చక్రవర్తులు వాడు ఉన్నతమైన, అతివిలువైన పానీయముగా ప్రపంచములో ఘనతనెక్కి సామాన్య జనాంగానికి అందుబాటులో లేనిదై, ఉన్నత స్థాయిలో ఉన్న ఐశ్వర్యవంతులకు అతి ముఖ్య గౌరవనీయమైన పానీయముగా సీసాలలో భద్రపరచబడి, చిత్రవిచిత్ర నామధేయాలను ధరించి, అందమైన రీతులలో లేబిళ్ళను తగిలించుకొని, ఘనమైన పానీయముగా, ఖరీదైన పానీయముగా త్రాగుబోతు కళ్ళకు కట్టుకున్న భార్య కంటే అతి ప్రియమైన ప్రేయసిగా తయారై, నరునియొక్క విలువలను, వాని గౌరవ మర్యాదలను, వాని స్థాయిని, వాని పదవిని, వాని ఘనతను బుగ్గిపాలు జేసి, సంఘములోను, సమాజములోను, ప్రజా బాహుళ్యము చేత, హీనునిగా, త్రాగుబోతుగా, కుత్సితునిగా, కుట్రదారునిగా, నీచునిగా చేయుటయేగాక, దైవదృష్టికి దోషిగాను, మరణానికి సన్నిహితునిగాను ఈ ద్రాక్షారస పానమన్నది చేస్తున్నది.  సామెతల గ్రంథములో మనము చదువుకొన్న వాక్య భాగము 23:29, ''ఎవరికి శ్రమ?''  అనగా త్రాగుబోతు తన కుటుంబాన్ని గురించిగాని, తన బిడ్డలను గురించిగాని, తాను అగ్నిసాక్షిగా పెండ్లాడిన భార్యను గురించిగాని ప్రయాసపడక లేక శ్రమపడక కేవలము త్రాగుడు కొరకే శ్రమపడి నానా విధములైనటువంటి కార్యాలు, క్రియలు జరిగించుటకు సిద్ధహస్తుడై అనగా మద్యము కొరకు తన భార్య మంగళ సూత్రాన్ని, బిడ్డల కాలి గొలుసులను లేక ఇంటిని, తుదకు భార్య శీలాన్ని కూడా తాకట్టు పెట్టుటకు వెనుకాడని నీచ స్థితిలో శ్రమ పడేటటువంటి అభాగ్యులు లోకములో లేరా?  ఉన్నారు.

        ఇట్టివారిని గూర్చి లోకములో మనము పత్రికల ద్వారా, రేడియోల ద్వారా వింటున్నాము.  మనయొక్క జీవితానుభవములో ప్రత్యక్షముగా మన ఇరుగుపొరుగులో కూడా ఇట్టి వ్యక్తులను గూర్చి ఎరిగి యున్నాము.  త్రాగుడన్నది నరుని వెర్రివానినిగా చేయుటయేగాక, వాని మనస్సునకు నెమ్మదిలేని స్థితిని కల్పించి, త్రాగుడు కొరకు ఎంతటి అఘాయిత్యమైన చేయుటకు నరుని ప్రేరేపిస్తుందన్న విషయము మనమెరిగిన సత్యమే.  ఎన్నో కుటుంబాలు త్రాగుడు వలన నాశనమై, ఊరు పేరు లేక చరిత్రనే కోల్పోయిన సంఘటనలు మనమెరిగి యున్న విషయమే!  మన నిత్య జీవితములో ఆహారము కొరకు శ్రమపడే వారికంటే  త్రాగుడు కొరకు శ్రమపడే వారి సంఖ్య నేడు ప్రాముఖ్యతను సంతరించుకొని యున్నది.  ఆనాడు ఏదెనులో స్త్రీ దృష్టికి ఆకర్షించిన చెట్టు ఫలము వలె ఈనాడు ద్రవరూపమై, మద్యమునైయున్న ద్రాక్ష రస మద్యమన్నది తన రంగు ద్వారా నరుని ఆకర్షించి, నరునియొక్క జీవితాన్ని అధోగతి పాల్జేస్తుంది.  ఈ ద్రాక్ష రసమన్నది రూపాంతరము చెంది సురాపానముగా అనగా దేవతలు త్రాగే పానీయముగా హిందూ వేదములో అభివర్ణించబడి యున్నది.  దేవతలు త్రాగునది సురాపానము, అసురులు త్రాగేది రక్తపానము.  అయితే మనుష్యులు త్రాగేది మద్యపానముగా లోకములో నామధేయము పొందియున్నది.  దేవతలు ద్రాక్షారసపానము  చేశారు.  నిజమే;  యేసుక్రీస్తు బల్లలో రొట్టె భోజనముగాను, ద్రాక్షారసమన్నది పానముగా వాడబడినట్లుగా వేదములో మనము చదువగలము.  అంతేగాకుండా ప్రభువు ఆచరించిన ఆ రొట్టె ద్రాక్షరస విందును ఆయన తదనంతరము అపొస్తలులైన ఆయన శిష్యులు కూడా ఆచరించారు.  ఆచరించడమేగాక వారియొక్క సావాసములో ఎదిగిన విశ్వాసులను కూడా ఈయొక్క రొట్టె విరిచేటటువంటి కార్యక్రమములోను, వారితో పాలుపంచుకొన్నారు.  ఇది నేటికిని ఆచరింపబడుచున్నది.

        ఇంతకును ద్రాక్షారసములో మంచి ఉంది, ఆరోగ్యము ఉంది, రక్తశుద్ధి ఉంది, దేహానికి ఉపశమనము ఉంది.  ద్రాక్షారసములో ఉన్నట్టి గుణాలు ఫలజాతులలో మరి వేటికిని లేదు.  అయితే ఈ ద్రాక్ష రసముయొక్క గుణము వక్రించిందంటే నర జీవితానికి గొడ్డలిపెట్టుగా తయారగుతుంది.  అంటే నరజీవితమును పనికిరాని స్థితిలోకి దిగజారు స్తుంది.  నరుని మరణ పాత్రునిగా చేస్తుంది.  పాత నిబంధన కాలములో ద్రాక్షరసమును మద్యముగా వాడి అనేకమైన ప్రమాదాలలో ఇరుక్కున్న వ్యక్తులను గూర్చి వేదరీత్యా కొందరిని గూర్చి తెలిసికొందము.  మొట్టమొదటగా ద్రాక్షరస మద్యపు వ్యసనములో తగుల్కొని పతనావస్థలో అనగా అవమానకరమైన వాతావరణమును అనుభవించిన వారిలో ద్రాక్షారసమునకు మూలకారకుడైన నోవహు అని చెప్పవచ్చును.  ఇతనే ద్రాక్ష పంటను మొట్టమొదటగా పండించి, దానిలోని ఫలసాయమును పూర్తిగా అనుభవించి తద్వారా ద్రాక్ష మద్యమును తయారుచేసే పరిజ్ఞానమును పొంది మద్యపు మత్తులో దిగంబరియై, దేవుని చేత నీతిమంతునిగా పిలువబడిన నోవహు ద్రాక్షా మద్యపాన ప్రభావమున హీనుడయ్యాడు.  అంతేగాకుండా ఈయొక్క దురలవాటును బట్టి నోవహుకు చరిత్ర లేకుండా పోయింది.  ఇక రెండవ వ్యక్తి లోతు - లోతునకు మద్యము అలవాటు ఉండబట్టియే కుమార్తెలు అతనితో పాపము చేసే అవకాశము ఏర్పడింది.  అనగా మద్యమన్న మత్తులో నరుడు ఎలాంటి దారుణానికైననూ వెనుకాడడు అన్నటువంటి సత్యాన్ని ఈ మద్యపాన వ్యసనమన్నది మనకు వివరిస్తున్నది.  అందుకే సామెతలు 23:29, ''ఎవరికి శ్రమ?  ఎవరికి దు:ఖము?  ఎవరికి జగడములు?  ఎవరికి చింత?'' అనుటలో ఈ మద్యపాన వ్యసనము వలన సంక్రమించేటటువంటి దుష్పలితము దు:ఖము, దానియొక్క అలవాటు మూలముగా నిష్కారణమైనటువంటి కలహములు, జగడములు, దెబ్బలు, లోక సంబంధముగా శిక్షలు, వగైరాలు కాక మరియు జన బాహుళ్యములో తల ఎత్తుకొని తిరుగలేనట్టి అవమానము.  ఇవన్నియు ద్రాక్ష రసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా?  అని అంటున్నాడు.

        ద్రాక్ష రసమన్నది మామూలు ప్రకృతి సిద్ధముగా, తాజాగా ద్రాక్షా ఫలముల నుండి తీసిన రసమైతే దానివలన ఎలాంటి హాని జరగదు.  అనగా అది దేవుడు అనుగ్రహించిన పానీయముగా ఎంచబడుచున్నది.  అనగా కలిపిన ద్రాక్ష రసము రుచి చూచుటన్నది ఇది లోక సంబంధముగా, కృతిమముగా తయారు చేయబడినటువంటి విధానములోని ద్రాక్షారసము.  దీనినే ద్రాక్షామద్యము లేక ద్రాక్షాసారాయి అనవచ్చును.  సామెతలు 23:31, ''ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను  త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము.''  ద్రాక్షారసము సాధారణమైనది అనగా ద్రాక్షాఫలముల నుండి పిండబడి సహజ స్థితిలో ఉన్నదైతే, దాని వలన నర జీవితమునకు ఆరోగ్యమేగాని హాని లేదు.  అయితే కృత్రిమముగా నానా విధమైనటువంటి వస్తు సముదాయముతో పులిసినదై పవిత్రతను కోల్పోయి, నరజ్ఞానముతో నరుని చేత తయారు చేయబడిన ద్రాక్షారసముయొక్క గుణాన్ని గూర్చి ఈ క్రింది వేదభాగములో వ్రాయబడి యున్నది.  ఏమనగా, సామెతలు 23:32, ''పిమ్మట అది సర్పమువలె కరచును  కట్లపామువలె కాటువేయును.''  అని అనుటలో ద్రాక్షారస మద్యమన్నది విజృంభించినప్పుడు దాని సహజత్వమును కోల్పోయి, అది మానవునియొక్క కుతంత్రములో రూపాంతరము పొంది, ద్రాక్షారసమునకు బదులుగా ద్రాక్ష మద్యముగా తయారైనప్పుడు దాని రూపము సర్పమునకు పోల్చడమైనది.  అనగా సర్పము ఏ విధముగా తళతళలాడుతూ ఆకర్షణీయముగా ఉంటుందో, అలాగే ఈ మద్యము కూడా ఆకర్షణీయమైన రంగులో మెరయుచూ నరుని ఆకర్షించి, తనను త్రాగమన్నట్లుగా అది ప్రేరేపిస్తూ దానికి అలవాటు పడిన వ్యక్తిని కట్లపాము వలె కాటు వేయునట్టి హాని కల్గించే ప్రమాదమున్నదని ఈ గ్రంథకర్త యొక్క ప్రవచనమై యున్నది.  ఈ విధముగా మద్యపానమునకు అలవాటుపడిన వ్యక్తియొక్క  శరీర స్థితి, ఆత్మీయ జ్ఞానము ఒకదానికొకటి వక్రించి దేహమునకు కైపు, నేత్రాలకు భ్రమ, వెర్రి మాటలు, జ్ఞానమును, ఆత్మీయతను కోల్పోవుట, తాను మాట్లాడే వికృతమైన మాటలనుబట్టి ఇతరులతో నిష్కారణమైన కలహాలకు కాలుదువ్వుట, వారిచేత దెబ్బలు తినడమేగాక, పోలీసుల చేత చిక్కి దెబ్బలు, అవమానకరమైన మాటలు, దూషణలు అనుభవించుటయును, ఇంను ఈ మద్యపానము వలన న్యాయస్థానములో దోషిగా ఎంచబడి కారాగారములో శిక్షను అనుభవించడం నేటి దినములలో న్యాయస్థానములలో జరుగు విచారణలలో ఒక ప్రాముఖ్యమైన నేరమై యున్నది.  ఇందునుగూర్చి నేటి మన ప్రభుత్వాలు కూడా ఈ మద్యపాన వ్యసనము అన్నదాన్ని బహు గొప్ప నేరముగా పరిగణించి, దానికి ఒక ప్రత్యేక న్యాయస్థానమును, ప్రత్యేకమైన శిక్షలను విధిస్తున్నది.  ఇంకను ఈ మద్యపాన వ్యసనమును బట్టి నేటి ప్రభుత్వము త్రాగుబోతులను పట్టుకొనుటకు ఒక ప్రత్యేకమైన పోలీసు శాఖలను కూడా ఏర్పరచి యున్నది.  ప్రభుత్వము తలపెట్టిన ఈయొక్క విధానములో త్రాగుడు నిషేధము అన్నదాన్ని ప్రొహిబిషన్‌ అనియు - త్రాగినవానిని శిక్షించు పోలీసు శాఖను ఎక్సైజు పోలీసు శాఖ అనియు పేర్లు పెట్టి నేడు బహుముఖ వ్యాప్తముగా విస్తరించియున్న ఈ మద్యపానము అను ఈ వ్యసనమును పూర్తిగా నిషేధింప జేయుటకు నానావిధ పద్ధతులలో పకడ్భందిగా ప్రభుత్వము కఠిన వైఖరిని అవలంబించి, మద్యపాన వ్యాపారులను, మద్యపానమును సేవించిన వారిని గూర్చియు బహుజాగ్రత్తను వహించి, అట్టివారిని బహు చిత్రవిచిత్రమైన పద్ధతులలో పట్టుకొనే విధానాలు కూడా మనము వార్తాపత్రికలలో చదువుతున్నాము.

        కట్లపాము కంటె ప్రమాదకరమైన ఈ మద్యపానమనే భయంకరమైన సర్పము అన్నది ఎంతటి దారుణానికైననూ ఒడిగట్టడమేగాక వికృతమైన ఘోరాతిఘోరముగా సంఘాలకును, సమాజమునకును, దైవత్వమునకును ఓర్వలేనట్టి నీచ కార్యాలకు నరుని సాహసింప జేస్తుంది.  దీని సాంగత్యము ద్వారా నోవహు లోతు అనువారే గాక సంసోను వంటి వీరులు, నాటి ఇశ్రాయేలు అను దైవజనాంగమును పాలించిన రాజులు, కీర్తనలు కొన్ని, సామెతలు, పరమగీతాలు, ప్రసంగి, విలాపవాక్యాలు వంటి ఐదు దైవ వేదములోని వేదభాగాలు రచించిన మహాజ్ఞానియైన సొలొమోను వంటి వారిని నాశనము చేసింది.  అంతేగాక యెహోవా దేవుని తేజస్సు, మహిమ, ప్రసన్నత కొరకు యెరూషలేములో దేవునికి దేవాలయమును నిర్మించిన ఘనత సొలొమోనుకే దక్కింది.  అంతటి మహనీయుడు మద్యపానాసక్తుడై, స్త్రీలోలుడై, దైవత్వమును పూర్తిగా విసర్జించి, తాను దేవునికి కట్టిన మందిరమునకు వ్యతిరేకముగా అన్య దేవతా దేవాలయమును కట్టి, బలులు అర్పించి, అన్య దేవాతారాధన జరిగించి, దైవత్వమును కోల్పోవు స్థితికి దిగజారినాడంటే అందుకు కారణము ఈ మద్యపాన వ్యసనమే.

        అయితే ఇంత అనర్థముతోను, అక్రమములతోను, దుర్మార్గముతోను కూడిన ఈయొక్క మద్యపానమును దేవుడు నిషేధిస్తే, ఆయన కుమారుడు మన రక్షకుడు యోహాను 2:లో కానాలోని వివాహ గృహములో వారి సాంప్రదాయము ప్రకారము పెండ్లి విందులో ద్రాక్షారసము చేయుటలో ఉన్న మర్మము మనము తెలుసుకోవలసి యున్నది.  భోజనమున కంటే పెండ్లి విందుకు సిద్ధపరచబడిన మద్యపానపు విందులో ద్రాక్షారసము అయిపోయిందంటే ద్రాక్షారస మద్యమునకు ఆనాడు ఉన్నట్టి ప్రాధాన్యతను కానాలోని పెండ్లి గృహపు సంఘటన మనకు వివరిస్తున్నది.  అంటే పెండ్లి ఇంటివారి భోజన పదార్థముల కంటె ద్రాక్షా మద్యమునకే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చినట్లుగా యోహాను 2:1-3లోని వేదభాగాల ద్వారా తెలియగలదు.  ఆ విధముగా ద్రాక్షామద్యము మీద ఆసక్తిపరులై ఆ పెండ్లి ఇంటివారు కంగారు చెందినప్పుడు, యేసు తల్లి తన కుమారునితో పెండ్లి ఇంటివారికి ద్రాక్ష రసము అయిపోయిందని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఆమె మాటనుబట్టి గాక, తండ్రి తనకు అనుగ్రహించిన అవకాశమును బట్టి ఆ పెండ్లి గృహములో వాకిట ఉంచబడిన ఆరు రాతి బానలను నీళ్ళతో నిండించి, ఆ నీళ్ళను విందు యజమానికి ఇస్తున్నప్పుడు ఆ నీళ్ళు ఆ యజమానికి ద్రాక్షమత్తును కల్గించుటలో దైవోద్ధేశ్యమేమిటో మనము తెలిసికోవలసి యున్నది, ఎందుకంటే మద్యపానమును ఇంత తీవ్రముగా నిషేధించిన దైవత్వము మరి పెండ్లి విందులో ద్రాక్షారసము సరఫరా చేయుటలోని దైవోద్ధేశ్యమేమిటి?  అనిన ప్రశ్న మనకు కలుగక మానదు.

        వాస్తవమునకు యేసుక్రీస్తు పెండ్లి విందులో ద్రాక్ష గుత్తులను తెప్పించి వాటిని త్రొక్కించి ఆ రసమును మద్యముగా మార్చి విందుకు వచ్చిన అతిధులకు త్రాగించలేదు.  అయితే యేసు మాటలను బట్టి బానలను నీళ్ళతో నింపిన పరిచారకులు ఆ బానలను నీళ్ళతో నింపారేగాని ద్రాక్ష రసముతో నింపలేదు.  చిత్రమేమిటంటే యేసుక్రీస్తు పెండ్లి గృహములో చేసిన ద్రాక్ష రసమును గూర్చిన పూర్వార్థము బానలోని నీళ్లను తీసుకొని పోయినవారికి తప్ప మరెవరికిని తెలియదు.  అయితే ప్రభువు చేసిన ప్రయోగాత్మక క్రియను ప్రత్యక్షముగా ఆయన శిష్యులు చూచి ఆయన మీద విశ్వాసముంచినట్లుగా వేదములో వ్రాయబడియున్నది.  ఇందునుగూర్చి మనము ఆత్మీయముగా ఆలోచిస్తే దేవుడుగాని, దేవుని కుమారుడుగాని, దేవదూతలుగాని మద్యమును తయారు చేయువారు కారు.  మద్యమన్నది భూలోక సంబంధ మత్తు పదార్థము.  ధూమపానమన్నది కూడా భూలోకములో వృక్ష సంబంధముగా ఏర్పడిన వ్యసనము.

        ఈ విధముగా మద్యపానము, ధూమపానము అన్నవి రెండును నేడు భూలోకములో విశేషముగా ప్రబలి వివాహము కాని స్థితిలో యవ్వనులను, గుట్టుగా సంసారము చేసుకొనే సంసారులలోను, వారి జీవితాలను, శారీర సంబంధముగాను, ఆత్మ సంబంధముగాను కూడా భ్రష్టు పట్టించుచున్నది.  యేసుక్రీస్తు ప్రభువు కానాలోని పెండ్లి ఇంటి వాతావరణము ఆయన పరిశోధించాడు.  ఆ పెండ్లి ఇంటిలో భోజన పదార్థముల కంటె మత్తు పదార్థాలకు ఎక్కున ప్రాధాన్యత నిచ్చినట్లుగాను, అప్పటి పెండ్లి ఇంటియొక్క పరిస్థితిని, కొరతను అవగాహన చేసికొని తల్లియైన మరియమ్మ కుమారునితో హెచ్చరించగా, కుమారుడు తన సమయము ఇంకను రాలేదని చెప్పినాడు. ఇది జరిగిన విషయము.  అయితే కుమారుడు ఆశించిన సమయము రానే వచ్చింది.  పెండ్లి ఇంటిలో ద్రాక్షారస కొరతను పూర్తిగా తీర్చడమన్నది కూడా జరిగింది.

        యేసుక్రీస్తు కానాలోని పెండ్లి గృహములో దైవత్వము మానవత్వపు విలువ రెండును లేని కేవలము మత్తు పదార్థమునకే ఆ గృహములో చోటు అన్నట్లు గ్రహించి, ఆ పెండ్లి ఇంటివారు ఏ మత్తుకు అలవాటు పడి ఆత్మీయ స్థితిని కోల్పోయి వున్నారో, ఆ మత్తును పెండ్లి ఇంటివారు ఆశించినట్లు ద్రాక్షారస మద్యముతో గాక బానలో నింపబడిన నీళ్ళతో ఆ ద్రాక్షారసపు మద్యపు అనుభూతిని కల్పించి, మత్తులో వారిని మరిపించాడు.  అందుకే విందు ప్రధాని చెప్పిన మాట - యోహాను 2:9-10, ''ఆ ద్రాక్షారసము ఎక్కడనుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినదిగాని విందు ప్రధానికి తెలియక పోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి-ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును;  నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను.''

        పాలస్తీన దేశములో అతి ముఖ్యమైన పంటలలో ద్రాక్ష పంట ఒకటి.  యూదులు ఈ ద్రాక్ష పంటకు ఎక్కువగా ప్రాధాన్యత నిస్తారు.  ఇది ఒక పాలస్తీనులోనే గాక నేడు ప్రపంచ మందంతట వ్యాపించి, కూల్‌డ్రింక్‌ షాపులు లగాయతు బ్రాందీ బారుల వరకు ఈ ద్రాక్ష ఫల ప్రభావము విస్తరించి బారులు అని, క్లబ్బులు అని, వేశ్యా గృహాలు, విలాస విహార యాత్రలలోను బహు ప్రాముఖ్యతను సంతరించుకొని యున్నది.  మద్యపానాసక్తులకు వావి వరుసలు, మానమర్యాదలు, ఇంగిత జ్ఞానము, ఆత్మీయత, సోదర ప్రేమ, న్యాయ విచారణ వగైరాలు అన్నవి ఏమిటో ఎరుగని స్థితిలో వారు ఈ లోకములో ఉన్నను లేనట్లుగానే వ్యవహరిస్తారు.  వారు చేసే పనులేమిటో వారికే తెలియదు.

        కనుక మద్యపానములోని విపత్తుకు కారణము ద్రాక్ష ఫలమే.  ద్రాక్ష ఫలములతో తయారు చేయబడిన మద్యము ఉన్నతమైనదియు, ఖరీదైనదియు, సామాన్య నరునికి అందుబాటులో లేనిదియు, రాజులకు, చక్రవర్తులకు, ధనిక వర్గమునకు ఇది ఒక ఘనమైన పానీయముగా వాడబడుతుంది.  వాస్తవమునకు మద్యపాన మత్తు అన్నది ద్రాక్షారసము నుండి ప్రారంభింపబడి ద్రాక్షారసములోని మత్తునకు సమానమైన మత్తు పుట్టించేటటువంటి ద్రవములు, ఓషధులు, చెట్టు ఆకులు, వగైరాలు ఎన్నో ప్రజా బాహుళ్యములో నేడు క్రియ జరిగిస్తున్నవి.  అయితే మద్యము పుట్టింది ద్రాక్షారసములోనే.  అందుకే ద్రాక్ష రసమును తండ్రియైన దేవుడు నిషేధించాడు.  కుమారుడైన యేసుక్రీస్తు కూడా దీనిని ఒక నిషేధ వస్తువుగా ప్రవచించి యున్నాడు.  అయితే ప్రభువు బల్లలో మనము పాలు పొందినప్పుడు ద్రాక్ష రసమును వాడుటలోని పరమార్థమేమి?  యేసు ప్రభువు తన చివరి బల్లలో - లూకా 22:17-18, ''ఆయన గిన్నె ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి-మీరు దీనిని తీసికొని మీలో పంచుకొనుడి;  ఇకమీదట దేవుని రాజ్యము వచ్చువరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాననెను.''  లూకా 22:20, ''ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని-ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన.''  ఇందులో మొట్టమొదటి మాట ద్రాక్షారస నిషేధము.  రెండవ మాట నిబంధన.

        ఈ రెంటిని గూర్చి తెలిసికొందము.  యేసు ప్రభువు ఎందుకు తాను తన రాకడ వరకును ద్రాక్ష రసమును నిషేధించాడో మనము ధ్యానించుకొందము.  యేసుక్రీస్తు చనిపోయి మరణ పునరుత్ధానుడైన తర్వాత ఆయన ద్రాక్షరసమును ముట్టవలసిన అవసరము లేదు.  ఎందుకంటే ఆయన లోక సంబంధి కాడు.  లోక సంబంధమైన ఆహారము ఆయనకు అవసరము లేదు.  ఆయన ఆత్మ సంబంధి.  ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనకు ఆయనే భోజనము.  ఎలాగంటే యేసుక్రీస్తు సాతానుతో శోధింపబడునప్పుడు, శోధకుడు ఆయన యొద్దకు వచ్చి - ''నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమనెను, అందుకు యేసు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట వచ్చు ప్రతి మాట వలనను జీవించును,'' అని చెప్పెను.  దేవునియొక్క మాట యేసే.  

        యోహాను 1:14లో దైవ వాక్యమై యున్న యేసుయొక్క పూర్వ ఆకారము శరీరధారిగా మానవాకృతిలో అవతరించినట్లుగా చదువగలము.  కనుక యేసుక్రీస్తు సంపూర్ణ నరుడు కాడు.  అందుచేత లోక సంబంధమైన భోజన పానీయములు ఆయనను తృప్తి పరచలేవు అనగా ఆయన ఆకలిని తీర్చలేవు.  

        ఈ సందర్భములో యోహాను 4:34, ''యేసు వారిని చూచి-నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.''  కనుక దైవ కార్యమును నెరవేర్చుటయు, దానిని సంపూర్ణము చేయుటయే యేసు ప్రభువునకు లోకములోని ఆహార పానీయము.  కనుక లోక సంబంధమైన భోజన పానీయములతో జీవించవలసిన స్థితి ఆయనకు లేదు.  అయితే లూకా 22:20లో ప్రభువు చెప్పినమాట - ద్రాక్షారసపు గిన్నెను పైకెత్తి ఈ గిన్నెలోని ద్రాక్షారసము తన రక్తమునకు పోల్చుకొని ప్రజలందరి కొరకు, పాపపరిహారార్థము చిందింపబడుటకు మాదిరిగా దానిని అభివర్ణిస్తూ క్రొత్త నిబంధన అను గ్రంథమునకు ఆ పాత్రను ముంగుర్తుగా ప్రతిష్టించుటలో - ఈ ద్రాక్ష రసమన్నది పాప పరిహారార్థము కొరకు ప్రాయశ్చిత్తముగా వాడబడే పానీయమేగాని, దీనిని పులిసిన దానినిగా జేసి, దీని విలువను చెడగొట్టి, మత్తు పదార్థముగా వాడమని కాదు.  యేసు ప్రభువు బల్లలో ఆచరించిన ద్రాక్షారసము పులియనిది అనగా ద్రాక్షారస మద్యము కాదు - పవిత్రతను కోల్పోయింది కాదు.  ఇట్టి ద్రాక్షారసము దైవత్వములో ఒక ప్రత్యేకతను పొంది, దేవుని హస్తముతో ఆశీర్వదింపబడింది.  

        అయితే మద్యముగా వాడబడే ద్రాక్షారసము మద్యపానాసక్తులకు వెర్రిని పుట్టించి, బుద్ధి వైకల్యము, వెర్రి మాటలు, ఒల్లు తెలియని స్థితి, బుద్ధి మాంద్యము, కనుదృష్టి మాంద్యము, నోటి దురుసుతనము, క్రూరత్వము, కఠినత్వము వగైరా అరిష్టాలకు ఆలవాలమై, నరుని జీవితములో వానికున్న విలువలను పాడు జేయుటయే గాక వాని ఆయుష్కాలమును, వాని కుటుంబాన్ని, వాని ఆస్తిపాస్తులను సమూలముగా నాశనము చేసి, తుదకు వానిని మరణానికి నడుపుచున్నది.  కనుక ఇటువంటి మరణాంతకమైన ద్రాక్షారసమును ప్రభువు రక్తాపరాధము చేయువారికి ఇది ముంగుర్తుగా  చూపియున్నాడు.  నూతన నిబంధన అనగా రక్తాపరాధమునకు గుర్తు.  రక్తాపరాధమునకు మూలము ద్రాక్షారసము.  ప్రతివానియొక్క పాపమునకు రక్తమే అని దీని భావము.

        ఇట్టి ప్రమాదభరితమైన ఈ ద్రాక్షారసమును పాత నిబంధన కాలములో ద్రాక్షా మద్యమును తయారు చేయుటలో బహు తెగువగల్గి నేర్పరిగలవాడై యుండిన నెహెమ్యా తన ద్రాక్షారసముతో రాజుల మనస్సులను పరవశింప చేయగలిగినాడు.  అందువలన నెహెమ్యా తన జీవితములో అనేక గొప్ప కార్యాలు చేయగల్గినాడు.

        ఒక్కమాటలో చెప్పాలంటే ఈ మద్యపానమన్నది నర జీవితమునకు కత్తి వంటిది.  అందుకే మద్యము మత్తులో ఉన్న వ్యక్తిని గూర్చి సామెతలు 23:29-35 చదివితే త్రాగుబోతుయొక్క  దేహస్థితి ఎట్టిదో మనకు వివరముగా తెలియగలదు.  ఇందునుబట్టి దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిలోని 3వ వ్యక్తియైన పరిశుద్ధాత్మ బహు కఠినముగా మద్యపానమును నిషేధించినట్లు వేదములో చదువగలము.  అలాగే అపొస్తలుడైన పౌలు - ఎఫెసీ 5:18, ''మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు;'' అని ప్రవచిస్తున్నాడు.

        కనుక ప్రియపాఠకులారా!  ద్రాక్షారసమన్నది చాలా సున్నితమైన పానముగా మనకు కనబడుచున్నది.  అయితే దాని నుండి పుట్టిన మద్యము మూలముగా నేడు విస్తరించియున్న మత్తు పదార్థములకు లోకము బానిసయై, నానా విధమైనటువంటి శోధనలకు, బాధలకును, అరిష్టాలకును, మరణాలకును గురియగుటన్నది మనము చూస్తున్న విషయమే.  కనుక కట్లపాము వంటి ఆకర్షణలో వున్న ఈ మద్యమునకు అనగా నానా విధములైనటువంటి నామధేయాలతో నేడు విస్తరించియున్న హేయమైన మత్తు ద్రవములను ఆశింపక, మహిమగల ప్రభువుయొక్క మహిమ రాజ్యములో నివసించుటకు మన ఆత్మీయ జీవితమును, మన శరీర అలవాట్లను కాపాడుకొంటూ మానవత్వానికి యోగ్యకరముగా - దైవత్వానికి మహిమకరముగా జీవించెదము గాక!

6.  ఇమ్మానుయేలు

        యెషయా 7:14, ''కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును.  ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.''

        ప్రియపాఠకులారా!  యెషయా 7:14లో వ్రాయబడిన ఈ వాక్యమే మత్తయి 1:21లో మనము చదువుచున్నాము.  ''ఆమె యొక కుమారుని కనును;  తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.''  అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలుకుటలో, ''ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము,'' అని ఈ వాక్యములోని వివరణ.  ఇదే రీతిగా నూతన నిబంధన కాలములో యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యకయైన మరియమ్మకు దేవుని దూత దర్శనమిచ్చి లూకా 1:30లో వలె కన్యకయైన మరియమ్మకు కూడా యేసు అను పేరు పెట్టమన్నట్లు వేదములో వివరించబడి యున్నది.  మరియొక విశేషమేమిటంటే లూకా 2:11లో అదే దేవదూత గొర్రెలు కాసే మంద కాపరులకు దర్శనమిచ్చి - ''దావీదు  పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు; ఈయన ప్రభువైన క్రీస్తు.'' అని చెప్పెను.

        యెషయా 7:14లోని ప్రవచనము, మత్తయి 1:22, లూకా 1:30 మరియు 2:11లలో వివరించబడిన వేదభాగాలలో ప్రభువును గూర్చి చెప్పినది.  దైవత్వమన్నది తన ప్రేమ చేత వివరించిన మాటలు ఒకదానికొకటి ఉన్న పొందిక ఏమిటో మనము తెలిసికొందము.  మొదట ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అనిన దాన్ని గూర్చి మనము తెలిసికోవలసి యున్నది.  ఈ ఇమ్మానుయేలు అనగా దేవుడు తోడు అనిన పదము మొట్టమొదటగా ఇశ్రాయేలుకే వర్తించును.  ఎందుచేతనంటే ఇమ్మానుయేలు శక్తితో దైవత్వమెన్నుకున్న పరిశుద్ధ జనాంగమైన ఇశ్రాయేలు కూటమి తన సొత్తుగా దేవుడు వాడియున్నట్లు వేదభాగాలలో నిర్గమ ద్వితీయోపదేశకాండములలో చదువగలము.  ఇది దైవకృపయే అన్నట్లు రూఢియగుచున్నది.  ఎట్లనగా దేవుడు ఇశ్రాయేలునకు మోషేయను వ్యక్తిని అధిపతిగాను, తన కర్రనిచ్చి నాయకునిగాను నడిపించి క్రియ జరిగించెను.  ఈ విధముగా దేవుడు మోషేను వాడియున్నాడు.  ఐగుప్తులో సంభవించిన గొప్ప క్షామము నుండి వారిని రక్షించగా దైవత్వముతో నడువవలసినవారు దైవత్వముపై తిరుగుబాటు చేసి సణుగుకొన్నారు.  కాని మోషే వారి తరపున విజ్ఞాపన జేస్తూ స్వస్థత చేకూర్చమని ఎన్నో విధాలుగా ప్రాధేయపడి దైవత్వాన్ని అభ్యర్థించి విజయాలు సాధించారు.

        మనము కూడా ప్రతి అవసరములో ఆయనకు ప్రార్థన చేయవలెను.  అట్లు చేయకపోతే మనపై డేగవలె ఉగ్రుడై నశింప జేయగలడు.  కన్యకయై యుండి గుణ వంతురాలును, తిరుగు జెప్పని స్వభావము గలదై, దైవత్వము నందు బహు భక్తి విశ్వాసము గల స్త్రీయైన మరియమ్మ గర్భములో ఆయన జన్మించుటకు తీర్మానించిన  సర్వశక్తుడైన దేవుడు యోసేపు అను ఒక వడ్రంగి వ్యక్తి దగ్గరకు దూతను పంపించెను.  యోసేపు సహృదయుడు గనుక నిర్దయుడు మరియు కఠినుడుగాని కాడు.  యోసేపు భార్య నిమిత్తము అనుమానించిన సందర్భములో దూత చెప్పిన విధానము దావీదు కుమారుడైన యోసేపు అని సంబోధించి - ''ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టగలవని'' చెప్పుటలో వున్న పరమార్థాన్ని మనము గ్రహించవలసి యున్నది. యేసు అనగా ఎవరు?  దీని జవాబు ఈ వేదభాగములోనే ఉన్నది.  ఈ సందర్భములో లూకా 1:32, ''ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడన బడును;  ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.''  మత్తయి 1:21-23, ''ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.  ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును  ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను.  ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.''  ప్రియపాఠకులారా, ఇందులోని భావము, ''ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును  ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు.''  అనగా దేవుడు తోడు నిజమే!  ఇశ్రాయేలునకు దేవుడు తోడు.  ఇశ్రాయేలుయొక్క జీవమునకును, వారి కుటుంబాలకును, వారి రాజ్యాలకును అందులోని జనాంగానికి ఆయన తోడు.  అయితే ఇమ్మానుయేలు అను పేరుతో పుట్టిన అట్టి బాలుడు భూమి మీద ప్రసవింపబడిన తర్వాత ఆయనకు పెట్టబడిన పేరు యేసు అంటే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని ఉన్నది.

        యేసు ప్రభువు విషయములో అనగా ఇమ్మానుయేలుయొక్క విషయములో ఇశ్రాయేలుకైతే దేవుడు తోడుగా ఉన్నాడు.  కాని వారు ఇమ్మానుయేలుగా వుండి, రూపాంతరము పొంది దైవజనాంగమైన ఇశ్రాయేలీయులలో యూదా గోత్రములో పుట్టెను.  అయినను యూదులే ఆయనను అపహసించి, హేళన జేసి, విమర్శించి, ఆయనమీద నేరారోపణ జేసి, ఆయనను ఒక దోషిగా నిర్థారించి, సిలువ మరణానికి ఆయనను అప్పగించుట జరిగింది.  ఇది జరిగినప్పుడు, ఇమ్మానుయేలు మనుష్యులకు తోడా?  యేసు అను ఇమ్మానుయేలునకు ప్రజలు తోడా?  ఈ వేదాంతము శారీర జ్ఞానముతో మనము ఆలోచిస్తే తికమకలాడుట తప్పదు.  ఇందునుబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడ ఇశ్రాయేలునకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడిన యేసుయొక్క తోడు అనగా రక్షణ యుండనే ఉన్నది.  ఎందుకంటే అది అన్య దేశమైతే నేమి?  అది ముస్లీముల దేశమైతే ఏమి?  మరి ఏ దేశమైనను ఇశ్రాయేలునకు విరోధులై యుండగా ఒక్క క్రైస్తవ దేశములు మాత్రమే నేటి నాగరికతా యుగములో రక్షణ నిచ్చుచునే యున్నవి.  అయిననూ ఇశ్రాయేలీయులకు ఇమ్మానుయేలు అనగా ఆయన ఎవరో తెలియదు.

        యోహాను 4:22, ''మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది.'' అనగా యూదుల నుండియే క్రీస్తు పుట్టుచున్నాడు.  ''మీరు మీకు తెలియనిదానిని,'' అనుటలో ఇమ్మానుయేలు అను యేసుక్రీస్తు పుట్టునని తెలియక మీరు సృష్టినారాధి స్తున్నారు.  ఇమ్మానుయేలు అను రక్షకుడు యేసు అను నామముతో రాబోవుచున్నాడని దీని భావము అనగా ఎందుకు ఈయన వస్తున్నాడు? ఎట్లు వస్తున్నాడు?  లూకా19:10, ''నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.''

        పరిశుద్ధ గ్రంథ వేద మర్మము ఆ విధముగా ఉన్నది.  ఇంత లోతుగా మానవ జ్ఞానముతో మనము ఆలోచించాలంటే, అది ఆత్మీయ శ్రమతో కూడిన పని.  అందుకే దేవునియొక్క ప్రవచనము మత్తయి 2:2లో మొట్టమొదటగా అనగా ఇమ్మానుయేలు పుట్టిన తర్వాత అనగా యేసు ప్రభువు జన్మదిన సందర్భములో యూదా దేశపు జ్ఞానులు ఈ ఇమ్మానుయేలుయొక్క రూపాంతరమును గూర్చి వివరించి యున్నారు.  మత్తయి 2:5, ''అందుకు వారు-యూదయ బేత్లెహేములోనే; ఏలయనగా యూదయదేశపు బేత్లెహేమా  నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు;  ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును.''  ఇందునుబట్టి ఇమ్మానుయేలు ఎక్కడ నుండి రావలెను?  ఇశ్రాయేలు నుండి రావలెను.  ఇశ్రాయేలు నుండి ఉదయించిన ఈ ఇమ్మానుయేలు లోకానికి యేసు పాప విమోచకుడు లేక రక్షకుడుగా ఉదయించినాడు.

        ఇట్లు ఉదయించినటువంటి ఈ ఇమ్మానుయేలుయొక్క సువర్తమానమును లూకా 2:11లో మన దేవుడు తన దూతచేత గొల్లలకు ప్రకటించిన సువర్తమానములో దేవదూత  ''దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు.''  అని అనుటలో ఇందులోని పమార్థాన్ని కూడా మనము తెలిసికోవలసి యున్నది.  ఇందులో క్రీస్తు అను మాటకు అభిషిక్తుడు, ఎందుకనగా యేసుక్రీస్తు ఎనిమిదవ దినమున యూదా ఆచార ప్రకారముగా దేవాలయములో ప్రతిష్టించబడి యోహాను బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మ పూర్ణుడై అభిషిక్తుడయ్యాడు.

        అప్పటికి కూడా ఈయన ఇమ్మానుయేలు అని లోకము అర్థము చేసికొనలేదు.  అసలు ఇమ్మానుయేలంటే ఏమిటో కూడా తెలిసీ తెలియని అయోమయ స్థితిలో ప్రవక్తల నాటి యుగము, రాజుల కాలము, ఇశ్రాయేలు జీవితము ఉండినది.  ఎందుకంటే, ''ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.'' అను ఒక మాటతో ఆ ప్రవచనము పూర్తి కాలేదు.  యెషయా 9:6, ''ఏలయనగా మనకు శిశువు పుట్టెను  మనకు కుమారుడు అనుగ్రహింపబడెను  ఆయన భుజముమీద రాజ్యభారముండును.  ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.''  ఇలాంటి బిరుదులున్నట్లుగా ఆ లేఖన భాగములో వివరించబడి యున్నది.  దైవత్వముయొక్క ప్రకటన ఈ విధముగా వుండగా మానవ జ్ఞానము ఇందుకు భిన్నముగా సుదూరమైన నిరీక్షణ లేని జీవితములో ఉండబట్టే, నవనాగరిక యుగము వరకును పై వేద వాక్యముయొక్క సత్యములు గ్రహించినట్లుగా కనబడుటలేదు.  ఇమ్మానుయేలు ఎందుకు పుట్టినాడో, అనగా ఏవిధముగా తోడై యున్నాడో?  ఆయన ఎటువంటి బలవత్తరమైన శక్తి సంపన్నతతో కూడిన నామధేయములెన్నో, అవి ఎటువంటివో,  వాటి గుణాతిశయము లేమిటో?  అవి జరిగించిన క్రియా విధానము లెట్టివో?  ప్రస్తుతము జరిగిస్తున్న క్రియ లేమిటో?  ఇక జరిగించబోవు కార్యక్రమాలెట్టివో?  కూడా లోకానికి అర్థము కాలేదు.  కాని దైవత్వము సంపూర్ణముగా లోకము పుట్టినది మొదలుకొని అనగా జగదుత్పత్తి నుండి నేటివరకు దైవక్రియ జరిగించిన క్రియా మర్మములు బైల్పరచుచున్నవి.

        అయినను 2 కొరింథీ 4:4లో వలె ఈ లోకము మనో నేత్రాంధకారములో జీవిస్తున్నది.  నేటి మానవ అతిరథ మహారథ విద్యా వేదాంత శాస్త్రజ్ఞులు సుదూరముగా గ్రహించి, పరిశోధించినను వారికి కూడా ఈ ఇమ్మానుయేలు అను పేరులో ఉన్న దైవ పూర్వార్థమును, యేసును గూర్చిన జ్ఞానమును, క్రీస్తును గూర్చిన పరమార్థమును, మెస్సీయాను గూర్చిన పూర్వార్థమును, ప్రవక్త అపోస్తలిక యాజక సిద్ధాంతములలోని గురుతర బాధ్యతలను, అందులోని బాధ్యతాయుతమైన జ్ఞానమును గూర్చి చాలామంది ఎరగకున్నారనియే చెప్పవచ్చును.  అయితే ఎరిగిన వారెవరో పరిశుద్ధ గ్రంథమునకు బాహ్యముగా జీవించిన వారిని గూర్చి మనము అనుకోకూడదు.  కాని వేదరీత్యా వేదములో గ్రహించిన వ్యక్తుల గూర్చి మనము ఈ సందర్భములో ధ్యానించుకొందము.

        ఇమ్మానుయేలుయొక్క రాకడను గూర్చి పాత నిబంధన కాలములో యెషయా గ్రంథములో ప్రవచించబడి యున్నది.  ఇమ్మానుయేలు అంటే అర్థము కూడా అందులోనే వివరించబడి యున్నది.  అదేవిధముగా మత్తయి సువార్తలో కూడా ఇమ్మానుయేలుగా కూడా అభివర్ణించబడి యున్నది.  ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడని కూడా వక్కాణించబడి యున్నది.  సృష్టికర్తయైన దేవునికి నిర్గమ 3:14లో హెబ్రీ భాషలో - ''ఉన్నవాడు'' అని పేరు వున్నట్లే, లేఖన భాగములో ప్రవక్తయొక్క ప్రవచనాలలో వివరించబడిన ఇమ్మానుయేలుయొక్క పదము కూడా దేవుడు మనకు తోడని తెనిగించబడి యున్నది.  మంచిదే!  అయితే ఈ ఇమ్మానుయేలు యొక్క ప్రవక్తల లేఖనానుసారముగా లోకానికి తోడా లేక సృష్టికి తోడా?  నరులకు తోడైతే ఏ విధముగా తోడై యున్నాడు?  ఈ ఇమ్మానుయేలు తోడుగా ఉండి ఏయే రూపాంతరాలు పొంది ఏయే క్రియలు చేశాడు?  భూమి మీద ఈయన క్రియలు సమాప్తమైన పిమ్మట అనగా భూమి మీద జరిగించవలసిన ప్రణాళికను అమలుజేసిన పిమ్మట ఈయనకు ఎన్ని బిరుదులున్నవో?  ఆ బిరుదులు ఏయే నామధేయాలతో ఉచ్ఛరింపబడుచున్నవో?  ఆ బిరుదుల ద్వారా ఇమ్మానుయేలు జరిగించిన కార్యాలేమిటో?  ఇమ్మానుయేలు వాస్తవమునకు ఏయే సందర్భాలలో ఏవిధమైన తన తోడును అనుగ్రహించి ఏయే క్రియలలో విజయోత్సవము సాధించాడో?  ఏవిధముగా మహిమపరచబడినాడో?  ఏవిధముగా ఘనత పరచబడినాడో?  కఠిన శిలా హృదయులైన నరుల జీవితములో ఇమ్మానుయేలు చేసిన పనులేమిటో?  వేదరీత్యా తెలుసుకోవలసిన అవసరత ఎంతో వున్నది.

        మొట్టమొదటగా యెషయా ప్రవక్త ప్రవచనానుసారముగా ఈ ఇమ్మానుయేలుయొక్క తోడు అవతరణకు మూలకారకమైన వంశములను గూర్చి తెలియగలదు.  దీనినిగూర్చి మత్తయి 1:17 చదివితే ఇమ్మానుయేలుయొక్క అవతరణకు మానవులు గాకుండా దేవదూతయే ప్రత్యక్షముగా వివరించింది.  ఇక మత్తయి 1:18 నుండి చదివితే లోక నర సంబంధియైన ఒక వడ్రంగి కుటుంబములో కర్మపాపము మెరుగని పవిత్రురాలియొక్క కుటుంబ జీవితానికి మొట్టమొదటగా ఈ ఇమ్మానుయేలుయొక్క తోడు బీజము వేసినది.  ఎట్లంటే మత్తయి 1:18వ వచనము నుండి మనము చదివితే యోసేపు అను యవ్వనస్థునికి ప్రధానము చేయబడిన స్త్రీయొక్క జీవితములో పురుష పాపమెరుగని వాతావరణములో ఈ ఇమ్మానుయేలు తానే ఆమెకు తోడైయుండి ఆమె గర్భములో పునాది వేసినాడు.  కనుక ఆమె జీవితములో ఆమెకును, ఆమె గర్భమునకును, ఆమె గృహమునకును, ఆమె ఆత్మీయ జీవితమునకును, ఇమ్మానుయేలు ఆత్మీయుడాయెను.  ఆమె భర్తయైన యోసేపు అనగా నీతిని అనుసరించువాడును, లోకమునకు భయపడినవాడును, లోకము నకు సుదూరమైనవాడును అయినందున ఆమెను అనుమానించి, రహస్యముగా ఆమెను విడనాడాలని ఉద్ధేశించినాడు.  

        అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా అనగా ఈమెను వదలి వేద్దామా?  కాపురములో ఉంచుకొందామా?  అనుకుంటున్న సందర్భములో దేవుని దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై మాట్లాడిన మాటలోని పరమార్థాన్ని మనము గ్రహించవలెను.  అదేమిటంటే - ''దావీదు కుమారుడవైన యోసేపు'' అనగా ఇశ్రాయేలు అను దైవజనాంగమునకు దేవుని రాజ్యముయొక్క  స్తోత్ర సింహాసనము మీద - దేవుని కూర్చోబెట్టి దేవుని యందు భయభక్తులు కలవాడై; తన యావద్‌ రాజరికమునకును తన యుద్ధ సమయాలలోను, తన శత్రు పోరాటములలోను, దైవత్వానికే ప్రాధాన్యతనిచ్చిన మహా ప్రవక్తయైన దావీదుయొక్క వంశావళిలో జన్మించిన యోసేపు అని అర్థము.  యోసేపు - నీ భార్యయైన మరియమ్మను చేర్చుకొనుటకు భయపడకుము.  ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్పెను.  యోసేపును భయపడవద్దని అనుటలో యోసేపునకు కూడా ఇమ్మానుయేలుయొక్క అండ ఉన్నది.  కనుక దేవుని దూతయొక్క మాట విశ్వసించినాడు.  ఇక మత్తయి 1:20వ వచనములో ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినదనుటలో మరియమ్మను, గర్భములోని శిశువునకును, మరియమ్మ భర్తయైన యోసేపునకు ఇమ్మానుయేలు అండ ఉన్నదని మనమెరుగవలెను.

        ఇంతవరకు ఈ లేఖన భాగములో అర్థము బాగుగానే యున్నది.  అయితే మత్తయి 1:21వ వచనములో మాటను ధ్యానించెదము.  మత్తయి 1:21, ''ఆమె యొక కుమారుని కనును;  తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.''  అనుటలోని పరమార్థాన్ని మనము సుదీర్ఘముగా ఆలోచించవలసి యున్నది.

        ''ఆమె యొక కుమారుని కనును;''  ఎవరు ఈ కుమారుడు?  శరీరేచ్ఛలతో పుట్టినవాడు కాడు.  మానష ధర్మముతో జన్మించినవాడు అసలు కాడు.  ఈ కుమారునికి మత్తయి 1:21వ వచనము రెండవ భాగములో వివరించిన మాటలను ఈ సందర్భములో తెలిసికోవలసి యున్నది.  ''తన ప్రజలనువారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు,'' అని అనుటలో ఇక్కడ ఒక గొప్ప పరమార్థమున్నది.  యోసేపు కుటుంబములో మరియమ్మ గర్భములో జన్మించిన కుమారుని వరకు ఇమ్మానుయేలే?  ఆయన భూమి మీద ప్రసవించబడిన తర్వాత తనకంటూ ప్రజలున్నారని, వారు పాపులని, వారి పాపాల నుండి ఆయనే రక్షించునని కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టాలని దేవదూతయొక్క సందేశము.

        ఇమ్మానుయేలు ఇప్పుడు ఇక్కడికి రక్షకుడయ్యాడు.  అయితే ఈ విధముగా యేసు అను పేరున జన్మించిన ఈ రక్షకుని గూర్చినటువంటి జనన విధానాన్ని మొదట గ్రహించిన వారెవరో రెండవ అధ్యాయములో మనము ధ్యానించవలసి యున్నది.  ఈ సందర్భములో మత్తయి 2:3లో వలె రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూష లేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు?  తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజించ వచ్చితిమని చెప్పిరి.  యేసు పుట్టినట్లు వాక్యము వివరిస్తున్నది.  రాజైన హేరోదు యేసు పుట్టిన వార్తను ఎరుగడు.  బేత్లెహేములో యేసు పుట్టునని కూడా తెలుసుకున్నవాడు కాదు.  ఇందునుబట్టి మనము గ్రహిస్తే ఇమ్మానుయేలుయైన యేసు రాజులకు తోడుగా లేడనియు, ప్రత్యేకించి దైవజనాంగమైన యూదులకు రాజుగాను, తోడుగాను, రక్షకుడుగాను పుట్టినాడనుట ఈ వచనముయొక్క మర్మమైయున్నది.  ఎందుకనగా ఇమ్మానుయేలు అను యేసును అతి రహస్య విధానములో తూర్పు దిక్కున దేవుడు ఇమ్మానుయేలు యేసు నక్షత్రమును దివి నుండి పంపి, ఆ నక్షత్ర జనన విధానము, దాని మర్మమును గూర్చి ముగ్గురు జ్ఞానులకెరిగించి, అట్లు ఎరిగించుటయేగాక ఈ ఇమ్మానుయేలుయొక్క నక్షత్రమును ముగ్గురు జ్ఞానులకు ప్రయాణమునకు దారి చూపుచూ వారికి ముందుగా నడుచుచూ యూదయా దేశమునకు వారిని జేర్చింది.

        ఇంతవరకు ఇమ్మానుయేలుయొక్క నక్షత్రము తన బిడ్డలైన ముగ్గురు జ్ఞానులకు క్షుణ్ణముగా వివరించి నడిపించింది.  అయితే యూదయా దేశములో యూదా సామ్రాజ్య మునకు హేరోదు రాజుగా వున్నాడన్న సంగతి జ్ఞానులకు తెలియును.  జ్ఞానులకు తెలిసినదేమిటంటే ఇమ్మానుయేలు అనగా యూదుల రాజు అనగా యూదయా సామ్రాజ్యములోనే పుట్టునని, వారి శాస్త్రీయ జ్ఞానముయొక్క అంచనా.  ఇక్కడ వారు తారుమారై తమ ప్రయాణ మంతటితో ఇమ్మానుయేలు నక్షత్రము వైపు చూస్తూ ప్రయాణించిన జ్ఞానులు లోక సంబంధియు, దైవ వ్యతిరేకియు, సాతాను అనుచరుడైన హేరోదు నుద్ధేశించి - ''యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు?  తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి,''  అనుటలో ముగ్గురు జ్ఞానులకు తోడై యుండి వారిని నడిపించిన ఇమ్మానుయేలుయొక్క జనన విధానము నెరిగిన హేరోదు రాజును అతని అనుచరులును కలవరపడి, లోక సంబంధమైన యాజకులను శాస్త్రులను సమకూర్చి, లోక జ్ఞానముతో కూడిన అంచనాలు వేయమని, క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను.  ''అందుకు వారు - యూదయా బేత్లెహేములోనే; ఏలయనగా యూదయా దేశమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైనదానవు కావు;  ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు  అధిపతి నీలో నుండి వచ్చును,'' అని ప్రవక్తల లేఖనముల ద్వారా వ్రాయబడిన సంగతిని గ్రహించినవాడై కపట నాటకముతో నయ వంచనతో హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, ఇమ్మానుయేలుయొక్క విలాసమును గూర్చిన వివరమును, ఆయన నక్షత్రముయొక్క జన్మ రహస్యమును గూర్చి తెలుసుకున్నవాడై నయవంచనతో జ్ఞానులనుద్ధేశించి తాను ఇమ్మానుయేలు బిడ్డననియు, ఇమ్మానుయేలు నరకోటికి తోడై యుండగా హేరోదు ఇమ్మానుయేలును ఆరాధించేవాడుగా నటన చేయుటన్నది గమనార్హము.

        నిజమునకు ఇమ్మానుయేలుయొక్క జీవితము, ఆయన మనుష్యులకు తోడై యున్నట్లుగా ప్రవచనములు ప్రవచించినప్పటికిని, ఎల్లవేళల యందు ఈయన ఆత్మ యావద్‌ పాప నరకోటికిని తోడుగా ఉండకపోతే, భూమియు అందలి సమస్తమును ఏనాడో నశించిపోయేది.  నాటి జనకూటమి నిరీక్షించినట్లే అనగా వారిని నడిపించినట్లే, ఈనాడు ఇమ్మానుయేలు క్రైస్తవులమైన మనలను కూడా ఏయే నామములతో నడిపిస్తున్నాడో మనమొక్కసారి గ్రహించవలసి యున్నది.  మొట్టమొదటగా ఇమ్మానుయేలు అను పేరుతో ఆది నరజంటను వారి సంతానములను అనగా కయీనుకు రక్షణ, హేబెలు బలి మీద లక్ష్యము, షేతు చేత ఈ లోకములో ప్రార్థన ప్రారంభోత్సవము జరిగించుట, హనోకుతో నడిచి-హనోకును తనతో నడిపించి, భూలోకమునకు మరుగు పరచుట చేసెను.  ఈ విధముగా ఇమ్మానుయేలు తన ప్రేమను నరులకు వెల్లడి పరచుచూ, తనకంటూ ఒక్క జనాంగము నేర్పరచుకొని అందుకు మోషేను నాయకునిగాను, ప్రవక్తగాను నియమించి, అటుతర్వాత యెహోషువాను, ఎలీషా, వగైరా ప్రవక్తలకు అహరోను వంటి యాజకులను సంసోను గిద్యోను వంటి న్యాయాధిపతులకు, సమూయేలు, యెషయా, యిర్మీయా, వగైరా ప్రవక్తలు;  దానియేలు వంటి దీర్ఘదర్శులను నెహెమ్యా వంటి ప్రార్థనాపరులను ప్రేమించి, వారితో సంభాషించి, వారికి తోడుగా వుండి ఘనవిజయాన్ని సాధించిన చరిత్రయే ఇమ్మానుయేలు చరిత్ర.

        ఇక దేవుడు తన దూత ద్వారా పలికించిన రెండవ మాట మత్తయి 1:21, ''ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.''  అనుటలో ఇమ్మానుయేలు ప్రతిరూపమైన ఈ యేసు ఎవరితో నడిచినాడు?  ఎవరి మధ్య జీవించినాడు?  ఎవరిని ప్రేమించినాడు?  ఏయే పనులు చేశాడో కూడా మనము తెలిసికోవలసిన అవసరము ఎంతో వున్నది.  మొట్టమొదటగా, ఈయన ఎవరిని ప్రేమించినాడు?  యోహాను 11:3, ''అతని అక్క చెల్లెండ్రు-ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియైయున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి,'' అని చెప్పుటలో యేసుయొక్క ప్రేమ రోగులపై యున్నదని యేసుయొక్క స్నేహితులు రోగులని ఈ క్రింది వేదభాగాల ద్వారా క్షుణ్ణముగా మనము గ్రహించగలము.  మార్కు 5:25లో వలె పండ్రెండేండ్ల రక్తస్రావము కలిగిన స్త్రీ అనేక వైద్యులచేత ఎన్నో తిప్పలుపడి జన సమూహములో వున్న యేసు అంగీ అంచును తాకి స్వస్థురాలైనది.  లూకా 17:11 చదివితే పదిమంది కుష్టు రోగుల చరిత్రను బట్టి కుష్టురోగులకు కూడా ఆయన స్నేహితుడే.  లూకా 13:10-13లో వలె పదునెనిమిదేండ్ల నుండి దయ్యము పట్టి బలహీనమైన యొక స్త్రీ ఆమె నడుము వంగిపోయి చక్కగా నిలబడ లేకుండిన ఆమెను చూచి ఆమె మీద చేతులుంచి ఆమెను స్వస్థపరచగానే ఆమె దేవుని మహిమపరచినట్లుగా చదువగలము.  అటు తర్వాత మార్కు 5:1-14 చదివితే దయ్యము పట్టినవారికి కూడా ఈయన స్నేహితుడే అనగా వీరిని కూడా ప్రేమించినాడు.  ఈ విధముగా గ్రుడ్డివాళ్ళు, మూగవాళ్ళు, చెవిటివారు, పక్షవాయువుతో బాధపడుచూ మంచము పట్టియున్న వానిని - ''లేచి, నీవు పరుపెత్తుకొని నడువుము,'' అని అనుటలో పక్షవాయువు రోగికి కూడా ఈయన స్నేహితుడే.  అదే విధముగా బెతెస్థా కోనేటి దగ్గర 38 ఏండ్ల నుండి వ్యాధిగస్థుడైనవాడు.  మరీ విడ్డూరమేమంటే చనిపోయినవారికి కూడా ఈయన తోడు స్నేహితుడై యున్నాడు.  ఎట్లంటే యాయూరు కుమార్తె చనిపోయినది కాని క్రీస్తు లేపినాడు.  విధవరాలి కుమారుడు చనిపోయి పాడి మీద మోసుకొని పోబడుచుండగా ప్రభువు పాడెను ముట్టి, విధవరాలి కుమారుని బ్రతికించుట.  అదే విధముగా లాజరు చనిపోయి సమాధిలో ఉంచబడి నాలుగు రోజులు కుళ్ళుపట్టి దుర్గంధమైన వాసనతో, శవమైయున్న వానిని సజీవముగా బ్రతికించుట.  ఇందునుబట్టి చనిపోయిన వారిని కూడా ఈయన ప్రేమించినట్లుగా మనము గ్రహించవలెను.  ఇది ఇమ్మానుయేలు యేసుక్రీస్తు రూపములో జరిగించిన మహిమాన్విత క్రియ ఆయన ప్రేమించిన వ్యక్తుల వివరములు.

        ఇక యేసుప్రభువుగా ఇమ్మానుయేలుగా ఆతిథ్యమును స్వీకరించిన గృహాలు కూడా ఉన్నవి.  ఇందులో లూకా 19:లో జక్కయ్య, సీమోను అను కుష్టురోగి యింట విందు, బేతనియలో మార్త మరియమ్మల ఇంటి ఆతిధ్యము, సమరయ స్త్రీయొక్క జీవితమును మార్చిన పిమ్మట ఆమె యేసును గూర్చి ప్రకటించి, యేసుయైవున్న ఇమ్మానుయేలుయొక్క ప్రభావమును వెల్లడిపరచి సుఖారా అను గ్రామములోని జనాంగమును యేసు యొద్దకు నడిపించినప్పుడు వారు యేసును తమ యొద్దనుంచుకొని ఆతిథ్యమిచ్చుట.  ఇట్టి ఇమ్మానుయేలు యేసు అను పేర ఉదయించి, జన్మించి మానవుల పట్ల చూపిన ప్రేమానురాగాల వివరములు.

        ఇక యేసు - క్రీస్తుగా మారి జరిగించిన క్రియా విధానమును గూర్చి తెలిసికొందము.  మత్తయి 6:5లో క్రీస్తుగా చెప్పబడుట.  యోహాను 13:3-8లో ఇది క్రీస్తుగా వుండి తాను ప్రతిష్టించిన క్రియ.  ఇందును బట్టి యోహాను 4:29లో ఈయన క్రీస్తు కాడా?  అని ఆ ఊరివారితో చెప్పబడినది.  ఈయన క్రీస్తు అని ఆ స్త్రీకి తెలిపిన వారెవరో అనిన విషయాన్ని ఇదే వేదభాగములో యోహాను 4:28వ వచనములో యేసు ప్రభువుతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేనెరుగుదును.  ఈయన వచ్చి సర్వమును తెలియజేయునని చెప్పగా యేసు నేనే ఆయనని ఆమెతో చెప్పుట, అంతవరకు యేసుగా ఉన్న ఇమ్మానుయేలు ఆ స్త్రీ ఎదుట యేసునని తానే నిరూపించుకోవడమన్నది సమరయ స్త్రీ గ్రహించిన విషయము.

        2 కొరింథీ 5:17, ''కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి;  పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;''  అయితే క్రీస్తులో ఉన్న ఘనత ఏమిటో - 2 కొరింథీ 5:19, ''అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను.'' ఇది ప్రత్యేకత.  

        2 కొరింథీ 5:20-21, ''కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై-దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము.  ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.''  ఈవిధముగా యేసు క్రీస్తు అయ్యాడు.  అయితే పరిశుద్ధాత్మ ఎట్లయ్యాడు?  గాబ్రియేలు దూత హిత వచనాల ప్రకారముగా కన్యకయైన మరియమ్మ పరిశుద్ధాత్మ శక్తిని పొంది - ఆయన శక్తి కమ్ముకొనగా, ఆయన శక్తితో గర్భము ధరించి ఇమ్మానుయేలు అను పరిశుద్ధాత్మునికి శారీర జన్మనిచ్చింది.

        ఇక్కడ ఒక మర్మమున్నది.  శరీర జన్మనిచ్చింది స్త్రీ గర్భమైనప్పటికిని, నిర్మాణ క్రియ మాత్రము పరిశుద్ధాత్మునిదే!  ఇట్టి పరిశుద్ధాత్ముడు కన్యకయైన మరియమ్మతోనే పరిమితము కాలేదు.  యేసు బాప్తిస్మము పొందినప్పుడు ఆయనమీద పావుర రూపము పొంది పైన వ్రాలినట్లు వేదములో చదువగలము.  ఇది పరిశుద్ధాత్మ క్రియ.  కాని ఈ పరిశుద్ధాత్మ క్రియ ద్వారానే యేసు ప్రభువు కూడా మహిమాన్వితుడైన లోకములో ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది నరుల చేత ద్వేషించబడి నప్పటికిని కుమారుడైన యేసు మహిమపరచబడినాడు.  

        ఇట్టి మహిమాన్వితుడైన పరిశుద్ధాత్మ - యేసు మరణాన్ని జయించి, సమాధి జయించి, సమాధిలో నుండి పునరుత్థానుడైనప్పుడు ఆయనను తాకవలెనని నరులు ప్రయత్నింపగా నేనింకను నా తండ్రి దగ్గరకు వెళ్ళలేదు కాబట్టి నన్ను ముట్టుకోవద్దని అంటున్నాడు.  

        ఇందునుబట్టి ''ముట్టుకోవద్దు'' అని అనుటలో యేసు ప్రభువు మరణ యాగము చేసినంత వరకు పరిశుద్ధాత్మ క్రియలో జీవించినాడు.  ఇప్పుడైతే ఆయన మోక్షారోహణుడై వెళ్ళిపోయిన తర్వాత - మరి యేసు వాగ్దానము జేసిన ఆత్మ ఈ పరిశుద్ధాత్మయే.  ''నేను వెళ్ళి మీకు ఆదరణకరమైన వేరొక ఆత్మను పంపెదను.  ఆయన వచ్చినప్పుడు మీకు సత్యాన్ని బోధించును.''  

        ఇప్పుడు బోధిస్తున్నది ఆయనే.  అప్పుడు అపొస్తలులకు బోధించినది ఆయనే.  అపొస్తలుల చేత లేఖనాలు వ్రాయించినది ఆయనే.  అపొస్తలుల చేత బోధింపజేసింది ఆయనే.  అందుకే అంటున్నాడు ప్రకటన 21:9-10, ''అంతట ఆ కడపటి యేడు తెగుళ్లతో నిండిన యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి-ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను, అనగా గొఱ్ఱెపిల్లయొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.''

        ప్రియపాఠకులారా!  మనము పరిశుద్ధాత్మను పొందాలంటే బజారులో కొంటే రాదు.  అది విలువైనది, సత్యమైనది, యదార్థమైనది, ప్రేమగలది, శక్తిగలది, కుయుక్తి లేనిది.  లూకా 4:1లో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మ చేత నడిపింపబడుట అపొస్తలుల కార్యములు 2:1-4లో పెంతెకోస్తను పండుగ దినమున జరిగిన సంఘటనలు.

7.  శ్రమ - ఎవరికి శ్రమ?

        యెషయా 10:1-2, ''విధవరాండ్రు తమకు దోపుడుసొమ్ముగా ఉండవలె ననియు  తలిదండ్రులులేనివారిని కొల్ల పెట్టుకొనవలెననియు కోరి న్యాయవిమర్శ జరిగింపకుండ దరిద్రులను తొలగించుటకును  నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకును  అన్యాయపు విధులను విధించువారికిని బాధకరమైన శాసనములను వ్రాయించువారికిని శ్రమ.''

        ప్రియపాఠకులారా!  యెషయా గ్రంథములోని ఈ వేదభాగములో వ్రాయబడి యున్నటువంటి ఆరు విధములైన దైవ చట్ట వ్యతిరేకమైన కార్యములను గూర్చి ప్రవచనము వివరిస్తున్నది.  ఈ అంశమును గూర్చి ఇప్పుడు తెలిసికొందము.  పైన వివరించబడిన వేద వాక్యములు మొట్టమొదటగా విధవరాండ్రను గూర్చి వ్రాయబడి యున్నది.  అనగా భర్తయొక్క సావాసాన్ని, తాను భర్తతో అనుభవించిన సంతోషాన్ని, అభివృద్ధికరమైన జీవితాన్ని కోల్పోయి, పచ్చని చెట్టు నిస్సారమై ఎండియున్న విధముగా భర్తయొక్క సావాసమును, ఆయనతో చేసిన సంసారిక జీవితమును, తన భర్త మరణము ద్వారా కోల్పోయి, మోడైన జీవితములో చేదు అనుభవముతో జీవిస్తున్న స్త్రీయొక్క అభాగ్య జీవితమే వైధవ్యము.

        దైవత్వమునకును లోకానికిని పరస్పర విరుద్ధమైన స్వభావాలు ఉన్నాయని ఈ వైధవ్యమును గూర్చి కొన్ని ముఖ్యాంశములు తెలుసుకొందము.  లోకరీత్యా విధవరాలైన స్త్రీ సంఘములోగాని, సమాజములోగాని, కులములోగాని ఎలాంటి ఆధిక్యతలు లేవు.  అంటే విధవరాలిని చిన్నచూపు చూస్తున్నది.  పెళ్ళి, పేరాంటానికి వెళ్ళే యోగ్యత కూడా విధవరాలికి లేదు.  ఇట్టి విధవరాండ్రను దేవుడు పాత నిబంధన కాలములో అక్కడక్కడ తన సేవలో వాడెను.  అట్టి విధవరాండ్రు దైవ ప్రవక్తలకు, దైవ సేవకులకు ఆతిథ్యమిచ్చి పొందిన మేళ్ళను కూడా పాత నిబంధనలోని విషయాలు తెలుసుకోగలము.  మొదటగా ఏలీయా విషయములో మనము చదివితే, ఒక బీద విధవరాలు తన బిడ్డతో గొప్ప కరువులో జీవిస్తూ తన వద్ద నున్నటువంటి నూనె - పిండి అయిపోవు పరిస్థితి వచ్చినప్పుడు, అనగా తాను, తన బిడ్డ పస్తుపడే దినము ఆసన్నమైనప్పుడు దేవుని ప్రవక్తయైన ఏలీయాకు ఆ విధవరాలు ఆశ్రయమిచ్చినందుకు తన ప్రవక్త ద్వారా దేవుడు ఆమెను మిక్కిలి ఆశీర్వదించి, కరువు దినములు సంపూర్ణమగు వరకు ఆమె తొట్టిలోని పిండిని, ఆమె సీసాలోని నూనెను తరగనీయక చేశాడు.  అంతేగాకుండా చనిపోయిన ఆ విధవరాలి కుమారుని తన ప్రవక్త ద్వారా బ్రతికించినాడు.  1 రాజులు 17:9-24.  అలాగే ఎలీషాకు ఆశ్రయమిచ్చిన విధవరాలి జీవితములో ఎలీషాకు ఆమె ఇచ్చిన ఆతిథ్యమును బట్టి దేవుడు తన ప్రవక్తయైన ఎలీషా ద్వారా ఆమెకున్న లోక సంబంధమైన ఋణాలను, ఆమె గృహములో వున్న నూనెతోనే ఆశ్చర్యకరముగా తీర్చి, విధవరాలి పట్ల తనకున్నట్టి ప్రేమను దేవుడు బయల్పరచుచున్నాడు.  2 రాజులు 4:7.  అలాగే పాత నిబంధన కాలములో విధవరాండ్రయిన స్త్రీలకు అక్కడక్కడ దేవుడు మంచి అవకాశమును కల్పిస్తూ కొందరిని ప్రవక్త్రీలుగాను, కొందరిని తీర్పురులుగాను, కొందరిని తన మందిర సావాసములో వాడబడే సాధనాలుగా వాడినట్లు వేదములో చదువగలము.

        అయితే నూతన నిబంధన కాలములో దేవుడు యేసు అను పేరున జీవించిన కాలములో ఆయన జరిగించిన అద్భుత కార్యాలు ఎక్కువగా విధవరాండ్రకే!  విధవరాలి కుమారుడు చనిపోగా పాడెను ముట్టి బిడ్డను బ్రతికించి తల్లికి అప్పగించుట, యెరూషలేములో కానుకలు వేయు సందర్భములో గొప్ప గొప్ప ధనవంతులు తమకు తోచిన విధముగా పెద్ద పెద్ద మొత్తాలు కానుకల పెట్టెలో వేశారు.  కాని ఓ బీద విధవరాలు వేసిన రెండు కాసులను బట్టి దైవ కుమారుడైన ప్రభువు ఆమెను హెచ్చించి మాట్లాడుటన్నది గమనార్హము.  మార్కు 12:42-44.  అలాగే సమరయ స్త్రీ జీవితము కూడా ముండమోపి జీవితమే.  ఎందుకంటే తాళిగట్టిన భర్త లేడు, ఇంను స్థిరమైన భర్త కూడా లేడు.  లోకరీత్యా భర్తలకు దూరమైన జీవితమును అనుభవించబట్టి ఆమెను విధవరాలుగానే లోకము భావించింది.  మరి గొప్ప ఏమిటంటే ప్రభువు ఎదుట తనకు భర్త లేడని చెప్పుకొనిందామె.  సత్యమునే చెప్పింది.  ఆమెకు ఆరుగురు భర్తలున్నారు.  ఒక్కడు కూడా ఆమెను పెండ్లాడినవాడు కాడు.  ఇందునుబట్టి చచ్చినవారి సాంగత్యము వలన ఆ సమరయ స్త్రీ జీవితము కూడా విధవరాలి సాదృశ్యమైంది.  అయితే ప్రభువు ఆమెను గొప్పగా ఆశీర్వదించి, తనను క్రీస్తుగా ఆమెకు ప్రత్యక్ష పరచుకొనుటన్నది మనము గుర్తించాలి.  యోహాను 4:30.  అలాగే ఏడు దయ్యములు పట్టిన విధవరాలిని కూడా ప్రభువు స్వస్థపరచినట్లు మనము చదువగలము.  అలాగే అపరాధములతోను, పాపములతోను ఆత్మీయముగా చచ్చినవారి జీవితము కూడా విధవరాలి జీవితమే.

        దైవసన్నిధిలో ఇంత గొప్ప ఆధిక్యత విధవరాలికుండగా నేటి ఆధునిక విజ్ఞాన యుతమైన నర సమాజము, భర్తను పోగొట్టుకొని గోడుగోడున విలపిస్తున్న స్త్రీలతో కల్ల బొల్లి మాటలతో, కపట బోధలు చేసి, వారికి వితంతు సమాజము అని పేరు పెట్టి, వారి పేరిట వితంతు శరణాలయాలు, విడో హోం అను కట్టడాన్ని నిర్మించి, తద్వారా స్వదేశ విదేశ సహాయ సహకారాలు అనుభవిస్తూ ఆ విధవరాండ్రకు వారి పేరిట వచ్చే ఆ జీవనభృతిని, ధనాన్ని, దొంగ లెక్కలతో స్వాహా చేస్తూ, తమ స్వార్థానికి పై వివరించిన విధవరాండ్రను సాధనాలుగా వాడుకొనే ప్రబుద్ధులకు శ్రమ కాకపోతే సంతోషమెక్కడిది?  వితంతువుల జీవనభృతిని, పెన్షను ఇచ్చేటటువంటి ప్రభుత్వ విధానములు కూడా జరుగుచున్న అవకతవకలను గూర్చి మనము వింటున్నాము.  వార్తాపత్రికలలో కూడా చదువుచున్నాము.

        ఈ విధముగా వితంతు జీవితాలను తమ స్వార్థాలకు వాడుకొంటూ, వారి విధవరాలితనములో భాగస్థులయ్యై స్థితికి దిగజారే ఉద్యోగులున్నారు, సంఘ పెద్దలున్నారు.  కనుక విధవరాండ్ర జీవితాలు స్వార్థపరులయొక్క స్వార్థానికి బలియై, దోచుకొనబడు వారి జీవితము దోపుడు సొమ్ముగా ఉన్నది.  ఇక తల్లిదండ్రులు లేనివారిని కొల్లబెట్టు కొనవలెనని కోరేటటువంటి ప్రబుద్ధుల విషయములో మనము తెలుసుకొన్నదేమిటంటే, అనాధ శిశు శరణాలయాలు, అనాధ బాలికల హాస్టలు అని, అనాధ బాలిక రక్షిత కేంద్ర ములని, తల్లిదండ్రులను పోగొట్టుకొని వారి ప్రేమకు నోచుకోని అనాధులైన బిడ్డలను ఒకచోట చేర్చి, అనాధ శిశువులను తాము ఉద్ధరించువారమని చెప్పుకొనుచూ, అనాధ శిశువుల జీవితాలతో చెలగాటమాడుచూ, వారిని ఉద్ధరించుటయే తమ ధ్యేయమని, దిక్కులేని బిడ్డలు తమ బిడ్డలని ప్రకటించుకొంటూ, ఆ బిడ్డలయొక్క పోషణలో అవకతవకలు జరిగిస్తూ, శుభ్రమైన ఆహారమునకు బదులు ఉడికీ ఉడకని అన్నము, అదియును వడ్లు, రాళ్ళు, పురుగులమయముగా వుండుట, సరియైన పోషక విలువలులేని ఆహారముతో, ఆ బిడ్డలను కడుపులు గొట్టి, వారిపట్ల కఠినముగా వ్యవహరిస్తూ, తమ బిడ్డలయొక్క ఐశ్వర్యము, మేలు, విద్యాభివృద్ధి, ఆరోగ్య వాతావరణాన్ని కోరుకొంటూ, శ్రద్ధాసక్తులతో ప్రవర్తించే అభాగ్యులైన అతిరథ మహారథులు, సంఘోద్ధారకులు, ప్రజా సేవకులైన పెద్దలను గూర్చి మనము ఎన్నో అవకతవక ప్రవర్తనలను గూర్చి వింటున్నాము, వార్తాపత్రికలలో చదువుచున్నాము.  విధవరాలి పక్షములోను, అనాధులైన చిన్నపిల్లల పెంపకములోను, విదేశీ సహాయముతో హాస్టళ్ళ శరణాలయాలను నిర్వహిస్తూ, తమ పొట్టలను నింపుకొంటూ, బీదలతో చెలగాటమాడేటటువంటి స్వార్థపరులైన క్రైస్తవ మహాశయులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.  

        ఇట్టివారు తాము సంఘోద్ధారకులమని, ప్రభుసేవా పరాయణులమని, స్వచ్ఛమైన కల్తీలేని ఎలాంటి అవినీతికి పాల్పడని నీతిమంతులమైన క్రైస్తవులమని ప్రకటించుకొంటూ, విధవరాండ్రు, అనాధ శిశువులకుగాను విదేశాలనుండి పంపబడుతున్న ద్రవ్య సహాయాన్ని తమకును, తమ ఇంటివారికిని, తమ గృహ నిర్మాణములకును, తమ విలాస జీవితాలకును ఖర్చు పెట్టి, పదిమందిలో పెద్ద మనిషిగా, మతోద్ధారకుడుగా నయవంచకమైన మాటలు పరిశుద్ధ గ్రంథములోని ప్రవచనములతో ముడి పెట్టుచూ, ఎదుటి వ్యక్తులకు తమ రహస్యపూరితమైన పాపక్రియలను, అపరాధములను దాచిపెట్టి, ప్రజా బాహుళ్యములో దీనజనోద్ధారకుడుగాను, ప్రజా సేవకునిగాను, క్రీస్తు ప్రభువుయొక్క పరిచారకులుగాను, తమను గూర్చి ప్రకటించుకొనే అభాగ్యులు లేకపోలేదు.

        ''న్యాయవిమర్శ జరిగింపకుండ దరిద్రులను తొలగించుటకును,'' అనుటలో ఈ న్యాయ విమర్శ అన్నది ప్రభుత్వ చట్ట పరముగా లేక విశ్వాస సావాసములో సంఘ సమక్షములో, సంఘ పెద్దల విచారణలో - దేవుని ధర్మశాస్త్ర విధులను బట్టి తీర్పు దీర్చుచూ, ఒక బీదవానికి సాధ్యమైనంతవరకు వాని నోటిని కొట్టకుండా, వాని ఉద్యోగమును కాపాడుటకు శాయశక్తులా ప్రయత్నించుచూ సృష్టికర్తయైన దేవుని న్యాయ విచారణ జరిపించాలి.  అనగా ఆత్మీయ దృక్పథములో దోషియైన వ్యక్తి దరిద్రుడైన వ్యక్తిని విచారించాలి.  అంతేగాని ప్రజా బాహుళ్యములో బీదలయొక్క న్యాయమును తప్పించి, వారిని అన్యాయస్థులుగాను, అక్రమస్థులుగాను వ్రేలు పెట్టి చూపుచూ వారిని అన్యాయస్థులుగా తీర్చక, ధర్మశాస్త్ర విధి ప్రకారము, అట్టివారి పట్ల న్యాయబుద్ధితో వ్యవహరించాలి.  అయితే దీనికి బదులుగా నరులు తమకంటూ ఒక చట్టాన్ని ఏర్పరచుకొని, అన్యాయపు చట్టాలను, విధులను ఏర్పరచుకొని, దానిని అనుసరించి, అన్యాయపు పరి పాలన సాగిస్తూ, దేశములోను, రాజ్యములోను, న్యాయాన్ని సమాధి చేయుటకు ప్రయత్నించు వారికి శ్రమ మరియు బాధాకరమైన శాసనములు వ్రాయించు వారికిని అంటున్నాడు.  ఈ బాధాకరమైన శాసనములు వ్రాయించువాడు ప్రభుత్వములోని పరిపాలకుడే అని మనము తెలుసుకోవలెను.  రాజు తన ప్రవర్తనలోను, తన పరిపాలనా జీవితాలలోను, నీతిని పాటించాలి మరియు వ్యవహరించాలి.  అట్లుగాకుండా తనకో న్యాయము, ఎదుటివానికో న్యాయము, తనవారికి ఒక న్యాయము, ఎదుటివారికొక న్యాయము కల్పిస్తూ, అందుకు అనుగుణ్యమైన కల్లబొల్లి చట్టాలతో, బాధాకరమైన అనగా ఎదుటి వ్యక్తియొక్క జీవితాన్ని సర్వనాశనము చేసే చట్టాలను సృష్టించే వానికి శ్రమ.

        లోక సంబంధముగా ఏ రాజ్యముతోనైనా పోరాడవచ్చును, వాటిని జయించ వచ్చును.  అయితే దైవరాజ్యముతో చెలగాటమాడుటన్నది మహా భయంకరము, ఎందుకంటే దైవరాజ్యాధిపతియైన దేవునితో అవివేకియైన నరుడు కుయుక్తులతోను, తంత్రములతోను, స్వజ్ఞానములోను, తన అంగబలముతో పోట్లాడుచున్నాడంటే అది తన నాశనానికే మూలము, మనుష్యులు చేయు మోసాలకు మోసపోయేవాడు కాదు మన దేవుడు.

        అన్య దేవుళ్ళు అనగా విగ్రహ దేవుళ్లను దైవసృష్టములైన సర్ప, పంది, పక్షి, చెట్టు, పుట్టవంటి దేవుళ్ళను సులభముగా మోసము చేయవచ్చును.  వాటిని హతమార్చ వచ్చును కూడా.  అలాగే శిలా సంబంధమైన విగ్రహ దేవుళ్ళను కూడా నరుడు సులభముగా మోసము చేయగలడు.  ఆ మోసమన్నది చాటు మరుగునకాక, బహిరంగముగా కాషాయాంబరము, పసుపు వస్త్రాలు, రుద్రాక్షల తులసీ వగైరా దండలు, నెత్తిన నామాలు, పిలక పింగళము వగైరా అలంకారాలు, తాను దైవ సంభూతుడనని, తాను దేవునితో ప్రత్యక్షముగా మాట్లాడినానని తానే స్వయముగా చెలామణి కాగలడు.  అట్టి మోసకృత్యాలతో ఎంతో ధనాన్ని సంపాయించగలడు.  అయితే ఆత్మయైయున్న దేవుని జీవముగల దేవుని సర్వసృష్టికి ఆది సంభూతుడైయున్న దేవుని, ఆయన విశ్వాసులను, ఆయన కట్టిన సంఘమును మోసగించాలంటే చిన్న విషయము కాదు.  ఈ సత్యాన్ని తెలిసి కూడా క్రైస్తవులే అమాయకులైన జనులను మోసము చేస్తూ, వారిని యేమార్చి, విదేశాల నుండి వారి పేరిట నిధుల సహాయాన్ని తెప్పించుకొని అనుభవిస్తున్నారంటే ఎంతో దారుణమో ఎటువంటి శాపకరమైన క్రియయో చెప్పనక్కరలేదు.  

        శాపగ్రస్థమైన వస్తువులను దొంగతనముగా ఆశించిన ఆ కానుకల విషయములో ఎలీషా నిషేధించిన నయమానుయొక్క సంపదను గేహాజీ ఆశించి కుష్టురోగి అయ్యాడు.  2 రాజులు 5:27.  అననీయ సప్పీరాలు తమ సొంత పొలాన్ని అమ్మి, కొంత దాచుకొని అపొస్తలుల ఎదుట పలికిన అబద్ధమునకు మరణశిక్ష పడిన విధమును ఒక్కసారి మన వేదాన్ని చదివి తెలుసుకొందము.  అపొస్తలుల కార్యములు 5:1-11.  లోక సంబంధమైన న్యాయస్థాన రంగములో క్రైస్తవులే పోట్లాడుకొని, కోర్టులకెక్కి సంఘముయొక్క గౌరవ మర్యాదలను, ఆత్మీయతను అధోగతి పట్టించుట సంఘములో జరుగుచున్న అన్యా యములను గూర్చి అన్యులైన వకీళ్లను ఏర్పరచుకొని, క్రైస్తవ మిషనరీలు ఉచితముగా అనుగ్రహించిన స్థలాలను, మాన్యాలను, తమ సొంత పిత్రార్జితమువలె అన్యాక్రాంతము చేయు ప్రబుద్ధులు క్రైస్తవ్యములో లేకపోలేదు.

        ఈ విధముగా బీదల పక్షముగా జరిగించవలసిన న్యాయము సత్యదేవుని యొక్క న్యాయ విధులను తప్పించి, తమకు అనుకూలమైన చట్టములతో అన్యాయపు తీర్పును దీర్చు ప్రబుద్ధులున్నారు.  ఇట్టివారు బైబిలులో లేకపోలేదు.  అహాబు రాజు లోకాశపరుడై, నేత్రాశకు ఆకర్షితుడై, బీదవాడైన, అభాగ్యుడైన నాబోతు ద్రాక్షతోటను ఆశించి, భార్య చేత అన్యాయపు విధులను గూర్చిన తాఖీదును వ్రాయించి, నాబోతును అన్యాయస్థునిగా, రాజదూషకునిగాను, రాజద్రోహిగాను, అక్రమస్థుని గాను నేరారోపణ చేస్తూ, అతనిని రాళ్ళతో కొట్టి చంపునట్టి ఘోరాతి ఘోరమైన మరణశిక్షకు గురి చేయుటన్నది ఈ సందర్భములో మనము తెలుసుకోవలెను.  1 రాజులు 21:10-15.

        ఇక ''బాధకరమైన శాసనములు వ్రాయించువారికిని శ్రమ,'' అనుటలో ఇట్టి శాసనములు వ్రాసినవారు పరిశుద్ధ గ్రంథములో కొందరిని గూర్చి తెలుసుకొందము.  ఎస్తేరు 7:10లో వలె హామాను విషయములో హామాను యూదా జాతినంతమొందించాలని సంకల్పించినవాడై యూదులనందరిని ఏక కాలములో నిశ్శేషముగా చంపి వేయాలని ఒక శాసనమును వ్రాయించి, దానిమీద రాజముద్రిక వేసి అహష్వేరోషు పరిపాలించిన సంస్థానములన్నింటికిని వాటిని జారీ చేసినట్లుగా చదువగలము.  బాప్తిస్మమిచ్చు యోహాను విషయములో వేదములో చదివితే, హేరోదు తన సోదరుని భార్యతో అక్రమ సంబంధము ఏర్పరచుకొని ఆమెను తన వెంట ఉంచుకొన్నందుకు, యోహాను హేరోదు చేసిన పాపమును బట్టబయలు చేసి గద్దించినందులకు హేరోదు భార్యయైన హేరోదియ యోహాను మీద పగబట్టినది.  ఆమె యోహానును అంతమొందించాలని సంకల్పించి, అట్టి సమయము కోసము కనిపెట్టి యుండి, హేరోదుయొక్క జన్మదిన సందర్భములో హేరోదు కుమార్తె నాట్యము చేయు సందర్భాన్ని పురస్కరించుకొని, అట్టి తరుణములో నిర్దోషియు, నిరపరాధియు, దైవాత్మపూర్ణుడైన చెరలో బంధించబడిన యోహానుయొక్క తలను నరికించు తీర్పు రాజు చేత జరిగించుటన్నది అన్యాయము కాదా?  మార్కు 6:28.

        కనుక అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.  ఇట్టి వారియొక్క జీవితము రోగపూరితమును, వేదనకరమును, అసమాధానమును, బాధకరముగ వుండి, వారి కొరకేగాక, వారి కుటుంబాలు కూడా వారు చేసే అరాచక క్రియలు, దైవ వ్యతిరేక కార్యాలు, వారేర్పరచు అన్యాయపు శాసనాలు, అన్యాయపు తీర్పులు, ప్రవర్తించు కఠినమైన విధానమునకు ప్రతిగా దేవుడనుగ్రహించు బహుమానము రోగము, మరణము పొందుదురు.  ఎవని జీవితములో ధనము, భోగము, ఐశ్వర్యము పెరుగుతుందో అట్టివారికి నానాటికిని మరణభీతి కూడా అధికమగుతుంటుంది.  అందునుబట్టి తన కుటుంబ రక్షణార్థము, తన ఆత్మ రక్షణార్థము అట్టి వ్యక్తులు తుపాకి లైసెన్సు, కాపలా కుక్కలు లేక కాపలాదారుడు వగైరా సహాయాలు కోరుతాడు. అయినను అట్టివానిని మరణము వెంటాడి, ఏదోయొక సమయములో వానిని కబళించక తప్పదు.

        కనుక ఇట్టి సత్యాన్ని గుర్తించిన దైవ విశ్వాసులైన మనకు మన జీవితాలలో మనయొక్క ఇహలోక జీవితములో - మన జీవితాలను పరిశీలించు నిమిత్తము తండ్రియైన దేవుడు కొన్ని ఈవులు ఇస్తాడు.  ఆ విధమైన అవకాశాలు దొరికినప్పుడు అది ప్రభువు యిచ్చిన అవకాశమని విధేయించి బహు జాగ్రత్తగా, మెలకువతో లోకచట్టము ప్రకారముగా కాకుండా, దైవ చట్టరీత్యా తమకు వచ్చిన ఆ అవకాశమును సద్వినియోగ పరచుకొంటూ విధవరాండ్ర పట్లను, తల్లిదండ్రులు లేని దిక్కులేని వారి విషయములోను, బీదలకు న్యాయము తీర్చు సందర్భములోను దేవునికి భయపడి లోకచట్టమునకు గాక దైవచట్టమునకు విధేయించి ఎవరైతే తమ ఆత్మ విలువను కాపాడుకొంటారో, అట్టివాడు దైవసన్నిధిలో కదలని కొండవలె స్థిరమైన, నిర్మలమైన, ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తాడు.  కీర్తన 125:1-2. ఇట్టివారు కూడా వేదములో ఉదాహరణగా ఒకరున్నారు.  అతడే యాకోబు కుమారుడైన యోసేపు.  ఈ సందర్భములో ఆదికాండములో యోసేపుయొక్క చరిత్ర మనము చదివితే యోసేపు తన అన్నలయందు లక్ష్యముంచినవాడు కాడు.  తన అన్నలవలె లోకసంబంధి కాడు, ధనాశపరుడు కాడు.  అయితే ధనానికి అమ్మివేయబడినాడు.  తాను నమ్మిన దేవుడు సత్యవంతుడును, ప్రకాశవంతుడును, ప్రతిభాశాలియైనందున యోసేపుకు కలిగిన ప్రతి ఆపదలోను, ప్రమాదములోను, సమస్యలలోను, గండములలోను దేవునియొక్క హస్తము అతనికి తోడై యుండి, ఫరో సంస్థానములో రాజుకు తర్వాత రెండవ రాజుగా రాజ సింహాసనము తర్వాత రెండవ సింహాసనముగా రాజుయొక్క రథానికి రెండవ రథములో, రాజు పరిపాలనలో తానే ప్రధాన పరిపాలకునిగా దేవునిచేత ఐగుప్తు సంస్థానములో హెచ్చింపబడినాడు.  ఆదికాండము 41:41. ఇందుకు కారణము దేవుని తోడ్పాటు.

        కనుక నేటి క్రైస్తవ విశ్వాసులమైన మనము అన్యులకు మాదిరికరముగా ఉండి అన్యులను కూడా మనలో చేర్చుకోవలసిన ఆత్మీయ ఆకర్షణను సంపాయించుకొను యోగ్యత గలవారమై యుండి, ఆత్మ దేవునియొక్క ఆవరింపు గలవారమై యుండి, దేవునికిని, ఆయన కుమారుడైన క్రీస్తునకును - ఇట్టి మన సంఘాలలో మనలను ఆవరించి క్రియ జరిగిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికిని, యోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తూ, రానున్న ప్రభువు రాకడకు ఎత్తబడే సంఘములో మనము చేర్చబడేవారమై యుండాలని, అట్టి రాకడకు సిద్ధపడువారముగా జీవించాలని ఈ మాటలనుబట్టి ప్రభువు నామములో తెలియ జేయడమైనది.

8.  చిగురు - అంకురము

        యెషయా 11:1-5, ''యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును  వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును  యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ  ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ  తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును  యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.  కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు  తాను వినుదానినిబట్టి విమర్శచేయడు  నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును  భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగా విమర్శ చేయును  తన వాగ్దండము చేత లోకమును కొట్టును  తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును  అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును.''

        ప్రియపాఠకులారా!  మనమిప్పుడు చదువుచున్న వేదభాగములో యెష్షయి అనువాడు వేదాంతి కాడు.  మత విద్వాంసుడు కాడు, బైబిలు తెలిసినవాడు కాడు, బైబిలు ఎటువంటిదో ఎరుగడు.  అతనియొక్క జీవితములో ఎరిగియున్న విషయమంతయు గొర్రెల పెంపకము.  అతని గుణాతిశయములన్నియు జీవిత విధానము గొర్రెవలె అమాయక జీవితము.  అందుకే అతనిని దేవుని వాక్యము యెష్షయిని ఒక మొద్దుగా అభివర్ణిస్తున్నది.  మొద్దు ఎప్పుడు మోడై యుండదు.  కొమ్మలులేని మొద్దు తన దిగువనున్న వేరులయొక్క బలముద్వారా సారము గల్గి ఒకానొక దినమున చిగిరించేటటువంటి దినమున్నదని మనమెరుగుదుము.  మునగ చెట్టుగాని, అంజూరపు చెట్టుగాని, ఏ చెట్టు అయినను తన దిగువనున్న వేరుల ద్వారా సారము గల్గి, ఈ వేరుల ద్వారా వచ్చు భూసారము ద్వారా మొద్దు చిగురిస్తున్నది.  అలాగే ఆనాటి దేవుని ఎన్నికలో యెష్షయి అను వ్యక్తిని మొద్దుగా పోల్చి సారముగల వానినిగా చిగురింపజేసినట్లు ఈ వాక్యము ప్రకటిస్తున్నది.  అంతేగా కుండా మొద్దు దిగువన ఉన్న యెష్షయి మొద్దుయొక్క వేరులు అనగా అతని కుమారులు, వారిలో నుండి అంకురము ఎదిగి ఫలించును.  అనగా సృష్టికర్తయైన దేవునియొక్క ఎన్నికను బట్టి యెష్షయియొక్క వేరులలో నుండి అంకురము అనగా యెష్షయి సంతానములో చివరివాడైన దావీదును గూర్చిన జీవిత విధానమిది.

        యెష్షయి మొద్దు చిగురించి అనగా దేవునియొక్క కన్యకలో ఫలభరితమై, యెష్షయియొక్క వేరులో నుండి అంకురము అనగా ఇమ్మానుయేలు, లోకరక్షకుడు, పాపవిమోచకుడు, మరణ విజయుడు, నిత్యజీవుడైన అనగా జనన మరణములు లేనటువంటి యెష్షయి కుమారుడైన దావీదు నుండి మరియు దావీదు పట్టణములో నుండి యూదా గోత్రములో అంకురము ఎదిగి పై విధముగా లోకరక్షకుని ఫలిస్తుంది.  అయితే ఈ అంకురముయొక్క ఫలభరితమైన జీవితము ఎట్లుంటుంది?  అంటే ఈ దిగువ వాక్యాల ద్వారా మనము తెలిసికొందము.

        ఈ అంకురమన్నది మన రక్షకుడైన యేసుక్రీస్తు జన్మ చరిత్రకు మాదిరియై యున్నది.  అయితే ఈ అంకురము ఎదిగి ఫలించే ఫలభరితమైనటువంటి విధానాలను గూర్చి మనము తెలిసికొందము.  అంటే మామూలుగా చెట్లకు తోటమాలి ఎరువు నీళ్ళు, రసాయనపు మందులు వగైరాలతో పోషిస్తాడు.  అయితే యెష్షయి వేరులో నుండి అంకురమైన ఈయొక్క ప్రభువునకు దేవుడు జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మను అనగా లోకములోని జ్ఞానులకు వెర్రివారినిగా చేయు జ్ఞానము, అవివేకముతో జీవించేవారికి వివేకమును బోధించే జ్ఞానమునకు ఆధారము అగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, లోకాన్ని జయించే తెలివిని, సాతానును ఓడించే తెలివి, శోధనను జయించే తెలివి, అంతేగాకుండ దేవుని యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ - అతని మీద నిలుచును అని వ్రాయబడి యున్నది.

         ప్రకటన 31 ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలును గలవాడు ఈ లేఖ వ్రాస్తున్నాడు.  ''ప్రకటన గ్రంథ రహస్యములు ఇప్పుడు మీ చేతిలో . . .'' అను నా చే విరచితమైన పుస్తకము ప్రకారము ఏడు నక్షత్రములు  కలిగినవాడు క్రీస్తే. ఈ యేడు ఆత్మలు క్రీస్తునందు గుప్తమైయున్నవి అని ఎలా చెప్పవచ్చును? యోహాను 1030 నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను. ఈ వాక్యము ప్రకారముగా దేవుని యొద్దనున్న యేడు ఆత్మలు క్రీస్తునందును ఉండి క్రియ జరిగించుచున్నవి.

        యెషయా 111-2, ''యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును.  యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలియును యెహోవా యెడల భయభక్తులను  పుట్టించు ఆత్మ అతనిపై  నిలుచును.  ఈ ప్రవచనము క్రీస్తు యేసు గురించి చెప్పబడి యున్నది. ఇందులో

        మొదటి ఆత్మ్ష ః-  జ్ఞానమునకు ఆధారము

        రెండవ ఆత్మ ః-  వివేకమునకు ఆధారము

        మూడవ ఆత్మ ః-  ఆలోచనకు ఆధారము

        నాలుగవ ఆత్మ ః-  బలమునకు ఆధారము

        ఐదవ ఆత్మ ః-  తెలివిని పుట్టించును

        ఆరవ ఆత్మ ః-  యెహోవా యెడల భయమును పుట్టించును

        ఏడవ ఆత్మ ః-  యెహోవా యెడల భక్తిని పుట్టించును

        ఈ ఏడు ఆత్మలు క్రీస్తునందు ఉన్నప్పుడు వాటి కార్యములు క్రీస్తు ద్వారా  జరిగించుచున్నవని తెలియుచున్నది. మరి ఏడు నక్షత్రములు ఏడాత్మలు గలవాడైన యేసుక్రీస్తు ఈ లేఖలో కొన్ని సంగతులను క్రీస్తు తెలియజేస్తున్నారు.

        సప్త విధములైన శక్తివంతుడైన యేసుక్రీస్తు ప్రభువు ఏడు లోకాలకు, ఏడు సువార్తలకు, ఏడు మండలాలకు అధిపతియై యుండి మితిలేని ఐశ్వర్యవంతుడై యుండి పరలోక, భూలోక, జలలోక, పాతాళ లోకములనేగాక పంచభూతాలను తన స్వాధీనమం దుంచుకొని యావత్‌ సృష్టికి అధిపతియైన క్రీస్తు తాను 2 కొరింథీ 8:9లో వలె ఇట్టి శక్తిమంతుడైన ప్రభువు తన్ను తాను తగ్గించుకొనుటయేగాక అనగా తన సర్వస్వమును మన కొరకు ధారబోసి, తాను ఈ లోకములో పరిచారకుడుగా వచ్చినట్లు నిరూపిస్తూ శిష్యుల కాళ్ళు కడిగినాడు.  

        గెత్సెమనె వనములో మొట్టమొదటిగాను, రెండవదిగా సిలువ మరణ కాలములో ఆయన మాట్లాడిన ఏడు మాటలలో, ''నా దేవా!  నా దేవా!  నన్నేల చేయి విడిచితివి?'' అనుటలో ప్రభువు మన కొరకు ఎంతగా తన్ను తాను తగ్గించుకొన్నాడు.  ఎంతగా తనను పుట్టించిన తండ్రికి భయభక్తులు కలిగియుండి ఆయనకు ఇంపైన పరిమళ పూరితమైన వాసనగా ఉండినట్లు వేదములో వ్రాయబడి యున్నది.  ''యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.''  

        ఒక్కమాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు తన తండ్రియైన దేవునికి ఏనాడు వ్యతిరేకి కాడు.  తండ్రియొక్క మాటను జవదాటలేదు.  తాను తండ్రికి విధేయుడై జీవించినట్లు మనలను కూడా తన యందు భయభక్తులు గల్గి, తన ప్రేమలో తాను లోకము నుండి వెడలి అపొస్తలుల మీద పంపిన పరిశుద్ధాత్మతోబాటు - యేసు నామములో మనము జీవించాలని ప్రభువు కోరుచున్నాడు.  ఇందునుబట్టి  యెషయా 11:4, ''కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు  తాను వినుదానినిబట్టి విమర్శ చేయడు.''  యేసుక్రీస్తు దేవునియొక్క ఆత్మతో రూపించబడిన ఆత్మీయ కుమారుడు గనుక దేహ సంబంధముగా దృశ్యమైన వాటినిబట్టి ఆయన ఎప్పుడు లోకములో తీర్పుదీర్చలేదు.  ఆయన ఆత్మ సంబంధి కాబట్టి ఆత్మ ద్వారానే తీర్పు దీర్చాడు.  ఇందుకు ఉదా :- సిలువ మీది దొంగ.  అతనిలో కల్గిన పరివర్తన, పాప పశ్చాత్తాపము, మారుమనస్సును బట్టి సిలువ మీద అధిష్టించిన ప్రభువు ఆ దొంగవైపు తిరిగి - ''నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు.''  ఇది కంటిచూపును బట్టి తీర్చిన తీర్పుకాదు.  ఇది ఆత్మీయ దృష్టిలో తీర్చిన తీర్పు.

        కంటిచూపు అన్నది రెండు రకములై యున్నది.  మొదటిది ఆత్మ సంబంధము, రెండవది దేహ సంబంధము.  శరీర సంబంధమైన చూపు కంటెను ఆత్మ సంబంధమైన చూపునకు ప్రభావము, శక్తి, ఫలితము వున్నది.  సృష్టికర్తయైన దేవుడు కూడా యావద్‌ సృష్టిమీద తన ఆత్మీయ దృష్టిని సారించుచున్నట్లుగా కీర్తనలు 14:2లోను 53:2లోను - ''వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను.''  అలాగే ఆదికాండము 11:5, ''యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను.''  ఈ మూడు విషయములలోను సృష్టికర్తయైన దేవుడు ఆత్మయై యుండగా ఆయన తన ఆత్మీయ దృష్టితోనే యావద్‌ సృష్టిని చూచుచున్నట్లుగా ఇందునుబట్టి తెలియుచున్నది.

        కనుక దేవుని కుమారుడైయున్న క్రీస్తు కూడా శరీరియైయున్నను, ఆయన శరీరము నరసంబంధమైన నర బీజము ద్వారా రూపించబడినది కాదు అనగా ఆత్మ బీజముతో రూపించబడినాడు.  కనుక ఆయన దృష్టి కూడా ఆత్మ సంబంధముగా ఉండబట్టి, ఆయన ఆత్మ దృష్టిని కలిగి యుంటాడని ఆత్మ చూపుని బట్టి నరులకు తీర్పు దీర్చునని ఇందులోని భావము.  మరియు ''తాను వినుదానినిబట్టి విమర్శచేయడు,'' అనుటలో ఈయన దైవపుత్రుడు గనుక సృష్టిలో కనబడే ప్రతివాటిని, ప్రతి జీవిని గూర్చి లోక సామ్రాజ్యాలను గూర్చి లోక అంతమును గూర్చి లోకస్థులయొక్క హృదయాంత రాళాలను గూర్చి ఎరిగినవాడు.  కనుక ఎవరో ఒకరు చెప్పితే ఆ విన్నదానిని బట్టి విమర్శచేయువాడు కాదు, ఎందుకంటే నరులైన మనము సృష్టికర్తయైన దేవుని ననుసరించి ఆయన చిత్తము ప్రకారము, ఆయన ప్రణాళిక ప్రకారము, ఆయన ఆజ్ఞానుసారము జీవించవలసిన విధి యావద్‌ నర సమాజమునకున్నది.  మనుష్యుల సలహాలను పాటించవలసిన బలహీనత దేవునికి లేదు.  అలాగే దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు కూడా లేదు.

        మనుష్యులను సృష్టించింది దేవుడు, కాని దేవున్ని సృష్టించింది మనుష్యులు కాదు.  దేవుడు తన కొరకు తన చిత్తానుసారము తనకు విధేయుడై తన ఆజ్ఞననుసరించి తన సృష్టికి మెరుగు దిద్దుటకు నరుని నిర్మించాడు.  ఈనాడు అదే నరుడు దైవవ్యతిరేకియై - నరుని అపరాధమును బట్టి దోషమును బట్టి, నరదృష్టికి కనుమరుగైయున్న దేవుని కానక, నరుడు తన స్వార్థానికి తన చిత్తము ప్రకారము, తన ఇష్ట ప్రకారముగా నానా రూపములలో రూపాలను సృష్టించి, వాటిని దేవుళ్ళుగా తాను కొలుచుట, ఆచరించుట మాత్రమేగాక, తన సాటి నరులను కూడా ఆరాధించమని శాసిస్తున్నాడు.  ఇంతకంటె బుద్ధిహీనత ఉందా?  కనుక శరీరమునుబట్టి దృశ్యమైన వాటిని బట్టి తీర్పు తీర్చేది నరుడు.  చూచినవాటిని గూర్చినట్టి నిరాధార అసత్య అనూహ్యమైన వాటిని బట్టి విమర్శ చేయకుండా దైవకుమారుడైన యేసుక్రీస్తు ఆత్మీయ దృష్టితో నరులను తీర్పుతీర్చును అని ఇందులోని భావము.  

        చూపును బట్టి యేసు ప్రభువు తీర్పుదీర్చువాడైతే, చేపలను పట్టే జాలరులైన పేతురు, యోహానులను తన శిష్యరికానికి పిలచేవాడు కాదు.  అలాగే మత్తయి అను సుంకరి.  వీరందరు కూడా యేసుక్రీస్తు ప్రభువుయొక్క ఆత్మీయ దృష్టినిబట్టి యేసుక్రీస్తునకు ప్రియమైన శిష్యులుగా ప్రభువుచేత తీర్చబడినారు.  జక్కయ్య విషయములో జక్కయ్య లోకములో ధనవంతుడు, పొట్టివాడు.  జక్కయ్య ఎక్కిన చెట్టు క్రింద నుంచి జక్కయ్యను క్రీస్తు సంబోధించి చెట్టు నుంచి దింపి - ''జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసి యున్నదని,'' అన్నప్పుడు చెట్టు దిగువున జక్కయ్య చుట్టూ ఆవరించియున్న జనాభా యేసును గూర్చి విమర్శిస్తూ ఈయన పాపియైన మనుష్యుని ఇంట బసజేయ వెళ్ళుచున్నాడని సణుగుకొన్నారు.  అయితే ఈ సణుగుళ్ళను ప్రభువు వినకుండ జక్కయ్య ఇంటికి వెళ్ళి ఆతిథ్యము జేసినట్లుగా చదువగలము.  అట్టి సందర్భములో యేసుక్రీస్తు చెట్టు క్రింద వ్యక్తుల మాటలను ఖాతరు చేయలేదు.  ఇందునుబట్టి - ''తాను వినుదానినిబట్టి విమర్శచేయడు,'' అని తెలుస్తున్నది.

        ఇంకను ''నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును.''  ఈ సందర్భములో, విధవరాలి కుమారుడు చనిపోయి పాడె మీద మోయబడుచుండగా యేసు ప్రభువు ఆ విధవరాలికి ఆ కుమారుడు ఒక్కడే అని, ఆ విధవరాలియొక్క సర్వ ఆస్థి చనిపోయిన ఆయొక్క పిల్లవాడే అని విధవరాలియొక్క దీనస్థితిని ప్రభువు గ్రహించినవాడై పాడెను ముట్టి, చనిపోయిన ఆ పిల్లవానిని సజీవునిగా ఆ తల్లికి అప్పగించెను.  బీదలకు అనుకూలమైన తీర్చు దీర్చు ప్రథమ ఘట్టము.  అలాగే బేతనియాలో మార్త మరియమ్మల మధ్య ఒక్కడైయున్న ఒకే సోదరుడు లాజరు.  ఆ ముగ్గురు వ్యక్తులయొక్క కుటుంబములోని నీతిని ప్రభువు గుర్తించి, వారు లోక సంబంధముగా ఐశ్వర్యవంతులు కాదుగాని యేసుప్రభువు చేత ఎక్కువగా ప్రేమించబడినవారు.  అట్టివారి గృహములో ఆవరించిన మృత్యువును ప్రభువు తొలగించి, చనిపోయిన లాజరును సజీవునిగ చేసి అతనిని - అతని సహోదరీలకు అప్పగించుటన్నది నీతిని బట్టి బీదలకు తీర్పుతీర్చుటయే.

        ''భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగా విమర్శ చేయును.''  ఈ సందర్భములో మత్తయి 5:3-11లోని ధన్యతలు.  ''తన వాగ్దండము చేత లోకమును కొట్టును.''  ప్రియపాఠకులారా, ఇది సాధ్యమా?  అది జరిగిందా?  అని మనము అనుకోవచ్చును.  ఇది జరిగింది.  మత్తయి 27:50-54 చదివితే ఆయన వాగ్దండముతో భూమిని కొట్టిన సంఘటన మనము చదువగలము.  ''యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను.  అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను; భూమి వణకెను;  బండలు బద్దలాయెను; సమాధులు తెరువబడెను; నిద్రించిన అనేకమంది పరిశుద్ధుల శరీరములు లేచెను.''  ప్రకటన 19:15, ''జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది.''  ఇంకను ప్రకటన 19:11, ''మరియు పరలోకము తెరవబడియుండుట చూచితిని.  అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను.  దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు.  ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు.''

        ఈ వాగ్ధండము అనగా నేమిటి?  హెబ్రీ 4:12, ''ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యొటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.''  అనిన విధముగ యెషయా 11:4లో వివరించబడిన ప్రభువుయొక్క వాగ్దండము నరులనే గాకుండా సృష్టి యావత్తును లయపరచునట్టి ప్రభావము గలదని మనము తెలిసికోవలసి యున్నది.

        ఇక యెషయా 11:4, ''తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును.''  ప్రియపాఠకులారా, ఆదిలో దేవుడు ఆదికాండము 2:7లో జీవవాక్యము నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో తన పెదవులతో జీవాత్మను ఊదినట్లుగ వివరిస్తున్నది.  అంటే ఈ విధముగా రూపించబడిన నరుడు దైవచిత్తానుసారముగా ఆయన ప్రభావము, ఆయన శక్తి, ఆయన మహిమ కొరకు జీవించాలని దేవుని సంకల్పము.    ఆ విధముగా నరుడు కొంతకాలము జీవించాడు.  అంటే దేవునికి ఇష్టుడుగా నడిచాడు.  అటుతర్వాత దైవాజ్ఞను వ్యతిరేకించి దైవచిత్తమునకు ప్రతికూలుడై దేవుడు నిషేధించిన ఫలాన్ని భక్షించి దైవ వ్యతిరేకియైనప్పుడు, అదే దైవాత్మ నరుని శాసిస్తూ మరణానికి అప్పగించినట్లుగా వేదవాక్యములో వివరించబడి యున్నది.  ఈ విధముగా నరుని మరణానికి అప్పగించుటన్నది కేవలము మాటలతోనేగాక, క్రియా రూపముగ ఆదికాండము 7:21-23లో వలె భూమి మీద సంచరించు పశువులు, పక్షులు, మృగములు, సమస్త శరీరులు, నరులతో కూడా భూమిమీద నుండకుండ తుడిచి వేయబడెను.

        దైవత్వముయొక్క ఊపిరి ఎంత ప్రభావమైనదో తెలిసికొన్నారు గదా!  ఆయన కుమారుడు, మన రక్షకుడైన యేసు ప్రభువు శరీరరీత్యా దైవకుమారుడుగ లోకములో జన్మించినప్పటికిని, తన తండ్రియైన దేవునివలె ఊపిరితో శరీరులను చంపువాడు గాక, దైవకుమారుడైన ప్రభువు తన ఊపిరితో దుష్టుని, దురాత్మల మూలముగ కలుగు కీడు ఉపద్రవము, వేదన, బాధ, శోధన వాని క్రియలు, వాని ద్వారా సంక్రమించు అపరాధ దోషములను చంపువాడుగ ఈయన లోకములో అవతరించినట్లు మనము గ్రహించాలి.  ఎట్లంటే ఎఫెసీ 2:1లో పౌలు వివరించిన రీతిగా మనము మన అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చినవారమై యుండగా క్రీస్తు ద్వారా ఆయన మనలను బ్రతికించెను.  కాబట్టి దైవకుమారుడైన ప్రభువు దుష్టత్వమునకు కారకులైనట్టి దురాత్మలను నిర్మూలించుటకు ఈ లోకానికి వచ్చాడు.  అంటే లోక నాశనకరమైన సాతాను పుత్రుని జయించుటకు ఈ లోకానికి వచ్చాడు.  ఈనాటికి కూడా దైవ సేవకులు ప్రార్థన జేయునప్పుడు ప్రార్థనలో నోటి ఊపిరితో ఆత్మవశులై జేయు స్వస్థత క్రియలను మనము చూస్తున్నాము.  తద్వారా జరిగే ప్రభువుయొక్క మహత్కార్యాలను కూడా చూస్తున్నాము.  సామాన్య మానవులమైన మనము ప్రభువుయొక్క ఆత్మ వరమును పొంది ఆయన ప్రార్థన, బలము, శక్తి మూలముగ స్వస్థత కార్యములు చేస్తుంటే, దైవ కుమారుడైన ప్రభువు స్వయముగ ఆయన ఊపిరి ద్వారా స్వస్థత కల్గించడా?  దుష్టత్వాన్ని నిర్మూలించడా?

        ఇక యెషయా 11:5, ''అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును.''  ఈ సందర్భములో యోహాను 13:3-5 చదివినట్లయితే యేసు ప్రభువు తాను తండ్రి యొద్దకు వెళ్లవలసి వచ్చు సమయపు చివరి గడియలలో, చివరి రాత్రి భోజన కాలము అనగా కడరాత్రి భోజన కాలమున శిష్యులతో తాను కూర్చున్న పంక్తి నుండి లేచి తన పై వస్త్రమును అవతలపెట్టి ఒక తువ్వాలును తీసి నడుముకు కట్టుకొని, పళ్ళెములో నీళ్ళుపోసి శిష్యుల పాదములు కడుగుటయు, తాను కట్టుకొన్న తువ్వాలుతో తుడుచుట అనిన క్రియను గూర్చి మనము ఆత్మీయముగా ఆలోచిస్తే, ప్రభువు దేవునియొక్క కుమారుడు అనగా దేవునియొక్క వస్త్రమైయున్న క్రీస్తు తండ్రి చిత్తప్రకారము ఈ లోకములో జరిగించిన ప్రణాళిక యావత్తును సంపూర్తి జేసి, తిరిగి తన తండ్రి యొద్దకు వెళ్ళవలసి వచ్చిన గడియ సంభవించినప్పుడు తాను తండ్రియొద్ద నుండి నడికట్టుగా నడుముకు కట్టుకొని వచ్చిన దేవునియొక్క నీతియే నడికట్టు.  తాను ప్రేమించి, తాను పిలుచుకొని, తన సేవకునిగాను, తన శిష్యులుగా ఆయన నియమించుకున్న తన శిష్యకోటిని దేవుడు తనకు అనుగ్రహించిన అదే నీతిలో తన శిష్యకోటి జీవించాలని, వారిని ప్రతిష్టించి, పాద ప్రక్షాళనము ద్వారా వారిని నీతి మంతులుగానే - తన నడుమునకు కట్టుకున్న తువ్వాలుతో తుడిచి, పరిశుద్ధులై యుండి దైవరాజ్య సువార్తకు సాధనములుగాను, యెరూషలేము అను దేవుని పట్టణమునకు 12 పునాదులుగాను ఏర్పరచి, తనయొక్క దైవప్రణాళిక నెరవేర్పును జరిగించెను.  యేసు ప్రభువుయొక్క నీతి ఆయన నడికట్టు అయి, ఆ తర్వాత ఆయన ప్రతిష్టించిన అపొస్తలులకు నడికట్టుగా ఆ నీతి విస్తరించినది.  ఆ అపొస్తలుల ద్వారా వారి సువార్త ప్రకటనలద్వారా, వారు రచించిన లేఖన భాగముల ద్వారా విస్తరించిన నూతన విశ్వాసులయొక్క ఆత్మీయ జీవితాలకు కూడా ఈ నీతి నడికట్టయి వుండి, నాటి నుండి నేటి వరకు క్రైస్తవ కుటుంబానికి నీతితో జీవించుటకు విశ్వాసియొక్క జీవితమునకు ప్రాధాన్యమైన ఫలముగ నిలిచియున్నది.

        ''అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును.''   యాకోబు ఇశ్రాయేలు అగుటకు కారణము ఏమి?  అతని తుంటి మీద దేవునియొక్క పరీక్షయే కారణము.  యాకోబు దేవునితో పోరాడినాడు.  దేవుడు ఆ పోరాటములో యాకోబును మెచ్చి యాకోబునకు ఒక బిరుదునిచ్చాడు.  ఏమని?  ఆదికాండము 32:24-28, ''యాకోబు ఒక్కడు మిగిలిపోయెను;  ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను.  తాను అతని గెలువకుండుట చూచి తొడగూటిమీద అతనిని కొట్టెను.  అప్పుడతడు ఆయనతో పెనుగులాడుటవలన యాకోబు తొడగూడువసిలెను.  ఆయన-తెల్లవారు చున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు-నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యననెను.  ఆయన-నీ పేరేమని యడుగగా అతడు-యాకోబు అని చెప్పెను.  అప్పుడు ఆయన-నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను.''  ఈ గాయము ఆశీర్వాదకర మైనది, మహిమాన్వితమైనది, ప్రభావము గలది, దైవక్రియకు సాక్ష్యార్థమైనది, సత్యదేవుని యొక్క నిజత్వమును బయల్పరచునదియై యున్నది.  అందుకే దేవుని వలన యాకోబుకు కలిగిన ఈ తుంటి గాయము మహిమకరమైనదియు, దేవునియొక్క సత్యమును బయల్పరచునదియై యుండినట్లుగ నూతన నిబంధనలో దేవుని దూత కన్యకయైన మరియమ్మతో మాట్లాడిన మాటలలో - లూకా 1:32-33, ''ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడన బడును;  ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.  ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును;  ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.''  అని మరియమ్మతో చెప్పిన విషయము ఈ సందర్భములో మనము జ్ఞాపకముంచుకోవలెను.  ఈ విధముగా యాకోబు తుంట్లకు కట్టిన సత్యము అను నడికట్టు క్రీస్తుయొక్క చరిత్ర వరకు దేవుని క్రియను బయల్పరచుచున్నది.  అనగా యాకోబు తుంట్లకు కట్టబడిన నడికట్టు అను దేవునియొక్క సత్యము ఈనాటి వరకును, యావద్‌ ప్రపంచములో ప్రతిచోట నానా భాషలు మాట్లాడువారిలోను, నానా స్థలములలోను, నానావిధములైన జాతులలో ఈ సత్యము నేటికిని స్థిరముగా నిలబడియున్నది.

9.  పాతాళముయొక్క గొప్ప ఆశ

        యెషయా 5:14, ''అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమిత ముగా తన నోరు తెరచుచున్నది  వారిలో ఘనులును సామాన్యులును ఘోషచేయువారును హర్షించువారును పడిపోవుదురు.''

        ప్రియపాఠకులారా!  ''అందుచేతనే,'' అని అనుటలో ఇది ఒక కారణము వల్ల జరుగుచున్నట్లుగా తెలియుచున్నది.  ఈ కారణము ఏమై యుండవచ్చును?  పాతాళములోకి వెళ్ళువారు ఎవరు?  ఇందునుగూర్చి మనము సవివరముగా తెలుసుకొనవలసి యున్నది.

        చాలామంది బోధకులు జీవగ్రంథములో పేరులేనివారు పాతాళలోకములో ఉందురని చెప్పుదురు.  ఇందునుగూర్చి పూర్తిగా ఈ అధ్యాయములో తెలుసుకొందము.  మానవుని మరణానంతరము ఎక్కడ వుండవలెనన్నది వారి క్రియలను బట్టి నిర్థారించ బడును.  ప్రకటన 14:13, ''అంతట-ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని.  నిజమే;  వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు;  వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.''  వారి క్రియలు వారి వెంట వెళ్ళుట వలన వారి స్థాన నిర్ణయము జరుగును.  ఇంతకి ఎవరు పాతాళ లోకములో ఉందురు?  అనిన విషయము ఇప్పుడు తెలుసుకొందము.  దైవవ్యతిరేకియైన లూసిఫర్‌ తన్ను తాను దేవుని కన్నా ఎక్కువగా ఊహించుకొని పాతాళములో పడినట్లుగా చెప్పబడి యున్నది.  

        యెషయా 14:12-15, ''తేజో నక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి?  జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?  -నేను ఆకాశమున కెక్కిపోయెదను  దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును  ఉత్తర దిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును  మేఘమండలముమీది కెక్కుదును  మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా?  నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.''  

        ఇలా దేవుని కన్నా యెక్కువగా ఊహించిన సాతాను నేలమట్టము వరకు నరకబడినాడు.  అటుతరువాత పాతాళలోకములో ఒక మూలన పడిపోయాడు.  అంటే పరిశుద్ధులు తప్ప ప్రతి ఒక్కరు పాతాళలోకమునకు వెళ్ళవలసినదే.  ఈ పాతాళ లోకము ప్రేతములతో నిండి యుండును.  ఇందు బాధ, వేదన కలిగి యుండును.  లూకా 16:22-23, ''ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను.  ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను.  అప్పుడతడు పాతాళములో బాధపడుచు,''  

        ఇందునుబట్టి పాతాళములో బాధ అనునది సర్వ సాధారణమైనది.  అయితే సాతానును దైవకార్యములలో దేవుడు వినియోగించునప్పుడు మాత్రమే మన మధ్య సంచరించి శోధనా కార్యక్రమమును జరిగించును.  అయితే మన మూలవచనములో - ఇటువంటి పాతాళము గొప్ప ఆశతో అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది అని వ్రాసాడు.  దీనికి కారణము మరణించిన వారిలో 99% అపరిశుద్ధులు లేక దైవ వ్యతిరేకులు ఉండడమే,  ఎందుకంటే పాతాళము అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది.  అనగా పాతాళములోనికి వెళ్ళుచున్న మరణించినవారి ఆత్మలకు ఒక పరిమితి లేదని అర్థమగుచున్నది.  

        ఉదా :-  మన ప్రాంతములో 10 లక్షలమంది వుంటే పాతాళములోకి వెళ్ళువారు 9,99,990 మంది వరకు ఉండవచ్చును.  మిగిలిన ఈ 10 మంది మాత్రమే అన్ని విధాలుగా దేవునికి యోగ్యమైన రీతిలో జీవించి, మరణించినను వారు జీవము కలిగి పాతాళ వశము కాకుండా పరదైసులతో ఆనందకరమైన జీవితమును జీవించుదురు.

        కనుక ఈ పాతాళము అనునది మృతుల లోకములో ఒక భాగము.  ఈ భాగములో అపరిశుద్ధులు ఉందురు.  మృతుల లోకములోని పాతాళము కాక మిగిలిన భాగములో పరిశుద్ధులు ఉండి, ఆనందకరమైన జీవితమును జీవిస్తున్నారు.  ఇందులో మృతుల లోకములో ఉన్న పరిశుద్ధులు - మృతుల లోకములోని పాతాళములో ఉన్న అపరిశుద్ధులు ఒకరినొకరు చూచుకొనుచుందురుగాని వారు ఒక ప్రాంతమునుండి మరియొక ప్రాంతమునకు వెళ్ళలేరు.  

        లూకా 16:25-26, ''అందుకు అబ్రాహాము కుమారుడా, నీవు నీ జీవితకాల మందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అను భవించెనని జ్ఞాపకము చేసికొనుము;  ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు.  అంతేకాక ఇక్కడనుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మాయొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నదని చెప్పెను.''  ఇందునుబట్టి మృతుల లోకములో రెండు భాగములు వున్నవని అర్థమగు చున్నది.  ఇందులో లాజరు, ధనికుడు ఇద్దరు మృతులు.  కాని ధనికుడు మృతుల లోకములోని పాతాళ లోకములో బాధను అనుభవిస్తున్నాడు.  అయితే లాజరు జీవయుతమైన జీవితములో ఉన్నాడు.  యోహాను 5:24, ''నా మాటవిని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు;  వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.''  ఈ విధముగా లాజరు నిత్యజీవము కలవాడుగా మృతుల లోకములో ఉన్నను పాతాళముయొక్క వశములోనికి పోక జీవము కలిగి ఉన్నాడు.

        అయితే - జీవగ్రంథములో పేరులేనివారు మొదట పాతాళ లోకములోనే వారి కార్యములను బట్టి బాధింపబడుదురు.  అటు తరువాత, ఈ యుగాంతము జరిగి క్రీస్తు 1000 సంవత్సరము పరిపాలన అనంతరము ఈ కడమవారైన, అపరిశుద్ధులకు తీర్పు తీర్చును.  అప్పుడు ఎవరి పేరైతే జీవగ్రంథమందు వ్రాయబడక ఉన్నదో వారిని రెండవ మరణమునకు అప్పగించబడుదురు.  ప్రకటన 20:15, ''ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.''  ధనవంతుని వలె ఎవరైతే బాధను అనుభవించి మారుమనస్సు పొంది జీవగ్రంథములో మరల పేరును పొందు అవకాశము ఉన్నది.  కాని అది 1000వ సంవత్సరము తరువాత జరుగును.  ప్రకటన 20:6, ''ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు.  ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు;   వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.''  ప్రకటన 20:7-9, ''వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును.  భూమి నలుదిశలయందుండు జనములను, లెక్కకుసముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై  వాడు బయలుదేరును.  వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను.''  

        ఈ విధముగా క్రీస్తు మొదటి పునరుత్థానములో పాలిపంపు గలిగి జీవగ్రంథములో పేర్లు ఉన్న పరిశుద్ధులతో 1000 సంవత్సరములు పరిపాలన చేసిన తరువాత కడమవారుగా చెప్పబడిన అపరిశుద్ధులు పాతాళ వేదన నుండి విడిపింప బడుదురు.  ఈ కాలములో వారిలో జరిగిన మార్పు ఎంతవరకు నిజమైనదని తెలుసు కొనుట అబద్ధమునకు జనకుడైన సాతాను మరలా విడుదల చేయబడును.  ఈ విడుదల చేయబడిన సాతాను ఈ అపరిశుద్ధులుగా వుండి పాతాళ లోకములో వేదన పొందినవారిని మరల శోధించి పరిశుద్ధుల పట్టణములను ముట్టడి చేయించును.  ఈ విధముగా ఈ కడమవారిలో వచ్చిన మార్పును దేవునికి తెలియజేయును.  ఇలా మోసగింపబడక సాతాను శోధనకు ఇందులో లొంగనివారి పేరు మరల జీవగ్రంథములో లిఖించబడి, వారు తీర్పునకు గురియై పరలోక ప్రవేశము లభించును.  మిగిలినవారికి అగ్నిగుండములో రెండవ మరణమును పొందుదురు.  

        మన మూలవచనములో చెప్పబడినవారు ఫకలు అనగా ఈ లోకరీత్యా గొప్ప స్థితిని పొందినవారు, సామాన్యులు అనగా సాధారణ జీవితములో జీవించువారు,  ఘోష చేయువారు అనగా ఇతరులను వేదనకు గురి చేయువారు, హర్షించువారు అనగా వీరు ఇతరుల బాధను చూచి ఆనందించువారు లేక ఇతరుల ఉన్నతిని చూచి బాధపడేవారు.  ఇలా వారందరు ఈ పాతాళములో పడిపోవుదురని చెప్పుచున్నారు.  వారందరు పరలోక రీత్యా అల్పులుగను, వీరు పాతాళ లోకములో అణగద్రొక్కబడుదురు.  ఇటువంటి వారి కోసము పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది అని ప్రవక్త చెప్పుచున్నాడు.  కనుక పై వారిలో మనము ఉన్నట్లైతే, పాతాళ వశము నుండి తప్పించుకొనుటకు క్రీస్తు చెప్పిన మార్గములో నడుచుదుముగాక!

10.  యెహోవా దినము వచ్చుచున్నది

        యెషయా 13:6-11, ''యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండివచ్చును.  అందుచేత బాహువులన్నియు దుర్బలములగును  ప్రతివాని గుండె కరగిపోవును  జనులు విభ్రాంతినొందుదురు  వేదనలు దు:ఖములు వారికి కలుగును  ప్రసవవేదన పడుదానివలె వారు వేదనపడెదరు  ఒకరినొకరు తేరి చూతురు  వారి ముఖములు జ్వాలలవలె ఎఱ్ఱబారును.  యెహోవా దినము వచ్చుచున్నది.  దేశమును పాడుచేయుటకును  పాపులను బొత్తిగా దానిలో నుండకుండ నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును.  ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు  ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును  చంద్రుడు ప్రకాశింపడు.  లోకుల చెడుతనమునుబట్టియు దుష్టుల దోషమునుబట్టియు నేను వారిని శిక్షింపబోవు చున్నాను  అహంకారుల అతిశయమును మాన్పించెదను  బలాత్కారుల గర్వమును అణచివేసెదను.''

        యెహోవా దినము ఎలాగుండును?  యుగాంతములో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రెండవ రాకడ ఎలాగుండును?  యెహోవా దినములో జరిగే కార్యములు దైవ కుమారుడైన క్రీస్తుయొక్క రాకడలో జరుగు కార్యములు ఈ రెండు సందర్భాలలోను జరుగు కార్యక్రమములో సంభవించు క్రియలలోని తారతమ్యములను గూర్చి తెలుసు కొందము.  పరిశుద్ధాత్మ దినము ఎట్లుండును?  ఆయన జరిగించే పని ఏమి?  త్రియైక దేవునియొక్క రాకడ సందర్భములలో జరగు త్రివిధమైన రాకడలలో సంభవించిన మరియు సంభవింపబోవు క్రియలలోని తారతమ్యములను గూర్చి తెలుసుకొందము.

        మొదటి మాట - ''యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి.''  రెండవ మాట - ''యెహోవా దినము వచ్చుచున్నది.  దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుటకును'' అని దైవవాక్యము వివరించుటలో యెహోవా దినము వుంది.  ఆ దినములో జరుగవలసిన సకలమైనటువంటి కార్యక్రమములు, క్రియలు, వినాశనము సమస్తము జరిగింది.  యెహోవాయొక్క రాకడను ప్రకటించుటకు ఆ దినములలో ప్రవక్తలు లేరు.  సృష్టిలో తాను సృష్టించిన నరజంటయొక్క పాప ప్రవేశము మొదలుకొని వారియొక్క జ్యేష్ఠ సంతానమైన కయీనుయొక్క సంతతి వరకు అనగా ఆదికాండము మూడవ అధ్యాయము నుండి ఆరవ అధ్యాయము వరకు ఉన్న వేదభాగాల వరకు యెహోవా రాకడను గూర్చి ప్రవచించిన లేక ఆయన జరిగించే క్రియను గూర్చి వివరించిన ప్రవక్తలు ఎవరును లేరు.  ఎందుకంటే అప్పుడు లిపి లేదు - వేదము లేదు, లేఖకులు లేరు.

        ఆ స్థితిలో ఆదికాండము ఆరవ అధ్యాయము చదివితే, యెహోవా వచ్చే దినమునకు కారణమేమిటో కారకులెవరో?  అనిన విషయాన్ని వివరించబడి యున్నది.  ఇందులో మొదటిది నరులు భూమి మీద విస్తరింపనారంభిన తర్వాత దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కనివారని చూచి వారందరిలో తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.  యెహోవా దినము వచ్చుటకు కారణము ఇదియే.  దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కలిగిరి.  ఈ విధముగా విస్తరించిన పాప నరకోటి నిమిత్తము తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాప పడినట్లు వ్రాయబడి యున్నది.  ఇక భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి యుండెను.  భూలోకము బలత్కారముతో నిండి యుండెను.  భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసికొని యుండిరి.

        యెహోవా దినము వచ్చుటకు మూలమైనటువంటి మాటలు యివి.  అయితే యెహోవా తాను వచ్చే దినమును గూర్చి ఎవరితో చెప్పినాడు?  దేవుడు ఈ విషయాన్ని నోవహుతో చెప్పెను.  ఆదికాండము 6:13, ''దేవుడు నోవహుతో-సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది;  ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును.''  ఈ విధముగా యెహోవా తాను జరిగించు లోక నిర్మూలవ క్రియను గూర్చియు, యావద్‌ సృష్టిని లయపరచబోవు క్రియను గూర్చియు నోవహుతో దేవుడు ప్రత్యక్షముగా చెప్పుచూ, ఆ విపత్కర ప్రళయ మారణహోమము నుండి తప్పించుకొనుటకు కావలసిన జాగ్రత్తను గూర్చి అందుకు అవసరమైన రక్షణాయుతమైన ఒక ఓడ గృహమును నోవహు చేత దేవుడు నిర్మింప జేశాడు, ఎందుకంటే తాను లోకమును లయపరచబోవు ఆ మహాదినమును గూర్చియు - ఆ దినమును గూర్చి నోవహు వహించవలసిన జాగ్రత్తను గూర్చియు దేవుడు సవివరముగా నోవహుకు విదితపరచి యున్నాడు.

        ఈ విధముగా నరకోటికి మరుగైయున్న దేవుడు తానెన్నుకున్న నీతిగల వ్యక్తికి మాత్రము ప్రత్యక్షమై తాను యెషయా 13:6లో విధముగా చెప్పెను.  యెహోవా దినము వచ్చుచున్నది.  అది ప్రళయమువలె  సర్వశక్తుడైన దేవుని యొద్దనుండివచ్చును.  యెహోవా దినము దేశమును పాడుచేయుటకు; పాపులు దానిలో నుండి నశింపజేయుటకును, క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును.  ఆకాశ నక్షత్రరాశులను చీకటిమయము జేసి అనగా కాంతి విహీనము చేసి సూర్యచంద్ర వెలుగులను చీకటిమయముజేసి, మహా పర్వతములు సహితము ముంచివేయు అగాధ జలములతో నిండిన యెహోవా దినమును నోవహు చూచాడు.  ఆయొక్క చీకటి చేదు అనుభవాన్ని అగాధ జలముల మీద పయనిస్తున్న నోవహు ఓడ గృహములో అనుభవించాడు.  నోవహు తాను మాత్రమేగాక తన కుటుంబము - దేవుడు తనకు ఆజ్ఞాపించిన రీతిగా ఓడలోనున్న దేవుని సృష్టములును, యెహోవాయొక్క మహాదినమును గూర్చిన భయంకర ప్రళయ దినమును కన్నులారా చూచినట్లుగా ఆ వేదభాగము వివరిస్తున్నది.

        ఇది యెహోవా దినమును గూర్చిన రెండవ ఘట్టము.  అయితే, మొదటి ఘట్టము ఏది?  ఆదికాండము 1:1-2, ''ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.  భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను;  చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను;''  ఈ దినము నాశనము జరుగు దినము కాదు.  దేవునియొక్క దినముయొక్క మొదటి సంఘటనలు నిరాకారశూన్య స్థితిలో ఉన్న ఈ అనంత విశ్వము యెహోవా తన వాక్కు చేత అలంకరించి, చక్కని సృష్టిగా తీర్చిదిద్ది తనకు మహిమకరముగా ఉండాలని ఆశించాడు.  అందుకు వ్యతిరేకముగా భూమియు, దాని నివాసులును దేవుని పట్ల కనపరచిన అలక్ష్య వైఖరిని చూపారు.  వ్యతిరేకత హేయక్రియలను బట్టి సృష్టికర్తయైన యెహోవా సంతాపపడి సృష్టికి పూర్వము ఈ అనంత విశ్వమే స్థితిలో ఉన్నదో అనగా నిరాకార శూన్య స్థితిలో అంధకార జలములలో ఏ విధముగ ఉండినదో, అదే విధముగా దీనిని మార్చివేసినట్లుగా యెహోవా దినము వివరిస్తున్నది.

        ఇందులో ప్రత్యేకత ఏమిటంటే సృష్టికి పూర్వము దేవునియొక్క ఆత్మ చీకటి అగాధ జలముల మీద అల్లాడింది.  అలాగే సృష్టి నాశన కాలములో అనగా ఈ భూమిని చీకటి అగాధ జలములు ముంచి వేసిన దినము నందు చీకటి అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడలేదు.  కాని దేవుని ఎంపికలో నీతిమంతుడుగ ఎంపికయైన విశ్వాసి అతనియొక్క కుటుంబము ఓడ గృహములో చీకటి అగాధ జలముల మీద తేలియాడుచు పయనించినట్లు మనకు తెలియుచున్నది.  ఇది యెహోవా దినములను సూచించిన సంఘటనలు.  మొదటి సంఘటనలో దేవుని ఆత్మ చీకటి అగాధ జలముల మీద అల్లలాడి సృష్టిని చేసింది.  ఇది దేవుని ఆత్మయొక్క దినము.  ఆ దేవునియొక్క ఆత్మ యెహోవా అను పేరుతో - యెహోవా దినముగా ప్రవచించబడి, అపవిత్రత, అన్యాయము, అక్రమము హేయక్రియా కర్మలతో - కలుషితమైయున్న ఈ లోకమును జలప్రళయము ద్వారా భూమి మీద ఉగ్రతపూరితమై, నాశనకరమైన మారణహోమమును జరిగించిన ఈ యెహోవా దినము నోవహు కాలములో వున్నది.  ఇది యెహోవా దినముయొక్క వివరణ.

        ఇక యెహోవా దినము తాను జరిగించిన సృష్టి వినాశ మారణహోమమును బట్టి సంతాపపడెను.  కాబట్టి యెహోవా తన దినమును రక్షకుని దినముగ మార్చెను.  అనగా లూకా 2:11, ''దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు.''  ఈయన తన పేరును యేసుక్రీస్తుగా మార్చుకొనెను.  ప్రభువైన క్రీస్తు అను పేరుతో మరియొక దినాన్ని నరుల కోసము నియమించి ఈ లోకములో అవతరించాడు.  అనగా యెహోవా యేసుక్రీస్తుగా లోకములో కన్య గర్భము నుండి జన్మించిన ఆ దినము రక్షకుని దినము ''క్రిస్ట్‌మస్‌.''  ఇది ఆరాధనా దినము.

        అటు తరువాత దేవుడైన యెహోవా దినము ఎలాగున్నది?  ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఏర్పరచిన అపొస్తలుల మీదకు పావురము వలె వచ్చాడు.  అపొస్తలుల కార్యములు 2:1-4, ''పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి.  అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను.  మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.''  

        దేవుడైన యెహోవా దినము పవిత్రాత్మలాగా బహిర్గతము అయ్యాడు మరియు అపొస్తలుల ద్వారా తన క్రియలు జరిగించాడు.  అటు తరువాత యెహోవా ఆత్మయొక్క శక్తి పవిత్రాత్మ రూపములో విస్తరించి రోజురోజుకు అభివృద్ధి చెందినది.  ఈ యుగములో, పుస్తక రూపములో లేక వేదగ్రంథ రూపములో దేవుడైన యెహోవా దినము ఉన్నది.  ఇదే ఆరవ యెహోవా దేవుని దినము.  ఈ దినములో, పవిత్రాత్మగా ఆయన ఉండి, పవిత్ర గ్రంథము అనగా ఆయనను గూర్చిన శుభ వర్తమానమును గ్రంథ రూపములో సిద్ధపరచెను.  ప్రతి స్థలములోను, ప్రతి మనిషి హృదయమును ఈ గ్రంథము ఉత్తేజపరస్తూ వారిని తన వారినిగా చేసుకొని అనేక స్థలములలో అనేక పేర్లతో సంఘములను ఏర్పరచి వృద్ధి చెందుచున్నది.

        ఇప్పుడు మనము అతి పెద్ద దినమును గూర్చి నిరీక్షణలో ఉన్నాము.  ఈ ఏడవ దినమున దేవుడైన యెహోవా మనుష్య కుమారునిగాను, రాజుగాను మరియు న్యాయాధి కారిగాను వచ్చును.  ఇది మనకు మన ఆత్మీయ జీవితమును సరిదిద్దుకొనుటకు సరియైన సమయము, ఎందుకంటే నోవహు కాలములో, మేఘములు, గాలి, చీకటి మరియు అగాధ జలములు భూమిని నింపి తమ కార్యములు జరిగించాయి.  అనగా తమ పంచేద్రియాలలో గాలి, నీరు మాత్రమే వాటి క్రియను జరిగించాయి.  కాని అగ్ని దాని క్రియను జరిగించలేదు.  అనగా దేవుడు అగ్నితో గొప్ప మారణహోమము జరిగించలేదు.  కాని, ఈసారి ఆ గొప్ప దినము వలన పంచేద్రియాలు, భూమి, మొదలైన సమస్త సృష్టి భయముతో వణుకుచున్నవి.  ఈ దినమే దేవుని ఉగ్రతతో కూడిన ఏడవ దినము.

        ఈ విధముగా దేవునియొక్క దినము ఏడు విధములుగా భూమి మీద క్రియ జరిగించును.  1.  ఆత్మగా  2.  ఉగ్రతగా  3.  ఇశ్రాయేలీయుల ఎన్నిక  4.  ఉద్ధారణకర్తగా  5.  పవిత్రాత్మగా 6.  పవిత్ర గ్రంథము మరియు  7.  యేసుక్రీస్తు ప్రభువు మహిమధారిగా.

        కాని, నరునికి అది గోచరము కాదు కనుక నరుడు ఇప్పుడేమియు ఫరవాలేదులే, మనమున్న ఈ యుగము చాలా ఆధునిక యుగము, విజ్ఞాన యుగము, అన్ని వనరులు, అన్ని విధాలైన అనుకూలతలు; సుఖాసన జీవితము అనుభవించేటటువంటి స్థితిలో అనుభవిస్తున్నాము.  సమస్తమును మానవ జ్ఞానమునకు అనుగుణముగా వున్నాయి.  కాబట్టి దేవుడు లేడు ఏది జరిగినను ప్రకృతి - నరుడే కారణము.  నరుని మీదనే ఆధారపడి యున్నది.  కాని దేవున్ని బట్టి ఏదియు జరుగుట లేదు.  కాబట్టి నర జీవితానికి ఏ ఢోకా లేదు.  ఏ భయము లేదు అని గ్రుడ్డిగా నేటి యుగమున్నది.  అయితే 2 పేతురు 3:5-13లో జరిగేది ఏడవ దినము.  ఇప్పుడున్న భూమి అగ్ని కొరకు నిలువ జేయబడి యున్నది.  ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును.  పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును.  భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును.  పంచ భూతములు మహావేండ్రముతో కరిగి పోవునట్లుగా దేవుని దినపు రాకడ యుండును.  కాబట్టి మనము సర్వశక్తుడైన ప్రభువు మరియు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుని రాక కొరకు మనమిప్పుడు కనిపెట్టుకొని ఉండవలసిన సమయమిది.

        చిత్రమేమిటంటే ఆనాటి దినములలో యెహోవా తన దినములను గూర్చి తానే తన బిడ్డలకు, తాను జరిగించబోవు కార్యములను గూర్చి తానే చెప్పేవాడు.  ఎట్లంటే నోవహుకు ముందుగానే జలప్రళయాన్ని గూర్చి చెప్పినాడు.  అలాగే లోతుకు సొదొమ గొమొఱ్ఱాలకు తాను జరిగించబోవు నాశనాన్ని గూర్చి ముందుగానే తెలిపినాడు.  తాను నర కుమారునిగా, నరుడుగా జన్మించబోవు సందర్భాలను గూర్చి, సమయాలను గూర్చి, ప్రవక్తల నోట ప్రవచింప చేశాడు.  ఆ విధముగ ఆయన తన క్రియలను విశదీకరించాడు.  తాను క్రీస్తుగా జన్మించబోవు సందర్భాన్ని కూడా తన దూతల చేత కన్యకయైన మరియమ్మకు తెలిపినాడు.  తూర్పు దేశపు జ్ఞానులకు, నక్షత్రము ద్వారా తన పుట్టుక దినమును గూర్చి వివరించినాడు.  అలాగే గొల్లల దగ్గరకు, దూతను పంపించి వివరించాడు.

        నరుల మీద తనకున్న ప్రేమ కొద్ది నరుల మధ్య ఆయన నరునిగా తిరుగుచూ, తాను సామాన్యమైన నరుడు కాదని, దైవాత్మ సంభూతుడనని ఋజువుపరచుటకు అనేక మహిమాన్విత క్రియలు జరిగించి, తనను గూర్చి నరులకు ప్రత్యక్ష పరచుకున్నాడు.  ఆయనను నరులకున్న లోకాంధకార మనోనేత్ర గుడ్డితనమునుబట్టి క్రీస్తు ప్రభువుగా అవతరించిన దైవకుమారుని దేవునిగా నరులు గ్రహించలేక పోయారు.  అయినను దేవుడు నరుల పట్ల ఆగ్రహించక క్రీస్తు రూపములో ఉండి - యోహాను 14:16, ''నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.''  

        ఈయన ఎవరయ్యా అంటే ఆదరణకర్త అనగా తండ్రి నామమున మీ యొద్దకు పంపబడు ఆత్మ మీతో కూడా నుండును, మీలో నివసించును.  తండ్రి నామమున పంపబోవు ఆత్మ ఏ సమయములో ఏది మీకు అవసరమో అది మీకు బోధించి జ్ఞాపకము చేయును.  ఈ వాగ్దానమును బట్టి ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మగా ఆయన దినమున్నది.  

        ఇక నేటి తరములో వున్న మనము యెహోవా రాకడ దినములలో యెహోవా రాబోవు ఏడవ దినము కొరకు నిరీక్షించువారమై యున్నాము.  ఇది లోక నాశనమునకు చివరి దినము అని మనము గ్రహించవలెను, ఎందుకంటే యెహోవా రాబోవు ఏడవ రాకడకు ఈ లోకమునకు అంతము, లోకము లయపరచబడుచున్నది.  ఇందునుగూర్చి ప్రకటన 21:1, ''అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని.  మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను.  సముద్రమును ఇకను లేదు.''

        కనుక ఈ అనంత విశ్వమును అగ్నితో లయపరచుటకు సృష్టికర్తయైన ప్రభువు రాబోవు దినమొకటున్నదని ఆ దినములో జరుగబోవు లోక దహనాన్ని చూడకుండ ప్రభువుయొక్క అనగా దేవునియొక్క కూటమిలో ముందుగానే చేరుకొనే మహా భాగ్యము పొందుటకు మనము నిరీక్షించవలసి యున్నది.  అంటే ప్రభువుయొక్క రాకడకు మనము కనిపెట్టువారమై యుండవలెను.  

        ఈ విధముగా కనిపెట్టుట అంటే మెలకువతోను, ప్రార్థనతోను, విశ్వాసముతోను, ప్రార్థనా కూడికతోను, వాక్య ధ్యానముతోను, ఆత్మీయ దృష్టితో జీవించవలసిన బాధ్యత ఉన్నదని గ్రహించుదుము గాక!''

11.  తేజో నక్షత్రమైన వేకువచుక్కా నేలమట్టుకు నరకబడుట

నరకములో మూలకు త్రోసివేయబడుట

        యెషయా 14:9-17, ''నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది.  అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది  భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజుల నందరిని  వారి వారి సింహాసనముల మీదనుండి లేపుచున్నది  వారందరు నిన్ను చూచి-నీవును మావలె బలహీనుడవైతివా?  నీవును మాబోటివాడవైతివా?  అందురు.  నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను.  నీ క్రింద పురుగులు వ్యాపించును  కీటకములు నిన్ను కప్పును.  తేజో నక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి?  జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?  -నేను ఆకాశమున కెక్కిపోయెదను  దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును  ఉత్తర దిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును  మేఘమండలముమీది కెక్కుదును  మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా?  నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.  నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు  -భూమిని కంపింపజేసి రాజ్యములను వణకించినవాడు ఇతడేనా?  లోకమును అడవిగాచేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా?  తాను చెరపట్టినవారిని తమ నివాసస్థలమునకు పోనియ్యనివాడు ఇతడేనా?''

        ఇది సాతానును గూర్చి చెప్పబడిన వాక్యములు.  ఈ సాతాను ఒకప్పుడు దైవసన్నిధిలో లూసిఫర్‌ అను నామధేయముతో గొప్ప గాయకుడు మరియు వైణికుడిగా వెలుగొందుచుండెను.  అందుకే మన మూలవాక్యములో - ''నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను,''  అని చెప్పబడినది.  అనగా స్వరమండలము నుండి గొప్ప కీర్తనలు వెలువడును కనుక లూసిఫర్‌ ఒక గొప్ప గాయకుడు మరియు వైణికుడుగా మనము గుర్తించాలి.

        దైవసన్నిధిలో ఇంతటి గొప్ప స్థానము పొందిన లూసిఫర్‌ దేవుని కన్నా తన్ను తాను హెచ్చించుకొన్నాడు.  యెషయా 14:13, ''-నేను ఆకాశమున కెక్కిపోయెదను  దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును  ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును.''  ఈ విధముగా లూసిఫర్‌ అను తేజో నక్షత్రము వేకువచుక్కగా పేరు పొందినవాడు దేవుని కన్నా హెచ్చించుకొని పతనమును చవి చూసాడు.  ఈ విధముగా మొదట పరలోకములో లూసిఫర్‌ హెచ్చించుకొని పడిపోయాడు.  ఇంతకి దేవుని కన్నా ఎక్కువగా హెచ్చించుకొన్న లూసిఫర్‌ ఎక్కడకు పడిపోయాడు?  ఈ విషయము మనము తెలుసుకొనవలసి యున్నది.  యెషయా 14:12, ''తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి?  జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?''  

        ఇందునుబట్టి తేజోనక్షత్రము, వేకువచుక్కగా వెలుగొందిన లూసిఫర్‌ తన్ను తాను హెచ్చించుకొనుట చేత నేలమట్టము వరకు నరకబడినాడు అనగా ఇతని అధికారము ఈ భూమి వరకు మాత్రమే అని గ్రహించాలి.  ఇది లూసిఫర్‌యొక్క మొట్టమొదటి పతనము.  ఈ విధముగా పడిపోయిన లూసిఫర్‌ తన వెలుగును కోల్పోవటము సాతాను అను నామధేయముతో చీకటిని, వికార రూపమును పొందాడు.  ఇలా దేవునిచేత నేలమట్టము వరకు మాత్రమే నరకబడిన లూసిఫర్‌ను గూర్చి ఎవరెవరు ఏమేమి అనుకొనుచున్నారో మనము ఇప్పుడు తెలుసుకొందము.  

        యెషయా 14:9, ''నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది.  అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది  భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజుల నందరిని  వారి వారి సింహాసనములమీదనుండి లేపుచున్నది.''    ఇందునుబట్టి పాతాళము తనలోకి సాతాను రాక ముందే అతని గూర్చి కలవరపడుచున్నది, ఎందుకంటే శాపగ్రస్థుడైనవారు ఎవరైనా చివరకు పాతాళమునకు చేరవలసినవారే!  కనుక దేవునికన్నా ఎక్కువగా హెచ్చించుకొని పతనము పొందిన సాతాను అను లూసిఫర్‌ ఏనాటికైనా నా సన్నిధికి రావలసినవాడు గనుక, ఈ పాతాళము ఇతని గూర్చి కలవరపడుచున్నట్లు ప్రవక్తయైన యెషయా తెలియజేస్తున్నాడు.  అంతేకాకుండా, ఈ పాతాళము, దానిలోనున్న ప్రేతలను రేపుచు ఉన్నది.  వీరితోబాటుగా సమస్త శూరులను, జనులను, రాజులను కూడా ప్రేరేపిస్తున్నట్లుగా చెప్పబడినవి.  వీరందరు ఈ పతనము పొందిన లూసిఫర్‌ను చూచి - యెషయా 14:10, ''వారందరు నిన్ను చూచి-నీవును మావలె బలహీనుడవైతివా?  నీవును మాబోటి వాడవైతివా?  అందురు.''  

        ఈ విధముగా మొదట పరిశుద్ధుడుగా ఉండి దేవునిలో మహోన్నతమైన స్థానము పొందిన లూసిఫర్‌ పతనము వల్ల, అపరిశుద్ధులుగా పాతాళములో ఉన్నవారియొక్క ఆనందము పై వచనములో మనకు కనబడుచున్నది.  ఇలా నరకబడిన సాతానును దేవుడు తిరిగి తన కార్యక్రమములో విశ్వాసి యొక్క విశ్వాసము పరీక్షించుటకు వాని అధికారము ఉన్నంతవరకు వానిని ఉపయోగిస్తున్నాడు.  అనగా మొదట సాతాను నేలమట్టము వరకే గదా!  అనగా వాని అధికారము ఈ భూమి మీదను పాతాళము మీదను ఉన్నది.  కనుక ఈ పాతాళము ఇంకా కలవరపడుచు తనలో ఉన్న ప్రేతలను రేపుచున్నది.  ఈ ప్రేతలనబడునవి అశుద్ధమైన ఆత్మలుగా గుర్తించాలి.

        తన అధికారము పరలోకములో కోల్పోయినను మృతుల లోకములోని నరకము మరియు భూమిపై యున్నట్లుగా మనము గుర్తించాలి.  అందుకే - లూకా 4:6, ''-ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును;  అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును;''  కనుక సాతాను ఈ నేలపై సంపూర్ణ అధికారమును పొందియున్నాడు.  ఈ అధికారమును సాతాను దేవుని యొద్దనుండి పొందినట్లుగా మనము గుర్తించాలి.  కనుకనే పై వాక్యములో - ఈ రాజ్య అధికారము నాకు అప్పగింపబడి యున్నదని సాతాను యేసుక్రీస్తునకు చెప్పుచున్నాడు.  ఇలా, ఆదికాండములో ఆదామునకు ముందే పతనావస్థతను పొందిన లూసిఫర్‌ సాతానుగా భూమిపై నిలబడి తను పొందిన అధికారమునుబట్టి ఆదామును శోధించాడు.  అతనిని తన పతనములో భాగస్థునిగా చేయగలిగాడు.  ఇలా నేలమట్టము వరకు నరకబడిన లూసిఫర్‌ సాతానుగాను, గర్జించు సింహముగా ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాలను నాశనము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు.  ఈ కార్యక్రమమును సాతాను దేవుని ఆజ్ఞ మేరకే ఆదికాండములో ఆదాము మొదలుకొని యుగాంతము వరకు జరిగించును.  ఈ విధముగా నరులలో ఉన్న దైవభక్తిని, సహనమును వెలికి తీయునని గుర్తించాలి.

        ఇలా పరలోకము నుండి నేలమట్టము వరకు నరకబడిన తేజోనక్షత్రము, వేకువచుక్కా అన్న పేరు గలిగిన సాతాను మరల పతనావస్థను పొందుచున్నట్లుగా గ్రహించాలి.  ఈసారి సాతాను తన్నుతాను దేవునికన్నా ఎక్కువగా హెచ్చించుకొనుటవల్ల కాదుగాని, దేవునితో సమానముగా మనస్సున అనుకొనుట వలన జరిగింది.  యెషయా 14:14, '' మేఘమండలముమీది కెక్కుదును  మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?''  ఈ విధముగా సాతాను మేఘ మండలము పైకి వెళ్ళి మహోన్నతునితో సమానముగా వుండాలని ఈ భూరాజులను ప్రేరేపించి, వారిని తన సైన్యముగా చేసుకొని మహోన్నతునితో సమానముగా ఊహించుకొని యుగాంతములో యుద్ధము జరిగించి పతనమును చవి చూచెను.  ప్రకటన 16:13-15, ''మరియు ఆ ఘటసర్పము నోటనుండియు క్రూరమృగము నోటనుండియు అబద్ధ ప్రవక్త నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని.  అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే;  అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లి, హెబ్రీభాషలో హార్‌ మెగిద్దోనను చోటుకు వారిని పోగుచేసెను.''  ఈ విధముగా చివరి యుద్ధమునకు పోగు చేసిన తన తరపున క్రూరమృగము మరియు అబద్ధ ప్రవక్తల ద్వారా భూరాజులు వారి సేనలతో యుద్ధము చేసి, చివరకు ఓడిపోవును.  ప్రకటన 19:19-21, ''మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.  అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.  కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్నవాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి;  వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.''  ఈ చివరి యుద్ధమునకు ముందు సాతాను యెషయా 14:14లో వలె మహోన్నతుడైన దేవునితో సమానముగా తన్నుతాను చేసుకొని యుద్ధము జరిగించి చివరకు ఓడిపోవుదురు.  ఇలా యుద్ధము జరిగిన తరువాత క్రూరమృగము అబద్ధ ప్రవక్త అగ్ని గంధకములుగల గుండములో ప్రాణముతోనే వేయబడ్డారు.  కాని సాతాను ఏమయ్యాడు?  ఈ విషయములను గూర్చి ఇప్పుడు తెలుసుకొందము.

        యెషయా 14:15, ''నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయ బడితివే.''  ఈ విధముగా పాతాళమను నరకములో ఒక మూలకు త్రోయబడుచున్నాడు.  ఇది ఎప్పుడు జరుగును?  ఈ ప్రపంచము అంతము అయిన వెంటనే జరుగును.  దీనికి ముందు సాతాను తన అనుచరులైన క్రూరమృగము, అబద్ధ ప్రవక్త, భూరాజులు, వారి సేనలతో కలిసి యుద్ధము జరిగించి ఓడిపోవును.  అప్పుడు సాతాను నరకములో ఒక మూలకు త్రోసివేయబడును.  ఇదే సంగతిని ప్రకటనలో కూడా యోహాను తెలియజేసాడు.  ప్రకటన 20:1-3, ''మరియు పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధముయొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని.  అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను;  అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెను.''  ఈ విధముగా 1000 సంవత్సరములపాటు పాతాళము అను అగాధములో, నరకములో ఒక మూల పెద్ద సంకెళ్లతో బంధింపబడి మూలకు త్రోయబడెను.  ఈ స్థితిలో సాతాను ఎలా వున్నాడో ఇప్పుడు తెలుసుకొందము.  యెషయా 14:11, ''నీ క్రింద పురుగులు వ్యాపించును  కీటకములు నిన్ను కప్పును.''  ఈ పురుగులు కీటకములు కూడా ఆత్మలే అయితే అశుద్ధమైనవి, అపవిత్రమైనవియునై యుండి, సమస్త చెడుకు మూలకారణమైనవే.  ఇవి సాతాను ఈ స్థితికి ముందు అనేక రకములైన జబ్బుల రూపములో నరులను బాధించినవే.  ఇవి కూడా సాతానుతోబాటుగా నరకములో మూలకు త్రోయబడినవి.  అవి సాతాను బంధింపబడి యున్నందున వానిని క్రింద మరియు వాని కప్పియున్నట్లుగా చెప్పబడినది.

        ఈ స్థితిలో ఈ సాతానును గూర్చి పాతాళ లోకములో వున్నవారు ఏమనుచున్నారో తెలుసుకొందము.  యెషయా 14:16-17, ''నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు  

        - భూమిని కంపింపజేసి రాజ్యములను వణకించినవాడు ఇతడేనా?  

        లోకమును అడవిగాచేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా?  

        తాను చెరపట్టినవారిని తమ నివాసస్థలమునకు పోనియ్యనివాడు ఇతడేనా?''

        ఇందులో, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు,'' అనుటలో ఒకప్పుడు సాతాను ఉన్నది వేరు.  ఇప్పుడు నరకములో ఒక మూలకు త్రోయబడి పెద్ద సంకెళ్లతో బంధింపబడి కీటకము అతనిని కప్పి, పురుగులు అతని క్రింద ఉండగా చూస్తున్నారు.  కనుక వారు నిదానించి చూచుచూ ఉన్నట్లుగా చెప్పబడినది.  అంటే సాతానును వారు నిదానించి అనగా పదేపదే చూచి, సాతానును గుర్తించుచున్నారు.

        ఇలా గుర్తించిన వారు - ''భూమిని కంపింపజేసి రాజ్యములను వణకించినవాడు ఇతడేనా?'' అని అనుటలో సాతాను లూకా 4:6లో వలె ఈ భూమిపై అధికారి కనుక తన ఇష్టము వచ్చినట్లుగా ఒక రాజ్యము పైకి ఒక రాజ్యమును రేపుచు రాజ్యాలనే వణకించినట్లుగా చెప్పబడినది.  ఈ విధముగా చేయుట ద్వారా ఈ భూమి రక్తసిక్తమై కంపించినట్లుగా మనము గ్రహించాలి.  

        ఇంకా వారు - ''లోకమును అడవిగాచేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా?'' అని అనుటలో పై విధముగా భూమిని కంపింపజేసి రాజ్యము మీద రాజ్యమును లేపి, ఒకరినొకరు నరుకుకొన్నట్లుగా చేసి, ఈ లోకాన్ని అడవిగా మార్చినట్లు గుర్తించాలి.  ఇలా చేయుట ద్వారా పట్టణములు పాడైపోతున్నాయి.  ఈనాడు ఐక్యరాజ్య సమితిని నరులు ఏర్పరచుకొని సాధ్యమైనంతవరకు యుద్ధములు లేకుండా చేస్తున్నారు.  కాని ఇది ఎంతో కాలము నిలువదు.  కొంతకాలానికి తిరిగి సాతాను రాజ్యము మీదికి రాజ్యాన్ని లేపి, ఈ రాజ్యాలనన్నిటిని కంపింపజేయును.  చివరగా వీరినందరిని ప్రోగుచేసి, రాజాధిరాజైన క్రీస్తు ప్రభువుపై యుద్ధము చేసి, పాతాళమను నరకములో ఒక మూలకు త్రోయబడునని గుర్తించాలి.  

        ఇంకా, ''తాను చెరపట్టినవారిని తమ నివాసస్థలమునకు పోనియ్యనివాడు ఇతడేనా?'' అని అనుచున్నారు.  ఇంతకి సాతాను చెర పట్టినది ఎవరిని?  నరులమైన మనలనే కదా!  మనయొక్క ఆశలను బట్టి, కోరికలను బట్టి, మనకు వాటినే ఎరగా వేసి మనలను చెర పట్టుచున్నాడు.  ఇలా చెరపట్టిన వారిని దైవ వ్యతిరేకులుగా చేసి, వారిచే దైవ వ్యతిరేక కార్యములైన విగ్రహారాధన, దొంగతనము, మాంత్రిక విద్యలు, వ్యభిచారము, లోభత్వము వగైరాలతో పిరికివారుగా చేసి, అనేకులను చెడగొట్టును.  ఇలా చెడగొట్టిన వారిని సాతాను చెరపట్టి వారిని, వారి నివాస స్థలములకు వెళ్ళనీయకుండా చేస్తున్నాడు.  ఒకసారి సాతాను చెరలోకి వెళ్ళినవారు, వారు తిరిగి వచ్చుట చాలా కష్టమైన పనియే అని ఇందునుబట్టి మనము గ్రహించాలి.

        ఇందులో మన నివాసాలకు సాతాను పోనియ్యుట లేదని చెప్పబడినది.  అయితే మన నివాసాలు ఏవి?  అవి ఎక్కడ ఉన్నవి?  వీటిని గూర్చి మనము తెలుసుకొనవలసి యున్నది.  క్రీస్తు ప్రభువు తన బోధలో ఈ విషయమును గూర్చి చెప్పి యున్నారు.  యోహాను 14:2, ''నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.''  ఇవే మనయొక్క నివాస స్థలములు.  వీటిలోనికి మనము వెళ్ళకుండా సాతాను చెరపట్టి మనలను పోనియ్యకుండా చేయు చున్నాడు.  ఎవరైతే సాతానును జయించి ఈ లోకము, దాని ఆశలను జయించునో వారు ఈ చెర నుండి విడుదల పొంది, క్రీస్తు ప్రభువు మనకు చెప్పిన నివాస స్థలములకు వెళ్ళగలరు.

        అయితే, ఈ చెరపట్టిన వారిని, సాతాను వారి నివాస స్థలములకు పోనియ్యడు.  ఇది బాగానే వుంది.  మరి వారిని ఎక్కడికి వారి మరణానంతరము తీసుకొని వెళ్ళును?  ఈ విషయము మనము తెలుసుకోవాలి.  తనకు సిద్ధపరచబడిన ప్రాంతమైన పాతాళమునకు అని గ్రహించాలి.  ఇది గ్రహించి, సాతానును జయించి పరలోక రాజ్యములో క్రీస్తు ప్రభువు సిద్ధపరచిన నివాసాలలో జీవించు యోగ్యతను పొందుదుము గాక!

        ఇక యెషయా 14:15లో చెప్పిన విధముగా సాతాను పాతాళమునకు నరకములో ఒక మూల త్రోయబడి యున్నాడు.  ఇలా ఎన్ని సంవత్సరములు ఉండును?  1000 సంవత్సరములు మాత్రమే.  ప్రకటన 20:7, ''వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపించబడును.''  ఈ వెయ్యి సంవత్సరములు క్రీస్తు ప్రభువు పరిశుద్ధులతో రాజ్యము చేయునని మనకందరికి తెలిసిన విషయమే.  ప్రకటన 20:6, ''ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు.  ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు;  వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.''  ఈ వెయ్యి సంవత్సరముల కాలము కడమ మృతులు అనగా పాపము చేసినవారు సాతాను వలె జీవముతో నరకములో బంధింపబడినవారై విడుదల లేక వేదన నొందుదురు.  అనగా వారిని ఒకప్పుడు సాతాను వారికి దురాశలను చూపి, తన చెరలో వేసుకొన్నాడు.  కనుక వారికి సాతానుతోబాటుగా శిక్ష ఇక్కడ లభిస్తున్నట్లుగా గ్రహించాలి.  ఈ వెయ్యి సంవత్సర కాలము పరిశుద్ధులు, వారు సాతానును జయించిన వారు కనుక మొదటి పునరుత్థానములో జీవము పొంది, క్రీస్తుతో కూడా రాజ్యము చేయుదురని ప్రకటన 20:4-6లో చెప్పబడినది.  వీరు రాజ్యము చేయునది భూమి మీదనే.  ప్రకటన 20:9, ''వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల  శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను.''  కనుక పరిశుద్ధులు పరిశుద్ధ శిబిరములు వేసుకొని ప్రియమైన పట్టణములో ఉందురు.  అటు తరువాత అనగా వెయ్యి సంవత్సరముల తరువాత సాతాను విడుదల పొంది, ఈ నరకములో శిక్షను పొందుచున్న జనులను తీసుకొని ప్రకటన 20:8-9, ''భూమి నలుదిశలయందుండు జనములను, లెక్కకుసముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును.  వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల  శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను.''  

        అటుతరువాత సాతాను మరల అగ్ని గంధకములు గల గుండములో వేయబడెను.  ప్రకటన 20:10, ''వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను.  అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు;  వారు యుగయుగములు రాత్రిం బగళ్లు బాధింపబడుదురు.''  ఇంతటితో ఈ సాతాను చరిత్ర సమాప్తమైనట్లేనా?  

        ఇందులో సాతాను ఆత్మ చనిపోవును అని చెప్పుట లేదు.  ఈ అగ్నిగుండములో సాతానును అనుసరించిన ప్రతి ఒక్కరు సాతానుతోబాటుగా పాలిపంపులు పొందుదురు.  ఇందునుబట్టి వారి పరిస్థితి యెషయా ప్రవచనము చెప్పిన విధముగా ఉండునని గ్రహించాలి.  యెషయా 66:24, ''వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు.''  అనగా ఆత్మ నశించదు.

        అయితే దేవుని ఆజ్ఞ ప్రకారముగానే ఏదెనులో ప్రవేశించి ఆదాము హవ్వలను శోధించాడు.  అట్లే యోబును యేసు ప్రభువును శోధించాడు.  లూకా 22:31 యేసు శిష్యులను జల్లెడ వలె పట్టి శోధించుటకు అనుమతి పొందినాడు.  యేసు తనను పట్టించువానిని చూపుటకు ఆయన మాట ప్రకారముగా యూదాలో ప్రవేశించాడు.  యోహాను 13:26.  ఇందువలన ఇతను పాతాళములో శిక్ష అనుభవించాల్సిన దుస్థితి ఎందుకు కలిగింది?

        దేవుడు ఆదేశించిన ప్రకారముగా శోధన కార్యము జరిగించక అత్యధికముగా విజృంభించి దురాగతాలు చేసినందునను, మితిమీరి గర్జించు సింహము వలె క్రూరమృగ లక్షణాలతోను అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త వేషధారణ లక్షణాలతో దేవుని ఆలయములోనే కూర్చుండును గనుక ఇతనికి శిక్ష విధింపక తప్పదు.  2వ థెస్సలొనీక 2:4  ఇదే మాట యెషయా 14:13-14.

12.  సర్పబీజమునుండి మిడునాగు పుట్టును  

దాని ఫలము ఎగురు సర్పము

        యెషయా 14:29, ''సర్పబీజమునుండి మిడునాగు పుట్టును  దాని ఫలము ఎగురు సర్పము.''

        ప్రియపాఠకులారా!  దైవసృష్టిలో ప్రతి జీవికి బీజమున్నది.  బీజమన్నది లేకపోతే జీవికి జన్మలేదు.  ఆదిలో దేవుడు సృష్టించిన ఈ అనంత విశ్వమునకు ఇందులోని స్పష్టములకు ఆయన వాక్కే బీజము.  ఈ సందర్భములో ఆది 1:లో ఆయన తన వాక్కు ద్వారా ఈ సృష్టి నిర్మాణము చేసినట్లుగా వివరించబడి యున్నది.  యోహాను 1:2, ''సమస్తమును ఆయన మూలముగా కలిగెను,'' అని వ్రాయబడి యున్నది.  కనుక సృష్టి యావత్తునకు దేవుని వాక్యమే బీజము.

        అయితే పై మూలవాక్యములో - ''సర్పబీజము'' అనుటలో ఉన్న పరమార్థమును మనము తెలిసికోవలసి యున్నది.  ఆదికాండము 3:1లో వలె సర్పము తనయొక్క యుక్తితో కూడిన విషతుల్య మాటలు మరియు సృష్టికర్తను అబద్ధికునిగా చేసిన మాటలు - స్త్రీ గర్భములో సర్పముయొక్క ప్రతిరూపమునకు బీజము వేసింది.  ఈ బీజముయ్కొ తొలి పంటయే పాపము.  ఈ పాపమే మిడునాగు అను కయీనుయొక్క పుట్టుక.  ఇందునుబట్టి దేవునియొక్క తొలి ఆత్మ బీజము ఆదాము.  అలాగే పాపముయొక్క తొలి బీజము కయీను.  ఆదికాండము 1:4లో వలె కయీను అను ఇతడు సర్పబీజము నుండి పుట్టిన మిడునాగు - మిడిసిపడినవాడు.  ఇతనిలోని కోపము, పగ, ద్వేషము అను సర్ప గుణములు గల మిడునాగు, ఇతని ద్వారా గర్భఫలములగు ఎగురు సర్పముల విషయము కూడా తెలిసికొందము.

        ఆదికాండము 6:1-2 ఈ సందర్భములో మనము చదివితే, ''నరులు భూమిమీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.''  ప్రియపాఠకులారా!  ఈ వేదభాగములో నరుల కుమార్తెలు వీరెవరు?  దేవుని కుమారులు వీరెవరు?  అనిన విషయాన్ని మనము తెలిసికోవలసి యున్నది.  ఇందులో మొట్టమొదటగా నరులు భూమి మీద విస్తరింపనారంభించినారు.  భూమి మీద జనాభా విస్తరించిన కాలములో నరుల కుమార్తెలు అనగా మిడునాగు అను కయీనుయొక్క సంతానము.

        మిడునాగుకు ఉన్న అందము, మిడునాగుకున్న ఆకర్షణ దాని రంగు, దానియొక్క చలాకీతనము, దాని యుక్తి, దాని కుయుక్తి సర్పజాతిలో దేనికి ఉండదు.  మిడునాగునకు పడగ ఉన్నది.  పడగను విప్పి నాట్యము చేయగలదు.  పడగను విప్పి శత్రువుల ఉనికిని పసిగట్టగలదు.  తన పడగ ద్వారా లోకాన్ని ఆకర్షించి, నరుల చేత ఆరాధించబడుచున్నదంటే, దానిలోని ఆకర్షణ ఎంత ప్రభావితమైనదో, శక్తివంతమైనదో ఒకసారి మనము గ్రహించాలి.

        అలాగే మిడునాగు వంటి కయీను సంతానము నరుల కుమార్తెలు ఇంకను నాగకన్యలు అని చెప్పవచ్చును.  ఈ నాగకన్యలయొక్క ఆకర్షణకు అందచందాల అవయవ సౌష్టవము, రంగు లావణ్యములకు దేవుని కుమారులు అనగా ఆదాము సంతానమైన పురుష సంతానమును ఆకర్షించినది.  వీరు దేవుని కుమారులు.  ఈ మిడునాగు సంతానమైన సర్ప కన్యలను మోహించి, వారి వారి మనస్సుకు నచ్చిన రీతిగా పెళ్ళి చేసుకొన్నట్లుగ వ్రాయబడి యున్నది.  వీరి ద్వారా సంభవించిన అనగా వీరిలో నుండి పుట్టిన పాపము బహుగా విస్తరించి విహరించినట్లుగా భూమియొక్క నలుదిశలలోను దైవత్వము కంటెను సర్ప ప్రభావము ప్రజ్వరిల్లి గర్వాంధకారముతో భూమిమీద రెక్కలు కట్టుకొని విహరించినది.  అట్టి వాతావరణమును తిలకించిన దేవుడు సంతాప హృదయుడై నరుని పుట్టించినందుకు నొచ్చుకొన్నట్లుగా వేదములో వ్రాయబడి యున్నది.  తాను సృష్టించిన భూజంతువైన సర్పముయొక్క ప్రభావము, తన హస్త నిర్మితుడును, తన ఆత్మ భాగస్థుడైన నరునియొక్క ఆత్మీయ జీవితాన్ని భంగపరచినందుకు నరునియొక్క పతనావస్థకు ఉగ్రుడై, తాను సృష్టించిన నరులను రెక్కలు గట్టుకొని విహరిస్తున్న ఎగురు సర్ప సంతానాలను సమూలముగా జలప్రళయము ద్వారా లయపరచినాడు.

        ఆ విధముగా జలప్రళయము తర్వాత కూడా దేవుడు సృష్టించిన పున:సృష్టిలో కూడా ఈ సర్పబీజము లోకములో నశించలేదు.  అందుకే నూతన నిబంధన కాలములో లూకా 3:7లో బాప్తిస్మమిచ్చు యోహాను తన వద్దకు బాప్తిస్మము పొందుటకు వచ్చుచున్న స్వార్థపరులు సర్ప గుణాతిశయములు గల కపట జనాంగమునుద్ధేశించి - ''సర్ప సంతానమా?'' అని ప్రవచించినట్లుగా వ్రాయబడియున్నది.  అలాగే మత్తయి 23:33లో యేసుక్రీస్తు నరులను - ''సర్పములారా, సర్పసంతానమా,'' అని ప్రవచించినట్లు చదువ గలము.  ఇది నూతన నిబంధన కాలము నాటి ఎగిరే సర్పాలయొక్క వివరము.

        ఇక నేడు ప్రభువు రాకడకు నిరీక్షణలో ఉన్నట్టి లోకస్థులైన మనము జీవిస్తున్న ఈ కాలములో మిడునాగు ఫలము అగు ఎగురు సర్పము నరులను సర్ప జ్ఞానముతో నడిపిస్తూ బ్రేక్‌ డాన్సులని, డిస్కో డాన్సులని, భరతనాట్యము అని, వగైరా పేర్లతో చిందులు వేయిస్తూ నరులను ఎగిరిస్తున్నది ఈ ఎగురు సర్పము.  అంతేగాక ఈ సర్పము నరులను విమానాలు, హెలికాప్టర్లు, వగైరా రూపములతో ఎగిరిస్తూ, వాటి ద్వారా బాంబులు, రాకెట్లు వగైరా మారణాయుధాలతో లోక నాశనాన్ని జరిగిస్తున్నది.  పాతకాలములోని లేక ఆదికాండము 6వ అధ్యాయములో ఎగిరిన నర సర్పాలను దేవుడు జళప్రళయముతో ముంచేశాడు.  అయితే ఈనాడు ఎగురు సర్పాలను ప్రభువు అగ్నితో దహిస్తాడని ప్రకటన 20:10లో వివరించబడినది.  ఆదిసర్పమునకు కలుగు శిక్ష మనకు ఈ విషయములను వివరిస్తున్నది.

        కనుక సర్ప సంబంధులుగా జీవించిన మనలను తన స్వరక్తము ద్వారా సమస్త దోషములను కడిగి, పవిత్రులనుగా జేసి దేవుని కుమారులుగా పావురముల వంటి పరిశుద్ధ జీవితాన్ని మనకు ప్రసాదించి పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ సావాసము, పరిశుద్ధ ఆలయము మనకు అనుగ్రహించి పరిశుద్ధులుగా జీవించమంటున్నాడు.  కనుక పరమగీతము 2:12లో వలె నేడు అనేక ఆత్మలు ప్రభువులో వికసించి యున్నవి.  ప్రతి క్రైస్తవ సంఘము లోకములో ప్రభువును స్తుతిస్తున్నది.  ప్రతి మందిరములోను పరిశుద్ధాత్మ స్వరము సువార్త రూపములో ప్రకటించబడుచున్నది.

        కనుక ప్రియపాఠకులారా!  మత్తయి 10:16లో వలె మనము పాముల వంటి వివేకము, పావురముల వంటి నిష్కపట జీవితములో ఈ లోకములో జీవించాలని ప్రభువు హెచ్చరిస్తున్నాడు.  ఈయొక్క సాహిత్యాన్ని చదువుచున్న ప్రియపాఠకులారా, నీవు ఏ స్థితిలో ఉన్నావు?  ఎగిరే సర్ప జీవితములో ఉన్నావా?  లేక పరిశుద్ధాత్మ పావురము వలె పవిత్ర జీవితములో ఉన్నావా?  ప్రభువు రాకడ సమీపమై యున్నది.  ఆయన రాకడలో ఎగిరే సర్పాలను ఆయన అగ్నిలో పడవేయును.  పరిశుద్ధమైన పావుర స్థితిలో ఉన్న మనలను తన రెక్కల క్రింద చేర్చుకొంటాడు.  కనుక నిరీక్షణ గల్గి ఆయన రాకడ కొరకు కనిపెట్టి ఆయనలో జీవించుటకు ఎల్లవేళల మనము ప్రార్థన మెలకువతో ఉందుముగాక!

13.  బబులోను కూలెను కూలెను

        యెషయా 21:8-10, ''సింహము గర్జించునట్టు కేకలు వేసి -నా యేలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజుమీద నిలుచుచున్నాను  రాత్రి అంతయు కావలి కాయుచున్నాను  ఇదిగో జతజతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అనిచెప్పెను.  బబులోను కూలెను కూలెను  దాని దేవతల విగ్రహములన్నిటిని ఆయన నేలను పడవేసియున్నాడు  మ్కుముక్కలుగా విరుగగొట్టియున్నాడు అని చెప్పుచు వచ్చెను.  నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్లములో నూర్చబడినవాడా, ఇశ్రాయేలు దేవుడను సైన్యములకధిపతియునగు యెహోవావలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పి యున్నాను.''

        ప్రియపాఠకులారా!  ఈ వచనములో ఒక కావలివాడు, ''బబులోను కూలెను కూలెను,'' అని చెప్పుచున్నట్లుగా తెలియజేయబడినది.  ఇంతకి ఈ బబులోను ఎవరు?  ప్రకటన 17:1-5, ''ఆ యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడువచ్చి నాతో మాటలాడుచు ఈలాగు చెప్పెను.  -నీవిక్కడికి రమ్ము, విస్తార జలములమీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను;  భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి.  అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవదూషణ నామములతో నిండుకొని, యేడు తలలును పది కొమ్ములునుగల ఎఱ్ఱని మృగముమీద కూర్చుండిన యొక స్త్రీని చూచితిని.  ఆ స్త్రీ ధూమ్రరక్తవర్ణముగల వస్త్రము ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై, ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచారసంబంధమైన అపవిత్రకార్యములతోను నిండిన యొక సువర్ణ పాత్రను తనచేత పట్టుకొనియుండెను.  దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడి యుండెను -మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహా బబులోను.''  ఇందునుబట్టి ప్రతివిధమైన దైవకార్యము చేయువారు ఈ బబులోను సంబంధులే.  చెడు కార్యములు చేయువారు మహా వేశ్యకు చెందినవారే.  వీరు ఆదికాండము మొదలుకొని యుగాంతము వరకు ఉందురు.  అయితే దేవునికిని మరియు క్రీస్తు ప్రభువుకును యోగ్యమైన రీతిలో జీవించినవారు పరమ యెరూషలేముగాను, వధువు సంఘముగాను మారుదురు.

        అయితే ఇటువంటి బబులోనుయొక్క పతనమును గూర్చి కావలివాడు తెలియజేయుచున్నాడు.  -''బబులోను కూలెను కూలెను.''  ఇది ఎప్పుడు జరగనున్నది?  యుగాంతములో ఇది జరుగును.  ఇదే విషయమును యోహాను తన దర్శనములో చూచి వ్రాసెను.  ప్రకటన 14:8, ''వేరొక దూత, అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి-మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన యీ మహా బబులోను కూలిపోయెను కూలిపోయెను అని చెప్పెను.''  ఇందులో ఇంకొంత స్పష్టత కనిపించుచున్నది.  ఈ విషయమును చెప్పుచున్న కావలివాడు దూత అని తెలుపబడినది.  కనుక నిరంతరము బురుజు మీద నిలుచుని కావలి కాస్తున్న ఈ దూత బబులోను పతనమును గూర్చి తెలుపుచున్నాడు.  ఇంతకి ఈ పతనము ఎవరి వల్ల జరిగినది?  ''ఇదిగో జతజతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అనిచెప్పెను.''  వీరు ఎవరు?  ప్రకటన 17:16, ''నీవు ఆ పది కొమ్ములుగల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు.''  కనుక ఈ బబులోను దాని దేవతల విగ్రహములన్నిటిని పడగొట్టినవారు మృగము, అతని అనుచరులని గ్రహించాలి.  అందుకే మన మూలవచనములో దూత కావలివాడుగా ఉండి, బబులోనును ముక్కముక్కలుగా విరగగొట్ట బడుచున్నదని చెప్పుచున్నాడు.

        దీనికి ముందుగా బబులోను పతనమును గూర్చి ఎవరు ఈ దూతకు తెలియజేసారు?  ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా వలన అని యెషయా 21:10లో చెప్పబడినది.  కనుక ఈ దూత యెహోవా దేవుని దగ్గర నుంచి ఈ వార్తను తెలుసుకొన్నాడు.  అదే సంగతిని ఎవరికి తెలియజేయుచున్నాడు?  యెషయా 21:10, ''నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్లములో నూర్చబడినవాడా,'' అని తెలియజేయుచున్నాడు.  నూర్చిన ధాన్యము శ్రేష్ఠమైనది.  కనుక పరిశుద్ధులకు ఈ విషయమును తెలియజేయుచున్నట్లుగా మనము గ్రహించాలి.  ఈ వచనములో, ''నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్లములో నూర్చబడినవాడా,'' అనుటలో వీరిని శ్రేష్ఠమైన ధాన్యముగా నూర్చినవారు ఎవరు?  మన మూల వచనమును బట్టి యెహోవా దేవుడు కాదు.  అనగా వీరు పరిశోధనలో వచ్చినవారు కారు.  కనుక శోధనను జయించినవారని గుర్తించాలి.  సాతాను మనలను శోధించుట ద్వారా మనకు దేవుని యందు భక్తిని, ఓర్పును కనబడును.  అనగా సాతాను దైవాజ్ఞ మేరకు మనలను శోధించి మనలను కళ్లములో వేసి నూర్చి మేలైన అనగా విశ్వాసము, ఓర్పు గలిగిన పరిశుద్ధులను వెలికి తీయును.  వారికి ఈ పతనమును గూర్చి తెలియజేస్తున్నాడు.  అనగా ప్రకటన 14:8లోను, యెషయా 21:8-10లో కావలివాడుగా చెప్పబడినవాడు సాతానే!  ఇంతకి కావలివాడుగా చెప్పబడిన ఈ దూతయైన సాతాను కావలి బురుజు మీద నిలుచుకొని ఎవరిని కాయు చున్నాడు?  బబులోను పట్టణమునే కదా!  కనుక సాతాను బబులోను పట్టణము బురుజు మీద నిలుచుని రాత్రి పగలనక కాచుచున్నను, ఆ పట్టణము కూలెను కూలెను అను వార్త ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వలన సాతాను విని పరిశుద్ధులకు తెలియజేయు చున్నాడు.  సాతాను కూడా ఒక దేవుని దూతయే కదా!  కాని అతడు తనను తాను హెచ్చించుకొని పతనమును చవి చూచాడు.  అయిన అతనిని దేవుడు తన కార్యములలో వినియోగించున్నట్లుగా మనము గ్రహించాలి.

14.  కావలివాడా, రాత్రి యెంత వేళైనది?

        యెషయా 21:11, ''కావలివాడా, రాత్రి యెంత వేళైనది?  

                         కావలివాడా, రాత్రి యెంత వేళైనది?''

        ఆదికాండము 2:15, ''మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను.''  ఆదాము ఏదెనుకు కాపరి.  ఈ కావలి  వాడెటువంటివాడు?  అంటే ఇతను శాకాహారుడు, దైవాత్మ పూర్ణుడు, నిర్విచారుడు, దైవత్వముతో సంభాషించువాడు.  దైవసృష్టికి పేర్లు పెట్టినవాడు, నిరాడంబరుడు.  అయినను కావలి కాయలేకపోయాడు.

        పరమగీతము 1:6, ''నల్లనిదాననని నన్ను చిన్న చూపులు చూడకుడి.  నేను ఎండ తగిలినదానను  నా సహోదరులు నామీద కోపించి  నన్ను ద్రాక్షతోటకు కావలికత్తెగా నుంచిరి  అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని.''  కనుక ఈ శూలమతి తోటకు కావలి.  ఈమె తన ప్రియుని కోసము కావలి కాసింది.  శూలమతి సంఘమను స్త్రీ.  పరమగీతము 3:3, ''పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు పడగా  మీరు నా ప్రాణప్రియుని చూచితిరా?  అని నేనడిగితిని.''  కావలివారి ద్వారా తన ప్రియుని సువార్తను గూర్చి అడిగింది.  అయితే కావలియైన కాపరులు సంఘము అను స్త్రీని బాధించి, వేధించి మనోగాయపరచి సంఘ ఈవులను దోచుకున్నారు.  అట్టి సమయములో-యెషయా 21:6, ''-నీవు వెళ్లి కావలివాని నియమింపుము  అతడు తనకు కనబడుదానిని తెలియజేయవలెను.''  ఇట్లు దేవుడు కావలి వానిని నియమింపగా యెషయా 21:8, ''సింహము గర్జించునట్టు కేకలు వేసి -నా యేలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజుమీద నిలుచుచున్నాను  రాత్రి అంతయు కావలి కాయుచున్నాను.''  ఇట్లు కావలివాడు మేల్కొని రాత్రియు పగలని ఎంచక, కాపుకాచి శత్రువుల రాకని దృష్టించినట్లు తెలియుచున్నది.  కనుక ఇట్టి కావలి వానిని గూర్చి దైవోక్తి యెషయా 52:8లో వలె కావలివారు గాన ప్రతిగానములు చేయుచూ సంఘముగా కూడి సీయోను దర్శనము పొందినారు.

        యిర్మీయా 6:17, ''మిమ్మును కాపుకాయుటకు నేను కావలివారిని ఉంచి యున్నాను;  ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది.''  మిమ్ములను కాయుటకు ఆయనే కాపరులను ఏర్పరచి యున్నారు.  ఇట్టి సందర్భములో యిర్మీయా 31:6, ''ఎఫ్రాయిము పర్వతములమీద కావలివారు కేకవేసి-సీయోనునకు మన దేవుడైన యెహోవాయొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను.''  సీయోను అను దైవరాజ్యములో ప్రవేశింప జేయు కాపరులు సత్య సువార్తను స్వార్థము కుత్సితముతోగాక, సత్యముతోను, నిస్వార్థముతోను ప్రకటిస్తూ సంఘాభివృద్ధికి పాటుబడు కాపరులు నేటి మన విశ్వాస జీవితమునకవసరమని - యెహెజ్కేలు 3:17, ''నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించియున్నాను, కాబట్టి నీవు నా నోటిమాట ఆలకించి నేను చెప్పినదానినిబట్టి వారిని హెచ్చరిక చేయుము.''  ఇందులో విధముగా దైవాత్మ మనలను హెచ్చరిస్తున్నది.  కనుక అపొస్తలుల కార్యములు 20:7, ''ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను.''  ఆ విధముగా నేటి కాపరుల జీవితాలు సంఘ పెద్దల నిర్వహణ కార్యములు బహు బాధ్యతతో కూడియున్నట్లు ప్రభువు మనలను అడుగుచున్నాడు, ''కావలివాడా, రాత్రి యెంత వేళైనది?''

        ఆదాము తన కాపుదలను నిల్పుకోలేకపోయాడు.  మోషే తన కాపరితనమును సార్థకము చేసికొన్నాడు.  శూలమతి ద్రాక్షతోట కాపరత్వమును నిల్పుకొని తన ప్రియునిలో ఐక్యమైనది.  అదేవిధముగా యేసు యోహాను 10:11లో వలె తనను కాపరిగా తెల్పుకొని, తన కాపరి స్థానాన్ని స్థారకము చేసుకొన్నాడు.  అటు తర్వాత అపొస్తలులను దేవుడు సంఘ కాపరులుగా జేసినట్లును, ఆ విధముగా పోషింపబడిన సంఘమునకు నేడు మనలను కాపరులుగా దేవుడు నియమించియున్నట్లు మనలను అడుగుచున్నాడు.  కావలివాడా, రాత్రి యెంత వేళైనది?

15.  తీవ్రసర్పమైన మకరము - వంకరసర్పమైన మకరము

సముద్రముమీదనున్న మకరము

        యెషయా 27:1, ''ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును  తీవ్రసర్పమైన మకరమును వంకరసర్పమైన మకరమును ఆయన దండించును  సముద్రముమీదనున్న మకరమును సంహరించును.''

        ప్రియపాఠకులారా!  పై వాక్యములో - ''యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును,'' అని వ్రాయబడి ఉన్నది;  ఈ ఖడ్గమేమిటి?  అనిన విషయమును గూర్చి మనము తెలిసికోవలసి యున్నది.  ఈ సందర్భములో హెబ్రీ 4:12, ''ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.''  ఇది యెహోవా ఖడ్గమును గూర్చి వివరము.  అంటె యెహోవాయొక్క మాటే ఖడ్గము.  జాస్తి మాట్లాడితే యెహోవాయే ఖడ్గము.  ఈ సందర్భములో యోహాను 1:1, ''ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.''  ఆ వాక్యము ద్వారానే సర్వమును సృష్టింపబడినవి అని యోహాను 1:2-3లో వ్రాయబడి యున్నది.  సృష్టి నిర్మాణ క్రియ జరుగు సందర్భములో పంచభూతాలు, పర్వత శ్రేణులు, నానావిధ వృక్షములు, మృగ, పక్షి సముదాయములు ఒకటేమిటి సర్వమును సృష్టించింది దేవుని వాక్కే.  అందుకే యోహాను 1:2-3, ''సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.'' అని వ్రాయబడి యున్నది.  గనుక దేవునియొక్క వాక్య ఖడ్గము సృష్టించగలదు, పుట్టించగలదు, పోషించగలదు, గిట్టింపగలదు అని మనము రూఢిగా తెలుసుకోవాలి.  ఇప్పుడు మరల మనము మూల వాక్యాన్ని ధ్యానిస్తాము.  యెషయా 27:1లో మొట్టమొదటగ ఆ దినమున అనగా ఈ యుగాంతములో భూమిని లయపరచి అంతము చేయు దినమున తన కుమారుడు, మన రక్షకుడైన యేసుప్రభువు రెండవ రాకడ దినమున లోక నరునియొక్క అవిధేయత, దైవవ్యతిరేకత, హేతువాద నాస్తిక, ఆత్మాంధకార అజ్ఞానముతో కూడిన నేటి యుగములో యెహోవా ఏర్పరచిన ఆ దినమున యేసుప్రభువు తన దూతలతో మధ్యాకాశము మీదకు యేతెంచు ఆ దినమున జరిగేదేమిటి?  అనిన దానిని గూర్చి మనమిప్పుడు తెలుసుకొందము.  ఆ దినమున యెహోవాయొక్క వాక్య ఖడ్గము ''యేసు'' అను నామధేయముతో జరిగించబోవు సర్ప సంహారక క్రియను గూర్చి సర్పమునకు విధించు శిక్షను గూర్చి తెలిసికొందము.

        దేవునికి త్రిత్వమున్నట్లే సర్పానికి కూడా త్రిత్వమున్నది.  ఇందులో మొదటిది తీవ్ర సర్పము.  దీనికి బిరుదు మకరము.  ఈ తీవ్రసర్పమే ఆదిలో ఏదెనులో దేవుని వనములో ఆత్మ వికాసముతో, ఆత్మీయ స్థితిలో, ఆహ్లాదకర వాతావరణములో, ఆత్మీయ తన్మయత్వములో, దైవసన్నిధిలో, పరిశుద్ధ వనములో అమాయకులై, నిష్కపటులై జీవిస్తున్న నరజంట పట్ల ఓర్వలేనిదై, వారి జీవితాన్ని గూర్చి అసూయపడి, తీవ్రముగా ఆలోచించి, తీవ్రమైనటువంటి మాటలతో, తీవ్రమైన స్వభావముతో, మృదుమధురమైన కమ్మని కంఠారావముతో బహు నయగారముగా నరులను తినవద్దని నిషేధించిన ఫలమును గూర్చి అభివర్ణించి, పురుషుడు లేనటువంటి ఏకాంత సమయములో స్త్రీని ప్రేరేపించి, ఆమె చేత దేవుడు నిషేధించిన ఫలమును తినిపించినది.  నరులకును, దేవునికిని వైరము కల్పించన సర్పమే తీవ్రసర్పము.  అంతేగాకుండా తీవ్రసర్పమైన మకరమునకు కాళ్ళు, రెక్కలు వున్నవి.  ఒక చెట్టు నుండి మరియొక చెట్టు మీదకు నెమలి వలె ఎగురుచూ యుక్తితో సంచరించే సర్ప మకరము.

        ఇది తీవ్రసర్ప మకరముయొక్క పూర్వీక స్థితి మరియు వివరము.  ఇక ఈ వచనములో రెండవ భాగమున వ్రాయబడిన మాట వంకర సర్పమైన మకరము :-  ఇందును గూర్చి పాఠకులైన మీరు ఏనాడైనను ఆలోచించారా?  ఈ వాక్యమును గూర్చి పరిశోధించారా?  ఇందులోని భావాన్ని ఆత్మీయ దృక్పథముతో దృష్టించారా?  మరేవిధముగా అర్థము చేసికొన్నారు?  ఇది బహు గొప్ప మర్మముతో కూడిన వాక్య భాగము.  ఇందునుగూర్చి తెలిసికొనుట క్రైస్తవులమైన మనకెంతో ముఖ్యము.  కనుక తీవ్రసర్పమైన మకరమును గూర్చి - ఆదికాండము 3:1లోనే మనము చదువగలము.  ''దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను.''  అనగా ఇది సర్ప మకరము.  దీనికి కాళ్ళు, రెక్కలున్నవి, తోక వున్నది.  ఆకర్షణీయమైన రంగులో మెరయుచూ, తీక్షణమైన వెలుగును స్ఫురింపజేయుటను బట్టి ఇది తీవ్ర సర్పమును, యుక్తిగల సర్పమును, మకరమునై యున్నట్లుగా మనము గ్రహించవలెను.

        తీవ్రసర్పము వంకర సర్ప మకరము అగుటకు కారణమేమి?  ఈ సందర్భములో - ఆదికాండము 3:14, ''అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించ బడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్నియు మన్ను తిందువు.''  దేవునియొక్క ఈ శాపయుతమైన, బలమైన ఖడ్గము అగు వాక్యమును బట్టి తీవ్ర సర్ప మకరమైయున్న ఆ జీవి కాళ్ళు, రెక్కలు, వగైరా అంగములు పోగొట్టుకొని, పొట్టతో ప్రాకుచూ, శాపగ్రస్థమై దైవవాక్కు ఖడ్గ తాకిడికి, శాపగ్రస్థమై అనగా తన అంగములు పోగొట్టుకొని వంకర సర్ప మకరమైనది.  ఆ వంకర సర్పమైన మకరమును ఆయన దండించాడు.  ఎలా?  దేవునియొక్క వాక్కు ఖడ్గము ఆ వంకర సర్పమును దండించింది.  ఆదికాండము 3:15, ''మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను.  అది నిన్ను తలమీద కొట్టును;  నీవు దానిని మడిమెమీద కొట్టుదువని చెప్పెను.''  ఇది తీవ్ర సర్పమైన మకరమును మరియు వంకర సర్పమైన మకరమును దండించి, శిక్షించిన విధానము.

        ఇప్పుడు రెండు సర్ప మకరాలను గూర్చిన పూర్తి చరిత్రను మనము తెలిసి కొన్నాము.  ఇంక మూడవదిగ యెహోవా ఖడ్గము సముద్రముమీదనున్న మకరమును సంహరించును;  ఈ సముద్రముమీదనున్న మకరము ఏది?  అన్నదానిని గూర్చి తెలుసుకొందము.  ఈ సందర్భములో తీవ్రసర్పము యెహోవా ఖడ్గము ద్వారా వంకర సర్పము కాగా, వంకర సర్పము రూపాంతరము పొంది ప్రకటన 17:1లో వలె విస్తార జలములమీద కూర్చున్న అనగా సముద్రపు మీద కూర్చున్న మహావేశ్యగా  రూపాంతరము పొందినట్లు వ్రాయబడి యున్నది.  ఈ రూపాంతరము పొందిన సముద్రము మీదనున్న మృగమే ప్రకటన 20:2లో ఆది సర్పము అనగా అపవాది సాతాను అను ఆ ఘటసర్పము అంటే ఆది సర్ప మకరము, ఘటసర్ప మకరము అను ఆ జీవికి విధించబోవు శిక్ష సముద్రముమీదనున్న మకరమే నేటి యుగాంతములో జనసముద్రము మీద పవళించి, లోకస్థులకు దైవత్వమును గూర్చిన నిగూఢ మర్మాలతో కూడిన జ్ఞానమును, వారికి బయల్పరచకుండ వారిని తన క్రింద త్రొక్కిపెట్టి, దైవదూషకులుగాను, విగ్రహారాధికులు గాను, అవిశ్వాసులుగాను, క్రీస్తు ప్రేమకు దూరమైనవారినిగాను జేసి ఇప్పుడు క్రియ జరిగిస్తున్నది.  ఈ వంకర సర్పమే యుగ సంబంధమైన దేవతగా నేటి దేవుని రాజ్యము నకును, ఆయన కుమారుని రాజ్యమునకు, వారు జరిగించిన దైవ మహత్తర స్వస్థత కార్యములను గూర్చిన పరిజ్ఞానమునకు అడ్డంకి.  

        ఈ సముద్రము మీద పవళించి రూపాంతరము పొందిన ఈ మకరము

2 కొరింథీ 4:4లో వలె దేవుని స్వరూపియైయున్న క్రీస్తుమహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవతగా ఇప్పుడు క్రియ జరిగించుచున్నది.  ఇదియే సముద్రము మీద తిష్ట వేసిన సర్పము.  ఈ జనసముద్రము మీద తిష్ట వేసియున్న ఆ మకరము ఇప్పుడు మరియొక రూపాంతరము పొంది, ఈ యుగ సంబంధమైన దేవతగా రూపాంతరము ధరించి, అవిశ్వాసులైనవారిని, నేత్రాశగలవారిని,  ధనాశపరులను, పదవీవ్యామోహితులను, ఈ లోకమే స్థిరము అనుకొనేవారిగాను, దైవదూషకులుగాను ఉన్నట్టి ఐదు రకములైన జనాభాకు మనోనేత్రములకు గ్రుడ్డితనమును కలుగజేసి, యెహోవా క్రీస్తుగా - సర్పమైయున్న తనకు విధించబోవు శిక్ష, తనతోబాటు తానున్న స్థలములో అనగా నరకాగ్నిగుండములో నిత్య నివాసము చేయుటకు భూనివాసులను ప్రేరేపిస్తున్నాడు.  ఇది సముద్రము మీద అనగా జన సముద్రము  పవళించియున్న సర్ప మకరము.  ఇదే యుగ సంబంధమైన దేవత.  దీని సంఘమే మహాబబులోను.

16.  సీయోనులో పునాదిరాయిని వేసిన ప్రభువగు యెహోవా

        యెషయా 28:16, ''ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు  -సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే  అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి  బహు స్థిరమైన పునాదియైన మూలరాయియై యున్నది   విశ్వసించువాడు కలవరపడడు.''

        ప్రియపాఠకులారా!  మన మూలవాక్యములోని మాటలను ప్రభువగు యెహోవా చెప్పుచున్నాడు.  ఇందులో - సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అని అనుటలో 1 కొరింథీ 3:11, ''వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు;  ఈ పునాది యేసు క్రీస్తే.''  ఇందులో - ''వేయబడినది,'' అని చెప్పుచున్నాడు.  ఈ వేసినవారు ప్రభువగు యెహోవాయే అని యెషయా 28:16లో చెప్పబడినది.  ఈ పునాది క్రీస్తు.  క్రీస్తును పునాదిరాయిగా ఈ లోకములో యెహోవా దేవుడు వేసి ఆ పునాది మీద మనలను నిర్మించుకొనమని, అలా నిర్మించినది నిలిచినట్లైతే అతనికి ఫలితము దక్కునని చెప్పబడినది.  

        1 కొరింథీ 3:12-14, ''ఎవడైనను ఈ పునాదిమీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైనవాటితో కట్టినయెడల, వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును.  మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.  పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును.''  కనుక మనము క్రీస్తు అను పునాదిపై విలువైన రాళ్ళకు మించిన విలువగల సువార్తకు సంబంధించిన నీతి కార్యము జరిగించవలసినవారమై యున్నాము.  క్రీస్తు అను పునాదిరాయిని సియోనులో వేసినట్లుగా చెప్పబడినది.  ''ఈ రాయి పరిశోధింపబడిన రాయి మరియు అమూల్యమైన తలరాయి,'' అనగా క్రీస్తు దేవుని పరిశోధనలో నిలిచినవాడు.  సిలువ బలియాగములో క్రీస్తు పరిశోధింపబడి అమూల్యమైన రాయిగా పునరుత్థానము పొంది నిజ దైవారాధనకు తలరాయిగా మారాడు.  క్రీస్తు తలరాయిగా క్రైస్తవ ఆరాధన అనగా నిజ దైవ ఆరాధన ఏర్పాటు చేయబడినది.  ఇది అమూల్యమైనది.  అంటే ఇంతకు మించిన ఆరాధన లేదని చెప్పబడినది.  అంతేకాకుండా ఈ వేయబడిన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియై యున్నదని చెప్పబడినది.  కనుకనే క్రైస్తవ్యము ఈ లోకములో బహు స్థిరమైన స్థితిలో ఉన్నదనుటలో అతిశయోక్తి లేదని చెప్పవచ్చును.  సుమారు ప్రపంచ జనాభాలో క్రీస్తును అనుసరించువారు 70% ఉన్నారు.  అంటే వీరందరు ఎవరిని మూలముగా చేసుకొని దేవుని స్తుతిస్తున్నారు?  క్రీస్తు ప్రభువును!  కనుక క్రీస్తును తలరాయిగా చెప్పబడినది.

        ఇక, ''విశ్వసించువాడు కలవరపడడు,'' అని అనుటలో క్రీస్తు నందు విశ్వసించిన వాడు నిత్య జీవములో ప్రవేశించిన వానితో సమానుడు.  కనుక నిజ దైవ ఆరాధనలో ఉన్నవారికి కలవరము ఉండదని గ్రహించాలి, ఎందుకంటే క్రీస్తు దేవుని అవతారము, ఈయన తప్ప మరియొక రక్షకుడు లేడు.  కనుక ఆయనను విశ్వసించి ఆయన చెప్పినట్లు అనుసరించినవానికి నిత్యజీవములో ప్రవేశము లోకము మరియు సాతానుపై ఆధిపత్యము పొందును.  నరులను కలవరపరచువాడు సాతాను.  ఎవరైతే క్రీస్తును విశ్వసిస్తారో వారు సాతానుపై విజయమును పొందుదురు.  కనుక కలవరపరచు సాతానును వారు జయించుదురు కనుక వారిక కలవరపడరని గ్రహించాలి.

17.  నూతన బలము

        యెషయా 40:31, ''యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు.''

        ప్రియపాఠకులారా!  లోకరీత్యా నరులలో పరీక్షలు వ్రాసినవారు ఫలితాల కోసము ఎదురు చూచెదరు.  పందెములో పొల్గొన్నవాడు బహుమతి కోసము ఎదురు చూస్తాడు.  పెండ్లి సందర్భముగ అన్వేషించెడివారు మంచి కన్య దొరకాలని, మంచి వరుడు దొరకాలని ఎదురు చూచెదరు.  ప్రయాణములో వున్నటువంటి వ్యక్తులను గూర్చి, వారి బంధువర్గములు ఎదురు చూస్తుంటారు.  ఇది లోకములో సాధారణ విషయము.  అయితే దేవుడి కొరకు ఎదురు చూచువారు లోకములో అరుదు అని చెప్పవచ్చు.  మనుష్యుల మెప్పుకోసము, లోకము ఇచ్చే బహుమానము కోసము, పొలములో పండే ఫలముల కోసము ఎదురు చూచుటన్నది దానివలన ఫలితము కలుగవచ్చును, లుగకపోవచ్చును.  అయితే దేవుని కొరకు ఎదురు చూచుటలో ఎవరును ఎప్పుడును తక్కువ కాలేదు.  వేదరీత్యా పరిశుద్ధ గ్రంథములో కొంతమంది వ్యక్తుల జీవితములు వారు దేవుని కొరకు ఎదురు చూచి పొందిన సత్ఫలితములు, లోకమువైపు దృష్టించి, లోక ఫలితముల కొరకు ఎదురు చూచి, దైవోగ్రతకు పాత్రులై, దుష్ఫలితములు పొందిన వ్యక్తులు వగైరాలను గూర్చి వేదరీత్యా మనము తెలిసికొందము.

        మొట్టమొదటగా యెహోవా కొరకు ఎదురు చూచినవారిలో హేబెలు ప్రథముడు.  హేబెలు అర్పించిన బలి, దానియొక్క ఫలితము అనగా దైవత్వమునకు ప్రీతికరమైన జీవకోటిలోని తొలిచూలును యెహోవాకు అర్పణగ తెచ్చి, నిర్మల నిష్కల్మష హృదయముతో, నిస్వార్థ బుద్ధితో హేబెలు అర్పించిన బలి నూతనత్వమును పొంది, హేబెలు మరణించినను, అతని రక్తములో ఆ జీవము ప్రవేశించి హేబెలుయొక్క నిర్దోషత్వమును గూర్చి దేవునికి మొరపెట్టి కయీను మీద దోషారోపణ చేసినట్లు చదువగలము.  అటు తర్వాత హానోకు తన ఇహలోక జీవితమంతటిలోను దేవుని కొరకు కనిపెట్టి దేవునితో సావాసము చేసి నూతన బలాన్ని పొంది పక్షిరాజువలె ఆకాశములో ఎగురుచు, దేవునితో నడచినవాడై నరులకు కనుమరుగైనాడు.  ఇది యెహోవా కొరకు ఎదురు చూచువారికి కలుగు ఉన్నత స్థితి.  అలాగే అబ్రాహాము తన విశ్వాస జీవితములో దేవుని కొరకు కనిపెట్టి తన కుమారుని యందు కూడా లక్ష్యముంచలేదు.  కేవలము యెహోవా కొరకు కనిపెట్టి తన కుమారుని, బలి కట్టెల మీద నుంచి, దైవవాక్కుల మీద లక్ష్యముంచి, కుమారునికి ప్రతిగా దేవుడు చూపిన పొట్టేలును సమర్పించి మరియు దైవత్వము చేత ఆశీర్వదింపబడి విశ్వాసులకు తండ్రి ఆయెను.  మరియు పరలోకములో ఒక సింహాసనాన్ని పొంద గల్గినాడు.  అదియే అబ్రాహాముయొక్క కౌగిలి.

        అలాగే నోవహు కూడా యెహోవా యందు దృష్టించి, ఆయన చిత్తమును, ఆయన నోటి మాటలకు చెవినిచ్చి, ఆయన నమూనాను బట్టి ఓడను జేసి, ఆయన జరిగించబోవు లోక వినాశ జలప్రళయ మారణహోమములో నశించిపోక, ప్రచండ జలముల మీద పక్షిరాజువలె ఓడ గృహములో విహరించాడు.  అలాగే మోషే యెహోవా కొరకు ఎదురు చూచి ఆయన వెలుగును, తేజస్సులో బలమును పొంది, ఆయన ధర్మశాస్త్రమును బహుమానముగ పొందగల్గినాడు.  పక్షిరాజు వంటి రెక్కలు గలవాడై, దైవజనాంగమును తన రెక్కల క్రింద నడిపించాడు.  ఇది మోషేయొక్క దైవశక్తితో కూడిన చరిత్ర.  అలాగే ఏలీయా, ఆహాబు పరిపాలనలో యెజిబేలుయొక్క రాక్షస సామ్రాజ్యమును సవాలు చేస్తూ కర్మేలు పర్వతము మీద బలి అర్పించు సందర్భములో యెహోవా కొరకు ఎదురు చూచి ఆశ్చర్యకరమైన దేవుని శక్తితో పై నుండి అగ్నిని రప్పించి బలిని దహింపజేశాడు.  ఇది ఏలీయా పొందిన నూతన బలమునకు సాక్ష్యము.  అలాగే సంసోను సింహాన్ని సంహరించు సందర్భములో చేతిలో ఏమియు లేకపోయిననూ, తనను సృష్టించిన దేవుని నభ్యర్థించి, ఆత్మబలమును పొంది, సింహాన్ని చీల్చినాడు.  అలాగే వేలమంది ఫిలిష్తీయులను ఏ ఆయుధము లేకుండా సంహరించిన సందర్భములున్నవి.  దావీదు మహారాజు యెహోవా కొరకు కనిపెట్టి దైవజనాంగమైన ఇశ్రాయేలీయులపై 40 దినములు సవాలు జేయుచు, తన దేహము, సైనిక ఆయుధ బల సంపత్తిని బట్టి లోకము కొరకు కనిపెట్టి లోకస్థులను వెంటేసుకొని దైవజనాంగము మీద సవాలు చేస్తూ, విఱ్రవీగిన గొలియాతుతో పోరాడు సందర్భములో బాలుడైన దావీదు యెహోవా కొరకు కనిపెట్టినాడు.  ఆయన బలాన్ని పొందినాడు.  వడిసెలరాయి దెబ్బకు పడిపోయిన ఫిలిష్తీయ అను యోధునిపై పక్షిరాజువలె ఎగిరి వానిపై కూర్చుండి, వాని మెడ నరికి చంపినట్లు వేదములో చదువగలము.  ఈవిధముగ యెహోషువ, యెషయా, సొలొమోను, దానియేలు, ఎజ్రా, యెహెజ్కేలు, నెహెమ్యా, వగైరా ప్రవక్తలు యోహోవాను కనిపెట్టి ఆయన నూతన బలము ద్వారా పాత నిబంధనలోని గ్రంథములకు గ్రంథకర్తలయ్యారు.  అనగా వారు వ్రాసిన మాటలన్నియు దేవుని మాటలు అనగా ప్రవచనాలు.  వారు వారి జీవితకాలములో కేవలము లోక సంబంధమైన ఆహారముతోగాక దేవునియొక్క ఆత్మీయ ఆహారముతో జీవించి, ఆత్మ సంబంధమైన శక్తిని పొంది, పక్షిరాజువలె వారియొక్క చరిత్రలను దైవసన్నిధిలో స్థిరపరచుకున్నారు.

        ఇక నూతన నిబంధనలో దైవ కుమారుడైన యేసుక్రీస్తు కొరకు కనిపెట్టినవారు ఎటువంటి బలమును పొందినారు?  అది కూడా మనము తెలుసుకోవలసి యున్నది.  యేసుకొరకు ఎదురు చూచినవారిలో మొట్టమొదటివారు కానాలోని పెండ్లి ఇంటివారు.  యేసు రాకకు పెండ్లివారి ఇంట అయిపోయిన ద్రాక్షారస కొరతను, ఆ పెండ్లి ఇంటి వాకిటనున్న ఆరు రాతిబానలు ప్రభువు రాక కొరకు ఎదురు చూచి, వాటికున్న ఆ పురాతన స్వభావమును కోల్పోయి, బాగుగా కడుగబడి నీటితో నింపబడి పరమ రక్షకుడైన ప్రభువుయొక్క కృప ద్వారా నూతన ద్రాక్షారసాన్ని పుట్టించినవి.  పెండ్లి ఇంటివారికి నూతనానందాన్ని కల్గించినవి.  పెండ్లి ఇంటనున్న కొరతను తీర్చినవి, ప్రభువును మహిమపరచినవి.  అలాగే పదిమంది కుష్టురోగుల చరిత్రలో పదిమంది యేసు నందు లక్ష్యముంచి, ఆయన కెదురుగా వచ్చి యేసు ప్రభువా, మమ్ము రుణించుమని కేకలు వేసి, ఆయన స్వస్థత కొరకు ఎదురు చూచి స్వస్థత పొందినారు.  

        ఇక 12 యేండ్ల రక్తస్రావరోగి ప్రభువు కొరకు కనిపెట్టి, ఆయన అంగీ అంచును ముట్టి స్వస్థురాలై, నూతన బలము, నూతన శక్తి, నూతన జీవితము, నూతన ఆనందము పొంది ప్రభువును మహిమ పరచింది.  అలాగే బేతనియాలో మార్త మరియమ్మలు యేసు ప్రభువు రాక కొరకు కనిపెట్టి, చనిపోయి సమాధి చేయబడి, నాలుగు దినములై కంపుగొట్టు తన సోదరుడు క్రుళ్ళి దుర్గంధములో ఆయన రాక కొరకు ఎదురు చూచి, మరల తమ సహోదరుని బ్రతికించుకొని నూతనానందమును పొందినారు.  అలాగే జక్కయ్య యేసు రాకను గూర్చి ఎదురు చూచి, తన పాత జీవితములోని ధనబలము, ఐశ్వర్య బలము, అధికార బలము అన్నిటిని వదలుకొని ప్రభువుయొక్క ఆలింగనము ద్వారా నూతన స్వభావమును పొంది, తన జీవితములో నూతనముగా జీవించుటకు ఆత్మశక్తిని సంపాదించుకోగల్గినాడు.

        అపొస్తలుల కార్యములు 2:2, ఇక యేసు ప్రభువు శిష్యుల విషయములో అపొస్తలులు పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెట్టి ఎదురు చూచి, నూతన బలాన్ని పొంది, నూతన నిబంధనకు గ్రంథకర్తలైరి.  అలాగే కొర్నేలి తన దానధర్మాల చేతను, తన సన్మార్గమును బట్టి దేవుని మెప్పించి దైవత్వము కొరకు ఎదురు చూచి దేవుని దూత దర్శన భాగ్యము పొంది తన జీవితాన్ని ధన్యవంతము చేసికొన్నాడు.

        నేటి మన ఆత్మీయ స్థితి ఎట్లున్నది?  మన శరీరస్థితి ఎట్లున్నది?  మన శరీరములో మన ఆత్మ ఉండగానే మన సృష్టికర్తయైన దేవుని యందు మనము ఎదురుచూచి, మన సృష్టికర్తయొక్క నిర్ణయము కోసము మనము ఎదురు చూడవలసిన విధి మనపై ఎంతో ఉన్నది.  కాని నేటి నరులమైన మన స్థితి ఎట్లున్నదంటే మనయొక్క దృక్పథములో లోకసంబంధమైన పురోహితుల మీదను, పంచాంగముల మీదను, చిలక ప్రశ్నలు, లాటరీలు, లోక ప్రభుత్వములయొక్క వేతనములు, బహుమానములు వీటి కొరకు మనమెదురు చూస్తున్నాము.

        ఇక యెహోవా కొరకు ఎదురు చూడక లోకముపై లక్ష్యముంచి, అలౌకిక శక్తుల కొరకు ఎదురుచూచి, నాశనానికి గొయ్యి త్రవ్వుకున్న వారిని గూర్చి తెలుసు కొందము.  యెహోవా కొరకు ఎదురు చూడక, తన చిత్తానుసారముగా రాజ్య పరిపాలన చేసినవాడు సౌలు.  ఇతడు సోది చెప్పుదాని మాటల మీద లక్ష్యముంచి, యెహోవా తనను ఇశ్రాయేలీయులపై రాజుగా నియమించిన సంగతి తెలిసి కూడా లోకము కొరకు ఎదురు చూచి, యుద్ధరంగములో కుటుంబ సమేతముగా నరుకబడినాడు.  అలాగే ఆహాబు రాజు ఇశ్రాయేలుకు రాజైయుండి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా కొరకు లక్ష్యముంచక, కేవలము సాతాను సమాజ విగ్రహారాధికురాలైన యెజిబేలును వివాహము చేసికొని యెజిబేలు చిత్తమునకు ఎదురు చూచాడు.  ఆమెయొక్క ఆజ్ఞానుసారముగ ఇశ్రాయేలు రాజ్య పరిపాలన చేసి యెహోవాకు విరోధియై, యెహోవా పక్షపు ప్రవక్తయైన ఏలీయా మాటలను తిరస్కరించి ఘోరాతిఘోరమైన మరణాన్ని పొంది నాశనమును చవిచూచినాడు.  అలాగే దావీదు మహారాజు యుద్ధ సమయములో దైవ సైన్యముతో వుండి, యుద్ధరంగములో యుద్ధము చేయవలసిన దైవిక బాధ్యత అతని మీద నుండగా, ఆ విధముగా యుద్ధరంగములో యెహోవా కొరకు ఎదురు చూచి విజయోత్సాహాన్ని సాధించవలసిన మహారాజు యుద్ధము నుండి రాజాంత:పురమునకు వచ్చి, యెహోవా జనుల యుద్ధ ఫలితాన్ని గూర్చిగాని, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను గూర్చిగాని ఆలోచింపక, తానున్న మేడ మీద నుండి దిగంబరిగా స్నానము చేయుచున్న స్త్రీయొక్క అంగ సౌందర్యమును చూచి, ఆ స్త్రీ మీద వ్యామోహితుడై దోషాన్ని సంపాదించుకున్నాడు.

        ఇక నూతన నిబంధన కాలములో పరమ రక్షకుడైన యేసుక్రీస్తుయొక్క శిష్యుడగు యూదా ఇస్కరియోతు ప్రభువుయొక్క దైవికశక్తిని, ఆయన ప్రభావాన్ని ఎరిగి, ఆయన యందు లక్ష్యముంచక, లోక సంబంధమైన ముప్ఫయి వెండి నాణెములకు ఎదురుచూచి, గురుద్రోహి, స్వామి ద్రోహము సంపాయించుకొని, ఘోర మరణాన్ని చవి చూచినాడు.  అలాగే అపొస్తలుల కార్యములు తొమ్మిదవ అధ్యాయములో సౌలుగా ఉండిన పౌలు క్రైస్తవ బిడ్డలను హింసించుటకును, చెర పట్టుటకును, చంపుటకు దమస్కుయొక్క అధికార పత్రముల కొరకు ఎదురుచూచి, తానున్న స్థితి నుండి త్రోయబడి నిరాయుధుడును, అంధుడును, కన్నుగానని స్థితిలో దిగజారినాడు.  ఇది లోకముపై దృష్టి నుంచి లోకము కొరకు ఎదురు చూచిన నరుల స్థితిని గూర్చిన చరిత్ర.

        ప్రియపాఠకులారా!  మీ, మన ఆత్మీయ స్థితి, ఆత్మీయ దృక్పథము మన ఇహలోక జీవితము ఎట్లున్నది?  మనయొక్క చూపులు లోక సంబంధమైనటువంటి వాటికొరకు ఎదురు చూస్తున్నాయా?  లేక పరలోక సంబంధమైన వాటిని గూర్చి అన్వేషిస్తున్నాయా?  దైవ చిత్తానికి ఎదురు చూస్తున్నామా?  లోకాధికారుల ఉత్తరువులకు ఎదురు చూస్తున్నామా?  ఏ స్థితిలో ఉన్నది ఒకసారి మనలను మనము పరీక్షించుకోవలసి యున్నది.  అందుకే కొలస్సయులకు 3:1, ''మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు.''  అలాగే 1 యోహాను 2:15, '' ఈ లోకమునైనను, లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి.  ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు.''

18.  ఉత్తరదిక్కునుండి - సూర్యోదయ దిక్కునుండి వచ్చువారు

        యెషయా 41:25, ''ఉత్తరదిక్కునుండి నేనొకని రేపుచున్నాను  నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కునుండి వచ్చుచున్నాడు''

        ప్రియపాఠకులారా!  ఉత్తరదిక్కు ఏమిటి?  సూర్యోదయ దిక్కేమిటి?  అనిన దానిని గూర్చి మనము తెలిసికొనవలసి యున్నది.  ఇద్దరును ఒక్కరు గాదు.  ఇద్దరు దైవసంభూతులని మనము గ్రహింపవలసి యున్నది.  ఉత్తరదిక్కునుండి లేవబడువాడు సూర్యోదయ దిక్కునుండి వచ్చువానికి సమకాలికుడు కాదు.  ఎందుకంటే సూర్యోదయ దిక్కు తూర్పు.  ఈ తూర్పు నుండి వచ్చువాడు ఉత్తరదిక్కు నుండి లేపబడు వానిని కలుసుకుంటాడు.  కాని ఉత్తరదిక్కు నుండి లేపబడినవాడు తాత్కాలికుడును, నామ మాత్రమైన వాడునై యున్నాడు.  అయితే స్థిరుడు సూర్యోదయ దిక్కునుండి వచ్చువాడే.  ఈయన ప్రార్థనాపరుడును, జనసందోహమునకు ప్రార్థనను నేర్పువాడును, విగతులైన నరులయొక్క ఆత్మలను ప్రకాశమానమైన దైవసన్నిధికి చేర్చుటకు శక్తిమంతుడు, సమర్థుడునై యున్నారు.

        ఇంతకు వీరెవరు?  అనిన సందేహము పాఠకులకు కలుగవచ్చును.  సూర్యోదయ దిక్కునుండి వచ్చువానికి ముందుగా ఉత్తరదిక్కునుండి లేపబడినవాడు పెద్దవాడును.  సూర్యోదయ దిక్కునుండి లేపబడినవాడు నిరాడంబరుడును, దైవమార్గ నిర్మితుడును, దైవాంశ సంభూతుడునై యున్నాడును మరియు సకల జనులకు రక్షకుడై యున్నాడు.  ఈయనే దైవాంశ సంభూతుడును, నరరూపధారియు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు.  సూర్యోదయ దిక్కు అనుటలో మత్తయి 2:2లో ఈ సూర్యోదయ దిక్కును గూర్చిన వివరమును గూర్చి ముగ్గురు జ్ఞానులు ప్రవచించి యున్నారు.  అందులోని పరమార్థ మేమిటంటే - ''తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి.''  ఈ తూర్పుదిక్కు సూర్యుడు ఉదయించు దిక్కు.  ఈ సూర్యుడు ఉదయించు దిక్కునుండియే నీతి సూర్యుడు పుట్టినట్లు గుర్తుగా ఆకాశ విశాలములో నక్షత్రము పుట్టినది.  ఆ నక్షత్రము చలన సంబంధమై, నీతి సూర్యునియొక్క జనన వృత్తాంతము నెరింగించుటకును పంపబడి, ఆయన జన్మ స్థలమును చూపుటకును, ఆ ముగ్గురు జ్ఞానులకు ముందుగా అది పయనించి, నీతి సూర్యుడు ఉద్భవించిన స్థలమును ఈ జ్ఞానులను చేర్చింది.

        ఇక్కడ ఒక గొప్ప దైవిక మర్మాన్ని మనము గ్రహించవలసి యున్నది.  అదేమిటంటే ఈ వాక్యములో మొట్టమొదటి వచనములో ఉత్తర దిక్కును గూర్చి ప్రస్తావించి యున్నాడు.  అనగా తూర్పుదిక్కునుండి వచ్చిన వానికంటే ముందువాడు ఈ ఉత్తరపు దిక్కున ఉన్నవాడు.  అంటే ఈ తూర్పుదిక్కున ఉదయించిన వానికంటే ఈ ఉత్తరపు దిక్కువాడు పెద్దవాడు.  మరియు దేవునిచేత రేపబడినట్లుగా వ్రాయబడి యున్నది.  ఈ సందర్భములో యోహాను 1:6, ''దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను;  అతని పేరు యోహాను.''  కాబట్టి యోహాను యేసుక్రీస్తు కంటే పెద్దవాడు.  సూర్యోదయ దిక్కు నుండి వచ్చినవానికి బాప్తిస్మము ఇచ్చుటకు ప్రతిష్టించుటకును, (బాప్తిస్మము ఇచ్చిన తదుపరి ప్రతిష్టిత ఉంటుంది) ఈ ఉత్తరదిక్కువాడు దైవత్వము చేత నియమింపబడినట్లు లేక రేపబడినట్లు తెలియుచున్నది.

        ఇందునుబట్టి ఇద్దరును ఉన్నత స్థాయిలో ప్రత్యేకమైన, దేవుడేర్పరచిన దిక్కునుండి వచ్చినారేగాని వారంతట వారు రాలేదు.  ఇందులో దేవునియొక్క దిక్కు తూర్పు.  దీనికి సూచనగా ఆయన తీర్పుదిక్కున ఏదెను వనమును వేసినట్లు చదువగలము.  ఆయన ఏర్పరచిన లోకజ్యోతియైన సూర్యుడు తూర్పుదిక్కునుండియే ఉదయిస్తున్నాడు.  

        దావీదు కూడా తనయొక్క ప్రవచనములలో - కీర్తన 103:12, ''పడమటికి తూర్పు ఎంత దూరమో  ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి యున్నాడు.'' అని ప్రవచించి యున్నాడు.  ఇందునుబట్టి చూడగా పడమట అన్నది సూర్యాస్తమయ దిక్కును, దైవత్వమునకు ప్రాధాన్యత లేని దిక్కుగా వున్నది.  అలాగే దక్షిణమున కూడా దైవ దృక్పథములో గొప్ప స్థానమును పొందినట్లు లేదు.  నేటి నరలోకములో ఈ పడమటి దక్షిణ దిక్కులకు ప్రాధాన్యతనిచ్చి కొన్ని విధములైన విగ్రహ దేవుళ్లకు గుళ్ళు కట్టి, పుణ్యక్షేత్రాలుగా, యాత్రా స్థలములుగ నియమించి అనేకులను ఆకర్షిస్తున్నారు.

        ఉత్తరము, తూర్పు ఈ రెండు దిక్కులలో వున్న ప్రాముఖ్యతను యెషయా ప్రవచనాలలోని ఈ వేదభాగములు వివరిస్తున్నాయి.  ''నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కునుండి వచ్చుచున్నాడు,'' అనుటలో సూర్యోదయ దిక్కునకు అధికారి దేవుడు.  ఎందుకంటే ఆదికాండము 1:లో దేవుడు వెలుగు కమ్మనగా వెలుగాయెను అని వ్రాయబడి యున్నది.  ఆ విధముగా దేవునియొక్క మాట ప్రకారము ఈ వెలుగు ఏ దిక్కునుండి పుట్టుచున్నదో మన ఇహలోక జీవితములో ప్రతి ఉదయము మనము చూస్తున్నాము.  అట్లే అస్తమించు దిక్కు కూడా చూస్తున్నాము.  సూర్యోదయ దిక్కునుండి వచ్చినవాడు అనగా ఉదయించినవాడు సూర్యునివలె అస్తమించి మహిమ పునరుత్థానుడై తిరిగి లేచి సర్వలోకమునకు తన సువార్త అను కిరణములను సువార్త రూపముగ అనేకులతో వెలిగించుచున్నాడు.  నరజీవితములో ప్రార్థన ఎరుగని మట్టి పాత్రలుగా ఉన్న మనలను పగిలిన మట్టి పాత్రలవలె శిథిలమై పోకుండా సృష్టికర్తయైన దేవునియొక్క సన్నిధికి ఉపయోగకర పాత్రలుగ చేయాలని, సృష్టికర్త నామములో ప్రార్థనా వ్రతమును ఆచరించి, గొప్ప ప్రార్థనపరునిగా, ప్రార్థనకు గురువుగా సకల నరకోటి ప్రార్థనను ఆచరించుటకు మాదిరిగా ప్రార్థనను నేర్పు అధ్యాపకునిగా ఆత్మీయమైన జీవితానికి తర్ఫీదునిచ్చి ఆత్మ గురువుగా ఈ లోకములో ఆయన క్రియ జరిగించి నరకోటికి మార్గదర్శకుడాయెను.

        ఇక ఉత్తరదిక్కునుండి లేపబడిన వాని గూర్చిన విషయములో ఈ ఉత్తరదిక్కులో లేపబడినవాడు సత్యమునకు సాక్షిగాను, తూర్పుదిక్కునుండి దైవనామములో, ప్రార్థనలో జీవించిన ఆ పరమ యోగపుంగవుడైన యేసుక్రీస్తు ప్రభువు మార్గమును సరాళము చేయుటకు ఒక సాధనముగ వాడబడి, సత్యమును గూర్చి పోరాడి, సత్యమునకు సాక్షిగా వుండి, దైవమార్గమునకు మైలు రాయియై యున్నాడు.

        ప్రియపాఠకులారా!  ఉత్తరదిక్కునుండి లేపబడిన వాని చరిత్ర సూర్యోదయపు దిక్కునుండి వచ్చిన వాని చరిత్రకు భిన్నమై యున్నది.  ఉత్తరదిక్కునుండి లేపబడినవాడు దైవత్వము చేత రేపబడినను నరునిలో జనించి, వాక్యమును ఆచరించి, విరాగియును, నిరాడంబరుడును, నిరాహారుడుగాను అనగా ఉన్నతమైన భోజనము మరియు ఉడికిన ఆహారమును నిషేధించి కొండలలోని ఆకులలములతో తన జీవితాన్ని ధన్యవంతము చేసికొన్నాడు.  ఈయన తన బాప్తిస్మము అను కార్యక్రమముతో అనేకుల నెదిరించి, గద్దించి లోక అవిశ్వాస జనకోటికి జ్ఞానోదయమును కల్గించినాడు.  ఇక తూర్పుదిక్కున నుండి ప్రార్థనాపరుడుగ ఉదయించినవాడు యావన్నరకోటికున్న శాపము మరణము అను శిక్ష నుండి విమోచన కల్గించుటకు కర్త అయ్యాడు.

19.  బురద త్రొక్కుట - మన్ను త్రొక్కుట

        యెషయా 41:25, ''ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి మన్ను త్రొక్కునట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును.''

        ప్రియపాఠకులారా!  బురద త్రొక్కుట అంటే ఏమిటి?  కుమ్మరివాడు మన్ను త్రొక్కుట అంటే ఏమిటి?  ఇందునుగూర్చి మనము తెలిసికోవలసి యున్నది.  నరులైన మనము చేయు ప్రతి పాపము బురదయే అనగా అసహ్యమైన కార్యములు.  ఈ అసహ్యమైన కార్యములు దైవత్వానికి, ఆయన సన్నిధికి, లోక చట్టానికి, సంఘమునకు, సమాజమునకు హేయమైన కార్యము.  అలాగే బురదన్నది దుర్గంధపూరితమై అసహ్యముగా కనబడుటయేగాక దాని వాసన మానవత్వానికి పందికి తప్ప మరి ఇతర జంతుకోటికి అసహ్యమైన జడపదార్థము.  ఇది మురుగునీటి వలన ఏర్పడి, తడి నేలలో ఉండి దాని త్రొక్కు ప్రతివానికిని అసహ్యతను, చెడు వాసనను నరకోటిలో అంటరానిదిగ చేయుచున్నది.  అలాగే పాపము అను బురద కూడా నరజీవితాన్ని తాకినప్పుడు అతడు లోక సృష్టికిని, దైవసన్నిధికిని కిరాతకుడుగాను, పాపిగాను, జనబాహుళ్యములో వెలివేయబడినవానిగాను, శిక్షార్హుడుగాను ఎంచబడుచున్నాడు.  ఈ విధముగ బురద వంటి పాపములో, లోకములో ప్రతి నరుడు తల్లి గర్భము నుండి పుట్టినది లగాయతు మరణము వరకు ఏదో యొక క్రియారూపకమైన బురద వంటి పాపానుభూతి పొందుచున్నాడు.

        ఇట్టి పాప భూయిష్టమైన బురద వంటి పాపములో చిక్కిన దావీదు మహారాజు - ''జిగట మన్నుగల దొంగ ఊబి నుండి నన్ను పైకి లేవనెత్తినవాడవు నీవే,'' అనుటలో ఈ దొంగ ఊబి అన్నది బురదవంటిదై లోతు కనబడని రీతిలో ఉండి తనలో చిక్కుకున్న ప్రాణిని అగాధములో మూసివేసి ఏమియు ఎరుగనట్లు సాధారణమైన ఆరిన నేలగా కనబడుచుండును.  ఇట్టి దొంగ ఊబిలో చిక్కుకొన్న నర జీవితమునకు ఉన్నటువంటి ఈ బురద మరకలు అను పాపపు మచ్చలను, మరకలను తొలగించుటకు యేసు ఈ లోకమునకు వచ్చెను.  ఏ బురదనైతే నరుడు త్రొక్కి పాపపు మరకలు కలిగియున్నాడో - అదే బురదవంటి పాపము అను బురదను దైవకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు త్రొక్కి మనవంటినున్న బురద మరకలను ఆయన వహించి యున్నారు.  పాపము అను బురదను త్రొక్కిన సందర్భములో లూకా 22వ అధ్యాయములో ఆయన తన రక్తపు చెమటను మనమీద చిలకరించి, మనకున్న పాపపు బురద మరకలను పూర్తిగా తీసి వేయుటకు తానే బురదను త్రొక్కవలసి వచ్చింది.  ఆవరకు మనకున్న బురద వాసనను, తన ఇంపైన నిష్కళంకమైన, సంపూర్ణమైన బలియాగము ద్వారా సువాసనగల జీవితాన్ని మనకు అనుగ్రహించి యున్నాడు.

        ఇక, ''కుమ్మరి మన్ను త్రొక్కునట్లు,'' అనుటలో యిర్మీయా 18:6లో ఈ కుమ్మరి దేవుడు.  మన్ను ఇశ్రాయేలు.  ఈ ఇశ్రాయేలును దేవుడు ఆయనకు లోబడి, ఆయన ఇష్టానుసారముగా ఆయన చిత్తానుసారముగా ఆయన మార్గములో నడుచువరకు అనేకమైన అవాంతరాలతో వారిని బాధించి కుమ్మరి త్రొక్కునట్లుగా ఆ జనమును త్రొక్కి, వారిని విశ్వాసములో నడిపించెను.  తన బిడ్డలుగ ఉన్న ఇశ్రాయేలీయులను తన స్వాస్థ్యముగా మలచబడుటకు, దేవుడు ఇశ్రాయేలు అను మన్నును త్రొక్కి మలచి, వారిని తన స్వాస్థ్యముగా చేయుటకు ఆయన చేసిన విధానమే - కుమ్మరి మన్ను త్రొక్కుటలోని పరమార్థము.

        2 పేతురు 2:18-22లోని వివరణ ఈ బురదకు సాదృశ్యమైనది, ''వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు, తామే శరీరసంబంధమైన దురాశలుగలవారై, తప్పుమార్గమందు నడుచువారిలోనుండి అప్పుడే తప్పించు కొనినవారిని పోకిరిచేష్టలచేత మరలుకొల్పుచున్నారు.  తామే భ్రష్టత్వమునకు దాసులైయుండియు, అట్టివారికి స్వాతంత్య్రము ఇత్తుమని చెప్పుదురు.  ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడగును గదా  వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానముచేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటిచేత జయింప బడినయెడల, వారి కడవరి స్థితి మొదటి స్థితికంటె మరి చెడ్డదగును.  వారు నీతిమార్గమును అనుభవపూర్వకముగా తెలిసికొని, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞనుండి తొలగిపోవుటకంటె ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక యుండుటయే వారికి మేలు.  కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను.''

        ఇక ''అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును,'' అనుటలో ఆదిలో యెహోవా దేవుడు రాజులనే గాక సైన్యాధిపతులను కూడా ఆయన శిక్షించినట్లును, ప్రతిభావంతులుగ జేసినట్లును పాత నిబంధన గ్రంథములో మనము చదువగలము.  మొట్టమొదటగా దేవుడు తన సైన్యమైన ఇశ్రాయేలును నడుపుటకు సైన్యాధిపతిగా మోషేను నియ మించాడు.  మోషే రాజు కాడు.  అట్లు మోషే నియమించబడిన తర్వాత ఇశ్రాయేలు జనాంగమును నడిపించుటలో అటు ఇశ్రాయేలుయొక్క కోరికలను ఇటు దేవునియొక్క చిత్తము, ఆయనయొక్క ఆజ్ఞ నిబంధనలు, వాటి మధ్య బహుముఖ వ్యాప్తముగ మోషే నలిగి, సంతోషము, నెమ్మది కరువై, ప్రతినిత్యము జనులు చేయుచున్న తిరుగుబాటు, దేవుడు మోషేతో మాట్లాడేటటువంటి ప్రభావితమైన మాటలు, వాటితో సతమతమయ్యాడే గాని మోషే ఏనాడు తన భార్యాబిడ్డలతో, తన స్వకీయులతో సంతోషముగ సంసార జీవితము, లోక సంబంధమైన విహార జీవితమును అనుభవించినట్లుగా వేదములో లేదు.

        అలాగే అతి చిన్న మొత్తమైన ఇశ్రాయేలు యోధులకు గిద్యోనును దేవుడు సైన్యాధిపతిగా జేసి, అతని ఉజ్జీవపరచి, ఆయుధములు, కవచములు, అశ్వములు, రథములు ఏవియు లేకుండా కేవలము 300 మంది మనుష్యులను సైనికులుగ నియమించి వారి ద్వారా ఇసుక రేణువుల వంటి మిద్యానీయులను, అమాలేకీయులను, విస్తారమైన ఒంటెలు, ఆయుధములు, మందిమార్భలముతో ఇశ్రాయేలీయులపై దండెత్తినప్పుడు అమాలేకీయుల, మిద్యానీయుల సైన్యమును సైన్యాధిపతులను దేవుడు త్రొక్కినాడు.  వారు నాశనమై దోచుకోబడినారు.  అలాగే యెహోషువ కూడా దేవునియొక్క పాదాల క్రింద ఒక గొప్ప సైన్యాధిపతిగ సిద్ధపరచబడినాడు.  నయమాను విషయములో సిరియా దేశపువాడైన నయమాను గొప్ప పేరు ప్రఖ్యాతులు పొంది, అపజయ మెరుగని సైన్యాధిపతి అయితే దేవుడు అతనిని కుష్టువ్యాధితో త్రొక్కియున్నాడు.

        అలాగే పాత నిబంధన కాలములో అనేకులు పై సైన్యాధిపతులు, యుద్ధవీరులను ఆయన త్రొక్కి హతము చేసినట్లును చదువగలము.  మరియొక సంఘటనలో ఫిలిష్తీయ వీరుడు, యోధుడు, సైన్యాధిపతి గొలియాతు స్థూలకాయుడు, భారీ యుద్ధ సామాగ్రి కలవాడు, మహాబలశాలి.  ఆనాటి ఫిలిష్తీయ ఇశ్రాయేలీయ జనాంగమంతటి పైన పొడగరియైన గొలియాతును చిన్న బాలుడైన దావీదు చేత త్రొక్కించాడు.

        నేడు లోకరీత్యా ఈ యుగాంతములో వున్నటువంటి మనలను తన విశ్వాసములో తన రాక కొరకు నిరీక్షణ కల్గిన స్థితిలో మలచబడుటకును, తన యెరూషలేము సంఘ సభ్యుల నెన్నుకొనుటకు, తన రాజ్య వారసులుగ చేయుటకును, లోకములో ప్రతి అధికారి, అనధికారి అని బేధము లేకుండా ఆత్మీయముగ త్రొక్కుచున్నాడు.  ఆయన పాదాల క్రింద త్రొక్కబడుటన్నది నూతనమైన రూపాన్ని మలచుటకే అనిన సత్యాన్ని మనము గ్రహించవలెను.  ఒక గృహ నిర్మాణకుడు మన్ను త్రొక్కుచున్నాడంటే గట్టి ఇటుకను లేక ఘనమైన పాత్రను చేయుటకును లేక అమూల్యమైన పరిశుద్ధాలయమును నిర్మించుటకును, ఆ పని చేయుచున్నాడనుట నమ్మదగినది.  కనుక దేవుడు నరకోటికి తన పరిశోధన ద్వారా త్రొక్కుచున్నాడంటే నూతనముగా ఆయనలోకి మలచుకొనేందుకు జరగు క్రియ అని మనము గ్రహించవలెను.

        యోబును త్రొక్కినాడు.  కాని యోబును త్రొక్కుటలో దేవుడు సాతాను ఏకమై త్రొక్కినారు.  కాని యోబు నలుగలేదు మరియు బాధింపబడినాడే గాని శిథిలము కాలేదు.  అయితే యోబుయొక్క అంతము ఆశీర్వాదకరముగాను, నూతన వికాసములోను, దైవిక సంపదతోను, ప్రశాంతకరమైన బహు ఉన్నత స్థాయిలో యోబు చరిత్ర ముగిసినది.  అలాగే యోనాను త్రొక్కినాడు.  అయితే చంపలేదు.  యోనాను త్రొక్కి చేప గర్భములో సముద్రములో వదిలినాడు.  దేవుడు తాను ఉద్ధేశించిన సువార్త పనికి యోనాను నీనెవె పట్టణానికి చేర్చి, తన కార్య సాఫల్యతను పొంది - యోనా జీవితాన్ని ధన్యవంతము చేశాడు.  దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువును లోక పాపముల నిమిత్తము, ఆయనను మనుష్యుల చేత త్రొక్కించినాడు.  కాని యేసు ప్రభువు పాపము అనే బురదను త్రొక్కి దాని ద్వారా సంభవించిన మరణమనే శిక్ష నుండి తప్పించుటకు ఆయన సమాధి చేయబడినప్పటికిని మహిమ శరీరుడుగా పునరుత్థానుడైనాడు.  ఈనాడు యావద్‌ ప్రపంచాన్ని తన కాలి క్రింద త్రొక్కి పెట్టి సమస్తమునకును, సకలాది ఆధిపత్యములకును అధికారియై యుండి రాజ్య పరిపాలన చేయుచున్నాడు.  రారాజుగ ఈ లోకాంత్యములో రాబోవుచున్నాడు.

        కనుక ప్రియపాఠకులారా!  మన జీవితము బురదమయముగ వున్నదా?  లేక కుమ్మరివాడైన దేవునియొక్క పాదముల క్రింద కుమ్మరివాని మట్టిగా ఉండి, ఆయనకు ఉపయోగకరమైన పాత్రగా వాడబడుటకు యోగ్యకరమైన జీవితములో ఉన్నదా?  మన ఆత్మీయ స్థితి ఎట్లున్నది?  మన శరీర ఆలోచనలు, స్వభావములు, క్రియలు ఎట్లున్నవి?  మనలను మనమే మననము చేసికొందము.

20. దూరమునుండి నా కుమారులను

భూదిగంతమునుండి నా కుమార్తెలను తెప్పించుటకు

తూర్పు - పడమర - ఉత్తరము - దక్షిణములకు ఆజ్ఞలు

        యెషయా 43:5-6, ''భయపడకుము, నేను నీకు తోడైయున్నాను  తూర్పునుండి నీ సంతానమును తెప్పించెదను  పడమటినుండి నిన్ను సమకూర్చి రప్పించెదను.  అప్పగింపుమని ఉత్తరదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను  బిగబట్టవద్దని దక్షిణదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను  దూరమునుండి నా కుమారులను భూదింగతమునుండి నా కుమార్తెలను తెప్పించుము.''

        ప్రియపాఠకులారా!  యెషయా గ్రంథములోని ఈ వేదవాక్యాలను మనము ధ్యానించుకొందము.  అందులో ''భయపడకుము, నేను నీకు తోడైయున్నాను.''  నరులైన మనము, దేవుని ఆత్మను పొందియున్న మనము, చీకటిమయమైన ఈ లోకమునకును, దీని అధికారమునకు, దీని చట్టములకు, దీని సంబంధమైన నరులకును, దీని మూలముగా కలిగే వేదనలు, బాధలు, సమస్యలను గూర్చి భయపడవలసిన పనిలేదు.  ఎందుకంటే బైబిలు వేదము అన్ని గ్రంథములలో పరిశుద్ధ గ్రంథముగా నామధేయాన్ని పొంది, పరిశుద్ధ స్థితిలో, పరిశుద్ధ దేవుని మాటల ద్వారా నేటి విశ్వాసులమైన మనకు హెచ్చరికలు, ఆదరణపు మాటలు, సలహాలు ఇస్తూ ఉన్నది.  పరిశుద్ధ గ్రంథములో మొదటి భాగమైన పాత నిబంధనలో - ఆ అజ్ఞాన కాలములో, ఆ నిరక్షరాస్యత యుగములో మొదటి జనాంగములతో దేవుడే స్వయముగా వారితో మాట్లాడి, సందర్భోచితముగా వారికి సలహాలను, ఆయా ప్రమాదాలలో వారికి ఆదరణకరమైన మాటలను, కష్టాలు సంభవించిన వాతావరణములో ఓదార్పును కల్గించు మాటలతో నాటి జనాంగమును తన మార్గములో దేవుడు నడిపించెను.  యాకోబు విషయములోను, అటు తరువాత యాకోబు సంతానమైన 12 గోత్రాల ఇశ్రాయేలు జనాభాతో దేవుడు భయపడవద్దన్నట్లుగా హెచ్చరికలున్నవి.  అలాగే ఆనాటి ప్రవక్తలైన మోషే, యెహోషువ, ఎలీషా, యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, వగైరా ప్రవక్తలతో కూడా ఆది దేవుడు వారిని భయపడవద్దని ధైర్యపరచి, వారి ద్వారా క్రియ జరిగించినట్లుగా మనము వేదములో చదువగలము.

        అలాగే మిద్యానీయుల వలన ఇశ్రాయేలుకు యుద్ధము సంభవించు సమయములో మిద్యానీయుల యొక్క విశేష బలమునకు శత్రువుయొక్క అఖండమైన, అధికమైన యుద్ధ పరికరాలు, వాహనాలు ధాటికి భయపడిన గిద్యోను అను ఒక రైతుకు దేవుడు ప్రత్యక్షముగా అతనికి దర్శనమిచ్చి ధైర్యపరచిన మాటలను బైబిలు నందు చదువగలము.  న్యాయాధి పతులు 6:12, ''యెహోవా దూత అతనికి కనబడి-పరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైయున్నానని అతనితో అనగా''  న్యాయాధిపతులు 6:16, ''నేను నీకు తోడై యుండును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను.''  ఇట్టి మాటల ద్వారా ఆనాటి ప్రవక్తలను బలపరచినట్లుగా మనము చదువగలము.  పాత నిబంధన కాలములోని దైవ విశ్వాసులందరిని భయపడ కుండా వారిని ధైర్యపరచి, వారితో కూడా వుండి అనేకమైన అద్భుత కార్యములు దేవుడు చేసి యున్నాడు.  ఎట్లంటే ఇశ్రాయేలుకు దేవుడు తోడు.  ఇందుకు ఋజువు ఏమిటంటే - వారు ఐగుప్తు చెర నుండి విడిపింపబడినప్పుడు, మోషే కర్రతో ఎర్రసముద్రాన్ని రెండు పాయలుగ చేయించి, ఆరిన నేల మార్గములో బాటగా జేసి, ఇశ్రాయేలును నడిపిస్తూ ఇటువైపు అటువైపు సముద్రజలములు గోడలవలె వుండగా జలముల మధ్య నడిపించెను.  తన సైన్యమైన ఇశ్రాయేలును నడిపిస్తూ పగలు మేఘ స్థంభముగాను అనగా వారికి చల్లదనమిస్తూ, రాత్రి అగ్ని స్థంభము అనగా వారి మార్గమున చలి నుండి కాపాడి వెలుగునిస్తూ వారిని నడిపిస్తున్నట్లుగా దాఖలాలున్నవి.  

        ఈ విధముగా దేవుడు తన జనాంగమునకు తోడై యున్నాడనుటకు సరియైన సత్యవచనము.  ఇమ్మానుయేలు అనగా ఎల్లప్పుడు మనకు తోడై యున్నాడు.

        తూర్పు దిక్కు  :-   ''తూర్పునుండి నీ సంతానమును తెప్పించెదను,''  అని అనుటలో యేసు పాప భూయిష్టమైన ఈ లోకములో పుట్టిన ఆ శుభవేళ దేవుడు ఎన్నుకున్న మొట్టమొదటి దిక్కు తూర్పు.  అందుకే యేసుక్రీస్తు జన్మదినమున తూర్పు దిక్కున ప్రభువుయొక్క నక్షత్రము కనబడినది.  ఆ నక్షత్రమును గూర్చిన పూర్తి వివరము, దాని ఉద్ధేశ్యము, అది కనబడిన సందర్భాన్ని గ్రహించగల్గిన జ్ఞానవంతులైన మేధావులు ముగ్గురు కూడా తూర్పు దిక్కువారే.  మనుష్య కుమారుని జననము, ఆయన జన్మను గూర్చినటువంటి నక్షత్ర పుట్టుదల, ఆ జ్ఞానమును గ్రహించిన ముగ్గురు జ్ఞానుల రాక, ఇవన్నియు తూర్పు దిక్కుననే జరిగింది.  యేసు ప్రభువుయొక్క జీవితయాత్ర అంతయు తూర్పు సంబంధమే.  ఆయన తూర్పువాడే అనగా నీతి ఉదయ భాస్కరుడు.  నీతిని ఉదయింపజేసినవాడు.  అందుకే తనను గూర్చి సంబోధిస్తూ - యోహాను 8:12, ''మరల యేసు-నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు గలిగి యుండునని వారితో చెప్పెను.''  ఇందునుబట్టి పాపమునకు అంతము మరణము.  మరణమునకు విజయము తూర్పు నుండి కలిగినది.  ఈ తూర్పు దిక్కున నుండి వచ్చిన ఈయొక్క సంతానమే మరణ పునరుత్థాన సంతానము.  వీరి మీద మరణానికి అధికారము లేదు.  వీరిని దుష్టుడు ముట్టడు.  అనగా పాపము వీరిని అంటదు.  వీరు లోకమాలిన్యాలకు దూరముగా ఉంటారు.  ఈ విధముగా తూర్పు దిక్కు నుండి రప్పించిన సంతానము దైవ సంబంధులేగాని లోక సంబంధులు గారు.  లోకమును జయించినవారు.  ఒక్క మాటలో చెప్పాలంటే వీరు దేవుని వంశమునకు చెందినవారు.  తూర్పు దిక్కున ఏ విధముగా సూర్యుడు ఉదయించునో ఆ విధముగా తూర్పు దిక్కున ఉదయించిన ఈ దైవనరుని సంతానము ఈ విధమైన ప్రత్యేకతలు కల్గియున్నారు.

        పడమటి దిక్కు  :-  పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను.''  సువార్త పుట్టింది తూర్పున.  ఏదెనులో ఆదాము, అతని భార్య పుట్టింది తూర్పున.  పాపము పుట్టినది కూడా తూర్పున.  ప్రభువు తినవద్దని నిషేధించిన చెట్టు ఫలముకూడా తూర్పు దిక్కుననే పుట్టింది.  నరుడు పాపపు వాతావరణములో పతనావస్థను చవిచూచింది కూడా తూర్పే.  ఈ విధముగా తూర్పు దిక్కు నుండి పడమర వరకు ఆది నరుడు తరిమి వేయబడినాడు.  అందుకే దావీదు మహారాజు - కీర్తన 103:12, ''పడమటికి తూర్పు ఎంత దూరమో  ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి యున్నాడు.'' అనుటలో తూర్పు నుండి పడమటికి తరిమి వేయబడిన ఆదాముయొక్క సంతానమును మరల తూర్పువారిగా జేయుట దేవుని సంకల్పమైయున్నది.  ఈ తూర్పు పడమటి సంతానములను ఏకపరచుటకు తన కుమారుని ఈ లోకమునకు పంపి, ఆయన రక్తము ద్వారా పడమటివారమైన మనకు సంక్రమించిన జన్మకర్మ పాప దోషములను పరి హరించుటకు దేవుడు సంకల్పించెను.  ఆ విధముగా క్రియ జరిగించి, తూర్పు పడమరలను ఏకపరచుటకు అనగా దైవత్వమునకును, మానవత్వమునకును వున్న ఆయొక్క అడ్డమైయున్న తెరను, తన కుమారునియొక్క బలియాగము ద్వారా చించి, తూర్పు నుండి వెలివేయబడి పడమటికి తరిమి వేయబడిన ఆది సంతానమైన మనలను మరల ఐక్యపరచుటకు, తన వైపుకు చేర్చెదనన్న వాగ్దానము ఈ వచనములో ఉన్నది.

        ఉత్తర దిక్కు మరియు దక్షిణ దిక్కు :-  నేటి యుగములో తూర్పు పడమరల కంటె ఉత్తర దక్షిణాలలోనే ఎక్కువగా పాపకృత్యముల మారణ హోమములు, దోపిడీలు, నక్సలిజము, హత్యలు, మానభంగాలు, చీకటి వ్యాపారాలు, నానావిధమైన మద్యపానీయ తయారీలు, దొంగనోట్లు వగైరాలు జరుగుచున్నవి.  అందుకే ఈ వేదభాగములో ఉత్తర దిక్కును దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు.  ఏమని?  అంటే దైవసేవకు, సువార్త పరిచర్యకు, మందిర నిర్మాణాలకు, పరలోక రాజ్య విస్తరణకు కావలసిన ఆత్మలయొక్క సమూహమును ఈ ఉత్తర దిక్కు ప్రభువునకు అప్పగించవలసిన సమయమాసన్నమై యున్నది.  అందుకే ఈ వాక్యములో దేవుడు ఈ ఉత్తర దిక్కును అప్పగించుమని శాసిస్తున్నాడు.  ఎవరిని అప్పగించమని?  నీ దాసులై, నీ చట్టానికి, నీ ఆచారానికి, నీ అజ్ఞానానికి, నీ ఐశ్వర్యానికి, నీ తాత్కాలికమైన భోగభాగ్యానికి, నీ పరిపాలనా పదవికి కొట్టుమిట్టాడి, కక్ష్యలు కలహాలతో హతులైనవారు పోను, మిగిలినవారిని నాకు అప్పగించుము.  నీకు బానిసలైన వారిని నీవు చంపుకో, వారు పోగా మిగిలినవారు అనగా యేసు రక్తముతో కడుగబడి బాప్తిస్మమును, ఆయన శరీర రక్తములలో పాలిపంపులు పొంది, ఆయనను స్వరక్షకునిగా అంగీకరించి, ఆయన రాకడ కొరకు నిరీక్షించే దైవజనాంగాన్ని తనకప్పగించమని ఉత్తర దిక్కునకు మన దేవుడు ఆజ్ఞ యిస్తున్నాడు.

        ''బిగపట్టవద్దని దక్షిణదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను,'' అని అనుటలో ఈ ఉత్తర దిక్కు దహనకాండతో  ఉగ్రతాపూరితమైతే దక్షిణదిక్కు మరియొక విచిత్రమైన స్థితిలో క్రియ జరిగిస్తున్నది.  అనగా ఉత్తర దిక్కు మనిషిని హతము జేస్తే - దక్షిణ దిక్కు మనిషిని అజ్ఞానములో నడిపిస్తున్నది.  ఈ దక్షిణదిక్కులో అన్య దేవతల లెక్క చెప్పాలంటే ఎవరి వల్ల కాదు.  సంవత్సరానికొక దేవున్ని, ఒక దేవతను ఈ దక్షిణదిక్కు తనకుతానే పుట్టిస్తున్నది.  ఈ దక్షిణ దిక్కులో వున్న దేవుళ్ళు పాము లగాయతు ఏనుగు వరకు ఎన్ని జీవ జంతువులున్నాయో వాటి రూపాలనన్నిటిని దేవుళ్ళుగానే ఆరాధిస్తున్నారు.  అంతేగాక ఈ జంతుజాలానికి ప్రత్యేకించి మందిరాలు కూడా వున్నాయి.  కుక్కను కుక్క దేవుడు అనకుండా భైరవన్‌ అను విచిత్ర నామముతో ఆ భైరవునికి గుడి కట్టి పూజించే తమిళ సోదరులున్నారు.  ఇక పామును గూర్చి చెప్పవలసిన పని లేదు.  ఏనుగుకు ఒక గుడి, పులికి ఒక గుడి, ఎద్దుకొక గుడి, నక్కకొక గుడి, ఎలుకకొక గుడి, కోతికొకటి, పుట్టకొకటి.  ఇవిగాక నల్లగుడ్డలతో కొలువు జేసే దేవుడు.  మూడు నామములతో నీలార్పణ సమర్పించుకొనే దేవుడు.  వీరు మగ దేవుళ్ళు.  ఇక ఆడ దేవుళ్ల సంఖ్య దక్షిణ దిక్కులో సందుకొక ఆడ దేవత ఉన్నది.  పేర్లు మనకు అనవసరము.

        ఈ దక్షిణదిక్కును దేవుడు ఒక ప్రత్యేక రీతిలో ఈ దిక్కును గూర్చి సానుభూతి పరుడై ఈ దిక్కునకు కొంత సమయాన్ని ఇచ్చి యున్నాడు.  ఎందుకంటే భారతదేశములో మొట్టమొదటగా క్రైస్తవ రాజ్యము రాజ్యసువార్త స్థాపన ఈ దక్షిణ దిశ నుండి ప్రారంభమైంది.  అంటే సువార్తకు పునాది దక్షిణ భారతమే.  యేసు ప్రభువు శిష్యులలో ఒకడైన తోమా వాక్య పరిచర్య చేసి, అనేకులకు దేవుని సువర్తమానము నెరింగించి మద్రాసులో హత్య జేయబడి సమాధి చేయబడెను.  ఈనాటికి దక్షిణ భారతదేశములో మద్రాసులో తోమా సమాధి ఉన్నది.  అలాగే దైవిక పరిచర్యలో సత్యదేవునియొక్క సత్యారాధన గూర్చిన ప్రకటన జేస్తూ చనిపోయి శవము చెడకుండా కొన్ని వందల సంవత్సరములుగా ప్రపంచములో ఏ వ్యక్తి పొందనటువంటి గొప్ప ఆశ్చర్యకరమైన దేవునియొక్క మహత్కార్యాన్ని బయలు పరుస్తున్నది.  సెయింట్‌ ప్రాంసిస్‌ జేవియర్‌ అను దైవసేవకుడు చనిపోయి ఆరువందల సంవత్సరములు జరిగినను, నేటికిని ఆయనయొక్క భౌతికకాయము శిథిలము గాకుండా, చెడక భద్రముగా ఒక పేటికలో ఉంచబడి లోక నరకోటికి దేవునియొక్క మహిమను, శక్తిని బయల్పరచుచున్నది.  అలాగే ఇంకను అనేకమంది దక్షిణ భారత నివాసులు యేసు రాజ్యవ్యాప్తి కొరకు హతసాక్షులున్నట్లుగా జీవిత చరిత్రలు ఈ దక్షిణదిశలో రచింపబడి యున్నవి.

        దక్షిణ దిక్కు అన్నది దైవ రాజ్యమునకు పునాది -  దైవ పరిచర్యకు పునాది.  దేవుని సంఘముయొక్క నిర్మాణమునకు పునాది.  అలాగే దేవుడు లేడు.  క్రీస్తు దేవుడు కాడు.  దేవుని పూజలు వ్యర్థము అని నిర్జీవ ప్రచారము చేసే ఈ హేతువాద నాస్తికత్వము కూడా ఈ దక్షిణ దేశములోనే పుట్టింది.  

        అబ్రాహామ్‌ కోవూర్‌ దక్షిణ దేశీయుడే!  ఇన్ని విధాలైన క్రియాకర్మలకు ఈ దక్షిణ దిక్కు కేంద్ర స్థానమైయున్నది. నేటి మన యాత్రా జీవితములో ఉత్తర దిక్కు కంటే దక్షిణదిక్కులోనే యాత్రా విహార కేంద్రాలు బహుముఖముగా వెలసియున్నాయి.  కర్నాటక సంగీతము, వారి సాహిత్యాలు సాటిలేనివి.  దక్షిణదిక్కు యాత్రన్నది వ్యయ ప్రయాసలతోను, ఆసక్తికరమైన, ఆహ్లాదకరమైన వాతావరణముతో కూడినది.  కనుక నరుడు తన జీవితములో చూడవలసినవి ఎన్నో ప్రకృతి సంబంధమైన దైవ సృష్టియుతమైన పుణ్య క్షేత్రాలు, చర్చీలు ఎన్నో వున్నాయి.  నేటికిని మన నిత్య జీవితములో ఉత్తరదిక్కు నుండి దక్షిణ దిశకు వెళ్లే యాత్రా వాహనములు బస్సులు, రైళ్ళు, వ్యానులు, కార్లు వగైరాలు లెక్కకు మించి చూస్తున్నాము.

        ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ దిక్కును దైవవాక్యము బిగపట్టవద్దని దక్షిణ దిక్కుకు ఆజ్ఞ యిస్తున్నది.  అంటే దక్షిణదిక్కులో బిగపట్టేటటువంటి పనులేమిటో ఒక్కసారి మనము తెలిసికోవలసి యున్నది.  క్రైస్తవుడుగా జీవించాలంటే దక్షిణ దిక్కులో శ్రమతో కూడిన పని.  అయినప్పటికిని వానికి ఒక ప్రత్యేకమైన స్థానమున్నది, గౌరవమున్నది.  అందుకే ప్రభువు వాక్యము దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇస్తూ బిగపట్టవద్దు అనగా క్రైస్తవుని జోలికి నీవు పోవద్దు అని ఆజ్ఞ ఇస్తున్నది.

        భక్తికి యుక్తికి మరియు మోసము ఈ మూడింటికి కూడా దక్షిణదిక్కు ప్రావీణ్యత పొందింది.  అంతేగాక గొప్ప గొప్ప విద్వాంసులు, ఇంజనీర్లు, వేదాంతులు, స్వాములవార్లు ఒకరేమి,  సమస్తమైనవారికి ఈ దిక్షిణదిక్కు కేంద్రము.  అందుకే దేవునియొక్క వాక్యము దక్షిణదిక్కును ప్రత్యేకించి బిగపట్టవద్దని చెప్పుటలో దక్షిణదిక్కు నివాసులు డబ్బు విషయములోను, దానధర్మాలను ఏదేని దైవిక కార్యాలలోను ఉదారముగా ఇచ్చేటటువంటి మనోస్థితిగలవారు.  ఇట్టి దిక్కును ఎక్కువగా ఆవరించి యుండేది సాతాను, ఎందుకంటే ఎక్కడ దైవత్వము విస్తరించి యుంటుందో అక్కడ పైశాచికము కూడా ఉంటుందని మనము గ్రహించాలి.  దక్షిణ దిశలోఉన్న దైవ విశ్వాసులను ప్రభువు ఏవిధముగా ఆవరించి యుంటాడో అలాగే వారి గృహ పరిసరాలలో కూడా సాతాను సంచరిస్తూ ఏ విధముగా శోధిస్తామా?  అని తిరుగుచుండును.  అందువలన దక్షిణదిక్కులో దైవత్వమున కెంత ప్రాధాన్యత వున్నదో హేతువాద నాస్తికత్వము కూడా అంత ప్రాధాన్యత సంపాదించు కోవాలని తాపత్రయపడుచున్నది.  దక్షిణ దిక్కు నుండి హేతువాద నాస్తిక రచయితలు వ్రాసిన పత్రికలు, గ్రంథములు మా దగ్గర ఎన్నో ఉన్నవి.  అందుకే తన బిడ్డలను గూర్చి దేవుడు బిగపట్టవద్దు అంటే తన బిడ్డలను అడ్డగించవద్దని ఆజ్ఞాపిస్తున్నాడు.

        ఇందులో తూర్పు అనగా జన్మ స్థానమని, పడమర అనగా నరులు తప్పిపోయి దేవునికి దూరమై జీవించువారి స్థానమని గుర్తించాలి.  ఇక ఉత్తరదిక్కు మరియు దక్షిణదిక్కు అనగా తూర్పున పుట్టినవారు పతనము చవిచూసి పడమరగా మారి క్రీస్తు ద్వారా నిజ దైవమును తెలుసుకొని, తూర్పు సంబంధులుగా మారాలని ప్రయత్నించి, అక్కడ వున్న సమస్యలతో సతమతమవుతున్న దానికి చిహ్నముగా చెప్పబడినది.  అయినను దేవుడు వారిని తిరిగి రప్పించెదనని ఈ వచనము ద్వారా వాగ్దానము చేస్తున్నారు.  

        ఇక, ''దూరమునుండి నా కుమారులను'' అనుటలో భారతదేశమునకు సమీపములో ఉన్నటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి.  భారతదేశములోనే కొన్ని భాగాలుగా విభజింపబడిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి.  ఈ భారత ఖండానికి అనగా ఆసియా ఖండానికి దూరములో ఉండే దేశాలు కొన్ని ఉన్నాయి.  అందుకే భారతదేశములో మన పూర్వుల కాలములో క్రీస్తును గురించిగాని, క్రీస్తుయొక్క సువార్తను గూర్చి ఎరుగరు.  యెహోవా అను దేవుడు ఎవరో ఎరుగరు.  యెహోవా అను నామముగాని, ఇశ్రాయేలు అను నామముగాని అసలు వారెరుగరు.  అప్పుడు బైబిలు ఏమిటో తెలియదు.  సువార్త ఎరుగని దేశములలో సువార్తను ప్రకటింప జేయుటకును, సువార్త పరిచర్యను కొన సాగించుటకు, దైవరాజ్య సువార్తను యావద్‌ ప్రపంచములో విస్తరింప జేయుటకును దూరము నుండి అనగా పాశ్చాత్య దేశముల నుండి దేవుని కుమారులు అనబడు క్రైస్తవ బిడ్డలు ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి, తమ యౌవ్వనాన్ని, తమ కుటుంబ జీవితాలను, తమ శారీర భోగభాగ్యాలను వదలుకొని, మన దేశమునకు వచ్చి మన దేశ వాతావరణ ములో అనేక బాధలుపడి ఎంతో బాధాకరముగాను, అసౌకర్య స్థితిలో దైవ రాజ్యమును గూర్చి, దేవుని పరిచర్య కోసము ఎన్నో త్యాగాలు జేసిరి.  చర్చీలు, వైద్యశాలలు, పాఠశాలలు, అనాధ శరణాలయాలు, వికలాంగులు ఆశ్రమాలు, హాస్టళ్ళు, కుష్టురోగ కేంద్రాలు, గుడ్డివాళ్ళకు శరణాలయము, కుష్టు రోగులకు చికిత్సా కేంద్రాలు, అనాధలైన శిశువులకు సంరక్షణ ఆలయాలు, వితంతు శరణాలయాలు స్థాపించుటయే కాక సత్యదేవుని ఆరాధనను గూర్చిన ప్రకటనలు చేసిరి.  సత్యదేవుని గూర్చినటువంటి సత్య మార్గోపదేశము వగైరా విధముగా మన దేశములో వారి సేవలను జరిగించి, తమ జీవితాలలో గొప్ప చరిత్రలను కలిగినటువంటి ఎందరో మహానుభావులు మన దేశములో వారు చేసిన సేవాధర్మాలను బట్టి మన దేశ చరిత్రలో నిలిచియున్నారు.  అట్టివారిని గూర్చి ఈ వాక్యము ప్రవచిస్తున్నది.

        ఇక ''భూదిగంతమునుండి నా కుమార్తెలను,''  ఈ కుమార్తెలు శారీరకముగా మాత్రమే గాకుండా శరీరాత్మలతో సమర్పించుకొన్నటువంటి యౌవ్వన స్త్రీలు.  క్రీస్తుయొక్క పరిచర్యకు తమ్ము తాము అప్పగించుకొని లోకమునకు దూరస్థులుగాను, పరలోకానికి సమీపస్థులుగాను, శారీరకముగా చచ్చినవారుగాను, ఆత్మీయముగా సజీవులుగాను సేవా పరిచర్యలు జరిగించినవారు.  ఇందులో నానా దేశముల నుండి, నానా జాతులువారుగా, నానా భాషలు మాట్లాడువారుగా, నానా తెగలకు చెందినవారుగా, నానా మతస్థులుగా, నానా విధమైనటువంటి దేహచ్ఛాయ గల్గినవారుగా వుండినప్పటికిని, వీరందరూ దేవుని కుమార్తెలుగా యెషయా గ్రంథములోని వాక్యము ప్రవచిస్తున్నది.  ఉదాహరణ :-  ఇతర దేశాలలో సువార్త ఆయా దేశ భాషలను బట్టి ఒకే భాషలో పరిశుద్ధ గ్రంథమన్నది అచ్చు వేయబడి ప్రచారములో ఉన్నది.  అయితే మన భారతదేశములో క్రైస్తవులమైన మనలో అదే పరిశుద్ధ గ్రంథము కేరళ, తమిళము, తెలుగు, ఒరిస్సా, హిందీ, గుజరాతీ, మరాఠీ, కర్నాటక, కొంకిణి, ఒరియ వగైరా నానా విధములైన భాషలతో ఈ పరిశుద్ధ గ్రంథము అచ్చు వేయబడి, నానా విధమైన జనాంగముల మధ్య ఆయా భాషలు నేర్చిన సువార్త సేవకుల ద్వారా, సేవకరాండ్ర ద్వారా ప్రకటించబడుచున్నదంటే, భూదింగతము నుండి నా కుమార్తెలను రప్పించునన్న ఈ వాక్యానికి ఇది నెరవేర్పు కాదా?

        ప్రియపాఠకులారా!  ''దూరమునుండి నా కుమారులను భూదిగంతమునుండి నా కుమార్తెలను తెప్పించుము,''  అనుటలో ఒకప్పుడు సువార్త కార్యక్రమ నిమిత్తముగా భూదిగంతములకు వెళ్ళిన కుమారులు, కుమార్తెలు వారిచ్చిన తర్ఫీదులో నిజ క్రైస్తవులుగా మారి, దేవునిలో ఎదిగిన కుమారులు, కుమార్తెలు అనేకము ఈ ప్రపంచ నలుమూలల ఉన్నారు.  వీరినందరిని తెప్పించుమని దేవుని వాక్యము చెప్పుచున్నది.  వీరందరు దైవరాజ్యమైన పరమ యెరూషలేములో నివసించుటకు యోగ్యత పొందినవారు కనుక వీరు దూరముగా భూదిగంతములో ఉండినను వారిని పరమ యెరూషలేమునకు తెప్పించునని గ్రహించాలి.

21. ప్రకటించువాడు - రక్షించువాడు - గ్రహింపజేయువాడును నేనే

        యెషయా 43:11-12, ''నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.  ప్రకటించినవాడను నేనే రక్షించువాడను నేనే  దాని గ్రహింపజేసినవాడను నేనే;  యే అన్యదేవతయు మీలో నుండియుండలేదు   నేనే దేవుడను మీరే నాకు సాక్షులు;  ఇదే యెహోవా వాక్కు.''

        ప్రియపాఠకులారా!  పై వాక్యము యెహోవా దేవుడు తన ప్రవక్తయైన యెషయాచే వ్రాయించాడు.  ఇందులో దేవుడైన యెహోవా - ''నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు,'' అని చెప్పుచున్నాడు.  ఇందులో - దేవుడైన యెహోవా తనను రక్షకునిగా చెప్పుకొనుచున్నాడు.  రక్షకుడు అనగా యేసు అని అర్థము.  మత్తయి 1:21, ''ఆమె యొక కుమారుని కనును;  తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.''  కనుక యెహోవాయే యేసు.  యేసే యెహోవా.  వారి ఇద్దరిలో తేడా లేదు.  కనుక యెహోవా దేవుడే యేసుక్రీస్తు పేరుతో ఈ భూమి మీద అవతరించెను.  లూకా 1:47-48, ''ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను  నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను.''  కనుక మరియమ్మయొక్క ఆత్మ రక్షకుడైన యెహోవా యందు ఆనందించినట్లుగా మనము గ్రహించాలి.  హోషేయ 13:4, ''మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను;  నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు.''  అంతే కాకుండా యోహాను 4:42, అపొస్తలుల కార్యములు 5:31, అపొస్తలుల కార్యములు 13:23, ఎఫెసీ 5:23, 2 పేతురు 1:1,  2 పేతురు 3:2, 1 యోహాను 4:14 మొదలైన అన్ని వచనములు క్రీస్తును దేవునిగా చెప్పుచున్నవే!  కనుక క్రీస్తు ప్రభువు తన బోధలో తనను చూచినవారు తన తండ్రిని చూచినట్లే అని బోధించాడు.  కారణము తను తండ్రికి ప్రతిరూపమేగాని క్రీస్తు వేరు, యెహోవా వేరు కారు.  ఇద్దరు ఒక్కరే అని చెప్పుచున్నారు.  ఇందునుబట్టి క్రీస్తులో యెహోవా, యెహోవాలో క్రీస్తు - ఇద్దరు ఏకమై క్రియ జరిగించుచున్నారు.

        ఇక ''ప్రకటించినవాడను నేనే, '' అనుటలో ఆదికాండము ఏదెను చరిత్రలో తినవద్దన్న పండును గూర్చి ఆదామునకు ప్రకటించింది యెహోవాయే!  అలాగే మోషే కాలములో పది ఆజ్ఞలను ప్రకటించినది యెహోవాయే.  అలాగే ప్రవక్తలకు దర్శనమిచ్చి జరుగబోవు సమస్తమును గూర్చి ప్రకటించినది యెహోవాయే.  నూతన నిబంధనను ప్రకటించినది యెహోవాయే, ఎందుకంటే యెహోవాయే రక్షకుడు.  యెహోవాయే యేసు.  యెహోవాయే క్రీస్తు.  ఇలా తన ప్రవక్తల చేత ప్రకటించినవారు యెహోవాయే.

        ''రక్షించినవాడను నేనే,'' అనుటలో ఆదిలో ఆదాము హవ్వలు పాపము చేసి దైవశాపమును పొందినప్పుడు, యెహోవాయే వారికి చర్మపు దుస్తులను అనుగ్రహించి వారికి రక్షణ దయ చేస్తానని మాదిరిగా చేసాడు.  అలాగే కయీను విషయములో ముద్రను వేసి రక్షించాడు.  ఇలా యెహోవాయే క్రీస్తు రూపములో భూమిపై అవతరించి సకల మానవాళి పాపశాప మరణములను నుండి రక్షించాడు.  

        ''దాని గ్రహింపజేసినవాడను నేనే,'' అనుటలో యెహోవా దేవుడు ప్రకటించి, క్రీస్తు రూపములో రక్షణ దయజేసి, పరిశుద్ధాత్మ రూపములో ఆ ప్రకటన రక్షణను గూర్చి గ్రహించునట్లు చేయగలిగెను.  యోహాను 14:25-26, ''నేను మీయొద్ద ఉండగానే యీ మాటలు మీతో చెప్పితిని.  ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.''  ఇందునుబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటించినవి క్రీస్తు రూపములో దేవుడు ఇచ్చిన రక్షణ, దాని సంబంధ బోధనలను జ్ఞాపకము చేసి వారు గ్రహించునట్లు చేయును.  కనుక పరిశుద్ధాత్మ కూడా దేవుడైన యెహోవాయే!  వీరిద్దరిలో కూడా తేడా లేదు.  కనుక దేవుడైన యెహోవా, క్రీస్తు ప్రభువు మరియు పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురును దైవ త్రిత్వముగా గ్రహించాలి.  ముగ్గురు ఒక్కరే కాని సృష్టికార్యముల నిమిత్తము ఆత్మయైన దేవుడు ముగ్గురుగా విభజింపబడినట్లుగా గ్రహించాలి.  కాని ఈ ముగ్గురుగా క్రియ జరిగించినను అది నేనే అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తెలియజేయుచున్నారు.

        ఇక, ''యే అన్యదేవతయు మీలో నుండియుండలేదు,'' అని చెప్పుచున్నాడు.  అన్య దేవతలు దైవ సంబంధమైనవి కావు.  అవి సాతానుయొక్క అభూతకల్పన మాత్రమే.  సాతాను కల్పించిన కథలు కొంతకాలానికి స్థిరపడి దానినుండి నరులు బయటపడలేని స్థితిని చేరుచున్నారు.  ఇవి దైవ సంబంధమైనవి కావు.  వీటి చరిత్రకు ఋజువులు ఉండవు.  పొంతనలేని కథలతో సత్యదేవుని నుండి నరులను దూరము చేయుటకు సాతాను అల్లిన కట్టుకథలుగా మనము గ్రహించాలి.  ఇలాంటివి కొందరి మధ్య లేవని చెప్పబడినది.  కనుక దైవుడైన యెహోవా- ''నేనే దేవుడను మీరే నాకు సాక్షులు;'' అని చెప్పుచున్నారు.  అన్యదేవతలను తమ దగ్గరకు రానియ్యని వారిని తన సాక్షులుగా దేవుడు ఈ వాక్యము నందు చెప్పుచున్నారు.  నుక ఆత్మయైన దేవుడు తండ్రి, కుమార మరియు పరిశుద్ధాత్మగా క్రియ జరిగించి అన్య దేవతల నుండి దూరమై, సత్య దైవారాధనలో ఉన్నవారిని దేవునికి సాక్షులుగా నియమించి యున్నాడు.  వీరు మొదటి పునరుత్థానములో పాలిపంపులు కలవారు.  వీరే క్రీస్తు 1000 సంవత్సరముల పరిపాలనకు యోగ్యులైనవారు.  వీరు అన్యులవలె విగ్రహారాధికులు కారు.  వీరు దేవుడైన యెహోవాయొక్క ప్రకటనల యందు లక్ష్యముంచినవారు.  వీరు క్రీస్తు ప్రభువుయొక్క రక్షణానుభూతిని పొందినవారు.  వీరు పరిశుద్ధాత్మ ద్వారా సమస్తమును గ్రహించి దేవునికి సాక్షులుగా ఉన్నవారు.  ప్రకటన 20:4, ''అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను.  మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని.  వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.''  ఇందులో, ''తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము,'' అని మొదటి పునరుత్థానములో పాలిపంపులుగలవారికి ఒక ఆధిక్యతగా చెప్పబడినది.  కనుక దేవునికి సాక్షులుగా ఉన్నవారు అన్య దేవతలను తమ జీవితములో రానియ్యని వారుగ గుర్తించాలి.

        ఈ యెషయా ప్రవచనమును బట్టి, ప్రకటించువాడు, రక్షించువాడు, గ్రహింప చేసినవాడు ముగ్గురు త్రిత్వములోని వ్యక్తులే అని గ్రహించి, అన్య దేవతలను దగ్గర రానియ్యక దేవునికి సాక్షులుగా జీవించవలసిన అవసరత ఉందని గ్రహించాలి.  ఇలా జీవించితేనే వారిని తన సాక్షులుగా దేవుడు ఎన్నిక చేయునని గ్రహించి అన్యదేవతలకు దూరముగా జీవించుదుము గాక!

22.  ప్రతి మోకాలు దేవుని యెదుట వంగును

ప్రతి నాలుక దేవుని స్తుతించును

        యెషయా 45:23, ''-నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు  నేను నా పేరట మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు.''

        ప్రియపాఠకులారా!  ఇదే విషయమును రోమా 14:11-12, ''నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.''  కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క యొప్పగించవలెను.

        ఇందులో మొట్టమొదటగా - ''నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు,'' అనుటలో సాధారణముగా మోకాలు వంగనిదే ఒక వ్యక్తి నడువలేడు.  కాళ్ళు నిటారుగా చాపి నడచుట అసాధ్యము.  మోకాలు వంగనిదే ఒక వ్యక్తి కూర్చోలేడు.  పద్మాసనము వేయలేడు.  మోకాలు వంగనిదే సైకిలు త్రొక్కుటగాని, రైలు ఎక్కుట, బస్సు ఎక్కుట, కారు ఎక్కుటగాని జరుగదు.  మోకాలు వంగనిదే చెట్టు ఎక్కలేము.  మోకాలు వంగుటలో ఇంత ముఖ్య పద్ధతులుండగా కాళ్ళను సృష్టించిన సృష్టికర్తయైన దేవుడు లోకము నిమిత్తము లోకముయొక్క అవసరాల నిమిత్తము, దేహము నిమిత్తము, దేహ చిత్త ప్రకారము లేక దేహ జ్ఞానముననుసరించి, దేహ అవసరతలను బట్టి శరీరులైన మనము మన మోకాళ్ళు వంచుచున్నాము.  కాని దేహమును, కాళ్ళను, చేతులు వగైరా పంచేంద్రియాలను ప్రసాదించిన పరమాత్ముడు తన యెదుట మోకాలు పంచాలని అంటున్నాడు.  ఇది ఎంత సహజమో ఈ విధముగా మోకాళ్ళు వంచినటువంటి సందర్భాలు ఏవో వేదరీత్యా మనము ధ్యానించగలము.  ప్రభువుతో కూడా ఉండి, మోకాలు వంచిన వారిని కూడా ఈ సందర్భములో మనము తెలిసికోవలసి యున్నది.

        ఆదాము తన భార్యతో కూడా ఏదెనులో మోకాలు వంచి ప్రార్థన చేసినట్లుగా లేదు.  కాని దేవుడు వారితో తోడుగా వున్నట్లు వేదములో చదువగలము.  తుదకు నోవహు కుటుంబము కూడా మోకరించినట్లు లేదుగాని బలులర్పించారు.  అయితే దేవుడు జలప్రళయము ద్వారా సృష్టిని లయపరచి పున:సృష్టిని ఏర్పరచిన పిమ్మట ఈ మోకాలి ప్రార్థనలో కొంతమంది జీవించినట్లు మనము చదువగలము.  మోషే దేవునితో పరిశుద్ధ యోరేబులో సంభాషించినప్పుడు మోకరించి ప్రార్థనా విజ్ఞాపన ద్వారా దేవునితో సంభాషించినట్లు, దేవుడు మోషేయొక్క విజ్ఞాపననాలకించినట్లు వేదములో చదువగలము.

        అసలు మోకాలు వంచుటలోని ప్రత్యేకత ఏమిటంటే తాను దేవుని సన్నిధిలో తన ఎత్తును మరియు తన్నుతాను తగ్గించుకొని దైవత్వానికి విజ్ఞాపన చేస్తున్నట్లుగా సూచనయై యున్నది.  ఇక ఆదికాండము 24:11లో వలె యెలియాజరు కన్యాన్వేషణ చేస్తూ రిబ్కా ఉన్న గ్రామమునకు జేరి, తాను వచ్చినట్టి పనిని గూర్చి దేవునికి విన్నవించుతూ తాను మోకరించుటయేగాక తన మంది మార్భలమును తన వాహకములైన  ఒంటెలను కూడా మోకరింపజేసినట్లు వేదములో చదువగలము.

        ఈ విధముగా మోకరించి దేవుని నామమును స్తుతించిన వారికి కల్గిన సత్ఫలితములను గూర్చి కూడా వేదరీత్యా మనము తెలిసికోవలసి యున్నది.  ఇందులో మోషే మోకరించి చేసిన ప్రార్థన వల్ల ఇశ్రాయేలు అను దైవజనమునకు ఉన్న ఆకలిని దేవుడు మన్నా రూపముగా తీర్చినాడు.  మోషే మోకరించి చేసిన విజ్ఞాపన వల్ల ఇశ్రాయేలుకున్నటువంటి మాంసపు కొరతను దేవుడు దీర్చినాడు.  ఏలీయా జేసిన ప్రార్థన ద్వారా అగ్ని లేకుండగనే దేవుడు బలిని దహించినాడు.  ఏలీయా దేవుని నామములో మోకరించి చేసిన విజ్ఞాపన మూలముగా 3 1/2 సంవత్సరము అనావృష్టి

3 1/2 అతివృష్టి దేవుడు కల్గించినాడు.  అదే విధముగా యెహోషువా, ఎలీషా, యెషయా, యిర్మీయా వగైరాలు.  నెహెమ్యా జేసిన ఉపవాసములో మోకరించి చేసిన ప్రార్థన ద్వారా యెరూషలేమును తిరిగి కట్టుటకు ఫలితాన్ని అందించాడు.  అదే విధముగా దానియేలు గుహ నుండి మోకరించి చేసిన ప్రార్థన ద్వారా దేవుడు దానియేలుతో కూడా ఉండి సింహాల నోళ్లు మూయించినట్లు చదువగలము.

        దేవుని నామములో ఆయనయొక్క తోడులో మోకరించి ప్రార్థన చేయవలసిన విధానాన్ని నూతన నిబంధన కాలములో దేవుడు క్రీస్తు ద్వారా నేటి క్రైస్తవులమైన మనకు చూపించెను.  ఆయన ఎదుట మోకాలు వంచుటకు ఆయనకు విజ్ఞాపన చేయుటకు, మన అవసరతలు మనకున్న సమస్యలు తీర్చుటకు, ఒక ముఖ్య సాధనముగా ఈ మోకాలు వంగుటన్నది దేవుడు నిర్థారించినట్లు తెలియుచున్నది.  మొట్టమొదటగా యేసుప్రభువు నూతన నిబంధన కాలములో ప్రతి విశ్వాసికిని మోకాటి ప్రార్థనన్నది అవసరమనియు, మోకాలు వంగనిదే దైవత్వములో సహాయ సహకారాలు లభించవనియు, కార్యసిద్ధి కలుగదనియు కొన్ని సంఘటనల ద్వారా నిరూపించినట్లు వేదములో మనము చదువగలము.

        మొట్టమొదటగా యేసు ప్రభువు ఈ లోకములో తాను సంచరించిన దినములలో ఒలీవల కొండ మీద తండ్రితో ఏకాంతముగా మాట్లాడు సందర్భములో ఆయన మోకరించి, తండ్రియైన దేవునికి విజ్ఞాపన జేసినట్లు వేదములో చదువగలము.  అటుతర్వాత ఆయనేర్పరచుకున్న 12 మంది అపొస్తలులు కూడా ఈ మోకాటి సావాసమన్నది ఎంతో అవసరమైనట్లుగా బోధించి వారిని కూడా ఈ ప్రార్థనా పరిచర్యలో నడిపించినట్లు వేదరీత్యా తెలిసికోగలము.  స్తైఫను మోకరించి ప్రార్థన చేయుటను బట్టి ఆకాశము తెరువబడుట, దేవుని మహిమను క్రీస్తు దేవుని కుడి పార్శ్వములో నిలిచియుండుటన్నది దర్శనములో చూడగల్గినాడు.  అదే విధముగా పేతురు కూడా మోకాటి ప్రార్థన ద్వారా తనకు కల్గిన దర్శనములో నాలుగు చెంగులు గల దుప్పటిలో అనేక జంతుజాలము, పక్షిజాలమును చూడగల్గినాడు.  ఇక ప్రకటన గ్రంథ రచయితయైన యోహాను మోకాటి ప్రార్థనాశక్తి ద్వారా లోకాంత్యము, క్రీస్తుయొక్క రెండవ రాకడ, నూతన రాజ్య స్థాపన, దేవుని రాజ్య విస్తరణ, దేవునియొక్క పరిపాలన, నిశ్చింత ఆత్మీయ జీవితమును గూర్చినట్టి అనేక మర్మాలు చూడగలిగెను.  దేవునితో వుండి మోకాలు ప్రార్థన ద్వారా దైవత్వానికి విజ్ఞాపన చేస్తూ, ప్రకటన గ్రంథాన్ని యోహాను రచించగల్గినాడు.

        నేటి మన క్రైస్తవ జీవితములో మన మోకాటి ప్రార్థనల ద్వారా మనము సాధించిన దేమిటి?  సాధించి అనుభవించిందేమిటి?  మన మోకాటి ప్రార్థనలెట్టి ఫలితాలిస్తున్నవి?  ఏ శక్తి ద్వారా, ఏ విధమైన యంత్రము ద్వారా సాధించలేని ఘన విజయాలను మోకాటి ప్రార్థన ద్వారా ఆనాటి దైవ విశ్వాసులు సాధించినట్లుగా ఋజువులున్నవి.  ''మెషగు - షద్రగు - అబిద్నగోలు'' వారి మోకాటి ప్రార్థన అనుభవము మూలమున అగ్నిలో కాలకుండుటయేగాక దేవుడు నాలుగవ వ్యక్తిగా కూడా వారికి తోడుగా ఉన్నట్లు దానియేలు గ్రంథములో చదువగలము.  రాణియైన ఎస్తేరు యూదా జాతికి కల్గిన ఉపద్రవము నుండి రక్షణ కోరి చేసిన మోకాటి ప్రార్థన మూలముగా వారి ప్రార్థన విన్న దేవుడు - యూదులకు కలుగుబోవు మారణహోమమును ఆపుజేసినాడు.  నేటి నాగరికతలతో కూడిన క్రైస్తవులమైన మనము మన ప్రార్థనా జీవితములో ఎట్లున్నాము?  మన మోకాటి ప్రార్థన దేవునికెంత వరకు ఒప్పిదముగా ఉన్నాయి?  మనలను మనమే పరీక్షించుకొందము.

        ఇక ''ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయునని,'' అనుటలో మోకాలు వంగుటను గూర్చి తెలిసికొని యున్నాము.  ప్రతి నాలుకయు దేవుని ఏ విధముగా స్తుతించుచున్నదో తెలుసుకొందము.  లోకరీత్యా పంచేంద్రియాలలో ఒక ఇంద్రియమైన నాలుకను గూర్చి యాకోబు పత్రిక 3:5-10లో వివరించబడిన వేద వాక్యాల ద్వారా ఈ సందర్భములో మనము తెలిసికోవలసినదెంతయినా ఉన్నది.  దేవుడు నరునిలో  నాలుకను వుంచినది ఆయనను స్తుతించుటకును ఘనపరచుటకును ఆయన రాజ్య సువార్తను ప్రకటించుటకును, ఆయనకు విజ్ఞాపన జేయుటకును ఆయనను గూర్చి పాడుటకును ఆయన అనుగ్రహించిన ఆహార పానీయాలను చవిచూచుటకేగాని మరి దేనికిని కాదు.  అయితే యాకోబు 3:5-10లో వరుసగా నాలుకను గూర్చి ఈ క్రింది ఖచ్చితమైన అభి ప్రాయమును తెలుసుకోగలము.  ''నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును,'' అని చెప్పబడినది.  నిజమే!  లోకరీత్యా నాలుక దేహాన్ని గూర్చి గర్వపు మాటలు ఎదుటి వానిని తిరస్కరించుట, బూతులు తిట్టుట, అమర్యాదగా మాట్లాడుట, డంభోక్తులు మాట్లాడుట.  దైవత్వానికిని, మానవత్వానికిని ప్రయోజనము లేని నిర్జీవ మాటలు మాట్లాడుచూ - కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టునో, అదే విధముగా నాలుక వలన వ్యక్తులను కుటుంబాలను విశ్వాస కూటమిని సహోదరుల ఐక్యతను అగ్నికంటె బహు తీవ్రముగా రగిల్చి విచ్ఛిన్నము చేయగలదని మనము తెలిసి కోవలసి యున్నది.  

        నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రాపంచికమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు అనగా నరుని పాపిష్టిగాను, భ్రష్టునిగాను, ధర్మ విరోధిగాను, అసత్యవాదిగాను, అన్యాయస్థునిగాను చేయుటయేగాక, గ్రామాలను, పట్టణాలను, దేశాలను, రాజ్యాలను ఖండఖండాలనే తగులబెట్టేటటువంటి తీవ్రమైన శక్తిగలదని మనము తెలుసుకోవలసి యున్నది.  రాజులు మాట్లాడు నోటి మాటల వల్లనే యుద్ధాలు సంభవి స్తున్నవి.  రాజులు మాట్లాడు శాంతి సంభాషణలు యుద్ధ నివారణకు నాంది పల్కుచున్నవి.  ఒక్క రాజుయొక్క నోటి నాలుక మాటల చేత అనేక వేలమంది సైనికులు పౌరులు చిన్న పెద్ద అను తారతమ్యము లేక మరణానికి బలియగుచున్నారో - నేటి రాజ్య పరిపాలనలో అక్కడక్కడ మనము వార్తా పత్రికల ద్వారా వింటున్నాము.  ఇందునుబట్టి మనము ఆలోచిస్తే నాలుక మహా భయంకరమైన, నరునికి సాధు కాజాలని అవయవమైనట్లు గ్రహించవలసియున్నది.

        ఏనుగు మొదలు కోతి వరకు ఉన్న జంతుజాలములలో సమస్తమును నరునికి లోబడి నరుని చిత్తానుసారముగా నరుని ఆజ్ఞానుసారముగా నరుని క్రమశిక్షణలో మసలుచూ క్రియ జరిగిస్తున్నవి.  అదే విధముగా వన్యమృగాలు, గుఱ్ఱములు, ఒంటెలు, గాడిదలు, పశువులతో సహా మనిషి మాటలకు లోబడి క్రియ జరిగిస్తున్నవి.  కాని ఇన్నిటిని స్వాధీనము చేసుకొన్న నరుడు తన నాలుకను స్వాధీనము జేసుకోలేక అనేక అనర్థాలకు దిగజారి పోవుచున్నట్లు మనము అప్పుడప్పుడు వార్తాపత్రికల ద్వారా లేక ప్రత్యక్షముగా వింటున్నాము, చూస్తున్నాము.  ఈనాటి యుద్ధాలు, ఉగ్రవాదత్వము, దోపిడీ, దహనకాండ, దేశ నాయకుల పరిపాలనలో వారియొక్క చట్టాలు.  వీటన్నింటికి మూలము నోటిలోని నాలుకయే.

        నాలుక మాటలలో మోజుపడి నాలుక మాటలనాశించి నాలుక మాటలకు ముగ్దులై, ఆదిలోని నరజంటలో ఒకరైన హవ్వ అపవాది ప్రతిరూపమైన సర్పముయొక్క నాలుక విషపు వాక్కులకు ముగ్దురాలై, తన జీవితమును, తన భర్త జీవితాన్ని, తమ ఇరువురియొక్క నిశ్చింత జీవితాన్ని, అన్నిటికంటే ముఖ్యముగా దైవరక్షణ వలయము దైవకృపను పోగొట్టుకొని, దేవుని పరిశుద్ధ సన్నిధియైన ఏదెను నుండి తరుమబడుటకు  కారణము నాలుక మాటలే.  పాత నిబంధన కాలములో నాలుక మాటల వలన కొందరు మరణపాత్రులై  నాశనకరమైన గోతిలో పడినట్లు ఈ క్రింది వ్యక్తులను గూర్చి తెలుసు కొందము.   ''సౌలు వెయ్యి దావీదు పదివేలు,'' అనిన జనుల మాటలను బట్టి సౌలులో ద్వేషము రగిలి దావీదును చంపుటకు ఈటె నెత్తుకున్నాడు.  అదే విధముగా గొలియాతను ఫిలిష్తీయ వీరుడు నలభైదినములు ఏకధాటిగా దైవజనాంగమైన ఇశ్రాయేలు మీద సవాలు జేస్తూ గర్వముతో కూడిన పరుషమైన మాటలు పల్కుతూ ఇశ్రాయేలు దేవుని దూషిస్తూ దైవ జనాంగాన్ని శపిస్తూ, డాంబికముతో కూడిన గర్వపు మాటలు మాట్లాడుతూ ప్రవర్తించి నందుకు బాలుడైన దావీదు చేత వధించబడినాడు.  అదే విధముగా అహష్వేరోషుయొక్క సంస్థానములో యూదుల మీద కత్తిగట్టిన హామాను యూదా వంశాలను నాశనము జేయ సంకల్పించి, ఫారసీరాజైన అహష్వేరోషుయొక్క సంస్థానములో ద్వారపాలకుడైన మొర్దెకై మీద పగబట్టి, యూదా జనాంగమును సమూలముగా నాశనము జేయుటకు, తన నాలుక మాటలతో రాజును మభ్యపెట్టి, యూదా జాతి నిర్మూలనకు రాజాజ్ఞను సృష్టించి ముద్రించి అమలు జరుపుటకు ఉద్రిక్తుడైనట్లు వేదములో మనము చదువగలము.  సంసోను తన నోటి మాటలవల్ల దేవుడు తనకిచ్చిన ప్రతిష్ట యొక్క రహస్యాన్ని అబలయైన స్త్రీకి వివరించి మరణ పాత్రుడయ్యెను.  అదే విధముగా ఎలీషాచే తిరస్కరించబడిన నయమాను యొక్క కానుకలను గేహాజీ నోటి మాటలతో ఆశించి కుష్టు సంపాయించుకొన్నాడు.  ఫిలిష్తీయ సైన్యము తరుముచుండగా సౌలు దేవుని వెదికి దేవునితో మాట్లాడుటకు బదులుగా సోదెకత్తె చెప్పుమాటలు విని కుటుంబ సమేతముగా చంపబడినాడు.

        నాలుక వలన సంభవించిన ఈ ఉపద్రవాన్ని గ్రహించినారు కదా?  నూతన నిబంధన కాలములో కూడా అక్కడక్కడ కొన్ని వాగ్దోషములను బట్టి మరణాన్ని పొందిన వారిని గూర్చి కూడా చదువగలము.  అననీయ, సప్పీరాలు తమ నాలుకతో అబద్ధాలు మాట్లాడి మరణాన్ని సంపాయించుకున్నారు.  పౌలు సౌలుగా వున్నప్పుడు క్రైస్తవులను చంపుటకును హింసించుటకును, తన నాలుకను ఉపయోగించి కనుదృష్టి కోల్పోయి అభాసుపాలయ్యాడు.  ఇక స్తుతించి ఘనపరచి దేవునియొక్క ఆశీర్వాదములు పొంది, దైవసన్నిధిని దైవరాజ్యములో సుఖశాంతులు పొందిన వారిని గూర్చి తెలుసుకొందము.

          దావీదు మహారాజు తన కీర్తనల ద్వారా దేవుని స్తుతించి లోకరక్షకుడైన ప్రభువునకు పితామహుడయ్యాడు.  అబ్రాహాము తన విశ్వాస పూరితమైన హృదయముతో దైవ చట్టాన్ని విధేయించి, దేవుని స్తుతించి విశ్వాసులకు తండ్రి అయ్యాడు.  మోషే, యెహోషువా, సమూయేలు, ఏలీయా, యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, నెహెమ్యా వంటి ప్రవక్తలు, తమ నాలుకలతో ప్రవచనాలను ప్రవచించి, గొప్ప ప్రవక్తలుగా పరిశుద్ధ గ్రంథములో నేటికి నిలబడి యున్నారు.  అదేవిధముగా పాత నిబంధన కాలములో  తండ్రియైన దేవుని స్తుతించిన వారిలో ముఖ్యుడు దావీదే.  నూతన నిబంధన కాలములో సృష్టికర్తయైన దేవుని ఆయన కుమారుడైన క్రీస్తును, వారి శక్తియైన పరిశుద్ధాత్ముని ముగ్గురిని కూడా స్తుతించేటటువంటి కాలము ప్రారంభమై, క్రీస్తు తర్వాత అపొస్తలులు తమ నాలుకలతో దేవుని స్తుతించారు.  అపొస్తలుల తర్వాత హతసాక్షులు దేవుని స్తుతించారు.  హతసాక్షుల తర్వాత వేదసాక్షులు వేదము ద్వారా దేవుని స్తుతించి ఘనపరచి చరిత్రకెక్కినారు.  వేదసాక్షుల తర్వాత నేటి క్రైస్తవ విశ్వాసులమైన మనము మన నాలుకలతో త్రియైక దేవుని స్తుతించాల్సిన బాధ్యత అవసరత ఎంతో ఎక్కువగా ఉన్నదని మనము గ్రహించాల్సి ఉన్నది.  ఈ రోజులలో ఏదో యొక విధమైన వాక్కులతో దేవుడు ప్రతి స్థలములో స్తుతించబడి మహిమ పరచబడుచున్నట్లుగా ఈ క్రింది విధానము ద్వారా తెలుసుకోగలము.  1.  వేద సాహిత్యాలు,  2.  ప్రార్థనలు,  3.  ప్రసంగాలు,  4.  రేడియోల ద్వారా,  5.  టి.వి.ల ద్వారా  6.  సినిమాల ద్వారా  7.  కరపత్రాల ద్వారా  8. బహిరంగ సువార్తల ద్వారా  9.  ప్రతి ఆదివారము మందిర ఆరాధనల ద్వారా ప్రభువు నామము స్తుతించబడి ఘనపరచబడి, ఆరాధించబడి మహిమ పరచబడుచున్నట్లుగా మనము గ్రహించవలెను.  ఈ మాట వ్యర్థము కాదని ప్రవచింపబడినది.

        ప్రియపాఠకులారా!  ఈనాడు అన్యులు దేవుని యెదుట తమ మోకాలు వంచి  తమ నోటితో ప్రమాణము చేయుట లేదు అని ప్రతి ఒక్కరికి తెలియును.  అంటే మన మూలవాక్యము నిరర్థకమైనట్లేనా!  ఎంత మాత్రము కాదు, ఎందుకంటే యేసుక్రీస్తు తన రెండవ రాకడలో మేఘారూఢుడై వచ్చినప్పుడు, ఆయన తీర్పు తీర్చునప్పుడు పరిశుద్ధులు ఎలాగా తమ మోకాలు వంచి ప్రమాణము చేస్తారు.  అయితే అపరిశుద్ధులు కూడా ఆయన తీర్పును బట్టి భయముతో తమ మోకాళ్లను వంచి ప్రమాణము చేయుదురని మనము గ్రహించాలి.  కనుక ఇది జరగవలసియున్నది.

23. దేవుడు యోచించిన కార్యములను నెరవేర్చు క్రూరపక్షి

        యెషయా 46:11, ''తూర్పునుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను  దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను  నేను చెప్పి యున్నాను దాని నెరవేర్చెదను  ఉద్దేశించియున్నాను సఫలపరచెదను.''

        ప్రియపాఠకులారా!  ఆదిలో దేవుడు తూర్పు దిక్కున ఏదెను తోటను వేసి ఆ దిక్కులోనే తాను ఉద్ధేశించిన నరజంటను రూపించి, వారి మనుగడకు ఆ తోటనిచ్చి ఆ తూర్పు దిక్కుననే తాను నిర్మించిన నరులతో కాలము వెళ్ళబుచ్చుతున్నాడు.  అలాగే యేసు ప్రభువు జనన కాలములో ఆకాశములో తూర్పు దిక్కున ఏ నక్షత్రమును రూపించినాడో ఆ నక్షత్ర పుట్టుకను గూర్చిన జ్ఞానము గల జ్ఞానులను తూర్పు దిక్కున నుండియే రప్పించాడు.  ఇప్పుడు తూర్పు నుండి క్రూరపక్షిని రప్పించుచున్నానని అంటున్నాడు.  ఈ మూడు వాక్యాలలోని పరమార్థమును మనము బహు లోతుగ ధ్యానించవలసి యున్నది.  మొట్టమొదట తూర్పుదిక్కు నుండి మానవకోటి భూమి మీద విస్తరించింది.  తూర్పుదిక్కు నుండియే లోక నరకోటియొక్క పాపమును విమోచించు విమోచకుడైన రక్షకునియొక్క వృత్తాంతము, జ్ఞానులకు, గొల్లలకు వివరించబడింది.  అయితే తూర్పుదిక్కు నుండి దేవుడు పంపెడి ఈ క్రూరపక్షి ఏ దిక్కు అనిన విషయాన్ని కూడా మనము తెలిసికొందము.

        ఆదిలో తూర్పుదిక్కులో దేవుని ఆత్మ నరునిలో నివాసము చేసినట్లే అపవాదియొక్క ఆత్మ కూడా తోటలో సంచరించి, దేవుడు చేసిన భూజంతువైన సర్పములో ప్రవేశించి, తన రూపాన్ని మార్చుకొని నయవంచకముతో స్త్రీతో మాట్లాడి ప్రశాంతము, సమాధానము, ఐక్యత, పరిశుద్ధత, నిష్కళంకము, నిరపాయము, మహా రక్షణాయుతమైనటువంటి ఏదెను అను స్థలములో నరులను దైవాజ్ఞాతిక్రమము, దైవ వ్యతిరేకత, పాపము మరణము అను శాపకరమైన వాతావరణమునకు పునాది వేసిన దిక్కు కూడా తూర్పే అని ఈ సందర్భములో మనమొకటి జ్ఞాపకము చేసుకోవలెను.

        తూర్పు దిక్కున ఆదిలో మాట్లాడిన సర్పము ఆది ఘటసర్పము అని వేదము వక్కాణించి ఉన్నది.  అటుతర్వాత, సర్పముయొక్క మరియొక రూపమే క్రూరపక్షి రూపము.  అపొస్తలుల కాలములో ఈ క్రూరపక్షి రూపాంతరము పొంది గర్జించు సింహమువలె విజృంభించినట్లును, ప్రభువు రాకడ సమయములో, లోకాంత్యములో ఈ క్రూరమృగము అను అబద్ధ ప్రవక్తతో ఈ లోకములో చలామణి యగునని కూడా వేదము ఘోషిస్తున్నది.

        చిత్రమేమిటంటే లూకా 3:22లో పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదికి వచ్చినట్లుగా వ్రాయబడి యున్నది.  అలాగే ఆదిలో ఈ క్రూరపక్షి ఆత్మ సౌలును ఆవరించి, దావీదును చంపుటకు ఈటెను ఎత్తుకొనునట్లు చేసెను.  అలాగే యేసు జనన కాలములో ఈ క్రూరపక్షి ఆవరించిన హేరోదు శిశు సంహారము చేశాడు.  ఈ క్రూరపక్షి ఆవరించిన నరులు ఇశ్రాయేలుకు ప్రతికూల వర్గమునకు చెందినవారు అనగా విగ్రహారాధికులు.  క్రూరపక్షి సాతాను సంబంధ జనాంగము లేక విగ్రహారాధికులైన ఫిలిష్తీయులు, ఐగుప్తీయులు, ఆరామీయులు, మిద్యానీయులు, అమ్మోరీయులు, మోయాబీయులు వగైరా దైవ వ్యతిరేక కూటమిని ఆవరించియుండును.  ఈ విధమైన క్రూరపక్షి క్రీస్తు బాప్తిస్మము పొందినవారిని కూడా ఆవరిస్తున్నది.

        క్రూరపక్షి ఆవరించని స్థలమంటూ లేదు.  ఈ క్రూరపక్షి పుట్టుక తూర్పే.  అనగా ఏదెను వనములోని ఆది ఘటసర్పముయొక్క ప్రతిరూపమే ఈ క్రూరపక్షి.  ఆది ఘటసర్పము కాళ్ళు, రెక్కలు కలిగి వాక్కును కలిగి యుండినది.  ఆదిఘటసర్పము దృశ్యమైనది అనగా కంటికి కనబడేది. ఈ క్రూరపక్షి అన్నది కంటికి కనబడదు.  కాని ఇది ఆవరించిన వ్యక్తి కఠినుడు క్రూరుడు, చెరుపు చేయువాడుగాను, జగడాలమారిగాను, ఎల్లప్పుడు ద్వేషించువాడుగాను, స్వార్థపరుడును, సంఘమును, సమాజమును చెరుపుటకు సాహసియై ఎల్లప్పుడు తిరుగుబాటు చేయు స్వభావము గలవాడుగ ఉండును.  మరియు తనయొక్క క్రూరత్వమును మరుగుపరచి, నయవంచకముతో మాట్లాడుచూ, క్రైస్తవ పరిశుద్ధ మందిరములోనైనను సరే సంఘ పెద్దలలోను, సంఘ కాపరులలోను చేరి, సంఘమును పాడు చేయుటకు సాహసించును.  అంతేగాకుండా ఈ క్రూరపక్షి ఒకటిగా వుండక అనేకులలో చేరి నానా విధములుగల నానా రకముల పొడలు గల దైవత్వమునకు వ్యతిరేకముగా ఒక సమూహమును సృష్టించును.  ఇందునుగూర్చి యిర్మీయా 12:9లో వలె అనేకముగా పక్షుల సమూహముగాను, సంఘమునే కకావికలు చేయు ప్రమాదము లున్నదని మనకు తెలియుచున్నది.

        యిర్మీయా 12:9, ''నా స్వాస్థ్యము నాకు పొడల పొడల క్రూరపక్షి ఆయెనా?  క్రూరపక్షులు దానిచుట్టు కూడుచున్నవా?  రండి అడవిజంతువులన్నిటిని పోగు చేయుడి; మ్రింగివేయుటకై అవి రావలెను.'' అనుటలో దేవునికి చెందవలసిన మహిమను ఇవ్వవలసి నది క్రైస్తవ మందిరములో బలిపీఠము.  అట్టి దేవునికి పరిశుద్ధ బలిని, ఇంపైన బలిని, సువాసనకరమైన బలిని అర్పించబడు స్థలములో క్రూరపక్షి ఆస్థానమును అలంకరించి, బలిపీఠమునకు, దైవవాక్యమునకు, దైవారాధనకు, దైవసంకల్పానికి, సంబంధము లేకుండా చేసి దేవుడు ప్రేమించిన సంఘమునకు కళంకము నంటగట్టును.  మందిరమును బలిపీఠమును కూడుకున్న సంఘమును ఈ క్రూరపక్షి ఆత్మ ఆవరించి, దైవత్వానికి దైవమందిరానికి విశ్వాసుల ఆత్మీయ జీవితానికి విరుద్ధమైన కఠినమైన క్రూరమైన పరుషపు మాటలతోను, వేదమునకు దూరమైన బోధనలతోను అనగా వేదములో వున్న సత్యమును మరుగుపరచి క్రూరపక్షి తన జ్ఞానమును తాను ఆవరించియున్న బోధకునికి అనుగ్రహించి, తద్వారా దైవత్వానికి విశ్వాసుల ఆత్మీయ జీవితానికిని, విరుద్ధమైన బైబిలు చట్టమునకు వేదమునకు పొందికలేని నిష్ప్రయోజన మాటలతోను, పరుషము, కుటిలము, స్వార్థము, ద్వేషము, అహంభావము వగైరా గుణములతో సంఘ కార్యక్రమములను జరిగిస్తూ సంఘస్థులను చెదరగొట్టే హీనస్థితికి ఈ పక్షి తయారైంది.

        ఈ పక్షి ప్రత్యక్షముగా కంటికి కనబడక పోయినను ఆత్మీయ దృక్పథములో అనగా ఆత్మీయ మనోనేత్రముతో ప్రార్థనాయుతముగా దీని నిజరూపమును, దీనియొక్క గుణగణాలను మనము తెలిసికోవచ్చును.  అంతేగాని ప్రత్యక్షముగా దీనిని కనుగొని దీనిని బంధించాలన్న మన శరీర జ్ఞానమునకు ఆగమ్యము.  యెహోవా వద్ద నుండి సౌలు మీదకు వచ్చిన దురాత్మ ఒక్కగానొక దావీదు రాజును మాత్రమే సంహరించాలని ప్రయత్నించింది.  అయితే దావీదు మహారాజు దైవజనుడు గనుక దైవాత్మ పూర్ణుడు గనుక దైవిక తోడ్పాటు గలవాడు గనుక ఆ క్రూరపక్షి బారి నుండి దావీదు తప్పించుకోగల్గినాడు.  వాస్తవానికి దాని బారి నుండి తప్పించుకోవాలంటే చిన్న విషయము కాదు.  మానవమాత్రులు లోక సంబంధమైన సాధనాలతో ఈ పక్షిని బంధించలేరు.  అపొస్తలుల కాలములో ఈ క్రూరపక్షి ఆవరించిన హేరోదు మహారాజు దేవునిని మహిమపరచనందువల్ల పురుగులు పడి నేల మీద పడి చనిపోతాడు.

        క్రూరపక్షి బారి నుండి విశ్వాసపూరితమైన మన ఆత్మీయ జీవితము ప్రశాంతముగా ఉండాలంటే మెలకువ ప్రార్థన సిద్ధపాటు ఇవి అవసరము.  అందుకే ఎఫెసీ 6:12-16, ''ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారుల తోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులతోను, ఆకాశమండల మందున్న దురాత్మలు సమూహములతోను పోరాడుచున్నాము.  అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి  ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువబడుడి.  ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతు లవుదురు.''  ఇది క్రూరపక్షి నెదుర్కొనుటకు ఆయుధ సముదాయములై యున్నవి.  వీటి ద్వారా క్రూరపక్షి బారి నుండి తప్పించుకొనవచ్చును.

        మరియొక విశేషమేమిటంటే ఈ క్రూరపక్షి తనలో ఉన్న క్రూరత్వమును దాచి పెట్టుకొని నయవంచకమును ప్రదర్శిస్తూ నానా విధాలైన వేషధారణలతో విశ్వాసియొక్క జీవితాన్ని ఆత్మపరుడైన వాని వ్రతాన్ని; భక్తిగలవారి భక్తిని పరిశుద్ధతను దెబ్బతీయును.  అనగా వానిని పనికిరాని వానినిగాను, దైవ విరోధిగాను చివరిదశలో క్రూరపక్షి మరణ పాత్రునిగా నరుని పతనము చేస్తుంది.  ఇది మహాభయంకరమైనది.  వేదరీత్యా ఈ పక్షి ఎక్కడెక్కడ ఏయే విధములైనట్టి నీచాతి నీచ కార్యములను జరిగించి ఏయే రీతులుగా నరులను భ్రష్టు పట్టించిందో తెలిసికొందము.

        ఏదెను వనములో ఆదిలో పరిశుద్ధ నరజంట జీవితాన్ని ఆదిసర్పము చెరిపింది.  అటుతర్వాత, ఆది ఘటసర్పమును వదలిన అపవాది ఆత్మయైన క్రూరపక్షి కయీనును ఆవరించి ద్వేషిగాను, పగస్థునిగాను, అసూయపరునిగాను, కోపిష్టిగాను చేసి, దైవదృష్టిలో వానిచేత సోదర హత్యను జరిగించి, హంతకునిగా జేసి దైవదృష్టిలో వానిని శాపగ్రస్థుని గాను, దేశ దిమ్మరిగాను మార్చింది.  దీని మూలమున శాపగ్రస్థుడైన కయీను తనకంటూ ఒక ఊరు కట్టుకొని ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టుకొని, తన సంబంధమైన సంతానాన్ని సృష్టించి విపరీతమైన జనాభాకు తండ్రి ఆయెను.

        ఇట్లుండగా క్రూరపక్షి కయీనును వదలక కయీనుయొక్క స్త్రీ సంతానాన్ని ఆవరించి అనగా స్త్రీ రూపములో క్రియ జరిగిస్తూ, దేవుని కుమారులైన ఆదాము సంతతి యొక్క ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టినది.  ఈ క్రూరపక్షి తాను ఆవరించిన స్త్రీ రూపముల ద్వారా ఆదాము కుమారులను ఆకర్షింపజేసి ఆదికాండము 6:1లో విధముగా కోళ్ళ ఫారములో పొదుగుడు యంత్రములో ఏ విధముగా పిల్లలు పిగులునో ఆ విధముగా పాపాన్ని ఇది పిగిలించి విస్తరింప జేసింది.  అయినను దైవత్వమన్నది దీనిని వదలక జలప్రళయము ద్వారా ఈ క్రూరపక్షికి దొరకని నోవహు అను ఒక కుటుంబాన్ని తప్పించి యావద్‌ సృష్టిని లయపరచాడు.  అయినను క్రూరపక్షి ఆత్మ కాబట్టి ఆ తర్వాత నోవహు ద్వారా ఏర్పరచిన నూతన సృష్టిలో కూడా ఈ క్రూరపక్షియొక్క కార్యక్రమాలు ప్రారంభించ బడినవి.  అందులో భాగముగా ఈ క్రూరపక్షి మొట్టమొదటగా సొదొమ గొమొఱ్ఱా పట్టణ ప్రజలను తన పొదుగుడు పిల్లలుగా చేసికొని అనగా వారిలో తాను ప్రవేశించి, పాపమును విస్తరింపజేసి, దైవత్వము ఓర్చుకోలేనంతటి మితి లేని పాపాన్ని ఆ రెండు పట్టణాలలో ఈ క్రూరపక్షి పుట్టించింది.  ఆ సమయములో దేవుడు సొదొమ గొమొఱ్ఱా పట్టణాలను అగ్ని గంధకముతో తుడిచివేయు ప్రణాళికను రూపొందించి, సొదొమ పట్టణ నివాసియైన లోతు అతని కుటుంబము క్రూరపక్షికి దూరముగా దైవత్వమునకు సమీపమై, దేవునికి ప్రీతికరమైన కుటుంబముగా ఉండుటనుబట్టి సొదొమ పట్టణాన్ని విడిచి రమ్మని తన దూతలను పంపెను.  సొదొమ గవిని లోతు కుటుంబాన్ని దాటించు సందర్భములో ఈ క్రూరపక్షి లోతు కుటుంబాన్ని గగ్గోలు పెట్టుటకు, లోతు ఇంటికి వచ్చిన దేవదూతలను చెడుపుటకు సొదొమ జనాంగమును ఆవరించి, బహు తీవ్రముగా,  భీకరముగా, కఠోరముగా క్రియ జరిగించగా, దైవత్వము ఆ జనాంగానికి గ్రుడ్డితనము కల్గించింది.  ఈ విధముగా దేవుని ఆత్మయైన పావురమునకు సాతానుయొక్క రూపమైన క్రూరపక్షికిని పోరాటము జరిగింది.  ఈ సమయములో లోతును, అతని కుటుంబాన్ని వెంటబెట్టుకొని దేవదూతలు సొదొమ గొమొఱ్ఱా దాటి వచ్చునప్పుడు కూడా ఈ క్రూరపక్షి లోతు భార్యను ఆవరించి, ఆమెను వెనుదిరిగి చూచునట్లుగా క్రియ జరిగించగా దైవశాపము చేత ఉప్పు స్థంభముగా మార్పించింది.

        చూచితిరా?  ప్రియపాఠకులారా, క్రూరపక్షియొక్క నయవంచక లీలలు, అపవిత్ర కార్యాలు.  ఇంతేగాకుండా జల ప్రళయానంతరము నోవహు చేతను, లోతుతో అతని కుమార్తెల చేతనే పాపము చేయించింది కూడా ఈ క్రూరపక్షియే.  అంతటితో ఆగక, బాబేలు గోపురమును కట్టుటకు జనాంగమును ప్రేరేపించి, వారిచేత ఆకాశమును అంటు గొప్ప ఎత్తయిన పట్టణమును కట్టుటకు క్రియ జరిగించింది?  ఈ క్రూరపక్షి జరిగిస్తున్న ఈ క్రియను దేవుడు గ్రహించి, స్వార్థము, అహంభావము, దైవ వ్యతిరేకతతో కూడిన కార్యక్రమమునకు సిద్ధపడిన నరకోటిని క్రూరపక్షి ఆవేశపూరిత మొండి వైఖరిని గ్రహించిన దేవుడు, వారి భాషలను తారుమారు చేసి వారి పని నుండి ఆపు చేయించాడు.  అయినను ఈ క్రూరపక్షి భూమి మీద తన కార్యక్రమాలను విడవలేదు.  అబ్రాహాము మొదలుకొని యాకోబు వరకు వున్న జనాంగములో విశ్వాసియైన అబ్రాహాము, అతని కుమారుడైన ఇస్సాకు 12 గోత్రాలకు మూల పురుషుడైనట్టి సంతానమును అక్కడక్కడ శోధించినప్పటికిని దీని ఆటలను కట్టిస్తూ వచ్చినాడు.  ఈ విధముగా దేవునికి క్రూరపక్షికిని పోరాటము జరుగుచుండుటలో దేవుడు తనకంటూ ఒక జనాభాను ఏర్పరచుకొని, వారి ద్వారా భూమి మీద ఈ క్రూరపక్షి - దీని సంతానముతో పోరాడినట్లు ఇశ్రాయేలుయొక్క చరిత్ర మనకు వివరిస్తున్నది.

        ఇంతకును ఈ క్రూరపక్షి తనంతట తానుగా ఏదియు చేయలేదు.  దీనికి కూడా దైవాజ్ఞ, దైవచట్టము, దైవనిర్ణయము, దైవసంకల్పము అవసరమై యున్నట్లు యెషయా 46:11లో మనము చదివినట్టి వాక్యమే దీనికి ఋజువగుచున్నది.  ''తూర్పునుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను దూరదేశమునుండి నేను యోచించిన కార్యములు నెరవేర్చు వానిని పిలుచుచున్నాను.''  అయినను దీనికి మరియొక ఋజువు న్యాయాధిపతులు 13:1 మనము చదివితే, ''ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను.''  ఇందులోని సారాంశము దోషులుగా కాగా ఫిలిష్తీయులకు వారిని అప్పగించెను.

        కనుక దైవజనాంగముయొక్క ఆత్మీయ స్థితి దైవత్వానికి విరోధముగాను, ప్రతికూలముగాను వ్యవహరించిన దేవుడు అట్టి వారిని క్రూరపక్షికి అప్పగిస్తాడు.  ఈ ఫిలిష్తీయులేగాక క్రూరపక్షి సంబంధులైన జనాంగము ఐగుప్తీయులు, ఆరామీయులు, మిద్యానీయులు, అమ్మోరీయులు, మోయాబీయులు, వగైరా దైవకూటమికి వ్యతిరేకులైన అన్య జనాంగమంతయు ఈ క్రూరపక్షి సంబంధులని మనము గ్రహించవలెను.

        యెరూషలేమును కూడా దేవుడు క్రూరపక్షికి అప్పగించినట్లుగా ప్రభువు విలపిస్తూ - లూకా 13:34, ''యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో ఆలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరొల్లకపోతిరి,'' అనుటలో పరిశుద్ధాత్మ రూపుడైన యేసు ప్రభువును దేవుని పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమును కూడా తృణీకరించి ఈ పక్షి ఆవరించింది. మరియు లూకా 19:41.

        దేవుని ఆత్మ పావుర రూపములో సంసోను మీద వాలుచు, సింహాన్ని క్రూరపక్షి సముదాయమైన ఫిలిష్తీయులను ఏ ఆయుధ సామగ్రి లేకుండా, ఏ వ్యక్తి సహాయము లేకుండా పరిశుద్ధాత్మ అనగా దేవునియొక్క ఆత్మ శక్తితో పోరాడి శత్రుసంహారము జరిగించిన సంసోనును అంధునిగాను, అశక్తునిగాను, మరణపాత్రునిగాను, ఒక పశువుగాను చేయుటకు ఈ క్రూరపక్షి క్రియ జరిగించింది.  ఈ క్రియలో నయ వంచకములతో స్త్రీలో జొరబడి సంసోనును తన తొడల మీద ఉంచి క్షౌవరము చేయించి, సంసోనుయొక్క దైవత్వముపై విజయాన్ని సాధించాలని అనుకున్నది ఈ క్రూరపక్షి.  అయితే దైవత్వమన్నది విజృంభించి క్రూరపక్షి జనాంగమైన ఫిలిష్తీయులను క్రూరపక్షి దేవాలయమైన దాగోను ఆలయములో సభ చేయించి, అంధుడైన సంసోనుకు బలాన్ని ఇచ్చి దాగోను ఆలయ స్థంభాలను కూల్చి, నిశ్శేషముగా దేవుని ఆత్మ ఫిలిష్తీయుల జనాంగాన్ని తుద ముట్టించింది.

         యెజెబేలు రాణిని ఈ క్రూరపక్షి ఆవరించి దైవజనాంగమైన ఇశ్రాయేలు రాజైన తన భర్తయైన ఆహాబును సహా విగ్రహారాధికులుగా మార్చింది.  ఈ విధముగా ఈ క్రూరపక్షియొక్క క్రియాకర్మలను గూర్చి తెలిసికోవాలంటే వేదరీత్యా చాలా అంశములున్నవి.  క్రూరపక్షి ఆవరించబట్టే పరమ గురువు రక్షకుడైన యేసుక్రీస్తు శిష్యుడైన యూదా ఇస్కరియోతును కూడా ఈ క్రూరపక్షి వెండి రూపముగా అతనిని ఆవరించి మరణపాత్రునిగ జేసింది.  ఈ విధముగా నాటి రాజులు, చక్రవర్తులు సువార్తకు విరోధులైన ప్రతి వ్యక్తిని ఈ క్రూరపక్షి ఆవరించి నానావిధ ఆశలతో, వ్యామోహాలతో, వారియొక్క ఆత్మ విలువలను పతనము చేసి దైవత్వము నుండి తప్పించింది.

        క్రూరపక్షి అన్నది సాతానుయొక్క ప్రతిరూపాలలో ఒకటి.  దైవత్వముయొక్క దృశ్యరూపము యేసుక్రీస్తు అనగా దేవుని రూపమై యున్నాడు.  చిత్రమేమంటే దేవుని రూపము లోక సంబంధముగా మానుషేచ్ఛలతో కల్గింది కాదు.  మానుషేచ్ఛలు అనగా నర ప్రమేయముతో రూపించబడింది కాదు.  దేవునియొక్క స్వరూపము నిజమునకు మానవరూపమేగాని, మానవ సంబంధము మానవేచ్ఛలతో కూడినది కాదు.  పురుష ప్రమేయము లేకుండా దైవత్వము స్త్రీ గర్భములో కుమారత్వమును రూపించింది.  పురుష సంబంధము స్త్రీ గర్భము లేకుండా నేలమంటితో దైవత్వము నరరూపాన్ని నిర్మించింది.  సాతానుయొక్క కుతంత్రములను దృశ్యములుగా కనబరచుటకు వీలుగాని రీతిలో బహు కుయుక్తిగా వుంటుంది.  దేవుడు చేసిన క్రియా రూపములో సాతాను ప్రవేశించగలడుగాని సాతాను స్వతహాగా స్వయంభవుడు కాదు.  దైవసృష్టిలో ప్రవేశించువాడును లేక కన్నులకు భ్రమ గొలిపి, మాయామంత్రాలతో, మాయతో కూడిన దృశ్యాలను చూపించగలడు.  అలాగే నరుడు కూడా విద్యుచ్ఛక్తి, యంత్రశక్తి ఉపయోగించి యంత్రాల ద్వారా టి.వి.లలో దృశ్యాలు, రేడియోలలో మాటలు, యంత్రాల ద్వారా సందర్భమును బట్టి పనిముట్లు, మానవ అవసరతలకు కావలసిన పనులు జరిగిస్తున్నాడు.  నరుడు కూడా స్వయంభవుడు కాడు.  స్వయంభవుడు దేవుడే.  దేవునియొక్క క్రియల మూలముగా ప్రకృతిలో ఏర్పడిన సృష్టిలో సాతానుగాని, నరుడుగాని క్రియ జరిగిస్తున్నారు.  ఉదా :-  ఏదెను వనములో దేవుడు ముఖాముఖిగ ఆదాముతో మాట్లాడినాడు.  సాతాను సర్పములో ఆవరించి మాట్లాడవలసిన స్థితి ఏర్పడింది.  ఇంతకు సర్పము దేవుడు చేసిన భూజంతువు.  సర్పముతో దృశ్యముగ మాట్లాడినందున స్త్రీ పాప ప్రవేశము చేయుటకు వీలైనది.  అయితే దేవుడు నరులతో మేఘములో నుండి మోషేతో అదృశ్యములో ఉండి మాట్లాడినట్లును వేదములో చదువగలము.

        ఈ విధముగా అదృశ్యములో ఉండి మాట్లాడిన దేవుడు నూతన నిబంధన కాలములో దృశ్యమైన ప్రతి వ్యక్తికిని అందుబాటులో మాట్లాడినట్లుగా నూతన నిబంధన చరిత్ర ద్వారా మనకు తెలియును.  నరుడు కూడా అంతే.  దేవుని సృష్టియైన జంతుజాలమునకు మాటలు నేర్పి, తర్ఫీదునిచ్చి, వాటిని సాధనపరచి వాటి ద్వారా తన పనులను చేయించుకుంటున్నాడు.  ఈ విధముగా నరుడు తన స్వార్థమునకు జంతు జాలమును, పక్షి సముదాయమును వాడుకుంటున్నాడు.  ఉదా :-  ఏనుగు, ఎద్దు, గుఱ్ఱము, కుక్క, కోతి, వగైరా వాటి చేత నానా విధములైనట్టి పనులు చేయించుట సర్కసులో మనము చూస్తున్నాము.

        చిత్రమేమంటే దేవుని ఆత్మను పొంది దేవుని హస్తము చేత రూపించబడిన నరునియొక్క జ్ఞానమును, వాని శరీరమును సాతాను తన సాధనముగా వాడుకొను చున్నాడు.  అంటే దీని భావము నరునిలోనే ప్రవేశిస్తున్నాడు.  సాతానుయొక్క నిజరూపము సర్పము అంటూ వాక్యములు ఉన్నప్పటికిని, సాతానుయొక్క  అనుచరులు, ప్రవక్తలు, బోధకులు, నరులేయని మనము గ్రహించవలెను.  ఇందుకు సాక్ష్యము అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తువులు మొదలైనవారు సాతాను ఆత్మ ఆవేశులై, సాతానుయొక్క ఆత్మకు ప్రతిరూపాలై బహిరంగముగా కనబడే ప్రబుద్ధులు, వీరి బోధలు, విరి నియమాలు, వీరి చట్టాలు, వీరి ఆశయాలు, వీరి చర్యలు బహు చిత్రవిచిత్ర రీతులలో ఉండును.  క్రైస్తవులే జాతకాలు చూస్తారు.  క్రైస్తవులే తిథి, వార, నక్షత్రాలు పాటిస్తారు.  క్రైస్తవుల ప్రధానము, తాంబూలాలు, ఇచ్చి పుచ్చుకొనుట, కట్నకానుకలు ఇచ్చి పుచ్చుకోవడము, బీద, ధనిక అనెడి తారతమ్యాలు పాటించుట, సోదె అడుగుట, శకునాలు చూచుట, అమావాస్య - పాడ్యమిలు పాటించుట, వగైరా ఆచారాలను ఆచరిస్తారు.  అయితే వీరు క్రైస్తవులే.  ఇట్టివారు ఏ రకము క్రైస్తవులో మనలను మనమే ఎంపిక చేయవచ్చును. ఇందునుబట్టి చూడగా సాతాను కూడా క్రీస్తును పోలి, క్రైస్తవ ఆచారముతో క్రైస్తవ గ్రంథమైన బైబిలును చేత పట్టుకొని తిరుగుచున్నాడు, అనుటకు ఇంకా కొన్ని నిదర్శనాలున్నవి.  క్రైస్తవులే క్రీస్తు ప్రేమ లేదు.  క్రైస్తవులే తమవలె ఎదుటివానిని ప్రేమించలేరు.  క్రైస్తవులే ఎదుటివారి అవసరతను తీర్చలేరు.  క్రైస్తవులే నెలకొకసారి కూడా గుడికి రారు.  క్రైస్తవులే గుడిలో, ఆరాధనలో కునికిపాట్లు పడి తూగుచుందురు.  క్రైస్తవులే అంతస్తులు పాటిస్తారు.  విశ్వాసులేగాని, వారి విశ్వాసము ప్రభువు మీద వుండదు, ప్రభువును అనుసరించి వుండదు.  లోక సంబంధమైన సంఘ పెద్దలయొక్క అజమాయిషీ మీద ఉంటుంది.  వారి మెప్పును బట్టి ఉంటుంది.  అలాగే క్రూరమైన పక్షియైన సాతానుడు క్రైస్తవ మందిరాలను కూడా ఆక్రమిస్తున్నాడు.  

        దీనినిగూర్చి 2 తిమోతి 3:1-4లో తేటతెల్లముగా వివరించియున్నాడు.  ఇది యొక రకము.  ''అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము.  ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖాను భవము నెక్కువగా ప్రేమించువారు.''  కనుక

2 థెస్సలొనీక 2:4లో వలె క్రైస్తవ మందిరాలలోనే సాతాను ప్రవేశించి బలిపీఠము మీద యాజకులలో ప్రవేశించి, సంఘస్థులను కోర్టుల పాల్జేసి, అన్యుల యెదుట క్రీస్తు నామమును హేళన చేయించుటకు కూడా క్రియ జరిగిస్తున్నాడు.  ఈ విధముగా ఎన్నో సంఘములు విమర్శలకు గురియై పతనావస్థలో ఉండుట కూడా మనము చూస్తున్నాము.  ఇవి క్రూరపక్షియొక్క గుణాతిశయములు.  కాబట్టి ఆ విధముగానున్న క్రూరపక్షి ఈ దినములలో పక్షి రూపమును వదలుకొని రెండు కాళ్ళు, రెండు రెక్కలుతో సంచరించుటకు బదులు చతుష్పాద జీవియైన వన్య మృగమైన గర్జించు సింహము వలె పతనావస్థ అను దాహమును పొంది, యావద్‌ నరకోటి జీవితాన్ని దైవత్వమునకు నిష్ప్రయోజనముగాను, మరణానికి పాత్రులుగాను చేయుటకు ప్రతి వ్యక్తియొక్క ఆత్మీయ జీవితాన్ని మ్రింగివేయాలని ప్రతిచోట, ప్రతి స్థలము, ప్రతి మందిరము, ప్రతి గృహము మరి ముఖ్యముగా ప్రత్యేకించి, ప్రతి క్రైస్తవ ఆత్మీయ జీవితాన్ని నాశనము చేయాలని దుర్భుద్ధితో ఈనాడు విచ్చలవిడిగా తిరుగుచున్నాడు.

        దైవత్వమునకు పైశాచికమునకును ఉన్నటువంటి తారతమ్యమేమిటంటే దైవసృష్టిలో సాతాను ప్రవేశించగలడుగాని దేవుడు - సాతాను సృష్టిలో ప్రత్యక్షముగా ప్రవేశించలేడు.  ఎందుచేతనంటే ఆ విధముగా సాతానుయొక్క సృష్టిలో దేవుడు ప్రవేశించియుంటే ఈనాడు దైవత్వానికి భూమి మీద ఘనత ఉండేది కాదు.  దేవుడు ప్రవేశింపని మరియు పవిత్రపరచని ఆయన దృష్టికి హేయమైనట్టి జంతుజాలములు, పక్షిజాలములు కలవు.  కోతిగా అపవాది అవతారమెత్తగలడు.  అనగా కోతిలో ప్రవేశించి నేను ఒక దేవుడను అనగలడు.  అలాగే పంది ఇంకను సింహము, తాబేలు, సర్పము వీటిలో ప్రవేశించి, తాను దేవుడనని ఈనాటికిని నరుల చేత పూజింపబడుచున్నాడు.  కాని రూపములు మాత్రము సాతానువే.  ఆరాధించేది మాత్రము దేవుని పేరుతో, ఈ పరమార్థాన్ని నరుడు గుర్తించనందున నరకోటికి వాటివలన ప్రయోజనము కలుగలేదు.  కారణము అవి దైవ రూపములు కావు.  అయితే దేవుని పేరుతో ఆరాధించబడుచున్నవి.  వాటి ఆరాధన దైవారాధన కాదు.

        మరియు సాతాను అబద్ధమునకు జనకుడు.  కనుక ప్రతి విగ్రహానికి ఒక కాకమ్మ కథ అల్లి, అందుకు అనువగు సాహిత్యాన్ని దానికి సంబంధించిన దండకాన్ని సృష్టించి, తన బాధ్యతను నెరవేర్చుకొని, ఆ ఆచార ఆరాధనలో వచ్చెడి నిందను దైవత్వానికి అంటగట్టి గుట్టుచప్పుడు కాకుండా వెళ్ళిపోవును.  సాతానుడు మౌనియై, పరమ సాధువుగా, కాషాయాంబరధారియై, గడ్డాలు మీసాలు ధరించి, జడలు పెంచి, నరరూపములో బహిరంగముగా స్వాములవారు అను పేరుతో తిరుగుచున్నాడు.  కాని ప్రజలనుద్ధేశించి ఈ స్వామి పలికే మాటలు మాట్లాడుతూ, లోక సృష్టాలుగా రూపించబడిన విగ్రహాలనే కొలువమంటాడు.  విగ్రాహాలే దేవుళ్ళని కథలు వల్లించును.  నిజమైన ఆరాధన క్రైస్తవ్యములో ఉంది.  ఈ నగ్నసత్యాన్ని లోకమెరుగదు.  

        ఈ సందర్భములో యోహాను 1:1-4, ''ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.  ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను.  సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.  ఆయనలో జీవముండెను;  ఆ జీవము మనష్యులకు వెలుగైయుండెను.  ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నదిగాని చీకటి దాని గ్రహింపకుండెను.''  ఆ విధమైన చీకటి అంధకార జీవితములో వున్న వ్యక్తులే అంధకార జ్ఞానముతో కూడిన మాటలు, ఆరాధనలే ఈ అన్య జీవుల ఆరాధనలు.

        నేడు సువార్త వెలుగు ప్రత్యక్షముగా వెలుగుచున్నను, చీకటియైన లోకము ప్రత్యక్షముగా ఆ సువార్త వెలుగును గుర్తించలేకున్నది.  అందుకు కారణము 2 కొరింథీ 4:4, ''దేవుని స్వరూపియైయున్న క్రీస్తుమహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.''  దేవుని రాజ్య సంబంధమైన యేసుయొక్క సువార్త వెలుగు క్రీస్తు నెరుగని అనగా అవిశ్వాసులైనవారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధ దేవత అనగా ఈ క్రూరపక్షియొక్క ప్రతిరూపము ఆత్మీయ అంధత్వాన్ని కల్గించినట్లుగా వ్రాయబడి యున్నది.  

        క్రూరపక్షియొక్క నిజ రూపము ఇప్పటివరకును సరిగా బైటపడలేదు.  ఇంత వరకును క్రూరపక్షియొక్క రూపము అదృశ్యములో ఉండి ఏదెనులో సర్పరూపములోను, కయీను రూపములోను, కయీను కుమార్తెల రూపములోను, లోకాన్ని భ్రష్టు పట్టించి క్రియ జరిగించినది.  ఈ క్రూరపక్షి మూలాన జరిగిన జల ప్రళయ నాశన మారణహోమము.  తదుపరి దైవ సంకల్పములో పున: నిర్మించబడిన సృష్టిలో బాబేలు అను దైవ వ్యతిరేక కట్టడమును నిర్మించి, ఈ క్రూరపక్షియొక్క ఆత్మ అనేకులలో ప్రవేశించి, వారిని దైవోగ్రత పాలు జేయుటకు వారిచేత కట్టించిన బాబేలు గోపురము ఈనాటికినీ వేదములో నిలబడి ఉన్నది.  ఈ విధముగా క్రియ జరిగించిన క్రూరపక్షియను సాతానుడు నానా విధములుగా ఆయా సందర్భాలను బట్టి ఇశ్రాయేలుకు ప్రత్యర్థి కూటములలో అనగా ఫిలిష్తీయ ఆరామీయ మిద్యానీయ ఐగుప్తీయ అమ్మోరీయ, మోయాబీయులు వగైరా అన్య జనాంగములలో ఈయొక్క సాతాను ఆత్మ బహుముఖరీతులలో, నానా విధమైన హింసలతో పద్ధతులలో దైవ జనాంగమైన ఇశ్రాయేలును చెరపట్టి హింసించినట్లు చదువగలము.

        అయితే యేసు నియమించిన నూతన నిబంధన కాలము జరిగిపోగా, ఆయన ప్రతిష్టించిన అపొస్తలుల యుగము జరిగిపోగా, అపొస్తలులు ఏర్పరచిన కృపాకాలము జరిగిపోగా, లోకాంత్యము ప్రభువు రాకడకు సమీపములో ఉంటూ - నిరీక్షణ కలిగిన జీవితములో ఉన్న నేటి నరకోటియొక్క విశ్వాసమును పతనము చేయుటకు, సాతానుడు నానా రీతులుగా నేటి యుగములో క్రియ జరిగిస్తున్నాడు.  యావద్‌ ప్రపంచములో ఆహార సమస్య, విద్యుచ్ఛక్తి సమస్య, నీటి సమస్య, విపరీతమైన ధన వ్యయము, నిరుద్యోగ సమస్య, వాతావరణ కలుషితము, యుద్ధ భయాలు, మొదలైనవి అలుముకొనియున్న ఈ యుగములో అపవాది జరిగించు క్రియలు అతి భయంకరము.  క్షామము, అనారోగ్యము, జనాభా పెరుగుదల, వాతావరణ కలుషితము వగైరా తీవ్ర సమస్యలను నేడు ఎదుర్కొనుచున్న ప్రపంచ దేశాలలో నరునియొక్క నిత్యావసరత తీర్చుటకు జరుగవలసిన కార్యమునకు బదులు నల్లగుడ్డలు, ఆరాధన, మసీదును కూల్చుట, రామాలయము పేరుతో విప్లవాలు లేవనెత్తుట, సమ్మెలు, నిరాహారదీక్షలు, తిరుగుబాటు, మందుగుండు సామగ్రితో పోరాటము జరిగించుట, వగైరా కార్యములతో ప్రభుత్వాల మీద తిరుగుబాటు, రాజ్యాంగ చట్టము మీద తిరుగుబాటు, సత్యదేవునిపై తిరుగుబాటు చేస్తున్నారు.  మతతత్వము, కులతత్వము, జాతి బేధము, స్వార్థము, ధనదాహము, పదవీవ్యామోహము, ఈ అస్త్రముల నుపయోగించి ప్రభువు రాకడకు నిరీక్షించే భక్తకోటియొక్క నిరీక్షణను, విశ్వాసమును, భ్రష్టత్వము పట్టించుటకు అపవాది నిర్విరామముగా తిరుగుచూ మరియొకవైపు ఉగ్రవాదత్వము, దోపిడీలు, హత్యలు, దేశములోను, రాష్ట్రములోను, గ్రామాలలోను, ఒకచోట అనిగాక ప్రతిచోటను మారణహోమములు జరిగిస్తున్నారు.  అంతేగాక మానవ ప్రపంచములో అగ్రదేశాలలో కూడా కారు చిచ్చును రేపి యుద్ధానికి పురికొల్పి బహు ఘోరమైన, భయంకరమైన మారణహోమానికి ఇప్పుడు సిద్ధపడి యున్నాడు.

        నరుడు జీవించియున్నంత కాలము ఏదో యొక్క రీతిలో దేవుని కృప అతనికి సహాయముగా ఉంటుంది, ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు.  అపొస్తలుల కార్యములు 10:34-36లో వలె యేసుక్రీస్తు అందరికి ప్రభువు అన్నట్లుగా ప్రతి జీవికిని తండ్రి దేవుడైయున్నాడు. దేవుని బిడ్డగా రూపొందించబడిన నరునికి శరీరరీత్యా ప్రతి నిత్యము, ప్రతి దినము, ప్రతి క్షణము ప్రధాన శత్రువు ఈ సాతాను అను క్రూరపక్షియై యున్నది.

        దేవుడే విధముగా మనలను కనిపెట్టి యున్నాడో అపవాదియగు క్రూరపక్షి కూడా ఒకవైపు మనలను నరుని పతనము చేయుటకు క్రియ జరిగిస్తున్నాడు.  అందుకే లూకా 13:34, ''యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో ఆలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని యుంటినిగాని మీరొల్లకపోతిరి.''  అనుటలో ప్రభువు కోడిపెట్టయు, ఆయన రెక్కల క్రింద ఆయన సన్నిధి ఉన్నదనియు, ఆ సన్నిధిలో మనము జీవిస్తున్నామన్న నగ్నసత్యాన్ని ఇందులో గ్రహించవలసియున్నది.  అనగా ప్రభువు రెక్కల క్రింద వున్నంత వరకు మనకేమియు భయము లేదు.  ప్రభువు రెక్కలకు బాహ్యముగా జీవిస్తే క్రూరపక్షి ఆత్మ డేగ రూపములో మన ఆత్మీయతను కబళిస్తున్నదని భావము.  కోడి రెక్కల క్రింద ఉండని కోడిపిల్ల కోడి రెక్కలకు బైట దిరిగినప్పుడు అనగా ఇష్టానుసారముగా సంచరించి నప్పుడు అది గ్రద్దవాత పడక మానదు, గ్రద్ద తన్నుకొనిపోతుంది.  అనగా కోడితో వున్న సంబంధము దానికి తెగిపోతుంది.  ప్రభువు రెక్కల క్రింద అనగా ఆయన వాక్కులు, ఆయన ప్రార్థనలో, ఆయన సహవాసములో, ఆయన మందిరములో, ఆయన సన్నిధిలో, ఆయన ప్రేమలో, ఆయన విశ్వాసములో, ఆయన పరిధిలో మనము నివసించినంత కాలము లోకము అనెడి రాబందు క్రూరపక్షి అను సాతానుడు మనలనేమియు చేయనేరడు.  అందుకే క్రీస్తుయేసు నందున్నవానికి ఏ శిక్షావిధి లేదు అని రోమా 8:1లో పౌలు అంటున్నాడు.  అలాగే అపొస్తలుల కార్యములు 16:31, ''అందుకు వారు-ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి''  అని పౌలు చెప్పి యున్నాడు.  ఆయన విశ్వాసములో ఆయన ప్రేమలో మన ఆత్మీయ జీవితమున్నంతకాలము ఆత్మ సంబంధముగా గాని, శారీర సంబంధముగా గాని ఏ బాధలు, ఏ లోటుపాట్లు రావు.

        ఇక ప్రకటన గ్రంథము అనగా బైబిలులోని చివరి వేదభాగములో సాతానుయొక్క ప్రతిరూపమైన క్రూరపక్షియొక్క క్రియాకర్మలను గూర్చి తెలిసికొందము.  మొట్టమొదటగా యోహానుకు ప్రకటన 1:16లో కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొనియున్న మనుష్య కుమారుని పోలిన ప్రభువుయొక్క దర్శనము.  ఈ దర్శనములో ఏడు నక్షత్రాలను గూర్చిన మర్మము ఏమిటంటే - ప్రకటన 1:20లో వలె ఏడు నక్షత్రాలు ఏడు సంఘములకు దూతలు, ఆయన సంచరించిన ఏడు సువర్ణ దీపస్థంభములు ఏడు సంఘములు.  ఈ ఏడు సంఘములు ఏవంటే - ఎఫెను, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్‌, ఫిలడెల్ఫియ, లవొదికియ అనునవి ఏడు.  ఈ ఏడు సంఘములను గూర్చి వరుసగా ఏడు విధములైన క్రూరపక్షియొక్క సావాసమును గూర్చి వ్రాయబడి యున్నది.  

1.  ఎఫెను :-  ఈ సంఘములో ఈ క్రూరపక్షియొక్క క్రియ ఏమిటంటే ప్రకటన 2:4లో వలె మొదట ఈ సంఘమునకు ఉండిన ప్రేమను వదలినట్లును మారుమనస్సు పొందవలసినట్లు ప్రభువు చేత హెచ్చరిక చేయబడడమైనది.

2.  స్ముర్న :-  ప్రకటన 2:9-10లో వలె ఈ సంఘమును ఈ క్రూరపక్షియొక్క ప్రేరేపితులు ద్వారా కలుగు దూషణ శ్రమ, భయము, శోధనలు, చర ఇత్యాది క్రియలు జరిగించి యున్నాడు.

3.  పెర్గము :-  ప్రకటన 2:14లో వలె క్రూరపక్షియొక్క ప్రమేయము మూలమున విగ్రహాలకు బలియిచ్చిన వాటిని తినుట, జారత్వము చేయునట్లును, భిలాము బోధన అనుసరించినవారున్నట్లును, అలాగే నికొలాయితుల బోధ కూడా ఇందులో ఉన్నట్లు తెలియుచున్నది.  ఇది క్రూరపక్షి ప్రేరిత బోధలు.

4.  తుయతైర :-  ప్రకటన 2:20లో వలె యెజెబేలు వంటి విగ్రహారాధికుల దైవ వ్యతిరేక బోధలు, విగ్రహాలకు బలి యిచ్చిన వాటిని తినుట, వ్యభిచార క్రియలతో కూడిన నేరము - ఈ క్రూరపక్షి వల్ల జరిగినవే.  

5.  సార్దీన్‌ :-  ప్రకటన 3:1-2లో వలె జీవించుచున్న సంఘమై నామ మాత్రముగా ఉన్నను, ఇది మృతమైన సంఘముగా మరియు దీని క్రియలు దేవుని యెదుట సంపూర్ణముగా కనబడని స్థితిలో క్రూరపక్షియొక్క ప్రభావము క్రియ జరిగించి యున్నది.

6.  ఫిలడెల్ఫియ :-  ప్రకటన 2:10లో వలె భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి క్రూరపక్షి వలన రాబోవు శోధన కాలము ఒకటున్నదని వివరించబడి యున్నది.

7.  లవొదికియ :-  ప్రకటన 3:16లో వలె ఈ సంఘము చల్లగానైనను, వెచ్చగానైననూ ఉండక నులివెచ్చని స్థితిలో ఉండి, క్రూరపక్షియొక్క ఆత్మక్రియ జరిగించి యున్నది.  మరియు ప్రకటన 3:18లో వలె దౌర్భాగ్యమును దిక్కుమాలినతనమును, దారిద్య్రమును, అంధత్వమును, దిగంబరత్వమును ఈ సంఘమునకు కలిగియున్నట్లు - అందునుబట్టి దైవత్వము హెచ్చరిస్తున్నట్లు తెలియుచున్నది.

        ప్రకటన 6:లో వివరించబడిన మొదటి ముద్ర విప్పినప్పుడు కనబడిన తెల్లని గుర్రము మీద కూర్చుండి విల్లుపట్టుకున్నవాడు, రెండవ ముద్ర విప్పినప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము మీద కూర్చుండిన రెండవవానికి పెద్ద ఖడ్గము, మూడవ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రము మీద కూర్చున్న వ్యక్తికి త్రాసు ఇవ్వబడుట, నాలుగవ ముద్ర విప్పినప్పుడు పాండుర వర్ణముగల యొక్క గుర్రము మీద కూర్చున్న వానిపేరు మృత్యువు - ఇతనికి చంపునట్టి అధికారము ఇవ్వబడినది.  ఈ నాలుగును క్రూరపక్షియొక్క అనుచరుల క్రియాకర్మలను గూర్చిన వివరము.

        ఇక ప్రకటన 11వ అధ్యాయమంతయు క్రూరపక్షియొక్క పరిపాలనను గూర్చి వివరించబడి యున్నది.  అయితే ప్రకటన 12:13 నుండి చదివితే పూర్వీకములో క్రియ జరిగించిన ఆదిఘటసర్ఫము, దాని ఉగ్రత, దాని ఘోరాతిఘోరమైన భయంకర క్రియలను గూర్చి వ్రాయబడి యున్నది.  ప్రకటన 13వ అధ్యాయము వచ్చుసరికి పది కొమ్ములు ఏడు తలలు గల ఒక క్రూరమృగము సముద్రములో నుండి పైకి వచ్చుట యోహాను చూచుట ఇందునుగూర్చి 13వ అధ్యాయమంతను ఈ క్రూరమృగముయొక్క వివరము వ్రాయబడి యున్నది.

        క్రూరపక్షి, ఆదిఘటసర్పము, క్రూరమృగమును గూర్చి ఇప్పటివరకు మనము చదివియున్నాము.  ఈ మూటికి నివాసమైన దాని గురించి ప్రకటన 17:1 నుండి వ్రాయబడిన వివరములో క్రూరపక్షి, ఆదిసర్పము, క్రూరమృగము మూటికిని భార్యయై వేశ్యలకును, భూమి మీద హేయమైన వాటిని జరిగించు మనుష్యులకు తల్లియైన బబులోను.  ఈ యెరూషలేము పరిశుద్ధమును పవిత్రమును, దైవత్వమునకును ప్రీతికరమైన విశ్వాసమునకు ఏ విధముగా తల్లియై యున్నదో అలాగే లోక మర్మాలకును దానియొక్క కుతంత్రాలకు, దైవ వ్యతిరేకమైన విగ్రహ సమూహాలకు, వాటి ఆరాధనలకు భూమిలో హేయమైన వాటికిని వేశ్యలకును, అక్రమస్తులకును ఈ బబులోను తల్లియై యున్నది.

        ఇందులో ఒక పరమార్థాన్ని మనము గ్రహించవలెను.  అదేమిటంటే పవిత్రమైన వాటిని గూర్చి  ప్రవచిస్తూ వ్రాయబడిన మాటలు.  తల్లియైన యెరూషలేమును మహా యెరూషలేము అనలేదు.  కాని బబులోను పాపభూయిష్టమైన ఈ పట్టణమును మహా బబులోను అని ప్రవచించబడి యున్నది.  మహా అన్నప్పుడు అది మితిమీరిన అనగా ఎన్న శక్యముగాని క్రియలకు నిలయమని లేక మాత్రుక అని గ్రహించవలసి యున్నది.  ఈ బబులోను గూర్చి తెలుసుకొనుటకు ముందు ఈ బబులోను పట్టణమునకు లేక సంఘమునకు మూలకర్తను కూడా మనము తెలిసికోవలెను.  ఈ మూలకర్తను గూర్చి ప్రకటన 16:13లో ఘటసర్పమనియు క్రూరమృగమనియు, అబద్ధ ప్రవక్తయనియు వివరించబడి యున్నది.  అంతేగాకుండా, ఈ మూడింటి నోటి నుండి బైల్పడిన కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు అవి సూచనలు చేయునట్టివి, దయ్యముల ఆత్మలునైయుండి, లోకములో క్రియ జరిగించునని వ్రాయబడి యున్నది.  ఈ మూడు ఆత్మలు లోక మందంతట వున్న రాజులను అర్మేగెదోను అను చోట యుద్ధ సన్నిద్ధులుగా చేయనున్నది.

        సాతాను సమయోచితముగా ఏ నీచమైన రూపమును వేషమును ధరిస్తూ ఆడా మగా అను విచక్షణ లేక తన హేయ క్రియా కార్యాలు జరిగిస్తాడని ఈ క్రింది కొందరి స్త్రీలను, ఈ సమయములో మనము జ్ఞాపకము చేసుకొందము.  మొట్టమొదటగ ఏదెనులో హవ్వ, కయీను సంతానమైన స్త్రీలు ఆదికాండము ఆరవ అధ్యాయము, అహాబు రాజు భార్యయైన యెజెబేలు, యోసేపుయొక్క వ్రతమును పాడుచేయుటకు ఫరో భార్యను ఆవరించి జరిగించిన క్రియ, గాజాలో వేశ్యయైన డెలీలా మొదలైనవి.  ఇది సంసోను చరిత్రలో జరిగిన సంఘటన.  ఇది స్త్రీ సంబంధము.

        చిత్రమేమనగా దేవుడు ఇశ్రాయేలు పక్షముగా మాట్లాడిన మాట - ''నీ దేవుడైన యెహోవానైన నేను రోషము గల దేవుడను,'' అనుటలో ఆయన కేవలము ఒక పురుషత్వానికి పరిమితమైనట్లుగా తెలియుచున్నది.  ఆయనలో ఎంత మాత్రమును స్త్రీ లక్షణములు స్త్రీ రూపములు లేవని ఈ క్రింది దైవక్రియ మూలముగా మనము తెలిసికోవలసియున్నది.  ఆయన పురుషుడు కాబట్టి తన జనాంగమైన ఇశ్రాయేలీయుల మీద మగవానికే నాయకత్వమిచ్చాడు.  మరియు తన జనాంగమునకు ప్రవక్తలను ఇచ్చాడు.  తన ఆరాధనకు యాజకులు మరియు తన బలిపీఠమునకు వారసులుగా పురుషులనే ఏర్పరచాడు.  దేవుడు పురుషుడు కనుకనే తన కుమారుడైన యేసుక్రీస్తు ఏర్పరచుకొన్న 12 మంది శిష్యులను పురుషులనే ఎన్నిక చేయించాడు.  ఆయన పురుషుడు కనుకనే తన పురుషత్వమును నిరూపించుటకు ధీరోచితముగా-లోకముతోను, లోకనాథులతోను, అంధకార శక్తులతోను, దురాత్మల సమూహములతోను పోరాడినాడు.  ఆఖరుకు మరణముతో పోరాడినాడు.  మరణాన్ని గెలిచాడు.  సమాధితో పోరాడినాడు, సమాధిని గెలిచాడు.  ఆయన పురుషత్వపు ధాటికి తట్టుకోలేక పాత నిబంధనలోని సకల గోత్రాలు రొమ్ము కొట్టుకొని ప్రలాపించినవి.

        ఆయన పురుషత్వపు ధాటికి లోకమే తల్లడిల్లింది.  ఆయనయొక్క పురుషత్వపు ఉగ్రతకు సృష్టి యావత్తు అల్లకల్లోలమై జటిలమయమై పోయింది.  ఆయన పురుషత్వము యొక్క ఉగ్రత జలాలను భూమిపై క్రమ్మజేసి మొదటి సృష్టి లయపరచుటకు కారకమైంది.  ఆయనలోని పురుషత్వము 90 యేండ్ల పురుషునితో కాపురము చేసిన గొడ్రాలైన శారాకు గర్భాన్ని ఫలాన్ని వాగ్దానముగా ఇచ్చింది.  ఆయనలోని పురుషత్వము హన్నాయొక్క గర్భద్వారాన్ని చేధించి ప్రవక్తయైన సమూయేలును కనెడి ఆశీర్వాదాన్ని ప్రసాదించింది.  మరియు నూతన నిబంధనలో దేవుని బలిపీఠమునకు యాజకుడై ధూపార్పణ జేయు జెకర్యా భార్యయైన గొడ్రాలైన ఎలీసబెతునకు పుత్రదానము చేసింది.  మరియు విచిత్రమేమంటే పురుష ప్రమేయము లేని కన్యయైన మరియమ్మకు దేవునియొక్క పురషత్వమే పరిశుద్ధుడును, నిష్కళంకుడును, పవిత్రుడును, దైవకుమారుడైన లోకరక్షకుని పుత్రునిగా రూపొందించింది.  ఆయన పురుషత్వములో నేటికిని ఎటువంటి లోపముగాని, అంగవైకల్యముగాని, మచ్చ డాగు ఏదియు లేదు.  ఇది దైవత్వముయొక్క పురుష లక్షణము.

        ఇక అపవాదిలో ఉన్నటువంటి లక్షణమేదో తెలిసికోవలసి యున్నది.  ఈ సందర్భములో 1 కొరింథీ 6:9-10లో మనము చదివితే సాతానుగాని, సాతాను సమాజముగాని ఎటువంటి లక్షణము గలవారో ఈ వేదవాక్యములలో మనము చదువ గలము.  ఇందులో మొదటగ జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనము కలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోభులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకొనువారు.

        దైవత్వములో ఉన్నది నీతి మరియు పరిశుద్ధత మాత్రమే.  అయితే అపవాది సాతాను అను ఈ ఆత్మకున్న గుణాతిశయములను ఇందులో అభివర్ణించి యున్నాడు.  అనగా అపవాదికి నిలకడయైనట్టి ఒక్క లక్షణము, ఒక్క గుణము లేదని ఎటుపడితే అటు సమయోచితముగా క్రియ జరిగిస్తాడని ఋజువగుచున్నది.  అనగా అపవాది నపుంసకుడు, ఆడంగితనము కలవాడు.  సమయోచితముగా స్త్రీవలె నటిస్తాడు.  స్త్రీలో జొరబడి స్త్రీగా క్రియ జరిగిస్తూ సత్యమునకును, నీతికిని, విశ్వాసమునకు కట్టుబడియున్న వ్యక్తికి స్త్రీలో ప్రవేశించి, స్త్రీ రూపము ధరించి, నయవంచకముతో విశ్వాసియొక్క పవిత్ర జీవితాన్ని కళంక పరచునని తెలియుచున్నది.  అట్లు గాని పక్షములో కల్పనా కథలతో రూపించబడిన విగ్రహారాధనకు విశ్వాసియొక్క ఆత్మీయ దృష్టిని మళ్ళించుటకు నానా విధమైన క్రియలు, పూజాది కార్యక్రమాలు, తాను ఆవరించిన వ్యక్తుల చేత జరిగిస్తాడు.  నీతిమంతునియొక్క సంపదను కొల్లగొట్టుటకు దొంగ రూపముగా ప్రవేశించును.  ఆత్మ సంబంధమైన విశ్వాసులయొక్క మనోస్థితిని మార్చుటకు లోక సంబంధమైన వెండి, బంగారము, ధన వస్తు సంపాదనలో లోభిగా క్రియ జరిగించి, లోభిగా మార్చుటకు ప్రయత్నిస్తాడు.

        చిత్రమేమిటంటే దైవసన్నిధిలో ధీరోచితముగా పురుష లక్షణముతో పోరాడే విశ్వాసిని ఆడంగితనము కలవానినిగా చేయుటకు ప్రయత్నించును.  ఆడంగితనము కలవారిని విశ్వాసి ఎదుట ప్రత్యక్షపరచును.  వీటికి లొంగనటువంటి విశ్వాసిని మనో వైకల్యము కల్గించి, లోక సంబంధ శ్రమలు పాల్జేసి, శ్రమ నుండి ఉపశమనము పొందుటకు మద్యమును మందుగా ఉపయోగించుమంటాడు.  ఇవిగాక మంత్ర తంత్రములు, జ్యోతిష్యము, జాతకము వగైరా అనుమాన పిశాచాలను నరునిలో రేకెత్తించి, ప్రతి విషయానికి అనగా శుభకార్యము గాని, అశుభకార్యము గాని, వివాహాలు గాని, ఇల్లు కట్టుటగాని, గృహ ప్రవేశానికిగాని, ప్రతి దానికి జాతకాలు చూడమంటాడు.  దీనివలన నరునికి ఆత్మీయ బలహీనత ఏర్పడి, శారీర సంబంధ నరుల మీద వారి దృష్టి మరల్చుటయే గాక శాశ్వతముగా దేవునికి దూరమయ్యే ప్రమాదమున్నది.  ఇది అపవాది యొక్క కుతంత్రములు, అతనియొక్క విశేషమైన అవతారములు.

        దేవునికున్నది మూడు అవతారములు.  మొట్టమొదటిది యెహోవా.  రెండవది యేసుక్రీస్తు.  మూడవది పరిశుద్ధాత్మ.  ఈ మూడింటిని ఎదుర్కొనుటకు అపవాది ముక్కోటి దేవతల రూపములో లోకాన్ని ఆవరించి క్రియ జరిగిస్తున్నాడు.  ఇందులో ఏ ఒక్క దేవత కూడా యోగ్యకరమైనది కాదు.  నరునియొక్క ఆత్మీయ జీవితానికి క్షేమ కరమైనవి దైవత్వానికి ప్రీతికరమైనవి కావు.  ఈ ముక్కోటి దేవతల ఆరాధన నరునియొక్క జీవితాన్ని మూడు విధములైన అనగా దైవశాపము, తత్సంబంధమైన పాపము, దాని జీతమైన మరణము ఈ మూడింటికిని ముచ్చటగా అప్పగించి దేవునియొక్క ఉగ్రతకును, అపవాదికిని, వాని దూతలకును సిద్ధపరచబడియున్న నరకాగ్నిగుండములోనికి నడిపిస్తున్నది.

        కనుక ఆదిలో దేవుని ఆత్మ ఉన్నట్టే ఆదిలో ఘటసర్పము అను సాతాను కూడా ఉన్నది.  పాత నిబంధన మధ్య కాలములో దేవుని జనాంగమైన ఇశ్రాయేలు ఉన్నట్లే సాతాను సంబంధమైన బబులోను వున్నది.  క్రీస్తు కాలములో దైవకుమారుడైన క్రీస్తు ఉన్నట్టే క్రీస్తుకు ప్రత్యర్థిగా సాతాను బెలియాలుగా క్రియ జరిగించి యున్నాడు.  అపొస్తలుల కాలములో పరిశుద్ధాత్మ ఉన్నట్లే రోమా, గ్రీకు సామ్రాజ్య పరిపాలనలో హేరోదు నీరో వగైరా లోక సంబంధమైన రాజులు, చక్రవర్తుల రూపములో అపవాది క్రియ జరిగించి యున్నాడు.  ఈనాటి ఆధునిక యుగములో అదే అపవాది క్రైస్తవ వేదమును చేతబట్టి నేను క్రీస్తును, నేనే నిజమైన బోధకుడనని బోధకుని వేషములో తిరుగుచూ 2 తిమోతి 3:1-8 చదివితే ఈ అబద్ధ ప్రవక్త ఏర్పరచుకొన్న ఇతని అనుచరులైన అబద్ధ క్రీస్తువులు చేయు క్రియలు, బోధలు క్రియ జరిగిస్తున్నవి.

        ఈ విధముగా అబద్ధ క్రీస్తువులుగా ఉన్నట్టి సాతాను ఎంతో కాలముగా క్రీస్తును గూర్చి బోధన చేయుచూ తిరగడు.  ప్రభువు రాకడలో ప్రభువుయొక్క ఉగ్రత ప్రారంభము కానున్న దశలో సాతాను అబద్ధ క్రీస్తువులుగా ప్రపంచ శాంతిని కోరుచూ మరొక వైపున ప్రపంచములో ఒక దేశమునకు, మరియొక దేశమును, రాజ్యమునకు మరియొక రాజ్యము, రాష్ట్రమునకు మరియొక రాష్ట్రముతో కలతలు రేపుచూ ఒక దానితో నొకటి పోరాడునట్లు చేయుచున్నాడు.  

        ఇప్పటి ప్రపంచ స్థితి దైవత్వాన్ని గూర్చిగాని, పైశాచికమును గూర్చిగాని ఆలోచించే స్థితిలో లేదు.  రాజకీయ జీవితములోను, వైద్యరంగములోను, శాస్త్రజ్ఞాన దృక్ఫథములోను, న్యాయస్థానాలలోను, వ్యాపార కేంద్రాలలోను, వ్యవసాయ కేంద్రాలలోను, రైలు స్టేషన్లలోను, విమాన కేంద్రాలలోను ఎక్కడ కూడా దేవుడు, దయ్యము అను మాటకు స్థానమున్నట్లుగా గోచరించుట లేదు.  రాజకీయ వ్యక్తిని కదిలిస్తే దేవుడు లేడు, దయ్యము లేదంటాడు.  అదేమాట ప్రతి శాస్త్రజ్ఞుడికిని, అతని వైద్యుడైనను, న్యాయవాదియైనను లేక ఎటువంటి పరిశ్రమకు చెందినవాడైనను నేడు దేవుడు దయ్యము ఉన్నదన్న స్థితిలో లేరు.  మన పూర్వీకులలో కలరా వస్తే మహమ్మారి, అమ్మోరు దేవత అనుకొనేవారు.  ఇప్పుడు దానిని అనుకునేవారు లేరు.  కోర్టులో సాక్ష్యము పలికేవారుగాని, తీర్చు తీర్చే న్యాయాధికారిగాని, దేవుడున్నాడన్న సత్యాన్ని నాలుగు గోడల మధ్య నమ్మే స్థితిలో లేరు.  తక్కెడ ముందు కూర్చున్న వ్యాపారి కూడా కర్పూరము వెలిగించి, తక్కెడకు దండము పెట్టుచున్నాడేగాని తక్కెడను, ముల్లును గుర్తించే దేవుడున్నాడని, తూనికరాళ్ళు యొక్క యదార్థతను, తక్కెడలో ఉన్న వారను గుర్తించే దేవుడున్నాడన్న సత్యాన్ని ఆ వ్యాపారి మరచియున్నాడు.  ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని, బాధలో కొట్టుమిట్టాడుచున్న తన రోగిని చూస్తున్న వైద్యుడు అతనిని బ్రతికించాలన్న దృక్ఫథానికి బదులు, ఆతని ద్వారా ఎంత సంపాదించాలన్న ఫీజు విషయాన్ని గూర్చి ఆలోచిస్తున్నాడు.

        ఈ విధముగా లోకము నోవహు కాలమున కంటే విపరీతముగా పెరిగి విపరీతముగా దైవదృష్టికి ఉగ్రత పాలు కానున్నది.  అందుకే నోవహు కాలములో దేవుడు నలభై దివారాత్రులు జలప్రవాహము రప్పించాడు.  అయితే ప్రభువు రాకడలో లోకాంత్య సందర్భములో దేవుడు జరిపించబోవు మారణహోమము నాటి నోవహు కాలమున కంటే అరవై రెట్లు మహా భయంకరమైనది.  

        దీని గూర్చి 2 పేతురు 3:10, ''అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును.  ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.''  

        కనుక నానా విధములు నానా రూపములతో క్రియ జరిగిస్తున్న ఈ అపవాదియొక్క రూపములలో ఒక్క రూపమైయున్నదే క్రూరపక్షి రూపము.  

        ఇది పావురము వంటి పరిశుద్ధాత్మ రూపమైన దైవ రూపమునకు ఈ క్రూరపక్షి యొక్క రూపము; సాతానుయొక్క ప్రతిరూపముగా మనము గ్రహించవలెను.  ఇది ఇప్పుడు క్రియ జరిగిస్తున్నది.  

        ఎట్లంటే క్రైస్తవ మందిరాలలో, విశ్వాసుల హృదయాలలో, విశ్వాసుల ఆత్మీయ జీవితాలలో, పరిశుద్ధాత్మ పావురము వలె క్రియ జరిగిస్తుంటే, నామ క్రైస్తవుల గృహాలలో నామ క్రైస్తవ ఆత్మీయ జీవితాలలో అవిశ్వాసులయొక్క గృహ జీవితాలలో ఈ క్రూరపక్షి చోటు జేసుకొని క్రియ జరిగిస్తున్నది.

24. దేవుడు మన తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ?

        యెషయా 50:1, ''యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు   -నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది?  నా అప్పులవారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని?  మీ దోషములనుబట్టి మీరు అమ్మబడితిరి  మీ అతిక్రమములనుబట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను.''

        ప్రియపాఠకులారా!  పై వాక్యములో దేవుడు సెలవిచ్చిన రీతిగా మన తల్లి ఎవరు?  ఆమెను పరిత్యాగము చేసిన వారెవరు?  ఆమెను విడనాడిన పరిత్యాగ లేక విడాకుల పత్రమేది?  దేవునికి అప్పుల వాళ్ళు ఉన్నారా?  దేవుని అప్పువాళ్ళలో ఎవనికి అమ్మి వేశాడు?  మన దోషములనుబట్టి మనము ఏవిధముగా అమ్మబడినాము?  మన అతిక్రమములనుబట్టి మన తల్లి ఏ విధముగా పరిత్యాగము చేయబడింది?  ఈ విషయములను గూర్చి తెలిసికోవలసి యున్నది.  ఇందులో మొదటిగ - ''నేను నీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది?''  అనిన దానిని గూర్చి మనము తెలిసికొందము.  దీనికి ముందు మనము - ''మన తల్లి ఎవరు?''  అన్నది మొదట గ్రహించవలెను.

        దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.  ఈ వేదభాగములోని వివరణ.  కనుక నరునికి రూపాన్ని, ఆకారాన్ని నమూనాను ఇచ్చినది తల్లియైన భూమియే అనగా నర శరీరము రూపించబడుటకు భూమియే మూలమైయున్నది.  ఇంకను - ''ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నై పోదువని,'' అనుటలోను ప్రసంగి 12:7లో కూడా ఈ విషయాలను గూర్చి చెప్పుచూ మన్నయినది వెనుకటి వలెనే మరల భూమికి చేరును,'' అని నిర్థారించి యున్నాడు.  కనుక నరునికి తల్లి భూమి.  ఈమెను దేవుడు విడనాడినట్లుగా ప్రవచనములో ఉన్నది.  వాస్తవానికి దేవుడు భూమిని విడనాడలేదు.  విడనాడినట్లుగా పత్రాలు అనగా దాఖలాలు లేవు.  దేవుడు భూమిని పరిత్యాగము చేసినానన్నట్లుగా ఋజువైన పత్రికలు కూడా లేవు.  కాని దేవుడు తన ప్రవక్త ద్వారా మన తల్లికి పరిత్యాగము మన దైవాజ్ఞాతిక్రమము వలన జరిగినదని యెషయా 50:1లోని రెండవ భాగములో చెప్పబడినది.  

        అయితే  ''నా అప్పులవారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని?''  అనుటలో దేవునికి అప్పుల వాళ్ళున్నారా?  దేవునికి అప్పులవాళ్ళు లేరు.  ఈయనను అప్పుల పాల్జేసినది మనమే.  ఏ విధముగా?  మన దోషములనుబట్టి మనకై మనమే అమ్ముడై పోయాము అని యెషయా 50:1లోని రెండవ భాగములో చెప్పబడినది.  కీర్తన 8:6-8లో వివరించబడిన రీతిగా నరుని తల్లి భూమియైనప్పటికిని తండ్రి దేవుడు గనుక పిత్రువాత్సల్యమును బట్టి ఆత్మ బంధమును బట్టి, ఆత్మయైయున్న దేవుడు తన స్పష్టమైన, స్వాస్థ్యమైన భూమిని అందులోని స్పష్టములను యావత్తును నరునికి అప్పగించి, సృష్టిలోని ప్రతి జీవికిని నరుని చేతనే పేర్లు పెట్టించి, తండ్రి ప్రేమను వెల్లడిపరచి ఉన్నాడు.  కనుక నరునికి భూమి తల్లి.

        సృష్టికర్తయైన తండ్రియైన దేవుడు ఆయన చేతిపనియై వున్న భూమి ఇద్దరి పోషణలో ఉన్న నరుడు తనకు సాటి సహాయముగా అనుగ్రహించబడిన వారి ఇరువురును  దేవుడు స్వాస్థ్యముగా ఇచ్చిన సకలైశ్వర్యములతో, నిశ్చింత గల్గి ఏదెనులో నివసిస్తున్నారు.  అలౌకిక శక్తియైన సాతానుడు తన కుయుక్తితో స్త్రీని మోసపు మాటలతో మొట్టమొదటగా ఆమెను కొనుక్కున్నాడు.  అనగా ఆ ఘటసర్పమైన సాతాను మాటలు విని, ఆ వృక్ష ఫలాలు తిని, తాను సర్పమునకు అమ్ముడై పోవుటయేగాక, తన భర్తను కూడా సాతానుకు అమ్మి దైవత్వము నుండి త్యజించబడి, తాము అమ్ముడైపోవుటయేగాక, మంచిచెడ్డ తెలివినిచ్చు వృక్షఫలాలను మొలిపించిన భూమి కూడా విడువబడింది.  ఏ విధముగా భూమి అమ్ముడైనది?  ఆదికాండము 3:17, ''ఆయన దేవుడు ఆదాముతో-నీవు నీ భార్యమాట విని-తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడియున్నది;''  మీరు అమ్ముడుపోయినట్లుగా అది అమ్ముడైనది.  మీరెట్లు విడువబడినారో భూమి కూడా విడువబడినది.  ఏ విధముగా భూమి అమ్ముడైనది?  లూకా 4:6లో యేసును అపవాది శోధిస్తూ - ''ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును;  అది నాప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును;''  కనుక దైవత్వము చేత విడువబడిన ఈ సృష్టిలో అపవాది చోటు చేసుకొని ఆదికాండము 6:లో మొదట నుండి చదివితే దైవశాపము వలన నరుని ద్వారా అపవాదికి సంక్రమించిన ఈ సృష్టిలో - నరులను పాపముతో ముంచెత్తి అపవాది విస్తరింపజేసినట్లు ఈ వేదములో చదువగలము.

        అదే విధముగా సంసోను విషయములో దేవుడు తన కనుగ్రహించిన బల మర్మాన్ని కూడా తప్పకుండా సాతాను ఆవరించిన స్త్రీ ఒడిలో పరవశుడై మరణాన్ని కోరి, తనలో ఉన్న బలముయొక్క మర్మాన్ని, దేవుడు తనకిచ్చిన ప్రతిష్టతను మంట గలిపి తనకు తానే మరణానికి అమ్ముడైనట్లుగా చదువగలము.  అదే విధముగా యూదా ఇస్కరియోతు ముప్ఫయి వెండి నాణెములకు పరమ రక్షకుని అమ్మి, సాతాను ఆవేశితుడై మరణాన్ని పొందినాడు.  అననీయ సప్పీరాలు అయినటువంటి ఇద్దరు తమ స్వంత పొలము అమ్మి దేవుని వాగ్దానము చేసిన ఆ అర్పణను అయోగ్యముగా కొంత దాచి, కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద ఉంచి, భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య ఒకరినొకరు సాతాను ప్రేరేపణతో అబద్ధము మాట్లాడి మరణాన్ని తెచ్చుకున్నారు.  కనుక మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి.  మన దోషములను బట్టియే మనము సాతానుకు అమ్ముడైనాము.

        ''మీ అతిక్రమములనుబట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను,'' అనుటలో నరునియొక్క దోషాలు, అపరాధముల మూలముననే అనగా దైవత్వము పట్ల తిరుగుబాటు చేయుట వల్ల దైవోగ్రతకు భూమి గురియై భూకంపము, తుఫానులు, వడగండ్లు, వరదలు చేత మొత్తబడుచు అతివృష్టి మూలముగా ముంపుకును  అనావృష్టి మూలముగా బీడుబారి కళావిహీనమై సారమును కోల్పోయి, పనికిమాలినదైనట్లుగా కూడా నేటి భూమియొక్క సారము ఋజువు పరచుచున్నది.  అంటే నేటి భూమిలో సారము లేదు.  కనుక లోకమునకు అమ్ముడైపోయిన మానవత్వాన్ని, మనలో ఉన్న దేవునియొక్క ఆత్మ విలువలను కాపాడుకోవాలంటే రోమా 12:1-2లో వివరించిన రీతిగా ఈ లోక మర్యాద ననుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మన మనస్సులు మార్చుకొని, మన జీవితాలను మార్చుకొని నూతనత్వము పొంది, రూపాంతరము పొందాలని కూడా పౌలు హెచ్చరిస్తున్నాడు.

        యేసుప్రభువు కూడా, మన నిమిత్తము తన్నుతాను తగ్గించుకొని 2 కొరింథీ 8:9, ''మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా?  ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్య్రమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.''  అన్నట్లుగా మనయొక్క అంతస్థులను ఆధిక్యతల మూలముగా ఈ లోక మర్యాదననుసరించి జీవింపకుండ పరలోక భాగ్యాన్ని వదలి, తాను తన ధనమును, తన ఐశ్వర్యమును, తన సామ్రాజ్య మహిమను విసర్జించి, ఆయన తన దారిద్య్రము వలన మనలను ధనవంతులుగా చేయాలని ఈ లోకములో తన రక్తము ద్వారా కొన్నాడు.  సజీవముగా శారీర రక్తముల ద్వారా బలియాగము చేసినట్లు మనము కూడా మన దేవుని చిత్తమును నెరవేర్చ బద్ధులమైయుండి, ఆత్మ ఫలముల చేతను, ఆత్మీయారాధన చేతను, ఆత్మయైయున్న దేవుని మహిమ పరచవలసిన విధి మనకున్నదని గ్రహించవలెను.

        యేసు ప్రభువు ఏ విధముగా తన శరీర రక్తములను సజీవముగా ప్రతిష్టించారో  అదే విధముగా ఆయన ప్రతిష్టించిన అపొస్తలులు, ఆయన సత్య వేదమునకు సాక్షులుగా హతమైన హతసాక్షులు, విశ్వాసులు వగైరాలు ఈయన రక్తముతో కొనబడినవారని ఇందునుబట్టి మనము గ్రహించాలి.  ప్రకటన 14:1-4 చదివితే గొర్రెపిల్లయైన క్రీస్తుయొక్క బలియాగము మూలమున ఆయన రక్త క్రియల ద్వారా కొనబడినవారిని గూర్చి కొన్ని ముఖ్యాంశములు తెలిసికోగలము.  ఇందులో ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ మీద లిఖించబడియున్న 144 వేలమంది ఆయనతో కూడా వుండిరి.  వీరు దేవుని కొరకును, గొర్రెపిల్ల కొరకును మనుషులలో నుండి కొనబడినవారు.

        పై వివరించిన ఋజువులను దేవుడు తన కుమారునియొక్క రక్తము ద్వారా మనలను లోకానికి లోకనాథుడైన సాతానుకును, అమ్ముడైపోయిన మన జీవితాలను కొన్నాడు.  దేవుడు నిర్దోషమైన, నిష్కళంకమైన, పరిశుద్ధమైన తన కుమారుని రక్తమును, రక్తాపరాథముగా మన కొరకు చెల్లించి, తన కుమారులుగా మనలను విడిపించినట్లు - అట్లు చెల్లించబడి కొనబడినవారే దైవకుమారులు.

        ఇక సాతానుకు నరులు ఏ విధముగా అమ్ముడై పోయారో, సాతాను ఏ విధముగా కొన్నాడో అనిన సారాంశాన్ని మనము తెలిసికోవలసి ఉన్నది.  ఆదిలో దేవునియొక్క హస్తక్రియ ఆయన ఆత్మలో పాలిపంపులు పొంది, ఆత్మ జ్ఞానముతో దైవసృష్టి మర్మాలను గ్రహించి, దేవుని సన్నిధిలో వాటి వాటి జాతుల ననుసరించి పేరు పెట్టి దేవునికి సన్నిహితుడై, దైవత్వమునకు సహచరుడై, నిరాక్షేపణగా, నిశ్చింతగా, స్వేచ్ఛగా దేవునియొక్క స్వాస్థ్యమైన ఏదెను అను వనమును తన స్వాస్థ్యముగా అనుభవించెను.  పరిశుద్ధమును, నిరాడంబరమును, నిశ్చింతకర జీవితములో జీవించిన నరులకు అపవాది సర్పరూపములో ప్రత్యక్షమై అబలయైన స్త్రీయొక్క హృదయాన్ని దోచి, ఒక చిల్లిగవ్వయైన కూడా ఖర్చు లేకుండా దేవుడు తినవద్దన్న చెట్టు ఫలము ఏదెనులో ఉన్నదానినే స్త్రీకి తినిపించాడు.  ఈమెకు బజారులో కొనుక్కోమని డబ్బులు ఇవ్వలేదు.  పండు తింటే నీకు అది ఇస్తాను యిది ఇస్తానని ఆశ చూపలేదు.  సాతాను ఏ యొక్క నాణెములనుగాని, లోహములనుగాని స్త్రీకి చూపించి మభ్యపెట్టి కొనలేదు.  దేవుడు సృష్టించిన చెట్టు ఫలముతోనే మొట్టమొదటిగా స్త్రీని సాతాను కొన్నాడు.  అదే విధముగా ఆదామును మరియొక పండునో తినమనో లేక ఏదో యొక వస్తురూపమైన కానుక ఇవ్వమనో, అసలు ఆదాముతో మాట మాత్రము కూడా పలకకుండా ఆదాముకు కనీసము కనబడకుండా అనగా అదృశ్యములో ఉండి స్త్రీ ద్వారా ఆదామును కొనుక్కున్నాడు.

        ఇందులో దేవుడు ఏదెను వనమును వేసాడు.  కనుక ఏదెనులోని సమస్తమునకు హక్కుదారుడు దేవుడే.  ఇటువంటి దేవుడు ఆదామును సృజించి ఏదెను వనమును సేద్యపరచుటకును, కాచుటకును ఉంచాడు.  ఆదికాండము 2:15, ''మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను.'' ఈ విధముగా ఏదెనుకు దేవుడు నరుని కాపలాగా ఉంచిన తరువాత తన స్వాస్థ్యము అనగా తన హక్కుయైన ఏదెను ఫలములో ఒక ఫలమును తినవద్దని చెప్పాడు.  ఆదికాండము 2:16-17, ''మరియు దైవుడైన యెహోవా-ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు;  నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.''  ఇందునుబట్టి, దేవుడు తను వేసిన చెట్టు ఫలములలో ఒక చెట్టు ఫలమును నరునికి ఇయ్యలేదని మనము గ్రహించాలి.  ఏదెను వనము నరుడు వేసినది కాదు కనుక తనకు ఎంతవరకైతే అనుమతి ఉన్నదో అంతవరకే ఆదాము వేసుకొనుటకు హక్కుదారుడు అగును.  అనుమతి లేనిది ఎటువంటి పరిస్థితులలో తీసుకొనకూడదు, ఎందుకంటే ఏదెను వనమును నరుడు వేయలేదు కనుక స్వంతదారుడు అనగా ఆదాము యజమాని కాడు.  ఒకవేళ ఇయ్యని దానిని యజమానికి తెలియకుండా తీసుకొనుట దొంగతనముతో సమానము.  కనుక సాతాను సర్పము ద్వారా స్త్రీని ప్రేరేపించి, యజమానియైన దేవుని అనుమతి లేకుండానే నిషేధ ఫలమును తినిపించాడు.  అంటే ఆ ఫలము సాతానుది కాదు.  నరులది కాదు.  సర్పముది కాదుగాని దేవునిది.  అయితే తనదిగాని ఫలమును తన చేతితో ఇయ్యకుండా సాతాను సర్పము ద్వారా హవ్వను ప్రేరేపించి తినిపించాడు.  ఇక్కడ తినిపించాడు అనే దానికన్నా తినేటట్లుగా ప్రేరేపించాడు అనుట సరియైనది.  ఈ విధముగా తన ఫలము కాని ఫలముతో హవ్వను కొన్నాడు.  ఇక్కడ అమ్మినది సర్పము కొన్నది సాతాను.  అటుతరువాత హవ్వ తన ఫలముకాని ఫలమును ఆదాముచే తినిపించి, ఆదామును కూడా ఋణగ్రస్థుని చేసింది.  కనుక ఆదాము విషయములో హవ్వ ఆదామును అమ్మింది.  ఆదాము దేవుని ఆజ్ఞ మీరి తినుట ద్వారా సాతానుకు అమ్ముడైపోయాడు.  ఇలా మన అతిక్రమములను బట్టి మనము అమ్ముడై పోయాము.  అనగా దేవుని ఆజ్ఞలను మీరుట ద్వారా సాతానుకు అమ్ముడై పోతున్నట్లుగా మనము గ్రహించాలి.

        సింహము కంటె బలమైనవాడు ఆయుధము లేకుండా సింహమును చంపినవాడు, పచ్చి గాడిద దవడ ఎముకతో వెయ్యిమందిని హతమార్చినవాడు, ఫిలిష్తీయులకు సింహస్వప్నముగా వుండి, దేవునికి నాజరు చేయబడి దైవత్వములో ప్రతిష్టించబడి దైవాత్మతో ఆవేశితుడగు సంసోనును కూడా అపవాది రూకలు లేకుండగనే కొన్నాడు.  ఇక్కడ కూడా డెలీలా అను స్త్రీ  ఒక దైవాత్మ సంబంధియైన నరుని కొనుటకు నాణెముగా అపవాదికి ఉపయోగపడింది.  తత్ఫలితముగా ఫిలిష్తీయులకు సంసోను అమ్మబడినాడు.  ఈ సందర్భములో కూడా సాతాను ధనమును ఆశించలేదు, ధనమును వెచ్చించనూ లేదు.  ఉచితముగానే సంసోనును కొన్నాడు.

        అదే విధముగా యాకోబు జీవితములో మోసగాడైన యాకోబుయొక్క రుచికరమైన వంటకాన్ని ఎరగా జూపి, ఇస్సాకు పెద్ద కుమారుడైన ఏశావును తండ్రి దీవెన నుంచి తప్పించి, అనగా తండ్రి జరుపబోవు జ్యేష్ఠత్వ ప్రతిష్టను తొలగించుటకు యాకోబుయొక్క రుచికరమైన, సువాసనకరమైన వంటను సాతాను సాధనముగా వాడి ఏశావును జ్యేష్టత్వ ప్రతిష్టకు బదులు భ్రష్టత్వాన్ని అంటగట్టినాడు.  ఇక్కడ కూడా అపవాది ఏశావు ద్వారా ఏ విధమైన నాణెమును, ధనమును ఆశింపలేదు.  కాని సాధారణముగా భోజనముగా వాడబడు వంటను ఎరగా పెట్టి ఏశావును కొన్నాడు.  వేటకు వెళ్ళి అలసియున్న ఏశావు, తన తమ్ముడు చేసిన రుచికరమైన వంటకు, దాని రంగునకు, దాని వాసనకు ఆకర్షితుడై నా జేష్టత్వాన్ని నీవు తీసుకొని నాకు వంటకము పెట్టమని యాకోబును బలవంతము చేసి, దాన్ని తిని తండ్రియొక్క ప్రతిష్టితమైన ఆశీర్వాదమునకును దేవుని కృపకును దూరస్థుడై భ్రష్టుడాయెను.

        ఇక ఎలీషా చేత తిరస్కరించబడిన నయమానుయొక్క వెండి, బంగారు కానుకలను సాతాను ఎరగాబెట్టి గేహాజీని కొన్నాడు.  కాని గేహాజికి నయమానుకు వచ్చిన కుష్టు రోగము వచ్చింది. గేహాజీ చేసిన అవాంఛనీయమైన పనికి ఏలీషా శపించగా నయమానుకు వచ్చినకుష్టు గేహాజికి వచ్చినట్లు చదువగలము.  ఇట్టి సందర్భములో గేహాజి కుష్టురోగమునకు అమ్మబడినాడు.

        ఇక నూతన నిబంధనలో సజీవుడైన దైవకుమారుడైన క్రీస్తును సాతాను ఆత్మయొక్క ఆవేశము ద్వారా యేసుయొక్క శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదాను సాతాను ప్రేరేపించి, యేసు ప్రభువును ముప్ఫయి వెండి నాణెములకు, అతని ద్వారా అమ్మించాడు.  కాని, అమ్మిన డబ్బును ఇస్కరియోతు యూదా అనుభవించలేదు.  ఆ డబ్బును మందిరములో చల్లి ఉరి పెట్టుకొని చనిపోయినట్లుగా వేదములో చదువగలము.  ఈ విధముగా ఇస్కరియోతు యూదా మరణానికి అమ్మబడినాడు.  ఇక అననీయ సప్పీరాలు అను ఇద్దరు వారియొక్క స్వంత భూమిని అమ్మి, ఆ అమ్మిన డబ్బులో కొంత దాచుకొని మిగతా ధనాన్ని అపొస్తలుల పాదాల దగ్గర ఉంచినారు.  పరిశుద్ధాత్మ ఆవేశితుడైన పేతురు అననీయ చేసిన పనిని ఆత్మ ద్వారా గ్రహించినవాడై విచారించగా అననీయ చనిపోయాడు.  అటు తర్వాత అతని భార్య కూడా దైవసన్నిధిలో అపొస్తలుల ఎదుట అబద్ధమాడి భర్త పోయిన మరణ మార్గములో ఆమె కూడా పోయింది.

        ఈ విధముగా సాతానుడు నరులను తన ఆత్మావేశము ద్వారా దేవునిపై తిరుగుబాటు జేయించి, నిర్దోషియైన ప్రభువును విడిపించుటకు బదులుగా సిలువ వేయుము - సిలువ వేయుమని ప్రభువును గూర్చి గొప్ప కేకలు జనాంగము చేత ఘోషింపజేసి, బరబ్బాను విడుదల చేయమని న్యాయ తీర్పును సృష్టించాడు.  మరణానికి అమ్మబడిన ప్రభువు - మరణానికి బానిసయై మరణించి పునరుత్థానుడై, మహిమతో ఈ లోకములో నలభై రోజులు సంచారము చేసి, ఇప్పుడు దేవుని కుడి పార్శమున ఉన్నాడన్న విషయాన్ని మనము గ్రహించ గలుగుచున్నాము.  

        సాతానుకు అమ్ముడై పోయినవారు శరీర సంబంధమైన నరులేగాని, ఆత్మ సంబంధమైనవారు కారు.  ఈ విధముగా అమ్ముడైపోయిన జనాంగమును దేవుడు తన కుమారుడును, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువు జరిగించిన బలియాగములో అమూల్యమైన రక్తము ద్వారా నేటి నరకోటియొక్క పాపములకు మనకు విమోచన, రక్షణ, నూతన జన్మ, నూతన విశ్వాసము, సజీవమైన ఆరాధన, సత్యదేవుని గూర్చిన పరిజ్ఞానము ననుగ్రహించి, లోకస్థులైన ప్రజలందరిని తన కుమారునియొక్క సిలువ మార్గములో తన సన్నిధికి రమ్మంటున్నాడు.  యెషయా 50:1 ప్రకారముగా ఉచితముగా అమ్మబడిన, కొనబడిన మనలను అనగా రూకలు లేకుండా కొన్నటువంటి సాతానుయొక్క కబంధ హస్తాల నుండి రూకలు లేకుండానే గొర్రెపిల్లయైన క్రీస్తుయొక్క అమూల్యమైన రక్తముతో ఆయన మనలను కొన్నాడు.  కనుక ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా యేసుయొక్క అమూల్యమైన రక్తముద్వారా కొన్నాడనే విషయాన్ని క్రైస్తవ విశ్వాసులమైన మనము గ్రహించుదుము గాక!  ఆమేన్‌.  1 పేతురు 2:9, ''అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.''

25. మనము చెక్కబడిన బండ  

మనము తవ్వబడిన గుంటను

గూర్చి ఆలోచించుడి అని దేవుడు చెప్పుచున్నారు

        యెషయా 51:1, ''నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచునుండు వారలారా, నా మాట వినుడి  మీరు ఏ బండనుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి  మీరు ఏ గుంటనుండి తవ్వబడితిరో దాని ఆలోచించుడి''

        ప్రియపాఠకులారా!  ఇందులో మొట్టమొదటి వచనములో ''నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచునుండు వారలారా,'' అనుటలో నీతిని అనుసరించుచు యెహోవాను వెదకినవారు ఎవరు?  ఈ జాబితాలో మొట్టమొదటివాడు హానోకు.  తాను లోక సంబంధముగా సంసారిక బంధములో జీవించినను నీతికి మూలకర్తయైన యెహోవా దేవుని సన్నిధిని, ఆయన ఆత్మీయతను, ఆయన రాజ్యమును గూర్చిన ఘనతను వెదకుటయే గాక, అనుసరించు నీతియొక్క ప్రభావ మూలమున దేవునితో చేయి కలిపి, దేవునితో నడిచి దేవునిచే కొనిపోబడి భూనివాసులకు కనుమరుగయ్యాడు.

        అలాగే దేవుని చేత నీతిమంతుడనిపించుకొన్న నోవహు తన నీతి గుణాతి శయములను బట్టి దేవుని వెదికెను.  ఆయన చిత్త ప్రకారము నడుచుచు, ఆయన యందు లక్ష్యముంచి ఎల్లప్పుడు ఆయన కొరకు కనిపెట్టుకొంటూ వుండెను.  ఆయన మాటలను ఆయన ప్రణాళికను ఆయన చిత్త ప్రకారము, ఆయన వివరించిన కొలతలతో ఆయన సంకల్పమును బట్టి దేవునిచేత కలుగబోవు లోక వినాశనము నుండి తప్పించుకొనుటకు తాను సిద్ధపాటు జేసిన ఓడను నిర్మించెను.  ఈ నిర్మాణ కార్యక్రమము సుమారు 120 సంవత్సరములు పట్టింది.  ఈ 120 సంవత్సరములు నోవహు ఆనాటి లోకస్థులకు దేవుని శుభ వర్తమానమును లోకమునకు కలుగబోవు భయంకరమైన జల ప్రవాహముతో కూడిన ఉపద్రవమును గూర్చి బహు తేటతెల్లముగ ప్రకటిస్తూ లోకస్థుల నెచ్చరిస్తూ దేవుని చిత్తానుసారముగా ఓడ నిర్మాణము జరిగిస్తూ దేవుడు తనకిచ్చిన యావత్తు పనిని సంపూర్ణము చేసి దేవుని ద్వారా కలుగబోవు లోక వినాశము కొరకు కనిపెట్టుకొని యుండినాడు.  అంతేకాకుండా జలములు భూమ్మీద విస్తరించిన కాలము నుండి 150 దినములు దేవుని చిత్తానుసారముగా దేవుడు తనకనుగ్రహించిన విధిని బట్టి తాను తన కుటుంబము, తనతో ఉన్న సృష్టిలోని జంతుజాలము, మృగపక్షి సముదాయములతో నోవహు ఉంటూ - జలము మీద మరియొక సృష్టి కొరకు కనిపెట్టుకొని యుండుటయు అనగా సృష్టి అంతయు లయమై పోగా శేషించిన సృష్టి శేషముతోబాటు నోవహు అతని కుటుంబము నిర్మించిన ఓడ యెహోవాను వెదకుచు జలముల మీద తిరిగారు.

        యెహోవాను వెదకినవారిలో మూడవ వ్యక్తి అబ్రాహాము.  అతడు నీతి మాత్రమే గాక విశ్వాసమును బట్టి యెహోవా మీద లక్ష్యముంచి విశ్వాసులకు తండ్రియై ఇసుక రేణువులవలె విస్తరించిన జనాభాకు మూల పురుషుడాయెను.  ఈ విధముగా బైబిలులో అనేకులు యెహోవాను వెదకుచు జీవించిన వారున్నారనుటకు సాక్ష్యముగా నాటి ఇశ్రాయేలు అనబడిన దేవుని జనాంగము నేడు ప్రపంచములో దేవుని వెదకినవారి జాబితాలో సాక్ష్యముగా నిలబడి యున్నది.  అట్టి దేవుడు - ''నామాట వినుడి.  మీరు ఏ బండనుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి,'' అని అంటున్నాడు.

        ఆనాటి ప్రవక్తల ద్వారా యెహోవా ప్రవచించిన విధముగా ఆయన మాటలు వినుటను బట్టి ఇశ్రాయేలు అను జనాంగమును ఏ బండలో నుండి తమ దప్పికను తీర్చుకున్నారో ఒక్కసారి ఆలోచించవలసి యున్నది.  ఆ బండ యేసుక్రీస్తే.  ఆనాటి ఇశ్రాయేలీయుల దప్పికను తీర్చుటకు ఆ బండ మోషే కర్ర తాకిడిని బట్టి స్రవించి పెద్ద జలధారను ప్రవహింప జేసింది.  అంతేగాక, లక్షల జనాభాయొక్క దప్పికను, వారి అవసరతను తీర్చింది.  ఆ బండ నేటి యుగములో విస్తరించియున్న క్రీస్తుయొక్క రూపమునకు  సాదృశ్యమై యున్నది.  అనగా ఆనాడు ఇశ్రాయేలుకు దప్పిక దీర్చిన బండ వలె ఈనాడు అనేక విశ్వాసులయొక్క ఆత్మీయ దప్పికను తీర్చు బండగా క్రీస్తుయొక్క ఆత్మ నేటి జనాంగమును రూపించి, వారికి తన నామము పెట్టబడిన విశ్వాసులుగాను, తనను ఆరాధించు భక్తులుగాను, తనలో అంటగట్టబడిన ద్రాక్షాపళ్ళులుగాను, తన ద్వారా జీవజలమును ఊరించు బండలుగాను రూపించెను.  నేటి క్రైస్తవ విశ్వాసులయొక్క ఫలభరితమైన విస్తరణకు మాదిరియై యున్నది.  అనగా క్రీస్తు అను బండ నుండి నేటి విశ్వాసులమైన మనము చెక్కబడిన క్రైస్తవ బిడ్డలుగా ఉన్నామని గ్రహించవలెను.

        ''చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కికొని యున్నాను.''  కీర్తన 144:12, ''నగరునకై చెక్కిన మూలకంబములవలె ఉన్నారు.''  ప్రియపాఠకులారా, దేవుడు తన ఆత్మీయతతో మనలను ఆత్మ సంబంధమైన బండతో రూపించి యున్నాడని దీని భావము.  మనము స్వతహాగా క్రైస్తవులము కాము.  దైవకుమారుడు, లోకరక్షకుడు, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మరణ పునరుత్థానము ద్వారా మన ఆత్మీయ జీవితములో మార్పుజెంది, సజీవమైన రాళ్ళుగా అంటే సజీవమైన బండలుగా దైవవాక్యము చేత రూపించబడి యున్నామని మనము గ్రహించవలెను.

        ఇక చివరగా - ''మీరు ఏ గుంటనుండి తవ్వబడితిరో దాని ఆలోచించుడి,''  అనుటలో ఆదికాండము 2:7లో దేవుడు మనలను భూమిని గుంట జేసి అందులోని మట్టితో నర రూపమును నిర్మించి, తన జీవమును ఆత్మ ద్వారా ప్రాణదానము చేసెను.  ఈ విధముగా మనలను తన మహిమార్థముగా తనకు యోగ్యులుగా, విధేయులుగా జీవించమని దేవుడు చేసెను.  అందుకు విరుద్ధముగా నరులమైన మనము దైవ వ్యతిరేకతకు పాల్పడినందువలన, ఆయన మన్ను తీసిన అదే గుంటలోకి మరలి వెళ్ళవలసిన క్రియ ప్రాప్తించింది.

        ఆదిలో దేవుడు వనాన్ని సృష్టించినప్పుడు వనములో వున్న పక్షిజాలము, వృక్షజాలము, జంతుజాలము సమస్తమును పరిశుద్ధములు, పవిత్రములునై యుండగా నర నిర్మాణము మాత్రమే ఏదెను వనములో జరుగలేదు.  ఏదెను వనమునకు బయట నరునియొక్క నిర్మాణ క్రియ జరిగినట్లుగా తెలియుచున్నది. ఏదెనుకు బయట నిర్మించబడిన ఆదాము తన పరిశుద్ధమైన ఏదెనులో ప్రవేశమిచ్చి అతనిని బహుగా ప్రేమించాడు.  దేవుడు కుత్సితుడు కాదు గనుక ఆదామును శాసిస్తూ ఈ తోట చెట్ల ఫలములన్నియు నీవు తినవచ్చును.  కాని తోట మధ్యలోని చెట్టు ఫలములను అతడు చావకుండునట్లు వాటిని నిషేధించాడు.  ఏనాటికైనను నిషేధించిన ఫలాన్ని మానవుడు తింటాడని దేవునికి తెలియును.  వానిని ఏదెనులో పాతిపెట్టితే తోట కలుషితమగునని తెలిసియే ఏదెనుకు బయట ఆదామును రూపించినాడు.  అందుకే శాపగ్రస్థుడైన నరుని తోట నుండి వెళ్ళగొట్టి ఇక ఎన్నిటికిని ప్రవేశము లేకుండా చేశాడంటే, ఏదెను తోటన్నది నరుని జన్మస్థానము కాదని తేలిపోయింది, ఎందుకంటే ఏదెను తోటలోని మట్టితో ఆదామును చేసి ఉంటే యాకోబు వలె ఆదాము దేవునితో దినముల తరబడి పోట్లాడేవాడు.  తోటకు బయట దేవుడు ఆదాముయొక్క నిర్మాణ క్రియ జరిగించి యుండబట్టి, ఏదెను ప్రవేశమునకు ఆదాము అనర్హుడై దేవునితో వాదించలేక పోయాడు.

        కాబట్టి ఆదినరుడు చేసిన అపరాధమును, పాపమును, అతడు భుజించిన దైవనిషేధ ఫలమును మరియు దైవాజ్ఞ వ్యతిరేకతను బట్టి దేవుడు తాను ఏ గుంట నుండి తనను మన్ను తీసి ఆదామును రూపించినాడో, తిరిగి మరణావస్థ అను క్రియ ద్వారా దేవుడు మరల అదే గుంటకు అప్పగించినట్లుగా నేడు మన కంటి ఎదుట చనిపోయే వ్యక్తులయొక్క సమాధి కార్యక్రమము ఋజువు పరుచుచున్నది.  అనగా చనిపోయినవానిని గుంట త్రవ్వి పాతి పెట్టుచున్నాము.  ఒక వ్యక్తిని పూడ్చినను, కాల్చినను మరణ గోతికి అప్పగించినట్లు లెక్క.  ఇది ఈ వేద వచనములోని వివరణ.

26. తల్లికి దారి చూపలేని కుమారులు

చేయి పట్టుకొని నడిపించలేని పెంచిన కుమారులు

        యెషయా 51:18, ''ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగల వాడెవడును లేకపోయెను.  ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయి పట్టుకొను వాడెవడును లేకపోయెను.''

        ''ఆమె కనిన కుమారులు,'' అనుటలో మొట్టమొదటిగా నరుని భూమి కనినది.  అనగా భూగర్భము నుండి నరుడు రూపించబడినాడు.  ఆ తర్వాత సృష్టికర్తయొక్క క్రియా ప్రభావమువలన పురుషుడు స్త్రీని కన్నాడు.  అటుతర్వాత, అమాయకులైన నరజంట దైవ నిషేధ ఫలముల ద్వారా కనువిప్పు గల్గినవారై సిగ్గు, లజ్జ తెలిసిన తర్వాత ఆదాము భార్య ఇద్దరిని కనింది.

        భూమి కనిన నరులు భూసంబంధులై దైవత్వము నతిక్రమించి మానవత్వమునకు దిగినందువలన మానమర్యాద లెరిగినందువల్ల నరజన్మకు తల్లియైన భూమి కూడా శాపగ్రస్థురాలై దిక్కులేనిదిగాను, సక్రమమైన దారి ఎరుగనిదిగాను అయి శాపగ్రస్థురాలైనది.  ఇందునుబట్టి యెషయా 1:2లో దేవుడు ప్రవచిస్తూ - ''నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరగబడియున్నారు.'' అని విచారించినట్లు వేదములో మనము చదువగలము.

        ఇంతకు ''ఆమె'' అనగా ఎవరు?  యెరూషలేము అను వధువు సంఘము.  ఈమెను దేవుడు భూమిపై ఇశ్రాయేలీ జనాంగముతో ఏర్పరచాడు.

        దేవుని పరిశుద్ధ సంఘమైన ఇశ్రాయేలీయులు దోషులై దైవత్వము మీద సణిగి పలుమార్లు మోషేపై తిరుగుబాటు చేస్తూ, ప్రభువు మార్గములో ప్రవక్తలయొక్క సారధ్యములో నడువక పోవుటయేగాక దైవత్వము మీదను, నాయకుల మీదను సణిగినట్లుగా బైబిలులో మనము చదువగలము.  ఇట్లు సణగుట వల్ల దేవుని చేత మొత్తబడి అనేక విధములైన అరిష్టాలకు గురియైనట్లు వేదములో చదువగలము.  ఇందునుబట్టి సంఘము అను ఇశ్రాయేలు జనాంగమును కని సంబరపడగా, ఆ సంఘము అను స్త్రీని దైవమార్గములో నడిపించుటకు బదులు తమ చిత్త ప్రకారముగా వారి వారియొక్క సిద్ధాంతాలను, వారి మనో తత్వాలకనుగుణముగా సంఘమును కూడా అలౌకిక దైవ వ్యతిరేక మార్గాలలో నడుపుచూ - సంఘము అను స్త్రీ నడువవలసిన దారిని ఆమెకు చూపలేక పోయారు.  అదే విధముగా సంఘము కనినటువంటి బిడ్డలు సంఘమునకును, సంఘ నిర్మాణకుడైన సృష్టికర్తను అలక్ష్యము చేసి, వారి మనోవృత్తిని బట్టి ప్రవర్తింపగా దేవుడు నరుని సృష్టించినందుకు సంతాపము నొందెను.  పాత నిబంధన అను సంఘము అను స్త్రీని తన జనాంగమైన ఇశ్రాయేలీయులకు అనుగ్రహించినాడు.  ఈ పాత నిబంధన సంఘ బిడ్డలు కూడా సంఘ మర్యాదకును, సంఘమును నడుపవలసిన ఆదర్శపూరితమైన విధానమును విస్మరించి, సంఘమునకే చీడపురుగులైనట్టుగా పాత నిబంధన నిర్గమ కాండములో చదువగలము.

        ఇట్లుండగా ఈ యెరూషలేము అను వధువు సంఘము అను స్త్రీ కనిన బిడ్డలు నిష్ప్రయోజకులుగా కాగా దేవుడు కన్నికయైన ఒక స్త్రీ గర్భాన్ని ఎన్నుకొని, ఆమె ద్వారా ఈ లోకములో ప్రసవించబడి, మరియమ్మ కుమారునిగా అనగా కన్యక కన్నబిడ్డగా జన్మించి, మనుష్య కుమారునిగా ప్రకటించుకొంటూ తానేర్పరచబోవు సంఘమునకు తాను ఆదర్శముగా క్రియ జరిగిస్తూ - తల్లియైన మరియమ్మకు విధేయుడై, ఆమెను తన మార్గములోనికి అనగా దైవమార్గములోనికి నడిపించి, దైవ పుత్రునికి తల్లిగా ఆమెకు ఒక చరిత్రను సృష్టించి, జీవ మార్గములో నడుచుటకు ఆమెకు దారి చూపించినాడు.  ఇందునుబట్టి యేసు తల్లియైన మరియమ్మ లోక స్త్రీలందరిలోను ధన్యురాలుగా ప్రకటించబడి ఉన్నది.

        ఈ విధముగా కన్యకయైన మరియమ్మ కన్నటువంటి ఆమె కుమారుడు తల్లియైన మరియమ్మను సత్య జీవ మార్గములో నడిపించినట్లు వేదములో చదువగలము.  ఈమె యేసు ప్రభువు కన్నతల్లిగాను, ఆమె దైవత్వము చేత తనకనుగ్రహించబడిన బాధ్యత మేరకు యేసు ప్రభువును పెంచి, ఆయనను చెయ్యిపట్టి నడిపించి, ఆయన చేత చెయ్యి పట్టించుకొని పుణ్య మార్గములోనికి వెళ్ళగలిగింది.  దీనినే ఆదర్శముగా తీసుకొని యేసు ప్రభువు కూడా తనకంటూ ఒక వధువు సంఘమును, దైవవాక్కుతో కట్టి, ప్రార్థనాశక్తితో దానిని రూపించి, అనేకులైన విశ్వాసులకు సంఘము అన్నది తల్గిగాను, అనేకమంది ఆత్మలను కనుటకు తల్లిగా రూపొందించినాడు.  సంఘములో కనబడిన ఆత్మలను ప్రార్థనతోను, వాక్యముతోను, ఆత్మీయతతోను పోషించిన తల్లిగా సంఘమును ఏర్పరచాడు.  అట్టి తల్లికి శిరస్సుగా అనగా భర్తగా యేసుక్రీస్తు ఏర్పరచబడి ఉన్నట్లు - ఎఫెసీ 5:23, 27, ''క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున ...  క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.  ...  పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి.  అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.''  కనుక యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఏర్పరచబడిన సంఘము కూడా యెరూషలేము అను సంఘమే.  అయితే క్రీస్తు ప్రభువు ద్వారా నూత్నీకరించబడినది అనగా నూతనపరచబడింది.

        యెషయా గ్రంథము 51:18లో వివరించబడిన వాక్య వివరణలో చెప్పబడిన ఆమె యేసుయొక్క బలియాగము ద్వారా శారీర రక్తములతో రూపించబడి పవిత్రమైనదిగాను, పరిశుద్ధ మహిమగలదిగాను ఏర్పరచబడిన సంఘము లేక పరిశుద్దుల కూడికగా క్రీస్తు ద్వారా మరల ఏర్పరచబడినది.  కనుక నేటి క్రైస్తవ సంఘము అను తల్లియొక్క బిడ్డలుగా ఉన్న మనము క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనము ఆత్మ పూరితులముగా ఆ దేవుని బిడ్డలుగా చెలామణి యగుచున్న మనము నేటి మన క్రైస్తవ సావాసములోనే మనముంటున్న సంఘమును దైవత్వములోకి అనగా క్రీస్తులోనికి నడుపుటకు ప్రయత్నము చేస్తున్నామా?  సంఘమును క్రీస్తు మార్గములో నడిపించుటకు యోగ్యకరమైన క్రియలు మనకున్నవా?  ఇందునుబట్టి రోమా 3:11, ''నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు  గ్రహించువాడెవడును లేడు  దేవుని వెదకువాడెవడును లేడు,''  అని అంటున్నాడు.

        సంఘముయొక్క బిడ్డలమైన మనము మన కుత్సిత గుణములను బట్టి మనము ఆశించిన వక్రమార్గములో సంఘమును నడిపించాలని ప్రయత్నిస్తున్నాము.  ఈనాడు సంఘమును ఉద్ధరించి సంఘమును మంచిదారిలో నడుపుటకు ప్రయత్నించవలసిన సంఘ పెద్దలు, కాపరులు ఏ విధముగా వున్నారో మనయొక్క క్రైస్తవ అనుభవములో మనము గ్రహించవలసి యున్నది.  నేటి క్రైస్తవ సంఘములలో స్వార్థము, పదవీవ్యామోహము, కులతత్వాలు, జాతి బేధాలు, అంతస్థు బేధాలు, ఇవి విలయ తాండవమాడుచూ సంఘ మర్యాదను, సంఘమునకున్న విలువను సంఘముయొక్క ఆత్మీయ స్థితిని దిగజార్చి సంఘములను పాడు చేస్తున్నట్టి వారు లేకపోలేదు.  అందుకే అంటున్నాడు - ''ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగల వాడెవడును లేకపోయెను.''  అనగా సంఘము కనిన బిడ్డలు ఎవరును సంఘముతో ఐక్యము కాలేదని భావము.  సంఘము కనిన ఆత్మలు సంఘమును గౌరవించక సంఘమునే తప్పుడుదారులు పట్టించుటకు తయారగుచున్నవి.

        ఇంతకు ఆమె అనగా యెరూషలేము అను వధువు సంఘము.  ఈ సంఘమును దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా ఎన్నుకొని, అతని ద్వారా భూమిపై జన్మించి 12 మంది కుమారులతో ఏర్పరచెను.  వీరు ఇశ్రాయేలు జనాంగమునకు మూలపురుషులు.  వీరి ద్వారా జన్మించిన కుమారులు, యెరూషలేము అను వధువు సంఘము అను స్త్రీ కనిన కుమారులుగా ఇందులో చెప్పబడినది.  అయితే ఈ యెరూషలేము పాలస్తీనా భూభాగములో దేవునిచే ఏర్పరచబడి సొలొమోను చక్రవర్తిచే ఆలయ నిర్మాణము జరిగింది.  అయినను యెరూషలేము కనిన కుమారులందరు త్రోవతప్పి యెరూషలేమను సంఘమను స్త్రీని సరియైన మార్గములో నడిపించలేక పోయారు.  క్రీస్తు పుట్టునప్పటికి యెరూషలేమను స్త్రీ కనిన కుమారులు అందరు పనికిమాలినవారై ఆత్మీయ జీవితములో పతనావస్థలో వుండి, యెరూషలేమను స్త్రీని సరియైన దేవుని మార్గములో వుంచలేక పోయారు.

        అయితే - ''ఆమె పెంచిన కుమారులు ఎవరు?''  వీరు స్వతహాగా యాకోబు సంతతిలో 12 గోత్రములకు చెందినవారు కారు.  వీరు ఇశ్రాయేలు దేవుని మహత్కార్యములను చూచి నమ్మి ఇశ్రాయేలు దేవుని తమ దేవునిగా విశ్వసించి, ఇశ్రాయేలీయులలో ఐక్యమైనవారు.  వీరు కనిన కుమారులు కారు.  వీరు ఆత్మరీత్యా పెంచబడిన కుమారులేగాని యాకోబు సంతానమునకు చెందినవారు కారు.  కాని ఇశ్రాయేలు దేవుని నమ్మి ఆయనను తమ దేవునిగా అన్యజనుల నుండి వచ్చినవారు.  కాని యెషయా ప్రవక్త కాలములోను, క్రీస్తు కాలములోను ఈ పెంచబడిన కుమారులు కూడా పనికిమాలినవారై ఆత్మీయ రీత్యా పతనమును చూచారు.  కనుక వీరు కూడా ఆమెకు చెయ్యి అందించలేక పోయారు.  

        యెరూషలేమను సంఘమను స్త్రీకి చెయ్యి అందించినవారు కూడా వున్నారు.  వీరు పరిశుద్ధులు.  వీరు సంఘమను స్త్రీని చెయ్యి పట్టి నడిపించినవారు.  అయితే యాకోబు సంతానము ద్వారా ఏర్పరచబడిన యెరూషలేమే ఆమె అని ఎలా చెప్పగలము?  ప్రకటన 21:9-12, ''అంతట ఆ కడపటి యేడు తెగుళ్లతో నిండిన యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి-ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను, అనగా గొఱ్ఱెపిల్లయొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.  దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్య రత్నమును పోలియున్నది.  ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను;  ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి, ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మములు మీద వ్రాయబడి యున్నవి.''  ఇందునుబట్టి యెరూషలేము పరిశుద్ధ పట్టణము లేక వధువు సంఘము అను ఈమె యాకోబు 12 గోత్రముల పేర్లు పైన నిర్మించబడినది.  కాని క్రీస్తు కాలములోగాని, యెషయా ప్రవక్త కాలములోగాని, కనిన కుమారులు, పెంచబడిన కుమారులు అందరు ఏకముగా ఆత్మీయస్థితి కోల్పోయి ఉన్నారు.

        పైన చెప్పినట్లుగా ఇటువంటి స్థితిలో దేవుడు కన్య మరియమ్మను ఎన్నుకొని ఆమె ద్వారా తనే క్రీస్తుగా ఈ లోకములో జన్మించి, నూతన నిబంధన అను మరియొక సిద్ధాంతమును ఏర్పరచి, మరల తనే పునాదిగా యెరూషలేమను సంఘమును నూత్నీకరించి (నూతనపరచి) ఏర్పరచాడు.  ఈ సంఘమును కూడా యెరూషలేము అను వధువు సంఘమును క్రీస్తు 12 మంది అపొస్తలులను ఏర్పరచి, వారి మీద ఈ సంఘమును నిర్మించాడు.  కనుక ఈ యెరూషలేము అను పరిశుద్ధ పట్టణముయొక్క పునాదులపై 12 మంది అపొస్తలుల పేర్లు లిఖించబడియున్నవి.  ప్రకటన 21:14, ''ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలది, ఆ పునాదులపైనగొఱ్ఱెపిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేళ్లు కనబడుచున్నవి.''  

        కనుక పాత నిబంధనలో కనిన కుమారులు, పెంచబడిన కుమారులు అను బేధము కలిగియున్న సంఘము అను స్త్రీ అప్పటి ఆమె కనిన కుమారులు, పెంచిన కుమారులు విడిచి పెట్టుట చేత క్రీస్తు ప్రభువు తన నూతన నిబంధన అను సువార్త ద్వారా అందరిని ఏకపరచి అనగా తన రక్తముతో పరిశుద్ధులుగా చేసి, పరమ యెరూషలేమునకు యోగ్యులుగా చేసి యున్నాడు.  క్రీస్తు ప్రభువు తరువాత కనిన కుమారులు, పెంచిన కుమారులు అన్న తేడా లేదు.  అందరు పరమ యెరూషలేమునకు కుమారులే.  వీరు క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి, ఆయన నామములో బాప్తిస్మము పొందినవారుగా మనము గుర్తించాలి.

        మన స్థితి ఎలా ఉన్నది?  మనము సంఘమను స్త్రీని పరిశుద్ధ స్థితిలో నడిపించుటకు మన చేయిని అందించుచున్నామా?  లేక యుగాంతములో జరగబోవు లోక నాశనమునకు సిద్ధపరచుచున్నామా?  ఒకసారి మనము ఆత్మ విమర్శ చేసుకోవలసిన సమయము ఇది, ఎందుకంటే ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మరియు ఇశ్రాయేలీయుల దేవుని తమ దేవునిగా అంగీకరించినవారు సంఘమను స్త్రీని చేయిపట్టి సరియైన మార్గములో నడిపించలేకపోవుట చేత యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో జన్మించి మరల సంఘమను స్త్రీని నూత్నీకరించి తనే పునాదిగా ఏర్పరచుట జరిగింది.  అయితే సంఘమను స్త్రీకి పెంచిన, కనిన కుమారులు అను తేడా లేకుండా క్రీస్తు ప్రభువు ఈ సంఘమును ఏర్పరచాడు.  అయితే సంఘమను స్త్రీని క్రీస్తులో బాప్తిస్మము పొందిన మనము నడిపించవలసినవారమై యున్నాము.  అయితే పాత స్థితిలోవలె మరల మనము సంఘమను స్త్రీని సరియైన మార్గములో మన నీతి క్రియలతో నడిపించక నాశన మార్గములో నడిపించినట్లైతే, క్రీస్తు ప్రభువు రెండవ రాకడలో మనలను నిత్య నరకాగ్ని గుండము పాలు చేయును.  ఎవరైతే సంఘమను స్త్రీని చేయిపట్టి నీతి క్రియలతో నడిపిస్తారో వారికి పరలోక రాజ్యములో ఉన్నత స్థితిలో ఉందురని గ్రహించాలి.

27.  సుందర వస్త్రములు

        యెషయా 52:1, ''సీయోనూ, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము  పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము  ఇకమీదట సున్నతిపొందని వాడొకడైనను  అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు.''

        ప్రియపాఠకులారా!  పై వేద వాక్యములో నిరుత్సాహముతోను, అలక్ష్యముతోను క్రీస్తు ప్రేమను, దేవుని ప్రేమను, పరిశుద్ధాత్మయొక్క శక్తిని, ప్రభావమును గుర్తింపలేని స్థితిలో నిద్రావస్థలోను, లోక సంబంధమైన వ్యాజ్యములు, కలహములు, పార్టీలతో సతమతమౌతున్న సంఘమునకు దేవుని హెచ్చరికయై యున్నది.  అంటే సీయోను అను ఓ క్రైస్తవ సంఘమా!  మేల్కొనుము - మేల్కొనుము నీ బలమును ధరించుకొనుము, అనుటలో సంఘమునకు ఉన్న బలము పరిశుద్ధాత్మునియొక్క నింపుదల - శక్తి.  ఇదియే బలము.  ఈ బలమును ధరించుకొన్నప్పుడు సంఘము పరిశుద్ధమైన సంఘముగా పరమ యెరూషలేము అను దేవుని పట్టణమునకు అనుబంధముగా ఉండగలదని భావము.

        సంఘము బలపడాలంటే మొట్టమొదటిగా ప్రార్థనా శక్తి, విశ్వాసుల సహవాసము, దైవ సేవకుల పరిచర్య, మంచి తర్ఫీదు, కన్నవాటిని, విన్నవాటిని దేవుని మహిమ పరచుచూ చేయు సువార్త ప్రచురణ, క్రమము తప్పకుండా జరిగించు పరిచర్య.  ఈ విధముగా వున్న పక్షములో తప్పకుండా పరిశుద్ధాత్మను సంఘము ఆకర్షించగలదు.  సంఘము పరిశుద్ధాత్మ శక్తిని పొందకపోతే సంఘములో పరిశుద్ధాత్ముడు ఉండకపోతే, క్రియ జరిగించకపోతే అట్టి సంఘము జీవము కలిగింది కాదు.  మృతమైనదే!  ఎందుకంటే యేసు ప్రభువు తాను ఈ లోకము నుండి వెళ్ళు సందర్భములో తన శిష్యకోటిని ఓదార్చుచూ, తాను వాగ్దానము చేసి పంపబోయే ఆత్మను గూర్చి ప్రకటించి ఉన్నాడు.  యోహాను 14:16-17, 26 ''నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకను గ్రహించును.  లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు;  మీరు ఆయనను ఎరుగుదురు.  ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును.  ...  ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.''  పరిశుద్ధాత్ముడు సంఘమును ఆదరించువాడును, సంఘమును సత్య మార్గములో నడిపించువాడును, సంఘమును పరిశుద్ధముగా ఉంచువాడునై యున్నట్లుగా ఈ పరిశుద్ధాత్మునియొక్క క్రియ ఉన్నది.  ఇట్టి పరిశుద్ధాత్మునియొక్క ఆదరణలో, సత్య మార్గములో ఎదిగే సంఘము పరిశుద్ధ పట్టణమైన యెరూషలేముగా, భూలోక యెరూషలేముగా ఉండాలని తండ్రియైన దేవుడు యెషయా ప్రవక్త ద్వారా వ్రాయించిన మాటలు ఇవి.

        లోకములో ఏ పట్టణమునకు, ఏ యాత్రా స్థలమునకును, పుణ్య స్థలమునకును, లోక రాజ్యములకు వేటికిని లేనటువంటి ఒక ప్రత్యేక మరియు దైవత్వము చేత ప్రత్యేక గుర్తింపు యెరూషలేము లేక సియోను అను పేరునకున్నది.  లోకరీత్యా ఈ లోక రాజ్యములలో, రాష్ట్రాలకు, కొన్ని పట్టణాలకు రెండేసి పేర్లు కూడా వున్నవి.  ఉదా :-  బెజవాడ పట్టణము.  ఈ పట్టణము పేరు విజయవాడ అను మరొక పేరున్నది.  అలాగే ఒంగోలు జిల్లాను ప్రకాశము జిల్లా అని మరొక పేరుతో పిలవబడుచున్నది.  అలాగే నెల్లూరుకు సింహపురి అని మరియొక పేరున్నది.  ఇంకను మద్రాసుకు చెన్నపట్టణమని పేరు కూడా ఉన్నది.  ఈ విధముగా రెెండు పేర్లు గల పట్టణములు ఉన్నవి.  అట్లే యెరూషలేమునకు కూడా సీయోను అని, యెరూషలేము అని, షాలేము అని వగైరా పేర్లతో పిలువబడుతున్నది.  ఇది భూలోక సంబంధముగా పిలువబడుచున్న పేర్లు.  కాని పరలోక రాజ్యములో మాత్రము భూలోక సంబంధమైన పట్టణాల పేర్లు ఏవియు లేవు.  ఉండేది రెండు పేర్లే పరమ సీయోను, పరమ యెరూషలేము. అందుకే సీయోను అని పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము అని యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు.  ఈ దేవుని పట్టణమైన ఈ పవిత్ర సంఘము సీయోను అను పేరుతో నిద్రావస్థలో వున్నట్లు, అట్టి నిద్రావస్థలో వున్న ఈ పట్టణమును, ''లెమ్ము, లెమ్ము,'' అని యెషయా అంటున్నాడు.  అంటే సీయోనులో పాలుమాలిక ఆవరించి బలహీనమైన, అశక్తమైన, శక్తి హీనమైయున్నట్లు నీ బలమును ధరించుకొమ్ము అని సీయోనును హెచ్చరించుచున్నాడు.  ఇది బలమును ధరించుకొనుటకు హెచ్చరిక.

        అట్లయితే సీయోను మేల్కొని మెలుకువ గలదై, బలము, శక్తి, ఆత్మ నింపుదల - మెలకువతో కూడిన సిద్ధపాటు గలదైనప్పుడు - పరిశుద్ధ పట్టణమైన యెరూషలేముగా మారుతుంది.  పరిశుద్ధ స్థితిలో పరిశుద్ధ ఆరాధనల్లో, పరిశుద్ధ క్రమములో, పరిశుద్ధుల జీవితములో జీవిస్తే ఆ సీయోనే యెరూషలేముగా మారుతుంది.  యెరూషలేముగా మారిన ఆ సీయోనునకు జరుగు సత్కారము సుందర వస్త్రములతో అలంకరణ.

        నేటి నవవాగరిక యుగములో కవులను, పండితులను, వేద విద్వాంసులను, వేదాంతులను, పెద్దలను గొప్ప పదవిని అలంకరించిన వారిని జన బాహుళ్యము సత్కరించి, శాలువలు కప్పి సన్మానిస్తుంది.  అలాగే ఇక్కడ కూడా దైవత్వములో గొప్ప ప్రగతిని సాధించిన ఈ సీయోను యెరూషలేముగా మారి, పరిశుద్ధ స్థితిలో ఉన్నప్పుడు అనగా పరిశుద్ధాత్మను ధరించుకొన్నప్పుడు సుందర వస్త్రములు ధరించుకొనవలసి యున్నది.  రిబ్కా తన కుమారుడైన యాకోబుకు తొడిగిన ఏశావుయొక్క ఆశీర్వాద వస్త్రము, ఐగుప్తులో ఫరో యోసేపుకు తొడిగిన రాజవస్త్రము, తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు చేరినప్పుడు తండ్రి కుమారుని యందు కనికరపడి అతనికి తొడిగిన ప్రశస్థ వస్త్రము, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొంది, దైవరాజ్య వ్యాప్తి నిమిత్తము సమర్పణా జీవితములో సాగిపోయేటటువంటి విశ్వాసులకు ప్రభువు తొడిగే మహిమ వస్త్రము వంటి వస్త్రములు పరిశుద్ధ సంఘము ధరించుకోవాలని దేవునియొక్క సంకల్పము.  ఇదియే సంఘము ధరించుకోవలసిన సుందర వస్త్రములు.  అంతేగాని వాయిలు, టెరికాటన్‌, ఆర్గండి వస్త్రములు కావు.  ఇక్కడ సుందర వస్త్రములు ఆనగా నీతి క్రియలు అని గుర్తించాలి.  ఈ నీతి క్రియలు పరిశుద్ధులు జరిగించినవే.  ఈ పరిశుద్ధుల నీతిక్రియలు యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము ధరించి క్రీస్తును యుగాంతములో చేరునని గ్రహించాలి.  ప్రకటన 19:8, ''ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను;  అవి పరిశుద్ధుల నీతిక్రియలు.''

        ''ఇకమీదట సున్నతిపొందని వాడొకడైనను,''  అనుటలో ఇట్టి పరిశుద్ధ సంఘములో సభ్యుడుగాను, ఒక గుర్తింపు కలవాడుగా లేక సంఘ నిర్వాహకుడుగాను, లేక సంఘ పరిచర్యలో పాలుపంపులు గలవాడుగాను జీవించాలంటే అట్టివాడు తప్పకుండా జలబాప్తిస్మము పొంది యుండవలెను.  ఇది పాత నిబంధన కాలము.  కాబట్టి ఇందులో సున్నతి అని వ్రాయబడి వున్నది.  ఇప్పుడు అపొస్తలుల యుగము దాటి హతసాక్షుల యుగము గతించిపోయి ప్రభువు రాకడకు నిరీక్షించవలసిన సమయము కనుక ఇప్పుడు బాప్తిస్మము పొంది, యేసు నామములో ముద్రించబడకపోతే అతడు ఈ పరిశుద్ధ యెరూషలేము సంఘములో జీవించుటకు యోగ్యుడు కాడు.  అతనికెట్టి అధికారములుండవు.  ఒకవేళ అట్టివాడు సంఘములో కూర్చున్నను అట్టివాడు  సంఘ సహవాసములోను, ప్రభువు సంస్కారములోను, సంఘ కార్యములలోను వారసుడు, అర్హుడు కానేరడు.  ఇది సున్నతి పొందని వానిని గూర్చిన మాట.

        ''అపవిత్రుడొక్కడైనను నీ లోపలికి రాడు,'' అని అనుటలో ఈ అపవిత్రుడెవరు?  ప్రియపాఠకులారా, ఈ అపవిత్రులు ఐదు రకములున్నారు.  

        1.  దేవుడు నిషేధించిన వాటిని తినువారు.  

        2.  దేవుడు నిషేధించిన వాటిని ఆరాధించువారు.  

        3.  స్త్రీ సాంగత్యము ద్వారా అపవిత్రులైనవారు.  

        4.  దైవత్వాన్ని మరచి లోకాన్ని అంటిపెట్టుకొని సృష్టినే దేవునిగా భావించేవారు.

        5.  ఎఫెసీ 2:1లో వలె అపరాధములచేతను, పాపములచేతను చచ్చినవారు.                  ఇట్టివారు ఈ పరిశుద్ధాత్ముని పట్టణము అను ఈ యెరూషలేము సంఘ కార్యములలో, పరిశుద్ధ సంఘములో, పరిశుద్ధ మందిరములో, పరిశుద్ధ సహవాసములో, పరిశుద్ధ కూడికలో, పరిశుద్ధ ఆరాధనలో ఒక్కమాటలో చెప్పాలంటే మందిర ప్రవేశమునకు కూడా అనర్హులు.  ప్రియపాఠకులారా, ఒక్కమాటలో వ్రాయాలంటే యెరూషలేము అను పట్టణ సహవాసములో ఉండు విశ్వాసులకే విధమైన అపవిత్రత ఉండదని మనము గ్రహించుకోవాలి.

28.  ఊరకయే అమ్మబడుట

 రూకలియ్యకయే విమోచింపబడుట

        యెషయా 52:3, ''యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు -మీరు ఊరకయే అమ్మబడితిరి గదా  రూకలియ్యకయే మీరు విమోచింపబడెదరు.''

        ప్రియపాఠకులారా!  ఈ వాక్యము రెండు విధములైన భావములను తెలుపుచున్నది.  అదేమంటే ఊరకయే అమ్మబడుట, రూకలియ్యకయే విమోచింపబడుట.  మొట్టమొదటిగ ఊరకయే అమ్మబడిన వారెవరు?  వారు ఎక్కడ అమ్మబడినారు?  ఎందు నిమిత్తము అమ్మబడినారు?  అమ్మబడిన వారి స్థితియొక్క పర్యవసానమేమిటి?  రూకలియ్యకయే విమోచింపబడిన వారెవరు?  వారు విమోచింపబడినదెక్కడ?  వారి పర్యవసానమేమిటి?  వీటిని గూర్చి తెలిసికొందము.

        దేవుడు ఆరు దినములు శ్రమించి నిర్విరామముగ కృషి జేసి ఈ సృష్టిని సృష్టించెను.  ఈ సృష్టిలోని సృష్టములు వాటితో బాటుగా దేవుడు నిర్మించిన ఏదెను అను పరిశుద్ధ వనము, అందులోని నరజంట, వీరందరి విషయము మనము ఆలోచిస్తే, వీరందరికి దేవుడు అనుగ్రహించిన నిర్విచార నిత్యసంతోష పరమానంద జీవిత విధానము మనము తలచుకుంటే, దైవత్వమునకు నరుని మీద నున్న ప్రేమ ఏపాటిదన్నది విలువ కట్టలేము. ఈ విధముగా నరులతో సఖ్యతగా ఉండి, నరులలో ఒకడుగా వుండి, నరులను తన ఆత్మీయ కుటుంబముగా భావించి క్రియ జరిగించిన దేవునిపట్ల నరులు చూపిన కృతజ్ఞత ఎటువంటిదంటే నేడు మనము ఊహించని స్థితిలో క్షమించుటకు కూడా వీలుగాని మహా నేరమైయున్నట్లు ఈ క్రింది అంశములను బట్టి వేదరీత్యా మనము గ్రహించగలము.

        ఇందులో మొట్టమొదట ఆదినరుడైన ఆదాము సృష్టికర్తయొక్క క్రియయై యుండి ఆయన ఆత్మను, ఆయన పరిశుద్ధతను, ఆయన సహవాసమును పొంది, యావద్‌ సృష్టికి నిర్వాహకుడుగా అనగా ఏలికగా నియమించబడెను.  అట్టి నరుని శల్యములో నుండి స్త్రీ రూపించబడినది.  ఈమె కూడా పురుషునిలోని ఆవయవ భాగమై యుండి, దేవుని క్రియాకర్మయై పరిశుద్ధ స్థితిలో మరియు పరిశుద్ధ వనములో వంటావార్పు లేకుండుట ఉండినది.  నేటి నరకోటి ఆహార సమస్యను గూర్చి విప్లవాలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదములు చేయుచూ కూడు గూడును గూర్చి పోట్లాడుతున్నారు.  ఇట్టి కూడూ గూడును గూర్చి చింతలేని జీవితములో ఆది నరులను ఆది దేవుడు వుంచి పోషించగా, ఇట్టి నరజంటను అలౌకిక శక్తియైన సాతాను అనగా దురాత్మ సర్పమును మధ్యవర్తిగాను, దళారిగాను, వర్తకునిగాను మూడు విధములైన ఆధిక్యతలతో వారిని ప్రేరేపించి, వాని ద్వారా అపవాది తన సొమ్ముగాని, సర్పపు సొమ్ముగాని లేకుండా దేవుడు తినవద్దన్న దేవుని సొత్తయిన పండుతోనే ఆది నరజంటను కొన్నాడు.  

        అపవాదికి ఆది నరజంటను అమ్మినది దేవుడు కాదు.  కాని ఆది నరజంటను సర్పము అమ్మినది.  సాతాను వారిని కొన్నాడు.  అటు తర్వాత ఇక్కడ నుండి కొనుగోలు అమ్మకము అన్నది ప్రారంభమైనది.  పాతకాలములో అమ్మకములు వస్తు మార్పిడి పద్ధతిలో జరిగేవి.  అనగా ఒకరు ఒక వస్తువును ఇస్తే మరియొకరు మరియొక వస్తువును ఇచ్చేవారు.  అలాగే ఏదెను వనము సాతాను నరులను పాప ప్రవేశము చేయించి వారిని తన దాసులుగా చేసుకోవాలని అనుకొన్నాడు.  అందుకోసము సాతాను సర్పమును మధ్యవర్తిగా చేసుకొని వానిని ఆవహించి, హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెను కొనుటకు ప్రయత్నము చేసాడు.  ఇందులో సాతాను సర్పము ద్వారా దేవుడు తినవద్దన్న పండును హవ్వకు చూపించి మాట్లాడుట జరిగింది.  ఈ పండుకు యజమాని దేవుడు.  

        దానిని తినుటకు దేవుడు నరులకు ఇయ్యలేదు.  అనగా నరులు ఆ పండును తినుటకు యోగ్యత లేదు, ఎందుకంటే వారు ఆ పండునకు యజమానులు కారు.  కనుక సాతాను నరులకు ఆ పండును మధ్యవర్తియైన సర్పము ద్వారా హవ్వ చేత తినిపించుట చేయగలిగింది.  ఈ విధముగా హవ్వ తన సొమ్ముగాని సొమ్మును తీసుకొని తిని ఋణగ్రస్థురాలై పోయినది.  అనగా అమ్ముడై పోయినది.  ఈ విధముగా ఆమె దేవుడు తినవద్దన్న పండును తినుటనుబట్టి సాతాను ఈమెను తన సొమ్ముగాని, వస్తువుగాని ఇయ్యకుండానే ఆమెను కొనగలిగాడు.  ఎందుకంటే దైవాజ్ఞ మీరుట ద్వారా హవ్వ దేవుని శాపమును పొందినది.  శాపగ్రస్థులు సాతాను వశమై యుందురు.  అలాగే ఆదాము విషయములోను జరిగింది.  ఆదాము హవ్వలను కొన్న రీతిగానే సాతాను కయీనును కొన్నాడు.  ఎట్లంటే కయీనులో ఉన్నటువంటి దుర్గుణముల ద్వారా కయీను సాతానుకు అమ్ముడాయెను.  అలాగే ఇస్సాకు కుమారుడైన ఏశావు తన తమ్ముడైన యాకోబుయొక్క వంటకానికి అమ్ముడాయెను.  అనగా యాకోబు వండిన రుచికరమైన కూర ఏశావును కొన్నది.  ఏశావు ఆ కూరకు అమ్ముడై పోయాడు.  అలాగే ఏశావు కూడా ఊరకే తన తమ్ముడైన యాకోబునకు తన జేష్టత్వపు హక్కును అమ్ముకొన్నాడు.  యాకోబు ఆ హక్కును రుచికరమైన కూరను ప్రతిగా ఇచ్చి కొనుక్కున్నాడు.

        యాకోబు సంతానములో ఒకడైన యోసేపును అతని అన్నలు ఇష్మాయేలీయులకు అమ్ముకున్నారు.  ఇష్మాయేలీయులు యోసేపును కొన్నారు.  అలాగే సంసోను తన ఆత్మీయ బలహీనతను బట్టి స్త్రీ వ్యామోహితుడై దైవచట్టాన్ని దైవప్రతిష్టను మంట గలిపి డెలీల అను వేశ్య పొందుగోరి, ఆమె రూప లావణ్యమునకు అమ్ముడైపోయి, తన బలాధిక్యతల రహస్యమును ఆమెకు చెప్పి అశక్తుడును, అంధుడుయై ఫిలిష్తీయులకు అమ్మబడినాడు.  అలాగే నయమాను ఎలీషాకు ఇచ్చిన బంగారు, వెండి వస్త్రయుతమైన కానుకలను ఎలీషా తిరస్కరించగా గేహాజి వాటిని ఆశించి, వాటిని తెచ్చుకొని నయమాను య్కొ కుష్టు రోగమునకు అమ్ముడాయెను.  అనగా నయమానుకు వచ్చిన కుష్టురోగము గేహాజీని కొనుక్కున్నది.  అలాగే ప్రియపాఠకులారా, పాత నిబంధనలో ఇంకను చాలామంది అమ్ముడై పోయినవారున్నారు.

        నూతన నిబంధనలో పరమ గురువైన యేసు ప్రభువును ఆయన శిష్యుడైన ఇస్కరియోతు యూదా 30 వెండి నాణెములకు ఆయనను అమ్మినాడనిన మాటేగాని ఆ సొమ్మును అనుభవించలేదు.  అది నేలపాలైనది.  కనుక ఇస్కరియోతు యేసు ప్రభువును ఊరకనే అమ్ముకున్నట్లుగా మనము భావించవలసి యున్నది.  కాని యేసు ప్రభువును యూదులు ఊరకనే కొనుక్కున్నట్లయినది.  అనగా మరణమునకు యూదా ఊరకే అమ్మబడినాడు.  అననీయ సప్పీరాలు ఇద్దరును తమ స్వంత ఆస్థిని గూర్చిన విషయములో తమ పొలాలను అమ్ముకొనిరి.  ఆ అమ్మిన డబ్బును దేవుడు అడుగలేదు.  అయినను అనవసరముగా దేవునికి ఇచ్చెదమని నిర్ణయించి, దేవుడు వారియొక్క సొత్తును అడుగకపోయినను తామే ఇచ్చెదమని మొక్కుకున్నవారై, భార్యాభర్తలు ఇరువురును ఒకే రోజు ఒకే స్థలములో, ఒకే రీతిలో మరణించి సమాధియైనట్లు చదువగలము.  ఈ విధముగా రూకలు లేకుండా ఇప్పుడు మనము తెలుసుకున్న నరులు అందరు దైవోగ్రతకు, శాపానికి, మరణానికి అమ్మబడినట్లుగా తెలిసికొన్నాము.

        అయితే ఈ వాక్యములో రెండవ భాగము - ''రూకలియ్యకయే మీరు విమోచింపబడెదరు,''  అనుటలో ఈ విధముగా విమోచింపబడిన వారున్నారా?  అంటే వీరిని ఎవరు విమోచించినారు?  ఎవరు కొన్నారు?  అనిన విషయాన్ని మనము తెలుసుకోవలసి యున్నది.  నేత్రాశ, మాంసపు ఆశ, తిండి మీద ఆశ కలిగినవారై దైవజనాంగమైన ఇశ్రాయేలు అనేకమార్లు దేవుని మీద తిరుగుబాటు చేసి దైవోగ్రతకు గురియై, దేవుని చేత అన్యులైన ఫిలిష్తీయులకు, ఐగుప్తీయులకు, మిద్యానీయులకు, అరామీయులకు వగైరా అన్యులకు ఆయన అమ్మినట్లు అనగా అప్పగించినట్లుగా గ్రహించాలి.  తన జనాంగమైన ఇశ్రాయేలీయులను బానిసలుగా జేసి వారిని అన్యులకు అమ్మినట్లును, వారిచేత కఠినమైన పనులు చేయించుచూ కొరడా దెబ్బలతో - వారిని హింసిస్తూ చిత్రవిచిత్రమైన శ్రమలలో వారిని బాధపెట్టుచూ, వారి ద్వారా కఠిన చాకిరీ చేయించుకున్న విధానాన్ని మనము చదువగలము.  అయితే ఈ విధముగా ప్రతి విధమైన చెరలో శిక్షననుభవించిన ఇశ్రాయేలు అను తన జనాంగము తమ తప్పు తెలుసుకొని, దేవుని మొరపెట్టి కన్నీరుమున్నీరుగా విజ్ఞాపన చేసి ప్రార్థించినప్పుడు, వారి మొర విన్న దేవుడు అన్యుల చెర నుండి వారిని విమోచించుటకు వారిలో నుండి ఒక నాయకుని పుట్టించి, ప్రతిష్టించి వానిచేత ఇశ్రాయేలును అన్యుల చెర నుండి విడుదల చేయించేవాడు.  ఉదా :-  మోషే, యెహోషువ, సౌలు, దావీదు, సొలొమోను, గిద్యోను వగైరాలు.  వీరందరు దేవుని జనాంగమైన ఇశ్రాయేలును అన్యుల చెర నుండి దైవచిత్తానుసారముగా అనగా దేవుని ఏర్పాటును బట్టి విమోచించినట్లు వేదములో ఆయా సందర్భాలను బట్టి చదువగలము.  ఇది పాత నిబంధన కాలములో అమ్ముడైపోయిన వారి మాట.

        నూతన నిబంధనలో సుస్థిరముగా సాతానుకు అమ్ముడైపోయి యున్నవారైన మన పితరులు మన పాత జీవితపు అనుభవమును గూర్చి మనము ఆలోచిస్త్తే మనము కూడా లోకానికి అమ్ముడై, లోక బానిసలై లోక ప్రభుత్వాలకు ఊడిగము చేస్తూ - అరిగురి లేకుండా సత్యమేదో అసత్యమేదో, దేవుడెవరో దయ్యమెవరో తెలియని స్థితిలో మన పితరులు మనము లోక స్పష్టములకు అమ్ముడై పోయినట్లు మన పాత జీవితమును గూర్చి మనము ఆలోచిస్తే తేటపడగలదు.

        మనము అమ్ముడైపోయిన సందర్భాలు మనలను కొన్నటువంటి ఆ ఆసాములు - మొట్టమొదటగ ఏదెను తోటలో ఆదాము హవ్వలు సర్పమునకు ద్వారా సాతానుకు అమ్ముడైపోయారు.  సర్పము వారిని అమ్మాడు.  ఈ విధముగా ప్రారంభమైన కొనుగోలు వ్యాపారము దినదిన ప్రవర్థమానమై చెట్లకు, పుట్లకు,  గోరీలకు, రాతి బొమ్మలకు, లోహ శిల్పాలకు, సృష్టములైన ఎద్దులు, గోవులు, పులి, సింహము, ఏనుగు, నక్క, కుక్క వగైరా జంతుజాలములకు కూడా నరునియొక్క ఆత్మీయ బలహీనత స్థితిని బట్టి నరుని అమ్మివేసినట్లు మన పూర్వీక విగ్రహారాధన విధానమును బట్టి మనము గ్రహించవలసి యున్నది.  అంటే లోకము మనలను కొనింది అంటే లోకానికి మనము అమ్ముడై పోయామన్నదే సరియైన నిర్వచనము. చిత్ర విచిత్రపు రీతులలో దైవభక్తులను సాధువులని, సన్యాసులని, మహా ఋషులని, నానావిధ బిరుదులతో సత్యదేవుని ఎరుగని స్థితిలో సతమతమగుచు, లోకానికి అమ్ముడైపోయిన మనము ఈ లోకములో నివసిస్తూ పరలోకాన్ని కొనాలని పలు విధములుగా పూసలు, దండలు, బొట్టుకట్టు సాంగ్యములు, మడి వడుగు ఆచారములు, వేషధారణతో కూడిన అవతారములతో పరమ భక్తులమంటూ బిరుదు తగిలించుకొని చెలామణియగుచున్న భక్తులను చూస్తున్నాము.  పరమ భక్తులంటే పరలోక రాజ్యము కాంక్షిస్తూ ఆ సంపదను పొందాలని భోగభాగ్యాలనుభవించాలని ఆశించినను, ఈ లోకములో మనము చేయుచున్నటువంటి ఈయొక్క అర్థరహితమైన  కార్యక్రమము దైవరాజ్యమును కబళించాలని గొయ్యి త్రవ్వుటయేగాని, ఇది పరలోకాన్ని సంపాదించే సరియైన మార్గము కాదని మనము గ్రహించాలి.

        ఈనాడు కూటి కోసము, లోక సాంకేతిక పరిజ్ఞానము కోసము, లోక పదవుల కోసము, ఆధిక్యతల కోసము, ఋణానుబంధాల కోసము, లోక సంబంధమైన మానవ మర్యాదల కోసము, క్రైస్తవులు తమకు తామే పలువిధములుగా అమ్ముడైపోయిన సందర్భాలు మనము చూస్తున్నాము పత్రికల ద్వారా చదువుచున్నాము.  తప్పిపోయిన కుమారుని అమ్మినవారెవరు?  తానే తన క్రియలను బట్టి అమ్ముడైపోగా అట్టి అభాగ్యుడైన ఆ చిన్న కుమారుని పందులు కొన్నాయి.  అయితే తండ్రియొక్క నామము, తండ్రియొక్క ప్రేమను, తండ్రియొక్క ధ్యానము ద్వారా తాను తన తప్పును తెలుసుకొని, పందుల దొడ్డిలో నుండి విమోచించబడి తన తండ్రి యొద్దకు చేరి తండ్రియొక్క స్వాస్థ్యానికి వారసుడైనాడు.

        ఈ అంశమును చదువుచున్న ప్రియపాఠకులారా, నీవు అమ్ముడైపోయిన జీవితములో ఉన్నావా?  లోకము నిన్ను కొని యున్నదా?  ఏయే విషయాలలో మనము అమ్ముడైపోయామో ఒక్కసారి మనము ఆలోచించి, దేవుడు తన కుమారుడైన గొఱ్ఱెపిల్ల రక్తము ద్వారా మనలను ముద్రించి కాయా కర్పూర నైవేద్యము, ప్రసాదాలు వగైరా దృశ్యమైన వస్తువులతో కాక, అమూల్యమైన గొఱ్ఱెపిల్ల రక్తముతో మనలను విమోచించి యున్నాడు.  అంటే యేసు ప్రభువు తన రక్తముతో మనలను కొన్నాడు.  మనము ఆయనకు అమ్ముడైయున్నామన్న నగ్నసత్యాన్ని మనము గ్రహించి విమోచింపబడిన వారి జాబితాలో చేర్చబడి నిత్యజీవము, నిత్య విశ్రాంతి, నిత్య సంతోషము నొంది, పరమ తండ్రియైన దేవుని రాజ్యమునకు వారసులమగుదుము గాక!  ఈ వారసత్వమన్నది దైవకుమారుడైన యేసుక్రీస్తు రక్తముతో కొనబడిన వారికే తప్ప ఏ ఇతర విధమైన మరెవని ద్వారానూ ఈయొక్క విమోచన కలుగదని గ్రహించాలి.  ఆమేన్‌.

29.  సంసారిపిల్లలకంటె విడువబడినదాని పిల్లలు విస్తారము

        యెషయా 54:1, ''గొడ్రాలా, పిల్లలు కననిదానా, జయగీతమెత్తుము  ప్రసవవేదన పడనిదానా, జయకీర్తన నెత్తి ఆనందపడుము.   సంసారిపిల్లలకంటె విడువబడినదాని పిల్లలు విస్తారమగుదురని  యెహోవా సెలవిచ్చుచున్నాడు.''

        ప్రియపాఠకులారా!  ''గొడ్రాలా, పిల్లలు కననిదానా,'' అని అను ధర్శశాస్త్ర కాలములో గొడ్రాలు జీవితాన్ని శాపగ్రస్థ జీవితముగా చెప్పబడినది.  కాని యెషయా ప్రవక్త ఆమెను జయగీతమెత్తుము అని చెప్పుచున్నాడు.  అలాగే - ''ప్రసవవేదన పడనిదానా, జయకీర్తన నెత్తి ఆనందపడుము,'' అని యెషయా చెప్పుచున్నాడు.  ఇలా గొడ్రాలికి అనగా ప్రసవవేదన పడని స్త్రీ అనగా శాపగ్రస్థ జీవితములో వున్నట్లుగా భావించే స్త్రీని ఎందుకు ఆనందించమని చెప్పబడినది?

        లూకా 23:29, ''ఇదిగో-గొడ్రాండ్రును కనని గర్భములును  పాలియ్యని స్తనములును ధన్యములైనవని చెప్పుదినములు వచ్చుచున్నవి.''  ఇది క్రీస్తు ప్రభువు చెప్పిన మాట.  గొడ్రాలు జీవితములో వున్న స్త్రీ ధన్యవంతమైనది అని చెప్పు దినములు వచ్చుచున్నట్లుగా చెప్పుచున్నాడు.  ఎందుకని?  ఈ విషయమును మనము ఆత్మీయ రీత్యా ఆలోచిస్తే యెషయా 54:1లోని రెండవ భాగములోనే జవాబు ఇచ్చాడు.  ''సంసారిపిల్లలకంటె విడువబడినదాని పిల్లలు విస్తారమగుదురని.''  

        ఇందులో సంసారి పిల్లలు యెరూషలేమునకు చెందినవారు.  అనగా నిజ దైవములో వుండి గొఱ్ఱెపిల్లను తమ నాథుడుగా ఎంచుకొనినవారు.  వీరు కొద్దిమంది మాత్రమే.  వీరి సంఖ్య విడువబడినదాని పిల్లల సంఖ్య కన్నా చాలా తక్కువ, ఎందుకంటే విడువబడినదాని పిల్లలు విస్తారము అని చెప్పుచున్నాడు.  ఇంతకి విడువబడినది ఎవరు?  మహా బబులోను.  దైవాజ్ఞ మీరి జీవించిన వారందరు మహాబబులోను నివాసులే.  వీరు సమస్త చెడు గుణములకు నిలయమైనవారు.  వీరే విగ్రహారాధికులును, వ్యభిచారులును, వక్రబుద్ధిగలవారును, నరహంతకులు, మాంత్రికులును ఇటువంటివారు.  వీరిలో నీతి లేదు, పరిశుద్ధత లేదు.  వీరు నిజ దైవ ఆరాధికులు కారు కనుక దేవుడు వారిని విడిచివేసాడు.  కనుకనే పాత నిబంధన కాలములో ఇశ్రాయేలు దేవుడని చెప్పబడినది కాని ఫిలిష్తీయ దేవుడని, ఐగుప్తీయుల దేవుడని, రోమీయుల దేవుడని మొదలైన రీతులుగా దేవుడు చెప్పబడలేదు.  కనుక ఈ జనాంగమంతా విడువబడినవారే!  అలాగే క్రీస్తు అవతరణ తరువాత క్రైస్తవులు ఏర్పడ్డారు.  ఇప్పుడు క్రైస్తవుల దేవుడు అని చెప్పబడుచున్నది.  అయితే హిందువుల దేవుడు, ముస్లీముల దేవుడు మొదలైన రీతులుగా చెప్పబడుటలేదు.  ఏ జాతివారైన, ఏ దేశమువారైన క్రీస్తును విశ్వసించినవారు క్రైస్తవులే.  క్రీస్తును విశ్వసించనివారు విడువబడినవారుగా చెప్పబడింది.  వీరి సంఖ్య విస్తారము అయితే సంసారిగా చెప్పబడిన యెరూషలేము పిల్లలైన ఇశ్రాయేలీయులు క్రైస్తవులు సంఖ్య ఎప్పుడో నిర్ణయమై పోయి ఉన్నది.  కనుకనే ఈ వాక్యము ఈ విధముగా చెప్పబడినది.  ఇశ్రాయేలీయులు క్రైస్తవులు అయినంత మాత్రాన వారు సంసారి పిల్లలు అనగా యెరూషలేము పిల్లలు కారు.  ఎవరైతే నీతి పరిశుద్ధతలతో జీవిస్తారో, ఎవరైతే క్రీస్తు చెప్పినట్లు జీవిస్తూ పది ఆజ్ఞలను క్రమబద్ధముగా వారి జీవితములో పాటిస్తారో వారే యెరూషలేము పిల్లలుగా గుర్తించాలి.  

        వీరి సంఖ్య - ప్రకటన 7:4, ''మరియు ముద్రింపబడినవారి లెక్క చెప్పగావింటిని.  ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడినవారు లక్ష నలువది నాలుగు వేలమంది.''  మరియు ప్రకటన 7:9-14, ''అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలో నుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను.  వారు తెల్లని వస్త్రములు ధరించు కొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి - సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.  దేవదూతలందరును సింహాసనము చుట్టును పెద్దలచుట్టును ఆ నాలుగు జీవులచుట్టును నిలువబడియుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి-ఆమేన్‌;  యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి;  ఆమేన్‌.  పెద్దలలో ఒకడు-తెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు?  ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను.  అందుకు నేను-అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను-వీరు మహా శ్రమలనుండి వచ్చిన వారు;  గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.''

30.  మన తలంపులు త్రోవలు - దేవుని తలంపులు త్రోవలు

        యెషయా 55:8-9, ''నా తలంపులు మీ తలంపులవంటిని కావు  మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు  ఇదే యెహోవా వాక్కు   ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు  మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.''

        ప్రియపాఠకులారా!  లోకరీత్యా నరులైన మనము మన ఇహలోక జీవితములో ఎన్నో కోరికలు కలిగి నానా విధములైన తలంపులు, చింతనలతో రేయి పగలు ఆలోచనలతో కాలాన్ని ఖర్చు చేస్తూ ఉన్నాము.  ఒకవేళ మనమనుకున్నది సవ్యముగా జరిగినట్లయితే దేవునిచేత అనుకూలించినట్లుగా మంచి కార్యము జరిగినప్పుడు చెప్పుకుంటూ వుంటాము.  ఇది కేవలము భ్రమ.  సహజముగ ప్రతి నరునికి కోరికలు, తలంపులు అన్నవి ఉండుట సహజము.  మానవులకే గాదు, దేవునికి కూడా తలంపులున్నవి.  ఆయన తలంపులన్నియు కూడా నెరవేర్పు కలిగినవియేగాని అపజయము పొందేవి కావు. ఆయన త్రోవలు వేరు మన త్రోవలు వేరు.  అందుకే 127వ కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే!  యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాయువారు మేల్కొని యుండుట వ్యర్థమే.  కనుక మన తలంపులను బట్టి దేవుని క్రియలు జరగాలని అంచనా వేసే పెద్దలు కూడా లోకములో ఉన్నారు.  లోకము సంగతి ఎట్లున్నను వేదములో సంగతిని పరిశీలించెదము.

        ఆదిలో దేవుడు తన తలంపులనుబట్టి తన చిత్త ప్రకారము ఈ సృష్టి నిర్మాణక్రియను చేశాడు.  చేయుటలో ప్రతి సృష్టి కార్యములను గూర్చి అది మంచిదైనట్లుగా కూడా అనుకున్నాడు.  ఇందులో తన క్రియా సంకల్పములో మానవునియొక్క సలహాగాని, సృష్టియొక్క ప్రమేయముగాని లేక, ఏదేని యొక దృశ్యమైన వస్తువును గాని వాడకుండా సృష్టిలో ఎటువంటి పొందిక లేకుండానే, కేవలము తన ప్రభావితమైన వాక్కానుసారము దేవుడు సృష్టి నిర్మాణ క్రియను పూర్తి గావించాడు.  ఈ అనంత సృష్టి నిర్మాణములో దేవునియొక్క తలంపులు ఆరు దినములు బహు ప్రభావితముగా క్రియ జరిగించినట్లు ఆదికాండము మొదటి రెండు అధ్యాయములలో చదువగలము.

        ఈ సందర్భములో మనకొక సంశయము రాక మానదు.  అదేమిటంటే దేవుడు తాను సృష్టించిన నరుడు పాపము చేయునని ఎరుగడా?  అనిన తలంపు రాలేదా అనిన సంశయము కలుగవచ్చు.  దేవునికి తెలియును.  దేవుని తలంపులలో నరుడు బలహీనుడని బాల్యము నుండి అనగా పుట్టుక నుండి సకల జీవరాసులలో నరుడు కుత్సితుడు అనిన విషయాన్ని గ్రహించే మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలవృక్షపు చెట్టును తోట మధ్యలో వుంచి ఆది నరజంటను పరిశోధించారు.  ఈ పరిశోధనలో దేవుడే విజయుడాయెనుగాని నరుడు అపజయాన్ని పొంది, మరణము అను శిక్షను బహుమానముగ పొందినాడు.  దేవుడు నరుని సృష్టించినందుకు సంతాప పడినట్లుగా కూడా వేదములో ఆదికాండము 6:6 చదువగలము.

        ఇట్లు దోషపూరితమైన నరుని పట్ల దేవుడు సానుభూతితో కూడిన తలంపుతో దయార్థ హృదయుడై ఏదెను నుండి వెళ్ళగొట్టబడు సందర్భములో వాని మాన సంరక్షణార్థము నరజంటకు చర్మపు చొక్కాలు తొడిగినట్లుగా వేదములో వ్రాయబడి యున్నది.

        ఇక ఇక్కడ నుండి నరునియొక్క తలంపులు నరుడు నడచిన మార్గము చిత్రవిచిత్రముగా తయారైనది.  అందువలన దేవుడు తన త్రోవలను మార్చుకొని, తన పరిశుద్ధ సన్నిధియైన ఏదెనుయొక్క మార్గమును మూసివేసి, నరుని వెళ్ళగొట్టి తన మార్గమునకు అగ్నిజ్వాలలను కాపలా ఉంచినట్లు చదువగలము.  ఇందునుబట్టి దేవుని తలంపులు పరిశుద్ధ ఏదెను వంటివి.  నరుని తలంపులు కృతజ్ఞత లేనివి.  దైవత్వానికి వ్యతిరేకమైనవి.  సాతానుకు స్థానమిచ్చేవి.  చెడుకు ఆలవాలమై యుండి నరకమునకు పోవు త్రోవలై యున్నవి.  ఇంతటితో దేవుని తలంపులు ఆగలేదు.  నరునియొక్క తలంపులకు అవధులు లేవు.  ఈ విధముగ తోట నుండి బహిష్కరించబడిన నరజంట, వారి తలంపుల చేతను, క్రియల మూలముగాను, విస్తారమైన జనసంఖ్యను పెంచి, జనముతో బాటు పాపమును కూడా విస్తరింపజేసి, తమ మార్గములను దైవత్వమునకు విరోధముగ సక్రమమైన విధానములో మలచుకొని విపరీతముగా పాపాన్ని పెంచినారు.  మరియు దేవుని తలంపులు, తాను సృష్టించిన ఈ అనంత సృష్టిని సర్వనాశనము జేసి, పున:సృష్టిని నిర్మించాలని అనిన తలంపుతో ఆనాటి జనసందోహములో నీతిమంతుడైన నోవహు అనిన ఒక వ్యక్తిని అతని కుటుంబాన్ని ఎన్నికజేసి, ఆ కుటుంబ రక్షణార్థము దేవుడు తనయొక్క తలంపుల ప్రకారము తన నమూనా ప్రకారము, తన చిత్తానుసారముగా ఓడ గృహాన్ని ఆ వ్యక్తి చేత నిర్మింపజేశాడు.

        ఈ సందర్భములో నోవహు అను నీతిమంతుడు తన స్వంత తలంపులు చిత్తముతో నమూనా జ్ఞానాన్ని ఉపయోగించక దేవుని చిత్తము, దేవుని తలంపులు, దేవుని నమూనా ప్రకారముగా దేవుడు కట్టదలచిన ఓడ గృహాన్ని నిర్మించి పూర్తి చేశాడు.  ఈ విధముగా పూర్తియైన ఓడ జలప్రళయ కాలములో 150 దినములు దేవునియొక్క మార్గములో ఆ ఓడలో వున్న నోవహు కుటుంబము, జంతుజాలము, జలముల మీద నిలిచి ఈ ఓడ నడిచింది యంత్రముతో కాదు, తెరచాపతో కాదు, చుక్కాని తెడ్లు మరి ఏ ఇతర ఉప కరణములు లేక కేవలము దైవసహాయముతో ఆయన చిత్తానుసారముగ నడిచింది.  ఈ విధముగ దేవుని తలంపులు దేవునియొక్క త్రోవలలో ఆనాటి నోవహు నడిచాడు.

        ఆ తదుపరి దేవుని తలంపులకు, ఆయన త్రోవలకును ఎదురు తిరిగి నడిచినవారు కూడా లేక పోలేదు.  బాబేలు గోపుర నిర్మాణము.  మంచి పేరుప్రఖ్యాతులు సంపాయించు కోవాలని మానవునియొక్క జ్ఞానానుసారముగ వారి తలపులనుబట్టి వారి స్వజ్ఞానమునుబట్టి దైవత్వాన్ని విచారించక తమకు తామే జ్ఞానవంతులమని, తమ కొరకు ఒక ఎత్తయిన గోపుర నిర్మాణమును జరిగించినట్లును, వారు చేయుచున్న పని త్వరితగతిని జరుగుచుండగా దేవుడు వారి తలంపులను, వారి క్రియాకర్మలను, వారియొక్క త్రోవలలో చెదరగొట్టుటకు భాషలను తారుమారుజేసి, గోపురమును కట్టు కార్యక్రమాన్ని స్థంభింప జేసినట్లు చదువగలము.  అట్లే సంసోనుయొక్క బలహీనతను మనము చదివినట్లయితే, దేవుడు సంసోనును తన జనాంగమునకు న్యాయాధిపతిగ నియమించి తన మార్గములో నడిపించాలనుకున్నాడు.  ఇది ఆయనయొక్క తలంపు.  కాని సంసోను అందుకు విరుద్ధముగా మరణ మార్గముగా ప్రవేశించాడు.  దేవుని పరిశుద్ధ జనాంగమునకు న్యాయము తీర్చుటకు దేవుడే తన చిత్తానుసారముగా ప్రణాళికను రూపించి, దైవజనాంగమునకు దేవుని న్యాయ విధులలో, ఆయన కట్టుబాట్లలో నడిపించుటకు సంసోను అను వీరుని ఒక సాధనముగా రూపించినాడు.  కాని సంసోను దేవుని తలంపులకును, ఆయన కార్యక్రమానికి విరుద్ధుడై, లోక మార్గములో స్త్రీ వ్యసనములో స్త్రీలను గూర్చిన తలంపులతో అంధుడై మరణాన్ని చవి చూచాడు.

        ఇక అబ్షాలోము తండ్రిపై దైవచిత్తమునకును దేవుని సన్నిధికిని విరుద్ధమైన కుట్రపన్ని దురాలోచన చేసి తండ్రియొక్క సింహాసనాన్ని, ఆయన ఉపపత్నులతో కూడుటయే గాక తండ్రిపై తిరుగుబాటు జేయుచూ ఆయనను తరుముచూ రాజ్యభ్రష్టునిగా జేసి చంపవలెనని ఆలోచనలు చేసినట్లు చదువగలము.  ఈ విధముగా కుట్ర పన్నిన అబ్షాలోము యొక్క తలంపులు దేవునికి విరుద్ధములై అబ్షాలోమును గూర్చినదంతయు దేవుని తలంపులు 2 సమూయేలు 18:9-10లో వలె ఉన్నట్లు మనము గ్రహించవలెను.  అబ్షాలోము తలంపులు తండ్రి రాజ్యాన్ని స్వాస్థాన్ని తండ్రి ప్రాణాన్ని హరించాలని.  కనుక వాని తలంపులు వానిని యుద్ధరంగములో నడిపించాయి.  అయితే తాను కూర్చుని ప్రయాణిస్తున్న గాడిద కూడా అబ్షాలోమును ఒంటరివానిగా చేసి మస్తకి వృక్షానికి వ్రేలాడదీసి మరణాని కప్పగించి, ఆ గాడిద కూడా వెళ్ళిపోయినట్లు వేదభాగములో చదువగలము.  అబ్షాలోము దేనినైతే నమ్ముకున్నాడో వేటి మీద లక్ష్యముంచాడో వేటిని గూర్చి ఆలోచించాడో అవి అన్నియు వ్యర్థమైనవి.

        ఇక ఎస్తేరు విషయములో యూదులకు శత్రువైన హామానుచే విధించబడిన యూదా జాతి నరమేధ యాగము అనగా సంహారమును గూర్చి హామాను చేసిన ఆలోచన - అహష్వేరోషుయొక్క సూషను కోటలో ద్వారము దగ్గర నున్న మొర్దెకైని చంపవలెనని.  దీని కోసము హామాను ఉరి కొయ్య చేయించెను.  ఇవన్నియు కూడా నరునియొక్క కుత్సిత తలపులు.  ఈ తలపులు కుట్ర, ద్వేషము, ఈర్ష్య, పగలుతో కూడినదై యున్నట్లు తెలియుచున్నది.  దీని వలన యూదా నాశనమునకు మరియు మొర్దెకై నాశనమునకు ప్రతిగా, హామానుయొక్క జీవితము కుటుంబ సమేతముగా వినాశకరమైన మార్గములోనికి వెళ్ళవలసి వచ్చింది.  ఇక యోనా విషయములో దేవుడు నీనెవె పట్టణస్థులయొక్క దోషపూరితమైన బలహీనతను గూర్చి నాశనము నుండి వారిని కాపాడాలని తలంచి, తన ప్రవక్తయైన యోనాను నీనెవె పట్టణము వెళ్ళమని ఉత్తరువు ఇచ్చినాడు.  కాని యోనా తలంపు దైవత్వానికి ప్రతికూలమై ఓడను మార్చినాడు.   ఊరు మార్చినాడు.  మార్గాన్ని మార్చినాడు.  దీని ఫలితము యోనా సముద్రము పాలయ్యాడు.

        ఇదే విధముగా నెబుకద్నెజరు అను రాజు తాను నిలబెట్టించిన బంగారు విగ్రహము - తన రాజ్య పరిధిలో ఉన్న సకల జనులు ఆ విగ్రహమును ఆరాధించవలెనని శాసనము చేసాడు.  ఇది నెబుకద్నెజరుయొక్క తలంపు.  దానికి అందరు సాష్టాంగపడి నమస్కరించవలెను.  ఆ విగ్రహమే దేవుడు మరి ఏ దేవుడును లేడు.  ఈ విధముగ సవాలుగ తన తలంపులను తన చిత్తానుసారముగ జరుగుచున్న ప్రతి క్రియను నిరాటంకముగ జరిగించాలని అనుకున్నాడు.  అనుకోవడమే గాక అమలు పరచినాడు.  అయితే ఈ ప్రయత్న కార్యములో జీవముగల దేవుని బిడ్డలను కూడా ఈ శాసనమునకు విధేయులు కమ్మన్నాడు.  ఆ విధముగా వారు కాకపోయినందువలన వారినెత్తి మంటలలో వేశాడు.  అయితే దేవుడు తన సంకల్పముతో తన చిత్తము తన నిర్ణయములో నెబుకద్నెజరు ఏర్పరచిన అగ్నిగుండము మంటలు నిర్వీర్యపరచి అవి నిష్ప్రయోజనకరములని, అగ్ని గుండములో తన భక్తుల ద్వారా నిరూపిస్తూ అగ్నిగుండములో వేయబడిన ముగ్గురు వ్యక్తులతో కూడా నాల్గవవాడుగ సంచరించి రాజుకు కనువిప్పు గల్గించాడు.  ఆ క్షణమే రాజు తేరుకొని నిజ దైవమార్గములో నిజ దేవుని కీర్తిస్తూ తన విగ్రహము నిరుపయోగమని, నిర్జీవమని, నిరాధారమైనదని తాను ఒప్పుకున్నాడు.  ఆ విగ్రహారాధన నిషేధించి దైవభీతిలో జీవించినాడు.  ఇది పాత నిబంధనలోని వ్యక్తులయొక్క తలంపులు దేవునియొక్క తలంపులను గూర్చిన వివరణ.

        ఇక దైవకుమారుడైన యేసుక్రీస్తుయొక్క తలంపులేమిటి?  ఈ సమయములో యోహాను 4:34, ''యేసు వారిని చూచి-నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.''  మరి ''నేను పాపులను పిలువ వచ్చితినిగాని నీతిమంతుల కొరకు రాలేదు.''  పై రెండు వాక్యములు యేసుక్రీస్తు యొక్క ఇహలోక తొలిరాకకు దేవునియొక్క సంకల్పమై యున్నట్లు తెలియుచున్నది.  యేసుక్రీస్తు పుట్టక మునుపే యెషయా ప్రవక్త చేత దేవుడు తన ఆలోచనలను వ్రాయించెను.  యెషయా 7:14, ''కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును.  ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.''

        యేసుక్రీస్తు జన్మ రహస్యము తండ్రియైన దేవునియొక్క తలంపులలో ఏనాడో ఉన్నదని మనము గ్రహించవలసి యున్నది.  అలాగే మత్తయి 3:3, ''ప్రభువు మార్గము సిద్ధపరచుడి  ఆయన త్రోవలు సరాళము చేయుడని  అరణ్యములో కేకవేయు నొకని శబ్దము  అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవాడితడే.''  ఇది కూడా ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడిన మాటయే.  ఈ ప్రభువుయొక్క మార్గమున నడిచి సరాళము చేయుటకు పంపబడినవాడు యోహాను.  యోహాను 1:6, ''దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను;  అతని పేరు యోహాను.''  ఈయన దైవమార్గమును భూమిపై కంకర బాటను ఏర్పరచుటకు వచ్చినవాడు.  ఆ వరకు భూమియొక్క మార్గము పాపము, అక్రమములు, అన్యాయములు, అవినీతి, అహంకారము, క్రూరత్వము, కఠినత్వము, అజ్ఞానము, విగ్రహారాధన, నిర్ధాక్షిణ్యము అను ముండ్ల తుప్పలు, బలు రక్కసి ముండ్లు, వల్లేరు, నాగజెముడు, తుమ్మ వగైరా గుణాతిశయములు కలిగిన నరులయొక్క క్రియల ద్వారా నిజమైన దైవ మార్గము భూమి మీద ఏర్పడకుండు సమయములో, పై ముండ్లతో కూడిన గుణాతిశయములు కలిగిన నరకోటి మధ్య దైవమార్గమును సరాళమైన మార్గముగా ఏర్పరచుటకు ఈయన దేవుని ద్వారా పంపబడినట్లు చదువగలము.  ఈయన వేసిన బాట ఆనాటి యూదా జనాంగములో దైవరాజ్యమును గూర్చిన తలంపులను, చింతనలను రేకెత్తించి, అనేకులకు ఈయన దైవత్వమును గూర్చిన క్రియామూలక జల బాప్తిస్మము ద్వారా దైవమార్గమునకు పునాది వేసినాడు.  ఈ మార్గమును స్థిరపరచినవాడును, మార్గమునకు అధినేతయైన వాడును క్రీస్తే అని యోహాను 14:6లో చదువగలము.  అనగా దైవరాజ్యమునకు వెళ్ళాలంటే యేసే త్రోవ అని దీని భావము.

        ఇప్పుడు మూలవాక్యము రీత్యా మనము ఆలోచిస్తే ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావని ఆయన తలంపులు, ఆయన ఈ లోకమునకు పంపు తన కుమారుడైన క్రీస్తు అని గ్రహించవలసి యున్నది.  ఆయన త్రోవలు కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుయొక్క బోధలే.  ఆదిలో మోషే చేత దేవుడు ఇశ్రాయేలు అను తన జనాంగమును తన త్రోవలలో నడిపించుటకు మోషేకు అండగా తన కర్రనిచ్చి, అప్పుడప్పుడు మేఘరూపముగాను, వెలుగు రూపముగాను, మోషేకు తోడుగా వుండి నడిపించినాడు.  కాని అట్టి దేవుని శక్తిని, ఆయన త్రోవను ఇశ్రాయేలు మీద దేవునికున్నటు వంటి ఆశయాలను, కృతజ్ఞతలేని ఆ జనాంగము కఠినులై ఆయనను వ్యతిరేకించి, త్రోవదప్పి తిరుగుచుండగా దేవుడు వారి పట్ల ఉగ్రుడై, సందర్భానుసారముగ వారిని శిక్షిస్తూ మరలా తన మార్గములో నడుపుచు క్రియ జరిగించినను, కానాలోకి చేరునప్పటికి యెహోషువ కాలేబు ఇద్దరే మిగిలినారు.  దైవజనాంగమును నడిపిన మోషే కూడా కానాను చేరలేకపోయినాడు.  

        ఈనాడు తన కుమారుని ఈ లోకమునకు పంపెడి తలంపుతో దేవుడు జరిగించిన క్రియలో ఆయన ప్రణాళిక నెరవేరింది.  ఆయన లేఖనాలు నెరవేరింది.  ఆయన సువార్తలు నెరవేరినవి.  ఆయన తన కుమారుని ద్వారా జరిగించిన క్రియలు నెరవేరినాయి.  నరులనుబట్టి ఆయన కుమారుని లోకమునకు బలియాగముగ చేసిన కార్యక్రమము, కుమారునియొక్క మరణ పునరుత్థానములు కూడా నెరవేరినవి.  కాని నరునియొక్క ఉన్నత స్థితిని గూర్చి దేవుడు తలంచిన తలంపులు నెరవేరలేకున్నవి.

        ఆయన తలంపుతో ఏకీభవించిన వారెవరు?  అంటే నోవహు లగాయతు లోతు, అబ్రాహాము, మోషే, అహరోనులు, యెహోషువ నుండి మలాకీ వరకున్న పాత నిబంధన ప్రవక్తలు;  యేసు ప్రభువు కాళ్ళు కడిగి ప్రతిష్టించిన అపొస్తలులు, హతసాక్షులు, వేదసాక్షులు.  ఆయన తలంపులో ఏకీభవించి ఆయన తలంపులలో ఉన్నట్టి భావాన్ని భూమిపై ఆయనేర్పరచుకున్న ప్రణాళికను నెరవేర్చినారు.  మరియు ఆయన త్రోవలలో నడిచారు.  దేవుని అడుగుజాడలలో అనగా ఆయన త్రోవలలో పాత నిబంధన ప్రవక్తలు నడిచారు.  యేసుక్రీస్తుయొక్క మార్గములో ఆయన ప్రతిష్టించిన అపొస్తలులు, హతసాక్షులు, వేదసాక్షులు నడిచారు.  వీరితోబాటు ఆయనేర్పరచుకున్న విశ్వాసులు నడిచారు.  ఇప్పుడు పరిశుద్ధాత్మ యుగములో మనము మన తలంపులు, మన త్రోవలు ఎట్లున్నాయి?  ఒక్కసారి మనము ఆలోచిస్తే నేటి నరులయొక్క తలంపులు యావత్తును స్వార్థము, అంతస్థులు, అహంభావము, కులబేధము, వర్గ బేధము, జాతి బేధము, మత బేధము అన్నిటికంటే అతి నీచమైన పదవీవ్యామోహముతో కూడినదై యున్నవి.  ధన సంపాదన, వ్యభిచారముతో కూడిన లౌకిక తలంపులు, అలౌకిక గుణాతిశయములతో కూడినవై నరుని ఆత్మీయముగాను, శరీరముగాను, పనికిమాలినవారినిగ దిగజార్చే స్థితికి లోకము చేయుచున్నది.  నేటి నరుని మార్గము, త్రోవలు ధన సంపాదనకును, పదవీవ్యామోహము, కోర్టు కచ్చేరీల దావాలకును, తనకు సంబంధము లేనటువంటి వ్యవహారాలలో తలదూర్చుటకు జోక్యమును, అబద్ధపు సాక్ష్యాలకును, నిరాధారమైన వ్యాజ్యాలకును పొరుగువాని మీద అపనిందలు మోపుటకును, మనశ్శాంతి లేని స్థితిలో అడ్డమైన త్రోవలలో తిరుగుచున్నాడు.

        తండ్రిని కాదని తండ్రి సంపదను కొల్లగొట్టి దేశాటనకు బైలుదేరి వేశ్యలు, మద్యశాలలు, అల్లరిమూకతో సావాసము, విలాస జీవితములో కూడిన త్రోవలలో నడిచి, తప్పిపోయిన కుమారునియొక్క గమ్యముయొక్క అంతము పందుల మంద.  అలాగే జక్కయ్యయొక్క పాపభూయిష్టమైన జీవితము, అతని పొట్టితనము, అతని అక్రమమైనట్టి తలంపునకు, మార్గములకు అంతము యేసు ప్రభువు దర్శన భాగ్యము తద్వారా పొందిన దైవ ఆశీర్వాదము.  అలాగే 12 యేండ్ల రక్తస్రావపు స్త్రీయొక్క దీర్ఘకాల తలంపులు, 12 యేండ్ల చిత్రవిచిత్రమైన వైద్య పరిచర్యల కోసము తిరిగిన త్రోవలకు అంతము - యేసుక్రీస్తుయొక్క అంగీ అంచు.  ఈ అంచు స్పర్శతో ఆమెయొక్క అస్వస్థతకు అంతము, ఆమె ప్రయాసపడి తిరిగిన మార్గాలకు అంతమేర్పడింది.

        ప్రియపాఠకులారా!  నేటి మన జీవితములో ఆత్మ శరీరములతో ఈ లోకములో మనము జీవిస్తుండగా మన తలంపులు దేవుని వాక్యమును గూర్చిన ధ్యానము, యేసుక్రీస్తుయొక్క బలియాగపూరితమైన త్యాగము, ఆయన మన పట్ల చేసిన మేళ్లు, ఆయన మనకు బోధించిన వాక్య పరమార్థములతో కూడిన తలంపులు, ఆయన నడిచిన మార్గములో ఉన్నామా?  లేక ఇహలోక సంబంధముగ ఆటపాటలతోను, అల్లరితో కూడిన వాజ్యములతోను, ధన సంపాదనకు, పదవులను గూర్చి ఆలోచిస్తూ తత్సంబంధమైన త్రోవలలో తిరుగుచున్నామా?  ఏ త్రోవలలో ఉన్నాము?  ఏ తలపులలో ఉన్నాము?

31.  ఉపవాస ఫలము

        యెషయా 58:3-5, ''మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు?  మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు?  అని అందురు  మీ ఉపవాసదినమున మీరు మీ వ్యాపారము చేయుదురు.  మీ పనివారిచేత కఠినమైనపని చేయించుదురు  మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు  మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు.  అట్టి ఉపవాసము నాకనుకూలమా?  మనష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా?  ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదె పరచుకొని కూర్చుండుట ఉపవాసమా?  అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరనుకొందురా?''

        ఉపవాసమంటే సమీపముగా లేక సన్నిహితముగా జీవించుట.  ఈ విధముగా ఇట్టి జాబితాలో దేవునికి సమీపస్థులుగా జీవించినవారు పాత నిబంధనలో నోవహు, అబ్రాహాము, మోషే, ఇశ్రాయేలు, దావీదు వగైరాలు.  ఇట్టి ఉపవాస క్రియలో శరీరేచ్ఛలను చంపుకొని ఆత్మీయ ప్రార్థనాశక్తి ద్వారా దైవ ప్రత్యక్షతకు చేయు క్రియ.

        ఉపవాసము రెండు విధములు.  ఇందులో 1.  ఆత్మ సంబంధమైనది గొప్పది.  2.  శరీర సంబంధమైనది వేషధారణతో కూడినది.  ఇందులో మొదటిగా ఆత్మ సంబంధము యొక్క వివరము, దాని ఫలితములను గూర్చి తెలిసికొందుము.

        (1)  నోవహు అగాధ జలములపైన దేవునితో చేసిన ఉపవాస ఫలితము

పున:సృష్టికి నోవహు కుటుంబము ఆదియైనది.  (2)  అబ్రాహాము దేవునితో చేసిన ఉపవాస ఫలితము అతడు దేవునిచే బహుగా ఆశీర్వదించబడి విశ్వాసులకు తండ్రియైనాడు. (3)  మోషే సీనాయి కొండపై దేవునితో చేసిన ఉపవాస ఫలితముగా దేవుని చేవ్రాతతో కూడిన దశాజ్ఞల ధర్మశాస్త్రము దైవజనాంగానికి ఇవ్వబడింది.  నిర్గమకాండము 31:18.  (4)  యాకోబు కుమారుడు యోసేపు ఉపవాస ఫలితముగా ఐగుప్తు చెర నుండి విడుదల పొందుతయేగాక ఫరో యొక్క రాజరికమును రెండవ రథము, రెండవ సింహాసన పరిపాలనను పొందినాడు.  (5)  ఎస్తేరు 4:16లో రాణి ఎస్తేరు చేసిన రాణివాస ఉపవాసములోని ఫలితమునుబట్టి, యూదులకు విధించిన మరణశిక్ష రద్దు చేయబడింది.  

(6)  దానియేలు చేసిన ఉపవాస ప్రభావ మూలమున సింహాల నోళ్ళను దేవుడు మూసినాడు.  (7)  యోనా మూడు దినరాత్రులు ఆత్మశుద్ధితో చేప గర్భములో నుండి చేసిన ఉపవాస ప్రార్థనా ఫలితము అతను వెళ్ళవలసిన నీనెవె పట్టణ భాగములో సజీవునిగా కక్కి వేయబడినాడు.  యెహోషువా దేవునితో చేసిన ఉపవాసము యెహోషువా 10:12లో వలె సూర్యచంద్రులు అస్తమించలేదు.    

        ఇక నూతన నిబంధనలో యేసు ఆయన శిష్యులు చేసిన ఉపవాస ఫలితముల ద్వారా గొప్ప కార్యాలు జరిగాయి, దేవుని మహిమ ప్రకటితమైంది.

        దేహ సంబంధమైన ఉపవాసములు - ఇందును గూర్చి ''దేవుడు - క్రీస్తు'' ప్రవచించిన మాటలు, యెషయా 58:3-5లో వలె వ్యర్థముగా అయోగ్యముగా ఉపవసించుటను గూర్చి ప్రవచించి యున్నాడు.  అలాగే యేసు ప్రభువు మత్తయి 6:16-18లో వేషధారణతో కూడిన ఉపవాసమును, నిజమైన ఉపవాసమును గూర్చి ప్రవచించి యున్నాడు.  దీని వలన దేహమును ఆయాసపరచుకొనుటయేగాని ఫలితము శూన్యము.  ఇవియే ఈనాటి మన ఉపవాసాలు.

        ప్రభువైన యేసుక్రీస్తు కూడా మత్తయి 4:1-2లో 40 దివారాత్రులు ఆత్మశుద్ధితో దేవునితో ఉపవాసము చేసినట్లును, పరిశుద్ధాత్మ శక్తితో సాతానును జయించాడు.  యేసుయొక్క ఉపవాసము గెత్సెమనెలో ఏకాంతముగా తన తండ్రితో చేసినట్లు మత్తయి 26:36-44లో చదువగలము.

        కనుక ఉపవాసమంటే దైవత్వమునకు సమీపముగా జీవించుట.  అంతేగాని అన్నము మాని దేహాన్ని బలహీనపరచుకొనుట కాదు.  అన్నపానీయములు లేక వ్రతమాచరించు పద్ధతిని నిరాహారదీక్ష వ్రతమంటారు.  సామాన్య భాషలో ఒక్కప్రొద్దు అంటారు.  నేటి యుగములో మన ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఘోరావ్‌లని, రిలే నిరాహారదీక్షలని, షామియానాల క్రింద కూర్చున్నవారిని మనము చూచుట సాధారణమైన విషయము.  దేవుని చిత్త ప్రకారము దైవ సిద్ధాంతముల రీత్యా మన ఉపవాస క్రియలు యెషయా 58:6-8లోను మత్తయి 6:17-18లో విధముగాను వున్నట్లయితే కలుగు ఫలితములు యెషయా 58:10-14లో వలె దైవాశీర్వాదములు పొందగలము.  ''ఆశించిన దానిని ఆకలిగొన్న వారికి ఇచ్చి, శ్రమ పడిన వారికి తృప్తి కలిగించిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును.  క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును.  పాడైపోయిన సమస్తమైనవాటిని నీవు తిరిగి కట్టెదవు.''  ఇవి ప్రభువునకు ఇష్టమైన ఉపవాసములు.

32.  కపట కర్కశ శాపగ్రస్థ జీవితము

        యెషయా 59:5, ''వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు  సాలెపురుగు వల నేయుదురు  ఆ గుడ్లు తినువాడు చచ్చును  వాటిలో ఒకదానిని ఎవడైన త్రొక్కినయెడల విషసర్పము పుట్టును.''

        ప్రియపాఠకులారా!  సర్పము పాపపు జీవితమునకు గుర్తు.  కనుకనే బాప్తిస్మ మిచ్చు యోహానుగాని క్రీస్తు ప్రభువుగా పాపపు జీవితములో జీవించువారిని ''సర్ప సంతామని'' సంబోధించారు.  ఆదిలో ఆదాము చేసిన పాపమునకు ఒక కారణము సర్పమే.  దానిని ఆదిఘటసర్పముగా ప్రకటన గ్రంథమందు చెప్పబడినది.  ఇలా పాపపు జీవితములో ప్రవేశించి ఆదాము హవ్వలు దైవశాపమును పొందారు.  ఆదికాండము మూడవ అధ్యాయము చదివితే వారు పొందిన శాపములను గ్రహించగలము.  ఇలాంటి శాపగ్రస్థ జీవితములో ఉన్న ఆదాము హవ్వలు మొట్టమొదటగా కయీనును కన్నారు.  కయీను, ఆదాము హవ్వలయొక్క సంతానము.  అంటే కయీను ఆదాము హవ్వలు శాపగ్రస్థులుగా మారిన తరువాత పుట్టినవాడు.  కనుక ఇతను శాపగ్రస్థుడే.  కనుక కయీను సర్పసంతానముగా మారాడు.  ఇతనిలో సర్పమునకు ఉన్న లక్షణాలు ఉన్నాయి.  తమ్మునిపై అసూయ, ద్వేషము కలిగియున్నాడు.  అటుతరువాత కొంతకాలానికి హేబెలు జన్మించాడు.  ఇతనిలో ప్రార్థనా జీవితము, సత్క్రియలు వున్నవి.  అందుకే కయీనుతో దేవుడైన యెహోవా ఆదికాండము 4:7, ''నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా?  సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును;  నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను.''  

        కాబట్టి హేబెలు సత్క్రియలు  చేసినవాడుగా గ్రహించాలి.  అనగా శాపగ్రస్థ జీవితములో హేబెలు పుట్టినను తనలో మంచిచెడు జ్ఞానము ఇచ్చు వృక్షఫలము వల్ల వచ్చిన జ్ఞానము చేత మంచినే కోరుకొని దేవుని యోగ్యరీతిగా జీవించాడు.  కనుక దైవకుమారునిగా చెప్పబడినాడు.  ఇక కయీను తను ఏ స్థితిలో అయితే జన్మించాడో అదే శాపగ్రస్థ స్థితిలోనే ఉండి సర్ప సంతానముగా మారాడు.  కనుకనే ఆదికాండము ఆరవ అధ్యాయములో అతని కుమార్తెలను, నరుల కుమార్తెలుగా చెప్పబడినది.  కనుక సర్ప సంతతిగా పుట్టిన కయీను మిడునాగుగా గుర్తించాలి.  అనగా మిడిసిపడినవాడు.  తమ్మునిని చంపి నర హంతకుడైనవాడు.  ఈ మిడునాగు అను కయీను సంతానము గుడ్లుగా చెప్పబడినది.  అనగా మిడునాగు గుడ్లు - మిడునాగులనే పుట్టించునుగాని, మంచివారిని కాదు గదా!  

        కాని సర్పము కన్నా మిడునాగు చాల శక్తివంతమైనదని గ్రహించాలి.  సర్పము ఆదాము హవ్వలను అబద్ధము ద్వారా దైవాజ్ఞను మీరునట్లు జేస్తే, మిడునాగు కయీనును నరహంతకునిగా మార్చి, అతనిని సర్ప సంతానముగా చేసింది.  ఈ మిడునాగు కయీను ద్వారా తన గుడ్లను ఏర్పరచి వారిచే తన గుడ్లను పొదుగునట్లు చేసింది.  అనగా కయీను సంతతిలోని వారు పాపమును వీడక తమ పాపపు జీవితమును జాగ్రత్తగా గుడ్ల రూపములో దాచుకొని పొదుగుచున్నారు.  

        ఇక, ''సాలెపురుగు వల నేయుదురు,'' అనుటలో మిడునాగు గుడ్లు పొదుగువారు సాలెపురుగువలె కుళ్ళు కుతంత్రములతో పాపము వెంట పాపమును జరిగించుచూ - అన్ని రకములుగా పాపపు క్రియలతో వారి జీవితమును అల్లుకొని బయటపడని స్థితిలో వుందురు.  సాలెపురుగు విష కీటకమే అనగా వారు జరిగించు పాపపు క్రియలు నరుని పతనమను ఉచ్చులోనికి లాగునని గ్రహించాలి.  ఇక, ''ఆ గుడ్లు తినువాడు చచ్చును,''  మిడునాగు సాతానుకు ప్రతిరూపమే.  గుడ్లు పాపపు జీవితము.  వీటిని ఎవరైతే తిందురో వారు పాపమును తమ జీవితములోనికి రానిచ్చినవారు అగుదురు.  పాపానికి జీతము మరణమని చెప్పబడినది.  రోమా 6:23.

        ''వాటిలో ఒకదానిని ఎవడైన త్రొక్కినయెడల విషసర్పము పుట్టును,''  అని అనుటలో ఎవరైనా ఆ గుడ్లలో ఒకదానిని అనగా పాపపు జీవితాలలో ఒకదానిని త్రొక్కిన ఆ స్థానములో విషసర్పము పుట్టునని అనగా ఎవరైతే పాపము జీవితమును తొక్కుతారో వారు ఆ పాపపు జీవితము వలన తమ జీవితాన్ని కోల్పోవుదురని చెప్పబడినది.  విషసర్పములు మోషే కాలములో ఇశ్రాయేలీయులు దేవునిపై  తిరుగుబాటు చేసినప్పుడు విజృంభించి ఇశ్రాయేలీయులలో అనేకులను చంపినది.  కనుక ఎవరైతే పాపపు జీవితమను గుడ్లను త్రొక్కుదురో వారి జీవితమునకు ఆ గుడ్డు విషసర్పముగా మారునని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పుచున్నారు.

33.  ప్రసవవేదన పడకమునుపు పిల్లను కనినది  

నొప్పులు తగులకమునుపు మగపిల్లను కనినది

---  ఈ వార్త యెవరు వినియుండిరి?

        యెషయా 66:7-8, ''ప్రసవవేదన పడకమునుపు ఆమె పిల్లను కనినది   నొప్పులు తగులకమునుపు మగపిల్లను కనినది.  అట్టివార్త యెవరు వినియుండిరి?  అట్టి సంగతులు ఎవరు చూచిరి?  ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవవేదన చాలునా?  ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా?  సీయోనునకు ప్రసవవేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను.''

        ప్రియపాఠకులారా!  మన మూలవాక్యములో ప్రసవవేదన పడకమునుపు ఆమె కనిన పిల్ల ఎవరు?  నొప్పులు తగులకమునుపు ఆమె కనిన మగపిల్ల ఎవరు?  ఇంతకి ఆమె ఎవరు?  అనిన విషయములు ముందుగా తెలుసుకొందము.  ఈ వాక్యము కన్య మరియమ్మ, క్రీస్తు ప్రభువు, మరియు యెరూషలేములను గూర్చినది.  ఎలా?

        ఆమె అనగా యెరూషలేము.  ఇది వధువుగా ప్రకటన గ్రంథము 21:2, 9 వచనములలో చెప్పబడినది.  అయితే యాకోబు 12 గోత్రాలుగా పాలస్తీనా ప్రాంతములో యెరూషలేము అను స్త్రీకి పునాది భూమి మీద వేయబడినది.  ఈమె అనగా ఈ యెరూషలేము నూతన నిబంధన కాలములో ఇద్దరికి జన్మనిచ్చింది.  వీరిద్దరిని గూర్చి యెషయా పై విధముగా ప్రవచనములు చేసాడు.

        ఇక, ''ప్రసవవేదన పడకమునుపు ఆమె పిల్లను కనినది,'' అనుటలో ప్రసవవేదన అనగా ఆత్మీయ జీవితములో ఉన్నత స్థానముగా గుర్తించాలి.  ఈ ఆత్మీయ ఉన్నతిలో ప్రసవవేదన కలిగినవారు దేవుని గుర్తించుదురు.  ఆయన కార్యములను జరిగిస్తారు కనుక ప్రసవవేదన అనునది ఉజ్జీవమునకు ఆత్మీయ క్రియలకు మాదిరిగా చెప్పబడినది.  నూతన నిబంధనలోని జనులు ప్రవక్తల ప్రవచనములోని ప్రవచన సారాంశమును గ్రహించలేని స్థితిలో ఉన్నారు.  అనగా వారిలో ప్రసవవేదన లేదు.  ప్రవక్తల మాటలోని పరమార్థాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు.  అనగా వారిలో ఆత్మీయ వికసింపు లేదు.  కనుక వారు అంధులై జీవించుచున్నట్లుగా చెప్పవచ్చును.  ఇటువంటి స్థితిలో ప్రసవవేదన లేని జనులతో నిండిన యెరూషలేము తన నగరమందు పిల్లను కనినది.  ఈమె పరిశుద్ధ మరియమ్మ.  ఈమె యెరూషలేములో పుట్టినను దేవునికి జన్మనిచ్చుటకు లేక రక్షకునికి జన్మనిచ్చుటకు ఈమె ముందుగా జన్మించినది అనిన సంగతి యెరూషలేము ప్రజలు గుర్తించలేదు.  వారు ఆమెను పేదరాలుగానే చూచారు.  కనుకనే కనీసము సత్రములో కూడా ఆమెకు ఉండుటకు బేత్లెహేము వాసులు అంగీకరించక కనీసము తమ ఇండ్లలో ఒక మూలలో ఉండుటకైనను వారు అంగీకరించలేదు.  దీనినిబట్టే మనకు యెరూషలేము నందు మరియమ్మ అను పిల్ల పుట్టినప్పటికి వారి పరిస్థితి ప్రసవవేదన అను ఆత్మీయ ఉజ్జీవము లేక ఉన్నారు.

        ఇక, ''నొప్పులు తగులకమునుపు మగపిల్లను కనినది.''  అనుటలో అదే యెరూషలేము జనము సత్యదేవుని కార్య భారములో మునిగి, శ్రమపడి - ఆ శ్రమలో తమకు నొప్పులు తగలని స్థితిలో ఉండగా మగపిల్లవానికి అనగా క్రీస్తు ప్రభువును మరియమ్మ ద్వారా కనినది.  అయితే క్రీస్తు పుట్టుకను గూర్చి కూడా ఈ యెరూషలేము తెలియని స్థితిలో ఉన్నది.  అందుకే నొప్పులు తగులక మునుపు  అని చెప్పబడినది.  కనుకనే బేత్లెహేము వాసులు క్రీస్తు పుట్టుట కొరకు సత్రములో కొంచెము స్థలము కూడా ఇయ్యలేదు.  అంతేకాదు వారు క్రీస్తును సిలువ వేసారు.  అంటే ఈ యెరూషలేము వాసుల ఆత్మీయస్థితి ఎంత అధ్వాన్నముగా ఉన్నదో మనకు అర్థమగుచున్నది.  కనీసము క్రీస్తు అద్భుతములు వారి మధ్య జరిగించుచున్నను, ఆయనను దేవుని కుమారుడుగా వారు గుర్తించలేదంటే యెరూషలేము ఆత్మీయస్థితి అధ:పాతాళమునకు చేరినదని అర్థము.

        ఇటువంటి స్థితిలో ప్రసవవేదన పడకనే యెరూషలేము కన్య మరియమ్మ అను పిల్లను కని, ఆమె ద్వారా నొప్పులు తగులకమునుపే మగపిల్ల అను క్రీస్తును కనినట్లుగా మనము గ్రహించాలి.  అనగా అజ్ఞాన స్థితిలో వీరిద్దరిని యెరూషలేము కనినట్లుగా మనము గ్రహించాలి.  ''అట్టివార్త యెవరు వినియుండిరి?  అట్టి సంగతులు ఎవరు చూచిరి?''  అనిన ప్రశ్నకు జవాబు తెలిసికొందము.  ఆ దినములలో యెరూషలేముయొక్క దృక్ఫథములో యెరూషలేము సామ్రాజ్యములో యెరూషలేము దృష్టిలో మరియమ్మకు ఎన్నిక లేదు.  కనీసము మరియమ్మకు ఆనాటి యెరూషలేములో సొంత యిల్లు కూడా ఉన్నట్లుగా లేదు.  మత్తయి 2:1-4.

        ఈ వార్త ఎవరు విన్నారు?  మొట్టమొదట ఈ వార్త వేద పండితులకు కాదు.  అతిరథ మహారథులకు కాదు, అయితే గొర్రెలు మేపుకొనే గొల్లవారు దేవదూత ద్వారా గొర్రెలు కాపరులు విన్నారు.  ''అట్టి సంగతులు ఎవరు చూచిరి?  అనుటలో మత్తయి 2:1లో వలె తూర్పు దేశపు జ్ఞానులు తూర్పుదిక్కున పుట్టిన యేసు నక్షత్రమును చూచిరి.  ఆ నక్షత్రమును గూర్చిన వివరమును బట్టి ప్రయాణించి సరియైన నివాసమును తెలిసికొని యేసు ప్రభువు నక్షత్రమును చూస్తూ ప్రభువు పుట్టిన స్థలమునకు వెళ్ళి, ఆయనను చూచి ఆయనను పూజించి కానుకలు సమర్పించిరి.

        ఇది ప్రసవవేదన కలుగకుండా మగపిల్లను కన్న యెరూషలేము స్థితి.  ఇందునుబట్టి ప్రసవవేదన ఎవరికి వచ్చిందంటే - హేరోదు రాజు జ్ఞానుల ద్వారా తెలిసికొన్న విషయమును బట్టి అతడును అతనితో కూడా యెరూషలేములో ఉన్న వారందరు కలవరపడినట్లుగా వ్రాయబడి యున్నది.  ఇందునుబట్టి ప్రసవవేదన పొందినవారు నాటి యూదయా సామ్రాజ్యములో హేరోదు పరిపాలనలో ఉన్న వారందరికి రాజులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు అందరికి ప్రసవవేదన కల్గింది.

        ''ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవవేదన చాలునా?  ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా?''  ప్రియపాఠకులారా, యేసుక్రీస్తును కని ఆయనను మరణానికి అప్పగించి, ఆయన మరణ పునరుత్థానుడై పరమునకు వెళ్ళిన తర్వాత అప్పుడు యెరూషలేము అనగా సీయోనులో ప్రసవవేదన ప్రారంభమైంది.  మొట్టమొదట యేసు మరణ కాలములో భయంకరమైన మరణవేదన అనుభవించింది.  ఆ ప్రసవవేదనలోని కొన్ని ఘట్టాలు - ఆకాశము చీకటి క్రమ్ముట, భూమి కంపించుట, సమాధులు తెరవబడుట, బండలు బ్రద్దలగుట, దేవాలయ తెర చినుగుట.  ఇవి యెరూషలేమునకు కలిగిన ప్రసవవేదన.  అటు తర్వాత యేసు ప్రభువు ద్వారా జన్మించిన ఆత్మలగు అపొస్తలులు ఒకచోట కూడియుండగా అపొస్తలుల కార్యములు 2:1-4, ''పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి.  అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను.  మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒకొక్కని మీద వ్రాలగ అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.''  ఇది యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యకోటికి వాగ్దానము చేసిన ఆదరణకర్తయగు ఆత్మ ద్వారా అపొస్తలుల సంఘమునకు జరిగిన ప్రసవవేదన.  దీని ద్వారా అనేకులకు యేసు నామములో యెరూషలేము కనింది.  అనగా క్రైస్తవ జనాంగమునకు పునాది వేయబడింది.  ఈ విధముగా దినదిన ప్రవర్థమానమైన యెరూషలేము, రోమా, పోర్చుగ్రీసు - గ్రీసు దేశములలో ఈ ప్రసవవేదన బహుముఖ వ్యాప్తముగా కలిగి అపొస్తలుల ద్వారా ప్రసవింపబడి ఈనాడు యావద్‌ లోకమును ఆవరించి, ఒకే ఒక్కటిగా ఉన్న సీయోను కుమార్తె బహుముఖవ్యాప్తమై నానా రూపాంతరములుగా అనగా నానా సంఘములుగా ఏర్పడి, ఈనాడు లోకములో అనేకులైన ఒక జనము అదియే క్రైస్తవ సంఘము అనగా క్రైస్తవ జనకూటమిని కనింది.

        ఆ జనకూటమిలోని సభ్యులము అభ్యర్థులమైన మనలను ఆనాటి సీయోను కుమార్తె ఈనాడు యావద్‌ లోకమును తన ఆత్మీయ ప్రభావ మూలముగా కని యున్నది.   మరియొక మాట - ''ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా?'' అని వ్రాయబడి యున్నది.  ఇది ఒక్క నిమిషములో జరిగినది కాదు.  ఇది కొన్ని యుగాలుగా జరిగిన క్రియ.  అందుకే మోషే దైవ ప్రార్థనలో కీర్తన 90:2, ''పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు''  ఆ విధముగా మారిన యుగాలలో నేటి క్రైస్తవ యుగము ఒకటి -  ఆ క్రైస్తవ యుగమే క్రీస్తు శకముగా మారి ఉన్నది.  ప్రియపాఠకులారా!  ఇంత ప్రభావితమైన, ఫలభరితమైన మర్మము సీయోనులో ఉన్నది.

        సీయోనునకు ప్రసవవేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను,'' అనుటలో సీయోనునకు ప్రసవవేదన కల్గించిన వాడెవరు?  యేసుక్రీస్తు.  సీయోను ఎవరి కుమార్తె?  దేవుని కుమార్తె అనగా దేవుని పట్టణము.  సీయోనులో పుట్టిన జనాంగము ఎవరు?  యూదులు.  క్రీస్తు ద్వారా సీయోనుకు పుట్టినవారము క్రైస్తవులమగు మనము.

        సహజ స్థితిలో సీయోనులో నేడు క్రైస్తవులుండవచ్చును లేకపోవచ్చునుగాని, సీయోను రాజైన యేసుక్రీస్తు ద్వారా సీయోను నుండి తన రక్షణను యావద్‌ లోక నరకోటికి ప్రసాదించినది.  పాపము మరణము అను ఉగ్రతల నుండి కడతేర్చిన మహాపురుషుడు సీయోను నుండియే రావాలి.  ఈ సత్యాన్మి మత్తయి 2:5లో తూర్పు దేశపు జ్ఞానులు క్రీస్తును గూర్చి హేరోదు రాజుతో ప్రస్తావించినప్పుడు - ''అందుకు వారు-యూదయ బేత్లెహేములోనే;  ఏలయనగా యూదయదేశపు బేత్లెహేమా  నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు;  ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును,'' అని అనుటయే ఇందుకు ఋజువు.  క్రీస్తు ద్వారా సీయోను లోకములోని క్రైస్తవులను కనియున్నది.  లోకములోని విశ్వాస నరకోటికి జన్మనిచ్చుటకు దేవుడు తన ప్రణాళికలో తన కుమారత్వమునకు సీయోను అను పట్టణమును రాణివాసముగా ఎంపిక జేసినట్లు మనము గ్రహించవలెను.  యేసుక్రీస్తును బట్టి సీయోనుకు గొప్ప ఆశీర్వాదమున్నది.   యేసుక్రీస్తును బట్టి సీయోనుకు చరిత్ర వున్నది.  ఆ చరిత్ర చెరిగిపోయేది కాకుండా ఒక వేదముగా రూపించబడి అనేకులకు ఆదర్శముగాను, ఆచరణీయముగాను వేదములో లిఖించబడి యున్నది.

        సీయోనుయొక్క చరిత్ర ఇంత ప్రావీణ్యతను పొంది ఉన్నది.  ఈ విధముగా సీయోనుకు ప్రసవవేదన కలుగగానే ఆమె బిడ్డలను కన్నది.  కనుక క్రైస్తవులమైన మనము సీయోను నివాసులము అనిన సత్యాన్ని గ్రహించాలి.  కనుక ఈ విధముగా సీయోనుకు ప్రసవవేదన కల్గించి, ఆమె చేత బిడ్డలను ప్రసవింప చేసిన దేవుడు - యెషయా 66:9, ''నేను ప్రసవవేదన కలుగజేసి కనిపింపక మానెదనా?''  ''పుట్టించు వాడనైన నేను గర్భమును మూసెదనా?''  అనియు సెలవిస్తున్నాడు.  ఇందునుబట్టి సీయోనుకు ప్రతిదినము, ప్రతి గడియ, ప్రతి నిమిషము, ప్రతి క్షణము ప్రసవవేదన పడుచున్నదని తెలియుచున్నది.  ఇందునుబట్టి సీయోనుయొక్క రక్షణ ద్వారము దేవుడు మూయడు.  ఎల్లవేళలు తెరిచి వుంచాడని తెలియుచున్నది.  ఈ విధముగా అన్ని సమయాలలోను తెరవబడియున్న ఈ సీయోను అను ఈ రక్షణ ద్వారము క్రీస్తు.  ఈ మాటలను యోహాను 10:7, 9, ''కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను -   ...  నేనే  ద్వారమును;  నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.''  మరి సీయోనులో ప్రవేశించుటకు ద్వారము క్రీస్తు.  ఈ విధముగా భూలోకములో ఒక ప్రత్యేకతను అమూల్యమైన దేవునియొక్క ప్రణాళిక క్రియలో పాలుపంపులు పొందిన భూలోక యెరూషలేము, ప్రభువుయొక్క రెండవ రాకడలో ఒక ఉన్నత స్థాయికి ఎత్తబడి ప్రకటన 21:2 మరియు 9వ వచనములో వలె పరమ యెరూషలేము లేక పరమ సీయోనుగా పై నుండి దిగి వచ్చునట్లుగా ప్రవచనములో వివరించబడి యున్నది.

        ప్రియపాఠకులారా!  ఈ సీయోను అన్నది క్రీస్తు విశ్వాస జనమునకు భూలోక తల్లిగాను, అలాగే దైవాత్మ నింపుదల పొందినవారికి పరమ సీయోనుగాను రెండు విధములుగా మాతృకయైయున్నది.  ఈ సందర్భములో - గలతీ 4:25, ''ఈ హాగరు అనునది అరేబియా దేశములోఉన్న సీనాయి కొండయే.  ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడ దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయియున్నది.''  కనుక తల్లియైన యెరూషలేము ద్వారా లోకమునకు క్రైస్తవ్యమన్నది వ్యాపించి యున్నదని ఇందులోని భావము.  ఇష్మాయేలు సంతతికి హాగరు తల్లి - క్రైస్తవ విశ్వాస సోదరులకు కన్యకయైన మరియమ్మ తల్లి.  యోహాను 19:27, ''తరువాత శిష్యుని చూచి-యిదిగో నీ తల్లి అని చెప్పెను.  ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను.''

34.  ప్రసవవేదన కలుగజేసి కనిపింపక మానెదనా?  పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా?

        యెషయా 66:9, ''నేను ప్రసవవేదన కలుగజేసి కనిపింపక మానెదనా?  అని యెహోవా అడుగుచున్నాడు.  పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా?  అని నీ దేవుడడుగుచున్నాడు.''

        ప్రియపాఠకులారా!  ఇందులో మొట్టమొదటగా నేను ప్రసవవేదన కలుగజేసి కనిపింపక మానెదనా?  అని యెహోవా అడుగుచున్నట్లుగా వ్రాయబడి యున్నది.  పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా?  అని మన దేవుడు అడుగుచున్నట్లుగ వ్రాయబడి యున్నది.

        సర్వశక్తిమంతుడైన దేవుడు ఎవరికి ప్రసవవేదన కల్గించాడు?  ఎవరిచేత సంతానాన్ని ప్రసవింప జేశాడు?  అనిన అంశాన్ని గూర్చి తెలిసికొందము.  యెషయా గ్రంథములోని ప్రతి మాట ఆత్మీయ పరమార్థములతో యెషయా ప్రవక్త చేత విరచితమై యున్నది.  ఇప్పుడు మనము తెలిసికొనబోయే వాక్య వివరణ కూడా పరమార్థముతో కూడినదై యున్నది.  యెహోవా అడుగుచున్నాడు - నేను ప్రసవవేదన లుగజేసి కనిపించక మానెదనా?  ఈ మాట ప్రకారము దేవుడు మొట్టమొదటగా ఎవరికి ప్రసవవేదన కల్గించాడు?  ఆ విధముగా ప్రసవవేదన పొందినటువంటి వారు ఏయే రూపములో ఏయే విధముగా ఎవరెవరిని ప్రసవించారు అనిన విషయాన్ని క్షుణ్ణముగా తెలిసికొందము.

        మొట్టమొదట ఈ ప్రసవవేదన సృష్టి నుండి ప్రారంభమైంది.  అంటే దేవుడు జరిగించిన సృష్టి నిర్మాణ కార్యక్రమము నుండి నేటివరకు ఈ ప్రసవించుటన్నది నానా విధములుగ ఆశ్చర్యకర రీతులలో క్రియ జరుగుచుచున్నది.  ఆదికాండము 1:2-4, ''భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను;  చీకటి అగాధ జలము పైన కమ్మి యుండెను;  దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.  దేవుడు-వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.  వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను;  దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను.''  ఇప్పుడు ఈ వేదభాగాన్ని గూర్చి మనము ముందుగా తెలిస ికొందము.  ఇందులో మొట్టమొదటగా నిరాకారముగాను శూన్యముగాను వున్న భూగోళమును చీకటి అగాధ జలములను చుట్టియున్నది.  అనగా చీకటన్నది మగ - ఆగాధ జలమన్నది ఆడ.  ఈ చీకటి అగాధ జలములన్నవి రెండు రకముల వాతావరణ ములు.  ఇవి భూమిని గర్భములో దాల్చినవి అని ఇందులోని భావము.  అనగా జల గర్భములో భూమి యుండగా దాని ఉపరితల భాగములో చీకటి మగధీరుడై యుండినట్లుగా ఇందులోని భావము.  అందుకే చీకటి అగాధ జలముపైన కమ్మి యుండినట్లుగా వ్రాయబడియున్నది.  అంటే ఇంత పెద్ద అనంత విశ్వమైన ఈ భూమి ఒకప్పుడు జలము తన గర్భములో చూలాలివలె మోస్తుండినట్లుగా ఇందునుబట్టి మనకు తెలియుచున్నది.

        సాధారణముగా ఒక గర్భిణీ స్త్రీ ప్రసవించాలంటే ఆ క్రియ తన స్వంతముగా తాను జరిగించుకోలేదు.  అందుకు ఒక వైద్యుడుగాని, ఒక మంత్రసానిగాని కావాలి.  అలాగే జలములు మోస్తున్న ఈ భూగోళమును జలములు ప్రసవించుటకు గొప్ప శక్తిమంతుడైన సమస్త శాస్త్రములకు మించిన సహస్ర శాస్త్ర పారంగతుడు కావాలి.  ఆయన భూసంబంధియైతే పనికిరాడు.  అంటే భూమి లేదు గాబట్టి భూసంబంధి లేడు.  అతడు తగడు.  అందుకే పరలోక రాజ్యము నుండి పరమాత్ముడైన ఆత్మ కాన్పులు లేక మెటర్నటీ డాక్టర్‌ దిగి వచ్చెను.  ఆయన ఈ చీకటి అగాధ జలముల మీద సంచరిస్తూ అల్లాడుచూ జలములు పడుచున్న ప్రసవవేదన, కటిక చీకటిలో వున్న అంధకార వాతావరణమును చూచాడు.  సాధారణముగా హాస్పిటలులో ఒక రోగినిగాని, ఒక గర్భిణీ స్త్రీనిగాని పరీక్షించాలంటే బల్లమీద పరుండబెట్టి విద్యుద్దీప కాంతిలో, టార్చిలైట్‌ కాంతితో రోగిని సమస్త అంగములలో క్షుణ్ణముగా పరీక్ష జేస్తాడు.  ఆ విధముగా ఈ పరమ వైద్యుడైన పరమాత్ముడు అంధకార బంధురమైన అగాధ జలములలో తల్లి గర్భములో మాంసపు ముద్ద ఎట్లు ఉంటుందో అలాగే జల గర్భములో ఉన్న ఈ మట్టిముద్దను వెలికి తీయుటకు, పరిశోధించుటకు వెలుగు కలుగును గాక అని అనెను.  ఈ విధముగా వెలుగును ప్రసరింప జేశాడు పరమాత్ముడు.  ప్రసరింపజేసిన  ఈ వెలుగు ధాటికి చీకటి తొలగిపోగా జలగర్భములో నిరాకారముగా ఉన్న భూమిని చూచి తాను ప్రసవింపజేసిన వెలుగు మంచిదైనట్లుగా చూచినట్లు వ్రాయబడి యున్నది.

        మొట్టమొదట దేవుడు భూమి మీద జరిగించిన ఆత్మీయ శస్త్ర చికిత్స ఏదనగా చీకటిని వెలుగును వేరు చేయుట అనగా చీకటి వెలుగును కనింది.  జలములు భూమిని కనక పూర్వము దేవునియొక్క క్రియా విధానములో దేవుడు చీకటికి కల్గించిన ప్రసవవేదనను బట్టి చీకటి వెలుగును కనింది.  ఇది దేవుని క్రియ.  అంతమాత్రమేగాక దైవవాక్కునుబట్టి జన్మించిన వెలుగు చీకటిలకు, దేవుడు తానే చక్కటి పేర్లు పెట్టినాడు.  అదేమనగా ఆదికాండము 1:5లో వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అని పేర్లు పెట్టుట.

        కనుక ఈ విధముగా ప్రసవవేదనతో చీకటి వెలుగులు  రెండింటిలో మొట్టమొదటగ దేవుడు క్రియ జరిగించెను.  దేవుడు కల్గించిన ప్రసవవేదనను బట్టి మొట్టమొదటగ లోకములో ఈ రెండు పుట్టినవి.  అటు తర్వాత దేవునియొక్క ఆత్మ దృష్టి జలముల మీద క్రియ జరిగిస్తూ పరమ వైద్యుడైన దేవుడు జలములలో భూమి, ఆకాశము అను కవల బిడ్డలు ఉన్నట్లుగా నిర్ధారించి, జలములలోనే రెండు భాగాలు జేసి దేవుని చేత వేరు చేయబడిన ఉన్నత జలములకు ఆకాశము అని (మేఘములు) క్రింది జలములకు జలరాశులని పేరు పెట్టినట్టుగ ఆదికాండము 1:8లో వ్రాయబడి యున్నది.  ఇక ఇప్పుడు ఆకాశము క్రింద ఉన్న జలములకు ప్రసవము కలుగజేసి ఆరిన నేల కనబడును గాక అనగా ఆ ప్రకారమే ఆయెను.  ఆరిన నేలకు భూమియని పేరు పెట్టెను.

        ఆ నిరాకార సృష్టిలో నుండి భూమిని గోళముగా రూపించి జలరాశి నుండి వేరుపరచి అనగా జలరాశి చేత ప్రసవింపజేసెను.  ఈ విధముగా జలముల చేత ప్రసవించబడిన భూమిని సృష్టికర్తయైన దేవుడు ఆ గోళమును నిష్ప్రయోజనకరముగా బాల్య దశలోనే ఉంచలేదు.  దేవుడు తన వాక్కు అను ఆత్మ వీర్య బీజము ద్వారా ఆదికాండము 1:11-21 చదివితే దేవుడు తాను జరిగించిన ప్రసవించు క్రియాకర్మలను గూర్చి క్షుణ్ణముగా వ్రాయబడి యున్నది.  ఇందునుగూర్చి కొంత మనము తెలిసికొందము.

        జలము చేత ప్రసవింపబడిన భూమిని దేవుడు విడిచిపెట్టక మొట్టమొదట విత్తనములిచ్చు చెట్లు, చేమలు, ఫల వృక్షములు, గడ్డి వీటిని దేవునియొక్క వాక్‌బీజము ద్వారా భూమి కన్నది.  అంతటితో దేవుడు ఊరుకోలేదు.  భూమికి ప్రసవవేదన కల్గించి, భూమి ద్వారా వృక్షజాలము, జంతుజాలము, పక్షిజాలము, మృగ కీటకాదులు, వగైరాలను భూమి ద్వారా ప్రసవింప జేశాడు.  

        అలాగే తాను జలరాశి నుండి వేరుపరచిన ఆకాశ విశాలమునకు కూడా ప్రసవవేదన కల్గించి, భూమి మీద వెలుగిచ్చుటకు ఆకాశ నక్షత్రాదులను, సూర్యచంద్రులను, గ్రహాలను ప్రసవింప చేశాడు.  అంతేగాకుండా ఆకాశ మండలములో ప్రయాణించే మేఘాలను కూడా ప్రసవవేదన కల్గించి, వర్షాన్ని ప్రసవింప జేస్తున్నాడు.  అట్లే అదే మేఘాలకు ప్రసవవేదన కల్గించి, వడగండ్లను పుట్టిస్తున్నాడు.  అలాగే భూగర్భము నుండి ఆదికాండము 2:7లో దేవుడు సృష్టించిన నరునియొక్క చరిత్ర బహు విచిత్రరీతిలో ఆశ్చర్యకర రీతిలో ఉన్నది.  ఎట్లనగా దేవుడు భూమికి ప్రసవవేదన కల్గించి భూగర్భము ద్వారా నరరూపమును రూపించి, భూమిలో ఉన్న జీవాన్ని వానికివ్వకుండా, భూమిలోని జీవములో వానికి పాలు లేకుండా వానిలో తన జీవాత్మను ఊది, వానిని శారీరరీత్యా కొంతవరకు భూసంబంధిగా వున్నను మూడు వంతులు ఆత్మ సంబంధిగా రూపించినట్లుగా, దేవుడు నరునిలో ప్రవేశింపజేసిన జీవము ఆత్మయొక్క చరిత్రలు ఋజువు పరచుచున్నవి.

        ఈ విధముగా భూమి మొట్టమొదటిగా కనిన నరుడు ఆదాము అయితే ''స్త్రీ'' భూమికి పుట్టినది కాదు.  దేవుడు ఆదామునకు ప్రసవవేదనకు బదులుగా నిద్రావస్థను కల్గించి పురుషుని ద్వారా స్త్రీని ప్రసవింప జేశాడు.  ఈ విధముగా ప్రసవవేదనకు దేవుని చేత భూమి మీద పునాది వేయబడినది.  చిత్రమేమిటంటే దేవుడు వేదనతో స్త్రీ ప్రసవించు స్థితిని కల్గించలేదుగాని, నరులు దైవత్వము పట్ల అవలంభించిన తిరుగుబాటుతనము, ఆయన సన్నిధిలో చేసిన పాపమును బట్టి, పాపపూరితమైన వాతావరణములో పాపక్రియా కర్మల వలన పాపము ద్వారా మొట్టమొదట దేవుడే స్త్రీకి గర్భవేదన కల్గించాడు.  ఈ గర్భవేదన వల్ల పుట్టిన ప్రథమ పాపఫలమైన కయీను, ఇతడు స్త్రీ గర్భము ద్వారా ప్రసవింపబడిన మొదటి నరుడు.  

        ఏ విధముగా ప్రసవింపబడినాడంటే ఆదికాండములో 4:1లో హవ్వ మాట్లాడిన మాట - ''యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించు కొన్నాననెను.'' అని అనుటయే.  ఇక్కడ నుండి స్త్రీకి ప్రసవవేదన ప్రారంభమైంది.  ఈ విధముగా తాను సృష్టించిన నరుడు పతనావస్థకు దిగజారినందున సృష్టికర్తయైన దేవుడు ప్రతి జీవికి ప్రసవవేదన పెట్టినాడు.

        ఆదాముతో దేవుడు మాట్లాడుచు ఆదికాండము 3:17-18, ''ఆయన ఆదాముతో-నీవు నీ భార్యమాట విని-తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది;  ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు;  అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును;  పొలములోని పంట తిందువు;''  ఇందునుబట్టి ఆదామును కనిన భూమికి మరియొక ప్రసవవేదన ఏదనగా భూమి నిలిచియున్నంత కాలము నరులనుబట్టి భూమి శపించబడినదై తన పవిత్రతను, తన ప్రభావమును, తన జీవమును, తన శక్తిని, తన సహజత్వమును పోగొట్టుకొనినది.  భర్తను పోగొట్టుకొన్న స్త్రీ ఏ విధముగా విధవరాలై, అనాధగా జీవిస్తుందో అలాగే ఆదామును బట్టి శాపగ్రస్థమై దైవత్వమునకు దూరమై పోయినది.  తాను మనుష్యులకు అనుగ్రహించే బహు ప్రయాసతో కూడుకొన్నదియు మరియు తాను మోయలేనటువంటి జనాభాను భూమి మీద విస్తరింప జేసినట్లును, ఇందునుబట్టి భూమి ప్రసవవేదనతోను, నిస్సార మూలుగుతోను మరెక్కువ ప్రసవవేదన పడుచున్నట్లుగా తెలియుచున్నది.

        ఆదిలో దైవాశీర్వాదముతో రూపించబడిన భూమి యూరియా, సల్ఫేటు, పాస్ఫేటు, అమ్మోనియా, నత్రజని వగైరా ఎరువుల రసాయనములతో ఫలించింది కాదు.  అయితే నేటి యుగములో భూమిలో వున్న సారము యావత్తు హరించినట్లే అని చెప్పవచ్చును.  అంటే రసాయన ఎరువులు వాడకపోతే నేటి భూఫలములకు అభివృద్ధిగాని, విస్తరింపుగాని లేదు.  కనుక నాడు కయీనును బట్టి ప్రసవవేదన పొందినట్టి హవ్వ వలె నేడు పాపమును బట్టి విస్తరించిన జనాభాను బట్టి, భూమి ప్రసవవేదనతో మూలుగు చున్నట్లుగా రోమా 8:9లో ఒక విధముగాను 22లో మరియొక విధముగాను సృష్టి ప్రకృతి యొక్క ప్రసవవేదనను గూర్చి తెలిసికొనగలము.  

        రోమా 8:9, 22, ''దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు.  ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.  ...  సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు  ప్రసవవేదన  పడుచునున్నదని యెరుగుదుము.''  ఇందులో మొదటిగా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఆశతో కనిపెట్టుచు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము కొరకు ఎదురు చూస్తూ ఆశతో కనిపెట్టుకొని యున్నది.  రోమా 8:19, ''దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది.''  అనగా ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తున్నది.

        అలాగే రోమా 8:22, ''సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు  ప్రసవవేదన  పడుచునున్నదని యెరుగుదుము.''  ఈ ప్రసవవేదనను బట్టి సృష్టి మారిందా?  మారినట్లే కనబడుతుంది గాని మారలేదు, ఎందుకంటే పరిశుద్ధుల సంఖ్య కంటే పాపుల సంఖ్య విస్తారముగా ఉన్నది.  అనగా నోవహు కాలమునాటి కంటే ఇప్పుడు విస్తారముగా వున్నది.  ఈ విధముగా ప్రసవవేదనతో మూలుగుచున్న సృష్టి యేసు ప్రభువుయొక్క రాకడలో ఆయన కొరకు తాను కన్న ఆత్మలను గూర్చి సాక్ష్యమియ్యవలసిన దిన మొకటున్నది.  ఈ ఆత్మలే యెరూషలేము అను వధువు సంఘము.  ఈ సంఘమునకు ప్రసవవేదన కలుగవలెను.  ఈ సంఘము అను వధువునకు భర్త దేవుని గొర్రెపిల్లయైన క్రీస్తు.  ఇందునుగూర్చి ప్రకటన 21:2లోను, 9లోను చదువగలము.

        ఈనాడు ఈ ప్రసవవేదన ఏయే విధముగా ఏయే రూపమున ఉన్నదో మనము తెలిసికోవలసి యున్నది.  నేడు భూమి మీద సువార్తతోబాటు విశ్వాసుల సమూహాలు కూడా విస్తరించి యున్నవి.  అంటే సువార్త ప్రసవించిన విశ్వాసులైన బిడ్డలు అనేకులున్నారు.  ప్రభువు ఉగ్రత ద్వారా ప్రసవవేదన పొంది పిల్లలను కనువారున్నారు.  ఈ విధముగా అనేక రీతులుగా ప్రసవవేదన కలుగజేసే వారి ద్వారా ఆత్మీయ ఫలములను దేవుడు పొందుచున్నాడు.  అనగా ప్రవక్తలకు ప్రసవ వేదన కలుగజేసి వారి నుండి భవిష్యత్తును ప్రకటించుచున్నాడు.  ఇలా చెప్పుకొంటూపోతే ప్రతీ విషయము ప్రసవవేదనే.  ఆలాగే సాతాను కూడా దైవాజ్ఞతో నరులకు ప్రసవవేదనను కలుగజేసి వారిలోని పరిశుద్ధులను ఏరును.  ఇలా అందలి విషయములో జరుగునని గ్రహించి మనకు ప్రసవవేదన కలుగజేసిన దేవుడు మన ద్వారా ఏదో ఒక కార్యమును జరిగించును.  అదే కనిపించుట అని అర్థము.  కనుక దేవుడు గర్భమును దయ చేసిన దానిని మూయువాడు మాత్రము.

        ఉదా :-  మదర్‌ థెరిస్సా :-  ఈమెకు దేవుడు దిక్కులేనివారిని ఓదార్చు వరమును ఇచ్చాడు.  ఇది ఈమెలో గర్భవాసము చేసింది.  ఈ గర్భములో ఈ వరము ఈనాడు ప్రపంచ నలుమూలలా కార్యములు జరిగించింది.  ఇలా కార్యములు జరిగించుటయే కనుట.  అనగా దేవుడు మదర్‌ థెరిస్సాకు దిక్కులేనివారికి ఓదార్చు వరమును ఇచ్చాడు.  దానిని జరిగించకుండా మానలేదు.  వాటివాటి కాలములయందు అవి జరగవలసి యున్నవని గ్రహించాలి.

        అలాగే - నేను (వి. శేఖర్‌రెడ్డి) :-  నాకు దేవుడు పుస్తక రచనా జ్ఞానమును వరముగా ఇచ్చాడు.  దీనిని నేను గర్భము ధరించాను.  దానినే పుస్తక రూపములో విడుదల చేసి జనులయొక్క మానసిక ఎదుగుదల చేయుటయే కనుట అని గ్రహించాలి.  అనగా నేను నా జీవితములో సుమారు 40 సంవత్సరాల కాలములో ఈ పుస్తక రచన అను వరమును గర్భము ధరించుట జరిగింది.  ఈనాడు ఈ పుస్తకములు ఈ స్థితికి వచ్చి ఉన్నవి.  

        ఈ విధముగా ఇంకా అభివృద్ధి చెందుచూ ఉన్నవి.  అంటే పుస్తక రచన అను వరమును నాలో నింపిన దేవుడు దానిని అంతటితో మూసివేయలేదు.  దానిని బహిర్గతము చేసి ఈనాడు ఇంత వృద్ధిలోనికి తీసుకొచ్చెనని గ్రహించాలి.

        కనుకనే మన మూలవాక్యములో - దేవుడు అన్ని విధాలుగా మీకు సహాయము చేయుదునని చెప్పుచున్నాడు.  అయితే ఇంతకి మూసేది ఎవరు?  సాతాను.  సాతాను మనలో దురాశలను రేపి, దాని ద్వారా పాపమును జరిగించి మన జీవితాలను మూసివేయుచున్నది.  కనుక ఎవరైతే లోకాశలను, సాతానును జయించి దేవునిలో నిలబడుతారో వారిలో దేవుడు ప్రసవవేదన కలిగించి, వారి ద్వారా తన కార్యములు జరిగించుకొనునని ఈ వాక్యము ద్వారా మనకు తెలియజేయుచున్నారు.

చివరిగా ఒక మాట

        ప్రభువునందు సహోదరీ సహోదరులారా!  ఏదెను వనము ఒక చరిత్ర.  అది  ఆదాము మరియు హవ్వల చరిత్ర.  ఇది మనందరి జీవితాలకు మూల చరిత్ర.  ఈ చరిత్రను సమూలముగా పఠించి, బాగా అధ్యయనము చేసి మన జీవితాలను సరిదిద్దు కోవలసియున్నది.  అంతేకాదు,

        1. ఈ పుస్తకమును చదువుచున్న మీకు ఏమైన అనుమానాలు ఉన్నట్లయితే,

        2. ఈ పుస్తకములోని సారాంశములో లోపమును మీరు గ్రహించినట్లయితే,

        3. దీనిలో విభాగములు పూర్తిగా వివరించనట్లు మీరు గ్రహించినట్లయితే,

        4. పవిత్ర గ్రంథమునకు వ్యతిరేకమైన అంశములు మీరు ఇందులో చూచినట్లయితే,

        5. మీ హృదయమునుండి ఈ అంశమును కలిపిన మరింత బాగుండునని ఆలోచన వచ్చినట్లయితే,

                 ''దయవుంచి నాకు వ్రాయండి.''

        దీని వలన, మేము మీ యొక్క సహాయ సహకారాలవల్ల తరువాత ముద్రణలో ఈ పుస్తకము అన్ని కోణాలలో అందముగా తీర్చిదిద్ది అందించగలము. ఆమేన్‌.

1.  దానియేలు - నాలుగు జీవులు

దానియేలు 71-28

        దానియేలు 71-3, ''బబులోను రాజగు బెల్షస్సరుయొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను; అతడు తన పడక మీద పరుండి యొక కలకని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను. దానియేలు వివరించి చెప్పినదేమనగా - రాత్రియందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరిచూచుచుండగా ఆకాశపు నలుదిక్కులనుండి సముద్రముమీద గాలి విసరుట నాకు కనబడెను.  అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహా సముద్రములో నుండి పైకెక్కెను.  ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై యుండెను.''

        ప్రియపాఠకులారా!  ''ఆకాశపు నలుదిక్కులనుండి సముద్రముమీద గాలి విసరుట,'' దానియేలు చూచాడు.  ప్రకటన 1715, ''మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను-ఆ వేశ్య కూర్చున్నచోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములును, జనములను, ఆ యా భాషలు మాటలాడువారిని సూచించును.''  ఇందునుగూర్చి మత్తయి 1343లో అపవిత్రాత్మకు నీరుతో అవసరము లేదు.  అపవిత్రాత్మ యొక్క విశ్రాంతి అంటే - మనుష్యులను పట్టి పీడించి వారిని ఏడిపించుటయే దాని ఆనందముతో కూడిన విశ్రాంతి.  మానవులకు విహార యాత్రలు, ఆటలు, సినిమాలు, టీవిలు ఇవియే ఆనందించుచు పొందే విశ్రాంతి.  కనుక ఇందులో ఏ ఆత్మ కైనను నీటితో అవసరము లేదు గనుక ఇక్కడ నీరు అంటే ప్రజలే యని అర్థము.  ఇందునుబట్టి సముద్రము లేక జలములు అనుటకు భూజనులకు మాదిరిగా చెప్పబడియున్నది.  ఈ భూజనులపై ఆకాశపు నలుదిక్కులనుండి గాలి విసురుట అనుటలో ఎఫెసీ 612, ''ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.''  ఇందునుబట్టి ఈ జనసమూహముపై దురాత్మల సమూహము అంధకార శక్తుల దాడి జరుగబోవుటకు సూచనగా ఉన్నది. ఈ సముద్రము అను భూజనులలో నాలుగు ఒక దానికి ఒకటి భిన్నములై నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు పైకి వచ్చాయి.  అని అనుటలో ఇది సాతానుయొక్క ప్రతిరూపములు అని చెప్పవచ్చును.  దీనికి ముందు ప్రకటన నాలుగవ అధ్యాయములో చెప్పబడిన నాలుగు జీవులయొక్క ఆధిక్యతలలో ఎటువంటి తేడా లేదు.  యెహెజ్కేలు ఒకటవ అధ్యాయములో దర్శనములోని నాలుగు జీవులయొక్క శక్తులలో కూడా తేడా లేదు.  కాని దానియేలు ఏడవ అధ్యాయములో చెప్పబడిన ఈ నాలుగు జంతువులలో తేడా ఉన్నట్లుగా చెప్పబడియున్నది.  విభిన్నమైన తేడాలు ఉన్నవి.  కనుక సాతాను సంబంధమే.  

సింహము ః- సాతాను ప్రధమ రూపము దానియేలు 74, ''మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కలవంటి రెక్కలుండెను.  నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యునివలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడెను. మరియు మానవమనస్సు వంటి మనస్సు దానికియ్యబడెను.''

        ప్రియపాఠకులారా!  తండ్రియైన దేవునికి ప్రతిరూపముగా చెప్పబడిన నాలుగు జీవులలో సింహము మొదటిది.  ప్రకటన 46-7 మరియు యెహెజ్కేలు 110.  అయితే దానియేలు గ్రంథములో 74లో చెప్పబడిన సింహము సాతాను యొక్క ప్రతిరూపమే!  ఎలా చెప్పగలము?  దీనికి కూడా పక్షిరాజు వంటి రెక్కలు కలిగియున్నవి. ఈ రెక్కలు తీయబడినవి అని చెప్పబడియున్నది.  దేవునికి వున్న ఆధిక్యత ఎవరు తీసివేయలేరు. కనుక ఇది సాతాను సంబంధమే. సాతాను సింహము రూపములో దానియేలునకు కనిపించుచున్నాడు.  1 పేతురు 58, ''నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.'' దీనికి ఉన్న రెండు రెక్కలు రెండు రకముల ఆధిక్యతలుగా గుర్తించాలి.  ఇవి రెండు తీసివేయబడినవి. మొదటి సాతాను ఆధిక్యత వీణానైపుణ్యము దీనితో దైవసన్నిధిలో గొప్ప గాయకుడిగా ఉన్నాడు.  మొదటి ఆధిక్యతను కోల్పోయిన దానినిగూర్చి యెషయా 1412, ''తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి?  జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?''  లూకా 1018, ''ఆయన-సాతాను మెరుపువలె ఆకాశమునుండి పడుట చూచితిని.''  ఈ విధముగా సాతాను త్రోసివేయబడుటకు కారణము యెషయా 1413-15, ''-నేను ఆకాశమున కెక్కిపోయెదను  దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును  ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును  మేఘమండలముమీది కెక్కుదును  మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని  నీవు మనస్సులో అనుకొంటివిగదా?  నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.''  దేవునికన్న తన్ను తాను ఎక్కువ చేసుకొనిన తలంపే సాతాను పతనమునకు కారణమైనది. ఇక రెండవ ఆధిక్యత మొదటి ఆధిక్యతతోబాటుగా కోల్పోయాడు.  దీనికి ప్రతిగా తన అనుచరులకు తన గాన నైపుణ్యతను ఇచ్చి తనకు గీతములు పాడించుకొంటున్నాడు. మనము ఒక్కసారి అన్యుల దేవతల పాటలను ఆలకిస్తే దానిలో అతిమాధుర్యమైన అనేక పాటలు కనిపిస్తాయి.  దీనినిబట్టి సాతాను ఎంత గొప్ప గాయకుడో మనము గ్రహించవచ్చును.  అయితే దేవునికి పాడవలసిన పాటలను తనకు తన సమాజము వారి ద్వారా పాడించుకొని దేవునిలో తనకున్న రెండు ఆధిక్యతలను కోల్పోయాడు.  మరి ఇక్కడ సాతానును సింహముతో పోల్చవలసిన అవసరత ఏమున్నది?  దీనికి కారణము సాతాను దేవుని దూతలలో అనగా శక్తులలో ప్రధానమైన స్థానమును పొందినవాడు.  సాతానుయొక్క మొదటి దైవిక స్థితిని ఇక్కడ చూపిస్తున్నాడు.  అయితే సాతాను తన ఆధిక్యతలను కోల్పోయిన తరువాత తనను దేవునికి వ్యతిరేకమైనవానిగా అనుకొని గర్జించు సింహమునకు తనను పోల్చుకొని వెలుగు దూతగా క్రియ జరిగించుచున్నాడు.

మొదటి జీవి ః- మనుష్యుని రూపము ః-  ''నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యునివలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడెను.  మరియు మానవమనస్సు వంటి మనస్సు దానికియ్యబడెను.''  ఈ విధముగా ఆధిక్యతలు కోల్పోయిన సాతాను మనుష్యునివలె పాదములు నేలపై మోపి నిలువబడినది.  దీనికి మానవమనస్సు దానికి ఇయ్యబడినది.  ఈ రూపమే అబద్ధ ప్రవక్త రూపము.  ఈ అబద్ధ ప్రవక్త మనుష్యులలో ఒక మనిషే, నేలపైన నిలబడినవాడే మానవునికి ఉన్న మనస్సు కలిగినవాడే.

        ప్రియపాఠకులారా!  ఈ అబద్ధ ప్రవక్త రూపమైన సాతాను సృష్టి ఆరంభము నుండి తన బోధను మొదలు పెట్టాడు.  ఏదెను వనములో దేవుని అబద్ధికునిగా సర్పము ద్వారా బోధించాడు. ఆదికాండము 31-5,  ''దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను.  అది ఆ స్త్రీతో-ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?  అని అడిగెను.  అందుకు స్త్రీ-ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును; అయితే తోట మధ్యవున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు-మీరు చావకుండునట్లు వాటిని తిన కూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము-మీరు చావనే చావరు; ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా,'' ఈవిధముగా మొదలైన సాతానుయొక్క అబద్ధపు బోధ యుగాంతము వరకు జరుగుతూనే ఉంటుంది.  ఈ అబద్ధ ప్రవక్తనుగూర్చి యెహోవా దేవుడు జాగ్రత్త పడమని మోషే ద్వారా ద్వితీయోపదేశకాండములో బోధించాడు.  ద్వితీయోపదేశకాండము 131-3, ''ప్రవక్తయేగాని కలలు కనువాడేగాని నీ మధ్యలేచి నీ యెదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పినయెడల అతడు నీతో చెప్పిన సూచక క్రియగాని మహత్కార్యముగాని సంభవించినను ఆ ప్రవక్తమాటలను కలలు కనువాని మాటలను వినకూడదు.  ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలిసికొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు.''  ద్వితీయోపదేశకాండము 1820, ''అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని, నేను చెప్పుమని తన కాజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, యితర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను,'' అని వ్రాయబడిన ప్రకారము అబద్ధ బోధకునితో పాలిపంపులు గల వానికి పట్టు గతిని

1 రాజులు 1322, ''ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగబడి నీవు వెనుకకు వచ్చి, నీవు అచ్చట అన్న పానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసియున్నావు గనుక, నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని యెలుగెత్తి చెప్పెను.''  ఆత్మను కోల్పోయిన శరీరమును సముద్ర గర్భములో వేస్తే ఏమిటి?  2 రాజులు 936-37లో వలె కుక్కలు తింటే ఏమిటి?  శవాన్ని కాల్చి వేస్తే ఏమిటి?  పితరులు నివసించు పరదైసు భాగ్యమును ఆత్మ కోల్పోవునని భావము.  అందుకే యేసు ప్రభువు తన కుడివైపు దొంగతో నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావన్నాడు.  కాని శరీరమును గూర్చి ఆయన ప్రవచించలేదు.  రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు.''  1 కొరింథీ 1550.  ఈ విధముగా యెహోవా దేవుడు సాతానుయొక్క అబద్ధ ప్రవక్త రూపమును గూర్చి అనేక రీతులుగా తన ప్రవక్తలందరికి తెలియజేసి వారి ద్వారా బోధింపజేశారు.

        ప్రియపాఠకులారా!  అదే విధముగా క్రీస్తు ప్రభువు కూడా ఈ అబద్ధ ప్రవక్తను గూర్చి జాగ్రత్తపడమని తన శిష్యులకు బోధించారు.  మత్తయి 2411, ''అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు;''  మత్తయి 2424, ''అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.''

        అయితే యుగాంతములో ఈ అబద్ధ ప్రవక్తయొక్క కార్యములనుగూర్చి తెలుసుకోవలసియున్నది. ప్రకటన 1311-17, ''మరియు భూమిలోనుండి మరియొక క్రూరమృగము పైకివచ్చుట చూచితిని. గొఱ్ఱెపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికుండెను; అది ఘటసర్పమువలె మాటలాడుచుండెను; అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధికారపు చేష్టలన్నియు దాని యెదుట చేయుచున్నది; మరియు చావు దెబ్బ తగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది.  అది ఆకాశము నుండి భూమికి మనుష్యులయెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది.  కత్తి దెబ్బ తినియు బ్రదికిన యీ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనలవలన భూనివాసులను మోసపుచ్చుచున్నది.  మరియు ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొసటియందైనను ముద్ర వేయించుకొనునట్లును, ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది.''  దీనిని గూర్చి 13వ అధ్యాయములో సంపూర్తిగా తెలుసుకొందము. ఇది అబద్ధ ప్రవక్తయొక్క రూపము.  ఇది ప్రకటన 131-2లోని క్రూరమృగమునకు మార్గమును సుగమము చేయుచు రకరకాల సూచకక్రియలతో జనులను మోసపరచుచున్నది.  ప్రకటన 1610-11, ''అయిదవ దూత తన పాత్రను ఆ క్రూరమృగముయొక్క సింహాసనముమీద కుమ్మరింపగా, దాని రాజ్యము చీకటి కమ్మెను; మనుష్యులు తమకు కలిగిన వేదననుబట్టి తమ నాలుకలు కరచుకొనుచుండిరి; తమకు కలిగిన వేదనలను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందిన వారు కారు.''  దేవుని కోపముతో నిండిన అయిదవ పాత్రను క్రూరమృగము సింహాసనముపై కుమ్మరింపగా ఈ క్రూరమృగము తన అధికారము కోల్పోయింది. అయితే ప్రకటన 1311-18లోని క్రూరమృగ రూపములో రెండు గొర్రెపిల్ల  కొమ్ము వంటి కొమ్ములు కలిగిన అబద్ధ ప్రవక్త క్రూరమృగము తన రాజ్యము కోల్పోయినను దేవుని నుండి కూడా కప్పల వంటి అపవిత్రాత్మను భూనివాసులను మోసపరచుటకు పంపింది. ప్రకటన 1613-14, ''మరియు ఆ ఘటసర్పము నోటనుండియు క్రూరమృగము నోటనుండియు అబద్ధ ప్రవక్త నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్దమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లి.'' దేవుడు దేవుని కుమారుడు చేసే సూచక క్రియలు లేరు.  సాతాను చేసే సూచక క్రియలు వేరు.  దైవకుమారుడు డాక్టర్లకు అలవిగాని ఎటువంటి రోగమునైనను స్వస్థపరచగలడు.  ఇవి ప్రపంచమందంతట దైవజనుల ప్రార్థనల వలన జరుగుచున్నవి.  మూగవారు మాట్లాడుచున్నారు.  నడవలేనివారు నడుస్తున్నారు.  చెవిటివారు వినుచున్నారు.  గుడ్డివారు చూచుచున్నారు వంటివే గాక వారి అనేక సమస్యలకు పరిష్కారము జరుగుచున్నది.    మరి సాతాను చేసేవి మాయలు మంత్రాలు కనికట్టు చేతబడి వగైరాలేగాక ఒక మనిషిని తన అదుపులో పెట్టుకొనుటకు అకస్మాత్తు రోగాలు కల్గించడం, జ్వరాలు, మూర్ఛలు వగైరాలే గాక కొన్ని విధాలైన అర్థముగాని రోగాలతో పీడిస్తాడు.  దయ్యము పట్టుట ఇందులో భాగమే.  ఇట్టి బాధలతో ఉండువారు సాతానుకు మ్రొక్కుకొని శరణు వేడినప్పుడు తాను ఆవరించి కల్గించినవి కాబట్టి అవి సులభముగా వెనువెంటనే బాగుపడును.  ఇవి విగ్రహ దేవుళ్ళ యొక్క సూచక క్రియలు - ఇందునుగూర్చి వివరముగా తెలుసుకోవాలంటే సువార్త సాక్షులు అను గ్రంథములో ఈ గ్రంథ రచయిత యొక్క సాక్ష్యములో వివరించబడి ఉంది.  అయితే శరీరమును క్రమేణా అస్వస్థత పాలు జేయుచున్న రోగాలు బి.పి., షుగరు, క్యాన్సరు గుండె జబ్బులు కట్ట కడకు పిల్లవాని నీళ్ళ విరేచనాలు కక్కుళ్ళు వగైరాలు కూడా నయము చేయలేడు.  సాతాను విగ్రహ దేవుళ్ళ రూపములో ఆవేశమై జరిగిన విషయాలన్ని కరెక్టుగా చెప్పగలడు.  కాని భవిష్యత్తు ఏ మాత్రము చెప్పలేడు.  కనుక అపవాది యొక్క సూచక క్రియలు తాత్కాలికమును, నిష్ప్రయోజనమై యున్నవని గ్రహించాలి.  చివరగా ఈ అబద్ధ ప్రవక్తయొక్క పరిస్థితి ఏమిటి?  ప్రకటన 1919-20, ''మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని. అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనినవారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.''

రెండవ జీవి ః-  ఎలుగుబంటి ః-  దానియేలు 75, ''రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది, అది యొక పార్శ్వముమీద పండుకొని తన నోట పండ్లమధ్య మూడు ప్రక్కటెముకలను పట్టుకొనినది.  కొందరు-లెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి.''  ఎలుగుబంటి నలుపు రంగు అనగా చీకటికి ప్రతిరూపము.  సాతాను చీకటికి రాజు అనగా అంధకార శక్తులకు రాజు.  ''అది యొక పార్శ్వము మీద,'' అని వ్రాయబడియున్నది.  దీనికి ముందు మానవుని రూపములో మారిన సింహమునకు ఈ విధముగా వ్రాయబడలేదు. ''అది యొక పార్శ్వము మీద,'' అనగా ఒక విభాగము పైన ఆధిపత్యము.  అయితే మనుష్యునిగా మారిన తన జనాంగము లేక సాతాను సమాజము అను తేడా లేకుండా క్రియ జరిగించింది.  కాని ఈ ఎలుగుబంటి మాత్రము ఒక పార్శ్వము మీద మాత్రమే క్రియ జరిగించుచున్నది.  ఈ విభాగమే దైవజనాంగానికి వ్యతిరేకమైన జనాంగము.  ఆదికాండము 61-2, ''నరులు భూమిమీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.'' వీరిలో ఎలుగుబంటి జనాంగము నరులు కుమార్తెలకు సంబంధించినవారు. ఇశ్రాయేలీయులను యెహోవా దేవుడు యాకోబు పోరాటము ద్వారా ఎన్నుకొన్న తరువాత పాతనిబంధన కాలము నాటి ప్రజలు రెండు భాగాలుగా మారారు. వారిలో దైవజనాంగము కాని జనాంగము ఎలుగుబంటి జనాంగమునకు చెందినవారు.  నూతన నిబంధన కాలములో క్రైస్తవ జనాంగము ఏర్పడినది.  ఈ జనాంగము కాని వారు కూడా ఎలుగుబంటి జనాంగమే!  ఈ విధముగా భూమి పుట్టినది మొదలు సాతాను ఎలుగుబంటి రూపములో ఈ జనాంగము మీద మూడు కాలాలలో ఒక పార్శ్వము మీద అనగా దైవకుమారులు, దైవజనాంగము, క్రైస్తవులకు వ్యతిరేక జనాంగము మీద పరుండి వారి ద్వారా తన క్రియలను జరిగించుచున్నది.

        ''తన నోట పండ్లమధ్య మూడు ప్రక్కటెముకలను పట్టుకొనినది,'' అనుటలో ఈ ప్రక్కటెముకల         అర్థము ఏమై ఉండవచ్చును.  మరి వీటిని పండ్లమధ్య ఎందుకు పట్టుకొని యున్నది?  ఈ  విషయములనుగూర్చి తెలుసుకొందము.  ఈ మూడు యెముకలు మూడు కాలాలకు చెందిన దైవజనాంగము అనగా పరిశుద్ధులు. అందులో ఒక ఎముక ఆదాము మొదలు జలప్రళయము వరకు ఉన్న పరిశుద్ధులను సూచిస్తుంది.  రెండవ యెముక నోవహు కాలమునుండి నూతన నిబంధన వరకు ఉన్న దైవజనాంగములోని పరిశుద్ధులను సూచిస్తున్నది.  ఇక మూడవ యెముక నూతన నిబంధన కాలము మొదలు యుగాంతము వరకు వున్న క్రైస్తవ జనాంగములోని పరిశుద్ధులు.  ఈ మూడు రకముల జనాంగమును ఈ సాతాను సమాజము మీద పడుకొనియున్న ఎలుగుబంటి రూపములో ఉన్న అపవాది తన పళ్ల మధ్య బంధించి నలగత్రొక్కుచున్నట్లుగా గ్రహించాలి.  ఇక్కడ ఒక విషయము మనము గ్రహించాలి.  ఎలుగుబంటి రూపములో సాతాను సమాజముపై పరుండి మూడు రకములు దైవజనాంగమును ఎంత హింసించినను అవి అట్లే ఉన్నట్లుగా మనము గ్రహించాలి.  అనగా అవి పొడియైపోలేదు. ప్రకటన 1310, ''ఈ విషయములో పరిశుద్దుల ఓర్పును విశ్వాసమును కనబడును.

        ''కొందరు-లెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి,'' అనుటలో సాతానుకు వత్తాసు పలుకు కొందరు ఈ ఎలుగుబంటితో ఇక లెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి, కనుక పరిశుద్ధుల హత్యలకు ఇది ఉత్తరవాది.  అనగా సృష్టికర్తను వదలి సృష్టముల రూపములతో సాతానును ఆరాధించువారు మాంసమును భక్షించుము అని చెప్పుచు  గొర్రెలు, పొట్టేళ్ళు కోళ్ళతో బలులు జాతరలు చేయుచు వివిధ నైవేద్యాలతో ఆరాధించుచు దేవుని విడిచి సాతానును బలపరచుచు వ్రతములు, నోములు, యాగములు అను పేరుతో వానిని బలపరచినందున వాడు విస్తారమైన బలమును పొంది పరిశుద్ధులను హింసించుచు వారి రక్తమాంసములను  భక్షించుచు బయలుదేరినాడు.  బయలుప్రకటన 69-10, ''ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు -నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందునని బిగ్గరగా కేకలు వేసిరి.''  వీరందరి వధకు కారణము ఈ ఎలుగుబంటి రూపమే.        

మూడవ జీవి ః-  చిరుతపులి ః-  దానియేలు 76,  ''అటు పిమ్మట చిరుతపులినిపోలిన మరియొక జంతువును చూచితిని.  దాని వీపున పక్షిరెక్కలవంటి నాలుగు రెక్కలుండెను; దానికి నాలుగు తలలుండెను; దానికి ఆధిపత్య మియ్యబడెను.''  చిరుతపులి అనేక మచ్చలతో కూడిన జీవి.  ఇది సాధుజంతువు కాదు క్రూరమృగము.  పరిశుద్ధుల జీవితము మచ్చలు లేని జీవితము.  ప్రకటన 144-5, ''వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు; వీరు దేవునికొరకును గొఱ్ఱెపిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు. వీరినోట ఏ అబద్ధమును కనబడ లేదు; వీరు అనింద్యులు.''  ఇందునుబట్టి ఎవరి జీవితములలోనైతే ఎటువంటి లోపము ఉండదో వారు దేవునికి ప్రథమఫలముగా ఉండువారు.  వీరిని చిరుతపులి ఆకారములో ఉన్న సాతాను తనకున్న మచ్చను వారికి ఇచ్చుటకు కాచుకొని కూర్చుని ఉన్నది.  అందుకే ఈ ఆకారమును సింహముతో పోల్చుచూ జాగ్రత్త వహించమని ప్రవచించియున్నారు. 1 పేతురు 58, ''నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.''  దీని వీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలుండెను, దానికి నాలుగు తలలుండెను.  యెషయా 4611, ''తూర్పునుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను  దూరదేశమునుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను  నేను చెప్పియున్నాను  దాని నెరవేర్చెదను ఉద్దేశించియున్నాను సఫలపరచెదను.''  ఈ పక్షి అనేక పక్షులుగా మారి సంఘమును దెబ్బ తియ్యబోవుచున్నట్లుగా చెప్పబడియున్నది.  యిర్మీయా 129, ''నా స్వాస్థ్యము నాకు పొడల పొడల క్రూరపక్షి ఆయెనా?  క్రూరపక్షులు దానిచుట్టు కూడుచున్నవా?  రండి అడవి జంతువులన్నిటిని పోగు చేయుడి; మ్రింగివేయుటకై అవి రావలెను.''  ఈ పక్షి పట్టిన వాని పరిస్థితి 1 సమూయేలు 1614-15, ''యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్దనుండి దురాత్మయొకటి వచ్చి అతని వెరపింపగా సౌలు సేవకులు-దేవునియొద్దనుండి వచ్చిన దురాత్మ యొకటి నిన్ను వెరపించియున్నది;''

        ప్రియపాఠకులారా!  ఈ పక్షి తన రెక్కలను ఈ జంతువునకు ఇచ్చినట్టుగా మనము గ్రహించాలి.  ఈ పక్షి సౌలునందు దావీదుపై క్రోధము, అసూయలను రేపి దేవుని దృష్టిలో అల్పుని ఏ విధముగా చేసిందో, అదే విధముగా ఈ చిరుతపులి రూపములో ప్రతి ఒక్కరిని నాశనము చేయుటకు బయలుదేరియున్నాడు.  దీనియొక్క తలలు దీని ఆలోచన విధానాన్ని తెలియజేస్తుంది.  ముందు చెప్పబడిన మూడు జీవులు వాటి ఆలోచనల చొప్పున జరిగించగా ఇది నలుగురు ఆలోచనలను తన తలగా వాడుకొని మరింత ఎక్కువ స్థానములో సంఘముపై దాడిచేసి సంఘమునకు తన మచ్చలు అను సకల దుర్గుణములను అంటించవలెనని ప్రయత్నించుచున్నది.  దీనికి దాని నాలుగు రెక్కలు సహకారాలుగా ఉన్నాయి.  దీని మొదటి రెక్క దేవుని నుండి వచ్చినది. దీనివల్ల ఎవరినైనను శోధించుటకు అధికారమును పొందియున్నాడు.  దీని రెండవ రెక్క ఈ లోకము మీద అధికారము.  ఇది దేవుని నుండి పొందియున్నాడు.  దేవుని అనుమతి పొందిన అపవాదిని ప్రకటన 2010లో చెప్పబడినట్లు అగ్నిగంధకముల గుండములో పడవేయుట ఎందుకు?  దేవుడిచ్చిన అధికారమును దుర్వినియోగము చేసాడు.  ఆయన ఇచ్చిన అధికారము వరకే శోధించాలి.  అట్లుగాక దేవుడిచ్చిన అధికారమునుబట్టి గర్వించి ప్రకటన ప్రకటన 1823లో వలె అనేకులను తన మాయమంత్రముల చేత మోసము చేస్తూ దేవుని ఆలయములోనే కూర్చున్నాడు.  2 థెస్సలొనీక 24.  కనుక అపవాదికిగాని, అతని రూపాంతరాలైన క్రూరమృగము, అబద్ధ ప్రవక్తడుకు శిక్ష తప్పలేదు.  మూడవది తన గుణములను విశ్వాసిలో ప్రవేశింపజేయుటకు అబద్ధ ప్రవక్త సహకారము.  ఈ అబద్ధ ప్రవక్త బోధ ద్వారా విశ్వాసిని తన విశ్వాసము నుండి తొలగించును.  ఇక నాలుగవ రెక్క క్రూరపక్షి నుంచి పొందియున్నది.  ఈ నాలుగు రెక్కల మూలముగా ఈ జంతువు పవిత్ర జీవితములో ఉన్న విశ్వాసికి లేక సంఘానికి ఏదో ఒక రూపములో తనలోని మచ్చలు అను దుర్గుణములను అంటగట్టాలని చూస్తున్నాడు.

నాలుగవ జీవి ః-  భయంకరమైన జంతువు ః-  దానియేలు 77-8, ''పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా, ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువొకటి కనబడెను.  అది తనకు ముందుగా నుండిన యితర జంతువులకు భిన్నమైనది; అది మహాబల మహాత్త్యములు గలది; దానికి పెద్ద ఇనుప దంతములను పదికొమ్ములు నుండెను.  అది సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలినదానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను.''

        ప్రియపాఠకులారా!  పై మూడు జంతువులకు ఈ చివరి జంతువునకు మధ్య కాల వ్యవధి ఎక్కువగా ఉన్నట్లు తెలియుచున్నది.  ఈ జంతువు ముందు జంతువులకు భిన్నమైనది.  ఇది మహాబల మహాత్త్యములు గలది.  దీనికి పెద్ద ఇనుప దంతములును పది కొమ్ములును నుండెను.  ఇది సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలినదానిని కాళ్ళ క్రింద అణగద్రొక్కుచున్నది, అనుటలో దానియేలు చూచిన ఈ జంతువు ప్రకటన 13వ అధ్యాయములోని జంతువుగా భావించాలి.  ప్రకటన

131-2, ''మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ములమీద పదికిరీటములును దాని తలలమీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను.  నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములవంటివి, దాని నోరు సింహపు నోరువంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను.''  కనుక ఈ జంతువుయొక్క ప్రతిమ మాట్లాడుచున్నట్లుగా ప్రకటన 1315లో చెప్పబడియున్నది.  ఈ జంతువుకు పది కొమ్ములు ఉన్నట్టుగా ప్రకటన 131లో చెప్పబడియున్నది.  ప్రకటన 135-7, ''డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను.  మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుప నధికారము దానికి ఏర్పాటాయెను గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోకనివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను.  మరియు పరిశుద్ధులతో యుద్ధముచేయను వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను.  ప్రతి వంశముమీదను ప్రతి ప్రజమీదను ఆ యా భాషలు మాటలాడువారిమీదను ప్రతి జనముమీదను అధికారము దానికియ్యబడెను.''  పరిశుద్ధులు సాతానును గెలవ వలెనేగాని వాని చేతిలో ఓడిపోతే పరలోక రాజ్యములో పరిశుద్ధులకు స్థానమెట్లుంటుంది?  హానోకు ఏలీయాలు పరిశుద్ధులు.  వారు మరణము లేకుండ శరీరములతో పరదైసు ప్రవేశము చేశారు.  వారు దేహము విడిచి పెట్టనిదే పరలోకము ప్రవేశము జరుగదు.  వారు భూమి మీదకు ఇద్దరు సాక్షులుగా వచ్చినప్పుడు వారు సాతాను చేత చంపబడి వారి శరీరాలు నేల మీద రాలిపోవాలి.  అప్పుడు వారి ఆత్మలు పరలోక ప్రవేశము చేస్తారు.  యేసు ప్రభువును అపవాది జయించి చంపనిదే నరులమైన మనకు రక్షణ లేదు.  కనుక ఇక్కడ పరిశుద్ధులను జయించను అంటే దేవుని ప్రణాళికను నెరవేర్చుటయే యగను.  ఇందునుగూర్చి ప్రకటన 117-8 చదువగలరు.  ఈ విధముగా సమస్తమును అనగా పరిశుద్ధుల ఆత్మీయ జీవితమును భక్షించుచూ,'' మిగిలిన దానిని'' అనగా ఎవరైతే ఈ జంతువునకు లొంగరో వారిని కాళ్ళ క్రింద అనగా అధికమైన శ్రమలను కలిగించెను.  అందుకే ప్రకటన 1310లో ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడెను అని చెప్పబడియున్నది.

        ప్రియపాఠకులారా!  దానియేలు 78, ''నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్మువాటిమధ్యను లేచెను; దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరికి వేయబడినవి.  ఈ కొమ్మునకు మానవుల కన్నులవంటి కన్నులును గర్వముగా మాటలాడు నోరును ఉండెను.''  ప్రకటన 1613-14, ''మరియు ఆ ఘటసర్పము నోటనుండియు క్రూరమృగము నోటనుండియు అబద్ధ ప్రవక్త నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లి,''  ఇది ఈ జంతువుకున్న మూడు కొమ్ములు.  ఇవి ఈ జంతువుకు ఉన్నను అవి ఈ క్రూరమృగమునకు బలమును ఇచ్చిన ఘటసర్పము నోటనుండి, నోరును ఇచ్చిన అబద్ధ ప్రవక్త నోటనుండి మరియు తన నోటనుండి బయలు వెళ్లి, భూరాజులను మహయుద్ధమునకు ప్రోగు చేయుచున్నది.  ఇటువంటి పరిస్థితులలో అబద్ధ వ్రపక్త తనలోనుంచి అపవిత్రాత్మ అను ఒక కొమ్మును ఇచ్చెను.  అది బహుగా వృద్ధి చెంది ప్రధానత్వము పొంది మిగిలిన ఈ మూడు అపవిత్రాత్మలను తనకు లోబరచుకొని తను ఆధిపత్యము పొంది ప్రోగు చేయబడిన భూరాజులతో కూడా యుద్ధము చేయుటకు వెళ్ళింది.  ప్రకటన 1919-20, ''మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.  అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనినవారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంథకముతో మండు అగ్ని గుండములో ప్రాణముతోనే వేయబడిరి.''  ఈ అబద్ధ ప్రవక్త దీనిని ఒక కొమ్ము రూపములో ఆధిక్యతను పొందియున్నది. ఈ అబద్ధ ప్రవక్త చూపును, నోరును కలిగియున్నట్లుగా గుర్తించాలి.

        దానియేలు 79, ''ఇంక సింహాసనములను వేయుట చూచితిని; మహా వృద్ధుడొకడు కూర్చుండెను.  ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱెబొచ్చువలె తెల్లగాను ఉండెను.  ఆయన సింహాసనము అగ్నిజ్వాలలవలె మండుచుండెను; దాని చక్రములు అగ్నివలె ఉండెను.

        ''సింహాసనములను వేయుట చూచితిని;''  ప్రియపాఠకులారా!  ఈ సింహాసనములన్నవి దేవునియొక్క సర్వోన్నత స్థలములోని ఆసనములు.  ప్రకటన

204, ''అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను.  మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని.  వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడా రాజ్యము చేసిరి.''  ఈ సింహాసనములో  వృద్ధుడొకడు కూర్చుని యుండెను.  ప్రకటన 2011, ''మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.''  అనగా ఈ వృద్ధుడు ఎవరు?  ఈ వృద్ధుడు ఏండ్లు మీరినవాడు కాదు, వయస్సు మళ్ళినవాడు కాదు, నిరక్షరాస్యుడు కాదు, నిస్సహాయకుడు కాడు, అశక్తుడు గాడు, ఏమియు ఎరుగని అజ్ఞానుడు కాడు.  సమస్త శక్తులకు మించిన శక్తి గల్గినవాడును జ్ఞానియు బహుబల పరాక్రమము కలిగి, సర్వమునకు ఆదియై సర్వమునకును సృష్టికర్తయై తన వాక్కుచేత సమస్తమును రూపించగల సమర్ధుడు.  ఈయన వేదమునకు ఆది, మధ్యవర్తియు అంతమునైయున్నాడు.  అట్టివాడు ఈయొక్క సర్వోన్నత స్థలమైన సింహాసనము మీద కూర్చునియుండగా - ఇక ఆయన అలంకారములగూర్చి మనము తెలిసికోగలము.

        అందులో ప్రప్రధముగా వస్త్రము, ''ఈయన వస్త్రము హిమమువలె ధవళము,'' అని వ్రాయబడియున్నది.  అనగా ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు సున్నితమైన  వస్త్రములును, ''ఆయన శుద్ధమైన గొఱ్ఱెబొచ్చువలె  తెల్లగా వుండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను,'' అనుటలో ఆయన సింహాసనమును ఆవరించిన పరిశుద్ధాత్మ ఈ అగ్ని జ్వాలలవలె మండుచున్న కాంతిలో ఉన్నట్లు ఇది పరిశుద్ధాత్మకు సాదృశ్యమైయున్నట్లు తెలియుచున్నది. ''దాని చక్రములు అగ్నివలె వుండెను,'' అనుటలో అగ్ని చక్రాలు అనగా సముద్రపు అలలవలె నుండెడి అగ్ని సుడులు చక్రాలు కదలికకు గుర్తు.  మధ్యాకాశములో జరుగు తీర్పునకు ఈ సింహాసనము కదలి వచ్చునని మాదిరిగా చెప్పబడినది.

1 థెస్సలొనీక 416-18, ''ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.  ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము.  కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము. కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.''  కనుక చక్రము అనేది గమనమునకు గుర్తుగా ఉన్నది.  అగ్ని వంటి ప్రవాహము ఆయనయొద్దనుండి ప్రవహించుచుండెను.  ప్రకటన 221, ''మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనమునొద్దనుండి;'' ఈ అగ్ని జీవజలముగా ప్రవహించుచున్నది.  ఇది ఆత్మలయొక్క దాహమును తీర్చును.  ఈ జీవజలము ఈ సింహాసనాసీనుడైనవాని ఆధీనములో ఉండి ఆయనకు ఇష్టులైన వారి దాహమును తీర్చుటకు ప్రవహించుచున్నట్లుగా గ్రహించాలి.

        ''వేవేల కొలది ఆయన యొద్ద పరిచారకులుండిరి.  కోట్లకొలది మనుష్యులు ఆయనయొద్ద నిలిచిరి.''  ఇక్కడ నరులను రెండు తెగలుగా విభజించినట్లు మనకు ప్రత్యేకముగా కనబడుచున్నది.  మొదట పేర్కొన్నవారు పరిచారకులు, వీరు వేవేల కొలదిగా ఉన్నారు.  ఇక రెండవ తరగతికి చెందిన మనుష్యులు వీరు కోట్ల కొలది ఉన్నారు.  ఆ వేల మంది పరిచారకులు ఎవరు? ఈ కోట్ల కొలది మనుష్యులెవరు?

        ''పరిచారకులు'' అనగా ప్రకటన 141, ''ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు ధరించిన 144 వేలమంది.  ప్రకటన 57-13, ''నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను  చేసితివి.''  వీరే పరిచారకులు.  వీరు దేవునికి యాజకులుగా ఉండుటకు బ్రతికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేయుదురు. వారు మొదటి పునరుత్థానములో పాలిపంపులు కలవారు.  ప్రకటన 204-6,  ''అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను.  మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని.  వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడా రాజ్యము చేసిరి.  ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుకలేదు;  ఇదియే మొదటి పునరుత్థానము.  ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు.  ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారము లేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.''  మొదటి పునరుత్థానములో పాలిపంపులు కానివారు మనుష్యులుగా గుర్తించాలి.  వీరికి తీర్పు జరుగును.  మొదటి పునరుత్థానములో పాలిపంపులు గలవారి తీర్పు జరిగి యాజకులుగాను దేవునిని పరిచారకులుగా దూతలతోపాటు ఉన్నారు.

        ప్రియపాఠకులారా!  ఆయన యొద్దయున్నటువంటి పరిచారకులకు తీర్పు దీర్చబడింది.  తరువాత అనగా వెయ్యి సంవత్సరముల దేవుని కాలమానము తరువాత తీర్పు మనుష్యులకే.

        ''కోట్ల కొలది మనుష్యులు ఆయన యెదుట నిలిచిరి, తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను,'' అని అనుటలో ప్రకటన 2011-12, ''మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.  మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని.  అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పుపొందిరి.''  ఆత్మకు చావు లేదు.  ఎఫెసీ 21 అపరాధములు చేత పాపముల చేత వీరు చచ్చినవారై వేదనపడుచు శిక్షాకాలము పూర్తి కాలేదని దైవసన్నిధికి ప్రవేశించు అర్హత పొందలేదని భావము.  అనగా చచ్చినవారని కాదుగాని భూమిమీద తమ దేహమును వదలి వచ్చిన ఆత్మలు.  కనుక కోట్ల కొలది మనుష్యులకు తీర్పు తీర్చబడుటకు ఆయన ఎదుట నిలిచారు.    ''గ్రంథములు తెరవబడెను,'' అనుటలో జీవగ్రంథము గాక మరికొన్ని గ్రంథములు ఉన్నట్లుగా తెలుస్తున్నది.  ఈ గ్రంథములు వారివారి క్రియలను గూర్చినవి.  అంతేకాదు వారు పాటించిన మత గ్రంథములు.  వీరికి తీర్పు తీర్చువారు పాటించిన వాటినిబట్టి జరుగును.  అందుకే క్రీస్తు ప్రభువు ఈ విధముగా చెప్పుచున్నారు.  ప్రకటన 315-16, ''-నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.''  వెచ్చగా అనగా క్రీస్తులో జీవించుట అనగా జీవగ్రంథమునకు యోగ్యులుగా జీవించుట.  దీని ద్వారా పరలోక రాజ్యము లభించును.  వీరికి తీర్పు ఉండదు.  చల్లగా అనగా సాతాను సంబంధిత క్రియలు.  వాటికి సంబంధించిన గ్రంథములను పాటించుట. వీరికి ఈ గ్రంథములనుబట్టే తీర్పు.  ఇక నులివెచ్చని వారు అటు ఇటు కాని వారు.  వారికి రక్షణ లేదు.  వీరిని క్రీస్తు ప్రభువు ఒప్పుకొనడు.  ఈ తీర్పు వారి క్రియలచొప్పున జరుగును.  2 కొరింథీ 510, ''ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.''  ఇంతకి ఈ మహా సింహాసనము మీద కూర్చుండువాడు ఎవరు?  సృష్టికర్తయైన దేవుడు కదా!  ఈ సింహాసనము తన కుమారుడైన క్రీస్తునకు ఇచ్చియున్నాడు.  తీర్పుదినమున తండ్రియైన దేవుడు సింహాసనము మీద కూర్చున్నప్పుడు ఆయన ఎదుట మనలను ఒప్పుకొను అనగా మనగూర్చి నమ్మకమైన సత్యసాక్షి అను పేరుగల క్రీస్తు ప్రభువు సాక్ష్యము చెప్పుచూ తీర్పు తీర్చును.  ప్రకటన 35, ''జయించు వాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.''  ఈ విధముగా తండ్రియైన దేవుడు మహా సింహాసనముపై కూర్చుండగా క్రీస్తుప్రభువు తీర్పుతీర్చును.

        దానియేలు 71, ''బబులోను రాజగు బెల్షస్సరుయొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను; అతడు తన పడకమీద పరుండి యొక కలకని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను,'' అనుటలో ఈ క్రూరమృగము దానికి జరుగు తీర్పునుగూర్చి తెలుపబడియున్నది.  ప్రకటన 1920, ''అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనినవారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంథకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.''  ప్రకటన 201-3.  ''దానియేలు 712, ''మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగి పోయెను; సమయము వచ్చువరకు అవి సజీవుల మధ్యను ఉండవలెనని యొక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటాయెను.''  ప్రకటన 207, ''వెయ్యి సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపింప బడును.''  ఈ విధముగా దైవనిర్ణయము ప్రకారము క్రూరమృగము అగ్నిగుండము అను శిక్షకు గురియైనాడు.  అలాగే సాతాను వెయ్యి సంవత్సరములు  దేవుని కాలము ప్రకారము బంధింపబడి అటుతరువాత సజీవులుగా బయటపడి ప్రకటన 208-10, ''భూమి నలుదిశలయందుండు జనములను, లెక్కకుసముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును.  వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను.  వారిని మోసపరచిన అపవాది అగ్ని గంథకములుగల గుండములో పడవేయబడెను.  అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ వ్రపక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రిం బగళ్లు బాధింప బడుదురు,'' అని వ్రాయబడిన ప్రకారము కార్యములు జరిగించి శిక్షకు గురియగు చున్నాడు.  యుగయుగాలు అంటే ఆత్మల యొక్క కాలమానమేగాని దేవునియొక్క కాలమానము కాదు.  సుఖసంతోషాలతో కాలము సులభముగా గడుస్తుంది.  కాని బాధలు వేదనలుతో కాలము ఒక పట్టున గడవదు.  దీనినే యుగయుగాలని అనిపిస్తుంది.  విద్యార్థులు పరీక్ష కాలము కంటే ఎక్కువగా ఉన్న సెలవులు త్వరగా గడచిపోయాయే అను భావము కలుగుతుంది.  ప్రియుడు ప్రియురాలితో మంతనములాడునప్పుడు వారికి కాలమే తెలియదు!  దేవుడు ఇచ్చే శిక్షలోని బాధలు, వేదనలు దుఃఖము, ఏడ్పులు రోదనలనుబట్టి యుగయుగములనిపించును.  కాని ఆ శిక్షాకాలము స్వల్పమే - అపవాదికి విధించబడు శిక్షాకాలము వేయి సంవత్సరాలు మాత్రమే.  లోకపరిపాలనలో ఖైదీయొక్క విధేయతనుబట్టి శిక్ష తగ్గించుదురు.  అట్లే దేవుడు కూడా ప్రకటన 203లో వలె అపవాది యొక్క పరివర్తనను గమనించాలని కొంచెము కాలము విడిచిపెట్టి వాని గమనమును గమనించును.  అంతేగాని యుగయుగముల శిక్ష ఎవ్వరికి ఉండదు.

        దానియేలు 713-14, ''రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారునిపోలిన యొకడువచ్చి, ఆ మహావృద్ధుడు, ఆ మహావృద్ధుడగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను.  సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను.  ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.''  అప్పుడు తీర్పు తీర్చుటకు మధ్యాకాశమునకు వచ్చిన క్రీస్తు ప్రభువు దేవుని సన్నిధి చేరి తీర్పు తీర్చిన తరువాత ఆయన రాజ్యము అనంతకాలము ఏలునని చెప్పబడియున్నది.

        ప్రియపాఠకులారా!  ఈ దర్శనము చూచిన తరువాత దానియేలుకు ఏమి అర్థము గాక కలవరపడి దు:ఖము గలవాడైనట్లు తననుగూర్చి వ్రాసుకొన్నాడు. దానియేలు 715-16, ''నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలను నేను నా దేహములో మనో దుఃఖముగలవాడనైతిని.  నేను దగ్గర నిలిచి యున్న వారిలో ఒకని యొద్దకుపోయి-ఇందునుగూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడుగగా, అతడు నాతో మాటలాడి ఆ సంగతుల భావమును నాకు తెలియజేసెను.''

        దానియేలు 717, ''ఎట్లనగా ఈ మహా జంతువులు నాలుగైయుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి,'' అని అనుటలో లూకా 46, ''-ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వారికిత్తును;'' అని వ్రాయబడిన ప్రకారము ఈ రాజ్యమేలు అధికారము దేవుని నుండి సాతాను పొందియున్నది.  అయితే సాతాను మొదటి ముగ్గురుగా రాజ్యమేలి, చివరకు క్రూరమృగముగా రాజ్యము చేయును.  

        అయితే దానియేలు 718, ''అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు; వారు యుగయుగములు యుగయుగాంతములవరకు రాజ్యమేలుదురు,''  చెప్పబడిన రీతిగా దేవుని పరిశుద్ధులే రాజ్యము యేలుదురు. ప్రకటన 204-6, ''అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను.  మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని.  వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడా రాజ్యము చేసిరి. ఆ వెయ్యి సంవత్సరములు గడుచువరకు మృతులు బ్రదుకలేదు; ఇదియే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు.  ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారము లేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.''

        అయితే దానియేలు క్రూరమృగము దానియొక్క చరిత్ర గూర్చి మరికొంత తెలుసుకోవాలని ఆశ ఉన్నట్లుగా దానియేలు 719లో చెప్పబడియున్నది. దానియేలు 719-21, ''ఇనుపదంతములును ఇత్తిడిగోళ్లును గల ఆ నాలుగవ జంతువు సంగతి ఏమైనదని నేను తెలిసికొనగోరితిని; అది యెన్నటికి భిన్నమును మిగుల భయంకరమునై, సమస్తమును పగులగొట్టుచు మ్రింగుచు మిగిలిన దానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను.  మరియు దాని తలపైనున్న పది కొమ్ముల సంగతియు, వాటి మధ్యనుండి పెరిగి మూడు కొమ్ములను కొట్టివేసి, కన్నులును గర్వముగా మాటలాడు నోరునుగల ఆ వేరగు కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ములకంటె బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించితిని.  ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచున దాయెను.''  మనము ముందు తెలుసుకొన్నట్లుగానే క్రూరమృగమునకు సహాయము చేయుటకోసముగా ప్రకటన 1311-17లో వచ్చిన క్రూరమృగము రూపములోని అబద్ధ ప్రవక్త క్రూరమృగము రాజ్యము కోల్పోయిన తరువాత (ప్రకటన 1610) క్రూరమృగమునకు బలమును ఇచ్చిన ఘటసర్పము ముగ్గురును తమ నోటనుంచి మూడు అపవిత్ర ఆత్మలను పంపినవి.  ఇవి సూచనలు చేయు ఆత్మలు.  అయితే వీటి స్థానము ఒక కొమ్ముగా అబద్ధ ప్రవక్తే క్రూరమృగమునకు ప్రధానత్వమును పొంది యుద్ధమును జరిగించి ఈ కొమ్ము పరిశుద్ధులతో పోరాడుచు గెలుచునది అని ప్రకటన 137లో వ్రాయబడియున్నది. అనగా క్రూరమృగముతో బాటుగా క్రూరమృగ రూపములో కనిపించి అబద్ధ ప్రవక్త పరిశుద్ధులతో పోరాడి గెలుస్తున్నాడు.

        దానియేలు 723-26, ''నేనడిగిన దానికి ఆ పరిచారకుడు ఈలాగున చెప్పెను-ఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది.  అది సమస్తమును అణగద్రొక్కుచు పగులగొట్టుచు లోకమంతయు భక్షించును.  ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు పదిమంది రాజులను సూచించుచున్నవి; కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరియొక రాజుపుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయును.  ఆ రాజుమహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాలములను న్యాయపద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్థకాలము అతని వశమున నుంచబడుదురు.  అతని యధికారము నశింపజేయుటకును నిర్మూలముచేయుటకును తీర్పు విధింపబడెను గనుక అది కొట్టి వేయబడును.''    అని వ్రాయబడిన ప్రకారము మొదటి మూడు విధములైన రాజ్యమును భూజనులలో జరిగించినట్లు మనము మూడు జీవులు వాటి గూర్చి ముందు పేరాలలో చదివాము.  అయితే ఈ నాలుగవ జీవి ఈ మూడు జీవులలో భిన్నమైన రాజ్యమును సూచిస్తున్నది. అంతేకాదు పరిశుద్ధులను నలగగొట్టుచు వారిని చంపి, వారి శరీరములను నాశనము చేయుచున్నది అయితే దానియేలు 724లో 10 కొమ్ములు గూర్చి వ్రాయబడి యున్నది.  ఇవి పది మంది రాజులు వీరు పుట్టాలి.  వీరిని గూర్చి ప్రకటన

1712, ''నీవు చూచిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు.  వారిదివరకు రాజ్యమును పొందలేదు గాని యొకగడియ క్రూరమృగముతో కూడ రాజులవలె అధికారము పొందుదురు.''  వీరు రాజ్యమును కోల్పోవలసినవారే.  కాని వీరు ఇంకా పుట్టలేదు.  దీనిలో ముగ్గురు రాజులను పడద్రోసి భిన్నమైన రాజు అబద్ధ ప్రవక్త తానే ఒక రాజుగా క్రూరమృగముతో జత కలుపును.  వీడి జీవితమే దైవ వ్యతిరేకమైనదే కదా!

        చివరగా దానియేలు 727, ''ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును.  ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరును దానికి దాసులై విధేయులగుదురు.  ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పెను.''  ఈ దర్శనమును గూర్చి విస్మయముగల వాడనైతినిగాని దాని సంగతి తెలుపగలవాడెవడును లేకపోయెను.  దీనిలో ఎటువంటి మార్పులేదు.

2. దానియేలు - రెండు జీవులు

దానియేలు 81-27

        దానియేలు దర్శనములకు  ప్రకటన గ్రంథమునకున్నంత ప్రత్యేకత వుంది.  మన మూల వచనములో వున్న దర్శనము ఇది రెండవ మారు కలిగినది.  ఈ దర్శనము  బెల్షస్సరు ప్రభుత్వపు  మూడవ సంవత్సరమందు కలిగినట్లుగా వ్రాయబడి యున్నది.  అప్పుడు దానియేలు ఏలామను ప్రదేశ సంబంధమగు షూషనను పట్టణపు నగరులో ఉన్నాడు.

        ప్రియపాఠకులారా!  ఈ షూషనను పట్టణము, దాని కోట గూర్చి మనము ఎస్తేరు  గ్రంథము నందు  చదువగలము.  ఎస్తేరు కాలములో ఈ నగరము చాలా ప్రసిద్ధి చెందినదిగా మనము చదువగలము.

        దానియేలు 83,'' నేను ఊలయియను నదిప్రక్కను ఉన్నట్టు నాకు  దర్శనము కలిగెను.  నేను కన్నులెత్తి చూడగా, ఒక పొట్టేలు ఆ నది ప్రక్కను నిలిచి యుండెను;''  ఇక్కడ పొట్టేలు దైవగుణములకు  సూచనగా వుంది.  అనగా మత్తయి 25వ అధ్యాయములో మనము చదివితే గొఱ్ఱెజాతి దైవికమును, మేకజాతి సాతాను జాతిగాను వర్ణించబడియున్నది.  దీనినిబట్టి పొట్టేలు గొఱ్ఱెజాతి కాబట్టి ఇది దైవసంబంధమైనది.  పొట్టేలు అనగా ఇది మగ, ''దానికి రెండు కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తయినవి గాని యొకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను'', ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది.'' అనగా పొట్టేలు అను దైవత్వములో రెండు కొమ్ములు ఒకేసారి వున్నది కాని మొదట మొలిచినది పొడవుగా వున్నను దాని తరువాత మొలిచినది ఇంకా పొడవుగా వున్నట్లుగా చెప్పబడినది. కొమ్ము అనునది వారియొక్క ఆధిక్యతకు చూచన.  మొదటి కొమ్ము బాప్తిస్మమిచ్చు యోహాను.  యోహాను 16, ''దేవుని యొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను.''  దేవుని చేత పంపబడినవాడు ఈ పొట్టేలునకు కొమ్ము.  అయితే రెండవ అనగా ఇంకా పొడవైన కొమ్ము బాప్తిస్మమిచ్చు యోహాను తరువాత పుట్టిన యేసు క్రీస్తునకు సాదృశ్యమైయున్నది.  దీని ప్రభావము ఎక్కువ ఎందుకంటే దీని పొడవు మొదటి దానికంటే ఎక్కువగా యున్నది.  మనకందరికి తెలిసిన విషయమే!  అదేమిటంటే క్రీస్తు యేసు  హెచ్చించవలసియున్నది, బాప్తిస్మమిచ్చు యోహానును తగ్గించవలసియున్నది. అనుటకు సూచనగా ఈ రెండవ కొమ్ములు మొలిచి వాటి పొడవులలో తేడా చూపుచు దైవసమాజమునకు  సాదృశ్యమైన పొట్టేలునైయున్నది.

        దానియేలు 84, ''ఆ పొట్టేలు  కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని.''  అనగా ఈ పొట్టేలు ఎవరిని  పొడుచుచున్నది.  పాపాత్ములనే కదా!  ''ఇట్లు జరుగగా  దానిని ఎదిరించుటకైనను, అది పట్టకుండ తప్పించుకొనుటకైనను, ఏ జంతువునకును శక్తిలేక పోయెను; అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చెను,'' అని దర్శనములో  చెప్పుచున్నాడు.  క్రీస్తు ఈ లోకములో జీవించిన కాలములో తాను పిలిచిన ప్రతి ఒక్కరు తమ జీవితములను సరిదిద్దుకొనుచు ప్రభువును వెంబడించినారు.  ఆ విధముగా సాతాను సమాజము వారిని దైవ సమాజముగా మారుస్తూ వచ్చారు. వారు వారికి ఇష్టమైన రీతిలో సువార్త అను కార్యమును జరిగించుచూ వారి బలమును అందరికి చూపుచు వచ్చిరి.  ఈ విధముగా దానియేలుకు  బాప్తిస్మమిచ్చు యోహాను, క్రీస్తు జరిగించు కార్యములనుగూర్చి దర్శనములో చూపించబడినవి.

        ప్రియపాఠకులారా!  ఇది ఇట్లుండగా దానియేలు 85, ''నేను ఈ సంగతి ఆలోచించుచుండగా'' అనగా దానియేలునకు ఏమి అర్థము కాని స్థితి. ఆలోచనలో ఉండగా అనగా ఈ పొట్టేలు ఏంది?  దాని మీద ఉన్న రెండు కొమ్ములు ఎవరు?  అది మూడు దిక్కులులో పొడుచుట ఏమిటి?   అన్న విషయము అర్థముగాని పరిస్థితులలో దానియేలు ఉండగా, దానియేలు 85, ''ఒక మేకపోతు  పడమట నుండి వచ్చి, కాళ్లు నేల మోపకుండ భూమియందంతట పరగులెత్తెను;'' దానియేలులో చెప్పబడిన ఈ మేకపోతు సాతాను సమాజమునకు సూచనయై ఉంది.  క్రీస్తు వ్యతిరేకులనందరిని కూడగట్టుకొని  పడమర నుంచి మేకపోతుగా  పరుగులు తీస్తు క్రీస్తు పైన  బాప్తిస్మమిచ్చు యోహాను మీద అనగా పొట్టేలు మీద దాడి చేయుటకు సిద్ధమైంది.  ''దాని రెండు కన్నుల మధ్యనొక ప్రసిద్ధమైన  కొమ్ముండెను,'' అని వ్రాయుటలో ఈ కొమ్ము ప్రసిద్ధమైనదే.  ఏ విధముగా ఇది ప్రసిద్దమైనది?  ఇది సాతానుకు  సూచనయైయున్నది.  ఇది ఒకప్పుడు పరలోకములో  యెహోవా సన్నిధిలో  గాయకుడిగా ఉండి, దేవునిన్నా ఎక్కువ స్థితిని ఊహించుకొని పడిపోయినవాడు. ఇటువంటి ప్రసిద్ధమైనవాడు కొమ్ముగా ఈ మేకపోతు సమాజములో రెండు కన్నుల మధ్యచేరి అనగా కేంద్రస్థానముగా  క్రియజరిగించి, మొట్టమొదటగా ఈ సాతాను మేకపోతు సమాజము ద్వారా  పొట్టేలుపై దాడిచేసి దాని మొదట మొలిసిన కొమ్ము అను యోహాను తలనరికించింది.  అటుతర్వాత క్రీస్తును సిలువపై చంపించింది.  ఈ విధముగా దానియేలు 86-8, ''ఈ మేకపోతు నేను నదిప్రక్కను నిలుచుట చూచిన రెండు కొమ్ములుగల పొట్టేలు సమీపమునకు వచ్చి, భయంకరమైన కోపముతోను బలముతోను దానిమీదికి  ఢీకొని వచ్చెను.  నేను చూడగా ఆమేకపోతు పొట్టేలును కలిసికొని, మిక్కిలి రౌద్రముగలదై దాని మీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచిదాని రెండు కొమ్ములను  పగలగొట్టెను.  ఆ పొట్టేలు దాని నెదిరింపలేక పోయినందున ఆ మేకపోతు  దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను; దాని బలమును అణచి ఆ పొట్టేలును  తప్పించుట ఎవరిచేతను కాకపోయెను.  ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచువచ్చెను.''

        ప్రియపాఠకులారా!  ''రెండు కొమ్ములను పగలకొట్టెను.''  అనగా బాప్తిస్మమిచ్చు యోహానును మరియు క్రీస్తు ప్రభువును పడగొట్టగల్గింది.  ఇక్కడ మనము ఒక విషయము గమనించవలసియున్నది.  అదేమిటంటే అ పొట్టేలు దాని నెదిరింపలేక పోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెనే గాని దానిని చంపలేక పోయింది.  అనగా దైవ సమాజమును పూర్తిగా నాశనము చేయలేక పోయింది.  అనగా శోధనకు నిలబడి ఇంక సహిస్తున్నవారు ఆ రోజులలో చాలామంది వున్నారు అని అర్థము.

        ప్రియపాఠకులారా!    దానియేలు 88, ''అది (మేకపోతు) బహుగా పుష్టినొందగా దాని పెద్దకొమ్ము విరిగెను;'' అనగా సాతాను సమాజము కొంత తగ్గించబడింది అని అనవచ్చును, లేక క్రీస్తు ప్రభువు పునరుత్థానము వల్ల ఈ సాతాను సమాజము అయిన మేకపోతు బహుగా పుష్టినొందినప్పటికిని అది విరిగిపోయింది.

        ఈ పునరుత్థానము తరువాత క్రీస్తు తన  11 మంది శిష్యులను ప్రతిష్టించి వారిని అపొస్తలులుగా చేస్తాడు.  అదే విధముగా ఈ సాతాను సమాజము కూడా విరిగిన ఎముక స్థానములో నాలుగు ప్రసిద్దమైన కొమ్ములు  ఆకాశపు నలుదిక్కులకు నాలుగు పెరిగినట్లు దానియేలు 88లో వ్రాయబడియున్నది.  వీరు అంత్యక్రీస్తుకు  సంబంధించిన అబద్ధ బోధకులు అని చెప్పవచ్చును.  దానియేలు 89, ''ఈ కొమ్ములలో ఒకదానిలోనుండి యొక చిన్నకొమ్ము మొలిచెను.  అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను.''  వీరి మధ్యలో క్రూరమృగముగా ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి యొక చిన్నకొమ్ము మొలిచెను.  అవి దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను.''  ఈ కారణము  వల్ల అబద్ధ బోధకుల మధ్య ఈ చిన్న కొమ్ముయొక్క మార్గము సరాళము చేయబడి, అది బహుగా వృద్ధి చెందినట్లుగా వ్రాయబడియున్నది. అనగా క్రూరమృగముయొక్క ప్రభావము చాలా ఎక్కువగా చెప్పబడినది.  ఈ చిన్న కొమ్ముయైన క్రూరమృగముయొక్క ప్రభావము అతని కార్యములనుగూర్చి తెలిసికొందము. దానియేలు 810, ''ఆకాశ సైన్యమునంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళక్రింద అణగ ద్రొక్కుచుండెను.''  ఇక నక్షత్రములు అనగా సువార్త సేవా వెలుగును కలిగినవారు.  వీరి మీద కూడా  క్రూరమృగము ఆధిక్యతను కలిగి వారి కార్యములను అప్పటినుండి ఇప్పటివరకు కూడా అణగద్రొక్కుచున్నాడు.  అనగా సువార్త వెలుగు వారి నుంచి ప్రకాశింపనియ్యక అణగద్రొక్కుచున్నారు.  ఈ క్రూరమృగము దానియేలు 811, ''ఆ సైన్యముయొక్క అధిపతికి (క్రీస్తునకు) విరోధముగా తన్ను  హెచ్చించుకొని, అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను.''  ఈ విధముగా అతిక్రమము జరిగించుటకు, అనుదిన బలిని నిలుపు చేయుటకు ఒక సేన అతనికియ్యబడెను.  దానియేలు 812, ''అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై యొక సేన అతనికియ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను.'' ఈ నేనే అబద్ధ ప్రవక్త అతని అనుచరులు.  కనుక ఈ అబద్ధ బోధకులనే సైన్యము ప్రభువు భోజనమనే అనుదినము చేయవలసిన బలిని నిలుపుచేయుచున్నది. దానియేలు 123.

        ప్రియపాఠకులారా!  ఈ సంఘటనలు జరిగిన తర్వాత దానియేలు దర్శనములో 813-14లో ఇద్దరు పరిశుద్ధులు మాట్లాడుకొనుట వింటున్నాడు. వీరు నాశనకరమైన హేయ వస్తువు గూర్చి మాట్లాడుచు ఇంకెన్నాళ్లు ఈ దర్శనము నెరవేరును అని ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్ళ క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్లు జరుగునని మాట్లాడుకొనిరి.

        అందుకతడు - రెండువేల మూడు వందల దినములమట్టుకే యని నాతో చెప్పెను.  ఆ తరువాత ఆలయపవిత్రతనుగూర్చిన తీర్పు తీర్చబడును.

        2 థెస్సలొనీక 23-4, ''మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనేగాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనియ్యకుడి.''

        ప్రియపాఠకులారా!  నాశనకరమైన హేయ వస్తువు ఈ విధముగా  బయలు వెడలి, శ్రమల కాలము గతించిన తరువాత అనగా రెండువేల మూడు వందల దినముల తరువాత ప్రభువు రాకడ తీర్పు జరుగును అని భావము.  ఈ దినములు ప్రభువుయొక్క దినములు కాబట్టి వాటిని ఇన్ని రోజులు లేక ఇన్ని సంవత్సరములని చెప్పలేము.  ఎందుకంటే 2 పేతురు 38లో వలె ఒక దినము వెయ్యి సంవత్సరములకు సమానమని చెప్పుచున్నాడు.  ఈ దినములు అనగా రెండువేల మూడు వందల దినములు తరువాత తీర్పు జరుగునని చెప్పబడియున్నది.    

        ప్రియపాఠకులారా!  దానియేలు  815-19లో వలె దానియేలు పై దర్శనములో ఉన్న సంగతులు సంపూర్ణముగా తెలుసుకోవాలని అనుకొన్నప్పుడు మనుష్యుని రూపముగల యొకడు, అతనే గబ్రియేలు ఈయొక్క దర్శన భావమును తెలియజేసెను.  దానియేలు 817, ''అప్పుడతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను; అతడు రాగానే నేను మహా భయమొంది సాష్టాంగపడితిని; అతడు-నరపుత్రుడా, యీ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలిసికొనుమనెను.''  అటుతర్వాత గబ్రియేలు మాట్లాడుచుండగా దానియేలునకు గాఢనిద్ర పట్టినవాడై నేల మీద సాష్టాంగపడ్డాడు.  కనుక గబ్రియేలు దానియేలును లేవనెత్తి నిలువ బెట్టెను.

        ప్రియపాఠకులారా!  దానియేలు 819లో గబ్రియేలు - ''ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది.''

        ఇక్కడ గబ్రియేలు దానియేలుతో ఉగ్రత కాలమునుగూర్చి చెప్పలేదు. ఇది యోహానుకు బహిర్గతమైనది.  దానిని ప్రకటనలో వ్రాశాడు.  అయితే దానియేలుకు గబ్రియేలు దూత ఉగ్రత కాలము గడిచిన తరువాత జరుగు సంగతులు తెలియజేస్తున్నాడు.  ఇందులో దానియేలు 820-26, ''నీవు చూచిన రెండు కొమ్ములుగల ఆ పొట్టేలున్నదే, అది మాదీయులయొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది.  బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకులరాజు; దాని రెండు కన్నుల మధ్యనున్న ఆ పెద్దకొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా నాలుగు కొమ్ములు పుట్టినవి గదా;  నలుగురు రాజులు ఆ జనములో నుండి పుట్టుదురుగాని వారు అతనికున్న బలముగలవారుగా ఉండరు.  వారి ప్రభుత్వముయొక్క అంతములో వారి యతిక్రమములు సంపూర్తియగుచుండగా, క్రూరముఖము గలవాడును యుక్తిగలవాడునై యుండి, ఉపాయము తెలిసికొను ఒక రాజు పుట్టును.  అతడు గెలుచునుగాని తన స్వబలమువలన గెలువడు; ఆశ్చర్యముగా శత్రువులను  నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు, ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను,  అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును.  మరియు నతడు ఉపాయము కలిగినవాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును;  అతడు అతిశయపడి తన్నుతాను హెచ్చించుకొనును;  క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరించును; అతడు రాజాధిరాజుతో యుద్ధముచేయును గాని కడపట అతని బలము దైవాధీనమువలన కొట్టివేయబడును. ఆ దినములను గూర్చిన దర్శనమును వివరించియున్నాను.''

        ప్రియపాఠకులారా!  ఇక్కడ పారసీకుల మాదీయుల రాజు ఈ పొట్టేలు అనుటలో దానియేలు రాజుల కాలములో వ్యక్తి కాబట్టి గబ్రియేలు దూత దేశముల పేర్లతో పోల్చి చెప్పుచున్నదిగాను, నిజానికి వీరు దేశములయొక్క రాజులు కాదు.  ఇక్కడ పొట్టేలు దైవ జనాంగానికి  రాజు (క్రీస్తు ప్రభువు) బొచ్చుగల ఈ మేకపోతు సాతాను సమాజమునకు రాజు.  ఈ పెద్దకొమ్ము సాతాను సమాజనమునకు మొదటి రాజు, ఈ రాజు సాతానే.  ఇది క్రీస్తు పునరుత్థానముతో విరిగిన పిమ్మట దానికి బదులుగా నాలుగు కొమ్ములు పుట్టినవి.  వీరు జనములలోనుండి పుట్టుదురు అని చెప్పబడియున్నది.  అనగా వీరు అబద్ధ బోధకులు కాని వీరు మొదటి కొమ్ము కున్నంత ప్రసిద్ధియు, బలముగలవారై ఉందురని వాక్యములో చెప్పబడియున్నది.  దీనికి కారణము వీరు సాతానుయొక్క బలము వలన జనములలో కార్యములు జరిగించువారు.  వీరికి సాతాను శక్తి ఇచ్చునంత మట్టుకేగాని వీరు స్వతహాగా శక్తిమంతులు కారు.  వీరు సాతాను నడిపించిన విధముగా వీరి ప్రవర్తన ఉంటుంది.  వీరియొక్క కార్యకలాపాలు చివరదశకు చేరినప్పుడు వారి కొమ్ములలో ఒక కొమ్మునుండి క్రూరమృగము, యుక్తిగల ఉపాయము తెలిసిన ఒక రాజు కొమ్ముగా పుట్టును.  క్రూరమృగమును పోలి అనుటలో ప్రకటన 131, ''మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకివచ్చుట చూచితిని.  దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలలమీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను.''  వాడు యుక్తిగలవాడై ఉపాయము తెలిసికొనని ఒక రాజు.  అతడు గెలుచునుగాని తన స్వబలము వలన గెలవడు అని అనుటలో ప్రకటన 132, ''నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను.  దాని పాదములు ఎలుగబంటి పాదములవంటివి, దాని నోరు సింహపునోరువంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను.''  అనగా దీనియొక్క స్వంత బలము కాదు ఘటసర్పము తన బలమును ఇచ్చినది.  అలాగే తండ్రి తన యందుండి తన క్రియలను చేయుచున్నాడని యేసుక్రీస్తు యోహాను 1410-11లో వివరించియున్నాడు.

        ప్రియపాఠకులారా!  ఈ విధముగా ఘటసర్పము నుండి బలము పొందిన క్రూరమృగము ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటయందు బలము పొందుచూ అనగా దైవజనులను నాశనము చేస్తు ఇష్టమైనట్టు క్రియలు చేస్తూ  పరిశుద్ధ జనమును నశింపజేయును.  ''ఈ విధముగా నతడు ఉపాయము కలిగినవాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును;'' అనుటలో ప్రకటన 137, ''మరియు పరిశుద్ధులతో యుద్ధముచేయను వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను.  ప్రతి వంశముమీదను ప్రతి ప్రజ మీదను ఆ యా భాషలు మాటలాడువారిమీదను ప్రతి జనముమీదను అధికారము దానికియ్యబడెను,'' అని వ్రాయబడిన ప్రకారము క్రూరమృగము పరిశుద్ధులతో యుద్ధము చేసి ఉపాయముతో ప్రతి వంశము, ప్రతి ప్రజలను  ఆ యా భాషలు మాటలాడు ప్రతి ఒక్కరి మీద అధికారమును పొంది వారిని మోసపరచుచున్నది. ''అతడు అతిశయపడి తన్నుతాను హెచ్చించుకొనును;'' అనగా ప్రకటన 135, ''డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుప నధికారము దానికి ఏర్పాటాయెను.''  42 నెలలు అనగా 3 1/2 సంవత్సరము.  లూకా 323 యేసు సువార్త ప్రకటించ మొదలుపెట్టినప్పుడు ఆయన వయస్సు 30 సంవత్సరాలు.  33 1/2 వయస్సులో ఆయన సిలువ వేయబడెను;  ప్రభువును శోధించుటకు ఆయన సువార్త సేవను అడ్డగించుటకు ప్రభువును సిలువపై కొట్టి చంపుటకు అందుకు కావలసిన అధికారము 3 1/2 సంవత్సరము సమయము అనగా 42 నెలలు సాతాను దేవుని వద్ద నుండి అనుమతి పొంది ప్రభువు జరిగించవలసిన సిలువ బలియాగమును తనకు తెలియని రీతిగానే దైవప్రణాళికను నెరవేర్చింది.  ఈ విధముగా డంబపు మాటలు పలుకుచూ అనేకులను సంహరించుచున్నది, అనగా ఆత్మీయ జీవితమును పడగొట్టుచున్నది.  ప్రకటన 133, ''దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలి నట్టుండెను; అయితే ఆ చావుదెబ్బ మానిపోయెను గనుక భూజనులందరు మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్య పడుచుండిరి.''  దీనిలో ఈ క్రూరమృగముకున్న చావుదెబ్బ ఏమిటి? అన్న విషయము మనము తెలిసికోవలసియున్నది.  మేకపోతుగా ఉన్నప్పుడు  దీనికి ఒక ప్రసిద్ధి కొమ్ము ఉండెను.  అది క్రీస్తు పునరుత్థానముతో అది విరిగి పోవుట వలన ఆ భాగము చావు దెబ్బగా కనిపించుచున్నది.  ఇది మానిపోయెను గనుక అనగా మరల ఈ మేకపోతు ఘటసర్పముయొక్క బలమును పొంది క్రూరమృగముగా విజృంభించుచున్నది.  క్రీస్తు పునరుత్థానము వలన చావుదెబ్బ తగిలినను ఘటసర్ప బలమును పొంది క్రూరమృగముగా విజృంభించింది.  అట్లే సాతాను దైవ అధికారమును చలాయించి క్రీస్తును శోధించి సిలువకు కొట్టి చంపినను యోహాను 1018లో వలె యేసు ప్రభువు తన ప్రాణము పెట్టుటకును దానిని తిరిగి తీసుకొనుటకును తాను తండ్రి యొద్ద నుండి అధికారమును పొంది మహిమ పునరుత్థానుడాయెను.

        అతడు రాజాధిరాజుతో యుద్ధము చేయునుగాని కడపట అతని బలము దైవాధీనమువలన కొట్టివేయబడును,'' అనుటలో రాజాధిరాజు క్రీస్తు అని మరల ప్రత్యేకముగా చెప్పనవసరత లేదు.  క్రీస్తు ప్రభువుతో క్రూరమృగము యుద్ధము చేయును.  కాని క్రీస్తుయొక్క దైవబలములో దీనియొక్క బలము కొట్టివేయబడి దీని చరిత్ర అంతము అగును.  అందుకే ప్రకటన 1310లో ఈ విషయములో  పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును అని వ్రాయబడియున్నది.

          ప్రియపాఠకులారా!  ఈ విధముగా దానియేలు తన దర్శనములో బాప్తిస్మమిచ్చు యోహాను, క్రీస్తుల చరిత్రను మొదలుకొని ప్రకటనలో చివరిగా రాజాధిరాజైన క్రీస్తు ప్రభువు జరిగించు యుద్ధమునుగూర్చి తన దర్శనములో చూచాడు.  ఈ దర్శనముయొక్క తీవ్రతకు దానియేలుయొక్క శరీరము దెబ్బ తిని జబ్బునపడి కొంతకాలమునకు కోలుకొన్నట్లుగా వ్రాయబడియున్నది.  శోధన అనునది కొంతవరకే  అవతల పరిశుద్ధులకు పవిత్రమైన ఆనందకరమైన  జీవితము లభించును.

        ప్రియపాఠకులారా!  మాచే ప్రచురించబడిన ''ప్రకటన గ్రంథ రహస్యములు ఇప్పుడు మీ చేతిలో . . . ''  మొత్తము చదివిన తరువాత దానియేలు దర్శనము మరల ఒకసారి చదవండి.  ఇంకా సంపూర్ణముగా అర్థమగును.         

3.  డెబ్బది వారములు విధింపబడిన దానిని గూర్చిన దర్శనము

దానియేలు 9:24-27

        ప్రియపాఠకులారా!  దానియేలు 9:24, ''తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనములకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బది వారములు విధింపబడెను.''  ఇందులో డెబ్బది వారములు గూర్చి చెప్పబడినది.  ఈ కాలము ఆయన జనమునకు పరిశుద్ధ స్థలమునకు సంబంధించినది.  ఈ డెబ్బది వారములలో  జరుగవలసిన కార్యము.  1.  తిరుగుబాటు మాన్పుట  2.  పాపమును నివారించుట  3.  దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట  4.  యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుట  5.  దర్శనమును ప్రధానమును ముద్రించుట  6.  అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట.  ఈ విధముగా ఈ కార్యములన్ని ఈ డెబ్బది వారములలోనే జరగాలి.  ఈ కార్యములను గూర్చి ఇప్పుడు ఒకటొకటిగా తెలుసుకొందము.

1.  తిరుగుబాటు మాన్పుట :-  తిరుగుబాటు అనగా నేమి?  దేవుడు ఇలా ఉండాలని ఆజ్ఞ ఇచ్చుట జరిగింది.  ఇందులో భాగముగా - ఆదామునకు మంచి చెడు జ్ఞానమును ఇచ్చు ఫలమును తినవద్దని ఆజ్ఞ యిచ్చుట జరిగింది.  అయితే ఆదాము ఆజ్ఞను మీరి ఆ పండును తినుట జరిగింది.  అనగా దేవుని ఆజ్ఞను వ్యతిరేకించి చేయుటయే తిరుగుబాటు.  దేవుని ఆజ్ఞలను వ్యతిరేకించుట, ఆయనపై తిరుగుబాటు చేయుటయే కదా!  అలాగే మోషే కాలములో పది ఆజ్ఞలను ఇచ్చుట జరిగింది.  దీనితోబాటుగా నిర్గమ ద్వితీయోపదేశకాండములలో అనేక ఆజ్ఞలను వారికి నియమములుగాను, ఆచారములుగాను ఇచ్చుట జరిగింది.  అయితే దానియేలు కాలమునకు అందరు ఆజ్ఞలను మీరి తిరుగుబాటు ధోరణిలో ప్రవర్తించుట జరుగుచున్నది.  ఇశ్రాయేలీయులు చెర పట్టబడి అగ్ర దేశపు రాజులకు బానిసలుగా జీవిస్తున్నారు.  దీనికి కారణము వారు నిజదైవముపై చేసిన తిరుగుబాటని గుర్తించాలి.  ఇటువంటి తిరుగుబాటును అనగా దైవాజ్ఞను మీరి జీవించుటనుబట్టి ఈ డెబ్బది వారముల చరిత్రలో మొదటగా జరగవలసియున్నది.

2.  పాపము నివారించుట :-  ఇందులో ఒక రహస్యము దాగియున్నది.  అదేమిటంటే పాపమును నివారించుట మాత్రమేగాని పాపమును తొలగించుట కాదు.  ''నివారించుట,'' అనుటలో పాపమును జరుగకుండా చూచుటయేగాని ఆపలేము.  అనగా కొంత వరకు పాపము జరుగకుండా ఆపగలము.  అయితే క్రీస్తు ప్రభువు సిలువపై బలియాగము ద్వారా సమస్త పాపములనుండి నరులకు విడుదల కలిగించుట జరిగిందిగాని, . . . ఇందులో ''కాని,'' అనునది ప్రత్యేక గుర్తింపు కలిగియున్నది.  ఎందుకంటే కాని అంటే ఏదో ఒక లోపము ఇందులో ఉన్నది.  సంపూర్ణత్వము ఇందులో లేదు.  క్రీస్తు ప్రభువు తన బలియాగము ద్వారా పాపమునకు పరిహారము చేసాడు.  కాని నరులు ఈ పాప క్షమాపణను  కోరుకొనవలసి యున్నది.  కోరుకొననివారికి క్షమాపణ రాదు.  అలాగే అన్య దేవతల విగ్రహారాధన చేయువారికి దానిని తప్పుగా భావించి తిరిగి క్రీస్తునందు తమ తప్పును ఒప్పుకొంటే వారికి పాపక్షమాపణ లభిస్తుంది.  అనగా వారు అంతవరకు చేసిన అన్యదేవత విగ్రహారాధన అను పాపము నివారింపబడి దానినుండి వారు విడుదల పొందుట జరుగును. అంతేకాని అందరికి కాదని గుర్తించాలి.  ఇది ఈ డెబ్బది వారముల కాలములోనే జరుగవలసియున్నది.  

3.  దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట :-  ప్రతి ఒక్కరు ఈ విషయము తెలిసినవారే!  క్రీస్తు ప్రభువు దోషములను తన రక్తమును సిలువపై చిందించి ప్రాయశ్చిత్తము చేసెనని మనకు తెలుసు.  ఇది కూడా 70 వారముల చరిత్రలోనే జరుగవలసియున్నది.

4.  యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుట :-  దేవుని ఆత్మ నీతి పరిశుద్ధతకు మారురూపము.  క్రీస్తు ప్రభువు దేవుని కుమారునిగా ఈ లోకములో జన్మించి పాప నివారణ, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము జరిగించుట జరిగింది.  ఈయన నీతికి మారు రూపమే.  ఈ నీతి సంబంధమైన క్రీస్తు ప్రభువు నూతన నిబంధన కాలములో కన్యకయైన మరియమ్మ గర్భమున జన్మించి 33 1/2 సంవత్సరములు భూమిపై నీతిని నూతన నిబంధన రూపములో స్థాపించుట జరిగింది.  అటుతరువాత క్రీస్తు ప్రభువు పాప నివారణ కొరకు దోషము నిమిత్తము, ప్రాయశ్చిత్తము చేయుట కొరకు తన ప్రాణమును అర్పించి తిరిగి పునరుత్థానుడై దేవుని కుడి పార్శ్వమున కూర్చునుట జరిగింది.  కాని క్రీస్తు ప్రభువు తన తరువాత దేవుని ఆత్మలో భాగమైన నీతిని బయలుపరచుట జరిగింది.  యోహాను 16:7, ''అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుట వలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్ళినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును.''  ఈ విధముగా పరిశుద్ధాత్మ అను నీతిని గూర్చి క్రీస్తు ప్రభువు ఆదరణకర్తగా బయల్పరచుట జరిగింది.  యోహాను 16:13, ''అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.''  ఈ విధముగా సత్యస్వరూపియైన ఆత్మ అనగా పరిశుద్ధాత్మను క్రీస్తు ప్రభువు  బయల్పరచుట జరిగింది.  అటుతరువాత పెంతెకొస్తు దినమునందు క్రీస్తు ప్రభువుయొక్క అపొస్తలులపై దిగి వచ్చుట జరిగింది.  అపొస్తలుల కార్యములు 2:1-4, ''పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి.  అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను.  మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.''  ఈ విధముగా పెంతెకొస్తు దినము మొదలుకొని యుగాంతము వరకు నీతిని పరిశుద్ధాత్మ రూపము బయల్పరచుట చేయుచున్నది.  ఇలాంటి కార్యము కూడా ఈ డెబ్బది వారముల చరిత్రలోనే జరుగవలసియున్నది.

5.  దర్శనమును ప్రవచనమును ముద్రించుట :-  దర్శనము క్రీస్తు ప్రభువు యోహానుకు ఇచ్చుట జరిగింది. ఇదే ప్రకటన గ్రంథము.  ఈ గ్రంథములో ఉన్నవన్నీ ప్రవచనములే!  ఎందుకంటే ఇది భవిష్యత్తులో జరుగవలసియున్నది.  కనుక జరుగబోవు సంగతులను తెలియజేయుట అనగా భవిష్యత్తును తెలియజేయుట ప్రవచనములు.  యోహానుకు ఈ ప్రవచనములు దర్శనములుగా చూపించుట జరిగింది.  ఈ ప్రవచనములను ముద్రించుట జరుగునని దానియేలుకు చూపించుట జరిగింది.  అయితే ఈ ముద్రింపబడిన వాటిని గొఱ్ఱెపిల్లయైన క్రీస్తు ప్రభువు విప్పుట జరుగునని ప్రకటన గ్రంథములో చదువుకొని యున్నాము.  ప్రకటన 5:1-5, ''మరియు లోపటను వెలుపటను వ్రాతకలిగి, యేడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైయుండువాని కుడిచేత చూచితిని.  మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైనవాడెవడని బలిష్ఠుడైన యొక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని.  అయితే పరలోకమందు గాని భూమిమీదగాని భూమిక్రిందగాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను.  ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు-ఏడువకుము; ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.''  ఈ విధముగా గొఱ్ఱెపిల్లయైన క్రీస్తు ప్రభువు ఈ ముద్రింపబడిన దర్శనములోని ప్రవచనములను విప్పుట జరుగును.  ఈ ముద్రింపబడుట కూడా డెబ్భది వారముల చరిత్రలోనే జరుగునని దానియేలుకు చూపించుట జరిగింది.

6.  అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట :-  లేవీయకాండము 6:16, ''దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతివారును తినవలెను.  అది పులియనిదిగా పరిశుద్ధస్థలములో తినవలెను.  వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను;''  ఇందులో అహరోను అతని సంతతివారు పరిశుద్ధ స్థలములో తినవలెనంటూనే ఆ స్థలము పేరు చెప్పుట జరిగింది.  దీనినే ప్రత్యక్షపు గుడారము అని చెప్పబడినది.  లేవీయకాండము 16:2, ''-నేను కరుణాపీఠముమీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెరలోపలికి ఎల్లప్పుడును రాకూడదని అతనితో చెప్పుము.''  ఇందునుబట్టి ఎవరును అతిపరిశుద్ధ స్థలములో ప్రవేశింప అర్హత కలిగి లేరు.  యాజకునికి మాత్రమే ఈ అవకాశము దేవుడు ఇచ్చుట జరిగింది.  దేవుడు తననుతాను ప్రత్యక్షపరచుకొను స్థలమును హిజ్కియా రాజు కాలమునాటికి సంపూర్ణ నిర్లక్ష్యము చేసినట్లుగా మనము గ్రహించవలసియున్నది.  అందువలన ఇశ్రాయేలీయులలో అనేక అనర్థాలు జరిగినట్లు మనము బైబిలు గ్రంథమందు చదువగలము.  2 దినవృత్తాంతములు 29:1-11, ''హిజ్కియా యేలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యిరువదితొమ్మిది సంవత్సరములు యెరూషలేములో ఏలెను.  అతని తల్లి జెకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా.  అతడు తన పితరుడగు దావీదు చర్యయంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను.  అతడు తన యేలుబడియందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగుచేసి, యాజకులను లేవీయులను పిలువనంపి, తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికీలాగు ఆజ్ఞ ఇచ్చెను-లేవీయులారా, నా మాట ఆలకించుడి; ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్టించి పరిశుద్ధస్థలములోనుండి నిషిద్ధ వస్తువుల నన్నిటిని బయటికి కొనిపోవుడి.  మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడతలు నడచి ఆయనను విసర్జించి, ఆయన నివాసమునకు పెడ ముఖము పెట్టుకొని దానిని అలక్ష్యముచేసిరి.  మరియు వారు మంటపముయొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి, పరిశుద్ధస్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహనబలులను అర్పింపకయు ఉండిరి.  అందుచేత యెహోవా యూదావారిమీదను యెరూషలేము కాపురస్థులమీదను కోపించి, మీరు కన్నులార చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగాచేసెను.  కాబట్టి మన తండ్రులు  కత్తిచేత పడిరి; మన కుమారులును కుమార్తెలును భార్యలును చెరలోనికి కొనపోబడిరి.  ఇప్పుడు మనమీదనున్న ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనస్సులో అభిలాష పుట్టెను.  నా కుమారులారా, తనకు పరిచారకులై యుండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధచేయకుడి.''  ఇందునుబట్టి ప్రతినిత్యము ఆరాధనలతో ఉండవలసిన ప్రాంతమే ఈ పరిశుద్ధస్థలము.  కాని ఇశ్రాయేలీయులు ఈ ప్రాంతమును నిర్లక్ష్యము చేసి దానిని పాడుబడునట్లు చేయుట ద్వారా దేవుని నిర్లక్ష్యము చేయుట జరిగింది.  దీనిని నిర్లక్ష్యము చేసినప్పుడల్లా ఇశ్రాయేలీయులలో అనేక అనర్థములు జరిగించినట్లు తెలియజేయబడినది.

        అలాగే క్రీస్తు ప్రభువు తను సిలువ బలియాగము చేయునపుడు దేవుడు ప్రత్యక్షపరచుకొను స్థలముయొక్క అడ్డతెరను రెండుగా చీల్చి దానిని బహిర్గతము చేయుట జరిగినది.  మత్తయి 27:50-51, ''యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను.  అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్దలాయెను;'' ఇలా క్రీస్తు ప్రభువు తన సిలువ బలియాగ కాలములో అతి పరిశుద్ధస్థలమును ప్రత్యక్షపరచుటకు దానికి ఉన్న తెరను రెండుగా విడదీసి దానిని అందరికి ప్రత్యక్షపరచుట జరిగింది.  దీనినిగూర్చి - హెబ్రీ 9:11-12, ''అయితే క్రీస్తు రాబోవుచున్న మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణ మైనదియునైన గుడారముద్వారా, మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.''  ఈ విధముగా క్రీస్తు ప్రభువు తన స్వరక్తముతో దేవాలయపు తెరను చించుకొంటూ స్వయముగా తన బలియాగ సందర్భములో పరిశుద్ధస్థలములో ప్రవేశించుట జరిగింది.  ఈ విధముగా మేకల, కోడెలవంటి వాటి రక్తముతోగాక తన సిలువ పైన తాను చిందించిన తన రక్తముతోనే ఆయన ప్రవేశించుట జరిగింది.  ఈ విధముగా శుద్ధి చేయుట ద్వారా లేక అభిషేకించుట ద్వారా పాప క్షమాపణ మనకు కలిగినట్లుగా మనము గ్రహించాలి.  హెబ్రీ 9:23-24, ''పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలులవలన శుద్ధిచేయబడవలసియుండెను గాని పరలోక సంబంధ మైనవి వీటికంటె శ్రేష్ఠమైన బలుల వలన శుద్ధిచేయబడ వలసియుండెను.  అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి  హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు  పరలోకమందే ప్రవేశించెను.''  ఈ విధముగా క్రీస్తు ప్రభువు నరుడైన సొలోమోనుచే నిర్మించబడిన దానితోకాక స్వయముగా పరలోకములోని అతి పరిశుద్ధస్థలములో ప్రవేశించుట జరిగింది.  దీనికి మాదిరిగా యెరూషలేములోని దేవాలయములోని తెరను రెండుగా విభాగించి తొలగించుట జరిగింది.  ఈ విధముగా క్రీస్తు ప్రభువు అతి పరిశుద్ధస్థలమును తన రక్తముతో తనే స్వయముగా అభిషేకించుట జరిగింది.   దీనివలననే పాప క్షమాపణ జరిగినట్లుగా మనము గ్రహించాలి.  ఈ చరిత్ర కూడా ఈ డెబ్బది వారములలోనే జరుగవలసియున్నది.

డెబ్బది వారములలో మొదటి ఏడు వారములు :-  ఇక దానియేలు 9:25, ''యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము.  అరువది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులును కందకములును మరల కట్టబడును.''  యెరూషలేము మరల కట్టించవలసిన ఆజ్ఞ ఎందువలన ఏర్పడినది?  ప్రవక్తయైన యిర్మీయా కాలములో దేవుడు డెబ్బది సంవత్సరములపాటు ఇలా యెరూషలేము నాశనము పొందునని చెప్పుట జరిగింది.  2 దినవృత్తాంతములు 36:21, ''యిర్మీయాద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతిదినములను దేశము అనుభవించువరకు ఇది సంభవించెను.  దేశము పాడుగానున్న డెబ్బది సంవత్సరములకాలము అది విశ్రాంతి దినముల ననుభవించెను.''  దీనిని లేఖనముల ద్వారా దానియేలు గ్రహించినట్లుగా మనము చదువగలము.  దానియేలు 9:1-2, ''మాదీయుడగు అహష్వేరోషుయొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయెను.  అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను  యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు, యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తియౌచున్నవని గ్రంథములవలన గ్రహించితిని.''  ఈ విధముగా గ్రహించిన దానియేలు 9:3-23 వరకు అనేక విధములుగా యెరూషలేము పున:నిర్మాణము ఇశ్రాయేలీయుల విడుదలను గూర్చి తన ప్రార్థన విజ్ఞాపనల ద్వారా తండ్రియైన దేవుని అడుగుట  జరిగింది.

        అయితే ఈ యెరూషలేమును నాశనము చేసినది బబులోను రాజైన నెబుకద్రెజరు.  యిర్మీయా 52:12-15, ''అయిదవ నెల పదియవ దినమున, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఏలుబడియందు పందొమ్మిదవ సంవత్సరమున బబులోనురాజు ఎదుట నిలుచు నెబూజరదానను రాజదేహసంరక్షకుల యధిపతి యెరూషలేమునకు వచ్చెను.  అతడు యెహోవా మందిరమును రాజునగరును యెరూషలేములోని గొప్పవారి యిండ్లనన్నిటిని కాల్చివేసెను.  మరియు రాజదేహసంరక్షకుల యధిపతితోకూడ నుండిన కల్దీయుల సేనాసంబంధులందరు యెరూషలేము చుట్టునున్న ప్రాకారములన్నిటిని పడగొట్టిరి మరియు రాజదేహసంరక్షకుల యధిపతియైన నెబూజరదాసు ప్రజలలో కడుబీదలైన కొందరిని, పట్టణములో శేషించిన కొదువ ప్రజలను, బబులోనురాజు పక్షము  చేరినవారిని, గట్టి పనివారిలో శేషించినవారిని చెరగొని పోయెను.''  యిర్మీయా 52:17-28, ''మరియు యెహోవా మందిరములోనుండిన ఇత్తడి స్తంభములను మందిరములోనుండిన మట్లను ఇత్తడి సముద్రమును కల్దీయులు తునలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనునకు గొనిపోయిరి.  అదియుగాక వారు బిందెలను కుండలసు కత్తెరలను గిన్నెలను గరిటెలను యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణము లన్నిటిని గొనిపోయిరి.  మరియు పళ్లెములను ధూపార్తులను గిన్నెలను పాత్రలను, బంగారు వాటిని బంగారునకును వెండివాటిని వెండికిని చేర్చుకొని రాజదేహసంరక్షకుల యధిపతి గొనిపోయెను.  రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లక్రిందనుండిన పండ్రెండు ఇత్తడి వృషభములను గొనిపోయెను.  వీటికన్నిటికున్న ఇత్తడి యెత్తువేయుటకు అసాధ్యము.  వాటిలో ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల యెత్తుగలది, పండ్రెండు మూరల నూలు దాని చుట్టు తిరుగును, దాని దళసరి నాలుగు వ్రేళ్లు; అది గుల్లది.  దానిమీద ఇత్తడి పైపీట యుండెను; ఒక్క పైపీట అయిదేసి మూరల ఎత్తుగలది, పైపీటకు చుట్టు అల్లిన వల అల్లికయు దానిమ్మ పండ్లును ఉండెను; అవియన్నియు ఇత్తడివి.  ఈ స్తంభమునకును ఆ స్తంభమునకును ఆలాగుననే దానిమ్మ పండ్లుండెను.  ప్రక్కలయందు తొంబదియారు దానిమ్మపండ్లుండెను; చుట్టు ఉండిన వల అల్లికమీద దానిమ్మపండ్లన్నియు నూరు.  మరియు రాజదేహసంరక్షకుల యధిపతి ప్రధానయాజకుడైన శెరాయాను రెండవ యాజకుడైన జెఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకొనెను.  అతడు పట్టణములోనుండి యోధులమీద నియమింపబడిన యొక ఉద్యోగస్థుని, పట్టణములో దొరికిన రాజసన్నిధిలో నిలుచు ఏడుగురు మనుష్యులను, దేశ సైన్యాధిపతియగు వానియొక్క లేఖరిని, పట్టణపు మధ్యను దొరికిన అరువదిమంది దేశప్రజలను పట్టుకొనెను.  రాజదేహసంరక్షకుల యధిపతియైన నెబూజరదాసు వీరిని పట్టుకొని రిబ్లాలో నుండిన బబులోను రాజు నొద్దకు తీసికొని వచ్చెను.  బబులోనురాజు హమాతుదేశమందలి రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యూదా వారిని తమ దేశములో నుండి చెరగొని పోయెను.  నెబుకద్రెజరు తన యేలుబడియందు ఏడవ సంవత్సరమున మూడువేల ఇరువది ముగ్గురు యూదులను చెరగొనిపోయెను.''  ఈ విధముగా యెరూషలేములోని దేవాలయముయొక్క పతనము జరిగింది.  అదే సమయములో యిర్మీయా చేత దేవుడు తిరిగి డెబ్బది సంవత్సరముల తరువాత ఇది పునర్నిర్మాణము జరుగునని తెలియజేయబడినది.  దీనిని తిరిగి నిర్మించినావారు జెరుబ్బాబెలు.  జెకర్యా 4:6-7, ''అప్పుడతడు నాతో ఇట్లనెను-జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే; శక్తిచేతనైనను బలముచేతనైననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను.  గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపుదానవు?  నీవు చదునుభూమి వగుదువు; -కృప కలుగును గాక కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసికొని పెట్టించును.''  జెకర్యా 4:8-10, ''యెహోవా వాక్కు మరల నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను- జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసియున్నవి, అతని చేతులు ముగించును, అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీయొద్దకు పంపియున్నాడని నీవు తెలిసికొందువు.  కార్యములు అల్పములై యున్న కాలమును తృణీకరించిన వాడెవడు?  లోకమంతటను సంచారము చేయు యెహోవాయొక్క యేడు నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుటచూచి సంతోషించును.''  ఈ విధముగా యెహోవా దేవుడు జెరుబ్బాబెలు చేత తిరిగి నిర్మించుట జరిగింది.

        కాని మన మూలవచనములో మొత్తము డెబ్బది వారములలో యెరూషలేము తిరిగి నిర్మింపబడునని యిర్మీయా చేత చెప్పించిన ఆజ్ఞ బయలుదేరినది మొదలు అభిషిక్తుడగు అధిపతి వచ్చువరకు ఏడు వారములు.

        ఇంతకి ఈ అభిషిక్తుడగు అధిపతి ఎవరు?  లూకా 4:17-18, ''ప్రవక్తయైన యెషయా గ్రంథము విప్పగా -ప్రభువు ఆత్మ నామీద ఉన్నది  బీదలకు సువార్త ప్రకటించుటకై  ఆయన నన్ను అభిషేకించెను  చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును.''  ఇందులో ఆయన నన్ను అభిషేకించెను అని క్రీస్తు ప్రభువు యెషయా గ్రంథము ద్వారా యెరూషలేము వాసులకు తెలియజేయుట జరిగింది.  ''ఆయన'' అనగా దేవుడు స్వయముగా తన ఆత్మ ద్వారా క్రీస్తు ప్రభువును అభిషేకించుట జరిగింది.  ఎప్పుడు?  క్రీస్తు ప్రభువు బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మమును పొందినప్పుడు ఈ అభిషేకము జరిగినట్లుగా మనము గ్రహించాలి.  లూకా 3:21-22, ''ప్రజలందరును బాప్తిస్మము పొందినప్పుడు యేసుకూడ బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను.  అప్పుడు- నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.''  అపొస్తలుల కార్యములు 4:27-28, ''ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో, వాటి నన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.''  ఈ విధముగా పరిశుద్ధాత్మ క్రీస్తు ప్రభువును అభిషేకించి ఆయనను అభిషిక్తునిగా మార్చి అభిషేకించుటకు అధిపతిగా చేయుట జరిగింది.  ఈ విధముగా యిర్మీయాకు యెరూషలేము తిరిగి నిర్మింపబడును అను ఆజ్ఞ బయలువెళ్లుట మొదలు అభిషిక్తుడు అగు అధిపతి వచ్చువరకు ఏడు వారములు లెక్కగా చెప్పబడినది.

        ఇందునుబట్టి డెబ్బది వారములలో మొదటి ఏడు వారములు యిర్మీయా కాలములో యెరూషలేము తిరిగి నిర్మించుట అను ఆజ్ఞ బయలుదేరినది మొదలు అభిషిక్తుడగు అధిపతియైన మెస్సియా అనగా క్రీస్తు ప్రభువు బాప్తిస్మ యోహాను వద్ద బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడి యెరూషలేమునకు వచ్చు వరకు యున్న కాలము మొదటి ఏడు వారములు.  ఇది జరిగిపోయినది.

డెబ్బది వారములలో అరువది రెండు వారములు :-  దానియేలు 9:25, ''అరువది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులును కందకములును మరల కట్టబడును.''  ఇందులో చెప్పబడిన అరువది రెండు వారములు, ఏడు వారముల తరువాత జరుగవలసినది.  అయితే యెరూషలేము పట్టణమునకు ఒక రాజ వీధి మాత్రమే ఉండునని మనము గ్రహించాలి.  ఎంతటి పట్టణమైన రాజ వీధి ఒక్కటే.  పరమ యెరూషలేమునకు రాజవీధి ఒక్కటే అని, అందులో దేవుని జీవజలముల నది ప్రవహించుచున్నదని ప్రకటన గ్రంథమునందు చెప్పబడియున్నది.  ప్రకటన 22:1-2, ''మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనమునొద్దనుండి ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను.''  ఇందునుబట్టి రాజవీధి ఒక్కటే.  కాని మన మూల వచనములలో ''రాజవీధులు,'' అని చెప్పబడియున్నది.  ఇందునుబట్టి అరువది రెండు వారములలో కట్టబడే రాజవీధులు అనేకము ఉన్నట్లుగా మనకు అర్థమగుచున్నది.  అనగా ఈ అరువది రెండు వారములలో అభిషిక్తుడు పైన చెప్పబడినట్లుగా తిరుగుబాటును మాన్పి, పాపమును నివారించి, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి, యుగాంతము వరకు ఉండవలసిన నీతియైన పరిశుద్ధాత్మను బయలుపరచి అతి పరిశుద్ధస్థలమును అభిషేకించి మరల యెరూషలేము అను సంఘమునకు పునాది వేయుట జరిగింది.  ఈ సంఘమునకు రాజవీధి ఒక్కటే అని మనము ప్రకటన 22:1-2 నందు చదువుకొని యున్నాము.  కాని క్రీస్తు ప్రభువు ఈ యెరూషలేము అను సంఘమును ఏడు సంఘములుగా విడదీసి క్రియ జరిగించినట్లుగా మనము గ్రహించాలి.  అనగా యెరూషలేము సంఘమే కాని అది ఏడు సంఘములుగా ఈ భూమిపై కార్యము జరిగించుచున్నది.  యెరూషలేమునకు రాజవీధి ఒక్కటే కందములు ఒక్కటే కాని క్రీస్తు ప్రభువు దీనిని ఏడు సంఘములుగా విడదీసి ఏడు రాజవీధులను ఏర్పరచుట జరిగింది.  ప్రకటన 1:20, ''ఆ యేడు దీపస్తంభములు ఏడు సంఘములకు దూతలు.  ఆ యేడు దీపస్తంభములు ఏడు సంఘములు.''   ఈ విధముగా ఏడు సంఘములకు ఏడు దూతలను కందకములుగా అనగా రక్షణగా క్రీస్తు ప్రభువు ఏర్పరచుట జరిగింది.  ఈ విధముగా ఏడు చోట్ల సంఘమును ఏర్పరచుట జరిగింది.  ఇవి  1.  ఎఫెసు,  2.  స్ముర్న,  3.  పెర్గము,  4.  తుయతైర,  5.సార్దీస్‌,  6.  ఫిలదెల్ఫియ  7.  లవొదికయ.  ఇలా ఏడు సంఘములు ఆత్మీయరీత్యా ఏడు ప్రాంతములలో నిర్మించుట జరిగింది.  సువార్త కార్యము ద్వారా రాజవీధులను నిర్మించుట జరిగింది.  ఈ విధముగా సంఘము అను పరమ యెరూషలేమును ఏడుగా విభజించి రాజవీధులను, కందకములను నిర్మించుట జరిగింది.  అయితే ఈ సంఘములు నిర్మించిన చోటున అవి ఉండవలసిన అవసరత లేదు.  ఈ సంఘములు ఏడును క్రియలు కలిగిన చోటనే అవి ఉండునని గ్రహించాలి.  ప్రకటన 2:5, ''నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారు మనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము.  అట్లుచేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి; లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును.''  ఇలా మారుమనస్సు పొందక పతనమైన వారి దగ్గర నుంచి ఆ సంఘము అను దీపస్తంభమును తీసివేసి వేరొక చోట దానిని తిరిగి నిర్మించుట జరుగును.  ఇలా యుగాంతము వరకు ఈ అరువది రెండు వారముల కాలములలో జరుగుచూనే ఉండును.  ఇది అరువది రెండు వారముల చరిత్ర.  ఈ చరిత్ర క్రీస్తు ప్రభువు అభిషిక్తుడై అధిపతిగా యెరూషలేమునకు వచ్చినది మొదలు యుగాంతము ముందు వరకు యున్న చరిత్ర.  ఇది కొంత జరిగింది ఇప్పుడు జరుగుచున్నది.  ఇక మీదట యుగాంతము ముందు వరకు జరుగుచూనే ఉండును.  ఇలా అరువది రెండు వారములు జరుగును.

        ఇలా యుగాంతమునకు ముందు వరకు 7 ష 62 వ 69 వారములు గడుచును.  ఈ విధముగా సంఘము తిరిగి నిర్మింపబడును.  కనుకనే రాజవీధులు కందములు అని బహువచనముతో ఈ వచనము వ్రాయుట జరిగింది.  తిరిగి నూతన యెరూషలేమును ఏర్పరచినప్పుడు ప్రకటన 22:1-2లో వలె ఈ రాజవీధులన్ని కూడా ఒకటిగా మారి క్రీస్తుయొక్క రక్షణలో నిర్మింపబడునని గ్రహించాలి.  అయితే నూతన యెరూషలేమును గూర్చిన చరిత్ర మాత్రము ఈ ఏడు మరియు అరువది రెండు వారములలోని చరిత్ర కాదు.  ఇది అటుతరువాత ఆత్మల రాజ్యములో చివరగా వచ్చు చరిత్ర.  ఈ నూతన యెరూషలేము చరిత్రకు డెబ్బది వారముల చరిత్రకు అసలు సంబంధము లేదు.  అయితే భూలోక యెరూషలేమును పునర్నిర్మించి దానిని ఏడు సంఘములుగా విభజించి దానిని నిర్మించబోవుచున్నట్లుగా దానియేలుకు తెలియజేయుట జరగింది.  ఈ విధముగా అరువది తొమ్మిది వారములు గడచిపోవుట జరుగును.

        అటుతరువాత చివరి ఒక వారము వచ్చును.  దానియేలు 9:26, ''ఈ అరువది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమియు లేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును.  వచ్చునట్టి రాజుయొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును.  మరియు యుద్ధకాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను.''  ఇందులో, ''అభిషిక్తుడు నిర్మూలము చేయబడును,'' అని వ్రాయబడుటనుబట్టి క్రీస్తు ప్రభువు నిర్మూలన చేయబడునా?  ఈ అర్థము ఇందులో వర్తించదు.  క్రీస్తు ప్రభువు ఏర్పరచిన సిద్ధాంతములను తొలగించి పూర్తిగా నాశనము చేయుట క్రీస్తును నాశనము చేయుటతో సమానమే కదా!  ఎలాగంటే, క్రీస్తును అనుసరించి నడుచువారు క్రీస్తుతో సమానమే.  1 కొరింథీ 11:1, ''నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.''  గలతీ 2:20, ''నేను క్రీస్తుతో కూడ సిలువవేయబడి యున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు.''  ఈ వచనములనుబట్టి క్రైస్తవులు క్రీస్తుకు ప్రతిరూపమని గ్రహించాలి.  అలాగే క్రైస్తవులలోని క్రైస్తవ్యమును అనగా క్రీస్తు సిద్ధాంతములను తొలగించుట అభిషిక్తుని అనగా వారిలోని క్రీస్తును తొలగించుటయే.  ఇలా ప్రతి ఒక్కరిలోని క్రీస్తు ప్రభువును తొలగించి అందరిని నాశన మార్గములో నడిపించుట అభిషిక్తుడు నిర్మూలము గావింపబడినట్లే అగునని గ్రహించాలి.  అంతేకాని అభిషిక్తుడైన క్రీస్తు ప్రభువు నాశనమగునని లేక నిర్మూలము గావింపబడునని కాదు.  చివరి వారములో క్రీస్తు ప్రభువుయొక్క అన్ని సిద్ధాంతములు తొలగించబడి సమస్త జనులు నాశన మార్గములో తమలో ఉంచుకొనవలసిన క్రీస్తును వ్యతిరేకించి దూరముగా అన్య దేవతారాధకులుగా మారుదురని గ్రహించాలి.  ఇలా ప్రతి ఒక్కరు మారుట వలన ఈ భూమిపై క్రీస్తు ప్రభువునకు స్థానము లేకుండా పోవునని గ్రహించాలి.  ఇందుకుగాను సాతాను అబద్ధ ప్రవక్త ప్రేరణతో క్రూరమృగముయొక్క రూపములో అనేక అద్భుతములు చేస్తున్నట్లుగా మనము బైబిలు గ్రంథమునందు చదువగలము.  ప్రకటన 13:11-15, ''మరియు భూమిలోనుండి మరియొక క్రూరమృగము పైకివచ్చుట చూచితిని.  గొఱ్ఱెపిల్ల కొమ్మువంటి రెండు కొమ్ములు దానికుండెను; అది ఘటసర్పమువలె మాటలాడుచుండెను; అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధికారపు చేష్టలన్నియు దాని యెదుట చేయుచున్నది; మరియు చావుదెబ్బ తగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది.  అది ఆకాశము నుండి భూమికి మనుష్యులయెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది.  కత్తి దెబ్బ తినియు బ్రదికిన యీ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనలవలన భూనివాసులను మోసపుచ్చుచున్నది.  మరియు ఆ మృగముయొక్క  ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను.''  ఈ విధముగా సాతాను క్రూరమృగము రూపములో సూచక క్రియలు చేసి తన విగ్రహములైన అన్య దేవతల రూపములో మాట్లాడుచు ఆకాశమునుండి అగ్ని దిగి వచ్చినట్లు చేయుచు భూమిపై నివసించి ప్రతి ఒక్కరిని మోసపరచి వారిలోని క్రీస్తును నిర్మూలన చేయునని గ్రహించాలి.    దీనికి లొంగక ఉన్నవారిని అది హతము చేసి, వారిని భూమిపై బ్రతుకనియ్యకుండా చేయుట ద్వారా ఈ భూమిపై క్రీస్తు ప్రభువును విశ్వసించువారు ఇక ఉండరు.  ఇది డెబ్బది వారములలో చివరి వారమున జరుగునది.  ఈ విధముగా అరువది రెండు వారములు గడిచిన పిమ్మట అనగా 7 ష 62 వ 69 వారములు గడిచిన పిమ్మట పై కార్యములు సాతాను, క్రూరమృగము రూపములో జరిగించుట చేయును.  ఈ విధముగా భూమిపై  క్రీస్తును పోలినవారు క్రీస్తును ధరించి క్రీస్తు ప్రతిరూపముగా జీవించువారు అసలు ఉండరు.  ఈ విధముగా నరులలోని క్రీస్తును అనగా అభిషిక్తుని నిర్మూలము చేయుట జరిగించును.

        ''వచ్చునట్టి రాజుయొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు,'' అని అనుటలో ఈ రావలసిన రాజు క్రూరమృగమే.  ఈ రాజు యుగాంతములో అనగా చివరి ఒకటవ వారములో వచ్చును.  వచ్చీరాగానే క్రీస్తుకు సంఘమునకు చెందిన ఇద్దరు సాక్షులను వధించును.  ప్రకటన 11:7, ''వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములోనుండి వచ్చు క్రూరమృగము  వారితో యుద్ధముచేసి జయించి వారిని చంపును.''  ప్రకటన 13:1-2, ''మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని.  దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను.  నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను.  దాని పాదములు ఎలుగుబంటి  పాదములవంటివి, దాని నోరు సింహపునోరువంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను.''  కనుక ఈ వచ్చునట్టి రాజు క్రూరమృగమే.  ఈ రాజుయొక్క ప్రజలు విజృంభించి పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు.    ప్రకటన 13:6-7, ''గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోకనివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను.  మరియు పరిశుద్ధులతో యుద్ధముచేయను వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను.  ప్రతి వంశముమీదను ప్రతి ప్రజ మీదను ఆ యా భాషలు మాటలాడువారిమీదను ప్రతి జనముమీదను అధికారము దానికియ్యబడెను.''  ఈ విధముగా పరిశుద్ధులను జయించి ప్రకటన 13:15లో వలె తన ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతమార్చుట ద్వారా దేవుని   పరిశుద్ధ ఆలయమును నశింపజేయుచున్నట్లుగా మనము గ్రహించాలి.  అనగా దేవుని పరిశుద్ధ ఆలయము పరిశుద్ధులతో నిండియుండును.  పరిశుద్ధులు లేకపోవుట ఆలయమును నశింపజేయుటతో సమానమని గ్రహించాలి.  అందుకే క్రీస్తు ప్రభువు తన సంఘములకు వ్రాయు లేఖలో పరిశుద్ధులుగా మీరు మారకపోతే ఈ సంఘమును అక్కడ నుండి తీసివేసి వేరొక చోటుకు మార్చుదునని చెప్పుట జరిగింది.  ప్రకటన 2:5, ''నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారు మనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము.  అట్లుచేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి; లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును  దాని చోటనుండి తీసివేతును.''  అలాగే క్రూరమృగము విజృంభించి నలుబది రెండు నెలల సాధారణ కాలములో సమస్త పరిశుద్ధులను హింసించి వారిని హతమార్చి వేయును.  కనుక పరిశుద్ధులు ఇక భూమిపై ఉండరు.  ఈ విధముగా పరిశుద్ధులు లేకుండా దేవుని ఆలయము అక్కడ ఉండదు.  ఈ విధముగా ఈ వచ్చునటువంటి రాజు అతని ప్రజలు సమస్తమును నాశనము చేయుట జరుగును.

        కాని, ''వాని అంతము హఠాత్తుగా వచ్చును.'' అని అనుటలో ఎప్పుడైతే దేవుని పట్టణము పవిత్ర ఆలయము నాశనము అయిపోతుందో ఈ భూమి అందులోని జనులు ఇక ఉండవలసిన అవసరత లేకుండా పోవును.  కనుక క్రీస్తు ప్రభువు ముద్రల ద్వారా, బూరల ద్వారా, పాత్రలు కుమ్మరించుట ద్వారా ఈ భూమిని వానిలోని సమస్తమును నాశనము జరిగించును.  ఇక మిగిలినవారితో సాతాను ప్రేరణ ద్వారా క్రూరమృగము అబద్ధ ప్రవక్త భూరాజులు కలసి క్రీస్తుపై యుద్ధము జరిగించి తమ పతనమును అగ్నిగుండములో పొందురని గ్రహించాలి.  ప్రకటన 19:19-21, ''మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.  అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనినవారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.  కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్నవాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.''  ఈ విధముగా యుద్ధకాలాంతము వరకు నాశనము కొనసాగుచూనే ఉండునని గ్రహించాలి.

        దానియేలు 9:27, ''అతడు ఒక వారమువరకు అనేకులకు నిబంధనను స్థిరపచును; అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించువరకు ఈలాగున జరుగును.''  ఇందులో ఒక వారములో మొదట - అనేకులకు నిబంధనను స్థిరపరచుట జరుగును.  నిబంధన అనగా క్రీస్తు ప్రభువు చెప్పిన అజ్ఞలు.  అవి రెండు - మార్కు 12:28-31, ''శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి-ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగెను.  అందుకు యేసు-ప్రధానమైనది ఏదనగా-ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు.  నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ.''  ఇది నిబంధన.  దీనితోబాటుగా లూకా 22:14-20, ''ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతోకూడ అపొస్తలులును పంక్తిని కూర్చుండిరి. అప్పుడాయన-నేను శ్రమపడకమునుపు మీతో కూడ ఈ పస్కాను భూజింపవలెనని మిక్కిలి ఆశపడితిని.  అది దేవుని రాజ్యములో నెరవేరువరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి-మీరు దీనిని తీసికొని మీలో పంచుకొనుడి; ఇకమీదట దేవుని రాజ్యము వచ్చువరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాననెను.  పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, వారి కిచ్చి - ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను.  ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని-ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన.''  ఇదే క్రొత్త నిబంధన.  ఈ నిబంధనను అనేకులలో స్థిరపరచుట చివరి వారములో జరుగును.  ఏ విధముగా?  ప్రకటన 11:3-6, ''నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు.  వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు.  ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించినయెడల వారి నోటనుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హానిచేయ నుద్దేశించినయెడల ఆలాగున వాడు చంపబడవలెను.  తాము ప్రవచింపు దినములు వర్షము కురువ కుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు.  మరియు వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును, నానావిధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు.''  ఈ విధముగా వారు ఈ నిబంధనను స్థిరపరచుట చేయుదురు.  అటుతరువాత - ప్రకటన 11:7, ''వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములోనుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధముచేసి జయించి వారిని చంపును.''  మరియు ప్రకటన 13:7 మరియు ప్రకటన 13:15లో వలె క్రూరమృగము పరిశుద్ధులను నాశనము చేయుట ద్వారా చివరి వారములోని మొదట అర్థ వారమునకే బలి నైవేద్యము నిలిపివేయుట జరుగును.  అనగా ప్రభువు నియమించిన క్రొత్త నిబంధనను రొట్టె ద్రాక్షారసముయొక్క బలిని నిలిపివేయుట జరుగును.  ఇది క్రూరమృగము కాలములో జరుగును.  ఇది జరుగునప్పటికి చివరి డెబ్బదివ వారములో అర్థ వారము మాత్రమే జరుగును.  అటుతరువాత క్రూరమృగము హేయమైనవాడుగా దేవుని ఆలయములో తన ప్రతిమలు నిల్పి క్రియ జరిగించునని ప్రకటన 13:11-15లో చదువగలము.  2 థెస్సలొనీక 2:3-4, ''మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనేగాని ఆ దినము రాదు.  ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనియ్యకుడి.''  ఈ విధముగా దేవునికి హేయమైనదైన విగ్రహములు దేవునికి బదులుగా అనగా పరిశుద్ధ పట్టణము పరిశుద్ధ ఆలయములను నాశనము జరిగించి ఆ స్థానములో నిలుపుట జరుగును.  తద్వారా సమస్త మానవాళిని నాశనమార్గములో నడిపించుటకు క్రూరమృగముయొక్క సంఖ్యనుగాని  దానిని 666 సంఖ్యనుగాని ముద్రించుట జరుగును.  ప్రకటన 13:16-17, ''కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొపటియందైనను ముద్ర వేయించుకొనునట్లును, ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది.''  ఈ విధముగా సమస్త జనులను నాశనమునకు సిద్ధపరచునని దానియేలుకు దర్శనములో చూపించుట జరిగినది.  పైన చెప్పినవన్నియు ఈ నాశనము చేయువానికి అనగా సాతాను విశ్వరూపమైన క్రూరమృగముయొక్క అగ్నిగంధకములో జరుగవలసిన నాశనము జరుగువరకు ఈలాగున జరుగవలసి యున్నది.  దానియేలుకు దర్శనరూపములో తెలియజేయుట జరిగింది.

4. దేవుని ఆజ్ఞ తన సేవకుడైన దానియేలుకు తెలియజేయుటకు ముందు - తెలియజేసిన తరువాత ఆత్మల పోరాటము

దానియేలు 10:4-21

        దానియేలు 10:4, ''మొదటి నెల యిరువది నాలుగవతేది నేను హిద్దెకెలను  గొప్ప నది తీరమున ఉంటిని.''  ఇందులో దానియేలు 10:1 ప్రకారము పారసీకరాజగు కోరెషు పరిపాలన కాలములో మూడవ సంవత్సరము మొదటి నెల 24వ తేదీన దానియేలు హిద్దెకెలను నది తీరమున కొందరు మనుష్యులతో కూడా ఉండుట జరిగింది, ఎందుకంటే దానియేలు 10:7లో ''నాతోకూడనున్న మనుష్యులు దాని చూడలేదు,'' అని చెప్పుట జరిగింది.  కను దానియేలు అతనితోబాటుగా మరి కొందరు మనుష్యులు కలసి ఈ నది తీరాన ఉన్నారు.  అప్పుడు . . .

        దానియేలు 10:5, ''నేను కనులెత్తిచూడగా, నారబట్టలు ధరించుకొన్న యొకడు కనబడెను, అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొనియుండెను,'' అని వ్రాయబడుటనుబట్టి దానియేలు కన్నులెత్తి చూడగా మనుష్యుని రూపములో నారబట్టలను ధరించి యొకడు కనబడుట జరిగింది.  ఈ యొకడు ఎవరు?  ఈయన నారబట్టలు ధరించి ఎందుకు కనబడును?  ప్రకటన 19:8, ''మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.''  కనుక  తెల్లని నారబట్టలు పరిశుద్ధుల నీతి క్రియలకు సూచనగా చెప్పబడినది.  కనుక ఈ యొకడు నారబట్టలు ధరించుటనుబట్టి ఇతను పరిశుద్ధుడు నీతికి ప్రతిరూపము అని గ్రహించాలి.

        ఇక, ''అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొనియుండెను,'' అని అనుటలో మేలిమి బంగారు రాజరికమునకు గుర్తు.  అనగా ఈ యొకడు దేవుని ఆజ్ఞ వలన వచ్చినవాడు.  కనుక అతని నడుమున మేలిమి బంగారును కలిగియున్నారు.  ఈ నడికట్టు నడుమునకు కట్టుటనుబట్టి ఇతను కార్యభారము కలిగియున్నట్లుగా మనము గ్రహించాలి.  ఏదైనా ఒక పని చేయువారు వారి పై వస్త్రమును నడుమునకు కట్టుకొనుట సహజము.  అలాగే క్రీస్తు ప్రభువు కూడా తన శిష్యుల కాళ్ళను కడుగుటకు కార్యసిద్ధి పొందినప్పుడు ఒక తువాలును నడుమునకు కట్టుకొనెను.  యోహాను 13:4-5, ''భోజనపంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసికొని నడుమునకు కట్టుకొనెను.  అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొని యున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను.''  కనుక ఈ యొకడు నీతికి మారు రూపము గలవాడైన క్రీస్తు ప్రభువు దేవుని కార్యమును జరిగించుటకు వచ్చినట్లుగా చెప్పబడినది.

        దానియేలు 10:6, ''అతని శరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపువలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములును, అతని భుజములును పాదములును తళతళలాడు ఇత్తడిని పోలియుండెను.  అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె ఉండెను.''  ఇందులో క్రీస్తు ప్రభువు రక్తవర్ణపు రాతివంటి శరీరమును కలిగియున్నాడు.  1 కొరింథీ 10:4, ''అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి.  ఏలయనగా తమ్మును వెంబండించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి;  ఆ బండ క్రీస్తే.''  కనుక రాతి అనగా పునాది బండగా చెప్పబడిన క్రీస్తు శరీరము రక్తవర్ణముగా ఉన్నది.  లూకా 22:44, ''ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్తబిందువులవలె ఆయెను.''  అలాగే సిలువ బలియాగములో కూడా ఆయన శరీరము రక్తముతో నిండి యుండునని మనకందరికి తెలిసిన విషయమే.  కనుక క్రీస్తు ప్రభువును రక్తవర్ణముగల రాతిగా వర్ణించుట జరిగింది.  అందుకే ఆయన శరీరము రక్తవర్ణము వంటిది అని చెప్పుట జరిగింది.  అలాగే క్రీస్తు వెలుగునకు ప్రతిరూపము.  కాని సాతాను చీకటికి ప్రతిరూపము.  కాని సాతాను వెలుగు రూపములో క్రీస్తువలె కనిపించి సాధారణమైన నరులను మోసపుచ్చుట జరుగును.  అయితే ఈ సాతాను వెలుగు లేక చీకటి క్రీస్తు వెలుగు ముందు నిలువలేవు.  క్రీస్తు తేజోమయుడు, కోటి సూర్యులకన్నా ఎక్కువ వెలుగు కలిగినవాడు.  ప్రకటన 21:23, ''ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది  గొఱ్ఱెపిల్లయే దానికి దీపము.''  కనుక గొఱ్ఱెపిల్లయైన క్రీస్తు ప్రభువే పరమ యెరూషలేమను అతిపరిశుద్ధమైన పెద్దదైన పట్టణమునకు దీపము అనగా వెలుగుగా ఉన్నారు.  కనుక వెలుగును తనలో కలిగియున్న క్రీస్తు ప్రభువు దానియేలుకు మెరుపువలె యున్న ముఖము జ్వాలామయమైన దీపములుగా తళతళలాడు ఇత్తడివలె పాదములును భుజములను కలిగి కనబడుచున్నారు.

        అలాగే క్రీస్తు ప్రభువుయొక్క కంఠధ్వని నరుల మాటలవలె వుండెనని చెప్పబడినది.  అనగా క్రీస్తు ఈ లోకములో జన్మించక ముందే దానియేలుకు దర్శనములో హిద్దెకెలను గొప్ప నది ప్రక్కన కనబడుట జరిగింది.  అప్పటికి క్రీస్తు ప్రభువు ఆత్మ రూపములోనే ఉన్నాడు.  ఈ ఆత్మ మాట్లాడుట నరులవలె ఉండునని మనము గ్రహించాలి.  అనగా ఆత్మ నరులవలె మాట్లాడును అనుటకు సాదృశ్యముగా క్రీస్తు ప్రభువుయొక్క మాట నర సమూహపు మాటలవలె యున్నట్లుగా చెప్పబడినది.

        దానియేలు 10:7-8, ''దానియేలను నాకు ఈ దర్శనము కలుగగా నాతోకూడనున్న మనుష్యులు దాని చూడలేదు గాని మిగుల భయక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయిరి.  నేను ఒంటరినై యా గొప్ప దర్శనమును చూచితిని; చూచినందున నాలో బలమేమియు లేకపోయెను, నా సొగసు వికారమాయెను, బలము నా యందు నిలువలేదు.''  దానియేలుకు జరిగినట్లే అపొస్తలుడైన పౌలు విషయములో కూడా జరిగింది.  అయితే దానియేలు దేవునిలో ఉన్నాడు కనుక అతనికి ఏ హాని జరుగలేదుగాని అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు అపొస్తలులను చంపుటకు ప్రయాణమైపోవుచున్నందున అతడు తన కన్నులను పోగొట్టుకొనుట జరిగింది.  అపొస్తలుల కార్యములు 9:3-8, ''అతడు ప్రయాణము చేయుచు దమస్కుదగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను.  అప్పుడతడు నేలమీదపడి-సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.  -ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన-నేను నీవు హింసించుచున్న యేసును; లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను.  అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని యెవనిని చూడక మౌనులై నిలువబడిరి.  సౌలు నేలమీదనుండి లేచి కన్నులు తెరచినను ఏమియు చూడలేక పోయెను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి.''  అయితే తన దర్శనములో ప్రత్యక్షముగా చూచిన దానియేలు పరిస్థితి మనము తెలుసుకొనవలసియున్నది.  దానియేలు 10:9, ''నేను అతని మాటలు వింటిని; అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢనిద్ర పొందినవాడనైతిని.''

        దానియేలు 10:10-11, ''అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అఱచేతులను నేలమోపి నన్ను నిలువబెట్టి -దానియేలూ, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని; నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పుమాటలు తెలిసికొనుమనెను.  అతడీమాటలు నాతో చెప్పగా నేను వణకుచు నిలువబడితిని,'' అని వ్రాయబడుటనుబట్టి దానియేలు దేవుని దృష్టిలో అత్యంత ఉన్నత స్థానమును పొంది ఉన్నట్లుగా అర్థమగుచున్నది.

        దానియేలు 10:12, ''అప్పుడతడు-దానియేలూ, భయపడకుము, నీవు తెలిసికొనవలెనని నీ మనస్సును అప్పగించి, దేవుని యెదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలనుబట్టి నేను వచ్చితిని,'' అని వ్రాయబడుటనుబట్టి దేవుని యెదుట దానియేలు ఏ విధముగా తగ్గించుకొనుట జరిగినది?  ఎప్పుడు తననుతాను దానియేలు తగ్గించుకొనెను?  దానియేలు 9:1-3, ''మాదీయుడగు అహష్వేరోషుయొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయెను.  అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు, యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తియౌచున్నవని గ్రంథములవలన గ్రహించితిని.  అంతట నేను గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట నా మనస్సును నిబ్బరము చేసి కొంటిని.''  ఈ విధముగా దానియేలు తనను తాను తగ్గించుకొని యెరూషలేము అను దేవుని ప్రియమైన పట్టణమును తిరిగి పునరుద్ధరణ కోసము గోనెపట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని దేవుని ముందు తన ప్రార్థన విజ్ఞాపనలతో తనను తగ్గించుకొంటూ దేవుని హెచ్చించి యెరూషలేమును తిరిగి పూర్వ వైభవము ఇయ్యమని కోరుకొనుట జరిగింది.  ఇందులో భాగముగానే తనను తాను తగ్గించుకొన్నాడు.  ఏ విధముగా దానియేలు తనను తాను తగ్గించుకొనుట జరిగింది?  దానియేలు 9:18, ''నీ గొప్ప కనికరములనుబట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతికార్యములనుబట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు.''  ఇలా దానియేలు తాను నీతిమంతుడైన దేవునికి బహు ప్రియుడైనను తననుతాను తగ్గించుకొనుట జరిగింది.

        దానియేలు 10:13, ''పారసీకుల రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములు నన్ను ఎదిరించెను.  ఇంక పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను,'' అని వ్రాయబడుటనుబట్టి పారసీకుల రాజ్యాధిపతి ఎవరు?  అన్న సంగతి మనము తెలుసుకొనవలసియున్నది.  ఇందులో - దానియేలు 10:1, ''పారసీకరాజగు కోరెషు పరిపాలన కాలములో మూడవ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను; గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే; దానియేలు దాని గ్రహించెను; అది దర్శనమువలన అతనికి తెలిసిన దాయెను.''  ఈ రాజు కాలములోనే ఈ దర్శనము దానియేలుకు వచ్చినది.  ఈ రాజు పారసీకుల రాజ్యాధిపతియే.  అయితే ఇరువది యొక్క దినములు దానియేలు ఉపవాసము ప్రార్థనలో ఉన్నంత కాలము, ఈ పారసీకుల రాజ్యాధిపతి దానియేలును నిలువబెట్టిన వానిని అనగా దూతను ఎదిరించుట జరిగింది.  అనగా ఇరువది యొక్క దినములు ఈ దూత ఈ పారసీక రాజుతో పోరాడుట జరిగింది.  ఈ విధమైన పోరాటములో పారసీకుల రాజులు నిలువగా వారి ఎదుట ఈ దూత నిలువగా ఇతనికి సహాయముగా ప్రధాన దూతయైన మిఖాయేలు సహాయము చేయ వచ్చాడు.

        ఇందులో ఒక గొప్ప మర్మము ఉన్నది.  మిఖాయేలు దేవుని దూత.  ఈ దూతకు శరీరరీత్యా మరణము లేదు.  మరి మట్టి శరీరము లేని దూత పారసీక రాజుపై యుద్ధము జరుగుచున్నప్పుడు ఎలా సహాయము చేయ వచ్చెను?  ఇదే ఇందులో ఉన్న రహస్యము.

        దావీదు దేవుని పక్షమున ఉన్న రాజు.  తన జీవితములో దేవుని నుండి తొలగినను తిరిగి తాను నిలువగలిగెను.  అలాగే పారసీకరాజైన కోరెషు, అన్య దేవతలను పూజించు రాజు, దుష్టులైన కఠినులైన రాజులు.  వీరందరు సాతానుకు సంబంధించినవారు.  వీరు మట్టి శరీరమును కలిగిన వారైనను వీరు సాతాను ద్వారా నియమింపబడినవారు.  అనగా వీరి తరపున సాతాను కూడా తన దూతలతో యుద్ధము జరిగించి మారణహోమము జరిగించుట చేయును.  ఇలా కాని యెడల వీరిలో ఇంత ఆవేశము వచ్చు అవకాశము ఉండదు.  ఒక మనిషి నిర్థాక్షిణ్యముగా ఇంకొకరిని నరికి చంపుట ఎంత దారుణమో ఒకసారి గ్రహించవలసి యున్నది.  అలాగే ఈ లోకముపై సాతాను రాజుగా నియమింపబడి యున్నాడు.  ఇదే విషయమును సాతాను క్రీస్తు ప్రభువుతో కూడా చెప్పుట జరిగింది.  లూకా 4:5-7, ''అప్పుడు అపవాది ఆయనను తీసికొనిపోయి, భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి -ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును; కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగునని ఆయనతో చెప్పెను.''  ఇందునుబట్టి సాతాను భూలోక రాజ్యములన్నింటికి అధిపతి.  కనుకనే క్రీస్తు ప్రభువుకు నన్ను మ్రొక్కిన ఈ భూలోక రాజ్యాలన్నింటిని నీకు ఇచ్చి నిన్ను రాజుగా చేయుదునని ఆశ పెట్టుట జరిగింది.  ఇందునుబట్టి ఈ లోక పరిపాలకులను సాతాను తన దూతల సహాయముతో అనేకమంది రాజులుగా నియమించుట చేయును.  వారి ద్వారా తన కార్యములు భూమిపై జరిగించును.  దేవుడు తన ప్రవక్తలు, బోధకులు, సేవకుల ద్వారా కార్యములు జరిగించును.  ఇలా ఈ నరులను రెండు రకములుగా విభజించి కార్యములను జరుపుచున్నారు.  ఈ లోకరీత్యా మనము ఈ కార్యములన్ని మనమే చేయుచున్నట్లుగా అనుకోవచ్చును.  కాని మన వెనుక ఉండి అదృశ్య రూపములో మనలను నడిపించు రెండు వర్గములు ఉన్నవి.  వారు 1. సాతాను, అతని దూతలు  2.  దేవుడు, అతని దూతలు.  వారు వారివారి సంబంధులతో కార్యములు జరిగించుదురు.

        ఈ దర్శనములో దానియేలు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు.  దానియేలు కోరిక మేర అతనికి తెలియజేయుటకు దేవుని నుండి ఆజ్ఞను పొంది  ఒక దూత వచ్చింది.  దానియేలు పారసీక రాజుయైన కోరెషు పరిపాలనలో పరదేశిగా ఉన్నాడు.  అంటే దానియేలు ఉన్న ప్రాంతము పైన రాజు శరీరరీత్యా కోరెషు.  అయితే ఆత్మరీత్యా సాతాను లేక సాతాను నియమించిన అంధకార శక్తులని గ్రహించవలసి యున్నది.  అనగా దానియేలు ఉన్న ప్రాంతము సాతాను లేక సాతాను దూతయొక్క అంధకార శక్తులతో నిండి అందరిని దైవవ్యతిరేకములో నడిపించుచున్నవి.  కనుక దానియేలు ఉపవాన ప్రార్థనతో ఉన్నను ఇరువది యొక్క దినముల వరకు ఆ అవకాశము అతనికి రాలేదు.  దీనికి కారణము పారసీకరాజు అతనిని ఎదిరించాడు.  అయితే సాధారణమైన మట్టి శరీరము ఉన్న కోరెషు రాజైతే దూత చేతిలో అతనికి మృత్యువు ఎంతసేపు?

        కాని ఈ దూతను ఎదిరించినవారు కోరెషును రాజుగా నియమించిన సాతాను గాని లేక అతని అంధకార శక్తులుగాని ఉండును కనుక దేవుని ఆజ్ఞను పొందిన ఈ దూత దానియేలుకు ఆ ఆజ్ఞ లేక వర్తమానమును తీసుకొని వచ్చినప్పుడు సాతాను లేక పారసీక రాజ్యమైన అధిపతిగా సాతానుచే ఏర్పరచబడిన దూత అతనిని ఎదిరించి ఇరువదిఒక్క దినముల వరకు పోరాడుచూనే ఉన్నాడు.  అనగా దేవుని ఆజ్ఞ లేక వర్తమానము దేవుని నుండి పొందిన ఈ దూత దానియేలుకు తెలియజేయుటలో ఇరువది యొక్క దినముల ఆలస్యము జరిగింది.  దీనికి కారణము ఈ దూతను అంధకార శక్తులు ఎదిరించుటయే అని మనము గ్రహించాలి.  ఈ సందర్భములో మిఖాయేలు మాత్రమే అతనికి సహాయము చేసినట్లుగా మనము గ్రహించాలి.  అందుకే అపొస్తలుడైన పౌలు ఈ విధముగా తన లేఖలో వ్రాసి యున్నాడు.  ఎఫెసీ 6:12, ''ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండల మందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.''  

        ఏ విధముగా మనము పోరాడుచున్నాము?  ఎఫెసీ 6:10-11, ''తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి.  మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.''  ఎఫెసీ 6:13-18, ''అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.  ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువబడుడి.  ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.  మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి.  ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి.''  ఇదే పనిని దానియేలు కూడా చేస్తున్నాడు.  దానియేలు ప్రార్థన విజ్ఞాపనలతో ప్రతి సమయమందు తనను తాను దేవుని ముందు తగ్గించుకొని ప్రార్థిస్తున్నాడు.  తద్వారా దేవుని దూతలు దేవుని నుండి ఆజ్ఞను తీసుకొని బయలుదేరి ఆ దాసునికి తెలియజేయుటకు బయలుదేరినప్పుడు సాతాను అతని దూతలు అడ్డగింపగా మిఖాయేలు అను ప్రధాన అధిపతియొక్క సహాయముతో ఆ దూత మనము ప్రార్థన విజ్ఞాపనలతో ఉండగా వారు సాతాను, అతని దూతలతో పోరాటము జరిగించుట చేయుదురు.  ఈ విధముగా జరుగునప్పుడు సాతాను సర్వశక్తులు ఒడ్డి వారిని నివారించుటకు దేవుని నుండి బయలుదేరిన ఆజ్ఞను చేరనియ్యకుండా చేయుటకు అనగా దైవ సేవకునికిని తెలియనియ్యకుండుటకు పోరాటము జరుపును.  ఈ పోరాటములో మన పక్షముగా మిఖాయేలు పోరాడి దేవుని నుండి వచ్చిన దూత మన యొద్దకు వచ్చుటకు సహాయము చేయును.

        ఈ విధముగా మిఖాయేలు యుద్ధము జరిగించుచుండగా దానియేలు వద్దకు దేవుని ఆత్మయైన క్రీస్తుయొక్క ప్రత్యక్షతతో ఆ దూత వచ్చి దానియేలుకు సంగతులను వివరించుట జరుగుచున్నది.  ఈ విధముగా మనకు తెలియకుండానే మన పక్షమున కొందరు మనకు విరోధముగా కొందరు పోరాటము ఆత్మరీత్యా జరిగించుట జరుగును.

        దానియేలు 10:14, ''ఈ దర్శనపు సంగతి ఇంక అనేకదినములవరకు జరుగదు; అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయ వచ్చితినని అతడు నాతో చెప్పెను.''  దానియేలు 10:15-19, ''అతడీమాటలు నాతో చెప్పగా నా ముఖము నేలకు వంచుకొని మౌనినైతిని.  అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నాయెదుట నిలిచియున్న వానితో ఇట్లంటిని-నా యేలినవాడా, యీ దర్శనమువలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను, నా యేలిన వాని దాసుడనైన నేను నా యేలినవానియెదుట ఏలాగున మాటలాడుదును?  నా బలము తొలగిపోయెను, ఊపిరి విడువలేక యున్నానని చెప్పగా అతడు మరల నన్ను ముట్టి నన్ను బలపరచి-నీవు బహు ప్రియుడవు భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకొమ్ము.  ధైర్యము తెచ్చుకొమ్మని నాతో చెప్పెను.  అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యము తెచ్చుకొని-నీవు నన్ను ధైర్యపరచితివి గనుక  నా యేలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితిని.''

        ఈ విధముగా దానియేలు ఆజ్ఞను ఇయ్యమని అడుగగా, ఆ దూత - దానియేలు 10:20, ''అతడు-నేనెందుకు నీయొద్దకు వచ్చితినో అది నీకు తెలిసినది గదా; నేను పారసీకుడగు అధిపతితో యుద్ధముచేయుటకు మరల పోయెదను.  నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశముయొక్క అధిపతి వచ్చును,'' అని చెప్పుట జరిగింది.  కనుక ఆ దూత వచ్చిన పని అయిపోయింది.  తాను చెప్పవలసిన దానిని దానియేలుకు చెప్పింది.  ఇలా చెప్పుటకు వచ్చు మార్గములో సాతానుచే నియమింపబడిన పారసీకరాజైన సాతాను దూతలతో పోరాటము జరిపి వచ్చుట జరిగింది.  ఈ సమయములో దానియేలుయొద్దకు క్రీస్తు ప్రభువు వచ్చుట ద్వారా సాతాను తొలగి ఆ దూత దానియేలును చేరు అవకాశము కలిగింది కనుకనే మొదట క్రీస్తు ప్రభువును దానియేలు చూచాడు.  అటుపిమ్మట ఆ దూత దానియేలును లేపి సమస్తమును వివరించుట జరిగింది.

ఇతని తిరుగు ప్రయాణము :-  దానియేలుకు తెలియజేయవలసినవి క్రీస్తు ప్రభువు రాగా, అతని ప్రధాన దూత, సాతాను దూతలతో యుద్ధము చేయుచుండగా దానియేలుకు ఆ దూత వచ్చి చెప్పుట జరిగింది.  ఇది అవుతుండగనే క్రీస్తు తన సన్నిధికి తిరిగి వెళ్ళిపోవును, ఎందుకంటే తెలియజేయవలసిన దేవుని కార్యము తెలియజేయుట ద్వారా పరిపూర్తి చేయబడినది.  కనుక అక్కడ ఇక క్రీస్తు ప్రభువు  ఉండవలసిన అవసరత లేదు.  కనుక తిరుగు ప్రయాణము ఆ దూతకు ప్రయాసతో కూడినది, ఎందుకంటే పారసీకరాజైన, సాతాను దూతలు (మట్టి శరీరముతో ఉన్న రాజైన కోరెషు కాదు)  ఈ దూతను వెళ్ళనియ్యకుండా అడ్డగించును.  కనుకనే ఈ దూత తనే ముందుగా సిద్ధపడి పారసీకరాజుతో యుద్ధము చేయుటకు బయలు వెళ్ళుచున్నట్లుగా చెప్పుచున్నాడు.  ఆ సమయమందు అనగా ఈ దూత యుద్ధమునకు బయలు వెళ్ళుచుండగానే గ్రేకేయుల దేశముయొక్క అధిపతి పారసీకరాజైన వారితో కలసి ఈ దూతపై యుద్ధము జరిగించునని గ్రహించాలి.  

        ఇలా యుద్ధములు జరుగుచుండగా ఈ దూత దేవుని యొద్ద నుండి పంపబడినను, ఈ దూత పక్షముగా ఒకే ఒక్క దూత సహాయముగా నిలుచునని చెప్పబడినది.  అతనే ప్రధాన దూతయైన మిఖాయేలు.  దానియేలు 10:21, ''అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ యధిపతియగు మిఖాయేలు గాక యీ సంగతులనుగూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడును లేడు.''

        ఉదా :-  ఇండియాలో ఒక దైవసేవకునికి దైవవర్తమానము అందించుటకు లేక ఈ లోకములో జరిగించవలసిన క్రియలను తెలియజేయుటకు దేవుని నుండి ఆజ్ఞను పొందినవారు బయలుదేరి ఆ దైవసేవకుని వద్దకు వచ్చుచున్నట్లైతే - అతనికి మిఖాయేలు సహాయము చేయగా ఈ ఇండియాలో అనగా హిందూదేశములో రాజులైన మంత్రులను నియమించిన సాతాను ఆ మంత్రులకు సహకారులుగా ఉన్న అంధకార శక్తులను ఆ వర్తమానమును ఆ సేవకునికి దరి చేరనీయకుండా అన్ని విధములుగా పోరాటము జరిగించునని గ్రహించాలి.  ఆ సమయములో ఆ సేవకునికి క్రీస్తు దర్శనము కలిగి ఆ వర్తమానమును ఎరిగించి అతనిని బలపరచునని గ్రహించాలి.  అటుతరువాత వారు తిరిగి ప్రయాణమై వెళ్ళుచుండగా ఇండియా లేక హిందూదేశములో రాజులుగా లేక మంత్రులుగా నియమించిన సాతాను లేక వారికి సహాయముగా సాతానుచే ఏర్పరచిన అంధకార శక్తులు ఈ దూతపై పోరాటము మరల జరిగించును.  అప్పుడు కూడా ఈ దేవుని దూతకు ప్రధాన దూతయైన మిఖాయేలు సహాయము అందించునని మనము గ్రహించాలి.  అంతేకాదు, ఇండియా లేక హిందూదేశముపై సాతాను లేక సాతాను ఏర్పరచిన దూతలకు సహాయముగా చుట్టుప్రక్కల ఉన్న రాజ్యములైన పాకిస్తాన్‌, చైనా, బర్మా, బంగ్లాదేశ్‌, శ్రీలంక వంటి దేశాలపైన సాతాను ఏర్పరచిన దూతలు కూడా వీరికి సహకరించి ఆ దూతతో యుద్ధము జరిగించునని మనము గ్రహించాలి. ఈ విధముగా దైవ వర్తమానము ఒక సేవకునికి అందుట జరుగునని ఈ దర్శనములో దానియేలుకు చూపించుట జరిగింది.  కనుక మనము ఎల్లవేళల అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలను ఎఫెసీ 6:10-18 వరకు జ్ఞాపకపరచుకొనుచూ అను నిత్యము ప్రార్థన విజ్ఞాపన వాక్య ధ్యానము పరిశుద్ధత పట్టుదలతో ప్రార్థించవలసిన అవసరత ఉన్నది. ఎందుకంటే మన వద్దకు దేవుని ఆజ్ఞను తీసుకొని బయలుదేరిన దూతలకు సాతాను, అతని దూతలు అడ్డు తగిలి పోరాడుచున్నారు.  వీరిని తప్పించుకొని మన వద్దకు రావలసి యున్నదని గ్రహించి మరి ఎక్కువ పట్టుదలతో మనము ప్రార్థించి దేవుని మహిమపరచ వలసిన అవసరత మనకు ఉన్నది.  ఇలా పరిపూర్ణ పట్టుదల కలిగిన దేవుని వర్తమానము మనకు కొద్ది రోజులలోనే అందునని గ్రహించాలి.

        అయితే దానియేలు దేవుని వర్తమానము అందుటకు ఇరువది యొక్క దినములు పట్టింది.  ఈ దినములలో దేవుని వర్తమానము అందించుటకు వచ్చిన దూత ఖాళీగా కూర్చుని యుండలేదు.  ఈ వర్తమానము మనకు అందనియ్యకుండా పోరాడుచున్న సాతాను, అతని దూతలతో యుద్ధము జరిగించుచున్నాడు.  కనుకనే దేవుని వర్తమానము దానియేలుకు అందుటకు ఇరువది యొక్క దినములు పట్టింది.  కనుక దేవుని నుండి మనకు వర్తమానము అందలేదని బాధపడక, పరిపూర్ణ పట్టుదలతో ప్రార్థించి మరింత ఎక్కువ ప్రార్థన విజ్ఞాపన తగ్గింపు స్వభావము జరిగించవలసిన అవసరత ఉన్నదని ఈ దర్శనమునుబట్టి మనము గ్రహించాలి.

5. మహా ఆపద, పునరుత్థానము మరియు తీర్పును గూర్చిన దర్శనము

దానియేలు 12:4-21

        దానియేలు 12:1, ''ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును.  అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.''  ఇందులో - ''నీ జనులు రాజ్యముగా కూడిన కాలము,'' అని అనుటలో ఇశ్రాయేలీయుల ఎన్నిక యాకోబుతో మొదలైనప్పటికిని వారి ఎన్నిక యాకోబు తల్లియైన రిబ్కా గర్భముతో ఉండగానే జరిగినట్లుగా మనము గ్రహించాలి.  ఆదికాండము 24:60, ''వారు రిబ్కాతో మా సహోదరీ, నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా''  అలాగే ఆదికాండము 25:22-23, ''ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగులాడిరి గనుక ఆమె -ఈలాగైతే నేను బ్రదుకుట యెందుకని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగ వెళ్లెను.  అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను-  రెండు  జనములు నీ గర్భములో కలవు.  రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును.  ఒక జనపదముకంటె ఒక జనపదము బలిష్టమై యుండును.  పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.''  ఈ విధముగా నీ జనులు అనగా దేవుడైన యెహోవాయొక్క జనులుగా రిబ్కా గర్భములోనే ఎన్నికైనట్లుగా చెప్పబడినది.  కాని ఈ జనముయొక్క ఎన్నిక రిబ్కాకు ఇస్సాకుతో వివాహమునకు ఎన్నిక చేయబడినప్పుడే వారి ఎన్నిక జరిగినను, యొర్దానులో 12 రాళ్ళు పునాదులుగా వేయబడుట ద్వారా ఈ జనమును ప్రతిష్టించినట్లుగా మనము గ్రహించాలి.  యెహోషువ 4:8.  ఈ విధముగా ఎన్నిక చేయబడిన కాలము మొదలు యీ కాలము వరకు అనగా దానియేలు ఈ దర్శనము చూచిన కాలము వరకు అని అర్థము.  అయితే దేవుని జనుల పక్షమున ఆ కాలము అనగా యుగాంతములో జరుగు ఆపదలో మిఖాయేలు వచ్చునని చెప్పబడినది.  ఈ విధముగా మిఖాయేలు దేవుని జనుల పక్షముగా నిలిచినప్పుడు జరుగు ఆపద గూర్చి చెప్పబడినది.  ఈ ఆపదను గూర్చి - ప్రకటన గ్రంథములో చదువగలము.  ప్రకటన 19:17-21, ''మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచియుండుట చూచితిని.  అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి-రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరియొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను.  మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.  అప్పుడా మృగమును, దానియెదుట సూచకక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనినవారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.  కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.''  ఇందులో గుఱ్ఱము మీద కూర్చున్న క్రీస్తు ప్రభువునకు సేనకు నాయకునిగా ఆయన జనుల పక్షముగా నిలువబడు మిఖాయేలును దానియేలు తన దర్శనములో చూస్తున్నాడు.  అనగా యుగాంతములో జరుగు యుద్ధము మహా ఆపదగా దానియేలు తనలోని దైవజ్ఞానముతో వర్ణించుట జరిగింది.  ఇది నిజమే, ఎందుకంటే ఈ ఆపద తరువాత ఇక భూమిపై నరమాత్రులు జీవించు అవకాశము లేదు.  ఆ విధముగా ఈ ఆపద సంభవించును.  ఇటువంటి ఆపద దైవజనాంగము ఎన్నిక చేసినది మొదలు దానియేలుకు ఈ దర్శనము కలిగినంతవరకు సంభవింపలేదని తెలియజేస్తూనే ఈ ఆపదలోని ప్రభావమును తెలియజేయుచున్నాడు.

        ఇక, ''అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు,'' అని వ్రాయబడుటనుబట్టి యెహోవా పై విధముగా ఇశ్రాయేలీయులను తన జనాంగముగా ఎన్నిక చేసుకొనుట జరిగింది.  ఈ జనులలో గ్రంథమునందు దాఖలైనవారు ఎవరు?  వారినిగూర్చి మనము ఎప్పుడైన ఆలోచించామా?

        ప్రకటన 7:4-8, ''మరియు ముద్రింపబడినవారి లెక్క చెప్పగావింటిని.  ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడినవారు లక్ష నలువది నాలుగు వేలమంది.  యూదా గోత్రములో ముద్రింపబడినవారు పండ్రెండువేలమంది.  రూబేను గోత్రములో పండ్రెండు వేలమంది, గాదు గోత్రములో పండ్రెండు వేలమంది, ఆషేరు గోత్రములో పండ్రెండు వేలమంది, నఫ్తాలి గోత్రములో పండ్రెండు వేలమంది, మనష్షే గోత్రములో పండ్రెండు వేలమంది, షిమ్యోను గోత్రములో పండ్రెండు వేలమంది, లేవి గోత్రములో పండ్రెండు వేలమంది, ఇశ్శాఖారు గోత్రములో పండ్రెండు వేలమంది, జెబూలూను గోత్రములో పండ్రెండు వేలమంది, యోసేపు గోత్రములో పండ్రెండు వేలమంది, బెన్యామీను గోత్రములో పండ్రెండు వేలమంది ముద్రింపబడిరి.''  వీరందరు ఇశ్రాయేలీయుల గోత్రములలో నుండి గ్రంథములో దాఖలైనవారు.  వీరు మాత్రమే తప్పించుకొన వీలు అగును.  మిగిలినవారికి తప్పించుకొన వీలు కలుగదు.  అనగా యుగాంతములో వీరు ఈ ఆపద పొందవలసి    యున్నది.  ఇంతకి వీరు పేరులను దాఖలైన అనగా వ్రాయబడిన గ్రంథము ఏది?  ప్రకటన 20:15, ''ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్నిగుండము''  కనుక ఈ గ్రంథము గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమే.  ఈ గ్రంథములో వీరు వీరి పుట్టుకతోటే అందరిలాగానే నమోదు చేయబడినవారు.  ప్రకటన 3:5, ''జయించు వాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును;  జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.''  ఇందునుబట్టి వీరు వీరి పుట్టుకతోనే దానియేలు తన దర్శనములో చూచిన జీవగ్రంథము నందు నమోదు చేయబడి వారి కార్యములు పరిపూర్ణమైనవి కనుక వారి పేరు అందులో నుండి తుడిచిపెట్టక అలాగే ఉంచుట వలన ఈ 1,44,000 మంది రాబోవు ఆపద నుండి తప్పించుకొనుట జరుగును.  ఈ ఆపద రెండు రకములుగా ఉన్నట్లుగా నేను గమనించాను.  దానియేలు అనుకొన్నట్లుగా దేవుడు ఇశ్రాయేలీయులను ఎన్నుకొన్నప్పటి నుండి దానియేలు దర్శనము చూచినంత వరకు ఇంత గొప్ప ఆపద జరుగలేదు.  ఈ ఆపద యుద్ధముగా జరుగును.  ఇది ఖచ్చితమే.  సాతాను తన దూతలతో నరులను భూరాజులను ప్రకటన 9:19-22లో వలె ప్రేరేపించి రాజాధిరాజైన క్రీస్తు ప్రభువుపై యుద్ధమునకు ప్రేరేపించి వారి  సంపూర్తి నాశనమునకు కారణమగును.  అలాగే యుగాంతములో ముద్రల ద్వారా, పాత్రలు కుమ్మరించుట ద్వారా అనేక నాశనకర కార్యములు జరుగునని మనము ప్రకటన గ్రంథములో చదువుకొనియున్నాము.  ఇది జరిగిన తరువాత అంతిమ యుద్ధము జరుగును.  ఇది అన్ని వరుస క్రమములో చాలా స్వల్పకాలములోనే జరుగునని గ్రహించాలి.  అందుకే దానియేలు దీనిని ఆపదగా వర్ణించుట జరిగింది.  ఈ ఆపదను జీవగ్రంథములో నమోదు చేయబడినవారు మాత్రమే తప్పింపబడుట జరుగును.  అటుతరువాత మిగిలినవారిలో అనేకులు ఈ ఆపద కాలములో అనేక హింసలు ముద్రల ద్వారా, బూరల ద్వారా మరియు పాత్రల ద్వారా జరిగి నాశనము పొంది శరీరరీత్యా మరణించుట జరుగును.  ఈ శ్రమల కాలము తరువాత మిగిలినవారు రాజాధిరాజుతో యుద్ధము జరిగించి అందరు మరణించుట జరుగును.  అందుకే దానియేలు ఎన్నటికిని కలుగనంత ఆపద అని వర్ణించుట జరిగింది.

        అయితే జీవగ్రంథములో నమోదు చేయబడినవారు ఈ ఆపద నుండి రక్షింపబడుట జరుగును.  అనగా ఈ శ్రమలనుండి పరిశుద్ధులు అనగా జీవగ్రంథములో నమోదు చేయబడినవారు తప్పింపబడుదురు అనగా వీరు ఈ శ్రమలకన్నా ముందుగానే మరణమును పొందవలసియున్నది.  అందుకే వధింపబడినవారి ఆత్మలు క్రీస్తు ప్రభువును ప్రతీకారము తీర్చమని అడిగినప్పుడు పరిశుద్ధుల లెక్క పూర్తి యగువరకని చెప్పుట జరిగింది.  ప్రకటన 6:9-11, ''ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.  వారు-నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి.  తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్యబడెను; మరియు వారివలెనే చంపబడబోవువారి సహదాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.''  ఇందునుబట్టి ప్రతిదండన అనగా దానియేలు తన దర్శనములో చూచి ఆ మహా ఆపద ఈ వధింపబడిన వారి సహదాసులు, సహోదరులైన పరిశుద్ధుల లెక్క పూర్తి కావలసిన అవసరత ఉన్నది.  కనుక వీరి లెక్క పూర్తిగా అవుట అనగా వీరు అందరు శరీరరీత్యా మరణించవలసిన అవసరత ఉన్నది.  ఇలా వీరి లెక్క పూర్తి అగుట ఎప్పుడు జరుగును?

        ప్రకటన 11:3, ''నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు.''  వీరు దేవుని దూతలుగా భూమిపై వచ్చువారు.  వీరు పరిశుద్ధులు.  వీరు చంపబడాలి.  అటుతరువాత ప్రకటన 13:7, ''మరియు పరిశుద్ధులతో యుద్ధముచేయను వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను.  ప్రతి వంశముమీదను ప్రతి ప్రజమీదను ఆ యా భాషలు మాటలాడువారిమీదను ప్రతి జనముమీదను అధికారము దానికియ్యబడెను.''  ఇందులో క్రూరమృగము పరిశుద్ధులను జయించి వారిని నాశనము చేయుట చేయును.  కనుక క్రూరమృగము కాలము కూడా పూర్తి కావలెను.  అనగా ప్రకటన 13:5, ''డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను.  మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుప నధికారము దానికి ఏర్పాటాయెను.''  ఇలా నలుబదిరెండు నెలల కాలము అనగా 3 1/2 సంవత్సరముల కాలము క్రూరమృగము యొక్క పరిపాలన కూడా పూర్తి కావలెను, ఎందుకంటే ఈ కాలములో కూడా పరిశుద్ధులు ఉన్నారు.  వారి హింస జరుగుచున్నది.  ఇక్కడ కొందరు మహా శ్రమలలో సంఘము ఉండదని చెప్పుచున్నారు.  ఇది వాస్తవమే.  ఇందులో ఎటువంటి తేడా లేదు.  కాని క్రూరమృగము కాలము మహాశ్రమలలోకి రాదని గుర్తించాలి, ఎందుకంటే సాతానుయొక్క చివరి ప్రయత్నమే క్రూరమృగముగా విజృంభణ అనగా సాతాను పరలోకమునుండి త్రోసివేయబడిన తరువాత ఆదికాండము ఏదెను చరిత్రలో అబద్ధ ప్రవక్తగా సర్పమును ఆవరించి అబద్ధములతో ఆది జంటయొక్క పవిత్రతను నాశనము చేయుట జరిగింది.  అలాగే రకరకాల అన్య దేవతల రూపములలోను, అబద్ధ అపొస్తలులుగాను, అబద్ధ బోధకులుగా క్రియ జరిగిస్తూ అనేకుల ఆత్మీయ ఉన్నతిని నాశనము చేయగలిగినాడు.  ఇలా తాను చేయుచున్న ప్రయత్నములలో చివరి ప్రయత్నమే క్రూరమృగముయొక్క ప్రయత్నము.  అటుతరువాత సాతాను చివరి యుద్ధము క్రూరమృగము రూపములో జరిగించి పట్టుబడి అగ్నిగంధకముగల రెండవ మరణమునకు అప్పగింపబడెదరని మనము ప్రకటన 19:20లో చదువుకొనగలము.

        ఎప్పుడైతే క్రూరమృగము పరిశుద్ధులను నాశనము చేసి హింసించి విజయము పొందునో, అంతటితో ప్రకటన 6:9-11లో చెప్పబడిన వారి లెక్క పూర్తి అగును.  అటుతరువాత మహాశ్రమలు మొదలు అగును.  ఇవి మూడు శ్రమలని ప్రకటన 11:14, ''రెండవ శ్రమ గతించెను; ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది.''  మరియు ప్రకటన 9:12, ''మొదటి శ్రమ గతించెను; ఇదిగో మరి రెండు శ్రమలు ఇటుతరువాత వచ్చును.''  ఈ శ్రమలు మహా శ్రమలు.  ఇవి ఐదవ బూరగాను, ఆరవ బూరగాను మరియు ఏడు పాత్రల రూపములో క్రియ జరిగించునని గ్రహించాలి.  ఈ శ్రమలు దేవుని ఉగ్రత వలన వచ్చునవి.  ఇందులో పరిశుద్ధులకు పాలిపంపులు లేవు.  కనుక వారు ఇందులో ఉండరు.  కాని క్రూరమృగము కాలము మహా శ్రమలలోనిది కాదని గ్రహించాలి.  (ఇంకా దీనిపై పూర్తి వివరణతో తెలుసుకోవాలనుకొంటే నాచే విరచితమైన ''ప్రకటన గ్రంథ రహస్యములు - ఇప్పుడు మీ చేతిలో . . . '' అను గ్రంథమును చదువగలరు.

        కనుక ఇంత గొప్ప ఆపద ఎప్పుడు చూడనటువంటి ఆపదను ఆ కాలములోని వారు చూచుట జరుగును.

పునరుత్థానము మరియు తీర్పు :-  దానియేలు 12:2, ''మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.''  

        ఇందులో రెండు రకముల పునరుత్థానమును గూర్చి చెప్పబడినది.  వారు 1.  నిత్యజీవమును అనుభవించుటను  2.  నిత్యముగా హేయులగుటకు లేక నిందపాలగుటకు మేల్కొలుపుట జరుగును.  ఇలా మేల్కొన్న వీరు సమాధులలో నిద్రించుచున్నవారివలె మేల్కొనుట జరుగును.  దానినే పునరుత్థానమని చెప్పబడినది.  ఇలా మేల్కొనిన వారిలో క్రీస్తు బలియాగ కాలములోను యుగాంతము తరువాత ఉన్నారు.  ఇందులో - మత్తయి 27:52-53, ''నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను.  వారు సమాధులలోనుండి బయటికి వచ్చి ఆయన లేచినతరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి.''  వీరందరు పరిశుద్ధులే!  ఇందులో తప్పు చేసినవారు మాత్రమే కాదు.  కనుక వీరు నిత్యజీవము పొందుటకే లేచుట జరిగిందిగాని, నిందపాలగుటకు మాత్రము కాదు.  కనుక వీరు ప్రకటన 14:14, ''మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనపడెను.  మనుష్యకుమారుని పోలిన యొకడు ఆ మేఘముమీద ఆసీనుడైయుండెను  ఆయన శిరస్సు మీద సువర్ణకిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను.''  ఈ విధముగా పరిశుద్ధులు క్రీస్తు కాలములో కొందరు పునరుత్థానము పొంది ప్రకటన 14:4లో వలె గొఱ్ఱెపిల్లయైన క్రీస్తు ప్రభువుతోబాటుగా సంచరించుట జరుగుచున్నది.  ఈనాడు వీరు మరణించినవారి వలె మృతులలోకములో లేరు.  వీరు సజీవులు.

        వీరినిగూర్చి దానియేలు చెప్పుట లేదు.  కాని యుగాంతము తరువాత జరుగు పునరుత్థానమును గూర్చి దానియేలు తెలియజేస్తున్నాడు. ప్రకటన 20:4-6, ''అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను.  మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని.  వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.  ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుకలేదు; ఇదియే మొదటి పునరుత్థానము.  ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు.  ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారము లేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.''  ఇందులో క్రీస్తునందుండి మృతులైనవారు క్రీస్తు కోసము దేవుని వాక్యము కోసము చంపబడినవారు.  అందరు పునరుత్థానము ద్వారా తిరిగి లేచుట జరిగింది.  వీరు క్రీస్తు వెయ్యి సంవత్సరముల పరిపాలనలో భాగస్థులై రాజ్యము చేయుట జరుగును.  వీరందరు నిత్యజీవమును అనుభవించుటకు మేల్కొనినవారని మనము గ్రహించాలి.  ఇక పైన చెప్పబడినవారు కాక మిగిలిన ప్రతి ఒక్కరు కూడా పునరుత్థానము పొందుట జరుగునని దానియేలు గ్రంథము ద్వారా మనకు అర్థమగుచున్నది.  ఈ మిగిలినవారు మేల్కొనినను వీరు నిందపాలగుదురని చెప్పబడినది.  ఏ విధముగా?  వీరు పునరుత్థానము ద్వారా తిరిగి లేచుదురుగాని క్రీస్తు తీర్పులో వీరు శిక్షించబడి తిరిగి పాతాళలోకమున వెయ్యి సంవత్సరముల శిక్ష అనుభవించుటకు త్రోసి వేయబడుదురు.  అటుతరువాత వీరిలో మార్పు గలవారు రక్షింపబడి, మార్పు లేనివారికి రెండవ మరణమను అగ్నిగంధకములలో పడవేయుట జరుగును.  అనగా మారుమనస్సు లేనివాడు పునరుత్థానము పొందినను వానికి నిత్యజీవమైన ఆనందకరమైన పరలోకము లభించదు కనుక వారు బాధాకరమైన స్థితిలో త్రోసివేయుట జరుగును కనుక వీరు నిందపాలగుదురని దానియేలు వ్రాయుట జరిగింది.  (వీటిని గూర్చి ఇంకా బాగా తెలుసుకోవాలంటే నాచే విరచితమైన, ''మరణము తరువాత,'' అను గ్రంథమును చదివి గ్రహించగలరు.)  ఈ విధముగా పునరుత్థానము పొందినవారిలో రెండు భాగములుగా విభజన జరుగును.  మత్తయి 25:31-33, ''తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును.  అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును.''

        మత్తయి 25:34, ''అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి-నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.'' మరియు మత్తయి 25:41, ''అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి-శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.''  ఇలా రెండు రకములనుగూర్చి క్రీస్తు ప్రభువు కూడా తెలియజేయుట జరిగింది.

బుద్ధిమంతులు :-  దానియేలు 12:3, ''బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు.  నీతి మార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.''

        ఇందులో బుద్ధిమంతుడు ఎవరు?  ఎవరైతే నిజదైవమును ఈ లోకములో తెలుసుకొందురో వారు బుద్ధిమంతులు.  ఈ లోకములో సాతాను అనేక దేవుళ్ళ పేర్లతో అనేక విగ్రహములను ఏర్పరచి నిజమైన దేవుడు ఎవరు అనేది తెలుసుకోనియ్యకుండా మానవుని మనస్సును తికమకకు గురిచేయుచున్నది.  వీటిని దాటి విగ్రహములన్ని వ్యర్థమనువారిని గురువుల పేరుతో కట్టిపడేస్తున్నాడు.  వారిని కూడా వ్యర్థమనుకొన్నవారిని దేవుడే లేడని హేతువాద నాస్తిక సిద్ధాంతములతో కట్టిపడేస్తున్నాడు.  ఇలా కాలము గడిచిపోవుచున్నది.  పుట్టినవారు మరణిస్తున్నారేగాని నిజదైవమును తెలుసుకొనలేక చివరకు తమ ఆత్మను నాశన మార్గములోనే ఉంచుకొని నశిస్తున్నారు.  యేసుక్రీస్తునుగూర్చి తెలియనివారు ఈ లోకములో లేరు అని చెప్పవచ్చును.  కాని ఈ లోక నరులు ఆ చెట్టులో మహత్యమున్నది ఆ రాయిలో మహత్యమున్నదని చెప్పిన పోయి మ్రొక్కుదురుగాని నిజమైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అని చెప్పిన నమ్మరు.  ఆయనను ప్రార్థించుటకు వారి చేతులు చాపరు.  దీనికి కారణమేమి?  ఈ లోకములో వీరికి దేవుళ్ళు, దేవతలు అని సాతాను ఏర్పరచినవారు అనేకులు ఉన్నారు.  వారిని పూజించు నరులు యేసును పూజించుటకు ఎందుకు వెనకాడుచున్నారు?  హిందూమత ధర్మము ప్రకారము ముక్కోటి దేవతలు.  వీరిని వారు పూజిస్తారు.  వీరందరి పేర్లు వీరికి తెలుసునా?  వారి చరిత్ర వీరికి తెలుసునా?  వీరు గురువులుగా గౌరవించేవారికి ఈ ముక్కోటి దేవతలు వారి పేర్లు, వారి చరిత్ర తెలుసునా?  ఇలా వీరు ఎవరికి ఎవరు అనునది తెలియకుండానే పూజించుట  ఆశ్చర్యముగా లేదా!  కంటికి కనపడినదంతయు వారికి దైవత్వమే, ఎట్లంటే సూర్యుడు వెలుగు ఇస్తున్నాడు కనుక సూర్యుడు దేవుడు - కాని సూర్యుని సృష్టించిన వాడెవరో వానికి తెలియదు - భూమి సమస్తమును నరులకు ఆహారము అందిస్తున్నది కనుక భూమి దేవత.  భూమిని సృష్టించిన సృష్టికర్త ఎవరో వారికి తెలియదు.  అట్లే పంచభూతాలను ఆరాధిస్తారు.  గ్రహాలకు దండము పెడతారు.  మరీ విచిత్రమేమిటంటే పుట్టలో ఉన్నంతసేపు సర్పము దేవుడే - పుట్టను వదలి వెలుపలికి వచ్చిన సర్పమును కొట్టి చంపందే వారికి నిద్ర పట్టదు.  వేప చెట్టు ఒక దేవత, గోవు ఒక దేవత, ఎద్దు దేవుని వాహనము - వస్తువులను పాడు చేసే ఎలుక కూడా వాహనమే - సమస్త కల్మషమునకు మూలమైన పంది దేవుని అవతారాలలో ఒకటి.  ఈ విధముగా పుక్కిటి పురాణాలతో కాలక్షేపము చేయిస్తూ సృష్టికర్తను గ్రహించకపోవుట.  ఇదంతా సాతాను మాయ!  ఇలాంటి మాయను వీడి ఎవరైతే నిజదైవము క్రీస్తులో ఉన్నదని గుర్తిస్తారో వారు బుద్ధిమంతులని దానియేలు  చెప్పుచున్నాడు.  కనుక ఈ బుద్ధిమంతులు నీతి అనగా క్రీస్తు మార్గమును అనుసరించి క్రీస్తులోని వెలుగును కలిగి క్రీస్తు వలె వారి చరిత్ర కూడా ప్రకాశించునని గ్రహించాలి.  ఇలా వీరు నక్షత్రముల వలె ప్రకాశించుట జరుగును.  అంతేకాకుండా వీరు దేవుని రాజ్యమును పొందుదురు.

        వీరు ఏ మార్గములో అయితే ఉన్నారో పై విధమైన సాతాను మార్గములో ఉన్నవారిని త్రిప్పి నీతి మార్గమైన క్రీస్తు మార్గములో నడిపించినట్లయితే వీరు ఇంకా ఎక్కువ ఉన్నత స్థితిని కలిగియుందురని గ్రహించాలి.  అనగా సాతాను మార్గములో ఉన్నవారు వారి ఆత్మలను నాశన మార్గములో ఉన్నట్లుగా మనము గ్రహించాలి.  ఇలాంటివారిని తప్పించి నిజ దైవమార్గములో రప్పించుట ద్వారా ఆ ఆత్మను మరణమునుండి తప్పించినవారము మనము అగుదుము.  అలా తప్పించుట ద్వారా మనలోని అనేక తప్పులు, తప్పింపబడి వానిలోని తప్పులు అనేకము తొలగింపబడునని గ్రహించాలి.  యాకోబు 5:19-20, ''నా సహోదరులారా, మీతో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరియొకడు అతనిని సత్యమునకు మళ్లించినయెడల పాపిని వాని తప్పు మార్గమునుండి మళ్లించువాడు మరణమునుండి యొక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పి వేయునని తాను తెలిసికొనవలెను.''  ఈ విధముగా పాపములను కప్పివేయబడుట ద్వారా సువార్తను బోధించిన ఈ బుద్ధిమంతుడు సువార్తకు ప్రతిరూపముగా మారును.

        అయితే సువార్తకు ప్రతిరూపమైన సంఘమును దీపస్తంభములుగా వర్ణింపబడినవి.  ప్రకటన 1:20, ''ఆ యేడు దీపస్తంభములు ఏడు సంఘములు.'' సువార్త అను వెలుగును ఆత్మలలో ప్రసరింపజేయు సంఘమును దీప స్తంభముగా వర్ణించుట జరిగింది.  అలాగే బుద్ధిమంతుడు సువార్త అను వెలుగును గ్రహించినవాడై దానిని తనలోనే ఉంచుకొనక మరి కొంతమందికి ఆ వెలుగు చూపి వారికి సువార్తను బోధించి సాతాను మార్గములైన నాశనకర మార్గమునుండి తప్పించుట ద్వారా వారిలో కూడా సువార్త వెలుగును నింపును.  ఇలా బుద్ధిమంతులనుండి సువార్త అను వెలుగు నిరంతరము ప్రకాశించుట జరుగునని మనము గ్రహించాలి.  సువార్తను బోధించు వారినుండి ఎల్లవేళలా ఎలాగైతే సువార్త బయలు వెళ్ళి వేరేవారిని నిజదైవమును తెలుసుకొను మార్గమును చూపునో, అలాగే బుద్ధిమంతుని నుండి సువార్త వెలుగు ఎల్లవేళలా ప్రకాశిస్తూనే ఉండునని మనము గ్రహించాలి.

ముద్రణా యంత్రమును గూర్చిన ప్రవచనము :-  దానియేలు ప్రవచనములు అంత్య కాలములో ముద్రింపబడు వరకు మరుగు చేయబడుట :-  

        దానియేలు 12:4, ''దానియేలూ, నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలమువరకు ఈ గ్రంథమును ముద్రింపుము.  చాలమంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గబ్రియేలను నతడు చెప్పెను.''  దానియేలుకు అనేక దర్శనములు అంత్య కాలమును గూర్చి తెలియజేయబడినవి.  కనుక దానియేలు ప్రవచనములు యుగాంతము పునరుత్థానము తీర్పును గూర్చినవి.  ఇలాంటి ప్రవచనములు మరుగు చేయమని యుగాంతములో ముద్రింపమని చెప్పుట జరిగింది.  కనుక దానియేలు ఈ దర్శనములను వ్రాసి ఎవరికి తెలియజేయక మరుగు పరచుట జరిగింది.  దీనికి కారణమేమి?  అలాగే ప్రకటన గ్రంథమంతయు యుగాంతమునకు సంబంధించినది.  దీనిని మరుగు చేయమని చెప్పబడుట లేదు.  ప్రకటన 1:1-3, ''యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత.  ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను.  అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమునుగూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను.  సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.''  ఇలా మరుగు చేయమని ప్రకటన గ్రంథమునకు చెప్పకపోవుటకు కారణమేమి?

        దీనికి కారణము ఒక్కటే.  అదే దానియేలు ప్రవచనములు దర్శన రూపములో పొందిన కాలము క్రీస్తుకు పూర్వము.  కనుకనే మరుగుచేయమని చెప్పుట జరిగింది, ఎందుకంటే యుగాంతముకన్నా క్రీస్తు అను రక్షకుడు ఈ లోకములో నరుల విముక్తి కొరకు జన్మించుచున్నాడన్న ఆనందముతో జీవించవలసి యున్నది.  అందుకనే - దానియేలుయొక్క గ్రహింపునుబట్టి యుగాంతమునకు సంబంధించిన ప్రవచనములను ముందుగానే చూపించి వ్రాయించినప్పటికిని ఆ కాలము యుగాంతమును గూర్చి చింతింపవలసిన కాలము కాదు గనుక ఆ ప్రవచనములను మరుగు చేయమని చెప్పుట జరిగింది.  అయితే ప్రకటన గ్రంథము యోహానుకు క్రీస్తు మరణానంతరము చూపించి వ్రాయించుట జరిగింది.  క్రీస్తు తరువాత ఇక యుగాంతము మరియు క్రీస్తు రాకడ గూర్చి ఎదురు చూచు దినములు కనుక ఈ ప్రవచనములను ముద్ర వేయవలదని మరుగు చేయవలదని చెప్పకనే వాటిని చదువువాడును, వాటిని గైకొనువారును ధన్యులని చెప్పుట జరిగింది.

        కనుక దానియేలు ప్రవచనములు క్రీస్తు పూర్వమునకు చెందినవి కనుక మరుగుచేయబడినవి అని గ్రహించాలి.  అయితే - ''అంత్య కాలమందు ఈ గ్రంథమును ముద్రింపుము,'' అని అనుటనుబట్టి యుగాంతమునకు ముందు ఈ దానియేలు గ్రంథము ముద్రించుట జరిగింది.  అనగా, ముద్రణా యంత్రము లేని రోజులలోనే గ్రంథము ముద్రించుట జరుగునని ముందుగానే దేవుని ప్రవక్తయైన దానియేలుకు దేవుడు తెలియజేయుట జరిగింది.  అలాగే అంత్యకాలములో ప్రవేశించుటకు సిద్ధముగా ఉన్న మనకు ముద్రణాయంత్రమును కనుగొను జ్ఞానమును దేవుడు దయచేసి మరుగు చేయబడిన దానియేలు ప్రవచనములను తిరిగి వెలుగులోకి తెచ్చి దేవుని ప్రవచనము ప్రకారముగా ముద్రించుట జరిగింది.  ఈనాడు అనేకులు బైబిలు గ్రంథముతోబాటుగా దానియేలు ప్రవచనములు చదువుకొనుచున్నారు.  ఈ విధముగా ముద్రణా యంత్రమును గూర్చి యుగాంత కాలములో ముద్రింపుమని దానియేలు ద్వారా ముందుగానే తెలియజేయుట జరిగింది.  1440లో జొహన్నెస్‌ గుటన్‌బెర్గ్‌ అనే జర్మనీ పౌరుడు అచ్చు యంత్రమును కనుగొని మొట్టమొదటగా బైబిలు గ్రంథమును ముద్రించెను.  

        ఈ విధముగా దానియేలు ప్రవచనము ప్రకారము ముద్రణాయంత్రము కనుగొని మరుగు చేయబడిన దానియేలు గ్రంథమును బైబిలు గ్రంథముతోబాటుగా ముద్రించుట జరిగింది.  

        దానియేలు కాలమున గ్రంథములను తాళ పత్రములపైన చర్మము పైన వ్రాసి వాటిని తాడుతో కట్టి ఒకచోట భద్రపరచేవారు.  అనగా ఇవి శిథిలావస్థకు వచ్చినప్పుడు వాటిని వేరొకరు వేరే తాళ పత్రములపైనగాని, చర్మపు వాటిపైన గాని వ్రాయుట జరిగేది.  ఇలా వ్రాయుటకు రాజుల వద్ద వ్రాతగాళ్ళు ఉండేవారు.  ఆనాడు వీటిని ముద్రించుటకు యంత్రములు లేవు.  కాని దానియేలు తన దర్శనములో ముద్రించుటను గూర్చి వ్రాయుట యుగాంతమునకు ముందు జరుగబోవు విషయముగా మనము గ్రహించాలి.

6.  ప్రపంచమును తిరుగుట - నరులలో పెరుగు తెలివిని గూర్చిన ప్రవచనము

దానియేలు 12:4

        దానియేలు 12:4, ''చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గబ్రియేలను నతడు చెప్పెను.''

        శేఖర్‌రెడ్డి అను నేను 24.03.1935న జన్మించుట జరిగింది.  అప్పటికి ఇండియాకు స్వాతంత్య్రము కూడా రాలేదు.  సుమారు నాకు 18 సంవత్సరముల వయస్సులో నేను నెల్లూరులో ఉపాధ్యాయునిగా ఉద్యోగమును పొందుట జరిగింది.  అప్పటి కాలములో నా స్వంత గ్రామమైన రెడ్డిపాళెం, కొడవలూరు మండలము నుండి నెల్లూరులోని నా నివాసమునకు కాలి నడకనగాని లేక ఎద్దుల బండి పైన వచ్చేవారము.  ఇలా రావటానికి ఐదు లేక ఆరు గంటలు పట్టేది.  అటుతరువాత  కొంత కాలానికి బస్సు సౌకర్యము వచ్చింది.  దీనితో అదే దూరమును ఒక గంటలో వెళ్ళుట జరిగింది.  అలాగే ఈనాడు రైలు, విమానాలు, రాకెట్స్‌ వంటివి కనుగొనుట ద్వారా గుఱ్ఱములు, ఒంటెలు, గాడిదలవంటి ప్రయాణ సాధనాలకు విలువ లేకుండా పోయినది.  ఈనాడు కేవలము 42 గంటలలోపే అమెరికాకు    ఇండియా నుంచి వెళ్ళగలుగుచుండెనంటె ఆశ్చర్యము వేయుట లేదా!  ఈనాడు చంద్రునిలోనికి వెళ్ళి కొన్ని దినములు ఉండి వచ్చుచున్నారంటే ఆశ్చర్యముగా లేదా!  అమెరికాకు కాలి నడకన వెళ్ళగలమా!  ఇది సాధ్యమేనా!  కాని దైవాత్మ ఆవేశితులు క్షణిక కాలములో ఒక ప్రాంతమునుండి మరియొక ప్రాంతమునకు వెళ్ళగలిగినారు.  కనుకనే ప్రయాణ సాధనములు లేని క్రీస్తు మరణానంతరము కొద్ది సంవత్సరములలోనే తోమా ఇండియాకు వచ్చి సువార్తను ప్రచారము చేయుట జరిగింది.  ఇశ్రాయేలు దేశము నుండి ఇండియా ఎంత దూరము?

        ఈనాడు నరుడు దైవాత్మ సహాయము ద్వారా ప్రయాణించకుండా తమ  స్వంతముగా ప్రయాణ సాధనములు  చేసుకొని ప్రయాణము చేయుట జరిగింది.  ఇవి అన్ని అశాశ్వతమైనవేనని మనము గ్రహించాలి.  అయితే దానియేలు దర్శనములో ఇలా ప్రపంచ నలుమూలల నరులు తిరుగుట జరుగునని అందువలన నరుల తెలివి పెరుగునని చెప్పుట జరిగింది.  ఈ కాలములో మన ముందు పుట్టుచున్న చిన్నారుల జ్ఞానము మనకు ఆశ్చర్యమును కలిగించుట లేదా!

        ఒకనాడు ప్రయాణ సౌకర్యములు లేక ఎవరు ఏమి చేయుచున్నారో తెలియ ఉన్నారు.  ఈనాడు ప్రయాణ సౌకర్యములు పెరుగుట ద్వారా అనేకులు అనేక ప్రాంతములను సందర్శించి అందులోని జ్ఞానమును గ్రహించి తమ తెలివిని పెంచుకొనుట జరిగింది.  దీని ఫలితముగా ఈ జ్ఞానము ప్రతి ఒక్కరిలో త్వరితగతిని పెరుగుట ద్వారా మరికొంత ముందుకు జ్ఞానముతో ఆలోచించుట జరుగుచున్నది.  నా చిన్నతనములో అనగా సుమారు నా వయస్సులో నేను ఫోనును 45 సంవత్సరముల కాలములో చూచాను.  ఆనాడు నాకు దానిని ఎలా పట్టుకొనాలో తెలియదు.  ఈనాడు రకరకాల ఫోనులతో ప్రపంచమే మారు మ్రోగుచున్నదని గ్రహించవలసియున్నది.  దీనికి కారణము నరులు ప్రపంచ నలుమూలల తిరిగి తాము జ్ఞానవంతులమగుటయేగాక ఆ జ్ఞానము తమ ప్రాంతములో కూడా పెంపొందించుట ద్వారా ఈ ప్రవచనము నెరవేర్పు జరుగుచున్నట్లుగా మనము గ్రహించాలి.

        సుమారు 1800 సంవత్సరముల కాలములో నర జ్ఞానము ఎంత ఉన్నదో ఒక్కసారి మనము ఊహించవలసిన అవసరత మనకున్నది, ఎందుకంటే ఈనాడు శాస్త్ర జ్ఞానము ఎంత?  అలాగే ప్రకటన 19:19-22లో వలె భూరాజులు, నరులు సాతానుతో కుమ్మక్కై రాజాధిరాజైన క్రీస్తు ప్రభువుతో యుద్ధము జరిగించాలి అంటే మన జ్ఞానము ఇంకెంత పెంపొందాలో ఒక్కసారి మనము ఆలోచించవలసిన అవసరత యున్నది.  ఇదే సంగతిని దానియేలు తన దర్శనములో చూచి నరులలో పెరుగు ప్రయాణ సౌకర్యములు తద్వారా వచ్చు జ్ఞానము లేక తెలివితో వృద్ధిని గూర్చి తెలుసుకొన్నవాడై తన గ్రంథము నందు లిఖించుట జరుగుతుంది.

        ఇలా ఈ ప్రయాణ సౌకర్యము ఇంకా ఎక్కువగా పెరిగి ఇంకా ఎక్కువ జ్ఞానము పెరుగుచూనే ఉండును.  ఇలా యుగాంతమునకు ముందు వరకు మాత్రమే.  అటుతరువాత తమలో పెరిగిన జ్ఞానమునకు అతిశయించి నరులు రాజాధిరాజైన క్రీస్తును వ్యతిరేకించి తమ పతనమును తాము పొందవలసి యున్నదని గ్రహించాలి.

7.  ఏటి అవతలి యొడ్డున ఒకడు - ఇవతలి యొడ్డున ఒకడు నీళ్లపై ఆడుచుండగా దర్శనము

దానియేలు 12:5

        దానియేలు 12:5, ''దానియేలను నేను చూచుచుండగా మరియిద్దరు మనుష్యులు ఏటి అవతలి యొద్దున ఒకడును ఏటి ఇవతలి యొడ్డున ఒకడును నిలిచిరి.''  వీరు ఇద్దరు ఎవరు?  ఏటికి ఒకరు ఒక ఒడ్డున ఇంకొకరు ఇంకొక ఒడ్డున నిలిచియుండవలసిన అవసరత ఏమున్నది?  ఈ దర్శనము క్రీస్తు బాప్తిస్మమిచ్చు యోహాను జీవితమును గూర్చినది.  ఇందులో ఒకరైన బాప్తిస్మమిచ్చు యోహాను నది ఒడ్డున నిలుచుకొని మారుమనస్సు కలిగి బాప్తిస్మము పొందుడని బోధించుచూనే మారుమనస్సు కలిగినవారికి బాప్తిస్మము ఇచ్చెను.  అలాగే క్రీస్తు ప్రభువు కూడా ఇంకొక ఒడ్డున నిలిచి బాప్తిస్మమిచ్చినట్లుగా మనము గ్రహించాలి.  ఇలా బాప్తిస్మ మిచ్చుటకు బాప్తిస్మమిచ్చు యోహాను మరియు క్రీస్తు ప్రభువు ఇద్దరును ఒకరు ఒక ఒడ్డున, ఇంకొకరు ఇంకొక ఒడ్డున చేరి బాప్తిస్మ కార్యక్రమము జరిగించినట్లుగా మనము బైబిలు గ్రంథమందు చదువగలము.

        అయితే యేసే బాప్తిస్మము ఇయ్యలేదుగాని ఏటి యొడ్డున నిలిచి శిష్యుల చేత బాప్తిస్మమిప్పించినట్లుగా యోహాను 4:3లో వ్రాయబడియున్నది.  ఎందుకంటే యేసు ప్రభువు యొక్క హస్తములో తండ్రి పరిశుద్ధాత్మ యొక్క మహిమా ప్రభావములు ఇమిడి యున్నవి.  ఆయన హస్తముతో బాప్తిస్మము పొందిన పరలోక రాజ్యానికి అతడు నిశ్చయముగా అర్హత పొందినవాడని గ్యారంటీ ఇచ్చినట్లే యగును.  కాని దేవుడు మనుష్యుని యందు నమ్మిక ఉంచుటకు మనుష్యుడు దేవుని దృష్టిలో ఏపాటివాడు?  రోమా 3:11 నీతిలేని మానవునికి ఆయన పవిత్ర హస్తముతో బాప్తిస్మము పొందే యోగ్యము లేదు.  నోవహు త్రాగుబోతయ్యాడు.  దావీదు నరహంతకుడు.  సొలొమోను అన్య దేవతలకు బలి అర్పించాడు.  అబ్రాహాము భార్య మాట విని హాగరుకు గర్భమిచ్చి ఆమెను, ఆమె పిల్లవానిని అడవుల పాల్జేశాడు.  మోషే క్రీస్తను దివ్యమైన బండను తాకమని దేవుడు చెప్పినప్పుడు కొట్టి దైవసమ్మతమైన కానాను ప్రవేశింపలేకపోయాడు.  దేవునికి భయపడవలసిన ఏలీయా యెజెబేలుకు భయపడి ప్రాణ భయముతో అడవుల పాలయ్యాడు.  పేతురు అబద్ధమాడినాడు.  సిలువ బలియాగములో శిష్యులు ప్రాణ భయముతో పరారయ్యారు.  అందుకనే క్రీస్తు కుడివైపు దొంగతో నేడే నీవు పరలోకములో ఉందువని చెప్పలేదుగాని ఆత్మలు విశ్రాంతి పొందు మధ్యాకాశములో ఉంటావని పరదైసులోకి అభయమిచ్చాడు.  అందుకనే 1 యోహాను 1:8-10లో నేను పాపము లేనివాడనని చెప్పుకొనినచో తన్నుతానే మోసపుచ్చుకొనును.  మరియు వానిలో సత్యముండదు.  మరియు ప్రభువును అబద్ధికునిగా చేసినవాడగును.  మరియు ముఖ్యమైన విషయమేమిటంటే తప్పు చేయకపోయినను ఏది మేలైనదో ఏ పని చేస్తే మంచిదో తెలిసి కూడా దానిని చేయకుండుట పాపమని యాకోబు 4:17లో వ్రాయబడియున్నది.  కనుక పాపమన్నది ఏదో యొక రూపములో ప్రతి మానవుని వెంటాడుచున్నదని గ్రహించాలి.  అందుకనే క్రీస్తుయేసు తన హస్తముతో ఎవరికిని బాప్తిస్మము ఈయలేదు.

        యోహాను 3:22-30, ''అటుతరువాత యేసు తన శిష్యులతో కూడ యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచు ఉండెను.  సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహానుకూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మముపొందిరి.  యోహాను ఇంకను చెరసాలలో వేయబడియుండలేదు.  శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను.  గనుక వారు యోహాను నొద్దకు వచ్చి-బోధకుడా, యెవడు యొర్దానుకు అవతల నీతో కూడ ఉండెనో, నీ నెవని గూర్చి సాక్ష్యమిచ్చితివో, యిదిగో, ఆయన బాప్తిస్మమిచ్చుచున్నాడు; అందరు ఆయనయొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి.  అందుకు యోహాను ఇట్లనెను-తనకు పరలోకమునుండి అనుగ్రహింపబడితేనేగాని యెవడును ఏమియు పొందనేరడు.  నేను క్రీస్తును కాననియు, ఆయనకంటె ముందుగా పంపబడినవాడనే అనియు చెప్పినట్లు మీరే నాకు సాక్షులు.  పెండ్లికుమార్తెగలవాడు పెండ్లి కుమారుడు; అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినెడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును; ఈ నా సంతోషము పరిపూర్ణమైయున్నది.  ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసియున్నది.''  ఈ విధముగా క్రీస్తు ప్రభువు యొర్దానునదికి ఆవల బాప్తిస్మమిచ్చు యోహాను, యొర్దానునది ఈవల ఉండి బాప్తిస్మమిచ్చుచు మారుమనస్సు నిమిత్తమై బోధించుచూ వచ్చుచుండిరి.

        దానియేలు 12:6, ''ఆ యిద్దరిలో ఒకడు నార బట్టలు వేసికొన్నవాడై యేటినీళ్లపైన ఆడుచుండువాని చూచి-ఈ యాశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని యడుగగా,''  ఈ యిద్దరిలో ఒకరికి నారబట్టలు యున్నట్లుగా వ్రాయబడియున్నది.  బాప్తిస్మమిచ్చు యోహాను నారబట్టలు ఎప్పుడును ధరించలేదు.  మార్కు 1:6, ''యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు, అడవి తేనెను మిడుతలను తినువాడు.''  ఇందునుబట్టి బాప్తిస్మమిచ్చు యోహాను ఇద్దరిలో ఒకరైనను నారబట్టలు ధరించినవాడు కాదు.  కాని క్రీస్తు ప్రభువు నార వస్త్రములు ధరించినవాడు.  యోహాను 19:23-24, ''సైనికులు యేసును సిలువవేసిన తరువాత ఆయన వస్త్రములు తీసికొని, యొక్కొక్క సైనికునికి ఒక్కొక భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి.  ఆయన అంగీనికూడ తీసికొని, ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు-దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి.''  ఈ విధముగా ఒడ్డున నిలువబడిన ఇద్దరిలో ఒకరు నార వస్త్రములను మరియొకరు ఒంటె రోమములు కలిగిన చర్మపు వస్త్రములను ధరించుకొని యున్నారు.  ఇద్దరు వారి వారి స్థితినిబట్టి యొర్దాను నదికి ఆవల ఈవల నిలిచి బాప్తిస్మ కార్యక్రమమును జరిగించుచున్నారు.  ఈ యిద్దరిలో ఒకరు నార వస్త్రములు వేసుకొనిన ఒకరు నీటిపై ఆడుట చూచినట్లుగా వ్రాయబడియున్నది.  బాప్తిస్మమిచ్చు యోహాను ఎన్నడును ఏనాడు నీళ్ళపై తిరిగినట్లుగాని ఆడినట్లుగాని లేదు.  కాని నారవస్త్రములు ధరించిన క్రీస్తు ప్రభువు మాత్రము నీళ్ళపై నడుచుచూ తన శిష్యులకు కనపడి వారిలో పేతురు కూడా నీళ్ళపై నడుచుటకు ప్రయత్నము చేసి, అందులో కొంత దూరము నడిచి అవిశ్వాసము వలన మునిగిపోసాగి క్రీస్తు ప్రభువుచే రక్షింపబడినట్లుగా మనము గ్రహించాలి.  మత్తయి 14:22-33, ''వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయు నంతలో తన శిష్యులు దోనె యెక్కి తనకంటె ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను.  ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థనచేయుటకు ఏకాంతముగా కొండ యెక్కి పోయి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను.  అప్పటికాదోనె దరికి దూరముగనుండగా గాలి యెదురైనందున అలలవలన కొట్ట బడుచుండెను.  రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారియొద్దకు వచ్చెను.  ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి.  వెంటనే యేసు-ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు-ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను.  ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెనుగాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి -ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను.  వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని-అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను.  వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను.  అంతట దోనెలో నున్నవారు వచ్చి-నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.''  ఈ విధముగా క్రీస్తు ప్రభువు నార వస్త్రములు ధరించినవారై నీళ్లపై నడుచుట దానియేలు నీళ్ళపై ఆడుచుండువానివలె వివరించెను.

        ఇందులో ఏటి అనగా యొర్దాను నదికి ఆవల ఈవలన ఉన్నవారిలో ఒకరు ఒంటె రోమములు గల చర్మపు దుస్తులు ధరించుకొని, నారవస్త్రములు ధరించుకొని నీళ్ళపైన ఆడుచుండు క్రీస్తు ప్రభువును ఇలా అడుగుచున్నాడు.  - ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని యడుగగా.''  ఈ విధముగా క్రీస్తు ప్రభువు బాప్తిస్మమిచ్చు యోహాను ఒకరితో ఒకరిని పలకరించుకొన్నట్లుగా మనము గ్రహించవలసి యున్నది.  మత్తయి 11:2-3, ''క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని-రాబోవు వాడవు నీవేనా, మేము మరియొకనికొరకు కనిపెట్టవలెనా?  అని ఆయనను అడుగుటకు తన శిష్యులనంపెను.''  ఇలా బాప్తిస్మమిచ్చు యోహాను అడిగినప్పుడు క్రీస్తు ప్రభువు ఇచ్చిన సమాధానమును దానియేలు తన దర్శనములో ముందుగానే చూచుచున్నాడు.  దానియేలు 12:7, ''నారబట్టలు వేసికొని యేటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని; ఏమనగా, అతడు తన కుడిచేతిని ఎడమచేతిని ఆకాశమువైపుకెత్తి నిత్యజీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకొని, ఒకకాలము కాలములు అర్ధకాలము పరిశుద్ధజనముయొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగుననెను.''  ఈ విధముగా నారవస్త్రములు ధరించిన క్రీస్తు ప్రభువు, ''ఒక కాలము కాలములు అర్ధకాలము,'' అని చెప్పుచున్నాడు.  ప్రతి ఒక్కరికి ఈ విషయము తెలిసినదే.  ఎలా?  క్రీస్తు ప్రభువు తన జీవితములో బాప్తిస్మము తీసుకొన్న అనంతరము నూతన నిబంధనను భూమిపై ఏర్పరచుటకు తన బోధనలను స్థిరపరచుటకు సుమారు 3 1/2 సంవత్సరముల కాలము పట్టింది.  అనగా ఒక కాలము (ఒక సంవత్సరము) కాలములు (ఇలాంటి సంవత్సరములు రెండు) అర్ధకాలము (అనగా అర సంవత్సరము).  ఇలా క్రీస్తు ప్రభువు తన సువార్తను కాలాలవారీగా ఒక సంవత్సరము ష రెండు సంవత్సరములు ష 1/2 సంవత్సరము జరిగించాడు.  ఈ 3 1/2 సంవత్సరములకు క్రీస్తు ప్రభువును సిలువ బలిలో యూదులు చంపుట జరిగింది.  ఈ విధముగా పరిశుద్ధ జనముయొక్క బలము క్రీస్తు రూపములో దేవుడే వారి మధ్య ఉండగా ఆయనను చంపి కొట్టి వేయుట జరిగింది.  యోహాను 19:30, ''యేసు ఆ చిరక పుచ్చుకొని-సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.''  ఈ విధముగా క్రీస్తు ప్రభువు సిలువపై సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించుట జరిగింది.  ఈ విధముగా సకల సంగతులను ముగించుట అనగా తాను ఈ లోకములో చేయవలసిన  సమస్త కార్యములను తన కుడి ఎడమ చేతులను సిలువ పైకెత్తి సీలలు కొట్టియుండగా సమస్త కార్యములను ముగించుట జరిగింది.  ఇలా క్రీస్తు జీవితములో జరుగనున్నదని దానియేలుకు దర్శనములో చూపించుట జరిగింది.

        దానియేలు 12:8-9, ''నేను వింటినిగాని గ్రహింపలేకపోతిని-నా యేలినవాడా, వీటికి అంతమేమని నేనడుగగా అతడు-ఈ సంగతులు అంత్యకాలమువరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక, దానియేలూ, నీవు ఊరకుండుమని చెప్పెను.''  ముద్రింపబడినవి అంటే అందరికి అందుబాటులో ఉండునట్లు పుస్తకములుగా అచ్చు వేయబడినవని మనము ఈ రోజులలో చెప్పుకొంటాము.  ఇక్కడ ముద్రింపబడినవి అంటే ఎవరు విప్పి చదువుటకు వీలు లేకుండ సీలు వేయబడిందని అర్థము.

        ఇక దానియేలు 12:10, ''అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులును నిర్మలులును అగుదురు.  దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవునుగాని బుద్ధిమంతులు గ్రహించెదరు.''  శుద్ధిపరచుకొని ప్రకాశమానులును నిర్మలులుగా మారుట ఒక గొఱ్ఱెపిల్లయైన క్రీస్తు రక్తముతోనే సాధ్యమని గమనించాలి.  ప్రకటన 7:9-14, ''అటుతరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండియు ప్రతి వంశములో నుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను.  వారు తెల్లని వస్త్రములు ధరించు కొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి -సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.  దేవదూతలందరును సింహాసనము చుట్టును పెద్దలచుట్టును ఆ నాలుగు జీవులచుట్టును నిలువబడియుండిరి.  వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి -ఆమేన్‌; యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్‌.  పెద్దలలో ఒకడు-తెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు?  ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను.''  ఈ విధముగా అనేకులు గొఱ్ఱెపిల్లయైన క్రీస్తులో మారుమనస్సు పొంది శుద్ధిపరచుకొని క్రీస్తును, ఆయన వెలుగును వీరు పొందుదురని దానియేలుకు దర్శనములో చూపించుట జరిగింది.  ఈ సంగతిని దుష్టుడు గ్రహింపలేడు అనగా క్రీస్తులోనే మన పాపములకు ప్రాయశ్చిత్తము ఉన్నదన్న సత్యాన్ని ఈ దుష్టుడు గ్రహింపలేడు.  ఎవరైతే క్రీస్తును అంగీకరింపక ఆయనయందు విశ్వాసముంచి ప్రాయశ్చిత్తము  తమ పాపములకు క్షమాపణ పొందనివారిని దానియేలు దుష్టునితో పోల్చి చెప్పుచున్నాడు.  అయితే ఎవరైతే క్రీస్తును అంగీకరించి ఆయనయందు తమ పాపపు జీవితము కడుగుకొని తమని తాము శుద్ధీకరించుకొందురో వారిని బుద్ధిమంతులుగా వర్ణించుచున్నాడు.  ఇలా రెండు రకముల జనాభాగా విభజించుట జరిగింది.  అయితే వీరిలో బుద్ధిమంతులకు చెందినవారు అనేకులు వీరు క్రీస్తును అంగీకరించెదరని, ఆ విధముగా వీరు శుద్ధి పొందుదురని దానియేలుకు దర్శనములో తెలియజేయుట జరిగింది.

        ఇక దానియేలు 12:11, ''అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైనదానిని నిలువ బెట్టువరకు వెయ్యిన్ని రెండువందల తొంబది దినములగును.''  ''అనుదిన బలి,'' అను పదమునకు రెండు అర్థములు ఉన్నవి.  అందులో ఒకటి పాత నిబంధన కాలములో అనేక జంతు బలులు అనుదినము జరిగించుచు వచ్చారు.  ఇందులో దహనబలి, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి వంటివి అనేకము ఉన్నవి.  ఇది క్రీస్తు తన బలి ద్వారా నిలుపు చేయుట జరిగింది.  కాని దానియేలు దర్శనములో చెప్పిన అనుదిన బలి దీనిని గూర్చి కాదు, ఎందుకంటే అనేకమార్లు యెహోవా దేవుడు ఈ బలులు నాకు ఇష్టము లేదని తన ప్రవక్తల ద్వారా తెలియజేయుట జరిగింది.  1 సమూయేలు 15:22, యెషయా 66:3, హోషేయ 6:6, మీకా 6:6-8.  ఇలా దేవునికి ఇష్టము లేని బలిని క్రీస్తు ప్రభువు తన బలియాగము ద్వారా నిలుపు చేయుట జరిగింది.  ఇలా నిలుపు చేయుటకు ముందు, మరియొక బలిని క్రొత్త నిబంధనగా ఏర్పరచుట జరిగింది.  లూకా 22:14-21, ''ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతోకూడ అపొస్తలులును పంక్తిని కూర్చుండిరి.  అప్పుడాయన-నేను శ్రమపడకమునుపు మీతో కూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని.  అది దేవుని రాజ్యములో నెరవేరువరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి-మీరు దీనిని తీసికొని మీలో పంచుకొనుడి; ఇకమీదట దేవుని రాజ్యము వచ్చువరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాననెను.  పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, వారి కిచ్చి - ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను.  ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని-ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన.  ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడ ఈ బల్లమీద ఉన్నది.''  ఈ విధముగా క్రీస్తు ప్రభువు క్రొత్త నిబంధనగా ఏర్పరచిన ప్రభువు బల్ల కార్యక్రమము కూడా పస్కా బలిగా వర్ణించుట జరిగింది.  అయితే బలిలోని ఉగ్రతను కాఠిన్యమును క్రీస్తు ప్రభువు తగ్గించి, జంతు రక్తము మరియు మాంసమునకు బదులు ద్రాక్షారసమును రొట్టెను ఆయన శరీర రక్తములుగా భావించి ఉపయోగించుట జరిగింది.  దీనిని - ''నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని,'' క్రీస్తు ప్రభువు చెప్పుట జరిగింది.  ఈ విధముగా ఈనాడు క్రీస్తును నమ్మిన సంఘములు అనుదిన బలిగా ప్రభువు రొట్టెను, ద్రాక్షారసమును ఉపయోగించి జరుపుకొనుట జరుగుచున్నది.  దీనిని కూడా అనుదిన బలిగానే గుర్తించాలి.  ఈ బలి ద్వారా నిరంతరము దేవుని రూపమైన క్రీస్తును జ్ఞాపకపరచుకొనుట జరుగుచున్నది.  దీనిని కూడా అనుదిన బలిగానే గుర్తించాలి.  ఈ బలి ద్వారా నిరంతరము దేవుని రూపమైన క్రీస్తును జ్డాపకపరచుకొనుట జరుగును.  క్రీస్తు బలి ద్వారా సమస్త బలులు ఆగిపోవుట జరుగుటయేగాక నూతనమైన బలిని క్రీస్తు బలికి సాదృశ్యముగా నిరంతరము ఆయనను జ్ఞాపకపరచుకొనుచూ ప్రభువు బల్లను మనము ఆచరిస్తున్నాము.  అపొస్తలుల కార్యములు 2:42, ''వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.''  ఈ విధముగా క్రీస్తు ప్రభువు ద్వారా ఏర్పరచబడిన అనుదిన బలి అనగా రొట్టె విరుచుట ద్రాక్షరసమును పంచుట అనునవి ప్రతి నిత్యము అపొస్తలుల కాలము నుండి పరిశుద్ధులు భూమిమీద ఉండు వరకు జరుగునని గ్రహించాలి.  ఇలా పరిశుద్ధులు ప్రకటనలో చెప్పబడిన క్రూరమృగము కాలము వరకు ఉండురు.  ఈ కాలములో పరిశుద్ధులను సాతాను చివరి ప్రయత్నముగా క్రూరమృగ రూపములో హింసించి, అనేకులను మోసపరచి నాశనము చేయుట జరిగించును.  ఈ క్రూరమృగము అగాధము నుండి వచ్చి దేవుని ఇద్దరు సాక్షులను వధించి యుగాంతములో తన రాజ్యమును ఏర్పరచుట జరుగును.  ప్రకటన 11:7, ''వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములోనుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధముచేసి జయించి వారిని చంపును.'' ప్రకటన 13:1-2, ''మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని.  దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను.  నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను.  దాని పాదములు ఎటుగుబంటి పాదములవంటివి, దాని నోరు సింహపునోరువంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను.''  ఈ విధముగా సాతాను క్రూరమృగము రూపములో ఈ భూమిపై తన రాజ్యమును ఏర్పరచి నలువదిరెండు నెలలు తన పరిపాలనను కొనసాగించుట జరుగును.  ఈ నలువదిరెండు నెలల కాలములో దైవవ్యతిరేక కార్యములు జరిగించి పరిశుద్ధులను నాశనము చేయును.  మిగిలినవారిని తన ముద్రను వారిపై ముద్రించి వారిని దైవ వ్యతిరేక వర్గములో చేర్చును.  ప్రకటన 13:5-7, ''డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను.  మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుప నధికారము దానికి ఏర్పాటాయెను గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోకనివాసులను దూషించుటకును అది నోరు తెరచెను.  మరియు పరిశుద్ధులతో యుద్ధముచేయను వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను.  ప్రతి వంశముమీదను ప్రతి ప్రజమీదను ఆ యా భాషలు మాటలాడువారిమీదను ప్రతి జనముమీదను అధికారము దానికియ్యబడెను.''  ప్రకటన 13:13-15, ''అది ఆకాశమునుండి భూమికి మనుష్యులయెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది.  కత్తి దెబ్బ తినియు బ్రదికిన ఈ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనలవలన భూనివాసులను మోసపుచ్చుచున్నది.  మరియు ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను.''  ఈ విధముగా పరిశుద్ధులు ఈ మృగమునకు నమస్కారము చేయనట్లయితే వారిని చంపించుట జరిగించి, పరిశుద్ధులు, నిజదైవమును అనుసరించువారు లేకుండా చేసి అనుదినము క్రీస్తు జ్ఞాపకార్థముగా జరుగవలసిన బలియైన రొట్టె విరుచుటను ఆపివేయును, ఎందుకంటే ఈ నలువదిరెండు నెలలలో సాతాను క్రీస్తును జ్ఞాపకవరచుకొనువారైన పరిశుద్ధులను హతమార్చుట చేయును.  కనుక మిగిలినవారు సాతాను ప్రతిమకు నమస్కారము చేయుచు క్రీస్తును జ్ఞాపకము చేసుకొను అనుదిన బలిని మరచిపోవుదురు.  ఇలా నలువదిరెండు నెలల కాలములో జరుగును.

        ఇంతకి ఈ నలువదిరెండు నెలల కాలము క్రూరమృగము బయలుదేరి అనుదిన బలిని, పరిశుద్ధులను చంపి ఆపివేసిన ఆ స్థానములో హేయమైన క్రూరమృగముయొక్క విగ్రహములు నిలుపు వరకు ఉన్న కాలము.  నలువదిరెండు నెలలు వ 3 1/2 సంవత్సరములు - ఒక సంవత్సరమునకు 365 రోజులు వ 365 ని 3 సంవత్సరములు వ 1095 రోజులు ష అర సంవత్సరము వ 1095 ష మిగిలిన 175 రోజులు అర్ధ సంవత్సరములో భాగముగా గుర్తించాలి.  ఇలా 1290 దినములు ఈ కార్యక్రమము జరుగును.  ఇందులో అర సంవత్సరము జనవరి - 31 ష  ఫిబ్రవరి - 28 ష  మార్చి - 31 ష  ఏప్రిల్‌ - 30 ష  మే - 31 వ 181 రోజులు అర్ధ సంవత్సరముగా లెక్కించవచ్చును.  కనుక ఈ నలువదిరెండు నెలల కాలము లోపలే సాతాను విజృంభించి అనుదిన బలిని ఆపి దేవునికి హేయమైన తన విగ్రహములను ఆ స్థానములో నిలుపుట జరుగును.  ఈ కాలమును 1290 దినములుగా దానియేలుకు తెలియజేయబడినది.  ఈ కాలము సాతాను క్రూరమృగముగా విజృంభించు కాలము.  ఇది యుగాంతములో జరుగు కాలము.

        ఇలా జరిగిన తరువాత - దానియేలు 12:12, ''వెయ్యిన్ని మూడువందల ముప్పదియైదు దినములు తాళుకొని కనిపెట్టుకొనువాడు ధన్యుడు.''  వెయ్యిన్ని మూడువందల ముప్పదియైదు దినముల తరువాత దేవుని ఉగ్రత నరులపైకి వచ్చునని తెలియజేయబడినది.  అనగా 1290 రోజులలో సాతాను అనుదిన బలిని ఆపి హేయమైన తన విగ్రహములను దేవుని స్థానములో నిలిపి అందరిని దైవవ్యతిరేక స్థితిలో మార్చిన తరువాత, కేవలము 1335వ దినమున దేవుని ఉగ్రత బయలుదేరును.  1335 - 1290 వ 45.  కేవలము 45 రోజులలోనే దేవుని ఉగ్రత వీరి పైకి వచ్చును.  ఈ ఉగ్రత 45వ దినము తరువాత ఆరు ముద్రలుగాను, బూరలుగాను, పాత్రలుగాను దైవవ్యతిరేక జనముపై జరుగుట జరుగును.  కనుక ఈ కాలములో కనిపెట్టుకొని యుండువారు ధన్యులుగా చెప్పబడినది.  ఇదే సంగతిని ప్రకటన గ్రంథములో కూడా యోహాను తెలియజేయుట జరిగింది.  ప్రకటన 14:13, ''అంతట-ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని.  నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.''  కనుక ఇప్పటినుండి అనగా 1335వ దినము తరువాత అనగా అనుదిన బలిని ఆపి హేయమైన విగ్రహములను దేవుని స్థానములో నిలిపిన తరువాత 45వ రోజునుండి ఎవరైతే కనిపెట్టుకొని యుందురో వారందరు ధన్యులే!

        ఈ విధముగా అంత్యము వరకు ఎవరైతే నిలకడగా దేవునిలో ఉంటారో వారందరు తీర్పు దినమున వారు వారి క్రియలనుబట్టి వారి వారి వంతులో నిలబడుట జరుగునని దానియేలుకు దర్శనములో తెలియజేయుట జరిగింది.  దానియేలు 12:13, ''నీవు అంత్యము వరకు నిలకడగా ఉండినయెడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు.''  ఇలా దానియేలుకు క్రీస్తు బాప్తిస్మమిచ్చు కాలము మొదలు తీర్పు వరకు జరుగు క్రీస్తుకు సంబంధించిన సంగతులను ఈ దర్శనములో తెలియజేయుట జరిగింది.

........

ముందుగా ఒక మాట

జెకర్యా ఒక ప్రవక్త :-  జెకర్యా 1:1, ''దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా''  ఈ విధముగా జెకర్యాకు యెహోవా వాక్కు ప్రత్యక్షము కాగా జెకర్యాకు ప్రవక్తగా ఒక స్థానము లభించింది.  దేవుని ప్రత్యక్షత లేనివారు ప్రవక్తగా ఎన్నిక కాలేరు.  కనుక జెకర్యా ఒక గొప్ప ప్రవక్తగా దేవునిచే ఎన్నిక కాబడి బైబిలు గ్రంథములో అతని పేరు మీద ఒక పుస్తకము లిఖించబడియున్నది.  కాని ఈ జెకర్యా ఎవరు?  ఎందుకు దేవుడు ఆయనను ఎన్నిక చేసాడు?  ఎందు నిమిత్తము ఈ ప్రత్యక్షతలు అనుగ్రహించబడినవి?  ఈనాటికి మనకు అర్థము కానటువంటి విషయమే.  నేను క్రైస్తవునిగా మారినప్పటినుండి అనేకులైన దైవజనులు బోధలు విన్నాను కాని వారి బోధలో జెకర్యాను గూర్చిన బోధను నేను వినలేదనే చెప్పవచ్చును.  నా ఈ క్రైస్తవ జీవితములో జెకర్యా ప్రవచనములోని వాక్యము అను దైవసేవకుల బోధలో అత్యంత తక్కువ సార్లు వినుట జరిగింది.

        ఈ పుస్తకము వ్రాయుట మొదలు పెట్టినప్పుడు నాలో జెకర్యా ఒక గొప్ప దైవ ప్రత్యక్షత కలిగిన ప్రవక్త అని నేను గుర్తించితిని.  ఇలాంటి ప్రవక్త 14 అధ్యాయములు కలిగిన ఒక గ్రంథమును రచించుట జరిగింది.

జెకర్యాయొక్క కాలము :-  జెకర్యా దర్యావేషు రాజుయొక్క కాలము నాటివాడు.  బైబిలు చరిత్ర ఆధారముగా ఈ జెకర్యా సుమారు క్రీస్తు పూర్వము 500 - 510 సంవత్సరముల క్రితమువాడు.

జెకర్యాయొక్క వంశావళి :-  జెకర్యా 1:1 ప్రకారము ఈ జెకర్యా బెరక్యాయొక్క కుమారుడు.  ఈ బెరక్యా ఇద్దోకునకు పుట్టినవాడు.  అనగా జెకర్యాయొక్క తాత ఇద్దోకు అని మనము చెప్పవచ్చును.

జెకర్యాయొక్క దర్శనములు :-  ఈ పుస్తకములో ఈ దర్శనములు సంపూర్ణముగా వివరించుట జరిగింది.  ఈ దర్శనములు కొన్ని మాత్రమే అయినను దీనిలో చాలా ఆత్మీయ అర్థములు కలిగియున్నట్లుగా మీరును ఈ పుస్తకము చదివి గ్రహించగలరు.

జెకర్యా ఒక హతసాక్షి :-  జెకర్యా ప్రవక్తలలో అగ్రగణ్యుడైన లేక హతసాక్షులలో అగ్రగణ్యుడైన క్రీస్తుకు ముందు చంపబడి మరణించినవాడు.

        క్రీస్తు ప్రభువు ప్రవక్తలలో చివరివాడు కనుక ఒక గొప్ప ప్రవక్తగా ఈ లోకములో నూతన నిబంధనను ఏర్పరచుట జరిగింది.  జరగబోవు ప్రత్యక్షతలు ఎన్నో ముందుగా ప్రవచించుట జరిగింది.  ప్రవక్త ఎన్ని విధములుగా యోగ్యతను  కలిగియుండునో అందరికన్నా ఎక్కువ యోగ్యతను క్రీస్తు ప్రభువు ఈ లోకరీత్యా  కలిగియుండెను.  అలాగే క్రీస్తు ప్రభువు సాధారణ మరణమును పొందినవాడు కాదు.  తన 33 1/2 సంవత్సర కాలము తరువాత యూదులు సిలువపై దారుణముగా క్రీస్తు ప్రభువుని చంపుట జరిగింది.  సీలలు చేతులకు కాళ్ళకు కొట్టి ముళ్ళ కిరీటము ద్వారా రక్తమును నేలపై చిందింపజేసి చంపుట జరిగింది.  అంతేకాకుండా యూదులు క్రీస్తు ప్రక్కలో బల్లెముతో పొడిచి చనిపోయినట్లుగా నిర్థారించుకొన్నారు.  ఇది హత్యయే కదా!  

        కనుక హతసాక్షులో అగ్రగణ్యుడు క్రీస్తు ప్రభువే, ఎందుకంటే ఏ తప్పు చేయని వాడుగా తన శరీరమును బలిగా సిలువపై అర్పించుట జరిగింది.  

        కనుక హేబెలుతో మొదలై క్రీస్తుతో పాత నిబంధనలోని ప్రవక్తల బలి సంపూర్తియైనట్లుగా మనము గ్రహించాలి.  అయితే జెకర్యా కూడా హతసాక్షుల వలె చంపబడినవాడు.  కాని క్రీస్తుకు కొంచెము ముందు చంపబడినవాడు. అనగా జెకర్యా తరువాత క్రీస్తు ప్రభువే హతసాక్షి అవుట జరిగింది.  ఇదే విషయమును క్రీస్తు ప్రభువు చెప్పుట జరిగింది.  

        మత్తయి 23:35, ''నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠము నకును, దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును.''  

        ఈ విధముగా క్రీస్తు ప్రభువే స్వయముగా హేబెలు రక్తమును ప్రస్తావిస్తూనే జెకర్యా చంపబడిన తీరును ప్రస్తావించుట జరిగింది.  ఆనాటి ఇశ్రాయేలీయులు ఈ జెకర్యాను బలిపీఠమునకు దేవాలయమునకు మధ్యన చంపుట జరిగింది.  అంటే ఈ ఇశ్రాయేలీయులు దేవుని ప్రవక్తలను చంపుటకు ఎంత దారుణమైన చేయ సంసిద్ధులై యున్నట్లుగా మనకు తెలియుచున్నది.  

        ఈ విధముగా క్రీస్తునకు కొంచెము ముందు అనగా 500 సంవత్సరములకు ముందు తన ప్రాణమును బలిగా అర్పించి హతసాక్షిగా మారినవాడు జెకర్యా.  జెకర్యాకు క్రీస్తుకు మధ్య హతసాక్షులు లేరు.  బాప్తిస్మమిచ్చు యోహాను తల నరకబడి చంపబడినను, ఆయనను చంపుటకు ఉద్దేశ్యము వేరు.  దేవుని రాజ్య విస్తరణ కోసరము ఆయన చంపబడలేదు అనగా దైవరాజ్య సువార్త వ్యాప్తి జరువీగట ఇష్టము లేనివారు ఆయనను చంపలేదు.  

        రాజకుమార్తెయొక్క తల్లి చేసిన తప్పును కప్పిపుచ్చుకొనుటకును, పగ తీర్చుకొనుటకును బాప్తిస్మమిచ్చు యోహాను హత్య జరిగింది.  ఈ విధముగా జెకర్యా దేవుని రాజ్య సువార్త కార్యక్రమములో ప్రవక్తగా ప్రత్యక్షత కలిగియుండి చివరకు హతసాక్షిగా గతించుట జరిగింది.

        ఈ విధముగా ఇంత గొప్ప యోగ్యతను పొందిన జెకర్యా ఒక ప్రవక్తగా ఉండగా అనగా తాను హతసాక్షి కాక మునుపు దైవవాక్కు ఆయనకు ప్రత్యక్షమై ఆయనచే వ్రాయించి ఈ చిన్న గ్రంథము నా యీ ఆత్మీయ జీవితములో కొన్ని రహస్యములు నాకు తెలియజేసినది అనుటకు సందేహము లేదు.  ఏనాడు ఎప్పుడు వినని రహస్యములు నాకు ఈ గ్రంథము ద్వారా దేవుడు తెలియజేయుట జరిగింది.  ఈ రహస్యములను ఇప్పుడు మీ ముందు పుస్తక రూపములో ఉంచుచున్నాను.  

        కనుక పాఠకులు ఈ చిన్న పుస్తకమును చదివి ఆత్మీయ ఉన్నతిని పొందమని ప్రభువు నామములో మిమ్మును అడుగుచున్నాను.

        తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీకు తోడై యుండునుగాక!

నెల్లూరు                                                      గ్రంథకర్త

19.07.2007                                             వాసా శేఖర్‌ రెడ్డి

1.  గొంజి చెట్లలో రకరకముల గుఱ్ఱముల దర్శనము

జెకర్యా 1:7-21

దర్శనముయొక్క స్థితి :- అప్పటి యెరూషలేములో జరగవలసిన దానిని గూర్చి

దర్శనము ఎవరికి వచ్చింది :-  జెకర్యా (బెరక్యా కుమారుడు)

దర్శనము వచ్చిన కాలము :-  దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము శెబాటు అను పదకొండవ నెల యిరువది నాలుగవ దినమున.

దర్శనము ఇచ్చినది :-  యెహోవా దేవుని వాక్కు (అనగా క్రీస్తు)

ముఖ్య ఉద్దేశ్యము :-  ఇశ్రాయేలు దేశములో శాంతిని నెలకొల్పుట.

అంతరార్థములు  

ఎఱ్ఱని గుఱ్ఱములు :-  రక్తపాతము

మచ్చల మచ్చల గుఱ్ఱములు :-  జబ్బులు లేక అవలక్షణములు

తెల్లని గుఱ్ఱము :-  శాంతి

కొమ్ములు :-  ఆధిక్యత (ఇందులో అన్యులకు)

నలుగురు కంసాలులు :-  యోధులు (దేవుని కోసము పోరాడేవారు)

ఈ శాంతిని కోరినది :-  యెహోవా దూత

ఈ గుఱ్ఱములను పంపినది :-  యెహోవాయే!

ప్రకటన చేయవలసినది :-  ప్రవక్త (జెకర్యా)

        ప్రియపాఠకులారా!  జెకర్యా 1:7, ''మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము శెబాటు అను పదకొండవ నెల యిరువది నాలుగవ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జెకర్యాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.''  ఇది జెకర్యాకు యెహోవా వాక్కు ద్వారా తన ప్రత్యక్షతను తెలియజేసాడు.  ఈ ప్రత్యక్షతతో యెహోవా దేవుడు ఏమి తెలియజేయుచున్నాడో తెలుసుకొందము.

        జెకర్యా 1:8, ''-రాత్రి ఎఱ్ఱని గుఱ్ఱము నెక్కిన మనష్యుడొకడు నాకు కనబడెను;  అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలువబడియుండగా అతని వెనుక ఎఱ్ఱని గుఱ్ఱములును చుక్కలు చుక్కలు గల గుఱ్ఱములును తెల్లని గుఱ్ఱములును కనబడెను.''  ఇందులో ఎఱ్ఱని గుఱ్ఱము రక్తపాతమునకు మాదిరిగా చెప్పబడినది.  దానిని ఎక్కిన మనుష్యుడు దేవుని దూతయే,  ఎందుకంటే దేవుని దూతలు మనుష్యుని పోలినవారు.  అంతేకాదు, దేవుడు కూడా మనుష్యుని పోలికయే!  ఆదికాండము 1:26, ''దేవుడు-మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము;  వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.''  ఇందునుబట్టి ప్రతి ఒక్కరు నరుని ఆకారములో ఉన్నవారే అని గ్రహించాలి.  అందుకే ఈ వాక్యములో మనుష్యుడొకడు అని జెకర్యా చెప్పుచున్నాడు.  కాని ఈ మనుష్యుడు మనుష్యుని ఆకారము, స్వరూపములో వున్న దేవుని దూతయే అని గ్రహించాలి.  అలాగే ఈ ఎఱ్ఱని గుఱ్ఱమునకు  వెనుక ఇంకా చుక్కలు చుక్కలు గల గుఱ్ఱములును, తెల్లని గుఱ్ఱములు ఉన్నట్లుగా చెప్పుచున్నాడు.  ఇందులో చుక్కలు చుక్కలు గల గుఱ్ఱములు రకరకాల జబ్బులకు, అవలక్షణములకు సూచనగా చెప్పబడినది.  తెల్లని గుఱ్ఱములు దైవరాజ్య సంబంధమైన శాంతికి సూచనగా వున్నది.  

        అయితే జెకర్యా 1:8లో చ్కులు చుక్కలు గల గుఱ్ఱములు తెల్లని గుఱ్ఱములు ఎఱ్ఱని గుఱ్ఱమునకు వెనుక వున్నట్లుగా చెప్పబడినది.  ఇందునుబట్టి రాజ్యములో రక్తపాతము ఎక్కువగా వుండుట చేత జబ్బులు లేక అవలక్షణముల ప్రభావము దైవరాజ్య సంబంధమైన ప్రభావము తెలియకుండా వాటిని ఎఱ్ఱని గుఱ్ఱముయొక్క రక్తపాతము కప్పినట్లుగా చెప్పబడినది.  ఇంతకి ఈ గుఱ్ఱములన్ని ఎక్కడ వున్నవి?  లోయలోనున్న గొంజి చెట్లలో వున్నవి అనగా జెకర్యాకు ఈ ప్రత్యక్షమైనప్పుడు రక్తపాతము, జబ్బులు లేక అవలక్షణము, దైవరాజ్య సువార్త జరగక లోయలో నిలుచుని యున్నట్లుగా గ్రహించాలి.  ఆ సమయములో వాటి కార్యములు నిలుపు చేయబడి జెకర్యాకు దైవ ప్రత్యక్షత లభించింది.

        జెకర్యా 1:9, ''అప్పుడు-నా యేలినవాడా, యివి ఏమని నేనడుగగా నాతో మాటలాడు దూత-ఇవి ఏమియైనది నేను నీకు తెలియజేతుననెను.''  జెకర్యా 1:10, ''అప్పుడు గొంజి చెట్లలో నిలువబడియున్న వాడు-ఇవి లోక మంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుఱ్ఱములని చెప్పెను.''  అని అనుటలో ఈ మూడు రకముల గుఱ్ఱములు ఈ లోకమందంతట సంచరించి వాటి వాటి కార్యములు జరిగించుటకు యెహోవా దేవుడు పంపినవిగా చెప్పబడినది.  అంటే ప్రపంచములో జరిగే రక్తపాతము, జబ్బులు లేక అవలక్షణములు, దైవరాజ్య సువార్తా కార్యక్రమములు అన్నియు యెహోవా దేవుని నుండి జరిగేవే అని మనము గ్రహించాలి.  ఎందుకంటే రోమా 7:24లో వలె జనులయొక్క దురాశలను బట్టి వారి కఠిన హృదయాలనుబట్టి వారిని శిక్షించుటకు దేవుని ఏర్పాటు.  యెషయా 46:11, ''తూర్పునుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను  దూరదేశమునుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను  నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను  ఉద్దేశించియున్నాను  సఫలపరచెదను.''

        జెకర్యా 1:11, ''అప్పుడు గొంజి చెట్లమధ్యను నిలువబడిన యెహోవా దూతను చూచి-మేము లోకమంతట తిరుగులాడి వచ్చి యున్నాము;  ఇదిగో లోకులందరు శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారని చెప్పెను.''  అని అనుటలో ఈ గుఱ్ఱములు వాటిని అధిరోహించిన మనుష్యుని పోలినవారు యెహోవా దూతకు తమ కార్యములను గూర్చి చెప్పుచున్నారు.  ఏమని చెప్పుచున్నారు?  అవి లోకమందంతట తిరుగులాడి వచ్చామని.  అయితే లోకులందరు శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారని చెప్పుచున్నారు.  ఇందులో లోకులందరు అనగా వీరు దైవరాజ్య సంబంధులు కారు.  లోకులు అనగా ఈ లోక సంబంధమైనవారు.  పాత నిబంధన కాలములో అనగా జెకర్యా కాలములో లోకులు అనగా ఇశ్రాయేలీయులు కానివారు.  దైవప్రజలు ఇశ్రాయేలీయులు.  అయితే జెకర్యాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైనప్పటికి లోకులందరు అనగా ఇశ్రాయేలీయేతరులు అందరు శాంతితో వున్నట్లుగా చెప్పబడినది.

        జెకర్యా 1:12, ''అందుకు యెహోవా దూత-సైన్యములకధిపతియగు యెహోవా, డెబ్బది సంవత్సరములనుండి నీవు యెరూషలేముమీదను యూదా పట్టణములమీదను కోపముంచి యున్నావే;  యిక ఎన్నాళ్లు కనికరింపకయుందువు అని మనవిచేయగా,'' అని చెప్పుటనుబట్టి ఆ పరిస్థితులలో యెహోవా కోపము కేవలము యెరూషలేము మరియు యూదా మీద మాత్రమే యున్నది.  అలా యెహోవా కోపము యెరూషలేము మరియు యూదా మీదకు వచ్చి 70 సంవత్సరములు గడిచిపోయినది.  అప్పటికి లోకులందరు శాంతితో వుంటే, దైవజనాంగము మాత్రము అశాంతితో వున్నారు.  జెకర్యా 1:13, ''యెహోవా నాతో మాటలాడిన దూతకు ఆదరణయైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను.''

        జెకర్యా 1:14, ''కాబట్టి నాతో మాటలాడుచున్న దూత నాతో ఇట్లనెను -నీవు ప్రకటన చేయవలసినదేమనగా-సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు-నేను యెరూషలేము విషయములోను సీయోను విషయములోను అధికాసక్తి కలిగియున్నాను;''  జెకర్యా 1:15, ''నిమ్మళముగా ఉన్న అన్యజనులమీద నేను బహుగా కోపించుచున్నాను;  ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడుచేయ వలెనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి.''  అని అనుటలో అన్యజనులు అనగా లోకులు దేవుని కోపమును ఆసరా చేసుకొని ఇశ్రాయేలీయులకు కీడు చేసినట్లుగా చెప్పబడినది.  అంతేకాదు తిరిగి యెరూషలేమును తన తట్టు తీసుకోబోవుచున్నానని చెప్పుచున్నాడు.  అందులో తిరిగి యెహోవాకు ఆలయము కట్టబడునని, శిల్పులు తమ నూలు అనగా దారమునకు పని చెప్పుదురని చెప్పుచున్నాడు.  జెకర్యా 1:16-17, ''కాబట్టి యెహోవా సెలవిచ్చునదేమనగా-వాత్సల్యముగలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగియున్నాను;  అందులో నా మందిరము కట్టబడును; యెరూషలేముమీద శిల్పకారులు నూలు సాగలాగుదురు;  ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.  నీవు ఇంకను ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా -ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును, ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.''

        కనుకనే ఈ మూడు రకముల గుఱ్ఱములు ఇశ్రాయేలీయుల దేశములోని లోయలో గొంజి చెట్ల మధ్య నిలువబడియున్నట్లుగా గ్రహించాలి.  ఈ గుఱ్ఱముల కారణముగా ఇశ్రాయేలీ దేశములో రక్తపాతము, జబ్బులు, మరియు శాంతికి సంబంధించిన కార్యములు ఒకేసారి జరిగినట్లుగా గ్రహించాలి.  ఈ సంఘటనలో రక్తపాతము ముందు  ప్రాధాన్యతను పొంది, మిగిలినవి దీనియొక్క కార్యముల మూలమున కప్పబడి వెనుకగా వున్నట్లుగా గ్రహించాలి.

        జెకర్యా 1:18, ''అప్పుడు నేను తేరిచూడగా నాలుగు కొమ్ములు కనబడెను.''  ఈ స్థితిలో జెకర్యా ప్రవక్త తేరి చూచినప్పుడు నాలుగు కొమ్ములు కనబడెనని చెప్పుచున్నాడు.  కొమ్ములు ఆధిక్యతకు సూచన.  ఇంతకి ఇది ఎవరికి ఆధిక్యతతో మనము తెలుసుకొన వలసియున్నది.  జెకర్యా 1:19, ''-ఇవి ఏమిటివని నేను నాతో  మాటలాడుచున్న దూతనడుగగా అతడు-ఇవి యూదావారిని ఇశ్రాయేలువారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను.'' అని చెప్పుట లో ఇశ్రాయేలీయులందరిని చెదరగొట్టిన కొమ్ములుగా వర్ణించుటనుబట్టి, ఇవి అన్యరాజ్యములకు చెందినవిగా గ్రహించాలి.  ఈ నాలుగు కొమ్ములు ఇశ్రాయేలీయులను చెరపట్టిన అన్యులయొక్క ఆధిక్యతగా గుర్తించాలి.  ఇది దేవుని కోపము వలన వారికి ఆధిక్యత వచ్చినట్లుగా గ్రహించాలి.

        జెకర్యా 1:20-21, ''యెహోవా నలుగురు కంసాలులను నాకు కనుపరచగా -వీరేమి చేయబోవుచున్నారని నేనడిగినందుకు ఆయన-ఎవడును తలయెత్తకుండ యూదావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయ పెట్టుటకును, యూదాదేశస్థులనందరిని చెదరగొట్టుటకై వారిమీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చియున్నారని నాకు సెలవిచ్చెను.'' అని చెప్పుటను బట్టి,ఈ కంసాలులుగా వచ్చేవారు నలుగురు.  వీరు ఇశ్రాయేలీయులను కొమ్ముల నుండి అనగా అన్యుల నుండి విడిపించునని చెప్పుచున్నారు.  అనగా ఈ కంసాలులుగా చెప్పబడినవారు ఇశ్రాయేలీయులలో నుండి వచ్చువారుగా గ్రహించాలి.  వీరు గిద్యాను, దావీదు, మోషే మొదలైన వారివలె వచ్చి ఇశ్రాయేలీయులను 70 సంవత్సరములుగా అణగద్రొక్కినవారిని పడగొట్టుటకు వచ్చుచున్నారని గ్రహించాలి.

        అయితే ఇందులో కూడా మూడు రకములుగా గుఱ్ఱములు కార్యము జరిగించును.  మొదట రక్తపాతము, అటుతరువాత జబ్బులు, చివరగా శాంతి.  అనగా ఎఱ్ఱని గుఱ్ఱములు వెనుక చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములు, దాని వెనుక తెల్లని గుఱ్ఱములు.

2.  యెరూషలేముయొక్క వైభోగముయొక్క దర్శనము

జెకర్యా 2:1-5

దర్శనముయొక్క స్థితి :-  అప్పటి యెరూషలేములో జరగవలసిన దానిని గూర్చి

దర్శనము ఎవరికి వచ్చింది :-  జెకర్యా (బెరక్యా కుమారుడు)

దర్శనము వచ్చిన కాలము :-  దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము శెబాటు అను పదకొండవ నెల యిరువది నాలుగవ దినమున.

దర్శనము ఇచ్చినది :-  యెహోవా దేవుని వాక్కు (అనగా క్రీస్తు)

దర్శనముయొక్క ఉద్ధేశ్యము :-  యెరూషలేముయొక్క వైభోగమును తెలియజేయుట

అంతరార్థములు

యొకడు - దేవుని దూత

కొలనూలు :-  యెరూషలేముయొక్క స్థలమును కొలిచి నిర్ణయించుట

అగ్ని ప్రాకారము :-  క్రీస్తులోని పరిశుద్ధాత్మకు సాదృశ్యము

నేను :-  యెహోవా

యౌవనుడు :- జెకర్యా

        జెకర్యా 2:1, ''మరియు నేను తేరిచూడగా కొలనూలు చేతపట్టుకొనిన యొకడు నాకు కనబడెను.''  ఇందులో కొలనూలు అనగా కొలతలు చూచు దారము.  చాలా ఎక్కువ దూరముగల కొలతలు ఈ దారముతో కొలుచుట జరుగును.  అలాగే జెకర్యా దర్శనములో కొలనూలు చేత పట్టుకొని ఒకడు కనబడుచున్నాడు.  ఈ యొకడు దేవుని దూత, ఎందుకంటే జెకర్యా 2:3లో, ''మరియొక దూత,'' అని చెప్పుటనుబట్టి మొదటి యొకడు కూడా దేవుని దూతయే!

        జెకర్యా 2:2, ''నీ వెక్కడికి పోవుచున్నావని నేనతని నడుగగా అతడు -యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచిచూడబోవు చున్నాననెను.''  అలాగే యోహాను దర్శనములలో కూడా ఇలాగే కొలుచుచున్నట్లుగా చెప్పబడినది.  ప్రకటన 11:1-2, ''మరియు ఒకడు చేతికఱ్ఱవంటి కొలకఱ్ఱ నాకిచ్చి-నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి, ఆలయములో పూజించువారిని లెక్క పెట్టుము.  ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచి పెట్టుము; అది అన్యులకియ్యబడెను, వారు నలువది రెండు నెలలు పరిశుద్ధపట్టణమును కాలితో త్రొక్కుదురు.''  ఇందులో కొలకఱ్ఱ, బంగారమునకు చెందినదని ప్రకటన 21:15లో చెప్పుట జరిగింది.  

        ప్రకటన 21:15-18, ''ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకఱ్ఱ యుండెను.  ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము.  అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.  మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలుబదినాలుగు మూరలైనది; ఆ కొలత దూతకొలతయే.  ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది.''  

        ఇది పరిశుద్ధ పట్టణముయొక్క కొలతలు.  ఈ కొలతలు పరమ యెరూషలేమునకు చెందినది.  ఈ కొలతల ప్రకారము దాని నిర్మాణము జరుగును.  అందులో నివసించువారి లెక్క కూడా నిర్ణయింపబడునని గ్రహించాలి, ఎందుకంటే ఒక అడుగు స్థలములో ఒక్కరు లేక ఇద్దరు నిలువగలరుగాని 100మంది నిలువలేరుకదా!  కనుకనే కొలతలు ఆలయ నిర్మాణమునకు చెందినవి అయినను దానిలో నివసించవలసిన వారి లెక్క గూడా దానిని బట్టి నిర్ణయమగును.

        జెకర్యా 2:3-4, ''అంతట నాతో మాటలాడుచున్న దూత బయలుదేరగా మరియొక దూత యతనిని ఎదుర్కొనవచ్చెను.  రెండవ దూత-పరుగెత్తిపోయి యెరూషలేములో మనుష్యులును పశువులును విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యౌవనునికి తెలియజేయుమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను.''  యెరూషలేములోని స్థలము మైదానము వలె యుండుటనుబట్టి చాలా పెద్ద స్థలముగా మనము గమనించవలసి యున్నది.  దీనిని జెకర్యాకు తెలియజేయుట జరిగింది.

        జెకర్యా 2:5, ''నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును; ఇదే యెహోవా వాక్కు.''  ఇందులో చెప్పబడిన అగ్ని ప్రాకారము సూర్యకాంతముగా కట్టబడెనని ప్రకటన 21:18లో చదువగలము.  అనగా క్రీస్తు ప్రభువులోని పరిశుద్ధాత్మయొక్క వెలుగు ఆ యెరూషలేమునకు కంచెగా లేక ప్రాకారముగా ఉన్నదని గ్రహించాలి.  అలాగే యెరూషలేముయొక్క మహిమకు నేను కారణమగుదునని యెహోవా తన వాక్కుగా తెలియజేసెను.  

        ప్రకటన 21:23, ''ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము.''  

        ఈ విధముగా యెరూషలేమునకు తండ్రియైన దేవుడు మహిమగా అనగా క్రీస్తు అందులో ప్రకాశించుచు యెరూషలేము యొక్క ఘనతకు కారణమగును.  దీనికి కారణము పరమ యెరూషలేములో తండ్రియైన దేవుడు క్రీస్తు ప్రభువుతోబాటుగా నివసించుట జరుగునని ముందుగా జెకర్యాకు తెలియజేయుట జరిగింది.

3.  తీర్పు జరుగు విధానము

జెకర్యా 3:1-10

దర్శనముయొక్క స్థితి :-  అప్పటి యెరూషలేములో జరగవలసిన దానిని గూర్చి

దర్శనము ఎవరికి వచ్చింది :-  జెకర్యా

దర్శనము వచ్చిన కాలము :-  దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము శెబాటు అను పదకొండవ నెల యిరువది నాలుగవ దినమున.

దర్శనము ఇచ్చినది :-  యెహోవా దూత

దర్శనముయొక్క ఉద్దేశ్యము :-  పరిశుద్ధులకు జరుగు తీర్పు - క్రీస్తు జరిగించబోవు రక్షణను గూర్చి తెలియజేయుట.

అంతరార్థములు

యెహోవా దూత  :-   క్రీస్తు ప్రభువు

మలిన వస్త్రములు :-  పాపపు జీవితమునకు మాదిరి

ప్రశస్త వస్త్రములు :-  నీతి క్రియలు

దర్శనము ఎవరికి వచ్చింది :-  జెకర్యా (బెరక్యా కుమారుడు)

దర్శనము వచ్చిన కాలము :-  దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము శెబాటు అను పదకొండవ నెల యిరువది నాలుగవ దినమున.

దర్శనము ఇచ్చినది :-  యెహోవా దేవుని వాక్కు (అనగా క్రీస్తు)

తెల్లని పాగా  :-  దేవుడు ఇచ్చు జీవకిరీటము లేక అధికారము.

రాతి :-  క్రీస్తు

రాతిపైన ఏడు నేత్రములు :-  క్రీస్తుకు కలిగిన ఏడు ఆత్మలు.

        ప్రియపాఠకులారా!  జెకర్యా 3:1, ''మరియు యెహోవా దూతయెదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాదియై అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచెను.''  ఇందులో యెహోవా దూత ఎవరు?  ఈయన ఎదుట యెహోషువ నిలబడి యుండెనని వ్రాయబడినది.  అంతేకాదు, సాతాను ఫిర్యాదియై నేరము మోపుటకు నిలువబడి యున్నాడు.  ఇందునుబట్టి యెహోవా దూత క్రీస్తు ప్రభువుగా మనము గుర్తించాలి.  తీర్పు తీర్చువారు క్రీస్తు ప్రభువే.  సమస్త జనులు ఆయన ఎదుట నిలువవలసిన వారేనని గ్రహించాలి.  యెహోవాయొక్క దూతగా క్రీస్తు ప్రభువు భూమిపై అవతరించి మనకందరికి రక్షణను ఒసెగెనని మనము మరచిపోకూడదు.  క్రీస్తు ప్రభువు దూతలలో అగ్రగణ్యుడని  బైబిలు గ్రంథము చెప్పుచున్నది.  దూతలలో ప్రధాన దూత క్రీస్తు ప్రభువు అని ప్రకటన 10: లో వివరించబడియున్నది.  కనుకనే క్రీస్తు ప్రభువును ఈ మూలవచనములో యెహోవా దూతగా వర్ణించుట జరిగింది.  ఈ విధముగా యెహోవా దూతయైన క్రీస్తు ప్రభువు యెదుట ప్రకటన 20:11-12, ''మరియు ధవళ మైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను;  వాటికి నిలువ చోటు కనబడకపోయెను.  మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని.  అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను;  ఆ గ్రంథములయందు వ్రాయబడి యున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.''  యెహోషువ అను ప్రధాన యాజకుడు నిలువబడి యున్నాడు.  అనగా తీర్పు కొరకు తీసుకొని రాబడినట్లుగా మనము గ్రహించాలి.

        అలాగే సాతాను ఫిర్యాదియై అతని కుడి పార్శ్వమున నిలువబడుట జెకర్యా తన దర్శనములో చూచుట జరిగింది.  ఇందులో ఒక చిన్న రహస్యము ఉన్నది.  అదేమిటంటే కుడి పార్శ్వ మనగా నీతికి స్థానము.  అలాంటి స్థానములో గొఱ్ఱెలు మాత్రమే నిలుచునని క్రీస్తు ప్రభువు (మత్తయి 25:33, ''తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును.'') చెప్పుట జరిగింది.  కాని యెహోషువయొక్క కుడి పార్శ్వములో సాతాను నిలబడి యున్నట్లుగా చెప్పబడినది.  ఇంతకి యెహోషువ ఎవరు?  ఈ యెహోషువ ప్రధాన యాజకుడని చెప్పబడినది.  బైబిలు గ్రంథమందు యెహోషువ అను పేరు కలిగినవాడు గొప్పవాడు ఒక మోషే పరిచారకుడుగా ఉన్నవాడు మాత్రమే.  ద్వితీయోపదేశకాండము 34:9, ''మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువమీద ఉంచి యుండెను గను అతడు జ్ఞానాత్మపూర్ణుడాయెను; కాబట్టి ఇశ్రాయేలీయులు అతనిమాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి.''  ఈ విధముగా యెహోషువ మోషేకు ముఖ్య పరిచారకుడుగా ఉండి, మోషే మరణానంతరము కానానుకు ఇశ్రాయేలీయులను నడిపించినవాడు.  ఇతను తన జీవితములో సూర్యుని చంద్రుడిని 24 గంటలపాటు కదలనియ్యకుండా తన ప్రార్థనాశక్తితో ఆపినవాడు.  కాని ఈ యెహోషువాయొక్క తీర్పును గూర్చి కాదు.  

        ఎందుకంటే జెకర్యా 6:11, ''వారి నడిగి వెండి బంగారములను తీసికొని కిరీటముచేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువ తలమీద ఉంచి''  కనుక యెహోజాదాకు కుమారుడైన యెహోషువ యాజకునిగా ఎన్నిక చేయబడినవాడు.  ఇతని గూర్చి ఇందులో తెలియజేయబడినది.  ఇలాంటివాడు యెహోవా దూతయైన క్రీస్తు ప్రభువు ఎదుట నిలిచియుండుట జెకర్యా తన దర్శనములో చూచుట జరిగింది.  ఇందులో ఎదుట నిలుచుట ద్వారా క్రీస్తు ప్రభువుయొక్క  కుడి యెహోషువకు ఎడముగాను, ఎడమ కుడిగాను మారునని గ్రహించాలి.  కనుక యెహోషువా క్రీస్తు ప్రభువుకు ఎదురుగా నిలువబడగా యెహోషువ కుడివైపు క్రీస్తుకు ఎడమవైపు వచ్చునని గ్రహించాలి.  ఇలా సాతాను ఎడమవైపునే నిలుచుని యెహోషువపై ఫిర్యాదు చేయుట జరుగుచున్నది.  అయితే అది యెహోషువకు కుడి స్థానమే, ఎందుకంటే యెహోషువ నీతిమంతుడు కాడని ఫిర్యాదులో ప్రధాన ఉద్దేశ్యమే కదా!  కనుక మనకు కుడి స్థానము నీతి, ఎడమ స్థానము అవినీతి.  సాతాను మన కుడి స్థానము పైనే ఎల్లవేళల పోరాటము జరుపును.  మనకు ఉన్న కొద్దిపాటి నీతిని కూడా దొంగిలించాలని ప్రయత్నము చేయుచూనే ఉండునని గ్రహించాలి.  1 పేతురు 5:8, ''నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.''

        జెకర్యా 3:2, ''- సాతానూ, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్ని లోనుండి తీసిన కొరవివలెనే యున్నాడుగదా అని యెహోవా దూత సాతానుతో అనెను.''  అని అనుటలో క్రీస్తు ప్రభువు కూడా సాతానును పరుషపు మాటలతో నిందించుట లేదు.  కేవలము యెహోవా నిన్ను గద్దించును అని మాత్రమే అనుట జరుగును అని చెప్పుచూనే యెహోవా రగులుతున్న కట్టె వలె ఉన్నాడని చెప్పుట జరిగింది.  రగులుతున్న కట్టె, యెహోవా దేవునిలోని కోపమునకు మాదిరిగా చెప్పబడినది.  అలాగే యూదా 1:9, ''అయితే ప్రధాన దూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషేయొక్క శరీరమునుగూర్చి తర్కించినప్పుడు, దూషించి తీర్పుతీర్చ తెగింపక- ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను.''  ఇలా ఒకరిని ఒకరు దూషించుట చేయుట లేదు.  అయితే సాధారణ నరులమైన మనము అనేక దూషణలు, నిందలు చేస్తూనే ఉన్నామన్న సంగతి గ్రహించాలి.  ఉదయము మొదలు సాయంత్రము వరకు మనము వేయుచున్న నిందలు ఎన్ని?  దూషించుట ఎన్నిసార్లు?  ఇలా పరిశుద్ధుని జాబితాలో చేరాలనుకొన్నవారు చేయకూడదని మనము గ్రహించాలి.  క్రీస్తు ప్రభువు చెప్పిన రెండు ప్రధాన సిద్ధాంతాలలో రెండవ సిద్ధాంతమే - మార్కు 12:31, ''రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పెను.''  ఇందునుబట్టి దూషించుటలో ప్రేమ ఉండదని గ్రహించాలి.  ఎవరిని నిందించుట చేయకూడదు.

        జెకర్యా 3:3, ''యెహోషువ మలిన వస్త్రములు ధరించినవాడై దూత సముఖములో నిలువబడియుండగా,'' అని అనుటలో మలిన వస్త్రములు అనగా నేమి?  యెహోషువా దేవుని కోసము పోరాడినవాడు కాదా?  మరి మలిన వస్త్రములు ధరించుకొనవలసిన అవసరత ఎందుకు వచ్చింది?  ఇలాంటివాడు మలిన వస్త్రములు ధరించుకొనవలసిన అవసరత లేదు, ఎందుకంటే యెహోషువ కాలేబుతో బాటుగా కానాను ప్రవేశించు యోగ్యతను కలిగియున్నారు.  వీరు తప్ప మిగిలినవారు అందరు మరణించుట జరిగింది. చివరకు మోషే కూడా కానానులో ప్రవేశించు యోగ్యతను కోల్పోయినాడు.  ఇంతకి ఇక్కడ చెప్పిన యెహోషువ ఎవరు?  ఇతను ప్రధాన యాజకుడని చెప్పబడినది.  జెకర్యా 6:11, ''వారి నడిగి వెండి బంగారములను తీసికొని కిరీటముచేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువ తలమీద ఉంచి.''  ఇందులోని యెహోషువ యెహోజాదాకు కుమారుడు.  జెకర్యా కాలము నాటివాడు అని గుర్తించాలి.  అయితే మనిషి తన మరణానంతరము వానిలోని ఆత్మ తన క్రియలనుబట్టి తాను జరిగించిన వాటిని బట్టి వస్త్రమును కలిగి యుంటుంది.  దీనినే మలిన వస్త్రముగా చెప్పబడినది.  (నాచే విరచితమైన ''మరణము తరువాత,'' అను పుస్తకమునందు ఇంకా వివరముగా చదువుకొనవచ్చును.)  ఇలా వీరు తీర్పు కాలము వరకు ఉండి నెమ్మదిని పొందుచున్నట్లుగా మనము గ్రహించాలి.  లూకా 16:23, ''అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి'' మరియు 16:25, ''అందుకు అబ్రాహాము కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు.''  

        ఈ విధముగా మలిన వస్త్రములతోనే ఉన్న పరదైసులలోని ఆత్మలు యాతన నుండి అనగా వారు భూమిపై జరిగించిన కార్యముల నుండి నెమ్మదిని క్రీస్తు రాకడ తీర్పు వరకు పొందుచూనే ఉందురని గ్రహించాలి.  అటుతరువాత పునరుత్థానము ద్వారా శరీరము మహిమను పొంది క్రీస్తు సన్నిధికి తీర్పు కొరకు చేర్చినప్పుడు వారు మలిన వస్త్రములనే కలిగి ఆయన సముఖమునకు తేబడుదురని గ్రహించాలి.  రోమా 3:11, ''నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు.''  రోమా 3:9, ''అందరును పాపమునకు లోనైయున్నారు.''  కనుక క్రీస్తు తీర్పు కాలములో మలిన వస్త్రముగా వారి పాపపు క్రియలు కనబరుచునని గ్రహించాలి.  ప్రకటన 19:9, ''మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను-గొఱ్ఱెపిల్ల పెండ్లివిందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము;  మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను.''  కనుక క్రియలు వస్త్ర రూపములో కనబడుచున్నవి.  ఎంత తెల్లని వస్త్రమైనను కొద్దిపాటి బురద మరక అసహ్యముగా చేయును కదా!  అలాగే దేవునిలో ఎంత ఉన్నత స్థానము పొందినను మనము చేయు చిన్నపాటి బురద వంటి పాపము మన వస్త్రములను మలిన వస్త్రములుగా మార్చునని గ్రహించాలి.

        జెకర్యా 3:4, ''దూత దగ్గర నిలిచియున్న వారిని పిలిచి-ఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి-నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను.'' అని వ్రాయబడుటనుబట్టి ఏది జరిగినను ఈ యెహోషువ కూడా నీతిమంతుడు.  కనుక క్రీస్తు ప్రభువు ప్రశస్తమైన వస్త్రములతో అలంకరింప చేయుచున్నాడు. అనగా యెహోషువలోని దోషమును ఆ దూత రూపములో ఉన్న క్రీస్తు ప్రభువు పరిహరించుచున్నట్లుగా మనము గ్రహించాలి.  నరుల దోషములను పరిహరింప జేయువాడు క్రీస్తు ప్రభువు మాత్రమే.  కనుక ఈ దూత క్రీస్తు ప్రభువు అని మనకు అర్థమగుచున్నది.

        జెకర్యా 3:5, ''అతని తలమీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవిచేయగా వారు అతని తలమీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి;  యెహోవా దూత దగ్గర నిలుచుండెను.''  అని వ్రాయబడుటనుబట్టి క్రీస్తు ప్రభువు ప్రశస్త వస్త్రములు దయచేసి యెహోషువలోని పాపపు జీవితమును, దోషములను పరిహరించిన తరువాత తీర్పు కాలములో తీర్పు తీర్చు అధికారమును పొందినవారు విమర్శించుట జరుగును.  1 కొరింథీ 6:2-3, ''పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా?  మీవలన లోకమునకు తీర్పు జరుగవలసి యుండగా, మిక్కిలి అల్పమైన సంగతులనుగూర్చి  తీర్పు తీర్చుటకు మీకు యోగ్యతలేదా?  మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని యెరుగరా?  ఈ జీవన సంబంధమైన సంగతులనుగూర్చి మరిముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా?''  వీరు విమర్శించి ఇచ్చిన తీర్పు ప్రకారమే వారి యొక్క ఉన్నత స్థితి క్రీస్తు వెయ్యి సంవత్సరముల పరిపాలనలోను, అటుతరువాత పరలోక జీవితములోను ఉండునని గ్రహించాలి.  అయితే జెకర్యా 3:5లో వలె యెహోషువ విషయములో జెకర్యా యెహోషువ తలపై తలపాగాను పెట్టమని చెప్పుట జరిగింది.

        జెకర్యా 3:6-7, ''అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను.  - సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా - నా మార్గములలో నడుచుచు నేను నీ కప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల, నీవు నా మందిరముమీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు; మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీ కిత్తును,''  అని వ్రాయబడుటనుబట్టి, దేవుని మందిరము అనగా యెరూషలేముకు అధికారిగా ఉండు భాగ్యము పొందుచున్నాడు.  అలాగే యెరూషలేముయొక్క ఆవరణను కాపాడుచూ అందులో నిలుచు భాగ్యము కలుగుచున్నది.  ప్రకటన 20:6, ''ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు.  ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.''  ఈ విధముగా యాజకులుగా మందిరముపై అధికారమును, ఆవరణను పాలించుచూ వీరు రాజ్యము చేయుట జరుగునని ఈ దర్శనములో చూపించుట జరిగింది.

        ఇందులో యెహోవా దూతయైన క్రీస్తు ప్రభువు యెహోషువకు తన ఆజ్ఞను సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినట్లుగా చెప్పుచూనే ఈ మాటలు చెప్పుట జరిగింది.  కనుక ఇక్కడ చెప్పునది క్రీస్తు ప్రభువే అయినను, యోహాను 17:7లో వలె చెప్పబడిన మాటలు మాత్రమే యెహోవా దేవునివేనని గ్రహించాలి.  జెకర్యా 3:8, ''ప్రధాన యాజకుడవైన యెహోషువా, నీ యెదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు; నీవును వారును నా మాట ఆలకింపవలెను, ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవుచున్నాను.'' అని వ్రాయుటనుబట్టి ప్రధాన యాజకుడైన యెహోషువతోబాటుగా అతనివంటివారు ఆయనకు సహకారులుగా ఉన్నారు.  అనగా తీర్పు తరువాత క్రీస్తు ప్రభువుయొక్క వెయ్యి సంవత్సరముల పరిపాలన కాలములో పాలిపంపులు గల ప్రతి ఒక్కరు యాజకులుగాను, పరిపాలకులుగాను ఉందురని మనము ప్రకటన 20:6లో చదువుకొన్నాము.

        ఇక జెకర్యా 3:8 నుండి రెండవ భాగముగా క్రీస్తు పుట్టుక గురించి యెహోవా దేవుడు జెకర్యాకు తెలియజేయుచున్నాడు.  అదే - ఏదనగా ''చిగురు'' అను నా సేవకుని నేను రప్పింపబోవుచున్నాను.

ఎ.  చిగురు  

        ఈ చిగురు అను యెహోవా సేవకుడు ఎవరు?

        యెషయా 11:1, ''యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును  వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును''  ఈ చిగురు క్రీస్తు ప్రభువు అని ''యెషయా ప్రవచన సాహిత్యము'' అను నాచే విరచితమైన గ్రంథములో చదువుకొని యున్నాము. ఇందులో యెష్షయి దావీదు తండ్రి.  యెష్షయి కాలమునకు ఈ వంశము మొద్దుగా మారి అందులో దేవునికి యోగ్యమైన స్థితిలో లేక ఉన్నది.  ఈ మొద్దు మాత్రమే నిలిచియున్నది.  అనగా యెష్షయి మాత్రమే దేవుని ఎన్నికలో ఒక మొద్దుగా నిలువబడి యున్నాడు.  ఇటువంటి దేవుని ఎన్నిక కలిగిన మొద్దు అను ఈ వంశములో చిగురు అంకురము అనునవి వచ్చునని చెప్పుట జరిగింది.  మొదటగా మొద్దు వేరులను పెట్టుకొననిదే చిగురును చిగురించదు.  ఇది అందరికి తెలిసిన విషయమే.  ఇలా యెష్షయి ఏడుగురి పిల్లలకు జన్మను ఇయ్యగా ఏడవవాడైన దావీదు దేవుని ఎన్నికలో నిలిచి క్రీస్తు ప్రభువు తన సంతానములోనే జన్మించునని, తన సింహాసనము క్రీస్తు ప్రభువుకు ఇయ్యబడునని వాగ్దానమును పొందెను.  అందుకే - లూకా 1:29-33, ''ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి-ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత-మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి.  ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడన బడును;  ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.  ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.''  ఈ విధముగా యెష్షయి అను మొద్దు జీవితములో తనకు కలిగిన సంతానమే వేర్లుగా ఎదిగి, అందులోని ఒక వేరు అంకురముగా మారి ఎదిగి ఫలించి దేవుని వాగ్దానమునకు కారణమైయ్యాడు.  ఇతనే దావీదు.  ఈ వాగ్దానము రహస్యమైనదే.  బహిరంగమైనది కాదు.  ఎందుకంటే వేరు భూమి లోపలికి ఉండి చూచువారికే కనబడదు.  దానిని తవ్వి - శ్రమించి చూడవలసినదే.  అనగా బైబిలు గ్రంథమును క్షుణ్ణముగా పరిశీలించి ఆత్మీయ జ్ఞానముతో పరిశీలించినవారికి మాత్రమే ఈ అంకురమను దావీదు చరిత్ర, అతని ఎన్నిక వివరముగా తెలుసుకొనుట జరుగును.

        అయితే అదే యెష్షయి మొద్దు నుండి దావీదు ఆత్మీయ ఫలింపునుబట్టి దేవుని వాగ్దానము వలన క్రీస్తు ప్రభువు ఒక చిగురుగా పుట్టుట అనగా అవతరించుట జరిగింది.  మత్తయి 1:11-16 వరకు వ్రాయబడిన యేసుయొక్క వంశావళిలో యెష్షయి యొక్క కుమారులలో దావీదుకు పుట్టిన వారిలోనే క్రీస్తు ప్రభువు పుట్టుట జరిగింది. మిగిలిన సంతానము కేవలము వేర్లుగానే ఉన్నారుగాని అంకురించి ఫలించి దేవుని వాగ్దానములను పొందలేకపోయారు.  ఈ చిగురు మొద్దుకు చిగిర్చినప్పుడు అందరికి బహిరంగముగానే కనబడును.  ఈ చిగురుకు రహస్యమనేది ఏమి లేదు, ఎందుంటే ప్రపంచములో ఎవరిని క్రీస్తు ప్రభువును గూర్చి అడిగినా తెలియదు అనేవారు అరుదు.  ప్రతి ఒక్కరికి ఆయన క్రైస్తవుల దేవుడుగా పరిచయమే.  వారు ముస్లీములు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, అన్యులు కావచ్చు.  ప్రతి ఒక్కరు ఆయనను గుర్తించినవారు.  ఇక్కడ ఈయనను పరిశోధించి కనుగొనకుండానే సువార్త రూపములో ప్రతి ఒక్కరికి తెలియజేయబడుచున్నది.  అదిగో ''చిగురు,'' అని ఎత్తి మరీ చూపిస్తున్నారు.  అందరికి చూపించబడుటకు యెష్షయి మొద్దుకు చిగురుగా బహిరంగముగా వచ్చి అందరికి కనబడుచున్నాడుగాని, విశ్వసించువారు మాత్రమే రక్షింపబడుదురని గ్రహించాలి.

        అయితే మన మూల వాక్యములో ఈ చిగురును నా సేవకునిగా యెహోవా దేవుడు చెప్పుట జరిగింది.  క్రీస్తు ప్రభువు ఈ లోకములో దైవకుమారునిగా జన్మించినప్పటికి దేవుని సేవకునిగా మనకు రక్షకునిగా ఈ లోకములో జీవించుట జరిగినదని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.  ఏనాడు క్రీస్తు ప్రభువు దేవుని కుమారునిగా తన జీవితములో కనబరచకుండా తనను తాను మన కొరకు తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని సాధారణ జీవితమునే జీవించాడు.  ఇలా దేవునిచే ''నా సేవకుడు'' అని పిలిపించుకొన్నాడు.  మత్తయి 12:8.  ఇలాంటి నా సేవకునిగా నేను చెప్పుకొనగలిగిన నా కుమారుని మీ మధ్యకు రప్పించబోవుచున్నానని యెహోవా దేవుడు జెకర్యాకు తెలియజేస్తున్నాడు.

బి.  రాతి, ఆ రాతికి ఏడు నేత్రములు

        జెకర్యా 3:9, ''యెహోషువ యెదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి ఏడు నేత్రములున్నవి, దాని చెక్కడపు పని చేయువాడను నేను.  ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు; మరియు ఒక దినము లోగానే నేను ఈ దేశముయొక్క దోషమును పరిహరింతును;''  ఇందులో ''యెహోషువ యెదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి,'' అని చెప్పబడినది.  ఇంతకు యెహోషువ యెదుటన సైన్యముల కధిపతియైన యెహోవా ఏమి ఉంచాడు?  రాతిని.  ఈ రాతి ఎవరు?  మొట్టమొదటగా ఈ దర్శనములో జెకర్యా కూడా యెహోషువ యెదుట యెహోవా దూతను చూచుట జరిగింది.  జెకర్యా 3:1, ''మరియు యెహోవా దూతయెదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువ బడుటయు, సాతాను ఫిర్యాదియై అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచెను.''  అనగా యెహోవా దూత యెదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడియున్నాడు.  అంటే ఒకరికి ఎదుట ఒకరు.  అలాగే యెహోషువ యెదుట యెహోవా దూత.  దానినే రాతిగా దేవుడైన యెహోవా వర్ణిస్తున్నాడు.  

        ఈ యెహోవా దూత క్రీస్తు ప్రభువని మనము జెకర్యా 3:1లో తెలుసుకొన్నాము, ఎందుకంటే జెకర్యా 3:4లో ఈ దూత - ''నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను.''  కనుక ఎవరి దోషములైన పరిహరించవలెనన్న అది ఒక్కరి వలననే సాధ్యము.  ఆయనే క్రీస్తు ప్రభువు.  ఇందులో ఆశ్చర్యమేమైన ఉన్నదా!  యెషయా 28:16, ''ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు  - సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే  అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి  బహు స్థిరమైన పునాదియైన మూలరాయియై యున్నది  విశ్వసించువాడు కలవరపడడు.''  ఈ రాయిని ఎవరు వేసారు?  ప్రభువగు యెహోవాయే కదా!  ఈ రాయి క్రీస్తు ప్రభువు అని పౌలు తన పత్రికలో సాక్ష్యము చెప్పుచున్నాడు.  1 కొరింథీ 3:11, ''వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే.''  కనుక క్రీస్తు ప్రభువు రాయిగా యెహోషువ ఎదుట ఉన్నాడు.  ఈ రాయిని తేరి చూడుడని చెప్పబడినది.  ఇంతకి జెకర్యా ఈ రాయిని యెహోవా మాట ప్రకారము తేరి చూడగా ఏమి కనబడినది?

        ''ఆ రాతికి ఏడు నేత్రములున్నవి.''  

        ఇందులో ఉన్న నేత్రములు దేనికి సూచనగా చెప్పబడినవి.  

        నేత్రము భవిష్యత్తు జ్ఞానమునకును సూచనగా చెప్పబడినది.  

        ప్రకటన 5:6, ''మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్ల నిలిచియుండుట చూచితిని.  ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను.  ఆ కన్నులు భూమియందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.''  

        కన్నులు ఆత్మలకు ప్రతిరూపముగా చెప్పబడినది.  ఇవి ఏడు రాతికి ఉన్నట్లుగా చెప్పబడినది.  అనగా రాతి రూపములో యెహోషువ ముందు ఉన్న రాయి ఏడు ఆత్మలను కలిగియున్నది.

        ఈ ఆత్మలు ఏవి?  

        యెషయా 11:1-2, ''యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును  వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును  యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ  ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ  తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును.''  

        ఈ ఆత్మలు ఆయన అనగా క్రీస్తు అను చిగురుపై నిలుచునని చెప్పబడినది.  కనుక ఈ రాయిపైన న్నులుగా ఈ ఏడు ఆత్మలు కనబడుచున్నవి.

        ఇంతకి ఈ ఆత్మలు ఏవి?  

        1.  జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ.  

        2.  వివేకమునకు ఆధారమగు ఆత్మ.  

        3.  ఆలోచనకు ఆధారమగు ఆత్మ.  

        4.  బలమునకు ఆధారమగు ఆత్మ.  

        5.  తెలివికి ఆధారమగు ఆత్మ.  

        6.  యెహోవాయందు భయమును పుట్టించు ఆత్మ మరియు  

        7.  యెహోవాయందు భక్తిని పుట్టించు ఆత్మ.  

        ఇలా ఈ ఏడు ఆత్మలు ఆయనపై నిలుచుట జరిగింది.  

        కనుక జెకర్యా దర్శనములో కూడా ఆ రాయిపై ఈ ఆత్మలు కన్నులుగా కనబడుచున్నవి.  అవే ప్రకటన 5:6లోని వధింపబడి యున్నట్లుగా కనబడిన గొఱ్ఱెపిల్లకు కూడా ఏడు కన్నులు ఉన్నవి.  

        అవి కూడా ఈ ఆత్మలే.  ఈ ఆత్మలన్ని క్రీస్తు ప్రభువుపై నిలిచి క్రియ జరిగించినట్లుగా గ్రహించాలి.

        ఇక, ''దాని చెక్కడపు పని చేయువాడను నేను,'' అని అనుటలో ఈ రాయిగా ఉన్న క్రీస్తు ప్రభువు, ఈ రాయిపై ఏడు కన్నులు, ఇవన్ని దేవుడైన యెహోవాయే చెక్కుచున్నట్లుగా చెప్పుచున్నాడు.  క్రీస్తుయొక్క సమస్త చర్యలలోను దేవుడైన యెహోవా పని మాత్రమే కనబడినది.  క్రీస్తు ప్రభువు తండ్రియొక్క పనిని తుద ముట్టించుటకే ఈ లోకమునకు వచ్చెను.  క్రీస్తుయొక్క పుట్టుక తండ్రి వలననే జరిగింది.  క్రీస్తుయొక్క బలియాగము తండ్రి వలననే జరిగినది.  కనుక క్రీస్తు చేయు ప్రతి పని దేవుడైన యెహోవా చేయు పనియే!

        ఇక ''మరియు ఒక దినము లోగానే నేను ఈ దేశముయొక్క దోషమును పరిహరింతును,''  అని వ్రాయబడుటనుబట్టి యెహోవా దేవుడు దోషమును ఏ విధముగా పరిహరించుట జరిగింది?  

        యోహాను 1:29, ''మరునాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి-ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.''  సిలువ బలియాగము ద్వారా ఒక దినములోనే సమస్త దోషములను పరిహరించుట జరిగింది.  ఇలా రక్షణను ఇవ్వబోవుచున్నానని జెకర్యాకు ముందుగానే తెలియజేయుచున్నారు.  ఈ రక్షణ కొరకు క్రీస్తు రూపములో అవతరించి దోష పరిహారముగా సమస్త దోషములను సిలువ బలియాగములో జరిగించి తన ఆత్మను అప్పగించుటకు పట్టిన కాలమే ఈ ఒక దినము.  ఈ దినములోనే దేవుడైన యెహోవా పరిహరించుట జరిగింది.

        జెకర్యా 3:10, ''ఆ దినమున ద్రాక్షచెట్లక్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరు ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.''  అని అనుటలో దోషమును పరిహరించిన ఈ దినములోనే క్రీస్తు ప్రభువు తన సువార్త కార్యమును జరిగించుట జరిగింది.  ఈ సువార్తను క్రీస్తు ప్రభువు రహస్యముగా కాక బహిరంగముగానే జరిగించాడు.  ఇదే విషయమును సిలువ బలియాగమునకు ముందు క్రీస్తు ప్రభువు తెలియజేసెను.  

        కొండలపై ఎడారులలో సముద్రపు ఒడ్డున, సమాజ మందిరములలో, యెరూషలేము దేవాలయములో ఇలా క్రీస్తు ప్రభువు సంచార జీవితములో అనేకులకు దేవుని రాజ్యమును గూర్చి బోధించాడు.  ఇలా బోధించుట జరుగుచున్నప్పుడు అక్కడ ఉన్న ఒకరినొకరు పిలుచుకొనుట జరుగునని, అలా పిలుచుకొని ఒకచోట కూర్చునుట జరుగును.  

        అదే దేవుడైన యెహోవా వీరు ద్రాక్షచెట్లక్రింద, అంజూరపు చెట్ల క్రింద కూర్చుని క్రీస్తు జరిగించు సువార్త తెలుసుకొనుటకు వారిలో వారు పిలుచుకొనుట జరుగునని జెకర్యాకు దర్శనములో తెలియజేయుట జరిగింది.

4.  దీపస్తంభము, ప్రమిదె, దీపములు, గొట్టములు,

ఒలీవ చెట్ల దర్శనము

జెకర్యా 4:1-14

దర్శనముయొక్క స్థితి :-  యెరూషలేము దేవాలయముయొక్క పున:నిర్మాణమును గూర్చి

దర్శనము ఎవరికి వచ్చింది :-  జెకర్యా (బెరక్యా కుమారుడు)

దర్శనము వచ్చిన కాలము :-  దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము శెబాటు అను పదకొండవ నెల యిరువది నాలుగవ దినమున.

దర్శనము ఇచ్చినది :-  యెహోవా దేవుని వాక్కు (అనగా క్రీస్తు)

ముఖ్య ఉద్దేశ్యము :-  యెరూషలేము దేవాలయమును తిరిగి నిర్మించుట.

అంతరార్థములు

దీపస్తంభము :-  యెరూషలేము అను పరిశుద్ధ నగరము

ప్రమిదె :-  గొఱ్ఱెపిల్ల దీపము

ఏడు దీపములు :-  ఏడు ఆత్మీయ సంఘములు -  1.  ఎఫెను  2.  సుర్న  3.  పెర్గము 4.  తుయతైర  5.  సార్దీస్‌  6.  ఫిలదెల్ఫియా  7.  లవొదికయ.

ఏడు గొట్టములు :-  దేవుని దూతలు

రెండు ఒలీవ చెట్లు :-  ఇద్దరు సాక్షులు (హానోకు, ఏలీయా)

దర్శనము ఎవరికి వచ్చింది :-  జెకర్యా (బెరక్యా కుమారుడు)

దర్శనము వచ్చిన కాలము :-  దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము శెబాటు అను పదకొండవ నెల యిరువది నాలుగవ దినమున.

దర్శనము ఇచ్చినది :-  యెహోవా దేవుని వాక్కు (అనగా క్రీస్తు)

దర్శనముయొక్క స్థితి :-  అప్పటి యెరూషలేములో జరగవలసిన దానిని గూర్చి

జెరుబ్బాబెలు :-  క్రీస్తుకు పూర్వీకుడు  (ముద్ర యుంగరము)

గొప్ప పర్వతము  :-  సాతాను.

ఈ దర్శనమును ప్రకటించవలసినది :-   జెకర్యా.

        జెకర్యా 4:1, ''నాతో మాటలాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యొకని లేపినట్లు నన్ను లేపి,'' అని అనుటలో జెకర్యా నిద్రలో లేడని తెలియుచున్నది.   అయితే జెకర్యా నిద్ర వంటి స్థితిలో వున్నాడు.  

        అందుకే నిద్రపోయిన యొకనిని లేపినట్లు నన్ను లేపి అని చెప్పుచున్నాడు.  కాని జెకర్యా నిద్రలో లేడు.  పరధ్యాసలో ఉన్నట్లుగా మనము గ్రహించాలి.  పరధ్యాసలో వున్న వ్యక్తి తన ముందు ఏమి  జరుగుతుందో తెలియదు.  ఇది ఒక రకముగా నిద్రావస్థ అనే చెప్పవచ్చును.

          జెకర్యా 4:2,  ''నీకు ఏమి కనబడుచున్నదని యడుగగా నేను- సువర్ణమయమైన దీపస్తంభమును దానిమీద ఒక ప్రమిదెయును, దీపస్తంభమునకు ఏడు దీపములును దీపమునకు ఏడేసి గొట్టములును కనబడుచున్నవి,'' అని అనుటలో జెకర్యాకు సువర్ణమయమైన దీపస్తంభము సంఘమునకు మాదిరిగా చెప్పబడినది.  ఈ సంఘమను దీపస్తంభము సువర్ణమయమైనది అనగా బంగారు రంగులో వున్నది.  బంగారము రాజరికమునకు గుర్తు.  కనుక రాజాధిరాజైన క్రీస్తు ప్రభువు ఏర్పరచినవిగా మనము గుర్తించాలి.  ప్రకటన 1:20, ''ఆ యేడు దీపస్తంభములు ఏడు సంఘములు.''  కనుక దీపస్తంభము సంఘమే.  అదే ప్రకటన 1:20లో ఈ దీపస్తంభములు సువర్ణముగా వున్నట్లుగా వ్రాయబడియున్నది.  కాని ఈ సంఘము యెరూషలేమను పరిశుద్ధ సంఘమని గ్రహించాలి.  ఇందులో చెప్పబడిన ఒక సువర్ణమయమైన దీపస్తంభము యెరూషలేమను పరిశుద్ధ సంఘమునకు మాదిరి.  దీనిపై ఒక ప్రమిదె యున్నది.  ఇదే దీపము.  సంఘమునకు దీపము క్రీస్తు ప్రభువుగా మనము గుర్తించాలి.  ప్రకటన 21:23, ''ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది.  గొఱ్ఱెపిల్లయే దానికి దీపము.''

        అయితే అదే సువర్ణమయమైన దీపస్తంభమునకు ఏడు దీపములును దీపమునకు ఏడేసి గొట్టములును కనబడినట్లుగా వ్రాయబడి యున్నది.  ఇందునుబట్టి సువర్ణమయమైన దీపస్తంభము అను పరిశుద్ధ యెరూషలేము ఒక దీపము గొఱ్ఱెపిల్ల రూపములో వుంటే, అదే యెరూషలేము ఏడుగా విభజింపబడి యున్నట్లుగా మనము గ్రహించాలి.  అనగా యెరూషలేమను పరిశుద్ధ వధువు సంఘము ఏడు సంఘములుగా  ఆత్మరీత్యా విభజింపబడి యున్నది.  ఈ ఏడు సంఘములు ఏడు దీపములుగా సంఘమునకు మూలమైన యెరూషలేము సంఘమునకు సమతుల్యముగా వారసత్వముతో ఏడు గొట్టములుగా అనగా ఏడు ద్వారములను కలిగియున్నాము.  అవే గొట్టములుగా కనబడుచున్నది.  అవే  1. ఎఫెసు,  2.  స్ముర్న,  3.  పెర్గము,  4.  తుయతైర,  5.  సార్దీస్‌,  6.  ఫిలదెల్ఫియ  7. లవొదికయ.  ఇందునుబట్టి సంఘము ఒక్కటేగాని అవి ఏడు సంఘములుగా ఆత్మరీత్యా క్రియ జరిగించుచున్నవి.  కనుకనే జెకర్యాకు యెహోవా వాక్కు ఇచ్చిన దర్శనములో సువర్ణమయమైన దీపస్తంభములో ఈ ఏడు దీపములు ఉన్నట్లుగా చెప్పుచున్నాడు.  ఈ ఏడు దీపములుకు రక్షణగా ఏడు గొట్టములు ఉన్నవి.  ఇవి ఏడు నక్షత్రములని అవి దేవుని దూతలు అని చెప్పబడినది.  ప్రకటన 1:19-20, ''కాగా నీవు చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట లుగబోవువాటిని, అనగా నా కుడిచేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ యేడు సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము.  ఆ యేడు దీపస్తంభములు ఏడు సంఘములకు దూతలు.  ఆ యేడు దీపస్తంభములు ఏడు సంఘములు.''  వీరు సంఘమును కాపాడువారు.  అనగా గొట్టములు ఏ విధముగా దీపమును కాపాడునో నక్షత్రములుగా చెప్పబడిన దేవుని దూతలు ఏడు సంఘములను కాపాడునని గ్రహించాలి.

        జెకర్యా 4:3, ''మరియు రెండు ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడిప్రక్క ఒకటియు ఎడమప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి,'' అని అనుటనుబట్టి రెండు ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడిప్రక్క ఎడమప్రక్క కనబడుచున్నవి.  ఇదే విషయమును ప్రకటన 12:14, ''అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను.  అచ్చట ఆ సర్పముఖమును చూడకుండ ఆమె ఒకకాలము కాలములు అర్ధకాలము పోషింప బడును.''  సంఘమను స్త్రీకి రెండు రెక్కలు అనగా కుడివైపు ఒక రెక్క ఎడమవైపు ఒక రెక్క ఉన్నట్లుగా గ్రహించాలి.  ఈ రెక్కలు ఒలీవ చెట్లు అని జెకర్యాలో చెప్పబడినది.  ఇంతకి ఈ ఒలీవ చెట్లు ఎవరు?

        ప్రకటన 11:3-4, ''నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను;  వారు గొనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు.  వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు.''  ఇందునుబట్టి ఈ ఒలీవ చెట్లు దేవునియొక్క యిద్దరు సాక్షులు అని తెలియుచున్నది.  వీరు హానోకు, ఏలీయాలని మనము నాచే విరచితమైన ప్రకటన గ్రంథ రహస్యములు ఇప్పుడు మీ చేతిలో. . .  అనిన పుస్తకమునందు ఋజువుపరచి యున్నాము.  వీరు సంఘమునకు ప్రక్కన వుండి సంఘమును సరియైన దారిలో నడిపించెదరని చెప్పబడినది.

        జెకర్యా 4:4-7, ''-నా యేలినవాడా, యిదేమిటియని నాతో మాటలాడుచున్న దూత నడిగితిని.  నాతో మాటలాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా యని నన్నడుగగా-నేను నా యేలినవాడా, నాకు తెలియ దంటిని.  అప్పుడతడు నాతో ఇట్లనెను-జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే; శక్తిచేతనైనను బలము చేతనైననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను.  గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపుదానవు?  నీవు చదునుభూమి వగుదువు;  -కృప కలుగును గాక కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసికొని పెట్టించును.''

        ఇందులో జెరుబ్బాబెలు ఎవరు?  జెరుబ్బాబెలు క్రీస్తుకు పూర్వీకుడు.  యూదా గోత్రములోనివాడు.  మత్తయి 1:12-13, ''బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను; జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను;''  ఇతను బబులోను దాస్యము నుండి తప్పించుకొనినవాడు.  హగ్గయి 2:13, ''శవమును ముట్టుటవలన ఒకడు అంటుపడి అట్టివాటిలో దేనినైనను ముట్టినయెడల తాను ముట్టినది అపవిత్రమగునాయని హగ్గయి మరల నడుగగా యాజకులు-అది అపవిత్రమగు ననిరి.''  ఇందునుబట్టి జెరుబ్బాబెలు క్రీస్తుకు పూర్వీకులలో ఒక తరమువాడై యుండి దేవుని చేత ఎన్నిక చేయబడి ఇశ్రాయేలీయులపై ఎన్నిక చేయబడినవాడు.

        ప్రియపాఠకులారా!  ఇశ్రాయేలీయులను యాకోబు ద్వారా తన జనాంగముగా ఎన్నుకొని వారిని బహుగా దేవుడు ఆశీర్వదించాడు.  అటుతరువాత వారు ఐగుప్తు దాస్యములో వుండగా మోషే నాయకత్వములో ఈ జనాంగమును అద్భుత రీతిలో కనానుకు దేవుడు నడిపించాడు.  కానానులో మొదట న్యాయాధిపతులు, అటుతరువాత రాజులు ఏర్పరచబడ్డారు.  వీరిలో సొలొమోను చక్రవర్తి యెరూషలేమును ప్రధాన నగరముగా చేసి అందులో దేవునికి ఆలయము దేవుని నిర్ణయముగా చేయుట జరిగింది.  ఈ ఆలయము జెరుబ్బాబెలుకు ముందు తరములో బబులోను రాజుల చేత నాశనము చేయబడినది.  ఈ ఆలయము దేవుని నిర్ణయము ప్రకారము కట్టబడినది కనుక ఇది తిరిగి పున:నిర్మాణము చేయవలసి యున్నది.  ఈ పున: నిర్మాణ కార్యము జెరుబ్బాబెలు జరిగించినట్లుగా మనము గ్రహించాలి.

        ఇందులో భాగముగా - జెకర్యా 4:7లో దేవుని ఆత్మ చేతనే ఈ కార్యము జరుగుచున్నట్లుగా చెప్పబడినది.  అంటే యెరూషలేముయొక్క పున:నిర్మాణ కార్యమునకు పునాది జెరుబ్బాబెలు చేత తన ఆత్మ ప్రేరణతో జరిగించినట్లుగా మనము గ్రహించాలి.  ''గొప్ప పర్వతమా,'' అని అనుటలో ఈ గొప్ప పర్వతము ఎవరు?  ఇది ఎందుకు జెరుబ్బాబెలును అడ్డగించుచున్నది?  ఇంతకి జెరుబ్బాబెలు చేయాలకున్న పని ఏది?

        జెరుబ్బాబెలు యెరూషలేము అను సువర్ణమయమైన ద్వీప స్తంభమును తిరిగి నిర్మించాలని అనుకున్నాడు.  దీనిని గొప్ప పర్వతము అడ్డగించుచున్నది.  అందుకే దేవుని వాక్యము - ''గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు?'' అని చెప్పుచున్నది.  ఇది దైవ వ్యతిరేకమైన చర్యగా చెప్పుటనుబట్టి, గొప్ప పర్వతము సాతానుగా గుర్తించాలి.  దైవకార్యములకు అతి పెద్ద అడ్డు బండ సాతానే కదా!  కనుక సాతానును గొప్ప పర్వతముగా చెప్పుట జరిగింది.  కాలి నడకన గొప్ప పర్వతములు దాటుట చాలా ప్రయాసముతో కూడిన పని.  అలాగే మానవులకు సాతానును జయించి సాతానును దాటి, నిజదైవమును తెలుసుకొని ఆయన మార్గములో జీవించుట కూడా చాలా ప్రయాసముతో కూడిన పనిగా గుర్తించాలి.  కనుక గొప్ప పర్వతము సాతానే!  కాని జెరుబ్బాబెలు చేయ తలచిన పని విషయములో ఈ గొప్ప పర్వతము చదును భూమిగా మారునని చెప్పబడినది.  చదును భూమి అనగా దేవునికి యోగ్యమైనదిగా గుర్తించాలి.  యోహాను 1:23, ''అందుకతడు-ప్రవక్తయైన యెషయా  చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాళముచేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను.''  కనుక సరాళము చేయబడిన అనగా చదును భూమి దేవునికి యోగ్యమైనదని గ్రహించాలి.  ఇలాంటి స్థితిలో సాతాను దేవునికి యోగ్యమైన చదును భూమిగా మారగా - ''కృప కలుగును గాక కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసికొని పెట్టించును,'' అనగా జెరుబ్బాబెలు యెరూషలేమును తిరిగి నిర్మించుటకు మొదటి రాయిని తీసి పునాది రాయిగా పెట్టునని చెప్పబడినది.

        జెకర్యా 4:8-9, ''యెహోవా వాక్కు మరల నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను- జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసియున్నవి, అతని చేతులు ముగించును, అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీయొద్దకు పంపియున్నాడని నీవు తెలిసికొందువు,''  అని అనుటలో తిరిగి యెహోవా వాక్కు  ప్రత్యక్షమై దేవుడు ఇశ్రాయేలీయుల పక్షముగా వున్నాడని తెలుసుకొనునట్లుగా ఈ పునాది కార్యము జరిగి పున:నిర్మాణ కార్యము జరిగించునని చెప్పబడినది.

        జెకర్యా 4:10, ''కార్యములు అల్పములై యున్న కాలమును తృణీకరించిన వాడెవడు?  లోకమంతటను సంచారము చేయు యెహోవాయొక్క యేడు నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుటచూచి సంతోషించును.''  కార్యములు అల్పములైయున్న కాలమును తృణీకరించినవాడెవడు?  ఈ జెరుబ్బాబెలు కాలమునకు ముందు ఇశ్రాయేలీయులు దైవవ్యతిరేకులై బబులోనునకు దాస్యము చేయుటకు కొనిపోబడినారు.  ఈ కాలములో దేవుని కార్యములు అల్పముగా గుర్తించాలి.  ఇలాంటి దానిని తృణీకరించినవాడు ఎవడు?  అని దేవుడు అడుగుచున్నాడు.  వీడే జెరుబ్బాబెలు.  నెహెమ్యా, హగ్గయి మొదలైన గ్రంథములలో జెరుబ్బాబెలు బబులోను నుండి వచ్చి యెరూషలేమును పున:నిర్మాణ కార్యము జరిగించినట్లుగా చదువగలము.  కనుక ఈ తృణీకరించినవాడు జెరుబ్బాబెలు.  ఇటువంటివాని చేతిలో గుండు నూలు వుండుట చూచి, అనగా ఇది బేలదారి మేస్త్రీ చేతిలో వుండు తూకపు గుండుగా గుర్తించాలి.  ఇది చూచిన యెహోవాయొక్క యేడు నేత్రములు సంతోషించినట్లుగా చదువగలము.   ఈ విధముగా జెరుబ్బాబెలు యెరూషలేము అను సువర్ణమయమైన దీపస్తంభమును తిరిగి పున:నిర్మాణము చేయుటను జెకర్యా తన దర్శనము ద్వారా తెలియజేస్తున్నాడు.

        జెకర్యా 4:11-12, ''దీపస్తంభమునకు ఇరుప్రక్కలనుండు ఈ రెండు ఒలీవచెట్లు ఏమిటివనియు, రెండు బంగారపు కొమ్ములలోనుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న రెండు కొమ్మలును ఏమిటివనియు నేనతనిని నడుగగా,'' మరియు జెకర్యా 4:13-14, ''అతడు నాతో-ఇవేమిటివని నీకు తెలియదాయనెను-నా యేలినవాడా, నాకు తెలియదని నేననగా అతడు-వీరిద్దరు సర్వలోకనాధుడగు యెహోవాయొద్ద నిలువబడుచు తైలము పోయువారై యున్నారనెను.''  వీరు ఇద్దరు సాక్షులు.  ప్రకటన 11:3-4, ''నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు.  వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు.''  సర్వలోకనాధుడగు యెహోవాయొద్ద నిలువబడి తైలమును బంగారపు కొమ్ము నుండి కుమ్మరించి ఈ ఇద్దరు సాక్షులు పరిశుద్ధులను అభిషేకించుచున్నారు.  కనుక వీరు ఆ తైలమునకు మూలమైన ఒలీవ చెట్లువంటివారు.  వీరు బంగారపు కొమ్ము నుండి సువర్ణ తైలముతో పరిశుద్ధులను అభిషేకించు వారుగా చెప్పుచున్నాడు.  ఇవన్ని ఆత్మయొక్క శక్తితో జరుగునేగాని స్వశక్తితో కాదని గ్రహించాలి.

        ఈ దర్శనములో మొదట యెరూషలేము అను పరిశుద్ధ నగరమును ఆత్మరీత్యా భూమిపై నిర్మింపబడి బబులోను దాస్య కాలములో పడగొట్టబడినది.  ఈ స్థితిలో జెరుబ్బాబెలు చేతి ద్వారా పున:నిర్మాణ కార్యము జరిగించబడునని ఈ దర్శనములో చెప్పబడినది.  ఇటువంటి పున:నిర్మాణము జరిగిన యెరూషలేము తిరిగి ఆత్మరీత్యా ఇద్దరు సాక్షుల సహాయముతో యెరూషలేము తేజరిల్లబోవుచున్నట్లుగా చెప్పబడినది.

5.  ఎగిరిపోవు పుస్తకము

జెకర్యా 5:1-4

దర్శనముయొక్క స్థితి :-  అప్పటి యెరూషలేములో జరగవలసిన దానిని గూర్చి

దర్శనము ఎవరికి వచ్చింది :-  జెకర్యా (బెరక్యా కుమారుడు)

దర్శనము వచ్చిన కాలము :-  దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము శెబాటు అను పదకొండవ నెల యిరువది నాలుగవ దినమున.

దర్శనము ఇచ్చినది :-  యెహోవా దేవుని వాక్కు (అనగా క్రీస్తు)

దర్శనముయొక్క ఉద్దేశ్యము :-  బైబిలు గ్రంథము ప్రపంచ వ్యాప్తి పొందబోవుచున్నదని చెప్పుట.

అంతరార్థములు  

ఎగిరిపోవు పుస్తకము - పాత మరియు క్రొత్త నిబంధనలతో

                    కూడిన బైబిలు గ్రంథము.    

ఇండ్లలోని దూలము మరియు రాళ్లు - క్రియలు.

        ప్రియపాఠకులారా!  జెకర్యా 5:1, ''నేను మరల తేరిచూడగా ఎగిరిపోవు పుస్తకమొకటి నాకు కనబడెను.''  ఇందులో ప్రవక్తయైన జెకర్యా తేరిచూడగా అనగా ప్రత్యేకించి చూచినప్పుడు ఒక ఎగిరిపోవు పుస్తకము కనబడింది.  ఈ పుస్తకము - జెకర్యా 5:2, ''నీకేమి కనబడుచున్నదని అతడు నన్నడుగగా నేను, -ఇరువైమూరల నిడివియు పది మూరల వెడల్పునుగల యెగిరిపోవు పుస్తకమొకటి నాకు కనబడు చున్నదంటిని.''  జెకర్యా 5:3, ''అందుకతడు నాతో ఇట్లనెను-ఇది భూమియంతటిమీదికి బయలువెళ్లు శాపమే; దానికి ఒక ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి దొంగిలువారందరును కొట్టివేయబడుదురు;''  రెండవ ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి అప్రమాణికులందరును కొట్టివేయబడుదురు.''  ఇందులో రెండు రకముల వారిని గూర్చి వ్రాయబడినది.  

        1.  దొంగిలువారు  2.  అప్రమాణికులు.

ఎ.  దొంగిలువారు  

        మలాకీ 3:8-9, ''మానవుడు దేవుని యొద్ద దొంగిలునా?  అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి; దేనివిషయములో మేము నీయొద్ద దొంగిలితిమని మీరందరు.  పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి.  ఈ జనులందరును నాయొద్ద దొంగిలుచునే యున్నారు, మీరు శాపగ్రస్తులై యున్నారు.''  సాధారణముగా వేరేవారి వస్తువులను దొంగిలించుట చాలామంది చేస్తుంటారు.  చిన్న పెన్నులు మొదలు ప్రక్క ఇంటివారి చెట్లుకు ఉన్న కాయలు లేక పండ్లు వరకు దొంగిలించుచూనే ఉందురు.  దొంగ ఇంటికి కన్నము వేసి దొంగిలించినదే దొంగతనము అనుకొనుట పొరబాటే!  చిన్న వస్తువు నుండి  ప్రక్కవారి ఇంటిలో కాచిన కాయలు, పండ్లును వారిని అడగకుండా తీసుకొనుట కూడా దొంగతనమే.  ఇలాంటి దొంగతనములలో మరొక ఉదాహరణ అత్యల్పమైనది నీచమైనది దేవునికి చెందవలసిన దశమ భాగమును దొంగిలించుట అని గ్రహించాలి.  ద్వితీయోపదేశకాండము 14:23-29.

బి.  అప్రమాణికులు

        అప్రమాణికులు అనగా వాగ్దానము చేసి నెరవేర్చనివారు.   ఉదా :-  మనము బాప్తిస్మమప్పుడు క్రీస్తు ప్రభువును తప్ప మరి ఎవరిని రక్షకునిగా అంగీకరించమని ప్రమాణము చేసియున్నాము.  నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తామని ప్రమాణము చేసియున్నాము.  ఈ వాగ్దానములు నెరవేర్పువారు ఎందరు?  దేవుని 10 ఆజ్ఞలను ప్రతి ఒక్కరు పాటించవలసినదే కదా!  అయితే ఎందరు పాటించుచున్నారు.  ఎందరు ఈ ప్రమాణము నుండి వైదొలగియున్నారు.  అలాగే మనము మొక్కుకొను ప్రతీది వాగ్దానమే.  అయితే నెరవేర్చువారు ఎందరు?

        ఈ రెండు రకములవారు రెండవ మరణమును పొందువారుగా వర్ణించబడినది.  ప్రకటన 21:8, ''పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.''  ఇందులో చెప్పబడినవారు పై రెండు వర్గములలోనివారే అని గ్రహించాలి.  ఇలాంటివారి మీదకు ఈ పుస్తకము శాపముగా వెళ్ళుచున్నట్లుగా చెప్పబడినది.  జెకర్యా 5:3, ''ఇది భూమియంతటిమీదికి బయలువెళ్లు శాపమే;''  జెకర్యా 5:4, ''ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు - నేనే దాని బయలుదేర జేయుచున్నాను; అది దొంగల యిండ్లలోను, నా నామమునుబట్టి అబద్ధప్రమాణము చేయువారి యిండ్లలోను ప్రవేశించి వారి యిండ్లలో ఉండి వాటిని వాటి  దూలములను రాళ్లను నాశనము చేయును.''  

        1 కొరింథీ 3:11-15, ''వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు;  ఈ పునాది యేసు క్రీస్తే.  ఎవడైనను ఈ పునాదిమీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైనవాటితో కట్టినయెడల, వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును.  మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.  పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును.  ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.''  ఇందునుబట్టి ఇందులో చెప్పబడిన దూలములు రాళ్ళను క్రియలుగా మనము గుర్తించాలి.  ఈ క్రియలు దేవునికి యోగ్యమైనవైతే అది దేవుని అగ్నిచే పరీక్షింపబడినప్పుడు అవి నిలిచి క్రీస్తు ప్రభువు ఇచ్చు ప్రతిఫలమును పొందును.  అయోగ్యమైనవైతే కూడా క్రీస్తు ప్రభువు ఇచ్చు ప్రతిఫలమును పొందుదురుగాని అది నిత్యజీవము కాదు.  

        ప్రకటన 20:12, ''ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.''  తీర్పులో వారు పొందునవి రెండు.  1.  నిత్యజీవము  2.  నిత్యనరకము.  నిత్యజీవము నీతిమంతులకు లభించును.  కాని నిత్యనరకము దొంగిలువారు, అప్రమాణికులకు లభించును.  ఇది శాపమే కదా!  ఆదాము దేవుని తీర్పు తరువాత ఏదెను వనమును పోగొట్టుకొని, అక్కడ నుండి దైవశాపమును మరణమును పొంది త్రోసివేయబడెనని మనకందరికి తెలిసిన విషయమే.  అలాగే జెకర్యా కాలము నాటికి ఒక పాత నిబంధన అనగా ధర్మశాస్త్రము మాత్రమే ఉన్నది.  దీనిని ఇశ్రాయేలీయులు ఒక మందసము చేసి అందులో ఉంచి తమతోబాటుగా తీసుకొని కానానుకు చేరి అక్కడ యెరూషలేము దేవాలయములో భద్రపరచుట జరిగింది.  ఇంతవరకు అది ఎక్కడకు వెళ్ళలేదు.  ఈ ధర్మశాస్త్ర సంబంధమైన గ్రంథము యెరూషలేము దేవాలయములో భద్రముగా ఉంచబడినది.  ఎప్పుడో పండుగలకు పబ్బాలకు దానిని తీసి చదివి అందులోనే ఉంచేవారు.

        ఇలాంటి నిబంధనలుగల ధర్మశాస్త్రముతో నిండిన మందసమును ఫిలిష్తీయులు తీసుకొని తమ దేశమునకు ఎగరేసుకొని పోవుట జరిగినట్లు మనము చదువగలము.  

1 సమూయేలు 4:4-11, ''కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడనుండి కెరూబులమధ్య ఆసీనుడైయుండు సైన్యముల కధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి.  ఏలీయొక్క యిద్దరు కుమారులైన హొఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరు భూమి ప్రతి ధ్వని నిచ్చునంత గొప్పకేకలు వేసిరి.  ఫిలిష్తీయులు ఆ కేకలు విని, హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకలధ్వని యేమని అడిగి, యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చెనని తెలిసికొని జడిసి దేవుడు దండులోనికి వచ్చెనని అనుకొని-అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారీలాగు సంభ్రమింపలేదు, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలోనుండి మనలను ఎవరు విడిపింపగలరు?  అరణ్యమందు అనేకమైన తెగుళ్లచేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా.  ఫిలిష్తీయులారా, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండ బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి.  ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరు తమ డేరాలకు పరుగెత్తి వచ్చిరి.  అప్పుడు అత్యధికమైన వధ జరిగెను; ఇశ్రాయేలీయులలో ముప్పదివేల కాల్బలము కూలెను.  మరియు దేవుని మందసము పట్టబడెను; అదికాకను హొఫ్నీ ఫీనెహాసులను ఏలీయొక్క యిద్దరు కుమారులు హతులైరి.''  ఈ విధముగా ఫిలిష్తీయుల చేతికి చిక్కి బలవంతముగా ఎగురుటకు ముందు జరిగిన మారణహోమము.

        1 సమూయేలు 5:1-6, ''ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరునుండి అష్డోదునకు తీసికొనివచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి.  అయితే మరునాడు అష్డోదువారు ప్రాత:కాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి యుండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వానిస్థానమందు మరల ఉంచిరి.  ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడియుండెను.  దాగోనుయొక్క తలయు రెండు అరచేతులును తెగవేయబడి గడపదగ్గర పడియుండెను, వాని మొండెము మాత్రము వానికి మిగిలి యుండెను.  కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చు వారేమి నేటివరకు ఎవరును అష్డోదులో దాగోనుయొక్క గుడిగడపను త్రొక్కుట లేదు.  యెహోవా హస్తము అష్డోదువారిమీద భారముగా ఉండెను.  అష్డోదువారిని దాని సరిహద్దులలో నున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా.''  ఇలా ఫిలిష్తీయుల వలన బలవంతముగా అష్డోదునకు ఎగిరించబడిన పాత నిబంధన అను పుస్తకముతో నిండిన నిబంధన మందసము అక్కడ వారిని శాపగ్రస్తులుగా తీర్పు తీర్చగా అక్కడివారు అనేక విధాలుగా బాధింపబడి హతమగుట జరిగింది.

        1 సమూయేలు 5:7-9, ''అష్డోదువారు సంభవించిన దాని చూచి- ఇశ్రాయేలీ యుల దేవుని హస్తము మనమీదను మన దేవతయగు దాగోనుమీదను బహుభారముగా నున్నదే; ఆయన మందసము మనమధ్య నుండుటయే దీనికి కారణముగదా; అది యిక మన మధ్య నుండకూడదని చెప్పుకొని ఫిలిష్తీయుల సర్దారు లందరిని పిలువనం పించి-ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మరియు ఏమి చేయుదుమని అడిగిరి.  అందుకు వారు-ఇశ్రాయేలీయుల దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును అక్కడనుండి గాతునకు మోసికొని పోయిరి.  అయితే వారు అష్డోదు నుండి గాతునకు దానిని మోసికొనిపోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి, గొప్ప నాశనము జేసెను.''  అటుతరువాత - 1 సమూయేలు 5:10-12, ''వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి-మనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసికొని వచ్చిరనిరి.  కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులనందరి  పిలువనంపించి-ఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జనులను చంప కుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి.  

        దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండెను గనుక మరణభయము ఆ పట్టణస్థులందరిని పట్టి యుండెను.  చావక మిగిలి యున్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి.  ఆ పట్టణస్థుల కేకలు ఆకాశమువరకు వినబడెను.''  అటుతరువాత 1 సమూయేలు 6:19-21, ''బేత్షెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతముచేసి ఆ జనులలో ఏబది వేల డెబ్బదిమందిని మొత్తెను.  యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దు:ఖాక్రాంతులైరి.  అప్పుడు బేత్షెమెషువారు పరిశుద్ధదేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు?  మనయొద్దనుండి ఆయన ఎవరియొద్దకు పోవలెనని చెప్పి కిర్యత్యారీము కాపురస్థులకు దూతలను పంపి-ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరల తీసికొని వచ్చిరి; మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసికొని పోవలెనని వర్తమానము పంపిరి.''

        ఇలా జరుగుటకు కారణమేమి?  ఈ మందసము జీవమైన దేవునిది.  ఇది ఎక్కడ ఉండునో అక్కడ అది తీర్పు తీర్చునని జెకర్యాకు దేవుడు తెలియజేయుచున్నాడు.  అందుకే  - జెకర్యా 5:3-4, ''అందుకతడు నాతో ఇట్లనెను-ఇది భూమియంతటిమీదికి బయలువెళ్లు శాపమే; దానికి ఒక ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి దొంగిలువారందరును కొట్టివేయబడుదురు;  రెండవ ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి అప్రమాణికులందరును కొట్టివేయబడుదురు.  ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు-నేనే దాని బయలుదేర జేయుచున్నాను; అది దొంగల యిండ్లలోను, నా నామమునుబట్టి అబద్ధ ప్రమాణము చేయువారి యిండ్లలోను ప్రవేశించి వారి యిండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును,'' అని వ్రాయబడినది.  ఈ విధముగా అష్డోదులో, గాతులో మొదలైన వాటిలో ఈ ధర్మశాస్త్ర గ్రంథము అను పాతనిబంధన ఆజ్ఞలు కలిగిన మందసమును ఉంచినప్పుడు అది ప్రతి ఒక్క ఇండ్లలో ప్రవేశించి వాటి దూలములను, రాళ్లను అనగా క్రియలను పరిశోధించి వారిని శిక్షించుట చేసినట్లుగా మనము గ్రహించాలి.  దేవుని పాత నిబంధన గ్రంథము లేక పది ఆజ్ఞలు మంచి చెడు తెలుపుటయే కదా!  అదే ఈ గ్రంథముతో నిండిన మందసమును తీసుకొని వెళ్ళినప్పుడు దాని పని అది చేసి అక్కడివారి అప్రమాణికులు దొంగలపై తన నుండి శాపమును వెళ్ళగ్రక్కినట్లుగా మనము గ్రహించాలి.

        అదే మందసము దేవుని పది ఆజ్ఞల గ్రంథమును కలిగి ఇశ్రాయేలీయులలో ఉన్నంతవరకు వారిని కూడా దేవుని నుండి వారు తొలగినప్పుడెల్లా శిక్షించినట్లుగా మనము బైబిలు గ్రంథములో చదువగలము.  అనేకమార్లు ఇశ్రాయేలీయులు పతనమును అనగా శాపమును చూచుట, తిరిగి మారుమనస్సు పొంది పవిత్ర స్థితిని మారినప్పుడు వారిని రక్షించుచూ వచ్చింది.  ఇంతవరకు జెకర్యా చూచినది పైన చెప్పబడిన సంగతి కాదు.  జెకర్యాకు దర్శనములో చూపినది ఇక జరగబోవు సంగతి.  అదే క్రీస్తు తరువాత క్రొత్త నిబంధన అను క్రీస్తు తన రక్తము చిందించి ఏర్పరచిన నిబంధన అను గ్రంథము దానితోబాటుగా జతపరచిన పాత నిబంధన గూర్చియే ఈ ఎగిరిపోవు పుస్తకము.  ఈ ఎగిరిపోవు పుస్తకము మొదట నుండి ఇశ్రాయేలీయులతోనే ఉండినది.   క్రీస్తు దానిలో నూతన నిబంధనను ఏర్పరచి ఎగిరిపోవు పుస్తకములో జతపరచుట జరిగింది.  అటుతరువాత క్రీస్తు ప్రభువు తాను ఏర్పరచుకొన్న 12 మంది శిష్యులకు దానిని వారికి ఇచ్చి ప్రపంచ నలుమూలల దానిని సువార్త రూపములో బోధించమని చెప్పుట జరిగింది. ఇలా నూతన మరియు పాత నిబంధనలతో కూడిన ఈ ఎగిరిపోవు పుస్తకము ఈనాడు ప్రపంచ నలుమూలలో కనబడుచున్నది.  ఇంతకి ఇది ఎక్కడ నుండి వచ్చింది?  పాలస్తీనాలోని ఇశ్రాయేలు దేశము నుండియే కదా!

        క్రీస్తు పునరుత్థానము తరువాత తన శిష్యులను సువార్తకు పంపించగా, అపొస్తలులలో ఒకడైన తోమా ఈ నిబంధనలతో కూడిన గ్రంథమును సువార్త రూపము క్రీ.శ. 100 సంవత్సరముల లోపలే ఇండియాలోకి కొని వచ్చెనంటే దీని అర్థమేమిటి?  కనుక యెహోవా దేవుడు తన నిబంధనలు అత్యంత త్వరితగతిన ఎగిరి ప్రపంచ నలుమూలల వ్యాపింపబోవుచున్నదని జెకర్యాకు చూపించుట జరిగింది.  ఈనాడు ఇలా ఎగిరి వచ్చిన గ్రంథమైన బైబిలును మన ఇళ్లలో ఉంచుకొనుట దానిని పాటించాలని ప్రయత్నించుట జరుగుచున్నది.  కాని అలా ఎగిరి వచ్చిన ఈ గ్రంథము మన గుమ్మములను రాళ్ళను అనగా  క్రియలను పరిశోధించి అందులోని దొంగలపై, అప్రమాణికులకుపై తన శాపమును పంపుచున్నట్లుగా మనము గ్రహించవలసి యున్నది.

6.  తూములో కూర్చున్న యొక స్త్రీ  

సంకుబుడి కొంగ రెక్కలుగల ఇద్దరు స్త్రీలు

జెకర్యా 5:5-11

దర్శనముయొక్క స్థితి :-  అప్పటి యెరూషలేములో జరగవలసిన దానిని గూర్చి

దర్శనము ఎవరికి వచ్చింది :-  జెకర్యా (బెరక్యా కుమారుడు)

దర్శనము వచ్చిన కాలము :-  దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము శెబాటు అను పదకొండవ నెల యిరువది నాలుగవ దినమున.

దర్శనము ఇచ్చినది :-  యెహోవా దేవుని వాక్కు (అనగా క్రీస్తు)

దర్శనము ఉద్దేశ్యము :-  అన్య దేవతల గుడుల నిర్మాణము ఎలా జరుగును అను దానిని గూర్చి తెలియజేయుట.

అంతరార్థములు

కొల :-  కొలత

తూము :-  రహస్య జీవితము

సీసపు బిళ్ళ :-   రహస్య జీవితమును కనబడక మూయునది.

తూములో కూర్చున స్త్రీ :-  దోషమూర్తి అనగా బబులోను

ఇద్దరు స్త్రీలు :-  సాతాను దూతలు

సంకుబుడి కొంగ :-  దేవుడు నిషేధించిన పక్షి

రెక్కలు :-  సాతాను ఇచ్చిన ఆధిక్యతలు

సాలలు :-  గుడులు

పీఠము :-  ఆరాధనకు ఉపయోగించు స్థలము.

        ప్రియపాఠకులారా!  జెకర్యా 5:5, ''అప్పుడు నాతో మాటలాడుచున్న దూత బయలు వెళ్లి-నీవు నిదానించి చూచి ఇవతలకు వచ్చునదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా,'' అని వ్రాయబడుటనుబట్టి కనిపెట్టి చూచిన జెకర్యా, అదేమిటో అర్థము కాకపోవుట చేత మరల దూతను అడుగుట జరిగింది.  జెకర్యా 5:6, ''ఇదేమిటియని నేనడిగితిని.  అందుకతడు-ఇది కొల, ఇది బయలువెళ్లు తూము అనెను; మరియు లోకమంతటను జనులు ఈలాగున కనబడుదురని చెప్పెను.''

        ఇందులో - కొల అనగా కొలతను చూపునవి.  అలాగే బయలు వెళ్ళు తూము అనగా తూమును ద్వారము అందురు.  దీనికి మూత ఉండి దానిని తీసిన దానిలోనివి బయటకు వచ్చుట జరుగును.  తూము మూడు ప్రక్కల నిర్మించబడి దాని ద్వారా ప్రవాహము వచ్చుటకు అవకాశము కలిగియుండును.  అయితే ఈ తూము రహస్య జీవితమునకు మాదిరిగా చెప్పబడినది, ఎందుకంటే ఆ ద్వారమును తెరిచినప్పుడే దానిలో ఏమున్నదో తెలుస్తుంది.  మరి ఆ ద్వారమును తెరవనప్పుడు అందులో ఏమున్నదో మనకు తెలియదు.  ఇలాంటి రహస్య స్థితి కలిగిన ఈ తూమునకు కొల అనగా కొలతలు కలిగియున్నది.  ఈ కొలను బట్టి మనము దానియొక్క రహస్య క్రియల పరిమాణమును తెలుసుకోవచ్చును.

        ఇందులో - ''లోకమంతటను జనులు ఈలాగున కనబడదురని చెప్పెను.''  ''ఈలాగున,'' అనుటలో ఏలాగున కనబడును?  కొల తూము లాగున ప్రతి ఒక్కరు కనబడుదురు.  అనగా వారి రహస్య జీవితము దాని కొలతతోబాటుగా వారు కనబడుదురు.

        జెకర్యా 5:7, ''అప్పుడు సీసపు బిళ్లను తీయగా కొల తూములో కూర్చున్న యొక స్త్రీ కనబడెను.''  ఈ వచనము పైన చెప్పిన రహస్య జీవితమును సమర్థించునదిగా వ్రాయబడినది.  దాని సీసపు బిళ్ళ అనగా మూతను తీసినప్పుడు, ఆ తూములో జెకర్యాకు  మొదట కనబడని రీతిగా రహస్యముగా కూర్చునియున్న ఒక స్త్రీ కనబడుట జరిగింది.  అనగా ఈ స్త్రీ రహస్యముగా కూర్చుని యున్నది.  కనుక ఈ స్త్రీ మనము జరిగించు రహస్య క్రియలకు మాదిరిగా చెప్పబడినది.

        జెకర్యా 5:8, ''అప్పుడతడు-ఇది దోషమూర్తి యని నాతో చెప్పి తూములో దాని పడవేసి సీసపుబిళ్లను తూముమీద నుంచెను.''  ''దోషమూర్తి,'' అనగా పాపపు జీవితములో ఉన్న స్త్రీని దోషమూర్తి అనుట జరిగింది.  అనగా లోకమంతటను జనులు ఈ దోషమూర్తి లాగానే కనబడుదురు, ఎందుకంటే పాపము చేయనివారు లేరని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.  రోమా 3:11, ''నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు  గ్రహించు వాడెవడును లేడు  దేవుని వెదకువాడెవడును లేడు.''  కనుక పాపము జీవితము కలిగిన ప్రతి ఒక్కరు దోషమూర్తియే.  ఈ మూర్తిని గూర్చి - ప్రకటన 18:2, ''అతడు గొప్ప స్వరముతో అర్భటించి యిట్లనెను-మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను.  అది దయ్యములకు నివాసస్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రముగను అసహ్యముగానైన ప్రతి పక్షికి ఉనికిపట్టును ఆయెను.''  ఇందునుబట్టి ఈ దోషమూర్తిని బబులోను అని ప్రకటన గ్రంథములో చెప్పుట జరిగింది.  ఇక్కడ అందరి దోషములకు ఒక మోడల్‌గా ఒక స్త్రీ అని చెప్పబడినదేగాని, ఇది అందరి దగ్గర ఉన్న పాపమే.  అనగా పాపపు దోషము ఆ స్త్రీగా దేవుని ఎదుట కనబడెను.  అనగా నీ గురించి దేవుడు పరికించి చూచినప్పుడు, తీర్పు దినమున మన పాపపు జీవితము ఒక దోషమూర్తిగా బయటపడునని గ్రహించాలి.  ఇలాంటి స్త్రీని మరల తూములో పడవేసి సీసపు బిళ్లను ఉంచి మూసివేసినట్లుగా చెప్పబడినది.  అనగా స్త్రీ లేక మనందరి రహస్య జీవితమును మూసివేయుట జరిగింది.  కాని ఒకానొక కాలమున తీర్పు దినమున మరల తిరిగి తియ్యబడునని గ్రహించాలి.

        జెకర్యా 5:9, ''నేను మరల తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరిరి; సంకుబుడి రొంగ రెక్కల వంటి రెక్కలు వారి కుండెను, గాలి వారి రెక్కలను ఆడించుచుండెను, వారు వచ్చి తూమును భూమ్యాకాశముల మధ్యకు ఎత్తి దాని మోసిరి.''  ఇందులో మరల ఇద్దరు స్త్రీలను గూర్చి చెప్పుట జరిగింది.  వీరు సాతానుయొక్క అంధకార శక్తులు.  వీరు స్త్రీ రూపములోనే కనబడుట జరుగుచున్నది.  వీరికి సంకుబుడి  కొంగ రెక్కలవంటి రెక్కలు కలిగి యున్నారు.  రెక్కలు ఆధిక్యతకు సూచన.  ఈ ఆధిక్యత వీరు సాతానునుండి పొందినది.  లేవీయకాండము 11:13, 18, ''పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను.  వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ,  . . .  సంకుబుడి కొంగ, ప్రతివిధమైన కొంగ.''  దేవుడు నిషేధించినవి సాతానుకు నిలయమని గ్రహించాలి.  కనుకనే నేను ఈ స్త్రీలు పొందిన ఆధిక్యతను సాతాను నుండి పొందినవిగా వ్రాయుట జరిగింది.  ఇలా సాతాను దూతలు స్త్రీల ఆకారములో సాతానుయొక్క రెండు రెక్కలు కలిగి ఈ స్త్రీకి సహాయము చేయుటకు వచ్చినట్లుగా మనము గ్రహించాలి.  అందుకే అపొస్తలుడైన పౌలు విశ్వాసి పోరాటమును గూర్చి చెప్పుచూ మన పోరాటము సాధారణమైనది కాదని చెప్పుట జరిగింది.  ఎఫెసీ 6:12, ''ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండల మందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.''  కనుక చెడుకు సాతానుయొక్క అంధకార శక్తుల సహకారము ఉండునని గ్రహించాలి.  ఈ సహకారము సంకుబుడి కొంగ రెక్కలుగా ఆ స్త్రీలకు కనబడుచున్నవి.  ఈ రెక్కల సహకారముతో ఈ స్త్రీలు ఈ రహస్య జీవితమును కలిగిన మొదటి స్త్రీ ఉన్న తూమును భూమ్యాకాశములకు మధ్యకు ఎత్తి దానిని షీనారు దేశమందు కొనిపోయెను.

        అక్కడ జెకర్యా 5:10-11, ''వీరు ఈ తూమును ఎక్కడికి తీసికొని పోవుదురని నాతో మాటలాడుచున్న దూతను నేనడుగగా -షీనారుదేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు; అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠము మీద పెట్టి యుంచుదురని అతడు నాకుత్తర మిచ్చెను.''  అక్కడ ఆ తూములో ఉన్న ఆ స్త్రీకి ఒక సాలను అనగా గుడిని కట్టి - ఆ గుడి సిద్ధమైన తరువాత దానికి పీఠము అనగా బలిపీఠమును కట్టి ఆరాధించుట జరుగునని ఆ దూత జెకర్యాకు చూపుట జరిగింది.  ఈ రకముగా జీవముగల దేవుని దేవాలయము కన్నా, సాతాను ఆధిక్యతలు కలిగిన దూతలు సహాయముతో రహస్య జీవితము కలిగిన మొదటి స్త్రీయొక్క సాలలు అనగా గుడులు బహుగా ఏర్పరచుచున్నట్లుగా చూపించుట జరిగింది.  అనగా దేవుడు అన్యదేవతల గుడులు ఎలా ఏర్పడుచున్నవని జెకర్యాకు ఈ దర్శనములో తెలియజేయుట జరిగింది.

7.  యెహోవా ఆత్మకు నెమ్మది

పరచుచున్న - పరచని రకరకాల గుఱ్ఱముల దర్శనము

జెకర్యా 6:1-8

దర్శనముయొక్క స్థితి :- భూమిపై జరగవలసిన అంతము లేని దానిని గూర్చి

దర్శనము ఎవరికి వచ్చింది :-  జెకర్యా (బెరక్యా కుమారుడు)

దర్శనము వచ్చిన కాలము :-  దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము శెబాటు అను పదకొండవ నెల యిరువది నాలుగవ దినమున.

దర్శనము ఇచ్చినది :-  యెహోవా దేవుని వాక్కు (అనగా క్రీస్తు)

దర్శనముయొక్క ఉద్ధేశ్యము :-  భూమిపై జరుగు నాలుగు అంతము కాని కార్యములను గూర్చి తెలియజేయుట.

అంతరార్థములు  

ఇత్తడి పర్వతము - యెహోవా వెలుగు వలన ఆలాగున కనబడు పర్వతములు.

ఎఱ్ఱని గుఱ్ఱము :-  రక్తపాతము

ఎఱ్ఱని గుఱ్ఱముయొక్క రథము :-  రక్తపాతము అను కార్యభారము.

నల్లని గుఱ్ఱము :-  సాతాను క్రియలు (శోధకుని క్రియలు)

నల్లని గుఱ్ఱముయొక్క రథము :-  సాతానుకు దేవుడు ఇచ్చిన కార్య భారము.

తెల్లని గుఱ్ఱము :-  క్రీస్తుకు సాదృశ్యము (సువార్త)

తెల్లని గుఱ్ఱముయొక్క రథము :-  సువార్త భారము.

చ్కులు చుక్కలుగల గుఱ్ఱము :-  రకరకాల జబ్బులు, అవలక్షణములు.

చ్కులు చుక్కలుగల గుఱ్ఱముయొక్క రథము :-  జబ్బులు, అవలక్షణములు కలిగించు భారము.

చతుర్వాయువులు :-  4 రకముల ఆత్మలు,   నా ఆత్మ - యెహోవా ఆత్మ.

         ప్రియపాఠకులారా!  ఈ దర్శనములో జెకర్యా యుగాంతములో జరగబోవు కార్యములను గూర్చి తెలుసుకొనుచున్నాడు.  మొదటగా రెండు పర్వతముల మధ్య నాలుగు రథములు బయలుదేరుచున్నవి. రథము రాజరికమునకు గుర్తు. ఈ గుఱ్ఱములు రాజాధిరాజైన దేవునియొద్ద నుండి వచ్చుచున్నవి గనుక రథమును కలిగియున్నవి.  గుఱ్ఱములు రథములను లాగాలి.  అంటే గుఱ్ఱము దానిమీద వున్న వాయువు కలసి రథములను లాగాలి.  అనగా దేవుని కార్యభారము వాటికి అప్పగించబడి వాటిని నెరవేర్చుచున్నవని గుర్తించాలి.  ఇందులో మొదటగా రెండు పర్వతములు వున్నవి.  జెకర్యా 6:1, ''నేను మరల తేరిచూడగా రెండు పర్వతముల మధ్య నుండి నాలుగు రథములు జయలు దేరుచుండెను, ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై యుండెను.''  కనుక ఇత్తడితో పర్వతములు వుండవు.  దీనిని ఆత్మీయ అర్థముతోనే దానిని గ్రహించాలి.  దేవుని సన్నిధిని  దేవుని వెలుగుతో నింపబడి యుండుట చేత అవి ఇత్తడిగా కనబడుచున్నవి.  వీటి మధ్య నుండి నాలుగు రథములు వాటితోబాటుగా నాలుగు గుఱ్ఱములు బయలుదేరు చున్నవి.

        జెకర్యా   6:2-5,  ''మొదటి రథమునకు ఎఱ్ఱని గుఱ్ఱములు, రెండవ రథమునకు నల్లని గుఱ్ఱములు, మూడవ రథమునకు తెల్లని గుఱ్ఱములు  నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలుగల బలమైన గుఱ్ఱము లుండెను.  నా యేలినవాడా, యివేమిటియని నాతో మాటలాడుచున్న దూతను నేనడుగగా అతడు నాతో ఇట్లనెను - ఇవి సర్వలోకనాధుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్లు ఆకాశపు చతుర్వాయువులు.''        1.  మొదటి రథమునకు ఎఱ్ఱని గుఱ్ఱములు  :-  ఇది దేవుని సన్నిధి నుండి వెడలి తనకు అనుగ్రహించిన కార్యభారమును బట్టి నాశనములను కలిగిస్తూ సమస్త రక్తపాతమునకు కారణమై యున్న ఆత్మ.  ఈ ఆత్మ ఏ రూపములోనైనను రక్తపాతమే సృష్టించును.

2.  రెండవ రథమునకు నల్లని గుఱ్ఱములు  :-  ఇది సాతాను ఆత్మకు మాదిరిగా వున్నది.  రోమా 1:18-32 వరకు చదివితే నల్లని గుఱ్ఱముల యొక్క కార్యములను తెలుసుకోగలము.  1 సమూయేలు 18:10, ''మరునాడు దేవునియొద్దనుండి దురాత్మ సౌలుమీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణచేత పట్టుకొని వాయించెను.''  కనుక దురాత్మ దేవుని యొద్ద నుండి కార్యసిద్ధి కలిగి వచ్చినదే.

3.  మూడవ రథమునకు తెల్లని గుఱ్ఱములు :-  ఇది క్రీస్తు ఆత్మకు, పరిశుద్ధాత్మకు సూచనగా చెప్పబడింది.  నేడు ప్రపంచమంతటా సువార్త రూపములో ప్రకటింపబడుటకు ఈ ఆత్మలే కారణము.

4.  నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములు :-  ఇది ఈ లోకములో ప్రబలుతున్న జబ్బులకు సూచనగా వున్నది.  రోజురోజుకు ఈ జబ్బులు ప్రబలుచున్నదేగాని తగ్గుట లేదు.  దీనికి కారణము ఆత్మయే.

        ఈ విషయము గురించి అర్థము కాని జెకర్యా - జెకర్యా 6:4, ''నా యేలినవాడా, యివేమిటని నాతో మాటలాడుచున్న దూతను నేనడుగగా'', జెకర్యా  6:5, ''అతడు నాతో ఇట్లనెను - ఇవి సర్వలోకనాధుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్లు ఆకాశపు చతుర్వాయువులు.''  చతుర్వాయువులు అనగా ఆది 2:7, ''దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.''  ఇందులో జీవాయువు అనగా మనలోని ఆత్మ కనుక చతుర్వాయువులు అనగా నాలుగు రకముల ఆత్మలుగా గుర్తించాలి.

        జెకర్యా 6:6, ''నల్లని గుఱ్ఱములున్న రథము ఉత్తర దేశములోనికి పోవునది;  తెల్లని గుఱ్ఱములున్న రథము వాటి వెంబడిపోవును, చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములుగల రధము దక్షిణ దేశములోనికి పోవును.''  ఇందులో చెప్పబడినట్లుగా నల్లని గుఱ్ఱము తెల్లని గుఱ్ఱము ఉత్తర దేశములో కార్యములు జరిగించుచున్నవి. అనగా ఒకే ప్రాంతములో రెండును అనగా సాతాను కార్యములు మరియు సువార్తా కార్యములు రెండును జరుగుచున్నట్లుగా మనము గ్రహించాలి.  ఇక చుక్కలు చుక్కలుగల రథము దక్షిణ దేశములోకి పోవును.  కనుక రకరకాల జబ్బులు దక్షిణ దేశమునుండి ప్రబలి లోకమంతా వ్యాపించును.  అనగా ఒక ప్రాంతమునుండి ప్రబలును అని అర్థము.  ఇక్కడ ఎఱ్ఱని గుఱ్ఱములుగల రథమును గూర్చి చెప్పబడలేదు.  అంటే రక్తపాతానికి పరిమితిము లేని విధముగా జరుగునని అర్ధము. పై మూడు గుఱ్ఱములు, అనగా తెలుపు, నలుపు, చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములు పరిమిత ప్రాంతములోనే క్రియ జరిగిస్తే, ఎఱ్ఱని గుఱ్ఱమునకు ఆ పరిమితి లేక లోకమంతా ప్రతి క్షణము ఏదో ఒక రూపములో క్రియ జరిగించును.

        జెకర్యా 6:7, ''బలమైన గుఱ్ఱములు బయలువెళ్లి లోకమంతట సంచరింప ప్రయత్నింపగా, -పోయి లోకమందంతట సంచరించుడని అతడు సెలవిచ్చెను గనుక అవి లోకమందంతట సంచరించుచుండెను.''  ఆ బలమైన గుఱ్ఱములు బయలు వెడలుటకు ప్రయత్నించునప్పుడు దేవుడు ఆజ్ఞ యిచ్చినట్లుగా చెప్పబడింది కనుక పై కార్యములన్నియు దేవుని ఆజ్ఞ మేరకు జరుగుచున్నట్లుగా గ్రహించాలి. జెకర్యా 6:8, ''అప్పుడతడు నన్ను పిలిచి-ఉత్తరదేశములోనికి పోవు వాటిని చూడుము;  అవి ఉత్తరదేశమందు నా ఆత్మను నెమ్మది పరచునని నాతో అనెను.''  

        ఇందు ఉత్తర దేశమందు పోవునవి ఏవి - నల్లని మరియు తెల్లని గుఱ్ఱములున్న రథములు.  ఇవి దేవుని ఆత్మతో నెమ్మది పరచునని యని చెప్పబడింది.  ఇది ఎలా జరుగును.  

        తెల్లని గుఱ్ఱములు గల రథము అనగా ఆత్మ సువార్త ద్వారా మనుష్యులలో మార్పు కలిగించి దేవుని ఆత్మకు నెమ్మది పరచుచున్నారు.  అయితే సాతాను ఆత్మగా చెప్పబడిన నల్లని గుఱ్ఱములు గల రథము ఎలా దేవుని ఆత్మకు నెమ్మది కల్గించుచున్నది?  శోధన ద్వారా కదా!  

        శోధన ద్వారా నిజమైన మార్పును పరిశోధించి, గోధుమ ఏదో గురుగేదో తెలియజేసి దేవుని ఆత్మకు నెమ్మది కల్గిస్తున్నట్లుగా గ్రహించాలి.

8.  చిగురు అను ఒకడు ఏలుట - యాజకత్వము చేయుట

జెకర్యా 6:12-13

దర్శనము ఎవరికి వచ్చింది :-  జెకర్యా (బెరక్యా కుమారుడు)

దర్శనము వచ్చిన కాలము :-  దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము శెబాటు అను పదకొండవ నెల యిరువది నాలుగవ దినమున.

దర్శనము ఇచ్చినది :-  యెహోవా దేవుని వాక్కు (అనగా క్రీస్తు)

దర్శనముయొక్క ఉద్దేశ్యము :-  క్రీస్తుయొక్క ఉన్నత స్థితిని గూర్చి తెలియజేయుట

అంతరార్థములు

చిగురు :-  క్రీస్తు

తన స్థలము :-  యెరూషలేము ప్రాంతము (పాలస్తీనా ప్రాంతము)

యెహోవా ఆలయము :-  సంఘము (పరిశుద్ధుల నిలయము)

        జెకర్యా 6:12-13, ''అతనితో ఇట్లనుము- సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా-చిగురు అను ఒకడు కలడు; అతడు తన స్థలములోనుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును.  అతడే యెహోవా ఆలయము కట్టును; అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై యేలును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును.''

        ప్రియపాఠకులారా!  చిగురు అను ఒకడు ఎవరు?  ప్రకటన 5:5, ''ఆ పెద్దలలో ఒకడు-ఏడవకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.''  ప్రకటన 6:1, ''ఆ గొఱ్ఱెపిల్ల ఆ యేడు ముద్రలలో మొదటిదానిని విప్పినప్పుడు.''  బైబిలు జ్ఞానము కొద్దిగా కలిగినవారెవరైన గొఱ్ఱెపిల్ల క్రీస్తు అని చెప్పుదురు.  కనుక దావీదు చిగురైన ఒకడు క్రీస్తు ప్రభువే!

        ''అతడు తన స్థలములో నుండి చిగుర్చును,'' అని అనుటలో క్రీస్తు ప్రభువు పాలస్తీనాలోని బెత్లహేములో జన్మించి యెరూషలేము ఆలయమునకు దగ్గర జీవించుట జరిగింది.  ఆయన ఏనాడు కూడా పాలస్తీనాను దాటి వెళ్ళలేదు.  క్రీస్తు ప్రభువు తన జీవిత కాలమంతా  పాలస్తీనా భూభాగములోనే జీవించుట జరిగింది.  ఆయన బోధలు పాలస్తీనాలో జరిగినవేగాని మిగిలిన భూభాగములో జరిగినవి కావు.  అందుకే మన మూలవాక్యములో - ''ఆయన తన స్థలములోనుండి చిగుర్చును,'' అని చెప్పుట జరిగింది.  ఈనాడు ప్రపంచ జనాభాలో 65% శాతము పైన క్రైస్తవులు ఉన్నారంటే క్రీస్తు స్వయముగా ప్రపంచమంతా తిరిగి బోధించినది కాదని అందరికి తెలుసు.  కనుక క్రీస్తు ఎక్కడైతే అవతరించుట జరిగిందో అక్కడ నుండి తన సిద్ధాంతములు చిగురించుట జరిగినట్లుగా మనము గ్రహించాలి.

        ఇక ''అతడే యెహోవా ఆలయము కట్టెను,'' అని అనుటలో యెహోవాకు ఆలయమును కట్టుటకు నిజమైన యోగ్యత కేవలము క్రీస్తు ప్రభువునకు మాత్రమే యున్నదని మనము గ్రహించాలి.  పాత నిబంధన కాలములో దావీదు యెహోవాకు ఆలయమును కట్టాలని తలంచి దేవుని అడిగినప్పుడు, యెహోవా నీ కుమారుడైన సులోమోనుచే కట్టించుదునని తెలియజేసెను.  2 దినవృత్తాంతములు 6:9, ''నీవు ఆ మందిరమును కట్టరాదు, నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును ట్టును.''  అలాగే సొలోమోను చేత ప్రసిద్ధమైన యెరూషలేము ఆలయమును నిర్మింపజేయుట జరిగింది.  కాని యెరూషలేము ఆలయమును కట్టిన సొలోమోను అన్య దేవతలను పూజించు స్త్రీలను వివాహమాడి చివరకు నాశన మార్గములో పతనమగుట జరిగింది.  అటుతరువాత దావీదు వంశములో చిగురుగా జన్మించిన క్రీస్తు ప్రభువు సంఘమును తానే పునాదిగా మారి నిర్మించుట జరిగింది.  

        1 కొరింథీ 3:11, ''వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే.''  ఈ విధముగా క్రీస్తు పునాదిగా ఏర్పడి సంఘమును నిర్మించుట జరిగింది.  క్రీస్తు తను నిర్మించిన సంఘమునకు శిరస్సైయుండి దానిని పవిత్ర స్థితిలో ఉంచుచున్నట్లుగా పునీత పౌలు చెప్పుట జరిగింది.  ఎఫెసీ 5:23, 25-27, ''క్రీస్తు సంఘమునకు శిరస్సై  . . .  పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి.  అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధ మైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధ పరచుటకై  దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.''  

        ఈ విధముగా యెహోవాకు క్రీస్తు ప్రభువు సంఘమును నిర్మించి యెహోవాకు దానిని అంకిత పరచినట్లుగా మనము గ్రహించాలి.

        ఇక ''అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై యేలును,'' అనుటలో తాను ఏర్పరచిన సంఘము అను ఆలయమునకు క్రీస్తు అధికారిగా తండ్రియైన దేవుడు నియమించినట్లుగా మనము గ్రహించాలి.  అందుకే ప్రకటన గ్రంథములో క్రీస్తు ప్రభువు తన అధికారమును గూర్చి ఈ విధముగా చెప్పుచున్నారు.  

        ప్రకటన 3:21, ''నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.''  మరియు ప్రకటన 21:6, ''మరియు ఆయన నాతో ఇట్లనెను- సమాప్తమైనవి; నేను అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొనువానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.''  ఈ విధముగా క్రీస్తు ప్రభువు సింహాసనాసీనుడై ఏలునని ముందుగానే జెకర్యాకు తెలియజేయుట జరిగింది.  

        ఇలాంటి సింహాసనాసీనుడైన క్రీస్తు యాజకత్వము కూడా జరుపునని ప్రకటన 21:6లో వలె జెకర్యాకు క్రీస్తు పుట్టుక ముందే తెలియజేయుట జరిగింది.  అనగా క్రీస్తు ప్రభువు తాను సిద్ధపరచిన దేవుని ఆలయమైన పరిశుద్ధులను తన వెయ్యి సంవత్సరముల పరిపాలన కాలములో సింహాసనాసీనుడై ఏలుచూ దేవుని యాజకుడుగా ఉండునని జెకర్యాకు ముందుగానే తెలియజేయుట జరిగింది.

        ఇలా పరిపాలన యాజకత్వము చేయునప్పుడు - ''ఆ యిద్దరికి సమాధానకరమైన  యోచనలు కలుగును,'' అని చెప్పబడినది.  ఇదే - తండ్రియైన దేవునికి - కుమారుడైన క్రీస్తునకు మధ్య జరుగు సంభాషణ సమాధానకరముగానే ఉండునని చెప్పబడినది.  వారి ఆలోచన ఒక్కటే.  

        కనుక వారి యోచన సమాధానమును కలిగిన తరువాత ఆత్మల జీవితము ఎలా ఉండాలన్న నిర్ణయము జరుగును.  ఈ నిర్ణయములో వారిద్దరి ఆలోచన ఒక్కటేనని చెప్పబడినది.

9.  క్రీస్తు ప్రభువు జీవితచరిత్రలో

కొన్ని ఘట్టములను గూర్చిన దర్శనము

జెకర్యా 9:9, 11:7-14, 12:10-14

దర్శనముయొక్క స్థితి :-  అప్పటి యెరూషలేములో జరగవలసిన దానిని గూర్చి

దర్శనము ఎవరికి వచ్చింది :-  జెకర్యా (బెరక్యా కుమారుడు)

దర్శనము వచ్చిన కాలము :-  దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము శెబాటు అను పదకొండవ నెల యిరువది నాలుగవ దినమున.

దర్శనము ఇచ్చినది :-  యెహోవా దేవుని వాక్కు (అనగా క్రీస్తు)

దర్శనముయొక్క ఉద్ధేశ్యము :-  క్రీస్తు బలియాగము - రక్షణ

అంతరార్థములు

సౌందర్యమనునట్టియు - బంధకము మనునట్టి రెండు కఱ్ఱలు :-  దేవుడు ఇశ్రాయేలీయులకు దావీదు ద్వారా ఇచ్చిన రెండు నిబంధనలు.

బలహీన గొఱ్ఱెలు :-  విశ్వాసముతో బలహీనముగా ఉన్న విశ్వాసులు.

కాపరి :-  క్రీస్తు

సంహరింపబడిన ముగ్గురు కాపరులు :-  సుమెయోను, బాప్తిస్మమిచ్చు యోహాను, యూదా ఇస్కరియోతు.

క్రయ ధనము :-  క్రీస్తును పట్టించుటకు ఇచ్చిన ద్రవ్యము (30 వెండి నాణెములు)

కుమ్మరికి పారవేయుట :-  కుమ్మరి పొలమును కొనుట.

ఎ.  నీ రాజు యెరూషలేమునకు వచ్చుట  

        ప్రియపాఠకులారా!  జెకర్యా 9:9, ''సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు.''  ఇది నిజమే!  బహుగా సంతోషించవలసిన విషయమే, ఎందుకంటే నీ రాజు యెరూషలేమునకు వచ్చుచున్నాడు.  ఈ రాజు నీతిపరుడు అనగా ఈయనలో ఎటువంటి లోపము లేదు.  మచ్చలేనివాడు మాత్రమే నీతిపరుడు అని పిలుచుటకు యోగ్యుడు.  ఇటువంటి రాజు రక్షణ గలవాడు అని చెప్పుచున్నాడు.  మనకందరికి తెలిసిన విషయమే!  అదేమిటంటే రక్షణ ఒక్క క్రీస్తు ప్రభువు ద్వారా మాత్రమే లభించును.  ప్రకటన 19:11, ''మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని.  అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను.  దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు.  ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు.'' మరియు ప్రకటన 19:16, ''-రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడమీదను వ్రాయబడి యున్నది.''  ఇంత గొప్ప రాజు తన వద్ద రక్షణ కలిగి యున్నట్లుగా జెకర్యా వర్ణించుచున్నాడు.  ఈయన రాజులందరికి రాజు అని అనుటలో ఈయనను మించినవారు లేరని చెప్పుట జరిగింది.

        ఇంత గొప్ప రాజు మనందరి రక్షణ తన చేత కలిగియున్న రాజు ఎలా వస్తున్నాడు?  దీనుడనై వస్తున్నాడు.  అంటే ఎటువంటి ఆర్భాటము లే సాత్వికుడుగా ఒక సాధారణ మనుష్యుడుగా క్రీస్తు ప్రభువు యెరూషలేమునకు వచ్చునని జెకర్యా ప్రవచించుట జరిగింది.  అయితే ఎలాగున వస్తున్నాడు?  గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు.  ఈ ప్రవచనమును క్రీస్తు ప్రభువు తన నోటితో ఏ విధముగా చెప్పుచున్నాడో తెలుసు కొందము.  మత్తయి 21:1-11, ''తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండదగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; వెళ్లగానే కట్టబడియున్న యొక గాడిదయు దానితోనున్న యొక గాడిదపిల్లయు మీకు కనబడును.  వాటిని విప్పి నాయొద్దకు తోలుకొని రండి; ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడల-అవి ప్రభువునకు కావలసియున్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను.  ప్రవక్తవలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను, అదేమనగా - ఇదిగో నీ రాజు సాత్వికుడై, గాడిదను భారవాహక పశువుపిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది.  శిష్యులు వెళ్లి యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను.  జనసమూహములోను అనేకులు తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను.  జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారిపొడుగున పరిచిరి; కొందరు చెట్లకొమ్మలు నరికి దారిపొడుగున పరచిరి.  జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండినవారును -దావీదు కుమారునికి జయము  ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక  సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.  ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు-ఈయన ఎవరో అని కలవరపడెను.  జనసమూహము-ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి.'' క్రీస్తు జన్మకు ముందే జెకర్యా ప్రవచించిన ప్రవచనము ఈ విధముగా నెరవేర్చుట జరిగింది.

        ఈ విధముగా నీ రాజుగా వచ్చిన క్రీస్తు ప్రభువు ఏమి చేయబోవుచున్నాడు?  జెకర్యా 9:10, ''ఎఫ్రాయిములో రథములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములు లేకుండ చేసెదను, యుద్ధపువిల్లు లేకుండ పోవును, నీ రాజు సమాధానకర్త అన్యజనులకు తెలియజేయును, సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతమువరకు అతడు ఏలును,'' అని వ్రాయబడుటనుబట్టి క్రీస్తు ప్రభువు తన రాజ్యమును యూఫ్రటీసు నది మొదలు భూదిగంతముల వరకు వ్యాపింప జేయుట తన శిష్యుల చేత తన సమాధాన వార్తను సువార్తగా బోధింపజేసి ఈనాడు ప్రపంచ జనాభాలో 65% ప్రజలను క్రైస్తవులుగా తన రాజ్య వారసులుగా చేసియున్నాడు.  కాని మనము ఆయన చెప్పినది పాటించిన ఖచ్చితముగా మనము ఆయన రాజ్య వారసులమగుదుము.

బి.  సౌందర్యమనునట్టియు బంధకమనునట్టియు రెండు కఱ్ఱలు  

        జెకర్యా 11:7, ''కాబట్టి నేను సౌందర్యమనునట్టియు బంధకమనునట్టియు రెండు కఱ్ఱలు చేతపట్టుకొని వధకేర్పడిన గొఱ్ఱెలను ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచువచ్చితిని.''  ఇందులో రెండు రకముల కఱ్ఱలను ఒకరు చేత పట్టుకొని యున్నట్లుగా చెప్పబడినది.  అందులో  1.  సౌందర్య మనునట్టియు  2.  బంధకమనునట్టియు.  ఇందులో వీటికి వేరొక అర్థము కూడా బైబిలు గ్రంథమందు వ్రాయబడినది.  అది 1.  కటాక్షము.  2.  సమకూర్చుట.  ఇవి రెండును రెండు రకముల అర్థములను బయల్పరచుచున్నవి.  కీర్తన 23:4, ''గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను  నీవు నాకు తోడై యుండువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును.''  ఇవి రెండు రకముల కఱ్ఱలే.  ఇందులో ఒకటి దుడ్డుకఱ్ఱ.  ఇది నరుల నడకకు సహాయముగా పని చేయును.  ఎక్కడకు వెళ్ళువారైనా సరే చేతిలో దృఢమైన దుడ్డుకఱ్ఱ ఉన్నవారి ప్రయాణము సజావుగానే సాగును.  రకరకాల ఆపదల నుండి అది వారిని రక్షించును.  వారికి ఎటువంటి ఇబ్బంది కలుగనియ్యక వారికి అది సహాయముగా నిలుచును.  దేవుని సహాయము దుడ్డుకఱ్ఱ రూపములో వారికి అనుగ్రహింపబడినవారు సౌందర్యమనునట్టి ఆత్మ సౌందర్యమును పొంది, ఇక ఎన్నటికిని వారిలోని ఆత్మ సౌందర్యమును కోల్పోరు.  దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తుందో వారిలో ఒక ప్రత్యేక సౌందర్యమును కలిగియుందురని గ్రహించాలి.

        ఇక రెండవది దండము.  ఇది కూడా కఱ్ఱయే అయినను దీనిలో అధికారము ఉన్నది.  ఈ అధికారము బంధకము కావచ్చును.  గొఱ్ఱెలకు అనగా విశ్వాసులకు కావలసినవి సమకూర్చు విషయము కావచ్చును.  ఇలా ప్రతి విశ్వాసి ఈ రెండు రకముల కఱ్ఱలను తమ కాపరులనుండి పొందినవారు సంపూర్ణులగుదురని గ్రహించాలి.  అయితే మన మూలవాక్యములోని కాపరి ఈ రెండు రకముల కఱ్ఱలను చేత పట్టుకొని వధకేర్పడిన గొఱ్ఱెలను ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచూ వచ్చితిరని చెప్పబడినది.  

        ఇందులో కాపరి రెండు రకముల గొఱ్ఱెలను మేపుతూ వచ్చుచున్నాడు.  అందులో  1.  బలమైనవి.  2.  బలహీనమైనవి.  

        బలమైనవి నీతి పరిశుద్ధులతో జీవించువారు.  ఉదా :-  బాప్తిస్మమిచ్చు యోహాను, నీకొదేము యోహాను 3:1-15.  ఇలా నీతి పరిశుద్ధులతో ఉన్నవారిని తన వాక్యముతో వారిని మేపుతూ వచ్చాడు.  ఇక బలహీనమైనవి.  తనను నమ్మిన 12 మంది శిష్యులు ఇంకా విశ్వాసులు.  ఈ సందర్భములో మనము బాగా గమనిస్తే 12 మంది శిష్యులు క్రీస్తుచే పిలువబడునాటికి వారు సాధారణ జీవితము జీవిస్తూ బలహీన స్థితిలో ఉన్నవారే అని గమనించవచ్చును.  వీరిలో చేపలు పట్టు జాలరులు ఉన్నారు, పాపులుగా ఎంచబడిన సుంకరులు ఉన్నారు.  ఇలా బలహీనమైన వాటిని కూడా చేరదీసి వాటిని మేపుచూ వచ్చుచున్నాడు.

        ఈ వచనములో మనము ఓ రహస్యమును గుర్తించవలసి యున్నది.  ఈ గొఱ్ఱెలన్నీ కూడా వధకు తేబడినవేగాని సహజ మరణమును పొందునవి కావు.  బాప్తిస్మమిచ్చు యోహాను తల నరకబడి వధింపబడినవాడే.  అపొస్తలులలో యోహాను తప్ప మిగిలిన వారందరు వధింపబడినవారే.  ఇలా అనేక విశ్వాసులు కూడా ఆ రోజులలో క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా వధింపబడినవారే.  అనగా క్రీస్తు ప్రభువు మేపిన గొఱ్ఱెలన్నీ వధకు తేబడిన గొఱ్ఱెలుగానే వారు దేవుని కార్యములు నెరవేర్చుట జరిగిందిగాని వారు తమ ప్రాణములను ప్రేమించినవారు కారు.

సి.  కాపరి ముగ్గురు కాపరులను వధించుట

        జెకర్యా 11:8, ''ఒక నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించితిని; ఏలయనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి.''  ఇందులో కాపరి ఒక నెలలోనే ముగ్గురు కాపరులను సంహరించితిని అని వ్రాయబడియున్నది.  అంతేకాదు వీరి విషయమై ఈ కాపరి సహనము లేనివాడైనాడు.  అందుకుగాను వారు ఆయన విషయమై ఆయాసపడిరి.  కాని ఫలితము మాత్రము వారు మరణమును రుచి చూడవలసి వచ్చింది.  ఇందులో కాపరి ఈ ముగ్గురు కాపరులు మరణించినను వారి కొరకు ఎటువంటి సహాయము చేయలేదు.  కనుకనే ఆయన వారిని బ్రతికించగల్గిన స్థోమత ఉండి కూడా వారిని అలాగే మరణమునకు వదిలివేసాడు.

        ఉదా :-  1.  బాప్తిస్మమిచ్చు యోహాను :-  ఈయనను హేరోదు తల నరికించి చంపించాడు.  ఈ సమయములో ఈ నీతిమంతుని మరణమును గూర్చి విన్న యేసుక్రీస్తు ప్రభువు ఎటువంటి సహాయము చేయలేదు.  తను తలుచుకొంటే ఒక్క మాటలో బ్రతికించవచ్చును.  మరణించిన లాజరు మూడు రోజులు దుర్గంధ స్థితిలో ఉన్నా కూడా తిరిగి లేపుట జరిగింది.  నాయీరు గ్రామము వద్ద విధవరాలి కుమారుడు మరణించి పాడెపై మోసుకొని పోతున్నప్పుడు కూడా క్రీస్తు ప్రభువు ఆ బాలుని బ్రతికించుట జరిగింది.  కాని బాప్తిస్మమిచ్చు యోహాను విషయములో ఎలాంటి సహాయము చేయలేదు.  ఈ విధముగా క్రీస్తు ప్రభువు బాప్తిస్మమిచ్చు యోహాను విషయములో సహనము లేనివాడుగా మారిపోయాడు.  అలాగే బాప్తిస్మమిచ్చు యోహాను క్రీస్తు ప్రభువు కోసము ఆయాసపడి ఆయన కొరకు సమస్తమును జరిగించుట జరిగింది.

        2.  సుమెయోను :-  లూకా 2:25-32, ''యెరూషలేము నందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను.  అతడు నీతిమంతుడును భక్తిపరుడునైయుండి, ఇశ్రాయేలు యొక్క ఆదరణకొరకు కనిపెట్టువాడు; పరిశుద్ధాత్మ అతనిమీద ఉండెను.  అతడు ప్రభువుయొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మచేత బయలుపరచబడి యుండెను; ఆత్మవశుడై దేవాలయములోనికి వచ్చెను.  అంతట ధర్మశాస్త్రపద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసికొనివచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తికొని దేవుని స్తుతించుచు ఇట్లనెను - -నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధాన ముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు;  అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను  నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను  నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని.''  ఈ సుమెయోను అను నీతిమంతుడు క్రీస్తు ప్రభువును చూడాలని ఆయాసపడినాడేగాని, క్రీస్తు ప్రభువు రక్షణను చూచాడుగాని క్రీస్తు ప్రభువు నుండి ఎలాంటి సహాయము పొందలేదు.  అలాగే తన మరణము పొందుట జరిగింది.  ఈ విషయములోను క్రీస్తు ప్రభువు సహనము లేనివాడుగానే ఉండవలసి వచ్చింది.

        3.  ఇస్కరియోతు యూదా :-  ఈయన 12 మంది క్రీస్తు అను కాపరి శిష్యులలోని వాడే.  ఇతనిని క్రీస్తు ప్రభువు తను నిర్మించిన సంఘమునకు కాపరిగానే ఎన్నిక చేసినవాడు.  ఇలాంటి కాపరి తప్పిపోయి కొండ శిఖరమున ఉరి వేసుకొని ఆ సమయములో వచ్చిన భూకంపము వలన ఆ త్రాడు తెగి ఆ పై భాగమునుండి క్రింద పడి ప్రేగులు బయటపడగా మృతి చెందుట జరిగింది.  ఈ ఇస్కరియోతు యూదా క్రీస్తు బలియాగమునకు సాతాను ప్రేరణ ద్వారా సహాయపడినవాడే.  ఇందులో ఈయన ఆయాసపడుట జరిగిందేగాని క్రీస్తు ప్రభువు నుండి ఎటువంటి సహాయము పొందలేక పోయాడు.  ఈయన విషయములోను క్రీస్తు ప్రభువు సహనము లేనివాడుగా మారిపోవుట జరిగింది.

        అనగా క్రీస్తు ప్రభువు దగ్గరలోనే ఈ సంఘటనలు జరిగాయి.  ఒకరు కాదు ముగ్గురు ప్రాణము వదులుట జరిగింది.  వీరు ముగ్గురు నీతిలో అంటగట్టబడినవారే.    కాని వీరికి వారి మరణ సమయమందు ఎటువంటి సహాయము అందలేదు.  కాని వీరిలో సుమెయోను మరియు బాప్తిస్మమిచ్చు యోహాను మాత్రము వారి మరణము వరకు నీతిని వదలలేదు.  కాని ఇస్కరియోతు యూదా మాత్రము నీతిని విడుచుట జరిగింది.  అయితే ముగ్గురు కాపురులుగా ఉండవలసినవారేగాని క్రీస్తు అను కాపరి కాలములోనే మరణించుట జరిగింది.  అయితే వీరిని క్రీస్తు ప్రభువు తిరిగి లేపుటకు శక్తిమంతుడైయున్నను అసహనముతో ఉన్నట్లుగా చెప్పబడినది.  దీనికి కారణము దేవుని నుండి వారిని బ్రతికించుట లేక రక్షించు ఆజ్ఞను క్రీస్తు ప్రభువు పొందలేదని అందు నిమిత్తముగా ఆయన సహనము లేనివాడుగా ఉండినట్లుగా మనము గ్రహించాలి.  ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు నుండి సహాయము వారు పొందలేక పోయారో వారి వారు చేసిన కార్యములో క్రీస్తు విషయమై వారు ఆయాసపడినట్లుగా మారిపోయింది.

        జెకర్యా 11:9-11, ''కాబట్టి నేనికను మిమ్మును కాపుకాయను; చచ్చునది చావవచ్చును, నశించునది నశింపవచ్చును, మిగిలినవి యొకదాని మాంసము ఒకటి తినవచ్చును అనిచెప్పి సౌందర్యమను కఱ్ఱను తీసికొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయునట్లు దానిని విరిచితిని.  అది విరువబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకొనియున్న గొఱ్ఱెలు తెలిసికొనెను,'' అని వ్రాయబడుటనుబట్టి క్రీస్తు ప్రభువు తన గొఱ్ఱెలను కాపు కాయనని చెప్పుచున్నాడు.  ఆ కారణము చేత ఈ గొఱ్ఱెలు తమ పోరాటములో సువార్త కోసము చనిపోవునవి చనిపోతూనే ఉన్నవి, నశించునవి నశిస్తూనే ఉన్నవి.  అలాగే వేరే జంతువులకు ఆహారముగా వేయబడుచున్నప్పుడుగాని క్రీస్తు ప్రభువు నుండి వీరికి వారి మరణ సమయములో సహాయము రాలేదు.  ఈ గొఱ్ఱెలుగా చెప్పబడిన విశ్వాసులు అనేక అద్భుతములు చేసినను సాధారణమైన వారివలె చంపబడినవారే!  ఉదా :-  యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒకడైన తోమా భారతదేశములో యేసుక్రీస్తు  సువార్త జరిగించి గోవా, కేరళ, తమిళనాడు నందు అనేకులను క్రైస్తవులుగా మార్చినవాడు.  దీనికోసము ఈయన అనేక అద్భుతములు జరిగించియుండవచ్చును, ఎందుకంటే నన్ను నమ్మిన  విశ్వాసులు నాకన్నా ఎక్కువగా అద్భుతములు, మహత్యములు జరిగించునని యేసుక్రీస్తు ప్రభువు చెప్పియున్నారు.  ఈనాడు క్రైస్తవుల ప్రాబల్యము ఇండియాలో ఎక్కడ ఉన్నది అని ఎవరైనా అడిగితే ఈ మూడు రాష్ట్రాలనే చెప్పుదురు.  ఇలా క్రీస్తు తరువాత 100 సంవత్సరముల లోపే ఇండియాలో సువార్తను జరిగించి అనేక అద్భుతములు చేసిన ఈయన అతి సాధారణమైన మానవునివలె వెనుక నుంచి బల్లెముతో పొడవగా చెన్నైలోని సైయింట్‌ థామస్‌ మౌంట్‌ నందు మరణించుట జరిగింది.  ఈ మరణించినప్పుడు క్రీస్తు ప్రభువు సహాయము వారికి అందలేదు.  ఇదే సంఘటనని దేవుడు జెకర్యాకు తెలియజేయుచున్నాడు.  ఇలా వదిలివేయు దానికి చిహ్నముగా సౌందర్యమను కఱ్ఱను విరిచి నేను మీకు సహాయము చేయనని చెప్పుట జరిగింది.

        ఇలా ఎప్పుడైతే సౌందర్యమను కఱ్ఱను విరిచినో అదే సమయములో మందలోని బలహీనములై కాపరిని కనిపెట్టుకొనియున్న గొఱ్ఱెలు తెలిసికొనెను అని చెప్పబడినది.  ఈ విధముగా మిగిలిన విశ్వాసులందరు కూడా తమకు కూడా దేవుని నుండి సహాయము మన మరణకాలములో లభించదని తెలుసుకొనుట జరిగినట్లుగా జెకర్యాకు తెలియజేయ బడినది.

డి.  మీకు అనుకూలమైన యెడల నా కూలి నాకియ్యుడి  

        జెకర్యా 11:12, ''-మీకు అనుకూలమైనయెడల నా కూలి నాకియ్యుడి, లేనియెడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై ముప్పది తులముల వెండి తూచి యిచ్చిరి.''  ఇందులో ఈ కాపరి మీకు అనుకూలమైన యెడల నా కూలి నాకియ్యుడని లేకపోతే మాని వేయమని అడిగినట్లుగా చెప్పబడినది.  లూకా 22:3-5, ''అంతట పండ్రెండుమంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్లి, ఆయనను వారికేలాగు అప్పగింపవచ్చునో దానినిగూర్చి ప్రధాన యాజకులతోను అధిపతులతోను మాటలాడెను.  అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి.'' మరియు మత్తయి 26:14-15, ''అప్పుడు పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకులయొద్దకు వెళ్లి -నేనాయనను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని వారినడిగెను.  అందుకు వారు ముప్పది వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి.''  

        ఈ విధముగా సమాజ మందిరములోని యాజకులు, అధిపతులు ఆయనకు కూలిగా 30 వెండి నాణెములు నిర్ణయించుట జరిగింది.  దీనినే ముందుగా జెకర్యాకు దర్శనములో చూపించాడు.  ఇందులో జెకర్యా దర్శనములో ఈ కూలిని ఈ కాపరే స్వయముగా అడిగినట్లుగా చెప్పబడినది.  కాని మత్తయిలోగాని లూకాలోగాని యూదా ఇస్కరియోతు అడిగినట్లుగా క్రీస్తును అమ్మినట్లుగా చెప్పబడినది.  కాని యోహాను 13:26-28, ''అందుకు యేసు-నేనొకముక్క ముంచి యెవని కిచ్చెదనో వాడే అని చెప్పి, ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను; వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను.  యేసు-నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా ఆయన ఎందునిమిత్తము అతనితో ఆలాగు చెప్పెనో అది భోజనమునకు కూర్చుండినవారిలో ఎవనికిని తెలియలేదు.''  ఈ పని చెప్పినది క్రీస్తు ప్రభువే!  కనుక క్రీస్తు ప్రభువు తరపున యూదా ఇస్కరియోతు జీతమును అడిగినట్లు అయినది.  ఈ విధముగా ప్రధాన యాజకులు, అధిపతులు క్రీస్తు ప్రభువుకు 30 వెండి నాణెములు తూచి ఆయన ప్రాణమునకు ఖరీదు ట్టుట జరిగింది.

        జెకర్యా 11:13, ''యెహోవా-యెంతో అబ్బురముగా వారు నా కేర్పరచిన క్రయ ధనమును కుమ్మరికి పారవేయుమని నాకు ఆజ్ఞ ఇయ్యగా నేను ఆ ముప్పదితులముల వెండిని తీసికొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని.''  

        ఈ క్రయ ధనమును కుమ్మరికి పారవేయమని యెహోవా ఆశ్చర్యరీతిలో చెప్పగా ఆ వెండిని తీసికొని యెహోవా మందిరములో పారవేయుట జరిగింది.  ఇది ఆశ్చర్యమని పించుట లేదా!  యెహోవా చెప్పినది కుమ్మరికి ఇమ్మని కాదు గాని కుమ్మరికి పారవేయమని.  అయితే ఆ క్రయ ధనమును యెహోవా మందిరములో పారవేయుట  జరిగింది.  ఎలా?  

        మత్తయి 27:3-5, ''అప్పుడాయనను అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఆ ముప్పది వెండి నాణెములు ప్రధానయాజకుల యొద్దకును పెద్దలయొద్దకును మరల తెచ్చి -నేను నిరపరాధరక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను.  వారు-దానితో మాకేమి?  నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి, పోయి ఉరి పెట్టుకొనెను.''  

        ఈ విధముగా యేసుక్రీస్తు కొరకు తూచిన ఆ వెండి నాణెములు యూదా ఇస్కరియోతు  దేవాలయములో అనగా యెహోవా మందిరములో పారవేయుట జరిగింది.  అటు తరువాత - మత్తయి 27:6-8, ''ప్రధానయాజకులు ఆ వెండి నాణెములు తీసికొని -ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి.  కాబట్టి వారు ఆలోచనచేసి వాటినిచ్చి, పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి.  అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది.''  

        ఈ విధముగా యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లుగా కుమ్మరివానికి పారవేయుట జరిగింది.  ఇలా క్రీస్తు అను ప్రధాన కాపరి విషయములో ప్రధానయాజకులు జరిగించబోవుదానిని ముందుగానే జెకర్యా తన ప్రవచనములలో యెహోవా దేవుడు వ్రాయించుట జరిగింది.  ఇందునుబట్టి సమస్తము ముందుగానే తన ప్రవక్తలద్వారా తెలియజేసి తరువాత తన ప్రణాళికను నెరవేర్చునని మనము గ్రహించాలి.

        జెకర్యా 11:14, ''అప్పుడు బంధకమనునట్టి నా రెండవ కఱ్ఱను తీసికొని యూదావారికిని ఇశ్రాయేలువారికిని కలిగిన సహోదర బంధమును భంగము చేయునట్లు దానివిరిచితిని.''  ఈ విధముగా క్రీస్తు మరణముతోనే దేవునికి, ఇశ్రాయేలీయులకు, యూదావారికే పరిమితమైయున్న బంధము తొలగి అన్యులకు రక్షణ కలిగినట్లుగా మనము గ్రహించవలసి యున్నది.

ఇ.  తాము పొడిచిన నామీద వారు బహుగా ప్రలాపించుట

         జెకర్యా 12:10, ''దావీదు సంతతివారి మీదను యెరూషలేము నివాసులమీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద  దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దు:ఖించునట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై యొకడు ప్రలాపించునట్లు అతని విషయమై దు:ఖించుచు ప్రలాపింతురు.''

        ప్రియపాఠకులారా!  యెరూషలేములోని దావీదు సంతానము మరియు ఇతరులు కలసి క్రీస్తు ప్రభువును సిలువ మరణమునకు అప్పగించి చివరకు ఆయనను క్రూరముగా చంపుట జరిగింది.  

        అయితే వారు క్రీస్తు ప్రభువు మరణించాడో లేదో అని బల్లెముతో ఆయన ప్రక్కన పొడిచి ఆయన చనిపోయినట్లుగా నిర్ణయించుకొన్నారు.  యోహాను 19:33-37, ''వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొందియుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను.  ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు; అతని సాక్ష్యము సత్యమే.  మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయనెరుగును.  -అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను.  మరియు -తాము పొడిచినవానితట్టు చూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది.''  

        ఈ విధముగా బహు క్రూరముగా క్రీస్తు ప్రభువును యెరూషలేమువాసులు ఆయనను మరణమునకు అప్పగించారు.  ఎవరును ఆయన కోసము పోరాడలేదు.  తమ ముందు అనేక మహత్యములు చేసినను వారు ఆయన కొరకు పోరాడలేదు.  మరణించినవారిని తిరిగి లేపినాడు.  

        కనీసము వారు కూడా ఆయన కొరకు పోరాడలేదు.  ఆయన శిష్యులు అందరు పారిపోయి తలదాచుకొని రహస్యముగా ఉన్నారు.  

        ఒక యోహాను మాత్రమే సిలువ దగ్గర చూస్తున్నాడు కాని వారు చేయుచున్న క్రూర పనిని ప్రతిఘటించలేదు.  

        దీనికి కారణము . . .  

        1.  ఈ బలియాగము దేవుని నిర్ణయము ప్రకారము జరుగుచున్నది.  

        2.  ఈ బలియాగము ద్వారా సమస్తమైన వారికి రక్షణ ఒసగబడును.  అందువల్ల వారు ఏమి చేయలేక యోహాను సహితము చూస్తూ ఊరుకొన్నారు.

        3.  క్రీస్తు ఎన్నో మహత్యములు చేసినవాడు.  చనిపోయినవారిని కూడా లేపి యున్నాడు.  కనుక  ఏదో ఒక రూపములో ఆయన వారి నుండి తప్పించుకొనునని ప్రతి ఒక్కరు ఎదురు చూచారు.  సమస్త జనులకు అద్భుతములు చేసిన క్రీస్తు ఎలాగైనా తప్పించుకొనునని ఎదురు చూస్తున్నారేగాని వీరు సహాయముగా వారు వెళ్ళాలని, ఆయన తరపున మాట్లాడాలన్న తలంపు వారిలో లేదు.  ఈ విధమైన తలంపుతో ప్రతి ఒక్కరు క్రీస్తు మరణము వరకు ఎదురు చూచారు.  ఆయన మరణానంతరము తాము చెప్పిన ఆత్మను ఆయన పంపించుట జరిగింది.  

        ఇప్పటికి ఆయనను నమ్మిన విశ్వాసులపై కుమ్మరించుట జరుగుచూనే ఉన్నది.  ఎప్పుడైతే వారు ఆత్మను పొందారో వారి హృదయములో క్రీస్తుపై కరుణ ఏర్పడింది.  ఇంతమంది ఉండి కూడా ఆయనను కోల్పోయామన్న బాధ వారిలో కలిగింది. అందువలన తండ్రియైన దేవునికి విజ్ఞాపన చేస్తూనే వారు ఆయన విషయమై తమ ప్రవర్తననుబట్టి దు:ఖించుచు ప్రలాపించుట జరిగింది.  ఎందుకంటే వారు ఏదో ఒక అద్భుతము జరుగునని ఆశించారు.  కాని ఆయన సాధారణ మానవుని వలె మరణించుట వారు పొందిన ఆత్మ వలన తెలుసుకొని దు:ఖించుచు ప్రలాపించుట జరిగింది.  అందువలన వీరి మనస్సునందు తమ చేతులారా తామే క్రీస్తు ప్రభువును చంపుకొన్నామన్న బాధ వారికి కలిగి వారి దు:ఖమునకు కారణమైంది.  

        ఈనాడు దైవజనులు అనేకులు తమ పాపముల మూలముగానే కదా నా రక్షకుడు మరణించుట జరిగిందని వారి ప్రార్థనలో కన్నీరు విడుచుచూ, దు:ఖించుచూ ప్రార్థించుట మనము చూడగలము.  

        జెకర్యా 12:11-14, ''మెగిద్దోను లోయలో హదదిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపమువలెనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును.  దేశనివాసులందరు ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు, దావీదు కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, లేవి కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, మిగిలినవారిలో ప్రతి కుటుంబపువారు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపింతురు.''  

        ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు యాజకులకు, అధిపతులకు భయపడి వారు రహస్యముగా ప్రలాపించుట క్రీస్తు విషయములో జరిగినట్లుగా మనము గ్రహించాలి.  ఇది బహిరంగముగా జరిగింది కాదు.  

        వారి వారి రహస్య మందిరములలోను, స్థలములలో వారు ఎవరికిని తెలియ కుండా దు:ఖించుట జరిగింది.

        ఈ విధముగా క్రీస్తు ప్రభువు ఒక రాజుగా యెరూషలేమునకు గాడిద మరియు గాడిద పిల్లపై వచ్చుట, అక్కడ ఉన్న ప్రధానమైన తన తోటి కాపరుల మరణములో ఏ సహాయము చేయకపోవుట, తనను 30 వెండి నాణెములకు యూదా ఇస్కరియోతు అమ్ముట, కుమ్మరి పొలమును కొనుట, క్రీస్తు సిలువపై మరణించిన తరువాత దేశ నివాసులు అందరు ప్రత్యేకముగా దు:ఖించి ప్రలాపించుట, జెకర్యాకు యెహోవా దేవుడు ముందుగానే చూపించుట జరిగింది.

చివరిగా ఒక మాట

ప్రభువునందు సహోదరీ సహోదరులారా!  

  1. ఈ పుస్తకమును చదువుచున్న మీకు ఏమైన అనుమానాలు ఉన్నట్లయితే,
  2. ఈ పుస్తకములోని సారాంశములో లోపమును మీరు గ్రహించినట్లయితే,
  3. దీనిలో విభాగములు పూర్తిగా వివరించనట్లు మీరు గ్రహించినట్లయితే,
  4. పవిత్ర గ్రంథమునకు వ్యతిరేకమైన అంశములు మీరు ఇందులో చూచినట్లయితే,
  5. మీ హృదయము నుండి ఈ అంశమును కలిపిన మరింత బాగుండునని ఆలోచన వచ్చినట్లయితే, ''దయవుంచి నాకు వ్రాయండి.'' (email: FaithScope@thamu.com)

        దీని వలన, మేము మీ యొక్క సహాయ సహకారాల వల్ల తరువాత ముద్రణలో ఈ పుస్తకము అన్ని కోణాలలో అందముగా తీర్చిదిద్ది అందించగలము. ఆమేన్‌.

శేఖర్ రెడ్డి గారు వ్రాసిన పుస్తకములు: 

  1. ఏడు అను సంఖ్యలోని సర్వసంపూర్ణత  
  2. లోకానికి బైబిల్‌ సవాల్‌ - పార్ట్‌ 1-5
  3. మరణము తరువాత  
  4. నా ప్రభువు తల్లి
  5. ఏదెనులోని దైవప్రణాళిక  
  6. సున్నతి - బాప్తిస్మము  
  7. దేవుని దూతలు - వారి పరిచర్యలు
  8. జేసునాథుని దివ్య వాక్కులు  
  9. ప్రవక్తల ప్రవచనములు - పరమార్థములు  
  10. ప్రకటన గ్రంథ రహస్యములు ఇప్పుడు మీ చేతిలో
  11. పరమగీతము
  12. సాటి సహాయిని

వీటిని మీరు www.FaithScope.com ద్వారా ఉచితముగా పొంద వచ్చును.