స్వామి దయానంద సరస్వతి విరచిత సత్యార్ధ ప్రకాశిక బైబిలు విమర్శలకు జవాబులు

        గ్రంథకర్త : శేఖర్‌రెడ్డి వాసా

www.FaithScope.com

నీ మరణానంతరము నీ ఆత్మ ఎక్కడ వుండబోవుచున్నదో నీకు తెలుసునా?

మూలము

రెడ్డిపాళెం గ్రామములోని నా ప్రభువు తల్లి ఉపదేశములు మరియు ఆమెను ఆవరించిన పరిశుద్ధాత్మయొక్క జ్ఞాన సహాయమే ఈ పుస్తక రచనకు మూలాధారము.

అంకితము

ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించి నన్ను ప్రేమించిన క్రీస్తు ప్రభువుకు అంకితమిస్తున్నాను. -  వాసా శేఖర్‌రెడ్డి

హైందవ దేవుడైన కృష్ణుడు తన జన్మ సమయమున కంసుని బారినుండి అనగా మృత్యువునుండి తప్పించబడుటకు వాసుదేవుని వలన గోకులమునకు కొనిపోబడెను.  నందుని ఇంట కాలక్రమేణా ఎదిగి పెద్దవాడై గొల్లల ఇంట వెన్న-నెయ్యిని దొంగిలించి కొల్లగొట్టుట గొల్లభామలతో సయ్యాటలాడి కామతప్తుడగుట అనునది మనము గుర్తించి,  క్రైస్తవ దేవునికుమారుడైన ఏసుప్రభువునకును హైందవ దేవుడైన విష్ణురూపమైన కృష్ణునికిని వున్న దైవయోగ ప్రభావభేదమును ఈ క్రింది విధముగా గుర్తించి వీరిద్దరిలో ఎవరు యోగ్యులు (యోగులు) ఎవరు బ్రహ్మ బ్రహ్మాచారులు ఎవరు లోకాన్ని జయించారు? అనునది గుర్తించినచో ఏసే దైవకుమారుడనియు ఆయన కామక్రోధమధమత్సరాది గుణములను వానితో బాటు లోకవైరాగ్యమును అటు పిమ్మట లోకాధికారియైన సాతానుతో తాను సాగించిన విజయమును అటు పిమ్మట  మృత్యువు అను పాతాళకూపమునుండి దానిని జయించి పునరుత్థానమగుటను ఆత్మీయ జ్ఞానముతోను మనో నేత్రముతోను పరిశోధించిన యెడల ఈ యొక్క పుస్తకమును చదువు పాఠకులు ఏసే దేవుడు ఏసే దైవకుమారుడు ఏసే అస్కలిత బ్రహ్మచారి, ఏసే మహాయోగి ఏసే జగద్గురువు ఆయన నామమే పావనము ఆయన శబ్దమే నిత్యజీవము.  ఆయన వేదవాక్యమే ఆత్మీయ ఆహారము.  ఆయన జపమే ఆత్మీయ తృష్ణజలము అని తలంచకమానడు.  గొల్లల యింట జొచ్చి క్షుద్భాధకు తాళలేక వెన్న ముద్దలు దొంగిలించి తినుట దైవత్వమా? దైవ కుమార లక్షణమా? కనబడిన గొల్లభామలందరిని తన కామవాంఛకు బలిగావించి ఈ విధంగా పదహారువేలమందితో రతిక్రీడల నొనరించుకామాంధుడు బ్రహ్మచారియా? యోగియా? దైవరూపుడా? ఇతను మృతిని గెల్చినాడా? చదువరులే నిర్ణయించండి.

        యోహాను చెరలో వేయబడినపుడు తల నరకబడువరకు నిరాహారిగా వుండినాడు గదా! మత్తయి 14:4-5 మోషే మరియు ఏలియాలు. ''ఇశ్రాయేలీయుల ప్రయాణములో  గాని ఏలియా యోరేబు అను పరిశుద్ధ పర్వతము చేరుటకు ఉపవాసమున్నట్లు', అదే విధంగా క్రీస్తును విశ్వసించిన భక్తులు ఉన్నట్లుగా ఋజువులు గలవు.

        నా వెంబడి రండి నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులునుగా జేయుదునుః-

        నరుడు దేహముతో జీవించుచున్నంత కాలము దేహమునకు ఋణస్థుడైయున్నాడు. ఎందుకనగా నరునిలోని జీవాత్మ ఎంతో ప్రతిభావంతమైనను శరరీపటుత్వం చక్కగాలేనట్లయితే ఆత్మకు క్రియాసంకల్పముగాని లోకసంబంధమైన విలువలుగాని దైవసన్నిధానపు గుర్తింపుగాని వుండుట అసాధ్యము.  ఎట్లనగా ఒక వ్యక్తి ప్రజోపకారమగు కార్యము అనగా సత్రము వైద్యశాల పాఠశాల నుయ్యి-స్థూపము-మందిరము దేవాలయము వగైరా కార్యములు దేహము ద్వారా ఆత్మజరిగించిన క్రియను బట్టియే అది గుర్తింపుగా ఉన్నది.  ఇందును బట్టియే పౌలు 11 కొరింధీ5:10 వచనములో వలె మనము గుర్తిస్తే  తల్లి దండ్రి, బార్యాబిడ్డలు, ఇల్లు పొలము, బంగారు ధనము వగైరాలు ఈ నరునికి జన్మతఃవచ్చినవి కావు.  అనగా తల్గి గర్భమునుండి బయటపడు శిశువు ఏ విధంగా దిగంబరియో అనగా ఇవేవితేడు.  అట్లే దైవత్వం అభిలషించునరుడు కూడా శిశువువలె దిగంబరికావలెను.  లోకాశలు లోకబాంధవ్యం అంటుగట్టుకొని దైవమాధుర్యంబును చవిచూడాలంటే బురదగుంటలోని కప్ప పన్నిటి తొట్టిలో స్నానము చేయాలని తలచినట్లుండును.  లోకము, లోకములోని బాంధవ్యము నరునికి స్థిరమైనవిగావు.  మరణకాలములో నరునిలోని జీవము వాని లోకబాంధవ్యం నుండియు లోక జీవితము నుండియు నరుని ఆయుష్కాలము నుండియు తాను ప్రేమించిన సకలమైనవాటినుండి వానిని వేరుపరచి తన స్థలమునకు వెళ్ళి పోవుచున్నది.  అదే విధముగా దైవత్వమును అభిలషించునరుడు ఈ లోకబాంధవ్యములను వదలిపెట్టుకొని దైవసేవాపరాయణుడు కావాలంటే పరమాత్ముని రూపమును వెంబడించాలి అను (ఏసు మాటలోని మర్మము అనగా ఏసును వెంబడించాలి అని అర్థము.

        మరణకాలములో జీవాత్మ తన దైవ విద్యుత్‌ ధర్మప్రకారం ఈ లోకసంబంధమైన పాపశరీరమును ఆ శారీర సంబంధులైన ఆలుబిడ్డలు దాయాదులు బంధువర్గాలు వగైరాలకు శరీరమును అప్పగించి తన ఆయుఃపరిమితిని బట్టి తన దారిన అనగా తాను వచ్చిన దారిని బట్టి వెళ్ళుచుండగా-ఇట్లు వెళ్ళుట న్యాయము గాదని ఆతని భార్యాబిడ్డలగతిఏమి గావాలి? వారికి మైనర్‌ తీరినంతవరకు వుంచకూడదా? అని మెమొరాండం పంపిస్తూ విజ్ఞాపన చేయకూడదా? ఈ ఆర్యసమాజమునకు ఆశక్తి లేదా? కన్నుమూసిన వానికి తాను ప్రేమించిన భార్యాబిడ్డలు బంధువర్గము కన్పడుచున్నదా? పోనీవారితో మాట్లాడగల్గుచున్నాడా? లోకబాంధవ్యము ఒట్టిదే.  మానవ జీవితం మట్టిదే.

        క్రీస్తు యొక్క రూపము పరమాత్ముని యొక్క ప్రతిరూపము. క్రీస్తు యొక్క స్వరము,  పరమాత్ముని శబ్దము (''ఆదియందు వాక్యముండెను.  వాక్యము దేవుడైయుండెను'') ఇంక క్రీస్తులో ఇన్ని మిళితమైయున్నపుడు రక్షరేకులు విభూతితాయెతులు కవచాలు దంపలు వేయవలసిన పనిలేదు.  ఎందుకంటే ఆయన వాక్కులో సమస్త శక్తి ఇమిడియున్నది.  కానిఆర్యసమాజము వంటి అజ్ఞానసాహిత్యముతో పోల్చుట ఘోరము-అన్యాయము-పాతకము.

        మత్తయి 5:3 ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోకరాజ్యము వారిది. ఆత్మవిషయమై దీనులనగా ఆత్మయొక్క జన్మస్థానమైన అనగా ఆత్మకు ఆదిసంభూతుడైన పరమాత్ముని స్థలము అనగా పరలోకము అక్కడనున్న పరలోకమునకును పాతాళమునకును, సర్వసృష్టికిని ఆదిసంభూతుడైన ఆత్మరూపుడైన అనగా రూపములేనివాడైన పరమాత్ముని సన్నిధికి రూపములేకయే అనగా రక్తమాంసములతో కూడిన ఈ రూపమును దీన్ని పోషించిన ఈ లోకమును, దీనితో ఈ లోకమునకు వున్న సంబంధ బాంధవ్యమును-ఈ శరీరము ఆసించిన సమస్తమైన భూలోకసంబంధభోగ భాగ్యములను పెంటతో సమానముగా ఎంచుకొని, సర్వమునకు మూలకారణమైన పరమాత్ముని సఖ్యతను అభిలషించి  ఆయన విషయమై జపతపంబులగు పూజాదిక్రియలను అభిలషించి దీనత్వముతో మొర్రపెట్టుకొను ఆత్మ ధన్యమైనదియే.  ఇందులోని మర్మము.  అట్టివారికి మోక్షభాగ్యము గాని ఈ విషయములను ఆర్యసమాజము దానిలోని మహాజ్ఞానులైన మనోనేత్ర అంధత్వ పరాయణులగు యోగులు పొరబడి విమర్శించిన ఈ విమర్శ చదువరులకు హాస్యాస్పదమును వెగటు తనమును కల్గించక మానదు.  పరమాత్మునికి ఆత్మసంబంధమైన  దరిద్రత ఆత్మసంబంధంగా ఆత్మకున్న వేదన బాధలు వగైరాలు.  లోకసంబంధమైన ధన్యత దీనత లోకసంబంధనమైన చరిత్ర కాదు.  లోకసంబంధమైన ధనవంతుడు పరలోకమునకు చేరాలంటే'', సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని ప్రభువు వక్కాణించియున్నాడు.  దీనిని బట్టి ఆలోచిస్తే లోకసంబంధమైన ఈ ధనమును అంటిపెట్టుకొని దానిమీద తన మనస్సును లగ్నపరచి దైవత్వమును చవిచూడాలంటే నరునికసాధ్యము.  ఆత్మ ధీనతకు మూలము లోక వైరాగ్యంతో విరిగి నల్గిన హృదయము.  శరీర సంబంధమైన దీనత్వమునకు కారకములు.  జూదము, పరస్త్రీవ్యామోహము, మధ్యపానము, పరులధనాపహరణ,హత్య, అక్రమార్జితము, ఈర్ష్య , ధనాశ, ఒకడు తన స్నేహితుని నమ్మితన డబ్బంతయు వానికిచ్చి వాని చేత ముంచబడి కడకు కోర్టులో కూడా వాడేగెల్చి ముంచినచో అది శరీర సంబంద దీనత్వము. శారీర సంబంధ దీనత్వమునకు మధ్యవర్తి జడ్జి, మెజస్ట్రేటు, కలెక్టరు, తాహసిల్దారు, మునసు మొదలైన వారు.  వీరు తగాదాలను తీర్చువారుప్రశ్న.  

        మత్తయి 6:11-19 మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. భూమిమీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు.

        సమీక్షః- ఏసు అను దినాహారమనుటలో అనేక దినములు ఆహారముంటే నరుడు పరమసోమరి యగునని అందుచేత నరజన్మకు దైవానుభవము భూలోకానుభవము బాధ్యత వగైరాల విలువ తెలియాలంటే సంపాదన అను సమస్య నరునిలో వుండుట ముఖ్యమైనట్లు పరమయోగియైన ఏసుప్రభువు గుర్తెరింగి అను దినాహారమనెను.  ఎందుచేతననగా అనేక దినములు ఆహారముంటే నరుడు తిని సోమరియై నిద్రపోయి బాధ్యతలను మరచి అప్రయోజకుడగును.  ఎందుకనగా భుక్తాయాసము కల్గినవాడు నిద్రతో విశ్రమించును.  వెంటనే ఏ పని చేయలేడు. దైవత్వమునకు ఆహారము , మధువు, సురాపానము, మాంసము వగైరాలు అడ్డుగోడలైయున్నవి.  ఇవి ఏర్పడబట్టి నరుడు ఒకప్పుడు కాకున్నను ఒకప్పుడైన దైవనామసంకీర్తన చేయును.  కడుపునిండిన వాడు కాళ్ళుముడుచుకొని పడుకొనునే గాని, దైవత్వంలోకి వెళ్ళుటకు ఆతనికి నిద్ర ఆవళింతలు పాలు మాలిక వగైరా అవలక్షణములు వుద్భవించి దైవత్వమునకు దూరునిగా చేయును.  ఇందును బట్టి అనుభవ పూర్వకముగా ఏసుపల్కిన ఈ వాక్కులు విశ్వసనీయమైనవి.

        భూమిమీద ఒకడు తన కొరకు ధనము కూర్చుకొనునపుడు కూర్చుకొనుటయే వాని వంతు అగునుగాని, దానిని భక్షించుటకు వేరొకడు తనలోనుండి వచ్చును.  కాని తన శరీరమునుండి ఆత్మను వేరుపరచునపుడు దానిని ఎవ్వరును ఆపలేరు.  కనుక శారీరరీత్యా ఒక మనుష్యుడు అనుభవించలేని ధనము అతని మరణానికే అది చేటగును.  ఇందును బట్టియే భూమిమీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అన్నారు.  ధనమును బట్టి హత్యలు కలహములు కోర్టు కచ్చేరీలు బైలుదేరుచున్నవి.  మరియు ఇది దైవత్వమునకు నిరుపయోగము. కాబట్టి అనుదినాహారమునకు దయచేయుము.  అని ఏసుప్రభువు చెప్పిన రీతిగా అను దినము కావలసిన రీతిగనే అనుదిన సువార్తసేవకు కావలసిన అనుదిన కుటుంబ పోషణకు కావలసిన, అనుదిన దైవసేవకు అనుదిన సోదర ధర్మములకు ప్రజోపకారములకును ధనము కావలసియున్నది.  ఇందును బట్టి చూస్తే ఆహారము ధనము శారీరములైయున్నవి.   దైవవాక్యము దైవప్రార్థన పరలోక జీవాహార జీవజలముగ (పరలోకధనముగ) నిర్ధారింపబడియున్నవి.

        ప్రశ్నః- మత్తయి 7:21 ప్రభువా! అని పిలచు ప్రతి యొక్కడు పరలోకరాజ్యము చేరలేడు.  తండ్రి చిత్తము ప్రకారము జరిగించువాడే ప్రవేశించగలడు.  మత్తయి 25:34-40 క్రియలు లేని విశ్వాసము మృతమని అర్థము.

        కొలస్సై 1:15-18 రోమా 10:9-11 ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని వారి హృదయము నాకు దూరముగనున్నది.  కపట ప్రేమ కపట పిలుపులు వ్యర్థమని భావము.

        ప్రశ్నః- మత్తయి 7:22-23 అక్రమము చేయువారలారా! నా యొద్దనుండి పొండు.  ఇది అమాయికులను ప్రలోభము కలుగజేయుట  కాదు ఇది యదార్థమేయని కొలస్సై 1:15 వివరించుచున్నది.

        మత్తయి 8:23 ఏసుప్రభువు జీవించింది నిజమేనని క్రీస్తు శకము నిరూపిస్తున్నది.  అంతేగాని ధన్యతరి శకమని శుక్రాచార్య శకమని ఎచ్చటలేదు.  గనుక అవి నమ్మశక్యములు గావు.  క్రీస్తు దేవుని కుమారుడని ఆయన దైవత్వంగల ప్రవక్తయని ఆయనకు స్వస్థతా ప్రభావము గలదని, ఆయన జీవించియున్న కాలములో ఆయన వెంట తిరిగిన జనాంగము ఆయన ఏర్పరచుకొన్న శిష్యులు వారు లిఖించిన లేఖనములు యదార్థములు అని, క్రీస్తు యొక్క మహిమాన్విత చరిత్ర యదార్ధములని నిరూపిస్తున్నవి.  మరియు క్రైస్తవ్యమును బట్ట బైలు చేయు సంఘటనలు స్థలములు నరకోటి యొక్క దృక్పధములో మసలు చున్నవి.  అట్టి క్రీస్తు చరిత్ర ఆయన చేసిన క్రియలు యదార్ధమైనట్లు ఋజువులున్నవి.  మరియు ధన్వంతరి, శుక్రుడు,కశ్యపుడు వగైరా జడదారుల చరిత్ర బండ క్రింద మట్టివలె సమసి పోయినదేగాని యదార్థముగా ప్రజానీకములో నిలువ లేకున్నవి.

        క్రైస్తవ విశ్వాసులైన భక్తులు కూడా కొన్ని అద్భుత కార్యములు చేస్తూ దైవత్వమును వెల్లడించుచున్నారు.  యోగాశ్రమము అను పేరు పెట్టి ఆసనాలు వేయు జడదారుల సంగతి ఏమిటి? ఋషీశ్వరులమని ముక్కు మూసుకొని తపస్సునాచరించు సన్యాసి సంగతి ఏమి? కనపడిన శిలకంతకును కొయ్యతో చెక్కబడిన బొమ్మలకును, సిమెంటుతో పోతపోసిన విగ్రహములకును వానరసర్పరూపములను ఆరాధించు అజ్ఞానుల యొక్క సంగతి ఏమిటి? బాబాలమంటూ కాషాయాంబర ధారులై ప్రజలను మోసము చేయు మోసగాళ్ళమాటేమిటి? వీరు ఆర్య సమాజము దృష్టిలో లేరా? అట్లు గ్రహింపలేకున్నచో వీరును క్రైస్తవులుగా మారుట ఎంతో ప్రశంసనీయము.

        ప్రశ్నః- మత్తయి 8:28-32 దయ్యములు పందులమందలో ప్రవేశించి ప్రపాతమున బడిచచ్చుట. మార్కు 5:1-20

        జవాబుః- దైవ వాక్య విమర్శలో ఆర్య సమాజ అధినేతలు జ్ఞానలోపము చెందిన వారనుటకు సందేహము లేదు.  ఎట్లన దయ్యము పట్టిన మనిషి స్మశానములో తిరుగును గాని సమాధులలోనుండి రాలేడు.  సమాధిలో వున్నది శవము. మార్కు 5:3 లోని ఈ సంఘటనను గూర్చిన వివరమును చదివితే అతడు సమాధులలో నివాసము చేసెడి వాడని వున్నది.  నిజమే దయ్యము పట్టిన మనిషి ఎప్పుడును నరులతో చేరక, ఏకాంతమును కోరుచు మంకుబట్టి ఒంటరిగా నిద్రించుట సహజము. ఇట్లు దయ్యము పట్టిన మనిషికి స్వకీయులు బంధువర్గము రక్తసంబంధులు వగైరా బాంధవ్యములతో సంబంధము పెట్టుకొనక ఎల్లవేళలు ఒంటిగా జీవించుటకును దయ్యము ఆవేశమైనపుడు లోకమునే మరచి చంచల స్వభావమును ధరించి, తన ఇచ్చవచ్చిన విధముగా ప్రవర్తించును. అటులనే ఈదయ్యము పట్టినవారును నరుల మధ్యనివసింపక స్మశాన వాటికలో సమాధుల కట్టడములలో నివసించి నంతమాత్రాన వీరు సమాధిచేయబడిన వారు కాదని యిందుమూలంగా గుర్తింపవలసియున్నది.  పోతే చచ్చినవానిని బ్రతికించు సామర్ధ్యము గల మరియు అధికారము గల శక్తి గల క్రీస్తునకు సమాధితోటలోని సమాధిలో వున్నట్టి మృతులను లేపుట కూడా అసాధ్యం కాదు.  అట్టిపరిస్థితులలో అనేక దయ్యములు ఒక వ్యక్తిని బట్టి అవి దైవత్వం ద్వారా విడువబడిన కాలములో-వేల సంఖ్యలో వున్న పందుల మందలో జొరబడుటలోని పరమార్థమును మనము గ్రహించినట్లయితే మానవజ్ఞానేంద్రియము చాలా చిన్నది.  అందులో ఇమిడియున్న ఆలోచనలు ఆకాశ నక్షత్రములవలె ఇసుక రేణువులవలె జలపాతబిందువుల వలె క్షణక్షణము ప్రబలు విధముగా మానవుని హృదయము లోని కోరికలు కూడా అందుకు సమతుల్యముగా అధికమించుట చేత ఇహమానవుని యొక్క ఆలోచనలు కోరికలు ఆశయములకుఅంతము గలదా? అనుసంశయము మనకు కలుగక మానదు. ఇట్టితత్వము గల నరుని యొక్క శారీర ఆత్మలలో అనేక అపవిత్రాత్మలు చోటు చేసుకొన్నాయంటే ఇంక నరుడు సంపూర్ణుడా? అసంపూర్ణుడా? అనేది చదువరి గుర్తింపవలసియున్నది.  నరుడు సంపూర్ణుడు కాడు.  దేవుడు నరుని తనవలె సంపూర్ణునిగా సృష్టించాడు.  అయితే తన ఆలోచనను బట్టి భవిష్యత్తులో నరుడు అసంపూర్ణుడు కాగలడని తలంచి వానిని కొంచెము తక్కువ వానినిగా చేసినాడు.   ఈ తక్కువ తనమును బట్టి దైవాజ్ఞాతిక్రమమును బట్టి నరునిలో అనేకాత్మలు చోటుచేసుకొనుటకు అవకాశమున్నది.  ఆ విధంగానే ఈ సేన అను భూత సమూహం ఆ నరునిలో కాపురము చేసి వానిని సమాధులలో అందలి సమాది కట్టడపు మందిరములలో నివసింపజేసి, ఏసురాకకై నిరీక్షిస్తూ శారీర జ్ఞానము కాదు కనుక అవి ఆత్మలు గనుక ఆత్మజ్ఞానముతో ఏసునెరింగి, ఆయనను దర్శించి ఆయనకు దాసోహమై ఆయనచే విభజింపబడి ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క శరీరమును ఆవేశించి, అన్ని ఆత్మలు పందుల మందలో ప్రవేశించి నరుని మీద ఏసుమీద వున్న ఈర్ష్యను బట్టి పందుల మందనుసంహరించి ఏసును నిందుతినిగా జేసి, ఆయన నావూరు నుండి పంపివేయుటకు పందులను చంపి క్రియజరిగించినటుల తెలియుచున్నది.

        కాలము రాకమునుపే మమ్ములను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అను వాక్యభావమేమిటి? దేవుడు మమ్ములను అపవిత్రాత్మలగా జీవించమని ఇచ్చిన కాలపరిమితి సంపూర్ణం గాకమునుపే మమ్ములను బాధించాలని వచ్చితివా? అని అర్థము.  గుడి-గోపురము దైవభక్తి-దయదాక్షిణ్యాలు లేక కౄరమైన జీవితములో జీవించిన వారే ఈ అపవిత్రాత్మలు.  అట్టి ఆత్మలను దేవుడు వెలుపల వదలక తనలో ఐక్యము చేసి కొనునా? వాటికి ఇవ్వబడిన కాలపరిమితిని బట్టి విడువబడినవి.  అక్రమము చేయు వారలారా (మత్తయి 25:41-46) అపవాదికిని వాని దూతలకును సిద్ధము చేయబడిన నిత్యాగ్ని గుండములోనికి వెళ్ళుడి.  భూతములను సృష్టించిన వాడు దేవుడు.  పవిత్రతకును అపవిత్రతకును మూలకారకుడు దేవుడే; ఎట్లనగా పవిత్రమైన జంతువులకు ప్రతిగా అనగా అపవిత్ర మైనవిగా పంది-పక్షులలో అపవిత్రమైనదిగా కాకి పురుగులలో అపవిత్రమైనదిగా ఈగ; ప్రాకెడి జంతువులలో అపవిత్రమైనదిగా బల్లి-సర్పము.  దేవదూతలలో అపవిత్రునిగా సాతానును.  నరులలో అపవిత్రునిగా పై వివరించిన వాటిని ఆరాధించి పూజించి వాటి యొక్క స్వభావమును కల్గినవాడు. పాము వంటి పగ, బల్లి వంటివిషము, పందివంటిఅసహ్య జీవితము ఇటువంటి వన్నియు కల్గినవాడు అపవాది.  వానిననుసరించు నరులు.

        (మత్తయి 9:2-3) పక్షవాయువు గల రోగితో పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట,

        భూలోకములో భూలోకసంబంధమైన న్యాయాధికారి ఒక నేరస్థుని శిక్షించుటకును క్షమించుటకును అధికారము పొందియున్నాడు.  న్యాయస్థానమును న్యాయాధికారిని నేరస్థుని సృష్టించిన సర్వాధికారియగు దేవుని స్వరూపియగు క్రీస్తుకు, ఒక నరుని పాపమును క్షమించుటకు అధికారము లేదా? ఎంత కాలము ఉపవాసవ్రతములను బూని ఆర్యసమాజము ఈ విమర్శకు ఒడిగట్టినది.  ఇందువల్ల లోకసంబంధమైన ముద్దాయి న్యాయాధికారి తీర్పు మూలము నిర్దోషిగా తీర్చబడి శిక్షనుండి విడుదల పొంది, పదిమందిలో నరునిగా తిరిగే యోగ్యతను పొందుచున్నాడు.  అదే విధంగా పక్షవాయువు.  అనెడి బంధకమునుండి విమోచింపబడి నడవగల్గుటయే గాక ఆరోగ్యవంతునిగాను సమాజమునకు ఉపయోగకరమగు వ్యక్తి గాను అతను తీర్పు పొందినాడు.

        మత్తయిః -పరమాత్ముడైన దేవుడు యోహాను 1:12లో తన్ను ఎందరంగీకరించెరో వారందరు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము ఇచ్చెను.  ఏసు ఈ లోకమునకు వచ్చిన కారణము ఆయన చేసిన త్యాగము ఆయన చరిత్రము యావత్తు కూడా భూలోకమందంతట ప్రతిష్టించుటకును మరియు పరలోక రాజ్యము ప్రవేశించుటకు ఏసు సత్యము జీవమైయున్నాడని తెలియజెప్పుటకును అనగా ఇశ్రాయేలను దేవుని జనాంగమైన పన్నెండు గోత్రములుఅనగా యోర్దానునదిలో నాటబడిన పండ్రెండు రాళ్ళకు సాదృశ్యమైయున్న పండ్రెండు మంది శిష్యులను, వారి చేత నిజదైవసత్యములను ప్రచారము చేయుటకును-అట్లు వారు  ప్రచారము చేయువీరిని లోకము నమ్ముటకు తండ్రియైన దేవుని యందు నుండి ఏసు ఏ విధంగా అధికారము పొందియుండెనో-అదే విధమైన అధికారమును ఏసు ప్రభువు తన శిష్యులకు ఆ అధికారము నిస్తు అనగా దయ్యములను వెళ్ళగొట్టుటకును వ్యాధులను స్వస్థపరచుటకును.

        10. మత్తయి 1:20-34-35-36 ప్రతి వాని దేహమందును పరమాత్మ జీవాత్మయై వున్నాడు  పరమాత్ముడు జీవాత్మయై నరునిలో నివసిస్తున్నాడనుట 1 కొరింధీ 3:16 లో చూడగలము.  ''మీలోనివసించును''కాన ప్రతివానిలో నుండి మాట్లాడుచున్నది పరమాత్ముడే యని యిందు మూలముగ మనము గ్రహించవలసియున్నది.  ఏసు భూమిమీదకు వాక్యధారిగా అనగా యోహాను 1-14 అ వాక్యము శరీరధారియై'' క్రీస్తు యొక్క రూపమే ఖడ్గము.  దేవుడు దహించు అగ్నియైయున్నాడు.  ఖడ్గమనగా అసత్యమును ఖండించుటకును అక్రమమును అణచుటకును, నరుని హృదయమును అంధకారక్రియలనుండి ఖండించి వెలుగు సంబంధిగా ఆతనిని రూపొందించుటకును ఇట్టి సమయములో లోకమే భయంకరమైన చీకటి గనుక యోహాను 1:5లో వలె దేవుని యొక్క సమాధానమను వాక్కులను, ఆయన వాక్యమను ఖడ్గము యొక్క న్యాయతీర్పునకును సత్యవివరణకును వ్యతిరేకమై మత్తయి 10:35-36 లో వలె నరులు తయారైనారు.  ఇందును బట్టి ఈ మాట అన్నాడుగాని ఏసుప్రభువు కలహప్రియుడుగాదు.  తంటాలమారి గాదు.  ఆయన మనకును దేవునికిని సమాధానకర్తగాను మద్యవర్తిగాను, యుగసమాప్తిలో తీర్పరిగాను పరమాత్ముని చేత ఏర్పరచబడినవాడు.  ఈ నగ్నసత్యమును గుర్తించి ఓ ఆర్యసమాజమా! నీ విమర్శలను మానుకొని క్రీస్తులోని దైవత్వమును గ్రహించుము.

        ప్రశ్నః- మత్తయి 15:34-38 పై వాక్య సందర్భమును గుర్తించినచో ఏసు ప్రభువు రొట్టెలను చేపలను పంచు మహిమక్రియ మనకు తేటతెల్లముగా తెలుసుకోగలము.  మత్తయి 15:32 లో ఏసును వెంటాడుచున్న జనాంగము నిరాహారముగ వుండి ఆయన యందు విశ్వాసముతో ఆయన చేయు మహత్తర క్రియలను వీక్షించుట యందును, ఆయన సూచక క్రియలయందు ఆసక్తి కల్గియుండుటచేతను ఏసుప్రభువు దర్శనమూలముగా ఆయన ప్రభావకాంతులు వారిని ఆవరించియున్నందున, తన్మయులై అన్నాహారములు వీడి స్నానపానాదుల నెరుగక తన్మయులై నిరాహారులై యున్నవారి యందు కనికరపడి, వారిని నిరాహారముతో వారి స్వస్థలములకు పంపించుటకు ఆయన అంగీకరించక తనలో వున్న దైవిక ప్రభావమనునది కేవలము రోగములను భూతప్రేత పిశాచములను అంధత్వమును నిర్మూలించునదియే గాక, క్షుద్భాధ సహితము చల్లార్చుచునది అని నిరూపించుటకును ఏమియు లేకుండ చేయగలడు.  రొట్టెలు లేకుండగనే తన వెలుగు దైవమహత్తరశక్తి చేత వారి ఆకటి చిచ్చును దప్పికను చల్లార్చగలడు.  అట్లు చల్లార్చి యున్నట్లయితే ఈనాటి ఆర్యసమాజము చెవికోసిన మేషమువలె వెర్రి అరపులు అరచియుండును.  ఇది గ్రహించియే గాబోలు ఆనాటి ప్రభువు ''గంగి గోవు పాలు గరిటెడైనను చాలు'' కడవడైన నేమి ఖరము పాలు అన్నలోకోక్తి వలె, ఆ రొట్టెలను గంగిగోవులుగ జేసి వాటిని ఆశీర్వదించి వాటిపై తన ప్రభావమును ప్రసరింపజేసి, దాన్ని తన సంపూర్ణతతో నింపియుండుట చేత ఆ రొట్టె ముక్కలు భుజించినవారు మారన్నమడుగక కూరలేదని సణుగుకొనక, ఉప్పు సప్పిడియని విమర్శింపక జనుల ఎదుటనే తానేర్పరచుకున్న శిష్యుల ఎదుటనే ఈ క్రియను జేసి వారి చేతనే మిగిలినవాటిని ఏరించి పోగుచేసి, గంపలకెత్తి మోయించుటలో దైవసన్నిధి యన్నది అల్పాహారము-స్వల్పజలముతో కూడినదియే గాని యోగులమంటూ బైలుదేరి బాబాలమంటూ బ్యాండు వాయించుకుంటూ బజారులో ఊరేగింపులు చేసుకొంటూ సంతలో సలాములు ఆచరిస్తూ-పూటకు ఒకటిన్నర విస్తరి భోంచేస్తూ సుఖాయాసముతో జీవించే వ్యక్తులకు యిట్టి క్రియలు అసాధ్యములని నిరూపించుటకే ఈ క్రియ చేసినాడే గాని తాను ఇంద్రజాలికుడుగాడు మహామాంత్రికుడు గాడు.

        ప్రశ్నః- మత్తయి 16:27 ప్రతి మనుష్యునకు ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును.  పాపము చేసిన వ్యక్తిని శిక్షించమనడము భూలోకచట్టము.  పాపము చేసిన వ్యక్తి పరితాపమును పొంది తన ద్రోహక్రియలను గూర్చి నెమరువేస్తూ ఒక్కొక్కటిగా దైవసన్నిధానములో వాటిని గూర్చి ప్రలాపించి భగవంతునికి విజ్ఞాపన మూలమున క్షమాభిక్ష పెట్టమని వేడినపుడు మానవ హృదయము కంటె దైవహృదయము సున్నితమైనది గనుక వానినుండి ఆతని దూరపరచి దైవత్వము అట్టి పాపి యొక్క క్రియలను క్షమించి వాటి నుండి ఆతనిని దూరునిగా చేయును.

        ప్రశ్నః- మత్తయి 17:17 విశ్వాసము లేని మూర్ఖతరమువారలారా! గలతీ 5:17 ఆత్మశరీరమునకును శరీరము ఆత్మకును పరస్పర విరుద్ధము లైయున్నవి.  ఇవి ఒక దాని కొకటి వ్యతిరేకములై యున్నవిగనుక మీరేమి చేయనిశ్చయింతురో వాటిని చేయలేరన్నట్లు, ఏసు యొక్క శరీరము ఆత్మ యొక్క రూపకల్పన .శిష్యుల శరీరములు మానవ మాత్రమైనవి.  అనగా రెండు శరీరముల సంపర్కముతో ఉత్పన్నమైనవిగనుక ఇవి భూలోకసంబంధమైనవి.  అనగా జన్మకర్మ పాప దోషములు కల్గియున్నవి.  జన్మతఃనరులకున్న కోరికలు వీరిలోకూడా వున్నవి.  వీరు క్రీస్తు అను శరీరముతో వున్నవారేగాని ఆయన ఆత్మలో జీవించినవారు కాదు.  కనుక వీరిలో విశ్వాసశూన్యమని ఆత్మరూపుడైన ప్రభువు గ్రహించి ఈ విధంగా వక్కాణించాడు.  ఆవగింజకంటె అతి పెద్ద పరిమాణముతో విశ్వాసముతో క్రీస్తులో జీవించి అనేకాద్భుతములు జేసి మరణించి, నేటికిని ఆశవము చెడక క్రీస్తు యొక్క మహిమను చాటుచున్న విశ్వాసుల శవములు లోకములో కనపడుచున్నవి.  క్రీస్తును విశ్వసించిన వాడు క్రీస్తు యొక్క క్రియలను కూడా చేయగలడను (విశ్వాసము) సిద్ధాంతం ప్రకారం అపోస్త 3:6-7 చూచినట్లయితే ఆయన శిష్యులైన పేతురు యోహానులు చేసిన మహత్తర క్రియను చదువగలము.  ఆయన విషయమై తమ జీవితమును దారబోసిన అనేక మహత్కార్యములు చేసి దైవసువార్తను ప్రకటించి, మరణించి అతి గొప్ప విశ్వాసియైన ప్రాంసిస్‌ జేవియర్‌ యొక్క మృతదేహమును కొన్ని వందల సం||ల నుండి చెడక నేటికిని సజీవ కళతో-శవవాసనలేక అలరారుచున్నట్లు ప్రత్యక్షంగా చూస్తున్నాము.  మరి ఇట్టి సందర్భములో ఆర్యమత సభ వేదమతస్థులైన వారు గబ్బిలాల్లాగ వేదాలను సృష్టిని పూజిస్తూ ఎంతమంది వ్యాధిగ్రస్థులకు స్వస్థత గల్గించారు? ఎంతమంది సన్యాసులు మృతిచెంది చెడక శవాకారములలో వున్నారు? పాఠకులే గ్రహించాలి. ఎవరెేలాగు జీవించినను శరీరమనునది పాపకృత్యమైనది.  దీనికి లోకముతో అంటిపెట్టుకొని జీవించెడిది. దీనిలోకాశలు మెండు.  పరమాత్ముని యొక్క ఆయన అగ్ని పరీక్షలో జీవించాలంటే ఆయన ఆవగింజంత విశ్వాసము కోరినాడు.  సాటి నరులమీద అయితే గంపెడు విశ్వాసముతో నరుడు జీవిస్తాడు.  దైవత్వములో ఆవగింజంత వుంచాలంటే ఆరు సంవత్సరాలు పాటుపడిన దైవత్వం అది అసాధ్యమంటుంది.

        ప్రశ్నః- మత్తయి 18:3 మీరు మారు మనస్సు నొంది పిల్లల వారి వంటి వారైనగాని పరలోక రాజ్యములో ప్రవేశింపరు.  

        ఏసు పల్కిన పై వాక్యములోని మర్మము మనము రెండు విధములుగా గ్రహించవలసియున్నది.  ఇందులో మొదటిది ఆత్మ శరీరమునకు అనేక ఇచ్చలు కోరికలుండుట సహజము. శరీరము ఎన్ని కోరినను ప్రసంగిలో చెప్పిన విధముగా దేహము మట్టి  సంబంధమైనవియే మనము గమనింపవలసియున్నది.  ఏసు పై మాటను దేహసంబంధమైన ఆధిక్యతలను కోరుచు శిష్యులు ఒకరినొకరు ఎవరు గొప్ప అనువాదము కల్గినపుడు, దేహసంబంధంగా ఈ ఆధిక్యత కల్గినపుడు-ఏసు ఆత్మసంబంధి గనుక ఆత్మ సంబంధంగా పరలోక రాజ్యములో ధనికుడు దరిద్రుడు అని, పేదవాడు గొప్పవాడని విద్యావంతుడు విద్యావిహీనుడని జ్ఞాని అజ్ఞాని అనితతారతమ్యములు ఆత్మ సన్నిధిలో లేవు గనుక-వున్నదంతా భూలోకం లోనే ఈ వైషమ్యములున్నవి గనుక, ఆత్మ యొక్క సన్నిధి పసిబిడ్డ సన్నిధివలె వుండును గనుక కాబట్టి శారీరేచ్ఛలతో వీరు ఆత్మీయ రాజ్యము యొక్క విలువను గుర్తింపలేకున్నారనియు, ఆత్మరాజ్యము వేరు శారీర రాజ్యము వేరనియు ఈ లోకములో ఘనముగా ఎంచబడునది ఆత్మీయ రాజ్యములో అది హీనమనియు, చిన్నపిల్లలలో స్వార్థము గనుక కామ క్రోద మదమత్సరాది దుర్గుణంబులును, కక్ష్యలు కలహములు ఈర్ష్య పగలును ఏలాగు వుండవో-అటువంటి స్వభావముతో శారీరేచ్ఛలు చంపుకొని-ఆత్మీయంగా వికసించిన వాడే ఈ యోగ్యత పొందగలడని నిరూపించుచు ఈ వాక్యమును ప్రవచించినాడేగాని ఆయన దరిద్రుడు కాడు.  ఒకవేళ ఆయన ఆనాడు ఏమి లేనివాడుగా కనపడినాడే గాని,ఈనాడు ఐదు ఖండములకు నాధుడుగా వున్నాడు.  ఈ విలువ ఆర్యసమాజమునకు లేదు గనుక దారిద్రావస్థలోవున్న ఈ ఆర్యసమాజము క్రీస్తు యొక్క ఔన్నత్యమును చూడలేక విమర్శిస్తున్నదని తెలియుచున్నది. అనగా చిన్నబిడ్డకును మీలో ఆత్మకు తేడా వుండకూడదు.  శారీరేచ్ఛలను శారీర గుణములను చంపుకొని ఆత్మీయంగా జీవించమని ఇందులోనిభావము.

        ప్రశ్నః- మత్తయి 19:23 ధనికుడు ఎవరు? ఏసు చెప్పిన ధనికుడు మత్తయి 5:3-11 చదువుము.   ఈ గుణములు కల్గియుండి లోకరీత్యా ధనికుడైనను దరిద్రుడైనను దైవసన్నిధిలో రాణించగలడు.  ఎలాగంటే బైబిలులో అబ్రహాము-ఇస్సాకు -యాకోబు యోసేపు-యోబు-దావీదు మహారాజు సొలొమోను వగైరా భక్తులు లోకరీత్యా ధనవంతులు కారా? పరలోక రాజ్యములో వీరికి స్థానము లేదా? వారితో దేవుడే సంభాషించినట్లు ఆధారాలు వున్నవి.  ఎంతధనముతో జీవించిన ఎంత దరిద్రుడుగా జీవించిన ధర్మబుద్ధితో కూడిన చిత్తశుద్ధి  లేనట్లయితే నరుని యొక్క జీవాత్మకు దైవసన్నిధిలో స్థానములేదని గ్రహించవలయునే గాని,''సూదిబెజ్జములో ఒంటె దూరుటయనునది కేవలముదైవత్వమునకు ఒప్పుదల గల్గించు రీతిగా నరుని యొక్క ధర్మకార్యములుండాలి.  అని (అవి) కేవలము మానవులను మభ్యపెట్టుటకు కాదని భావము.  లోకరీత్యా ధనవంతుడులోకాన్ని మెప్పించగలడు.  అయితేఆ మెప్పుదలను దైవత్వం లో లోపించినట్లయితే ధనికుడు ఎంత సంపద వున్నను ఎంత భోగియైనను పరలోకరాజ్యములో ప్రవేశింపలేడని భావము.

        ప్రశ్నః- మత్తయి 19:28-29 ఒక తండ్రికి నలుగురు కుమారులు.  నలుగురు కుమారులలో తండ్రికి పెద్దకుమారుని మీదనే ప్రేమమమకారము.  పెద్దకుమారుని మీదనే తండ్రి యొక్క ప్రేమానురాగములు కేంద్రీకృతమైయున్నవి.   ఆ తర్వాత వున్న రెండవ కుమారుని మీద మరియొక విధమైన ప్రేమ, మూడవ కుమారుని మీద వేరొక రకమైన ప్రేమ వున్నరీతిగనే ప్రభుత్వం కూడా అగ్రకులమనియు క్షత్రియకులమనియు మధ్యకులమనియు బలహీనవర్గమనియు వెనుకబడిన వారనియు విభజించుచున్నది.  అదే విధంగా దైవసన్నిధానములో యాజకులనియు ప్రధాన యాజకులనియు భక్తులనియు భక్తిహీనులనియు నాలుగు వర్గములుగా విభజించుచున్నవి.  అదేవిధంగా దేవుడేర్పరచుకొన్న జనాంగము ఇశ్రాయేలు.  వారిపట్ల దేవుడుచూపిన మహత్తర కార్యముల మూలము వలనను వారి వంశములో దేవుడే అవతారమూర్తియై, ఏసురూమును దాల్చి ఆసియాఖండమను మన ఖండములో దైవ మహత్తర ప్రభావమును నిరూపించి, దేవుని దృష్టిలో అజ్ఞానములో వున్న మన పూర్వీకులను మనలను నిజదేవునికి సమీపస్థులుగా చేయుటకై తద్వారా తన సింహాసన మహిమలో మనలను భాగస్వాములుగా చేయుటకు తాను చేసిన నిరంతర కృషియే దైవసంకల్పమైయున్నది.  కాన దైవసన్నిధిలో పక్షపాతవైఖరి, తన మన అను బేధముగాని దేవుని రాజ్యములో వని ఆర్యసమాజము ఇందుమూలముగ గుర్తింపవలసియున్నది.

        అపోస్త 17:30-31 లో వలె ఆ కాలమందైతే నరులు చేయుచున్న పాపములను దోషములను ప్రత్యక్షంగా నరులు చేయు క్రియలను బట్టి నరుని అజ్ఞానమునకు దేవుడు క్షమించి బలుల ద్వారాను హోమముల ద్వారాను ఆఘ్రాణించి నరులను క్షమించినట్లును, ఇప్పుడైతే తాను నియమించిన ఏసుఅను మనుష్యకుమారుని తీర్పరిగా నియమించియున్నందున అప్పటివారిని దేవుడును, ఇప్పటి వారిని క్రీస్తు పరలోకమునకు చేర్చుటకు కారకులైయున్నట్లు అధికారులై యున్నట్లును ఇందును బట్టి తెలియుచున్నది.  కావున నరసృష్టి ప్రారంభమునుండి హానోకు -మోషే - ఏలియా ఎలీషా వగైరా వారి చరిత్రలో వారిని దేవుడే స్వయముగా తనలోకి చేర్చుకొన్నట్లు తెలియుచున్నది.  ఇప్పుడైతే ప్రతి ఒక్కడును బలికి ప్రతిగా విరిగినలిగిన హృదయమును, ధూపమునకు ప్రతిగా ఉజ్జీవమైన ప్రార్థనలును నైవేద్యమునకు ప్రతిగా వక్యపఠనమును దైవసన్నిధానములో చేయవలసియున్నది.  ఇట్లుండిన వాడే పరలోక ప్రవేశము చేయగలడు.  ఈ నగ్నసత్యమును గ్రహించలేని యోగులనెడి ఆర్యసమాము ఏవుద్దేశ్యముతో ఈ విమర్శ చేయుచున్నదో చదువరులే గ్రహించగలరు.

        ప్రకటన 20:10 ప్రకటన 21:6 ఇక్కడ వివరించబడిన నరకాగ్ని వేదన జీవాత్మకు ఇచ్చునట్టి దండన మాత్రమే గాని అనగా భూలోకములో ఒక మనిషి చేసిన శిక్షను చెరసాల (ఖైదు) రూపములో వున్నలాగుననే పై లోకములో కూడా ఇలాంటిది వుండును.  అయితే భూలోకము హంతకునికి ఉరిశిక్ష వేస్తారు.  ఉరిశిక్ష అనగా శరీరాత్మలను వేరు చేయుటయే.  పరలోకములో ఈ శిక్ష వీలుపడదు.  ఎందుకనగా శరీరము దృశ్యమైనది.  ఆత్మ అదృశ్యమైనది.  ఆత్మను ఉరి ఎత్తలేరు.  ఈనరక శిక్ష అనునది ఒక వేదనకరమైన స్థలమే. ఈ శిక్ష అనునది చాలావరకు భూమిమీదనే ఆత్మాశరీరములు వేదనపడుచున్నవి.  యుగయుగములు అనునది తండ్రి తన కుమారుని క్రమశిక్షణయందుంచుటకుగాను బెదిరించుటకు వాడునట్టి మాటలే.  తోలు వలిచేస్తాను నీ వీపు చీరేస్తాను.  నిన్ను చితక బాదుతాను.  అని ఒక తండ్రి తన కుమారుని గూర్చి అన్నపుడు వీపు చీరేయడు.  పచ్చడి లాగా చితకబాదడు. ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి.  కరుణామయుడు.  మానవునిలో ప్రవేశపెట్టబడిన ఆత్మతనదే.  తన ఆత్మను తాను యుగయుగములు దహించుకొనునా! ఏమి? ఈ భూలోక రాజ్యములలో పాపికి శిక్ష ఏలాగు అమలు పరచబడుచున్నదో ఆలాగే దైవసన్నిధిలో కూడా అమలు పరచబడుచున్నది; కారాగార శిక్ష కఠిన కారాగార శశిక్ష మొదలైనవి.  అదే రీతిగా ఆత్మను బంధించుట.  విడుదల చేయుటమొదలగునవి.

        ప్రశ్నః- మత్తయి 21:18 పై వచనములోని ఏసుప్రభువు శాంతుడుకాడని క్రోధియని ఋతుజ్ఞానము లేనివాడని ఆర్యసమాజము విమర్శలు.  ఆలాగైతే విశ్వామిత్రుడు-వసిస్థుడు- వ్యాసుడు - వగైరా ఋషులు వారికి తపోభంగమైనదనియు సాటినరులు చేసిన అపరాధముల నిమిత్తము నరులను జంతువులుగను రాక్షసులుగను అభాగ్యులుగను జీవించునటుల శపించుట అనునదియు, దాని మూలమున వారి జన్మతో వారు పొందిన వేదనలు అందువల్ల కల్గిన శ్రమలు ఆ తర్వాత శాపవిమోచనమునకు వారికి కల్గు సంఘటనలను బట్టి ఆలోచిస్తే నరులను శపించు ఋషులు శాంతులా? క్రోధులా? మదమాత్సర్యమదాంధులా? నిజముగ దైవశక్తిగల వారా? ఇవి దైవసంభూతునికి వుండవలసిన లక్షణాలా? ఇట్టివారిని బట్టి వ్రేలాడు ఆర్యసమాజములోని దైవత్వమేపాటిది? క్రీస్తు క్షుద్భాధ నిమిత్తం అంజూరపు చెట్టును శపించినాడే గాని నిష్కారణముగా గాదు.  తన భార్యలకు నీళ్ళు మోయలేదనియు తనకు కాళ్ళువత్త లేదనియు తన భోజనమునకు విస్తరికుట్టలేదనియు, తననిద్రకు భంగము కల్గెననియు తన తపస్సుకు అంతరాయము కల్గినదనియు రాజుల బార్యలతో తాను జరుపబోవు కామక్రీడలకు తనకు అంతరాయము కల్గినదనియు, కినుక వహించి శపించు జడదారులు ఋష్య పుంగవులా? ఏసుఅజ్ఞానియా? చదువరులే ఊహించగలరు.

        జమదగ్ని తన భార్యతో కేళీవిలాసములాడు సమయమున సూర్యుడు తీక్షణమైన వేడితో ప్రకాశింపగా తన భార్యకు ఒడలు వేడెక్కిందని సూర్యుని శపించబోగా సూర్యుడు భయపడి  జమదగ్నికి గొడుగు చెప్పులిచ్చివాడట.  ఇదెంతనిజము? ఇటువంటి వేదాలను ఇటువంటి అసంబద్దపు చరిత్రలను వేదాలుగా భావించి ఆరాధించునట్టి ఆర్యసమాజము ఎంత సత్యమైనదో వీటిని బట్టి తెలియగలదు.

        ప్రశ్నః- మత్తయి 24:29 ''ఆదినము శ్రమ'' అనగా మొదటి కాలములో అనగా ఆదికాలములో దేవుడు సృష్టిని ఎదిగించాడు.  ఆ ఎదుగుదల దోషపూరితమైనదికాగా జలప్రళయముతో మొత్తి దానిని నాశనపరచినాడు.  మొట్టమొదట ఆదాము అను ఒక పురుషునితో ప్రారంభించిన ఈ సృష్టిని జలప్రళయానంతరము ఒక్క కుటుంబంతో ఈ సృష్టిపై క్రియ జరిగించ మొదలుపెట్టినాడు.  అయినను భూమి తన యొక్క నీచత్వమును మానక పోవుసరికి, భూశ్రమకు బదులుగా తనే నరరూపముతో శ్రమను అనుభవించినాడు.  ఆ శ్రమ రక్తచెమట కారునంతను ఆ తర్వాత సిలువమీద వేదన పూర్వకమైనదిగాను, ఆ తర్వాత మరణముతో ఆ శ్రమ ముగిసిన వెంటనే సూర్యుని చీకటి క్రమ్మి భయంకర భూకంపము చీకటి ఏర్పడి సమాధులు ఒణకి మృతులు సజీవులైనట్లు తెలియుచున్నది.  ఆదిలో కల్గిన శ్రమ భూమిది.  ఆదిలో జలప్రళయము ద్వారా శ్రమ పొందినది భూమి.  రెండవసారి లోకపాపపరిహారార్థ మూలమున శ్రమపొందినది ఏసుప్రభువు.  మరి ఇప్పుడు మూడవ శ్రమగా నరులు-నరులతో బాటు భూమి అనుభవింపవలసియున్నది.

        చీకటి సూర్యునిక్రమ్మును.  అనగా చీకటి అను అపవాది నీతిసూర్యుడను క్రీస్తునుమరుగుపరచును.  ఎప్పుడు? ఇక రాబోయేదినములలో నీతిసూర్యుడను క్రీస్తును సాతాను అను అంధకారము కప్పును.  క్రీస్తును గూర్చిన దైవత్వం అజ్ఞానాంధకారణమగును.  క్రీస్తు దేవుడు కాదని ఆయన దేవుని కుమారుడు మాత్రమేనని బోధకులు వాదింతురు.  నక్షత్రములనగా దేవుని వద్ద భద్రపరచబడియున్న ఆత్మలు. వీరు భూమిమీదకు విడువబడుదురు.  ఆకాశమందలి సైన్యము అనగా దేవదూతలు.  శక్తులనగా ఉరుములు మెరపులు విషవాయువులు, వేడిగాడ్పులు తుఫాను అణుధార్మిక శక్తులు వాని తాలూకూ వాయువులు.  ఇవి ఆకాశ శక్తులుగా నామధేయములు కల్గియున్నవి.  ఆకాశసైన్యమనగా దేవదూతలు అనగా ప్రధాన అతి ప్రధాన వగైరా పదవులు అలంకరించిన వివిధ రకాలైన దేవదూతల సముదాయము.  ఏసు మూర్ఖుడును, అజ్ఞానియు వడ్రంగి కులమునకు చెందినవాడైన పక్షమున ద్వారా బంధములు కిటికీలు వానికి తలుపులు చేయుచు కుర్చీలు-బల్లలు-మేజాలు-పీటలు వగైరాల  తయారుతో జీవిస్తూ తన జన్మను సార్థకము చేసికొనేవాడే.  ఈయన దైవబోధలు చేస్తూ దైవ మహత్తర శక్తి మూలమున అనేక రోగులను స్వస్థతచిత్తులుగాను, మృతులు సజీవులుగాను అంధులను చూపరులుగాను అవిటివారిని బాగుపరచువారుగాను, నీళ్ళను ద్రాక్షారసముగా మార్చుటకును ఏ విధంగా శక్తిమంతుడయ్యెనో తనలోని శక్తిని గూర్చి వేలమందిలో నిరూపించి, నేడుఐదు ఖండములలో తన బ్రహ్మచర్య ప్రభావమూలమున తనలోని దైవసిద్ధి శక్తి మూలమున, తానీలోకమునకు వచ్చిన ధ్యేయమును దైవసంబంధమైన సువర్తమానమును అనేకులకు ప్రకటించి, ఐదు ఖండములలో తన యొక్క సంఘమును ఏర్పరచి దానికి తన రక్తబలి ద్వారా జీవమిచ్చి, తాను మృతుడై-మృతసమాధినుండి సజీవుడై యావత్‌  లోకమునకు తీర్పరిగా వుండగా ఇట్టి మహాపురుషుని విమర్శించుటకు ఆర్యసమాజము ఎంత విమర్శిస్తే మాత్రము ఫలితము శూన్యమని ఇందుమూలముగ గ్రహించగలము.

        ప్రశ్నః- మత్తయి 24:35 ఆకాశము భూమియు గతించును గాని నామాటలు ఏ మాత్రము గతింపవు.

        ఒక వ్యక్తి మరి యొక వ్యక్తితో పోటీకి తలపడి అటు సూర్యుడు అనగా తూర్పున ఉదయించిన సూర్యుడు పడమట ఉదయించినా నీయింటికి రాననియు, ఆరు నూరయినా నూరు ఆరయినా అట్లు జరుగుటకు వీలు లేదనును.  తూర్పున ఉదయించు సూర్యుడు పడమట ఏలాగు ఉదయించగలడు? ఆరు నూరు నూరు ఆరు ఏలాగగును? కాబట్టి ఇవి ఏ విధంగా మారవో అదే విధంగా ఆకాశము గతించదు.  ఏసుప్రభువు మాట భూమిమీద నశించదు అని అర్థము.  అంతేగాని ఏసుప్రభువు తనను గొప్పవానినిగా చేసికొనుటకు ఈ మాట అనలేదు.

        ప్రశ్నః- మత్తయి 25:41 సాతాను దేవునికి భయపడినట్లు దైవగ్రంధములో ఎచ్చట వ్రాయబడియున్నది.

        సర్వసృష్టికిని సృష్టికర్త యైన పరమాత్ముడు పక్షపాతికాడు. ఎందుకనగా ఆయన పక్షపాతియైనచో చీకటి అగాధజలములలో గుప్తమైయున్న భూగోళమును లేవనెత్తి దానికి రూపురేఖలు దిద్ధి తన సృష్టిలో దానిని అలంకరింపజేసి, దాని సౌందర్యమును తను తనివితీర కొంతకాలము అనుభవించి అటు పిమ్మట దానికి సహాయముగాను తనకు సహచరుగను వుండుటకు నరుని సృష్టించి, ఎంతో ఆనందించి తన రూపములో తన పోలికలో సృష్టించబడిన నరరూపముతో అనుదినము ముచ్చటిస్తూ మురిసిపొయ్యాడు.  

        నేడున్న దైవవిరోధ కూటములనెడి నాస్తిక హేతువాద వేద వగైరా సంఘముల భవిష్యత్‌ ఎరిగియుండుట చేతనే ఆదిలోనే దేవుడు నరునికొక శాపము, సర్పమునకుకొక శాపము భూమికి ఒక శాపము స్త్రీకి ఇక శాపము ఇవ్వబట్టి ఈనాడు కొంతవరకైనా దైవత్వమనెడి ఇరుసును ఆనుకొని భూమి తిరుగుచున్నది. దేవుడు పక్షపాతబుద్ధితో నరునియందు గాని సృష్టియందు గాని ఎన్నడైనను ఎప్పుడైనను ఎక్కడైనను ప్రవర్తించినట్లుగా లేదు.  నిజదైవలక్షణము.  అయితే తన యందు భక్తిగలవారికి చెరుపు చేయు వాటిని లయపరచి భక్తులకు రక్షణ ఇస్తూ-అక్రమము మితిమీరగా సక్రమమైన మార్గమును బోధించుటకు తానే ఈ లోకమునకుయోగిగా వచ్చి భూలోక జగద్గురువులను మరణతుల్యులకు నీతిమార్గమును బోధించి, లోకమశాశ్వతమని శాశ్వతమైన స్థానము నరునికొకటున్నదని బోధించి, తాను మరణము యొక్క ప్రభావమును తానే తన దేహము ద్వారా చూపించి, దానిని గెల్చిన వానికే నిత్యజీవము తధ్యమని ఆ తర్వాత తానే సజీవుడై సమాధిని గెల్చి నరులకు కనిపించి తానే దైవత్వ ప్రభావమును చాటినట్లు వేదములో చదువగలము.

        ఇట్టి సాక్ష్యాధారాలు వుండగా ఆర్యసమాజము సైతాను నేలసృజించవలెను? నరకమునేల  సృజించవలెననుట'', గవర్నమెంటు వారు పొలీసును ఎందుకు ఏర్పరచాలి? చెరసాలలనెందుకు కట్టించవలెను? అన్నట్లుగా వున్నది. గవర్నమెంటువారు పోలీసు శాఖకును చెరసాల ఉద్యోగస్థులకును జీతములిస్తున్నది.  వారిని పోషిస్తున్నది.  అదే విదముగా దేవుడు అపవాదిని నియమించియున్నాడు.  నరకము అన్నట్టి ఖైదును ఏర్పరచియున్నాడు. వీటికికూడా ఆయనే అధికారి.  ఆయన తీర్పునిచ్చి ఇతను దోషి నరక శిక్ష పాత్రుడు గనుక ఆ శిక్షను విధించునపుడు దేవుని యొక్క వుత్తరువు మేరకు అపవాదికిని వాని దూతలమని అతిక్రమము మితీమీరిన ఆత్మలను అప్పగించి శిక్షించుట అనునది యోగ్యమైయున్నది.  అయితే ఇది మిక్కిలి వేదనకరమైన స్థలముగ నిర్ణయించబడినది.

        ప్రభుత్వాధి కారులు ప్రభుత్వపు జీతము నే తింటూ నేరస్థుల దగ్గర లాలూచీపడిన విధముగా అపవాది అతని దూతలు కూడా దేవుని యొక్క అజమాయిషీలో వుండి దైవత్వానికి మానవత్వానికి విరుద్ధంగా నరుని తప్పుడు దారులు పట్టించి అపవిత్ర పరచుచున్నాడు

        ప్రశ్నః- మత్తయి 26:14 యుస్కరియోతు యూదా ఏసుసాంగత్యములో పవిత్ర స్వభావమును పొందలేకపోవుటనుగూర్చి

        ఈ వాక్యమును అర్థము చేసికొను సందర్భములో ఆర్యసమాజము అడుసులో జారిపడినట్లుగా వున్నది.  ఎట్లన ఏసుప్రభువు ఆత్మయై అదృశ్యుడుగా వున్న పరమాత్ముని యొక్క ప్రణాళికానుసారము భూలోకములో నరుల మధ్య నరరూపములో జీవిస్తూ-తనను దేవుడు అనకుండ తానే దేవుడనని అనక మనుష్య కుమారుడు అని తనను గూర్చి జనకోటికి ప్రకటిస్తున్నట్లు వేదములో చదువగలము.  ఈయన దశరధమహారాజు భార్యలు భర్తనెరుగక ఆయనకు పట్టపు రాణులైయుండి కూడా బ్రహ్మచారులైన ఋషులతో కూడి వారి ద్వారా సంతానము బడసి, దశరధ మహారాజు కుమారులుగా వారికి పౌరసత్వమును కల్గించి రాజకుమారులుగా వారిని రాచరికములో పెంచారు. ఇంతవరకు యదార్థము.  అయితే దశరధమహారాజు పెద్దకుమారుడు దేవుని అవతారమంటూ కోదండరామస్వామిగా ఆయనకు బిరుదును తగిలించి, రాజసింహాసనమునకు ఆయనకు యోగ్యునిగా చేసినపుడు కైకేయి వ్యతిరేకింపగా -రాజ్యశాసనం ప్రకారం జ్యేష్ఠకుమారునికే పట్టాభిషేకం జరుగవలసియుండగా దైవసంభూతుడును అవతారమూర్తియైన రాముడు కైకమనస్సును ఎందుకు మార్చలేకపోయినాడు?  దైవత్వంలో వున్నట్టి అవతారమూర్తియైన రాముడు తన దైవమహత్తర శక్తితో మరియు వాక్శక్తితో దుష్టసంహారము చేసిదురితమును తొలగించవచ్చును గదా! అంబుల పొదిని విల్లును ఎందుకు చేపట్టెను? దేవునికి ఆయుధమెందుకు? అరణ్యవాసమెందుకు? కట్టుకున్న భార్యపై అనుమానమెందుకు? తనలో వున్నట్టి దైవజ్ఞానమును లోకార్పణజేసి మురికి బట్టలు వుతికే చాకలి వాని మాటపై విశ్వాసమెందుకు? మహాపతివ్రతగా వేదములో రచించబడ్డ సీతపై శంక ఎందుకు? ఆమెకు అగ్ని పరీక్ష పెట్టుట ఎందుకు? పుత్రసమేతంగా ఆమెను అడవుల పాలు చేయుట ఎందులకు? లంకాధీశుని రాముడు చంపి కండ్లు బోగొట్టుకొనుట ఎందులకు? చదువరులారా!ఆలోచించండి పై లక్షణములు ఏవేని ఏసుప్రభువునందు గలవా? ఆయన వివాహితుడా? ఏసునువిశ్వసించి అనేకులు రక్షించబడినట్లు వేదములో వున్నది గాని రాముని మాటలను పినతల్లియైన కైకేయి విశ్వసించలేదు.  తనకు సన్నిహితుడు పాదదాసుడైన ఆంజనేయుడు సైతము యుద్ధమునకు వచ్చినాడు.  వాలి సుగ్రీవుల భేదము తెలియక రాముడు తికమకలో యుండుట దైవలక్షణమా? చెట్ల చాటున నుండి వాలిని చంపినాడు. చాటు మరుగున నుండి వాలిని చంపుట ఏమి? ఇట్టి అవినీతికరమైన క్రియలు ఏసునందు ఒక్కటి గలదా? దేహి అన్నవారిని చేరదీసి రోగియైన వారిని స్వస్థత నిచ్చి, పాపి అన్నవానికి రక్షణ నిచ్చి పాపిపొందవలసిన శిక్షను తాను పొంది, మరణము ఒట్టిదే అని నిరూపించుటకు తాను పునరుత్థానుడై, మరణము దేవుని దృష్టికి తెరవంటిదేయని నిరూపించెను.  పూర్వము ఇట్టి క్రియలు ఏ అవతారుడైన చేసియుండెనేని అట్టివాడు దైవసమానుడే యనదగును.

        పోతే రెండవవాడుగా లక్ష్మణుడు.  ఇతడుఆదిశేషుని అవతారునిగా రామాయణములో రచించబడినది.  లక్ష్మణుని పేరు సౌమిత్రి.  ఆదిశేషుడను సర్పదేవుని రూపముగా ఏర్పడిన లక్ష్మణుడు తనను వలచి తన ప్రేమానురాగములను కోరి వలచివచ్చిన ఒక అబలను ముక్కు చెవులు కోయుట నేరము కాదా? ఆమె చేసిన నేరమేమి? ఆమెకున్న మోహతలంపును మాన్పుటకు లక్ష్మణుని లోని దైవశక్తి మార్చలేకపోయినదా? ముక్కు చెవులు అబలకు కోయుట నేడు భూలోక చట్టప్రకారము మానభంగనేరముగా కల్గును.  ఈ విధంగా ఏసుప్రభువు ఎవరినైన ముక్కుచెవులు కోసినాడా?

        మైరావణుడు వేసిన బాణమునకు లక్ష్మణుడు మూర్చపోయినట్లుగా వున్నది.  దైవసంభూతునికి మూర్చవచ్చుట కలదా? అట్టి మూర్ఛను నివారించుటకు ఆంజనేయుడు దైవత్వసిద్ధి పొందిన వాడు కదా! ఆయనే పోయి లక్ష్మణుని తాకి మూర్ఛను పోగొట్టవచ్చు గదా! మరి ఆంజనేయునిలోని దైవశక్తి ఏమైనట్లు? ఏసుప్రభువు ఏ సంజీవని లేకనే మూర్ఛరోగిని బాగుచేసినట్లు బైబిలులో వున్నది.  అదియే చాంద్రరోగము.

        ఇంక కృష్ణుని సంగతిః- కృష్ణునిలోని దైవత్వము మహావిష్ణువు  ఎత్తిన అవతారాలలో ఒక్కటిగా పురాణాలలో రచించబడినది.  ఇతను వాసు దేవునికిని దేవకికిని జన్మించినట్లు హైందవ పురాణ విరచితము.  మహావిష్ణువు దేవుడే అనుకుందాము.  దేవకి కంసుని చెల్లెలు కంసుడు రాక్షస వంశీయుడు రాక్షసవంశమునకు రాజు.  రాక్షసుడు రాక్షసుని చెల్లెలైన దేవకీ రాక్షసి.  ఆమె కడుపున పుట్టిన కృష్ణుడు రాక్షసుడా? దేవుడా? ఇట్టిఅవతారమునకు పూనుకున్న ఈతడు రాక్షసత్వమునకు సమకాలికుడు కాడా? కానిచో రాక్షసుని చెల్లెలి గర్బములో అవతారమెత్తుటకు ఆమెలో వున్న దైవత్వమేమైనట్లు? ఆలాగు దేవుడే అనుకుందాము.  ధృతరాష్ట్రుడు పాండురాజు అను సోదరులకు దాయాదులుగా జన్మించిన కౌరవపాండవుల మధ్యన కృష్ణుడు పార్టీలు పెట్టి, ఒక పార్టీకి తాను నాయకుడై రెండు పార్టీలకు గురువుగా వున్నద్రోణాచార్యులను చంపించుట, అక్రమయుద్ధముతో కౌరవులను భీష్మజరాసంధులను చంపించి తన రక్తదాహమును తీర్చుకొనుటలో ఈయనలో దైవత్వం నేతిబీరకాయ వంటిదని ఋజువు కాగలవు.  అనగా నేతిబీరకాయలో ఎంత నెయ్యి వున్నదో ఇట్టి అవతారపురుషులలో కూడా అంత దైవత్వం వున్నదని చదువరులైన మనము గ్రహించాలి.

        ఆంజనేయస్వామిః-ఈ స్వామిలోని దైవత్వమును నిరూపించు సంఘటనలు సందర్భములుః- లంఖిణి అను రాక్షసి గర్భములో సూక్ష్మరూపములో జొరపడి, దాని ఉదరములో ప్రవేశించి దేహమును పెంచి దానికడుపును చించుకొని బైటపడుట.  అటు పిమ్మట రాజాజ్ఞ మేరకు తన వాలమునకు గుడ్డ పేలికలు చుట్టి నిప్పంటించి చంపుమను శిక్ష.  ఈ శిక్ష అమలు జరుపునపుడు ఆంజనేయుడు తనవాలమును పెంచి ఆ పురమందలి వస్త్రముల నన్నింటిని తోకకు చుట్టించుకొని లంకను తగులబెట్టుట; మైరావణుడు-రామలక్ష్మణులను అపహరించుటకు వచ్చు సందర్భములో తన తోకను కోటగాచుట్టి ఆంజనేయుడు వారిని దాచుట.

        విమర్శః- స్వామియైనవాడు అనగా పరమాత్మునికి అదిచెందును.  స్వామి అనుట దౌవత్వమునకు సమానము.  అనగా భూలోకసంబంధికాడు.  ఈ ఆంజనేయుడు వానర సమూహమునకు రాజైన సుగ్రీవుని దాసుడు.  ఇతను నరుడు కాడు.  వానరము కాదు. అనగా సంకరరూపము దాల్చిన వాడు.  వానరుడు అనుటకు ఏలాంటి సందేహము లేదు.  ఇట్టివానరునికి దేహమును పెంచుటగాని దాన్ని సూక్ష్మంగా చేయడము గాని, వాలమును పెంచడముగాని దాని పొడవును తగ్గించుట గాని వానరమునకు అసాధ్యము.  అట్లు సాద్యమైయున్న పక్షములో నేడు మనకండ్ల ఎదుట నున్న వానరములు దేహమును పెంచుట వాలమును పెంచుట మొదలగు క్రియలు చేయవచ్చును గదా! గదా గాండీివమును చేత బట్టి తమ నెదిరించునరులతో పోరాడి గెలువవచ్చును గదా! అందుకు విరుద్ధంగా నేటి వానరములు నరులు వేసికొన్న తోటలను నాశనము చేయుటయేగాక పండ్లికిలిస్తూ గుర్రుబెట్టి నరుని చేతిలోని బడితను చూచి పారిపోవుటలో అర్థమేమి? ఆంజనేయునిలో దైవత్వమున్న పక్షమున తన మాయాశక్తితో అశోకవనము లోని సీతను ఏ వానరముగానో పిల్లిగానో లేక మరి ఏ ఇతర జీవిగానో మార్చి రాముని చెంతకు జేర్చి యధావిధిగా సీతగా మార్చవచ్చును గదా!  అట్లు మార్చలేదేపో! భూతవైద్యములో గాలి దయ్యములను నిరోధించు శక్తియున్న ఆంజనేయుడు అంకలోని రాక్షసబృంధము చే బంధితుడై చీవాట్లు తిన్నపుడు ఈయనలోని దైవత్వమే మైనది? లంకరాజుయైన రావణాసురుని ముఖాముఖిగా దర్శించలేక లంకలోని ఉద్యానవనములను రాజాంతఃపురములను పాడుజేస్తూ వృక్షశాఖలను విరచుచు తోటలకును జనములకును విపరీతనష్టమును గల్గించిన ఈ స్వామి ఎటువంటి వాడో చదువరులు గ్రహించగలము.

         పై ఉదహరించిన లక్షణములు క్రీస్తులో ఆయన జీవితములో మచ్చుకైనను ఎప్పుడైనను ఎక్కడైనను స్వదేశ విదేశచరిత్రలోను జరిగినట్లు ఎరుగము.

        శివుడుః-మూడు నేత్రములు గలవాడై మహతపస్వి గొప్పవరదాత మహాశక్తి సంపన్నుడుగా వివరించబడిన శివుడు శనైశ్చరునికి దాగి బురదగుంటలో దాగినాడట.  ఏమిటీ విచిత్రము.  శనైశ్వరుని పీడను నిరోధించు శక్తి శివునకు లేకపోయెనా? స్నానార్థమై పార్వతి వెళ్ళుచు స్నానాలగది ద్వారము చెంత తనలోనుండి తీయబడిన ఒక స్వరూపమును వాకిట కాపుంచి స్నానము తీయబడిన చేయుచుండగా సతీప్రేమను తలపోసుకున్న శివుడు గృహాన్ముఖుడై తన మందిరమునకువచ్చిన సందర్భములో వాకిటనున్న బాలుని చూచి, వాని పిల్ల చేష్టల కల్గి వానితో పోరునకు తలపడి పోరాడి శిరశ్చేదనము చేసి తన కోపమును చల్లార్చుకున్నాడు.  ఏమి ఈ వైపరీత్యము? తన ఇంటి వాకిట తన స్వాస్థ్యములో తన ముందున్నట్టి బిడ్డను మూడు నేత్రములు గల శివుడు తనకున్న రెండు నేత్రాలు గృడ్డివైనపుడు తన కున్న మూడో నేత్రమైన మనో నేత్రముతో నైనను వీక్షించిన యెడల, ఆ బాలుని చరిత్రను అవగాహన చేసికొని యుండెడివాడే.  ఇందునుబట్టి చూస్తే శివుడు -శివుడంధుడనియే చెప్పవచ్చు.  అనగా మూడు నేత్రములు కల్గియున్నను పరమాత్ముడైన వానికి భూతభవిష్యత్‌ వర్తమానకాలజ్ఞానమును కల్గియుండుట సహజము  అయితే ఈ పురాణములో ఈ విధముగా వర్ణింపబడిన దేవతలు వీరిలోని లక్షణములు, వారిలోని లీలలు కేళీలక్షణములు స్త్రీ సాంగత్యములు ఇంకను ఎన్నొయో మన భారత పురాణములో లిఖింపబడియున్నవి.  

        అన్నిటికంటె విడ్డూరమేమిటంటే ఘోరతపస్సు చేసిన రాక్షసుల యొక్క ఉద్దేశ్యముల నెరుంగకయే ఈశ్వర దేవేంద్రాదులు వరములు ఇచ్చి వారి చేత శృంగభంగమొంది వారి చేత తరుమబడి మరి యొక్క విష్ణుదేవుని  శరణు కోరినట్లుగా మనపురాణములలో అనేకములున్నవి.  ఉదా|| భస్మాసురునికి వరమిచ్చి అది ప్రమాదమని తలంచక తన నెత్తికే ప్రమాదము తెచ్చుకొని వాని చేత తరమబడి శివుడు పలాయనము చిత్తగించినట్లు శివపురాణములో వున్నది.  అదే విధంబుగా దేవేంద్రుడు కూడా అసురులకు అభేద్యమైన వరములను ఇచ్చి భంగపడినట్లు వేదములో వున్నది.  ఇట్టి వారి నామధేయములను పెట్టుకొని వారి విగ్రహాలను ప్రతిష్టించి, వివిధ నామములతో అర్చన కార్యక్రమమును వివిధనామములతో ఆ దేవుళ్ళకు ఆలయములను, ఆ దేవుళ్ళకు పెళ్ళిళ్ళను చేస్తూ సర్వసృష్టికి ఆది సంభూతుడైన అవివాహితుడు సప్తవ్యసనములలో ఏ ఒక్కవ్యసనము లేనివాడును, కామక్రోధాది మదమాత్సర్యగుణములకు దూరుడైన సర్వేశ్వరునియొక్క నామమునకు కళంక మేర్పరచి లేని పోని అచారములను సృష్టించి శాకాహారులమంటూ బాజాభజంత్రీలను వాయించి, మేము పూజారులమనియు అగ్రజులమనియు ద్విజులమనియు బ్రాహ్మాణోత్తములనియు తమ్ములను గూర్చి తామే ప్రచారము చేసుకొంటూ-నరులను నిజ  దైవమార్గమునుండి తప్పించి వక్రమార్గములనడిపించు-ఈవరుస భక్తుల గుణములకంటె ఏసుప్రభువులో వున్న గుణములు ఏలాటివో నరమాత్రులు విమర్శించలేరు. అందుకే ఏసుప్రభువు తన బోధలో నాలోపాపమున్నదని మీలో ఎవ్వరు నిరూపించగలరని సవాలు చేసినాడు.  ఇట్టి ప్రభువును గూర్చి ఆర్యసమాజము యూదాను ఏసుప్రభువు మార్చక పోయెనో'', అనుటలో తనను కొల్చిన రాక్షస భక్తునికి శివుడు ఇచ్చిన వరమును మార్చలేక పొయ్యాడా? మహావిష్ణువు అవతారమును ఎత్తకుండా రాక్షసహృదయాలను మార్చలేక పోయ్యాడా? స్వామి నామధేేయమును ధరించిన ఆంజనేయుడు గదలేకనే రాక్షస సంహారము చేయలేకపోయెనా? ఇంద్రునికి రంభ.  ఊర్వశి మేనర తిలోత్తమల నాట్యములు చూడనిదే నిదురపట్టలేదా? ఈ విధంగా ఏసుప్రభువు తన దర్భారులో నాట్యకత్తెలను పెట్టి నాట్యము చేయించుకున్నాడా? పాఠకులే ఊహించాలి.

        యూదా యొక్క మనస్సును ఏసుప్రభువు మార్చలేకపోవుటకు కారణము దైవలిఖితమైయున్నది.  ఎట్లనగా ఆదికాండములో నరజంటచేసిన దోషమునకు పరమాత్ముడుపశ్చాత్తాప్తుడై వారికి చర్మపు చొక్కాలు తొడిగించి, ఆ నరజంట నుండి విస్తరించబోవు జనసందోహము యొక్క పాపము విస్తరించి భూమిని నింపినపుడు, నరజంటను సృష్టించుట అనునది దేవుని యొక్క కర్మక్రియ కునక నరుడు చేసిన నేరమునకు వాని మూలమున సృష్టి పొందిన కలుషితమునకును వాని మూలమున సృష్టి పొందిన కలుషితమునకును నరునిలో ప్రవేశపెట్టబడిన జీవాత్మ కలుషితపడగా దానిని నిష్కళంకపరచుటకు నిష్కళంకమైన తన అవతారసంబంధమైన నరరూపరక్తమే అట్టి దానిని శుద్దీకరించునని ఎంచి అందుకు వాగ్దానము తన రక్షణ నరకోటికి భవిష్యత్తులో ఇవ్వబోవు రక్షణగా ఈ చర్మపు చొక్కాయిలు ప్రామాణికము వాగ్దానముగాను వున్నవి.  ఇట్టి సంకల్పము ద్వారానే దేవుడు అబ్రాహాము ఇస్సాకు సంతతివారు తన జనాంగముగాను యాకోబు-మోషే, ఏలియా వగైరా ప్రవక్తలును యెషయా ఇర్మియా గ్రంధకర్తలనుప్రేరేపించి తన సంకల్పమును బైల్పరచియున్నాడు.  ఈ సందర్భములో ఆదికాండము యెషయా ఇర్మియా మొదలగు లేఖన భాగములలో దేవుని యొక్క భవిష్యత్‌  సంకల్పమును వివరించియున్నారు.  ఈ నెరవేర్పు కావాలంటే యూదా మనస్సు మారకూడదు.  ఇది జరగాలంటే ఏసుప్రభువు మనుష్యుల చేతికి అప్పగించబడాలి.  నరులకు గల జన్మకర్మ పాపదోషములు పరిహరాంచబడాలంటే ఏసుప్రభువు యొక్క రక్తము చిందించబడాలి.  భూమిమీద ఆయన కార్చిన రక్తము ద్వారా భూమి యొక్క కళంకము నిష్కళంకము కావాలి.  మరణమనునది ఎట్టి తుచ్ఛమైనదో బైల్పరచబడాలి.  నరశరీరము స్థిరమైనదిగాదనియు అందులోని జీవాత్మ ఏనాటికైన దేవునిదనియు ఈ నగ్నసత్యము బైల్పరచబడాలంటే ఏసుప్రబభువు మరణించి సమాధి గెల్చిరావాలి.  ఇది జరుగాలంటే యూదా ఆతనిని పట్టివ్వాలి. యూదా యొక్క హృదయమును దేవుడు కఠిన పరచబడ బట్టే యూదా అప్పటి వరకు తన కఠినత్వమునుండి విడుదల పొందలేక పోయ్యాడు.  దేవుడు సంకల్పించిన ప్రణాళిక సమాప్తియైన తర్వాత యూదా యొక్క మనస్సు పరితాపము జెంది పశ్చాత్తాప్తుడై మరణము పొందినంత వేదన అనుభవించి మరణించాడు.  ఇది దైవసంకల్పము ఈ విషయము క్రీస్తుకు తెలిసియున్నది గనుక తండ్రి నిర్ణయమును ఏసుప్రభువు కాదనలేక వాని హృదయమును మార్చలేకపోయెను.  క్రీస్తు తాను పట్టుబడిన తర్వాత యూదాలో పరితాపక్రియజరిగించాలి.  అదే విధంగా చలిమంట దగ్గర క్రీస్తు నెరుగనని బొంకిన పేతురులో కూడా ఇట్టి పరివర్తన కల్గించాడు.  పరివర్తన కల్గింనదుననే చాటుకు వెళ్ళి పఏడ్చెను గదా! అర్థంపర్థంలేని విమర్శచేయు ఆర్యసమాజము ఈ గ్రంధము చదివి పరితాపము చెందుతుందో లేదో. పరితాపము చెందితే మంచిదే.  

        ప్రశ్నః- మత్తయి 26:26 ఏసు కడరా  భోజన సమయమున రొట్టె ద్రాక్షారసాలను తన శరీరమాంస రక్తముగా పోల్చుటః-

        పాఠకమహాశయులారా! పై వాక్యములోని అణగారియున్న దైవసత్వము యొక్క వివరణను ఏసు చెప్పిన మాటలలోని పరమార్థము  లూకా 22:19 లో చదివినట్లయితే ఏసుప్రభువు విరిచిన రొట్టె ఎత్తిన ద్రాక్షారసపాత్రము లోకపాపనివారణార్థం పాపవిమోచనార్థం పరమునుండి నిజదేవునిచే పంపబడిన రక్షకునిగా క్రీస్తు యొక్క బలియాగమును అనగా ఆయన పొందు శరీర శ్రమలకును తన్మూలముగ గాయపరచబడిన తన శరీరమును విరువబడిన పులియని రొట్టెకు పోల్చి తాను చిందించబోవు రక్తమునకు సూచనగా ద్రాక్షారసపాత్రను ఎత్తినట్లుగా ఏసుమాటలలోని అర్థము బైబిలులోని వివరణ.  ఇది ఇట్లుండగా ఆర్యసమాజము మనోనేత్ర అంధత్వముతో విమర్శించిన విధానము ఏసుప్రభువును మూర్ఖునిగాను అజ్ఞానిగాను మారిసాహారుని గాను జేసి హెయ్యముగా మాట్లాడియున్నది.

        శివపురాణములో ముక్కంటియనియు ఈశ్వరుడనియు గంగాధరుడనియు మహావరబలసంపన్నుడనియు పలురీతుల వర్ణింపబడిన శివుడు తపో సమాధిలోనుండి లేచి యోహావేశుడై నీటి బిందెను మోస్తున్న ఋషి భార్యను మోహించి ఆమె వెంటబడి పరస్త్రీ వ్యామోహపరుడై తనలో వున్న సర్వ  దైవత్వమును కోల్పోయి కామావేశమున ఆమెను తనవశము చేసికొనబోవగా ఆమె పెట్టిన గావు కేకలకు ఆమె భర్తయైన మునీశ్వరుడు ప్రత్యక్షమై కామావేశమున కన్ను గానక ఋషీశ్వరులమైన మాసతీసమణులకు నీవు చేసిన ఈ అపరాధమును బట్టి నీ లింగమునీఅంగము నుండి వేరుపరచబడును గాక! అని శపించగా వెంటనే శివుని లింగము ఊడి భూమిమీద పడినట్లును దానిని నేటి వరకు కూడా శివుని నుండి వేరుపరచబడిన శివలింగమునకు పేరుపెట్టి నరకోటి దానిని ఆరాధించుచున్నట్లు బారతీయులకు తెలిసిన విషయమే.  లింగము ఊడిపోయిన శివుని ఆడంగివాడని రచిస్తే శివపురాణమునకు లోపమని ఆ పురాణమును రచించిన పోపులు అర్థనారీశ్వరుడని ఒక టైటిలు తగిలించారు.

        ఏసుప్రభువు పరమాత్ముని యొక్క ప్రతిరూపమై యుండి నరాకృతిలో నరుల మధ్య నేను నరపుత్రుడను మనుష్యకుమారుడనని ప్రవచిస్తూ తన్నుతాను తగ్గింపు జీవితములో నరులమధ్య జీవించాడు. అంతే గాని ముక్కుమూసుకొని కొంగజపము జేసి మన్మదుని మోహపాశమున తగులుకొని కన్నుమిన్ను గానక కామాంధకారముతో సన్యాసుల పెళ్ళాలను మోహించి వారిపై బడి వారి భర్తలచేత శపించబడి లింగమును ఊడగొట్టుకున్నవాడు ఏసుప్రభువ కాదు.  శివుని శపించిన వారున్నారు.  బ్రహ్మను శపించిన వారున్నారు.  విష్ణుదేవేంద్రాదులను శపించిన వారున్నారు.  కాని ఏసును శపించిన వారు ముల్లోకాలలో ఎవ్వరును లేరు.  ఏసు మాటను లోకము వినిందిగాని లోకము మాటలను ఏసుప్రభువు లక్ష్యపెట్టలేదు.  కనుక ఆర్యసమాజమా! ఏసుప్రభువు ఆటవికుడు గాదు.  అజ్ఞానిగాదు.  అజ్ఞానులము నీవు, నేనే, ఆయనను గూర్చివిమర్శించునీవే.

        ప్రశ్నః- మత్తయి 26:32 ఏసు చింతాక్రాంతుడగుట,

        ఏసుప్రభువు నరులమధ్య మనుష్యకుమారుడుగా జీవించినట్లున్నదేగాని ఆయనకు త్రికాలజ్ఞమున్నదని అందుకు ఋజువులుగా బైబిలులో అక్కడక్కడ తాను పొందబోవు మరణమును గూర్చి పల్కినట్లు ఈ క్రింది మాటల వలన తెలిసికోగలము.  కుమారుడు తనతో వున్నంత కాలము పస్తుండరుగాని పెళ్ళికుమారుడు కొనిపోబడు సమయమున వారు ఉపవసించెదరని ఒక చోట తాను తండ్రి యొద్దనుండి వచ్చి తండ్రి యొకద్దకు తిరిగి వెళ్ళి సమయమాసన్నమైనదని ఒక చోట.  మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడి వారు కొరడాలతో కొట్టుదురని మరియొక చోటను, దేవాలయమును తన శిష్యులు చూపించినపుడు తన దేహమును ఆ దేవాలయమునకు చూపించి దీనిని పడగొట్టుడిః మూడు దినములు తిరిగి నిర్మించెదననియు వగైరా విధములులగాను భవిష్యత్తును గూర్చి తెల్పియున్నారు.  ఇక భూత కాలములో అబ్రాహము పుట్టకమునుపూ యున్నానని అన్నడు. ఇంక వర్తమానకాలములో ఆయన తనను గూర్చి తాను బైల్పరచుకొనగా అప్పటిఅజ్ఞాన నరకోటి నీవు దేవుని దగ్గరనుండి వచ్చిన వానిని కావనియు నీవు యోసేపు కుమారుడవనియు దయ్యము పట్టిన వాడవనియు మామూలు మనిషివనియు పలురీతులుగా ఆజ్ఞానముతో మాట్లాడినట్లు చదువగలము.  ఈ విమర్శ చేసిన ఆర్యసమాజము కూడా ఈ కోవకే చెందినదే.  నిస్సందేహముగా ఈ జాబితాలో ఆర్యసమాజము ను చేర్చవచ్చును.  ఏఉప్రభువు ఈ లోకమునకు సుఖబోగము లనుభవించి రాజుల ఇంటను చక్రవర్తుల యింటనుజన్మించి సాంసారిక జీవితములోను లోకసంబంధ బంధములలోను తగుల్కొని దానిని వదిలించుకొని దొంగసన్యాసిగా వుండుటకు ఆయన పంపబడలేదు.  పంపిన పరమాత్ముడు కూడా ఆయననుఅట్టి జాబితాలో చేర్చలేదు.  అనగా రాజులతోను భోగభాగ్యసందోహముతోను జతపర్చలేదు.  నేడున్న బాబాలు జగద్గురువులు భక్తశ్రేష్ణులు గొప్ప టైటిల్సులో జీవించు కాషాయంబరధారులవలె ఆయన ప్రగల్భములు ఆడంబరములు భక్తుల చేత ఊరేగింపులు కాళ్ళు కడిగించుకోవడము ప్రజాసత్కార్యములు పొందడము నిరాడంబరులమని చెప్పుకోని ఇండ్లకు వెళ్ళుట.  ఏనుగు అంబారీల మీద ఊరేగించుకొను ఆడంబర సన్యాసజీవితమును ఆయన అభిలషించక అస్కలిత బ్రాహ్మచారిగా వుండిలోకము యొక్క మెప్పును కోరక లోకాన్ని లెక్కచేయక లోకస్తుల యిష్ఠానుసారముగా ప్రవర్తింపక తనను పంపిన పరమాత్ముని చిత్తానుసారముగా నడిచి తన నరరూప జీవితమునకు కళంకము లేకుండ చేసికొని తాను చేసినట్టి క్రియలకును తాను ఈ లోకమునకు వచ్చిన ఉద్దేశ్యమును తాను ఈ లోకము నుండి వెళ్ళు సందర్బములో పండ్రెండు మంది అపోస్తలులగానియమించచి వారి ద్వారా తన యొక్క జన్మమర్మములను తెలిపి నిజమైన దేవుని యొక్క సత్యములను గూర్చిన వర్తమానమును రచించుజ్ఞానమును వారికి అనుగ్రహించి తన సాక్షులుగా వారిని నిలిపి తన రాకను గూర్చిన వివరము ఐదు ఖండములలో క్రీస్తును గూర్చిన రాకను వేదజల్లు యుండగా క్రీస్తును అడవి మనుష్యుని చేయుట లో ఆర్యసమాజము అడవి మనుష్యల కూటమా? లేక క్రైస్తవ సమాజములు అడవి మనుష్యుల కూటమా? పాఠకులే ఊహింపదగును.

        బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేక అవతారాలు ఎత్తి మనుష్యుల చేత అభివర్ణింపబడి గోరంతలు కొండతలుగా చేసి వ్రాయించుకొని శతృసంహారము జరిపి మనుష్యుని జ్ఞానమునకు నమ్మశక్యముగాని వరములను ఇచ్చినట్లుగా హిందూపురాణాలలో వ్రాయబడియున్నది.  క్రైస్తవ వేదములో వున్న సర్వేశ్వరుడైన యెహోవా ఆయన రూపమైన ఏసుక్రీస్తు.  పరిశుద్ధాత్మ అను పరమాత్ముడు ఎన్ని అవతారాలు ధరించి ఏయే అవతారాలలో ఎవరెవరిని వుద్దరించారు?

        హైందవ పురాణములలో సృష్టికి మూలకారకుడగా వర్ణింపబడిన బ్రహ్మా పరమాత్ముడు.  ఏకత్వములో వున్నవాడు గనుక కామక్రోధమదమత్సర్యంబులకు తావిచ్చువాడు కాదు.  అవి ఆయనకల్గించగలడుగాని ఆ లక్షణములు వానికి లేవు ఆలాంటి గుణములు తనలో వుంచుకొను వాడు గాదు.  మరి హైందవ పురాణములోని బ్రహ్మా సరస్వతి అను స్త్రీని భార్యగా పొంది కామాంధుడై తనను కొల్చిన రాక్షసులకు కోరిన వరములను ఇచ్చి ముప్పుతెచ్చుకొని విష్ణు పార్వతి మొదలగు దేవతలుగా ఎంచబడిన వారిని సహాయము అభ్యర్థించి తన కొచ్చిన ముప్పును తప్పించుకొనుకటకు ప్రయత్నించినట్లును అట్టి ప్రయత్నముల ద్వారా వేరొక దేవతను చిత్రవిచిత్రములైన రూపములతో అవతారముల నెత్తించి వారి చేత తన వరమునకు విరుగుడును జేసి ఆవరము పొందినట్టి వ్యక్తిని సంహరింపజేసి తద్వారా తన దైవత్వమును నిలబెట్టుకొని కృతార్ధుడైనట్లుగా గ్రంధములో వున్నది.  భస్మాసురునికి  వరము ఇచ్చి శివుడు పలాయనము చిత్తగిస్తాడు.  పాలసముద్రము మధించు సమయమున దేవదానవులకు యుద్ధము జరుగగా దానవుల దాటికి దేవతలు బలహీనులై మృత్యువాత పడుచుండగా విష్ణువు మోహిని రూపము ధరించి రాక్షసులను తన అందముతో మభ్యపెట్టి దేవామృతమును దేవతలకు త్రాగించి నయగారముతో నాట్యము సలుపు దానవపక్షమున వున్న శివుడు అనగా దానవులకు మరణక్రియగా లేక చేసిన శివుడు మోహిని రూపమున వున్నవాడు విష్ణువని గుర్తింపక తాను దేవుడనని మరచి వారిరువురుకు సంకరమున పడినవాడే అయ్యప్పస్వామి.  మోహించి ఆమెను కూడగా మోహినీ రూపములో వుండి ప్రసవింపబడిన శిశువే నేడు మళయాళపు అయ్యర్లు కొలిచే అయ్యప్ప స్వామియైయున్నాడు  ఈయనకు తెల్లదనమే పనికి రాదు. చీకటి శక్తి అనగా నల్లగుడ్డలు, నల్లపూసలు, స్త్రీ సాంగత్యము పనికిరాదు.  స్త్రీతో శయనించకూడదు.  ఇవియే ఈయన నియమములు.  అంటే ఇందును బట్టి చూస్తే శివ విష్ణువులు ఇద్దరు మగవారేగనుకను శివవిష్ణువుల యొక్క మగలైంగిక తనములో పుట్టిన వాడెగనుక ఇతనికి ఈ సంప్రదాయము వచ్చినట్లున్నది.  

        ఇక మహావిష్ణువు ఎత్తిన తన పది అవతారాలను చూస్తే ప్రతి అవతారాలలోను ఒక విధమైన హత్యాకాండను జరిపించినట్లుగా  ఈ అవతారము ఋజువుపరచుచున్నది.  ఒక్కొక్క అవతారములో ఈయనకు ఒక్కొక్క ఆయుధము వున్నట్లుగా అనగా  రామావతారములో విల్లు, పరశురామావాతరములో గొడ్డలి.  నారాయణావతారములో గద కృష్ణావతారములో చక్రము.  వగైరా విధములైన ఆయుధదారియై జనసంహారము చేసినట్లు హిందూ వేదవివరణ.  సర్వేశ్వరుడైన వాడు తన భక్తుని అనగా తనలో లీనమగు జీవాత్మను కామక్రోదాది మదతమత్సర్యములను గుణములను అనగా వ్యభిచారము, ఈర్ష్య, పగ, ద్వేషము, పరస్త్రీ వ్యామోహము కిరాతకము వగైరా దుష్టగుణములను విసర్జించి పవిత్రముగ తనలో విలీనము గావాలని కోరువాడే పరమాత్ముడు.  అట్టివాడే పూజ్యుడనదగును.  క్రైస్తవ వేదమైన బైబిలులో వర్ణింపబడిన పరమాత్ముడైన యెహోవా ఎత్తిన అవతారములు మూడే.  అది నేటికిని ప్రతిచోట ప్రతి క్రైస్తవాలయములలోను ప్రతి క్రైస్తవ భక్తుల నోటను ఆరాధకుల నోటను ''తండ్రి-కుమార-పరిశుద్ధాత్మ'' అను నామధేయములతో  వుచ్చరింపబడుచున్నాడు.  కాని పై విధముగా కల్పనా కాకమ్మ కధలుగా ఈ గ్రంధము లిఖింపబడలేదు.  సర్వేశ్వరుడు యెహోవా అను రూపమున లోక సృష్టిని చేశాడు.  ఆ తర్వాత ఆది 1:26 లో తన పోలిక తన రూపమున తన అవతారమున నరుని చెప్పినట్లుగా క్రీస్తు యొక్క జన్మతో దానిని ఋజువుపరచియున్నాడు.  నేను ఎత్తిన క్రీస్తుయొక్క అవతారముతో మిమ్ములను చేసినాను.  ఇందును బట్టి దేవుని యొక్క అవతారముతో మిమ్ములను చేసినాను.  అనుటకు ఋజువు క్రీస్తే.  తన జీవాత్మను నరులలో వుంచియున్నాడనుటకు ఏసుమీద వ్రాలిన పావురరూపమైన పరిశుద్ధాత్ముడే గుర్తు.  తన ఆజ్ఞను మీరిన నరునికి శోధనలు వేదనలు తప్పవనుటకు గుర్తుగా ఏసు ప్రభువు నలబైదినములు అరణ్యములో శోధింపబడుట ఋజువు.  అట్టి శోదనలను జయించినపుడు అతడు దైవసన్నిధిలో అస్కలిత బ్రహ్మాచారియై అనేక మహిమా ప్రభావములు పొందకల్గియున్నాడనుటకు క్రీస్తు చేసిన అద్భుత కార్యములు ఈజువులైయున్నవి.  తన ఆజ్ఞ మీరిన నరునికి తన సన్నిధిలో దోషపూరితుడైన నరునికి ఘోరాతిఘోరమైన మరణశిక్ష కలదని క్రీస్తు శిలువలో పొందిన శిక్షయే ఋజువైయున్నది.   ఇట్టి జ్ఞానమును బజారునపెట్టి అజ్ఞానియైన నేటి నరుడు సతత్యనారాయణస్వామికి కళ్యాణము. పోలేరమ్మకు జాతర వినాయకునికి కొలువు, ఆయుధాలకు పూజ చచ్చినోళ్ళకు పండుగ సమాధులకు పండుగలు మరియు ఆరాధనలు అంటూ జీవము లేనట్టి పిల్లకాయ చేష్టలవంటి కొలువులను చేస్తూ దేవుని శిలాప్రతిమగాను నిర్జీవునిగాను జేసి కట్టుకధలతో కూడిన పురాణములను రచించి లోకాన్ని లోకజనాన్ని మనోనేత్రాంధకారులుగా చేయుచున్నారు.  క్రైస్తవ సర్వేశ్వరుడైన యెహోవా పార్టీలు పెట్టేవాడా? ఆయనకు భార్యలు ఉంపుడుగత్తెలు వున్నారా? భక్తులకు వరాలు యిచ్చి పారిపోయ్యాడా? చాకలి వాని మాట విని పెళ్ళాన్ని తరుమకొట్టినాడా.  వెన్నముద్దలు దొంగిలించుకొని తిన్నాడా? మోహినీ అవతారమెత్తి శివునితో రమించి బిడ్డనుగన్నాడా? పాఠకమహాశయులారా! సమయము మించిపోలేదు  నిజదేవుడు యెహోవా అనియు ఆయన నిజరూపము యేసు క్రీస్తనియు మనము గుర్తించుదముగాక!

        ప్రశ్నః- మత్తయి 26:32 ఆర్యసమాజము విమర్శించిన విధముగా ఏసుశక్తిహీనుడనిగాని యోగ్యతలేనివాడనిగాని అసహాయుడనిగాని దుర్దశచే మరణించినట్లు వగైరా విధములుగా ఆయనను విమర్శించుటలో ఆర్యసమాజమే అడుసులో కాలువేసి మొలబంటి బురదలో కూరుకుపోయి ఆ బుదరదనుండి బైటకు రాలేక తెనాలి రాముడు గూనిచాకలి మాటలవలె ఈ విమర్శయున్నది.  ఏసు ఈ లోకములో జీవించిన దినములలో ఆయన కాలాజ్ఞానియు మనుష్యుల మర్మమును ఎరిగిన వాడును జరుగబోవు సంఘటనలను వివరించువాడు గాను సందర్భమును బట్టి దేవుని యొక్క మహాత్తర శక్తులను అజ్ఞానులైన నరులకు నిరూపించి సత్యసాక్షిగాను ప్రవక్తగాను పరమాత్ముని పుత్రునిగాను ఈ క్రింద వివరించబడు సంఘటనల ద్వారా ఈజువు కాగలదు.

        ఏసుప్రభువు తన బోధలో మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడును.  వారు ఆయనను అపహసించి కొరడాలతో కొట్టి దోషిగా సిలువకు అప్పగింతురనిచెప్పినట్లుగా వేదములో వున్నది.  ఈయన జన్మకు ముందే ఎషయా ప్రవక్త ఈయనను గూర్చి తన లేఖనములలో ఈయన జన్మవృత్తాంతమును ఈయన మరణకాలమును గూర్చి చదువగలము.  మరణమును జయించి పాతాళమును ఓడించి పునరుత్తానుడై సజీవుడై లేచిన వారిలో యావద్‌ మానవకోటిలోగాని దేవతలనబడే అనేకులలో గాని లేరని బైబిలు చదివిన ప్రతి వ్యక్తి ఒప్పుకొనక మానడు.  ఆయన మరణించి సమాధి చేయబడి మన్నైయున్న పక్షమున ఐదు ఖండములలో క్రైస్తవ్యమనునది ప్రబలుట దుర్లభము.  ఐదు ఖండములలో క్రైస్తవ గ్రంధమైన బైబిలు మున్నూట అరవైభాషలలో లిఖించబడియున్నదిగాని ఇతర వేదములు ఆ విధంగా ప్రబలినట్లు లేదు.  ఇంక ఏసుప్రభువు శిష్యులు ఏసు యొక్క మారణకాలములో కకకావికలు కాకుంటే దైవ ప్రణాళికకు పెద్ద ఆటంకమేర్పడి యుండెడిది.  ఎందుకనగా శిష్యులు ఏసుతో కూడా పట్టుబడియున్న పక్షమున ఈ 11 మందికిని యూదా తప్ప క్రీస్తుతో కూడా పండ్రెండుమందికిని పండ్రెండు శిలువలమీద వ్రేలాడి మరణించి యుంటే దేవుడు ఏసుప్రభువును లోకమునకు పంపించిన వుద్ధేశ్యం నెరవేరెడిదికాదు.  క్రీస్తు ఒక్కడే పునరుత్థానుడై తన్ను తాను అగపరచుకొనుటకు యోగ్యుడు ఆ దినములలో లేడు. మరియు ఏసుప్రభువు ఈ పండ్రెండు మందిని దైవసువార్తకు గాను దాని ప్రకటనకు గాను తన చరిత్రకు హతసాక్షులుగాను నియమించినట్లును తెలియుచున్నది.  ఇట్టి దైవసత్యమునగుప్తమైయుండుటచేతనే అప్పటికి ఆ శిష్యులు దాగవలసివచ్చినది.  క్రీస్తును ఎరుగనని బొంకిన పేతురు మారు మనస్సు పొంది పశ్చాత్తాప్తుడై ఏసుప్రభువు చరిత్రకు హతసాక్షిగా నిలచి గ్రంధమును లిఖించి ఆయన పొందిన శిలువ మరణమును పొందినాడు.   మరియు పేతురు బొంకేసంగతి కూడా ఏసుప్రభువు ముందే పల్కినట్లును గ్రంధములో వున్నది. క్రీస్తు మరణ పునరుత్థానానంతరము పునరుత్థానుడైన క్రీస్తు శిష్యులకు దర్శనమిచ్చి తాను సజీవుడుగా వున్నట్లుగా కనపడి వారికి నమ్మిక కల్గుటకు తన గాయాలను చూపి తన దేహమును సృశింపజేసి వారి విశ్వాసము ను పెంచి వారిలో పిరికితనము పోగొట్టి నేడు బైబిలులోని కొన్ని గ్రంధములకు గ్రంధకర్తలగునట్లుగా వారిని ఏర్పరచినాడు.  ఆ తర్వాత పేతురు యోహానుల చేత శృంగారమను ద్వారము దగ్గర అవిటివానిని గంతులేయించడగము మృతులను సజీవులుగా చేయడము.  చెరసాలలో వుండి ప్రభువు దూత చేత బంధకములనుండి విముక్తులగుటయు కొర్నేలివంటి అన్యులకు సైతము క్రీస్తులోనికి నడిపించడము వగైరా సంఘటనలు నిర్జీవమైనవా?

        ఇక పౌలు విషయములో చెరసాలలో వున్నపుడు తన బంధకములు ఊడి ఆశ్చర్యకరమైన వెలుగు ప్రకాశింపగా చెరసాలనాయకుని హృదయము మార్చి అతనికి అతని ఇంటివారికిని క్రైస్తవత్వములోనికి నడిపించాడు మిద్దెమీద నుండి తూగి క్రిందబడి చనిపోయిన వానిని బ్రతికించాడు.  ఈలాటి మహత్కార్యములు ఏసు శిష్యులు చేసిన వెన్నియోవున్నవి.  అలాంటపుడు కాషాయాంబరధారులైన ఈ ఆర్యసమాజము విమర్శ అనునది పిల్లకాయల మాటలకు పోలి వున్నవి.

        ప్రశ్నః- మత్తయి 26:63 ఏసుప్రభువు ఈ లోకమునకు పంపించబడిన దైవోద్దేశ్యము ''ఏసు సాదారణ సంసారియై ఆలు బిడ్డలతో జీవించి తన జన్మను సార్థకము చేసికొని దైవత్వంలోకి రమ్మని దేవుడాయనను పంపలేదు.  ఏసుప్రభువు జన్మతః బ్రాహ్మాచారియని చెప్పవచ్చును.  ఆయనలో ఏ స్త్రీ వ్యామోహము లేదు.  భూలోకాశలు అసలు లేవు.  ఒక మహాఋషికంటే వందలరెట్లు ఉత్తముడని నేడు లోకము ఒప్పుకొనక తప్పదు.  ఎందుకనగా మహాఋషులు తమకు తపోభంగమైనపుడు తమ తపస్సును భంగపరచిన వ్యక్తులను ఏ రాక్షసుని గానో ఏ అడవి మృగము గానో  ఏ సర్పము గానో ఏ పక్షిగానో ఏ దీనునిగానో శపించబడినారు.  ఏసుప్రభువు ప్రయోజనము లేని అంజూరపు చెట్టును మాత్రమే శపించినట్లు గ్రంధములో వున్నది.  ఆయన నరులను రక్షింపచ్చెనేగాని శపించను శిక్షించనురాలేదు.  తాను ఒలీవల కొండలో తపస్సుచేయుచుండగా శిష్యులు నిద్రాసక్తులైయున్నపుడు ఒక్కఘడియయైన నా కొరకు మేల్కొని యుండలేరా? అని ప్రాధేయపడ్డాడుగాని శపించలేదు.

        అయితే ఆర్యసమాజమును ఈ కాషాయాంబర ధారులు అట్టి పరబ్రహ్మచారిని చవటగా విమర్శించుటలో ఏసుప్రభువులో వున్న గుణలక్షణంబులు మరియు దైవత్వము వీరిలో ఏ మాత్రమున్నదో చదువరులు గ్రహింతురుగాక!

        ఆయనలో ఏ నేరము లేకున్నను నిరపరాధిగా లోకమానవ కోటి పరిహారార్తము ఆయన బలిపశువుగా తన బలియాగమును పూర్తిజేసి నిష్కారణముగానే వధింపబడి తను ఏ తండ్రి దగ్గరనుండి వచ్చెనో ఆ తండ్రి దగ్గరకు వెళ్ళవలసిన ప్రణాళిక వుండ బట్టి ఆ ప్రణాలఙకను గూర్చి శిలువపైన ఆయన మాట్లాడిన ఏడు మాటలలో చివరిమాటగా సమాప్తమాయెను'', అని పల్కి తన తండ్రి యొద్దకు వెళ్ళినట్లుగా చదువరులైన మనము గ్రహింపవలసియున్నది.  అందువల్ల ఆనాటి ప్రధాన యాజకులు సహస్రాదిపతులు కఠినత్వము కల్గి కౄరముగా ప్రవర్తించి నిష్కారణముగా ఏసుప్రభువుకు శిక్ష వెయ్యాలి వెయ్యాలి.  అది దైవోద్దేశ్యము.  దైవోద్ధేవ్యము కాక పోతే ఏసుప్రభువన్నట్లుగా నరసందోహముతో పోట్లాడే వాళ్ళేః-

        ఈశ్వరునకొక పుత్రుడు లేడుః సిలువ మీద నుండి దిగిరావచ్చును.  మహిమగలవాడేమైన అరచి అరబ ప్రాణత్యాగము

        ప్రశ్నః- మత్తయి 27:11-50 ఆర్యసమాజము విమర్శించిన ఈ విమర్శ రచయితలకును చదువరులకును నవ్వుపుట్టించును.  నరుడే నారాయణుడని బ్రహ్మకొడుకు నారదుడని వాసుదేవుని కొడుకు కృష్ణుడని దశరదుని కొడుకులు రామలక్ష్మణులని హిమవంతుని కుమార్తె పార్వతియని ఇంకనూ పురానాల్లో లెక్కలేని విదములుగా దేవుళ్ళు  దేవుళ్ళ కొడుకులు భార్యలు వున్నారు.  వీరందరు పురషవీర్యమునకు ఋషుల సంపర్కములో లేక దైవబీజములో స్త్రీ గర్భమున ధరించినట్లుగను పుత్ర నాకిష్టి యాగము వల్ల జన్మించి నారని పురాణకధలు.

        అయితే ఏసుక్రీస్తు జనన విధ్యామెట్లునగా ఆయనతండ్రియైన యోసేపు పుత్ర కామేష్టి యాగము చేయలేదు.  తన భార్యయైన మరియమ్మను సంతానము కొరకు ఋషులకు అంకితము చేయలేదు.  యోసేపు మగదీరుడైయున్నను మరియమ్మను ప్రధానము చేసి ఆమెతో కూడక యున్నపుడు సుగుణశీలియైన నిష్కళంక హృదయధారిణియైన మరియు పరమాత్మునికి యోగ్యమైన ఆ యొక్క పరిశుద్ధకన్య పరమాత్ముని ఆకర్షించుట చేత నరుని మట్టితో చేసి జీవాత్మను ఊదిన పరమాత్ముడు నరునిలో ఏ విధంగా తన జీవాత్మను బిందువును విడిచాడో అదే విధంగా నిష్కళంక కన్యగర్భములో కూడా ఆయన యొక్క తన జీవబిందును వేసి నరరూపమును ఏర్పరచి రూపొందించాడు. నరుని నేలమంటితో నిర్మించాడు.  స్త్రీ రూపమును నరుని ఎముకనుండి నిర్మించాడు.  ఏసురూపమును స్త్రీగర్భమునుండి బైటకు తీశాడు.  ఇందును బట్టి దేవుని హస్తమునుండి పురుషశరీరము పురుషుని ప్రక్కటెముకనుండి స్త్రీ శరీరము స్త్రీ గర్భమునుండి ఆత్మశరీరము ఒక దాని కొకటి అమరి వున్నవి.  ఇట్టి అమరిక ఇట్టి పొందిక ఏ వేదమందును లేదు.  ఏ దేవుడును ఇట్టి క్రియజేయలేదు.

        పురాణాల్లో దేవుళ్ళకు బావమరదులు బావలు చిన్నాన్న పెదనాన్నలు అత్తలు వగైరా బంధువర్గములున్నట్లు పురాణాల్లో వున్నది.  ఏసుప్రభువుకు లోకములో నా అన్నవాళ్ళు లేరని ఏసుప్రభువు పలుచోట్ల వక్కాణించినట్లు తన చుట్టుననున్న జనసందోహము ఇదిగో నీ తల్లి అన్నపుడు ఎవరు నా తల్లి? అన్నాడు.  నీ సోదరులు వచ్చివున్నారన్నపుడు నాకెవరు సోదరులు. నన్ను ప్రేమించి నామాటలు ప్రకారం నడచుకొన్నవాడే నా తల్లియు నా సొదరులును అని అన్నాడు.

        ఇందును బట్టి ఆర్యసమాజము చెప్పిన దేవుళ్ళు వావివరుసలు పురాణ దేవుళ్ళకు వున్నవే గాని క్రీస్తుకు లేదని తెలియుచున్నది.        

        ప్రాణాత్యాగము చేసి సకలమానవకోటి పాపపరిహారార్థం బలియాగము చేయవలసిన దైవసంభూతుడు తనలో వున్న దైవశక్తిని నిర్వీర్యపరచుకొని సామాన్య నరునిగా అయితేనే తప్ప బలియాగ సందర్భములో మరణించుటకు వీలుండదు.

        ఇందుమూలముగా యావత్‌ నరకోటికిని పరమాత్ముడే తండ్రియైనట్లు ఆయన ఏర్పరచిన స్త్రీ తల్లి యైనట్లును లోకములో చెలామణి యగుచున్నారు.  అయితే ఏసుప్రభువు లోకసంబంధికాడు.  ఎట్లంటే మరియమ్మకు పుట్టుట ద్వారా మరియమ్మ సుతునిగా వ్యవహరించబడినను యోసేపు కుమారుడు కాదు. లోక దర్మాచారము ప్రకారము బిడ్డయొక్క జన్మకు కారకము తండ్రి యొక్క బీజము.  ఏసుప్రభువు శరీరము నరవీర్యోత్పత్తి కాదు. అందుకే ఆయన తన ప్రవచనాలలో నేను లోకసంబంధికాను అన్నాడు.  ఆయన లోకసంబంధియైతే లోకరీత్యా స్త్రీ వ్యామోహము ధనాశ ఇత్యాది లోకేచ్ఛలతో జీవించుచుండెడివాడు.  అందుకే తన వాక్యమునిమిత్తము బార్యాబిడ్డలను ఇండ్ల పొలములను ఆస్థిపాస్థులను విసర్జించమన్నట్లుగా బహిర్గతమగుచున్నది.

        పురాణాల్లోని అవతారమూర్తులట్లుగాక తల్లికి తండ్రికి లోకధర్మము చొప్పున జన్మించి సకల బోగభాగ్యములు అనుభవించి కామక్రోధ మదమత్సర్యాది గుణములకు తావిచ్చి మేము దేవతలమన్నట్లుగా కవుల విరచితమైయున్నది.  వాస్తవమునకు సర్వమానవకోటి దేవుని పుత్రులే.  అందులో        ప్రత్యేకంగా పురుష కలయిక లేకుండ సృష్టించబడినవాడు ఏసు. పరమాత్ముని యొక్క నిజమైన అనగా యదార్ధమైన ఉద్దేశ్యము ఒక్క క్రీస్తుద్వారానే బైల్పడుచున్నది.  ఎట్లనగా నరునిహస్తముతో చేసినాడు.  స్త్రీని ఎముకతో చేసినాడు.  మీరిద్దరు దేవుని హస్తకృత్యములు.  నరశరీరము నారీ శల్యము రెండును దోషపూరితము లైనందున అటు శరీరము ఇటు ఎముకతో కాక ఆత్మరూపముగానే ఆత్మకలయిక ద్వారానే ఆత్మబీజము మూలమున ఆత్మదేవుని రూపమైన శరీరమును ఒక పవిత్ర స్త్రీమూర్తి గర్భములో దేవునిచే రూపించబడింది.  నిష్కల్మషమైనది.  రక్తమాంసములతో కూడినదైనను మహిమగలదది.  పై పెచ్చు పరమాత్ముని రూపమైనది.  భూలోకములో దైవత్వమును నిరూపించుచున్నది. దేవుని యొక్క మర్మములను వెల్లడిచేయుచున్నది.  అనేక మహిమలు చూపింది.  అనేకుల పాపపరిహారార్థం బలిచేయబడినది దేవుని వాక్కైయున్నది (ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుడు యుండెను.  ఆ వాక్యమే శరీర ధారియు కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్యవాసము చేసెను) ఇట్టి శరీరమునకు దేవుడు పై నుండి దూత ద్వారా పునరుజ్జీవమును పునరుత్థానశక్తిని ఈ దేహమునకు కల్గించినాడు.  మరియు దృశ్యాదృశ్యప్రభావములు కూడా కల్గించినట్లు ఇది పరమాత్ముని క్రియాశక్తిగా వెల్లడియగుచున్నది.

        మరి ఇప్పుడు ఈ దినములలో ఆర్యసమాజములు ఆజ్ఞానసమాజములు హేతువాదనాస్తిక సంఘములును నిర్జీవ విగ్రహారాధన కూటములతో చేరిన ఈ లోకసంబంధ ప్రస్తు నరకోటికి బొందితో కైలాసానికి తీసుకొని పోవుట సాధ్యమా?

        నరకోటికి దేవుడేలేదని దేవుడు విగ్రహామని పాములని చెట్టని ఎద్దని సింహమని ఏనుగని ఇవేవిగాక పోతే బండయని లేదా గొచి పెట్టుకున్న నరుడని వగైరా రీతులుగా అజ్ఞాన దశలో వుండి సకల దుర్గుణపూరితమైన హృదయదారులై ధనాపేక్షలును బింకములాడువారును అసూయాపూరితులైనరులను బొందితో కైలాసము పోవాలనుట యోగ్యమా? అట్టిది ఇవ్వమనుట ఆర్యసమాజమునకు న్యాయమా? ఆ విధంగా వెళ్ళినవారు పురాణాల్లో గాని మరి ఎచ్చటను ఎవ్వరును లేరు.

        ఏసుప్రభువు సిలువ మరణము పొందకయుండుట సిలువమీద నుండి దిగివచ్చుట వగైరా క్రియలు చేసియుండినచో అదెట్లు ప్రాణత్యాగము చేసినట్లు? ఆలాగు దిగివచ్చి యుండిన దేవుడు తనను పంపించిన ప్రణాళిక సార్థకమా? నిరర్ధకమా? నరులకై త్యాగము చేయువాడు నరస్వభావము ధరించి మనుష్యరీతిగా మరణించినట్లుగానే వుండవలెను గాని అందులకు విరుద్ధంగా వున్నట్లయితే అతనే విధంగా లోకరక్షకుడుకాగలడు? అందువల్లనే ఏసుప్రభువు తనమరణకాలములో సామాన్య నరస్వభావుడై తనదైవత్వమును మరుగుపరచి వేదన, దుఃఖము , బాధ, శ్రమ, మరణము వంటి అరిష్టములకు తన దేమములో తావిచ్చెను.  అందుచేత మరణాన్ని పొందినాడు.  ఇది లోకరీత్యా జరిగిన క్రియ దైవసిద్దాంత రీత్యా దైవనిర్ణయము రీత్యా దైవ ప్రణాళిక రీత్యా మూడవనాడు తిరిగి పురనరుత్థానుడాయెను. ఇది పరలోక క్రియ.  పరమాత్ముని క్రియ.  ఏసులోని దైవత్వమును ఋజువు పరచుక్రియ.మరి ఈ దినములలో క్రైస్తవులు బొందితో స్వర్గమున కేలబోరు? శరీరము దినములకు కృళ్ళిపోదెందులకు?

        ప్రశ్నః- మత్తయి 28:2-20 ఏసు మరణించి భూస్థాపన చేయబడిన శరీరము ఏదేను తోటలో ఆదాము యొక్క శారీర నిర్మాణమును సూచించుచున్నది.  ఏసు యొక్క దేహము నాటి సమాధుల తోట.  ఆదాము యొక్క దేహ నిర్మాణమైన స్థలము ఏదేను వనము.  రెంటికిని హస్తిమశకాంతరమున్నది.  ఎందుకనగా ఆదాము యొక్క దేమము మట్టితో చేయబడినది.  భూసంబంధమైనది.  సమాధిలోని ఏసుదేహము ఆత్మచే రూపించబడింది.

        సమాధిలోని ఏసు దేహము ఆత్మచే సృష్టింపబడినది.  మరి క్రైస్తవులు క్రీస్తును నమ్మినవారు బొందితో కైలాసానికి వెళ్ళి వచ్చునుగద అని ఆర్యసమాజము ఊహింపవచ్చును.  ''ఎవడైనను నేను నీతిమంతుడనని చెప్పుకొన్న యెడల వాడు దేవుని వాక్యమును అబద్దము చేయుచున్నాడు.  తప్పులేని వనరుడు లేడు.  ప్రతివాడు తన పాపములు ఒప్పుకొని దైవమార్గములో దైవసన్నిధానమును కోరుకోవాలని తెలియుచున్నది.

        ప్రశ్నః- మార్కు 6:3 ఈ సందర్భములో కృష్ణునిజన్మ వివరమును మనముగ్రహించవలసియున్నది.  కృష్ణుడు పుట్టినది దేవకీ వసుదేవులకు వాసుదేవుడు నరుడు.  దేవకి రాక్షసవంశ స్త్రీ.  ఇద్దరికి సంకరములో పడినట్లుగా మనకు అర్థమగుచున్నది.  కాబట్టి మానవరాక్షసులకు సంకరములో జన్మించిన కృష్ణుడు మహావిష్ణువు రూపమని వేదాలు నిర్ణయించాయి,  దీంతో కృష్ణుడు మూడుకులాలుకు పుట్టినట్లు ఋజువైనది.  ''నర, రాక్షస, విష్ణు'' ఈ మూడు కులములకు పుట్టిన కృష్ణుడు నాలుగవ కులమైన గొల్లలతో సాంగత్యం చేసి గొల్ల భార్యలతో కేళీ విలాసముల జరిపి వారి ఇండ్లలో జొరబడి వెన్న దొంగనా మారి నానా భీభత్సము చేసి తన స్వజాతీయులైన రాక్షసులతో వైరము బూని అనగా తల్లియైన దేవకి పార్శ్వపు బంధువర్గమైన రాక్షసులతో వైరము బూని పక్షపాతియై తగుల్కొన్న సంబంధియైన గొల్లలతో జరిగించిన కేళీ విలాసములను బట్టి స్వజాతియులైన రాక్షసులపట్ల విరరుద్ద స్వభావం వహించుట ఇతడు దేవుడా? నరుడా? రాక్షసుడా? పైగా ఒక అమ్మకు ఒక అబ్బకు పుట్టి వీరి యొక్క పేరుతో చెలామణి యైనట్లుగా దేవకి వసుదేవులకు పుట్టి మేనమామయైన  కంసునికి వెరచి గోకులంబునకు కొనిపోబడి యశోదనందనులు ఇంటివారి బిడ్డగా చెలామణియగుచు'' నందకుమారా! నవనీత చోరా! అని ప్రజాబాహుళ్యముచే ఉచ్చరింపబడుటలో కృష్ణుడు ఎవరికొడుకు? ఇతని పని దొంగతనము అనగా వెన్నదొంగ కన్యదొంగ.

        ఏసుప్రభువు వడ్రంగము చేయుటతప్పా? ఇన్ని బుద్దుళు కల్గిన కృష్ణుడే చెలామణి యగుచుండగా ఏసుప్రభువు వడ్రంగము చేయడము తప్పా? పై వివరించిన గుణములలో ఏదేని ఏసునందు కలదే? సిగ్గు,సిగ్గు ఇప్పటికైనను ఇటువంటి విమర్శలను ఆర్యసమాజ ఏసుపై చేయుట ఱాతిగోడకు బంతిని కొట్టుటతో సమానమి.

        లూకా 18:19 ఈ మాట అన్న ఏసుప్రభువు ఈయన ఎవరు? దేవుడెవరు? దేవుడు మన రుసుము మన పోలిక చోప్పున నరులను చేయుదముఅన్నపుడు ఈయన అచ్చట ఉన్నదే కదా! ''తండ్రి - కుమార- పరిశుద్ధాత్మ'' అను త్రినామధారియైన దేవుడు ఒక ఆత్మా ఒక్కశక్తి ఒక్కసృష్టికర్త ఒక్కక్రియా సంపన్నుడు ఒక్కవాక్కు అనగా ఒక్క శబ్దము ఒక్క శరీరము అయివున్నట్లుగ ఏసుప్రభువు చెప్పిన విధముగా గ్రహించవలసియున్నది.  సత్పురుషుడనని ఏలచెప్పుచున్నావనుటలో స్త్రీపురుషులను బేధము భూలోకమునకే పరిమితమైయున్నది.  ఎందుకనగా లోకరీత్యా శరీరమనునది స్త్రీ పురుషులనియు వర్ణచేదము జాతిబేధము కులబేధము మతబేధము స్థలబేదము అనగా బారతదేశము అమెరికా, రష్యా చైనా వగైరా దేశవిభజనల ప్రకారం ఆయా దేశనివాసముగను స్థలబేధము రాష్ట్రబేధము కండభేదము ఇన్నియు పాటించేది శరీరమే,  బాషాబేధము వగైరా బేధములు సాంగ్యములు ఆచారములు  తో కూడుకొన్న సకలారిష్టములకు శరీరమునిలయమైయున్నది.  అట్టి పాపభరితమైన నరకోటి కొరకు పరమాత్ముడు ఏసుశరీరమును సకల నరకోటి పాపపరిహారార్థము నిర్దోషమైనట్టి ఆయన శరీరమును లోక దోషమును భరించుటకు లోకస్థులచేత పాపిగా ఎంచబడుటకును దోషశిక్షును ఆయన మీద మోపబడుటకును తన్మూలముగ ఆయన తన రక్తమును చిందించి ఒక్కసారియే సర్వమానవకోటికి ఆయన బలియగుటకు ఆయన మరణించునంతటి శిక్షకు ఆయనను గురిచేయవలసియుండగా నరులచేత ఆయన సత్పురుషుడు అని పించుకొన్న పక్షములో రాజులు సహస్రాది పతులు ప్రధానయాజకులవద్ద కూడా సత్పురుషుడుగానే ఎంచబడి మరణమునకు అయోగ్యుడగును.  కనుక దైవోద్ధేశ్యం ప్రకారం లేఖనముల ప్రకారం ఆయన దోషిగా ఎంచబడవలసివున్నది. కనుక సత్పురుషుడును మాటను దేవునికి నెట్టి తాను తగ్గినాడు.  ఎందుకంటే నరుడు మనోనేత్ర జ్ఞానముతో ఆలోచిస్తే దేవుని యొక్క రూపమే క్రీస్తు అని గ్రహించినట్లయితే సత్పురుషుడని వేరే చెప్పనక్కరలేదు.  ఏసుప్రభువు ఒక్కడే సత్పురుషుడై యున్నపక్షమున అదృశ్యములో వున్న పరమాత్ముడును ఏసునావరించియున్న పరమాత్ముడును వ్యర్థముగా ఆరాధించబడు వారేగనుక ఏసు అను శరీరము మార్గముగాను అందుకు తర్పీదు నిచ్చువాడు పవిత్రాత్ముడుగాను తద్వారా జీవమను పరమాత్మయైన నిత్యజీవుడైన సృష్టికర్త యొక్క సన్నిధానము చేరుటకు మార్గమైయున్నట్లుగా యిందును బట్టి తెలియుచున్నది.  కనుక  సత్పురుషుడును పదము సర్వేశ్వరుని కేతగును.  ఆయన రూపమైన ఏసుప్రభువునకే తగును.  ఆయనను ఆవరించియున్న పరిశుద్ధాత్మకే తగును.  పాపశరీరములో జీవించు ప్రతి నరునికిని వాడెంతటి వాడైనను ఏదో యొక్క లోపము చేత వాడు సత్పురుషుడు కాలేడు.  క్రీస్తునిట్లు విమర్శించు ఆర్యసమాజములోనివారు నేతిబీరకాయవంటివారా? లేక ఇంగువ కట్టిన మూటలా?

        ప్రశ్నః- లూకా 23:79 పై సందర్భమును మనము ఆలోచిస్తే యేరోదు తన దగ్గరకు పంపబడిన ఏసును చూచి సంతపించుటయేగాక ఆయన ఏదైన ఒక సూచకక్రియ చేయచూడనిరీక్షించినట్లును ఆయననుచూచుటకు బహుకాలం నుండి వేచియున్నట్లు ను ఈ వాక్యము యొక్క వివరణ.

        ''ఏరోదు'' అను మాటకు పాపి అని అర్థము.  పాపి ఏసును చూచిసంతోషించాడు.  అనగా తాను చేసిన పాపక్రియల నుండి ఏసును చూచి సంతోషించినట్లును ఆయననను చూడాలనిచాలాకాంలం నిరీక్షించినట్లును ఆ నిరీక్షణ ఏసు ఈ లోకము వదలిపోవు సమయం సమీపించినపుడు యేరోదుకు నెరవేర్చినుట్లును యిందులో మనము గుర్తించవలసియున్నది.  మరియు ఆయన ఏదైన ఒక సూచకక్రియ చేస్తే ఏరోదుచూస్తా మనుకున్నాడేగాని ఏసు ప్రభువు గారడీ వాడు కాదు.  సమాధానకర్త యైయున్నాడు గనుక (లూకా 23:12) ఏరోదునకు పిలాతునకు వున్న శతృత్వము మిత్రత్వము గా మారుట అనునది ఏసు చేసిన సూచక క్రియయైయున్నది.  రాజులకున్న వైరమునుండి ఒకరి కొకరు సమాధాన పరచుట ఏక పరచుటయనునది ఏసుచేసిన సూచక క్రియ గాదా?ఓ ఆర్యసమాజమా! నీకు సమాధానమేమిటో తెలుసునా?

        ప్రశ్నః- యోహాను 1:1 ఆదియందు వాక్యముండెను.  క్యాసెట్‌  టేపులో మాటలు పాటలు వుంటాయి గాని దాన్ని విన్పించు రికార్డరు లేదా రేడియోనొ లేనపుడు శ్రొతలకది ఎట్లు విన్పించును? అదే విధంబుగ సృష్త్యారంభమున మాటగాని శబ్దముగాని భాషగాని దైవసన్నిధిలో గుప్తమైయుండునే గాని దృశ్యమై మాట్లాడుటకు యోగ్యమైన రూపముండెనేని భాషగాని శబ్దము గాని మాటగాని బహిర్గతమగుటకు అవకాశమున్నది.

        సర్వేశ్వరుడే వాక్కైయున్నాడనుటకు ఆధారములుః- తొలుత తాను నరుని చేసి ఆదామనిపేరుపెట్టి తొటలో తినదగిన ఫలములు తినదగని ఫలములను గూర్చి బోధించుట అను సంఘటనలు దేవుడే వాక్కైయున్నట్లుగను దేవునియందు వచనమున్నట్లును మనము గుర్తించగలము.  ఆయనలో జీవమున్నదనుటకు నరునిలో ఊదిన జీవాత్మే సాక్ష్యాధారమైయున్నది.  వాక్కు దేవుని యొద్ద వున్నదనుటలో వాక్కు ఆయన దగ్గర లేనట్లయితే ఆయన చేసిన మనలను వాక్శక్తి రాదు.  వాక్కుతోనే సృష్టియావత్తును సృష్టించినట్లు ఆదికాండము మొదటి అధ్యాయం నిరూపిస్తున్నది.  ఇన్ని ఋజువులుండగా మరియు దేవుని యొద్దనే ''ఓం'' అను శబ్దమున్నట్లును అదియే శబ్ద బ్రహ్మము ఇతర వేదములు ఘోషిస్తున్నది.  మరిమానవుడు అట్టి వాక్శక్తిని దేవుని యొద్దనుండి పొంది కూడా కృతజ్ఞతలేనివాడై విమర్శించుట శోచనీయము, మరి జీవముగల వాక్కు మనుష్యులకు వెలుగైన విధమెట్లనగా దైవగ్రంధమును పఠించుటకు కావలసిన భాషాజ్ఞానము ఉచ్చారణ దైవసన్నిధిలో జీవించుటకు కావలసిన యోగ్యతలు నాగరికత సభ్యత గౌరవ మర్యాదలకును సమాజము ఎదుట జీవించగల్గిన జ్ఞానము వగైరాలకు దోహాదకారిఆయెను.  నరునిమనోంధకారమును తొలగించి వానికి దూరదృష్టి కల్గించుటకు ఈ వాక్కు వెలుగాయెను.  మరియు వాక్కైయున్న దేవుని యొక్క శబ్దమును బట్టి వెలుగుచున్న సూర్యచంద్రానక్షత్రాదుల వెలుగులు పశుపక్ష్యాదులకు వెలుగాయెను.  ఇది దైవవాక్శక్తి గాదా? దయచేసి చదువరులు బైబిలునందలి ఆదికాండం మొదటి అధ్యాయం చదివిన దేవుని వాక్కులోనే వెలుగు కూడా వున్నట్లు చూడగలము.

        ప్రశ్నః- యోహాను 1:1 ఆదియందు వాక్యముండెననుటకు సాక్ష్యాధారములు ఏవి? వాక్యము దేవుని యొద్దనుండడెననుటకు ఋజువేమి? వాక్యము దేవుడై యుండెననుటకు ఆధారమేమి? ఆ వాక్యము జీవము, వెలుగు, శరీరము కల్గినట్లుగా గ్రంధములో వ్రాయబడియున్నది.  ఇవి మనకే విధంగా గోచరము కాగలదు? ఆ వాక్యరూపము క్రీస్తే అయినపుడు మనమద్య ఇపుడు క్రీస్తు లేడు గదా! మరి ఇపుడు దేవుని యొక్క రుసుము ఎచ్చటవున్నది.  ఏ రూపముగా వున్నట్లు? ఏమిచేయుచున్నట్లు?

        ఆదియందు వాక్యముండెను.  వాక్యము పలుకువారు లేక పల్కించువారు లేక పలుకుటకు వాతావరణము ఏర్పడక పలుకవలసిన అవసరములేక గుప్తమైయుండెను. అయితే ఈ వాక్యము ప్రకాశమానమై జీవయుతమై జలములపై సంచారము చేసినపుడు మొట్టమొదట ఈ జీవయుతమైన వాక్యధ్వనిని  విన్నవారు జలరాశి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాక! జీవయుతమైన ఈ వాక్యధాటికి జలరాశి విభజింపబడినది.  జలములను తన సమీపము వరకు అంటుకొనియుండిన ఆకాశము వేరుపడిపోయెను.  ఈ జీవయుతమైన వాక్కే జలరాశులలో నుండి భూమిని పైకి లేవనెత్తి సృష్ట్యాలంకారమును తన సృష్టి క్రియతో అలంకరించినట్లును తన సృష్టియైన  ఈ భూమికి పగటి వెల్గును రాత్రి వెల్గును పుట్టించు జ్యోతులను ఆకాశములో ఏర్పరచినట్లును తెలియుచున్నది. కాబట్టి యిందుమూలముగా వాక్కైయున్న పరమాత్ముడు మొట్టమొదటి సారిగా జలరాశిలోను రెండవదిగా ఆకాశముతోను మూడవదిగా భూమితోను తన వాక్శక్తితో మరియు తన వాక్‌ ధ్వనితో వాటివాటి ధర్మము చొప్పున వాటి వాటి క్రియలను వాక్‌శక్తితో జరిపినట్లు తెలియుచున్నది.  ఇందును బట్టియే యెషయా 2:1లో లో ఆకాశమా! ఆలకించుము,  భూమీ చెవి యొగ్గుము'', అని దేవుడనుటలో దేవుని  యొక్క వాక్‌ శబ్దమునకు ఈ మూడు స్థానము ఆకాశము - భూమి - జలరాసులు ఉత్తర సాక్షులుగా వున్నట్లు మనము గ్రహించవలసియున్నది.  ఏసుప్రభువు కూడా తన బోధలో భూమి తనమృతులను (పాతాళము)సముద్రము తన మృతులను దైవసన్నిధికి అప్పగించబోవు ననుటకూడా యిందుకు సాదృశ్యమైయున్నది.

        పరమాత్ముడు తన వాక్‌ ధ్వనిచేతను తన జీవాత్మ ప్రభావమూలమునను తన సృష్టియైన నేలమంటితో చేసిన రూపము తనయందు లక్ష్యముంచి అనగా వాక్కు అయిన దేవుని యందు లక్ష్యముంచక దైవసృష్టియైన లోకాన్ని ప్రేమించి దానిబబోధలను విశ్వసించి అపవిత్రముకాగా సర్వసృష్టికి వాక్కైయున్న పరమాత్ముని ద్వారా జరిగిన మూలమున సృష్టిపతనమగుటకకు తొలుత ఏ శరీరమును తాను చేశాడో ఏ విధంగా చేశాడో ఏ రూపంగా చేశాడో ఆ రూపము ద్వారానే తన సృష్టికి కల్గిన అపవిత్రతను పోగొట్టనెంచి ''ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడై మనమధ్య వాసము చేసెను'' అనుమాటను సార్థకము పరచెను.

        నవనాగరికతతో కూడిన సుజ్ఞానులమని చెప్పుకొను నేటి తరమైనఈ సృష్టిజనాంగము ఈ మర్మము గుర్తింపలేకున్నది.  అందుచేత దేవుడు వాక్యము దేవుని యొద్ద వుండక దేవునిచే ఈ వాక్యము మనుష్యులకు అప్పగింపబడి జీవగ్రంధములో జీవవాక్యము, జీవాహారము అని వుచ్చరింపబడుచు జీవయుతమైన ఈ వాక్యము వెలుగైయున్న ఈ వాక్యము సర్వమునకు ఆధారమైయున్న ఈ వాక్యము నేడు నరుల చేతికి దేవుడిచ్చి యున్నందున నేడు ఈ వాక్యము అనేకులను నిజదైవసత్యము లోనికి నడిపించుటకు దోహదకారియై అనేకులను బోధకులుగాను బోధక రాండ్రుగాను సువార్తీకులుగాను ఏర్పరచి ప్రతి హృదయమును వెల్గించుటకు వ్యక్తులద్వారాను రేడియోల ద్వారాను టెలివిజన్య ద్వారాను పత్రికలద్వారాను పలురీతులుగా తన యొక్క జీవమును వెల్లడిపరచుచున్నది.

        అయితే నాడు జీవమైయున్న వాక్యము మన దోషములను బట్టి క్రీస్తును రూపముగా దేహమును దాల్చి క్రియజేసినది.  నేడు పరిశుద్ధాత్మ అను రూపమును దాల్చి ఆ వాక్మము మన యొద్దకు వచ్చి విశ్వాసులలో జేరి క్రియజేయుచున్నది.  కనుక నేటి తరము వారైన మనములోకాంత్యమునకు యుగసమాప్తికిని సమీపస్థులుగా వున్నామను విషయమును గుర్తింపవలసియున్నది.  ఒక యాత్రికుడు తన కార్యములు ముగించుకొని తన స్వస్థలమునకు వెళ్ళునో అదే విధంబుగా ఈ లోకములో తల్లిగర్భమునండి బైల్పడి జీవిస్తున్న  మనము ఈ లోకమునకు యాత్రరూపము గా వున్నాము.  అను విషయము గుర్తించి ఈ లోకములో మన యాత్ర పూర్తి కాగానే మనము ఏ తండ్రి యొద్దనుండి వచ్చినామో ఆ స్వస్థలమునకే తిరిగి వెళ్ళవలెనను నగ్నసత్యము గుర్తింపవలసియున్నది.  అదే విధంగా మనమున్న ఈ భూలోకము కూడా తానే విధంబుగా జలరాశులనుండి దైవ వాక్కు చేత బైల్పడి దైవాజ్ఞమేరకు ఏ విధముగా చలించుచున్నదో అదే విధంబుగ నరులను బట్టి దేవుడు కూడా యధారూపంబుగ జేసి అనగా నవగ్రహాములతో బాటు ఈ భూమి కూడా యదారూపముగ తిరిగి లయపరచబడునన్నట్లు ప్రకటన గ్రంధములో ''అంతట నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచితిని అనుమాటను సార్థకము చేయవలసియున్నది.  కనుక నేటి తరము వారైన మనము వాక్కైన దేవుడు మనవేదముగాను మన వేదములోని వాక్కుగాను వుండి మన ఇంటినే అలంకరించియుండగా దేవుడెక్కడవున్నాడని బైటజేరి వెర్రిముఖాలేసుకొని వుండుట క్రైస్తవులకు లక్షణము గాదు.  ఆదిలో వాక్కైన దేవుడు రూపములేక యుండి క్రియజేసినాడు.  ఇపుడు వాక్కైయున్న దేవుడు రూపము దాల్చి ప్రతిక్రైస్తవ గృహమునందును వాని హృదయమందును వాని జనాంగముల మద్య క్రియజేస్తున్నాడు.  వారియొక్క గుణాతిశయములను గుర్తించుచున్నాడు.  వారి స్తుతి-స్తోత్రములపై ఆసీనుడై యున్నాడు.  కనుక ఇప్పటి నరజీవియు దైవత్వము నకు దూరమై జీవించుట కష్టమని ప్రమాదకరమి ఎరిగి నిజదైవసన్నిధిలో ప్రార్థనలతోను వాక్య ఆహారముతోను జరుపుచు వాక్కైన దేవుని సన్నిధానమునకు యోగ్యులుగా జీవించాలని దేవుని హెచ్చరికయైయున్నది.

        ప్రశ్నః-యోహాను ఇస్కరియయోతు యూదాలో సైతాను దురాలోచన కల్గించుటః-

        హైందవ వేదములో ఋషులచే శపించబడిన దేవతలు గంధర్వులు రాక్షసజన్మలను దాల్చి శాపవిమోచనముకొరకు ఏదో యొక్క సంఘటన ద్వారా నివర్తియగునట్లు శపించబడుచున్నట్లు మరల జన్మఇచ్చినట్లు వేదములో చూడగలము.  అందుకు ఉదా|| జయవిజయులను ద్వారపాలకులు నారాయణ దర్శనార్థం వచ్చిన ఒక ఋషిని అడ్డగించగా ఆ ఋషి ఉగృడై ఆ యిద్దరిని రాక్షసులు కమ్మని శపించగా వారిరువురును హిరణ్యాక్ష హిరణ్య కశిపులను రాక్షసులుగా రూపము దాల్చి ఏదేవుని వద్దవారు కొలువు చేశారో ఆ దేవునికే వారు అడ్డము తిరిగి అనేక తపస్సులను చేసి నరబలముతో మధించి తమ తపోబలముచే తమ దైవవరశక్తి ప్రభావముతో దేవతలపై తిరుగుబాటు జేసి వారిని ముప్పతిప్పలు బెట్టి ఋషుల యజ్ఞములను పాడుజేస్తూ లోకములో ఎదురులేని జీవితములో జీవిస్తూ మూడులోకాలకు ముప్పతిప్పలు పెట్టించి గగ్గోలు పెట్టినట్లుగా హైందవ వేదవిరచితము.  ఇట్టి కల్లబొల్లి మాటలు పోలు పొందులేని సంఘటనలు కల్పించి వ్రాసిన కాకమ్మ కధలు హైందవ వేదములో కోకొల్లలుగా వున్నవి.  ఇట్టి రచనలు వ్రాయుటకు ఆనాటి ఋషీశ్వరులకుసిగ్గుజ్ఞానము లేకపోయెనని చదువరులకు స్ఫురించక పోలేదు.  ముక్కు మూసుకొని తపస్సుచే సే ఋషిచేత శపించబడిన వాడు రాక్షసుడై ముల్లోకాలనుముప్పుతిప్పులుబెట్టాడంటే ఇంక క్రైస్తవ వేదంలో సర్వేశ్వరుని సన్నిధిలో గర్విష్టియై సర్వేశ్వరుని చేతనే తరుమగొట్టబడి శాపగ్రస్థుడైన దూత ఎట్టి ప్రభావము కల్గినవాడై యుండునో మనము గ్రహించవలసియున్నది.  ఎందుకనగా అలనాడు ఋషీశ్వరుల చేత శపించబడిన వారు శరీరులు.  అదేవిధంబుగ క్రైస్తవ దేవుని చేత శపించబడిన దేవదూతలు అదృశ్యములోని ఆత్మలు.  ఇంక సర్వేశ్వరుని యొక్క సన్నిదిలో వున్న దూత అదృశ్యుడైయుండి యూదాలో జొరబడుట అనగా పరకాయప్రవేశము చేయుట అనునది అసాధ్యమైన పనికాదు.  ఋషుల చేత శపించబడిన దైవభక్తులు నరులను ఋషీశ్వరులను చిత్రహింసల పాలుచేసి దేవతలను అనేక ఇక్కట్లు పాలుచేసినట్లుగా పురాణాలలో వున్నది.  అది అసాధ్యమా? ఇది అసాధ్యమా? చదువరులే గ్రహించాలి.  అదృశ్యములో సాతానుడు నరునిలో క్రియజేయుట సాధ్యమా? దృశ్యమైయున్న రాక్షసుడైన శాపగ్రస్థుడు శరీరాన్నే పాడు చేయును.

        కాని క్రీస్తును పట్టించిన యూదాలో అదృశ్యుడైన సాతానుడు బహుగోప్యముగానే క్రియజేసినట్లును ఈవిషయమును తెలిసికొన్న ఏసుప్రభువు ఆతనిని హెచ్చరించినట్లును వేదములో చదువగలము.

        ప్రశ్నః- యోహాను 14:1-6 ఇనుపచువ్వగాని మేకుగాని వంకరయైన పక్షములో ఇనుముతోనే దానిని కొట్టాలి.  గాజును గాజుతోనే దానిని కొయ్యాలి.మాంసాహారియైన మృగమునకు మృగమే ఆహారము.  మృగశరీరమే ఆహారము.  అదే విధముగా అదృశ్యములో వున్న పరమాత్ముని యొక్క మాటలు మృతప్రాయుడును తుచ్ఛడును సమస్త కల్మషములకు దోహదకారియైన నరుడు వినాలంటే తనవలె దృశ్యమైయున్న శారీరమే నరునికి కావాలి.  అదృశ్యంలో వుండి మాట్లాడితే తాను పవిత్రుడైనట్లు దయ్యమంటాడు.  యక్షిణి అంటాడు.  మాయ అంటాడు.  దృశ్యములో వుండి మాట్లాడితే విమర్శించును.  కనుక ఏసు సృష్టికర్తయొక్క రూపమైయుండి పై వాక్యమును ''నా ఇంటి అనేక నివాసములు కలవు.  అని చెప్పవచ్చును.  ఆ చుట్టు వున్న నరకోటి విమర్శకులు గనుక తన కొక తండ్రియున్నట్లును కొలస్సై 1:15లో వలె సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నను తన్నుమరుగుపరచుకొని తనుమాట్లాడుచున్న నరులు బలహీనులు గనుక వారిని బలపరచుటకు తనకు ఒక తండ్రి వున్నట్లుగాను ఆయనకు అనేక నివాసములు కలవన్నట్లుగా చెప్పుటలో ఏసులో అణగారిన దైవత్వము మొట్టమొదటి వచనములోనే ఇమిడియున్నది.  దేవునియందును విశ్వాసముంచుచున్నారు.  నాయందును విశ్వాసముంచుడీ.  దేవుడెవరు? తానెవరు? అనునది గ్రహిస్తే ఆయన అన్నట్లుగా మనహృదయములో కలవరపాటు వుండదు.

        నేనువెళ్ళి మీకుస్థలమును సిద్దపరచినపుడు నేనుండుస్థలములో అనుటలో ఈయన పరము నుండియే భూమికి వచ్చినట్లు యాకోబు కలలోని నిచ్చెన సూచిచంచున్నది.  సూచించుచుండగా ఈయనుండు స్థలమేమిటి? ఈయన వెళ్ళి స్థలమును సిద్ధపరచుట ఏమిటి? ఈయన భూలోకంలో వుంటూ మరల వచ్చి నా యొద్దకు మరల తీసుకొని పోయెదననుట మరల ఈయన రావడమేమిటి? పోవుట ఏమిటి? అనునది గుర్తిస్తే ఏసుప్రభువు దేవుని యొక్క రూపమైయుండియు సర్వసృష్టికి ఆదిసంభూతుడైయుండియు తానున్న రూపము నరునిది గనుక నరులవలె నరునివలె ఆయన ప్రవర్తించి ప్రవక్తవలె దైవసువార్తను దైవమర్మమును దైవలోకములోని నిగూఢసత్యములను బోధించి తన జన్మను సార్థకపరచుకొన్నట్లును ఏ నరుడైనను సర్వేశ్వరుని సన్నిధికి వెళ్ళాలంటే యాకోబు కలలో కనపడిన విధముగా ఈయన మెట్లవలె వున్నట్లును ఆ మెట్లుయదార్ధమైనవియు జీవయుతమైనట్లును వివరించినట్లునుఅట్టి జ్ఞానముతో లోకములో జీవించవలెనని ఇందుమూలముగా మనము గ్రహించవలసియున్నది. పరమాత్మునికి నాసికా రంద్రము లేనట్లయిన నరునికి నాసికారంధ్రమును ఏర్పరచి జీవవాయువును ఎట్లు ఊదినాడు? ఆయనకు నోరులేదా? ఆర్యసమాజములోని వారికే నా దైవత్వము మానుషత్వము.  దేవునికి మానుషత్వము లేనట్లయిన ప్రత్యేకముగా మనుష్యుని ఎట్లు ఉత్పత్తిచేస్తాడు.  నరుడు పరమాత్ముని యొక్క రూపకల్పనుడు కాకున్నచో నరుడు వానరుడా? గబ్బిలమా? లేక మహీషమా?

        ఒక నివాస గృహము శిధిలావస్థలో నుండి వర్షమునకు కారుచు విషకీటకాదులకు నిలయమై పై కప్పు పతనాదశాస్థితి యందుండగా గృహయజమాని ఆశిదిగా గృహమును దానిశిధిలావస్థనుండి విముక్తి చేసి నూతన పరచి నూతన సంతృప్తి పొంది తానొక నూతన క్రియ చేసినానను హృదయానుభూతిని పొందుచున్నాడు.  అదే విధముగా నరగృహమను శరీరము జీవాత్మ గృహములను శరీరములను అవి పాప భూయిష్టమై సకల అరిష్టములకునిలయమై యుండగా అట్టి అరిష్టాప్రపంచమును నూతన పోకడలలో నిర్మించుటకు అరిష్టమును నిర్మూలించి పరిశుద్ధతను నెలకొల్పుటకు ముల్లోకాదిపతియైన క్రైస్తవ దేవునికి అసాధ్యమా? ఇట్టి దైవసత్యమును ఎరుగక పసిపిల్లల జ్ఞానమునకు దీనిని అబివర్ణించుటలో ఇట్టి వర్ణన చేసిన ఆర్యసమాజమే పిల్లకాయల సమాజమని దైవసత్యము నిరూపించుచున్నది.  ఏలాగంటే శపించుట చంపివేయుట చంపననుట ఇవన్నియు జరిగినట్లే ఆర్యసమాజము అంగీకరించినపుడు దేవుని విద్వాసంసునిగా చేసి మామూలుగా హైస్కూలు పండితునితో పోల్చి వివరించుటలో భూలోక విద్యాజ్ఞానము పరలోక దేవునకు వెర్రితనమైయున్నది.  కనుక భూలోకములో ఉన్న ఆర్యసమాజవేదజ్ఞానము పరమాత్ముని దృష్టికి వెర్రితనము.  పరమాత్ముడు-పరమాత్ముడే.  జీవాత్ముడు జీవాత్ముడే.

        అభము శుభము ఎరుగనటువంటి జింకలను దుప్పులు, కనుజులు వగైరా వన్యమృగము యావంతయిన కనికరము లేక అతికౄరముగ వాడియైన గోర్లు కోరలతో పట్టి చంపి రక్తమాంస భక్షణము చేయు పెద్దపులిని ఆరాధించు నరుడు యోగి వేదపుంగవులు శాపగ్రస్థులు కారా? ఆ బెబ్బులి చర్మమును ఆసనముగా చేసుకొని దానిమీద యోగసమాధిని పరమాత్మ  దర్శనమునకై ప్రయత్నించు యోగి ఆ బెబ్బులి వంటివాడు కాడా? అడవిలో పులి వన్యప్రాణులను చంపుచున్నది.  వన్యప్రాణులను పులిని నరుడు చంపుచున్నాడు.  చంపి నది చాలక వాటిచర్మములను జపతపాదులకు యోగ్యమని ఎంచుట కపట యోగుల ఉద్ధేశ్యమై యుండగా నిస్వార్థపరుడు అతిపరిశుద్ధుడు భూతభవిష్యత్‌ వర్తమాన కాలములను ఎరిగినవాడు సర్వాతర్యామి సకల జీవరాసులకును ప్రాణదాతయైన సర్వేశ్వరుడు సకల జనకోటికిని సకల విధ ఆహారభక్ష్యములను అనుగ్రహించుటలో ఆయన నరునికి ఇచ్చినట్టి ప్రదమ ఆహారమును (ముఖ్యాహారము) మాంసభక్షణమైయున్నది.  అందులో నరమాంసభక్షణమే ప్రధానమైయున్నది.   అందులో నరమాంసభక్షణమే ప్రధానమైయున్నది. ఎట్లనగాః- యోగి దయానంద సరస్వతి వెలుదలు సప్త మహాఋషుల వరకు నరజన్మ ఎత్తిన ప్రతి ఒక్కడును తల్గి గర్భములో పిండోత్పత్తి పొందిన లగాయతు తొమ్మిది మాసములు తల్లి గర్భకోశములో దేవునిచే అనుగ్రహించబడినమాంసపు గుళికలే శిశువు ఎదుగుదలకు దోహదమిచ్చునవైయున్నవి.  అట్టి చీకటి గర్భములో ఉన్న శిశువునకు వేదజ్ఞానమను అంధత్వములో ఉన్న ఆర్యసమాజము తల్లి ప్రసవించు నంత వరకు తల్లి గర్భమున ఉన్న శిశువునకు పూరీమసాల,ఇడ్లీ సాంబారు, దద్దోజనము, పులిహోర, దబ్బళాలు ఇచ్చి ఎదిగిస్తున్నదా!

        ఒక విమర్శన చేయునపుడు విమర్శించువాడు తాను విమర్శకు లోనగు తాడేమోనని తన్నుతాను పరిశోదించుకోవలెను.  అట్లు పరిశోధించకుండ మతదూషణ చేయుట సన్యాస లక్షణము కాదా?

        పచ్చని కూరమొక్కల నిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చియున్నాను అన్నాడు.  పచ్చని కూరమొక్కలు కూడా ప్రాణము కల్గినవి కావా? దయానందుడు కూరగాయల ఆకులలములు తినక ప్రాణము నిలుపుకోగలడా?

        జనము ఒక్కటే అనగా దైవజనము.  వారిభాష ఒక్కటే.  అనగా దైవికభాష ఒక్కటే.  అయితే నరక్రియాసంకల్పము భిన్నముగా ఉండుటను బట్ట అనగా వారి సంకల్పములో సాతానుతోబాటు చేసుకొనునట్లు ఈ వాక్యసారాంశము బైలుపరచుచున్నది.

        ఒక్కజనము ఒక్కభాష వాళ్ళుచేయ సంకల్పించిన ఒక్క గోపురము లోపించి అహంభావము, అలక్ష్యము, ఆడంబరము, అతిశయోక్తి నరుని యొక్క హృదయములో విలయతాండవము చేయును గనుక నరసృష్టికి నరరూపమునకు సృష్టికర్తయైన దేవుడు ఇది గ్రహించినవాడై నరుడు చేయు క్రియాసంకల్పము వ్యర్థమనియు అది పరమాత్మునికి ఎంతమాత్రము యోగ్యము కాదనియు దైవానుకూలతతో చేయు కార్యమేని కరమనియు భక్తిని సాధనముగా చేసికొని యాచించుటభక్తుని  లక్షణమనియు ఈ క్రియచేత మానవకోటికి దేవుడు నిరూపించియున్నాడు.

        ఆనాడు దేవుడు మానవభాషను తారుమారుచేయకుంటే ఒక్కజాతి ఒక్కభాషగా ఉంటే ఈనాడు అమెరికన్లు, రష్యన్లు, మొత్తం విదేశీయులు దేశవ్యాప్తంగా జనాంగము రాష్ట్రవ్యాపితంగా బాషలును వేదమనే అజ్ఞానమును గా చేసిన చూరులు బట్టి వ్రేలాడు ఆర్యాసమాజమను అజ్ఞానులును ఈ దినములలో ఉండజాలరు.  ఆ భాషల తారుమారు చేసిన ప్రణాళికయే నరజాతిని ఇంతగా విస్తరింపజేసినది.

        లోకములో ప్రతిప్రాణికిని ప్రాణరక్షణ అను నియమమున్నది అబ్రాహాము వంశమునుండి పరమాత్ముని యొక్క నరరూపము భూమిపై ప్రతిష్టితము కావలసిన దైవసంకల్పము ఒకటి వున్నది.  అందులో అబ్రాహము పరమాత్మునిసన్నిధిలో యదార్ధ ప్రవర్తన గలవాడుగ నిర్ధారించబడియున్నాడు.  అటువంటి కీర్తి గల్గిన అబ్రాహాము జీవుడైయుండి దైవసంకల్పము నెరవేర్చవలసిన కర్తవ్యముండగా కోరి మరణాన్ని నెత్తికెక్కించుకోవలసిన ఖర్మము అబ్రాహాము కేల ఉన్నది? అబ్రహాము యదార్ధాన్ని బైలుపరచిఉంటే మరణము సంప్రాప్తించును.  అట్లు దేవుని యొక్క అబీష్టము సిద్దింపనేరదు.  అందును బట్టి నరుని యొక్క చిత్తస్వభావమును పరమాత్ముడు ఎరిగినవాడగుట చేత అప్పటి ఐగుప్తీయ సామ్రాజ్య ప్రవృత్తిని (విధానాలను) బట్టి తన క్రియాసంకల్పమునుఆ విధంగా మార్చుకొనియుండునేమో! ఇది కూడా విమర్శయేనా!

        గొప్యాంగ చర్మపు ఖండన అనునది పరమాత్ముని వాక్కును జీవాత్మయైన నరుడు ఎంతవరకు పాటింపగలడు? అనుటయు దేవుడు ఏర్పరచిన కట్టడే గాని దానిని ఆచరించవలెనని ఆచరించకూడదని ఏమియు లేదని దైవగ్రంధమందు వ్రాయబడియున్నది.  ఈ ఆర్యసమాజవయోగులు సంభోగము ఎరుగని వారు.  రతిక్రీడా అనుభవము కల్గినవారు కారు.  కామశాస్త్రఅజ్ఞానులు.  మేతమేయుటలో ఏనుగు పిల్లలైయ్యు నపుంసకులై (అస్కలిత బ్రహ్మాచారులై) నపుంస జ్ఞానముతో గోప్యాంగ చర్మమును గూర్చి వివరించితే అది ఎట్లు ఆమోదమగును.

        గోప్యాంగ చర్మము వలన రతిక్రీడ మూలున పలురకములైన స్త్రీ వ్యాదులు సోకుటకును అవకాశముకలదు.  ఎట్లనగా స్త్రీయోనినుండి స్రవించు వీర్యము పురుషుని అంగమునుండి స్కలనము వీర్యము రెండును సంగమమైనపుడు ఆ వీర్యాణువులు పురుషుని గోప్యాంగ చర్మము ద్వారా లింగసంబంబుూధమైన జాడ్యములు ఏర్పడుటకు లింగం మీదనున్న చర్మము దోహదకారియగుచున్నది.  మరియు మీదుగా లింగంలో దఏదేని ఒక వ్రణము ఏర్పడినపుడు ఆ వ్రణము మానకయుండుటకు అడ్డతతెరగా ఉంటున్నది.  పై చర్మము లేకుండినచో ఆ వ్రణము మానుటకు అవకాశమున్నది.  రతిక్రియ జరుగునపుడు దా చర్మము ఇబ్బంది కరమే.  ఇన్ని దుర్గుణములు అందుదాగియుండుటను బట్టి పరమాత్ముడు సృహృద్భావముతో ఆ నియమమును తానేర్పరచుకొన్న జనాభాకు తెలిపియున్నాడు.

        అలాగైతే సృష్టారంభంములోనే గొపాగ చర్మము లేకుండగ చేయకూడదా? అనుప్రశ్న మనకు కలుగవచ్చును.  నరునికి భాహ్యము గాకనపడు అవయవములలో లింగము అతిసున్నితమైనది. తల్లి గర్భములో పసిరూపముగా ఉన్న లేత అవయవము లలో పురుషాంగమనునది ప్రధానమైయున్నది.  అది పటిష్టత మగుటకు దానిపై ఒక కవచమ అవసరము,. తల్లి గర్భములో వుండు శిశువు ప్రసవింపబడు వరకు అది అవసరమైయున్నది.  ఇది దైవసంకల్పము.  అటు తర్వాత తల్లి గర్భమునుండి ప్రసవింపబడిన తర్వాత ఆ చర్మము తొలగింపబడుటలింగమునకును లింగమును ఆనుకొని యున్న నరునికిని శ్రేయస్కరముగా లోకవైద్యరీత్యా పరలోక దైవరీత్యా ఆమోదమైయున్నది.

        ఈనాడు గొప్యాంగ చర్మమర్మమును వైద్యశాస్త్ర సిద్ధాంతములను వైద్యరీతిగాను దైవ కట్టడరీతిగాను అది ఆచరించక పోయినను వైద్యశాస్త్రరీతిగా పురుషుడు లింగశుద్ధి స్త్రీయోని శుద్ధి చేసుకొనుచున్నట్లుగా మనము గ్రహించుచున్నాము.  మానవ శాస్త్రము శుద్ధి చేసుకోమంటున్నది.  దైవసన్నిధానము దానిని తొలగించుకోమంటున్నది.  ఎవడు ఏదిచేసికొన్నను తప్పులేదని సృష్టమగుచున్నది.

                        ఆత్మక్రిందికి పైకి చలించుటః-

        ఒక మేడను కట్టిన వ్యక్తి పై అంతస్థులో కాపురము పెట్టి తన దిగువ అంతస్తులో ఉన్నట్టి తన సాటి సహోదరుల యోగక్షేమమును విచారించుచు మేడ మీదనుండి దిగువకు దిగువనుండి మేడ మీదకు ఎక్కచుండుట సహజమేగదా! అయితే ఆకాశమునకు భూమికిని పాతాళమునకును త్రిలోకాధిపత్యము తవహించిన పరమేశ్వరునికి తుచ్చవమైన నరునితో సంభాషించి  తన ఇచ్ఛను సంచరించుటకు శక్తి లేదా? ఓ వేద జ్ఞాని నీవు అనుకున్న దేవుడు నీవలెనే ఐంద్ర జాలికుడును, జ్ఞానములేని పక్షిగను, తుచ్ఛమైన నరుని గను ఉండక సర్వాంతర్యామి త్రిలోక సంచారి సృష్టికి ఆదిసంభూతుడైన ఆ యెహోవా పరమాత్ముని యొక్క లీలను వర్ణించికు నీవెంత? నీ సమాధియెంత?

        అయినను నేను పరలోక సింహాసానాధిపతి అని నిరూపించుటకు ఆయన పైకి వెళ్ళినట్లుగ లీలకనుపరచియున్నాడు.  అంతేగాని ఆత్మ అనువాడు ఇచ్చట అచ్ట అవిగాక అంతట నిండియున్నాడు.  ఆయన ఆత్మ ఆయన చిత్తము చొప్పున చేయుటకు శక్తివంతములైయున్నవి. అబ్రాహాము విషయములో ఈ క్రియ జరిగించియున్నాడు.  ఆత్మ దృశ్యము గాగలదు.  అదృశ్యముగా గలదు.

        పరమాత్ముడైన ఈశ్వరుని వెంబడి ఎవరో ఇద్దరు ఉండిరనుటకు గూర్చిః- దేవునిలో త్రిత్వమున్నదనియు ఆయన త్రికరణ శుద్ధికల్గినవాడు అనియు ఆయన ఈ లోకములో త్రివిధ ఆధిపత్యము వహించిన వాడనియు సృష్టి యొక్క త్రికాలజ్ఞనమునకు మూలకారణమైయున్నాడనియు అనగా అవియే పాతనిబంధన కొత్తనిబంధన - లోకాంత్యము (ప్రకటన) అగు త్రివిధ ఆధిపత్యములు ఈ లోకములో ఆయన వహించియున్నాడనియు ఆయనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని త్రివిధ రూపములను అబ్రాహమునకు దర్శనములో కనపడినట్లు విదితమగుచున్నది,

        ఇది గ్రహించు కొననేరక ఇందుకు భిన్నముగా లిఖించిన ఈ యొక్క వేదసమాజము అంధసమాజమైనట్లు గుర్తించవలసియున్నది.

        మానవునిలో కూడా దైవ త్రిత్వమునకు ముంగుర్తుగా ''శరీరము - హృదయము - జీవాత్మ'' లను దేవుడు ఏర్పరచియున్నాడు. ఈ మూడు ఏకమై మూర్తీ భవించి యున్నవాడే మనస్సాక్షి కల్గినవాడు యదార్ధమానవుడు.

        అంతటను ఆవరించియున్న సర్వేశ్వరుని దృష్టికి మరుగైనది ఏదైనను ఉండునా? సర్వేశ్వరునకు కొంచెము దూరములో గుడారములో  ఉన్న శారా నవ్వు.  అనగా ఒక అబల యొక్క ప్రవర్తన.  పరమాత్ముడైన సర్వేశ్వరుడు దృష్టింపడా? అట్లు దృష్టింపని వాడు ఆతడు సర్వేశ్వరుడు కాడు.  ఇందులో శారా యొక్క చిత్తవృత్తి ఏమంటే స్త్రీ ధర్మము ఉడిగిన నాకు గర్భధారణ ఏమిటి?అనే భావముతో మానవజ్ఞానము తో నవ్వినది.  నరసృష్టికర్తయైన సర్వేశ్వరునికి నరశరీరముల యొక్క చిత్తవృత్తి తెలియదా? అందుకే ఎత్తిపోడిచినాడు.

        సొదమ గొమర్రా పట్టణములలోని పసిబిడ్డలను పాపులైన పెద్దలతో కూడా అగ్నికి ఆహుతి చేయుటను గూర్చిః-

        ఏరు విజృంభించినవరదలై ప్రవాహ వెల్లువలజలై విజృంభించి ప్రవహించునపుడు పశుపక్ష్యాదులు వదరలో కొట్టుకొని పోవునపుడు ఇవి పశుపక్ష్యాదులే.  ఇది గొఱ్ఱెపిల్లయే.  ఇది ఆవు దూడే! ఇది జంకపిల్లయేయని కనికరించువా! ఆ విధంగా ఆ ఏటి ప్రవాహము కనికరించి వాటిని అనగా ఆ అమాయికపు  పశుపక్ష్యాదుల పిల్లలను వదలిపెట్టి కౄరమృగ సంతతులను మాత్రమే తనలో తీసుకొని కూడదా? అట్లే దైవశక్తి కూడా అక్రమాన్ని ఖండించునపుడు నల్లులను బట్టి మంచమును మోదినట్లుగా నరులను బట్టి నరనివాసములను కూడ మొతుఉ్తట సహజమైయున్నది (ఇచ్చటి మంచము, గృహములు, గెదెపిల్ల, గొఱ్ఱెపిల్ల.  అమాయికులైన పసిబిడ్డలకు పోల్చబడియున్నది , అనగా భరించరాని పాపము ఏర్పడినపుడు క్షమించాలనే పాపభీతి ఉండదు.

        మద్యసేవనమును గూర్చిః- లోతు తన కుమార్తెలను మద్యమడిగి ఆ మత్తులో మీకు కడుపుచేయుదునని అన్నట్లుగా లేదు.  ఏ వ్యక్తికైనను ఒక దురలవాటు ఉన్నపుడు ఆ దురలవాటే ఆతనిని దోషపూరితము చేయగలదు.  లోతుకు మద్యము సేవించు అలవాటు ఉండబట్టే కుమార్తెలకు ఆ వీలు చిక్కింది గాని తండ్రికే ఆ అలవాటు లేనియెడల కుమార్తెలకు ఆ పని చేయవీలుపడేది కాదు.  అదే విధముగా నరుని మద్యపాన ప్రియునిగా చేసినది ప్రకృతేగాని మతము కాదు.  ఎట్లనగా గంజాయిని వాడమనియో శ్రమము బోధించుట లేదు.  కాని ఆశ్రమము లోని యోగి అయోగ్యుడై గంజాయిని చేతబట్టి నేను ఘనుడనని డబ్బావాయిస్తూ ఆయుష్కాలమునకే ముందే గోయిత్రవ్వించుకొనుచున్నాడు.

        ఓ ఆర్య సమాజమా! ఇది ఏమి పుత్ర కామేష్టి యాగమనుకున్నావా? పెళ్ళాలను యోగులకు పరుండబెట్టుట అనుకున్నావా? సన్యాసులకు దేవుళ్ళకు పెళ్ళాలను పండబెట్టు మతమనుకున్నావా?

        రాతిగర్భములో కప్పను నిల్పిన దేవునకు ముసలిస్త్రీ గర్భములో శిశువును సృష్టించుట ఆసాధ్యమా? ఇట్టి అజ్ఞానముతో కూడిన ఈ ఆర్యసమాజమును అంధసమాజమనుట మేలు.

        తాళిగట్టిన భార్యను విడువమనుట దైవచట్టముగాదు అబ్రహాముకు తాను పెండ్లాడిన భార్యయే గణనీయురాలు.  దాసీగా చాకిని చేయు స్త్రీ అబ్రాహము యొక్క స్వాస్థ్యము నకువారసురాలు కానేరదు.  దేవుడు దేవుడే ఆయన సత్యపరిపాలకుడే.  సత్యపరిపాలన దక్షకల్గినవాడు అసత్యమును ఏలాగు అంగీకరించును?

        కనుక ఆ గృహము అబ్రాహామునకును ఆతని యజమానురాలైన శారాకును పరిమితమైయుండగా అక్కడ దాసీవారసత్వము యజమానత్వము లేదని నిరూపించుటకే దేవుడు తన దైవక్రిను జరిగించెను.        

        ద్రాసీది దోషి కనుకనే) అనగా ఆమె చెప్పుడు మాటలు డైరెక్టుగా అబ్రాహాము సన్నిధికి వెళ్ళలేదు.  దాసీ దోసిగనుకనే దేవుడు ఆమె ఏడ్పును వినింపించుకోలేదు.  బాలుడు నిర్దోషి గనుకనే అనగా అమాయికుడు, అభము శుభము ఎరుగనివాడు ఆకనుక ఆతని యొక్క రోదన దేవుని యొద్దకు చేరినది.  అబ్రాహామును పరిశోధించకయే అనగా పరీక్షించకయే ఆతని హృదయ పరిస్థితిని దేవుడు అర్థము చేసికొలేడా?

        ఒక తండ్రి తన కుమారుని భవిష్యత్తును గూర్చియోచిస్తూ తన కుమారుడు సత్యవంతుడును మంచి విశ్వాసియును దైవభక్తి పరాయణుడు కావలయుననే అప్పుడప్పుడు తండ్రి తన ఎదుట వానిని కుశలప్రశ్నల మూలముగ పరీక్షించుచు బిడ్డకు ఆరోగ్యం చెడ్డపుడు వైద్యుని ద్వారా పరీక్షచేయించుచు బాలునివిద్యాభ్యాసము గావించి పాఠశాలలో విద్యాపరీక్ష మూలమున కొన్ని పరీక్షలు తన బిడ్డకు జరుపబడినట్లు తదనంతరము తన బిడ్డకు మంచి భవిష్యత్తు ఏర్పడి సజ్జనుడుగ విశ్వములో ఖ్యాతిపొందవలెనని కోరుచూ తదనుగుణ్యముగా అపుడపుడు వానిని వాని శారీరస్వభావమును తన క్రమ శిక్షణలో ఉంచుకొనుటకు పరీక్షించుచుండును.        

        నరుడు చండాలుడని దేవునికి తెలియక పోలేదు.  కాని దేవునికి కావలసినది మంచి గనుక ఆ మంచిని అపేక్షించుచు అపుడపుడు తన భక్తులను పరీక్షించుట దేవునికి సహజలక్షణమై యున్నది.

        అయితే అబ్రాహాము దైవపరీక్షలో నెగ్గతాడనే తెలియును.  దేవుని బిడ్డ అనునామము సార్థకము కావాలంటే దైవ పరీక్షలలో ఉత్తీర్ణుడు కావలెను.  వైద్యుడు అన్నపుడు వైద్యపరీక్షలో ఆతడు ఉత్తీర్ణుడు కావలెను.  న్యాయవాది అన్నపుడు న్యాయవాదము అను న్యాయశాస్త్ర పరీక్షలో ఆతడు ఉత్తీర్ణుడు కావలెను.  భూలోకములో ఇన్ని పరీక్షలు ఉన్నపుడు దేవుని చిత్తవృత్తిలో పరీక్షలు అనునవి ఉన్నవి గనుక ఆ పరీక్షలు కూడా మానవుని యొక్క జీవితగమనమున ఇప్పటికిని అనుసరించబడుచున్నవి.  అట్లే యోగి అనుటకు గుర్తుగా యోగపరీక్షలో నెగ్గాలి.

        శవమును కాల్చవలెనా?పూడ్చవలెనా? శవమును కాల్చుటయనునది మాంసభక్షములైన కోళ్ళు పందులు మొదలగు మృగపక్ష్యాదుల కాల్చుటతో సమానమే గాని అది ఒప్పుదల క్రియకాదు.  అనగా పవిత్ర కార్యము కాదు.  మరణమనునది సుస్థిరమైన నిద్రాక్రియగా దైవసన్నిధానము వక్కాణించియున్నది.  అట్టి ఆత్మను విడిచి నిద్రించు శరీరమును సాటిసోదరులైన నరసందోహము కనికరము లేకుండ ఏడుగుండ్ల కట్టి ఇరవైపిడకలు ఒక బుడ్డి కిరసనాయితో అంకాదహనము చేయుటలో నరుడు కౄరుడా? అజ్ఞానుడా? పశుప్రాయుడా? పశుపక్ష్యాదలకు ఈ జ్ఞానము లేదు.  వాటికి కిరసనాయి దొరకదు.

        దైవసన్నిధానములో నిర్మలభక్తికి మూలము విశ్వాసము మానవకోటికి అధిగమించిన విశ్వాసము సర్వేశ్వరుని పట్ల అబ్రాహాము చూపిన విశ్వాసక్రియను బట్టియే సర్వేశ్వరుడు అబ్రహాము సర్వేశ్వరుడుగామారెను.  అట్టి విశ్వాసులకు పుట్టిన క్రైస్తవులు సర్వేశ్వరుని బిడ్డలనుటకు తప్పేమి ఉన్నది.  ప్రతి క్రైస్తవుడును అబ్రహామునకు బంధువే, ఈ యుగములో అట్టి విశ్వాసము లేనందున దైవ విశ్వాసము దైవసంభాషన దైవ ప్రేమ అరుదైపోయెను గనుక దైవ వాక్కు అను బైబిలు వాక్కుతతో మార్గమును చూపమన్నాడు.  నీ వాక్యము నా పాదములకు దీపము.  నాత్రోవలకు వెలుగు అనెడి వాక్యము'', ఇపుడు మార్గమైయున్నది.  అనగా దేవుని వాక్కే మార్గము.

        ఆర్యసమాజ ఉద్దారకులలో ఒక్కడైన దయానంద సరస్వతి పుట్టుక నుండియే మహాఋషి వేషముతో వచ్చాడా? లేక బాల్యము నుండి ఋష్య వేషము వేయునంతవరకు ఎన్ని వేషములు వేశాడో ఆర్యసమాజమునకు తెలియునా? యోగులు, సన్యాసులు, సిద్దులు అనగా సిద్దులు అంటే కాషాయాంబరధారులు ప్రతి ఒక్కరు కూడా రక్తపిపాసులు అను చిహ్నమునకు ఆ వేషధారణ తగియున్నది.  అటువంటి వారిలో ఒకడై యాకోబు కపట వేషముతో మానవబుద్ధితో తండ్రియొక్క ఆశీర్వాదమును యాచించుటలో తప్పేమున్నది.  వాల్మీకి దారిదోపిడి హంతకుడుగా ఉండి రామాయణాన్ని రచించాడు.  యాకోబు మోసగాడై తండ్రి ఆశీర్వాదాన్ని పొంది క్రీస్తు జన్మకు మూలకారకుడాయెను.  అటు వాల్మీకి ఇటు యాకోబు యొక్క చరిత్రలు ఆర్యసమాజమునకు అంధత్వము కలుగజేసియున్నవి.  కనుక ఇందును బట్టి కామిగానివాడు మోక్ష కామికాడు అనెడి ఆర్యుల మాటలు కూడా తలంచలేవా?

        రాతిని మందిరస్థంభముగ నిల్పుటను గూర్చిః-

        ఓ అజ్ఞాన సమాజమా! యాకోబు రాతిని నిల్పి మందిరమన్నాడేగాని దానిని దేవుడనిగాని అది దేవతా రూపమనిగాని ఉచ్చరించి నారికేళ ఫలపుష్పాదులు హారతి కర్పూరములతో దానిని పూజించినట్లు లేదు. గుడిసెకునిట్రాళ్ళు పాతునపుడు పాతి ఎదైన ఇల్లుకట్టెదమో ఆ విధంగా ఆ రాళ్ళను పాతి అది దైవద్యాన మందిరముగా వర్థిల్లునట్లు తలపోసియుండవచ్చును.  గుడిసె వంటి చిన్న మందిరము వేయుటకు మధ్యలో ఒక రాయి మాత్రమే చాలును,  చుట్లూగోడలు ఉండును.  ఇది కూడా విమర్శయేనా?

        గర్భమును తెరచుటను గూర్చిః-

        నూతనముగా గర్బమును నిర్మించి అడ్డముగా రిబ్బను ఒకటి కట్టి ఆలయ ప్రారంభోత్సవము అను సాంగ్యమును ఆచరించుచున్న నరకోటి నరరూపమునకు ఆది సంభూతుడైన పరమాత్ముడు తాను నిర్మించిన గర్భద్వారమును సంతానోత్పత్తి కార్యార్థమై తెరచుటకు శక్తుడుకాడా? ఇదియు ఒక ప్రశ్నయేనా? లేక పరమాత్ముని క్రియయా? ఆలోచించావా? బొడి సన్యాసి సొదరా! కన్యస్త్రీ యోని ద్వారమును తెరచి పుష్పవతిని చేసేది దేవుడే కదా! మీ తల్లి యోనా ద్వారపు గర్భమును దేవుడే తెరవకపోతే మీరెట్లు జన్మించారు? పొట్టకోసి బిడ్డలను వెలికి తీయవలసినదే కదా!

        విగ్రహ దేవతలను గూర్చిః- నరుని యొక్క అజ్ఞానముతో మలచబడిన (బొమ్మలు) విగ్రహములు దేవతలుగా వాటిని నరుని యొక్క కుచ్చిత జ్ఞానముతో ఏర్పరచుకొన్న విగ్రహాము లేతప్ప అది దేవతలనబడవు.  అవి నిజముగా దేవతలైన పక్షమున రాహేలు వాటిని దొంగిలించినపుడు యాకోబుకు ప్రత్యక్షమై రాహేలు వాటిని దొంగిలించినపుడు యాకోబుకు ప్రత్యక్షమై అవి ఎందుకు చెప్పకూడదు.  కనుక క్రైస్తవ దేవుడు తప్ప మరి ఎవ్వడును సర్వేశ్వరుడనబడడు.  క్రైస్తవుల దేవుడే సర్వేశ్వరుడనియు, ఆయనకు వేరుగా ఏవైన ఉన్న యెడల అవికల్పితమనియు నకిలీలనియు గ్రహించుచున్నాము.

        దేవదూతల సేనను గూర్చిః- 71 భూలోక అస్థిరజన్మలైన రాజులకు రాజాగ్న సంరక్షణకు నరసైన్యములుండగా ''భూమిని రాజులను , సైన్యము లను సృష్టించిన పరమేశ్వరునకు దూతసేన అక్కరలేదనియా? నీ అభిప్రాయము. రాజక్యాములకు రాజభటులు ఎట్లు అవసరమైనదో అట్లే సృష్టి కార్యములు జరిపించుటకు దూత సైన్యములు కావలయుననెడి జ్ఞానము నీకు లేదా? నీవు ఏ ఆశ్రమములో విద్యనార్జించి నావు? ఆర్యసమాజమంటే అనాగరికుల సమాజమని ఈ మాటల ద్వారా తెలియుచున్నది.

        తండ్రి చేసిన అపరాధమును బట్టి అతని నాలుగు తరములవారిని దండించుట న్యాయమేనా?

        ఈ తరము వారైన మనము ఒక దినమునకు ఆత్మసంబంధముగను దేహరీత్యా ఎన్ని శిక్షలు అనుభవించుచున్నామో అది మన దేహమునకును మన జీవాత్మకును ఈ రెండింటికిని ఆధిసంభూతుడైన దేవునికిని ఈ ముగ్గురికి తెలియును.  ప్రతి నరుడు తన తరములో ఏదో యొక రీతిగా తన జన్మకర్మపాపముల చేత తనేదండనకు గురియగుచుండగా తన దోషమును కప్పిపుచ్చుకొని నాలుగు తరములు దేవుడు దండించుచున్నాడని దేవుని దూషించుచు ఆయన నామమును వ్యర్థము చేయుచు నరుడు తన పాపములను అపరాదములను కప్పిపుచ్చుకొనుట ఎంత సమంజసమో మనము గుర్తించవలసియున్నది.  ఇపుడున్న తరములోని మనమే పరమాత్ముని దండనకు ఉక్కిరిబిక్కిరి యగుచుండగా మనము ఎన్నవతరము వారమోయని గుర్తింపక ఐదవతరము వారిని అడ్డము పెట్టుకొని దైవదూషణచేయుడి ఆర్యసమాజమునకు ప్రధానమైయున్నది.  అట్లయిన ఆర్యసమాజము ఎన్నవ తరములోనికది? నీ తల్లి గర్భములో బీజమేసిన వాడు నీ తండ్రేనని నీకు తెలియునా? అట్లుతెలిసి ఉంటే ఆతడు ఎన్నవ తరములోని వాడో నీవే చెప్పగలవా?

        విశ్రాంతి దినమును గూర్చిః- దైవసృష్టియైన ప్రతిదినమును పవిత్రమైనవి.  దేవుడు సృష్టించిన ప్రతి నరుడు పవిత్రుడే.  వానికర్మలవసు క్రియా సంకల్పము వల్ల రాజకియవ్యక్తి పదవి కలవాడును సామాన్యుడు దరిద్రుడుగాడు.  దరిద్రుడు అధికుడుగను, వివిధరీతుల పాపక్రియల దుర్మార్గలు తమదుర్మార్గమును బట్టి క్రూరులు గను నిర్ణయించబడినట్లుగా వారములలో ఉన్న దినములు కూడా పవిత్ర అపవిత్రములుగా నరులే సృష్టించుకున్నారు.  కాని దేవుడు సృష్టించుకోలేదు.  దేవుడు ఆరు రోజులు కష్టపడిపనిచేసి ఏడవ రోజు విశ్రమించినట్లుగా వున్నది.  విశ్రమించుట అనగా నిద్రపోవుటగాదు.  సేదదీర్చుకొనుటయే.  నరుడు అపవిత్రలోలుడై శనివారము ఒక్కప్రొద్దనియు శుక్రవారము ఉప్పుసున్నము ధనము ధాన్యము వగైరాలున ధర్మముచేయుటయునిషేధముగా  ఎంచుకొని అంధకారజీవియై మరణమునకు గొయ్యి తీసికొని ప్రమాదములో ఉండి శాపగ్రస్థుడై పరమాత్ముని ఉగ్రతకు గురియైన సందర్భములో దేవుడు తన క్రియా సంకల్పము చొప్పున తానే నరావతారుడై నరపాప విమోచనార్థము నీతిసూర్యుడను ఏసుక్రీస్తును ప్రతిష్టించుసమయము మోషే పురుష సంయోగము నెరుగని ప్రతి ఆడు పిల్లను మీ నిమిత్తము బ్రతుకనిండు'' అని అన్నాడు.  కాని తన నిమిత్తము కాదు.

        ఆర్యసమాజమా! మోషే అనునది కాలినడక లో దైవజనులైన ఇశ్రాయేలీలులను కొన్ని లక్షల సమూహమైన దైవజనులను నడిపించి తన జన్మను సార్థకము చేసినట్లుగా ఉన్నది.  కాని అతడు స్వార్ధపరుడై వ్యభిచారియై తన స్వార్థముకొరకు పరస్త్రీ సాంగత్యము కోరినట్లు గ్రంధములో వివరించబడలేదు.  పురుషసంభోగము ఎరిగిన స్త్రీలు పాపమును విస్తరింపజేయుటకు సమర్ధులు అనగా ఏ రూపమకమైనను సరియే.  కాటు మరిగిన పాములవలె పరుషులతో కామక్రియలు జరుపగలరు.  పిల్లలలో ప్రతి మగవాడన్నపుడు యవ్వన ప్రాయమందు ఒల్లు తెలియని వయస్సులో మనాతనా అను విచక్షణ లేకుండ మగవాడు కామేచ్ఛలను అనుభవించగలడు.  అందువల్లనే ఇటు మగవారిని పురుష సంభోగమెరిగిన పర స్త్రీని చంపమన్నాడు.  పురుష సంయోగము ఎరుగని ఆడుపిల్లలను బ్రతుకనీ అన్నపుడు ఒక యౌవ్వనస్తురాలికి భర్త ఒకడై యుండవలెనని దీని సిద్ధాంతము.  ''మీ నిమిత్తముబ్రతుకనివ్వుడి'', అనగా అర్థమేమి?అన్యసంపర్కమెరుగకుండ మీతోనే వారి యొక్క సాంసారిక జీవితమును స్థిరపడాలని ఆ యొక్క మర్మము.  మోషేయొక మనుష్యుని చంపి పూడ్చిపెట్టినపుడు వానికి దండన విధింపలేదెందులకు? పై క్రియలు జరుగుదినములలో ''నీతిన్యాయము'' ఒకదానికొకటి పొందిక లేక చిత్రవిచిత్ర భంగిమలలో విహరించుచున్నట్లు విదితమగుచున్నది.  ఎందుచేతనంటే అప్పటి నరునిలో విద్యాజ్ఞానము విచక్షణ దురాలోచన అనునవి నరునిలో లేనట్లే తలియుచున్నది.  ఎందుకనగా దేవుడు ఆ జ్ఞానమర్మములును వివరించుటకు నరునిలో అంత ఆత్మనిగ్రహణము లేనట్లే తెలియుచున్నది.  దశాజ్ఞయు దైవశాస్త్రములు కూడా అప్పటికి పుట్టలేదు.  అందుచేత దేవుడు దుష్టత్వమును దుష్టత్వము చేత అవినీతిని నీతి చేతను ఖండించుచు నర జీవితమును నడుపుచున్నట్లు తెలియుచున్నది.

        పశుల రక్తము కోరుటలో దాగియున్న సర్వేశ్వరుని నిగూఢ సత్యములు.  నరుడు దైవార్పితములనియు అర్పించిన పశువులు వారి పాపము యొక్క విలువలను వాటి స్వభావములను బైల్పరచుచున్నవి. ఎట్లనగా సర్వేశ్వరునికి పశువు నర్పించునరుడు పశువు వాంఛలో తాను చేసినట్టి క్రియలను లయపరచుమని తన యొక్క శరీరమును పశువుతో సమానముగా గచేసికొని ఆ పశు జ్ఞానముతో చేసిన పాపములను ఈ పశువు రక్తముతో శుద్దీకరించుమని సర్వేశ్వరునికి విజ్ఞాపన చేయుచు ఆ నిర్దోష రక్తమును పాపభూయిష్టులైన మనుష్యుల మీద చిలకరించుటలో ఆ పశువు రక్తముతో నిష్కల్మష పశురక్త మరకలచేత పాపులైన మమ్ములను శుద్దీకరించుమని దీని భావము.  దీనికంతటికి మూలకారకుడు నరుడేగాని దేవుడు అడవిమనుష్యుడు కాడు.  ఆయన సకలనరుల పాపవిమోచనార్థము తానే ఈ లోకములో పశువుగ బలియై తన రక్తముతో పాపభూయిష్ఠులైన లోకమునకు పాపవిమోచకమును కల్గించుదునను దైవసత్యము పై బలులు ద్వారా బహిర్గతమగుచున్నది.  ఈ సత్యము నెరుగక మనోనేత్ర అంధత్వము కల్గిన ఆర్యసమాజము సర్వేశ్వరుని అడవి మనుష్యునితో పోల్చుటలో ఆర్యసమాజము యొక్క బలహీనత బయల్పరచుచున్నది.  ఇక గువ్వ, పావురము'', అను పక్షుల రక్తమును దేవుడు బలికోరుటలో ఇవి క్రీస్తు యొక్క రక్తమునకు ముంగుర్తులై యున్నవి.  క్రీస్తు బలిదానమునకు ముంగుర్తులైయున్నవి.  కనుకనే యాత్మ పావురపు ఆకారములో క్రీస్తు మీదకు ఏతెంచినది.

        క్రైస్తవుల దేవుడు మల్లుడా? యాకోబు యొక్క తొడనరమును బెణికించి గెలిచెను కాని దానిని బాగుపరచలేదేల? ఈశ్వరుని ముఖాముఖిగ చూచి ఆతనితో మల్లయుద్ధము చేసెనన్న ఆతడు ఈశ్వరుడా? ఆది 32:24-32

        నరునికి దేవుడు తండ్రియగును.  అనగా జనన మిచ్చినవాడు అని అర్థము.  నరుడు త్రికాలయోగుడైన పరమేశ్వరుడు ద్విబలసంభూతుడైన యాకోబుతో పోరాటమనునది చిన్నవిషయముగాదు.  ఎందుకనగా ఆది 27:27 ఈ విధంగా తండ్రి ఆశీర్వాద బలమును దైవ ఆశీర్వాదబలము సంపాధించుకొని యున్నవాడు గనుక యాకోబు ఆత్మ దేవుని పోరాటములో నిలువగల్గి తను కోరుకున్న దీవెనను పొందకల్గినాడు.

        పరమాత్మ-దురాత్మ-జీవాత్మ వీటికి రూపమున్నదా? దుర్మాత-జీవాత్మ-నరశరీరము ఈ మూడింటికి ఆదిసంభూతుడు పరమాత్మయే.  పరమాత్మ ఒక రూపమును పుట్టించగలడు.  అనగా పిండము శిశువు-బాల్యము, యౌవ్వనము, కౌమారము, వృద్ధాప్యము అనెడి అంచెల వారీగా శరీర ఆకారములను సృష్టించి పోషింప సమర్ధుడు.  వాటివాటి ఆయుర్ధాయము పరిమితిని ఏర్పరచు సామర్ధ్యుడు. ఆ వయోపరిమితి చెల్లినపుడు ఆ శరీరములను లయపరచగలడు.  కనుక సమస్తము పరమాత్మునికి సాధ్యమే.  లేని దానిని పుట్టించగలడు. ఉన్నదానిని తీసివేయగలడు.  కనుక ఈయనకు సర్పము సాధ్యము,  ఉదా|| శారాకు గర్భము అనుగ్రహించుట.  మరియమ్మకు పురుష సంపర్కము లేక పవిత్రుని అనుగ్రహించుట.  మోరియా కొండమీద పొట్టేలును అబ్రహామునకు చూపుట. మోషే చేత బండను తాకించి జల ఊటలను రప్పించుట.  ఏలియా బలిని అగ్ని లేకుండ దహించుట ఇత్యాదులు.  అపోస్త 12:7-19 ప్రకారముగా దైవాత్మ మహిమశరీరమును దాల్చుట వివరించబడియున్నది.  ఆది 18:1 యెహోవా శారీరదారియై అబ్రహాము సిద్దపరచిన భోజనమును భుజించుట.  ఆది 19:3 ''లోతు'' శరీరధారులైన దేవదూతలకు విందుచేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి.

        పరమాత్ముని సృష్టిలో భూజంగుడు జిత్తులమారియైయున్నాడు.  దేవునికి ఏది అయితే అయిష్టమో అందులో దురాత్మ ప్రవేశించుచున్నది. పరమాత్మ - దురాత్మ స్వభావములు పరస్పర విరుద్దములు గనుక దేవునికి ప్రియము లేని వాటిని దురాత్ముడు ఆశించగలడు.  పరమాత్ముడు ఆవేశించని నరుల మీద దురాత్మ ఆవేశించగలడు.         పరమాత్మఆవేశించి పల్కిన నరులు మరియు క్రియలు చేసిన వారుః- హానోకు, నోవహు, అబ్రాహము నందు శారాగర్భము లోతును ఉపద్రవమునుండి నెట్టుకొని పోవుట, అపోస్తలుల మీదఆత్మ దిగిరావడము స్టెఫనుకు కల్గిన దర్శనము, ఏసునామమున అద్భుతములు చేసిన గారడివాడు.

        దురాత్ముడు కాలము సంపూర్ణము కాకమునుపే అనగా హత్యద్వారా గాని ఆత్మ ద్వారా గాని చనిపోయిన ఆత్మలు పరమాత్ముని సంకల్పము ద్వారా ఆయువు మూడి పరమాత్ముడు వాటికిచ్చిన కాలనిర్ణయముద్వారా గాక అకాలముగ శరీరమును వీడినపుడు వాయుమండలాధిపతియను ఈ దురాత్మ తన కూటమిలో చేర్చుకొని తన చిత్తము చొప్పున వాటి ఆఆత్మలు ఏయే ఆశలలో ఉన్నవో ఆ ఆశలను అనుసరించి వాటిని త్రిప్పుచు నరులను పీడింపజేయును.  ఈ విధంగా ఏసుప్రభువు వెళ్ళగొట్టిన దయ్యములు ఈ రకమైనవియో నేడు అపవిత్రాత్మ పట్టి మన ఇండ్లలో తిరుగు దయ్యములు కూడా ఈ కోవకు చెందినవియే.

        జీవాత్మః- దీనికి స్వయం సృష్టాత్మక శక్తిలేదు.  పరమాత్ముడు రూపించిన ఆకారములలో ఇది ప్రవేశించును.  దీని జ్ఞానమునకు నిశ్చలతయనునది లేదు.  ఇది ఎటుబడితే అటు సంచరించును.  దీనికి ఆకలి దప్పిక నిద్ర అను శారీర గుణములను మరియు గలతీ 5:19లో వలె పరమాత్మ వ్యతిరేక కార్యములు అనగా శారీర సంబంధ గుణములు గల్గి పరమాత్ముని కంటెను ఎక్కువగా ఇది భూలోకమునకే ఇది విధేయత కల్గియుండును.        

        పరమాత్మ ధరించునది మహిమ రూపము. దురాత్మ ధరించునది మాయరూపము. దురాత్మ తాత్కాలికముగా ధరించుమాయరూపములేవి? మంత్రగాళ్ళచేత త్రేళ్ళు-పాములు సృజింపబడి అదృశ్యములగుట.  మోహినీ మొదలైన పిశాచ రూపము అప్సరస స్త్రీలుగా వచ్చి పురుషులను పీడించుట మొదలైనవి.

        ఆది 37:7-9 యూదా జ్యేష్టకుమారుడైన ఏరు ఆతని సహోదరుడైన ఓనానును చంపుటలో దేవుని ఉద్దేశ్యముః-

        ఓన చేయవలసిన క్రియ తన అన్నభార్యకు మరిది ధర్మము నెరవేర్చి అన్నయొక్క వంశావళిని నిల్పుటయైయున్నది.  ఓనాను అట్లు చేయక స్వార్ధపరుడై అనగా ఓర్వలేని వాడును తన అన్న వదినల కుటుంభ శ్రేయస్సు కోరనివాడును స్వలాభాపేక్షతో వదినతో సంభోగించియు నరభీజోత్పత్తికి మూలకారకమైన ఇంద్రియమును సంభోగసమయమున నేలవిడుచుటలో శిశుహత్యతో సమానమని ఎంచి పరమాత్ముడు అతనిని చంపెను.  పుట్టబోవు శిశువును చంపినట్లుగ ఇందుగమనించవలెను.  ధర్మశాస్త్రము యొక్క న్యాయమును గుర్తెరింగిన ఓనాను తొలుత తన అన్న ధర్మశాస్త్ర విరోధియై మరణమును సంపాధించుకున్నాడు.  అను విషయము విస్మరించి అన్న వలనే మరణపాత్రమైన క్రియను జరిగించుటలో దేవుని తప్పేమున్నది?

        మోషే పెద్దవాడైనపుడు తన జనులలో నొక ఇబ్రీయుని నొక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను.  ఇందు విషయమును గూర్చిః- ఈ భూలోకము సర్పము మాటలు విని సర్పస్వభావము దాల్చినపుడు అనగా నరులను తమరణమనునట్టి మృత్యువు అనుక్రియతో కాటువేయుచున్నదైనపుడు పాముకు విరోధి ముంగిస  పామును చంపసమర్ధుడు ముంగిసుడే.  భుజంగమును కడతేర్చుటకు సమర్ధుడు ముంగిసయే.  అదే విధముగా దేవుని యొక్క దృష్టికి ఐగుప్తీయుడగు భూసంబంధి దైవసంబందియగు హెబ్రీయుని కాటు వేయచూచినపుడు ఐగుప్తీయుడైన సర్పసంబంధికి ప్రత్యర్థియైన ముంగిసుడైన మోషే ఆ భుజంగపుత్రుని కడతేర్చి తన స్వజాతియైన ఇశ్రాయేలును రక్షించుటలో మోషే ఏ విధంగా నరహంతకుడయ్యెను,.  సృజన రక్షకుడు కాడా? ఇట్టివాడు పై గంబరుడనుటకు యోగ్యుడు కాడా? ఇట్టి వాని న్యాయమును గుర్తించి దానిని నరహత్యగా భావించకుండ శతృసంహారమును గావించి మోషేను ఇశ్రాయేలీయుల ప్రవక్తగా నియమించుటలో క్రైస్తవ దేవుడు ప్రభావవంతుడా? లేక గోచీ పెట్టుకొని శిఖను, గడ్డమును పెంచుకొని అడవిలో కొక్కెర జపమును ఆచరించి తమ్మాశ్రయించిన రాజులను పుత్రకామేష్టి యాగమను సాకు బెట్టి వారి భార్యలకు గర్భమును ఇచ్చి ఆ రాజులను నపుంసకులుగా మార్చి రాణివాసములను చెరచు సన్యాసియా? ఈ ఆటవిక దేవుడు.  ఈ కాషాయాంబరులా? లేక సృష్టికర్తయైన క్రైస్తవ యెహోవా దేవుడా? ఆర్యసమాజమా! మేలుకో!

  చివరిగా ఒక మాట

ప్రభువునందు సహోదరీ సహోదరులారా!  

  1. ఈ పుస్తకమును చదువుచున్న మీకు ఏమైన అనుమానాలు ఉన్నట్లయితే,
  2. ఈ పుస్తకములోని సారాంశములో లోపమును మీరు గ్రహించినట్లయితే,
  3. దీనిలో విభాగములు పూర్తిగా వివరించనట్లు మీరు గ్రహించినట్లయితే,
  4. పవిత్ర గ్రంథమునకు వ్యతిరేకమైన అంశములు మీరు ఇందులో చూచినట్లయితే,
  5. మీ హృదయము నుండి ఈ అంశమును కలిపిన మరింత బాగుండునని ఆలోచన వచ్చినట్లయితే, ''దయవుంచి నాకు వ్రాయండి.'' (email: FaithScope@thamu.com)

        దీని వలన, మేము మీ యొక్క సహాయ సహకారాల వల్ల తరువాత ముద్రణలో ఈ పుస్తకము అన్ని కోణాలలో అందముగా తీర్చిదిద్ది అందించగలము. ఆమేన్‌.

శేఖర్ రెడ్డి గారు వ్రాసిన పుస్తకములు: 

  1. ఏడు అను సంఖ్యలోని సర్వసంపూర్ణత  
  2. లోకానికి బైబిల్‌ సవాల్‌ - పార్ట్‌ 1-5
  3. మరణము తరువాత  
  4. నా ప్రభువు తల్లి
  5. ఏదెనులోని దైవప్రణాళిక  
  6. సున్నతి - బాప్తిస్మము  
  7. దేవుని దూతలు - వారి పరిచర్యలు
  8. జేసునాథుని దివ్య వాక్కులు  
  9. ప్రవక్తల ప్రవచనములు - పరమార్థములు  
  10. ప్రకటన గ్రంథ రహస్యములు ఇప్పుడు మీ చేతిలో
  11. పరమగీతము
  12. సాటి సహాయిని

వీటిని మీరు www.FaithScope.com ద్వారా ఉచితముగా పొంద వచ్చును.