లోకయాత్ర - పరలోకయాత్ర
గ్రంథకర్త : శేఖర్‌రెడ్డి వాసా
నీ మరణానంతరము నీ ఆత్మ ఎక్కడ వుండబోవుచున్నదో నీకు తెలుసునా?
మూలము
రెడ్డిపాళెం గ్రామములోని నా ప్రభువు తల్లి ఉపదేశములు మరియు ఆమెను ఆవరించిన పరిశుద్ధాత్మయొక్క జ్ఞాన సహాయమే ఈ పుస్తక రచనకు మూలాధారము.
అంకితము
ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించి నన్ను ప్రేమించిన క్రీస్తు ప్రభువుకు అంకితమిస్తున్నాను. - వాసా శేఖర్‌రెడ్డి
గ్రంథపరిచయము
ప్రియక్రైస్తవ పాఠక మహాశయులారా! లోకయాత్ర - పరలోక యాత్ర అను ఈ పుస్తకమును గూర్చిన రచయిత తొలి పలుకు - ఈ పుస్తకములో వ్రాయబడిన అంశాలు మన విశ్వాస జీవితానికెంతో ఉపయోగకారులు. మానవత్వానికి సోపానములును మన యొక్క భూతభవిష్యత్ వర్తమానకాలములలో అనగా మన బాల్యమునుండి వృద్ధాప్యము వరకును మన శరీర సంబంధమైన జీవిత యాత్రకు అతిముఖ్యమైన పాత్రను కల్గియున్నది. ఇందునుగూర్చి ఈ పుస్తకములో వ్రాయబడిన అంశముల ద్వారా పరిశుద్ధ గ్రంథ ప్రవచనానుసారముగా తెలిసికొందము. నరులైన మనము ఏదో యొక సందర్భములో ఏదో యొక పని మీద, ఏదో యొక ఉద్ధేశ్యంతో లేక ఏదైన కార్యాన్ని తలపెట్టినప్పుడు మనము వెళ్ళే మార్గము గాని, ఆ మార్గములో పయనించేందుకు నియమించబడిన వాహనమును గాని, ఆవాహనముల ద్వారా చేరవలసిన గమ్యము చేరుటన్నది పరిపాటి అనగా సర్వసాధారణమైన విషయము. కాని ఈ విధంగా కార్యార్థంగా వెళ్ళే సందర్భాన్ని ప్రయాణము అంటారు. అలాగే కాలేజీ పిల్లలు బడిపిల్లలు లేక ప్రభుత్వ ఉద్యోగులు తమ తీరిక వేళల్లో చేసే ప్రయాణాన్ని పిక్నిక్ అనగా విహారము అని దానికి పేరు. ఇది కూడా వాహన సంబంధమైందే! ఈ వాహనమన్నది ఆటో లగాయతు భూమి మీద వాడేటటవంటి ప్రతివాహనము అనగా కారు వ్యాను బస్సు రైలు వగైరాలు, ఇది లోకసంబంధమైన ప్రయాణ సాధనాలుగ వాడబడుచున్నవి. అకాశములోని గగనతలములో విహరించే నరులు చేయు ప్రయాణాన్ని విమానయానము''; అని అంటారు. అదే నరులైన మనము ఏదైన ఒక పుణ్య క్షేత్రము వెళ్ళే ప్రయాణాన్ని యాత్ర అని అంటున్నాము. ఇవన్నియును లోకసంబంధమైవియే! దైవికముగా చేసే ప్రయాణాన్ని ప్రయాణము అని గాని విహారము అని గాని లేక మరి ఏదైన అనక, లోకములోని నరులు వైకుంఠ యాత్ర అను క్రొత్త పేరుతో దేహము విడిచిన ఆత్మకు పేరు పెట్టియున్నారు.
చిత్రమేమంటే ప్రియపాఠకులారా! లోకసంబంధంగా శరీరయుతముగా చేసే ప్రతి ప్రయాణము చేసే యాత్రలలో మరల ఇల్లు చేరుకొనే వీలుంటుంది. కాని వైకుంఠ యాత్రన్నది చేసే నరులు అది నరసంబంధమైనను శరీరమునకు ఆత్మకును శాశ్వతమైన అనగా మరి ఎన్నటికిని శరీరాత్మలు ఏకమయ్యేటటువంటి స్థితిలేనట్లుగా వేదరీత్యా అపొస్తలుల చేత ప్రవచించబడియున్నది. ఈ ప్రవచనమన్నది కేవలము మాటలతోగాక వ్రాత మూలముగా సువర్ణాక్షరములతో రాతిపలకల మీద చెక్కినట్లుగా స్థిరపరచబడి యున్నది. ఈ విధముగా స్థిరపరచబడింది దేవుని చేతనేగాని నరుల చేత కాదు. నరుని యొక్క శరీరాత్మలు చేసేటటువంటి యాత్రలను గూర్చి పరిశుద్ధ గ్రంథములో చాలా వేద భాగాలు విశ్వాసులైన మనలను హెచ్చరించుచున్నాయి. ఈ సందర్భములో హెబ్రీ 11:13-16లో ఈలాగు వ్రాయబడి యున్నది, ''వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను, దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై యున్నామని ఒప్పుకొని, విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశదపరచుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచు కొన్న యెడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగియుండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించు కొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచియున్నాడు. మరియొక ప్రవచనము 2వ కొరింథీ 5:1 భూమిమీద మన గుడారమైన ఈ నివాసము శిధిలమైపోయినను, చేతిపనికాక దేవుని చేత కట్టబడినదియు, నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను.'' ఆ తర్వాత యోహాను 14:1-6 మీ హృదయమును కలవరపడనియ్యకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు. నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని యెడల మీతో చెప్పుదును , మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్దపరచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలవచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను. అందుకు తోమా - ప్రభువా! ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గము ఏలాగు తెలియునని ఆయనను అడుగగా యేసు - ''నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు.''
ప్రియపాఠకులారా! పై మూడు వేదభాగాలలో వివరించబడిన పరమార్థాలను గూర్చి నరుని ఆత్మీయ జీవితములో చేసే ఆత్మీయ యాత్రను గూర్చి ఈ పుస్తకములో వివరించబడియున్నది, లోకరీత్యా శరీరరీత్యా నరుడు చేయు యాత్రలను గూర్చి వివరముగా తెలిసికొనియున్నాము. భూమి మీద నరుడు చేసే ప్రతి యాత్ర కూడా శారీరయుతమైనదియు అనారోగ్యము ప్రమాదాలు అసందర్భాలు వికృత వాతావరణము, వాహన లోపము అనగా ప్రయాణ సాధనము యొక్క యాంత్రిక లోపము లేక ప్రకృతి వైపరీత్యము వాగులు పొంగి ప్రవహించుట, ఇరుకైన లోయలలో చేసే ప్రమాదకరమైన ప్రయాణాలు, ఇవన్నియు లోకసంబంధమైన యాత్రలకు చెందిన పనియే ఈ సందర్భములో మనము తెలిసికోవలసి యున్నది. నరుడు చేసే ప్రతి యాత్ర ప్రతి ప్రయాణము నిర్ణీతమైన రుసుము చెల్లించవలసియున్నది. ఇది కాంట్రాక్టు పద్ధతిగాను లేక కుటుంబ పరముగా ఉండవచ్చును. లేక వెళ్ళే స్థలానికి రుసుము టికెట్టు రూపముగా ఉంటుంది. టిక్కెట్టు లేనిదే ఈ వాహనాలలో నరుడు యాత్ర చేసేందుకు అవకాశము లేదు. తప్పని సరిగా టిక్కెట్టు ఉండాలి. అయితే శరీరము - ఆత్మ రెండును విభజింపబడి ఆత్మ చేరే గమ్యమునకు ఆత్మ చేయు యాత్రలో - శరీరము నుండి ఆత్మ వేరైన తర్వాత నిర్జీవమైన వ్యక్తి యొక్క మృతదేహము యొక్క స్థితి కూడా లోకసంబంధమైన యాత్ర చేస్తుంది. దీనినే అంతిమయాత్ర అంటారు. ఈ అంతిమ యాత్రన్నది ఘనముగా పేర్కొంటున్నారుగాని, ఈ అంతిమయాత్ర అనేది నరునియొక్క దేహాన్ని దహించి బుగ్గి చేయడము లేక పాతిపెట్టబడి లయమైపోవడము. మూడవదిగ అది జలసమాధి మరణమైతే - నదిలో కొట్టుకొనిపోయి నానావిధముగా ఛిద్రమై శిధిలమై దుర్గంధ పూరితమైన జలాలలో కలిసిపోవుట జరుగుతుంది. అయితే లోకరీత్యా ఒక గొప్ప వ్యక్తి యొక్క మృతదేహాన్ని చాలా పేర్లతో వర్ణిస్తారు. చనిపోయిన వ్యక్తి యొక్క మృతదేహాన్ని కీర్తి శేషుడని, భౌతిక కాయమనియు, కొందరైతే వికృతముగా చెప్తారు. చనిపోయిన వ్యక్తి యొక్క నిర్జీవ శరీరాన్ని గూర్చి మాట్లాడే మాటలున్నవి. శవమని కళేబరమని పీనుగని అనుట మనము వింటున్నాము. ఇది ఏ భాషలో కాదుగాని స్వచ్ఛమైన తెలుగు భాషలోనే ఘనత - ఘనహీనతన్నది మనమెరిగిన సత్యమే! అయితే ఇంగ్లీషు భాషలో ఇన్ని పేర్లు లేకపోయినను డెడ్ బాడీ అని ఒక్కమాటలో చెప్పడం మనము వింటున్నాము. ఆత్మ విడిచిన దేహానికి ఎన్ని పేర్లున్నను, వారు జీవితములో చేసే రెండు విధ యాత్రలు చాలా ప్రాముఖ్యంగా ఉన్నాయి. లోకరీత్యా చనిపోయిన వ్యక్తిని పాతిపెట్టే స్థలానికి వివిధ పేర్లున్నాయి. సమాధుల తోట, శ్మశాన వాటిక, పీనుగుల రేవు, వల్లకాడు, ఈ విధమైన పేర్లతో మృతిచెందిన శరీరము యొక్క అంతిమయాత్ర అంతమును గూర్చిన వక్కాణించబడి యున్నది.
అయితే దైవసన్నిధిలో దేవుడు పక్షపాతి కాడు గనుక ''ఆత్మ - శరీరము'' రెంటికిని రెండు విధములైనటువంటి యాత్రలను నిర్ధారించియున్నాడు. నరునియొక్క మరణకాలములో అతడు చేయవలసిన అంతిమయాత్రలో శరీరమునకు ఆత్మకును రెంటికిని సృష్టికర్తయైన దేవుడే ప్రాధాన్యతనిచ్చి యున్నాడు. ఇందునుగూర్చి పౌలు 2వ కొరింథీ 5:10లో ప్రవచించబడిన మాట. 'తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము,'' అనుటలో నరునియొక్క అంతిమయాత్రలో దేవుడు ఆత్మకే గాకుండ మొట్టమొదట శరీరమునుబట్టి చెప్పుటలో -మొదట శరీరమును అనగా నరుని యొక్క హృదయమును, అతని ప్రవర్తన, అతని జ్ఞానము, దేహరీత్యా అతను ఆచరించిన ఆచారములు, అతడు అభ్యసించిన అలవాట్లు, అతనిలో దైవత్వమునకున్నట్టి విలువలు, లోకరీత్యా నరుడు పాటించవలసిన విధులను గూర్చి కూడా దేవునియొక్క తీర్పులో నరుడు నిలువవలసిన దినమున్నదని ఇందునుబట్టి మనకు తెలియుచున్నది. ఇందునుగూర్చి పౌలు వ్రాసిన పత్రికలో మొట్ట మొదటగ దేహానికి ప్రాధాన్యతనిచ్చియున్నాడు. ''తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను,'' అనుటలో మన యాత్ర గమ్యము క్రీస్తు న్యాయపీఠము అని ఇందునుబట్టి ఋజువగుచున్నది. ఆ గమ్యములో మన శారీర ఆత్మీయ స్థితిగతులనుబట్టి దేవునికిని నరులకును మధ్యవర్తియైన క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనము ప్రత్యక్షము కావలెను.
ప్రియపాఠకులారా! ఇంతవరకు చదివిన మనలో మన విషయము ఇలాగు ఉంటే చచ్చినవాడు తక్కెడో బిక్కెడో వాడేమైపోతాడో అనియు, చచ్చినవానిని తీసికొని వచ్చి బూడిద చేసితిమి గదా! ఆలాగున చనిపోయినవానిని భూమి మీద స్మశాన వాటికలో పూడ్చి పెట్టడమో లేక కాల్చి దానిని నిప్పులో బూడిద చేసి మట్టి తినివేస్తే - వీడు మరల లేచి ఏ విధముగా క్రీస్తు న్యాయపీఠము దగ్గరకు ఎలా పోతాడు? అనిన అజ్ఞానము, అయోమయము, అలక్ష్యము, హేతువాద నాస్తికత్వముతో కూడిన కల్లబొల్లి కబుర్లతో కాలయాపన చేస్తున్నవారున్నారు. ఈలాటి వారినిగూర్చి ఏమనాలి? ఇంతవరకు చదివిన పాఠకులు ఇందునుగూర్చి ఏమనుకొంటున్నారు? ఇక ఈ చిన్న పుస్తకములోని చనిపోయినవారిని గూర్చిన వ్యాఖ్యానమును చదవండి.
.........
శరీరము విడిచిన ఆత్మ నలభైవరోజు తర్వాత వాయుమండలములో చేరును. ఈ దినముల కాలపరిమితి పూర్తియైన పిమ్మట ఎఫెసీ 2:2 అవిధేయులైన వారిని ప్రేరేపిస్తున్న వాయుమండల సంబంధ అధిపతి ననుసరించి - ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకొన్నవారు. ఈ విధముగా గాలిలో కలిసిపోయిన ఆత్మను గూర్చి నానావిధములైన వదంతులు - ఆ ఆత్మను విడిచిన గృహము దాని పరిసరాలలో ఏర్పడినప్పుడు ఈ సంఘటన ఆసరాగా చేసుకొని, ఈ వాయుమండల సంబంధమైన సాతానుయొక్క దూత ఆత్మకు బదులుగా తాను మాయా శరీరమును ధరించి అనగా చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ అపవిత్రాత్మ యైందని అంటూ - దానిని సుళువుగ రెండు మాటలలో గాలి అనే పేరుతో వ్యవహరిస్తాడు. అందువలన గృహసంబంధ ఆవరణలోగాని, ఆ గృహానికి సంబంధించి ఇతర గృహాలలోగాని, ఇతరులు అద్దెకు చేరుటకుగాని లేక ఆ గృహస్థులు కాపురముండుటకుగాని భయపడుచుందురు. ఎందుకంటే ఈ ఇంటిలో గాలి ఉన్నదను వదంతి ఏర్పడుతుంది. ఈ విధముగా గాలిలో కలిసిన ఈ ఆత్మ చలనము కలిగి ఉన్నను, అది గాలి వరకే పరిమితముగాని భూమి మీద సంచరించుటకు వాటికి ఉత్తరువు లేదు.
మరియొక మాటేమిటంటే చనిపోయిన మనిషి ఆత్మ దయ్యమై పట్టుకోవడము అసాధ్యము. ఈ సందర్భములో మనమొక విషయాన్ని జ్ఞాపకముంచుకోవలెనుః సువార్త ప్రకటనలో దేవుని బోధ క్రీస్తు బోధ పరిశుద్ధాత్మ బోధ ఉన్నట్లే - అబద్ధ బోధ, అబద్ధ ప్రవక్తల బోధ, దయ్యపు ఆత్మల బోధ కూడా ఉన్నదని మనము ముఖ్యముగా తెలిసికోవలెను. దయ్యపు ఆత్మలు కూడా బోధ చేస్తాయి. కాని చనిపోయిన వాని ఆత్మ మాత్రము అయోమయ స్థితిలో అతిమితి లేకుండ వాయువులో సంచరిస్తుంది. కాని దానికి పూర్వ జ్ఞానముండదు. శరీరములో తాను జరిగించిన క్రియలు మరచిపోతుంది. ఇది వాయుమండలములో ఆత్మల యొక్క సంగ్రహ చరిత్ర.
ఇంకొక మాట : ఈ వాయుమండలములోనే దురాత్మ లీలలు, దైవాత్మ కార్యాలున్నాయనుటకు ఋజువులున్నవి. డ్యాన్సులు, నానావిధమైన అల్లరితో కూడిన ఆటపాటలు, వాయిద్య మోతలు, వగైరాలు. రేడియోలలోను, దూరదర్శినిలోను ప్రదర్శించే సంఘటనలు, ఈ విధానము ప్రదర్శించే క్రియలు ఈ ఆత్మలు చేయుచున్నవి. దేవునియొక్క దూతలకు ఆయనకు సంబంధించిన ఆత్మలు చేయు క్రియల వలె అపవిత్రాత్మ సంబంధమైన సమూహము కూడా ఇంచుమించు దైవత్వము కంటె అశక్యములైనను మహత్కార్యాలు నానావిధమైన అల్లరి అశ్లీలవిధానమైన ఆటపాటలతో కూడిన క్రియాకర్మలు జరిగిస్తున్నవి. ఇపుడు టీ.విలో కనబడేటటువంటి బొమ్మలు, రూపములు, సంగీత నాదములు, నానావిధమైనటువంటి నాట్యభంగిమలు - ఇవన్నియు వీటన్నిటికి ఆధారము గాలి. ఇందునుబట్టి వాయుమండలమునకు ప్రకటన చేయు శక్తి దృశ్యములను చూపించెడి ప్రభావము శబ్దతరంగిణి, నరకోటికి కావలసిన ప్రాణవాయువు సకల జీవులకు కావలసిన గాలి ఉన్నదని మనకు బాగుగా తెలియును. అంతేగాకుండ వాయువునకు మరియొక శక్తి కూడా ఉన్నది. అదేమిటంటే లారీ, బస్సు, కారు, ఆటో సైకిలు, రిక్షా వగైరా వాహనాలకు గృహములో వాడే వంటకును, హాస్పిటలులో అవసాన స్థితిలో కొట్టుమిట్టాడుచున్న రోగికి ప్రాణవాయువు రూపముగాను ఈ వాయువు అవసరతను కలిగియున్నది. ఇది వాయుమండల సంబంధమైన అవసరతను గూర్చిన విధానము.
ఇక మేఘమండలము :- మొదటి థెస్సలొనీక 4:17 ఆత్మలను మోసే పని. ఆత్మ దప్పికను మేఘమండలము, ఆత్మ చలనమునకు వాయు మండలము.
శూన్యమండలము :- ఇక్కడ గాలి లేదు, మేఘము లేదు. స్థబ్దత - నిశ్శబ్దము, అచేతన స్థితి అనగా నిరీక్షణ కలిగియుండెడి స్థితి : ఇక్కడ ఆత్మ కెటువంటి ఆందోళనగాని, చలనముగాని ఉండదు. దీని తర్వాత పరదైసు అనగా విశ్రాంతి. ఇక్కడ హోరు గాలిగాని, తుఫాను గాలిగాని, ప్రమాదకర గాలులు గాని ఈ శూన్య మండలములో లేవు. మరియు శూన్యమండలములో ఆత్మకు - గాలి పీల్చుకొనే అవసరత లేదు. ఎందుకంటే ఆత్మకు గాలి ఊపిరితిత్తులు శరీరము వాయువు అనవసరము.
గ్రహ నక్షత్ర మండలము :- ఆత్మకు శరీరము లేదు గనుక ఇక్కడనుండియే వేడి వాతావరణానికి తట్టుకోగల శక్తి ఆత్మకున్నది. ప్రియులారా! ఇందుకు ఋజువు శరీరములో జీవాత్మ ఉన్నప్పుడు వెచ్చదనము వేడి ఉష్ణము పైత్యము, నాడీ మండల చలనము, రక్తమండలములో జీవము శరీరమునకు చలనము హృదయమునకు స్పందన; పంచేంద్రియములకు కదలిక ఉంటుంది. ఇందుకు కారణము జీవాత్మునియొక్క వేడి. ఈ వేడి ఉన్నంత కాలము శరీరుడు జీవము గలవాడే! అనగా లోకరీత్యా దృశ్యమైయున్న శరీరమునకు లోకసంబంధమైన గౌరవమర్యాదలు, ఇతర శరీరముల ద్వారా సంబంధ బాంధవ్యాలు రక్త సంబంధాలు, శరీర సంబంధాలు అనగా భార్యాభర్తల బంధము, పుత్ర పౌత్రాదుల బంధము, బంధువుల బంధము వగైరా బంధములుంటవి. ఇందుకు కారణము జీవాత్మకును, శరీరమునకున్న పరమాత్ముని యొక్క పరిమితకాలబంధము అనగా ఆయుష్కాలము. అది ఉన్నంతకాలము శరీరమునకు జీవాత్మ బంధమున్నది. అయితే ఒకానొక నిర్ణీత కాలములో జీవాత్మ శరీరమును వదలిపోవు సందర్భములో పై వివరించిన లోక సంబంధ శరీరములన్నియు వీగిపోవును అనగా తెగిపోవును. ఈ విధముగా తెగిపోయిన జీవాత్మ బంధమును గూర్చి లోకము సంబోధించే పదము - అమరజీవి లేక కీర్తిశేషుడు అనిన పదజాలము వాడుతుంది.
ఆత్మ ఏ విధముగా శీతల వాయువు, ఉష్ణ వాతావరణములో శరీరమును వదలి ప్రవేశిస్తుందో అలాగే జీవాత్మ వదలి వెళ్ళిన శరీరము కూడా అట్టి వాతావరణాన్ని ప్రకృతి సిద్ధముగ అనుభవిస్తుంది. ఎట్లు? చనిపోయిన వారి బంధువులు రావడము లేటైనట్లయితే చెడకుండ ఐస్‌లో భద్రపరచెదరు. ఇది శీతలము. అటుతర్వాత స్మశాన వాటికకు వాయువు వాతావరణములో మోసుకెళ్ళుట. అటుతర్వాత నర శరీరమును పూడ్చినను కాల్చినను వేడి వాతావరణము : ఇక్కడ నుండి విగత జీవియైన శరీరుడు తన రూపమును పూర్తిగా కోల్పోయి, భూమిలో కలిసి నిరాకారుడగును. ఇది జీవాత్మ శరీర బంధమును గూర్చిన లోక సంబంధిత చరిత్ర.
అయితే ఉష్ణమండలములో ఉన్న జీవాత్మ శరీరమును వదలి అంచెలవారీగా పయనిస్తూ - గ్రహ నక్షత్ర మండలాలలో ప్రవేశించిన జీవాత్మ గతి కూడా ఇంతియే! దీని తర్వాత పరదైసు. ఇందులో వేడి లేదు, వాయువు యొక్క ఉద్రిక్తత లేదు. గ్రహ నక్షత్రాదుల వేడి వాతావరణము లేదు, శత్రు భయము లేదు, ఏ భయము లేదు. ఇందునుగూర్చి ప్రకటన 14:13, ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులుః తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు.'' ఇది పరదైసు ఇక్కడ నుండి జరుగు క్రియ ఆత్మలకు విశ్రాంతి : ఎటువంటి కొరత ఉండదు, ఎటువంటి శబ్దములుండవు. దురాత్మలుగాని, అంధకార శక్తులుగాని, భూత ప్రేత పిశాచులుగాని ఇక్కడకు రాలేవు. అయితే ఈ స్థలములో లోకముల జీవాత్ముడైన నరుడు శరీరుడుగా ఉండి భూలోకములో చేసిన క్రియలనుబట్టి తలపోసుకుంటూ వాటినిబట్టి ఆలోచనలో ఉంటాడు. అయితే తీర్పు ఇక్కడ కాదు.
ప్రియులారా! ఈ పరదైసు అన్నది లోక పాప పరిహారార్థము బలియాగము గావించి ప్రాణ త్యాగము గావించి మొట్టమొదటగా విశ్రాంతి పొందిన స్థలము - మరియు తన కుడివైపున సిలువ వేయబడిన దొంగకు వాగ్దానము చేసిన స్థలము. ప్రభువునకు తర్వాత మానవరీత్యా ఒక్క దొంగకు మాత్రము నేరుగా వెళ్ళ గల యోగ్యత కల్గింది. రెండవ కొరింథీ 12:1-4 ఇతడు క్రీస్తు యొక్క కుడివైపున సిలువ వేయబడిన దొంగ. ఈ కుడివైపు దొంగ ఏ ఆటంకము, ఎవరి సిఫారసు, ఏ వస్తువాహనము, ఏ లోక సంబంధమైన అధికారము లేకుండగనే దైవకుమారుని చిత్తానుసారముగా ఈ పరదైసు అనే విశ్రాంతిలోకి ప్రవేశించగల్గినాడు.
ప్రియులారా! లోకసంబంధమైన మనమైతే ఆ పరదైసులోకి నేరుగా వెళ్ళలేము. మనము నేేరుగా వెళ్ళాలంటే యేసును మనము ధరించి ఉండవలెను. యేసు నామమును మనము ధరించి ఉండవలెను. ఆయన నామమును మహిమ పరిచే ఆత్మ స్థితి మనకు ఉండవలెను. వీటి అన్నిటికంటె ముందుగా మారుమనస్సు, పాపపశ్చాత్తాపము, పరమాత్మ యొక్క ఐక్యతను గూర్చిన నిరీక్షణ. ఇట్టి స్థితిలో పరదైసులోకి దొంగ వెళ్ళగల్గినాడు. ఈ విధముగా మనము కూడా పరదైసులోకి వెళ్ళగలము. మనకు దొంగకు తేడా ఏమిటంటే అతడు ప్రభువు మన కొరకు అనుభవించిన శిక్షలో భాగస్వామియై, అదే శిక్షను అనుభవిస్తూ మరణావస్థలో యేసుతో సమకాలికుడై, ఆయనలో ఉన్నటువంటి మహిమను గ్రహించినవాడై, ఆయనలో ఉన్న దైవత్వమునకు ఆకర్షితుడై ప్రభువుతోబాటు పరదైసులోకి వెళ్ళే యోగ్యతను పొంది, ఆయనతోబాటు నేరుగా పరదైసులోకి వెళ్ళగల్గినాడు.
........
గుడ్‌ఫ్రైడే అంటే ఏమిటి ''ఫ్రై'' అనగా వేపుడు - (కాల్చిన) గొర్రెపిల్లను కాల్చిన దినము.
''యాజకుడు'' అంటే ఏమిటి? యాచించువాడు :
ఎవరిని అడుక్కోవడము - లోకులను గూర్చి దేవుని అడుగుకొనేవాడు.
.............
శరీరము విడిచిన ఆత్మలు క్రమశిక్షణలో ఉండవలెను. ఈ లోకములో అనుసరించిన వడకము (మౌనవ్రతము) ఆత్మలు అక్కడ కూడా అనుసరించును. కొలస్స 3:1-4 మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడియున్నది.
.........
హెబ్రీ 11:35 స్త్రీలు మృతులైన తమవారిని పునరుత్థానము వలన మరల పొందిరి. కొందరైతే శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనేరక యాతన పెట్టబడిరి.''
ప్రియపాఠకులారా! పై వాక్యములో స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరల పొందిరి-అంటున్నాడు. లోకరీత్యా స్త్రీకి కావలసింది పురుషుడు. పురుషుడు లేనిదే స్త్రీ లేదు -స్త్రీ లేనిదే పురుషుడు లేడు. ఇందునుబట్టి సజీవులైయున్న స్త్రీలు తమ జతగాళ్ళను అనగా పురుషులను పోగొట్టుకొని తమ విశ్వాసము ద్వారా దైవ ప్రభావము వలన మరల పొందగల్గినారని, ఆ పొందుటన్నది మరియొక జన్మలో జన్మించుట గాకుండ, మృతులైన కొంత కాలమునకు వారు భూమి మీద శరీరాకృతిలో కనబడక పోయినను, వారి రూపములు మార్చబడినను వారు భూమి మీద తుడిచిపెట్టబడినను కేవలము వారి భౌతికకాయముతో చీకిపోయినను, ఎముకల ద్వారా అనగా ఎముకలనుబట్టి, ఆ ఎముక దైవవాక్కునకు విధేయించి కూర్చబడి, ఆయా పురుషుని బట్టి వాని దేహము యొక్క ఎముకలు దైవవాక్శక్తికి కూర్చబడి మాంసము నరములు కండరములు చర్మము - ఆ ఎముకలను కప్పినప్పుడు యధావిధిగ ఈ లోకములో జీవించిన వ్యక్తి తానే రూపములో ఉన్నాడో - ఆ రూపములో తయారై ''యెహెజ్కేలు'' అను దైవ విశ్వాసునికి దేవుడనుగ్రహించిన తలాంతు అనగా ఇందులో శ్రమించి ఎముకలన్నిటిని ఏరి వాటిని ఆయా భాగములలో అతికించి, మాంసము నరములు చర్మములు మానవ ప్రమేయము లేకుండ దైవవాక్శక్తికి కొన్ని లక్షల ఎముకల గూళ్ళు రూపాంతరము పొంది, వాటి యదాస్థితిని బట్టి పూర్వీక నరులుగ రూపించబడి పునరుత్థానము పొంది, తాము ఈ లోకములో ఏయే స్త్రీలతో జతకూడి జీవించినారో అలాగే ఆ స్త్రీలను తమ వారినిగ చేసుకొని, యధావిధిగ వారితో ముఖాముఖిగ కలిసికొని, మరల ఈ లోక మర్యాద చొప్పున తమ బంధువులుగ తమ ఇంటిల్లిపాదిగ పొందుటన్నది ఆశ్చర్యము అనూహ్యము - మానవ జ్ఞానానికి అంతు చిక్కనిది, చదువరులకు ఇది ఎట్లు సాధ్యము? అనిన ప్రశ్నలు కలుగవచ్చును.
యోహాను 11:39-44 చనిపోయి నాలుగు దినములైన వాసన గొట్టుచున్న లాజరును బ్రతికించుట ఇది జీవ పునరుత్థానము. పునరుత్థానములు మూడు. 1. జీవ పునరుత్థానము 2. మహిమ పునరుత్థానము 3. మరణ పునరుత్థానము.
ప్రియపాఠకులారా! హెబ్రీ 11:35 రెండవ భాగములో కొందరైతే శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందక యాతన పెట్టబడిరి,'' అని వ్రాయబడియున్నది. లాజరు విషయములో లాజరును సజీవునిగ చేసిన సంఘటనన్నది మృతులైన ప్రతివారికిని పునరుత్థానమున్నదని - ఈ పునరుత్థానము తీర్పు పునరుత్థానము - ఈ తీర్పు పునరుత్థానములో ఎవరైతే దేవుని యొక్క తీర్పులో నిలిచి, ఆయన న్యాయ తీర్పులో ఎవరైతే నిర్దోషులుగా ఎంచబడుదురో మత్తయి 27:52-53లో సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేకమంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బైటకు వచ్చి ఆయన లేచిన తర్వాత అనేకులకు అగపడిరి. దీనిని శ్రమల పునరుత్థానమంటారు. ఇది శ్రమల పునరుత్థానము కాబట్టే అనగా యేసుప్రభువు శ్రమలలో ఆయన సిలువ మీద మరణవేదనలో ఉన్నప్పుడు ఆయన శ్రమల నిమిత్తము పంచభూతములు తమ పనులను ఆపి అనగా సూర్యుని చీకటి క్రమ్ముట, దేవాలయపు తెర పైనుండి రెండుగా చినుగుట, ప్రకృతి భీభత్సము, కొండ బండలు బ్రద్దలగుట, సమాధులు తెరవబడుట.
శ్రేష్టమైన పునరుత్థానము హెబ్రీ 11:35 మహిమ పునరుత్థానము :- మోషే ఏలీయాలు ప్రకటన 14:1-5లో వివరించబడిన పవిత్రులు, వీరు మహిమ పునరుత్థానములో యేసు రక్తము ద్వారా కొనబడి ఆయన నామము - ఆయన తండ్రి నామమును, తమ నొసళ్ళ మీద లిఖించుకొన్న 144 వేలమంది గూర్చిన వివరములను మనము ఈ వేదభాగములో చదువగలము. ఇంకను రెండవ తిమోతి 2:10లో ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతో కూడా క్రీసుయేసునందలి రక్షణ పొందవలెనని పౌలు ఓర్చుకొన్నట్లును, అంటే మనము ఆయనతో కూడా చనిపోయినవారమైతే ఆయనతో కూడా బ్రతకుదుము ఆయనతో కూడా సహించినవారమైతే ఆయనతో కూడా ఏలుదుము. అంటే ఇది మహిమ పునరుత్థానము.
ప్రభువైన యేసునందు ఈ లోకములో జీవిస్తూ ఆయన సేవ జరిగిస్తూ అనాధ శరణాలయాలను, విదేశ సాయముతో నడుపుచు దొంగ లెక్కలతో దొంగ బోధలతో లక్షలకు లక్షలు సంపాయించినవారి గతి - మిక్కిలి అధోగతి. బోధకులే, దేవుని వాక్యమే - బైబిలు చేత పట్టుతారు. దేవుని వాక్యాన్ని లోకానికి జతపరచి, విశ్వాసుల ఉజ్జీవాన్ని చల్లార్పుతారు. హాస్టల్సు, అనాధ శరణాలయాలు నడుపుచు, వారి కడుపులు కొట్టి దొంగ లెక్కలు చూపి సంపాయించిన డబ్బు - ఇటువంటివారికి పరిశుద్ధుల సావాసములో - అదే క్రైస్తవ సావాసములో ప్రభువు నందు నిద్రించినవారి సమూహములో ప్రవేశించుటకు అర్హత కోల్పోతారు. పరిశుద్ధుల చేత వెలివేయబడుతారు. శరీరముతో జీవించిన కాలమంతయు బైబిలు గ్రంథముతో జీవించినవారు - శరీరము విడిచిన తర్వాత బైబిలు గ్రంథము కూడా వీరి చేతికి దొరకదు. వీరు అన్యులతో కలువలేరు. ఎందుకంటే వారు హరేరామ హరేకృష్ణ నామాలతోను, గోవింద నామాలతోను కాలము వెళ్ళబుచ్చుతారు. కనుక వారితో కలవలేరు - వారితో జీవించలేరు. ప్రభువు పేరట నిలిచియున్న ఆత్మల యొద్దకు ప్రవేశించుటకు - ఇతడు చేసిన దుష్క్రియలు, స్వార్థపరత్వము అడ్డు తగులుతాయి. కనుక ఇట్టివారు రెంటికి చెడ్డ రేవడులుగా ఈ ఆత్మలు విడువబడి వేరుచేయబడి అల్లలాడుతాయి.
ఇక తన జీవితకాలమంతయు స్వార్థరహితులై, ప్రేమపూరిత సౌభాతృత్వముతో పేదల సేవలో గడిపినవారికి - నిత్య దరిద్రులకు పొరుగువారికి సహాయపడు మనస్తత్వము గల స్వార్థరహితులకు, శరీరము విడిచిన తర్వాత వారికి ఏ ఆటంకము లేదు - ఏ విధమైన శ్రమ జీవితము లేదు. వారి క్రియలు వారి వెంట ఉండి తేజోమయ జీవితము, ఆనందమయ జీవితములో వారు ఆకాశ మధ్యములో కావలసిన ప్రదేశాలలో నిరంతరమును తమ ఆత్మ ఆనందమును పొందుచుందురు. వారికి ఏ దురాత్మల వలనను, ఏ ఇతర శక్తుల వలనను పీడనగాని ఆటంకముగాని ఉండదు.
శరీరము విడిచిన ఆత్మలు దేవుడు అనుగ్రహించిన కాలపరిమితి వరకు ఈ లోకములో వాయువులో చేరి సంచరిస్తుంటారు. ఆ తదుపరి అవి లోకము నుండి వేరుచేయబడి, ప్రత్యేకమైన భూమికి ఉపరితల భాగములో ఆ ఆత్మలు భద్రపరచబడి ఉంటారు. నూతనముగా శరీరమును విడిచిన ఆత్మలు తమ గడువు తీరినంతవరకు నరుల మధ్యలో వారికి కావలసిన ప్రాంతాల్లో పరిసరాల్లో సంచరిస్తుంటారు. మహా పుణ్య మార్గములో సంచరించిన ఆత్మలు - సమూహము ఒక గ్రూపుగాను మహా చెడ్డవిగా ఈ లోకములో జీవించిన పాపులు - మరొక సమూహముగాను, అటు పాపాలు చేస్తూ -ఇటు పుణ్య కార్యాలు కూడా మిశ్రమముగా చేస్తూ - మంచిచెడు కార్యాలలో నిమగ్నమగుతున్నవారు మరొక గ్రూపు. అన్యదేవతా విగ్రహాలు అనగా సృష్టికర్తను వదలి సృష్టములను, పశువులను, యోగులని - నరులను, దేవతలని వృక్షాలను పూజించువారు మరొక తెగగాను వేరుచేయబడుచున్నారు.
శరీరము విడిచిన ఆత్మలు అనేక విభాగాలుగ వేరు చేయబడి యుందురు. వారు భూమి మీద ఉన్న నరులను - సమస్తమును చూస్తున్నారేగాని, శరీరము విడిచిన ఆత్మలు నివసించు స్థలము వారికే తెలియదు - అదిప్రత్యేకించబడి యుండును.
ఆత్మ వేలాది మైళ్ళు దూరమును ఒక్క క్షణములో ప్రయాణించగలదు. ప్రతి వ్యక్తికి దేవుడు వారి వారికి కొంతవరకు ఆయుస్సును అనుగ్రహించియున్నాడు. దేవుడు అనుగ్రహించిన కాలము తీరక మునుపే నరులు మరణించుట జరుగుతుంది. ఎందుకంటే దుర్‌వ్యసనాల వలన, రోగాల వలన, యాక్సిడెంట్ల వలన శరీరము వదలుతారు. ఆ విధముగా శరీరము నుండి వేరైన ఆత్మలు దేవుడు ఇచ్చిన ఆయుష్కాలము తీరునంతవరకు నరుల మధ్యనే గాలిలో అటుఇటు సంచరిస్తుంటారు. ఆ తదుపరి వారు పై ఉన్నత ఆకాశ భాగాలలోని దైవ నిర్మిత ప్రదేశాలకు వారి ఆత్మలు చేర్చబడును.
...........
శరీరాత్మలకు పునర్జన్మ ఉన్నదా? అను ప్రశ్న నేడు భూమి మీద నరులైన మనలో వేధించుచున్నది. ఉన్నది అని దైవ గ్రంథము దీనికి సమాధానమిచ్చుచున్నది. దేవుని చేత నిర్మించబడిన తొలి నరుడు జీవాత్మ పూరితుడైనప్పటికిని మూగవాడుగా ఆతడు సంచరించినట్లు మనము గ్రహించవలసియున్నది. ఎందుచేతనంటే బైబిలులో దేవుడు ఆది నరునికి సాటిసహాయము అనగా స్త్రీని ఏర్పరచినంత వరకు మానవుడు మూగగానో మౌనిగానో ఉన్నట్టు తెలియుచున్నది. ప్రకటన :- పరలోకమందు ఒక దూత కనపడి ప్రభువు నందు మృతులైన మృతులు ధన్యులనియు మొదటి థెస్సలొనీక పత్రిక 4:13లో నిద్రించుచున్నవారిని గూర్చి,'' అనుటలో దాగియున్న దైవరహస్యమేమిటంటే - మరణమనునది దేవుని సన్నిధానములో గాఢ నిద్రగా ఎంచబడినట్లు తెలియుచున్నది. ఆదాము శరీరము నుండి జీవాత్మను వేరు చేసి దేవుడు జరిగించిన సాటి సహాయము అను స్త్రీ సృష్టిని శరీరము నుండి వేరుచేయబడిన ఆదాములో నివసించిన జీవాత్మ ఆత్మీయ నేత్రముతో వీక్షించినందున, ఆ నిద్ర నుండి మేల్కొన్న ఆదాము తన ఎదుట నిలబడియున్న స్త్రీ రూపమును గూర్చిన నిర్మాణ రహస్యమును గ్రహించినవాడై, ''నా ఎముకలలో ఎముక నా మాంసములో మాంసము, నాలో నుండి తీయబడితివి - గనుక నీవు నారివి,'' అనుటలో తన పూర్వ జన్మ స్మృతిని ఈ సంఘటన బయల్పరచుచున్నది.
గాఢనిద్ర అన్నది చనిపోయినవానితో సమానమైయుండి, ఆదాములో ఈ క్రియ జరిగిందంటే ఈనాడు చనిపోయిన నరునిలోని ఆత్మ మరియొక స్త్రీ గర్భములో శారీర రూపము దాల్చినప్పుడు దానికి పూర్వజన్మ స్ముృతులు, వృత్తాంతములు చెప్పుచున్నవంటే ఇది ఆశ్చర్యమెట్లగును?
దీని పరమార్థము :- శరీరాలు శిధిలములే. అస్థిరములే - ఆత్మ స్థిరమైనది. శరీరమునకు భిన్నములున్నవి గాని ఆత్మ మాత్రము ఏకత్వము పొందియున్నది. శరీరమునకు రూపములు ఉన్నవి. కాని ఆత్మకు రూపము లేదనియు, శరీరమునకు స్థిరమైన నివాసము లేదనియు, ఆ శరీరములోని జీవాత్మకు దాని సృష్టికర్తయైన పరమాత్మ స్థిర నివాసమై యున్నాడనియు మనము ఎరుగవలసియున్నది. జీవాత్మ శూన్యమైన శరీరము మృతము. మృతమైన శరీరము దుర్గంధపూరితము. మరియు అపరిశుద్ధము శరీరము వదలిన జీవాత్మ పరిపూర్ణ సమాధానమును పొంది, నిబ్బరమైన ఆత్మీయ జ్ఞానములో బరువు బాధ్యతల నుండి విడుదలను పొంది పరిపూర్ణ విశ్రాంతి నొందును. ఇందునుబట్టియే మత్తయి సువార్తలో ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైనవారలారా! నా యొద్దకు రండి - నేను మీకు విశ్రాంతి కలుగజేతును అనగా సమస్త జీవాత్మలారా! అని ఇందులోని భావము. ఆత్మీయ దేవుని స్వరూపమైన ఆత్మ శరీరుడైన యేసు ప్రభువు తన ప్రవచనములో ప్రవచించియున్నారు.
ఇందులో ఆదాము గాఢనిద్ర వరకు ఒక జన్మ. గాఢనిద్రలో సాటి సహాయమునకై నిద్రించు మర్మము మృత్యువుతో సమానము. ఆదాము మేల్కొని ఆ కార్యమును గుర్తించుటలో పునర్జన్మ స్మృతిగా మనము గుర్తింపవలసియున్నది. మానవునకు పునర్జన్మ ఉన్నదనియే ఇందులోని మర్మము.
ఇది దైవ క్రియలో ఆదాము ద్వారా బయల్పరచబడిన పునర్జన్మ మర్మము.
.........
అపవిత్రాత్మకు పునర్జన్మ రూపమును కల్పించుటకు కారకులు :- 1. సర్పము 2. ఈ లోక ఆశలకు దీని యొక్క భోగభాగ్యములకు దాసులైన నరులు మరియు ఆత్మజ్ఞానవిహీనులైన మనోనేత్ర అంధత్వము కల్గినవారుగా ఇట్టివారిని దైవదాసులు వర్ణించియున్నారు. ఎఫెసీ 2:2-3, రోమా 1:28
గలతీ 5:22 ఆత్మఫలానుసార జన్మలు గల్గిన స్త్రీ మరియమ్మ. కనుకనే ఈమెలో క్రీస్తు జన్మించగల్గినాడు. ఒకే జన్మలో రెండు రూపాంతరములు రెండు జన్మలు పొందినవారు ఉన్నారు. ఉన్నారనుటకు గ్రంథములో అక్కడక్కడ ఆధారములు ఉన్నవి. ఆదాము విషయములో ఆదాము సృష్టించబడినపుడు పవిత్రుడే. దైవ పవిత్ర జన్మలో నుండి అపవిత్రములో ప్రవేశించినట్లుగా రెండు జన్మలు మనకు కనపడుచున్నవి. ఉదా|| సౌలు - పౌలు - సిలువ మీద దొంగ.
..........
మృతులను గూర్చి :- రోమా 6:8లో మృతి పొందినవాడు పాపవిముక్తుడనుటలో గూఢార్థము. రెండవ కొరింథీ 5:7 ''ఈ లోకములో జీవించుచున్నంత కాలము ప్రభువుకు దూరస్థులము,'' లో వలె మన ఈ లోకజీవితము జరుగుచున్నట్లు గ్రహించవలెను. అయితే మన దేహము విషయము ఏమిటి? రెండవ కొరింథీ 5:1-3లో వలె గుడారము వంటి ఈ దేహముతో మూల్గుచున్నాము. కనుక ఈ లోకము మన దేహము స్థిరమైనవి కావు. ఎందుకంటే దేవుడు మనలను మన్నుగా శపించియున్నాడు.
.........
గుడారము :- దేవుడు భూమి మీద నివసించిన గుడారము నరుని శరీరము - అందులో జీవాత్మగా ఆయన జీవించాడు. అంతేగాని పరమాత్మగా జీవించలేదు. నరునియొక్క దేహములో ఆయన జీవిస్తూ - బాహ్యములో నరుని గూర్చి జీవాత్మునిగా ప్రకటించాడు. ఇది కొంత కాలమే జరిగింది. ఎందుకనగా నరునిలో వున్న దేవుని ఆత్మ పవిత్రమైనది, అయినను దేహము జరిగించిన అవాంఛనీయమైన క్రియను బట్టి నిషేధ ఫలభక్షణము వలన దైవాత్మ ప్రభావము నరుని నుండి తొలగింది. అందునుబట్టి నరుడు అపరిశుద్ధుడై దైవాతిక్రమణ చేసినందున దోషిగా తీర్చబడినాడు. ఇట్టి స్థితిలో నరునియొక్క జీవితము చెట్టు క్రింద జీవితమైంది. అనగా చెట్టు క్రింద జీవిస్తూ చెట్టు ఆకులను చుట్టుకునే దశ ఏర్పడింది. దీని ఫలితము నరుడు చెట్టు క్రింద జీవితాన్ని నోచుకోలేక ఏదెను అను దైవసన్నిధి నుండి వెలివేయబడినాడు. ఈ విధముగా తరిమివేయబడిన నరునికి దిక్కుమొక్కు లేకుండా - నేటి యుగములో రోడ్ల ప్రక్కన జీవించే - అభాగ్యుల కంటె కూడా నిరాదరణ స్థితిలో సతీసమేతముగా జీవిస్తూ ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చాడు. మొదటివాడు కయీను, రెండవవాడు హేబెలు. ఈ ఇద్దరిలో మొదటివాడైన కయీను పుట్టుక నుండియే పాపము యొక్క తొలి ఫలమైనట్టి ''కోపము - ద్వేషము'' అసూయ ఈ మూడింటి ద్వారా ప్రేమ లేని జీవితములో జీవిస్తూ ఈ మూడింటితో ఏకీభవించి, ఈ మూడింటితోనే జీవించాడు. కయీను యొక్క జీవితములో ప్రేమ సమాధానము గాని ఐక్యతన్నది లేనందువలన కయీను జీవితమంతయు పగ ద్వేషముతో మొదలై తన తోబుట్టువైన హేబెలును తమ్ముడని ఎంచక అనగా సహోదర ప్రేమ విలువను గ్రహించని స్థితిలో - హేబెలును చంపి దైవత్వము చేత శాపగ్రస్థుడై ఉనికిని కోల్పోయి దేశద్రిమ్మరిగా మారినాడు. చంపబడిన హేబెలు యొక్క నివాసము మరణములోనికి వెళ్ళింది. ఈ విధముగా శాపగ్రస్థుడైన దేశద్రిమ్మరియైన కయీను సంచార జీవియై, ఒక ఊరును కట్టినట్లుగ వేదములో వ్రాయబడియున్నది. కయీను కాలములో ఊరు కట్టే జ్ఞానము లేదు, ఇల్లు కట్టే జ్ఞానము లేదు, ఇల్లు అన్నదేమిటో కయీను కాలములో లేదు. కాని కయీను తనకు కావలసిన సాటి సహాయమును నాటి నరులలో వావివరుసలు కలిగిన నరసంతానము లేనందున, ఆదామునకు పుట్టిన సంతానములోనే తన తోబుట్టువును భార్యగా జేసికొని తద్వారా సంతానోత్పత్తి జరిగించినట్లు,'' ఆ విధముగా కయీను కొంత కాలము జీవించి భూమి మీద తన సంతానము విస్తరింపజేసినట్లు ఆది 6:లో మనము చదువగలము. అనగా నరులు భూమి మీద విస్తరింపగా దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి తమకు ఇష్టము వచ్చిన వారిని వివాహమాడిరి,'' అని ఈ వేద భాగములో వ్రాయబడి యున్నది. ఈ దేవుని కుమారులు ఆదాము సంతానము - నరుల కుమార్తెలు అనువారు కయీను సంతానము. వారిరువురి ద్వారా జనించిన సంతానమంతయు సంకర జనము.
ఇందునుబట్టి నరుల యొక్క జ్ఞానము దైవత్వము నుండి మరలి అటు దైవజ్ఞానమును ఇటు శారీర జ్ఞానమును కోల్పోయి, చంచల స్వభావులై అనగా స్థిరత్వము నిలుకడలేని బుద్ధిగలవారై జీవించుటను బట్టి - వారి జీవిత నివాసాలు స్థిరము లేనివై అస్థిరమైనవై - వారి బుద్ధి ఏ విధముగా వికటించి చంచలత్వముతో నానావిధములుగా ప్రవర్తిస్తున్నవో - అలాగే వారు ఆనాటి నరుల యొక్క జీవితాలు కూడా ఎటుబడితే అటు మరలి పెద్ద చిన్న - దేవుడు దయ్యము, లోకము నరుడు - పాపము పుణ్యము అనే ఇంగితజ్ఞానమును కోల్పోయి, వారి మనోభీష్టమును బట్టి వారి చిత్తానుసారము జీవించారు. అందువలన వారిని జలప్రళయము అను మారణహోమ ఉపద్రవమునకు అప్పగించాడు. ఈ జలప్రళయము ద్వారా సర్వమును నాశనకరమైనది. ఈ సందర్భములో తానెన్నుకున్న నీతిమంతుడైన నోవహు చేత నివాసము కట్టించాడు. ఈ ఓడ గృహము కూడా సంచారమే! జలముల మీద సంచారము చేసింది. ఈ విధముగా ఓడ గృహములో జలముల మీద సంచరించిన నోవహు సంతానము జలప్రళయ అనంతరము భూమి మీద సంచారము చేయ మొదలుపెట్టినారు. అట్టివారిలో ప్రధముడు అబ్రాహాము. నోవహు - ఓడలో జలముల మీద సంచారము చేస్తే అబ్రాహాము - భూమి మీద ఆయా స్థలములలో గుడారములలో తన సంచార జీవితము సాగించినట్లుగ వేదములో చదువగలము.
యోహాను 12:24
గోధుమ గింజ భూమిలో పడి అది చావకుంటేనేగాని అది ఫలించదు. అదే విధముగా మానవుడు మరణించి భూమిలో పాతివేయబడినను, అతడు విస్తారముగా ఫలించుననెడి భావము కలదు. కాని గోధుమ గింజ గాని అది ఏ గింజయైనను ఆ గింజలో ఆహారమున్నది, జీవమున్నది ప్రాణమున్నది. కనుక అది పాతివేయబడినప్పుడు అది మొలకెత్తి విస్తారముగా ఫలించుచున్నది. కాని చనిపోయిన వ్యక్తి శవము అందులో ప్రాణము లేదు జీవము లేదు గోధుమ గింజలో వలె అందులో ఉపకరించే పోషకాహారము లేదు. కుళ్ళి - కృశించిన శరీరము భరించరాని దుర్వాసనతో కూడినది. కనుక మానవ శరీరము పాతివేయబడి నప్పుడు అది ఫలించుటకు ఎట్టి అవకాశాలు లేవు. అది మట్టిలో కలిసి మన్నయి పోవలసిందే, కనుక లోక సంబంధమైన ఆహార ధాన్యాదులతో చనిపోయినవారి శరీరాలకు సంభవించు మరణానికి ఎందుకు పోల్చినట్లు?
ఇందులో భావమేమిటంటే గోధుమ గింజగాని అది ఏ గింజగాని - ఆ గింజ ఎవరు? సృష్టికర్తయైన దేవుని అవతారమైన యేసుక్రీస్తు ప్రభువే - ఆ గింజ. అంతేగాని లోకసంబంధమైన ఏ నరుడును ఆ గింజకు యోగ్యుడు కాడు. గట్టి గోధుమ గింజ వంటి యేసుక్రీస్తు ప్రభువులో ఆయన చనిపోయినను ఆయన శరీరము ఆత్మ సంబంధమైందే కాబట్టి క్రైస్తవులకు అది దివ్యాహారమైయున్నది. గోధుమ గింజ పాతివేయబడినప్పుడు అది తిరిగి ఎట్లు మొలకెత్తి నూతన రూపము దాల్చి వస్తుందో అలాగే యేసుక్రీస్తు ప్రభువును సిలువలో చంపి సమాధిలో పాతివేయబడి భద్రము చేసినను, ఆ శరీరము నూతన జీవముతో పునరుత్థానమై మహిమ శరీరముతో అనేక ఆత్మలను దైవసన్నిధికి చేర్చి ఫలింపుననుగ్రహిస్తుంది. యేసుక్రీస్తు శారీరము గోధుమ గింజకు వలెనే ఆయనలో ఆహారమున్నది - జీవమున్నది అనగా నిత్యజీవమున్నది. దైవసన్నిధిలో ఆత్మలు ఫలింపజేయు శక్తి సామర్థ్యమున్నది. అంతేగాని నరునియొక్క శరీరాన్ని గోధుమ గింజకు పోల్చరాదు. నర శరీరముతో భూమి మీద జీవించియున్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువుతో అంటు గట్టుకొని అనేక ఆత్మలను ప్రభువు సన్నిధిలో ఫలించాలేగాని, జీవము వీడిన నరశరీరము ఒట్టి మట్టియే. దైవసన్నిధికి పునరుత్థానము కాగల స్వయంశక్తి నర శరీరానికి లేదు. పాతివేయబడిన గోధుమ గింజకు నరుని మరణము పోల్చకూడదు. పాతివేయబడిన గింజ అది ఏదైనను క్రీస్తు యొక మరణమునకు ఆయన సమాధికి ఆయన పునరుత్థానమునకు సాదృశ్యమైయున్నది. యేసుక్రీస్తు ప్రభువుతో అంటుగట్టుకొన్న ప్రతి ఆత్మ గట్టి గోధుమ గింజయే అగుచున్నది. ఎందుకంటే ఆయనలోని నిత్యజీవయుతమైన ఆహారము ఈ ఆత్మలను కూడా విశేషముగా ఫలింపజేస్తున్నది. నాలుగు రోజుల క్రిందట పాతివేయబడిన గింజ మొలకెత్తును. వేల సంవత్సరాలు గడిచినను పాతివేయబడిన నర శరీరము స్వయంశక్తితో పునరుత్థానము కానేరదు. కాబట్టి పాతివేయబడిన అది ఏ గింజయైనను అది ''మరణించి సమాధి చేయబడి మూడవ నాడు పునరుత్థానమై - లోకము అంతటినుండి దేవుని రాజ్యమునకు నరశరీరుల ఆత్మలను దైవసన్నిధిలో చేరి మంచి ఫలింపును అనుగ్రహించుచున్న యేసుక్రీస్తు ప్రభువే - ఈ గట్టి గోధమ గింజ. ఈయనను అంటు గట్టుకొని ఫలించే గింజలన్నియు దేవుని కొట్టులో కూర్చబడి భద్రము చేయబడుచున్నవి. యోహాను
16:16 ఈయనలో ఫలించని ఆత్మలు పొట్టు వలె బయట పారవేయబడి కాల్చబడుచున్నవి. యోహాను 15:6.
.........
ఆదాము శరీరములో ఏ విధముగా జీవాత్మ ప్రవేశిస్తే బ్రతికినాడో ఆ విధముగానే సమాధులలో మట్టి తినిన శరీరములను, ఆ రోజున సమాధులలో జీవాత్మ ప్రవేశించినప్పుడు సమాధులలో పూడ్చి వేయబడిన శరీరములన్నియు రూపుదిద్దుకొని శరీరములతో బయటకు వస్తారు. క్రీస్తు చనిపోయినప్పుడు సమాధులలో నుండి అనేకులు బయటకు రావటం జరిగింది. శరీరము విడిచిన ఆత్మలు విగ్రహారాధికులైన పక్షమున వారు ప్రార్థించుటకు విగ్రహాలు ఆత్మలు నివసించు స్థలములో ఉండవు. శరీరము విడిచిన ఆత్మలు అన్యులైనను ఏ మతస్థులైనను కలిసియేయుందురు. తాడు మీద పరచిన వస్త్రము వలె ఆత్మలు మధ్యాకాశములో ఉండును. ఆ స్థలము మిగుల ప్రశాంతిగా ఉండును. ఆత్మలు నివసించుటకు మధ్యాకాశములో మూడు రకముల స్థలములుండును. 1. ప్రశాంత స్థలము 2. వేదన స్థలము 3. ఉత్తరించు స్థలము. ఆయా స్థలములకు ఆయా ఆత్మలు వారు చేసిన క్రియాకర్మలనుబట్టి కాలక్రమేణా స్థల మార్పు జరుగుచు కొనిపోబడుదురు.
శరీరము విడిచిన ఆత్మలు ఈ లోకములో వారేమి పనులు చేసేవారో ఏయే వ్యాపారాలు చేయుచుండిరో మొదలైన వివరాలన్నియు టి.విలో వలె దృశ్య రూపములో వారి ఆకారము వారి రూపములతో కూడా ఆత్మదర్శన్ ద్వారా చూపగలదు. తన ఆత్మీయుల కలలో కూడా ప్రవేశించగలదు. ఆత్మలు నివసించు స్థలము చాలా ప్రశాంతముగా నయనానందకరముగ ఉల్లాసముగ నుండును. ఆకాశ మధ్యములో శరీరము విడిచిన ఆత్మలు నివసిస్తాయి. ఆత్మలు తమ శరీరములతో ఉన్నప్పుడు సాధించిన పుణ్యక్రియలను బట్టి మధ్యాకాశమును దాటి పై లోకాలను స్వతంత్రించుకొందురు. అన్నిటికంటే సుదూరములో పైన ఉండే లోకము పరలోకము. భూమి మీద కొన్ని ఆత్మలు - భూమి క్రింద భాగమైన పాతాళములో కొన్ని ఆత్మలు, భూమి పై భాగాన కొన్ని ఆత్మలు నివసించును. ఆ పై లోకాలలో కూడా వివిధ రకముల ఆత్మలు వాటి శక్తి సామర్థ్యాలనుబట్టి స్వతంత్రించుకొనియుండును. ఆకాశ మధ్యమములో ఉండే ఆత్మలు భూమి మీద నరులు చేయు వివిధ రకములైన సమ్మెలు, సత్యాగ్రహాలు, ప్రచారములు, వారివారి ఉత్సవ కార్యక్రమములు మొదలైనవి. ఆకాశ మధ్యము నుండి భూమి మీద నరులు చేయు వివిధ కార్య కలాపములను దర్శించుదురు.
.........
దయానంద సరస్వతి అనునతడు వ్రాయబడిన తన పేరు గల పట్టీిని నడుముకు కట్టుకొని దర్శనమిచ్చాడు. తాను వేదములే దేవుళ్ళు అనుకొని తప్పటడుగులు వేశాను. కాని నిజమైన గ్రంథము బైబిలు; నిజమైన దైవ అవతారము యేసుక్రీస్తు,'' అని తన అభిప్రాయము వెల్లడించాడు. కాని నేను చెడినదేగాక తన గ్రంథము ద్వారా అనేకమందిని తప్పుదారి త్రొక్కించిన పరిస్థితి ఏర్పడింది. అందులో ప్రధానుడు ముఖేష్ ఘోష్ చటర్జీ. అతని సమాధి ఇప్పటికి కూడా ఉన్నది. దానికి పూజలు కూడా జరిపిస్తున్నారు. నేను మధ్యలో చంపబడినవానిని. దైవత్వమునకు విరోధముగా నేను వ్రాసిన గ్రంథమే - తప్పు త్రోవ ఏర్పరచింది. అందుకే నేను బహుగా దుఃఖిస్తున్నాను. యదార్థమైన దైవ గ్రంథమును దుయ్యబట్టుటయే నేను చేసిన నేరము. మానవ కల్పితాలైన వేదాలను పరిశోధించి అవియే సత్యాలని నిరూపించినాను. నేను వేదాలను పరిశోధిస్తే - అవి నన్ను పరిశోధించి పనికిమాలినవానినిగా చేసెనని నేను గ్రహించలేకపోయినాను.
.........
యోహాను 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు.'' ఆత్మల యొక్క తరగతులు విభజింపబడి ఆయా నివాసములలోకి కొనిపోబడుదురు. మొదటి థెస్స 4:14 యేసునందు నిద్రించినవారిని దేవుడు ఆయనతో కూడా వెంటపెట్టుకొని వచ్చును. అప్పుడు ఆత్మల యొక్క నివాసములు మార్చబడును. వాటి వాటికి తగిన అర్హత గల నివాసములు ఈయబడును. అంతవరకును దయానంద సరస్వతిగాని మరెవ్వరైనను ఇప్పుడున్న నివాసములలోనే ఉండవలసిందే! ఎఫెసీ 6:12 ఆకాశమండలమందున్న దురాత్మల సమూహము వలన కూడా శరీరము విడిచిన ఆత్మలు బాధింపబడుచుండును.
యోగులకు విగ్రహారాధన లేదు. వారి చేతిలోని కమండలములోని నీరు జీవజలమునకు సాదృశ్యము. వారు ధరించు చిలుక కొయ్య క్రీస్తు సిలువకు సాదృశ్యము. కాలము తీరి శరీరమును విడిచిన ఆత్మలు ఉండు స్థలములోకి - ఆత్మహత్య చేతను, యాక్సిడెంటు చేతను శరీరమును విడిచిన ఆత్మలు వెలివేయబడును. అవి తమ సాధారణ శరీరము యొక్క ఆయువు కాలపరిమితి తీరునంతవరకు భూమి మీద సంచరించును. ఆ ఆత్మలే సోదెలోను దయ్యములై, బ్రతికియుండువారిని ఆవహించి బాధించుటయు భూమి మీద సంచరించుచుందురు. యుద్ధములో చనిపోయి విడువబడిన ఆత్మలు -దేవుని కొరకును నీతి కొరకును ప్రాణము పెట్టలేదు. కాబట్టి అవి నిత్యజీవమును స్వతంత్రించుకొనవు. దేవుని రాజ్యమును పొందలేవు. యుద్ధ సైనికులు తమ జీవనోపాధి నిమిత్తము, ఉద్యోగరీత్యా చేరినవారే గనుక దైవరాజ్య ప్రవేశము యుద్ధములో మరణించినవారికి లేదు. క్రీస్తు కొరకును నీతి నిమిత్తము సువార్త సంబంధముగా హతసాక్షులకును పరలోక ప్రవేశము లభించును.
శరీరము విడిచిన ఆత్మను తీసికొనిపోవుటకు మరణ దూత వచ్చి, ఆ ఆత్మను తోడ్కొనిపోయి, ఆ ఆత్మ యొక్క నివాస స్థలమును చూపి అందులో ప్రవేశపెట్టును. కొన్ని రకముల ఆత్మలు నివసించు స్థలము చెరువు వలె కనబడుచున్నది. అందులో ఆ ఆత్మలు ప్రశాంత వాతావరణములో కలిసికట్టుగా - ఆ చెరువు వలె కనబడు ఆ తటాకమును ఆశ్రయించి అందులో నివసించును.
శరీరము వదలిన ఆత్మలకు దైవబోధయుండును. ఆ ఆత్మల స్థలములో విగ్రహాలు ఉండవు. పలురకములైన కల్పనా కథలతో కూడిన లోకసంబంధమేమియు అందులో ఉండవు. దైవసంబంధమైన బైబిలు చేత ధరించుకొన్న బోధకులు బోధించువారుగ ఉందురు. భూమి మీదను - మధ్యాకాశములోను పరలోకములోను దేవుని గ్రంథమున్నది. ఆత్మ రాజ్యములో దైవ ప్రార్థనలు విస్తారముగా ఉండును. దేవుని తీర్పు కొరకు ఎదురు చూచుచుందురు. లోకసంబంధమైన కాషాయ గుడ్డలు, రుద్రాక్షమాలలు విభూది బొట్లు ఇవన్నియు లోకసంబంధమైన వేషధారణయేగాని వాటిలో ఏమియు ప్రయోజనము లేదు,'' అని శరీరమును విడిచిన దయానందసరస్వతి ఆత్మ తెలుపుచున్నాడు.
లోకసంబంధమైన వ్యామోహము వదలలేక శరీరము విడిచిన ఆత్మలు భూమి మీదనే తిరుగు చుండును. ఒక సినిమా చూడాలని అపేక్షించేవాడు ఆ సినిమా విడుదలకు పూర్వమే చనిపోతే ఆ ఆత్మ సినిమా మీది వ్యామోహము చేత, అది విడుదలైన సినిమాలో ప్రవేశించి టిక్కెట్టు లేకుండ చూస్తుంది. భూమి మీద అవి ఎచ్చటికైనను సంచారము చేయగలవు, ఏవైనను దర్శించగలవు. భూనివాసులను పట్టి పీడించనుగలవు. ఆ ఆత్మల సంబంధికులకు కలలో దర్శనమిస్తుంటాయి. శరీరముతో నివసించువారు ఆత్మలను చూడలేరుగాని శరీరమును వదలిన ఆత్మలు శరీరులను చూడగలరు. కాని వారితో మాట్లాడలేరు. ఆత్మ యోగదర్శనాపరులకే అది సాధ్యము - అందరికి అది అసాధ్యము.
నిజమైన దేవుని ఎరిగి ప్రభువులో జీవించి చనిపోయిన ఆత్మలకు ఒక ప్రత్యేకమైన స్థలముంటుంది. అచ్చట వేదనయైనను, ఏడపుయైనను, దుఃఖమైనను, బాధలైనను ఉండవు. వారికి అందరికి ఆయా భాషలు మాట్లాడువారు, ఆయా భాషలలో చేసే ప్రార్థనలు, పాటలు కలసి లిపి గల భాషలతోబాటు - లిపి లేని మరి కొన్ని భాషలతో కూడా అవి ఉండి, ఆనాటి గీతముల ప్రార్థనల ఆలాపన యొక్క శబ్దము ప్రత్యేకమైన శ్రవణానందమును, ఆనందోత్సాహమును కల్గించును. ఆడా మగా తేడా లేదు. అందరు కలిసిమెలసి ఆనందముగా ఉత్సాహ గానములు చేయుదురు. ఈ ఆత్మలకు అన్నిటికిని కలసి ఒక ఆత్మ భాష ఉంటుంది. ఆ ఆత్మ భాషలోనే దేవదూతలు ఈ ఆత్మలను క్రమబద్ధము చేయుచున్నారు. ఇవి భూమి మీద సంచరించు పరిధిని తెలియజేయుదురు. ఆ పరిధికి మించి ఎక్కడను తిరుగుటకు అనుమతి ఉండదు.
భూమి మీదనే దేవుడు నరుని జేసి వానిలో ఆత్మప్రతిష్ట చేశాడు. కాబట్టి శరీరము వదలిన ఆత్మ భూమి మీద పదేపదే సంచరించుటకు అవకాశముంటుంది. కాని చంద్రమండలమని ఇతర అంతరిక్ష గృహాలలోకి వెళ్ళదు. వెళ్ళుటకు పర్మిషన్ లేదు. భూమి మీద పెద్ద బోధకుడుగా ఉండవచ్చు లేదా ఫాస్టరుగానో రెవరెండు బిషప్పుగానో - పెద్ద ప్రతిభ గల వేదాంతిగానో ఉండవచ్చును. కాని వీరందరు దేవదూత చేసే దైవారాధనలను, వారు చేయు సువార్త బోధను వినవలసినవారేగాని వీరు అక్కడ ప్రసంగించుటకు అనుమతి లేదు. ప్రకటన 14:6 వీరి జ్ఞానము దేవదూతల జ్ఞానము ముందు లెక్కలోకి రాదు.
శరీరము విడిచిన ఆత్మలు నివసించు ఆ మహాపట్టణము ఆత్మలకు మాత్రమే నిలయము, శరీరులకు అందులో ప్రవేశము లేదు. క్రీస్తు నెరుగని ఆత్మలకు ఆ మహాపట్టణము యొక్క వెలుపలనే గతి గాని అందులో ప్రవేశింపలేవు. కనుక భూమి మీద క్రీస్తు ద్వారా పరమాత్మను తెలిసికొని ఆయనను ఆరాధించుటయే నరజీవికి ధన్యత చేకూరుస్తుంది. కాని మరి ఏ నామమును ఏ దేవుని పేరట గాని ఆత్మ పరమాత్మతో విలీనము కాదు. వారు నివసించు ఆ మహాపట్టణము రాత్రి పగలు లేక ఎప్పుడు తేజోమయమైన దేవుని అపారమైన దివ్య వెలుగులో నిండియుండుటయేగాక, కొన్ని ఆత్మలు ఆ వెలుగులో నిరంతరము ఉండజాలక భూమి మీద అంధకారములో ఉంటూ వెళ్ళుచుండును.
సృష్టికర్తయైన పరమాత్మ యొక్క నరావతారమైన క్రీస్తును తెలిసికొనక శరీరము విడిచిన ఆత్మలు - క్రీస్తును ఎరిగినవారి ఆత్మల పట్టణములో ప్రవేశించుటకు వీలుండదు. వాటికి వీటికి మధ్య మహా అగాధము ఉంచబడియున్నది. దయ్యపు ఆత్మలుగాని, అపవాదిగాని, వాని దూతలుగాని క్రీస్తు నెరిగి సమాధానకర పరదైసు అను ఆ మహాపట్టణము నందున్న వారి జోలికి అవి వెళ్ళలేవు. శరీరము విడిచిన ఆత్మను అపవాదిగాని, వాని దూతలుగాని ఏమియు జేయలేవు. శరీరమును విడుచు సమయములో శరీరము రోగగ్రస్థముగాను, ముసలితనముగాను ఉన్న రూపమును ఆత్మ ధరించదు. ఇంచుమించు నడివయస్సులో గల మంచి ఆకర్షణీయమైన శరీర రూపమును ఆత్మ ధరించును. భూమి మీద మనము బాగుగా సన్నిహితముగా ఉన్న వాని ఆత్మను మనము దర్శించినట్లయితే గుర్తుపట్టుట కూడా కొంత కష్టముగా ఉండవచ్చును. నేను పలాని వాని శరీరములోని ఆత్మనని అది చెప్పుకుంటుంది. భూమి మీద చనిపోవుటకు ముందున్న శరీరము వాడిపోయి రోగగ్రస్తముగా ఉంటుంది. ఆత్మ శరీర రూపాన్ని ధరించు కొనుటకు ఆ శరీరము యొక్క ఆకర్షణీయమైన బలిష్టమైన చక్కనైన, ప్రకాశవంతమైన నడివయస్సు రూపాన్ని ధరించుకొంటుంది. కనుక ఒక్కొక్కసారి గుర్తుపట్టుట కష్టము.
క్రీస్తు నెరిగిన ఆత్మలు అందరు తెల్లని అంగీలు వస్త్రముగా ధరించియుంటారు. పైన వేసుకొనే ముసుగులు, కండువాలు మొదలగునవి. స్త్రీలో నుండి వచ్చిన ఆత్మలు ఒకరకముగాను, పురుషులలో నుండి వచ్చిన ఆత్మలు మరొక విధముగాను వస్త్రధారణ ఉంటుంది. చేతులలో చిన్న పుస్తకాలును మరికొందరికి యేసుప్రభువు ఆకారము లేనట్టి సిలువలు మరికొందరు ధరించి ఉంటారు. ఈ ఆత్మలు ఎవరికిని ఏ విధమైన అపకారము చేయవు.
శరీరులు దిగంబరులుగా కనబడవచ్చునేగాని - శారీరము విడిచిన ఆత్మలు వస్త్రములు ధరించినవారుగానే కనబడుతారు అని వేదము 2వ కొరింథీ 5:2 వివరిస్తున్నది. టి.విలో బొమ్మలు ఏ విధముగా కనబడుచుండునో ఆలాగే పరదైసులోనివారు ఉంటారు. అన్ని విధాలుగ కనబడుతారేగాని, శరీరులకు వారు అందుబాటులో సన్నిహితముగా ఉండలేరు. టి.వి.లోనివారు వివిధ వంటకాలతో కూడిన భక్ష్యమును ఆరగిస్తారు. కాని చూచేవాళ్ళు వాటిని వాసన చూడలేరు. భక్ష్యములను రుచి చూచుటకు వీలుండదు. ఆ విధముగానే పరదైసులోనివారు మనకు దర్శనములో కనబడగలరుగాని వారిని తాకుటకుగాని మరి ఏదైనను మనకు వారికి సంబంధబాంధవ్యాలుండవు. యేసుక్రీస్తు ప్రభువు కుడివైపు సిలువ వేయబడిన దొంగ కూడా సమాధానకర పరదైసులో అంగీ వేసుకొని తిరుగుచున్నాడు. అక్కడ ఉన్నవారందరు తెల్లని అంగీలు ధరించి ఉంటారు. ఆడ మగా బేధము లేదు. ఆత్మలకు లింగ భేదము లేదు. వయోబేధము లేదు, సంపర్కము లేదు. బిడ్డలు కనుట, బహిష్టు ముట్టు దోషాలు లేవు. స్నానపానాదులు లేవు. ఆకలి దప్పులు లేవు. జలపాతములలో నీటి మీదను, సముద్రము నదులు తటాకముల యందును ఆత్మలు విహరిస్తుంటాయి. అలల మీద తేలుచుండును. అడవులలో సంచరిస్తాయి. ఆత్మలు ఈ లోక శరీరముతో ఉండేవారిని స్పష్టముగా చూచెదరు; వారి మాటలు వింటారు. కాని వారిని శరీరులు దర్శించలేరు. వారితో సంబంధబాంధవ్యాలు పెట్టుకోలేరు. శరీరము విడిచి వేదనకరమైన స్థలములో బాధలు పడే ఆత్మలు - భూలోకములో తాము విడిచి వచ్చిన ఆత్మీయుల మీద ప్రేమ మమకారమును వదలలేక తమ శత్రువుల మీద ద్వేషమును పోగొట్టుకోలేక, ఎదురుపడిన వారిలో ప్రవేశించి వారిని, వారి కుటుంబాలను ఎన్నో కష్ట నష్టాలకు గురిజేస్తాయి. తనకేవిధముగా ఆత్మకు శాంతి లేకుండ అల్లలాడుచు ఉంటుందో అదే రీతిగా భూమి మీద నరులను అశాంతి పాలు జేయాలని, వీరందరు తన వలెనే వేదనకర పరదైసుకు రప్పించాలని దేవుడైన ప్రభువు సన్నిధికి రానీయక అన్యదేవతా విగ్రహాల దగ్గరకు, మంత్రగాళ్ళ దగ్గరకు రప్పిస్తుంది. నాశనకర మార్గానికి గొయ్యి త్రవ్వుతుంది. సమాధానకర పరదైసులోని ఆత్మలను అపవాదిగాని, అపవాది దూతలుగాని, దయ్యపు ఆత్మలుగాని వారిని ఏమియు జేయజాలవు. వారికి కనబడుటగాని సమాధానకర పరదైసులో ప్రవేశించుటయుగాని జరుగదు. వాయుమండలాధిపతియని సాతానుకు పేరున్నది. అతడు వాయుమండలమును ఆక్రమించుకొని వాయువులో ప్రయాణము చేయుచున్న విమానమును తలక్రిందులు చేసి, దానిని ప్రమాదకర పరిస్థితులలో పడవేయుటకు కూడా అపవాదియనువాడు సర్వసమర్థుడు. ఎందుకంటే వాయువు అతని అధీనములో ఉంచుకొనియున్నాడు.'' విగ్రహారాధనతో మ్రగ్గి జీవితకాల మంతయు గడిపిన నరులు - శరీరము విడిచిన తర్వాత వారికి వేదన తప్ప, దైవిక సహాయముగాని, ఏ యొక్క విగ్రహముగాని, ఏ యొక్క రూపముగాని, నైవేద్యాలుగాని వారికి అక్కడ కనబడవు. ఏ విధమైన సహకారము లభించదు. వారు ఈ లోకములో జరిగించిన విగ్రహారాధనయంతయు దైవ సమ్మతము కాదు గనుక, ప్రతిఫలము లేక కష్టనష్టాల పాలగుదురు. నైవేద్యము అనగా ఆత్మ కల్గియున్న నరుడు కష్టనష్టాలలో ఇరుకు ఇబ్బందులలో శ్రమలతో ఉన్నప్పుడు వానికి చేయు ఏ కొంత సహాయమైనను అది నైవేద్యము అని బైబిలులో వ్రాయబడియున్నది. అంతేగాని నోరు లేని విగ్రహాలకు నైవేద్యాలు సమర్పించు వాడు శాపగ్రస్థుడని కూడా వ్రాయబడియున్నది. కడుపు కాలేవానికి గంజి అన్నము పెట్టక గొంతు ఎండిపోవువానికి గ్లాసుడు మంచి నీళ్ళు ఇయ్యక; చలికి బాధపడువానికి ముతక వస్త్రమునైనను ఇయ్యక విగ్రహాల ముందు టెంకాయలు కొట్టి నీళ్ళు పారపోయువాడు - ఇటు దైవదృష్టిలోను మానవ దృష్టిలోను ఏ పాటివాడో చదువరులు గ్రహించండి. ఇందునుగూర్చి యెషయా 42:17 యెహెజ్కేలు 6:13 చదువగలరు.
........
హోమియో డాక్టరు సుబ్బారావుగారు శరీరము విడిచిన తర్వాత 5 సంవత్సరముల తదుపరి ఆ ఆత్మ చేత ఇయ్యబడిన కొన్ని వివరాలు.
దర్శనమిచ్చిన ఆ ఆత్మ రూపము :- లేత పసుపు రంగు సిల్క్ షర్టు ప్యాంటు, మెడలో గొలుసు, చేతిలో కొయ్య రుద్రాక్షమాల, మెడలో చైనుకు వ్రేలాడే సిలువ కన్పించలేదు - అది షర్టు లోపలికి వేయబడియున్నది. లోపల ఆ చైనుకు సిలువ ఉందో లేదో తెలియదు. చేతిలో కొయ్య పూసల జపమాల పిడికిటిలో ఉండగా చుట్టుకొని పట్టుకొనియున్నాడు. ఆ జపమాలకు సిలువ వ్రేలాడగట్టబడి యున్నదో లేదో తెలియదు. కొంతభాగము పిడికిటిలో ఉన్నది.
తాను జీవించియున్న కాలములో తాను ఉపయోగించుచున్న వస్తువులలో ఉన్నవి, స్టెతస్కోపు పాత టేబిలు కుర్చీ, ప్యాంట్ ఒక చొక్కా, కరెంట్ ట్రీట్‌మెంటు చేసే మూడింటిలో ఒకటి మాత్రమే ఉన్నది. రెండవ కుమార్తెకు నేను అప్పుడప్పుడు కలలో కబడుతుంటాను. నేను ఈ ఇంటిని వదలక అంటి పెట్టుకొని యున్నాను. ఆ ఆత్మ దర్శనమిచ్చినప్పుడు ఏడ్చుచుండుటయు, దిక్కులేని కుటుంబమును గూర్చి వేదనపడుట స్పష్టముగా కనబడుచున్నది. ఆ ఆత్మ ఆ కుటుంబమును గూర్చి వివిధ రీతులుగా పోరాటము సల్పుచున్నది. ధరించుకొన్న వస్త్రములు లోగడ శరీరముతో ఉన్నప్పుడు ధరించుకొన్న వస్త్రధారణ కంటే సుందర రూపము కళ కనపడుతున్నది, అనగా కొంత మెరుగైన రూపము ధరించింది. లోగడ ఈ కుటుంబము వేరొక పూరింటిలో ఉన్నప్పుడు, ఆ ఇంటిలో ఎప్పటినుండియో ఉన్న కాటేరి వలన తన కుటుంబ సభ్యులకు ఏ మాత్రము ఆటంకము కష్టాలు కలుగకుండ, ఈ ఆత్మ సదాకాలము కనిపెట్టుకొని ఆ ఆత్మ వలన తన కుటుంబానికి కీడు కలుగకుండ కాపాడింది.
ఒకసారి పూర్తిగా వారు ఆర్థిక ఇబ్బందులలో తగుల్కొని యున్నప్పుడు ఒక లెటరు కావలసి వచ్చింది. లెటరు వ్రాయుటకు డబ్బులు లేవు. ఆ రోజు రాత్రి రెండవ అమ్మాయి కలలో అమ్మా! పలాని పుస్తకములో ఒక వ్రాయబడని ఇన్‌లాండ్ లెటర్ ఉంది. అది తీసుకొని లెటరు వ్రాయండి అన్నాడు. నిదుర లేచినప్పుడు అందులో వ్రాయబడని క్రొత్త లెటరు ఉండుట ఆశ్చర్యము కల్గించింది. ఇంతకును ఈయన చనిపోయి ఇన్ని సంవత్సరములుయైనను కూడా ఆ ఆత్మ - ఆయన స్వకుటుంబీకులతో నివసించుచుండుట ఎట్లు సాధ్యము? ఎందుకంటే ఏ ఇంటిలో శరీరాన్ని విడిచిన ఆ ఆత్మ - ఆ ఇంటిమీది వ్యామోహముతో ఆ ఇల్లు విడిచి వెళ్ళకుండ - ప్రతి కుటుంబములోను శరీరాన్ని విడిచిన ఆత్మలు వారి వారి ఇండ్లలోనే ఉంటాయి కదా! అట్లుండుటకు వీలులేదు. ఎందుకంటే ఈ ఆత్మకు ఆయువు యొక్క కాలపరిమితి తీరలేదు. అకాలమృత్యువు వాతబడినాడు. కాబట్టి దేవుని దూత పిలుపు వరకు ఆయన స్వకుటుంబీకులతోను ఆ ఆత్మ నివసిస్తుంటుంది. ఆ ఆత్మ శరీరములో నివసించవలసిన కాలపరిమితి తీరిపోగానే ఆ ఇంటి నుండి వెళ్ళిపోవలసియున్నది. ఏ పరిస్థితులలోను ఆ ఇంటిలో ఉండుటకు వీలులేదు.
10:9-89 ఆదివారము. శరీరము వదలిన యాళ్ళ జార్జి దంపతులతో జరిపిన సంభాషణ. ఆత్మను పిలచుటకు ముందు జార్జి యాళ్ళ పోలికలతో రూపముతో సాతాను ప్రవేశించకుండ ముందు జాగ్రత్తగా ప్రార్థన చేసి, సువార్త సేవ నిమిత్తముగా ఆ ఆత్మను మా సన్నిధికి పంపమని కోరినాము. లాయరు గారి పేరు కాగితము మీద వ్రాసి ఆ ఆత్మను మా సన్నిధికి పంపమని సర్వేశ్వరుని ప్రార్థించినప్పుడు ఆ ఆత్మ మా సన్నిధికి పంపబడింది. రెండు నిమిషముల వ్యవధిలో ఆ ఆత్మ ప్రవేశించింది. మా అబ్బాయిని మీరు డబ్బులు ఇవ్వమని మాకు మీ నాన్నే చెప్పిస్తున్నాడని చెప్పండి. మా జీవితాలలో మేము దైవిక కార్యాలు సమృద్ధిగ చేయలేదు. మంచి ఇల్లు కట్టించినాను, బ్యాంకుల్లో సమృద్ధిగ డబ్బు ఉంది. నేను బ్రతికిన దినములలో కెనడాకు వ్రాసి నా కన్న బిడ్డలనే దిక్కులేనివారని, నేను వారిని సాకుతున్నానని డబ్బులు తెప్పించుచుండేవాడిని. ఆనాడు పిల్లల పెళ్ళిళ్ళు అయిన వెంటనే మేము ఇరువురము కొన్ని నెలల తేడాతో శరీరాన్ని వదలి నిజముగానే అనాధలయ్యాము. దిక్కులేని పిల్లలు అని చెప్పుకొంటున్న మాకు తల్లిదండ్రీ లేరని చెప్పుకొన్నందులకు, నిజముగానే తల్లిదండ్రులను లేకుండా చేశాడు - దేవుడు. నేను నా భార్య ఆ ఇంటి ముందు గదిలో ఉంటున్నాము. నా కోడలు నూరి చేసిన గోంగూర పచ్చడి అంటే నాకెంతో ఇష్టము. నాకు లోక ఆశలు చావలేదు. కనుక నన్ను ఎవరి శరీరము మీదనైనను నన్ను ప్రవేశపెట్టు. ఎందుకంటే ఎలీషా ఆత్మ గేహాజీని వెంటాడింది కదా! అన్నాడు. అందుకు నేను ఆ ఆత్మ గేహాజీలో ప్రవేశించలేదుగాని ఆ ఆత్మ వెంటాడింది - అంతమాత్రమే గదా! అన్నాను. అంతగా ప్రవేశించాలి అనుకుంటే తానే స్వయముగా ప్రవేశించవచ్చును గదా! అని నేనన్నాను. అందుకు జవాబు లేదు. ఆ తర్వాత నేను ఆత్మతో - మీ అబ్బాయి కలలో కనబడి సువార్త ప్రచురణకు మాకు డబ్బు ఇవ్వమని నీ కొడుకుతో చెప్పమని బలవంతపెట్టినాను. కలలో కనబడి చెప్పుటకు కొన్ని అడ్డంకులు ఏర్పడుతాయి. దానికి పరిస్థితులు అనుకూలము కావాలి అన్నాడు. ఒక్కొక్కసారి జరుగవచ్చును కొన్ని యెడల తప్పిపోవచ్చును, నేను చెప్పుచున్నానని నా మీద చెప్పి మీరు మా అబ్బాయిని డబ్బు అడగండి ఇస్తాడు అని అన్నాడు. దేవుని కంటే మిన్నగా నన్ను నా ఫోటోకు మాలలు కట్టి మైనపువత్తులు వెల్గించి అతిగా మర్యాదలు చేస్తున్నారు. ఇట్లు చేయవద్దని సర్వేశ్వరునే ఆరాధించమని గౌరవించమని చెప్పండి. నేను నా జీవితకాలమంతయు వ్యర్థపుచ్చి అల్ప సంపాదనతో డబ్బే ముఖ్యమని, కాలమును సమయమును వ్యర్థపుచ్చి ఈ దశకు వచ్చాను. నా కుమారునికి ఈ గతి పట్టకూడదు. జాగ్రత్తగా వాడికి ప్రబోధించండి,'' అని తన భార్యను కూడా తీసుకువస్తానని వెళ్ళి కొన్ని క్షణాల తర్వాత ఆమెను తీసుకవచ్చాడు. ఆమె కూడా కాసేపు కొన్ని విషయాల మీద ముచ్చటించింది. కొన్ని నెలల తేడాతో ఇరువురము అనుకోకుండ చనిపోవుట చేత అబ్బాయి బెంగపడినాడు. ఇప్పటికి ఆ దుఃఖము అబ్బాయి నుండి తొలగిపోలేదు. మీరు ధైర్యము చెప్పండి అన్నారు. ఇంటిలో ఉండే లాయరు పుస్తకాలు చూచినప్పుడు - లోకులకు న్యాయము చెప్పిన నేను - నన్ను నా కుటుంబమునకు సరియైన న్యాయము చేయలేకపోయినానని వేదనతో నోటి మాటలు సరిగా రాక కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. జరిగింది జరిగిపోయింది కనుక నా కుమారుని హెచ్చరించమని కోరినాడు. నేను ధరించు కోట్లు మూడు ఉన్నవి. నాది నా భార్యది బైబిళ్ళు ఉన్నవి. అవి చూచినప్పుడు దుఃఖముతో బాధపడుతున్నాడు. మేము ధరించు కోట్లు - మా బైబిళ్ళు కూడా అడిగి తీసుకోండి అన్నాడు.
శరీరము విడిచిన ఆత్మలలో చాలా ఆత్మలు దిగులుగాను ఏదో పోగొట్టుకొన్నట్లుగాను ఉంటాయి. శరీరముతో ఉండినప్పుడు చేయకపోయిన కార్యములను గూర్చి దుఃఖిస్తుంటారు. కనుక శరీరముతో ఉన్నప్పుడే సిద్ధపడవలెెనని గ్రహించాలి. శరీరము విడిచిన ఆత్మ ఒంటరిది కాదు. తాను జనసందోహములో జనుల మధ్య ఉన్నట్లుగానే ఆ ఆత్మకు కనిపిస్తుంటుంది. సాధారణముగ శరీరము విడిచిన ఆత్మ తాను ఎక్కడ ఉంటున్నది ఖచ్చితముగా చెప్పలేదు. భూమి మీద తాను నివసించిన ప్రాంతము, తాను మిక్కిలిగా ప్రేమించిన వారిపై గల గుబులుతో వారి సన్నిధి అంటిపెట్టుకొని యుండును. తాను తన తెగకు చెందిన ఆత్మలతో కలసి నివసించును.
శరీరము విడిచిన క్రైస్తవులు తమ ప్రార్థన కార్యములు - అనుదినము తమ సమయములను బట్టి దైవప్రార్థన కార్యక్రమాలు కూటములుగా ఏర్పడి చేయుచుందురు. అట్టివారిని అన్యుల ఆత్మలు కొంత దూరముగ ఉండి చూచుచుందురు. గారడివాడు వీధి ప్రక్కన తాను డేరా వేసికొని ఆట మొదలు పెట్టినప్పుడు జనము చుట్టును మూగినట్లుగ, శరీరము విడిచిన క్రైస్తవ ఆత్మలు చేయు ప్రార్థనను అన్యుల ఆత్మలు దూరముగ ఉండి తిలకించుచుందురు. శరీరము విడిచిన ఆత్మలు వారి వారి లోక జీవిత విధానమునుబట్టి వస్త్రధారణ ఉంటుంది. అనగా వస్త్రము ధరించినవారుగానే కన్పడుదురు. వారు భూమి మీద సంచరించిన శరీర రూపములతో ఆత్మలు దర్శనమిచ్చును. భర్త చనిపోయిన కొంతకాలమునకే భార్య కూడా చనిపోయిన ఇరువురి ఆత్మలు వారు మిక్కిలిగా ప్రేమించిన కుటుంబమును, వారి గృహమును అంటిపెట్టుకొని యుందురు. అయితే వారు ఏమియు తినరు, పగ పెట్టుకొనరు. వారు శరీరముతో జీవించిన కాలములో సంపూర్ణముగ చేయక నిలిచిపోయిన కార్యములను గూర్చి బెంగపెట్టుకొందురు. వారు శారీరముతో జీవించినప్పుడు చేసిన దుష్క్రియలను గూర్చియు, వారు సాధించలేని కార్యములను గూర్చియు బహు దుఃఖమును నెమ్మదిలేని జీవితమును అనుభవించుచుందురు. వారు భూమి మీద ఉపయోగించిన గ్రంథములు వారి చేతులలో ఉంటాయి. ఆ గ్రంథములను తెరచి పఠించుదురు. శరీరము విడిచి వచ్చిన ఇతర ఆత్మలకు కూడా బోధించగలవు.
ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి శరీరముతో ఉన్న రోజులలో బైబిలును వ్యతిరేకించి దానిని విమర్శించాడు. శరీరమును విడిచిన తర్వాత ఆత్మలు నివసించు రాజ్యములో బైబిలులో వివరించిన విధముగా పరదైసు ఉన్నది గనుకను అచ్చట విగ్రహ సంబంధ దేవుళ్ళు లేనందు వలనను, యేసుక్రీస్తే నిజమైన ప్రభువనియు, పరిశుద్ధ గ్రంథమనబడు బైబిలే యదార్థ గ్రంథమనియు నమ్మితినని ఆత్మ సాక్షాత్కారములో సాక్ష్యమిచ్చుట జరిగింది.
ఆయన వివరించిన కొన్ని వివరములు :- నేను కాలము తీరకముందే చంపబడుట చేత మీ ముందు దర్శనములో మాట్లాడగల్గుచున్నాను. విశ్వామిత్ర స్వర్గమన్నది కేవలము కల్పితము. అచ్చట అదేమియు లేదు. సముద్రము కంటె మిక్కిలి విశాలమైనది ఆత్మ. ఆ సముద్రములోని నీటి బిందువు అంత పరిమాణముతో - తల్లి తన శిశువును ప్రసవించినప్పుడు, ఆత్మ అణువు అందులో ప్రవేశించును. కాని శరీరము విడిచిన ఆత్మ ఎంత మాత్రము అందులో మరల ప్రవేశింపనేరదు. ఇది నిజము - అందువల్ల బైబిలు సత్యమైన గ్రంథము. ఈ ఆత్మ అణువు పరమాత్మలోనుండి బయలుదేరి వచ్చును.
తల్లి గర్భములో మొదట పిండోత్పత్తి జీవాణువులతో ఏర్పడును. బిడ్డను ప్రసవించిన తర్వాత ఆత్మ ప్రవేశించును. కన్యకయైన మరియ గర్భములో పరమాత్మయే ప్రవేశించాడు. కాని నరుల గర్భములో జీవాత్మ అణువు ప్రవేశించును. కనుక యేసుక్రీస్తు ప్రభువు పరమాత్మ యొక్క సంపూర్ణ అవతారము.
నోములు, వ్రతాలు, ప్రతిష్ట, శాపాలు ఇవన్నియు బైబిలులోను, హిందువుల చరిత్రలలోను ఉన్నవి. పురాణముల యందు హిందువుల పురాణాలలో శాపము వలన సర్పమైనాడని ఏదో అయినాడని అంటారు. అది చూచినదెవరు?
శాంసను క్షారము లేకుండ ద్రాక్షారసము త్రాగనీయక ప్రతిష్టించబడుట ఉన్నది. ఎఫెసీ 6:12 లో ఆకాశమండలమందున్న దురాత్మల సమూహము యొక్క పోరాటము శరీరము విడిచిన ఆత్మలకు ఉండదు. అవి పోరాడేది శరీరముతో భూమి మీద నివసించు శరీరులతోనే వాటి పోరాటము. శరీరులను తమ వద్దకు రప్పించుకోవాలన్నదే వాటి ఆరాటము.
యేసుక్రీస్తు ప్రభువు యొక్క దర్శన భాగ్యము శరీరము విడిచిన ఆత్మలలో నాకు ఇంతవరకు కలుగలేదు. యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు - నిజదైవము అనుటకు అనేక సూచనలు అనేకము ఆత్మల రాజ్యములో కన్పడుచుండును. ప్రశాంత వాతావరణమున్నది, వేషధారణ లేదు, విగ్రహారాధన లేదు, దేవతాస్మరణలు లేవు, మంత్ర ప్రయోగాలు లేవు, శకునము ముహూర్తాలు లేవు. రంభ, ఊర్వశీ, వగైరా నాట్యకత్తెలు లేరు - నాట్యములు లేవు. కనుక బైబిలు గ్రంథము యదార్థము.
ఆత్మలకు పరమానందము, నిత్యానందము, సత్యానందము అనగా దైవత్వముతో ఆనందించు ఆత్మానందము, జీవానందము - జీవునితో ఆనందించుట. శరీరమునకు ఆనందము లేదు. అనగా శరీరమునకు తృప్తి అన్నది లేదు. అనగా సంపూర్ణత్వము లేదు. శరీరములో ఏదో యొక లోటు ఉంటుందని ఇందునుబట్టి మనము గ్రహించాలి. నరజీవి అనగా శరీరుడు సంపూర్ణుడు కావాలంటే లోకానికి దూరస్థుడై యుండాలి.
రోమా 6:7 చనిపోయినవాడు పాపవిముక్తుడు. తమ క్రియలు మాని విశ్రాంతి పొందుదురు. కనుక శరీరము విడిచిన ఆత్మకు ఏ కర్తవ్యము లేదు.
కీర్తన 8:3 బాలురు చంటి పిల్లలులోని ఆత్మ శరీరమును విడిచితే వారికి ప్రత్యేకమైన స్థలములుండును. కనుక దేవుడు చంటి పిల్లలకు ప్రత్యేక దుర్గమును స్థాపించియున్నాడు. పెద్దవారి ఆత్మలతో కలిసి ఉండవు. ఎందుకంటే చంటి పిల్లల ఆత్మలకు శిక్ష లేదు - ఉత్తరింపు లేదు.
దుర్గములు అనగా స్థావరములు :- పరిశుద్ధులు, అతిపరిశుద్ధులు, హతసాక్షులు మొదలైనవారికి కూడా ఆత్మల రాజ్యములో దేవుడు దుర్గములను ఏర్పరచియున్నాడు. ఆత్మ తన కేర్పరచబడిన స్థలము నుండి వేరొక మహోన్నత స్థలమునకు వెళ్ళుటకు వీలులేదు. అది దేవుడు విధించిన హద్దు. దానిని దాటి పోవుటకు జీవాత్మకు శక్తి లేదు. అదియే ఆత్మస్థంభన. పరమాత్మ ఆత్మను స్థంభింపజేస్తాడు. పరమాత్మ ఎదుట జీవాత్మ శక్తి చూపలేడు.
హెబ్రీ 11:15 దేవుడు వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచియున్నాడు. కనుక ఆకాశములో గాని ఆత్మల రాజ్యములో గాని పరలోకములోగాని నివాసాలు, పట్టణాలు ఉన్నట్లుగ ఋజువులు ఉన్నవి. ఆత్మలు సంపాదించుకొన్న శక్తి సామర్థ్యాలను బట్టి వారి వారికి ఆయా పట్టణాలు రాజ్యాలు సింహాసనములు అనుగ్రహించబడును.
ఆత్మ తనకు అనుగ్రహించబడిన స్థలమును దాటి వేరొక మహోన్నత స్థలమునకు ప్రవేశించ ప్రయత్నించినచో దేవుని వాక్కు హద్దుగా ఆ ఆత్మను అడ్డగిస్తుంది. పరమాత్మలో ఒక అంశము మాత్రమే జీవాత్మ. ఆ జీవాత్మ సముద్ర జలములో ఒక నీటి బొట్టు శాతమే - నరశరీరములోని జీవాత్మ. కనుక ఆత్మల రాజ్యములోగాని పరదైసులోగాని పరలోకములోగాని - నర లోకములోని జీవాత్మ పరమాత్మ ఆజ్ఞ దాటజాలదు. హద్దు మీరలేదు.
ఒక కుటుంబములో ఒక వ్యక్తి చనిపోయాడు. అతడు తనకంటె ముందు చనిపోయినట్టి తన తండ్రిని కలుసుకోవచ్చు అని మనము అనుకోవచ్చును. కాని లోకములో మనష్యులందరిని మనము చూస్తున్నాము. కాని వారిలో నివసించే ఆత్మను మనము చూడడము లేదు. శరీరము సమాధిలో పాతి వేయబడుచున్నది. కనుక తన ఆత్మలలో తన తండ్రి ఆత్మను గుర్తించుట కష్ట సాధ్యము. అందుకే వేదములో ఒకచోట ఒక పురుషుడు ఒక స్త్రీని పెండ్లి చేసుకొని కొంత కాలానికి చనిపోతాడు. ఆ తర్వాత ఆ స్త్రీని అతని తమ్ముడు పెండ్లాడును, అతను చనిపోయిన తదుపరి మరియొక తమ్ముడు ఈ విధముగా ఏడుగురు అన్నదమ్ముళ్ళు ఆ స్త్రీని పెండ్లాడెదరు. అందరి ఆత్మలు శరీరాన్ని వదలినప్పుడు ఆ స్త్రీలోని ఆత్మకు ఎవరి ఆత్మ భర్తగా వ్యవహరించును, అని ప్రశ్నిస్తాడు. ఆత్మకు రూపము లేదు, నామము లేదు. కనుక ఆత్మలు దేవదూతల వలె ఉందురని చెప్పబడింది. ఇందునుబట్టి ఆత్మకు రూపము లేదు. ఏ ఆత్మ ఎవరిదో? తన తండ్రి ఎవరో? తన కుమారుడెవరో? భర్త ఎవరో? భార్య ఎవరో? శరీరము విడిచిన ఆత్మను చూచి ఎవరి శరీరములోని ఆత్మయో చెప్పుట కష్టము.
అయితే ప్రభువు యొక్క దయాపూరిత హృదయమునుబట్టి ఆయన అనుగ్రహము చొప్పున ఆత్మలు శరీర రూపము ధరించుటకు శక్తి పొందుతాయి. అవి మహిమ శరీరాలుగా ఉంటాయి. క్రీస్తు రాకడలో ఆయన మధ్యాకాశ తీర్పులో ఇది జరుగుతుంది. ఏ ఆత్మ ఏ శరీరములో నివసించిందో తెలియుట ప్రభువు కృప వల్లనే అది సాధ్యము. ఎందుకంటే ఆత్మ ఒక్కటేనని వ్రాయబడింది. కోటానకోట్ల నర శరీరాలలో నివసించు ఆత్మ కూడా ఒక్కటే. ఇవన్నియు ఆత్మాణువులు అని అనుకోవచ్చును.'' పునరుత్థాన దినమందు ప్రభువు పిలుపు విన్న ఆత్మలు శరీర రూపాలు ధరించి ఆయన సన్నిధికి వెళ్ళెదరు. ఇందులో తీర్పు పునరుత్థానము పొందెడి ఆత్మలుగాని, మహిమ పునరుత్థానము నొందిన ఆత్మలుగాని, ప్రభువు పిలుపు, ఆయన శబ్దము విని భూమి మీద నివసిస్తున్నప్పుడు ఉన్నట్టి వారి వారి శరీర రూపాలను ఆత్మలు ధరించును.
వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు,'' అని వ్రాయబడియున్న విధముగా జీవాత్మకు నిద్ర ఉన్నది. కాని పరమాత్మకు నిద్రలేదు. ఆత్మకున్న ఆహారము దేవుని కార్యమును నెరవేర్చుట, ఆయన పనిని తుదముట్టించుట,'' అని యేసుప్రభువు పల్కుట మనకు తెలిసిందే. ఇదే ఆహారము. లోకములో మనుష్యమాత్రుడుగా ఉండి మానవుడుగా జీవించి, సహజముగా మరణించి పాతిపెట్టబడినవాడు భూలోకములో పరమాత్మకు ప్రతిగా నరుల చేత పూజింపబడుచుండెనేని అట్టి ఆత్మకు ఆవేదన ఎక్కువ. పరమాత్మను వదలి పనికిమాలిన ఆత్మకు పూజించుట నేరము.
యేసుప్రభువు పరమాత్మ యొక్క దృశ్య రూపము. ఈయన మరణించినను సశరీరుడుగా తనంతట తానుగా జనాంగముల ఎదుట ఆరోహణమై పరమునకు వెళ్ళినాడు. ఇప్పుడు మన మధ్య ఆయన ఆత్మ ఉంటున్నది. కనుక ఆయనకు ఒక్కనికే తప్ప భూమి మీద సాధారణ మరణము పొంది, మట్టిలో కలిసిపోయిన ఏ వ్యక్తిని కూడా నరులు పూజించకూడదు, ఆరాధించకూడదు. కనుక జీవరాసుల పూజలు, సృష్టి పూజలు అసలు పనికిరావనియు, అట్టివారికి అనగా పరమాత్మను ఆత్మతో ఆరాధించుట వదలి సృష్టిని - జీవరాసులను - నరులను పూజించేవారికి శిక్ష తప్పదని, నరుల చేత పూజింపబడు శరీరము విడిచిన ఆత్మలు చెప్పుచున్నవి.
శరీరము విడిచి ఆత్మలు తాము పూజించుకొనుటకు విగ్రహాలుండవు. గుళ్ళు గోపురాలుండవు. హిందువులు వారి ఇష్ట దేవుళ్ళ ప్రార్థనలు, ముస్లిమ్‌లు వారి నవాజు - దర్గా ప్రార్థనలు; క్రైస్తవులు క్రీస్తు ప్రార్థన ధ్యానాదులు చేసుకొందురేగాని - శరీరము విడిచిన ఆత్మలు కూడా నిజమైన దేవుని ఎరుగుటకు అవకాశము ఉండదు. ఎవరి ప్రార్థనలు ఎవరి ఇష్టదైవ ప్రార్థనలు వారు జేసుకుంటారు.
యేసుక్రీస్తును అంగీకరించి లోకములో శరీరముతో జీవిస్తున్నవారిలోని ఆత్మలుగాని, శరీరము విడిచిన ఆత్మలుగాని, అవి మంచివైనను, చెడ్డవైనను అన్యుల ఆత్మల కంటె చాలా బలము గలవై ఉజ్జీవముతో ఉంటాయి. అన్యుల ఆత్మలకు అంతటి శక్తి సామర్ధ్యాలుండవు. శరీరముతో నివసిస్తున్న ఆత్మయైనను ప్రభువులో జీవిస్తున్న ఆత్మ - వెలుపలి ఆత్మలతో పోరాటము సాగించగలదు. ఆ బలము ఆ ఆత్మకు అనుగ్రహించబడుతుంది. ఒక ఫాదరీ ఆత్మను కొట్టి ఈడ్చుకొనిపోయిన ఒక దురాత్మను చూడగల్గినాము. కనుక ప్రభువులో యదార్థ హృదయముతో జీవించని ఆత్మలకు దుష్టశక్తుల పోరాటము ఉంటుంది. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాటము.
పెంతెకోస్తు సంఘాలలో ఆత్మ ఆవేశము పొంది రకరకాల భాషలు మాట్లాడడము - వారిలోని జీవాత్మ ఉజ్జీవముతో మాట్లాడే మాటలుగాని దైవాత్మ మాత్రము కాదు. వారు మాట్లాడే మాటలకు అర్థంపర్థం ఉండదు. వారిలోని ఆత్మ ఆవేశపూరితమై జరిగించే క్రియలేగాని దైవాత్మ ఆవేశము మాత్రము కాదు. దైవాత్మ ఆవేశము అయితే జబ్బులు నయము కావాలి. అర్థయుతమైన భాషలు మాట్లాడాలి.
దురాత్మ పరిశుద్ధుల సంఘములో ఒకరిని ఆవేశించి సన్మానము పొందుటకు తాను పరిశుద్ధాత్మను అని బొంకి రకరకాల సూచక క్రియలు చేస్తుంది. ఆ సంఘస్థులందరు అట్టివాటిని నమ్మి మోసపోతారు. కడకు ఏ మనుష్యుని ఆవహించి సూచకక్రియలు జరిగిస్తున్నదో ఆ మనుష్యుడు చనిపోయి నప్పుడు - ఆ మనుష్యుని పట్టి పీడిస్తున్న ఆత్మ - ఆ మనుష్యునిలోని జీవాత్మ రెండును చేరి అదే సంఘములో మరి కొందరి మీద ప్రవేశించి, గగ్గోలుపరచి అనేక సూచకక్రియలు చేసి మోసపరచుచుండును.
గాలిలోని ఆత్మల యొక్క ప్రభావము వల్లనే అగాధ సముద్రాన్ని కదిలించి తుఫాను గాలిగా మారి, చెట్లను ఇండ్లను కరెంటు స్థంభాలను కూలుస్తుంది. గాలికి అంతటి శక్తిలేదు. కాని గాలిలోని ఆత్మలయొక్క ప్రవాహ వేగము వల్ల గాలికి ఆ శక్తి ఏర్పడుతుంది. టన్నుల కొలది బరువును టైర్లలోని గాలి మోయలేదు. కాని గాలిలోని ఆత్మల సందోహము ఆ టైరు గాలిలో ఇమిడియున్నందున, ఆత్మలతో మిళితమైయున్న గాలి ఎంతటి బరువైనను మోయగల శక్తివంతమగుతుంది. ఒక నీతిమంతుని ఆత్మ ఏదైనను ఆ టైరు గాలిలో పొరబాటున ప్రవేశిస్తే ఎంతటి క్రొత్త ట్యూబ్‌నైనను పంచరు చేసుకొని వెలుపలికి రాగలదు. కనుక పాపాత్ముల ఆత్మలు అట్టి గాలిలోకి శిక్షకు సూచనగా పంపటం జరుగుతుంది. టి.విలలో ఎక్కడో ప్రసారము చేసిన కార్యక్రమములోని బొమ్మలు - ఆయా రూపములలో ఆత్మలు ధరించి ఆ కార్యక్రమములోను, ఆ ప్రసారానుసారముగా పాల్గొని, ఆయా రూపాలు ధరించి మనకు దృశ్యముగా కనబడుచుండును. ఈయొక్క వివిధ కార్యక్రమాలలో శరీరముతో జీవించియున్నప్పుడు నటన మీద వగైరా కార్యక్రమాల మీద అభిరుచి గల ఆత్మలే ఆయా రీతులుగా వాడబడుచుండును.
శరీరము విడిచిన ఆత్మలు భూమి మీద ఉన్న కొన్ని పద్ధతులు పాటిస్తారు. క్యాథలిక్కు సిస్టర్లు ఫాదర్లు వడక్కం అను పేరుతో మౌనవ్రతాన్ని పాటిస్తారు. ఆ దినము ఆ ఆత్మలు మౌనాన్ని పాటించి స్థబ్దతగా ఉంటారు. ఉదయ సాయంత్రాలు ప్రార్థనా కార్యాలలో పాల్గొంటారు. సమయాన్ని బట్టి పాటించే పద్ధతులున్నాయి. లోకము మీద బోధకులుగా ఫాస్టర్లుగా ఫాదరుగా చలామణి అయ్యే బోధకులుగా ఉన్న అనేక ఆత్మలు - దుఃఖముతోను వేదనతోను నిండియుండుట ఆశ్చర్యము. ఒక ఫాదరు తన జీవిత కాలములో ఎంతో ధనము వస్తువాహనాలను సంపాదించి కూడబెట్టి, సమస్తము విడిచిపెట్టి వెళ్ళటం జరిగింది. తన వారసులకు కూడా దక్కలేదు. ఎందుకంటే తాను అనుకోకుండ ఊహించని రీతిలో చనిపోవటము జరిగింది. ఆయనలో ముఖ్యముగా మూడు దుర్గుణాలు పనిచేశాయి అంటున్నాడు. రెడ్డిపాళెము గుడి విషయములో అపోహ కలిగి వ్యతిరేకించుట, రెండవది నేను వ్రాస్తున్న పుస్తకాలకు సహాయమును అందివ్వకపోగా ద్వేషించడము. ఎందుకంటే ఆయన అనేక గ్రంథాలకు గ్రంథకర్త. మూడవది అహంభావ గుణము, విపరీతమైన త్రాగుడు, పొగ త్రాగుడు వగైరా.
మరొక బిషప్పు రెడ్డిపాళెము గుడిని చూచుటకుగాని, సహాయము చేయుటకుగాని రాలేదు. తన జీవిత కాలములో సంస్థ డబ్బు కూడబెట్టి 70 ఎకరాల వరకు తోటలు సంపాదించి, వాటిలో టెంకాయ చెట్టు వగైరాలు వారసులకు వదలి వెళ్ళటం జరిగింది. తన జీవిత కాలములో తన త్రాగుడుకు ఏ విధముగా బలియై త్రాగి జీవితము వ్యర్థపోయిందో - ఆ వారసులలో చేతులలో సంస్థ యొక్క డబ్బుతో కొనిన ఆ తోటలు కూడా వారి చేతులలో మద్యము త్రాగి వ్యర్థ జీవితము గడిపి ఆ తోటలు పరాధీనమై పోయినవి.
ఇక పెద్ద సంఘానికి ఫాస్టరు దుఃఖముతో నిండిన భావముతో ఏడుస్తూ చెప్పింది. మిమ్మల్ని ద్వేషించడము, మీ పుస్తకాలను తప్పుబట్టడము, మరియు ఎవరి చేత సంఘములో వాక్యోపదేశము చేయించుటకు అనుమతినివ్వటముగాని, ఎవరి ప్రార్థనను అంగీకరించడముగాని జరిగించడు. తానే వాక్యోపదేశము చేయాలి. తన ప్రార్థనకే అందరు లోబడాలి. తన క్రమశిక్షణలోనే ఉండాలన్న స్వార్థము. ఇతరులకు తన సంఘములో ప్రాధాన్యతగాని, అవకాశముగాని, ఇతరులు పాలుపంచుకోవడముగాని జరుగనివ్వడు. ఆరు లక్షల రూపాయల ఖర్చుతో కట్టిన మేడను నా ఆత్మ అంటిపెట్టుకొని అల్లలాడుతుంది. నేను ఖర్చుపెట్టింది సంఘము యొక్క డబ్బు - దేవుని డబ్బు ఖర్చుపెట్టడము జరిగింది. ధనవ్యామోహము సమస్త కీడులకు మూలమైంది. శరీరముతో ఉన్నప్పుడే ఏదైనను చక్కబరచుకోవాలి. ఆ తర్వాత చేసేది ఏముంది? ఆయన బైబిలు బోధకుడు కాబట్టి ఆయన శరీరము విడిచినను ఆయన చేతిలో బైబిలు ఉన్నది. మీరెంతో ధన్యులంటారు - పై వివరించిన ముగ్గురు కూడా, ఎందుకంటే మీకు త్రాగుడు లేదు - పొగ త్రాగుడు లేదు. ఈ విధముగా ఆత్మలను పిలుచుకొని మాట్లాడమనేది బైబిలు రీత్యా కొర్నేలి నుండి - పగలు 3 గంటల వేళ దర్శనములో (సశేషము)
మాసిలామణి :- యోహాను 7:39 తనయందు విశ్వాసముంచువారు అదనముగా పొందబోవు ఆత్మ. అనగా మరణానంతరము పొందబోవు ఆత్మ. ఈ ఆత్మను పొందినవారిలో మాసిలామణి యొకరు. ఈయనను ఈ ఆత్మను శరీరము విడిచిన తర్వాత ఆ ఆత్మను పొంది, క్రీస్తు నెరుగని వారికి సువార్త బోధించుచున్నాడు. మత్తయి 28:18-20 పరలోక మందును భూలోకమందును నాకు సర్వాధికార మీయబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చుచు ఇదిగో! యుగసమాప్తి వరకు నేను మీతో యున్నానని చెప్పెను. రోమా 8:11 మృతులలో నుండి యేసును లేపిినవాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. మరణ పునరుత్థానము నుండి జీవ పునరుత్థానమునకు మరల్చుచున్నారు.
మాసిలామణిగారు చనిపోయే ముందు గోదావరి జిల్లాలో హిందువుల యోగాశ్రమము లాగా ఒక పెద్ద ఆశ్రమము కట్టవలెనని డబ్బు చందాల రూపేణా కూర్చుకున్నాడు. ఆ అవకాశము చేజారి శరీరము విడిచినాడు. ఆ డబ్బు కుమారుని వశమైనది. ఆశ్రమము కట్టి జనులకు సేవజేయు అవకాశము చేజారినందున సువార్త నెరుగని క్రీస్తు నెరుగక చనిపోయిన ఆత్మలకు సువార్త బోధ చేయుచున్నాడు. భూమి మీద తాము తినక ఇతరులకు పెట్టక విడిచి వచ్చిన వాటిపై మక్కువ చంపుకోలేక, మాసిలామణిగార్కి చెప్పుకొని ఆ ఆత్మలు ఆవేదన పడుచుందురు. ఆయన వారిని ఓదార్చుచుండును.
........
శరీరము విడిచిన ఆత్మ దిగ్భ్రమతో ఉంటుంది దానికొక నిలకడ ఉండదు. ఆ ఆత్మ వదలబడిన ఉపగ్రహములాగా తిరుగుతుంటుంది. సరియైన రూపము ఉండదు, నిలకడ ఉండదు. ప్రకటన 14:13 లో వలె వారి క్రియలు వారి వెంటబోవునన్నట్లుగా బంగారు నగలు చేయువాడైతే - నగల దుకాణములలో ఆ ఆత్మ తిరుగుచుండును. క్లబ్బులు, సినిమాలు, చీట్లపేకలు వగైరా వాటితో కాలము గడుపువాడైతే వాటికి సంబంధించిన ప్రదేశాలలోనే ఆ ఆత్మ సంచరించుచుండును. కనుక ఎవరెవరు ఏయే పనులు చేస్తూ వాటి మీద మక్కువ గల్గి ఆశ చావక శరీరాన్ని విడుచుదురో అట్టి వారి ఆత్మలు ఆయా ప్రదేశాలలో అట్టి క్రియలు చేయు వారి సంబంధీకుల మధ్య ఉంటూ వచ్చి పోవుచుండును. వారి రక్తసంబంధీకులకు బంధుమిత్రాదులకు కలలో కనబడుచుండును.
శరీరముతో ఉండు నరులు ఏ విధముగా ఒకరితోనొకరు మాట్లాడు కొనుచుందురో అట్లాగే శరీరము విడిచిన ఆత్మలు ఒకదానితోనొకటి చక్కగా మాట్లాడుకొనుచు, భూమి మీద తాము విడిచి వచ్చిన బంధుమిత్రాదుల క్రియలను చూచి అవి మంచివైతే సంతోషించుచు చెడ్డవైతే వేదనపడుచు ఉంటాయి. భూమి మీద నరులు చేయు కార్యాలను గూర్చి శరీరము విడిచిన ఆత్మలు చర్చించు కొనుచుండును.
.........
మరణములోని మర్మము :- ఆదికాండము 2:17 మానవుని జీవాత్మ తనను సృష్టించిన దేవుని దగ్గరకు పోవుటయే మరణము. ఎందుకనగా ఆదికాండము 2:7లో వివరించిన విధముగా నరునిలోని జీవాత్మ దేవునిది. కాబట్టి అది మరల దేవునికే చెల్లవలెను. హెబ్రీ 4:9 -10 మరియు 11 చూడుము. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము - తన కార్యములు ముగించిన నాడు కూడా ఆయన విశ్రాంతిలో ప్రవేశించును. కాబట్టి అవిధేయతతో పడిపోకుండా ఆయన విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము.'' ఇట్లు నిదురించిన వాని పరిస్థితి ఏమి? రోమా 6:7 క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల పాపవిముక్తుడని తీర్పు పొందియున్నాడు.''
మత్తయి 16:22-23 పై వాక్యము ఉచ్ఛరించుటలో పరమార్థము ఏమి? దేవుని సంగతులను గూర్చి తలంచవలెను. నశించిన నరజీవితమును రక్షించుటయే అనగా పాప విముక్తి కొరకే ప్రభువు వచ్చాడు. లూకా 19:1-10 జక్కయ్య ప్రకరణము.
.......
ప్రసంగి 5:3 విస్తారమైన పనిపాటల వలన స్వప్నము పుట్టును.
మనము అధికముగా దేనిమీదనైతే మనస్సు లగ్నము చేసి పాటపడుచుందుమో ఆ విధములైనవి మన స్వప్నములో కనపడుచుండును. ఈ స్వప్నములలో కొన్ని దేవుడు కల్గించినవియు, మరికొన్ని సైతాను కల్గించునవియు, మరికొన్ని సహజ స్వప్నములుగా కలుగుచుండును.
మనము నీతికిని, నీతి కార్యములకు సంబంధించియు నీతిపరుల జ్ఞాపకము చేసికొని, ఆ మంచి మనిషి ఇప్పుడు ఎచ్చట ఉన్నదో ఎట్లున్నదో? అని మన మనస్సుకు వచ్చినప్పుడు, దేవుడు ఆ త్మను మనకు స్వప్నమున కనపరచును. ఆ ఆత్మకు రూపమును కల్గించి స్వప్నమున చూపును. ఈ సృష్టిలోని సమస్తము ఆయనదే కాబట్టి ఎట్లయినను ఆయనకు సులభసాధ్యము.
కాని ఒక స్త్రీ పై కన్నుపడి మనోచింతనతో మధనపడినట్లయిన అనగా ఆమెతో సంభాషణమునకు ఆమె పొందుకు తహతహలాడినట్లయిన, వాడు పెండ్లయినవాడైనను సరే వాడి జ్ఞానేంద్రియముయొక్క సవ్వడి కనుగొని సైతానుడు వానిలో ప్రవేశించి, వానికి ఆ కార్యము నెరవేర్చుకొను ఉపాయము చెప్పి నాశనమునకు దారితీయును. అయితే ప్రజల దృష్టిలోగాని, దేవుని దృష్టిలో నీతిమంతుడైన ఒక పురుషుని కన్ను ఒక అందాలరాశికి వశమైన పక్షమున, వాడు పెండ్లి అయినవాడైనను సరియే సైతానుడు వానిలో ప్రవేశించి నాశనమునకు ఉపాయములు చెప్పలేడు కాని, స్వప్నములో ఆ స్త్రీ రూపము తాను ధరించి వచ్చి అనేక క్రియలు చేసి, వాని ఉద్రిక్తుని చేసి వైచునప్పుడు- ఆ ఉద్రేక సమయమున వానికి మెలకువ వచ్చి ఓహో! ఇంతకు ఇది స్వప్నమేనా? అని తలంచి స్వప్నములోనే నేను ఆ స్త్రీని అనుభవించితిని కదా! నిజముగా నేను ప్రయత్నించి ఆ స్త్రీని ఎందుకు పొందరాదని ఉపాయము కొరకు ప్రయత్నించును. అప్పుడు సైతానుడు వానిలో ప్రవేశించి వేద గ్రంథమును చేతబట్టి వారి ఇంటికిపో, వారిని ప్రార్థించి, విందుకు పిలువుము. ఈ విధముగా ఆమెతో సంభాషించుచు మాట్లాడుము. నీ శరీరమును ఆమె ఇంటికి మోసుకొనిపోవుటయే నీవు చేయవలసిన కార్యమిదే. ఆ తర్వాత ఆమె శరీరములో నేను ప్రవేశించి నీకు దాసురాలిని చేసేస్తాను, అని తన పన్నాగము మేర సమస్తము నెరవేర్చి అతనిని పతనము చేయును. కొంత అలవాటు ఆ స్త్రీతో పడిన తర్వాత నీతిమంతుడైన వానిని ప్రజలకు సైతానుడు పట్టించును. ఎందుకంటే వానిని అందరు నీతిమంతుడంటున్నారు. కాబట్టి వానిని శాశ్వతముగా తన వానిని చేసుకోవలయునని తలంచి ఆ పని చేయును. పదిమందిలో అతడు పట్టుబడుట వలన తర్వాత అతను మనస్సు మార్చుకొనినను, అవినీతిపరుడను ముద్ర శాశ్వతముగా పడిపోవును. మానవుని యొక్క ఆత్మను తెచ్చి స్వప్నములో చూపలేడు. కాని ఆ మానవుని యొక్క రూపము అపవిత్రాత్మ ధరించి వచ్చి ఆ స్త్రీ పోలికగా నటించును. మానవుడు దైవ నీతిలో నిలబడి ఏ ఒడుదుడుకులు లేనప్పుడు అతనిని లోబరచుకొనుటకు ఏ ఉపాయము దొరకక బహుక్రోధావేశుడై ఎవరిని మ్రింగుదునా? అని ఎద్దు పాము సింహము మొదలగు రూపములు ధరించుకొని, స్వప్న రూపమున కనబడి తన క్రోధమును తాత్కాలికముగా తృప్తిపరచుకొనుచున్నాడు. కాని స్వప్నము నందు పాము కరచినట్లు, ఎద్దు పొడవబోవునట్లు, సింహము గర్జించునట్లున్నను ఇది స్వప్నమే కనుక నిరుపయోగము - అయితే నిద్రాభంగము.
ఈ లోకము గతి ఏమి? లోకము యొక్క భవిష్యత్తు - భవిష్యత్తు యొక్క అంతము :- ప్రియపాఠకులారా! భూలోకములో ఆది నుండి నేటి వరకు భూతతద్దర్మ భవిష్యత్ అను మూడు కాలాలు నిర్ధారించబడి - ఈ మూడు కాలాలు దేవుని చిత్తమును లోకము యొక్క చక్రమును - లోకమనెడు భూచక్రమును త్రిప్పుచు వరసగా క్రియ జరిగిస్తున్నవి. పై విధముగా భూతతద్దర్మ భవిష్యత్ కాలాలు అను మూడును లోకములో క్రమము తప్పకుండ వాటి వాటి కాల క్రియాకర్మలను జరిగిస్తున్నాయి. ఇందులో భూతకాలము ఇది మొట్టమొదటి కాలము - ఆదికాలము పంచభూతాలు దేవుని చేత రూపించబడినవి - పంచభూతాలు ఏర్పడిన కాలము. పంచభూతాలు దేవుని చేత సృష్టించబడి క్రియ జరిగించింది. కనుక ఈ కాలమును భూతకాలమని కూడా అనవచ్చును. అనగా జరిగిన లోకములో పంచభూతాలు లేనిదే లోకమునకును లోకసృష్టికిని మనుగడ లేదు. పంచభూతాలకు సూత్రధారి పరమాత్ముడు. ఈ పంచభూతాలేగాక యావద్ సృష్టిని అంతేగాక పరలోకమును, జలలోకమును, పాతాళ లోకమును, సమస్త లోకాలు కల్గియున్నవాడుగాను ఆయనకు యెహోవా యనియు ఉన్నవాడనియు, సమస్తమును ధరించి సమస్తమును తానేయైయున్నవాడనియు అర్ధము. ఈ భూతకాలములో క్రియ జరిగించిన ఈ యెహోవా అను పరమాత్ముడు యావద్ సృష్టి కార్యములను తన వాక్శక్తి చేత సృష్టించి, లోకాలను, వాటిలోని సృష్టాలను, లోకములు అనగా సూర్యలోకము, భూలోకము, చంద్రనక్షత్ర మండలాలు. వాయుమండలము, శూన్యమండలము, మేఘమండలము, ఆకాశమండలము, చివరకు పాతాళము అను ఈ మండలాలను పోషిస్తూ అందులో సంచరించినట్టి ఈ యెహోవా దేవుని గూర్చి - ''దేవుడు దహించు అగ్నియైయున్నాడన్న ప్రవచనము మనము హెబ్రీ 12:29లో చదువగలము. ఆ విధముగా దహించు అగ్నియేగాక యోబు యొక్క సంపదలోని గొర్రెలను దహించుటలోను, సొదొమ గొమొఱ్ఱా అను పాపభూయిష్ట పట్టణాలను అగ్ని గంథకాలతో కూడిన వర్షమును కురిపించి నాశనపరచినట్లుగా కూడా పాతనిబంధన గ్రంథములోను 2 పేతురు 2:6లోను చదువగలము. తన భక్తుడైన ఏలీయా యొక్క బలిని యెహోవా అగ్ని రూపముగా దిగివచ్చి దహించినట్లుగా 1 రాజులు 18:38లో చదువగలము. ఈ విధముగా అగ్నిగాను సుడిగాలిగాను, నహూము 1:3లో వలె సుడిగాలి తుఫానుగా కూడా యెహోవా దేవుడున్నట్లు వ్రాయబడి యున్నది. ఇది పరమాత్ముని యొక్క శక్తి ప్రభావపూరితమైన క్రియలను గూర్చిన వివరాలు. అంతేగాకుండ తన యొక్క పరిధిలో తన యొక్క చిత్తమునుబట్టి తనకు విధేయులు గానట్టి జనాంగములు యెహోవా దేవుని ప్రచండమైన జలప్రళయముతో నలుబది దినములు రాత్రింబగళ్ళు వర్షమును కురిపించి, యావద్ సృష్టిని తుడిచివేసినట్లు చదువగలము. ఇందునుబట్టి యెహోవా దేవునిలో ప్రచండ జలశక్తి ఉన్నదని ఋజువగుచున్నది.
ప్రియపాఠకులారా! మన ఇరుగుపొరుగున ఉన్న అన్య సోదరులు అనగా విగ్రహారాధికులైన హైందవులైన భక్తులు యావద్ సృష్టికి ఒక్కడైయుండి సమస్త శక్తులను కలిగియుండి, యెహోవా అను ఈ పరమాత్ముని అనగా యావే అనే ఈ ప్రభువును విభజించుటయేగాక, విగ్రహారాధన రూపములో విగ్రహరూపాలను రూపించి ఆరాధించుటన్నది తెలియని ఆరాధనయైయున్నది. ఎలాగంటే అగ్ని దేవుడు యెహోవా ఏలీయాను సుడిగాలిలో అగ్నిరథం మీద కొనిపోవుటయు, అపొస్తలుల మీద అగ్ని నాలుకల రూపముగాను వేగముగా వీచు గాలి వంటి ధ్వనితోను, యోబును ప్రభువు పరిశోధిస్తూ సుడిగాలి రూపముగాను - ఆయనను వాయుశక్తి - వాయుదేవుడవని ఆయన నలుబది దినాలు రాత్రింబగళ్ళు ఏకధాటిగా వర్షమును కురిపించుటనుబట్టి వరుణ దేవుడనియు, ఆయన మేఘరూపుడుగా సంచరించుటను బట్టి మేఘనాధునిగాను, ఆయనలోని తీక్షణయుతమైన ప్రభావ వెలుగును బట్టి సూర్యదేవునిగాను, ఆయనలోని దయారసము శాంతమును బట్టి శాంతమూర్తిగాను, ఇంకను నానావిధాలుగ సృష్టికర్తయైన యెహోవా దేవుని తెలియని రీతిగా పంచభూతాలు - పంచభూతాల వాహనాలతో పయనించే ఈ పరమాత్ముని యొక్క రూపమును నానావిధ రూపములుగ ఆరాధించుటన్నది అజ్ఞానమును మూఢత్వమునై యున్నది. ఎందుకంటే రోమా 1 :19-23లో విధముగా ''దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది - దేవుడు అదివారికి విశదపరచెను. ఆయన అదృశ్యలక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైయున్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదుగాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు ప్రతిమాస్వరూపములుగా మార్చిరి.''
ప్రియపాఠకులారా! దేవుని పంచభూతాలకు గ్రహాలకు పోల్చుటయేగాక దేవుని సృష్టములను కూడా పూజించుటన్నది నరునిలో అజ్ఞానమన్నది అద్దము పట్టియున్నదని మనము గ్రహించుకోవాలి. సృష్టికర్తకున్న శక్తి సృష్టాలకున్నదా? సృష్టికర్తలోని ప్రభావము శక్తి ఆయన రూపించిన గ్రహాలకున్నాయా? సృష్టికర్తను వదలి సృష్టాలను ఆరాధించే నరుడు జ్ఞానియా? అజ్ఞానియా? అన్నది పాఠకులే ఊహించండి. ఇది భూత కాలములో జరిగిన విషయము. అనగా దీనినే పాతనిబంధన కాలమని అంటున్నాము. ఈ పాతనిబంధన కాలములో సృష్టికర్తయైన దేవుడు నరులకు జ్ఞానోదయము కల్గించుటకు తానే ప్రత్యక్షుడై ఆయా సందర్భాలలో మేఘములలోనుండి ఆకాశములో నుండి లేక ఒక దూత రూపముగా కనబడి దేవుడు మాట్లాడినట్లుగ వివరిస్తున్నది. దీనిని కూడా భూతకాలమని అనవచ్చును. ఇక ఆనాటి అజ్ఞాన నరులకు వారి అజ్ఞాన క్రియలను, వారి మూర్ఖతను, వారి కఠినవైఖరిని బట్టి దేవుడు ప్రత్యక్షముగా వారితో మాట్లాడుచు, వారిని మందలించినను దేవునియందు లక్ష్యముంచకపోగా నాటి జనాంగములో యాకోబు అనగా మోసగాడు అను ఒక నరుని నుండి 12 మంది కుమారులను పుట్టించి, వారి నుండి 12 గోత్రాలను సృష్టించి, ఆ 12 గోత్రాలకును ఇశ్రాయేలు అనగా దేవుని జనాంగము అను ప్రత్యేకమైన నామధేయముతో ఈ అనంత విశ్వములో వారిని ఒక గొప్ప జనాభాగా నాటి దినాలలో ఏర్పరచుకున్నాడు. దేవుని పేరు పెట్టబడిన ఈ జనాంగము కూడా ఆయాసందర్భాలనుబట్టి అన్య జనాంగాలతో సావాసమేర్పరచుకొని, అన్యులు ఆచారాలు కూడా పాటించుచున్న సందర్భాలనుబట్టి దేవుడు అనేకమారులు వారిని మొత్తి జ్ఞానోదయము కల్గించినను, వారు తమ అజ్ఞానమును తొలగించుకొనందున దేవుడు వారిపై మోషే అను వ్యక్తిని నాయకునిగ నియమించి, అతని ద్వారా తన జనాంగమును తన క్రమములో ఉంచుకోవాలని ప్రయత్నించి, మోషేలో ఉన్న అజ్ఞానాన్ని నోటి మాంద్యాన్ని తొలగించి, దేవుడు తన విశ్వాసిగా చేసి, తన జనాంగముపై నాయకత్వమునిచ్చి నలుబది సంవత్సరాలు దేవుని జనాంగమైన ఇశ్రాయేలును పరిపాలించుటకు అధికారమును, యోగ్యతను ఇచ్చి, అతని ద్వారా ఇశ్రాయేలులలో దేవుడు మహిమ పరచబడాలని ఆశించాడు. ఈ ఆశన్నది కేవలము తలంపుతోనేగాక క్రియామూలకముగా తన జనాంగమునకు తన మహిమను కనబరచినాడు. అలాగా తన మహిమను కనబరచుచు, తన జనాంగమును క్రమపరచుటకు ధర్మశాస్త్రము అను రెండు రాతిపలకలను మోషే కిచ్చి, అందులోని నిబంధనలను తప్పక ఆచరించునట్లును, అందులో ఏదేని ఒక దానిని తప్పిన పక్షములో కఠినమైన శిక్ష విధింపబడునట్లును, ఆ శాసనాలకు దేవుడు తన జీవాన్ని మహిమను ప్రసాదించాడు. ఆ విధముగా దేవుడు బహు కట్టుదిట్టముగా నరులయొక్క అజ్ఞానము తొలగిపోవుటకు క్రియ జరిగించినను నరునియొక్క అజ్ఞానము మారలేదు. అందుకే రోమా 3:11లో నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు. గ్రహించువాడెవడును లేడు. దేవుని వెదకువాడెవడును లేడు,'' అని వ్రాయబడియున్న ప్రకారము నాటి జనాంగములో నిజమైన దేవుడు ఎవరో? అన్నది తెలియక నానావిధమైనటువంటి రీతులలో దేవుళ్ళు కాని వాటిని, దేవుడు సృష్టించిన సృష్టములను కూడా దేవుళ్ళుగా పూజిస్తూ క్రియ జరిగించింది. దాని ఛాయలు నేటికిని ఉన్నాయి.
ప్రియపాఠకులారా! ఈ భూతకాలమన్నది నానా అనర్థాలకు మూలమైయున్నను దేవుని యొక్క ప్రత్యక్షత ఈ కాలములోను జరిగింది. ఎలాగంటే దేవుడు తన జనాంగములో దూత ద్వారా ప్రత్యక్షముగాను తానును పరోక్షముగా దూత ద్వారాను, మరో విధముగా ప్రవక్తల ద్వారాను నాటి ప్రపంచ జనాభాతో మాట్లాడినట్లును, ఆయా సందర్భాలలో హెచ్చరించినట్లును చదువగలము. ఆ విధముగా దైవ హెచ్చరికను వారు ఆదాము నుండి యెహేజ్కేలు వరకు ఇట్టి అనుభవాలు పొందినవారే, భూతకాలములో ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచింపజేసిన మాటలు నూతన నిబంధన కాలములో నెరవేరినవి. ''ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును - ఆయనకు ఇమ్మానుయేలని పేరుపెట్టును,'' అన్నట్టి వచనము భూత కాలములలో ప్రవచించబడింది. అయితే దాని నెరవేర్పు నూతన నిబంధన కాలములో క్రీస్తు పుట్టుక ద్వారా నెరవేరింది. అలాగే యేసుక్రీస్తు జరిగించిన బలియాగమునుగూర్చి కూడా భూతకాలములో యెషయా గ్రంథములో వివరముగా ప్రవచించబడియున్నది - అది కూడా నెరవేరింది. అలాగే నూతన నిబంధన కాలములో దేవుని కుమారుడు నరావతారుడైన దేవుడు ప్రవచించిన మాటలు ఇప్పుడు ఈ తద్ధర్మ కాలములో నెరవేరుచున్నాయి. కాని కుమారుడైన దేవుడు ప్రవచించినవి భవిష్యత్ కాలములో జరుగబోవు వాటిని గూర్చి మాట్లాడిన మాటలు - క్రీస్తు రాకడ, నూతన సృష్టి, గొర్రెపిల్ల వివాహమహోత్సవము, వగైరాలు కూడా నెరవేరబోవుచున్నాయి.
ఈ విధముగా ప్రియపాఠకులారా! భూతవర్తమాన భవిష్యత్ అను మూడు కాలాలను అనుసరించి వ్రాయబడిన కాలమే పరిశుద్ధ గ్రంథము. ఈ మూడు కాలములు పరిశుద్ధ గ్రంథములో నాలుగు విధాలుగ విభజింపబడియున్నవి. 1. దేవుని కాలము 2. రక్షకుని కాలము 3. పరిశుద్ధాత్మ కాలము. 4. అపొస్తలుల కాలము 5. యుగాంత కాలము 6. అంత్యకాలము 7. నూతన సృష్టి అనగా భూతతద్దర్మ భవిష్యత్తు అను ఈ మూడు కాలములలో క్రైస్తవ వేదరీత్యా రెండు కాలములు అదనముగా ఏర్పడియున్నవి. అలాగే ఈ 7 కాలములు 7 యుగాలుగా విభజించబడియున్నవి. అందుకే ప్రవక్తయైన మోషే 90వ కీర్తనలో ప్రభువా! తరతరములకు మాకు నివాస స్థలము నీవే. పర్వతాలు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగాలు నీవే మా దేవుడవు,'' అని ప్రవచించియున్నాడు. ఇందునుగూర్చి నేర్చుకొందము. పై వేదభాగ రీత్యా నరజీవితములో తరములు యుగములున్నట్లును మనకు తెలుస్తున్నది. యుగములను గూర్చి తెలిసికొన్నాము. తరములనుగూర్చి కూడా తెలిసికోవలసి యున్నది. మొట్టమొదటగా దేవుడు సృష్టించిన ఆదినరజంటకు తరము లేదు. వారి తరము దేవునియొక్క మహిమలో గుప్తమైయున్నట్లు దేవుడు నిర్మించిన నరనారీ నిర్మాణక్రియ ద్వారా మనకు ఋజువగుచున్నది. అనగా అప్పుడు నిర్మితమైన నరజంటకు తరము లేదు. ఎందుకంటే వారు దైవహస్త క్రియయైయుండి దేవుని మహిమగా మొట్టమొదట భూమి మీద వారు రూపించబడినారు. అయితే ఈ తరము అన్నదానికి పునాది దైవ ఆజ్ఞాతిక్రమము చేసి, దైవశాపమునకు గురియై తత్సంబంధముగా ఆదామునకు గర్భము ధరించి కనిన కుమారుడు - కయీను నుండి ఈ తరము అను దానికి పునాది ఏర్పడింది. అనగా ఆదాము యొక్క తరము ఆదినరుని యొక్క తరము వంశము ప్రారంభమైంది. అంతకుముందు నరుడు దైవాంశ సంభూతుడుగా ఏర్పడియున్నాడు.
ఈ విధముగా ప్రారంభమైన ఈ తరములు దినదిన ప్రారంభమై ఆదికాండము 6 వచ్చుసరికి దేవుని కుమారులు నరుల కుమార్తెలు అను రెండు తరాలు ఏర్పడినవి. ఈ రెండు తరాలు ఫలించిన శారీర ఫలాలు దైవత్వమునకు ప్రతికూలములును, విరోధములును, దైవోగ్రతకు పాత్రములైనట్లుగా ఆదికాండము 6:లో మనము చదువగలము. ఇది ఆదాము తరము నుండి ప్రారంభమై శారీరేచ్ఛ మూలముగా ఆదాము యొక్క జ్యేష్టకుమారుడైన కయీను ద్వారా విస్తరించిన జనాభాను బట్టి దేవుని తరము నరుల తరము అను రెండు తరములు - నరుల కుమారులు దేవుని తరము, నరుల కుమార్తెలు తరమును వివాహము చేసికొని, ఈ రెండు తరాలు దేవుని ఉగ్రతకు గురియైనందున, అప్పటి భూతకాలంలో విస్తరించిన ఆ జనాభా దైవోగ్రతకు గురియైన మూలమున దేవుడు ఆ రెండు తరములను బట్టి యావద్ సృష్టిని - జలప్రళయమనే ఉపద్రవముతో తుడిచివేశాడు. ఈ విధముగా దేవుని కుమారులు నరుల కుమార్తెలు అను ఈ రెండు తరములు తుడిచిపెట్టుక పోగా నాటి తరముల దినములలో దేవుడు ఒక్క నీతిమంతుడు, అతని కుటుంబాన్ని ప్రత్యేకమైన తరముగ ఏర్పరచుకొని, అతని ద్వారా పూర్తిగా లయమై పోయిన అనంతరము నూతన సృష్టి నిర్మాణము గావించుటకు అతని ద్వారా మూడవ తరముగా - దేవుడు భూమి మీద ఏర్పరచిన ఇతడు నీతిమంతునిగ నోవహు దేవుని సన్నిధిలో అప్పటి తరములో ఎన్నిక చేయబడినాడు.
కనుక ప్రియపాఠకులారా! ఆనాటి ప్రారంభమైన నూతన తరములో జీవిస్తున్న మనమందరము నోవహు తరము నుండి వచ్చిన వారమే కాని, ఈ తరము కూడా దేవుని ఎదుట నీతియుతమైన స్థితిలో జీవించలేక పోయింది. ఇట్టి పరిస్థితులలో దేవుడు లోకములో ఒక విశ్వాసిగా ఒకతనిని ఏర్పరచుకొన్నాడు. ఆ విశ్వాసి అబ్రాహాము - అబ్రాహాము దేవుని యొక్క విశ్వాసములో ఎదిగి తండ్రియై రెండవ తరమునకు పితామహుడైనాడు. ఈయన నుండి వచ్చిన జనాంగమే ఇశ్రాయేలు జనాంగము. ఈ ఇశ్రాయేలు జనాంగానికి మూలపురుషుడు అబ్రాహాము. అతని కుమారుడైన ఇస్సాకు - ఇస్సాకు కుమారుడైన యాకోబు తండ్రియైనట్లు వేద వివరణ. ఈ యాకోబు నుండియే 12 వంశాలు, 12 గోత్రాలు ఏర్పడినట్లుగ కూడా వేదములో మనము చదువగలము. ఆవిధంగా అభివృద్ధి చెందిన ఈ తరములను దేవుడు ఆశీర్వదిస్తూ తాను ఇశ్రాయేలు అను పేరు పెట్టిన జనాభాకు ప్రవక్తలను, యాజకులను, న్యాయాధిపతులను, రాజులను, ఏర్పరచి, వారిని ప్రతిష్టించుటయే గాక వారందరు దేవుని క్రమములో తప్పకుండ దైవ మార్గములో క్రమశిక్షణతో నడుచుటకు, ధర్మశాస్త్రమను నిబంధన మందసమును విధిగా వారు ఆచరించునట్లుగాను, అలా ఆచరించుటయేగాక - దేవుడు అనుగ్రహించిన ఈ ధర్మశాస్త్రమును తూచా తప్పకుండ పాటిస్తూ వారి పట్ల బహుకఠిన వైఖరి నవలంబించి, వారిని తన క్రమములో నడిపించినట్లు భూతకాలమైనట్టి పాతనిబంధనలో మనము చదువగలము. ఈ విధముగా తరతరములకును ఇశ్రాయేలునకు దేవుడు ఆశ్రయమును కేడెమును బలమునై యుండి, వారిని సకల విపత్తులలోను, భయాలలోను, సమస్తములోను, పోరాటాలలోను కాపాడుచు, ఈ విధమైన పాతనిబంధనలోని తరతరములకు మహాదేవుడైయున్నట్లు, ఆది కాలములోని ఆయుగములలో ఆయన తన ప్రజలకు దేవుడైయున్నట్లు పాతనిబంధనలోని నాటి చరిత్ర మనకు తెలియుచున్నది.
ఈ విధముగా భూతకాలములో క్రియ జరిగించిన దేవునియొక్క మహిమను ఆయన తేజస్సును, ఆయన స్వరమును, ఆయన మాటలను, ఆయన శాసనములకు, ఆయన యొక్క మార్గములో నడిచిన నాటి ఇశ్రాయేలు జనాంగమేగాక అన్యులైనటువంటి జనాంగము కూడా దేవునియొక్క క్రమము నుండి తొలగిపోయి, దైవ జనాంగమును అన్య జనాంగమును ఏకమై సృష్టిని - సృష్టములను విగ్రహాలను వగైరాలను ఆరాధించుచు దేవునికి చెందవలసిన మహిమను సృష్టికిని, సృష్టిలోని సృష్టములకును తమ హస్తాలతో నరులు చేసికొన్న చేతి పనికిని వారు నమస్కరిస్తూ వారు జరిగించిన దైవ చట్ట వ్యతిరేక క్రియాకర్మలకు దేవుడు వారిని అప్పుడప్పుడు ప్రకృతి భీభత్సాలకును, అన్యరాజుల యొక్క దాస్యానికి వారిని కఠినముగా అప్పగించి శిక్షించి, నానా ఇక్కట్టులకు గురిజేసినట్లుగా వేదములో చదువగలము. ఇది భూత కాలములో దేవుడు తన ప్రవక్తల ద్వారా నాటి భవిష్యత్కాలములో అవతరించబోయే అవతారమూర్తియైన యేసుక్రీస్తును గూర్చి దేవుడు తానేర్పరచుకొన్న ప్రవక్తల చేత ప్రవచింపజేయుటయేగాక, లేఖన భాగాలు కన్యక గర్భవతియై కుమారునికంటుందని, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురని యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన కర్తయగు అధిపతి అని పేరుపెట్టబడును.'' ఇది భూతకాలములోనే దేవుడు తాను ప్రవక్తల నోట రచింపజేసిన నాటి భవిష్యత్తును గూర్చిన వివరణ అనగా అప్పటికి క్రీస్తు జన్మించలేదు - క్రైస్తవ్యము లేదు. అట్టి స్థితిలో దేవుడు భూలోకములో తన రాజ్యమును స్థాపించాలని తానే కుమారత్వము ధరించి తానే పరలోక రాజ్యమునకు దీటైన రాజ్యముగా భూలోక రాజ్యాలను మార్చాలని సంకల్పించి, తన ప్రవక్తల నోట పల్కించుటయేగాక లేఖన భాగాలుగా రచింపజేశాడు. ఇది ఆనాటి భూతతద్దర్మ కాలాల చరిత్ర. కాని నాటి భవిష్యత్తులో అనగా క్రీస్తు జన్మించబోవు దినాలను - క్రీస్తు జన్మించిన దినమును మత్తయి 2:1 - రాజైన హేరోదు సామ్రాజ్యములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రాజుగా పుట్టిన క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? అందుకు వారు యూదయా బెత్లెహేములోనే ఏలయనగా యూదయా దేశపు బెత్లెహేమా! నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైనదానవు కావు. ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాసిన లేఖనము నెరవేర్పు క్రీస్తు ద్వారా దేవుడు జరిగించాడు. ఆనాటి పాతనిబంధన కాలములో భూత తద్దర్మ కాలములో దేవుడు రచింపజేసిన పై వచన వివరము. ఆదిలో భూతకాలమునుగూర్చి మనము తెలిసికొన్నాము. అటుతర్వాత ఇశ్రాయేలు జీవితమును బట్టి వారికి ఇవ్వబడిన ధర్మశాస్త్రము అను నిబంధన యుతమైన మందసము జరిగించిన క్రియాకర్మలను గూర్చి నాటి తద్దర్మ కాలమును గూర్చి, నాటి ప్రవక్తల కాలములో జరిగిన సంఘటనలు వివరిస్తున్నవి. ఆ ప్రవక్త కాలములోనే క్రీస్తు యొక్క జన్మ రహస్యము, ఆయన పుట్టబోవుటకు ఆయనను కనే కన్యయైన వివరము - ఆయనకు పెట్టబడే పేరు. ఆయన ఎందు నిమిత్తముగా ఈ లోకములో జన్మించబోయే దైవోద్దేశ్యము, ప్రణాళిక, ఆయన జన్మించి జరిగించబోయే బలియాగమును గూర్చి యెషయా గ్రంథము వివరిస్తున్నది. అంటే నాటి ప్రవక్తల కాలము తద్దర్మ కాలమైయుండి నూతన నిబంధన కాలము - ప్రవక్తల కాలము నాటికి భవిష్యత్ కాలముగా నిర్ణయించబడినట్లు అప్పటి వేదవివరణలు మనకు తెలుపుచున్నవి. ఆ విధముగా ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు లోకరక్షకుని యొక్క జనన కాలము, ఆయన జన్మించిన విధము, ఆయనను గర్భము దాల్చి ప్రసవించిన కన్య యొక్క వివరము వగైరా వివరాలన్నియు - ప్రవక్తల ప్రవచనాల యొక్క వివరణానుసారముగా నెరవేర్చబడింది. అనగా నూతన నిబంధన కాలము ప్రవక్తల కాలమునకు భవిష్యలత్కాలమైయుండబట్టి - భవిష్యత్తు యొక్క మహిమాన్వితమైన క్రియాకర్మలను క్రీస్తు కాలములోని జనాంగము కన్నులారా చూడగల్గినారు. అయితే ఆ కాలమును క్రీస్తు భూతకాలముగ నరకోటికి వివరిస్తూ ప్రవచించిన వివరము మత్తయి 24:1-27 ఇది లోకమునకు సంభవించబోవు భవిష్యత్తును గూర్చి వివరిస్తూ దైవకుమారుడైన ప్రభువు ప్రవచించిన వివరము. ఇవి జరుగవలసియున్నదని యేసుక్రీస్తు నాడు చెప్పినట్లే ఆయన చెప్పిన మాటలు కొన్ని గుర్తులు ఈ తద్దర్మ కాలములో జరుగుచున్నవి. అవేమనగా ఇందులో మొట్టమొదటగా మత్తయి 24:4-13లో యేసు చెప్పిన మాటలు.
ప్రియపాఠకులారా! ఇందులో 24:4లో ప్రభువు చెప్పిన రీతిగా నేటి విశ్వాసులమైన మనకు నేడు జరుగుచున్న తద్దర్మ కాలములో మోసమనేది కళ్ళెము లేని గుర్రము వలె అడ్డు అదుపు లేకుండ క్రియ జరిగిస్తు - ఈ మోసమన్నది లోకరీత్యా ఉంటున్నది. వ్యక్తులలో ఒకరినొకరు మోసపరచుకొనుటన్నది - ఈ మోసమన్నది అనేక రీతులుగా ఉన్నది. అందులో నకిలీ బంగారము చూపించి సిసలైన బంగారాన్ని కన్ను కప్పుట, మోసపూరితమైనటువంటి వంచనతో కూడిన మాటలతో లోకపరిపాలన పదవిని అలంకరించి, తాను ఆ పదవిని అలంకరించిన తర్వాత తాను మాట్లాడిన మాటలకు విరుద్ధముగా ప్రవర్తించుట, మోసముతో ధనార్జన చేయుట, క్రీస్తు పేరును పెట్టుకుంటూ క్రైస్తవ సంస్థగా ప్రకటించుకొంటు అందులో జరిగే మోసాలు, వ్యాపారములో మోసాలు, ఆహారములో కల్తీల మోసము, వాడే ఔషధాల వ్యాపారములో మోసము, తక్కెడలో మోసము, తూకములో మోసము, తూనికలలో మోసము - ఇన్ని రకాలైన మోసాలకు ఈనాటి విశ్వాసి తట్టుకొని నిలబడాలి. అంతేగాకుండ 24:5 అనేకులు క్రీస్తు పేరట సభలను ఏర్పాటు చేసి, తానే క్రీస్తు అన్నట్లుగ ప్రకటించుకొంటూ వేదములోని ప్రవచనాలను తమ యొక్క స్వార్ధానికి మలచుకొని బోదిస్తూ మోసగించుట, తామే క్రీస్తు యొక్క దూతలని, పరిశుద్ధాత్మకు ప్రతిరూపాలని ప్రకటించుకొంటూ 24:6 మీరు యుద్ధములు, యుద్ధ సమాచారాలను గూర్చియు వినబోదురు,'' అనుటలో ఇవి ఇప్పుడు క్రియ జరిగిస్తున్నవి - ప్రారంభమైనవి. భారతదేశము పాకిస్థాన్, ఇరాన్ - ఇరాక్ అమెరికా, చైనా భారతదేశము శ్రీలంకలో చెలరేగిన అంతర్ యుద్ధాలు, ఇశ్రాయేలు పాలస్తీనా మరియు ఉగ్రవాదులకు ప్రభుత్వానికి జరిగే పోరాటాలు. ఇవిగాక ప్రత్యక్షముగా అగ్రరాజ్యాలు కలసికట్టుగా పోరాడే సమయము రానున్నట్లు అందుకు తగువైన మారణాయుధాలు తయారు చేయుట కూడా జరుగుచున్నది. ఇప్పటివరకు జరుగుచున్న ఈ పోరాటాలు అన్నియు చిన్నవియే, అయితే లోకానికి దైవత్వానికి కూడా జరుగబోయే పెద్ద పోరాటమున్నదని అందునుగూర్చి కలవరపడకుండ ఆత్మ సంబంధులైన మనము సిద్ధపాటుతో కనిపెట్టి వాటిలో పాలుపొందక, వాటిని చూడకుండ ప్రభువులో లీనమయ్యే ఐశ్వర్యాన్ని పొందవలసినవారమై యున్నాము. ఇట్టి సందర్భములో కలవరపాటు తగదని ప్రభువు హెచ్చరిక. పైగా ఇవి జరుగవలసియున్నవని భవిష్యత్తును గూర్చి ప్రభువు ప్రవచించియున్నాడు.
ఇక 24:7లో ''జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును.'' ఇది ఇప్పుడు ప్రారంభమైంది. ఒక్కజాతి, ఒక్క జనము, ఒక్క ఆత్మీయత, ఒక్క సావాసము, ఒకే సిద్ధపాటుతో జీవించవలసిన నరులు భిన్న మనస్కులై వికటించిన మనస్సుతో - జాతిమత కులశాఖ, భాష దేశ భేదములను కలిగి ఒకరినొకరు ద్వేషించుకొంటూ - ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకొని పోట్లాడుట, మత కలహాలు భాషా కలహాలు వర్ణభేదాలతో విప్లవాలను, దహనకాండను, హత్యలను జరిగిస్తూ భీభత్సాన్ని సృష్టించి, జనము మీద జనము, రాజ్యము మీద రాజ్యము, కయ్యానికి కాలుదువ్వి పోరాడుట, ఇప్పుడు మన దేశములోని ఉగ్రవాదత్వము, ఎన్‌కౌంటర్లు అనగా ప్రభుత్వానికి ఉద్యమకారులకు జరుగు పోరాటాలు. ఇవిగాక గ్రామ కక్షలు, చేతి బాంబులతో మారణయుధాలతో హత్యాకాండ జరిగించుట, ఇవన్నియును కూడా ఒక జనమునకు మరియొక జనము మీద జరిగే పోరాటాలుగ ఉన్నవి. ఇక అక్కడక్కడ కరువులు ఇవి ఇప్పుడు ప్రారంభమైయున్నవి. అనగా అనావృష్టి ద్వారా పంటలు పరడక - అక్కడక్కడ జనాలు బాధపడుచుండగా ఆ ప్రాంతాలను కరువు ప్రారతాలుగా ప్రభుత్వము ప్రకటించుట మనమెరిగిన విషయమే, ఇక భూకంపాలు విషయములో ఈ భూకంపాలు కూడా బహుముఖముగా విస్తరించి, జననష్టము, ఆస్థి నష్టము, ప్రాణనష్టము కల్గించుచున్నట్లు ఫిలిప్పీన్స్, మనిలా చిలీ, ఇటీవల జపాన్‌లో కలిగిన భూకంపాలు, మన భారతదేశములో మహారాష్ట్రములోని లాతారు కిలారి అనే పట్టణాలు భూకంపము ద్వారా జరిగిన అతి భీకర ఉపద్రవముతో లక్షల జనాభా లయమై పోవడం, తద్వారా అనేక విధములైనటువంటి నష్టాలు కష్టాలు బాధలు, నిరాశ్రయము వగైరా అనర్థాలు. ఒక్కొక్కసారి చైనా జపాన్ ఉగాండా టర్కీ వగైరా దేశాలలో కలిగిన భూకంపాలు ఇవన్నియును ప్రభువు మాటల నెరవేర్పయియున్నవి. ఇంతేగాకుండ సముద్రాలలో భూకంపము సంభవించి సముద్రపు నీళ్ళు ప్రకోల్పమై ఉప్పెనగా మారి గ్రామగ్రామాలు దోచుకొనిపోయిన సంఘటనలు కూడా వార్తాపత్రికల ద్వారా తెలిసికొంటున్నాము. ఈ విధముగా ఒక్క భూకంపమే గాకుండ తుఫానులు పిడుగుపాటు సుడిగాలులు మంచు తుఫాను, ఎడారి ఇసుక తుఫానులు, వడగండ్లు ఇవన్నియును కూడా లోకాంత్యములో భూలోకమును క్షోభపెట్టుటకు ఏర్పడిన ఉగ్రతలైయున్నవి.
ప్రియపాఠకులారా! ఇంతటితో ఈ శ్రమ ఆగక దీని ద్వారా వేదనలు ప్రారంభమగునట్లుగా ప్రభువు యొక్క ప్రవచనము వివరిస్తున్నది. ఈ వేదనలు మట్టుకేగాక జనములు కూడా ఒకరిపై నొకరు తిరుగబడి ఒకరినొకరు చంపుకొంటూ - క్రైస్తవ విశ్వాసులను కూడా సువార్త నిమిత్తము చంపే అఘాయిత్యాలు కూడా జరుగుతాయని, ఆ విధముగా జరుగుటకు పూర్వము ప్రభువు యొక్క నామము నిమిత్తము క్రైస్తవ విశ్వాసులైన జనాంగము దూషింపబడుదురని, ఈ దూషణకరమైన వాతావరణములో అనేకులు అభ్యంతరపడి, ఒకరినొకరు అప్పగించుకొని, ఒకరినొకరు తిట్టుకుంటూ - అనేక విధాల వికార మనస్తత్వముతో ప్రవర్తిస్తారని, అది చాలదన్నట్లుగా అనేకులు సాతాను శక్తులతో ప్రేరేపించబడిన అబద్ధ ప్రవక్తలు దేవుని సువార్తను ప్రకటిస్తున్నట్లుగానే నటిస్తూ దేవునియొక్క ప్రవచనాలను లోకానికి జతపరచుచు, దైవరాజ్యమనేది వేరే ఏది లేదనియు, దైవరాజ్యమనేది భూమి మీద ఉన్నటువంటి నేటి మన నరజీవితమనియు, పాపపుణ్యాలు ఈ లోకములోనే అనుభవిస్తాము అనియు, వేరే లోకమంటూ ఏదియు లేదని చనిపోయినవాడు తక్కెడో బిక్కెడో - చనిపోయినవారిని గూర్చి అనుకోకూడదని, లోకంలో ఉన్నంత కాలము లోకాన్ని అనుభవించాలని, అందుకే మనము లోకములో పుట్టాము అని, పాతనిబంధనలోని రాజులు ప్రవక్తలు వారి యొక్క జీవిత కాలము అంతయు బహు గొప్పగా జీవించి, లోక భోగాలననుభవించి తమ జన్మను సార్థకము చేసికొన్నారని,'' ఇటువంటి తప్పుడు బోధలు - మద్యపానము, ధూమపానము, స్త్రీ సాంగత్యము అన్నవి నేరాలు కావని, మద్యపానమునకు మూలమైన వృక్ష సంపదను దేవుడే కదా సృష్టించాడు. అలాంటప్పుడు ఆ వృక్ష సంపద రసాలను అనుభవించుటలో తప్పేముందని , కనుక తాగవచ్చని ధూమపానమునకు మూలమైన పొగాకు దైవసృష్టి తప్పేముంది? నోటిలో నుండి కడుపులోకి పోయే ప్రతిదీ మంచిదేయనియు, అయితే లోపలి నుండి వెలుపలికి వచ్చే మాటల విషయములో జాగ్రత్తగా ఉండాలని ప్రభువే మత్తయి 15:11లో చెప్పాడు కదా! అది తప్పు ఎలాగవుతుంది?
కాబట్టి లోకములో జీవిస్తూ లోకస్థులమైన మనము సర్వాన్ని అనుభవించుటకు హక్కుదారులము వారసులమైయున్నామని చెప్పుచు, పాతనిబంధన కాలమునాటి వ్యక్తుల జీవితాలను ఎరగా పెట్టి ప్రకటిస్తూ - పాతనిబంధన కాలములో అబ్రాహాము వంటి విశ్వాసులకుగాని, మోషే వంటి పవిత్రునికిగాని, దావీదు సొలొమోను వంటి జ్ఞానికిగాని, బహుభార్యత్వము బహు స్త్రీలోలత్వము నరహత్య అన్నది బహుముఖముగా క్రియ జరిగించగా - నేటి దైవ విశ్వాసికి ఇద్దరు ముగ్గురు భార్యలుంటే తప్పేమని, కాబట్టి పురుషుడు ఎంతమంది స్త్రీలతో ఉన్నను నేరము కాదని, పోషించే సత్తా ఉన్నవాడు ఎంతమంది స్త్రీలతో ఉన్నను అది వానికి నేరము కాదని, విగ్రహారాధన తప్పని దైవత్వము ప్రకటించింది గదా! అయితే లోకములో నానావిధ విగ్రహాలను, సృష్టములను ఆరాధించుట తప్పే. అయితే యేసుక్రీస్తును, ఆయనను కన్నతల్లిని, ఆయన ఏర్పరచుకొన్న అపొస్తలులను విగ్రహాలుగా చేసికొని ఆరాధించుటలో తప్పేముంది? వారు కూడా దేవుళ్ళతో సమానులే. కనుక వారిని కూడా విగ్రహలుగా చేసి వారి పేరట గుళ్ళు కట్టి ఆరాధించుట తప్పులేదనియు, అసలు పాపమనేది మానవుని నైజగుణమని దేవునికి తెలియునని తెలిసియే ఆయన ఈ లోకములోని పాపులను పిలువవచ్చినానని, నేను నీతిమంతులను గూర్చి రాలేదని బాహాటముగా యేసుక్రీస్తు ప్రవచిస్తూ - పాపములో జీవించేవారికి విడుదల కల్గించుటకే ప్రభువు వచ్చినాడని వేదము ఘోషిస్తుండగా మనము పాపము చేయక పరిశుద్ధులుగ జీవించుటన్నది అది అసాధ్యమైన పని. పాపము లేకుండ పరిశుద్ధులుగ జీవిస్తే అట్టివానికి దేవునియొక్క ప్రసన్నత లేకపోగా అనేక కష్టనష్టాలకు గురియగును. అయితే ఒక వ్యక్తి ఎంత ఎక్కువగా పాపము చేస్తే అది వాని జీవితానికి మేలు. ఎందుకంటే పాపములో జీవించే వ్యక్తికి దేవుని దర్శనముంది. ఇందుకు ఋజువులు మన వేదమే మనకు చూపుచున్నది.
బైబిలు గ్రంథములో పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవ సంఘాలను బంధించుటకును, వారిని హింసించుటకును, చెరపెట్టి శిక్షించుటకును తనకు ప్రాణాధారమైనట్లుగా పౌలు మరెక్కువగా విజృంభించి తనకు ఆవరకున్న అధికారాలు చాలక డమస్కు పరిపాలకులను మరి కఠినమైన ఆజ్ఞల కొలది, వాటి ద్వారా క్రైస్తవులను చిత్రహింసల పాల్జేయాలని సంకల్పించాడు. ఆ విధముగా అనుకొన్న సౌలు తన కార్యాచరణను గూర్చి అంగరక్షకులతో ప్రయాణించు సందర్భములో ప్రత్యక్షముగా యేసుక్రీస్తు దర్శనములో నేల పడవైచిన సంఘటన మనకు తెలిసిందే గదా. ఆనాటి నుండి ఆ సౌలు పౌలై ఎనిమిది సంఘాలకు లేఖలు వ్రాసి అపొస్తలులలో ప్రధముడయ్యాడు. ఆ సౌలుయే భక్తితో ప్రభువు విశ్వాసములో ఆరాధనలో ప్రార్థనా సావాసము బోధించాడంటే ఆ ప్రభువు దర్శనము కలిగేదా? ఇక మోషే విషయానికొస్తే మోషే ప్రభువును ఎరుగక పూర్వము ఐగుప్తీయుని చంపి ఇసుకలో కప్పిపెట్టిన అక్రమాన్ని బట్టి అతడు నరహంతకుడుగా గుర్తింపు పొందాడు. మరి నరహంతకుడైన వ్యక్తిని దేవుడు హోరేబు అను తన పరిశుద్ధ స్థలములో తన జనాంగమును పరిపాలించుటకు మోషేను పేరుపెట్టి పిలిచి ఎన్నుకొనలేదా? ఇక అబ్రాహాము విషయములో అయితే అబ్రాహాము ఏకపత్నీవ్రతుడైయుండి సంతానము లేదనే నెపముతో దాసీదానికి గర్భమిచ్చి, ఆ దాసీదానిని, ఆ బిడ్డను అడవుల పాల్జేశాడు. అయినను దేవుడు ఆ దాసీదానిని ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించి ఇష్మాయేలు అను పేరు పెట్టించి, అతని ద్వారా ఒక గొప్ప జనాంగము నేడు ప్రపంచమంతా విస్తరించియుందంటే, ఆ దాసీకి ఆ బిడ్డ పుట్టకపోతే ఈనాడు ఆ శిశువు సంబంధమైన జనము ఉండేది కాదు.
కనుక క్రైస్తవ బిడ్డలారా! విశ్వాసులకు తండ్రియైన అబ్రాహాము ఎంత నీచమైన క్రియకు ఒడిగట్టినాడంటే అది దేవునికి తప్పుగా ఎంచబడలేదు. దేవుడు అబ్రాహామును ఆశీర్వదించగా అబ్రాహాము విశ్వాసులకు తండ్రిగా ఎంచబడుచున్నాడు. ఇక యాకోబు విషయములోకొస్తే యాకోబు మోసగాడు, అట్టి మోసగానితో దేవుడు పోరాడి అతన్ని దైవజనునిగా ఇశ్రాయేలని పేరు పెట్టినట్లుగా వేదములో చదువగలము. ఇక ఈ విధముగా చెప్పుకొంటూ పోతే చాలా ఉన్నవి. కనుక పాపములోనే నరునికి ప్రమాదమున్నదని పాపములోనే నరునికి దైవదర్శనము దొరకుతుందని, పాపము ద్వారానే నరుడు దైవ సాన్నిధ్యమునకు వెళ్ళగలమని నరుడు తెలిసుకోవాలి - ఇది అబద్ధ ప్రవక్తల యొక్క బోధయైయున్నది. ఇట్టి బోధను విన్న జనాంగము ఆ వరకు చేస్తున్న పాపమును రెట్టింపుగా చేస్తూ - తమ జీవితములో అక్రమస్థులుగా మారి, అక్రమాన్ని విస్తరింపజేయుట ద్వారా క్రైస్తవ విశ్వాసులమని చెప్పుకొంటున్న వారిలో క్రైస్తవ ప్రేమ చల్లారిపోతుంది.
ఇక నూతన నిబంధనలో ప్రత్యక్షముగా పాపికొరకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మా మాట అబద్ధమైతే లూకా 19:2-10లో వ్రాయబడిన మాటలు చదవండి. జక్కయ్య యొక్క పాపపు స్థితి. జక్కయ్య ఎటువంటి పాపియో వేదమే సాక్ష్యమిస్తున్నది. ఇంకను జక్కయ్య తానే తన పాపమునుగూర్చి యేసు ఎదుట మాట్లాడిన మాటలు చదువగలము. అలాగే మగ్దలేనే మరియ పాపి గదా! ఆమెను యేసుప్రభువు క్షమించలేదా? వ్యభిచారములో పట్టుబడిన స్త్రీని గూర్చి ఆనాటి యూదులు యేసు ముందుంచి ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలన్నప్పుడు ఆమెకు రక్షణ ఇయ్యలేదా? ఇంతెందుకు తన కుడివైపు దొంగను పరదైసుకు తీసుకొని వెళ్ళలేదా?
కనుక దేవుని బిడ్డలారా! పాపమును చేసేందుకు భయపడవద్దు - పాపాన్ని క్షమించేందుకే రక్షకుడుండేది,'' అంటూ ఇలాంటి తప్పుడు బోధలు అనేకులైన అబద్ధ ప్రవక్తలు జనాన్ని మోసపరచే కాలం ఇపుడు జరుగుచున్నది. ఇట్టి బోధల ద్వారా అక్రమము విస్తరించుట ద్వారా విశ్వాసులలో ప్రేమ కూడా చల్లారిపోతున్నది. కాబట్టి ఇక ప్రవక్తయైన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే మత్తయి 24:15 అనుటలో అబద్ధ ప్రవక్తల యొక్క బోధలు ఇలాయుండగా - అబద్ధ ప్రవక్తలను ఆవేశించి ప్రేరేపించి మాట్లాడించే అంత్యక్రీస్తు ఆత్మ సంఘకాపరులను ఆవేశించి, బలిపీఠానికి యాజకుడైయుండి, అనేకుల పాపము నిమిత్తము కొరకు దేవునికి విజ్ఞాపన చేస్తూ - తన పాపము నిమిత్తమును, సంఘస్థుల పాపము నిమిత్తమును ప్రాయశ్చిత్తమును చేస్తూ - దైవత్వమును ఆత్మతోను సత్యముతోను రక్షణార్థమైన మాటలతోను ప్రభువు యొక్క ప్రవచనాల పరమార్థమును బోధిస్తూ - ప్రభువును మహిమపరచవలసిన కాపరిని - ఈ అంత్యక్రీస్తు ఆత్మ ఆవేశించి, అతని ద్వారా సంఘములో కలతలను, సంఘములో విభేధాలను, పదవీవ్యామోహమును స్వార్థమును, ఒకరి యెడల ఒకరికి ద్వేషమును పుట్టించి, సంఘములో సమాధానము లేక ఐక్య ఆరాధన లేక సంఘకాపరి చేత దూషణకరమైన మాటలను మాట్లాడించి, సంఘాన్ని వెక్కిరింతల పాలు జేయు బోధలను చేస్తూ - సంఘము యొక్క పతనావస్థకు కాపరియే కారణమైన స్థితికి ఈనాడు జరుగుటన్నది ఈ అంత్యక్రీస్తు యొక్క ఆత్మయే కారణము. ఇక ఇప్పుడు మన జీవిత అనుభవములో అనేక సంఘాలలో జరుగుచున్నటు వంటి క్రియయైయున్నది. ఇటువంటి అరాచక క్రియల మూలముగా సంఘములో ఆత్మీయునిగ పరిశుద్ధునిగ, విశ్వాసిగా దేవుని యందు భయభక్తులు గల్గి కేవలము వాక్యాల కొరకే ఆలయ ప్రవేశము చేసే విశ్వాసుల స్థితినిగూర్చి 24:15-16 చదువువాడు గ్రహించునుగాక, యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను,'' అనుటలో ప్రతి వారము ఆరాధనలో పాల్గొనే విశ్వాసి ఇట్టి అంత్యక్రీస్తు ఆత్మ బోధలనుబట్టి విసిగివేసారి మనశ్శాంతి లేక వాక్యము కరువై, ఇతర సంఘాలకు వెళ్ళుటన్నది కూడా మనమెరిగిన విషయమే. ఇది యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను అన్న మాటకు మాదిరి.
ఇక 24:17 మిద్దె మీద నుండువాడు తన ఇంటిలో నుండి ఏదైనను తీసికొని పోవుటకు దిగకూడదు,'' అనుటలో ప్రియపాఠకులారా! మిద్దె మీది జీవితమన్నది దేవుడు ఒక వ్యక్తికి అనుగ్రహించిన ఉన్నత స్థితిని సూచిస్తున్నది. ఆదిలో నోవహు దైవ ప్రణాళికను బట్టి మూడంతస్థుల ఓడను కట్టి లోకములోని సృష్టములను, జంతుజాలాలను సమస్తమును క్రింది రెండంతస్థులలో చేర్చి మూడవ అంతస్థయిన ఉన్నత స్థలములో అనగా ఓడ గృహము మిద్దె మీద దైవత్వముతో సావాసము చేశాడు. ఆనాటి రాజులు అయిన దావీదు సొలొమోను వగైరాలు - రాచనగరు మిద్దె మీద నివాసము చేసినట్లుగా వేదములో చదువగలము. ఇట్టి మిద్దె మీద ఐశ్వర్యాన్ని వారికనుగ్రహించినవాడు దేవుడే! క్రైస్తవ సంఘాలలో దైవ పిలుపును బట్టి ఇచ్చే ఉన్నత పదవిని కూడా మిద్దెమీది జీవితానికి సాదృశ్యమైయున్నది. అనగా సంఘములో సెక్రెటరీగాని ప్రెసిడెంటుగాని ఛైర్మెన్ గాని, ఖజానా దారుడు మరి ఏదైనను అది ఉన్నత పదవిగాని, అది దేవుని చేత అనుగ్రహించబడిందిగాని, దైవమందిరంలో ఒక వ్యక్తి ఉన్నత పదవిని అలంకరించియున్నాడంటే, అతడు దైవసన్నిధిలో మిద్దె మీద జీవించు జీవితములో ఉన్నదానితో సమానుడు - అంటే మిద్దె మీద జీవించువాడు, ఐశ్వర్యవంతుడని దీని భావము. ఈ మిద్దె మీద జీవితమన్నది రెండు విధములైయున్నది. 1. పరలోక సంబంధము 2. భూలోక సంబంధము. పరలోక సంబంధమైన మిద్దె మీది జీవితమెలాంటిదంటే నోటి మాంద్యము గలవాడై, నరహంతకుడైన మోషేను దేవుడు తన జనాంగానికి నాయకునిగ ప్రవక్తగా నియమించుటన్నది - ఇది ఆత్మీయముగా మేడ మీది జీవితముతో సమానమైయున్నది. అనగా ఇట్టి ఉన్నతమైన జీవితము నోటిమాంద్యము, పాశవికము, మూర్ఖత్వము, ఐగుప్తీయుని చంపి హంతకుడుగ మార్చిన మోషే జీవితములో దేవుడు అనుగ్రహించిన గొప్ప పదవి - తన జనాంగముపై నాయకత్వము ఇచ్చుటన్నది ఈ ఉన్నతమైన అనగా మేడ మీది జీవితమైయున్నది. అలాగే న్యాయాధిపతులు 6:11లో మిద్యానీయులకు భయపడి గానుగ చాటున దాగిన వృద్ధుడైన గిద్యోనును దేవుడు ప్రత్యక్షముగా దర్శనమిచ్చి మిద్యానీయులతో యుద్ధమునకు గిద్యోనును రేపి మాట్లాడిన మాటలు మనము ఈ సందర్భములో చదివితే గిద్యోను పక్షముగా దేవుడు జరిగించిన యుద్ధములో గిద్యోనుకు ఆయుధాలు లేవు. పెద్ద సైనిక సమూహము లేదు, యుద్ధములో తర్ఫీదు పొందిన యుద్ధ వీరులు లేరు. గుర్రాలు లేవు. రథాలు రౌతులు లేవు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏ ఆయుధము లేదు. యుద్ధ వస్త్రాలు లేవు. గిద్యోను పక్షముగా వేగులవారు లేరు, ధైర్యసాహసాలతో పోరాడేవారు లేరు. అయినను దేవుడు గిద్యోనునకు తోడైయుండి అతనికి ఒక ప్రత్యేక పదవినిచ్చి, నాయకునిగా చేసి యుద్ధములో ఇసుక వేస్తే రాలని మిద్యానీయులతో పోట్లాడి గెల్చుటన్నది ఉన్నతమైన స్థితి కాదా? ఇక గాడిదలు మేపే సౌలును రాజుగా ప్రతిష్టించి, దైవజనాంగమైన ఇశ్రాయేలుపై అతనిని రాజుగా నియమించిన సందర్భములో- సౌలు నిజముగా రాజగుటకు రాజకుటుంబములో పుట్టినవాడా? కాదు, అయినను దేవుడు అతనిని రాజుగా ఇశ్రాయేలు మీద నియమించుటలో ఇది మిద్దె మీది జీవితమైయున్నది. అలాగే ఎస్తేరు విషయములోను ఉన్నత పదవిని గూర్చి మనము చదువగలము.
ప్రియపాఠకులారా! ఈ విధముగా మిద్దె మీది జీవితమును గూర్చి యేసుక్రీస్తు ప్రవచిస్తూ మిద్దె మీద నుండువాడు తన ఇంటిలో నుండి ఏదైనను తీసికొనిపోవుటకు దిగకూడదు,'' అనుటలో దేవుని చేత ఉన్నత పదవిని అలంకరించినవాడు లోకసంబంధమైన వాటిని తలంచకూడదు, వాటిని ఆశించకూడదు. లోకసంబంధమైన వాటిని సంపాదించుకొనుటకు ప్రయాసపడకూడదు. అనగా తానున్న ఉన్నత స్థితి నుండి దిగజారకూడదు. అనగా తాను అధిష్టించియున్న ఆత్మ దేవునియొక్క ఉన్నత స్థితి నుండి దిగజారకూడదు, అనగా అవిశ్వాసి కాకూడదు. ఆత్మీయ జీవితాన్ని పాడుచేసుకోకూడదు. ఈ సందర్భములో కొలస్స 3:1-2 మీరు క్రీస్తుతో కూడా లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి,'' అనుటలో క్రీస్తులో బాప్తిస్మము పొంది ఆత్మీయతను పొంది మన పాపాలను సమాధి జేసికొని, శారీరముగా చచ్చి ఆత్మీయముగా లేపబడిన మనము పైనున్న వాటి మీదనేగాని భూసంబంధమైన వాటి మీద మనస్సు ఉంచకూడదనియు, ఎందుచేతనంటే మనము శరీరముగా చనిపోయి ఆత్మీయముగా క్రీస్తుతో కూడా లేపబడియున్నవారమైనందువలన, ప్రభువు సన్నిధియైన ఉన్నత స్థానమందే మనము లక్ష్యముంచి జీవించవలసియున్నదని ఇందులోని భావము. మిద్దె అనగా దేవుడు మన పట్ల స్థిరపరచిన విశ్వాసము మరియు ఆయన రక్షణ వలయములో నుండి తొలగిపోకూడదు.
ఇక మత్తయి 24:18 పొలములో ఉండువాడు - తన బట్టలు తీసికొనిపోవుటకు ఇంటికి రాకూడదు,'' అనుటలో పొలము అన్నది దేవునియొక్క సన్నిధానము. క్రైస్తవ సంఘాన్ని పరిశుద్ధ గ్రంథములో ఒక పొలమునకు సమన్వయపరచి ప్రవచించబడినట్లు కొన్ని సందర్భాలనుగూర్చి మనము తెలిసికొందము. లూకా 3:8లో మారుమనస్సుకు తగిన ఫలములు ఫలించుడి,'' అనియు 3:9లో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడియున్నది. కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడు ననియు, యోహాను 15:1 నుండి చదివితే ''నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగెను తీసిపారవేయును' అని ప్రభువు చెప్పుటలో క్రైస్తవ సావాసమన్నది ఒక తోటగా ఉన్నట్లు మనకు తెలుస్తున్నది. యోహాను 15:1లో యేసుక్రీస్తు చెప్పిన మాట యేసుక్రీస్తే ద్రాక్షతోటగాను మరియు యేసుక్రీస్తు తన ప్రవచనాలలో క్రైస్తవ సముదాయమును ఒక పొలముగా వర్ణించి, ఆ పొలములో గోధుమ గింజలుగా విశ్వాసులను గూర్చి ప్రవచిస్తూ - అవిశ్వాసులను గురుగులుగా పోల్చినట్లు మనము మత్తయి 13:24-30 వ్రాయబడిన ఉపమానమునుగూర్చి తెలిసికొందము. ఇందులో మొదటగా మంచి విత్తనము విత్తిన యొక మనుష్యుని పోలియున్నది. మనుష్యులు నిద్రిస్తుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి - అయ్యా! నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా! అందులో గురుగులెక్కడినుండి వచ్చినవి? అని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు - మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీ కిష్టమా? అని అడిగిరి, అందుకతడు - వద్దు, గురుగులను పెరుకుచుండగా, వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోత కాలము వరకు రెంటిని కలిపి ఎదుగనియ్యుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పదుననెను.'' ఇది క్రైస్తవ సంఘమను పొలమునకు పోల్చి చెప్పిన ఉపమానము. ఇక రెండవదిగ మరియొక ఉపమానము. మత్తయి 13:31-32 పరలోక రాజ్యము, ఒకడు తీసికొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదిగాని, పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెట్టగును.'' ఇందులో మొదటిది క్రైస్తవ సంఘములో గోధుమ గింజలాంటి విశ్వాసులు పరిశుద్ధులు ఆత్మీయులు దైవసంబంధులుండగా వారిని గోధుమలకు పోల్చుచు, వారి మధ్యలో నివసించే అవిశ్వాస జనాంగమును అనగా లోకసంబంధులను అపవాది యొక్క ఉరులలో లోకాశలలో తగుల్కొన్నటువంటి ద్విమనస్కులైనవారిని, గురుగులకు పోల్చుచు, గోధుమ చేనిలో గోధుమలు గురుగులు ఏ విధముగా ఉంటాయో - ఆ విధముగానే క్రైస్తవ సంఘమనే పొలములో కూడా విశ్వాసులు, అవిశ్వాసులు కూడా కలిసి ఉంటారని, ప్రభువు తీర్పు కాలములో వీరిని వేరుపరచి, ఆ వేరుపరచబడిన జనాంగమునకు విధించబడే తీర్పు మత్తయి 13:30లో వ్రాయబడిన ప్రకారము అంటే ''కోతకాలము వరకును రెండిటిని కలిపి ఎదుగనీయుడి, కోత కాలమందు గురుగులను ముందుగా గూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుడు,'' అని ఆజ్ఞనిచ్చెను. అనగా విశ్వాసులను అవిశ్వాసులను వేరుపరచి విశ్వాసులను దైవసన్నిధికి, అవిశ్వాసులను అగ్నికి అప్పగించు దినమున్నది.
అయితే రెండవ ఉపమానములో ఆవగింజను గూర్చి ఆయన ప్రవచిస్తూ పొలములో విత్తిన ఆవగంజ అనగా సంఘములో ఆత్మీయముగా ఎదుగుచున్న విశ్వాసి యొక్క జీవితము ఆవగింజ - విత్తనములన్నిటిలో చిన్నదైయుండి ఏ విధముగా పెరిగి పెద్దదై కూరమొక్కలన్నిటిలోను అతి పెద్దదై, ఆకాశ పక్షులు దాని కొమ్మలయందు నివసించునంత చెట్టు అగుతుందో - అలాగే సంఘములో జీవించుచున్న విశ్వాసి - ఆత్మ సంబంధ ఐశ్వర్యాలతో పోషించబడి ప్రభువు యొక్క వెలుగును ధరించుకొన్నవాడై, అనేకులకు అతను ఆతిధ్యమిచ్చువాడుగాను, ఆదరించువాడుగాను, సహాయకుడుగాను, ఆదర్శపురుషుడు గాను జీవిస్తూ - తన సద్గుణముల ద్వారా తన ఆత్మీయ వికసింపునుబట్టి సంఘానికే తలమానికముగా ఉంటాడని ఇందులోని భావము. పొలములో ఉన్నవాడు అనగా సంఘములో జీవించువాడు, దైవసన్నిధిలో ఆత్మీయముగా నిరాడంబరముగా వినయవిధేయతతో జీవిస్తూ లోకసంపదను లోక అలంకారాలను, లోక ఐశ్వర్యాల వైపు చూడక అనగా వాటిపై మనస్సు ఉంచక వాటి వైపు తిరుగక, నిబ్బరమైన మనస్సు గల్గి జీవించాలని దీని భావము. అనగా తన దేహసంబంధమైన వాటిని గూర్చి లోకము వైపు మరలకూడదు.
ఇక మత్తయి 24:19 అయ్యో! ఆ దినాలలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ.'' నిజమే - ఇది ఇప్పుడు జరుగుచున్నది. గర్భిణీ స్త్రీలకు కుటుంబ నియంత్రణ అనియు గర్భస్రావ క్రియ అనియు, కన్న బిడ్డను కడతేర్చుటన్నది నేటి యుగములో జరుగుచున్నది. అనగా గర్భవిచ్ఛేదనము. ఇక పాలిచ్చే వారికి శ్రమ,'' అనుటలో అది కూడా ఇప్పుడు క్రియ జరిగిస్తున్నది. శిశువుకు జన్మనిచ్చిన తల్లికి సరియైన ఆదరణ ఈ దినాలలో లేదు. ఆ కాలమందైతే అనగా సత్యవేద కాలములో శిశువును కన్నతల్లిని ధన్యురాలని దేవుని కృప పొందినదని ప్రవచిస్తూ - ఆ ప్రసవింపబడిన బిడ్డను దేవునికి ప్రతిష్టింపగా ఆ బిడ్డ ఒక గొప్ప ప్రవక్తగానో యాజకునిగానో లేక రాజుగానో లేక న్యాయాధిపతిగానో లేదా నూతన నిబంధనలో అపొస్తలుడుగానో వేదసాక్షిగానో ఉండునట్లు బైబిలు చరిత్ర వివరిస్తున్నది. అయితే అలాగాకుండ ప్రభువు రాకడ ఆసన్నమైన ఈ దినాలలో పాలిచ్చు తల్లులకు - బిడ్డల ద్వారా, గర్భాన్ని ఇచ్చిన భర్త ద్వారా, ప్రభుత్వ పరముగాను వంశపరముగానో శ్రమ ఇప్పుడు జరుగుచున్నది.
ఇక 24:24లో అబద్ధపు క్రీస్తులును, అబద్ధపు ప్రవక్తలును వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యాలను కనబరచెదరు,'' అనుటలో అబద్ధపు ప్రవక్తలను గూర్చి మనము ఇదే అధ్యాయములో 24:11లో చదువుకొనియున్నాము. అయితే అబద్ధపు ప్రవక్తలున్నట్లుగానే అబద్ధపు క్రీస్తువులున్నారు. ఈ అబద్ధపు క్రీస్తువులెవరు? అన్న విషయాన్ని మనము తెలిసికొందము. ఈ అబద్ధపు క్రీస్తువులు అన్యుల సాంగ్యములతో క్రీస్తును ఆరాధించువారు. క్రీస్తు తల్లిని, ఆయన ఏర్పరచుకొన్న శిష్యులను - క్రీస్తు యొక్క ఆత్మను ధరించుకొని, పరిశుద్ధ దేవుని పిలుపు అందుకొని, పరిశుద్ధ పట్టణమునకు చేరిన పరిశుద్ధులను సహితము బొమ్మలు చేసి వారి పేరట గుళ్ళు కట్టి వారి పేర్లు చెప్పుకొని, హైందవ సోదరుల వలె హైందవ ఆచారాలతో కాయాకర్పూరాలతో - కుంకుమ సాంబ్రాణీ నైవేద్యాలతోను నిర్జీవ విగ్రహాలను ఆరాధిస్తూ - తాము కూడా క్రైస్తవులమని చెప్పుకొను ప్రబుద్ధులు. ఇట్టివారు హైందవులవలె బొట్టు కాటుక, పసుపుకుంకుమలు, సమారాధన, పూజాపునస్కారాలను పేర్లతో ఆత్మ దేవుని అయోగ్యముగా ఆరాధించువారు. ఇట్టివారిలో దేవుని వాక్యము ఉండదు. దేవుని గూర్చిన సత్యము ఏదో వారికి ప్రత్యక్షముగా బయల్పరచబడినను రోమా 1:19 దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది. దేవుడు అది వారికి విశదపరచియున్నాడు. ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది కనుక వారు నిరుత్తరులైయున్నారు. మరియు వారు దేవునినెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. ఇట్టివారు అబద్ధపు క్రీస్తువులుగా ఉండుటయేగాక మత్తయి 23:39లో వలె సత్యవేదమునకు సాక్షులైన ప్రవక్తలను - ప్రవక్తలయొక్క సమాధులను ఆత్మీయముగా ఎదిగిన నీతిమంతుల యొక్క సమాధులను అలంకరించుచు, వాటికి బహు భక్తితో ఆరాధిస్తూ తమ యొక్క మూఢత్వమునుబట్టి ఆనాటి ప్రవక్తలను చంపిన కిరాతకుల సంతతికి చెందినవారై అనగా ప్రవక్తలను చంపినవారి యొక్క కుమారులై యున్నట్లు, వీరి ఆచారాలు వీరి సాంగ్యాలు వీరి వస్త్రాలంకరణ నియమాలు - దాదాపు హైందవ సోదరుల యొక్క ఆరాధనకు సమకాలికముగా నున్నట్లుగా కూడా ఇందునుబట్టి తెలుస్తున్నది.
ప్రియపాఠకులారా! ఒక్క మాటలో చెప్పాలంటే వీరిని ఈ అబద్ధ క్రీస్తువులను వేషధారులు అనవచ్చును. అంతేగాక వీరు గొప్ప ప్రవక్తలు వలె నటిస్తూ జపదండలు చేతబట్టి ప్రార్థన చేసి, తమయొక్క కుయుక్తి జ్ఞానముతో శకునములు చెప్పుచు సూచక క్రియలు కూడా చేస్తారని యేసుప్రభువు ప్రవచనాలలో ప్రవచింపబడియున్నవి. ఇవి క్రీస్తు కాలము నాటి మాటలు గనుక క్రీస్తు ఈ లోకములో జీవించిన కాలము తద్దర్మ కాలము. ఆ తద్దర్మ కాలములో యేసుక్రీస్తు పల్కిన మాటలు ఆయన రాబోవు భవిష్యత్తును గూర్చి ప్రవచిస్తూ చెప్పిన మాటలలో కొన్ని సత్యాలున్నవి. ఇట్టి అబద్ధ బోధకులు వారి మాటలలో యేసుక్రీస్తు నామమును అయోగ్యముగా వాడుచు, ఆయనను అబద్దీకునిగా చేయుటకు మాట్లాడిన మాటలు మత్త 24:26లో ''ఎవరైనను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి; ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి,'' అనుటలో ఈ అబద్ధపు ప్రవక్తలు వారు ప్రవచిస్తూ - ఇదిగో ప్రభువు నాతో కూడా మాట్లాడినాడని, పలాని దగ్గరకు వెళ్ళమన్నాడని, మేము ప్రార్థన చేయగా పలాని ఆమె రోగము బాగవుతుందన్నాడని, ఫలాని వారికి ఉద్యోగము తప్పక దొరకుతుందని చెప్పినాడని, పరారైపోయిన వ్యక్తి స్వయముగా తానే ఇల్లు చేరుతాడని చెప్పినట్లును, ఆయన పలాని సంవత్సరము, పలాని నెల, పలాని తారీఖున రాబోవుచున్నాడని, ఈ విధముగా అబద్ధ ప్రవచనాలను ప్రవచిస్తూ జనులను మోసపుచ్చి కలవరపరచుదురని మత్తయి 24:29లో ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును. చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రాలు రాలును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశాన కనబడును.'' ఇందునుగూర్చి ధ్యానిస్తాము.
ప్రియపాఠకులారా! ఇందునుగూర్చి పేతురు తాను వ్రాసిన రెండవ పత్రికలో యేసుప్రభువు రాకడను గూర్చి ప్రవచించి, ఆ రాకడలో జరుగు ఉపద్రవాలను గూర్చి ప్రవచించినట్లు చదువగలము. ఈ సందర్భములో 3:10 అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశాలు మహాధ్వనితో గతించిపోవును. భూమియు దాని మీదనున్న సకల కృత్యములు కాలిపోవును. ఇవి అన్నియు ఇట్లు లయమైపోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహా వేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను,'' అని హెచ్చరిస్తున్నాడు. కనుక మత్తయి 24:29 ఆ దినముల శ్రమ ముగియుట ఏమిటి? చీకటి సూర్యుని కమ్ముట, చంద్రుడు కాంతిని ఈయకపోవుట, నక్షత్రాలు రాలుట ఆకాశమందలి శక్తులు కదిలింపబడుట,'' అన్న విషయాన్ని మనము తెలిసికొందము.
ప్రియపాఠకులారా! యేసుక్రీస్తు కల్వరిలో ప్రాణము విడిచినప్పుడు ఇదే వాతావరణము ఏర్పడింది. ఇందునుగూర్చి మనము మత్తయి సువార్త 27:45-53 లూకా 23:44 అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయెను.'' ఈ విధముగా మనుష్యకుమారునియొక్క అస్తమయమన్నది జరిగినప్పుడు పట్టపగలు మధ్యాహ్న కాలమే. ఆ దేశమంతటి మీద చీకటి క్రమ్మినట్లును, సూర్యుడు అదృశ్యుడైనట్లును ఈ లేఖన భాగములో వ్రాయబడియున్నది. కనుక మొట్టమొదట మనుష్యకుమారుని రాకడ సందర్భములో అనగా లోకాంత్య కాలములో జరుగబోయే ఉపద్రవాలలో మొట్టమొదట సూర్యుని మీదికేనని మనకు తెలుస్తున్నది. అటుతర్వాత రెండవ ఉపద్రవము చంద్రుని మీదికి - సూర్యుడు ఏ విధముగా కాంతి విహీనుడై చీకటి వాతావరణములో చీకటి గర్భములో కలిసిపోతాడో - అలాగే చంద్రుడు కూడా చీకటిలో కలిసిపోవునని ఇందులోని భావము. ఇక నక్షత్రాలు రాలుట,'' అనుటలో భూమి కంటే ఒక నక్షత్రమే పెద్దది. అలాంటప్పుడు అనేకమైన నక్షత్రాలు భూమి మీద రాలునప్పుడు జరిగేటటువంటి సంఘటన ఏలాగుంటుందో ఆత్మీయముగా మనము ఆలోచిస్తే అది మన ఊహకందనట్టి విషయము.
ప్రియపాఠకులారా! ఆకాశ నక్షత్రాలు రాలినప్పుడు భూమి మీద సజీవులైన వ్యక్తులు కూడా ఆ నక్షత్రాలలో కలిసిపోతారని, ఆ నక్షత్రాలను బట్టి అనగా అకాలముగ కాసినటువంటి పంట ఏ విధముగా చెట్టు నుండి రాలుతుందో - ఆ విధముగా అకస్మాత్తుగ అసందర్భముగా దైవోగ్రత మూలముగా దైవ కుమారుని రాకడ సందర్భముగా పాత సృష్టి గతించిపోవు సందర్భము, సమస్త సృష్టములు లయమైసోవు సందర్భమునుబట్టి అకస్మాత్తుగా సృష్టికి సంభవించబోవు వినాశములో - అతి విషాదకరమైన సంఘటన ఈ నక్షత్రాలు రాలుటయే.
ప్రియపాఠకులారా! నక్షత్రాలు రాలినప్పుడు భూమి కాలిపోయిన గడ్డి పోచ వలె కనబడని స్థితిలో అనగా దుమ్ముకు దుమ్ము, ధూళికి ధూళియై కలసిపోయే స్థితిలోకి దిగజారునట్లుగా ప్రభువు యొక్క ఈ మాటలలోని పరమార్థమైయున్నది. ఇక ఆకాశమందలి శక్తులు కదలింపబడును,'' అనుటలో 2వ పేతురు 3:10లో ''అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినాన ఆకాశాలు మహా ధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును,'' అనుటలో ఈ పంచభూతములన్నవి నేడు భూలోకములో మనలను పీడిస్తున్న పిశాచ సమూహాలు కావు. పంచభూతాలు అంటే నీరు నిప్పు ఆకాశము గాలి వగైరాలు. ఇవన్నియు స్థంభించిపోతున్నాయని భావము, అనగా సముద్రము ఎండిపోతుంది. జలాశయాలు నదులు సరస్సులు వగైరాలన్ని ఇంకిపోయి ఆరిన నేలగా మార్చుటయేగాక వాటి ఉనికిని కోల్పోతాయి. గాలి స్థంభించి పోతుంది. నిప్పు అన్నది భూమి మీద అగ్గిపుల్ల రూపములో కూడా కనిపించని స్థితి ఏర్పడుతుంది. భూమి కాలిన బొగ్గు వలె నిరాకారముగా అనగా ఆదిలోని పూర్వీక రూపమునకంటే హీనముగా నిరాకారముగాను, బుగ్గియై మాడిపోతుందనియు ఇక పంచభూతాలలో ఒకటైన ఆకాశము మహావేండ్రముతో లయమైపోతుంది. భూమి మీద కృత్యములు కాలిపోతాయని, ఇట్టి వినాశనమునకు గురియయ్యే ఈ అనంత విశ్వము మీద మనస్సు పెట్టక, ఈ విధముగా సృష్టములైయున్న ఈ యొక్క దృశ్యములైయున్నట్టి ఈ యొక్క అశాశ్వతమైన లోకము యొక్క ఆశలను వదలి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షిస్తూ మనము పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను, ఎంతో జాగ్రత్తగలవారమై యుండవలెనని, అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టువారమైయుండాలని, వాటిలో నీతి స్థిరస్థాయిగా నివసిస్తున్నదని 2వ పేతురు 3:10-13 వ్రాయబడిన లేఖన భాగములో పేతురు ప్రవచించి యున్నాడు. దాని ముందుగా ప్రభువైన యేసు ప్రవచించిన ప్రవచనాలు మత్తయి 24:లో ఆయన తన శిష్యకోటికి చెప్పిన మాటలను బట్టి లోకమునకు ఇవి భవిష్యత్తులో తన రాకడ సందర్భములో - సృష్టికి సంభవించబోవు ఉపద్రవము, వినాశము, భయంకర వాతావరణము, తదనంతరము జరిగే ప్రభువు రాకడను గూర్చి వివరించబడియున్నది.
ఈ విధముగా జరిగిన తర్వాత ప్రియపాఠకులారా! యేసుక్రీస్తు కాలము నుండి ఇప్పటి వరకు మనమున్నట్టి ఈ కాలము సర్వ శక్తిమంతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన కాలము - ''క్రీస్తు నుండి అపొస్తలుల కాలము వరకును, యేసుక్రీస్తు శరీరయుతముగాను, ఆత్మీయముగాను వారిని ఆవేశించి క్రియ జరిగించినందువల్ల అపొస్తలుల కాలములో అనగా అప్పటి భవిష్యత్కాలములో - భూమి మీద దైవరాజ్య స్థాపన అనగా సువార్త ప్రకటన, క్రైస్తవ సావాసము, క్రీస్తు ఆచరించిన నియమాలు - అనగా పాపపశ్చాత్తాపము, మారుమనస్సు, నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను బాప్తిస్మము అనగా పాపములోను మరణించి తిరిగి జన్మించుట, తద్వారా క్రైస్తవుడు అను నామముతో ఆ వ్యక్తి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొంది క్రైస్తవుడుగా జీవిస్తున్నాడు. అప్పటి కాలములో ప్రియపాఠకులారా! నాటి పరిశుద్ధుల కాలములో క్రైస్తవత్వమన్నది విస్తరించుట నేటి తరమువారమైన మనకు భూతకాలముగా మనము భావించవచ్చును. అయితే ఆ భూతకాలము నుండి విస్తరించిన దైవరాజ్యమును బట్టి నాటి విశ్వాసులు ప్రకటించిన సువార్త ప్రణాళికను బట్టి కట్టబడిన సంఘాలు విస్తరించి, నానావిధ రూపాలను పొంది, ఆ విధముగా విస్తరించి నేడు చక్కటి ముద్రణలో నానావిధ రూపాలతో సులభశైలిలో - వ్యక్తికి ఆయా భాషలలో విరచితమై, నేటి విశ్వాస జీవితములో మన ఆత్మీయ మేళ్ళను బట్టి మన ఆత్మీయ స్థితిని కాపాడుకొనుటకు ఇప్పటి తద్దర్మ కాలములో - అపొస్తలుల ద్వారా అందించబడిన ప్రవచనాల సముదాయమే పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథమన్నది నేటి కాలములో మనమధ్య మన విశ్వాస జీవితాన్ని కాపాడుకొనుటకు ప్రాముఖ్యతను సంతరించుకొని, మన ఆత్మీయ జీవితములో దైవత్వాన్ని అనగా ఆత్మయైయున్న దేవుని ఏ విధముగా ఆరాధించాలో ఏ విధముగా స్తుతించాలి? ఏ విధముగా మహిమపరచాలి? ఇట్టి స్థితిలో మనము పరిశుద్ధ ప్రవర్తన గలిగి పరమతండ్రి యొక్క రాజ్యములో చేరుటకు, ఇప్పటి వర్తమాన కాలములో ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మన ఆత్మీయ జీవితమును బట్టి - ఇది మనకు బాలశిక్షగా దేవుని చేత అనుగ్రహించబడిన గ్రంథమైయున్నది. అందువల్లనే దీనికి పరిశుద్ధ గ్రంథమని పేరు. ఎందుకనగా ఇందులోని ప్రవచనాలు పరిశుద్ధ దేవునివి.
కనుక ప్రియపాఠకులారా! నేడు ప్రపంచమందంతట విస్తరించిన జనాభాను బట్టి తద్వారా విస్తరించిన నరులయొక్క అతి తెలివి, అక్రమము, అన్యాయము, ఉగ్రవాదత్వము, దోపిడీలు, దహనకాండ, మారణహోమము, త్రాగుడు, జూదము, వ్యభిచారము, వంచన వ్యామోహము, ఈర్ష్యా వగైరా దుష్ట స్వభావమునుబట్టి అక్రమమైన రీతిలో వ్యాపారాలు - అక్రమార్జన, నేత్రాశ వగైరాలలో కొట్టుమిట్టాడుచున్న ఈ తద్దర్మ కాలములో ఒక వైపు రోగాలు, తీరనట్టి జబ్బులు, మరియొక వైపు నరుడు ఏర్పరచుకొన్న ప్రయాణ వాహనాల ద్వారా ప్రమాదాలు, ఇవిగాక ఆత్మహత్యలు - హత్యలు విస్తరించియున్న ఈ దినాలలో మనుష్యకుమారుని యొక్క రాకడ ఈ సృష్టికి భవిష్యత్తైయున్నది. ఇది నరజీవితములో ఆఖరు భవిష్యత్కాలము. అంతేగాకుండ యావద్ సృష్టి అంతరించి పోయేందుకు భవిష్యత్కాలమైయున్నది. దీని తర్వాత ఇటువంటి సృష్టి కలుగబోదు. అయితే కలుగబోయే సృష్టిని గూర్చి అతిగా ప్రేమించిన తన భక్తుడైన యోహానునకు ప్రత్యక్షముగా బయల్పరచిన మాటలు ప్రకటన 21:1-5 అంతట నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి, పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలైయుందురు. దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. మరణమిక ఉండదు. దుఃఖమైనను, ఏడుపైనను, వేదనయైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు - ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునైయున్నవి. కనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు.
కనుక ప్రియపాఠకులారా! ఇప్పటి తద్దర్మ కాలములో సజీవులుగా ఉన్న మనము క్రైస్తవులమని చెప్పుకొంటున్న ఈ దినాలలో - మనము ఈ లోకాన్ని ప్రేమిస్తూ - దీని మీద ఆశలు పెట్టుకొని ఇదే స్థిరమని భావిస్తూ - దీని మీదనే కొట్టుమిట్టాడుచు, దీనినే ప్రేమిస్తూ దీనినే స్థిరమని అనుకొంటున్నాము. లేక ప్రభువు చెప్పిన రీతిగా ఈ అశాశ్వతమైన లోకము గతించిపోగా ప్రభువు రాకడలో అవతరించే నూతన లోకములో అనగా నూతన భూమి, నూతన ఆకాశములో - సృష్టికర్తయైన దేవుని పరిపాలనలో పౌరసత్వాన్ని పొంది, ఆయన రాజ్య ప్రవేశానికి వారసత్వమును యోగ్యతను పొందేటటువంటి, పరిశుద్ధ ప్రవర్తనతోను, భక్తితోను మెలకువ గల్గి, సిద్ధపాటుగలవారమై నిరీక్షించే స్థితిలో ఉన్నామా? ఉంటే ధన్యులమే!
మరణము - జీవము - దైవ శాసనము
మరియు దేవుడైన యెహోవా - ఈ తోటలో నున్న ప్రతి వృక్షఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆది 2:16-17
ప్రియపాఠకులారా! సృష్టి యావత్తును రూపించిన సృష్టికర్తయైన దేవుడు మొట్టమొదటగా తాను నిర్మించిన నరునికి మరణాన్ని గూర్చి హెచ్చరిక చేసినట్లుగా పై వాక్యములోని భావము మనకు తెలియుచున్నది. అయితే దేవుని మాట ప్రకారము ఆ ఫలాలను తినక మానినాడా? లేక తిని చచ్చినాడా? ఛస్తే ఏ విధముగా చచ్చాడు? ఏ విధముగా నరునికి మరణము వచ్చింది? అనిన విషయమును గూర్చి తెలిసికొందము.
ప్రియపాఠకులారా! దేవుడు తన ఆత్మను నరునిలో ఉంచినను నరనిర్మాణ క్రియలో భూమికి సంబంధ బాంధవ్యాలుండబట్టి - భూమ్యాకర్షణ శక్తి అన్నది జీవాత్మను ఆకర్షించబట్టి, భూమ్యాకర్షణ శక్తికి జీవాత్మలోనై బలహీనపడినట్లును, ఇందుకు ఉదా|| న్యూటన్ అను శాస్త్రజ్ఞుడు చెట్టు మీది నుండి రాలిన యాపిల్ పండును గూర్చి పరిశోధన జేసి, పైనున్న పండు నేలరాలుటన్న దానినిగూర్చి సుదీర్ఘముగా పరిశోధన జేసి, భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని ఋజువుపరచిన భూగోళ శాస్త్రజ్ఞుడని మనకు తెలిసిన విషయమే! వాస్తవమునకు భూమికి ఆకర్షణ శక్తి ఉండబట్టే విమానాలు కూలిపోవుట ఆకాశము నుండి కురిసే మంచు వడగండ్లు వగైరాలు నేల రాలుటలో భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదనుటకు ఋజువైయున్నది. ఇంకను యోహాను దర్శనములో ప్రకటన 12:4లో దాని తోక ఆకాశ నక్షత్రాలలో మూడవ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవైచెను,'' అని వ్రాయబడియన్నది. ఇందునుబట్టి భూమికి ఉన్న ఆకర్షణ ఒక బలమైన పీడితమైన ప్రభావితమైన శక్తి తోడైయున్నట్లు - ఈ శక్తి ప్రతివిధమైన దానిలో మిళితమైయున్నట్లు మనము తెలిసికొందము. మొట్టమొదటగా భూమికి ఉన్న ఆకర్షణకు ఋజువులు. దేవుడు నిషేధించిన ఫలము నరుల నేత్రదృష్టికి రమ్యమైనదియు, ఆహారమునకు మంచిదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచి, ఆమె దాని ఫలములలో కొన్నిటిని తీసికొని తిని తనతోబాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను.'' ఆది 3:6.
ప్రియపాఠకులారా! ఇందునుబట్టి త్రివిధమైన ఆకర్షణలు భూమికి ఉన్నట్లు ఋజువగుచున్నది. నాటి నుండి నేటి వరకు ఈ త్రివిధమైన ఆకర్షణలకు ప్రాధాన్యత ఉన్నట్లుగ ఈ క్రింది అంశముల ద్వారా తెలిసికొందము. లోకరీత్యా నేటి నరుడు శ్రమపడి సంపాదించుటగాని, ప్రయాసపడుటగాని, పొట్ట కూటికేనన్న లోకోక్తి ఒకటి ఉన్నది. సకల విద్యలు కూటికే! మొట్టమొదటగా నరుని ఆహారము కొరకు నరుని భూమి ఆకర్షిస్తున్నది. ఈ సందర్భములో ఇందుకు దృష్టాంతముగా ఆదాము భార్యయైన హవ్వయే గాక ఆది 25:29-34 చదివితే మరొక వ్యక్తి కూడా ఇందుకు ఉదాహరణయైయున్నాడు. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి - నేను అలసియున్నాను. ఆ ఎర్ర ఎర్రగా ఉన్నదానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుము,'' అని అడిగెను. అందుకు యాకోబు - నీ జ్యేష్టత్వము నేడు నాకిమ్మని అడుగగా - ఏశావు - నేను చావబోవుచున్నాను గదా జ్యేష్టత్వము నాకెందుకు అనుట, యాకోబు - నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్టత్వమును అమ్మివేయగా - యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావు కిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోవుట. ఆ విధముగా ఏశావు తన జ్యేష్టత్వమును అమ్ముకొనుట. ఇది ఆహారము ద్వారా భూమి నరుని ఆకర్షించిన విధానము.
ఇక రెండవదిగ సంపదతో భూమి నరులను ఆకర్షించుట ఆది 19:17లో ఆ దూతలు వారిని వెలుపలికి తీసికొని వచ్చిన తర్వాత ఆయన - నీ ప్రాణమును దక్కించుకొనునట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము. ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండ ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పుట. ఈ హెచ్చరికను లోతు పాటించాడు. అయితే భూమి లోతు భార్యను ఆకర్షించినప్పుడు లోతు భార్య దైవాజ్ఞను వ్యతిరేకించి, వెనుకకు తిరిగి చూచినందువలననే ఉప్పు స్థంభముగా మారుట. ప్రియపాఠకులారా! ఇది లోకము తన సంపదతో నరులను ఆకర్షించిన విధానము. ఈ విధముగా లోకమన్నది ఆయా సందర్భాలలో అనేకమంది వ్యక్తులను ప్రవక్తలను సహితము ఆకర్షించి, వారిని ప్రలోభపెట్టి వారి జీవితాలను భ్రష్టత్వమునకు అప్పగించినట్లు కొంతమందిని గూర్చి తెలిసికొందము. ఈ సందర్భములో ఉదాహరణగా దేవునియొక్క పరిధిలో ఆయన విశ్వాసము నుండి ఆయన మార్గము నుండి వారిని తప్పించుటకు, అహరోను చేత దూడను రూపించి దైవజనాంగమైన ఇశ్రాయేలును ఆకర్షింపజేయుట - ఇది బంగారముతో పోత పోయబడిన దూడ. ఈ దూడ ద్వారా దైవజనాంగమును ఆకర్షించి, వారిని దైవత్వము పట్ల అవిశ్వాసులుగా మార్చి వారిని దైవోగ్రతకు గురిజేయుట.
అటుతర్వాత దేవుని చేత ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకింపబడిన దావీదు దైవజనాంగము పక్షముగా ఉండి అనగా దేవుని పక్షమువాడై, దైవపక్షమునకు వ్యతిరేకులైన ఫిలిష్తీయులతో దావీదునకు యుద్ధము సంభవించగా - అట్టి సమయములో దావీదు తన రాచనగరులో విశ్రాంతి పొందియుండగా ఆ సమయాన్ని కనిపెట్టి భూమి వివస్త్రయైన స్త్రీ ద్వారా అతనిని ఆకర్షించుట, తద్వారా అతనిని దైవోగ్రతకు గురిజేయుట.
ఇక గేహాజీ విషయములో నయమాను యొక్క వెండి బంగారముతోను, ప్రశస్తమైన వస్త్రములతో కూడిన కుష్టురోగ సంబంధమైన కానుకలను గేహాజీని ఆకర్షింపజేసి అతనిని కుష్టురోగిగా జేసింది. అలాగే దేవుని ప్రవక్తయైన యోనాను దేవుడు వెళ్ళమన్న నీనెవె పట్టణానికి ఈ భూమి అన్నది వెళ్ళనీయక తర్షీషు ఓడను అతనికి చూపించి, తర్షీషు సంపదను అనుభవించుటకు అతనిని ప్రేరేపిస్తూ - అందుకు ఆకర్షితుడై తర్షీషు ఓడనెక్కిన యోనాను సముద్రము పాలుచేయుట.
ప్రియపాఠకులారా! చెప్పుకుంటూపోతే ఇంకను చాలా ఉదాహరణలున్నవి. ఇప్పుడు మనము తెలిసికొన్న ఉదాహరణలలో పాతనిబంధనలోనివి. క్రొత్త నిబంధనలో కూడా చాలా ఉదాహరణలున్నవి. అవి అన్నియు జరిగిపోయిన అనంతరము, అపొస్తలుల కాలములో అవి జరిగిపోయిన తర్వాత నేటి యుగములో అయితే భూమి యొక్క ఆకర్షణ బహుముఖవ్యాప్తమై, తన సంపద ద్వారా అనేకుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుచున్నది.
ప్రియపాఠకులారా! భూమి మీద కట్టబడిన క్రైస్తవ సంఘాలలో కూడా భూమి యొక్క ప్రభావము తీవ్రతరముగా ఉంది. దేవుని వాక్కు చేత రూపితమైన ఈ యొక్క భూలోకమునకు జీవముగాని జీవాధారముగాని పోషకత్వముగాని, ఫలభరితముగాని సమస్తము దేవుని వాక్కు చేతనే ఈ భూమికి కల్గిందిగాని ఇది స్వయంభవమైంది గాదు. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృష్టించెనని ఆది 1:1లో మనము చదువగలము. ఆయన సృష్టించక పూర్వము భూమికి ఆకాశము లేదు, అలంకారము లేదు. జీవము, ఆకర్షణ లేదు. కేవలము ముడిపదార్థముగాను, జడపదార్థముగాను, దుర్గంధపూరితమైన వాతావరణములో - నిరాకారము, శూన్యముగా ఉన్నట్లుగా ఆది 1:లో మనము చదువగలము. ఇట్టి స్థితి గలిగిన భూమికి ఆకారము తర్వాత అలంకారము, ఆ తర్వాత జీవము, ఆ తర్వాత ఆకర్షణ, ఆ తర్వాత స్వయంపోషకత్వము, వగైరాలను సృష్టికర్తయైన దేవుడు భూమికి వరములుగా దానము చేసి, దానిని ఎప్పటికిని జలరాశులు కబళించకుండ సరిహద్దులేర్పరచి, ఆదిలో సముద్ర జలనిధిలో మునిగియున్న భూమిని జలాల నుండి వేరుపరచి, మరి ఎన్నటికిని సముద్ర జలాలతో కలిసిపోకుండ హద్దులు నియమించాడు. దేవుడు నియమించిన పరిధులనుబట్టి ఈనాటికిని సముద్రము భూమిని తన ప్రచండ అలల చేత తాకినను తనలో చేర్చుకోలేకపోతున్నది. ఇది దైవిక ఏర్పాటు. ఈ విధముగా రూపించబడిన భూమికి సృష్టికర్తయైన దేవునియొక్క వాక్కుచే జీవాన్ని పోశాయి. మొట్టమొదటగా ఆరిన నేల కనబడునుగాక! ఆ మాటతో కూడా భూగోళము ఘనీభవించి జలరాశుల నుండి వేరుపరచబడి దైవసన్నిధిలో ఒక గొప్ప గోళాకారముగా ఎలాంటి అలంకరణలు లేని స్థితిలో నిలిచినట్లు, అట్టి సమయములో దేవుడు వరుసగా మాట్లాడిన మాటలు ప్రకారము - భూమి మీద ఏర్పడిన సృష్టి నిర్మాణమును గూర్చి ఆది 1:9-13 చదివితే భూమి మీద దేవుడు జరిగించిన సృష్టి నిర్మాణ కార్యము మనకు తెలియగలదు. అంతేగాకుండ భూమి పతనము గాకుండ భూమి యొక్క వాతావరణము కలుషితము గాకుండ, భూమి యొక్క మనుగడ నిమిత్తము భూగోళమునకు సాటి సహాయముగా దేవుడు చేసిన గ్రహకూటమి నిర్మాణమును గూర్చి ఆది 1:14-18లో చదువగలము. ఇవన్నియు దేవుడు భూమికి సాటి సహాయముగా ఇచ్చినవి.
ఇక జలముల నుండి వేరుపరచిన తర్వాత - జలరాశులను కూడా అనాధులుగాను నిర్జీవముగాను నిష్ప్రయోజనకరముగా వదలక, జలములలో కూడా తన వాక్కును నింపి జీవము గలిగి చలించువాటిని జలములు ఆది 1:20 సమృద్ధిగా పుట్టించునుగాక అని ప్రవచించినట్లు చదువగలము. అంటే దేవుని యొక్క వాక్కులు జలములకు కూడా జీవాన్ని ఇచ్చి జలసంబంధ జీవరాసులను సృష్టించినట్లు, దైవవాక్కును బట్టి జలములకు కూడా ఆకర్షణ శక్తి ఏర్పడినట్లు ఈ క్రింది సాహిత్యము ద్వారా మనము తెలిసికొందము. జలములలో జీవము లేకపోతే జలరాశులు జీవించలేవు. చేప మొదలుకొని తిమింగలము వరకు వున్నట్టి మత్స్య జాతులు - తాబేలు మొదలుకొని మొసలి వరకున్న జంతుజాలములు ఒకటేమిటి? సమస్తమైన వాటికి నీరు ఆధారమైయున్నది.
ప్రియపాఠకులారా! దైవసృష్టిలో గ్రహకూటమిలోగాని, జలరాశులలోగాని పరస్పరము ఒకదానికొకటి దైవిక ఏర్పాటును బట్టి ఆయన చిత్తమును బట్టి సహాయకారులుగా ఉన్నాయి. ఎలాగంటే భూమికి ఎంత జీవమున్నను - భూమి ఎంత ప్రభావితమైనను ఎంత ఆకర్షితమైనదైనను వర్షము కురువకపోతే దీని జీవితము వ్యర్థమే! వర్షము కురవకుంటే భూమికి ఫలింపు లేదు. నదులు సరస్సులు యొక్క ప్రభావము లేకపోతే భూమిలోని జీవరాసులకు మనుగడ లేదు. భూమిపై వృక్షజాతులకు పుట్టుక లేదు, ఫ¦లింపు లేదు. ఈ విధముగా భూమికి జలాలు - జలాలకు భూమి ఒకదానికొకటి సహాయ సహకారులుగాను అలాగే గ్రహాలు కూడా ఒకదానికొకటి సహాయకారులుగా ఉన్నాయి.
అలాగే సృష్టికర్తయైన దేవుడు భూమి యొక్క ఉపరితల భాగమైన ఆకాశములో కూడా తన వాక్కులతో జీవాన్ని పుట్టించాడు. ఆకాశ విశాలములో కూడా జీవులు జీవించుటకు ఎగిరేందుకు కావలసిన అనుకూలత ఆకాశమునకు ప్రత్యక్షముగా దేవుడు అనుగ్రహించియున్నాడు. ఇందునుగూర్చి ఆది
1:20-22లో ఈ విధముగా వ్రాయబడియున్నది. దేవుడు - జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు; జలములలో వాటి వాటి జాతిప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము గల్గి చలించు వాటినన్నిటిని - దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని పుట్టించిన తర్వాత ఈ క్రింది విధముగా ప్రవచించియున్నాడు. ''మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండు డనియు, పక్షులు భూమి మీద విస్తరించునుగాక అనియు వాటిని ఆశీర్వదించినట్లు చదువగలము.
ప్రియపాఠకులారా! ఈ విధముగా దైవాశీర్వాదముతో దైవ జీవవాక్కుల యొక్క బలాధిక్యతలతో ఆధిక్యత పొంది విస్తరించిన ఈ భూలోకము ఆకర్షణాశక్తి గలదై, సమస్తమును లోబరచుకొనుటకు శక్తివంతమై యున్నట్లు ఈ క్రింది వేదసాహిత్యముల ద్వారా తెలిసికొందము. మొట్టమొదటగా తన చెట్టు ఫలము ద్వారా ఆది నరజంటను ఆకర్షించుట ఆది 6:లో భూమి తనపై విస్తరించిన జనాభాలో దేవుని కుమారులైన ఆదాము సంతానమును, మనుష్యకుమారుల సంతానమైన తన సంతానము చేత ఆకర్షింపజేసి, నీతికి బదులు అవినీతిని విధేయతకు బదులు అవిధేయతను, అనుకూలతకు బదులు వ్యతిరేకతను దైవత్వమునకు బదులు మానవత్వాన్ని ప్రబలించి, తనను రూపించిన తన సృష్టికర్తయైన దేవునికే వ్యతిరేకియై భూమి మీద దైవవ్యతిరేకతను ప్రబలిపంజేసి దైవోగ్రతకు గురియై, ఏ జలమునైతే తనకు సన్నిహితముగా ఉన్నాయో ఏ జలముల చేత దేవుడు తనకు సరిహద్దులు నియమించి రక్షణ కల్గించాడో - ఆ దేవుని చేతనే మరల ప్రవాహజలముల చేత ముంచెత్తబడి సృష్టి విహీనమైనట్లు, దుర్గంధపూరితమైనట్లు, నిర్మానుష్యమైనట్లు నిర్జీవమైనట్లు, నిరాకారమైనట్లు వేదములో 7 మరియు 8 అధ్యాయాలలో మనము చదువగలము.
ప్రియపాఠకులారా! యోహాను 8:23 యేసుప్రభువు చెప్పిన మాటలు :- మీరు క్రిందివారు, నేను పై నుండువాడను, మీరు ఈ లోకసంబంధులు, నేను ఈ లోకసంబంధుడను కాను. మరియొక మాట యోహాను 15:18-19 ''లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీ కంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరు ఎరుగుదురు. మీరు లోకసంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును.'' ఈ మాటలు ఆత్మీయతను కోల్పోయి, పాశవిక జ్ఞానముతో లోకసంబంధులు పశుపక్ష్యాదులలో ఒకదానితో సమానముగా జీవించు నరునికి సంబంధించినదైయున్నది,
ప్రియపాఠకులారా! యేసుప్రభువు చెప్పిన పై మాటలలో మొట్టమొదట వచన భాగములో ''మీరు క్రిందివారు'' అనుటలో మనము క్రిందివారము ఎలాగయ్యాము? అటుతర్వాత ఆయన తనను గూర్చి చెప్పుకుంటూ నేను పై నుండు వాడను మీరు ఈ లోకసంబంధులు - నేను ఈ లోకసంబంధుడను కాను,'' అనుటలో ప్రియపాఠకులారా! సృష్టిలోని జనాంగమంతటిని దేవుడు ప్రతి అంశములోను రెండు విధములుగా విభజించియున్నాడు. ''క్రిందివారు'' అనుటలో భూసంబంధమైనవారు. ''పైనున్నవాడు'' అనుటలో పరమాత్మ సంబంధమైనవాడు. ''ఈ లోకసంబంధులు'' అనుటలో లోకసంబంధమైన మన్నుతో జీవాత్మయైన నరదేహమునకు సంబంధమున్నది. అంటే లోకసంబంధమైన మన్నే నరునికి రూపము గల్గింది. దేవుడు నరుని నిర్మించుటలో నమూనాగా మట్టియే వాడబడింది. అందువల్ల భూమి జీవాత్మయైన నరుని ప్రత్యేకించి తన వానినిగా చేసికొనుటకు, నాటి ఆదాము కాలము నుండి అటుతర్వాత నోవహు కాలము నుండి, అటుతర్వాత దైవజనాంగమైన ఇశ్రాయేలు ఏర్పడిన కాలము నుండి పిమ్మట వారికి దేవుడేర్పరచిన ధర్మశాస్త్రము, దశాజ్ఞ విధులు క్రియ జరిగించిన నాటి నుండి, అటుతర్వాత దేవుడే నరుని యొక్క దోష తీవ్రతకును, వాని పతనావస్థకును సంతాపపడి నరరూపములో ''యేసు,'' అను పేరట అవతరించి, నరజీవితము యొక్క ఆత్మీయ వికాసము కొరకు ఆత్మ సంబంధుడైన ప్రభువే తన శరీరమును సజీవయాగముగా సమర్పించి మరణవిజయుడై మహిమపునరుత్థానుడై, లోక నరకోటికి తనను ప్రత్యక్షముగా కనబరచుకొని పరిశుద్ధులుగా జీవించుచు పరమ రాజ్య ప్రవేశము జేయమని ప్రకటిస్తూ - తానేర్పరచుకొన్న శిష్యకోటిని అపోస్తలులుగా పేరు పెట్టి అనగా దేవుని చేత పంపబడినవారిగా నిర్ధారించి, వారి ద్వారా దైవరాజ్య సువార్తను నాటి నుండి నేటి వరకు ప్రబలించి, నానారీతులలో సువార్త వ్యాపక ప్రణాళిక ద్వారా భూమి మీద పరలోక రాజ్యాన్ని స్థాపించాలని దైవసంకల్పమైయుండి, దేవుడు తానేర్పరచు తన దూతల చేతను తానేర్పరచుకొన్న వ్యక్తుల చేత ఒకవైపు పోరాడుచుండగా - లోకము తన వారిని ఏర్పరచుకొని దైవత్వమును మరణవిజయుడైన క్రీస్తును ద్వేషిస్తూ - క్రీస్తుకు వ్యతిరేకముగా మాట్లాడుచు - యేసుక్రీస్తు దేవుడు కాడని ఆయన సామాన్య నరుడని, ఆయన దైవకుమారుడు కూడా కాడని, ఆయన దేవుని కుమారుడైతే దేవుడు ఆయనను కాపాడువాడు కాడా? అనియు ఆయన చనిపోయి తిరిగి పునరుత్థానము కాలేదని ఆయన తనను తానే రక్షించుకోలేకపోయినప్పుడు నరులనేమి రక్షిస్తాడని, క్రీస్తునుగూర్చి ఒకవైపు దుష్ప్రచారము చేస్తూ - క్రైస్తవ విశ్వాసులను భూమి తనయొక్క ఐశ్వర్యముతో భ్రమింపజేసి, యేసుక్రీస్తు పేరుతోనే క్రైస్తవులను మభ్యపెట్టి, తన సంపద ద్వారా వారిని ఐశ్వర్యవంతులుగా జేసి, అన్యుల ఎదుట వెక్కిరింతల పాలుజేస్తూ - క్రైస్తవుడు అన్నవాడు హీనుడని, క్రైస్తవుని కంటె అన్యుడు మేలని, క్రైస్తవునిలో దైవత్వమన్నది లేదని క్రైస్తవుని ద్వారానే అవినీతి అన్నది లోకములో విస్తరించిందని ఇందుకు ఉదాహరణ
:- క్లబ్బులు, డాన్సులు, పేకాట, బ్రాంది, విస్కీ, వగైరా మద్యపానీయాలు; సిగారు- సిగరెట్టు అను ధూమపాన విశేషాలు, సినిమాలు, టి.విలు అను అల్లరితో కూడిన ఆటపాటలు క్రైస్తవులే కనిపెట్టి వారు వాటి యొక్క అనుభవాన్ని చవి చూస్తూనే ఈనాడు తాము ఏమియు ఎరగనట్లుగ ఉన్నారని, ఇట్టివారు పరలోక సంబంధులు ఎలాగవుతారు? అని ఈ లోకము క్రైస్తవులను దుయ్యబట్టుచు ఒకవైపు ప్రచారము చేస్తూ - తన ప్రయత్నాన్ని అంతటిలో ఆపక క్రైస్తవ సంఘాలలో కూడా తన సంబంధుల చేత పార్టీలు కొట్లాటలు; క్రైస్తవ మందిర ఖజానాను గూర్చి సమస్యలు రేకెత్తించి, సంఘకాపరిని సహితము సంఘస్థుల విమర్శలకును సంఘ పెద్దల అవమానములకు గురిజేస్తూ - కాపరిలో ఉన్న దైవత్వాన్ని బలిపీఠము మీద నున్న పరిశుద్ధతను; ప్రభువు పై సంఘస్థులకున్న విశ్వాసాన్ని చెడగొట్టుచు క్రియ జరిగిస్తున్నది. అందుకే యేసుప్రభువు అన్న మాట లోకము మిమ్ము ద్వేషించిన యెడల మీ కంటె ముందు - నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు,'' అనిన ప్రభువు మాటను బట్టి ఈ లోకము క్రైస్తవ మందిరాలనేగాక క్రైస్తవ్యమును, క్రైస్తవ విశ్వాసులను ద్వేషించుటయే, ఈ లోకము యొక్క ప్రధానోద్దేశ్యమైయున్నదని ప్రభువు మాటను బట్టి మనకు విశదమగుచున్నది.
కనుక నేటి విశ్వాసులమైన మనము ఆత్మసంబంధులమై యుండి ఆత్మ సంబంధమైన పోరాటము లోకముతో పోరాడుచు, లోకసంబంధమైన వాటిని స్వార్థముతో సంపాదించుకోవాలంటే సాధ్యపడదు. అటు దైవత్వానికి, మానవత్వానికి భూలోకానికి మన విశ్వాస జీవితానికి కుదురనటువంటి సంబంధము. ఎలాగంటే మన విశ్వాస జీవితములో కొందరి క్రైస్తవ సోదరులనుగూర్చి ఉదాహరణగా తీసికొంటే హీనస్థితిలో నుండి అనగా లోకములోను, లోక ప్రభుత్వములోను గుర్తింపు లేని స్థితిలో ఉండి, ప్రభువు చేత ఎన్నిక చేయబడి సువార్త పరిచర్యలో సేవానుభవము పొంది, అనేక శ్రమలు అనేక కష్టములు సేవానుభవములో అనేకమైనటువంటి చేదు సంఘటనలను ఎదుర్కొని, ప్రభువు యొక్క ప్రేమకు పాత్రుడై సువార్త పరిచర్యలో పలుకుబడిని సహాయసహకారాలు, స్వయముగా సంఘములను కట్టుకొను జ్ఞానమును సంపాదించుకొన్న తర్వాత అట్టివాని జీవితము ఏదెను వనము వలె ఫలభరితముగా పరిశుద్ధముగా నిర్విచారముగా - ఆత్మీయ వికసింపులో ఉన్న స్థితిలో అలనాటి ఏదెనులో ప్రవేశించిన సర్పము వలె, అలనాటి ఏదెనువనములో దేవుడు నిషేధించిన ఆకర్షణయుతమైన చెటు ్టఫలము వలె, ఇట్టి విశ్వాసుల యొక్క నేత్రములకు లోక ఐశ్వర్యములు లోక భోగభాగ్యాలు, విలాసవంతమైన జీవితము, అధికార దాహము అన్నటువంటి దైవనిషేధఫలములు, వాటిని పొందుటకు ప్రేరేపించేటటువంటి స్వార్థపూరితులైన అలనాటి సర్పాంధ గుణాతిశయములుగల ప్రబుద్ధుల యొక్క సలహాలు ప్రేరేపించుటను బట్టి, ఇట్టి దైవసిద్ధులు అలనాటి ఆదాము వలె పతనమునకు దారితీసే లోక వ్యామోహములో తగులుకొనే ఉరులలో చిక్కుకొని బాధపడేటటువంటి వారి జీవిత చరిత్రలు మన కండ్ల ముందు ఎన్నో ఉన్నాయి.
ప్రియపాఠకులారా! అనేక విషయాలలో దైవవిశ్వాసులను ఈ లోకము - ఈ లోకాధికారి ఉభయులు ఏకముగా ఏకమై, వారి విశ్వాస జీవితలమును చెడగొట్టి, అట్టివారికి సమాజములో స్థానము, అట్టివారికి సంఘములో గౌరవము లేకపోగా - వారికి సంక్రమించిన సంపదను అనుభవించుటకు కూడా వీలుగాని రీతిలో అనగా సమస్యలతోను, జబ్బులతోను, రోగములతోను, వాజ్యములతోను దైవసన్నిధిలో నిలుకడగా నిలువలేని వాతావరణములో - అట్టివారి జీవితాలతో చెలగాటమాడుచున్నట్లు నేడు మనము చూస్తున్నటువంటి వ్యక్తుల జీవితాలలో అనుభవపూర్వకముగా ఎరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నవి.
ప్రియపాఠకులారా! ఆత్మ సంబంధముగా దైవత్వము చేత ఎన్నిక చేయబడి, దైవపిలుపు అందుకొన్న మోషే యొక్క జీవితములో అతని పూర్వ స్థితి మనము ఆలోచిస్తే అతను వేదాంతి కాడు, అక్షరాస్యుడు కాడు, నాలుక మాంద్యము కలవాడు, మూర్ఖుడు, జాతి అభిమాని, నరహంతకుడు. అట్టివాడు ఐగుప్తీయుని హత్య జేసి ఇసుకలో పాతిపెట్టి, తాను జరిగించిన హత్యా నేరమునుబట్టి మనఃశ్శాంతి లేక పరారై అజ్ఞాతముగా జీవిస్తూ - తన మామ గొర్రెలను మేపుచు, తన మామ మందను దేవుని స్వాస్థ్యమైన హోరేబు పర్వతము మీద మేపుచుండగా అతనికి దేవుని పిలుపు అనుగ్రహించబడి, దేవునియొక్క దృష్టిలో మోషే ఆకర్షించబడి పూర్తిగా లోకసంబంధియైయున్న మోషే యొక్క జీవితమును - సంపూర్ణముగా దైవ సంబంధమైన ఆత్మీయ రాజ్యమునకు మరియు లోకరీత్యా దేవుని ఇల్లయిన ఇశ్రాయేలు గృహమునకు నిర్వాహకునిగా దేవుడు ఎంపిక జేయుటయేగాక అతనికి తోడైయుండి, అతడు చేసిన ప్రతి పనిలోను ప్రతి పోరాటములోను విజయాన్ని చేకూరిస్తూ - అతనికి సంభవించిన శ్రమలు, దైవజనాంగము ద్వారా జరిగే తిరుగుబాటు, వగైరా ప్రతికూల వాతావరణములలో సహాయపడుచు, ఫరో చెరలో ఉన్న తన జనాంగమును విడిపించుటకు మోషే చేత చేయించిన అనేక అద్భుత కార్యాలు మోషే జీవిత చరిత్రలో మనము చదువగలము.
ప్రియపాఠకులారా! దేవుడు మోషేకు తోడైయుండినట్లుగ వేదములో మరెవరికిని తోడై యుండలేదని చెప్పవచ్చును. ప్రతి విషయములోను, ప్రతి సమస్యలోను, ప్రతి అవసరతలోను మోషే దేవునితో సంప్రదించనిదే చేసేవాడు కాదు. అలాగే దేవుని సెలవు లేనిదే ఏ కార్యమును చేసేవాడు కాదు. మరి గొప్ప విశేషమేమిటంటే నూతన నిబంధనలో యేసుక్రీస్తు ఏకాంతంగా ఒలీవల వనములో మాట్లాడిన రీతిగా - మోషే కూడా పాతనిబంధన కాలములో కొండ మీద దేవునితో ఏకాంతముగా సంభాషించేవాడు. మోషే ఇశ్రాయేలు జనాంగమునకు నాయకుడు మాత్రమేగాక, ప్రవక్తగా కూడా దేవునిచే నియమించబడినట్లు మనము చదువగలము.
ఈ విధముగా అనేక చేదు అనుభవాలలో జీవితము జీవించిన మోషే జీవితము చాలా విచిత్రమైనది. మోషే తన తల్లి గర్భములో పుట్టినప్పుడే దేవుని ప్రవక్తగా దేవునిచే ఎన్నిక చేయబడియున్నట్లు మోషే చరిత్రలోని పూర్వార్థము మనకు వివరిస్తుండగా - భూలోకము ఇందుకు ప్రతికూలమైన రీతిలో మోషేను తన వానినిగా జేసికోవాలని క్రియ జరిగించినట్లుగ మనము చదువగలము. ఈ సందర్భములో నిర్గమ 2:9లో బాలుడైన మోషేను ఫరో కుమార్తె - మోషే తల్లియని ఎరుగక ఆమెతో ఫరో కుమార్తె మాట్లాడిన మాట - ఈ బిడ్డను తీసుకొని నా కొరకు పాలిచ్చి పెంచుము, జీతమిచ్చెదనని చెప్పెను. అటు తర్వాత ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసికొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె - నీటిలో నుండి ఇతనిని తీసితినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టుటన్నది మోషే జీవితమును - భూలోకము తన వారి తోడ తన వానినిగా మోషేను స్వీకరించి, తానే అతనికి మోషే అను నామధేయము జేసి భూసంబంధిగా ప్రకటించుకొనింది. అయితే మోషే తల్లి గర్భములోనే దేవుని చేత ఎంపిక చేయబడినాడన్న జ్ఞానము భూమికి లేదు.
ప్రియపాఠకులారా! ఈ విధముగా భూలోకము పరలోకము ఒకదానితోనొకటి పోటీపడి మోషే జీవితముతో నానావిధాలుగా ఆటలాడింది. కాని ఈ ద్వివిధ పోరాటములో దైవాత్మ మోషేకు అనుకూలించబట్టి మోషే జీవితము విజయవంతమును, ఆశీర్వాదమును, ప్రభావితమును, దైవత్వమునకు యోగ్యకరమైనట్లును మనము ఈ విధముగా భూమ్యాకర్షణ శక్తికి అతీతుడై, భూమ్యాకర్షణకు లొంగనివాడైన మోషే అంటే మోషేను భూమి ఏ విధముగా ఆకర్షించింది అనినదానిని గూర్చి తెలిసికొందము.
మోషే బాల్యములోనే భూమి ఫరో కుమార్తె ద్వారా మోషేను ఆకర్షింపజేసి, తన సంబంధిగా చేసుకోవాలని ప్రయత్నించింది. అందుకు భిన్నముగా మోషే యొక్క చరిత్ర తయారయ్యేసరికి భూమి మోషే పట్ల హత్యానేరము జరిగించి, అతనికి లోకసంబంధమైన ఫరో చేత మరణశిక్ష విధింపజేసి, అతనిని చంపి తన పొట్టన పెట్టుకోవాలని ప్రయత్నించింది. కాని ఐగుప్తీయుని చంపిన మోషేను ఫరో చంపజూచెను. కాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను యాజకుని ఇంట జేరి అతని ఏడుగురు కుమార్తెలకు లోకసంబంధముగా సంభవించిన నీటి సమస్య ఈ సందర్భములో నిర్గమ 2:16-22 చదివితే మోషేకు కలిగిన దైవరక్షణ మనకు వివరముగా తెలియగలదు.
ఎలాగంటే మోషే దేవుని చేత ఆకర్షించబడుటకు ఋజువుగా మిద్యాను యాజకునికున్న ఏడుగురు కుమార్తెలు వారు తమ తండ్రి మందకు నీళ్ళిచ్చే తొట్లను నింపుట. మందకాపరులు వారిని బెదిరించి తోలివేయుట. అప్పుడు మోషే ఒక్కడే వారికి సాయము జేసి నీళ్ళు పెట్టుట. రగూయేలు నొద్దకు వచ్చినప్పుడు ఆయన ఆశ్చర్యపడి మీరింత త్వరగా ఏలాగు వచ్చారని - అందుకు వారు ఐగుప్తీయుడొకడు మంద కాపరుల చేతి నుండి తప్పించి, మన మందకు నీళ్ళు పెట్టెనని చెప్పుట. ఆ మనుష్యుని ఏల విడిచి వచ్చితిరని చెప్పి భోజనమునకు అతనిని పిలిపించుట. మోషే నివసించుటకు సమ్మతించుట, అతడు తన కుమార్తెయైన సిప్టోరాను మోషేకిచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే - నేను అన్యదేశములో పరదేశినైయుంటిననుకొని వానికి గెర్షోము అను పేరుపెట్టెను. ఇది మోషే యొక్క చరిత్రలో మొదటి ఘట్టము.
ప్రియపాఠకులారా! ఈ విధముగా మోషే జీవితములో నూతన అధ్యాయము ప్రారంభమైనట్లు మనకు తెలియుచున్నది. ఇట్లుండగా అనేక దినములు జరిగిన తర్వాత ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెరలో బానిసలై వారి చేత అడ్డమైన చాకిరి, కఠినమైన చట్టములతో స్వాతంత్య్రము లేక వెట్టి పనులు చేయుచు, ఐగుప్తు పట్ల జరిగిస్తున్న వెట్టి చాకిరిని బట్టి వారు దేవునికి చేసిన ప్రార్థన, వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరుట. ఇందునుబట్టి దేవుడు వారి మూలుగును విని తాను అబ్రాహాము, యాకోబు, ఇస్సాకులకు చేసిన వాగ్దానమును జ్ఞాపకము చేసికొని, ఇశ్రాయేలు పట్ల కనికరించి, వారి ప్రార్థనయందు లక్ష్యముంచినట్లుగ చదువగలము.
ఇట్టి వాతావరణములో ఆనాటి ఇశ్రాయేలు జనాభాలో మోషే దేవునియొక్క దృష్టిలో తన జనాంగమును ఐగుప్తు చెర నుండి విడిపించి, దైవరక్షణ వలయములో వారిని నడిపించుటకు సమర్థునిగ ఆయన దృష్టిలో నిలబడినాడు. ఈ విధముగా నిలిచిన మోషే పట్ల భూమి ఆగ్రహించి జరిగించిన క్రియలు నిర్గమకాండము తర్వాతి అధ్యాయాలలో నుండి ద్వితీయోపదేశకాండము చివరివరకు మోషే అనుభవించిన చేదు అనుభవాలు మోషే యొక్క మహిమకర జీవితము, మోషేకు దేవుడు తోడైయుండి జరిపిన అద్భుత కార్యాలు, మోషే చేసిన యుద్ధములు, ఆత్మ సంబంధమైన పోరాటములు, ఐగుప్తు మంత్రగాళ్ళను ఢీకొని వారితో పోరాడి జయించిన విధానము. దైవ ఆకర్షణ, దైవికతోడ్పాటును బట్టి మోషే తన జీవితములో సాధించిన ఘనవిజయాలు, దేవుడు సినాయి కొండ మీద మోషేకు అనుగ్రహించిన దశాజ్ఞల రాతిపలకలు, ప్రత్యక్షముగా దేవుడు మోషేతో మాట్లాడిన విధానము, దేవుడే మోషేను ఆకర్షించి, తన వెలుగు ద్వారా లోకస్థులు మోషే ముఖమును చూడలేనట్టి తేజస్సును దేవుడు మోషేకు అనుగ్రహించి నట్లును, అంతేగాకుండా మోషేతో కూడా దేవుడు స్వయముగా నడచుచు, తన జనాంగాన్ని కూడా మోషేను వెంబడించులాగున అనగా మోషే మార్గాన నడిపించాడు. అయితే లోకాకర్షణకు గురియైన దైవజనాంగమైన ఇశ్రాయేలు లోకసంబంధమైన ఐగుప్తు యొక్క సంపద చేతను, ఐగుప్తు యొక్క రాజభోజనము చేతను ఆకర్షితులై మోషేపై తిరుగుబాటు జేసి, సణుగుకొని నశించిన సంఘటనలు కూడా మనము చదువగలము.
ఈ విధంగా భూమ్యాకర్షణ శక్తి నరజీవితములో నానావిధాలుగా క్రియ జరిగించిన కార్యాలు ఇంకను ఎందరో వ్యక్తులను గూర్చి వేదములో వ్రాయబడియున్నది. వ్రాయబడిన వ్యక్తులలో మోషే తర్వాత దావీదు - దైవత్వము చేత అభిషేకింపబడినవాడును, దేవునికి అతి ప్రీతిపాత్రుడును, కీర్తనాకారుడు, మహారాజు, ప్రవక్తయైన దావీదు తన రాజరికములో తన సైన్యములో ఒక సైనికుడైన ఊరియా భార్య విషయములో - భూమి దావీదును ఆకర్షించి, దావీదు చేత ఊరియా భార్యను ఆకర్షింపజేసి, దైవవిశ్వాసియైన దావీదు యొక్క ఆత్మీయ జీవితమును పాడుజేస్తూ - జరిగించిన స్త్రీ పాపము, నరహత్య, దైవవ్యతిరేకము మూడు క్రియలను ఏక కాలములో భూమి జరిగించి, దైవసంబంధియైన ప్రవక్త యొక్క ఆత్మీయ వ్రతాన్ని భంగపరచడమన్నది ఊరియా భార్యయైన బెత్సెబా విషయములో దావీదు చేసిన పాపమును మనము చదువగలము.
ఇక రాజుల గ్రంథములో నయమాను కానుకలను నిరాకరించిన ఎలీషా పట్ల భూమి క్రియ జరిగించకపోగా ఎలీషా శిష్యుడైన గేహాజీని ఆకర్షించి, అతనికి కుష్టు రోగాన్ని కల్గించుటకు భూమియే కారణమైంది. ఎందుకనగా లోకసంబంధమైనవియు, గేహాజీ ఆశించిన వస్తు సముదాయమంతయు భూసంబంధమైనవి - నయమానుకు కలిగిన కుష్టురోగము భూసంబంధమైనదే! ఈ విధముగా మూడు విధములైన ఆకర్షణలకు గేహజీ యొక్క ఆత్మీయ జీవితము గురియైనట్లు ఈ క్రింది అంశముల ద్వారా మనము తెలిసికొందము. 1. నయమాను యొక్క అత్యధికముగా గేహాజీకి ఇచ్చిన వెండి గేహజీని ఆకర్షించింది. అలాగే రాజ వస్త్రాల చేత గేహాజీ ఆకర్షింపబడినాడు. అలాగే నయమానుకు వచ్చిన కుష్టు కూడా గేహాజీని ఆకర్షించింది. ఇందునుబట్టి మూడు విధములైన ఆత్మసంబంధమును, దైవవ్యతిరేకములైన క్రియాకర్మలనుబట్టి తరతరములు వంశపారంపర్యముగా తరగనటువంటి కుష్టురోగాన్ని ఎలీషా యొక్క శాప మూలముగా గేహాజీ సంపాదించుకొన్నాడు.
ఇక సంసోను విషయములో భూమి - స్త్రీ వ్యామోహములో అతనిని అంధునిగా చేసి దైవత్వము చేత మరణశిక్షకు అతనిని గురిజేసింది. ఇక బిలాము కూడా ఇశ్రాయేలు యొక్క ప్రవక్తయైయుండి దైవ జనాంగమైన ఇశ్రాయేలును ఆత్మీయముగా దైవమార్గములో నడిపించుచుండవలసినవాడు బాలాకు యొక్క లోకసంబంధమైన, భూసంబంధమైన సంపదకు దాసుడై, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ జీవితాన్ని పాడు జేయుటకు క్రియ జరిగించి, తాను జరిగించబోవు దైవవ్యతిరేక కార్యమునకు తాను వాహనముగా వాడిన గాడిద ద్వారా హెచ్చరించబడినవాడై, మరియు గాడిదకు దర్శనమిచ్చిన దేవుని దూత యొక్క గద్దింపునకు గురియై అపజయాన్ని పొందినాడు. యోనా విషయములో నీనెవెకు వెళ్ళమని దేవుడు శాసించగా ఇందుకు విరుద్ధముగా యోనా లోకసంబంధమైనదియు, దైవత్వమునకు ప్రతికూలమైనదియు భూలోక సంబంధముగా తూరు దేశపు సాధనమైన ఓడ చేత ఆకర్షింపబడి, దైవ ఆజ్ఞను దైవత్వమును విస్మరించి, దైవసన్నిధి నుండి పారిపోవుటకు ప్రయత్నించి, తర్షీషు ఓడనెక్కి సముద్రము పాలైన విషయము మనకు తెలిసిందే! ఇది పాత నిబంధనలోని భూమ్యాకర్షణకు గురియై, దైవత్వము చేత శిక్షించబడి పతనావస్థకు గురియైన వారి చరిత్ర.
ఇక నూతన నిబంధనలో భూమ్యాకర్షణకు లోనై పతనమైన వారి చరిత్ర కూడా ఈ సందర్భములో తెలిసికొందము. యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదాను భూమి ఆకర్షించి, ''భూలోకము - లోకనాధుడు'' క్రియ జరిగించగా యూదా ఇస్కరియోతు వెండి నాణెములకు ఆకర్షితుడై దైవకుమారుని అనగా దేవునినే లోకానికి అప్పగించే హీనత్వానికి గురియై, గురుద్రోహి స్వామి ద్రోహిగా దైవత్వము చేత తీర్పు పొంది, ఒకని చేత గాక తనకు తానే ఆత్మహత్య జేసుకొనే భయంకర శిక్షకు లోనైనట్లు వేదములో చదువగలము. ఇక అపొ 5:1-10లో అననీయ సప్పీరాల విషయములో సాతాను భూమి ఇరువురును ఏకమై అపొస్తలుల ఎదుట అబద్ధమాడించి మరణానికి గురిజేసినట్లు వేదములో చదువగలము.
ప్రియపాఠకులారా! ఈ విధముగా భూమ్యాకర్షణ శక్తి పాత నిబంధన కాలము, నూతన నిబంధన కాలము, అపొస్తలుల కాలము, పరిశుద్ధాత్మ యుగములో కూడా ఈ నాలుగు కాలములలోనేగాక, మరణ పునరుత్థానుడై తిరిగి రానైయున్న ప్రభువు యొక్క ఆగమన కాలమైన - ఈ కాలములో కూడా భూమి యొక్క ఆకర్షణ బహువిధముల క్రియ జరిగిస్తున్నది. నేటి యుగములో ఈభూమ్యాకర్షణన్నది చాలా విధములుగా క్రియ జరిగిస్తున్నది. ఇట్టి క్రియలలో భాగముగా వస్త్రాలంకరణలు, ముస్తాబులు, వెండి, బంగారు నగలు, నానావిధమైనటువంటి ఫ్యాషన్లతో దైవత్వము వైపు కాకుండ లోకము తన వైపు మరల్చుకొనుటకు స్త్రీలను పై విధముగాను, పురుషులలో పదవులు ఉద్యోగాలు లాటరీలు అక్రమ ఆర్జనలకు ప్రేరేపించుట, చీకటి వ్యాపారము, విపరీతమైన ధనసంపాదన వాటిపై నరునియొక్క జీవితాన్ని మరల్చుట, అపార్ట్‌మెంట్స్ అను పేరుతో భవన సముదాయములు, సినిమాలు, జూదగృహాలు, మద్యశాలలు, వ్యభిచార గృహాలు వగైరాల చేత ఈ యుగములో భూమి విపరీతముగా జనమును ఆకర్షించి, క్రైస్తవ విశ్వాసిని కూడా పతనావస్థకు దిగజారుస్తుందంటే, భూమ్యాకర్షణ ఎంత విపరీతముగా క్రియ జరిగిస్తున్నదో ఆత్మీయముగా మనము ఆలోచిస్తే - నేటి విశ్వాసులమైన మన పట్ల కూడా భూమ్యాకర్షణన్నది ఎంత వరకున్నదో కూడా ఒకసారి మనలను మనము పరిశోధించుకోవలసియున్నది.
ప్రియపాఠకులారా! దావీదు మహారాజు గొప్ప ఐశ్వర్యవంతుడై యుండియు, వాటియందు అతిశయింపక దేవునియందే అతిశయించినట్లుగా తన కీర్తనల యందు 20:7 బయల్పరచియున్నాడు.
1 యోహాను 2:15-17లో ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోకసంబంధమైనవే! లోకమును దాని ఆశయు గతించిపోవునుగాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును,'' అనిన ప్రవచనములనుబట్టి ఈ అంశములను చదువుచున్న పాఠకులు నిబ్బరమైన బుద్ధి గలిగి, నిలుకడయైన విశ్వాసముతో దైవాత్మ వరమును అభిలషిస్తూ లోకరాజ్య సంపద కొరకు గాక, లోకవిశ్వాసులమైన మనము లోకాకర్షణకు గురి గాకుండా దైవరాజ్య సంబంధమైన సంపదను గూర్చియు, ప్రార్థనలోను, పరిశుద్ధ సావాసములోను మన ఆత్మీయ జీవితాలను కాపాడుకొందముగాక!
ప్రసంగాంశము - కిరీటములు
మూలము :- రెండవ తిమోతి 4:7-8. 1. నీతికిరీటము :- ఇది మంచి పోరాటము పోరాడిన విశ్వాసికి ఈ సందర్భములో దావీదు గొల్యాతు పోరాటమును గుర్తించుము. ఇది దేవుడిచ్చు బహుమానము. ఎఫెసీ 6:12లో వలె పోరాటమున్నది. 2. జీవకిరీటము :- యాకోబు 1:12 ప్రకటన 2:10లో వలె శోధనను జయించుట, యోబు జీవితము అపొ 12:5-7లో పేతురు 16:25-26లో పౌలులకు కల్గిన శోధన.
మహిమ కిరీటము :- ప్రకటన 3:11 మరియు ఒకటి పేతురు 5:4 ఇది తన కప్పగించబడిన మంద లేక సంఘమును అధికారయుతముగా పరిపాలింపగల్గిన మంచి పరిచారకులును, పెద్దలుగను, కాపరిగను మాదిరికరమైనవారుగా జీవించువారికి ప్రధాన కాపరి, మరియు సంఘమునకు శిరస్సు అయిన యేసుప్రభువు తన భక్తకోటి కిచ్చు స్వాస్థ్యము మహిమ కిరీటము.
అక్షయ కిరీటము :- మొదటి కొరింథీ 9:25లో దైవత్వము ఈ లోకయాత్ర పరుగు పందెములో నరుని పరుగునకు బహుమానంగా ఇచ్చుస్వాస్థ్యము. ఈ లోకపరుగు పందెములో మనకు ఎదురగు శోధనలు, రోగాలు, దూషణలు, నిందలు, అపవిత్రాత్మల బాధలు, వగైరాలు ఎదురైనప్పుడు సహనముతోను శాంతియుతముగా ప్రార్థనా జీవితములో సాగు భక్తునికి ఇది బహుమానము ''అక్షయ కిరీటము.''
4. ఈ విధముగా నరులకు గొప్ప ఐశ్వర్యములు అనుగ్రహించు దేవుని కుమారునికి మన పితరులైన మూర్ఖపు జనాంగము మత్తయి 27:28-29లో ముండ్ల కిరీటము పెట్టినట్లు వేదము వివరిస్తున్నది.
.......
2వ కొరింథీ 12:1 అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చింది'', అని పౌలు అనుటలో
ప్రియపాఠకులారా! పై వాక్యములో అతిశయమన్నది నరజీవితములో రెండు విధాలు. 1. పరలోక సంబంధము. 2. లోకసంబంధము. పరలోక సంబంధమైన అతిశయాన్ని కోరినవారు అనుభవించినవారు - పరలోక అతిశయములో లోకాన్ని సవాలు చేసినవారు వేదములో కొందరున్నారన్న సత్యము ఈ సందర్భములో మనము తెలిసికోవలసియున్నది. అతిశయమన్నది దైవత్వము నుండి కల్గింది కాదు. శారీర అతిశయము వేరు, ఆత్మీయ అతిశయమన్నది వేరు. ఆత్మ సంబంధ అతిశయము లోకసంబంధ అతిశయాలను సవాలు చేస్తుంది గాని, లోకసంబంధమైన అతిశయము దాని ముందు నిలువలేదు. ఎందుకనగా శారీర సంబంధ అతిశయము దృశ్యమైనది. ఆత్మ సంబంధ అతిశయము అదృశ్యమైనది. శారీర సంబంధ అతిశయము శారీర సంబంధముగాను, లోకసంబంధంతోను కూడుకొన్నది. ఆత్మ సంబంధ అతిశయము దైవత్వాన్ని మెప్పించుచు, ఆత్మ సంబంధమైన ప్రతి వరాన్ని మనము పొందునట్లుగ అందునుగూర్చి ఇది ప్రయాసపడుతుంది. శారీర సంబంధ అతిశయానికి ఏ విధముగాను పరిమితి ఉండదు. అయితే ఆత్మసంబంధ అతిశయానికి పరిమితి ఉంది. అదేమనగా వేదములో కృపావరములు నానావిధాలుగ ఉన్నవి. ఈలాగు వ్రాయబడియున్నది. నా కృప నీకు చాలును - దేవుని యొక్క కృప చాలును అంటే అది తృప్తికరమే. ఇట్టివాడు డంభముగా పలుకడు ఇతరుల చేత పొగిడించుకోడు, తానేమో ధనికుడనని గర్వించడు. లోకరీత్యా తన వంశము రాజవంశమని డంభముగా ప్రవర్తించడు. మాటలలో క్రియలలో తలంపులలోగాని, శారీరకముగాను, మానసికముగాను ఆత్మ సంబంధముగా అతిశయపడువాడు ఎల్లప్పుడు ఆత్మ సంబంధమైన అతిశయముతో వాని జీవితము గుప్తమైయుంటుంది. కాని అందును గూర్చి అనుకోడు తలంచడు ప్రయాసపడడు.
కనుక ప్రియపాఠకులారా! వేదరీత్యా శరీర సంబంధమైన అతిశయము ఆత్మ సంబంధమైన అతిశయము ఈ రెండు తరహా నరకోటిని గూర్చి వివరముగా తెలిసికొందము. అతిశయమనే గుణమును నరుని జన్మ నుండే ఉంచలేదు. ఇందుకు ఋజువు. ఆదాము ఏదెను వనములో సంచరిస్తూ దైవత్వమును విధేయించినంతకాలము దేవుని మహిమలో జీవించుచు అతిశయపడినాడేగాని, తన దిగంబరత్వమును వీషన్మాత్రము ఎరిగినవాడు కాదు. తాను దిగంబరినని అనుకొన్నవాడు కాదు. అనగా లోకసంబంధ అతిశయములో ప్రవేశించలేదు. లోకసంబంధ అతిశయమన్నది దేవుని యొక్క సన్నిధిలో ఫలనిషేధాజ్ఞలో గుప్తమైయున్నట్లు దానిని నరుడు గ్రహించలేక, వ్యక్తిగతముగా అనగా తనకు సాటి సహాయముగా రూపించబడిన స్త్రీ ద్వారా అతిశయమనేటటువంటి గుణములో ప్రవేశించుటకు వీలుగల్గింది. ఈ వీలు కల్గించినవాడు సర్పమే. ఏదెను తోటలో నారితో జీవించుచున్నను ఏదెనులోని దైవశక్తి ప్రభావము, మహిమను గూర్చి వన స్వాతంత్య్రమునుగూర్చి అతిశయపడినాడేగాని, శారీర సంబంధముగా లోకరీత్యా అతిశయపడినట్లుగా దాఖలాలు లేవు. ఏదెను తోటలో అన్ని మంచి గుణాలున్నవిగాని, లోకసంబంధ పైశాచిక సంబంధమైనది దైవవ్యతిరేకమైనది, మానవత్వాన్ని మరణావస్థకు దిగజార్చేవి ఏవియు లేవు. ఆదినరజంటకు ఎలాంటి అతిశయము లేదు. ఈ అతిశయమనే గుణము మొట్టమొదట దేవదూతలలో ఏర్పడింది. లూసీఫర్ అనే దేవదూత బహుప్రజ్ఞాశాలియు, అందచందాలు గలవాడును, వైణికుడు అనగా వాయిద్య విద్వాంసుడునై దైవత్వాన్ని రంజింపజేయునంతటి శక్తి కల్గియున్నట్లును, ఈ విధముగా అందచందాలు, తనకున్న సంగీతనైపుణ్యము, వగైరాలను సంతరించుకొని దేవదూతలలో కొందరిని ఒక వర్గముగా చేసుకొని, తాను నాయకుడై, దైవత్వము మీద తిరుగుబాటు చేయగా - ఈ తిరుగుబాటులో జరిగిన పోరాటములో మిఖాయేలు అను పేరు గల దూత లూసీఫర్‌తోను, దాని దూతలతోను యుద్ధము చేసి భూమి మీద పడవేసినట్లు యెషయా 14:12లో చదువగలము. దైవసన్నిధిలో ఎల్లప్పుడు కనిపెట్టి దైవసన్నిధిలో కంఠారావము, సంగీత నైపుణ్యముగల దూత గర్వియై, తన్ను దేవునితో సమానత్వముగా అనగా దేవుడుగా చేసికొనుటకు అతిశయపడినట్లును, ఇతని అతిశయములో అనేక రీతులు ఏకీభావముతో లూసీఫర్ అతని దూతలు దైవత్వము చేత బంధింపబడి చెర పెట్టబడినట్లును, నేటి భూలోకములో ఆ విధముగా పడద్రోయబడిన శాపగ్రస్థ ఆత్మలు, వీటి నాయకుడైన సాతాను - అనగా ఆదిలో సర్పములో ప్రవేశించి స్త్రీని ఆకర్షించిన సాతాను వీరందరు కూడా ఇప్పుడు క్రియ జరిగించుచున్నారు.
ఈ విధముగా లూసీఫర్ గాలిలో చేరి లోకములో భక్తుల మీదను, దైవత్వము మీదను, దైవ గ్రంథము మీదను, దైవకార్యాలను గూర్చి నిజముగా దేవుడున్నాడా? ఉన్నట్లయితే ఎందుకు కనబడడు? దేవున్ని చూచినవారెవరైనా ఉన్నారా? కనబడని దేవుని నమ్మి కొలువడమేమిటి? తల్లిదండ్రులే దేవుళ్ళు - మీకు విద్య చెప్పేవాడే దేవుడు. ఆపదలో ఆదుకున్నవాడే దేవుడు. నీ అవసరతలలో నీకు సహాయపడినవాడే. నీకు కనబడని దేవునిగూర్చి వ్యర్థముగా ఆరాధించడమేమిటి? ఇది లూసీఫర్ బోధ. ఈ బోధనే ఆదిలో ఏదెనులో సర్పములో ఉండి స్త్రీతో చేసియున్నాడు. మీరు చావనే చావరు, మీ నేత్రాలు తెరవబడుతాయి, మీరు దేవతల వలె ఉందురని దేవునికి తెలియునని పల్కియున్నాడు గనుక లూసీఫర్ - విశ్వాసులను అవిశ్వాసులుగా చేయుటకు నాటి ఏదెనులో సర్పములో చేరి పల్కిన పల్కులు ఆదిలో వేదవాక్కులుగా భావించారు. ఈ లోకాధికారి బోధలకు వాని సలహాలకు చెవినిచ్చి, ఆత్మీయ జీవితమును భ్రష్టుపడుతున్న క్రైస్తవ సోదరులు నేడు లేడంటారా? తాము దేవుని బిడ్డలని చెప్పుకొంటూ దైవమార్గము తప్పి తిరుగుచు, దైవత్వమునకు చెందని దైవత్వమునకు సంతాపమును పుట్టించు బోధకులు లేకపోలేదు. అట్టివారిని అనుసరించి అట్టివారినే తమ ప్రవక్తలుగా భావించే సంఘస్థులు లేకపోలేదు. అందుకే పౌలు చెప్పినట్లుగా ఈ అతిశయమన్నది విశ్వాసికి ఉన్నది, అవిశ్వాసికి ఉంది. పాపికి ఉంది నీతిమంతునికి ఉంది, ఇల్లాలికి ఉంది బికారికి ఉంది, ఏది ఏలాగున్నను వేదరీత్యా వీరందరి జీవితాలను గూర్చి మనము తెలిసికొందము. మొట్టమొదటగా ఈ అతిశయమన్నది లోతు కాలములోను, అబ్రాహాము కాలములోను, ఇశ్రాయేలు జనము, వారి సంతానమైనవారిలో నుండి దేవుడేర్పరచుకొన్న ప్రవక్తలలోను, న్యాయాధిపతులలోను, యాజకులలోను ఉన్నట్లు వేదరీత్యా తెలిసికొందము.
ప్రియపాఠకులారా! ఆది 6:లో దేవుని కుమారులుగాను నరుల కుమార్తెలుగాను విభాగింపబడిన జనాంగములు - దైవత్వమునకు చోటివ్వక శరీరసంబంధముగా శారీర వ్యామోహాలలో తగుల్కొని, దైవ కుమారుడైన ఆదాము సంతతిలోని పురుషులు అలాగే కయీను సంతతియైన నరుల కుమార్తెలు ఒకరి యెడల ఒకరు అందచందాల ఆకర్షణ అతిశయాలనుబట్టి దైవత్వమును మరచి శారీర కామవ్యామోహాలకు స్థానమిచ్చి, శారీరయుతముగా తమ ఈ లోక అతిశయము వలన లోకానికి వినాశము దేవునికి సంతాపము పుట్టించి, దేవుడు నరులను చేసినందుకు నొచ్చుకొన్నాడంటే నరులయొక్క అతిశయము దేవుని పట్ల గాక లోకానికి పరిమితము కాగా - దేవునికి మనస్తాపము కల్గించినందున ఆయన ఉగ్రుడై, యావద్ సృష్టిని లయపరచిన సంగతి మనకు తెలిసిందే.
ప్రియపాఠకులారా! ఈ విధముగా ప్రారంభములో పునాది వేయబడిన ఈ అతిశయమునకు తొలి మెరుగులు దిద్దినవారు అబ్రాహాము భార్యయైన శారా - తన యొక్క జాతి గౌరవాన్ని బట్టి, తన అంతస్థును బట్టి, తన ఆధిక్యతను బట్టి, తన ధనాన్ని బట్టి, అబ్రాహాము దాసియైన హాగరుకు పుట్టిన కుమారుడు మన ఆస్థికి హక్కుదారుడగుటకు అనర్హుడు. ఇతడు మనయొక్క వంశానికి చెందినవాడు కాదు. ఇప్పుడే ఇతనిని తల్లిని, బిడ్డను తరిమివేయమని సలహా ఇచ్చింది. ఇది విశ్వాసులకు తల్లియైన అబ్రాహాము భార్య యొక్క అతిశయము. అయితే దేవుడు ఈ అతిశయమనే తలంపునకు సమ్మతించిన వాడు కాదు. కనుక హాగరు అడవిలో జలబుగ్గ దగ్గర పసివాని కొరకై అంగలార్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై హాగరుకు ఇచ్చిన వాగ్దానము - నిశ్చయముగా ఆ పసివానిని గొప్ప జనముగా చేసెదను,'' అన్నదే ఈ వాగ్దానమును బట్టియే నేటికిని హాగరు సంతానమైన ఇష్మాయేలులు లోకముతో సవాలు చేస్తూ - అల్లాయే మా దేవుడు. ఆయన భక్తులే మాప్రవక్తలు అని గాఢమైన విశ్వాసముతో - తమ దేవుడైన యెహోవాను గూర్చి ఘంటాపధముగా బాహాటములో - అదిప్రభుత్వములో గాని, న్యాయస్థానములో గాని, అది ఏదైనను దానిముందు సవాలు చేస్తూ మనోస్థయిర్యముతో పలికే ముస్లిమ్‌లు - వారి అతిశయము, వారు దేవుని పట్లను, ఆయన విధించిన మతము పట్లను, ఆయన నియమావళిని, ఆయన యొక్క ఆచారాలు తూచా తప్పకుండ పాటించి, అనగా రక్తము చిందించిన దానిని తినాలి గాని, చచ్చినదానిని తినకూడదు - గొంతు పిసికి చంపకూడదు. దేవుని సన్నిధి పరిశుద్ధమైనది గనుక పరిశుద్ధముగా ఆయనను ఆరాధించాలి. దేవుని తప్పకుండ ఆరాధించాలేగాని విగ్రహాల ముందు సాగిలపడకూడదు. దేవునికి బలులర్పింపకూడదు. ప్రతియొక్కరు అల్లా నియమాన్ని పాటించాలి. ప్రతి యొక్కరు ఒక ఇష్మాయేలుగా మారాలి. ప్రతి యొక్కరు మహమ్మద్ ప్రవక్తగా మారాలి. ప్రతి యొక్కరు ముస్లిమ్ సావాస ప్రార్థనలో పాల్గొనాలి. ఇది హాగరు సంతానము యొక్క అతిశయము. ఇక శారాకు పుట్టిన ఇశ్రాయేలుల అతిశయము - యెహోవాయే దేవుడు - యేసు దేవుడు కాడు. యేసు చనిపోయి లేవలేదు. దేవుని ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండ ఆచరించాలి. ఆయన నియమావళిని పాటించుటలోనే వారి అతిశయమున్నది.
ప్రియపాఠకులారా! అబ్రాహాము యొక్క దాసికి పుట్టిన హాగరు సంతానము లోకాన్ని సవాలు చేస్తూ విగ్రహ దేవుళ్ళు యొక్క దేవాలయాలను నేలమట్టము చేసి, మసీదులు కట్టిన సంఘటనలు భారతదేశములో ఇతర దేశాల చరిత్రలలోను ఉంది. కాని క్రైస్తవులు క్రైస్తవ్యము అన్నది దేవాలయాలను, మసీదులను పడగొట్టి క్రీస్తు మందిరాలను నిర్మించిన చరిత్ర ఎక్కడైనను ఉందా? పాఠకులైన మీరు ఎక్కడనైనను విన్నారా? ఆ విధముగా జరిగిన సంఘటనలున్నాయా? ఆ విధముగా ముస్లిమ్‌ల మసీదులు పడగొట్టి మనశ్శాంతితో జీవించే రాజ్యముందా? సంతోషించిన ప్రభుత్వముందా? ముస్లిమ్‌ల ద్వారా వచ్చే ఉగ్రతను ఎదుర్కొనే పాలకవర్గముందా? ఇందుకు మీ సమాధానమేమిటి? ఇట్టివారిలో లోక సంబంధమైన అతిశయమేగాని, ఇట్టివారి యొక్క అతిశయము నేడు లోకసంబంధమైన డిగ్రీలు హోదాలు అంతస్థులను బట్టియేగాక కులమతాల మధ్య చిచ్చు రేపుకొంటున్నారు.
యూదా జాతికి అతిశయము ఉంది. ఇష్మాయేలుకు అనగా ముస్లిమ్ సోదరులకు అతిశయమున్నది. క్రైస్తవుని యొక్క అతిశయమేమిటి? అన్నది మన అతిశయాన్ని గూర్చి ఏనాడన్న ఆలోచించి చూచారా? క్రైస్తవ విశ్వాసులము, ఆత్మపూర్ణులమని, పరిశుద్ధులమని చెప్పుకొను క్రైస్తవులే తమ క్రైస్తవ్యాన్ని దాచిపెట్టి, మనము క్రైస్తవులమని చెప్పుకొని అతిశయపడుటకు బదులు, తాము క్రైస్తవులమన్న పేరును మరుగుపరచి, తాము అన్యులమని రాతపూర్వకముగా పత్రాల ద్వారా ఋజువు పరచుకొని, ఆదివారము క్రీస్తులోను, మిగతా వారాలలో లోకముతో జీవించే క్రైస్తవ్యమును మనము చూస్తున్నాము. ప్రత్యక్షముగా వింటున్నాము. ఈనాడు ప్రభుత్వములోను, ఉద్యోగాలలోను సట్ట సగము మంది ఈ కోవకు చెందినవారే. అబ్రాహాము దాసికి పుట్టిన ముస్లిమ్ ఈ పని చేస్తున్నాడా? తాను హరిజనుడనని చెప్తున్నాడా? అయితే ఆత్మ సంబంధులును, క్రీస్తు ఆత్మను ధరించుకొన్నవారు - దైవచిత్తానికి లోబడు విశ్వాసులును, పరిశుద్ధాత్మ పూర్ణులైన వారిలో వీషన్మాత్రము ఈ అతిశయము కనబడదు. ప్రియపాఠకులారా! సంఘపరముగా ఈ అతిశయమును సాతాను తనదైన శైలిలో కాక దైవత్వము మీద దానిని నెట్టుచు, బహు కుయుక్తిగ ఈ అతిశయాన్ని బయల్పరచుచున్నాడు. ప్రియపాఠకులారా! ఎత్తబడే సంఘము మాదేయని పరిశుద్ధులమని, మాకు లోకాశలు లోకేచ్ఛలు లేవని పరిశుద్ధాత్మ పూర్ణులమని చెప్పుకొంటూ - మాటలకు తగ్గ వేషాన్ని ధరించుకొని, అర్థముగాని భాషను ఉచ్ఛరించుచు, బాహ్యముగా పదిమందిలో భక్తులుగా చెలామణియగుచు, తమ క్రియలను బట్టి, తమను నడుపుచున్న బోధకుని బట్టి, సంఘాన్ని బట్టి అతిశయమన్నది - దైవత్వమునకు యోగ్యకరము కాదు. ఇట్టివారిలో సాతాను ఎక్కువగా క్రియ జరిగించు అవకాశమున్నది. సాతాను జరిగించు ఈ క్రియలలో సంఘ విశ్వాసులు పప్పులో కాలు వేసి, సంఘ భ్రష్టత్వము పొందే అవకాశముంది. ఈ విధముగా ఒక్క సంఘానికేగాక అన్ని సంఘాలలో సాతాను లోకరీత్యా నానారీతులుగా అనగా లెక్కింప శక్యముగాని విధముగా అతిశయాస్పద క్రియ జరిగిస్తూ దైవత్వానికి అవమానము కల్గించు రీతిలో లోకానికి పరిమితము చేస్తూ - కొందరిని తన జాతిని బట్టి, కొందరిని తమ కులమును బట్టి, అంతస్థులను బట్టి, కొందరిని విద్యను బట్టి, కొందరిని రంగును బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, కొందరిని గృహాన్ని బట్టి అనగా అంతస్థులు, భవనాలు, మేడలో జీవించువారు. క్రైస్తవులలో సాధారణముగా తమ అంతస్థులకు సరిపోయే విధముగా ఎదుటివారిని ప్రేమించేవారే గాని నిరుపేదలుగా జీవించేవారిని, ముఖ్యముగా ప్రేమించే క్రైస్తవులు లేకపోతే ఇది అతిశయాస్పదము కాదు. ఆ విధముగా నిరుపేదకు సహకరించి, వారిని ప్రేమించేవారు లేకపోలేదు. సంఘస్థులలో ఇట్టి అతిశయాస్పద క్రియలు గల వారిని సర్వసాధారణముగా చూస్తున్నాము. క్రైస్తవ సంఘములో ప్రత్యేక కానుకలు ఇచ్చి తమ్ముతాము పొగిడించుకొను ప్రబుద్ధులు, లేక సంఘములో దేవునికి ఇవ్వవలసిన మర్యాదను, మహిమను, ఘనతను తాను పొందుచు, సంఘము ఎదుట తన కుటుంబాన్ని తన పదవిని, తన ఉద్యోగాన్ని, ఘనతను గూర్చి, తమ విలువలను తన అంతస్థును గూర్చి, విదేశాలలో తమకు కల్గిన గౌరవ మర్యాదలను గూర్చి పొడిగించుకొని, అతిశయించే క్రైస్తవ సోదరులు లేరంటారా? అంతే గాకుండ యేసుక్రీస్తు తన బలియాగము ద్వారా తన రక్తము ద్వారా - తాను కన్న సంఘాన్ని పరిపాలించుటకు పరిశుద్ధాత్ముడు ఎవరైనను ఒక వ్యక్తిని సంఘ పెద్దగా నియమించినప్పుడు, ఆ విధముగా నియమించబడిన వ్యక్తి సంఘములో గౌరవమర్యాదలు కల్గి దైవత్వముపై భయభక్తులు గల్గి, సంఘకార్యాలు నిర్వహించుటలో శ్రద్ధ కలిగి, సంఘమునకు - సంఘమునకు శిరస్సయిన ప్రభువునకు యోగ్యకరముగా ఆయనకు మహిమకరముగా జీవించవలసినవాడై యుండగా - సంఘ ప్రకటనలలో దేవుని మహిమపరచవలసి యుండగా - ఆ స్థానమును సంఘములో లోకసంబంధముగా గొప్ప పదవిలో ఉన్న వ్యక్తికి ఇచ్చి, అతన్ని గూర్చి పొగడుటలో ఇది కూడా ఒక విధమైన అతిశయమే.
కనుక ప్రియపాఠకులారా! ఈ అతిశయమన్నది నేటి క్రైస్తవులలోనే కాదు గాని పరిశుద్ధ గ్రంథములోని ప్రవక్తలు, న్యాయాధిపతులు, యాజకులు, రాజులు, వగైరా ప్రబుద్ధులలో కూడా క్రియ జరిగించి, వారిని భ్రష్టు పట్టించినట్లుగా వేదరీత్యా కొందరి చరిత్రలను గూర్చి తెలిసికొందము. మొట్టమొదటగా లోకాన్ని బట్టి అతిశయించినవాడు ప్రవక్తయైన బిలాము. తన అతిశయాన్ని దైవజనాంగమైన ఇశ్రాయేలునే బలి చేసి తప్పుడు దారి మళ్ళించినట్లును, అలాగే న్యాయాధిపతి సంసోనుకు అనుగ్రహించిన బలాధిక్యతలు ఆత్మావేశము మంట గలిపి, వ్యభిచారియై దేవుడు తనకు అనుగ్రహించిన బలాధిక్యతలను గూర్చియు తనలో ఉన్న దైవనిగూఢ మర్మమును గూర్చి అతిశయముగా వేశ్యకు తెలిపి అంధుడై, భూమిపై ఖైదీయై తుదకు మరణాన్ని చవి చూచాడు. అలాగే మహారాజైన దావీదు ప్రవక్తయు, కీర్తనాకారుడు, దైవత్వానికి ఇష్టుడు, దేవుని చేత అధికముగా ప్రేమించబడినవాడు. దైవకుమారునికి తన వంశములో జన్మనిచ్చిన దైవప్రవక్త - మహారాజైన దావీదు దైవత్వమును గూర్చి విచారించక, తన జ్ఞానముతో తన స్వశక్తితో ఎవరి యొక్క అనుమతిని కోరకయే తన సైన్యాన్ని లెక్కపెట్టుటన్నది అతిశయాస్పదము.
1 దినవృత్తాంతములు 21, అలాగే 2వ సమూయేలు 11:లో వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయాన దైవపక్షముగా దైవజనాంగముతో కూడా ఉండి, యుద్ధరంగములో పోరాడవలసిన దావీదు అతిశయించి, ఒంటరియై, సాతానుకు అవకాశమిచ్చి స్త్రీ పాపములో పడుటన్నది అతిశయాస్పదము కాదా?
యోనా విషయములో దేవుడు వెళ్ళమన్న నీనెవె పట్టణమునకు వెళ్ళక, దైవాజ్ఞను అతిక్రమించి, అహంభావము, అతిశయాస్పదముతో - లోక వ్యామోహముతో దైవాజ్ఞను ఖాతరు చేయక తర్పీషు ఓడనెక్కి దైవసన్నిధి నుండి వెళ్ళిపోవుటకు ప్రయత్నించాడు. ఇందులో అతిశయమన్నది యోనాలో క్రియ జరిగించింది.
అలాగే అపొ 9:లో పౌలు సౌలుగా ఉన్నప్పుడు ప్రభువు యొక్క శిష్యులను హింసించుటకును, చెర పెట్టుటకును చంపుటకును తనకు ప్రాణాధారమైనట్లుగా - యేసుక్రీస్తు నామాన్ని ఏ రూపములో కూడా ఏ విధముగా కూడా ఏ నరుడు ఎప్పుడు ఎక్కడ ప్రవచింపక ఉండాలని - హెబ్రీయుడైన సౌలు తన హెబ్రీయ జాతి యొక్క నియమావళితో అతిశయించుచు జరిగించుచున్న ఘోరాతిఘోర క్రియలు సౌలు యొక్క అతిశయాన్ని ప్రకటిస్తున్నాయి. ఆ విధముగా సౌలుగా వుండి ప్రభువు బిడ్డలను హింసించి, చెర పెట్టి హత్య చేసి, వారి హత్యలకు సాక్షిగా నిలిచిన సౌలు ప్రభువు చేత మొత్తబడి అంధుడై, తన అతిశయాన్ని యేసుక్రీస్తు నామములో పోగొట్టుకొని, ఆ సౌలే పౌలుగా మారి కొరింథు సంఘానికి వ్రాసిన రెండవ లేఖ
12:1లో అతిశయపడుచున్నాడు.
అయితే ప్రియపాఠకులారా! సౌలుగా ఉన్నప్పుడు పౌలు జీవితము ధర్మశాస్త్రము నందును డమస్కు యొక్క పరిపాలనా విధానము మీదను, తన జాతిని బట్టి, తన నిష్టను బట్టి, ధర్మశాస్త్ర మూఢాచారములో తలమునకలై అతిశయించి జరిగించిన క్రియలను బట్టి, ఇప్పుడు అదే సౌలు పౌలుగా మారి కొరింథు సంఘానికి వ్రాసిన లేఖ 12:1లో ఈ విధముగా మాట్లాడుచున్నాడు. పౌలుగా మారిన ఈ సౌలునకు ఇప్పుడు అతిశయమేమిటంటే ప్రభువు దర్శనము, ఆయన ప్రత్యక్షత, ఆయన తనకిచ్చిన ఐశ్వర్యము, ఆత్మీయత, తనకిచ్చిన ప్రవచన వరము, క్రీస్తు ఆత్మ యొక్క ప్రభావము వలన దైవత్వమును ఎరుగని లోబడని క్రీస్తు ఎవరో ఎరుగని సంఘాలకు, క్రీస్తును గూర్చి పూర్తిగా తెలియబరచి, క్రైస్తవ బిడ్డలుగా మార్చుటకు ప్రభువు తనకిచ్చిన ధన్యత, అవకాశము మరియు ఎనిమిది సంఘాలకు హెచ్చరికలు వ్రాసిన ప్రభువు తనకిచ్చిన జ్ఞానమును బట్టి, తన అతిశయమును గూర్చి పౌలు లేఖనాల ద్వారా బయల్పరచుచున్నాడు.
కనుక ప్రియపాఠకులారా! నేటి క్రైస్తవ విశ్వాసులమని చెప్పుకొంటున్న మనము ఈ పుస్తకములో వ్రాయబడిన అంశాలను వీక్షించి, ఇందులోని పరమార్థాలను ఆత్మీయముగా మననము చేసికొని, దేవుని యందును, ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు, మనలను నిత్యము నడుపుచున్న పరిశుద్ధాత్మ యొక్క తోడ్పాటుకు మన జీవితమును పరిమితము చేసుకోవాలని, మరియు త్రియైక దేవుని సువార్తను ప్రకటించుచు అనేకులను క్రీస్తు విశ్వాసులుగా చేస్తూ ఉన్నట్లయితే అతిశయపడవలసినవారమైయున్నాము. అట్టి అతిశయముతో సోదరీ! సోదరా! మన జీవితములో లోక మర్యాదను కోరక, ఈ లోకములో గడుపుచు ప్రభువుకు మహిమకరముగా జీవించెదము గాక! ఆమేన్.
ఇంతవరకు మనము ఆత్మీయముగా జీవించిన జీవితాలు, శారీరముగా జీవించిన అతిశయాలను గూర్చి తెలుసుకున్నాము. ఇక లోక సంబంధమైన అతిశయము కూడా వేదరీత్యా తెలిసికోవలసియున్నది. కీర్తనాకారుడు ప్రవక్తయైన దావీదు తాను వ్రాసిన కీర్తన 20:7లో ఈలాగు వ్రాసియున్నాడు. ''కొందరు రథములను బట్టియు, కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము.'' వారు క్రుంగి నేల మీద పడియున్నారు. మనము లేచి చక్కగా నిలుచున్నాము.
ప్రియపాఠకులారా! పై వాక్యములో లోకరీత్యా కొందరి సంగతిని దావీదు మహారాజు ఈ విధముగా ప్రవచించియున్నాడు. లోకరీత్యా లోక పదవులు, సంపదను బట్టి అతిశయించిన వారి యొక్క చరిత్రలు వేదములో పాతనిబంధనలో దానియేలు గ్రంథము 4:29లో ఈలాగు వ్రాయబడియున్నది. పన్నెండు నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరు నందు సంచరించు చుండగా రాజు - బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కాదా! అని తనలో తాననుకొనెను.'' ఇది రాజగు నెబుకద్నెజరు యొక్క లోకసంబంధ అతిశయము. రాజు నోట ఈ మాట యుండగా ఆకాశము నుండి యొక శబ్దము వచ్చెను. ఏమనగా రాజగు నెబుకద్నెజరూ! ఇదే నీకు ప్రకటన - నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారియై యుండి, తానెవరికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించునని నీవు తెలిసికొనువరకు ఏడు కాలములు నీకీలాగు జరుగునని చెప్పెను. వెంటనే ఆలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతనిని తరిమిరి. అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తలవెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకెల వంటివియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివియునైనట్లు ఈ వేదభాగములో చదువగలము.
అలాగే 1 సమూయేలు 17:4లో గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు ఆరు మూళ్ళ జానెడు ఎత్తుండెను. అతని తల మీద రాగి శిరస్త్రాణముండెను. అతడు యుద్ధకవచము ధరించియుండెను. ఆ కవచము ఐదువేల తులముల రాగి ఎత్తు గలది. మరియు అతని కాళ్ళకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లె మొకటి యుండెను, అతని ఈటె కర్ర నేత గాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈటె కొన ఆరువందల తులముల ఇనుము ఎత్తు గలది. ఒకడు డాలును మోయుచు, అతని ముందర పోవుచుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకనిని ఏర్పరచుకొని, అతనిని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగల్గిన యెడల మేము మీకు దాసులమగుదుము. నేను అతని జయించి చంపిన యెడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు.'' ఈ విధముగా ఇశ్రాయేలులను భయపెట్టుచు సవాలు చేయుచు అతిశయపడుచుండిన గొలియాతు యొక్క ఈ సవాలునకును. అతిశయమునకును దైవజనాంగమైన ఇశ్రాయేలు బహుగా భయపడినవారైనట్లును, ఆ విధముగా ఆ ఫిలిష్తీయ యోధుడు నలుబది దినములు ఇశ్రాయేలుతో సవాలు చేస్తూ అతిశయపడు చుండినట్లు వేదములో చదువగలము.
ఈ అతిశయము దేహ సంబంధమైనదియు, బలాధిక్యతలతో కూడినదియు, గర్వముతో కూడినదియు దైవత్వమునకు విరోధనమైనదియు, దైవత్వమును కించపరచునదియు దైవత్వమును హీనపరచునదియు, దైవజనాంగమును తిరస్కరించునది - నరుడు తన్నుతాను హెచ్చించుకొన్నదియునైన అతిశయమైయున్నది. ఇట్టి అతిశయమునకు ఫలితము ఇదే సమూయేలు గ్రంథములో బాలుడైన దావీదు దైవాత్మతో ఎన్నిక చేయబడి, దైవాత్మ తోడ్పాటు, దైవాత్మ ఆవేశము, దైవసంబంధ పోరాటము, లోక సంబంధమైన ఆయుధములను అన్నిటిని విసర్జించి, నిరాయుధుడుగాను, ఎలాంటి యుద్ధ వస్త్రాలు శస్త్రాలు ఆయుధాలుగాని, కవచాలుగాని లేకుండ, కేవలము హీనమైన వస్త్రధారణతో నిరాయుధుడుగ ప్రతిపక్షములో ఉన్న శూరునితో పోరాడుటకు, కావలసిన అన్ని శక్తులు, అన్ని ఆయుధాలను, అన్ని విధములైన పోరాటముల భావమును, తన దేవుడైన యెహోవా మీద ఉంచి, తాను నామమాత్రముగా వడిసెల రాయి చేత బట్టుకొని యుద్ధరంగములో నిలిచి, దేవుని పేరట దైవవ్యతిరేక ఫిలిష్తీయ సైన్యముతో దైవపక్షముగా సవాలు చేస్తూ మాట్లాడిన మాటలు - మొట్టమొదట దావీదు సౌలుతో మాట్లాడిన మాటలు 1 సమూయేలు 1:32-37 ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును క్రుంగ నిమిత్తము లేదు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా సౌలు - ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసినవాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను - మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును, ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తికొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి, దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించితిని. మీ దాసుడనైన నేను ఆ సింహమును, ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలెనగుననియు, సింహము యొక్క బలము నుండియు, ఎలుగుబంటి యొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా - ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు - పొమ్ము. యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను,
అటుతర్వాత యుద్ధరంగములో దావీదు గొలియాతు మీద దైవపక్షముగా అతిశయపడుచు పల్కిన మాటలు 1 సమూయేలు 18:46-52 ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును, భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను, ఈటె చేతను రక్షించువాడు కాదని ఈ దండు వారందరు తెలిసికొందురు. యుద్ధము యెహోవాదే. ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురు పోగా - దావీదు తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి యొకటి తీసి, వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట చొచ్చినందున వాడు బోర్లపడినప్పుడు దావీదు పరుగెత్తిపోయి, ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తితో వాని తలను తెగవేసినట్లును, తమ శూరుడు, చచ్చుట చూచిన పిలిష్తీయులు పారిపోయిరి. అప్పుడు ఇశ్రాయేలువారును, యూదావారును లేచి జయము జయమని అరచుచు ఫిలిష్తీయులను తరిమి, వారి డేరాలను దోచుకొనినట్లు ఈ వేదభాగములోని వివరణ.
ప్రియపాఠకులారా! ఇప్పుడు రెండు విధాలైన అతిశయాలు. 1. లోకసంబంధము - శారీర సంబంధము - ఇది ఒక విధమైన అతిశయము. రెండవది దైవసంబంధము - ఆత్మ సంబంధము. ఇక అపొ 12:21-23 నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి, వారి యెదుట ఉపన్యాసము చేయగా జనులు - ఇది దైవ స్వరమేగాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతనిని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఇది లోకసంబంధ అతిశయము. దానియేలు మూడవ అధ్యాయములో నెబుకద్నెజరు తాను నిలబెట్టించిన విగ్రహము ద్వారా పొందిన అతిశయము - దాని ఫలితము. అతడు పూర్తిగా తన అతిశయాన్ని అపజయము పాలై అవమానము పాలై కనువిప్పు కల్గి, సత్యదేవుని ఎరుగుట. ఇది లోకసంబంధ అతిశయము. దాని వలన కలిగిన ఫలశూన్యమును గూర్చిన వివరము.
దైవత్వము నందు అతిశయపడిన వారి వివరాలు - వారు సాధించిన ఘనవిజయాలు. లోక సంబంధమైన విగ్రహ సంబంధమైన అతిశయములో విర్రవీగు అజ్ఞానులకు, ''మెషగు షద్రకు అబిద్నగో అను వారికి పరమాత్ముని యందుండి వారు సాధించిన విజయము - వారి అతిశయాన్ని బట్టి దేవుడే అగ్ని గుండములో వారితో బాటు సంచరించినట్లును, ఎవరైతే పడవేశారో వారికి నలుగురుగా కనబడి, వారియొక్క ఇహలోక అతిశయాన్ని వమ్ము చేసి, సత్యదేవుని యందు అతిశయపడాలన్న నీతిని బోధించి, కనువిప్పు గల్గించి, మెషగు షద్రగు అబిద్నగో అను వారి దేవుడే నిజమైన దేవుడన్న స్థితికి మారుటన్నది ప్రభువును బట్టి అతిశయించువారికున్న ఘనతను, ఆధిక్యతను చాటుచున్నది.
ప్రియపాఠకులారా! ఈ సందర్భములో 4:15లో నెబుకద్నెజరు రాజు ప్రభువు నందు అతిశయించే ముగ్గురు బిడ్డలైన - ''షద్రకు మేషాకు అబేద్నగో'' అను వారితో ప్రగల్భముతో ఆ విగ్రహ ఆరాధనతో అతిశయించి మాట్లాడిన మాటలు - బాకా పిల్లన గ్రోవి, పెద్ద వీణె విపంచిక, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన యెడల సరే, మీరు నమస్కరింపని యెడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడనున్నాడు? ఇది నెబుకద్నెజరు యొక్క లోకసంబంధమైన అహంభావముతో కూడిన అతిశయము. ఇందువల్ల కల్గిన ఫలితమేమనగా పై ముగ్గురు దేవుని బిడ్డలు నెబుకద్నెజరు మాటలు తిరస్కరింపగా - మండుచున్న అగ్ని గుండములో వారిని పడవేయుడని రాజు ఆజ్ఞ ఇయ్యగా రాజు నియమించిన మనుష్యులు వారిని బంధించి అగ్ని గుండములో పడవేయగా - అగ్నిగుండములో పడవేయబడిన ఆ ముగ్గురు అగ్నికి ఆహుతియై పోలేదు గాని, అగ్ని వాసన అంటక కాలిపోకుండుటయేగాక, చల్లని వాతావరణములో ఉన్నట్లును రాజాజ్ఞ ప్రకారము పడవేయబడినవారు ముగ్గురైయుండగా - వారితోబాటు నాలుగవ వ్యక్తి కూడా వారితో సంచరించినట్లు ప్రత్యక్షముగా ఆ నాల్గవ వ్యక్తి దేవుని దూతగా ఉన్నట్లును, రాజు సంభ్రమాశ్చర్యాలు పొంది, భయకంపితుడై తేరిపార చూచి, తన అతిశయమునకు సిగ్గుపడి, పూర్తిగా పరితాపము పొందినవాడై, అగ్ని గుండములో ఉన్న ముగ్గురిని బయటకు వచ్చునట్లుగా ఆజ్ఞనిచ్చి, వారిని పరీక్షింపగా అగ్ని వాసన అంటక పోవుటయేగాక, వారు క్షేమముగాను, సంతోషముగాను, నిర్భయముగాను ఉండుట చూచి, లోకసంబంధమైన నెబుకద్నెజరు మనోదృష్టి - మనోజ్ఞానము, ఆత్మజ్ఞానము పొందినవాడై షద్రకు, మేషాకు - అబేద్నగో అనువారు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడని అనుటయేగాక తన శాసనాన్ని మార్చి, మేషాకు షద్రకు అబేద్నగో అనువారి దేవుడే పూజార్హుడు. అట్టి దేవుని ఎవడైతే దూషించునో అట్టివాడు తుత్తునియలుగా చేయబడును,'' అను శిక్షను విధించి ఆజ్ఞను జారీచేయుటన్నది, ప్రియపాఠకులారా! లోకములో నరుని యొక్క అతిశయము ఎంత దుర్భలమో, ఎంత నికృష్టమో ఎంత విలువ లేనిదో - ఎంత దురుద్దేశముతో కూడుకొన్నదో - దైవత్వము ముందు అది ఎంత నీచమైనదో కూడా గ్రహించగలము.
కనుక ప్రియపాఠకులారా! నీ అతిశయము లోకమునుబట్టి ఉన్నదా? లేక నీ వ్యక్తిత్వమును బట్టి ఉన్నదా? లేక నీ అతిశయము ప్రభువును బట్టి ఉన్నదా? లోకములో ఎట్లున్నది? ఈ మూడింటిలో నీ అతిశయము దేనికి పరిమితమైయున్నది? నిన్ను నీవే పరీక్షించుకో? నిన్ను నీవే పరిశోధించుకో? నిన్ను నీవే చక్కబరచుకో! నీ విశ్వాసము ఒకవేళ లోకము యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి గాక ప్రభువును బట్టి ఉన్నట్లయితే, మూలవాక్యములో ప్రభువు చెప్పినట్లుగా అనగా పౌలు వలె రెండవ కొరింథీ 12:1-5 ప్రభువు దర్శనము, ప్రత్యక్షత, ప్రవచన వరము, ప్రార్థనాశక్తి - ఆత్మీయత, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ వంటి గుణాలతో కూడినదైతే, ప్రభువు నిన్ను తప్పకుండ మేషాకు షద్రకు అబేద్నగో అను వారిని అగ్నిబంధకాల నుండి విమోచించినట్లుగ ఆయన నిన్ను విమోచించి కాపాడగలడు. ఆ విధముగా నీ యొక్క అతిశయాన్ని దైవత్వముపై మరల్చి, దేవుని బిడ్డగా జీవించే భాగ్యాన్ని పొంది అతిశయపడుటయే. అంతేగాని లోకసంబంధమైన అతిశయమున్నట్లయితే, వాటి నుండి విడుదల పొందుటకు ప్రయత్నించుము.
ప్రభువునందు సహోదరీ సహోదరులారా!
దీని వలన, మేము మీ యొక్క సహాయ సహకారాల వల్ల తరువాత ముద్రణలో ఈ పుస్తకము అన్ని కోణాలలో అందముగా తీర్చిదిద్ది అందించగలము. ఆమేన్.
శేఖర్ రెడ్డి గారు వ్రాసిన పుస్తకములు:
వీటిని మీరు www.FaithScope.com ద్వారా ఉచితముగా పొంద వచ్చును.