సప్త సర్ప వ్యాఖ్యానము గ్రంధ పరిచయ వాక్కు

అపవాది వాని అవతారములు

        గ్రంథకర్త : శేఖర్‌రెడ్డి వాసా

www.FaithScope.com

నీ మరణానంతరము నీ ఆత్మ ఎక్కడ వుండబోవుచున్నదో నీకు తెలుసునా?

మూలము

రెడ్డిపాళెం గ్రామములోని నా ప్రభువు తల్లి ఉపదేశములు మరియు ఆమెను ఆవరించిన పరిశుద్ధాత్మయొక్క జ్ఞాన సహాయమే ఈ పుస్తక రచనకు మూలాధారము.

అంకితము

ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించి నన్ను ప్రేమించిన క్రీస్తు ప్రభువుకు అంకితమిస్తున్నాను. -  వాసా శేఖర్‌రెడ్డి

ప్రియక్రైస్తవ పాఠక మహాశయులారా!  సప్తసర్ప వ్యాఖ్యానము అను ఈ చిన్న పుస్తకములో ఎన్నో దైవిక సంబంధమైన వివరములు పొందుపరచబడియున్నవి. సప్తసర్పాలు అనగా ఏడు పాములు దైవసృష్టియే, కాని పాములలో వివిధ జాతులు-నాగుపాము లగాయతు నీళ్ళపాము వరకు వున్నటువంటి సర్పజాతులన్నియు దైవసృష్టములే, ఇవి సాతాను సృష్టికి కాదు. దేవుడు చేసిన భూ జంతువు'', అని వ్రాయబడియున్నది గాని సాతాను సృష్టించిన భూజంతువు'', అని వేదములో వ్రాయబడలేదు.  దేవుడు సాతాను ఇరువురును నరజాతిపై పరిశోధన చేయుటకు నాటి నానా విధమైన జంతు జాలములో వేటికని ప్రాధాన్యత నివ్వక ఒక్క సర్పానికే ప్రాధాన్యత నిచ్చి నరులపై దేవుడు  పరిశోధన, సాతాను శోధన కార్యములు జరిగించినట్లు సర్పాన్ని సాధనంగా వాడినట్లు వ్రాయబడియున్నది.  ఆది 3: నుండి పరిశుద్ధగ్రంధము చివరి గ్రంధమైన ప్రకటన గ్రంధము వరకు సర్పాన్ని గురించి వ్రాయబడిన అంశాలు చాలా వున్నవి. ఇందును గూర్చి ఈ పుస్తకంలో ఆదినుండి అంతము వరకు వ్రాయబడిన కొన్ని ముఖ్య సంఘటనలను గూర్చి వ్రాయబడియున్నవి.  ఆదిలో దేవుని వనమైన ఏదేను తోటలో హవ్వను శోధించుటకు సాతాను వానిది సర్పము.  అలాగే సృష్టికర్తయైన దేవుడు కూడా ఆయన చేసిన భూజంతువులలో సర్పానికి ఒక ప్రత్యేకమైన గుణాన్ని వరంగా ఇచ్చాడు-అదియే యుక్తి కుయుక్తి గల గుణము.  ఈ యుక్తి కుయుక్తినే ఆదరువుగా చేసికొని సాతాను సర్పములో ప్రవేశించుటకు వీలు గల్గింది.  ఈ విధంగా సాతాను ఆవరించిన సర్పము తన యుక్తిని తనకుయుక్తిని ఆ తర్వాత సాతను యొక్క శక్తిని పొంది ప్రయోగించి స్త్రీని శోధించే క్రియలో భాగస్వామియైంది.  ఈ విధముగా నెరవేర్చిన సాతానునకు వేదములో ఇచ్చిన బిరుదు-ఆది సర్పముగా సాతాను బిరుదు పొందినాడు.  మొట్టమొదటిగా సాతాను కున్నటువంటి ప్రత్యేకమైన బిరుదు ఆది ఘటసర్పము.

        2వదిః-మోషే చేసిన కర్ర సర్పము.  ఇది దేవుని మహిమను లోకానికి వెల్లడిపరచుటకు సాధనంగా దేవుని ప్రవక్తయైన మోషే చేత దర్శన మిచ్చింది.  మోషే దగ్గర చేతి కర్ర తప్ప మరొక సాధనము లేకపోయినను ఆ చేతి కర్రనే సర్పంగా చేశాడు.  ప్రియపాఠకులారా!  దేవుడు చేసిన భూజంతువులో సాతాను ప్రవేశించగల్గినాడే గాని ఏదేను వనములోని చెట్టు కర్రలో సాతాను ప్రవేశించలేదు, ఆ కర్రను మాట్లాడించలేదు.  దేవుడు మోషే చేత జరిగించిన ఈ మహిమాన్విత క్రియను బట్టి అతని అన్నయైన అహరోనుకు కూడా ఒక చేతి కర్ర వుంది.   దానినే చిగిరించిన అహారోను చేతి కర్ర ఇది 3వదిః- ఇందులో నుండి దైవమహిమ రెండు విధాలుగ క్రియజరిగించింది.  1.ఫరోమంత్రగాళ్ళు చేసిన పాములను మ్రింగింది.  2వది దేవుని పవిత్ర స్థలములో ఇశ్రాయేలు 12 గోత్రాల నిర్ధారణకు వాడబడుటయేగాక దేవుని పరిశుద్ధ్ద మందసములో చిగిర్చిన దైవబాదము పండ్లు కాసినట్లు రెండు విధములైన ఫలితాలను దైవత్వమునకు మావత్వమునకు ఋజువుపరచింది. సంఖ్యా 17:8

        4వ సర్పముః- మోషే మీద సణిగిన జనాంగముపై ప్రయోగించిన సర్పప్రయోగము తద్వారా అనేక మంది చచ్చుట.  ఇవి తాపకరమైన సర్పములు సంఖ్యా 21:6. 5వదిః-ఇశ్రాయేలు పశ్చాత్తాపపడి మోషేను వేడుకొనగా మోషే ప్రార్థన చేయగా దేవుని యొక్క సలహామేరకు ఇత్తడి సర్పమును చేసి ఎత్తయిన స్థలములో వుంచుట, 21:9

        6వదిః- పరిశుద్ధగ్రంధములో పాతనిబంధన నూతన నిబంధన అపోస్తలుల కాలములోను నేటియుగాంతమువరకును వివిధరీతులుగా మనుష్యుల చేత తయారుచేయబడి గుళ్ళు కట్టించుకొని యున్నటువంటి నిర్జీవ సర్పపు కొలువులు.  ఇవి దైవత్వమునకు పూర్తిగా విరోధము మరియు మానవత్వానికి అవమానకరము, బాహ్యంగా సృష్టికర్తయైన దేవుని అగౌరవపరచడము. విషతుల్యములైన సర్పారాధన నరకాగ్ని గుండముతో కూడిన మరణానికి సంగీతకేతకమైయున్నది.  ఇది నేడు భూలోకములో బాహాబాహీగా క్రియజరిగిస్తున్నది.

        7వదిః- ఈ సర్పశాపము నుండి తత్సంబంధమైన తత్పలితమైన నరకాగ్ని నుండి రక్షించుటకు రక్షకుడుగా అవతరించి నాడు మోషే చేత ఎత్తబడి ఎత్తయిన స్థలములో వుంచబడిన ఇత్తడి సర్పము సిలువపై ఎత్తబడిన యేసునకు సూచకము.  సర్పమునుండి కల్గిన పాప విమోచనమునకు దైవకుమారుడు తన శరీర రక్తములను సమర్పించి సకల నరకోటికి రక్షకుడయ్యాడు.  నాడు మోషే ఎత్తిన ఇత్తడి సర్పము పాపపు విషమునుండి కాపాడి జీవముననుగ్రహించినట్లు రక్షణార్థమైన ప్రభువు తనమానవత్వమును వదలి తనను సర్పమునకు పోల్చుకొని యెహా 3:14లో వలె అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందుటకు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను''. ఇది ఏడు సప్తసర్పముల సువిశేషణము-ఇక చదవండి.

                ----------------þ-------------

        శివలింగము అనగా శివుని యొక్క మర్మాంగమునకు పాము చుట్టుకొని పడగ పట్టుకొని యుండునట్లు అచ్చటచ్చట మనము చూస్తున్నాము.  శివుడు శరీరము నిండా పాములను హారములుగా ధరించుకొనియున్నాడు.  సుబ్బరాయుడు-కుమారస్వామి ఎట్ట ఎదుట పామునిలిచియుండును.  కాళి దానిమెడపైన పాము వుండును. విష్ణువు వాని పడకయే పాము; కాబట్టి పాము లేని దేవుడే అన్యదేవతలలో కానరాదు.  ఆదిలో పామే సైతానుకు నిలయమైనది.  కాబట్టి సాతాను తాను ధరించిన సమస్త అవతారములలో కూడా ఆ పామును మాత్రము వదలుటలేదు.  దేవుని అవతారము ఒక్కటే! దేవుని భాషలు అనేకములు.  సైతాను అవతారములు అనేకములు-అట్లే సైతాను భాషలు కూడా అనేకములు

        గ్రామదేవతలు అనగా ఎవరు?

        ఒకే ఒక్క సైతాను యొక్క వివిధరూపములు.  కాని వేర్వేరు మాత్రము కాదు.  సైతానుడే గణాచారిగా పూని వివధములైన పనులను అజ్ఞానులైన మానవుల చేత చేయిస్తుంటాడు.

        తన సంపద తన కాలము మొదలుగా సర్వము దేవునికి అంకితము చేసి దేవుని యందున్న నీతిమంతుని ఇంటిలో ప్రవేశించుటకు సైతానుడు అనేక మార్గములు వెదకెను. పాములో చేరి కాటు వేయ ప్రయత్నించును.  వారి పిల్లలపై కాలేజీ పిల్లలచేత గోడల మీద వ్రాయించుట.  సైతాను పరివారమును ప్రభువు పందులలో ప్రవేశింపజేసినట్లు-ఆ పందులతో సమానమైన అవినీతి పరులను- ఆ నీతిమంతుల కారు క్రింద పడవైచి వారిపై నిందమోపచూచును.  కోర్టులో వారిపై బైబిలు ప్రమాణము చేయించి ఘనముగా వాదింపజూచును.  అవినీతి పరులలో జేరి వారిని ఎగతాళి పట్టించుచుండును  

        సైతానుడు ఏసు ప్రభువును ఏయే విధములుగ వెంటాడెను?

        1.శోదకుడు 2.విమర్శకుడు-శాస్త్రులు పరిసయ్యులు విమర్శించుట 3.నిర్దోషియైనను శిక్షకు అప్పగించుట4.సిలువ వేయమనెడి శాసనముగ 5. మరల లేచునేమోయనెడి సంశయముగలవాడుగ ఉదా|| దేవుని కుమారుడవైతే సిలువనుండి దిగిరా? ఆయన నిజముగ దిగివచ్చినట్లయితే ఈనాడు జీవగ్రంధము వుండదు.  నీవు దేవుని కుమారుడవైతే ఱాళ్ళను రొట్టెలుగా మార్చుము.  ఆ విధముగా మార్చినట్లయితే దేవుడు సైతానుకు లోబడినట్లు అగును.

        సైతాను చేత కట్టుకొనిన పామునకు ప్రతిగా గర్భవేదనతో కూడిన హవ్వ ప్రసవమునకు ఆదామే  మంత్రసాని అయ్యెను.  కాని శపించబడిన వారు కాబట్టి దేవదూతలు అచ్చటికి రాలేదు.

                సాతాను యొక్క దశావతారములు

        ప్రభువునందు ప్రియసోదరీ! సోదరుడా!  నేటి మన జీవితములో క్రైస్తవులము కాకమునుపు క్రీస్తు నెరుంగక పూర్వము మన హైందవ జీవితములో ఎందరో దేవతలను గూర్చి వింటూ అనేక పురాణకధలను చదివియున్నాము.  అయితే వాటన్నిటికిని విరుద్ధమైన విచిత్రమైన యదార్థముతో కూడిన వేద మర్మము ఈరోజు మనము బైబిలు ద్వారా తెలిసికొనబోవుచున్నాము.  అదేమనగా అపవాది యొక్క అవతారములు వాటిని గూర్చిన వేదసత్యములు మనము తెలిసికోవలసివున్నది.

        లూసిఫర్‌ అను దేవదూతః-ఈ అవతారములో యితను అతి సుందరుడై దేవదూతలందరిలోను ఒక ప్రత్యేకస్థానమును పొంది, దేవుని సన్నిధిలో జీవించినట్లును అట్టిజీవితములో వున్నట్లుండి అగస్మాత్తుగా అపవాదిలో అహంభావమను గుణమేర్పడి తన్మూలముగ శాపగ్రస్థుడై పడద్రోయబడి చీకటికి ప్రభువాయెను. ఇట్లున్నయితను చీకటి అగాధజలములలో జీవిస్తూ దారితెన్నులు లేని జీవితములో వుండగా దేవునికి తానున్న లోకముగాకుండ మరి యొక్క లోకమును సృష్టించి దానిలో తన జీవాత్మ నూది తన మహిమను అందులో కూడా కనుపరచాలని దేవుడు వాంచించిన వాడై భూలోక నిర్మాణమునకు ప్రణాళిక వేసి చీకటి అగాధ జలములలో వున్న భూమిని పైకిలేవనెత్తి తన మహిమా ప్రభావములతో దానిపై సృష్టినేర్పరచి, దానినేలుటకు తన జీవాత్మ పూర్ణుడైన ఆత్మసంబంధియైన నరుని భూసంబంధిగా మట్టితో నిర్మించి వానిని నమ్మక వానికనువైనట్టి వాతావరణమును కల్గించి, వాతావరణమున కనుగుణ్యంగా ఆతని దేహనిర్మాణమును కూడా పటిష్ఠముచేేసి అనగా ఎటువంటి వాతావరణమునకైనా తట్టుకోగల్గినట్లుగా జేసి, వానికి సాటిసహాయంగా ఒక స్త్రీ నేర్పాటుజేసి అన్ని హంగులలోను అతనికే లోటు కలుగనీయక పటిష్ఠమైన తన కాపుదలతో తన యొక్క సంరక్షణలో నరుని జీవితాన్ని క్రమబద్దము జేసెను.

        ఇట్టి పరిస్థితిలో దేవుడు నరుని పరీక్షించుటకు ఆతోటలో ఫలనిషేధమను షరతును బెట్టి నరుని యొక్క బుద్ధిని పరీక్షిస్తూ వచ్చెను. ఇట్టి సమయములో అపవాది యనువాడు నరుని దైవపరీక్ష నుండి ఓడించాలని సంకల్పించినవాడై సర్పావతారమెత్తి, స్త్రీ పురుషులను తన యొక్క శోదనతో నరులను దైవత్వంనుండి తప్పించగల్గెను.  యిది సాతాను యొక్క రెండవ అవతారము.  ఇట్టి సర్పావతారమును ప్రకటన 20:2 లో వివరించబడియున్నది.  మూడవది సాతాను 4.అపవాది 5.కౄరమృగము 6.అబద్ద ప్రవక్త 7.అంత్యక్రీస్తు.  నెబుకెద్నెజరు జేసి నిలబెట్టిన విగ్రహము పిలిష్తీయుల దాగోను యెజిబేలు మొదలైనవి.  ేదైవత్వానికిఏదైతే వ్యతిరేకంగా వుంటుందో అదంతయు సాతాను యొక్క అవతారంగా మనమూహించవలసియున్నది.

        క్రీస్తును చంపచూసిన హేరోదు అపోస్తలులను హింసించిన నీరో-కైజరు వీరందరు కూడా ఈతని ప్రతి రూపాలు. పది అవతారాలు మాత్రమేకాదుగాని చాలా అవతారాలున్నవి. యేసుప్రభువును పట్టించిన ఇస్కరియోతుయూదా కూడా ఈతని అవతారము. ఒక్కముక్కముంచి ఆతని నోటిలో పెట్టినపుడు ప్రవేశించినది సాతాను.  యోహాను శిరస్సును ఖండింపజేసిన యేరోదియ కూడా ఈతని ప్రతిరూపమే.  ఈవిధంగా ఆడామగా తేడా లేకుండ అనేక అవతారములెత్తి భూమి పై క్రియజరిగించి దైవత్వమునకును దైవరాజ్యమునకు విరోధియై ప్రవక్తలను అపోస్తలులను విచక్షణారహితంగా హింసించి చంపి తన అక్కసును తీర్చుకొనుటయే గాక, నేటి క్రైస్తవ సంఘములన్నిటి మీద పడి క్రైస్తవులలో కూడా సమాధానము లేని జీవితాన్ని రేకెత్తించి క్రియ జరిగిస్తున్నాడు.  యిది యదార్థ విషయము.

        జంతు సంబంధంగా అపవాది యొక్క రూపములుః-సర్పము-తోడేలు (గర్జించు) సింహము చిరుతపులి, ఎలుగుబంటి (అహరోను చేసిన దూడ యోహాను దర్శనములోను దానియేలు దర్శనములోను సూచించిన సూచక క్రియలు-అపవాది యొక్క ప్రతిరూపములే.  ఇవిగాక దాగోను అష్టారోతు బైలు అర్తిమినేనిమొలకు వగైరా చిల్లరరూపములు.

        ఇట్టి చిల్లర రూపములలో నేటి తరము వారైన మన అన్యసోదరులు ఆచరించు వాటిలో పోలేరమ్మ కనకదుర్గమ్మ పరమేశ్వరమ్మ మాలక్ష్మమ్మ వగైరా అమ్మల యొక్క రూపాలు లేనిచో వీరి పేరుతో చెట్లు.  వేపచెట్టుకు మాలక్ష్మమ్మ పేరు రాగిచెట్టుకు మునీశ్వరుని పేరు పేట్టేది.  కొలువులు జరిపేది. ఇందులో ఒక గొప్ప మర్మమున్నది.  దేవునికి భార్య లేదు.  అదేవిధంగా అపవాది కూడా ఆత్మగనుక ఆతనికి కూడా భార్యలేదు.  ఈ విధంగా జంట జీవితమునకును స్త్రీ సాంగత్యమునకును సాంసారిక జీవితమునకును దూరమైయున్న ''దేవుడు-అపవాది, యనురెండు శక్తులలో దైవశక్తికి కామోద్రేకము పుట్టించు శక్తియున్నదిగాని దేవుడు కాముకుడు గాడు. ఆయన ఉద్రేకిగాడు.  అదేవిధంగా అపవాది కూడా కాముకత్వమును గల్గినవాడే గాని నపుంసకుడు.  అందుచేతనే భూమిమీద దైవవ్యతిరేకముగా నరులనజ్ఞానులుగా జేసి తన ఆడంగితనమును బైల్పడనీయక తనను ఆడంగివాడని జనసందోహము గుర్తింపనీయక, పైగనపరచిన తన విగ్రహ రూపములను దేవుళ్లుగా జేసి ఆ దేవుళ్ళకు పెళ్ళి తంతు జరుపు సందర్భములోను, పెళ్ళి జరిగిన తర్వాత రధోత్సవములలోను తానుమరుగైయుండి ఆ దేవుళ్ళకు పెళ్ళి జరిగించునపుడు ఆ యొక్క ఆలయములో పూజాదిక్రియలు జరిగించే బ్రాహ్మణుని చేత ఆ దేవతల విగ్రహాల మెడలో తాళిగట్టించుచుండును. ఈ తాళిగట్టే బ్రాహ్మణునికి తానుగట్టేది చేతితో మలచబడిన బొమ్మకేనని అది దేవుడు గాడని బాగుగా తెలియును.

        ఈ విధంగా ప్రతి సంవత్సరము ఆ ఆలయ పూజారి.  ఆలయ పండుగసందర్భంలో ఆ దేవతగా యేర్పరచబడిన భార్యవిగ్రహమునకు తాళిగట్టుచు అందులో మామూలు పద్దతితో గాక మేళతాళములతోను బాజాభజంత్రీలతోను ఈ వివాహకార్యక్రమాన్ని జరిగించి ఈ బొమ్మలకు  సీమంతము  కూడా జేయించుచుండును.  ఇవన్నియు చేయించువాడు అపవాదియే.  ఇది పరమ అసహ్యకరమైన దైవవ్యతిరేకమైన దేవుని కించపరచునట్టి క్రియమైయున్నది.

        క్రైస్తవ వేదమైన బైబిలు గ్రంధములో దేవుడు తన ప్రజలనుద్దేశించి ''నేను తప్ప మరియొక్క దేవుడు వుండకూడదు.  ఆకాశమందలి వాటినిగాని భూమియందున్నవాటికైనను జలములలోని దేవని రూపమునైనను మీరు జేసికోకూడదు. వాటికి సాగిలపడి మ్రొక్కకూడదు''.  అని దైవసిద్దాంతము. దీనిని పెడచెవిని బెట్టి నేటినరకోటి దేవుళ్ళని పేరుపెట్టి అనేక విగ్రహాలకు ఆలయాలు గట్టించి దిక్కుమొక్కు లేని ఆ ఆలయాలకు ట్రస్టుబోర్డులు నిర్మించి వాటి ద్వారా ధనాశను ప్రేరేపించి జనులను వక్రమార్గమున త్రిప్పి ఆ రాతిదేవుళ్ళ సొమ్మును కొల్లగొట్టించి వీలైతే మంచిరేటుకు ఆలోహవిగ్రహాలను విదేశాలకు అమ్మించడము నరసందోహములో సర్వసాధారణంగా ఈలాంటి చోరీకేశులను వార్తాపత్రికలలో చూస్తుంటాము.  కనుక చూస్తూవున్న ఈ అట్టి దేవుడు మగధీరుడా? నపుంసకుడా?చదువరీ! ఆలోచించుము.

        యెహోవానగు నేను రోషముగల దేవుడను.  పౌరుషముగలవాడను.  దేవుడు శపించగలడు.  శాపవిమోచన జరిగించగలడు.  ప్రమాదమునుండి రక్షించగలడు.  నరుని ఆయుర్ధాయమును పెంచగలడు, తగ్గించగలడు.  అపవాదియనువాడు శాపగ్రస్థుడు గనుక తనవలెనే నరులను దైవవ్యతిరేకులుగా మార్చి తన వలేనే శాపగ్రస్థులుగా చేయుటకు అహర్నిశలు కృషిచేయుచున్నాడు.  ఎందుకంటే తాను శాపగ్రస్థుడాయెను.ప్రమాదంలో చిక్కుకున్న నరుని అబద్దాలతో కూడిన కాకమ్మ కధలతో మభ్యపెట్టునేగాని నిజంగా అపవాది సమర్ధుడుగాడు నరుని ప్రేరేపించునే గాని అపవాది వ్యభిచారుడు గాదు.  దీనికి ఉదా||సంసోనును దైవాత్మ నుండి వేరుపరచి భ్రష్ఠుపాలుజేయుటకు లైలాయను, పిలిష్షీయ సుందరి రూపమును అడ్డుపెట్టి తన ధ్యేయాన్ని నెరవేర్చుకున్నాడు.  అదే విధంగా వెండి నాణెముల ఆశజూపించి యూదా ఇస్కరియోతును మరణం పాల్జేశాడు.  ఇందును బట్టి మనమాలోచిస్తే అపవాదికి నరుని నాశనమునకు బంపు శక్తివున్నదిగాని నాశనము నుండి నరుని కాపాడు శక్తి విహీనుడుగా ఆత్మజ్ఞానంతో మనము తెలిసికోగలము.

        భీకరమైన తుఫానును సుడిగాలులను సంద్రపు పొంగును ఉరుము మెరుపులను సృష్టించగలవాడు సర్వశక్తిగల  దేవుడొక్కడే. అయితే అపవాది తనకుతంత్ర మూలమున అట్టి సృష్టికర్తను సృష్టియొక్క శక్తిని నరులకు మభ్యపరచి ఆయన సృష్టములైన ఉరుములు మెరుపులు గాలి వర్షమునీరు వగైరాలకు దేవుళ్ళ పేర్లు పెట్టి నరులను అజ్ఞానులుగా జేసి ఉదా|| ఉరుము మెరుపులకు అర్జున రధమనియు మేఘములకు మేఘనాధుండనియు, వర్షానికి వరుణుడనియు గాలికి వాయు దేవుండనియు, కొంపలను నేలమట్టము జేయువరద నీటికి గంగమ్మని పేరుపెట్టి అపవాది ఈ విధంగా నరుల చేత కొలువులు చేయిస్తున్నాడంటే, నరుని యొక్క అజ్ఞానం సాతాను యొక్క కుతంత్ర మెట్టిదో మనము గ్రహించవలసియున్నది.

        ఇందును బట్టి దేవుడు అపవాది యొక్క కుతంత్రములకు లోనై అజ్ఞానమరణాంధ కారమునకు వెళ్ళు జనులపట్ల కరుణించిన వాడై ఆయన కూడా ఈ లోకంలో కొన్ని అవతారములు ఎత్తవలసివచ్చెను.

        మొట్టమొదటిగా ఆదికాండ 6:లో నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత అపవాది వారితోబాటు పాపమును కూడా విస్తరింపజేసి దేవుని కుమారులను నరుల కుమార్తెలతో సంగమింపజేసి పాపమును పెంచెను.  ఈ పెరిగినట్టి జన సంఖ్యలో విస్తరించబడిన పాప పరిమాణమెంతయ్యా! అంటే కొన్ని కోట్ల జనాభాలో నోవహు అను ఒకే ఒక కుటుంబము మాత్రమే నీతిమంతుడుగా దేవుని దృష్టికి అగపడిరంటే దీనిని బట్టి మనము తూకము వేస్తే పాపము యొక్క పరిమాణము దాని ప్రభావమెంత మోతాదులో విస్తరించెనో సులభముగా తెలిసికోగలము.

        ఈ విధంగా పాపముతో కూడిన జనకోటికి తన ప్రభావమును నిరూపించుటకు దేవుడుగ్రరూపమును దాల్చి ప్రవాహజలముల వలె అవతారమెత్తి నలుబది దివారాత్రాలు జలధార రూపములో దేవుడు లోకనాశనమున కుపక్రమించి క్రియజరిగిస్తూ ఒక వైపున తన విశ్వాసుని కుటుంభ రక్షాణార్థము అటువంటి మహాజల ప్రళయమునుండి రక్షణ కల్గించుటకుయేసను రూపమొకటి లోకమునకు రావలసివున్నదని గుర్తుగా నరుడు జేయు పాపమునకు నరుని ద్వారానే రక్షణన్నట్లు ఆనాటి జనుల యొక్క పాపమునకు నరుని యొక్క హస్తకృత్యమే రక్షణన్నట్లు దేవుడు నరునిచేత జేయించిన ఓడ నూతన నిబంధన కాలంలో క్రీస్తు శరీరమునకు నేటి యుగములో బైబిలు గ్రంధముగా ఆయెను. దీనికి ముందుగా దేవుడెత్తిన అవతారమును గూర్చి తెలుసుకొందము.

        ఆది 1:1లో చీకటి జలములలో దేవుని యాత్మ దేవుని యొక్క యదార్థరూపము ఆత్మ. ఈయన పరమందున్నాడుగాబట్టి పరమాత్మ. ఈ పరమాత్మ యోహాను సువార్త 1:1 వాక్కైయుండెను.  వాక్కు దేవుడైయున్నట్లుగాను గ్రంధవివరణ.  అంతేగాక ఆ వాక్కు జీవమైయున్నట్లును, ఆ జీవము మనుష్యులకు వెలుగై యున్నట్లును యిందును బట్టి యిప్పటివరకు దేవుని యొక్క అవతారములు సృష్టముగా రూఢిియగుచున్నవి.  ఆత్మ, వాక్కు, జీవము, వెలుగు ఆ తర్వాత ఆ వాక్యము కృపాసత్యసంపూర్ణుడుగా శారీరధారియై మనమధ్యవాసము జేసెను. యెహాను 1:14 క్రీస్తు శరీరము.

        దేవుడు క్రీస్తును రూపముతో ఊరుకొనక ఆ రూపము ఈ దిగువ రూపాంతరములను పొందినట్లుగా వేదములో చదువగలము. యేసుపుట్టినపుడు ఆకాశములో పుట్టిన నక్షత్రము కూడా ఆయనే.  యోహాను 1:29లోకపాపము మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను 10:1లో గొర్రెల ద్వారము.  యోహాను 5:2లో ఐదు మంటపముల కోనేరు కూడా క్రీస్తే.  యోహాను 6:51 జీవాహారము క్రీస్తే, అనగా రొట్టె ద్రాక్షారసము.  నేను నిజమగుద్రాక్షావళ్లి,  కనుక ఈయన ద్రాక్షావళ్ళి.  యేసురూపాంతరము పొందుట మత్తయి 2:2 యూదుల రాజు.  నేటి యుగములో సంఘము.  యేసుసంఘమునకు దేహమును సంఘమునకు శిరస్సైయున్నాడు. మత్తయి 25:31 చివరి అవతారము తీర్పరి.

        ఇవిగాక పాతనిబంధన కాలంలో దేవుడు మోషే కిచ్చిన కర్ర క్రీస్తు.  ఆరులక్షల జనాభాయైన ఇశ్రాయేలీయులకు దప్పిక తీర్చినబండ క్రీస్తే.  దశాజ్ఞలమందసం క్రీస్తు.  ఇశ్రాయేలీయులు బలిపీఠం కట్టి బలులర్పించు సందర్భంలో పరిశుద్ధస్థలంలో ప్రవేశించుటకు పూర్వము కాళ్ళు కడుగు కొనుటకు వుంచబడిన గంగాళము క్రీస్తే.  బలిపీఠము ఆయనే. వధించబడు బలిపశువు ఆయనే.  ఆ బలిపీిఠము  దగ్గర బలి అర్పించు ప్రధానయాజకుడు కూడా ఆయనే.

        ఇశ్రాయేలీయులను సముద్రమధ్యములో నడిపించిన మేఘము కూడా క్రీస్తే. గొలియాతును వడిసెలతో కొట్టి దావీదు సంహరించిన వడిసెలలోని రాయి కూడా క్రీస్తే.  యెషయా 28:16 ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.  సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే.  అది పరిశోధించబడిన రాయి.  అమూల్యమైన తలరాయి.  బహుస్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది.  విశ్వసించువాడు కలవరపడడు.  దేవుడేర్పరచిన పునాది రాయి క్రీస్తే.  విశ్వాసమనెడి రాయి.

        పరలోకంలో దేవునికున్న అవతారములుః-దావీదు చిగురు.  యూదా గోత్రపు సింహము ఏడుదీపములస్థంభము.  పరలోకానికి వెలుగు పరలోకసామ్రాజ్యానికి అధిపతి.  లోకమునకు తీర్పు తీర్చుటకు న్యాయాధికారి ఆయనే.  దైవరాజ్యమునకు మార్గము - సత్యము-జీవము ఆయనే.

        ఇన్ని విధములుగ దైవక్రియ కునకక నిద్రపోక ఇహపరమందు క్రియజరిగిస్తుండగా అపవాది దిక్కుదోచని వాడై స్థిమితము లేని బుద్ధితో మనశ్శాంతి లేక త్రాగుబోతుగాను జూదరిగాను సినిమా ప్రియుడుగాను లాటరీపిచ్చివాడుగాను, ప్రతి వానిని ధనాపేక్షగలవానిని గాను, ధనాపేక్షమూలమున వారినారి స్వంత మనుష్యులలోనే వారు హత్యజేసుకొనే పద్ధతులలో హంతకులుగాను దేవుడు లేదన్నట్లుగా జనులచేత పలికిస్తూ తాను మనశ్శాంతి పొందుటకు ప్రయత్నిస్తున్నట్లును యిట్టి ప్రయత్నానికి చాలమంది యౌవ్వన సోదరులు ఆత్మహత్యలకును హంతకులుగాను దేవునిపై తిరుగుబాటు జేయువారిని గాను జేయుచు క్రైస్తవాలయములనే వీలైతే వాటిని అన్యాక్రాంతముగా అమ్మించి భూలోకంలో దేవుడేలేడన్నట్లుగా జేయాలని ఉగ్రరూపుడై దెబ్బతిని నెత్తురు కార్చుచున్న సింహము అడవిని ఏ విధంగా గగ్గోలు పరచునో ఆ విధంగా ఉగ్రవాదులు టెర్రరిస్టులనియు నక్సలైట్లనియు, నాస్తికులనియు హేతువాదులనియు వగైరా నామధేయంబులతో అంచెలవారీగా కూటముల నేర్పరచి, తన ప్రణాళికానుసారము నరసందోహమును నడుపుచు రాబోవు ప్రభువు రాకడలో ప్రభువుపై తిరుగుబాటు జేయుటకొక సైనిక సమూహమును భూమిపై సిద్దపరస్తున్నట్లుగా మనము తెలిసికొనవలసివున్నది.

        ఇపుడు దేవుని యొక్క అవతారము యేసుప్రభువు.  ఈ లోకములో జీవించినపుడు తాను జెప్పిన రీతిగా నేను వెళ్ళి ఆదరణకర్తయైన సత్యస్వరూపియైన ఆత్మను పంపెదనని చెప్పిన విధంగా ఆయన పంపిన పరిశుద్ధాత్మ అవతారమే భూమిమీద క్రియజరిగిస్తున్నట్లుగా మనము గ్రహించవలసియున్నది.

        సోదరీ!సోదరుడా! ఈ గ్రంధములోని అంశములు ఇప్పటి లోకమునకు వెర్రితనముగా వుండవచ్చును.  దీనిని చదువుచున్న నీ యొక్క ఉద్దేశ్యమేమి? మనము భ్రష్టత్వం పొందుటకు అపవాది ఎత్తిన రూపములకు నీవు బానిసయైయుందువా? ఆ రూపముల నుండి మనలను కాపాడుటకు తండ్రియైన దేవుడు తాను పొందిన పవిత్ర రూపములకును ఆయన నిబంధనలకు కట్టుబడి యుందువా? ఏది నీ నిర్ణయము? ఇదియే, అనుకూల సమయము, ఇదియే రక్షణ దినము.  సాకులు చెప్పు సమయము దాటి పోవుచున్నది.  ఎందుకంటే దేవుడు తన అవతారములను చాలించి తీర్పరిగా రాబోవుచున్నాడు.  అపవాది కూడా భూమిపై తన చివరి అవతారముతో విజృంభించి దేవుని ఎదుర్కొని దేవదూతల చేతబంధింపబడి పాతాళములోని చీకటి బిలములలో చెరపెట్టబడు సమయము ఆసన్నమైయున్నది.  ప్రభువుమనలను ఆశీర్వదించి కాపాడునుగాక! ఆమేన్‌.

        ప్రసంగముః-అంశము-సుబ్బరాయుడు లోకసంబంధి ఆది 3:1లో ఇతడు దేవుడు చేసిన భూజంతువు.  ఈయన చేసినపని.  ఆదినరులను దేవునితో వారికున్న సంబంధాన్ని విడగోట్టాడు.  తత్‌ఫలితము-కాళ్ళు ఱెక్కలు పోయి పొట్టతో ప్రాకు హీనస్థితికి దిగజారి నరులకు విరోధియైనట్లు ఆది 3:14-16లో చదువగలము.  ఇతని బోధవలన చెడి పాపులైన ఆది నరసంతానమును గూర్చి మత్త 3:7లో బాప్తీస్మమిచ్చు యోహానును మత్త 23:33లో ఏసుప్రభువు సర్పసంతానము అనగా సర్పమును ఆరాధించి తమ సంతానములకు దాని పేరుపెట్టుకొన్న భక్తులు. ఇది భూసంబంధియు భూజంతువైన సుబ్బరాయుని చరిత్ర.

        ఇక ఈ సర్ప సంబంధమైన విషవాక్కులు మూలమున నరకోటికి సంభవించిన పాపము, శాపము, మరణము అను ఉపద్రవములను తొలగించుటకును దైవజనాంగమునకు కనువిప్పు కలిగించుటకు దేవునిచే నిర్గ 4: 1-4లో సృష్టించబడిన కర్ర పాము, ఇది దేవుడి పాము. ఇక అన్యుడైన ఫరోరాజునకును అతని మంత్ర వేత్తలు సృష్టించిన పాములను మ్రింగి దేవుని మహిమపరచిన అహరోను చేతికర్ర పాము నిర్గ 7: 8-13 ఇది పరమదేవుని ప్రభావము నిరూపించినది.

        అయితే నేటి తరము వారమైన మనము యోహా 3:14లో విధంగా ఎత్తబడిన పరమ సుబ్బరాయుని వైపు చూడవలసియున్నది.  అప్పుడే మనకు రక్షణ-సర్పవిషమునుండి విడుదల కల్గుతుంది.  కనుక హెబ్రీ 12:1-2 లో వలె విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు వాడునైన ఏసు అను పరమ సుబ్బరాయుని వైపు చూస్తూ మన యాత్ర సాగించుకోవాలి.  ఆమేన్‌.

        ఆదిలో సర్పము జిత్తుల మారిదై మనుష్యభాషలో మాట్లాడినట్లున్నది.  నరులను పాపములో ప్రవేశింపజేయుటకు దాని మాటలు మూలాధారమైనది అట్టి సర్పమునకు దేవుడు నోటిమాటను పడకొట్టి ఱెక్కలు కాళ్లను రాలగొట్టి పొట్టతో ప్రాకి మట్టిని తినమని మఱియు స్త్రీ సంతానము అనగా నరసంతానమునకును సర్పసంతానమునకును వైరము కల్గునట్లుగా దేవుడు శపించియున్నాడు.  నేడు సోది అడుగు వారి సోదెలో సర్పము సుబ్బరాయుడనని మాట్లాడుచున్నాడు.  ఈనాడు ఈ సర్పమునకు సుబ్బరాయుడు అను పేరు ఎట్లు సార్ధకమైనది?

        సుబ్బరాయుడు అనగా సుబ్బరంగా మొత్తము రాలగొట్టుకున్నాడని అర్థము.  కాళ్ళు ఱెక్కలు, నోటిమాటలు మొ||నవి.  సోదెగానికి జ్ఞానము ఇచ్చి మాట్లాడించునది మన అజ్ఞానమే, అనగా చనిపోయి ఉత్తరించు ఆత్మలు మాత్రమే.

                        యుగసంబంధమైన దేవత

        2వ కొరింధీ 4:4 దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈయుగసంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గృడ్డితనము కలుగజేసెను'',

        ప్రియపాఠకులారా!  ఇంత వరకును మనమెన్నో అంశాలను గూర్చి తెలిసికొని ధ్యానించియున్నాము.  పై వాక్యములో యేసుక్రీస్తును దేవుని యొక్క స్వరూపముగాను మరియు ఆయన క్రీస్తేగాక మహిమ గల వానినిగాను దేవుని యొక్క సువార్తకు ఆయనవెలుగుగాను పౌలు అభివర్ణించి యున్నాడు.  ఇందును బట్టి దేవుని యొక్క ప్రతిరూపమైన క్రీస్తులో పౌలు వ్రాసిన సిద్ధాంతము ప్రకారము మూడు విధములైన సత్యములు మనకు బయల్పరచబడుచున్నది.  మొదటిది ఏసుక్రీస్తు దేవుని స్వరూపము 2. క్రీస్తు- మహిమ గలవాడు 3.ఆయన దేవుని వెలుగైయున్నాడు ఆ వెలుగే సువార్త వెలుగు.  ఈ సత్యాన్ని లోకములో గ్రహించేవారున్నారా? అనిన ప్రశ్న మనకు మనకే ఈ సందర్భములో కలుగవచ్చును.  దీనికి జవాబు పరిశుద్ధగ్రంధములోనే వున్నది.  ఇందును గూర్చి రోమా పత్రిక 3:11లో ''నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించు వాడెవడును లేడు, దేవుని వెదకు వాడెవడునులేడు, అని వ్రాయబడియున్నది.  దేవుని వెదకాలంటే కేవలము నరుని యొక్క జ్ఞానము, నరుని యొక్క ప్రయత్నము నరుని యొక్క ప్రయాస చాలదు, దేవుని    వెదకాలంటే దేవుడు చేసిన కార్యాలను మనము ధ్యానించవలసియున్నది.  దేవుడు చేసిన కార్యాలు మనము ధ్యానిస్తే దేవుని వెదకువారి జాబితాలో చేర్చబడగలము.  దేవుని వెదకాలంటే శరీర సంబంధ ప్రయత్నాలు, శరీర సంబంధ నేత్రాలు వ్యర్థము,  దేవుని వెదకువాడు ఆయన ఆత్మ కాబట్టి ఆత్మ దృష్టితో ఆత్మతో సత్యముతో వివేకముతో ఆరాధించాలి.  ఆయనను స్తుతించి ఆరాధించి ఘనపరచాలి.  ఇదియే దేవుని వెదకుటకు మూలమైన సూత్రము.  అంతేగాని నరులు తమస్వార్థానికి చేసిన విగ్రహాలు అవి కొయ్యవి మట్టివి లోహముతో తయారైనను సరే, రాతి సంబంధమైనవైనను సరే, మరి ఏ సంబంధమైనను వాటిలో దేవుడు వుండడు. దేవుడు నిత్యజీవుడు కనుక ఆయన చేసిన బొమ్మలైన మనము జీవము గల బొమ్మలము.  మనము ఆయనలో జీవిస్తూ చలిస్తూ ఆయనను మహిమపరచుచు ఆయన రాజ్యవారసులుగ జీవించుటకు ఈ లోకములో తర్పీదు పొందాలి.  ఈ సత్యాన్ని మరచి కేవలము చెట్లను పుట్టలను, దైవ సృష్టములైన కోతులు వగైరా కృరమృగాలను విషసర్పాలను దేవుళ్ళుగా జేసి, జీవముగల దేవుని నిర్జీవమైన బొమ్మలుగా జేసి నరుడే పండుగలు చేస్తూ ఆ బొమ్మలకు భార్యభర్తలను ఏర్పరచి అతినీచాతీనీచమైన క్రియలు చేస్తున్నారంటే నరుడు .నిజంగా జ్ఞానియా? పశువుకంటె హీనుడా! ఇట్టి వారిని ఏ జాబితాలో చేర్చగలము. మనలను తన హస్తంతో రూపించి, మనకొక తల్లిని తండ్రిని ఏర్పరచి వారి పాలతో ఎదిగించి జీవమిచ్చి ఆరోగ్యమిచ్చి సకలము చక్కగా అమర్చి నీతి-పరిశుద్ధత తో జీవించమని ఈ లోకానికి పంపిచాడు. అంతేగాని మన స్వజ్ఞానంతో ఈ లోకానికి రాలేదు.  మన అన్నది భూమి మీద లేదు, నాది మనది అనుటకు నరునికి ఏ విషయములోను భూమిమీద పాలిపంపులు లేవు. నరుడు అస్థిరుడు, సృష్టికర్త స్థిరుడు, అస్థిరులుగ వున్న మనలను సృష్టిలో పుట్టించిన స్థిరుడైన దేవునికి యోగ్యకరంగా మహిమకరంగా జీవించాల్సినవారమైయున్నాము.  ఈ విధంగా జీవించాలంటే మన ఆత్మీయ స్థితిని చాలా క్రమ శిక్షణయందుంచుకోవాలి.  ఆత్మ-శరీరాన్ని రెండింటిని క్రమబద్దీకరణ చేసుకొని సిద్దపాటు కలవారమై దైవత్వానికి యోగ్యత కల్గినవారమై, ఎదుటి వ్యక్తులకు ఆదర్శముగా దేవునియందు భయభక్తులు గల్గి జీవించు ఇట్టి స్థితిలో ఎదగాలంటే మనకన్ను మన నాలుక మన చేతులు మనకాళ్ళు మన జ్ఞానము వగైరా పంచేంద్రియాలు వీటిని స్వాధీన పరచుకొని క్రమపరచుకొని లోకానికి కాకుండ దైవ మర్యాదలతో దైవకార్యములలో వాడాలి.  ఆ విధంగా వాడిననాడే నరుడు సంపూర్ణుడు.

        ప్రియపాఠకులారా!  దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ అవయవాలు ప్రతిదియు రెండు విధములైనట్టి విధానాలున్నాయి.  1.హృదయము -దీనిని సరికొత్త రీతిలో వుంచాలి.  ఇది మోసకరమైనది.  ఇది లోకము విచారకర వ్యాధిలో నరజీవితమును అశాంతిలోను వేదనతోను విచారముతోను నరుని యొక్క జీవితానికి అడ్డుతగులుతుంది.  కన్ను ఇది నరుని యొక్క పతనావస్థకు నరుని యొక్క ఉచ్ఛస్థితికి కూడా ప్రధాన అవయవమై యున్నది.  లోకరీత్యా కంటి చూపు చెడును చూడక చెడు సాహిత్యాలను అశుభమైన వాటిని అక్రమమైన వాటిని ప్రమాదకరమైన వాటిని చూడకుండ తప్పించుకొనుటకు ఈ కన్నులు చాలాప్రాముఖ్యత వహించియున్నవి.  కన్నులను మంచి విధానములో వాడాలంటే కొన్ని సూత్రాలు అవేవనగా దైవానుగ్రహం కొరకు మనము ప్రార్థన చేయునపుడు ఆకాశము వైపు చూచువారు కొందరు, కండ్లు మూసుకొని చేస్తున్నారు.  ప్రార్థన సమయములో స్థిరత్వమన్నది కంటికి చాలా ప్రాధాన్యత నిచ్చాడు.  ప్రభువు ఆకాశము వైపు కన్నులెత్తి విజ్ఞాపన చేసిన విధానము కొన్ని సంఘటనలలో వేదరీత్యా తెలిసికొనియున్నాము.  ఇందును గూర్చి మోషే ఆకాశము వైపు కన్నులెత్తి విజ్ఞాపన చేశాడు.  అబ్రాహాము కూడా తన కుమారుని బలిచేయు సందర్భములో కన్నులెత్తి ఆకాశము వైపు చూచి యెహోవాకు ప్రార్థన చేసినట్లును, ఏలియా ఎలీషాలు కూడా ఆ విధంగా ప్రార్థన చేశారు.  ఈ విధంగా పాతనిబంధనలో ప్రవక్తలు నూతన నిబంధనలో క్రీస్తు ప్రభువు ఈలాగు ప్రార్థన చేసినవారే, అనిన సత్యాన్ని వేదగ్రంధములో మనము చదువుకొనియున్నాము.

        ప్రియపాఠకులారా!  ఇది శారీర సంబంధమైన దృష్టిని గూర్చిన వివరము, పాతనిబంధన కాలములోను నూతన నిబంధన కాలములోను ఆకాశము వంక కన్నులెత్తి ప్రార్థన చేసేటటువంటి విధానముండగా నేటి క్రైస్తవ విశ్వాసులమైన మనము తలవంచి కన్నులు మూసుకొని ప్రార్థన చేసే స్థితి ఏర్పడుటకు కారణము లేకపోలేదు.  పాతనిబంధనకాలములో నాటి దైవజనులు ఆకాశము వైపు కన్నులెత్తి ప్రార్థన చేసేవారు.  కాని తలవంచి కన్నులు మూసుకొని మోకరించి ప్రార్థన చేసే స్థితి నేటి సంఘాలలో నేటి విశ్వాసుల మైన మనలో ఏర్పడుటన్నది కూడా దైవనియమమైయున్నది.  ఇది అపొస్తలుల యొక్క గురుత్వములో విశ్వాసులకు అనుగ్రహించబడిన ఆచారము, ఏది ఏమైనను అనగా శారీరయుతమైన స్థితి ఎలాగున్నను శారీర నేత్రాలు మూసికొన్నను తెరచికొన్నను, శారీర నేత్రాలు గృడ్డివైనను మనో నేత్రము మాత్రము గృడ్డిది కాదు.  మనో నేత్రానికి కన్నుమూతలేదు.  మనో నేత్రానికి నిద్రలేదు, దానికి గృడ్డి తనము లేదు, శారీర నేత్రానికి దృష్టిలోపము లేక గృడ్డి తనము ఉండుట సహజమే,  కాని మనోనేత్రమునకు గృడ్డితనము గాని కంటి జబ్బుగాని కలకగాని ఏదియు లేదు.  మరి మనోనేత్రము గృడ్డిదైంది అంటే గృడ్డితనానికి కారకుడైన ఒక శక్తి ఉండాలి-అదియే కారణమైయుండాలి.  మనోనేత్రము గృడ్డిదైతే- ఆ మనోనేత్రము కల్గియున్న వ్యక్తి జీవితము కూడా గృడ్డిదే, అతని ఆత్మీయత గృడ్డిదే, అతను చేయు పనులు గృడ్డివే. ఇందును గూర్చి ప్రకటన 3:17లో నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గృడ్డివాడవును దిగంబరుడవైయున్నావని వ్రాయబడియున్నది.  ఇవన్నియు కూడా ఆత్మీయ గృడ్డితనము ద్వారా మనో గృడ్డి తనము వలన ఏర్పడినవి, అనగా శారీర దృష్టి ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి మంచి కనుచూపుకలవాడనుటకు వీలులేదు.  మనో దృక్పధం కూడా వుండాలి.  దైవత్వానికి శారీర దృష్టి  నరుని యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు జేస్తుంది. శారీర దృష్టి  కాదు, దైవత్వము మనోదృష్టిని అభిలషించును,  శారీర దృష్టి నరుని పతనంలోకి నడిపిస్తున్నది.  శారీర దృష్టిలోకసంబంధమైంది, ఆత్మీయ దృష్టి దైవసంబంధమైంది.  ఆత్మ దృష్టికలవాడు మెలకువగల్గి జీవించును, శారీర దృష్టికలవాడు పతనాన్ని కల్గించును.  మనో దృష్టి కోల్పోయినవాడు అభాగ్యుడు, మనో దృష్టి లేనివాడు సర్పము వంటివాడు. శారీర దృష్టిమీద ఆధారపడువాడు ఆత్మీయ దృష్టిని మనో దృష్టిని కోల్పోతాడు.  ఈ శారీర దృష్టి అన్నది అవిశ్వాసులకే గాని విశ్వాసులకు ఉండదు.  అవిశ్వాసులైన వారికి ఆత్మ సంబంధమైనవి ఏవియు కనబడవు.  అవిశ్వాసులైనవారికి మనో దృష్టి సంబంధమైన జ్ఞానముండదు.  అవిశ్వాసులైనవారికి సృష్టికర్తయైన దేవుని మహిమ తెలియదు. అవిశ్వాసులైనవారు నాస్తికులుగాను హేతువాదులుగ జీవిస్తారు.  మనో నేత్ర గృడ్డితనము కలవారు సృష్టములను పూజించుదురు, విగ్రహాలను ఆరాధించు వారైయున్నారు.  ఇది మనో గృడ్డితనము వలన కలిగే ఫలితములు.  క్రియలు. అందుకే యేసుప్రభువు అవిశ్వాసులతో విజ్జోడుగ ఉండకూడదనియు అంటే వారితో చేరకూడదనియు సెలవిచ్చియున్నాడు.  అవిశ్వాసము అన్నది సకల అనర్థాలకు మూలము అని తెలియుచున్నది.  ముఖ్యంగా మనో నేత్రమునకు గృడ్డితనము కల్గించేది అవిశ్వాస ఫలితమే!

        ప్రియపాఠకులారా!  శారీర గృడ్డితనము కలవానికి కనుచూపు మసకయైనవారికి మరొకరు దారిచూపించగలరు.  కాని మనోనేత్ర అంధకారమున్న వానికి ఎవడేది చెప్పినను ఎవరు ఏ సలహా ఇచ్చినను ఎవరు సత్యమార్గమును గూర్చి విన్పించినను, వాడు తనకున్న అంధకారదృష్టి మూలంగా తానున్న చీకటి మార్గమునే మంచి మార్గమని సత్యమార్గమనియు, తన మనో నేత్రాంధకార దృష్టియే సరియైన దృక్పధమని తలంచునేగాని సత్యాన్ని గ్రహించడు.  తన ఆత్మీయ అంధకారము నుండి విడుదల పొందలేడు.  ఇంతకును నరునిలో మనో నేత్రాంధకారమునకు సాతాను జరిగించే బలమైన క్రియ ఏదనగా దేవుని ప్రతిరూపమైయున్న దేవుని యొక్క రూపమును పొందిన క్రీస్తు యొక్క మహిమా ప్రభావములు ఆయన యొక్క సువార్త వెలుగును అవిశ్వాసి యొక్క జ్ఞానమునకు అర్థంగాని తెలియని స్థితి కల్పించుట అనగా క్రీస్తు నుండి అవిశ్వాసి యొక్క ఆత్మీయ జీవితాన్ని వేరుపరచుట, ఇదియే ఈ యుగసంబంధ దేవత అనగా ఈ లోకనాధుడు అనగా వాయుమండల సంబంధమైన అధిపతిని ఎఫెసీ 2:2 అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని'', అను బిరుదులు పొందిన అపవాది యొక్క శక్తియే అవిశ్వాసి యొక్క మనో నేత్రాంధకారమునకు మూలమైయున్నది.  ఇందును బట్టి ఇట్టి అవిశ్వాసులైన వారి యొక్క జీవితము లోకరక్షకుడైన క్రీస్తును ఆయన తండ్రియైనదేవుని వారిని నిత్యము ఆవరించియున్న పరిశుద్ధాత్మ శక్తిని ఈ మూడింటిని గూర్చిన పరిజ్ఞానము కూడా నరుడు పొందలేనట్టి దుర్భరమైనదియు చీకటి సంబంధమైన చీకటి మార్గమున నడిపించునదియు, చీకటి రాజ్యమునకు చేర్చునదియై యుండు అవిశ్వాసి యొక్క జీవితాన్ని అతనిని కుటుంబ సమేతంగాను బంధు సమేతంగాను ఈ యొక్క మనో దృష్టి అంధత్వాన్ని కల్గించి సృష్టికర్తయైన దేవునికి ప్రతిగా సృష్టములను పంచభూతాలను దేవుళ్ళుగా ఆరాధించే నిర్జీవస్థితికి అనగా నీర్జీవ విగ్రహాలను ఆరాధించే గృడ్డితనానికి దిగజార్చే స్థితికి కారకుడైయున్నాడు.

        ప్రియపాఠకులారా!  సృష్టిలోని అందులోని వస్తువులను నరులను వారి యొక్క శారీర ఆత్మీయ జీవితాలను తనకు యోగ్యకరముగాను మహిమకరముగాను, తన ఆత్మను సమ ఉజ్జీవంగా రూపించిన దేవుడు నరునిలో తన ఆత్మను ఉంచబట్టి ఈ మనో నేత్రము ఏర్పడింది.  అనగా జీవాత్మ యొక్క నేత్రమే మనో నేత్రము.  ఈమనో నేత్రమును నరునిలో ఉంచినవాడు దేవుడు. మనో నేత్ర దృష్టిని బట్టియే దేవుడు నరునికి సమీపంగా ఉంటాడు.  మనో నేత్రము ఎప్పుడైతే గృడ్డిది అవుతుందో దేవునికి నరుడు సమీపస్థుడుకాలేడు.  ఇదియే ఆత్మీయ గృడ్డితనము.

        ప్రియపాఠకులారా!  ఒక్క నరుడు తప్ప తక్కిన యావద్‌ జీవకోటిలో ఈ మనో నేత్ర

దృష్టిలేదు.  వాటికి ఉన్నది శారీర దృష్టియే, ఈ మనో నేత్ర దృష్టి అన్నది నరునిలో ఉండబట్టే  నరుడు భూలోకము రెండును ఏకమై, నరుని యొక్క మనో దృష్టిని తమవైపు మళ్ళించి దైవత్వము పై నుండి పూర్తిగా మరల్చుటకు నరునిపై క్రియజరిగిస్తున్నవి.  ఈ క్రియఫలితమే నిర్జీవవిగ్రహారాధన.  సృష్టికర్తకు బదులు సృష్టములను ఆరాధించుట. సృష్టికర్తయైన దేవుని విసర్జించు సృష్టములను ఆరాధించుట, సృష్టికర్తయైన దేవునికి బదులు దేవుని మహిమను నిర్జీవ విగ్రహాలకును జ్ఞానము లేని పశుపక్ష్యాదులకును పూజించి వాటిని స్తుతించి మహిమపరచుట.  ఇందును బట్టి నరుని యొక్క శారీర ఆత్మీయ జీవితాలలో క్రీస్తు  యొక్క వెలుగు ప్రకాశింపలేక పోవుటకు కారణమైయున్నది.

        ప్రియపాఠకులారా!  క్రీస్తు యొక్క సువార్త వెలుగు ద్వారా అనేకుల యొక్క మనో నేత్ర అంధకారమును తొలగించినట్లు నూతన నిబంధనలో కొన్ని సంఘటనలు మనము తెలిసికొందము.  మత్త 2:2లో క్రీస్తు యొక్క సువార్త వెలుగును గూర్చి ఆకాశములోని ఆయన నక్షత్రము ప్రకాశింపగా ఆ సువార్త వెలుగు ద్వారా మలచబడిన ముగ్గురు జ్ఞానులు-లోకమును లోక వాతావరణమును, అపవాదిని వాని కుత్సిత పన్నాగములను లెక్కచేయక కటిక చీకటి వాతావరణములో ప్రవేశించి, క్రీస్తు యొక్క నక్షత్ర వెలుగులో తమ ప్రయాణమును సాగించి ఆయనను దర్శించి ఆయనను ఆరాధించి ధన్యులైనారు.  అంతేగాక ఆయన జననములోని పరమార్థాలను పూర్వార్ధమును గూర్చిన మర్మాలను గ్రహించి సంతోషచిత్తులై తమమనోనేత్ర దృక్పధాన్ని విశాలపరచుకొని తద్వారా తమ జీవితాలను ధన్యవంతము చేసికొని, నూతన నిబంధన చరిత్రలో-క్రీస్తు చరిత్రకు మూడు మందిరాలుగ నిలిచినారంటే వారి యొక్క మనో నేత్రము యొక్క దృక్పదము ఎంత విశాలమో ప్రభావితమైనదో ఎంత పట్టుదలతో వాడినారో మనము ఆలోచించవలసియున్నది.  అయితే ఆ విధమైన హేరోదు మార్గంలో పయనించిన ఆ ముగ్గురుజ్ఞానులు ఆనాటి యూదయా దేశపు పరిపాలకుని క్రీస్తును గూర్చిన లోకరక్షకుని వర్తమానమును గూర్చి ప్రశ్నింపగా నాటి యూదయా పరిపాలకుడైన హేరోదు మనో దృష్టి కోల్పోయి అంధుడై పూర్తిగా ఈ యుగసంబంధమైన దేవతకు తనను తాను సమర్పించుకొని దైవత్వము అన్నది వున్నదా? అనిన నికృష్టమైన స్థితిలో కేవలము లోకసంబంధమైన తన రాచరికాన్ని తన స్వార్థాన్ని చాటుకుంటూశరీర స్థితిలో మనో దృష్టిని కోల్పోయి, దైవకుమారుని అవతారమును గూర్చిన పరిజ్ఞానమును లోకసంబంధమైన శాస్త్రజ్ఞానంతో జరిగించిన క్రియ మత్త 2: 3-9లో వ్రాయబడిన వేదభాగములోని వివరముల ద్వారా తెలిసికొందము.

        ప్రియపాఠకులారా!  హేరోదు యూదయా దేశపు బెత్లెహేమును పరిపాలించుకాలములో యేసు పుట్టిన తర్వాత తూర్పుదేశపు జ్ఞానులకు దర్శనమిచ్చిన యేసు నక్షత్రమును గూర్చిన పరిజ్ఞానమును గ్రహించిన వారై ఆయన నక్షత్రమును వెంటాడి, యేసు పుట్టిన స్థలమును దర్శించి ఆయనను పూజించినట్లు వ్రాయబడియున్నది.  ఇది నరుల ద్వారా జరిగిన మనో నేత్ర దృష్టిక్రియ,   అయితే హేరోదు మనో నేత్ర అంధకార దృష్టికల వాడైనందున అతడు శారీర స్థితిలో కలవరపడుటయే గాక అతని యొక్క పరిపాలనలో ఉన్నవారు కూడా కలవరపడినట్లుగాను, కాబట్టి రాజు నాటి ప్రధాన యాజకులను ప్రజలలో నుండి లోకసంబంధ శాస్త్రాలను సమకూర్చి శారీర జ్ఞానంతో శారీర దృక్పధంతో క్రీస్తు ఎక్కడ పుట్టెను? అని అడుగుట.  అందుకు వారు-యూదయా బెత్లేహేములోనే, ఏలయనగా యూదయా దేశపు బెత్లేహేమా! నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చునని దేవుని ప్రవక్త ద్వారా వ్రాయబడిన సంగతిని మనో నేత్ర దృష్టి కల్గిన జ్ఞానులు యొక్క మాటలు విన్నటువంటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రముకనబడిన కాలము ఆ నక్షత్రము ద్వారా కలిగే సంఘటనలను గూర్చి వివరంగాను పరిష్కారముగాను తెలిసికొన్నవాడై''మీరు వెళ్ళి ఆశిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పివారిని బెత్లేహేమునకు పంపెను''. ఇది ఈ యుగసంబంధమైన దేవత యొక్క మనోనేత్ర గృడ్డితనానికి ఋజువైయున్నది.  ఈ మనో నేత్ర దృష్టి అన్నది క్రీస్తు కాలములోనే గాక ఇశ్రాయేలు కాలములో కూడా అనేక మార్లు జరిగింది.  దేవుని జనాంగమైన ఇశ్రాయేలు దేవుని జనమని ఎరిగియు దేవుడు తమకు తండ్రి అని తెలిసియు తాము దేవుని జనాంగము అనిన జ్ఞానము కల్గియు లోకము దాని ఆకర్షణ, లోకపరిపాలకుడైన అపవాది అతని యొక్క ఆకర్షణ, లోకపరిపాలకుడైన అపవాది అతని యొక్క ఆకర్షణ ఇవన్నియునుఏకమై అనేక మార్లు దైవ దృష్టిలో గృడ్డితనము పొందినట్లు, ఆ గృడ్డితనము వల్ల నాటి ఇశ్రాయేలు దేవుని పట్ల దేవుని ప్రవక్త యైన మోషే పట్ల సణుగుకొన్నట్లును తద్వారా అనేక మంది మరణవాతపడినారంటే, మనో నేత్ర దృష్టికి గృడ్డితనము కల్గిందంటే అట్టివాడు దైవత్వానికి యోగ్యుడుకాడని ఆత్మపరుడు ఆత్మీయుడు కాదని పరలోకసంబంధికాడని, భూలోకసంబంధి యేనని ఇందును బట్టి మనకు తెలుస్తుంది.  మనో దృష్టి కలవాడు లోకసంబంధమైన వాటిపై దృష్టినుంచడు.  అనగా తనశరీర దృష్టిని సద్వినియోగపరచుకొంటాడు.  తన మానవత్వమును సార్థకపరచుకొంటాడు.  మనో దృష్టిలేనివానికి దైవరాజ్యము దైవసువార్త పరిజ్ఞానము దాని మర్మాలు దాని సత్యములు దాని క్రియలు నమ్మశక్యము కానివిగ వుంటాయి. అంటే మనో గృడ్డితనము కలవాడు పశుప్రాయుడు మూర్ఖుడును గర్వాంధుడును లోక వ్యామోహితుడై యుండి పూర్తిగా ఆత్మీయ స్థితిని కోల్పోతాడు.  ఈ జాడ్యము ఒకరికని పరిమితంలేదు, క్రైస్తవ లోకములో కూడా నేడు క్రియ జరిగిస్తున్నది.  ఇపుడు క్రైస్తవ్యములో ఎక్కువగా క్రియజరిగిస్తున్నది ఈ మనో నేత్ర అంధకారమే.  ఎలాగంటే దేవుని యొక్క స్వరూపమును దైవత్వములోని ఒక అంశమును దైవ నరునిగ జన్మించిన యేసు యొక్క సువార్త చాలా మహిమకరమైంది.  యేసుక్రీస్తు యొక్క రూపము మహిమ రూపము, నరులమైన మన రూపము మట్టి రూపము.  యేసుక్రీస్తు యొక్క రూపము నరప్రమేయము లేనిది, మన యొక్క రూపము నరప్రమేయముతో కూడింది.  నరుని యొక్క రూపము కేవలము దేవుని యొక్క చేతిపని అయితే యేసుక్రీస్తు యొక్క రూపము పరిశుద్ధాత్మ యొక్క రూపకల్పనగా వేదరీత్యా మనకు తెలుసును.  అందుకే నరులు క్రీస్తును విశ్వసించి క్రైస్తవులుగా మారినను ఆ విధమైన క్రైస్తవ్యాన్ని బట్టి తాము క్రైస్తవులమని అతిశయపడినను వారి అతిశయాన్ని క్షణములో తుడిచి, వారిని అజ్ఞానులుగాను గృడ్డివారినిగాను చేయగల శక్తి ఈనాడు అనేక క్రైస్తవ సోదరులలోను మతాధిపతులలోను బోధకుల లోను సువార్తీకులలోను సంఘకాపరులలోను వేదవిద్వాంసులలో సహితము ఈ మనోదృష్టి గృడ్డి తనమన్నది ఈ క్రింది విధంగా క్రియజరిగిస్తున్నది.

        ప్రియపాఠకులారా!  ఒక విశ్వాసిఎంతో నిబ్బరములో శ్రమలను సహించి లోకసంబంధ అవాంతరాలు తట్టుకొని నిలువబడి ఏసును లోకరక్షకునిగా అంగీకరించి జలప్రమాణము ద్వారా దేవుని బిడ్డగా ముద్రించబడి ప్రతినిత్యము పరిశుద్ధగ్రంధవేదాపారాయణ చేస్తూ ఎంతో ఆత్మీయంగా జీవించాలని అని అనుకొన్నపుడు, ఈ యుగసంబంధ దేవతయైన ఈ లోకాధికారి అట్టి వానిని దైవత్వమునుండి తప్పించుటయే గాక దైవత్వమునకు అయోగ్యునిగాను నిష్‌ప్రయోజకునిగాను పనికిమాలిన వానిగాను చేయు క్రియచాలావిచిత్రంగ వుంటుంది.  క్రైస్తవ్యాన్ని క్రీస్తు అను నామముతోనే అపవాది గృడ్డితనం కల్గిస్తున్నాడు.  ఎట్లనగా అనేక ఒడిదుడుకులను అవాంతరాలను తట్టుకొని లోకాన్ని లోక ఆరాధనను శరీరాన్ని, శరీర సంబంధమైన సుఖభోగాలను వదలుకొని కేవలము క్రీస్తు కొరకేతాను జీవిస్తున్నట్లుగా వున్నవిశ్వాసిని మరియు సత్‌ క్రైస్తవుడుగా పిలువబడే విశ్వాసియొక్క మనో దృష్టిని సాతాను పాడు చేసే విధానములో మొట్టమొదటిగ క్రైస్తవుడు చేసే సేవను గూర్చి అనేకుల చేత ప్రశంసింపజేయుటయు, దేవునితో సమానునిగ పదిమందిలో హెచ్చింపజేయుటయు, అతనిని గూర్చి కరపత్రముల ద్వారా ప్రకటనల ద్వారా స్వస్థత వరముగల దైవ జనులని అతనిని గూర్చి వార్తాపత్రికల ద్వారా మాసపత్రికల ద్వారా గొప్ప గొప్ప వ్యక్తుల ద్వారా పొగిడింపజేయుట, అంతేగాకుండ విదేశాలలో కూడా అతని యొక్క పరపతిని పెంచి విశేషమైన ధనసంపత్తిని కల్గించుట.  ఇట్టి స్థితిలో ప్రియపాఠకులారా!  ఎంత ఆత్మీయుడైనను ఎంత వేదాంతియైనను ఎంత ప్రవచనము గల కాపరియైనను మనో గృడ్డితనమును పొందగలడనియు మనము గ్రహించవలసియున్నది.  అనగా మనో గృడ్డితనము పొందకపోడు.

        ప్రియపాఠకులారా!  పాతనిబంధన కాలములో గొప్ప గొప్ప ఆత్మపరులనే దైవజ్జాన సంపన్నులనే బోల్తాకొట్టించిన అపవాది యొక్క సందర్భాలెన్నో వున్నవి.  అందులో సంసోనుకు ఆత్మావేశము ఆత్మజ్ఞానము ఆత్మబలమున్నను అట్టి వానిని అవకాశమును బట్టి ఈ యుగ సంబంధమైన దేవత అపవాది స్త్రీ రూపమును ఎరగా చూపి సంసోనులో వున్న దైవాత్మను-దైవాత్మ శక్తిని దైవజ్ఞానాన్ని వ్యర్థపరచి వాఇనిన స్త్రీ వ్యామోహితునిగాను పశువాంఛతో కామాతురత గలవానినిగా రేకేత్తించి స్త్రీలోలునిగ జేసి, వానిని ఆత్మీయంగాను శారీరకంగాను గృడ్డివానిగా జేసి దేవునికి చెందవలసిన అతని జీవితాన్ని అంధునిగా జేసి మరణానికి అప్పగించుట మనమెరిగిన విషయమే! ఇశ్రాయేలు తొలిరాజైన సౌలు కూడ గాడిదల కాపరిగ దౌర్భాగ్యుడుగ హీనాతిహీనుడుగ అనాదిగవున్న తనను, తన జనాంగమైన ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించి ప్రతిష్టించాడు.  మొట్టమొదటి రాజుగా పట్టాభిషిక్తునిగా చేయగా అట్టివాని మనో నేత్రానికి అపవాదిగృడ్డితనము కలుగజేసి పూర్తిగ దైవత్వాన్ని విస్మరింపజేసి అతనిని  గర్వాంధునిగాను కృతజ్ఞత హీనునిగాను జేసి మరణానికి అప్పగించినాడు. అలాగే అతని తర్వాత రాజైన దావీదు గొప్ప భక్తుడు ప్రవక్త కీర్తనాకారుడు, దేవునికి అతనిమీద మితిలేని ప్రేమ, ఇశ్రాయేలుకు దీపమువంటివాడు.  పరలోకపు తాళపు చెవులు బహుమానంగా పొందినవాడు. ఎల్లపుడు దేవుని కొరకు కనిపెట్టి మహారాజైన దావీదును అపవాది వివస్త్రయైన స్త్రీని చూపించి అతని వ్రతమును భంగపరచుటయే గాక దైవత్వముతో దావీదుకు ఉన్న సంబంధాన్ని త్రెంచుకొనే స్థితికి దిగజార్చినాడు. అంతే గాకుండ అతని జీవితాన్ని తన కార్యాల ద్వారానే అవమానము పొందు స్థితికి దిగజార్చి సింహాసన భ్రష్టునిగ జేసి దైవోగ్రతకు గురిజేసిన సంఘటన మనకు తెలిసిందే.

        నూతన నిబంధనలో యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా ప్రభువుకు అతి సన్నిహితుడుగా వుండి జీవించుచున్న సందర్భములో అతనికి వెండి నాణెములను చూపి అపవాది యేసుక్రీస్తు నివాసమునుండి వేరుపరచి గురుద్రోహిగా జేసి, దైవోగ్రతకు పాల్జేసి మరణానికి అప్పగించిన విషయము మనకు తెలిసిందే, యేసుక్రీస్తు మహిమను ఆయన సువార్తను ఎరిగిన యూదాలో కల్గిన ఆత్మీయ అంధకారస్థితిని ఎంతమోతాదులో వుందో చదువరులే ఊహించాలి.

        కనుక ప్రియపాఠకులారా!  అంత గొప్ప శక్తి ఈ యుగ సంబందమైన దేవతకున్నది.  అంతేగాక క్రీస్తు యొక్క సువార్తను భూమిమీద విస్తరింపబడకుండుటకును అపొస్తలుల చరిత్రలు వేదసాక్షుల చరిత్రలు మనము చదివితే నాటి రాజులను పరిపాలకులను మంత్రులను, సకల విధములైన విగ్రహారాధక సకల జనాంగముల యొక్క మనో నేత్రాలకు గృడ్డితనము కల్గించింది.  యేసుప్రభువు విశ్వాసుల రక్తము చవిచూచి మరణానికి అప్పగించింది.  వేదసాక్షులు దైవరాజ్య సువార్త సాక్షులు ప్రవక్తలు దైవజనులు అందరిని అపవాది జరిగించిన మనో నేత్ర అంధకారమువలన ప్రభుత్వాలలో దైవ జనులకు నిర్దోష మరణశిక్ష విధింపజేసి రక్తాన్ని ప్రవహింపజేసింది ఈ యుగ సంబంధమైన దేవత ప్రభావము ఎంత గొప్పదో మనము ఊహింపవలసియున్నది.

        ప్రియపాఠకులారా!  ఆదిలో ఆదిలో దైవకార్యము చెడగొట్టుటకు ఈ యుగసంబంధమైన దేవత నానా విధ హేయక్రియలు జరిగించింది.  ఆ తర్వాత క్రీస్తు యొక్క రాజ్య సువార్త వెలుగును ప్రకాశింపనీయక అనేకుల మనో నేత్రాలకు అపవాది గృడ్డి తనము కల్గించి జరిగించిన క్రియ నూతన నిబంధనలో బాప్తిస్మమిచ్చు యోహాను దగ్గర నుండి ప్రారంభమైంది.  అటు తర్వాత యేసుక్రీస్తు శిష్యుల మనో నేత్రాలమీద క్రియజరిగించుటకు ప్రయత్నించి అపవాది అను ఈ యుగసంబంధమైన దేవత విఫలుడయ్యాడు.  అయితే అపొస్తలుల ద్వారా కట్టబడిన సంఘాలనే పడద్రోయుటకు ఈ యుగసంబంధమైన దేవత అనేకులైన రాజులను మంత్రులను ప్రేరేపించి వారి ద్వారా నానా విధ ఘోర కృత్యాలు జరిగించాడు, అయితే ఈనాడు క్రైస్తవ విశ్వాసులమని చెప్పుకొంటున్న మన మనో నేత్రాలకు సులభంగా గృడ్డి తనము కల్గించే అవకాశాలు సులభంగా ఉన్నవి. 1.ఐశ్వర్యము 2.హోదా 3.పదవి 4.లోక వ్యామోహము 5. ఆధిపత్యము 6.దేవుని కంటె ఎక్కువ ఘనత పొందే ప్రయత్నము అనగా తనను మనుష్యుల చేత పొగడించు కొనుట క్రైస్తవ మందిరాలలో సహితము ఆరాధన కంటె ముందు వ్యక్తిని స్తుతించుటన్నది నేడు జరుగుచున్న సాదారణ విషయమే! ఇది ఉజ్జీవ సభలలోగాని ఒక ఆరాధన సందర్భములోగాని అతిధిగా వచ్చిన వ్యక్తులను ఘనంగా పొగడుట ఆ వ్యక్తి యొక్క జీవితానికి అది పతనావస్థయైయున్నది.  ఇందును గూర్చి రోమా 1:23 వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్క రూపమునకు మార్చి ఘనపరచుట-ఇది ఇందులో క్రైస్తవ విశ్వాసులమైన మనకు ఆత్మీయ గృడ్డితనము ఎంతబలంగా క్రియజరిగించుచున్నదో ఆలోచించాలి.  సర్వసాదారణంగా ఒక దైవజనుని గూర్చి ఘనంగా చెప్పుకోవడము సబబే! అతనిని దైవత్వము కంటె ఎక్కువ జేసి స్తుతించుటకూడదు.  శరీర నేత్రము మనో నేత్రము ఒక దానికొకదానికి పొత్తుకుదరదు.  శారీర నేత్రము దృశ్యమైనవాటిని, మనో నేత్రము అదృశ్యమైన వాటిని చూస్తుంది.  దేవుడు కోరేది మనో నేత్ర దృష్టియే గాని శారీర నేత్ర దృష్టిని ఆయన లక్ష్యపెట్టడు.  అయితే మనో నేత్ర దృష్టి దైవసన్నిధిలో ఒక ప్రాదాన్యతను సంతరించుకొనియున్నది.  మనోనేత్ర దృష్టి ప్రబావము వలన జరుగబోవు సంగతులను గూర్చి లేఖనాలు వ్రాశారు.  ఆ విధంగా వ్రాయుటలో మొట్టమొదటి గ్రంధకర్త మోషే వ్రాసిన పంచకాండములు-ఇది దేవుని యొక్క ఆత్మ నరుని యొక్క మనో నేత్రమునకు దర్శింపజేసి రచింపజేసిన గ్రంధము.  అటు తర్వాత అనేకులైన ప్రవక్తలు వ్రాసియున్నారు.  అవి అన్నియును నూతన నిబంధన నెరవేర్చినవి.  నూతన నిబంధనలో జరుగబోయేవి యెషయావ్రాసియున్నాడు.  అలాగే యోవేలు అలాగే మాలాకి వగైరా ప్రవక్తలు వ్రాసిన గ్రంధాలు వ్రాసిన ప్రవచనాలు పాతనిబంధనలోనివి.  ఇక నూతన నిబంధనలో యేసుప్రభువు తన శిష్యకోటికి ఏకాంతములో బోధించిన సత్యాలను మత్తయి 24:లో లోకభవిష్యత్తును గూర్చి చెప్పిన సంగతులను చదువగలము.  లోక వినాశనమును గూర్చి పేతురు ప్రవచించి రచించి యున్నాడు.  పత్మాసు దీవిలో యోహానునకు దేవుడు ఆయన మనో నేత్ర దృష్టిని బట్టి దర్శనం ద్వారా రచింపజేసిన గ్రంధమే ప్రకటన గ్రంధము.        

        కనుక ప్రియపాఠకులారా!  ఈ విధంగా మనో నేత్ర దృక్పధము ఉన్న వ్యక్తులు నేడున్నారా? ఉంటే వారి యొక్క జీవితాలు ఎలాగున్నవి.  వారి జీవితాలు ఎలాగున్నను ఈ సాహిత్యాన్ని చదువుచున్న పాఠకులైన మీరు మీయొక్క మనో నేత్రదృష్టిని చక్కబరచుకొని, పరమవైద్యుడైన యేసుక్రీస్తు ద్వారా మీ మనో నేత్ర జాడ్యమును స్వస్థపరచుకొని స్వస్థబుద్ధిగల్గి సిద్దపాటుగల్గి, ఆత్మపూర్ణులై రాబోవు నట్టి ప్రభువును దర్శించే ఆత్మీయ దృష్టిని సిద్దపాటును యోగ్యతను కలిగి మనో నేత్ర దృష్టితో ఈ లోకములో జీవించెదము గాక! ఆమేన్‌

        అపవాదిః అంధకార శక్తి అనగా చీకటికి రాజు మరియు అధికారి ఎఫెసీ 6:12 మనము పోరాడునది ఎవరితోనో వివరింపబడియున్నది.  నరులైన మనము చీకటిని కోరుకొని చీకటి కార్యకలాపములు జరిగించు విధానములు అనగా దోపిడీలు హత్యలు క్లబ్బు డాన్సులు, రాత్రి పూట జరుగు వ్యభిచార వృత్తి, దొంగ వ్యాపారము జూదము మొదలైనవి. ఇవి నరులచేత అపవాది చేయిస్తూ ఉండు విధానము.  అదే విధముగా నరులేగాక కొన్ని రకములైన జీవరాసులకు కూడా ఈ అంధకారశక్తితో కలిసి గొప్ప కృత్యాలు చేయుచున్నవి.  పులి, సింహము, చిరుతపులి, జంగుపిల్లి, పిల్లి, గుడ్ల గూబ, గబ్బిలము వగైరా జంతుజాలములు,  క్షుద్భాధ కోసరము వేట రూపములో ఘోరసంహారములు చేయుచుండును.  వీనిలో అపవాది యొక్క ప్రతి రూపములుగ గుడ్లగూబ - గబ్బిలము-చిరుతపులి, సింహము వగైరాలు ఏర్పరచబడియున్నవి.

        ఈ విధముగా మానవ జంతుజాలములు ఏకమై అంధకారశక్తియైన అపవాది యొక్క పాప ప్రభావమును మెరుగుపరుస్తున్నాయి, ఈ ప్రభావమే తోకచుక్క (తేజోమయనక్షత్రము) ఇది పరలోక మర్మములను వెల్లడించునదియే.  కాని భూలోకములో జరుగబోవు అరిష్టములనురాజకీయ పతనములకు, రాజ్య పతనములకు రాజుల జన్మమరణ వృత్తాంతములను మత్తయి 2: 1-3 ఇచ్చట కనపడిన నక్షత్రము దేవుడు ఏర్పరచినదియే.  ఈ నక్షత్రమును గూర్చిన జ్ఞానమును తన ప్రతిరూపమైన ఎఱ్ఱని ఘటసర్పము ప్రకటన 12-3 నకు ఎరిగింపవలెనని ఈ జ్ఞానులను హేరోదువద్దకు అపవాది పంపించినాడు.  అప్పుడు ఈ ఘటసర్పమనబడు యేరోదు జ్ఞానులచేత పరాభవము పొంది ఉగ్రుడై ప్రకటన 12-4లో విధముగ ఆకాశనక్షత్రం బులవంటి అమాయికమైనట్టి రెండు సం||ల లోపు వయస్సుగల మగపిల్లలను బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను మత్తయి 2-16 లో వలె వధించి నేలరాల్చినట్లు వివరించబడియున్నది.  పైన వివరించబడిన నక్షత్రప్రభావము వల్లనే అపవాది క్రీస్తు పుట్టినాడని ఎరింగి వానిని సంహరించుటకు హేరోదును లేపెను.  అంతవరకు క్రీస్తు జన్మ వృత్తాంతము అపవాదికి తెలియదు.  అపవాదికి రూపముఇచ్చి ప్రతిరూపమైనది హేరోదుగా నిర్ధారించబడినది నిజముగా అపవాదికి రూపము లేదు.  కాని అపవాదికి రూపము ఇచ్చిన వాళ్ళము మనమే. మన యొక్క హేయ్య క్రియల ద్వారా మనమే అపవాదికి రూపము ఇస్తున్నట్లుయైనది.  ఇచ్చట అపవాదికి ప్రతిరూపము హేరోదు.

        ఆది 22-17 ఆకాశ నక్షత్రంబులు అనగా నిర్మలమైన గొప్ప వెలుగుతో కూడిన అమాయికమైన ఆత్మలు అని అర్థము.  హేరోదు ప్రకటన 12-4 అనగా స్త్రీ జనాభా అధికులు స్త్రీ పురుష శిశువుల మొత్తంలో మూడవ భాగంగా ఉన్న పురుష శిశువులను నేలరాల్చడమే.  ఆకాశ నక్షత్రంబులను ఆహేరోదు అనబడు ఎఱ్ఱని ఘట సర్పము నేలరాల్చినట్లు వివరించబడియున్నది.  మత్తయి 2-5 ఆ ముగ్గురు జ్ఞానులు బెత్లెహేములో క్రీస్తు పుట్టాలని ప్రవక్తల యొక్క ప్రవచనము ఆధారంగా జ్ఞానులు ఆ నక్షత్ర ప్రభావమును గుర్తించి హేరోదు వద్దకు వచ్చారు. అపవాదికి కలవరము పుట్టించినారు.  అనగా అపవాదికి సంబంధియై హేరోదుకు అని భావము.

        రెండవ కొరింధి 11:13-15 అబద్ద ప్రవక్తః-వీరలు క్రైస్తవత్వములో ఉండి మేమే క్రీస్తులమని డబ్బాలు వాయిస్తూ కొన్ని వింత క్రియలను చేయుచూ అనగా దయ్యములు ఆడిస్తూ మేమే క్రీస్తువులమనియు మాలో క్రీస్తు ఉన్నాడని, మా ద్వారానే యుగ సమాప్తి అని ప్రజలను తప్పుడు దారి పట్టించి వాళ్ళను అయోమయ పరిస్థితులలో పెట్టి, మోసపు మార్గములో నడుపు వారు ఈ అపవాది యొక్క ప్రవక్తలు.

        వెలుగు దూతలుః-లేని దాన్ని సృష్టించి ఉన్నదాన్నిమరుగు పరచి సత్యమును అసత్యముగా మార్చి అసత్యమును సత్యముగా ప్రతిష్టించి నరులను గుడ్డి జ్ఞానములో నడుపుచు, పిశాచి వెలుగుతో  కళావికాసములతో, ముఖారవిందములుకలవారు.  వీరు బాహ్య అలంకరణములతో శరీరమును వివిధ అలంకరణములతోను పలురకములైన కృత్రిమ దీపపు వెలుగుల తోను సాంగ్యములను జరుపుచు ప్రజల చేత పూజింపబడుదురు. గారడిపనులు -హిస్నాటిజమ్‌-తాంత్రిక క్రియలు మొ||నవి దైవ క్రియలని మోసము చేయువారు.

        ఆ తర్వాత గోగు, మాగోగు అనగా హేతువాదస్థులు-నాస్తికులు ప్రకటన 20-8 ఎంచబడినవారు కూడా ఈ అపవాది నిర్ణయించుకున్న ప్రణాళికలో ఒక భాగము. పైవి జరుగవలసిన సత్యములు.  అయితే జరుగుచున్న బైబిలు సత్యములుః-అపవిత్రాత్మ అనునది అదృశ్యమైనది.  పైగా అంధకారశక్తి,  దానికి రూపము ఇస్తున్నది మనమే.  ఎందుకంటే మనము మన క్రియల ద్వారా సాతాను యొక్క గుణములను వాని రూపములను బైలు పరచుచున్నాము.

        1.చిరుతపులి-ఇది అతి క్రూరమైన జంతువు. ఇది మృత కళేబరములను కూడ తినుటకు వెనుకాడని జంతువు.  నరులలో కూడా ఇటువంటి లక్షణములు కల్గి పనికిమాలిన జీవితము జీవించుచూ దేవుని ఉగ్రతకు లోనైతున్నారు.  ఎందుకంటే సాటి సోద రుల మీద కీర్తనః37:8 సామెతలు 27:4ప్రసంగి 7: 9-11  కొలస్సీయుల పత్రిక 3:8  ద్వేషము.  ఓర్వలేని తనము సమయోచితముగ ఎదుటివారిని హంతమొందించుటకు ప్లానులు వేయడము.  రక్తము చిందించక రోగమో, తెగులో వచ్చి చచ్చినట్టి జంతువులను భుజించడము ఈ తెగకు చెందిన వారి లక్షణము. అనగా వీరికి ఈలోకసంబంధమైన ఆశలపై ప్రయాస.

        2.నెమలిః-ఈ పక్షి పక్షులన్నిటిలో అందమైనదై యుండి సొగసుగ నాట్యము చేయునదై యున్నది.  ఇందును బట్టి ఈ పక్షికి గర్వము ఎక్కువ.  నరులలో కూడ దేహ సౌందర్యమును బట్టియు, నాట్యకళను బట్టియు ఈ లోక అలంకరణలను బట్టియు, శరీర అందమును బట్టియు గర్వించుట సహజము.  ఇట్టి గుడి దైవభక్తి మాని నీతినియమము లేకుండ బజారు ఎక్కి తమకాలమునంతయు శరీరేచ్ఛలమీద ఖర్చుపెట్టి దైవత్వమునకు దూరులై వారి దేహసౌందర్యముతో నటన కౌశలములతో ఇతరులను ఆకర్షించి వారి మనస్సులను పాడుచేయుచు దేవునికి దూరమై జీవిస్తున్నారు.  యెషయా 14:9:7యెహెజ్కేలు 28:12-17 యెషయా 3:17-24 మొదటి పేతురు 5-5 సామెతలు 8-13 సామెతలు 16-8

        (6)అపవాది ఎవరు? ఆదినుండి నేటి వరకు అపవాది క్రియలు ఏ రూపములో ఉన్నవి.  ఆది 4:7 కయీనులో ద్వేషము-ఈర్ష్య

        1 సమూయేలు 19:9 సౌలులో గల్గిన పగ న్యాయాధిపతులు 16:6 సంసోనులోని అయోగ్యత యోబు 1:12 లో యెహోవా యొక్క పరిచారకుడు.  దానియేలు 3:4 ప్రతిమ విగ్రహారాధన జరిగించు కారకుడు మత్తయి 4:1 యేసుని శోధించుటలో దేవుని యొక్క నిర్ణయమైయున్నాడు.  మత్తయి 26:49 యూదాలో చేరి వ్యాపారస్థుడుగ తయారై (అమ్మినాడు)

        అయితే ఇపుడు ఎవరి ద్వారా అతని క్రియలు నెరవేరుచున్నవి.  యాకోబు 1:14-15

        ఇంకాః-క్రైస్తవ సంఘాల్లో భేదాలుః సంఘభిన్నాలు మొదటి పేతురుః 5-8 విధముగా తిరుగుతున్నాడు.

                        ఆదిశేషుడు బైబిలులో దీని నిర్వచనముః-

        ఆదిలో దేవుని చేత దేవదూతల కూటమినుండి శేషించబడిన వాడు.  భూమి భారమును మోయుచున్నట్లు అనగా దేవుని సృష్టియైన భూమి యొక్క ఆదిపత్యము పొందినవాడు. ఇందుబట్టియే ఏసుతో లూకా 4:6 ఈ లోకరాజ్యములు వాటి మహిమలు నిర్వహణ తనకు అప్పగింపబడినట్లును అపవాది ఏసును తనకు సాగిలబడి మొక్కమనియు దానిని ఏసునకు ఇచ్చెదననియు తెలియుచున్నది.  ఇతని రూపము ఆదిలో సర్పము దేవునిచేత శపించబడిన మూగయైన సర్పమును మన పితరులు దానికి శిరస్సులు అతికించి ఘనముగా ఆరాధించుచున్నారు.  బైబిలు ఇందుకు వ్యతిరేకముగా మాట్లాడుచున్నది.  ఈ దేవతగా ఉన్న సర్పమును ఘటసర్పము అనగా మట్టి ఘటములగు నరులచే పూజింపబడు చున్నదని అర్థము. పరమాత్మ అల్పుడుగాడు అతిమాయగాడైన అపవాది సర్పమును ఆవేశించి తన ప్రయత్నమును నెరవేర్చిన వెంటనే సర్పము నుండి పరారు అయినట్లు ఆత్మజ్ఞాన రీత్యా తెలియుచున్నది. దేవుడు పురుషుని, స్త్రీని పలుకరించి సర్పమును ప్రశ్నించినపుడు, అది మాట్లాడినట్లులేదు.  మౌనియైనట్లు తెలియుచున్నది.

        అయితే అపవాది ఏమైనట్లు? సర్పమును వదలి ఆదాము జంటలో ప్రవేశించినట్లు మనము గ్రహించవలసియున్నది.  ఎందుకంటే దైవాత్మ పూర్ణులైన నరజంట నిత్యము ప్రత్యక్షముగా దేవుని సమక్షములో ఆనందించుచున్నట్లును, పండు తినగానే సిగ్గు అవరించి ఆకుల కచ్చడములతో మాన సంరక్షణగావించుకొన్నట్లు తెలియుచున్నది.  దేవునిసన్నిధిలో సిగ్గు అభినయించుటలో దావీదు కీర్తనః-నీతి మంతుల సభలో పాపులు నిలువరన్నట్లు అపవాది నరజంటలో ప్రవేశించి నిజదేవుని ఎదుట వారిచేసిగ్గు అభినయింపజేసి తాను తడబడినట్లు తెలియుచున్నది.  నిషేధఫలము ద్వారా అపవాది సర్పములోనుండి స్త్రీలోనికి ఎగుమతి ఐనట్లు, ఆ తర్వాత స్త్రీ ఆకర్షణీయ రూపము కల్పించి అదే ఫలముల ద్వారా ఆదాములోనికి ప్రవేశించినట్లును, ఇద్దరిని దేవునితో వారించు వారినిగా చేసినట్లును, ఆ తర్వాత ఆదాము జంటలో కామోద్రేకము అను క్రియజరిగించి శరీరేచ్ఛలను కల్గించి సంతానోత్పత్తి  క్రియకు పునాది వేసి హవ్వతోటి ఆనందముగ యెహోవా దయవలన నేను ఒక మనుష్యుని సంపాదించుకొంటినని పల్కించడము లోని మర్మమును ఆత్మదృష్టితో మనము గ్రహించిన యెహోవాదయ లేనిదే ఒక శరీరమునుండి మఱియొక శరీరము ఏర్పడుట దుర్లభము.  ఈ క్రియను అపవాది చేత కాకుండ ప్రత్యక్షముగ జరిగించుట జరుగదు.  ఎందుకంటే సంతతిని కల్గించుటగాని, నిరోదించుటకు గాని దానిని లయపరచుటగాని ఆయనే సాధ్యుడు ఏలాగంటే సృష్టిని ఏర్పరిచినాడు  దానిని ఫలింపజేసినాడు. మరియు ఆశీర్వదించినాడు.  నోవహును రక్షించాడు సృష్టినంతటిని జలప్రళయముతో లయపఱచినాడు  అపవాదికి ఈ శక్తిలేదు సృష్టిలో ప్రవేశించి ప్రతిసృష్టిని కల్గించి  వికృతక్రియలను చేయువాడేగాని స్వతహాగా శక్తిశూన్యుడు ఆదిలోని మొదటి ఆదాము శరీరుడు గనుక సర్ప శరీరములో ఆవరించి ప్రత్యక్షముగా పాపక్రియను జరిగించి తొలి నరులను తన దాసులుగ చేయగల్గినాడు అయితే రెండవ ఆదామైన క్రీస్తు ఆత్మ నిర్మితుడు గనుక ఆత్మకలయికతో అపవాది శోధించినను విజయుడైనట్లు తెలియుచున్నది.

        అయితే ఇప్పుడు అపవాది సర్పములో ఉన్నాడా? అనిన సంశయము మనకు కలుగవచ్చును.  ఆదిలోని నరులను పాపపూరితులచేసి నరులలో ప్రవేశించిన అపవాది నేడు కూడ నరులలోనే ఉంటూ తొలినరులను మోనవఱచిన తన సర్పరూపమును ముంగుర్తుగా మన ఆత్మ మనకు తేటతెల్లముగా తెల్పుచున్నను, నేటి నరకోటిలో ఆ సర్ప రూపమును అతిరధ మహారధులచేతను, విద్యాప్రవీణులచేతను, అతిజ్ఞానులను సహితము అజ్ఞానులుగను అంధులుగను చేసి నాటి వృక్షశాఖలో వ్రేలాడిన సర్పమును ముంగుర్తుగా తన రూపమును చిత్రవిచిత్ర భంగిమలలో నరుల చేత రూపొందించి సుబ్బరాయుడు, నాగయ్య, ఆదిశేషయ్య, నాగేంద్రబాబు, నాగమణి, నాగరత్నం, నాగభూషణం, ఫణీంద్రుడు అను టైటిల్సు నరులకు తగిలించి తన సంబంధులుగా చేయుచున్నట్లు తెలియుచున్నది.  ఇందును బట్టి నరులెన మనలను యోహాను, ఏసుప్రభువులు సర్ప సంతానముగా ప్రవచించినట్లు గ్రంధములో ఉన్నది ఈ ఆదిశేషుని ఏడు తలలే ఇవి సప్తవ్యసనములు ఇందును బట్టి సప్తస్వరములు ఏసుసిలువలో పల్కినట్లు తెలియుచున్నది.  ప్రకటన గ్రంధములో వివరింపబడిన ఆ మహాఘట సర్పమునకు ఏడు తలలుగా వర్ణించబడియున్నది,

        దావీదుకు దేవుడు పరలోకము నందు ఒక సింహాసనమును ఏర్పాటుచేసినట్లు తెలియుచున్నది.  దైవ మహిమాప్రభావితమైన ఆ దైవసింహాసనమును ఆదిలో లూసిఫర్‌ తనను తాను హెచ్చించుకొన్నవాడై అధిరోహించదలచినపుడు దేవుడు వానిని శపించి త్రోసివేసెను ఆ సింహాసనమును దేవుడు తన అపార దయతో నరులైన మనకోరకు నిర్ణయించి దావీదు సింహాసనముగా పేరిడినారు.  కనుక అబ్రాహాము దావీదు యోసేపు మొదలుగాగల దైవపుత్రులందరు ఆ సింహాసనమును స్వతంత్రించు కొందురు.  అబ్రహాము దావీదుకు పూర్వమే ఉన్నవాడైన దైవస్వాస్థ్యమును అబ్రహాము ఒడిలో లాజరు సుఖశాంతులు మహిమా ప్రభావములు పొందినట్లుగ గ్రంధములో వివరించబడియున్నది.  అట్లే మోషే ఏలియాలు కూడా క్రీస్తు మహిమా ప్రభావములతో పొలినవారైనట్లుగా రూపాంతరము ద్వారా మనకు విదితమౌచున్నది,  అద్వితీయమైన ఆ దైవ సింహాసనము దావీదు పేరట నరులైన మన కొరకు దేవుడు అనుగ్రహించి యున్నాడు.

        ఆత్మ, శరీర, లోక, జీవిత వైరాగ్యములు గూర్చిన అంశములు, ఆత్మ మూలవాక్యముః-ఒకటి కొరింది 12-4-7 లో విధముగా ప్రతి నరునిలోనుజీవించువాడు ఆత్మ ఒక్కడే, కాని ఆత్మ ప్రభావ మూలమున పరిచర్యలు అనేక రకములుగా వున్నవి.  నానా రకముల భాషలు, భాషాజ్ఞానములు స్వప్న ఫలితములు, స్వస్థత పఱచువరములు, ప్రవచించుట వగైరాలు అయితే ప్రభువునందు ప్రియమైన సోదరీ సోదరుడా! నేటియుగములో నరశరీరమైన నరునిలో దేవుడు తన ఆత్మను ప్రతిష్టించి నీతితోను పరిశుద్ధతతోను జీవింపనుద్ధేశించితే రోమా 1:21-25 ఆత్మ ప్రత్యక్షతను దాని విలువను దానిని అనుగ్రహించిన కర్తను విస్మరించిన జనుల యొక్క క్రియలు వాని ఫలితములు తెలియుచున్నవి.  హేతువాదస్థులు, నాస్తిక సోదరులు కూడా ఇట్టి కూటమిలో చేర్చబడియున్నారు.  మనకు దేవుడు అనుగ్రహించిన ఆత్మ ప్రత్యేకించబడినట్లు ఆత్మ యొక్క మర్మముల ద్వారా తెలియుచున్నది.  గలతీ 5:17 ఇది ఆత్మ శరీరములకు ఉన్న తేడా.

        ఆత్మకు విరోధి శరీరజ్ఞానము, నరశరీరములో ఆత్మను నిల్పిన పరమాత్ముని క్రియలు ఎట్లు బహిర్గతమౌచున్నవి? అంటే అదృశ్యములో ఆత్మీయ ప్రత్యక్షములో క్రియలును బయల్పడుచున్నవి.  హానోకు దేవునితో నడిచి భూమిమీద కనపడక పోయెననుటలో హానోకు ఒకటవ యోహాను 2:15-16 లోకమును ప్రేమింపక లోకవైరాగ్యముతో శరీరమును మరుగుపఱచి పరమాత్మయైన యెహోవాలో ఐక్యమైనట్లు గ్రహించవలసియున్నది.

        ఒకటి పేతురు 1:23 నరశరీరములోని బీజము అక్షయము అయితే ఆ శరీరములో ప్రతిష్టించబడిన ఆత్మ వాక్యబీజము అక్షయమగు నీతియు అగుచున్నది.  పరమాత్మ దృక్పధములో శరీరముతో జీవించు జీవాత్మ యొక్క నివాసమును పాలు మహాఋషి రెండవ కొరింధీ 5: 1-3లో నర శరీరమును చర్మపు గుడారముగా ప్రవచించినట్లు తెలియుచున్నది.  ఈ మర్మమును పరమ ఋషీశ్వరుడు యేసుప్రభువు తన ప్రవచనములలో యోహాను 14-2 తండ్రియైన పరమాత్ముని సన్నిధిలో అనేక నివాసములు ఐనట్లు ఏసు అను పవిత్రాత్ముని విశ్వాసము ద్వారా జీవాత్మ యుతనరుడు ప్రవేశింపగలడనియు పల్కినట్లు గ్రంధములో ఉన్నది.

        ఏసుప్రభువు కూడ తన ప్రసంగాలలో తాను (ఏసు) ఈ లోకసంబంధిని కాననియు తన తండ్రియైన పరమాత్మ యొక్క ఆత్మ కార్యార్థము ఈ లోకములో అవతరించిన ఆత్మ కార్యకర్తగా వక్కాణించియున్నారు.  ఆత్మ యొక్క ప్రభావమును వెలువరించిన వారు ఏసుప్రభువే, ఎట్లనగా పండ్రేండేళ్ళ రక్తస్రావము అను శరీరరుగ్మత గల్గిన స్త్రీ ఆయన అంగీఅంచునుహృదయ విశ్వాసమను క్రియతో ఆత్మ శరీర జ్ఞానములను లోబఱచి తాకుట అను క్రియ మూలమున పరమాత్మ ప్రభావమును ఆకర్షించుకొన్నట్లు తెలియుచున్నది.

        తదనుగుణంగా ఏసు చెప్పినమాట ''నాలో నుండి ప్రభావము పోయినది అనుట, అందుకు నిదర్శనమునైయున్నది. కనుక హృదయము శరీరజ్ఞానము జీవాత్మలయొక్క త్రికరణశుద్ధితో పరమాత్మ ప్రభావమును నరశరీరుడుపొందగలడు అనుసిద్ధాంతము తెలియుచున్నది.  ఆత్మ స్వరూపి కనుక ఏసు ఆత్మ దృష్టితో ఆత్మ విశ్వాసక్రియను గుర్తింపగల్గినాడు.

        అయితే ఆయన శిష్యులు శరీరజ్ఞానమును దృష్టియందుంచి బోధకుడా! జన సమ్మర్థము వలన కల్గిన రద్దీలో ఎంతోమంది నిన్ను తాకుచుండగా నన్ను తాకిన వారెవరనుట అసమంజసము అనుట నర శరీర జ్ఞానము యొక్క బలహీనత బయల్పడుచున్నది అయితే ఆత్మ విధేయతతో ఆత్మక్రియను చెప్పిన స్త్రీ తన పాపశరీరమును వణికించి పరబ్రహ్మచారియైన పరమాత్ముని ముందు వణకుచున్న క్రియను కనపర్చగా,అనగా ఇందులో అణగారి యున్న త్రివిధేయతల జీవాత్మ హృదయము శరీరములను త్రికరణ సంకల్పముతో చూపిన అ విధేయత క్రియకు ఏసుప్రభువు సమ్మతుడై కుమారీ, నీ విశ్వాసము నిన్ను రక్షించెననుట ఇందుకు నిదర్శనము.        

        మరియమ్మ గర్భములో రూపించబడిన ప్రభువు శరీరము నరసంబంధమా?దైవసంబంధమా? అను సంశయము నేటి క్రైస్తవ ప్రపంచములో ఉధృతముగా ఏర్పడిఉన్నది,  నరసంబంధమైతే ఏసుప్రభువు చేసిన దైవమహత్తర సూచక క్రియలు చేయుట దుర్లభము దైవ సంబంధమైతే అనగా పరలోక సంబంధమైతే మనుష్యులచేత దూషించబడుట, కొరడాదెబ్బలకు శరీరము నలుగ గొట్టబడుట సిలువ మీద ఏసుప్రభువు చీలమేకులతో కొట్టబడుట ఇట్టి శరీర శిక్షలు అమలు జరుపుట దుర్లభము.

        మరియు ఈయన శరీరము పునరుత్థానము అయిన తర్వాత యూదులను భయపడి ''ఈయన శిష్యులందరు ఒక ఇంట తలుపులకు గడియ బెట్టి సమావేశమైయున్న సందర్భములో యోహాను 20: 19-25ఏసు శరీరయుతముగా వారి మధ్య నిలచుట.  తలుపు సందులో నుండి ఏసు శరీరము గృహములో ప్రవేశించుట మానవ శరీరమునకు అసాధ్యము.  తోమా యొక్క అనుమానమును బట్టి కాళ్లుచేతులలోని గాయములను ప్రక్కలోని బల్లెపు పోటును ఆయనకు చూపించి అల్ప విశ్వాసుడుగా ఉన్న తోమాను నమ్మించుట ఇవన్నియు నరులమైన మనకు తీరని సంకోచమును కల్గించుచున్నవి.

        ఇందును బట్టి నరులమైన మనము ఆలోచించవలసినదేమి? ఏసుయొక్క రూపమునకు కారకుడుగాని నిర్మితుడు సృష్టికర్తగాని, మూలకారకుడుగాని సృష్టికర్తయైన దేవుడే ఏలాగంటే లూకా 1:30 లో గాబ్రియేల్‌ అను దూత మరియమ్మతో చెప్పినట్లు దేవుని కృప కేవలము అదృశ్యములో ఉండక దృశ్యములోనికి తెచ్చుటకై మరియమ్మ గర్భములో ఏసు అను మానవ ఆకృతిలో రూపొందినట్లుగా ఆ రూపమునకు కావలసిన పోషణ ఆకారము అవయన నిర్మాణము రక్తమాంసములు వగైరాలకు నిష్కళంక మరియమ్మ గర్భము ప్లస్‌ శరీరము నిర్ణయించబడి యున్నట్లును మనకు తెలియుచున్నది.

        దైవనిర్మాణశక్తికి గర్భములో రూపమునిచ్చి ఆశక్తిని నవమాసములు మోయుచు జీవించాలంటే అందుకు కావలసిన యోగ్యతలు భూలోక వైరాగ్యము దైవత్వము పైననే ధ్యాస ఈ లోకసుఖ భోగభాగ్యములమై విముఖత నిష్కళంకహృదయము, నిర్మలత్వము, పురుష కలయిక లేని పరిశుద్ధజీవితము తలంపులలోగాని క్రియలలోగాని లోభత్వములోగాని వాక్కులోగాని దోషములేనట్టి స్త్రీ జీవితగర్భమే ఇట్టి దైవశక్తిని భరించుటకు యోగ్యమైయున్నది.

        నీవు సినిమాలో చూచుచున్న బొమ్మలు ఒక చిన్న కెమెరా కంతలో నుండి వెలువడుచున్న ఒక పోకస్‌.  ఇంత చిన్న కెమెరా కంతనుండి ఆ చిన్న పోకస్‌ అంత పెద్ద తెరమీద పెద్ద పెద్ద బొమ్మలుగా మహా పట్టణములుగా మహా సముద్రములుగా కనబడును.  ఇవి ఎన్నిసార్లయిన చూడవచ్చును.  మానవ జ్ఞానముతో చేయబడు టి.వి. మొదలైన ప్రదర్శనలు ఈలాగు ఉండగా పరమాత్మ తన జ్ఞానశక్తితో క్రీస్తును ఆ ఇంటిలో ప్రవేశింపజేయలేడా! హృదయమనెడు తలుపు నుండి ఆయన మనస్సులో అంతరంగములోను ప్రసరింపజేయబడుచున్నాడు.

        అర్థనారీశ్వరుడు అనగా ఎవరు? పరమాత్మ స్త్రీ యొక్క సగము శరీరము ద్వారా అనగా స్త్రీ యొక్క రక్త మాంసములతో తన ఆత్మనిలయముగా రూపొందించుకొని ఆ స్త్రీ యొక్క చనుబాలతో పోషించబడి పెరుగుటయే పరమాత్మ నారీశరీరముతో జతపరచబడుట వలననే అర్థనారీశ్వరుడు అని ఏసుప్రభువుకు ఆ పేరుసార్థకమాయెను పరిశుద్ధాత్మ నిన్నుక్రమ్ముకొనుట అనగానేమి? స్త్రీ యొక్క రక్తమాంసముల మయమైన ఆమె పవిత్ర శరీరముతో దేవుని ఆత్మ జతపరచబడినది.  నరశరీరము ప్లస్‌ దైవాత్మ రెండు కలిసి ఒకటిఅయినది.  కాబట్టి అర్థనారీశ్వరుడుగా సార్థకమాయెను.

        మరి ఆ అర్థనారీశ్వరునికి మొలదట్టి, ఈ అర్థనారీశ్వరునికి కూడా మొలదట్టి అంగవస్త్రముగా కట్టి సిలువ వేసినారు. ఆ అర్థనారీశ్వరునికి జడలలో గంగ నిక్షిప్తమైయున్నది.  ఈ అర్థనారీశ్వరునికి సమరయ స్త్రీకి వాగ్దానము చేసినట్లు-'' నేనిచ్చు జలము ఎల్లప్పుడు ఊరెడి జీవజలబుగ్గయై ఉన్నది అన్నాడు. మరి ఎన్నటెన్నటికిని మరల దప్పిక దప్పిక పొందుట ఎరుగరు అన్నాడు.  కాబట్టి ప్రభువు ఇచ్చువాగ్ధానబలమే.  జీవజల ఊటలు మరియమ్మగారి యొక్క రక్తమాంసములతో రూపొందించబడి చనుపాలతో పోషించబడిన ఫూర్తి శరీరమే ఏసుక్రీస్తు. పురుషుని వీర్యకణములతో ఫలదీకరణము జరిగి ప్రసవింపబడినది కాదుగాని, ఆత్మ బీజము ద్వారా మరియమ్మ గర్భములో ఫలింపబడినది.

        మనము అన్య జీవితములో త్రిలోక పంచారి అని నారదునికి పేరు పెట్టినాము.  ఇప్పటి మన క్రైస్తవ జీవితములో నారదునిజీవితము పోలిస్తే ఆ త్రిలోక పంచారి అనుబిరుదు ఒక క్రీస్తుకే చెల్లినట్లుగా అర్థమగుచున్నది.  ఎట్లనగా ఏసుప్రభువు పరలోకమున దేవుని యొద్దనుండి  ఈ లోకమునకు వచ్చి భూలోకములో పుట్టి నరుల మధ్య సంచరించి, నరపాప నిమిత్తము మరణించి సమాధి చేయబడి పాతాళములో మత్తయి 27: 51-54 పరిశోధించి వారిని లేపినట్లుగా తెలియుచున్నది,.

        బ్రహ్మకు ముఖములు మూడు ఒక ముఖము వైకుంఠము రెండవ ముఖము భూలోకము,మూడవది పాతాళము (మూడు లోకములకు ముల్లోకాధిపతిగా) వ్యవహరించుచున్నాడు.

        బైబిలులో యెహోవా దేవుడు ఒక ముఖముతోనేే మూడు అదృశ్యశక్తులను భూమిమీద ప్రయోగించెనని తెలియుచున్నది.  ఇందులో మొదటిది తన స్థానము పరలోకము. అందులో దేవతా సముదాయము, నీతిమంతులైన ఆత్మలకు ఏర్పరచబడియున్నట్టి అధిక్యతలు.

        రెండుః-కలుషితమైన దానిని శుద్ధీకరించుటకు ఏర్పరచబడిన శక్తి-ఈయనే పరిశుద్ధాత్మ. ఈ రెండు శక్తులును మూడవ శక్తియైన క్రీస్తును రూపొందించి అర్థనారీశ్వర ఆ కృతిలో ఈ భూలోకము మీదనరకోటికి సంప్రాప్తమైన పాప మలినమును తుడుచుటకు ఈ అర్థనారీశ్వరుని సృష్టిలో వీరు ఉద్దేశింపబడియున్నట్లు తెలియుచున్నది.  ఇక చతుర్ముఖుడైన శని అనగా సాతాను అను అపవిత్రాత్మశక్తి- నీతి అను ఖడ్గమునకు పదును పెట్టుటకును, భక్తి అను జ్వాలను తీవ్రతరము జేయుటకును, పరిశుద్ధత అనుక్రియను అపరిశుద్ధత అను తన ప్రక్రియతో చక్కబరచుటకును అవిశ్వాసము అను బలహీనతను ప్రవేశింపజేసి అనగా ప్రయోగించి విశ్వాసమను క్రియకు ప్రకాశము కల్గించుటకును, యెహోవా అను పరమాత్మునిచేత నిర్ణయించబడిన శోధకుడుగా ఈ ఆత్మ నిర్ణయించబడియున్నది.

        అయితే బ్రహ్మ పురాణములో నరునిగూర్చి చాలాఉన్నతముగ వర్ణించబడియున్నది . యెహోవా సన్నిధి నరజన్మను గూర్చి చాలా బలహీనముగ ఎంచుచున్నది.  నరునిహృదయమువాని బాల్యకాలమునుండి చెడ్డది, హృదయము మోసకరమైనది,  అది ఘోరమైన వ్యాధికలది.  నీవు మన్నె గనుక తిరిగి మనైపోదువు.

        త్రిశంకు స్వర్గము అనగా ఏమి? ''పరడైసు'' అను దీనిని సృష్టికర్త యైన యెహోవా ఏర్పాటు చేసినది త్రి అనగా మూడు 1.వేదనకర పరడైసు 2.సమాధాన పరడైసు 3.దైవ ఐక్యత అను మూడు భాగములుగ ఈ త్రిశంకు స్వర్గము అనగా పరడైసు ఏర్పరచబడియున్నది.        

        బోధకుడు భోదించుచున్నాడు.  ఘంటాపదముగ సువార్తను ప్రకటించుచున్నాడు.  అతనికి తిండికి బట్టకు లోటు, అతని ప్రసంగములు సంఘములు వింటున్నవి.  ఆ వినడము ఎక్కువ మందియైన సందోహములో కూడిన ఆర్‌.ఆర్‌.కె మూర్తిగారు రేడియో ప్రసంగాలు ప్రతిరోజూ వింటున్నారు. రేడియో ప్రసంగములు ఇచ్చునట్టి ఆర్‌,ఆర్‌,కె మూర్తి గారు శారీరకముగామానసికంగాఈలోక సంబంధముగా ఎన్నో బాధలు పడవలసివచ్చును, ఆయన ప్రసంగ వార్తావాహిని అనేక లక్షల రేడియోలు వెదజల్లుచున్నవి,  సంఘభేధములు మతభేధములు లేకుండ ప్రతి వారము ఇండ్లలో కూర్చుని వింటున్నాము. మన ఊరి దైవానుగ్రహ మూలమునను లేక దేవుడాయనను పరీక్షార్థముగ పంపుట మూలమునను మన పట్టణములోను ప్రభువు వారికి అనుగ్రహించిన తరుణమును బట్టి దైవిక ప్రసంగ కూటములు ఏర్పాటు చేయబడినపుడు ఆర్‌.ఆర్‌.కె. మూర్తిగారిని అవహించిన ప్రభువు స్వరము వినుటకు వేలసంఖ్య, కొన్ని సందర్భములలో ఇంకను అధిగమించి కూడ సంఘ సోదర సోదరీమణులు హాజరై ఆయన బోధలను వినుటకు ఉవ్విళ్ళూరుచున్నారు.

        దేవుని సన్నిధానములో గుప్తమైయున్న అదృశ్యములైయున్న ఆరని అగ్ని యొక్క ప్రభావము వాటి విలువలుః- (లూకా 12:49 యోహాను 8-12)

        ఈ అగ్ని ఎల్లపుడు ప్రతివ్యక్తిలోను వలురీతులుగను మండుచుండును లోకమందు అంతట వ్యాపించియున్నది.  ఏసుప్రభువు తాను అగ్నినని ఈ అగ్ని ప్రభావ మూలముగ లూకా 12-52లో విధముగా ఈ ఆత్మయు అగ్ని శరీరములను ధరించు విధానము మనకు గోచరమగుచున్నది.  ఏసుప్రభువు కూడ దైవాత్మాగ్నిలోని బాగమా? అలాగైతే ఎట్లు భాగమైయున్నదో మనము గ్రహించవలసియున్నది.

        లూకా 9-29 ఆత్మరూపుడైన ఏసుప్రభువు జన్మవలన భూమిమీద రగుల్కొన్నట్టి ద్వేషాన్ని హేరోదులో ప్రవేశించెను ఈ అగ్ని హేరోదు యొక్క శరీరమును దహింపగా హేరోదు శరీరమును రగుల్కొనపడి అనేక శిశు శరీరములను ఖండించి నట్లుగా ఏసు అనుఅగ్ని యొక్క దహించబడిన ప్రభావము మత్తయి 2-17 యోహాను 11:49 యూదులలోని శాస్త్రుల యొక్కయు పరిసయ్యుల యొక్కయు హృదయములను క్రోధావేశములతో దహింపజేసిన అగ్ని, దేవుని రాజ్య సువార్తను నశించుచున్న హృదయములను వెల్గించు అగ్ని.

        ఈ అగ్ని ప్రభావ మూలమున తుపాను, సముద్రపు పొంగు గాలిని సముద్రమును గద్దించి శాంతింపజేసినది జలరాశులలో నడిచినది దైవాగ్నియే, దీనిని మట్టి తినలేదు.  ఇది ఈ లోకమునకు వెలుగు, మనిషికి జీవమిచ్చిన అగ్ని, కాళ్ళు చేతులు చల్లబడిన చనిపోయినటే,్ట మనలో ఉన్నది అదృశ్యమైన అగ్ని దృశ్యమైన అగ్నిని ఆర్పగలము. కాని అదృశ్యమైన అగ్నిని ఆత్మప్రభావము తోనే అర్పవలెను.

        మానవుడు అనబడు యంత్రములో ఈ అగ్ని అదృశ్యములో ఉండి, మోటారు కారులో పెట్రోలు దహించబడి దాని పీడన శక్తితో మిక్కిలి బరువైన బండిని,దానితో బాటు ప్రయాణీకులను వారియొక్కసరంజామాను ఏ విధముగా నడుపుచున్నదో-అదే విధముగా అంతర్య పురుషుడైనట్టి ఆత్మ పరమాత్మ నిర్ణయము ప్రకారము ఆయన అగ్ని పీడనముతో ఈ శరీర సంచారములను, దీని యొక్క నడుపుదలకును కారణభూతమై సంచరించుచున్నాడు.  మానవునిలో దహించుచున్న ఆత్మను ఎవరైతే అనుగ్రహించియున్నారో వారి దగ్గరకు అదిచేరవలెను.  శరీరమునకు నిర్మాణకేంద్రము (వర్కుషాపు) భూమి గనుక ఇది భూమిలో కలసిమన్నై పోవును.

        దేవుని యొక్క అగ్ని ప్రత్యక్షముగా సొదమ గొమర్రా పట్టణములను హేబేలు బలిని యోబు గొఱ్ఱెలను దహించినట్లుగ తెలియుచున్నది. దేవుని ఆత్మ ఆరని అగ్ని అని ముంగుర్తుగాను మోషేకు మండుచున్న అగ్నిరూపములో కనబడుట కూడా ఒక నిదర్శనము ఏసుప్రభువు అను అగ్ని యూదాను దహించి శరీరాత్మలను వేరుపఱచెను.  అనగా మరణ పాత్రుడాయెను.

        అపోస్తలులను వేదసాక్షులను చక్రవర్తుల హృదయాలను దహించి, నీతిమంతులను హతసాక్షులను వేదసాక్షులను తనలోనికి ఐక్యత చేసికొనుటకు మార్గాన్ని ఏర్పరచినది.

        పిలాతు ఎదుట యూదుల శరీరములను దహించి సిలువ వేయుము, సిలువ వేయుము అని అనిపించింది.  ఏసుప్రభువు చనిపోయిన తర్వాత యూదుల హృదయాలలో కలవరమైన ఆ అగ్నిని (ఈయన మరలలేచును) రగుల్కొల్పినది, దీని ప్రభావమున కాపలాదార్ల  శరీరములకు కునుకుపాట్లు అనగా ఈ అగ్నివారి హృదయ జ్వాలలను అర్పి శరీరములకు నిద్రమత్తునుకల్గించి నిద్రాసక్తులుగ చేసింది.

        యోహాను చెప్పిన రీతిగా ఏసు ప్రభువు ఆత్మతోను అగ్నితోను మత్తయి 3-11 బాప్తిస్మము ఇచ్చుననియు యోహాను నీళ్ళతో ముంగుర్తుగా బాప్తిస్మము ఇచ్చియున్నారు.

        ఏసుప్రభువు దైవాగ్నిలోని జ్వాల అనుటకు ఆధారము ప్రకటన 2-18 మరియు 6-12 దేవుని ఆత్మ యొక్క అగ్ని ప్రవాహ స్వరూపము.

                                లూసిఫర్‌ చరిత్ర

        ప్రభువునందు ప్రియమైన సోదరీ సోదరుడా!

        దేవుడు లూసియర్‌ అను దూతను శపించి చీకటి అగాధములో అతనిని పడద్రోసినట్లుగా గ్రంధంలో ఉన్నది.  అప్పటికి సృష్టి నిర్మాణము జరుగలేదు.  అయితే ఆదికాండము మొదటి అధ్యాయము ప్రారంభములోనే దేవుని యొక్క ఆత్మ అగాధ జలములపై అల్లలాడుచున్నట్లుగ గ్రంధములో ఉన్నది.  మఱి అపవాది ఉన్నట్టి చీకటి అగాధ జలములపైన దేవుడు అల్లలాడుచు తిరుగుటలో ఆయన ఉద్దేశ్యమేమి?

        దేవుడు ఎవరినైనను శిక్షించును.  కాని నాశనమును చేయు స్వభావము కల్గినవాడు కాదు. అనగా అవినీతికి దూరుడు.  నీతికి నిధి వంటివాడు.  కనుక అవినీతి పరుడైనను విరిగినలిగిన హృదయముతో సేవించితే తప్పక వానిని ఉద్దరింపగలడు ఇట్టి స్వభావము గలవాడే పరమాత్మ శపించి అగాధ చీకటిలో పడద్రోసిన తన ప్రధాన దూతయైన లూసిఫర్‌ని శపించి చీకటి అగాధము పాలుచేసినందుకుగాను పరమాత్మ పరిశాపము పొందినవాడై ఆ జలముల మీద అల్లలాడినట్లు మనము గ్రహించవలసియున్నది.

        కాబట్టి అపవాదికి పునర్జన్మ  కల్గించనెంచి సృష్టిని సృష్టించినాడు.  తన సృష్టిలో తాను మట్టి నుండి తీసిన నర రూపమును  పరీక్షించుటకు దానిని శోదించుటకును ఆ నర రూపము ద్వారా జన సంతతిని అభివృద్ధి పఱచుటకును నరులలో ప్రవేశించి ప్రకృతిని మెరుగుపరచుటకును, సృష్టి కార్యము యావత్తును దైవనిర్ణయము ప్రకారము నిర్వహించుటకును దేవుడు తన సృష్టియైన నరుల ద్వారా నీతిని నరులలో ఫలింపజేసి, దైవ క్రమశిక్షణలో నడిపించి వారితో బాటు లోకాంత్యమున అపవాది కూడ తన జన్మను సార్థకము చేసికొని పరమాత్మలో ఐక్యమగునట్లుగా దైవ ఉద్దేశ్యమైయున్నది.  ఇందును బట్టి బైబిలు గ్రంధములో అక్కడక్కడ అపవాదికి తన దైవిక కార్యములలో అవకాశము కల్గించినట్లుగా పరిశుద్ధ గ్రంధములో ఆధారములు ఉన్నవి.

        శపించబడి నిరాశ్రయుడుగా ఉన్నట్టి లూసిఫర్‌ ఈ యుగసంబంధమైన దేవతగాను, భూనాధుడుగను, దేవుడు ఏర్పరచుటలోని భావమేమిటో మనము గ్రహించవలసియున్నది.  నిరాశ్రయులైన ప్రజలకు వెనుకబడిన జాతులకు ప్రభుత్వము ఏ విధముగ గృహవసతి ఉద్యోగ అవకాశము పశువుల పెంపకము భూమి సాగుబడి ఇత్యాది బ్రతుకు తెరువులకు ఏ విధముగ ప్రభుత్వము వసతి కల్పించి సహాయపడుచున్నదో-అదే విధముగా వెనుకబడిన స్థితిలో అంధకార అగాధములలో శపించబడి దైవప్రభావము ఆయన అక్షయమైన కరుణానిధిని పోగొట్టుకొని నిరాశ్రయుడై అశక్తుడై భ్రష్టత్వముతో ఉన్న అపవాదికొరకు దేవుడు ఈ సృష్టిని పశుపక్ష్యాదులను వృక్ష సముదాయము నరకోటి నిర్వహణ కొఱకును అనగా సంరక్షణ జ్ఞానముతోను సృష్టిజ్ఞానముతోను అది అపవాది జ్ఞానమే.  వీనితో అభివృద్ది వఱచి ప్రతినరుని నీతి వరునిగ జేసి ఏ ఆత్మయు నశిపకుండచేసి వారితోబాటు అపవాదియైన తన యొక్క ఆత్మను కూడ పరమాత్మలో ఐక్యము చేసికొని జన్మను తరింపజేసికొనవలసినట్లుగా దేవుని ఉద్దేశ్యమైయున్నది,

        శపించబడిన ఆత్మకు పునరావాసమును కల్గించుటకు దేవుని యొక్క ఆత్మ చీకటి జలములపై అల్లలాడినట్లును ఇందు విషయమై ఈ లోకము సృష్టించబడినట్లు తెలియుచున్నది.

        అపవిత్రాత్మ తన అహంకారమునుబట్టి తన నాశనమునకు తానే కారణమాయెను.

        రెండవదానికి అపవిత్రాత్మ ఆవేశపూర్ణుడై నర జీవాత్మలు చేసిన హేయకృత్యములు పాపక్రియలు కారణములైయున్నవి.  ఇందును బట్టి క్రీస్తు ఈ లోకమునకు రావలసియున్నది.

        నశించిన నరుని వెదకి రక్షించుటకు ఏసుప్రభువు శరీరము సిలువకు ఎత్తబడినది.  ఇచ్చట నిర్దోషమైన శరీరము మ్రానికి ఎత్తబడినది.

        పరిశుద్ధాత్మ ఎవరు?భూమి మీద అపవాది యొక్క క్రియలను నరుల యొక్క చర్యలను ఎప్పటికప్పుడు కనిపెట్టుచు, భూలోక మంతట వ్యాపించి సర్వసృష్టిలో జరుగుచున్న నీతి అవినీతి న్యాయ అన్యాయము పాపము పుణ్యము అను నరకోటి యొక్క చర్యలను వీక్షించి పరలోక అదిపతియైన పరమాత్ముని దృష్టికి ఎరిగించువాడు.

        మరియు భూమి మీద ప్రత్యేకముగ అపవాదివాని చర్యలను వావిక్రియలను వాని రూపములను వానిపవిత్ర అపవిత్ర కార్యములను గుర్తించుచు అపవాదిని ఒక ప్రక్క హెచ్చరించుచు ఏసు అను నరరూపముతో-దేవుని సువార్త అను వాక్యమును పరిశుద్ధాత్మ అను దేవుడు విస్తరింపజేయుచున్నాడు.  అందువల్లనే ఇది పరిశుద్దగ్రంధము మఱియు ఈ బైబిలు అను గ్రంధము అపొస్తలులను ఆవరించి వారి చేత రచియించి ప్రవచింపజేసినది మఱియు నేడు పరిశుద్ధులో-ఇది ఇందులోని వాక్యములు ప్రవచింపబడుచున్నవి.

        పరిశుద్ధాత్మ నిష్కలష్మమైన కన్యకలో తండ్రియైన దేవుడు మట్టితో నరరూపమును చేసితే పరిశుద్దాత్మ అను ఆదరణ కర్తయైన దేవుడు నిష్కళంక కన్యలో ఆత్మశక్తితో నరరూపమును చేసినట్లు గ్రంధములో వివరించబడియున్నది.  నరుల ఎదుట భూలోకములో సాతాను జరుపుచున్న నిర్వహణ క్రియలు 2వ కొరింధి 11:12-15

        అపవాదిని దేవుడు సర్పములోనికి ఎందుకు పంపించినాడు? అది సర్పములోచేరి ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? సర్పము నుండిగాక చిలుక గోరింకల్లో చేరి ఎందుకు మాట్లాడకూడదు?  అవి మనుష్యుల మాటలవలె మాట్లాడు అవకాశము ఉన్నది కదా!        

        సృష్టిని నరుని సృష్టించిన దేవునకు వీటి రెంటి భవిష్యత్తు ఎరుగని వాడుకాదు.  ఎరిగినవాడైనందు వల్లనే భవిష్యత్తులో తన సృష్టియైన నరుడు దైవ ఆజ్ఞ అతిక్రమముచేసి సర్ప విషతుల్య సమానుడగునని నిర్ణయించు కొన్నవాడును అయినందువల్ల అపవాదిని సర్పములో ప్రవేశింపజేసినాడు.

        దైవాజ్ఞ అతిక్రమణచేసిన నరుడు అజ్ఞానియై ఆత్మజ్ఞానమును పోగొట్టుకొని అంధకారమైన సృష్టిజ్ఞానముతో అంధుడై జీవించుననియు, అందు మూలమున చెట్టుపూజను, సర్పపూజను చేయుచు వ్యర్థుడై తన కృపనుండి తొలగగలడనియు దేవుడు తలంచి మొదటచెట్టును నిషేధించినాడు.  సర్పమును శపించినాడు.  చెట్టుమూలమున సర్పమూలమున భ్రష్టత్వము పొందిన అనగా శాపగ్రస్థమైన సర్పము చెట్టు రెండును ఒకదాని, నొకటి ఆశ్రయించి సుబ్బరాయుడు పుట్టగా మారియున్నది,

        తండ్రియైన దైవనిర్ణయమును బట్టి ఏసుప్రభువు సర్ప సంతానమా! అనుటలోని ఉద్దేశ్యమును బట్టి అది దైవసంకల్సమని అర్థమగుచున్నది.  సర్పము యొక్క విషప్రభావమును మనలో ఇముడ్చుకొని యున్నారమని అర్థము.   రోమా 3-13 లూకా 3-7 నర సంతతిని సర్ప సంతానముగ మాట్లాడినట్లు తెలియుచున్నది.  దేవుడు సృష్టిలో సమస్త భూ జంతువులలో సర్పముయుక్తిగలదైయుండెను.

        ఆయుక్తిని అపవాది సర్పమునుండి నరునిలోనికి ఎక్స్‌పోర్టు చేసినట్లుగ తెలియుచున్నది.  కనుక ఇపుడు నరుని అంతటి యుక్తిగలవాడులేడని భూమి మీద సాటినరులమైన మనము అహంభావముతో బహుదర్పముగ చెప్పుకొనుచున్నాము. కాని దేవుని ముందు మన యుక్తులు మన పన్నాగములు ఏ మూలకుపనికిరావని ప్రకటన 3-17 ద్వారా గ్రహించవలసియున్నది. నీవు దౌర్భాగ్యుడవు దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గృడ్డివాడవును దిగంబరుడవునైయున్నావు''.

                                అపవిత్రాత్మ ఎవరు?

        ప్రభువునందు ప్రియసోదరీ, సోదరులారా!

        శరీర జ్ఞానము అంధత్వముతో కూడినదిగా మనకుతెలియుచున్నది.  ఎందుకనగా చర్చీలో కూర్చుని పెద్దగా ఆడంబరముగా పాడుచు అన్ని కాలంబుల యున్న యెహోవా! నిన్ను ఎన్నా! తరంబా యో కన్నతండ్రీ! అనిపాడుచు ఆ పాటలో ఒక చరణమైన ''పుట్టింప నీవంచు, పోషింప నీవంచు, గిట్టింప నీవంచు కీర్తంతును'' అని పాడుచు గుఱ్ఱం గుగిళ్ళు మేసినట్లుగా దానిని మన శరీర అంధత్వమునకు బలిచేసి గుఱ్ఱము గుగ్గిళ్ళను జీర్ణము చేసుకొనునట్లు ఆ చరణములను కూడా గాలికి వదలి వేయుచున్నాము.        

        ''పుట్టింపనీవంచు''ఈ చరణములోని అర్థము.  ఇవి మూడు ఆత్మల యొక్క భావమును విశదపరచుచున్నది. 'పుట్టింప నీవంచు' ఇది సృష్టికర్తయైన యెహోవా దేవుని యొక్క ఆత్మగా ఈ మాట అర్థము ఇచ్చుచున్నది.

        ''పోషింప నీవంచు'' అనగా ఇది పరిశుద్దాత్మ, ఆది తండ్రియైన దేవుడు సృష్టించిన సృష్టిని ఆవరించి ప్రతివ్యక్తి ఆత్మనడుపుదలకు దోహదమిచ్చుచున్నట్లు అర్థము ఇచ్చుచు, భూలోక నరులమైన మనలను తన ఆదరణతో పోషించుచున్నది. అట్లు పోషించుటయ గాక తనను ఒక శరీరిగా రూపొందింపబడి ఆ శరీరమునకు ఏసు అను పేరు పెట్టించి, తన మహిమ ప్రభావముతో ఆ శరీరమును ఎదిగింపజేసి, ఆ శరీరముచేత అనేక మహిమక్రియలను చేయింపజేసి జీవాత్మ నరులమైన మన ఆత్మ మలిన నిమిత్తము ఆ శరీరమును బలిగా నొప్పగించి మరణము అనునది ఒక నిద్రగా తేల్చి తాను పరిశుద్దాత్మ రూపొందించిన ఏసు అను శరీరము నిజదైవత్వ సన్నిధానమునకు చేర్చి మన మధ్య అనుదినము దైవత్వము లోనికి నడుపుచు పోషించుచున్న ఆత్మ ఇది పరిశుద్ధాత్మయని అందురు.        

        ''గిట్టింప నీవంచు'' గిట్టించునది అనగా పడగొట్టునది 'అపవిత్రాత్మ' ఇది దేవుని సన్నిధిలో ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలను దైవ సన్నిధినుండి పడగొట్టించినది.  దీనికి ఈ ప్రభావమును ఈ శక్తిని అనుగ్రహించినవాడు దేవుడే, అపవిత్రాత్మ అనగా సరియైన నిర్వచనము ఏమి? దైవత్వమును పరీక్షించుటకు శోదించునదిగా నిర్ణయించబడి యున్నది.  దేవుడు సమయోచితముగ ఈ ఆత్మను ప్రయోగించుచున్నట్లు పరిశుద్ధ గ్రంధములో ఈ క్రింద ఉదాహరణలు తెల్పుచున్నవి.

        1.ఆదినరజంట 2.కయీను, హేబేలు, 3.దైవ సృష్టియైన భూమినే శోదించి ఆనాటి భూ నరులలో నోవహు కుటుంబము ఒక్కటే నితిమంతులుగా దేవుని సన్నిధానములో నిల్పి ఆనాటి జనసంఖ్యను భూమిని దైవ ఉగ్రతపాలు చేసి జలప్రళయముతో నశింపజేసినది అపవిత్రాత్మయే.  4.సొదమ గొమర్రా పట్టణ వినాశమునకు దైవోగ్రతలో దహింపజేసిన ఆత్మ కూడా అపవిత్రాత్మయే. 5.ఇశ్రాయేలీ జనాంగము యొక్క దైవత్వమునకు పదును పెట్టించినది కూడ ఈ అపవిత్రాత్మయే 7.ఇదే విధముగా యాకోబు ఏశావులలో జ్యేష్ఠత్వమును శోధించినదిగాని అబ్రహామును పరిశోధించినది గాని, సంసోనును దైవ పరీక్షలో నిల్పినదిగాని విశ్వాసులను అవిశ్వాసులుగ చేయుటకు ప్రయత్నించి పరీక్షలు పెట్టి నిజమైన దైవత్వములోనికి నిలబడగల వ్యక్తిని నిలబెట్టించినది కూడాఈ అపవిత్రాత్మయే. ఈ విధముగా ఏలియా, అబ్రహాము, సమూయేలు యోబు, సౌలు, దావీదు సొలొమోను, అబ్షాలోము మొదలుగాగల దైవ విశ్వాసులందరు ఈఅపవిత్రాత్మ యొక్క పరీక్షలో ప్రవేశించినారు.

         వీరందరిలో అగ్రగణ్యుడు యోబు.  అందువల్ల ఈ పరీక్షలో నిలబడకల్గి పోయిన దానికంటె ముప్పదంతలు ఎక్కువ అశీర్వాదమును దేవుని దగ్గర పొందగల్గినాడు.  దానియేలును సింహము బోమలో పెట్టించి పరీక్షింపగా దానియేలు యొక్క దైవ విశ్వాసము సింహాల నోళ్ళను మూయించునట్లుగా చేయగల్గినపుడు రాజు చేత దానియేలు సన్మానింపబడుట అపవిత్రాత్మ పరీక్షలో దానియేలు విజయము పొందినట్లుగా మనము గ్రహింపవలెను.  దానియేలు పరిశుద్ధాత్మ శక్తి వలన విజయముపొందినాడు.

        ఇకపోతే క్రొత్తనిబంధనకాలములో క్రీస్తును శోధించినాడు. యోహానును, క్రైస్తవ భక్తులను శోధించినాడు.  ఏసుప్రభువు శిష్యులను శోధించినాడు,  వారి హత సాక్షులను శోదించినాడు.  అయితే వారిలో కొంతమంది ఆ పరీక్షలో విజయమును సాధించి, నేడు మన వేదగ్రంధమైన బైబిలును రచించినారు.  ఈ యుగములో బైబిలు గ్రంధమును చేతబట్టిన పాప్టర్లను ఫాదరీలను ధనాశతోను, పదవీ వ్యామోహముతోను, హోదాలతోను కుల మత భేధములతోను అంగసౌష్టవము (పర్సనాలిటీ) తోను అనగా అంగీలు సూట్లు బూట్లు మొదలైనవి.  అపవిత్రాత్మ విజృంభించి సంఘబేధములను కల్పించి అనేక డినామినేషన్లు సృష్టించి, ఒక డినామినేషనుతో మరియొక డినామినేషనుకు కలతలు పెట్టి, వీలైతే కోర్టు కచ్చేరీలకు ఎక్కించి సర్కారువారు నిర్వహించు పబ్లికు పరీక్షలవలె ఈ పరీక్షలను రచ్చకెక్కించి నిజమైన భక్తులను జల్లెఢపట్టుచున్నాడు.  ఈ పరీక్షలో నెగ్గలేక అవిశ్వాసులై దేవుని పట్ల వెగటుతనమును చూపించుచున్న ప్రజలను గురించి మార్కు 7:6-7 లో ఏసుప్రభువు అపజయము పొందుచున్న సంఘములను గూర్చి సంఘ సోదరులను గూర్చి పడుచున్న వేదనను మనము గుర్తించవలెను.

        అంశము-తీర్పుకు కావలిలో వుంచుట

        మూలముః-2వ పేతురు 2:4 యూదా 1:6 దేవదూతలు పాపము చేసినపుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకుకావలిలో వుంచబడుటకు వారిని అప్పగించెను'' తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమనివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పువరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను,

        ప్రియపాఠకులారా!   పై రెండు ప్రవచనాలు మానవులను గూర్చి కాదు, సృష్టిని గూర్చికాదు, సృష్టికర్తను గూర్చి కాదు. సృష్టికర్తకు దోషులును అనగా దేవుని యొక్క చట్టానికి విధేయులు గాని వారును ఆయనపై తిరుగుబాటు జేసి పదవీ వ్యామోహపరులై దైవోగ్రతకు పాత్రులై దేవుని చేత పడద్రోయబడి భూమికి అప్పగించబడి, నరుల కాపుదలలో వున్నటువంటి నేటి ముక్కోటి దేవతల యొక్క చరిత్ర.

        ప్రియపాఠకులారా!  ఈమాట చదివే వారికి కఠినంగా వుండవచ్చును.  ఒక యజమాని తోటలో అనేక ఫలవృక్షాలున్నపుడు అవికాలము ఋతువుననుసరించి యజమాని యొక్క చిత్త ప్రకారంగా ఆ చెట్లు తమ ఫలాలను విశేషంగా ఫలించిపుడు ఫలసాయమును బట్టి తోటయజమాని ఫలవృక్షాలయెడ శ్రద్దవహించి వాటిని బహు జాగ్రత్తగా పోషిస్తాడు.  మొట్టమొదటగా జంతు జాలము తోటలో పశువులు గాని మరి ఏ ఇతరమైన జీవరాసులు గాని తోటఫలించినపుడు దానిని కబళించుటకు వచ్చే కోతుల విషయములోను శ్రద్ధవహించి తోట ఫలము పాడవకుండ తాను పొందిన శ్రమకు సంపూర్ణమైన సంతృప్తి పొందుతాడు.  అయితే తోటలో ఏదైన చెట్టు ఫలించకుండ ఎదుగుదల లేకుండ అనగా ఆకురాల్పుడు పువ్వు పిందె లేనటువంటి స్థితిలో వున్నపుడు తోట యజమాని కొంతకాలము దాని పట్ల శ్రద్ధవహించి నప్పటికిని నిరుత్సాహపడి కఠినచిత్తుడై దాన్ని నఱకి ఱంపపు మిల్లు పాల్జేస్తాడు.

        అదే విధంగా దేవుడు కూడా తన సన్నిధియైన ఉద్యానవనంలో మనతో కూడా కూర్చుని మన ఆరాధనలో పాలుపంపులు పంచుకొంటూ సంతోషిస్తాడు.  అదే విధంగా దైవరాజ్యంలో కూడా దేవుడు తన సన్నిధానంలో దేవదూతలు అను ఫలవృక్షములు వుండగా అనగా దేవదూతలనెడి ఫలభరితమైన వృక్ష జీవులు-తోటయజమానియైన దేవునికి విధేయించాలి. అణకువ గల్గి అట్ల్లు గాకుండ తిరుగుబాటు జేసి అరాచకాన్ని సృష్టించిన దేవదూతల పట్ల దేవుడు ఆగ్రహించి తోటలో ఫలశూన్యమైన చెట్టును నరికి వేయబడినట్లుగా వారిని ఇహలోకానికి అప్పగించాడు.  ఈ విధంగా అప్పగించబడిన దేవదూతలు భూగర్భంలో త్రోయబడి మరియు గర్భాలయములు, ఆలయంలో గర్బగుడులని వగైరా పేర్లతో ఆపడద్రోయబడిన దేవదూతలు అదృశ్య రూపంలో వుండి ప్రత్యక్షంగా శిలారూపమును దాల్చి నేరము జేసిన ముద్దాయిల నేవిధంగా అయితే కటకటాలలో బంధించబడుదురో అదే విధంగా నరుల చేతికి వీరిని అప్పగించి లోకాంత్యములో ప్రభువు తీర్చబోవు తీర్పునకు మనుష్యుల చేత కావలివుంచినట్లు పై వేదవాక్యములోని మర్మము.

        ప్రియపాఠకులారా!  తోటలో చెట్టు నరకబడినపుడు అది ఎండుకట్టెగా మారి లేక దాని మొదలును ఱంపపు మిల్లులో కోసి రకరకాలైన గృహపరికరాలను తయారు జేస్తారు.  అదే విధంగా ప్రభువు రాకడ సమయంలో పై విధంగా బంధీలైన దేవదూతలు దైవసన్నిధిలో నరకాగ్నిలో భస్మీపటలము కావలసిన సందర్భము ఒకటున్నదని మనము గ్రహించాలి.  ఈ సందర్భంలో ప్రక 21: మనము చదివినట్లయితే - అంతట నేను క్రొత్తాకాశమును క్రొత్తభూమిని చూచితిని -మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను''. అనుటలో ప్రభువు రాకడలో ఈ యొక్క దేవతారూపములు దైవ తీర్పుకు గురియై దహించబడునని ఇందులోని భావము.  ఇటువంటి దైవోగ్రతకు గురికావలసిన స్థితిలో వున్న ఈ దేవదూతలు తాము కటిక చీకటిలో బంధకాలలో వున్నను, మనుష్యుల చేత తమను ఆరాధింపజేసుకొనుటన్నది గమనించదగిన విషయము,.  అయినను దేవుని మాట వ్యర్థంకాదు.  దేవుని నిర్ణయాన్ని బట్టి ఈ దేవదూతలకు విధించబడిన శిక్ష ఏమిటంటే వీరు దేవుళ్ళుగా చెలామణియైనను వీరి భక్తులు సమర్పించు కానుకలు మ్రొక్కు బళ్ళు హుండీల పెత్తనము నరులదే! దేవదాయ ధర్మాధాయ చట్టము అను ఒక చట్టమును గుర్తించి నరులు ఈ దేవదూతలను ఆ ఆలయములో వుంచి ఉలుకు పలుకు లేకుండ జేసి హారతి కర్పూరం లగాయతు నైవేద్యాలు అలంకారాలు వగైరాధికారాలు ట్రస్టీ బోర్టులు అను పేరుతో ఈ శాపగ్రస్థమైన దేవదూతల పేరట మాన్యాలను, వచ్చెడిమ్రొక్కు బళ్ళను అనుభవిస్తూ ఈ దేవుళ్ళను మాత్రం కాపలా కాయుచు తమ జీవితాలను ఈ లోకంలో లోటులేకుండా జరుపుకొనేటటువంటి ప్రబుద్దులున్నారు.                ప్రియపాఠకులారా!  సత్యదేవుని సన్నిధిలో ఈ దేవదూతలకు స్థానము లేదు.  నరులమైన మన యొక్క సన్నిధిలో కూడా ఈ దేవదూతలకు స్థానము లేదు.  వీటి స్థానము కటిక చీకటితో కూడినట్టి భూగర్భము. కాని వీరి అజ్ఞానమును బుఱ్ఱలో వుంచుకొన్న భక్తులు అజ్ఞానులై దేవుడు వచ్చుచున్నాడని ఒక విగ్రహాన్ని పల్లకిలో పెట్టి హంగామా జేస్తూ పురవీధులలో త్రిప్పుచు తిరుణాల జేస్తున్నారు.  ప్రియపాఠకులారా!  మనుష్యులు మోయుచున్న ఈ ఊరేగింపు శిలలలో దేవతలు గాని దేవుళ్ళుగానివుంటారా? దేవుడు ఆకాశంలో వున్నాడు.  త్రోయబడిన ఈ దూతలు పాతాళంలో వున్నారు.  అయితే నరుడు భూమ్మీదను, దేవదూతలు పాతాళంలో వున్నారన్నది యిందులోని సత్యము.  కాబట్టి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కల్గాలంటే భూమ్మీద వున్నటువంటి నరులు ఆయనను మహిమ పరచాలిగాని శాపగ్రస్థమై పతనావస్థలో వున్న దూతలకు యిట్టి క్రియ అసాధ్యము.

        దయ్యం పట్టుట అనగానేమి? లూకా 4:33 శరీరములో వుండే ఆత్మ శరీర బలహీనత్వమును బట్టి అపవిత్రాత్మకు చోటుయిచ్చును.  ఈ రెండాత్మల పెనుగులాటయే మతితప్పుట దయ్యము పట్టుట యగును.  ఆదాములో ప్రవేశించిన అపవిత్రాత్మ వలన ఒకరిమీద ఒకరు చెప్పుకొనినారు.  లూకా 4:33 మన మిచ్చిన బలమును బట్టి అపవిత్రాత్మ దేవుని ఎదుర్కొనుచున్నాడు.

        సర్వోన్నతుడు అనగా అన్నిటికంటె పైనున్న వాడు సర్వాంతర్యామి అన్నిటిలో సంచరించువాడు.  సర్వజ్ఞుడు.  ఆయన ప్రయోగించు శక్తులను ప్రతిశక్తిని ఒక దేవతగా శిలారూపముగను కర్ర రూపముగనో చిత్రవిచిత్రములైన నామరూపములతో వాటికి బలులు నైవేద్యములు అర్పించి, వాటిని ఆరాధిస్తున్నాడు.  పరమాత్ముని శక్తులను పూజించుటకంటె ఆ శక్తులకు ఆది సంభూతుడైన దేవుని పూజించుట మంచిది.

        నరుడు పతన మగుటకు ''అహం'' ఆ నరుడే తన తప్పును తెలుసుకొని బాగుపడుటకు ''ఓం'' అనగా ఓనాదేవా!ఓదేవా! అని అర్థము.

        సృష్టికర్తను వదలి సృష్టికర్త శక్తియైన సృష్టములు అనామకరూపములను నరులు తమ కల్పనా చాతుర్యముతో సృష్టించి నిజదేవుని వ్యర్థముగా ఆరాధించుట చేతనే, నేటి దైవదర్శనము ప్రత్యక్షంగా కరువైనట్లు తెలియుచున్నది.  ఆ కాలములో అమాయికులకు అజ్ఞానులకు మూర్ఖులకు దర్శన మిచ్చి మాట్లాడిన దేవుడు నేడు నాగరికులు అయిన నరులకు దర్శనమిచ్చి మాట్లాడక పోగా సృష్టిజ్ఞానమునకు దాసుడై సృష్టికి మూలకర్తను మరచి దేవుడే లేడను హీనత్వమునకు నరుడు దిగజారియున్నాడు.

        పాతనిబంధన చరిత్రకు మూలకారకుడు ఆదాము అయితే నూతన నిబంధన చరిత్రకు పునాదిక్రీస్తు.  పాతనిబంధనలో మరణమునకు పునాదివేయబడితే నూతన నిబంధనలో జీవమునకు పునాది వేయబడినది. పాతనిబంధనలో నరుడు అజ్ఞానియైతే నూతన నిబంధన నరుడు హేతువాదనాస్తికుడుగా తయారైనాడు.  దేవుని యొక్క కోరిక తన సృష్టియైన నరుడు తనను మహిమ పర్చాలని ఆయన కోరిక.  కాని నరుడందుకు వ్యతిరేకియై ఆదిలో సర్వోపదేశమునకు దాసుడై సర్పమును మహిమపరచుటకు సతీసమేతంగా పూనుకొన్నట్లు నేటి యుగములో జరుగు సర్పపూజలు ఋజువుపరచుచున్నవి.  అయినను పరమాత్ముడు పరమశాంతుడై నరుల పట్ల కినుక వహింపక క్రీస్తు రూపములోనే నన్ను తనను మహిమపరచగలడన్న విశ్వాసములో వాక్కు అనగా శబ్దమైయున్న దేవుడు శరీరమును దాల్చి నరుని ముందు ప్రత్యక్షమై, అనేక అద్భుతములు చేయగా నరుడు అందుకు వ్యతిరేకముగా క్రీస్తును భూతముగాను సర్పమును దేవునిగా వుచ్చరిస్తూ పాపము అనేకగోయ్యికి అతి సమీపమైపోవుచున్నాడు.  కాని నేడు నరునికి నిత్యజీవము క్రీస్తులో తప్ప మరి ఎవ్వరిలో లేదని నరసందోహము గ్రహింపవలసియున్నది.

        నేడు నరుని నిత్యజీవమార్గములోనికి క్రీస్తు పిలచుచున్నాడు.  ఆ పిలుపుకు నరుడు యోగ్యుడుగా వున్నాడా? అట్టి యోగ్యతలు వారికి వున్నవా? అట్టి యోగ్యతలు నాకున్నవి అనే నరుని సవాలును బైబిలు ఒప్పుకోవడము లేదు.  ఎట్లు? నీతిమంతుడు ఒకడును లేడు'', అని ప్రతివాడు అనుకుంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చినది వ్యర్థమే.  కనుక ప్రతి యొక్క నరుడును మారణాయుధములు కనిపెట్టుట పొరుగు దేశం మీద కత్తిగట్టుట, ఎదుటి వాని సంపదకు ఓర్వలేకపోవుట. ఎదుటివాని ద్వేషం పెంచుకొని దేవుడిచ్చిన ఆయుర్దాయానికి ముప్పు తెచ్చుకోవడము , ఇటువంటి పనులు మాని దైవకార్యములు దానధర్మములు సహోదర ప్రేమగల్గి సౌమ్యంగా జీవించడం నేర్చుకోవాలి.  అప్పుడు జక్కయ్య ఇంటికి ఏసుప్రభువు ఏ విధంగా అతిధిగా వచ్చెనో నేటికి అదే విధంగా మన హృదయములో కూడా నిత్యం ఆతిధ్యం వహించును- ఇది దైవ నిగూఢ సత్యము.

        అంధకార సంబంధులగు లోకనాధులు-అంధకార సంబంధులు లోకమును పరిపాలించువారు-చీకటి సంబంధులు లంచాలు బ్లూఫిలిమ్‌లు-క్లబ్‌లు, మానభంగాలు హతమార్చుట, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహాలు లూసిఫర్‌తో ఏకమై దైవత్వంతో పోరాడినపుడు పడగొట్టబడి చీకటిలో పడవేయబడినవారు. వీరు దైవత్వమును కోల్పోయి కఠినత్వం దాల్చుటవలన దురాత్మలుగా మారినట్లును-వీటిపని ఏమిటి? పూర్తిగా దైవత్వమునకు విరోధము, లోకసంబంధమైన పదవుల కోసము ధనవ్యామోహము.  దేవుడు లేదు దయ్యం లేదు పరలోకం లేదు నరకం లేదు-మోక్షం లేదు. చచ్చినవాడు తక్కెడో బిక్కెడో! కాబట్టి జీవించినంతకాలం ఘనంగా ఉన్నతంగా విలువలతో అంతస్థులుగ సిరిసంపదలతో తులదూగుచు, లోకాన్ని అనుభవించాలి.  ఇది దురాత్మల సమూహసంబంధమైన ప్రేరేపణ. ఈ దురాత్మల సమూహమన్నది దీని వ్యామోహంలో ప్రతి యొక్కడు పడుతాడు.  సన్యాసులే గాని లోకంలో వాటి ప్రోద్బలమునకు ప్రతియొక్కరు దురాత్మల ప్రేరేపణలేనిదే ఇది జరుగదు.ఈ దురాత్మ క్రియ జరిగించినపుడు జ్ఞాన వివేచన పూర్తిగా తుడిచిపెట్టుకొని వావి వరుసలుండవు, ధర్మముండదు,స్వార్దము ఈర్ష్యా ద్వేషాలు సందర్బనుసారంగా మారణహోమము జరిగించేందుకు తెగించేందుకు ఈ ఆత్మలు జీవాత్ములైన నరులను ప్రేరేపించును. వీటి ప్రభావము వలన లోకములో హత్యలు మానభంగాలు దహన కాండ, అన్యాయపు ఎన్నికలు దొంగనోట్లు అక్రమ పరిపాలన వగైరాలకు ఈదురాత్మల సముదాయము ప్రేరేపించి జరిగించుచుండును.ఆత్మల లోకములో పాలకవర్గ్గాలు ఎఫెసీ 6:12 ప్రధానులు అధికారులు లోకనాధులు దురాత్మల సమూహములు'', ఇవి గాక పంచభూతాల ప్రకోల్పం.  ప్రకటన 14:13లో ప్రభువునందు నిద్రించిన వారికి పై పోరాటములు లేవు.  క్రీస్తునందున్న వారికి ఏ శిక్షవిధియులేదు.  దానియేలు 12:3 బుద్ధిమంతులు, నీతిమార్గముననుసరించి అనేకులను త్రిప్పినవారు ఆకాశ మండలంలోని జ్యొతులవలె ప్రకాశించెదరు. అయితే ఆత్మలు ఎచ్చట ఉన్నవి? చనిపోవుచు దేహంవిడిచేటప్పుడు మరణకాలంలో ఆత్మను కొనిపోవు దూతలకున్న క్రియావిధానమెలా గుంటుంది? దేవుడిచ్చిన ఆయుష్కాలముతో సహజమరణాన్ని పొందే వాని విషయంలో కాలపరిమితిని బట్టి అతని ఆత్మను తీసికొని పోవు మరణ దూతలుంటాయి.  చనిపోయే కాలములో అతనిని పోషించి పెంచిన విగతజీవులైన ఆత్మలు కూడా-ఈ విగతజీవులైన ఆత్మలకు స్వాగతం పలికే జీవాత్మలు,  మొదటివి మరణ దూతలు.  మరణములో మూడు రకాలు 1.సహజ మరణం అకాల మరణం ఆత్మహత్య.  ఆత్మ హత్యను ప్రేరేపించు దూత అది ఆ వ్యక్తికి కాపలా ఉంటుంది.

        2వ కొరింది 4:4 ఈ యుగసంబంధమైన దేవత దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను వారికి ప్రకాశింపనీయక మనో గృడ్డితనము అనగా వీరికి ఆత్మజ్ఞానమును లోపింపజేసి బ్రతుకు మీద విరక్తి గల్గిస్తుంది.  కనుక వారు ఆత్మల రాజ్యంలో ప్రవేశించుటకు అనర్హులుగ చేయించుటయే ఈ యుగసంబంధమైన దేవత పని.  వీటిపని-నీతిమంతుని జ్ఞానాన్ని అజ్ఞానానికి మార్చుట, విశ్వాసి హృదయములో వెలుగే దైవ వెలుగును ఆర్పి వాని జ్ఞానమును మరల్చుట, వానిని బుద్ది హీనునిగా చేయుటయేగాక మృతుల లోకానికి వానిని ఎగుమతి చేయుట రోమా 1:21-26 సృష్టికర్తను వదలి సృష్టములను పూజించువారిని దేవుడే వారిని అపవిత్రాత్మలకు అప్పగిస్తున్నాడు.  ఇందువలన తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనునట్లు వారిని అపవిత్రతకు అనగా చెడ్డవి హానికల్గించే ఆత్మలకు అప్పగిస్తున్నాడు.  దీని ఉపశాఖలు తుచ్ఛమైన అభిలాషలకు అప్పగించుట, పాన్‌పరాగ్‌, గుట్కా, పొగాకు నమలుట పొగత్రాగుట-నరులు దైవత్వానికి విరోధులుగ నడచుట.

        సువార్త డిపార్ట్‌మెంట్‌ ప్రకటన 14:6 నిత్యసువార్త- భూమి మీద ఉండు వారికిని-శారీరం విడిచిన వారికి కూడా ఎయిర్‌ గోస్పెల్‌ రేడియో టి.వి. ల ద్వారా సువార్త,.  క్రీస్తు నెరుగకపోతే విగ్రహాలకు బానిసలై బంధింపబడుచున్నారు.  1 కొరింది 12:2 అన్యజనులైయున్నపుడు మూగవిగ్రహాలను ఆరాధించుటకు ఎటు బడిన అటు నడిపింపబడినారు.  మన ఆరాధనకు ఒక క్రమం లేదు.  అనేకమైన తల్లులు-సర్పారాధన.

        ఇదిగో నీ తల్లి-నా తల్లి ఎవరు? తల్లిగాని తండ్రిగాని ఆత్మయే, తల్లిగుణాలు తండ్రిగుణాలు సమస్తం ఆయనలోనే ఉన్నాయి,  విశ్వాసుల కూటమియే తల్లి, - దేవుని భార్య, గలతీ 4:26 పై నున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది అది మనకు తల్లి ప్రకటన 21:10 అవిశ్వాసులకు తల్లి-భూలోక యెరూషలేము.  భూలోక యెరూషలేము-పాపము అక్రమము - దైవ కుమారునికి అన్యాయపు శిక్షవిధించి మరణశిక్షకు గురిజేయుట-భూలోక యెరూషలేము క్రియలివి.  పరలోక యెరూషలేము అంటే పరిశుద్ధుల సావాసము - క్రీస్తును నమ్మిన యెరూషలేము పైనున్నది.  క్రీస్తును నమ్మని యెరూషలేము భూలోక యెరూషలేము.

        అపవాదియైన సర్పము నరులను పాపభూయిష్టులుగా చేయుటలోని నిగూఢ దైవ సత్యములు 1.ఆది 1:26లో వలె దేవుడు నరులను తన పోలికలో చేయుట 2.సృష్టియావత్తు నరుని పాదముల క్రింద వుంచుట ఆది 1:  3.తనతో సమానత్వము కలిగింయుండునట్లు తన జీవాయువును నరునిలో ఊదుట. 4.తన సృష్టికి నరులచే పేర్లు పెట్టించుట 5. ప్రకృతిని నరుల స్వాధీనంచేయుట.  6.అట్టి ఆధిక్యతలను లూసిఫర్‌ అను సాతాను పొందలేక దేవునిచే శపించబడి పాతాళములోనికి త్రోయబడుట 7దేవుని యొద్దనున్న లూసిఫర్‌ స్థానమును నరులకు ఏర్పరచుట, ఇట్టి ఓర్వలేని స్వభావము వలన దేవుని స్వరూపములైన నరులను తన స్వభావములతో చెడగొట్టి వారిని భ్రష్టుపట్టించుటకు సంకల్పించుటన్నది ముఖ్య కారణమైయున్నట్లు తెలియుచున్నది.

        సైతానుకు ఏయేశక్తులున్నవి?

        దేవునికి ఏయే శక్తులున్నవో ఇంచుమించుగా అవి వున్నవి.  స్త్రీ పురుషులను ఒకటిగా కలపగలడు.  మరల విడదీయగలడు, కానిమరి విడదీసిన తర్వాత కలుపలేడు. ఆ కార్యము దేవుడు చేయవలసిందే, విరిగిన మనస్సును అతికించునది దేవుడే కదా! అది సైతాను వలన కాదు.

        అపవిత్రాత్మలు అనగా సైతాను క్రియలలో గడపుచు కాలము సమీపించకపూర్వమే మరణించినవారు. అనగా దేవుడు ఇచ్చిన ఆయుస్సు పూర్తికాక మునుపే మరణించినవారు. ఇట్టివారు దయ్యములై పిశాచి పరివారముగా వుందురు.

        1 సమూ 28:3 తన చెవిని పిశాచికి ఎల్లప్పుడు అర్పించిన వాడు కర్ణపిశాచము గలవాడని అర్థము.  చిల్లంగి వారనగా సోదెగాండ్రు.

        రెంటికి చెడిన రేవడి-దైవజ్ఞానమునకు దూరమగుట, సాతాను వేదనలకు గురియగుట.  మానవులను సాతానుఎప్పుడును నమ్మడు, దేవుడును నమ్మడు, యోబు గతియు అంతే అనగా యోబును దేవుడు, సాతాను ఇద్దరు శోధించారు.          

        పండుకొనిమేసేది ఏది? ''పాము''

        అంశము 2వ ధెస్స 2:3-5 మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలు పడితేనేగాని ఆ దినము రాదు.  ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దాని నంతటిని ఎదిరించుచు, దాని కంతటికి పైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనబరచుకొనును;

        ప్రియపాఠకులారా!  మరణాన్ని గూర్చి జీవమును గూర్చి పునరుత్థానమును గూర్చి ఇంతకు ముందు మనము తెలిసికొనియున్నాము.  ఇపుడుపాపమునకును మరణమునకును నాశనమునకును భ్రష్టత్వమునకును నరకమునకును అగాధమునకును నడిపించేటటువంటి ఒక అలౌకిక శక్తిని గూర్చి మనం తెలిసికోబోతున్నాము.  ఈ అలౌకిక శక్తి దైవకూటమిలో దేవదూతలలో ప్రాముఖ్యమైన దూతగా ఉండి తన అందము తన గర్వము తన అహకారమును బట్టి మరియు వాయిద్య నైపుణ్యతను బట్టి తన శ్రావ్యమైన కంఠస్వరమును బట్టి దేవదూతలనే పరవశింపజేయు జ్ఞానాతిశయం కల్గినవాడై, ఒకానొకదినాన దైవత్వమునకంటె ఒక మెట్టు అధికంగా తన యొక్క హోదాను కనబరచుటకు తన్ను తాను హెచ్చించుకొని, దూతగణములలో ఒక గణమును తన వైపు త్రిప్పుకొని దైవలోకంలో తిరుగుబాటుజేసి, తన దూతగణ సమేతంగా అగాధంలో పడవేయబడిన దూతయే ఈ నాశన పాత్రుడైన పాప పురుషుడు.  దేవునికి ఏ విధంగా దూతలున్నారో ఇతనికి కూడా పిశాచ గణాలున్నాయి.  వీటి ద్వారా భూలోకములో తన శోదన కార్యమును జరిగిస్తూ అనేకులను దైవమార్గం నుండి తప్పించి, తన నాశన మార్గము అనగా నరకమార్గం లో నడిపిచుటకు నానా విధ ప్రలోభముల చేత నరుల యొక్క దైవ విశ్వాస జీవితాన్ని పాడుజేసి, నరజీవితాన్ని  పాడుజేసి నరజీవితాన్ని శరీరాన్ని ఆత్మీయంగాను నిష్ప్రయోజనకరంగా దైవోగ్రతకు లోనయ్యేస్థితిలో క్రియ జరిగిస్తున్నాడు.  దేవునికి అసాద్యమైన కార్యము ఎలాగులేదు.  అలాగే ఈ నాశన పాత్రుడైన పాప పురుషునికి కూడా శోదన కార్యంలో తనకు సాధ్యం కానిదంటూ ఏదియు లేదు.  ఇతని యొక్క దోషక్రియలను బట్టి అనేకులు నానా రీతులుగ కష్టాలకును హింసలకును వేదనలకును బాధలకును గురియై చివరకు మృత్యు వాతపడిన సంఘటనలు కూడా ఉన్నాయి.  ఇందును గూర్చి వేదరీత్యా పాతనిబంధనలో కొందరి జీవితాలను ఈ సందర్భంలో ఉదాహరణగా తెలిసికొందము.  దైవసన్నిధిలో లూసిఫర్‌ అను నామధేయంతో దేవుని ప్రేమకు పాత్రుడైన ఈ దూత తన గర్వ అహంకారమును బట్టి దేవునిపై తిరుగుబాటు చేసిన మూలాన ఇతడు భ్రష్టుడై ఖరారైన పేరు లేక నానా విధమైన నామధేయాలతో అనగా విశేషమైన పేర్లు ఇతని జీవితానికి అంటుగట్టబడినవి.

        ప్రియపాఠకులారా!  దైవత్వమునకున్నట్టి కొద్దిపేర్లే అయితే లూసిఫర్‌ అను ఈ దేవదూతకు ఉన్న పేర్లలో మొట్టమొదటిది అపవాదియన్న పేరు, వెలుగు దూత అంత్యక్రీస్తు అబద్ద ప్రవక్త ఆది సర్పము, ఈ యుగసంబంధమైన దేవత, వాయుమండలాధిపతి, ధర్మవిరోధి, అబద్దమునకు జనకుడు, ఈ లోకాదికారి సాతాను, అవిధేయులైన వారిని ఇపుడు ప్రేరేపించు శక్తి, పాప పురుషుడు తేజోమయనక్షత్రము, మృగము, ఇవి వేదయుతంగా లూసిఫర్‌ను గూర్చి ప్రకటించబడిన నామధేయాలు.  ఇవిగాక నరుల తమ యొక్క స్వజ్ఞానంతో కల్పనా కధలల్లి నానా విధమైన పేర్లను అంటగట్టి తెలియని రీతిలో అనగా సాతాను యొక్క మాయలో దేవుళ్ళుగా ఆరాధించే పిశాచ రూపాలు ఎన్నో ఉన్నవి.  ఈ విధంగా నానానామధేయాలతో నానా రీతులలో నానా ఆశలను నరులకు కల్పించి, దైవ విశ్వాసం నుండి నరులను తప్పించి ప్రతినిమిషము ప్రతిక్షణం విశ్వాసియొక్క జీవితం పాడు చేయుటకు అపవాది జరిగించు క్రియలు కోకొల్లలు, అపవాది తన యొక్క శోదనకు లోబడని వ్యక్తిని మొట్టమొదటిగా లోకాశలను కల్పించుట, ధనాశ వెండి బంగారాలను గూర్చిన తపన అనగా నిధినిక్షేపాలు అను భ్రమ కల్పించుట, పదవులు అధికారాలు రాజ్యకాంక్ష-వీటి మీది వ్యామోహము కల్గించుట, వీటి వేటికి లోనుగాని వానిని త్రాగుడు జూదము స్త్రీ వ్యామోహము కామాతురత, వీటికి లోబడని వానిని అకస్మాత్తు ధనంతో శోధించుట, అకస్మాత్తు ధనసంపాదన అనగా కానీ ఖర్చులేకుండ లాటరీపేరుతో గుర్రపు పందాలు వగైరాలు,.  వీటికి కూడా లోబడని వ్యక్తిని అంగసౌష్టవమును బట్టి సినిమాలలో చేర్పించుట నాటకాలు పిచ్చి పుట్టించుట, వీటికి కూడా లోబడని వ్యక్తిని శారీరకంగా మానసికంగా శోధించి బాధించుట.  ఇవి సాతాను యొక్క శోదన క్రియలోని సాధారణ అంశాలు.

        ప్రియపాఠకులారా!  ఈ శోదనన్నది సాతానుడు విగ్రహారాధకుల పట్ల దైవత్వమును వ్యతిరేకించి ప్రవర్తించు వారిపట్ల అజ్ఞానుల పట్ల తన యొక్క శోదనకు సులభంగా లోబడే వారిపట్ల జరిగించాడు.  కాని ఎవడైతే దేవునిలో ఉంటాడో ఎవడైతే దేవుని వెదకుచుంటాడో ఎవడైతే దేవునిలో ఉండి దైవత్వం యొక్క అనుగ్రహం కొరకు దివారాత్రాలు దైవనియమమును పాటిస్తూ దైవ చారపరాయణుడై'' దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మగా ఆరాధిస్తూ ఆయన యందు గురినిల్పి సత్యదేవుని గూర్చి తన యొక్క శారీరాత్మలను సమర్పించుకొని లోకధర్మమును త్యజించి, పరలోకసంపద కొరకు అనగా దైవత్వం కొరకును ఆకలి దప్పులు గల్గి ఉంటాడో అట్టివానిని ఈ అపవాది తన శోదన కార్యమును జరిగించు విధము చిత్రవిచిత్రమైన కఠోర మైనటువంటి విధానంలో ఉంటుంది.  ఇందును గూర్చి వేదరీత్యా కొన్ని సంఘటనలు మనం తెలిసికొందము.  

        దేవుడు మొట్టమొదటగా సృష్టించిన ఆదినరుడైన ఆదాము దేవుని ఆత్మ చేత పూరించబడి దైవాత్మ జ్ఞానం గల దైవ స్వాస్థ్యంలో పాలివాడై దేవుని యొక్క తొలికుమారుడుగా రూపించబడి అత్యున్నత విలువను సంతరించుకొనగా తన శోధన కార్యమును జరిగించుటకు అపవాది ఆదినారి ఆది నరుని పాపప్రయోగసాధనాలుగ వాడబడినారు.  అపవాది మొట్టమొదట పురుషునిపై శోదనాకార్యం జరిగించుటకు శక్తి జాలక,  అతని ప్రక్కటెముకనుండి తీయబడిన నారిపై శోదన కార్యం జరిగించుటకు తన రూపమును మార్చుకొని భూసంబంధియైన సర్పమును ఆవేసించి స్త్రీతో మాట్లాడినాడు.  ఈమె పురుషునిలో అర్ధాంగి అనగా సగము శరీరము, అంటే సంపూర్ణ శరీరి కాదు.  సంపూర్ణనరుడైన ఆదాముతో ఈమె సమకాలీనురాలు కాదు.  కనుక అర్థ శరీరమును సులువుగ శోధించుటకు అవకాశం లభించింది.  అందును బట్టి మానవ భాషతో స్త్రీతో మాట్లాడి దైవ నిషేధఫలమునే తన శోదన కార్యంలో వాడుచు దానిని గూర్చిన మంచి చెడును బోధించి, మొట్టమొదటగా స్త్రీ యొక్క ఆత్మీయతను హృదయాన్ని దోచుకొని స్త్రీ హృదయంలో స్థానం సంపాదించకొని దేవుడు చేయవద్దన్న కార్యమును స్త్రీ ద్వారా చేయించాడు. అంతేగాక అంతటితో వదలక స్త్రీని అడ్డంగా పెట్టి స్త్రీ తిన్న నిషేధఫల ప్రభావం ద్వారా ఆమెలోని అందమును రెట్టింపుగ అధిగమింపజేసి అనగా పురుషుని ఆకర్షింపజేసే దేహ సౌందర్యాన్ని రెట్టింపుగ స్త్రీలో కనబరచుటకు సర్పమును విడిచినటువంటి ఈ అపవాది స్త్రీలో ప్రవేశించి ఆదామును ఆకర్షించుటను బట్టి సాతాను యొక్క ఈ ప్రకాశమానమైన స్త్రీ సౌందర్యానికి ఆదాము ముగ్దుడై మారు మాట్లాడక ఫలభక్షణ చేటు జరిగిస్తున్నది.                  ఈ విధంగా సర్పం నుండి స్త్రీలో ప్రవేశించిన అపవాది స్త్రీ ఇచ్చిన నిషేధఫలములను భుజించుటను బట్టి ఆదాము హృదయంలో స్థానాన్ని సంపాయించుకోబట్టి ఆదాము కూడా మారు మాట్లాడక ఫలభక్షణం చేసినట్లు ప్రియపాఠకులారా!  ఈ యొక్క అపవాది జరిగించిన త్రివిద క్రియను బట్టి ఏదేను వనంలోనే అపవాదికి మూడు నామాలు కలిగియున్నవి.  ఇవి పాఠకులకు ఆశ్చర్యం కల్గించవచ్చును.  ఆ పేర్లను గూర్చి తెలిసికొందము.  అపవాది  మొట్టమొదటిగ సర్పంలో ప్రవేశించుటను బట్టి ఆది ఘటసర్పము అను పేరు కల్గింది.  స్త్రీలో జరిగించిన క్రియను బట్టి అబద్దమునకు జనకుడు, పురుషుడు చేసినదైవ ఆజ్ఞాతి క్రియను బట్టి పాప పురుషుడు. ఈ త్రివిధ కార్యమును బట్టి అపవాదికి సంబంధించిన నామము దేవుని యొక్క ధర్మమునకు ఇతడు విరోధి అనగా ధర్మవిరోధి అను బిరుదు ఏర్పడింది.  ఇక్కడనుండి అనగా ఆదికాండం 3:లో అపవాది తాను జరిగించిన శోధన కార్యం ద్వారాపాపప్రవేశం చేసిన లగాయతు జరిగించిన ఘోరమైనట్టి అధర్మ కార్యములు వరుసగ తెలిసికొందము.  ఆది 4:లో ఆదాము హవ్వల తొలిగర్భఫలమైన కయీనులో ఆవేశించి, తొలినరహత్యకు ప్రారంభోత్సవం అనగా కయీను హేబేలును హత్యచేయుట, దేవుని చేత శపింపజేయుట, కయీనును దేశద్రిమ్మరిగా జేయుట, సాతాను కయీను చేత చేయించిన తొలి హత్యక్రియ.  ఇక తర్వాత కామేచ్ఛలతో నరుడు దైవత్వాన్ని వ్యతిరేకించుటను గూర్చి ఆది 6:లో చదువుచున్నట్టయితే నరుల కుమార్తెలు అందంగా ఉండుట చూచి దేవునికుమారులు కామేచ్ఛలతో కూడిన శోదన కార్యము జరిగించారు.  దీని మూలంగా యావద్‌ నరకోటిని అపవాది ఆత్మీయంగా చెడగొట్టి శారీరంగా అపవిత్రత కల్గించాడు.  దైవత్వమునకు నరులపై ఉగ్రత పుట్టించాడు.  దీనిఫలితం జలప్రళయ మారణ హోమమునకు ప్రణాళిక రూపించాడు.  ఈ ప్రణాళికను అమలు జరుపు సందర్భములో దైవపరిశోధనలో నాటి నరకోటిలో దైవ దృష్టిలో నిలిచిన ఒక కుటుంబములో నోవహు అతని కుటుంబీకులు జలప్రళయ నాశనానంతరము భూమి మీద దేవుడు నీతిని స్థాపించాలని తానెన్నుకొన్న నోవహుకుటుంబము ద్వారా పునఃనిర్మాణ క్రియను జరిగించాడు.  ఈ పునఃసృష్టి నిర్మాణంలో దేవుడు ఏ నీతిమంతుడైతే దేవుడు లోకంలో ఎన్నుకొన్నాడో ఆ నీతిమంతుని నీతిని చెడగొట్టి వానిని త్రాగుబోతుగా చేసి, మొలమీద బట్టలేకుండ వివస్త్రంగా చేశాడు.  

        ప్రియపాఠకులారా!  ఇందును బట్టి అపవాది శోదన ద్వారా తెలిసికొన్న ఫలితాలేమిటంటే మొట్టమొదటిది తిండి ద్వారా చెడగొట్టుట అనగా ఫలభక్షణం ద్వారా నరులను భ్రష్టుపట్టించుట 2వది ఈర్ష్యాద్వేషం ద్వారా హంతకునిగ నరుని మార్చుట 3వది కామేచ్ఛల ద్వారా యావద్‌ నరకోటిని నాశనానికి నడుపుట 4వది త్రాగుడు ద్వారా నరజీవితాన్ని దైవ పధంనుండి వ్యతిరేకునిగా చేయుట 5వది మాంసాహారం మీద మమకారాన్ని ఆసరాగా అడ్డుపెట్టి అనగాయాకోబుతండ్రియైన ఇస్సాకును మాంసాపేక్షునిగా ఇస్సాకునుచేసి, అతను ముదిమివల్ల కనుచూపు కోల్పోయి యుండగా-యాకోబు తల్లియైన రిబ్కాను యాకోబును ఇరువురిని అపవాది ప్రలోభపెట్టి జ్యేష్టునికి చెందవలసిన ఆశీర్వాదములను 2వ కుమారుడైన యాకోబుకు అనుగ్రహించుటకు అపవాది వాడినట్టి ఉపకరణాలు యాకోబు తల్లియైన రిబ్కా తండ్రి యొక్క దీవెనలు తన రెండవ కుమారుడైన యాకోబుకు కలగాలని కపటోపాయంతో అనగా అపవాది యొక్క కుతంత్రంతో మేక మాంసంతో వంటకము మేక చర్మములతో తోలును అలంకరించి, ఏశావు వేటనుండి వచ్చు సరికి రిబ్కా ద్వారా అపవాది ఇస్సాకు యొక్క రెండవ కుమారునికి తండ్రి యొక్క దీవెనలను అనుగ్రహింపజేయుటన్నది ఇదికుతంత్రంతో కూడిన కార్యము.  ఆలాగే ఈ సంఘటనకు పూర్వము ఒకానొక దినమున ఏశావు వేటకు వెళ్ళి అలసి వచ్చిన వాడై యాకోబు యొక్క శాకాహార వంటకమునకు ఆకర్షితుడై ఒక్కపూట కూటికోసము తన సోదరుడైన యాకోబుకు తన జ్యేష్టత్వం అమ్ముకొనుటన్న శోధనకు గురిజేశాడంటే అపవాది తిండి ద్వారా కల్గించిన క్రియ.  

        అలాగే ఇశ్రాయేలు అను దైవజనాంగముపై అపవాది జరిగించిన శోదన కార్యాలలో వారు తమ దేవుడైన ప్రభువు మీద, తమకు నాయకుడైన మోషే మీద అనేకమార్లు సణుగుకొన్నట్లు గా మాసంమును గూర్చి దైవత్వం చేత శిక్షింపబడినట్లు మనకు వేదరీత్యా తెలిసిన విషయమే.  దేవుడు ఎన్ని అద్భుత కార్యాలను ఆయన జనాంగమైన ఇశ్రాయేలులకు జరిగించి యుండగా అట్టి ఆశ్చర్యకర క్రియలనే దేవుని బిడ్డలు అలక్ష్యపెట్టి, దైవత్వం మీద తిరుగుబాటు చేశారంటే, అపవాది యొక్క ఆవేశపూరిత శోదన ఎంత ప్రభావితమైనదో ఎంత శక్తి వంతమైనదో మనము తెలిసికోవలసియున్నది.  ఒక్క మాటలో చెప్పాలంటే దైవ జనాంగంమీదనే అపవాది అధికారమును చెలాయిస్తూ పరిపాలించిన సంఘటనలు కూడా వేదరీత్యా మనకు తెలిసిందే, ఆహాబు చరిత్రలో వివరంగా తెలుస్తున్నది.  ఆహాబు ఇశ్రాయేలుకు రాజై పరిపాలించిన విధానంలో అపవాది యెజెబెలును ఆవరించి, ఆహాబు పరిపాలనలో ప్రతి యొక్కరు విధిగా బయలు వగైరా అన్య దేవతా ఆరాధనలకు రూపములను విగ్రహాలుగ చెక్కి సర్వశక్తిమంతుడును సర్వమునకు ఆదిసంభూతుడును మహిమాప్రభావం గల దేవుని యొక్క బలిపీఠమునకు వ్యతిరేకమైన బలిపీఠములు కట్టించి సతీసమేతంగా ఆహాబు జరిగించిన పాతకక్రియ మన మెరిగిందే.  అంతేగాక యెజెబేలుకు దాసుడైన ఆహాబు దేవుని ప్రవక్తలను చంపించినట్లుగా కూడా రాజుల గ్రంధములో మనము చదువగలము.                ఇక సంసోను విషయంలో సంసోను దేవునికి నాజరు చేయబడిన వాడై తలమీద మంగలి కత్తిగాని మధ్యపానంగాని స్త్రీ సాంగత్యం గాని, అపవిత్రమైన వాటిని తినుట గాని ఆచరించుటగాని కూడదు.  అన్న కఠోరనియమమునుదేవుడు సంసోను జీవితంలో విధించియుండగా అందుకు యవ్వనుడైన సంసోను ఇందుకు పూర్తిగా వ్యతిరేకియై, దేవుడు ఏదియైతే చేయకూడదని శాసించాడో వాటిని పిశాచ ఆవేశంతో బహుఖచ్చితంగా పాటిస్తూ స్త్రీ సాంగత్యము మద్యపానము అపవిత్రమైనటువంటి విధులను పాటిస్తూ సృష్టికర్తయైన దేవుడు తనకనుగ్రహించిన ఏడు జడల మర్మమును వేశ్యకు వివరించి, క్షురకర్మ చేయబడినవాడై-ఇశ్రాయేలు పక్షంగా న్యాయాధిపతిగా వుండి దేవుని జనాంగముతో న్యాయపోరాటం సాగించవలసిన దైవ ప్రతిష్టితుడైన సంసోను దైవత్వమునకు పూర్తిగా వ్యతిరేకించి జరిగించిన కార్యములను బట్టి అపవాది అతనిని, స్త్రీలోలునిగాను విశేషమైనట్టి వ్యభిచారిగాను జేసి తన శోధన కార్యంలో బలంగా వాడి అతన్ని దైవోగ్రతకు గురిజేసి, అప్పుడప్పుడు సంసోనును ఆవరిస్తున్న దైవాత్మనుండి సంసోనును వేరుపరచి, అతన్ని సామాన్య మానవునిగాను అంధునిగాను చేసి చెరలో వుంచి అన్యదేవతయైన దాగోను ఆలయంలో బందీ గృహంలో ఇత్తడి సంకెళ్ళతో బంధించబడి తిరుగలి విసరే హీనస్థితికి సంసోనుజీవితాన్ని దిగజార్చినాడంటే ప్రియపాఠకులారా!  దైవ ప్రతిష్టత గల్గిన వాని మీదనే సాతాను బలమైన శోదన కార్యం జరిగించి భ్రష్టుపట్టించేడంటే సామాన్య నరుడైతే ఆగ గలడా? గాడిదలను కాచుకొనే సౌలును దేవుడు మొట్టమొదటి ఇశ్రాయేలు రాజుగా వానిని ప్రతిష్టించి అభిషేకించి ఇశ్రాయేలు సింహాసనము మీద కూర్చుండబెట్టి సకల విధమైన ఆధిక్యలతో తన జనాంగాన్ని ఏలమన్నాడు.  సింహాసనమును ఎక్కినంతవరకే దైవభక్తి దైవ విధేయత కల్గియున్నాడు. సింహాసనం ఎక్కిన తర్వాత సౌలులో కల్గిన మార్పు సమూయేలు గ్రంధంలో మనము చదువగలము.  యెహోవా వద్దనుండి దురాత్మ సౌలును ఆవరింపగా అతడు బాలుడైన దావీదును సంహరించుటకు ఈటె ఎత్తుకొని వెంటాడినట్లు వేదములో 1 సమూ 18:10లో చదువగలము.  ఇది దైవ ప్రతిష్టితుని మీద సాతాను జరిగించే హత్యాకాండను సూచిస్తున్నది.  ప్రియపాఠకులారా!  ఇపుడు ఇంతవరకు వ్రాయబడిన వేదవచనాలు వరుసగ తెలిసికొన్నాము.  ఇక ఈ విధంగా పాతనిబంధన కాలంలో దేవుడు ఎన్నిక చేసి ప్రతిష్టించిన వారిని సాతాను అపవాది శోధించిన  విధానము తెలిసికొనియున్నాము.

        ఇక నూతన నిబంధనలో యేసు క్రీస్తు విషయంలో ఆయన యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిస్మము పొంది నదియొడ్డునకు వచ్చినపుడు పరిశుద్ధాత్మ పావుర రూపములో ఆయనపై వ్రాలినట్లును మత్త 4:1-2లో వ్రాయబడినట్టి లేఖన భాగంలో పరిశుద్ధాత్మ నలుబదిదినములు యేసుప్రభువును అరణ్యంలో ఉపవాస దీక్షతో త్రిప్పి ఆయన ఆకలిగొనగా శోధింపబడుటకు అపవాదికి అప్పగించెను.  ఆయన శోధింపబడుచుండగా'' అని వ్రాయబడియున్నది.

        ప్రియపాఠకులారా!  దైవ ప్రతిరూపము దైవ కుమారుడు దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఇన్ని విధములైన ఆధిక్యతలు ఉన్నత విలువలు గల్గిన దైవ కుమారుడు ఆత్మ చేత సిద్దపరచబడి నిర్జన ప్రదేశ అరణ్యంలో నడిపించబడినట్లు అపవాది చేత ఆయన శోధింపబడినట్లు వ్రాయబడుటలో అపవాదికున్నట్టి బలము జ్ఞానము శక్తి సామర్ధ్యమును గూర్చి ఆలోచించవలసియున్నది.  దైవ కుమారుడు అపవాది చేత శోధింపబడిన విధానమెట్లనగా ఆయన నలుబది దినములు ఉపవాస అనంతరము ఆయన ఆచరించిన నియమమును గూర్చి మత్త 4: 1-4లో వివరించిన విధానమును గూర్చి తెలిసికొందము.  యేసు అపవాది చేత శోధింపబడుటకు పరిశుద్దాత్మ వలన అరణ్యమునకు కొనిపోబడి నలుబది దినముల ఉపవాస దీక్ష తీరిన తర్వాత ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాటవలనను జీవించును'', అని బదులిచ్చుటలో ఈ వేదభాగములో మనము చదువగలము.                

        ప్రియపాఠకులారా!  ఈ దినములలో పుట్టుక క్రైస్తవులమని సత్‌ క్రైస్తవులమని పరిశుద్ధాత్మ వరమును పొందిన వారమని, పరిశుద్దాత్మను ధరించుకొన్న వారమని ఆత్మను కల్గియున్న వారమని దర్శనములతో ప్రతినిత్యము ప్రభువును చూస్తున్నామని, ప్రతి విషయంలో ప్రభువు దర్శన మిచ్చి మాతో మాట్లాడుచున్నాడని బాహాటంగా చెప్పుకొను వారి విషయమును గూర్చి మనము ఆలోచిస్తే, దైవకుమారుని సాక్షాత్తు దేవుని పట్టి శోధించిన అపవాది ఇట్టివారిని శోధించుటకు అశక్తుడని అన్న ప్రశ్న మనకు కలుగక మానదు.

        ప్రియపాఠకులారా!  అపవాది యొక్క శోదన కార్యమును జయించిన వాడొక్క యేసుక్రీసై  ఆయన దైవత్వంలో ఒక శక్తియు ఆత్మయు మహిమయైయుండబట్టి శోదనను జయించగల్గినాడు.  నరమాత్రుడు శోదకుని యొక్క శోదన కార్యమును జయించుటకు అశక్తుడని ఇందును బట్టి తెలిసికోవలసియున్నది.  దేవుని యొక్క అనుమతిని పొంది, యోబును శోధించిన అపవాది యోబు యొక్క చలించని విశ్వాసం యోబుకున్న దేవుని యొక్క శక్తి ప్రభావమును బట్టి యోబును అపవాది శారీర రీత్యాను ఆత్మీయంగాను కుటుంబరీత్యాను, లోకంలో తనకు కల్గిన సంపద రీత్యా జరిగించిన తీవ్రమైన శోదనను ఎదుర్కొనుటలో, యోబు పొందిన శ్రమలు లోకంలో ఏ నరుడు పొందలేదని, పొందనేరడన్న సత్యాన్ని మనం ఒప్పుకోవాలి.  ఇట్లుండగా నేటి క్రైస్తవ విశ్వాసులైన సోదరులు చాలామంది సహజ ధోరణిలో సాతాను చేయు క్రియను తీసిపారేస్తారు.  వాస్తవమునకు ప్రియపాఠకులారా!  యేసుప్రభువుతో అపవాదిమాట్లాడిన మాట లూకా 4: 5-7 అప్పుడు అపవాది ఆయనను తీసికొనిపోయి, భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి-ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అవి నాకు అప్పగించబడియున్నవి.  అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా ఇదంతయునీదగునని ఆయనతో చెప్పెను''.

        ప్రియపాఠకులారా!  పాతనిబంధనకాలంలోను నూతన నిబంధన కాలంలోను అపవాది యొక్క శోదన కార్యాలకు ఆటంకములు ఇబ్బందులు కల్గింయుండవచ్చునేమోగాని, నేడు విస్తరించియున్న క్రైస్తవ్యములో అన్యులకంటే క్రైస్తవులనే ఈ అపవాది బహుముఖ వ్యాప్తంగా తన శోదన కార్యాలను సునాయాసంగా జరిగిస్తూ నానావిధ ఆశలు భోగభాగ్యాలను సమకూరుస్తూ-క్రీస్తును క్రైస్తవ సిద్దాంతాన్ని క్రీస్తు నెరవేర్చమన్న ఒకే ఒకమాట''నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము'', అన్న ఈ మాటను క్రైస్తవులు పూర్తిగా మరిచిపోయే స్థితిలో దిగజార్చి అపవాది తన శోధన కార్యమును జరిగిస్తున్నాడంటే, క్రైస్తవ్యంలో ఉన్న బలహీనతయే కారణము.  అపవాది యొక్క శోధన క్రైస్తవ విశ్వాసి యొక్క హృదయబలహీనత మనోనేత్ర అంధత్వము ధనాశ నేత్రాశ వ్యామోహము వీటితో సమన్వయ పరచి అపవాది జరిగిస్తున్న శోదనలో అనేకులు చరిత్రహీనులె,ౖ తుదకు వారి యొక్క స్వకీయుల ద్వారాను కిరాతకులుగ నికృష్ట జీవులుగ బిరుదులు పొంది, కాలగతులలో కలిసిపోయిన నేటి క్రైస్తవ్యములో అపవాది శోదనకు లోనైన ఎందరో మహాను భావులను గూర్చి తెలిసికొనియున్నాము.  క్రైస్తవ సంఘాలలో అపవాది జరిగించు ప్రధానమైన శోధన కార్యము సంఘమును చీల్చుట, అసమాధానమైన ఆరాధనను జరిగించుట, క్రైస్తవ మందిరాలను రాజకీయ వేదికలుగా మార్చుట పదవీ వ్యామోహము అందును బట్టి తమ స్వార్థమునకు క్రైస్తవ విశ్వాసులను విభజించి తమ కంటూ ఒక గుంపును ఏర్పరచుకొని, ఆ విధంగా చీల్చబడిన నికృష్టమైన గుంపును పరిశుద్ధ సంఘంగా ప్రకటించుచు, దైవత్వమునకు నికృష్ట కార్యమని తెలిసికూడా అపవాదితో చేతులు కలిపి చేస్తే ఆ పరిచర్య ఇది నిజంగా క్రీస్తు యొక్క సువార్త సేవా? లేక అంత్యక్రీస్తు యొక్క పరిచర్యయా? ఇది ఏ పరిచర్య? ఇందును గూర్చి 2వ ధేస్స 2:4లో వ్రాయబడిన వేదభాగాలలోని'' ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దాని నంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనబరచుకొంటూ దేవుని ఆలయములో కూర్చుండును''. 2:7-8లో ధర్మ విరోధసంబంధమైన మర్మము ఇప్పటికే క్రియజరిగించుచున్నది గాని, ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడువరకే అడ్డగించును.  ఇప్పుడా ధర్మవిరోధి బయలు పరచబడును.

        ప్రియపాఠకులారా!  ఇవన్నియును కూడా అంత్యక్రీస్తు యొక్క ఆత్మ ప్రవేశమునకు క్రైస్తవ మందిరాలలో విశ్వాసుల యొక్క బలహీనతల ద్వారా అనగా క్రైస్తవ సంఘాలలో ఉన్న పై విధమైన స్వార్థపూరితమైన హృదయ స్థితివున్న నామక్రైస్తవ అనగా అల్పవిశ్వాసులైన క్రైస్తవ సమాజమును బట్టి బలి పీఠం మీదకే ఎలాంటి ఆటంకములు లేకుండ, నిర్భయంగా కూర్చుండి ప్రభుత్వం చేసే దినాలు ఇపుడు వచ్చియున్నవి.  అందుకే పై వేద వాక్యంలో 2:7లో ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియజేయుచున్నది'', అన్న వాక్య నెరవేర్పు జరుగుచున్నది.

        ప్రియపాఠకులారా!  నేటిక్రైస్తవ నరకోటిలో దేవుని బిడ్డలు అని చెప్పుకొంటూ ఆత్మసంబంధులము ఆత్మావేశులము అని చెప్పుకొంటూ లోకసంబంధ న్యాయస్థానాలలో వ్యాజ్యమాడుచు, తమ పదవుల కోసము తమ హక్కుల కోసము నానా విధ నిరాధారమైన అభియోగాలు చేయుచు, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆయన కుమారుడు మనరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామాన్ని దూషణపాలు జేస్తుండుట మన మెరిగిన విషయములే. ఈవిధంగా క్రియజరిగిస్తున్న క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులను గూర్చి 2వ తిమోతి 3: 2-8లో వ్రాయబడిన వేదభాగంలో వరసగా ఇట్టి వారిని గూర్చి ఈ విధంగా వ్రాయబడియున్నది.  ఎలాగంటే మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకము లాడువారు అహంకారులు దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగ రహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు కౄరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాందులు, దేవుని కంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు.  పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునైయుందురు. ఇట్టి వారికి విముఖుడువై యుండుము.  పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి, ఎల్లప్పుడు నేర్చుకొనుచున్నను సత్యవిషయమైన అనుభవమును ఎప్పుడును పొందలేని, అవివేక స్త్రీల యొక్క ఇండ్లలోచొచ్చి , వారిని చెరపట్టుకొని పోవువారు, వీరిలో చేరిన వారు.  యన్నే, యంబ్రే అను వారు మోషేను ఎదిరించి నట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరిస్తారని వ్రాయబడిన ప్రకారము ఇపుడు మందిరాలలో శారీర ఆత్మీయ స్థితులు వీటిననుసరించి జరుగుచున్నాయని మనము ఎరుగవలసియున్నది.

        కనుక ప్రియపాఠకులారా!  ఇంత గొప్ప మర్మమును పరిశుద్ధగ్రంధము మనకు విశదపరచియుండగా లూసిఫర్‌ అను శాపగ్రస్తమైన దేవదూత యొక్క అలౌకిక దైవ వ్యతిరేక లోకసంబంధమైన కుయుక్తుల చేత నయవంచకమైనటువంటి గుణాతిశయముల చేతను ఉగ్రత ద్వేషము అసూయ కపటము కుత్సితము స్వార్థము పైశాచికము వగైరా వికృతగుణములతో నరుని యొక్క హృదయ స్థితిని మార్చి అపవాదిగా వేరొక నామముతో విజృంభించి లోగడ మనము తెలిసికొన్న విధంగా నానా విధ నామధేయాలతో పరిశుద్ధగ్రంధంలో పిలువబడినను క్రైస్తవేతరులైన అనగా అన్యులైన వారి సాహిత్యాలలో ఇతను కోటాను కోట్ల నామధేయాలతో స్త్రీపురుష జంతు మృగపక్షి వృక్ష, పంచభూతముల నామధేయాలతో తనను ప్రత్యక్షంగా నరులు ఆరాధించుటకు , నరులు ఎల్లప్పుడు ఉండునట్లు వారి యొక్క ఉద్దేశ్యాలను వారి తలంపులను మార్చి, తన రూపమును దేవుని వలె తాను కూడా ఖరారైన రూపము లేని వాడైనప్పటికిని, ప్రత్యక్షమైన రూపము లేకపోయినను, నరులఅజ్ఞానమును ఆసరాగా చేసుకొని వారిఇష్టానుసారంగా తన రూపమును ఏర్పరచుకొని, వారు సత్యదేవుని వైపు మరల కుండ, అన్ని వేళల తన వైపు ఆకర్షించుకొని, తన రూపమును శ్లోకాలతో దండకాలతో మంత్రాలతో ఉచ్చరించుచు, జపతపాలు ఆచరించునట్లుగా అపవాది నేడు లోకములో నెలకొల్పియున్నటువంటి రూపాలు ఇందుకు ఋజువులైయున్నవి.

        ప్రియపాఠకులారా!  పాతనిబంధనకాలములో అనగా లోకము పుట్టిన తొలి దశలో దేవుడు ఒక్కడే, ఆలాగే లోకములో రూపించిన నరుడు కూడా ఒక్కడే, దేవుడు మొట్టమొదటగా భూమిమీద వేసిన తోట కూడా ఒక్కటే.  దేవునితో నరుడు చేసిన సావాసం కూడా ఒక్కటే, నరుని ప్రక్కటెముకనుండి తీయబడిన నారి కూడా ఒక్కటే, వీరిద్దరును దైవత్వంతో చేసిన సావాసము కూడా ఒక్కటే, ఈ విధంగా ఒకే తోటలో ఏక దేవునితో ఏకత్వంలో నరనారులు కలిసి సావాసంలో జీవిస్తుండగా ఈ సావాసము యొక్క భవిస్యత్తు కలుగబోవు ఆదిక్యతలను గూర్చి దేవుడు నానా విధ ప్రణాళికలు రూపించు సమయంలో అపవాది దైవ ప్రణాళికను నరుని యొక్క నాటి దైవసావాసము యొక్క ఉన్నత విలువలకును దేవునికి నరునికి మద్యవున్న ఆత్మీయ అనుబంధానికి, అడ్డుబండగా తగిలి, అపవాదికి రూపములేదుగనుక, తన కంటూ ఒక రూపాన్ని ఆ తోటలో గల యుక్తిగల సర్పమును ఆసరాగా చేసికొని, దానిని ఆవేశించి పలికిన మాటలు జరిగించిన, నిషేధఫలభక్షణ తద్వారా నరజీవితములో ప్రవేశించిన దైన అజ్ఞాతిక్రమమను క్రియ జరిగించి, దేవుడు నిషేధించిన ఫలభక్షణం ద్వారా దేవునికి నరునికి ఉన్న ఆత్మీయ సన్నిహిత బంధాలు విడగొట్టి, దేవుని పోలిక దేవుని స్వరూపమైయున్న నరజంటను వారి యొక్క రూపాలను మార్చి సర్పమును విడిచి నరులలో ప్రవేశించుటకు తన మార్గమునుసుగమము చేసుకొన్నట్లుగా వేదరీత్యా ఎరిగిన విషయము.  మొట్టమొదటగానే సాతాను నరులలో ప్రవేశించుటకు అవకాశాలు లేవు.  ఎందుకంటే దేవుని పోలిక దైవ స్వరూపమైయుండుటను బట్టి నరులలో అపవాది ప్రవేశించుటకు అవకాశం లేదు.  అందుకని అడ్డదారులలో యుక్తిగల సర్పంలో ప్రవేశించి సర్పం ద్వారా నారీగర్భంలో ప్రవేశించాడు.  సర్పం నుండి నిషేధఫలంలో ప్రవేశించి-ఆ విధంగా ప్రవేశించినట్టి అపవాది యొక్క ఆత్మ ఫలభక్షణం ద్వారా స్త్రీలోను, స్త్రీ తన భర్తకు ఇచ్చిన ఫలముల ద్వారా పురుషునిలోను ఈ విధంగా ఉభయులలో ప్రవేశించి వారిని శాపగ్రస్థులుగా చేసినందువల్ల వారి యొక్క శారీర కలయిక ద్వారా ప్రధమఫలంగా జన్మించిన కయీనును తన సంతానంగా చేసికొన్నట్లును, ఆ విధంగా అపవాది-పాపము ద్వారా ఫలించిన ఆది నారి గర్భం నుండి ఫలించిన ప్రధమ సంతానమే కయీను.  భూమి మీద సాతాను యొక్క ప్రధమ ఫలంకూడా కయీనే, అపవాదియని పిలువబడే లూసిఫర్‌ ఏ విధంగా అనేకమంది దూతలను తన యొక్క ఆధీనంలో ఉంచుకొన్నాడో అలాగే కయీను ద్వారా అపవాది ఆది 6:లో కయీను సంతానమును తన కుమార్తెలు గాను అనగా ఆదాము సంతానమును దైవకుమారులుగాచేసి, ఆదాము దంపతులను ఏ విధంగా శాపగ్రస్థులుగా చేసాడో, అట్లే ఆదాము యొక్క సంతానమును దైవకుమారులను నీతికి పరిశుద్ధతకు స్థానం లేకుండ చేసి విస్తారమైన పాపాన్ని ప్రబలించాడు. దీనివల్ల దేవునికి స్థానం లేకుండ పోయింది, పాపం విస్తరించింది.  ఇందును బట్టి దేవుడు నరులను సృష్టించినందుకు సంతాపపడి తన హృదయంలో నొచ్చుకొన్నట్లు వేదములో ఆది 6:6లో చదువగలము.  అయితే నాటి జన సందోహములో దేవుని యందు భయభక్తులు గల్గి వివేకం కల్గిన ఒక్క నీతిమంతుని కుటుంబము దైవదృక్పధంలో ఎన్నికైంది.  ఆ విధంగా ఎన్నిక చేయబడిన వాడే నోవహు అతని కుటుంబము.  దేవుడు లోకాన్ని విశాల దృక్పధంలో పరిశీలింపగా శారీరంగా ఆత్మీయంగా పూర్తిగా చెడియుండుట చూచినపుడు దేవుడే - నరులను నరులతో కూడా భూమిపైనున్న సృష్టములను సర్వమును తుడిచివేయుటకు ప్రణాళికను రూపించి, నాటి కాలంలో తానెన్నుకొన్న నోవహు అను నీతిమంతునితో మాట్లాడిన మాట ఆదికాండ ఆరు ఏడు అధ్యాయాలలో మనము చదువగలము.  ఆ విధంగా ఎన్నికైనట్టి నీతిమంతుని దేవుడు హెచ్చరిస్తూ తాను జరిగించబోవు జలప్రళయ మారణ హోమం నుండి తప్పించబడుటకు కావలసిన రక్షణ. ఆ రక్షణార్థసాదనమైన ఓడను గూర్చి దాని యొక్క నిర్మాణమును అనగా ఎత్తుపొడుగు వగైరా కొలతలు దాని నిర్మాణ వివరము దానినమూనావగైరా వేదములో చదువగలము.                ప్రియపాఠకులారా!   ఈ విధంగా ప్రధమ సృష్టి వినాశనానికి అపవాదియే కారకుడని ఇందును బట్టి తెలుస్తున్నది.  ఈ విధంగా ప్రారంభమైన దైవత్వమునకును పైశాచికమునకును జరుగుచున్న పోరాటము సమసిపోలేదు.  జలప్రళయ వినాశ అనంతరము దేవుడు పునఃసృష్టి నిర్మాణమును జరిగించిన తర్వాత కూడాను సాతాను తన యొక్క శోదన కార్యమును వదలిపెట్టలేదు.  ఇక్కడనుండి బహురీతులుగాదేవునికి సాతానుకు కూడా పోరాటం జరుగుచుండగా దేవునితో అపవాది పోరాడుటకు-నరులు అపవాదికి సాధనములయ్యారు. నరులను ఆసరాగా చేసుకొని అపవాది దేవునితో జరిగించే పోరాటంలో అపవాది సంబంధులు ఎక్కువైపోయారు,  కాని దైవసంబంధీకులు అరుదైపోయారు.  అందుకే కీర్తన 14 మరియు 53 లోను ''వివేకము కల్గి దేవుని వెదకు వారు కలరేమోయని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించినను, ఆయనదృష్టిలో ఒక్కడు కూడా నీతిమంతునిగా కనబడకపోవుటన్నది శోచనీయమైన విషయము.  నేటి లోకంలో ప్రభువు రాకడ సమీపమై యున్న ఈ కాలంలో అపవాది యొక్క పరిపాలనన్నది బహుముఖంగా వ్యాపించి తీవ్రతరంగా మహారౌద్రంతో సామదాన భేదదండోపాయాలు ప్రయోగించి జరిగిస్తున్న ఈ పోరాటం చాలా చిత్రవిచిత్రాలుగా ఉన్నది. క్రైస్తవ విశ్వాసుల ఆత్మీయతను పాడుచేయుటకు అపవాది ఏర్పరచుకొనిరూపించుకొన్న ప్రణాళిక చాలాకుయుక్తితోను మోసంతోను నయవంచకంతోను ప్రమాదకరమైన రీతిలో ఉన్నట్లు ఈ క్రింది ఉదాహరణల బట్టి మనకు తెలుస్తున్నది.  ఇందులో ప్రధమమైనది దైవత్వాన్ని మోసగించుట అనగా సత్యదేవుని ఎరిగి ఆయన సంబంధులమని చెప్పుకొంటూ-ఆయన భక్తిగలవారముగ నటిస్తూ లోకప్రభుత్వ పరమైన రాయితీలు పొందుటకు బాహాటంగా ప్రభుత్వం ఎదుట తాము క్రైస్తవులము కామని అనుటయే, నోటితోనే గాకుండా లిఖితపూర్వకంగా అనగా రాత ద్వారా ప్రభుత్వానికి తెలుపుటలో క్రైస్తవ విశ్వాసము నరులలో ఏ మోతాదులో ఉన్నదో చదువరులే ఊహించండి.  వివాహసందర్భంలో సామాన్యుడు భరించలేనట్టి వరకట్నాలు బంగారు వెండి ఆభరణాలు ఇల్లు స్థలము పొలము ఇవి కోరుట, రాజ్యపరిపాలన చేయాలన్న కాంక్షతో కక్షపద్ధతిలో ఎన్నికలో విజయం సాధించుటకు ప్రయత్నించుట, ధనాశ నేత్రాశ ఉన్నత పదవులు, అన్నిటికంటె మరీ ఘోరము అక్రమార్జన, ఎదుటి వానిని హతమార్చియైనను వాని సంపదను ఆర్జించాలి.  స్త్రీ వ్యామోహము వగైరా గుణాతిశయముల మూలంగా దేవుడు లేడు క్రీస్తు లేడు పరిశుద్ధాత్ముడు లేడు, అంతయు మానవకల్పితమన్న స్థితికి నరులను దిగజార్చుట. ఇది అపవాది ప్రణాళికలోని ముఖ్యాంశాలు, అంతేగాకుండ ఒక నరుడు తాను ఆర్జించిన ధనాన్ని ఖర్చుపెట్టనీయక ధనాన్ని బ్యాంకులో నిల్వచేయుట - ఇట్టి క్రియల ద్వారా దేవుని ఉగ్రత ద్వారా సంక్రమించిన రోగాలు కూడా నరులను ఖాతరు చేయనీయక అపవాది బహుకఠిన వైఖరిలో క్రియజరిగిస్తున్నాడు.  ఈ రోగాలు దేవుడు విధించిన శిక్ష అనే జ్ఞానమును తలంపును కూడా అపవాది నరులలో లేకుండ చేస్తున్నాడు.

        ప్రియపాఠకులారా!  దైవ గ్రంధములో పాపానికి వచ్చు జీవితము మరణమైతే, అపవాది యొక్క సిద్ధాంతము ఇందుకు భిన్నంగా ఉంది.  ఏమంటే పాపం వలన వచ్చేది రక్షణ అంటాడు.  పాపి కొరకే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.  పాపికి దైవ దర్శనము కలదు.  క్రైస్తవ వేదమైన బైబిలు లోనే కొన్ని సంఘటనలను చూపుచు-''రాళ్ళ దెబ్బలనుండి వ్యభిచార స్త్రీని కాపాడలేదా? వివాహంలేకుండా ఆరుగురు భర్తలతో సంసారం చేసిన స్త్రీని ప్రభువు జ్ఞానవంతురాలుగా చేయలేదా? క్రైస్తవ సంఘాలను పాడు చేసిన సౌలును అపొస్తలుడైన పౌలుగా మార్చలేదా? ఊదారంగు పొడిని అమ్ముచు దేవుడంటే ఎవరో తెలియని తుయతైర పట్టణస్థురాలైన లూదియా హృదయాన్ని దేవుడు తెరవలేదా? కనుక ఇందును బట్టిమనము తెలిసికొన్నదేమిటి? మొదటి ఆదాము ద్వారా లోకంలో అపవాది ప్రవేశించి లోకాన్నినానా విధమైన విశేషమైన భ్రష్టత్వము పాపము ప్రబలించి నరునికి దైవత్వమునకు మధ్య పటిష్టమైన పాపపు గోడను తెరగాచేసి ప్రతి నిత్యము దైవ సృష్టములైన నరులు దేవునిపై తమ క్రియల ద్వారా తమస్వార్ధ అహంభావములను బట్టి తిరుగుబాటు చేసే విధంగా క్రియలు కలిగి అపవాది విజృంభించినట్లును, వాడి ఆటను కట్టించుటకు దేవుడు నారీ గర్భంనుండి రూపించి లోకానికి పంపి ఇట్టి సందర్భంలో లూకా 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు ఈ లోకానికి వచ్చెనన్న ప్రవచనాన్ని స్థిరపరచినట్లు మనం తెలుసుకోవాలి.

        ఈ విధంగా నూతన నిబంధనకాలంలో క్రియజరిగించిన ప్రభువుతో సహితం ఈ అపవాది తన క్రియల ద్వారా పోట్లాడిన విధానము మనకు తెలిసిందే, దేవుని యొక్క రక్షణాయుతమైన ప్రణాళిక క్రియావిధానంలో భూమి మీద నేటికిని ఎంత ప్రభావితంగా క్రియజరిగిస్తున్నదో అందుకు సమకాలికంగా ఈ లోకాంత్య దినాలలో బహుముఖంగా క్రియజరిగిస్తున్నది.  ఇట్టి స్థితిలో సత్‌ క్రైస్తవుని హెచ్చరిస్త్తున్న జీవితాన్ని జీవించాలని అనుకుంటున్న మనకు ప్రభువు యొక్క ప్రవచన హెచ్చరిక 1 పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి.  మీ విరోధియైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగు చున్నాడు.  కనుక లోకం యొక్క అంతము అపవాది క్రియలకు అంతము.  ఒక్కమాటలో చెప్పాలంటే అపవాది యొక్క పరిపాలనకే అంతము సమీపించి యుండగా మనమింకను వాని ఆశలతో జీవించుటన్నది వ్యర్థమని ప్రమాదకరమని ఎరిగి మెలకువకలిగి సిద్దపాటు కల్గి, ఆత్మ పూర్ణులమై ప్రభువు బిడ్డలుగా ప్రభువు రాకడ కొరకు సిద్దపడిన వారమై నిరీక్షణ కల్గి జీవించెదము గాక!

                                        అంశముఃఅపవాది

        అపవాది పురుషుడా!స్త్రీయా?

        ప్రియశ్రోతలారా! సృష్టిలో దేవుడు పక్షపాతము లేక ప్రతిజీవిలోను ప్రతి వృక్షరాజములోను ఆడమగా అని రెండు జాతులను సృజించినట్లు తెలియుచున్నది.  దేవుడైతే పురుషుడే! ఎందుకనగా మొట్టమొదటగా పురుషుని జేశాడు.  మరియొక నిదర్శన మేమిటంటే ఒక విశ్వాసికి అభయమిస్తూ-భయపడకుము-నేను నీకు తోడైయున్నాను'' అంటున్నాడు.  23వ కీర్తనలో దావీదు ''నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్నాధరించును'', అనుటలో దుడ్డుకఱ్ఱ దండము స్త్రీ దగ్గర వుంటుందా? పురుషుని దగ్గర వుంటుందా? ఒక్కసారి మీరు ఆలోచించండి.  దుడ్డుకఱ్ఱ పురుషుని దగ్గర వుంటుంది.  ఈ మాటను బట్టి దేవుని దుడ్డు కర్ర, దేవుని దండము క్రీస్తని మనము గ్రహించవలెను.  ఎట్లనగా దేవుడు మోసేకు ఒక  కర్రనిచ్చి అతని చేతిలోని కఱ్ఱనుసర్పముగా మార్చి తన మహిమను కనబరచి ఆ కర్ర సర్పము మాత్రమేగాకుండ ఎఱ్ఱ సముద్రాన్ని కూడా దేవుడు పాయలుగా చీల్చి సముద్రమధ్యములో తిన్నని బాటను వేసి మోషేనేగాకుండ మోషే నాయకత్వము వహించియున్న దైవ జనాంగమున కంతను క్షేమకరమైన రాచబాటయైనది.  ఇక అహరోను చేతికఱ్ఱ ఫరో యొక్క సంస్థానములో మంత్రగాళ్ళు శకున గాండ్రు చేసిన మంత్ర సర్పాలను మొత్తాన్ని మ్రింగి ఫరోనే గాకుండ ఫరో సంస్థానములో వున్న సకల ప్రజానీకాన్ని ముగ్దునిగా జేసింది.  మరియు మోషే తన కఱ్ఱతో బండను తాకగా దైవజనాంగము యొక్క దప్పిక తీరునటువంటి జలధార ఆబండ నుండి స్రవించింది.  

        దావీదుకు కూడా గొఱ్ఱెలు కాచెడి సమయములో ఆదరించింది దుడ్డుకఱ్ఱయే ఇందును బట్టి దావీదు తన దైవత్వాన్ని గూర్చి ప్రశంసిస్తూ 23వ కీర్త-''నీదుడ్డుకఱ్ఱ-నీదండము నన్ను ఆదరించునంటున్నాడు.  ఈవిధముగా పాతనిబంధనలోని దైవత్వం చేత ప్రత్యేకించబడిన ప్రతివ్యక్తి కూడా ఆదాము మొదలుకొని పురుషులనే దేవుడు ఎంపిక చేయుటలోను ఆది 1:26లో మన పోలిక మన స్వరూపమున నరులనుచేయుదమనుటలో దేవుని యొక్క మొట్టమొదటి స్వరూపము పురుషుడే.  దానికి నిదర్శనము మొట్టమొదట ఆదినరుడగు ఆదాము యొక్క నిర్మాణము.         

         కనుక పురుషుడైయున్న దేవుడు వివాహితుడుగాడు ఆయన ఏకత్వములో వుండి సృష్టికార్యములో మాత్రము ప్రతిజీవికిని దాంపత్యాన్ని అనుగ్రహించియున్నాడు.  అయితే సృష్టిలో ప్రతి జీవరాశికిని జంటవున్నది.  అందుకే దేవుడు జీవాత్ముడైన నరుని కూడా మొట్టమొదటగా ఒంటరిగానే జేసి వాని జీవిత విధానాన్ని తన సావాసములో మలచుకొని పరిశోధించి నరుడు ఒంటరిగా వుండుట మంచిది కాదని వానికి ఒక జంటఅవసరమని యోచించి సృష్టిలోని జీవరాశి యొక్క ఎముకలో నుండి గాక మాంసములో నుండిగాక ప్రయోగాత్మకంగా నరుని నుండియే మాంసమును ఎముకను తీసిజంటగా నారీ నిర్మాణము గావించాడు.  ఈ విధముగా నరులు దంపతులయ్యారు.  కాని దైవత్వానికి దాంపత్యములేదు.  నరజీవితములో దేవుడు అనుగ్రహించిన దాంపత్యాన్ని బట్టి సృష్టికర్తయైన దేవుడు నరుల యొక్క జంట జీవితమును చూస్తూ ముచ్చట పడినట్లు ఏదేను చరిత్ర వివరిస్తున్నది.

        ఇట్లే సృష్టికి పూర్వము అనగా భూలోకమును సృష్టించక పూర్వము దేవుడు తన రాజ్యములో దేవదూతల చేత వారి యొక్క స్తుతిస్తోత్ర గానములతో ఆనందిస్తూ దూతల పరిచర్యలో తన రాజ్యపరిపాలన కొనసాగించినట్లు యెషయా గ్రంథములో ఈ దూతగణములను గూర్చి వివరిస్తూ కెరూబులు సెరాపులు అతిదూతలు దూతలు ప్రధాన దూతలు కొందరు వైణికులు కొందరు గాయకులు కొందరు పరిచారకులు వగైరా రీతులుగా ఈ దూతగణములు దైవసన్నిధిలో వ్యవహరించినట్లుగా దైవరాజ్య చరిత్ర వివరిస్తున్నది.  ఇందులో ప్రాధాన్యత వహించిన దూతలలో మొట్టమొదటగ వార్తా హరుడు లేక రాయబారపు మధ్యవర్తిత్వము చేయు గాబ్రియేలు.  ఇక దైవపక్షముగా సైన్యములతోను దూతగణముల సమేతముగా అపజయమన్నది లేక దైవశక్తితో విజయాన్ని సాధించేటటువంటి శూరుడు మిఖాయేలు, రఫాయేలు వగైరాలు.

        ఇక దైవత్వమును ఎల్లవేళలు స్తుతిగానములతోను వాయిద్య సంగీతములతోను కమ్మని కంఠస్వరముతో దైవత్వాన్ని తన్మయ పరచేటటువంటి దూత లూసిఫర్‌.  ఇతడు సుందరుడును గొప్ప వైణికుడు సంగీత విద్వాంసుడును పాటగాడునై యున్నట్లు వేద చరిత్రలో చదువగలము.  ఇట్టి వానికి ఒకానొక దినమున దైవిక వ్యతిరేక బీజము తనలోనే-తుపానుకు పూర్వములో సముద్రములో ఏర్పడు అల్పపీడనము వలె అంకురించి అల్పపీడనమెట్లు శక్తివంతమై తుపాను బిందువుగా మారి  సముద్రములో వాయుగుండమును సృష్టించి తుపానుకే విధముగా దోహదకారి యగునో-ఆ విధముగా లూసిఫర్‌లో కూడా ఈ అహంభావము దినదిన ప్రవర్థమానమై దైవ ప్రతికూల వాతావరణము సృష్టించి తన వరకే గాక తనకంటూ ప్రత్యేకంగా తనకు అండగాను సహచరులుగాను అనుచరులుగాను కొంతమంది దేవదూతలను ప్రోగుజేసుకొని, దేవుని సింహాసన మంత ఉన్నత స్థలములో తనకంటూ ఒక సింహాసనాన్ని ఏర్పరచుకొని దేవునివలె తనను కూడా దూతలు ఆరాధించవలెను, దేవునితో సమానంగా తనను తాను హెచ్చించుకోవలెను'', అనిన అహంభావముతో దూతల సమూహములో తుపాను వంటి అల్లకల్లోలమైన విప్లవాత్మకమైన వాతావరణము సృష్టించి, తిరుగుబాటుజేసి దైవత్వాన్ని ఎదుర్కొని దేవుని యొక్క దూతయైన మిఖాయేలు యొక్క ఆయుదశక్తికి ఆగలేక వాని చేత పడద్రోయబడి చీకటిలో బంధించబడినట్లు లూసిఫర్‌ జీవిత చరిత్రను గూర్చి బైబిలులో వివరించబడిన లేఖన భాగాలు వివరిస్తున్నవి.

        దేవుడు ఏ విధముగా ఏకత్వములో వున్నాడో సాతాను కూడా ఏకత్వమే పొందియున్నాడు.  ఇతనికి కూడా భార్యలేదు.  ప్రియశ్రోతలారా! మీరు బాగుగా గ్రహించండి. అపవాది అని ఏకవచన మున్నదేగాని అపవాదీలు అన్నది లేదు, సాతాను అని వున్నది గాని సాతానులు అను బహువచనములేదు.  అట్లే ఘటసర్పము.  కౄరమృగము,  అబద్దప్రవక్త, అంత్యక్రీస్తు వగైరా నామములకు బహువచనములు లేవు, ఇందును బట్టి చూడగా సాతానుకూడా ఏకత్వమే! ఇది యొక ఆత్మ, ఇతనికి భార్యలేదు.  ఈ విధముగా దేవునికిని సాతానుకును భార్యలేనపుడు ప్రత్యేకించి నరునిలో ఈ యొక్క భార్యాభర్తల జీవితము, బహు భార్యల జీవితము ఉపపత్నుల జీవితము వ్యభిచారములు వగైరాలు నరలోకములోనే జరుగుచున్నవి.  కానిపరలోకములో లేవనియే మనము గ్రహించవలెను.  ఈ విధముగా దేవుడుసాతాను ఇరువురును అవివాహితులే! ఇందులో దేవుడు పౌరుషము రోషము ఉగ్రత స్వయంభవత్వము సృష్టికర్త వగైరా గుణాతిశయములు కల్గినవాడైయున్నాడు,  అయితే సాతాను పరలోకములో దైవసన్నిధానములో ఒక పరిచారక దూతయై యుండి పురుషత్వమును కోల్పోయి నపుంసకత్వమును దైవత్వము చేత పొంది భూమిమీద పడద్రోయబడి తినవలె నపుంసకులు వలేనే నరులను చేయుటకు ఆది నరుని దేవుడు శపించిన అనంతరము నుండి దైవ వాక్కు నెరవేర్పును బట్టి భూమ్మీద నరులు బహుగా విస్తరించి ఫలించి భూమిని నిండించి దానిని ఏలుడి అనిన రీతిగా దైవ వాక్కు రీతిగా జన సందోహము భూమ్మీద విస్తరించిన తర్వాత సాతాను కూడా విస్తరించిన జనాభాలో నపుంసకత్వమును వ్యభిచారమును నిండించి రోమా 1: 26-27 ఆది 6:లో వలె దేవుని కుమారులైన ఆదాము కుమారులకు నరుల కుమార్తెలనబడు కయీను కుమార్తెలకును జతలు కల్పించి సంకరజాతిగా మార్చుటకు క్రియజరిగించాడు.  అయితే సాతాను ఆడంగి. ప్రియశ్రోతలారా! నేటి ఆధునిక యుగనరులలో ఆడంగులను బజారు వీధులలో మనము చూస్తున్నాము.  వీరు పురుషులై యుండి లింగపటుత్వమును కోల్పోయి స్త్రీలవలె ప్రవర్తిస్తూ స్త్రీ జాతిని అనుసరిస్తూ పురుషుల యొక్క పొందును కోరుటన్నది మనము సహజముగా చూస్తున్న విసయమే! ఇందును బట్టి మనము ఆలోచిస్తే ఇట్టి గుణాతిశయముగల వ్యక్తులు సాతాను సమాజపు వారని సాతానుప్రేరేపణతో వ్యభిచరించే టటువంటి స్త్రీలు దైవత్వానికి పనికి మాలిన వారును, లోకములో నీచమైన జాతికి చెందిన వారని లోక ప్రభుత్వాలకు నేరస్థులుగాను సాంసారిక జీవితములో జీవించేటటువంటి నీతిమంతులకు చిచ్చుబెట్టి కాపురాలను విడదీసేటటువంటి కత్తులని మనము గ్రహించవలసియున్నది.

        ప్రియపాఠకులారా! మనము బాగుగా ఆలోచిస్తే సాతాను మనలను శోదించునపుడు తన జేజిగాని సొత్తుగాని తన బాబుగాని సొత్తుగాని మనకు ఇవ్వడు.  ఇచ్చేటటువంటి సత్తా దానికి లేదు.  ఉదా||ఏదేను వనములో సాతాను సర్పము నుండి నరజంటను శోధించినపుడు తోటకు బాహ్యములో నుండి అనగా తనసంబంధమైన ఫలమును స్త్రీకి చూపించలేదు.  ఏదేను వనములోనే దేవుడు సృష్టించిన చెట్టునే చూపించి ఆయన నిషేధించిన ఫలమునే తినిపించి దైవత్వము నుండి నరులను తొలగించేనేగాని తన సొత్తుతో ఆ పరిశోదన కార్యము జరిగించలేక పోయినాడు.  అట్లే గేహజీ విషయములో నయమాను ఎలీషాకు ఇచ్చెదనన్న బంగారు వెండిని అపవాది ఎలీషాముందు వుంచగా దైవాత్మ బల సంపూరుడైన ఎలీషా దానిని నిరాకరించగా ఎలీషానుతాకుటను శక్తిలేని అపవాది గేహాజీని ఆవరించి తన సొత్తుగా ఇవ్వకుండ నయమాను సొతుతోనే గేహాజీని సోధించి అతనిని వశపరచుకొని ఎలీషా అడుగమన్నట్లుగా నయమానుతో నయవంచకంగా గేహాజీతో నయమాను ఎదుట మాట్లాడించి నయమాను యొక్క బహుమానాలను వెండి బంగారు కానుకలను గేహాజీ గృహానికి జేర్చి, ఆదైవజనుడైన ఎలీషా యొక్క శాపానికి గురిజేసి నయమాను యొక్క కుష్టురోగమునకు భాగస్వామిగా మార్చుటకు కారకుడు సాతానే! యోనా విషయములో దేవుడు నీనెవేకు వెళ్ళమంటే దేవుని ప్రవక్తయైన యోనాను సాతాను ఆవరించి సాతాను యొక్క పెట్టుబడిగాని దైవసహాయము గాని ఏదియు లేకుండ యోనా చేతి డబ్బులతోనే ఓడకు కేవుచెల్లించి దైవాజ్ఞకు వ్యతిరేకమైన ఓడ నెక్కించి యోనాను దైవోగ్రతకు గురిజేశాడు.  అట్లే అననీయ సప్పీరాలను వాని స్వంతభూమిని అమ్ముకొన్న డబ్బునేదైవత్వానికి చెల్లించుటకు ఒప్పుకోనీయకజేసి అనగా భూమిని అమ్మిన వెల దాచుకొన్నట్లుగా జేసి అపోస్తలుల ఎదుట అబద్దమాడించి అననీయ సప్పీరాల దంపతులను ఏకంగా మరణానికి అప్పగించాడు.  చూశారా! సాతాను యొక్క నయవంచకక్రియ.  తన పేరిట ఏ ఒక్కపైసా నరునికివ్వడు.  లోకసంబంధమైన వాటినే మనము కోరుకొనే వాటిని మనకు ఎరగా జూపిస్తూ అవి మనకు చెందవలెను'', అనెడి పట్టుదలను మనకు రేకెత్తించి, ఎదుటి వానిని చంపియో లేక దొంగతనము చేతనో లేక దొంగదస్తావేజుల చేతనో లేక అన్యాక్రాంతము చేతనో అక్రమ ఆర్జనను ఆర్జించుటకు మనలను పురిగొల్పుచు ప్రేరేపిస్తుంటాడు.  సాతాను కంటూ ప్రత్యేకముగా బంగారు లేదు, వెండి లేదు వస్తువాహనాలు లేవు, డబ్బులేదు.  మన డబ్బే, మన సొత్తే, మన బంధువులనే మన రక్తసంబంధులనే మనకు ఎరగాచూపి శోధన క్రియ జరిపించేటటువంటి ఈ అపవాది అనే వ్యక్తి ఆడంగివాడుగాక మగధీరుడా! సాతానులో వున్న మరొక జిత్తుల మారి గుణమేమిటంటే నేడు సులభముగా శోదించుటకు కొన్ని మార్గాలను మనముందుంచియున్నాడు.  సినిమాలలో తెరమీద చిత్రవిచిత్రమైన దేవుని రూపములతో మనుష్యులకు చూపించునుగాని తనను చూపడు.ఈ దేవుళ్ళు సినిమా సెట్టింగులు అలంకారములు ముస్తాబులు మేకప్పులతో చిత్రవిచిత్రమైన అలంకరణలతో తెరమీద కనబడే మనుషులేగాని దేవుళ్ళుకారు.  వారిని తెరమీద చూపించి సాతాను అదృశ్యములో వుండి నాటక మాడుచున్నాడు, ఆడిస్తున్నాడు.  ఈ విషయము నరకోటి నేటి విజ్ఞాన యుగములో గ్రహించేటటువంటి స్థితిలో లేరు.  సాంకతిక జ్ఞానము వెల్లివిరిసిన ఈయుగములో దైవత్వాన్ని గూర్చి పైశాచికమును గూర్చి ఆలోచించువారు లేరనియే చెప్పవచ్చును.

        ప్రియశ్రోతలారా! మీరు ఎప్పుడైనా ఆలోచించినారా! మనము వంట చేసుకొన్న కూరతోనే కొన్ని సందర్భాలలో ఎదుటివారికి మనకు విరోధాలు పెట్టిస్తుంటాడు.  కూరలో కూడా పక్షపాతములతో విందు వినోదములు, వడ్డించే సమయములో పక్షపాతములుతో వడ్డించుకున్నారే! మనస్తాపములు పెట్టించుచుండును.  ఎదుటివారి చేత దుయ్యబట్టించుచుండును.  సొత్తుమనదే, కార్యక్రమము మనదే! డబ్బు దస్కము మనదే, తినిపోయే వారికి మన మీద ద్వేషాన్ని రేకెత్తించి కలతలు రేపేవాడే సాతాను.

        ఇక సినిమాలలో దైవత్వాన్ని దుయ్యబట్టుచు ఒక్కొక్క దేవునికి ఇద్దరు భార్యలు నలుగురు ఉంపుడు గత్తెలు వీరుగాక దేవుని ఆస్థానములో డ్యాన్సర్లు వారి వైభోగములు చూపించునేగాని వాస్తవానికి వారు దేవుళ్ళు కారు. సాతాను తాను సైతాను అని వారి మధ్యకి బహిరంగముగా రాడు, రాలేడు, ఇక సినిమా తెరమీద ఆడునటువంటి నాటకాలు చేయునటువంటి నటనలు డ్యాన్సులు సైతానువి గాదు.  ఇవి నరుల చేత సాతాను వేయించేటటువంటి చిందులు. ఇవి సాతానుకు ప్రియములును అవిశ్వాస జనాంగమునకు ప్రజారంజకములని దైవత్వానికిని నిషేధములని మనము గ్రహించవలెను.  సాతాను గూర్చి మనము అనుకోవాలంటే సాతాను యొక్క క్రియలు దైవత్వమన్నది లోకములో ఎంతముందుకు పయనిస్తుందో-అందుకు పోటిగా కొలది దూరము తక్కువ ప్రయాణములో సాతాను యొక్క క్రియాకర్మలు కూడా జరుగుచున్నట్లుగా కూడా మనము తెలుసుకోవలెను.

        దావీదును దృష్టాంతరంగా తీసుకోవచ్చును. దావీదు దైవత్వములో ఎంతో ముందుకు సాగినాడు. కాని రెప్పపాటుకాలములో ఒకానొకయుద్ధ సమయములో దావీదు విశ్రాంతిని కోరి మేడ మీద నిలువగా సాతాను, వివస్త్రమైన స్త్రీ ద్వారా మహాభక్తుడైన దావీదును శోధించాడు. ఈ స్త్రీ సాతానుకు బంధువుకాదు, దాని సంబంధి కాదు.  అయినను దావీదు రాజ్యములో దావీదు పరిపాలనలో ఆయన మందీమార్భలములో ఆయన సైనికులలో ఒక్కడైన ఊరియా భార్యను దావీదుకు చూపినాడేగాని సాతాను తన సృష్టిలో జేసిన స్త్రీని దావీదుకు చూపలేదు.

        ప్రియశ్రోతలారా!  గ్రహించితిరా! సాతాను యొక్క శోధన క్రియను గూర్చి మర్మాన్ని గూర్చిగ్రహించితిరా! ఏనాడైనను యిది మీరు గ్రహించితిరా! దేవుడు ఒక రూపమును సృష్టించగలడు, దానిని విస్తరింపజేయగలడు, దానిని ఫలింపజేయగలడు, పోషించగలడు. సాతాను సృష్టించలేడు, పోషించలేడు.  ఫలింపజేయుటకు బదులుగానాశనము జేయును.  అందుకే ఇతనికి నాశన పుత్రుడని పేరు.  అనగా సాతాను నాశనము చేయగలడు. ఈ నాశనపుత్రుడైన సాతాను యొక్క క్రియలను లయపరచుటకును ఇతని ద్వారా నాశనమునకు గురియైనటువంటి వారిని వెదకి రక్షించుటకు దేవుడు ఏసుప్రభువును ఈ లోకమునకు పంపించినాడు.

        ప్రియశ్రోతలారా!  ఈ కడవరి దినములలో ప్రభువు రక్షణలో వున్న విశ్వాసుల ఆత్మలను పతనావస్థలో దిగజార్చుటకు అంత్యక్రీస్తుగా ఈ సాతాను క్రియజరిగించబోవుచున్నాడు.  అంత్యక్రీస్తు అంటే క్రీస్తుకు విరోధి.  ఇతను కూడా వేదమును చేతబట్టి వేషధారణతో క్రైస్తవ ఫాదరీల కంటె అత్యున్నత స్థాయిలో కాపరులందరి కంటె పెద్దకాపరిగాను, బిషప్పులు ఆర్చి బిషప్పుల స్థానాలను హోదాలను పొంది ఆత్మ సంబంధంగ జీవిస్తూ క్రీస్తు మార్గంలో నడిచేటటువంటి విశ్వాసులను దారి తప్పించి, దైవ వ్యతిరేక బోధతో సందిగ్ధావస్థలో విశ్వాసులపై క్రియజరిగించును.  నరుల హృదయాలోచనలను బట్టి వారి జ్ఞానాన్ని బట్టి అంత్యక్రీస్తు యొక్క క్రియలు భూమిమీద చెలామణి కాబోవుచున్నవి. ఇప్పటి వరకును ఆది ఘటసర్పమైన అపవాది తాను ఏ సర్పాన్ని ఆవేశించి మాట్లాడినాడో ఆ సర్పరూపాన్ని దేవుని గాను ఏ చెట్టుఫలమును తినిపించినాడో ఆ చెట్టును దేవతగాను-ఏసుప్రభువును ఏ ఱాళ్ళతో రొట్టెలు చేయమన్నాడో ఆరాళ్ళతో మలిచి దేవతలుగాను-ఏసుప్రభువును తీసుకవెళ్ళి ఏ కొండమీద నిలబెట్టినాడో ఆ కొండ ప్రదేశాలను అజ్ఞాన నరులకు పుణ్యస్థలాలుగాను యాత్రస్థలాలుగాను, ఆనాడు ఇశ్రాయేలీయులు అహరోను మీద తిరుగబడినపుడు అహరోను లోహముతో ఏ రూపాన్ని చేశాడో ఆ రూపము దేవతా విగ్రహముగాను దేవతల వాహనముగాను భూమ్మీద దైవత్వానికి మారుగా ప్రతిష్టింపజేసి-ప్రకటిస్తూ అది చాలదన్నట్లుగా చిత్రవిచిత్రమైన వేదాంతములతో కాకమ్మ కధలతో అనేకమైన దేవుళ్ళను; వారికి భార్యలను ఉంపుడు గత్తెలను దాసదాసీలను ఆదేవుళ్ళ విలాసమందిరాలలో నాట్యము చేసేటటువంటి నాట్యకత్తెలను చిత్రవిచిత్రమైన నామధేయములతో మానవుని యొక్క జ్ఞానమును తన జ్ఞానమునకు మార్చుకొని, తన వేదాంత ధోరణిలో నరుల జ్ఞానమును మలచి దేవుళ్ళు కానట్టి అనేక దేవుళ్ళను దేవతలను భూమ్మీద నిండించి, నిజదైవత్వమును మరుగుపరచుటకును-దేవుడు క్రీస్తు ద్వారా పరలోక రాజ్యమునకు పరిశుద్ధులను చేర్చు ప్రణాళికను వమ్ముజేసి, ఏ ఆత్మ కూడ క్రీస్తును విశ్వసించకూడదని క్రీస్తు దేవుడు కాడని క్రైస్తవ్యములో ఏమియు లేదని లోకమే దేవుడు - కడుపే కైలాపబె సృష్టియే దేవుత ధనమన్నది లక్ష్మి-ఇది లేనిదే ప్రపంచ నరజీవితానికి విలువలేదన్న సిద్దాంతానికి లోకనరులను దిగజార్చి మూకుమ్మఢిగా నరకోటిని  మరణాలకును నరకానికిని చేర్చుటకు మూలకర్తయైయున్నాడు.

        ప్రియశ్రోతలారా!  నేటి నవనాగరిక యుగములో జరుగుచున్న బంగళాదేశ తుఫాను ఐదులక్షల పైచిలుకుగా ఊడ్చినది.  రష్యాలో జరిగిన రెండు భూకంపములు కొన్ని లక్షల మందిని భూగర్భానికి ఆహుతిజేసింది.  ఇదిగాక పడవమునకలు విమాన ప్రమాదాలు ఓడ ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు కిరోసిన్‌తో ఆత్మాహుతి జేసుకోవడము వరకట్నమరణాలు దారిదోపిడీలు అతిసారవ్యాధి రైలు ప్రమాదాలు, ప్రతినిమిషము జరుగుచున్న దైవోగ్రత మూలముగా సంభవించు జననష్టము గూర్చి మనము వార్తా పత్రికలలోను టి.వి.లలోను రేడియోలలోను వింటున్నాము.  చూసున్నాము.  వీటికి కారణము సాతానుతో లోకస్థులు ఏకీభవించి చేయుచున్న అవిశ్వాసపు క్రియలే!

        అయితే ప్రియశ్రోతలారా!  ఈ సాతాను ప్రభువు రాకడ సమయములో రూపాంతరము పొంది అంత్యక్రీస్తుగా ప్రత్యక్షము కాబోవుచున్నాడు.  అనగా మొదటి యోహాను 4:3లో వలె ఏసును ఒప్పుకొనని ఆత్మగా చెలామణియగును.  మత్త 24: 4-5 లో ఏసు నామములో ఏసు పేరట వచ్చి ప్రజలను మోసపరచు వ్యక్తులు బైలుదేరియున్నట్లు నేటి మన క్రైస్తవ్యములో చూస్తున్నాము.  మత్త 24: 23-24 లో అబద్ద క్రీస్తులు అబద్ద ప్రవక్తలు వచ్చిసాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచకక్రియలను మహాత్కార్యాలను కనబరచెదరు.  ఇట్టి క్రియలచే వారి మాటలకు పరిశుద్దులు కూడా మారి పోవుదురు.  అంత్యక్రీస్తు రాకకు ముందు కొన్ని మార్పులు జరుగును,  ప్రపంచమంతటికి ఒకే రకమైన నాణెములు స్టాంపులు ముద్రలు, ప్రపంచమంతటికి కేంద్రము ఒకే స్థలమేర్పడుతుంది.  దీనికి ఋజువు మనకున్న రేషన్‌ కార్డులు,.  ఇది లేనిదే మనకు రేషన్‌ లేదు.  ప్రపంచమంతటికిని ఆధిపత్యము వహించుటకు ఒకనియంత వచ్చును.  ఆ సమయములో సమస్త దేశవాసులు ఆయనను తమ ఏలికగా నియమిస్తాడు.  ఆయన మత సంబంధమైన దృక్పధములో వ్యవహరించునని మొదటి యోహాను 2:18లో చూడగలము.  ''క్రీస్తు విరోధి బైలుదేరును.  ఇప్పుడు అనేకమైన క్రీస్తు విరోదులు బైలుదేరియున్నారు''.  అంత్యక్రీస్తు ప్రత్యక్షము కావాలంటే సంఘము ఎత్తబడవలెను.  సంఘము ఎత్తబడవలెనంటే ఏసుక్రీస్తు రావలెను'', ఏసు క్రీస్తు వచ్చితే గాని అంత్యక్రీస్తురాడు. అంత్య క్రీస్తు రాజ్యము నిలువదు యూదా ఇస్కరియోతు క్రీస్తు శిష్యులలో ఒక్కడైయుండి క్రీస్తు వెండి నాణెములకు అమ్మినాడంటే క్రైస్తవ్యములో వుండి అంత్యక్రీస్తు ఆత్మను పొందిన వారిలో ఇతనొకడు.  మొదటి యోహాను 4:3లో క్రీస్తును ఒప్పుకొనని ఆత్మ ఇప్పటి వరకు మనము గ్రహించవలసినదేమిటంటే అంత్యక్రీస్తు ప్రత్యక్షత కాలేదు.  క్రీస్తు రానిదే అంత్యక్రీస్తురాడు.  కనుకదేవుని బిడ్డలమైన మనము అంత్యక్రీస్తుల యొక్క బోధకులకు వాదములకు దూరముగా వుండి క్రీస్తు కొరకు కనిపెట్టుకొని యుండవలెను.

        అంత్యక్రీస్తు చాలా ఉపాయశాలి. అంటే కుయుక్తిగల వాడు.  జంతువు లలో నక్కకంటె యుక్తిగలవాడు.  ఇతనిని గూర్చి దానియేలు 8:23లో కౄర ముఖముగల యుపాయశాలియగు రాజు ఇతను సైతాను ఆత్మ ఆవరించి గొప్ప ప్రభావము పొంది యుండును.  దానియేలు 9:27లో అతను పాలస్తీనులో ప్రవేశించి ఇశ్రాయేలీయులతో రాబోయే మేస్సీయాను నేనేయని బోధింప వారు మోసపోయి వారి రాజ్యాన్ని ఇతని పరము జేసి ఇతనికి లొంగిపోవుదురు.  అంతట వాడు దేవుని ఆలయములో చేరి రెండవ ధెస్స 2:4 లో వలె తాను దేవుడనని తనను ఆరాధించుము అని శాసిస్తాడు.  ఇతనికి విజ్జోడుగా ప్రకటన 13:11-13లో వలె అబద్ద ప్రవక్తలు బైలుదేరి అంత్యక్రీస్తు యొక్క అనుచరులుగా పనిజేస్తారు.  అంతేగాక క్రీస్తు కొరకు పరిశుద్ధాత్ముడు సంఘమును సిద్ధపరచునట్లు అబద్దప్రవక్త కూడా అంత్య క్రీస్తు కొరకు ఒక నకిలీ పెండ్లి కుమార్తెను సిద్దపరచును.  విశ్వాస జీవితములో వున్న భక్తులను బలవంతము జేయుచు ఒక సంఘవధువును ఏర్పరచును.  తండ్రికుమార పరిశుద్ధాత్మ దేవుని త్రిత్వము.  సాతాను అంత్యక్రీస్తు అబద్ద ప్రవక్త-''సాతాను యొక్క త్రిత్వము, మొదటి రాజులు 18:37-38 లో వలె ఏలియా సవాలుగ ఆకాశము నుండి అగ్నిని రప్పించినట్లు అంత్య క్రీస్తు కూడా ప్రకటన 13:13లో విధముగా నకిలీ పద్దతిలో ఆకాశమునుండి అగ్నిని రప్పించును.  యెష 14:4లో వలె మరియు దానియేలులో నెబుకద్నెజరు కున్న గర్వము ఇతనికున్నట్లు వర్ణింపబడియున్నది.  యెష 14:12లో లూసిఫర్‌ గా గర్వభంగము దానియేలు 7:8లో ఇతనికున్న చిన్న కొమ్ము దానికున్న మానవకన్నులు గర్వంతో కూడిన నోరు, ఈ పది కొమ్ములు పది రాజ్యాలు, ఈ పది రాజ్యములు అంత్యక్రీస్తును తమ నాయకునిగ నియమించుకుంటారు.  దానియేలు 8:9లో ఆనంద దేశము అంటే పాలస్తీనా దేశముయూదులమీద తన క్రియాప్రణాళికలను అమలుజేయును.  దానియేలు 8:23లో & 9:26లోను వచ్చునట్టి రాజు అను పేరు ఈ అంత్యక్రీస్తునకున్న పేరు.  ఇతడు తనకై ఒక సైన్యాన్ని తయారుజేయును.  దానియేలు 11:36 లో ఇతను తన ఇష్టానుసారముగా నిరంకుశముగా ప్రవర్తించి దైవత్వముపై తిరుగుబాటు జేసి తానే రెండు ధెస్స 2: 3-8లో వలె దేవుడనని యెరూషలేము దేవాలయములో కూర్చుని తనను ఆరాధించమంటాడు.  ఇతనికి రెండవ ధెస్స 2:3లో నాశన పుత్రుడనే పేరు వ్రాయబడినట్లుగా చూడగలము.  ఏసు దేవుని పుత్రుడైనట్లుగా ఇతను సాతాను పుత్రుడు. ఈ  అంత్యక్రీస్తు యొక్క అనుచరుల యొక్క కార్యక్రమాలను పరిశుద్దాత్మడు అడ్డగిస్తున్నాడు.  అంటే పరిశుద్దాత్ముడు వధువు సంఘమును సిద్ధపరచి ఈయనకు అప్పగించునపుడు సంఘముతో బాటు పరిశుద్దాత్ముడు కూడా ప్రభువు దగ్గరకు వెళ్ళి పోవును.  అప్పుడు అంత్యక్రీస్తు క్రియలకు అడ్డమేమియు వుండదు.  ఇందును బట్టి సంఘము ఎత్తబడునపుడు విడువబడిన అన్యులు నామ క్రైస్తవులు అనగా క్రీస్తును అంగీకరించని వారు బహుశ్రమలు అనుభవిచుదురు.  మొదటి యోహా 2:18లో విధముగా ఇదికడవరి గడియ.  అనేకులైన అబద్ద ప్రవక్తలు బైలుదేరియున్నారు.  ప్రియశ్రోతలారా!  ఈ సందర్భములో క్రీస్తు అంత్యక్రీస్తులో వున్న భేదములు గుణాతిశయములను గూర్చి తెలిసికొందము.

                        వేద సాహిత్యము -పరిశుద్దవేదము

        సాతానుకు వేద సాహిత్యమున్నదా? వుంటే ఈతని సాహిత్యమెలాంటిది? అపవిత్ర అసత్య వేదములను గూర్చిన వివరములుః

        ప్రభువునందు ప్రియమైన సోదరీ!సోదరా! సంఘములను గూర్చి సంఘనిర్మాణములను గూర్చియు సంఘముల యొక్క భోగభాగ్యములు వాటి యొక్క విలువలు, అంత్యకాలములో సంభవించబోవు పరిణామములను గూర్చి తెలిసికొన్నాము.  ఇపుడైతే ఈ రెండింటికిని వీటి యొక్కచరిత్రలను తెలుపు వేదములను గూర్చి వాని యొక్క యదార్థతను గూర్చి తెలిసికొనగలము.  ఇందులో మొదటిదైన సత్యవేదమును గూర్చి తెలిసికొనగలము. ఈ సందర్భములో యోహాను సువార్త్త 1: 1-14 చదివితే వేదమనునది ఎక్కడనుండి వచ్చెనో వేదమునకు మూలమైనట్టి వాక్కును గూర్చి అనగా శబ్దమును గూర్చి మనము తెలిసికొనగలము. ఈ విధంగా శబ్దమును వాక్కునైయున్న దేవుడు. ఏ విధంగా క్రియజరిగించినది ఆదికాండ మొదటి అధ్యాయంలో వివరించబడియున్నది.  ఈ విధంగా  సృష్టికార్యమును జరిగించిన శక్తి తన మహిమా ప్రభావముల చేత నరనిర్మాణమును గావించిన విధానము కొరకు ఏర్పాటుచేసిన వాతావరణము పరిశుద్ధవనము, అన్నిటికంటె ముఖ్యమైనదిగా తనతో బాటు సమానత్వమును తన సన్నిధిని నరునితో కూడా వుంచి నరుని ప్రేమించిన విధానమును ఆదికాండ రెండవ అధ్యాయంలో చదువగలము.  అట్ల ప్రేమించిన నరునికి ఒంటరితనము నుండి వేరుపరచి అతని కొరకు సాటిసహాయంగా ఒక జంటను కూడ ఏర్పరచినట్లు చదువగలము.

        ఇందును బట్టి మొట్టమొదట పరిశుద్ధగ్రంధములో వివరించబడిన క్రియ అనగా బైబిలు యొక్క వివరములను బట్టి సత్య వేదము క్రియజరిగించి భూమిని జలములను సూర్యచంద్రనక్షత్రాదులను సృష్టిని జంతుకోటి వృక్షజాలమును పక్షిజాలము వాతావరణము వగైరా నరుని మనుగడకు ఉపయోగించు వనరులను దేవుడేర్పరచినట్లు పరిశుద్ధ వేదము ఋజువుపరచుచున్నది.

        ప్రభువునందు ప్రియసోదరీ! సోదరా! ఇదే సందర్భంలో ఆది 3:లో వేరొక అలౌకిక శక్తి పరకాయ ప్రవేశముగా సర్పములో ప్రవేశించి అంతటితో ఊరుకోక పరమాత్ముని పరిశుద్ధ క్రియా సంభూతురాలైన స్త్రీకి రుచికరమైనదియు ఆకర్షణాయుతమైనదియు మనస్సును రంజింపజేయునట్టిదియు నమ్మదగినట్టిదియునైన, మితమైన బోధ అనగా ఇప్పటి బోధకులవలె సమయాన్ని సందర్భాన్ని వాతావరణాన్ని సంఘస్థుల మనస్తత్వాలను ఎరుగక సంఘకాపరి అనుమతించడమే మహాభాగ్యంగా ఎంచి ఛాన్సు దొరికిందని అర్థంపర్థం లేని అంశములతో తానేమి మాట్లాడుచున్నాడో తానెరుంగని పరిస్థితులలో గంటన్నర కాలముఖర్చుపెట్టి గొప్ప కంఠస్వరముతో బైబుల్లోని 66 గ్రంధాలను గూర్చి వివరించి బోరెత్తించినట్లుగాకుండ ముక్తసరిగా సర్పములో అలౌకికశక్తి యను దైవవ్యతిరేక కూటమికి పెద్ద ఫాస్టరైన ''పాస్టర్‌ సాతాను సర్పమునకు తన శక్తిని తన ప్రభావాన్ని ఇచ్చి మాట్లాడమని ఛాన్సు యిచ్చినపుడు సర్పము మాట్లాడిన విధానము బహుక్లుప్తముగను, కాలాన్ని సమయాన్ని సందర్భాన్ని బహుకుయుక్తితో వాడుకున్నట్లు ఈ క్రింది మాటల ద్వారా మనము గ్రహించవలసిన వారమైయున్నాము.          

        ఇది నిజమా! ఈ తోట చెట్లలో దేని ఫలమైనను మీరు తినకూడదని దేవుడు మీతో చెప్పెనా? అని అనుట. వారి ద్వారానే నిషేధించిన ఫలము యొక్క వివరాన్ని తెలిసికొని మాట్లాడిన విధానమును మనము గ్రహించవలసియున్నది.  ఇందులో ప్రధానాంశములు ''మీరు చావనే చావరు'' ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ నేత్రములు తెరువబడి మీరు దేవతలవలె వుందురు.        

        ప్రభువునందు ప్రియసోదరీ!సోదరా! సాతాను మాట్లాడిన మాటలు మూడే మూడు-మీరు చావనే చావరు.  మీ కన్నులు తెరువబడును.  మీరు దేవతలవలె వుందురు.  చివరగా ఈ విషయము తన వలె దేవునికి కూడా తెలియునని దేవుని మీద నిందమోపి. దేవుడు ఆ ఫలమును నిషేధించుటనునది తప్పని తెలిపినట్లుగ పై బోధ వివరించుచున్నది.  సాతాను చేసిన ఈ బోధ వేద సాహిత్యముతో కూడినది కాదు. అప్పటికి వేదము లేదు. లిపిలేదు.  అక్షర జ్ఞానము లేదు.  వ్రాతకు తగిన పనిముట్లుగాని వ్రాయుటకు కావలసిన ఇంధనములు గాని కాగితములు గాని భాషాపరిజ్ఞానములేని సమయమది.  అట్టి సమయములో ముక్తసరిగా బోధించిన ఆ మూడు మాటలలోని ప్రభావము దైవ క్రియాసంభూతులై అనగా దేవుని హాస్తముతో చేయబడిన వారై దైవాత్మ పూర్ణులైన నరుల సహితము వారి యొక్క ఆత్మ ప్రభావమును కోల్పోయి; సర్పబోధకు చెవి యిచ్చినారంటేః- నేడు మన సంఘాలయములలోను సువార్త పరిచర్యలలోను దైవసేవకులు చేయుబోధతో పోల్చితేః నేటి బోధ లేవియు దాని ముందు పనిచేయక పోవుచున్నవి. లోకము చెడినది,   లోకశాస్త్రములు వికసించినది వేదములు వేదసాహిత్యములు  లిఖించబడి నరునికి యంత్ర మంత్ర తంత్ర జ్ఞానములను నేడు భూమిపై అలరింపజేసింది కూడా ఆ బోధయే.  నరుని యొక్క జ్ఞానమును పూర్తిగా మార్చివేసి దైవసృష్టికి ప్రతిసృష్టిని చేయుటకును దేవుడు ఆకాశములలో సృష్టించిన గ్రహాలలోకి బాటలు వేయుటకును నరప్రమేయము లేకనే పిండోత్పత్తి జరిగించుటకు నరప్రయత్నములకును వాటికి సంబందించిన శాస్త్రజ్ఞానములకును దేవుని మరపింపజేసి దైవత్వముపై తిరుగుబాటు చేయుటకునునాడు చెట్టుకొమ్మల నుండి వ్రేలాడుచు పాముజేసిన బోధమూలకారకమైయున్నట్లు మనము గ్రహించవలసియున్నది.

        ప్రభువునందు ప్రియసోదరీ!సోదరా! బైబిలు లేకుండ కీర్తన పుస్తకము లేకుండ కీర్తన పాడకయే బైబిలు చదవకనే ప్రారంభ ప్రార్థన అంత్యప్రార్థన చేయకయే, చెట్టుమీది సర్పము చేసిన బోధ ప్రభావము నరునిలో క్రియజరిగించి రేడియో అని పేరుతోమనిషితో ప్రమేయము లేకనే గాయకులు వారి బృందము లేకనే ఒక పెట్టెలో విద్యుశ్చక్తి మీటర్ల సహాయమున శ్రావ్యమైన సంగీతము. విశ్వ వాణియని శ్రీలంకయని, జానపదగేయాలని సినిమాగీతాలు శాస్త్రీయసంగీతాలు వినేటటువంటి జ్ఞానముః మరియు టెలివిజన్‌ వీడియో సినిమాలు. మరి ఆశ్చర్యమేమిటంటే పాము జేసిన బోధ నెరవేర్పుగా సినిమాలో తెరమీద నరులు దేవుళ్ళుగా వెలసి అంతర్థానమగుటయు, వరాలు యిచ్చుట, భక్తులను కాపాడుట, భక్తుల యొక్క కష్టాలలోను శ్రమలలోను వారి నాదుకొనుట, వారిని కాపాడుటకు ఏ పాముగానో జంతువుగానో లేక బలమైన గాలిగానో శక్తిగానో ఆదుకున్నట్లుగా సినిమా తెరమీద చూపిస్తూ-విగ్రహపూజలు తత్ఫలితముగా ఆ విగ్రహాలలో ఏదో యొక్క శక్తి వున్నట్లు కాకమ్మ కధల ద్వారా కల్పించి నిజదేవుని మరుగపరచి, ఆయన యొక్క ద్యేయాన్ని మంటగల్పిభూమిపై ఆయన వేసిన ప్రణాళికలను వమ్ముజేసి నేటి నరులు నాటి సర్పబోధను సత్యమైనదిగా ఋజువుపరచుచున్నట్లు కనపడుచున్నది.

        శక్తిగల వేదము సత్యమైన వేదము బలమైన దేవుని యొక్క మందసము రక్షణాయుతమైన ఏసుయొక్క పరిజ్ఞానము, ఆయన సామర్ధ్యము ఆయన శక్తి ప్రభావములు క్రియజరిగించి ఆయన రక్తముతో కొనబడినట్టి మనముఃనూతనంగా మతములో జేరిన విశ్వాసిని బాప్తిస్మమిచ్చు సందర్భములో సంఘమంతయు కూడియుండగా బోధకుడు నడుములోతు నీటిలో వుండి, అదే లోతులో బాప్తిస్మం తీసుకొనబోవు విశ్వాసిని కూడా దింపి మాట్లాడబోవు మాటలు బహుచిత్రంగా వుండును నీ వెందుకు బాప్తిస్మం తీసుకొంటున్నావు? అందుకు విశ్వాసి ఇచ్చు జవాబుః- ఏసుప్రబువు నాజీవితములోనా కనుగ్రహించిన రక్షణను బట్టి బాప్తిస్మం తీసుకొంటున్నాను'', అని అనును ఇంక బోధకుని ప్రశ్న అట్లయితే ఏసును నీ స్వరక్షకునిగ అంగీకరించితివా? ఆయన నీ పాపముల నుండి నీకు విమోచన కల్గించెనని నమ్ముచున్నావా? ఇక మీదట నీ పాత ఆరాధనలు ఆచారాలు అలవాట్లు మానెదవా? అట్లయితే నీకు తండ్రి కుమార పరిశుద్దాత్మల నామముతో బాప్తిస్మము ఇచ్చెదనంటాడు.  ఇచ్చును కూడా, బాప్తిస్మమిచ్చి నీటిలో ముంచి లేవనెత్తును.  ఇది మన క్రైస్తవసాంగ్యము.

        ప్రభువునందు ప్రియసోదరీ!సోదరా! అయితే ఆదిలో ఏదేను లోని సర్వసాంగ్యమునకు నేటి బాప్తిస్మ సాంగ్యమును పోల్చితే'',  కుంకుడు గింజకును  ఆవ గింజకును వున్న తేడా కన్పించును.  ఆదిలో చెట్టు మీద నుండి పాము మాట్లాడిన మాటలు కూడా మూడే.  1.మీరు చావనే చావరు 2.మీ కన్నులు తెరువబడి మంచి చెడ్డలు ఎరిగిన వారై 3.దేవతలవలె వుందురు.  సర్పసాంగ్యములో సర్పముజేసిన బోధ ఇది.  నీటి సాంగ్యములో బోధకుడు చేయు బోధ; ఇవి కూడా మూడు మాటలే.  1.ఏసుప్రభువును నీ స్వరక్షకునిగ అంగీకరించావా? 2. ఆయన నీ పాపముల నుండి నిన్ను విమోచించెనని నీవు నమ్ముచున్నావా? 3.అట్లయితే నేను తండ్రి కుమార పరిశుద్దాత్మల నామమున నీకు బాప్తిస్మమిచ్చుచున్నాను.

        ప్రభువనందు ప్రియసోదరీ!సోదరులారా!  రచయితగ దైవ జ్ఞానముతో దైవాత్మ యొక్క ప్రేరేపణ మూలముగ రచించిన ఈ రెండు సంఘటనలలో చదువరియైన నీవు నీ ఆత్మీయ జ్ఞానముతో ఆలోచించనట్లయితే దేనికి ప్రభావమున్నదో నీవే తీర్మానించాలి.  నేడు బోధకుల ద్వారా దైవ విశ్వాసిగా తీర్చబడి ఏసు చెప్పినట్లుగా-''నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఒక వ్యక్తి జన్మించవలెను. అనిన సిద్దాంతముననుసరించి బోధకుని ద్వారా బాప్తిస్మం పొందిన విశ్వాసి సమయానుకూలముగా సందుచూసి పదవిని ఉద్యోగాన్ని లేక ఉన్నత స్థానాన్ని ఆశించి, మొలలోతు నీటిలో సంఘమెదుటసంఘకాపరి ఎదుట అన్నిటికంటెను ముఖ్యంగా అదృశ్యములో వున్న దేవుని యెదుట, చేసిన ప్రమాణములను మంటగల్పి నిజదైవత్వం నుండి తొలగి లోకసంబంధిగా ప్రకటించుకొంటు లోకనాధుని ఎదుట నేను క్రైస్తవుని కానని హరిజనుడనని బలహీనవర్గమునకు చెందిన వానినని ప్రకటించుకొని, తానేగాక తన కుటుంబ మంతటిని దైవత్వం నుండి తప్పించి లోక పదవులు లోక చదువులు వాటి గౌరవాలను ఆశించి ఉన్నత పదవి కోసం ప్రాకులాడి భ్రష్టత్వం పొందినది చాలక, పదిమందిలో తానొక ఉద్యోగిననియు అధికారిననియు జీబుల్లోను కార్లలోను పెద్దపెద్ద అధికార్లతోను సంచారము చేసే ప్రబుద్దులను మనము మన జీవితాల్లో చూస్తున్నాము.

        ఎందుకంటే ప్రభువునందు ప్రియసోదరీ!సోదరా! ఇది మానవునికి ఈ రోజు పుట్టిన గుణము కాదు.  ఇది సహజమైనదియే.  ఆదిలో సర్వమానవ సృష్టికిని మూలమైన వాడును ఆది సంభూతుడునైన ఆదాము దేవుని హస్తనిర్మితుడును, దేవుని జీవాత్మతో భాగస్వామియునై దేవుని సృష్టియైన పరిశుద్ధ ఏదేను వనమును స్వాస్థ్యముగా పొందియుండి, తానున్న పరిశుద్దోన్నత పదవిలోని ప్రభావమును తెలిసికొని కూడా లోకనాధుని బోధకు చెవినిచ్చి భూఫలాన్నాశించి దైవత్వంలో భ్రష్టుడై దైవసన్నిదిని కోల్పోయాడు.

        నాటి ఆదాముదేవుని ఎదుటకు వచ్చుటకు శక్తిచాలక ముఖము చెల్లక తాను భూసంబంధియైనందున చెట్ల చాటున నుండియు దైవత్వమునకు తాను దిగంబరినని చెప్పుకొన్నాడు.  దిగంబరియంటే గిరిజనుడనని చెప్పుకొన్నాడు.  గిరిజనులకు దేహము నిండా బట్టలు లేనట్లే ఆదాము దంపతులకు కూడా అంజూరపు  ఆకుల కచ్చడములు దప్ప మరేమియు దుస్తులు లేవు.  నేటి క్రైస్తవ విశ్వాసి సమస్త వేదజ్ఞాన మెరిగియు అనేకుల బోధకుల ద్వారాను రేడియో టెలివిజన్‌ వగైరా సాధనముల ద్వారావినియు గ్రంధరూపమున చదివియు, పాటల రూపమున దైవనామసంకీర్తనము జేసియు లోకపదవుల నాసించి తాను హరిజనుడనని ప్రకటించుకొనుచున్నాడు.

        ప్రభువనందు ప్రియసోదరీ!సోదరా!  మన ఆది తండ్రియైన ఆదాము సర్పబోధ విని భూఫలాన్నిసించి జీవముగల దేవుని ఎదుట నిలువలేక చెట్ల చాటున నుండి నేను దిగంబరినని గ్రిరిజనుడ)నని పల్కినాడు.  నీవు దిగంబరివని (గిరిజనుడవని)నీకు తెల్పినవాడెవడు? చెట్టు కొమ్మల మీదనుండి వ్రేలాడే మండలాధికారియైన సర్పము(వాయుమండలాధికారి)

        ప్రభువనందు ప్రియసోదరీ!సోదరా!  మన జీవితమును మన జీవితములో వున్నట్టి అసహ్యకరమైన గుణాలను బయలు పరచునదియే పరిశుద్ధ గ్రంధము నాడు ఏదేను వనములో దేవుని మీద తిరుగుబాటు చేసిన అనగా దైవత్వమును వదలి భూఫలాన్ని ఆసించిన నరజంటకు దేవుడిచ్చిన తీర్పు ఏమంటే (1)ఆయన పరిశుద్ద సన్నిధి నుండి వెడలగొట్టుట (2)ఆతని శపించుట (3)మరణ పాత్రునిగా చేయుట.  ప్రయాసపడి భూమిని దున్నుట ప్రయాసపడి గర్భాన్ని మోయుట.  ఇది దిగంబరులైన (గిరిజనులైన) మన ఆదినరుల కిచ్చిన శాపము.

        ఇంక చెట్టున వ్రేలాడిన సర్పమైన మండలాధికారికిచ్చిన శాపమేమిటంటే ఆయనకున్న కాళ్ళు ఱెక్కలు ఊడగొట్టి వికలాంగునిగా జేసి మట్టి తిని పించుట.  నేడు కూడ హరిజన గిరిజన దళిత వర్గాలకు అన్యాయం జరిగించిన మండలాధికారికి కూడా ఈ గతియే పట్టును.  ఉద్యోగము నుండి ఊడగొట్టుట.  ట్రాన్స్‌ఫర్‌ సస్పెండు లేదా లంచగొండినేరము క్రింద దండన వగైరాలు మనము వార్తాపత్రికలలో చదువుచున్నాము.

        చిత్రమేమిటంటే నాడు సర్పబోధ విని భూఫలము నారగించి దైవ వ్యతిరేకియైన నరుడుదైవసన్నిధిలో నిలువలేక తాను దిగంబరినని చెప్పుకొని దాగినాడు.  నేడు జీవము గల దేవుని ఎరిగియు ఆయన కుమారుడైన యేసుప్రభువు యొక్క జన్మచరిత్రను ఆకళింపు జేసుకొని, ఆత్మపూర్ణుడై ఏసు వలె జల బాప్తిస్మంలో భాగస్వామియై రొట్టె ద్రాక్షారసరూపంలో ఆయన శరీర రక్తములను ఆరగిస్తున్న విశ్వాసి ఒక శుభముహుర్తాన మంచిఛాన్సు దగిలి గొప్ప, ఉద్యోగము లేక రాజకీయములో యమ్‌.ఎల్‌.ఏ గా గెలుచుట యమ్‌.పి గా గెలుచుట లేదా ఎన్నికలలో పోటిచేయుటకు ఛాన్సు దగిలినపుడు! నాడు ఆదామువలె చెట్లచాటున నుండిగాక; తన దిగంబరత్వాన్ని లోకములో ప్రతి చోట తెలిసికోవాలనే ఉద్దేశ్యంతో వార్తాపత్రికలలోను లోక అధికారుల ఎదుటనుః నాడు అంజూరపు కచ్చడములు కట్టుకున్న ఆదామువలె గాక సందర్భాన్ని బట్టి ఖద్దరు బట్టలు లేకపోతే ఫుల్‌ సూట్‌ ధరించి టక్‌ చేసుకొని, నేను హరిజనుడనని ధీమాగా అనేక సర్టిఫికేట్లను కరణము మున్సపులచే తను మండలాధికారులచేతను సృష్టించి తాననుకున్న విధంగా పదవినలంకరించి వాహనాల నెక్కి, వీర విహారం చేస్తున్న క్రైస్తవ విశ్వాసులను నేడు జన బాహుళ్యంలో చూస్తున్నాము.  ఏమిటీి వైపరీత్యము.        

        ప్రభువునందు ప్రియసోదరీ!సోదరా!  ఆదిలో ఆదాము అపరాధము జేసి దేవుని సన్నిదిలో సతీసమేతంగా దాగినాడు.  అందుకు దేవుడు నరునిపై కటాక్షించి నరునికున్న దిగంబరత్వాన్ని తొలగించుటకు తన రక్షణాయుతమైన చర్మపు దుస్తులు వారికి తొడిగించినట్లు వేదములో చదువగలము.  నేడు దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క జనన మరణముల నెరిగి పరిశుద్ధగ్రంధమను వేద పారాయణము జేయుచు నిజదైవ సత్యాలను పఠించి తెలిసికొని మరియు దైవదాసుల సావాసములో బోధలను వారి యొక్క దైవ హెచ్చరికలను వింటు దేవాలయమునకు వెళ్ళుచు ప్రభువు యొక్క బల్లను ఆచరించుచు, విశ్వాసుల జాబితాలో చేర్చబడి విశ్వాస జీవితములో జీవిస్తున్న క్రైస్తవ కుటుంభము లోకము దాని ఆధిపత్యము భోగభాగ్యము స్థిరచరాస్థులు పదవులనాసించి తన తన కుటుంబానికి స్థిరమైన భవిష్యత్తు కావాలని కాంక్షించి క్రైస్తవ్యమునుండి తొలగి లోకసంబంధంగా మార్చబడుచున్న మన సోదరుల సంగతి ఆలోచిస్తే నేటి ఆదాము కుమారుడు చేయుచున్న క్రైస్తవ రాజ్య ద్రోహము ఖాతుకము అపరాధము ఓర్వలేనటువంటి దోషమును గూర్చి మనమెంతయో విచారించవలసియున్నది.

        నాటిఆదాము దేవుడు తినవద్దనిన భూఫలాన్ని తిన్నాడు. అదియే ఆతడు చేసిన దోషము ఆదోషమును దేవుడు దైవ వ్యతిరేకక్రియగా భావించి శపించెను. నాడు ఆదాము తినినది మంచి చెడ్డల తెలివినిచ్చు భూఫలము.  నేడు ఆదాము సంతతియైన మనము క్రైస్తవులముగా మారి భుజించుచున్నది.  నాడు ఏదేను వనములో వన మధ్యలో నాటబడిన జీవవృక్షమైన క్రీస్తు యొక్క శరీరమును అనగా జీవవృక్షఫలములను రొట్టె ద్రాక్షరసరూపంగా పవిత్రంగా భుజించుచున్న వారమై పై విధంగా క్రైస్తవ సావాసమునకు దూరమగుచున్నామంటే, మనకు దేవుడు ఆదామన కిచ్చిన శిక్షాలేకపోతే యూదా ఇస్కరియోతుకు విధించబడిన శిక్షా.  ఏ శిక్ష మనకు దైవత్వం విధించగలదో మనలను మనమే ప్రశ్నించుకోవలసిన సమయమాసన్నమైయున్నది.

        ప్రభువనందు ప్రియసోదరీ!సోదరా!  ఆదాము కాలము అజ్ఞానకాలము అనగా భాష లేదు.  జ్ఞానము లేదు వేదము వేదసాహిత్యము లేదు.  కనుక ఆ అజ్ఞానకాలమును దేవుడు గుర్తించి చూచి చూడనట్లుగ అప్పటి నరుని క్షమించెను.  ఇపుడైతే అనగా క్రీస్తు లోకానికి వచ్చి ఆయన యొక్క దైవత్వాన్ని నిరూపించి, ఎన్నియో దైవమహత్తర కార్యాలను జనుల మధ్య జరిగించి మరణ పునరుత్థానుడై సర్వలోకానికిని సువార్త ప్రకటించమని తన విశ్వాసులకాజ్ఞాపించి తన విశ్వాసులను తనతో కూడా తీసుకొనిపోవుటకు తిరిగిరానైయున్నాడు.  కనుక ఇప్పటి క్రైస్తవుడు చేయుచున్న పాపమునకు అపరాధమునకును అంత సులభముగా క్షమాపణదొరకదని మనము గ్రహించవలసియున్నది.  అందుచేతనే నేటి క్రైస్తవ్యము అనేక శ్రమలకును పరీక్షలకును దేవుని చేత పరిశోధించబడి ఒకరి కొకరికి సంబంధం లేక ముక్కచక్కలై ప్రతిపేటలో వివిధ నామధేయములతో కూడిన సంఘములు చేరి ఆలయములు నిర్మించి, ఒకరికొకరికి ఐక్యతలేక క్రీస్తులో ఐక్యముగా జీవించాల్సిన సంఘములుః-''మన మందరము ప్రభువుబిడ్డలము ప్రభువులో మనమందరము ఐక్యతగా జీవించాలని పైకి ప్రకటించుచు''మందను చెదరగొట్టి విభేదములను సృష్టించి ఎవరివరకు వారే నీతిమంతులమని విశ్వాసులమని నీతిమంతులసంఘమని చెప్పుకొంటున్న సమయమిది.  ఇట్టిసమయములో దేవుడు ఇంకను ఓర్పువహించి నరులను బహు క్షుణ్ణముగా పరిశీలిస్తున్నాడు.  

        నాటి ఆదాము దోషియైనపుడు దేవుడు చర్మపు చొక్కాలను అనుగ్రహించెను.  నేటి ఆదాముకుమారుడు దోషియైతే దేవుడు చర్మపు చొక్కాయకు బదులుగా నరకాగ్ని మంటలతో నరునికి విధించబడునట్టి శిక్షను గూర్చి ప్రకటన గ్రంధములో చదువగలము.        

        ప్రభువనందు ప్రియసోదరీ!సోదరా!  ఇది ఆదాము యుగము కాదు.  మోషేయుగము కాదు.  ఏలియా యుగముకాదు.  ఏసుప్రభువు యుగము కాదు.  ఏసుప్రభువు వాగ్దానము జేసిన పరిశుద్దాత్మ యుగము ఇపుడు క్రియజేయుచున్నది.  ఎందుకంటే ఏసుప్రభువు యొక్క రెండవ రాకడలో ఆయన ఎన్నుకొనబోవు పరిశుద్ధమైన యెరూషలేమను వధువు సంఘమునకు మనలను యోగ్యులుగాచేయుటకు కావలసిన తర్బీదు దానికి ఉండవలసిన యోగ్యతలను గూర్చి క్రీస్తు రాకడలో క్రీస్తు ముద్ర ధరించిన విశ్వాసులకు జరుగబోవు సన్మాన సత్కారములను గూర్చిన తర్భీదును పరిశుద్దాత్ముడు క్రైస్తవులైన మనకు ఇచ్చుచున్న సమయమిది.  ప్రతివ్యక్తియు క్రైస్తవ్యాన్ని గూర్చి క్రీస్తులో దాగియున్న దైవసత్యాలను గూర్చి వేదము వేద సాహిత్యముల ద్వారాను, బోధకుల రేడియోల ద్వారాను వినుచున్న సమయమిది.  ఈ సమయములో నరుడు దోషియై తానేమియు ఎరుగక లేదనుట కాస్కారము లేదు ఎట్టి పరిస్థితులలో ఏ విధమైన సాకులతోను నరుడు తప్పించుకొనుటకు అవకాశము లేదు.

        ఇంతటి గొప్ప సాహిత్యము గల్గిన క్రైస్తవ్యమును సాతానుడు జీవములేని అర్థంపర్థంలేని కాకమ్మ కధలతో విగ్రహాలను వృక్షజాలాన్ని సర్పాలను చతుష్పాధ జీవులను, ఆకారములుగ జూపి నరులను విగ్రహారాధికులుగాను దైవ వ్యతిరేకులుగాను దేవునిపై తిరుగుబాటు దారులుగాను జేయుచు విగ్రహానికి దాసుడుగాని వాని ''ధనము బంగారము పొలము స్థలము పదవి ఉద్యోగము అధికారము'' వగైరా ఆశలతో క్రైస్తవ విశ్వాసిని జీవమార్గమైన క్రీస్తు నుడి తప్పించి క్రియజరిగిస్తున్నాడు.

        సాతానుకు వున్న వేదమొక్కటే, వీలున్నంతవరకు నరుని అజ్ఞానిగా చేయుటకు పురాణాలని వేదాలని ఆచారాలని సాంగ్యములని, అమావాస్యనెలపొడుపు పౌర్ణమి గ్రహణాలు నవగ్రహాలు నక్షత్ర దోషాలని వగైరా ప్రకృతి సంబంధమైనవి అడ్డుపెట్టి వాటికి లొంగని వ్యక్తిని, పై విధంగా లోకాశలతో ప్రలోభపెట్టి దైవత్వం నుండి నరుని తొలగించుటకు శాయశక్తుల శక్తి వంచనలేక తనకు జతపనివారలుగా స్వాములు బాబాలు మఠాధిపతులు పౌరోహితులు హేతువాదులు నాస్తికులు వగైరా క్రైస్తవ వ్యతిరేక కూటములను సృష్టించి ఏ నరులనైతే దేవుడు నిర్మించి సృష్టించి ఏనరుల కోసము వారిమనుగడకు శ్రమపడెనో ఆ నరులనే భ్రష్టత్వము జేయుటకు అపవాది కూడా నరులలోనే పై విధంగా కొందరి నేర్పరచుకొని శాశ్వతంగా దేవునికిని నరునికిని విరోధమేర్పడాలని దైవరాజ్యంలో నరులకు ప్రవేశము వుండకూడదని, అపవాది రాత్రింబగళ్ళు భూమిపై క్రియ జరిగిస్తు శ్రమపడుచున్నాడు.

        ఈ పుస్తకమును చదివిన నీవు ఏ విధంగా తీర్మానించుకున్నావు? ఏ కూటమిలో చేరియున్నావు? చివరిగడియల్లో నీవు కోరుకోబోవునట్టి స్థలమేది? నీ పదవిలోకసంబంధమైనదా? లేక పరలోకసంబంధమైనదా? ఏ పదవి నీవు పొంది అలంకరించుకోవాలనుకున్నావో ఆ భాద్యతనీకే ఈ సమయములో దేవుడు నీకు అప్పగించియున్నాడు.  ఏసు రాకడలో ఎత్తబడుసంఘములో నీవుండదలచుకొంటే అంతము వరకు పోరాడు అట్లుగాక లోకపదవులకోసము ప్రాకులాడు చున్నావా? అట్లయితే లోకాధికారికి జరుగబోవు శిక్షలో నీవు పాలుపొందగలవు.

        దేవుడైన యెహోవా సృష్టించిన జంతు జాలములో సర్పము యుక్తిగలది.  కాని అయితే ఇది జీవేగాని ఆత్మయుతమైనది కాదు.  నరులను పాపములో ప్రవేశింపజేసినంతవరకు ఇది మామూలుగ భూజంతువుగానే యుండినది.  పరిశుద్ధవనములో నరుని యొక్క నిర్విచార జీవితమునకు నిర్భయ జీవితమునకు కన్నెర్ర జేసిన అపవాది ఆత్మ కనుక తన కంటూ దృశ్యముగా వుండి వారిని మోసగించి దైవాజ్ఞను అతిక్రమింపజేయుటకు ఒక శరీరాన్ని అన్వేషించాడు.  ఎందుకంటే అపవాది శరీరుడు కాడు-అపవాది కూడా ఆత్మయే! ఆత్మ శరీరమును పొందాలంటే పరకాయ ప్రవేశము చేయాలి.  అంతేగాని పరమాత్మునివలె స్వయంభువత్వమయముగా శరీరాన్ని పొందుట దుర్లభము.  ఇట్టి సమయములో అపవాది ఆత్మ యొక్క ప్రణాలికలో అన్ని విధాలుగ ఉపయోగకరమైనటువంటి గుణాతిశయముల యోగ్యకరముగా వుండుటకు సర్ప రూపము చోటు చేసుకొన్నది. కనుక సాతాను ఆత్మ ఆవేశించిన సర్పము మానవ భాష మాట్లాడుటన్నది నారికి అనగా స్త్రీకి ఆశ్చర్యమును నమ్మకమును కల్గించింది.  అందువలన స్త్రీ సర్పవాక్కులకు చెవినిచ్చి హృదయవిశ్వాసము పొందింది.  కనుక అపవాది యొక్క ప్రయత్నము నిరాటంకముగా నెరవేరింది.

        అలాగే ఏసు ప్రభువు యొక్క శిష్యులలో ఒకడైన యూదా ఇస్కరియోతులో అపవాది ఆత్మ ప్రవేశింపబట్టియే అతనికి దైవ కుమారుని యొక్క మహిమ కనుమరుగౖైెనది.  అంటే యూదా యొక్కనిర్ణయము వెండి నాణెముల మీద నున్నది. కాని పరమ గురువైన  ఏసు క్రీస్తు మీద లేదు.  అపవాది ఆత్మ ఆవేశము వెండి నాణెముల ప్రభావము రెండును ఏకీభవించి యూదాలో క్రియజరిగించినందున ఏసుప్రభువును యూదా ముద్దుపెట్టుకొన్నప్పటికిని ఏసులోని ప్రభావము యూదా మీద క్రియజరిగించలేకపోయింది.  అలాగే ఆదాము లేక ఒంటరిగా వున్న హవ్వ సర్పవాక్కులకు చెవినిచ్చి హృదయవిశ్వాసముతో దేవుడు నిషేధించిన ఫలములు తాను తినినపుడు నిషేధఫలముతో బాటు సర్పము యొక్క మాటలు, సర్పమును ఆవరించిన సాతాను యొక్క ఆత్మ ఈ మూడును హవ్వలో ప్రవేశించినందున హవ్వ తన భర్తకు తినమని యిచ్చిన ఫలములను ఆదాము ప్రేమతో అందుకొని తిన్నాడంటే, ఆదాములో వున్న దైవాత్మ శక్తి దైవ ప్రభావము పరిశుద్ధత ఈ మూడును హవ్వ యొక్క అందమునకు ఆకర్షణకును బలహీనపడినందున, విచక్షణ లేకుండ ఆదాము ముగ్దుడై ఫలమును తిని దైవాజ్ఞాతిక్రమము చేశాడంటే అపవాది యొక్క ప్రభావమెట్టిదో మనము తెలిసికోగలము.

                                        జగత్‌ కిలాడి

        ప్రభువనందు ప్రియసోదరీ!సోదరా!  జగత్‌ కిలాడి అను ఈ నామధేయము చదువరియైన నీకు క్రైస్తవ ఇతిహాసములలో యిది ఎక్కడ వున్నదా? యని సందేహమును నవ్వును పుట్టించకమానదు.  ఆదిలో దేవుడు భూమ్యాకాశములను సృష్టిలోని జీవరాసులను వాటితో బాటు నరులను సృష్టించినపుడు జన్మతః నరుడు కిలాడి కాడు.  అయితే ఈ కిలాడి తనమనుగుణమెక్కడ నుండి వచ్చింది? అను ప్రశ్న నీ వెప్పుడైన ఆలోచించావా? కిలాడి అను మాటకు అర్థము జిత్తులమారి ఇక దానికి ఉపనామము వంచించుట అని అర్థాలున్నవి.        

        నరులలో ఈ జిత్తుల మారి గుణము ఆదిలో లేనే లేదు. దేవుడు నరుని సృష్టించిననపుడు నీతితోను పరిశుద్దతతోను నిరాడంబరముగాను దిగంబరులుగాను అమాయికులు గాను సృష్టించినట్లు వేదములో మనము చదువగలము.  ఇట్లున్న నరసృష్టికిని లోకసృష్టికిని నరజ్ఞానమునకును లోకజ్ఞానమునకును తుదకు లోకమును పరిపాలించు రాజ్యాంగమునకును, ప్రభుత్వ ఉచిత వైద్యశాలల్లోను ప్రభుత్వ కార్యాలయాల్లోను కర్మాగారాల్లోను యంత్రాగారాల్లోను కుటుంబాల్లోను ఒక తల్లి దండ్రి కడుపున పుట్టిన రక్తసంబంధీకుల్లోను సహితము ఆఖరుకు దేవుని సంఘములుగా చెప్పుకొనుచున్న దైవ సంస్థల్లోను, దైవదాసుల మని చెప్పుకొను స్వాములు బాబాలుపాస్టర్లు బోధకులు పూజారులు వగైరా దైవపూజాదిక్రియలు జేయు యాజకులలో సహితము, ఈ వంచకత్వము ఈ జిత్తులమారి గుణము  బహువిధరీతులుగా ప్రపంచమంతట దైవమార్గమునకు పల్లేరుగా ప్రాకి, అడుగడునకు కంటకమై క్రియజరిగిస్తున్నట్లు ఈ క్రింది వేదభాగముల ద్వారా మనము తెలిసికోగలము.

        ప్రభువనందు ప్రియసోదరీ!సోదరా!  గురిగింజకు ముడ్డికింద ఏ విధంగా నల్లమచ్చవున్నదో భూసృష్టిలో దేవుడు తన సృష్టియావత్తును నిష్కల్మషమైనదిగాను నిర్దోషమైనదిగాను ప్రశాంతమైనదిగాను దైవత్వమును మహిమపరచునదిగాను చేసినప్పటికిని, తాను సృష్టించిన ప్రాణికోటి అంతటిలోను సర్పజాతికి కిలాడి తన మనగా జిత్తుల మారి తనమన్న గుణమును గల్గించినట్లు ఆదికాండ 3:1లో చదువగలము.  ఈ విధంగా సర్పము మానవ భాషతో మాట్లాడి  స్త్రీని మోసగించిన విధానమును గూర్చిన విషయమును ఈ అధ్యాయంలో మనము చదువగలము.  మధురమైన కంఠారావముతో నరవంచకములైన మాటలకు వంటరియైయున్న స్త్రీ ముగ్దురాలైచేసిన నిషేధ ఫలభక్షణము, జగత్‌కిలాడియైన సర్పము యొక్క గుణమునకు నరకోటిలో పునాది వేయబడినట్లు ఇందును బట్టి మనము గ్రహించగలము.  ఇట్టి మోసకరమైన వంచకత్వముతో జరిగించిన క్రియను బట్టి ప్రకటన గ్రంధము 20:2 ఈ సర్పమునకు వున్నటువంటి బిరుదును మనమీ సందర్భంలో తెలిసికోవలసియున్నది.

        ప్రభువనందు ప్రియసోదరీ!సోదరా!  సర్పము యొక్క కిలాడి తన మెలాంటిదంటే ఆదికాండ 3:లో దేవుడు సర్పమును శపించి దాని రెక్కలు కాళ్ళను రాలగొట్టి పొట్టతో ప్రాకునటువంటి దుర్ధశకు గురిజేసినను, దాని యొక్క జిత్తులమారి తనము అనగా కిలాడితనమను గుణము : దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన పండు యొక్క ప్రభావము ఇవి రెండును ఏకమై దేవుని యొక్క జీవమును ఆత్మను పొందిన నరుడు దైవత్వముతో సావాసము చేసిన నరుని జీవితమును అప్రతిష్టపాల్జేసి మరణ పాత్రునిగా జేసి శాపగ్రస్థమైన జీవితము తరతరములనుభవించునట్లుగా నరుని యొక్క జీవితమునుదిగజార్చిన ఈ సర్పము మూగయై మట్టితింటు కప్పలను తొండలను పక్షులను ఫలహారము చేస్తూ-ఒంటరి జీవితములో వున్నను; దీని కిలాడి తనము అనగా తొలుత ప్రయోగించిన ఆగుణము నరులలో బహుముఖములుగా వ్యాపించి ఒకవైపున విషజంతువుగాను మరియొక్క వైపున దేవునిగాను ఈ సర్పచరిత్ర భూమిపై నిలచియున్నది.

        ప్రభువనందు ప్రియసోదరీ!సోదరా!  కాళ్ళు ఱెక్కలు ఊడగొట్టుకొని పొట్టతో ప్రాకి భుజంగమను పేరుతో వున్న ఈ సర్పము తన పతనావస్థను గుర్తింపనేరక అహంకారియై పడగవిప్పి ఉవ్వెత్తునలేచి బుసలు కొట్టుచు ఊగుచు నేను సుబ్బరాయుడననియు, నేనే మీదేవుడననియు మీకు లౌకిక జ్ఞానమును గల్గించిన గురువును; మంచి యేదో చెడు ఏదో తెల్పినట్టి జ్ఞానిని; నేనే దేవుడననియు, వేరే దేవుడు లేడనియు నన్ను కొలిచినట్లయితే మీకు అనేక మేలులు శుభములు కలుగుననియు; నన్ను కొలవని పక్షమున అనేకారిష్టాలు కల్గుననియు అన్నట్లుగాః రౌద్రాకృతిలో ఈ సర్పము నాగేంద్రుడు నాగదేవతనియు సుబ్బరాయుడు ఆదిశేషుడనియు వగైరా పేర్లతో-నేటికిని జనులను మోసగిస్తూ దీని వంచకత్వము అనగా జిత్తుల మారి గుణమును క్రియజరిగించి విశ్వమంతయు వ్యాపింపజేసి, దేవుని సన్నిధిలో 14వ కీర్తన 2:4 కీర్తన 53: 3-4 రోమా 3:11 మరియు 23 లో వలెనుః ప్రతివానిలోను ఈకిలాడి తనము జిత్తులమారి గుణమున్నదని వేదరీత్యా మనము తెలిసికోగలము.

        సర్పము మూగయైయుండి పిరికియై వికలాంగియై జనకోటికి దూరముగ ఒంటరి జీవితము జీవిస్తున్నను ఆది సర్పము ద్వారా ఆది నరులనుండి ప్రాకిన ఈ జిత్తుల మారి తనము ఈ కిలాడి తనమను గుణము మాత్రము దినదిన ప్రవర్థమానమై పాము నాలుకల వలె చీలి ప్రపంచము నలుమూలల వ్యాపించి స్త్రీ పురుషులలో సైతము ఏకరీతిగా క్రియజరిగిస్తున్నట్లు, వేదములో పాత నిబంధనలోను క్రొత్తనిబంధనలోను నేటి తరము వారమైన మనలోను ఏయేరీతుల క్రియజరిగిస్తున్నదో తెలిసికోగలము.

        ఆదిలో స్త్రీ ద్వారా సర్పము ప్రయోగించిన ఈ జిత్తుల మారి తనమను గుణము మొదట స్త్రీలోను తర్వాత పురుషునిలోను తర్వాత పశుపక్ష్యాదుల  లోను ఈ కీడు ప్రాకినట్లుగా మనము ఈ క్రింది జంతుజాలముల యొక్క గుణాతిశయములను బట్టి తెలిసికోగలము.  నక్కః- దీని నుండి ఇది జిత్తులమారియని మన పూర్వీకులు అనేక కధల ద్వారా చెప్పుకొనుచుందురు.  రెండవది పిల్లిః-ఇది పొంచి నయవంచకంగా బహుచాకచక్యముతో కోళ్ళను ఎలుకలను కోడిపిల్లలను పావురాలు వగైరాలను వేటాడుతుంది.  ఇదే విధంగా పిల్లిజాతికి చెందిన పులి సింహము చిరుత జంగుపిల్లి వగైరాలు. ఇంక పక్షిజాలములో కాకి గ్రద్ద కొంగ-ఇది ఒంటికాలి జపము చేసినట్లుగా నిలువబడి చేపలు తనను సమీపించినపుడు గుటుక్కున మ్రింగుతుంది. కాకులు సైతము మోసము జేసి పిల్లల చేతులలో వున్న ఆహారమును తస్కరిస్తుంది.

        ప్రభువనందు ప్రియసోదరీ!సోదరా!  దేవుడు ఏదేనులో సృష్టించిన పశుపక్ష్యాదులలో వేటికిని ఇట్టి గుణాతిశయము లుండినట్లు అప్పటి సృష్టిలో లేదు.  ప్రతి దానిని పవిత్రంగా నిష్పక్షపాతంగా ఐక్యతగా జీవించినట్లు దేవుడు ఏదేను వనములో జంతు కోటిని సృష్టించినట్లు జింకలు జింకపిల్లలు ఆవులు ఆవు దూడలు; గేదెలు గేద దూడలు; గుఱ్ఱము గుఱ్ఱపు పిల్లలు; గాడిద గాడిద పిల్లలు; వగైరాలు సింహాలు పులులు ఎలుగుబంట్లు వాటివాటి పిల్లలతో అవి యన్నియు సఖ్యతగల్గి ప్రేమతో ఒకదానికొకటి చుంబనము గల్గిఅనగా ముద్దుపెట్టుకొంటు సఖ్యతగా జీవించినట్లు బైబిలులో మనము చదువగలము.  ఇట్లున్న సృష్టి జీవితము సర్పము యొక్క ఈ జిత్తులమారి గుణము చేత రౌద్రమై భీకరమై సృష్టిలోను మానవునిలోను కూడా విచ్చిన్నకరముతో కూడిన భయాందోళన జీవితానికి మూలమైనట్లు మనము గ్రహించవలసియున్నది.

        ఇట్లు సర్పము ద్వారా సంక్రమించిన జిత్తులమారియను గుణము మొట్టమొదటగా హవ్వ ద్వారా క్రియజరిగించి విస్తరించి ఆది 6:1లో వలె నరుల కుమార్తెలనబడు వారిలో ప్రవేశించి, ఈ జిత్తుల మారి గుణము నయవంచకములతోను వ్యవహరించి దేవుని కుమారులను మోసగించి పాపమును కిలాడితనమును భూమిపై విస్తరింపజేసి, దైవోగ్రతకు నరులను గురిచేయునంతగా క్రియజరిగించినట్లు వేదభాగములో మనము చదువగలము.        

        రాహేలు తండ్రి యింట నుండి విగ్రహాలను దొంగిలించి ఒంటేగంతపై కూర్చుండి తన తండ్రి ఇంటివారు తనను పరీక్షించు సమయములో నేను కడగావున్నావని బొంకుట.  సంసోను భార్యఇంటి సంబంధీకులైన పెద్దలకు పొడుపు కధవేయగా దాని యొక్క భావమును చెప్పలేకపోయిన పిలిష్తీయుల యొక్క ఒత్తిడికి ఆ పిలిష్తీయ సుందరి సంసోను భార్య నయవంచకముతో ఆ విప్పుడు కధ భావమును తెలిసికొని తన స్వకీయులకు చెప్పి సంసోనును ఓడించి పరాభవించుట.  అటు తర్వాత సంసోను యొక్క మహాబలమును గూర్చిన మర్మమును గాజాలోని వేశ్యయైన డలైలా నయవంచకముతో ఆ మర్మమును తెలిసికొని ఆతని పిలిష్తీయులకు పట్టిస్తు అందునిగ చేయుట.  అను సంఘటనలు స్త్రీ జాతిలో ఈ జిత్తుల మారి గుణము ప్రాకిన విధానమును బట్టి మనము తెలిసికొనగలము. రిబ్కా ఏశావుకు చెందవలసిన ఆశీర్వాదములను తనకుమారుడైన యాకోబు పొందాలని ఆసించి భర్తను వంచించి యాకోబుకు మేక తోలు గప్పించి ఏశావుగా అంధుడైన తండ్రికి చూపించుటనునది ఈ సందర్భంలో గమనార్హము.        

        ప్రభువనందు ప్రియసోదరీ!సోదరా!  ఇవి పాతనిబంధనలో స్త్రీలలో సర్పము యొక్క కుయుక్తి క్రియజరిగించినట్లు మనము తెలిసికొన్నాము.  ఇంక పురుషులను గూర్చి తెలిసికొందము.  దేవుడేర్పరచుకున్న పరిశుద్ధజనమైన ఇశ్రాయేలులలో అనేక మార్లు ఈ సర్పకుయుక్తి గుణము చేత దైవమార్గమునుండి తొలగి, సర్పసమాజము వారైన పిలిష్తీయులకును ఐగుప్తీయులకును బానిసలై వెట్టిచాకిరి చేసినట్లు చదువగలము. ఆదినములలో సర్పసమాజములో సర్పకుయుక్తితో జీవించిన వారిలో పిలిష్తీయులు ఆరామీయులు మోయాబీయులు అమ్మోరీయులు, పారసీకులు తూర్పుదేశపు రాజులు వగైరాల చరిత్రను మనము చదివినపుడు వారిలో క్రియజరిగించినది ఈ ఆది సర్పమైన కుయుక్తి గుణము. ఇట్టి కుయుక్తి గుణము చేత దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను సైతము బానిసలుగా జేసుకొని వారిపై పెత్తనము చెలాయించినట్లు చదువగలము.

        మరి యొక్క గొప్ప విశేషమేమిటంటే ఇశ్రాయేలీయుల నాయకుడైన మోషే సీనాయి కొండమీద దేవునితో 40 దినములు మాట్లాడుచు కాలాతీతము చేసినపుడు అనగా జాగుచేసినపుడు; దేవుని జనమైన ఇశ్రాయేలీయులు మోషే అన్నయైన అహారోనును పట్టుకొని వేధించి బాధించి విసిగించగా ఆతను అలౌకిక శక్తి గుణమైన సర్పగుణమునకు దాసుడై జరిగించిన దూడ నిర్మాణ క్రియను గూర్చి చదువగలము.  ఈ విధంగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను చెరపట్టుటకును హింసించుటకును వారిని దైవత్వం నుండి తప్పించుటకును ఈ సర్పము యొక్క కుయుక్తిగుణము సర్పనాలుకవలె అనేక వక్రమార్గములతో క్రియజరిగించినట్లు మనము వేదములో చదువగలము.  ఇస్సాకుకుమారుడైన యాకోబులో కూడ ఈ వంచకత్వమన్నది క్రియజరిగించ బట్టి తండ్రి ఆశీర్వాదమును పొందగల్గెను.  అనగా అన్నకు చెందవలసిన ఆశీర్వాద ఫలములను తల్లితో ఏకీభవించి యాకోబు నయవంచన ద్వారా తండ్రిని మోసగించి తల్లి సమేతంగా జరిగించిన క్రియను చదువగలము.  అదే విధంగా మెర్దెకయ్యను ఉరి ఎత్తాలని పారసీ రాజును అంతము జేసి తానే మెర్దెకయ్యను యూదా జనాంగమును ఒక్కని కూడా వుంచక నిశ్శేషంగా రాజాజ్ఞప్రకారం అంతము జేసి తుదకు రాజును కూడా అంతము జేసి, తానే రాజ్యపరిపాలన చేయాలని బహుముఖవంచకుడైన హామాను చరిత్రను అతనికి జరిగినట్టి శిక్షను గూర్చి ఏస్తేరు గ్రంధ వేదభాగములో మనము చదువగలము.  తనకుమార్తె భర్తయు తనకు అల్లుడైనట్టి దావీదును తన స్వకీయుడని తలంపక నీయక అపవిత్రాత్మను ఈ సర్పము యొక్క ప్రతిరూపము దాని గుణము సౌలు నావేశించి దావీదును చంపుటకు ఈటెను బాణములను కత్తులను విసరుటన్న విషయాన్ని గూర్చి వేదములో చదువగలము.  మహాచక్రవర్తిగ పేరు పొందిన దావీదు రాజు సైతము ఇట్టికుయుక్తి గుణము చేత తనను నమ్మిన బంటుయైన ఊరియా భార్యనాసించిన వాడైః నిర్దోషియు నమ్మకస్థుడైన తన సేవకుని నిర్దయతో కుయుక్తితో యుద్దరంగమందు చనిపోవునట్లుగా క్రియజరిగించుటన్నది ఈ సర్పము యొక్క గుణము దాని వంచకత్వ స్వభావమైయున్నది.

        ఇంక దావీదు కుమారుడైన మహాజ్ఞానియైన సొలొమోను మహారాజు గొప్ప దైవజ్ఞానము పొందినవాడై యుండి జ్ఞానము మితిమీరి అజ్ఞానంగా మారి కామాంధుడు కాగా ఈ సందర్భంలో సర్పము నావేశించిన ఆత్మ సొలొమోనును కూడా ఆవేశించి; మోయాబీయులు అమ్మోరీయుల కన్నెలనుః దేవ గందర్వుల కన్నెలుగా సొలొమోను దృష్టికి ఆకర్షింపజేసి ఆ కన్నెలను సొలొమోను యొక్క దైవత్వాన్ని మానవత్వాన్ని ఆత్మను దేహాన్ని రాచరికాన్ని యావత్తును గులాములుగా జేసి; యెహోవా చిత్తమును నెరవేర్చి ఆయనకు బలులర్పించవలసిన వాడు; యెహోవాకు మందిరము కట్టినవాడు ఆయనను బహుగా స్తుతించి ఘనపరిచినవాడుః తనను తాను పూర్తిగా స్త్రీ దాసునిగా మార్చుకొనుటనునది ఈ సర్పము యొక్క కుయుక్తి వంచనయను గుణమే కారణమని మనము గ్రహించవలసియున్నది.  యెహోవాకు  ఏస్థలములో అయితే మందిరము కట్టెనో ఏ స్థలములో ఆయనకు బలులర్పించెనో-ఆ మందిరమునకు పోటిగా అనగా వ్యతిరేకముగా ఆ మందిరము ఎదుటనే అన్యదేవతలైన మోయాచీయులు అమ్మోరీయుల దేవతలకు బలిపీఠములు కట్టి బలులర్పించాడంటే  సర్పము యొక్క వంచకత్వమనునట్టి గుణము అనగా కిలాడి తనము సొలొమోను వుంచుకొన్న ఆ స్త్రీలలో ఎంత ఘాటుగా క్రియజరిగించిందో మనకు తెలియగలదు.

        అదే విధంగా నూతన నిబంధన కాలంలో క్రీస్తు జన్మకాల సందర్భములో ఈ సర్పము ఉగ్రరూపము దాల్చి హేరోదులో ప్రవేశించి జ్ఞానులతో మీరు వెళ్ళి ఆశిశువు బోగట్టా తెలిసికొనగానే నేనును వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తీసుకరమ్మని చెప్పి వారిని నయవంచకపు మాటలతో అనగా లోపట విషము వాక్కులో తీయదనము ప్రవర్తింపజేయుట గమనార్హము.  ఇదియే సర్పవిషము సర్ప వాక్కు.  ఆజ్ఞానులు ఎంతకును రాకపోవుసరికి హేరోదులో దాగియున్న విషసర్ప స్వభావం ఉగ్రరూపము దాల్చి శిశుసంహారము చేయుటకు బూను కొనుట ఈ సర్పస్వభావమునకు తార్కాణమైయున్నది.

        ఇంక క్రీస్తు చరిత్ర కాలంలో రాణువులు, శాస్త్రులు పరిసయ్యులు సద్దూకయ్యులు న్యాయాధిపతులు వగైరాలలో కూడా ఈ సర్పగుణ స్వభావమున్నట్లును అట్టి స్వభావముండుట వల్లనే ఏసు ప్రభువును పట్టుకొనుటకును ఆయన మీద దోషారోపణ చేయుటకును, సమయమును వెదకుచు వారివల్ల కాక ఏసుప్రభువును పట్టుకొనుటకు నయవంచకతతో ఆయన శిష్యులలో ఒకడైన యూదాకు ద్రవ్యమును ఎరగా చూపి ఆతనిని లోగొట్టుకొనుటయు, అతడా వెండి నాశించి నయవంచకత్వముతో యూదులకు పట్టించుటయు క్రొత్తనిబంధన చరిత్రలో సర్పగుణమైన వంచకత్వము యొక్క క్రియావిశేషమైయున్నది.  అయితే నేడు జగత్‌ కిలాడియైన సర్పము యొక్క గుణాతిశయములు ఏయే రూపముగా క్రియజరిగిస్తున్నవో లోకచరిత్రలను బట్టియు, లోకములోని సంఘచరిత్రలను బట్టియు లోకరాజ్య పరిపాలనా విధానముల లోను, ఏయే విధముగా క్రియజరిగిస్తున్నవో ఈ క్రింది అంశముల ద్వారా తెలిసికోగలము.

        ప్రభువునందు ప్రియసోదరీ!సోదరా!  ఇందును బట్టియే ఏసుప్రభువు తన శిష్యులను సువార్తను ప్రకటించుటకు పంపిస్తు తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపించునట్లు నేను మిమ్ములను పంపిస్తున్నాము.  పాములవలె వివేకులును పావురముల వలె పరిశుద్ధులుగాను వ్యవహరించమన్నట్లు నూతన నిబంధన వేదభాగములో మనము చదువగలము. లోకములో ఈ జిత్తుల మారి తనము వంచకత్వమన్నది ఏసుప్రభువు కాలములో కూడా ఆయన సమక్షములో క్రియజరిగించినట్లు వేదములో చదువగలము.  శాస్త్రులు పరిసయ్యులు సద్దూకయ్యులు వగైరా అధిష్టాన వర్గము ప్రభువుతో బహునయగారముతో వంచన కపటోపాయములతో మాట్లాడినట్లును ఈ సర్పగుణము ఏసుక్రీస్తు శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదాలో ప్రవేశించి వంచనతో కూడిన పలుకులతో కిరాతకులకు పట్టించినట్లు వేదములో చదువగలము.

        ప్రభువనందు ప్రియసోదరీ!సోదరా!  పాతనిబంధన కాలముకంటెను నూతన నిబందన కాలములో ఈ సర్పగుణమైన జిత్తులమారి తనము బహురీతులుగా క్రియజరిగించిననునేటి తరము వారమైన మనలో మన ఎదుటను  మననావరించియున్న వాతావరణాన్ని సృష్టిని పాడుజేయుచున్నట్లు ఈ క్రింది అంశముల ద్వారా తెలిసికొనగలము.  రాజ్యాలే ప్రభుత్వాన్ని ఈ జిత్తుల మారి సర్పగుణములంచములతోను ఎదుటివాని ఉద్యోగభ్రష్టునిగా చేయుట యందును లేక ట్రాన్స్‌ఫర్‌ అనగా బదలీ చేయుటకును కుట్రచేయుట, ఉద్యోగములో లంచాలు కోరుట వగైరాలు.  నేరస్థులు పట్టుబడిన వాని నుండి ద్రవ్యరూపమున లంచము పట్టుట.  ప్రతి చిన్నా పెద్ద విషయము లోను ఈ సర్పగుణముధనాశను చూపి ప్రభుత్వోద్యోగులలోను ఆఫీసరు మొదలుకొని జవానులో వరకు క్రియజరిగించి విజయతాండవమాడుచు, నేటి రాజ్యపరిపాలనలో విహరిస్తున్నట్లు నేడు మనరాజ్య పరిపాలకుల యొక్క పరిపాలనా విధానములు మనకు వివరిస్తున్నవి, ఇంక రాజ్యపదవులలో కౌన్సిలర్‌గాను సర్పంచ్‌గాను యమ్‌.ఎల్‌.ఏ గాను యమ్‌.ఎల్‌.సి గాను లేక యమ్‌.పి.గాను పదవినాసించి ప్రాకులాడు వ్యక్తిని ఈ జిత్తుల మారి గుణము వానిలో ప్రవేశించి ధనాశతోను ఉద్యోగాశలు లేక స్థలభోగములను గూర్చిన ఆశలు, ఇవేవి లేక పోయినట్లయితే త్రాగుడు వగైరా  ఆశలను చూపి ఊరిలో వున్న వానిని, లేని వానిని చనిపోయిన వానిని ఓటు హక్కుకు అర్హతలేని వానిని కూడాఓటు వేయించుటకును పై చెప్పిన ఆశలను ఎరగా బెట్టి ఓటర్లను లొంగదీసుకొనుటలోను నిలబడిన అభ్యర్తి చేత, గడ్డి పోచవంటి అల్పమైన వాగ్దానాలు చేయిం చుటయు ఈ జిత్తుల మారి గుణము క్రియజరిగిస్తున్నది.  ఇంక యుద్దరంగములో శతృవును మట్టుపెట్టుటలో ఈ వంచకత్వమన్నది బహు చాకచక్యముగా యుద్దకార్యములను జరిగిస్తున్నది.

        ఇంక మతపరంగా దీని యొక్క ప్రభావము ఎట్లున్నదంటే దేవుళ్ళను పేరుతో విగ్రహాలను నిలిపి ఆలయాలు కట్టి పూజాపురస్కారాలంటూ జీవము లేని క్రియజరిగిస్తు ఫలశూన్యమైన దైవారాధనతో విగ్రహము ముందు కూర్చున్న అర్చకుని ఈ సర్పగుణము ఈ కుయుక్తి గుణము వాని చేత కొబ్బరి కాయను కొట్టించి, భక్తునికి సగము పూజారికి సగము చెరి సగముగా ఆ కొబ్బరి కాయను కొట్టించి, కొబ్బరి నీరు నేలపాల్జేసి, నరుని నిజదైవత్వంనుండి తప్పించుటకు ఈ వంచకత్వమనుగుణము బహు నైపుణ్యంగా క్రియజరిగిస్తున్నది.  నరుని జ్ఞానవంతునిగానే అను కొనునట్లుజేసి; దైవ సన్నిధిలో వానిని అజ్ఞానినిగాను పనికిమాలిన వానినిగా జేస్తున్నది.

        క్రైస్తవ సమాజములో అలనాడు క్రీస్తు శిష్యులలో చూపిన ధనాశనే చూపిస్తు ఎదుటి వ్యక్తిని కన్నులు కప్పుటకు బోధకుడు లేని సంఘాలను బాప్తిస్మము లేని మనుష్యులను ఎరగాచూపించి కూడిన సంఘానికి సంఘనిర్మితమైన గ్రామానికి తీరని శాపమును తెచ్చి పెట్టుచు, ప్రతి వ్యక్తిచేత వ్రేలు బెట్టి విమర్శించు కొనేంత హీనత్వానికి దిగజారిస్తున్నది.  అందుకే దీనిని ఆది సర్పమని ప్రకటన గ్రంధములో వివరించబడియున్నది. ఇది ఆదినుండియు నరులలో బహు చాకచక్యముగా క్రియజరిగిస్తు నేటి క్రైస్తవ సంఘాల్లో పార్టీలు, పదవులలో కోట్లాటలు, విదేశ సహాయము కొరకు ప్రాకు లాట, సందుదొరికితే సంఘాన్నే అమ్మునటువంటి తెగింపు; వున్న సంఘాన్ని లేనట్లు లేని సంఘాన్ని ఉన్నట్లు దస్తావేజులు సృష్టించి, విదేశీ దొరల సహాయము కొరక అలనాడు అపొస్త 3: 1-10 సంఘటనలోని భిక్షకుని వలె తయారు చేస్తున్నట్లు మనము గ్రహించవలసియున్నది.

        ప్రభువునందు ప్రియసోదరీ! సోదరా!  శృంగారమను క్రీస్తు యొక్క ఆలయద్వారమున వున్న మనము చీలమండల రోగివలె విదేశీసహాయము, ధనాశతో కూడినటువంటి ఆశల వైపుమనదృష్టిని మరల్చవలెనా? లేక నజరేయుడైన ఎత్తబడిన ఏసు వైపు మనదృష్టిని వుంచవలెనా?; అన్నదే; మనలను మనమే ప్రశ్నించుకోవలసియున్నది.  జిత్తుల మారి గుణమన్నది ఈ లోకమునకే పరిమితము.  దీనిని గూర్చి మొదటి యోహాను 2:16 లోకములో వున్న దంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవితడంబమును తండ్రివలన పుట్టినవికావు.  అవి లోక సంబంధమైనవే! అవి లోకానికే పరిమితమై యున్నవి.  కాబట్టి నీవు లోకసంబంధివా? పరలోకసంబంధివా? లోకసంబంధంగా నీవు జిత్తులమారివే!పరలోక సంబంధంగా జీవిస్తే నీవు జీవ గ్రంధపు జాబితాలో వ్రాయబడెదవు.  ప్రభువు నిన్ను ఆశీర్వదించును గాక!     ఆమేన్‌.

        అంశముః-లోకాధిపత్యమునకు రానైయున్న నియంతః. రెండవ ధెస్స 2: 3-4

        ప్రియపాఠకులారా!  మొదట భ్రష్టత్వము సంభవించుట అటు తర్వాత నాశన పాత్రుడగు పాపపురుషుడు బైలుపడితేనే గాని ఆ దినము రాదు'', అని వ్రాయబడియున్నది.  ఇందులో ఈ మొదటి భ్రష్టత్వము అన్నది దేనికి సంభవించుచున్నది? భూమికా? నరులకా? లోకానికా? సృష్టికా? మరి దేనికి? అనిన దానిని మనము తెలిసికోవలసియున్నది.

        ప్రియపాఠకులారా!  ఈ మొదటి భ్రష్టత్వము సంభవించిన విధానము ఆదిలో ఏదేను లోనే ప్రారంభమైనది.  దేవుడు సృష్టించిన ఈ సృష్టి ఆరుదినములు ఆయన సంకల్సములో ఆయన వాక్కును బట్టి ఆయన చిత్తానుసారము ఆయన హస్తక్రియను బట్టి నిర్మితమైనది.  ఇట్లుండగా ఏదేనులో ఈ మొదటి భ్రష్టత్వము అన్నది సాతాను అను అదృశ్య శక్తి యొక్క రూపము పామైమాట్లాడి క్రియజరిగించి, ఏదేను వనమును సృష్టిని పంచభూతాలలో, సృష్టిలో ప్రాణికోటిలో, నరజీవితములో ఈ భ్రష్టత్వమునకు ప్రారంభోత్సవరము జరిగింది.  ఈ ప్రారంభోత్సవము జరిగిన సందర్భములో సర్వసృష్టి నాశనమునకు కారకుడగు పాప పురుషుడు నాశనకారుడు సర్ప రూపములో క్రియజరిగించాడు.  దాని ఫలితము ఆది నుండి నేటి వరకును ఈ భ్రష్టత్వ కలుషిత జీవితమన్నది ప్రతి నరునిలో ప్రవేశించి క్రియజరిగించి జలప్రళయ నాశనమునకును అగ్ని గంధకములతో కూడిన నాశనమునకును దారి తీసి మారణ హోమము సాగించింది. అనగా నాశన పాత్రుడు పాప పురుషుడైనట్టి ఆది సర్పము ఏదేను తోటలో దేవుడు నరులను విచారించుచున్న సందర్భములో దేవుని ఎదుట ఈ పాప పురుషుడు సర్ప రూపము లో ప్రత్యక్షమై నరులతో బాటు సర్పము కూడా దైవశాపమునకు గురియై వికలాంగమైనట్లు వేదరీత్యా మనము చదువగలము.

        ఈ విధముగ మొట్టమొదట ఆదికాండములో పాప పురుషుని యొక్క ప్రత్యక్షత వాని భంగపాటు వివరించబడియున్నది.  వాని మూలముగ తోటకు సృష్టికి జంతుకోటికి నరకోటికి వినాశన మేర్పడింది.  ఈ భ్రష్టత్వము సంభవించిన అనంతరము పాప పురుషుడు నాశన పాత్రుడైనటువంటి  సర్పరూపుడు తన ప్రణాళికను విరమించుకోక బహు తీవ్ర తరముగ కయీను ద్వారా ప్రబలించి నరకోటిలో దేవుని యందు భయభక్తులు లేనటువంటి మరియు విధేయత లేని స్థితికి దిగజార్చి, విస్తారమైన పాపమునకు కారకుడాయెను.  అయితే దైవత్వమన్నది ఉగ్రరూపము దాల్చి ఈ పాపపురుషుని యొక్క సంతతిని సమూలముగా నాశనము చేయుటకు జలప్రళయము రప్పించి నాశనము చేసినట్లుగా చదువగలము.

        అటు తర్వాత రెండవ భ్రష్టత్వము.  దేవుడు తనకంటూ ఏర్పరచుకున్న దైవజనాంగమైన ఇశ్రాయేలీయులలో కూడా ఈ నాశన పుత్రుడు పాప పురుషుడైన ఈ ఆదిసర్పము, మారణ హోమము జరిగించుట దైవత్వము మీదకు తిరుగుబాటు చేయుట, దైవ చట్టాలను సాతాను సమాజముతో జతచేసి లైంగిక జీవితాన్ని సాగించుట; మాంస ఆశ, తిండిని గూర్చిన ఆసక్తి; విగ్రహారాధన వగైరా అవాంఛనీయమైన ఆచారాలకు వారిని దిగజార్చినాడు.  దాని ఫలితముః ఏ సర్పము ద్వారా దైవజనాంగము భ్రష్టత్వమైనదో అదే తాపకర సర్పముల ద్వారా దేవుడు సర్పసమూహములను పంపి వాటి విషప్రయోగము ద్వారా వారిపై మారణహోమము సాగించాడు-ఇది మూడవ భ్రష్టత్వము.

        4. నాశన పాత్రుడు పాప పురుషుడు అయిన వాడు యాజకులను సైతము భ్రష్టులుగ జేసినట్లు అహరోను విషయము వేదములో చదువగలము.  అంటే మోషేను గూర్చి అహరోను మీద తిరుగుబాటు జేసిన దైవజనాంగమును అవిశ్వాసములో నడుపుచు అహరోను యొక్క మూసలో ఈ ఆది సర్పము, అను నాశన పాత్రుడు బంగారు దూడనుగా అహరోను చేత చేయించి, యాజకుడైన అహరోనును అతని జనాంగమును అవిశ్వాసులుగాను దైవ వ్యతిరేకులుగాను మార్చి అహరోను వంటి యాజకుని కూడా భ్రష్టునిగ చేసిన సంఘటన చదువగలము.  అహరోను విషయములో మూసలో పోసిన బంగారు ద్రవమునకు రూపము ఇచ్చిన నాడు ఈ పాప పురుషుడేగాని అహరోను కాదు.  అయితే మూసనుండి బైటకు తీసిన తర్వాత నిర్జీవమైన దూడవిగ్రహమును అహరోనునకు దైవజనాంగమునకు ప్రత్యక్షపరచినట్లుగ ఈ సంఘటన వివరిస్తున్నది.

        చిత్రమేమిటంటే ఏదేను వనములో ప్రధమ భ్రష్టత్వ క్రియను జరిగించు సందర్భములో ఈ అపవాది భూ ప్రాణియైన సర్పమును ఆవేశించి మాట్లాడినాడు.  కాని మోషే కనబడకుండినపుడు కొండ క్రిందనున్న జనాభాకు ఐగుప్తునుండి నడిపించిన దేవుడు ఎవరు? అనిన సమస్యను అపవాది లేవనెత్తి క్రియాసంకల్పరూపముగ దైవజనాంగము చేసిన వత్తిడిని అహరోను మీద మోపి, బలాత్కరింపగ యాజకుడైన అహరోనులో సాతాను జొరబడి స్వయముగ దైవజనాంగము యొక్క బంగారమును తెమ్మని పురిగొల్పి ఆ విధముగ పోగైన బంగారమును కరిగించి మూసలో పోసినపుడు, అహరోనులో వున్న సాతాను యొక్క సంకల్ప మూలముగానే దూడ  అకారమేర్పడినట్లును, ఈ విధముగ ఏర్పడిన ఈఆకారము నిర్జీవమైయుండి జీవము గల దేవుని సైన్యమును జీవము లేని వారుగ దైవత్వము ఎదుట నిరూపించాడు.  మరియు ఐగుప్తునుండి ఇశ్రాయేలును నడిపించిన దేవుడు ఇదే అన్నట్లుగ దైవ జనాంగము చేతనినాదము చేయించాడు.  దీని ద్వారా దైవజనాంగమైన ఇశ్రాయేలు దేవుని ఎదుట భ్రష్టులుగ ఎన్నిక చేయబడినారు.

        ప్రియపాఠకులారా!   ఈవిధముగా నాలుగవ భ్రష్టత్వక్రియను నాశన పాత్రుడుగ పాపపురుషుడు జరిగించినవి.  మొదట సర్పముగాను రెండవది కయీను ద్వారాను (3)జలప్రళయము ద్వారాను (4)యాజకుని అవిశ్వాసమూలమున రూపించబడిన దూడ విగ్రహము ద్వారాను పాపక్రియతో ఈ నాశనకర పుత్రుడగు అపవాది బైల్పడినట్లు చదువగలము.        

        ఇక 5వ దిగః-ఐగుప్తు తొలిచూలి సంహారమునకు  దైవ దూత సంచారమునకు సాతానే కారకుడు.  ఎందుకనగా ప్రతి నరసంతతిలో ప్రధముని భ్రష్టత్వము చేశాడు.  ఇది మొదటి భ్రష్టత్వముః అంటే జ్యేష్టుడైన ప్రతినరుని భ్రష్టునిగ చేయుటఃమొదట ఆదాము భ్రష్టుడాయెను. ఆ తర్వాత ఆదాము కొడుకులలో కయీను భ్రష్టుడాయెనుఃఏశావు యాకోబుల ఏశావును భ్రష్టునిగ చేశాడు. మోషే అహారోనులలో పెద్దవాడైన అహరోనును భ్రష్టునిగ జేశాడు.  ఇది మొదటి భ్రష్టత్వపు క్రియ.         

        ప్రియపాఠకులారా!  ఈ విధముగ ప్రధమ భ్రష్టత్వపుక్రియను జరిగించిన సాతానుడు ఆయా సందర్భాలను బట్టి ఈ నాశన పాత్రుడును పాపపురషుడు తన యొక్క క్రియాకర్మలను బైల్పరచియున్నాడు. కాని ఈ ఐదు భ్రష్టత్వాలలో దేవుని దినము దేవుడు జరిగించిన క్రియ అని ఆయా సందర్భాలలో ప్రత్యక్షపరచబడియున్నది.

        ఇక ఈ పాపపురుషుడు నరులను వదలిపెట్టి దేవుళ్ళుగా తానే రూపములు ధరించుకొని దేవుడు అనబడు ప్రతి రూపమును ఆవేశించుటన్నది మున్మూట అరవై ఐదు రూపములలో అవతరించి వాటిని కూడా కాదని తానే దేవుడనని ఋజువుపరచుకొన్న సంఘటనలు కూడా వున్నవి.  ఈ విధముగ ఋజువుపరచుటలో వేదరీత్యా కొన్ని సందర్భాలను మనము తెలిసికొందము.

        ప్రియపాఠకులారా!  ఐగుప్తులో మోషే కఱ్ఱపడవేసి సర్పమును సృష్టించగా-ఐగుప్తులోని శకున గాండ్రు కూడా సర్పాలను సృష్టించారు.  ఇది దైవత్వమునకును సాతానునకును ముఖాముఖి పోరాటమైయున్నది.  ఈ విధముగ సాతాను ప్రత్యక్షముగ తనను కనబరచు సందర్భాలు ఇంకను మరికొన్ని వున్నవి.  ఆ తర్వాత నెబుకద్నెజరు తయారు చేయించిన బంగారు విగ్రహమును పూజించమని నెబుకద్నెజరులో చేరి చట్టాన్ని శాసించాడు. ఇంక తనను తానే హెచ్చించు కొనుటః పిలిష్తీయ యోదుడైన గొలియాతు తనను తానే హెచ్చించుకొంటు దైవజనాంగము మీద సవాలు చేసిన సంఘటన మనము చదువగలము.  యెజిబేలులో సాతాను ఆవేశించి ఇశ్రాయేలు రాజైన ఆహాబును కూడా ఎదిరించి తాను కట్టించిన బైలు అష్టారోతు అను దేవతల బలిపీఠములను ఆరాధింపజేసినట్లు చదువగలము.  ఇది యెజిబేలు యొక్క హెచ్చింపు అనగా సాతాను యొక్క అహంభావము.

        ఇక సాతాను దేవుడనని తనను కనబరచుట అనుటలో :- ప్రియపాఠకులారా!  తండ్రియైన దేవుడు ఆయన ప్రతిరూపమైన క్రీస్తు-వీరిలో విలీనమైయున్న పరిశుద్దాత్మ ముగ్గురును ఒకే దేవుళ్ళుగా వున్నారన్నది వేదసత్యము. కాని ఈ అపవాది సర్పరూపముగాను శిలారూపముగాను జంతురూపముగాను చెట్టురూపముగాను తుదకు సమాధిరూపముగాను, తనను తాను కనబరచుకొనుటన్నది నేటి నవనాగరిక యుగములో కూడా కన్నులముందు జరుగుచున్న యదార్థ సంఘటనలు.

        ప్రియపాఠకులారా!  కుమార రూపములో దేవుడు ప్రత్యక్షమయ్యాడు.  ఇది క్రైస్తవులమైన మనమెరిగియున్న నగ్న సత్యము.  ప్రియపాఠకులారా!  సాతాను తన్నుతాను హెచ్చించుకుంటున్నాడంటే ప్రత్యక్షముగా కాక పరోక్షముగా నరులలో చేరి తన యొక్క ప్రతిభను తాను ఆవరించియున్న నరుని ద్వారా జనబాహుళ్యానికి బైల్పరచుచు ప్రగల్భముగా పలుకుటన్నది మన మెరిగిన విషయమే! ఈ విధముగా తాను దేవునిగా ఎరిగించుకొన్న స్థలములు సంఘటనలు నామములు అనేకములున్నవి.

        ఇక దేవుని ఆలయములో కూర్చుండుటః ఇది చాలా లోతైన విషయము.  ఇప్పటి వరకు నిరూపించిన సంఘటనలన్నియు కూడా దైవత్వమునకు బాహ్యంగా అనగా బైట వివరించబడిన సంగతులు.  ఇపుడు దేవుని ఆలయములో సాతాను స్వయముగ వచ్చి కూర్చుండలేడుగాని, దేవుని ఆలయములో సంగస్థుల ద్వారా ఎన్నిక చేయబడిన పెద్దలు-సంఘమును కాసెడి కాపరి, ఇక విశ్వాసులైన భక్తకోటిని వారిలో ఆవరించి బలిపీఠకార్యాలలో పెత్తనము చెలాయించుటకు వీలైతే కొట్లాటలు కోర్టువ్యాజ్యములతో ద్వేషములతో క్రియజరిగించి, మందిరములోని ప్రధానాసనము అనగా బలిపీఠము మీద పెత్తనము చెలాయించుటకు ఆలయములో కూర్చుండును.  ప్రియపాఠకులారా!  ఈ సంఘటన ఈ దశ చాలా భయంకరమైనది.  దేవుని మూలముగ సంఘములో సమాధానము గాని శాంతిగాని ఐక్యతగాని లోపించి దైవారాధనకు బదులుగా వ్యక్తి పూజలు జరిపించుటకు ఉద్యుక్తుడగును. ఇది రెండవ ధెస్సః2: 3-4 లోని వచనాలలో విరించబడిన పరమార్థము.

        అంశముఃకీర్తిశేషుడుః-ప్రియపాఠకులారా!  నరుడు జీవించుకాలములో నానా విధములుగ వాని యొక్క జీవితకాలగతి జరుగుతుంది.  లోకములో నరుడు విద్యాధికుడు గాగాని ధనసంపన్నుడుగా గాని ఐశ్వర్యవంతుడుగా గాని గొప్ప పదవి కలవాడుగా గాని లేక రాజ్యాన్ని ఏలే మంత్రియో రాజో అయివున్నపుడు లోకములో అట్టివానికి చాలాప్రాధాన్యత నిస్తుంది.  బీదవానికైతే లోకరీత్యా ఎటువంటి ఘనత ప్రాధాన్యత వుండదు.  భిక్షగానికైతే ఎన్నికయే వుండదు.  ఈ విధముగా నరుల యొక్క అంతస్థులు వాటివిలువలు వుంటే-మరణానికి కూడా అంతస్థులు విలువలు వున్నవి.  ఎటువంటి ఆదరణ సహకారము అండ, దిక్కుమొక్కులేకుండ చనిపోయిన వ్యక్తి మరణావస్థను లోకము దిక్కులేని చావు అంటుంది.  మధ్యతరగతి కుటుంబీకుడైతే మరణించాడు అనిలోకము అంటుంది.  రాజకీయ నాయకుడుగా వుండి చనిపోతే అమరజీవి  అని లోకము పలుకుచున్నది.  రాజ్యాన్ని ఏలే మంత్రిగాని రాజుగాని చనిపోతే అమర్‌రహే! అదే దానకర్తగాను ఐశ్వర్యవంతుడుగా వుండి అట్టివాడు చనిపోతే కీర్తిశేషుడు. అని లోకము సంభోదిస్తున్నది.  ఇందులో లోకరీత్యా ఘనమైన మాట కీర్తిశేషుడు క్రైస్తవ్యములో మరణము సంభవిస్తే ప్రభువునందు నిద్రించిన వారు అని క్రైస్తవ మరణాన్ని గూర్చి క్రైస్తవ సంఘము ప్రవచిస్తున్నది.

        ఇంతకును ఈ యొక్క గ్రంధకర్తనైన నేను బయల్పరచిన మరణమును గూర్చిన ఈ ప్రకటనలో కీర్తిశేషులు అనిన దానికి మనము ప్రాధాన్యత నిచ్చి దీన్ని గూర్చి వివరంగా తెలిసికొందము.  ప్రియపాఠకులారా!  మరణాన్ని గూర్చిన సత్యాలు మాత్రము ముఖ్యముగా కొన్నింటిని మనము తెలిసికొందము.  ఇందులో కీర్తిశేషులు అని వ్రాయబడుట మనము పాఠ్యపుస్తకాలలోను సమాధులతోటలో సమాధి పలకల మీదను; వార్తాపత్రికలలోను రేడియోలు టి.విలు వగైరాలలో చనిపోయిన వ్యక్తిని గూర్చి వాడబడే పదమే కీర్తిశేషుడు అనిన పద జాలము. అసలు కీర్తిశేషుడు అంటే అర్థమేమిటి? అంటే పేరును మాత్రము మిగిల్చి-వ్యక్తి కనపడకుండ పోవుట అంటే వ్యక్తి లేకుండ పోవుట.నిజమే చనిపోయిన వ్యక్తి యొక్క శవము కృళ్ళి కృశించి భూమిలో లయమై పోయినను అతడు చేసిన క్రియను బట్టి అతని పేరు మాత్రమే భూమిమీద చిరస్థాయియై యుంటుంది. ఇట్టి కీర్తిశేషుల లిస్టులో ఉదా|| మన భారతదేశములోనే కొందరి మహానీయులనుఏ ఈ సందర్భములో పేర్కొందము. గాంధీమహాత్ముడు, జవహార్‌ లాల్‌ నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ ఆంధ్రరాష్ట్రమును సంపాయించి పెట్టిన పొట్టి శ్రీరాములు టంగుటూరి వీరేశలింగం పంతులు వగైరాలు వీరు గాక ఎంతో కీర్తిశేషులున్నారు. జన భాహుళ్యములో కీర్తిశేషుల జాబితాలో చేర్చబడు వారు చిన్నవాళ్ళు కాదు. వీరందరు ఆస్థి అంతస్థు హోదా పదవి డిగ్రీలు వున్న వాళ్ళే కీర్తిశేషులు అన్న పదవి అన్వయిస్తుంది.

        ప్రియపాఠకులారా!  ఒక విషయము మాత్రము ఖాయము అదేమిటంటే దేవుడు ఆదిలో నరుని సృష్టించినపుడు వానిని మరణించు వానినిగా సృష్టించలేదు. ఎందుకంటే ఏదేను తోటలో మరణము లేదు.  దేవుడు చేసిన ఆరు దినముల సృష్టిక్రియాకార్యములో దేవుడు సృష్టించి చేసిన సృష్టములలో వేటికిని మరణము లేదు.  అన్ని జీవులకు ఫలభరితమైన ప్రభావితమైన జీవముతో కూడిన శక్తేగాని  నాశనకరమైన శక్తి ఆనాటి సృష్టములలో లేదు.  కౄరమృగాలు సహితము తమ కౄరత్వమును మరచి కౄరత్వాన్ని ఎరుగని స్థితిలో వుండి సహజీవనము చేయుచు సృష్టి-నరుడు-సృష్టికర్త ముగ్గురును సమైక్య జీవనము జరుపుచు మరణభీతిలేని వాతావరణములో జీవించినట్లు నాటి ఏదేను చరిత్ర ఋజువుపరచుచున్నది.                 ప్రియపాఠకులారా!  ఆదికాండ మొదటి అధ్యాయము లగాయతు మూడవ అధ్యాయము చివరి వరకును మనము పఠిస్తే ఎక్కడ మరణానికి ఆస్కారమున్నట్లు వ్రాయబడలేదు.  మరణించిన జీవికూడా ఈ మూడు అధ్యాయాలలో కనబడదు.  అయితే నరుని యొక్క నామము పేరును మాత్రము నిల్పి శరీరములయమై పోయే స్థితి-నరుని మరణానికి అప్పగించి నరుడు కీర్తిశేషుడగుటకు కారకుడెవరు? అంటే ఆదిశేషుడే! ఈ ఆదిశేషుడు నరునికి దేవునికి విరోధాన్ని కల్పించి, నరుని దేవునికి వ్యతిరేకునిగా జేసి మరణానికి అప్పగించి కీర్తిశేషునిగ మార్చుటకు ఈ ఆదిశేషుడు అను ఈ ఆది సర్పము మోసకరమైన కుయుక్తి మాటలతో నయవంచకముతో దైవవ్యతిరేక క్రియజరిగించి తద్వారా నరుని మరణ పాత్రునిగ జేసి నరుని లోకానికి కనుమరుగు చేయుటకు కంకణము కట్టుకొన్నట్లు ఈ యొక్క ఆదిశేషుని క్రియయైయున్నది.  ఇట్టి పతనావస్థకు నరుని దిగజార్చి నరుని మరణావస్థకు అప్పగించి ఈ ఆదిశేషుడు ఏమైనను బావుకున్నాడా? అంటే అదియు లేదు.  అంటే ఇతను అంగవికలుడై దైవశాపము చేత ఉన్న అవయవాలను పోగొట్టుకొని పుట్టలో దూరి భుజంగుడయ్యాడు.  ఈ విధముగా ఉభయభ్రష్టత్వము పొంది కీర్తిశేషుడైన నరుడు భుజంగుడైన ఆదిశేషుని యొక్క జీవితము శతృవు రోగము మరణము అను త్రివిధమైన భయములు అలముకొని ఒకరి యెడల ఒకరు భయస్థులై కీర్తిశేషుడు కంటపడితే-ఆదిశేషుడు పుట్టలోను; ఆదిశేషుడు కంటబడితే కీర్తిశేషుడు భయముతోను జీవిస్తున్నారు.

        భూమి మీద మొట్టమొదటి కీర్తిశేషుడు హేబేలు నుండి కీర్తిశేషుల చరిత్ర ప్రారంభమైంది.  బైబులులో కీర్తిశేషులు అనగా మరణించినను తన పేరును సార్థకము చేసుకొన్నాడు. హేబేలు. ప్రియపాఠకులారా!  ఇట్టి కీర్తిశేషులు పరిశుద్ధగ్రంధములో అనేకులున్నారు.  అందరును ఆదిశేషుని ద్వారా సంక్రమించిన మరణమును అనుభవిస్తున్నవారే! అయితే ఆదిశేషుని ద్వారా సంక్రమించిన మరణావస్థను చవిచూడకుండ నిత్యజీవియై సృష్టికర్తలో లీనమై తరించి లోకమునకు కనుమరుగై సృష్టికర్తతో నడిచి నేటివరకును నరుల యొక్క జ్ఞానమునకు అంతు చిక్కని వ్యక్తి హనోకు.  ప్రియపాఠకులారా!  హానోకునకు ఆదిశేషుని యొక్క పీడ అంటలేదు.

        ఇపుడు మనము మరియొక మర్మాన్ని తెలిసికొందము.  అదేమనగా నరుడు కీర్తిశేషుడైనపుడు నరునికి పాపమును మరణమును అంటగట్టిన సర్పము ఆదిశేషుడు ఎట్లయినాడు? ఆదిశేషుడు అనగా అర్థమేమి? అనిన దానిని గూర్చి మనము తెలిసికోవలసియున్నది.  ఆది నరుడు ఆదాము యొక్క ఆత్మీయ జీవితమును అస్తవ్యస్తము జేసి ఆదాము యొక్క జీవితాన్ని అభాసుపాల్జేసి ఆదినరుని జీవితమును అధోగతిపాల్జేసినందుకు ఆనాటి జంతుకోటిలో సృష్టికర్తచేసిన సమస్త భూజంతువులలో ఈ ఆదిశేషుడు అనువాడు ఒకడు; ఆదిశేషుడు అనిన వానికి వున్న బిరుదు ఏమిటంటే సర్పము.

        ప్రియపాఠకులారా!  ఆదినరుడు ఆదిసర్పము అని ఇపుడు మనము తెలిసికొన్నాము.  ఈ మర్మమును గ్రహించలేని అన్యసోదరులు ఆదిశేషుడు భూభారాన్ని మోస్తున్నాడని తనను దేవునితో సమానముగ చేసికొని ఏడు పడగలతో భూమిని మోస్తున్నాడని - ఈ ఆదిసర్పము యొక్క రూపము ఏడు తలలు ఏడు పడగలు పొడవాటి శరీరమున్నట్లుగా పటముల ద్వారాను; పోతపోసిన విగ్రహరూపములు? చెక్కబడిన రాతిరూపములు.  కొయ్యతో చెక్కబడిన రూపము రూపించుకొని నేడు దేవునికిని క్రీస్తునకును పరిశుద్ధాత్మ దేవుడైన త్రియైక దేవునికి విరోధియైన ఈ ఆదిశేషుడు, అందరి నెత్తిన పడగపట్టుచు అందరికిని పడగను చూపెట్టుచు తనను ఆరాధించమంటున్నాడు.

        ప్రియపాఠకులారా!  ఇంతకును ఆదిశేషునికి ఏడు తలలు లేవు.  ఆదిశేషునికి వున్న సప్తశిరములు సప్తవ్యసనములు.  ఈ సప్తశిరములు ఏడు దైవవ్యతిరేకగుణములకు ప్రతీకలైయున్నవి.  ప్రియపాఠకులారా!  ఆదిశేషుడెవరో ఆదిశేషునికున్న ఏడు తలల మర్మము ఆదిశేషునికున్న పది కొమ్మలకున్న మర్మము-దాని తల మీద ఏడు కిరీటములు, ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము ఈడ్చి భూమి మీద పడవేయగల దాని తోక - ఇవన్నియు కూడా నరులలో వున్న ఆత్మీయ బలహీనతలను బట్టి దైవసన్నిధిలో నరుడు ప్రవర్తించిన వ్యతిరేక క్రియలను బట్టి ఆదిశేషునికి బలము కల్గినదే గాని ఆదిశేషుడు స్వతహాగా బలముకలిగినవాడు కాదు.  అనగా మానవుల పాప క్రియలను బట్టివాడు బలము పొందుచున్నాడు.  ప్రకటన 12:3

        ఈనాటికిని సర్పారాధకులు ఆదిశేషుడు అను ఈ ఆది సర్పమునకు ఏడుతలలతో రూపించి శేషపాన్పు అని నానా విధములుగ సర్పమును హెచ్చించి నానావిధములైన వాటితో సర్పారాధన చేస్తున్నారు.   ఎన్ని చేసినను లోకములో చలామణియగుచున్నది మాత్రము దేవుని మాటలే! అదేమంటే ఆది 3:14లో అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నియు మన్నుతిందువు.  మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరముకలుగజేసెదను-అది నిన్ను తలమీద కొట్టునునీవు దానిని మడిమెమీద కొట్టునని చెప్పెను'',

        ప్రియపాఠకులారా!  ఈ రెండు మాటలు ఇపుడు దేవుని మాటలు ఆదిశేషుని పట్ల భూమి మీద నెరవేరుచున్నవి.  ఎట్లంటే ఆదిశేషుడు పుట్టలోవుంటే నరులకు దేవుడు, పుట్టవదలిబైటకు వస్తే నరులకు విరోధి.  ఈ రెండు విధములైన క్రియలు జరుగుచున్నవి.   పుట్టలో వున్నపుడు నానా వస్తుసముదాయములతో కూడిన ఆరాధనఃపుట్టవదలి బైటకు వస్తే కఱ్ఱతో దేహశుద్ది ఇది ఆదిశేషుని గతి.

        ప్రియపాఠకులారా!   ఈ విధముగా ఆదిశేషుని ద్వారా లోకమునకు అంతములేని మితిలేని దైవత్వము సహించలేని మానవత్వము భరించలేని పాపము శాపము మరణము అను త్రివిధములైన ఉపద్రవాలు ఈ ఆదిశేషుని ద్వారా కల్గింది.  ఆదిశేషుని యొక్క సంతానమే సుబ్బరాయుడుః సుబ్బరాయుని సంతానమే నాగేంద్రుడుః నాగేంద్రుని యొక్క సంతానమే మానవత్వము లేని నరుడు.  అంటే సర్పస్వభావము గలవాడుః విషపూరితమైన హృదయము-ద్వేషముతో కూడిన స్వభావము-చీటికి మాటికి కోపము, శాంత స్వభావము లేనటువంటి ప్రవర్తన-ఇది సర్పగుణము. ఆదిశేషుని యొక్క పాన్పు ప్రమాదకరమైనది-కుట్ర కుత్సితముతో కూడినది-దైవత్వమునకు విరోధమైనది.  సానుభూతి అనిన దేమిటో ఎరుగనిది.  శేషపాన్ను మీద పవ్వళించిన వారు సర్పసంబంధులే!

        ప్రియపాఠకులారా!  మొట్టమొదటిగా ఆదిశేషుని యొక్క యుక్తిగల తీయటి మాటలను పాన్పుపై తొలినారియైన హవ్వ ఆనందానుభూతిని అనుభవించి, దైవత్వము మీద దైవనిషేధ ఫలమును సహితము భుజించుటకు వెనుకాడలేదు.  అంటే ఆదిశేషుని యొక్క పాన్పులో ఎంత దైవ వ్యతిరేకతవున్నదో మన మొకసారి లోతుగా ఆలోచించాలి.

        ప్రియపాఠకులారా!  అలాగే నరుని బట్టి కూడా ఆదిశేషునికి దేవుడు విధించిన శిక్షను మనము 3:15లో చదివియున్నాము. శాపగ్రస్థుడు దైవత్వానికి మానవత్వానికి విరోధి విషతుల్యుడు. నరజీవితాన్ని పతనావస్థలో పడవేసిన ఆదిశేషుని యొక్క రూపము వాని సాహిత్యము వాని చరిత్ర నేటి మన హైందవ సోదరులలో అలాగే నిలచి వుంది. అందుకే దైవ వాక్యము అంటుంది. ''ఏ భేదమును లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు.  

        పాపమునకు రూపమేర్పడింది.ఎందుకంటే సర్పమునుండియే పాపములోకములో విస్తరించింది.  దేవుడు పరిశుద్దునిగ ఆదామును సృష్టిస్తే ఆదిశేషుడు పాపిగా అనగా పాపము చేయు వానినిగా కయీనును సృష్టించాడు.  ఇందును బట్టి దేవుని యొక్క పరిశుద్ధ సంతానమును ఆదాముఃఆదిశేషుని యొక్క సర్పసంతానము కయీను. దేవుని తొలి నరపంట ఆదాము ఆదిశేషుని తొలినరపంటకయీను. ఇందు మూలముగా సర్పసంతానము యొక్క ఆకర్షణకు అందచందాలకు అవయవ సౌష్టవాలకు మోజుపడిదేవుని కుమారులైన ఆదాము సంతానము ఈ ఆదిశేషుని సంతానమునకు ముగ్గులై వారిలో తమకు ఇష్టము వచ్చిన రీతిని నానా రీతులలో వారివారి ఇష్టానుసారంగా గాంధర్వ విధిని వివాహ మాడుచు తద్వారా భూమిలో పాపము అనే పంటను పెంచారు.  అంటే ఆదిశేషుని యొక్క దోషము భూమి మోయలేనంత గాను దైవత్వము ఒర్వలేనంతగాను దేవుడు సంతాపపడునట్లుగాను చెడినదంటే - ఈ ఆదిశేషుని సంతానమున కెంత విస్తరింపు వున్నదో ఎంతగా విస్తరించారో అన్న దాని మనము ఆలోచించవలసియున్నది.  నోవహు కాలమునాటి జలప్రళయానికి కారకుడు ఆదిశేషుడు.  ఎందుకనగా భూమి మీద ఒక్క నోవహు కుటుంబము తప్ప ఆనాటి లోకములోని జనాభా యావత్తును ఆదిశేషుని సంతానమే! దేవుని ఉగ్రతమూలముగ ఆయన భూమి మీదకు పంపిన జలప్రళయ మారణహోమములో ఆదిశేషుని పుణ్యమున చాలామంది యావద్‌ నరకోటికీర్తిశేషులయ్యారు.  ఈ విధముగా అందరు కీర్తిశేషులు కాగా మిగిలిన నోవహు కుటుంబము భూమిమీద జీవిస్తున్న నరులుగా దైవత్వము చేత ఎన్నికచేయబడినందు వలన, ఈ ఒక్క నీతిమంతుని వలననైన దైవసంతానాన్ని ప్రతిష్టించాలని దేవుని సంకల్పము. అయినను ఆదిశేషుని యొక్క ప్రభావము భూమి మీద నశించలేదు.  ఇంతకును ఆదిశేషుడు ఎవరో కాదు.  ఆది 3:1లో దేవుడైన యెహోవా చేసిన భూజంతువుల జాబితాలో చేర్చబడినవాడు సర్పమే! ఈ విధముగా సర్పకొలువు సర్పసాంగ్యము సర్ప ఆరాధనను సర్పవ్రతాలు ఆచారాలు పాటిస్తున్న అజ్ఞాననరకోటి మీద అనగా దేవుని యొక్క పవిత్ర జనాంగమైన ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు ఉగృడై సర్పసమూహలను విషపూరితమైన సర్పసమూహాలున పంపి అనేకులను చంపినాడు.  అయితే దైవ విశ్వాసియైన మోషే యొక్క ప్రార్థనను బట్టి ఇశ్రాయేలీయులలో శేషించిన తన జనాంగమును బట్టి మోషే ప్రార్థన మేరకు, ఇత్తడితో సర్పమును చేయించి మోషేను ఎత్తమన్నాడు.  ఆ సర్పమును నిదానించి చూచిన వారికి సర్పవిష భయము వుండదని మోషేకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞల వివరము.

        ప్రియపాఠకులారా!  అయినను ఈ సర్ప ప్రభావము నరులను వదలలేదు  అందుకే తండ్రియైన దేవుడు ఏసు యొక్క రూపములో లోకములో అనేకవిధములైనటువంటి దోషాపరాధములను మోస్తూ- సతమతమగుచున్న జనాభానుద్దేశించి భారమును మోయుచున్న వారలారా! నా యొద్దకు రండి-నేను మీకు విశ్రాంతి నిచ్చెదనని అనుటలో ప్రియపాఠకులారా!  దేవుని యొక్క ఉగ్రతను ఆయన విధించిన శిక్షను ఆదిశేషుడు మోస్తున్నాడు.  ఆది శేషుని ద్వారా సంక్రమించిన అపరాధము పాపము యొక్క భారమును నరులైన మనము మోస్తున్నాము.  మనకున్న ఈ మోత తొలగిపోవాలంటే, మన భారాన్ని ఏసయ్యకు అప్పగిస్తే ఆయన తీరుస్తాడు.  ఆదిశేషుని వలన మనము మోయుచున్న భారమునకు ప్రతిగా ఏసుప్రభువు సిలువ రూపములో మోసిన మనశాపము మన పాపము అనుభారమును తీసివేశాడు.  ఇది ఒక క్రైస్తవునికి మాత్రమే పరిమితము.  అయితే అన్యుడు మాత్రము దీనిని మోస్తున్నాడు.  అందుకే దేవుని వాక్యము నీ భారము యెహోవా మీద మోపుము'', అని ప్రవచిస్తున్నది.

        కనుక ప్రియపాఠకులారా!  లోకసంబంధంగా ఏ భారమును కూడా మనము అనగా క్రీస్తు రక్తంతో కడుగబడి క్రైస్తవ బిడ్డలుగ  చేర్చబడి, విశ్వాసజీవితంలో వున్న మనకు భారమును మోసుకొంటూ తిరగవలసిన మనకు లేదు.  ఎందుకంటే మన యావద్‌ సగభారమును మన ప్రభువు మోస్తున్నాడు.  ఆదిశేషుడు కాదు.  మనప్రభువు మన భారమును మోస్తున్నపుడు మన జీవితాలు తేలికగా ప్రశాంతమైనదిగా ఆహ్లాదకరంగా ఆరోగ్యంగా, ఆత్మీయ ఫలభరిత జీవితములో దైవత్వానికి ప్రీతికరంగా వుంటుందనుట కెలాంటి సందేహము లేదు.  దావీదు మహారాజు తన కీర్తనలో దేవుని గూర్చి వర్ణిస్తూ-యెహోవా నాకాశ్రయము యెహోవాయే నాకాశ్రయ దుర్గము-నా ఎత్తయిన కొండ-నా కేడెము'', అని అభివర్ణించియున్నాడు.  ఆ విధముగా సృష్టికర్త యైన దేవుని స్తుతించి ఘనపరచిన దావీదు-మహారాజుగాను, దేవుని సన్నిధిలో ఒక సింహాసనము పొందిన యోగ్యత గలవాడుగాను దేవుడే తన యొక్క వంశములో లోకపాపపరిహారార్థము బాలుడుగా జన్మించే ఘనతను పొందినాడు.  ఇట్టి ఘనతను దావీదు తప్ప మరెవనికిని లోకములో ఏ స్థలములోను ఏ జాతి ఏ వంశము ఏ ప్రాంతీయుడైన వ్యక్తి యొక్క జీవితములో లేదు.  అనగా దావీదు యొక్క జీవితములో ఆదిశేషుడు శోదన వలయాన్ని ప్రయోగించినను దావీదుకున్న దైవ బలము ఆదిశేషుని యొక్క విషవలయాన్నుండి  తప్పించింది.

        ప్రియపాఠకులారా!  ఆదిశేషుని యొక్క క్రియాకర్మలలో నరజ్ఞానమునకు అంతుచిక్కనట్టి మర్మమున్నది.  మన ఇరుగు పొరుగైన అన్యసోదరులు ఆదిశేషుని గూర్చి ప్రచారము చేయుచు ఆదిశేషుడు భూభారాన్ని మోస్తున్నాడని ఆయన గొప్పమేధావి అని; ఆదిశేషుని యొక్క ప్రతిరూపమే రాముని తమ్ముడు లక్ష్మణుడు అని; ఆదిశేషుని ప్రతిరూపము లక్ష్మణుడైతే యెహోవా దేవుని యొక్క ప్రతి రూపము ఏసుక్రీస్తు.  ఆయన యొక్క ఆత్మీయమైన సంతానము పౌలు-పౌలు మాటలను బట్టి పరిశుద్ధ క్రైస్తవ సావాసములో జీవించే మనము క్రీస్తు సంతానమైయున్నాము.

        ప్రియపాఠకులారా!  ఆదిశేషుని సంతానమునకు రోగభయము శతృభయము భూతభయము సర్ప భయము మరణభయమున్నది.  అయితే క్రీస్తు సంతానమైన మనకు ఇవేవియు వుండవు.  అలాగే ఆదిశేషుని సంతానమునకు పదవీ వ్యామోహము, వెండి బంగారముల మీద ఆశ ధనాశ నేత్రాశ, లోకములో అన్నియు సంపాయించుకోవాలన్న తాపత్రయము లోక వ్యామోహము దైవ వ్యతిరేకత; దైవములు కాని వాటిని అనగా ఆ సత్యమైన వాటిని ఆరాధించుట ఉదా||విగ్రహాల కొలువు; మందసమును ఆరాధించుట-ఆయుధాల పూజ చెట్టు పుట్టలను పూజించుటః ఇవన్నియు దైవత్వమునకు విరుద్దములు. ఆదిశేషుని సన్నిహితమైన కార్యములుః

        ప్రియపాఠకులారా!  నరుని యొక్క నరసృష్టి అన్నది.  సృష్టిలోని యావద్‌ సృష్టములలో ఉత్తమమైనది.  ఎందుకంటే దేవుడు నరుని ఒక ప్రత్యేకరీతిలో ఏ జీవికి లేనటువంటి ఒక ప్రత్యేకమైన ఆధిక్యత నిచ్చి రూపించినాడు.  అదేమిటంటే లోకములోని సమస్త సృష్టములను దేవుడు వాక్కుతో చేశాడు.  కాని హస్తముతో చేయలేదు.  దేవుడు సృష్టించిన సర్పము కూడా దేవుని వాక్కుసృష్టియేగాని దేవుని ఆత్మ-దేవుని చేతిపనికాదు.  ఈ ఆదిశేషుడైన సర్పము నరుని కంటె కూడా చాలా తక్కువ హంగులు కలది, కాని యుక్తి గలది. ఇట్టి యుక్తిగల గుణమును ఆసరాగా తీసుకొని అపవాది సాతాను అను  దైవవ్యతిరేక ఆత్మ ఇందులో ప్రవేశించి దేవుని ఆత్మలోను ఆయన హస్త క్రియలోను ఆయన యొక్క పరిశుద్ధ ఏదేనువనములోను, ఆయన సముఖములోను పాలిభాగస్థుడుగ నరుడు జీవించుటన్నది ఈ అపవాది సాతాను అను ఆత్మకు గిట్టలేదు.  అందుచేత దేవుని యొక్క ఆత్మ రూపమునకు ప్రతిగా సర్పరూపమును నరుని దృక్పదములో వుంచి సర్పము చేత మాట్లాడించి, సంపూర్ణడుగా దైవత్వములో జీవించాల్సిన నరుని కిర్తీశేషునిగా జేశాడు.  కీర్తిశేషుడు అనగా పేరును మాత్రము మిగిల్చిన వాడు.  కాని అతనికి రూపము లేదు.  అయితే నరుని దేవుడు సజీవుడుగా చేశాడు గాని మృతుడుగా అనగా చచ్చేవానిగా చేయలేదు.  తనతో బాటు నిత్యజీవిగా వుండాలని చేశాడు.  ఆ విధంగా దేవుడు తన సంకల్పములో నిత్యజీవిగా నరుని జేశాడు.  నరజీవితాన్ని ఫలభరితముగా జేసియుంటే భూమి మీదగాని దైవ సముఖములో గాని అపవిత్రాత్మకు స్థానము లేదు.  అది గ్రహించిన అపవాది అను సాతాను సర్పమును తన సాధనముగ జేసికొని సర్పమును తన ప్రతిరూపముగా జేసికొని, నారితో మాట్లాడింది.  కాని నరునితో మాట్లాడ లేకపోయాడు.  ఎందుకంటే నారి అబల ఇందును గూర్చి నూతన నిబంధనలో పౌలు తన లేఖనములో స్త్రీ బలహీనమైన ఘటముగా అభివర్ణించియున్నాడు.  ఈ బలహీనమైన నారి రూపమును తన సాధనంగా వాడుకొని సర్పమునకు ఒక ప్రత్యేకమైన స్థానమునిచ్చి అపవాది సర్పములోనుండి మాట్లాడి నరులను కీర్తిశేషులుగా జేసి నరులకు మరణాన్ని తెచ్చి పెట్టిన సర్పాన్ని, ఆదిశేషునిగా కొలవమన్న స్థితికి నరుల యొక్క జ్ఞానమును బలహీనపరచి సత్యదేవుని యొక్కసన్నిధికిని ఆయన చిత్తానికి నరులను వ్యతిరేకులుగా జేయుటయేగాక దైవోగ్రతకు పాత్రులుగా జేసినట్లు ఏదేనులోని సర్పము యొక్క బోధ సర్పరూపమును గూర్చిన చరిత్ర మనకు వివరిస్తున్నది.

        ప్రియపాఠకులారా!  నేటి ఆధునిక శాస్త్రజ్ఞానముతో కూడిన యుగములో అనగా నరుని యొక్క జ్ఞానము శాస్త్రజ్ఞానము నానావిధమైన సాంకేతిక శాస్త్రజ్ఞానముతో వ్యాప్తిజెంది యున్న ఈ యుగములో కూడా ఆదిశేషుని యొక్క ఆరాధన ఆచారములు నరులను ఇంకను వదలలేదంటే, సర్పమునకున్న ప్రభావమెట్టిదో సర్పము ద్వారా లోకానికి సంబంధించిన అపరాధము పాపము యొక్క విలువ లెట్టివో మనము గ్రహించవలసియున్నది.  దేవుని యొక్క శాపమునకును దేవుని యొక్క ఉగ్రతకును బలియై, అంగవైకల్యము పొంది ఫలభక్షణమునకు బదులు అపరిశుద్ధములును తినే హీనస్థితిలో దిగజారుచు క్షణక్షణము మరణ భయము శతృభయము వగైరా అనేక భయములతో ప్రాణభీతితో నరసంచారమునకు దూరముగా ప్రశాంత జీవితమును బహిరంగముగా కాక చాటు మరుగున పుట్టలలోను చెట్ల తొఱ్ఱలలోను జీవితమును, సాగించుకొంటున్న సర్పమును అజ్ఞానియైన నరుడు ఆరాధిస్తున్నాడంటే, నరుని యొక్క అజ్ఞానము వెర్రితలలు వేస్తూ ఎంత బలహీనతలో క్రియజరిగిస్తున్నదో ఒక్కసారి మనము ఆలోచించవలసియున్నది.  నేటికిని జనబాహుళ్యములో ఈ ఆదిశేషుని పేరు గలవారు లక్షల సంఖ్యలో వున్నారు.  ఆదిశేషయ్య అని, వెంకటశేషయ్య అని శేషారత్నం అని శేషావతారం అని భుజంగరావని ఫణీంద్రుడని నాగభూషణంగ నాగరత్నం అని సర్పనామదేయాలతో వున్న జనాంగము మన మధ్యనున్నారు.  ఇందునుబట్టి చూస్తే ప్రభువు యొక్క రాకడ వరకు నరకోటిలో ఈ సర్ప వ్యామోహము వదలదని మనకు అర్థమగుచున్నది.  అంటే ప్రభువు రాకడకాలములో ప్రకటన 20:2 అపవాది సాతాను అనబడు ఆ ఆదిసర్పమును వెయ్యిసంవత్సరములు బంధించి అగాధములో పడవేసి'', అనుటలో ప్రభువు రాకడ వరకు ఈ ఆదిశేషుని యొక్క ప్రభావము-వాని యొక్క పరిపాలన సిద్దాంతములుంటాయని ఇందును బట్టి మనము తెలిసికోవలసియున్నది.

        ప్రియపాఠకులారా!  లోకరీత్యా మరణించిన వారిని గూర్చి నానారీతులుగ పలుకుచున్నారు.  అందులో ఉదాహరణగా మొట్టమొదట కీర్తిశేషులు అనగా లోకములో పేరు మాత్రము మిగిల్చినవారు. 2.అమరజీవిః-అంటే చనిపోయినను బ్రతికి యున్న వారి జాబితాలో వున్నవారు. చిరంజీవిః-అంటే నిరంతరము జీవించువాడు. నిత్యజీవులు అనగా మరణములో నుండి జీవములోనికి దాటినవారు. ఇందులో మొదటగా కీర్తిశేషుని గూర్చి మనము నేర్చుకొనియున్నాము.  ఇట్టి కీర్తిశేషులు చాలామంది పాతనిబంధన క్రొత్తనిబంధనలో వున్నారు. ఇట్టి వారి జాబితాలో విశ్వాసుల తండ్రి అబ్రహాము.  యాకోబు-యాకోబు యొక్క జనాంగమును దైవ ఆజ్ఞాను సారము నడిపిన మోషే ఏలియా దావీదు యెషయ ఇర్మియ వగైరా ప్రవక్తలు ఇట్టివారు. వీరందరు కీర్తిశేషులు.  అయితే నూతన నిబంధన మూలకర్త ఏసుక్రీస్తు ఆయన ఏర్పరచుకున్న అపోస్తలులు, నూతన నిబంధనకు హతసాక్షులు వేదసాక్షులు వీరు ప్రభువునందు నిద్రించినవారు.

        ఇక అమరజీవులుః-పాతనిబంధనలో ఏలియా బ్రతికించిన విధవరాలికుమారుడు-నూతన నిబంధనలో ఏసు మరణ శయ్య మీదనుండి సజీవులుగా జేసిన నాయీరుకుమార్తె; విధవరాలికుమారుడు.  బేతానియాలోని మార్త మరియలసోదరుడు లాజరు; వీరు అమరులు.  ఇవన్నియు లోకసంబంధము .  అయితే దైవకుమారుడైన ఏసుప్రభువునందు ఆయన నామములో ఆయనసావాసములో, ఆయన పరిచర్యలో మరణించిన వారిని దైవ వాక్యమునిద్ర అంటున్నది.  లోకసంబంధముగా మరణమన్నది నిర్జీవమైన శరీరమునకు నామధేయమైయున్నది.  అయితే ప్రభువు సన్నిధిలో మరణము-నిద్ర; ఈ సందర్భములో మొదటిధెస్స4:14 ఏసు మృతిపొంది తిరిగిలేచెనని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసుసందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును'' ,ప్రియపాఠకులారా!  ఈ వాక్యములో మరణాన్ని నిద్రకు పోల్చి ప్రవచిస్తున్నాడు. కాని లోకసంబంధంగా శరీరయుతమైనట్టి మరణము-శరీర సంబంధమైనది. అయితే పరలోకము దృష్టిలో మరణము అన్నది ఆత్మకున్నట్లుగా చెప్పబడలేదు.  శరీరము నుండి ఆత్మను వేరుచేయబడుటయే! లోకరీత్యా ఇది మొదటి మరణము.  అయితే ఆత్మీయమైన మరణమొకటున్నదని ప్రకటన 21:8లో రెండవ మరణాన్ని గూర్చి వ్రాయబడియున్నది. ఈ మొదటిమరణము శరీరానికి రెండవ మరణము ఆత్మకు

        కనుక లోకసంబంధంగా మరణించిన వ్యక్తిని గూర్చి పరలోకము ప్రవచింపక పోయినను ఆత్మకున్నట్టి మరణాన్ని గూర్చి మాత్రము బహుఘాటుగ హెచ్చరిస్తున్నది.  ఈ రెండవ మరణమన్నది ఆత్మసంబంధమైనది.  కనుక క్రీస్తు యొక్క రక్తముతో కడుగబడి క్రైస్తవ విశ్వాసులుగ తీర్చబడిన మనము రెండవ మరణము యొక్క ప్రభావమునకు లోను గాకుండ, మన ఆత్మీయ జీవితాన్ని పదిలపరచుకొని దైవత్వమునకు విదేయులమై, ఏసుక్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధ నామములో రానున్న ఆయన రాకడ కొరకు నిరీక్షణ గలవారమై మెలకువతోను ఆయత్తముగాను వేచియుందుముగాక!

        అపవిత్రాత్మ చేసిన క్రియలుః-

        ఆదినరజంటను జిత్తులమారి సర్పాకృతిలో జేరి మాయమాటలు చెప్పి దైవ వ్యతిరేకుల జేయుట, కయీనులో చేరి హేబేలును చంపుట, అహరోనులో చేరి దూడను చేయించుట, సొదమ గొమర్రా పట్టణముల జనాంగమును కామక్రోధాది గుణోన్మత్తులుగా జేయుట, సంసోనును త్రాగుబోతుగాను వేశ్యాలోలునిగాను జేసి మరణపాత్రుని గాను జేయుట,  ఇశ్రాయేలు అను దేవుని ప్రజలను అనేకమార్లు దైవమార్గమును తప్పించుట, అభిషిక్తుడైన సౌలును జ్యొతిష్కుల విశ్వాసిగా మార్చుట, ఊరియా భార్యను ఎరగాజూపి దావీదు మహారాజును హంతకునిగాను వ్యభిచారిగాను మార్చుట, దేవుని జ్ఞానమును పొంది దేవుని మందిరమునకు మూలస్థాపకుడైన సొలొమోనును పరస్త్రీలోలునిగా అన్యసాంగ్యములు ఆచరింపజేసి, అన్యదేవతల బలులను చేయించుట-ఇట్టివి అనేకములు పాతనిబంధనలో జరిగియున్నవి,

        ఇక క్రొత్తనిబంధనలో - యేసు ప్రభువును శోధించుట హేరోదులో ప్రవేశించి శిశుహత్యను జరిగించుట, యేసుకు బాప్తిస్మము ఇచ్చిన యోహాను తనలగొట్టించుట, యాజకులను ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రేరేపించి, ఏసుకు విరోధులు గాను విమర్శకులుగాను మార్చి విమర్శించుట.  యూదా ఇస్కరియోతులో ప్రవేశించి ధనాశను ఎరగాచూపి క్రీస్తును గుర్తింపజేయుట.  ఆదినములలో రోము,గ్రీకు ప్రభుత్వాలనే తన వశములో ఉంచుకొని క్రీస్తుకు మరణశిక్ష,  క్రైస్తవులకు చిత్రవిచిత్రములైనట్టి శ్రమలను కల్గించి చంపించుట వగైరాలు.  అయితే ఈ తరము వారైన క్రైస్తవ జనాంగములో దైవాత్మ అనువాడు భక్తులను ఉజ్జీవపరచి అనేక విధములుగ సువార్తను ప్రకటింపజేసి ఆలయాలను నిర్మిస్తుంటే, అపవిత్రాత్మ ఆ ఆలయాలలో భక్తులలో పదవీ వ్యామోహములు ధనాశ స్వార్థము ఇత్యాదిగుణంబులతో వశపరచుకొని భక్తులు కట్టిన గుడిలో పార్టీలు పెట్టి వీలైతే కోర్టు కెక్కించి తాళాలు వేయించుట,బోధకులలో పార్టీలు పెట్టుట. ఇవేవి సాధ్యము కానపుడు కుల తత్వాలతో క్రైస్తవులలో విభేధాలు కల్పించి ఐక్యతలేకుండ నానాగ్రూపులను సృష్టించి ప్రకటన 3:1 నీవు జీవించుచున్నావన్నమాటేగాని నీవు మృతుడవే'', అన్నట్లుగా క్రైస్తవ మతము చాలాగొప్పమతమను పేరు మాత్రము వున్నదిగాని అందులో మరణ పాత్రమైనట్టి లోపాలన్నో వున్నట్లుగా మనము గ్రహించవలసియున్నది.  ఈ అన్నింటిని బట్టి చూచిన అనేక శాఖలుగా వున్న ఓ క్రైస్తవ సంఘమా! మనలో వున్న శాఖలను పార్టీలను పదవీ వ్యామోహములను ధనాశా పూరితమైన గుణములను విస్మరించి, యావద్‌ క్రైస్తవ కోటి ఒక శాఖగా మారకపోతే పవిత్రాత్ముని క్రియకంటే అపవిత్రాత్ముని క్రియ విస్తరించి పరువుతో బ్రతికే పదిమంది క్రైస్తవులకు కూడా పడరాని పాట్లు చెందవలసిన ఉగ్రత మన మీదికి ఈ అపవిత్రాత్మ తేగలడు.  కనుక మనతో ఏకీభవించు ఆత్మను పవిత్రాత్మ సాంగ్యముగా ఎంచి, పవిత్రమైన సావాసములోను పవిత్రమైన జీవితములోను పవిత్రమైన క్రైస్తవ్యములోను జీవించాలని ఆత్మనరుడిచ్చు సందేశమైయున్నది.

        లూకా 11: 24-26 ఏసుప్రభువు చెప్పిన ఉపమానములో ఒక అపవిత్రాత్మ ఒకనిని వదలిపెట్టిన  తర్వాత అది తన కంటే ఏడు చెడ్డ ఆత్మలను వెంటతీసుకొనివచ్చునని గ్రంధములో వున్నది.  వదలిన ఒక ఆత్మ ఏమిటి? అది వెంట తీసుకొని వచ్చే ఏడాత్మలు ఎటువంటివి?

        ఆదిలో సర్పమును బట్టిన అపవిత్రాత్మ నరజంటలో పాపబీజము వేయు ప్రణాళికను సంపూర్తిజేసి దేవుడు సర్పమును శపించక మునుపే దైవోగ్రతను తాను అనగా అపవిత్రాత్మ గురికాకుండ, సర్పమును అడ్డుపెట్టినట్లు ఏదేను వనములో దేవుడు జరుపు తీర్పును గ్రహించిన వాడై దైవత్వమునకును నరజంటకును దూరమై దేవుని శాపానంతరము అటు సర్పములోను నరునిలో ప్రవేశించి ఇద్దరిని తన దాసులుగా జేసికొని శారీరముగా సర్పమును చూపించి దాన్ని చంపిస్తూ  ఆత్మీయముగా అదృశ్యమైయున్న తన రూపమును సర్పరూపమునకు పోల్చి మరియు సర్ప రూపమునకు సమతుల్యముగా జేసి నరులు సర్పమును కొలుచునట్లుగాను శారీరముగా దృశ్యమైన సర్పమును చంపునట్లుగాను తాను సర్పమూలమున మాట్లాడిన వాక్కులను బట్టి నరునిలో సప్తవ్యసనములను, ఏడు అపవిత్రాత్మలను గుణములను ప్రవేశపెట్టి అనగా కామక్రోధ మదమత్సరములు, బిడియము అజ్ఞానము అనగా నిజదైవత్వమునకు దూరము వేట మొదలైన ఇట్టి గుణములు కల ఏడాత్మలకు నరుని యొక్క జీవాత్మను అప్పగించి నేడు నెలకు వెయ్యిరూపాయలు జీతగాని లగాయతు పాతిక వేల రూపాయలు జీతగాని వరకును అ ఆ లు నేర్చిన అన్నయ్యలగాయతు గొప్ప ఫారిన్‌ చదువులు చదివిన గొప్ప మేధావుల సైతము, ప్రతి యొక్కనిని రెండవ కొరింధీ 4:4 లో వలె వారి మనోనేత్రములకు గృడ్డితనము కలుగజేసి అజ్ఞానులుగా నిర్జీవమయిన వాటినినశించిపోయే వాటిని ఏమియు ఎరుగని జీవమే లేని వాటిని ఆరాధించమంటూ ఒక వేళ అట్టి జ్ఞానమును (మర్మమును) సంపాధించుకొనిన నరునిని దేవుడే లేడంటూ నాస్తికునిగాను హేతువాదునిగాను  చేసి వాక్యమనే జ్యోతిని నరుల హృదయాలలో వెల్గింపక వ్రాక్యమను ఉజ్జ్వల జ్యోతిని వెలుగింపనీయక) ప్రమిదవంటి గృడ్డి జ్ఞానముతో అది కూడా లేకుంటే చీకటియందు మూఢజ్ఞానముతో భూలోకములో నరులలో జేరి, పదవులు డిగ్రీలు.  హోదాలను బిరుదులను తగిలించి సభావేదికలమీద అలనాడు వృక్షశాఖలో ఉన్నతములో సర్పములో వ్రేలాడి నరజంటకే విధంగా ఉపన్యాసము చేశాడో-అదే ఉపన్యాసము నేడు సభావేదికల మీద చేయుచు తనను ఆరాధించు భక్తులకు బిల్డింగు కాంట్రాక్టులు, రోడ్డు కాంట్రాక్టులు ,కాలువల కాంట్రాక్టులు, కరెంటు కాంట్రాక్టులు తెలుగు గంగ కాంట్రాక్ట్సు, హరిజన గిరిజన దళిత వర్గాలకు ఇళ్ళ స్థలాల పట్టాలు, ఇళ్ళ స్థలములలో ఇల్లు కట్టించే కాంట్రాక్ట్సు, ఇస్తూ-నిజ దైవత్వమొందిన క్రైస్తవుని, దైవత్వములో ఆత్మీయముగా సువార్త జ్ఞానము నెరిగిన క్రైస్తవుని భూలోకరీత్యా వాని కెలాంటి ప్రాధాన్యత నీయక క్రైస్తవులు దేవుని బిడ్డలయ్యా! వారు లోకసంబంధులు కారు.  వారులోకసంబంధంగా  ఏవిధంగా నైనాధనాశకు అర్హత లేదు.  అదివారి వేదము యొక్క సిద్దాంతమని ప్రబోధిస్తూ-క్రైస్తవులు చిన్న చూపు చూస్తూ యూదా ఇస్కరియోతు చలిమంట దగ్గర పేతురు లాంటి నామక్రైస్తవులను లోకములో జీవనోపాధి కొరకు క్రైస్తవులము కాదు హరిజనులము అను క్రైస్తవులను, ఎవడైన క్రైస్తవ సోదరుడు నిశ్చింతగా జీవిస్తున్నపుడు అతనితోనే సఖ్యముండి అతనితోనే సేవజేస్తూ అతను ఇచ్చు కొద్దియోగొప్పమేళ్ళను పొందుచు సమయము వచ్చినపుడు ప్రజలకు ప్రభుత్వమునకు పట్టి ఇచ్చి, నామక్రైస్తవులను తయారు జేసి, క్రైస్తవులు దొంగలు మోసగాళ్ళు అని దుయ్య బట్టిస్తున్నాడు.  ఇందును బట్టి బైబిలు గ్రంధము ప్రకటన 12:12 అపవాది తనకు సమయము కొంచెమేనని తెలిసికొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చియున్నాడు. కనుక క్రైస్తవ లోకము దీనిని గుర్తించవలసియున్నది.

        దేవుడైన యెహోవా చేసిన సమస్తభూజంతువులలో సర్పము యుక్తిగలదైయుండెను.  ఇందులో సర్పము యుక్తిగలదై యుండెను. ఇందులో సర్పమునకు ఒక ప్రత్యేకమైన మరియు అపవిత్రాత్మ కార్యములకు అతని డిపార్టుమెంటులో ఉద్యోగార్హతకు అవకాశమున్నట్లుగా దేవుడిచ్చిన యుక్తి అను సర్టిఫికేటు పనికివచ్చినట్లుగా మానవ భాషలో సర్పము మాట్లాడి చేసిన దైవవ్యతిరేకక్రియ తెలుపుచున్నది.  నరజంటలో ఈ యుక్తిగాని అపవిత్రాత్మకు కావలసిన యోగ్యతలు గాని నరజంటలో వున్నట్లు దాఖాలాలు లేవు.  ఒక డిపార్టుమెంటులో ఒక ఉద్యోగిని ఉద్యోగిగా ఎన్నిక చేయుటకు ఒక జిల్లా  అధికారి అతని అసిస్టెంటు ఏ విధంగా ఇంటర్యూజరుపుదురో, అదే విధంగా పురుషుడు మరుగైయున్న స్త్రీతో అపవాదియను లోకాధికారి అతని అసిస్టెంటు సర్పము ఇరువురును స్త్రీకి ఇంటర్వూ జరిపి దైవాజ్ఞాతిక్రమణము చేయించి, పండును తినిపించుట ద్వారా పాపము అను ఉద్యోగానికి ఎన్నికజేసి పాపము వలన వచ్చు జీతమును దానికి ఫలితమగు మరణమును జీతమునకు యోగ్యముగా స్థిరమైన ఆ స్త్రీకిని ఆ భర్తకును ఇద్దరికి ఇచ్చి, తాను పత్తా లేక పరారైనట్లు వేద వాక్యవివరణ.  ఇందును బట్టి ఏసుప్రభువు చెప్పిన వాక్యములో అపవిత్రాత్మ ఒక మనిష్యుని వదలిపోయిన తర్వాత అని వున్నది.  అయితే మనుష్యునిలో కంటె ముందుగా అపవిత్రాత్మ ఎవరిలో ప్రవేశించాడో పై సంఘటనను బట్టి మనము తెలిసికోవచ్చును.

        ఇక ఆ వాక్యంలో రెండవ భాగముగా అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. సర్పాన్ని వదలిన అపవిత్రాత్మ అపుడు నరజంట ఒక్కటే జనాభా విస్తరణ లేదు.  సర్పాన్ని వదలిన ఈ అపవిత్రాత్మ ఏదేను వనమనులోకమును వదలిన తర్వాత యెహోవా చేసిన నరజంట సర్పపు బోధకు చెవినిచ్చినందున సర్పమును వదలి నరజంటలోజేరి వారిని చెట్ల చాటున దాగుకొను పిరికితనమును కల్గించెను.  మొదటిది యుక్తి రెండవది పిరికితనము అనగా దీని మూలమున నరజంట దేవుని సన్నిధిలో రాలేకమూలకు చెట్లఆకులు  కట్టుకొని కూడా రాలేకపోయినారు. ఇందును బట్టి సాతాను బలముగా నరజంటను పట్టినట్లు తెలియుచున్నది.  సర్పమును వదలిన అపవిత్రాత్మ నరజంటలో ప్రవేశించెననుటకు ఆధారములుః- ఎ..సర్పబోధను విని దేవుడు తినివద్దన్న ఫలమును భక్షించుట బి.దేవుని స్వరమును విని దాగుకొనుట ఇది పిరికితనమును తెలుపుచున్నది సి. దేవుని ఎదిరించి మాట్లాడుట చేసిన తప్పును ఒప్పుకొనలేకపోవుట.  ఆదామును ఆవరించిన అపవిత్రాత్మ పురుషునిలో జేరి నేను దోషిని గానని సాటిసహాయముగా నీవిచ్చిన స్త్రీయే యని చెప్పుట.  స్త్రీలో వున్న అపవిత్రాత్మ శక్తి ఆ దోషము స్త్రీదికాదన్నట్లు సర్పమే ఈ క్రియకు కారణమని చెప్పుట.  నిజముగా ఆ సమయములో అపవిత్రాత్మ సర్పములో వున్నట్లయితే నేను తినమంటే వారెట్లుతిన్నారు? అనకపోవునా? ఆ వరకు మానవ భాషలో మాట్లాడిన యుక్తిగల సర్పము అవాక్కై అశక్తియై మౌనముగా వుండుటలో అపవిత్రాత్మ దానిని వదలి నరునిలో ప్రవేశించినట్లుగా తెలియుచున్నది.  ఈ విధంగా నరునిలో ప్రవేశించుటకు అవకాశము దొరకినది.  ఇందును బట్టి మనము ఆలోచిస్తే దేవుడేర్పాటుచేసిన వనము ఆయన సృష్టించిన వృక్షజాలము ఆయన ఎన్నుకొన్న పరిశుద్ధస్థలము.  ఆయన భూమిని పెళ్ళగించి నరాకృతిని చేసిన పరమ పవిత్ర స్థలము.  అట్టి స్థలములో అపవిత్రమైనదియు యుక్తిగలదియు విషపూరితమైనది యు నైన సర్పము ప్రవేశించుటకు అర్హత ఎక్కడనుండి వచ్చినది? దేవుడే దానిని ఆవాతావరణమును సర్పమునకు సర్ప ప్రవేశమునకు వీలు కల్గించి, అపవాది అతని వాహనమైన లేక వాని రూపమైన సర్పము ప్రవేశించుటకు వీలు కల్గించినట్లు తెలియుచున్నది.

        నరజంటకు దేవుడిచ్చిన శాపములుః- ఆ తర్వాత దేవుడు నరజంటకు చర్మపు చొక్కాయిలు తొడిగించి ఆదాము హవ్వలకు భూతవైద్యము చేయించెను.  ఈ చర్మపు చొక్కా రక్షరేకగా పనిచేసినది.  చేసిన పనివలన అపవాధిని వారిని వదలినాడు.  ఆ తర్వాత అపవాది ఆ నరజంటనువదలి విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను.  అనగా అప్పటి ఆ ఒక్క నరజంట వున్నందున జనసందోహము లేనందున నిర్జీవ వాతావరణములో నీరు లేని చోట్ల నిర్జీవ ప్రదేశములో తిరుగుచు, నీరు లేనిచోట అనగా జీవము (జీవాత్మ) లేని చోట తిరుగుచుండినట్లును ఆ తర్వాత విశ్రాంతి దొరకనందున ఇచ్చట అపవిత్రాత్మ యొక్క విశ్రాంతి అనగానేమి?

        ఆదిలో చీకటి అగాధజలముల మీద దేవుని యొక్క ఆత్మ అల్లలాడుచుండెను.  నరుని హృదయములో ప్రవేశించుటకు దేవుని యొక్క ఆత్మ ఆ జలములపై అనగా నరసృష్టిలేని నిరాకార సృష్టిపై అల్లలాడినట్లు తెలియుచున్నది.  అదే విధముగా నేడు క్రైస్తవ్యము అభివృద్ది జెందియున్న ఈ భూమిలో దైవ వాక్యమను వెలుగు పూరితమైన ఈ భూమిపై నరుని యొక్క అంధకార హృదయములో ప్రవేశించుటకు తహతహలాడుచున్నట్లుగా, నేటి మానవ మారణాయుధముల నిర్మాణము పదవీ వ్యామోహములు ధనాశ దైవ వ్యతిరేకత అనుగుణములను సృష్టించి నరుల హృదయములో దైవత్వమునకు వెరచి అల్లలాడుచున్నట్లుగా వేదవాక్యము ద్వారా తెలియుచున్నది.

        ఈ సందర్భములో యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాధించుకొంటిని.  ఇక్కడ పాము దయ అనిగాని లేదా తన భర్తయైన ఆదాము దయయని గాని లేక అపవాది దయవలననని గాని ఒక మనుష్యుని సంపాదించుకొన్నానని హవ్వఅనలేదు.  ఇందును బట్టి గ్రహించవలసినదేమంటే దేవుడు నరజంటకు తొడిగిన చర్మపు దుస్తులు అపవాది యొక్క పట్టునుండి నరజంటను విడిపించి పూర్తి రక్షణ వారు పొందునట్లుగాను అయినప్పటికిని నరజంటను వదలిన అపవిత్రాత్మ వారిని వెంటాడుచు వారి తొలి గర్భ ఫలమైన కైనులో ప్రవేశించినట్లు కయీను చేసిన హత్యాక్రియ ద్వారా తెలియుచున్నది.

        ఎందుకంటే లూకా 11:24 లో మూడవ అంశమైన విశ్రాంతి దొరకనందున నేను విడిచివచ్చిన నా ఇంటికిః- ఇచ్చట నా ఇల్లు అనుటలో - దైవత్వము నుండి నరజంట సాతాను వాక్కులకు బానిసలైనందున దైవ సన్నిధిలోని ప్రాధాన్యతను విలువను కోల్పోయి వినుటచేతను క్రియలద్వారా సాతాను యొక్క సిద్దాంతమును అనుసరించిన వారైనందున వీరివురును సాతానుకు స్వంతమైనందున ఇచ్చట నా ఇంటికి అనెడి హక్కు ఏర్పడినది.  యెషయా 50: 1-2 అదే విధముగా నేటి నరుని యొక్క గృహము హృదయము రెండును పై వాక్యరీతిగా ధనాశ లోభము కామక్రోధమదమత్సరములు నేత్రాశ వగైరా గుణంబుల చేతను అపవాదికి ఆలయములు మార్చినందున ఏసుప్రభువు అపవిత్రాత్మ యొక్క గమ్యమును గూర్చి చెప్పుచు నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగివెళ్ళుదునని ఆదాము హవ్వలను వారి యొక్క స్థానములను పరిశోధించుచు దేవుడు వారికి తొడిగిన చర్మపు దుస్తుల ప్రభావమైతే ఉన్నదిగాని, వారికినిజదైవభక్తి ఏమిటో ఎరుగని అయోమయ పరిస్థితిలో వుండి ప్రార్థన ఆరాధన వగైరా దైవిక క్రియాశూన్యులై యుండుటయే ఊడ్చిపెట్టుటయని భావము.  అట్టి వారి పరిస్థితి గుర్తించి ఇక అమర్చి యుండుట'', అనుటలో వారి గర్భఫలమైన కయీను అను నరశరీరియైన గృహములో లూకా 11:24 నాల్గవ అంశమైన తనకంటె చెడ్డవైన మరి ఏడు అపవిత్రాత్మలు అనగా నరునికున్న సప్తవ్యసనములను గుణములను అతని హృదయములో ఈ ఏడాత్మలకును ఈ ఏడు గుణములను ఆత్మలను ఆతని హృదయములో ప్రవేశపెట్టి, ఎనిమిదవ స్థానమైన (అష్టమస్థానమైన) ఆతని హృదయములో పీఠం వేసి ఆతనిలో ప్రవేశించి, అక్కడ కాపురముండును అనిన విధంబుగా కయీను యొక్క ఆత్మను శరీరమును హృదయమును మనస్సును రక్తమును ప్రవర్తన జ్ఞానము అను ఈ ఏడిటిలో ఏడు చెడ్డ ఆత్మలగుణములను చొప్పించి, ఆతని హృదయములో సంపూర్ణస్థానమును ఆక్రమించి తల్లిదండ్రులకును సోదరునికిని దైవత్వమునకును మనస్సాక్షికిని మానవత్వమునకును దైవ చట్టమునకును వ్యతిరేకియై చేసిన హత్యాకాండను బట్టి ఆతనిలో అపవాది స్థిరనివాసమేర్పరచుకున్నాడు.  అక్కడనే కాపురముండును.  అందుకు ఉదా|| ఏమి? నా తమ్మునికి నేను కాపలా వాడనా? అని నిర్లక్ష్యభావమును కనపరచెను.

        లూకా 11:24 వచన చివరిభాగమైన అందుచేత ఆ మనుష్యుని కయీను యొక్క మొదటి స్థితి ఓర్వలేని తనము కోపము ఈర్ష్య పగ ద్వేషము ఘాతుకము ఇత్యాదిగుణములచే కైను అను శరీరిలో ప్రారంభించిన అపవిత్రాత్మ క్రియ ఆది 6: 1-4 విధముగా కయీను యొక్క కడపటి స్థితి మొదటికంటె బహు చెడ్డగా ఆతనిలో నుండి పాపమును ప్రబలించి, భూమిని నరులను దైవ కుమారులను సైతము ఆక్రమించెను.

        ఆది 4:9-15 దేవునికి కయీనుకు జరిగిన సంభాషణలో కయీనుని పట్టిన ఏడాత్మల దోషము దేవుని నోటి వెంటనే 15వ వచనములో పల్కినట్లు తెలియుచున్నది.

        ఏసుప్రభువు పల్కిన తన కంటె చెడ్డవైన మరి ఏడు అపవిత్రాత్మలు అనుమాటయు ''ఎవడైనను కయీనును చంపిన యెడల వానికి ప్రతి దండన ఏడంతలు కల్గును.  కయీనులో అణగారియున్న ఏడాత్మలు యొక్క ప్రవేశము కయీనును చంపిన వాని ఇంటిలో కూడా ఉండుననియే ఈ వాక్కుకు అర్థమైయున్నది.  ఎట్లనగా మార్కు 5:లో గెరాసీనుల వద్ద సేనా అను దయ్యమును బట్టిన వానిలోని అపవిత్రాత్మలను ఆత్మలు ఏసుప్రభువును పందుల మందలో పంపమన్న విధంబుగ ఒక మనుష్యుని పట్ట్టిన అపవిత్రాత్మలు కూడా వానిననుసరించువానితో అనగా పంది జీవితములో పందివలె అపవిత్రమైన జీవితములో జీవించు ప్రతి వ్యక్తిలో కూడా ఇవి ఏడాత్మలుగా లేక సేనగా లేక సమూహముగా ఏకమైనివసించు అవకాశమున్నట్లు మనము గుర్తించాలి.  ఇచ్చట మనము గుర్తించవలసినదేమంటే కయీను దేశద్రిమ్మరియైనాడు.  పందులు పరుగెత్తి జలసమాధియైనవి.  దేవుడు కయీనుని దేశద్రిమ్మరిని కమ్మన్నాడు.  ఏసు రూపములో దేవుడు పందులను సముద్రములో పడి చావమన్నాడు.

        ఆదిలో అపవిత్రాత్మ సర్పములో ప్రవేశించి దానికి వాక్శక్తి నిచ్చి తద్వారా నరజంటను తన విశ్వాసులుగా జేసి వారిలో ప్రవేశించి దేవుడు వారికి తొడిగిన చర్మపు దుస్తులను బట్టి వారి నుండి విడుదలను పొంది విశ్రాంతి లేక తిరుగుచు నరజంట తొలిసంతానమైన కయీనులో చోటుచేసుకొని ఆతనిలో వుండి ఆతనిని సొదరహంతకునిగాజేసి నందున కయీనును దేవుడు శపించి ఆది 4:15 లో వలె దేవుడు కయీనుకు వేసిన గుర్తును బట్టి కయీనును కూడా వదలి ఆది 6:1 విధంబుగ అనేకులలో ప్రవేశించి అనగా గెరాసీనుల దగ్గర ఒక వ్యక్తిని బట్టిన సేన అను దయ్యము ఏ విధముగ ఒక మందపందులలో ప్రవేశించెనో అదే విధంబుగ ఒక కయీను నుండి విడిచిన అపవిత్రాత్మ భూమి మీద విస్తరించిన జనసంఖ్యలో జేరి ప్రతి యొక్క వ్యక్తిని వశపరచుకొన్నట్లు ఆది 6:1 యెషయా 52:3 భావములు తెలియగలవు.

        అపవిత్రాత్మ అన్నపుడు అది సాతానుకును వారి గుణములకును స్వభావములకును సాదృశ్యములైయున్నవి.  యెషయా 54:16 సాతానే చెడ్డయైనపుడు ఇక్కడ తనకంటె చెడ్డ అన్నపుడు సాతానే లోకములో చెడ్డయని చెలామణియగుచుండగా-ఒక అపవిత్రాత్మ తన కంటె చెడ్డవైన ఏడాత్మలు అనగా అవి ఏవైయుండవలెను? యెషయా 54:16 ఐగుప్తులో ఫరోహృదయమును కఠిన పరచుటలో మోషే చేసిన దైవమహత్తర క్రియలు సప్తతెగుళ్ళు ఎవరు రప్పించిరి? దేవుడేః ఏడాత్మలు అనగా తనకంటె ఏడంతలు ఉగ్రత పాలుచేయు గుణములను వారిలో అలవరుచుట.  (ఇందును బట్టి వారానికి వున్న ఏడు దినములు గ్రహాలక్రింద లెక్కచెప్పుచున్నారు.  అవి కూడా ఆత్మలే అనగా ఆత్మచేత సృష్టించబడినవి.  అనగా ఆత్మకు సన్నిహితమైనవి.  వారానికి ఏడు దినములు ఏడు దినములకు గురుపేరు పెట్టబడినవి.  సూర్యచంద్రబుదుడు గురుడు శుక్రుడు శని భూమి మున్నగునవి)

        ఏసుప్రభువు చెప్పిన ఈ ఏడాత్మల ఉపమానము అనేక విధములైన రూపములకు ఆలవాలమైయున్నట్లు ప్రకటన :15:8 మరియు 16:1 ఇది దేవుని వలన కల్గిన శక్తిగా నిరూపించబడుచున్నది.

        అయితే నేటి యుగములో అనగా ఏసుప్రభువు రాక కొరకు నిరీక్షిస్తున్న క్రైస్తవ యుగములో ఈ అపవిత్రాత్మ ప్రభావమెట్లున్నది? ఆదినములలో అయితే ఏసుప్రభువు కాలములో ఇది ఏడాత్మలను ఒక వ్యక్తిలో ప్రవేసింపజేసినట్లు తెలియుచున్నది.  అయితే నేటి యుగములో ఈ ఆత్మ ఒకమనుష్యుని వదలిన పరిస్థితిలో గలతీ 5:20లో పదిహేను గుణములుగల ఆత్మలను ప్రవేశపెట్టినట్లుగ తెలియుచున్నది.  బాప్తిస్మం పొందిన క్రైస్తవుని లగాయతు సంపూర్ణక్రైస్తవత్వములో క్రీస్తుకు సాక్షిగాను సువార్తకు బాకాగాను జీవించుచున్న బోధకునికి సైతము ఈ అపవిత్రాత్మ ప్రభావము సోకుచున్నట్లు నేటి యుగములో అనేక సంఘటనల ద్వారా మనము గ్రహించగల్గుచున్నాము.  ఏసుప్రభువు ఈ మాటకు లూకా 11:24 లో వలె చెప్పడమే గాక యోహాను 13:26లో వలె క్రియామూలకముగా యూదా ఇస్కరియోతు విషయములో జరిగించెను.  ఇందులో చదువరులకు ఒక సంశయము రావచ్చును.  లూకా 22:19 దీనిని బట్టి ఈ ఏడాత్మల యొక్క ప్రభావము పాపపశ్చాత్తాపము మారు మనస్సు బాప్తిస్మమును తీసుకొని ప్రభువు బల్లలో రొట్టె ద్రాక్షారసమును తీసుకొను వానిలో కూడా ఈ అపవిత్రాత్మ ప్రవేశించగలడని మరియు వాని ఏడాత్మలు కూడా ఆ వ్యక్తిలో ప్రవేశించగలవని, వాని జీవితములో వాని ఫలితము మరణమేనని ఈ క్రియనిరూపించినట్లు మనము గ్రహించగలము.  వాని అంతము మరణమే.  క్రైస్తవ్యములో జీవిస్తూ క్రైస్తవ సావాసములో వుంటూ క్రైస్తవ వేదమును ఆచరిస్తూ ప్రార్థనా వాక్యములందు అను దినము ఎదుగుచున్న కుటుంబములలో కూడా లోకానికి భయపడి విద్య పదవి ఉద్యోగము భూలోకసంబంధమైన సంపాదనలు ప్రభుత్వము యొక్క లాంఛనాలను ఆసించి క్రైస్తవులము కాదని మేము వెనుకబడిన షెడ్యూల కులముల వానిని జాస్తి మాట్లాడితో హరిజనులమని, ఇంకా మీరు నమ్మకపోతే మేము మాలవారిమని తమను హీనపరచుకొంటూ జీవించునట్టి క్రైస్తవాధములు (నామక్రైస్తవులు) ఈ యుగములో ఉందురని క్రీస్తు పేతురు విసయములో జరిగించిన క్రియ సాదృశ్యము. క్రీస్తును ముమ్మారు ఎరుగనని చెప్పిన విషయము మనము గుర్తింపవలసియున్నది.

        మత్తయి 24:12 అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమచల్లారును.  అని పల్కిన విధముగా ఆయన తానీలోకములో అక్రమస్థుల మద్య అక్రమమైన శిక్షకు పాత్రుడై, అక్రమము విస్తరించియున్న సామ్రాజ్యములో ఏసుప్రేమలేని అనగా దేవుని ప్రేమచల్లారి అన్యాయము విస్తరించిన ఆదినములలో ఆయన సిలువ మీద ఎత్తబడినపుడు ఆయన ప్రేమించిన శిష్యులెవరును దగ్గర లేకుండ పరారై, తాను ప్రేమించిన యోహానును తల్లియు వుండుటయనునది నేటి క్రైస్తవ యుగములో జరుగుచున్న మరియు తన రాకడలో జరుగబోవు క్రైస్తవ చరిత్రలో జరుగు సంఘటనలకు సాదృశ్యమైయున్నది.  అనగా దీని సారాంశము.  క్రీస్తు రాకడ సమీపమునందు క్రైస్తవ బోధకులు పరారు.  క్రైస్తవ సువార్తీకులు నిలువరు.  బోధకులు గా వుండరు.  సంఘాలను వుద్దరించు నాయకులు సంఘసేవకు దూరమై సంఘాలయములను వానికి సంబంధించిన వస్తు వాహనములను, అక్రమవ్యాపారముతో అమ్మి డలైలా అను వేశ్య ఒడిలో ఏడు జడలను కత్తిరించుకున్న సంసోను వలె దైవాశీర్వాదములను పోగొట్టుకొని నిర్లక్ష్య క్రైస్తవ జీవితమును జీవించి నిత్యనరక మరణమునకు ఎన్నిక జేయబడు దినములు వచ్చునని ఇందు మూలముగ గ్రహించగలము.  సంఘము వుంటుంది గాని సంఘ కూడికలు వుండును. సంఘ పెద్దలు సంఘనిర్వాహకులు బోధకులు ఉండరు.  సువార్తీకులు కరువగుదురు.

        లూకా 11:26లో మూడవ భాగమైన అంశముః-అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును.  అను వాక్యభావము ననుసరించి ఏసు ఈ లోకములో జీవించినపుడు, ఈ అపవిత్రాత్మ అనువాడు యెరూషలేములో స్థిరనివాసమేర్పరచుకొని క్రీస్తుకు వ్యతిరేకముగ క్రియజేసినట్లు ఈ క్రింది రెపరెన్సులు ద్వారా తెలిసికొనగలము.  మత్తయి 23:37 లూకా 19: 41-46 ఇపుడు తనకంటె చెడ్డవైన అన్నపుడు తనకంటె చెడ్డవాళ్ళుగా మనుష్యులను ఏడంతలుగా తయారుజేసియున్నాడు. కాబట్టి ఇప్పుడు మనుష్యులలో క్రియ జేయుచున్న అపవిత్రాత్మ జేసే క్రియలో నరుని దైవధ్యాన ధ్యాసలేకుండ చేయుటయు గాక లూకా 4: 5-6లోవలె సప్తవ్యసనములను ఏడాత్మలను లోకమును చూపించి క్రియజేస్తున్నట్లుగా మనము గ్రహించవలసియున్నది.  (కనుక లూకా 11:10 లో వలె ఆత్మలకు మూలకారకుడైన ఆత్మ రూపకల్పనుడైన క్రీస్తు మాట మనము గ్రహించవలసియున్నది)అడుగు ప్రతివానికియ్యబడును. వెదకువానికి దొరకును. తట్టువానికి తీయబడును.

        ఇకపోతే అపవిత్రాత్మ యొక్క విశ్రాంతిని గూర్చి వివరణముః-ఆది 2:1లో దేవుడు తాను సృష్టించిన సృష్టియంతటినుండి ఏడవ దినమున విశ్రమించెను.  ఆ దినము శనివారము. అదే విధముగా ఆయన కుమారుడు మన రక్షకుడు ఏసుప్రభువు కూడా మార్కు 16:1 లూకా 24:56 లోను శారీరాత్మలు రెండును విశ్రాంతి పొందునటుల గ్రంధములో వున్నది.  నరునిలోని జీవాత్మకు విశ్రాంతి కావాలి.  దేవుని యొక్క ఆత్మ ఆదిలో చీకటి జలముల మీద అల్లలాడుచుండెను.  అనగా సృష్టికార్యమును గూర్చి ఆయాత్మ ఎంత ఆతృతతో తిరుగుచుండునో ఆ వాక్యము మనకు విశదపరచుచున్నది.  అయితే అపవిత్రాత్మ కోరు విశ్రాంతి అంతయు లోకసంబంధంగా వుండి నిర్ణయము లేని చలనముతో-అచంచలమైన స్వభావముతో తిరుగుచు తనకే తన గమనము మీద నిలకడలేనపుడు తాను పట్టిన వ్యక్తిని కూడా అదే స్వభావముతోను అదే ధ్యాసతోను వుండునట్లుగ చేయుచు శరీరమునకు నిద్ర ఆహారము అనునవి లేకుండ తనకు శాంతి లేక నరునిలోని జీవాత్మకు శాంతి లేక జీవించుచు, నరుని అదే స్థితిలో జీవింపజేయుచు దైవత్వమునకు మానవత్వమునకు విరుద్దముగా నరజీవితమును జరిగించును.

        అయితే ఇంతకు నరునికి దేవునికి విశ్రాంతి యున్నది.  నీతిమంతుని హృదయములో దేవునికి విశ్రాంతి వున్నది.  నీతిమంతుని హృదయములో దేవుడు నివసిస్తూ విశ్రాంతి పొందుచు, నిబ్బరముగను మెళుకువగను వుండునట్లు చేయును.  మొదటి పేతురు 5:8 దేవుని విశ్రాంతి వుండు వానికి అది వుండును.

        నీ విరోధి ఎట్లుండును? గర్జించు సింహమువలె వుండును.  గర్జించుసింహమునకు విశ్రాంతి వుండదు.  ఈ లోకములో దైవపిలుపు వుండి దైవత్వములో శరీరేచ్ఛలు నడిపి క్రమబద్దములో జీవితాన్ని సార్థకము చేసికొని యున్నట్లయితే, అది దైవత్వముతో కూడిన విశ్రాంతి ననుభవించుచు లోకమునకును మానవాళికిని చూపుకందక సోదెలోకి రాక మంత్రగాళ్ళ యొక్క మాయలకు అందక పరిశుద్ధమైన జీవితములో జీవించును.  ఈ విధంగా పరిశుద్ధమైన జీవాత్మ జీవించును.  

        అపవిత్రాత్మ అంటే లోకసంబంధమైన జీవితములోను లోకసంబంధజ్ఞానముతోను లోకదాస్యములోను శరీరమును నడిపి, బ్రతికి వున్నపుడే అనగా జీవాత్మతో నరదేహము వున్నపుడే నీవు జీవించుచున్నావన్న మాటేగాని మృతుడవే.  అనునట్టి వాక్యమునకు యోగ్యుడుగా జీవింపజేసి,చనిపోయిన తర్వాత అనగా ధనాశ,నేత్రాశ,సంపద, లోకమమకారము ఇత్యాదిగుణములతో  ఆ శరీరమును జీవింపజేసి, అకాలమరణము పొందినపుడు, ఆ యొక్క ఆత్మలోకము మీద వ్యామోహముతో తిరిగెడిదే ఈ అపవిత్రాత్మః- దీనికి వావివరుసలు తన మనఅనుబేధము, మానవులకున్న కులమత బేదములు, జాతిబేధము అన్నవి ఏవియు పట్టింపు లేక ప్రతియొక్కరిలోను ప్రవేశించి, దైవనిర్ణయము నుండి తప్పించి తన సహచరులుగా చేసికొనుటకు ప్రయత్నించును.

        ఒక దైవసేవకుని దేవుడు విశ్రాంతి లేకుండ సువార్త విషయమై త్రిప్పుచున్నాడో అదే విధంగా లూకా 9:58 లో వలె ఈ కోవలో ప్రధమ సువార్తీకుడు ఏసుప్రభువే.  ఆయన ఆరకంగా సేవచేసెను.  ఆయన ఆ రకంగా సేవచేయబట్టే నేడు సాతాను కూడా దైవత్వంతో పోట్లాడుచు విశ్రాంతి లేక అపవాదియు తనకు సమయం కొంచేమేయని బహుక్రోధము గలవాడై బయలు దేరియున్నాడు.  అనువేదవాక్యానుసారముగ నేటి యుగములో అపవాదికిని వాని అనుచరులకును, భీకరమైన అదృశ్యపోరాటము జరుగుచున్నట్లుగా మనము చూచు సంఘటనలు అక్రమములు అన్యాయపు తీర్పులు హత్యలు దోపిడీలుఅనేక ఇక్కట్టులకు దైవదాసులు గురియగుట.  ఇవన్నియు ఇందుకు సాక్ష్యము లైయున్నవి.  ఎఫెసీ 6:12 దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఏలయనగా అంధకార సంబంధ దురాత్మలతో పోరాడుచున్నాము.

                                లూసిఫర్‌ని గూర్చిన యదార్ధ చరిత్రః-

        అపవిత్రాత్మను క్రైస్తవ వేదము ఘటసర్పముగాను గర్జించు సింహము గాను తేజోనక్షత్రమని క్రూరమృగమని అబద్దప్రవక్తయని అపవాదియని, ఈ యుగసంబంధమైన దేవతయని వాయు మండలాధి పతియని సాతాను అని లోకనాధుడని వగైరానామధేయములతో ఈ లూసిఫర్‌ అను దూతను క్రైస్తవ లోకము వుచ్చరించుచున్నది.

        అయితే అపవాది ఆడా?మగా? అపవాదిని అతను చేసిన క్రియనుబట్టి అనగా మొదట సర్పములో ప్రవేశించి చేసిన బోధను బటి,్ట ఆ బోధకు విశ్వాసియై మొదట స్త్రీ-ఫలములు తిని ఆ తర్వాత సర్పబోధకు విశ్వాసియైన స్త్రీ ఫలములు తిన్నపుడు సర్పమును వదలిన సాతాను స్త్రీలో ప్రవేశించెను.  ప్రవేశించిన అపవాది దైవ వాక్యములో వివరించిన రీతిగా అపవాది అనగా లూసిఫర్‌ అను వాడు దేవదూతలలో అతిసుందరుడును మంచి గాన కళాకోవిదుడును అయిన లూసిఫర్‌ పండును తిన్నట్టి స్త్రీలోనుండి తన సౌందర్యాన్ని తన కంఠమాధుర్యమును ప్రదర్శించిన కళకు పురుషుడు ముగ్దుడై, ఈ పండ్లెక్కడివి? ఎవరు తినమన్నారు? నీవు తిన్నావా? దేవుడు తినవద్దన్నాడే'', అనునట్టి హెచ్చరిక కూడా లేకుండ స్త్రీ యొక్క అందమునకును కంఠారావమునకును ముగ్దుడై ఫలభక్షణం చేసిన పిదప, ఆదాములో వున్న దైవాత్మ ఆతనిని విడిచి పోగా తను అనగా సాతాను ఆదాములో చేరి తన ప్రధాన దూతను స్త్రీలో వుంచి అప్పటినుండి నరసంతునుపెంచి పాపమునకును సర్పమునకును సర్పపూజకును బీజము వేసిన వాడాయెను.  కనుక నేటి అన్యసోదరులుచేయు సర్పపూజ సుబ్రహ్మణ్యస్వామి ఆదిశక్తి అను పేర్లతో కొలుచునట్టి వారైనట్లు మనము ఆత్మీయ జ్ఞానముతో గ్రహించవలసియున్నది.  ఎందుకనగా సర్పములో ప్రవేశించి అపవాది చేసిన బోధలు కేవలము పండుతింటే మీరు చావరని మీరు మంచి చెడ్డలు ఎరిగినవారై పరువు మర్యాదలతో జీవిస్తారని చెప్పివుంటే ఈ రోజు సర్పపూజ ఆదిశక్తి అనేవి వుండవు.  తన బోధలో మీరు మంచి చెడ్డలు ఎరిగినవారై దేవతలవలె వుందురని దేవునికి తెలియును'', అనుటలో సర్పము ద్వారాను స్త్రీ ద్వారాను పురుషుని ద్వారాను అపవాది వేసిన బీజము ఆదికాండ ఆరవ అధ్యాయములోను, నరులను భూమిమీద విస్తరింపజేసినట్లు వారు నిర్లక్ష్య జీవితములో జీవించినట్లును, అజ్ఞానము అంధకారము నిలకడలేని దైవత్వములోను జీవింపజేసి మరణ పాత్రులుగా జేసినట్లు మనము గ్రహించగలము.

        ఆదిలో ప్రారంభమైన ఈ యొక్క కొలువు అపవాది త్రివిధముగ అనగా సర్పము స్త్రీ పురుష రూపములను ధరించి విగ్రహములుగ రకరకాలు లోహములతోను కొయ్య,శిల,మట్టి వగైరా పదార్థములతో తన రూపములను నిర్మించుకొని బహిరంగముగ తనకొలువును అపవాది చేయించుకొంటున్నాడు.  ఆది తల్లిదండ్రులను ఆదిశక్తి అను రూపములతో ఊరికొక దేవత పేరు ఒక దేవుడిపేరు ఒక వేళ దేవతకు భర్తలేడని భక్తులు చింతపోవుదురని కల్పనాకధలతో భర్తను సృష్టించి, సందుకొక దేవుని గొందికొక దేవతను సృష్టించి నేటి యుగములో చెలామణియగుచు నరుడు సందిగ్దుడైనపుడు, వానిని దేవుడేలేడను నాస్తికత్వమునకు దిగజార్చుచు నిజదైవత్వము నుండి నరుని తప్పించుచున్నాడు.

        ఇందును బట్టి దేవుడు కూడా త్రివిధముగ మూడు శరీరాలు ధరింపవలసి వచ్చెను. మొదటిఆదాము ఇతడు హిందువుల దేవుడాయెను.  ఉదా|| ఆదెయ్య ఆదినారాయణ, ఆదిశేషయ్య, ఆదెపు రెడ్డి, వగైరానామధేయములు. ఆదిలక్ష్మమ్మ ఆదెమ్మ, ఆదినారాయణమ్మ, ఆదిశేషమ్మ వగైరా స్త్రీ నామధేయములు, ఈయన పాము మాటవిన్నందు వల్ల ఆదిశేషమ్మ, నాగమ్మ, పాములమ్మ, నాగభూషణమ్మ వగైరా నామధేయములు,  పురుషుడు స్త్రీ మాట వినినందువల్లకాంతయ్య, శ్రీనాధుడు వగైరా నామధేయములు.  స్త్రీసర్పనామధేయములతోనే భువిలో చెలామణియగుచున్నది.  పురుషుడైతే సర్పము-స్త్రీ''ఇరువురి నామధేయములతో లోక జీవితములో వున్నట్లుగా ఉదా||భుజంగరావు నాగయ్య, నాగభూషణం, ఫణీంద్రుడు లక్ష్మికుమారి నాగరత్నం, పాములయ్య ఇత్యాదినామధేయముల ద్వారా విధితమగుచున్నది.  మరియు ముత్యాలమ్మ, ముత్యాలయ్య, మారెమ్మ, మారెయ్య, దుర్గమ్మ, దుర్గయ్య, శేషయ్య శేషమ్మ మొదలుగునవి.  ఇట్లు త్రివిధములుగ భూమి మీద ప్రజ్వరిల్లిన అపవాది యొక్క అసమానక్రియను వీక్షించిన దేవుడు ఆయన కూడా సాతాను వలె ఒక జీవి, ఒక స్త్రీ ఒక పురుషునిలో ప్రవేశించి సాతానుకు సమతుల్యముగా భూమిపై క్రియజేసినట్లుగా ఈ క్రింది రెఫరెన్సుల ద్వారా మనము తెలిసికోగలము.

        లూకా 1:26లో మరియమ్మకు కల్గినదూత దర్శనము.  ఇక్కడ మరియమ్మ హవ్వకు సమకాలికురాలుగాను ఏసుప్రభువు రెండవ ఆదాముగాను దేవునిఏర్పాటులో వున్నట్లు గ్రంధములో వివరములను బట్టితెలిసికొనగలము.  బాప్తిస్మము పొందినపుడు క్రీస్తుపై వ్రాలిన పావురము పరిశుద్ధాత్మకు ముంగుర్తుగాను వుండి, పావురమును రూపమాత్రంగా వాడుకొని ఆకాశవాణియందుండి దేవుని మాటలు పల్కినట్లు లూకా 3: 21-22 దీని ద్వారా తెలియుచున్నది.  ఈ రెండు సంఘటనలలో చాలా దైవికమర్మములను బోదిస్తున్నట్లుగా ఈ క్రింది సంఘటనల ద్వారా తెలిసికొనగలము.  క్రొత్త నిబంధనకాలములో ఒక నిర్ణయదినమున శుభసమయములో దేవుడు తన దూతను మరియమ్మ దగ్గరకు పంపినట్లు గ్రంధములో వున్నది.  అదే విధముగా ఆదిలో ఏదేను వనములో దేవుడు తాను చేసిన యుక్తిగల సర్పములో అపవాది దూతగా పంపి అది స్త్రీతో మాట్లాడుటకు అవకాశమిచ్చినట్లును, దాని బోధకు చెవినిచ్చుటచే పాపమునకు మూలకారకమైనట్లును-ఇచ్చట మరియమ్మ'',  దూత బోధకు చెవినిచ్చి, తన నిష్కల్మష జీవితమును పవిత్ర పరచుకొని దేదూత వాక్కిచ్చిన ప్రకారంఆది తల్లిమూలమున వచ్చిన పాపమును పరిహరించుటకు ఒక రక్షకుని అనుగ్రహించి భూమిపై నిజదైవత్వసామ్రాజ్యమునకు మూలకారకురాలై, ఆదితల్లి వలె క్రైస్తవ విశ్వాసులను తన పేరుతో తన పేరుతో వుచ్చరించునట్లు యోగ్యతను సంపాధించుకొన్నట్లు ఈ క్రిందినామధేయాలను బట్టి తెలిసికొనగలము.  పురుషులకుః- మరెయ్య, మరెన్న, మరియభూషణం, మరియదాసు, ఆరోగ్యరాజు వగైరా నామధేయములు ఇక స్త్రీలలోః-మేరి,మరియమ్మ మేరి రాణి, రోస్‌ మేరీ, మేరి స్టెర్లా, గ్రేస్‌మేరీ, మేరీ రత్నం వెలాంగణి, పాతిమాంబ, మరియం బీబి. వగైరానామదేయముతో వుచ్చరింపబడుచున్నది.  ఇక రెండవ ఆదామైన ఏసుప్రభువుపేరు పురుషులలో ఏసు పాదం ఏసు రత్నం, ఏసుప్రకాశం, ఏసుప్రసాద్‌, జేసెస్‌ రాజు వగైరా పేర్లతో వుచ్చరింపబడుచున్నది.

        స్త్రీలలోః-ఏసమ్మ, సువార్తమ్మ, ఏసురత్నమ్మ, ఏసుభూషణమ్మ వగైరా నామధేయములలో వుచ్చరింపబడుచున్నని.  కాని చిత్రమేమిటంటే బాప్తిస్మములో క్రీస్తు మీద వ్రాలిన పరిశుద్దాత్మ యొక్క నామధేయము మాత్రం క్రైస్తవ స్త్రీ పురుషులలో లేదు.  పరిశుద్ధాత్ముని పేరు లేదు.  పరిశుద్ధాత్మ ఆవరించిన కపోత రూపము నామధేయముకూడా లేదు.  మరి విడ్డూరమేమిటంటే పాపమునకు మూలకారకుడైన అపవాదియొక్క పేరుగాని సాతాను అనుపేరుగాని నరులకులేదు.  అదేవిధంగా సృష్టికి మూలకారకుడైన యెహోవా దేవుని యొక్క పేరు కూడా నరులలో లేదు,  ఇది మరుగుపరచబడిన దైవసత్యము.

        ఇక ప్రత్యక్షంగా బైల్పరచబడిన సత్యమేమిటంటే యోహానుకు దేవుడనుగ్రహించిన ప్రకటన గ్రంధములోని 22వ అధ్యాయం వరకు వివరించబడిన లోకనాశనము భూమి పతనము, దేవునికి సాతానుకు జరుగు యుద్ధము వగైరా సంఘటనలను గూర్చి మనము గ్రహించవలసినవి గ్రంధములో వివరించబడియున్నవి.

        ఆదిలో మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలవృక్షమును ఆ వృక్షముపై నుండి సర్పములో అపవాది ప్రవేశించి మాట్లాడినట్లు తెలియుచున్నది.  క్రొత్తనిబంధనకాలంలో ఆదిలో ఏదేను తోటలో జీవవృక్షమై యుండి మౌనియైయుండి, క్రీస్తు నూతన నిబంధన కాలంలో యోహాను చేత యోర్దానులో బాప్తిస్మం పొంది గట్టున నిలిచినపుడు ఆయన మీద పరిశుద్దాత్మ వ్రాలి, ఆదిలో సాతాను ఏ విధంగా మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను గూర్చి మాట్లాడెనో అదే రకముగ పావురములో ప్రవేశించి ఏసుప్రభువుపై వ్రాలి పవిత్రాత్ముడు పల్కిన మాటలు కూడా మనము గుర్తింపవలసియున్నది.  చిత్రమేమిటంటే మంచి చెడ్డ తెలివినిచ్చు ఫలవృక్షము పై నుండి మాట్లాడిన సర్పము నేడు అన్యజనాంగముల దేవాలయముల పైనను నరుల కల్పనాచాతుర్యము లతో మలచబడిన దేవుళ్ళ మెడలోను, ఆ దేవుళ్ళకు శేషపాన్పుగాను వారి నెత్తిన గొడుగు వలె పడగపట్టుచు అన్యదేవతలపేర్లను వుచ్చరిస్తూ అనగా ఈయన పలాని దేవుడు అంటూ ఆ దేవుళ్ళ కీయన పడగపట్టుచు తనను జ్ఞాపకము చేసికోమన్నట్లుగా-అజ్ఞాన భక్తులకు కనపడుచున్నాడు.  ఉదా||హైందవ దేవుళ్ళ మెడలో వున్న సర్పము పటముల ద్వారాను లోహసంబంధమైన రూపములతోను శిలారూపములతోను ఏదియు కానపుడు, మెలికలు తిరిగిన గుమ్మడి తీగరూపముతోను కొయ్యతో చెక్కబడిన రూపముతోను, ఏలాగైతేనేమి నరుని యొక్క తలంపు దృష్టి దేవుని మీద మరల్చకుండ అనేక తిప్పలు బడి దేవునికి చెందవలసిన మహిమను తాను పొందాలని కాంక్షిస్తున్నట్లు తెలియుచున్నది.

        అయితే దేవుడు ఇది ఎరిగి ఇట్టి కౄరమైన ఆది సర్పము బారినుండి తన సృష్టియైన నరకోటిని రక్షించుటకు, తాను నరరూపముతో పొందిన పాపమరణమునకు గుర్తు అగు శిలువను క్రైస్తవ దేవాలయముల పైనను క్రైస్తవ బిడ్డలమెడలోను క్రైస్తవ సంస్థల వాహనముల మీదను క్రైస్తవ గృహాలలోను క్రైస్తవ సాంకేతికముగా శిలువను జ్ఞాపకార్థముగా నరుని ఎదుట చూపుచున్నట్లు మనము గ్రహింపగలము. ఇందును బట్టి ఆలోచిస్తే నేడు ఎఫెసీ 6:12 లో వలె ఇపుడు ఈ యుగములో జరుగుచున్న యుద్దము సిలువకును సర్పమునకును జరుగుచు వీరికి అండగా నరకోటిని దృశ్యమైన భూలోకసంబంధ సైన్యంగా వాడు కొనుచున్నట్లు విదితమగుచున్నది. ఈ సందర్భములో క్రైస్తవ వాఙ్మయములో సిలువను చుట్టుకొనియున్న సర్పమును చూడగలము.  యెహాను 3:15 లో వలె ఇపుడు నాశనకరమైన నరుడు ఆదిలో ఎత్తబడిన సర్పము వైపు నిదానించి చూచి సర్పవిషమునుండి విడుదలపొందినాడు. నేడు నశించుచున్నట్టి వ్యక్తి రక్షణ పొంది పాపము నుండి విడుదల పొందాలంటే ఏసుఎత్తబడిన శిలువవైపు చూడవలెను,  నేడు మానవాళికొక సంశయము కలుగవచ్చు.  అదేమంటే సిలువను మెడలో ధరించినవాడంతా భక్తుడా? సిలువతో ప్రతిష్టించబడిన పవిత్రాలయములంతా పవిత్రములా? అట్టి సిలువనుప్రధానధ్యేయముగా తమ సంస్థలో దేవుని మహిమార్థంగా ఉంచుకొని సేవజేస్తున్న సంస్థలు పవిత్రములా? పాము పుట్ట దగ్గర కెళ్ళే భక్తులు పాపులా? దాన్ని ఆరాధించు వారు పాపులా? అనుసంశయము రాకమానదు.  ఏసుప్రభువు తన సువార్తలో క్రైస్తవులనుద్దేశించి మీకంటె ముందు అన్యులు పరలోక రాజ్యములో ఉందురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అంటారు.  మరి క్రీస్తు సిలువను మెడలో వ్రేలాడవేసుకున్న భక్తుల సంగతి ఏమిటి? ఈ సందర్భములో మార్కు సువార్త 7:6 ప్రేమలేని జీవితములో జీవిస్తున్న సిలువధారులైన క్రైస్తవ  కూటమినిచూచి ప్రభువు పల్కిన ఈ సిలువ'',  బాహ్యముగా మాత్రమే కాదు గాని ఆచరణలలోను దాని యొక్క విలువను ఏసు పాపిపైనున్న ప్రేమను సార్థకము చేయుచున్న దానికి గుర్తుగా ప్రేమను క్రియాత్మకంగా ఆచరించాలి.  క్రైస్తవ జీవితమంతయు ప్రేమమయమైనదని దానిని తమ జీవితములో ఆచరించాలని ఇందలి అర్థము.

        ఇక అన్యదేవతలకు మూలకారకుడైన భుజంగుని సిద్దాంతం:- బ్రహ్మ-విష్ణు-శివ అన్నాడు.  ముగ్గురికి పడగపట్టిన దెవరా? నరజంటను పాపములో ప్రవేశపెట్టిన సర్పమేగదా ''అహింసో పరమోధర్మఃపరోపకారం పాపశరీరం'' అన్నాడు.  పరోపకారం పాపశరీరం అంటే ఇది అపవాదికే అనువర్తించును.  జనాభా పెంపుదలకు వాడు చేసిన ఉపకారమును బట్టి పాపశరీరం అనుసర్పములో జేరి పరులైన నరులకు (అపవాదికి పరుడు నరులే) ఉపకారము జేసి అనగా మంచి చెడ్డ అనుజ్ఞానమును వివరించి, తాను ఆవరించిన సర్పశారీరమునకు అవయవలోపము శాపము, దినదినగండమును మరణమును ప్రాప్తింపజేసిన విధానమును ఈ సిద్దాంతము వివరించుచున్నది.

        మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షశాఖను వ్రేలాడి సర్పము వృక్షము ఫలముల యొక్క గుణములను వివరించినట్లుగా ఆదిలో ఏదేను వనములో జీవవృక్షమైయున్న క్రీస్తు నరుల మద్య యోహాను 6: 51-54 లో వలె జీవాహారమైయుండి నరుని మృతినుండి నిత్యజీవములోనికి నడుపుమార్గమైయున్నాడు.

        ఏసుప్రభువు తన ప్రవచనాలలో లూకా 19:10 ఈ మాటలను ఆయన సార్థకము చేయుచు ఆయన ఆదినములలో సమరయులు సద్దూకయ్యులు పరిసయ్యులు యాజకులు, ప్రధాన యాజకులు, ప్రధానులు-మోషే ధర్మశాస్త్రమని మూఢభక్తితో ఆచరించునట్టి పెద్దలు, దొంగలు హంతకుల మధ్య ఈయన సంచరించుచు సువార్త ప్రకటించినాడు.

        అదే విధంగా నేటియుగములో క్రైస్తవునితో వున్న క్రీస్తు-క్రైస్తవుని జోలికి పోక అన్యుల మధ్య అనగా అనేక కులముల మధ్య సువార్తను ప్రకటించుటకు సువార్తీకులను ఉజ్జీవ పరచుచున్నాడు.  ఎందుకనగా తాను జీవించియున్న కాలములో తన శిష్యులను ప్రబోధించి'',  మీరు వెళ్ళి సర్వప్రజలకును సువార్తను ప్రకటించుడి అన్న విధముగా నేడు అన్యులమధ్య సువార్తసేవ జరుగుచున్నట్లు మనము గ్రహించగలము.  ఇందును బట్టి అన్యులు విగ్రహాలతో నిర్మించబడిన ఆలయములలో సాతాను వున్నాడని మనము భ్రమపడుచున్నాము.  ఆ దేవాలయములను అసహ్యించుకొనుచున్నాము.  కాని దైవ జ్ఞానముతో మనము ఆలోచించినట్లయితే అచ్చట దేవుడు ఆ ఆలయములను నిర్జీవముగ వున్నను అనగా నిజదైవత్వం లేని దైనను అచ్చటికి వచ్చు నరుల యొక్క విగ్రహముల పట్ల అనగా అవి దేవుళ్ళనియు, ఆ దేవునిముందు అవకతవకలు చేయుట మంచిది కాదనియు ఈయన పలాన రూపముగల దేవుడనియు, ఆయనకు చెందవలసిన మర్యాదలు చెందనట్లయితే ఆయన శిక్షించుననియు వినయవిధేయతలతో అన్యులు అర్పించి ఆ విగ్రహాలకు మ్రొక్కి వెళ్ళుచున్న భక్తులను తిలకిస్తున్న దేవునికి వారిపట్ల సానుభూతి దయ వున్నప్పటికిని, తాను ఏదైన వారికొక మేలు జేసిన యెడల ఆ మేలుకు ప్రతిఫలముగ తనకు జెందవలసిన మహిమను నరుల హస్తనైపుణ్యమైన ఆ విగ్రహాలకు ఆఱాతి దేవుళ్ళకు చెందునేెమోయని కఠినముగా చూస్తూ అప్పటికి ఆ భక్తులు విగ్రహాల చెంతజేరి ఏమి స్వామీ! మేమేమి అపచారము చేశాము.  మేము అన్ని అర్పిస్తున్నాము.  కదా! ఇంకా ఏదైన లోటువుంటే చెప్పమనియు అట్టి సమయములో బుఱ్ఱ పనిచేయక తన నీలాలు కూడా ఆ ఱాతి దేవునికి సమర్పించుటయే గాక నిలువుదోపిడీయని, ఒంటి మీద గుడ్డతో కూడా అర్పించి అడ్డగుడ్డలతో వెళ్ళే భక్తులను చూస్తూ దేవుడు వారి అజ్ఞానమునకు అబ్బురపడి మౌనియైయున్నాడు.

        జీవముగల దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు యొక్క ఆలయములు వానిలోని భక్తులక్రియలు యాజకుల క్రియలు, నాయకుల సంఘపెద్దల క్రియలు సంఘాధ్యక్షుల క్రియలు సంఘనిర్వాహకుల క్రియలు పై ఉదహరించిన అన్యదేవతాలయములలో జరుగు క్రియలకు భిన్నముగా వున్నవి. మత్త 18:19-20 ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామమున కూడుదురో నక్కడ నుందునని ఏసుప్రభువు చెప్పిన మాట క్రైస్తవుల సంఘముల పట్లను క్రైస్తవ జీవితము పట్లను సార్థకమైనట్లు ఈ క్రింది వివరణ వల్ల తెలియుచున్నది.  నేటి క్రైస్తవాలయములలో మత్తయి 23: 1-36 చదివినట్లయితే నిలువుటంగీలు ధరించి బోధలు చేయు క్రైస్తవుని లగాయతు సగము సర్కారు ఉద్యోగమంటూ సగము స్వామి సేవయంటూ సైకిళ్ళ మీద బైలుదేరి గ్రామసేవచేస్తున్నానను సువార్తీకుని వరకును, వీరు కట్టిన సంఘము సంఘాలయములలోను జరుగు సంఘమునకును సమాజము స్వామికిని వ్యతిరేకముగా జరుగు క్రియలను క్రైస్తవ ఆత్మీయ జ్ఞానముతో తిలకిస్తే, వీరు జేసే సేవలో నిజముగ ఏసుప్రభువు ఉన్నాడా? అను సంశయము ఈ క్రిందవివరించబడు సంఘటనల ద్వారా కలుగకమానదు.

        ఇందులో 1.ఆలయములో బలిపీఠ(పుల్‌పీఠం) యొద్ద దేవునికి చెందవలసిన గౌరవము స్తుతిమహిమ వగైరా ప్రాధాన్యతలను అట్టిపెట్టి సంఘాధ్యక్షుడు సంఘమును పొగడడము.  సంఘములోని పెద్ద లేచి సంఘాధ్యక్షుని గుణగుణములను పొగడడము.  సంఘములోని పెద్ద లేచి సంఘాధ్యక్షుని గుణ గుణములను పొగడడము అనంతరము ఆరాధన జరుపవలసిన యాజకుడు సంఘమును సంఘాధ్యక్షుని ఇద్దరిలో ఏ ఒక్కరిని పొగడినా తన పదవికి భంగమని సంఘాన్ని సంఘాధ్యక్షులను, ఆయనను ఆవరించిన కమిటీని పొగడి అనగా ఈ పొగిడింపు చాలా విచిత్రంగా వుంటుంది.  ఉచ్చరించుటకు మాత్రము ప్రభువులో సోదరసోదరీమణులారా! మన సంఘము యొక్క అభివృద్ధిని గూర్చి అనేకలు విని మన సంఘము చాలా మంచిదని ఉజ్జీవకరమైనదని పవిత్రమైనదని, పరిశుద్ధాత్ముడు పరిపూర్ణంగా మన సంఘములో ఆవరించియున్నాడని ఇందుకు కారణము మనము చేసిన సేవయేయని, అన్నిటికంటె ముఖ్యము మన సంఘాధ్యక్షులు ''శ్రీ శ్రీ'' అని మూడు శ్రీలు పెట్టి పేరును వుచ్చరిస్తూ వారి యొక్క కృషి వలన వారిప్రోత్సాహము వల్లను మనసంఘము తరపున అనేక ఆలయములు కట్టబడుట, నిజముగ దైవాశీర్వాదమని దేవుని అడ్డము పెట్టి ఆ తర్వాత కొంత సందుచేసుకొని తనను గుర్తింపరేమోయని బోధకుడు కూడా తనను గూర్చి చెప్పుకుంటూ ఇందులో నేనుకూడా పడిన శ్రమకు దేవుడనుగ్రహించిన మేళులనుబట్టి '' అనిచెప్పుచు తన అనుభవము ఏదో యొక్క సంఘటననుగూర్చిచెప్పుకొంటూ ఆ తర్వాత ఆరాధనను ప్రారంభించును.  

        ఇందును బట్టి అపొస్త 17: 24-25 దేవుడు తనకు చెందవలసిన మహిమను ఆధిక్యతను నరులకు అనుగ్రహించువాడు కాదు.  కనుకనే ప్రభువు క్రైస్తవ ఆలయములలో వుండడు.  అనుటకు ఈ క్రింది సంఘములలో ఉండడని బలహీనుడై యున్నాడని మన చేతబలహీనపరచబడుచున్నాడనుటకు ఈ క్రింది ఉదాహరణలు మన స్వానుభవములో తెలుసుకోగల్గుచున్నాము.  1.పాదరక్షలతో ఆలయప్రవేశము. పుల్‌ పీఠం ఎక్కుట.  2.ఆరాధన జరుపు పాస్టరు (యాజకదుస్తులు) అంగీలేకుండ కాలేజీ కుర్రాడువలె దుస్తులు ధరించుట.  లేక జడ్జీ కోర్టులో వకీలు వలె నల్లకోటు ప్యాంటు ధరించుట.  పరిశుద్ధగ్రంధములో అహరోను కిచ్చిన యాజకదుస్తులు అంగీ అక్కడనుండి మొదలు పెట్టిన ఈ ఆచారము క్రీస్తు యొక్క శిష్యులలో కూడా ఇవి ఆచారయోగ్యంగావించబడినవి.  దీనిని ఏసుప్రభువు ఆయన శిష్యులు ఆచరించారు.  నేటి కొన్ని సంఘాలు ఈ పద్దతిని  ఆచరిస్తున్నాయి,  నేటి క్రైస్తవాలయాలలో క్రైస్తవుడు ఎంతో భక్తితో ముందుకు సాగాలని గంపెడాశతో ప్రార్థన పూర్వకముగా బైబిలును చేత బట్టి ఆలయములో అడుగుపెట్టిన వెంటనే ఆయన కెదురయ్యే ప్రధమ సమస్య గ్రూపు పద్దతి.  ఆ వరకు ఐక్యతగా వున్నసంఘము ఆది 2: 10లో వలె ఆదిలో యెహోవా దేవుడు చేసిన క్రియను సంఘాధ్యక్షులు చేసి నీవు ఏ శాఖలో బాప్తిస్మక్రైస్తవుడుగా జీవిస్తావని నిలదీసి అడుగుచున్నారు.  పొరబాటున ఈ సంఘస్థుడు అదేమీ సార్‌! ఏదేను వంటి పరిశుద్ధమైన ఈ సంఘాన్ని శాఖలుగా చేయడము ఏంబాగుంటుంది ఏంమర్యాద అని అడిగితే, దేవుడు ప్రవహింపజేసిన నదియే ఏదేనులో నాలుగు శాఖలుగా అయినవి.  అది ఒక్కటిగా వుంటే చెట్లుకొట్టుకొని పోయి వుండేవి.  కాబట్టి సువార్త వ్యాప్తి కొరకు నలుదెసల సంఘము యొక్క ప్రభావము ప్రాకాలంటే శాఖలుగా జీవించడమే మంచిదని స్వలాభాపూరిత మైన ధనాశ పదవీ వ్యామోహము, ఎదుటివాని మీద ద్వేషము ఈర్ష్య దైవాజ్ఞకు వ్యతిరేకము వగైరా స్వభావసిద్దమైన చిత్తము గలవాడై ,పైకి ఆ సంఘస్తునికి నచ్చజెప్పి నా మాటవిని రాబోయే ఎలెక్షన్‌ లో నీ ఓటును  మన పార్టీకి చెందిన ఫలాని వ్యక్తికి వేయుము.  భవిష్యత్తులో నీకుటుంబమునకు నా వల్ల జరుగబోవు మేలు నానోటితో చెప్పనని మభ్యపెట్ట్టును.  ఆ తర్వాత ఇంకొక వ్యక్తి ఆతని కెదురై ఈ సంఘస్థుని తెగపొగిడి మీనాన్న మీ తాతముత్తాతలు మీరందరు నిజమైన క్రైస్తవ విశ్వాసులుగా జీవించారు. ఆడిన మాట తప్పరు.  ఫలాని దినమున మీ స్థలము తగాదాలలో నేను సహాయము చేశాను.  మీ ఇంట్లో శుభకార్యమునకు నేను తక్కువ వడ్డీకి డబ్బు ఇప్పించినాను.  మీ పిల్లవానిని హరిజన హస్టలు సీటు తెప్పించింది నేనే కదా! కాబట్టి నా తరపున నిలబడిన వ్యక్తికి నీవు నీ కుటుంబము ఓటు చేశారంటే, బ్లాక్‌ డెవలప్‌మెంటు ఆఫీసర్‌కు చెప్పి నీ కుమార్తెను దగ్గరకు ట్రాన్స్‌ఫర్‌ చేయిస్తానని చెప్పును.  అట్టి పరిస్థితులలో సందిగ్దావస్థలో వున్న వ్యక్తి ప్రక్కన ఇంకొక వ్యక్తి చొరవచేసుకొని, ఆ ఇద్దరు వ్యక్తులను కేవలపరచుచు వాళ్ళేమి పెద్దమనుష్యులండీ! సంఘాన్ని చీలికలు చేయాలని చూస్తున్నారు.  మీ వరకు మీరు చెప్పండి.  సంఘానికి వచ్చు కానుకలు ఒకాయన తింటే, చందాను లెక్క అడిగితే ఒకాయనకు కోపము ఇద్దరు మంచి ఎట్లయ్యారు? నేను చేప్పేవ్యక్తికి నీవు ఓటు చేశావంటే దేవుడు కూడా మెచ్చుతాడు.  ఫలాని అని పేరు చెప్పి ఈ వ్యక్తి ఎవ్వరికి ఏ హాని చేసిన వాడుకాదు.  ఆయన హరిజన సేవాసంస్థలో పనిచేయుచున్నాడు.  కనుక సమయానుకూలంగా నీకు ప్రభుత్వసహాయమును అందించే కార్యక్రమములో సమర్ధుడు గనుక ఆయన మన ఆలయములో ఈ కార్యక్రమములో దిగడము నిజంగా మన సంఘమునకు ఆశీర్వాదము.  ఆయన ఈ కార్యమునకు ఒప్పుకోలేదు గాని నేనే ఆయనను ఒప్పించి రంగములోకి దింపాను.  బాగా ఆలోచించుకో, మన సంఘములో చాలా మంది ఆర్ధికంగా వెనుకబడి వున్నారు.  అటువంటి వారికి ఈయన ఎంతో ఉపయోగ కారి.  చాలామంది ఈయనను బలపరుస్తున్నారు.  నీవు కూడా బలపరచుమని సలహానిచ్చును.  ఇట్లువ్యక్తుల యొక్క ప్రబోధమూలమున అయోమయ స్థితిలో ఉన్న వ్యక్తి ఎటూ తోచక ఆ ఆలయ ఎలక్షన్లు అయినంతవరకు తన ఉద్యోగానికి సెలవు బెట్టి ఊరువదలి వెళ్ళి ఎలెక్షన్లు అయి పార్టీ తగాదాలు జరిగి ప్రశాంత వాతావరణములో ఆ వ్యక్తి ఆలయములో ప్రత్యక్షమైనపుడు, ఏ పార్టీ వానితో ఏ మాట మాట్లాడితే ఏంపేచీవస్తుందోయని ఆందోళన పూరిత భక్తి ఉన్న సంఘస్థులను మన అనుభవములో చూస్తున్నాము. ఇందును బట్టి యేసు ప్రవచనములో మత్త 21:31 మీకంటె ముందు అన్యులు పరలోక రాజ్యంలో చేరుదురనినిశ్చయంగా మీతో చెప్పుచున్నానని'',అన్నట్లుగా తెలియుచున్నది.

        అపవాది ఎవరు? అతని నిరూపమేది? అతను చేయు అతి యుక్తికరమైన పనిఏది?

        అపవాది దేవుని దూత. ఇతను ఆత్మరూపుడే.  పాతనిబంధన కాలములో దేవుని రూపమును చూచిన వారు గాని అపవాది నిజరూపమును చూచిన వారు గాని లేరు.  ఆకాలములో దేవుడు మేఘము వలెను, వెలుగుగను, స్వరముగను దర్శనమిచ్చినట్లు గ్రంధము చెప్పుచున్నది.  అదే విధముగా అపవాది సర్పములోను మనుష్యులలోను ప్రవేశించినట్లును వారిని అవిశ్వాసులుగను దైవవ్యతిరేకులుగను, భ్రషులుగను చేసినట్లును ఉన్నదేగాని ప్రత్యక్షముగా నిజరూపములో ఎవరితో నైన మాట్లాడినట్లు లేదు.  ఆనాటి ప్రవక్తలలో కూడా నిజరూపముగా అపవాదిని చూచిన వారు లేరు.  అందుచేతనే ఆత్మదేవుడు ఆత్మరూపము విడచి కన్యకలో నరరూపము దాల్చినట్లు గ్రంధములో నున్నది.  అపవాది శాపగ్రస్థుడైనను దేవునితో సన్నిహితముగా యుండి దైవభక్తులను పీడించుచ,ు ప్రతి నరునిలో ఏదో ఒక రూపముగా పాప బీజము వేయుచున్నాడు.  మరియు తనను పూజించమని తనకు మ్రొక్కుమని ప్రబోధించినట్లు గ్రంధములో ఎచ్చటను లేదు.  అయితే ఏసుప్రభువును కొండ శిఖరము మీద లూకా 4:6:7 నిల్పి తనకు అప్పగించబడి యున్న ఈ లోకమాయలను చూపి తనకు సాగిలపడి మ్రొక్కు మన్నట్లు వ్రాయబడియున్నది.  దీనిలో గొప్ప మర్మము ఉన్నది.  ఈ సందర్భములో యోహాను 10:7:8లో క్రీస్తు పలికిన మాటలలో కూడా గొప్ప మర్మము ఉన్నది.  ఇందును బట్టి ఆలోచించిన భూమిమీద గొప్ప గొప్ప ప్రవక్తలు జీవించియున్నను వారు జన్మ పాపమో కర్మ పాపమో చేసి తప్పును గ్రహించి దైవసన్నిధిలో క్షమాపణ పొంది పవిత్రులైనట్లు తెలియుచున్నది.

        మానవ బలహీనతః-ఆది 6:5,6 వాక్యములు చదివితే భూమి మీద నరులను సృష్టించినందుకు దేవుడు సంతాపము నొంది హృదయములో నొచ్చుకొన్నట్లును ఆ తరువాత నోవహుబలిని లక్ష్యపెట్టుచు ఆది 8:21లో నరుని ఆలోచన వాని బాల్యము నుండి చెడ్డదనియు, ఆది దేవుడు నరుని హృదయబలహీనత అవిశ్వాసమును గూర్చి బాధపడితే ఆయన కుమారుడును మనరక్షకుడునైన ఏసు ప్రభువు మత్తయి 17:17 మార్కు 7:6 ఒకటవ పేతురు 2:12 నరులను గూర్చి బాధపడుచున్నాడు.  కారణము ఏమనగా మనము చేయు పనుల వలన వచ్చు ఫలితము మంచిదైతే దేవుని పొగడేది.  చెడ్డదైతే ముందు దేవుని, అటు తర్వాత అపవాదిని గ్రహాలను, సంవత్సరమును, నెలను, వారమును, దినమును, ముహుర్తములను, పిల్లవచ్చిన వేళ, గొడ్డువచ్చిన వేళ, ఈ స్థలము కొన్నవేళ, ఇల్లు కట్టిన వేళ, ఇంటిలో చేరిన వేళ, మనిషిచనిపోతే చచ్చిన రోజు మంచిది కాదని, ఇవన్ని పోతే తన తలవ్రాత అంతేనని తనని తాను శపించుకొనుట మున్నగు నిర్జీవ మాటల వలనను, అట్టివి పాటించుట వలనను మన బుద్ధిబలహీనత అవిశ్వాసము వలన ఆది దేవుడును ఆయన సుతుడు మన ప్రభువును పై విధముగా నొచ్చుకున్నట్లు తెలియుచున్నది.

        అయితే మత్తయి 25:1-13 క్రీస్తు చెప్పిన ఉపమానములోని మర్మము ఏమనగాః- పెండ్లి కుమారుడు క్రీస్తు.  పదిమంది కన్యలు దైవ సన్నిధానము కోరు భక్తులు.  వీరిలో ఐదుగురు విశ్వాసులు ఐదుగురు అవిశ్వాసులు. దివిటీలు దేవుని వాక్యకాంతులు (దశాజ్ఞలు) చమురు ఆయన ప్రార్థన. నూనె వ్యాపారులు-సువార్తీకులు.  దీనిని బట్టి మనము గ్రహించు విషయములు మనము శరీర ధారులమై యున్నపుడే క్రీస్తును ఆత్మీయముగా సంధించుటకు ఆయత్త పడవలెను.  ఆయన దశాజ్ఞల ముఖముగా మనము పాటించవలెను.  ఈ దశాజ్ఞలు మనలో స్థిరపడవలెనంటే దైవిక ఆత్మీయ విశ్వాసము మనలో ఉండవలెను. ఈ దైవ ఆత్మీయ విశ్వాసము మనలో ఏర్పడవలయునంటే సువార్తీకుల సాంగత్యమువారితో వాక్యపరిచయము ప్రార్థన అనుచమురు ముఖ్యము ఇదిలేనియెడల మనలో దేవుని భక్తి ప్రకాశించదు.  కీర్తన 119:105 నీ వాక్యము నా పాదములకు దీపము నా మార్గమునకు వెలుగైయున్నది.  అనువాక్యమును గమనించవలెను.

        భ్రష్టత్వము :- అపవాది దేవుని ప్రధముడనియే (పుత్రుడు) చెప్పవలెను. ఎందుచేతనంటే దేవుని సమక్షములో దేవుని బిడ్డగా ఉండి దేవుని కంటె అగ్రస్థానము పొందగోరి, దైవభ్రష్టుడైనందున భూమి మీద జ్యేష్ఠనరుని భ్రష్టత్వము చేయుచువచ్చెను.  ఉదా||ప్రధమ శ్రేణిసర్పము స్త్రీలలో జ్యేష్టురాలు హవ్వ.  పురుషులలో ఆదాము, కయీను,అహరోను, ఇష్మాయేలు, ఏశావు, సలోమోను, సంసోను మొదలగు వారితో 14తరములు జరిపించినాడు.  ఆది దేవునికిని అపవాదికిని జ్యేష్ఠవాత్సల్యము లేకపోతే సర్పమును శపించినాడేగాని, సర్పములో చేరి తన తొలిచూలు బిడ్డలను మోసపఱచిన  అపవాదిని శపించినట్లు గ్రంధములో లేదు.  ఇచ్చట ఒక మర్మము ఉన్నది.  సర్పములోని అపవాది దేవుని యందు భయము కల్గినవాడై సర్పమునుండి తప్పించుకొన్నట్లు గ్రహించవలెను.  దేవునికి అపవాదియందు జ్యేష్టవాత్సల్యము ఉన్నది అని ఈ వచనముల ద్వారా తెలిసికోవచ్చును.  యోబు 1:6-7 దేవుని దూతలు యెహోవా సన్నిదిలో నిలుచు దినమున అపవాది వారితో వచ్చినపుడు వానికిని అంతమంది దేవదూతలు ఉండగా ప్రత్యేకించి అపవాదిని పరామర్శించుటలోను, అటు తర్వాత తన బిడ్డను పరీక్షించుటకు ఆజ్ఞఇచ్చుటలో కూడా అర్థము ఉన్నది.  ఒక తండ్రి తన బిడ్డను పరీక్షించుటకు తన ఇంటిలోని తన వారినే గాని ఇతరులను నియమింపడు.  అపవాది యోబు 1:12లోని విధముగా దేవుని చేత యోబు కలిమినంతటిని స్వాస్థ్యముగా పొందినట్లు తెలియపరచబడియున్నది.  ఇంకను తన భక్తుడైన యోబు 2:6 యోబును కూడా అపవాదికి అప్పగించినట్లు వాక్యము ఉన్నది.  పై కార్యములు జరిగించుటలో దేవుని కూడా ప్రేరేపించినట్లును, దేవుని ఆజ్ఞమీరక దేవుడు చెప్పిన మేరకు తన బోధన క్రియలు జరిపినట్లు గ్రహించవలెను.  ఈ శోధన క్రియలో దేవుని ఆజ్ఞను అపవాది మీరినట్లు ఎక్కడను లేదు.  పాతనిబంధనకాలములో దేవుడు అపవాదిని దూషించి నట్లుగాని విమర్శించినట్లుగానిలేదు.  ఎంతకూ తాను చేసిన నరుని గూర్చియు వాని సంతానమును గూర్చియు వారి ప్రవర్తనలను క్రియలను గూర్చియు దేవుడు బాధపడినట్లు తెలియుచున్నది.  జలప్రళయము వచ్చునంతకు, సొదమ గొమర్రా పట్టణములను అగ్నితో కాల్చి నాశనము చేసినను అపవాదిని గూర్చి దేవుడు  ఆది 18: 20,21 లో బాధపడినట్లు లేదు.  కాని అపవాది తనకు చేదోడుగ తన శోధన క్రియలకు అపవిత్రాత్మలను ఏర్పరచుకొని యున్నట్లు వాని కనుగుణ్యముగా ప్రవర్తించు నరులలోని కొంతమంది అగ్రజులను కూడ తన ప్రవక్తలుగా ఏర్పరచుకొని యున్నట్లును, తన క్రియలను దేవుని క్రియలుగా ఎంచునట్లును నరులను నమ్మించుచు సంచరించుచున్నాడు.  ఇందువలన నరుడు దేవునికి అసహ్యుడుగా ఎంచబడుచున్నాడు.

        పాతనిబంధనకాలములోని ''బయలు ప్రవక్తలు దాగోను ప్రవక్తలు,భక్తులు'' అపవాది దేవుని జ్యేష్టుడనుటకు కొన్ని ముఖ్యాంశములు- ఎ.యోబు కలిమిని స్వాధీనము చేయుట బి.యోబును కూడా అప్పగించుట సి.తన బిడ్డయైన క్రీస్తును శోధనకు అప్పగించుట. డి.ఈ భూప్రపంచమంతయు నాకు అప్పగించబడియున్నదని క్రీస్తుతో అపవాది పల్కియున్నాడు. లూకా 4:6 ఇ.పరిశుద్ధపట్టణములో క్రీస్తును దేవాలయశిఖరము పై తీసుకొని పోయి నిలువ బెట్టినాడంటే అపవాదియు దేవుని బిడ్డయై యుండవలెను.  మత్తయి 4:5:6 ఎఫ్‌. మత్తయి 4:10 లో ప్రభువైన నీ దేవునికి మ్రొక్కు అన్నపుడు అపవాది కూడా దేవుని బిడ్డయే యని అర్థము.అందువల్లనే దేవుడు జ్యేష్టసంతతి భ్రష్టుకావడము మూలమున తన బలిపశువుగా ప్రతి తొలిచూలును కోరినట్లు గ్రంధములో తెలియుచున్నది.

        క్రొత్త నిబంధన కాలములోః-అపవాది జరిపిన క్రియలన్నియు మనదృష్టికి నీచమైనవిగను ఘోరమైనవిగను ఉన్నను లేఖనములు నెరవేర్చుటకు దేవుడు అపవాది చేత నరుల పాపక్రియలకు ప్రతిగా ఆదిమానవుడు ఆదాము నుండి ఏర్పడిన జ్యేష్ఠభ్రష్టత్వమును పోగొట్టుటకు దేవుడే జ్యేష్ఠకుమారుడై జన్మించి అపవాది చేత శోధింపబడి లోకపాపముల కొరకు అపవాది పరీక్షలకును బలియై, పునరుత్థాన మరణమును సాధించు మార్గమును సకల మానవకోటికి చూపియున్నాడు.  అపవాది ఇది గ్రహింపక ఈ క్రిందివిధముగా ఏసును తన వలె జ్యేష్టభ్రష్టుత్వముచేయ ప్రయత్నించినట్లు తెలియచున్నది.  40 రోజులు శోదనః ఱాళ్ళను రొట్టెలుగా మార్చమనుట.  క్రీస్తు చేసియున్నట్లయితే భ్రష్టుడైనట్లే. దేవాలయశిఖరమందుండి దూకిన భ్రష్టుడే.  సాగిలపడి నమస్కారము చేసియుంటే భ్రష్టుడే. అటు తర్వాత బాప్తిస్మయోహాను జ్యేష్టుడు.  ఆయనను హేరోదు చేత చెరపట్టించి తలకొట్టించుట, ఆ తర్వాత తన శోదన క్రియలకు భ్రష్టుడు కాలేదని ప్రధాన యాజకులు, పరిసయ్యులను ప్రేరేపించి యూదా ఇస్కరియోతును తన సాధనముగా వాడుకొని క్రీస్తును మరణమునకు అప్పగించుట.  తుదకు తన అన్యాయ తీర్పుతో అనేక వేల ప్రజలను ప్రేరేపించి సిలువ మరణ శిక్షవిధింపజేయుట తత్‌ ఫలితము నిర్దోషి యగు క్రీస్తు దోషిగా ఎంచబడి సిలువ మరణము నొందుట.  ఇట్లు జరుగునని లేఖనములలో వ్రాయబడియున్నది.  అటు పిమ్మట యూదాను భ్రష్టమరణము పాలు చేసి పేతురును ఘోరముగా చంపించి, తోమాసు, పౌలు ఇత్యాది వాక్యప్రచారకులను మరియు క్రీస్తును నమ్మిన భక్తులను క్రైస్తవ సంఘములను, సంఘసభ్యులను బోధకులను, సువార్తీకులను విమర్శింపజేయుట, చిత్రవిచిత్ర నిర్జీవక్రియలను జరిపించి భ్రష్టుపట్టించుచున్నాడు.  యోహా 19:11లో క్రీస్తు పల్కిన విధంగా అపవాదికి ఎక్కువ పాపమున్నది.  ''నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువపాపమున్నది.

        మత్త 16: 21-24 క్రీస్తు ప్రధమ శిష్యుడు పేతురులో ప్రవేశించి క్రీస్తు చేయి పట్టినట్లు తద్వారా క్రీస్తుతో ఈ లోకసంబంధంగా జీవించమని శోధించి చెప్పుటలోను, క్రీస్తును ఆయన జ్యేష్ఠశిష్యుడు పేతురును భ్రష్టులుగా చేయప్రయత్నించినట్లు తెలియుచున్నది.

        మత్త 3:7లో సర్పసంతానమా! అని యోహాను ఉచ్చరించుటలో అర్థమేమి? మనము పాము విశ్వాసులగు అనగా సర్పము మాటలు వినిన ఆది తల్లి దండ్రుల సంతానమని అర్థము.

        అంశముః-కామక్రోధమదమాత్సర్యములన్నవి భూమి సృష్టి వాతావరణ దేహసంబంధము లైనవా? లేక పరలోకరాజ్య సృష్టియైన ఆత్మ సంబంధమైనవా? అసలు పై గుణములు సృష్టికర్తయైన దేవునికి వున్నవా? మరి లేని గుణములు నరులకెందుకు అలవడింది.  నరులకే గాక సృష్టిలో ప్రతి ప్రాణికిని ఈ కాముకత్వమన్నది నేడు బహురీతులుగా క్రియజరిగిస్తు మానవులలో అయితే వావివరుసలు నీతినియమాలను విస్మరించి బహిరంగంగా రచ్చకెక్కి విలయతాండవమాడుచున్నది.  దీన్ని గూర్చి మనము క్షుణ్ణంగా తెలిసికోవలసియున్నది.

        ప్రభువునందు ప్రియచదువరీ!  మానవ సృష్టిలో ప్రప్రధమమున నరుని యొక్క పుట్టుదల అన్నది కామేచ్ఛలతో జరుగలేదని మనమెరుగుదుము.  ఈ సందర్భంలో ఆది 2:7 కామముతో కూడిన లైంగిక క్రియతో నరుడు సృష్టించబడలేదని ఋజువు కాగలదు.  అదే విధంగా ఆది 2: 21-22 స్త్రీ యొక్క జన్మ కూడా కామేచ్ఛలతో కూడిన సంభోగముతో స్త్రీ యొక్క సృష్టి నిర్మాణము జరుగలేదని మనము చదువగలము.  భూగర్భము నుండి రతి క్రీడలు లేక ఏ విధంగా నరసృష్టి నిర్మాణము జరిగిందో అదే విధంగా పురుషుని గర్భము నుండి కామక్రీడలేకనే స్త్రీ నిర్మాణము జరిగింది.

        స్త్రీ పురుషులు ఇట్లు పవిత్రంగా సృష్టించబడి సృష్టికర్తయైన శక్తిపై తిరుగుబాటు జేసి శాపగ్రస్థులైనందున వీరికి సంభవించిన సుదీర్ఘమైన శాపవిమోచనకుగాను, ఏ విధమైన కామేచ్ఛలు లేకుండ కన్నెకయైన స్త్రీ గర్భములో సృష్టికర్త నరాకృతి దాల్చవలసివచ్చింది.  ఇందును బట్టి దైవజ్ఞానంతో మనము ఆలోచిస్తే సృష్టికర్తయైన దేవుడు మొదటి రూపమును భూగర్భంనుండియు అట్లు భూగర్భంనుండి తీసిన రూపమునకు సహచారిణిగా పరిచర్య చేయుటకు తానుయే భూగర్భంనుండి పురుషరూపమును సృష్టించెనో ఆ పురుష గర్భంనుండి స్త్రీ రూపాన్ని సృష్టించి నరునిలో నుండి తీయబడినదిగ నారిని సృష్టించెను.

         నరునినుండి తీయబడిన నారి అపరాధి కాగా దేవుడు అపరాదియైనట్టి స్త్రీ గర్భమును శపించి వేదనతో పిల్లలను కందువను శాపముననుగ్రహించాడు.  చిత్రమేమిటంటే నరుని భూమి ప్రసవించునపుడు వేదన బాధ పత్యాలు అరిష్టాలు లేవు.  అదే విధంగా పురుషుని నుండి స్త్రీ జన్మించి నపుడు వేదన బాధ వగైరాలు లేవు.  అయితే దేవుడు వారికిచ్చిన శాపమును బట్టి నాటి నుండి నేటి వరకును శిశువును ప్రసవించే ప్రతి తల్లి, పై అరిష్టాలకు గురియగుచున్నది.  అయితే ఏ విధమైన లైంగిక క్రియలేకుండ పవిత్రంగా నిరాదరణ స్థితులలో, నిస్సహాయ స్థలములో వికృతమైన వాతావరణములో ఎన్నికలేని స్థలములో శిశువును గన్న స్త్రీ ఆమె గర్భము ఆమె గర్భము నుండి ప్రసవించిన శిశువు ఇరువురును చరిత్రను సృష్టించి నూతన నిబంధన యను క్రైస్తవ వేదమునకు పునాదులయ్యారు.

        ప్రభువునందు ప్రియమైనచదువరీ! లోకసంబందమైన స్త్రీకిని పరసంబంధమైన అనగా పరలోక సృష్టికర్తయొక్క ప్రతిరూపమైన శిశువునకును ఇంత ప్రాధాన్యత వుండగా-భూలోకసంబంధమైన మగధీరుడనంటు మీసాలు మెలిబెట్టునట్టి పురుషుని యొక్క ప్రతాపమేమైనట్లు? ఆదిలో లోకసృష్టిలో సృష్టి ఆరంభంలోని తొలిపురుషునకు కామేచ్ఛలు లేవు.  లైంగిక జ్ఞానం లేదు.  అయితే నరుడే విధంగా కామాంధుడాయెను? అన్న దానిని గూర్చి కూడా మనము తెలిసికోవలసియున్నది.

        ప్రియచదువరీ! నేటి మన నాగకరికతా యుగములో నరకోటిని పట్టి పీడిస్తున్న గొప్ప సమస్యాయుతమైన జబ్బు ఏదంటే సెక్స్‌వ్యాధి అనగా లైంగిక పరమైన క్రియలందు అయిష్టత, నపుంసకత్వము నరాలబలహీనత సంతానహీనము పురుషునిలోని వీర్య లోపము.  వీరోత్పత్తి వున్నను సంతానమునకు కావలసిన జీవకణములు లేకపోవుట.  వగైరా పరిజ్ఞానము పొందిన డాక్టర్లు ఎందరినో మనము లాడ్జిలో బసజేసి నపుంసకత్వమను సంతాన హీనము వగైరా కామేచ్ఛల సంబంధమైన వైద్యులు పుట్టగొడుగుల వలె బైలుదేరి కరపత్రాల ద్వారాను సినిమా స్లయిడ్స్‌ ద్వారాను రేడియోలు టెలివిజన్‌ ద్వారాను మైకుల ప్రచారం ద్వారాను లోకములో బహుళ ప్రచారంలో వున్నారు.

        ఏదేను నరజంటకు సెక్సుజ్ఞానము లేదు.  అనగా కామక్రోధమదమాత్సరములు లేవు.  వారు తిన్న తిండిలో కూడా ఈ గుణములు లేనట్లే కనపడుచున్నవి.  ఎందుకనగా దేవుడు నరజంటను శాసించినపుడు ఈ తోట చెట్ల ఫలములన్నియు మీరు తినవచ్చును గాని తోట మధ్యములోనిచెట్లుఫలాన్ని తినవద్దన్నాడు.  అది తింటే ఛస్తావన్నాడు.  ఆ పండు తిన్నందువలన నరునిలో చచ్చినదేమి? నరుడు చనిపోయాడా? వాని ఆత్మ చనిపోయిందా? అన్న దాన్ని గూర్చి మనము తెలిసికోవలసియున్నది.

        దేవుడు నరజంటను నిషేధఫలాన్ని తినవద్దన్నాడు. ఈలోగా అభము శుభమెరుగని ఆ నరజంటకు సెక్సుసంబంధమైన ట్రయినింగు పొందిన ఆది 3:1 సర్పమునకున్న బిరుదును బట్టి మనము గ్రహిస్తే యుక్తిగల గుణమును బిరుదుగా పొందిన ఈ సర్పము దీని విషవాక్కుల ద్వారా ఉద్బవించిన కామబీజములు స్త్రీ యొక్క గర్భములోకి ప్రవేశించుటయే ఆమె హృదయములో కూడా సర్పము యొక్క రూపమును దాని మాటలకును చెవినిచ్చి, మొట్టమొదటగా సర్వ హక్కులకు విదేయించి ఆ తర్వాత సర్పఆజ్ఞానుసారంగా నిషేధఫలములను భుజించి దైవశాపము మూలమున గర్భవతియై, సర్పపు పిల్లలను కన్నట్లు నూతన నిబంధనలో మత్తయి 23:33లో మనము చదువగలము.  మరియు దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనునన్నట్లు ఆదిలోని స్త్రీ సర్పవ్యామోహముతో పాపాన్ని గర్భమున ధరించింది. దేవుని యొక్క శాపముతో మరణాన్ని కన్నది. ఇక్కడ సెక్స్‌డాక్టరుగా అనగా కామేచ్ఛలను గుణమునకు ప్రధాన వైద్యుడుగా సర్పము యెన్నికచేయబడియున్నట్లు ఈ సందర్భములో మనకు తెలియగలదు.

        ప్రియచదువరీ! వాస్తవమునకు కామక్రోధమదమాత్సరాది గుణములు దైవత్వానికి లేవు. ఎట్లనగా దీన్ని లూకా 20: 27-36 కామేచ్ఛలు లేవని చదువగలము.  కామోద్రేకము సంయోగము సంతానోత్పత్తి మదమాత్సర్యములను గుణములు భూమిపై దృశ్యమైయున్న వాటి యొక్క అనగా కనపడుచున్న పశుపక్ష్యాదులు నరశరీరాలకు పరిమితమై యున్నదేగాని, అదృశ్యములో వున్న ఆత్మ సముదాయమునకు యిది అనువర్తించదని తెలియుచున్నది.

        అయితే ఇది దేవతలలోను దేవునిలోను వున్నవా? అన్నదానిని గూర్చి మనము తెలిసికోవలసియున్నది. ఆది 1:1 దైవశక్తి అన్నది అగాధ జలములతో సంగమించి భూమికి జన్మనిచ్చింది.  అటు తర్వాత అదే దైవశక్తి భూమితో సంగమించి నరుని కన్నది.  నరునితో సంగమించి నారిని కన్నది.  ఈ క్రియ వీర్యస్కలనము లేక రతిక్రీడలేక జరిగింది.  ఇక్కడ వరకును దైవ సృష్టి పరిశుద్ధమైనదిగా పవిత్రమైనదిగాను యెంచబడింది.  చిత్రమేమిటంటే దేవునికి పుట్టిన బిడ్డలైనట్టి నరజంట దిగంబరులును లైంగిక జ్ఞాన మెరుంగని వారునైయుండిరి.

        ప్రభువునందు ప్రియచదువరీ!  నేడు సంతాన హీనులకు సంతానోత్పత్తి గల్గించి సంతానవంతులుగా చేయగలమని కరపత్రాల ద్వారా మైకుల ద్వారా గోడల పైన వ్రాతమూలముగాను రేడియోలలో ప్రకటన ద్వారాను మరియు పట్టణాలలోని లాడ్జీలలో దిగి తమ యొక్క ఘనతను ప్రకటిస్తు- తమకున్న హోదాలను డిగ్రీలను జన బాహుళ్యమునకు బహు గొప్పగా వెల్లడి పరచుచు నెలలవారీగా తమ యొక్క కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తు సంచారము చేయుచున్న సెక్సుడాక్టర్లు స్థానికంగా ఆయా ఊర్లలో వున్నటువంటి సెక్స్‌డాక్టరమ్మలు కోకొల్లలుగా వున్నట్లు నేటి నాగరికత ప్రపంచంలో తెలిసికొంటున్నాము.

        అయితే హోదాలుగాని బిరుదులుగాని సెక్సుసంబంధమైన శాస్త్రజ్ఞానముతో కూడిన విద్యగాని ఎరుగని స్థితిలో భూజంతువైనసర్పము నరజంట పక్షములో సెక్స్‌డాక్టరుగా వ్యవహరిస్తు సర్పము యిచ్చిన సలహా, సర్పము జేసిన వనమూలికాప్రచారము తరతరములకును లోకములో నరకోటి విస్తరించుటకును నరజ్ఞానము వికసించుటకును, ప్రపంచజ్ఞానము మితిమీరుటకును దైవత్వము నెదిరించుటకును, దైవత్వంతో శాశ్వతంగా విరోధము సంపాదించుటకును నాశనకరమైన మరణానికి బాటవేసుకొన్నట్లు క్రియజరిగించినట్లు మనము చదువగలము.  ఇక్కడ సంతానహీనులైనట్టి ఆదిదంపతులకు సెక్స్‌డాక్టర్లుగా తోటలో సర్పము క్రియజరిగించింది.  ఎటువంటి ఔషధంతో పనిలేకుండ కేవలము చెట్టు-చెట్టు ఫలములుతోనే నరులకు లైంగిన జ్ఞానము కామోద్రేకము నాగరికత, మంచి చెడు అను విచక్షణా జ్ఞానమేర్పడి దైవ జ్ఞానం మీద ఆధారపడుటకు బదులు స్వజ్ఞానం మీద ఆధారపడి, దైవ వ్యతిరేకులై శాపగ్రస్థులై తమకును తమ సంతానములకును తామున్నటువంటి లోకానికిని తీరనటువంటి శాపాన్ని దైవత్వంచేత సంపాధించుకొని నాటి నుండి నేటి వరకు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు.

        ఇందును బట్టి చూడగా దైవత్వంలో అణగారియున్న కామవాంఛ క్రియా రూపందాల్చి జలములతో సంబోదించి భూమిని పుట్టించినట్లును, భూమితో సంభోగించి జీవరాసులను వృక్షపర్వతశ్రేణులను, అటు తర్వాత నర రూపమును సృష్టించినట్లు వేదములోని ఆత్మీయ క్రియలను మన ఆత్మ జ్ఞానంతో పరిశోధించినట్లయితే బైల్పడగలవు.

        కామమన్నది సరియైన నిర్వచనము తలంపు ఇట్టి తలంపుద్వారానే ఆత్మీయమైన అదృశ్యశక్తియైన దేవుడు తన వాక్కైనట్టి శబ్ద తరంగముల ద్వారా-అదృశ్యమైయున్న అణు సంబంధిత పరమాణువుల ద్వారా క్రియ సంయోగముల ద్వారా యావద్‌ సృష్టిని సృష్టించినట్లును, ఎట్లనగా పురుషుని వీర్యము ఎంత శక్తివంతమైనదైనను స్త్రీ గర్భము లోని ప్రతి వీర్యసంగమము లేనిదే పిండోత్పత్తి కానేరదు.  ఇది మానవ శారీరశాస్త్ర మర్మమై యున్నది.

        అదే విధంగా దైవశక్తి కూడా భూమితో సంగమించి నరరూపమును నిర్మించిన వెంటనే సృష్టికర్త యొక్క వాక్కానుసారంగా భూమి కూడా తన యొక్క పరమాణువుల పరిమాణములను వెదజల్లి క్రియారూపమున స్కలించి దేవుని యొక్క కామవాంఛను దేవుని యొక్క వాక్కానుసారంగా ఆయా జాతుల పశుపక్ష్యాదులు వన్యమృగాలు పర్వతశ్రేణులు పచ్చిక బైళ్ళు ఖనిజములు లోహములు రసాయనములు వగైరా రూపములను తన సారము ద్వారా ఉత్పన్నము జేసినట్లును, అట్లు రూపించబడిన దేహమునకు వాక్కైయున్న దేవుని యొక్క శబ్దమే జీవము పోసినట్లును, ప్రేత్యేకించి నర రూప నిర్మాణంలో దేవుడు ప్రత్యక్షంగా భూమితో తన సంభోగక్రియ ద్వారా నర రూపమును భూగర్భంలో సృష్టించి, ఏ జీవికిని లేనటువంటి ప్రత్యేకతనుతాను సృష్టించిన నర రూపములో తన జీవమును తన ఆత్మను ఊదినట్లు అట్లు సృష్టించబడిన జీవి-జీవాత్ముడైనట్లు ఆది 2:7లో చదువగలము.

        ప్రియచదువరీ! ఇందును బట్టి చూడగా దేవుని వాక్కులలోని సృష్టి నిర్మాణ లేక శరీర నిర్మాణోత్పత్తిని గల్గించు వీర్యాణువులున్నట్లు యిందును బట్టి మనకు విదితమగుచున్నది.  ఇట్టి శక్తి ద్వారానే దేవుడు గొడ్రాలు యొక్క గర్బాన్ని కూడా సంతానవంతురాలుగా చేయుటకు శక్తిమంతుడైయున్నట్లు ఆది 17:17 & 18:13 తొంబై ఏండ్ల వయస్సున్న శారా నూరు సం||ల వయసున్న అబ్రహాము యొక్క దాంపత్య జీవితములోని సంతాన జీవితము బైల్పరచుచున్నది.  ఇదే విధంగా హన్నా వగైరాల చరిత్ర.  

        ఇక క్రొత్త నిబంధనలో పురుష ప్రమేయము లేకనే కన్నెకయైన స్త్రీ గర్భంలో దేవుడు జరిగించిన క్రియ దేవుని యొక్క వాక్‌ వీర్య ప్రభావమే మూలమైయున్నట్లు క్రీస్తు జన్మ రహస్యము ద్వారా మనము తెలిసికొనియున్నాము.  ఈ క్రియను గూర్చి ముందే దేవదూత మరియమ్మకు దర్శనమై పరిశుద్దాత్మ నీ మీదికి వచ్చును.  సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును.  పుట్టబోవు శిశువు పరిశుద్దుడై దేవుని కుమారుడనబడుననుటలో ఆది దేవుడు  భూగర్భంలో క్రియ జరిగించి ఏ విధంగా నరపిండమును సృష్టించెనో, అదే విధంగా దోషురాలైన స్త్రీ యొక్క సంతాన రక్షణార్థము పరిశుద్దురాలు నిష్కల్మషురాలు ఏ పురుషుని ఎరుగనిదియు ప్రభువు దాసురాలైన స్త్రీ గర్భముతో వాక్కయివున్న దేవుడు వాక్శక్తితో వీర్యోత్పత్తి ద్వారా పరిశుద్దుడైనశిశువు జన్మకు సృష్టికర్తఅయ్యెను.  కనుక నేటి నరులమైన మనము మనకు సృష్టికర్తయైన దేవునిలో కామేచ్చవున్నది.  కాని వ్యభిచారికాడు. న్యాయమున్నదిగాని అన్యాయస్థుడు కాడు. సత్యమున్నది గాని అసత్యవంతుడు గాడు. ఉగృఢు గాని ప్రశాంతుడు.  అయపరచువాడు గాని సృష్టించగలడు, శిక్షించగలడు. రక్షించసమర్థుడు.  బాధించగలడు గాని ఆశ్రీతుడు అనగా ఆశ్రయమిచ్చువాడు,  శాంతమూర్తి అయినను క్ష్షమించగలవాడు.  ఇన్ని లక్షణములు సృష్టికర్తలో అణగారియున్నవి గనుక వీటన్నిటికిని మూలకారకుడును సమయోచితంగా వీటన్నిటి మీద ఆయన అధికారియైయుండుట వలన వీటన్నిటి మీద ఆయనకు అధికారమున్నందువలన వీటన్నింటి మీద ఆయన ఆసీనుడై యుండుట వలన, ఆయనకు సర్వోన్నతుడని ఉచ్చరింపబడుచున్నాడు.  ఈ ఉచ్చారణ కేవలము నరుల చేత కల్గినదికాదు. దేవదూత చేత నరుల కెరిగించబడిన వర్తమానము.

                                పరిచయము

        సాతాను త్రిత్వము -అపవిత్రాత్మ -సాతాను-అబద్దప్రవక్త(అంత్యక్రీస్తు)

        ఇతడు లోకసంబంధి, దైవత్వం నుండి పడద్రోయబడిన లూసిఫర్‌ అను దేవదూత, శాపగ్రస్థుడైన దేవదూత యెష 14: 12-14 ఇతను ప్రణాళికలు కార్యక్రమాలు నిత్యకృత్యాలు-దైవాత్మ పూర్ణులైన నరులను దైవత్వం నుండి దూరపరచి, దైవరాజ్య ప్రవేశము కలుగనీయక నిత్యము వారిని దైవత్వముపై తిరుగుబాటు చేయిస్తూ-వారు మరల సృష్టికర్తవైపుతిరుగనీయక దైవసృష్టముల వైపు తిరుగునట్లు నయవంచకపు మాటలతో సత్యదేవుని ఆరాధనను, ఆ యొక్క దైవ మహిమను రోమా 1: 19-23 చదివితే ఇతని క్రియలు ఋజువుకాగలవు.  ''దేవుని యొక్క నిత్యశక్తి ఆయన అదృశ్య లక్షణములు జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి.  దేవుని నెరిగియు ఆయననను దేవునిగా మహిమ పరచలేదు.  తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్దిహీనులైరి.  వారు అక్షయుడగు దేవుని క్షయమగు మనుష్యులు పక్షులు చతుష్పాద జంతువుల ప్రతిమా స్వరూపములుగా మార్చి వాటిని ఆరాధించిరి'' ఇతడు ఈ సాతాను అను అబద్ద ప్రవక్త వారి చేత చేయించు హీనాతిహీనమైన దైవత్వము ఓర్వలేనటువంటి కార్యములు నరుల చేత చేయించుచు విశ్వాసులను సహితము అవిశ్వాసులుగా చేయుటకు నిత్యము అతి తీవ్రంగా బహు మెలకువగా క్రియజరిగించువాడు.  ఈ ఆదునిక యుగములో అపవాది అపవిత్రాత్మ సాతాను అను ఈ యొక్కఆత్మ రేయింబగళ్ళు అన్న పానాదులు లేక దైవకుమారుని రాకడ సమీపమగుకొలది ఇతనిలో ఎక్కువ ఆందోళనకలిగి, ప్రతి వ్యక్తి దగ్గర చాకచక్యముతో తన దూతల ద్వారా క్రియజరిగిస్తున్నాడు.  ఇందుకు ఈ గ్రంధములో వ్రాయబడిన అంశాలను గూర్చిన పరిచయ వాక్కులు.  ఇవి వేదరీత్యా చదివి ఆత్మీయ మేలులు పొంది పాఠకులు దేవుని పట్ల మీకున్న విశ్వాసము క్రీస్తు పట్ల మీకున్న ప్రేమను, ఆయన రాకడ పట్ల మీకున్న నిరీక్షణను స్థిరపరచుకొని నిరీక్షణతో జీవింతురు గాక! ఆమేన్‌.        

                                        

                                చివరిగా ఒక మాట

ప్రభువునందు సహోదరీ సహోదరులారా!  

  1. ఈ పుస్తకమును చదువుచున్న మీకు ఏమైన అనుమానాలు ఉన్నట్లయితే,
  2. ఈ పుస్తకములోని సారాంశములో లోపమును మీరు గ్రహించినట్లయితే,
  3. దీనిలో విభాగములు పూర్తిగా వివరించనట్లు మీరు గ్రహించినట్లయితే,
  4. పవిత్ర గ్రంథమునకు వ్యతిరేకమైన అంశములు మీరు ఇందులో చూచినట్లయితే,
  5. మీ హృదయము నుండి ఈ అంశమును కలిపిన మరింత బాగుండునని ఆలోచన వచ్చినట్లయితే, ''దయవుంచి నాకు వ్రాయండి.'' (email: FaithScope@thamu.com)

        దీని వలన, మేము మీ యొక్క సహాయ సహకారాల వల్ల తరువాత ముద్రణలో ఈ పుస్తకము అన్ని కోణాలలో అందముగా తీర్చిదిద్ది అందించగలము. ఆమేన్‌.

శేఖర్ రెడ్డి గారు వ్రాసిన పుస్తకములు: 

  1. ఏడు అను సంఖ్యలోని సర్వసంపూర్ణత  
  2. లోకానికి బైబిల్‌ సవాల్‌ - పార్ట్‌ 1-5
  3. మరణము తరువాత  
  4. నా ప్రభువు తల్లి
  5. ఏదెనులోని దైవప్రణాళిక  
  6. సున్నతి - బాప్తిస్మము  
  7. దేవుని దూతలు - వారి పరిచర్యలు
  8. జేసునాథుని దివ్య వాక్కులు  
  9. ప్రవక్తల ప్రవచనములు - పరమార్థములు  
  10. ప్రకటన గ్రంథ రహస్యములు ఇప్పుడు మీ చేతిలో
  11. పరమగీతము
  12. సాటి సహాయిని

వీటిని మీరు www.FaithScope.com ద్వారా ఉచితముగా పొంద వచ్చును.