దేవుని దూతలు - వారి పరిచర్యలు (Part 2)

గ్రంథకర్త : శేఖర్‌రెడ్డి వాసా

పూర్తి రచనా సహకారము :  ఇమ్మానుయేల్‌ రెడ్డి  వాసా

www.FaithScope.com

ఈ భూప్రపంచాన్ని ఒక్కసారి పరికించి చూచిన అదో అద్భుతమైన సృష్టిగా భావిస్తాము.  అలాగే మనకు తెలియని మన చుట్టు ఉండే మరో అద్భుత ప్రపంచము దేవదూతలకు నిలయమై ఉన్నది.  ఈ దేవదూతల ప్రపంచమునకు మన ప్రపంచమునకు పెద్ద తేడా ఏమి లేదు.  మన చుట్టు మనతో బాటుగా అదృశ్యములో ఉండే అత్యంత రహస్యమైన ప్రపంచము ఇది.  ఇలాంటి దేవదూతలను గూర్చి బైబిలు గ్రంథములో అనేక సంఘటనలు బోధింపబడి ఉన్నాయి.  కాని ఈనాడు ఈ దూతలను చూచినవారు ఎవరైన ఉన్నారా?  ఏ బోధకుడు కూడ దీనిని గూర్చి బోధించు స్థితిలో లేరు.  కాని బైబిలు గ్రంథములో ఇంచుమించు ప్రతి ఒక్క దైవజనుడు దేవుని దూతల యొక్క పరిచర్యను పొందియున్నారు.  మరి బైబిలు గ్రంథములో ఇంత ఉన్నత స్థానమును పొందిన దేవుని దూతలను గూర్చి వారి పరిచర్యను గూర్చి తెలుసుకొనుట మన కనీస ధర్మము.  ఈ పరిచర్యలో ఎవరు ఎంతవరకు భాగస్థులై యున్నారో ఈ గ్రంథము ద్వారా తెలుసుకొనుటకు ప్రయాసపడుదుము గాక!  

మూలము

రెడ్డిపాళెం గ్రామములోని నా ప్రభువు తల్లి ఉపదేశములు మరియు ఆమెను ఆవరించిన పరిశుద్ధాత్మయొక్క జ్ఞాన సహాయమే ఈ పుస్తక రచనకు మూలాధారము.

అంకితము

ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించి నన్ను ప్రేమించిన క్రీస్తు ప్రభువుకు అంకితమిస్తున్నాను. -  వాసా శేఖర్‌రెడ్డి

Contents

విభాగము – 7        

యెహోషువ మొదలు ఇశ్రాయేలీయులు బాబిలోనియాకు బానిసలుగా కొనిపోబడిన కాలము        

75.  యెహోషువ లేక ఇశ్రాయేలీయుల పక్షములో దేవదూతలు యుద్ధము చేయుట        

76.  దేవుని దూతలు భూలోక రాజ్యాలను ఆక్రమించుకొనుట        

77.  దేవుడే స్వయముగా యెరూషలేము దేవాలయ నమూనా ఇచ్చి దానిలో కెరూబులను చెక్కించుట        

78.  యెరూషలేము దేవాలయములో కెరూబులతో దేవుని వైభవము        

79.  దేవునితోబాటుగా నివసించువారు        

80.  దేవుని దూతలుగా మనచే పిలువబడు దేవుని శక్తులైన కెరూబులు చేయు క్రియలు        

81.  కెరూబులతో ప్రభువు తేజస్సు భూమిపైకి వచ్చుట మరల తిరిగి విడనాడుట        

82.  ప్రభువు తేజస్సు భూమిని విడనాడి తిరిగి పరలోకమునకు వెళ్లిపోవుట        

83.  పతనము చెందిన దేవుని దూతలు యెరూషలేములోని దేవుని ఆలయమును ఆక్రమించిన తీరు        

84.  పతనము చెందిన దేవుని దూతలు నిజదేవుని వస్తువులను దొంగిలించుట        

ముగింపు        

విభాగము - 8        

బాబిలోనియాకు ప్రవాసము మొదలు క్రీస్తు ప్రభువు పుట్టుకకు ముందు కాలము        

85.  పతనము చెందిన దూతయైన బేలుకు బానిసలుగా నిజదైవ ప్రజలు        

86.  రాజు విగ్రహ దేవుళ్లను ప్రతిష్టించగా వాటిని పూజించమని ఎదురు తిరిగిన నిజదైవభక్తులు        

87.  ఇశ్రాయేలీయుల విముక్తి కోసము దేవుని దూత మనవి        

88.  నిజదైవ వస్తువులను దొంగిలించిన పతనము చెందిన దూతల నుండి దేవుడు తిరిగి పొందుట        

89.  ఇశ్రాయేలీయుల పక్షము వహించు దూత        

ముగింపు        

విభాగము - 9        

నూతన నిబంధన కాలము        

90.  బేతెస్ద కోనేరులోని నీళ్లను కదిలించి స్వస్థపరచు దేవదూత        

91.  గాబ్రియేలు దూత దైవవర్తమానమును తెచ్చి ఫలానా పేరు పెట్టమని చెప్పుట        

92.  రక్షకుని పుట్టుక దినమున భూమిపై నరుల ముందు పండుగ చేసుకొంటూ ఆ వర్తమానమును నరులకు దేవుని దూతలు తెలియజేయుట!        

93.  దేవుని దూతలు కలలో ప్రత్యక్షమగుట        

94.  క్రీస్తు ప్రభువు దేవుని దూతల స్వభావమును ధరించుకొని పుట్టలేదు        

95.  ఈ లోకసంపద ఆహారమే మనలను జీవింపజేయునని ప్రేరేపించు పతనము చెందిన దూతయైన సాతాను        

96.  దేవుని శోధింపమని ప్రేరేపించు పతనము చెందిన దేవుని దూత        

97.  సాతాను అను పతనము చెందిన దేవుని దూత తనకు నచ్చినవారికి ఈ లోక రాజ్యములపై అధికారిగా చేస్తానని క్రీస్తు ప్రభువును ప్రలోభ పెట్టుట        

98.  క్రీస్తు ప్రభువుకు పరిచర్య చేసిన దేవుని దూతలు        

99.  దేవుడు నూతన నిబంధన కాలములో తన పరిపాలనను క్రీస్తు ప్రభువుకు అప్పగించుట క్రీస్తు ప్రభువుకు వ్యతిరేకముగా సాతాను అతని దూతల పరిపాలన        

100.  మనుష్యకుమారునిపైగా ఎక్కుట దిగుట చేయుచున్న దేవుని దూతలు.        

101.  మనుష్యకుమారునికి శత్రువు అపవాది అను పతనము చెందిన దూత        

102.  సాతాను క్రీస్తు ప్రభువును (పరిశుద్ధుని) వెంబడించుట        

103.  సాతాను క్రీస్తు ప్రభువును గద్దింప చూచుట!        

104.  సాతాను అను పతనము చెందిన దూత యొక్క రెండవ పతనము - విశ్వాసులు కాళ్లతో త్రొక్కుట        

105.  క్రీస్తు ప్రభువుకు బెలియాలుతో (దేవుని దూతలలో పతనము చెందినవారితో) పొత్తు ఎక్కడ?        

106.  అపవిత్రాత్మలు అనగా పతనము చెందిన దేవుని దూతలు క్రీస్తు ప్రభువును తమని శిక్షించవద్దని వేడుకొనుట        

107.  దేవుని యెదుట సాతాను క్రీస్తు శిష్యులను కోరుకొనుట క్రీస్తు ప్రభువు తన శిష్యులు తప్పిపోకుండునట్లు కోరుకొనుట        

108.  క్రీస్తు ప్రభుని పట్టించుటకు యూదా ఇస్కరియోతు హృదయములో ఆలోచన కలిగించిన సాతాను        

109.  ఒలీవకొండలో క్రీస్తు ప్రభువును బలపరచిన దేవుని దూత!        

110.  క్రీస్తు ప్రభువు సిలువ శ్రమకు ముందు దేవుని దూతల సహాయము కొరకు తండ్రిని అడగలేదు        

111.  క్రీస్తు ప్రభుని సిలువ బలియాగము ఈ యుగ సంబంధమైన శక్తుల విజృంభణ        

112.  క్రీస్తు ప్రభువు పునరుత్థానము - దేవుని దూతల పరిచర్య        

ముగింపు        

విభాగము – 10        

అపొస్తలుల కాలము        

113.  క్రీస్తు ప్రభువు పరలోకమునకు ఎక్కి పోవుట దేవుని దూతలు సాక్ష్యము చెప్పుట        

114.  దేవుని దూత పేతురును రక్షించుట - యాకోబును స్తెఫనును రక్షింపకపోవుట        

115.  పౌలుకు దేవుని దూత దర్శనము        

116.  విగ్రహములనుగూర్చి పౌలు ఆత్మ పరితాపము చెందుట!        

117.  పుతోను అను పతనము చెందిన దూత రక్షణ మార్గమును బోధించుట        

118.  పౌలు క్రీస్తు ప్రభువును గూర్చి బోధించుట అర్తెమిదేవి అను పతనము చెందిన దేవుని దూత భక్తులు అల్లరి చేయుట        

119.  పౌలు శరీరములో ఒక ముల్లు సాతానుయొక్క దూత ఉంచబడుట        

120.  నీతికి ప్రతిరూపమైన కొర్నేలీ రక్షణార్థము దేవుడు తన దూతను పంపుట        

ముగింపు        

విభాగము – 7

యెహోషువ మొదలు ఇశ్రాయేలీయులు బాబిలోనియాకు బానిసలుగా కొనిపోబడిన కాలము

పరిచయము

ప్రియపాఠకులారా! మోషే తరువాత యెహోషువ ఇశ్రాయేలీయులకు నాయకునిగా ఎన్నిక చేయబడినాడు.  ఈ యెహోషువ దేవుడైన యెహోవా సైన్యాధికారియైన మిఖాయేలు అను దేవుని దూతను చూచి ధైర్యము తెచ్చుకొని దేవుని దూతల సహాయము తమ ప్రక్క ఉన్నదని గ్రహించి కానాను జయించుట జరిగింది. ఇంత ఉన్నత స్థితిలో మొదలైన ఈ కాలములో ఎన్నో ఒడిదుడుకులకు లోనైనదని మనము చెప్పవచ్చును. సొలొమోను మందిరము నిర్మించుట చివరకు ఆ మందిరమునే విగ్రహ దేవుళ్లు ఆక్రమించుకొని వీరు ఆరాధింపబడుట జరిగింది. దీని ఫలితమే ఇశ్రాయేలీయుల ప్రవాసము బానిస బ్రతుకు. ఈ కాలములో దేవుని దూతల ప్రత్యేక కార్యములను గూర్చి తెలుసుకొందము.

75.  యెహోషువ లేక ఇశ్రాయేలీయుల పక్షములో దేవదూతలు యుద్ధము చేయుట

        ప్రియపాఠకులారా!  నరులు యుద్ధములు జరిగించు సమయములో దేవుని దూతలు ఆ యుద్ధమునకు ముందు వెళ్లి అక్కడ వాటి వాటి కార్యములు జరిగించును.  ఇందులో ఒక గొప్ప రహస్యము ఇమిడి యున్నది.  ఈ రహస్యమును మనము బైబిలు గ్రంథము నుంచి తెలుసుకొనిన చాలా గమ్మత్తుగా కూడా ఉంటుంది.  ఇందులో - యుద్ధము రెండు రాజ్యముల మధ్య సంభవిస్తుంది.  ఈ యుద్ధము జరుగుటకు అనేక కారణములు చెపుతూ ఉంటారు.  ఏ జాతి చరిత్రను మనము చదివినా అందులో యుద్ధములు జరుగు సందర్భాలు అనేకము చదువుకొనవచ్చును.  ఈ యుద్ధ సమయములో రెండు ప్రక్కల రాజులు వారి వారి సైన్యముతో సిద్ధమై బారులు తీరి నిలుచుందురు.  అటుతరువాత యుద్ధనాదమును బూరలతో ఊది ఒకరిపై ఒకరు కత్తులు దూసుకొని నరుకుకొనుట చేయుదురు.  ఇందులో రెండు రకములవారు ఉన్నారు.  వీరిలో ఒక రకమువారు గెలుపొందువారు.  రెండవ రకమువారు ఓడిపోవువారు.  ఇరు జట్లలో యుద్ధము జరుగగా ఒక జట్టు మాత్రమే గెలుచునన్న సంగతి జగమెరిగిన సత్యమే!  అయినను ఇరు జట్లు గెలుపు కోసము పోరాటము జరుపుదురు.  బైబిలు గ్రంథములో యెహోషువ చరిత్రలో ఇలాంటి ఒక యుద్ధము గురించి చెప్పుచూ ఆ యుద్ధములో ఉండు దేవదూతలను గూర్చి చెప్పుట జరిగింది.

        యెహోషువ 5:13-14, ''యెహోషువ యెరికో ప్రాంతమున నున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా, దూసిన కత్తి చేత పట్టుకొనియున్న ఒకడు అతని యెదుట నిలిచియుండెను; యెహోషువ అతనియొద్దకు వెళ్లి-నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధులపక్షముగా నున్నవాడవా?  అని అడుగగా అతడు-కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి యున్నాననెను.  యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారముచేసి-నా యేలినవాడు తన దాసునికి సెలవిచ్చునదేమని అడిగెను.''  ఇందులో యెహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు.  నిజమునకు యెహోవా  దేవుని సేనాధిపతులు ఆయన దూతలలో అగ్రగణ్యుడైన మిఖాయేలు మాత్రమే.  ఈ మిఖాయేలు యెహోషువకు దర్శనమిచ్చుట జరిగింది.  ఈ దర్శనములో సాధారణమైన మానవులమైన మనము మాట్లాడుకొనుచున్నట్లుగా వారు మాట్లాడుకొనుచున్నారు.  మన మూల వాక్యములోని సంఘటన మోషే మరణించిన తరువాత యెహోషువ ఇశ్రాయేలీయులందరికి నాయకుడు అయ్యాడు.  అటుతరువాత ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వములో కానాను అందులోని సమస్త జాతులను జయించుటకు సిద్ధపడుట జరిగింది.  ఈ సందర్భములో ఈ దేవుని దూత యెహోషువకు దర్శనమిచ్చుట జరిగింది.  ఇందులో యెహోషువ ఇశ్రాయేలు సైన్యమునకు అధిపతి.  దృశ్యములో ఉన్నవాడు.  కనబడిన ఈ దూత యెహోవా సైన్యమునకు అధిపతి.  ఇతను అదృశ్య రూపుడైనను యెహోషువలోని నీతి, పరిశుద్ధత అతనికి దేవుని దూత కనబడునట్లు చేసింది.  కనుకనే యెహోషువ అను ఇశ్రాయేలీయుల జనాంగమునకు నాయకుడు యెహోవా సైన్యాధిపతి ఇరువురు కలసి మాట్లాడుకొనుచున్నారు.  యెహోషువ 6:1-5, 7-20, ''ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండను లోపలికి రాకుండను యెరికోపట్టణ ద్వారము గట్టిగా మూసి వేయబడెను.  అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను-చూడుము; నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీచేతికి అప్పగించుచున్నాను.  మీరందరు యుద్ధసన్నద్ధులై పట్టణమును ఆవరించి యొకమారు దానిచుట్టు తిరుగవలెను.  ఆలాగు ఆరు దినములు చేయుచు రావలెను.  ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువవలెను.  ఏడవ దినమున మీరు ఏడు మారులు పట్టణముచుట్టు తిరుగుచుండగా ఆ యాజకులు బూరల నూదవలెను.  మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరలధ్వని వినునప్పుడు జనులందరు ఆర్భాటముగా కేకలు వేయవలెను, అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ యెదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. . . .  మరియు అతడు-మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు, యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలెననియు ప్రజలతో చెప్పెను.  యెహోషువ ప్రజల కాజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు, ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారివెంట నడిచెను.  యోధులు బూరల నూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలను ఊదుచుండిరి.  మరియు యెహోషువ-మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినమువరకు మీరు కేకలువేయవద్దు.  మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటనుండి యే ధ్వనియు రావలదు, నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలెనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను.  అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని యొకమారు దానిచుట్టు తిరిగిన తరువాత వారు పాళెములో చొచ్చి రాత్రి పాళెములో గడిపిరి.  ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తికొని మోసిరి.  ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని, నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి, యోధులు వారికి ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడివచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలు ఊదుచు వచ్చిరి.  అట్లు రెండవదినమున వారొకమారు పట్టణము చుట్టు తిరిగి పాళెమునకు మరల వచ్చిరి.  ఆరుదినములు వారు ఆలాగు చేయుచువచ్చిరి.  ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి యేడుమారులు ఆ ప్రకారముగానే పట్టణముచుట్టు తిరిగిరి;   ఆ దినమున మాత్రమే వారు ఏడు మారులు పట్టణముచుట్టు తిరిగిరి.  ఏడవమారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను-కేకలువేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు.  ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను.  రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ యింటనున్న వారందరును మాత్రమే బ్రదుకుదురు.  శపింపబడినదానిలో కొంచెమైనను మీరు తీసికొనిన యెడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు.  వెండియు బంగారును ఇత్తడిపాత్రలును ఇనుపపాత్రలును యెహోవాకు ప్రతిష్ఠితములగును; వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను.  యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి.  ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను; ప్రజలందరు తమ యెదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి.''  ఈ యుద్ధములో కోట గోడ ఉన్నది ఉన్నట్లుగా కూలిపడింది.  దానిని యెహోషువ ఏమి చేయలేదు.  అతని సైన్యము ఏ ప్రయత్నము చేయలేదు.  వీరు చేసినదెల్లా బూరలను ఊదుట, యుద్ధనాదము చేయుచూ కేకలు వేయుట ఇంత మాత్రముననే కోట గోడ పడిపోవునా?  ఇందులో ఇమిడియున్న రహస్యమే దేవుని సైన్యాధికారియైన దూత ఈ పనిని అదృశ్యములో జరిగించి దృశ్యములో ఉన్న ఇశ్రాయేలీయుల యొక్క సైన్యమునకు సహాయపడినట్లుగా మనము గ్రహించాలి.

        ఇందులో దృశ్యములో - యెహోషువ - ఇశ్రాయేలీయుల సైన్యాధికారి.  ఇశ్రాయేలీయ సైన్యము - వీరు యుద్ధవీరులు.  వీరంతా ఒక ప్రక్క.  యెరికో రాజు - యెరికో నగర వాసులకు అధిపతి, సైన్యాధికారి, యెరికో సైన్యము - వీరు యుద్ధ వీరులు.  వీరంతా రెండవ ప్రక్కవారు.  ఇందులో అదృశ్యములో - యెహోవా సైన్యాధికారి  - ఈయన ఇశ్రాయేలీయుల పక్షముగా తన సైన్యముతో వచ్చియున్నాడు, ఎందుకంటే ఇక్కడ యెహోవా సైన్యాధికారి అని చెప్పుచున్నాడు.  సైన్యాధికారి అనగానే సైన్యమునకు అధిపతి అనగా దేవుని దూతలలో యెహోవా దేవుని సైన్యముగా ఉన్నవారికందరికి ఈయన అధిపతి కనుక సైన్యాధికారి కదలిన చోటుకు అతని సైన్యము కూడా వచ్చును.  కనుక మొదటివారి ప్రక్క యెహోవా సైన్యాధికారి మరియు అతని సైనికులు అదృశ్యములో ఉన్నారు.  వీరంతా దేవుని దూతలు.  ఇక ఇశ్రాయేలీయుల సైనికుల వద్ద వారి వారి సంబంధులైన దేవుని దూతలు ఉన్నారు, ఎందుకంటే నరులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుని దూత కాపలాగా దేవుడు ఇచ్చి యున్నాడని మనము మూడవ విభాగములో 47వ అధ్యాయములో చదువుకొని యున్నాము.  కనుక యెహోవా సైన్యాధికారి, అతని సైనికులైన దేవుని దూతలతోబాటుగా ఆ యుద్ధ వాతావరణములో వారిని రక్షించు దేవుని దూతలు వారి చుట్టూ నీడలా అదృశ్యములో తిరుగాడుచున్నారు.

        ఇక రెండవ ప్రక్కవారు దైవజనాంగము కాదు.  వీరు అన్యదేవతలను పూజించువారు.  వీరి అధిపతి సాతాను.  వీరు కొలిచిన దేవతలు సాతాను యొక్క దూతలు.  న్యాయాధిపతులు 5:8, ''ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను  ఇశ్రాయేలీయులలో నలువదివేలమందికి ఒక కేడెమేగాని యీటెయేగాని కనబడలేదు.''  కనుక యెరికో పట్టణ వాసులు కూడా అన్య దేవతలను పూజించువారు.  కనుక వీరికి సాతాను దూతల అండలో ఆ యుద్ధ రణ రంగమున చేరి వారు విజయమును పొందుటకు ప్రయత్నిస్తారు.  అలాగే వీరితోబాటుగా అన్య జనులైన యెరికో పట్టణవాసులతోబాటుగా వారిని సంరక్షించుటకు దేవుడు ఇచ్చిన దూతలు ఉన్నారు.  ఇలా రెండు వర్గములు తయారు అయ్యాయి.  వీరిలో దృశ్యములో కొందరు, అదృశ్యములో కొందరు.  యెహోషువ పక్షమున దేవుని సైన్యాధికారి అదృశ్యములో క్రియ జరిగించగా, సాతాను అతని దూతలు వాని ముందు నిలువనేరవు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కడే.  దేవుడు యెహోషువను ఆశీర్వదించుట చేత, దేవుని సైన్యాధికారి యెహోషువ పక్షమున పోరాడుటకు వచ్చాడు.  నిర్ణీత కాలములో ఈ దూత అతని సైన్యముతో అదృశ్యములో ఉన్న అంధకార శక్తులైన సాతాను అతని దూతలతో పోరాడి వారిని ఆ ప్రాంతము నుండి తరిమివేయుట ముందుగా జరిగించును కనుక ఆ యుద్ధము ఏక పక్షముగా జరిగి యెహోషువకు విజయమును అందించుట జరిగింది.  అదృశ్యములో యెహోవా సైన్యాధికారి, అతని దూతలు మరియు సాతాను అతని దూతలు యుద్ధము జరిగించుట చేసాడు.  దృశ్యములో అదే సమయములో యెహోషువ సైన్యాధికారిగా ఇశ్రాయేలీ యోధులు సైనికులుగా యెరికో నగర వాసులపై  పడి వినాశనము సృష్టించి ఆ ప్రాంతమును వారు స్వాధీనము చేసుకొనుట జరిగింది.  ఈ విధముగా ప్రతి యుద్ధము జరుగును.  ఈనాడు రాజుల కాలములో వలె కాక విమానాలు, ట్రాక్టర్లు, తుపాకులు, మెషిన్‌ గన్స్‌తో యుద్ధము జరుగుచున్నది.  ఇది కూడా పైన జరిగిన తీరు వలె జరుగునని గ్రహించాలి.  ఇందులో దృశ్యములోని ఇవన్ని  దృశ్యములో పోరాడుచుంటే, అదృశ్యములోని దేవుని దూతలు అదృశ్యములో పోరాడుట జరిగిస్తాయి.  దైవనిర్ణయములో ఉన్నవారు గెలుపును పొందుతారు.  ఇందులో నీతిగా యెహోవా దేవుని హృదయశుద్ధితో పూజించినంత కాలము ఇశ్రాయేలీయులు విజయము పొందినారు.  ఏనాడైతే ఇశ్రాయేలీయులు దేవుని విస్మరించి అన్య దేవతలను పూజించుట జరిగించారో, అప్పటినుండి వారిపై అన్య జాతివారు పెత్తనము జరిగించుట చేసారు.  అంటే ముందు విజయము సాధించినవారు అటుతరువాత దేవుని విడనాడినప్పుడు వారు ఓడిపోవుట జరుగుచున్నది.  ఇందులో ఒక రహస్యము ఇమిడి యున్నది.

        ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు అన్యదేవతలను పూజించినారో అప్పటినుండి వారికి యెహోవా దేవుని సహాయము తొలగిపోవుట జరిగింది.  ఇప్పుడు వారి పక్షమున అదృశ్యములో పోరాడు వీరులు లేరు.  అనగా దేవుని దూతలు వారిని విడిచిపెట్టి పోవును.  ఇప్పుడు వీరు కేవలము దేవుడు వారికి ఇచ్చిన దూతల సంరక్షణలో వారు లేరు.  కాని ఈ దూతలు వారిని నీడలా వెంబడించుట జరుగును గాని దేవుని ఆజ్ఞ లేకపోవుటచేత ఇవి వారిని యుద్ధ కాలములో విడిచిపోవును.  ఇప్పుడు వారికి అదృశ్యములో సహాయము చేయువారు లేరు.  కాని వీరు పోరాడు శత్రువులకు అదృశ్యములో వారు పూజించు అన్యదేవతలుగా పిలువబడు సాతాను దూతలు అనగా దయ్యములు వారికి సహాయపడును.  కనుక వారు ఇశ్రాయేలీయులపై విజయము సాధించుట జరుగును.  కొంతకాలము ఇశ్రాయేలీయులు దృశ్యములో అనేక బాధలు అనుభవించి తిరిగి చివరకు నిజదైవములోనికి వచ్చుట సంభవించును.  అప్పుడు వారి బాధాపూరితమైన ఘోషను విన్న దేవుడు ఇశ్రాయేలీయులు ఈ బాధా కాలములో తిరిగి తన చెంత చేరి నిజదైవమును పూజ చేయుట ద్వారా దేవుని సైన్యాధికారి అతని దూతలు వీరికి సహాయము చేయుటకు దేవుని ఆజ్ఞను పొంది వత్తురు.  కనుక వీరు స్వల్పజనులైనను అనేకులను వధించి తిరిగి వారిని జయించుట జరుగుచున్నది.  ఇందునుబట్టి మనము తెలుసుకొనవలసిన నీతి ఉన్నది.  అదేమిటంటే - ఇశ్రాయేలీయులు దేవునిలో ఉన్నంత కాలము విజయులుగా ఉన్నారు.  ఎప్పుడైతే అన్య దేవతలను పూజించి దేవునికి దూరమై జీవించారో వారు తమ పతనమును పొంది అన్యజనులకు బానిసలుగా మారారు.  అలాగే ఇశ్రాయేలీయులు దేవునిలో ఉన్నంతకాలము అన్యజనులు ఇశ్రాయేలీయులకు బానిసలుగా ఉన్నారు.  అలాగే ఇశ్రాయేలీయులు నీతి తప్పి నిజ దైవపూజను విడనాడి అన్యదేవతలను పూజించి పాపము కట్టుకొనుట జరిగినప్పుడు, అన్యజనులు వీరు యెహోవా దేవుని పూజించకపోయినను వీరు సాతాను అతని దూతలను దేవతలుగా పూజించినను వీరు వారిపై ఆధిపత్యము పొంది వారిని పరిపాలించారు.  దీనికి కారణము ఇశ్రాయేలీయులు నిజదైవమును విడనాడినప్పుడు, వారి రక్షణగా ఉన్న దేవుని సైన్యాధికారి అతని సైన్యము వారి నుండి తొలగిపోవుట అని గుర్తించాలి.  ఇలా దేవుని సహాయము తొలగినప్పుడు అంధకార శక్తులు విజృంభించి వారి శత్రువులైన అన్యజనాంగమును పురికొల్పి ఇశ్రాయేలీయులను ఆక్రమించుట జరుగును.  తిరిగి ఇశ్రాయేలీయులు నిజదైవము వైపు తిరిగినప్పుడు, వారికి అదృశ్యములో దైవసహాయము సైన్యాధికారిగాను, అతని దూతలుగాను వారికి లభించును.  ఈ దూతలు ఇశ్రాయేలీయులలో ఒకరిని ప్రేరేపించి వారి ద్వారా తిరిగి వారి రాజ్యమును ఆక్రమించుకొనునట్లు చేయును.  ఈ విషయమును మనము న్యాయాధిపతుల గ్రంథములో చదువగలము.  

        న్యాయాధిపతులు 2:11-15, ''ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులయెదుట కీడుచేసి, ఐగుప్తుదేశములోనుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టునుండు జనుల దేవతలలో ఇతరదేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి.  వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి.  కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండెను; ఆయన దోచు కొనువారిచేతికి వారిని అప్పగించెను.  వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి; ఆయన వారి చుట్టునున్నవారి శత్రువులచేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల యెదుట నిలువలేక పోయిరి.  యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయెను గనుక వారికి మిక్కిలి యిబ్బంది కలిగెను.''  న్యాయాధిపతులు 6:11-18, ''యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకివృక్షము క్రింద కూర్చుండెను.  యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై యుండునట్లు గానుగచాటున గోధుమలను దుళ్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి -పరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైయున్నాడని అతనితో అనగా గిద్యోను -చిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండినయెడల ఇదంతయు మాకేల సంభవించెను?  యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నియు ఏ మాయెను?  యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను.  అంతట యెహోవా అతనితట్టు తిరిగి-బలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా అతడు-చిత్తము నా యేలిన వాడా, దేని సహాయముచేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను?  నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే.  నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై యున్నానని ఆయనతో చెప్పెను.  అందుకు యెహోవా-అయిననేమి?  నేను నీకు తోడైయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతముచేయుదువని సెలవిచ్చెను.  అందుకతడు-నాయెడల నీకు కటాక్షము కలిగినయెడల నాతో మాటలాడుచున్న వాడవు నీవే అని నేను తెలిసికొనునట్లు ఒక సూచన కనుపరచుము.  నేను నీయొద్దకువచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టువరకు ఇక్కడనుండి వెళ్లకుమీ అని వేడుకొనగా ఆయన-నీవు తిరిగి వచ్చువరకు నేను ఉండెదననెను.''  ఈ విధముగా న్యాయాధిపతుల విషయము ప్రతి ఒక్కరి విషయములో జరుగుచున్నది.  కనుక దేవుని విస్మరించనంతవరకు మనకు దైవసహాయము పొందుదుమని గ్రహించాలి.

        ఈ విధముగా యెహోషువకు దేవుని దూతలు సహకరించగా వారు కానాను స్వతంత్రించుకొన్నారు.  అలాగే న్యాయాధిపతుల కాలములో ఇశ్రాయేలీయులు దేవునితో ఉన్నంతకాలము విజయము పొందుచూ ఎప్పుడైతే దేవునికి దూరమై విగ్రహ దేవుళ్ల చెరలో పడినప్పుడు వారు ఓటమిని పొందుచూ వచ్చుచున్నారు.  అలాగే రాజుల కాలము కూడ గడచింది.  దీనికి కారణము వారు దేవునిలో ఉన్నప్పుడు వారికి దేవుని దూతల సహాయము లభించేది.  కనుక వారు విజయము సాధించినట్లుగా మనము గ్రహించాలి.  ఈ విధముగా ఈ కాలము గడిచింది.

76.  దేవుని దూతలు భూలోక రాజ్యాలను ఆక్రమించుకొనుట

        ప్రియపాఠకులారా!  దేవుని దూతలు దేవుని ఆజ్ఞ ప్రకారము జీవించవలసినవారు.  వీరు అదృశ్య రూపములో దేవుని ఆజ్ఞను అటు పరలోకము నుండి ఇటు పాతాళలోకము వరకు వారి కార్యములు నెరవేర్చాలి.  అయితే జీవాత్మ అయిన నరుని మరణానంతర జీవితపు నిర్ణయము జీవాత్మ భూమిపై తాను నివసించు స్థితిని బట్టి ఉంటుంది.  యిర్మీయా 21:8.  కనుక దేవుడు జీవమును మరణమును మన ముందు ఉంచి ఏది కావాలో నిర్ణయించుకొను జ్ఞానమును ఆదాము ద్వారా మంచి చెడు జ్ఞానమిచ్చు ఫలము ద్వారా అనుగ్రహించి యున్నాడు.  ఈ జ్ఞానముతో నరులు మంచిని చెడును గుర్తించి, మంచిని మాత్రమే పాటించవలసియున్నది.  అయితే పరలోకములో తిరుగుబాటు చేసిన సాతాను అతని దూతలు నేల మట్టము వరకు త్రోసివేయుట జరిగింది.  యెషయా 14:12, ''తేజో నక్షత్రమా,  వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి?  జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?''  ఈ విధముగా భూమి వరకు సాతాను అను మిలమిల మెరయు వేకువచుక్క పతనము పొందాడు.  అతనితో పాటుగా అనేకమంది దూతలు పతనము చెంది పాతాళ లోకములోని బిలములలో బంధింపబడియున్నారు.  వీరు సాతానుకు అనుకూలముగా క్రియ జరిగించుచున్నారు.  లూకా 4:5-7, ''అప్పుడు అపవాది ఆయనను తీసికొనిపోయి, భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి -ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింప బడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును; కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగునని ఆయనతో చెప్పెను.''  ఇందునుబట్టి దేవుడే స్వయముగా ఈ అధికారమును సాతానుకు ఇచ్చుట జరిగింది.  దీనికి కారణము - దేవుడు నరుల ముందు మంచిని చెడును రెంటిని ఉంచాడు.  ద్వితీయోపదేశకాండము 11:26-28, ''చూడుడి; నేడు నేను మీ యెదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను.  నేడు నేను మీకాజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకాజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని యితర దేవతలను అనుసరించిన యెడల శాపమును మీకు కలుగును.''  వీటిలో ఏది కావాలి?  మంచి నిజదైవమైన క్రీస్తులో ఉంది.  చెడు సాతాను రూపములో ఉన్నది.  వీటిలో ఏది నీకు కావాలి అన్నది మన నిర్ణయమే!  మనము ఎవరిని కోరుకుంటే వారు మన పక్షమున క్రియ జరిగిస్తారు.

        అబ్రాహాము నిజదైవమైన యెహోవాను కావాలని అనుకొన్నాడు.  అబ్రాహాము ముందు తరమువారైన ఆయన తల్లిదండ్రులు విగ్రహారాధికులుగా ఉన్నారు.  యెహోషువ 24:2, ''యెహోషువ జనులందరితో ఇట్లనెను-ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా-ఆదికాలమునుండి మీ పితరులు, అనగా అబ్రాహామునకును నాహోరుకును తండ్రియైన తెరహు కుటుంబీకులు నది (యూఫ్రటీసు) అద్దరిని నివసించి యితర దేవతలను పూజించిరి.''  అబ్రాహాము బాల్యము విగ్రహారాధన చేయు తన తల్లిదండ్రులతో గడిచినది.  కాని అబ్రాహాము విగ్రహములను దేవుళ్ళుగా నిర్ణయించుకొని పూజించలేదు.  ఆయన నిజదైవము కొరకు కనిపెట్టుకొని యున్నాడు.  ఈ గ్రంథ రచయితనైన నేను కూడ విగ్రహారాధికుల కుటుంబములో జన్మించినను, సర్వాయపాళెం గ్రామములో పీర్ల సావిడి రామాలయము కలుగోళమ్మ దేవాలయము వగైరా దేవుళ్లు కనబడుచున్నను వీరిలో ఎవరు దేవుడో ఈ చరాచర జగత్తు సృష్టించినదెవరో తెలియక అయోమయములో పడియున్నాను.  పిచ్చి కుక్క కాటుకు నలువది రోజులు చప్పిడి పత్యముతో అన్నము సహించక బలహీనపడుట చేత ప్రాథమిక విద్యలో అక్షరాలు పలికే స్వరము సరిలేనందున జ్ఞాపకశక్తి లేనందున బలహీన పరిస్థితులలో నిత్యము తినెడి దెబ్బల మూలమునను, నన్ను కాపాడే దేవుడు ఆకాశములో ఆసీనుడైయున్నాడన్న ధ్యాసతో విశ్వాసముతో ఆకాశము వైపు చూస్తూ ఉండేవాడను.  ఎదిగే వయస్సులో రక్తముతో నిండిన గడ్డలు కురుపులతోను పార్శ్యపు తలనొప్పులతోను నా శరీరము అస్థవ్యస్థము రోగగ్రస్థమైపోయింది.  కాని ఇంత భయానక పరిస్థితులలో కూడ లేవలేని స్థితిలో కూడ ఆకాశములో ఆయన నన్ను చూస్తున్నాడని నాకేదో సహాయము చేస్తాడని నన్ను బలపరుస్తాడని దృఢ నమ్మికతో ఉండేవాడను.  ఈ తలంపు బాల్యములోనే నాకు సహజముగా ఏర్పడింది ఒకరు నేర్పింది కాదు.  ఈ విశ్వాసము యొక్క ప్రభావమే ఈనాడు పాఠకులైన మీ అభిమానము పొందగలిగినాను.  ఒకానొక దినమున దేవుడు అబ్రాహామును తన సేవకునిగా పిలిచి తన వారినందరిని వదిలి కానానుకు బయలు దేరమని చెప్పుట జరిగింది.  నిజమునకు ఇక్కడి విగ్రహదేవుళ్ళు ఎవరు?  ఈ నిజదైవము ఎవరు?  అన్న దానిని గూర్చి తెలుసుకొనవలసిన అవసరత ఉన్నది.  జెకర్యా 5:5-11, ''అప్పుడు నాతో మాటలాడుచున్న దూత బయలు వెళ్లి-నీవు నిదానించి చూచి ఇవతలకు వచ్చునదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా ఇదేమిటియని నేనడిగితిని.  అందుకతడు-ఇది కొల, ఇది బయలువెళ్లు తూము అనెను; మరియు లోకమంతటను జనులు ఈలాగున కనబడుదురని చెప్పెను.  అప్పుడు సీసపు బిళ్లను తీయగా కొల తూములో కూర్చున్న యొక స్త్రీ కనబడెను.  అప్పుడతడు-ఇది దోషమూర్తి యని నాతో చెప్పి తూములో దాని పడవేసి సీసపుబిళ్లను తూముమీద నుంచెను.  నేను మరల తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరిరి; సంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారి కుండెను, గాలి వారి రెక్కలను ఆడించుచుండెను, వారు వచ్చి తూమును భూమ్యాకాశముల మధ్యకు ఎత్తి దాని మోసిరి.  వీరు ఈ తూమును ఎక్కడికి తీసికొని పోవుదురని నాతో మాటలాడుచున్న దూతను నేనడుగగా -షీనారుదేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు; అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠముమీద పెట్టి యుంచుదురని అతడు నాకుత్తర మిచ్చెను.''  నాచే విరచితమైన ''జెకర్యాకు యెహోవా వాక్‌ దర్శనములు - పరమార్థములు'' అను గ్రంథము నందు ఇందులో చెప్పబడిన అంశము సంపూర్ణముగా వివరించబడియున్నది.  ఇందులో సంకుబుడి కొంగ అపవిత్ర పక్షి అని చెప్పబడియున్నది.  లేవీయకాండము 11:13-19, ''పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను.  వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచపక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతివిధమైన గద్ద, ప్రతివిధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతివిధమైన డేగ, పైగిడికంటె, చెరువుకాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ, సంకుబుడి కొంగ, ప్రతివిధమైన కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము.''  కనుక దేవునిచే హేయముగా ఎన్నుకొన్నవి సాతానుకు నిలయము.  ఈ పక్షుల రెక్కలు చేయు సహాయము సాతాను చేయు సహాయముగా గుర్తించాలి.  ఇవి తూములో కూర్చుని అనగా రహస్య జీవితములో ఉన్న స్త్రీకి సహకరిస్తున్నాయి.  సాతాను అతని దూతల సహకారముతో భూమ్యాకాశముల మధ్యకు ఎత్తబడి ఒక ప్రాంతము నుండి వేరొక ప్రాంతమునకు తీసుకొని పోబడి షీనారు అను దేశములో ఆ స్త్రీని చేర్చి అక్కడ దానికి ఒక సాలను కట్టి దానిలో ఒక పీఠము మీద దానిని ఉంచుట జరుగును.  ఈ విధముగా విగ్రహదేవుళ్ళు, దేవతలు ఏర్పాటు చేయబడు చున్నాయి.  ఈ విగ్రహదేవుళ్ల దేవతల జీవితాలు రహస్య సంబంధమైనవి హేయమైనవి.  ఇవి సాతాను అతని దూతలు అను రెండు రెక్కల సహాయముతో ఈ విగ్రహ దేవుళ్ళుగా ఈ రహస్య జీవితముగలవారిని ఏర్పాటు చేయుట జరుగుచున్నది.  ఇంతకి వాటి రహస్య జీవితము ఏమిటి?  వీరు పాపము చేసి పతనము చెందిన దూతలు వీరు తూములో రహస్యముగా ఉన్నారు.  వీరు పేతురు వ్రాసిన లేఖలో వలె పాతాళ బిలములలో రహస్యముగా ఉన్నారు.  వీరు పాపము చేసినవారు.  ఇలా దైవవ్యతిరేకతలో ఉన్నత స్థానము పొందిన పతనము చెందిన దేవుని దూతలను దేవుడు పాతాళ బిలములలో బంధించి ఉంచాడు.  ఇవి ఈ విధముగా అదృశ్య స్థితిలో ఉండుట రహస్యము నరులు తమ నేత్రములతో చూడలేరు.  ఇలా రహస్య స్థితిలో ఉన్న దైవవ్యతిరేకతను పొందిన పతనము చెందిన దేవుని దూతలకే సాతాను రెక్కలుగా తన సహాయమును దయజేసి ఎక్కడ లేని చోట ఈ విగ్రహ రూపము ఈ పతనము చెందిన దూతను ఏర్పరచును.  అప్పటినుండి ఈ పతనము చెందిన ఈ దూత సాతాను సహాయముతో ఏర్పరచబడిన కాలము నుండి అన్యులను వారు కట్టుకున్న గుడులను దాని పరిసర ప్రాంతాలను కనిపెట్టుకొని తన రహస్య జీవితమును కప్పిపుచ్చి, తనే నిజమైన దేవుడు దేవతలుగా నరులను గణాచారి రూపములో ఆవేశమై మాట్లాడుచు మోసగిస్తుంటారు.  ఇలా ఈ సాతాను సహాయముతో ఏర్పరచుకొన్న పతనము చెందిన ఈ దూతలు అన్యజనులలో దైవములుగా వెలుగొందుచున్నాయి.  ఇంతకి ఈ దూతలు పతనము చెందుటకు కారణము ఏమి?  యెషయా 14:12-15, ''తేజోనక్షత్రమా,  వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి?  జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?  -నేను ఆకాశమున కెక్కిపోయెదను  దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును  ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును  మేఘమండలముమీది కెక్కుదును  మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా?  నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.''  ఈ విధముగా సాతాను అతని దూతలు దేవునితో సమానమైన లేక దేవుని కన్నా ఉన్నతమైన స్థానమును కోరుకొని పతనము చెందినవారు.  కనుక వీరు విగ్రహ దేవుళ్ళుగా మారి నరులను మోసగించి వారిచే పూజింపబడుచూ తమ కోరికను తీర్చుకొనుచున్నాయి.

        మనము ఇశ్రాయేలీయుల చరిత్రను చదివితే ఈ సాతాను విగ్రహ దేవుళ్ళ రూపములో చేసిన క్రియలను మనము చదువవచ్చును.  మొదట సాతాను ఏర్పరచిన ఈ విగ్రహదేవుళ్లు అన్యజాతిని వారి ప్రదేశములను ఆక్రమించుకొని వారిచే ఆరాధించ బడుచున్నాయి.  అలా దాగోను, ఆమోసు 5:26 - మోలెకు, బయలు, అష్తారోతు, కెమోషు, మిల్కోము, అషేరా మొదలైన దేవుళ్లు దేవతలు గూర్చి బైబిలు గ్రంథములో ఇశ్రాయేలీయుల చరిత్రలో మనము చదువగలము.  ఈ విగ్రహదేవుళ్లు అన్యజాతి జనులైన ఫిలిష్తీయులు, ఐగుప్తీయులు, మోయాబీయులు, కనానీయులు వంటి జాతులలో పాతుకొని ఆ జనులను నిజదైవమును గుర్తించని స్థితికి దిగజార్చుట జరిగింది.  ఈ స్థితిలో అబ్రాహాము సంతానములోని ఇశ్రాయేలీయులు మోషే ద్వారా నిజదైవములోనికి వచ్చారు.  దేవుడు మహాఅద్భుత కార్యము ఐగుప్తీయుల మధ్య జరిగించి తనే నిజమైన దేవునిగా వారందరికి తెలియజేసి వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను విడిపించుకొని కానానుకు నడిపించాడు.  ఎఱ్ఱ సముద్రము దాటిన తరువాత సీనాయి కొండపై దేవుడు మోషేకు పది ఆజ్ఞలను బహుకరించుట జరిగింది.  ఈ సమయములో సాతాను రహస్య జీవితములో ఉన్న పతనము చెందిన దేవుని దూతను  ఇశ్రాయేలీయుల మధ్య ఏర్పరచాలని అనుకొన్నాడు.  అదే అదనుగ, సాతాను ఇశ్రాయేలీయులను ప్రేరేపించి ఐగుప్తు నుంచి మమ్ములను విడిపించిన దైవమును చూపించమని అహరోనును బలవంతము చేసాడు.  అప్పుడు - నిర్గమకాండము 32:1-5, ''మోషే కొండదిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చి-లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకొరకు చేయుము.  ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి.  అందుకు అహరోను-మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నాయొద్దకు తెండని వారితో చెప్పగా ప్రజలందరు తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి.  అతడు వారియొద్ద వాటిని తీసికొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను.  అప్పుడు వారు-ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి.  అహరోను అది చూచి దాని యెదుట ఒక బలిపీఠము కట్టించెను.  మరియు అహరోను-రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా''  

        ఈ విధముగా ఒక దేవతను ఇశ్రాయేలీయులను దైవజనాంగము మధ్య పునాది వేసి దానిని పూజించుటకు సాతాను ఇశ్రాయేలీయులను పురికొల్పాడు.  అప్పుడు మోషే దానిని బూడిద చేసి ఇశ్రాయేలీయులచే తాగించి ఇది పనికిరాని హేయమైనదేగాని దానిలో శక్తి లేదని నిరూపించుట జరిగింది.  ఇశ్రాయేలు ఆనాడు ఆచరించిన దూడ కొలువు వివిధ భంగిమలలో అనగా ఆ దూడ ఎదిగి పెయ్య అయితే గోమాత - కామధేనువుగాను; కోడె అయితే గంగిరెద్దు నంది బసవయ్య అను నామధేయాలతో - నాడు ఇశ్రాయేలీయులలో పునాది వేసిన ఈ కొలువు మొలకెత్తినప్పుడే మోషే ద్వారా వేరులతో కూడ పెకలించబడి నామరూపాలు లేకుండ తుడిచిపెట్టుకొని పోయింది. ఈ కొలువు నేడు భారతదేశములో బలపడి మహా వృక్షముగా వేరులు నిండించి దేవాలయము లలో నందీశ్వరుడని నంది వాహన ఊరేగింపులని గోమాత కొలువులతోను నిండిపోయింది.  ఇలా యెహోషువ వరకు చరిత్ర జరిగింది.  అటుతరువాత న్యాయాధిపతుల కాలము వచ్చింది.  ఈ కాలములో అనేకమార్లు అన్య దేవతలను పూజించుట జరిగింది.  న్యాయాధిపతులు 2:11-15, ''ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులయెదుట కీడుచేసి, ఐగుప్తుదేశములోనుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టునుండు జనుల దేవతలలో ఇతరదేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి.  వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి.  కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను; ఆయన దోచు కొనువారిచేతికి వారిని అప్పగించెను.  వారు ఇశ్రాయే లీయులను దోచుకొనిరి; ఆయన వారి చుట్టునున్నవారి శత్రువులచేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువులయెదుట నిలువలేకపోయిరి.  యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయెను గనుక వారికి మిక్కిలి యిబ్బంది కలిగెను.''  ఈ విధముగా సాతాను దైవజనాంగము మధ్య అన్య దేవతలను ఏర్పరచుట తద్వారా వారు వాటికి బానిసలై నిజ దైవమును వదిలివేయుట చేసేవారు.  దీనికి ఉగ్రుడైన దేవుడు వారిని వదిలి వేసినప్పుడు వారు అనేక రీతులుగా కష్టాలకు లోనై తిరిగి దేవునిలోనికి వచ్చేవారు.  అప్పుడు అన్య దేవతలకు సంబంధించిన విగ్రహములను బలిపీఠములను తొలగించేవారు.  

        న్యాయాధిపతులు 10:6-7, ''ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరల దుష్‌ ప్రవర్తనులైరి.  వారు యెహోవాను విసర్జించి ఆయన సేవమానివేసి, బయలులు అష్తారోతులు అను సిరియనుల దేవతలను సీదోనీయుల దేవతలను మోయాబీయుల దేవతలను అమ్మోనీయుల దేవతలను ఫిలిష్తీయుల దేవతలను పూజించుచువచ్చిరి.  యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారినప్పగించెను గనుక'' ఇలా సాతాను దైవజనాంగమును కూడ తన ఆధీనములో ఉంచుకొనుట జెకర్యాలో చెప్పబడిన రీతిగా విగ్రహదేవుళ్లను ఏర్పరచి కాలక్రమేణా దైవజనాంగమును నిజదైవమునకు దూరము చేసి వారిని అన్య దైవారాధికులుగా మార్చుట జరిగింది.  2 రాజులు 17:9-12, ''మరియు ఇశ్రాయేలువారు తమ దేవుడైన యెహోవా విషయములో కపటము గలిగి దుర్బోధలు బోధించుచు, అడవి గుడిసెల నివాసులును ప్రాకారములు గల పట్టణనివాసులును తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని యెత్తయిన కొండలన్నిటిమీదనేమి, సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి, అంతటను విగ్రహములను నిలువబెట్టి దేవతా స్తంభములను నిలిపి తమ యెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నతస్థలములలో ధూపము వేయుచు, చెడుతనము జరిగించుచు, యెహోవాకు కోపము పుట్టించి -చేయకూడదని వేటినిగూర్చి యెహోవా తమ కాజ్ఞాపించెనో వాటిని చేసి పూజించుచుండిరి.''  2 రాజులు 17:16-18, ''వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని యనుసరింపక పోత విగ్రహములైన రెండు దూడలను చేసి దేవతాస్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలు దేవతను పూజించిరి.  మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసికొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి.  కాబట్టి యెహోవా ఇశ్రాయేలువారియందు బహుగా కోపగించి, తన సముఖములోనుండి వారిని వెళ్లగొట్టెను గనుక యూదాగోత్రము గాక మరి యేగోత్రమును శేషించి యుండలేదు.''  ఇలా ప్రతిచోట అనేకమార్లు వ్రాయబడియున్నది.  సాతాను ఈ విగ్రహదేవుళ్ళను ఏర్పరచి వాటిని పూజించుటకు నరులను ప్రేరేపించి దైవజనాంగముగా పేరు పొందిన ఇశ్రాయేలీయుల రాజ్యమును తన అధికారములోనికి తెచ్చుకోవాలని ప్రయత్నించేవాడు.  ఈ ప్రయత్నము దేవుడు తను ఎన్నుకొన్నవారి ద్వారా వమ్ము చేసి తిరిగి తన రాజ్యమును స్థాపించేవాడు.

        పాత నిబంధన గ్రంథములో సొలొమోను దేవునికి ఆలయమును నిర్మించినవాడు.  అలాంటివాడు తన జీవిత చరమ కాలములో విగ్రహ దేవుళ్లను ఏర్పరచి వాటిని కొలుచుటకు బలిపీఠములు నిర్మించుట జరిగింది.  ఈ విధముగా సాతాను పతనము చెందిన దేవుని దూతలలో తన ముఖ్య అనుచరులైనవారిని తిరిగి ఇశ్రాయేలీయులలో సొలొమోను వివాహము చేసికొనియున్న వేయిమంది అన్యజాతి భార్యల ద్వారా ప్రేరేపించి ఇశ్రాయేలీ దేశములో వాటికి సాలలను బలిపీఠములను ఏర్పరచాడు.  2 రాజులు 23:13, ''యెరూషలేము ఎదుటనున్న హేయమను పర్వతపు కుడిపార్శ్వమందు అష్తారోతు అను సీదోనీయుల విగ్రహమునకును, కెమోషు అను మోయాబీయుల విగ్రహమునకును, మిల్కోము అను అమ్మోనీయుల విగ్రహమునకును ఇశ్రాయేలు రాజైన సొలొమోను కట్టించిన ఉన్నతస్థలములను రాజు అపవిత్రపరచి''  దేవుడు వీటిని యోషియా రాజు కాలములో తొలగించాడు.  ఈ విధముగా సాతాను విగ్రహదేవుళ్లను ఆసరా చేసుకొని ఇశ్రాయేలీయులను దైవజనాంగమును వారి రాజ్యమును దేవుడు అతని సైన్యాధికారుల నుంచి లాగుకోవాలని ప్రయత్నించేవాడు.  ప్రతిసారి విగ్రహదేవుళ్లను ఏర్పరచుట ద్వారా ఆ ప్రాంతములపై ఆధిపత్యమును సాధించేవాడు.  తిరిగి దేవుడు చేసిన ఉగ్రత వలన వచ్చిన మార్పుతో నరులు తిరిగి నిజ దైవములోనికి వచ్చేవారు.  అలా వచ్చినవారికి భక్తిలో నిలువబడినవారు ఈ దైవరాజ్యములోని అన్య దేవతల విగ్రహములను కూలద్రోయించి తిరిగి ఆ రాజ్యమును దైవరాజ్యముగా మార్చేవారు.  ఇలా రాజుల కాలము జరిగిపోయింది.

        ఇందులో - ప్రతిసారి సాతాను విగ్రహ దేవుళ్లను ఆసరా చేసుకొని రహస్య స్థితిలో అదృశ్యములో క్రియ జరిగిస్తు విగ్రహ దేవుళ్లను దృశ్యముగా ఉంచి ఇశ్రాయేలీయుల మధ్య కొందరిని ప్రేరేపించి వాటికి బలిపీఠములను ఏర్పరచేవాడు.  ఈ విధముగా ప్రపంచములోని అన్ని జాతులను ఆక్రమించిన సాతాను తిరిగి ఇశ్రాయేలీయులను పరిపాలించి దేవుని నుండి వారిని లాగుకొని ఆక్రమించాలని ప్రయత్నించేవాడు.  దేవుని ఉగ్రతను చూచిన నరులు తిరిగి మారుమనస్సు పొంది దేవుని ప్రార్థించినప్పుడు వారిలో నుండి ఒక నాయకుడు పుట్టి వారిని ఈ అన్య దేవతా విగ్రహముల నుండి రక్షించి తిరిగి నిజదైవములోనికి నడిపించెడివారు.  ఇలా సాతాను తను ఆక్రమించిన దైవరాజ్యమును కోల్పోయేవాడు.  ఈ రాజ్యము తిరిగి దేవునికి సొంతమయ్యేది.  ఇలా రాజుల కాలములో అతి ముఖ్యమైన గ్రంథము - ధర్మశాస్త్రము.  దీనినిగూర్చి పట్టించుకోని స్థితికి సాతాను తన విగ్రహ దేవుళ్ల ద్వారా చేయగలిగాడు.  2 రాజులు 22:8-10, ''అంతట ప్రధాన యాజకుడైన హిల్కీయా-యెహోవా మందిరమందు ధర్మశాస్త్రగ్రంథము నాకు దొరికెనని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను.  అతడు దానిని చదివి రాజునొద్దకు తిరిగి వచ్చి-మీ సేవకులు మందిరమందు దొరకిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పనివిషయములో అధికారులై పని జరిగించువారిచేతికి అప్పగించిరని వర్తమానము తెలిపి యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము అప్పగించెనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివెను.''  అంటే దేవుడు స్వయముగా తన సేవకుడైన మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును గూర్చి పట్టించుకోని స్థితికి రాజుల కాలము వచ్చింది.  ఆ ధర్మశాస్త్రమును యోషీయా రాజు దగ్గర చదివి వినిపించారు.  అప్పుడు యోషీయా ధర్మశాస్త్రానుసారము సాతాను ఆక్రమించుకొన్న యూదా దేశమును తిరిగి దైవరాజ్యముగా మార్చుట జరిగింది.  ఇలా సాతాను ఆక్రమించుట, దేవుడు తన దూతల సహాయమును నరులలో తన భక్తులకు ఇచ్చి వారి ద్వారా తిరిగి స్థాపించుట చేసారు.  ఈ విధముగా దైవరాజ్యము సాతాను రాజ్యముల మధ్య పోరాటము జరుగుచూ వచ్చింది.

        క్రీస్తుయేసు పుట్టుట, పండ్రెండుమంది శిష్యులను ఏర్పరచుకొనుట, పవిత్రాత్మ అను జ్ఞానవరమును వారితోబాటుగా తనయందు నమ్మిక ఉంచినవారికి ఇచ్చాడు.  దీనితో క్రీస్తుయేసు రాజ్యము అనతి కాలములోనే ప్రపంచ నలుమూలలా పాతుకొని పోయింది.  ఈ రాజ్య విస్తరణలో అప్పటిదాకా సాతాను అతని దూతలైనవారు అనగా విగ్రహ దేవతల కబంధ హస్తాలలో ఉన్న రాజ్యాలు సైతము దేవుని రాజ్యాలుగా మారిపోయాయి.  ఈనాడు ఇండియా అను హిందూ దేశములో కేరళ, గోవా, మిజోరాం వంటి క్రైస్తవుల రాష్ట్రాలు ఉన్నాయి అంటే ఆశ్చర్యముగా లేదా!  పైన చెప్పబడిన ప్రాంతములలో క్రీస్తు పండ్రెండుమంది శిష్యులలో ఒకడైన తోమా క్రైస్తవ రాజ్యమును స్థాపించాడు.  ఇలా ఈనాడు ప్రపంచ దేశాలలో క్రైస్తవ రాజ్యాలు అనేకము ఉన్నాయి.

        ఇలాంటి స్థితిలో సాతాను ముందుగా ఈ రాజ్యములను తన నుండి పోగొట్టుకొనకూడదని వాటిని తన ఆధీనములోనే ఉంచుకొనుటకు పండ్రెండుమంది శిష్యులలో పదకొండుమందిని చంపించాడు.  ఒకరిని పత్మాసు ద్వీపములో జీవిత ఖైదీని చేసాడు.  వారి తరువాత అంత స్థితిలో క్రైస్తవ రాజ్య వ్యాప్తిని చేయువారిని హతసాక్షులుగా మార్చాడు.  ఈ విధముగా తన రాజ్యాన్ని కాపాడుకొనుచున్నాడు.  ఈనాడు సాతాను రాజ్యములో మనము నివసిస్తూ క్రైస్తవ సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలని మనము క్రీస్తును గూర్చిన బోధను సువార్త రూపములో ప్రకటించుచున్నాము.  కనుక సాతాను కూడ తన విగ్రహ రూపములను గూర్చి బోధిస్తూ అవే నిజమైన దైవములుగా ప్రకటిస్తున్నాడు.  అలా తన రాజ్యాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.

        ఈనాడు సాతాను అతను ఏర్పరచిన విగ్రహ దేవుళ్లు తామున్న స్థితిని నిలబెట్టు కొన్నవనే చెప్పవచ్చును.  చిన్న చిన్నగా ఈ విగ్రహదేవుళ్ళు సాతాను సామ్రాజ్యములో పాతుకొనిపోయి వాటిని తొలగించలేని స్థితికి వచ్చేసాము.  అన్య దేశాలలో ఈ స్థితిని మనము చూడవచ్చును. ఇక్కడ ఆ అన్య దేవతల బలిపీఠములను తొలగించలేని స్థితిలో ఈనాడు అన్య దేశాలు ఉన్నాయి.  కనుక సాతాను కన్ను తాను గతములో కోల్పోయిన రాజ్యాలపై కన్ను పడింది.  కనుక శాస్త్ర జ్ఞానమను పేరుతో పాశ్చాత్య క్రైస్తవ దేశాలలో ఉద్యోగాల పేరుతో తాను తన విగ్రహ దేవుళ్ళకు బానిసలుగా చెరలో ఉన్నవారిని పంపించి అక్కడ వారి నివాసాలలో గుళ్లు గోపురాలు కట్టించుకొంటూ పటాలు విగ్రహాలుగా వెలుగొందుచు క్రైస్తవ రాజ్యాలలో చిన్నగా పాగా వేయుచున్నాడు.  అనగా ముట్టడి ప్రారంభమైనదని చెప్పవచ్చును.  

        ఇలా మొదలైన విగ్రహ దేవుళ్లు అను దయ్యముల ప్రేరణ ఈ మధ్య కాలములో కొన్ని దేవాలయముల వరకు వచ్చింది.  అక్కడక్కడ బ్రిటన్‌, అమెరికా వంటి క్రైస్తవ దేశాలలో కూడ విగ్రహారాధనను విస్తరింపజేయాలన్న తలంపు గలిగిన సాతాను అన్య దేశాలలో కంటే అగ్రగామియై విగ్రహారాధనలో ఇండియాలో తన స్థానమును నిలదొక్కుకొని అగ్ర స్థానములో పూజింపబడు దేవుళ్లు, దేవతలను పై రాజ్యాలలో కూడ ఆక్రమించుడని క్రైస్తవ రాజ్యాలలోనికి పంపిస్తున్నాడు.  ఒకానొక పాత నిబంధన కాలములో పంపబడిన దేవుళ్ళు దేవతలు వేరు.  వీరు పతనము చెందిన దేవుని దూతల యొక్క అపవిత్రమైన విగ్రహ రూపములు.  వీరు అషేరా, దాగోను, బాలు వంటి నికృష్ట దేవతలు.  ఇవి తిరిగి భూలోక రీత్యా పతనము చెందినవి.  కనుక సాతాను సామ్రాజ్యములో వాటి ప్రాబల్యము తగ్గుట చేత, అన్య దేశాలలో క్రైస్తవుల విస్తరణ కానియ్యకుండ నరులను నిజదైవముయైన క్రీస్తులోనికి రానియ్యకుండ సాతానుకు ప్రతినిధులుగా సామంత రాజులుగా ఉండే భారతదేశములో అత్యధికులు పూజించే దేవుళ్లు దేవతల విగ్రహాలను వాటి సంబంధమైన పురాణాలతోను భజనలు గాన నృత్య వినోదాలతోను పొందిన విజయమును బట్టి ఇప్పుడు సాతాను వారిని క్రైస్తవ రాజ్యములో ఆక్రమించుటకు ప్రయోగిస్తున్నాడు.  జెకర్యా ఐదవ అధ్యాయములో చెప్పిన రీతిగా దూరదేశములలో చిన్నగా తన దాసులను పంపి పటాలు, విగ్రహాలుగా వారి ఇండ్లలో నివసిస్తూ, చిన్నగా ఈనాడు గుడులను ఏర్పరచు కొనుట జరుగుచున్నది.  ఈ విధముగా సాతాను తిరిగి తన దూతలలో క్రైస్తవ రాజ్యములను ఆక్రమించుటకు ప్రయత్నిస్తున్నాడు.  ఈనాడు క్రైస్తవ రాజ్యములలో ఈ పేరులతో దేవాలయముల నిర్మాణము జరిగి వాటికి పీఠములు ఏర్పరచి పూజా కార్యక్రమములు ఈనాడు జరుగుచున్నవి.  ఇలాగే వీటిని వదిలి వేస్తే అనతి కాలములోనే ఈ క్రైస్తవ రాజ్యాలలో విగ్రహ దేవుళ్ల రాజ్యములుగా మారుస్తాయని మనము గ్రహించాలి.

        ఇందునుబట్టి, ప్రపంచ క్రైస్తవ దేశాలకు ఈ పుస్తకము ద్వారా దేవుని పేరట హెచ్చరిక చేస్తున్నాను.  ఇలాంటి విగ్రహ దేవుళ్లను మీ మధ్యకు రానియ్యకుడి.  మీలో ఉన్న భక్తి మీ తరము వరకు ఉంటుంది.  పుట్టుక నుంచి విగ్రహ దేవుళ్లను చూస్తున్న మీ చిన్నారులు వాటికి దాసులై నిజదైవమును పోగొట్టుకొను స్థితికి వచ్చుదురు.  ఇలా జరిగితే ఈ ప్రపంచపు అంతమును మనము చూడవలసివస్తుంది.  మీ జాతుల నాశనమునకు అదే కారణమగును.  నిజదైవములో లేని ఏ జాతి కూడ ఎక్కువ కాలము మనుగడ సాధించలేదని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.  మనము ఒక్కసారి పాత నిబంధనలోని యెహోషువ, న్యాయాధిపతులు, రాజుల గ్రంథములు చదివితే, ఎన్ని జాతులు దేవుని శాపమునకు గురియైన వారి జాతులు మొత్తము నాశనమయ్యాయి.  దీనికి కారణము విగ్రహ దేవుళ్ల పూజ.  అదే తిరిగి ఈనాడు క్రైస్తవ దేశాలలో మొదలైంది.  ఇలాగే జరిగితే కొంతకాలానికి క్రైస్తవ దేశాలు అన్యదేవుళ్ల దేశాలుగా మారిపోవుట తధ్యము.  వారివారి జాతులు నాశనమగుట తధ్యమే.  ఇది దైవహెచ్చరిక.

        దేవుడు మీకు ముందుగా తెలియజేస్తున్నాడు.  ఏమని?  విగ్రహాల నిమిత్తము చేయు పండుగలలో ప్రతి ఇంటి ముందు మంటలు వేయుట వలన గాలిలో ఆక్సిజన్‌ తగ్గి వాయు కాలుష్యము, విగ్రహాలను ఏడు రోజులు పూజించి నిమజ్జనము చేయాలన్న షరతు శ్రుతులుగాని ఉపనిషత్తులుగాని ఆదేశించకున్నను, అందుకు విరుద్ధముగా ప్రతి ఏటా మానవుడు లెక్కించలేని కోటానకోట్లు విలువ జేసే విగ్రహాలను నీళ్ల పాలుజేసి జల కాలుష్యము వగైరాలలతో దేశానికి దేశమే ప్రపంచ బ్యాంకు నుండి అప్పు తెచ్చుకొని ఆర్థికముగాను అనారోగ్యముతోను బాధపడుచున్నారు.  భారత ప్రభుత్వము విగ్రహ నిమజ్జనమును నిషేధించినను విగ్రహారాధికులు దానిని ఖాతరు చేయక ప్రతి సంవత్సరము సమైక్యముగా నీళ్ల పాలు జేస్తున్నారు.  ఈ నిమజ్జన కార్యము ఆగిపోతే ఇండియా ఆర్థికముగా బలపడి విదేశాలకు అప్పు ఇచ్చే స్థితికి ఎదగగలదని గ్రహించాలి.  నిజము తెలుసుకొని వాటిని మీ నుండి దూరము చేయండి లేని యెడల నాశనము తప్పదు, తప్పదు . . .

        ఈ విధముగా దేవుని దూతలలో రెండు వర్గములవారు ఒకరి రాజ్యాన్ని ఒకరు ఆక్రమించుకొనుటకు ప్రయత్నము చేస్తూనే ఉంటారు.  కాని దీని తుది నిర్ణయము నరుల ఆలోచన పద్ధతి పైనే ఆధారపడి యుంటుంది.  మంచిని కోరుకొని క్రీస్తుయేసులోని నిజదైవము గురించి ఆయన ఆజ్ఞలను పాటించిన ఉన్నత స్థానమును పొందుటయేగాక ప్రపంచము శాంతిని కలిగి ఉంటుంది.  దైవరాజ్య స్థాపన జరుగుతుంది.  నరులు చెడును కోరుకొని విగ్రహ దేవుళ్లను ఆశ్రయిస్తే ఈ ప్రపంచ నాశనమునకు కారణమగునని గుర్తించాలి.  చెడును ఆశ్రయించిన సాతాను తన విగ్రహ దేవుళ్ల రూపములో తిరిగి తన రాజ్యాన్ని విస్తరింపజేయాలని నిరంతరము తపించుచున్నాడు.  

        ఇందులోని భాగమే క్రైస్తవ రాజ్యాలలో విగ్రహ దేవుళ్ల గుడులను నెలకొల్పుట జరుగుచున్నట్లుగా మనము గుర్తించాలి.  ఈ విధమైన పోరాటముతోనే ఈ కాలము గడచిపోయింది.  ఈ పోరాటము ఒక్క ఈ కాలములోనే కాదు అన్ని కాలాల్లో జరుగుచున్నట్లుగా మనము గ్రహించవలసి యున్నది.

77.  దేవుడే స్వయముగా యెరూషలేము దేవాలయ నమూనా ఇచ్చి దానిలో కెరూబులను చెక్కించుట

        ప్రియపాఠకులారా!  దేవుడు అబ్రాహామును విశ్వాసులకు తండ్రిగా ఎన్నుకొని ఆయన సంతానములో ఇస్సాకును దైవజనాంగానికి తండ్రిగా ఎన్నుకొన్నాడు.  ఇస్సాకు కుమారులలో ఏశావు పాపపు స్థితిలో పడిపోగా, యాకోబు రాత్రి అంతయు దేవునితో పెనుగులాడి తిరిగి ఆశీర్వాదాన్ని పొందాడు.  కనుక యాకోబుకు జన్మించిన పన్నెండు మంది దేవునిలో ఎన్నుకోబడ్డారు.  దైవజనాంగానికి మూలపురుషులుగా ఎన్నిక చేయబడ్డారు.  దీనిని గూర్చి బైబిలు గ్రంథములో విపులముగా చదువుకొనవచ్చును.

        ఇలా - దైవజనాంగముగా మారిన యాకోబు అతని సంతానము యోసేపు మూలముగా ఐగుప్తులో నివసించవలసి వచ్చింది.  అక్కడ వారు వారి సంతానములో ఆరు లక్షలు మగవారు పెరుగు వరకు సవ్యముగా జరిగింది.  ఇక్కడ ఫరో రాజు ఇశ్రాయేలీయులు బహుగా వృద్ధి చెందుట చూచి వారిని తగ్గించాలని మొదటి మగ సంతానమును చంపునట్లుగా శాసనము చేసి ఇశ్రాయేలీయులను బానిసలుగా చూచుట జరిగించాడు.  ఈ కాలములో దేవుడు మోషేను ఎన్నుకొని దైవజనాంగానికి నాయకునిగా చేసాడు.  అతని ద్వారా ఇశ్రాయేలీయులు ఐగుప్తును వీడి వచ్చారు.  ఈ సందర్భములో దేవుడు మోషే ద్వారా పది ఆజ్ఞల పలకలను ఇచ్చుట జరిగింది.  అటుతరువాత దేవుడైన యెహోవా మందసమును కరుణాపీఠమును వాటిని చేయవలసిన విధానమును మోషేకు తెలియజేసి, దానిని తయారు చేయించుట జరిగించాడు అని ముందు విభాగములో నోవహు మొదలు మోషే వరకు ఉన్న కాలము యొక్క అధ్యాయములో చదువుకొని యున్నాము.  

        నిర్గమకాండము 25:10-21.  ఈ విధముగా దైవ ఆజ్ఞను పొందిన మోషే మందసమును కరుణాపీఠమును నిర్మించుట నిర్గమకాండము 37:1-9లో జరిగించాడు.  ఇక్కడ మనకు సంబంధించిన విషయము ఒకటి ఉన్నది.  అదే కెరూబులను చెక్కించుట.  ఇంతకి ఈ మందసమును కరుణాపీఠమును కెరూబులను ఎందుకు చెక్కించాడు?  నిర్గమకాండము 25:22, ''అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణా పీఠముమీద నుండియు, శాసనములుగల మందసము మీద నుండు రెండు కెరూబుల మధ్య నుండియు, నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీ కాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను.''  దేవుడైన యెహోవా తాను ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షపరచుకొను నిమిత్తము దీనిని చేయించుట జరిగింది.  తాను ఇందులో ప్రత్యక్షముగా తన ప్రవక్తలతో మాట్లాడునని మనము గ్రహించాలి.  ఇందులో నుండి సమస్త విషయములను మోషేకు తెలియజేసేవాడు.  అందుకుగాను దేవుడు అందులో నివసించుచున్నట్లుగా మనము గ్రహించాలి.  దేవుడు ప్రేమాస్వరూపి కనుక పరలోకమును వీడి తుచ్ఛమైన నరులమైన మన మధ్య ఆయన మందసము కరుణాపీఠము కెరూబుల మధ్య ప్రత్యక్షమయ్యేవారు.  

        ఈ విధముగా పాత నిబంధన కాలములో కొంతకాలము జరిగింది.  అయితే కెరూబుల మధ్య ఆయన నివసించుచున్న వాక్యరీత్యా మందసము మీద ఉన్న కరుణా పీఠములలో కెరూబులను చెక్కించుట జరిగించాడు.  దేవుని శక్తులు ఇందులో ప్రత్యక్ష పరచబడెనని గ్రహించాలి.  అటుతరువాత దేవుడైన యెహోవా ఈ కెరూబుల మధ్య అనేకమార్లు ప్రత్యక్షమగుట జరిగింది.  ఈ విధముగా దేవుడు అదృశ్యములో కెరూబుల మధ్య నివసించేవాడు.  దానినే దృశ్యరూపములో ఏర్పాటు చేసి వాటి మధ్య తాను నివసిస్తున్నట్లుగా మనము గ్రహించాలి.  

        ఈ విధముగా ఉన్న మందసమును దావీదు చూచినప్పుడల్లా ఆయన మదిలో ఏదో వెలితి కనిపించేది.  అందుకే ప్రవక్తతో నేను రాజప్రసాదములో ఉన్నను నేను కొలుచు దేవుడు గుడారములో ఉన్నాడని వాపోయాడు.  కనుక యెరూషలేము దేవాలయమును కట్టాలని దావీదు నిర్ణయించుకొన్నాడు.  కాని దేవుడు అందుకు నిరాకరించాడు.  కాని దేవుడు సొలొమోనుచే కట్టిస్తానని వాగ్దానము చేసాడు.  1 దినవృత్తాంతములు 17:11-12, ''నీ జీవిత దినములు తీరి నీ పితరులయొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారులవలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను.  అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసెదను.''  ఈ విధముగా దేవుడైన యెహోవా సొలొమోను చక్రవర్తిని ఎన్నిక చేసి యెరూషలేములో తనకు దేవాలయాన్ని కట్టుటకు దేవుడే స్వయముగా ఒక నమూనాను ఇచ్చుట జరిగింది.  

        1 దినవృత్తాంతములు 28:19, ''ఇవియన్నియు అప్పగించి-యెహోవా హస్తము నామీదికి వచ్చి యీ మచ్చుల పని యంతయు వ్రాతమూల ముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పెను.''  ఈ నమూనా ప్రకారము సొలొమోను యెరూషలేములో దేవునికి ఒక ఆలయమును నిర్మించాడు.  

        ఈ నిర్మాణములో సొలొమోను మరల కెరూబులను చెక్కించుట చేసాడు.  అదియును ఈ కెరూబులను గర్భాలయములో ఉంచుట చేసాడు.  1 రాజులు 6:23-29, ''మరియు అతడు గర్భాలయమందు పదేసి మూరల యెత్తుగల రెండు కెరూబులను ఒలీవ కఱ్ఱతో చేయించెను; ఒక్కొక్క కెరూబునకు అయిదేసి మూరల పొడవుగల రెక్కలుండెను; ఒక రెక్క చివర మొదలు కొని రెండవ రెక్క చివరమట్టుకు పది మూరలు పొడవు.  రెండవ కెరూబును పది మూరలు కలదై యుండెను; కెరూబులు రెండింటికిని ఏక పరిమాణమును ఏకాకారమును కలిగి యుండెను.  ఒక కెరూబు పది మూరల యెత్తు రెండవ కెరూబు దానివలెనే యుండెను.  

        అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను.  ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని యొకదాని రెక్క యివతలి గోడకును రెండవదాని రెక్క అవతలి గోడకును అంటి యుండెను; గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని యుండెను.  ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను.  మరియు మందిరపు గోడలన్నిటిమీదను లోపల నేమి వెలుపల నేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను.''  

        2 దినవృత్తాంతములు 3:1-17.  ఇందులో కెరూబుల ఆకారమును గోడలపై చెక్కుటయేగాక రెండు ప్రత్యేక కెరూబులను చెక్కించుట జరిగింది.  ఈ గర్భాలయములో ఈ కెరూబుల మధ్య దేవుడు ప్రత్యక్షమై ప్రధాన యాజకులతోను దైవసేవకులతోను మాట్లాడుచుండెడివాడని బైబిలు గ్రంథము మనకు తెలియజేయుచున్నది. ఈ విధముగా దేవుడు పరలోకములో కెరూబుల మధ్య అదృశ్య రూపములో నివసించేవాడు, అలాగే భూలోకములో కెరూబులను బొమ్మలుగా చెక్కించి వాటి మధ్యలో నివసించుట ఒక్క యెరూషలేము దేవాలయములో మాత్రమే జరిగింది.

78.  యెరూషలేము దేవాలయములో కెరూబులతో దేవుని వైభవము

        ప్రియపాఠకులారా!  దేవుడు సింహాసనముపై కూర్చొనునని మనకందరికి తెలిసిన విషయమే.  కాని ఇక్కడ మనము ఇంకొక ముఖ్య విషయమును గుర్తించవలసి యున్నది.  దేవుడు ఈ సింహాసనముపై తానే కూర్చొనుట జరుగునా?  ప్రకటన 3:21, ''నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.''  యేసు ప్రభువు జయించి తండ్రితోకూడ ఆయన సింహాసనముపై కూర్చుండును.  ఈ లోకములో పిశాచిని లోకాన్ని శరీరాశలను జయించి ప్రభువు మార్గములో ఆయన సేవలో నడిచిన ప్రతి విశ్వాసికి ప్రభువు తోడుండుటకు వేలాదిమంది పరిశుద్ధులకు ప్రభువుతోకూడ   దేవుని సింహాసములో ఆసీనులగుటకు దేవుని సింహాసనములో కూర్చుండుటకు చోటు ఎక్కడనుండి వస్తుంది?  దేవుని సింహాసనము మహిమాప్రభావములతో నిండినది.  ఆ సింహాసనములో కూర్చుండుటకు ఎంతమంది వచ్చినను మరొకరికి జాగా చూపిస్తుంటుంది.  ఆయన సింహాసనము విశాలమైనది.  అదియే ఆకాశ సింహాసనము.  దేవుని సింహాసనము పరలోకములో ఉన్నదని మనకందరికి తెలిసిన విషయమే.  ప్రకటన 4:2-3, ''వెంటనే నేను ఆత్మ వశుడనైతిని.  అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడియుండెను.  ఆ సింహాసనమునందు ఒకడు ఆసీనుడైయుండెను, ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; మరకతమువలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించియుండెను.''  

        ఇందులో సింహాసనమునందు ఒకడు ఆసీనుడైయున్నాడు.  ఈ ఒక్కడు ఎవరు?  ఇతను చూచుటకు సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు.  అంటే కోటానుకోట్ల సూర్యుని వెలుగు కంటే ఎక్కువ వెలుగు కలిగినవాడు దేవుడు.  ఈయన కూర్చొనియుండగా ఆ సింహాసనమును ధనుస్సు ఆవరించియున్నది.  ఈ ధనుస్సును తండ్రియైన దేవుడు నోవహు కాలములో జలప్రళయము ద్వారా నాశనము చేయనని నరులకు తనకు మధ్యస్థముగా దానిని ఏర్పరచుట జరిగింది. ఆదికాండము 9:11-17, ''నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును; సమస్త శరీరులు ప్రవాహ జలములవలన ఇకను లయపరచబడరు; భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను.  మరియు దేవుడు-నాకును మీకును మీతోకూడనున్న సమస్త జీవరాసులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే.  మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును.  భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును.  అప్పుడు నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు.  ఆ ధనుస్సు మేఘములో నుండును.  నేను దాని చూచి దేవునికిని భూమిమీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసికొందుననెను.  మరియు దేవుడు-నాకును భూమిమీదనున్న సమస్తశరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను.''  ఈ విధముగా తండ్రియైన దేవుడు తన సింహాసనమును ఆవరించియున్న ధనుస్సును నరులకు తనకు మధ్య ఉన్న నిబంధనను గుర్తు చేయుటకు ఏర్పరచియున్నాడు.  కనుక ధనుస్సు ఆవరించియున్న సింహాసనముపై కూర్చొనియున్న ఆ ఒకడు తండ్రియైన దేవుడే.  ఈ విధముగా దేవుని సింహాసనమును ధనుస్సు ఆవరించగా, దేవుడు దానిపై కూర్చొనుట జరుగును.  తండ్రియైన దేవుని కార్యాలలో దైవోగ్రతలో భూమి నశించకుండుటకై దేవుడేర్పరచిన మహిమగల ధనుస్సు.  ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రకటన 10:1లో ధరించుకొన్న ధనుస్సు.  తనను అతిఘోరముగా హింసిస్తున్న జనులపై దైవోగ్రత ప్రసరింపకుండ ఆయన శిరస్సుమీదనున్న ధనుస్సు తండ్రియైన దేవుని పాదసన్నిధిలో మోకరించి ప్రభువు తలపై ప్రకాశిస్తు దేవునికి జ్ఞాపకము చేస్తున్నది.

        ప్రకటన 4:6-8, ''మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజువంటి సముద్రమున్నట్టుండెను.  ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టును, ముందు వెనుక న్నులతోనిండిన నాలుగు జీవులుండెను.  మొదటి జీవి సింహము వంటిది; రెండవ జీవి దూడవంటిది; మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖముగలది; నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజువంటిది.  ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి.  అవి-భూతవర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండెను.''   ఇందులో నాలుగు రకముల జీవులు ఆ సింహాసనమునకు మధ్య, చుట్టూ, ముందు, వెనుక ఉన్నట్లుగా చెప్పబడింది.  అంటే దేవుడైన యెహోవా కూర్చొను స్థలములో వీరు ఎందునిమిత్తము కూర్చొని యున్నారు.  లేక ఎందునిమిత్తము వీరు ఆ సింహాసనమును ఆవరించియున్నారు?  యెహెజ్కేలు 10:14, ''కెరూబులలో ఒక్కొక్కదానికి నాలుగు ముఖము లుండెను; మొదటిది కెరూబుముఖము, రెండవది మానవముఖము, మూడవది సింహముఖము, నాల్గవది పక్షిరాజు ముఖము.''  ఈ ముఖ రూపములు మొదటి దర్శనములో వాటివలె యున్నదని యెహెజ్కేలు తెలియజేసాడు.  యెహెజ్కేలు 10:22, ''మరియు వాటి ముఖరూపములు కెబారు నదిదగ్గర నాకు కనబడిన ముఖరూపములవలె ఉండెను; అవియు వాటి రూపములును అదేవిధముగా ఉండెను; ఇవియన్నియు ఆయా ముఖముల వైపుగా జరుగుచుండెను.''  ఇదే విషయమును - యెహెజ్కేలు ఒకటవ అధ్యాయములో చదువగలము.  యెహెజ్కేలు 1:10, ''ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి.  యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి.  నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖములు కలవు.''  ఇందునుబట్టి కెరూబులు నాలుగు రకముల ముఖములు అనగా శక్తులు కలిగియున్నట్లుగా మనకు అర్థమగుచున్నది.  ఈ నాలుగు ముఖములు కలిగిన కెరూబులు దేవుడైన యెహోవా సింహాసనమును ఆవరించియున్నాయి.  ఎందునిమిత్తము ఇవి ఆ సింహాసనమును ఆవరించియున్నవో మనము తెలుసుకోవలసి యున్నది.  

        యెహెజ్కేలు 10:18-19, ''యెహోవా మహిమ మందిరపు గడపదగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా కెరూబులు రెక్కలు చాచి, నేను చూచు చుండగా నేలనుండి పైకి లేచెను.  అవి లేవగా చక్రములు వాటితో కూడ లేచెను, అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి, అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికిపైగా నిలిచెను.''  ఇందులో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మహిమ ఈ కెరూబులపై నిలిచినట్లుగా చెప్పబడింది.  కనుక కెరూబులపై దేవుడైన యెహోవా నివసించునని గ్రహించాలి.  కనుకనే మందసము, యెరూషలేము దేవాలయ నిర్మాణములో కెరూబులకు విలువనిచ్చి దేవుడు నివసించు ప్రాంతమున వాటిని చెక్కించుట జరిగించారు.  అందుకే కీర్తనాకారుడు దేవుడైన యెహోవాను స్తుతిస్తూ ఈ విధముగా పాడుచున్నాడు.  కీర్తన 80:1, ''ఇశ్రాయేలునకు కాపరీ, చెవియొగ్గుము.  మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబులమీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము.''  ఇది రాసిన కీర్తనాకారుడు ఆసాపు.  ఈయన ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు అను దైవజనాంగానికి కాపరి అని వారిని ఒక మందవలె నడిపించునని చెప్పుచూనే దేవుడైన యెహోవా కెరూబుల మధ్య ఆసీనుడైయున్నట్లుగా చెప్పుచున్నాడు.  కనుకనే ప్రకటన నాలుగవ అధ్యాయములో ఆ సింహాసనాసీనుడైన వాని స్థానములో నాలుగు జీవులు అనగా కెరూబులు కనబడుచున్నవి.

        కెరూబులు పరమాత్మ చేత రూపింపబడినవి.  ఆయన కార్యములకు ఆదికాండము 3:24 కాపలాదారులుగాను ఆయన కెరూబుల మధ్య నివసించుటకు 1 సమూయేలు 4:4 తండ్రియైన దేవుని వాహనముగా వాడబడుచున్నవని 2 సమూయేలు 22:11 తెలియజేస్తున్నది.  కనుక ఇవి హెబ్రీ 9:5లో వలె అత్యద్భుతమైన మహిమాప్రభావములు కలవి.

79.  దేవునితోబాటుగా నివసించువారు

        ప్రియపాఠకులారా!  మనము నివసించు దానిని ఇల్లు అంటాము.  ఇందులో భార్య, భర్త మరియు పిల్లలు ఉంటారు.  వీరితోబాటుగా దేవుని దూతలు కాపలాగా ఉంటారు.  పాపపు స్థితిలో జీవించేవారితో బాటుగా దేవుని దూతలలో పతనము చెందిన అపవిత్రాత్మలు లేక దయ్యాలుగా పిలువబడు సాతాను దూతలు ఉంటాయి.  అలాగే మనకందరికి తెలిసిన విషయమేమిటంటే దేవుడు నివసించునది పరలోకములోనని.  అయితే అదే పరలోకములో దేవుని సింహాసనము ఉన్నదని ఇంతకు ముందే తెలుసు కొన్నాము.  అక్కడ సెరాపులు అనేవారు దేవుని కార్యములలో కొంతవరకు నెరవేర్చుచున్నట్లుగా చదువుకొన్నాము.  అయితే దేవుని నివాసములో ఉండు దేవుని దూతలు ఎవరు?  2 సమూయేలు 6:2, ''బయలుదేరి, కెరూబుల మధ్య నివసించు సైన్యములకధిపతియగు యెహోవా అనుతన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసికొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడ బాయిలా యెహూదా లోనుండి ప్రయాణమాయెను.''  ఈ వచనములో - ''కెరూబుల మధ్య నివసించు సైన్యములకధిపతియగు యెహోవా,''అని చెప్పుట జరిగింది.  సైన్యములకధిపతి యెహోవా.  ఈ యెహోవా అను దేవుడు ఎవరి మధ్య నివసిస్తున్నాడు?  కెరూబుల మధ్యయే గదా!  ఇందునుబట్టి కెరూబులు దేవునితో బాటుగా నివసిస్తున్నట్లుగా మనకు అర్థమగుచున్నది.  ఈ కెరూబులు దేవుని దూతలని ఆదికాండములో చెప్పబడి యున్నది.  

        ఆదికాండము 3:24, ''అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.''  ఇందులో కెరూబులను దేవుడు కాపలాగా ఉంచుట జరిగింది.  అలాగే యెహెజ్కేలు 10:12, ''ఆ నాలుగు కెరూబులయొక్క శరీరములును వీపులును చేతులును రెక్కలును ఆ చక్రములచుట్టును కన్నులతో నిండియుండెను; నాలుగింటికి చక్రములుండెను.''  ఇందునుబట్టి కెరూబులు దేవుని దూతలని మనకు అర్థమగుచున్నది.  కాని మనము వీరిని దేవుని దూతలు అనుట కంటే దేవుని శక్తులుగా వీరిని గుర్తించవలసియున్నది.  ఎందుకంటే - యెహెజ్కేలు 10:14, ''కెరూబులలో ఒక్కొక్కదానికి నాలుగు ముఖము లుండెను; మొదటిది కెరూబుముఖము, రెండవది మానవముఖము, మూడవది సింహముఖము, నాల్గవది పక్షిరాజు ముఖము.''  ఇందులో మూడు ముఖములు స్పష్టముగా చెప్పుట జరిగింది.  కాని మొదటి ముఖమును కెరూబు ముఖముగా చెప్పబడింది.  ఇలా యెహెజ్కేలు చెప్పుచూనే- యెహెజ్కేలు 10:22, ''మరియు వాటి ముఖరూపములు కెబారు నదిదగ్గర నాకు కనబడిన ముఖరూపములవలె ఉండెను; అవియు వాటి రూపములును అదేవిధముగా ఉండెను; ఇవియన్నియు ఆయా ముఖములవైపుగా జరుగుచుండెను,'' అని చెప్పెను.  కనుక కెబారు నది దగ్గర కనబడినది ఏమై యుండవచ్చునో మనము ముందుగా తెలుసుకొనవలసి యున్నది.  యెహెజ్కేలు 1:1-3, ''ముప్పదియవ సంవత్సరము నాలుగవ నెల అయిదవ దినమున నేను కెబారు నదీప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని; ఆ కాలమున ఆకాశము తెరవ బడగా దేవునిగూర్చిన దర్శనములు నాకు కలిగెను.  యెహోయాకీను చెరపట్టబడిన అయిదవ సంవత్సరము ఆ నెలలో అయిదవ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షముకాగా అక్కడనే యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను.''  మరియు యెహెజ్కేలు 1:10, ''ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి.  యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి.  నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖములు కలవు.''  

        ఇదే విషయమును మనము ప్రకటన గ్రంథమందు కూడ మనము చదువగలము.  ప్రకటన 4:6-7, ''మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజువంటి సముద్రమున్న ట్టుండెను.  ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టును, ముందు వెనుక కన్నులతోనిండిన నాలుగు జీవులుండెను.  మొదటి జీవి సింహము వంటిది; రెండవ జీవి దూడవంటిది; మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖముగలది; నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజువంటిది.''  ఇందునుబట్టి కెరూబు ముఖము ఎద్దు ముఖముగా గుర్తించాలి.  ఇలా నాలుగు రకముల ముఖములుగా ఉన్న ఈ కెరూబుల మధ్య తండ్రియైన దేవుడు నివసిస్తున్నాడు.  ఈ నాలుగు జీవులు తండ్రియైన దేవునిలోని నాలుగు ప్రధాన శక్తులుగా మనము నాచే విరచితమైన - ''ప్రకటన గ్రంథ రహస్యములు ఇప్పుడు మీ చేతిలో . . . '' అను గ్రంథము నందు సంపూర్ణముగా తెలుసుకొని యున్నాము.  ఇందునుబట్టి నాలుగు ముఖములు కలిగిన కెరూబులు అను నామధేయము కలిగి దేవుని శక్తుల మధ్య దేవుడు నివసించుచున్నట్లుగా మనకు అర్థమగుచున్నది.  ప్రకటన 4:2-3, ''వెంటనే నేను ఆత్మవశుడనైతిని.  అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడియుండెను.  సింహాసనమునందు ఒకడు ఆసీనుడైయుండెను, ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; మరకతమువలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించియుండెను.''  ఇందులో సింహాసనముపై కూర్చున్నవాడు తండ్రియైన దేవుడని ''ప్రకటన గ్రంథ రహస్యములు ఇప్పుడు మీ చేతిలో . . . '' అను నాచే విరచితమైన గ్రంథములో చదువుకొనియున్నాము.  ఇదే గ్రంథములో ఆ సింహాసనములోనే ఈ నాలుగు జీవులు ఉన్నట్లుగా చెప్పబడింది.  ఈ నాలుగు జీవులు అదే సింహాసనములో కూర్చునట్లుగా చెప్పబడింది.  ఇందునుబట్టి తండ్రియైన దేవుని సింహాసనములో కూర్చొను యోగ్యత తనలోని శక్తులకు మాత్రమే యుండునని గ్రహించాలి.  కనుకనే కెరూబుల మధ్య నివసించు సైన్యముల కధిపతియగు యెహోవా అని చెప్పుట జరిగింది.  కనుక దేవుడు కెరూబులు అను దేవుని శక్తుల మధ్య ఆయన నివసిస్తున్నాడు.  అంటే తన శక్తులతో బాటుగా తానే నివసించుట జరుగుచున్నది.  కనుక కెరూబులు దేవునిలోని శక్తులే కాని దేవుని దూతలుగా పిలువబడుచున్నారు, ఎందుకంటే క్రీస్తుయేసు ప్రభువు దేవుని కుమారునిగా పిలువబడినను దేవుని దూతగా మన మధ్యకు ఆయన వచ్చుట జరిగింది.  అలాగే కెరూబులుగా పిలువబడిన దేవుని నాలుగు రకములైన శక్తులు కూడ దేవుని దూతలుగా కాలానుగుణముగా క్రియ జరిగించుటను బట్టి వారిని దేవుని దూతలుగా గుర్తించుట జరిగింది.

80.  దేవుని దూతలుగా మనచే పిలువబడు దేవుని శక్తులైన కెరూబులు చేయు క్రియలు

        ప్రియపాఠకులారా!  ఇహలోకములో నేను పుట్టాను అంటే దేవుడు నాచే ఏదో ఒక కార్యమునకు నన్ను ఏర్పరచుకొని భూమిపై నన్ను పుట్టించెనని నా చిన్ననాటి నుండి నా నమ్మకము, ఎందుకంటే పని లేకుండ వృధాగా ఈ భూమిపై నన్ను పుట్టించడని నేను ఎప్పుడు అనుకొనేవాడిని.  అలాగే దేవుడు నన్ను సుమారు ఇరువదిఐదు సంవత్సరములలో తన బిడ్డగా పిలుచుకొని అన్యదేవతా ఆరాధన నుండి నిజదైవములోనికి నడిపించాడు.  1963లో ఇది జరిగింది.  అప్పటినుండి దేవుడు నన్ను ఈ పుస్తకములు వ్రాయుటకు తన తల్లి ద్వారా రెడ్డిపాళెం గ్రామములో 1972 సెప్టెంబరు 25 నుండి ప్రారంభమగుటయేగాక ప్రభువు తన పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించి, ఈనాడు నన్ను పుట్టించినదానికి నా ద్వారా ఒక కార్యము ఈ పుస్తక రూపములో జరిగించుచున్నాడు.  అదే కాదు ఈ లోకములో మనలను దేవుడు పుట్టించినది  ఆయనలోని నిజదైవమును తెలిసికొని సాతాను అతని దూతలు కల్పించిన అసత్య దైవములను వదలి నిజదైవము తండ్రియైన దేవునిలో ఉన్నది, అది క్రీస్తు ప్రభువు రూపములో భూమిపై నివసించెనని మనము గ్రహించి క్రీస్తుయేసు నామమున తండ్రియైన దేవుని స్తుతించి ఘనపరచి ఆయన సువార్తను అందరికి ఎరిగించి, వారిని నిజదైవములో నడిపించుట కొరకు మనలను ఈ లోకములో పుట్టించాడు.  ప్రతి ఒక్కరు ఈ కార్యమును జరిగించి చివరకు పరలోకములో ఉన్న తండ్రియైన దేవుని సన్నిధిని చేరవలసియున్నది.  ఇదే మనకు నిర్ణయించిన పని.  అలాగే దేవుడు తనలో నుండి నాలుగు ముఖముల శక్తులను కెరూబులుగా చూపెనంటే ఈ కెరూబులకు కూడ ఏదో ఒక కార్యము ఉండి ఉండాలి.  లేకుంటే వీటిని తన సన్నిధిలో ఏర్పరచవలసిన అవసరత లేదు.  దీనినిగూర్చి ఇప్పుడు మనము సంపూర్ణముగా తెలుసుకొందము.

        ఆదికాండము 3:24, ''అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.''  ఇందులో కెరూబులను కాపలాగా ఉంచబడినట్లుగా మనకు అర్థమగుచున్నది.  ఇందులో - జీవవృక్షము క్రీస్తుకు సూచనగా ఉన్నది.  క్రీస్తునందు విశ్వసించువారు నిత్యజీవమును పొందుదురు.  అలాగే జీవవృక్షము యొక్క ఫలములు తినువారు నిరంతరము జీవింతురని ఆదికాండము 3:22లో చెప్పబడింది.  జీవవృక్ష ఫలములను తినకుండునట్లుగా తండ్రియైన దేవుడు తనతోబాటుగా నివసించు కెరూబులను కాపలాగా ఉంచాడు.  ఈ కెరూబులు దేవునిలోని శక్తులే కాబట్టి నాలుగు జీవుల రూపముగా కనబడుచూ దేవునికి సంబంధించిన వాటికి కాపలాగా ఉంటున్నాయి.  కనుక దేవుని పనిని నెరవేర్చు దూతలుగా వీరిని కూడ పిలువవచ్చును, ఎందుకంటే దేవుని దూతలు దేవుని కార్యములను నెరవేర్చువారు మాత్రమే.  ఆయనకు వీరు సహకారులుగా ఉంటూ, ఆయన చెప్పు కార్యములు నెరవేర్చువారెవరైనా దూతలుగా లెక్కింపబడుదురు.  రాజు కార్యసిద్ధి కొరకు కొందరు మనుష్యులను సిద్ధపరచి వేరొక రాజు వద్దకు మొదట పంపించుట జరుగును.  ఇలా వెళ్ళువారు రాజు యొక్క ఉద్దేశ్యాన్ని ఏ మార్పు లేకుండ తెలియజేస్తారు.  వీరు దూతలుగా మన భాషలో చెప్పుకొంటాము.  అలాగే దేవుని కార్యములు నెరవేర్చువారు కూడ దూతలుగా పిలువబడుచున్నారు.  ఈ కోవకు చెందినవారే కెరూబులు.  వీరు దేవునిలోని శక్తులకు ప్రతిరూపమైనను వీరు దూతలుగానే పిలువబడుట సమంజసమని గ్రహించాలి.

        కాని దైవసన్నిధిలో ఉంటున్న ఈ కెరూబులకు మానవ ముఖము ఎద్దు సింహము పక్షిరాజు వగైరా ముఖములు ఏర్పడుటకు దైవిక మర్మము - 1.  మనుష్య ముఖము - ఇది దేవుని స్వరూపము ఆయన పోలికయైయున్నది.  2.  సింహము - యూదాగోత్రపు సింహము అనుటలో సింహము మృగములకు రాజు.  యేసు - యూదా జనాంగానికి రాజు.  కనుక ఆయన కార్యములకు ఓటమి లేదు.  3.  ఎద్దు - దేవునికి అత్యంత ఇష్టమైన బలిపశువు.  ఇది మానవ లోకానికి సహాయ సహకారాలు అందిస్తున్న శ్రమజీవి.  4.  పక్షిరాజు - భవిష్యత్తులో ప్రజలకు జరుగబోవు భయానక స్థితిని తెలియజేసే మహత్తరమైన దైవికశక్తి - పరిశుద్ధాత్మ దేవుడు ఈయనయే.  ప్రకటన 14:6 సకల జాతి జనులకు సువార్త ప్రకటిస్తున్నాడు.  ప్రయోజనకరమైన ఆత్మీయ మేలులు కలిగించు రూపములు కనుక ఆ రూపములు తగినవేనని తెలుస్తున్నది.

81.  కెరూబులతో ప్రభువు తేజస్సు భూమిపైకి వచ్చుట మరల తిరిగి విడనాడుట

        ప్రియపాఠకులారా!  ఇదో అద్భుత సంఘటన.  దీనినిగూర్చి తెలుసుకొని దానిని నమ్మి నిజదైవమునందు విశ్వాసముంచువారు ధన్యులని నేను ఈ గ్రంథములో ప్రకటిస్తున్నాను.  దేవుని తేజస్సు భూమిపైకి తాను నివసించు కెరూబులతో సహా దిగి వచ్చుట జరిగింది.  ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడనాడు సందర్భములో దేవుడు వారిమధ్య మోషేను నియమించి అతని ద్వారా మాట్లాడుట జరిగించాడు.  తాను చెప్పాలనుకొన్నవి మోషేకు తెలియజేసేవాడు.  ఇలా జరిగిన కొంతకాలమునకు దేవుడు వారిమధ్య నివసించుటకు మందసమను గుడారమును ఏర్పరచుకొనుట జరిగింది.

          సంఖ్యాకాండము 9:15-23, ''వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను; సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు అగ్నివంటి ఆకారము మందిరముమీద నుండెను.  నిత్యమును ఆలాగే జరిగెను.  మేఘము మందిరమును కమ్మెను; రాత్రియందు అగ్నివంటి ఆకారము కనబడెను.  ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడునప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి; ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసికొనిరి.  యెహోవానోటిమాటచొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమైసాగిరి.  యెహోవా నోటిమాటచొప్పున వారు తమ గుడారములను వేసికొనిరి.  ఆ మేఘము మందిరముమీద నిలిచియుండిన దినములన్నియు వారు నిలిచిరి.  ఆ మేఘము బహుదినములు మందిరము మీద నిలిచినయెడల ఇశ్రాయేలీయులు యెహోవా విధి ననుసరించి ప్రయాణము చేయ కుండిరి.  మేఘము కొన్ని దినములు మందిరముమీద నిలిచినయెడల వారును నిలిచిరి; యెహోవానోటిమాట చొప్పుననే నిలిచిరి, యెహోవా నోటిమాటచొప్పుననే ప్రయాణము చేసిరి.  

        ఆలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు నిలిచిన యెడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి.  పగలేమి రాత్రియేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి.  ఆ మేఘము రెండుదినములుగాని, ఒక నెలగాని, యేడాదిగాని తడవు చేసి మందిరముమీద నిలిచినయెడల ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి.  అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి.  యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసికొనిరి; యెహోవామాటచొప్పున వారు ప్రయాణము చేసిరి; మోషేద్వారా యెహోవా చెప్పిన మాటనుబట్టి యెహోవా ఆజ్ఞ ననుసరించి నడిచిరి.''  ఆ మేఘముగాని అగ్నివంటి వెలుగుగాని క్రీస్తు ప్రభువైయున్నట్లు ప్రకటన 10:1 చదివిన గ్రహించగలము.  ఈ విధముగా దేవుని తేజస్సు మేఘముగా అగ్నిరూపమును కమ్మి వారిమధ్య నివసించు చుండెడిది.  ఈ మేఘములో ఎవరెవరు ఉంటారు అన్నది ఇందులో వివరింపబడలేదు.  కాని మేఘముగా పగలు గుడారమును కమ్మి చల్లదనమును ఇయ్యగా చీకటి పడినప్పుడు అదే మేఘము అగ్నిరూపముగా మారి వెలుగు నిచ్చేది.  ఈ విధముగా దేవుని తేజస్సు ఇశ్రాయేలీయుల మధ్య నివసించేది.  

        సంఖ్యాకాండము 10:33-36, ''వారు యెహోవా కొండనుండి మూడు దినముల ప్రయాణము చేసిరి; వారికి విశ్రాంతిస్థలము చూచుటకు ఆ మూడు దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను.  వారు తాము దిగిన స్థలమునుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారిమీద ఉండెను.  ఆ మందసము సాగినప్పుడు మోషే-యెహోవా లెమ్ము; నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ యెదుటనుండి పారిపోవుదురుగాకయనెను.  అది నిలిచినప్పుడు అతడు-యెహోవా, ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరల రమ్మనెను.''    ఈ విధముగా ఇశ్రాయేలీయులను దేవుడు దగ్గర ఉండి వారిని నడిపించి కానాకు చేర్చుట జరిగింది.  గుడారములోనే తన సేవకులకు దేవుడు సమాధానమిచ్చేవాడు.

        సొలొమోను చక్రవర్తి కాలములో దేవుని ఆజ్ఞ మేర దేవుడైన యెహోవా మందిరము నిర్మించారు.  ఈ మందిరములో దేవుడైన యెహోవా తేజస్సుతో నివసించుట జరిగింది.  1 రాజులు 8:1, 3-4, 6, 9-13, ''అప్పుడు సీయోను అను దావీదు పురములోనుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసికొని వచ్చుటకు యెరూషలేములోనుండు రాజైన సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దలను గోత్రప్రధానులను, అనగా ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల పెద్దలను తనయొద్దకు సమకూర్చెను.  . . .  ఇశ్రాయేలీయుల పెద్దలందరును రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాని తీసికొనివచ్చిరి.  ప్రత్యక్షపు గుడారమును గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులును లేవీయులును తీసికొని రాగా  . . .  మరియు యాజకులు యెహోవా-నిబంధన మందసమును తీసికొని దాని స్థలములో, అనగా మందిరపు గర్భాలయమగు అతిపరిశుద్ధస్థలములో, కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి.  . . .  ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను.  దానిలో ఆ రెండు రాతిపలకలు తప్ప మరి ఏమియు లేక పోయెను.  యాజకులు పరిశుద్ధస్థలములోనుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను.  కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువుచేత యాజకులు సేవచేయుటకు నిలువలేక పోయిరి.  సొలొమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు.  నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించియున్నాను;  సదాకాలము అందులో నీవు నివసించుటకై నేనొకస్థలము ఏర్పరచియున్నాను అని చెప్పి''  ఈ విధముగా దేవుడైన యెహోవా తేజస్సు యెరూషలేము దేవాలయములోకి వచ్చి నివసించుట జరిగింది.  ఇలా వచ్చినప్పుడు కూడ దానిని వర్ణించలేదు.  ఆ మేఘములో ఎవరు ఉన్నారన్న సంగతి తెలియజేయలేదు.

        ఈ విధముగా దేవుని తేజస్సు యెరూషలేములో దేవాలయముపై వచ్చుట జరిగింది.  నెహెమ్యా 9:19.  ఇది వాస్తవము.  ఈ విధముగా వచ్చునప్పుడు ఆయనతో ఎవరెవరు వచ్చారన్న సంగతి ఇక్కడ వర్ణించలేదు. కాని ప్రభు తేజస్సు ఈ భూమిని విడనాడునప్పుడు ఎవరెవరు ఉన్నారన్న సంగతి తెలియజేసాడు.  దీనినిగూర్చి తరువాత విభాగములో తెలుసుకొందము.

82.  ప్రభువు తేజస్సు భూమిని విడనాడి తిరిగి పరలోకమునకు వెళ్లిపోవుట

        ప్రియపాఠకులారా!  ఇదో అద్భుత సంఘటన.  మోషే కాలములో దేవుని తేజస్సు భూమిపైకి వచ్చినట్లుగా మనము చదువుకొన్నాము.  అలాగే యెరూషలేము దేవాలయమును సొలొమోను చక్రవర్తి నిర్మించిన తరువాత ఆయన ప్రార్థింపగా దేవుని తేజస్సు భూమిపైకి వచ్చుట యెరూషలేము దేవాలయములో చేరుట ద్వారా ఆ దేవాలయములో ఎన్నో మహత్కార్యములు సూచక క్రియలు జరిగాయి.  కాని ఇలా చెప్పునప్పుడు ఆ తేజస్సులో ఉన్నవారెవరన్న సంగతి తెలియజేయలేదు కనుక అందరు అది మొత్తము దేవుడు అని అనుకొన్నారు.  కాని యెహెజ్కేలు ఈ తేజస్సు విడనాడునప్పుడు దానిలో దేవునితోబాటుగా ఎవరెవరు ఉన్నారు అన్న సంగతిని సంపూర్ణముగా తెలియజేయుట జరిగింది.

        దేవుడు తన తేజస్సుతో ఇశ్రాయేలీయుల దేశములోని యెరూషలేములో తన ఆలయములోనికి వచ్చిన తరువాత ఆ దేవుని ఆలయము ఎంతో వైభవమును పొందుట జరిగింది.  ఇలా కొంతకాలము గడిచిపోయింది.  మరల ఇశ్రాయేలీయులు పాపము చేసి నిజదైవమైన యెహోవాను విడిచిపెట్టి విగ్రహ దేవుళ్లు అనగా పతనము చెందిన దేవుని దూతలను, ఈ సృష్టిని ఆరాధించుట మొదలుపెట్టారు.  దేవుని ఆలయములోనే విగ్రహ దేవుళ్లకు స్థానము కల్పించడముతో దేవుడు వారి చర్యకు అసహ్యపడి ఆ దేవాలయమును విడనాడుట జరిగింది.  యెహెజ్కేలు 10:1-3, ''నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశమండలమువంటిదానిలో నీలకాంతమయమైన సింహాసనమువంటి దొకటి అగుపడెను.  అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొనినవానితో యెహోవా-కెరూబు క్రింద నున్న చక్రముల మధ్యకు పోయి, కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతులనిండ తీసికొని పట్టణముమీద చల్లుమని సెలవియ్యగా, నేను చూచుచుండునంతలో అతడు లోపలికి పోయెను.  అతడు లోపలికిపోగా కెరూబులు మందిరపు కుడిప్రక్కను నిలిచి యుండెను; మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను.''  ఈ మేఘము లోపలి ఆవరణములో ఉండగా అక్కడ కుడి ప్రక్కన కెరూబులు ఉన్నాయి.  ఈ కెరూబులు దేవుని మహిమతోబాటుగా వెడలిపోవుచున్నాయి.  యెహెజ్కేలు 10:4, 16, ''యెహోవా మహిమ కెరూబులపైనుండి ఆరోహణమై మందిరపు గడపదగ్గర దిగి నిలిచెను మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో  నిండిన దాయెను.  . . .  కెరూబులు జరుగగా చక్రములును వాటి ప్రక్కను జరిగెను.  కెరూబులు నేలనుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటియొద్ద నుండి తొలగలేదు.''  ఈ విధముగా దేవుని మహిమ మేఘరూపములో ప్రత్యక్షమవగా అందులో కెరూబులు కూడ ఉన్నాయి.  వాటికి చక్రములు కలిగి ఎటు కావాలంటే అటు వెడలుచున్నాయి.

        ఇందులో మనము గమనించవలసిన ముఖ్య విషయమేమిటంటే మోషే కాలములో ప్రత్యక్షమైన దేవుని మహిమ ఇశ్రాయేలీయులు బాబిలోనియన్ల చేతిలో ఓడిపోయి ప్రవాసమునకు కొనిపోవు వరకు కొనసాగింది.  చివరకు ఇశ్రాయేలీయులు బాబిలోనియన్ల చేతిలో ఓడిపోవుటకు ముందు ఈ మహిమ పరలోకమునకు భూమిపై యెరూషలేము దేవాలయము నుండి కొనిపోబడినట్లుగా గుర్తించాలి.  

        ఇలా కెరూబులు దేవుని మహిమతో కొనిపోవునప్పుడు తమతోబాటుగా మందసమును కూడ కొనిపోయాయి.  కనుక ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడార సంబంధమైన మందసము పరలోకములో ఉన్నది.  ప్రకటన 11:19, ''మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను.  అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.''  

        ఈ విధముగా పాతనిబంధన కాలములో దేవుని మహిమ మేఘము లేక అగ్ని రూపములో క్రియ జరిగించగా దేవుని ఆజ్ఞ ప్రకారము ఆయన శక్తులైన కెరూబులు కదలి వెళ్లుచున్నవన్నట్లుగా మనము గుర్తించాలి.  ఈ విధముగా కెరూబులు దేవుని క్రిందుగా చేరి కదులుచుండగా దేవుడు తన తేజస్సుతో వీటిపై ఆసీనుడై పరలోకమునకు వెళ్లిపోవుట జరిగింది.

83.  పతనము చెందిన దేవుని దూతలు యెరూషలేములోని దేవుని ఆలయమును ఆక్రమించిన తీరు

        ప్రియపాఠకులారా!  దావీదు మహారాజు కోరుకొనిన దేవాలయమును దేవుడు నిరాకరించినప్పటికిని ఆయన కుమారుడైన సొలొమోనుచే నిర్మింపజేస్తానని ప్రమాణము చేసాడు.  ఈ ప్రమాణమును సొలొమోను జీవితములో మొదటి భాగములోనే దేవుడు నెరవేర్చుట జరిగింది.  ఈ విధముగా దేవుడు సొలొమోను చేత తనకు ఒక మందిరమును యెరూషలేములో ఏర్పరచుకొన్నాడు.  ఈ సమయములో ఒక్కసారి మనము బైబిలు గ్రంథములో గమనిస్తే దేవుడైన యెహోవాకు మందసము అనగా గుడారములతో ఏర్పరచినది తప్ప మరియే విధమైన నిలయము లేదు.  కాని సొలొమోను కట్టించినది ప్రథమమైనది.  అప్పటి కాలములో నిజదైవమునకు వేరొక దేవాలయము లేదు.  యెరూషలేములో నిర్మించినది మాత్రమే దేవునికి ప్రపంచములో ఆలయముగా ఉన్నది.  ఇదే సమయములో మనము గమనిస్తే - దాగోనుకు ఆలయము కలదు.  

        ఉదా :-  1 సమూయేలు 5:1-2, ''ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరునుండి అష్డోదునకు తీసికొనివచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి.  అయితే మరునాడు అష్డోదువారు ప్రాత:కాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడియుండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వానిస్థానమందు మరల ఉంచిరి.''  దాగోను యొక్క తల చేతులు మొండెము మానవాకారము క్రింది భాగము చేప ఆకారము.  ఈ విధముగా దాగోను మొదలు అన్ని రకములైన పతనము చెందిన దూతలు వారి వారి ప్రాంతాలలో ఆ అన్యజనులను ప్రేరేపించి వాటికి స్థిరమైన నివాసములు ఏర్పరచుకొన్నారు.  కాని దేవుని మందిరము వచ్చునాటికే ఈ విగ్రహ దేవుళ్లుగా చెలామణి అగుచున్న పతనము చెందిన దూతలు ఆలయాలు నిర్మించుకొని ఆరాధనలు బలులు పొందుచున్నారు.  ఈ విధముగా ఆరాధనలను అన్యజాతుల నుండి పొందుచున్నను వారికి అనగా పతనము చెందిన దేవుని దూతలకు సంతృప్తి లేదు.  ఈ దూతలకు ఎప్పుడు తాము సర్వోన్నతునితో సమానముగా ఉండాలనే వాటి కోరిక.  సర్వోన్నతునికి ఆలయము కట్టబడింది.  ఏదో ఒక విధముగా ఆలయములోనికి ప్రవేశించాలి.  ఇందులో ఒక భాగముగా సొలొమోను భార్యలను ప్రేరేపించి యెరూషలేము దేవాలయమునకు ముందుగా చేరాయి.  1 రాజులు 11:4-8, ''సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృదయము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాక పోయెను.  సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను.  ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడచి తన తండ్రియైన దావీదు అనుసరించినట్లు యథార్థహృదయముతో యెహోవాను అనుసరింప లేదు.  సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండమీద బలిపీఠములను కట్టించెను.  తమ దేవతలకు ధూపము వేయుచు బలుల నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను.''  ఈ విధముగా దేవుడు ఎవరినైతే ఎన్నిక చేసి తనకు మందిరము నిర్మింపజేసుకొన్నాడో, వానిచే ఈ పతనము చెందిన దూతలు తమకు కూడ మందిరములు నిర్మింపజేసుకొన్నాయి.  ఈ విధముగా ఇశ్రాయేలీయులలో తిరిగి విగ్రహారాధన మొదలైంది.  ఈ విధముగా యెరూషలేము దేవాలయమునకు ముందు చేరిన ఈ విగ్రహ దేవతలు అనగా పతనము చెందిన దేవుని దూతలు కొద్ది కాలములోనే ఇశ్రాయేలు రాజ్యము మొత్తము చుట్టివేయుట జరిగింది.  యిర్మీయా 11:13, ''యూదా, నీ పట్టణముల లెక్కచొప్పున నీకు దేవతలున్నవి గదా?  యెరూషలేము నివాసులారా, బయలు దేవతకు ధూపము వేయవలెనని మీ వీధుల లెక్కచొప్పున లజ్జాకరమైన దానిపేరట బలిపీఠములను స్థాపించితిరి.''  యూదాలోని నగరముల సంఖ్యను బట్టి అన్ని విగ్రహ దేవుళ్లు యెరూషలేమును చేరినారు.  మొదట కొద్దిమంది పతనము చెందిన దూతలు విగ్రహ దేవుళ్లుగా చేరగా కొంతకాలమునకు నగరానికో దేవత చేరిపోయినాయి.  ఇలా చేరిన దేవతలు అనగా పతనము చెందిన దేవుని దూతలకు యెరూషలేము దేవాలయముపై కన్ను పడింది.  అటుతరువాత ఒకటి ఒకటిగా యెరూషలేము దేవాలయమును ఆక్రమించుట జరిగింది.  వీరు యెరూషలేము దేవాలయములోని ఏ ఏ ప్రాంతాలను ఎవరెవరు ఆక్రమించారో ఇప్పుడు తెలుసుకొందము.  

        యెహెజ్కేలు 8:1-3, ''ఆరవ సంవత్సరము ఆరవ నెల అయిదవ దినమున నేను నా యింట కూర్చునియుండగాను యూదా పెద్దలు నా యెదుట కూర్చుండియుండగాను ప్రభువైన యెహోవా హస్తము నామీదికి వచ్చెను.  అంతట నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను, నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజియైనట్టుగాను ఆయన నాకు కనబడెను.  మరియు చెయ్యివంటిది ఒకటి ఆయన చాపి నా తలవెండ్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమ్యాకాశముల మధ్యకు నన్నెత్తి, నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తరవైపుననున్న ఆవరణ ద్వారముదగ్గర రోషము పుట్టించు విగ్రహస్థానములో నన్ను దించెను.''  ఈ విధముగా దేవుని శక్తి యెహెజ్కేలును ఆవరించగా ఉత్తర భాగములోని అంతర్భాగమున ఉన్న తలుపు యొద్ద ఒక విగ్రహమును చూచాడు.  యెహెజ్కేలు 8:5-6, ''-నరపుత్రుడా, ఉత్తరవైపు తేరి చూడుమని యెహోవా నాకు సెలవియ్యగా నేను ఉత్తరపువైపు తేరి చూచితిని; ఉత్తరపువైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను.  అంతట ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను-నరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచుచున్నావు గదా; నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా?  యీతట్టు తిరిగినయెడల వీటికంటె మరి యధికమైన హేయక్రియలు చూచెదవు.''  ఈ విగ్రహము పేరు చెప్పలేదుగాని దేవుని పవిత్ర స్థలముగా గుర్తించదగిన పీఠము ప్రక్కకు ఈ విగ్రహము చేరిపోయింది.  ఇలా చేసి దేవుడైన యెహోవాను ఆయన మందిరము నుండి తరిమివేయ చూస్తున్నట్లుగా చెప్పబడింది.  2 థెస్సలొనీక 2:4, ''ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనియ్యకుడి.''

        యెహెజ్కేలు 8:7-12, ''అప్పుడు ఆవరణద్వారముదగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను. -నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వు మని ఆయన నాకు సెలవియ్యగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారమొకటి కన బడెను.  -నీవు లోపలికి చొచ్చి, యిక్కడ వారెట్టి హేయకృత్యములు చేయుచున్నారో చూడుమని ఆయన నాకు సెలవియ్యగా నేను లోపలికి పోయి చూచితిని; అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములును హేయమైన మృగముల ఆకారములును, అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహములన్నియు గోడమీద చుట్టును వ్రాయబడియున్నట్టు కనబడెను.  మరియు ఒక్కొకడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు డెబ్బది మందియు, వారిమధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు, ఆ యాకారములకు ఎదురుగా నిలిచి యుండగా, చిక్కని మేఘమువలె ధూపవాసన ఎక్కుచుండెను.  అప్పుడాయన నాకు సెలవిచ్చినదేమనగా-నరపుత్రుడా- యెహోవా మమ్మును కానక యుండును, యెహోవా దేశమును విసర్జించెను అని యనుకొని, ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానిని నీవు చూచుచున్నావు గదా.''  ఈ విధముగా డెబ్బదిమంది ఇశ్రాయేలీయుల పెద్దలు రకరకాల జంతువుల బొమ్మలు గీచుకొని పూజిస్తున్నారు.

        అలాగే యెహెజ్కేలు 8:13-14, ''మరియు ఆయన-నీవు ఈతట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయకృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా, అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతనుగూర్చి యేడ్చుట చూచితిని.''  ఇందులో దేవుని ఆలయములో తమ్మూజు దేవతను గూర్చి స్త్రీలు శోకించుట చేస్తున్నారు.  తమ్మూజు సిరియా దేశస్థులకు బాబిలోనీయులకు దేవత.  ఇది సూర్యదేవత.  ఈ సూర్యదేవత యొక్క భార్యయే ఇష్తారు లేక అష్తారోతు.  తమ్మూజు అనేవాడు ఒక గొల్లవాడు.  ఇతడు యవ్వన కాలమున పంది కోరలచే హతుడయ్యెను.  ఇతని భార్య ఇష్తారు అతని కొరకు అంగలార్చుచు పాతాళలోకమున వెదకుచుండెను.  ఇది బబులోనీయుల పురాణ కథ.  తమ్మూజు మరణపు జ్ఞాపకార్థ పండుగగా ఏడు రోజులు చేయుదురు.  ఈ పండుగ కాలములో స్త్రీలు తమ తల వెండ్రుకలను లాగుకొనుచు గాయపరచుకొంటూ దు:ఖించుచు ఈ పండుగను ఆచరింతురు.   ఇది హేయమైన కృత్యముగా వర్ణింపబడియున్నది.

        అలాగే యెహెజ్కేలు 8:15-16, ''అప్పుడాయన-నరపుత్రుడా, యిది చూచితివి గాని నీవు తిరిగి చూచిన యెడల వీటిని మించిన హేయకృత్యములు చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా, అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు ఇరువది యయిదుగురు మనుష్యులు కనబడిరి.  వారి వీపులు యెహోవా ఆలయము తట్టును వారి ముఖములు తూర్పుతట్టును తిరిగి యుండెను; వారు తూర్పున నున్న సూర్యునికి నమస్కారము చేయు చుండిరి.''  ఈ విధముగా కొందరు యెరూషలేము దేవాలయములోనే నిజదైవమునకు వీపు చూపుచూనే సూర్యుని పూజించుట చేస్తున్నారు.

        యెహెజ్కేలు 8:17-18, ''అప్పుడాయన నాతో ఇట్లనెను-నరపుత్రుడా, నీవు చూచితివే; యూదావారు ఇక్కడ ఇట్టి హేయకృత్యములు జరిగించుట చాలదా?  వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు, తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు.  కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోథమునగుపరచి, వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొఱ్ఱ పెట్టినను నేను ఆలకింప కుందును,'' అని చెప్పుట జరిగింది.  ఇది జరిగింది బాబిలోనియన్లు యెరూషలేము దేవాలయమును నాశనము చేయక ముందు సంగతి.  ఈ విధముగా యెరూషలేము దేవాలయమును పతనము చెందిన దేవుని దూతలు ఆక్రమించాయి.  ఈ కారణము చేత దేవుడు ఆ ఆలయమును పడగొట్టించుట చేసాడు.  ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు యెరూషలేము దేవాలయమును వేశ్యల గృహముగా మార్చారో అప్పుడే దేవుని మహిమ దేవాలయమును విడుచుట జరిగింది.  ఎప్పుడైతే పతనము చెందిన దూతల ఆధిపత్యము మొదలైనదో అప్పుడే దేవుని మహిమ యెరూషలేము ఆలయమును విడిచినట్లుగా మనము గుర్తించాలి.  ఈ విధముగా పతనము చెందిన దేవుని దూతలు యెరూషలేమును ఇశ్రాయేలీయుల దేశమును ఆక్రమించుటయేగాక అతి పవిత్రమైన దేవుని నిలయమును ఆక్రమించాయి.  యిర్మీయా 16:18, ''వారు తమ హేయదేవతల కళేబరములచేత నా దేశమును అపవిత్రపరచియున్నారు, తమ హేయ క్రియలతో నా స్వాస్థ్యమును నింపియున్నారు గనుక నేను మొదట వారి దోషమునుబట్టియు వారి పాపమును బట్టియు రెండంతలుగా వారికి ప్రతీకారము చేసెదను.''  యెహెజ్కేలు 6:5, ''ఇశ్రాయేలీయుల కళేబరములను వారి బొమ్మలయొదుట పడవేసి, మీ యెముకలను మీ బలిపీఠములచుట్టు పారవేయుదును.''  ఈ విధముగా పీనుగుల వంటి విగ్రహ దేవుళ్లు దేవతలు యెరూషలేము ఆలయములో చేరి దానిని అపవిత్రము చేసాయి.

        యెహెజ్కేలు 8:17-18లో బలాత్కారముతో నింపుచూఉన్నారు.  బలాత్కారము అనునది హేయమైన స్థితి.  ఈ స్థితిలో ప్రతి ఒక్కరు  అన్యదేవతలను అనగా విగ్రహ దేవుళ్లను పూజిస్తారు.  అంటే దేవుని గూర్చి తలుచువారు లేరు.  కనుక దేవుడు ఈ స్థితిలోని వారిని నాశనమునకు అప్పగింప జేస్తున్నాడు.  అలాగే పాత నిబంధన కాలములో రాజుల గ్రంథములో చివరగా ఈ బలాత్కారముతో నింపబడిన ప్రపంచమును బాబిలోనియన్ల చేత నాశనము చేయించుట అనగా డెబ్బది సంవత్సరముల తరువాత బాబిలోనియన్లను కూడ నాశనము చేసాడు.  ఈ డెబ్బది సంవత్సరముల కాలములో దేవుడైన యెహోవాను అరాధించువారు అనేకులు తోడవడముతో ఈ వినాశన క్రియకు అంతరాయము కలిగింది.  లేకుంటే అప్పుడే మొత్తము నాశనమైయుండేది.

        అలాగే - ఆదికాండము 6:1-2, 11-12, ''నరులు భూమిమీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.  . . .  భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను.  దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి.''  ఇందులో రెండు కారణములచేత జలప్రళయము ద్వారా భూమిలోని సమస్తమును నాశనము జరిగించుట జరిగింది.  

        1.  అప్పటిలో దైవకుమారులుగా ఉన్నవారు అన్యదేవతలను కొలుచుచూ లేక దేవుని నుండి దూరమై జీవిస్తున్న స్త్రీలను మోహించి పెండ్లి చేసుకొనుట చేశారు.  ఈనాడు అనేక ప్రేమ వివాహాలు జరుగుచున్నాయి.  అలాగే వీరు తమకు నచ్చిన స్త్రీని వివాహమాడుట జరిగింది.  ఇలాంటి వివాహములు అపరిశుద్ధమైనవిగా గుర్తించాలి.  విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడ?  ఈ పొత్తు ఇలాంటి వివాహాలలోనే ఉంటుంది.  2 కొరింథీ 6:14-16, ''మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి.  నీతికి దుర్ణీతితో ఏమి సాంగ్యము?  వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?  క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము?  అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?  దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక?''  ఇలాంటి వివాహాలు చేసికొని స్థిరమైన స్థితిలో ఉండి అవిశ్వాసిని విశ్వాసిగా మార్చగలిగితే మంచిదే!  కాని విశ్వాసి అవిశ్వాసిగాను విగ్రహారాధికునిగాను మారితే!  కొందరు మొదట విశ్వాస జీవితములో ఉంటారు ప్రేమిస్తారు పెండ్లి చేసుకొంటారు.  ఆ స్త్రీ కోసమో లేక ఆ పురుషుని కోసమో దేవాదిదేవుని వదిలి పతనము చెందిన దూతలను పూజిస్తారు.  ఈ కోవకు చెందినవారే సొలొమోను సంసోను అహాబు వగైరాలు.  అందుకే ఇలాంటి వివాహాలను దేవుడు అపవిత్రమైనవిగా గుర్తించి తన ఆత్మ మనుష్యుని ముందు నిలువదని తెలియజేసాడు.  అలాగే ధర్మశాస్త్రములో కూడ అన్యజాతి స్త్రీలను పెండ్లాడకూడదని నిబంధన చేశాడు.  ద్వితీయోపదేశకాండము 7:2-4, ''నీ దేవుడైన యెహోవా వారిని నీకప్పగించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను.  వారితో నిబంధన చేసికొనకూడదు, వారిని కరుణింప కూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు.  నన్ను అనుసరింపకుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అందునుబట్టి యెహోవా కోపాగ్ని నీమీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును.''  ఈ విధముగా వీరు కామ విషయములో నిత్యము ఒకరి వెంట ఒకరు తిరుగుచూ ప్రేమ అన్న పేరును చెడగొట్టుచున్నట్లుగా మనము గుర్తించాలి.  

        2.  బలాత్కారముతో ఈ భూమి నింపబడియున్నది.  అంటే నోవహు అతని కుటుంబము తప్ప ఇక ఏ కుటుంబము దేవుని ప్రార్థించువారుగా లేరు.  ఇలాంటి స్థితిని పతనము చెందిన దేవుని దూతలు నోవహు కాలములో కూడ కలిగించాయి.  కనుకనే అప్పుడు జలప్రళయము ద్వారా దేవుడు నాశనము చేయుట జరిగింది.  సొదొమ గొమొఱ్ఱా ప్రజల అక్రమ సంబంధమైన బలత్కారము లోతు విషయములో జరిగింది.  అలాగే యెరూషలేములో దేవునికి ఆలయము నిర్మించినప్పుడు ఇశ్రాయేలీయులందరు దేవునిలో ఉన్నారు.  కాని కొంతకాలానికి విగ్రహ దేవుళ్లు అనగా పతనము చెందిన దేవుని దూతల మాయలో పడి బలాత్కారము ఈ భూమిపై ఏర్పరచుట చేసారు కనుక అప్పుడు బబులోనుచే ప్రపంచ నాశనమును దేవుడు జరిగించాడు.  బబులోను సామ్రాజ్యాన్ని పలు దేశాల రాజులు జయించినను వారి వారి పరిపాలనను సజావుగాను నెబుకద్నెజరు పరిపాలన వరకు బబులోను రాజ్య వైభవము బహు గొప్పగా సాగింది.  అటుతరువాత చారిత్రక ఆధారాలు ధ్వంసమైపోయాయి.  సూర్యదేవత (షామసు) చంద్రదేవత (సీను) కామదేవత ఇష్తారు తెగుళ్ల దేవత నెర్గవ అమావాస్య దేవత మస్కు.  వీరుగాక ఎంతోమంది దేవతా రూపములు ఆరాధించేవారు.  వారి దేవతల యొక్క ఆరాధనలు మంత్రతంత్రాలు సోదె చెప్పుట బల్యర్పణలు, స్తోత్రగీతాలు, వాటి పురాణములు  హిందువులయొక్క విగ్రహారాధనకు చేరువుగా ఉన్నాయి.

        ఇలాంటి స్థితి ఎప్పుడు కలుగునో అప్పుడే ప్రపంచ నాశనము యుగాంతము సంభవించునని ప్రతి ఒక్కరు గ్రహించవలసియున్నది.  ఆత్మ స్వరూపమైన పరబ్రహ్మమే ప్రకాశిస్తున్నాడు.  స్వయం ప్రకాశము లేని సూర్యచంద్ర నక్షత్రాదులను కూడ ఆయనే ప్రకాశింపజేస్తున్నాడు.  కనుక వాటిని ఆరాధించుట వ్యర్థమని కఠోపనిషత్తు 5:15 వివరిస్తున్నది.

84.  పతనము చెందిన దేవుని దూతలు నిజదేవుని వస్తువులను దొంగిలించుట

        ప్రియపాఠకులారా!  యెరూషలేములో దేవుడైన యెహోవాకు ఆలయ నిర్మాణము సొలొమోను చక్రవర్తి నిర్మించుట జరిగింది.  అంటే అప్పటికే రకరకాల దేవతల పేర్లతో పిలువబడు పతనము చెందిన దూతలు తమ ప్రేరణకు లొంగినవారిచే మందిరములు నిర్మింపజేసుకొని ప్రపంచ నలుమూలల ఉన్నారు.  కాని నిజదైవమైన యెహోవా పేర మందిరము నిర్మాణము జరిగిన తరువాత ఇశ్రాయేలీయులందరు యెరూషలేములో ఆలయ ప్రాంగణములో పండుగలు జరుపుకొనుచుండేవారు.  ఈ ఆలయములో సొలొమోను చక్రవర్తి అనేక రకములైన వస్తువులను తయారు చేయించుట జరిగింది.  ఇందులో

2 దినవృత్తాంతములు ఒకటవ అధ్యాయము మొదలు ఐదవ అధ్యాయము వరకు సొలొమోను తయారు చేయించిన వస్తువులు అనేకము చెప్పబడినవి.

        కాని ఐగుప్తు దాస్యము నుండి విడుదల దయచేసిన దేవుడైన యెహోవాయొక్క నియమ నిబంధనలను ధర్మశాస్త్రముగా ఇశ్రాయేలీయులు మోషే ద్వారా పొందారు.  వీటిని పాటించుచు వారు అన్యదేవతలను విడనాడుట జరిగింది.  చివరికి వీరు కానాను చేరి అక్కడ అన్యజాతులను పారద్రోలి ఆ ప్రాంతములో నివసించుట మొదలుపెట్టారు.  ఈ సమయములో తమ మధ్య నివసించువారి దైవములను ఇశ్రాయేలీయులలో కొందరు పూజించుట జరిగింది.  న్యాయాధిపతులు 5:8, ''ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను  ఇశ్రాయేలీయులలో నలువదివేల మందికి ఒక కేడెమేగాని యీటెయేగాని కనబడలేదు.''  అలాగే న్యాయాధిపతులు 2:11-15, ''ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులయెదుట కీడుచేసి, ఐగుప్తుదేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టునుండు జనుల దేవతలలో ఇతరదేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి.  వారు యెహోవాను విసర్జించి బయలును (సూర్యదేవత పురుష రూపముగల విగ్రహము) అష్తారోతును (ఆకాశ రాణి - చంద్ర నక్షత్రాల దేవత) పూజించిరి.  కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండెను; ఆయన దోచు కొనువారిచేతికి వారిని అప్పగించెను.  వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి; ఆయన వారి చుట్టునున్నవారి శత్రువులచేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువులయెదుట నిలువలేకపోయిరి.  యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయెను గనుక వారికి మిక్కిలి యిబ్బంది కలిగెను.''  ఈ విధముగా వీరు అన్యదేవతలను పూజించుట, దేవుని విస్మరించుట నీచమైన చర్యలు.  కనుక దేవుడైన యెహోవా వారికి సంపూర్ణముగా వ్యతిరేకియై అనేక రీతులుగ హింసలకు గురి చేసి బుద్ధి చెప్పుటకు ప్రయత్నించాడుగాని ఇశ్రాయేలీయులలో మార్పు లేదు.  కొంతకాలము నిజదైవములో ఉన్నట్లుగా ఉన్నను అనతికాలములోనే వారిలో మరల పతనము చెందిన దూతలు ఏర్పరచిన దయ్యముల రూపములైన విగ్రహములు చోటు చేసుకోవటం జరిగింది.  ఇలాంటి స్థితిలో రాజుగా ఎన్నికైన దావీదు మందిర నిర్మాణమును తలంచగా, దేవుడు సొలొమోనును ఎన్నుకొని యెరూషలేములో దేవుడైన యెహోవా నామములో ఒక ఆలయ నిర్మాణము చేసి అనేక రకములైన వస్తువులను ఏర్పరచుట జరిగింది.

        ఈ వస్తువులను దేవుడైన యెహోవాను పూజించుటకు ఉపయోగించేవారు.  ఇలాంటి వస్తువుల పైన అన్ని రకాల దేవతలు అనగా పతనము చెందిన దేవుని దూతల కళ్లు పడ్డవని చెప్పవచ్చును.  ఈ వస్తువులతో తాము కూడ ఆరాధింపబడాలని కోరుకొన్నారు.  అందుకోసము అన్ని రకముల దూతలు ఇశ్రాయేలీయులు నివసించు ప్రాంతములను అదృశ్యరూపము వదలి దృశ్యరూపమైన విగ్రహదేవుళ్లు ఆక్రమించుకోవాలని ప్రయత్నించాయి.  ఇలా ప్రయత్నించినప్పుడు ఇశ్రాయేలీయులలో బలహీన స్థితిలో ఉన్నవారు వాటి ప్రేరణకు లోనై విగ్రహ దేవుళ్లను తమ ప్రాంతములలో ప్రతిష్టించి బలిపీఠములు నిర్మించి బలులతో ఆరాధించుట చేసేవారు.  ఈ విధముగా పతనము చెందిన దేవుని దూతలు ఇశ్రాయేలీయ దేశములో ప్రవేశించి దైవజనులుగా పేరు పొందిన వారి హృదయములలో చోటు చేసుకొనుటయేగాక వారి ప్రాంతాలను ఆక్రమించాయి.  ఈ విధముగా ఆక్రమించుట చేత దేవునికి ఈ భూమిపై తన రాజ్యపు వైశాల్యత తగ్గిపోవుట జరిగింది.  ఇలా సంభవించినప్పుడు ఇశ్రాయేలీయులు ఏ దేవతలనైతే పూజించారో వాటి సంబంధమైన జనాభాచే ఇశ్రాయేలీయులను పీడింపజేసి వారిలో ఒక నాయకుని ఎన్నుకొని వాని ద్వారా వారి పీడ నుండి విమోచించేవాడు.  ఈ విధముగా మీరు అన్యజాతి విగ్రహ దేవుళ్లను పూజిస్తే అవే మిమ్ములను హింసించునని ఇశ్రాయేలీయులకు నిరంతరము ఆ యా సందర్భాలనుబట్టి తెలియజేసేవాడు.  అప్పటికి మారినట్లు కనబడిన ఇశ్రాయేలీయులు పదేపదే అదే తప్పును జరిగించారు.  ఈ విధముగా అనేకసార్లు ఇశ్రాయేలీయుల దేశము నుండి త్రోసివేయబడినను తిరిగి అదే ప్రాంతాన్ని ఆక్రమించేవారు.  అయినప్పటికి ఈ పతనము చెందిన దేవుని దూతలకు ఒక కోరిక అలాగే ఉండిపోయింది.  అదే నిజదైవమైన యెహోవాను పూజించిన సామాగ్రితో తాము పూజింపబడాలని వాటి కోరిక!  దేవుడైన యెహోవా ఆలయములో ఉపయోగించు వస్తువులు తమ ఆలయములకు నిలయములైన వేశ్య ఇండ్లలలో ఉపయోగించాలన్నది వాటి కోరిక.  ఈ కోరిక ఎలా తీర్చుకోవాలి?  ఆ సమయము కోసము అందరు ఎదురు చూస్తూ ఉన్నారు.  ఇశ్రాయేలీయుల దేశమును స్వాధీనపరచుకొంటూ తమ ఆక్రమణలు కొనసాగిస్తూ ఉన్నారు.  ఇలా ఆక్రమిస్తూ చివరకు యెరూషలేము దేవాలయమును ఆక్రమించుట జరిగింది.  ఈ విధముగా నరుల ద్వారా యెరూషలేము ఆలయములో తమ ప్రతిమలు ఏర్పరచుకొనుటచే అవి దేవుడైన యెహోవా ఆలయముగా ఉన్నదానిని కూడ ఈ విగ్రహ దేవుళ్లు అనగా పతనము చెందిన దేవుని దూతలు ఆక్రమించాయి.  అందులోనే పూజింపబడుచు ఉన్నారు.  ఈ స్థితిని చూచిన దేవాదిదేవునికి ఆ ఆలయము పూర్తిగా పతనమైనదని గ్రహించి దీనికి కారణమైన ఇశ్రాయేలీయులను అన్యదేశపు రాజులతో శిక్షించాడు.  వారిని ఆలయమును ఆక్రమించిన దేవతలు అనగా పతనము చెందిన దేవుని దూతలు వాటికి అంత పేరు తెచ్చిన అన్యజాతుల వారిని బబులోను రాజైన నెబుకద్నెజరు ద్వారా శిక్షించాడు.  యిర్మీయా 51:20, ''నీవు నాకు గండ్రగొడ్డలివంటివాడవు  యుద్ధాయుధమువంటివాడవు  నీవలన నేను జనములను విరుగగొట్టుచున్నాను  నీవలన రాజ్యములను విరుగగొట్టుచున్నాను.''  యిర్మీయా 51:7, ''బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారుపాత్రయై యుండెను.  దానిచేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి యున్నారు.''  ఈ విధముగా దేవుడు అన్యజాతి జనులలో ఇశ్రాయేలీయుల నుండి దూరమున జీవిస్తున్న బాబిలోనియన్లను గండ్ర గొడ్డలిగా ఉపయోగించి తన జనాంగమును, తన జనాంగము పాడు అగుటకు కారణమైన అన్య జాతులను శిక్షించుట జరిగింది.

        ఈ విధముగా శిక్షించునప్పుడు బాబిలోనియా దేవత పతనము చెందిన దేవుని దూతయైన బేలుకు విచిత్రమైన ఆశ కలిగింది.  ఈ ఆశేమిటంటే దేవుడైన యెహోవా ఆరాధనకు ఉపయోగపడు వస్తువులు తనకు కావాలని ఆశించాడు.  బాబిలోనియా రాజైన నెబుకద్నెజరు ఇశ్రాయేలీయులతో యుద్ధము జరిగించినప్పుడు, దైవనిర్ణయము ప్రకారము తాను గెలుచుట జరిగింది.  అన్ని దేవాలయములను నాశనము చేసినట్లే అన్య దేవతలతో నిండిన యెరూషలేము దేవాలయమును కూడ నాశనము చేసాడు.  ఈ స్థితిలో బేలు అను పతనము చెందిన దేవుని దూత తన కోరికను నెరవేర్చుకొనుటకు యెరూషలేము ఆలయములోని వస్తువులను తన అనుచరులను ప్రేరేపించి దొంగిలించుట చేసాడు.  2 రాజులు 25:13-16, ''మరియు యెహోవా మందిరమందున్న యిత్తడి స్తంభములను మట్లను యెహోవా మందిరమందున్న యిత్తడి సముద్రమును కల్దీయులు తునక లుగా కొట్టి, ఆ యిత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తికొనిపోయిరి.  సేవకొరకై  యుంచబడిన పాత్రలను చేటలను ముండ్లను ధూపార్తులను ఇత్తడి ఉపకరణములన్నిటిని వారు తీసికొని పోయిరి.  అగ్నిపాత్రలు గిన్నెలు మొదలైన వెండి వస్తువులను బంగారు వస్తువులను రాజదేహసంరక్షకుల అధిపతి తీసికొనిపోయెను.  మరియు అతడు యెహోవా మందిరమునకు సొలొమోను చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లను తీసికొనిపోయెను.  ఈ యిత్తడి వస్తువులయెత్తు లెక్కకు మించియుండెను.''  ఈ విధముగా బేలు అను పతనము చెందిన దేవుని దూత బబులోను నాయకులను ప్రేరేపించి ఈ వస్తువులను దొంగిలించుట చేసాడు.  నిజానికి ఇవి దేవుడైన యెహోవావి.  వీటిని దేవునికి సొలొమోను చేసి ఇచ్చినవి.  వీటిపై ఒక్క దేవుడే అధికారము కలిగియున్నాడు.    ఇలాంటివాటిని బేలు అను పతనము చెందిన దేవుని దూత తన జనాంగమును ప్రేరేపించి వాటిని అపహరించుట చేసాడు.  ఇది దొంగతనముతో సమానమే గదా!  ఈ బేలు బబులోను దేవతలలో ముఖ్యమైనది.  ఇది ''అను-ఈయ,'' అనబడు రెండు దేవతలతో కలిపి త్రిమూర్తియైయున్నది.  బేలు అను పదము బయలు అను సూర్యదేవునికి సంబంధించింది అని చరిత్రకారులు చెప్పుచున్నారు.

        అందుకే యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు బేలు మ్రింగినవాటిని తిరిగి కక్కించుదునని ప్రవచింపజేసియున్నాడు.  యిర్మీయా 51:44, ''బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను  వాడు మ్రింగినదానిని వానినోటనుండి కక్కించుచున్నాను  ఇకమీదట జనములు వానియొద్దకు సమూహములుగా కూడి రావు  బబులోను ప్రాకారము కూలును;''  కనుక ఈ దొంగతనము చేసినది బేలు అను విగ్రహ దేవత వీడు తన అనుచరులను ప్రేరేపించి, నిజదైవసంబంధమైన వాటిని తాను పాలించు ప్రాంతమునకు కొనిపోవుట జరిగినది. 

ముగింపు

        ప్రియపాఠకులారా!  యెహోషువ కాలములో మొదలైన ఈ కాలము చాలా ఉన్నతమైన స్థితిలో దేవునిలో ఉండుట జరిగింది.  కాలక్రమేణా ఎన్నో ఒడిదుడుకులకు లోనై కొంతకాలము విశ్వాసములోను మరి కొంతకాలము విగ్రహ దేవుళ్లపై విశ్వాసములోను గడచిపోయింది.  ఇలాంటి స్థితిలో దేవునికి ఆలయ నిర్మాణము జరిగి దేవుని మహిమ భూమిపైకి వచ్చి చివరకు యెరూషలేము ఆలయములో తన స్థానమును ఏర్పరచుకోగా, విగ్రహ దేవుళ్లు ఆ స్థానమును కూడ నరులను ప్రేరేపించి వారి ద్వారా ఆ ఆలయమును ఆక్రమించుకొని దేవునికి సంబంధించినవాటిచే వారు ఆరాధింపబడుచు వచ్చారు.  ఈ స్థితిలో యెషయా, యెహెజ్కేలు, యిర్మీయా వంటి ప్రవక్తలను దేవుడు పంపినను ఇశ్రాయేలీయులు వినకపోవుట మనము గ్రహించాలి.  దీని పర్యావసానము ఇశ్రాయేలీయుల వినాశనము జరుగగా, మిగిలినవారు బాబిలోనియా దేశమునకు బానిసలుగా కొనిపోబడినారు.  దీనికి కారణము నిజదేవుని విడనాడి విగ్రహ దేవుళ్లు అను పతనము చెందిన దూతలను పూజించుట.  ఈ కాలము ఉన్నత స్థితిలో మొదలై చివరకు అవిశ్వాసులుగా అంతమగుటయేగాక, ఈ అవిశ్వాస మూలముగా ఇశ్రాయేలీయులలో వినాశనములో మరణించినవారు పోగా మిగిలినవారిలో ఎక్కువ భాగము బానిసలుగా కొనిపోబడుట జరిగింది.  అంతేకాకుండ బాబిలోనియన్ల దేవతలు అనగా పతనము చెందిన దూతలు నిజదైవమైన యెహోవా యొక్క వస్తువులను దొంగిలించినట్లుగా చదవగలము.

        మోషే చేయించిన ఇత్తడి సర్పము అహరోను చేయించిన బంగారు దూడ బాబిలోనియన్లు ఆరాధించే లెక్కించ వీలుగాని దేవీదేవతలు వారి పురాణాలు మంత్రతంత్రాలు సోదెలు బలులు నైవేద్యాలు భారతదేశములో వ్యాపించి విగ్రహాలతో నిండిపోయింది.  ఇట్టి పరిస్థితులలో శ్రుతులు ఉపనిషత్తుల యొక్క ప్రవచనాలు కూడ వినే స్థితిలో లేరు.  కేనోపనిషత్తు ఒకటవ విభాగము ఒకటి నుండి ఎనిమిది శ్లోకాలలో - ''ఆత్మను కండ్లు ముక్కు చెవులు వగైరా ఇంద్రియాలు గుర్తించలేవు.  అయితే మానవుడు చేసిన విగ్రహాలు ఆత్మను గుర్తిస్తాయా?  అందుకనే ఈ జనులంతా పూజించేది బ్రహ్మము కాదని ముక్త కంఠముతో ముమ్మార్లు ప్రకటిస్తున్నాడు.  రెండవ భాగము ఐదవ శ్లోకములో ప్రతివానిలోను దైవాత్మను దర్శిస్తూ పరిశుద్ధమైన మనస్సుతో జ్ఞానము కలిగి ఆత్మ సాక్షాత్కారము పొందమంటున్నాడు.  అట్టివాడే జీవన్ముక్తుడు.

విభాగము - 8

బాబిలోనియాకు ప్రవాసము మొదలు క్రీస్తు ప్రభువు పుట్టుకకు ముందు కాలము

పరిచయము

ప్రియపాఠకులారా! బాబిలోనియా రాజు నెబుకద్నెజరు ప్రపంచమును జయించి ఇశ్రాయేలీయులను తన రాజ్యములో బానిసలుగా చేసుకొనుట జరిగింది. ఈ స్థితిలో నుండి తిరిగి ఇశ్రాయేలీయులు తమ దేశమును ఏర్పరచుకొన్నను క్రీస్తు ప్రభువు పుట్టునాటికి వారు తమ రాజ్యము హస్తగతము చేసుకోలేని స్థితిలోనే ఉండిపోయారు.  వీరు వేరే రాజుల ఆధ్వర్యములో రాజ్యమును నడుపుచున్నట్లుగా నూతన నిబంధన చరిత్రలో మనము తెలుసుకొనగలము.  ఈ కాలములో దానియేలు జెకర్యా వంటి ప్రవక్తలు ఉన్నారు. జరగబోవువాటిని గూర్చిన దర్శనములు చూచినవారు.  యిర్మీయా డెబ్బది సంవత్సరములలో ఇశ్రాయేలీయుల దేశము పాడుబడునని ప్రవచించాడు.  ఈ కాలమును గుర్తించిన దానియేలు ప్రార్థించగా జెరుబ్బాబేలు ఎజ్రా వంటివారు ఇశ్రాయేలీయ దేశమును పునరుద్ధరించుటకు ప్రయత్నించారు.  ఈ విధముగా ఈ కాలములో మరల నిజ దైవభక్తిలో ముందుకు రాగలిగిరిగాని దైవమహిమను తిరిగి యెరూషలేము ఆలయమునకు తీసుకొని రాలేకపోయారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆలయము సాధారణమైన ఆలయముగా ఇప్పుడు ఉండిపోయెనని చెప్పవచ్చును. ఈ కాలములో జరిగిన దేవుని దూతల పరిచర్యను గూర్చి తెలుసుకొందము.

85.  పతనము చెందిన దూతయైన బేలుకు బానిసలుగా నిజదైవ ప్రజలు

        ప్రియపాఠకులారా!  యిర్మీయా 51:44, ''బబులోనులోనే బేలును శిక్షించు చున్నాను  వాడు మ్రింగినదానిని వానినోటనుండి కక్కించుచున్నాను  ఇకమీదట జనములు వానియొద్దకు సమూహములుగా కూడి రావు  బబులోను ప్రాకారము కూలును;'' ఇందునుబట్టి బేలు అను పతనము చెందిన దేవత బాబిలోనియా ప్రాంతమునకు చెందినవాడు.  ఇశ్రాయేలీయులపై దేవుని ఉగ్రత రగులుకొనగా ఈ అవకాశమును బేలు ఉపయోగించుకొని నిజదైవ సంబంధమైన వస్తువులను తన ప్రాంతమునకు దోచుకొని తెచ్చుకొన్నాడు.  అంతేకాకుండ ఇశ్రాయేలీయులలో అనేకులను బానిసలుగా తన ప్రాంతమునకు రప్పించాడు.  ఈ విధముగా వీరిని తన ప్రాంతములో తనకు బానిసలుగా తన రాజ్యములో వారిచే వెట్టి చాకిరి చేయించినట్లుగా మనము గ్రహించాలి.  ఈ కాలములో అందరు లొంగినను దానియేలు అతని మిత్రులు, జెకర్యా, ఎజ్రా వంటివారు శోధనకు లొంగక నిజదైవములో నిలిచినట్లుగా మనము గ్రహించాలి.

86.  రాజు విగ్రహ దేవుళ్లను ప్రతిష్టించగా వాటిని పూజించమని ఎదురు తిరిగిన నిజదైవభక్తులు

        ప్రియపాఠకులారా!  రాజు తలచినదే న్యాయము అను సామెత ఒకటి ఉన్నది.  ఇశ్రాయేలీయులు బబులోనులో దాస్యము చేయుచున్నప్పుడు, బబులోను రాజైన నెబుకద్నెజరుకు ఒక తలంపు వచ్చింది.  కనుక ఈ రాజు తలచినదే న్యాయమన్న సామెత ప్రకారము ఒక విగ్రహమును తయారుచేసి తన రాజ్యములోని వారందరు ఈ విగ్రహమునే పూజించాలని శాసించాడు.  దానియేలు 3:1-2, ''రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమయొకటి చేయించి, బబులోనుదేశములోని దూరాయను మైదానములో దాని నిలువబెట్టించెను.  అది అరువదిమూరల ఎత్తును ఆరుమూరల వెడల్పునై యుండెను.  రాజగు నెబుకద్నెజరు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్రవిధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించినవారినందరిని సమకూర్చుటకును, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమయొక్క ప్రతిష్ఠకు రప్పించుటకును దూతలను పంపించగా''  అలాగే దానియేలు 3:3-6, ''ఆ యధిపతులును సేనాధిపతులును సంస్థానాధిపతులును మంత్రులును ఖజానాదారులును ధర్మశాస్త్రవిధాయకులును న్యాయాధిపతులును సంస్థానములలో ఆధిక్యము వహించినవారందరును రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమయొక్క ప్రతిష్ఠకు కూడివచ్చి, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమయెదుట నిలుచుండిరి.  ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా-జనులారా, మీకాజ్ఞ ఇచ్చుచున్నాను.  ఏమనగా, బాకా పిల్లంగ్రోవి పెద్దవీణె సుంఫోనీయ వీణె విపంచిక సకలవిధములగు వాద్యధ్వనులు మీకు వినబడునప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమయెదుట సాగిలపడి నమస్కరించుడి.  సాగిలపడి నమస్కరింపనివాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును.''  ఈ విధముగా ప్రతి ఒక్కరు బూరలు, పిల్లంగ్రోవి శబ్దముతోనే ఆ విగ్రహమును పూజించాలి.  ఇలా పూజించనివారు బలవంతపు మరణమును పొందుతారు.  ఇది రాజు యొక్క తలంపు.  ఈ తలంపును సాతాను లేక పతనము చెందిన దేవుని దూత వారి అనుచర దూతల ప్రేరణతో సమాజ పెద్దలు పురికొల్పగా ఒక విగ్రహమును రాజు నెలకొల్పుట జరిగింది.  ఈ విగ్రహమును అందరు పూజించాలి.  ఇది నిజదైవ సంబంధమైన కార్యము కాదు.  సాతాను ఏర్పరచినది.  ఈ విధముగా రాజుల చరిత్రలలో అనేక విగ్రహ దేవుళ్లు వెలసినట్లుగా మనము గ్రహించాలి.  రాజు తన ఇష్టానుసారము దేవుని ఏర్పరచాడు.  అందుకు సంబంధమైన విగ్రహమును తయారుచేసి దానిని ఒక దేవునిగా ప్రతిష్టించుట జరిగింది.

        నిజదేవుడైన యెహోవా ప్రళయ కాలమున ఓడను ఆజ్ఞల మందసము యెరూషలేము ఆలయము కెరూబులు ఉండవలసిన విధానము సృష్టి చరిత్ర వగైరాలన్నియు తానేర్పరచుకొన్న దైవజనుల చేత ఏర్పాటు చేయించినట్లే సాతాను తన భక్త బృందము చేత స్వప్నముల ద్వారాను గణాచారి ఆవేశము ద్వారాను ప్రాణము లేని విగ్రహాలను తయారు చేయించి వాటికి ప్రాణ ప్రతిష్ఠ అను పేరు పెట్టి గర్భ గుళ్లలో ప్రతిష్ట జేయిస్తున్నాడు.  ఈ విగ్రహాలకు సంబంధించిన పురాణాలు ఒకదానికొకటి సమన్వయము లేనందున ఏ విగ్రహ దేవుడు గొప్పో భక్తునికి తెలియక కంటికి కనబడిన ప్రతి విగ్రహానికి సృష్టికి - సృష్టములకు మ్రొక్కుకొంటూ కళ్లకు అద్దుకుంటూ వీలైతే గుంజీలు తీస్తూ తన అతిభక్తిని విగ్రహాల ముందు చాటుకుంటున్నాడు.  ఇదియే ఆత్మ సాక్షాత్కారమని తరించినానని మురిసిపోతున్నాడు.

        ఈ విధముగా సాతాను అతని దూతలు రాజును ప్రేరేపించి ఒక విగ్రహమును ప్రతిష్ఠ చేసి, దానిని అందరు పూజించాలని శాసనము చేయించుట జరిగింది.  జెకర్యా 5:10-11, ''వీరు ఈ తూమును ఎక్కడికి తీసికొని పోవుదురని నాతో మాటలాడుచున్న దూతను నేనడుగగా -షీనారుదేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు; అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠముమీద పెట్టియుంచుదురని నాకుత్తర మిచ్చెను.''  ఈ విధముగా పాతాళలోక బిలములలో ఉండు రహస్య జీవితములను సాతాను అతని దూతలు విగ్రహ దేవుళ్లుగా బబులోనుకు కొనిపోయి అక్కడ రాజును ప్రేరేపించి ప్రతిష్ఠించుట జరిగింది.  ఈ రహస్య జీవితమే పతనము చెందిన జీవితము.  పాపభూయిష్ఠమైన జీవితము.  ఇలాంటి పాపపు జీవితమును సాతాను అతని దూతల ప్రేరణతో రాజు ప్రతిష్టించుట జరిగింది.  ఈనాడు అనేక ప్రాంతాలలో ఇదే స్థితి జరుగుచున్నది.  అమెరికా వంటి క్రైస్తవ దేశాలలో విగ్రహ దేవుళ్లను నూతనముగా ప్రతిష్టించుట, వాటికి ఆలయములు కట్టుట జరుగుచున్నది.  వీటి జీవితము రహస్య జీవితమే.  ఆ జీవితము పాపభూయిష్టమైనది.  ఒకప్పుడు నిజదైవమును వ్యతిరేకించి ఆయన యొక్క ఉన్నత స్థానములను ఆశించి చివరకు పతనము చెందినవారు.  వీరి దగ్గరకు వెళ్లువారికి ఈ పతనమును గూర్చి తెలుపరు.  ఇంతమంది విగ్రహ దేవుళ్లు ఎలా పుట్టుకొచ్చారో చెప్పరు.  వీరి పాప జీవితమును గూర్చి ఎవరికి తెలియదు.  అక్కడకు వెళ్లువారు వీరిని నిజదైవముగా భావించుదురు.  కనుక వీటి జీవితము రహస్య జీవితముగా ఉన్నది.

        ఇలాంటివాటిని రాజు లేక నరులలో కొందరు ప్రతిష్టించి ప్రక్కవారిని శోధించుటకు వాటిని పూజించాలని శాసిస్తారు.  ఇలా పూజించకపోతే మిమ్మును చంపుతామని బెదిరిస్తారు.  మీపై ఈ విగ్రహ దేవత ఆగ్రహించి మిమ్ములను నాశనము చేయునని తెలియజేస్తారు.  ఇక మన రక్తసంబంధీకులు వారి మాటలను విశ్వసించి మనలను అనేక రకములుగా బ్లాక్‌మెయిల్‌ చేస్తారు.  ఈ స్థితిని గూర్చి నిజదైవము ఏమి చెప్పుచున్నదో మనము ఒకసారి గమనించాలి.  ఇది ఒక శోధన అని చెప్పుచున్నది.  ఈ శోధనను జయించువారు ధన్యులు.  యాకోబు 1:12-15, ''శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.  దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు-నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.  ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.  దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమునుకనును.''  అలా జయించినవారు దేవునిలో ఉన్నత స్థానమును పొందుట జరుగును.  ఇదే పరిస్థితి దానియేలు యొక్క ముగ్గురు మిత్రులకు సంభవించింది.  రాజు శాసనము చేసినను వీరు ఆ విగ్రహ దైవమును పూజించలేదు.  దానియేలు 3:12-18, ''రాజా, తాము షద్రకు, మేషాకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి; ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి.  అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును మేషాకును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను పట్టుకొని రాజసన్నిధికి తీసికొని వచ్చిరి.  అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లనెను-షద్రకూ, మేషాకూ, అబేద్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియు నాకు వినబడినది.  అది నిజమా?  బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణెను వీణెను సుంఫోనీయను విపంచికను సకలవిధములగు వాద్యధ్వనులను మీరు వినుసమయములో సాగిలపడి, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినయెడల సరే మీరు నమస్కరింపని యెడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు; నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ నున్నాడు?  షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి-నెబుకద్నెజరూ, యిందునుగురించి నీకు ప్రత్యుత్తర మియ్యవలెనన్న చింత మాకు లేదు.  మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు; మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము.''  ఈ విధముగా వాగ్వివాదము జరిగినప్పుడు నిజ దైవభక్తులు దేవుడు మమ్ము కాపాడిన కాపాడకపోయిన ఫరవాలేదుగాని ఈ రహస్య జీవితము కలిగిన పతనము చెందిన దేవుని దూతలు ఏర్పరచినవాటిని మేము ఆరాధించమని చెప్పుట జరిగింది.  ఈ విధముగా నిజ దైవభక్తులు ఎదురు తిరిగి సాతాను అతని దూతలు చేసిన పన్నాగమును ఛేదించి నిజదైవములో నిలుచుచున్నారు.  ఈ విధముగా ఏమి జరిగినను నిజదైవముపై విశ్వాసము కలిగియుండాలి అన్నది దైవము కోరుకొను చున్నది.  కనుక దానియేలులో జరిగిన సంఘటన వారి విశ్వాసమునకు చివరి మెట్టు.  ఈ స్థితి తరువాత రాజు వారిని అగ్నిగుండములో పడవేయగా, దానియేలు 3:24-25, ''రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవరముగ లేచి-మేము ముగ్గురు మనుష్యులను బంధించి యీ అగ్నిలో వేసితిమిగదా యని తన మంత్రుల నడిగెను.  వారు-రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి.  అందుకు రాజు-నేను నలుగురు మనుష్యులు బంధకములులేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను; వారికి హాని యేమియు కలుగలేదు; నాల్గవవాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను.''  ఈ విధముగా దేవుడు తన దూతను పంపి సాతాను అతని దూతలు వాని అనుచరులు పన్నిన పన్నాగము నుండి వారిని విడిపించుట జరిగింది.

        ఏది ఏమైనప్పటికి సాతాను అతని దూతలు ప్రేరేపించగా ఏర్పరచబడిన విగ్రహ దేవుళ్లను నిజ దైవభక్తులు మాత్రమే వ్యతిరేకించి వారి మరణము వరకు సాతానుకు లొంగక సాతానుపై సంపూర్ణ విజయమును పొంది దేవునికి మహదానందమును కలిగింతురని మనము గ్రహించాలి.  ఈ విధముగా ఈ కాలములో విగ్రహ దేవుళ్లుగా పతనము చెందిన దేవుని దూతలు ప్రపంచము మొత్తముపై ఆధిక్యతను పొందాలని ఈ ప్రయత్నము చేసినట్లుగా మనము భావించాలి.  కాని నిజదైవభక్తులు దీనిని వ్యతిరేకించి తమ ప్రాణముల సైతము పణముగా పెట్టుట వారు దేవునిలో ఉన్నత స్థానమును పొందినట్లుగా మనము గ్రహించాలి.

విగ్రహారాధననేగాక కులమతాలను కూడ ఖండించిన యోగి వేమన.

        1.  హృదయమందునున్న ఈశుని తెలియక శిలలనెల్ల మ్రొక్కు జీవులారా!  -  శిలలనేమి యుండు జీవులందేగాక.  

        2.  బ్రహ్మనెరుగవు భావమందుండిన తనువు గుడిగ జేసి తన్ను నిలిపి లోక బుద్ధి విడిచి లోజూపు చూడరా!  

        3.  తనదు తల్లి గిరిజన తనయాలు మాదిగ - శ్రీపతికి గురువు వశిష్టుడరయా - తపము చేత ద్విజుడు తర్కింప  కులమెట్లు?  

        4.  శిలలు జూచి నరులు శివుడని మెచ్చురు - శిలలు శిలలేగాని శివుడు గాదు.  తనలోని శివుని తానేల తెలియదో  

        5.  మాల మాలగాదు మహిమీద జూడంగా - మాట తిరుగువాడే మాలగాక - వాని మాలయన్న వాడే ఫో పెనుమాల.  

        6.  శివుడు గలడటంచూ శిలలకు మ్రొక్కెడు వెఱ్ఱి జీవులారా!  వెటల విడుడి జీవులందేగాక శిలల నేమి ఉన్నది?  

        7.  రాతి ప్రతిమ తెచ్చి రాజసంబున నుంచి పూజ జేయు నరుడు బుద్ధి మారి భావమందు పరము భావింపనేరడు.  

        8.  మాట నిలుపలేని మనుజుండు మారడు - ఆజ్ఞ లేని రాజే ఆడు ముండ - మహిమ లేని వేల్పు మట్టి జేసిన బొమ్మ.  

        9.  మంటితోడ కొన్ని మ్రాని తోడను కొన్ని - రాతి చేత కొన్ని రాగి కొన్ని ప్రతిమలెన్నో చేసి భగవంతుడని మ్రొక్కి ముక్తి ఎట్టు లిచ్చు మనసి వేమ.  

        10.  పలుగురాళ్లు తెచ్చి పరగ గుడులు కట్టి - చెరగి శిలల సేవ జేయనేల?  శిలల సేవ జేయ ఫలమేల గలుగురా?

87.  ఇశ్రాయేలీయుల విముక్తి కోసము దేవుని దూత మనవి

        ప్రియపాఠకులారా!  జెకర్యా దర్శనములో ఇశ్రాయేలీయుల బానిసత్వమును గూర్చి వ్రాయబడియున్నది.  ఇశ్రాయేలీయులు బానిసలుగా బాబిలోనియా ప్రాంతమునకు కొనిపోబడినారు.  ఈ కాలములో అనేక బాధలను వీరు పొందుట జరిగింది.  ఈ విధముగా సుమారు డెబ్బది సంవత్సరముల కాలము గడిచింది.  ఈ కాలములో దేవుడు ప్రపంచమును పరిశీలించి తన దూతలను పంపి వార్తలను సేకరించుచున్నాడు.  జెకర్యా 1:9-11, ''అప్పుడు-నా యేలినవాడా, యివి ఏమని నేనడుగగా నాతో మాటలాడు దూత-ఇవి ఏమియైనది నేను నీకు తెలియజేతుననెను.  అప్పుడు గొంజి చెట్లలో నిలువబడియున్న వాడు-ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుఱ్ఱములని చెప్పెను.  అవి గొంజిచెట్లమధ్యను నిలువబడిన యెహోవా దూతను చూచి-మేము లోకమంతట తిరుగులాడి వచ్చి యున్నాము; ఇదిగో లోకులందరు శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారని చెప్పెను.''  ఈ విధముగా పంపబడిన దూతలు లోకమంతా తిరిగి ప్రపంచ జనులలో అన్యులందరు శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారని తెలియజేస్తున్నాడు.  ఇలా చెప్పిన తరువాత ఈ దూత యెరూషలేమును కనికరింపమని దేవుని కోరుకొనుచున్నాడు.  

        జెకర్యా 1:12, ''అందుకు యెహోవా దూత-సైన్యములకధిపతియగు యెహోవా, డెబ్బది సంవత్సరములనుండి నీవు యెరూషలేముమీదను యూదా పట్టణములమీదను కోపముంచియున్నావే; ఇక ఎన్నాళ్లు కనికరింపకయుందువు అని మనవిచేయగా''  ఈ మాటలకు - జెకర్యా 1:13, ''యెహోవా నాతో మాటలాడిన దూతకు ఆదరణయైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను.''  ఈ విధముగా ఇశ్రాయేలీయుల విముక్తి కోసము దేవుని దూతలు కనికరింపమని దేవుడైన యెహోవాను అడగుట ఈ కాలములో జరిగినట్లుగా మనము గ్రహించాలి.

88.  నిజదైవ వస్తువులను దొంగిలించిన పతనము చెందిన దూతల నుండి దేవుడు తిరిగి పొందుట

        ప్రియపాఠకులారా!  సుమారు డెబ్బది సంవత్సరముల ముందు ఇశ్రాయేలీయులు పూర్తిగా చెడిపోయి విగ్రహ దేవుళ్ల బలాత్కారముతో నిండిపోగా దేవుడు ఇశ్రాయేలీయులను బాబిలోనియన్లకు బానిసలుగా చేసాడు.  ఇలాంటి స్థితిలో బేలు అను పతనము చెందిన దూత తన అనుచరులను ప్రేరేపించి నిజదైవసంబంధమైన వస్తువులను దొంగిలించినట్లుగా చదువుకొన్నాము.

        యిర్మీయా 51:47, ''రాబోవు దినములలో నేను బబులోనుయొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును  దాని దేశమంతయు అవమానము నొందును  జనులు హతులై దాని మధ్యను కూలెదరు.''  ఇలా చేసినందుకు దేవుడు బబులోనియాలో చెక్కిన విగ్రహములకు బుద్ధి చెప్పనున్నట్లుగా చెప్పబడింది.  ఈ బుద్ధి చెప్పునప్పుడు దేవుడు వాడు అనగా బేలు అను వారి దేవత అనగా పతనము చెందిన దూత మ్రింగిన వాటిని అనగా తన దేవాలయములో ఉండవలసిన వాటిని ఏవైతే వీడు అపహరించినాడో వాటిని క్రక్కించుదునని చెప్పుచున్నాడు.  యిర్మీయా 51:44, ''బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను  వాడు మ్రింగినదానిని వానినోటనుండి కక్కించుచున్నాను  ఇకమీదట జనములు వానియొద్దకు సమూహములుగా కూడి రావు  బబులోను ప్రాకారము కూలును;''    ఈ విధముగా ఈ బేలు తనకు దేవుడు ఇచ్చిన పరిధిని దాటి దేవుని ఉపకరణములు తనకు కావాలని తలంచి చివరకు తాను సమస్తమును తిరిగి ఇవ్వవలసి వచ్చింది.  ఎజ్రా 1:1, 7-11, ''పారసీకదేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయాద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతట చాటింపుచేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. . . .  మరియు నెబుకద్నెజరు యెరూషలేము నుండి తీసికొని వచ్చి తన దేవతలయొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరెషు బయటికి తెప్పించెను.  పారసీకదేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రిదాతుద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి, యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను.  వాటియొక్క లెక్క ముప్పది బంగారపు పళ్లెములును వెయ్యి వెండి పళ్లెములును ఇరువది తొమ్మిది కత్తులును ముప్పది బంగారుగిన్నెలును నాలుగువందలపది వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలును, మరియితరమైన ఉపకరణములును వెయ్యియై యుండెను.  బంగారు వస్తువులును వెండి వస్తువులును అన్నియు అయిదువేల నాలుగువందలు.  షేష్బజ్జరు బబులోను చెరలోనుండి విడిపింపబడినవారితో కూడ కలిసి వీటన్నిటిని యెరూషలేమునకు తీసికొని వచ్చెను.''  ఈ విధముగా బాబిలోనియా రాజును దేవుడు శిక్షింపగా అతని స్థానములో రాజైన కోరెషు జరిగిన తప్పును గుర్తించి దేవునికి సంబంధించినవి తిరిగి పంపివేయుట జరిగింది.  ఈ విధముగా బేలు అను పతనము చెందిన దూత దొంగిలించుట జరిగినట్లుగా మనము గుర్తించాలి.  అలాగే దేవుడు ఆ పతనము చెందిన దూతయైన బేలును శిక్షించి తనవి తిరిగి పొందినట్లుగా ఈ కాలములో జరిగినట్లుగా మనము గ్రహించాలి.

89.  ఇశ్రాయేలీయుల పక్షము వహించు దూత

        ప్రియపాఠకులారా!  దేవుడు ఒక్కొక్క జాతికి ఒక్కొక్క దూతను కాపలాగ ఉంచాడు.  ద్వితీయోపదేశకాండము 32:8, 12, ''మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కనుబట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను.  . . .  యెహోవా మాత్రము వాని నడిపించెను  అన్యులయొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతో కూడ ఉండలేదు.''  ఈ విధముగా దేవుడే స్వయముగా ఇశ్రాయేలీయ జాతిని తన పక్షము చేసుకొని తానే వారిని నడిపించుట పాతనిబంధన చరిత్రలో జరిగింది.  కాని దేవుడు ఇశ్రాయేలీయులను తన జనాంగముగా ఎన్నుకొన్నను దేవుని ఆజ్ఞ ప్రకారముగా మిఖాయేలు దూత ఇశ్రాయేలీయుల పక్షము నిలిచి ఇతర జాతులతో పోరాడి విజయమును ఇచ్చేవాడు.  

        దానియేలు 12:1, ''ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును.  అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని లుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.''  అందుకే ఈ వాక్యములోనే జనుల పక్షము వహించు మహా అధిపతియగు మిఖాయేలు అని చెప్పుట జరిగింది.  నీ జనులు అనగా దానియేలు యొక్క జనులు.  వీరు ఇశ్రాయేలీయులు.  2 దినవృత్తాంతములు 7:19-20, ''అయితే మీరు త్రోవతప్పి, నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడచి, యితర దేవతలను అనుసరించి వాటికి పూజానమస్కారములు చేసిన యెడల నేను మీకిచ్చిన నా దేశములోనుండి మిమ్మును పెల్లగించి, నా నామమునకు నేను పరిశుద్ధపరచిన యీ మందిరమును నా సన్నిధినుండి తీసివేసి, సమస్త జనములలో దానిని సామెత కాస్పదముగాను నిందకాస్పదముగాను చేయుదును.''

        ఇలా పాపము చేసి అన్యదేవతలను పూజించి నిజదైవమైన యెహోవాను వదిలిన రోజున దేవుడు ఇశ్రాయేలీయుల పక్షము నుండి తొలగిపోవును.  ఇందునుబట్టి ఇశ్రాయేలీయులు ఎంత కాలము నిజదైవమైన యెహోవాయందు ఉన్నంతకాలము దేవుడు వారి పక్షము వహిస్తాడు.  ఇలా దేవుడు ఇశ్రాయేలీయుల పక్షము వహించినప్పుడు సమస్తము ఆయన ఆధీనములో ఉండాలి.  ఆయన చెప్పిన ఆజ్ఞలను అనుసరించి జరగాలి.  ఇంతకి ఈ ఆజ్ఞలను నెరవేర్చువారు ఎవరు?  అని అంటే దానియేలుకు తెలుపబడిన మిఖాయేలు అను ప్రధానాధిపతి.  ఇతను మాత్రమే ఇశ్రాయేలీయుల పక్షము ఉండువాడు.  

        యెహోషువ 5:13-14, ''యెహోషువ యెరికో ప్రాంతమున నున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా, దూసిన కత్తి చేత పట్టుకొనియున్న ఒకడు అతని యెదుట నిలిచియుండెను; యెహోషువ అతనియొద్దకు వెళ్లి-నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధులపక్షముగా నున్నవాడవా?  అని అడుగగా అతడు-కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి యున్నాననెను.  యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారముచేసి-నా యేలినవాడు తన దాసునికి సెలవిచ్చునదేమని అడిగెను.''  ఇందునుబట్టి ప్రధాన దూత యెహోవా సైన్యమునకు అధిపతియైన మిఖాయేలు ఇశ్రాయేలీయ సైన్యమునకు అదృశ్యములో నాయకత్వము వహించి వారి పక్షము పోరాడుచుండినట్లుగా మనము గ్రహించాలి.  కనుక ఇశ్రాయేలీయులు పాపము చేయనంతకాలము వారు తక్కువమంది యోధులను కలిగియున్నారు.  వీరు విజయమును పొందగలిగారు.  దీనికి కారణము కేవలము దేవుని సైన్యానికి అధిపతియైన మిఖాయేలు అదృశ్యములో వీరి సైన్యమునకు సహాయపడుట వలన వీరు విజయము పొందారు.  ఇందునుబట్టి దేవుడు ఇశ్రాయేలీయుల పక్షము వహించగా మిఖాయేలు అను ప్రధాన దూత అనగా దేవుని సైన్యములకు అధిపతి కూడ  ఇశ్రాయేలీయులకు అనుకూలముగా క్రియ జరిగించుట జరిగింది.  ఈ మిఖాయేలు ఎప్పుడైతే దేవుని పక్షము వహించాడో, అప్పుడు దేవుని దూత గణములు మొత్తము ఇశ్రాయేలీయుల పక్షము వహించినట్లుగా మనము గ్రహించవలసియున్నది.

        అదే విషయమును ఈ కాలములో దానియేలుకు తెలియజేయుట జరిగింది.  ఇశ్రాయేలీయులైన నీ జనుల పక్షము మిఖాయేలు దూత వహించునని భయపడక దేవుని ఆజ్ఞానుసారము జీవిస్తూ తిరిగి యెరూషలేమును పునరుద్ధరణ కొరకు పాటుపడుమని చెప్పినట్లుగా మనము గ్రహించాలి. 

ముగింపు

        ప్రియపాఠకులారా!  దీనికి ముందు కాలములలో వలె కాక ఈ కాలములో ఇంచుమించు అందరు ప్రవక్తలు క్రీస్తు ప్రభువును గూర్చి ఆయన మానవునిగా జన్మించుటను గూర్చి ప్రవచించారు.  ఈ విధముగా బబులోను కాలములో వీరు సంపూర్ణముగా బానిసలుగా మారినను యెరూషలేము పునరుద్ధరణ జరిగి జరగనట్లుగా కాలము గడచింది.  కాని జనులందరు క్రీస్తు ప్రభువు పుట్టుక కొరకు ఆశగా ఎదురు చూస్తున్నారు.  మెస్సియా అను రాజు వచ్చును.  మనలను రక్షించి అత్యున్నత స్థితిలో మనలను నిలుపునని ఎదురు చూచారు.  వీరి నిరీక్షణ క్రీస్తు పుట్టుక కొరకు కొనసాగింది.  ఈ విధమైన స్థితిలో అనగా తమ దేశమును కోల్పోయిన స్థితిలో మొదలైన ఈ కాలము డెబ్బది సంవత్సరముల తరువాత తిరిగి పునరుద్ధరణ జరిగింది కాని పూర్తి స్థాయిలో నిలువలేక పోయారు.  అలాగే మెస్సియా రాక కొరకు నిరీక్షణలో వీరు ఈ కాలమును పూర్తి చేసారు.

విభాగము - 9

నూతన నిబంధన కాలము

పరిచయము

ప్రియపాఠకులారా! దీనికి ముందు కాలములో మెస్సియా రాక కొరకు ప్రతి ఒక్కరు ఇంచుమించుగా ఎదురు చూచారు, గాని ఈ కాలములో ఆయన వచ్చుట జరిగింది.  ఏ విధముగా?  కన్య మరియ గర్భమును ఎన్నుకొని తన దూత ద్వారా ఆమెకు తెలియజేసి ఆమె ఒప్పుకొనగా ఆమెను సర్వోన్నతుని శక్తి ఆవహించి క్రీస్తు ప్రభుని ఆత్మ ఆ గర్భములో చేరుట జరిగింది.  ఈ విధముగా బేత్లెహేములో పశువుల పాకలో ఈ మెస్సియా జన్మించాడుగాని జనులు అందరు ఆయన కొరకు నిరీక్షించుచున్నారుగాని ఆయనను గుర్తించలేదు.  ఇప్పటికి యూదులు మెస్సియా రాక కొరకు ఎదురు చూచుచున్నారంటే ఆశ్చర్యముగా లేదా! అంటే పుట్టిన క్రీస్తు ప్రభువును వారు మెస్సియాగా గుర్తించలేదు.  అలాగే ఈ కాలములో కూడ జరిగి ఆయనను నిరాకరించారు. ఈ కాలములో దేవుని దూతల ప్రత్యేక కార్యములను గూర్చి తెలుసుకొందము.

90.  బేతెస్ద కోనేరులోని నీళ్లను కదిలించి స్వస్థపరచు దేవదూత

        ప్రియపాఠకులారా!                ఇలాంటి సంఘటనలు నిజముగా జరిగేవా?  అన్న అనుమానము మనకు కలుగవచ్చును.  కాని ఇది వాస్తవ సంఘటనే, ఎందుకంటే క్రీస్తు ప్రభువు కూడ ఈ సంఘటన దగ్గర ఒక అద్భుతము చేసాడు.  దీనిని బైబిలు గ్రంథములో చెరగని రీతిగా వ్రాయుట జరిగింది.  యోహాను 5:2-4, ''యెరూషలేములో గొఱ్ఱెల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బేతెస్ద అనబడిన యొక కోనేరు కలదు, దానికి అయిదు మంటపములు కలవు.  ఆ యా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు.  నీరు కదలింపబడిన పిమ్మట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగు పడును, గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు ఊచకాలు చేతులు గలవారు, గుంపులుగా పడియిండిరి.''          ఇందులో ఒక దేవుని దూత ఈ స్వస్థతకు కారణమగుచున్నాడు.  దీనికి కారణము నరులలో దేవునిపై నమ్మకము కలిగించుటయేగాని దేవుని దూత స్వస్థత కలిగించాలని నిబంధనమేమి లేదు.  క్రీస్తు ప్రభువు కాలమునకు ముందు సుమారు జెకర్యా ప్రవక్త చంపబడిన తరువాత ఇశ్రాయేలీయులలో ప్రవక్తల ఎన్నిక లేదు, ఎందుకంటే క్రీస్తు ప్రభువు తన బోధలో హేబెలు రక్తము మొదలు జెకర్యా చంపబడి రక్తము చిందించినంతవరకు అని గుర్తు చేస్తున్నాడు.  మత్తయి 23:35, ''నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును.''  ఈ జెకర్యా మరణము కొన్ని వందల సంవత్సరముల క్రితము జరిగింది.  ఈ కాలములో దేవుని ప్రవక్తలు లేరు.  కనుక దేవుని గూర్చి బోధించుటకు దేవుడు ఉన్నాడు అని నమ్మకము కలిగించుటకు అద్భుతములు జరిగించువారు లేరు.  కనుక దేవుడు ఇశ్రాయేలీయులలో తన ఉనికి నిలబెట్టుకొనుటకు తాను పరలోకములో ఉన్నానని చెప్పుటకు ఈ క్రియను వారి మధ్య జరిగించుట జరిగింది.  ఇందులో భాగముగా దేవుడు తన దూతను ఈ కోనేటిని కదిలించునట్లును అందులో మొదట దిగినవారికి స్వస్థత కలుగునట్లును ఏర్పాటు చేసాడు.  ఇందువల్ల నరులలో ఒక అద్భుతము వారి మధ్య జరుగుట వలన వారికి తెలియని రీతిగా దేవునిపై నమ్మకమును కలిగియుందురు.  అంటే ఎంతోమంది ఆశగా ఇక్కడ చేరి ఆ స్వస్థత పొందుటకు ప్రయత్నించుచుందురు.  ఈ విధముగా నీళ్లను దేవదూత కదిలించినప్పుడు అందులోకి వెళ్లినవారు అదృష్టవంతులుగా గుర్తించబడుచు దేవుడు అద్భుత రీతిగ నాకు స్వస్థత కలిగించారని చెప్పుకొనుట జరుగును.  దేవుడు తన ఉనికిని నరుల మధ్య నిలబెట్టుకొనుట కొరకే ఇలాంటి అద్భుతములు జరిగించునని మనము గుర్తించాలి.

        ఈ సంఘటన ఎంత కాలముగా జరుగుచున్నదో ఎవరికి తెలియదుగాని క్రీస్తు ప్రభువు కాలములో ప్రతి సంవత్సరము జరుగుచూనే ఉన్నది.  ఎవరైతే మొదటగా ఆ నీళ్లు కదిలినప్పుడు దిగుతారో వారు సంపూర్ణ ఆరోగ్యమును పొందుట జరుగుచుండినది.  ఈ విధముగా మానవాతీతమైన శక్తి ఒకటి ఉన్నదని అందరు దానిని ఒప్పుకొనుటకు మాదిరిగా ఈ విధానమును దేవుడు ఉంచాడు.  క్రీస్తు ప్రభువు కాలములో కూడ ఈ దూత తన కార్యమును కొనసాగించుచూ క్రీస్తు ప్రభువు ఈ బెతెస్థ కోనేటి దగ్గర చేసిన అద్భుతముతో తన యాత్రను ముగించినట్లుగా మనము గ్రహించాలి.

91.  గాబ్రియేలు దూత దైవవర్తమానమును తెచ్చి ఫలానా పేరు పెట్టమని చెప్పుట

        ప్రియపాఠకులారా!                నూతన నిబంధన కాలములో ఇలాంటి రెండు సంఘటనలు జరిగాయి.  వాటిలో ఒకటి యోహాను.  రెండవది యేసు.  ఈ రెండు పేర్ల విషయములో దేవుని దూత మొదటివాడైన యోహానులో తల్లికి, తండ్రికి కనబడి యోహాను అను పేరు పెట్టమని చెప్పుట జరిగింది.  లూకా 1:13, ''అప్పుడా దూత అతనితో - జెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.''  ఈ విధముగా వర్తమానము చెప్పిన విధముగా అనగా గబ్రియేలు అను దూత చెప్పిన విధముగా వారు యోహానుకు యోహానని పేరు పెట్టుట జరిగింది.  లూకా 1:57-63, ''ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీసబెతు కుమారుని కనెను.  అప్పుడు ప్రభువు ఆమెమీద మహాకనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతో కూడ సంతోషించిరి.  ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరునుబట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా తల్లి-ఆలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను.  అందుకు వారు-నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి.  అతడు వ్రాతపలక తెమ్మని - వాని పేరు యోహానని వ్రాసెను; అందుకు వారందరు ఆశ్చర్యపడిరి.''  ఈ విధముగా వారు గబ్రియేలు దూత చెప్పిన ప్రకారము అదే పేరును పెట్టారు.

        అలాగే రెండవవాడైన యేసుక్రీస్తు విషయములో గబ్రియేలు దూత ఆయన తల్లియైన మరియమ్మకు కనబడి పేరును తెలుపుట జరిగింది.  లూకా 1:29-31, ''ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి-ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొను చుండగా దూత-మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి.  ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;''  ఈ విధముగా గబ్రియేలు యేసు అని పేరు తెలియజేయగా యేసుక్రీస్తు ప్రభుని పుట్టుక తరువాత వారు దూత చెప్పిన విధముగా యేసు అని పేరు పెట్టుట జరిగింది.  లూకా 2:21, ''ఆ శిశువునకు సున్నతి చేయవలసిన యెనిమిదవ దినము వచ్చినప్పుడు, గర్భమందాయన పడకమునుపు దేవదూతచేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి.''  ఈ విధముగా పేర్లను దూతలు తెలియజేయగా వారు ఆ దూత చెప్పిన విధముగా జరుగుట వలన దూత ఏ పేర్లు అయితే చెప్పుట జరిగిందో అదే పేర్లను వారికి నామకరణము చేయుట జరిగింది.  ఆ కాలములోనే కాదు ఏ కాలములోనైన ఒక దూత ప్రత్యక్షమై, పలానా పేరు పెట్టుమని చెప్పిన వారు తప్పక ఆ పేరే పెట్టుటకు ఆలోచిస్తారు, ఎందుకంటే వారి తలంపులో ఆ బిడ్డ దైవ ఎన్నికలో ఉండుట వలననే ఈ దూత ప్రత్యక్షత కలిగినదని అనుకొనుట సహజము.  అలాగే యోహాను, క్రీస్తు ప్రభుని విషయములో కూడ దూత చెప్పుట ద్వారా వారు ఇక ఏ ఆలోచన చేయక అదే పేరును వారు ఆ బిడ్డలకు పెట్టుట జరిగింది.  వీరికి ఈ పేరే పెట్టాలి.  వీరి తల్లిదండ్రులు ఈ విధముగా పుట్టబోయే బిడ్డ విషయములో జీవించాలని నిబంధనగా దేవుని నుండి దూతలు వర్తమానము పొంది వారికి తెలియజేస్తున్నారు.  వీరిలో ముఖ్యమైన వార్తావహుడు గబ్రియేలు దూత.  యోహాను, యేసుక్రీస్తుల పేర్ల విషయములో దేవుని నుండి వర్తమానము పొంది వారి తల్లిదండ్రులకు, తల్లికి తెలియజేసాడు.  ఇది తెలియజేయబడినవారు ఈ వర్తమానమును తేలికగా తీసుకొనక అదే పేరు పెట్టుట జరిగింది.  ఏదెనులో నరునికి పేరు పెట్టింది దేవుడే - నారికి పేరు పెట్టింది ఆదామని వ్రాయబడి ఉంది.  సృష్టికి సృష్టములకు నరుని చేత దేవుడు పేర్లు పెట్టించాడు.  అప్పుడే ఆదాము పేరు కూడ నిర్ణయమైంది.

92.  రక్షకుని పుట్టుక దినమున భూమిపై నరుల ముందు పండుగ చేసుకొంటూ ఆ వర్తమానమును నరులకు దేవుని దూతలు తెలియజేయుట!

        ప్రియపాఠకులారా!                రక్షకుని పుట్టుక ప్రతి ఒక్కరు ఆనందించవలసిన విషయమే!  ఇటు నరులు అటు దేవుని దూతలు ఇద్దరికి ఈయనే రక్షకుడు.  కనుకనే వారు దేవునికి స్తోత్రగీతము పాడుట చేసారు.  లూకా 2:8-12, ''ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి.  అయితే ఆ దూత-భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు.  దానికిదే మీ కానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను.''  ఈ విధముగా ఈ దూత (గబ్రియేలు - వార్తావహుడు) సువర్తమానమును తెలియజేయగా - లూకా 2:13, ''వెంటనే పరలోక సైన్యసమూహము ఆ దూతతో కూడనుండి,''  ఈ విధముగా వార్తావహుడైన గబ్రియేలు సువర్తమానమును తెలియజేసిన వెంటనే పరలోక సైన్యసమూహము ఆ దూతతో కూడనుండి దేవునికి స్తోత్రగీతము పాడుచూ నరుల ముందు ఉండి పండుగ వాతావరణమును కలిగించారు.  లూకా 8:14, ''-సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.''  

        అలాగే దూతలందరు ఒక సమూహముగా లెక్కకు మించి వచ్చి ఆ స్థలములో చేరి ప్రభువుయొక్క జన్మ సువర్తమానమును గబ్రియేలు దూత చెప్పుచుండగా వారందరు అమితానందముతో స్తోత్రములు చేసినట్లుగా మనము గ్రహించి పై విధముగా నరులమైన మనము కూడ క్రిస్మస్‌ దినమున దేవునికి స్తోత్రము చేయవలసియున్నది.  ఈ విధముగా రక్షకుని పుట్టుక దినమున దూతల సమూహములన్ని పరలోకము నుండి భూమిపైకి దిగివచ్చి అక్కడ ఆనందముతో స్తోత్రముల మధ్య పండుగ వాతావరణమును నెలకొల్పినట్లుగా మనము గ్రహించాలి.  ఇది జరిగిన తరువాత ఈ దూతలందరు ఈ గొఱ్ఱెల కాపరుల మధ్య నుండి పరలోకమునకు వెళ్లిపోవుట జరిగింది.  లూకా 2:15, ''ఆ దూతలు తమయొద్దనుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొఱ్ఱెల కాపరులు-జరిగిన యీ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించియున్నాడు; మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని.''  ఈ కారణము చేత గొఱ్ఱెల కాపరులు దేవుని సందేశముగా భావించి వారు కూడ వెళ్లి రక్షకుని చూచి దైవకుమారుని పుట్టుకను గూర్చి ప్రచారము చేసారు.  ఈ విధముగా రక్షకుడు భూమిపై పుట్టినప్పుడు దూతల సమూహములు భూమి పైకి వచ్చుట, వర్తమానమును నరులకు తెలియజేయుట, తిరిగి పరలోకమునకు వెళ్లుట జరిగింది.  కాని సాతాను అతని సంబంధి పతనము చెందిన దూతలు మాత్రము ఈ పండుగలో పాల్గొనలేదు, ఎందుకంటే క్రీస్తు ప్రభువుకు వీరు శత్రువులు.  వీరు రక్షకుని పుట్టుక, దూతల సంబరము, నరులకు సువర్తమానమును తెలుపుట చూచి తన ఆధీనములో ఉన్న హేరోదును క్రీస్తు ప్రభువును చంపుటకు పురికొల్పుచున్నాడు.  మత్తయి 2:12-15, ''తరువాత హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి.  వారు వెళ్లినతరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను.  అప్పుడతడు లేచి, రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని, ఐగుప్తునకు వెళ్లి ఐగుప్తులోనుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్తద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడునట్లు హేరోదు మరణమువరకు అక్కడనుండెను.''  ఈ లోకములో రక్షకుడు జన్మించాడంటే ఆనందించాలిగాని చంపుటకు ప్రయత్నించుట ఏమిటి?  

        దీనినిబట్టి దూతలందరు ఆనందోత్సాహములు జరిగించుచుండగా పతనము చెందిన దూతల నాయకుడైన సాతాను మాత్రము క్రీస్తు ప్రభుని చంపాలని ప్రయత్నించి హేరోదును పురికొల్పాడు.  కాని దేవుని దూత యోసేపుకు స్వప్నమునందు కనబడి ఐగుప్తుకు కొనిపొమ్మని తెలుపుట జరిగింది.  ఈ విధముగా క్రీస్తు ప్రభువును ఇశ్రాయేలు దేశము నుండి ఐగుప్తుకు తీసుకొని వెళ్లారు.  అంటే సాతాను హేరోదును ఎంతగా పురిగొల్పాడో మనకు అర్థమగుచున్నది.  ఈ సాతాను అను పతనము చెందిన దూత ప్రేరణకు లొంగిన హేరోదు రెండు సంవత్సరములలోపు మగపిల్లలను బేత్లెహేములోను దాని ప్రాంతాలలో వధించి దానిలో రక్షకుడు చనిపోయాడని తృప్తి చెందాడు.  మత్తయి 2:16, ''ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానులవలన వివరముగా తెలిసికొనిన కాలమునుబట్టి, బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లలనందరిని వధించెను.''  ఇక్కడ సాతానుకు క్రీస్తు ప్రభువు తప్పించుకొన్నాడని తెలుసు.  కాని హేరోదుకు ఈ విషయము తెలియదు.  హేరోదు తాను రక్షకుని చంపానన్న తృప్తితోనే ఉండిపోయాడు.  అంటే క్రీస్తు ప్రభువును ఎప్పుడైతే ఐగుప్తుకు తీసుకొని వెళ్లారో, అప్పుడు సాతాను హేరోదును వదిలివేసాడు, ఎందుకంటే హేరోదు ఐగుప్తునందున్న క్రీస్తు ప్రభువుని ఏమి చేయలేడని వీడికి తెలుసు.  

        కనుక హేరోదు తనని మోసము చేసిన జ్ఞానులపై ఆగ్రహించి రెండు సంవత్సరములలోపు పిల్లలను వధించునట్లు చేసాడు.  సాతాను చంపమన్నది క్రీస్తు ప్రభువును.  సాతాను ఏర్పరచిన తలంపుతో ప్రేరణ పొందిన హేరోదు, సాతాను వానిని వదిలివేసిన తరువాత కూడ తన దుష్ట తలంపును కొనసాగిస్తున్నాడు.  యేసుక్రీస్తును వారిలో కనుగొనలేక అందరిని వధిస్తున్నాడు.  ఈ విధముగా పతనము చెందిన దేవుని దూతలు నరుని తలంపులను ప్రేరేపించి వారిని పురికొల్పుతాయేగాని చేయవలసినది నరులే అని గ్రహించాలి.  నిజదైవములో ఉన్నవారు ఈ తలంపు కలిగినను ఇది దుష్టుడు నుండి వచ్చినదని గుర్తించి దానిని ప్రార్థనతో అణగద్రొక్కునని గ్రహించాలి.  ఈ విధముగా సమస్త దూతల సమూహములు భూమిపైకి వచ్చి నరులకు వర్తమానమును తెలియజేయుట జరిగింది.  అలా వర్తమానమును తెలియజేసిన తరువాత దూతలందరు స్తోత్రములు చెల్లించి తిరిగి భూమిపైనుండి పరలోకమునకు ఎక్కిపోవుట జరిగింది.

        ఈ విధముగా రక్షకుని జన్మదిన వర్తమానమును గాబ్రియేలు దూత కొని వచ్చుటయేగాక రక్షకుడు పుట్టిన తరువాత ఈ లోకములో వీరు ఆనందోత్సాహాలతో తొలి పండుగ జరుపుకొనుచూ రక్షకుని గూర్చిన వర్తమానమును గొఱ్ఱెల కాపరులకు తెలియజేయుట జరిగింది.

93.  దేవుని దూతలు కలలో ప్రత్యక్షమగుట

        ప్రియపాఠకులారా!                బైబిలు గ్రంథములో యెహోషువ, గిద్యోను, సంసోను తల్లిదండ్రులు మొదలైనవారు దేవుని దూతలను ప్రత్యక్షముగా చూచుట జరిగింది.  వారితో స్వయముగా మాట్లాడుట జరిగింది.  ఈ విధముగా ఇంచుమించుగా ప్రవక్తలందరు వారిని చూచారు.  పేతురు వంటి అపొస్తలులు వారిని చూచారు.  కొర్నేలి వంటి నీతిపరులు చూచారు.  ఇక చూడనివారు దైవప్రణాళికలో లేనివారు మాత్రమే.  నేను రెడ్డిపాళెములోని చర్చీ గూర్చి దాని అభివృద్ధిని గూర్చి ఆలోచించుచున్నప్పుడు ఒక దేవుని దూత నా కలలో ప్రత్యక్షమై నన్ను కుంటివారి ఆశ్రమమునకు కొనిపోయి చూపించాడు.  అటుతరువాత వృద్ధులు, అనాధ పిల్లలు మొదలైనవన్ని చూపించి, ఇవన్ని దేవుని ప్రణాళికలో జరుగుచూనే యున్నవి అని చెప్పి, మీరు క్రొత్తదానిని గూర్చి ప్రార్థించి మొదలుపెట్టండని చెప్పి అదృశ్యమైపోయాడు.  ఇందునుబట్టి ఏదో ఒక క్రొత్త లేక నూతన ప్రణాళిక రెడ్డిపాళెములో జరగబోవుచున్నదని నాకు అర్థమైంది.  దేవుని ప్రణాళిక నెరవేర్పు కొరకు మరి కొంతకాలము వేచి చూడవలసియున్నది.  ఇది తప్పక నెరవేరుతుంది.  కాని కాలములు, సమయములు మన వశములో లేవుగాని దేవుని వశములో ఉన్నాయి.  కనుక మనము జాగరూకులమై ప్రార్థన చేసి ఆ సమయము కోసము సిద్ధముగా ఉండి దావీదు యెరూషలేము దేవాలయము కోసము సమకూర్చినట్లుగా మనము కూడ సమకూర్చుచూ దేవుని ఆజ్ఞ కోసము ఎదురు చూడాలి.  నా కలలో దేవుని దూత ప్రత్యక్షమై అన్నింటిని నాకు చూపించి క్రొత్తదాని కొరకు ప్రార్థించి మొదలుపెట్టమని చెప్పుటను బట్టి, దేవుని ఆజ్ఞ ఇచ్చెనని మనకు అర్థమగుచున్నది.  కాని ఆ ఆజ్ఞ ఏ దానిని గూర్చి చెప్పెనో నాకు అర్థము కాలేదు గనుక ప్రార్థన చేయమని చెప్పాడు.  ఏది ఏమైనప్పటికి దేవుడు త్వరలో రెడ్డిపాళెము చర్చీ ద్వారా మరో అద్భుతమైనది నూతనమైన ప్రణాళికను కొనసాగించబోవుచున్నట్లుగా మనము గ్రహించాలి.  అందుకోసము ప్రార్థించి ఓర్పుతో పరీక్షించవలసియున్నదని మనము గ్రహించాలి.

        అలాగే బైబిలు గ్రంథములో కూడ దేవుని దూత యొక్క ప్రత్యక్షతను కలలో పొందినవారు ఉన్నారు.  వీరిలో ప్రముఖుడు యోసేపు.  మత్తయి 1:18-25, ''యేసుక్రీస్తు  జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను.  ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.  అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై-దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది; ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.  ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును  ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను.  ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.  యోసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి, తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను.''  మరియ కుమారుని కను వరకు ఆమెతో శారీరకముగా దాంపత్య సుఖమును యోసేపు పొందనట్లును, మరియ శిశువును కన్న తర్వాత ఆమెతో శయనిస్తూ యాకోబు యోసేపు యూదా అను పేరు గల ప్రభువు సహోదరులను కనినట్లును వారేగాక కొంతమంది ఆడ శిశువులకు జన్మనిచ్చినట్లు చెప్పుకొనువారు - తప్పక నాచే విరచితమైన ''నా ప్రభువు తల్లి'' అను గ్రంథము చదివి తమ సంశయాలను తీర్చుకోగలరు.  

        ఈ విధముగా యోసేపు తనకు కలిగిన అనుమానమునకు ప్రభువు దూత ద్వారా నివృత్తి చేసుకొన్నది కలలోనే.  ఈ యోసేపుకు కలలో దేవుని దూత ప్రత్యక్షము కాగా, ఆ దూత చెప్పిన దానిని నిద్రలో నుండి మేల్కొన్న తరువాత పాటించాడు.  అలాగే రెండవసారి హేరోదు బాలయేసును చంపాలని ప్రయత్నించినప్పుడు కూడ కలలోనే యోసేపుతో దేవుని దూత అనగా ప్రభువు దూత మాట్లాడుట జరిగింది.  మత్తయి 2:13-15, ''వారు వెళ్లినతరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను.  అప్పుడతడు లేచి, రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని, ఐగుప్తునకు వెళ్లి ఐగుప్తులోనుండి నా కుమారుని పిలిచితిని  అని ప్రవక్తద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడునట్లు హేరోదు మరణమువరకు అక్కడనుండెను.''  అలాగే హేరోదు చనిపోయిన తరువాత కూడ ప్రభువు దూత యోసేపుకు కలలో ప్రత్యక్షమై తిరిగి ఇశ్రాయేలు దేశమునకు ఐగుప్తు నుండి వెళ్లమని చెప్పుట జరిగింది.  మత్తయి 2:19-21, ''హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులోయోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై -నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని, ఇశ్రాయేలు దేశమునకు వెళ్లుము; శిశువు ప్రాణము తీయజూచుచుండినవారు చనిపోయిరని చెప్పెను.  అప్పుడతడు లేచి, శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను.''  ఈ విధముగా దేవుని దూత యోసేపు అను నీతిమంతునితో కలలోనే మాట్లాడుచున్నాడు.  అయితే యోసేపు దేవుని దూత కలలో మాట్లాడుటను తేలికగా తీసుకొనక దానిని దేవుని ఆజ్ఞగా భావించి కలలో చెప్పబడిన ప్రకారము జరిగించి దైవకుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకే బాల్య కాలములో రక్షకునిగా మారాడు.  అలాగే దైవకుమారునికి సేవ చేసుకొను భాగ్యమును పొందాడు.

        అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఒక్కడుగానే ఉండక కుమారుడని పరిశుద్ధాత్మయని ముగ్గురుగా పిలువబడుటలో ఏమని విమర్శించాను.  ఆరోజు రాత్రి కాలములో స్వప్నములో నిర్మలముగా ఉన్న ఆకాశ విశాలములో సింహాసనాసీనుడైన ఒకనిని చూచితిని.  సింహాసనము నాకు కనబడలేదుగాని సింహాసనము మీద కూర్చున్నట్లుగానే ఉన్నాడు.  ఆయన ముఖము నిశ్చలముగా ప్రకాశముగా ఆప్యాయతగా నా వైపే చూస్తూ ఉన్నట్లున్నాడు.  నేను భూమిమీద రెడ్డిపాళెంలో నేను నిర్మించిన రేకుల షెడ్డులో నేను నిలబడియున్నాను.  విగ్రహము లేదు.  నాకెదురుగా ఒక మహా సముద్రము ఉన్నది.  ఆ సముద్రపు నీళ్లు నా పాదాలును ముంచివేశాయి.  ఆ అగాధ సముద్ర జలరాశిలో నుండి ఒక చిన్న కొండవలె నున్న ఏనుగు గబా గబా అడుగులు వేస్తూ ఒడ్డునకు నా వైపు చూస్తూ వస్తున్నది.  కాని నేను ఏ భయానికి లోనుగాక ఆకాశములో ఆసీనుడైయున్న ఆయన ముఖమునకు ఆకర్షితుడనై చూస్తుండగా ఆయన శిరస్సు యొక్క ఇరువైపుల నుండి ఒకే రూపు ఒకే తేజస్సు ఒకే ముఖకవళికలుగల మానవ రూపము ఆయన శిరస్సును వదలి పెట్టకనే నావైపు చూస్తూ వెలుపలికి వచ్చి మరల లోపలికి వెళ్లుచు ఆ రెండు రూపములు చలాకీగా ఆయన శిరస్సు లోపల నుండియే అటు ఇటు  మారుచూ వెలుపలికి రావడం నన్ను చూడడం మరల లోపలికి వెళ్లటం నేను బాగా గమనించాను.  ఆ తదుపరి మెలకువ వచ్చి ఈ విధముగా ఆలోచించాను.  తండ్రియైన దేవుడు ఒక్కడేయనియు మానవ రక్షణార్థమై తన ఆత్మ నుండి కుమారుని పరిశుద్ధాత్మను మరి రెండు రూపాలుగా జేసి నరుల మధ్య క్రియ జరిగిస్తూ - మరల తండ్రి యందు విలీనమగుచున్నారని గ్రహించాను.  యోహాను 10:9-10లో వలె కుమారుని ద్వారా మనము నడిపింపబడితే ప్రభువు తన తండ్రిలో ప్రవేశించినట్లుగానే మనలను ప్రభువుతో కూడ పరమాత్మలో ఐక్యమై ఆయన బల్లమీద మేత మేస్తూ ఆయనతో కూడ వెలుపలికి వచ్చి సంచరిస్తు వేరుపడని బంధముతో సంచరిస్తామని ఆ సంచారమన్నది ఆకాశ మహాకాశాలలో దూత గణములతో ఆనంద గానములతో పరమాత్మ యొక్క ప్రత్యక్షతలతో లక్షలాది సంవత్సరాలు గడుస్తున్నను కాలమే తెలియరాని స్థితిలో జీవాత్మ ప్రభువు ద్వారా పరమాత్మలో సకల ఐశ్వర్యాలు అనుభవిస్తున్నది.

        ఈ విధముగా దేవుని దూత అందరికి కనబడదు.  ఎవరైతే దైవప్రణాళికలో ఉన్నారో ఎవరితోనైతే పని జరగవలసియున్నదో వారికి మాత్రమే దేవుని దూత దేవుని ఆజ్ఞ ప్రకారము కల ద్వారా గాని, ప్రత్యక్షముగా గాని ప్రత్యక్షమై చేయవలసిన పనిని తెలియజేయునని మనము గ్రహించాలి.  యేసు ప్రభువును మరియమ్మ పరిశుద్ధాత్మ ప్రేరణతో సర్వోన్నతుని శక్తి కమ్ముకొనగా గర్భవతి అయినది.  ఈ సంగతిని గబ్రియేలు అను దేవుని దూత మరియమ్మకు తెలియజేసాడు.  మరి రాబోవు ఆపదను యోసేపునకు కాక మరియమ్మకే తెలుపకూడదా!  ఎందుచేత యోసేపుకు తెలియజేయ బడింది?  కన్య మరియమ్మ దైవప్రణాళికలో యేసుక్రీస్తు ప్రభువు భూమిపైకి వచ్చుటకు ఒక మార్గముగా ఎన్నికైనది కనుక ఈ ప్రణాళికలో కన్య మరియమ్మ సమ్మతము కావాలి.  దేవుడు ఎవరైతే తాను చెప్పినదానిని ఒప్పుకొంటారో వారి ద్వారా మాత్రమే తన ప్రణాళికను నెరవేరుస్తాడు.  లూకా 1:37-38, ''దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను.  అందుకు మరియ-ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను.  అంతట దూత ఆమెయొద్దనుండి వెళ్లెను.''  ఈ విధముగా గబ్రియేలు దూత తెలియజేసిన దేవుని ప్రణాళికకు మరియమ్మ తన సమ్మతిని తెలియజేసిన తరువాత దూత వెళ్లిపోయాడు.  అలాగే యోసేపునకు దైవ ప్రణాళికలో యేసుక్రీస్తు ప్రభువును రక్షించాలి.  ఒక ప్రాంతము నుండి మరియొక ప్రాంతమునకు తీసుకొని వెళ్లాలి.  ఈ పని యోసేపు వలన అగును గనుక దేవుడు యోసేపుకు కలలో దేవుని దూత యొక్క ప్రత్యక్షతను కలిగించి తాను చేయవలసిన పనిని తెలియజేయుట జరిగింది.  ఈ విధముగా దేవుడు తన దూతల ద్వారా తన ప్రణాళికలో ఉన్నవారికి తెలియజేస్తాడు.  అలాగే నాకు కలలో చెప్పబడినది కొంతమట్టుకే!  ఏదో ఒక నూతనమైనది రెడ్డిపాళెములో మొదలుపెట్టాలి.  ఈ మొదలుపెట్టేది నేను కాదు గనుక అది ఏమైనది నాకు తెలియజేయలేదు.  దీనిని జరిగించువారు వేరేవారు ఉంటారు.  వారిని దేవుడు ప్రేరేపించి వారి ద్వారా నూతన ప్రణాళికను అక్కడ జరిగిస్తాడు అని మనము అర్థము చేసుకోవాలి.  నాకు కలిగిన సంశయమును కలలో దూత ప్రత్యక్షమై తీర్చుట జరిగింది.  ఇక జరిగించు ప్రణాళిక కొరకు మనము ప్రార్థించాలి.  ఇలా దేవుని ప్రార్థించిన ఆ ప్రణాళిక కొరకు ఎన్నికైనవారిని ప్రేరేపించి వారి ద్వారా దానిని పూర్తి చేస్తాడు.  అప్పుడు ఆ నూతన ప్రణాళిక ఎలాంటిదో నేను నా కళ్లతో చూచి దేవుని స్తుతించు అవకాశము దేవుడు మనకు కలిగిస్తాడు.  ఈ యొక్క నిరీక్షణతో నేను జీవించాలి.  అంతేగాని అన్ని సంగతులు ఒక్కరికే దేవుడు తెలియజేయాలన్న నిబంధన లేదు.  దేవుని ప్రణాళికలో ఎవరి భాగము వారికి తన దూత ద్వారా తెలియజేస్తారని మనము గ్రహించాలి.  1 కొరింథీ 12:4-11.

        ఈ విధముగా యోహానుకు కలలో ప్రత్యక్షమై చేయవలసిన కార్యములను గూర్చి తెలియజేసి రక్షకునికే రక్షణ దయ చేసినట్లుగా మనము ఈ దూతల విషయములో గ్రహించాలి.

94.  క్రీస్తు ప్రభువు దేవుని దూతల స్వభావమును ధరించుకొని పుట్టలేదు

        ప్రియపాఠకులారా!                దేవుడు మానవజాతిని ఎంతో ప్రేమించెను అని బైబిలు గ్రంథములో వ్రాయబడియున్నది.  యోహాను 3:16, ''దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.  కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్ర హించెను.''  ఒకసారి మనము గమనించవలసిన అవసరత ఇందులో ఉంది.  అదేమిటంటే దేవదూతలలో పాపము చేసినవారు ఉన్నారు.  నరులలో పాపము చేసినవారు ఉన్నారు.  అలాగే దేవదూతలలో పరిశుద్ధులు ఉన్నారు.  నరులలో కూడ పరిశుద్ధులు ఉన్నారు.  కాని దేవుడు తన కుమారుని దేవదూతలలో పాపము చేసినవారి కొరకు పంపించక ఈ లోకములో సకల మానవజాతి రక్షణ కొరకు పంపించారంటే మనపై దేవునికి ఉన్న ప్రేమ ఎంత అపారమైనదో మనకు అర్థమగుచున్నది.  దేవుని దూతలలో పాపము చేసి పతనము చెందినవారి కొరకు దేవుని కుమారుడు దేవుని దూతగా దూతల మధ్య జన్మించలేదు.  అలాగే వారి కొరకు సిలువ బలియాగము చేయలేదు.  కాని సకల మానవజాతి కొరకు ఈ లోకములో మనుష్య స్వభావమున జన్మించి మనకొరకు తన ప్రాణమును త్యాగము చేసి తన ప్రేమ మనపై అపారమని తెలియజేయుట జరిగింది.

        హెబ్రీ 2:14-16, ''కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింప జేయుటకును, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.  ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు.''  ఇందులో క్రీస్తు ప్రభువు కేవలము అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నట్లుగా చెప్పబడింది.  ఇంతకి అబ్రాహాము సంతానము ఎవరు?  ఆయన విశ్వాసులకు తండ్రి కదా!  గలతీ 3:7, ''కాబట్టి విశ్వాససంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి.''  కనుక క్రీస్తు ప్రభువునందు విశ్వాసము కలిగియున్న మనము కూడ అబ్రాహామునకు సంతానము లేక పిల్లలమే కదా!  ఇందునుబట్టి క్రీస్తు ప్రభువు మనవలె స్త్రీ నుండి గాక కన్యక నుండి ఈ భూమిపై పుట్టాడు.  సర్వోన్నతుని ఆత్మ ఆయన జన్మకు కారణమైనను కన్య మరియమ్మ శరీరము అబ్రాహాము సంతాన స్వభావమును ఆయనకు ఇచ్చుట జరిగింది.  కనుక దేవుడు మనలను ఎంతగానో ప్రేమించెను అనుటకు ఇది ఒక నిదర్శనము.  కనుక దేవుని దూతలలో తప్పు చేసినవారి నిమిత్తము ఆయన వారి కొరకు జన్మించలేదు గాని నరులమైన మనకొరకు ఆయన జన్మించుట జరిగింది.

95.  ఈ లోకసంపద ఆహారమే మనలను జీవింపజేయునని ప్రేరేపించు పతనము చెందిన దూతయైన సాతాను

        ప్రియపాఠకులారా!                రక్షకునికి ముప్పది సంవత్సరములు గడచిన తరువాత క్రీస్తు ప్రభువు ఈ లోకములో తన రాజ్య స్థాపన కొరకు ముందుగా బాప్తిస్మము తీసుకొని అపవాది శోధనకు లోనైనాడు.  ఈ శోధనలో ఇప్పుడు మనము తెలుసుకోబోవుచున్నది మొదటిది.  ఈ లోకములో జీవిస్తున్న మనము కేవలము ఆహారము ద్వారా మాత్రమే జీవిస్తున్నామన్న తలంపు ఉంటుంది.  కాని తినటానికే మనము బ్రతకాలని, సుఖభోగాలు అనుభవించుటయే మన ధ్యేయమన్న తలంపు మాని బ్రతకడానికే తింటున్నామన్న ఆలోచన మంచిది.  ఈ తలంపు వలన రేపటి మన పరిస్థితి ఏమిటని తెగ ఆలోచిస్తుంటాము.  దాని కోసము ధన సంపదలను కూడబెట్టుచున్నాము.  ఇదే స్థితిని పతనము చెందిన దూతలలో అగ్రగణ్యుడైన సాతాను నరులందరిని ప్రేరేపించి ఈ లోకములో ధనవంతులు, పేద అను తారతమ్యము కలిగించాడు.  నరుల హృదయములో సంపద లేకపోతే జీవించుట కష్టమన్న ప్రేరణ కలిగించి, అందుకోసము నరులను తెగ ప్రయాసపడువారిగా చేయుచున్నాడు.  ఇంతవరకు బాగానే ఉన్నది, ఇదే సంపద కోసము కష్టపడి నీతిగా సంపాదించక పరుల సొమ్ము కోసము వ్యసనపడువారుగా చేయుచున్నాడు.  ఇతరులకు చెందవలసిన ఆస్తులను తన ఆస్తులుగా మార్చుకొని వారికి ఏమి దక్కనీయక తాను జీవించినంత కాలము తన ఆధీనములో ఉంచుకొని తన స్వంతవారి కొరకు ఖర్చు పెట్టుకొంటూ సోమరిపోతులై జీవించువారు ఉన్నారు.  దానివల్ల ఆ సంపదకు చెందవలసినవారు ఎన్ని బాధలు పడుచున్నారో వీరు గుర్తించరు.  వీరికి కాలసినది కేవలము తమ స్వార్థము మాత్రమే!  దీనికి కారణము వీరిలో ఉన్న స్వార్థము  దీనికి తోడు వారిని ప్రేరేపించు సాతాను.  ఇలా నరులను వారి దైనందిక ఆహారము కొరకు ప్రేరేపించి వారిని పతన మార్గములోనికి నడిపించుచున్నది.  ఇందులో సాతాను అదృశ్యములో ఉండి దృశ్యమైన నరులను ప్రేరేపించగా వీరు దృశ్యములో కష్టపడి నీతిగా సంపాదించి బ్రతుకవచ్చును.  ఇలా జీవించువారు పాపము చేసినట్లుగా లెక్కకు రాదు.  కాని ఎవరైతే సాతాను ప్రేరణకు తగ్గట్టుగా సంపదను సమకూర్చుకొంటూ, అందుకోసము పైన చెప్పబడిన విధముగా వేరే వాని సంపదను దోచుకోవాలని తలంచుదురో వారు పాపము చేయుటకు సిద్ధపడిన వారి క్రిందకు లెక్కించబడుదురు.  ఈ తలంపు నుండి వెనుదిరిగి ఇది దేవుని ఆజ్ఞకు వ్యతిరేకమైనదని తలంచి దానిని జరిగించకున్న యెడల నీతిమంతునిగానే లెక్కించబడుదురు.  కాని ఈ తలంపు ప్రకారము జీవిస్తూ సాధ్యమైన చోట అన్యాయపు సొమ్ము కోసము తమ వారితోను తమ చుట్టు నివసించువారితోను తగవులాడుచు వారి సంపదను తమ సంపదగా చేసుకొని జీవించువారు పాపులే అని గుర్తించాలి.  వీరు సాతాను ప్రేరణతో ఈ స్థితిని పొందినట్లుగా మనము గ్రహించాలి.

        1 రాజులు 21:1-3, 6-10, 17-19, ''ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలువాడైన నాబోతునకు ఒక ద్రాక్షతోట కలిగియుండగా అహాబు నాబోతును పిలిపించి-నీ ద్రాక్షతోట నా నగరును ఆనుకొని యున్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటె మంచి ద్రాక్షతోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైనయెడల దానిని క్రయమునకిమ్మని అడిగెను.  అందుకు నాబోతు-నా పిత్రార్జితమును నీ కిచ్చుటకు నాకు ఎంతమాత్రమును వల్లపడదని చెప్పగా  . . .  అతడు ఆమెతో ఇట్లనెను-నీ ద్రాక్షతోటను క్రయమునకు నాకిమ్ము; లేక నీకు అనుకూలమైనయెడల దానికి మారుగా మరియొక ద్రాక్షతోట నీ కిచ్చెదనని, యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా అతడు-నా ద్రాక్షతోట నీ కియ్యననెను.  అందు కతని భార్యయైన యెజెబెలు-ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్యపరిపాలనము చేయుటలేదా?  లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండుము; నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోట నీకిప్పించెదనని అతనితో చెప్పి అహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి, ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను.  ఆ తాకీదులో వ్రాయించిన దేమనగా-ఉపవాసదినము జరుగవలెనని మీరు చాటించి నాబోతును జనులయెదుట నిలువబెట్టి -నీవు దేవునిని రాజును దూషించితివని అతనిమీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన యిద్దరు మనుష్యులను సిద్ధపరచుడి; తీర్పు అయినమీదట అతని బయటికి తీసికొని పోయి రాళ్లతో చావగొట్టుడి.  . . .  అప్పుడు యెహోవావాక్కు  తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను -నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలురాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము, అతడు నాబోతుయొక్క ద్రాక్షతోటలో ఉన్నాడు; అతడు దానిని స్వాధీనపరచు కొనబోయెను.  నీవు అతని చూచి యీలాగు ప్రకటించుము-యెహోవా సెలవిచ్చునదేమనగా-దీని స్వాధీన పరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివిగదా.  యెహోవా సెలవిచ్చునదేమనగా-ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే క్కులు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను.''  ఈ విధముగా పరులకు చెందిన దానిని ఆశించుట జరిగింది.  అహాబు రాజు తాను ఎంత స్థితిమంతుడైనను ఆశ చావలేదు.  సాతాను ఈ ఆశను ఆసరా చేసుకొని వానిని తప్పుద్రోవ పట్టించి వానిచే నాబోతు హత్యకు కారణమగునట్లుగా చేయగలిగాడు.  ఈ విధముగా మన బంధువులలోనే అనేకులు ఉన్నారు.  వీరు తాతల కాలము నాటి ఆస్తులను వారి ఆధీనములో ఉంచుకొని దానికి వారసులైనవారికి ఇయ్యకుండ వారే అనుభవిస్తూ, మిగిలినవారిని దూషించి వారికి ఆ వారసత్వముగా లభించవలసిన సంపదను వారికి రానియ్యకుండ తమ ఆధీనములో ఉంచుకొనుట చేస్తారు.  దేవుడు వీరి కొరకు ఈ నాబోతు జీవితమును వ్రాయించియున్నాడు.  నిన్ను దేవుడు కరుణించాడు, అయినను నీవు పరులకు చెందవలసినదానిని నీ ఆధీనములో ఉంచుకొంటున్నావు కనుక అహాబు రాజుకు వచ్చిన పరిస్థితి నీకు కలుగునని ఇందులో హెచ్చరిస్తున్నాడు.  అహాబు రాజు నాబోతు హత్యకు కారణమైయ్యాడు.  కనుక తన చావు కూడ శునకములు నాకు పరిస్థితి వచ్చింది.  అలాగే మనలో కొందరు మిగిలినవారికి దక్కవలసిన వాటిని స్వాధీనపరచుకొని జీవించుట మూలముగా మిగిలినవారి యెడల అన్యాయము చేస్తున్నారు.  కనుక ఇలాంటివారు ఏ అన్యాయమైతే చేసారో అదే స్థితిని దేవుడు వారికి కలిగిస్తానని చెప్పుచున్నాడు.  కనుక మీ జీవితములను ఒకసారి పరిశీలించుకొని మీరు ఇలాంటి పొట్ట కూటి కోసమో, సంపద కోసమో చేయక జీవించాలని కోరుకొనుచున్నాను.  కనుక ఇలాంటి స్థితి మీలో ఎవరైన ఉంటే ముందుగా సాతాను తలంపు ద్వారా ఈ పని చేస్తున్నామని గ్రహించి అలాంటి స్థితి నుండి దూరమై దేవుని ఆజ్ఞలకు బద్ధులమై, జక్కయ్య చెప్పిన విధముగా రెండంతల సొమ్మును వారికి ఇచ్చి, ఆ పాపము నుండి బయటపడవలసినదిగా ఈ పుస్తకము ద్వారా మిమ్ములను హెచ్చరిస్తున్నాను.

        అలాంటి ఆలోచననే సాతాను శోధకునిగా వచ్చి క్రీస్తు ప్రభువుని కూడ సాధారణ నరులను శోధించినట్టుగా శోధించాడు.  మత్తయి 4:1-3, ''అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను.  నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చి-నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను.''  ఈ విధముగా ఒక సవాలును విసరినాడు.  ఇందులో నీవు దేవుని కుమారుడవైతే అని ప్రశ్నిస్తున్నాడు.  ఇందులో రాళ్లను రొట్టెలుగా మార్చమని సాతాను అను పతనము చెందిన దూత శోధకునిగా వచ్చి అడుగుచున్నాడు.  ఇక్కడ ఒక సంగతి మనము గుర్తించాలి.  క్రీస్తు ప్రభువు రొట్టెలుగా రాళ్లను మార్చకపోతే నీవు దేవుని కుమారుడవు కావు అన్న విధముగా అడుగుచున్నాడు.  మన సమాజములో చాలామంది నీవు నిజముగా మగవాడివైతే ఈ పని చేసి చూపించు లేక నీవు నిజముగా ఆడదానివైతే చేసి చూపించు అని అడుగుచుంటారు.  ఆ పని చేయకపోతే!

        అలాగే శోధకుడు ఇలాంటి వారి వలె వచ్చి దైవకుమారుని నీవు నిజముగా దైవకుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమన్నాడు.  అందుకు - మత్తయి 4:4, ''అందుకాయన -మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటినుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.''  ఈ విధముగా క్రీస్తు ప్రభువు సమాధానము చెప్పుట జరిగిందేగాని సాతాను శోధకునిగా ప్రేరేపించిన విధముగా ఆయన రోషమునకు పోలేదు.  దేవుని కుమారుడనని నిరూపించుకొనుటకు రాళ్లను రొట్టెలుగా మార్చలేదు.  ఇందునుబట్టి మనము గ్రహించవలసిన దేమిటంటే దేవుని నోటినుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని గ్రహించాలి.  అంటే క్రీస్తు ప్రభువు - ''నరులు దేవుని మాట వలన మాత్రమే జీవిస్తున్నారని తెలియజేస్తున్నాడు.  ఎలా?  మన చుట్టు ప్రక్కలవారిలో ఏ విధముగా నరులు మరణించుచున్నారో ఒక్కసారి గ్రహించండి.  వీరు ఆశ్చర్యకర రీతిలో మరణిస్తుంటారు.  వీరికి ఎంత తిండి పెట్టినను వీరి చావును ఆపలేము.  కేవలము దేవుని నోటినుండి వచ్చు మాట మాత్రము వారిని జీవింపజేస్తుంది.  అంటే నరుని చుట్టు తాను జీవించుటకు కావలసిన సమస్తమును దేవుని నోటినుండి కలిగిన మాట ద్వారా మాత్రమే కలిగినట్లుగా మనము ఆదికాండములో మొదటి అధ్యాయములో చదువగలము.  ఇవి అన్ని నరుని జీవింపజేయుటకు క్రియ జరిగిస్తున్నాయి.  అంతేగాని ఒక్క రొట్టె వలన మాత్రమే జీవించుట జరుగదు అని సాతానుకు తిరిగి బోధించుట చేస్తున్నాడు.  ఈ విధముగా దేవుడు రాళ్ల నుండి రొట్టెలను తయారుచేసి తనకు సంపదగా కూర్చుకొనలేదని గ్రహించాలి.  ఇలాంటి ఆహారము కోసము స్వార్థముగా జీవించవలసిన అవసరత లేదని క్రీస్తు ప్రభువు ఈ వచనము ద్వారా మనకు తెలియజేయుచున్నాడు.  మనుష్యులకు ఆహారము అవసరమేగాని ఆహారము మాత్రమే మనుష్యులను బ్రతికించదని గ్రహించాలి.  దేవుని మాటల ద్వారా ఏర్పడిన సమస్తము సవ్యముగా మన యెడల క్రియ జరిగిస్తేనే మనము జీవించగలమని గ్రహించాలి.  శరీరములోని ఏ అవయవము చెడిన అది ఇక పనికిరాదు మనము జీవించుట అసంభవముగా మార్చును.  అలాంటి స్థితిలో దేవుని మాటేగాని రొట్టె వానిని జీవింపజేయదు.  కనుక దేవుని మాటను మనము కలిగియున్నట్లయితే ఆ మాట మన పక్షము ఉన్నంతకాలము మనకు ఏ కొదవ లేకుండ జీవించగలుగుదుము.  కనుక ఇలాంటి సంపద లేక రొట్టె కోసమును, పరుల సంపదల కోసము ఆశించక నీతిగా దేవుని మాట కొరకు జీవించాలని మనము గ్రహించాలి.  2 రాజులు 5:26 గేహాజీ అబద్ధమాడి ఆస్థిని సంపాదించుకొని ఎలీషా వద్దకు వచ్చినప్పుడు ఎలీషా అతనితో ఎడ్లను దాసదాసీ జనాన్ని సంపాదించుకొనుటకు ఇది సమయమా?  అని వానితో చెప్పి నయమానుకు నయమైన కుష్ఠురోగము నీకును నీ ఇంటివారికిని సదాకాలము నిలిచి యుండునని శపించాడు.  లూకా 9:25 ప్రభువు ఇట్లనుచున్నాడు ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము?  

96.  దేవుని శోధింపమని ప్రేరేపించు పతనము చెందిన దేవుని దూత

        ప్రియపాఠకులారా!                శోధన పరిశోధన అనునవి రెండు రకములు.  శోధించు వాడు శోధకుడు.  వీడు సాతానని వ్రాయబడియున్నది.  మత్తయి 4:1-3, ''అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను.  నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చి-నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను.''  ఈ విధముగా శోధించువాడిని శోధకుడని పిలువబడుచున్నాడు.  ఈ శోధకుడు సాతాను.  ఈ సాతాను పతనము చెందిన దేవుని దూత.  వీడు దేవునితో సమానముగా తనని తాను ఊహించుకొని పతనమైనవాడు.  కాని దేవునిచే శోధించువానిగా ఏర్పాటు చేయబడ్డాడు.  కనుక వీడు నరులను శోధించుచున్నాడు.  ఈ శోధన నరులకు వారి వారి దురాశల చొప్పున వచ్చునని చెప్పబడియున్నది.  యాకోబు 1:14, ''ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.''  ఈ విధముగా ఒక్కొక్క నరుని వారి వారి దురాశలకు లోను చేసి వారిని శోధించును.  ఈ శోధనను దేవుడు జయించమని నరులకు తెలుపుచున్నాడు.  ఈ శోధనను జయించినవారు సాతానును జయించినవారి క్రిందకు లెక్కించబడుదురు.  ఇలాంటి సాతాను నరులను శోధించుచూనే దేవుని శోధించమని ప్రేరేపించును.  ఎలా?  తాను ఏర్పరచుకున్నవారిచే మనలను ప్రేరేపిస్తూ నీవు నిజముగా దైవసేవకుడవైతే నీవు పలానా పని చేసి పెట్టు అని చెప్పుచున్నాడు.  అలాగే ఒకసారి నేను వార్తాపత్రికలో చదివాను.  ఒకడు దానియేలు చరిత్రలో సింహముల బోనులో ఉన్నను దానియేలుకు ఏ నష్టము జరగలేదు అని చెప్పి తాను సింహమున్న బోనులోకి వెళ్లి దేవుని ప్రార్థించి దాని నోరు మూయింపుమన్నాడు.  ఇది దేవుని శోధించుట.  ఈ ఆలోచన సాతాను నుండి వచ్చినదేగాని దేవుని నుండి వచ్చినది కాదు.  అలాగే మత్తయి 4:5-6, ''అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి -నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము -ఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను.''  ఇందులో ఈ శోధకుడు అను పేరుగల అపవాది అను పతనము చెందిన దేవుని దూత క్రీస్తు ప్రభువును శోధిస్తూ-ఈ దేవాలయ శిఖరమున నుండి క్రిందికి దుముకుము అని చెప్పుచూనే-నీవు దేవుని కుమారుడవైతే దేవుడు తన దూత ద్వారా నిన్ను ఎత్తి పట్టుకొనునని  చెప్పుచున్నాడు.  అంటే దేవాలయ శిఖరముపై నుండి దూకకపోతే క్రీస్తు దేవుని కుమారుడు కాడా!  దేవుని కుమారుడు ఎప్పటికి దేవుని కుమారుడే.  కాని సాతాను శోధించుటకు వచ్చినప్పుడు దూషణకర పరుషమైన మాటలతో శోధిస్తాడు.  అంటే నీవు నిజమైన దైవసేవకుడవైతే నీ చేతిని నిప్పులలో పెట్టు అది కాలదు అంటాడు.  ఇందులో మనము ప్రకటించవలసినది - చేతిని నిప్పులో పెట్టిన కాలకపోతే నిజమైన దైవసేవకుడా?  పెట్టకపోతే దైవసేవకుడు కాడా?  నిజమైన దేవసేవకుడని ఏ విధముగా నిర్ణయిస్తారు?  నిప్పులో చేతులు పెట్టితేనా లేక పెట్టకపోతేనా!  

        అలాగే మత్తయి 4:5-6 లో శోధకుడైన పతనము చెందిన దేవుని దూత క్రీస్తు ప్రభువుతో నీవు దేవుని కుమారుడవైతే దేవాలయ శిఖరము నుండి క్రిందికి దూకుము, దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి నీ పాదములకు రాతి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురని చెప్పుచున్నాడు.  అంటే క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడని నిరూపించుకొనుటకు దేవాలయ శిఖరము నుండి క్రిందకి దూకాలా!  అలా దూకకపోతే ఆయన దేవుని కుమారునిగా లెక్కించబడడా?  కుమారత్వము అనునది జన్మతః వచ్చునది.  అంటే లూకా 1:35, ''దూత-పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.''  దేవుని కుమారుడు అని చెప్పుటకు లూకాలో చెప్పినది సాక్ష్యముగాని, దేవాలయ శిఖరము నుండి దూకుట కాదు!  నాకు పుట్టిన కుమారులతో ఒకడు నీవు నిజముగా నీ తండ్రికి పుట్టి ఉంటే నీవు పలానా పని చేయగలవు అంటే రక్త సంబంధము ఆ పని పైన ఎలాగున ఆధారపడదో అలాగే దేవాలయ శిఖరము నుండి దూక నవసరత లేదు.  క్రీస్తు ప్రభువు ఏమి చేసినను ఆయన జన్మ దేవుని ఆత్మ ద్వారా జరిగినది కనుక ఆయన దేవుని కుమారుడే!  ఇందులో ఎటువంటి మార్పు లేదు.  అలాగే నిజదైవసేవకుడు అను మాటను వానిలోని భక్తిని బట్టి వస్తుంది.  అంటే మనుష్యునిలోని భక్తి వాని సేవా హృదయము వాడు పాటించు దేవుని ఆజ్ఞలను బట్టి నిజ దైవసేవకునిగా గుర్తింపబడుతాడు.  కాని నిప్పులో చేయి పెట్టుట ద్వారా కాదని గుర్తించాలి.

        అలాగే దానియేలు గ్రంథములో దానియేలు తాను నిజదైవమైన యెహోవాను తప్ప ఎవరిని పూజించనని తేల్చి చెప్పాడు.  అప్పుడు రాజు అతనిని సింహపు బోనులో వేయుట జరిగింది.  అప్పుడు దేవుడు తన దూతను పంపి సింహపు నోరును మూయగా వారికి ఎటువంటి హాని జరగలేదు అంటే దానియేలు నిజదైవభక్తుడు కనుక దేవుడు వానిని రక్షించాడు అని అర్థము ఇందులో రాదు.  కాని దానియేలు నిజదైవభక్తుడే!  దానియేలు కావాలని నలుగురిలో తన భక్తిని నిరూపించుకొనుటకు అందులోనికి దూకలేదు.  దానియేలు నిజదైవమును పూజించుటనుబట్టి రాజు నుండి శిక్షగా దానిని పొంది, వేరేవారిచే సింహపు బోనులో త్రోసివేయబడ్డాడు.  ఇక్కడ దానియేలు తన భక్తిని కనపరచుకొనుటకు ఈ పని చేయలేదు.  కాని దేవుడు దానియేలుకు కలిగిన కష్టములోనుండి రక్షించాడు.  ఇందులో దానియేలు ప్రభువా!  నేను సింహపు బోనులో దూకుతున్నాను కనుక నీవు నన్ను రక్షించి నా భక్తిని నిరూపించమని అడుగలేదు.  కాని సాతాను పలికిన వాక్యము పై విధముగా చెప్పినట్టు ఉన్నది.  ఇది దేవుని శోధించిన దానితో సమానము.  ఇలా పురికొల్పుట సాతాను ద్వారా కలిగినను, దీనిలో దేవునికి పరీక్ష పెట్టినవారమగుచున్నాము.  అలా చేయకూడదని క్రీస్తు ప్రభువు మనలను హెచ్చరిస్తున్నాడు.  కొండమీద నుండి దూకిన అది భక్తికి నిదర్శనము కాదు, దేవాలయ శిఖరము మీద నుండి దూకిన అది దైవకుమారుడు అన్నదానికి నిరూపింపబడుట కాదని గుర్తించాలి.  

        అందుకే మత్తయి 4:7, ''అందుకు యేసు -ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొకచోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను.''  ఇలా చేయుట దేవుని శోధించుటతో సమానమని మనము గుర్తించాలి.  సాతాను అతని అనుచరుల ద్వారా కలిగిన శ్రమల నుండి దేవుడు మనలను ఎల్లవేళలా రక్షిస్తాడు.  కాని, దేవుని శోధింపకూడదు.  అంటే మనము దేవుడు రక్షిస్తాడులే అని పై విధమైన పనులు చేయకూడదు.  అలా చేయుట సాతాను ప్రేరణ వలన జరుగునని గ్రహించాలి.  సాతాను దేవుని శోధించుటకు మనలను పురికొల్పినప్పుడు దేవుని మనము శోధించుచు ఈ కార్యమును జరిగిస్తున్నామని గ్రహించాలి.  క్రీస్తు ప్రభువుని కూడ వారి స్వజనులు మహత్కార్యాలను సూచక క్రియలను జరిగించమని అడిగారు.  కాని అడిగినప్పుడు చేయలేదు.  దీనికి కారణము మనము దేవుని శోధింపకూడదని గ్రహించాలి.  యెషయా 40:28, ''నీకు తెలియలేదా?  నీవు వినలేదా?  భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు  ఆయన సొమ్మసిల్లడు అలయడు  ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.''  అలాగే క్రీస్తు ప్రభువు తనకు నచ్చినప్పుడు, ఎదుటివారిలో విశ్వాసము కలిగియున్నప్పుడు అనేక అద్భుతములను వారి కొరకు చేసాడు.  మార్కు 8:12, ''ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి-ఈ తరమువారు ఎందుకు సూచకక్రియ నడుగుచున్నారు?  ఈ తరమునకు ఏ సూచక క్రియయు ననుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి.''  ఇందునుబట్టి నరులమైన మనము దేవుని శోధించుటకు సాతాను అను పతనము చెందిన దూతచే అదృశ్యములో పురికొల్పబడి, దృశ్యములో ఏదో చేయాలంటే అవి ఏమియు జరగవు.  దేవుని ప్రణాళికను ప్రార్థన ద్వారా తెలుసుకొని ఆ సమయమునకు ఆయన ఆత్మ ప్రేరణ పొందినప్పుడు చనిపోయినవారు క్షణిక కాలములోనే తిరిగి లేస్తారు.  రోగులు స్వస్థత పొందుతారు.  దినముల తరబడి దీర్ఘ ప్రార్థన అవసరము లేదు.  ఇందులో- ఎవరైన నీవు దైవసేవకుడవైతే నీవు వీడి రోగమును స్వస్థపరచమని లేక వీడు చనిపోయాడు తిరిగి లేపమని అడిగినట్లయితే అవి జరగవు.  ఎందుకంటే, నిజదైవసేవకుని ఎన్నిక దేవునిలో జబ్బు నయము చేస్తేనో లేక చనిపోయినవారిని లేపితేనో నిర్ణయింపబడదు.  అందుకే క్రీస్తు ప్రభువు చూచి నమ్మినవారి కన్నా చూడక నమ్మినవారు ధన్యులు అని చెప్పుచున్నాడు.  ఈ అద్భుతములు జరిగి అవి చూచి నమ్ముట కన్నా, ఏ విధమైన వాటిని చూడకనే భక్తి కలిగియుండుట ధన్యతకు పరాకాష్ఠ.  అలాగే దేవున్ని నమ్ముటకు ఇది జరిగితే నమ్ముతాననుట నిజదైవమును అవమానించుట అగునని గ్రహించాలి.  అంటే దేవుడు తాను దేవుడనని మన మధ్య నిరూపించుకోవలసిన అవసరత ఉందా!  ఇలా మాట్లాడుట లేక చేయుట ఆయనను శోధించినట్లు అగును.  అందుకే సాతాను అను పతనము చెందిన దేవుని దూత దైవములో ఉండువారిని, వారు పూజించు దేవుని శోధించునట్లు చేయుటకు పురికొల్పునని గ్రహించాలి.  అలాగే బైబిలు గ్రంథములో చనిపోయినవారిని ఏలీయా, క్రీస్తు ప్రభువు, పౌలు మొదలైనవారు బ్రతికించారు.  వీరు బ్రతికించుట దేవుని దేవునిగా గుర్తించుటకు కాదని గ్రహించాలి.  అవి దేవుని మహిమార్థముగా జరిగినట్లుగా మనము గ్రహించాలి.  

        సాతాను చేత శోధింపజేయడం దేవుడు పరిశోధించడం వగైరా పరీక్షలు లోకనరుల నిమిత్తము చేయడం అంత అవసరమా?

        ఈ లోకములో నరుడు బాల్యములో స్కూలులో చేరినది లగాయతు హయ్యర్‌ స్టడీస్‌ వరకు ప్రతి సంవత్సరము పరీక్షలుంటాయి.  ఆ తర్వాత ఇంటర్వ్యూలలో సెలక్షన్స్‌ ఉంటాయి.  ఆటపాటలలోను ప్రపంచవ్యాప్తముగా బహుముఖ పోటీలుంటాయి.  ఎందు నిమిత్తము ఈ లోకములో జరుగుచున్నాయంటే ఉన్నత స్థానమును అలంకరించి గొప్ప బహుమానాలతో పేరుప్రఖ్యాతులు ప్రశంసలు పొందడానికి వివాహ సందర్భాలలో కన్యను గూర్చి అడిగి తెలుసుకొంటారు.  వ్యవసాయ వైద్య సాంకేతిక రంగాలలో పరీక్షలుంటాయి.  ఇన్ని విధాలుగ పరీక్షలు ఈ లోకములో క్రియ జరిగిస్తుండగా పరలోక రాజ్య వైభవాలు అందలి మహిమతో కూడిన ఐశ్వర్యాలు పొందాలంటే ఈ పరీక్షలను సాతాను శోధనలను జయించాలి.  జయించినవానికే దేవుని పరదైసులోని జీవవృక్షఫలాలు లభిస్తాయి.  వీటిని జయించుటకు సాతానుతోను ఆకాశమండలమందున్న దురాత్మల సమూహాలతోను పోరాడాలి.  

        ఫిలిప్పీ 1:28 సువార్త విశ్వాస పక్షములో పోరాడాలి.  1 యోహాను 5:4 విశ్వాసముతోనే లోకమును జయించగలమంటున్నాడు.  జయించినవానికే  జీవజలము జీవాహారము నిత్యజీవము ఉచితముగా ఇవ్వబడుటయేగాక, పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనుటయేగాక దైవసింహాసనములో ప్రభువుతో కూడ ఆసీనులయ్యే భాగ్యము పొందెదరు.  ఇట్టి పరమోన్నత భాగ్యము పొందాలంటే మన శరీర ఆశలు నేత్రాశ జీవపు డంబము, కామవ్యామోహాలు జయించుచు, లోకాన్ని పిశాచ సమూహాలను జయించినప్పుడే 2 కొరింథీ 12:1-4 వచింప శక్యముగాని అష్టైశ్వర్యాలు ఎవరును పాడజాలని గ్రహించజాలని క్రొత్త కీర్తనలు - వివిధ వాయిద్యాలతోను ప్రొద్దు పుచ్చుటకు మనము చూచే టి.వి. కంటే ఎన్నో వేల రెట్లు కలిగిన ప్రత్యక్షలతోను, ప్రభువుతోను ఆయన దూతల సమూహాలతోను సంచరిస్తూ ఆద్యంతములు లేని ఆకాశ మహాకాశాలు - అందలి వైభవముల సందర్శనములతో తమ జీవితాలను స్కూలు పిల్లలు వేసవి సెలవులు గడిపినట్లుగా ఆ యొక్క యుగయుగాల జీవిత కాలగమనమును సులువుగా శాంతి సమాధానములతో పరిశుద్ధాత్మయందలి ఉజ్జీవముతో గడుపుదురు.  కనుక ఈ లోక ఆశలకు క్షయమగు ఈ లోక ఐశ్వర్యాలకు ప్రాకులాడక, సృష్టికర్తకు ప్రతిరూపమైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన ప్రేమ మార్గములో ఆయన ఉపదేశానుసారము నడిచి మన జీవితాలను ధన్యవంతము చేసికొందుముగాక!

97.  సాతాను అను పతనము చెందిన దేవుని దూత తనకు నచ్చినవారికి ఈ లోక రాజ్యములపై అధికారిగా చేస్తానని క్రీస్తు ప్రభువును ప్రలోభ పెట్టుట

        ప్రియపాఠకులారా!                ఈ లోకములో ఒక రాజు తనకు నచ్చిన కుమారుని తనకు వారసునిగా ప్రకటించి వానిని రాజుగా చేయును.  అలాగే దేవుడు ఈ లోకమును చేసినప్పుడు మొదటగా భూమిని అగాధ జలముల నుండి వేరుచేసి దానిపై సమస్త సృష్టిని సృజించినప్పుడు, దానిని ఏలుటకు ఇద్దరికి అవకాశము ఇచ్చినట్లుగా మనము గ్రహించాలి.  ఇందులో 1.  నరుడు.  2.  సాతాను.  నరుడు దృశ్య రూపము.  సాతాను అదృశ్య రూపము.  ఇద్దరికి ఈ లోకమును ఏలు అవకాశము ఇచ్చినవాడు దేవుడే.  ఆదికాండము 1:26, ''దేవుడు-మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.''  కీర్తన 8:5-8, ''దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు.  మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసియున్నావు.  నీ చేతిపనులమీద వానికి అధికారమిచ్చియున్నావు.  గొఱ్ఱెలన్నిటిని, ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశపక్షులను సముద్రమార్గములలో సంచరించువాటినన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి యున్నావు.''  ఇందులో ఈ అధికారమును ఇచ్చినది దేవుడే అని అర్థమగుచున్నది.  ఇది దృశ్యములో.  

        అలాగే అదృశ్యములో పతనము చెందిన దేవుని దూతలలో అగ్రగణ్యుడైన సాతానుకు కూడ దేవుడే ఈ అధికారమును ఇచ్చాడు.  లూకా 4:5-7, ''అప్పుడు అపవాది ఆయనను తీసికొనిపోయి, భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి -ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును; కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగునని ఆయనతో చెప్పెను.''  ఇలా ఇయ్యాలి అంటే ముందు తాను పొందియుండాలి.  కనుక ఈ సృష్టిని దేవుడే చేసినప్పుడు ఈ సృష్టిపై అదృశ్య శక్తులకు అధికారిగా సాతానును ఎన్నిక చేసాడు.  అలాగే సాతాను ఈ సృష్టి ఆరంభము నుండి అదృశ్యములో ఈ లోకమును ఏలుచున్నాడు.  నరులను దేవునికి వ్యతిరేకముగా ప్రేరేపించుచున్నాడు.

        ఇందులో ఒక రహస్యము ఇమిడియున్నది.  దురాశ కలిగినవారినే సాతాను శోధించగలడు.  మొదటగా సాతాను క్రీస్తు ప్రభువుకు ఈ లోక రాజ్యాలన్ని తన ఆధీనములో ఉన్నాయని చూపించాడు.  నీవు గనుక నాకు మ్రొక్కితే వీటిని నీకు ఇస్తానని చెప్పాడు.  అంటే సాతాను అను పతనము చెందిన దేవుని దూత కూడ తనకు నచ్చినవారికి ఇచ్చుటకు అవకాశము ఉన్నది.  సాతానుకు నచ్చాలంటే వాడు సాతానును ఆరాధించువాడై యుండాలి.  లేని యెడల వాడు వానికి విరోధి, ఎందుకంటే సాతాను నిజ దైవమునకు విరోధిగా ఉన్నాడు.  కనుక దేవున్ని విడనాడి తనను పూజించువారికి ఈ లోకరాజ్యములపై అధికారిగా ఇస్తానని చెప్పుచున్నాడు.  కాని క్రీస్తు ప్రభువు కాలములో ఇంచుమించుగా అందరు సాతానును ఆరాధించువారుగా ఉన్నారు.  ఇశ్రాయేలీయులు సాతానును ఆరాధించక పోయినను అక్రమ విషయములో నరమాత్రులుగా ఉన్నారు.  కనుక వీరు కూడ దేవునిలో లేనివారి క్రిందకే లెక్కించబడుచున్నారు.  అలాంటప్పుడు దేవుని ఆరాధించనివారు అనేకులు ఉండగా సాతాను కేవలము మిగిలినవారినందరిని వదిలివేసి క్రీస్తు ప్రభువు పైన మాత్రమే శ్రద్ధ తీసుకొని నీకు ఈ లోక రాజ్యాలపై అధికారము ఇస్తానని చెప్పుచున్నాడు.  అంటే తనను ఎప్పుడు కొలుచువారికి ఏమి ఇయ్యడుగాని నిజదైవమును కొలుచుచూ నీతిలో ఉండువారికి మాత్రము సమస్తము ఇస్తానని వాగ్దానము చేస్తున్నాడు.  అంటే నిజదైవములో ఉండువారిని ప్రలోభ పెట్టుచున్నట్లుగా లెక్కకు వస్తుంది.  క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు.  ఈ ఏడు లోకాలపై రాజ్యాధికారి, రాజులకు రాజు.  

        అలాంటి క్రీస్తు ప్రభువును తనకు దాసునిగా చేసుకొంటే దేవున్ని ఎదిరించుట సులభముగా జరుగునని ఈ ప్రలోభమును కలిగిస్తున్నాడు.  అందుకు- మత్తయి 4:10, ''యేసు వానితో-సాతానా, పొమ్ము -ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను.''  ఈ విధముగా సాతాను కలిగించు ప్రలోభమును తృణీకరించుట జరిగింది.  ఈ తృణీకరముతో క్రీస్తు ప్రభువు ఆత్మ రూపకముగా గాక శరీరధారిగా కూడ సాతానుపై సంపూర్ణ విజయమును పొందాడు.  కాని ఇందులో మనము గమనించవలసినది సాతాను అను పతనము చెందిన దేవుని దూత తనకు నచ్చినవారికి ఈ లోకముపై అధికారిగా చేయగలడని మనము గ్రహించాలి.  అదే విషయమును సాతాను క్రీస్తు ప్రభువునకు తెలియజేయుట జరిగింది.  ఈ అధికారమును పొందాలంటే మనము వానికి మ్రొక్కాలి.  అంటే మ్రొక్కితేనే  అధికారము పొందలేము, ముందు మనము నిజదైవములో ఉన్నత స్థితిలో ఉంటే వారిని మాత్రమే ప్రలోభపెట్టి వారి ఆత్మీయ జీవితమును నాశనము చేయాలని తలంచును.

98.  క్రీస్తు ప్రభువుకు పరిచర్య చేసిన దేవుని దూతలు

        ప్రియపాఠకులారా!                క్రీస్తు ప్రభువు దేవుని రాజ్య స్థాపన భూమిపై ఏర్పరచు సమయము రాగానే బాప్తిస్మమిచ్చు యోహానుచే బాప్తిస్మము పొంది, నలుబడి దినములు ఉపవాసము చేసి ప్రార్థించుట జరిగింది.  నలుబది దినముల ఉపవాసము చేయుట అతి కష్టమైన పని అని మనందరికి తెలిసిన విషయమే.  కాని క్రీస్తు ప్రభువు నలుబది దినముల ఉపవాసము తరువాత మత్తయి 4:1-10లో వలె మూడు విధాలుగ సాతానుచే శోధింపబడి వానిపై విజయమును సాధించాడు.  ఎప్పుడైతే విజయము సాధించుట జరిగిందో దేవుని దూతలు క్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి ఆయనకు సకల విధములుగా పరిచర్య చేయుట చేసారు.  మత్తయి 4:11, ''అంతట అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి.''  ఈ విధముగా క్రీస్తు ప్రభువు సాతానును జయించుట వలన దేవుని దూతలు ఆయనకు పరిచర్య చేయుట జరిగింది.  అలాగే మనము కూడ సాతానును జయించినట్లయితే మనకు కూడ దేవుని దూతలు పరచర్య చేస్తారు.  ఎలా?  బైబిలు గ్రంథములో క్రీస్తు ప్రభువు దైవజనులకు తన జీవితమును మాదిరిగా చూపుచున్నాడు.  ఆయన జీవితములో ఆయన పొందినవి ప్రతి ఒక్కటి తనయందు నమ్మినవారికి ఇస్తానని తెలుపుచున్నాడు.  చివరకు తనవలె జయించిన వారికి తాను పొందిన సింహాసనముపై కూర్చొను యోగ్యతను కూడ ఇస్తానని చెప్పుచున్నాడు.  కనుక క్రీస్తు ప్రభువు తన జీవితములో సాతానును జయించుట చేత దేవుని దూతలు ఆయనకు పరిచర్య చేసారు.  అలాగే మనము కూడ సాతానును జయించినట్లయితే మనకు కూడ దూతలు పరిచర్య చేస్తారని గ్రహించాలి.  ఇందునుబట్టి దేవుని దూతలు నరులకు సమస్త విషయములలో సహకారులుగా ఉండుట కొరకు సృజించబడినట్లుగా మనకు అర్థమగుచున్నది.

99.  దేవుడు నూతన నిబంధన కాలములో తన పరిపాలనను క్రీస్తు ప్రభువుకు అప్పగించుట క్రీస్తు ప్రభువుకు వ్యతిరేకముగా సాతాను అతని దూతల పరిపాలన

        ప్రియపాఠకులారా!  నూతన నిబంధన కాలము వరకు దేవుడు స్వయముగాను అంతేగాక ఆయన ఏర్పరచుకున్న ప్రవక్తలు రాజుల చేతను తండ్రియైన దేవుడు పరిపాలించాడు.  ఆయనకు సమతుల్యముగా ఆయన శపించిన దూతయైన అపవిత్రాత్మల నాయకుడు సాతాను అతని అనుచరులు ఈ ప్రపంచమును పరిపాలించారు.  ఇలా నూతన నిబంధన కాలమునకు దైవరాజ్యము పరిశుద్ధులతో గాక అపరిశుద్ధులతో నిండిపోయింది.  కనుక దేవుని వాగ్దానము ప్రకారముగా క్రీస్తు ప్రభువు ఈ లోకములో జన్మించాడు.  అప్పుడు లూకా 4:5-7, ''అప్పుడు అపవాది ఆయనను తీసికొనిపోయి, భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి -ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును; కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగునని ఆయనతో చెప్పెను.''  

        ఈ విధముగా సాతాను క్రీస్తు ప్రభువుకు అవకాశము ఇస్తున్నాడు.  నీకు ఇంకా రాజ్యము లేదు.  నీవు ఇప్పుడు ఉపవాసము ప్రార్థన ద్వారా క్రీస్తుగా రాజ్య స్థాపన మొదలుపెట్టావు.  కనుక నేను నీకు సహకరిస్తాను.  చూడు ఈ లోక రాజ్యాలన్ని ఒక్క నిమిషములో చూపాడు.  నీవుగాని నన్ను మ్రొక్కి పూజించినట్లయితే ఇవన్ని నీకు కష్టము లేకుండానే ఇస్తానని చెప్పుచున్నాడు.  అంటే సమస్త జాతులు దైవవ్యతిరేక స్థితిలో నడవటానికి కారణము సాతాను అతని దూతలు.  అందుకే సాతాను ధైర్యముగా క్రీస్తు ప్రభువుతో ఈ మాట చెప్పగలిగాడు.  ఒక్కసారి నన్ను మ్రొక్కితే ఈ సమస్త జనాభాను నీకు వదిలివేస్తానని వారందరిని నీకు దాసులుగా మారుస్తానని చెప్పుచున్నాడు.  అంటే సాతాను ఎంత శక్తిని దేవునినుండి అధికారముగా పొందియున్నాడో మనము గ్రహించవలసి యున్నది.  ఒకవేళ క్రీస్తు ప్రభువు సాతానును మ్రొక్కి యుండియుంటే, ఆయన తండ్రి నిజదైవమైన యెహోవాను వీడినవాడు అగును.  అంతేగాక సాతాను తనను పూజించువారిని సహచరులుగాను అనుచరులుగాను ఇస్తానని చెప్పుచున్నాడు.  ఇలా క్రీస్తు కాలము నాటికి సాతాను అతని దూతలు సమస్త నరులను అక్రమస్థులుగా మార్చి నిజదైవమునుండి దూరపరచియున్నారు.  కనుక సాతాను క్రీస్తుతో వారందరు మారుట కన్నా నీవే మారిన సరిపోవును కదా అన్న ఉద్దేశ్యముతో చెప్పాడు.  అందుకు క్రీస్తు ప్రభువు నిరాకరించి తన రాజ్య స్థాపనకు పన్నెండుమంది శిష్యులను ఏర్పరచుకొని తన బలియాగము ద్వారా ఈ లోకములో సంఘస్థాపన చేయుట జరిగింది.  ఈ విధముగా క్రీస్తు ప్రభువు రాజ్య స్థాపన చేసి పన్నెండుమందిని దానికి నాయకులుగా చేసి వారిలో తప్పిపోయిన యూదా ఇస్కరియోతు స్థానములో మత్తీయను ఎన్నుకొన్నాడు.  ఈ విధముగా ఒక పెంతికొస్తు దినమున క్రీస్తు ప్రభువు పవిత్రాత్మను వారికి ఒసగి వారి ద్వారా సమస్త భూలోకములో తన రాజ్యమును స్థాపించుట జరిగింది.  

        ఈనాడు హిందూ దేశమైన భారతదేశములో మనము క్రైస్తవులుగా ఉన్నామంటే దీనికి కారణము ఆనాడు క్రీస్తు ప్రభువు తన బలియాగము ద్వారా స్థాపించిన రాజ్యమే కదా!  ఈ విధముగా క్రీస్తు ప్రభువు రాజ్య స్థాపన జరిగించగా, సాతాను అతని దూతలు అప్పటికే సమస్త రాజ్యములను తమ గుప్పిట నుండి వెళ్ళిపోవుచున్నవన్న తలంపుతో వారు వీరికి వ్యతిరేకముగా క్రియ జరిగించుట జరిగింది.  జరుగుచూనే ఉన్నది.  సమస్త జనులకు సువార్తను బోధించుట నేరము అని శాసనములను కూడ వచ్చునట్లుగా సాతాను అతని దూతలు అదృశ్యములో క్రియ జరిగించగా దృశ్యములో దేశనాయకులు క్రియ జరిగించి వాటిని అమలుపరచు చున్నట్లుగా మనము గ్రహించాలి.

        ఉదా :-  పౌలు క్రైస్తవులను హింసించుటకు అధికారముగా పత్రములను పొందుటకు దమస్కునకు వెళ్లుట జరిగింది.  అపొస్తలుల కార్యములు 9:1-2, ''సౌలు ఇంకను ప్రభువుయొక్క శిష్యులను బెదరించుటయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకునియొద్దకు వెళ్లి యీ మార్గ మందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన యెడల, వారిని బంధించి యెరూషలేమునకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజములవారికి పత్రికలిమ్మని అడిగెను.''  అదే విధముగా ఇండియాలోని తమిళనాడుకు సంబంధించిన రాష్ట్రములోని అధికారులు సువార్తను బోధించి మతమార్పిడి చేసి క్రైస్తవులుగా మార్చుట నేరమని అధికారికముగా చెప్పుచున్నారంటే సాతాను వారి ద్వారా ఎలా దైవవ్యతిరేక క్రియ జరిగించుచున్నదో మనము అర్థము చేసుకోవలసియున్నది.  ఈ విధముగా కయీను అతని సంతానముతో వేసిన సాతాను రాజ్య పునాది యుగాంతము వరకు కొనసాగుచున్నది.  అందుకుగాను సాతాను తన అనుచర గణములనన్నింటిని ఉపయోగించుచున్నాడు.  ఇలాంటి స్థిరమైన రాజ్యములో క్రీస్తు ప్రభువు తన రాజ్యమును స్థాపించాడు.  ఆ రాజ్యమునకు వారసులుగా మనమందరము పాటుపడుచున్నాము.  అయితే అలాగే సాతాను కూడ కొందరిని ఏర్పరచుకొని వారి ద్వారా తన రాజ్యాన్ని స్థిరపరచుకోవాలని దానిని నాశనకర మార్గములో నడిపించాలని ప్రయత్నించుచున్నాడు.  ఇందులోని ఒక భాగమే విగ్రహారాధన, బాబాలు, దేవుడమ్మలు, శకునములు, నవగ్రహ పూజలు, పంచభూతముల కొలువులు, జాతరలు, బలులు, మంత్రతంత్రాలు వగైరాలేగాక అమ్మ భగవాన్‌ వంటివారు.  ఈ విధముగా క్రీస్తు ప్రభువు తన బలియాగము ద్వారా క్రైస్తవ రాజ్యమును స్థాపించగా, అతని శిష్యులుగా మనము దానిని కొనసాగిస్తున్నాము.  అందుకు పవిత్రాత్మయు, మనకు దేవుడు కాపలాగా ఒసగిన దూతలను సకల పరిశుద్ధులతోను క్రీస్తు ప్రభువు అదృశ్యములో సహకరించగా మనము దృశ్యములో ఈ కార్యములు కొనసాగిస్తున్నాము.  అలాగే - ద్వితీయోపదేశకాండము 32:8-9లో చెప్పబడిన రీతిగా దేవుడు తన జనాంగమును అబ్రాహాము నుండి ఏర్పరచుకొన్నాడు.  అయితే వీరు క్రీస్తు ప్రభువును నిరాకరించగా క్రీస్తు ప్రభువు అన్ని రకముల జాతులకు దైవజనాంగముగా పేరు పొందిన ఇశ్రాయేలీయులకు పెద్ద తేడా లేదని గ్రహించి రక్షణను సమస్తమైనవారికి ఒసగుట జరిగింది.  

        రోమా 11:11-12, ''కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్రిల్లరా?  అట్లనరాదు.  వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణకలిగెను.  వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును.''  ఈ విధానమే క్రీస్తు రాజ్య స్థాపన చేసి మొదటగా కొర్నేలికి పేతురు ద్వారా సువార్తను అందించాడు.  అక్కడనుండి భూమి నలుదిశల ఉన్న జాతుల మధ్య అనగా సాతాను సామ్రాజ్యములో క్రైస్తవ సామ్రాజ్యాన్ని నిర్మించుట జరిగింది.  ఇందుకుగాను సాతానుతోను అంధకార శక్తులైన పతనము చెందిన దేవుని దూతలతోను బహుగా పోరాడవలసి వచ్చింది.  అందులో భాగమే హతసాక్షులుగా అనేకులు మారారు.  అలాగే సాతాను తన రాజ్యాన్ని నిలద్రొక్కుకోవాలని తన అనుచరులతో అదృశ్యములో క్రియ జరిగిస్తూ సమస్త జనులను నాశనకర మార్గములో నడిపిస్తూ వీలైతే వారిని దైవజనులను చంపుట వరకు ప్రేరేపిస్తున్నాడు.  ఈ విధముగా యుగాంతము వరకు కొనసాగునని మనము గ్రహించాలి.

100.  మనుష్యకుమారునిపైగా ఎక్కుట దిగుట చేయుచున్న దేవుని దూతలు.

        ప్రియపాఠకులారా!                ఇలాంటి కలే పాతనిబంధనలో ఇశ్రాయేలీయులకు పునాది వేయబడక ముందు యాకోబుకు వచ్చింది.  ఆదికాండము 28:10-12, ''యాకోబు బెయేర్షెబానుండి బయలుదేరి హారానువైపు వెళ్లుచు ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండు కొనెను.  అప్పుడతడు ఒక కల కనెను.  అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచుదిగుచునుండిరి.''  

        ఈ కలలో దేవుని దూతలు నిచ్చెన అనగా దైవప్రణాళికను ఆధారము చేసుకొని యాకోబు మొదలు క్రీస్తు ప్రభువు పుట్టుక వరకు ఉన్న కార్యముల నిమిత్తము దిగుచు ఎక్కుచు ఉన్నారు.  ఈ విధముగా యాకోబుతో మొదలైన ఇశ్రాయేలీయుల చరిత్ర క్రీస్తు కాలము వరకు ఎన్నో దైవకార్యములకు నిలయమై దేవుని దూతలు పరలోకము నుండి దిగుచు ఎక్కుచు దైవప్రణాళికను నెరవేర్చుచున్నారు.  దీనినిగూర్చి 6వ విభాగములో 63వ అధ్యాయములో చదువుకొన్నాము.  ఇక మనుష్యకుమారుడైన క్రీస్తు ప్రభువుపై దేవుని దూతలు ఎక్కుట దిగుటనుగూర్చి తెలుసుకొందము.  యోహాను 1:51, ''మరియు ఆయన-మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్యకుమారునిపైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.''  ఇందులో చెప్పబడిన సంగతులు స్వయముగా క్రీస్తు ప్రభువు చెప్పినది.  ఇందులో చెప్పబడిన విధముగా దేవుని దూతలు ఎక్కుట దిగుట మనుష్యకుమారునికిపైగా జరుగును.  అది క్రీస్తు ప్రభువు కాలము నుండి యుగాంతము వరకు జరుగునని గ్రహించాలి.  ఎలా?  క్రీస్తు ప్రభువు జన్మ వరకు దైవ ప్రణాళిక ఇశ్రాయేలీయులకు మోషే ధర్మశాస్త్ర రూపములో క్రియ జరిగించియున్నది.  అయితే క్రీస్తు ప్రభువు జన్మించుట ద్వారా ఈ లోకములో నూతన నిబంధనకు పునాది వేయుట జరిగింది.

        దీనికి ముందు మనము మరియొక విషయము తెలుసుకోవాలి.  దేవుని దూతలు పరలోకములో ఉంటారని మనకందరికి తెలిసిన విషయమే.  కొందరు పతనము చెందిన దూతలు భూమిపైన పాతాళలోములో ఉన్నారు.  భూమిపైన ఉన్నవారు నరులను ఆవహించి వారిని నాశన మార్గములో నడిపించుటకు శతవిధాలుగ ప్రయత్నిస్తున్నారు.  వీరుకాక దేవుని దూతలుగా ఉన్నవారు పరలోకములో ఉండి దేవుని కార్యములను నెరవేరుస్తున్నారు.  పరలోకవాసులైన దూతలు పరలోకములోనే ఉండాలి.  కాని క్రీస్తు ప్రభువుకు పరిచర్య చేయుటకు దిగి భూమిపైకి వచ్చారు.  మత్తయి 4:11, ''అంతట అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి.''  అలాగే క్రీస్తు ప్రభువు పుట్టిన తరువాత ఆయన పుట్టుకను నరులకు తెలియజేయుటకు దేవుని దూతలు మరల భూమిపైకి వచ్చుట తిరిగి పరలోకమునకు ఎక్కుట జరిగింది.

        లూకా 2:8-9, 13-15, ''ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి.  . . .  వెంటనే పరలోక సైన్యసమూహము ఆ దూతతో కూడనుండి -సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.  ఆ దూతలు తమయొద్దనుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొఱ్ఱెల కాపరులు-జరిగిన యీ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి యున్నాడు; మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని''  ఈ విధముగా క్రీస్తు ప్రభువు విషయమై పరలోకము నుండి భూమి పైకి దిగి తిరిగి భూమినుండి పరలోకమునకు ఎక్కుట జరిగింది.  అలాగే క్రీస్తు ప్రభువు బలియాగమునకు ముందు కూడ దేవుని దూతలలో ఒకడు వచ్చి క్రీస్తు ప్రభువును బలపరచుట చేసాడు.  

        లూకా 22:43, ''అప్పుడు పరలోకమునుండి యొక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను.''  ఈ విధముగా ఆకాశము తెరవబడుట దేవుని దూతలు మనుష్యకుమారుడైన క్రీస్తు ప్రభువు విషయములో ఆయనను ఆధారము చేసుకొని ఎక్కుచు దిగుచు ఉన్నారు.  ఇది యేసుక్రీస్తు విషయములో జరిగిన దేవుని దూతలు ఎక్కుట దిగుటను గూర్చిన సంఘటనలు.  యేసుక్రీస్తు ప్రభువు మరణించి తిరిగి లేచినప్పుడు కూడ దేవుని దూతలు పరలోకమునుండి దిగి భూమిపైన సమాధి ప్రక్కన కూర్చుండి ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుట జరిగింది.  లూకా 24:23, ''-కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రదికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి.''  ఈ విధముగా క్రీస్తు చరిత్రలో దేవుని దూతలు ఆయన ప్రణాళిక కోసము ఆయనను ఆసరా చేసుకొని పరలోకము నుండి ఎక్కుట దిగుట జరుగుచున్నది.  ఈ కాలములో క్రీస్తు ప్రభువు నూతన నిబంధన అను పేరుతో నిజదైవ సంబంధమైన తన సువార్తను భూమిపై ఏర్పరచాడు.  ఈ సువార్తను కొనసాగించుటకు తన శిష్యులకు వారు చేయవలసిన బోధనా కార్యములకు తర్ఫీదునిచ్చాడు.  అటుతరువాత నుండి యుగాంతము వరకు మనుష్యకుమారుడైన క్రీస్తు ప్రభువు ఏర్పరచిన సువార్త కొనసాగుచూనే ఉన్నది.  ఈ సువార్త కోసము అనేకులైన దైవజనులు కృషి చేసారు.  ఇశ్రాయేలు ప్రాంతముల నుండి భూదిగంతముల వరకు వెళ్లి ఎన్నో శ్రమలకోర్చి వారు ఈ సువార్తను ప్రకటింపజేసారు.  ఇలా జరుగుట దైవజనులకు వారికి తెలియని అదృశ్య రూపములో దేవుని సహాయము ఆయన దూతల రూపములో అందుచున్నట్లుగా మనము గ్రహించాలి.  ఇందులో భాగము కొర్నేలీ జీవితము దేవునికి యోగ్యమైన రీతిలో ఉన్నదని గుర్తించి దేవుని ఆజ్ఞ మేరకు దేవుని దూత కొర్నేలీ వద్దకు పరలోకము నుండి దిగి కొర్నేలీని ప్రేరేపించగా పేతురు ఉన్న స్థలమును చెప్పి పిలిపించుకొని సువార్తను నమ్మి రక్షణను పొందమని చెప్పుట జరిగింది.  

        అపొస్తలుల కార్యములు 10:3-8, ''పగలు ఇంచుమించు మూడు గంటలవేళ దేవుని దూత అతనియొద్దకు వచ్చి-కొర్నేలీ, అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను.  అతడు దూతవైపు తేరి చూచి భయపడి-ప్రభువా, యేమని అడిగెను.  అందుకు దూత-నీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి.  ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి, పేతురు అను మారు పేరుగల సీమోనును పిలిపించుము; అతడు సముద్రపుదరినున్న సీమోనను ఒక చర్మకారుని యింట దిగియున్నాడని అతనితో చెప్పెను.  అతనితో మాటలాడిన దూత వెళ్లిన పిమ్మట అతడు తన యింటి పనివారిలో ఇద్దరిని, తన యొద్ద ఎల్లప్పుడు కనిపెట్టుకొని యుండు వారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నియు వివరించి వారిని యొప్పేకు పంపెను.''  

        ఈ విధముగా క్రీస్తు ప్రభువు సువార్త విషయమై దేవుని దూతలు పరలోకము నుండి ఎక్కుచు దిగుచు క్రీస్తు ప్రభువు ఏర్పరచిన సువార్త కార్యమునకు సహకరిస్తున్నారు.  ఇలా యుగాంతము వరకు జరుగుచూనే ఉండునని గ్రహించాలి.  

        ప్రతి ఒక్కరికి దేవుని గూర్చి సందేశములను దేవుని దూతలు వారు గుర్తించని స్థితిలో కూడ మన ప్రక్కన ఉండి వారి కార్యములను నెరవేర్చుచున్నారు.  ఇలా సుదీర్ఘమైన కార్యము మనుష్యకుమారుడైన క్రీస్తు ప్రభువు వల్ల వచ్చింది కనుక క్రీస్తు ప్రభువు పై వచనము చెప్పుట జరిగింది.  

        ఈ విధముగా క్రీస్తు ప్రభువు ఏర్పరచిన ప్రణాళికను వీరు దైవజనులకు అదృశ్యములో సహకరించుటకు కొనసాగించుటకు పరలోకమునుండి దిగుచు ఎక్కుచు ఉన్నారు.  

        ఈ విధముగా ఇక ఎన్నో కార్యములు జరగబోవుచున్నవి అనుటకు నిదర్శనముగా ఇది చూపినట్లుగా మనము గ్రహించాలి.

101.  మనుష్యకుమారునికి శత్రువు అపవాది అను పతనము చెందిన దూత

        ప్రియపాఠకులారా!  మనుష్యకుమారుడు ఎవరు? క్రీస్తు ప్రభువే కదా!  ఈయన తననుతాను తగ్గించుకొని దేవుని కుమారునిగా కాక మనుష్యకుమారునిగా చెప్పుకొనెను.  ఇలాంటి మనుష్యకుమారుడు కన్య మరియ ద్వారా ఈ భూమిపై జన్మించుట ద్వారా ఈ పేరును చెప్పుకొనుట జరిగింది.  ఈ మనుష్యకుమారునికి ఒక శత్రువు ఉన్నాడు వాడే అపవాది అను పేరు గల పతనము చెందిన దేవుని దూత.  మత్తయి 13:24-25, ''ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా-పరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక మనుష్యుని పోలియున్నది.  మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను.''  ఇందులో ఒక మనుష్యుడు మంచి విత్తనములు విత్తుట జరిగిన తరువాత అతని శత్రువు వచ్చి గురుగులు అను చెడు విత్తనములు విత్తుట జరుగుచున్నది.  మత్తయి 13:28-29, ''-ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు-మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా?  అని అతనిని అడిగిరి.  అందుకతడు-వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు.''  ఈ విధముగా ఇది శత్రువు చేసిన పని.  ఈ మనుష్యుడు మంచి విత్తనములు విత్తాడు.  కాని వీని శత్రువు చెడ్డ విత్తనములు విత్తుట జరిగెను.  మత్తయి 13:37-39, ''అందుకాయన ఇట్లనెను-మంచి విత్తనము విత్తువాడు మనుష్యకుమారుడు; పొలము లోకము; మంచి విత్తనములు రాజ్యసంబంధులు; గురుగులు దుష్టుని సంబంధులు; వాటిని విత్తిన శత్రువు అపవాది; కోత యుగసమాప్తి; కోతకోయువారు దేవదూతలు.''  

        ఇందులో క్రీస్తు ప్రభువు దానికి అర్థమును వివరించాడు.  ఇందులో మంచి విత్తనములను మనుష్యకుమారుడు అని క్రీస్తు ప్రభువు విత్తుట జరిగింది. అనగా దైవరాజ్య సంబంధులు పొలము అను ఈ లోకములోకి పంపాడు.  అలాగే గురుగులు అనగా దుష్టుని సంబంధులు అనగా పాపపు జీవితములో జీవించువారు.  వాటిని విత్తిన శత్రువు అపవాది అని పతనము చెందిన దేవుని దూత.  ఇక్కడ ఒక సంశయము మనకు కలుగును.  అదేమిటంటే దేవుడు సమస్త మానవ జన్మకు కారణమైనప్పుడు సాతాను కొందరి పుట్టుకకు కారణమెలా అగును?  ఇందులో దేవుడైన యెహోవా అందరి జన్మకు కారణమగుచున్నాడు.  వీరిలో నీతి సంబంధులు మనుష్యకుమారునిగా చెప్పుకొన్న క్రీస్తు ప్రభువు సంబంధులు.  వీరిలో సువార్తను నాటినది క్రీస్తు ప్రభువే!  క్రీస్తు ప్రభువు నాటనిదే ఎవరును క్రీస్తు ప్రభువును అంగీకరించలేరు.  మత్తయి 13:37, ''అందుకాయన ఇట్లనెను-మంచి విత్తనము విత్తువాడు మనుష్యకుమారుడు;''  అలాగే దేవుడైన యెహోవా సృజించినవారిలో సువార్త విత్తనమును నాటినది క్రీస్తు ప్రభువు కనుక వీరు రాజ్య సంబంధులుగా ఉన్నారు.  కాని వీరి మధ్య దుష్టత్వమును సాతాను తన తలంపులద్వారా నాటుచున్నాడు.  క్రైస్తవ సంఘములో రెండు రకములవారు పెరుగుచున్నారు.  అలాగే ఈ లోకములో ప్రతి ప్రాంతములో రెండు రకములవారు ఉన్నారు.  ఇలా నాటినవారు మనుష్యకుమారుడు నాటిన సువార్తకు చేటుగా దాపురించియున్నారు.  వీరి వల్ల నాలుగంతలు పదింతలుగా పెరగవలసిన వారి ఆత్మీయ ఉన్నతి అక్కడితో ఆగిపోవుచున్నది.  కనుక మనుష్యకుమారునిగా చెప్పబడిన క్రీస్తు ప్రభువు అపవాది అను పతనము చెందిన దేవుని దూతను తన శత్రువుగా ఈ ఉపమానములో చెప్పుకొనుట జరిగింది.

102.  సాతాను క్రీస్తు ప్రభువును (పరిశుద్ధుని) వెంబడించుట

        ప్రియపాఠకులారా!  సాతాను క్రీస్తు ప్రభువును వెంబడించుచున్నాడు అంటే ఆశ్చర్యముగా లేదా!  నేను హెడ్‌లైన్‌ను ఈ విధముగా వ్రాసాను గాని సాతాను క్రీస్తు ప్రభువును శోధించుటకు తిరుగుచున్నాడని గ్రహించాలి.  అందుకే క్రీస్తు ప్రభువు - సాతానుకు నాకు ఎటువంటి సంబంధము లేదని చెప్పుచున్నాడు.  యోహాను 14:30, ''ఇకను మీతో విస్తరించి మాటలాడను; ఈ లోకాధికారి వచ్చుచున్నాడు.  నాతో వానికి సంబంధమేమియులేదు.''  ఇందునుబట్టి సాతానుకు క్రీస్తు ప్రభువుకు సంబంధమే లేనప్పుడు, సాతాను క్రీస్తు ప్రభువును వెంబడించుటలో ఉన్న ఉద్దేశ్యమేమిటో మనము గ్రహించవలసియున్నది.  క్రీస్తు ప్రభువు బాప్తిస్మము పొందిన తరువాత నలువది దినములు ఉపవాసము ప్రార్థనలో ఉన్నాడు.  ఈ కాలములో సాతాను క్రీస్తు ప్రభువును గమనిస్తూ తిరుగుచున్నాడు.  ఆ సమయములో సాతాను అవకాశము దొరికినప్పుడల్లా క్రీస్తు ప్రభువును శోధించుచూ వచ్చాడు.  

        లూకా 4:1-2, ''యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దానునదినుండి తిరిగి వచ్చి, నలువది దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాదిచేత శోధింపబడు చుండెను.  ఆ దినములలో ఆయన ఏమియు తినలేదు.  అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా'' ఇందులో నలువది దినములలో అనేకమార్లు క్రీస్తు ప్రభువును సాతాను శోధించుచూ వచ్చాడు.  అటుతరువాత క్రీస్తు ప్రభువును మూడు విధాలుగా చివరి ప్రయత్నముగా శోధించాడు.  లూకా 4:2-13లో ఈ మూడు విధములైన శోధనలు గూర్చి వివరము వ్రాయబడియున్నది.  ఈ మూడు విధములైన శోధనల తరువాత సాతాను కొంతకాలము ఆయనను విడిచి వెళ్ళినట్లుగా చెప్పబడింది.  లూకా 4:13, ''అపవాది ప్రతి శోధనను ముగించి, కొంతకాలము ఆయనను విడిచిపోయెను.''  ఇందులో కొంతకాలము అని మాత్రమే చెప్పబడినది.  అంటే సాతాను కొంతకాలము తరువాత మరల శోధించు అవకాశము కొరకు క్రీస్తు ప్రభువును మళ్ళీ వెంబడించినట్లుగా మనము గ్రహించాలి.  ఈసారి సాతాను క్రీస్తు ప్రభువును ఇశ్రాయేలీయులలోని శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సుంకరులు మొదలైన వారిచే అనేక రీతులుగా చిక్కు ప్రశ్నలు వేయించుట, రాళ్ళతో క్రీస్తు ప్రభువును కొట్టుటకు ప్రేరేపించుట మొదలైన రీతులుగా సాతాను ప్రయత్నించాడు.  క్రీస్తు ప్రభువు ఇందుకు ప్రతిగా మారు మాట్లాడనీయని రీతిలో సమాధానాలు చెప్పాడు.  అలాగే సమాజమందిరముల నుండి ఎవరికి తెలియకుండ తప్పించుకొని బయటకు వచ్చుట జరిగింది.  ఈ విధముగా అదృశ్యములో సాతాను అతని దూతలు క్రీస్తు ప్రభువును శోధిస్తూ ఆయనను వెంబడిస్తూ ఉన్నాయి.  వెంబడించుట క్రీస్తు ప్రభువును అనుసరించుట కాదని గుర్తించాలి.  సాతాను వెంబడించుట క్రీస్తు ప్రభువును పతనము చెందించుటకని గుర్తించాలి.  ఇలా కొంతకాలము గడిచింది.  చివరకు క్రీస్తు ప్రభువు తన బలియాగమును గూర్చి తన శిష్యులకు తెలియజేయునప్పుడు సాతాను అదృశ్యములో ఉండి పేతురులో చేరి క్రీస్తును వెంబడించి ఆయనను నివారింప చూచాడు.  

        మార్కు 8:31-33, ''మరియు మనుష్య కుమారుడు అనేక హింసలుపొంది, పెద్దల చేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను ఉపేక్షింపబడి చంపబడి, మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప నారంభించెను.  ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను.  పేతురు ఆయన చేయిపట్టుకొని ఆయనను గద్దింపసాగెను  అందుకాయన తన శిష్యులవైపు తిరిగి, వారిని చూచి -సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను.''  ఇదే సంగతిని మనము మత్తయి 16:21-28లో కూడ చదువగలము.  ఈ విధముగా సాతాను పేతురును అదృశ్యములో ఆవరించి బలియాగమును జరపవద్దని క్రీస్తు ప్రభువును నివారింపజూసాడు.  కనుకనే పేతురూ!  ఛీ, ఫో అని అనలేదు.  సాతానును ఛీ!  ఫో!  అనుట జరిగింది.  ఈ విధముగా స్వయముగా క్రీస్తును బాప్తిస్మము తరువాత సాతాను శోధించాడు.  అటుతరువాత యూదులు పరిసయ్యులు ఇశ్రాయేలీ వగైరా ప్రజల ద్వారా జరిగించాడు.  చివరకు క్రీస్తు శిష్యులలో ప్రధాన శిష్యుడైన పేతురును ఆవరించి శోధించాడు.  ఇక యూదా ఇస్కరియోతును సాతాను ఆవరించి క్రీస్తును పట్టించుట జరిగించాడు.  యోహాను 13:26-27, ''అందుకు యేసు-నేనొకముక్క ముంచి యెవని కిచ్చెదనో వాడే అని చెప్పి, ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను; వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను.  యేసు-నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా''  ఈ విధముగా యూదాను ఆవరించి క్రీస్తు ప్రభువును పట్టించుట సాతాను చేయగలిగాడు.  చివరకు యూదా మత పెద్దలు పరిపాలకులచే క్రీస్తు ప్రభువుకు మరణ దండన విధించునట్లుగా చేయగలిగాడు.  ఈ విధముగా సాతాను నిరంతరము క్రీస్తు ప్రభువును శోధించుటకు ఆయనను వెంబడించుట చేసాడు.  క్రీస్తు ప్రభువు విషయములోనే ఇంతగా జరిగింది అంటే మనలాంటి వారి పరిస్థితి ఏమిటి?  అందుకే పేతురు క్రైస్తవులనందరిని హెచ్చరిస్తూ - 1 పేతురు 5:8, ''నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.''  కనుక సాతాను విషయములో బహు జాగరూకులమై యుండవలెనని గ్రహించాలి.

        ప్రభువు సమక్షములో ప్రభువు తన హస్తముతో తన దివ్య శరీరముతో సమత్యులమైన రొట్టె తన దివ్య రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షారసములో ముంచి యూదా చేతికిచ్చిన వెంటనే అపవాది వానిలో ప్రవేశించినాడంటే ఇందునుగూర్చి పాస్టర్లు పాదర్లు ఇచ్చే బల్ల భోజనములో రొట్టె ముక్కను పుచ్చుకొనునప్పుడు జాగ్రత్తపడవలసి ఉంది.  సాతాను ప్రవేశించుటకు ముఖ్య కారణము అతని హృదయములో ధనాశ చోటు చేసుకొని ఉంది.  యేసు ప్రభువు సిలువ బలియాగము నెరవేర్చబడాలంటే యూదాయే యోగ్యుడు.  అట్టి యోగ్యత కలుగుటకు కారణము యూదా గోత్రము మోషే వల్ల ఆశీర్వదించబడింది.  యూదా గోత్రములో క్రీస్తు జన్మించి యూదా గోత్రపు సింహమైనాడు.  కనుక ఇటు క్రీస్తు శిష్యుడైన యూదా అటు సాతాను ఇద్దరి వలన ప్రభువు బలియాగము నెరవేర్చబడాలి.  ప్రభువు సిలువ బలియాగము నెరవేర్చినప్పుడు యూదా ప్రభువు సిలువలో మరణించుట చూచి తన ధనాశను వదలి వెండి నాణెములను దేవాలయములో వెదజల్లి తన ప్రాణములు సైతము ఘోరమైన స్థితిలో వదలి ప్రభువు సన్నిధిలో చేరగలిగే యోగ్యత సంపాదించుకున్నాడు.  మరి మన గతి ఏమిటి?  ప్రభువు బల్లను ఆచరించాలంటే మనలో ఏ ఆశావ్యామోహాలుండకూడదు. మన సహోదరునితో ఏ విధమైన విరోధ భావమున్నట్లు జ్ఞాపకము వచ్చిన యెడల ప్రభువు బల్లను విడిచి వెళ్లి మొదట నీ సహోదరునితో సమాధానపడవలెనని మత్తయి 5:24లో ప్రభువు పలికెను.  అట్లు గాకుండ నిర్లక్ష్యముగా ప్రభువు బల్లను ఆచరిస్తే 1 కొరింథీ 10:21లో చెప్పబడినట్లు ప్రభువు పాత్రను దయ్యము పాత్రగా మార్చినవాడవగుదువు.  ఇందునిమిత్తముగా నీవు అపవిత్రతకు అప్పగించబడి భయంకరమైన నరకాగ్నిపాలు కావలసి వస్తుంది.

        ఈ విధముగా క్రీస్తు ప్రభువులోని దైవత్వాన్ని మ్రింగివేసి పాపములోనికి నెట్టుటకు తనకు సాధ్యమైనన్ని రీతులుగా ప్రయత్నించినట్లుగా మనము గ్రహించవలసియున్నది.  అయినను క్రీస్తు ప్రభువు ఏ తప్పు చేయక నీతి ననుసరించి జీవించాడు.  ఇలా సాతాను ప్రతి ఒక్కరి విషయములో జరిగిస్తాడు.  ఇలా జరిగించినప్పుడు వానికి లొంగక వానిపై విజయము సాధించినవారిని అతిపరిశుద్ధులని అంటారు.  వీరి లెక్క 1,44,000 మంది అని చెప్పబడియున్నది.  

        ప్రకటన 14:1-4, ''మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను.  ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతో కూడ ఉండిరి.  మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములోనుండి రాగా వింటిని.  నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది.  వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు; భూలోకములోనుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగువేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు.  వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు; వీరు దేవుని కొరకును గొఱ్ఱెపిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు.''  వీరిని సజీవులు అని చెప్పుదురు.  ఇక సాతాను శోధనకు అప్పుడప్పుడు లొంగుచూ తిరిగి క్రీస్తు నామమందు క్షమాపణ పొంది దేవునిలో మరణించినవారు.  వీరు క్రీస్తు ప్రభువు ఇచ్చిన క్షమాపణను ఉపయోగించుకొని దేవునిలో మరణించువారు.  వీరి ఆత్మ క్రీస్తు రాకడ వరకు ఉత్తరించు స్థలములలో ఉంటూ క్రీస్తు రాకడ కాలములో తిరిగి సజీవులుగా లేపబడుదురు.  

        ప్రకటన 20:3-6, ''ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను; అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెను.  అంతట సింహాసనములను చూచితిని; వాటి మీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను.  మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని.  

        వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.  ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుకలేదు; ఇదియే మొదటి పునరుత్థానము.  ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు.  ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.''  ఇందులో క్రీస్తు రాకడ కాలములో పునరుత్థానము జరిగినను తిరిగి సజీవులుగా మారక ఉన్నవారు కూడా ప్రకటన 20:3-6లో చెప్పబడింది.  వీరికి క్రీస్తు ప్రభువు ఇచ్చిన పాపక్షమాపణ అను అవకాశము కూడా సద్వినియోగము చేసుకోనివారు.  వీరిని సాతాను అన్ని విధాలుగా శోధించి వారిని ప్రతి విషయములో వారిని ఓడించి యున్నాడు.  కనుక వీరు సజీవులుగా లెక్కింపబడుట లేదు.  

        ఇలా 1 పేతురు 5:8లో చెప్పబడినట్లుగా సాతాను ఎవరిని మ్రింగుదునా అని గర్జించు సింహమువలె తిరుగు చున్నట్లుగా మనకు అర్థమగుచున్నది.  కనుక సాతాను క్రీస్తు ప్రభువుని (పరిశుద్ధుని) వెంబడించుచూ వారి ఆత్మీయ జీవితములో పతనము చెందుటకు వారిని వీలైనన్ని విధాలుగా శోధించుచున్నాడు.  ఈ శోధన దృశ్యరూపములో వచ్చునని మనము గ్రహించాలి.  కాని శోధించువారు అదృశ్యరూపములో ఉన్నను శోధనా కార్య క్రమము దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకముగా మనలను నడిపించుటకు దృశ్య రూపములో వచ్చునని మనము గ్రహించాలి.

        యోబు విషయములో అపవాది కార్యాలు సేవకులను చంపి గాడిదలను కాపరులను చంపి ఒంటెలను దొంగిలించుట - హత్య దోపిడీలు అపవాది కార్యాలు.  గొర్రెలను పనివారిని దహించుట, సుడిగాలి రూపములో ఇంటిని కూల్చి యోబు సంతతిని నిర్జీవులుగా చేయుట ఇవి దేవుడు జరిగించినవి.  అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతో మొత్తుట - ఇదియు అపవాది కార్యము.  దేవుడు అపవాది అదృశ్యరూపములో ఉండి దృశ్యరూపములో యోబు పట్ల జరిగించిన శోధన - పరిశోధన క్రియలు.

103.  సాతాను క్రీస్తు ప్రభువును గద్దింప చూచుట!

        ప్రియపాఠకులారా!  సాతాను క్రీస్తు ప్రభువుని గద్దించుట ఇది జరిగే పనేనా!  క్రీస్తు ప్రభువును చూడగానే వణికే పతనము చెందిన దేవుని దూతలు ఇలా చేయలేవు.  అంతేకాదు క్రీస్తు ప్రభువుని వాటంతట అవి ఎటువంటి పరిస్థితులలో ఆయనను గద్దింపలేవు.  ఆయన ముందు కనీసము నిలువనైన నిలువలేవు.  

        అలాంటి అవకాశము కొరకు ఎదురు చూస్తూ క్రీస్తు ప్రభువును గద్దించాలని క్రీస్తు ప్రభువు చుట్టూ తిరుగుచున్నాడు.  ఇలా కాచుకొని కూర్చున్న సాతానుకు పేతురు ద్వారా ఈ అవకాశము వచ్చింది, ఎందుకంటే తాను స్వయముగా చేయలేడు కనీసము క్రీస్తు ప్రభుని ముందు నిలువలేడు కనుక నరులలో ప్రవేశించి వారి ద్వారా తన కోర్కెను తీర్చుకోవాలని తలంచాడు.  ఆ అవకాశము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు.  మార్కు 8:27-30, ''యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలుదేరెను.  మార్గములో నుండగా-నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యుల నడిగెను.  అందుకు వారు-కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు, మరి కొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి.  అందుకాయన-మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారినడుగగా పేతురు-నీవు క్రీస్తు వని ఆయనతో చెప్పెను.  అప్పుడు తన్నుగూర్చిన యీ సంగతి ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను.''  

        ఈ విధముగా శిష్యులు రకరకాలుగా చెప్పగా పేతురు మాత్రమే మత్తయి 16:16 సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు ప్రభువని పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పాడు.  అటుతరువాత తన శిష్యులకు తన బలియాగమును సిలువ శ్రమలను గూర్చి ముందుగా తెలియజేసాడు.  మార్కు 8:31, ''మరియు మనుష్యకుమారుడు అనేక హింసలుపొంది, పెద్దల చేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను ఉపేక్షింపబడి చంపబడి, మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప నారంభించెను.''  ఈ విధముగా క్రీస్తు ప్రభువు తాను పొందబోవు సిలువ బలియాగమును గూర్చి చెప్పగా, సాతాను పేతురులో అదృశ్యములో ప్రవేశించి తన ఆలోచనలను పేతురు హృదయములో పుట్టించి వానిచే క్రీస్తు ప్రభువును గద్దించాడు.  

        మార్కు 8:32, ''ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను.  పేతురు ఆయన చేయిపట్టుకొని ఆయనను గద్దింపసాగెను.''  ఈ గద్దింపు దృశ్య రూపములో పేతురు మామూలుగా గాక క్రీస్తు ప్రభువుని చెయ్యి పట్టుకొని మరి గద్దిస్తున్నాడు.  కాని అదృశ్యములో క్రియ జరిగించుచున్నది సాతాను అను పతనము చెందిన దేవుని దూత కనుక సాతానును క్రీస్తు ప్రభువు గుర్తించి పేతురును ఏమి అనక సాతానును వెనుకకు పొమ్ము అని చెప్పుట జరిగింది.  

        మత్తయి 16:23, ''అయితే ఆయన పేతురు వైపు తిరిగి-సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపయున్నావని పేతురుతో చెప్పెను.''  అలా సాతాను అదృశ్యములో జరిగించుచున్నదని గ్రహించిన క్రీస్తు ప్రభువు సాతానును వెనుకకు పొమ్మని మొదట చెప్పి తరువాత పేతురును గద్దించాడు.  అంటే సాతానుకు అవకాశము ఇచ్చినందుకు ఈ గద్దింపు క్రీస్తు ప్రభువు పేతురుతో అనుట జరిగింది.  కాని సాతానును వెనుకకు పొమ్మని చెప్పాడేగాని గద్దించలేదు, ఎందుకంటే సాతానుకు శోధించుటయే పని.  ఈ పనిని వాడు నెరవేర్చుచున్నందున సాతానును వెనుకకు పొమ్మని, శోధనకు లొంగిన పేతురును క్రీస్తు ప్రభువు గద్దించుట జరిగినట్లుగా మనము గ్రహించాలి.

104.  సాతాను అను పతనము చెందిన దూత యొక్క రెండవ పతనము - విశ్వాసులు కాళ్లతో త్రొక్కుట

        ప్రియపాఠకులారా!  ఈ సృష్టికి ముందు సాతాను పతనము జరిగింది.    యెషయా 14:12-13, ''తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి?  జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?  -నేను ఆకాశమున కెక్కిపోయెదను  దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును  ఉత్తర దిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును.''  ఇలా ఆలోచించి నేలమట్టము వరకు తన పతనమును సాతాను పొందాడు.  అటుతరువాత తనతోబాటుగా దైవ వ్యతిరేకతను చూపిన దూతలను తన దూతలుగా చేసుకొని నరులను విగ్రహ దేవతలుగా మోసము చేస్తూ వారిని సంపూర్ణముగా నాశనమునకు అప్పగిస్తూ వస్తున్నారు.  ఈ విధముగా నోవహు కాలము నాటికి అందరు దేవుని మరచి అక్రమ సంబంధము కాముకత్వముతో బలాత్కారము చేయబడ్డారు.  అటుతరువాత వచ్చినవారిలో నుండి ఇశ్రాయేలీయులను తన వారిగా చేసుకొనినను వారు సాతాను ఏర్పరచిన విగ్రహ దేవుళ్ల మాయలో పడుతూ లేస్తూ పాతనిబంధన కాలమంతము జరిగిపోయింది.  ఇక నూతన నిబంధన కాలమునకు విశ్వాసమన్నది శూన్యతకు వచ్చినట్లుగా మనము గ్రహించాలి.  ఈ స్థితిలో క్రీస్తు ప్రభువు కొందరిని శిష్యులుగా చేసుకొని సువార్తను కొనసాగించాడు.  అంటే అదృశ్యములో ఉన్న సాతాను అతని దూతలు చేసిన మోసముపై యుద్ధమే కదా!  ఈ యుద్ధములో క్రీస్తు ప్రభువు తన వారినిగా కొందరిని ఏర్పరచుకొని సాతాను అతని దూతలను కొలుచుచున్న వారికి సువార్తను బోధింపమని చెప్పి పంపాడు.  

        లూకా 10:1, 17-19, ''అటుతరువాత ప్రభువు డెబ్బదిమంది యితరులను నియమించి, తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతిచోటికిని తనకంటె ముందు ఇద్దరిద్దరినిగా పంపెను.  . . .  ఆ డెబ్బదిమంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి-ప్రభువా, దయ్యములు కూడ నీ నామమువలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన-సాతాను మెరుపువలె ఆకాశమునుండి పడుట చూచితిని.  ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీ కెంతమాత్రమును హానిచేయదు.''  ఇందులో శిష్యులు ప్రభువు నామములో దయ్యములు లోబడుచున్నవని చెప్పినప్పుడు, క్రీస్తు ప్రభువు - సాతాను మెరుపువలె ఆకాశమునుండి పడుట చూచుచున్నానని చెప్పుచున్నాడు.  ఇందునుబట్టి శిష్యులు చేయబోవు సువార్త కార్యము చాలా గొప్పది.  అలాగే వారిలో విశ్వాసము కలిగియున్నారు కనుక దయ్యములు సైతము పారద్రోలగలుగుచున్నారు.  ఈ స్థితి వలన క్రీస్తు పునరుత్థానము తరువాత వీరు అదే స్థితిని కొనసాగించి, సువార్త కార్యమును జరిగించుట ద్వారా సమస్త జనులలో పూజింపబడుచున్న సాతాను ఆకాశము  అంత ఎత్తునకు వెళ్లియున్నాడు.  అక్కడనుండి మెరుపువలె క్రిందకు అనగా నేలమట్టము వరకు పడబోవుచున్నాడని చెప్పుచున్నాడు.  అతని స్థితి ప్రాబల్యము క్రీస్తు ప్రభువు కాలము తరువాత కోల్పోయినట్లుగా మనము గ్రహించాలి.  ఈ కాలములో నిజదైవ రూపమైన క్రీస్తు ప్రభుని పాబల్యము పెరిగినట్లుగా మనము గ్రహించాలి.  ఆ విధముగా సాతానును ఆకాశము నుండి క్రింద పడునట్లు చేసిన డెబ్బదిమంది శిష్యులు సాతాను అను క్రీస్తు ప్రభుని శత్రువుపై సంపూర్ణ అధికారము కలిగి వాని దూతలైనవారు అనగా పాములుగా తేళ్లుగా పిలువబడినవారిని వీరు అణగద్రొక్కి వాటిని ఓడించి క్రీస్తు రాజ్యమును స్థిరమైన పునాదులతో ఏర్పరచగలిగారు.  లూకా 10:19, ''ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీ కెంతమాత్రమును హానిచేయదు.''   ఇదే విషయమును పౌలు రోమీయులకు రాసిన పత్రికలో చెప్పుచున్నాడు.  రోమా 16:20, ''సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును.  మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక.''  క్రీస్తు ప్రభువు డెబ్బదిమంది శిష్యులతో ఏమైతే అన్నాడో, పౌలు కూడ రోమా ప్రాంతములో మారుమనస్సు పొంది క్రీస్తు ప్రభువుని విశ్వసించినవారితో పౌలు పై విధమైన మాటలు చెప్పుట జరిగింది.  త్వరలోనే దేవుడు మీచే సాతానువంటి పతనము చెందిన దూతను త్రొక్కించునని చెప్పుచున్నాడు.  రోమా 16:20.  ఇలా సాతానును త్రొక్కాలంటే విశ్వాసముతో జీవిస్తూ సువార్తను కొనసాగించాలని మనము గుర్తించాలి.

105.  క్రీస్తు ప్రభువుకు బెలియాలుతో (దేవుని దూతలలో పతనము చెందినవారితో) పొత్తు ఎక్కడ?

        ప్రియపాఠకులారా!                క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడని అందరికి తెలిసిన విషయమే.  అయితే బెలియాలు ఎవరు?  ఇది పతనము చెందిన దేవుని దూత.  ఈ దూత ఈ సృష్టికి ముందే పతనము చెంది దైవవ్యతిరేక క్రియలను జరుపుచున్నాడు.  ఇలాంటి వీరిద్దరికి ఒకరితో ఒకరికి ఏమన్నా సంబంధము ఉంటుందా?  ఇదే ప్రశ్నను పౌలు తన లేఖలో వ్రాస్తున్నాడు.  2 కొరింథీ 6:14-16, ''మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి.  నీతికి దుర్ణీతితో ఏమి సాంగ్యము?  వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?  క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము?  అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?  దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక?''  ఇందులో చాలా ఖచ్చితమైన ధోరణిలో పౌలు చెప్పుట జరిగింది.  ఇందులో నీతికి దుర్ణీతికి ఏమి సాంగత్యము?  అని అడుగుచున్నాడు.  నీతిని దుర్ణీతిని వేరు చేసి చెప్పునది ధర్మశాస్త్రము మాత్రమే.  అంటే ఈ రెంటికి మధ్య వారధిగా ధర్మశాస్త్రము ఉన్నది.  కనుక ధర్మశాస్త్రము సంబంధముగా కలిగిన నీతి దుర్ణీతి రెండు, రెండు దారులు.  ఒకటి జీవములోనికి  తీసుకొనిపోతే రెండవది రెండవ మరణమునకు మార్గము.  ఇక వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?  వెలుగు పగలు ఉంటే చీకటి రాత్రి ఉంటుంది.  ఈ రెంటిని కలిపి ఒక దినముగా లెక్కిస్తారు.  ఇదే రెంటి మధ్య పొత్తు.  వెలుగు చీకటి రెండు వేరువేరు సమయములలో వచ్చినను వాటి మధ్య పొత్తు  లేనట్లుగా మనము గ్రహించాలి.  దినములో రెంటిని లెక్కించినను వెలుగు పగలుగాను చీకటి రాత్రిగాను లెక్కించినను అవి ఒకటి ఉన్నప్పుడు రెండవది ఉండదు.  క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము?  ఒకరు దేవుని కుమారుడు ఇంకొకరు దేవుని దూత కాని పతనము చెందినవారు.  వీరికి సంబంధము దేవుడే.  ఒకరు నీతిని జరిగిస్తూ ఉన్నారు ఇంకొకరు నరులను దేవుని నుండి దూరపరుస్తూ నాశన మార్గములో నడిపించుచున్నాడు.  అయితే ఇలాంటి క్రీస్తు ప్రభువుకు బెలియాలుతో ఏమి సంబంధము?  వీరిద్దరు దేవునివారే కదా!  బెలియాలు అను దేవుని దూత పతనము చెందినప్పటికి దాని సృష్టికర్త దేవుడే కదా!  అలాగే దేవుడు క్రీస్తు రూపములో భూమిపై జన్మించలేదా!  ఈ రెండింటికి సంబంధము లేదా!  ఇక అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడ?  2 కొరింథీ 6:15.

        ఇందులో పెండ్లిలో పొత్తును కలిగియున్నారు కదా!  అంతేగాక వీరిద్దరికి సృష్టికర్త దేవుడే కదా!  ఇక దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక?  అని అడుగుచూనే దేవుని ఆలయములో అనగా యెరూషలేము దేవాలయములో కెరూబులను చెక్కలేదా?  వాటితోబాటుగా దేవదూత ఆకారములు చెక్కించలేదా?  ఇక్కడ మనము ఒక్క విషయమును గుర్తించాలి.  ఈ కెరూబులుగాని దేవదూత ఆకారములుగాని వీటిని దేవునిగా ఎవరు చెప్పరు.  అనగా ఈనాడు చర్చీలలో ఉన్న అనేక బొమ్మలు ఉన్నను వాటిని దేవునిగా ఎవరు చెప్పరు.  కొందరిని దేవుని భక్తులుగాను, క్రీస్తు ప్రభువు తల్లిగాను, క్రీస్తు ప్రభువును దేవుని కుమారుని రూపముగాను చెప్పుదురు.  ఒక్క క్రీస్తు ప్రభుని మాత్రమే దేవునిగా చెప్పుదురు.  కాని విగ్రహములు పతనము చెందిన దేవుని దూతలచే ఏర్పడి, నరులచే దేవునికి చెందవలసిన ఆరాధనను ఇవి పొందుచున్నాయి.  ఇలాంటివాటిని విగ్రహములని ఇలాంటి ఆరాధనను విగ్రహారాధనని చెప్పబడుచున్నవి.  వీటి పొందిక ఒక ఆరాధనలో వస్తున్నది.  విశ్వాసులు దేవున్ని ఆరాధిస్తే అవిశ్వాసులు విగ్రహాలను ఆరాధిస్తున్నారు.

        విగ్రహారాధనను బైబిలు ఖురానే షరీప్‌ వగైరా మత గ్రంథాలే గాక శ్రుతులు ఉపనిషత్తులు వేమనలాంటి యోగపురుషులు ఖండిస్తున్నను మూడు పువ్వులు ఆరు కాయలుగ ప్రపంచవ్యాప్తముగా విస్తరించిపోతున్నది.  ఈ విగ్రహారాధన సృష్టి-సృష్టములతో తమ చేతులతో చేసుకొన్న బొమ్మలతోను తాము అల్లుకొనిన పుక్కిటి పురాణాలతోను సకల జాతి జనులను ఆకట్టుకొంటుంది.  విగ్రహారాధనన్నది సర్వజనులకు ఒకే ఆచారము.  ఒకే విధమైన కల్పనా కథలతో కూడినవియై యుంటున్నది.  కాని వారి వారి భాషలను వేర్వేరుగా కనబడుచున్నవి.  కాని సిద్ధాంతాలంతా ఒక్కటే.  యూదులు ఇశ్రాయేలీయులు సృష్టికర్తను యెహోవా యనియు ముస్లీములు అల్లా అనియు కొలుస్తున్నారు.  కాని ఆయనకు విగ్రహము లేదు.  క్రైస్తవులు సృష్టికర్తకు ప్రతిరూపమైన నరుల మధ్య నిరసించిన నరావతారమైన యేసును విగ్రహ రూపములోను సిలువ రూపములోను కొందరు ఆరాధిస్తున్నారు.  ఎందుకంటే ఆయన సశరీరుడుగా జన్మించాడు.  కాబట్టి విగ్రహారాధన సమంజసమే అయినను క్రైస్తవులు చేసేది విగ్రహారాధన కాదు.  ఫలపుష్ప నైవేద్యాలతోను వివిధ రకాలైన నైవేద్యాలతో ఆయనను ఆరాధించరు.  క్రైస్తవుల ఎదుట విగ్రహమున్నను వారు యోహాను 4:24లో వలె ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తారు.  యూదులు ఇశ్రాయేలు ముసల్మానులు క్రైస్తవులు తప్పించితే మిగతా ఏ జాతి జనులైనను ఏ దేశవాసులైనను వారు విగ్రహాల మీదనే ఆధారపడి లెక్కింప వీలుగాని దేవీ దేవతలను సృష్టించుకొని ఏది దేవుడో?  ఏది దయ్యమో?  తెలియని రీతిలో అజ్ఞాన ఆరాధన కొనసాగిస్తున్నారు.  ఈ అన్యుల అజ్ఞాన ఆరాధనకు పునాది బాబేలు మహానగరము.  ప్రకటన 17:5.  వారి వారి భాషలను బట్టి బాబిలోనియన్ల విగ్రహారాధన ప్రపంచ వ్యాప్తముగా విస్తరించింది.  ఎట్లంటే ఆదికాండము 11:9.  బబులోను వాసుల భాషలను మార్చి ప్రపంచ నలుదెసల ఆ ప్రజలను యెహోవా చెదరగొట్టెను.  అక్కడనుండి వచ్చినవారే హిందూ దేశములోని ద్రావిడులు ఆర్యులు ముస్లీములు ఆంగ్లేయులు బ్రిటీష్‌వారు మొదలైనవారు.  వారు వస్తూ వస్తూ వారి ఆచారాలు ఆరాధనలు వేషభాషలు మొదలైనవన్నియు మనకు వారసత్వముగా వచ్చాయి.

        ఇందుకు ఉదాహరణగా కొన్ని విధములైన ఆరాధనలను గూర్చి తెలుసుకొందము.  అష్టారోత్‌ ఈమె ఆకాశరాణి అష్తారైత్‌ నక్షత్రాలు సొలొమోను దీని ఆరాధనను యెరూషలేమునకు తెచ్చాడు.  సీదోనీయులు పేనీకేయులు అష్టూరీయులు సూర్యుని పురుషునిగాను చంద్రుని స్త్రీనిగాను ఆరాధించారు.  సూర్యునిచే సూచింపబడిన పురుష శక్తి బయలనియు చంద్రునిచే పూజింపబడు శక్తి స్త్రీ శక్తి అష్తారోతు, కెమోషు జయశాలి.  దీనిని మోయాబీయులు అమ్మోనీయులు ఆరాధించారు.  అర్తెమి ఈ దేవతకు గ్రీకు నామము చంద్రునికి సంబంధించినది.  డయానా అన్నది లాటిన్‌ నామము.  ఈమె పొలములకు అడవులకు అధి దేవత ముఖ్యముగా వేటాడునది కనుక దాని ఆకారము విల్లు బాణములు ధరించిన స్త్రీ రూపము.  హిందూ దేశమున పాడిపంటలకు సూచించు శక్తిగా ధాన్యాల క్రియని మన దేశములో లక్ష్మికి మహాలక్ష్మియని బిరుదున్నట్లుగానే ఈ దేవతకు మహాదేవియని బిరుదు కలదు.  ఈ దేవి ద్యుపతి అనగా ఆకాశము నుండి పడినట్లు వారు నమ్మిరి.  మిల్కోము రాజు అమ్మోనీయుల దేవత మల్కోము - మోలెకు దీనికి సంబంధించిన పేర్లు.  ఈ దేవతకు సొలొమోను ఒలీవ కొండ మీద ఒక గుడి కట్టించెను.  అర్యోకు ఆకాశరాణియైన చంద్రునికి సేవకుడు.  అషేరా పేనీయుల కనానీయుల దేవతయైయున్నది.  హిందువుల లింగారాధనకు సంబంధించింది.  దాగోను ఫిలిష్తీయుల దేవత.  ఈ విగ్రహము యొక్క తల చేతులు మొండెము మానవాకారము, క్రింది భాగము చేప ఆకారము.  మొలెకు - ఇది అమ్మోనీయుల దేవత మోలోకు, మిల్కోము, మల్కోము దీని ఉపనామాలు.  సొలొమోను ఒలీవల పర్వతము మీద మొలెకునకు ఒక ఉన్నత స్థలమును నిర్మించెను.  1 రాజులు 11:2.  ఈ విగ్రహమునకును మనుష్యునికి వలె చేతులు కాళ్లు మొండెము ఉంటుంది.  దూడ తలయు కిరీటము ఉంటుంది.  విగ్రహము యొక్క చాపియున్న చేతులు ఎర్రగా కాల్చి ఆ చేతులలో తాము మ్రొక్కుకున్న పసిబిడ్డలను ఆ చేతులలో ఉంచుదురు.  ఆ బిడ్డల యొక్క చావుకేకలు వినబడకుండునట్లు వారు వాయిద్యాలతో గొల్లు చేయుదురు.

        నెబో దేవత హిందువుల సరస్వతి దేవివలె విద్యకు దేవత - ఇది గ్రీకువారి హెర్మే దేవత వలె వార్తలు తెలుపునది.  యెషయా 46:1.   బబులోను వారి మరికొన్ని దేవతలు 2 రాజులు 17:29-31 చంద్ర దేవత సీను కామ దేవత ఇష్టారు, మార్టూరు బోర్సిప్పా, నాబూ, బెల్‌ తెగుళ్ల దేవతయగు నెర్గల్‌ అమావాస్య దేవత నుస్కు ఈ దేవతల స్తోత్రమును తెలుపు కీర్తనలు చాలా కలవు.  వాటికిని హిందువుల వేదములకు చాలా సంబంధము కలదు.  2 రాజులు 17:16-17 కోడె దూడల విగ్రహాలను పూజించిరి.  ఆషేరా విగ్రహాలు ఆకాశములోని నక్షత్రాలకు, తమ కొడుకులను కుమార్తెలను అన్య దేవతలకు బలి ఇచ్చిరి.  జ్యోతిష్కులను సంప్రదించిరి.  వారిని దయ్యములు బాధింపకుండు

నట్లు మంత్రముల మీద నమ్మకముంచిరి.  సోదె చెప్పువారు మంత్రగాళ్లు  ఎక్కువగా ఉండేవారు.  ఇది హిందువుల మతము వంటిదై యుండెను.  యెషయా 47:9 నీ మాంత్రిక విద్యలు నీ శాటనిక్‌ తంత్రములు నిన్ను ఆదుకోలేవు.  యెషయా 19:3.   ఐగుప్తీయులు విగ్రహాలను మాంత్రికులను సోదె చెప్పువారిని మృతులను ఆవాహనము చేయువారిని సంప్రదింతురు.  ఇందునుబట్టి ప్రపంచ వ్యాప్తముగా విగ్రహారాధనన్నది భాషలను బట్టి నామధేయాలు మారినను వారి ఆచారాలు సాంగ్యాలు దురాచారాలు ఒకటేయని తెలుస్తున్నది.  

        ఈ విధముగా ఒకటితో ఇంకొకటికి సంబంధము కలిగినట్లుగా కనబడినను రెండింటి దారులు వేరు వేరు.  ఒకటి తూర్పుకు పోతుంటే రెండవది పడమరకు పోవును.  ఇవి రెండు వేరు వేరు క్రియలు.  వీటి క్రియలు వేరు వేరు అయినప్పటికి మొదటిది ఎత్తి చూపాలంటే రెండవది అవసరత ఉన్నది?  ఈయన అందరికంటే మంచివాడు అంటే మిగిలినవారిలో ఏదో కొంత చెడు ఉన్నట్టే కదా!  ఈ మంచి చెడును బట్టి నిర్ణయమగును.  అలాగే దుర్ణీతిని బట్టి నీతికి విలువ పెరుగుతుంది.  పతనము చెందిన బెలియాలు వంటి దూతలు వల్లే క్రీస్తు ప్రభువునకు నిజ దైవరూపమని గుర్తింపు కలిగింది.  అంటే మిగిలినవి అబద్ధ రూపములు అని చెప్పక నిజదైవరూపము క్రీస్తు రూపమని మనము చెప్పుచున్నాము.  అలాగే అవిశ్వాసి విగ్రహారాధికునిగా అన్య దేవతలను పూజిస్తే విశ్వాసి క్రీస్తు ప్రభువును ఆరాధించుచున్నాడు.  ఈ విధముగా పతనము చెందిన స్థితిని గుర్తించి ఉన్నత స్థితిలోనికి నరులు వచ్చుటకు ప్రయత్నిస్తున్నట్లుగా మనకు అర్థమగుచున్నది.  ఈ రెండింటికి పొత్తు లేకపోయినను గుర్తింపు మాత్రమే పతనము చెందినదానిని బట్టి నిజమైనదానికి కలుగుచున్నట్లుగా మనము గ్రహించాలి.  

        1 కొరింథీ 12:2, ''మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును.''  ఈ విధమైన స్థితిని గుర్తించి అనగా బెలియాలుతో ఉన్నామని గుర్తించి ఇది తప్పు అని గ్రహించి చివరకు క్రీస్తు ప్రభునిలోకి వస్తున్నట్లుగా మనము గ్రహించాలి.  ఇదే వీటి మధ్య పొత్తు నిజ స్థితికి నిజమైన గుర్తింపు, ఎప్పుడైతే నరులు ఇది అబద్ధమని గ్రహించి నిజ స్థితిలోనికి వచ్చుటయేనని మనము గ్రహించాలి.

106.  అపవిత్రాత్మలు అనగా పతనము చెందిన దేవుని దూతలు క్రీస్తు ప్రభువును తమని శిక్షించవద్దని వేడుకొనుట

        ప్రియపాఠకులారా!  దేవునికి కోపము తెప్పిస్తే ఎవరికైనను శిక్ష తప్పదు.  ఆయన ఎంత ప్రేమాస్వరూపియో అంత దుర్జన ద్వేషుడు లేక అంత భక్తిహీనులకు శత్రువు.  అలాగే తప్పు చేసినవారు ఎవరైనను శిక్ష అనుభవించవలసినదే.  యెషయా 14:12-13, ''తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి?  జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?  -నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును  ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును.''  ఈ విధముగా భావించి దాని కోసము పోరాడి పతనమును పొందారు.  ఒకసారి పాపము చేసి నేలమట్టుకు అధికారమును కోల్పోయిన పతనము చెందిన దూతలు ఇప్పుడు దేవుని గుర్తించి నీతిగా బ్రతకవలసియున్నది.  కాని వీరు ఇంకా దేవుని ధిక్కరించి ఇంకా వారి దురాశ కోసము ఈడ్వబడుచున్నారు.  అంటే వీరు దేవునితో సమానముగా లేక దేవుని కన్నా ఎక్కువ స్థితిని పొందాలన్న కోరికను వారి పతనము తరువాత కూడా తీర్చుకొనుచున్నారు.  వీరు భూమి పైన విగ్రహ దేవుళ్లను ఏర్పరచారు.  దాని రూపములో వీరు ఆరాధనలను బలులను అందుకొని తమని తాము దేవునితో సమానముగా చేసుకొనుచూ తమ కోర్కెను తీర్చుకొనుచున్నారు.  ఈ విధముగా వీరు రెండవసారి కూడా తప్పు చేయుట జరిగింది.  అంతేకాకుండ నరులను దైవాజ్ఞ మేరకు శోధనకు గురిచేసి వారిని తమ చెరలో బంధించి ఉంచుచున్నారు.   యెషయా 14:16-17, ''నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తల పోయుదురు -భూమిని కంపింపజేసి రాజ్యములను వణకించినవాడు ఇతడేనా?  లోకమును అడవిగాచేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా?  తాను చెరపట్టినవారిని తమ నివాసస్థలమునకు పోనియ్యనివాడు ఇతడేనా?''  ఈ విధముగా నరులను దైవవ్యతిరేకతకు ప్రేరేపించి వారిని తన బందీలుగా చేసుకొని వారికి విడుదల కలిగించుట లేదు.  అందుకే ఈనాడు దైవ ఆరాధన కన్నా విగ్రహ దేవుళ్ల ఆరాధన చేయువారు ఎక్కువ.  ఇలాంటి పతనము చెందిన దేవుని దూతలు యేసుక్రీస్తు ప్రభువుకు ఎదురుపడినప్పుడు ఆయనను ఈలాగున వేడుకొనుచున్నారు.  మార్కు 5:8-10, ''ఎందుకనగా ఆయన-అపవిత్రాత్మా, యీ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను.  మరియు ఆయన-నీ పేరేమని వాని నడుగగా వాడు-నా పేరు సేన, యేలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములోనుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను.''  క్రీస్తు ప్రభువును ఈ అపవిత్రాత్మలు అను పతనము చెందిన దేవుని దూతలు ఆ దేశము నుండి వారిని తోలివేయవద్దని వేడుకొనుచున్నారు.

        దీనికి కారణము ఏమైయుండవచ్చును?  ఒకసారి సాతాను ద్వారా ఒక ప్రాంతముపై అధికారులుగా నియమించబడినవారు ఆ ప్రాంతములో రాజులుగా చలామణి అగుదురు.  ఇలాంటివారు ఆ ప్రాంతము నుండి క్రీస్తు ప్రభువు వేరే ప్రాంతమునకు పారద్రోలిన వారి పరిస్థితి ఎలాగుండునో ఒక్కసారి ఆలోచించవలసియున్నది.  ఈ పతనము చెందిన దేవుని దూతలు అను దయ్యపు ఆత్మలు ఒక ప్రాంతమును పరిపాలిస్తున్నారు.  అక్కడ వారు అధికారులు, పారద్రోలబడిన తరువాత వారు వేరొక ప్రాంతములో నివసించాలి.  అక్కడ వారు అక్కడ ఉన్న పతనము చెందిన దేవుని దూతలు అనగా అంధకార శక్తులకు లోబడి వారు చెప్పినట్లుగా చేయాలి.  దానికన్నా క్రీస్తు ప్రభువును బతిమాలుకొనుట ఉత్తమము.  ఒకసారి లోబడినవారికి విలువ తక్కువ కదా!  అందులోను తన తోటి పతనము చెందినవారిలో హీనముగా ఉండుట కంటే ఉన్న ప్రాంతములోనే వేరొక స్థితిలో జీవించుట మేలు అని క్రీస్తు ప్రభువును మిగుల బతిమిలాడుకొనుచున్నాయి.

        అలాగే - లూకా 8:30-31, ''యేసు-నీ పేరేమని వాని నడుగగా, చాల దయ్యములు వానిలో చొచ్చి యుండెను గనుక, వాడు తన పేరు సేన అని చెప్పి, పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను.''  ఇందులో పాతాళములోనికి వెళ్లు శిక్షను ఇయ్యవద్దని క్రీస్తు ప్రభువును వేడుకొనుచున్నాయి.  

2 పేతురు 2:4, ''దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోకమందలి కటికచీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను.''  ఈ విధముగా దేవుని దూతలు పాపము చేసినప్పుడు వారిని పాతాళలోకమందలి కటిక చీకటి బిలములలో ఉండునట్లుగా వారికి శిక్ష దేవుడు విధించుచున్నాడు.  అలాగే లూకా 8:30-31లో సేన అను ఒక దయ్యముల గుంపు ఈ భూలోకములో క్రీస్తు ప్రభువు ముందుకు వచ్చారు.  వారు అనేక తప్పులు చేసినవారు.  వారికి నేలమట్టుకే దేవుడు శిక్ష విధించియున్నాడు.  అటుతరువాత వారికి పాతాళలోకములో ఉండునట్లుగా శిక్ష పడాలి.  దానినే ఈ పాపము చేసిన పతనము చెందిన దేవుని దూతలు క్రీస్తు ప్రభువుకు తెలియజేస్తూ ఆ శిక్ష మాకు ఇప్పుడే ఇయ్యవద్దని బతిమిలాడుకొను చున్నాయి.  ఇందునుబట్టి తప్పు చేసినవారికి శిక్ష తప్పదని గుర్తించాలి.

107.  దేవుని యెదుట సాతాను క్రీస్తు శిష్యులను కోరుకొనుట క్రీస్తు ప్రభువు తన శిష్యులు తప్పిపోకుండునట్లు కోరుకొనుట

        ప్రియపాఠకులారా!                క్రీస్తు ప్రభువు ఈ లోకములో పుట్టాడు, యోహాను వద్ద బాప్తిస్మము తీసుకొన్నాడు.  అటుతరువాత పండ్రెండుమంది శిష్యులను ఏర్పరచుకొని దేవుని రాజ్య సువార్తను కొనసాగిస్తున్నాడు.  ఇలా 3 1/2 సంవత్సరములు గడచిపోయాయి.  అప్పుడు క్రీస్తు ప్రభువు పాపపు జీవితములో ఉండే సమస్త జనుల విషయములో బలియాగము చేయుటకు సిద్ధపడుచున్నాడు.  ఈ సమయములో సాతాను వంటి పతనము చెందిన దూతల ప్రేరణతో నర సమాజము క్రీస్తు ప్రభువును సిలువపై చంపుటకు సిద్ధపడుచున్నారు.  ఇలాంటి స్థితికి ముందు సాతాను దేవుడైన యెహోవా లేక తండ్రియైన దేవుని వద్ద క్రీస్తు ప్రభువును బలియాగములో చంపుటకు అనుమతి కోరుచున్నాడు.  అలా అనుమతి కోరుకొని యూదాను ప్రేరేపించి వాని ద్వారా క్రీస్తు ప్రభువును పట్టించుటకు సిద్ధపడ్డాడు.  ఇంతటితో క్రీస్తు ప్రభుని చరిత్ర సమాప్తమగునని అటుతరువాత ఆయనను గూర్చి ఎవరు తలంచరని సాతాను అతని దూతలు ఆలోచించారు.  అప్పుడు వారి దృష్టి క్రీస్తు ప్రభువు పండ్రెండుమంది శిష్యుల పైకి వెళ్లుట జరిగింది.  వీరు క్రీస్తు ప్రభువు మరణము తరువాత ఆయన బోధలను కొనసాగిస్తారు కనుక వీరిని కూడ శోధించి గోధుమలవలె జల్లించుటకు దేవుడిని కోరుకొన్నాడు.  వీరు దేవుని అనుమతి పొందిన సాతాను చేతిలో శోధనకు గురి కావలసినవారు.  కాని క్రీస్తు ప్రభువు వారి పక్షమున తండ్రియైన దేవుడిని వేడుకొన్నానని చెప్పుచున్నాడు.  లూకా 22:31-32, ''సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెనుగాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను.''  ఈ విధముగా సాతాను వారిపై దేవుని అనుమతిని కోరగా, వారిని స్థిరపరచుమని క్రీస్తు ప్రభువు కోరుకొనుట జరిగింది.  ఈ విధముగా ఇద్దరు ఒక్కరినే అడుగుచున్నారు.  ఇందులో సాతాను శోధనకు వారిని వదలమని అడుగుచున్నాడు.  క్రీస్తు ప్రభువు వారిలోని నమ్మిక తప్పిపోకుండునట్లుగా వేడుకొన్నాడు.  ఈ విధముగా దైవకుమారుని ప్రార్థనా సహాయము శిష్యులకు తోడుగా ఉండుట చేత వారు సిలువ బలియాగము కాలములో తప్పిపోయినట్లుగా కనబడినను ఆ తరువాత వారి మనస్సు స్థిరపడి చివరకు ప్రపంచ నలుమూలల క్రైస్తవ రాజ్య వ్యాప్తికి కారణమైయ్యారు.  ఈ విధముగా సాతాను శోధించుటకు శిష్యుల విషయములో అనుమతి కోరాడు.  క్రీస్తు ప్రభువు వారి విషయములో నమ్మకము తప్పిపోకుండునట్లుగా కోరుకొన్నాడు.  ప్రభువును బంధించినప్పుడు శిష్యులు వారిని అడ్డగించి ఉంటే శిష్యులను కూడా సిలువ వేసి చంపి ఉండేవారు.  

        మత్తయి 26:31లో వ్రాయబడిన లేఖనము నెరవేరకుంటే నూతన నిబంధన గ్రంథము వ్రాయబడేది కాదు.  శిష్యులు తమ ప్రాణమును దక్కించుకోబట్టి ప్రభువు యొక్క జీవితమునకు ఆయన కార్యాలకు సాక్షులై ప్రపంచ నలుమూలల దైవరాజ్యముగూర్చి ప్రకటించగలిగినారు.  శిష్యులను చెదరగొట్టుట అనగా పిరికివారినిగా చేయాలి.  క్రీస్తును సిలువలో చంపుట అపవాది కోరుకున్న కార్యము.  ప్రభువు తాను వాగ్దానము చేసిన ఆదరణకర్తయైన పరిశుద్ధాత్మను పొంది నూతన నిబంధనకు గ్రంథకర్తలై ప్రభువు కార్యమునుగూర్చి ఆయననుగూర్చి సాక్ష్యమిస్తూ క్రైస్తవ సామ్రాజ్యము విస్తరించుటకు కారకులయ్యారు.  ఇందులో సాతాను కోరిక నెరవేరింది.  ప్రభువుయొక్క సంకల్పము విజయవంతమైంది.  కనుక దైవప్రణాళికలో ఉన్నవారికి వారు అడగకుండానే దైవకుమారుని సహకారము లభించునని మనము గుర్తించాలి.  నా జీవితములో నేను సాధారణమైన బడిపంతులు ఉద్యోగము చేయుచున్నవాడిని.  ఙశినీ ఓళిజీళీ నేను పాసై హయ్యర్‌ గ్రేడు ట్రయినింగ్‌ పొంది ఎలిమెంటరీ స్కూలులో ఉద్యోగము చేసుకొంటూ జీవించాను.  దేవుని పిలుపు వలన వాస్తవమును కనిపెట్టగలిగి క్రైస్తవునిగా మారాను.  క్రీస్తు ప్రభువు తల్లి నా ప్రభువు తల్లిగా రెడ్డిపాళెములో నాకు కనబడి నాకు వేదబోధను ఆరంభించింది.  క్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ సహాయమును దయ చేయగా ఈ స్థితిలో వ్రాయుట జరుగుచున్నది.  అంటే నేను క్రైస్తవునిగా మారి దైవప్రణాళికలో ఇన్ని గ్రంథములు వ్రాయుటకు నన్ను ఏర్పరచుకొనగా, దేవున్ని సాతాను నన్ను శోధించుటకు అనేకమార్లు అడిగియుంటాడు.  నిజముగా నాకు శోధన అనేక విధములుగా వచ్చినను నేను దానిని జయించగలిగాను.  దీనికి కారణము క్రీస్తు ప్రభువు ప్రణాళికలో నేను ఉండటమే, ఎందుకంటే ఆయన ప్రణాళిక పూర్తి అగుటకు క్రీస్తు ప్రభువు నా పక్షముగా ఉండి నన్ను పతనము చెందనీయక తన ప్రణాళికలో ఈ పనిని పూర్తి చేయించుట చేసాడు.  అలాగే దైవప్రణాళికలో ఎవరు ఉన్నను వారు శోధనను గూర్చి చింతించక దైవప్రణాళికలో తాము ఉన్న సంగతిని గుర్తించి సాధ్యమైనంత తొందరగా దానిని పూర్తి చేయుటకు కృషి చేస్తే, సాతాను శోధనలో మనము పడిపోనీయకుండ మనలను గూర్చి క్రీస్తు ప్రభువు తండ్రియైన దేవున్ని వేడుకొని మనలను దైవ నమ్మకములో స్థిరపరచునని గ్రహించాలి.  యోహాను 17:15, ''నీవు లోకములో నుండి వారిని తీసికొనిపొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను.''

108.  క్రీస్తు ప్రభుని పట్టించుటకు యూదా ఇస్కరియోతు హృదయములో ఆలోచన కలిగించిన సాతాను

        ప్రియపాఠకులారా!  సాతాను క్రీస్తు ప్రభుని చంపాలని అన్ని కోణాలలో ప్రయత్నము చేస్తున్నాడు.  ఈ ప్రయత్నములో మొదట యూదా ఇస్కరియోతు హృదయములో సాతాను క్రీస్తు ప్రభువును పట్టించు ఆలోచనను కలిగించాడు.  యోహాను 13:2, ''వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి యుండెను గనుక''  ఈ ఆలోచన అనుకూలముగా యూదా తిరుగుట ద్వారా తన శరీరమును సాతానుకు అనుకూలముగా మారింది.  కనుక సాతాను వాని శరీరమును ఆవహించి వాని ద్వారా క్రీస్తు ప్రభువును పట్టించుట జరిగింది.  ఈ విధముగా విగ్రహ సంబంధమైన శక్తులు అనగా సాతాను విజృంభించి చేసిన క్రియగా మనము భావించాలి.

109.  ఒలీవకొండలో క్రీస్తు ప్రభువును బలపరచిన దేవుని దూత!

        ప్రియపాఠకులారా!  క్రీస్తు ప్రభువు దైవకుమారుడని బైబిలు గ్రంథము బోధించుచున్నది.  అలాగే మనము కూడ దీనిని నమ్మి నిజదైవము క్రీస్తునందు ఉన్నదని బాప్తిస్మము కూడ పొందాము.  అలాగే దేవుని దూతలు క్రీస్తు ప్రభువుకు అనేకమార్లు సహకరించారు.  ఒకసారి ఒలీవ కొండ మీద కూడ దేవుని దూత కనబడి ఆయనను బలపరచినట్లుగా చెప్పబడింది.  లూకా 22:43-44, ''అప్పుడు పరలోకమునుండి యొక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను.  ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్తబిందువులవలె ఆయెను.''  ఈ దూత కనబడు సమయములో క్రీస్తు ప్రభువు ప్రార్థించుచున్నాడు.  లూకా 22:37-42, ''-ఆయన అక్రమకారులతో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసియున్నది; ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాననెను.  వారు ప్రభువా, ఇదిగో ఇక్కడ రెండు కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పెను.  తరువాత ఆయన బయలుదేరి, తన వాడుక చొప్పున ఒలీవలకొండకు వెళ్లగా శిష్యులును ఆయన వెంట వెళ్లిరి.  ఆ చోటు చేరి ఆయన వారితో-మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థనచేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్లూని తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చిత్తమైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను.''  

        ఈ విధముగా క్రీస్తు ప్రభువు ప్రార్థించుచుండగా ఆయన ప్రార్థనకు తండ్రియైన దేవుని నుండి సమాధానము లభించింది.  తండ్రియైన దేవుని నుండి దూత బయలుదేరి ఆయన ఉన్న స్థలమునకు చేరి క్రీస్తు ప్రభువును బలియాగము చేయుటకు బలపరచుట జరిగింది.  ఈ విధముగా సకల మానవాళి రక్షణకు కారణమైన సిలువ బలియాగము చేయుటకు క్రీస్తు ప్రభువును తన మాటలతో తండ్రియైన దేవుని ఉద్దేశ్యమును ఆయన ముందు బయల్పరచి, సకల జాతి జనులకు రక్షణ నిమిత్తము ఈ దేవుని దూత కూడ భాగము పొందినట్లుగా మనము గ్రహించాలి.  

        ఈ విధముగా దైవప్రణాళికలో ఉన్నవారందరికి దేవుని దూతల సహాయము ఎల్లవేళలా ఉంటాయని మనము గ్రహించాలి.  అలాగే క్రీస్తు ప్రభువు విషయములో కూడ ఆయన చేయవలసిన బలియాగమును సకల మానవాళి రక్షణ నిమిత్తము చేయుటకు ఈ దూత పరలోకము నుండి దేవుని ఆజ్ఞను పొంది భూమిపై ఉన్న ఒలీవకొండ పైకి వచ్చినట్లుగా మనము గుర్తించాలి.

110.  క్రీస్తు ప్రభువు సిలువ శ్రమకు ముందు దేవుని దూతల సహాయము కొరకు తండ్రిని అడగలేదు

        ప్రియపాఠకులారా!   సాతాను హృదయములో తలంపు కలిగించగా యూదా దుష్టులతో సంబంధము ఏర్పరచుకొని క్రీస్తు ప్రభువును పట్టించాలని పన్నాగము పన్నాడు.  అటుతరువాత క్రీస్తు ప్రభువు కడరా భోజనము అనగా రొట్టెను ద్రాక్షారసమును సిద్ధపరచి నూతన నిబంధనను స్థిరపరచుచూ మీలో ఒకడు సాతానని చెప్పి రొట్టె వాని నోటికి అందించగా వానిలో సాతాను ప్రవేశించి వానిని కొనిపోయాడు.  సాతాను ప్రేరణ ద్వారా యూదా క్రీస్తు ప్రభువును పట్టించుటకు సిద్ధపడి సమయము కొరకు వేచియున్నాడు.  అప్పుడు సమయము దగ్గర పడగా, యూదా క్రీస్తు ప్రభువును పట్టించుటకు వచ్చాడు.  మత్తయి 26:47-51, ''ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండుమందిలో ఒకడగు యూదా వచ్చెను.  వానితోకూడ బహు జనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకులయొద్ద నుండియు ప్రజల పెద్దలయొద్ద నుండియు వచ్చెను.  ఆయనను అప్పగించువాడు-నేనెవరిని ముద్దుపెట్టుకొందునో ఆయనే యేసు; ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి-బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను.  యేసు-చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి.  ఇదిగో యేసుతో కూడ ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి, కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని చెవి తెగనరికెను.''  

        ఈ విధముగా క్రీస్తు ప్రభువుని రక్షించుట కొరకు అక్కడ ఉన్నవారిలో ఒకడు తన కత్తితో పట్టుకొన వచ్చినవారిలో ఒక దాసుని చెవి నరుకుట జరిగింది.  ఇది నరికినవాడు ఎవరు?  యోహాను 18:10, ''సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగనరికెను.''  అప్పుడు క్రీస్తు ప్రభువు ఇది దైవ ప్రణాళికని తనకు సహాయపడదలచిన పేతురును వారించుట జరిగింది.  యోహాను 18:11, ''ఆ దాసునిపేరు మల్కు.  యేసు-కత్తి ఒరలో ఉంచుము; తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను.''  ఇందునుబట్టి ఈ శ్రమ క్రీస్తు ప్రభువుకు దేవుని నుండి వచ్చింది.  ఈ శ్రమ ఫలితము సకల మానవ జాతికి పాపవిమోచన.  ఇక్కడ కూడ ఒక నిబంధన ఉన్నది.  పాపక్షమాపణ అడిగినవారికే గాని అందరికి కాదు.  ఈ విధముగా పేతురు క్రీస్తు ప్రభువుకు సహాయపడాలని తలంచాడు.  కాని క్రీస్తు ప్రభువు ఆయనను వారించి నేను అడిగినట్లయితే దూతల సమూహములనే నా రక్షణ కోసము తండ్రియైన దేవుడు పంపునని చెప్పుట జరిగింది.  

        మత్తయి 26:53, ''ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువమంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా?''  కాని క్రీస్తు ప్రభువు అడగలేదు.  అడగలేదు కనుక దేవుని దూతల సహాయము ఆయనకు అందలేదు.  దీనికి ఇంకొక కారణము దైవ ప్రణాళిక సమస్త మానవ జాతికి పాపక్షమాపణ రక్షణ, విడుదల కలగాలి అంటే పస్కా బలిగా ఆయన మనందరి కొరకు చంపబడాలి.  అంతటితో బలులు ఆగిపోయి నూతన శకముగా నూతన నిబంధన మొదలు కావాలి.  మత్తయి 26:54, ''నేను వేడుకొనిన యెడల-ఈలాగు జరుగవలెనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను.''  కాబట్టి క్రీస్తు ప్రభువు జరిగించవలసిన లేఖనముల నెరవేర్పు జరగవలసియున్నది గనుక ఆయన దూతల సహాయమును అడగలేదని మనము గ్రహించాలి.

111.  క్రీస్తు ప్రభుని సిలువ బలియాగము ఈ యుగ సంబంధమైన శక్తుల విజృంభణ

        ప్రియపాఠకులారా!   క్రీస్తు ప్రభువును దేవుని దూత ఒలీవ కొండపై బలపరచిన తరువాత క్రీస్తు ప్రభువు సమస్త మానవాళి రక్షణార్థమై తన ప్రాణమును సిలువపై ఇచ్చుట జరిగింది.  ఈ కాలములో ఈ యుగ సంబంధమైన శక్తులు ఆయన విషయములో నానా అల్లరి చేసి చివరకు ఆయనను చంపుట జరిగింది.  హెబ్రీ 6:4-6, ''ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు, తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.''  

        ఇందులో దేవుని దివ్య వాక్యమును నమ్మి వెలిగింపబడి అనగా పరిశుద్ధాత్మలో వెలుగును పొంది, పరిశుద్ధాత్మ సంబంధమైన వరములను అనుభవించుట ద్వారా పరిశుద్ధాత్మలో పాలివారైయున్నారు.  ఇలాంటివారు రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమున తప్పిపోవుట ద్వారా క్రీస్తు ప్రభువును బాహాటముగా అవమానపరచుచు మరల సిలువ వేయుదురని చెప్పబడినది.  అంటే ఇది రాబోవు యుగ సంబంధమైనది.  కాని ఈ యుగములో దీనికి ముందు తప్పిపోయిన మనందరి కోసము ఆయన సిలువ బలియాగము చేస్తున్నాడు. అంటే దీనికి ముందు యుగములో ఇలాగే ఒకసారి పరిశుద్ధాత్మలో అన్ని పొంది తప్పిపోయి చివరకు ఈ యుగ సంబంధమైన దూతల ప్రభావము మూలముగా దేవుని విడనాడి మరణమును పొందుట జరిగింది.  వీరు మరల కొన్ని లక్షల సంవత్సరముల తరువాత జరిగిన ఈ సృష్టి అనగా ఈ యుగములో అలాంటి అన్యులమైన మనకోసము మన రక్షణ కోసము బలియాగము చేయుట జరిగినట్లుగా మనము గ్రహించాలి.  ఈ విధముగా క్రీస్తు ప్రభువు బలియాగము చేయునప్పుడు దేవుని దూతల సహాయమును అడగలేదని పేతురుకు తెలియజేయగా చదువుకొన్నాము.  ఇలాంటి స్థితిలో క్రీస్తు ప్రభువును ఈ యుగ సంబంధమైన శక్తులు ఈ లోక సంబంధులను ప్రేరేపించి ఆయనను బంధించి ఆయనను కొరడాలతో కొట్టి ఆయన తలపై ముండ్ల కిరీటము పెట్టి ఆయనపై ఉమ్మి చివరకు బహిరంగముగా యెరూషలేమునకు బయటకు కొనిపోయి ఆయనను సిలువపై మరణించునట్లుగా చేసారు.  అంతేకాదు ఎన్ని విధాలుగా సాధ్యమో అన్ని విధాలుగా ఆయనను అవమానపడునట్లుగా బహిరంగముగా అవమానించారు.

        క్రీస్తు ప్రభువుతోబాటుగా ఇద్దరు దొంగలను సిలువ వేయుట జరిగింది.  వీరు శిక్షను అనుభవిస్తూ కూడ క్రీస్తు ప్రభువును అందరితోబాటుగా బహిరంగముగా అవమానపరచుట జరిగింది.  లూకా 23:36, ''అంతట సైనికులు ఆయనయొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి''  మత్తయి 27:44, ''ఆయనతో కూడ సిలువవేయబడిన బందిపోటుదొంగలును ఆలాగే ఆయనను నిందించిరి.''  అలాగే లూకా 23:39, ''వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచు-నీవు క్రీస్తువు గదా?  నిన్ను నీవు రక్షించు కొనుము, మమ్మునుకూడ రక్షించుమని చెప్పెను.''  

        ఈ విధముగా క్రీస్తు ప్రభువు ఈ యుగ సంబంధమైన శక్తులచే బహిరంగముగా అవమానింపబడిమనకు రక్షణ దయచేసియున్నాడు.  ఈ రక్షణను మనము పోగొట్టుకొనిన మనలను ఏమనాలో ఒక్కసారి గ్రహించవలసియున్నది.

112.  క్రీస్తు ప్రభువు పునరుత్థానము - దేవుని దూతల పరిచర్య

        ప్రియపాఠకులారా!                ఈ విధముగా క్రీస్తు ప్రభువు యుగసంబంధమైన దూతలచే బహిరంగముగా అవమానపడుచున్నను తాను దేవున్నిగాని తన దూతల సహాయమును అడగలేదు.  అలాగే ఆయన మరణించాడు.  చివరకు సమాధి చేయబడినాడు.  తరువాత 1 పేతురు 3:19-20, ''దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైనవారియొద్దకు, అనగా చెరలోఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను.  ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి.''  ఈ విధముగా క్రీస్తు ప్రభువు తన మరణానంతరము ఉన్నవారియొద్దకు వెళ్లి వారికి బోధించుట చేసాడు.  అటుతరువాత ఆయన పునరుత్థానము పొందుట జరిగింది.  ఈ కాలములో దేవుని దూతలు క్రీస్తు ప్రభువు పునరుత్థానమును గూర్చి ప్రకటించుట చేసారు.  

        లూకా 24:3-5, ''ఇందునుగూర్చి వారికేమియు తోచకయుండగా, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలువబడిరి.  వారు భయపడి ముఖములను నేల మోపి యుండగా వీరు-సజీవుడైన వానిని మీ రెందుకు మృతులలో వెదకుచున్నారు?''  అలాగే లూకా 24:23-24, ''-కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రదికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి.  మాతో కూడ ఉన్నవారిలో కొందరు సమాధియొద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని, ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి.''  యోహాను 20:11-12, ''అయితే మరియ సమాధి బయట నిలిచి యేడ్చుచుండెను.  ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, తెల్లని వస్త్రములు ధరించిన యిద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట కనబడెను.''  అనగా ఆదివారము తెల్లవారుటకు ముందుగానే ఆయన లేచియున్నాడు.  శిష్యులకు భక్తబృందమునకు పునరుత్థానమును గూర్చి ప్రకటించుటకు మాత్రమే శుక్రవారము రాత్రి కాలములో ఆయన తలను కాళ్లను ఏ విధముగా అమర్చియున్నారో ఆ స్థలములో తల వైపు ఒకరు ఆయన కాళ్లు ఉంచబడిన స్థలములో మరొకరు ఉన్నారేగాని అక్కడ యేసు శరీరము లేదని గ్రహించాలి.  ఇందునుగూర్చి యోహాను 20:14లో యేసు సమాధిలో లేదుగాని ఆమె వెనుక తట్టు నిలుచుకొని ఆమెను ఎందుకు ఏడ్చుచున్నావని పలకరిస్తున్నాడు.  ఇందునుబట్టి దేవదూతలు ఖాళీ సమాధిలో ఇరువైపుల కూర్చునియున్నారు.  ఈ విధముగా క్రీస్తు ప్రభువు సమాధి వద్ద ఆయన తల వైపున ఒక దూత, కాళ్ల వైపున ఒక దూత కూర్చుని ఆయన పునరుత్థాన కాలములోను పునరుత్థానము తరువాత ఆయనకు పరిచర్య చేసినట్లుగా మనము గ్రహించాలి.  ఇంతకి వీరు ఎప్పుడు అక్కడకు వచ్చారు?  ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు శరీరమును సిలువపై నుండి దించి సమాధిలో ఉంచుట మరియు ఆ సమాధిని మూసివేసి బయటకు నరులు వెళ్లిపోయారో, అదే సమయములో దేవుని దూతలు వచ్చి ఆయన శరీరమునకు తల వైపు ఒకరు, కాళ్ల వైపున ఒకరు కూర్చుని ఆయనకు పరిచర్య చేయుట జరిగింది.  అటుతరువాత పునరుత్థానము ద్వారా క్రీస్తు ప్రభువు తన శరీరమును తిరిగి పొందినను వారు అక్కడనే ఉండి దానికి సాక్ష్యులైనట్లుగా మనము గ్రహించాలి. 

ముగింపు

        ప్రియపాఠకులారా!  ఈ విధముగా ఈ నూతన నిబంధన కాలములో జరిగింది.  ఈ కాలములో క్రీస్తు ప్రభువు అనేక కార్యములు జరిగిస్తూనే అపొస్తలుల కాలమునకు పునాది వేయుట జరిగింది.  ఈ యుగ సంబంధమైన శక్తులు క్రీస్తు ప్రభువును బాహాటముగా అవమానపరచి ఆయనను సిలువపై మరణించునట్లుగా చేయగలిగాయి.  కాని ఆయన పునరుత్థానముతో నూతన శకమునకు నాంది అయింది.  ఇక నిజదైవ జనులు క్రైస్తవులుగా మారుట జరిగింది.  ఈ కాలములో సాతాను విజృంభణ జరిగినట్లుగా కనబడినను సమస్త మానవాళికి రక్షణ ఇచ్చిన కాలముగా మనము గుర్తించాలి.

విభాగము – 10

అపొస్తలుల కాలము

పరిచయము

ప్రియపాఠకులారా! ఈ కాలములో అపొస్తలుల ఉన్నత స్థితి మనకు కనబడుతుంది.  ఈ కాలము క్రీస్తు ప్రభువు ఆరోహణము, పరిశుద్ధాత్మ రాకతో మొదలై వారి మరణానంతరము వరకు కొనసాగినట్లుగా మనము గ్రహించాలి.  ఈ కాలములో అనేక హింసలకు గురియైనను వారి లక్ష్యమును వారు వీడక చివరికి వారు తమ ప్రాణములను క్రీస్తు ప్రభుని సువార్త కొరకు అర్పించుట జరిగింది. ఈ కాలములో దేవుని దూతల పరిచర్యను గూర్చి తెలుసుకొందము.

113.  క్రీస్తు ప్రభువు పరలోకమునకు ఎక్కి పోవుట దేవుని దూతలు సాక్ష్యము చెప్పుట

        ప్రియపాఠకులారా!                క్రీస్తు ప్రభువు పునరుత్థానము తరువాత నలువది దినములు క్రీస్తు ప్రభువు భూమిపైన తన శిష్యులతో కూడ ఉండి ఆయన వారిలో విశ్వాసమును పెంపొందింపజేసి వారు చేయవలసినవి వారికి తెలియజేసాడు.  అటుతరువాత నలువదవ దినమున ఆయన ఆరోహణమై పరలోకమునకు ఎక్కి పోవుట జరిగింది.  ఈ సమయములో దేవుని దూతలు క్రీస్తు ప్రభువును గూర్చి సాక్ష్యమిచ్చుట జరిగింది.  అపొస్తలుల కార్యములు 1:9-11, ''ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను.  ఆయన వెళ్లుచుండగా, వారు ఆకాశమువైపు తేరి చూచుచుండిరి.  ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి -గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు?  మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.''  ఈ విధముగా దేవుని దూతలు అపొస్తలులకు క్రీస్తు ప్రభువును గూర్చి సాక్ష్యమిచ్చుట జరిగింది.

114.  దేవుని దూత పేతురును రక్షించుట - యాకోబును స్తెఫనును రక్షింపకపోవుట

        ప్రియపాఠకులారా!                అపొస్తలుల కార్యములు 12:1-3, ''దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపువారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను.  ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురునుకూడ పట్టుకొనెను.  ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు.  అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి, పస్కా పండుగైన పిమ్మట ప్రజలయొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి, అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను.''  ఇందులో చెప్పబడిన విధముగా హేరోదు రాజు యాకోబును ఖడ్గముతో చంపించాడు.  అప్పుడు దేవుని దూత ఆయనకు సహకరించలేదు.  ఒకవేళ సహకరించియుంటే యాకోబు తప్పించుకొని యుండేవాడు.  అలాగే అపొస్తలుల కార్యములు 7:54-60, ''వారీ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లుకొరికిరి.  అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను.  అప్పుడు వారు పెద్ద కేకలువేసి చెవులు మూసికొని యేకముగా అతనిమీదపడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్లగొట్టి, రాళ్లు రువ్వి చంపిరి.  సాక్షులు సౌలు అను ఒక యౌవనుని పాదములయొద్ద తమ వస్త్రములు పెట్టిరి.  ప్రభువును గూర్చి మొరపెట్టుచు-యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి.  అతడు మోకాళ్లూని-ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను.  సౌలు అతని చావునకు సమ్మతించెను.''  ఇందులో స్తెఫను కూడ మరణించాడు.  అప్పుడు దేవుని దూత ఆయనకు సహకరించలేదు అని చెప్పుట కంటే దేవుని దూత స్తెఫనుకు సహాయము చేయలేదు.  దీనికి కారణమేమైయుండవచ్చును?  అపొస్తలుల కార్యములు 12:6-11, ''హేరోదు అతనిని వెలుపలికి తీసికొని రావలెనని యుండగా, ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్లతో బంధింపబడి యిద్దరు సైనికుల మధ్య నిద్రించు చుండెను; మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి.  ఇదిగో ప్రభువు దూత అతనిదగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను.  దూత పేతురు ప్రక్కను తట్టి-త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్లు అతని చేతులనుండి ఊడిపడెను.  అప్పుడు దూత అతనితో-నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను.  అతడాలాగు చేసిన తరువాత దూత-నీ వస్త్రము పైన వేసికొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను.  అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి, దూతవలన జరిగినది నిజముగా జరిగెనని గ్రహింపక, తనకు దర్శనము కలిగెనని తలంచెను.  మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనెను.  వారు బయలుదేరి యొక వీధి దాటినవెంటనే దూత అతనిని విడిచిపోయెను.  పేతురుకు తెలివివచ్చి-ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలోనుండియు, యూదులను ప్రజలు నాకు చేయ నుద్దేశించిన వాటన్నిటినుండియు నన్ను తప్పించి యున్నాడని యిప్పుడు నాకు నిజముగా తెలియునని అనుకొనెను.''  ఈ విధముగా పేతురును ప్రభువు తన దూతను పంపి రక్షించుట జరిగింది.  ఇంతకి పేతురుకు మాత్రమే ప్రభువు తన దూతను పంపి ఎందుకు రక్షించాడు?  స్తెఫను, యాకోబులను ప్రభువు తన దూతను పంపి ఎందుకు రక్షించలేదు?  దీనినిగూర్చి ఎప్పుడైనా ఆలోచించామా?

        నరుల ఆయుస్సు దేవుని నిర్ణయము ప్రకారము ఉండును.  ఆయుష్కాలము ప్రకారము నరుల పుట్టుక మరణము ఉంటాయి.  నరుడు ఆయుష్కాలము ముగియక మునుపు ఎంత జరిగినా తప్పించుకొంటారు.  అలాగే ఆయుష్కాలము పూర్తి అయిన తరువాత మరణము తప్పదు.  అప్పుడు నరులందరు కూర్చుని మనము ఇలా చేసి ఉంటే బ్రతికి ఉండునని వాపోతుంటారు.  ఈ ఆలోచన వారికి ముందు రాదు.  దీనికి కారణము వారి ఆయుష్కాలము పూర్తి అయిపోవుటయే.  అలాగే దేవుడు పక్షపాతి కాడు.  యాకోబును, స్తెఫనును వారి వారి క్రియలు పూర్తి అగు వరకు ఎన్నో ఆపదలు సంభవించినను దేవుడు తన దూత ద్వారా వారిని కాపాడియున్నాడు.  లేకపోతే సువార్త కార్యము చాలా క్లిష్టతరమైనది.  దేవుడు తన దూతల ద్వారా వారిని రక్షించి సువార్తను కొనసాగింపజేసాడు, గాని వారి క్రియలు సంపూర్తి అయిన వెంటనే తన సహాయము విడుచుట చేత అట్టి వారికి మరణము సంభవిస్తుంది.  కాని బైబిలు గ్రంథములో స్తెఫను వంటి మిగిలిన శిష్యుల చరిత్ర పూర్తిగా వ్రాయబడలేదు కనుక మనకు జీవితములో దేవుని దూతలు చేసిన కార్యములు తెలియలేదు.  అంతమాత్రాన వారికి దేవుని దూతల సహాయము లేదని అనుకోకూడదు.  దేవుని దూత ద్వారా రక్షింపబడిన పేతురు ఇంకా బ్రతికి శరీర రీత్యా జీవించియున్నాడా?  ఆయన కూడ మరణించాడు కదా!  అంటే ఈ దేవుని దూతలు తమ సహాయమును ఆయుష్కాలము వరకు మాత్రమే క్రియ జరిగించి వారిని సకల ఆపదల నుండి కాపాడుదురు.  ఆయుష్కాలము పూర్తి అయినప్పుడు వారు వారిని విడనాడగా మృత్యువు వారిని మరణమునకు అప్పగించునని గ్రహించాలి.

        ప్రభువు యొక్క మరణములోనికి పాలి భాగస్థులగుటకు తన నిమిత్తము తన సువార్త నిమిత్తము ప్రాణాలు పోగొట్టుకొనువారి సంఖ్య ప్రకటన 6:11లో వివరించాడు.  ఇట్టివారు తెల్లని వస్త్రాలు ధరించుకొని క్రీస్తు యొక్క బలిపీఠము వద్ద విశ్రాంతి పొందుచున్నారు.  ప్రభువు ప్రకటించిన రక్షణ సువార్తను చేతబట్టి నిర్విరామముగా ప్రకటించువారిని రక్షించుటకు తన దూతను పంపుట జరుగును.  సువార్త ప్రకటించుటలో పేతురు బహు ఉత్తేజము ఆసక్తి గలిగినవాడు.  ఎట్లంటే యేసును క్రీస్తుగా గ్రహించాడు.  పరలోక రాజ్య తాళపుచెవులు పొందగలిగినాడు.  చేప నోటి నుండి అరషెకెలు తెచ్చి పన్ను కట్టినాడు.  ప్రభువు పక్షముగా మల్కు యొక్క చెవి నరికినాడు.  అననీయ సప్పీరాలను శపించాడు.  సముద్రము మీద నడచుటకు ప్రయత్నించాడు.  సంఘమునకు నీతిని గూర్చి పత్రికలు వ్రాశాడు.

        జెబెదయ కుమారుడైన యాకోబు ప్రభువు శిష్యులలో చేర్చబడినాడు.  క్రీస్తు రూపాంతరములో గెత్సెమనె లోను క్రీస్తుతో కూడ ఉన్నాడు.  సువార్త పరిచర్య ఇందులో కనబడలేదు.  అందువల్ల ప్రభువు నామము నిమిత్తమునైనను హతసాక్షియై పరిశుద్ధుల సావాసములో చేర్చబడుట యాకోబుకు ధన్యత గనుక ప్రభువు వానిని రక్షింపలేదు.  అట్లే ఇంచుమించు స్తెఫను కూడ.

        ఆయుస్సన్నది జనులందరికి సమానమే.  ఎందుకంటే అపొస్తలుల కార్యములు 10:34 దేవుడు పక్షపాతి కాడు.  యోనా ప్రకటన విన్న నీనెవె ప్రజలు దేవుడు ఇచ్చిన ఆయుస్సును కాపాడుకున్నారు.  నోవహు ప్రకటన విన్న ప్రజలు మారుమనస్సు పొందలేదు గనుక జల ప్రళయములో నాశనమయ్యారు.  ఇందులో దేవుడు ఆయుస్సు ఇచ్చేది ఏమిటి?  తప్ప త్రాగి పొగ త్రాగి అనేక దురలవాట్లతో దేవుడు ఇచ్చిన ఆయుస్సును పోగొట్టుకుంటున్నారు.  దుడుకు చిన్నవాడు తండ్రి ఇచ్చిన ఆస్థిని పోగొట్టుకొని బికారి అయ్యాడు.  కీర్తన 90:10.  అధిక బలముంటే మీ ఆయుస్సు డెబ్బది లేక ఎనభై సంవత్సరములు మాత్రమే నంటున్నాడు.  ఎందుకంటే మానవునియ్కొ కృత్రిమ ఎరువులు కృత్రిమ జీవితము మానవుల ఆయుస్సును క్రుంగదీస్తుంది.  వాతావరణ కాలుష్యము, జల కాలుష్యము వగైరాల వల్ల చస్తున్నారుగాని దేవుడు ఎవరిని చంపడు.  పేతురును చెరసాల నుండి కాపాడినట్లే ముక్కు నోట రక్తము చిందించినట్లుగా ఛాతిని పగలగొట్టిన దుండుగుల బారినుండి ఈ గ్రంథకర్తను ఎందుకు బ్రతికించాడు?  మీరు చదువుచున్న ఈ గ్రంథాలు రచించుటకే గదా!

115.  పౌలుకు దేవుని దూత దర్శనము

        ప్రియపాఠకులారా!                పౌలు తన జీవితములో మొదట క్రీస్తు ప్రభుని దర్శనములో చూచి తన కళ్లు పోగొట్టుకొని తిరిగి అననీయ అను దైవజనుని ద్వారా పొందుట జరిగింది.  అటుతరువాత పౌలు తన సువార్తను యూదులలో జరిగించి వారిపై విసిగి అన్యజనులలో సువార్తను విస్తరింపజేసాడు.  ఇలా జరిగిస్తున్నప్పుడు-పౌలును అగ్రిప్ప రాజు వద్దకు బందీగా కొనిపోవుట జరిగింది.  అగ్రిప్ప రాజు పౌలు రోమీయుడని తెలుసుకొని కైసరు వద్ద చెప్పుకొనుటకు ఓడలో పంపుట జరిగింది.  ఈ ఓడలో ప్రయాణమై పోవుచున్నప్పుడు ఉరుకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసరెను గనుక ఓడ ఆ గాలిలో చిక్కిపోయెను.  ఈ కష్టకాలములో పౌలుకు క్రీస్తు ప్రభువు కనపడలేదుగాని తాను ఎవనినైతే సేవించుచున్నాడో ఆ దేవుని దూత అతనికి కనబడి భయపడకుండునట్లుగా అభయమిచ్చుట జరిగింది.  అపొస్తలుల కార్యములు 27:23-26, ''నేను ఎవనివాడనో, యెవనిని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గడచిన రాత్రి నాయొద్ద నిలిచి-పౌలా, భయపడకుము; నీవు కైసరు ఎదుట నిలువవలసియున్నది; ఇదిగో నీతోకూడ ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరిని దేవుడు నీకు అనుగ్రహించి యున్నాడని నాతో చెప్పెను.  కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి; నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను.  అయినను మనము కొట్టుకొనిపోయి యేదైన ఒక ద్వీపముమీద పడవలసి యుండునని చెప్పెను.''  ఈ విధముగా పౌలుకు దేవుని దూత దర్శనమిచ్చి పౌలును ధైర్యపరచుటయేగాక జరగబోవుదానిని తెలియజేయుట జరిగింది.  ఈనాడు కూడ ఇలాంటి సంఘటనలు జరగాలిగాని పౌలువలె పోరాట ప్రతిమ గలిగిన దైవజనులు ఉన్నారా!  ఈనాడు క్రైస్తవ మత బోధ చేస్తూ శత్రువు చేతికి చిక్కి న్యాయస్థానములు చేరుట జరుగుట లేదుగాని చర్చీలను లేక చర్చీల స్థలములను అమ్ముకొని న్యాయస్థానాల చుట్టూ తిరుగువారు ఉన్నారు.  

        అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలైతే ఇలా వారికి ఆ స్థలములను కేటాయించి వాటిలోనే ప్రసంగాలు చేసుకోవాలని చెప్పుచున్నారు.  ఆనాటి వలె ఈనాడు ఊరి మధ్యలోను ఇండ్ల మధ్యలో క్రైస్తవ సువార్త జరుగుట లేదు.  ఏదో ఒక మీటింగ్‌ ఏర్పాటు చేసి అక్కడనే బోధించాలి.  వచ్చినవారికే చెప్పాలిగాని రానివారి వద్దకు పోరు.  అలాంటప్పుడు వీరు దేవుని కోసము శ్రమను పొందినది ఎలా అవుతుంది?  దేవుని కోసము శ్రమ పొందు దైవజనులు ఎవరు వెళ్లని సాహసించని ప్రాంతాలకు వెళ్లి బోధించి అక్కడివారు వారిని రాళ్లతో కొట్టగా దెబ్బలు తిని బాధపడాలి.  ఈ స్థితి ఈనాటి దైవజనులలో లేదు.  ఆనాటి దైవజనులు వారికి అపాయము కలుగును అని తెలిసినను వారు అక్కడ వదలి వెళ్లలేదు.  కేవలము సువార్తను వినకపోతేనే వారిని విడిచి వెళ్లేవారు.  సువార్త ప్రతి పట్టణములో గ్రామములో అందరి మధ్య జరిగించేవారు.  ఈనాడు అమెరికాలో సువార్తను ఈ విధముగా కొనసాగింప వీలులేదు.  ఆనాడు కూడ లేదు.  కాని ఆనాడు దైవజనులు సాహసముతో వారి మధ్యకు వెళ్లి సువార్తను బోధించేవారు.  అందుకు వారు అనేక విధాలుగా హింసింప బడేవారు.  ఇలాంటి స్థితి బుద్ధితో సహనముతో చేయువారికి క్రీస్తు ప్రభువు తన దూతను పంపి వారి మరణ కాలము వరకు వారిని రక్షించునని మనము గ్రహించాలి.  మరణ కాలము వరకు అని ఎందుకు చెప్పుచున్నానంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు మరణించాల్సి ఉంది.  కనుక దేవుడు వానికి ఆయుస్సు ఒసగినంతకాలము దేవుని దూత వానితో ఉండి అకస్మిక మరణములు, సాతాను అతని దూతల కుట్రల నుండి వానిని రక్షించునని మనము గ్రహించాలి.

116.  విగ్రహములనుగూర్చి పౌలు ఆత్మ పరితాపము చెందుట!

        ప్రియపాఠకులారా!                అపొస్తలుల కార్యములు 17:16, ''పౌలు ఏథెన్సులో వారికొరకు కనిపెట్టుకొనియుండగా, ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను.''  ఇది ఏథెన్సు అను ప్రాంతము.  ఈ ప్రాంతమును పతనము చెందిన దూతలు ఆక్రమించి తమ సంబంధమైన విగ్రహములతో నింపియున్నారు.  నరులను పూర్తిగా ఆక్రమించుటయేగాక ఎటు చూచిన ఈ విగ్రహాలు నింపబడియున్నాయి.  ఇలాంటి పరిస్థితిని చూచిన పౌలు బహుగా ఆత్మలో పరితాపము పొందాడు.  ఇలా పౌలుకే కాదు నిజదైవములో భక్తిలో జీవించు ప్రతి ఒక్కరు వాటిని చూచినప్పుడు మనస్సులో బాధను పొందుదురు, ఎందుకంటే ఈ విగ్రహములు నరులను పతనము వైపు నడిపిస్తున్నాయి అనునది ఖచ్చితము.  ఈ విధముగా ఆ ప్రాంతమంతా పతనములో ఉండుట చూచిన పౌలు తన ఆత్మలో పరితాపము పొంది ఆ బాధను తట్టుకోలేకపోయాడు.  ఈ విధముగా బాధపడిన పౌలు వారి మధ్య సువార్తను బోధించుట చేసి, అపొస్తలుల కార్యములు 17:33-34, ''ఆలాగుండగా పౌలు వారి మధ్యనుండి వెళ్లిపోయెను.  అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి.  వారిలో అరేయొపగీతుడైన దియొనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితో కూడ మరికొందరునుండిరి.''  ఈ విధముగా విగ్రహములు ఏథెన్సు ప్రాంతమును బలాత్కారముగా బంధించి యుండాలి.  వారిలో సువార్తను బోధించి వారిలో కొందరికి వాటి నుండి విముక్తి కలిగించి రక్షణ మార్గమును వారికి చూపాడు.

117.  పుతోను అను పతనము చెందిన దూత రక్షణ మార్గమును బోధించుట

        ప్రియపాఠకులారా!                అపొస్తలుల కార్యములు 16:16-18, ''మేము ప్రార్థనా స్థలమునకు వెళ్లుచుండగా (పుతోను అను) దయ్యముపట్టినదై, సోదె చెప్పుటచేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న యొక చిన్నది మాకు ఎదురుగావచ్చెను.  ఆమె పౌలును మమ్మును వెంబడించి-ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు; వీరు మీకు రక్షణమార్గము ప్రచురించువారై యున్నారని కేకలువేసి చెప్పెను.  ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి-నీవు ఈమెను వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను; వెంటనే అది ఆమెను వదలిపోయెను.''  ఇందులో పుతోను అను పతనము చెందిన దేవుని దూత దయ్యముగా మారి ఒక చిన్నది అను స్త్రీని ఆసరా చేసుకొని ఆమెను ఆవహించియున్నది.  ఈమె సోదె చెప్పుచూ జీవిస్తున్నది.  ఈమె సోదెను ఆసరా చేసుకొని కొందరు దీనిని సంపాదనగా చేసుకొని జీవిస్తున్నారు.  అంటే సోదె చెప్పువారిలో కొందరు నటించువారు ఉన్నారు.  కొందరు నిజముగా పతనము చెందిన దేవుని దూత అనగా దయ్యములు పట్టినవారు ఉన్నారు.  ఇలాంటివారిలో ఈమె ఒకటి.  ఈ దయ్యము పేరు పుతోను.  ఈ స్త్రీ పౌలును ఆయనతో ఉన్నవారిని చూచి వారిని వెంబడించింది.  ఇది దృశ్యములో జరుగుచున్న కార్యము.  కాని అదృశ్యములో పుతోను అను దయ్యము పౌలును ఆయనతో ఉన్నవారిని చూచి వారిని వెంబడిస్తున్నది.  అలాగే అదృశ్యములో ఈ పుతోను అను దయ్యము ఈ స్త్రీని ప్రేరేపించి ఆమెను కేకలు వేయించి పౌలు ఆయనతో ఉన్నవారు సర్వోన్నతుని దాసులని చెప్పిస్తున్నది.  అలాగే వీరు మీకు రక్షణ మార్గమును ప్రచారము చేయువారని పలికిస్తూ ఈ విధముగా అనేక దినములు ఇలాగే ప్రచారము చేయిస్తున్నది.  కనుక పౌలు ఈ పుతోను నుండి ఈ స్త్రీకి యేసుక్రీస్తు నామమున పుతోను అను దయ్యమును ఆజ్ఞాపించి విడుదల కలిగించాడు.  ఈ విధముగా పుతోను దేవుని వ్యతిరేకించి పతనమైన ఒక దూతయే.  కాని ఇది దయ్యపు ఆత్మగా ఈ స్త్రీని పట్టి ఆమెచే సోదె చెప్పించుచున్నది.  ఇలా కాలము గడచిపోతూ ఉన్నది.  ఎప్పుడైతే పౌలు ఆయనతో ఉన్నవారిని చూచాడో నిజదైవమార్గమును గుర్తించిన పుతోను అను పతనము చెందిన దేవుని దూత రక్షణ మార్గమును గూర్చి ప్రచారము చేయుట జరిగింది.  అటుతరువాత పౌలు మూలముగా విముక్తిని పొందింది.  అటుపై ఇలాంటివి ఆవహించి నరులను మోసపరచుట చేయకుంటే ఈ దూతలో మార్పు వచ్చినట్లే కదా!  ఎందుకంటే ఈ పతనము చెందిన దూత రక్షణ మార్గమును గుర్తించి నరుల మధ్య ప్రచారము చేసినట్లే కదా!  కనుక ఈ పతనము చెందిన దూత తనలో కలిగిన మారుమనస్సును నిజముగా గుర్తించి ఇక పాపము చేయకయుంటే ఈ దూత కూడ క్రీస్తు మార్గములో రక్షణ పొందునని గ్రహించాలి.

        పుతోను ఆగిశినీళిదీ నాగదేవత ఇది యొక సర్పము.  శ్రీకృష్ణుని కాళీయ మర్దనలాగే గ్రీకుల దేవతలలో ఒకడైన అపొల్లో అనువాడు ఈ సర్పమును చంపగా ఆ చంపిన ప్రదేశము ఈలిజిచీనీరి అను చోట పెద్ద పుణ్య క్షేత్రముగా వెలసి పుతోను పూజింపబడును.  దాని పేరుతో సోదె చెప్పుట జరుగుచున్నది.  సర్పకొలువు సోదె అన్నది మన దేశములో పుట్టినిల్లు.  

        అపొస్తలుల కార్యములు 16:16, అపొస్తలుల కార్యములు 19:15 దయ్యాలకు యేసు ఎవరో ఆయన విశ్వాసులెవరో తెలియును.  ఈ పుతోను అను దయ్యము ఆవహించిన ఆ చిన్నదానికి మాత్రము యేసు ఎవరో ఆయన విశ్వాసియైన పౌలు ఎవరో ఆమెకు తెలియదు.  ఎందుకంటే దయ్యములు పట్టినవారిని వారి మనస్సాక్షిని అణచివేసి తమకు అనుకూలముగా మార్చుకొంటాయి.  పౌలు సంచరించు ప్రదేశాలలో ఆ దయ్యము చిన్నదానిని నడిపిస్తూ కేకలతో పౌలు పరిచర్యకు ఆటంకాన్ని కలిగిస్తున్నందువలన దానిని ఆ చిన్నదాని నుండి తోలివేయవలసి వచ్చింది.  పుతోను అను దయ్యము నిజముగా మారుమనస్సు కలిగినదైతే ఆ చిన్నది సోదె చెప్పు ప్రతిచోట క్రీస్తే లోక రక్షకుడని సాక్ష్యము ఇప్పించవచ్చును కదా!  దయ్యములుగాని దేహము విడిచిన నరశరీరుల ఆత్మలకుగాని మారుమనస్సు కలిగినను శిక్ష నుండి తప్పించుకోలేరు.  ఆ ధనికుడు లూకా 16:23 వేదనపడుచు మారుమనస్సు పొంది అబ్రాహామును వేడినప్పుడు - అతని వేదనను చల్లార్చుటకు వీలులేదన్నాడు.  కనుక ఎవరి క్రియల చొప్పున వారికి శిక్ష విధింపబడును.  శిక్షాకాలము పూర్తియైనప్పుడే విడుదలయని ప్రకటన 20:3లో వివరించబడింది.  కనుక దేహముతో ఉన్నప్పుడే చేసిన పాపాల నిమిత్తము పరితపించి మారుమనస్సుతో ఇక ఆ పాపముల జోలికి పోకుండ ఉంటేనే వానికి రక్షణ.  అంతేగాని దేహము విడిచిన ఆత్మలకుగాని పరలోకము నుండి శాపగ్రస్థులైన దయ్యపు ఆత్మలకుగాని శిక్షాకాలము పూర్తి కానిదే విడుదల లేదు.  పుతోను అను దయ్యము నిజముగా మారుమనస్సు పొందినదైతే ఆ చిన్నదానిని వదలివేసి క్రీస్తు మార్గములో నడిపించుటకు అవకాశము కలిగేది.

118.  పౌలు క్రీస్తు ప్రభువును గూర్చి బోధించుట అర్తెమిదేవి అను పతనము చెందిన దేవుని దూత భక్తులు అల్లరి చేయుట

        ప్రియపాఠకులారా!                క్రీస్తు ప్రభువు ఏర్పరచిన అపొస్తలుల కాలములో ఇలాంటివి ఎన్నో జరిగాయి.  ఇందులో వ్రాయబడిన సంఘటన పౌలు జీవితములో జరిగినది.  అపొస్తలుల కార్యములు 19:23-38, ''ఆ కాలమందు క్రీస్తు మార్గమునుగూర్చి చాల అల్లరి కలిగెను.  ఏలాగనగా-దేమేత్రియను ఒక కంసాలి అర్తెమిదేవికి వెండి గుళ్లను చేయించుటవలన ఆ పనివారికి మిగుల లాభము కలుగజేయుచుండెను.  అతడు వారిని అట్టి పనిచేయు ఇతరులను గుంపుకూర్చి-అయ్యలారా, యీ పనివలన మనకు జీవనము బహు బాగుగా జరుగుచున్నదని మీకు తెలియును.  అయితే చేతులతో చేయ బడినవి దేవతలు కావని యీ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియయందంతట బహు జనమును ఒప్పించి, త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు నున్నారు.  మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోవుటయే గాక, మహాదేవియైన అర్తెమిదేవియొక్క గుడి కూడ తృణీకరింపబడి, ఆసియయందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతోచుచున్నదని వారితో చెప్పెను.  వారు విని రౌద్రముతో నిండినవారై-ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి; పట్టణము బహు గలిబిలిగా ఉండెను.  మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియవారైన గాయియును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి.  పౌలు జనుల సభ యొద్దకు వెళ్లదలచెను, గాని శిష్యులు వెళ్లనియ్యలేదు.  మరియు ఆసియ దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులైయుండి అతనియొద్దకు వర్తమానము పంపి-నీవు నాటకశాలలోనికి వెళ్లవద్దని అతని వేడుకొనిరి.  ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరీలాగున, కొందరాలాగున కేకలువేసిరి; తామెందునిమిత్తము కూడుకొనిరో చాల మందికి తెలియలేదు.  అప్పుడు యూదులు అలెక్సెంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి.  అలెక్సంద్రు సైగచేసి జనులతో సమాధానము చెప్పుకొనవలెనని యుండెను.  అయితే అతడు యూదుడని వారు తెలిసికొనినప్పుడు అందరును ఏకశబ్దముతో రెండు గంటలసేపు-ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి.  అంతట కరణము సమూహమును సముదాయించి-ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము అర్తెమి మహాదేవికిని ద్యుపతియొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలైయున్నదని తెలియనివాడెవడు?  ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండుట అవశ్యకము.  మీరు ఈ మనుష్యులను తీసికొనివచ్చితిరి.  వీరు గుడి దోచినవారు కారు, మన దేవతను దూషింపను లేదు.  దేమేత్రికిని అతనితోకూడనున్న కమసాలులకును ఎవనిమీదనైనను వ్యవహారమేదైన ఉన్నయెడల న్యాయసభలు జరుగుచున్నవి, అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యెమాడవచ్చును.''  ఈ విధముగా అర్తెమిదేవి అను పతనము చెందిన దేవుని దూతకు వెండి గుళ్లను (అర్తెమిదేవి రూపము కలిగిన చిన్న బిళ్లలు) కట్టి లాభము ఆర్జించుచున్నారు.  ఇలాంటి స్థితిలో పౌలు తన సువార్త కార్యక్రమములో క్రీస్తు ప్రభువును గూర్చి ప్రచారము చేయుచున్నాడు.  కొంత కాలానికి వారిలో అనేకులు జరుగు అద్భుతములు, సూచక క్రియలవలన క్రీస్తు ప్రభువును నమ్మి క్రైస్తవులుగా మారిపోతున్నారు.  ఇక ఈ అర్తెమిదేవిని పూజించువారి సంఖ్య రోజు రోజుకు పడిపోవుట గమనించి లాభసాటి వ్యాపారులు వారి వ్యాపార దృష్టితో వారెన్నుకున్న వారిచే ఈ అల్లరిని సృష్టించారు.

        అర్తెమిదేవి దేవతకు సంబంధించిన పేరు అర్తెమా.  అర్తెమి అన్నది గ్రీసు భాషలో ఒక దేవత పేరు.  డయానా అన్నది లాటిన్‌ భాషలో దీని పేరు.  గ్రీకుల దేవత చంద్రునికి సంబంధించినది.  ఈమె పొలములకు అడవులకు పాలకురాలైన దేవతయని ఈమె వేటాడు స్వభావము కలిగినదనియు వారి నమ్మకము.  దీని ఆకారము విల్లు బాణములు ధరించిన స్త్రీ ఆకారముగా ఉంటుంది.  హిందూదేశములో పాడిపంటలను కాపాడు శక్తి పూజ వంటిది.  ఎఫెసు పట్టణములో దీనికి ప్రసిద్ధమైన ఆలయమున్నది.  హిందూదేశమున లక్ష్మికి మహాలక్ష్మియని బిరుదు ఉన్నట్లే ఈ దేవతకు మహాదేవియని బిరుదు ఉన్నది.  అపొస్తలుల కార్యములు 19:15 ఈ దేవి ద్యుపతి అనగా ఆకాశము నుండి పడినట్లు వారు నమ్మిరి.  ఎఫెసీ పట్టణమందలి కంసాలులు ఈ దేవత యొక్క వెండి విగ్రహాలను చేసి అమ్ముకొని బహు లాభము పొందేవారు.  పౌలు బోధల వల్ల వారి వ్యాపారము తగ్గినందున వారు దేమేత్రితో కలిసి పౌలును హింసించి పట్టణము నుండి తరిమిరి.

        ఇందునుబట్టి ఆలోచిస్తే సకల జాతి జనులకు ప్రపంచ ప్రజలకందరికి బైబిలే మూలగ్రంథమని ఇదియే పురాతన గ్రంథమని అందులోని ఆచారాలు ఆరాధనలు సర్ప కొలువు మొదలుకొని సకల విధమైన దేవతా ఆరాధనలు వర్ణనలు కేవలము బైబిలునుండియే ప్రపంచమంతా వ్యాపితమై తెలియజేయబడుచున్నవి.  అంతేగాక బైబిలులో ఉన్న రాజ్యంగ పద్ధతులు న్యాయశాస్త్రము - వాటి విధులు ఇవి అన్నియు ప్రపంచ పరిపాలకులు అందరు వారికి తెలియని రీతిగానే ఆచరిస్తున్నారు.  భారతదేశములోని భాషలకు మూలభాష సంస్క్రృతమని అంటారు.  కాని ఈ సంస్కృతముతోబాటు ప్రపంచ భాషలకన్నిటికి మొట్ట మొదట బైబిలు వ్రాయబడిన ఆదిమ హెబ్రీ భాషయే సకల భాషలకు మూలమని శాస్త్రజ్ఞులు అంగీకరించి యున్నారు.  ఇందునుబట్టి బైబిలులో చెప్పబడిన దేవుడే యదార్థవంతుడని ఆయనయే సృష్టికర్తకు ప్రతిరూపమని ఆయన నుండియే  దివ్యావతారమైన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో అవతరించాడని - ఆయన ఏర్పరచిన క్రీస్తు శకము తప్ప ఇంక ఏ శకము ప్రపంచములో లేదని క్యాలెండర్లన్నియు క్రీస్తు శకమును ఆధారము  చేసుకొనే తయారు జేస్తున్నారని గ్రహించి యేసుక్రీస్తు ప్రభువులోని నిజదైవసత్యమును గ్రహించగలరని ఈ గ్రంథము ద్వారా వివరిస్తున్నాను.

        ఇండియాలోకి వచ్చి సువార్తను ప్రకటించిన తోమా చరిత్రలో కూడ ఇలాంటి సంఘటనే జరిగింది.  ఈ సంఘటన ఆయన మరణమునకు కారణమైంది.  తోమా గోవా, కేరళ, తమిళనాడు కొన్ని ప్రాంతాలలో క్రీస్తు ప్రభుని గూర్చిన మత బోధను జరిగించారు.  ఆయన చేసిన అద్భుతములు, సూచక క్రియల వలన ఇంచుమించుగా ఆయన బోధించిన ప్రాంతాలలోని జనులందరు క్రైస్తవులుగా మారారు.  ఈనాడు కూడ ఇండియాలోని క్రైస్తవుల ప్రాంతములు ఏవి అంటే గోవా, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు అని చెప్పుదురు.  దీనికి కారణము ఈ ప్రాంతములలో క్రీస్తు ప్రభువు పండ్రెండుమంది శిష్యులలో ఒకడైన తోమా క్రైస్తవ మత ప్రచారము జరిగించుటయే!  కనుకనే ఇక్కడ ఇంచుమించు అందరు క్రైస్తవులుగా మారారు.  ఇక ఇలాంటి స్థితిలో అక్కడ ఉన్న అనేక విగ్రహ దేవుళ్లు, దేవతల ఆలయాలు మూతలు పడినవి.  కొన్ని పడగొట్టబడ్డాయి.  కొన్ని ఆరాధన లేక పాడుపడిపోయాయి.  ఇలాంటి స్థితిలో కొందరు ఆయనపై కుట్ర పన్ని తమిళనాడులోని చెన్నై అను పట్టణములో థామస్‌ మౌంట్‌ అను కొండపై వెనుక నుండి బల్లెముతో పొడిచి ఆయనను చంపివేసారు.  దీనికి కారణము ఆ ప్రాంతములోని పతనము చెందిన దూతలు వారు ఏర్పరచిన విగ్రహాల యొక్క ప్రాబల్యము తగ్గుటయే!  ఇది గమనించిన సాతాను అతని అనుచర గణము నరులలో స్వార్థపరులను ఎన్నుకొని వారిలో లేని మతము చొప్పించి, వారిచే అల్లరి చేయించి ఈ పాడు పనికి పూనుకొనుట జరిగింది.

        ఈనాడు కూడ కొన్ని గ్రామాలలో క్రైస్తవ సంబంధమైన బోధకులు మత బోధ జరిగించుటకు వెళ్లినప్పుడు ఏమి అనరు.  కొంత కాలానికి అక్కడ ఉన్నవారిలో కొందరు క్రైస్తవులుగా మారితే వెంటనే వారిలో వారి దేవతలపై అనగా పతనము చెందిన దూతలపై భక్తి పెరిగి ఆ బోధకుని వెళ్లిపొమ్మని ఆజ్ఞ జారీ చేస్తారు.  వెళ్లకపోతే కొట్టడము లేక చంపటము చేస్తున్నారు.  ఇలా అపొస్తలుల కాలములోనే కాదు ఈనాడు కూడ సంభవిస్తున్నాయి.  దీనికి కారణము సాతాను క్రైస్తవ రాజ్య వ్యాప్తిని జరగనీయకుండ బహుగా పోరాడుటయేనని మనము గ్రహించాలి.

119.  పౌలు శరీరములో ఒక ముల్లు సాతానుయొక్క దూత ఉంచబడుట

        ప్రియపాఠకులారా!                2 కొరింథీ 12:7-8, ''నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను.  అది నాయొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని.''  ఇందులో పౌలు ఎన్నో ప్రత్యక్షతలు చూచాడు.  ఇంతగా దేవుడు ఆయనను ఆశీర్వదించినందుకు ఆయన ఎంతో సంతోషపడి యుంటాడు.  అలాగే మనము కూడ దేవునిలో ఏదైన కార్యములు జరిగించినప్పుడు లేక దేవుని పిలుపునందుకొన్నప్పుడు లేక దేవుని ప్రత్యక్షతను చూచినప్పుడు ఎంతో పొంగిపోతూ దానిని గూర్చిన సాక్ష్యము అందరికి తెలియజేస్తుంటాము.  ఆ విధముగా మిగిలిన అందరికన్నా ఎక్కువ స్థితి కలిగినట్లుగా మనము ఫీలవుతుంటాము.  ఇలా ఫీలవుట తప్పుగా చెప్పుచున్నాడు.  ఎక్కువగా ఉండగోరువారు తక్కువగా ఉండాలి.  మత్తయి 20:26-28, ''మీలో ఆలాగుండకూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను; మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను.  ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.''  అలాగే పౌలుకు ఎన్నో ప్రత్యక్షతలు కలుగుట వలన ఆయన తన్నుతాను హెచ్చింపకుండునట్లుగా ఒక ముల్లు ఆయనకు ఉంచబడింది.  ఇది ఎక్కడ ఉన్నది?  ఆయన శరీరములో.  1 కొరింథీ 15:55-56, ''ఓ మరణమా, నీ విజయమెక్కడ?  ఓ మరణమా, నీ ముల్లెక్కడ?  మరణపుముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే.''  ఇందులో మరణానికి కూడ ఒక ముల్లు ఉన్నది.  ఆ ముల్లే పాపము అని చెప్పబడింది.  ఈ పాపమునకు కొలత ధర్మశాస్త్రము ప్రకారము లెక్కించబడును గనుక పాపమునకు బలమే ధర్మశాస్త్రము.  ఇలాంటి పాపము మరణమునకు కూడ ఒక ముల్లుగా ఉన్నది.  ఈ మరణము అను దూత ఏ విధముగా పాపము చేసింది అన్నదానిని గూర్చి నాచే విరచితమైన ''మరణము తరువాత'' అను పుస్తకములో సంపూర్ణముగా చదువగలరు.  ఇక ఈ మరణమునకు ఒక ముల్లు పాపము అని చెప్పుటనుబట్టి పౌలు శరీరములో ఓ ముల్లు అని చెప్పుటనుబట్టి పౌలు ఎప్పుడు పాపము చేసాడు?  అని మనము ఆలోచిస్తే ఆయన మొదటి జీవితము పాపభూయిష్టమైనదే అయినప్పటికి ఆయన ఆ పాప జీవితమును బాప్తిస్మములో పూర్తిగా వదిలించుకొని నూతన జీవితమును ఆత్మలోను, నీటి ద్వారాను పొందుట జరిగింది.  ఇక అటుతరువాత పాపము ఆయన చేసినట్లుగా ఎక్కడ వ్రాయబడలేదు.  అయితే ఈ ముల్లు పౌలునకు ఎందునిమిత్తము వచ్చింది?  ఈ ముల్లు పౌలు తన్నుతాను హెచ్చించుకొని పడిపోకుండు నిమిత్తము ఆయన శరీరములో చేరి ఆయనను నలగగొట్టుచున్నది.  ఈ విధముగా నలగగొట్టుచున్న ఈ ముల్లు సాతానుయొక్క దూతగా చెప్పబడింది.  ఈ సాతాను దూత ఒక ముల్లుగా పౌలు శరీరములో చేరిందంటే ఒక్కసారి మనలాంటివారి పరిస్థితి ఊహించుకొనవలసిన అవసరత మనకు ఉంది.  ఇంతకి పౌలు శరీరములో చేరిన ఈ సాతాను దూత ఏమి చేస్తున్నది?  పౌలు శరీరమును నలగగొట్టి దానిని పనికిరాని స్థితికి తెస్తుంది.  ఆదికాండము 3:19, ''నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.''  ఇందునుబట్టి పౌలు శరీరము కూడ మట్టే కనుక అది శాపగ్రస్తమైనదే గనుక అది నలగగొట్టబడి సాతాను దూతచే తిరిగి మట్టిలోనికి వెళ్లిపోవాలి.  అందుకే భూమిపై పుట్టిన ప్రతివాడు పాపపు జన్మమే!  ఆ పాపపు జన్మ మన శరీరములో ఉన్న మట్టి రూపముగా ఉన్నది.  శాపగ్రస్థమైనది సాతాను అతని దూతలకు నిలయమని గ్రహించాలి.  అందరిలో వలె పౌలు శరీరములో కూడ ఈ సాతాను దూత చేరి శరీరమును నలగగొట్టుచున్నది.  అందుచేత శరీరము బలహీనపడి రకరకాల రోగాలకు కారణమగు చున్నది.  ఇలా జరిగినప్పుడు శరీరము వారి వారి క్రియలకు సహకరించదు.  అప్పుడు వారు చేయు సువార్త సేవ కుంటుపడు అవకాశము ఉన్నది, ఎందుకంటే వారు ఎన్ని అద్భుతములు చేసినను వారి శరీరమే వారికి సహకరించక ఉంటుంది.  

        అప్పుడు 2 కొరింథీ 12:8, ''అది నాయొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని.''  ఈ విధముగా మూడుసార్లు దేవున్ని పౌలు ప్రార్థించాడు.  అలాగే మనము కూడ మన శరీరములో చేరిన ఈ సాతాను దూత వలన కలిగిన శారీరక ఇబ్బందులలో ప్రార్థించి వాటి నుండి  విడుదల పొందాలని ప్రయత్నిస్తాము.  ఈనాడు దైవసేవకులు, అప్పటి కాలములో క్రీస్తు ప్రభువు, అపొస్తలులు, విశ్వాసులు మొదలైనవారు ఎన్నో అద్భుతాలు చేయుటయేగాక శారీరకముగా ఏర్పడిన ముళ్ల నుండి అనేకులకు విడుదల చేయుట జరిగింది.  కాని వారు వారి శరీరము నుండి అప్పటికి విముక్తి కలిగించారుగాని సాతాను దూతను అప్పటికి పారద్రోలారుగాని అటుతరువాత అది మరల వారిలో దేవుని శాపమునుబట్టి చేరి వారి శరీరములో మరొక రీతిగా ముల్లుగా మారుచున్నది.  ఈ విధముగా మారింది అనుటకు ఆనాటి కాలములో చనిపోయిన లాజరును క్రీస్తు ప్రభువు లేపాడు.  అంతమాత్రాన లాజరు ఇప్పటిదాకా బ్రతికి లేడు.  అలాగే క్రీస్తు ప్రభువు, అపొస్తలులు, విశ్వాసులు ఎన్నో రోగములనుండి విడుదల కలిగించారు.  ఈ సాతాను దూతను పారద్రోలి సంపూర్ణ స్వస్థతను కలిగించారు.  అయినను మరల కొంతకాలానికి వారు మరణించాలి కనుక ఆ దూతలు వారి శరీరములో మరల చేరుట జరిగింది, ఇలా ఎలా చెప్పగలము?  వీరు బ్రతికి ఇప్పుడు లేరు, అంటే ఆదాము నుండి వచ్చిన శాపమును వారు సాతాను దూత రూపములో పొంది వారి శరీరము నలగగొట్టబడి చివరికి శారీరక బలహీనతలో చనిపోవుట జరిగింది.  స్వస్థత పొందినప్పుడు వారి శరీరము ఆత్మలో నూన్యత నూతనత్వము ఏర్పడునేగాని అది ఎప్పటికి కాదని గ్రహించాలి.  అందుకే పౌలు ప్రార్థించినప్పుడు క్రీస్తు ప్రభువు సమాధానమును ఇచ్చాడు.  2 కొరింథీ 12:9-10, ''అందుకు-నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను.  కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.  నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను.''  

        ఇందునుబట్టి దేవుని కృపను మనము కోరుకోవాలి.  అది మనకు చాలు.  మన శారీరక బలహీనతలు సాతాను దూత నుండి ఏర్పడినను దానిని ఓర్పుతో భరించి చివర మన మరణము వరకు మన శరీరములోనే ఒక దుష్టుడు ఉన్నాడని గ్రహించి వాని నిమిత్తము ప్రార్థిస్తూ (స్వస్థత కొరకు కాదు) ఆ శోధనను జయించుటకు దేవుని ద్వేషింప కుండ చివరివరకు దేవునితో జీవించాలి.  అప్పుడే దేవుని శక్తి మన బలహీనత యందు పరిపూర్ణమగును.  ఈ శరీరము ఏనాటికైనా మట్టిగా మారవలసిందే.  అంతమాత్రాన మనము తప్పు చేయాలని తలంచకూడదు.  ఇక్కడ మనము మన శరీరములో ఒక సాతాను దూత ఉన్నాడని గ్రహించి వానిని మనము మన మరణము వరకు విశ్వాసములో బలహీనము కాకుండ ఓర్పుతో సహించాలి.  అంటే మనలో ఎంతో సహనము మనకు అవసరమైయున్నది.  ఒక మంచివాని కొరకు ఎవరైనా సహించవచ్చు.  కాని క్రీస్తు ప్రభువు మనలాంటి సమస్త పాపుల కొరకు ఆయన సిలువపై మరణించాడు.  అలాగే మనలను పాపినిగూర్చి మన విరోధిని గూర్చి ఓర్పును కలిగియుండమని చెప్పుచున్నాడు.  అతని కొరకు మనము మన శరీరమును అప్పగించి చివరివరకు ప్రేమనే వానికి పంచమని చెప్పుచున్నాడు.  రోమా 12:20.  అందుకే దేవుని వద్ద నుండి వచ్చిన శాపమును ఆసరా చేసుకొని శరీరములో చేరిన ఈ సాతాను దూత చేత ప్రేరేపించబడి మనకు విరోధులైనవారిని మనము మరణము వరకు ప్రేమించాలి.  వాడు కలిగించు బాధను ఓర్పుతో సహించాలి.  అప్పుడే క్రీస్తు ప్రభువు తండ్రియైన దేవుడు దీర్ఘశాంతము వహించి మత్తయి 25:34.  మనకొరకు ఏర్పరచిన దైవరాజ్యమును స్వతంత్రించుకొనుటకు 1 యోహాను 2:13లో వలె ఓర్పుతో ఎదురు చూస్తున్న దానిని మనము జయించి పొందుటకు ఓర్పును దీర్ఘకాలము మన శరీర విషయమై కలిగియుండాలి.  కొలస్స 1:9.  అంతేగాని పౌలు పాపము చేసి ఈ ముల్లును పొందలేదుగాని దేవుని శాపము మూలముగా వారసత్వముగా వచ్చిన శరీరము మూలముగా వచ్చినట్లుగా మనము గ్రహించాలి.

120.  నీతికి ప్రతిరూపమైన కొర్నేలీ రక్షణార్థము దేవుడు తన దూతను పంపుట

        ప్రియపాఠకులారా!                కొర్నేలీ జీవితము బహు ఉన్నతమైన జీవితము.  ఇతని నీతి క్రియలు దేవుని సముఖములో జ్ఞాపకము చేయబడుట బైబిలు గ్రంథములో చదవగలము.  అపొస్తలుల కార్యములు 10:1-4, ''ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతియైన కొర్నేలీ అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను.  అతడు తన యింటివారందరితోకూడ దేవునియందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయువాడు.  పగలు ఇంచుమించు మూడు గంటలవేళ దేవుని దూత అతనియొద్దకు వచ్చి-కొర్నేలీ, అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను.  అతడు దూతవైపు తేరి చూచి భయపడి-ప్రభువా, యేమని అడిగెను.  అందుకు దూత-నీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి.''  ఇలాంటి వ్యక్తి క్రీస్తు ప్రభువును ఇంకా అంగీకరించలేదు.  ఇలాంటి వ్యక్తి నశించుట దేవునికి ఇష్టము లేదు.  కనుక దేవుడు తన దూతను కొర్నేలీ యొద్దకు పంపుట జరిగింది.  అపొస్తలుల కార్యములు 10:5, ''ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి, పేతురు అను మారు పేరుగల సీమోనును పిలిపించుము;''  ఈ విధముగా దేవుని దూత దర్శనములో కొర్నేలీకి కనిపించి పేతురును పిలిపించుకొని, ఆయన చెప్పిన సంగతులను గైకొని తాము రక్షణ పొందుటకు ఉన్న ఒకే ఒక లోపమును కోల్పోవుట గూర్చి ఇందులో దూత కొర్నేలీకి తెలియజేయుట జరిగింది.  దూత చెప్పిన ప్రకారము కొర్నేలీ పేతురును పిలిపించి - అపొస్తలుల కార్యములు 10:22, ''అందుకు వారు-నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యూద జనులందరివలన మంచిపేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుష్యుడున్నాడు; అతడు నిన్ను తన యింటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూతవలన బోధింపబడెనని చెప్పిరి; అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను.''  ఆ విధముగా కొర్నేలీ అను నీతిమంతుడు దేవుని దూత ప్రేరణతో పేతురును పిలిపించుకొనుట, పేతురు చెప్పిన ప్రకారము సువార్తను విశ్వసించి రక్షణ పొందుట జరిగింది.  అపొస్తలుల కార్యములు 10:23-43.  ఇందులో పేతురు క్రీస్తు ప్రభువుని గూర్చి కొర్నేలీకి వారి జనులకు బోధించాడు.  ఈ బోధ ముగియక మునుపే వారిలోని నీతి వారు బాప్తిస్మము పొందక పోయినను పవిత్రాత్మను పొంది భాషలలో మాట్లాడుట జరిగింది.  అపొస్తలుల కార్యములు 10:44-48, ''పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరిమీదికి పరిశుద్ధాత్మ దిగెను.  సున్నతి పొందినవారిలో పేతురులోకూడ వచ్చిన విశ్వాసులందరు, పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సయితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి.  ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచు చుండగా వినిరి.  అందుకు పేతురు-మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను వీళ్ళకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను.  తరువాత కొన్ని దినములు తమయొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి.''  ఇది రక్షణ.  ఒకవేళ ఈ బోధను కొర్నేలీ ఒప్పుకొనకపోతే క్రీస్తు ప్రభువు ఒసగు రక్షణను కోల్పోయి ఉండేవాడు.  ఒకవేళ దూత ప్రేరణ కొర్నేలీకి జరగకపోతే కొర్నేలీ ఆత్మ క్రీస్తును గుర్తించేది కాదు.  అయినను అపొస్తలుల కార్యములు 10:35లో వలె కొర్నేలీ యొక్క ధర్మ కార్యాలు ప్రార్థన అన్నది కొర్నేలీని అంగీకరించి పరదైసులలో ప్రకటించబడు సువార్త వద్దకు దూతలు నడిపిస్తారు.  ఆ సువార్తను విని రక్షణలో ప్రవేశిస్తాడు.  కనుక దేవుడు తన దూతను పంపి మరి రక్షణకు మార్గము కొర్నేలీకి దయజేసాడు.

        ఈ విధముగా ఎవరైన నీతి కార్యములలో పరిపూర్ణత పొందినట్లయితే, వారు క్రీస్తు ప్రభువును తెలుసుకొంటే రక్షణ లభిస్తుంది కనుక దేవుడు వారి కోసము తన దూతలను పంపునని వారి ద్వారా రక్షణ మార్గములో వారు వచ్చునట్లుగా చేయునని మనము గ్రహించాలి.  రక్షణ కేవలము క్రీస్తు ప్రభుని నమ్ముట బాప్తిస్మము పొందుట యందు మాత్రమే ఉన్నదని గ్రహించాలి.

ముగింపు

        ప్రియపాఠకులారా!  ఈ కాలములో క్రైస్తవులు బహుగా వృద్ధి చెందిన కాలము.  విశ్వాసములో ఉన్నత స్థానమును పొందిన కాలము.  ఈ కాలములో అపొస్తలులు క్రీస్తు ప్రభువు కన్నా ఎక్కువ అద్భుతములు మహత్కార్యములు చేసి క్రైస్తవ రాజ్యమును భూదిగంతముల వరకు విస్తరించునట్లుగా చేయగలిగారు.  ఈ కాలములోనే విశ్వాసుల కాలమునకు పునాది జరిగింది.  కాని ఈ విశ్వాసుల కాలమునకు సంబంధించిన విశ్వాసులు అపొస్తలుల కాలములో వారి బోధలో వచ్చినవారుగా మనము గ్రహించాలి.