పరిచారకులు - కాపరి - సువార్తీకులు
గ్రంథకర్త : శేఖర్‌రెడ్డి వాసా
నీ మరణానంతరము నీ ఆత్మ ఎక్కడ వుండబోవుచున్నదో నీకు తెలుసునా?
మూలము
రెడ్డిపాళెం గ్రామములోని నా ప్రభువు తల్లి ఉపదేశములు మరియు ఆమెను ఆవరించిన పరిశుద్ధాత్మయొక్క జ్ఞాన సహాయమే ఈ పుస్తక రచనకు మూలాధారము.
అంకితము
ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించి నన్ను ప్రేమించిన క్రీస్తు ప్రభువుకు అంకితమిస్తున్నాను. - వాసా శేఖర్‌రెడ్డి
గ్రంథ పరిచయము :-
ప్రియ క్రైస్తవ పాఠక మహాశయులారా! ఇంతవరకు మనమెన్నో అమూల్య సత్యాలను పరిశుద్ధ గ్రంథ లేఖన భాగాలలో చదువుకొని యున్నాము. అనేకులైన దైవజనుల ప్రసంగాలలో వినియున్నాము. సాహిత్య రూపముగా ఎన్నో రచనలు కూడా చదివి మననము చేసికొనియున్నాము. నేటి యుగములో సువార్త పరిచర్యలో అనగా దేవునియొక్క ఎన్నికలో ఆయన కుమారుడైన యేసుక్రీస్తుయొక్క కృపలో పరిశుద్ధాత్మ ఆవరింపుతో - ''నీతి - విశ్వాసము - సత్యము - ప్రేమ - సమర్పణ - నిరీక్షణ'' కలిగియున్న దైవజనులున్నారా? అంటే ధనాపేక్ష, లోక వ్యామోహము లేకుండ లోకముతో పొత్తు లేకుండ లోకసంబంధ కట్టడలకు అలవడకుండ లోక సంబంధమైన వాటిని ఆశించక, వెండి బంగారాల మీద వ్యామోహాలు చంపుకొని, చిరచరాస్థుల మీదనున్న మమకారాన్ని త్యజించి, శరీరాత్మలను కేవలము ఆత్మననుగ్రహించిన దేవునియొక్క పరిచర్యలో పాలుపొంది, దైవిక జీవితములో జీవించిన భక్తులున్నారా? ఉంటే వారియొక్క జీవిత విధానాలేమిటి? అనిన సత్యాన్ని దైవత్వము చేత వాడబడేటటువంటి నరునిగూర్చి దేవుని వలన నియమించబడిన ''పరిచారకులు - కాపరి - సువార్తీకులు'' అను ఈ పుస్తకములో పరిశుద్ధ గ్రంథములోని చాలా అంశాలతో పొందుపరచబడి చదువరులకు, సువార్తీకులకు, సంఘమును నడిపించే ప్రతి యొక్కరికిని ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు వ్రాయబడియున్నవి.
అయితే ప్రియపాఠకులారా! ఈ నియామకమన్నది ఎవరి చేత కలగాలన్నది ప్రశ్న. పౌలు వ్రాసిన గలతీ 1:1-2 ఈ వేదభాగములో మనుష్యుల మూలముగా నియమించబడినవాడు తనను నియమించిన మనుష్యులకు అనుకూలముగాను, వారియొక్క గౌరవమర్యాదలలోను, వారియొక్క ఆజ్ఞ మేరకు వారి చట్టము వారి మనోభీష్టమును బట్టి, వారియొక్క గొప్పతనమును గూర్చి శ్లాఘిస్తూ మానవత్వానికి లోబడి, మానవత్వము చేతనే నియమింపబడినవాడుగ ఉంటాడుగాని అతడు దైవపరిచారకుడు కాడు. అందుకే పౌలు వ్రాసిన పత్రికలో - ''మనుష్యుల మూలముగానైనను,'' ఇది ఒక సమాజానికి, సంఘానికి సంబంధించినదిగా ఉన్నట్లు ఈ వాక్యములోని మొదటి భాగము మనకు వివరిస్తున్నది. దైవత్వమునకు విధేయించి దైవభక్తి గల్గి దైవసిద్ధాంతాలకు కట్టుబడి దైవానుగ్రహము కొరకు అహర్నిశలు శ్రమించేవాడుగ ఉండాలిగాని ఒక జన సమూహము చేత అతడు నియమించబడి, ఆ జన సమూహమునకు అనుగుణముగా కట్టుబడి లోబడి, వారి దయాదాక్షిణ్యాలతో చాకిరీ చేయుచున్న వారెవరైనను దైవత్వమునకు దూరమై జీవింతురను భావము.
ఇక రెండవదిగ ఏ మనుష్యుని వలనను,'' అనుటలో నేటి సంఘాలు సంస్థ పెద్దలు లేక ఆ సంస్థలో పెద్ద వ్యక్తి ఎవరో అతడు ఎలాంటివాడైనను, అతని అలవాట్లు గుణగణాలు మనోస్థితి ఎలాగున్నను సరియే, స్వభావ సిద్ధముగా అతను దైవత్వమునకు యోగ్యుడు కాకున్నను సరియే, అతను ఒక సంస్థకు పెద్దగా చలామణి అయ్యేటప్పుడు, అతని ద్వారా సువార్త సేవ అను పేరుతో అతను ఏ విధముగా ఉన్నాడో అతని సిద్ధాంతాలను పాటిస్తూ తాను చేసే ప్రతి నీచకార్యము కూడా దైవకార్యము అని, అతను పోయే వక్రమార్గము, దైవమార్గము అని; అతడు చేసే బోధ ఆత్మ సంబంధమైనదని భావించి, అతనియొక్క ఘనత కొరకు ప్రాకులాడుచు సంఘమునకు శిరస్సయియున్న క్రీస్తును కడగా బెట్టి, తనను ఏ మనుష్యుడు నియమించాడో అతడే సంఘానికి శిరస్సు అని బాహాటముగా ప్రకటిస్తూ అతని ద్వారా ఈ సంఘము అభివృద్ధి చెందినదని, ఇతను లేకపోతే ఈ సంఘము ఉండేది కాదని, కనుక మనము ఇతనికి ఋణస్థులమైయున్నామని,'' ఈయనను తండ్రియైన దేవుడు కుమారుడైన దేవుడు నిత్యము ఆశీర్వదించి కాపాడుననియు ఆశీర్వదించుచు, ఆ ఆశీర్వాదము తనకు లేదన్నటువంటి విషయాన్ని కడగాబెట్టి సర్వము తానేనని ముప్పొద్దుల అతనితో తిరుగుచు, అతని అడుగులకు మడుగులొత్తుచు, అతని ద్వారా దైవజనుడుగ నియమించబడాలన్న ఆశతో జీవించాలని ఆశించేవారు లోకములో కోకొల్లలుగా ఉన్నారు. ఈ రెండు తెగలవారిని గూర్చి పౌలు గలతీ సంఘానికి వ్రాసిన లేఖలో ఇందులోని నగ్నసత్యాన్ని బహిరంగపరచి, నరసమాజము మూలముగా గాని లేదు, ఒక గొప్ప వ్యక్తిగ చలామణి అయ్యే వ్యక్తి ద్వారా తాను అపొస్తలుడుగ అనగా పంపబడినవాడుగ పౌలు తనను గూర్చి ప్రకటిస్తూ - ''యేసుక్రీస్తు వలనను, ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రియైన దేవుని వలనను అపొస్తలుడుగ నియమింపబడిన పౌలను నేను,'' అనుటలో ప్రియపాఠకులారా! ఈ పౌలు యొక్క జీవితములో - ఈ వాక్యములో ఉన్నటువంటి నిజరూప మర్మము వేదరీత్యా మనకు ఋజువుపరచుచున్నదంటే పౌలు యొక్క పూర్వస్థితి ఎటువంటిది? పౌలు యొక్క జీవితము ఎన్ని మలుపులు తిరిగింది? పౌలు పుట్టుక నుండి దైవజనుడా? పౌలు పుట్టుక నుండి అపొస్తలుడా? అనగా పంపబడినవాడా? దైవసువార్త నిమిత్తము లోకానికి పంపబడినవాడా? అతడు దేవుని ఎన్నికలో ఉన్నాడా? ఇతని బాల్యము, ఇతని యవ్వనము, ఇతనియొక్క ఇహలోక జీవితము - దైవత్వమునకు యోగ్యకరముగా ఉండిందా? ఒక్క మాటలో చెప్పాలంటే పౌలు పుట్టుక నుండి దైవిక సావాసములో జీవించినవాడా? అంటే ఇట్టి అపొస్తలుడైన పౌలు తన నోటితో బహిరంగముగా - ''యేసుక్రీస్తు వలనను, ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రియైన దేవుని వలనను అపొస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను,'' అని చెప్పుటలో వాస్తవానికి ఇతనికి ఆ యోగ్యత ఉందా? అన్నదాన్ని గూర్చియు వేదరీత్యా తెలిసికొందము. ఈ విధముగా దేవునియొక్క పరిచర్యకు దైవత్వము చేత నియమింపబడి పంపబడిన ఈ పౌలు తాను దైవత్వములో దైవిక సావాసములో జీవించినను, పరిశుద్ధాత్మునియొక్క ఆవరింపులో జీవించినను, ఏ అపొస్తలునికి లేని ఒక ఉన్నత పదవిని అలంకరించినను, అంతేగాకుండ 1 కొరింథీ 11:1 లో వలె ''నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి,'' అనెడి సవాలును లోకానికి మరియు తాను ఈ లేఖ వ్రాసిన గలతీయ సంఘానికి లేఖలో వ్రాయుటలో ప్రియ పాఠకులారా! ఇది ఎంత గొప్ప విషయమో వేదరీత్యా మనము ఈ చిన్న పుస్తకములో చదువుకొందము.
......
ముఖ్యగమనిక :- ''దేవుడు నియమించిన పరిచారకులు,'' అను ఈ పుస్తకములో ఇది లోకరీత్యా ఒక వ్యక్తికి సంబంధించి వ్రాయబడింది కాదు. లోకములో ఎవరికి ఇది అనువర్తించదు. ప్రత్యేకించి ఒక సంస్థకు గాని ఒక సువార్తీకునికిగాని, కాపరికిగాని, ఒక సంస్థకుగాని, ఒక సంఘానికిగాని, వేదరీత్యా నూతన నిబంధనలో అపొస్తలుల నియామకాలలో అనగా లోకములో దైవసేవ నిమిత్తము దేవుని చేత ఎన్నిక చేసి, లోకానికి పంపించితే గాని, అది దేవునికి సంబంధించింది కాదు. కనుక పాఠకులు దీనిని చదివి తమ ఆత్మీయ జీవితాన్ని చక్కబరచుకొని దైవత్వానికి యోగ్యకరముగా - ఆత్మీయ జీవితమునకు సన్నిహితులుగా జీవించాలని నా ఆకాంక్ష. ఇట్లు - గ్రంథకర్త
ఉపోద్ఘాతము :- పాఠక మహాశయులకు రచయిత తొలిపలుకులు :- ఈ పుస్తకములోని అంశములు లోకసంబంధమైన జ్ఞానముతోగాక, లోకసంబంధమైన పుస్తక రచనలను కాపీ చేసి గాక, కేవలము ఆత్మ మీద ఆధారపడి అదృశ్యములో ఉన్న దైవశక్తి ఉజ్జీవముతో వ్రాయడమే ఇందుకు మూలాధారము. కనుక దైవఎన్నికలో దేవుడు మనుష్యులను సలహా అడిగిగాని, నరులయొక్క ఉద్దేశ్యముల బట్టిగాని, నరుల సహాయ సహకారాలతో నరులను విచారించిగాని, నరులతో సంప్రదించిగాని, నరుల సలహాల మేరకు గాక, తన చిత్తము, తన ప్రణాళికను బట్టియే కార్యములనన్నిటిని ఆయన క్రమముగా జరిగించినట్లు వేదములో మనము చదువుకొనియున్నాము. నరుల ప్రణాళికలు, నరుల ఉద్దేశ్యములు వేరు, దేవుని ప్రణాళిక చిత్తము వేరు, వీటన్నిటికి పొత్తు కుదరదు. అలాగే దేవునియొక్క ఎన్నికలో తన పరిచర్యకు వాడబడే వ్యక్తి ఎవరో? అనిన విషయాన్ని పరిశోధించినప్పుడు ఆయన పరిశోధించిన వ్యక్తుల యొక్క జీవితాలు పూర్తిగా లోకసంబంధముగా ఉంటాయిగాని, ఆత్మ సంబంధమైన విషయాలుగా ఉండుట అరుదు. - పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఎన్నుకొను అనేకుల జీవితాలనుగూర్చి మనము తెలిసికొని యున్నాము.
నరులలో ఎన్నిక జరగాలంటే ఓటింగ్ పద్ధతి అనగా ఎన్నికలు గుర్తు. దానికి అనువైన సన్నాహాలు, అందుకు కావలసిన ఏర్పాట్లు, ఆ ఎన్నికలు జరుపుటకు మందిమార్భలము, రక్షకభటుల బందోబస్తు, ప్రభుత్వపరముగ గుర్తింపబడేటటువంటి ఉన్నత ఉద్యోగుల సహాయసహకారాలు, ఇవిగాక ఓటు వేసే వ్యక్తులయొక్క దయాదాక్షిణ్యాలు, వగైరాలు కావాలి. అయితే దేవుడు జరిపించే ఎన్నికలో మనుష్యుల సహాయసహకారాలుగాని, నరుల ప్రమేయముగాని, లోకసంబంధమైన పాలక వర్గముతోగాని, లోక సంబంధమైన వ్యక్తులయొక్క ఓటు ద్వారాగాని ఆయన ఎన్నికలకు పూర్తిగా విరుద్ధమైయున్నది. అంటే దేవుని ఎన్నికలో ఓటింగ్ పద్ధతి లేదు. దేవుని ఎన్నికకు దేవుడే ఉన్నతాధికారిగా ఉండి సర్వమును తానే భరించుచు - ధన ప్రమేయము, వ్యక్తుల సలహాలు, సహకారాలు లేకుండ, తన ఎన్నికలో తన ఎన్నికను సజావుగా ఆయనయే స్వయముగా ఎన్నిక జేసి, తన జనాంగము మధ్య అతనిని నిర్వాహకునిగాను, పరిచారకునిగాను, ప్రవక్తగాను, అధికారిగను ఎన్నిక చేస్తాడు. దేవుని ఎన్నికలో లోకసంబంధమైన అనగా మట్టిపాత్రుడైన నరుడు స్థిరుడుగా నిలబడాలంటే చాలా కష్టతరమైన విషయము. ఆ విధముగా నిలబడినపుడు ఆ వ్యక్తి దైవనియమావళికిని, దైవనిబంధనకు, ఆయన చిత్తమునకును, ఆయన వాక్యమునకును, ఆయన ఉత్తరువునకును విధేయులై జీవించాలి. ఇందులో ఏది తప్పినను ఆ వ్యక్తిని ఆ పదవిలో నుండి తొలగించుటకు దేవునికి అధికారము ఉందిగాని నరులకెలాంటి అధికారాలుండవు. ఇందునుగూర్చి వేదరీత్యా కొంతమందిని ఉదాహరణగా ఈ సమయములో జ్ఞాపకము చేసికొందము.
ఆదినరుడు ఆదిలోని దేవుని వనమునకుగాను దేవుడు నేలమంటితో నరాకృతిని జేసి జీవాత్మను నింపి, ఏదెను వనమునకు కాపరిగ నియమించాడు. ఈ విషయాన్ని ఆది 2:15లో చదువగలము. ఏదెను వనములో పరిచర్య చేయుటకును, దానిని కాయుటకును అనగా కాపరిగాను నియమించాడు. ఇది దైవచిత్తముతో ఆయన ఆత్మతో జరిగించిన క్రియ. అలాగే ఒంటరియైన నరునికి సాటిసహాయిగా అనగా చేదోడువాదోడుగా ఉండి తన విద్యుక్త ధర్మము నెరవేర్చుటకు అతని ప్రక్కటెముకలలో ఒక ఎముకను తాను జరిగించబోయే స్త్రీ నిర్మాణ క్రియకు వాడినాడు. అనగా దేవునియొక్క స్త్రీ రూప ఎన్నికకు పురుషునిలోని ఒక ఎముక ఎన్నిక చేయబడినట్లుగా మనకు తెలుస్తున్నది. అటుతర్వాత ఈ ఆది నరజంట ద్వారా ప్రవేశించిన పాపము - శాపము - మరణము అను త్రివిధ వినాశకర ఉపద్రవమును బట్టి, అప్పటిలో ఉన్న దైవసృష్టిని దేవుడు జలప్రళయ ఉపద్రవ మారణహోమము గావించి, నాశనము చేయు ప్రణాళిక రూపించుకొని, ఆ విధముగా లోక వినాశనకర క్రియ అనంతరము జరుగు తన సృష్టి నిర్మాణ క్రియలో తనకు కావలసిన వ్యక్తిని కూడా ఎన్నుకున్నాడు. అతడే - నోవహు - అతని ద్వారా జలప్రళయ రక్షణార్థము ఓడ నిర్మాణము గావించి అప్పటి సృష్టిలో ఉన్నటువంటి జంతువులలో కొన్నింటిని తాను జరిగించబోవు నూతన సృష్టిలో జీవించుటకు ఆ జంతుజాలమునకు ఓడలో వసతి కల్గించాడు. ఇదంతయును దేవుని ఎన్నికలో జరుగు క్రియలేగాని ఇందులో నరప్రమేయమే మాత్రము లేదు. దేవుడు అన్న మాట ఆది 7:1 ఈ తరమువారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైయుండుట చూచితిని గనుక నీవును, నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి.'' ఇది నీతిమంతుని ఎన్నిక. 1. తోట కాపరి ఎన్నిక
2. పురుషునికి సహాయార్థము స్త్రీని పురుషునిలోని ప్రక్కటెముక నుండి స్త్రీ రూపమును ఎన్నిక చేశాడు. 3. లోకవినాశనములో మరు సృష్టి కార్యమునకు నోవహును ఎన్నిక చేశాడు. 4. ఆ తర్వాత నరసృష్టి నిర్మాణములో దేవుడు ఎన్నిక చేసిన వ్యక్తి త్రాగుబోతై మత్తుడై, మొల మీద బట్ట లేనివాడై సిగ్గులేని జీవితము జీవించాడు. ఆ తర్వాత దేవుడు అబ్రాహాము అనే వ్యక్తిని విశ్వాసులకు తండ్రిగా ఎన్నిక చేశాడు. ఈ విధముగా పాతనిబంధనలో దైవఎన్నికలో నిలబడినవారు చాలామంది ఉన్నారు. మోషే నరహంతకుడైనను దైవచిత్తము, ఆయన ప్రణాళిక నెరవేర్పుకు తగినవాడుగ ఎన్నిక చేశాడు. ఇందునుగూర్చి హెబ్రీ 3:2 దేవుని ఇల్లయిన ఇశ్రాయేలు గృహకూటమికి మోషేను నమ్మకస్థుడుగా ఎన్నిక చేశాడు. అటుతర్వాత ప్రవక్తల పరిపాలన మీద విసిగిన ఇశ్రాయేలు జనాంగము కోరిక మేరకు మొట్టమొదటి రాజుగ గాడిదలు కాసుకొనే సౌలును ఇశ్రాయేలు రాజుగ ఎన్నిక చేశాడు. ఇది తండ్రియైన దేవుని ఎన్నిక. కుమారుడైన యేసుక్రీస్తు ఎన్నికలో భూమి మీద దైవరాజ్య సువార్త పరిచర్యకు ఎన్నిక చేసిన వ్యక్తులను కూడా ఈ సందర్భములో మనము జ్ఞాపకము చేసుకోవాలి. యేసుక్రీస్తు ఎన్నిక చేసిన వ్యక్తులు ప్రవక్తలు కారు, రాజులు కారు - వారు అపొస్తలులు'' అని పిలువబడినారు. అపొస్తలులు ఎన్నిక యేసుక్రీస్తు ద్వారా జరిగినట్లు తెలుస్తున్నది. అయితే అపొస్తలులతో జరిగిన ఎన్నికలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రధాన పాత్ర వహించి యున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క వరము లేనిదే ఆ దినములలో అపొస్తలుడు కాలేడు. అపొస్తలుడనగా పంపబడినవాడు. ఈ పంపబడుట మనుష్యుల చేత గాక దేవుని చేత ఎన్నిక చేయబడి ఆయన వరమును పొంది, ఆయన ప్రవచన నెరవేర్పుకు అనేకులకు ప్రకటించి, తద్వారా అనేకులను దైవరాజ్య సంబంధులుగ మార్చుటకు పరిశుద్ధాత్మ దేవుని చేత - దైవరాజ్యమునకు నడిపించి, దేవుని ప్రజలుగా పరిశుద్ధాత్మ చేత ఎన్నిక చేయబడినవారే ఈ అపొస్తలులు.
ప్రియపాఠకులారా! ఇందునుగూర్చి నేను పూర్తిగ ఈ మూడు ప్రత్యేక విషయాలను మననము చేసికొని, అనుదినము మీయొక్క ప్రార్థనలో సావాసములో - మీయొక్క దైవధ్యానములోను, మీరు జరిగించు పరిచర్యలోను - ''గ్రంథ పరిచయము - గమనిక - ఉపోద్ఘాతము'' ఈ మూడును మీ మనస్సులో ఉంచుకొని పరిశుద్ధ గ్రంథములోని ఈ క్రింది వేదభాగాల ద్వారా - మన ఆత్మీయ జీవిత విలువలను కాపాడుకోవాలని విన్నవించడమైనది - ఇక చదవండి.
......
అన్ని విషయములందు నాకు స్వాతంత్య్రము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్య్రము కలదుగాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు.'' 1 కొరింథీ 10:23.
ప్రియపాఠకులారా! కొరింథీ సంఘానికి పౌలు వ్రాసిన పై వేదవాక్యములో చాలా గూఢార్థములు మిళితమై యున్నవి. ఇందులో మొదటిగ అన్ని విషయాలలో స్వాతంత్య్రము కలదని పౌలు చెప్పుటలో వేదరీత్యా దీన్ని గూర్చి మనము ధ్యానిస్తాము. మొట్టమొదటగ ఆది 2:8 దేవుడు వేసిన ఏదెను వనములో నరునికి తోటలో పూర్తి స్వేచ్ఛను అనుగ్రహించాడు. అనగా తోటలో విహరించుటలోనైతేనేమి, తోటలోని ఫలములు తినుటలోను, తోట ఫలసాయమును అనుభవించుటలోను, దేవుడు ఆదామునకు సంపూర్ణ స్వాతంత్య్రము నిచ్చినట్లుగా - ''ఆదామా! ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, మరియు దేవుడైన యెహోవా! నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును, దాని కాచుటకును దానిలో ఉంచెను. అంతేగాకుండ దేవుడు తాను సృష్టించిన ప్రతి సృష్టమునకు నరుని చేత పేర్లు పెట్టించినట్లు వేదములో చదువగలము. ఇందునుబట్టి దేవుడు నరుని పట్ల నిష్పక్షపాత వైఖరి అవలంభిస్తూ తన ఆత్మ భాగస్వామియైన నరునికి తన సృష్టిపై సంపూర్ణ స్వాతంత్య్రము ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఈ స్వాతంత్య్రము అన్నది ఒక నియమావళి లేనిదియు, ఒక నిబంధన లేనిదియునైయున్నట్లు ఇందునుబట్టి తెలుస్తున్నది.
ప్రియపాఠకులారా! పౌలు ప్రవచించిన ప్రకారము 1 కొరింథీ 10:23వ వాక్యములో అన్ని విషయములందు నాకు స్వాతంత్య్రము కలదుగాని అన్నియు చేయదగినవి కావు,'' అనుటలో ఆదాము చేయదగినవి కూడా ఏదెను వనములో ఉన్నట్లు తెలుస్తున్నది. అదేమనగా దైవత్వమునకు అయోగ్యకరమైనదియు, దైవత్వము చేత నిషేధింపబడినదియు కూడా ఉన్నట్లు ఈ వాక్యములోని రెండవ భాగమును మనకు వివరిస్తున్నది. అదేమనగా దేవుడు నరునికి తన వనములో సంపూర్ణ స్వాతంత్య్రము - చెట్టు ఫలములు భుజించుటలోను అనగా పలభక్షణలో కూడా సంపూర్ణ స్వాతంత్య్రము ఇచ్చినట్లును, అయితే దేవుడు ఇచ్చిన స్వాతంత్య్ర విధానములో ఒక చట్టము కూడా విధించినట్లు నరుని పట్ల మనము ఏదెను చరిత్రలో చదువగలము. అదేమనగా ఆది 2:16-17 ''ఈ తోటలోనున్న ప్రతి వృక్షఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలము తినకూడదు - నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను,'' ఇది ఫలనిషేధము. అనగా దీని ద్వారా దైవత్వములో నరుడు అయోగ్యుడగుటచే దైవవనములోనుండి బహిష్కరింపబడునట్లు ఒక చట్టాన్ని దేవుడు ఆదామునకు విధించియున్నాడు.
కనుక ప్రియపాఠకులారా! ఆదాము ఒంటరి. ఏదెను వనమన్నది దేవునియొక్క పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ స్థలములో స్వేచ్ఛగా విహరించే యోగ్యతను, ఇష్టానుసారముగా ఫలభక్షణము చేయుటకు స్వాతంత్య్రము దేవుడు నరునికి అనుగ్రహించియున్నాడు. అయితే ఇందులో నరుని జీవాత్మను పరిశోధించుటకు ఫలనిషేధమన్నది ఒక నియమావళి పరీక్షార్థముగ విధించినట్లు తెలుస్తున్నది. ఇందువలన నరుడు దైవనిషేధ ఫలమును భుజించకుండుటన్నది - నరునియొక్క స్వాతంత్య్రమునకు అడ్డుబండయై యున్నది. అనగా దైవనిషేధఫలము ఏనాడైతే ఆదాము తింటాడో ఆనాడే ఏదెనులోని స్వాతంత్య్రము, దైవత్వముతో కలసి జీవించే యోగ్యత, ముఖాముఖిగ దైవస్వరము వినే ప్రశస్త వాతావరణమును కోల్పోవుటయేగాక పాపము శాపము మరణము అను త్రివిధమైనటువంటి నికృష్ట స్థితికి నరుడు దిగజారిపోయే ప్రమాదమున్నది. ఇది ప్రత్యక్షముగా దేవుడు నరునికి బోధించినటువంటి హెచ్చరిక. నరునికి ఎంత స్వేచ్ఛ ఉన్నదో ఇంచుమించు సమాన స్వేచ్ఛను ఆ వనములో స్త్రీకిని అనుగ్రహించాడు. కనుక ఆది దంపతులు ఇరువురును స్వతంత్రులే; అయితే వీరి స్వాతంత్య్రపు హక్కును అలౌకిక శక్తియైన అపవాది అదును చూచి అవకాశము కొరకు కనిపెట్టి తగిన సమయములో - అనుకూల వాతావరణములో అనగా ఒంటరిగ స్త్రీ ఉన్న అదును కనిపెట్టి సర్పములో ప్రవేశించి, చేసిన బోధ మొట్టమొదటగ స్త్రీని లోకమునకు బానిసగాను, పురుషునికి బానిసగాను, సమాజములో తల ఎత్తుకోలేనట్టి అనగా తలఎత్తి తిరిగే వీలులేని స్థితికి దిగజార్చుటయేగాక, గర్భధారణ, ప్రసవవేదనతో కూడిన శారీర దౌర్భల్యమును, ఆత్మీయముగా వికసింపు లేకుండ జేయు మనోనేత్ర అంధకారమును సర్పము ద్వారా స్త్రీ సంపాదించుకొన్నది. అంతేగాకుండ సర్పబోధకు చెవినిచ్చిన స్త్రీ తాను చెడుటయేగాక తన భర్తకును ఇచ్చి దైవనిషేధఫలము ద్వారా చెడిపినందున, ఆ వరకు పిరికితనమును, సిగ్గు ఎరుగని స్థితిలో ఉన్న ఆ నరజంటలో సిగ్గు ప్రవేశించుటయు, అటుతర్వాత మొట్టమొదట ఆత్మీయ మరణము, మనోనేత్ర అంధకారము, ఆత్మీయ విలువను కోల్పోవుట, పరమాత్మతో ఉన్న సంబంధ బాంధవ్యాలు తెగిపోవుట, భయము ఆవరించగా చెట్ల మరుగున ఆశ్రయము కోరుట, దైవత్వమును ముఖాముఖిగ చూచే యోగ్యతను కోల్పోవుట, ఆత్మీయ మరణము, శారీర మరణము, సృష్టిలో పాపప్రవేశము, దైవసృష్టికి కళంకము, పంచభూతముల వైరుధ్యము, ప్రకృతిలో వివిధ అరిష్టాలకు ఈ లోకము గురియైంది. నరునికి అనుగ్రహించిన స్వాతంత్య్రాన్ని ఆయన నియమించిన నియమావళిని కాపాడుకోలేకపోవుటయు, సర్పానికిని, లోకానికిని ఆదినరజంట ఎప్పుడైతే బానిసలైనారో నాటి నుండి నేటి వరకును ఈ బానిసత్వములో నానావిధమైన బంధకాలలో తగుల్కొని, బందీయై అనగా స్త్రీ సంబంధము, పురుష సంబంధము, సంసార బంధము, ధన వ్యామోహము, భూవ్యామోహము, లోహ వ్యామోహము, విగ్రహ వ్యామోహము, పదవీవ్యామోహము వగైరాలు.
కనుక ప్రియపాఠకులారా! ఈ విధముగా సృష్టికి పూర్వము దేవుడు నరునికి అనుగ్రహించిన స్వాతంత్య్రములో ఒక హెచ్చరిక ద్వారా ఆ స్వాతంత్య్రపు విలువను పోగొట్టుకొన్నాడు. ఆ హెచ్చరిక పరీక్షార్ధమైనది. ఈ తోటలోనున్న ప్రతి వృక్షఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు,'' అనుటలో ఆ తోటలో ఉన్న చెట్ల ఫలములలో జరిగిన నిషేధము. ఈ నిషేధము అనే నియమాన్ని పాటించక, అనగా వ్యతిరేకించి నరుడు తెచ్చుకున్న బానిసత్వమే. దైవసన్నిధిలో నరుడు చేయరాని పనియైయున్నది.
ప్రియపాఠకులారా! ఈ విధముగా దేవుడు నరునికి స్వాతంత్రమిచ్చిన సంఘటనలు. అలాగే ఆ స్వాతంత్య్ర విలువలను నరుడు పోగొట్టుకొన్న కొన్ని సందర్భాలనుగూర్చి వివరముగా తెలిసికొందము. న్యాయాధిపతులు 13:లో సంసోను స్వతంత్రుడు ఎలాగంటే శరీరరీత్యా ఆత్మ ద్వారా ఒక ప్రత్యేక వరాన్ని పొందినాడు. ఈ వరము పొందుటలో దేవుడు విధించిన కొన్ని నియమావళులున్నవి. అందులో
1. అతని తల మీద మంగలి కత్తి రాకూడదు. అనగా క్షురకర్మ నిషేధము. రెండవది మద్యముగాని, ద్రాక్షారస మద్యము ఏదేని అతడు ముట్టకూడదు. మూడవదిగ స్త్రీ సాంగత్యము ద్వారా అపవిత్రుడు కాకూడదు. ఇది దేవుడు సంసోను చరిత్రలోని తల్లిదండ్రులకు అతడు జన్మించక పూర్వము దేవుడు విధించిన నియమావళి. ఈ మూడును పాటించినంతవరకు సంసోను స్వతంత్రుడు. సంసోను శక్తికి ఎదురు లేదు. ఒక్కడైయున్న సంసోను ఎదుట వేలమంది నిలువలేకపోయారు. అనగా వేలమందిని సంసోను ఏ ఆయుధము లేకుండ గాడిద ఎముకతో చంపడము, ఏ ఆయుధము లేకుండ ఒకడు మేక పిల్లను చీల్చినట్లు కొదమ సింహాన్ని చీల్చడము. ఎలాంటి శ్రమ లేకుండ సంసోను తనను కట్టిన బంధకాలు, అవి త్రాళ్ళుగాని, ఎలాంటి గొలుసులుగాని, తుత్తునియలుగ చేసి త్రెంపే బలాధిక్యత ఇందుకు ఋజువై యున్నవి. ఈ విధముగా స్వాతంత్య్ర వీరుడుగను, అజేయుడును, సింహబలుడైన సంసోను దైవజనాంగమైన ఇశ్రాయేలు మధ్య వారికి న్యాయాధిపతిగ స్వతంత్రుడై ఎదురులేని జీవితము జీవించాడు. ఈ స్వాతంత్య్రాన్ని ఆసరాగా తీసుకొని సంసోను దేవుడు తాననుగ్రహించిన ఈ స్వాతంత్య్రాన్ని లోకము వైపు మరల్చి స్త్రీ వ్యామోహితుడై, దైవ వ్యతిరేకుడై పూర్తిగా విరుద్ధమైన స్త్రీ సాంగత్యానికి లోనై, స్త్రీ ద్వారానే బలహీనుడై, అంధుడై, దైవవరమును, దైవబలమును, దైవశక్తిని, దైవత్వపు ప్రతిష్టతను మంటగలిపి బందీయై దిక్కులేని చావు చచ్చాడు. అంటే సంసోను చేయవలసిన పనులకు బదులు చేయదగని పనులు చేయుటయే ఇందుకు కారణములని ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది. అలాగే అన్నిటియందు నాకు స్వాతంత్య్రము కలదుగాని అన్నియును క్షేమాభివృద్ధి కలుగజేయవు 1 కొరింథీ 10:23 అనిన రెండవ వాక్యభావమునుబట్టి ఇందునుగూర్చి వేదరీత్యా మరియొక సంఘటనను గూర్చి తెలిసికొందము.
ప్రియపాఠకులారా! దావీదు మహారాజును దేవుడు బాల్యము నుండి తన బిడ్డగ ప్రతిష్టించి, పోషించి, ఎదిగించి బాల్యదశలోనే 1 సమూయేలు 18:లో గొలియాతు అను స్థూలకాయుడును, భయంకరుడును, యుద్ధ నైపుణ్యత కలవాడును అయిన గొలియాతును ఏ ఆయుధము లేకుండ కేవలము వడిసెలలోని రాయితో చంపే విధానములో దేవుడు అనుగ్రహించిన స్వాతంత్య్రము ఎంత గొప్పదో మనకు ఋజువగుచున్నది. దేవుడు ఆ విధముగా అనుగ్రహించి దావీదును హెచ్చించి ఆయనకిచ్చిన అనేకమంది భార్యలు, ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ఊరుగా కట్టబడిన దావీదుపురము ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. ఇందునుబట్టి దేవుడు దావీదుకు అనుగ్రహించిన స్వాతంత్య్ర విభాగాలు, అధికమైనటువంటి భార్యలు, ప్రవచన వరము - ఈ ప్రవచన వరమునుబట్టి కీర్తనలు రచించాడు. ఆ రచన ద్వారా ఆయన దేవుని కీర్తించాడు. అంతేగాకుండ ప్రవక్తగా పిలువబడినాడు. పరలోకపు తాళపు చెవులు భావి తరముల మీద సకల జనుల నేలే రక్షకుని జననమునకు మూలపురుషుడుగా ఎన్నుకొన్నట్లు అనగా దైవకుమారుడైన యేసుక్రీస్తు శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను.'' ఇది దేవుడు దావీదుకు అనుగ్రహించిన సంపూర్ణ స్వాతంత్య్రమైన ఆధిక్యత, ఒక్కమాటలో చెప్పాలంటే ఆనాటి రాజులలో దావీదు కంటె అధికులైన రాజులు లేరు. దావీదు దేవుని ఆరాధించేవాడు. అతని కంటే దేవుని ఆరాధించేవాడు లేడు, దేవుని స్తుతించినవాడు లేడు, మహిమపరచినవాడు లేడని తెలుస్తున్నది. అతనికంటే విధేయించినవాడు గాని సంపూర్ణ సమర్పణ చేసినట్టివాడుగాని లేడు. అట్టి దావీదు ప్రవక్తయు, కీర్తనాకారుడును మహారాజును ప్రవక్తయైన దావీదు చేయకూడని పనులు కొన్ని వేదరీత్యా 2వ సమూయేలు 11:లో దైవత్వమునకు చేయదగని పనులు, వ్యతిరేకమైన పనులు మనమెరిగిన విషయమే; ఇట్టి చేయదగని కార్యాలు చేసి తన జీవితానికి క్షేమాభివృద్ధికి బదులు తీరని దుఃఖాన్ని, వేదనను, తన సంతానాన్ని తరతరాలుగా వెంటాడిన పాపము ఒక వైపు, తాను కన్నట్టి సంతానము మూలముగా మానసికముగా ఆత్మీయంగాను శారీరంగాను ఎన్నో చేదు అనుభవాలు తీరని దుఃఖము, వేదనను, దైవోగ్రతనుబట్టి దావీదు అనుభవించిన విధము వివరముగా 2వ సమూయేలు గ్రంథములో చదువగలము. ఇది ఒక ప్రవక్త ఒక కీర్తనాకారుడు, దైవ విశ్వాసి, దైవజనాంగమునకు పరిపాలకుడు అయిన మరియు నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువునకు వంశాకురమైనటువంటి ప్రవక్తయైన దావీదుయొక్క చేదు అనుభవమును గూర్చిన విధానము.
కనుక ప్రియపాఠకులారా! నేటి క్రైస్తవ విశ్వాసులుగా పిలువబడుచు బాప్తిస్మము పొంది, క్రీస్తును ధరించుకొని, పరిశుద్ధుల సావాసములో జీవించే మనము దైవికముగా అనగా ఆత్మీయముగా ఆత్మీయ సావాసములో సంపూర్ణ స్వాతంత్రులమయ్యాము. ఆయన తన బలియాగము ద్వారా పాపబంధకాల నుండి తన రక్తము ద్వారా కడిగి క్షమాపణ ఇచ్చి తన రాజ్యవారసులుగ తన రాజ్య సువార్తకు సాక్షులుగ, తన చరిత్రకు హతసాక్షులుగ, తన మందిరములో ప్రవేశించు సభ్యులుగ, యోగ్యకరముగా అనుగ్రహించిన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పాపమరణ బంధకాల నుండి విడుదల పొందిన మనకు సంపూర్ణమైన స్వాతంత్రులమై ఆత్మరీత్యా క్రింది వారము కాము. శరీరరీత్యా మనము లోకముతో చెయ్యి కాలు కదపకూడదు, ఏకీభవించకూడదు, లోకాశలకు వ్యసనాలకు గురియై లోకాకర్షణకు మనము లోకము వైపు చూడకూడదు. ఆ విధముగా దైవత్వములో జీవించి లోకము వైపు చూస్తే లోతు భార్య గతియగుతుంది. ఒకవేళ స్త్రీ పురుషులైతే అననీయ సప్పీరాల గతియే!
........
మూలము ఎఫెసీ 4:1-3 ప్రియపాఠకులారా! పై వేదవాక్యాలలో సమాధానమను బంధమేమిటి? ఆత్మ కల్గించు ఐక్యత ఏమిటి? సమాధానమునకును బంధమునకును - ఆత్మ కల్గించు ఐక్యతకు ఉన్న అవినాభావ సంబంధాలను గూర్చి తెలిసికొందము. యేసుక్రీస్తు లోకములో జన్మించిన తర్వాత లూకా
2:14లో ఈలాగు వ్రాయబడియున్నది. ''సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక! అని పరలోక దేవునికి స్తోత్రము చేయుచుండెను.'' గొల్లలకు రక్షకుని వర్తమానము తెలిపి దూతతో ఉండి మాట్లాడిన ఈ మాటలు చదువగలము. ''సర్వోన్నతమైన స్థలములలో అనగా దేవునియొక్క ఉన్నత స్థానములో దేవుని మహిమ భూమి మీద - ఈ మహిమనుబట్టి మనుష్యులకు సమాధానము. అట్టి మహిమగల సమాధానము పొందుటకు దేవదూతల సమూహము స్తోత్రము చేస్తూ దేవుని స్తుతించినట్లుగా ఈ వేద భాగములోని వివరణ.
ప్రియపాఠకులారా! ఇప్పుడు మనము మూలవాక్యములో సమాధానము అనుబంధము అన్నది క్రీస్తు ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ క్రియనుబట్టి నరులలో అనుగ్రహించిన గొప్ప ధన్యతయైయున్నది. ఈనాడు క్రైస్తవ గృహాలలోను, క్రైస్తవ సంఘాలలో - క్రైస్తవ ఆత్మీయ జీవితాలలోను కొన్ని సందర్భాలలో లోపించి, లోకము వైపు నరుల దృష్టిని మరల్చి, విశ్వాస జీవితమును సహితము భ్రష్టుపట్టించే స్థితికి దిగజారుస్తున్నది.
ప్రియపాఠకులారా! లోకాధికారియైన అపవాదియొక్క శోధన కార్యము అన్యుల మీద సాధారణముగా జరుగదు. ఎందుకంటే సత్యదేవుని కనుగొననట్టి అన్య సోదరులు నానావిధ రూపాలు, నానావిధ సృష్టములు, నానావిధమైనటువంటి జ్ఞాన వికలత్వము ద్వారా దైవత్వాన్ని కనుగొనలేక నానారీతులుగా తమ జీవితాలను వక్రమార్గములో సాగిస్తూ - నామ క్రైస్తవ జీవితములో కొందరు, అసత్యమైన విగ్రహారాధన స్థితిలో కొందరు, దైవసృష్టములు ఆరాధిస్తు కొందరు. ఇవేవియు లేక నాస్తికత్వముతో కొందరు, హేతువాదముతో వితర్క వాదము చేస్తూ దైవత్వానికి దూరమై కాలగతులలో కలిసిపోతున్నారు.
కనుక ప్రియపాఠకులారా! సమాధానమన్నది క్రైస్తవ్యానికి ప్రధానమైన ఆయుధమై అతి అమూల్యమైన ధనమై, అత్యున్నతమైన ఐశ్వర్యమై, ఏ శక్తియు విడదీయనటువంటి బాంధవ్యాన్ని కల్గించే విధమును గూర్చి ఇందులో వ్రాయబడియున్నది. అయితే ఈ సమాధానమన్న బంధము క్రైస్తవ జీవితములో ఏర్పడాలంటే పరిశుద్ధాత్మయొక్క ఆవరింపు, పరిశుద్ధాత్మ సన్నిధి, పరిశుద్ధాత్మ యొక్క ఆరాధన, పరిశుద్ధాత్మతో విశ్వాసియొక్క ఆత్మీయ జీవితమునకును, హృదయమునకును, పరస్పరమునకు ఐక్యత కలగాలి. ఒక కుటుంబములో భార్యాభర్తలలో ఐక్యత లేకపోతే అక్కడ శాంతి సమాధానము, కుటుంబములో నెమ్మది ఏలాగు శూన్యమైయుంటుందో - అలాగే ఆత్మ కల్గించే ఐక్యత, సమాధానమను బంధము లేకపోతే ఆ వ్యక్తియొక్క జీవితము, వాని హృదయము నిష్ప్రయోజనకరములై యుండి, చరిత్రహీనునిగా అట్టి వ్యక్తిని మారుస్తుంది - అనుటకెట్టి సందేహము లేదు. ఉదా|| ఆదినరుడైన ఆదాముతో దేవుడు ఏదెను వనములో తన జీవాత్మను ఉంచుటనుబట్టి ఆత్మీయమైన బంధము భూమిలోనుండి నరుని శరీరము రూపించబట్టి భూమితో సంబంధ బాంధవ్యాలు, ఋణానుబంధము, వగైరా బంధాలెన్నో కల్గించాడు. మరియు దాంపత్య బంధము, పురుషుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆతని శరీరములోని ఒక ఎముకను తీసి సాటి సహాయమను జోడును ఇచ్చెను. ఇది భార్యభర్తల అనుబంధము. ఈ అనుబంధమన్నది నరజంటలోనే గాక ఆత్మరీత్యా సృష్టికర్తయైన దేవునిలో కూడా ఈ అనుబంధము ముడిపెట్టబడి, అంతేగాక ఈ త్రివిధ బంధకాలు ఏకమై దేవుని పరిశుద్ధ ఏదెనులో నివసించేటటువంటి నిశ్చింత, నిర్భయమైన, నిరపాయకరమైన, ప్రశాంతమైన, దైవత్వముతో ప్రతి నిత్యము సంభాషించే విధముగా నరునికి, దేవునికి, సృష్టికిని ఈ ముగ్గురికిని సమాధానకరమైన బంధము ఏదెను వనములో ఏర్పడింది. ఇందుకు కారణమే ఆత్మ కల్గించిన ఐక్యము.
ఇప్పుడు మన మూలవాక్యములో సమాధానమను బంధము చేత ఆత్మ కల్గించు ఐక్యమును కాపాడుకొనుటకు శ్రద్ధ గలిగినవారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు జీవించమంటున్నాడు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను, సాత్వికముతోను నడుచుకొనవలెనని, ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను,'' అనుటలో మొట్టమొదటగ దేవుడు నరజంటను దేనికి సృష్టించాడు? ఎందుకు సృష్టించాడు? ఆయన చిత్తములో నరుడు ఏ తరగతికి చెందియున్నాడు? నరుని విషయములో దేవుడు వహించిన ప్రత్యేక శ్రద్ధ ఏమిటి? నరుని నుండి దేవుడు ఆశించిన ఆశయమేమిటి? నరుని ద్వారా ఏ ఫలములు ఆశించాడు? అయితే నరుని నుండి దేవునికి ముట్టిన ఫలము ఏది? నరుని దేవుడు ఏమని పిలిచాడు? ఆ పిలుపుకు నరుడు తగినట్లుగ దేవుని ఎదుట నిలువగల్గినాడా? దేవుడు సృష్టించిన నరుడు దేవుని పిలుపు విన్నంతనే, దేవుని సమక్షములో నిలచే మరియొక సందర్భములో - దేవుని పిలుపునకు వెరచి ఏ స్థితికి దిగజారినాడు? ఈ విధముగా దిగజారిన స్థితిలో ఆత్మ కల్గించిన బంధము సమసిపోక వేరొక రీతిలో ముడి పెట్టబడింది. ఆ ముడి పెట్టబడిన విధానమేది? ఈ విధానమును ప్రభుత్వాలుగాని, లోకముగాని, లోకనివాసులుగాని గుర్తించగల్గినారా?
ప్రియపాఠకులారా! సృష్టికి - సృష్టికర్తకు సమాధానయుతమైన సంబంధ బాంధవ్యాలు సృష్టికర్త కల్గించుకొనియున్నాడు. ఈ బంధము ద్వారా సృష్టికర్త మహిమను సృష్టియు, ఆకాశమును ఆయన మహిమను వెల్లడిపరుస్తుంది. జంతుజాలములు ఆయన మహిమను లోకానికి చాటుచున్నది. సృష్టములకును, సృష్టికర్తకును సమాధానయుతమైన బంధకాలుండగా నరునికి సృష్టికర్తకు ఉన్న బంధము ఎలాంటిది? ఆత్మ కల్గించిన ఐక్యత ఎలాంటిది? అన్న సత్యాన్ని మనము తెలిసికొందము.
సృష్టికర్తకు, సృష్టికి వాక్ బంధము అనగా వాక్కు ద్వారానే సృష్టిలో ఉన్న సృష్టములు ఏర్పడినవి. ఆకాశము భూమి జలములు వీటితోనే సర్వస్వము సృష్టికర్తతో ఐక్యమై తమ క్రియలు జరిగిస్తున్నవి. జలములు సృష్టికర్త యొక్క ఆత్మతో ఐక్యమై నానావిధ జలచరాలను జలరాశి రూపించింది. అలాగే భూమి కూడా సృష్టికర్త యొక్క వాక్కును బట్టి ఆయన వాక్‌బంధము ద్వారా నక్షత్రాలు, గ్రహాలు, వగైరా కాంతివంతమైన సముదాయములతో సృష్టికర్తతో ఐక్యమై సమాధానము కల్గి జీవించినట్లు ఆదికాండములోని పూర్వ చరిత్ర వివరిస్తున్నది.
అయితే దేవుడు నరునిపట్ల జరిగించిన క్రియ వీటన్నిటికంటె ఒక ప్రత్యేక రీత్యా ఉన్నట్లుగా ఆదికాండము వేదభాగాలలో మనము చదువగలము. ఇందులో మొదటగ ఆది 1:26-27 మన స్వరూపము మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఇది నరరూపములో ఆత్మ కల్గించుకొన్నఐక్యత. ఇక రెండవదిగ ఆది 2:7లో '' దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, వాని నాసికారంధ్రాలలో తన జీవవాయువును ఊదెను. ఇది నరజీవితములో దేవుడేర్పరచుకున్న సుస్థిరమైన బంధము. ఆది 2:15 దేవుడు నరజీవితానికిని, తనకును సమాధానకరమైన ఐక్యతతో కూడిన బంధమును నరుని కొరకు ఒక తోటను వేసి, అందులో తన ఆత్మతో నరుడు ఐక్యత గల్గి జీవించాలన్నట్లుగ మనకు తెలుస్తున్నది. అయితే నరుడు ఈ యొక్క ఆధిక్యతను కాపాడుకోలేక దైవవ్యతిరేకమై, దైవ ఆజ్ఞాతిక్రమము చేసి, దైవవ్యతిరేకియైన ఈ ఆత్మ యొక్క ఐక్యతను, ఈ ఆత్మయొక్క సమాధానమును మరణ శాపముతో అనగా దేవుడు విధించిన మరణశిక్షతో విఫలుడయ్యాడు. అయినను దేవుడు నరుడు దోషియైనంత మాత్రాన వదలక అతనితో రక్షణాయుతమైన బంధాన్ని ఏర్పరచుకొన్నాడు. అదియే చర్మపు దుస్తులను తొడుగుట. ఇది నరులకు అనుగ్రహించిన సమాధానయుతమైన రక్షణాయుతమైన బంధము.
ఇక నూతన నిబంధనలో :- పాతనిబంధనలో నరులకు దైవశాపము, మరణము అనే శిక్ష ఉపద్రవాల నుండి విమోచనకు రక్షణకు నరునిలో తన ఆత్మ నుంచి విడరాని అనురాగయుతమైన బంధమును బట్టి దేవుడు - తానే నారీ గర్భములో ఆత్మ ద్వారా శారీరయుతమైన బంధకాన్ని ఏర్పరచుకొన్నాడు. అదియే కన్యకయైన మరియలో శిశువుగ పుట్టిన దైవకుమారుడైన యేసు యొక్క చరిత్ర ఇందుకు ఋజువైయున్నది. ఇది కూడా నరుడు గుర్తించే స్థితిలో నేరక దైవకుమారుడైన దేవుని అలక్ష్య పెట్టినందున, తన జన్మను గూర్చిన వర్తమానమును సువార్తగా భూమి మీద స్థాపించుటకు, దైవరాజ్య సువార్త అనుబంధములో దేవుడు తన ఆత్మ ద్వారా నరులను ఏర్పరచుకోవాలని ఆశించినట్లు యేసుక్రీస్తు ఏర్పరచుకొన్న 12 మంది శిష్యులు - వారి అపొస్తలత్వము ఇందుకు ఋజువైయున్నది. అంతేగాకుండ దేవుడే తన ఆత్మతో వారికి కల్గించిన బంధము, ఐక్యతను గూర్చిన విధానము ఎలాగంటే అపొ 2:1-4 చదివితే ఈ క్రింది విధమైన దేవునియొక్క శక్తి క్రియావిధానమును గూర్చి క్షుణ్ణముగా తెలియగలదు. అదేమనగా యేసుక్రీస్తు తన ఆత్మ ద్వారా తన సువార్త ద్వారా బంధము ఐక్యతను ఏర్పరచుకొన్న విధానములో యోహాను 13:3-8లో ''తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి యున్నదనియు యేసుఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి, తన పై వస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసికొని నడుమునకు కట్టుకొనెను. అంతట పళ్ళెములో నీళ్ళు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొనియున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. సీమోను పేతురు యొద్దకు వచ్చినప్పుడు అతడు - ప్రభువా! నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడుగని యెడల నాతో నీకు పాలు లేదనెను. అందుకు పేతురు - ప్రభువా! నా పాదములు మాత్రమేగాక నా చేతులు, నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను.
ప్రియపాఠకులారా! యేసు జరిగించిన ఈ క్రియ ద్వారా మొట్టమొదటగ ఆయన శిష్యులు అనబడినవారు యేసుయొక్క ఆత్మలో ప్రతిష్టితమైనట్లును, ఈప్రతిష్టిత కార్యమును యేసు స్వయముగా తన హస్తములతో జరిగించాడు. ఈ ప్రతిష్టితనుబట్టి యేసుయొక్క 12 మంది శిష్యులు ఈ విధముగా యేసుక్రీస్తు ఆత్మ చేతను, జలాభిషేకముతోను ప్రతిష్టితులైన ఈ శిష్యులు లూకా 2:1-4లో జరిగినట్టి సంఘటనలో పెంతెకొస్త అను పండుగ దినమున అందరు ఒక చోట కూడియున్నప్పుడు జరిగిన క్రియ. పరిశుద్ధాత్మ అందరి మీద వ్రాలి, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించు కొలది అన్య భాషలతో వివిధ భాషలు మాట్లాడుటన్నది పరిశుద్ధాత్మ అభిషేకము. ఈ విధముగా ప్రతిష్టిత చేయబడిన శిష్యులనే గాక ఈ పరిశుద్ధాత్మ అన్యులను సహితము ఆవరించి, క్రియ జరిగించినప్పుడు చూచువారికిని, వినువారికిని కలవరపరచినట్లుగాను, వారందరు ఆశ్చర్యపడి, ప్రతి యొక్కరును పరిశుద్ధాత్మ క్రియనుగూర్చి నానా విధాలుగ ఆశ్చర్యకరముగా మాట్లాడుటలో అందరు విభ్రాంతి నొందిరి. కొందరైతే ఈ కార్యము హాస్సస్పదముగా ఎంచి విమర్శించినప్పుడు పేతురు మాట్లాడిన మాటలు అపొ 2:14-19లో వ్రాయబడిన అంశము. ఇవన్నియును కూడా పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ శక్తియు, పరిశుద్ధాత్మ జ్ఞానము, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో కూడిన క్రియలైయున్నవి. పరిశుద్ధాత్మయొక్క శక్తి, ప్రభావమును లోకమునకు ప్రకటించునవియైయున్నవి.
కనుక ప్రియపాఠకులారా! ఇందునుబట్టి దేవుడు సమాధానమనే ఈ బంధమును ఈ నాలుగు విధాలుగ కల్గించియున్నట్లు వేదరీత్యా తెలిసికొందము. మొట్టమొదట దేవుడు తన జీవాత్మతో నరుని బంధించాడు. అతనిలో సఖ్యతను, సమాధానమును, ఐక్యతను కల్గించి, తన పరిశుద్ధ సావాసమున జీవింపజేశాడు. ఆ తర్వాత నరుడు నరసమాజము మరణ శాపమునకు గురికాగా వారిని క్రమబద్ధీకరణ చేయుటకు దేవుడు లోకములో ప్రత్యేకముగా ఇశ్రాయేలు అని పేరు పొందిన జనాంగముల వారిని తన ప్రతిష్టిత జనాంగముగా ఏర్పరచి, వారిలో - వారితో నివసించాడు. వారి మధ్య జీవించాడు, వారి ముందు వెనుకల నడిచాడు. ఇది దైవజనాంగముతో దేవుడు కల్గియున్న బంధము - సమాధానము ఆత్మ యొక్క ఐశ్వర్యమును గూర్చిన వివరము. అప్పటికిని నరులు దైవ ప్రేమను ఎరుగక దూరము కాగా దేవుడు తానే కుమారత్వము ధరించి కన్యకయైన స్త్రీ గర్భములో - ఆత్మీయ బంధము ద్వారా ఆత్మ ఐక్యత ద్వారా దైవ రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుటకును, నరరూపములో నరులమధ్య జీవించుటకు సంకల్పించి, కన్యకయైన మరియకు తనయొక్క ఆత్మను, తన శక్తిని, తన ప్రభావమును ప్రయోగింపజేసి, ఆమె గర్భములో నరరూపమును ఏర్పరచింది. ఇది ఆత్మ నరులతో కల్గించుకొన్న ఐక్యత. లూకా 2:14లో వలె ''సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును,'' అనిన ప్రవచన నెరవేర్పయియున్నది. ఎట్లనగా పాత నిబంధన కాలములో నరుని చేసినందుకు గాక నరునిలో తన జీవాత్మను ఉంచినందునకును, నరుల నిమిత్తము దేవుడు రూపించిన సృష్టి కొరకును, ఆయన సంతాపపడి నొచ్చుకొన్నట్లు ఆదికాండము 6:లో చదువగలము.
ఈ విధముగా నొచ్చుకొన్న దేవుడు నరునికి మరియొక అవకాశము ఇస్తూ నరునిలో కలిగిన బలహీనతనుబట్టి దేవుడు చింతించి, నరుని యొక్క ఆత్మీయ బలహీనతను విమోచించి బలవంతునిగ చేయుటకు, తానే ఈ లోకానికి నారీ గర్భములో తన ఆత్మ ద్వారా ఐక్యతను కల్పించుకొని, అంతేగాకుండ తన దైవత్వమును తన పరలోక సామ్రాజ్య ఘనతను, వైభోగమును, తన సర్వస్వమును వదలుకొని, నరులలో ఒక నరునిగ జీవించుటకు సంకల్పించి, అందులో ధనవంతుడుగా కాక, రాజుగా కాక, మహాభోగిగా కాక, ఉన్నత పదవిని అలంకరించినవాడుగా కాక, సామాన్య మానవునికంటెను అతిహీనమైన స్థితిలో అనగా మత్తయి 8:20 నక్కలకు బొరియలును, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నను, మనుష్యకుమారునికి తలదాచుకొనుటకు స్థలము లేదన్న ప్రవచన రీత్యా - ఆయన ఈ లోకములో 2వ కొరింథీ 8:9లో వలె ''ఆయన ధనవంంతుడైయుండియు మీరు తన దారిద్య్రము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడైనట్లుగ వ్రాయబడిన ప్రకారము - సర్వసృష్టి నిర్మాణకుడును, సర్వసృష్టికి ఆధారసంభూతుడును, సర్వసృష్టిని భరించువాడును, సర్వసృష్టిని కల్గియున్నవాడైన మహాదేవుడే - నరులను తనలో ఐక్యపరచుటకు తాను నరునియొక్క దారిద్య్రమును వహించినట్లు - ఈ ఆత్మయొక్క ఐక్యతలోని వివరము మనకు బయల్పరస్తున్నది.
ప్రియపాఠకులారా! ఈ ఆత్మయొక్క ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కల్గిన వారెవరంటే నూతన నిబంధనలో కన్యకయైన మరియమ్మ, యేసుప్రభువు ఎంపిక చేసిన శిష్యకోటి, ఆ తర్వాత అపొస్తలులు, వేదసాక్షులు, హతసాక్షులు, పరిశుద్ధులైన విశ్వాసులు, వగైరాలు. వీరు ఈ ఆత్మయొక్క ఐక్యతను కాపాడుకొనుటలో శ్రద్ధ గల్గినవారు.
ప్రియపాఠకులారా! ఆత్మ కల్గించు ఐక్యతను కాపాడుకోవాలంటే మొట్టమొదటి అహము అన్న స్వభావాన్ని చంపుకోవాలి. తనవలె తన ఎదుటివానిని ప్రేమించాలి. పొరుగువారిని ప్రేమించే స్థితిలో ఎదగాలి. వినయ విధేయతతో సాత్వికముతో కూడిన స్వభావమును కల్గియుండాలి. ఇవి జరగాలంటే కలగాలంటే మొట్టమొదట ప్రేమ, రెండవది దీర్ఘశాంతము, ఇవి రెండును నరుడు సంపాదించుకోవాలి. ఇట్టి గుణసంపత్తి ఉన్నవానికే ప్రభువుయొక్క పిలుపుకు వీలుగల్గి యోగ్యత కల్గుతుంది. ప్రభువుయొక్క పిలుపునకు యోగ్యత గల్గి జీవించాలంటే పై గుణాలుండాలి. అందుకే రోమా 14:16 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదుగాని, నీతియు సమాధానమును, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై యున్నది,'' అని అనుటలో ఇందులోనే దైవత్వమన్నదేమిటో పూర్తిగా మనకు బోధపడగలదు. నరజీవితములో ఆత్మయొక్క ఐక్యత, ప్రభువుయొక్క సమాధానము అన్న బంధము. ఇవి రెండును నరుడు కాపాడు కోవాలంటే మొట్టమొదటగ ఆ విధముగా జీవించే వ్యక్తి శ్రద్ధ గల్గినవాడై, ఒక క్రమముతోను, ఒక నియమముతోను, ఒక ఆచారముతోను, అభ్యాసముగా వాటిని ఆచరిస్తూ - దైవసన్నిధిలో నిందారహితుడుగ ఉండాలి. సంఘములో మంచి సాక్ష్యము కల్గి యుండాలి. తన గృహ విషయములో తన ఇంటివారిని, తన క్రమములో తనయొక్క క్రమశిక్షణలో నడిపించు సామర్థ్యము కల్గినవాడై యుండాలి. దూషకుడుగా, దూషింపబడేవాడుగ ఉండకూడదు. విమర్శకుడు, విమర్శింపబడేవాడుగ ఉండకూడదు. ఇట్టివాడు భూమి మీద దేవునియొక్క సమాధానమును ధనముగా పొందినవాడై ఆయన ఆత్మతో ఐక్యత గల్గి, భూమి మీద తాను చేయు ప్రతి క్రియను నెరవేర్చుకొన శక్తిమంతుడైయుండి, ప్రతి విషయములో అనగా సమస్యగాని, ఏదైన చిక్కుగాని, వ్యాధిగాని, అనిర్వార్య సంఘటనగాని జరిగినప్పుడు తొట్రుపడక, తనకు కలిగినటువంటి ఈ వైపరీత్యమునుబట్టి ప్రభువుకు ప్రార్థన చేసి, ఆయన అనుగ్రహమును గూర్చి ప్రార్థనాపరుడై, తన చింతను ప్రభువునకు అప్పగించి, ఆయనయొక్క చిత్తము కొరకు ఎదురుచూడాలి. అలాంటివాడు భూమి మీద కదల్చబడడు. ఏ శక్తియు, ఏ జీవియు, ఏ నరుడును, ఏ ప్రభుత్వమును, ఏ ఉపద్రవమును అతనిని ఏమియు చేయలేదు. అతని జీవితము బండ మీద పునాది వేయబడిన గృహము వలె నిత్యమైనదిగ నిలచును.
.......
యిర్మీయా 7:5 వాక్య ప్రకారముగా మనుష్యులను ఆధారముగా చేసుకొని, డబ్బును అవకాశముగా చేసుకొని దైవ సేవ చేయువాడు వ్యర్థుడు. మనుష్యులు గుడికి రానీ, రాకపోయినను, ధనము వచ్చినను - రాకపోయినను గుడిలో ఆరాధన జరిగి తీరాలి. యెహోవాపై మనస్సు కల్గియుండవలెను. హాగరు సంతానమును దేవుడు ఆశీర్వదించుటలో కారణమేమి? వారి మసీదులలో ఆఫీసరు వచ్చినను దేవుని సముఖములో నిరుపేద తోడి ఆసీనుడు కావలసినదే గదా! వానికి ఏ విధమైన స్పెషల్ సీట్లు ఉండవు కదా! దైవసంబంధమైన ఐక్యత వారిలో కల్గియుండుట ప్రధానమైనది. ఒక క్రైస్తవుడు సులభముగా అన్యుడుగా మారవచ్చునుగాని, ఒక ముస్లిమ్ సులభముగా క్రైస్తవుడగుట కష్టము. ఒక ముస్లిమ్ స్త్రీ హిందువులతో సంబంధము కల్గియున్నను తన ఘోషాలో ఉండియే అవినీతిని ఆచరించునుగాని, ఘోషా వదలి వచ్చుటకు సాధారణముగా ఒప్పుకోదు. క్రైస్తవులు సంసారి బిడ్డలు, మహమ్మదీయులు సాని బిడ్డలు. సాని బిడ్డలను దేవుడు ఆశీర్వదించుటలోని కారణమేమి? సంసారి బిడ్డలు తాను తినరు ఒకరికి పెట్టరు, తాను బాగుపడడు, ఇంకొకరిని బాగుపడనీయరు. సంసారి బిడ్డలు పసికందుల నుంచి గొర్రెలను ఎత్తుకొని చాకుదురు, సంసారి బిడ్డలు అమ్ముదురు. సాని బిడ్డలు కొందురు. క్రైస్తవులు సులభముగా ఇతరులకు అమ్ముడుపోవుదురు. కాని మహమ్మదీయులు ఇతరుల చెంతకు తమ మతమును వీడి రారు. ఒక క్రైస్తవ స్త్రీ సులభముగ అన్యునికి లోబడును. వాడు దాని నుదిటిపై మత ముద్ర వేయును. పైగా మనమంతా ఒక్కటేలే, ఒకే తండ్రి బిడ్డలము,'' అని అబ్రాహాము పేరు చెప్పును. కాని క్రీస్తు పేరు చెప్పనివ్వడు గదా! అట్లు క్రీస్తు పేరుతో వచ్చిన స్త్రీని వాడు చెంతకు చేరనివ్వడు. దేవుని గౌరవించు పద్ధతులు సాని బిడ్డలకు అధికము. వారు ఉదయ మధ్యాహ్న సాయంత్రాలు క్రమము తప్పక దేవుని ఆరాధింతురు. వారికి ఉన్న ఆ ప్రత్యేకతనుబట్టి దేవుడు వారిని ఆశీర్వదించెను. క్రైస్తవులు తమ్మును తాము అమ్ముకుంటారు. మహమ్మదీయులు తమ్మును తాము సంఘ ఐక్యతతో సంఘ బలముతో కాపాడుకొంటారు. క్రైస్తవులు సంఘ భిన్నములు, పార్టీలు ఆధిపత్యముతో ఒకరికొకరు విరోధులుగా ప్రవర్తించుచున్నారు. అందుకనే ముస్లిమ్‌లు చేయు ఫలావు శ్రేష్టమైనదని పేరు వచ్చింది. ఆ ఖ్యాతి వారికే దక్కింది. వీరు అమ్ముదురు - వారు కొందురు. పరిశుద్ధ బలిపీఠము యొద్దకు చెప్పులు కాళ్ళతో పరుగెడువారు ఫాదరీలు. పరిశుద్ధ మందిరములో పాదరక్షల రహితముగా ప్రవేశించువారు మహమ్మదీయులు. వారు దేవునికి ఇచ్చు గౌరవమునుబట్టి వారిని విశేషముగా దేవుడు ఆశీర్వదించి యున్నారు. వారు చేయు పరిశుద్ధ బలి ''ఫలావు'' కూడా ఆశీర్వదించబడి ప్రఖ్యాతి చెందింది.
........
అంశము :- బలహీనత 2వ కొరింథీ 12:9-10, ''నా కృప నీకు చాలును బలహీనతయందు నా శక్తి సంపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందు బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను.''
ప్రియపాఠకులారా! బలహీనతన్నది ప్రతి జీవిలోను, ప్రతి వ్యక్తిలోను, సృష్టములలోను, పంచభూతాలలోను తుదకు గ్రహనక్షత్రాదులలోను, వాతావరణంలోను, జలరాసులలోను, వాయుమండలములోను, ఆకాశమండలములోను, వీటికన్నిటికిని మూలకర్తయైన సృష్టికర్తయైన దేవునిలో కూడా బలహీనతన్నది క్రియ జరిగించిన విధానము కోకొల్లలుగా ఉన్నవి.
ప్రియపాఠకులారా! దేవుడు సృష్టిని బలహీనముగా రూపించలేదు. ఆలాగే సృష్టిలోని నరుని సృష్టిని ఏలే నరుని కూడా బలహీనునిగా రూపించలేదు. బలహీనతన్నది ఆదిలో భూమ్యాకాశాలు రూపించక మునుపు భూమి నిరాకారముగాను, శూన్యముగాను చీకటి అగాధ జలములను కమ్మియున్నట్లుగా ఆది 1:1-2లో మనము చదువగలము. నిరాకారము అనగా ఆకారము లేకుండ స్వరూప అలంకారాలు లేకుండ ఎలాంటి సృష్టములతో అలంకరింపబడక చీకటి గాఢాంధకారముతో కూడింది. ఇది మహాభయంకరమైన బలహీనత, సుస్థిరమైన సుదీర్ఘమైన బలహీనత, ఏ శక్తి వలన బాగుపడని బలహీనత, ఏ వ్యక్తి బాగుపరచలేని బలహీనత.
కనుక ప్రియపాఠకులారా! ఈ బలహీనతన్నది భూమ్యాకాశాలకు పునాది ఏర్పడక ముందే ఆదికాండము 1:లో ప్రధమ పాదములోనే దైవవాక్యము వెల్లడిపరస్తున్నది. ఇది బలహీనతనుగూర్చిన మొట్టమొదటి వివరణ. ఈ బలహీనతలు మూడు మండలాల్లో ఏకబిగిని క్రియ జరిగించినట్లుగా - ఈ బలహీనత యొక్క ఆధిక్యతలు, ఈ బలహీనత త్రివిధమై ఒకదానికొకటి అలముకొని ఉండి ఎవరును విడదీయని ఈ బలహీనతలు ఒకదానిలో నొకటి గుప్తమై, ఎవరును కనుగొనకుండ, గాఢాంధకార చీకటి కమ్మి యున్నట్లు అనగా మూడు మండలాల్లో ఒకదానిలోనొకటి ఉన్న బలహీనత ఎవరికిని తెలియని స్థితిలో గాఢాంధకారంతో కప్పియున్నట్లుగ ఆదికాండము 1:1-2లో చదువగలము. మొదటి బలహీనత భూమి నిరాకారముగాను, శూన్యముగా ఉండుట, రెండవ బలహీనత ఈ నిరాకార శూన్య భూమిని అగాధ జలము కప్పెను. ఇవి రెండును చేరి ఆకాశమును కూడా ఆవరించి ఆకాశము, జలములు, భూమి మూడును బలహీనతలలో ఏకత్వము కల్గియున్నట్లును, ఇట్టి బలహీనతలో ఉన్న ఈ త్రిమండలాలు అనగా ఆకాశము, భూమి, జల మండలాలు ఒకే స్థితిలో ఒకే అనారోగ్యమునకు అనగా బలహీనతలో కలుషిత వాతావరణములో బలహీనమై యుండగా శక్తివంతమై బలపరచుటకు దేవుని ఆత్మ ఈ బలహీనమైన త్రిమండలాల పైన సంచరించుచు అల్లలాడినట్లు చదువగలము. ఇది ఆది 1:2లో దైవాత్మ జలముల మీద అల్లలాడుచుండెను. ఎందుకు అల్లలాడినట్లు? ఈ మూడింటిలో ఉన్న బలహీనతలను తొలగించి, ఒక దాని నుండి మరొక దానిని విభాగించి, ఒక్కొక్క దానికి ప్రత్యేకమైన బలాన్ని, శక్తిని, జీవాన్ని, ఆధిక్యతలను అనుగ్రహించుటకు దేవుడు మొట్టమొదటగ ఈ మూడు మండలాలపై కప్పినట్లును, చీకటి తెరను తన వాక్కు, వెలుగుతో తొలగించాడు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగాయెను.'' ఇది ఆ వాక్యములోని వివరణ. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును, చీకటిని వేరుపరచెను.
ప్రియపాఠకులారా! బలహీనతలో ఉన్నటువంటి పదార్ధానికి వెలుతురు అవసరము. వెలుతురు లేనిదే మనము చేసే పనులు అర్థము కాదు. మనకు కనుదృష్టి కూడా పని చేయదు. ఈ యొక్క సందర్భములో దేవుడు తన వెలుగు ద్వారా తాను రూపించదలచిన ఈ అనంత విశ్వము యొక్క ప్రణాళికకు పథకాన్ని వేసుకొని, ఆ పథకము ననుసరించి 1:6-8 వ్రాయబడిన వేదభాగములో జలములలో ఉన్న భూమ్యాకాశములు ఒక దానితో నొకటి విభజించబడి ఆకాశము భూమిని దైవ వాక్శక్తి వేరుపరచగా ఆ ప్రకారము క్రింది జలములు - మీది జలములు విభజింపబడి విభాగింపబడిన జలములకు ఆకాశమని, క్రింది జలములకు సముద్రములని పేరు పెట్టినట్లును, అలాగే 19:లో ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమైనట్లును ఆరిన నేలకు భూమియని, జలరాశికి సముద్రములని దేవుడు పేరు పెట్టెను - అది మంచిదని దేవుడు చూచినట్లు లేఖన భాగము వివరిస్తున్నది. ఈ విధముగా మూడు మండలాలను విభజించి, వాటిని తన ప్రణాళికలో భాగస్వాములుగ వాటి బలహీనతల నుండి విడిపించి వేటికవి ప్రత్యేకించబడినట్లు దేవుడు క్రియ జరిగించినట్లు ఈ వేదభాగములో తెలిసికొనియున్నాము.
ప్రియపాఠకులారా! ఆకాశము, భూమి, జలములు విభజింపబడినను మూడు నిర్జీవములే. మూడు చలనము లేనివే అనగా నీటిలో ఏ విధమైన కదలికలుగాని, చలనయుతమైన సముదాయములు లేవు. జలములున్నవి - జీవము లేదు. ఆకాశములో సృష్టములు లేవు, భూమిలోను లేవు. వేటికవి బలహీనతలనుబట్టి నిర్జీవములై దైవసముఖములో నిలిచియున్నవి. అయినను ఇవి బలహీనములే.
ప్రియపాఠకులారా! మొట్టమొదట శూన్యము నిర్జీవము బలహీనములైయున్న భూమిపై దృష్టిని క్రోడీకరించి 1:11-12లో జరిగించిన క్రియ. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, ఫలవృక్షాలను భూమి మొలిపించును గాక! ఆ ప్రకారమాయెను అది మంచిదని దేవుడు చూచెను. దేవునియొక్క ఈ వాక్కునుబట్టి భూమిలో ఉన్న బలహీనత తొలగి, భూమి జీవము గలదై ఫలవంతము, సారవంతము బలవంతమైనది చలించునదియునై దేవుని వాక్కును బట్టి దైవమహిమను, తనలో దేవుడు రూపించిన సృష్టముల ద్వారా దైవత్వమును మహిమపరచింది. దైవవాక్కును నెరవేర్చింది. దైవప్రణాళికకు దోహదకారియైనది, దైవచిత్తమును సఫలీకృతము చేసింది. ఈ విధముగా భూమి యొక్క బలహీనత తొలగి, దైవవాక్శక్తిని బట్టి బలవంతురాలై మరొక లోకమునకు నాంది పల్కింది. అనగా భూలోకములో అవతరించింది.
ఇక ఆదికాండము 1:14-18 చదివితే ఈ ఆకాశ మండలమున దేవుడు పగలు రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలము నందు జ్యోతులు కల్గును గాక అని పల్కుచు, అవి దిన సంవత్సరములను సూచించునవిగా ఉండును గాక అని పల్కి భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికి, ఆ ప్రకారముగా దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రాలను చేసినట్లును, భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని, రాత్రిని ఏలుటకును వెలుగు, చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను, అది మంచిదని దేవుడు చూచెను. ఇందునుబట్టి ఆకాశానికి వాక్శక్తి ద్వారా బలహీనత వదలి, ఆకాశము ప్రజ్వరిల్లి, దైవవాక్కు ద్వారా ప్రకాశమానమై సూర్యచంద్ర నక్షత్రాదులు ఏర్పడుటకు దోహదకారియైనట్లును, ఆకాశము కూడా బలమును, శక్తిని పుంజుకొని దేవుని మహిమను వెల్లడిపరచినట్లును, రాత్రి, పగలు అనే కాలములు ఏర్పడుటకు ఆకాశము దోహదకారియైనట్లును, భూమి మీద వెలుగిచ్చుటకు జీవరాసులకు ఉపకారులుగా ఉండుటకు దేవుడు ఆకాశములో జరిగించిన క్రియ, ఆకాశానికేగాక వాతావరణానికిని, ఆకాశములోని జ్యోతులకును బలాధిక్యతలు కల్గినట్లుగ ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది. దేవుడు ఇచ్చే బలము, శక్తి మొట్టమొదట ప్రకృతి సంబంధముగా - సృష్టి సంబంధముగా ఇచ్చే శక్తిని గూర్చి ధ్యానించుకొందము.
దేవుడు భూమ్యాకాశాలకు జలాలకు స్వయంభవ శక్తి, బలము, స్వయంభవ ఉత్పత్తి అనగా స్వయముగా సృష్టములను, ప్రభావమును, శక్తిని అనుగ్రహించినట్లుగానే వాటిని బలహీనపరిచే మరియొక శక్తి ఆయనలో ఉన్నట్లు కొన్ని సందర్భాలనుబట్టి తెలిసికొందము. అనగా ఒకదానిని బలహీనపరచుటకు మరొకదానిని శక్తివంతము చేసి క్రియ జరిగించాడు. ఆదికాండము 1:లో శక్తిని అనుగ్రహించిన ఆరు దినముల క్రియ ద్వారా దేవుడు అనుగ్రహించిన శక్తి ప్రకటిస్తున్నది. దేవుడు భూమికిని, జలములకు వాటిలోనుండి పుట్టించుటకు స్వయంభవమును అనుగ్రహించాడు. స్వయంభవత్వమన్నది దేవునిలో ఉంది. మొట్టమొదటగా భూమ్యాకాశములు జలములకు అనుగ్రహించాడు - ఇది ఆదికాండము 1:లోని వివరణ. ఈ విధమైన అవకాశములో మూడు విధములైన మండలాలు బహుగా బలాధిక్యతలను దైవవాక్కు చేత పొంది, భూమి జంతుజాలములను, వృక్షజాలములను, పక్షి జాతులను, నానావిధ కీటక రూపాలను రూపించి, వాటికి కావలసిన ఆహారము, వృక్షములు, గడ్డి, ఫలవృక్షాలు, నానావిధమైన రీతులలో అనుగ్రహించినట్లును, బహుగా ఫలించి భూమి మరొక లోకముగ అనగా భూలోక స్వర్గముగా దైవత్వాన్ని అలరించినట్లును, ఈ ఆదికాండము 1:లోని వేదభాగము ద్వారా మనము తెలిసికొంటున్నాము. ఎలాగంటే అది మంచిదని చూచెను అని వ్రాయుటనుబట్టి దేవుడు సృష్టించిన ఈ అనంత విశ్వముయొక్క రూపము మంచిదిగానే శక్తివంతమైనది, శాంతమైన ఆహ్లాద తేజోమయమైనదై, దైవత్వానికి యోగ్యమై, దైవత్వాన్ని మహిమపరిచేదిగా ఆదికాండము ఒకటి రెండు అధ్యాయాలలో నాటి జలములు భూమి ఆకాశ మండలములయొక్క చరిత్రలు వివరిస్తున్నవి.
ప్రియపాఠకులారా! ఆ విధముగా దైవత్వము జరిగించిన దానిని బట్టి ఆయనను మహిమపరచిన ఈ త్రిమండలాల భవిష్యత్తు నరునియొక్క హృదయ ఆత్మీయ స్థితి మీద ఆధారపడియున్నట్లు గ్రహించాలి. అంటే ఈ మూడు లోకాల బలాధిక్యతలకు మూలము దేవుని జీవాత్మతో రూపించిన నరుని దేహము అన్న సంగతి గ్రహించాలి. హృదయస్థితిని బట్టి ఈ ముల్లోకాల భూతతద్దర్మ కాలములు ఆధారపడియున్నవి. ఆ విధముగా ఆధారపడిన మూలాన్ని కాలచరిత్రకు దేవుని జీవాత్మలో భాగస్వామియైన నరజంటయే అన్న సత్యాన్ని తెలిసికోవాలి. ఎందుకంటే దేవుడు భూలోకాన్ని తనకని ఏర్పరచుకొని, మరొక లోకాన్ని చేయుటలో తన పోలిక తన రూపములో రూపించబడిన నరులు మరొక లోకానికి తన వలె దూతలుగ వ్యవహరించాలి. దేవదూతలకంటె అత్యధికముగా దైవప్రేమకు యోగ్యులు కావాలి. దైవప్రేమలో దైవత్వమునకు యోగ్యులై దైవత్వానికి విధేయులుగ వారి జీవితాలను మలచుకోవాలి - ఇది దైవోద్దేశ్యము. అంతేగాని దేవుడు లోకాలను తన కొరకు సృష్టించుకొన పనిలేదు. ఇంతకును నరుల కొరకు సృష్టించియుండగా నరుని యొక్క ఆత్మీయస్థితి నారియొక్క హృదయస్థితి బలహీనపరచబడినవై యైనందున నిషేధ ఫలము భుజించి, దైవ ఆజ్ఞాతిక్రమము చేసి బలహీనమైనందున - ఆ విధముగా అలౌకిక శక్తి ద్వారా బలహీనపరచబడినందున నరుని బలహీనతకు సంతాపపడి దేవుడు ఉగ్రుడై తాను ఏయే లోకాలను బలాధిక్యతలతో సృష్టించాడో వాటినన్నిటిని బలహీనపరిచాడు. మొట్టమొదట బలహీనత నరుని మీదను, ఆ తర్వాత నరుని కొరకు సృష్టించిన ముల్లోకాలకును - ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టి యావత్తుకును వినాశముతో కూడిన బలహీనతకు కారణము నరుడే. ఇందునుగూర్చి దేవుడు నరులను, నాశన మార్గములో నడిపించిన సర్పమును, నరులను రూపించబడిన భూమిని, ముగ్గురికి తీర్పు దీర్చి శాపగ్రస్థులయ్యారు.
ఇందులో మొదటగా ఆది 3:9లో ఈ విధముగా నరుని గూర్చి చేసిన విచారణలోని మాటలను గూర్చి ముందుగా తెలిసికొందము. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి - నీవు ఎక్కడ ఉన్నావనెను. నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని,'' అనుటలో ప్రియపాఠకులారా! మొట్టమొదట నరునికి గల్గిన బలహీనత భయము. ఆ వరకు భయమన్నది లేదు. 2. తాను దిగంబరియని తెలిసికొనుట బలహీనతయే. అందుకు దేవుడు అంటున్నాడు - నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలాలు తింటివా? అందుకు ఆదాము - నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఆ స్త్రీయే వృక్షఫలములు కొన్ని నాకియ్యగా తింటిననెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో - నీవు చేసిన పని ఏమిటని అడుగగా స్త్రీ - సర్పము నన్ను మోస పుచ్చినందున తింటిననెను'', అనగా పురుషుని బలహీనతకు కారణము స్త్రీయే, స్త్రీ బలహీనతకు కారణము సర్పము. ఆ విధముగా ముగ్గురి బలహీనతలను గూర్చి తీర్పు దీర్చుచు శాపముతో కూడిన తీర్పు మొట్టమొదట సర్పానికి విధించిన తీర్పు ''నీవు దీని చేసినందున భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానవై, నీ కడుపుతో ప్రాకుచు, నీవు బ్రతుకు దినములన్నియు మన్ను తిందువు,'' మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును, ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను.'' ఆయన స్త్రీతో నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు. నీ భర్త యెడల నీకు వాంఛ కల్గును, అతడు నిన్ను ఏలును. ఆ తర్వాత ఆయన పురుషునితో - నీవు నీ భార్య మాట విని - తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలాలు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడియున్నది. ప్రయాసముతోనే - నీవు బ్రతుకు దినములన్నియు దాని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి - నీవు మన్నే గనుక తిరిగి మన్నయి పోదువు. భూమికి ఇచ్చిన రెండవ శాపము ఆది
4:10-12 నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర పెట్టుచున్నది. కనుక నీవు శపించబడినవాడవు. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. ఇది భూమియొక్క బలహీనత - నీవు భూమి మీద దిగులుపడుచు దేశద్రిమ్మరివై యుందువు. ఇది నరునికి విధించిన మరొక బలహీనత.
ఈ విధముగా ప్రియపాఠకులారా! ఈ బలహీనతలు నరులకు విధించాడు. నరునిబట్టి సృష్టికిని విధించిన బలహీనత - ఏయే రీతులుగా ఏ సందర్భాలలో ఏ విధముగా క్రియ జరిగించిందో మనము తెలిసికోవలసియున్నది. ఆది 6:లో మొట్టమొదట తాను రూపించిన యావద్ సృష్టికిని మూలకారకమైన భూమికిని సృష్టికిని కల్గించిన ఘోరాతిఘోరమైన బలహీనత ఆది 6:లో నేను సృజించిన నరులను - నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశపక్షులను, భూమి మీద నుండకుండ తుడిచి వేయుదును,'' అని నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఇది దేవుడు మొట్టమొదటగ సృష్టి మీద అమలుపరచిన బలహీనతలోని ప్రధమాంశము. ఈ బలహీనత అమలు జరుపబడిన విధము. ఆది 7:17-24 ఆ జల ప్రవాహము నలుబది దినములు భూమిమీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. ఆ ప్రచండ జలములు ప్రబలి మిక్కిలి విస్తరించినందున గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త నరులేమి చచ్చిపోయిరి. దేవుడు తన సృష్టిని, తాను రూపించిన సమస్తమును బలహీనపరచిన విధానము. ఈ విధముగా నిరాకారమును, నిరుపయోగమును, శూన్యమునైన ఈ అనంత విశ్వమునకు మరల బలమును అనుగ్రహించబడుటకు దేవుడు జరిగించిన మూలము నోవహు ఓడ. తానెన్నుకున్న నీతిమంతుని కుటుంబములో ఎనిమిదిమందిని పునఃసృష్టికి అనుగ్రహించాడు. అనగా లోకానికి ఉన్న బలహీనతను తొలగించాడు. ప్రియపాఠకులారా! ఈ విధముగ పునఃశక్తిని పొందిన ఈ అనంత విశ్వమునకు విస్తరించిన జనమునకు కారకుడు కూడా దేవుడే. ఆయన వాగ్దానము, ఆయన వాక్శక్తి, ఆయన ప్రభావము, ఆయన అనుగ్రహమే అని మనము గ్రహించక తప్పదు.
ప్రియపాఠకులారా! బలహీనతన్నది దేవుని ద్వారా కల్గింది కాదని బలహీనతకు కారణము నరుని యొక్క స్వభావము అని, బలహీనతకు కారణము భూమియొక్క ఆకర్షణయని, నరునియొక్క అజ్ఞానమని నరుడు గ్రహించిన నాడు నరుడు బలహీనుడు కాడు. ఈ సత్యాన్ని గ్రహించక అహంభావముతో కండ్లు పూడుకొని పోయినప్పుడు నరుడు చేసే ప్రతి పని కూడా బలహీనమైనదే. దేవుడు సృష్టించే బలము, శక్తి అన్నది దేవుడు పుట్టించే ప్రకృతి భీభత్సము అనగా తుఫాను, భూకంపము, హిమపాతము, సుడిగాలులు, పిడుగు, వికృత వాతావరణము, సముద్ర పొంగు, చిత్రవిచిత్రమైన తెగుళ్ళు, అతివృష్టి, అనావృష్టి, వేడిగాల్పులు, వగైరాలన్నియు కూడా దేవుడు ప్రకృతికి అనుగ్రహించే బలాధిక్యతలు. లోకాన్ని శిక్షించేందుకు తన సృష్టములను దేవుడు వాడుకొనును. వాటిని ఎదుర్కొనుటకు ఏ నరుడు సాహసించలేడు. ఏ నరుని జ్ఞానము వీటి ముందు పనికిరాదు. తుఫానును రానీయకుండ జేసే నరుడున్నాడా? పిడుగు పాటు రానీయక, సుడిగాలికి కదల్చబడని నరుడున్నాడా? సముద్ర అలకు కదర్చబడని నరుడున్నాడా? సముద్ర అలను ఎదుర్కొనే నరుడున్నాడా? వరదలలో కొట్టుకుపోకుండ నిలబడగలిగే నరుడున్నాడా? భూకంపములో శిధిల భూమి చేత మ్రింగి వేయబడని నరుడున్నాడా? శిధిలముగాని పట్టణమున్నదా? ఆకాశము నుండి వడగండ్లు పడునప్పుడు చావని నరుడున్నాడా? దేవునియొక్క బలాన్ని ఎదుర్కొని పోరాడగల్గిన నరుడున్నాడా? కనుక నరుడు బలహీనుడే. దేవుడే బలవంతుడన్న సత్యాన్ని గ్రహించి, ప్రియపాఠకులారా! దేవుడు బలవంతుడైనట్లుగా ఆయన నరులకు కూడా బలాధిక్యతలు ఇచ్చియున్నాడు. తనతో సమానమైన యోగ్యతలు నరునికి కూడా ఇచ్చినట్లు వేదరీత్యా కొన్ని సంఘటలనుబట్టి తెలిసికొందము. ఆది 5:23 హానోకు దేవునితో నడిచినాడంటే దైవశక్తి, దైవబలము, దైవసావాసము, ఐక్యత దైవత్వాన్ని అనుసరించుట, దైవత్వమునకు యోగ్యత గల్గి నడుచుకొనుట, ఇన్ని విధములైన సద్గుణ సంపత్తి ఉండబట్టే దేవుడు తనను చెయ్యి పట్టి నడిపించే బలాధిక్యతలను పొందగల్గినాడు. ఈ విధముగా దైవశక్తిని బలాన్ని, స్వభావాన్ని ధరించుకొన్న హానోకు దేవునితో నడుచుటయేగాక లోకానికి కనుమరుగయ్యాడు. ఇది దేవుడు హానోకుకు అనుగ్రహించిన శక్తి, బలము, ప్రభావము.
ప్రియపాఠకులారా! ఈ విధముగా దైవసన్నిధిలో నరుడు బలాన్ని శక్తిని పొందుటలో - ఆదిలో నరుడు దేవుడనుగ్రహించిన బలాన్ని, శక్తిని కోల్పోయి కేవలము స్వజ్ఞానము, స్వయంకృషి, స్వశక్తి మీద ఆధారపడే స్థితి ఏర్పడింది. ఈ విధముగా దైవశక్తిని కోల్పోయిన నరునిలో ఏర్పడిన బలహీనతలు, 1. ఆత్మ బలహీనత - ఈ ఆత్మ బలహీనత దేవునితో నరునికున్న ఆత్మీయ బంధము, సావాసము, సహజీవనము, వగైరా ఉన్నత విలువలను ఆత్మ బలహీనతనుబట్టి నరుడు కోల్పోయాడు - ఇది ఆత్మీయ బలహీనత ద్వారా నరునికి కల్గిన అనర్ధాలు. ఈ విధముగా ఆత్మీయ బలహీనుడైన నరునిలో శారీర సంబంధముగా కొన్ని బలహీనతలున్నట్లుగా లోకరీత్యా కొన్ని విషయాలను గూర్చి తెలిసికొందము.
1. దేహ బలహీనత, దృష్టి బలహీనత, నరాల బలహీనత, ఎముకల బలహీనత, రక్తహీన బలహీనత, రోగము ద్వారా సంక్రమించిన బలహీనత, గుండె బలహీనత, జ్ఞాన దృష్టి బలహీనత, వగైరా బలహీనతలు దేహ సంబంధముగా కలిగియున్నవి. అందుకే దైవకుమారుడు క్రీస్తు మనలను బలవంతులుగా చేయుటకు ఆయన బలహీనుడైనట్లును, మనలను బలవంతులుగా చేసినట్లు వేదములో మత్తయి 8:17లో ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగమును భరించినట్లు చదువగలము.
ప్రియపాఠకులారా! కొందరి జీవితాలలో ఇట్టి స్థితి బాహాటముగా క్రియ జరిగిస్తూ కొందరి చరిత్రలు వేదరీత్యా జ్ఞాపకము చేసికొందము. పాత నిబంధనలో ప్రయాణ సాధనాలు, వాహనాలు లేని ఆ యుగములో ఒక ఊరి నుండి మరియొక ఊరు, ఒక దేశము నుండి మరొక దేశానికి ప్రయాణించే వ్యక్తులు పాదచారులుగా నడిచినట్లు వేదములో చదువగలము. ఇందుకు ఉదాహరణగా ఇశ్రాయేలు జనాంగము. నలుబది సంవత్సరాలు మోషేతో కూడా చేసిన సంచార జీవితములో కాలి నడకలో వారి ప్రయాణములో వారి ఇహలోక జీవితములో - వారిని బలవంతులుగా నడిపించినవాడు దేవుడే. ముందు వెనుక దైవశక్తి ఆవరింపగా ఆ శక్తితో ప్రయాణము చేసినట్లు చదువగలము. ఇందుకు సంబంధించిన కొన్ని వేద ప్రవచనాలు కీర్తన 23:1 యెహోవా నా కాపరి - నాకు లేమి కలుగదు.'' ఇది నరునియొక్క ఇహలోక జీవితములో ఆత్మీయముగా శారీరకముగా మానసికముగా వ్యవహారికముగా - సమస్త సందర్భాలలో సంబంధించిన మాట అనగా యెహోవా యొక్క కాపుదల ఉన్న వ్యక్తికి ఆర్థిక లోటుగాని, ఆరోగ్య లోటు చింతగాని, భయముగాని, రోగముగాని, దారిద్య్రముగాని, సమస్యలుగాని, ప్రమాదాలుగాని, ఏవియు సంభవించవని ఇందులోని భావము. కారణము 23:4 ''నీవు నాకు తోడైయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును,'' అన్న మరొక ప్రవచనమున్నది. ఈ దుడ్డుకర్ర ఆయన యొక్క కాపుదల, దండము ఆయన వాక్యము. కనుక దండము, దుడ్డుకర్ర మనకు సహాయకారులుగా ఉన్నంత కాలము ఏ అరిష్టము కలుగదని భావము. అంతేగాకుండ నరునికి దేవుడు అనుగ్రహించిన బలమైన ప్రభావితమైన ప్రకాశమానమైన శక్తివంతమైన నడుపుదలనుగూర్చి ఈ విధముగా వ్రాయబడియున్నది. కీర్తన 121:8 కొండల తట్టు నా కన్ను లెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమ్యాకాశాలను సృజించినవాడు. ఆయన నీ పాదాలను తొట్రిల్లనియ్యడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు,యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును.''
ప్రియపాఠకులారా! ఇది దైవిక సంబంధ శక్తితోను, బలముతోను కూడిన అభయము. ఇది నరునియొక్క శారీర ఆత్మీయ ఉభయములకు దేవుడు ఇచ్చిన అభయము. దైవత్వమునకు దూరమై దైవజ్ఞానమును కోల్పోయి, దైవత్వము మీద విశ్వాసము లేక లోకము మీద ఆశతో లోకసంబంధిగా మారిన వ్యక్తికి పై వివరించబడిన వాటిలో ఏదియు జరుగవని ఇందునుబట్టి మనకు తెలియుచున్నది.
ప్రియపాఠకులారా! మన బలహీనతలు, కష్టనష్టాలతో మన సమస్తములలోను, మన ప్రతి అవసరతలోను మనకు బలమును, శక్తిని, సహాయ సహకారమును, శాంతి సమాధానమును అనుగ్రహించుటకు శక్తిమంతుడు దేవుడేయని మనము గ్రహించాలి. అయితే దేవుడు తాను మాత్రమే గాక తన కుమారుని ద్వారా మనలో ఉన్న దోషాపరాధముతో కూడిన బలహీనతలు సమూలముగా తొలగించుటకు తన కుమారుని ఈ లోకానికి పంపి, మన బలహీనతలు ఆయన మీద మోపి, మనము పొందవలసిన మరణశిక్షను ఆయనకు విధింపజేసి, ఆయన పునరుత్థానము ద్వారా మనలను బలవంతులుగాను, శక్తిమంతులుగాను చేయుటకు క్రియ జరిగించుట యేసుక్రీస్తు జన్మ ద్వారా ఇది అతి నిగూఢమైన దైవిక మర్మమని మనము తెలిసికొనియున్నాము.
కనుక ప్రియపాఠకులారా! ఈ బలహీనతన్నది మొట్టమొదట ఏదెనులో ఆత్మ శారీర సంబంధముగా ప్రారంభించబడి, భూలోకము అంతటికిని ఈ బలహీనతలు అను జాడ్యము విస్తరించి, నానావిధాల క్రియ జరిగించినట్లు చాలా వరకు మనము నేర్చుకొన్నాము. లోకాన్ని పరిపాలించే ప్రభుత్వాలు కూడా బలహీనమగుచున్నవి. లోకానికి వెలుగిచ్చే సూర్యుడు మబ్బు తెరల ద్వారా కప్పబడి వెలుగు బలహీనపడుచున్నది. అలాగే చంద్రుని ద్వారా కూడా కొన్ని బలహీనతలు మనము చూస్తున్నాము. పగటి పూట సూర్యుని వెలుగునకు కోటానకోట్ల నక్షత్రాలు తమ కాంతిని కోల్పోయి బలహీనమగుచున్నవి. బలహీనతన్నది నేటి నవనాగరిక యుగములో విజ్ఞానము మూడు పువ్వులు ఆరు కాయలుగ విస్తరించిన ఈ కాలములో - నరుని జ్ఞానము సాంకేతికపరముగా శాస్త్రపరముగా వెర్రితలలు వేసి బలసిందేగాని బుద్ధి బలము లేదు. ఎంత జ్ఞానికైనను బుద్ధి మాత్రము బలహీనముగానే ఉన్నది. ఎలాగంటే చిత్ర విచిత్రమైన మారణాయుధాలు కనిపెట్టే శాస్త్రజ్ఞుడు బుద్ధి విషయములో బలహీనుడే. ఎందుకంటే నర జీవితాన్ని పాడు జేయుటకు తన శాస్త్ర జ్ఞానాన్ని వినియోగించువాడు బుద్ధిహీనుడుగాక మంచివాడా?
కనుక ప్రియపాఠకులారా! ఈ విధముగా బలహీనతన్నది నేటి దినాలలో నరుని దేహస్థితిలోనే బహిరంగముగా బట్టబయలగుచున్నది. నేటి జనబాహుళ్యములో విస్తరించిన రోగాలు, జబ్బులు, లోక వైద్యునికి అతీతమైయున్నవి. ఇది నరునియొక్క బలహీనత కాదా? కనుక ప్రియపాఠకులారా!
2 కొరింథీ 12:10, ''నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కల్గిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను,'' అని అనుటనుబట్టి ప్రియపాఠకులారా! మన ఇహలోక జీవితములో మన బలహీనతన్నది క్రీస్తు నిమిత్తమైనదిగ ఉండవలెనుగాని, అనగా క్రీస్తు నిమిత్తము రోమా 12:1 కాబట్టి సహోదరులారా! పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరాలను ఆయనకు అప్పగించుటయే ఈ బలహీనత, అనగా లోకసంబంధమైన భోగభాగ్యాలు చంపుకొని వాటిని ఆశించక పదవులు, వెండి, బంగారాలు, వగైరాలు. ఈ విధముగా లోకసంబంధమైన బలాధిక్యతల నుండి విడుదల పొంది, క్రీస్తుయొక్క బలహీనతలలో పాలివారమై మనము జీవిస్తే - ఆయనయందు సంపూర్ణములమై ఆయనయొక్క ఆత్మీయ ఆనందములో పాలివారమై జీవించగలమని ఇందునుబట్టి మనము గ్రహించాలి.
కనుక ప్రియపాఠకులారా! క్రీస్తు సంబంధులుగ పరిశుద్ధాత్మ చేత బలపరచబడి, అనగా పరిశుద్ధాత్మలో బలవంతులమై, శక్తివంతులమై, లోకముతోను దాని ఇచ్ఛలతోను, దాని సంబంధమైన ఆశయాలతో వ్యతిరేకముగా పోరాడి, జయవీరులుగా ఉండుటకు లోకములో మన ఇహలోక జీవితాన్ని సార్థకము చేసికొందముగాక! ఆమేన్.
బలహీనత వల్ల కల్గిన ఫలితాలు :- బలహీనత దేవుని యొద్ద లేదు, సృష్టిలో లేదు, పంచభూతాలలోను బలహీనత లేదు, దైవరాజ్యములోను లేదు. బలహీనతన్నది ఏమిటో దేవదూతలు కూడా ఎరుగరు. ప్రియపాఠకులారా! మరెక్కడ లేని ఈ బలహీనత యావద్ సృష్టికి సంక్రమించింది. సృష్టికర్తయైన దేవుడు ఈ బలహీనతలో పాలివాడగుటకు కారణము ఈ బలహీనత లోకములో క్రియ జరిగించిన కారణాలు వగైరాలను గూర్చి ఈ సందర్భములో కొంత తెలిసికొనుట అవసరము. పై వివరించిన బలహీనతలకన్నిటికి కారకుడు దేవుడు కాడు, సృష్టి కాదు - సృష్టములు కాదు. బలహీనతలకు మూలకారకుడైనవాడు నరుడేయని మనము ఒప్పుకోక తప్పదు. అందుకే యేసుప్రభువు గెత్సెమనెలో చివరిగా ఆచరించిన ప్రార్థనా సావాసములో మత్తయి 26:41లో దైవకుమారుడైన ప్రభువు మాట్లాడిన మాట ''మీరు శోధనలో ప్రవేశించకుండునట్టు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పెను.'' కనుక బలహీనతన్నది శరీరానికి పరిమితమై శరీర సంబంధమై యున్నట్లును, కనుక శరీరమన్నది తన బలహీనతలో ఆత్మను కూడా తనతోబాటు బలహీనపరచుటకు క్రియ జరిగిస్తున్నట్లుగా గ్రహించాలి. దైవసన్నిధిలో నరుని బలహీనతన్నది పంచభూతాలను బలహీనపరచింది. ఏదెను వనమును బలహీనపరచింది. గ్రహాలను బలహీనపరచి, వాతావరణాన్ని కలుషితము చేసి బలహీనపరచింది. సర్వలోకాన్ని బలహీనపరచింది. ఇది లోకము యొక్క అభివృద్ధిని బలహీనపరచింది. అనగా భూమి తనకున్న సారము కొల్పోయి, నరుల మీద ఆధారపడి కృత్రిమ ఎరువులతో ఫలించే బలహీనతకు దిగజారింది.
ప్రియపాఠకులారా! అంతేగాకుండ సముద్రములో ఏర్పడే తుఫాను, దాని శక్తి, ప్రభావము, దాని వేగము, దాని సంచారము, అది సృష్టించే భీభత్సము అనగా భీకర అలలతో కూడిన ఉప్పెన, తీర ప్రదేశాలను జలమయము చేయుట, ఊళ్ళ మీద పడి సృష్టించే నష్టము, మారణహోమమును గురించి మనము లెక్క వేస్తే చాలా తీవ్రముగా ఉంటుంది. ఉరుములు, మెరుపులు, గాలితో కూడిన గాఢాంధకార చీకటి ఇవన్నియు భీకర వాతావరణముగా మారినను, ఇది కూడా బలహీనపడిపోతుంది. అలాగే భూకంపము కూడా ఎప్పుడును ఒకే రీతిలో కాకుండ భూమిని ప్రకంపనము చేసి బలహీనపడుతుంది. ఇది పంచభూతాల బలహీనత. అయితే నరుని బలహీనత వాని హృదయ అంతఃకరణ, బలహీనతల నుండి దేవుడు ఆయన కుమారుడైన క్రీస్తు - ఆయనకు రూపమిచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు వీరివల్ల తప్ప ఏ శక్తి ద్వారాను, ఏ విధమైన సాంకేతికపరమైన నరునియొక్క క్రియలు పనికి రావు. సముద్రములో ఏర్పడి పల్లెలు, పట్టణాలను ముంచే తుఫానుకు ఎదురు లేదు. దానిని ఎదుర్కొనే శక్తి నరునికి లేదు. అది బలహీనపడినంతవరకు నరుడు ఎదురు చూడవలసిందేగాని దానిని ఆపలేడు - నరుడు అశక్తుడు - నరుడు బలహీనుడే. నరుని యొక్క బలహీనత జ్ఞానములో ఉంది. బుద్ధిలో ఉంది, ఆత్మలో ఉంది, తలంపులలోను, క్రియలలోను ఉంది. పెద్దపెద్ద కట్టడాలు కట్టినను కొంతకాలానికి అవి బలహీనమయ్యే కట్టడాలే. అందునుబట్టి దేవుని ముందు దైవశక్తి ముందు దైవసన్నిధిలో దైవమందిరములో దైవపరిచర్యలో మన బలాధిక్యతలు ఆగవు - మనము బలహీనులమనే ప్రార్థించాలి. కనుక ఇందునుబట్టి దైవమందిరములో మోకరించి ప్రార్థించే మనము బలహీనులమన్న సత్యము మరువకూడదు - మరణ పర్యంతము నిత్యము మరణమను ఈ బలహీనత మనలను వదలదు.
కనుక ప్రియపాఠకులారా! లోకములో అధికులమనిగాని, బలవంతులమనిగాని, శక్తివంతులము, ఐశ్వర్యవంతులము, జ్ఞానులమని ప్రవర్తించుట అవివేకమని గ్రహించాలి. 1 సమూయేలు 17:4-11 చదివితే అందులో వ్రాయబడిన వివరాలను వరుసగా తెలిసికొందము. ''గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు ఆరు మూళ్ళు జానెడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణముండెను. అతడు యుద్ధ కవచము ధరించియుండెను. అతని కాళ్ళకు రాగి కవచము, భుజము మధ్యను రాగి బల్లెముండెను. అతని ఈటెకర్ర నేతగాని దోనె అంత పెద్దది. అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తు గలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలు దండువారిని పిలిచి నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కాదా? మీ పక్షముగా ఒకనిని ఏర్పరచుకొని, అతని నా యొద్దకు పంపుడు. అతడు నన్ను చంపగల్గిన యెడల మేము మీకు దాసులమయ్యెదము. నేను అతన్ని జయించి చంపిన యెడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయవలెను. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యమును తిరస్కరించుచున్నాను. సౌలును, ఇశ్రాయేలీయులందరును ఆ పిలిష్తీయుని మాటలు విని బహుభీతులైరి. 17:16 ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు, నలుబది దినములు తన్నుతాను అగుపరచుకొనుచు వచ్చెను.'' లోకసంబంధియు, దేహదారుఢ్యము కలవాడును, లోకాధికారము, లోకాధిపత్యము, తన ఆయుధ సంపత్తి, శారీర సంబంధ బలాధిక్యతలు, తన స్వశక్తిని బట్టి గర్వించి తన స్వజ్ఞానమునుబట్టి విజృంభించి, తన ఆయుధ బలమును, తన హస్త నైపుణ్యము, తన మందిమార్భలము, సకల విధాలుగ అత్యధిక బలసంపన్నుడగుటను బట్టి గర్వముతో దైవజనాంగముతో సవాలు చేస్తూ పల్కిన మాటలు.
ప్రియపాఠకులారా! గొలియాతు అనబడు ఇతడు ఎంతో బలాధిక్యత, ఎంతో దేహదారుఢ్యము, ఎంత ఎత్తు, ఎంత భారముతో నైపుణ్యముతో శూరుడైనను, వీరుడైనను, ధీరుడైనను, ఫిలిష్తీయ సైన్య సమూహమంతటిలో ప్రధానమైనవాడైయున్నను, ఫిలిష్తీయ సమూహమునకు తలయైయున్నను, ఇతడు తన్ను గూర్చి తాను ప్రకటించుకొంటూ - తన బలాధిక్యతలను గూర్చి దైవజనాంగము ముందు సవాలు చేసిన విధానమును బట్టి లోకరీత్యా బలవంతుడు, ఆరోగ్యవంతుడు, యుద్ధ నైపుణ్యము కలవాడుగ ఉండవచ్చును. ఎదుటివారికి భీతిని కొల్పేవాడుగ తరిమికొట్టే శక్తి సామర్థ్యములుండవచ్చును. తన ఆయుధములు ఎంతో ఖరీదైనవి, బరువైనవి, ప్రమాదమైనవిగా ఉండవచ్చును. కాని గొలియాతు పల్కిన మాటలు - వికృత స్వభావము గల్గి సైనిక సమూహము గల్గిన స్థూలకాయము దేవుని ముందు గడ్డిపరక వంటిదన్న సత్యాన్ని గొలియాతు యొక్క అంతము మనకు బయల్పరచుచున్నది. అనగా ఇంత గొప్ప ఆధిక్యతలున్న దైవజనాంగము ఎదుట ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో ఇతడు బలహీనుడే, ఎందుకనగా ఇశ్రాయేలు అనగా దేవుని జనాంగము, దేవుని ఇల్లు, దేవుని ప్రజ. ఇశ్రాయేలు అనగా దేవునియొక్క కూటమి. దైవకూటమి మధ్య దేవుడు - నివసిస్తున్నాడు గనుక గొలియాతు ఫిలిష్తీయ పక్షముగా దైవజనాంగముతో చేసిన సవాలు మనుష్యులతో కాదు - దేవునితోనే అని మనము భావించాలి. ఈ విధముగా దేవునితో సవాలు చేసిన దేవుని శక్తి - ఎన్నిక లేని వానిని బాలుడును, సరియైన వస్త్రాలు, సరియైన ఆదరణ లేనట్టి గుర్తింపు లేని, యుద్ధ నైపుణ్యము లేదు, సరియైన ఆయుధము లేదు. ఆయుధము వాడే నైపుణ్యము లేదు, దేహధారుఢ్యము లేదు, శత్రు పక్షములో ఉన్నట్టి ఫిలిష్తీయునియొక్క బలాధిక్యతలలో దేనిలో కూడా దావీదు సమానుడు కాలేడు. యుద్ధ వస్త్రాలు ఏమిటో ఎరుగనివాడు, గొర్రెల కాపరి, బీదవాడు. ఇంకను చెప్పవలెనంటే యెష్షయి కుమారులలో కనిష్టుడు - చివరివాడు. బాలుని చేత ఏ ఆయుధము లేకుండ కేవలము రాతితో కొట్టి చంపించుటన్నది దేవునియొక్క బలమా? దావీదు యొక్క బలమా? ఇశ్రాయేలు సైనిక బలమా? లేక లోకము దావీదుకు ఇచ్చిన బలమా? ఏ బలముతో దావీదు ఫిలిష్తీయుని సంహరించాడు అన్న సత్యాన్ని మనము 1 కొరింథీ 1:24-29 ఆయన యూదులకు ఆటంకముగాను, అన్య జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కాని యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు, దేవుని జ్ఞానమునైయున్నాడు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటె జ్ఞానము కలది. దేవుని బలహీనత మనుష్యుల బలము కంటె బలమైనది. సహోదరులారా! మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదుగాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.'' ఇది దావీదుయొక్క జీవితములో దైవప్రవచన నెరవేర్పయియున్నది.
కనుక ప్రియపాఠకులారా! ఆకాశము క్రింద ఏ నరుడు కూడా బలవంతుడు కాడు, ఆరోగ్యవంతుడును కాడు, శక్తివంతుడైనవాడు కాడు, జ్ఞానవంతుడును కాడు, ఐశ్వర్యవంతుడును కాడు, స్థిరుడు కాడు. ఇందునుగూర్చి దైవగ్రంథము ఇచ్చు హెచ్చరిక ప్రకటన 3:14-22 ఆమేన్ అను వాడును నమ్మకమైన సత్యసాక్షి. దేవుని సృష్టికి ఆదియైన వాడు చెప్పు సంగతులేమనగా - ''నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేక నులివెచ్చగా నున్నావు. కనుక నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన దరిద్రుడవు, గుడ్డివాడవును, దిగంబరుడవై యున్నావని యెరుగక - నేను ధనవంతుడను, నాకేమియు కొదువ లేదని చెప్పుకొనుచున్నావు, ''నీవు ధనవృద్ధి చేసికొనుటకు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రాలను, నీకు దృష్టి కల్గునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.''
కొనుక్కొమనుట అనగానేమి? అనగా నీ హృదయాన్ని నాకు ఇవ్వడమే కొనుక్కోవడమనబడును. ఆయనకు మన హృదయాన్ని ఇచ్చి ఆయన యొద్దనుండి పై వివరించిన వాటిని పొందవలెనని భావము.
.......
వారసత్వము - పౌరసత్వము - బానిసత్వము. ఈ మూడింటి ద్వారా కలిగే ఫలితాలు :- ప్రభువునందు ప్రియపాఠకులారా! ఇంతవరకును మనము వేదరీత్యా ఎన్నో అంశాలను గూర్చి నేర్చుకొని యున్నాము. ఆత్మీయంగా పై వాక్యములో ప్రతి అంశము కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకొని దేవుని మహిమార్థముగా లిఖించబడియున్నాయి. జన్మతః నరుడు స్వతంత్రుడు మరియు రెండు విధములైన వారసత్వపు పౌరసత్వపు హక్కును పుట్టుక నుండియే కలిగియున్నవి. అది ఎలాంటి విధానములో కూడి యుందో ఇప్పుడు వ్రాయబడే ఈయొక్క వ్యాఖ్యానములో తెలిసికొందము. మరియు బానిసత్వమన్నది నరుని జీవితములో మధ్య కాలములో సంభవించిందేగాని, నరుడు ఎప్పటికిని దేవునికి బానిసగా ఉండే దౌర్భల్యములో దేవుడు నరుని సృష్టించలేదు. నరుడు ఏ విధముగా వారసత్వమును, పౌరసత్వమును కలిగియున్నాడో ఏ విధముగా బానిస అయ్యాడో ఎందుకు బానిస అయ్యాడో - నరుడు స్వతంత్రుడుగా ఉండి సాధించిందేమిటి? బానిసత్వములో ఉండి అనుభవించిన అనుభవాలేమిటి? వగైరా విషయాలనుగూర్చి మనమిప్పుడు తెలిసికొందము. ఇందులో మొట్టమొదటగ వారసత్వపు హక్కు అన్నది నరునికి శరీర సంబంధముగా ఏర్పడిన మొదటి స్థితి, అనగా నేలమంటితో నరుని రూపించబట్టి భూమికి మొట్టమొదటి వారసుడు. అలాగే భూమి మీద దేవుని పరిశుద్ధ వనానికి కూడా వారసునిగా దేవుడు నియమించాడు. దేవుని పరిశుద్ధ వనములో ఆదినరుడు, అతనిలో నుండి తీయబడిన నారి వీరిద్దరే ఏదెను వనానికి వారసులు. ఇంకను యావద్ సృష్టికిని మొట్టమొదట దేవుని ద్వారా పౌరసత్వపు హక్కును పొందినవారు వీరే; నరుడు - నారి తప్ప వేరే మూడవ వ్యక్తి ఎవరును లేరు. అంతేగాకుండ యావద్ సృష్టి మీద నరునికి స్వాతంత్య్రాన్ని ఇచ్చి దేవుడు తాను సృష్టించిన ప్రతి జీవికి నామకరణము పెట్టించినట్లు ఆదికాండము 2:19లో చదువగలము. ఆనాడు ఆదినరుడు పెట్టిన నామధేయమే స్వతంత్రుడై దైవసృష్టి యావత్తునకు పెట్టినట్టి పేరు ఈనాడు అవి కలిగియున్నవి. ఆదినరుడు పెట్టింపనట్టి జీవి అంటూ లేడు. అలాగే ఆదినరుని అజమాయిషీలో జీవించని జీవి అంటూ లేదన్న సత్యాన్ని మనము గ్రహించవలసియున్నది. నరులను ఆశీర్వదించిన విధానములో దేవుడు వారిని ''మీరు బహుగా ఫలించి అభివృద్ధి పొంది, భూమిని నిండించి, దానిని లోబడరచుకొని ఏలుడి,'' అన్నాడేగాని దానికి బానిసలు కండని తొత్తులుగ జీవించమని ఆశీర్వదించలేదు. మరియు నరశరీరమును భూసంబంధముగా చేసినను నరునిలో జీవము, ఆత్మ భూసంబంధమైనవి కావు. అవి పరలోక సంబంధమైనవి. కనుక నరుడు పరలోక రాజ్య వారసుడును, ప్రవేశమునకు జీవించుచు హక్కుదారుడుగాను, పరమాత్మ యొక్క ఆత్మలో భాగస్వామియైనందున ఆయనలో అంశముగాను, ఆయన ప్రతినిధిగాను, ఆయనయొక్క రూపముగాను ఆదికాండము 1:26 ఆయన చేసిన పనిగాను, ఆయన జ్ఞానముగాను ఆధిక్యతలు పొందియున్నాడు. అయితే నారి మట్టితో చేయబడింది కాదు గాని యెముకతోను, మాంసముతోను రూపించబడి, పురుషునియొక్క జీవములో భాగస్వామియైనట్లు నారి యొక్క నిర్మాణ చరిత్ర మనకు వివరిస్తున్నది.
ఈ విధముగా దేవునియొక్క హస్తము చేత రూపించబడిన ఈ నరజంట భూమ్మీద దైవసృష్టికి వారసులుగాను, దైవరాజ్యములో పౌరసత్వపు హక్కులు గల్గిన వారుగాను, దైవసృష్టిని ఏలుటకు ఏలికలుగాను, దానిని కాపాడుటకు ఈ అనంత విశ్వము అను దేవుని సృష్టియైన ఏదెను వనమును కాయుటకు కాపలాదారుగాను, దానిని సేద్యపరచువారుగాను పరమాత్ముని చేత ఏర్పరచబడినట్లు పూర్వీక వేదచరిత్ర మనకు వివరిస్తున్నది.
కనుక నరుడు స్వతంత్రుడు, స్వేచ్ఛాజీవి, దేవుని పోలికయైయున్నట్లు ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది. దేవుడు నరునికి తన సృష్టములపై సృష్టి మీద స్వేచ్ఛతోబాటు దానిని ఏలే హక్కును, తోట ఫలమును అనుభవించే ఫలభక్షణ విషయములోను స్వాతంత్య్రాన్ని ఇచ్చినట్లుగ ఆది 2:16లో మనము చదువగలము. అదేమనగా ''ఈ తోటలో నున్న ప్రతి వృక్షఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు.'' ఇది నరునికి దేవునికి మధ్య కలిగిన నియమము. ఇది దేవుడు నరునికి ఒక పరీక్షగా ఈ నియమాన్ని ఇచ్చినాడు. ఎలాగంటే నరుడు శారీరరీత్యా భూసంబంధియు, ఆత్మరీత్యా పరలోక సంబంధియైయున్నాడు గదా! దైవచట్టాన్ని ఉల్లంఘించి, భూఫలాన్ని తిని భూలోక వారసత్వానికి భూలోక పౌరసత్వానికి దిగజారిపోతాడా? లేక దైవనియమమును పాటించి, ఆత్మ చట్ట ప్రకారముగా భూఫలమైన మంచి చెడ్డల తెలివినిచ్చు దైవ నిషేధ ఫలమును భుజించకుండ పరలోక వారసత్వమును, పౌరసత్వమును పొందే యోగ్యతను గలిగి దేవుని వలె స్వతంత్ర జీవిగా జీవిస్తాడా? ఏ జీవితాన్ని కోరుకుంటాడో చూస్తామన్న పరీక్షను, తాను నియమించిన నరునికి నియమావళిని విధించాడు.
ప్రియపాఠకులారా! ఆనాటి దైవహస్తముతో రూపించబడిన ఆదాము అను నరుడు అజ్ఞాని కాడు, అనామకుడు కాడు, అయోగ్యుడు కాదు, అంధుడు కాడు, పాశవికుడు కాడు, మూగ కాదు, వికలాంగుడు కాదు. దేవునియొక్క హస్తముతో రూపించబడి దేవునియొక్క జీవాత్మను ప్రత్యక్షముగా పొంది, దేవునితో ముఖాముఖిగ చూస్తూ ఆయనతో సంభాషిస్తూ ఆయనతో ఏకమై ఏదెను వనములో సంచరించినట్టి ధన్యాత్ముడు, ప్రభావితుడు జ్ఞానియు, శక్తిసంపన్నుడును, ఎలాంటి రుగ్మతలు, అవాంతరాలు గాని, చింత, భయము, వేదన, వగైరా చేదు అనుభవాలుగాని ఎరిగినవాడు కాదు. దేవుడు తనలోని యెముకను తీసి రూపించిన స్త్రీ యొక్క మర్మాన్ని ప్రత్యక్షముగా - దేవుడు తనకు గాఢనిద్ర కలుగజేసినను, ఆత్మీయ దృక్పధములో స్త్రీ యొక్క నిర్మాణమును క్షుణ్ణముగా గ్రహించినాడంటే నేటి నరుల కంటె జ్ఞానియు, ఆరోగ్యవంతుడును, ఆత్మశక్తి, వివేచన కలవాడును, దైవత్వమునకు ప్రతినిధియై జీవించాడన్న సత్యాన్ని మనము గ్రహించవలసియున్నది. ఇట్టి మహాజ్ఞానియైన ఆదాము శారీరకముగా దిగంబరియైనను దేవునియొక్క మహిమ వస్త్రమును ధరించుకొనబట్టి, దైవమహిమ వలయములో శారీరకముగా ఉన్నట్టి దిగంబరత్వాన్ని మరచి, అనగా తానున్న శారీర దిగంబరత్వాన్ని గూర్చి, చర్చించే మూడవ వ్యక్తి లేడు గనుక ఆదాము, అతని భార్యయైన హవ్వ ఇరువురు కూడా దైవమహిమ వస్త్రాన్ని ధరించుకొన్నవారే. ఇందునుగూర్చి 1 కొరింథీ 11:7లో పౌలు ఈ క్రింది విధముగా ప్రవచించియున్నాడు. అదేమనగా ''పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునైయున్నాడు గనుక తల మీద ముసుకు వేసికొనకూడదుగాని, స్త్రీ పురుషుని మహిమయైయున్నది.
ప్రియపాఠకులారా! ఇందునుబట్టి పురుషుడు దేవునియొక్క చేతి పనియు, ఆయన మహిమయై యున్నాడు. అలాగే స్త్రీ పురుషుని వలె దేవుని చేతిపనియై యున్నను, దేవుని క్రియను బట్టి పురుషుని మహిమయైయున్నది.
ఇట్టి జ్ఞానియైన ఆదినరుడు దైవవనమునకు నాటి దేవునియొక్క యావద్ సృష్టికిని వారసుడునై యున్నట్లుగా మనకు ఇందునుబట్టి తెలుస్తున్నది. అయితే నాటి సృష్టిలో పట్టణములు, రాచనగరులు, గ్రామాలు లేనందున అనగా ఇల్లు కట్టుకొనే అవసరత నరునికి లేనందున పౌరసత్వము అన్న మాటకు అప్పటిలో అవసరత లేకున్నట్లు తెలుస్తున్నది. ఈ విధముగా సృష్టికర్తయైన దేవుడు తన పరలోక సామ్రాజ్యము నుండి తరచుగ భూమి మీదనున్న నరుని దర్శించుటకు దిగి వచ్చుచు ముఖాముఖిగ నరునితో సంభాషిస్తున్నట్లు ఏదెను వనములోని తొలి నరునియొక్క చరిత్ర మనకు వివరిస్తున్నది. ఇట్టి మహాభాగ్యము నరుడు దైవసన్నిధిలో పొందినాడంటే ప్రియపాఠకులారా! ఇంతకంటె మహిమకరమైన ధన్యవంతమైన జీవితము వేరొకటి ఉన్నదా? అన్న తలంపు ఈనాటి నరులమైన మనకు కలుగక మానదు. నరుడు ఈ విలువను ఈ అమూల్యమైన వరమును ఎంతో కాలము నిలుపుకోలేకపోయాడు. దేవుడు విధించిన ఫలనిషేధమును ఉల్లంఘించి, ఫలభక్షణము చేసిన తొలి నరుడు, అతని భార్యయైన తొలి నారి ఇరువురును సతీసమేతముగా నిషేధ ఫలభక్షణము చేసినందువల్ల నరునియొక్క నైతికము, ఆత్మీయత ఈ రెంటి విలువను కోల్పోయి, దైవ ప్రసన్నత, దైవవనములో వారసత్వము రెండింటిని కోల్పోయి ఉభయ భ్రష్టత్వము పొంది, దైవశాపము, దాని ఫలమైన మరణము అను రెండును దైవోగ్రత మూలముగా కలిగిన సుదీర్ఘమైన ఫలములను నరకోటి తరతరములు అనగా యావద్ నరకోటి నశించినంత కాలము అనుభవించే తీరని శిక్షను దైవత్వములో తనయొక్క దైవ ఆజ్ఞాతిక్రమమును బట్టి, తన సంతానమంతటికిని దైవశిక్షను వర్తించే విధముగా దుర్భలుడయ్యాడు.
ప్రియపాఠకులారా! ఇంతవరకును దేవునియొక్క వారసత్వము, దైవానుగ్రహము కోల్పోయిన తర్వాత దైవవారసత్వము కోల్పోయినట్టి భ్రష్టత్వమునుగూర్చి తెలిసికొన్నాము. ఇప్పుడు పౌరసత్వము అన్నది వేదరీత్యా తెలిసికొందము. నరునికి పౌరసత్వము అన్నది జీవితము యొక్క హక్కు అనుభవాలతో కూడిన పూర్వార్థమైయున్నది. ఎలాగంటే దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసము మన పౌరసత్వము పరలోకములో ఉంది. మనము అక్కడ వస్త్రము ధరించుకొన్నవారముగానే ఉంటాము. మీరు మీ సొత్తు కాదు వెల పెట్టి కొనబడినవారు.
ప్రియపాఠకులారా! మన పౌరసత్వము, వారసత్వము రెండును పరలోక సంబంధమైనవేగాని లోక సంబంధమైనవి కావు. వారసత్వము అన్నది లోకములో బహు గొప్పగా క్రియ జరిగిస్తున్నను, వారసత్వపు హక్కు అన్నది నరుడు భూసంబంధముగా శారీరాత్మలతో జీవించినంత కాలమే హక్కు, వారసత్వము. చనిపోయినవారికి ఎలాంటి హక్కు అనుభవాలుండవు. ఆ తర్వాత వారు రక్తసంబంధములుండవచ్చును. వారు కూడా స్థిరులు కారు. కాబట్టి లోకసంబంధమైన స్థిరచరాస్థులకు వారసుడంటూ ఎవరును లేరనియే ఇందునుబట్టి చెప్పవచ్చును. భూలోక వారసత్వపు హక్కు వారు ఏనాడో నరుడు పోగొట్టుకొన్నాడు. దేవుడు నరుని దేహరీత్యా దిగంబరిగ రూపించినను, వారిని దరిద్రునిగ, సంపద హీనునిగ, నిర్భాగ్యునిగ, నిస్సహాయునిగ, అనాదిగ సృష్టించలేదు. దేవుడు నరుని సృష్టించక పూర్వమే వానికి రావలసిన అన్ని హంగులను ముందుగా సృష్టించాడు, అనగా నరునియొక్క క్షుద్భాధ నివారణకు నానావిధమైన ఫలవృక్షాలు, కలుషితము లేని వాతావరణము, సమాధాన స్థితిలో పంచభూతాల క్రియాకర్మలు, ప్రశాంతమైన వాతావరణము, అన్నిటికంటె సృష్టికర్తతో ముఖాముఖిగ సంభాషించే యోగ్యత కల్గించాడు - ఇది దేవుడు నరుని ప్రేమించి, నరునికి అనుగ్రహించిన లోకసంబంధమైన వారసత్వముతో కూడిన గొప్ప ఆధిక్యతలు - దేవుడు నరునికి అనుగ్రహించాడు.
అయితే ఈ ఆత్మీయ పౌర స్థితిని పరిశుద్ధ వనములోని వారసత్వాన్ని, దైవాత్మతో ఉన్నటువంటి ప్రగాఢమైన బంధమును దృశ్యముగా దైవత్వముతో ఉన్నటువంటి సావాసాన్ని, రక్షణను నరుడు కోల్పోయి తోట వారసత్వము నుండి దైవసన్నిధి నుండి దేవుని చేత తొలగించబడినాడు. ఈవిధముగా దేవుని చేత భూలోక వారసత్వపు హక్కును కోల్పోయిన నరునికి సృష్టిలోని ప్రతిదియు అనగా ఆహార నియమములోను, పంచభూతాల విషయములోను, సృష్టిలోని జంతుజాలములు, మృగపక్షి సముదాయములోను, చివరకు భూమియు, నరునికి విరోధియైయున్నట్లును, ఆ విరోధమన్నది తాత్కాలికమైనదిగాక, తరతరాలు తరగనటువంటి స్థిరాస్థిగా మారి, దాని పర్యవసానము లోకమును వదలక పోవుటయే గాక, లోకములో నరుడు తాను పెంచుకొన్న శరీరాన్ని లోకానికి అప్పగించి, మరణమను అగాధమునకు లోనైనట్లుగా నరుని యొక్క పూర్వీక చరిత్ర మనకు వివరిస్తున్నది. సత్యాన్ని, పౌరసత్వాన్ని, ఈ విధముగా దైవసన్నిధిలోని వారసత్వాన్ని కోల్పోయిన నరునియొక్క జీవితములో - అతనికిని, అతని సంతానమునకును అనేక విధములైన జీవిత సమస్యలు ఎదురైనవి. దైవోల్లంఘన చేసిన ఆదినరుని జీవితములో అతనికి కల్గిన సంతానములో కూడా ఈ దైవవ్యతిరేకత అన్నది అధికమించింది. ఎలాగంటే దేవునికి జ్యేష్ట పుత్రుడైన ఆదాములో పాప నరకోటి ఏ విధముగా అంకురించిందో - అలాగే ఆదాము జ్యేష్ట పుత్రుడైన కయీను జీవితములో కోపము, ద్వేషము అను రెండు అరిష్ట గుణాలు అంకురించి, తన సోదరునే హతమార్చు పాశవిక స్థితికి దిగజారినాడు. దాని ఫలితము కయీను కూడా ఆదాము వలె దేవుని సన్నిధిలో దేశద్రిమ్మరిగా వెలివేయబడినాడు.
చిత్రమేమిటంటే దైవత్వమును వ్యతిరేకించిన ఆదాము కయీనుల విషయములో దేవుడు కనికరించి, దైవానుగ్రహమును కోల్పోయిన ఆదామునకు చర్మపు దుస్తులను, సోదరుని చంపి హంతకునిగ తయారైన కయీను యొక్క విషయములో కయీనును దేశద్రిమ్మరిగా దేవుడు శపించినను, అతనికి వీపున ఒక గుర్తు వేసినట్లుగా వేదములో చదువగలము. ఇది నాటి పాపులైన తండ్రి కుమారులకు దేవుడనుగ్రహించిన రక్షణార్థమైన గుర్తులుగా వేదములో లిఖించబడియున్నది. అంటే ఆదామునకు దేవుడనుగ్రహించిన చర్మపు దుస్తులు మాన సంరక్షాణార్థముగాను, భవిష్యత్తులో అదినరునియొక్క రాజ వస్త్రముగా ప్రశస్త వస్త్రము, పెండ్లి వస్త్రము, యాజక వస్త్రముగాను రూపాంతరము పొంది, నేడు నానావిధమైన ఆధునిక పద్ధతులలో నరులను అలంకరిస్తున్నది. ఇది ఆదామునకు దేవుడనుగ్రహించిన చర్మపు దుస్తుల యొక్క దేహరీత్యా లోకరీత్యా ఉన్నట్టి నిగూఢ సత్యము. ఆత్మీయముగా నరునియొక్క జీవితములో నరుడు తన పాపము నిమిత్తము పశ్చాత్తాప్తుడై మారుమనస్సు పొంది, దైవత్వమును దృష్టించినప్పుడు దేవుడు తొడిగించిన చర్మపు దుస్తులే మహిమ వస్త్రాలుగా రూపాంతరము పొందినట్లు అనగా ప్రకటన
7:9 తెల్లని వస్త్రాలు ధరించుకొన్న వారి ఆత్మీయ స్థితిని గూర్చి ఈ యొక్క చర్మపు చొక్కాల యొక్క ఆత్మసంబంధమైన నిగూఢ సత్యము ప్రబోధిస్తున్నది.
ప్రియపాఠకులారా! ఇది తొలి నరుల జీవితాలలో దేవుడు జరిగించిన క్రియాకర్మలు, ఇక వేదరీత్యా పాపమునకు జీతము మరణము, అన్న ప్రవచనమున్నది రోమా 6:23 ఇందునుబట్టి ఆదామును మొట్టమొదటగా హెచ్చరించింది ఏమిటంటే ఈ పండు తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు,'' అని అన్నాడు. ఈ ఫలభక్షణము వలన దైవవాక్కుకు వ్యతిరేకియై దేవుని మాటను ఖాతరు చేయక, ఆదాము భూమి మీద నిషేధ ఫలభక్షణనుబట్టి అతడు వెంటనే చావలేదు. అంటే దేహసంబంధమైన మరణము దైవపరిశుద్ధ వనములో అప్పటి సమయములో క్రియ జరిగించలేదు. అంటే ఆదాము చావలేదు. అయితే ఆదాము చచ్చాడు. అంటే దేవుని వాక్కులు ఖాతరు చేయక నిషేధఫలమును తిన్నందుకు నరునియొక్క శారీర జీవితము భూసంబంధమునకు ముడిపడినందున నరునిలోని ఫలభక్షణము ద్వారా నరునిలో ఆత్మీయత చచ్చింది. ఆత్మీయ సావాసము కోల్పోయాడు, ఆత్మీయముగా అజ్ఞాని అయ్యాడు. పరమాత్మతో సావాసము కోల్పోయాడు. అలాగే సృష్టిలో ఉన్నటువంటి ఐక్యతను పరమాత్మతో ఉన్నట్టి సంబంధ బాంధవ్యాలను కూడా కోల్పోవుటయేగాక, దైవసృష్టములన్నియు నరునికి విరోధములై, దైవ సృష్టములైన పంచభూతాలు, నరునికి రూపమిచ్చిన భూమి - భూసృష్టములైన జంతుజాలము, ప్రకృతి వాతావరణము - ఒకటేమిటి? సర్వమును నరునికి ప్రతికూలములై, నరజీవితములో శారీరరీత్యా భీభత్సాన్ని సృష్టించాయి. ఈ భీభత్సము దినదిన ప్రవర్థమానమై, తుఫానులు, భూకంపాలు, వడగాలులు, అతివృష్టి - అనావృష్టి, కరువులు, వడగండ్లు, సుడిగాలులు, వేడిగాడ్పులు, పిడుగుపాట్లు, వగైరా రీతులుగా క్రియ జరిగిస్తూ నరునికి బద్ధ శత్రువులైయున్నవి. నరుడు దేవునితో సఖ్యత కల్గి యున్నప్పుడు ఇవి దైవ చిత్తానుసారము నరునికి ఊడిగము చేశాయి. ఆదినరుడు దేవుని వనములో ఉన్నప్పుడు గొడుగు పట్టుకొన్నట్లు గాని, చెప్పులు తొడుక్కొనుట గాని, రోగపీడితుడుగా గాని, వికలాంగుడుగా జీవించినట్లుగా గాని, భూత బాధితుడుగా ఉన్నట్లు గాని, మరణభయము, చోర భయము, వగైరా భయాలు లేకుండా నిశ్చింతగా స్వేచ్ఛగా నరుడు జీవించినట్లు నాటి ఏదెను చరిత్ర మనకు తెల్పుచున్నది.
ఈ విధముగా ధన్యకరమైన జీవితమును కోల్పోయిన నరుడు ఉభయ భ్రష్టత్వము పొందినందున భూలోకములో కూడా నరునికి స్థిరమైన పౌరసత్వము వారసత్వము లేదు. అన్యాయపు క్రియలనుబట్టి ఆత్మీయ కలుషితమునుబట్టి, పరలోక సామ్రాజ్య వారసత్వానికి కూడా యోగ్యుడు కాలేకపోయాడు. ఇట్టి స్థితిలో నర నిర్మాణ కారకుడైన సృష్టికర్తయైన దేవుడు నరునికి సంభవించిన ఉభయ భ్రష్టత్వమునకు సంతాపపడి వాని దేహములో తన జీవాత్మను ఉంచినందుకు నొచ్చుకొని, వానికి సంభవించిన భ్రష్టత్వమునకు చింతించి, వానిని తన చేతితో రూపించి, తన జీవాత్మను వానిలో ఉంచినందుకు వానికి సంభవించిన ఆత్మీయ కలుషిత రుగ్మతను బట్టి తానే నరుని కొరకు అనగా వాని పాపమునకు ప్రాయశ్చిత్తార్థ బలిగా తన దేహమును అర్పించుటకు సంకల్పించి, తీర్మానించి, తాను ఆ విధముగా లోక నరకోటి పాప పరిహారార్థము బలిపశువుగ భూమి మీద అవతరించబోవుచున్న విషయాన్ని పాతనిబంధన కాలము నాటి ప్రవక్తల ద్వారా దూతల ద్వారాను మరియు నూతన నిబంధనలోని మత్తయి సువార్త వరకును ప్రకటింపజేసి, దేవుడు ప్రకటించిన తన ప్రకటనను క్రియారూపముగా అమలుపరచుచు, కన్య గర్భములో నవమాసములు జీవించి, మానవ మర్యాదలో ఈ లోకములో జరిగించి, ప్రభువు ప్రకటించిన కాలము ఆసన్నమైనప్పుడు అనగా ఆయన ప్రణాళికను అమలు జరుపు విధానములో తాను ప్రవచింపజేసిన ప్రకారము మత్తయి 1:22 ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరుపెట్టుదురు, యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరుపెట్టబడును.''
ఈ విధముగా అనేక రీతులుగ ప్రకటింపజేసిన దేవునియొక్క ప్రవచనము కార్యరూపము దాల్చి కన్యక గర్భములో నరాకృతిని దాల్చి, నవమాసములు గతించిన పిదప బాలుడుగా జన్మించి, ఈ లోకములో ఎదిగి నరుల మధ్య జీవించి, నరులతో తినుచు త్రాగుచు నరులకు అతి సమీపములో సన్నిహితునిగ జీవించిన ప్రభువు లోక నరకోటి యొక్క పాపపరిహారార్థము బలి పశువుగాను, బలి వేదికగాను, బలికార్యము జరిగించు యాజకునిగాను, ఈ విధముగా సర్వము తానే యైయుండి, లోకనరకోటి యావత్తుకును రక్షకునిగాను, విమోచకునిగాను, ఆరాధ్యునిగాను, యావద్ నరకోటి విశ్వాసమునకు మూల పురుషుడుగాను, నిర్ధారించబడినవాడై, నరుడు దైవపథమును చేరాలంటే అట్టి నరునికి పౌరసత్వాన్ని వారసత్వాన్ని కల్పించేటటువంటి హక్కును, యోగ్యతను కల్పించుటకు ఈయన మూలకారకుడుగా దైవత్వము చేత నిర్ధారించబడినట్లు యోహాను 1:12లో ఈ విధముగా వ్రాయబడియున్నది. ''తనను ఎందరు అంగీకరించెరో వారికందరికి అనగా తన నామము నందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారముననుగ్రహించెను.'' ఇందునుబట్టి ప్రతి దైవవిశ్వాసి పరలోక రాజ్యము చేరాలంటే పరలోక రాజ్యములో పౌరసత్వము పొందాలంటే యోహాను 14:6లో వలె యేసుక్రీస్తు మార్గము సత్యము, జీవమైయున్నట్లు ఇందునుబట్టి మనము గ్రహించవలసియున్నది.
కనుక ప్రియపాఠకులారా! పరమాత్ముని సంకల్పము, పరమాత్మునియొక్క ప్రణాళిక, పరమాత్మునియొక్క చిత్తము ఆయన ప్రేమ లోకముపై ఎంత ఉన్నతమైన రీతిలో ఉన్నదో మనము గ్రహించవలసియున్నది. అనగా యోహాను 3:16లో వ్రాయబడిన ప్రకారము దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను,'' అని వ్రాయబడిన ప్రకారము దేవునియొక్క ప్రేమ నరుని పట్ల ఎంత ఉన్నతముగా ఉన్నదో ఇందునుబట్టి తెలుస్తున్నది. కనుక ఈ ప్రణాళిక దేవుడు తన కుమారుడైన క్రీస్తుతో కూడా సమావేశమై అమలు జరుపు కాలములో లోకము దైవకుమారుడైన క్రీస్తు ఏ విధముగా మరణించి, మహిమ పునరుత్థానుడై తండ్రి రాజ్యము వెళ్ళినాడో అలాగే ఆయన మరల భూమి మీదకు రాబోవుచున్నాడు. మొదటగ ఆయన రక్షకునిగ ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన కార్యమును నెరవేర్చుకొని, తన మరణ పునరుత్థానము ద్వారా లోకస్థులైన మనందరి కొరకు విమోచకుడుగ, పరలోకమునకు ఆరోహణమయ్యాడు. తన నిజత్వాన్ని బయల్పరిచినాడు. అయితే ఇప్పుడు తనయొక్క నిజత్వాన్ని గూర్చి ఆకళింపు చేసుకొన్న భక్తుడు, తన నామములో విశ్వసించిన విశ్వాసులు, తన శ్రమలలోను, తన మరణమునకును, తన చరిత్రకును హతసాక్షులైన ఆత్మీయులను, తన నిమిత్తము హింసింపబడి, శ్రమలపాలై మరణించిన వారి నిమిత్తము భూమిపై తనయొక్క విశ్వాసులుగ శేషించియున్న వారి ఆత్మీయ జీవితము కొరకును, ఆయన మరల ఈ లోకానికి రాబోవుచున్నాడు. ఈ విధముగా వచ్చు సందర్భములో ఆయన ఒక్కడే రాకుండ తానేర్పరచుకున్న దూత గణములతోను, తనలో నిద్రించిన పరిశుద్ధుల సమూహముతోను, తాను నిర్ణయించిన కాలము, సమయమును బట్టి ఆయన ఈ లోకమునకు రానైయున్నాడు. ఆ విధముగా వచ్చు సందర్భములో భూమి మీద తన స్వరక్తమిచ్చి సంపాదించుకొన్న విశ్వాసుల యొక్క కూడికను తన యొక్క వధువు సంఘముగా చేసికొని, వారిని తనలో ఐక్యపరచుకొని అనగా తన యొక్క వారసులుగ చేసుకొని, వారితో ఆనందించే ఉద్దేశ్యముతో ఆయన త్వరగా రానైయున్నాడు. ఆ విధముగా ఆయన వచ్చునప్పుడు, తానేర్పరచుకొన్న కూటమిని - తన వారసులుగ, తన రాజ్య పౌరులుగాను చేసుకొని వారితో సదాకాలము ఉంటాడని వేదముయొక్క వేదాంతములోని చివరి ఘట్టమైయున్నది. ఇది నరులయొక్క నిజమైన పౌరసత్వ స్థితిని వారసత్వపు హక్కును గూర్చిన చరిత్రయైయున్నది.
ఇక బానిసత్వమును గూర్చి :- ప్రియపాఠకులారా! పై ప్రవచనాలలో దేవుడు నరులతో సెలవిచ్చిన వాక్కులలో ద్వితీయోపదేశకాండము 28:14, ''మిమ్మును తలలుగా చేశానుగాని తోకలుగా చేయలేదని, ఆయన ప్రవచించి యున్నాడు. నిజమే, ప్రభువు మనలను ఆది నుండి నేటి వరకును తలగా జీవించవలసినట్టి స్థితిలోనే సృష్టించియున్నాడన్న సత్యాన్ని మనము మరువకూడదు. ఎలాగంటే ఏదెను వనమునకు ఆదాము శిరస్సు అనగా అధికారి, పరిపాలకుడు ఆది 2:15లో దేవుడు ఆదామును రూపించినవాడై నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును, దాని కాచుటకును దానిలో ఉంచెను.'' అనగా ఏదెను వనమునకు ఆదాము శిరస్సు, లేక అధికారి, హక్కుదారుడు, పెద్దయైయున్నట్లు ఇందులోని భావము. అలాగే పురుషునితో బాటు స్త్రీకి కూడా పెద్దరికాన్ని అంటగట్టుచు, ఆది 1:27-28 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను, పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.'' ఇది దేవుడు నరునికి ఇచ్చినటువంటి పెద్దరికము, అధికారము. ఈ విధమైనటువంటి ఏలుబడి అధికారము దేవుని ద్వారా నరులు పొంది, యావద్ సృష్టిలోని సృష్టములన్నిటికిని పేరు పెట్టు యోగ్యతను, ధన్యతను, అధికారమును, దైవత్వము ద్వారా సంపాదించుకొన్నాడు. ఇది మనుష్యుల ద్వారా నరునికి సంక్రమించిన హక్కు కాదు. సాక్షాత్తు సృష్టికర్త ద్వారా ఈ అధికారాన్ని నరుడు పొందాడు. అయితే దైవాత్మ, దైవశక్తి, దైవజ్ఞానముతో యావద్ సృష్టికిని ఏలికగా ఉన్నటువంటి నరుడు స్త్రీ ఆకర్షణకు లోనై, స్త్రీ ఇచ్చిన నిషేధఫలముల యొక్క పూర్వ స్థితిని గుర్తించలేనంత స్త్రీ ఆకర్షణకు తొలినరుడు లోనై దైవనిషేధ ఫలమును భుజించి, దైవఆజ్ఞాతిక్రమము చేసి లోక బానిసత్వానికి గురి అయ్యాడు. అలాగే పురుషుని నుండి పురుషునికి సాటి సహాయముగా రూపించబడిన నారి సర్పబోధకు చెవినిచ్చి, సర్పము చేతను నిషేధఫలము చేతను రెంటిని స్త్రీ ఆకర్షించుటను బట్టి తాను దైవనిషేధ ఫలమును భుజించి, భర్తకు కూడా ఇచ్చి రెండు విధములైన బానిసత్వాలకు గురియైనట్లుగా మనము తెలిసికోవలసియున్నది. ఇందులో మొదటిది లోకాకర్షణ, రెండవది పురుష వ్యామోహము.'' రెంటికిని దాసురాలై రెండు విధములైన గుణములకు స్త్రీ మూలకారకురాలైనట్లుగా నేటి నరజీవితములో స్త్రీకున్నట్టి పాత్ర ద్వారా మనము పై విషయాన్ని గుర్తించగలము.
ప్రియపాఠకులారా! సమాజములో నేడు స్త్రీకి ఒక ప్రత్యేక స్థానము, ప్రత్యేకమైన పదవి, ఆధిక్యత పురుషలోకము ఇచ్చియున్నట్లుగ ఈ క్రింది విధమైన సందర్భాన్ని బట్టి తెలిసికొందము. వైద్య వృత్తిలో స్త్రీలున్నారు. ఉపాధ్యాయ వృత్తిలోను, పోలీసు శాఖలోను స్త్రీలున్నారు. యుద్ధరంగాలలో స్త్రీలున్నారు. ఉద్యమాలలో స్త్రీలున్నారు. వ్యాపార కేంద్రాలలో స్త్రీలున్నారు. వాహనాలను నడిపే చోదకులు కూడా స్త్రీలే. అలాగే విమానములో చోదకులు కాని, పరిచారకులుగాని, చివరకు దైవమందిరాలలో పరిచారకులలో కూడా స్త్రీలయొక్క పాత్ర ఉన్నట్లు మనమెరిగిన విషయమే. చివరకు సాంసారిక జీవితములో కూడా స్త్రీ లేనిదే కుదరదు. ఇది స్త్రీకి ఏదెను వనము నుండి దేవుని ద్వారా అనుగ్రహించిబడిన వరము. అంటే ఆది 3:10-11లో దేవుడు పురుషునితో మాట్లాడు సందర్భములో ఆదామా! నీవెక్కడ ఉన్నావు? అన్నప్పుడు ఆదినరుడిచ్చిన సమాధానమేమిటంటే, ''నేను దిగంబరిని గనుక భయపడి దాగుకొంటిని అని అన్నాడు. అందుకాయన - నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలాలు తింటివా? అని అడిగెను.''
ప్రియపాఠకులారా! స్వతంత్రుడును, సాహసవంతుడును, ధైర్యవంతుడు అనగా పిరికితనము ఎరుగనివాడును, దైవత్వములో ఒక అంశమును, దైవత్వమును ధరించుకొన్నవాడును, దైవసృష్టికి, సృష్టములకును పేర్లు పెట్టిన ఈ ఆదినరుడు ఎన్నోమార్లు దైవస్వరమును వినియున్నాడు. దేవునితో ముఖాముఖిగ మాట్లాడియున్నాడు. దేవునితో కలసి తోటలో విహరించియున్నాడు. దైవత్వము చేత అత్యధిక ప్రేమకు పాత్రుడైయున్నాడు. ఇట్టి నరుడు అదే దేవుని ఎదుట స్వేచ్ఛగా తిరిగాడో - ఆ దేవుని ఎదుటనే నేను దిగంబరి నని భయపడి దాగుకొంటిని ,'' అనుటలో భయపడుట, దాగుటన్నది స్వతంత్రుని లక్షణమా? బానిస లక్షణమా? అన్న విషయాన్ని ఈ సమయములో గుర్తించవలసియున్నది. ఇందునుబట్టి పురుషుడు కూడా రెండు విధములైన బానిసత్వము తత్సంబంధ దాస్యమునకు దిగజారినట్లుగ మనము తెలిసికోవాలి. ఇందులో 1. దైవ ఆజ్ఞాతిక్రమము చేసి దైవచట్టమును అధిగమించి, భూఫలమును తిన్నందుకు భూలోకమునకు దాసుడుగాను, ఆ ఫలాలను స్త్రీచే అందుకొన్నందుకు స్త్రీకి దాసుడుగాను, ఇట్లు ఉభయ దాసత్వము, ఉభయ బానిసత్వ స్థితి పురుషునికి దాపురించుటనుబట్టి హోదాగలవాడైనను, గ్రామాధికారి లగాయతు ప్రపంచములో ప్రాధాన్యత సంతరించుకొన్న ప్రభువు వరకును, రాజకీయవేత్తగాని, శాస్త్రజ్ఞాని, ఉన్నత ఉద్యోగిగాని, సువార్తీకుడుగాని, సంఘకాపరి, మతాధిపతిగాని, వేదాంతమును ఆకళింపు చేసుకొన్న వేదపండితుడుగాని, స్త్రీ మాటకు శిరస్సు వంచక తప్పదు. తుదకు లోక న్యాయస్థానములో కూడా స్త్రీయొక్క మాటలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇందునుగూర్చి వేదరీత్యా మనము పరిశుద్ధ గ్రంథములో కొన్ని సందర్భాల ద్వారా తెలిసికొందము.
ప్రియపాఠకులారా! ఈ బానిసత్వము, దాస్యము అను ఈ రెండును దేవుని చేతనే నరునికి సంక్రమించాయి. నరుడు దైవత్వమును అతిక్రమించనప్పుడు దేవుడు అనుగ్రహించిన రెండు ఆధిక్యత లేమనగా 1. పౌరసత్వము 2. వారసత్వము - ఇవి ఆత్మ సంబంధమైనవి - ఇవి లోకసంబంధమైనవి కావు. పరలోక సంబంధమైనవి. అంత ఉన్నతమైన ఐశ్వర్యాన్ని ప్రభువు నరునికి పరిశుద్ధ స్థితిలో అనుగ్రహించాడు. లూకా 2:14లో వ్రాయబడిన ప్రవచనము ''సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక! అని పరలోక సైన్య సమూహము - ఆ దూతతో కూడా ప్రవచించినట్లు ఈ వేదవాక్యములో చదువగలము. అంటే నరునికి దేవుడు అనుగ్రహించిన వారసత్వము పౌరసత్వము విలువలను గూర్చి పై వాక్యము ప్రబోధిస్తున్నది. అనగా ''సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ'' అనుటలో నరుడు ఆత్మసంబంధి గనుక ఆత్మ సర్వోన్నతమైన స్థలమునకు చెందింది గనుక నరునిలో జీవాత్మ సర్వోన్నతమైన స్థలములో నుండి దేవుడు నరునికి అనుగ్రహించిన జీవాత్మన్నది పరలోక సంబంధమే గాని భూలోక సంబంధి కాదు. కనుక సర్వోన్నతమైన దేవుని మహిమపరచవలసిన విధి నిర్వహణన్నది ఎంతో ఉన్నది. ఒక్కమాటలో చెప్పాలంటే నరునిలోని జీవాత్మ పరములోని పరమాత్మకు ఋణపడియున్నదని అనదగును. కనుక ఆ విధముగా సర్వోన్నతుడైన దేవుని మహిమపరచినప్పుడు భూమి మీద నరునికి సమాధానము దేవునితో ప్రశాంతత, నిర్భయముతో కూడిన జీవితము కల్గుతుందని దీని భావము. ఇది నరుల చేత సంక్రమించేది కాదు. సృష్టికర్తయైన దేవుని ద్వారా తప్ప మరెవ్వరి ద్వారాను ఇట్టి ఆధిక్యతను నరుడు పొందలేడు.
ప్రియపాఠకులారా! ఈ విధముగా స్వతంత్రుడైన నరునికి నారికిని కలిగిన బానిసత్వము దాస్యమును గూర్చి ఇంకను మనము లోతులో వేదరీత్యా ఆలోచిస్తే స్త్రీకి కూడా దేవుడు రెండు విధములైన బానిసత్వ దాస్యమును అనుగ్రహించినట్లు స్త్రీతో దేవుడు మాట్లాడిన సందర్భమును గూర్చి ఈ సందర్భములో ఆది 3:16లో ''ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు. నీ భర్త యెడల నీకు వాంఛ కల్గును, అతడు నిన్ను ఏలునని చెప్పెను.'' ఈ ప్రవచనములో స్త్రీకి దేవుడు విధించిన బానిసత్వము, దాస్యము అను రెండు గుణములు బయల్పరచుచున్నవి. 1. దాస్యము అనగా పురుషునికి పరిచర్య చేయుట, ఊడిగము చేయుట, అతనికి లోబడి జీవించుట, అనగా పురుషునికి ప్రధమ స్థానమును ఇచ్చి, తాను ద్వితీయ స్థానాన్ని అలంకరించుట. ఇది బానిసత్వము. రెండవది :- ఈ బానిసత్వ స్థితిలో స్త్రీకి పురుషుని మీద వాంఛ, ఆ వాంఛనుబట్టి సంభవించిన గర్భధారణ - తత్సంబంధమైన వేదన ఇవి దాస్యమును సూచిస్తున్నది. అనగా పురుషుని కొరకు వారసుని - స్త్రీ వాని తరము కొరకును, పురుషుని మీద వాంఛతో అతని ద్వారా స్త్రీ ధర్మాన్ని పాటించి, అతని కొరకు బిడ్డలను కనుట, ఆ బిడ్డలను నవమాసములు మోసి బిడ్డలను కని పోషించి పెద్ద చేయుట, అనగా పురుషుని కొరకు పెంచుట దాస్యము. అంతేగాకుండ సంతానముతోబాటు గృహ యజమానియైన పురుషునికి తన గృహ సంబంధముగా గృహిణి సంబంధ బాధ్యతలను నెరవేర్చాలి - ఇది దాస్యము.
ప్రియపాఠకులారా! ఈ విధముగా స్త్రీ పురుషులకు సంక్రమించిన బానిసత్వము దాస్యమన్నది దినదిన ప్రవర్థమానమై మూడు పువ్వులు ఆరుకాయలుగ విస్తరించి, అబ్రాహాము నుండి పాతనిబంధన గ్రంథము అంతము వరకును ఈ బానిసత్వము, దాస్యము ఇవి రెండును స్త్రీ పురుషుల జీవితాలలో బహుగా క్రియ జరిగించినట్లు వేదరీత్యా మనము కొందరి వ్యక్తుల జీవితాలనుబట్టి తెలిసికొందము. మొట్టమొదటిగా అబ్రాహాము విషయములో అబ్రాహాము భార్యయైన శారా అబ్రాహామునకు పిల్లలు కనుటన్నది ఒక సమస్యగా తయారైంది. అబ్రాహాముయొక్క విశ్వాసమునుబట్టి అబ్రాహామునకు సంతానము ఇవ్వలేని అశక్తుడు కాడు. అయినను అబ్రాహామును పరిశోధిస్తూ అబ్రాహాముకు వంద సంవత్సరాలు, శారాకు తొంబయి సంవత్సరాలు నిండినంత వరకు దేవుడు వారిపై పరిశోధన జరిగించాడు. అయితే ఈ పరిశోధనలో అబ్రాహాము ఏనాడు కూడా దేవుని తనకు సంతానము ఇవ్వమని అడిగినట్లు లేదు. అయితే దేవుడు అశక్తుడు కాడు. ఎందుకంటే ఎండవేళ అబ్రాహామునకు దర్శనమిచ్చిన దేవుడు ఆతిధ్యమును స్వీకరించి ఆయన అబ్రాహామును సంతానప్రాప్తునిగా ఆశీర్వదించిన సందర్భములో - మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను అప్పుడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగును,'' అన్నప్పుడు ఆ మాటలకు శారా తనలో నవ్వుకొనింది. శారా ఉన్న గుడారమునకు దేవుడు అబ్రాహాముతో మాట్లాడిన స్థలమునకును రాతివేత దూరము ఉన్నప్పటికిని, శారా దేవునియొక్క మాటలు విని - ముసలిదాననైన నేను సంతాన సౌభాగ్యము పొందగలనా? అని అనుకొని నవ్వటం దేవుడు విని నీ భార్యయైన శారా నవ్వనేల? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనను కలదా? నిశ్చయముగా నీకు సంతానము కలుగునని దీవించినప్పుడు అబ్రాహాము దైవవాక్కును విశ్వసించాడు. అనగా అబ్రాహాము యొక్క జీవితములో అబ్రాహాము దైవదాసుడేగాని లోకదాసుడు కాడు. లోకదాసుడైయుంటే శారా గొడ్రాలైనందుకు అనేకమంది స్త్రీలతో శారీర సంబంధము పెట్టుకొని అనేకులైన స్త్రీలతో ఈనాడు విశ్వాసులకు తండ్రిగా బిరుడును దేవుని చేత పొంది యుండెడివాడు కాడు. దైవజనాంగమైన ఇశ్రాయేలు అనెడు 12 గోత్రాల జనాంగమునకు అబ్రాహాము మూలపురుషుడు ఉండేవాడు కాదు.
ప్రియపాఠకులారా! అబ్రాహాము దేవుని చిత్త ప్రకారము దేవునియొక్క హెచ్చరికను పాటిస్తూ - దైవ మాటకు చెవినిచ్చి దేవుడు వెళ్ళమన్న మార్గములో వెళ్ళి - ఆయా మార్గాలలో దేవునికి బలిపీఠములు కట్టి బలులర్పించుచు, అబ్రాహాము తన జీవితము పర్యంతము దేవుని మహిమపరచుచు హృదయశుద్ధి గలవాడు. స్వేచ్ఛాజీవి దైవచిత్తము కొరకు ఎదురుచూస్తూ ఒకరి క్రింద దాస్యము చేయలేదు. అందునుబట్టి దేవుడు అతనికి తోడై అబ్రాహాముకు దాసదాసీలు ఇచ్చాడు. ఇక రాజ్య పరిపాలనలో తలవంచినవాడు కాదు. అబ్రాహామును లోక దాస్యానికి అప్పగించలేదు. తన దాసునిగాను, తన విశ్వాసిగాను, దేవుడేర్పరచుకొన్నాడేగాని, ఏ పరిపాలకునియొక్క పరిపాలనలో బానిపత్వముతో గాక తలవంచని స్థితిలో జీవించాడు. ఈ విధముగా అబ్రాహాము స్వతంత్ర జీవిగాని, భార్య విషయములో పొరబడ్డాడు. ఎందుకనగా తొంబయి సంవత్సరాలు దీర్ఘకాలికముగా సంతాన హీనురాలైన శారా ఒత్తిడికి లోనై, తన ఇంటికి దాసీగా ఉన్న స్త్రీని కూడుటన్నది శారా యొక్క ప్రబోధము. శారాలో కలిగిన ఈయొక్క మానసిక బలహీనత దైవజనాంగమునకు బదులు ఇష్మాయేలీ జనాంగము అను వేరొక జనాంగము భూమి మీద విస్తరించుటకు మూలకారకమైంది - వీరు ఇశ్రాయేలుకు సమవారసులు కారు. ఈ జనాంగము విస్తరించుటకు కారణము శారాయే. శారా యొక్క ప్రేరేపణ వలన శారా యొక్క అవివేకము వలన శారా యొక్క వత్తిడి వలన అబ్రాహాము జీవితములో రెండు విధమైన జనాంగాలకు అబ్రాహాము మూలపురుషుడు కావలసివచ్చింది.
ప్రియపాఠకులారా! హాగరు అబ్రాహాము గుడారములో దాసి. అబ్రాహామునకు హాగరు చేసిన దాస్యమునకు ప్రతిఫలముగా అబ్రాహాము చేత హాగరుకు గర్భఫలాన్ని అనుగ్రహించి, అంతవరకును అబ్రాహాము శారాల యొక్క చెప్పు చేతలలో వారి యొక్క చిత్తానుసారముగా వారి మాటలను జవదాటక వారి కష్టసుఖాలలో వారితో ఉంటూ భారభరిత ఊడిగము చేసినందుకు అనగా అబ్రాహాము గృహములోని బానిసత్వము, దాస్యము నుండి విముక్తురాలగుటకు కారణము - దేవుడనుగ్రహించిన సంతానమే. ఇష్మాయేలు జననము వలన హాగరుకున్న బానిసత్వము దాస్యము నుండి విడుదల పొంది స్వతంత్రురాలైంది. శారా యొక్క ప్రబోధము మూలముగా అబ్రాహాము తన దాసియైన హాగరును, ఆమె బిడ్డను నిర్ధాక్షిణ్యముగా అజ్ఞాత ప్రదేశములో వదలివేయుటన్నది హాగరుయొక్క జీవితములో బానిత్వము, దాస్యము నుండి విడుదల పొంది, స్వతంత్ర స్థితికి అడుగు పెట్టుటకు దేవుని ద్వారా ప్రవేశించినట్లు మనకు ఇందునుబట్టి తెలుస్తున్నది.
కనుక ప్రియపాఠకులారా! బంధవిముక్తి, దాస్యవిముక్తి రెండును ఇష్మాయేలు ద్వారా దేవుడు హాగరుకు అనుగ్రహించాడు. అనగా అబ్రాహాము గృహములోని బంధములోను, బానిసత్వములోను ఊడిగములోను, ఏ విధమైన పాలుపంపులు లేకుండ సుస్థిరమైన స్వాతంత్య్రాన్ని ఇష్మాయేలునుబట్టి హాగరు దైవత్వము నుండి పొందగల్గింది. ఈ విధముగా స్వతంత్రుడుగ జీవించినటువంటి అబ్రాహాము యొక్క జీవితములో కూడా కొన్ని చేదు అనుభవాలు కలిగినవి. మొదటిది భార్యయైన శారా ఒత్తిడికి మానసికముగా అబ్రాహాము బాధించబడినాడు. రెండవది అబ్రాహాముకు తెలియని రీతిగా అన్య స్త్రీ సాంగత్యము, పొందునకును, కలయికకు ప్రేరేపించుట. ఇందునుబట్టి కసాయి జనాంగానికి కారకురాలైంది. ఇది శారా యొక్క దుడుకుతనమునకు దేవుడు జరిగించిన ప్రతీకారమైయున్నది. ఈ విధముగా ప్రారంభించబడిన ఈ బానిసత్వము, ఈ దాస్యము అన్నది అబ్రాహాముయొక్క కొడుకైన ఇస్సాకు విషయములో కూడా - ఇస్సాకు తన తండ్రి వలె స్వతంత్ర జీవితము అనుభవించిన జిహ్వ చాపల్యమునుబట్టి, భోజన పదార్థమునకు బానిసయై, మాంసాహార అపేక్షతో వ్యామోహముతో అంధత్వములో కుమారుని విషయములో తన భార్యయొక్క కుయుక్తికి బానిసయై ఉచితానుచితాలను గ్రహించలేని స్థితిలో దిగజారి, జ్యేష్టునికి ఇవ్వవలసిన దీవెనలను కనిష్టునికి ఇచ్చి, జ్యేష్టత్వములో ఉన్నటువంటి విలువను, ఉన్నత స్థితిని గ్రహించలేకపోయాడు. అనగా పెద్దకుమారుడైన ఏశావుకు ఇయ్యవలసిన ఆశీస్సును చిన్న కుమారునికి ఇచ్చి అంగలార్చినాడు.
అలాగే యాకోబు కూడా తన మామయైన లాబాను గృహములో తాను వరించిన స్త్రీ మీదనున్న ప్రేమానురాగమును బట్టి ఏడు సంవత్సరాలు బానిసత్వములో లాబానునకు ఊడిగము చేసి, తాననుకున్నటు వంటి తాను వలచిన భార్యను పొందలేక పోగా ఆమెను గూర్చి మరి ఏడు సంవత్సరాలు బానిసత్వముతో కూడిన ఊడిగమును 14 సంవత్సరాలు ఇద్దరు స్త్రీలను భార్యలుగ పొందడము - వారి ద్వారా సంతానవంతుడై 12 మంది కుమారులను కని, దైవత్వములో ఒక ప్రత్యేక స్థానము పొందినట్లు చదువగలము. అయితే యాకోబు తన బానిసత్వపు జీవితములో కృంగి, నలిగి, కృశించియున్న సందర్భములో యాకోబు కుటుంబ వైరాగ్యము పొంది, ఒకానొక దినమున తనయొక్క సమస్తమును వదలి ఏకాంతములో ఉండగా - ఒక నరుడు యాకోబుతో తెల్లవారు పర్యంతము పెనుగులాడగా ఆ పెనుగులాటలో యాకోబును ఆ వ్యక్తి గెలవకుండుట చూచి, అతనిని ఆశీర్వదించిన విధానము - ''నీవు మనుష్యులతో కాదు గాని దేవునితోనే పోరాడి గెలిచితివి. కనుక ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు - ఇశ్రాయేలు. యాకోబు అనగా మోసగాడు - మోసగాడు బానిసత్వములో జీవించాడు. మోసానికి దాసుడై చలామణి అయ్యాడు. లోకముతో మోసపోయాడు. మోసాన్ని ధరించుకొన్నాడు - దానికే అలవాటు పడ్డాడు. అట్టి వ్యక్తిని దేవుడు మోసము అను బానిసత్వము నుండి, మోసపూరిత క్రియలు అను ఊడిగము నుండి విమోచించి, ఇశ్రాయేలు నామధేయముతో అనగా దేవుని బిడ్డగా అతనిని - అతని 12 మంది సంతానాలను 12 గోత్రాలుగా జేసి, ఇశ్రాయేలు అను ప్రత్యేక జనాంగమును తన కొరకు భూమి మీద ఏర్పరచుకొన్నాడు. వీరు కూడా దేవునితో విశ్వాసములో నిలకడగా ఉండలేక అన్యులకు బానిసలుగాను, దాసులుగాను, వారియొక్క అవిశ్వాసము దైవత్వముపై వారు చేసిన తిరుగుబాటు చేసి శరీర అజ్ఞానమును బట్టి ఉగ్రతతో మొత్తగ తమ వైఖరిని మార్చుకోలేదు. అనగా వారున్న తమ బానిసత్వమే తమకు మేలని భావించి, అన్యుల యొద్ద బానిసత్వమును అమోఘముగా ఆమోదించారు.
ఈ విధముగా చెడిపోయిన ఈ జనాంగమును గూర్చి దేవుడు విచారించి సంతాపపడి, వారిని స్వతంత్రులుగ చేయుటకును, అన్యుల యొద్ద బానిసత్వమును, అన్యుల చెర నుండి ఊడిగము నుండి విమోచించుటకు వారికంటూ మోషే అను ఒకే నాయకుని ఎంపిక జేసి, అతని ద్వారా వారిని బంధ విముక్తులుగా జేసి స్వతంత్రులుగా తనతో నడచుటకు మోషే అను నాయకుని నియమించాడు. ఆ విధముగా మోషే నాయకత్వము క్రింద స్వతంత్రులుగ నడిపించినను, వారు బానిసత్వమును మరువలేక మోషేను అనేకమార్లు వారు విసిగించి, మానసికముగా ఎన్నో విధాలుగ క్షోభ పెట్టినారు. అయినను మోషే వారిపట్ల శాంతము వహించి, దేవునికి మొరపెట్టి వారికి సంభవించే అరిష్టాల నుండి రక్షణ కల్గించాడు. అయినను ఇశ్రాయేలు వారి యొక్క బానిస బుద్ధిని, ప్రవృత్తిని విడనాడలేదు. వారి హృదయస్థితి ఎల్లప్పుడును దైవత్వమునకును, దేవుని ప్రవక్తలకును, దేవుని శాసనాలకును, దేవునియొక్క నడుపుదలకును, దేవుని నియమాలకును విరుద్ధములై; అనేకమార్లు దైవత్వముపై తిరుగుబాటు చేసి నొప్పించినందున మరణాన్ని చవి చూచారు. అట్టి మరణ ఉపద్రవాల నుండి వారిని విడిపించుటకు మోషే ఎంతో ఓర్పుతో దైవత్వమునకు సవినయముగా విజ్ఞాపన చేసి, ఎన్నోమార్లు ఇశ్రాయేలు తప్పిదాలకు ఇశ్రాయేలు పక్షముగా మొరపెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నవి. అట్టి సందర్భాలలో మోషే పట్ల దేవుడు బహు శాంతము వహించి, అనేకమార్లు ఇశ్రాయేలు యొక్క బలహీనతలకు సంతాపపడినను, మోషేను బట్టి శాంతించి వారికి తన రక్షణ, భాగ్యమును అనుగ్రహించినట్లు వేదరీత్యా చదువగలము.
ఈ విధముగా దేవుడునరకోటిని స్వతంత్రులుగా జీవించమన్నాడేగాని బానిసలుగా జీవించమనలేదు - జీవించుటకు నరులను పుట్టించలేదు. నరులయొక్క మానసిక బలహీనతలనుబట్టి ఆత్మీయ బలహీనతలను బట్టి లోకానికి అమ్ముడై, లోక బానిసత్వమునకు లోకదాస్యమునకును దిగజారి పోతున్నారు. ఈ బానిసత్వము నుండి దాస్యము నుండి విమోచించుటకు తన జనాంగమును క్రమబద్ధము చేయుటకు దశాజ్ఞలను రాతిపలకల మీద లిఖించి శాసనాన్ని రూపొందించి క్రియ జరిగించాడు. అయినను ఇశ్రాయేలు తమయొక్క బానిస వైఖరిని మార్చుకోలేదు. అందునుబట్టి దేవుడు ఆయొక్క దశాజ్ఞల శిలాపలకలకు తాను తన శక్తిని, తన మహిమనిచ్చి, చిత్తశుద్ధి, ఆత్మశుద్ధి లేనివాడైనను ఆయొక్క దశాజ్ఞల మందస పేటికను తాకుటకుగాని, సమీపించుటకుగాని, యోగ్యత లేని విధముగా వాటిలో ఉండి దేవుడు క్రియ జరిగించాడు. అంత ప్రభావితమైన ప్రమాదకరమైన ఆ దశాజ్ఞల పేటిక అను మందసమును గూర్చి ఇశ్రాయేలు గ్రహించి కూడా, అవిధేయులుగ ప్రవర్తించిన సంఘటనలు కూడా ఉన్నవి. అట్టి సందర్భములో దేవుడు వారిని నానావిధ అన్యజాతులకు బానిసలుగా చేశాడు. ఇశ్రాయేలు జీవితములో వారు పొందిన బానిసత్వము ఎలాంటిదంటే, మొట్టమొదటగ దేవుడు వారిని ఐగుప్తుకు బానిసగా చేశాడు. అటుతర్వాత ఫిలిష్తీయులకు అటుతర్వాత అనేకులైన అన్యరాజులు ఇశ్రాయేలుపై పెత్తనము చెలాయించినట్లు వేదరీత్యా ఎన్నో జాతులను గూర్చి తెలిసికోగలము. లూకా 4:18 చెరలో నున్న వారికి విడుదలను, నలిగినవారిని విడిపించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అన్న ప్రవచనమునుబట్టి లోకదాస్యములో ఉన్న మనలను మన బంధకాల నుండి విమోచించుటకు ప్రభువై వచ్చియున్నాడు. ఆయన ద్వారా మన లోక బానిసత్వము లోక దాస్యము నుండి సంపూర్ణ విడుదల కల్గించాడు.
ప్రసంగాంశము :- తీర్మానము
మూలము :- నూతన సంవత్సర సందేశము :- ప్రభువునందు ప్రియమైనవారలారా! ఈ నూతన సంవత్సరములో పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప తీర్మానముతో ముందుకు సాగిపోవాలని నిన్ను కోరుచున్నాడు. లోకములో ఎంతోమంది తమకు నచ్చిన వాటిపై అనగా కొనుట, అమ్ముట, పడగొట్టుట, కట్టుట, తీసివేయుట ఇవిగాక; జీవితము మీద విరక్తి గల్గి చావాలని, లేక దూరదేశములో బ్రతకాలని వగైరా రీతుల తీర్మానాలు చేస్తున్నారు. కొందరైతే ఎక్కువగా సంపాదించాలని గొప్ప రాజకీయవేత్త కావాలని వగైరా రీతులుతో తీర్మానాలు చేస్తున్నారు. ఇవి లోక సంబంధమైనవి. ఆత్మీయముగా పరలోక సంబంధమైన వాటి విషయములో దేవుడు నరుని ముందు రెండు మార్గాలుంచి ఏది కావాలో తీర్మానించుకోమంటున్నాడు.
ఇందులో 1. ఇరుకు మార్గము 2. విశాల మార్గము. ఇరుకు మార్గము పరలోకాన్ని చూపిస్తున్నది. విశాల మార్గము నరకాన్ని చూపిస్తున్నది. ఈ రెంటిలో ఏదోయొక మార్గాన్ని చేరుటకు నరుడు తీర్మానించు కోవలసియున్నది.
అయితే దేవుని బిడ్డలు దేవుని కోసం ఎటువంటి తీర్మానము చేయాలన్నది బైబిలు రీత్యా తెలిసికొందము :-
నిర్గమ 3: దేవుడు మోషేను పిలిచి ఐగుప్తు దేశములో ఫరో చేతిక్రింద బాధపడుచున్న తన ప్రజల విమోచనకు ఐగుప్తు చెర నుండి వారిని విడిపించుటకు నాయకునిగా నియమించుటకు తీర్మానించెను. అట్టి దేవుని తీర్మానాన్ని మోషే నెరవేర్చాడు. అదే విధంగా క్రొత్త నిబంధన కాలములో దేవుడు నరకోటి యొక్క బలహీనతకును పాపపు జీవితానికి పరితాపము జెంది, తానే నరరూపములో పాపపరిహారార్థము బలియాగము చేయుటకు తీర్మానించి, కన్య గర్భములో యేసు అను పేరున జన్మించాడు. తన తండ్రి చిత్త ప్రకారము తన విధిని నిర్వహించుటకు తీర్మానించి తన పనిని తుదముట్టించాడు. నేడు ఈ భూలోకములో ఐగుప్తు దేశమనే సాతాను రాజ్యములో ఎంతోమంది బంధించబడి బాధించబడుచున్నారు. వారినందరిని విడిపించి విమోచించటానికి మిమ్ముల మమ్ములను దేవుడు కోరుచున్నాడు.
మత్తయి 9:36-37లో యేసు జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరియున్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమేగాని పనివారు కొద్దిమంది అని యేసు చెప్పెను. ఈ విషయాన్ని గూర్చి యేసుప్రభువు ప్రతిష్టించిన అపొస్తలులు, పౌలు, స్తైఫను వగైరా హతసాక్షులు దైవరాజ్యమును గూర్చిన యేసు సువార్తను ప్రకటించుటకు తీర్మానించారు. ఇట్టి తీర్మానము ద్వారా అనేకాత్మలను సాతాను బంధకములలో నుండి విడిపించగలిగారు. వీరి పరిచర్యలో ఎదిగిన ఎంతోమంది యేసు సువార్తను చేతబట్టి సాతాను బంధకాలలో ఉన్న అనేకాత్మలను యేసు యొద్దకు తెచ్చుటకు తమ్ము సమర్పించుకొను తీర్మానము చేస్తూ సేవ చేస్తూ - ఆత్మల సంపాదనలో విజయాన్ని సాధిస్తున్నారు.
సోదరీ!సోదరా! నీ తీర్మానమేమి? ఈ నూతన సంవత్సరములో యేసు వార్తను నీ బంధువులు, నీ ఇరుగుపొరుగువారికి తెల్పుటకు నీ తీర్మానమేమిటి? యేసుక్రీస్తు నీ, నా పాపములను తుడిచివేయుటకు ఆ మహిమ రాజ్యము వదలి తన్ను తాను తగ్గించుకొని తీర్మానించుకొని లూకా 19:10లో వలె వచ్చాడు. నేడు నీవు కూడా నశించిపోయే ఆత్మలను వెదకి రక్షించుటకు నిన్ను నీవు తీర్మానించుకో! ఇందుకు పరిశుద్ధాత్ముడు నీకు సహాయపడును గాక!
ఆలయ ప్రతిష్ట (శంకుస్థాపన)
మూలము :- మత్తయి 16:18 ప్రభువునందు ప్రియమైన సంఘమా? మన జీవితములో అనేకమైన సందర్భములలోను, కార్యక్రమాలలోను, లోకరీత్యా లోక ధర్మము చొప్పున, శారీర జీవితమునకు దీని మనుగడకు ఎన్నో ప్రయాసలు పడి చిత్రవిచిత్రములైన కడ్డడములను లోకసంబంధముగా నిర్మించుకుంటున్నాము. అందులో ఉదా|| గృహము, పాఠశాల, కార్యాలయము, కర్మాగారము, ఆశ్రమము, కళ్యాణమంటపము, వైద్యశాల, బస్‌స్టేషను, రైలుస్టేషను, ధర్మల్ స్టేషను వగైరాలు - ఇవి శరీర జీవితమునకు ముఖ్యములైయున్నవి. ఈ ఉదహరించినవన్నియు కూడా నరరూపమైన ఈ శరీరమునకు అగత్యములై యున్నవి.
లోకములో సంఘములోను సమాజములోను మరియు పుట్టిన దేశములోని పట్టణములో నివసించుటకు మొట్టమొదటగా ప్రతి వ్యక్తికిని గృహము కావలసియున్నది. ఇది కలపతోను లేక రాళ్ళతోను లేక పర్ణశాలగానో ఏ రూపమైనప్పటికిని దానిని గృహమంటారు. ఇది మానవ జీవితమునకు అవసరమై యున్నది. ఇట్టి గృహములో వ్యక్తిగా జీవించుటకు అనగా సంసారము లేక శారీర పోషణకు ఒక వృత్తిని ఆచరించుటకు ఆయా శాఖల ద్వారా ఆయా రూపములుగా అనగా ప్రభుత్వ కార్యాలయములలో ఉద్యోగములు లేక కార్ఖానాలలో పనులు వగైరాలతో జీవనోపాధి. ఇందుకు విద్య అవసరము గనుక తత్సంబంధమైన బాషాయుత పాఠశాల దేహమున కవసరమైయున్నది. ఇందులో వేదజ్ఞానమునకు కావలసిన అక్షరజ్ఞానము, వృత్తి ఉద్యోగాలకు కావలసిన తర్ఫీదును పొందవలసియున్నది.
ఇట్టి మానవ జీవితములో దేహమునకే దేని ఒక అనారోగ్యము అనగా జబ్బుగాని, గాయముగాని, వ్యాధిగాని దాపురించినప్పుడు దానికి చికిత్స చేయుటకు కూడా వైద్యశాలయను భవనము నిర్మించబడి యున్నవి. మరియు ఒక చోటు నుండి మరియొక్క చోటికి వెళ్ళుటకు అనగా మన దేహము ఒకచోట నుండి మరియొక్క చోటికి రవాణా అగు క్రియను ప్రయాణమంటారు. ఇట్టి ప్రయాణమునకు వాహనములు అవసరములైయున్నవి. ఈ వాహనాలు బస్ స్టేషను, రైలు స్టేషను, హార్బరు, విమానాశ్రయము, ఇంకా సైకిలు, రిక్షా స్టాండు, ఆటో రిక్షా స్టాండు, జట్కా బండ్ల స్టాండు అని కట్టడాలు లేనప్పటికిని, ఆయా నామధేయములతో ఆయా వాహనములు నిలుచు స్థలములను, స్టేషన్లని పేరు పెట్టి, ఆయా ప్రయాణీకులకు తగు వసతులతో ప్రయాణ వసతి కల్పించుటకు యిట్టి స్టేషన్లు పనిజేయుచున్నవి.
ఇప్పటివరకు ఉదహరించబడిన ఇవన్నియు కూడా జీవించియున్న దేహమును మోసుకొని పోవుటకును, దానికి మనోల్లాసమును కల్గించుటకును నరుల చేత ఎన్నిక చేయబడి ఏర్పరచబడియున్నవి. నరునికి చివరి స్టేషను ఏది? నరదేహమునకు చివరి స్టేషను ఏదంటే సమాధుల స్టేషను. దీనినే పీనుగుల రేవు అని మన పూర్వీకులు పిలిచేవారు. పశువుల దొడ్డి మాదిరిగానే దీనికిని సమాధుల దొడ్డియని మరి యొక్క పేరు నరసందోహములో ఉన్నది. ఇక్కడ నుండి నరజీవితమునకు సంపూర్ణమై భూమిపై నుండి తుడిచి పెట్టబడును. అనగా నరుని అంతమునకు చివరి స్టేషను యిది. సమాధులతోటలో వరకే నరుని రూపము చివరి సారిగా చూడగలము. ఇట్టి స్టేషను ప్రతి యొక్క నరుడును చేరవలసియున్నది. ఏ నరుడును ఈ యొక్క స్టేషనుకు రాకుండ తప్పించుకోలేడు. పోలీసుస్టేషనులో నైన పూచీ మీద లేక ఒక పెద్ద రాజకీయవేత్త సిఫారసు మూలముగా దెబ్బలను మరియు నేరము నుండి తప్పించుకొని బయట పడగలముగాని ఈ సమాధుల స్టేషనులో రెకమెండేషన్లు ఏవియు ఉండవు. ఎందుకంటే వ్యక్తిలో జీవము లేనందువల్ల చనిపోయిన వ్యక్తి తాలూకూ ప్రతివాడును సిఫారసు పత్రాలతో అక్కడకు చేరుటకు, చనిపోయిన వ్యక్తిలో జీవముండదు మరియు ఆ శరీరము కుళ్ళి చెడి దుర్గంధపూరితమైన స్థితిలోకి దిగజారును గనుక లోకసంబంధమైన సిఫారసులు అక్కడ కోరరు.
అయితే ఈ సమాధుల స్టేషనులో ప్రవేశించే వ్యక్తికి జీవముండదు, ఆత్మ ఉండదు. పై ఉదహరించిన ఆరు స్టేషనులలో అనగా ఈయొక్క సమాధుల స్టేషనుకు లింకులున్నవి. ఏలాగంటే బస్ స్టేషనులో బస్ ఎక్కిన వ్యక్తి బస్ ప్రమాదములో మరణిస్తే ఈ చోటికి చేర్చబడును. అదే విధముగా రైలు స్టేషనులో రైలు ఎక్కిన వ్యక్తి రైలు పట్టాలు తప్పి ప్రమాదానికి లోనైనప్పుడు చనిపోయి ఈ స్టేషనుకు వచ్చును. అదే రకముగా ఓడ రేవులో ఓడ ఎక్కిన వ్యక్తి ఓడ మునిగి మరణించినప్పుడు ఈ స్టేషనుకు వచ్చును. అదే విధముగా పడవ రేవులో పడవ మునిగి మరణించి ఈ రేవులోకి వచ్చుచుండును. అదే రకముగా విమానాశ్రయములో విమానమెక్కిన వ్యక్తి విమాన ప్రమాదానికి గురియై మరణించినప్పుడు ఈ సమాధుల స్టేషనుకు చేర్చబడును. ఇది లోక సత్యము.
ఇట్టి భయంకరమైన నిర్జీవమైన స్థితి నరదేహమునకు కలుగక పూర్వము అనగా ఆత్మ శరీరము ఏకమైయుండి, నరుడు మానవత్వముతో జీవితుడైయున్నప్పుడే కీర్తనలు : దావీదు మహారాజు పల్కిన రీతిగా యెహోవా నా ఆశ్రయము, నా దుర్గము, నా కోట, నాకేడెము అన్నట్లుగా పరమాత్మయైనట్టి త్రియైక దేవుడైన యెహోవా - యేసు - పరిశుద్ధాత్మ అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను నామములతో రూపించబడిన ఒక స్టేషను మనము బ్రతికి ఉన్నప్పుడే మనకవసరమైయున్నది. దీనిని క్రీస్తు దేవాలయము లేక ప్రార్థనా మందిరము అని అంటున్నాము. ఇది ప్రతి వ్యక్తికిని చనిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళు స్థలమునకు అనగా పరలోకములో ఉన్నట్టి మరియొక స్టేషనుకు, నరునియొక్క ఆత్మను పంపుటకు కార్యాలయముగా మరియు తర్ఫీదు కేంద్రముగా ఈయొక్క దేవాలయము రూపించబడియున్నది. ఇట్టి దేవాలయ నిర్మాణాన్ని గూర్చి ఈ రోజునకు శంకుస్థాపన అనగా ఆలయ నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమము మనము నేడు జరుపుకొంటున్నాము.
యేసుప్రభువు ఈ లోకములో జీవించియున్నప్పుడు మత్తయి 16:18 ఈ బండ ఎట్టిదో ఎటువంటి గుణాతిశయములు కలదో యెషయా 28:16లో చదువగలము. ఈ పునాది రాయి ఎవరో మొదటి కొరింథీ 3:1లో క్రీస్తుని తెలియుచున్నది. ఇట్టి పునాదిపై సంఘాలయమును కట్టిన మనము బాధ్యతాయుతమైన అధికారమును మత్తయి 16:19లో చదువగలము. ఇట్టి దైవోద్దేశ్యముతో క్రీస్తను బండ మీద కట్టబడిన ఈ దేవాలయము పాతాళ లోక ద్వారములను పడగొట్టి శృంగారమను ద్వారముగా సువార్త ప్రకాశముతో వెలుగొంది, చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలోని అన్య సోదరుల నాకర్షించి, అనేకులను ప్రభువులోనికి నడిపించి దైవ ప్రణాళికను నెరవేర్చును గాక!
ఇందులోని ఒక గొప్ప దైవరహస్యాన్ని మనము గ్రహించవలసియున్నది. తల్లి గర్భములో ప్రవేశించిన మనము మన జీవిత యాత్రను ముగించుకొని భూగర్భములోకి ప్రతి యొక్కరము వెళ్ళవలసిన వారమైయున్నాము. ఎలాగంటే రైలుస్టేషనులో రైలు ఎక్కిన వ్యక్తి మరియొక్క రైలు స్టేషనులో దిగాలి. బస్ స్టేజీలో బస్ ఎక్కిన వ్యక్తి మరియొక్క బస్ స్టేజీలో దిగాలి. అదే విధముగా విమానాశ్రయములో విమానమెక్కిన వ్యక్తి మరియొక్క విమానాశ్రయములో దిగాలి. ఇట్లు దిగుట, ఎక్కుట అనుక్రియను ఈ స్టేషనులలో జరుగు సందర్భములో వాహనము ఆ స్థలము చేరునంతవరకు అనగా బస్సుగాని, రైలుగాని విమానముగాని అవి వచ్చు సందర్భములో వాటి కొరకు కాచుకొని యుండుటకు వెయిటింగ్ రూమ్స్ అని చక్కటి వసతి గృహాలు నిర్మింపబడియుండును.
ఆవిధముగానే మనయొక్క నరజీవితము ప్రారంభము నుండి అంతము వరకు కొనసాగించుటకు నిరీక్షణాయుతమైన జీవితము కొరకు ఎన్నిక చేయబడిన ఆలయమే నేడు క్రైస్తవులమైన మనము ప్రతి వారము కూడుకొను చర్చీయైయున్నది. ఇది వెయిటింగ్ రూం. అనగా ప్రభువు రాకడకు కనిపెట్టియుండి మెలకువతో కాచుకొని యుండుటకు ఏర్పరచబడిన కట్టడము. ఈ సందర్భములో యోహాను సువార్త 14:1-4 యేసు ప్రభువు మన స్థిరమైన స్టేషను గూర్చి వివరించినట్లు మనము ఆ వేద భాగములో చదువగలము. రెండవ కొరింథీ 5:1 ఈ నివాసమును గూర్చి క్రైస్తవుడు ఎరుగవలసిన నివాసమైయున్నది. ఇట్టి నివాసమునకు మనము ప్రవేశించాలంటే ఈ లోకములో మనము దైవభక్తితో కూడి, త్రియైక దేవుని భక్తితో స్తుతించుటకును, కీర్తించుటకును, ఘనపరచుటకును, మహిమపరచుటకును, ఆరాధించుటకు ఈ లోకములో మనకొక నివాసము కావలసియున్నది.
..........
అంశము :- ''ఆయన మీతో చెప్పునది చేయుడి.'' యోహాను 2:1-9.
ప్రియపాఠకులారా! పై వేదభాగమునుగూర్చి ఎన్నోమార్లు దైవజనుల చేత బోధించుట మనమెరిగిన విషయమే! ఎన్నోమార్లు కానాలోని వివాహమును గూర్చి నానారీతులుగా వినియున్నాము. ప్రభువు చేసిన కానాలోని తొలి మహిమాన్విత క్రియను గూర్చిన వ్యాఖ్యానము విని విని మనకు పాతగిలి ఉండవచ్చును. కాని ఎంత మంది బోధకులు ప్రవచించిన ఎన్నోసార్లు ఆ సంఘటనను గూర్చి తెలిసికొన్నను, ఎన్నిసార్లు ఆ వాక్యము ద్వారా ప్రవచింపబడిన వేదములోని ప్రతి మాట నూతన జ్ఞానము, నూతన అర్థము, నూతన మర్మము, నూతనోద్దేశ్యమును బయల్పరచుచు వాక్యము వినే మనకు క్రొత్తదనాన్ని కల్గిస్తుంటుంది. వేదములో వ్రాయబడిన సారాంశములో కానాలో ఒక వివాహము జరిగినట్లును, యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును, ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువబడినట్లును, ఆ పిలుపు అందుకొని ప్రభువును, ఆయన శిష్యులును ఆ వివాహములో హాజరైనట్లును, ఆ వివాహము బహు ఘనముగాను, ఆడంబరముగాను, అధికమైన వ్యయముతో కూడినదై ఇరువర్గాల బంధుమిత్రులు, ప్రముఖ వ్యక్తులతోను, అతిరధులు, మహారాజులు, వగైరాలు ఎందరో ఆ వివాహమునకు హాజరైనట్లును, ఇంట గొప్ప జన సమూహముచే ఘనముగా జరిగిన ఆ వివాహములో ప్రతి వస్తువు కూడా వాడబడినట్లును, ఇక విందు సందర్భములో ఘనమైన ఖరీదైన వంటలను, రుచికరమైన నోరూరించే నానావిధమైన పిండివంటలు ఒకటేమిటి? సకల విధ షడ్రసోపేత విందు ఆ వివాహములో ఏర్పాటు చేయబడి యుండగా - ఇవన్నియు కూడా వచ్చిన అతిధులకు పుష్కలముగా ఉన్నవి. అయితే ఆ వివాహమహోత్సవములో వాడబడిన కాలములో ప్రాముఖ్యమైనటువంటి పానీయము పెండ్లి యొక్క ఘనతను చాటి చెప్పే పానీయము, పెండ్లి ఇంటి ఐశ్వర్యాన్ని హరించేటటువంటి పానీయము, నరునియొక్క ఆయుస్సును తగ్గించే పానీయము, నరుని దేహానికి హానికరమైన పానీయము, మానవత్వాన్ని ఛిన్నాభిన్నము చేసే పానీయము, మనస్సాక్షి గల నరుని మనస్సాక్షి లేని వానినిగా చేయుటయేగాక వానిని పశుతుల్యునిగా చేసే పానీయము, మానవత్వాన్ని మంట గలిపి వాని గౌరవాన్ని మట్టిపాలు చేస్తూ - నరునికిని, దేవునికిని అనగా మానవత్వానికిని, దైవత్వానికిని విరోధియైనటువంటి పానీయమైన ద్రాక్షరస మద్యమునకు ఆ పెండ్లి ఇంట కొరత ఏర్పడినట్లు - కానాలోని ఆ వివాహములో ఏర్పడిన ప్రాముఖ్యమైన మద్యపానమును గూర్చిన కొరత. ఈ మద్యపానము నాటి వివాహాలలోను, పండుగలలోను, శుభకార్య సందర్భాలలోను, ప్రయాణాలలోను విరివిగ వాడబడుచున్నట్లు ద్రాక్షారస ప్రాముఖ్యత ఇందునుబట్టి మనకు తెలియుచున్నది.
అయితే ప్రియపాఠకులారా! సకల వస్తుసంబారాలుండగా ద్రాక్షారసము అన్నది మాత్రము కొరత ఏర్పడుటన్నది పెండ్లి ఇంటివారి లోపమా? ఏది? ప్రియపాఠకులారా! ఈ సందర్భములో మనము యోహాను 11:1-4 చదివితే మరియ, ఆమె సోదరీ మార్త అను వారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అను ఒకడు రోగి అయినట్లును, ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తలవెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడైనట్లును, అతని అక్కచెల్లెండ్రు - ప్రభువా! ఇదిగో నీవు ప్రేమించువాడు రోగియైయున్నాడు,'' అని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని - ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని అనుట; మరి అలాగే కానాలో ద్రాక్షారస కొరత కూడా దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడునట్లు దేవుని మహిమ కొరకు కొరత ఏర్పడినట్లు గ్రహించాలి. అంటే కానాలో పెండ్లి ఇంటివారికి ఏర్పడిన ద్రాక్షారస కొరతన్నది దైవకుమారునియొక్క మహిమాన్విత క్రియ ద్వారా లోకమునకు కనువిప్పు కల్గించుటకే ద్రాక్షారస కొరత ఏర్పడినట్లు మనము గ్రహించాలి. లాజరు జబ్బు మరణము కొరకు కానప్పుడు ద్రాక్షారస కొరత వలన పెండ్లి గృహము - అభాసుపాలు కాకుండునట్లు దేవుని ద్వారా దైవకుమారుడు మహిమపరచబడునట్లు దేవుని మహిమార్థము దైవకుమారుడైన క్రీస్తుయొక్క మహిమాన్విత క్రియ ద్వారా లోకానికి కనువిప్పు కల్గించుటకు పెండ్లి గృహమునకు ద్రాక్షారస కొరత ఏర్పడినట్లు ఇందునుబట్టి మనము తెలిసికొనవలసియున్నది.
ప్రియపాఠకులారా! యోహాను 11:3లో లాజరు అక్కచెల్లెండ్రు ప్రభువా! నీవు ప్రేమించువాడు రోగియైయున్నాడు,'' అని ప్రభువుకు వారు విన్నవించుకొన్నారు. వీరు స్త్రీలే. కానాలో పెండ్లి గృహములో ద్రాక్షారసము అయిపోయినదని అదే ప్రభువుకు విన్నవించుకొన్నది స్త్రీయైన యేసుప్రభువు తల్లియే! అక్కడ మరియ నామమే! ఇక్కడ కూడా మరియ నామమే.
ప్రియపాఠకులారా! బేతనియాలోని మరియమ్మయొక్క విజ్ఞాపనను ప్రభువు విన్నాడు. కానాలో కూడా తల్లియైన మరియ చేసిన విజ్ఞాపన కూడా ప్రభువు విన్నాడు. ఇద్దరి విషయములో వారు చేసిన విజ్ఞాపన ప్రకారము క్రియ జరిగించాడు. కాని వారు చెప్పిన వెంటనే ప్రభువు జరిగించలేదు. అలాగే రోగియైయున్న లాజరు విషయములో తన చిత్తము, తన తండ్రి చిత్తము ప్రకారము రెండు దినములు ఆలస్యము చేశాడు. తనను కని గర్భమున మోసిన తల్లియొక్క విజ్ఞాపనము విన్నాడు. అయితే ఆమెను హెచ్చరిస్తూ, ''నాతో నీకేమి? అన్నట్లున్నదేగాని, అయితే ఆమె విజ్ఞాపన ప్రకారముగ ఆయన క్రియ జరిగించాడు. ఈ క్రియ ఎలా జరిగింది? తల్లియైన మరియతో యేసుప్రభువు అమ్మా! నాతో నీకేమి? నా సమయమింకను రాలేదని, ఆ సమయము కొరకు కనిపెట్టుచు - ఆ సమయములో తాను చేయవలసిన కార్యమేదో నిర్ధారణ చేసికొని, తన ప్రణాళికను అమలుపరచుటకుగాను ఆ పెండ్లి ఇంటి వాకిట నున్న ఆరు రాతి బానలను సాధనాలుగ, పాత్రలుగ, పనిముట్లుగ వాడుటకు వాటిపై దృష్టి కేంద్రీకరించాడు.
ఈ విధముగా ప్రభువు దృష్టిలో నిలబడిన ఆరు రాతిబానలు ఆ వరకు అవి అతిధులకు కాళ్ళు, ముఖము కడుగుకొనుటకుగాను, బాహ్య కార్యక్రమములకు వాడబడుటకు తృణీకరించబడి విలువ లేని స్థితిలో వాకిట ఎండకును, వానకును, గాలికి వదిలివేయబడి నిరాదరణ స్థితిలో - ఆ ఆరు రాతి బానలు ఉండుటన్నది ప్రభువు చూచి మొట్టమొదటగ ఆ ఆరు రాతిబానల ద్వారా పెండ్లి ఇంటి కొరతను తీర్చుటకు ఒక పధకమును రూపించుకొని, ఆ పథకము ప్రకారము ఆ పెండ్లి ఇంట పరిచారకులను పిలిచి ఆ బానలను నీటితో నింపమని చెప్పగా వారు ఆయన మాటలు విని అంచుల మట్టుకు నింపిరి. ఆ విధముగా నింపబడిన బానల ద్వారా దైవ మహిమాన్విత ప్రయోగమును ప్రయోగించుటకు ఆ పెండ్లి గృహములో యేసు ప్రభువు - అంచుల వరకు నీటితో నింపిన పరిచారకులతో అనగా ఏ నీటితో అంచుల వరకు నింపినారో ఆ నీటిని ముంచి విందు ప్రధాని యొద్దకు తీసికొని పొమ్మని ఆజ్ఞాపించినప్పుడు - నీరు ద్రాక్షారసముగా మారుటన్నది సమంజసమేనా? సాధ్యమేనా? ఇది నమ్మదగిన విషయమేనా? వాస్తవమునకు ఇది మానవునియొక్క జ్ఞానానికి, మానవ బుద్ధికి, వాని ఊహకు అయోమయ విషయమే!
ప్రియపాఠకులారా! యేసు మాటలందు విశ్వాసముంచి ఆ పరిచారకులు నీటితో పాత్రలను ముంచి పైకెత్తినారో - ఆ పైకెత్తబడిన నీరు ద్రాక్షారసముగా మారినట్లు ముఖ్యముగా మనము గ్రహించాలి. ఆ పరిచారకులు బానలలోని నీళ్ళు ముంచకుంటే నీళ్ళే! పాత్రలతో ముంచి పైకెత్తినప్పుడు అది ద్రాక్షారసముగా మారింది. అంతియేగాక పరిచారకుల చేత వివాహ విందులో పంచిన ఈ నీళ్ళు ద్రాక్షారసమై విందు ప్రధానికి అనగా ఆ వివాహ విందును నిర్వహించేవాడు అనగా అతిధులను ఆహ్వానించుట, ఆదరించుట, వారిని సన్మానించుట - వారి అవసరాలను గుర్తించే హోదాలో ఉన్న ఆ విందు ప్రధానిని ఈ నీళ్ళు బానలలో ముంచి పరిచారకులు తీసుకొని వెళ్ళగా నీళ్ళు మార్గములో పరిచారకులు సరఫరా చేసేటప్పుడు సామాన్య ద్రాక్షారసముగా కనబడినను విందు ప్రధానిని మత్తెక్కించి తన్మయునిగ పరవశునిగ చేయగా - తానెన్నడు తాగనటువంటి ద్రాక్షారస మాధుర్యాన్ని, ఆహ్లాదకరమైనటువంటి స్థితిని - తనకున్న ద్రాక్షారస అనుభవాన్ని గూర్చి పెండ్లికుమారునికి సాక్ష్యమిచ్చి, ఎవడైనను మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పుట, ఇది ద్రాక్షారసములో ఉన్నటువంటి అనుభవమును గూర్చినటువంటి సాక్ష్యాన్ని - పెండ్లి కుమారుని ఎదుట విందు ప్రధాని చెప్పుటయే!
ప్రియపాఠకులారా! మన జీవితములో మనము గ్రహించడమన్నది ఎంతో ముఖ్యము. ఇందులో మంచి ద్రాక్షారసమంటే ఏమిటి? జబ్బు ద్రాక్షారసమంటే ఏమిటి? మంచి ద్రాక్షారసమంటే పులియనిది, తాజాదనము కల్గింది, అప్పటమైంది, ఆహ్లాదకరమైనది, నరునికి సేదదీర్చేది, విశ్రాంతి కల్గించి నరుని దేహానికి బలాన్ని ఇచ్చేది. మంచి ద్రాక్షారసమంటే ఏమిటో? అన్నది ముందుగా తెలిసికోవలసియున్నది. యేసుప్రభువు తననుగూర్చి యోహాను 15:1లో లోకానికి బయల్పరచిన విధముగా నేను నిజమైన ద్రాక్షావళ్ళిని, నా తండ్రి వ్యవసాయకుడు.'' కీర్తన 128:3, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవళ్ళి వలె నుండును. యేసుక్రీస్తు తన రక్తమును ద్రాక్షారసముగా అభివర్ణించియున్నాడు. అలాగే ఆదికాండము 49:11లో యాకోబు తన కుమారులతో మాట్లాడుచు పల్కిన కొన్ని మాటలను చదువగలము. ''ద్రాక్షావళ్ళికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావళ్ళికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షా రక్తములో తన వస్త్రమును ఉదుకును.'' ఇవన్నియు ఫలభరితమైన ఆత్మీయ జీవితానికి సాదృశ్యాలు. ఈ ఫలభరిత జీవితము శారీర సంబంధముగా ఉంది, ఆత్మసంబంధముగాను ఉంది. శారీర సంబంధముగా శారీర ఫలాలు ఫలించాలి, ఆత్మసంబంధముగా ఆత్మ ఫలాలు ఫలించాలి. ఇందునుగూర్చి గలతీ 5:19-24లో శారీర ఫలములను గూర్చి ఆత్మ ఫలాలను గూర్చియు వివరించబడియున్నవి. లోకరీత్యా వృక్షసంబంధమైనవి, జంతు సంబంధమైనవి, పక్షి జాలములు, వీటన్నిటికిని ఒకే ఫలమున్నది. అదియే శారీర ఫలము అనగా తమ సంతతిని అభివృద్ధి పరచి, ఫలభరితమైన జీవితాన్ని కొనసాగించుటయే! అయితే నరునిలో మాత్రము ఇవి ప్రత్యేకించబడియున్నవి. నరునిలో దేవునియొక్క జీవాత్మ ఉంది. కాబట్టి నరుడు రెండు విధములైన ఫలముల ఫలితాలకు బాధ్యుడైయున్నాడు. శరీర సంబంధముగా నరుడు ఫలించే ఫలితాలలో మొట్టమొదటిది వివాహబంధము, సంసారము, సంతానము, వంశము, గోత్రము, వగైరా వాటిలో అభివృద్ధిని కలిగియుండుట ఇది శారీర సంబంధమైనది. ఈ శారీర సంబంధములో మరి రెండు రకాల ఫలములున్నవి. కొన్ని సత్ఫలితాలు, కొన్ని అయోగ్యకర ఫలితాలు అనగా సత్ఫలితాలను మంచి ద్రాక్షలనియు, అయోగ్యమైన ఫలితాలను కారు ద్రాక్షలని పేర్కొనవచ్చును. ఇందులో అపొస్తలుల కార్యములు 10:లో కొర్నేలి చేసిన ధర్మకార్యాలు, ప్రార్థనా సావాసము, విశ్వాసము, దైవత్వముపై భక్తి, విధేయత వగైరాలు. ఇవి శారీర ఫలాలలో ఒక భాగము, అనగా ఒక విధానము - ఇదే శారీర విధానములో చెడు కూడా ఉన్నది.
ప్రియపాఠకులారా! ఫలములంటే కేవలము గుణములు మాత్రమే కాదు, క్రియలు కూడా ఉన్నవి. పౌలు సౌలుగా ఉన్నప్పుడు జరిగించిన మారణహోమము విప్లవము, విప్లవాత్మక అధికారమును కోరుట. అంతియే గాకుండ ఆత్మ సంబంధులను, దైవవిశ్వాసులను, పరిశుద్ధులతో కూడిన సంఘమును, సంఘస్థులను గాలించి వారిని చెరసాలలో బంధించుట, హత్యచేయుట, వారిని దోపిడీ చేస్తూ అగ్ని చేత గృహ దహనాలు, వగైరాలు జరిగించుట పౌలు సౌలుగా ఉన్నప్పుడు జరిగించిన దేహకార్యాలు, అనగా దేహము ద్వారా పరిపక్వమై నేల రాలిన పండ్లు. ఇక దోర పండ్లు అనగా ఇట్టి క్రియాకర్మలనుగూర్చి యోచించుట, సమయము కొరకు వేచియుండుట, అదను చూచుట, కపటోపాయముతో కార్యసాధనను దురాలోచనతో చేయుట ఇవి కనబడనివి. ఇది శారీర సంబంధముగా నరుడు లోలోపల నరునిలో ఏర్పడే దోర ఫలములు. పైకి మంచిగానే ఉంటాడు, లోపల కుట్ర పన్నుట. ఈ దోర ఫలాలను గూర్చి ప్రత్యర్థియైన నరుడు గ్రహించలేడుగాని ఇవి క్రియా రూపము దాల్చి భయంకర ఆకారముతో - నరులపై విజృంభించి నప్పుడు నరునిలో ఉన్న శారీర ఫలముల నిజస్వరూపము బయల్పడగలదు.
ప్రియపాఠకులారా! శారీర ఫలములు ఏ విధముగా ఉన్నాయో ఆత్మఫలములు కూడా ఆలాగే ఆత్మ దేవునికి ప్రీతికరములును, దేవునికి కావలసినటువంటి ఆత్మీయ ఆహారములో ఇవి ప్రాముఖ్యమైన ఫలాలుగ అభివర్ణించబడియున్నవి. కనుక ప్రియపాఠకులారా! మనలో ఆత్మను ఉంచిన దేవునికి శారీర ఆత్మఫలాలు కావాలి గాని; శారీర సంబంధమైన లోకఫలాలు ఆయనకు అక్కరలేదు. భూసంబంధులైన మనము భూఫలములతోను, శారీర ఫలములతోను ఆత్మ దేవుని సంతృప్తి పరచుటకు దృశ్యమైన వాటిని ఏర్పరచుకొని, దైవత్వమును ఆరాధించుచున్నామంటే - మనలో ద్రాక్షా సంబంధమైన సద్గుణాలు ఉన్నాయా? పరిశుద్ధ గ్రంథములో ఆది నరుని నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా 6:6లో నూనెను, ద్రాక్షారసమును పాడు చేయవద్దని, కల్తీ చేయవద్దని స్వరము పల్కినట్లు వ్రాయబడి యుండుటను బట్టి ద్రాక్షారసమన్నది పవిత్ర జీవితానికి, నూనె అన్నది పరిశుద్ధాత్మ యొక్క సావాసానికి ముంగుర్తని తెలిసికోవలసియున్నది. లూకా 10:34లో నూనెను ద్రాక్షారసమును పోసి గాయములకు కట్టుకట్టుట, ఇందునుబట్టి ప్రియపాఠకులారా! ద్రాక్షారసములో మత్తు ఉన్నది, ద్రాక్షరసములో మధురమున్నది, ద్రాక్షారసములో ఆనందమున్నది, ద్రాక్షారసములో ప్రశాంతత ఉన్నది. ద్రాక్షారసములో గాయాలు మానేటటువంటి గుణమున్నదని మనకు రూఢిగా తెలుస్తున్నది. అంతేగాక యేసుప్రభువు తన చివరి బల్లలో ద్రాక్షారసము పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన - నిబంధన రక్తము అనుటలో ద్రాక్షారసము ద్వారా ప్రభువు తన జనాంగానికి ఒక నిబంధనను, ఈ బల్లను ఆచరించే ఆరాధనను నేటి క్రైస్తవులమైన మనకు వాగ్దానముగా ఇచ్చినట్లు ఇందునుబట్టి తెలియుచున్నది. ఏది ఏమైనప్పటికిని ద్రాక్షారసమన్నది పెండ్లి విందులో ఒక ప్రత్యేకత సంతరించుకొని యున్నట్లుగ - అట్టి ప్రత్యేకతన్నది ఏమిటంటే అన్ని వస్తువులు ఉన్న వివాహ గృహములో ద్రాక్షారసము అయిపోవుటలో - ద్రాక్షారసమునకు అధిక ప్రాధాన్యత ఉన్నట్లుగా తెలియుచున్నది.
ప్రియపాఠకులారా! ఆనాడు కానాలోని వివాహ గృహములోని ద్రాక్షారస కొరత ఏర్పడినది. ఈనాడు ప్రతి క్రైస్తవ కుటుంబాలలో ఏదో యొక రూపముగా క్రైస్తవ జీవితము కొరతను కల్గిస్తుందంటే వేదరీత్యా కొన్ని సందర్భాలను బట్టి తెలుసుకొందము. దేవుడేర్పరచుకొన్న మోషేకు దైవత్వమునకు కావలసిన అన్ని గుణాలున్నవి, యోగ్యతలున్నవి, కాని ఆనాడు నాలుక మాంద్యము కలవాడు. అలాగే దేవుడు సిరియా దేశపు రాజుకు విజయాన్ని కల్గిస్తున్న సందర్భములో నయమానును బహుగా ఆశీర్వదించియున్నాడు. నయమాను యుద్ధము చేయుటలోగాని, ధీరత్వములోగాని, ధైర్యసాహసాలలోగాని, పోరాటములోగాని, దేనిలోను అతనికి సాటియైనవారు లేరు, అంతయు దేవుడే నయమానుకు కల్గించిన గుణగణాలు. అయితే అతడు కుష్టురోగి. అలాగే అపొ 10:లో కొర్నేలికి దేవునియందు భయభక్తులున్నవి. గొప్ప దాతృత్వము, ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, ప్రార్థన అన్నియు ఉన్నవి. కాని అతడు సువార్త ఎరుగడు, యేసు అంటే ఎవరో అతనికి తెలియదు. యేసును గూర్చి తలంచినవాడు కాడు. ఆ విధమైనటువంటి కొర్నేలి జీవితములో దేవుడు తన దూతను పగలు 3 గంటల వేళ కొర్నేలి యొద్దకు పంపించి, కొర్నేలికి ఉన్న లోటును బయల్పరచి, ఆ లోటును పూర్తి చేయుటకు ఒప్పేలో ఉన్న దైవజనుని పిలిపించి ఆ కొరతను తీర్చుకోమని దేవదూత ఉపదేశము ద్వారా సలహా ఇచ్చుట. ఈ విధముగా కొర్నేలి దేవదూత మాటను నిరాకరించక పాటించి, తన వద్ద నున్న దాసులలో అతి నమ్మకస్థులుగ ఉన్నవారిని పంపి పేతురును పిలిపించుకొనుట. పేతురు రాకతో కొర్నేలికున్న లోటు - యేసును ఎరుగుట - యేసును ఎరగాలంటే తాను హృదయశుద్ధుడు కావాలి. తద్వారా బాప్తిస్మము తీసుకోవాలి. మారుమనస్సు, పాపక్షమాపణ పొంది, ఆత్మమూలముగాను నీటిమూలముగాను జన్మించాలి. పేతురు రాకతో ఇది జరిగిపోయింది. ఇది ద్రాక్షారసపు అనుభూతిని ఆత్మీయముగా పొందేటటువంటి స్థితి,'' అని మనము గ్రహించాలి.
కనుక ప్రియపాఠకులారా! కానా విందులో మనము ఎన్ని గొప్ప సత్యాలు తెలిసికొన్నను, కానా పెండ్లి విందు ఆనాడు లోకసంబంధముగా ఉన్నప్పటికిని, ఆ ప్రభువు ఆ వివాహ సందర్భముగా జరిగించిన మహాద్భుతము మాత్రము తరతరాలుగ గ్రహించుటయేగాక నానావిధమైన నూతన పరమార్ధము, నూతన సిద్ధాంతములు యేసుప్రభువు చేసిన ఈ మహిమాన్విత క్రియలనుగూర్చి మనము తెలిసికొంటున్నాము. ఇంతకును ఈ ప్రసంగాంశమును ఆత్మీయముగా గ్రహించిన పాఠకులు మంచి ద్రాక్షారసానుభూతిని కలిగియున్నారా? లేక జబ్బు రసమును త్రాగి, ఆత్మీయ రోగ పీడితులై దైవోగ్రతకు గురియై, కాలగతులలో కలిసిపోయే స్థితిలో ఉన్నారా? మంచి ద్రాక్షారసము కావాలంటే ప్రభువు సన్నిధి, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధులతో సావాసము, ప్రభువు చేర్చుకొనుట, ప్రభువుకు విధేయించుట, ప్రభువు మాటలను అంగీకరించుట - దాని ప్రకారముగా నడచుట, ప్రభువు మహిమార్థముగ ఇహలోక జీవితము గడుపుట, ఆ ఆరు రాతిబానల వలె తగ్గింపు జీవితమును అలవరచుకొనుట, అంచుల వరకు నింపబడినట్లుగా ప్రతి విషయములోను మితానుభవము గలిగి మనలను మనము హెచ్చించుకోవడము, రెచ్చిపోకుండ విధేయత గల్గిన స్వభావముతో దైవ భీతి, దైవభక్తి, దైవ విశ్వాసమునందు ఎదుగబడి జీవించినట్లయితే, మన జీవితాలు ప్రభువు సన్నిధిలో పెండ్లి కుమారుడైన ప్రభువునకు మంచి ద్రాక్షారసమును చేసినటువంటి ఉన్నత విలువను పొందగలము. ఆ విధముగా కాక లోకసంబంధమైన ఆచారాలు, గుణగణాల ద్వారా లోక సంబంధ ఆశలు, లోకసంబంధ అతిశయాలు, శారీర గుణాలతో ప్రభువు సన్నిధిలో మనము జీవితము జీవిస్తున్న అట్టి జీవితము జబ్బు రసము అనగా నకిలీ ద్రాక్షారసము, నకిలీ జీవితము'' అని తెలిసికొందము గాక! ఆమేన్.
ప్రభువు కానాలో చేసిన సూచక క్రియలోని రెండవ ప్రసంగము :-
యోహాను 2:2-5 ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి - వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా! నాతో నీకేమి? నా సమయమింకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి - ఆయన మీతో చెప్పునది చేయుడనెను.
ప్రియపాఠకులారా! ప్రభువు చేసిన సూచక క్రియలు, మహిమాన్విత అద్భుతాలను గూర్చి చెప్పుకోవాలంటే నానారీతులుగ నానావిధాలుగా నానా పరమార్థములతో అర్థము చేసుకొనే స్థితి ఆత్మ పరులమైన మనకు కలుగక మానదు. ఆత్మీయార్థము వేరు, శారీర సంబంధ జ్ఞానముతో కూడిన అర్థాలు వేరు, ఆత్మోజ్జీవము వేరు, శారీరోజ్జీవము వేరు. ఆత్మ ఉజ్జీవింపబడాలంటే ఆత్మ యొక్క ప్రేరణ, ఆత్మ యొక్క ఆవేశము, అవసరము - దానితోబాటు ఆత్మీయ జ్ఞానము కూడా ముఖ్యము. శారీర సంబంధమైన ప్రేరేపణను ఉద్రేకము అంటారుగాని అది ఉజ్జీవము అనబడదు. ఉద్రేకానికిని, ఉజ్జీవానికిని చాలా తారతమ్యాలున్నాయి. ఉద్రేకమన్నది శారీర సంబంధియైన నరుని నానావిధ అవాంఛనీయ కార్యాలను, హేయ క్రియలను, హత్యలను, మానభంగాలను, దోపిడీలను, పాశవిక స్వభావముతో కూడిన క్రియాకర్మలను చేయిస్తాయి. ఇవన్నియు ఉద్రేకముతో కూడినవి. అయితే ఆత్మ ఉజ్జీవములో పైవేవియు కాక ఆత్మ సంబంధమైన క్రియలు అనగా దైవరాజ్య ప్రకటన, దైవసంబంధ గీతాలాపన, దైవస్తుతి, దైవారాధన, లోకసంబంధ బంధకాలనుండి విడుదల, లోకసంబంధ వ్యామోహములనుండి వేరుపరచబడి, అంటకుండుట, లోకసంబంధమైన సంపద మీద వైరాగ్యము, లోకసంబంధమైన వేటిమీద కూడా వ్యామోహము లేకుండుట, ఇవి శారీర సంబంధముగ ఆత్మ సంబంధముగ ఉజ్జీవమునకున్నట్టి తారతమ్యాలు.
అలాగే కానాలో యేసుప్రభువు జరిగించిన ఈ యొక్క సూచక క్రియలు లోకసంబంధము కాదు, శారీర సంబంధమైనది కాదు. లేక నరులు కృత్రిమముగా చేసిన రసాయనము కాదు. ప్రభువు చేసిన ఈ సూచక క్రియలో నరునికి ఏ మాత్రము ప్రమేయము లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది శారీర సంబంధ క్రియ కాదు. ఇది ఆత్మ దేవుడు శారీర రూపములో భువిలో జన్మించి, నరుల మధ్య ఒక నరునిగ సంచరిస్తూ - నరస్వభావముతో కాకుండ తనను పంపిన పరమాత్మ స్వభావము ధరించుకొని నరుని జ్ఞానముతో కాక, పరమాత్మ యొక్క ఆత్మీయ జ్ఞానముతో - తనను ఈ లోకానికి పంపిన పరమాత్మ చిత్తానుసారముగా తాను చేయు ప్రతి కార్యము నరుల ఉద్దేశ్యము, నరుల సలహాలనుబట్టి గాక, తనను ఈ లోకానికి పంపిన తండ్రి చిత్తము, ఆయన ఉద్దేశ్యము, ఆయన అనుమతిని బట్టి క్రియ జరిగించాడు. దైవాంశ సంభూతుడైన దేవునియొక్క కుమారుడైన క్రీస్తు ఈయన నరులకు మానవుడుగ కనబడినను జన్మలో మాత్రము నరుడు కాడు, నరస్వభావము ధరించుకొన్నవాడు కాదు. ఈయన తనను గూర్చి ప్రకటించుకొంటు - ''రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు గదా! అయితే నేను పాపులను పిలువ వచ్చితినిగాని నీతిమంతులను పిలువరాలేదు,'' మత్తయి 9:12 అని చెప్పుకొంటు పరమ వైద్యునిగ ఈ లోకములో జీవించాడు.
ప్రియపాఠకులారా! లోకరీత్యా వైద్యులైన అనేకులైన సోదరులు వారు వైద్యులైనను, సకల శాస్త్రాలెరిగినను వారికి కూడా రోగాలున్నవి. పరమ వైద్యుడైన ప్రభువుకు ఏ రోగము లేదన్నది మనమెరిగిన సత్యము. ఇందునుగూర్చి పాతనిబంధనలోని లేఖన భాగాలే యేసును గూర్చి సాక్ష్యమిస్తున్నవి. నిశ్చయముగా ఆయన యందు ఏ దోషము లేదు. వాస్తవముగా ఆయన మన దోషములను భరించెను. ఈ సందర్భములో యెషయా 53:3లో చదివితే యేసుప్రభువును గూర్చి వ్రాయబడిన లేఖన భాగాలలో ఈ విధముగా వ్రాయబడియున్నది. ''అతడు తృణీకరింపబడినవాడును, మనుష్యుల వలన విసర్జింపబడినవాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిననుభవించినవాడుగాను, మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెనని వ్రాయబడుటలో - ఈ వ్రాయబడినవన్నియు కూడా లోకస్థులైన మనకున్నవిగాని దైవకుమారుడు వాటిని అనుభవించాడనుటకు కారణము మనమేనని యెషయా 53:5 మన అతిక్రమ క్రియలనుబట్టి అతడు గాయపరచబడెను, మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను, మన సమాధానకరమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియపాఠకులారా! ఏ పాపము ఏ దోషము ఏ కళంకము లేని దైవకుమారునికి గాయాలను, దోషాలను వ్యాకులాలను పుట్టించింది మనమే!
ప్రియపాఠకులారా! ఇట్టి ప్రభువును గూర్చి కానాలో ఆయన తల్లి పరిచారకులను చూచి -ఆయన మీతో చెప్పునది చేయుడనెను.'' ఆయన చెప్పినట్లు చేసిన వారెవరు? అంటే ఆయన స్వకీయులైన జనము కాదు. దేవుడు లోకములో తన జనాంగముగ ఏర్పరచుకొన్న ఇశ్రాయేలు జనము కాదు. తాను చెప్పినట్లు చేసినవారు వేదాంతులు కారు, విద్వాంసులు కారు, యాజకులు కారు, శాస్త్రులు కారు. కానాలో పెండ్లి గృహములో మొట్టమొదటి ఆయన చెప్పినట్లు చేసినవారు - పెండ్లి కార్యములోని పరిచారకులు. వీరు ఆ పెండ్లి గృహములో చివరివరకు చాకిరీ చేసుకొను పనివారు. వీరు ఆయన చెప్పినట్లుగ బానలను అంచుల వరకు నింపి - ఆ నీటినే ముంచి ఆయన చెప్పినట్లుగా విందు ప్రధాని యొద్దకు తీసికొని పోవుట, ఈ రెండు పనులు చేశారు. వీరు ఈ రెండు పనులు చేయుటను బట్టి వీరి ద్వారా ఆయన శిష్యులు ఆయన యందు లక్ష్యముంచారు. విశ్వాసముంచారు.
ఇందునుబట్టి ప్రియపాఠకులారా! ఆయన చెప్పినది చేయుటనుబట్టి పరిచారకులు ప్రభువు మహిమను చూడగల్గినారు. ప్రభువు మహిమలో పాలిభాగస్థులయ్యారు, ప్రభువు మహిమలో జ్ఞానోదయము పొందినారు. ఎలాగంటే బానలో ముంచిన నీళ్ళు విందు ప్రధాని యొద్దకు పోవు సందర్భములో నడకలోనే ఆ నీరు ద్రాక్షారస మాధుర్యమును పొందాయి. మొట్టమొదట ఆయన చెప్పినట్లు చేసిన పరిచారకులకు జ్ఞానోదయము కల్గింది. ఆ తర్వాత ఆయన శిష్యులు ఆయన మాటను విని ఆయన చేసిన కార్యము చూచి విశ్వాసులయ్యారు. ఆ తర్వాత ఆయన చెప్పినట్లు చేసిన వారెవ్వరు? అనిన ప్రశ్న కల్గినప్పుడు మార్కు 4:37-38 అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనయున్న దోనె మీద అలలు కొట్టినందున దోనె నిండిపోయెను. ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి - బోధకుడా! మేము నశించిపోవుచున్నాము, అని ఆయనతో అనుటయు అందుకు ఆయన లేచి గాలిని గద్దించి - నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను! అని వ్రాయుటనుబట్టి ఆయన చెప్పినట్లుగా గాలియు, సముద్రమును రెండును చేశాయి.
అలాగే మార్కు 5:లో వ్రాయబడిన గెరాసీనుల సమాధుల యొద్ద జరిగిన సంఘటనలో తమను తోలి వేయవద్దని అపవిత్రాత్మలు బ్రతిమాలుటయు, ఆ తర్వాత ఆ కొండ యొద్ద మేయుచున్న పెద్ద పందుల మంద యొద్దకు మమ్మును పంపుమని ఆ దయ్యములు ఆయనను బ్రతిమాలుకొనుటయు, ఆ తర్వాత ఆయన సెలవీయగా ఆ అపవిత్రాత్మలు ఆ పందుల మందలో ప్రవేశించుట.'' ఇందునుబట్టి ''సేన'' అను దయ్యముల సమూహము కూడా ప్రభువు చెప్పినట్లుగా క్రియ జరిగించినవి. ఇక ప్రభువు చెప్పినట్లుగా కుష్టురోగిని స్వస్థపరచుట,'' అనుటలో మత్తయి 8:2 ఇదిగో కుష్టురోగి వచ్చి ఆయనకు మ్రొక్కి- ప్రభువా! నీకిష్టమైతే నన్ను శుద్ధునిగ చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి - నా కిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టురోగము శుద్ధి ఆయెను,'' అని వ్రాయుటనుబట్టి కుష్టురోగము కూడా ఆయన చెప్పినట్లుగా విని ఆ రోగము ఆ రోగిని వదలి పోయింది. ఇక యోహాను 11:43 ఆయన ఆలాగు చెప్పి - లాజరూ! బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి యుండెను. అంతట యేసు - మీరు అతని కట్లు విప్పి పోనియ్యుడని వారితో చెప్పెను.'' ప్రియపాఠకులారా! ఈ సందర్భములో సమాధిలో నాలుగు దినాలుగా ఉంచబడి ఆ దుర్గంధపూరిత స్థితిలో ఉన్న లాజరుయొక్క శవమును యేసుప్రభువు లాజరూ! బయటికి రమ్మని పిలిచినప్పుడు ఆ శవమునకున్నట్టి అపరిశుభ్రత, చెడిపోయి కుళ్ళి దుర్గంధమైన స్థితిలో నాలుగు దినములు అట్టి వాతావరణమును అనుభవిస్తు - యేసు మాటలకు విమోచించబడి చనిపోయిన లాజరు సజీవముగా లేపబడుటన్నది మరణము కూడా ఆయన చెప్పినట్లుగా చేసింది. ఆయన చెప్పినట్లుగా చేసినవి - ''ప్రకృతి, పంచభూతాలు, దయ్యాలు, రోగాలు, అంగవైకల్యము, మరణము ప్రియపాఠకులారా! ఆయన చెప్పినట్లుగా చేయని వారెవరు? మనలను మనమే జవాబునకు పరిశోధించుకోవలసియున్నది.
ప్రియపాఠకులారా! ఈనాడు క్రైస్తవ సంఘము ప్రభువు చెప్పినట్లుగా నడుచుచున్నారా? దైవచిత్తానుసారము పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారము జీవిస్తున్నామని చెప్పుకొను మనము దేవుని చిత్తానుసారము ఆయన నిబంధన నియమావళినిబట్టి ప్రవర్తిస్తున్నారా? ఆయన చెప్పినట్లు చేసిన వారు కోకొల్లలు - ఆయన చెప్పినట్లు చేసిన వారికి ఏ లోటు లేదు, ఆయన చెప్పినట్లు చేసిన వానికి సాతాను రాడు. ఆయన చెప్పినట్లు చేసినవారికి మరణ భయము లేదు. ఆయన చెప్పినట్లు చేసినవారికే పరలోక రాజ్య ప్రవేశము ఉంటుంది. ఆయన చెప్పినట్లు చేసినవాడు ఈ లోకానికి విరోధి. ఆయన చెప్పినట్లు చేసినవాడు పరలోక సంబంధి, ఆయన చెప్పినట్లు చేయనివాడు సాతాను సంబంధి, మరియు లోకసంబంధి. ఆయన చెప్పినట్లు చేయుటనుబట్టి 12 మంది అపొస్తలులు పరలోక పట్టణానికి 12 పునాదులు అయ్యారు. ఆయన చెప్పినట్లు చేయుటనుబట్టి అపొస్తలులు పరలోక రాజ్యానికి భూమి మీద ఆరాధన మందిరాలుగ వెలిసేందుకు దోహదకారులయ్యారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యానము చదువుచున్న నీవు ఆయన చెప్పినట్లుగా వింటున్నావా? ఆయన చెప్పినట్లుగా చేస్తున్నావా? ఆ విధముగా ఉంటే ధన్యుడవే!
ప్రియపాఠకులారా! లోకసంబంధి తాంత్రిక విద్యాపరుడును, పిశాచాల ఆరాధించువాడైన తాంత్రికుడు, జాతకాల రూపముగా జ్యోతిష్య రూపముగా మనలను గూర్చి మాట్లాడుచున్నప్పుడు వానిని దక్షిణ తాంబూలాదులతో బహుగా సత్కరించి బహు జాగరూకతతో దేవుడే వానిలో ఉండి మాట్లాడుచున్నాడని భ్రమించి వాని మాటలు వింటున్నాము. అతడు చెప్పిన ప్రతిమాటను తూచా తప్పకుండ వింటున్నాము. అతడు చేయుమనిన ప్రతి కార్యాన్ని నిస్సంకోచముగా చేస్తుంటాము. అతడు చెప్పిన ప్రతి నియమాన్ని పాటిస్తాము.
అయితే దైవజనుడు చెప్పిన మాటలను వినుటగాని దైవజనుడు చెప్పిన ప్రకారము చేయుటగాని, అతనియొక్క మాటలందు లక్ష్యముంచడముగాని, కనీసము అతనిని గూర్చి విచారించుటగాని చేయము - ఇది మానవ నైజము - అయితే ఆత్మీయ నైజము వేరు, ఆత్మీయ సిద్ధాంతము వేరు, ఆత్మీయ నియమావళి వేరు, కనుక ప్రియపాఠకులారా! కానాలో జరిగిన సంఘటనలో ప్రభువు చెప్పినట్లుగా ఆ పెండ్లి ఇంటి పరిచారకులు చేసినందున దైవశక్తిని దైవమహిమను, దైవక్రియను ఆ క్రియలో ఉన్నటువంటి ఉన్నత విలువలను గ్రహించగలిగినారు. తద్వారా ఆయనేర్పరచుకున్న శిష్యులకు ఆయన మీద విశ్వాసమేర్పడింది. ఇందునుబట్టి మనము గ్రహించవలసినదేమిటంటే కానాలో పెండ్లి విందులో ద్రాక్షారస కొరత వలన అక్కడ ప్రభువు వలన జరిగిన గొప్ప కార్యము - ఆ కానాలోని పెండ్లి గృహములో దైవరాజ్యమునకు పునాది ఏర్పడింది. అనగా ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచి ఆయనను మహిమపరచుటయే పెండ్లి గృహములో జరిగిన ప్రభువు యొక్క పరిచర్యలోని ఉన్నత ఫలము. ఇక్కడ నుండి విశ్వాస జీవితానికి పునాది వేయబడింది.
ఆత్మ అనుగ్రహించబడలేదు గనుక నా సమయము ఇంకను రాలేదన్నాడు. ఆ తర్వాత ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడి,'' అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు ఆత్మను అనుగ్రహించబట్టియే తల్లి చెప్పిన మాట నెరవేర్చగల్గినాడు.
........
''యోనా - యేసు'' అన్యోన్య సంబంధము
దైవాజ్ఞ చేత సమాధి తెరవబడెను - దైవాజ్ఞ చేత తిమింగిలము కక్కినది యోనా దైవాజ్ఞ నెరవేర్చుటకు కక్కబడెను. చేప కడుపు యేసుయొక్క సమాధికి పోల్చవచ్చును. క్రీస్తును సిలువకు అప్పగించుచు చీట్లు వేసుకున్నారు. యోనాను పాపము వెంటాడగా చీట్లు వేసి సముద్రములో పడవైచినారు. యోనా దైవాజ్ఞను వ్యతిరేకించెను - యేసు దైవాజ్ఞను పాటించెను. యోనాను చేప మ్రింగునప్పుడు సాక్షులు లేరు - అది తిరుగ అతనిని క్రక్కి వేసినప్పుడు సాక్షులు లేరు. మన పాపము అనే తిమింగలము యేసును మ్రింగునప్పుడు ఆయనను విడిపించమని చెప్పినవారు లేరు. ఆయన సమాధి నుండి మహిమ శరీరుడై లేచునప్పుడు ఎవరును చూడలేదు. యేసును నింద మోపినారు. యోనాపై నింద మోపి ఎత్తి నీళ్ళలో వేసినారు. యేసు వైపు న్యాయము మాట్లాడలేక సిలువ వేసినారు. చేప విషయములో దేవుడు శాసనమైయున్నాడు. ఆయన వలననే చేప ఒడ్డుకు వచ్చి క్రక్కినది, సమాధి వద్ద దేవదూతకు ఆజ్ఞ ఇయ్యబడినది. దేనికి? సమాధి తెరచుటకు మాత్రమే, అయితే మొదట దేవుడు సమాధికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? నీవు నా బిడ్డను నాకు సురక్షితముగా అప్పగించమని.
.......
లూకా 1:8-18 ప్రియపాఠకులారా! పై వేదభాగములోని యాజకధర్మము, దైవిక ఏర్పాటును గూర్చి వివరముగా తెలిసికొందము. ఇందులో యాజక ధర్మము - అందుకు అనువైన క్రమము, దేవుని ఎదుట జరిగించే మర్యాద, యాజకుడు పాటించవలసిన మర్యాద, ఎప్పుడంటే అప్పుడు గాక, ఏ సమయమంటే ఆ సమయములో గాక, సమయ సందర్భము, పిలుపు, క్రమము ఈ వేదభాగములో ముఖ్యాంశాలు.
ప్రియపాఠకులారా! పై వేదవాక్యాలలో జెకర్యా కంటె ముందు యాజకులున్నారు. జెకర్యా తరగతికి చెందిన యాజకులున్నారు. అయితే జెకర్యా యాజక క్రమము వంతు ధర్మము పాటించుటను బట్టి అతని యొక్క క్రమమునకు దైవత్వము మెచ్చి అతడు ప్రభువు ఆలయములోకి వెళ్ళి ధూపము వేయుసందర్భములో ప్రజా సమూహమంతయు ఆలయమునకు వెలుపట ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ప్రత్యక్షమై, ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడినప్పుడు అతడు భయపడియుండినట్లును, అప్పుడు ఆ దూత జెకర్యాను సముదాయిస్తూ - జెకర్యా భయపడకుము, నీప్రార్థన వినపడింది,'' అనుటలో ప్రియపాఠకులారా! జెకర్యా దేవుని ఆలయములో ఆరాధన క్రమము జరిగించే యాజకుడుగా ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది. ఈ విధముగా యాజకుడైన జెకర్యా దైవత్వమునకు, బలిపీఠమునకు దేవాలయమునకు యాజకత్వమునకు యోగ్యుడైనను ఇతడు సంతాన హీనుడు. అనగా ఇతని భార్య గొడ్రాలైయున్నట్లుగా ఇందులో యాజకునియొక్క లోటును గూర్చి బయల్పడుచున్నది. ఎందుకంటే జెకర్యా నీ ప్రార్థన వినబడింది. నీ భార్యయైన ఎలీసెబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.''
ప్రియపాఠకులారా! ఈ విధముగా సంతానహీనులైన వారి క్రమము పాతనిబంధన కాలము నుండి నానారీతులుగా క్రియ జరిగించింది. అందులో కొందరు - మొట్టమొదట అబ్రాహాము, సంసోను తండ్రి మానోహ, సమూయేలు తల్లి హన్నా, వగైరాలు పాతనిబంధనలోనివారు. అయితే నూతన నిబంధనలో యాజకుని భార్యయైన ఎలీసెబెతు గొడ్రాండ్ర జాబితాలో చేర్చబడియున్నది. ఈ విధముగా గొడ్రాలైయున్న ఎలీసెబెతు కుమారుని కనుటన్నది కారణము జెకర్యా జరిగించిన యాజక ధర్మమే. జెకర్యా వేసిన ధూపము. జెకర్యా తన జీవితములో అనేకమార్లు ధూపము వేసియుండవచ్చునుగాని దేవదూత ప్రత్యక్షమైనప్పుడు జెకర్యా ఆలయములో వేసిన ధూపమునకు ప్రత్యేక స్థానమేర్పడింది. అంటే ధూపవేదిక కుడివైపున నిలిచి దేవుని దూత మాట్లాడుటన్నది ఒక ప్రత్యేకమైన దైవకార్యమైయున్నది. ఈ ప్రత్యేకమైన కార్యమునుబట్టి జెకర్యా ప్రభువు దృష్టికి గొప్పవానిగా ఎంచబడినట్లు మనము గ్రహించాలి. అలాగే యాజకుడైన జెకర్యా భార్య ఎలీసబెతుకు జన్మించబోవు శిశువును గూర్చి ఆ దూత వివరించుచు,'' అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. అంతేగాక అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులు, నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయా యొక్క ఆత్మయు, శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును, కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కల్గును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురని చెప్పెను. లూకా 1:34లో విధముగా మరియ దూతతో పల్కిన విధముగా అలాగే జెకర్యా కూడా ఇది నాకేలాగు తెలియును, నేను ముసలివాడను, నా భార్యయు బహు కాలము గడిచినదని దూతతో చెప్పగా దేవదూత పల్కిన ప్రవచనమునందు లక్ష్యముంచక అవిశ్వాసముతో మాట్లాడినట్లు తెలుస్తున్నది.
ప్రియపాఠకులారా! ఇదే మాటను అబ్రాహాము, భార్యయైన శారా ఇరువురు కూడా దేవుడును - దైవత్రిత్వముతో పల్కిన మాటను - ''మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా వచ్చెదను. అప్పుడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కల్గును,'' అనెను. అబ్రాహాము దంపతులకు ఆ మాట నమ్మతగనిదై ఇద్దరికి నవ్వు పుట్టించినందువల్ల ఆ పుట్టిన సంతానము కూడా నవ్వులపాలైంది. నవ్వు పేరు ధరించింది. ఆది 17:17-19 & 18:12.
కనుక ప్రియపాఠకులారా! మూడు సందర్భాలలో దైవత్వము చెప్పిన మాటలను ముగ్గురు కూడా ఈ మూడవ వ్యక్తియైన జెకర్యా కూడా అవిశ్వాసములో పడినట్లుగా లూకా 1:20లో ''నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివైయుందువని అతనితో చెప్పెను. జెకర్యా వెలుపలికి వచ్చినప్పుడు ప్రజలతో మాటలాడలేక పోయినందున సంజ్ఞలు చేయుచు, మూగవాడైయుండినట్లు ఈ వేదభాగములో చదువగలము.
కనుక ప్రియపాఠకులారా! దైవత్వము పట్ల విశ్వాసము లేని జనాంగమునకు దేవుడు విధించే లోపభూయిష్టకార్యాలు జరుగునని ఇందునుబట్టి స్పష్టముగా ఋజువగుచున్నది. ఈ విధముగా దేవదూత మాటల ద్వారా మౌని అనగా ఆ క్షణమే జెకర్యా తాను జరిగించు యాజక క్రియలోనే మూగవాడై వచ్చినప్పుడు, ఆలయ వెలుపలి ప్రజలు అతనికి దర్శనము కలిగెనని గ్రహించారు. అప్పుడు అతడు సైగలు చేయుచు అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఇందునుబట్టి మనకు తెలిసిన సారాంశమేమనగా దైవసన్నిధిలో యాజకుడుగాని, ప్రధాన యాజకుడుగాని, దైవజనుడుగాని, దైవదర్శనములు పొందే వరములు గలవాడైనను, ఆత్మ పూర్ణుడైనను, వాడు వేదవిద్వాంసుడైనను, ఎవరైనను సరే, దైవనరులు దైవక్రియలలో దేవునియొక్క కార్యాలు నెరవేర్చునప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు, ప్రవర్తించవలసిన విధానము, చేయవలసిన క్రియాకర్మలు, యాజకునియొక్క ప్రవర్తన, విధి, ధర్మము, ధైర్యము, సాహసము, దృఢ నమ్మిక, విశ్వాసము, ఈ నియమములన్నియు క్రమముగా పాటించాలి. అయితే జెకర్యాలో ఇవన్నియును ఉన్నవి గాని, ఇందులో దేవదూత మాటలను నమ్మక అవిశ్వాసముతో అలక్ష్యము చేయడము, అతని మాటలలో అలక్ష్యమన్నది బయల్పరచబడడము - అంటే, ''ఇది నాకేలాగు తెలియును? నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పుటలో మూడు విధాలైన అనుమానాలను దేవదూత ముందు మాటలాడుటయే, యాజకుడైన జెకర్యా యొక్క బలహీనతకు ప్రబల కారణమైనట్లు తెలుస్తున్నది.
ఇందులో 1. ఇది నాకేలాగు తెలియును? తన ముందు మాట్లాడే దేవదూతతో - ఆ దూత మామూలు దూత కాదు. దేవుని సముఖములో నుండి దేవుని ఆత్మ ధరించుకొని దేవుని మాటలతో పరలోక సంబంధియైన ఆ దూత యొక్క మాటలలో - అసత్యమన్నది లేదని ఎరిగియు కూడా - ''ఇది నాకేలాగు తెలియును? అనుటలో దైవకార్యాలు జరిగిస్తూ దైవజ్ఞానమును పొందిన దైవకార్య నిర్వాహకుడు, దైవసాన్నిధ్యములో ఉంటున్న దైవజనుడు అజ్ఞాని వలె '' ఇది నాకేలాగు తెలియును? అనుట మొట్టమొదటిది. రెండవ అనుమానాన్ని - తన వయస్సును జతపరచుచు నేను ముసలివాడను,'' అనుటలో దేవునియొక్క కృప, దేవునియొక్క వరము, దైవాశీర్వాదము, దైవశక్తి, దేవునియొక్క బలము, దైవిక తోడ్పాటు, దైవసన్నిధిలో వయోపరిమితి లేదన్నది దైవశక్తిని కనుగొనియు - తన వయోపరిమితినిగూర్చి దేవదూత ముందు మాట్లాడుట 2వ తప్పు. అంతియేగాక తన్ను గూర్చియే గాకుండ మూడవదిగ తన భార్యను కూడా జతపరచుకొని, ''నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పుటలో భార్యను కూడా తన అపనమ్మకములో తన అవిశ్వాసములో జతపరచుకొని మాటలాడుట మూడవ తప్పును బట్టి అతడు యాజకుడైయున్నను, దేవదూత అతనికి విధించిన శిక్ష లూకా 1:20 నా మాటలు వాటి కాలమున జరుగు వరకు నీవు మాటలాడక మౌనివైయుందువని అతనితో చెప్పెను.
ప్రియపాఠకులారా! ఇది యాజకుడైన జెకర్యాకు దేవదూత విధించిన శిక్ష. ఈ శిక్షకు విమోచన ఒక దినమున పుత్రోదయము కల్గినంతవరకు కొనసాగినట్లు చదువగలము. అనగా భార్యయైన ఎలీసెబెతునకు కుమారుడు కన్నంతవరకు శిక్ష అమలు జరుగుచున్నది. కుమారుడు కన్నంతనే ఈ శిక్ష రద్దయి మామూలుగా మాట్లాడే స్థితికి శక్తి గల్గి మాట్లాడగలడని తెలుస్తున్నది. అయితే దేవదూత విధించే శిక్ష నుండి జెకర్యా తప్పించుకోలేకపోయాడు. దేవదూత విధించే శిక్ష జెకర్యా కుమారుని కన్నంతవరకు అమలు జరిగింది. ఇది జెకర్యా జీవితములో దైవిక ఏర్పాటునుబట్టి జరిగిన క్రియ. తత్సంబంధ చరిత్ర. అటుతర్వాత లూకా 1:57 ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీసెబెతు కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరముంచెనని ఆమె పొరుగువారును, బంధువులును విని ఆమెతో కూడా సంతోషించిరి. ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, తండ్రి ప్రేమను బట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా తల్లి - ఆలాగు వద్దు వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను. అందుకు వారు - నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడేయని వాని తండ్రికి సైగలు చేసి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని - వాని పేరు యోహానని వ్రాసినట్లును అందుకు వారు ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడినట్లును, అందునుబట్టి వారి చుట్టు ప్రక్కన కాపురమున్న వారికందరికి భయము కలిగినట్లును, ఈ సంగతి అంతయు యూదయ కొండ సీమ యందంతట ప్రచురమైనట్లు వేదభాగములో వ్రాయబడియున్నది.
ప్రియపాఠకులారా! ఈ విధముగా యోహాను జన్మతో తండ్రికి ఉన్న శిక్ష, దేవదూత చేత విధించబడిన నోటి మాంద్యము, తల్లికి ఉన్న గొడ్రాలితనము రెండును తొలగి యోహాను అను పేరు గల ఈ బిడ్డ జన్మ ద్వారా జెకర్యా యొక్క నాలుక సడలింపబడి ప్రవచించిన మాటలు లూకా 1:67-80 వేదభాగములో చదువగలము. ఇది యాజకధర్మము యాజకక్రమము ప్రవర్తన ఆత్మీయత, యాజకునికి దైవత్వము మంచి చెడు - శిక్ష , విమోచనము, వివరణ.
కనుక ప్రియపాఠకులారా! ఇందునుబట్టియే మనలో అనేకులు యాజక ధర్మము, యాజకత్వమును గూర్చి సులభముగా అంచనా వేయ ప్రయత్నించగా - యాజకత్వమన్నది మానవ సంబంధమైనదని ఎంచక, యాజకునికి ప్రత్యేకత అని, దైవసంబంధమని, అది నరుల కార్యము కాదని, అది దేవుని సంబంధ కార్యమని, దానిని ఆచరించువాడు పాటించవలసిన నియమాలు, విధించబడిన నియమాలు చాలా కఠినమైనవియు, వాటిని ఆచరించు స్థితి ఉంటేనే ఆ పనికి పూనుకోవాలని ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది. ఇందునుగూర్చి యాకోబు పత్రిక 3:1లో ఈ విధముగా వ్రాయబడియున్నది. ''నా సహోదరులారా! బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి.'' అనేక విషయాలలో మనమందరము తప్పిపోవుచున్నాము అని వ్రాయబడియున్నది.
ప్రియపాఠకులారా! బోధకుడన్నను, సంఘకాపరియన్నను, సువార్తీకుడన్నను, దైవజనుడని పిలువబడి, దైవపక్షముగా జీవించే ప్రతి వ్యక్తికిని, శారీరకముగాను, ఆత్మీయముగా దైవత్వమన్నది కఠినమైన నియమమును, కఠినమైన పరీక్ష, కఠినమైన ఆచారముతో కూడినదని, ఈ పరీక్ష శారీరరీత్యాను, ఆత్మ రీత్యాను జరుపబడుటయేగాక, ఈ పరీక్షలో దైవత్వము చేత ఎన్నిక చేయబడి నెగ్గి దైవకార్యమునకు లోకములో ఎన్నిక చేయబడి ప్రతిష్టించబడిననాడే ఒక బోధకుడుగాని, ప్రవక్తగాని, ఒక కాపరిగాని లేక దైవజనుడుగా పిలువబడే వ్యక్తిగాని, మంచి సాక్ష్యాన్ని పొంది, ఇటు భూలోకములోను, అటు పరలోకములోను రెండు విధాలుగ తన చరిత్రను సార్థకము చేసికోగలడు. ఇందుకు పరిశుద్ధ గ్రంథములో ఉదాహరణగా మొట్టమొదటి ప్రవక్త మోషే జీవితములో అనేక చేదు అనుభవాలు, శ్రమలు, కాలినడకతో కూడిన ప్రయాణము, పర్వతము లెక్కుట, దైవజనాంగమైన ఇశ్రాయేలు చేత విమర్శించబడుట, నానావిధ హేళనలు, వెక్కిరింపులకు గురియై, అన్నపానాదులు కట్టుబట్టల విషయములో నానావిధమైన వాటిలో బహుకఠినమైన చేదు అనుభవాన్ని అనుభవించి, తాను - తనతోబాటు దేవుడు తనకిచ్చిన జనాంగము కూడా దేవునియొక్క కఠిన పరీక్షలో నిలువగల్గినందున దైవచరిత్రలో మొట్టమొదటివాడయ్యాడు. అటుతర్వాత యెహోషువ, ఏలీయా వగైరాలు. ఈలాంటి ప్రవక్తలెందరో వీరందరు లోకములో సుఖాసనముగా జీవించినవారు. ఎన్నో శ్రమలు అనుభవించారు. వీరు అనుభవించిన శ్రమలనుబట్టి దేవుడు వ్యర్థముగా వీరిని వదలక పరిశుద్ధ గ్రంథములో వీరి చరిత్రను గూర్చి వివరించియున్నాడు. అలాంటి ప్రవక్తల చేత వ్రాయబడిన ప్రవచన వాక్యాలే పరిశుద్ధ గ్రంథములోని వేదవాక్యము.
ప్రియపాఠకులారా! అలాగే దేవుడు యాజకుల విషయములో కూడా ఇదే చేదు అనుభవాలను చూపించాడు. ఇందులో మొట్టమొదట లోకరీత్యా ప్రధాన యాజకుడైన అహరోను, తన జీవితములో ఇశ్రాయేలు చేత అనేక శ్రమలు ఎదుర్కొన్నాడు. అలాగే ఆ తర్వాత ఏలీ - యాజకుడు, సమూయేలుకు గురువైన ఏలీ ప్రధాన యాజకుడు. తన యాజకధర్మము యాజక క్రమములో తన వలె నిలబడి పటిష్టముగా బలిపీఠ పరిచర్య జరిగించే స్తోమత ఏలీ కుమారులలో ఎవరికిని లేకపోబట్టి ఏలీ యొక్క జీవితము అర్థాంతరముగా అయిపోయింది.
ఇక నూతన నిబంధనలో ఒక్క యేసుక్రీస్తుకే ప్రవక్త అనేటటువంటి పేరు దక్కుతుంది. నూతన నిబంధనలో యేసు తర్వాత ప్రవక్తలు లేరు. యేసుక్రీస్తు తర్వాత ఆయన ప్రతిష్టించిన శిష్యులు అపొస్తలులుగ యేసు చేత ప్రతిష్టించబడినవారు. అపొస్తలులు అనగా పంపబడినవారు. వీరు యేసుక్రీస్తు చేత లోకములో దైవరాజ్య సువార్తకు పంపబడినవారు - వీరే అపొస్తలులు. చిత్రమేమంటే ప్రియపాఠకులారా! పాతనిబంధన ప్రవక్తలు పరలోకములో వారు ప్రవక్తలుగా ప్రవచించబడలేదుగాని, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణముయొక్క 12 గుమ్మముల మీద ఇశ్రాయేలీయుల 12 గోత్రాల నామములు వ్రాయబడియున్నవి. ప్రకటన 21:12-14 ఆ పరిశుద్ధ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్లయొక్క 12 మంది అపొస్తలుల పేర్లు కనబడుచున్నవి. ఇందునుబట్టి యేసుక్రీస్తు ప్రతిష్టించిన 12 మంది అపొస్తలులు పరలోకములో 12 పునాదులుగ ఉన్నట్లు ఇందునుబట్టి తెలుస్తున్నది.
కాబట్టి ప్రియపాఠకులారా! యాజకుడు యాజకధర్మము, యాజక క్రమము, యాజకునియొక్క ఆత్మీయస్థితి, ప్రవర్తన, నడవడిక, హృదయ స్థితి, యాజకుడు ఉండవలసిన స్థితి చాలా ఉన్నతమైనది. ఒకవేళ అట్టి యాజకుడు లోకములో లోక వ్యసనాలలో పడితే, అది క్షమింపరాని నేరముగా అది దేవుని చేత తీర్పు దీర్చబడుతుందని ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది.
........
ఆదికాండము 5:24 హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడతనిని తీసికొని పోయెను గనుక అతడు లేకపోయెను.''
ప్రియపాఠకులారా! లోకస్థులమైన మనము మన పూర్వీక జీవితములోను, మనము లోకరీత్యా తల్లిదండ్రులతోను, భార్యాబిడ్డలతోను లేక మన ఇరుగుపొరుగు ఇచ్చు సలహాలతోను, వారియొక్క మాటలననుసరించి నడుస్తున్నాము. ఇది లోకసంబంధమైనది. అయితే పై వాక్యరీత్యా దేవునితో నడిచినట్లును, దేవుడతనిని తీసుకొని పోయినట్లును వివరిస్తున్నది. ఇది ఆత్మ సంబంధమును, పరమాత్మునితో ఎడతెగని బంధమునకు సూచనగ ఉన్నది. ఆ విధముగా నడుచుటన్నది నేటి ప్రతి క్రైస్తవ విశ్వాసులమైన మనకు విధిగా ఉన్నట్లు గ్రహించాలి. ఈ రోజులలో క్రైస్తవ సంఘాలు, బోధకులు, కాపరులు, సత్యవాక్యము ననుసరింపక, దానిని తమ స్వలాభమునకు మార్చుకొని సత్యవాక్యమునకు మూలకర్తయైన ప్రభువుతో ఏకీభవించలేకపోతున్నాము. ఆయనతో ఏకీభవించి, ఆయనతో నడవాలంటే నేటి నూతన నిబంధన కాలములో అపొ 2:38, రోమా 6:3 వచనములలో వలె మనము పశ్చాత్తాపము, మారుమనస్సు, జలబాప్తిస్మము, ప్రభువు సంస్కారము, ప్రార్థన ఉపవాసము, వగైరా ప్రభువు కార్యవిధులను నిర్వర్తించుచు ఆయనలో నిలిచియుండవలెను. మరియు కానుకలు, దశమభాగాలు సమర్పించుట, ఇరుగుపొరుగుతో సమాధానము కల్గియుండుట వంటి కార్యాల నెరవేర్పు ద్వారా దేవునితో ఏకీభవించాలి. కాని పై కార్యాల లోపము వలన దేవునితో ఏకీభవించలేకున్నాము. అయితే హానోకు ఏకీభవించాడు. కారణము హెబ్రీ 11:5లో వలె మన జీవితము ప్రభువునకు ప్రీతికరమైయుండవలెను. అంటే హానోకు వంటి విశ్వాసము మనలో ఉండవలెను. విశ్వాసమునుబట్టే హానోకు దేవునికి ఇష్టుడాయెను. హానోకు తన కాలములో దేవుడు - హానోకు ఒకరిలో ఒకరు ఐక్యమగుటకు లోకసంబంధమైన దైవభక్తి సాధనాలు ఏమియు లేవు. బైబిలు లేదు, వాక్యము లేదు, హానోకు అక్షరాస్యుడు కాడు, గొప్ప నాగరికుడు కాడు, శాస్త్రవేత్త కాదు, పండితుడు కాడు, ఐశ్వర్యవంతుడసలే కాదు. మరెక్కువగా అతడు సంసార బంధములో ఉన్నను, కుమారులను కుమార్తెలను కని లోకవాంఛలలో తగులుకొనియున్నను, దేవునితో నడచుచు సమయములో హానోకు ఒక్కడే దేవునితో నడిచినట్లున్నదిగాని, కుటుంబ సమేతముగా నడిచినట్లుగా లేదు. అంటే హానోకు కుటుంబము భూమి మీద విడువబడినట్లు ఆది 5:25లో చదువగలము. ప్ర్రియపాఠకులారా! హానోకు జీవితము కుటుంబసమేతముగా నున్నను, హానోకు ఒక్కడే దైవత్వముతో కూడిన అంతరిక్ష యాత్ర చేసినట్లు ఋజువగుచున్నది.
కనుక నేటి క్రైస్తవ విశ్వాసులమైన మనము మన బోధకులు, సంఘములు, గలతీ 5:10లో పౌలు మాటలలో వలె మనుష్యుల దయ కొరకు కనిపెట్టువారము గాక, భిన్నమైన బోధలకు చెవినివ్వక ఉండవలెనని తెలియుచున్నది.
ప్రియపాఠకులారా! యూదా 1:14లో హానోకు జలప్రళయమునకు ముందు ఎత్తబడినాడు. హానోకు ఆదామునకు ఏడవ తరమునకు చెందినవాడు. బైబిలులో ఏడు అనిన సంఖ్య సంపూర్ణ సంఖ్య. ప్రకటన రెండు మూడు అధ్యాయాలలో ఏడు అను సంఖ్యకు ఇవ్వబడిన ప్రాధాన్యతను గూర్చి మనము పూర్తిగా తెలిసికోగలము. ఈ అధ్యాయాలలో సంఘముల ప్రతి యొక్క కాలములలో ''జయించువాని బహుమానమునుగూర్చి కూడా ఇందులో చదువగలము.
ప్రియపాఠకులారా! ప్రకటన 2:7లో ప్రభువు చేత ఎత్తబడువానికి ఇవ్వబడు బహుమానములలో మొదటిది జీవవృక్ష ఫలము. ప్రకటన 2:11లో ఇతనికి మరణభయము లేదు. (3) 2:17లో మరుగైయున్న మన్నా ఇతని ఆహారము. (4) 2:26లో జనుల మీద అధికారము. (5) తెల్లని వస్త్రములు (6) 3:12లో దేవాలయములో ఒక స్థంభము. (7) దేవుని సింహాసనము మీద కూర్చుండు మహాభాగ్యము.
ప్రియపాఠకులారా! పై ఆధిక్యతలను చదివారు కదా! ప్రభువుతో ఏకీభవించి, ప్రభువు చేత కొనిపోబడు జీవాత్మలకు ప్రభువు యిచ్చు బహుమానాలను ఏడింటిని తెలిసికొన్నాము. జలప్రళయమునకు ముందు హానోకు ఎత్తబడినట్లు ప్రభువు రాకడ సమయములో వధువు సంఘము కూడా ఎత్తబడుతుంది. ఇందునుగూర్చి ప్రకటన 2:9లో చదువగలము. ఎత్తబడు విధానమును గూర్చి కూడా మొదటి థెస్సలొనీక 4:16-17లో వివరించబడియున్నది.
అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా తనయందు విశ్వాసముంచిన దొంగను సిలువపైనుండి తనతో కూడా పరదైసునకు తీసుక వెళ్ళినాడు. దేవుడు హానోకును శరీరముతో తీసికొని వెళ్ళితే యేసుప్రభువు సిలువపై దొంగను ఆత్మీయముగా తనతో పరదైసుకు తీసుకొని వెళ్ళినాడు. మరి మన సంగతి ఏమిటి? మన యొక్క ఆత్మీయ జీవితము ప్రభువుకు యోగ్యకరముగా ఆయనకు విధేయులమై, ఆయనను ఏకీభవించే స్థితిలోను, ఆయనకు ఇష్టముగా ఆయనయందు విశ్వాసపూరితముగా ఉండి జీవించే స్థితిలో ఉన్నామా? ప్రభువు రాకడ సమయములో ఎత్తబడు వధువు సంఘములో - సభ్యత్వము పొందినవారమై ప్రభువుయొక్క దర్శనభాగ్యము పొంది, ఆయనతో సహజీవితము పొందగలిగి జీవించే యోగ్యతను సంపాదించుదుము గాక!
.......
రెండవ కొరింథీ 8:1-5
ప్రియపాఠకులారా! పై వివరించబడిన ఈ వేదభాగములోని వాక్యములను గూర్చి మనము నేర్చుకోవలసినది ఎంతయో ఉన్నది. ఇందులో మొదట ''దేవుని కృప మాసిడోనియా సంఘములకు అనుగ్రహింపబడియుండుటను గూర్చి అపొస్తలుడైన పౌలు వివరిస్తున్నాడు. యెరూషలేములో బీదల కొరకైన చందా విషయములో - మాసిడోనియా సంఘము యొక్క లోకసంబంధమైన బీదరికము దైవత్వము చేత బహుశ్రమలకు వారు పరీక్షింపబడినట్లు తెలియుచున్నది.
ప్రియపాఠకులారా! మాసిడోనియా సంఘములకు వలె నేడు భారతదేశపు క్రైస్తవ సంఘములకును కూడా దేవుని కృప విస్తరించియున్నదని మనకు బాగుగా తెలియును. మాసిడోనియా సంఘస్థులేవిధముగా దేవుని వలన గొప్ప శ్రమలచే పరీక్షింపబడినను, అధైర్యపడక వెనుకంజ వేయక విసుగక మందిరములో కూడుకొనుటలోను, ప్రార్థన సహవాసములోను, వాక్యపరిచర్య, రొట్టె విరచుట వంటి సంఘ ఐక్యతతో కూడిన బలముతో శ్రమలతో పోరాడి, ప్రభువు వారికనుగ్రహించిన కృపనుబట్టి శ్రమలను లెక్కజేయక, అత్యధికముగా సంతోషించినట్లు ఇందులో వివరించబడియున్నది.
నేటి మన భారత క్రైస్తవ సంఘాలలో దేవుని కృపను గూర్చిన విషయాన్ని మనము పరిశీలిస్తే ప్రభువు కృప అయితే సంఘముల మీద ఉన్నదిగాని సంఘముయొక్క విశ్వాసముగాని, సంఘములయొక్క ప్రవర్తన, నడుపుదల, క్రమములు అందుకు భిన్నముగా ఉన్నట్లు ప్రత్యక్షముగా మనము చూస్తున్నాము. క్రైస్తవ సంఘాలు అని పేరు మాత్రమున్నవిగాని, క్రీస్తు ప్రేమ సంఘములో ఉండినటుల కనబడుటలేదు. మాసిడోనియా సంఘాలలో పదవీ వ్యామోహములు గాని, జాతికుల భాషా విభేధాలుగాని, ఆధిక్యతలుగాని అహంభావాలుగాని లేకుండుటయేగాక ఐక్యతతో వారియొక్క సంఘ గౌరవములను గూర్చిన ప్రతిష్టతను నిలుపుటకు మాసిడోనియా సంఘములవారు స్థితిలో నిరుపేదలైయుండి దాతృత్వములో ధనికుల కంటె మరెక్కువగా దాతలైనట్లు ఇందులో వివరించబడియున్నది.
ప్రియపాఠకులారా! మన భారత క్రైస్తవ్యములో మందిరాలు కట్టుకోవాలంటే మందిరానికి కావలసిన నిధిని ప్రోగు చేయుటలో అవకతవకలు, మందిరము కట్టుటకు ఇట్టి విరాళములనుగూర్చి మందిరములోను మందిర వెలుపటను విరాళమిచ్చు దాతలనుగూర్చి ప్రకటన చేయుట, నిర్మింపబడిన మందిరములో ఎలెక్ట్రిక్ ఫ్యాన్ల ఱెక్కల మీదను, గుడిలో వాయించే గంట, కీర్తన పుస్తకాలు, బైబిలు, వగైరాల మీద ఇచ్చిన దాతలనుగూర్చి ఆరాధన సమయములో సంఘస్థుల మధ్య బహిరంగముగా ప్రకటించాలి. ఇది మన భారత క్రైస్తవుల మధ్యనున్న రివాజు లేక ఆనవాయితీ. ఇంకను మాసిడోనియా సంఘముల వారు పరిశుద్ధులతో కూడిన పరిచర్యలుతో అత్యధికముగా పాలుపంపులు పంచుకొని, నిండు మనస్సుతో తమ సామర్థ్యము అనగా తమ శక్తి కొలదిగాక శక్తిని మించి వారియొక్క విరాళములు కానుకలు అర్పణలు ఇచ్చినట్లు మాసిడోనియా సంఘములనుగూర్చి పౌలు వివరిస్తున్నాడు. ఇందుకు భిన్నముగా నాటినుండి సువార్త విస్తరించబడి నేడు బహుముఖ వ్యాప్తముగా విస్తరించి, అనేక మందిరాలకు నిర్మాణ కారకమైన భారత క్రైస్తవ్యము మందిరానికిచ్చే విరాళాలు, కానుకలు, అర్పణలు ప్రత్యేక కానుకల విషయములో చిత్రవిచిత్రమైన పద్ధతులలో వ్యవహరిస్తున్నాయి. చందాలో ప్రత్యేకముగా వేసే రెండు రూపాయల లగాయతు వేలవరకును ప్రత్యేక కానుకగా సంఘస్థులు చందా తిత్తిలో వేసే ధనమును గూర్చి యాజకుడు ఘనముగా పదిమందికి వెల్లడించాలి.
మాసిడోనియా సంఘస్థులు ఈ రకముగా దేవునికి ఇచ్చినదానికి బహిరంగముగా ఈషణ్మాత్రము ఇచ్చిన కానుకలనుగూర్చి వెల్లడించినట్లు ఈ వేదభాగములో లేదు. అపొస్తలుల కాలములో కూడా క్రైస్తవ విశ్వాసులు తాము ప్రభువుకు మ్రొక్కుకున్న మ్రొక్కుబళ్ళు, అర్పణలు, అపొస్తలుల పాదముల ఎదుట ఉంచుట, ఆరాధన సమయములో చందా పెట్టెలో కానుకలు ఉంచుట, ఇంతేగాని ఎవరెంత ఇచ్చారు? ఎవరేమి ఇచ్చారు? అనిన విషయము వెల్లడిపరచబడలేదు. ప్రియపాఠకులారా! నేటి మన క్రైస్తవ విశ్వాస జీవితములో మన భారత క్రైస్తవ మందిరాల నడుపుదల విషయములో రెండవ కొరింథీ 8:1-5లో వివరించబడిన పౌలుయొక్క సాక్ష్యము మన భారత క్రైస్తవ్యానికి సిగ్గుచేటైయున్నది. ప్రశంసించదగిన విషయమేమిటంటే 5వ వచనములో ఇదియుగాక మొదట ప్రభువునకును, దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు'', అనుటలో ప్రభువుకు మాసిడోనియా సంఘమెంత విధేయించి ప్రభువు మార్గములో ఏ విధముగా నడిచిందో - ప్రభువు యొక్క వాక్య పరిచర్యలో ఈ సంఘమేవిధముగా ప్రయాసపడిందో - ప్రభువుయొక్క ప్రణాళికను అమలుపరచుటలో మాసిడోనియా సంఘము ఎన్ని శ్రమలు, ఎన్ని అవాంతరాలు, ప్రకృతి బీభత్సాలు, ఆనాటి రాజుల నిషేధాజ్ఞలు, క్రైస్తవ హింసలు వగైరా ఉపద్రవాల నెదుర్కొని ప్రభువు కార్యము పట్ల ఏ విధముగా ప్రయాసపడి అటుతర్వాత ప్రభువు తమ ధ్యేయముగా ఉంచుకొని, ఆయన చిత్తము ననుసరించి అపొస్తలుల పరిచర్యలో పాలుపంపులు, వారితో సావాసము, వారితో మందిర నివాసము, ఆరాధనలు, కూడిక, రొట్టె విరచుట, ఆరాధన క్రమము, మందిర అవసరతలు దీర్చుటలో శ్రద్ధాసక్తులు, వగైరా విషయములలోను ప్రభువునుగూర్చి ప్రభువు యొక్క రాజ్య సువార్తను గూర్చి ప్రభువు యొక్క వధువు అయిన స్త్రీ సంఘమును గూర్చి మాసిడోనియా దైవ విశ్వాస కోటి ఏ విధముగా త్యాగము జేశారో - అనగా క్రీస్తు నిమిత్తము తమ్ముని తాము, లోకాన్ని, తమ దేహాన్ని పెంటగా ఎంచుకొని, ప్రభువు సేవయే పరలోక రాజ్యమనే ధ్యేయముతో వారు తమ శారీరాత్మలను త్యజించి, లోకాశలు, దేహచింతనలు విడచిపెట్టి తమ శరీరములను రోమా 12:1లో వలె సజీవయాగముగా సమర్పించుకొన్నట్లు తెలియుచున్నది.
మాసిడోనియా సంఘము ప్రదర్శించిన త్యాగపూరితమైన అనగా శారీరాత్మలను ప్రభువుకు సమర్పించుకొనుటయేగాక, సంఘముయొక్క నిత్య కార్యములలో క్రమముగా పాల్గొని, వారు జరిగించిన మరియు ప్రవర్తించిన విధానము అపొస్తలుడైన పౌలునే ఆశ్చర్యచకితునిగా జేసినట్లు తెలియుచున్నది. ఈనాటి భారత క్రైస్తవ మందిరాల స్థితి ఎట్లున్నదంటే మన నిమిత్తము అన్యుల మధ్య రూపింపబడి వెక్కిరింపబడుటయేగాక, నూతనముగ క్రీస్తు నమ్మేటటువంటి వ్యక్తులయొక్క ఆత్మోజ్జీవమును ఆర్పి, మరల వారిని మునుపటి వలె విగ్రహారాధన జీవితానికి మళ్ళించినట్లే గాక, సంఘములో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసమునకు బదులుగా ద్వేషాన్ని రగిల్చి, సంఘములో కక్షలు, కొట్లాటలు, మనస్పర్థలు, పదవీ వ్యామోహాలు, ఇత్యాది గుణములతో సంఘముయొక్క ఫురోభివృద్ధికిని, సంఘమునకు ప్రభువు అనుగ్రహించు కృపకును ఆడ్డుబండయై విశ్వాస జీవితమును పడగొట్టు స్థితికి దిగజారియున్నది. ఇందుకు కారణము సాతాను అని మనము అనుకోవచ్చును. సాతాను కంటె మానవునిలోని నైతిక గుణము మరియు వానిలోని కుత్సిత బుద్ధియేనని మనము గ్రహించవలెను.
అంశము :- జ్ఞానము :-
: మూలము :- హోషేయ 4:6 నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు, కనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేను నీ కుమారులను మరతును.''
ప్రియసంఘమా! నేటి నరుని జ్ఞానము ఎట్లున్నదంటే చెట్లు, పుట్టలు, కొండలు తుదకు గోరీలలోను జంతువులలోను దేవుని కొరకు వెదకుచు నరుడు వాటిని పూజిస్తున్నాడు? పైగా జ్ఞానినని చెప్పుకొంటున్నాడు. రోమా 1:23లో వలె అంధకారంలో అజ్ఞానములో కొట్టుమిట్టాడచున్నాడు. అయితే జ్ఞానమెక్కడున్నది? ఈ సందర్భములో సామెతలు 9:10లో చదివినట్లయితే - యెహోవా యందు భయభక్తులు కల్గియుండుటయే జ్ఞానమునకు మూలము. కనుక హోషేయ 6:3లో విధముగా జ్ఞానమును సంపాదించుటకు ఆయనను అనుసరించాలి. సొలొమోను అష్టైశ్వర్యములు కల్గియుండియు, గొప్ప జ్ఞానియైన దావీదు మహారాజు పుత్రుడైయుండియు, విస్తారమైన రథములు, గుఱ్ఱాలు, సైన్యములు, దాసదాసీజనములు, మందీ మార్భలము కల్గియుండియు, తనకు జ్ఞానము కావాలని దేవుని అడిగినాడు. అనగా ఈ జ్ఞానము కొరకు దైవత్వాన్ని ప్రార్థించాడు.
అయితే ఈ జ్ఞానమెట్టిదో అనిన దానినిగూర్చి మనము తెలిసికోగలము. ఇందులో 1. లోక జ్ఞానము :- ఇది శారీర సంబంధము, జీవాత్ముని క్రియ, ఇది ఈ లోకము వరకే పరిమితము. దేవునికి వెర్రితనము. ఈ లోక జ్ఞానమునుగూర్చిన సాంకేతిక ఇతిహాసములు, గ్రంథములు బజారులో దొరుకుచున్నవి. ఈ లోక జ్ఞానార్జనకు పాఠశాలలు, కాలేజీలు, ల్యాబరేటరీలు, కర్మాగారాలు, ప్రయోగశాలలు, వగైరాలెన్నియో ఉన్నవి. దీనిని ఒకరి నుండి మరియొకరు పుస్తకము ద్వారా గాని లేక క్రియాత్మకముగాగాని నేర్చుకొనుట జరుగుచున్నది.
అయితే పరలోక సంబంధమైన జ్ఞాన మెక్కడున్నది? ఇది బజారులో స్కూళ్ళలో కాలేజీలలో కర్మాగారాల్లో ప్రయోగశాలల్లో దొరికేది కాదు. దీనిని సృష్టికర్త దేవుని ద్వారా సంపాదించవలసియున్నది. ఇట్లు సంపాదించుటకు ఆయన సన్నిధిలో ఆయనను అభ్యర్థించాలి. ఆయనకు విన్నపము చెయ్యాలి. ఆయనకు మొరపెట్టాలి. అప్పుడు యాకోబు 3:17లో వలె ఆయన అనుగ్రహించు జ్ఞానము మొట్టమొదట పవిత్రమును తర్వాత సమాధాకరమైనదియు మృదువైనదియు, సులభముగా లోబడునదియు, కనికరముతో మంచి ఫలములతో నిండుకొనినదియు - పక్షపాతము, వేషధారణ లేనిదియునైయున్నది. ఇట్టి బలమైన జ్ఞానము సంపాదించగలము. ఇట్లు జీవిస్తే మొదటి కొరింథీ 1:31లో విధముగా జ్ఞానము, నీతి పరిశుద్ధత, విమోచనము కల్గుతుంది.
సంఖ్యా 32:1-2లో రూబేనీయులు, గాదేయులు, తమ మందలు వాటి పోషణ మరియు వారి ఆస్థులను గూర్చి యోచించారుగాని దేవుని జ్ఞానమును గూర్చి విచారించలేదు. మత్తయి 2:2లో తూర్పు దేశపు జ్ఞానులు - తూర్పు దిక్కులోని ప్రభువు నక్షత్రమును గూర్చిన జ్ఞానము నెరింగినవారైనందున, ప్రభువును కనుగొని ఆయనను పూజించారు. కనుక హెబ్రీ 2:1లో విధముగా ఇంగిత జ్ఞానమును విడిచిపెట్టితే కొట్టుకొని పోవలసి వస్తుంది గనుక జాగ్రత్త పడాలి. ఇందునుబట్టి మనము మన జ్ఞానమును దేవుని కప్పగిస్తే ఫిలిప్పీ 4:6లో వలె దేవుని జ్ఞానమైన క్రీస్తు మనకు కాపుదలగా నుండునని మనము గ్రహించాలి.
....
క్రీస్తుయేసు ఖైదీయైన పౌలును, సహోదరుడైన తిమోతియు మాప్రియుడును జత పనివాడునైన ఫిలేమోనుకును ఇది పీలేమోను 1:1.
ప్రియపాఠకులారా! పౌలు తన్ను గూర్చి తన జత పనివానికి పరిచయము చేసికొంటూ సంబోధిస్తూ వ్రాసిన ఈ మాట - అదేమనగా ''క్రీస్తుయేసు ఖైదియైన పౌలు,'' అని అనుటలో క్రీస్తుయేసునకు ప్రత్యేకించి లోకరీత్యా చెరసాలన్నది ఉన్నదా? అసలు క్రీస్తు రాజ్యములో చెర (ఖైదు) అన్న స్థలమున్నదా? క్రీస్తుయేసు ఈ లోకమునకు వచ్చి లోకస్థులకు చెరసాల శిక్ష విధించుటకు వచ్చాడా? మరియు లోకానికి తీర్పుదీర్చుటకు వచ్చాడా? ఆయన దుష్టులను శిక్షించుటకు వచ్చాడా? చంపుటకు వచ్చాడా? ఆయన ఈ లోకానికి వచ్చిన పరమార్థము లూకా 19:10 అదేమనగా నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు ఈ లోకానికి వచ్చెనని వ్రాయబడియున్నది. అలాంటప్పుడు పౌలు చెప్పినట్లు ''క్రీస్తుయేసు ఖైదీనని తన్ను గూర్చి ప్రకటించుకొనుటలో అర్థమేమి? ఇది అబద్ధమా? లేక నిజమా? అన్నదానిని గూర్చి వివరముగా తెలిసికొందము.
ప్రియపాఠకులారా! ఈ సందర్భములో అపొస్తలుల కార్యములు 9:1-2 చదివితే పౌలు సౌలుగా ఉన్నప్పుడు అనగా పౌలు క్రీస్తు చేత పట్టబడక పూర్వము సౌలు అన్న నామమేమిటో? లోకములో నాశనకర జీవితము, అజ్ఞాన అంధకారయుత జీవితము, లోక మెప్పును గూర్చిన జీవితము, ప్రభువు ప్రేమనుబట్టి గాక లోకపరిపాలకులయొక్క ఔదర్యాన్ని బట్టి జీవించే నికృష్ట జీవితముగా అహంభావము, కఠినత్వము, వగైరా దైవ వ్యతిరేక అనగా ప్రభువునకు ఉపయోగము లేనటువంటి స్థితిలో పౌలు సౌలుగా జీవించాడు. ఆ విధముగా జీవించిన దినాలలో అనగా పౌలు సౌలుగా జీవించిన దినాలలో క్రీస్తుకు దూరస్థుడు, క్రైస్తవ్యానికి వ్యతిరేకియు, యేసుక్రీస్తును వ్యతిరేకించినవాడును, ధర్మశాస్త్రము అను మూఢ విశ్వాసము, ధర్మశాస్త్ర ఆచారయుతమైన లోకసంబంధమైన సిద్ధాంతాలతో జీవిస్తూ యేసుక్రీస్తును, ఆయన శిష్యులను ద్వేషించి, ప్రభువుయొక్క మరణానంతరము ఆయన శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటకు తనకు ప్రాణాధారమైనట్లుగా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ఈ మార్గమునందున్న పురుషులనైనను, స్త్రీలనైనను కనుగొని యెరూషలేమునకు తీసుకొనివచ్చుటకు డమస్కు పరిపాలకులను పత్రికలిమ్మని ఆనాటి ప్రభుత్వాన్ని సౌలు అభ్యర్థించాడు. క్రైస్తవ్యమునకు వ్యతిరేకమైన ఆనాటి ప్రభుత్వాలు సౌలు ఉద్దేశ్యాలతో ఏకీభవించి అతని కోరికను మన్నించాయి.
ఆ విధముగా నాటి ప్రభుత్వము చేత అధికారము పొందుటకు సౌలు అట్టి అధికార పత్రాలను పొందుటకు అతడు డమస్కు దగ్గరకు వచ్చినప్పుడు జరిగిన సంఘటన. ఇది లోకసంబంధమైన తీర్పు, శిక్ష, చెర కాదు. ఇది ఆత్మ సంబంధమైనదియు, అంధకార సంబంధమైనదియు, ఘోరాతిఘోరమైనదియు, వెలుగును చూచే యోగ్యమును కోల్పోవునదియు, అంధకార సంబంధమైన మానసిక శరీరయుత నిస్సహాయ పూరిత ఖైదు. ఈ ఖైదులో సౌలు ఏ విధముగా పట్టుబడ్డాడు అన్నదాన్ని తెలిసికోవాలి. ఇతడు అధికార దాహముతో నాటి ప్రభుత్వముయొక్క సహకారముతో అదృశ్యములో ఉన్న క్రీస్తును గాక దృశ్యములో ఉన్న శిష్యులను, ఆయనేర్పరచుకున్న సంఘాన్ని చెరసాల పాల్జేసి వారిని చిత్రహింసల పాలు జేయుటకు సంకల్పించినవాడై క్రైస్తవ్యముతో పోరాటాన్ని సాగిస్తూ అజ్ఞానయుతముగా ప్రవర్తించిన సౌలు - చెరసాల లేకుండగానే ప్రభుత్వ సైనికులు లేకుండ, లోకసంబంధ రక్షక భటులు లేకుండ, లోకసంబంధ ప్రభుత్వము, వారి అధికారాలు లేకుండగానే, లోకసంబంధమైన ప్రతివాటిని వ్యర్థపరచి, ప్రభువు ఆత్మ డమస్కు దగ్గర సౌలునకు అకస్మాత్తుగా ఆకాశము నుండి వెలుగును ప్రకాశింపజేసినప్పుడు - ఆ వెలుగు ప్రభావమునకు సౌలు గుర్రముపై నుండి నేలపడినప్పుడు, అదృశ్యములో ఉన్న ప్రభువు - ''సౌలా! సౌలా! నీవేల నన్ను హింసిస్తున్నావు? అని తనతో ఒక స్వరము పలుకుటయు, అంధత్వముతో చెరపట్టబడిన సౌలు ప్రభువును చూడలేక అనగా ప్రభువును చూచే దృష్టి కోల్పోయినవాడై, ''నీవు హింసిస్తున్న యేసును,'' అనుటలో ప్రియపాఠకులారా! పౌలు యొక్క జీవితము ఏ విధముగా ఐదు విధాలుగ ఐదు మలుపులు తిరిగినట్లు ఈ సందర్భములో తెలిసికొందము.
ఇందులో మొదటిగ పౌలు యొక్క జీవితము యోధునిగాను, నాటి సామ్రాజ్యములో సౌలుతో పోరాడే సమ ఉజ్జీగా నిలిచే ప్రత్యర్థి లేని రీతిలో అనగా నాటి యెరూషలేము డమస్కు పరిపాలనలో సౌలు వంటి యోధుడు లేనట్టే చరిత్ర వివరిస్తున్నది. అనగా సౌలునకు అంగబలము, జనబలము, ప్రభుత్వ బలము, సైనిక బలము, తన దేహ బలము - ఇవన్నియు ఏకమైయున్నందువలన సౌలు యేసుక్రీస్తునకు దూరస్థుడుగా ఉండి, కఠిన వైఖరితో అహంకారపు పొరలు నేత్రాలను క్రమ్ముకొనగా - ఆ పొరల దృష్టిని బట్టి తానున్న స్థితియే తనకు గొప్ప, తన అధికారమే తనకు దేవుడు అన్న స్వభావముతో సౌలు జీవించాడు. అయితే సౌలు అనుకున్నది, సౌలు భావించింది, సౌలు యొక్క సకల ఆధిక్యతలు, అడవిలో కాచిన వెన్నెల అయింది - సౌలును గుడ్డివానిగా చేసింది. సౌలు యొక్క అహంభావమే, ప్రభువు యొక్క వెలుగే సౌలుకు జ్ఞానోదయము కల్గించింది. ఈ ప్రభువు యొక్క వెలుగు ద్వారా సౌలు యొక్క అహంకారపు పొరలు రాలిపోవునట్లుగా అపొ 9:18లో మనము ఈ విధముగా చదువగలము. ''అప్పుడే అతని కన్నుల నుండి పొరలవంటివి రాలగా దృష్టి కలిగి, లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను.
ఇందునుబట్టి ప్రియపాఠకులారా! సౌలు యొక్క కండ్లకు ఆవరించిన పొరలు యేసు శిష్యులను - ఆ శిష్యుల బోధలు విన్న విశ్వాసులను చెరసాల పాలు జేసే స్థితికి కంటి పొరలు తెచ్చాయి. అంతేగాకుండ క్రీస్తు ప్రేమకు సౌలును పూర్తిగా దూరపరిచాయి. కాని ఒకనొక దినాన ప్రభువు ఆత్మ సౌలు యొక్క దేహాన్ని చెర పెట్టబడి, అనేకులైన యేసు శిష్యులను, విశ్వాసులను చెరపెట్టాలని తలంచినప్పుడు క్రీస్తు చేత చెర పెట్టబడ్డాడు. అనగా పట్టుబడినాడు.
ప్రియపాఠకులారా! క్రీస్తు చేత ఖైదీగా పట్టబడిన ఈ సౌలు పేరు మారింది. గుణము మారింది. కంటిలో ఆవరించిన అహంకార పొరలు తొలగించి అతని చీకటి జీవితము వెలుగుమయమైంది. ఈ విధముగా జ్ఞానోదయము పొందిన - పౌలుగా మారిన ఈ సౌలు ప్రభువుకు సన్నిహితుడై మొదటి కొరింథీ 11:1లో వలె యేసుక్రీస్తును పోలి నడుచుకున్న మహోన్నత స్థానాన్ని అపొస్తలులలో పొందగల్గినాడు. ఎనిమిది సంఘాలకు పత్రికలు వ్రాసి, సువార్త పరిచర్య భయంకర వాతావరణములో శిరచ్ఛేదము చేయబడినాడు. ఆ విధముగా లోకముతో పోరాడి దైవ సాన్నిధ్యము చేరి జీవ కిరీటము పొందినాడు. 2వ తిమోతి 4:7 మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు తుదముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడియున్నది,'' అంటే ఏమని? నిత్యజీవములో ప్రవేశించాడు.
..........
అంశము :- సామెతలు 31:2 ఈ కుమారుడు ఎవరు?
నా కుమారుడా! నేనే మందును, నేను కనిన కుమారుడా నేనేమందును? నా మ్రొక్కులు మ్రొక్కి కన్నకుమారుడా! నేనే మందును?
ప్రియపాఠకులారా! ఈ వాక్యము మూడు విధములైన మర్మాలను ప్రకటిస్తున్నది. ఇందులో 1. నా కుమారుడు 2. నేను కనిన కుమారుడు. 3. మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడు. ఈ ముగ్గురి యొక్క విలువలను గూర్చి తెలిసికొందము.
ప్రియపాఠకులారా! ఇందులో నా కుమారుడా! అనుటలో ఇది దత్తపుత్రుని యొక్క విలువను సూచిస్తున్నది. అంటే దేవునికి దత్తపుత్రుడు. ఇశ్రాయేలు దేవునియొక్క దత్తపుత్రులు. దేవుని దత్తపుత్రుడు ఇశ్రాయేలు ఎట్లయినారంటే నిర్గమ 3:7 యెహోవా ఇట్లనెను - నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధలను నిశ్చయముగా చూచితిని,'' అనుటలో ఇశ్రాయేలు దేవుని సంతానము. కనుకనే ఆ జనాంగము నుండి దేవుడు కుమారత్వమును ధరించి లోకనరకోటి పాపవిమోచనార్థము నరపాపమునకు ప్రతిగా బలియాగము జరిగించుటకు లోకమునకు ఆయనను అనుగ్రహించినట్లు మత్తయి 3:17 ఈయనే నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందిస్తున్నాను.'' దేవుడు ఆయనను దత్తతగా అనుగ్రహించిన యేసుక్రీస్తు. అలాగే ఇశ్రాయేలు జనాంగమును పరిపాలించుటకును, దైవచిత్తానుసారముగ నడిపించుటకును దేవుని చేత దత్తుగా కొనబడినవాడు మోషే. ప్రియపాఠకులారా! ఇది దత్తపుత్రుల యొక్క జీవితము.
ఇక కనిన కుమారుడు :- ఆది 4:1-2 చదివితే - ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కని యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాను,'' అనుట తర్వాత ఆమె తన తమ్ముడైన హేబెలును కనుట, వీరిద్దరు స్త్రీ సహజ స్థితిలో కనిన కుమారులు. ఈ విధముగా ఆది 6:లో నరులు భూమి మీద విస్తరించ నారంభించినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలలో వారికి ఇష్టము వచ్చిన వారిని వివాహము చేసికొనుట. ఇది భూమి మీద స్త్రీలు కనిన సంతానాభివృద్ధి. అలాగే హాగరు కన్నటువంటి ఇష్మాయేలు కూడా లోకధర్మ ప్రకారముగా స్త్రీ గర్భములో జన్మించినవాడే!
ఇక మూడవ రకము :- నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా! వీరెవరు? సమూయేలును కనిన హన్నా. సంసోను తల్లితో యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై - ఇదిగో నీవు గొడ్రాలవు. అయితే నీవు గర్భవతియై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునేగాని, మద్యమునేగాని త్రాగకూడదు. అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతియై కుమారుని కందువు. అతని తల మీద మంగలకత్తి వేయకూడదు. ఆ బిడ్డ దేవునికి నాజరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించును; అటు పిమ్మట ఆ స్త్రీ కుమారుని కని సంసోనని పేరుపెట్టుట. ఇది దేవుని మ్రొక్కుబడిలో కనిన కుమారులయొక్క వివరము. అలాగే రిబ్కా విషయములో కూడా గొడ్రాలుగా ఉండి దేవునికి మ్రొక్కులు మ్రొక్కి ఏశావు, యాకోబులను కన్నది. ఈ విధముగా ఈ కుమారులయొక్క విధానమును గూర్చి తెలిసికొనగలము.
ప్రియపాఠకులారా! ఇప్పుడు ఈ మూడు తరహా కుమారుల బాగోగులు, వారి శారీర ఆత్మీయ ఇహలోక పరలోక జీవిత చరిత్ర విధానాలనుగూర్చి మనము తెలిసికోవలసియున్నది. 1. ఇశ్రాయేలు :- వీరు లోకనరకోటిలో దేవుని చేత కొనబడి దేవునికి దత్తపుత్రులుగ ఎంపికైనవారు. వీరు దైవాత్మ, దైవశక్తి, దైవకృప, దేవుని నడుపుదల, దేవుని మార్గములో నడచుచు, దేవునియొక్క అనేక మహిమలను చూచి కూడా అప్పుడప్పుడు దైవమార్గము నుండి తొలగి అన్య మార్గములో నడిచి, దైవత్వము చేత శిక్షించబడి అనేక శ్రమలననుభవించి తాము దేవునియొక్క కుమారులమన్న పేరును ఈనాటికిని, అనగా నేటి ఆధునిక యుగములో కూడా ఋజువుపరచుకొని యున్నారు.
కనుక ప్రియులారా! నేటికిని ఇశ్రాయేలు దేవుని ప్రజలే! అనగా దేవుని దత్తపుత్రులు. ఈ దత్తపుత్రులను క్రమమునందుంచి దైవమార్గములో ఆత్మీయముగా నడిపించుటకు దేవుడు మరియొక దత్తపుత్రుని ఆత్మీయముగా ఎంపిక జేసుకొని, తన జనాంగము మీద నాయకునిగాను, అధిపతిగాను నియమించినట్లు మోషేయొక్క చరిత్ర వివరిస్తున్నది. ఇందునుబట్టి హెబ్రీ 3:5లో మోషే పరిచారకుడై యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా నుండెను,'' అనుటలో దేవుని ఇంటి మీద నమ్మకస్థుడుగా ఉండుటకు దత్తపుత్రుడైన మోషే దేవుని చేత నియమితుడయ్యెను. ఈ విధముగా దేవునియొక్క దత్త కుమారత్వము వివరిస్తున్నది.
ఇక కనిన కుమారులు ప్రియపాఠకులారా! ఆదాము భార్యయైన హవ్వ కనిన ఇద్దరు కుమారులలో ఒకడు హంతకుడు, మరియొకడు హతుడయ్యాడు. కారణము దేవుడు తినవద్దని నిషేధించిన ఫలమును తిన్నటువంటి నేరమునకు పాపము అను పంటలో ప్రధమ ఫలముగా రూపించబడిన స్త్రీ సంతానము అగు కయీను, హేబెలు. వీరి చరిత్ర బహు విచారకరముగా ఉన్నట్లు ఈ అధ్యాయములో మనము చదువగలము. కయీను ద్వేషి - ఈర్ష్య, పగ - కఠినత్వము - క్రూరత్వము గలవాడునైయుండి, నిర్దోషియైన హేబెలును చంపి హంతకుడుగా దైవసన్నిధిలో తీర్చబడి దేశద్రిమ్మరి అయ్యాడు. ఇతని చరిత్ర అంతటితో ఆగక ఇతడు తండ్రి స్వాస్థ్యమునకు దూరమై ఒక ఊరు కట్టించి, ఆ స్థలములో వావివరుసలు పాటించని చట్టానికిని, దైవత్వానికి దైవసన్నిధికి విరుద్ధమైన పద్ధతిలో ఆది 6:1-2లో విధముగా దేవుని కుమారులను పాపములో పడద్రోయునట్టి ఆకర్షణాయుతమైన స్త్రీ సంతానానికి ఇతడు జనకుడాయెను. ఇందునుబట్టి నరుల కుమార్తెలు అనగా స్త్రీలు కనినవారు అని నిర్ధారణ అగుచున్నది. వీరి మూలముగా వీరు చేసిన క్రియాకర్మల మూలముగ దైవత్వము ఆగ్రహించి, యావద్ లోకసృష్టిని జలప్రళయముతో ముంచెత్తినట్లు వేదములో చదువగలము.
మొదటి సమూయేలు 2:11లో యాజకుడైన ఏలీ కుమారులు దేవుని ఎరుగని దుర్మార్గులై యుండిరి. ఏలీ తన కుమారులు చేసిన కార్యములు అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో కూడుట. ఇట్టి దోషాపరాధముల మూలముగా ఏలీ యొక్క యాజకత్వము యొక్క స్వాస్థ్యము ఏలీ కుమారులకు స్థానము లేకుండా వారిని తండ్రి వారసత్వమునకు అనర్హులుగ జేసింది. ప్రియపాఠకులారా! అలాగే దావీదు కనిన కుమారుడైన అబ్షాలోము తండ్రి మీద తిరుగుబాటు జేసి తండ్రి భార్యతో శయనించి, తండ్రి సింహాసనమును ఆక్రమించుటకు జరిగించిన పోరాటము కూడా ఈ సందర్భములో మనము జ్ఞాపకము చేసుకోవలెను. ప్రియపాఠకులారా! కన్న కుమారులు ఇంకను అనేకులు వేదములో వారి వారి హేయక్రియల మూలముగా భ్రష్టులు, బలహీనులైనట్లు చదువగలము. అయితే యేసుప్రభువు - ''స్త్రీలు కనినవారిలో యోహాను కంటె గొప్పవాడు లేడని ప్రవచించుట ఈ సందర్భములో మనము గ్రహించవలెను. యోహాను ఎలీసెబేతు కన్న కుమారుడు.
ప్రియపాఠకులారా! ఇక ''నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా! అని అనుటలో సమూయేలు తల్లి హన్నా దైవత్వమునకు దివారాత్రము ప్రార్థనాయుతముగ విజ్ఞాపన జేసి, తనకున్న గొడ్రాలితనమును దైవత్వము చేత తొలగించుకొని కనిన కుమారుడగు సమూయేలు గొప్ప ప్రవక్తయు, యాజకుడునై, అనేకులైన ప్రవక్తలను, రాజులను అభిషేకించినట్లు వేదములో చదువగలము. ఈ విధమైన సత్క్రియల మూలముగా సమూయేలు దైవసన్నిధిలో ఒక ప్రత్యేకమైన స్థానమును పొంది, పరిశుద్ధ గ్రంథములో తన చరిత్రను నిలుపుకొన్నాడు.
అలాగే సంసోను తల్లి - తాను దేవునికి మ్రొక్కుకొని కన్నటువంటి కుమారుడగు సంసోను దైవజనాంగమైన ఇశ్రాయేలులకు శత్రువులైన ఫిలిష్తీయ జనాంగమును నిశ్శేషముగా వధించాడు. దేవుని ఆత్మబలమును పొందినాడు. అలాగే దావీదు తన నిత్య జీవితములో అనేక విధములైన రాచకార్యములలో ఉండినను, ప్రతి దినము ఉదయము, మధ్యాహ్నమందును, సాయంకాల సమయమందును ప్రతి సమయములో దేవునికి స్తుతియాగము చేసేవాడు. అందునుబట్టి యెష్షయికి ఆఖరువాడైన దావీదు గొప్ప కీర్తనాకారుడును, ప్రవక్తయు, మహారాజును, చక్రవర్తిగాను దేవునియందు భయభక్తులు గలవాడునైయుండి దైవజనాంగము మీద మహారాజుగ పరిపాలనను సాగించినాడు.
ప్రియపాఠకులారా! ఈ విధముగ పరిశుద్ధ గ్రంథములో అనేకులు దేవునికి మ్రొక్కులు మ్రొక్కి పుట్టిన దేవుని బిడ్డలున్నారు. దేవుని మ్రొక్కులలో పుట్టియు లోకముతో నడిచి, లోకముతో సావాసము జేసి, లోకసంబంధమైన మరణశిక్షను పొందినవారున్నారు. వీరిలో సంసోను దేవునికి నాజరు చేయబడినవాడై, తన జనన కాలములో దేవుని చేత ప్రతిష్టించబడినవాడై, దైవనియమమును పాటిస్తూ, దైవత్వసావాసములో నడుస్తూ జీవించవలసిన సంసోను లోకసంబంధిగా మారి, స్త్రీ వ్యామోహితుడై, తన బలాధిక్యతలను గూర్చిన మర్మములను స్త్రీలకు బైల్పరచి, స్త్రీ ఒడిలో నిద్రించి మరణ నిద్రకు లోనైయ్యాడు.
అలాగే రిబ్కా కుమారుడైన యాకోబుయొక్క జనన మర్మములో దాగియున్న సత్యమేమిటంటే రిబ్కా దేవునికి మ్రొక్కుకొని ఏశావును యాకోబును కన్నది. అయితే ఏశావు భోజన ప్రియుడును, అనగా తిండికి దాసుడు - యాకోబు మోసమునకు లోనై మోసగించబడి, జ్యేష్ఠత్వమును, తండ్రి ఆశీర్వాదమును కోల్పోయాడు. అయితే యాకోబు దైవత్వముతో పోరాడి ఇశ్రాయేలు అయ్యాడు. వాస్తవమునకు రిబ్కా మ్రొక్కుకున్న కన్న కుమారులు ఏశావు, యాకోబులు; ఇద్దరును శ్రమలపూరితమైన మరియు అశాంతి వేదనతో కూడిన జీవితాలను అనుభవించారు.
కనుక ప్రియపాఠకులారా! ఇప్పుడు మన కుమారులు, మనము కన్న కుమారులు, మనము మ్రొక్కులు మ్రొక్కుకొని కనిన కుమారుల చరిత్ర ఈ విధముగా ఉన్నది. వారిని ఏ మార్గములో మనము నడిపిస్తున్నాము. వారు ఏ విధమైన ప్రవర్తనలు, నియమములలో ఉన్నారన్న విషయాన్ని గూర్చి మనలను మనమే మన పిల్లలలో ప్రయోగాత్మకముగా వారి పట్ల ప్రవర్తింపవలసియున్నది.
తల్లి క్రమములో నడిచిన బిడ్డలు మొట్టమొదట హవ్వ. ఈమె మాట్లాడుచు యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకొన్నాను, అని అన్నదేగాని యెహోవా మార్గములో తన తొలి బిడ్డయైన కయీనును నడుపలేదు. తత్ఫలితముగా అతడు హంతకుడయ్యెను. అలాగే మోషే తల్లియైన హెబ్రీ స్త్రీ ఫరో కుమార్తె సంరక్షణలో తాను కన్నబిడ్డను ఉంచి పాలిచ్చి పోషించింది. కాని దైవమార్గములో ఆ బిడ్డను పెంచలేదు. అలాగే సంసోను తల్లి దైవత్వమును ఆచరించి, మ్రొక్కుకొని, కఠోరమైన నియమాలతో బిడ్డను కని పోషించిందేగాని, ఆ బిడ్డ నడువవలసిన త్రోవలో నడిపించలేకపోయింది. అలాగే ఇష్మాయేలు తల్లియైన హాగరు అబ్రాహాము ఇంట నుండి వెళ్ళగొట్టబడిన పిమ్మట, తన కుమారుడైన ఇష్మాయేలు పసివాడైయున్నప్పుడు అతనిని భూమ్మీద పడవేసి కఠినముగా ప్రవర్తించింది. ఇందునుబట్టి ఇష్మాయేలు కూడా మూర్ఖుడును, కఠినుడును, అడవి గాడిద వంటివాడైనట్లును వేదములో చదువగలము. హన్నాకు పుట్టిన కుమారుడైన సమూయేలు - ప్రవక్త, యాజకుడై ఆదర్శవంతుడాయెనుః అలాగే ఎలీసెబేతు కనిన యోహాను దైవకుమారుడైన యేసుక్రీస్తుకు బాప్తిస్మమిచ్చే యోగ్యతను పొందగల్గినాడు. మరియమ్మ కనిన బిడ్డ లోకరక్షకుడాయెనుః ఈనాడు మనకు పుట్టిన బిడ్డలుపై వివరించిన విధులలో ఏయే స్థితిలో ఉన్నారు?
.........
ప్రసంగాంశము :- దైవజనుడు మూలము 1 తిమోతి 6:11-14.
ప్రియసంఘమా! బైబిలులో మొదటిసారిగా మోషే దైవజనుడని పిలువబడినాడు. పాతనిబంధన యుగములో ప్రవక్తలు దైవజనులుగా పిలువబడినారు. అలాగే క్రొత్త నిబంధన కాలములో యేసుప్రభువు పరిశుద్ధ రక్తముతో కడుగబడిన ప్రభువుయొక్క స్వాస్థ్యమునైన సంఘమును, పాలించుటకు దేవునిచే పంపబడిన సేవకుని దైవజనుడా! అని పౌలు భక్తుడు ప్రత్యేకముగా పిలుస్తున్నాడు. సువార్త పరిచర్యలో సంఘకాపరికి ఇవ్వబడిన ఈ బిరుదు విశిష్టమైనది, ఉన్నతమైనది. దైవజనుని గూర్చి అనేకులు అనేక విధమైన సాక్ష్యాలు ఇచ్చియున్నారు. ఇందునుగూర్చి వివరముగా తెలుసుకొందము.
1. న్యాయాధిపతులు 13:6 సమ్సోనుని తల్లి తన భర్తతో దైవజనుని రూపము - దేవదూత రూపము పోలినదై మిక్కిలి భీకరముగానున్నట్లు సాక్ష్యమిచ్చింది. 2. మొదటి సమూయేలు 9:6లో సౌలు పనివాడు సమూయేలును గూర్చి చెపుతూ అతడు బహుఘనుడు, అతడు ఏ మాట చెప్పినను ఆ మాట నెరవేరును,'' అని సౌలుతో చెప్పుచు ఇచ్చిన సాక్ష్యము. 3. మొదటి రాజులు 17:24 ఆ స్త్రీ - ఏలీయాతో నీవు దైవజనుడవై యున్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదునని సాక్ష్యమిచ్చింది.
4. 2వ రాజులు 4:9లో ప్రవక్తయైన ఎలీషా ఘానేము మార్గములో వచ్చునప్పుడెల్ల అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ ఇంట భోజనము చేస్తుండగా ఎలీషా ప్రవక్తను గూర్చి - ''మన యొద్దకు వచ్చుచు పోవుచు ఉన్నవాడు భక్తి గల దైవజనుడని సాక్ష్యమిచ్చి, అతని కొరకొక మేడ గదిని అమర్చింది. అతని కొరకొక దీపస్థంభమును, మంచమును అమర్చి, ఆయనను గూర్చి మంచి సాక్ష్యమిచ్చింది.
మన పరమరక్షకుని గూర్చి మనస్సాక్ష్యమెట్లున్నది? ఆది కాలములో ప్రవక్తలు, దైవజనులని బిరుదు పొందారు. ఈనాడు అదే బిరుదు సంఘకాపరికి కూడా అనుసరిస్తుంది. దైవజనునిగూర్చి దేవుడే మోషేను - నా ఇల్లంతటిలో నమ్మకస్థుడని ప్రవచించాడు. ఈనాడు సంఘకాపరి గూర్చి మన సాక్ష్యము ఏమిటి? ఆనాడు ప్రవక్త మాటలు, వారి యొక్క విధులు నరులు పాటించారు. క్రీస్తు కాలములోని ప్రజలు ఆయనయందు విశ్వాసముంచి రోగాలు, అంగవైకల్యము నుండి స్వస్థత పొందినారు. అయితే సంఘము విస్తరించియున్న ఈ దినములలో సంఘమును కాయుటకు కాపరిగా ఉండుటకు పిలువబడి దైవజనుడైన మన కాపరి విషయములో - మన తలంపులు, మన ప్రవర్తన, మనము అనుసరింపవలసిన విధానమేమిటి? ఆ దినములలో ప్రవక్తలకు నివాసములు లేకున్నను విశ్వాసుల గృహాలలో అతిధులుగా జీవిస్తూ - తమ చరిత్రలను ధన్యవంతము చేసుకున్నారు. దైవజనుడను పేరును సార్థకము చేసికొన్నారు. ఈనాడు దైవజనుని గూర్చి మన సంగతి ఏమిటి?
........
మందిరము :- నూతన నిబంధన దైవమందిరములో పాతనిబంధన కాలములో వలె బలి పీఠమన్నది కాక, ఈ నూతన నిబంధన కాలములో కట్టబడే ప్రతి మందిరము క్రీస్తు సంబంధితమైయున్నది. ఎందుకనగా యోహాను 1:12లో వలె క్రీస్తును అంగీకరించినవారు దేవుని కుమారులుగా పిలువబడే యోగ్యత ఉన్నదని వ్రాయబడియున్నట్లుగా - నేటి క్రైస్తవ మందిరాలలో ఉన్నటువంటి కట్టబడేటటువంటి పీఠమును బలిపీఠమని పిలువక క్రీస్తుయొక్క కరుణా పీఠముగా పిలుచుట సబబై యున్నది. దేవునియొక్క చిత్తము కూడా అదియే అన్నది గ్రహించాలి. ఎలాగంటే నేటి క్రైస్తవ మందిరాలలో పాతనిబంధన కాలములో వలె పశువులు, గొర్రెలు, పావురములు, గువ్వలను బలి ఇచ్చేటటువంటి అవసరతగాని, ప్రమేయముగాని లేదు. ఎందుకంటే లోకములో సర్వ మానవకోటి నిమిత్తము ఒక్కసారే బలిపశువుగ దైవకుమారుడైన క్రీస్తు సజీవయాగముగా - తన దేహమును బలికి సమర్పించుకొన్న కారణమునుబట్టి యేసుక్రీస్తు నేటి క్రైస్తవ మందిరాలలో సంఘముగాను, సంఘ మందిరాలలోని వేదిక సమస్తము ఆయనేయైయున్నట్లు వేదమే ఘోషిస్తున్నది. క్రీస్తు దేహము సంఘముగాను, ఆయన పేరట కట్టబడిన మందిరము క్రీస్తు యొక్క ఆరాధన మందిరముగాను, ఇందులో కట్టబడిన వేదిక క్రీస్తుయొక్క కరుణా పీఠముగా దేవుని చేత నిర్ధారించబడియున్నది. అనగా యేసుక్రీస్తుయొక్క కృపా కటాక్షములు ఎవరి మీద ఉండునో అట్టివాని దేహము, అట్టివాని హృదయము, అట్టివాని జీవితము ఒక మందిరముగాను, వాని హృదయము క్రీస్తుయొక్క పీఠముగాను, వాని జీవితము దేవునికి ఇంపైన హోమముగాను ఉన్నదనుటకు వేదరీత్యా కొన్ని సందర్భాలనుబట్టి తెలిసికొందము.
మొదటగా యోహాను 15:5లో యేసు చెప్పిన మాట - ''ద్రాక్షవళ్ళిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో - నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును,'' అనుటలో యేసును కల్గిన హృదయము వాని శరీరము యేసుమందిరము - ఇదియొక ఋజువు. గలతీ 3:27 క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.'' అనగా క్రైస్తవ మందిరముగా నిర్ధారించబడినారని ఇందులోని భావము. అలాగే క్రీస్తులో నిలిచియుండు విశ్వాసి ఆయన చేత కట్టబడిన మందిరమై అనగా నివాసమైయున్నాడు.
కనుక ప్రియపాఠకులారా! మందిరముగాని, బలిపీఠముగాని, బలిపశువుగాని సమస్తము క్రీస్తేయని ఇందునుబట్టి తెలుస్తున్నది.
.......
సింహాసనము :- ప్రియపాఠకులారా! సింహాసనమన్నది మొట్టమొదటగా దైవరాజ్యమునకు పరిమితమైయున్నది. అయితే భూమి మీద ఈ సింహాసనము ఏ విధముగా దిగి వచ్చింది? సింహాసనమన్నది పరలోకములో ఉందా? భూలోకములో ఎప్పటి నుండి వచ్చింది? పరలోక దేవునికి సింహాసనమున్నది. భూలోకములో సింహాసనము అధిష్టించాలంటే రక్తపాతంతో క్రైవసము చేసుకోవలసియుంది. కొందరు వధింపబడి కొందరు ఎన్నో శ్రమలపాలైనారు. సింహాసన ఆకర్షణన్నది ఎంతో బలమైంది. ఇట్లుండగా సింహాసనమనేది ఎక్కడ నుండి ఏర్పడింది? సింహాసనము దేనికి ముంగుర్తయియున్నది.'' ఈ సింహాసనమన్నది దేవునికేనా? నరులకు కూడా ప్రాధాన్యత ఉందా? వగైరా విషయాలను గూర్చి తెలిసికొందము.
ప్రియపాఠకులారా! మొట్టమొదటగ ఆదికాండము చరిత్రలో యోసేపుయొక్క జీవితమును గూర్చి మనము చదువుకొన్నప్పుడు, యోసేపు యాకోబు కుమారులలోను, యాకోబు గోత్రాలలోను ఒకడు. ఇతనికి సృష్టికర్తయైన దేవుడే తోడై ప్రతి అవసరతలలోను, ప్రమాదాలలోను, అవమానములోను లోకములో జరిగిన దోషపూరిత ఆరోపణలు చెరసాలలోను, దైవహస్తము యోసేపుకు తోడై యుండుట మనకు తెలిసిందే. అయితే తన సోదరుల ద్వారా నీరు లేని గోతిలో పడవేయబడి అటుతర్వాత అతని అన్నదమ్ములు ఇష్మాయేలులకు అమ్మివేయగా - వారు అతనిని ఐగుప్తులోని పరిపాలకుడైన పోతీఫరుకు అమ్ముడై, అతను ఫరో రాజు గృహములో పరిచారకుడుగా నియమించబడినాడు. ఆ పరిచర్యలో నమ్మకస్థుడుగ ఫరో చేత గుర్తింపబడి దేవునియొక్క హస్తము యోసేపును పట్టుకొనియుండినందున, శత్రు రాజ్య అధిపతి ఫరో యొక్క సేనాధిపతి యోసేపును గౌరవించినట్లు చదువగలము. ఇట్లుండగా దైవప్రభావము, దైవకాపుదల వలన యోసేపు క్షేమకరముగా చెరసాల జీవితములో కూడా చెరసాల కాలములో నిశ్చింతగా ఆనందముగా సంతోషముగాను చెరసాల వెళ్ళబుచ్చినాడు.
ఇట్లు ఖైదీగా బంధకాలలో ఉన్నట్టి యోసేపును సింహాసన అధిపతినిగా చేయుటకు దైవత్వము ఐగుప్తు పరిపాలకుడైన ఫరోకు రెండు స్వప్నాల ద్వారా ఫరో హృదయాన్ని కలవరపరచి, ఆ కల భావాన్ని వివరించువాడు లేకపోగా చెరసాలలోని ఖైదీల ద్వారా చెరసాల నాయకుల ద్వారా యోసేపును గూర్చి వినిన ఫరో తనకు కల్గిన స్వప్న దర్శనమును వివరించి, వాటి భావము, అవి సంభవించు కాలము - అట్టి సమయములో దేశ భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వగైరా వివరాలను గూర్చి దైవాత్మ ఆవేశితుడైన యోసేపు ద్వారా ఫరో విన్నవాడై, అతని మాటలయందు లక్ష్యముంచి, అతని చేత ఆకర్షింపబడి ఆ కలలను పూర్తిగా నమ్మి, ఆ కలల ద్వారా తన రాజ్యానికి సంభవించబోవు నాశనకర ఉపద్రవము నుండి కాపాడుకోవాల్సిన జాగ్రత్తలు యోసేపు ద్వారా విని, అతని ఆత్మీయ జ్ఞాన వికసింపునుబట్టి తన 2వ సింహాసనము మీద కూర్చుండబెట్టి తన 2వ రథము మీద ఎక్కించెను. ఐగుప్తు దేశమంతటి మీద అధికారిగ చేసిన ఫరో తన వ్రేలినున్న ఉంగరమును యోసేపు చేతికి పెట్టి తన రాజ్యాంగ సర్వస్వము మీద యోసేపును అధిపతినిగా చేసి, తాను రిక్తునిగాను, నామమాత్రపు రాజుగా ప్రజల ఎదుట కనబడుచు, పేరుకు మాత్రమే సింహాసనాసీనుడై - రాజ్య పరిపాలన, రాజ్య నిర్వాహకత్వము, శాసనాలు, ఆధిపత్యము యోసేపు పరము చేశాడు. ఇది యోసేపు జీవితములో దేవుడు ప్రసాదించిన ఐగుప్తు పరిపాలకుని సింహాసనాన్ని గూర్చిన వివరము. ఇది లోకసంబంధమైన సింహాసనము - ఇది లోకము ద్వారా అనుగ్రహించబడింది కాదు. ఇది దేవుని చేత అనుగ్రహించబడి ఫరో హృదయాన్ని మార్చి, యోసేపును ఫరోను ఆకర్షింపజేసి తద్వారా తన ఆత్మ ద్వారా జరిగించిన ఫలితమైన సింహాసనము ఫరో యొక్క 2వ సింహాసనమును అధిష్టించి, ఏడు సంవత్సరాల కరువు కాలములో కూడా సస్య పశు పోషణలతో కూడిన సుభిక్ష పరిపాలనను అందించాడు.
ఆనాటి ఫరో సామ్రాజ్యము కరువన్నది ఏమిటో ఎరుగని కొట్లతో నిండి ధాన్యము, వస్తుసంబారాలు, ఫరో ఔన్నత్యము, అన్ని దేశాలకు చాటుచు ఫరో పరిపాలనకు కీర్తి ప్రతిష్టతలు తెచ్చాడు. ఫరోకు యోసేపు మీదనున్న మమకారమెంత వరకు వచ్చిందంటే యోసేపు ఐగుప్తు అమ్మాయిని ఇచ్చి పెండ్లి చేసే వాత్సల్యాన్ని కల్గించింది. ఇట్టి స్థితిలో యోసేపు యొక్క జీవితము దేశదేశాలలోను వాడవాడలలోను సకల రాజ్యాలు సకల దేశాలలో పేరు ప్రఖ్యాతులు, ఆయా దేశాల ఆయా సంస్థాన పరిపాలకులు ఐగుప్తులో పశువులకు, పెంపుడు జంతువులకు, గ్రాసము జనాంగమునకు, ఆహారము కొనుగోలు చేసే ఉన్నత విలువలకు ఐగప్తు రాజ్య పరిపాలన ఐగుప్తు యొక్క ఔన్నత్యము బహుముఖముగా వ్యాపించియుండుటనుబట్టి, ఐగుప్తు రాజైన ఫరోకు యోసేపు మీద ప్రేమ, అనురాగము, వాత్సల్యము కల్గి, యోసేపు లేనిదే తన జీవితము వ్యర్థమనేటటువంటి హృదయ స్థితిని పొందినాడు. ఇది దైవానుగ్రహము ద్వారా అన్యరాజుల సింహాసనమును అధిష్టించిన దైవజనుడైన యోసేపును గూర్చిన వివరము.
ప్రియపాఠకులారా! దేవునికి కూడా ఒక సింహాసనమున్నట్లు వేదరీత్యా తెలిసికోవలసిన గొప్ప సత్యము. దేవుడు తన భక్త జనమైన ఇశ్రాయేలు జనాంగము మందిరము కట్టాలని పూనుకొనగా ''ఆకాశము నా సింహాసనము భూమి పాద పీఠముగా పల్కి - ''మీరు నేను నివసించు మందిరము ఏ పాటిదని, మానవ హస్తకృత్యాలలో దేవుడు నివసించడు అన్నట్లుగా మత్తయి 5:34 ఆకాశము, సింహాసనము, భూమి పాద పీఠముగా చేసికొని పరిపాలించే దైవసన్నిధిలో - ఆయన కుడి ప్రక్కన ప్రధాన అపొస్తలుడును, ప్రధాన యాజకుడు, దేవుని గొర్రెపిల్ల, దేవునియొక్క ప్రతిరూపమైన క్రీస్తు తన యొక్క ప్రవచనాలలో మత్తయి 25:31లో ఈలాగు చదువగలము. ''తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలును వచ్చునప్పుడు, ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై యుండును.'' అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట ప్రోగుచేయబడుదురు.'' ఇది తీర్పు సింహాసనము. ఇక ప్రకటన గ్రంథము 2:13లో ఈలాగు వ్రాయబడియున్నది. ''వాడియైన రెండంచులుగల ఖడ్గముగలవాడు చెప్పు సంగతులేవనగా - ''సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసియైయుండి, నన్ను గూర్చి సాక్షియైన అంతిపయనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో - ఆ స్థలములో ప్రభువు నందు విశ్వాసినై జీవించుటకు గూర్చి దైవవాక్యము ఇచ్చిన సాక్ష్యమిది. ప్రకటన 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనము నందు కూర్చుండియున్న ప్రకారము, జయించువానిని నాతో కూడా నా సింహాసనము నందు కూర్చుండనిచ్చెదను,'' అని వ్రాయబడుటలో ఇది లోకమును, లోకాధికారిని, శరీరమును - శరీరాశలను, నేత్రాశలను, స్వార్థము, వగైరా ఇహలోక సంబంధమైన వాటిని విసర్జించి, నిగ్రహించి, కేవలము దైవత్వమునకు శారీరాత్మలను అప్పగించి, ఆత్మీయ స్థితిని బట్టి సృష్టికర్తయైన దేవుడు వీటిని జయించినవానికి ఇవ్వబడే రెండు సింహాసనాలను గూర్చి ఇందులో వ్రాయబడియున్నది. జయించినవారిని నా సింహాసనము మీద కూర్చుండనిత్తును. ఇది విశ్వాసికి దేవుడు అనుగ్రహించు స్థిరమైనదియు, మహిమాన్వితమైనదియు, దేవునిదియు, దైవకుమారునిదియు, నిత్య నూతనమైనయున్న సింహాసనము - ఇది కదల్చబడని స్థిరమైన సింహాసనము.
కనుక ప్రియపాఠకులారా! సింహాసనములలో ఉన్నటువంటి విధానాలు, సింహాసన మర్మాలు, సింహాసన వివరాలు, సింహాసన ఆధిక్యతలు, మేళ్ళను గూర్చి ఇంతవరకు మనము తెలిసికొన్నాము. సింహాసనములో మొట్టమొదటి నుండి చివరివరకు నానా విధాలు ఆయా వ్యక్తులలో ఆయా సందర్భాలలో వారి ప్రవర్తన, వారి శారీర ఆత్మీయ స్థితిగతులను బట్టి, వారు జీవించిన జీవితమునుబట్టి, నానారీతులుగా వివరించబడిన సింహాసనాలు.
కనుక ప్రియపాఠకులారా! నేటి క్రైస్తవ జీవితములో క్రీస్తు బిడ్డలుగ తీర్చబడి ప్రకటించుచున్న మనము - మన ఇహలోక ఆత్మీయ జీవితాలలో మనము ఏ సింహాసనమునకు యోగ్యులుగా ఉన్నామన్న సంగతి మనలను మనమే పరిశోధించుకొని గ్రహించవలసియున్నది. దేవునికున్న సింహాసనము తన కుమారుడైన క్రీస్తుకు ఉన్నది. దేవునియొక్క సింహాసనము స్తుతులు, స్తోత్రాల మీద ఉంది. ఇశ్రాయేలు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడైయున్న ప్రవచన మర్మము - ఇశ్రాయేలు స్తోత్రాలే ఆయన సింహాసనమని మనము గ్రహించవలసియున్నది. అలాగే ఈ లోకములో సాతానుయొక్క సింహాసనమున్నది. సాతాను సింహాసనము లోకసంబంధమైనది. లోక రాజ్య పరిపాలనలో లోకసంబంధ రాజ్యాంగ చట్టాలు, లోకసంబంధ విధానాలు, ఆచారాలు, నియమావళి ఇవన్నియును సాతాను సింహాసనము నుండి వెలువడే శోధనతో కూడుకున్న క్రియలు. సాతానుయొక్క పరిపాలనలో ఉన్న ఈ లోకము, సాతాను తన సింహాసనాన్ని ఎలెక్షన్ల రూపముగా నానావిధ వ్యవస్థలను సృష్టించి, న్యాయాధికారి లగాయతు శాసనసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యుడు వరకు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులకును, రాష్ట్ర మంత్రులకు, గవర్నర్లకును, వీరుగాక ప్రభుత్వ పరముగా ఆయా జిల్లా అధికారులలో కొందరిని, తన అధికారము క్రింద నానావిధ రీతులలో ఈ సింహాసనములను ఈ లోకాధికారియైన అపవాది ఏర్పరచి, ఆ సింహాసనాన్ని తన వానినిగా ఉన్నవానికి అనుగ్రహించి లోకాధిపత్యమును చేజార్చియున్నాడు.
ఈ సింహాసనమును మీద కూర్చున్నవాని వ్యసనమన్నది ప్రతి యొక్కనిలో నానావిధాలుగా లోకము మీద క్రియ జరిగిస్తున్నది. క్రైస్తవ మందిరాలలో కూడా ఈ వ్యసనమన్నది తనకు ప్రధానాధిపత్యము ఉండాలని యాతనపడుచు, అక్రమ పద్ధతులలో సంపాదించాలని నరుడు నానా క్రియలు జరిగిస్తున్నాడు. ఇందునుగూర్చి లూకా 4:5-6లో దైవకుమారుడైన యేసుక్రీస్తుతో అపవాది పల్కిన మాటలు, ''భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి - ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకు అప్పగింపబడియున్నది. అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును,'' అనుటలో ఈ లోక రాజ్యాలు, వాటి సింహాసనాలు, ఆధిపత్యమంతయు, అధికారము పొందినవాడై, లోక సింహాసనాన్ని పరిపాలించేవాడు అపవాదియని ఇందునుబట్టి తెలుస్తున్నది. ఇంకను 2వ థెస్సలొనీక
2:4లో ''ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనబరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును,'' అనుటలో దేవుని ఆలయములో దేవుని బలిపీఠమన్నది అది దైవసింహాసనమని మనము గ్రహించాలి. దైవమందిరములో దైవారాధనలో దేవుడు సింహాసనాసీనుడై విశ్వాసులైన మనందరి ప్రార్థనలు నేరుగా ఆలకిస్తుంటాడు. కనుక అలాంటి మందిరములోని సింహాసనమును కూడా అపవాది ఆక్రమించుటన్నది కొన్ని సంఘాల బలహీనతలు దైవత్వమునకు అవకాశమీయక అపవాది దేవునికి చెందవలసిన ఘనత, దేవునికి ఈయవలసిన మహిమను - దైవత్వానికి బదులు లోక ఐశ్వర్యాలతో లోక ఆధిపత్యాలలో తులదూగుచున్న సంఘ సభ్యులకిచ్చి, సంఘములో ఐక్యత చెడగొట్టుచు, అపవాది వారిని కోర్టు కచ్చేరీలకు ఎక్కించి, సంఘాన్ని ఛిన్నాభిన్నము చేస్తూ రక్తము పారునట్లు, కొట్లాటలు జరిగిస్తున్నట్లు కొన్ని సంఘాల చరిత్ర మనకు అక్కడక్కడ ఋజువుపరస్తున్నది.
కనుక ప్రియపాఠకులారా! దేవుని సన్నిధిలో దైవ సింహాసనము ఎదుట అనేకమైన సింహాసనాలున్నాయి. యోబు గ్రంథము 1:6 దేవుడు ప్రధాన సింహాసనము మీద కూర్చుండగా దేవదూతలు వారి వారి సింహాసనముల మీద కూర్చుండగా - అపవాది కూడా తనకు నిర్ణయించబడిన ఆసనములో ఆసీనుడైయున్నట్లు చదువగలము. పైపెచ్చు అపవాది ''భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చినట్లు జవాబు ఇచ్చుట మనకు తెలిసిన విషయమే.
కనుక ప్రియపాఠకులారా! దైవరాజ్యము నుండి పడద్రోయబడిన తాను దైవవ్యతిరేకముతో - దేవుని కంటె తనను హెచ్చించుకొన్న లూసిఫర్ అను దేవదూత తన అహంకార గుణము చేత పడద్రోయబడి, భూమి మీద ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యము స్థాపించుకొని, ఆ రాజ్యమునకు తానే ప్రభువై, ఆ రాజ్యము దైవత్వమునకు వ్యతిరేకము, దైవరాజ్యానికి శత్రువుయైనట్లు మనమెరిగిందే. ఈ విధముగా దైవవ్యతిరేకత, పరలోక రాజ్యమునకు వ్యతిరేక రాజ్యమును అపవాది భూమి మీద ఏర్పరచుకొన్నట్లు; ఆ రాజ్యాధికారము తన బలాధిక్యతలతో లోకపరిపాలనా సింహాసనమధిష్టించి తన ఇష్టారాజ్యముగా నిరంకుశముగా ఏలుచున్నట్లు తెలుస్తున్నది. ప్రకటన 4:2 పరలోకమందు ఒక సింహాసనము వేయబడి యుండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడైయుండెను. ఆసీనుడైనవాడు సూర్యకాంత పద్మ రాగములను పోలినవాడు, 4 సింహాసనమును చుట్టు 24 సింహాసనములుండెను. ఆ సింహాసనములందు 24గురు పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకొని, తమ తలల మీద సువర్ణ కిరీటాలు పెట్టుకొన్నవారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులును, ఉరుములును బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. అవి దేవుని ఏడాత్మలు అని మనము ఈ వేదభాగములో చదువగలము.
కనుక ప్రియపాఠకులారా! సింహసనమునకు భూలోకమందును పరలోకమునకును నానావిధ ఆధిక్యతలున్నట్లు ఆ ఆధిక్యత కెట్టి ప్రాముఖ్యమైన స్థానమున్నట్లు, ఆ విధముగా ప్రాముఖ్య స్థానము పొందిన సింహాసన విలువ పరలోక సంబంధముగా ఉన్నట్లు తెలుస్తున్నది. భూలోక సింహాసనము ఉండవచ్చును. అందులో పాపి ఉండవచ్చును, సంతానహీనుడైన ఉండవచ్చును. పేరుకు సింహాసనములో కూర్చున్న రాజు గుండెపోటుతోనో అపజయము పాలయ్యే ఆ సింహాసనము అన్యాక్రాంతము కావచ్చును - ప్రత్యర్థుల పాలు కావచ్చును. ఏదేని అరిష్టము ద్వారా ఆ సింహాసనమును పోగొట్టుకోవచ్చు విచ్ఛిన్నము కావచ్చును. ఎందుకంటే భూలోక సంబంధి సింహాసనము నరుల చేత చేయబడింది. నరుల ప్రమేయముతో కూడింది. ఈ సింహాసనము మీద నీతిమంతుడు అనీతిమంతుడు కూర్చుంటాడు. పాపి కూర్చుంటాడు, పుణ్యవంతుడు కూర్చుంటాడు. భూలోక సింహాసనములో రెండు విధములైన వ్యక్తులకు అవకాశము ఉంది. అయితే పరలోక సింహాసనములో త్రియైక దేవుని చేత నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా తీర్చబడిన వానికి తప్ప మరెవరికిని కూర్చొను అవకాశము లేదు. భూలోకము అశాశ్వతము పరలోకము శాశ్వతము. క్షయమగునది భూలోకము. అక్షయమైనది పరలోకము. భూలోక సింహాసనము నరసంబంధమైన పరిపాలకునికి పరిమితమైంది. పరలోక సింహాసనము గొర్రెపిల్ల రక్తములో శుద్ధి జేసుకొన్నవారికి తప్ప మరెవ్వరికి తాకుటకుగాని, కూర్చుండుటకుగాని అధికారము లేదని గ్రహించాలి.
కనుక ప్రియపాఠకులారా! సింహాసనములో ఇంత గొప్ప శారీర ఆత్మీయ దైవనిగూఢ సత్యాలతో కూడిన మర్మాలున్నవి. అందుకే దేవుడు సింహాసనమును ఒక ప్రత్యేకమైన ఆసనముగా తనయొక్క లేఖన భాగములో అభివర్ణించియున్నాడు. సింహాసనమనగా సింహము కూర్చునేటటువంటి విధానము చూపే పీఠము. సింహము మృగరాజు, అనగా సకల జంతుకోటికి రాజు. సకల నరకోటికి పాలకుడైనవానికి కూడా ఈ సింహమనే నామముతోనే ఈ సింహాసనమున్నది. రాజ్యాన్ని పరిపాలించే రాజును గుర్తింపజేసేది, రాజ్యములోని ప్రజానీకము, ఈ రాజ్యము యొక్కయు, రాజు యొక్క ప్రాబల్యమును గూర్చి చాటి చెప్పేది సింహాసనము.
ప్రియపాఠకులారా! సింహాసనము వేరు, రాజాసనము వేరు, యోగాసనము వేరు. ఆసనాలు ఎన్నయినను, ఉన్నను అవి అన్నియు కూడా దైవసంకల్పాన్ని, దైవపరిపాలన వ్యవస్థను గూర్చిన ప్రణాళిక లోకానికి ప్రకటిస్తున్నవి. సింహాసనము మీద ఒక వ్యక్తి ఆసీనుడు కావాలంటే కూర్చునే యోగ్యత అతనికి కావాలి. లోక సంబంధమైన సింహాసనములో ఏ విధముగానైన చలామణి కావచ్చు. రాజయినప్పుడు అతడు కపటము చేతనో లేక ద్వేషము చేతనో లేక కుతంత్రము చేతనో లేక వారసత్వమునుబట్టి యో పరిపాలకుడుగా చెలామణి కావచ్చు. కాని పరలోక సింహాసనము కోరే వ్యక్తికి పరలోక సంబంధమైన నియమావళి, చట్టాలు, ప్రవర్తన, పరలోక సంబంధమైన ఆత్మీయత - పరలోకములో ప్రధమ సింహాసనము మీద ఆసీనుడైన వానికి కావలసిన యోగ్యత, పరలోకమును అభ్యర్థించే వ్యక్తికి ఉండాలి. అలా లేనప్పుడు పరలోక రాజ్యానికి అట్టివాడు వారసుడు కాలేడు. కనీసము ఆ రాజ్యములో ప్రవేశించుటకు కూడా అర్హుడు కాలేడు. ఇది సింహాసనమును గూర్చిన మంచి చెడు వివరాలు.
ప్రియపాఠక సోదరీ! సోదరుడా! నీకెలాంటి సింహాసనము కావాలని కోరుచున్నావు? పరలోక సింహాసనమా! లేక భూలోక సింహాసనమా? లేక మృతుల లోకములోని మరణ సింహాసనమా! ఏది కావాలో కోరుకో!
.......
కారణజన్మలు :- ప్రియపాఠక మహాశయులారా! వేదరీత్యా ఎన్నో దైవ వేద సంబంధమైన వేద సాహిత్యాలను గూర్చి, వివరాలను గూర్చి, వ్యాఖ్యానములను గూర్చి, పద్య గద్య భాగములలో నానారకములైన వేదాంతుల ద్వారా కవులు ద్వారా విరచితమైన గ్రంథాలు చదువుకొని యున్నాము. అయితే ఆ విధముగా రచించిన కవులు, వేదాంతులు కేవలము వారి యొక్క కవితా జ్ఞానముతో రచించారేగాని వారు రచించిన ఆ జ్ఞానము యొక్క అనుభవాలను పొందినవారు కారు. ఏదో యొక సందర్భాన్ని మాదిరిగా తీసుకొని ఆ సందర్భమును బట్టి తన స్వజ్ఞానముతో - కవితలల్లి వర్ణనలతో గ్రంథ రచనలు చేసియున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథము అని పిలువబడు బైబిలు వేదము ఆ విధముగా నరునియొక్క స్వజ్ఞానము, కవిత వర్ణనలు, మానవునియొక్క ఇష్టానుసారముగా వ్రాయబడింది కాదు. ఇది దేవుడే స్వయముగా తానేర్పరచుకొన్న భక్తుల చేత తన ఆత్మ ప్రేరేపణతో తన జ్ఞానముతో - తన చిత్తానుసారముగా తన విధి ధర్మమునుబట్టి నరుని శాసించి, బహు ఆశ్చర్యకర రీతులలో అనగా నరునియొక్క ఊహకు అందని రీతిలో - నరునికి సంభ్రమ ఆశ్చర్యాలు కల్గించే రీతిలో పరిశుద్ధ గ్రంథము యొక్క రచనలు వ్రాయబడియున్నవి. ఈ విధముగా వేదయుతముగా ఆయాసందర్భాలు దేవునియొక్క చిత్తమునకు అనుగుణ్యముగా - ఆయన క్రియాకర్మలకు కారకులుగా దేవుడేర్పరచుకొని, ఆయా కాలములనుబట్టి సందర్భాలనుబట్టి దేవుని చేత వాడబడిన వ్యక్తులే కారణ జన్మలు. చిత్రమేమంటే ఈ కారణ జన్మలుగా అవతరించినవారు ఈ లోకమును విడిచి వెళ్ళినను, వారి కీర్తి, వారి పేరుప్రతిష్టలు, వారి చరిత్రలు వేదములో సుస్థిరములై, నేటి తరమువారమైన మనకును, రాబోయే తరములకును ఆదర్శములై, ప్రతి నరుని జీవితములోను వానికి మార్గదర్శకములైయున్నవి. ఈ విధముగా జన్మించిన కారణ జన్ములను గూర్చి మనము ఇప్పుడు తెలిసికొందము.
కారణజన్మలు అంటే ఆయాసందర్భాలు సమయాలలో అవసరమైన కార్యములను నెరవేర్చుటకు ఏర్పరచబడినవారు. ఇట్టి వారిని గూర్చి పరిశుద్ధ గ్రంథములో అనేకుల చరిత్రలున్నను - ఆ చరిత్రలు లెక్కకు మిక్కిలిగా ఉన్నను ముఖ్యమైన కొందరిని గూర్చి మనము వేదరీత్యా తెలిసికొందము. ఇందులో మొట్టమొదటగ కారణజన్ముడు ఎవరంటే యావద్ సృష్టికిని - సృష్టికర్తయైన పరమాత్ముడు. ఈయన ఆది 1:2లో చీకటి అగాధ జలముల మీద ఆత్మగా అల్లలాడినట్లు వేదములో వ్రాయబడియున్నది. ఈయన ఆ విధముగా అల్లలాడుటకు కారణము నిరాకారమైయున్న సృష్టికి ఆకారమిచ్చుటయే. ఈ కారణము చేత దేవునియొక్క ఆత్మ అగాధ జలముల చీకటిలో అల్లలాడింది కనుక మొట్టమొదటి కారణజన్ముడు పరమాత్మ. అటుతర్వాత యావద్ భూలోక సృష్టిని సంపూర్తి చేసిన పరమాత్ముడు తాను జరిగించిన సృష్టి కార్యములలో ఐదు దినములు యావద్ ప్రాణులను, వృక్షజాలములను, జంతుజాలములను, పంచభూతాలను, గ్రహనక్షత్రాదులను చేసిన అనంతరము, ఆరవ దినమున జీవాత్ముడైన నరుని మొట్ట మొదటగా భూమి మీద చేశాడు. మరియు అతనికి జంటగా నారిని అతనిలోనుండి రూపించాడు. ఇది జరుగక పూర్వము ఆదికాండము 1:26-27లో వలె పరమాత్ముడు నరుని చేయుటలోని కారణమును గూర్చినట్టి నిగూఢ సత్యాన్ని బయల్పరచుచు - మన పోలికె మన స్వరూపము చొప్పున నరులను చేయుదము,'' అని దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను, పురుషునిగాను వారిని చేసినట్లును, వారికి భూమి మీద సకల హక్కు అనుభవాలు అనుగ్రహించినట్లును వ్రాయబడియున్నది. అనగా - ''మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని ఏలుడి, అనుట. కనుక ఈ భూలోకములో మొట్టమొదటి కారణజన్ముడు పరమాత్మలో భాగస్వామియైన ఆదినరుడైన ఆదాము అని ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది. అలాగే స్త్రీ నుండి సంతానము ప్రబలుటకు కూడా నరునిలోనుండి తీయబడిన ఆదినరుని పత్నియైన హవ్వ కారణజన్మురాలు. ఇందునుగూర్చి ఆది 3:20 జీవముగల ప్రతివానికిని హవ్వ తల్లి. కనుక లోకములో జనాభా విస్తరించుటకుఈ నరనారులే కారణ జన్ములు.
ప్రియపాఠకులారా! ముగ్గురు కారణజన్ములు తేలారు. సృష్టిని రూపించుటకు కారణజన్ముడు - కారకుడు పరమాత్ముడు. భూలోకములో నరకోటి విస్తరించుటకు స్త్రీ పురుషుల జనాభా ప్రబలుటకు కారకులు ఆదినరుడు - ఆదినరజంట ముగ్గురు కారణజన్ములు. కనుక పరమాత్ముడు జరిగించిన క్రియాకర్మలలో గురువు కూడా కారణజన్ములే. మరణాన్ని గూర్చి నరులకు ఉపదేశించిన గురువు - పరమాత్ముడే. అలాగే పరమాత్ముడు నిషేధించిన వృక్షఫలమును భుజించుటకు ఉపదేశించిన గురువు కూడా కారణ జన్ముడే! అయితే పరమాత్ముడు ఉపదేశించిన ప్రతిదానిలోను అడ్డు తగులు మరియొక గురువున్నాడు. ఇతడే ప్రకృతిని వికృతముగా మార్చి క్రియ జరిగించువాడు. ఇతనిని పరిశుద్ధ గ్రంథములో అపవాదియని, సాతానని నామధేయాలు - ఇతనికి ఉన్నాయి. ఈ విధముగా ఆదికాండము 6:లో ఈ కారణ జన్మలు ద్వారా విస్తరించిన జనాభా విస్తారమైనప్పటికిని అందులో పరమాత్మునికి ఇవ్వవలసిన గౌరవమర్యాదలు, ఆయన పట్ల చూపవలసిన భక్తి, కృతజ్ఞతలకు బదులు జన్మకు కారకుడైన పరమాత్ముని విస్మరించి, స్వజ్ఞానముతో స్వశక్తితో కామక్రోధ మదమత్సరాలతో కూడిన అహంకార స్వభావముతో ప్రవర్తించినందున, సృష్టికర్తయైన పరమాత్ముడు ఆగ్రహించి యావద్ సృష్టిని లయపరచి, మరల పునఃసృష్టిని రూపించాలని సంకల్పించినవాడై నాటి జనాంగములో దైవత్వమునకు యోగ్యుడైనవాడెవ్వడో - వానిని అన్వేషించి తద్వారా ఆనాటి జనాభాలో దైవత్వము పట్ల భయభక్తులు గల్గిన ఒక వ్యక్తిని, అతని కుటుంబాన్ని నీతిమంతుల జాబితాలో చేర్చి, వారి ద్వారా తన పునఃసృష్టి కార్యక్రమాన్ని జరిగించాలని ఎంచి, పరమాత్ముడు జరిగించిన సృష్టి వినాశ మారణహోమ క్రియలో - మరుసృష్టికి కారణజన్మునిగ ఆ నోవహు అను నీతిమంతుని పరమాత్ముడు ఎంపిక జేసి, అతని ద్వారా పునఃసృష్టి నిర్మాణము జరిగించాడు. ఆ విధముగా ఆ నోవహు అను నీతిమంతుని ద్వారా విస్తరించిన జనాంగమే నేటి విశ్వాసులమైన మనమున్నాము.
ఇట్లుండగా పరమాత్ముడు యావద్ సృష్టికి కారణజన్ముడు - తానొక్కడేగాక తన ప్రతినిధులుగ ఈ అనంత విశ్వములో అనేకులను రూపించినట్లుగ వేదరీత్యా ఈ క్రింది దైవజనులను గూర్చి మనకు తెలిసిన విషయమే. అనగా ప్రవక్తలు, విశ్వాసులు, యాజకులు, న్యాయాధిపతులు, రాజులు, నియంతలు, వగైరాలు. వీరందరు పాతనిబంధన కాలములో నరులను దైవిక క్రమ మార్గములో నడుపుటకు లోకరీత్యా న్యాయ మార్గములో నడుపుటకు కారణజన్మలుగా లోకములో అవతరించారు. అయితే దేవునియొక్క జన్మలలో పాతనిబంధన కాలములో దేవుడు పుట్టించిన కారణజన్ములు అందరును లోకసంబంధులును, మానవేచ్ఛలతో కూడి జీవించినవారును, ''దైవజనాంగమును దైవమార్గములో నడుపుటకును, దైవ జనాంగమును పరిపాలించుటలో ప్రావీణ్యతను పొందినవారుగాను, వేదములో కొందరిని గూర్చి తెలిసికొందము. ఇందులో అబ్రాహాము విశ్వాసము అను గుణమునకు కారణజన్ముడు. ఆలాగే మోషే దైవజనాంగము అను ఇశ్రాయేలును నలుబది సంవత్సరాలు దైవచిత్తము ప్రకారము ఏలుటకు కారణ జన్ముడాయెను. అలాగే అహరోను నాటి దైవజనాంగమైన ఇశ్రాయేలులలో దైవఆరాధన జరిగించుటకు కారణజన్ముడాయెను.'' అలాగే పరమాత్మునియొక్క ప్రవచనాలను ప్రవచించుటకు ప్రవక్తలు కారణ జన్ములయ్యారు. అట్టి వారిలో మోషే ప్రవక్త మాత్రమేగాక ఆదికాండము లగాయతు ద్వితీయోపదేశకాండము వరకున్న ఐదు కాండలకు పరమాత్ముని చేత పరమాత్మ జ్ఞానముతో రచించుటకు కారణజన్ముడు. ఈ విధముగా పాతనిబంధన కాలములో ఎందరో కారణజన్ములున్నారు.
ఇక క్రొత్త నిబంధనలో దేవునియొక్క ప్రణాళికను, ఆయన చిత్తమును నెరవేర్చుటకు ఆయన కార్యమును తుదముట్టించుటకు, లోకజనాభాలో విస్తరించియున్న పాపము, మరణము అను ఉపద్రవముల నుండి విమోచించుటకును, రక్షించుటకును, పరమాత్ముడు తన శక్తి, తన ప్రభావముతో దైవనరరూపమును రూపించి, తద్వారా యావద్ నరలోకము రక్షించబడుటకు కారణజన్మునిగా యేసుక్రీస్తు అను పేరుతో ఆయనను అవతరింపజేశాడు. ఇట్టి క్రియనుబట్టి యావద్ నరకోటికి పాపము - మరణము అను ఉపద్రవము నుండి రక్షించుటకు యేసుక్రీస్తు అను నామమే, పరమోత్తమ నామముగా ఈనాడు జనబాహుళ్యములో ప్రకటించబడుచున్నది.
కనుక ప్రియపాఠకులారా! నరుడు మోక్షరాజ్యము చేరాలంటే అందుకు కారణ జన్ముడు యేసుక్రీస్తు అని మనమెరిగియున్నాము. అయితే నరులను పరలోక రాజ్యము చేర్చుటకు తర్ఫీదును, సిద్ధపాటును ఇచ్చి దైవనియమాలతో నడిపించు శక్తి - పరిశుద్ధాత్ముడు. ఈయన నరులను ఆవరించడమేగాక దైవరాజ్య మహిమను భూమి మీద విస్తరింపజేయుటకు సంఘములను, సంఘమందిరాలను నియమింప జేస్తున్నాడు. ఈ విధముగా పరిశుద్ధాత్ముడు దైవరాజ్యము భూమి మీద స్థాపించుటకును, దానిని క్రమబద్దీకరణ చేసి, నరులను పరమాత్మ విశ్వాసము నుండి తప్పిపోకుండ కనిపెట్టియుండుటకు పరిశుద్ధాత్మ కారణ జన్ముడయ్యాడు. ఇందునుబట్టి పరిశుద్ధాత్మ లేనిదే క్రైస్తవ సంఘాలకు ఉజ్జీవము లేదు. పరిశుద్ధాత్మ లేని సంఘము - జీవము లేని శరీరముతో సమానము. పరిశుద్ధాత్మ లేనిదే విశ్వాసి యొక్క విశ్వాసము వ్యర్థము. పరిశుద్ధాత్మ లేనిదే దైవరాజ్య ప్రవేశమన్నది అసంభవము. పరిశుద్ధాత్ముని ఎరుగని జీవితము కన్నులుండి చూడలేనటువంటి వ్యక్తి యొక్క జీవితముతో సమానము.
కనుక ప్రియపాఠకులారా! ఇప్పుడు ప్రభువు రాకడలో ఆయనను ఎదుర్కొనుటకు శక్తిని, బలాన్ని, యోగ్యతను, అర్హతను కల్గించువాడు పరిశుద్ధాత్ముడే. నేటి ఈ అనంత విశ్వము ప్రభువు రాకడ కొరకు ఎలాగు కనిపెట్టి యున్నదో అలాగే పరిశుద్ధాత్మ కొరకు లోకము కనిపెట్టవలసియున్నది. యేసుక్రీస్తు మరణ పునరుత్థానుడైన తర్వాత అపొస్తలుల ద్వారా లిఖింపజేసిన ఆయన చరిత్ర, దైవరాజ్య స్థాపన, నూతన నిబంధన వేదరూప కల్పన, క్రీస్తు సంఘాల నిర్మాణ కార్యక్రమము క్రైస్తవ విశ్వాసుల అభివృద్ధికి కారణజన్ముడు పరిశుద్ధాత్ముడే! యేసుక్రీస్తు అపొస్తలుల ద్వారా నూతన నిబంధన అను గ్రంథము, అపొస్తలులు చరిత్ర అను గ్రంథము, ప్రకటన అనే గ్రంథము వగైరా త్రివిధ భాగములకు కారణజన్ముడు పరిశుద్ధాత్ముడే. నాటి కాలములో పరమాత్ముడు ఏర్పరచుకొని, యేసుక్రీస్తు ప్రతిష్టించిన అపొస్తలులను పరిశుద్ధాత్ముడు ఆవరించి క్రియ జరిగించకపోతే, నేటి క్రైస్తవ్యమునకు రూపము, విస్తరణ, అభివృద్ధి, ఆధిక్యత ఉండేది కాదు.
కనుక ప్రియపాఠకులారా! ప్రతి క్రియకును కారణ జన్మలున్నట్లుగ ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది. కనుక నేటి మన విశ్వాస జీవితములో మనము ఆత్మీయముగా ఎదగాలంటే దానికి కారణ జన్ముడు క్రీస్తు, కొనసాగించువాడు - పరిశుద్ధాత్ముడు; మన విశ్వాస జీవితమును పడగొట్టు వాడొకడున్నాడు. అతనినే అంత్యక్రీస్తు అనియు, అపవాది అనియు అంటారు. కనుక ప్రతి కార్యమునకును కారణ జన్ముడొకడున్నాడన్న సత్యాన్ని ఇందుమూలముగా మనము తెలిసికోవలసియున్నది. అందుకే అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో 12:1-2లో ఈ విదంగా ప్రవచించియున్నాడు. ''ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించియున్నందున మనము కూడా ప్రతి భారమును, సుళువుగా చిక్కుల బెట్టు పాపమును విడిచి పెట్టి విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.'' ఇందునుబట్టి విశ్వాసమునకు కర్తగాను, దానిని కొనసాగించుటకు కారణజన్ముడుగాను యేసుక్రీస్తు ప్రభువు ఒకడున్నాడన్న సత్యాన్ని ఎరిగి ఆయనను మనకు గురువుగా మన రక్షకునిగ, మన విమోచకునిగ, మనము ప్రయాణించే మార్గముగా, మనలను దరిజేర్చే ఆశ్రయపురముగా - మనకు ప్రాణాధారమైన జీవజలముగా జీవాధిపతిగా జీవాహారముగా జీవపు వెలుగుగా - వెలుగు బాటగా మన సమస్తమునకు కారణజన్ముడు'' యేసుక్రీస్తు ప్రభువు అనిన సత్యాన్ని ఎరిగి ఆయనలో జీవించుదము గాక! ఇది కారణ జన్మలను గూర్చి సరియైన నిర్వచనము.
ఇక వికార జన్మలను గూర్చిన అనగా వికృతమైన వాటి పుట్టుక వాని వివరము. ప్రియపాఠకులారా! లోగా మనము కారణ జన్మలను గూర్చి వేదరీత్యా తెలిసికొనియున్నాము. కారణ జన్మలు వలెనే వికార జన్మలు కూడా ఏర్పడియున్నవి. దేవుడు భూమ్యాకాశములు సృజించినప్పుడు ఆయన పక్షపాత వైఖరితో కలుషితమైన స్థితిలో సృష్టిని రూపించలేదు. ఆది 1:లో అంతయు కూడా దేవుడు చేసిన ప్రతి కార్యము అది మంచిదైనట్లు వ్రాయబడియున్నది. ఇందునుబట్టి పరమాత్ముడు సృష్టించిన ప్రతి సృష్టమును దేవుని మహిమపరచుటయేగాక, ఆయన సృష్టిలోని నిగూఢ సత్యాలను కూడా నరుని యొక్క జ్ఞానమునకు అనూహ్య రీతిలో వివరిస్తున్నది. దేవుడు లోకసృష్టిని చేసిన కాలములో ప్రకృతి అంతా కూడా ప్రాణికోటికిని, నరజీవితానికి ప్రశాంతకరమైనదిగాను, చల్లని వాతావరణము, ఆహ్లాదకరమైన జీవితాన్ని నరకోటికి ప్రసాదించింది. ఇది సృష్టి ప్రభావము కాదు గాని సృష్టికర్తయైన దేవునియొక్క మహిమ యొక్క ప్రభావము; ఆయన చేసిన ప్రతి సృష్టి కార్యములలో నిర్ధుష్టత్వము, పరిశుద్ధత కలిగి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండ నాటి నరజీవితము సాఫీగా జరుగుటకు, నాటి సృష్టి క్రియలో అనేకములైన హంగులను అనగా చలి, అతివృష్టి, అనావృష్టి, వేడిగాడ్పులు, హిమపాతము, తుఫాను, సుడిగాలులు, భూకంపము వగైరా అరిష్టములకే మాత్రము తావు లేని స్థితిలో సృష్టిని - సృష్టికి అనువైన ప్రకృతిని, వాతావరణము అను ఈ మూడింటిని లోకానికి ప్రసాదిస్తూ - పంచభూతాలను దేవుడు తన స్వాధీనమందుంచుకొని దేవుడు క్రియ జరిగించాడు. అందువలన నరుడు నిరపాయముగా ఉండి రోగభయము, మరణభయము, చింత, చికాకు, వగైరా అరిష్టాలు లేక దేవుడు సృష్టించిన వనములో జీవించాడు. ఇది ప్రకృతి సిద్ధముగా దేవుడు తన చిత్త ప్రకారముగా నరుల పట్ల జరిగించిన క్రియాకర్మలు.
ప్రియపాఠకులారా! ఈ సందర్భములో ఆహ్లాదకరమైన ఈ ప్రకృతికి వ్యతిరేకముగా వికృతి అన్నది ఏర్పడుటకు కారణము నరుడే, ఈ సరదర్భములో ఆది 3:17-18లో ఆదినరునితో దేవుడు అనిన మాట, ''నీవు నీ భార్య మాట విని - తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడియున్నది. ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు. అది ముండ్లతుప్పలను, గచ్చపొదలను నీకు మొలిపించును,'' లో వలె ప్రకృతి వికృతము దాల్చుటకు నరుడని తెలియుచున్నది. నరుని నిమిత్తముగానే దేవుడు ప్రకృతిని వికృతిగా మార్చినట్లు ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది. భూమి ఏ విధముగా తన సారమును కోల్పోయి నరునిపట్ల వికృత రూపము దాల్చిందో - భూమికి అనుబంధముగా అనగా ప్రకృతికి అనుబంధముగా గ్రహకూటమిగాని, పంచభూతాలుగాని వికటించి, భూమితోపాటు పంచభూతాలు గ్రహకూటమి వగైరాలును, భూసృష్టములలో జంతుజాలము, మృగపక్షి సముదాయలలో కూడా ఈ వికృతి అన్నది ఏర్పడి ప్రాణికోటిలో క్రూరత్వము, నరునిలో ద్వేషము, పగ, ఈర్ష్య, కామక్రోధ మదమాత్సర్యాలు వగైరా వికృత గుణాలు ఏర్పడినవి. అంతేగాకుండ నరుడు దేవుని పట్ల చేసిన ఆజ్ఞాతిక్రమమునుబట్టి దేవుడు తన సృష్టి యావత్తును నరునికి ప్రతికూలించేటట్లుగా చేసినట్లు ఈ వికృత వాతావరణములోని అనుభవాలు మనకు బోధిస్తున్నవి.
ఇట్లుండగా ఒక నరుని ద్వారా పాపమును, మరణమును, వికృతమైన ప్రకృతియు లోకములో ఎలాగు ప్రవేశించెనో ఆలాగే రెండవ నరుడైన, రెండవ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా విమోచన, రక్షణ, ఆహ్లాదకరమైన పూర్వీక ప్రశాంతమును, మహిమకరమైన ప్రకృతిని నరకోటి అనుభవించుటకు అవకాశము ఏర్పడినట్లు వేదములో రోమా 5:12-21లో చదువగలము. ఒక మనుష్యుని ద్వారా పాపము ఏలాగు ప్రవేశించెనో అట్లే మరియొక మనుష్యుని ద్వారా విమోచన, రక్షణ ప్రవేశించింది. ఈ సందర్భములో ప్రకటన 21:1లో ఈ విధముగా వ్రాయబడియున్నది. ''అంతట నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలైయుందురు. దేవుడు తానే వారి దేవుడై యుండి వారికి తోడై యుండెను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. దుఃఖమైనను ఏడుపైనను వేదనయైనను ఇక ఉండదు.
ప్రియపాఠకులారా! ఇది ఈ లోక సృష్టి గతించిపోయిన తర్వాత అనగా ఈ లోకము అగ్నితో దహించబడి, ఈ లోకసృష్టి - సృష్టిలో ఉన్న సమస్త సృష్టములు నరులును 2వ పేతురు 3:10-12లో వలె ''ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహా ధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీద నున్న సమస్త కృత్యములును కాలిపోవును. ఇవన్నియును ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు, మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో ఆపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను, భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై యుండవలెను. అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశముల కొరకును, క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటియందు నీతి నివసించును,'' అని వ్రాయబడిన ప్రకారము ఈ వికృతియైన ప్రకృతికి వినాశము తప్పదని - ఇది ఒకనాటికి పరమాత్ముని అగ్ని చేత దహించబడి నశింపక తప్పదని ఈ వికృతియైన ప్రకృతిలో ఉన్నటువంటి వికారుడైన మానవుడు తన వికారత్వమును మార్చుకొని, వికార స్వభావమును చంపుకొని యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెట్టుకొనువాడై, సిద్ధపాటు గల్గి నిరీక్షణ గల్గి, భక్తి ప్రార్థన సావాసము దైవత్వముపై మనస్సు నిలిపి జాగ్రత్తగా ఇహలోక జీవితమును సాగించవలసిన వాడైయున్నాడు.
ప్రియపాఠకులారా! నేడు మనమున్నట్టి ఈ ప్రకృతి సహజమైన ప్రకృతి కాదు - ఇది వికృతమైన ప్రకృతి. ఇప్పుడు మనము నివసించుచున్న ఈ ఆధునిక ప్రకృతిలో నరునికి విపరీతమైన జ్ఞానము - ఆ జ్ఞానమునుబట్టి నరునిలో అతిశయము అహంభావము, గర్వము, డంభము, వగైరా వికృత గుణములు చోటు చేసుకొని, నరునియొక్క దృష్టిని దైవత్వమునకు ప్రతికూలముగా మరల్చి ప్రకృతిలోని వికృతము కంటె నరునిలోనే వికృతము మహాభయంకరముగా నేడు క్రియ జరిగిస్తున్నది. అనగా నరునియొక్క మానసిక స్థితియే వికృతమైనట్లుగా నేటి నరజీవితములోని మారణహోమము, ధన దాహముతో కూడిన హత్యలు, దోపిడీలు, పదవీ వ్యామోహము, నరుడు తన యొక్క కార్యసాధన కోసరము ఎంతటి అఘాయిత్యమునకైనను తలపడి చేసే దురాగతాలు మరియు జూదము, వ్యభిచారము, అల్లరితో కూడిన మందిరాలు ఇవన్నియు కూడా దైవగుణములకు వికృతమైన గుణాలే. ఇటువంటి వికృతమైన వాతావరణములో నరునియొక్క జ్ఞానము, బుద్ధి వికటించి నరునినే వికారునిగాను, వికృత స్వభావునిగాను చేసి అనగా ఇట్టి వికృత గుణములనుబట్టి నరుడు మతి స్థిమితమును కోల్పోయి, వెర్రిగా ప్రవర్తించేటటువంటి స్థితికి నేటి వికృత వాతావరణము నరులలోను, సంఘాలలోను, సమాజములోను, లోకరాజ్య పరిపాలనలోను, కుటుంబ వ్యవస్థలోను, పురుష జీవితము, స్త్రీ జీవితాలలోను ఒకటేమిటి? భూమియందంతటను ఈ వికృతమన్నది వీరవిహారము చేస్తూ - నరునిలోను, నరసమాజములోను, కుటుంబములోను, ఒక వ్యక్తి జీవిస్తున్న విశ్వాస జీవితములోను, ఆ విశ్వాస జీవితమునకు కేంద్రమైన దైవమందిరములో కూడా ఈ వికృతమన్నది విలయతాండవమాడుచు వీరవిహారము చేస్తూ నరుని అశాంతిపరునిగ మార్చివేస్తున్నది. దీని అంతము మరణమే; రోమా 6:7 చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పు పొందియున్నాడు,'' అనగా శరీరరీత్యా ఇకను వాడు పాపము చేయడని భావము. ఇందునుబట్టి నరజీవితములో నరునికి సంభవించే వికారాలు మరణపర్యంతము వానిని వెంబడిస్తాయని మనకు తెలుస్తున్నాయి.
.......
దైవగ్రంథములో జంతువులు :- ప్రియపాఠకులారా! ఆయన సృష్టించిన సృష్టములు వాటి జీవిత విధానము, సృష్టికర్త రూపించిన జీవరాసుల యొక్క ఆకారములు, వాటి ఆహారపు అలవాట్లు, ఉనికి, వాతావరణము, పుట్టుదల, ఎదుగుదల, వగైరా క్రియలు చాలా ఆశ్చర్యకరముగా ఉన్నాయి. దేవుడు సృష్టించిన ప్రతిదియు ప్రతి సృష్టము కూడా లోకమునకు ఏదో యొక రీతిగా ఉపకారిగా ఉన్నది. చీమ మొదలు ఏనుగు వరకును జీవరాసులలో ప్రతిది కూడా ప్రతి విధమైన పనికి, లోక అవసరాలకు సృష్టించినట్లు వేదచరిత్ర ద్వారా తెలిసికోగలము. వేదచరిత్ర ద్వారానే గాక లోకరీత్యా కూడా మనకు తెలిసిన విషయమే. ఇందునుబట్టి దేవుడు సృష్టించిన యావద్ సృష్టిని దేవుడు నరునికి ఉపయోగ కారకములుగా చేసినట్లు ఆదికాండము మొదటి అధ్యాయములో ఈ క్రింది విధముగా తెలిసికోగలము. ఈ సందర్భములో
1:28-29లో నరుల పట్ల దేవునియొక్క ఆశీర్వచనాలు ఎట్లనగా ''మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి, భూమిని నిండించి, దానిని లోబరచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. మరియు దేవుడు - ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, వృక్షఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చియున్నాను, అది మీకు ఆహారమగును. భూమిమీదనుండు జంతువులన్నిటికిని, ఆకాశపక్షులన్నిటికిని, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను.
ప్రియపాఠకులారా! ఇందునుబట్టి ఆదిలోని సృష్టి ప్రారంభములో దేవుడుజరిగించిన సృష్టి నిర్మాణ కార్యక్రమములోను, ఆయన సృష్టించిన సృష్టములలోను, క్రూరత్వముగాని అనగా క్రూర స్వభావము గల జంతుజాలములు రూపించబడలేదని, క్రూరము - క్రూరమృగము అను పేరు గాని ప్రవచింపబడనట్లుగా ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది. అంటే ఆదికాండములోని మొదటి రెండు అధ్యాయాలలోని సకల జీవులు శాకాహారులైయున్నట్లును, మాంసాహారమన్నది నరకోటిలోను, జంతుజాలములోను లేనట్లే మనకు ఋజువగుచున్నది. అప్పటిలో నరుని కూడా దేవుడు శాసిస్తూ సముద్రపు చేపలను, ఆకాశపక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలమని పలికినాడేగాని, తినమని మాత్రము అక్కడ శాసించినట్లు వ్రాయబడలేదు. అయితే ఆది 1:30లో జంతుజాలమునకు ఆహారము నిర్ణయిస్తూ - ఆకాశపక్షులన్నిటికిని భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగును,'' అనుటలో నరులు, జంతుజాలము, ఉభయులు శాకాహారులుగా జీవించినట్లును ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది. అనగా క్రూరత్వము లేదు, మృగ స్వభావము లేదు. మృగమన్నమాట లేదు. మృగమన్నదేమిటో కూడా నాటి జనాంగమునకు తెలియదు.
ప్రియపాఠకులారా! ఆదికాండము 1:లో దేవుడు జరిగించిన ఆరు దినముల సృష్టి కార్యములలో తాను చేసిన ప్రతి పని కూడా అది మంచిదని దేవుడు చూచినట్లుగా వ్రాయబడి యున్నది. అయితే ప్రకటన 20:2లో ''అతడు ఆది సర్పమును, అనగా అపవాదియు, సాతాను అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరాలు వానిని బంధించి అగాధములో పడవేసి'' అని వ్రాయబడుట 13:1 మరియు పది కొమ్ములును, ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద పది కిరీటములును, దాని తలలమీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములవంటివి. దాని నోరు సింహపు నోరువంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను.''
ప్రియపాఠకులారా! ఈ క్రూరమృగము అను మాట పరిశుద్ధ గ్రంథ చివరి వేదమైన ప్రకటన గ్రంథములో వ్రాయబడుటలో ఆదిలో లేనటువంటి సృష్ట్యారంభములో లేని ఈ మాట లోకములోనికి ఏ విధముగా ప్రవేశించింది? అన్న దాన్ని గూర్చి మనము తెలిసికొందము. ఆదిలో దేవుడు జరిగించిన ప్రతి సృష్టము మంచిదైయున్నట్లుగా గ్రంథము ఘోషిస్తుండగా - క్రూరమృగము ఆదిఘటసర్పము అను పేర్లు ఎందుకు ఏర్పడినవో తెలిసికొందము.
ప్రియపాఠకులారా! ఆది 3:1లో ''దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదైనట్లుగా వ్రాయబడియున్నది. అప్పుడు దాని పేరు ఆదిసర్పము అనిగాని, ఘటసర్పము అనిగాని, మృగము అనిగాని పిలువబడలేదు. అంటే మృగము అను పేరుకు అప్పటి కాలములో స్థానము లేనట్లు తెలుస్తున్నది. ఇందునుబట్టి ఏదెను తోటలో ఉన్నట్టి సకల జీవులును జంతు పక్షిజాతులుగా పిలుబడినవేగాని, వన్య మృగాలని, క్రూరమృగాలని, వగైరా వికృత నామధేయాలు - ఆనాటి జంతుజాలములో లేనట్లే ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది. ఇప్పుడు మనము క్రూరమృగాలుగ పిలుస్తున్నవి కూడా ఆ కాలములో అనగా ఏదెను వనములోని వాతావరణములో క్రూరమృగాలుగా పిలువబడు నికృష్ట స్థితిలో నాటి జంతుజాలము లేదు. సకలము మంచిదైనట్లుగా సకల జీవులును మంచివియు, పరిశుద్ధమైనవియు మాంసాహారులు గాక కేవలము శాకాహారములైయున్నట్లుగ - అంతేగాకుండ ఆనాటి జంతుకోటి సృష్టికర్తయైన దేవుని మహిమపరచినట్లుగా నాటి ఏదెను చరిత్ర మనకు వివరిస్తున్నది.
అయితే జంతుకోటిలో విభేదమును కల్గించి నానాజాతులుగా మార్చి నానావిధమైన స్వభావములు గుణాతిశయములు అలవాట్లు, ఆహార బేధాలు, ప్రవర్తనలో మార్పులు, ఒకదానిపట్ల మరియొక దానికి వైరుధ్యము. అలాగే సమస్త జీవులతో నరునికి వైరము, సకల జీవులకు నరునిపట్ల విరోధము కల్గుటకు ప్రబలమైన కారణము లేకపోలేదు. అంటే ఏదెను వనములో ''నరుడు - జంతుజాలము, ఐక్యముగాను సమాధానముగాను, శాంతియుతముగాను, భయము - భ్రాంతి, ప్రమాదము, మరణము, అశాంతి, విభేధము లేక కలిసి కట్టుగా జీవించినట్లు విశదపరచుచున్నది. అలాగే నాటి ప్రకృతి వాతావరణము, గ్రహాల సంచారాలు శీతోష్ణ స్థితి గతులు కూడా నరునితో సమైక్యముగా నరునికి అనుకూలముగా ఉండి, సృష్టికర్తయైన దేవునికి విధేయమై ఆయన చిత్త ప్రకారముగా వ్యవహరిస్తూ నరునియొక్క ఆత్మీయ దేహ వికాసమునకు అనుకూలితములైయుండినట్లుగా కూడా ఏదెను చరిత్రనుబట్టి మనకు తెలుస్తున్నది. అయితే మృగము అను పదజాలము నాటి కాలములో వాడబడలేదు.
ఇట్లుండగ ప్రియపాఠకులారా! ఈ మృగము అన్న మాట ఎలాగ వచ్చిందో తెలిసికోవలసి యున్నది. ఇందుకు ప్రబల కారణము ఏమిటంటే నరుడే అనగా ప్రకృతి - వికృతి రూపము దాల్చింది, వాతావరణము కలుషితమైంది, ఆకాశ మండలములోని గ్రహనక్షత్ర కూటమి - ఒకదానితోనొకటి విరోధించింది. భీకరమైన, నాశనకరమైన, కలుషితమైన వాతావరణము ఏర్పడుట, జంతుజాలములో విభేధాలు, పక్షిజాలములో విభేదాలు, నరుని జీవితములో శాంతి - సమాధానాలకు బదులు అశాంతి, వేదన దుర్గుణాలేర్పడుటకును, సమస్తమునకును ఒక్కమాటలో చెప్పాలంటే సర్వసృష్టి క్రూరమృగమయము అనగా క్రూరత్వముతో కూడిన పాశవిక గుణాతిశయములు ప్రబలుటకు, క్రూరమృగమును పుట్టించుటకు కారకుడు నరుడే అని మనము తెలిసికోవలసియున్నది.
ప్రియపాఠకులారా! ఇది ఎలా సాధ్యము? అని మనము అనుకోవచ్చును. మొట్టమొదటగా ఏదెనులో దేవుడు నిషేధించిన ఫలమును నరునికి తినిపించుటకు ఏ విధమైన జీవియు అనుకూలమైన స్థితిలో లేవు. అప్పటి దైవసృష్టిలోని భూజంతువులలో అలౌకిక శక్తి యొక్క దృష్టికి సర్పమన్నది విచిత్రమైన అవయవ లక్షణాలు కలిగి అనగా ఇప్పుడున్నట్టి పొట్టతో ప్రాకే సర్పము వలె గాక, సర్పపు తల మాత్రము ఉండి, ఇప్పుడు మన కండ్ల ముందు కనబడే బల్లి వంటి కాళ్ళు, ఒకచోట నుండి మరియొక చోటికి ఎగురుటకు సలక్షణమైన రెక్కలు, పొడుగాటి తోక కలిగి పిశాచ రూపమునకు యోగ్యకరమైన ఆకారమది కలిగియుండి, పై పెచ్చు నరభాషలో మాట్లాడే నాలుక కూడా ఉన్నట్లుగా దేవుడు దానికి ప్రసాదించియున్నట్లు - అది స్త్రీతో మాట్లాడిన వాక్కులనుబట్టి మనకు తెలియగలదు. ఈ విధమైన సకల అంగముల సముదాయములు ఉండబట్టియే, సామాన్య నామధేయముతో పిలువబడే ఈ సర్పమును ఆదిసర్పము అనుట సమంజసమైయున్నది. అయితే దీనియొక్క వాక్కులకు మనసిచ్చి దైవాజ్ఞను విస్మరించి, దైవత్వమునకు వ్యతిరేకముగా అనగా దేవుని మాటలను తిరస్కరించి, ఆయన ఆజ్ఞలను అతిక్రమించి, నరుడు చేసిన దోషాపరాధమునకు మొట్టమొదటగా పురుషునికిని, ఆ తర్వాత స్త్రీకిని, అటుతర్వాత సర్పమునకును దేవుడు విధించిన శిక్షలు వరుసగా ముగ్గురికిని విధించిన శాపము - మూడు విధములైన అయోగ్యతలతోను, అరిష్టాలతోను, ప్రతికూల వాతావరణము అనగా మనుగడకు వ్యతిరేకమైన సంఘటనలతో కూడినదై, చివరిగా దాని ఫలితము మరణావస్థతో కూడినదై దైవశాపములోని త్రివిధ తీర్పులు వివరిస్తున్నాయి. దేవుడు న్యాయ విచారణ జరిగించు సందర్భములో మొట్టమొదటగా దేవుడు తన ఆత్మతో నింపబడిన నరుని విచారిస్తూ - ''నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలాలు తింటివా? అని అడిగెను. అటుతర్వాత స్త్రీతో - నీవు చేసినది ఏమిటని అడిగెను. మూడవదిగా దేవుడు సర్పముతో - ''నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోను, భూజంతువు లన్నిటిలోను నీవు శపించబడినదానవై నీ కడుపుతో ప్రాకుచు, నీవు బ్రతుకు దినములన్నియు మన్ను తిందువు. మరియు నీకును, స్త్రీకిని, నీ సంతానమునకును, ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును. నీవు దానిని మడిమ మీద కొట్టుదువు,'' అని చెప్పెను.
ప్రియపాఠకులారా! తొలి విచారణలో మొట్టమొదటి ముద్దాయియైన సర్పమునకు దేవుడు తీర్పు దీర్చిన విధానము మనకు తెలుస్తున్నది. అనగా భూజంతువైన సర్పము - జంతువు అను విలువను కోల్పోయి అనగా పాదములతో సర్పముగా నడిచి సునాయాసముగా పరుగెత్త గల అవకాశము, రెక్కలతో ఒక చోట నుండి మరియొక చోటికి సుదూరముగా ఎగురగలిగే భాగ్యము కోల్పోయి, జనవాసమునకును, ఇతర జంతుజాలమునకును దూరమై ఏకాకిగా - దినదిన గండముగా దినదినము మరణ భయము, మరణగండముతో అరచేత ప్రాణాలు పెట్టుకొని, భయాందోళిత జీవితాన్ని జరుపుకొనే నికృష్ట స్థితిలోకి దిగజారింది.
ప్రియపాఠకులారా! ఈ విధముగా సర్పమునకు తీర్పు దీర్చిన దేవుడు అంతటితో వదలక స్త్రీతో - నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు. నీ భర్త యెడల నీకు వాంఛ కల్గును. అతడు నిన్ను ఏలును - ఇది స్త్రీకి విధించిన తీర్పు. ఇక పురుషునితో - '' నీ నిమిత్తము నేలశపించబడియున్నది. ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు. అది ముండ్లతుప్పలను, గచ్చపొదలను నీకు మొలిపించును.'' ప్రియపాఠకులారా! ఇదే మాట ఆది 4:10-12లో దేవుడు ఆదాము కుమారుడైన కయీనును శపిస్తూ - ''నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తముయొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండ నీవు శపింపబడినవాడవు. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. భూమిని కూడా కఠినపరచడమైనది. ఈ విధముగా ఆది నరజంటకును, వారిని మోసగించిన సర్పమునకును, వారిని మోసగించుటలో భూఫలమైన భూమికిని, సర్పమునకును మొట్టమొదటగా న్యాయతీర్పు జరిగిన న్యాయస్థానమే 1. ఏదెను. రెండవ స్థలము ఏదెనుకు బాహ్య ప్రదేశము, అనగా పరిశుద్ధ వనము లోపటను, వనమునకు బాహ్యమున జరిగిన ద్వివిధ తీర్పును బట్టి దైవశాపము అన్నది బహు దైవోగ్రతతో కూడినదై క్రియ జరిగించి, కఠినమైన, ఘోరమైన మరణతుల్యమైన శాపము మూలముగా నరజీవితము, లోకముయొక్క మనుగడ, జంతు జాలములో ఐక్యత, వాతావరణములోను, గ్రహసంచారములోను, సప్త మండలములైన - ఆకాశములో సూర్యమండలము, చంద్రమండలము, నక్షత్రమండలము, శూన్యమండలము, వాయుమండలము, మేఘమండలము, భూమండలము. పై ఏడు మండలాలలో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణము వక్రించి, నరుడు దేవుని పట్ల చేసిన ఆజ్ఞాతిక్రమణను బట్టి సమస్తమును భీష్మించి, క్రూరత్వము దాల్చి నరజీవితమునకును, భూమి యొక్క కాలగతులకు ప్రతికూలములై దైవోగ్రత మూలముగా వికృతములు కాగా వీటి ప్రభావము నరజీవితము మీద క్రియ జరిగిస్తూ - నరునియొక్క ఆత్మీయ జీవితమును దైవత్వమునకు అనుకూలము కాక చెడగొట్టి, లోకము ప్రకృతి అలౌకికము వైపు మరల్చి, నరులలో పశు వాంఛను రేకెత్తించి క్రియ జరిగించుటనుబట్టి ఆది 6:లో విస్తరించిన జనాంగమంతయు మృగవాంఛలతో వావివరుసలు మాని, భక్తి విధేయత మాని, దేవుడున్నాడన్న సత్యాన్ని మరచి, జంతు స్వభావముతో ప్రవర్తించి, భూమి మీద విస్తరింపగా జరిగిన దైవోగ్రత మారణకాండను గూర్చి ఆదికాండము ఏడు, ఎనిమిది అధ్యాయాలలో జలప్రళయ వినాశనమును గూర్చిన చరిత్ర మనకు తెలిసిందే. అంటే నోవహు కాలములో నరులు పశువుల కంటెను, జంతువుల కంటెను, హీనమైన గుణాతిశయములు కలవారై దైవత్వమునకు సంతాపమును పుట్టించినట్లు కూడా మనకు తెలుసును.
కనుక ప్రియపాఠకులారా! నోవహు కాలములో ఆది 9:2లో మీ భయమును మీ బెదరును అడవి జంతువులన్నిటికిని, ఆకాశ పక్షులన్నిటికిని, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికిని కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడియున్నవి,'' అనుటలో ఈ మాటను ఆసరాగా తీసుకొన్న నరునియొక్క హృదయస్థితిని పూర్తిగా మార్చివేసి, సున్నితమైన దయాళుత్వము, ప్రేమాతిశయముతో కూడిన హృదయమునకు బదులు నరుని హృదయాన్ని కఠినపరచి, వానిని పశువుతో సమానముగా పశువాంఛలతో కూడిన గుణాలను రేకెత్తించి, జంతువు కంటె హీనమైనటువంటి ప్రవృత్తిలో నరునియొక్క జీవితాన్ని నడిపినందుకు ఆదికాండము లోతు కాలములో జరిగిన, నరులలో ప్రజ్వరిల్లిన కామాతురతతో కూడిన వావివరుసలు, మంచిచెడు, న్యాయాన్యాయాలు గుర్తించలేని స్థితిలో నాటి సొదొమ, గొమొఱ్ఱా వాసుల యొక్క కామేచ్ఛలతో కూడిన వైఖరిని బట్టి నరులెవరో - దేవదూతలు ఎవరో తెలిసి కూడా లోతు పట్లను, అతని ఇంటికి దేవుని చేత పంపబడిన దూతల పట్లను వ్యవహరించిన విధానములో అనగా కామముతో పూడుకొనిపోయిన గుడ్డితనముతో లోతు ఇంటికి విచ్చేసిన దేవదూతలనే కూడాలనే కామదాహముతో ప్రవర్తించిన సొదొమ నివాసులయొక్క హృదయస్థితి - మృగము, క్రూరమృగము కంటె హీనాతిహీనమైన స్థితిలో క్రియ జరిగించినందువల్ల ఆ జనాంగమును దేవుడు అగ్నివర్షముతో హతము చేసినట్లు వేదములో చదువగలము. అయినను నరులలోని పశువాంఛ అనగా జంతు స్వభావము దినదిన ప్రవర్థమానమై, పాతనిబంధన అంత్యము వరకును క్రియజరిగించుటయేగాక నూతన నిబంధనలో నరకోటికి ఉన్నట్టి ఈ దౌర్భల్యపు పనికిమాలిన గుణాతిశయములతో కూడిన క్రియలను లయపరచుటకు దేవుడే మానవత్వమును ధరించి నరులయొక్క దోషాపరాధమునుబట్టి పాపపరిహారార్థ బలిగా వధించబడు గొర్రెపిల్లగా అవతరించినట్లును, అట్టి గొర్రెపిల్లయైన క్రీస్తును నాటి కిరాతకులు అనగా క్రూరమృగ స్వభావితులైన యూదా జనాంగము కఠిన వైఖరితో నిర్దోషియైన దేవుని గొర్రెపిల్లయైన క్రీస్తును క్రూర కఠిన వైఖరితో మరణశిక్షను విధింపజేసి, సిలువకు మేకులతో కొట్టి శిక్షించుటను కార్యము అడవి మృగము కూడా చేయదని మనకు తెలుస్తున్నది.
ప్రియపాఠకులారా! ఇట్టి కిరాతక జీవితములో జీవించే జనాంగములో అనగా మృగ స్వభావముతో కూడిన మానవ మృగాలను ఏలుటకు, క్రూరమృగమన్నది యొక్కటి అధికారమును చెలాయిస్తూ పరిపాలించే సమయాలు, సందర్భాలు, క్రీస్తు తర్వాత జరిగిన రాజుల చరిత్రలు, వారి పరిపాలనా చట్టాలు, క్రైస్తవుల పట్ల వారు చూపిన వైఖరి, చరిత్రలు కూడా వేదములోను, దేశచరిత్రలలో కూడా మనమెరిగిన విషయమే. అట్టి జాబితాలో సౌలును మనము చేర్చవచ్చును. ఇందునుగూర్చి సౌలే తనను గూర్చి సాక్ష్యమిస్తూ -''పూర్వము నేను హింసకుడును, దూషకుడునైయుండి, దేవుని బిడ్డలను చెర పెట్టుటలోను, హింసించుటలోను, శిక్షించుటలోను, దండించుటలోను బహుకఠినుడనై యుంటినని తన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాడు. అంటే సౌలుగా జీవించిన కాలములో సౌలు యొక్క స్థితి డమస్కు యొక్క అధికార బలము ద్వారాను, తన అంగబలము, తనకు అనుగ్రహించబడిన సైనిక రక్షణ, ఆయుధములు, వగైరాలు అతనిని క్రూరమృగమునకు సమానునిగ జేసి, కేవలము మానవాకృతిలో జీవిస్తున్నాడన్న మాటేగాని, అతని హృదయస్థితి క్రూరమృగమును సమతుల్యముగా ఉండినట్లు ఆనాటి సౌలు యొక్క చరిత్ర వివరిస్తున్నది. అంటే సౌలు మాట అంటే ఆనాటి జనాంగమునకు భయము, దడ ఏర్పడి, కనీసము పసిపిల్లలు కూడా పాలు త్రాగుటకు వెరచే హృదయవిదారక వాతావరణము నెలకొనియున్నట్లు మనకు తెలుస్తున్నది. ఇందునుబట్టి సౌలు యొక్క మానసిక స్థితి చిరుత పులి, తోడేలు, ఎలుగుబంటి ఈ మూడింటి కంటెను మించినట్టి క్రూరత్వము, కఠినత్వము, పాశవిక గుణ లక్షణాలు ఒక్క సౌలులో మిళితమైయున్నట్లు కనబడుచున్నవి.
ప్రియపాఠకులారా! ఇది అపొస్తలుల కాలము నాటి చరిత్ర. అయితే విజ్ఞానము వెల్లివిరిసియున్న ఈ యుగములో క్రైస్తవ్యము - క్రైస్తవ సాహిత్యము, క్రైస్తవ మందిరాలు, క్రైస్తవ విశ్వాస బంధాలు, క్రైస్తవ వేదవిద్వాంసులు ప్రపంచ వ్యాప్తముగా విస్తరించియున్న ఈ దినాలలో క్రూరమృగాలని చెప్పబడే జంతు జాలముల కంటె నరునియొక్క శారీర ఆత్మీయ గుణగణాలు పెచ్చురిల్లి దారి దోపిడీలు, హత్యలు, ఈర్ష్యాద్వేషాలు, కుత్సితము, వగైరా నికృష్ట గుణాలతో కూడిన హృదయస్థితిని గలిగి, స్వార్థము, ఎదుటివారి యొక్క అభివృద్ధిని ఓర్వలేక తానే అన్నిటిలో ఆధిక్యత పొందాలనే స్వార్థ చింతనతో నరుడు చేయు క్రియాకర్మలు - క్రూరమృగము కంటె హీనాతిహీనముగా ఈ క్రింద ఉదహరించిన విధముగా ఉంటుంది. పదవీ వ్యామోహముతో ప్రత్యర్థుల పట్ల కుట్ర పన్ని వారిని హతమార్చుటకు ప్రయత్నించుట, ధనదాహమును బట్టి కట్నకానుకలు, వస్తువాహనాలు ఆశించి, పదికాలాలపాటు తనతో సహజీవనము సాగించుటకు ప్రామాణికముగా జతపరచబడిన భార్యనే తగిన విధమైన ధనలాభము, కట్నకానుకలు తేలేదన్న మిషతో కిరోసిన్ పోసి తగులబెట్టి హత్య చేయుట, గొంతు నులిమి చంపుట, తాను చేసిన హత్యానేరమును కప్పిపుచ్చుటకు చంపబడిన స్త్రీ యొక్క శవమును ఆత్మహత్యగా ప్రదర్శించుటకు ఇంటిలోని దూలానికో ఫ్యానుకో లేక పెరటిలోని బావిలో పడవేసో తన నేరమును కప్పి పుచ్చుటకు ప్రయత్నించుట, బాంబులతో దాడులు చేయుట, కత్తి, ఈటె, గండ్రగొడ్డలి మొదలగు ఆయుధములతో పోరాడుట, కట్టుకున్న భార్యను కాదని బజారు స్త్రీలతో చేరి స్త్రీలోలుడై, తన స్త్రీలోలత్వమునకు అడ్డముగా ఉన్న భార్యను హతమార్చుట, అదే విధముగా స్త్రీ కూడా పురుషునితో సమానముగా ఈర్ష్యా ద్వేష గుణాతిశయములతో అత్త కోడలిని చంపుట, భార్య - భర్తను చంపుట, లోకసంబంధమైన ఆస్థిపాస్థుల విషయములో తోబుట్టువులైన సోదరసోదరీలనే హతమార్చుట, ఒకటేమిటి? ప్రియపాఠకులారా! ఇంతకంటె కూడా హీనాతిహీనమైన స్థితిలో అజ్ఞానులేగాక సుజ్ఞానులు, విద్వాంసులు కూడా ఆయా సందర్భాలలో క్రూరమృగాని కంటె కఠిన వైఖరితో అమాయిక ప్రజలను నిర్ధాక్షిణ్యముగా తుఫాకులకు బలి చేసి చంపుట.
ప్రియపాఠకులారా! పై కనబరచిన మానవ గుణాలలో ఏ ఒక్కటి కూడా జంతుజాలానికి లేదు. వాటికి స్వార్థము లేదు. ఎందుకంటే ఒక జంతువును మరొక జంతువు ఆహార అవసరతను బట్టి గాని లేక ప్రాణరక్షాణార్థము కొరకు గాని చంపుట సహజము, మరియు ఆకలియైనప్పుడు తప్ప ఎదుటి జంతువు వల్ల ఎలాంటి హాని కలుగదన్న వాతావరణమునుబట్టి ఎంతటి మాంసాహార జంతువైనను నిష్కారణముగా తన ప్రత్యర్థి జోలికి పోదు. అయితే మానవలోకము వన్య ప్రాణులను క్రూరజంతువులుగ సంబోధిస్తూ వాటికంటె హీనాతిహీనమైన హృదయశుద్ధి గలిగి, మానవత్వానికి దైవత్వానికంటె హీనాతిహీనమైన స్థితిలో ప్రవర్తించుటలో క్రూరమృగము నరుడా? లేక వన్య ప్రాణియా? ఇందునుగూర్చి ప్రకటన గ్రంథములో యోహాను వివరించిన వివరణ 17:9-15 ఏడుగురు రాజులు కలరు. అయిదుగురు కూలిపోయిరి. ఒకడున్నాడు - కడమవాడు ఇంకను రాలేదు. నీవు చూచిన ఆ పదికొమ్ములు పదిమంది రాజులు - వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు; ప్రకటన 19:19-21 క్రూరమృగముగా పిలువబడే నరకోటికిని, క్రూరమృగముగా పిలువబడే రాజులకును, వాని అనుచరులకును, ఆ మృగము ముద్రను వేయించుకొని ఆ మృగము ప్రతిమకు నమస్కరించినవారికిని, అబద్ధ ప్రవక్తకును కలుగు శిక్ష వివరించబడియున్నది.
కనుక ప్రియపాఠకులారా! ఆదిలో ఏదెను వనములో నరజంటను మోసగించిన సర్పమును ఆదిసర్పముగాను, ఘటసర్పముగాను ప్రవక్తల చేత నిర్ధారించబడి వేదములో లిఖించబడియుండగా దాని మాటలకు లోనై అది చూసిన ఫలమును భుజించి, దానికి తమ యొక్క హృదయాన్ని ఇచ్చిన నరులలో - ఆది సర్పమును ఆవరించిన అలౌకిక శక్తి ప్రవేశించి తన మార్గమును సుగమము చేసుకొని, నాటి నుండి విస్తరించిన నరులను తన కైవసము చేసుకొని, లోకమును అందులో ఉన్న సంపదను, సుఖసౌఖ్యాదులను, తుచ్ఛమైనటువంటి లోకమాయతో నరునియొక్క జీవితమును దైవత్వము నుండి పూర్తిగా తొలగించి వానిలో క్రూరమృగ ముద్రను వేసి, తన చిత్త ప్రకారము తన మార్గములో నడిపిస్తూ క్రియ జరిగించిన ఆ అలౌకిక శక్తి - తానొక ప్రత్యేకమైన కూటమిని రూపించి, ఆ కూటమిలో అబద్ధ బోధకులను, అబద్ధ క్రైస్తవులను ఏర్పరచుచు, క్రీస్తుకు ప్రతిగా అంత్యక్రీస్తు అను మరియొక లోకరీత్యా ప్రముఖ వ్యక్తిని ఏర్పరచుకొని, ఒకవైపు దైవత్వమును పూజిస్తూ - మరియొక వైపు క్రీస్తును అనుసరిస్తూ క్రైస్తవ మత గ్రంథమైన పరిశుద్ధ గ్రంథములోని మాటలనే ప్రవచింపజేస్తూ - తేనె పూసిన కత్తి వలె నరుల యొక్క ఆత్మీయ జీవితాన్ని, హృదయ పరిశుద్ధతను హరించి వేస్తూ చేసే బోధ, వాని క్రియలు ఎలాగుంటాయంటే - పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి సువార్త ప్రకటింపజేస్తున్నట్లుగ ప్రవచింపజేస్తూ భూలోక సంబంధముగా పవిత్రమైన స్థితిలో జీవించే విశ్వాసులయొక్క హృదయాలను, వారి ఆత్మీయ జీవితాలను, వారి గృహాలను, వారి మందిరాలను, ఆఖరుకు వారికున్న క్రైస్తవ ప్రేమను చెడగొట్టుచు పరలోక సంబంధమైన క్రైస్తవ జీవితాన్ని భూలోక సంబంధముగా మార్చి - పరలోక యెరూషలేమన్నది ఒట్టిదని యెరూషలేమన్నది భూమి మీద మనకు కనబడే పట్టణమే దేవుని పట్టణమన్న మాటలను ప్రకటిస్తూ - పరలోకము నుండి దిగి వచ్చే పరిశుద్ధ పట్టణమనే యెరూషలేము ఒట్టిదేనని, నేడు పాలస్తీనులో ఉన్న యెరూషలేము పట్టణములోనే దేవుని ప్రవేశముంటుందని, దేవుని రాకడ ఉంటుందని ప్రకటన జేస్తూ - దైవత్వము మీద ఒక వైపు రహస్యముగా తిరుగుబాటు చేస్తూ - తమ క్రియల ద్వారా క్రైస్తవ సిద్ధాంతమును పూర్తిగా కాలదన్ని, తమ స్వంత సిద్ధాంతాలను ప్రవేశపెట్టుచు, తాము దైవోగ్రతకు గురియగుటయేగాక, ప్రభువు యొక్క విశ్వాసములో నూతనముగా ప్రవేశించే విశ్వాసిని కూడా నరకపాత్రునిగా చేసే స్థితిలో నేటి క్రైస్తవ్యమున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే క్రైస్తవ సంఘాలను వ్యాపార కేంద్రాలుగ మార్చి, క్రీస్తు పేరు చెప్పుకొంటూ లక్షలు, కోట్లు సంపాయించే ప్రబుద్ధులు నేడు లోకములో లేకపోలేదు.
ప్రియపాఠకులారా! ఇట్టి జీవితము క్రూరమృగాల కంటె భయంకరము కాదా? కనుక ఇట్టివారిని గూర్చి క్రీస్తు ముందుగా ప్రకటించిన విషయాలను గూర్చి తెలిసికొందము. మత్తయి 23:15 ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతనిని మీ కంటె రెండంతలు నరకపాత్రునిగా చేతురు,'' మరియు మత్తయి 24:23-24లో ప్రభువు చెప్పిన మరియొక మాట ''ఆకాలమందు ఎవడైనను - ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన యెడల నమ్మకుడి, అబద్ధపు క్రీస్తులును, అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కారాల్యను కనపరచెదరు. 2వ థెస్సలొనీక 2:3లో మరియొక మాట ''మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనేగాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిని పైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనబరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనియ్యకుడి.'' 2:7-8 ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. కాని ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడువరకే అడ్డగించును. అప్పుడా ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి, తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును.''
ప్రియపాఠకులారా! ఈ మాటలన్నియు కూడా దేవుని ఎరిగి ఆయన కుమారుడును, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమాప్రభావములను ఎరిగి, ఆయన విశ్వాసులమని చెప్పుకొంటూ ఆయన బాప్తిస్మము పొంది, ఆయన తన రక్షకుడని ప్రకటించుకొంటూ 2వ తిమోతి 3:5లో వలె వ్రాయబడిన లేఖన భాగములో వలె ''పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించక జీవించే క్రైస్తవ జనాంగమును గూర్చినట్టి హెచ్చరిక ప్రవచనాలు ముందుగనే మనకు తెలియపరస్తున్నవని గ్రహించవలసియున్నది.
ప్రియపాఠకులారా! ఒక పంటను నాశనము చేసే పురుగు పైరులోనే ఉంటుంది. చెరకు తీపును చెడగొట్టే వెన్ను చెరకులోనే పుట్టుతుంది. జలములతో వినాశము కల్గించే తుఫాను జలరాశులలోనే ఏర్పడి, అల్పపీడనము, వాయుగుండము, తుఫాను - భయంకరమైన తుఫానుగా విజృంభించి పల్లెలను, పట్టణాలను నాశనము చేస్తుంది. అలాగే క్రీస్తును కిరాతకులకు పట్టించిన వ్యక్తి క్రీస్తు శిష్యులలోనే ఉండినాడు. అలాగే క్రైస్తవ సంఘాన్ని పాడుచేసే వ్యక్తి కూడా సంఘములోనే ఏర్పడుతాడుగాని బాహ్యముగా ప్రత్యేకించి లేడు. అలాగే దైవరాజ్యమైన క్రీస్తు రాజ్యమును అడ్డుకొని తిరుగుబాటు చేసేవారును, దానిని చెడగొట్టుటకు క్రియ జరిగించువారును సంఘములోనే ఉంటారుగాని ప్రత్యేకించి ఎక్కడో లేరు. ఈనాడు క్రైస్తవ సంఘాలు పాడగుటకు కారణము అబద్ధ బోధకులు, అబద్ధపు క్రైస్తవులైన వక్ర జనాంగము. వీరికి నాయకుడు వీరియొక్క ప్రధాని అంత్యక్రీస్తు - ఇతడే మృగము, ఇతని అనుచరులు ఇతని కొమ్ములు, ఇతనియొక్క దైవవ్యతిరేకమైన సంఘములు - ఇతని తలలు. ఇతని పరిపాలన అనగా ఇతని సిద్ధాంతాలు క్రైస్తవ్యమునకును పరిశుద్ధాత్మ దేవునికిని వ్యతిరేకములై యావద్ సృష్టిని పాడుజేయుటకు, క్రైస్తవ్యమును కలవరపరచుటకు క్రైస్తవ సంఘాలను, సంస్థలను చీల్చుటకు నేడు అంత్యక్రీస్తు సంబంధులైనవారే ఈ అబద్ధపు బోధకులు, అబద్ధపు క్రైస్తవులు. బాప్తిస్మము లేకనే, దేవుని పిలుపు లేకనే, మంచి సాక్ష్యమును పొందకనే, సరియైన విశ్వాసము లేకనే, క్రీస్తులోని రక్షణానుభవమును పొందకనే పాపపశ్చాత్తాపము, మారుమనస్సు అన్నదేమిటో ఎరుగని స్థితిలో లోకసంబంధమైన అలంకారాలు, ఆడంబరాలు, ఆస్థిపాస్థులతో దైవత్వాన్ని ముడిపెట్టుచు - తనకు ప్రభువు దర్శనమిచ్చాడని తనను ఆయన తన సేవకు పిలిచాడని, నానావిధ మోసపు మాటలతో అబద్ధపు దర్శనాలు కల్పనాకథలతో కూడిన చరిత్రను తనకంటూ ఏర్పరచుకొని, తద్వారా అనేకులకు వేషధారణతో కూడిన క్రైస్తవ్యాన్ని కనబరచుచు - సమస్త నరకోటిని మోసపరచేటటువంటి ఇట్టి వ్యక్తిని వెలుగు దూత భక్తునిగా పోల్చవచ్చును.
ప్రియపాఠకులారా! సాతాను కూడా వెలుగు దూత వలె వేషధారియై, క్రైస్తవులను మోసగిస్తున్న సంఘటనలు నేడు కోకొల్లలుగా ఉన్నవి. క్రైస్తవునిగ ప్రకటించుకొంటూ - క్రైస్తవులనే మోసగించే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. ప్రియపాఠకులారా! ప్రభువు చెప్పిన ఉపమానములో గోధుమలు, గురుగులు రెండును కలసి ఉండగా, మేకలు గొర్రెలు కలసి జీవించినట్లుగా - నేడు ఈ అనంత విశ్వములో విశ్వాసులు, అవిశ్వాసులు, విగ్రహారాధికులు, ఆత్మారాధికులు, సత్ క్రైస్తవులు, నకిలీ క్రైస్తవులు, పరిశుద్ధులు, అపరిశుద్ధులు, సజ్జనులు, దుర్జనులు, న్యాయస్థులు, అన్యాయస్థులు ఒకరేమి సమస్తమైనవారు కలసి జీవిస్తున్న ఈ యొక్క లోకములో ప్రియపాఠకులారా! గోధుమల కంటె గురుగుల పంట, గొర్రెల కంటె మేకలు, విశ్వాసుల కంటె అవిశ్వాసులు, సత్ క్రైస్తవుల కంటె నామ క్రైస్తవులు విస్తరించియున్న ఈ యుగములో ఆదిసర్పము రూపాంతరము పొంది త్రివిధ నామధేయాలు, అనగా యుక్తిగల సర్పము, ఆదిసర్పము, ఘటసర్పము. ప్రకటన 20:2 ఆదినరులతో మాట్లాడిన ఆదిసర్పము నరుల చేత ఆరాధించబడుటబట్టి ఘటసర్పము. ఈ విధముగా త్రివిధ నామధేయాలు పొందిన ఆ ఘటసర్పము నరుని క్రూరమృగముగా మార్చింది. ఘటసర్పము యొక్క విషజ్వాలలే నరునిలో ప్రవేశించుటనుబట్టి నరుడు కన్నబిడ్డను, కట్టుకున్న భార్యను, తన ప్రాణమిత్రుని, తన ఆప్తులను సహితము కనికరింపక కపట వైఖరిని అవలంభిస్తూ మాయోపాయముతో కపటోపాయముతో హత్య జేయుటన్నది క్రూరమృగ లక్షణము కాదా? బైబిలులో కొంతమంది చక్రవర్తులు ఇందుకు తార్కాణముగా ఉన్నారు. ఫరో ఐగుప్తులో పుట్టిన ప్రతి తొలిచూలు మగ బిడ్డను హతమార్చమని తన భటులకు ఆజ్ఞాపించినప్పుడు మోషే చరిత్ర ఏ విధముగా తయారైందో మనకు తెలిసిందే. యేసు పుట్టినప్పుడు హేరోదు చేయించిన శిశు హత్య, మారణహోమము మనమెరిగిందే.
అయితే నేటి యుగములో పై రెండింటికి మించిన మారణహోమము ఈ ఆధునిక యుగములో - శాస్త్రజ్ఞానము వికసించిన ఈ యుగములో నరుడు పశువు కంటెను, మృగానికంటెను, అతి నీచమైన పంది కంటె పరమ చంఢాలముగా నికృష్టముగా జీవించే నరుడు మృగాని కంటె నీచుడా? అధికుడా? పాఠకులే ఊహించండి. కనుక యుగాంతములో ప్రభువు రాకడ కాలములో క్రీస్తుతోబాటు భూలోకములో - క్రీస్తుకు వ్యతిరేకముగా నిలిచే వ్యక్తి అనగా అంత్యక్రీస్తు, ''వేరు పురుగు జేరి వృక్షంబు చెరచును.'' క్రైస్తవులలో నుండియే రావాలి - వాడే అంత్యక్రీస్తు. ఈ వరకు క్రూరమృగమన్నది క్రియ జరిగించింది.
ప్రియపాఠకులారా! దైవసృష్టిని అనగా సహజ స్థితిలో కల్తీలేని, సంకరము కాని, పవిత్ర సృష్టిని సంకరము చేసి, ఆ జాతి యొక్క విలువను చెడగొట్టే గుణము ఏ పక్షికిని, ఏ జంతువుకును, ఏ జీవికిని లేదు. కాని నరుడు దైవసృష్టిని సంకరము చేస్తూ ఒక జాతితో ఒక జాతిని సంకరపరచి జాతి విలువలను చెడగొట్టే క్రియను నరుడు జరిగిస్తున్నాడు. అలాగే చిత్రవిచిత్రాలతో కూడిన మద్యపానాలు, నానారకాల మాదక ద్రవ్యాలు, నానారకాల కుతంత్రాలు, నానావిధ జూదాలు, నకిలీనోట్లు, ఆహారములో కల్తీ పానీయాలలో కల్తీ పాలల్లో కల్తీ తుదకు ఆరాధించే దేవున్ని కూడా కల్తీ చేసి అన్నిటిని చెడగొట్టినట్లుగా దైవనామాన్ని చెడగొట్టుచు, దేవునికి చెందవలసిన మహిమను పక్షులకు, పురుగులకు, సృష్టికి వ్యక్తులకు ఈ సందర్భములో రోమా 1:22 నుండి చదివితే నరునియొక్క జ్ఞానమెంత బలహీనముగాను, నికృష్టతలోను ఉన్నదో మనకు తెలియగలదు. ఈ విధముగా నికృష్ట జీవితములోనున్న నరుడు - ఆ నికృష్ట జీవితము నుండి వావివరుసలు, మంచిచెడు, న్యాయాన్యాయాలు విస్మరించి జరిగించే క్రియలు నేడు ఈ క్రింది విధముగా మనము వార్తా పత్రికల ద్వారా చదువుచున్నాము. రేడియోలు, టి.విలు ద్వారా వింటున్నాము. నేడు లోకములో విజ్ఞానవంతుడైన నరకోటిలో జరుగు హృదయవిదారక క్రియాకర్మలు ఒకటి :- కన్న బిడ్డలను కిరాతకముగా హతమార్చే తల్లిదండ్రులున్నారు. కట్టుకున్న భార్యను చేతులారా చంపే భర్త ఉన్నాడు. అలాగే భర్తను చంపే భార్య ఉన్నది. పాలు త్రాగే పసిబిడ్డతో కామేచ్ఛలు జరిగించే మానవ మృగమున్నది. నయవంచకముతో ప్రాణమిత్రుని హత్య చేసే మిత్రద్రోహి ఉన్నాడు. పదవీ దాహముతో ప్రత్యర్థిని దారుణముగా హతమార్చే ద్రోహి ఉన్నాడు. తన స్వార్థానికి దేశాన్ని పాడుజేసే దేశద్రోహి ఉన్నాడు. తన అవసరతలకు తనకు విద్య నేర్పిన గురువునే కడతేర్చే గురుద్రోహి ఉన్నాడు. ఉగ్రవాది అను పేరుతో అడివి జంతువు వలె అడవులలో ఉంటూ మారణాయుధాలతో దాడిచేసి, అమాయికులను బలికొనేటటువంటి కసాయి ఉన్నాడు.
ప్రియపాఠకులారా! పై ఉదహరించినటువంటి వ్యక్తుల కంటె క్రూరమృగాలు మేలా? క్రూర మృగాలని మనము పిలిచిన వన్యప్రాణులు మేలా? పై ఉదహరించిన జనాంగము ఉత్తములా? ఎవరు ఉత్తములు? ఎవరు మృగము? ఎవరు క్రూరమృగము? పాఠకులు నిర్ధారించండి. ప్రకటన గ్రంథములో వివరించబడిన మృగము, క్రూరమృగము, ఆదిఘటసర్పము, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త - ఇవన్నియును కూడా దైవాత్మతో నింపబడి మనస్సాక్షి గల్గిన వ్యక్తి పేరునే సూచిస్తున్నవిగాని, ప్రత్యేకించి ఇవి దేవుని చేత సృష్టించబడిన జంతుజాలములు కావు. నరులే ఈ దశలో మారుతారని, ఇటువంటి మనోభావాలు కలిగి ఉంటారని, ఈ విధముగా లోకాంత్య కాలములో దైవోగ్రతకు గురియయ్యే విధముగా వీరి క్రూర క్రియాకర్మలు లోకములో క్రియ జరిగిస్తుంటాయని వేదములో వేదయుతముగా మనము తెలిసికోగలము.
కనుక ప్రియపాఠకులారా! నేటి క్రైస్తవ విశ్వాసులైన మనకు సౌలు అను నామధేయముతో కౄరమృగమునకంటె క్రూరముగా ప్రవర్తించి జీవించి, క్రీస్తును - క్రైస్తవ జనాంగాన్ని, క్రైస్తవ మందిరాలను, క్రైస్తవ విశ్వాసుల పట్ల క్రూరాతిక్రూరముగా వ్యవహరించి, క్రైస్తవత్వాన్నే తుదిముట్టించాలని సంకల్పించిన సౌలు అను క్రూరమృగము - యేసుప్రభువు యొక్క ఆత్మతో మొత్తబడి నేలబడి, తన క్రూరత్వము నుండి అంధత్వములోకి దిగజారి దైవిక శిక్షకు గురియై, అంధుడై, ప్రభువు ఆత్మ చేత హెచ్చరింపబడినవాడై నిస్సహాయుడును, అంధుడునై, తన సర్వస్వమును కోల్పోయి, అభాగ్యుడుగా మారి అచేతన స్థితిలో ఉండగా - అట్టి అభాగ్యుని అనగా చావుదెబ్బ తిన్నట్టి ఆ మృగమునకు ఉన్నట్టి గాయములు మాన్పి, ఆ మృగమును సర్వశక్తిమయుడైన ప్రభువు తన సాధనముగా వాడుకొన్నట్లు సౌలుయొక్క చరిత్రలో - దేవునియొక్క ఆత్మ అననీయతో మాట్లాడిన మాటలలోను చదివినట్లయితే, సౌలు అను ఆ మృగమును దేవుడు తన సాధనముగా వాడుటకు పౌలుగా మార్చి, నూతన నిబంధన వేదములో ఒక ప్రత్యేక స్థానమును ఇచ్చినట్లుగా తెలుస్తున్నది.
ప్రియపాఠకులారా! ఈనాడు ఆనాటి సౌలు కంటె మించిన క్రూరులైన క్రూరమృగాలైన నరాధములు లోకములో అనేకులున్నారు. ఆనాడు ప్రభువు దృష్టికి సౌలు ఒక్కడే. 1 తిమోతి 1:12 పూర్వము నేను దూషకుడును, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించిన ప్రభువైన క్రీస్తుయేసునకు కృతజ్ఞుడనైయున్నాను.
కనుక ప్రియపాఠకులారా! క్రూరమృగమన్నది ఎక్కడో లేదు. చెరకును - చెరకు తీపిని చెడిపే వెన్ను చెరకులోనే పుట్టుతుంది, పైరును పాడుజేసే తెగులు పొలములోనే వ్యాపిస్తుంది. నరుని పాడుజేసే రోగము దేహములోనే పుట్టుతుంది. అలాగు నరకోటిని, వారి విశ్వాస జీవితాన్ని, వారి ఆత్మీయ స్థితిని చెడగొట్టేందుకు, నరులలోనే ఈ క్రూరమృగమన్నది అవతరిస్తుందని ఇందునుగూర్చి ప్రకటన గ్రంథము వివరిస్తున్నది. 20:1-3 ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరాలు బంధించాడు. అటు పిమ్మట వాడు కొంతకాలము విడిపింపబడును. 20:10 వారిని మోసపరచిన అపవాది - క్రూరమృగము, అబద్ధ ప్రవక్తయు ఉన్నట్టి అగ్ని గంథకములు గల గుండములో పడవేయబడెను.
.........
వైరము
ప్రియపాఠకులారా! ఇట్లు దైవత్వముతో సఖ్యత గల్గిన స్థితిలో దేవుడు సృష్టిని, నరులను చేశాడు. ఆది ఒకటి రెండు అధ్యాయాలలో దేవుడు సృష్టించిన సృష్టి యావత్తును ఐక్యత గల్గి, సృష్టిలో దేవుడు - దేవునిలో సృష్టి ఆ రీతిగా ఉండి వైరము, వైషమ్యము, తిరుగుబాటు, వగైరా క్రోధ గుణములు గాక, ఐక్యత సావాసము కల్గిన జీవితములోనే సృష్టిలోని పశుపక్ష్యాదులు, మృగజంతు సముదాయములు ఒకదానితోనొకటి సఖ్యత గల్గి, విరుద్ధ స్వభావములు మాని, సంతోష ఉత్సాహములతో గంతులు వేయుచు, ఆట్లాడుకొంటూ కాలము గడిపినట్లుగా పై వేదభాగములోని చరిత్ర నిరూపిస్తున్నది. అనగా క్రూరమృగమన్నది లేదు. నేడు క్రూరమృగములుగా ఎంచబడుచున్నవి ఏదెనులో సాధు జంతువులుగా వ్యవహరించినట్లుగా వేదభాగాల్లోని పరమార్థము ఋజువుపరచుచున్నది. సింహపు పిల్ల గొర్రె పిల్ల ఒకదానితో నొకటి ఆడుకొన్నట్లును, మేకపిల్ల పులి పిల్ల అదే విధముగా ఎలుగుబంటి, జింక, మనిషి ఉభయులు సమైఖ్యతగా ఏదెనులో జీవించినట్లుగా ఏదెనులోని చరిత్ర ఋజువుపరచుచున్నది. ప్రియపాఠకులారా! ఇందుకు ఋజువు ఏమిటంటే సృష్టికర్తయైన దేవుడు తాను సృష్టించిన మృగపక్షి సముదాయములను జంట జంటగా ఆదాము యొద్దకు పంపి, వాటికి ఏ పేర్లు పెట్టునోనని ఎదురు చూచినట్లు దేవుని వాక్యమున్నది. ఇందునుబట్టి చూడగా ఆనాడు కీటకాలు, జీవరాసులన్నియు కూడా నరునికి లోబడి, నరుని ఆజ్ఞానుసారముగా నడుచుకొన్నట్లు తెలియుచున్నది.
ఇట్టి సమైక్యతా వాతావరణములో వైరము ఎట్లేర్పడినదో ఈ సందర్భములో మనము తెలిసికోవలసియున్నది. సృష్టికిని, దైవత్వమునకును జీవరాసులలో ఒకదానికొకటి వైరము - భూమికిని ప్రకృతికిని వైరము. భూలోకానికి, పరలోకానికి వైరము కల్గుటకు కారణము, నరులు చేసిన దైవాతిక్రమణ పాపమే! ఇందువలన మొట్టమొదటగా స్త్రీని, ఆ తర్వాత పురుషుడు, ఆ తర్వాత వీరి నిమిత్తముగా సర్పము దైవశాపమునకు గురియైయ్యారు. భూమి కుడా శపించబడి దైవత్వానికి విరోధియైంది. ఇక్కడ నుండి అతివృష్టి, అనావృష్టి, భూకంపము, వడగండ్లు, తుఫానులు, సుడిగాలులు, వగైరా అరిష్టాలు భూమిపై నున్న వాతావరణమును చెడగొట్టుటకు కారణము మానవునియొక్క దైవాజ్ఞాతిక్రమమే! ఈ విధముగా సృష్టికిని నరులకును జంతుకోటికిని - నరులకును, క్రిమికీటకాదులకును - నరులకును వైరమేర్పడుటకు కూడా కారణము నరుడే! ఈ వైరమన్నది నాటి నుండి బహుముఖ రీతులుగా ప్రబలి, నేడు భీకర రూపాన్ని దాల్చి వరద చేతను, సముద్రపు ఉప్పెనల చేతను, పల్లెలు పట్టణాలు ముంపునకు గురి జేసే తీవ్ర స్థాయికి దిగినవి. ప్రియపాఠకులారా! దైవత్వముతో నరుడు తెచ్చుకున్న వైరము వాని సంతానమైన మనము నేటి వరకును దేవుని ఉగ్రత ననుభవిస్తూనే ఉన్నాము.
ప్రియపాఠకులారా! సర్వసాధారణముగా మనకేదైన ఆపదలు, అరిష్టాలు, సమస్యలు, ఉపద్రవాలు కల్గినప్పుడు, సాతానును గురించి ఆడిపోసుకుంటు - సాతానుడు గల్గించిన శోధన అని అనుకుంటుంటాము. కాని దీనికి జవాబు యాకోబు పత్రిక 1:14లో చదివినట్లయితే ప్రతివాడును దేవుని చేత గాక తన స్వకీయమైన దురాశల చేత ఈడ్వబడి, మరులు గొల్పబడి శోధింపబడునని వ్రాయబడియున్నది. ఈ విధమైన వైరమును గూర్చి దేవుడు సహృదయుడు, సమాధానకర్త గనుక, దైవత్వముతో నరుడు సంపాయించుకున్న విరోధానికి సంతాపపడి వానితో ఎట్లయిన ఒకనాడు సమాధానపడుదునన్న సూచనగా - నరజంటకు తొడిగిన చర్మపు చొక్కాలను గూర్చిన నిగూఢ సత్యము బైల్పరచింది. నాడు దేవుడు నరజంటకు కప్పిన చర్మపు చొక్కాలే నూతన నిబంధన కాలములో జనించిన దేవుని గొర్రెపిల్లయైన క్రీస్తుయొక్క జన్మరహస్యము ''ఈయన ద్వారా లోకానికి రక్షణ, లోకనివాసులకు పాపవిమోచన, దేవునితో సమాధానము, మరణము నుండి విడుదల ప్రాప్తించింది.
ప్రియపాఠకులారా! నరునికి దేవునికి కల్గిన వైరము తోటతో సమాప్తము కాలేదు. ఆది 6:లో దైవాజ్ఞాతిక్రమము చేసిన నరులలో నుండి జనించిన కయీను, అతని సంతానము దేవునితో వైరము గల్గి భూలోకమును స్నేహించి, భూలోకముతో అలౌకిక సంబంధాలేర్పరచుకొని, తమ చిత్తానుసారముగా వ్యవహరించి, పాపాన్ని విస్తరింపజేసినట్లుగా ఈ వేదభాగములో చదువగలము. ఇందునుబట్టి దేవునికి మానవునితో ఉన్న వైరము ఉగ్రరూపము దాల్చి జలళ్రయమను ప్రవాహజలముల ద్వారా సృష్టినే సర్వనాశనము జేసినట్లుగా మనము చదువగలము. అటుతర్వాత దేవుడు మానవజాతికి ఒక తరుణమునిచ్చి తనకంటూ ఇశ్రాయేలు అను ఒక జనాంగాన్ని ఏర్పరచుకొని, వారి ద్వారా మహిమపరచబడాలని ఆశించి, వారితోనైన నరులపట్ల తనకున్న వైరాన్ని ఉపసంహరించుకోవాలని ప్రయత్నించినట్లును, ఆ జనులు కూడా యెషయా 1:1-5లో వలె అవిశ్వాసులై దైవత్వాన్ని అలక్ష్యము జేసి అనేక వేదనలు, యాతనలు పడి మరణాన్ని కూడా చవి చూచారు. అయినను దేవుడు వారితో చాలా ఓర్పుగా వ్యవహరించి, తుదకు ఉగ్రతతో వారిని మొత్తి అప్పుడప్పుడు వారిని శిక్షించి, దండించినట్లుగా కూడా పాతనిబంధన చరిత్రలో మనము చదువగలము.
ఇట్లుండగా దేవుడు తన కాలము సమీపించినప్పుడు అనగా నరునియొక్క పాపము భూమిపై విలయతాండవము చేయుచున్న సందర్భములో అదృశ్యుడై ఆత్మయు, పరలోక రాజ్యాధిపతియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై సర్వమును కల్గియున్న దేవుడు - అదృశ్య రూపము నుండి దృశ్య రూపము దాల్చుటకు నరుని మీదనున్న ప్రేమకొద్దీ రెండవ కొరింథీ 8:9లో వలె - ఆయన ధనవంతుడై యుండియు మీరు ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఆయన ఐశ్వర్యముతో నరులను ఐశ్వర్యవంతులుగా జేయాలని నరకోటి నిమిత్తము దరిద్రునిగా - ఈ లోకములో జన్మించి రక్షకునిగా ఎంచబడి, విమోచకునిగాను, సమాధానకర్తగాను, బలిపశువుగాను, ప్రధాన యాజకునిగాను, ప్రధాన అపొస్తలుడుగాను ఈ లోకములో దైవత్వము చేత నిర్ణయించబడినట్లు హెబ్రీ 3:1లో మనము చదువగలము.
అయినను ఈ లోకము గుడ్డిదైనందున యేసుక్రీస్తుగా భూమిపై వెలసిన పరమాత్మ రూపాన్ని గ్రహించకుండునట్లు ఆ రూపమును గూర్చినటువంటి పరమార్ధాన్ని నరజ్ఞానము ఆలోచించలేనంతగా బుద్ధిహీనతకు 2వ కొరింథీ 4:4లో వలె ఈయుగసంబంధమైన అపవాది మనోనేత్ర గుడ్డితనమును గల్గించినట్లు తెలియుచున్నది.
అయితే దైవత్వానికిని, మానవత్వానికిని, భూలోకానికిని భూలోక రాజ్యములకు, పరలోక రాజ్యములకును కొలస్సీ 1:20లో వలె యేసు సిలువ రక్తము చేత తనతో సమాధానపరచుకోవాలని దేవుడు ఆశించినట్లును అదే విధముగా కొలస్సీ 1:22లో వలె తన సన్నిధిలో నరులను పరిశుద్ధులుగాను, నిర్ధోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు దేవుడు మాంసయుతమైన దేహమునందు నరులను సమాధానపరచినట్లును కొలస్సీ 2:15 మనము మృతులైయుండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద ఋణముగాను, మనకు విరోధముగాను ఉండిన పత్రమును, మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచి వేసి, మనకు అడ్డము లేకుండ దానిని ఎత్తివేసి, మన అపరాధములనన్నిటిని క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపజేసెను.
-: ఉగ్రత :-
ప్రియపాఠకులారా! దేవునికి నరులకు మధ్య వైరమేర్పడిన తర్వాత నరసంతానము విస్తరించి, నీతి - పరిశుద్ధత దైవభక్తికి మారుగ అవినీతిని, అపరిశుద్ధతను, అక్రమాన్ని - దైవత్వము పట్ల అలక్ష్య వైఖరిని అనుసరించిన నరకోటి పట్ల దేవుని ఉగ్రత రగిలి ఆది 7:8లో జలప్రళయమును, అటుతర్వాత కామతప్తులై వావివరుసలు మాని, మంచిచెడ్డ గ్రహించలేని స్థితిలో ఆత్మీయ జ్ఞానాన్ని కోల్పోయి, దీన చూపుతో గాక కామముతో కూడిన అంధకారమైన దృక్పధముతో విజృంభించిన సొదొమ గొమొఱ్ఱా పట్టణ నివాసులను, దేవుని ఉగ్రత రగుల్కొని అగ్నిగంధకాలు కురిపించి ఆ పట్టణాలను నాశనము జేసినట్లు వేదములో చదువగలము.
ప్రియపాఠకులారా! ఈ ఉగ్రతన్నది నరునియొక్క వ్యతిరేకతనుబట్టియు, నరుడు దైవత్వము పట్ల అవిధేయతగా ప్రవర్తించుటనుబట్టియు, దేవుని దేవుడుగా ఆరాధించి మహిమపరచకుండ దేవునికి చెందవలసిన మహిమను రోమా 1:21-32లో విధముగా దోషపూరితమైన నరకోటిని దేవుడు తన ఉగ్రతతో మొత్తి, శ్రమలకును, రోగాలకును, తెగుళ్ళకును, సర్పములకును అప్పగించినట్లు చదువగలము.
ప్రియపాఠకులారా! దేవునియొక్క ఉగ్రత జలప్రళయము, అగ్ని గంధక వర్షములతో కూడా సమాప్తము కాలేదు. కయీను సంతానాన్ని బట్టి, కయీను సంతానము జేసిన దోషాపరాధములనుబట్టి జలప్రళయముతో లోకాన్ని సొదొమ గొమొఱ్ఱా నివాసులు ప్రవర్తించిన కామవికార క్రియలనుబట్టి అగ్ని గంథకముతో కూడిన వర్షము అను ఉగ్రతతో వారిని మొత్తినట్లును, దైవజనాంగమైన ఇశ్రాయేలు దోషులు కాగా దేవుడు తన ఉగ్రతతో వారిని ఐగుప్తీయులకును, ఫిలిష్తీయులకును బానిసలుగా అప్పగించినట్లును; ఇశ్రాయేలు జనాంగము మోషే పట్ల ప్రవర్తించిన అవిధేయతనుబట్టి దైవోగ్రత రగుల్కొని, తాపకర సర్పములతో మొత్తినట్లును, ఐగుప్తు దోషాపరాధమును బట్టి ఏడు తెగుళ్ళతో దండించినట్లును చివరిగా ఇశ్రాయేలు రాజైన సౌలు యెహోవా దయవలన యెహోవా యొక్క ఏర్పాటు వలన ఆయన ప్రతిష్టత మూలముగా ఇశ్రాయేలుకు రాజైనాడన్న విషయాన్ని విస్మరించి యుద్ధ కాలములో దైవసహాయాన్ని అభ్యర్థించి ఆయనను ప్రాధేయపడి, ఆయన చిత్తానుసారముగా నడువవలసిన సమయములో సౌలు శకునగత్తె శరణు కోరి అది చెప్పు సోదెను ఆశ్రయించి, సోదె ద్వారా తన ఉపద్రవకర పరిస్థితిని గూర్చి విచారించుటను బట్టి దైవోగ్రత సౌలు మీద రగుల్కొని, సౌలును శత్రువుల చేతగాక తన్ను తానే తన ఆయుధాలతో హతమార్చుకొనునట్లుగా సౌలు ఆయుధాలకే సౌలును అప్పగించినట్లును - నూతన నిబంధన కాలములో దైవకుమారుడైన యేసుప్రభువును నిర్దోషముగా సిలువ శిక్షకు గురి జేసినందుకుగాను, దేవునియొక్క ఉగ్రత యూదుల మీద రగుల్కొని యూదులను రాజ్య భ్రష్టులుగా జేసి వారిని అన్యరాజుల కప్పగించి చిత్రహింసల పాల్జేసి వారిని దండించినట్లుగా చదువగలము.
అయితే దైవచిత్తానుసారముగాను దైవకుమారుడైన యేసుయొక్క బలియాగము ద్వారాను, ఆయన జరిగించిన దైవరాజ్య పరిచర్య ద్వారాను, ఆయన సిలువ రక్తము ద్వారా కట్టబడిన క్రైస్తవ సంఘము అను మన సంఘ జీవితములో దైవచిత్తానుసారముగాను, క్రీస్తు యొక్క సిద్ధాంతములు, క్రైస్తవ ధర్మములు, క్రైస్తవ సహోదరుల సావాసములు, ప్రార్థనలో వాక్య ధ్యానములో క్రియలలో దైవరాజ్యమునకు మార్గము, సత్యము జీవమైయున్న క్రీస్తు సువార్త ననుసరించి క్రీస్తును పోలి నడువవలసిన బాధ్యతయు, ఆత్మతోను, సత్యముతోను, వివేకముతోను క్రీస్తు నామాన్ని, దైవసంకల్పాన్ని మరియు గుణాతిశయములను, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావితమైన శక్తిని అనుసరించి నడువవలసిన బాధ్యత ఈనాటి క్రైస్తవులమైన మనకెంతో ఉన్నదని రోమా 12:2లో వలె ఈ లోక మర్యాదను, ఈ లోక చట్టాన్ని, ఈ లోక బోధ ననుసరింపక ఉత్తమమైనదియు, అనుకూలమునునైనదియు, సంపూర్ణమైయున్న దైవచిత్తానుసారమైన బోధ ననుసరించి, పరలోక ధర్మము చొప్పున నడువవలసిన బాధ్యత నేటి క్రైస్తవులమైన మనకు మన కుటుంబాలకు ఎంతో బాధ్యత ఉన్నది.
ప్రియపాఠకులారా! ఇంతటితో దేవుని ఉగ్రత సమసిపోలేదు. ప్రభువు రాకడలో కూడా క్రైస్తవులమైన మనపట్ల దైవోగ్రతన్నది పొంచి ఉన్నదన్న సంగతి మనము మరువకూడదు. దీన్ని గూర్చి మత్తయి 24:1-32 లోకము ప్రవర్తించబోవు స్థితి, లోక పరిపాలన, నరులయొక్క గుణాతిశయములు, నరులలో విస్తరించు కఠినత్వము తత్ఫలితముగా ఒకరికొకరు శత్రువులగుట, అబద్ధ ప్రవక్తల ఆగమనము, సంఘములు చీలి పాడైపోవు విధములు, సంఘములలో కలతలు, బోధకులకు కరువు, వాక్యానికి కరువు, దైవత్వము మీద నరకోటికి ఆసక్తి సన్నగిల్లుట, నాస్తికత్వము, హేతువాదము యొక్క ప్రాబల్యము విస్తరించుట, అన్యదేవతలను ఆరాధించు విగ్రహారాధికులయొక్క కుటిల ప్రవర్తన, లోకాధికారియైన సాతానుడు -సత్యదేవుని మరుగుపరచి, అసత్యములైన, నిర్జీవములైన, నిష్ప్రయోజనములైన దైవరాజ్యము నుండి త్రోయబడి, శాపగ్రస్థమైన దూతలయొక్క రూపాలను ఆరాధింపజేయుటకు బలవంతము జేయుట, క్రైస్తవ విశ్వాసికి విద్యావకాశాలు లేవు, కాలేజీలలో సీట్లు లేవు, ఉద్యోగావకాశాలు లేవు, లోకసంబంధమైన బ్రతుకే శూన్యము. ఇట్టి వాతావరణములో క్రైస్తవులకు కలుగు శ్రమలు, వేదనలు, నిరుద్యోగ సమస్యలతో కూడిన శారీర జీవితము. ఇట్టి జీవితములో విశ్వాసి సైతము అనగా దేవుని చేత ఎన్నిక చేయబడిన భక్తుడు కూడా అవిశ్వాసిగా మారి, లోకప్రభుత్వాలకు, లోకచట్టాలకు, లోక ఆరాధనలకు మొగ్గు చూపుట, ఇత్యాది క్రియలు. జాతి మత కులముల గూర్చిన పోరాటము, రిజర్వేషను, వర్గ పోరాటము, రాజకీయమైన కలతలు, తత్సంబంధమైన దోపిడీలు, బంద్‌లు, మారణహోమాలు ఇవిగాక ఒక దేశముతో మరొక దేశానికి యుద్ధ ఛాయలు, తుఫాను, భూకంపము, వరదలు, ఉప్పెనలు, ప్రమాదములు, క్షణక్షణము అశాంతితో కూడిన నరజీవితము, లోకములో శాంతి భద్రతలు కరువు, ఉగ్రవాదత్వము, దేవాలయాలను గూర్చిన కలహాలు ఒకటేమిటి? అనేక సమస్యలతో ఈనాడు భూలోకములో తలెత్తి భూమిని దైవోగ్రతకు గురి జేయుటకు నరజ్ఞానము దైవవ్యతిరేకముతో కూడిన వెర్రిజ్ఞానముగా మారి, వెర్రితో కూడిన లోక రాజ్యపాలన జేయుచున్నది.
ప్రియపాఠకులారా! ఇట్లుండినటువంటి ఈ లోకమును దైవోగ్రత ఏ విధముగా శిక్షిస్తుందో మత్తయి 24:29-31లోను, మత్తయి 24:19-22, ప్రకటన 6:12-17, ప్రకటన 8:6-13లో విధముగా నుండును. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని క్రమ్ముట, మత్తయి 24:29-31 ఆకాశము నుండి నక్షత్రాలు రాలుట, ఆకాశ శక్తులు కదిలింపబడుట, ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుడు వచ్చుట. 2. మత్తయి 24:19-22 ఆ దినములలో గర్భిణులకును, పాలిచ్చువారికిని శ్రమ. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఏ శరీరియు తప్పించుకొననేరడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ జేయబడును. 3. ప్రకటన 6:12-17 ఆరవ ముద్రను విప్పినప్పుడు పెద్ద భూకంపము గల్గుట, సూర్యబింబము నలుపు, చంద్రబింబము ఎరుపు అగుట - ఆకాశ నక్షత్రాలు రాలుట.
4. ప్రకటన 8:6-13 రక్తముతో మిళితమైన వడగండ్లు, అగ్నియు పుట్టి భూమిపై పడవేయబడును. భూమి మీద మూడవ భాగము కాలిపోవుట మొదలైనవి.
కనుక ప్రియపాఠకులారా! గడిచిన కాలములలో రగుల్కొన్న దేవుని ఉగ్రత కంటె ప్రభువు రాకడలో అనగా లోకాంత్య కాలములో అనగా లోకము యొక్క పాపపు పంట కోయబడు కాలములో రగుల్కొనబోవు దేవుని ఉగ్రత - పై వివరించిన వేదభాగాల ద్వారా ఎంత తీవ్రతరమైనదో ఎంత భయంకరమైనదో ఎంత ప్రచండమైనదో ఎంత శక్తివంతమైనదో అనిన విషయమును పై విధముగా వివరించబడిన వేద భాగాల ద్వారా చదివి - అట్టి దైవోగ్రత నుండి తప్పించుకొనుటకు మనము ప్రభువు రాకడకు సిద్ధపడినవారమై, ఆయత్తముగా ఉండి వాక్య ధ్యానము, ప్రార్థన సహవాసము, విశ్వాసులతో సాంగత్యము, కాపరులతో స్నేహము, సంఘముతో సత్సంబంధము కలిగి యోహాను 15:5లో వలె ద్రాక్షవళ్ళియైన యేసుతో తీగెలుగా మన జీవితాలను అంటుకొని, మనయందు ప్రభువును - ప్రభువునందు మనమును నిలిచియుండి, ఆత్మీయ ఫలాలను ఫలించి, ఆత్మ దేవునియొక్క స్వాస్థ్యములో ఆత్మ దేవుని రాజ్యములో ఆత్మీయమైన స్వాస్థ్యమును పొందుటకు, ఈ లోకమర్యాదను, ఈ లోక స్వాస్థ్యములను అనుసరించక యేసు మార్గములో నడిచి మన జీవితాలను ధన్యవంతము చేసికొందుము గాక!
మూలము :- మత్తయి 24:17 మిద్దె మీద నుండువాడు తన ఇంటిలో నుండి తీసికొని పోవుటకు దిగకూడదు.
ప్రభువునందు ప్రియపాఠకులారా! నరులమైన మనము మన జీవితానుభవములో ఎక్కువగా చెట్లు క్రింద, నేల మీద లేక పాకలలో సముద్ర తీరములు, నదీతీరములు, ఉద్యానవనములు, పార్కులు, వగైరా స్థలములలో మనయొక్క శారీర బడలిక నుండి విశ్రాంతి పొందుటకు మరియు మనోల్లాసము కల్గుటను బట్టి సేద దీర్చుకొనుటకు పై స్థలములలో విహరిస్తున్నాము. రోజంతయు కష్టించి పని జేసేవానికి ఏకాంతముగా ఏదో యొక్క ఆహ్లాదకరమైన స్థలములో విహరించి మనస్సానందాన్ని మానసిక శ్రమ నుండి ఉపశమనాన్ని పొందుచున్నాము.
అయితే బైబిలు గ్రంథములో యేసుప్రభువు యొక్క పై మాటలు ''మిద్దె మీద ఉన్నవాడు తన ఇంటి నుండి ఏదైన తీసికొని పోవుటకు దిగకూడదు.'' ప్రియపాఠకులారా! మిద్దె మీద నున్న వానికి వేదములో ఒక ప్రత్యేకత ఆధిక్యత ఉన్నట్లు - ఈ వేదవాక్య రీత్యా మనము గ్రహించవలసియున్నది. మేడ మీద జరుగు తీపి అనుభవాలు, చేదు అనుభవాలను గూర్చి మనము తెలిసికోవలసియున్నది. నిజమే! మేడ మీద జీవితమన్నది దేవుడు నరునికి ఇచ్చిన ఒక ప్రత్యేకమైన మరియు ఉన్నతమైన స్థానముగా మనము గ్రహించవలెను. ఆదిలో జలప్రళయ సందర్భములో దేవుడు నోవహుకు ఇచ్చిన ఓడ నమూనాలో ఓడను మూడంతస్థులు గల దానిగ చేయమని ఆ ఓడన్నది దిగువ భాగము ఓడ రూపముగా ఉండవచ్చునో ఏమో గాని వాస్తవమునకు అది ఓడ గాదు, దానిని ఓడ గృహమనవచ్చును. ఎందుకంటే ఆ దినములలో నేలమీద కట్టబడిన గృహాలు పాపభూయిష్టములై దైవోగ్రతకు గురియై జల ప్రళయములో పూర్తిగా ముంపునకు గురియగు సందర్భములో లోకసంబంధమైనవియు, మానవ జ్ఞానాన్ని బట్టి, మానవేచ్ఛలను బట్టి, నరుని స్వార్థమును బట్టి కట్టిన గృహాలు ముంపునకు గురికాగా దేవుడు నోవహు చేత కట్టించిన ఓడ గృహము జలముల మీద తేలి 150 దినములు ప్రచండ అగాధ జలములపై విహరించి, ఆ ఓడ పై అంతస్థు మేడ గదిలో నోవహు, అతని కుటుంబము ఐదు నెలలు ప్రార్థన, దైవధ్యానముతో కూడిన స్థితిలో అందులో జీవించినట్లు ఆది 7:లో మనము చదువగలము. ఇట్టి మేడయైన ఈ ఓడ - జలములు భూమి మీద ఇంకిపోయిన సందర్భములో నేల మీద నిలువక, అరారాతు పర్వతము మీద నిలువబడి దేవుని మహిమ పరచినట్లుగా కూడా వేదములో చదువగలము.
దైవాజ్ఞానుసారము, దైవచిత్తానుసారము, మార్గములో దేవుని మేడయైన ఓడ గృహములో కుటుంబ సమేతముగా ప్రార్థనాయుత జీవితములో బస జేసిన నోవహు, అతని కుటుంబము ఓడ గృహము యొక్క మేడ మీద నుండి క్రిందికి దిగక అగాధ జలప్రళయము నుండి దాని యొక్క ఉధృతమైన ప్రవాహము నుండి రక్షించబడినాడు. ఇది నోవహు జీవితములో మేడ గదిలో తాను పొందిన దైవత్వముతో కూడిన తీపి అనుభవము. నిర్గమకాండము 3:లో ఐగుప్తీయుని చంపి నరహంతకుడైన మోషేకు కల్గిన దైవదర్శనము. మండుచున్నను కాలిపోని పొద దేవుని పిలుపు. ఇది కూడ మేడ గది యొక్క అనుభవమే - ఎందుకంటే ఇది దేవుడు ఎన్నుకున్నటువంటి హోరేబు అను సర్వోన్నతమైన పరిశుద్ధ స్థలము. ఈ స్థలములలో దేవుడు మోషేను సంబోధిస్తూ మోషే! మోషే! నీ పాదరక్షలను వదలి రమ్ము. ఎందుకనగా నీవు నిలిచియున్న స్థలము అతి పరిశుద్ధ స్థలము అనగా సర్వోన్నతమైనది, మేడ యొక్క ఔన్నత్యాన్ని చూపునది అని అర్థము. ఈ విధముగా దేవుని మేడయైన యోరేబులో దైవ మాటలు, దైవదర్శనము, దైవ ప్రజలయొక్క భయంకర జీవితము. అనగా తగలబడిన మంటలతో కూడిన జీవితాన్ని ఈ స్థలములో మోషే చూడగల్గినాడు. ఈ స్థలములోనే దేవుడు తన జనాంగమైన ఇశ్రాయేలుకు మోషేను నాయకునిగ నియమించాడు.
ఇక ఆహాబు రాజు కాలములో మూడున్నర సంవత్సరము| ఏలీయా ప్రార్థన ద్వారా కరువు రాగా అనగా అనావృష్టి రాగా ఆ యొక్క భారమైన కరువు సమయములో సారెపతులోని విధవరాలు తన మేడ మీద ఏలీయాకు ఆశ్రయమిచ్చి, కరువు దినములు తీరినంతవరకు అతనిని ఆదరించి, ఒక దైవ ప్రవక్తగాను, పరిచారకునిగాను, ఆయనను ఘనపరచి, తన కుమారుని మరణము నుండి జీవింపజేసుకున్నది. కరువు దినములు పూర్తియగువరకు పిండిగాని, నూనెగాని తరగని స్థితిలో జీవించింది. ఇది మేడ గదిలోని ఆశీర్వాదకరమైన అనుభవము మేడ మీద అనగా దేవునియొక్క పరమోన్నత స్థలమని అర్థము.
ప్రియపాఠకులారా! రాజులు యుద్ధము చేయవలసిన కాలమే వసంత కాలము అనగా ఆనాటి రాజుల వసంత కాలములో యుద్ధాలను ప్రారంభించేవారు. అట్టి కాలములో దైవజనాంగమైన ఇశ్రాయేలీయులు యుద్ధము చేయు సందర్భములో ఇశ్రాయేలీయులకు రాజైన దావీదు యుద్ధభూమిలో నుండి దైవజనాంగముతో చేరి దైవజనాంగ పక్షముగా అనగా దేవుని పక్షముగా పోరాడవలసినవాడై యుండగా అందుకు విరుద్ధముగా దావీదు తన అంతఃపురము యొక్క మేడనెక్కి భోగియై, నిష్కారణమైన స్థితిలో మేడ పై భాగాన పచార్లు చేస్తూ స్నానమాచరిస్తూ వివస్త్రయైన స్త్రీని చూచి చలించి, ఆమెను మోహించినవాడై - అంతమాత్రమేగాక ఆమెతో కూడి ఆమె నిమిత్తము తన దోషమును కప్పి పుచ్చుకొను నిమిత్తము నిర్దోషియైన ఆమె భర్తయైన ఊరియాను చంపి తన జీవితాన్ని, తన జీవితములో ఉన్నత స్థలములలో దేవుని మహిమపరచవలసినవాడై యుండగా మేడ మీద నుండి త్రోయబడి, అగాధము యొక్క గోతిలో దిగజారిపోవు స్థితికి దావీదు ఎక్కిన మేడ యొక్క చేదు అనుభవము బైల్పరచుచున్నది.
ప్రియపాఠకులారా! దావీదు ఎక్కిన మేడ అకారణమైనది, అనవసరమైనది, దైవత్వమునకు వ్యతిరేకమైనది, తన జీవితానికి నాశనకరమైనది. అట్లే ఒకానొక సందర్భములో ఏలీయా శాపమూలముగా ఆహాబు రాజుపై అన్యరాజు యుద్ధము ప్రకటించి విజృంభించిన సమయములో ఇశ్రాయేలు ఓటమిని చవి చూస్తున్నందున శత్రురాజులకు భయపడి, మేడ మీద దాగుకొన్న యెజిబేలు జీవితమును గూర్చి కూడా ఈ సమయములో మనము ఆలోచించవలసి యున్నది. దైవజనాంగముతోను, దేవుని ప్రవక్తతోను చెలగాటమాడిన యెజిబేలు యొక్క జీవితములో తానెక్కిన మేడ తనకు శత్రువైంది. మేడ మీద నుండి పడద్రోయబడి, చనిపోయి కుక్కల పాలైనట్లు యెజిబేలు చరిత్ర మనము చదువగలము.
.......
ప్రసంగాంశము :- పరిచారక
మూలము :- రోమా 16:1 కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరి ''ఫీబే'' అనగా ప్రకాశమానమైన లేక కాంతివంతమైన అని అర్థము. ఈమె క్రీస్తు కొరకు ప్రకాశించెడి స్త్రీగా జీవించింది. ఈ దినాలలో చాలామంది వారి ప్రకాశమును మెరిసే వస్త్రాలు, ఆభరణములు, అలంకారములతో కనపరచుచున్నారు. కాని వారి జీవితాలలోని సాక్ష్యములోను ముఖవర్చస్సులోను ఈ ప్రకాశము కన్పించదు. ఫీబే కెంక్రేయాలో సంఘ పరిచారకురాలు. తగ్గింపు, త్యాగము, సమర్పణ లేనిది ఎవరును నిజమైన పరిచారకులుగా ఉండలేరు. ఈ దినాలలో అనేకులు స్వార్థపరులు, గర్విష్టులు, వదరుబోతులుగా ఉన్నారు. కాని ఫీబే వంటి పరిచారకులు చాలా తక్కువ. ఫీబే నమ్మకస్థురాలు. శిష్యులు బహుశ్రమల పాలగుచుండిన దినాలలో పౌలు రోమా సంఘమునకు ఒక పత్రికను ఆమె ద్వారా పంపుటలో ఆమెలో ఉన్న సాహసము, ఆమెయందున్న నమ్మకము కన్పించుచున్నది. నేడు అనేకులు కుంటిసాకులు చెప్పేవారుగా ఉన్నారుగాని, నమ్మకస్థులై దైవసేవలో సహకరించుట లేదు. ఫీబేలో స్వార్థము, దురాశ లేదు. ఆమెకు అవసరమైన సహాయము చేయుడని పౌలు చెప్పుటలో ఆమె అవసరమైన వాటినే అడుగునదని తెలియుచున్నది. నీవు దేవుని నామ మహిమార్థమైన వాటినే అడుగుచున్నావా?
ఫీబే అనేకులకు సహాయకురాలు. నాకు సహాయకురాలని రోమా 16:2లో రోమా 16:2లో పౌలు మెచ్చుకొన్నంతగా ఆమె తన సాక్ష్యాన్ని కాపాడుకున్నది. నీ సంఘకాపరి నిన్ను గురించి, నీ పరిచర్య గురించి, యిట్టి మంచి సాక్ష్యము ఇవ్వగలడా? నీవు ఆధ్యాత్మికముగాను, శారీరకముగాను సహాయకురాలుగా ఉన్నావా? గుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటినని యోబు చెప్పుచున్నాడు. యోబు ఆది 29:15 మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిరి గనుక నాకును చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను.'' మత్తయి 25:40లో ప్రభువు మాట ప్రియసోదరీ! సోదరా! మనము ఫీబే వలె క్రీస్తు ప్రేమ అను ప్రకాశమును ఇతరులకు చూపించు చున్నామా?
.......
-: యోహాను 10:1-17లోని పరమార్థములు :-
ప్రియపాఠకులారా! ఇందులోని ప్రాముఖ్యమైన విషయాలు తెలిసికొనుటెంతో అవసరము. మొట్టమొదటగా - ''గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున వచ్చువాడు దొంగయు, దోచుకొనువాడునైయున్నాడు,'' అనుటలో గొర్రెల దొడ్డి ఏది? గొర్రెలు ఏవి? ద్వారమేది? దొంగ ఎవరు? దోచుకొనువాడెవరు? అనిన విషయాలు ముందు మనము తెలిసికోవలసియున్నది.
ప్రియపాఠకులారా! దైవత్వమన్నది సృష్టిలో ఎన్నో రకములైన జాతులు మరియు అందచందాలతో కూడిన ఠీవి గలవి, చిత్రవిచిత్రమైన సొగసైనవి, బలముగలవి ఉండగా - అల్పజీవియైన గొర్రెను గూర్చి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుటలోని వేదసత్యాన్ని మనము తెలిసికోవలసియున్నది. సృష్టిలో ఏనుగు జంతుకోటి అంతటిలో పెద్దది. సింహము ప్రపంచములోని మృగ జాతులలో బలమైనది. జంతుజాలమునకు రాజైయున్న జీవి పులి. దీనికి సృష్టిలో ఒక ప్రత్యేకమైన స్థానమున్నది. ఈ విధముగా ఆయా గుణాతిశయములను బట్టి ఆయా జంతువులు ఎన్నో ఉండగా దైవత్వమన్నది గొర్రెను ఎన్నిక చేయుటలో ఉన్న మర్మమేమిటంటే గొర్రెలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలున్నవి. ఇందులో 1. అమాయికత్వము
2. విధేయత 3. నిర్మలత్వము 4. నిలకడగా ఒక చోట నిలబడి మేయు స్వభావము గలది. 5. సంఘీ భావము కలది. 6. కల్లాకపటం, కుత్సితమనునవి ఎరుగనిది. 7. పగ, ఈర్ష్య, ద్వేషములు లేనిది. 8. క్రూరత్వము లేనిది. 9. శాకాహారి 10. నరకోటికి ప్రతినిత్యము అందుబాటులో ఉండునది. 11. చంపువానికి మెడ నిచ్చునది. 12. తనను మేపు కాపరి యొక్క స్వరమును గుర్తు పట్టగల్గినది. 13. కాపరి ననుసరించి నడిసేది. 14. బొచ్చు కత్తిరించువానికి, చంపువానికి మెడనిచ్చునది. ఇట్టి గుణాతిశయములు గల జంతువు సృష్టిలో ఏదియు లేదని ఘంటాపథముగా చెప్పవచ్చును.
అందులో మొట్టమొదటగా హేబెలు అర్పించిన బలిలో మందలోని తొలిచూలు అని వ్రాయబడి యున్నది. ఆ విధముగా హేబెలు తన మందలో క్రొవ్విన వాటిలో దైవత్వానికి ప్రధమార్పణముగా తొలిచూలును అర్పించినప్పుడు దైవత్వమన్నది హేబెలు యొక్క బల్యర్పణను లక్ష్యపెట్టినట్లుగాను, కయీను యొక్క అర్పణను తిరస్కరించినట్లు వేదములో చదువగలము. ఇంకను అబ్రాహాము తన కుమారుని మోరియా మీద బలి జేయు సందర్భములో దైవత్వమన్నది అబ్రాహాము యొక్క క్రియను నివారించి, అబ్రాహాము యొక్క దర్శనములో - పొదలో తగుల్కొన్న పొట్టేలును చూపుట, ఇవన్నియు కూడా దైవత్వమునకు ప్రీతికరమైన మరియు దైవత్వమన్నది మానవత్వము దాల్చు సందర్భములోను, సకల మానవ కోటి పాపపరిహారార్థముగా తన శరీరమును లోకపాపనివారణార్థము వధించబడు గొర్రెపిల్లగా పిలువబడుటలోను, దైవత్వానికి గొఱ్ఱెజాతి మీదనున్న అభిలాషను ఋజువుపరచుచున్నది.
ప్రియపాఠకులారా! ఇట్టి గొర్రె జాతిని ప్రభువు తన ప్రసంగాలలో ఉపమానములుగా తీసుకొని యేసుప్రభువు ఈ లోకమును వదలి వెళ్ళిన తర్వాత కట్టబడబోవు క్రైస్తవ సంఘాలు గొర్రెపిల్ల సంఘాలుగాను, సంఘమన్నది గొఱ్ఱెలమందగాను, సంఘకాపరి గొఱ్ఱెలకాపరిగాను, సంఘాలయము గొఱ్ఱెల దొడ్డిగా గూడార్థములతో అభివర్ణించినట్లు పై లేఖన భాగములలోని మర్మములు బైల్పరచుచున్నవి. గొర్రెల దొడ్డి, నేటి సంఘాలయము ద్వారము యేసుప్రభువు.
గొర్రెల దొడ్డిని దోచువాడు అనగా సంఘమును చెడగొట్టువాడు లేక తన స్వార్థానికి బలి చేయువాడు, ''దొంగ'' అనుటలో నేటి మన క్రైస్తవ జీవితములో మనము కట్టిన సంఘముగాని లేక వేరొకరు కట్టిన సంఘమైతేనేమి, క్రైస్తవ్యానికి దైవత్వానికి ప్రీతికరమైనదిగాను, ఆదర్శము గలదిగాను, ఫలభరితమైనదిగాను ఉన్నప్పుడు, సంఘములో అర్థంపర్థం లేకుండ సంఘస్థులను దోపిడీ చేయుటయు, ఇటువంటి పనులు చేయువాడు, మరియు సంఘములో తనకేదైన బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు సంఘములో ఉన్న ఒక వ్యక్తిని బట్టి సంఘముపై కత్తిగట్టి, సంఘస్థులను చీల్చి తన స్వప్రయోజనాలకై వాడుకొనువారు ఇట్టి కోవకు చెందినవారు.
ప్రియపాఠకులారా! సంఘమన్నది గొఱ్ఱెలమంద. గొఱ్ఱెల మందను ఏ దారికి మళ్ళిస్తే ఆ దారికి మళ్ళే స్వభావము గలవి. అదే విధముగా సంఘస్థులు కూడా తమ పెద్దలు చెప్పిన మార్గములో నడుస్తారు. సంఘాలయమన్నది గొఱ్ఱెల దొడ్డి; సంఘము యొక్క ముఖద్వారము క్రీస్తు. సంఘము మీద అధికారము వహించువారు సంఘ పెద్దలు. సంఘకాపరి సంఘము యొక్క ఆత్మీయ జీవితము, దాని మనుగడ, కాపరి యొక్క సంఘ పెద్దల యొక్క అజమాయిషీ మీద ఆధారపడియుంటుంది. కనుక స్వప్రయోజనాలకు సంఘస్థులనుగాని, సంఘ సభ్యులనుగాని వాడుకోవటమన్నది క్రైస్తవ్యానికి, క్రీస్తుయొక్క ప్రణాళికకు దేవుని యొక్క పథకానికి గొడ్డలిపెట్టు వంటిది. ఈ సందర్భములో అపొ 3:1-10 చదివితే భూమి మీద ఒక వ్యక్తి యొక్క కుటుంబము బాగుపడవలెనన్న, గౌరవించబడవలెనన్న, పేరు ప్రఖ్యాతులు సంపాయించుకోవలెనన్న క్రీస్తు మార్గములో అతను నడువవలెను.
ప్రియపాఠకులారా! శృంగారమను దేవాలయము ద్వారములో క్రీస్తున్నాడు. కాని చీలమండల రోగి ద్వారము దగ్గర ఉన్నాడు. ద్వారము దగ్గర ఉన్న ఈ వ్యక్తి రోగియై భిక్షమడుక్కొంటున్నాడు. ప్రియపాఠకులారా! మనము కూడా క్రీస్తు ఆరాధనలో పాల్గొనకుండ లేనిపోని కబుర్లతో కాలక్షేపము జేయుచు, క్రీస్తుకు చెందవలసిన సమయాన్ని లోకానికి అప్పగించి, తాత్కాలిక సంతోషాన్ని అనుభవించి, శాశ్వతమైన దుఃఖానికి నాంది తెచ్చుకుంటున్నాము.
.......
అంశము :- కాపరి :- ప్రభువునందు ప్రియపాఠకులారా! పరలోక రీత్యా భద్రత అను క్రియకు చాలా విధానాలున్నవి. ప్రతి విషయములోను భద్రతన్నది అవసరము. నరజీవితములో భద్రతకు చాలా ప్రాముఖ్యత ఉంది. భద్రత - జాగ్రత్త రెండును ఒకదానికొకటి సమన్వయత పొందియున్నాయి. భద్రతలో జాగ్రత్త - జాగ్రత్తలో భద్రత రెండును ఏకమైయున్నవి. భద్రతకుగాని, జాగ్రత్తకుగాని సవ్యముగా క్రియ జరగాలంటే దీనికి కాపుదల అవసరము. భద్రత, జాగ్రత్త, కాపుదల ఈ మూడును ఒక దాని వెనుక ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి. ఈ మూడును భూమికి పునాది వేయబడినప్పుడే క్రియ జరిగించినట్లును, ఆ విధముగా క్రియ జరిగించిన, లోకము మీద జరిగిన మంచి చెడు చేదు అనుభవాలను గూర్చి తెలిసికొందము. భద్రత, జాగ్రత్త, కాపుదల ఈ మూడింటి క్రియాకర్మలలో చాలా తేడాలున్నవి. భధ్రతలో కూడబెట్టే గుణమున్నది. జాగ్రత్తలో జరుగబోయే ఉపద్రవము ద్వారాగాని, జాగ్రత్త ద్వారాగాని పాటించవలసిన నియమమున్నది. కాపుదలలో పై రెంటి విషయములో ఏదియు జరుగకుండ సంరక్షించే స్వభావమున్నది. ఇందునుగూర్చి వేదరీత్యా వివరముగా తెలిసికొందము.
ప్రియపాఠకులారా! దేవుడు సృష్టి ఆరంభములో ప్రప్రధమముగా పాటించినటువంటిది భద్రత అను కార్యము - ఈ భద్రతన్నది దైవక్రియలో చాలాప్రాధాన్యత వహించియున్నది. దేవుడు ఆరు దినాలు చేసిన సృష్టి కార్యాలలో తాను రూపించబోవు తన పోలిక, తన స్వరూపములో నరనిర్మాణమునుగూర్చి ముందే జాగ్రత్త వహించి, నరుని మనుగడకు కావలసిన అన్ని హంగులు అనగా వాతావరణము, ఆహారము, నీరు, గాలి నరజీవితానికి కావలసినటువంటి స్థల భోగము, వాని మనోవికాసానికి కావలసిన ఆహ్లాదకర వాతావరణము, ఎలాంటి అరిష్టాలు, ఉపద్రవాలు, అపరిశుభ్రతలు కలుగకుండ సర్వాన్ని చక్కబరచి, అటు తర్వాత నరుని మనుగడకు వాని జీవనోపాధికిని ఆహార విలువలకు మూలమైన ఏదెనను తోటను వేసి, ఆతోటలో నరుని జీవితానికి నరుని దేహానికి ఆకలిదప్పికను తీర్చుటకు ఆహార నిధులను సమకూర్చి, ఇవన్నియు జరిగిన పిమ్మట నర నిర్మాణము గావించి, వానిలో తన జీవాత్మను నింపి నరునిలోను జీవాత్మ విషయమై జాగ్రత్తపడి అనగా నరునియొక్క జీవాత్మ వక్రించినప్పుడు జరుగబోయే ఉపద్రవము, దైవ వ్యతిరేకత, సాతాను విజృంభణ, సృష్టి వినాశము గూర్చిన భవిష్యత్తు నెరిగినవాడై, ఏదెనువన నిర్మాణములోను, నర నిర్మాణములోను జాగ్రత్త వహించినట్లుగ దేవుడు సృష్టించిన ఈ సృష్టి యొక్క నిర్మాణ క్రియలోని ఆంతర్యము ఇందునుబట్టి మనకు బయల్పరచుచున్నది. ఇట్టి భద్రతతో కూడిన వాతావరణములో దేవుడు తన స్వరూపములో రూపించబడిన నరునితో సఖ్యత గల్గి ప్రతి నిత్యము వానితో ఆనందిస్తూ -దేవుడు తాను వేసిన ఏదెను వనమునకు తనచే రూపించబడిన నరుని కాపరిగా నియమించాడు. దేవుని సంపదపై నరుని కాపుదల అన్నది ప్రారంభములోనే క్రియ జరిగించలేక అపజయము పాలైంది. దేవుడు ఆదినరుని ఏదెను వనమునకు కాపరిగా నియమించినప్పుడు ఆదాము యొక్క కాపరితనమైతే క్రియ జరిగించి ఉండవచ్చునుగాని, ఆ యొక్క సాటి సహాయియైన స్త్రీ - భర్త యొక్క కాపరితనమును పాడు చేసే బలహీనతకు దారి తీసింది.
ప్రియపాఠకులారా! దేవునియొక్క స్వాస్థ్యమైన ఏదెనునకు నరుడు కాపరి. కాని నారి కాపరి యొక్క భార్యయైనప్పటికిని, ఆదాము యొక్క ఆత్మీయ విలువలను పాడుచేయుటయేగాక అతనిని దేవునికి దూరస్థునిగాను, దైవవ్యతిరేకిగాను, దైవసన్నిధికి అయోగ్యునిగాను, దైవదృక్పధానికి తీరనట్టి ద్రోహిగాను చేసేటటువంటి హీనత్వానికి దిగజారింది. ఇందుకు కారణము నారిలోని బలహీనతయే. నారి యొక్క బలహీనతన్నది సాతాను యొక్క సర్పము యొక్క ఆకర్షణకు లోనై, సర్ప ప్రభావము నారి మీద పొడ చూపుట ద్వారా తోట కాపరియైన ఆదాము కూడా ఆ స్త్రీకి ఆకర్షితుడై సతీసమేతముగా దైవాతిక్రమణ చేసి దోషి అయ్యాడు. అంతేగాక సతీసమేతముగా దైవస్వాస్థ్యము నుండి త్రోసివేయబడినారు. మరియు సతీసమేతముగా మరణానికి కాపరి అయ్యాడు. సకల నరకోటి యొక్క పాపమునకు కూడా ఆదాము కాపరి. నాటి ఆదాము యొక్క దోష క్రియ నాటి నుండి అతని సంతానమైన నేటి తరము వరకును ఈ పాపము బహువిధాలుగ నరులను ఏలుచు బహు జాగ్రత్తతోను, భద్రతలోను నానావిధ కాపుదలలోను క్రియ జరిగిస్తున్నది.
ఈ విధముగా క్రియ జరిగిస్తున్న మరణము నరుని అంతము చేయుటకు కాపరిగా ఉన్నది. ఈ మరణమన్నదానిని కాపరిగా నియమించినవాడు దేవుడే, ఎలాగంటే దేవుడు నరుని శాసిస్తూ - ఆదామా! ఈ తోటలోని చెట్ల ఫలములన్నిటిని నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే తోట మధ్యలోని మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. నీవు వాటిని తిను దినాన నిశ్చయముగా చచ్చెదవు,'' అని చెప్పినట్లు వేదములో చదువగలము. ఇందులోని భావమేమనగా ఏదెను చెట్ల ఫలములను దైవ ఆజ్ఞ ప్రకారము ఆదాము తిననంతవరకు ఏదెను వనమునకు ఆదాము కాపరియే. అట్లుగాక దేవుడు నిషేధించిన మంచి చెడు వృక్ష ఫలములను తిన్నప్పుడు నరజీవితము మీద మరణానికి కాపరితనమును దేవుడు నియమించినట్లుగ తెలుస్తున్నది. ఇందునుబట్టి దైవవనములోని సమస్త ఫల వృక్షాలను దైవచిత్త ప్రకారముగా భుజించే నరునికి మరణము లేదు మరియు దైవసన్నిధి నుండి తొలగించబడే దుర్గతి లేదు. ఇందునుబట్టి నరుడు తన కాపరితనమునకు ఎలాంటి ఢోకా లేదు. ఈ దైవవనమునకు కాపలా ఉన్నంత వరకు రోగభయము, పిశాచభయము, దొంగభయము, మరణభయము, ఆహార కొరత లేదు, లేమి లేదు. లోకసంబంధమైన అవసరతలేవియు లేవు. ఇది దైవవనమునకు కాపరియైన నరునియొక్క ఉన్నత స్థితి. ఈ ఉన్నత స్థితి నుండి దిగజారి పతనావస్థకు ఒరిగినప్పుడు మరణము అతని మీద ఏలుబడి చేసింది. ఈ మరణము యొక్క కాపుదల అన్నది ఆదాముతోనేగాక అతని సంతానమైన నేటి వరకు కూడా ఇది క్రియ జరిగిస్తున్నది. దైవవాక్యములో ఒక మాట వ్రాయబడి యున్నది. అదేమనగా యాకోబు 1:15 దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును'', అనుటలో నరునియొక్క లోభత్వమునకు కారణము దురాశ - దురాశను అధిగమింపజేసి వానిని నానారీతులుగా క్రియ జరిగించుటకు కాపరియే పాపము. దురాశ పాపమునకు కాపరియగుచున్నది. ఇందువలన మరణము, ఈ మూడును నేడు నరజీవితములో అత్యున్నత స్థితిలో క్రియ జరిగిస్తున్నాయి. దురాశలో మూడు గుణాలు మిళితమైయున్నవి. అంటే పదవీ వ్యామోహము - అవియే స్వార్థము - లోకాశ - నేత్రాశ. ఇవి మూడును దురాశలో ఉన్నాయి. అలాగే పాపములో కూడా త్రిత్వమున్నది - ''కోపము, ద్వేషము, హత్య లేక దాని సంబంధమైన క్రియ.'' కామక్రోధ - మద - మత్సరాలు. ఈ రెంటికి కారణమైన మరణములో కూడా మూడు విధమైన మరణాలు. 1. సహజ మరణము 2. అకాల మరణము 3. ఆత్మహత్య. ఇందునుగూర్చి వివరముగా తెలిసికొందము.
సహజ మరణము అనగా నరునికి దేవుడనుగ్రహించిన ఆయుష్కాలము తీరిపోయి సహజ స్థితిలో ఏదో యొక రీతిలో మరణించుట - ఇది సహజ మరణము. అకాల మరణమంటే ప్రమాదవశాత్తు అగ్ని ద్వారాను, జలముల ద్వారాను లేక వాహనాల ద్వారాను లేక జంతువుల ద్వారాను లేక అకస్మాత్తుగా కలిగే సంఫటనల ద్వారాను మరణించుట - గుండె ఆగి మరణించుట కూడా అకాల మృత్యువే. ఇక హత్య - హత్యలో కూడా రెండు రకాలున్నవి - 1. ఆత్మహత్య చేసుకొనుట లేక ప్రత్యర్థుల ద్వారా జరుపబడుట - ఇది హత్య. ఈ విధముగా దైవత్వమును వీడినటువంటి నరకోటి జీవితములో ఏదెను వనమునకు అనగా దైవ సృష్టికి నరుడు కాపరియైయుండి, ఆ కాపరత్వమును ఏలాగు నిలుపుకోలేకపోయాడో, అలాగే నరసంతానము కూడా వారి యొక్క ఆత్మీయ విలువలను చెడగొట్టుకొని, లోకాకర్షితులై లోకదాసులైనందువలన నేడు : నరుల మీద ''అపవాది - పాపము - మరణము, ఈ మూడును యావద్ నరకోటి జీవితమునకు కాపరులైయున్నాయి. ఈ విధముగా ఆత్మీయతను కోల్పోయి, త్రివిధమైన అరిష్టాలచే ఆ యొక్క కాపరత్వములో ఉన్న నరజీవితమునకు విడుదల, రక్షణ ప్రసాదించుటకే దైవకుమారుడు ఈ లోకానికి వచ్చి పల్కిన మాట ''యోహాను 10:11 నేను నిజమైన గొర్రెల కాపరిని.
ప్రియపాఠకులారా! మొట్టమొదటగా దేవుడు నరులకు కాపరియైయున్నట్లు యెషయా గ్రంథములోను మరియు కీర్తన 80:1లో ఇశ్రాయేలునకు కాపరీ! చెవియొగ్గుము, మంద వలె యోసేపును నడిపించువాడా! కెరూబుల మీద ఆసీనుడవైనవాడా! ప్రకాశింపుము. ఇక సర్వ జనాంగానికి దేవుడు కాపరియైనట్లుగా కీర్తన 23:1లో దావీదు తన్ను గూర్చి ప్రకటించుకొంటూ ''యెహోవా నా కాపరి - నాకు లేమి కలుగదంటున్నాడు.
ప్రియపాఠకులారా! ఇందునుబట్టి మొట్టమొదట దైవసృష్టియైన ఈ అనంత విశ్వములో దేవుడు వేసిన తోటకు 1. ఆది నరుడు కాపరి - ఆ కాపరి అవిధేయత చేత దైవ ఆజ్ఞాతి క్రియ చేయుటనుబట్టి ఆదినరుని కాపరత్వము నుండి అతనిని తొలగించి, అతని కుమారుడైన హేబెలును ఆది 4:2లో హేబెలు గొర్రెల కాపరి. ఈ విధముగా దేవుడు తన కాపరి ఉద్యోగమును మొదట తండ్రికి తర్వాత కుమారునికి; తండ్రి కాపరత్వమును నిలుపుకోలేకపోయిన కుమారుడు హతుడయ్యాడు. ఈ విధముగా ఇద్దరు అపజయము పొందగ, దేవుడు తానే కాపరిగా వ్యవహరించుచు, ఇశ్రాయేలు అను ప్రత్యేక జనాంగమును ఏర్పరచుకొని, వారికి కాపరిగా వ్యవహరించినట్లు కీర్తన గ్రంథములో చదువగలము. ఈ విధముగా ఇశ్రాయేలుకు తానే కాపరిగా ఉండి నలుబది సంవత్సరాలు ప్రవక్తలు యాజకుల యొక్క అజమాయిషీలో నడిపించినట్లు చదువగలము. ఇది దైవజనాంగమునకు దేవుడు కాపరిగా ఉండి జరిగించిన క్రియ.
1. ఆదాము 2. హేబెలు 3. యెహోవా ముగ్గురు కాపరులు - ఇట్టి జనాంగమైన ఇశ్రాయేలుపై దేవుడు ఒక నరుని నాయకునిగా నియమించుటకు సంకల్పించి, యోరేబు అను పరిశుద్ధ పర్వతము మీద ఆయన ఆసీనుడైయుండి, ఆ సమయములో అక్కడ మోషే అను హెబ్రీయుడు తన మామయైన ఇత్రో మందను ఆ పరిసరాలలో మేపుచు, ఆ పర్వతము ఎక్కినప్పుడు అతనికి కల్గిన దర్శనములో ఒక చెట్టు భగభగ మండుచున్నట్లును, ఆ విధముగా మండిన ఆ చెట్టు కాలిపోక ఉండినట్లును, చూచి ఆశ్చర్యపడగా - ఆ మండుచున్న పొద నుండి దేవుడు - హెబ్రీయుడైన యవ్వనుడైన మోషేను తన జనాంగము మీద ఉపకాపరిని అసిస్టెంట్ కాపరిగా నియమించుటకు దేవుడు మోషేను పిలుచుకొన్నాడు. అయితే ఆ సమయములో మోషే యొక్క వృత్తి ఏమిటంటే తన మామ గొర్రెలకు కాపరిగా ఉన్నాడు. ఈ గొర్రెల కాపరియైన మోషేను పిలుచుకొని, తన గొర్రెల మందయైన ఇశ్రాయేలును మేపుటకని తెలుస్తున్నది. ఇశ్రాయేలు అనబడు గొర్రెలను బహు క్రమశిక్షణలో దైవాత్మ నడుపుదలనుబట్టి దైవక్రమములో దైవమార్గములో అనగా సత్య మార్గములో - ఇరుకు మార్గములో కష్టతరమైన మార్గములో శ్రమలతో కూడిన మార్గములో నుండి ఇశ్రాయేలును మరల్చి వారిని దైవపరిధిలో నడిపించి, అనేక మహత్కార్యాలు సూచక క్రియలు చేశాడు. ఆ విధముగా మోషే ఇశ్రాయేలు కాపరియైయుండి అనుభవించిన చేదు అనుభవాలు కోకొల్లలు. మోషే ఏనాడు ఇశ్రాయేలు మధ్య ప్రశాంతముగా జీవించినవాడు కాదు. కాని దైవవాక్కు దైవమందసము ఈ రెంటి ద్వారా వారిని తన దైవ క్రమములో తన పరిధిలో నడిపించాడు. అందుకే కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, ''మంద వలె యోసేపును నడిపించువాడా!'' అని.
ప్రియపాఠకులారా! దేవుడు తన జనాంగాల మీద తన మందిరాల మీద, తన ఆరాధనలలో పాతనిబంధన కాలములో లోకసంబంధమైన కాపరులతోనే తన పరిచర్యకు పిలుచుకొన్నట్లు కొందరి జీవిత చరిత్రలను గూర్చి తెలిసికొందము. మొట్టమొదట ఏదెనుకు కాపరిగా ఆదామును నియమించినప్పుడు అతడు ఆ పదవిని నిలుపుకోలేకపోయాడు. అలాగే దేవుడు అర్పణల మీద లక్ష్యముంచే సందర్భములో గొర్రెల కాపరియైన హేబెలు బలిని లక్ష్యముంచినప్పుడు, దాని ద్వారా హేబెలుకు కల్గిన ఫలితము మరణము. అలాగే దేవుడు తన జనాంగమైన ఇశ్రాయేలుకు కాపరిగా ఉండి తన కాపరత్వములో సహచరునిగా మోషేను ఏర్పరచుకొన్న సందర్భములో - మోషే యొక్క వృత్తి గొర్రెల కాపరిగా ఉన్నట్లు వేదములో చదువగలము. అటుతర్వాత దేవుడు ఇశ్రాయేలుకు ఒక రాజును నియమించాలని సంకల్పించినప్పుడు రాచరికపు హోదా కల్గిన వ్యక్తి ఆ దినాలలో ఇశ్రాయేలులలో లేకపోయినందున గాడిదల కాపరియైన సౌలును ఎన్నుకోగా అతడు తన గాడిదల మంద తప్పిపోయినప్పుడు వాటిని వెదుకుచు వచ్చినప్పుడు సమూయేలుకు దేవుడు దర్శనమిచ్చి ఇశ్రాయేలుకు రాజుగా ఇతనినే నియమించమని, ఇతడేయని బయల్పరచగా సమూయేలు సౌలును అభిషేకించి ఇశ్రాయేలుకు రాజుగా ప్రతిష్టించాడు. అయితే గాడిదల కాపరియైన సౌలు దేవుని ఇల్లయిన ఇశ్రాయేలుపై అనగా దేవుని గొర్రెలను కాచుటలో సౌలు విఫలుడయ్యాడు. కారణము ద్వేషము, అసూయ, కుత్సితము, హత్యా ప్రయత్నము మరియు రాజుగా ఉండి ప్రధాన యాజకునిగ ప్రవర్తించుటన్నది దైవదృష్టికి మహా నేరము అయినందున అతడు రాజ్య భ్రష్టుడయ్యాడు. అతని తర్వాత దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా నియమించబడినవాడు గొర్రెల కాపరియైన దావీదు. ఈయన మహారాజుగాను, కీర్తనాకారునిగాను, ప్రవక్తగాను, వాయిద్య విద్వాంసునిగాను, రచయితగాను, లోకరక్షకుడైన యేసుక్రీస్తు భూమి మీద జన్మించబోయే సందర్భములో ఈయన సంతానములోని స్త్రీ ద్వారానే - ఆ స్త్రీ దేవుని చేతనే ఏర్పాటు చేయబడి ఆయన సంకల్పముతో ప్రవచనానుసారము కన్యకయైన మరియ గర్భములో యేసుక్రీస్తు పుట్టుట మనమెరిగిన విషయమే.
ప్రియపాఠకులారా! ఈ విధముగా కాపరులనే తన యొక్క పరిచర్యకు, తన సేవాధర్మమునకు తన పరిపాలనకు, తన లోకాధిపత్యానికి, తన యొక్క రాజ్య సువార్త సేవలోను దేవుడు వాడి ప్రపంచములో గొర్రెల కాపరికి ఉన్న విలువలను గూర్చి దేవుడు ప్రకటించినట్లుగ పరిశుద్ధ గ్రంథములో గొర్రెల కాపరులు పొందిన ఆధిక్యతలు, వారి జీవితాలలో వారికి కల్గిన ఉన్నతమైన పరిణామాలు ఇందుకు సాక్ష్యాలు. ఆలాగే పాతనిబంధనలో ఈ యొక్క కాపరుల చరిత్ర అంతము కాకపోగా నూతన నిబంధనలో కూడా గొర్రెల కాపరులను గూర్చిన పరమార్థమును సరియైన నిర్వచనము ద్వారా జనబాహుళ్యానికి అందులో క్రైస్తవ విశ్వాసులకు దేవుడు బయల్పరచిన విధానము బహు గొప్పది. ఆది 1:లో ఏ విధముగా కాపరితో వేదము యొక్క పూర్వార్థము ప్రారంభమైందో - అలాగే నూతన నిబంధన వేదములో కూడా ప్రారంభ దశలో కాపరుల ద్వారానే దేవుడు ప్రాధాన్యత నిచ్చినట్లుగా వేదరీత్యా ఈ క్రింది సందర్భమునుబట్టి తెలిసికొందము. బాలయేసును దర్శించినవారిలో మొట్టమొదటగ గొల్లలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ సందర్భములో లూకా 2:8-20 వ్రాయబడిన నూతన నిబంధన వేదభాగములో చదువగలము. చిత్రమేమంటే యేసు ప్రభువును దర్శించిన జ్ఞానులు సాంబ్రాణి, బోళము, బంగారము, వెండి వగైరా ఖరీదైన సామగ్రిని సమర్పించి ఆయనను ఆరాధించారు. యూదా దేశములో బెత్లేహేములో యేసు పుట్టిన తర్వాత వారికి యేసు పుట్టిన వర్తమానము తెలిపినది ఆకాశములోని నక్షత్రము - నక్షత్ర జ్ఞానమునుబట్టి, నక్షత్ర గణాంకమునుబట్టి, నక్షత్ర పుట్టుకనుబట్టి, ఆ నక్షత్ర పూర్వార్థమునుబట్టి జ్ఞానులు మత్తయి 2:1-3లో వలె ''తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి నాటి యెరూషలేము పరిపాలకుడైన హేరోదుతో మాట్లాడుచు, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి, ఆయనను పూజింప వచ్చితిమి; అని అడిగినట్లు వేదములో చదువగలము. జ్ఞానులు అడిగిన ఈ ప్రశ్నకు హేరోదు కలవరపడి అతడును అతనితో ఉన్నవారందరు కలవరపడి ప్రధాన యాజకులను, శాస్త్రజ్ఞులనందరిని సమకూర్చి లోకరీత్యా అనగా లోకజ్ఞానముతో ఆ నక్షత్రమును గూర్చి జ్ఞానులయొక్క ఆగమనమును గూర్చి విచారించుటయేగాక, హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలిసికొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికోగానే, నేనును వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని, కపటోపాయముతో వారిని పంపించి వంచన మాటలతో వారిని మోసగించి, బాలయేసును చంపాలన్న ఆలోచనతో ఉండినట్లు నాటి వేదవాక్యాల సారాంశమైయున్నది.
అయితే ప్రియపాఠకులారా! దేవుడు జ్ఞానులకు నక్షత్రము చూపినను, గొర్రెల కాపరుల పట్ల మాత్రము ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించి, వారి యొద్దకు నక్షత్రాన్ని గాక తన దూతను పంపి క్రీస్తుయొక్క వర్తమానమును గూర్చి ప్రకటింపజేస్తూ - క్రీస్తు జన్మ వృత్తాంతము ఆయన జన్మించిన స్థలము యొక్క విలాసము, జన్మించిన విధానము, వగైరా వివరాలు వివరముగా దూత చేత ప్రకటింపజేసినప్పుడు జ్ఞానులు నక్షత్రము మార్గములో గాక వక్రమార్గములో అడ్డదారులలో ప్రవేశించి, నానావిధ అవాంతరాలను ఎదుర్కొన్న జ్ఞానులు ఎంతోశ్రమలు అనుభవించి, అనగా నక్షత్ర మార్గము గాక లోకమార్గమునుబట్టి వారి యొక్క గమనాన్ని సాగించగా నక్షత్రము వారికి సరియైన మార్గాన్ని చూపిస్తూ - యేసు పుట్టిన స్థలమును చూపించుటన్నది మనమెరిగిన విషయమే; ఈ విధముగా యేసును దర్శించిన జ్ఞానులు ఆయనను ఆరాధించారు. అయితే దేవదూత చేత బోధించబడిన గొర్రెల కాపరులు తమ మందలను తోలుకొని రాత్రివేళ వాహనాల మీద గాక, కాలినడకతోనే దావీదు పురములో ప్రవేశించి బాలయేసును దర్శించి, ఆయనను స్తుతించి, కీర్తించి స్తోత్ర గాన ప్రతిగానాలతో ఆయనను గూర్చి ఆలాపించి, సంతోషచిత్తులై బాలయేసు దర్శన భాగ్యము ద్వారా తమ జన్మను ధన్యవంతము చేసికొన్నట్లు నాటి చరిత్ర తెలుపుచున్నది.
ప్రియపాఠకులారా! క్రీస్తును ఆరాధించుటలో రెండు విధాలైన వర్గాలు రెండు విధాలైన రీతులలో ప్రవేశించినట్లుగా ఇందులో మనము తెలిసికొంటే, జ్ఞానులు ఒంటెల మీద ఐశ్వర్యముతో ప్రయాణించారు. గొర్రెల కాపరులు కాలినడకన లేమితో ప్రయాణించి లేమితోనే ప్రభువును స్తుతించి కీర్తించారు. అందుకే నేటి యుగములో విజ్ఞానమన్నది నానావిధాలుగ నాలుకలు చాపి క్రియ జరిగించి నరులయొక్క జీవితాలలో ఎన్నో మలుపులను త్రిప్పి, లోకములో నరుడు జీవించుటకు అనేక విధములైనటువంటి వనరులు ఏర్పరచినను పరిశుద్ధ గ్రంథములో వివరించినట్లుగ నేటికిని లోకములో కాపరత్వమన్నది ప్రధానత్వము వహించియున్నది. దైవత్వంలో దేవుడు కాపరులను నానారీతులుగ నియమించియున్నట్లుగ లోకము అపవాది ఇరువురును ఏకమై నరజీవితమును దైవత్వములోకి ప్రవేశించకుండ దైవత్వముతో ఏకీభవించకుండ, దైవవలయములో చేరకుండ చేయుటకు అపవాది నిషేధఫలమును భుజించుటనుబట్టియు, భూసంబంధమైన మట్టితో నరనిర్మాణము జరుగుటనుబట్టి సర్ప ఉపదేశము ద్వారా నరులను దైవత్వము నుండి తప్పించిన అపవాదియు - నాటి నుండి నేటి వరకును దైవత్వములో సమఉజ్జీవముగా దేవుడు ఏ విధముగా తన దూతలను తన ఆత్మను, తన ప్రసన్నతను కాపరిగా ఉంచియున్నాడో - అలాగే లోకమును లోకనాధులైన అపవాదియు ఏకమై నరజీవితములో లోకరీత్యా కొందరి కాపరులను ఏర్పరచియున్నారు. ఈ కాపరత్వము రెండు విధాలు. 1. భూసంబంధము 2. అపవాది సంబంధమైనది. మొట్టమొదట భూసంబంధమైన దాన్ని గూర్చి మనము తెలిసికొందము.
ప్రియపాఠకులారా! ఆది 19లో లోతు కుటుంబము దేవునియొక్క ఆజ్ఞను బట్టి దేవదూతల కాపుదలతో సొదొమ పట్టణాన్ని వదలి వచ్చు సందర్భములో - లోకమన్నది తన సంపద ద్వారా లోతు భార్యను ఆకర్షించి, లోతు - లోతు కుమార్తెలు సొదొమ గవిని దాటినను లోతు భార్యను దాటకుండునట్లుగ లోకమన్నది కాపు గాచి, లోతు భార్యను లోకము వైపు చూచే హీనస్థితిని దిగజార్చింది. ఇందునుబట్టి లోకవ్యామోహముతో వెనుదిరిగి దైవశాపమునకు గురియై ఉప్పు స్థంభముగా మారినట్లు ఈ వేదభాగములో మనము చదువగలము. అలాగే ఎలీషా యొక్క ఆత్మీయ జీవితమునకు దేవునియొక్క ఆత్మ కాపుదలగా ఉండి, లోకసంబంధమైన వాటిని గూర్చి లోకసంబంధమైన భద్రతను గూర్చి అతని జీవితాన్ని ప్రభావితము చేసింది. అయితే ఎలీషా నిషేధించిన లోకసంబంధమైన సంపదన్నది ఎలీషా సావాసము నుండి తప్పించి తన ఆశావ్యామోహమును కాపుదలగా గేహాజీ యొక్క మానసిక స్థితిని తారుమారు జేసి, నయమాను యొక్క కానుకలను ఆశించినట్లుగా జేసి, ఆ విధముగా ఆశించుటయేగాక ఎలీషాకు తెలియకుండ వాటిని తన గృహానికి చేర్చుకొన్నంతలో దేవునియొక్క ఆత్మ గేహాజీ చేసిన కార్యాన్ని గూర్చి విమర్శింపజేసి, ఎలీషా యొక్క శాపమూలముగా నయమాను నుండి తొలగిపోయిన కుష్టురోగము నయమాను ఇచ్చిన కానుకల ద్వారా గేహాజీ గృహములో ఉన్నందున, నయమానును వదలిపోయిన కుష్టురోగము గేహాజి యొక్క జీవితానికి తీరని కాపరియైనట్లుగా గేహాజీని ఎలీషా శాసించిన విధానములో - ఐశ్వర్యము సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును - నీ ఇంటి సంతతి వారికిని సర్వకాలము జీవిత పర్యంతము కాపలాగా ఉండును. 2వ రాజులు 5:26-27.
నూతన నిబంధనలో అననీయ సప్పీరాల యొక్క జీవితాలలో వారు తమ స్వంత పొలాన్ని అమ్ముకొని దేవునికి ఇస్తామని అనవసరపు మ్రొక్కు మ్రొక్కుకొని, ఆ మ్రొక్కుబడి చెల్లించు సందర్భములో భూలోకము వారిని ఆకర్షించి వారిని తన క్రమములో ఉంచుటకు, వారిని అపొస్తలుల ఎదుట అపవాదితో ఏకమై అబద్ధము మాట్లాడించింది. భూమి అపవాది జరిగించిన క్రియ వారి మరణానికి కారకములైనవి. ఆలాగే యేసుక్రీస్తు శిష్యుడైన యూదాను లోకసంబంధమైన ధనాశన్నది యూదాను మభ్యపెట్టి, ధనాశతోబాటు ప్రభువు పాత్రలో ముంచి ఇచ్చిన రొట్టె ద్వారా యూదాలో ప్రవేశించి, అపవాది ఇరువురు వానియొక్క ఆత్మీయ జీవితములో దైవకాపుదల లేకుండ చేశాయి. ఇందునుబట్టి పై రెండు సంఘటనలలో భూమి, అపవాది ఇరువురును వారియొక్క అధీనములో నరులయొక్క ఆత్మీయ జీవితాన్ని ఉంచుకొని, దైవత్వమునకు చెందవలసిన ఆత్మను దైవత్వమునకు చెందనీయక చేయుటయేగాక, వాటిని పాతాళ వశము చేయుటకు కాపరులుగా క్రియ జరిగిస్తున్నట్లుగా ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది.
కనుక ప్రియపాఠకులారా! భూలోకములో కాపరులుగా ఉన్నవారిని లోకము చిన్న చూపు చూస్తున్నది. లోకరీత్యా కాపలాదారు ఉద్యోగము వృత్తులలో ఉన్న వ్యక్తిని ఎవరును గుర్తించరు. అతనికెలాంటి ప్రాధాన్యత లేదు. ఎందుకంటే అతనిని ప్రధాన ఉద్యోగిగాని, గుర్తింపు గల్గిన వ్యక్తిగాగాని ఒక పెద్ద వ్యక్తిగాగాని లోకస్థులు గుర్తించరు. అయితే ఆత్మీయముగా కాపరికి ఉన్న విలువలు చాలా గొప్పవి. దేవునియొక్క దృష్టి పరిశుద్ధ గ్రంథములో రాజుల మీదను, నాయకుల మీదను, ప్రధానులు, మత ప్రవిష్టులు, వేదాంతులు గొప్ప అంతస్థులు పేరు ప్రఖ్యాతులున్న వారి మీద గాక, కేవలము కాపరులనుగూర్చి దైవత్వమన్నది ప్రాధాన్యతను ఇచ్చినట్లు వేదములో చదువగలము. యెషయా గ్రంథములో కావలివాడా! రాత్రి ఎంత వేళైనది? అని కావలివానిని ప్రశ్నించినట్లుగా కూడా చదువగలము. అలాగే దైవనిషేధ ఫలమును భక్షించి చెట్లచాటున దాగిన ఆదామును దేవుడు ఆదామా! నీవు ఎక్కడ ఉన్నావు? అని ప్రశ్నించాడు. అంటే ఆదాము ఉండవలసిన స్థితి దేవుడు ఉంచిన స్థితి ఏమిటో? ఆదాముకు దేవుడు చెప్పుచున్నాడు. నిన్ను నా పరిశుద్ధ వనములో కాపరిగా ఉంచినాను కదా! ఎంతవరకు కాపాడుకున్నావని దాని భావము. అలాగే ఐగుప్తీయుని చంపి గొర్రెలకు కాపరియైన మోషేను దేవుడు - మోషే! మోషే! అని పిలిచి, లోకరీత్యా గొర్రెలు కాచే మోషేను తన మందయైన జనాంగము మీద కాపరిగా నియమించినట్లు మోషే చరిత్ర వివరిస్తున్నది. అలాగే గాడిదల కాపరియైన సౌలును ఇశ్రాయేలుకు తొలిరాజుగా నియమించగా అతడు గాడిదల కాపరిగా ఉండి, గాడిదల విషయములో పాటించిన శ్రద్ధ, ఇశ్రాయేలీయులను దైవజనాంగము విషయములో పాటించలేకపోయాడు. అందువలన గాడిదల కాపరిగా ఉండి ఇశ్రాయేలు కాపరిగా ఉన్న సౌలు యొక్క శారీర ఆత్మీయ జీవితాలకు, యెహోవా యొద్ద నుండి వచ్చిన దురాత్మ కాపరియై సౌలును మరణావస్థకు నడిపించింది. అలాగే దావీదు విషయములో కూడా దావీదు గొర్రెల కాపరిగా ఉండగా దేవుడు తన మందను కాయుటకు అభిషేకించి ప్రతిష్టించాడు. దావీదు కూడా అలాగే దైవసన్నిధిలో ఎంతో వినయ విధేయతలతో తన రాచరికాన్ని సాగిస్తుండగా 'అపవాది - స్త్రీ రూపము, అతనిని అతని ఆత్మీయ జీవితాన్ని పాడుజేసి, దైవత్వము నుండి తమ కాపుదలలోకి ఈడ్చి నరహత్య వలన మానభంగమను రెండు విధులకు దావీదు జీవితాన్ని ప్రవేశింపజేసి భ్రష్టునిగ చేశాయి.
ఇక నూతన నిబంధనలో యేసుప్రభువు చెప్పిన ఉపమానములో లూకా 15:11 ఒక తండ్రికి ఉన్న ఇద్దరు కుమారులలో తండ్రి అల్లారుముద్దుగా పెంచిన చిన్న కుమారుని జీవితములో ధనవ్యామోహము, దుష్టసాంగత్యము అన్నది చిన్న కుమారుని పట్ల తీవ్రముగా క్రియ జరిగించి, తండ్రి యొక్క చిరచర ఆస్థులపై వారసుడుగా జీవించాల్చిన కుమారుని యొక్క జీవితాన్ని భ్రష్టు పట్టించి, వాడిని పందుల కాపరిగా చేసినట్లు వేదములో చదువగలము.
కనుక ప్రియపాఠకులారా! దైవత్వములో దైవవేదములో దైవ సామ్రాజ్యములో - దైవ ప్రభుత్వములో కాపరత్వమన్నది చాలా ప్రాముఖ్యత సంతరించుకొన్నట్లుగ గ్రహించవలసియున్నది. అందుకే పరిశుద్ధ గ్రంథములో కాపరులుగా ఉన్నవారిని గూర్చి చాలా హెచ్చరికలున్నాయి. సంఘము యొక్క అభివృద్ధిగాని, సంఘప్రతిష్టతగాని, సంఘము యొక్క విలువలుగాని, మనుగడగాని, నడుపుదలగాని, సంఘము యొక్క సేవా కార్యక్రమాలుగాని, సంఘము యొక్క ఫలభరిత జీవితానికి సంఘకాపరి యొక్క వ్యక్తిత్వము, ఆత్మీయ స్థితి చాలా ప్రాముఖ్యమైయున్నది. ఇందునుగూర్చి 1 తిమోతి 3:1-7 వ్రాయబడిన లేఖన భాగములో సంఘకాపరి పాటించాల్సిన విధులు, నియమాలు, జాగ్రత్తలు, నడవడిక, ప్రవర్తన, ఆత్మీయ స్వభావ సిద్ధముగా ఉండవలసిన విధము, సమస్తము వ్రాయబడి యున్నది. మరియు అపొ 20:28లో ఈ విధముగా వ్రాయబడియున్నది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగ ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి,'' అని హెచ్చరిస్తున్నాడు.
కనుక ప్రియపాఠకులారా! అంతేగాకుండ ఎఫెసీ 5:23 క్రీస్తు సంఘమునకు శిరస్సయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయి ఉన్నాడు. అలాగే క్రీస్తు సంఘమునకు శిరస్సయియుండగా సంఘకాపరి కూడా సంఘానికి శిరస్సయియున్నట్లుగా ప్రతి విషయములోను కలతలు, విమర్శలు, విభేధములు, కక్షలు అలాంటివి మరేమియు లేకుండ సంఘమును సమాధానకరమైన స్థితిలో ప్రతి విషయములోను వివాదము లేకుండ ఏర్పడే ప్రతి సమస్యను, తానే పరిష్కరిస్తూ సంఘమును దైవత్వముతో నడిపించువాడే నిజమైన సంఘకాపరి.
ప్రియపాఠకులారా! సంఘకాపరులనుగూర్చి యేసుక్రీస్తు స్వయముగా మాట్లాడిన మాటలు యోహాను 10:11-13 నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెలకాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. ఇంకను అనేక సంగతులు నూతన నిబంధనలో కాపరులను గూర్చి వ్రాయబడియున్నది. పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలోను, నూతన నిబంధనలోను దైవజనాంగము గొర్రెలుగాను, దైవజనాంగమును పాలించువారు కాపరులుగాను ప్రవచించినట్లు వేదములో చదువగలము. ఇందులో రాజులని, ప్రధానులని, విద్యావంతులని, పండితులని, పామరులని, ధనికులని, దరిద్రులని భేధము లేదు. మొట్టమొదటగా దేవుడు తన జనాంగమైన ఇశ్రాయేలును గూర్చి తన ప్రవక్తల నోట ప్రవచించిన విధానాన్ని గూర్చి తెలిసికొందము. ఇందులో 80వ కీర్తనలో ఇందునుగూర్చి కీర్తనాకారుడు ప్రవచిస్తూ ఇశ్రాయేలు కాపరి చెవి యొగ్గుము, మంద వలె యోసేపును నడిపించువాడా! అని ప్రవచించి యున్నాడు. అనగా 23వ కీర్తనలో ''యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు.''
ప్రియపాఠకులారా! పై మాటలు గొర్రెల కాపరికి గొర్రెలకున్న అనుబంధాన్ని గూర్చి వ్రాయబడి యున్నది. కనుక దేవుడు గొర్రెల కాపరిగాను, ఆయన బిడ్డలమైన మనము గొర్రెల మందగాను వేదములోని ప్రవచనాలు వివరిస్తున్నాయి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. ప్రతివాడును తనకిష్టమైన త్రోవలలో తొలగిపోయెనని మరియొక సందర్భములో వ్రాయబడియున్నది. ఈ విధముగా వేదము వరకే గొర్రెలు - గొర్రెల కాపరి అన్న వచనాలు పరిమితము కాకుండ లోకములో కూడా ఈ గొర్రెలు - గొర్రెల కాపరులు కావలసిన విభజన యేసుక్రీస్తు ప్రభువు మత్తయి 25:31-33లో ఈ విధముగా వ్రాయబడి యున్నది, ''తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడైయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి, తన కుడి వైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలువబెట్టును.''
ప్రియపాఠకులారా! ఇందునుగూర్చి 1 పేతురు పత్రిక 5:4లో పేతురు ప్రవచనము ఈలాగున్నది. అదేమనగా 'ప్రధాన కాపరి - ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురని వ్రాయబడియున్నది. ఈ మహిమ కిరీటము ఏదనగా ప్రభువు రెండవ రాకడలో యేసుక్రీస్తు ఆయనతో కూడా సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనమును మీద కూర్చుండి యున్నప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడినప్పుడు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచినప్పుడు, తన కుడివైపున ఉన్న గొర్రెలను అనగా యేసుక్రీస్తు కాపరత్వములో ఆయన రక్షణలో ఆయన పరిధిలో - ఆయన సహవాసములో ఆయన ఆత్మీయతలో వారిలో ఆయన - ఆయనలో వారు, ఏకమైయున్న జీవితము వంటివారే ఈ కుడి వైపున ఉన్న గొర్రెలు - గొర్రెలుగా ప్రభువు చేత నిర్ధారించబడినవారు. వీరికి తన మహిమ కిరీటము ధరింపచేస్తాడని పేతురు పత్రికలో వ్రాయబడియున్నది. ఎందుకనగా దైవకుమారుడైన క్రీస్తుయొక్క ఆగమనము అన్నది మహిమతో కూడింది అని ఇచ్చట వ్రాయబడియున్నది. అంటే తన మహిమతో మనుష్యకుమారుడు ఆయనతో సమస్త దూతలు వీరందరు ఆయన మహిమతో వచ్చునప్పుడు, కుడివైపున నున్న గొర్రెలైన క్రైస్తవ విశ్వాసులైన జనాంగమునకు ఆయన ధరింపజేసేది, మహిమ కిరీటము. ఈ మహిమ కిరీటము క్షయము కానిది, వాడబారనిది, పాతగిల్లనది, తళతళ మెరిసే నానారత్నాలు, ముత్యాలు, మాణిక్యాలు, అన్నిటికంటె ముఖ్యముగా దేవుని మహిమను కల్గినదైయుండి, దానిని ధరించుకొన్నవారికి దేహసంబంధమైన ఆకలిదప్పులు గాని, దేహసంబంధమైన అవసరతలు, చింతనలుగాని, సమస్యలుగాని, భయములుగాని, అరిష్టాలుగాని, ఉపద్రవాలుగాని, తుదకు మరణముగాని లేకుండ చిరకాలము నిత్యజీవులై, ప్రధాన కాపరియైన క్రీస్తుతో ఆయన ఏలుబడిలో ఆయన కుడి పార్శ్వమున ఎల్లవేళలు చిరకాలము జీవిస్తారని ఇందులోని భావము.
ప్రియపాఠకులారా! మత్తయి 25:31-33 ప్రభువు చెప్పిన ఉపమానములో గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు,'' అనుటలో గొర్రెలకాపరి ఒక్కడే. ఆలాగే క్రైస్తవసంఘము ఒక్కటే. క్రైస్తవ మందను, క్రైస్తవ కూటమిని, గొర్రెల మందకు మాదిరియైయుండగా గొర్రెల మందలో రెండు విధములైన జీవములున్నట్లుగా, క్రైస్తవ మందలో రెండు విధములైన గుణములు, స్వభావములు గల సభ్యులుంటారు. ఇందులో మొట్టమొదట గొర్రెలు ఆత్మ సంబంధులు. వీరు ప్రభువు యొక్క నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ అనేకులకు మాదిరిగాను, క్రీస్తుకు యోగ్యముగాను, దైవత్వమునకు మహిమకరముగాను, వాక్యమందును, ప్రార్థన చేయుటయందును నిలుకడగాను, క్రమము తప్పనివారుగాను ఉండి ప్రభువునకు తండ్రియైన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి యోగ్యకరమైన జీవితములో వారి మహిమను పొందే అర్హతను కలిగి, ఆత్మ వరమును పొంది, నానావిధ దర్శనము ద్వారాను, స్వప్నముల ద్వారాను, దైవప్రణాళికనుగూర్చి తెలిసికొన్నవారై గొర్రెలను పోలిన స్వభావము ధరించుకొని, గొర్రెల వలె అమాయికులుగాను, లోకమునకును లోకసంబంధమైన వాటికిని దూరులై, తమ ఆత్మీయ జీవితము శారీర జీవితాన్ని దైవత్వమునకు సమర్పించుకొని జీవించువారు. వీరు ప్రభువు రాకడలో ఆయన కుడివైపు నిలువబెట్టునప్పుడు గొర్రెలకు సమతుల్యులు.
ఇక మేకలు వీరు దైవకుమారుడైన ప్రధాన కాపరియైన యేసుక్రీస్తు ఎడమవైపు నిలబడేవారు. వీరు మేకలుగ ప్రభువు వాక్యము ప్రవచిస్తున్నది. వీరు క్రైస్తవులుగానే ఉంటూ ఆరాధనలో మందిర ప్రవేశము చేయుటలో క్రైస్తవులమని ప్రకటించుకొంటూ క్రీస్తు మార్గమును అనుసరిస్తున్నట్లే కనబడుచు వేరొక మార్గాన్ని, ఆత్మీయ మార్గము వదలి లోకసంబంధ మార్గాలలో లోకస్థులతో లోక ఐశ్వర్యాలతో లోక భోగభాగ్యాలతో లోకసంబంధమైన పదవులతోను, అన్యుల సిద్ధాంతాలతోను, వారి సావాసములోను, వారి యొక్క కూటములలో సత్కరించబడుచు, లోకసంబంధమైన ప్రభుత్వాలలో క్రీస్తును మభ్యపెట్టి తాము క్రైస్తవులమైనను ఏ దేవుడైనను ఒక్కడే; ఆయన ఏ మతస్థులకైనను ఆయన అన్నిమతాలలోను ఉన్నను, క్రైస్తవులకని, హైందవులకని, మహమ్మదీయులకని ప్రత్యేకముగా దేవుడు లేడని, ఏ పేరుతో పిలిచినను ఒక్కటేనని అన్యులతో కలిసిపోయి క్రీస్తును అవమానించే రకాలు. ఇట్టివారికి నిలుకడయైన స్థిర విశ్వాసము ఉండదు. వీరు చపలచిత్తులై అన్యులతో సాంగత్యము, క్రైస్తవ మందిరాలలో పదవులు, లోకరాజ్య పరిపాలనలో రాజ్యపదవుల కోసము ప్రాకులాట. ఈ ప్రాకులాటలో నానావిధమైన అన్యుల సిద్ధాంతాలను అవలంభించుట, వగైరా విధాలుగా నానావిధమైన రూపాంతరాలలో క్రైస్తవులను మోసగించినను, క్రీస్తును మోసగించలేరు. కనుక ఇట్టివారికి నియమించబడిన స్థలము మనుష్యకుమారునికి ఎడమ వైపు స్థానము. ఈ స్థానము అపవాదికిని, అతని దూతలకును సిద్ధపరచబడిన నరకాగ్ని గుండము. ఇది మేకలకు సిద్ధపరచబడిన స్థలము.
అయితే యేసుక్రీస్తు కుడివైపున ఉన్నవారికి మహిమ కిరీటమేగాక కీర్తన 23:1-3లో వివరించ బడినట్లు ''యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. పచ్చిక గల స్థలము దేవునియొక్క కాపరత్వము.'' పచ్చికగల స్థలము అనగా ఆకలిదప్పులు లేని వాతావరణము, ప్రశాంతమైన జలము అనగా దేవుడు ఇచ్చే ఆత్మీయ జీవజలము మరియు ఇట్టి స్థలములో శాంతి సమాధానము, నిత్యజీవము ఉంటుందని భావము. ఇది ప్రభువు రాకడలో కుడి ఎడమల స్థానములలో ఉన్నట్టి పరమ రహస్యము. ఈ స్థానములలో క్రైస్తవ విశ్వాసులకు, నామక్రైస్తవులకును, క్రీస్తును విసర్జించినవారికిని జరుగబోవు తీర్పును గూర్చిన ఉపమానము. ప్రియపాఠకులారా! ఇందునుబట్టి కాపరి ఒక్కడే, కాని కాపరి మేపే గొర్రెల గుంపులో రెండు విధములైన జంతుగుణాలున్నవి. 1. గొర్రెబుద్ధి 2. మేక బుద్ధి. గొర్రెలు మేకలు కలిసి మందగా ఉన్నను గొల్లవాడు ఒక్కడే. అలాగే క్రైస్తవ సంఘాలలో విశ్వాసులు, అవిశ్వాసులు ఉన్నను సంఘానికి కాపరి ఒక్కడే; ఒక్క కాపరి యొక్క కాపుదలలోనే గొర్రెల మంద పోషింపబడుచున్నది. ఆదిలో ఇశ్రాయేలీయుల గొర్రెల గుంపులో కూడా రెండు తెగలవారున్నట్లుగా వేదరీత్యా 1. హెబ్రీయుడు
2. యూదుడు 3. అన్యుడు. ఇశ్రాయేలులకు దేవుడు కాపరియైనప్పటికిని ఇశ్రాయేలీయులు దైవత్వమును విసర్జించి, అన్యుల మార్గమైన ఐగుప్తు మార్గములో నడచుటనుబట్టి వారి ఆచారాలను పాటించుటనుబట్టి వారియొక్క సంపద, ఆహార విలువలను పాటించుటనుబట్టి దేవుడు వారిని ఐగుప్తుకు అప్పగించినట్లు వేదములో చదువగలము. ఈ విధముగా దేవునియొక్క కాపుదలలో ఉన్న ఇశ్రాయేలీయులు అన్యుల కాపరియైన అపవాది యొక్క కాపుదలలో చేరి మేకల వంటి చంచల స్థితికి దిగజారి నానావిధ శ్రమలకు, శిక్షలకును, వేదనలకును గురి అయ్యారు. అంతేగాకుండ దేవుని చేత శిక్షించబడిన చేదు అనుభవాలు అనుభవించారు.
కనుక ప్రియపాఠకులారా! నేడు క్రైస్తవ సంఘమను దొడ్డిలో క్రీస్తు అను గొర్రెల కాపరియొక్క కాపరత్వములో పోషింపబడుచున్న మనము ఆయన పచ్చిక అను ఆహారమును, ప్రార్థన జీవజలముతోను ఆయన సిద్ధాంతమను చేతి కర్రతోను, క్రమశిక్షణతో జీవిస్తున్న మనకు యోహాను 14:6లో వలె యేసే మార్గము, సత్యము, జీవము అని గ్రహించాలి. ఈయనయే మన ప్రధాన కాపరి. సంఘము ఏ పేరు పెట్టుకున్నను ఆ సంఘము మాత్రము క్రీస్తుది. క్రైస్తవ మందిరానికి ఏ పేరు పెట్టబడినను అందులో జరుగు ఆరాధన క్రీస్తు సంబంధమైనదే.
కనుక నేటి క్రైస్తవ సంఘాల గొర్రెల మందకును సంఘమునకు శిరస్సయియున్న క్రీస్తు గొర్రెల కాపరిగాను నిర్ధారించబడి యున్నందున ప్రధాన కాపరియైన క్రీస్తునుబట్టి దేవుడు సంఘములోని వ్యక్తులను విభజించిన విధానమును గూర్చి 1 కొరింథీ 12:8 కొందరిని కాపరులుగాను, కొందరిని ప్రవచించువారుగాను, కొందరిని సువార్తీకులుగాను, కొందరిని ఉపదేశకులుగాను ఎఫెసీ 4:13లో వలె నియమించియున్నాడు. ఈ విధముగా సంఘకాపరులయొక్క నియామకము క్రీస్తు సంబంధమైయున్నది, అనగా వీరు క్రీస్తునకు మాదిరి. వీరు అన్ని విషయాలలో క్రీస్తును బోలి నడుచు కోవలసినవారై యున్నారు. ఇది పరిశుద్ధ గ్రంథములో కాపరుల యొక్క విలువలు - ఉన్నత విలువలను గూర్చి వ్రాయబడిన వివరణయైయున్నది.
...........
పుష్పవతిని గూర్చి యెహెజ్కేలు 16:1-14. చావును గూర్చి సంఖ్యా కాండము 19:11-13.
హృదయ పరిశోధన యిర్మీయా 17:9-10. భోగి : సంక్రాంతి పండుగలు లేవీయ కాండము 23:5-8.
తీర్పు రోమా 2:1-6.
నీతిమంతుని గూర్చి రోమా 3:11-19. శరీరాత్మల సంబంధము (మరణము) రోమా 8:1-9.
శరీరాత్మల ఋణానుబంధం రోమా 8:12-17. ఆత్మీయముగా చనిపోవుట ఫఫెసీ 2:1-10.
నిష్ట ఆచారములు 1 తిమోతి 4:3-5.
2వ కొరింథీ 5:1-10 క్రీస్తు న్యాయపీఠము, సంఘ అధ్యక్షులు, పాస్టర్లు, కార్యకర్తలు బోధకులు, ప్రవక్తలు ఉండవలసిన జాగ్రత్తను గూర్చి హెచ్చరిక.
1వ తిమోతి 3:1 నుండి మన దేవుడు ఎటువంటివాడు? యిర్మీయా 17:9-10. ద్వితీయోపదేశకాండము 5:9-10.
ఇప్పుడు మనమెట్లున్నాము ఎఫెసీ 2:1-10.
అయితే మనము ఎట్లుండవలెను? ద్వితియోపదేశకాండము 7:12-16.
భాషాభేధము అనగా భాషలను బట్టి వ్యక్తులను గౌరవించుట ఎచ్చట నుండి పుట్టినది? ఆదికాండము 11:14.
తీర్పు రోమా 2:1-6. మరణమును గూర్చి ఫలితము రోమా 6-11.
అయితే మనము ఎవరి వారసులము? రోమా 8:12-17
భార్యాభర్తలు ఒకరి పట్ల మరియొకరు ప్రవర్తించవలసిన విధము. ఎఫెసీయు 5:22-33
తారాబలము - జాతకము
తారాబలము జాతక లగ్నములు క్రైస్తవులకు ఉన్నదా? అయితే క్రీస్తు జన్మ నక్షత్రము సాధించిన ఘనవిజయమెట్టిది? క్రీస్తు ఈ లోకములో పుట్టక మునుపు అనగా మరియ గర్భవతిగా యున్నప్పుడు లూకా 1:30-33, మత్తయి 1:21 - వాక్యములు చదివితే దేవదూత మరియమ్మకు తెల్పిన వర్తమానము క్రీస్తు పట్ల జాతకముగా నెరవేరినది. క్రీస్తు జన్మకాలములో తారాబల జాతక శాస్త్రములు ప్రగతిని సాధించగా అపవాది తన కుతంత్రముల చేత శాస్త్రులను, సిద్ధాంతులను ఏర్పరచి, తానే తన జ్ఞానములో వారిని నడిపిస్తూ తప్పుడు దారి పట్టిస్తూ - లేనిపోని అవినీతి అసత్య క్రియలను జరిపిస్తున్నాడు. నక్షత్ర విలువ (తారాబలము) నెరిగిన వారలు జ్ఞానులు; దానిని గూర్చి పరిష్కారముగా తెలిసి విశ్వసించినవాడు హేరోదు చక్రవర్తి. ఈ సందర్భమున మత్తయి 2:2-8 తరువాత మత్తయి 2:10-12 మరియు క్రీస్తు తన రాకడను గూర్చి తెలిసిన వర్తమానమును నెరవేరునా?
మత్తయి 24:6-10 మరియు 29-31 దైవ వాక్యములలో భూలోకము యొక్క భవిష్యత్ మానవుని భవిష్యత్ గూర్చి క్రీస్తు చెప్పిన జాతకమును తెలుసుకొనవచ్చును.
నరులను నమ్మువాని గతి. యిర్మీయా 17:5. హృదయమును గూర్చి యిర్మీయా 19-10.
రోమా 1:24 రోమా 10:8-9. మారుమనస్సు. ప్రకటన 3:1-3.
3:15-20 హెబ్రీ 1:1-7
దినములు, వారములు, నెలలు, సంవత్సరములు, ఉత్సవములు, తిరునాళ్ళు మున్నగు భూలోక సాంగ్యములు పాటించుటను గూర్చి హెచ్చరిక : గలతీ 4:10-11.
మృతులను గూర్చి :- ప్రకటనలు 14:13 మరియు 22:12
అపొస్తలుల కార్యములు 16:27-34 రక్షణ మార్గము, ప్రార్థనను గూర్చి హెచ్చరికలు.
మత్తయి 6:5-8, అధిక ప్రార్థన వ్యర్థము. మృతుని తీర్పు రోమా 6:8, యోహాను 5:24, యోహాను 3:36, రోమా 8:1.
క్రీస్తు మన కొరకు శాపగ్రాహియై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందునుగూర్చి గలతీ 4:14, మరణమును విశ్రాంతిగా దేవుడు ఏర్పరచియున్నాడు. ఈ సందర్భమున 4:9-12 క్రీస్తును గూర్చిన అభిప్రాయము :- 1. ఆదరణకర్త 2. పరిశుద్ధాత్మ 3. మనకు దేవునికి మధ్య ఉత్తరవాది 4. యేసుక్రీస్తు 5. పాపరక్షకుడు 6. సర్వశక్తిగల దేవుడు.
........
ఫిలిప్పీ 1:1, ఫిలిప్పీలో ఉన్న క్రీసుయేసు నందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకు క్రీస్తుయేసు దాసులైన పౌలును, తిమోతియు శుభమని చెప్పి వ్రాయునది :-
ప్రియపాఠకులారా! లోగా పరిశుద్ధ గ్రంథములోని ఎన్నో విషయాలను మనము తెలిసికొని యున్నాము. పాతనిబంధనలో అపొస్తలుల కార్యములు అను గ్రంథములో ఎన్నో మర్మాలు దాగియున్నట్లుగా అక్కడక్కడ మనము చదివియున్నాము, గ్రహించియున్నాము. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘమునకు వ్రాసిన లేఖలో మొట్టమొదటి అధ్యాయము మొట్టమొదటి మాట - ఈ మాటలో ఫిలిప్పీయ సంఘమునకు శుభవచనములతో వ్రాసిన ఈ మాట మూడు విధములైనటువంటి అనగా సంఘములో మూడు ప్రధాన పాత్రలు వహించియున్న పెద్దలకు పౌలును, తిమోతియు వ్రాసిన ఈ మాటలోని పరమార్థమును గూర్చి తెలిసికొందము. ఇందులో మొట్టమొదటిది :- క్రీసుయేసు నందలి సకల పరిశుద్ధులకు అనగా వీరెవరు? క్రీస్తుయేసునందు పరిశుద్ధులుగా లేనివారికి పౌలు తిమోతికి వ్రాసిన శుభవచనము యోగ్యము కాదా? అనిన విషయాన్ని మనము తెలిసికొనవలసియున్నది.
ప్రియపాఠకులారా! క్రీస్తుకు ముందు అనగా పాతనిబంధన కాలములోను దానికి ముందు సృష్టి కాలములోను దేవుని యొద్ద వాక్యము ఉన్న కాలములో - దేవునియొక్క వాక్యమే సృష్టిని, ప్రకృతిని; సృష్టిలోని జంతుపశుపక్షి మృగ జాతులను, అటుతర్వాత ఆదినరజంటను పరిశుద్ధులుగ ఉంచినట్లు ఆదికాండము మొదటి రెండు అధ్యాయాలలో మనము చదువగలము. ఆదినరజంట దేవునియందు పరిశుద్ధులు - తండ్రియైన దేవునిలో పవిత్రులుగా సృష్టింపబడినవారు. కాని వీరి పవిత్రతను వీరు కాపాడుకోలేకపోయారు. అందునుబట్టి దేవుడు సరియైన లిపి, అక్షరాస్యత లేని ఆ కాలములో బలుల ద్వారా దేవుడు నరులను పరిశుద్ధులుగా జేసినట్లుగా కూడా నరులర్పించిన బలులయొక్క చరిత్ర నిరూపిస్తున్నది. ఇందులో హానోకు యొక్క ఆత్మీయ జీవితము దేవునితో కొనిపోబడే యోగ్యతను కల్గించింది. విశ్వాసమునుబట్టి అబ్రాహాము తన కుమార బలి ద్వారా యదార్థునిగా దేవుని ఎదుట ఎన్నిక చేయబడి పరిశుద్ధుడుగా ఎంచబడినాడు. అట్లే మోషే దైవజనాంగానికి నాయకుడుగా ఎన్నిక చేయబడినాడు. ఇది ఆది చరిత్ర. అటు తర్వాత మోషే కాలములో దేవుడు ధర్మశాస్త్రము ద్వారా పరిశుద్ధులుగా చేయాలని సంకల్పించి మోషేకు శాసనాలుగా ఱాతిపలకలనిచ్చాడు. అందులో కూడా నరులు తప్పుటడుగులు వేశారు.
ఇక ఆఖరుగా దేవుడు తానే కుమారత్వమును ధరించి తనలో సకల జనులు పరిశుద్ధులుగ జీవించాలని ఉద్దేశించి తనకు తానే బలిగా అర్పించుకొని, తద్వారా క్రైస్తవులు అను పరిశుద్ధ జనాంగకూటమిని ఏర్పరచినాడు. ఈ కూటమియే సంఘము కనుక ఈ విధముగా క్రీస్తుయేసునందలి పరిశుద్ధులుగా రూపించబడిన సంఘమునకు దానిని పరిపాలించుటకును ఏలుటకును క్రమములో ఉంచుటకును, అధ్యక్షులు అను పేరుతో పెద్దలను వారికి సహకారులుగాను, సువార్త సేవలో పరిచారకులుగాను ఉండుటకు, క్రీసుయేసులో ఏర్పరచుకున్న ఇట్టి పరిశుద్ధ కూటమికి క్రీసుయేసు దాసులైన పౌలును, తిమోతియు శుభమని చెప్పి వ్రాయుటలో ప్రియపాఠకులారా! క్రీస్తుయేసులో పరిశుద్ధులుగా అధ్యక్షులుగ, పరిచారకులుగ ఏ విధముగా మూడు జనాంగములున్నారో అలాగే, క్రీస్తుయేసులో ప్రత్యేకించబడి ఆయన దాసులైన జనాంగము కూడా ఉన్నారన్న సంగతి ఈ వాక్యములో మనకు గోచరమగుచున్నది. క్రీస్తుయేసులో దాసులైన పౌలు, తిమోతియు మాత్రమేగాక పౌలుకును, తిమోతికిని ముందు పేతురు - యోహాను - మత్తయి - మార్కు ఇంకను తదితర శిష్య బృందము అనగా వీరు క్రీస్తుయేసు చేత పాదాభిషేకము చేయించుకొని, ఆయనలో ప్రతిష్టించబడి పరిశుద్ధులుగా తీర్చబడినవారు. ఇందునుబట్టి మొట్టమొదటి పరిశుద్ధులు వీరు.
వీరు ఎటువంటి పరిశుద్ధులు? క్రీస్తుయేసుయొక్క చరిత్రకు సాక్షులుగా నిలిచి నూతన నిబంధన గ్రంథమునకు మూలకంబములుగా క్రీస్తు చేత ప్రతిష్టించబడి, అంతేగాకుండ పరలోక పట్టణానికి 12 పునాదులుగా దైవత్వము చేత దైవరాజ్యములో ఎన్నిక చేయబడినవారు. వీరు పరిశుద్ధులు మాత్రమేగాక వారికి ప్రత్యేకమైన చరిత్ర ఉన్నది. ఇట్టి పరిశుద్ధుల చేత ప్రకటించబడిన సువార్త ద్వారా కట్టబడిన సంఘములోని పరిశుద్ధులు. వీరు నాలుగవ అంశమునకు చెందినవారు - నాలుగవ తరగతివారు. అయితే మొదటి తరగతి పరిశుద్ధులు యేసుక్రీస్తులో పరిశుద్ధులు. మొదటి తరగతి శిష్యులు ముందు పరిశుద్ధులు - వీరినిగూర్చి మత్తయి 5:3-12 చదివితే ఈ నియమములను పాటించినవారు. వీరినిగూర్చి ప్రకటన గ్రంథము 14:3, మొట్టమొదటి పరిశుద్ధులు : వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల ఎదుటను, పెద్దల యెదుటను, ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకము నుండి కొనబడిన ఆ 144 వేలమంది తప్ప మరెవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము నెరుగని వారునైయుండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును, గొఱ్ఱెపిల్ల కొరకును ప్రధమ ఫలముగా నుండుటకై మనుష్యులలో నుండి కొనబడినవారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. రెండవ పరిశుద్ధులు అపొస్తలులు 3. హతసాక్షులు 4. వేదసాక్షులు 5. ఇప్పుడున్న మనము : విశ్వాసము ద్వారా క్రీస్తు యొక్క జల ప్రమాణములో పరిశుద్ధులుగా తీర్చబడి పిలువబడిన మనము - ఇంకను మనము పరిశుద్ధులము కాముః ఇంకను సంఘమును పరిపాలించు అధ్యక్షులు అనగా ప్రధాన పాత్ర వహించినవారు. వీరు ఛైర్మన్ -సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఏ పేరులో ఏ పదవిలోనైన చలామణి కావచ్చును.
ప్రియపాఠకులారా! క్రీస్తు యేసునందలి పరిశుద్ధులు ఎంత నిష్ట నియమము కలిగి ఉంటారో అంత నిష్టనియమములతో సంఘమునకు ఆదర్శులుగాను, అధ్యక్షులుగా ఉన్న పేరులో కూడా ఆ పరిశుద్ధతను కలిగి ఉండాలి. వీరిని అనుసరిస్తూ దైవసేవకులు, పరిచారకులు, తమయొక్క సేవా ధర్మములను క్రమము తప్పకుండ జరిగించవలెను. ఈ విధముగా జీవించినప్పుడు అనగా ఆ విధముగా పరిశుద్ధులుగాను, సంఘ నిర్వాహకులుగాను, పరిచారకులుగాను జీవించినప్పుడు - ఈ విధముగా జీవిస్తూ తర్ఫీదు అనగా సేవానుభవము, సంఘ నిర్వాహక అనుభవము; ప్రార్థనానుభవము; సంఘసేవకుల సావాస అనుభవము. నూతన ఆత్మల సంపాదనలో అనుభవము. తత్సంబంధమైన మెలకువ, నిరీక్షణ, ఆత్మ నింపుదల కలిగిన విశ్వాసి - క్రీస్తుయేసు దాసుడైన పౌలుకును, తిమోతికిని సమానులుగా జీవించగలరు. అంటే మొదటి కొరింథీ 11:1లో పౌలు మహాశయుడు ప్రవచించిన విధముగా ''నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి,'' అనిన మాటను నెరవేర్చిన వారమవుతామని ఇందులోని సారాంశము.
ప్రియపాఠకులారా! క్రీస్తుయేసు దాసుడైన పౌలును, ఆయనయొక్క ఆచరణ విధానమును, నియమాలను, ఆయనతో సావాసమును అనుభవించి, ఆయనతో సేవలో సహకరించి ఆయన అడుగు జాడలలో నడిచినవారు తిమోతి, సీలయు, లూదియ, దోర్కా వగైరాలు అనగా పౌలు ఏ విధముగా క్రీస్తుయేసు మార్గములో నడిచాడో వీరును నడిచారు - ఈ విధముగా జీవించిన వ్యక్తులకు పౌలుయొక్క శుభవచనము అనగా శుభాశీస్సులు ఎప్పుడును వారిని ఆవరించి ఉంటాయి. అంటే ధన్యకరమైన జీవితము జీవిస్తారని ఇందులోని భావము.
ప్రియపాఠకులారా! పై వాక్యరీతిగా క్రీస్తుయేసునందు మనయొక్క క్రైస్తవ జీవితము పరిశుద్ధ స్థితిలో ఉన్నదా? మనము పరిపాలించే సంఘ నిర్వాహకత్వము క్రీస్తుయేసునకు యోగ్యకరముగాను, పౌలు యొక్క మార్గమునకు అనుకూలముగా ఉన్నదా? మన పరిచర్య, మెలకువ తిమోతి వగైరా ప్రభువు బిడ్డల సేవను బోలి, ఆత్మల సంపాదన విషయములో కూడిక విధానములోను, సంఘ ఫలాభివృద్ధి చెందుటకును, సంఘ నడుపుదలకును, అటు ఆత్మకు, ఇటు క్రీస్తుకు, అటు దేవునికి, ఇటు మనస్సాక్షికి సమ్మతముగా ఉన్నదా? దీన్ని గూర్చి మనము ఆలోచించుకొందము. ఒకవేళ ఆలాగు లేని పక్షములో ఆలాగు జీవించే స్థితికి ప్రయత్నిస్తాము. ప్రభువు మనలను ఆశీర్వదించి కాపాడును గాక!
ప్రభువునందు సహోదరీ సహోదరులారా!
దీని వలన, మేము మీ యొక్క సహాయ సహకారాల వల్ల తరువాత ముద్రణలో ఈ పుస్తకము అన్ని కోణాలలో అందముగా తీర్చిదిద్ది అందించగలము. ఆమేన్.
శేఖర్ రెడ్డి గారు వ్రాసిన పుస్తకములు:
వీటిని మీరు www.FaithScope.com ద్వారా ఉచితముగా పొంద వచ్చును.