కీర్తనలు

గ్రంథకర్త : శేఖర్‌రెడ్డి వాసా

www.FaithScope.com

నీ మరణానంతరము నీ ఆత్మ ఎక్కడ వుండబోవుచున్నదో నీకు తెలుసునా?

మూలము

రెడ్డిపాళెం గ్రామములోని నా ప్రభువు తల్లి ఉపదేశములు మరియు ఆమెను ఆవరించిన పరిశుద్ధాత్మయొక్క జ్ఞాన సహాయమే ఈ పుస్తక రచనకు మూలాధారము.

అంకితము

ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించి నన్ను ప్రేమించిన క్రీస్తు ప్రభువుకు అంకితమిస్తున్నాను. -  వాసా శేఖర్‌రెడ్డి

                 1.  కీర్తన1:1-3

        దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక - అపహాసకులుకూర్చుండు చోటును కూర్చుండక - యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించు వాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక  తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును. అతడు చేయున దంతయు సఫలమగును.

        ప్రియ శ్రోతలారా! పై కీర్తన భాగములో మొట్ట మొదటగా దుష్టుల ఆలోచన చొప్పున నడువక - పాపుల మార్గములో నిలువక '' అనుటలో ఈ దుష్టులెవరో - ఆ పాపులెవరో మనము తెలిసికోవలసియున్నది. సర్వ సాధారణముగా లోక సంబంధముగా దుష్టులు అంటే నర హంతకులు వ్యభిచారులు విగ్రహారాధికులు వగైరాలను లోక సంబంధముగా దుష్టులంటున్నారు. కానివాస్తవానికి  దుష్టులెవరో మనము తెలిసికోవలసియున్నది.

        మత్త 26:3 పరిసయ్యులు, సద్దూకయ్యులు, ధర్మ శాస్త్రోపదేశకులు యాజకులు ప్రధాన యాజకులు. ఇందులో

1. పరిసయ్యులు :- పరిసయ్యుడనగా - దేవుని బిడ్డగా పిలువబడుచు, దైవాచార పరాయణుడై దేవుని ధర్మశాస్త్రమును దాని విధులను నిష్ఠా గరిష్ఠతతో పాటించువాడు. ఇతనిని గూర్చి యోహా 3:1-4 చదివితే ఈ పరిసయ్యుని యొక్క జ్ఞానము తెలియగలదు. అనగా పరిసయ్యడు యూదులకు అధికారిగా వుండి తన మతాచారమే దైవము అని మత ధర్మాన్ని నెరవేర్చుటన్నది తప్ప మరి ఏ విధ”మైన క్రియతో దైవత్వాన్ని తృప్తి పరచలేమన్న సిద్ధాంతము గల వాడని దీని సారాంశము. ఈ పరిసయ్యుడు యోహా 3:10 లో ఇశ్రాయేలుకు బోధకుడుగా వున్నట్లు తెలియు చున్నది. కనుక ఈ పరిసయ్యుడు అను  వాడు వేదాంతిగా ఆదినములలో చెలామణియైనట్లు తెలియుచున్నది.

        ఇక రెండవది శాస్త్రులు :- ధర్మ శాస్త్ర విధులను విధిగా ప్రజల చేత ఆచరింపజేయుటకు తత్సంబంధమైన  శాస్త్ర పరాయణుడు అనగా గృహ నిర్మాణము బిడ్డల ప్రతిష్ఠ, వారి జన్మ కాలములను గూర్చి నరుల భవిష్యత్తును గూర్చిన సంఘటనల పరిజ్ఞానము మరియు ఏ కార్యము చేసినను శాస్త్ర రీతిగా జరిగించెడి వారు. ఇశ్రాయేలు జనాంగమునకు ప్రజల చేత నియమించబడిన వారే వీరు. ఒక విధముగా మత్త 23:3లో మోషే యొక్క పీఠమును అలంకరించునంతటి యోగ్యత గలవారు. వీరు భక్త కోటి మీద ఆచరింపలేనంతటి ఆచారమును బరువుగా మోపి మనుష్యుల యొక్క మెప్పును పొందాలని దైవత్వమునకు ప్రీతి లేని - స్వ జ్ఞానము తో కూడిన క్రియలను జేయుదురు. మత్త 23:5 లో వలె తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవి గాను జేయుచు విందులలో అగ్రస్ధానములను సమాజ మందిరాలలో అగ్ర పీఠములను సంత వీధులలో వందనములను మనుష్యుల చేత బోధకులని పిలువబడుటకుకోరెదరు. అందుకే వీరిని గూర్చి మత్త 23:13 లో -అయ్యో! వేషధారులైన శాస్త్రులారా! పరిశయ్యులారా! అని ప్రభువు అంటున్నాడు. వీరిని గూర్చి ఇదే సువార్తలో 23:14-15లో వీరి గుణాతిశయములను గూర్చి వివరిస్తూ - మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు.

        మత్త 23:15 అయ్యో! వేషధారులైన, పరిసయ్యులారా! ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినపుడు అతని మీ కంటె రెండంతలు నరక పాత్రునిగా చేసెదరు. మరియు 23:23 లో వేషధారులైన శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి దేవునికి దశను భాగము ఇవ్వవలసిన కార్యక్రమాన్ని నిష్ఠాగరిష్ఠతతో నెరవేరుస్తు ధర్మ శాస్త్రములో ప్రధానమైన న్యాయము కనికరమును విశ్వాసమును విడిచి పెట్టిన  అంధులైన మార్గదర్శులు. ఇట్టి వారిని గూర్చి మత్త 23:24 లో దోమ లేకుండ వడియ గట్టి ఒంటెను మ్రింగువారు. ''అని ప్రభువు అభివర్ణించి యున్నాడు. 25వ వచనములో వెలుపట శుద్ధి జేయబడి లోపట అశుద్ధముగా నున్న పాత్రలకు ఇట్టి వారిని ప్రభువు పోల్చినట్లు చదువగలము. 27లో శాస్త్రులు పరిసయ్యులను గూర్చి '' - సున్నము గొట్టిన సమాధులకు వారిని పోల్చినట్లు అనగా శృంగారముగా అలంకరించబడిన సమాధులు సున్నము పూయబడి చిత్ర విచిత్రమైన అలంకరణలతో వున్నను వాని లోపల చచ్చిన వారి ఎముకలు సమస్త కల్మషాలు నిండియున్న రీతిలో వీరిని పోల్చి యున్నాడు. అదే విధముగా 29 లో శాస్త్రులు పరిసయ్యులు ప్రవక్తలను చంపి సమాధి జేసి పీతి మంతులను హతమార్చి వారి గోరీలను శృంగారించి ఆరాధించువారు. ఇట్టి వారి ఆలోచనల ప్రకారము నడవ కూడదని భావము.

        ఇక సద్ధూకయ్యులు అంటే సద్ధర్మ ఆచరణ పరాయణులు అనగా మతపరమైన సమస్త ఆచారములను పద్ధతులను ఆచరిస్తూ తమ  మటుకు తామే నీతి మంతులమని ప్రకటించుకొనేవారు. నరునికి పునరుత్థానము లేదని వాదించువారు. యాజకులు దేవుని బలి పీఠము యొక్క పరిచర్యలో ప్రాతినిత్యము వహించి దేవుని ప్రజలు అర్పించు అర్పణలను దేవుని సన్నిధిలో అనగా బలి పీఠము మీద వుంచి భక్తులను గూర్చి దేవునికి విన్నపము జేసి ఆరాధించే వారు. ప్రియ శ్రోతలారా! ఇట్టి వారు ప్రభువు యొక్క దృష్టిలో దుష్టులుగా వివరించబడియున్నది. ఎందుకంటేె క్రీస్తును ఎవరైతే అంగీకరించరో వాడు దుష్ఠ్టుడే! కనికరము దయ ప్రేమ సహనము ఎదుటి వారితో సఖ్యత ఎవడికైతే వుండదో అతడెంతటి భక్తుడైనను వ్యర్ధుడే! కనుక దుష్టుని ఆలోచన చొప్పున నడవకుము.         

        పాపుల మార్గము అనగా దుష్కార్యములు చేయు వారితో పొందిక లేక సాపపు క్రియలు చేయుచున్న వారి యొక్క స్థలములలో  వుండుటయు, వారున్న మార్గములో నడుచుటయు అపహాసకులు కూర్చుండు స్థలములో కూర్చుండి వారితో కూడిక, వారి ననుసరించి వారు చేయచున్న పనులను ఆమోదించి వారితో సఖ్యత గల్గి జీవించుటయు అనగా వారుండు స్థలములలో         దైవ విశ్వాసిగా కూడని పనియనియు         - దైవ విశ్వాసిగి వున్న వాడు దేవుని ధర్మ శాస్త్రాన్ని ఆచరిస్తూ దివారాత్రులు దానిని ఆధ్యయనము చేయుచు దాని యందు ఆనందిస్తూ జీవించు వాడే! నిజమైన దైవ విశ్వాసియు ఆత్మీయమైన వ్యక్తిగా ఎంచబడునని అట్టివారు చేయునదంతయు సఫలమౌతుందని ఈ కీర్తనలోని భావము. నిజమే! ఎవరైతే ప్రతినిత్యము వేద పారాయణము దైవ సిద్ధాంత ఆచరణ క్రీస్తు ప్రేమ, క్రైస్తవ సావాసము, క్రీస్తు యొక్క ధ్యానము  ప్రార్ధన, పొరుగు వారి యెడలను విధవరాండ్ర యెడలను సయోధ్య గల్గి క్రీస్తు మార్గమును అనుసరించునో అట్టి వానిలో క్రీస్తు ఆత్మ క్రియ జరిగిస్తుంది. ఇదే కీర్తన చివరి భాగములో నీటి కాలువల యోర నాటబడినదై సకాలమునకు ఫలమునిచ్చు చెట్టునకు ఇట్టి వానిని పోల్చియున్నాడు. ఈ విధముగా జీవించిన వ్యక్తులు లేకపోలేదు. పాత నిబంధనలో ప్రవక్తలు రాజులు న్యాయాధిపతులు ఈ కోవకు చెందిన వారే! అయితే నూతన నిబంధన వచ్చు సరికి క్రీస్తు ద్వారా మలుపు దిరిగి మరెక్కువగా ఇట్టి వారికి ప్రాధాన్యత లభించునట్లు కొర్నేలి చరిత్ర లూదియా చరిత్ర వివరిస్తున్నది.

        1-1-6    1. నీతిమంతుడు

        ప్రియ పాఠకులారా! మొదటి కీర్తన మొదటి చరణములో ''దుష్టుల ఆలోచన చొప్పున నడువక'' అనుటలో దుష్టుడంటే విరోధి లేక అపవాది మరియు అలౌకిక శక్తి'' దుష్టుని ఆలోచన యావత్తును దుర్మార్గముగానే వుంటుంది గాని సన్మార్గములో వుండదు. దుష్టుని ఆలోచన ఒక మంచిని చెడగొట్టి కార్యము యావత్తును పాడుచేయుటకు క్రియ జరిగిస్తుంది. దుష్టుని ఆలోచన కీడునే శంకింపజేస్తుంది. దుష్టుని ఆలోచన అన్నది దుర్మార్గానికే తప్ప సన్మార్గునికది సన్నిహితం కాదు. కనుక దుష్టుని ఆలోచనతో నడవకూడదంటున్నది.

        ఇక పాపుల మార్గము అంటున్నాడు. కనుక దుష్టుల ఆలోచన పాపికిని అతని మార్గమునకును యోగ్యకరంగా వుంటుంది. వినుటకును ఆచరించుటకును యోగ్యకరమై వుంటుంది. పాపుల మార్గమన్నది దుష్టునికి రాచ బాట. దుష్టుని ఆలోచన యన్నది పాపికి అమూల్యమైన సాధనము.

        కనుక ప్రియ పాఠకులారా! దుష్టుల ఆలోచన చొప్పున నడిచిన రాజులను గూర్చి వేదములో ఈ సమయములో మనము ముచ్చటించుకొందాము. ఎస్తేరు గ్రంధములో దుష్టుడైన ఆమాను యొక్క సంభాషణలు అతని ప్రవర్తన అతని సలహాలు, పార్శీ రాజైన ఆశ్వారోషు కెంతో ఆమోదకరంగాను, యోగ్యకరమైనవిగాను, అమూల్యమైనవి గాను ఎంచబడినవి. ఆమానును రాజు ఎంత ఎక్కువగా ప్రేమించాడంటే వేదంలో యూదా వంశమైన యూదుల జనాంగమును సమూలంగా నిర్ధాక్షిణ్యంగా  అంతం చేయుటకు రాజ శాసనాన్ని పుష్టించగల స్థితికి దుష్టుడైన ఆమాను ఆలోచనలు క్రియ జరిగించాయి. ఈ విధంగా దుష్టుడైన ఆమాను యొక్క ఆలోచన చొప్పున నడిచిన  పార్శీ రాజైన ఆశ్వారోషు యొక్క స్థితి రాజునే అంతం చేసి - ఆమాను రాజ్యాధికారాన్ని కైవసం చేసుకొనే ఆలోచనకు వచ్చినట్లు ఎస్తేరు గ్రంధములో చదువగలము.

        అదే విధంగా రాజుల గ్రంధంలో ఆహాబు రాజు-దైవజనాంగమైన ఇశ్రాయేలుకు రాజుగా వుండి దుర్మార్గులైన ఎజిబేలును తన భార్యయొక్క ఆలోచన ప్రకారము, సలహాల ననుసరించి నిర్దోషియైన నాబోతును ద్రాక్షతోటను బట్టి నిర్ధాక్షిణ్యంగా చంపించి ద్రాక్షతోటను కైవసం చేసుకొన్నాడు. ఈ విధంగా హంతకియు దుర్మార్గురాలైన భార్య మాటలకు దాసుడై పరిపాలనచే ఆహాబు రాజు యొక్క పరిపాలన ఎంతో కాలం నిలువలేదు.

        అదే విధంగా ప్రియ పాఠకులారా! ఆదిలో ఏదేను నుండియే దుష్టుల ఆలోచన చొప్పున నడుచుటన్నది నరులకు గురుత్వమైనది.చెట్టులోని పాము పురుషుడు లేక ఒంటరిగా  వున్న స్త్రీ తో సంభాషిస్తూ దైవ వ్యతిరేకమైన బోదన కపటమైన ఆలోచనలతో కూడిన సంభాషణచేసి నర జంటను పదవీచ్యుతులను చేపి వారిని తోట నుండి గెంటి వేయుటకు కారణమైంది. ఇది దుష్టుని బోధ.

        దుష్టుని ఆలోచన :- ఇట్టి ఆలోచనలు నేటికిని దుష్టుడు నర కోటిలో తన శాయశక్తులా గల్గిస్తూ క్రియ జరిగిస్తున్నట్లు నేటి రాజకీయ నాయకుల హత్యలు, వర కట్నాల చావులు, దేశాన్ని పరిపాలించే మంత్రులపై కుట్రలు, కుత్సితములతో కూడిన మారణ హోమము వరకు దారి తీస్తున్నది. దుష్టుని ఆలోచనలతో కూడిన తీపి మాటలే నేటి లోకమునకు మూలబాటలుగా వున్నాయి గాని నరునిలోని ఆత్మ జ్ఞానము, స్వయం శక్తి నశించి పోయే కాలమేర్పడి వున్నది.

        ప్రియ పాఠకులారా! ఇదే వాక్యంలో 3వ చరణం అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అనుటలో '', ఈ అపహాసకులు వేదంలో ఎవరో ఈ సమయంలో మనము తెలిసికోవలసియున్నది. మొట్టమొదటగా అపహాసకుల ఆదికాాండ :- నోవహు విషయంలో తీసుకుంటే నోవహు దైవ నిర్ణయానుసారం ఆయన ప్రణాళికానుసారం ఓడ నిర్మిస్తూ దైవోగ్రతకు సంబంధించి లోకము మీదకు రానైయున్న జల ప్రళయాన్ని గూర్చి ప్రకటిస్తున్న సమయంలో ఆయన మాటలను అల్లుళ్ళు నమ్మలేక ఆయనను అపహసించినట్లు మనము వేదంలో చదువగలము. ఇక రెండవదిగా లోతు చరిత్రలో తీసుకుంటే లోతు యొక్క అల్లుళ్ళు లోతు యొక్క భక్తి విశ్వాసాలను హేళన చేసి ఆయనను అపహసించి ఎగతాళి చేసినట్లుగా వేదంలో చదువగలము.         

        అదే విధంగా యాకోబు కుమారుడైన యోసేపు తన కొచ్చిన కలలను అన్నలకు వివరిస్తూ చెప్పిన సంధర్భములను తన అన్నలు నమ్మక అతనిని ఎగతాళి చేసినట్లుగా వేదములో చదువగలము. అదే విధముగా కనులూడబెరికి దాగోను ఆలయంలో గొలుసులతో బంధింపబడిన సంసోనును పిలిష్తీయులు ఎగతాళి చేస్తూ అపహసించి తమ క్షుద దేవతయైన దాగోనును హెచ్చించి దైవ బలుడైన సంసోనును తిరస్కరించినట్లు వేదంలో చదువగలము. ఇక ఏసు ప్రభువు విషయంలో యూదులు లోకప్థులు తుదకాయన శిష్యులు కూడా ఆయనను అపహసించినట్లుగా వేదంలో చదువగలము. ఈ అపహాసకులను వారు నేటికిని క్రైస్తవ సువార్తనంగీకరించక క్రీస్తును గూర్చి విమర్శించుచు అపహసించే రకాలు నేటికిని ఉన్నారు. కనుక ఇట్టి వారుండు స్థలములలో నీతి మంతుడు నిలువ దగడని ఈ వచన భావము.

        ఇక రెండవ వచనము : యెహోవా ధర్మ శాస్త్రము నందు ఆనందించుచు'', అనుటలో యెహోవా ధర్మ శాస్త్రమంటే ఆయన మనకను గ్రహించిన విధులు నియమాలు హిత వాక్యాలు సిద్ధాంతాలు వగైరాలు, యెహోవా ధర్మ శాస్త్రమనగా ఒక ప్రత్యేకమైన జీవయుతమైన వాక్య సముదాయంతో కూడిన గ్రంధము.

        ప్రియ పాఠకులారా! నేడు లోకములో అనేకమైన శాస్త్రాలున్నాయి. అందులో ఖగోళ శాస్త్రము, భూగోళ శాస్త్రము, గణితము, సాంఘిక శాస్త్రము, సాంకేతిక శాస్త్రము, కళలు, శిల్ప శాస్త్రము, వగైరాలున్నవి. కాని ఇవన్నియు లోక సంబంధమైనవి మరియు శారీర జ్ఞానమునకు తోడ్పడునవి.

        అయితే యెహోవా ధర్మ శాస్త్రము ఆత్మ సంబంధమైయుండి అదృశ్యములో ఉన్న అదృశ్య రాజ్య సంబంధమైన విధులు యోగ్యతలు అందుకు కావలసిన పరిజ్ఞానము - ఆ అదృశ్య రాజ్యంలో  ప్రవేశించుటకు నరునికి కావలసిన యోగ్యతలు ఇందులో పొందు పరచియున్నవి. మరియు గొప్ప విశేషమేమిటంటే లోక సంబంధమైన శాస్త్రాల్లో జీవము లేదు. క్రమము లేదు. అయితే యెహోవా ధర్మ శాస్త్రంలో జీవము క్రమము యదార్ధత వగైరా గుణాలున్నవి. అట్టి గుణాలుండ బట్టే యెహోవా ధర్మ శాస్త్రము భూమిపై క్రియ జరిగిస్తూ - దైవ జనాంగమైన ఇశ్రాయేలుకు ఆచరణీయమైన మరియు క్రమ శిక్షణాయుతమైన గ్రంధంగా ఈ ధర్మ శాస్త్రము క్రియ జరిగించి యున్నది. ఈ ధర్మ శాస్త్ర విధులను నిరాకరించిన వానికి ఆ విధులను తప్పి ప్రవర్తించిన వానికి తగు శిక్ష కూడా ధర్మ శాస్త్రమే విధించేది.

        ఇందును బట్టి చూడగా ఈ ధర్మ శాస్త్రంలో న్యాయ శాస్త్రంకూడా మిళితమై యున్నట్లు మనము గ్రహించాలి. దోషికి ఎట్టి శిక్ష విధించాలో కూడా ఈ ధర్మ శాస్త్రంలో వివరించబడియున్నది. కనుక ఇట్టి ధర్మశాస్త్రమును బహు జాగురూకతతో పఠించుచూ దాని విధులను నెరవేరుస్తూ దానిని ఆచరిస్తూ జీవించుచూ దానియందు ఆనందించుట అనగా ధర్మ శాస్త్రంలో వివరింపబడిన విధులు ఆచరించ వలసిన ఆచరణలు గూర్చిన పరిజ్ఞానము గల్గి అందులో లీనమై ధర్మ శాస్త్రములోని - అదృశ్యంలో వున్న ఆత్మీయ పరిజ్ఞానమును ఆనందిస్తూ దివారాత్రములందులో లీనమైయున్న వానికి దైవత్వమన్నది కరతలామలకమని దీని భావము. ఇందుకు బైబిలులో కొందరి జీవితాలను మనము తెలిసికోవలసియున్నది.

        ఆది కాలములో యోబు ఇతని సత్ప్రవర్తన నీతి - పరిశుద్ధత అన్నది దేవుని యొక్క ధర్మశాస్త్రము యొక్క గుణాలను స్పురింపజేసింది. క్రియా మూలకంగా దేవుని యొక్క ధర్మ శాస్త్రాన్ని ఆచరించిన వాడు యోబు అని గట్టిగా చెప్పవచ్చును. ఎందుకనగా అతని హృదయములో గాని ప్రవర్తనలో గాని నిజాయితీలో గాని నీతిలో గాని ఎటువంటి లోటు పాట్లు లేవు. అందువల్ల దేవుడు సాతానుతో యోబును గూర్చి సవాలు చేస్తూ, నీ సేవకుడు యోబును గూర్చి నీవెరుగుదువా? అతని వంటి వాడు లోకంలో ఎవడు లేడని సవాలుకు దారిదీసింది. ఇక యాకోబు కుమారుడైన యోసేపు విషయములో ఇతను దేవుని ధర్యశాస్త్రము యొక్క విధులను ''తూచా'' తప్పకుండా నెరవేరుస్తూ ప్రవర్తనలోను క్రియా కర్మలలోను దేవుని యందు భయ భక్తులు గల్గి దేవునికి భయపడి  జీవించినట్లు, అట్టి యదార్ధ జీవితాన్ని బట్టి దేవుని చేత హెచ్చించబడి, ఫరో చేత సన్మానించబడి, ఐగుప్తు రాజైన  ఫరో యొక్క రాజ్యానికిని అతని యొక్క సమస్త సంపదమీదను అధిపతియై, ఏలికగా నియమింపబడినట్లు చదువగలము. ఇందుకు కారణము యెహోవా ధర్మ శాస్త్రమును ఆచరించి ఆనందించుటయే:

        ప్రియ పాఠకులారా! ఇక అనేక మంది పాత నిబంధనలో ధర్మ శాస్త్రము నందు ఆనందించిన వారున్నారు. ఇందులో ఎక్కువగా ప్రశంసింపదగిన వారు. ఈ కీర్తనా కారుడైన దావీదు. ఈయన యెహోవా యొక్క ధర్మ శాస్త్రమును ఆచరించుటలో అనుభవ పూర్వకముగా ఆచరణాను భూతిని పొంది కీర్తనలు వ్రాసినట్లు మనము గ్రహించగలము. ఇక నూతన నిబంధన కాలంలో కొర్నేలి జీవితము ప్రశంసింపదగినది.

        ఇక నీటి కాలువల యోరను నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అంటే ఏమిటో మనము తెలిసికోవలసియున్నది. ఈ జాబితాలో చేర్చదగిన వ్యక్తులను గూర్చి బైబిలులో మనము చదువగలము. ఆకు వాడక అనగా సారవంతమైన జీవితము, జీవము గల జీవితము. ఇందులో చేర్చదగిన వారు అబ్రాహాము, ఈయన యొక్క జీవితము యావత్తును జీవము గల జీవ జలమైయున్న దేవుని యొక్క నిర్ణయానుసారము ఆయన వాక్కును బట్టి సంచరించి తిరిగి సంతాన హీనత్వంలో వున్న తన జీవితంలో దేవుని సన్నిధానమును నీటి కాలువ యోరన నిలబడినవాడై నూరేండ్ల తన వృద్ధాప్యములో తొంబయి ఏండ్ల తన భార్య వృద్ధాప్యములో ఆకువాడక అనగా కామేచ్ఛలు ఉడిగి పోక మరియు సంతానసారమును కోల్పోక దైవత్వం యొక్క నిర్ణయ కాలంలో అనగా దేవుడు నిర్ణయించిన సమయంలో దేవుడు అనుకున్న సమయంలో దైవత్వమునకు అనుకూల సమయంలో సకాలంలో రెండు గర్భఫలాలను లోకానికి అనుగ్రహించాడు. ఇందులో ఒకడు ఇస్సాకు, రెండవ వాడు ఇష్మాయేలు.

        ఇష్మాయేలు నీటి కాలువ యోరను పడవేయబడిన వాడు. ఇస్సాకు జీవాధిపతియై జీవ జలమైయున్న దేవునిలో నాటబడినవాడు. కనుక వారి ఫలాలు నేటికిని  విస్తరించి ప్రపంచ జనాభాలో ప్రథమ జన సంఖ్య ద్వితీయ జన సంఖ్యగా లెక్కింపబడి యున్నది. ''వారు చేయునదంతయు సఫలమగును. కనుక         అబ్రహాము, ఇస్సాకులు చేసిన ప్రతి పనియు వారి సంతానములైన యాకోబు, యోసేపు, దావీదు, సొోలోమోను వగైరాలు చేసిన పనులన్నియు కూడా నేటికిని సఫలీకృతములై భూమి మీద స్థిరత్వము పొందియున్నట్లు వేదములోను లోక చరిత్రలోను ప్రత్యక్ష పరచబడియున్నది.

        ఇక ''దుష్టులు ఆలాగుననుండక గాలికి చెదరగొట్టు పొట్టువలె నుందురు''. అనుటలో ఏసు ప్రభువు చెప్పిన విధంగా ప్రభువు రాకడలో గురుగులను గోధుమలను దుళ్ళగోట్లు సందర్భములో గట్టి గింజలైన గోధుమలు ఒక చోటను, చచ్చు గింజలైన గురుగులు గాలికి మరియొక చోటను ఎగిరి పడునట్లు, మరియు గోధుమలను దంచగా జాడించు సందర్భములో పొట్టు వేరు, ధాన్యము వేరు అగునట్లుగాను'' అనుటలో - గోధుమలు విశ్వాసులు - గురుగులు పొట్టన్నది ఇందులోని సారాంశము. అయితే ఈ పొట్టును చెదర గొట్టు గాలి ఎవరు? అంటే పరిశద్ధాత్ముని దేవుని శక్తి అపో 2: లో బలమైన గాలియై వీచగా గట్టి విశ్వాసులైన అపోస్తలులు ఆత్మవశులై నానా భాషలు మాట్లాడినట్లు వేదంలో చదువగలము. ఇందును బట్టి దేవుని ఆత్మ బలమైన గాలియే వీచగా ఈ గాలి శక్తికి విశ్వాసులు వేరు అవిశ్వాసులు వేరుగా విడిపోయి నిజమైన విశ్వాసులు దైవ సన్నిధిలోను, అవిశ్వాసులు దైవ సన్నిధికి బాహ్యములోను చెదరి పోవు స్థితి వున్నది.

        ఇందుకు తార్కాణము బాలుడైన దావీదు నావరించిన దైవాత్మ ధాటికి లోక సంబంధము అన్యుడును దైవ వ్యతిరేకియునైన గొలియాతు బలవంతుడైనప్పటికి దేవుని యొక్క సన్నిధిలో దైవాత్మ యొక్క పీడన శక్తికి పొట్టు వలె ఎగిరిపడినాడు. అదే విధంగా దావీదు చేపిన యుద్ధములలో ఇశ్రయేలు పక్షంగా సైన్యాధిపతియైన  దైవాత్మ శక్తికి ఇశ్రాయేలుయొక్క శతృసమూహములు గాలికి చెదరగొట్టబడిన పొట్టు వలె కకావికలైనట్లు దైవ జనాంగమైన ఇశ్రాయేలు చేసిన యుద్ధాల చరిత్రలు వివరిస్తున్నవి. ఏసు ప్రభువును యూదులకు అప్పగించిన ఇస్కరియోతు యూదా క్రీస్తు సన్నిధి నుండి విడిపోయి ఉరివేసుకొని ఎగిరిపడి చనిపోయాడు. ఆననీయ, సప్పీరాలు అపోస్తలుల సన్నిధిలో అబద్ధాలాడి పరిశుద్ధాత్మను మోసగించి సరిశుద్ధాత్మ ప్రభావమున భార్య భర్తలిరువురును ఏక కాలంలో వాయువులలో కలిసి పోయారు. ప్రియ పాఠకులారా : ఇది దుష్టుల యొక్క నిర్మూలనకు సాదృశ్యము.

        ఇక న్యాయ విమర్శలో దుష్టులు నీతిమంతుల సభలో పాపులును నిలువరు'', అనుటలో మొదటిది న్యాయ విమర్శ, ఏదేను వనములో దేవుడు నరులను సృష్టిని గూర్చి విమర్శచేయు సందర్భములో సర్పానికి శిక్ష పడింది, సృష్టికి శాపమొచ్చింది. ఈ ముగ్గురును దైవ సన్నిధి చేత వెలి వేయ బడినారు. ఇక దేవుడు కయీనును విచారించు సంధర్భములో కయీను దైవ సన్నిధిలో నిలువ లేక దేశదిమ్మరి అయ్యాడు. బాబేలు గోపుర నిర్మాణంలో దేవుడు దిగి వచ్చి నరుల యొక్క స్వార్థపూరితమైన కుత్సిత వైఖరిని గూర్చి విచారించి నరుల యొక్క స్వావార్ధ చింతనకు వారి యొక్క భాషలను తారు మారు చేసి విరు చేయుచున్న పనిని నిరోధించాడు. దావీదు చేసిన యుద్ధములలో ఇశ్రాయేలీయుల ధాటికి అన్య రాజులు నిలువ లేక సలాయనము చిత్తగించినట్లుగా పరాజయం పొందిసట్లును అదే విధంగా గిద్యోను చేసిన యుద్ధములో గిద్యోను ఏ ఆయుధమును చేత పట్టకయే కుండ దివిటీతో 300 మంది అనుచరులను వెంటబెట్టుకొని వేలకొలదిగా వున్న మిధ్యానీయుల సైన్యమును చెదరగొట్టగా గిద్యోను యొక్క ధాటికి మిధ్యానీయులు నిలువలేక పరాజితులైనట్లు వేదంలో చదువగలము.

        ఇక నీతిమంతుల సభలో పాపులు'', అనుటలో మొట్టమొదటి నీతి మంతుడు యోబు - ''యోబు యొక్క సన్నిధిలో సాతానుడు యోబు యొక్క పతనానికెంతో తీవ్రంగా కృషి చేసి యోబు యొక్క  విశ్వాసపోరాటము ముందు ఆగలేక పోయినట్లు వేదంలో చదువగలము. అదే విధంగా ఏసు ప్రభువు యొక్క శిష్య కోటిలో యూదా నిలువ లేక ప్రభువు నుండి దూరమై ప్రభువును పట్టించుటకు దుష్టులైన యూదులతో చేరొ కుట్ర పన్నినట్లు ఆ విదంగానే ప్రభువు నప్పగించుటకు కృషి చేసి ప్రభువు నుండి దూరమై ఘోరాతి ఘోరమైన మరణానికి గురి అయ్యాడు.

        నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును''. అనుటలో ప్రియ పాఠకులారా! విశ్వాసియైన అబ్రహాము యొక్క విశ్వాసమార్గాన్ని దేవుడెరిగి యున్నాడు. అదేవిధంగా యాకోబు మార్గములలో దేవుడు నడిచి అతనితో పోరాడి అతనికి ఇశ్రాయేలు అను యేపేరును కూడా అనుగ్రహించినట్లు వేదంలో చదువగలము. మరియు నీతిమంతుల మార్గము నోవహు నడిచిన మార్గంలో లోక నాశనానికి మూలమైన జల ప్రళయంలో నోవహు యొక్క యోడను తన మార్గంలో దేవుడు నడిపించి, నోవహును అతని కుటుంబాన్ని పున:సృష్టికి పునాదిగా ఏర్పరచినట్లువేదంలో చదువగలము. నీతిమంతుల మార్గము - కన్నెకయైన మరియ యొక్క భర్తయైన యోసేపు అతని మార్గాలలో దేవుడు తోడైయుండి లోక రక్షకుడైన ప్రభువు యొక్క జన్మకు మూలమైయున్న యోసేపు కుటుంబములో యోసేపు నడిచిన మార్గంలో దేవుడతనికి తోడైయున్నట్లు వేదంలో చదువగలము. అదే విధంగా యాకోబు కుమారుడైన యోసేపు సత్య వ్రతము నాచరించి సత్యమార్గములో నడిచి ఫరో యొక్క సంస్థానమంతటికిని వారసుడైనట్లు వేదంలో చదువగలము. కొర్నేలి జీవితంలో కొర్నేలి మార్గమును నీతి మార్గముగా ఎంచిన దేవుడు కొర్నేలి యింటికి దేవ దూతను పంపుటన్నది యెహోవాకు తెలిసిన మార్గమైయున్నది.

        ఇక చివరిగా ''దుష్టుల మార్గము నాశనమునకు నడుపును'' అనుటలో ''దుష్టుల మార్గము'' బిలాము నడిచిన మార్గము  దుష్టుల మార్గము బిలామును శాపగ్రస్థుడిగా చేసింది. దుష్టులమార్గము అనగా అబ్షాలోము నడిచిన మార్గము మరణానికి దారితీసింది. ''కోరహు - ధాతాను - అభిరాము'' నడిపించిన మార్గము పాతాళమునకు నడిపించినది - ఫరో నడిచిన మార్గము నీళ్ళపాల్జేపింది. అనగా సముద్రము మధ్య నడిచిన ఇశ్రాయేలును అంతము చేయాలని ప్రయత్నించి ఫరో యొక్క రధాలు, అశ్వాలు, సైనిక సమూహాలు సముద్రము పాలైనాశనకరమైన మరణములోనికి నడిపించింది. నేడు క్రీస్తు నెరుగకుండ లోకాన్ని అనుసరించి లోకంతో సహవసించి దైవ వ్యతిరేకమైన మార్గంలో అనగా క్రీస్తు నెరుగని మార్గంలో నడచు నర జీవితము నాశనానికి నడుపుతుందని మనము గ్రహించబలసి యున్నది.

        ప్రియ పాఠకులారా! ఈ మొదటి కీర్తనలో దైవత్వానికి మానవత్వానికి దుష్టత్వానికి ఫలభరితమునకు ఫల హీనమునకును విశ్వాస జీవితమునకును దాని శ్రేష్టమైన ఈవులకును అవిశ్వాస జీవితమునకును తత్సంబంధమైన నాశనకర ఫలితాలకును ఉన్న తార తమ్యాలను గూర్చి క్షుణ్ణంగా వివరించబడి యున్నది.

        కీర్తనలు 6:5 మరణమైనవారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదరు?

        చనిపోయిన వారికి మాత్రము అనగా శరీరమును ఎడబాపిన ఆత్మలకు మాత్రము పాప క్షమాపణ యొసంగబడదు. ఆత్మ శరీరముతో కూడ వున్నపుడే దాని యొక్క పాప విషయములో దేవుడు దాని మొర ఆలకించి క్షమాపణ దయ చేయును. పాతాళములో పాతి పెట్టబడిన ఆత్మ ఎడబాసిన శరీరముల వలన ఎట్టి ప్రయోజనము లేదో! అంటే శరీరమును ఎడబాసిన ఆత్మ కూడా ప్రయోజన శూన్యమగుచున్నది. కాన శరీరమున్నపుడే అందలి ఆత్మయు - ఆత్మ శరీరంలో నివసించియున్నపుడే శరీరమును ఆత్మయు ఈ రెండు దైవ నీతిలో నిలిచి సత్క్రియలు చేసి నిత్య జీవము పొందవలెను. కాని అది వేరై పోయిన తర్వాత దేవుని తీర్పు కొరకు అవి నిరీక్షించవలెను. కాని ఏ విధమైన అభిమానము ఏ విధమైన క్షమాపణ వాటికి దైవ విషయములో అభించదు. కాన మానవుడు తన మరణగడియ లోపలనే సర్వ సన్నద్ధుడైన దైవ సన్నిధికి దైవ నీతికి దైవ కడ్డలకు లోబడి యుండి దైవ ప్రేమకు దైవ రాజ్య మందిరమునకు వారసులు కావలయును.

         ప్రసంగము :- ముద్దు

మూలము :- కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని యెడల ఆయన కోపించును. కీర్త 2:12 ఇది దేవుని ఉద్దేశ్యము. ఎందుకనగా కీర్త 85:10 దేవుని కృపాసత్యములు కలుసుకొని నీతి సమాధానములు ముద్దు పెట్టు కొన్నట్లు తెలియుచున్నది. ఇది దైవ సత్యము. ఆది 27:26-27 లో ఇస్సాకు యాకోబు తండ్రి కుమారుల ముద్దు ఇది అనుబంధ చిహ్నము. ఆది 29:11-13 మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు, రిబ్కా కుమారుడని రాహేలుతో చెప్పినపుడు ఆమె పరుగెత్తి పోయి తన తండ్రితో చెప్పెను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు  సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరుగెత్తికొనివచ్చి అతని కౌగిలించి ముద్దు పెటుకొని తన యింటికి తోడ్కొని పోయెను''. ఇందులో సంతోష వర్తమానమును గూర్చి వినినప్పుడు జరిగిన క్రియ. లాబాను విషయంలో ఆది 45:15 యోసేపు యొక్క సహోదర ప్రేమను సూచించిన ముద్దు. ఇది బంధుత్వము యొక్క ఆధిక్యతను సూచించును.

        లూకా 7:37-38 లోని సంఘటనను బట్టి 47వ వచనంలో ఆమె విస్తారంగా క్షమింపబడినది. మత్త 26:49 లో ఇస్కరియోతు యూదా యేసును శతృవులకు అప్పగించు సందర్భములో పెట్టిన ముద్దు. గురు ద్రోహం మరణాంతకమైనట్లు తెలియుచున్నది. మొదటి కొరింథీ 16:20 సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని, మీరు ఒకరికొకరు వందనములు చేసికొనుడి''. ఇది పవిత్రమైనది. మొదటి పేతురు 5:13 లో విధంగా ముద్దు ప్రేమకు చిహ్నము. ఇది ఏసు క్రీస్తు నందున్న మన కందరికి సమాధాన చిహ్నము.

        దేవుడు సృష్టించిన సృష్టిలో సృష్టి యావత్తును మంచిదిగా అనగా పవిత్రమైనదియు మరియు నిర్దోషమైనదియు నిష్కళంకమైనదియుగా నున్నందు వలన దేవుడు తన ముద్దుల తోనే ఈ లోకాన్ని పోషించినాడు. సాతాను యొక్క ముద్దును స్త్రీ నెరవేర్చుటను బట్టి మానవత్వము - సృష్టి కలుషితములై పోయి లోక సంబంధమైన సాతాను యొక్క బాటలో లోక మర్యాద చొప్పున అపభ్యకరమైన రీతులలో ఈ ముద్దులు లోక సంబంధములై విస్తరించి ముద్దుకున్న విలువను చెడ గొట్టినవి

        ప్రభువు నందు ప్రియ శ్రోతలారా! మన ఇహలోక జీవితములో జన బాహుళ్యములో ఆయా దేశ మర్యాదలను బట్టి ఆచారములను బట్టి షేక్‌ యాండ్‌ అని కరచాలనము నమస్కారములు వందనములు సలాములు - పాశ్యాత్య దేశములో గుడ్‌ మార్నింగ్‌లు అని థాంక్స్‌ అని వగైరా రీతుల సన్మానాలున్నవి. అయితే పాశ్చాత్య దేశములలో స్త్రీ గాని పురుషుడు గాని ముద్దు అను క్రియ ద్వారా తమకున్న ప్రేమను వెల్లడి పరచుకొనుచున్నారు.

        ఈ ముద్దు అను క్రియ దేవుని చిత్తములో ఘనమైనది. ఎందుకంటే కీర్త 85 :10 లో నీతి సమాధానము  ఒకదానితోనొకటి ముద్దు పెట్టుకొన్నట్లు వివరించబడియున్నది. అదే విధంగా ఆది 27:26-27 లో ఇస్సాకు యాకోబుల తండ్రి కుమారుల ముద్దు''. ఇది అనుబంధచిహ్నము. అదే విధముగా ఆది 29:13 లో లాబాను సంతోష వర్తమానమును గూర్చి విన్నపుడు యాకోబును కౌగిలించి ముద్దు పెట్టుకొనుట. ఇది మామా అల్లుళ్ళ అనుబంధమైనట్లు తెలియుచున్నది. అదేే విధముగా ఆది 45:15 లో యోసేపు తన సహోదర ప్రేమను సూచించిన ముద్దు. ఇది రక్త సంబంధ ప్రాధాన్యతను సూచిస్తున్నది.

        ఇక పరమ గీత 1:2 లో శూలమతి నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక! అంటున్నది. ఈ నోటి ముద్దులలో వున్న ప్రభావమెట్టిదో ఎంత ఘనమైనదో కూడా మనము తెలిసికొనవలసిన అవసరత ఎంతో వున్నది. మరియు నోటి ముద్దులలో వున్నటువంటి ప్రభావాన్ని కూడా ఈ సందర్భములో మనము తెలిసికొనవలసి యున్నది. లూకా 7:37-38 లో అను మగ్దలేనె  మరియ పాపపు స్త్రీ :- ఏసు పాదములను కన్నీటితో అభిషేకించి తల నీలాలతో తుడిచి అత్తరు పూసి విశేషంగా ఆమె పెట్టిన ముద్దుల విషయములో ఆమె విస్తారంగా ప్రభువును ప్రేమించి తన విస్తార పాపముల నుండి క్షమాపణ పొందినది. ఇందును బట్టి ముద్దులో పాప క్షమాపణ కూడా వున్నదని మనము గుర్తించ వలెను.

        మొదటి పేతురు 5:13లో విధముగా ముద్దులో ప్రేమ ఐక్యత వున్నట్లు క్రీస్తు ఏసు నందు ప్రతి యొక్కరికిని ఇది సమాధానయుతమై యున్నట్లు తెలియుచున్నది. మొదటి కొరింథీ 16:20లో పౌలు వివరించిన రీతిగా ముద్దు అనేది పవిత్రమైనదిగా విశదీకరించబడి యున్నది. లూకా 15:20 లో తప్పి పోయిన  కుమారుడు తండ్రి యింటిని చేరినపుడు కుమారుని రాక కొరకు విలపించిన తండ్రి తన కుమారుని రూపము ప్రత్యక్షము కాగానే, తనలో వున్నటువంటి ప్రేమానురాగాలు పెల్లుబికి కుమారుని మెడ మీద ముద్దు పెట్టుకొన్నట్లు తెలియు చున్నది. ఇది తండ్రి కుమారుని ప్రేమను బంధమును సూచించుచు ముద్దు.

        ఇక మత్త 26:49 లో ఇస్కరియోతు యూదా పరమ రక్షకుడైన ప్రభువును ధనాశ చేత శతృవుకు అప్పగించు పందర్భములో పెట్టిన ముద్దు - గురు ద్రోహము, స్వామి ద్రోహ నేరమే గాక యూదాను మరణములోనికి పడవేపింది.

        ప్రియ శ్రోతలారా! మనము మన బిడ్డలను ముద్దు పెట్టుకొనుచుందుము. యౌవ్వన పురుషులు - యౌవ్వన స్త్రీలు  కూడా తమ యౌవ్వన కాలములో ముద్దులతో తమ యౌవ్వనాన్ని గడపవచ్చును. ఆముద్దుల కార్యక్రమము తాత్కాలికమే! ఇరువురికి ఒక శిశువు  జన్మించినపుడు వారిరువురి ముద్దులు ఆ శిశువుకే పరిమితమగును. అయితే పిల్లలకు పెట్టే ముద్దులు మన పిల్లల భవిష్యత్తులో ఏ పరిణామానికి దారి తీయుచున్నాయనేది మనము ఆలోచించవలెను. డబ్బులు యిచ్చి పిల్లలచేత ముద్దు పెట్టించుకోవటమనేది కేవలము ధనాశకును అటు తర్వాత బిడ్డల యొక్క పతనావస్థకు దారి తీస్తుంది. లోకము యొక్క ముద్దు ముచ్చటలు లోకస్తులమైన మన ముద్దు ముచ్చట్లు వాక్యయుతంగా ప్రార్ధనా పూర్వకముగా ప్రభువుకే పరిమితము కావాలని - అట్లు ప్రభువుకు గాక లోకము వైపుకు ముద్దు మళ్ళినదంటే - దైవోగ్రత తప్పదని దైవత్వమునకు దూరమై దేవుని కోపమునకు గురి కావలసి వస్తుందని - అందును బట్టి పరలోక స్వాస్థ్యాన్ని కూడా కోల్పోయే పరిస్థితి వున్నదని మనము గ్రహించవలెను.

        ఇపుడు నిజ దైవ సత్యములతోను సువార్త ప్రకటనలోను ప్రకటనలోను ప్రారనాజీవితములోను సంఘమర్యాదలలోను క్రీస్తు యొక్క పోషణలోను, ఆత్మీయ ఫల సువాసనలతోను ప్రభువునకు ప్రీతి కరముగా నడిచేటువంటి సంఘమే ఆయన యొక్క ముద్దుకు యోగ్యకరమై యున్నది. ఆ విధముగా నడుపబడే సత్‌ క్రైస్తవ గృహము కూడా ఆయన ముద్దుకు ముచ్చటకు యోగ్యముగా వున్నట్లు ఇందును బట్టి మనము తెలిసికోవలెను.

                 జన్మ దినము

        పఠనము కీర్త 8 మూలము లూకా 18:15-16 ప్రభువు నందు ప్రియమైన సంఘమా! సాధారణంగా లోకములో  నూతనంగా కట్టబడిన గృహానికి శంకుస్థాపన అనియు ద్వార బంధము అమర్చునపుడు సింహ ద్వార ప్రతిష్ఠాపన అనియు ఆ తర్వాత గృహము కట్టబడినపుడు ఆ గృహములో ప్రవేశించు సందర్భములో గృహ ప్రవేశమనియు, అదే విధముగా దేవాలయమునకు శంకుస్థాపన ద్వారా ప్రతిష్ఠ. ఇవి గాక వార్షికోత్సవములని వగైరా నామ ధేయములతో మానవ జీవితానికి యోగ్యకరములైన ప్రతి క్రియలోను ఒక పేరు పెట్టి ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమములను జరుపు కుంటున్నారు. ఇందులో వర్కు షాపులు, పొలములో నాగలి పెట్టి దున్నుటకు ప్రారంభించు సందర్భము వాహనాలకు ప్రతిష్ఠతలు. ఆయుధములకు ప్రతిష్ఠతలు వగైరా ప్రతిష్ఠత రూపములుగా ఈ ప్రతిష్ఠా కార్యక్రమములు ఆచరిస్తున్నాము.                 నిర్గమ 3:8-9 ఇద్దరు స్త్రీలు ఒక శిశువును పెంచుటలో చూపిన శ్రద్ద వారి వారి స్వార్ధ పరమైనట్లుగా తెలియు చున్నది. ఎట్లంటే కన్న తల్లి తన బిడ్డ తనకన్నుల ముందే జీవించాలని ఆశించి రాజ శాపనము ప్రకారంతన బిడ్డను మరణ శిక్ష నుండి తప్పించ నెంచి జమ్ము పెట్టెలో పెట్టి నదిలో ఒదులుటలో ఆ బిడ్డను మరణమంటకుండ జీవములోనికి నడిపించి రాజ కుమార్తెచే ఆకర్షితురాలిగా చేసింది. రాజ కుమారియైతే తన కోసము తన రాజ్యాంత:పుర ఐశ్వర్య జీవిత నిమిత్తము మోషే తల్లిని మోషేకు పాలిచ్చి పెంచమనినది. ఈ సదవకాశమునకు ముగ్ధురాలైన మోషే తల్లి బిడ్డ గొప్పవాడు కావాలని ఆశించింది.

        అయితే సృష్టి కర్తయైన దేవుని నిర్ణయము వేరు. ఆయన నిర్ణయములో తన ప్రజలైన ఇశ్రాయేలుకు మోషేను ప్రవక్తగాను నాయకునిగాను ఏర్పరచుకున్నట్లు తెలియుచున్నది. రాజాంత:పురములో ఎదిగిన మోషే దైవ నిర్ణయాను సారం రాచరికమును ఒదులుకొని దేవుని స్వరమునకు లోబడి అనేక శ్రమల ననుభవించి, దేవుని  జనాంగమునకు నాయకుడై ఆది కాండముకు ఆది నర నిర్మాణ చరిత్రను దేవుడు చేసిన సృష్టి మర్మములను గ్రంధరూపముగా వ్రాసినాడంటే, మోషే పట్ల దేవుని ఆత్మ ఎంత గొప్ప క్రియ జేసినదో వేదములో మనము చదువగలము.

        అయితే ఆదాము హవ్వలు తమ గర్భ ఫలాలను దేవునికి ప్రతిష్ఠించనందున ఒకడు హంతకుడును ఒకడు మరణ పాత్రునిగా తయారైనాడు. కనుక సామెతలు 22:6 వేద వాక్య రీత్యా బిడ్డలను పెంచ వలసిన మార్గమును లూకా 23:28 ఏసును గూర్చి  అంగలార్చిన స్త్రీలను చూచి ఏసు పల్కిన మాటలు'' మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడ్వుడి!'' అని మాటలను మనము ఈ సందర్భములో గ్రహించవలసి యున్నది. వారు చెడి పోకుండా క్రమ శిక్షణతో నడపాలని యిందులోని భావము. బిడ్డలను కన్నంత మాత్రాన కాదు గాని తల్లి దండ్రులైన వారు బాలురను నడుపవలసిన త్రోవలను కూడా వారికి బోధించి, సరియైన జ్ఞానములో నడిపించవలసిన బాధ్యత ఎంతో ఉన్నట్లు  యిందును బట్టి మనము గుర్తించ వలసి యున్నది. మొదటి సమూహేలు 2:26 మనము చదివినట్లయితే సమూహేలు కూడా ఎదుగుచు దేవుని దయ యందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. లూకా 2:52. కనుక మన ఎదుట ప్రతిష్ఠితమై యున్న ఈ శిశువు యొక్క జీవితము తల్లి దండ్రులకు ప్రధానమైన పాత్ర వున్నట్లు మనము గ్రహించాలి.

        హెబ్రీ 2:5-9 కీర్తన 8:3-7 నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడే పాటి వాడు! నీవు నర పుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు?

         ప్రియ పాఠకులారా! అపోస్తలుడైన పౌలు హెబ్రీ 2:5-9 వివరించిన పై వేద భాగము పాత నిబంధన కాలములో దావీదు ముందుగానే తన యొక్క కీర్తన 8:3-7 లో చదువగలము. ఇంతకు ఈ రెండు వేద భాగముల సారాంశమును గూర్చి మనము తెలిసికోవలసియున్నది. ఈ రెండు భాగాలను ఇద్దరు లేఖకులు వ్రాసినను వివరణ మాత్రము ఒక్కటే! ఈ రెండు వేద భాగాల యొక్క వివరణలోని ముఖ్య పరమార్ధముతో కూడిన వాక్యాంశాలను ధ్యానించుకొందము. ఇందులో నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు: అనుటను గూర్చియు నీవు నర పుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు'', అనుటను గూర్చి ధ్యానించుకొందము. ప్రియ పాఠకులారా! నరుడు దేవుని యొక్క చేతి పనియు ఆయన ఊపిరియు ఆత్మయునై యున్నట్లుగా ఆది 2:7 లో మనము చదువగలము. ఈ విధముగ దేవుడు నర పుత్రుని దర్శించుటకు నరునికున్న యోగ్యతలు 1. నరుడు దేవుని చేతి పని 2. ఆయన యొక్క జీవవాయువులోను ఆత్మ లోను భాగ స్వామి అన్నది నిర్వివాదాంశము.

        ఇక రెండవది నీవు నర పుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు'', అనుటలో  నరుని యొక్క జీవితము దైవ సన్నిధలో అనగా దైవ  సృష్టిలో రెండు విధములుగ విభాగింపబడినట్లు ఈ వేద భాగాల వల్ల మనము గ్రహించవలసియున్నది. మనుష్యుడు అనగా మనస్సాక్షికలవాడు, దైవాత్మ శక్తిని పొందిన వాడు అని అర్థము. ఇట్టి ఆధిక్యత పొందినటువంటి ఈ మనుష్యుడు దైవ మాటను వ్యతిరేకించి దేవుడు నిషేదించిన  ఫలమును తనలో నుండి తీయబడిన నారి యొక్క వాక్కునకు ప్రాధాన్యత నిచ్చి, ఆమె చేతి ఫలమును తిన్నందుకు నర పుత్రుడయ్యాడు అనగా నారిలో నుండి జన్మించునట్టి కర్మ మనుష్యున కేర్పడినట్లు ప్రత్యక్షముగ ఈ మాటలు అర్ధమిచ్చుచున్నవి. నారి నుండి జన్మించిన వాడు నర పుత్రుడు: మనుష్యుడు - మనస్సాక్షి కల వాడు. ఈ మనస్సాక్షిని లోక సంబంధముగా కాక పరలోక సంబంధముగా సృష్టికర్త యొక్క ప్రభావముతో వరముగా పొందినవాడు. సృష్టిలో జంతు జాలమునకు ఈ మనస్సాక్షి లేనందుననే అవి మనుష్యులుగా పిలువబడుటకు అనర్హములైనవి, పిలుచుచుటకు యోగ్యత లేకుండా పోయింది.

        ప్రియ పాఠకులారా! చిత్రమేమంటే ఈ ఇద్దరినే దేవుడు దర్శించినట్లుగా వాక్యాలు వివరిస్తున్నవి. దేవుని చేతిపనియై ఆయన పరిశుద్ధవనమును స్వాస్థ్యముగా పొందిన వాడై జీవించిన మనుష్యుని ప్రతి నిత్యము - ''మనిషిని సృష్టించిన దేవుడు వానిని దర్శిస్తూ బాగోగులు విచారిస్తూ కుశలమైన మాటలతో పలకరిస్తూ తాను సృష్టించిన మనుష్యుని అల్లారు ముద్దుగా పోషించినాడు. ఈ విధముగ దైవత్వముతో సఖ్యతగా జీవించిన నరుడు తన అవిధేయతతో దైవ ఆజ్ఞాతిక్రమ మూలముగ శాపగ్రస్థుడైనపుడు అదే మనస్సాక్షి గల మనుష్యుని అనగాదైవాత్మను పొందియున్న మనుష్యుని దైవాత్మ జ్ఞానమును అతనిలో నుండి మరుగు పరచి, తాను నరుని శపించు సందర్భములో నీవు బ్రతుకు దినము లన్నియు చెమటోడ్చి భూమిని దున్ని ఆమారము తిందువు. నీవు నేేల నుండి తీయబడి తివి గనుక తిరిగి మన్నయి పోవుదువు'', అనిన మాటను బట్టి ఆది నరుడు సతీ సమేతంగా దైవత్వము నుండి వెలివేయ బడి దైవ వనము నుండి తరిమి వేయబడుచు నారీ వ్యామోహితుడై నర పుత్రుడుగ మార్చబడి అనగా నారికి ప్రియుడై తాను ప్రేమించిన నారి నుండి విశేషమైన సంతానమును పుట్టించుటకు అనగా జీవము గలనరులందరికి తండ్రి ఆయెను.  అలాగే జీవముగల ప్రతి వానికి ఆదాము భార్యయైన హవ్వ తల్లియైనట్లు వేదములో చదువగలము.

         ఈ విధముగ నర పుత్రులు భూమ్మీద ఆది 6:1 లో విధముగ విస్తరింప నారంభించినపుడు దేవుడు వారిని దర్శించి వారి ఆత్మీయ బలహీన స్ధితిని గూర్చి విచారించి మరణ తీర్పును విధించుటకూడా చదువగలము. ఈ విధముగ నర పుత్రులను దర్శించుటకు కూడా ఆయన సంకల్పించినట్లు కూడా తెలియుచున్నది. ఈ విధముగ దేవుడు మనుష్యుని అనగా సోదర హంతకుడైన కయీనును దర్శించి మాట్లాడినట్లు చదువగలము.

        అయినను దేవునికి నరుని మీదున్న ప్రేమ కొద్దీ ఆదామును శపించి తోట నుండి వెళ్ళగొట్టు సందర్భములో ఆదాము జంటకు చర్మపు దుస్తులు తొడిగినట్లును, కయీనును దేశ ద్రిమ్మరిగా శపించి తీర్పు దీర్చునపుడు, కయీను యొక్క ఆత్మీయ బలహీనతను గూర్చి అతని యొక్క ప్రవర్తనను గూర్చి చింతించిన వాడై, కయీను మీదనున్న  ప్రేమ చేత కయీనును కనుగొని ఎవరును చంపకుండ అతని వీపు మీద గుర్తు వేసినట్లుగా కూడా చదువగలము.

        అలాగే ఆది 6:లో నరకోటి యొక్క పాపము లోకము మీద విజృంభించి దైవత్వమునకే ఓర్వలేని స్థితిలో క్రియ జరిగించగా దేవుడు నరులను మరణానికి అప్పగించినను నరుల మీదున్న ప్రేమ కొద్దీ నోవహు అను ఒక నరుని కుటుంబాన్ని తన మరణ హోమములో రక్షించాలని సంకల్పించి రాబోవు జల ప్రళయము నుండి రక్షింపబడుటకు నోవహు చేత  ఓడను చేయించాడు.

        ప్రియ పాఠకులారా! ఈ విధముగ దేవుడు నరులను దర్శించినపుడల్లా నరుల మీదనున్న ప్రేమ కొద్దీ ప్రతి సందర్శన సందర్భములోను ఒక మంచి క్రియను జరిగించినట్లు చదువగలము.

        ఇక హెబ్రీ 2:7 వ వచనములో నీవు దేవ దూతల కంటె తక్కువ వానిగాను మహిమ ప్రభావములతో వానికి ధరింప జేసిన కిరీటాన్ని గురించి తెలిసికొందము. ప్రియ పాఠకులారా! నిజమే! దేవుని కంటెను దేవ దూతల కంటెను నరుడుతక్కువ వాడే ఎందుకంటే దేవుడు గాని దేవ దూతలు గాని అదృశ్యులు అనగా కంటికి కనబడని వారు. వారికి వ్యాధి భయముగాని రోగభయము గాని అంటే కుష్ఠు క్షయ వికలాంగత్వము  బి పి  షుగరు క్యాన్సరు పడిశము జ్వరము వగైరా ఏ విధములైన జాడ్యాలు లేవు మరియు వారిని అపవిత్రాత్మలు పట్టవు వారికి ఆకలి లేదు దప్పిక లేదు, దృశ్యమైన వాటి మీద వారికి మమకారములు లేవు, ముస్తాబులు లేవు స్నానము లేదు. వారికి వైద్యుడక్కరలేదు, న్యాయ స్థానములు రాజ్య పదవులు పదవీ వ్యామోహాలు అసూయలు కక్షలు  కలహాలు ద్శేషాలు క్రోధాది గుణములు లేవు అంధత్వము లేదు మరణము లేదు.         

        ప్రియ పాఠకులారా! దేవుడు కొంచెము తక్కువ జేసిన కొన్ని క్రియా కర్మలను గూర్చి మనము తెలిసివొందము. పై వివరించినవన్నియు దేవుడు దేవ దూతలకు సంబంధించినవి. ఇప్పుడు నర నారులకు దేవుని చేత చేయబడి వున్న తక్కువ గుణమును గూర్చి తెలిసికొందము. నరులు దృశ్యులు అనగా శరీరము కలవారు. శరీరముతో వున్నందు వలన దేవుని సృష్టియైన భూమి మీద వీరు నివసిస్తున్నందున వీరికి నేత్రాశ లోకాశ ధనాశ పదవీ వ్యామోహము అంతస్థులు కుల తత్వాలు జాతి బేధాలు వర్ణ బేధాలు భాషా భేదములు, శాకా భేదములు ఉద్యోగాలలో హెచ్చు తగ్గులు హోదాలు మదమత్సరము కామము క్రోధము ఈర్ష్య ద్వేషములు, వీటి ప్రతి ఫలాలైన జాడ్యాలు కుష్ఠు రోగము లగాయతు  బిపి షుగరు వరకు వున్నటు వంటి ఘోరాతి ఘోరమైన చికిత్సకు అందనట్టి జాడ్యాలు సంక్రమించి యున్నవి. వీటితో బాటు రోగాల మూలముగా  గాని లేక జన్మను బట్టి గాని వికలాంగత్వము భూత భయములు శతృ భయము విష కీటకాదులు వాహనముల భయము దొంగల భయము వగైరా భయములు నరులకున్నవి. వీటన్నిటితో బాటు మరణ భయము.

        దేవ దూతలు దేవుడు నిత్య జీవులు నరుడు అల్ప జీవి. ఇదియే దేవుడు నరుని పట్ల జరిగించిన అల్ప క్రియ దేవుడు నరుని అల్పునిగా జేసిన క్రియ. ఈ తక్కువ వానిగా వున్న ఈ నరుడే నేడు పటిష్టంగా వుండాలని లోక సంబంధమైన అక్రమ ఆర్జనలతోను, లోకము మీదనున్న వ్యామోహము కొలదీ తన అంతస్థును బటి,్ట అంతస్థు మీద అంతస్థులు పెరిగేటటువంటి కట్టడములు కట్టించుట అనగా అవి స్థిరముగా వుండాలని చెక్కు చెదరకూడదని, తరతరాలు అది తన ఇంటి ఘపతను చాట వలెనన్న ధ్యేయముతో  నిర్మిస్తున్నాడు. అలాగే తన ఘనతను నిరూపించుకొనుట ఖరీదైన వాహనాలు ఖరీదైన భోజనము విలాసవంతమైన తోటలు మందిరాలను నిర్మించుకొంటూ తనకు తన ఇంటి వారికిని పరిమితమైయున్న దీనిలో స్వార్థముతో కూడిన స్థితిలో నరుడు జీవిస్తున్నాడంటే దేవుడు నరుని సృష్టించేటప్పుడు స్వార్ధతను తీసివేసి నిస్వార్థునిగా సృష్టించెను గాని సర్ప బోధ ద్వారా మలచబడిన నర జీవితము స్వార్థపూరితమైనది. ఇది దేవుడు నరుని నిర్మించిన విధానములో తక్కువతనము. ఈ తక్కువ తనమన్నది నరుని యొక్క అంత్యమ దశలో వానిని పనికి రాని వానిగా జేసి లోకము చేతను లోకస్థుల చేతను లోక జీవితానికిని పనికి రాని స్థితిలో మరణము అను శిక్ష ద్వారా మట్టికి అర్పితమగు స్థితికి నర జీవితము అంకితమై పోతున్నది. ఇది ఈ తక్కువ తనము. ఇందును గూర్చి నరుని యొక్క ఆయువు గడ్డి పువ్వు నీటి బుడగ, అడవిలోని  గడ్డి వంటిదని వేదములో వక్కాణించబడియున్నది.

        దేవుడు తన విశ్వాసి అబ్రహాము మీదనున్న ప్రేమ కొద్ది ముగ్గురుగ అనగా మూడు రూపములుగ ఆయనను దర్శించి ఆయన గుడారములోని ఆతిధ్యాన్ని స్వీకరించారు. అయితే అబ్రహాము లోక దృష్టిలో తక్కువ వాడే? అనగా సంతానహీనుడు అబ్రహాము భార్య శారా గొడ్రాలు ఇదియే ఈ తక్కువ తనము.

        ఇపుడు హెబ్రీ 2:7 లోని  వేదభాగాన్ని ధ్యానించుకొందము. మహిమ ప్రభావముతో వానికి కిరీటము ధరింపజేసితివి. నీ చేతి పనుల మీద అధికారము అనుగ్రహించితివి.

        ప్రియ పాఠకులారా! ఇవి రెండును రెండవ ఆదామైన ఏసు క్రీస్తు యొక్క ఇహ లోక జీవితమును గూర్చిన పరమార్ధములై యున్నవి. ఇందులో 1. మహిమా ప్రభావముతో కూడిన కిరీటము అన్నది నరునికి కాదుగాని దైవ కుమారుడును రెండవ ఆదామైన ఏసు క్రీస్తుకే ఈ కిరీటము ఈయబడి యున్నట్లు ఈ దిగువ వేద భాగముల ద్వారా తెలిసికొందము. లూకా 9-28-31 కొండ మీద రూపాంతర సమయములోను, దైవచట్టము ననుసరించి దైవ చిత్త ప్రకారము ఏసు ప్రభువు బాప్తిస్మముపొంది నీళ్ళ నుండి ఒడ్డుకు వచ్చినపుడు దేవుని ఆత్మ పావురము వలె తన మీదకు వచ్చుట. ఇది దేవుని యొక్క మహిమా ప్రభావములతో కూడిన క్రియయై యున్నది. అయితే ఈ మహిమ ప్రభావమన్నది అంతటితో ఆగకహెబ్రీ29 లో వలె దైవ కృపను బట్టి ప్రభువైన క్రీస్తు ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు దూతల కంటె కొంచము తక్కువ వాడుగ చేయ బడిన ఏసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాడై మరణించి సమాధి చేయబడి మూడవదినమున సజీవుడై మహిమా ప్రభావముతో పునరుత్థానుడైనట్లు వేదములో చదువగలము. ఈ విధముగ దేవుని యొక్క మహిమా ప్రభావము ఆ పాదమస్తకము అనగా తల నుండి పాదముల వరకు పొందిన వాడై దేవుని మహిమా కిరీటమును ధరించుటను బట్టి దేవుని మహిమను కిరీటముగ ధరించుకొనియున్నాడు.

        ఇక నీ చేతి పనుల మీద వానికి అధికారమును గ్రహించితివి'', అనుటలో దేవుని చేతి పనులు ఏవి? మొట్ట మొదటగా చేతి పనిని గూర్చి తెలిసికొనుటకు ముందు దేవుని యొక్క నోటి నుండి బల్పోడలిన వాక్శక్తి చేసిన పనులు  వెలుగు కమ్మనగా వెలుగు అగుట - దేవుని వాక్శక్తి ఆరు దినములు జరిగించిన క్రియా కర్మలు సముద్రములోని జీవరాసులు మత్స్యములు భూమి మీద జంతు కోటి మృగ పక్షి సముదాయములు పర్వతాలు కొండలు నదులు సరస్సులు భూమ్యాకాశములు ఆది 1:లో ఇవి దేవుని వాక్కు చేసిన పనులు.

        నీ చేతి పనుల మీద అనుటలో - దేవుని చేతి పని ఆయన వేసిన ఏదేను తోట ఆయన చేసిన నర రూపములు. ఇశ్రాయేలు అను తన జనాంగమునకు ఆయన చేతి వ్రాతతో వ్రాసి యిచ్చిన రాతి పలకలు ఇవి ఆయన చేతి పనులు. ఇంకను దోషులైనటువంటి నర జంటకు ఆయన తొడిగించిన చర్మపు దుస్త్తులు, కయీనుకు వీపున వేసిన రక్షణార్ధమైన దేవుని యొక్క చేతి గుర్తు. ఇవన్నియు ఆయన చేతి పనులు.

        ప్రియ పాఠకులారా! దేవుని నోటి పనులకును ఆయన చేతి పనులకును నరులకు ఆయన ఇచ్చిన అధికారము ఆది 1:లో ఆయన పుట్టించిన సముద్ర జీవులను భూమ్మీద జీవ రాసులను గూర్చి నరులకు అధికారమిచ్చి మీరు బహుగా ఫలించి విస్తరించి భూమిని నింపి దానిని ఏలుడి. ఇది నరులకు మొట్టమొదటగ దేవుడు అనుగ్రహించిన అధికారము. అటు తర్వాత   తాను నిర్మించిన ఏదెను తోటలో ఆదినరులను శాసిస్తూ ఈ తోటచెట్లలోని అన్ని ఫలములు మీరు తినవచ్చును అటు తర్వాత ఎవడైనను కయీనును కనుగొని వానిని చంపకుండునట్లు కయీను వీపు మీద ఆయన వేసిన ఒక అధికారము. లోకమును జల ప్రళయముతో ముంచి నాశనము చేయు సందర్భములో నోవహు చేత దేవుడు నిర్మించిన ఆయన చేతి పనియైన ఓడ - ఓడలో ప్రవేశించు సందర్భములో ఆ నాటి నరకోటి అంతటికిని కాక తానెన్నుకున్న నోవహు కుటుంబానికి మాత్రమే ఆ ఓడలో ప్రవేశించుటకు అధికారమనుగ్రహించినట్లు చదువగలము. అలాగే తన జనాంగమైన ఇశ్రాయేలీయులకుతన దశాజ్ఞులు అను తన చేతి దస్తూరితో వ్రాయబడిన రెండు రాతి పలకలను దైవ చట్టములు శాసిిస్తూ వాటి మీద ఆధిపత్యాన్ని తానెన్నుకున్న ప్రవక్తలకు యాజకులకు ఆధికారమిచ్చినట్లు మోషే అహరోను యెహోషువా సమూయేలు వగైరా ప్రవక్తల యాజకుల యొక్క చరిత్రలు మనకు ఋజువులై యున్నవి.

        ఈ అధికారము యొక్క విలువను తొలి నరుడు వాని యొక్క సంతతి కోల్పోయిన తర్వాత దేవుడు తన రెండవ ఆదామైన తన కుమారుడు మన రక్షకుడైన ఏసునకు ఈ అధికారమను గ్రహించి, లోకానికి పంపినట్లుగ మొట్ట మొదటగా ఏసు క్రీస్తు జనన కాలములో దేవుని  చేతి పనియైనతోక చుక్క ఏసు క్రీస్తు జనన రహస్యాన్ని లోకానికి బైల్పరచుటకు సాధనముగ వాడబడింది.

        అలాగే దేవుని జనాంగమైన ఇశ్రాయేలు దేవుని చేతి పనియై యున్నారు. అట్టి వారిని ఏలుటకు అధికారులుగ నర హంతకుడైన మోషే - విగ్రహారాధికుడైన అహరోను - గాడిదలు మేపుకొనే సౌలు గొర్రెలు మేపే దావీదు మోసగాడైన యాకోబు వగైరాలను తన జనాంగము మీద అధికారులుగ జేసి యున్నాడు. ఈ విధముగ దేవుని చేత నడిపించబడిన జనాంగము దోషులైనందున వీరి చేత దోషమూలముగ యావద్‌ నర కోటి కలుషితమైనందున దేవుని యొక్క చేతి పనియైన ఈ సృష్టి యొక్క సర్వాధిపత్యాన్ని క్రీస్తుకు అప్పగించి యున్నాడు. ఇందును బట్టి ప్రతి వ్యక్తి  యొక్క ఆత్మీయ జీవిత విధానములో క్రీస్తు ఆధిపత్యము వహించి యున్నట్లు అనగా ప్రతి వ్యక్తి యొక్క జీవితమునకు క్రీస్తు అధికారి - సృష్టి మీద కూడా క్రీస్తు అధికారి. దీనికి ఋజువులు ఏసు ప్రభువు నీటి మీద నడుచుట - గెన్నే సరేతు సరస్సు సమీపంలో గాలిని గద్ధించుట సముద్రమును మందలించుట అవి ఆయన మాటలకు లో బడుట. ఇప్పుడును గాలికిని జలమునకు కూడా ఏసు ప్రభువు అధికారి. అలాగే కానాలోని పనికిమాలిన రాతి బానలు వాటిలో నింపబడిన నీళ్ళు దైవ కుమారుని యొక్క వాక్కుననుసరించి ద్రాక్షారసముగ రూపాంతరము పొందినట్లు చదువగలము. ఇందును బట్టి చూప్తే ఏసు క్రీస్తునకు నీటిని రుచిని మార్చే అధికారము దేవుని చేత ఇవ్వబడినట్లు ఋజువగుచున్నది. సేన అను దయ్యముల గుంపును పందులలోకి పంపించే అధికారము కూడా ప్రభువునకున్నది. ఇది దేవుడు తన కుమారునికిని నరులకును ఇచ్చిన అధికారము.

        ప్రియ పాఠకులారా! నేటి ఆధునిక యుగములో ఏసు ప్రభువు లోక పాప నివారణార్థము బలియై మరణాన్ని జయించి మహిమ పునరుత్థానము పొంది దేవుని యొద్దకు వెళ్ళిన సందర్భములో మోక్షారోహణమునకు ఆయత్తమైన ప్రభువు మత్త 28:18 లో పరలోక మందును భూమి యందును నాకు సర్వాధికారమున్నది''. అనుటలో - దేవుని యొక్క యావద్‌ సృష్టికిని దేవుడు తనకుమారుని అధికారిగ నియమించినట్లు తెలియుచున్నది. అలాగే క్రీస్తు విశ్వాసులమైన నేటి తరము వారమైన మనము ఆయన రక్షణవలయములో జీవిస్తూ అనగా ఆయన సిద్ధాంతములు ఆయన మాటలు ఆయన నిబంధనలను, ఆయన మనకు నేర్పిన బోధను ఆయన ప్రార్థనను నిత్యము మనము ఆచరిస్తూ ఆయన విశ్వాసులుగ జీవించితే మనకు కూడా ఆయన ఈ సృష్టిమీద కొన్ని అధికారములు ఇవ్వగలడని అవేమనగా తన  విశ్వాసులును బోధకులు అయిన వారికి బోధించు అధికారము, రోగములు స్వస్థపరచు అధికారము, దయ్యములు వెళ్ళగొట్టు అధికారము దైవరాజ్య సువార్తనుప్రకటించు అధికారము దైవారాధన జరిగిస్తూ ఆరాధన క్రమములో ఆచరించ వలసిన ఆచారములను అమలు పరచు అధికారము అనగా బోధకునిగా మాత్రమే గాక నూతన విశ్వాపికి బాప్తిస్మము ఇచ్చుటకును, ఏసు ప్రభువు యొక్క చివరి బల్ల భోజనమును ఆచరించు అధికారమును, క్రైస్తవ విశ్వాసి మృతుడైతే వానిని సమాధి చేయు అధికారము చిన్న బిడ్డలను ప్రతిష్టించుట నామకరణము చేయుట, క్రైస్తవ సంఘము మీద అధికారము వగైరా అధికారములు ఏసు ప్రభువు ద్వారా ఆయన విశ్వాసులమైన మనకు అనుగ్రహించబడింది.

        ఇక 8వ వచనములో - వాని పాదముల క్రింద సమస్తమును వుంచితివి'', అనుటలో ఏసు పాదముల క్రింద లేనటువంటి ఏ వస్తువు లేదు. సమస్తమును దేవుడు ఆయన పాదముల క్రింద వుంచినట్లుగ కొలస్స 1:15-17 చదివితే మనకు క్షుణ్ణంగా తెలియగలదు. ఆకాశమందున్నవి భూమి మీద వున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి సర్వము ఆయన యందు ఆయన ద్వారా సృజింపబడెను. అన్నిటి కంటె ముందుగా వున్నవాడు అన్నిటికి ఆధారభూతుడు. ఆయన లేకుండా ఏదియు సృష్టింపబడలేదు.

        ఈ విధముగ ఆయన పాదముల క్రింద సమస్తాన్ని దైవత్వం చేత వుంచుకొని యున్నాడు. ఇందును బట్టి చూడగా యావద్‌జగత్తు అందులోని సృష్టి యావత్తును వాటంతటి మీద అదికారమును ఏసు క్రీస్తు పొందియున్నట్లు పై వన్నియు ఆయన పాదముల క్రింద భద్రపరచబడి దాచబడి యున్నట్లు తెలియు చున్నది. ప్రియ పాఠకులారా! ఇందును బట్టి ఏసు క్రీస్తు యోహా 8:¦23 నేను పై నుండు వాడను, మీరు ఈ లోక సంబంధులు, అంటున్నాడు.

        8:1-9  దేవుని మహిమ

    యెహోవా! మా ప్రభువా! ఆకాశములో నీ మహిమను కనపరచువాడా!

        ప్రియ పాఠకులారా! 8వ కీర్తనలోని పై మొట్టమొదటి వచనము మొదటి అంశాన్ని గూర్చి ధ్యానించుకొందము. ''యెహోవా! మా ప్రభువా!'' యెహోవాను ప్రభువుగా నమ్మి జీవించిన వారిని గూర్చి వేదంలో కొన్ని సందర్భాలను మనము తెలిసికోగలము. ''యెహోవాను తనకు ప్రభువుగా గల జనులు ధన్యులని వేదంలో ప్రవచింపబడి యున్నది. యెహోవా! మాట వరసకు ఆయన ప్రభువు కాదు గాని సృష్టికిని లోకానికిని ఆయన ప్రభువు. లోకములన్నింటి మీదను యెహోవా ప్రభువై యున్నాడు. యెహోవాను ప్రభువుగా ఏర్పరచుకొని పాత నిబంధన కాలంలోఇస్సాకు మొదలుకొని దానియేలు వరకును జీవించిన ప్రవక్తలు రాజులు విశ్వాసులు ఇందుకు ఉదాహరణగా వున్నారు. ఇశ్రాయేలు విషయంలో గుర్తిస్తే ఇశ్రాయేలు జనాంగానికి యెహోవా ప్రభువు. ఇశ్రాయేలుసైన్యమునకు అధిపతి కూడా ఆయనే. ఈ మాటను దేవ దూతలు ప్రవచిస్తూ సైన్యముల కధిపతియైన యెహోవా! ''పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు'' అని గాన ప్రతి గానములు చేసినట్లును వేదంలో చదువగలము. కనుక ప్రియ పాఠకులారా! భూమి పుట్టినది మొదలుకొని లోకాంత్యము వరకును జరుగు కాలంలో యావద్‌ సృష్టికి యెహోవా ప్రభువై యున్నాడు. ఇందును బట్టి వేదంలో నినాదం చేస్తూ యెహోవాదే విజయము అని గాన ప్రతి గానములు దూతలు; దేవుని సైన్యమైన ఇశ్రాయేలులు నినాదము చేసినట్లు వేదంలో చూడగలము.

        ఇక ''ఆకాశములో నీ మహిమను కనపరచువాడా''! ప్రియ పాఠకులారా! ఆకాశంలో ఈ కల్గించిన మహిమా క్రియలేమిటి? అనిన దానిని మనము గ్రహించాలి. మొట్ట మొదటిగా ఆకాశం ఈయన మహిమను సృష్టికి రెండు జ్యోతులుగాను అవిగాక అనేక వేల సంఖ్యలో నక్షత్రాదులు కూడా ఆయన మహిమను వెలువరిస్తున్నవి. ఇట్లుండగా ప్రియ పాఠకులారా! దేవుడు ఆకాశములో కల్గించు మహిమ యొక్క విధానాలను తెలిసికొందము. ఆదికాండ ఆరు, ఏడు అధ్యాయాలలోనోవహు విషయంలో నోవహుకు ఈయన మహిమను కనబరచుటకుగాను నలభై దివా రాత్రులు వర్షమును కురిపించి పాతాళపు ఊటలను తెరిపించి ఆకాశ తూములను తెరిచి విపరీతమైన వర్షపు ప్రమాదంలో ఓడను తేల గొట్టి వరద  నీటి పై నడిపించాడు. ఈ సందర్భములో దేవుడు నోవహుతో నిబంధన చేసికొంటూ ఇంద్ర ధనుస్సును సాధనంగా చేసినట్లు  చదువగలము. ఇంద్ర ధనుస్సు ఆయన యొక్క మహిమను సూచిస్తున్నది. ఇంకను ఉరుములు మెరుపులు వడగండ్లు తుఫాను ఆయన యొక్క ప్రభావమును సూచిస్తున్నాయి.

        కీర్తన 8:2 శత్రువులను పగదీర్చుకొను వారిని మాన్పి వేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు, చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి యున్నావు.

        మంచి ఆత్మను ప్రసాదించమని దేవునికి గర్భములోని శిశువు తన రెండు చేతులను నుదిటికి చేర్చి ప్రార్ధించుచు బయటకు వచ్చును. భక్తులలో తమ దుర్నీతి అధికమైనపుడు దేవుడు శత్రువులను పగదీర్చుకొను వారిని అధికము చేయును. ఇశ్రాయేలీయులు దేవుని  మరచి పోకుండటకై వారి కొరకు వారి శత్రువులను పగ వారిని అధికము చేపి, దైవ భయము గలిగించెను. ఇట్లు చేయుట వలన భక్తులు తమ పాపకార్యముల నిమిత్తము  దేవుడు మాకు ఈ శత్రువులను శ్రమలను కల్గించుట న్యాయమే! మన పాపములే మన శ్రమలకు కారణమై  దేవుని సన్నిధికి మన ప్రార్థన చేరకుండా అడ్డగించుచున్నది.

        ఈ బిడ్డలు ఈ చిన్న వారలు ఏ పాప మెరుగని వారు. అమాయికులగుట చేత వారి ప్రార్థన దేవుడు తప్పక ఆలకించునని బాలురకు పసి బిడ్డలకు ప్రార్థనలు చెప్పించుచు నేర్పించుచు, వారి చేత దైవ కీర్తనలు క్రమ పద్ధతిగా పాడించుచు ఆ బిడ్డలకు నేర్పించు చుందురు. ఆ బిడ్డలు వచ్చీరాని తమ క్రియలతో ముద్దులొలుకు మాటలతో దైవ పీఠము ఎదుట తమ దైవ కార్యములు నెరవేర్చుచు తల్లిదండ్రులు చెప్పిన ప్రకారముగా తమ కుటుంబ కష్టముల నిమిత్తము ప్రార్థింప వారికి నేర్పించుచూ అలవాటు చేయుదురు. ఈ విధముగా చిన్న బిడ్డల చేత చేయబడిన స్తుతుల మూలమున తన జనాంగమునకు ఒక బలీయమైన దుర్గమును దేవుడు నిర్మించి యున్నాడు. అందువలననే ఎంత పతితులైనను దైవ జనాంగము కట్టకడగు గట్టెక్కుచున్నది.

        ఇక రెండవ వచనంలో ''బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించి యున్నావు'' అని అంటున్నాడు. ప్రియ పాఠకులారా! బాలురు చంటి పిల్లలు అంటే దేవుని చేత ఎన్నుకోబడి ఆయన పేరు పెట్టబడి ఆయన కుమారుని యొక్క అనగా దైవత్వమునకు రెండవ దేవుడైన ఏసు క్రీస్తు యొక్క నామమును యోహా 1:12 లో ఈ విధముగా ''తన్నెందరంగీకరించిరో వారి కందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికార మనుగ్రహించెను.'' అనగా ఏసును అంగీకరించిన వారు దేవుని పిల్లలు, బాప్తిస్మము పొందిన వారు. దుర్గమనగా సంఘము - సంఘాలయమునై యున్నది. ఈ దుర్గాన్ని గూర్చి దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమని కీర్తనా కారుడు రచించి యున్నాడు.4: 6-1

         నీ చేతి పనియైన నీ ఆకాశములును నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములును నేను చూడగా'', అనుటలో ఆయన కలుగజేసిన సూర్య చంద్ర నక్షత్రాదులు క్రీస్తును సూచిస్తున్నాయి. నీతి సూర్యుడు క్రీస్తు. చంద్రుడు చల్లని వెలుగిచ్చు వాడు క్రీస్తు. ఈ క్రీస్తు అను నీతి చంద్రుని మీదనే సంఘము కట్టబడి యున్నది. కనుక క్రీస్తు సంఘమునకు పునాది. ఇక నక్షత్రాలు, ప్రియ పాఠకులారా! ఏసు ప్రభువు జనన కాలంలో తూర్పు దిక్కున ఆయన జననమును సూచించిన నక్షత్రము ఆయన నక్షత్రము కనుక ఇది కూడా క్రీస్తుకు సంబంధమే! కనుక వీటితో నరుని పోలిస్తే, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు? అనుటలో మనుష్యుని జ్ఞాపకం చేసికోవాలంటే జ్ఞాపకానికి వచ్చెడి వ్యక్తి జ్ఞాపకము చేసికోబోవు వ్యక్తికి సన్నిహితుడుగా వుండాలి. తన జీవనాధారుడుగా ఉండాలి.  జీవాధిపతిగా ఉండాలి. సూర్య చంద్రాదులలో గుప్తమై యున్న ప్రభువు కంటె నరుడు అతీతుడు కాడని ఇందును బట్టి గ్రహించ వలసియున్నది. ''నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు? అనుటలో సృష్టిలోని సృష్టములతో పోలిస్తే నరుడు నీచ స్థితిలో వస్తాడు.

        ప్రియ పాఠకులారా! కీర్తనా కారుడు దావీదు ఈ కీర్తనలో తనను తగ్గించుకొని యెహోవా పన్నిధిని హెచ్చించి వ్రాసిన కీర్తన  యిది. మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు. ప్రియ పాఠకులారా! ఓడలోని నోవహును తిమింగల గర్భంలోని యోనాను, ఐగుప్తు చెరలోని ఇశ్రాయేలులను శత్రువుల బారి నుండి దావీదును జ్ఞాపకము చేసికొన్నట్లు మరియు సింహాల బోనులో వున్న దానియేలును ఆయన జ్ఞాపకం చేసికో బట్టే వారి కొరతలు ప్రమాదాలు వారి శతృ భీతి వారికి సంక్రమించిన విపత్తులు తొలగినవి.

        నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు? ప్రియ పాఠకులారా! అసలు దేవుడు నరపుత్రుని దర్శించిన సమయ సంధర్భాలను తెలిసికోవాలి. సింధూర వనంలో అబ్రహామును దర్శించాడు. ఏదేను వనంలో దోషులైన నరజంటను గూర్చి దర్శించాడు. దేవుని పట్టణమునకు వ్యతిరేకమైన బాబేలు గోపుర నిర్మాణంలో నరులు కట్టిన గోపురమును చూచుటకు దివి నుండి భువికి దిగివచ్చినట్లు ఋజువులున్నవి. ఇంకను యాకోబు కలలో నిచ్చెన దర్శనము, పేతురుకు కల్గిన దుప్పటి దర్శనము మరియమ్మకు దూత యిచ్చిన దర్శనము ఇవన్నియు కూడా దేవుడు నరులను దర్శించుటకు జరిపిన పద్దతులై యున్నవి.

        ప్రియ పాఠకులారా! దేవుడు నరుని దేవుడు నరుని దేవుని కంటె కొంచెము తక్కువ వానినిగా చేసి యున్నాడు. ఈ కొంచెము తక్కువ వాడు'', అనుటలో దేవుడు మాంసము ఎముకలు, నరాలతో చర్మముతోను ఒక జీవుని సృష్టిస్తే ఈ విధంగా తయారైన జీవుడు తన సాంకేతిక  శాస్త్ర జ్ఞానంతో మరలు, మేకులు, చక్రాలు బ్యాటరీలు పలువిధములైన ఇనుప సామానులు చేస్తూ వాటికి చలనాన్ని యిచ్చి వాటి చేత పని చేయిస్తున్నాడు. సృష్టికర్త చేసిన యంత్రమును దేహంలో గుండె, ఊపిరి తిత్తులు, నరములు, మాంసము, రక్తము, చర్మము వగైరాలతో మిళితమై కప్పబడియున్నది. అదే విధంగా నరుడు చేయుచున్న యంత్రమునకు కూడా పైవి లేకున్నను భూసంబంధమైన సాంకేతిక జ్ఞానంతో కూడిన శక్తి వున్నది.

        కనుక దేవునికి నరునికిని వున్న తేడా ఏమిటంటే దేవుడు తయారుచేసిన నర శరీరము అను యంత్రము ఆగిపోయినప్పుడు ఇక దీనికి మరామత్తు అనేది లేదు. అయితే నరుడు చేసిన యంత్రమునకు మరామత్తులున్నవి. జీవయుతమైన నర దేహము లోకాన్ని విడిచి మరణమైనపుడు లోకాశలుగాని, లోక పంబంధమైన వేవియు వెంటరావు. అయితే నరుడు చేసిన యంత్రమునకు తత్సంబంధమైన వస్తు సామాగ్రి దానితో  బాటు వుంటుంది.

        ''మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసియున్నావు'', అనుటలో దేవుని మహిమ చేతనే పాత నిబంధన చరిత్రలోని జనాంగము తమ జీవిత రథాలను నడుపుకోగల్గినారు. తమ చరిత్రలను సార్థకము చేసికోగల్గినారు. ఆయన మహిమ ద్వారా ఆనాటి జనాంగమునకు అనుగ్రహించ బడిన ధర్మ శాస్త్రమూలమున నరులను దేవుడు కొంత వరకు క్రమ బద్ధము చేయగల్గినారు. ఆయన మహిమ ఆనాటి అజ్ఞాన జనాంగానికి కనువిప్పు కలిగించి సముద్రమును పాయలుగా చీల్చుటకు బండనుండి జల ధారలు రప్పించుట. తెగుళ్ళు, దైవ జనాంగమునకు ఆహారము వగైరా క్రియలు జరిగినాయి. వాటి మూలంగా దేవుని యొక్క మహిమ ప్రభావయుతమైనందున అట్టి మహిమా ప్రభావయుతమైన దైవ క్రియకు విధేయుడైన నరునికి దేవుడు జీవ కిరీటము ధరింపచేస్తున్నాడనుటలో ఈ జీవ కిరీటమేదో మనము తెలిసికోవలసియున్నది.

        ఏది జీవ కిరీటము? పరిశుద్ధ గ్రంధంలో వారి చరిత్రలు లిఖింపబడుట, దైవత్వం యొక్క సంపూర్ణత్వాన్ని ఆనాటి విశ్వాసులు పొందగలుగుట. దేవుడుచేసే మహిమా కార్యాలలో పాలి భాగస్థులగుట, ఇందుకు తార్కాణము చనిపోయిన నాయీరు కుమార్తెను బ్రతికించుట, చనిపోయిన విధవరాలి కుమారుని బ్రతికించుట, చనిపోయి నాలుగు దినములు కంపు కొట్టిన లాజరును సజీవునిగా నడిపించుట. ఇవి దేవుని కుమారుని మహిమా ప్రభావములు. వీటిని సాధారణ నరకోటియగు ఏసు ప్రభువు శిష్యులకు కూడా ఇదే జీవ కిరీటము అనుగ్రహించబడింది. అనగా ఏసు నామము దేవుని యొక్క జీవమైయున్న క్రీస్తుయొక్క మహిమా ప్రభావములు పేతురు యోహానులలో ఉండబట్టే చీల మండల రోగిని నడిపించాడు. మృతులను లేపినాడు. తుదకు పేతురు నీడ రోగుల మీద పడిన వెంటనే స్వస్థత పొందునట్టి శక్తిని ప్రభావమును పేతురు కిరీటముగా ఏసు నామమున పొందగల్గినాడు.

        మొట్టమొదటిగా దేవుని యొక్క కిరీటములు ధరించిన వారు అబ్రహాము, మోషే, ఇశ్రాయేలు, దావీదు, సొలోమోను, ఏలియా, యెహోషువా వగైరా భక్తులు, నూతన నిబంధనలో అపోస్తలులు హత సాక్షులు, వేద సాక్షులు వగైరాలు మరిము నేటి తరము వారైన మనకును ఏసు నామమున దేవుడను గ్రహించిన కిరీటాలున్నవి. ఈ కిరీటాల వల్లనే మనము ఈ లోకాన్ని జయించగల్గుచున్నది.

        మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేయుచున్నావు. ప్రియ పాఠకులారా! లోకనరులైన మనకెన్నో విధాలైన దీవెనలు ఈవులు వరాలున్నాయి. ఉదా|| లోకములోని ప్రతి నరజీవికిని ఏదో యొక విధమైనటువంటి వరము దైవత్వం చేత అనుగ్రహింపబడియున్నది. సమస్తము దేవుని యొక్క మహిమార్థ క్రియగానే నిర్ణయింపబడినట్లు బైబిలులో కొందరి జీవితాలను గూర్చితెలిసికోగలము. దేవుడు తన జనాంగమైన ఇశ్రాయేలును కిరీటంగా అనగా ఆ జనాంగమును పరిపాలించుటకు మోషేను నాయకునిగ నియమించియున్నాడు.  అదే విధంగా యెహోషువా వగరా ప్రవక్తలు తన జనాంగమైన ఇశ్రయేలునకు తన మహిమా ప్రభావములతో నడిపించిన కిరీటాలై యున్నారు.

        గాడిదలను వెతుక్కుంటూ వున్న సౌలును దేవుడు ఎన్నుకొని అతని రాచరికము రాజ్యాధిపత్యమను కిరీటాన్ని అనుగ్రహించినాడు. అదే విధంగా గొర్రెలు మేపుకొంటున్న దావీదు; ఈ విధంగా దేవుడు అనేకులకు పరిపాలనా దక్షతననుగ్రహించి వారినాశీర్వదించి, తన సర్వమును  నరుని యొక్క ఏలుబడిలో వుంచినాడనుటకు నిదర్శనముగా యాకోబు కుమారుడైన యోసేపు ఫరో రాజ్యమంతటి మీదను అతని ప్రభుత్వం మీదను తిరుగా అతని గృహం మీదను ఆధిపత్యమను గ్రహించి, సర్వస్వమునకును యోసేపును అధికారిగా నియమించినట్లు వేదంలో చదువగలము.

        నూతన నిబంధన కాలంలో దైవరాజ్య సువార్తను ప్రకటించుటకు ఆయన మహిమా ప్రభావంతో చేపలు పట్టు జాలరులను సువార్త ప్రకటించుటకును దైవరాజ్యమందిర పునాదులుగా 12 మంది అపోస్తలుల నేర్పరచి వారికి తన మహిమను ప్రభావమును అనుగ్రహించి రోగులను స్వస్థపరుచుటకు గృడ్డి వారి కన్నులు తెరచుటకు మృతులను సజీవులుగా లేపుటకును అధికారమనుగ్రహించినట్లు నూతన నిబంధన చరిత్రలో తెలిసికోగలము. పాత నిబంధనలో కూడా మోషే నుండి దానియేలు వరకున్న ప్రవక్తలు కూడా ఇట్టి మహిమా ప్రభావములైన కిరీటములు అనగా సముద్రమును చీల్చి పాయలుగా చేయుట, బండలనుండి జలమును రప్పించుట, మన్నాను కురిపించుట, పూరేళ్ళు వర్షింపచేయుట, తెగుళ్ళు రప్పించుట, వర్షమును కురిపించుట, వర్షమును కురువనీయక స్థంభింపచేయుట, సూర్యుని అస్తమింపచేయకుండుట, రోగములను బాగు చేయుట, ఆకాశము నుండి అగ్నిని కురిపించుట, కౄర మృగములైన సింహాల నోళ్ళు మూయించుట వగైరా మహిమా ప్రభావములు కల్గిన క్రియలు దేవుడు తన బిడ్డల కనుగ్రహించిన కిరీటాలు.

        ఆయన మహిమా ప్రభావాలుండ బట్టే ఆయన రాజ్యము భూమి మీద విస్తరించి ప్రపంచమంతను వ్యాపించి యున్నది. ఆయన మహిమా ప్రభావములు లేకున్నట్లయితే నరుడు సాతానును జయించుట అసాధ్యము. మొట్టమొదట మహిమా ప్రభావములు గలవాడు దేవుడే; ఆ మహిమా ప్రభావములుండ బట్టే ముల్లోకాలను మహా జల రాశులను పరలోకాన్ని సృష్టి కర్త పరిపాలిస్తున్నాడు. తనకున్న మహిమా ప్రభావములను దేవుడు తొలుత లూసిఫరునకు కొంత కలుగ చేయగా ఆ కొద్దిపాటి మహిమా ప్రభావానికి లూసిఫర్‌ మిడిసిపడి దేవుని యొక్క సింహాసనాన్ని అధిగమించాలనుకొని పతనమయ్యాడు. దేవుడు తన హస్త నిర్మితుడైన నరునికి కూడా యిట్టి మహిమా ప్రభావములనను గ్రహించ దలచి మొట్టమొదటిగా ఏదేను అను తన పరిశుద్ధ వనము మీద అధికారమిచ్చాడు. ఆ వనములో సమస్త జీవులను జంతు జాలమును పక్షి జాలమును వృక్ష సంపదపై ఒకటేమిటి? ఆ తోటలోని సర్వ సంపద మీదను ఆధికారమిచ్చుటయే గాక సమస్త జీవ రాశికి పేర్లు పెట్టు అధికారమిచ్చాడు. అంతే కాకుండా నరునికి ఒక ప్రత్యేకమైన ఆధిక్యత నిచ్చి ముఖా ముఖిగా నరునితో సంభాషించునట్టి ప్రత్యేకతను నరునికి యిచ్చి యున్నాడు. ఈ విలువను నరుడు దైవ ప్రభావము నుండి పతనమైన సాతాను కుయుక్తి వల్ల పోగొట్టుకున్నాడు. ఫలితము :- శాపగ్రస్థుడాయెను. మరణ పాత్రుడై దేవుని పరిశుద్ధ సన్నిధియైన తోట నుండి వెళ్ళగొట్ట బడినాడు.

        ప్రియ పాఠకులారా! ఇట్టి శాపగ్రస్థులైన నరుల నుండి విస్తరించిన జనాంగమైన మనకు తన ప్రభావాన్ని మహిమను ఇంకను ఇవ్వాలని ఆయన ఆశించి ఏసు అను తన కుమారుని ద్వారా ఆయన మహిమా ప్రభావములను మన కనుగ్రహించాలని వాంచించాడు. ఆయన మహిమా ప్రభావాలను కిరీటములుగా ధరించి యోగ్యతను పొందిన వీరులు ఆయనేర్పరుచుకొన్న అపోస్తలులు పౌలు సైఫను వగైరా హత సాక్షులు తదితరులు.

        నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చి యున్నావు'', అనుటలో ప్రియ పాఠకులారా! ఆయన చేతి పని సృష్టిలోని సృష్టములు. ఆదిలో అడివిని ఏలిన నరుడు నేడు గ్రామాలను, పట్టణాలను రాష్ట్రాలను దేశాలను మరియొక విధంగా ప్రపంచానికి కూడా అధినేతగా వున్నట్లు మన పూర్వీక రాజులు నియంతలు మంత్రులు, ప్రధానులు వగైరా చరిత్రలు వివరిస్తున్నవి. యావద్‌ సృష్టి  మీద అధికారము వహించి ఆధిక్యతను పొందిన మొట్టమొదటి నరుడు ఆదామే! ఈ విధంగా దేవుడు ఇహలోక సంబంధంగా అందరిని అధికారులుగా నియమించినట్లు వేదంలో పాత క్రొత్త నిబంధనలో తెలిసికో గలము.

        ఇందులో మొదటిగా ఆయన చేతి పని మీద అధికారము పొందిన వాడు ఆదాము. తర్వాత నోవహు అటు తర్వాత యాకోబు కుమారుడైన యోసేపు. అటు తర్వాత యాకోబు 12 గోత్రాల మీద మోషేను అధికారిగా నియమించాడు. తన చేతి పనియైన అన్య జన పోరాటంలో  తన బిడ్డలకు అన్య రాజులను వారి దేశాలను వారి సర్వస్వాన్ని అప్పగించినట్లు వేదంలో చదువగలము. అదే విధంగా ఏసు ప్రభువు కూడా తన రాజ్య సువార్తకై 12 మంది శిష్యులను ఎన్నుకొని వారి కధికారమిచ్చినట్లు వేదంలో చదువగలము. పేతురుకు యిచ్చిన ఏడు తాళపు చెవులు కూడా ఈ అధికార సంబంధమైన ఆధిక్యతలు.

        8:7 గొర్రెలన్నిటిని, ఎడ్లనన్నిటిని, అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గంలో సంచరించు వాటినన్నిటిని వాని పాదముల క్రింద నీవు వుంచి యున్నావు. ప్రియ పాఠకులారా! నిజమే! గొర్రెలను ఎడ్లను నరుడు తన అవసరతలకు వాడుకొంటున్నాడు.  ఎడ్లు ఆవులను తన యొక్క బ్రతుకు జీవనార్థమును తన ఆహార అవసరతలకు విశేషంగా నరుడు వాడుచున్నట్లు మన నిత్య జీవితంలో మనము చూస్తున్న విషయమే! ఎడ్లను  దున్నుటకు బండ్లు లాగుటకు, బరువులు మోయుటకు గానుగ వగైరా త్రిప్పుటకును ఆవులైతే పాలకును, పాడికిని వాడ బట్లు నేటి నర జీవితంలో వున్నటు వంటి ముఖ్యావసరత, ఇక అడవి మృగములు మనుష్యుడు, మచ్చిక చేసి వాటి చేత చిత్ర విచిత్రములైన ప్రదర్శనములను చేయించుట. వాటిని తన ఇష్టము చొప్పున తన భాషానుసారంగా మనము చూస్తున్న సర్కసు ప్రదర్శనలు ఋజువులు. ఇక ఆకాశ పక్షులు కూడా నరున ఇయొక్క స్వాధీనంలో ఉన్నట్లు చిలుకల పెంపకము రకరకాలైన పక్షుల పెంపకములతో కూడిన జంతు ప్రదర్శన శాలలు మనకు నిరూపించుచున్నవి.

        సముద్ర మత్స్యములు, సముద్ర  మార్గములో సంచరించునవి'', అనుటలో సముద్ర మత్స్యములు నరునికి ఆహారములును మరియు ఔషధయుతంగా వాడ బడుట ఆహార కొరతను దీర్చుటకు అవి నరుని చేత పట్టుబడుట ఇందులోని జ్ఞానము. సముద్ర మార్గములో సంచరించు వాటినన్నిటిని'', అనుటలో సముద్ర మార్గములో సంచరించు జీవులు అనుటలో సీలు వాలరస్‌ డాల్ఫిన్‌ తిమింగలము, సొర తెల్ల ఎలుగు వగైరా మృగ జాతులు మనుష్యుని యొక్క అవసరతలకు ఉపయోగపడుచు మనుష్యుని చేత పట్టబడుచు'' వాని మనుగడకు అవి ఉపయోగకారులుగా వున్నవి. ఇందును బట్టి చూడగా సృష్టి యావత్తును దేవుడు నరుని పాదముల క్రింద వుంచినట్లు ఋజువగు చున్నది.

        ఇక 9వ వచనం :- ''యెహోవా మా ప్రభువా! భూమి యందంతట నీ నామమెంత ప్రభావము గలది'' అనుటలో - ప్రియ పాఠకులారా! యెహోవా అను పేరుతో భూమి మీద కొంత భాగమును ఏసు అను పేరట ఎక్కువ భాగమును పరిశుద్ధాత్ముడు అను నామమున సృష్టి అంతట మీదను, బహు ప్రభావము మహిమ విస్తరించి యున్నదనుట కెట్టి సందేహం లేదు. దేవుని యొక్క మహిమా ప్రభావమన్నది భూమి మీద లేకుంటే ఇశ్రాయేలుతోనే దేవుని యొక్క మహిమా ప్రభావము లంతరించిపోయేవి. దేవుడు భూమి యావత్తును గుర్తించు సమర్థుడు గనుక ఇశ్రాయేలు అను తన జనేంగ మేనాటకౖౖెనా పతనావస్థను పొంది ప్రపంచంలోని జనాభా అంతటిలో అల్ప జనాభాగానిచ్చి పోయెదరని తలంచిన వాడై తనలో నుండి ఏసు అను నామముతో నరరూపమును సృష్టించి, తద్వారా భూమి యందంతట తన మహిమా ప్రభావములనుబైౖల్పరచి క్రియ జరిగించి, తన నుండి రూపించ బడిన నర రూపమునకు ఏసు క్రీస్తు అను నామధేయము ననుగ్రహించి తద్వారా జీవాత్మలైన నరులను పరమాత్మ సామ్రాజ్యములోనికి వారసు లగుటకు అవకాశమిచ్చి నట్టును అట్టి అవకాశమును సద్వినియోగపరచుకొన్న విశ్వాసులను క్రైస్తవులని నామధేయ మొనర్చినట్లును, అట్లు క్రైస్తవులుగా తీర్చబడిన వారు నేడు దేవుని కుమారుడైన క్రీస్తు మహిమా ప్రభావముల వలన భూమి యందంతట విస్తరించి ప్రపంచంలో మొదటి జనాంగంగా విస్తరించి వ్యాపించి యున్నట్లు యోహా ''1:12 లో వలె'' తన్నెంద రంగీకరించెరో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికార మనుగ్రహించెను'' అను వాక్య నెర వేర్పు దేవుడు జరిగించినట్లు నేడు భూమి మీద విస్తరించి యున్న క్రైస్తవ జనాంగము యొక్క దైవ ప్రణాళిక యొక్క ఆత్మీయ మర్మమె ౖయున్నట్లు మనము గ్రహించాలి.         

         అంశము :- స్తుతి

మూలము:- కీర్త 9:1 నా పూర్ణ హృదయముతో నేను యోహోవాను స్తుతించెదను''.

        ప్రియ పాఠకులారా! సత్య దేవుని యొక్క నిత్యారాధనలో మొట్ట మొదట ఆధిక్యత స్తుతికి వున్నది.  అనగా స్తుతించుట తర్వాత కీర్తించుట ప్రార్ధించుట మహిమ పరుచుట ఇవి దైవారాధనలో ప్రధాన పాత్ర వహించి యున్నవి. అయితే అన్యులు రీనికి భిన్నంగా తాము నిర్మించుకొన్న రూపించుకొన్న విగ్రహాలు దైవ సృష్టములు, చని పోయిన వారి గోరీలు, నిర్జీ.వమైన శిలల ముందు కూర్చుని దండకములని సహస్ర నామములని అర్చ్యనయని సుప్రభాతములని సంధ్యా వందనముమని వగైరా రీతులుగ తమ స్వ జ్ఞానముతో రచించిన శ్లోకాలతో రాగయుక్తముగా వివిధమైన నైవేద్యాలను సమర్పించి బహు భక్తిగా తమ నిర్జీవమైన ఫల శూన్యమైన ఆరాధనను చేస్తున్నారు.

        అయితే సత్య దేవుని ఆరాధన ఎటువంటిది? సత్య దేవుని ఆరాధనలో మొట్టమొదటగా స్తుతి గీతముతో ప్రారంభమవుతుంది. ఈ స్తుతి గీతమన్నది - దేవుని స్తుతించుటన్నది మొట్టమొదటగా దావీదు నుండియే ప్రారంభించబడిందని చెప్పవచ్చును. దావీదుకు ముందు మోషే వ్రాసిన కీర్తనలున్నవి. మోషే కూడా దేవుని స్తుతించాడు. కాని మోషే స్తుతించిన విధానము వేరు - దావీదు స్తుతించిన విధానము వేరు. మోషే తన ప్రార్థనతో నిర్గ 15:1 చదివితే మోషేయు ఇశ్రాయేలీయులును, యోహోవాను గూర్చి కీర్తన పాడినట్లుగ వ్రాయబడి యున్నది. ఈ కీర్తనలో దేవుడు తన జనాంగమైన ఇశ్రాయేలీయుల పట్ల జరిగించిన మహత్కార్యాలు అద్భుతాలను గూర్చి వర్ణించబడి యున్నది. ఈ విధమైన అద్భుత కార్యాలను బట్టి దేవుడు తన జనాంగమైన ఇశ్రాయేలీయులకును వారి నాయకుడైన మోషేకును చేసిన మేలులను బట్టి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి ఇశ్రాయేలీయులు కీర్తిస్తూ చేసిన గానముగ ఈ నిర్గమ 15 లోని కీర్తన వివరిస్తున్నది. అయితే నిర్గ 15:20 లో మోషే ఇశ్రాయేలీయుల పాటలకు అనుగుణంగా మోషే అన్నయైన అహరోను మోషే సోదరియైన మిర్యాము తంబురను చేత బట్టుకొనగా స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను వారిని వెంబడింపగా మిర్యాము వారితో కలసి పాడిన  పల్లవిని గూర్చి 21 వ వచనములో చదువగలము. ఇది పాటతో యెహోవాను కీర్తించుట అని అనదగును. అయితే స్తుతించుటన్నది దావీదు నుండియే ఏర్పడినది. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు. నా పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతించెదను.

        ప్రియ పాఠకులారా! వాస్తవమునకు మోషే దోషియే; దావీదు మహారాజు దోషియే; ఇద్దరును పాపులే! మోషే ఐగుప్తీయుని చంపి నర హంతకుడాయెను. కీర్తనా కారుడైన దావీదు తన యందు విశ్వాసముంచి తన మాటకు అతి విలువనిచ్చి తన యందు భయపడు తన సైనికుడైన యూరియాను నిషా&్కరణముగా చంపించాడు. అయినను దేవుడు కరుణా సంపన్నుడు గనుక ఇద్దరి పాపములను క్షమించి నర హంతకుడైన మోషే ద్వారా కీర్తనలతో కీర్తించబడినాడు-కీర్తి కెక్కినాడు.  అలాగే దావీదు చేత స్తుతించబడి - అంతే గాకుండా దావీదునకు ఒక ప్రత్యేకమైన సింహాసనమును తన సన్నిధిలో వుంచి ఆ సింహాసనమును నూతన నిబంధన కాలములో జన్మించబోవు దైవ కుమారునికి దావీదు కుమారుడని పేరు పెట్టి ఈ సందర్భములో లూకా 1:32 రోమా 1:7 ఏసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను'', కనుక అట్టి దావీదు నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను'', అని అంటున్నాడు.

        ప్రియ పాఠకులారా! స్తుతికి తర్వాత స్తోత్రమన్నది ఒకటున్నది. నరుడు దేవుని స్తుతించని స్తోత్రము అను మాటకు సంపూర్ణత వుండదు. ఎప్పుడైతే దేవున్ని స్తుతించి ఆరాధిసాకతమో అటు తర్వాత స్తోత్రముతో ఆ ఆరాధన పూర్తి అవుతుంది. నేటి మన క్రైస్తవ మందిరాలలో ఆరాధనయైన తర్వాత ఆరాధన జరుగు సందర్భములో ఆరాధన జరుపు ఫాదరి - మన మందరము దేవుని స్తుతించెదము '' అని చెబుతాడు. స్తుతి యైన తర్వాత సమర్పణ - సమర్పణ అయిన తర్వాత స్తోత్రము ఆ తర్వాత కానుకలు అటు తర్వాత అంత్య కీర్తన అనగాముగింపు కీర్తన - పరలోక ప్రార్థన, ఆశీర్వాదము ఇది నేటి క్రైస్తవ మందిరాలలో జరుగుచున్న ఆరాధన క్రమము. ఇందులో మొట్టమొదటిగ స్తుతికి ఎక్కువ ప్రాధాన్యత వున్నది. మందిరములో ప్రార్ధన - దైవ స్తుతి - సంకీర్తన జరగనిదే ఆరాధనలో దేవుని యొక్క పిలుపుకు జీవముండదు.ఈ స్తుతి ఆరాధన మూలముగా దేవుని యొక్క ఆత్మ ఆయన ప్రభావము ఆయన తేజస్సు మందిరములో ప్రవేశిస్తుంది. ఆయన ఆత్మ ఆయన తేజస్సు మందిరములో నింపబడక పోతే బోధకునికి ఉజ్జీవము, సంఘమునకు ప్రేరేపణ ఉత్సాహము ఆరాధనలో దైవ ప్రత్యక్షీకరణ వుండదు. దేవుని స్తుతించుటలో ముఖ్యంగా ఏడు సూత్రములున్నవి. 1. విశ్వాసము 2. పూర్ణ హృదయము 3. సమర్పణ 4. వివేకము 5. లోక వైరాగ్యము 6. దైవత్వముతో కూడిన చింతన 7. ఆత్మీయ దృక్పదములో దైవ ప్రతి రూపమైన ఏసు ప్రభువు యొక్క రూపమును వుంచుకొనుట. ఈ ఏడు వున్నట్లయితే దేవునికి మనము చెల్లించు స్తుతి తత్సంబంధమైన యాగము సంపూర్ణతను పొందగలదు. అది లేకుండా అనగా పై వివరించిన వాటిలో ఏ ఒకటి లేకున్నను అది అసంపూర్ణమే!

        ప్రియ పాఠకులారా! ఈ స్తుతి అన్నది దైవారాధనలో చాలా కీలక పాత్ర వహిస్తున్నది. ఈ సందర్భములో యెష 6:1-4 చదివితే పరలోకములో కూడా దేవ దూతలు దేవుని స్తుతించుచున్నటుగ వివరించబడి యున్నది. పై వేద భాగములో రాజైన ఉజ్జీయా మృతి పొందిన దినములలో అత్యున్నతమైన సింహాసపము నందు ప్రభువు ఆసీనుడై యుండగా నేను చూచితిని. ఆయనకు పైగా సెరాపులు నిలిచి యుండిరి. వారు సైన్యముల కధిపతియగు యెహోవా పరిశుద్ధుడు. పరిశుద్ధుడు - పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి యున్నది'', అని గాన ప్రతి గానములు చేయుచుండిరి.

        కనుక ఇందును బట్టి ప్రియ పాఠకులారా! నేడు భూలోకములోమనము చేయుచున్న స్తుతి ఆరాధన పరలోకములో దేవ దూతలు ప్రత్యక్షముగా దేవుని స్తుతిస్తున్నట్లు తెలియు చున్నది. దేవ దూతలకు మనకు తేడా ఏమిటంటే వారు ప్రత్యక్షముగా దేవుని చూచి ఆయనను  స్తుతిస్తున్నారు. మనము పరోక్షముగా అనగా ఆత్మీయముగా ఒక్క మాటలో చెప్పాలంటే అదృశ్యములో వున్న దేవుని ఆరాధస్తున్నాము. దావీదు కూడా దేవుని స్వరమును విన్నవాడే! దైవ సర్వమునకు దావీదులో బడిన వాడే!  దేవునికి తన ఆత్మను తన శరీరమును లోక సంబంధముగా తనకు అనుగ్రహించబడిన రాజ్యమును సింహాసనమును మంది మార్బలము సైనిక సమూహములు దేవుడు తనకు అనుగ్రహించిన పశువులు గొర్రెలు మేకలు గాడిదలు గుఱ్ఱములు ఒంటెలు వగైరాలను కూడా దావీదు దేవునికి సమర్పించాడు. వాటి నన్నిటిని దైవ చిత్త ప్రకారమే పాలించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే - సింహాసనము దావీదుకున్నది గాని పరిపాలన, శతృరాజులతో పోరాటము, రాజ్య పరిపాలనలో వున్న లోటు పాట్లు వగైరాలు - యుద్ధము సంభవించినపుడు విజయము సర్వము యెహోవాదేయని సర్వము దేవునికి అప్పగించి తన కీర్త 20:7 లో వలె దేవుడైన యెహోవా నామమందు దావీదు అతిశయుడైనట్లుగా వ్రాసియున్నాడు. కనుక కీర్తనా కారుడును అనగా దేవుని కీర్తించు వాడును స్తుతించువాడును ఆరాదించు వాడును; కీర్తనలతో దేవుని నామమును సంకీర్తన చేయు వాడును, సితార వీణె తంబుర వగైరా వాయిద్య నైపుణ్య ప్రావీణ్యతను సంతరించుకొన్న వాడును ఆ నాటి తన పరిపాలనలో అపజయమన్నది నెరుగని వాడును, దైవ ప్రేమకు పాత్రుడైన వాడును దైవ కృపకు నోచుకున్న వాడును దావీదు ఒక్కడేయని ఇందుమూలంగా మనము తెలిసికోవలసి యున్నది.

        ప్రియ పాఠకులారా! పాత నిబంధన లగాయతు నూతన నిబంధన గ్రంధము మరియు ప్రభువు రాకడను గూర్చిన మర్మములను తెలుపు చివరి గ్రంధమైన ప్రకటన గ్రంధము వరకును దావీదు యొక్క నామము పలుచోట్ల ప్రవచించబడి యున్నది. పాత నిబంధనలో పలు చోట్ల దావీదు యొక్క చరిత్ర వివరించబడి యున్నది. అయితే నూతన నిబంధనలో దేవుని  దూత మరియమ్మతో మాట్లాడుచు లూకా 1:32 లో ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును'', అటు తర్వాత  గృడ్డి వాడు దావీదు కుమారుడా! అని ఏసును సంభోదించుట. మరియొక చోట దావీదు కుమారుడా? నన్ను కరుణించు మని మరియెకడు పలుకుట; కన్యకయైన మరియను అనుమానించిన ఆమె భర్తయైన యోసేపునకు స్వప్నములో దర్శనమిచ్చిన దేవ దూత - దావీదు కుమారుడవైన యోసేపు అని పలుకుట. అటు తర్వాత లూకా 19:38 లో గాడిద పిల్ల నెక్కి యెరూషలేములో ప్రవేశించిన దైవ కుమారుడైన ఏసు క్రీస్తుతో  ప్రవేశిస్తు జన బాహుళ్యములో చేసిన నినాదము దావీదు కుమారునికి జయము. ఇక పౌలు లేఖన భాగములో రోమా 1:7లో ఏసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను ప్రవచించియున్నాడు.''

         కాబట్టి ప్రియ పాఠకులారా! స్తుతించుట మూలముగా జీవాత్ముడైన నరుడు సాధించేటటువంటి ఘనత దైవ సన్నిధిలో ఎంత గొప్పదో దావీదు జీవితాన్ని బట్టి మనము తెలిసి కోవలసియున్నది. కనుక మనము జరుపుకొంటున్న ఆదాధనలో మొట్ట మొదట కీర్తన అనగా కీర్తించుట కీలక పాత్రయు, స్తుతించుటన్నది ప్రాముఖ్యమైన పాత్రయు ఘన పరచుటన్నది మానవ జీవితానికి ధన్యతయు దేవుని మహిమపరచుటన్నది నరుని యొక్క జీవాత్మకు - ఈ సందర్భములో కీర్త 113: 1-9 చదివితే  యెహోవాను స్తుతించుట వలన ఆయన భక్తులైన మనకు కలుగు ధన్యత ఐశ్వర్యము ఆశీర్వాదమును గూర్చి సంపూర్ణంగా వివరించబడి యున్నది.

        అయితే ప్రియ పాఠకులారా! దేవుని విషయములో నరులమైన మనము ఆయనను గూర్చి ఏదేదో చేస్తున్నాము. ఆయనకు చేయవలసినదేదో అది చేయలేక పోతున్నాము. అలాగే దేవునికి ఏదేదో ఇవ్వాలని దైవ సృష్టములైన వస్తు సముదాయములు కాయ కర్పూర ఫల పుష్ప తాంబూలాలు, ఇంకను వండిన నైవేద్యాలు భోజ్యాలను అంతే గాక ధూప దీప నైవేద్యముగా అగరువత్తులు సాంబ్రాణి వగైరాలు సమర్పించుట. అది చాల దన్నట్లుగ తల నీలాలు సహితము స్త్రీపురుష భేదము లేకుండా దేవునికి సమర్పించుచున్నట్లుగ మనము చూస్తున్నాము - వింటున్నాము. అట్టి వారిని గూర్చి ఎన్నో రకాలుగా అనుకొంటున్నాము. వాస్తవానికి దేవుడు ఇవన్నియు కోరె వాడు కాదు. మానవుడు తన తృస్తి కోసంగా దేవునికి బల్యర్పణలు చేస్తున్నాడు. మరీ పరమ హ్యేయమైన క్రియ ఏమిటంటే నరుడు  దేవుని తన హస్తములతో చేయుట - ఇది దైవ దృష్టికి భరించరాని మనలోని ఆత్మ దృక్పదానికి  మహా ఘోరమైన అపరాధము, అని గ్రహించక నరుడు తాను తన చేతితో చేసిన  బొమ్మకు పై నైవేద్యము సమర్పించి తనేదో దైవత్వాన్ని దైవాను భూతిని పొందినట్లు - దేవునికి ఏదో గొప్ప ఘన కార్యము చేసినట్లుగా అంటే తన హస్తంతో రూపించబడిన దేవుడు మహిమగల వాడని, వరాలు ఇచ్చు వాడని భక్తులకేదో ఒరగబెట్టే వాడని తన చేత్తో రూపించబడిన దేవునికి సాటియైన వేరే దేవుళ్ళు లేరని నరుడు అజ్ఞానియై తన స్వజ్ఞానమును బట్టి అతిశయపడి, అహంకారి యగుటయే గాక తాను రూపించిన దేవునికి చిత్ర విచిత్ర కల్పనా కథలల్లి జన బాహుళ్యము యొక్క జ్ఞానమును అజ్ఞానాంధకారములో నడిపించి, తనలో వున్న అజ్ఞానమునకు సాటి సోదరులను కూడా బలి పశువులుగా చేయుటన్నది అనగా మరణానంతరము లోకాంత్య కాలములో ప్రభువు సన్నిధిలో ప్రభువు తీర్పు దీర్చు దినములో ఈ విధముగా నర జ్ఞాన రూపితమైన విగ్రహారాధనలకు పాల్పడిన అభాగ్యులకు సిద్దపరచబడి యున్న నరకాగ్ని పూరితమైన అగ్ని గుండ రెండవ మరణ శిక్షలో పాలింపులు పొందుటకు లోకస్థులను, ఇట్టి వారు తయారు జేస్తున్నారే గాని నీతియుతమైన సత్యమైన నిత్య జీవమైన దైవ సన్నిధికి వెళ్ళుటకు కాదు.

        కనుక  ప్రియ పాఠకులారా! పౌలు అంటున్నాడు. విగ్రహాల జోలికి వెళ్ళవద్దని విగ్రహాల పూజ మహా నేరమని, భరింపరాని మహా ఉగ్రతని - అట్టి దైవోగ్రతకు గురియైన వారికి జరుగు శిక్ష నిత్య నరకాగ్ని గుండమేనని అట్టి ఘోరాతి ఘోర శిక్షకు గురి కాకుండా ఆత్మయైన దేవుని జీవము గల దేవుని సజీవుడైన దేవుని, సత్య స్వరూపియైన దేవుని ఎల్లప్పుడు పూర్ణ ఆత్మతోను పూర్ణ వివేకముతోను పూర్ణ సత్యముతోను స్తుతించి కీర్తించి ఘన పరచి మహిమపరచి ఆరాధించ వలసిన గొప్ప బాధ్యత జీవాత్ముడైననరజీవి కున్నది. ఈ నగ్న సత్యాన్ని నరుడు కాలరాచి ఆత్మ జ్ఞానమును వదిలి పెట్టి శారీర జ్ఞానముతో శరీర సంబంధమైన కోర్కెలను తీర్చుకొనుటకు ఆత్మయై యున్న దేవుని శరీరిగా భావించి అందులో ఒక శరీరము అని స్థిరత్వము లేదు. తనలో వున్న అజ్ఞానము ఏ దారి పట్టితే ఆ దారిలో  నడచుచు పంది అని నంది అని గోవు అని సర్పము అని ఏనుగు అని వానరమని వగైరాదైవ సృష్టములైన జంతు రూపములను - ఇక నర రూపమున కొస్తే దేవుడు నరునికి రెండు చేతులిచ్చి వానిని తన హస్తముతో రూపించి తన ఆత్మను దానము చేసి తన ఆత్మీయ జ్ఞానముతో ఈ భూలోకాన్ని ఏలమంటే - అంటే దేవుడు నరునికిచ్చిన రెండు చేతులతో దాన ధర్మాలతోను సాటి నరులకు ఆతిధ్యమును సహాయ కార్యాలు చేయుటకు మరి ముఖ్యముగా సలక్షణమైన శరీరము చక్కని ఆరోగ్యము మంచి వాతావరణము జీవించుటకు కావలసిన సకల ఒనరులు కల్గించిన సృష్టి కర్తయైన దేవుని నరుడు కీర్తించి నమస్కరించి స్తుతించి ఆరాధించి మహిమ పరచాలని దైవ సంకల్పమైతే అందుకు విరుద్ధంగా నరుడు దేవుడు ఇచ్చిన రెండు చేతులను  దేవునికి బదులుగా లోక సేవకు అనగా దెబ్బలాడుకొనుటకు ఎదుటి వారిని దూషించుటకు బెదిరించుటకును  హత్య చేయుటకు పేకాట ఆడుట చుట్ట కాల్చుకొనుటమద్యము త్రాగుట, జార స్త్రీలతో సాంగత్యము, లోక సంబంధమైన కోర్టులో అబద్ధాన్ని నిజమేయని రెండు చేతులతో ప్రమాణముచేయుట; సాటి సోదరునిచెడుపుటకు లంచము తీసుకొనుట; దొంగ దస్తావేజులు వ్రాయుట వగైరా సనులు చేయుటయే గాక పాప భూయిష్ఠమైన చేతులతో పనికి మాలిన దేవుళ్ళను కూడా చేయుట. ఇట్టి వారు చేసే ఈ బొమ్మలు జీవము లేనివి, చలనము లేనివి, కన్నులుండి చూడలేనివి, కాళ్ళు వేండి నడవలేనివి, తమ ఎదుటనిల్చున్న భక్తుడు ఆడ మగా అను విచక్షణ జ్ఞానము లేదు. అట్టి వాటిని ఆరాధించు భక్తుడు - వాటి వంటి వాడే కాదా! అట్టి వాటిని ఆదాధించు వాడు వాటి వలె శిధిలావస్థలో జీవించునని ప్రియ పాఠకులారా! ఎప్పుడైనను గ్రహించారా! ఆ విధంగా గ్రహించక పోగా నీవు కూడా అట్టి వానితో చేయి కలుపుతావా? లేదు - అట్టి వానిని గద్దించి వానిని సత్య మార్గములో నడిపించుటకు సత్య దేవుని స్తుతించుటకు ఆరాధించుటకు సత్యమెరిగిన సమాజములో అనగా సత్య దేవుని ఆరాధించు సమాజములోనికి అట్టి వానిని చేర్చుటకు ప్రయత్నిస్తున్నావా? సత్య దేవుని యొక్క సత్య సువార్తను నీకు పొరుగు వాడైన; నీకు అన్యుడైన సహోదరునికి ప్రకటిస్తున్నావా? అతడు చేసే ఆరాధన వ్యర్థమని నిజమైన ఆరాధన ఒకటున్నదని దానికొక పైసా కూడా ఖర్చు లేదని - అది ఆత్మ సంబంధమైనదని అట్టి ఆరాధనలో శిరస్సు వంచి మోకరించి లేక నిలువబడి రెండు చేతులు జోడించి కన్నులు మూసుకొని ఆత్మ దేవుని స్తుతిస్తే ఆత్మీయానందము ఆత్మ సంతోషము మనస్సుకు నెమ్మది జీవితమునకు ప్రశాంతత, దైవ సేవకుల సాంగత్యము దేవుని ఆత్మ నింపుదల దేవునితో సావాసము దొరుకుతుందని ఏనాడైనను నీ ఇరుగు పొరుగు వానికి ప్రకటించావా? ఆ విధంగా నీవు ప్రకటించి వుంటే నీ స్తుతి యాగాన్ని దేవుడు తప్పకుండా దృష్టిస్తాడు. నీవు చేసే అట్టి కార్యము దేవునికి ఇంపైన హోనుము అనగా అట్టి సువాసన పూరితమైన భక్తిని దైవత్వమన్నది తప్పకుండా ఆ ఘ్రాణిస్తుంది. ఆ విధముగా జీవించాలని అట్టి జీవితములో దేవుడు మన కిచ్చినటువంటి ఈ నర జన్మను సార్థకము చేసుకొంటూ, దైవత్వములో లీనమై దైవ రాజ్యములో నిత్య సంతోషముతో జీవించగలమని ఇందుమూలముగా అనగా దేవుని స్తుతించుట మూలాన్ని అట్టి ధన్యత పొందగలమని స్తుతించుటలోని భావము. ఆ విధముగా ఆత్మ దేవుడు మన కుటుంబస్తుతుల మూలాన్ని ఆశీర్వదించును గాక! ఆమెన్‌.                                           ఆపత్కాలము

        10వ కీర్తనను గురించి వ్యాఖ్యానము:- యెహోవా, నీ వెందుకు దూరముగా నిలుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు?

        ప్రియ పాఠకులారా! పదియవ కీర్తనలోని ఈ మొదటి వాక్యాన్ని గూర్చి సవివరణ :- యెహోవా దూరముగా ఎందుకు నిలిచియున్నాడో మనము తెలిసికోవలసియున్నది. ప్రియ పాఠకులారా! యెహోవా దూరంగా నిలిచి యుండ బట్టి ఆది నర జంట పాప ప్రవేశము జరుగుటకు వీలు కలిగింది. యెహోవా దగ్గరగా వున్నట్లయితే ఆది నర జంట పాప ప్రవేశము చేయుటకు వీలుండేది కాదు. యెహోవా దూరంగా నిలిచియుండబట్టే ఫరో తన ఇష్ట ప్రకారము ఇశ్రాయేలులను చెరపెట్టి హింసించి వారిని బాధించి వారి చేత ఊడిగము చేయించుకొన్నట్లు వేదంలో మనము చదువగలము. ఎందుకంటే యెహోవా దేవుడే ఇశ్రాయేలు అను తన జనాంగమును అప్పుడప్పుడు తప్పిపోవునపుడెల్లను వారిని అన్యుల చేతికిని అప్పగించి తాను మరుగయ్యేవాడు. ఇట్లు మరుగైనపుడు అన్యుల చేతిలో నానా బాధలు హింసలు వెట్టి చాకిరి చేసిన ఇశ్రాయేలు బుద్ధి తెచ్చుకొని తమ తప్పును తాము తెల్సుకొని తమ తండ్రియైన దేవుని గూర్చి ప్రార్థనలు ద్వారా విజ్ఞాపన చేసి ప్రలాపించి ఆయనను ప్రసన్నం చేసుకొని తద్వారా మేలులు పొందేవారు. ఇది పాత నిబంధనలో మోషే నుండి జరుగుచున్న ఇశ్రయేలుల చరిత్ర. ఇశ్రాయేలీయులు పొగరెక్కి దైవత్వాన్ని వ్యతిరేకించినప్పుడల్లా దేవుడు వారిని అన్యుల కప్పగించి కనుమరుగయ్యేవాడు. అట్టి స్థితిలో  వారి ఆపత్కాలములో దేవుడు దాగే వాడు.

        ప్రియ పాఠకులారా! ఆయనను వెదికే వారికి దేవుడెప్పుడు కనుమరుగయ్యే వాడు కాదు. ఆసన్నుడు. సంసోను యెహోవాను వెదికిపుడెల్లను ప్రసన్నుడై సంసోను యొక్క సమస్త ఆపదలలోను ఆదుకుంటున్నటువంటి వాడు, అధే విధంగా ఏలియా విషయంలో ఆయన క్రియ జరిగిస్తూ ఏలియా యొక్క ప్రతి అవసరతలో అనగా ఏలియా యెజిబేలుకు భయనడి సారెపతులోని విధవరాలి యింటదాగినపుడు ఆ విధవ రాలి యింట ఏలియాను బట్టి పిండిని నూనెను తరగకుండా జేశాడు. ఆమె కుమారుడు చనిపోగా ఏలియా ప్రార్ధన ద్వారా దేవుడు ఆ   బిడ్డను బ్రతికించాడు. ఇక ఆ సమయంలో ఏలియాను ఒంటరిగా జేసి దేవుడు తాను కనుమరుగై తన దూతను ఏలియాకు రక్షణగా వుంచి యున్నట్లును ఏలియా యెజెబేలుకు భయపడి ఒక వాగు దగ్గర బదరీవృక్షము క్రింద పవళించిన సందర్భములో  జరిగిన సంఘటన రాజుల గ్రంథంలో  చదువగలము.

        (2) ఇక '' దుష్టుడు గర్వించి, దీనుని వడిగా తరుముచున్నాడు''. అనుటలో దుష్టుడు యెజిబేలు ఆహాబు రూపమున దేవుని ప్రవక్తయైన ఏలియాను చంపుటకు తరుము సందర్భమును ఈ సందర్భములో మనము జ్ఞాపకము చేసికోగలము. యెజిబేలు నాబోతు విషయంలో జరిగించిన మోసక్రియను బట్టి యెజిబేలును దాని భర్తయైన ఆహాబును వారి మోసక్రియలను బట్టి మరణంలో చిక్కుకొని ఏలియా శాప వచనముల మూలమున హతులై కుక్కలకు ఆహారమైనట్లు కూడా ఈ వేద భాగంలో మనము చదువగలము.

        ఇక మూడవ వచనంలో దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోభులు యెహోవాను తిరస్కరింతురు. (4) దుష్టులు పొగరెక్కి యోహోవా విచారణ చేయడనుకొందురు. దేవుడు లేడని వారెల్లపుడు యోచించుదురు'' అనుటలో యెహోవాను తిరస్కరించి తమ మనోభిలాషను బట్టి తమ స్వార్థాన్ని బట్టి దుష్టులైన ఆహాబు ఎజిబేలు పొగరెక్కిన వారై బైలే దేవుడని యెహోవా తేడని యెహోవా విచారణ చేయువాడు కాదని బైలు విగ్రహమే పవిత్రమైనదని బైలును గూర్చి బైలు యొక్క  ఆరాధనను గూర్చి దాని బలిపీఠాలను గూర్చి దాని ప్రసిద్ధిని గూర్చి యెహోవా ప్రవక్తలను చంపించిన యెజిబేలు ఐదవ వచనంలో వలె ఎల్లప్పుడును భయపడక దేవుని న్యాయ విధులను ఆయన ప్రభావమును ఆయన ఉన్నతమైన దృష్టిని గ్రహింపక యెహోవా నామమును తిరస్కరించి ఆరవ వచనంలో వలె మేము చనిపోము, ఆపద మమ్ములనంటవు, తరతరముల వరకు రాజ్య పరిపాలన మాదేయని హృదయాలోచన చేసి ఏడవ వచనంలో వలె వారి నోటిని శాపము తోను కపటముతోను  వంచన తోను నింపుకొని వారి నాలుక క్రింద చేటును పాపమును వుంచుకొని క్రియ జరిగించి యున్నారు. ఎనిమిదవ వచనంలో వలె దేవుని ప్రవక్తయైన ఏలియాను చంపుటకు వేగులను నియమించి పొంచి చాటైన స్థలములలో దాగి యుండి వారి కను దృష్టి మూలమున నిరపరాధులను చంపాలని పొంచి యుండినట్లు ఏలియాయెజిబేలు యొక్క చరిత్ర బైబిలులో నిరూపించగలదు.

        గూహలో మాటు వేసిన సింహము వలె మరుగైన స్థలములలో పొంచియుండి బాధితులను బంధించుటకును చంపుటకును పొంచియుండినట్లు తొమ్మిదవ వచనంలో వివరింపబడి యున్నది. ఇక పదియవ వచనంలో నిరాధారులు నలిగివంగుదురు. వారి బలత్కారము వల్ల నిరాధారులు కూలుదురు'', అనుటలో నాబోతు నిరాధారుడు, నలిగిన వాడు, నలిగి అనగా యెజిబేలు యొక్క అన్యాయపు తీర్పులకు రాళ్ళు దెబ్బలకు నలిగి అన్యాయపు శిక్షకు అక్రమంగా రాళ్ళతో కొట్టి చంపు శిక్షకు గురియై నేలకొరిగినాడు. ఇది యెజిబేలు యొక్క అన్యాయపు తీర్పు వల్ల నాబోతుకు జరిగిన అన్యాయపు తీర్పు.

        ఇక పదకొండవ వచనంలో దేవుడు మరిచిపోయెను. ఆయన విముఖుడై యెప్పుడును చూడకుండునని వారు తమ హృదయములలో అనుకొందురు. ప్రియ పాఠకులారా! ఇది మూర్ఖులును సాతాను ఆవేశితులైన మదాంధులును సాతాను వలన ఆత్మీయ మనో నేత్రము నార్పుకున్న అంధుల యొక్క మనోభావము. సృష్టిలోని ప్రతి జీవి, ప్రతి స్థలము ప్రతి సంఘటన ప్రతి జీవి యొక్క చరిత్ర యొక్క మర్మము, సృష్టి కర్తయగు దేవుని సన్నిధిలో వున్నది. ఆయన కను దృష్టి సృష్టి అంతటి మీద సంచారం చేయుచున్నది. అయితే సృష్టిలోని దైవ విశ్వాస పూరితులై మరియు దేవుని  ఆత్మ చేత ఆవేశితులైన భక్తకోటి పన్నెండవ వచనం నుండి ఈ విధంగా ప్రవచిస్తున్నారు.

        యెహోవా! లెమ్ము, దేవా బాధపడువారిని మరువక నీ చెయ్యి యెత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుటయేల? నీవు విచారణ చేయవని వారు తమ హృదయాలలో అనుకొనుట యేల? నీవు దీనిని చూచి యున్నావు గదా! వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కని పెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై యున్నావు. దుష్టుల భుజమును విరుగ గొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమియు కనబడక పోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము. యోహోవా నిరంతరము రాజై యున్నాడు. ఆయన దేశములో నుండి అన్య జనులు నశించిపోయిరి. (కీర్తన 10:12-16)

        ప్రియ పాఠకులారా: నిజమే: ఇశ్రాయేలు దేవుని ప్రభావమూలమున ఇశ్రాయేలు-దేవుని మరచి నందున ఆయన క్రియలలోని మర్మాలను గ్రహించనందున ఈనాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు అన్యులు అనగా పొరుగువారమైన మన జీవితాలలో యెహోవా మనకు రాజును, నశించిన మన జీవితాలను వెదికి  రక్షించుటకు ఆయన కుమారుడు యేసు మన రక్షకుకుడై ఆయనను రూపించిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు మార్గదర్శకులై లేక ఆదరణకర్తయై నశించిన మన పూర్వీక జీవితాలను ఆరాధనలను ఆలయాలను సద్ధతులను ఆచారములను మార్చి, తన చిత్తానుసారముగా తన కుమారులుగా ఆధిక్యత నిచ్చి తన మందిరాలలో తన వేద రీత్యా తన శక్తిని డట్టి నేటి క్రైస్తవులమైన మన జీవితాలను ఆయన నడిపిస్తున్నాడు.

        (17) కనుక '' యెహోవా! లోకులు ఇంకను భయకారకులు కాకుండునట్లు బాధపడువారి కోరికను నీవు వినియున్నావు.''.

        లోకులు అనగా యెహోవా యొక్క మహిమా ప్రభావములు తెలియని వారు, ఏసు క్రీస్తు యొక్క చరిత్ర నెరుగని వారు. ఏసు యొక్క  మాటలను అంగీకరించని వారు. క్రైస్తవమన్నదేమిటో ఎరుగనివారు, ఇట్టి వారు లోక సంబంధమైన చెరమూలమున అపవాది యొక్క శోధనకు గురియై శారీరకంగాను, ఆత్మీయంగాను ఆర్ధికంగాను బాధపడుచున్న వారి మొరను వారి కోరికలను వారి అక్కరలను వినగలిగిన వారు యెహోవాయని 17వ వచనం వివరిస్తున్నది.

        ఇక 18 వ వచనంలో తండ్రిలేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై'', అనుటలో తండ్రిలేని వారు అనగా దేవుని నెరుగని వారు నిలుకడ లేని వారు, జీవము లేని వారు, జీవాధిపతిని తెలిసికొనని వారు, జీవ మార్గమును వెదకని వారు. జీవ జలాను భూతినిపొందిన వారు. నిర్జీవమైన అనేకమైన విగ్రహ పూరితమైన దేవతలను తండ్రులుగా నిర్జీవ ఆరాధనలతో నలిగి విసిగి వేసారిన వారు. ఇట్టి వారికి న్యాయము తీర్చుటకై  నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ''   అనుటలో యిర్మియా 17 లో హృదయ మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహించగల్గిన వాడెవరు? యోహోవాయే కదా? అన్నట్లు ఈ నలిగియున్న వారి హృదయ స్థితిని గ్రహించిన సత్య తండ్రియైన యెహోవా దేవుడు వారి హృదయరోగమును మాలిన్యములను దురాలోచనలను కల్మషముతో కూడిన వారి హృదయ స్థితిని  చక్క బరచి యేసు అను నామముతో శుద్ధీకరించి ఆయన రక్తంతో కడిగి క్రైస్తవులుగా మనలను స్థిర పరచి యున్నాడు. అట్టి వాడు చేయు  ప్రార్థనలను చెవి యొగ్గి ఆయన ఆలకిస్తున్నాడు.

        కనుక తమ హృదయ స్థితిని చక్కబరచుకొని పవిత్రంగా సత్య దేవుని ఆరాధించు వారికి యెహోవా దేవుడు. యేసు ప్రభువు అను నామమూలమున విశ్వాసులు చేయు ప్రార్థనలకు చెవి యొగ్గి వారి ప్రార్థనలను ఆలకించి వారు దేనికి ప్రార్థిస్తున్నారో, దేన్ని గూర్చి ప్రార్థిస్తున్నారో ఎవరిని గూర్చి ప్రార్టితస్తున్నారో  ఏ సమస్యను బట్టి ప్రార్థిస్తున్నారో ఎట్టి అవసరతలను బట్టి ప్రార్థిస్తున్నారో, ఎట్టి విపత్తులలో నుండి ప్రార్థిస్తున్నారో అనిన దానిని గూర్చి సత్య దేవుడు విచారించి వారు కోరుకున్న అవసరత ఏదియో వారికి కావలసిన సహాయమేమిటో? అట్టి అవసరతను తీర్చుటకు ఆయన సాధ్యుడై యున్నాడు. ప్రభువు మనల నాశీర్వదించి కాపాడును గాక!                                                                 గుడారము

        కీర్త, 15:1 యెహోవా నీ గుడారములో అతిధిగా వుండదగిన వాడెవడు?

        ఆది 9:1 లో వలె వస్త్ర హీనుడైన త్రాగుబోతుకు స్థానము లేదు. ఆది 12:8లో వలె కృతజ్ఞతార్పణలు బలిపీఠము ప్రార్థన దేవుని యందు భయభక్తులతో కూడినటువంటి నిశ్చల విశ్వాసికి ఈ గుడారములో ప్రవేశమున్నది. ఆది 24:67 ఈ గుడారము పెండ్లి కుమార్తెకు అనగా నీ కుమారుడు లోక రక్షకుడైన ఏసు క్రీస్తును తమ నాధునిగా తన అధికారిగా తన రక్షకునిగా పొందిన విశ్వాపి 25:27-34 మోసగాడైన యాకోబు వంటి పాపికి నీ గుడారములో ఆశ్రయమున్నది - ఆతిధ్యమున్నది.         

         సంఖ్య 9:17 ఆయన సంకల్పము ఆయన చిత్తము ఆయన గమనమును బట్టి మానవుని యొక్క నివాసము వుండాలని దీని భావము. న్యాయా 4:17 శతృవుకు తీర్పు తీర్చి శిక్ష విధించు గడారము. హెబ్రీ 11:9 దైవ విశ్వాసులకు నివాస యోగ్యమైన గుడారము. చివరిదిగ లోకములోని యావత్‌ నరులకును వారి శరీరాత్మ సంబంధమైన, అపరాధములు దోషములనుండి విమోచింపబడుటకు సృష్టి కర్తయైన దేవుడేర్పరచిన పరిశుద్ధ పవిత్ర మహిమ గల గుడారము. ఇదియే ఏసు క్రీస్తు యొక్క విశ్వాసము. ఆయన నామములో విడుదల, ఆయన నామములో రక్షణ, ఆయన నామములో స్వస్థత, ఆయన నామములో విశ్రాంతి, ఆయన నామములో మోక్ష మార్గము, ఆయన నామములో సమస్త సృష్టికి మనుగడ, ఆయన నామములో సమస్త సృష్టి వికసింపు, ప్రతి పాపికి రక్షణార్థమైన గుడారము క్రీస్తే!

        ప్రియ పాఠకులారా! ఈ సత్యమును గుర్తించి పాఠకులు విశ్వాస సంబంధమైన దైవిక చింతనతో ఈ లోకములో మన యొక్క శరీర సంబంధ యాత్రను ముగించుకొని, సత్య మార్గమును మైలు రాయి యైయున్న బాటయై యున్న యేసు వైపు లక్ష్యముంచి గొర్రె పిల్ల  రాజు యొక్క రాజ్యము చేరుదము గాక!

        ప్రియ పాఠకులారా! యెహోవా యొక్క గుడారములో నివసింపదగిన వాడెవరు? అనుటలో యోహోవా యొక్క గుడారములో నివసించుటకు ఒక్క యేసు క్రీస్తు తప్ప ఎవనికిని అర్హత  వున్నట్లు బైబిలు గ్రంథములో పాత నిబంధనలోను నూతన నిబంధనలోను వేద రీత్యా మనము కొన్ని ముఖ్య సంఘటనలగూర్చి తెలిసికొంటూ ఎవరెవరు యెహోవా గుడారములో నివసించుటకు దేవుడు చేతయు దేవుని దూత చేతయు, ప్రవక్తల చేతయు, నిర్ణయింపబడి దేవుని గుడారములో కొలువు చేసినను వారి జీవితాంతము వరకు దేవుని గుడారములో నీతి నియమాలతో జీవించిన వారు లేరనే చెప్పవచ్చును. ఈ సందర్భములో ఏదేను అను దేవుని గుడారములో ఆదాము అతని భార్య దేవునిచేత నియమింపబడినను ఎక్కువ కాలము వారు దేవుని యొక్క గుడారమైన ఏదేనులో దైవాజ్ఞ మేరకు దైవ చిత్త ప్రకారముగ పరిశుద్ధమైన ఏదేనులో జీవించలేక పోవుటయే గాక పాపాన్ని, శాపాన్ని మరణాన్ని సంపాయించుకొన్నారు. అలాగే ఆది నరుల ద్వారా విస్తరించిన జనాంగముతో బాటు పాపము దైవ వ్యతిరేకత బహుముఖ వ్యాప్తముగ భూమిపై విస్తరించి యుండగా ఆది 6: లో విధముగా నరులను సృష్టించినందుకు దేవుడు సంతాపపడి యావద్‌ సృషిన్టి జల ప్రళయముతో నాశనము చేయు సందర్భములో నోవహు అనే వ్యక్తిని నీతిమంతునిగా ఆనాటి జనాభాలో ఎంపిక చేసి అతని ద్వారా నూతన సృష్టిని ప్రారంభించాలనిఆశించి దేవుడు తాను జరిగించబోవు జల ప్రళయ మారణ హోమములో నుండి తప్పించుటకు తాత్కాలిక నివాసము అనగా ఓడ గుడారమును నోవహు చేత నిర్మింప చేసి భూ నాశనము జరిగి నూతన సృష్టిలో ప్రవేశించు వరకు నోవహు యొక్క కుటుంబము ఈ చలనాత్మకమైన ఓడ గుడారములో నిసించినారు. అయితే నీతిమంతుడైన నోవహు యొక్కజీవితము ఎక్కువ కాలము దైవత్వానికి ప్రీతికరము కాలేక పోయింది. ఆతడు త్రాగుబోతై వివస్త్రగా వుండి లోకానికి దైవత్వానికి అసహ్యుడైనాడు.

         అటు తర్వాత దేవుడు అబ్రహాము అను విశ్వాసిని తన యొక్క గుడారమునకు అతిధిగా వుండుటకు తగినవాడని ఎంచి ఆ విశ్వాస గుడారాన్ని ( విశ్వాస గృహాన్ని) అబ్రహాము చేత కట్టించి మమ్రేలో సింధూర వనంలో మరి గుడారములో వున్న విశ్వాస దంపతులను దేవుడు  దర్శించి వారి యొక్క ఆతిధ్యాన్ని స్వీకరించి సంతాన వరమును ప్రసాందించినట్లు ఆది 18:లో చదువగలము. అయినను అబ్రహాము యొక్క విశ్వాపము కూడా దేవుని యొక్క గుడారానికి ప్రీతికరము కాకపోయినను క్షమింపడిన దోషుల జాబితాలో దేవుడు అబ్రహామును చేర్చినాడు. అనుకొనుటకు కొన్ని ఆధారములు (1) అబ్రహాము దేవుని విచారించక దేవుని యొక్క అనుమతి పొందక భార్య ఇష్టానుసారంగా భార్య సలహా ననుసరించి తన దాసీదాన్ని కూడి ఆమె శీలాన్ని చెరిచినాడు. ఇక  రెండవదిగా ఆమె గర్భవతియై కుమారుని కనినపుడు ఆ దాసీ కుమారుడు అబ్రహాము యొక్క స్వాస్థ్యమునకు హక్కుదారుడు ఆగునేమోయని లోక సంబంధమైన వ్యామోహముతో అబ్రహాము భార్య ఆ దాసియైన హాగరును ఆమె కొడుకును తరిమి వేయుము అనియు వారిని ఎంత మాత్రము మనతో జీవించే యోగ్యత లేదని శాసించినపుడు అబ్రహాము ముందు వెనుక చూడక అట్టి సమస్యను గూర్చియు దేవునితో విచారించక భార్య మాటలే వేద వాక్కయి దాసియైన హాగరును ఆమె బిడ్డను తన గుడారము నుండి వెళ్ళగొట్టి తరిమి వేసినట్లు వేదములో చదువగలము.

        కనుక దేవుని గుడారములో అబ్రహాముకు కూడా అవకాశము లేనట్టే పై సంఘటనలను బట్టి తెలియుచున్నది. అయితే కలుషితమై పోయిన తన గుడారమును పరిశుద్ద పరచుటకు యాకోబు అను మోసగానిని ఇశ్రాయేలు అను పేరుతో ఎంపిక చేపి అతని సంతానమైన 12 గోత్రాలను ఒక గుడారముగా జేశాడు. వారి స్తోత్రాల మీద తాను ఆశీనుడై యుండాలని దేవుడు ఆశించాడు.  అది కూడ వ్యర్థమైంది.  ఎందుకంటే వారు దేవుని యొక్క క్రమములో నిలువ లేక పోయారు. తమ అజ్ఞానముతో దైవత్వము మీద తిరుగుబాటు చేసి అయోగ్యులైైనారు. దేవుడు కరుణ సంపన్నుడు గనుక పతనావస్థలో వున్న ఇశ్రాయేలుఅను గుడారమును చక్కబెట్టులకు మోషే అను హెబ్రీయుని నాయకునిగాను నిర్వాహకునిగాను ఎంపిక చేశాడు.

        ఈ విధంగా మోషే దేవుని యొక్క గుడారమైన ఇశ్రాయేలు మీద ఆధిపత్యము వహించి దేవునికి నమ్మకస్థునిగా వున్నాడు. అయినను ఇశ్రాయేలు దాహము తీర్చుటకు దేవుడు మోషేను బండను తాకమనగా అతడు కఱ్ఱతో బండను కొట్టినాడు. కాబట్టి పరమ కానాను అను గుడారములో ప్రవేశించుటకుమోషేకు యోగ్యత లేకుండా పోయింది. అటు తర్వాత యెహోషువా న్యాయాధిపతుల గ్రంధములో దేవుడున్యాయాధిపతులుగ తన జనాంగము మీద నియమించిన వారి నందరిని గొప్ప ప్రవక్తలుగాను న్యాయాధిపతులుగాను అందరి చరిత్రలు కూడా దేవునికి యోగ్యకరముగానే వున్నాయి. కాని దైవత్వాన్ని మెప్పించి ఆయన గుడారములో ఆతిధ్యాన్ని స్వీకరించిన వాడు ఎవరా? అనిన ప్రశ్న మనకు కలుగక మానదు. లోకములో బాధలకు లోక శిక్షలకు కట్టుబడి కొట్టబడి నరుకబడి చంపబడిన వారనేకులున్నారు. అయినను దేవుని పరిశుద్ధ గుడారములలో నిసించే యొగ్యత పొందలేక పోయారు. ఈ విధంగా విస్తరించిన ఇశ్రాయేలు యొక్క  పాపమును బట్టి దేవుడు  తన గుడారాన్ని పాలేములో వేసిపట్లు వేదరీత్యా చదువగలము.

        ఇంతకు ఆయన గుడారములో అతిధులెవరు? అనిన ప్రశ్నకు జవాబు ఉన్నది. దేవునికి లోక సంబంధమైన బలి పీఠమనే గుడారాలలో యాజకులు అనగా ఇశ్రాయేలు గోత్రములోని లేవీ గోత్రీకులైన వారు అహరోను సంతతిని ప్రత్యేకించి ఆయన గుడారములోని ఆరాధన క్రియలకు అర్పణలకు నియమితులుగా చేసిపట్లు పాత నిబంధనలో నిర్గమ, సంఖ్యా కాండములలో మొదలైన ఈ యాజకత్వమునకు లేవీ కాండములో మెరుగు పరచి దేవుడు తన బలి పీఠముల మీద ఆరాధన క్రియలకు ఇట్టి లేవీ గోత్రీకులైన యాజకులను నియమించినట్లు మనకు తెలియును. ఇట్టి యాజకులు కూడా క్రమము తప్పి దైవత్వానికి విరోధకరమైన పనులు చేసినారు.

        సమూయేలుకు యాజకత్వమును ఆంటగట్టింది. ఎందుకంటే ఏలీ కుమారులు మంద బుద్దియు అవిధేయులును అయివుండి  దైవ కార్యాల మీద అలక్ష్యము చూపి యాజకత్వమునకు పనికి రానివారైనారు. అందు చేత దేవుడు తన మందిర ఆరాధనలో సమూయేలును తన పిలుపు ద్వారా పిిలుచుకొని యాజక ధర్మాన్ని నెరవేర్చు కున్నట్లుగా సమూయేలు చరిత్ర వివరిస్తున్నది. సమూయేలు తర్వాత సమూయేలు కుమారులు, కూడా యాజక ధర్మాన్ని నిర్వర్తించలేక పోయారు. అలాగే అహరోను కూడా యాజకుడై యుండి కొండమీద మోషే తడవును బట్టి ఇశ్రాయేలు ఆగ్రహించిఅహరోను మీద తిరుగుబాటు చేయగా అహరోనుతన యాజక స్ధితిని తెలుసుకొని ఆమహా ఉపద్రవములో దైవత్వానికి తన సోదరుడైన మోషే యొక్క కనబడని వాతావరణమునకు ఖిన్నుడై ఇశ్రాయేలు కొరకు దూడను పోత బోసి విగ్రహారాధనకు కారకుడాయెను. ఈ విధంగా అనేకులు దేవుని గుడారములో ప్రవేశించుటకు యోగ్యత లేకపోయినట్లుగా అనేకుల చరిత్ర వివరిస్తున్నది.

        ఆయితే దేవుడు చేత గాని వాడు కాదు. ఆయన అశక్తుడు కాదు. ఆయన నిరుత్సాహపరుడు కాదు. తన యొక్క ప్రణాళికను నెరవేర్చుకొనుటకు సమర్ధుడు. కనుకనే మానవులతో  నివసించుటకు మానవులను తనలో నివసింపజేయుటకు నరులు దేవుడు ఒకరినొకరు అర్ధము చేసికొని సఖ్యత గల్గి జీవించుటకు, మోక్ష మార్గమును అధిరోహించుటకు మోక్ష మార్గమును చేరుటకు సృష్టి కర్తయైన దేవుడు కన్యకయైన మరియ గర్భము అను గుడారములో నవ మాసములు వుండి భూమి మీద ప్రసవింపబడి నరులతో సఖ్యత గల్గి జీవించుటకు క్రొత్త నిబంధన అను ప్రణాళికను రూపొందించినాడు.  ఈ క్రొత్త నిబంధన కాలములో దేవుడు కుమార రూపము ధరించి క్రియ జరిగిస్తుండగా మార్త, మరియల గుడారములో దైవ కుమారుడు బస జేశాడు. అయితే మార్త, మరియలు అను సోదరీలు ఏసుతో సఖ్యత కలిగి, '' ఏసు అను ఆశ్రయ గుడారములో ఆయన ప్రేమకు పాత్రులై జీవించినట్లు మనము చదువగలము. అలాగే సొట్టి వాడైన జక్కయ్య ఏసుకు ఆతిధ్యమిచ్చి ఆయనను తనలోను, తాను ఆయనలోను నేస్తము కలిపి జీవించినట్లు బైబిలులో తెలియగలదు. అలాగే 12 మంది శిష్యులను తనతో నియమించాడు.కాని చివరి దశలో ఒక్కడు మాత్రమే అనగా యోహాను ఒక్కడే ఆయన సిలువ దగ్గర వుండినట్లు మనము చదువగలము. ఏసు అను గుడారము లో జీవించిన యోహానుకు లోక వినాశములో జరగబోవు మారణహోమము, సృష్టిలయము నూతన సృష్టి వగైరాలను గూర్చి తెలుప బడినట్లు ప్రకటన 1: లో మనము చదువగలము.

        ప్రియ పాఠకులారా! యింతకును ఏసు ప్రభువు పుట్టినపుడు దావీదు పురములోని తాత్కాలిక నివాసమైన గుడారముతో సమానమైన పాకలో బాల యేసును దర్శించుటకు జ్ఞానులకు తార; గొల్లలకు దూత లోక రక్షకుడు పుట్టిన సువార్తను ప్రకటించినపుడు వారు బెత్లేహేము పురములో పాకలో వుండిన బిడ్డను దర్శించి బంగారము, బోళము, సాంబ్రాణితోను - గొల్లలు స్తుతి గీతాలతో ప్రభువును మహిమ పరచినట్లు మనము చదువగలము.  ఇందును బట్టి చూడగా దేవుని గుడారములో ఆతిధ్యము పొందాలంటే భూలోక్‌ సంబంధమైన గొప్ప అంతస్థులు పదవులు రాచరికాలు అధికారాలు పనికిరావని తెలియుచున్నది. బాల యేసును దర్శించిన జ్ఞానులకు ఏ పదవి లేదు. బాల యేసును దర్శించిన గొల్లలకు ఎటువంటి ఆస్థిపాస్థులు బిరుదులు, అధికారములు పొందిన వారు కారు. కనుక దేవుని యొక్క గుడారములో ఆతిధ్యాన్ని సంపాదించాలంటే కీర్త 13:2-5 వివరించబడిన యోగ్యతలు కలిగిన వారే దేవుని యొక్క గుడారములో అతిధులుగా వుండదగిన వారని తెలియు చున్నది.'' యదార్ధ ప్రవర్తన గలిగి కొండెములాడని, తన పొరుగువానికి  కీడు చేయని నింద మోపని వాడు, యెహోవా యందు భయ భక్తులు గల వారిని అతడు సన్మానించును. ప్రమాణము చేసి నష్టము పడినను మాట తప్పడు. నిరపరాధిని చెడుపుటకై లంచము పుచ్చుకొనడు.

        దేవుని యొక్క గుడారములో అతిధులుగా వుండిన వారు దేవుని యొక్క స్థిర నివాసములో ప్రవేశించుటకు అర్హులని కూడా మనము గ్రహించవలసి యున్నది. ఇందుకు తార్కాణముగా ఏసు ప్రభువు సిలువ మరణముననుభవిస్తున్న సంధర్భములో ఆయన ఇరు ప్రక్కల సిలువ వేయబడిన దొంగలలో కుడి వైపు దొంగ పశ్చాత్తాప్తుడై ప్రభువును మెప్పించి పరదైసులోకి వెళ్ళినాడు. అది తాత్కాలిక నివాసము- తాత్కాలిక నివాసములో యోగ్యతను సంపాయించినాడు. సుస్థిర నివాసమునకు సులభముగా వెళ్ళగలడని ఆ సంఘటన ఋజువు పరచుచున్నది. విశ్వాసులకు తండ్రియైన అబ్రహాము తన గుడారములో దేవునికి ఆతిధ్యమిచ్చి విశ్వాసులకు తండ్రియని బిరుదు పొందుటయే గాక పరలోకములో కూడ సుస్థిరమైన స్ధానాన్ని పొందినట్లు ఏసు ప్రభువు చెప్పిన ధనవంతుడు లాజరు కథలో అజరు చనిపోయి దేవ దూతల చేత మోయబడి అబ్రహాము ఎదురు రొమ్మున ఆనుకున్నట్లుగా వివరించబడి యున్నది. దేవునితో గుడారపు సావాసము ద్వారా గుడారపు ఆతిధ్యమునిచ్చి  సుస్థిరమైన స్థానాన్ని అబ్రహాము పొందగలిగినాడు. ఈనాడు క్రైస్తవులమైన మనము ఇహలోక సంబంధమైన మన గుడారములలో ఎంత వరకు దైవత్వానికి చోటు ఇస్తున్నాము. లేక దేవుని గుడారాలలో ప్రవేశించి ఆతిధ్యము పొందుటకు ఏయే అర్హతలు కలిగి యున్నాము. మనలను మనమే పరీక్షించుకొందము. ఈనాడు ఈ క్రిస్మస్‌ పండుగ సందర్భములో మన గుడారములలో ప్రభువు మనకు ఆతిధ్యమిచ్చును అనగా మన హృదయ గుడారమైన మన హృదయాలలో ఆయనకు స్థానమిచ్చి, ప్రకటన 3:20 లో వలె మన హృదయ ద్వారమును తెరచి ఆయనతో మనము మనతో ఆయన కలిసి ఆత్మీయమైన విందు ఆరగించి ప్రభువులో ఐక్యమగుదుము గాక! ఆమెన్‌.

                 అతిధి

        యెహోవా నీ గుడారంలో అతిధిగా వుండదగిన వాడెవడు? ప్రియ పాఠకులారా! రెండవ కొరింథి 5:1 లో భూమి మీద మన గుడారమైన యీ నివాసము శిధిలమైపోయినను'', అనుటలో జీవాత్ముడైన నరునికి దేహమన్నది గుడారము అనగా దేవుని యొక్క జీవాత్మకు నర శరీరమన్నది గుడారము అనగా ఆలయము.  అయితే దేవునికి కూడా ఒక ప్రత్యేకమైన గుడారమున్నట్లును ఆయనకు కూడా అతిధులున్నట్లును ఈ వచన భాగంలో ప్రకటితమైయున్నది.

        ప్రియ పాఠకులారా! దేవుని గుడారంలో ఆయన కొరకు ప్రత్యేకించబడిన స్థలములుగా పాత నిబంధనలో కొన్ని వేద భాగాల ద్వారా తెలిసికోగలము. మొట్ట మొదట దేవుని గుడారం ఏదేను, అందులో ఆదాము హవ్వలను ఆది నర జంటను తన జీవాత్మతో ప్రతిష్టించి అతిధులుగా వుంచినాడు. కాని ఏదేనుఅను పరిశుద్ద సన్నిధిలో నరులు దేవుని ఆతిధ్యానికి నిలువలేక పోయారు.  దైవాజ్ఞను అతిక్రమించి నరులు ఆ గుడారము నుండి తరిమి వేయబడినారు. అటు తర్వాత ఆది నర జంట ద్వారా ప్రబలిన విశేష జన సందోహ అక్రమములను తన సహించలేని దేవుడు నోవహు అను ఒక నీతిమంతుని కుటుంబాన్ని ఎన్నుకొని చిత్త ప్రకారం తన కొలతలను బట్టి తన నిర్ణయాన్ని బట్టి ఒక ఓడ గృహాన్ని నిర్మించాడు. ఇందులో అతిధులుగా దేవుడు తన సృష్టిలోని పశు పక్ష్యాదులను నోవహు యొక్క కుటుంబాన్ని ఈ ఓడ గృహంలో అతిధులుగా వుంచి తన మహిమా ప్రభావంతో వారిని కాపాడినాడు.

        ప్రియ పాఠకులారా! ఈ విధంగా దేవుని గుడారము తోట రూపంలో ప్రారంభమై అటు తర్వాత నరుని యొక్క దేహంగా మారి నోవహు గుడారంగా క్రియ జరిగింది. అనంతరము అబ్రహాము అను ఒక విశ్వాసిని తన అతిధిగా ఏర్పరచుకొని అబ్రహాము ద్వారా లోకములో రెండు జనాంగములకు జన్మనిచ్చాడు. ఇట్లు జన్మనిచ్చు సందర్భములో దేవునికి అబ్రహాము మీదనున్న ప్రేమ కొద్దీ ఆదిలో ఏదేను వనంలో ఆదాముతో సంభాషించి ఆదాముతో కూడా ఆతిధ్యాన్ని అనుభవించిన దేవుడు అబ్రహాము ద్వారా ఈ సందర్భములో మమ్రే దగ్గర సింధూరవనము అనగా ఆదినరుని నివాసము ఏదెను మనము విశ్వాసి నివాసము సింధూరవనముగా మార్చి దేవుడు త్రిత్వమును ధరించి ముగ్గురు అతిథులుగా అబ్రహాము యొక్క గుడారములో ఆతిధ్యాన్ని పొంది అతనిని అతని కుటుంబాన్ని ఆశీర్వదించినట్లు తత్పలితంగా తొంభై ఏండ్ల శారా గర్భవతియై సంతానవంతురాలైనట్లు కూడా చదువగలము. ఈ విధంగా విశ్వాసియైన అబ్రహాము తన జీవిత కాలము అంతను దైవ చిత్తానుసారంగా జీవించినడచి దేవుడు తనను వెళ్ళమన్న స్థలమునకును, దేవుడు తనకు చూపు స్థలములలో అబ్రహాము గుడారములు వేస్తూ సంచార జీవితం చేస్తూ తన ఇహలోక యాత్రను ముగించుకొని అమరుడైనట్లుగా మనము గ్రహించాలి.

        ప్రియ పాఠకులారా! దేవుని గుడారంలో నివసించాలంటే లోక సంబంధమైన విద్యలు డిగ్రీతో కూడిన చదువులు ఆస్థులు, అంతస్థులు గొప్ప రాజ వంశాలు, ఘనతలు, నిష్ప్రయోజనములు, లోక రీత్యా ఒక వ్యక్తి రాజుల గుడారములోను లేక ప్రభుత్వ ఆలయాలలోను లేక ప్రభుత్వ భవనాలలోను వుండాలంటే లోక రీత్యా కొన్ని అర్హతలు యోగ్యతలు కావాలి. దైవత్వానికి ఇది పనికి రాదు. ఇందుకు ఉదా|| దేవుడు తన గుడారంలో అతిధులుగా వుంచుకొని నడిపించిన వ్యక్తులు మోషే అహరోనులు లగాయతు యెహోషువా సమూయేలు, సోలోమోను, ఏలియా, యెషయా, ఇర్మియా, ఎలీషా, నెహెమ్యా, వగైరాలు దేవుని గుడారంలోని అతిధులుగా జీవించినవారు.

        ఇక ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారెవరు? మోషే, యెహోషువా, ఏలియా వగైరా ప్రవక్తలు, ప్రియ పాఠకులారా! యెహోవా గుడారాన్ని గూర్చి తెలిసికొన్నాము. ''యోహోవా యొక్క పరిశుద్ధ పర్వతము'', అనుటలో యెహోవా పర్వతాలు భూమి మీద ఏడు వున్నవి. అందులో 1. సీనాయి 2. యోరేబు 3. కర్మేలు 4. సీయోను 5. అరారాతు ఈ అరారాతు 6. మోరియా 7. ఒలీవలకొండ. ప్రియ పాఠకులారా! మొదటిది ఆరారాతు పర్వతాల మీద దేవుడు తాను నోవహు చేత చేయించిన ఓడ నేటికిని సాక్ష్యార్ధంగా నిలిచి దేవుని మహిమ పరచుచున్నది. అబ్రహాము ఇస్సాకును బలి అర్పించుటకు దేవుని చేత నిర్ణయించిన మోరియా పర్వత శ్రేణి నేటికిని వేదములో జ్ఞాపకార్థంగా నిలిచియున్నది.  ఈ మోరియా అను పర్వత శ్రేణి ఎక్కుటకు అబ్రహాము యొక్క గాడిదగాని పనివారు గాని అర్హతలేని వారు కాగా ఇస్సాకు బలి కట్టెలను మోయు అతనికి ముందు అబ్రహాము అగ్ని చేత సట్టుకొని ఈ మోరియా అను పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కినారు.

        ఇక నోటి మాంద్యము గల మోషేను దేవుడు ఇశ్రాయేలు అను తన పరిశుద్ధ జనాంగమునకు నాయకునిగా నియమించుటకు సీనాయి పర్వతం మీద మండుచున్న పొదగ దర్శన మిచ్చి మోషేను పిిలిచి సీనాయి అన్నది పరిశుద్ధ ప్థలమని దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడుతూ మోషే! నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైనది. అనగా సీనాయి పర్వతము పరిశుద్దమైనదని తెలియుచున్నది.ఇట్లు ఆయా సందర్భాలను బట్టి ఆయా పర్వతములను పరిశుద్ధ పర్వతములుగా నిర్ణయించిన దేవుని సన్నిధిలో నివసించుటకును సంచరించుటకును యోగ్యత కలిగిన నరులెవరయ్యా? అంటే యదార్ధమైన ప్రవర్తన గలిగి నీతిననుసరించారు. హృదయ పూర్వకముగా నిజము మాట్లాడువాడేనని'' అంటాడు. మరి ఇట్టి వాడు ఈ దినాలలో ఉన్నాడా? అంటే అది ప్రశ్నార్థకమే గాని సులభంగా దానికి జవాబు దొరకదు. అయితే పాత నిబంధన కాలంలోను నూతన నిబంధన కాలంలోను అట్టి వారున్నారు. కొందరి జీవితానుభవాలను గూర్చి తెలుసు కొందము. ఇట్టి జాబితాలో అబ్రహాము, ఇస్సాకు, యోబు సమూయేలు, యాకోబు కుమారుడైన యోసేపు ఇతడు నీతిననుసరించిన వాడే గదా! వగైరాలు.

        ఇక మూడవ వచనంలో అట్టి వాడు నాలుకతో కొండెములాడడు'' అంటున్నాడు. అయితే కొండెములాడింది ఎవరు? ప్రియ పాఠకులారా! ఆదిలో ఆదాము తాను చేసిన దైవాతిక్రియ నేరమును ఒప్పుకొనక తన ప్రియురాలు సాటి సహాయియైన స్త్రీ మీద నిందమోపుచూ - నీవు నాకు సాటిసహాయంగా యిచ్చిన స్త్రీయే ఆ పండు నాకు తినిపించింది''. అని నిందమోపినాడు. అదే విధంగా హేబేలును చంపిన కయీను కూడా నేరమును ఒప్పుకోక - నా తమ్మునికి నేను కాపలావాడనా? అని దైవత్వానికెదురు తిరిగినాడు. పొరుగు వారి మీద నిందమోపుటన్నది దైవ దృష్టికి బాధాకరమైన నేరము. దీన్ని ఏసు ప్రభువు సిలువ మీద ఋజువు పరచుచూ తనను హింసించి బాధించి సిలువ వేసిన వారిని తనను హేళన చేసిన వారిని గూర్చి తండ్రికి విజ్ఞాపన చేస్తూ, తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు'' మని ఆయన విజ్ఞాపన చేసియున్నాడు.

        ఇంక నాల్గవదిగా ''అతని దృష్టికి నీచుడు అసహ్యుడు'' అనుటలో నిజమే! యోసేపు దృష్టికి అతను మోహించిన ఫరో భార్య అసహ్యురాలు, నీచురాలు, మెషగు - షద్రగు - అబిద్నగోలు దృష్టికి నెబుకద్నెజరు చేయించి జరిగించు చున్న విగ్రహారాధన క్రియ నీచము అసహ్యము. ఎస్తేరు దృష్టికి హమాను నీచుడు, అసహ్యుడు. ఏలియా దృష్టికి యెజిబేలు ఆహాబు నీచురాలు, అసహ్యురాలు.

        అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించుదునంటున్నాడు. ప్రియ పాఠకులారా! ఇట్టి జీవితంలో యెహోవా యందు భయ భక్తులు గల వారు అనగా దైవదాసులు. దైవ విశ్వాసులను పోషించిన వారు, సన్మానించిన వారు. యోబు, సమూయేలు, దావీదు, ప్రవక్తలకు సహాయనడినవారు. ఎస్తేరు, అపో 10: లో కొర్నేలి. ''ఆ తదుపరి అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడనుటలో'', ప్రియ పాఠకులారా! దేవుడు అబ్రహాముకు ఒక్కడైయున్న ఇస్సాకు అను కుమారుని బలి కోరినపుడు అబ్రహాము నిరాకరించలేదు. బాధపడలేదు, మాట తప్పలేదు. అదే విధంగా యెప్తా - తన కుమార్తెను దేవునికి అర్పించుటలో ప్రమాణం చేసి తర్వాత కలిగినటువంటి బాధను హృదయ విచారకర వేదనను అనుభవించినను మాట తప్పకుండ ఆమెను దేవుని కర్పించాడు. హన్నా తనకున్న గొడ్రాలి తనమును పోగొట్టుకొనుటకు దేవునికి వ్రతమాచరించి తన కొక మగ సంతానమిచ్చినట్లయితే ఆ బిడ్డను దైవ మందిరానికి అంకితం చేస్తానని మాట యిచ్చి ఆ మాటను నిలబెట్టుకొన్నది.

        ఇక తన ద్రవ్యమును వడ్డికి ఇవ్వనంటున్నాడు. ప్రియ పాఠకులారా! ఈ వడ్డీ అన్నది నర జీవితానికి క్షేమకరం కాదు. ఆత్మీయంగా మన జీవితాన్ని గూర్చి మనమాలోచిస్తే దేవునికి మనము వడ్డీ ఇవ్వాల్సిన వారమై యున్నాము. మన శరీరంలో తన ఆత్మను వుంచిన దేవునికి మనము చందాలు దశమ భాగాలు ఎగ్గొట్టి మనము మాట చెప్పి తప్పి పోతున్నాము. ఆయన ద్రవ్యాన్ని ఆయన మందిరంలోని ఖజానాలో కూడా ఆయా సందర్భములను బట్టి ధనాన్ని ఆశించుచున్నామే గాని ఇంకను మన నిత్య సంపాదనలో మన ద్రవ్యాన్ని వడ్డీకి యిస్తున్నాము, వసూలు చేస్తున్నాము.

        మన ఇహలోక జీవితం ఈ విధంగా వుంటే పరలోక రీత్యా పరమాత్ముడు నర జీవునిలో ఆత్మననుగ్రహించినపుడు ఈ నర జీవునిలోని జీవాత్మ పరమాత్మకు ఋణపడి యున్నదను సంగతి మనము ఆలోచించుటలేదు. జీవాత్మ యొక్క అదృశ్య నిబంధనను ఆలోచించకుండ దృశ్యమైయున్న శారీర కార్యాలపై దృష్టి నిల్పి లోహ సంబంధమైన నాణాలకు విలువనిచ్చి వీటి మీద వడ్డీలు వసూలుచేయ సంకల్పిస్తున్నామేగాని దేవునికి మనము ఋణపడి యున్నామని, ఒకానొక దినమున తన ఆత్మను మనలో సంచకరువుగా వుంచిన దేవుడు రెండవ కొరింథీ 5:10 లో వలె ప్రభువు సమక్షంలో వడ్డితో కూడా ఆయన వసూలు చేస్తాడను జ్ఞానాన్ని ప్రతి యొక్కరము మరచియున్నాము.

        నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ప్రియ పాఠకులారా! ఈ వచనము నేటి యుగంలో అక్షరాలా నెరవేరుతూ ఈ లంచము క్రియ నేటి ప్రభుత్వాలలోను దేవాలయాలలోను ప్రభుత్వ సంస్థలలోను బహుముఖ రీతులుగా ఈ లంచమన్నది విలయతాండవమాడుచున్నది. ఒక ఉద్యోగిని మార్పించి ఆయా ఖాళీలో మరియొక్కడు ప్రవేశించాలని లంచాన్ని చూపుట. బి.యి.డి. సీట్ల కోసం లంచము, మత మార్పిడికి లంచము, బ్యాంకి ఋణ సహాయానికి లంచము ఉద్యోగానికి లంచము, ఒకటేమిటి? ప్రతి స్థలములోను ప్రతి చోటను, నేడు లంచం లేనిదే పనులు జరుగుటలేదు. లంచము లేనిదే నేటి పౌరుల జీవితానికి సుఖశాంతులు లేవు. ఏసు ప్రభువును పట్టించుటకు కూడా యూదా ఇస్కరియోతు లంచం పుచ్చుకున్నాడు. సంసోనును పట్టించుటకు డలైలాకు లంచమిచ్చారు.

        కనుక చివరగా :- ఈ ప్రకారం చేయు వాడు కదల్చబడడు'' అంటాడు. అనగా లోకరీత్యా అయితే ఎత్తుబడి అవుతాడు. దైవత్వంలో నిలకడగా నిలబడి ప్రార్థనా పూర్వకంగా వీరోచితంగా లోకంతో పోరాడి లోకాన్ని లోకనాథులను దురాత్మల సమూహాలను, అంధకారశక్తులను జయించ గల్గుటకు ప్రార్థన వేద వాక్య ధ్యానము రెండు కత్తుల వంటివి. ఈ సందర్భంలో ఏసు ప్రభువు నేను లోకమును జయించి యున్న ప్రకారము, మీరు లోకమును జయించి యున్నారు. ఆయన లోకమును    ఎట్లు జయించి యున్నాడు? ప్రార్థన, విజ్ఞాపనలతో, 125వ కీర్తన ఒకటిలో వలె '' యెహోవా యందు నమ్మిక యుంచిడి! నిత్యము నిలుచు సీయోను కొండె వలె నుందురు'' అను వాక్య నెరవేర్పు ఇట్టి వారికి సార్థకమైయున్నది.

                6. పరిశుద్ధ పర్వతము

         కీర్తన 15:1 యెహోవా! నీ గుడారములో అతిథిగా వుండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసించదగిన వాడెవడు?

        మొటంట మొదటి స్థలము జల ప్రళయానంతరము ఆరారతు పర్వతాల మీద నిలిచిన ఓడ నుంచి భూమి మీద అడుగు మోపిన వెంటనే నోవహు ఓడలో వున్న పవిత్రమైన పశుపక్ష్యాదులను కొన్నిటిని తీసుకొని బలిసీఠమును కట్టి దేవునికి దహన బలి అర్పించినపుడు ఆ బలి హోమమును ఆఘ్రాణించిన దేవుడు తన్మయుడై ఆ హోమమును ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని శపించను'' అని వాగ్దానాన్ని చేసినట్లు చదువగలము. ఇందువలన ఉన్నతమైన స్థలములలో దేవుడు తనను తాను మహిమ పరచుకొన్నట్లును, అట్టి మహిమలో నోవహు దేవునితో సమాధానపడినట్లుగా అట్టి మహిమను నకబరచి నోవహు ద్వారా నరసంతతితో సమాధాన పడినటుల తెలియుచ్నుది. ఇందును బట్టి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ - ''దేవుని మహిమ క్రియ జరిగించి దైవత్వానికి ఇష్టుడైనట్టి నీతిమంతుడైన నోవహు దేవుని మహిమపరచినట్లుగా తెలియుచున్నది.

        అలాగే సర్వోన్నతుని పరిశుద్ధ స్థలమైన హోరేబు మోషేకు దేవుడు తన మహిమను కనబరచి తద్వారా తన జనాంగమునకు నాయకుడుగా చేశాడు. అందుకు ప్రతిగా మోషే దేవుడు తనకిచ్చిన కఱ్ఱను బట్టియు దేవుని చే వ్రాతతో అన్నుగహింపబడిన వ్రాతపలకలను బట్టియు - ఇశ్రయేలీయులతో దేవుని కున్న విరోధము నుండి ఐక్యపరచి దౌవత్వానికి మానవత్వానికి సమాధాన కారకుడాయెను. ఈ విధముగా దేవునికి ఇష్టుడైన మోషే నాయకుని గాను ప్రవక్తగాను దేవుని చేత నియమింపబడినాడు. ఇక ఏలియా దేవుని పర్వతమైన కర్మేలులో విగ్రహారాధికురాలు కఠినురాలు సాతానుకు ప్రతి రూపమైన ఎజిబేలు యొక్క పీచమైన విగ్రహారాధన కార్యములలో ఆహాబు రాజు అది నీచ కార్యమని తెలిసి కూడా ఎజిబేలు తన భార్యయైనందుకు ఆహాబు స్త్రీ మమకారముతో ఆ మాయలాడి వలలోపడి ప్రవక్తులను దైవత్వానికినివిరోధియైనపుడు, ఏలియా కర్మేలు పర్వతము మీద దేవుని మహిమపరచుటకు బలిపీఠమును కటి ్ట  తన బలి కార్యము ద్వారా నిప్పులేకయే ఆకాశము నుండి అగ్ని దిగివచ్చినట్లుగా జేసి కర్మేలు పర్వతము మీద దేవుని మహిమ పరచగా దేవుడు తన మహిమను చూపి తన కిష్టుడైన ఏలియాకు సమాధానము కలిగించినాడు.

        అలాగే నూతన నిబంధన కాలములో  ఇశ్రాయేలు మీద దేవునికున్న ఉగ్రత నుండి  తన యొక్క సజీవ బలి యాగము ద్వారా మానవత్వానికి దైవత్వానికి ఉన్న విరోధమును రూపు మాపి సకల మానవాళిని దైవత్వములో సమాధాన పరచినట్లు కొలస్స 1:19 నుండి చదివితే తెలియగలదు. ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును సమాధాన పరచుకొనవలెనని తండ్రి అభీష్టమాయెను. తన సన్నిధిని నిరోధషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు మాంసయుక్తమైన దేహమందు, మరణము వలన మనలను పమాధానపరచెను.

        ఒకప్పుడు దేవుని యొక్క సర్వోన్నతమైన స్థలము ఇశ్రాయేలు యొక్క కృతజ్ఞతతో కూడిన స్తోత్రార్పణలు, స్తుతులు, వీటి మీద తన మహిమను కనబరిచినాడు. ఇప్పుడైతే ఏసు యొక్క బలి యాగమును బట్టి యావద్‌ ప్రపంచములోని ఏసు మీద విశ్వాసముంచిన వ్యక్తి  యొక్క హృదయాన్ని తన సర్వోన్నత స్థలముగా ఏర్పరచుకొని తద్వరా తాను సమాధానపడినట్లుతెలియు చున్నది. కనుక సమాధానము యొక్క అనుభూతిని నేటి యుగము వారైన మనము పొందుచున్నాము. కనుక ఇపుడు ఆదిలోని పర్వత శ్రేణులు పోయినవి. ఆ పర్వత శ్రేణుల మీద అర్పించిన బలి కార్యములు దేవుడు అనుగ్రహించిన ఱాతి పలకల ద్వారా దేవుడు బయల్పరచిన దశాజ్ఞల సిద్ధాంతములు ఇవన్నియు పోయినవి. ఇప్పుడు ఏసు క్రీస్తు - ప్రభువు అను ఈ మూడు నామములను దేవుడు తన సర్వోన్నత స్థలమైనమన హృదయాలలో వుంచి ఆయన సంతృప్తి పడుచున్నాడు. కనుక ఈ నామమున తప్ప సూర్యుని క్రింద మరి ఏ నామము నందున రక్షణ లేదని మనము గ్రహించవలపి యున్నది.

        ప్రియ పాఠకులారా! 15:1యెహోవా గుడారములో అతిథిగా వుండదగిన వానికి ఉండదగిన యోగ్యతలు కావలసిన ఆథిక్యతలు గూర్చి తెలిసికొని యున్నాము. ఇపుడు ఆయన పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? అనిన మాటను బట్టి మనము తెలిసికొందము. అసలు యెహోవా పర్వతమంటే అర్థమేమిటో అది ముందు తెలిసికొనవలసి యున్నది. ఈ సందర్భములో లూకా 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధాపము కలుగును గాక! ఆయన మహిమలో నివసించాలని అర్థము. నీ మహిమలో అనగా నీ పరిశుద్ధ సన్నిధిలో అని అర్థము.  ఎందుకంటే గుట్టలు మిట్టలు కొండలు పర్వతాలు కంటె ఉన్నతమైన స్థానము ఆయన మహిమతో కూడిన సన్నిధి. అందుకే సర్వోన్నతమైన స్ధలములలో దేవునికి మహిమ'', అనుటలో సర్వోన్నతమైన స్థలములలో వుండియే దేవుడు సృష్టి కార్యమును గూర్చి ఆలోచించి ఒక ప్రణాళిక రూపొందించి ఆ ప్రణాళికానుసారము ఆ  ప్రణాళిక క్రమమును బట్టి ఆయన చిత్తానుసారము ఈ సృష్టి కార్యములను జరిగించినాడు, జరిగిస్తున్నాడు.

        సర్వోన్నతమైన స్థలములలో నుండియే దేవుడు తన మహిమను మోషేకును ఇశ్రాయేలీయులను కనబరచి వారి ఆపత్‌ కాలములో ఆదుకున్నాడు. సర్వోన్నతమైన స్థలములలో వుండియే ప్రవక్తలకు తన ప్రణాళిక కార్యములను ప్రవచనాల రూపముగ వారి చేత ప్రవచింప జేశాడు. సర్వోన్నతమైన స్థలములలో వున్న దేవుడు తన పరిశుద్ధ సన్నిధియైనటువంటి ఉన్నతమైన సన్నిధికి నరులను కూడా పిలుస్తున్నాడు. కాని వెళ్ళినవారున్నారు వెళ్ళలేని వారున్నారు. మొట్టమొదటగా ఆయన పరిశుద్ధ పర్వతము మీద నివసించిన వాడెవడో మనము తెలిసికొందము. అరారతు  పర్వతముల  మీద నిలిచిన ఓడలోని నోవహు కుటుంబము. ఆయన పరిశుద్ధ పర్వతము మీద వుండి బలి పీఠము కటి,్ట పవిత్రమైన పశు పక్ష్యాదులను బలులర్పించి ఇంపైన సువాసనతో కూడిన హోమమును దేవుడు ఆఘ్రాణించునట్లుగ జేసి దైవాశీర్వాదము పొందినాడు, పున: సృష్టికి ఆదియైనాడు. అనగా సకల మానవ సంఖ్యకు మూల పురుషుడయ్యెను.

        ఇక రెండవ వాడు మోషే - తన మామ గొర్రెల మందను కాయుచు దేవుని పర్వతమైన హోరేబు నధిరోహించి దైవ పిలుపు అందుకొని దైవ జనాంగానికి నాయకుడాయెను. అలాగే సీనాయి పర్వతమునెక్కి దైవత్వంతో సంభాషించి దైవ కుటుంబములో నమ్మకస్థుడై దశాజ్ఞల మందసమును మోపి దేవుని మహిమ పరిచాడు. ఏలియా :- కర్మేలు పర్వతము మీద దేవునికి పరిశుద్ధ బలి ఆచరించి నిప్పు లేకుండగానే దేవుని అగ్నితో బలిని దహించి అన్య జనాంగానికి మరణాంతకమయ్యాడు. ఈ విధంగా దేవుని యొక్క పరిశుద్ధ పర్వతము మీద  నివసించిన వారి జాబితాలున్నవి.

         ఇక నూతన నిబంధన కాలములో ఏసు ప్రభువు జీవించిన కాలమంతయు ఆయన నివసించిన పర్వతము ఒలీవల కొండ. ఇది యెహోవా పరిశుద్ధ పర్వతము మీద నివసించిన వారి చరిత్ర. ఇపుడు లూకా 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అనగా సమస్తమునకు ఎత్తయిన స్థలము. దేవుడు కనబరచిన మహిమను గూర్చి తెలిసికొందము. ఈ సర్వోన్నతమైన స్థలము దేవుడు ఎన్నుకొన్నస్థలమైయున్నది. పై కనబరిచిర పరిశుద్ధ పర్వతాలు అనబడిన దైవ ప్రదేశాలలో దేవుడు ఎన్నుకొని తన సేవకి పిలిచిన వ్యక్తులు దేవుని మహిమ పరిచినారు. ఆ విధముగా దేవుని యొక్క ఉన్నత స్థలములలో జీవించిన వ్యక్తులకు దేవుడు తన మహిమను చూపిపాడు.

        15:1  కీర్త 15:1 యెహోవా! నీ గుడారములో అతిథిగా వుండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసించదగిన వాడెవడు?

        ప్రియ పాఠకులారా! యెహోవా గుడారములో అతిథిగా వుండదగిన వానికి ఉండదగిన యోగ్యతలు కావలసిన ఆథిక్యతలు గూర్చి తెలిసికొని యున్నాము. ఇపుడు ఆయన పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? అనిన మాటను బట్టి మనము తెలిసికొందము. అసలు యెహోవా పర్వతమంటే అర్థమేమిటో అది ముందు తెలిసికొనవలసి యున్నది. ఈ సందర్భములో లూకా 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధాపము కలుగును గాక! ఆయన మహిమలో నివసించాలని అర్థము. నీ మహిమతో కూడిన సన్నిధి. అందుకే సర్వోన్నతమైన సథలములలో దేవుని మహిమ అనుటలో సర్వోన్నతమైన స్థలములలో వేండియే దేవుడు సృష్టి కార్యమును గూర్చి ఆలోచించి ఒక ప్రణాళిక క్రమమును బట్టి ఆయన చిత్తానుసారము ఈ సృష్టి కార్యములను జరిగించినాడు, జరిగిస్తున్నాడు.

        సర్వోన్నతమైన స్థలములలో వేండియే దేవుడు తన మహిమను మోషేకును ఇశ్రాయేలుకును కనబరచి వారి ఆపత్‌ కాలములో ఆదుకున్నాడు. సర్వోన్నతమైన స్థలములో వుండియే ప్రవక్తలవు తన ప్రణాళిక కార్యములను ప్రవచనాల రూపముగ వారి చేత ప్రవచింప జేశాడు. సర్వోన్నతమైన స్థలములలో వున్న దేవుడు తన పరిశుద్ధ సన్నిధియైనటువంలి ఉన్తమైన సన్నిధికి నరులను కూడా పిలుస్తున్నాడు. కాని వెళ్ళలేని వారున్నారు. మొట్టమొదటగా ఇయన పరిశుద్ధ పర్వతము పర్వతముల మీద నివసించిన వాడెవడో మనము తెలిసికొందము. ఆరారతు పరిశుద్ధ పర్వతము మీద నిలిచిన ఓడలోని నోవహు కుటుంబము. ఆయన పరిశుద్ధ పర్వతము మీద వుండి బలి పీఠము కట్టి పవిత్రమైన పశు పక్ష్యాదులను బలులర్పించి ఇంపైన సువాసనతో కూడిన హోమమును దేవుడు ఆఘ్రాణించునట్లుగ జేసి దైవాశీర్వాదము పొందినాడు, పున: సృష్టికి ఆదియైనాడు. అనగా సకల మానవ సంఖ్యకు మైల పురుషుడయ్యెను.

        ఇక రెండవ వాడు మోషే - తన మామ గొర్రెల మందను కాయుచు దేవుని పర్వతమైన హారేబు నధరోహించి దైవ పిలుపు అందుకొని దైవ జనాంగానికి నాయకుడాయెను. అలాగే సీనాయి పర్వతమునెక్కి దైవత్వంతో సంభాషించి దైవ కుటుంబములో నమ్మకస్థుడై దథాజ్ఞల మందసములను మోపి దేవుని మహిమ పరిచాడు. ఏలియా :- కర్మేలు పర్వతము మీద దేవునికి పరిశుద్ధ బలి ఆచరించి నిప్పు లేకుండగానే దేవుని అగ్నితో బలిని దహించి అన్న జనాంగానికి మరణాంతకమయ్యాడు. ఈ విధంగా దేవుని యొక్క పరిశుద్ధ పర్వతము మీద  నివసించిన వారి జాబితాలున్నవి.

         ఇక నూతన నిబంధన కాలములో ఏసు ప్రభువు జీవించిన కాలమంతయు ఆయన నివసించిన పర్వతము ఒలీవల కొండ. ఇది యెహోవా పరిశుద్ధ పర్వతము మీద నివసించిన వారి చరిత్ర. ఇపుడు లూకా 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అనగా సమస్తమునకు ఎత్తయిన స్థలము. దేవుడు కనబరచిన మహిమను గూర్చి తెలిసికొందము. ఈ సర్వోన్నతమైన స్థలము దేవుడు ఎన్నుకొన్న స్థలమైయున్నది. పై కనబరిచిర పరిశుద్ధ పర్వతాలు అనబడిన దైవ ప్రదేశాలలో దేవుడు ఎన్నుకొని తన సేవకి పిలిచిన వ్యక్తులు దేవుని మహిమ పరిచినారు. ఆ విధముగా దేవుని యొక్క ఉన్నత స్థలములలో జీవించిన వ్యక్తులకు దేవుడు తన మహిమను చూపిపాడు.

        మొట్ట మొదటి స్థలము జల ప్రళయానంతరము అరారతు పర్వతాల మీద నిలిచిన ఓడ నుండి భూమి మీద అడుగు మోపిన వెంటనే నోవహు - ఓడలో వున్న పవిత్రమైన పశు పక్ష్యదులను కొన్నింటిని తీసుకొని బలి పీఠమును కట్టి దేవునికి దహన బలి అర్పించినాడు. ఆ బలి హోమమును ఆఘ్రాణించిన దరేవుడు తన్మయుడై ఆ హోమమును ఆఘ్రాణించి ఇక మీదట నదులను బట్టి భూమిని శపించును'' అనిన వాగ్ధానాన్ని చేసినట్లు చదువగలము. ఇందువలన ఉన్నతమైన స్థలములలో దేవుడు తనను తాను మహిమ పరచుకొన్నట్లును అట్టి మహిమలో నోవహు ద్వారా నర సంతతితో సమాధాన సడినట్లు తెలియు చున్నది. ఇందును బట్టి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి  మహిమ - దేవుని మహిమ క్రియ జరిగించి దైవత్వానికి ఇష్టుడైనట్టి నీతి మంతుడైన నోవహు దేవుని మహిమపరచినట్లుగా తెలియుచున్నది.

        అలాగే సర్వోన్నతుని పరిశుద్ధ స్థలమైన హారేబులో మోషేకు దేవుడు తన మహిమను కనబరచి తద్వారా మోషేను తన జనాగమునకు నాయకుడుగా జేశాడు. అందుకు ప్రతిగా మోషే దేవుడు తన కిచ్చిన కఱ్ఱను బట్టియు దేవుని చే వ్రాతతో అనుగ్రహించబడిన వ్రాత పలకలను బట్టియు - ఇశ్రాయేలీయులతో దేవుని కున్న విరోధము నుండి ఐ్యపరచి దైవత్వానికి మానవత్వానికి సమాధాన కారకుడాయెను. ఈ విధముగ దేవునికి ఇష్టుడైన మోషే నాయకునిగాను ప్రవక్తగాను దేవుని చేత నియమించబడినాడు. ఇక ఏలియా :- దేవుని పర్వతమైన కర్మేలులో విగ్రహారాధికులు కఠినురాలు సాతానుకు ప్రతి రూపమైన ఎజిబేలు యొక్క నీచమైన విగ్రహారిధన కార్యములలో ఆహాబు రాజు అది నీచ కార్యమని తెలిసి కూడా ఎజిబేలు తన భార్య యైనందుకు ఆహాబు స్త్రీ మమకారంతో ఆ మాయలాడి వలలో పడి ప్రవక్తలకును దైవత్వానికిని విరోధియైనపుడు ఏలియా కర్మేలు పర్వతము మీద దేవుని మహిమ నరచుటకు బలి పీఠమును కట్టి తన బటి కార్యము ద్వారా నిప్పు లేకుండా  ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చునట్లుగా జేసి కర్మేలు పర్వతము మీద దేవుని మహిమ పరచగా దేవుడు తన మహిమను చూపి తన కిష్టుడైన ఏలియాకు సమాధానము కల్గించినాడు.

         అలాగే నూతన నిబంధన కాలములో ఇశ్రయేలు మీద దేవుని కున్న ఉగ్రత నుండి తన యొక్క సజీవ బల యాగము ద్వారా మానవత్వానికి దైవత్వానికి వున్న విరోధమును రూపు మాపి సకల మానవాళిని  దైవత్వముతో సమాధాన సరచినట్లు కొలస్స 1:19 నుండి చదివితే తెలియగలదు. ఆయన సిలువ రక్తం చేత సంధి జేసి ఆయన ద్వారా సమస్తమును సమాధాన పరచుకొనవలెనని ఈండ్రి అభీష్టమాయెను. తన సన్నిధిని నిర్ధోషులుగాను దేహ మందు మరణము వలన మనలను సమాధాన పరచెను''.

        ఒకప్పుడు దేవుని యొక్క సర్వోన్నతమైన స్థలము ఇశ్రాయేలు యొక్క కృతజ్ఞతతో కకూడిన సోంతత్రార్పణలు స్తుతులు వీలి మీద తన మహిమను కనబరచినాడు. ఇప్పుడైతే ఏసు యొక్క బలి యాగమును బట్టి యావద్‌ ప్రపంచములోని ఏసు మీద విశ్వాసము ంచిన వ్యక్తి యొక్క హృదయాన్ని తన సర్వోన్నత స్థలముగ ఏర్పరచుకొని తద్వారా తాను సమాధాన పడినట్లు తెలియు చున్నది. కనుక ఆ సమాధానము యొక్క అనుభూతిని నేటి యుగము వారైన మనము పొందుచున్నాము. కనుక ఇపుడు ఆదిలోని పర్వత శ్రేణులు పోయినవి. ఆ పర్వత శ్రేణుల మీద అర్పించిన బలి కార్యములు దేవుడు అనుగ్రహించిన ఱాతి పలకల ద్వారా దేవుడు బయల్పరిచన దశాజ్ఞల సిద్ధాంతములు ఇవన్నియు పోయినవి. ఇపుడు ఏసు - క్రీస్తు - ప్రభువు అను ఈ మూడు నామములను దేవుడు తన సర్వోన్నత స్థలమూన మన హృదయాలలో వుంచి సంతృప్తి నడుతున్నాడు. కనుక ఈ నామమును తప్ప సూర్యుని క్రింద మరి ఏ నామము నందును రక్షణ లేదని మనము గ్రహించ వలసియున్నది.

        హబక్కుకు 3:2 సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము.

        ప్రియ పాఠకులారా! పై మాటలోని అర్థము మనకు తెలియక పోవులయే గాక దేవునికి అది తెలిసి ఆయన బాధపడుచున్నాడు. ఏమని  అంటే - అయ్యో! నా ప్రజలు జ్ఞానము లేక నశించి పోవుచున్నారు. లోకము పుట్టినది లగాయతు ఆదాము పుట్టుక వరకు ఎన్ని సంవత్సరాలు జరిగాయో ఎవరికిని తెలియదు.  ఆదాము పుట్టినది లగాయతు నోవహు జల ప్రళయము వరకు ఎన్ని సంవత్సరములు గతించినవో ఎవరును చెప్పలేరు. జల ప్రళయ వినాశములో భూమి తుడిచి పెట్టుక పోయిన తర్వాత నోవహు కాలము నుండి అబ్రహాము కాలము వరకు ఎన్ని సంవత్సరములు సరియైనటువంటి లెక్క లేదు.

        ఈ విధముగ పాత నిబంధన కాలములో సంవత్సరములు జరుగుచుండగా ఆయా సం||ల లో దేవుడు ఆయా రీతులుగా తాను సృష్టించిన నర కోటిని తాను సృష్టించిన సృష్టిని మార్పులు జేయుచు వున్నట్లు నేటికిని లోక పంబంధమైన శాస్త్రజ్ఞులు సాక్ష్యమీయగలరు. ఆదాము కాలములో వున్న జంతు కోటి నోవహు కాలములో లేదు. అంటే ఆదాము కాలములో రాక్షస బల్లులు చిత్ర విచిత్రమైన పిశాచ రూపముతో వుండి ఈ నాటి మన కన్నుల ముందున్న ఏనుగు కంటె పెద్దదైన భూచరములు జీవించిన చరిత్ర వాటి సంబంధమైనశల్యముల ద్వారా నేటికిని శాస్త్రజ్ఞులు తెలిసికోగలుగుతున్నారు. ఆయా కాలములను బట్టి దేవుడు నానా రకములైన జీవరాసులను ప్రాణులను జంతు జాలములను సృష్టించునట్లును ఈ సృష్టి కార్యములో ఎన్నో సం||లు గతించినా యోఖరారైన లెక్కలేదు.

        ఈ విధంగా ఆదాము కాలము నోవహు కాలము ఇశ్రాయేలు కాలము మోషే కాలము అబ్రాహాము కాలము వగైరా కాలములతో బాటు సంవత్సరాలు జరిగిపోయినవి.  అయినను లోకము యధాస్థితిలోనే ఉన్నది.  ఆది 6:లో ఆనాటి జనాంగము ఏ జ్ఞానముతో ఉండిందో అదే జ్ఞానము నేడు క్రియ జరిగిస్తున్నది.  అయితే దేవుని యొక్క కాలము ఋతువులు సంవత్సరాలు మాత్రము వాటి యొక్క క్రియ కార్యములను దైవ చిత్తానుసారముగ ఆయా సంవత్సరములను బట్టి జరుసుకొంటున్నవి. ఈ కాలములు సంవత్సరములు బట్టియే దేవుడు చింతించి ఖరారైన లెక్కను అనగా సృష్టి పట్ల దేవునికున్న ప్రేమ అనురాగము ఆసక్తిని గూర్చి నరకోటికి తెలియ బరచాలని దేవుడు సంకల్పించి తానే రంగ ప్రవేశము జేస్తూ తన దైవత్వాన్ని వదులుకొని తన రాజ్య వైభోగాన్ని విస్మరించి సామాన్య కన్య గర్భములో నిరాదరణ వాతావరణములో నిస్సహాయ స్థితిలో జన్మించినాడు. ఈ జన్మించిన కాలమే నూతన నిబంధన అనగా ఖరారైన సంవత్సరములు లెక్క జనాంగానికి తెలిసి యున్నది. అనగా దేవుడు ఏసుగా పుట్టి 2004 సం||లు అని లెక్క తేలింది.

        ఈ విధముగ నరులకు కాలగమనమన్నది మరియు సంవత్సరముల యొక్క జరుగు బాటు ఏమిటో తెలియరాని స్థితిలో వుండగా-ఇట్టి అజ్ఞాన నరకోటికి సృష్టి కర్తయైన దేవుడు సంవత్సరములు యొక్క లెక్క మరియు శకము అనినదేమిటో తెలియబరచుటయే  యెహోవా యొక్క సంవత్సరములు జరుగుటన్నది వివరిస్తున్నది. ఈ విధముగ యెహోవా సం||లు జరుగుచుండగా సం||లు తో బాటు క్యాలండర్లు కూడా మారుచున్నవి, వాతావరణము మారుచున్నది. ఒక సంవత్సరములో వున్న కాల గమనము వాతావరణము మరెయొక  సంవత్సరములో లేదు ఒక సంవత్సరములో జరిగే అరిష్టాలు మరియొక పంవత్సరములో లేదు. సం||లుతో బాటు వాతావరణము మనుష్యుల యొక్క కాలగతులు జరిగిపోవుచునే యున్నవి. అయినను లోక నరకోటిలో మార్పులేదు. దీనిని గూర్చి ఏసు ప్రభువు ప్రత్యక్షంగా మనుష్య కుమారుని యొక్క రాకడ ఎట్లుంటుందో మత్త 24:37 లో వలె ప్రస్తుత లోకము పోకడ వున్నది.'' నోవహు దినములు ఏలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు ఆలాగే వుండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసికొనుచు పెండ్లికి ఇచ్చుచు నుండి, జల ప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకుఎరుగక పోయిరి. ఆలాగుననే మనుష్య కుమారుని రాకడ వుండును''.

        అయితే లోకము గతి సృష్టి యొక్క అంతము ఏ విధముగ వుంటుందో కూడా దేవుని వాక్యము వివరిస్తూ మత్తయి సువార్తలో లోకాంత్యము ప్రభువు రాకడ నూతన భూమి  నూతనాకాశమును గూర్చి వివరించబడి యున్నది. ఈ సందర్భములో రోమా 12:2 లో వలె - ''మీరు ఈ లోక మర్యాదననుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనుస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి; అని వివరించబడిన రీతిగా సం||లు కాలములు యుగములు వాతావరణములు నూతనత్వాలను పొందుచు వాతావరణములోను కాలగమనములోను అనేక మార్పులు చెందుచు నూతనత్వమును పొందుచుండగా నరులైన మనలో ఎంత వరకు మార్పులు జరుగుచున్నవి. మనలోని మానవత్వమెట్లున్నది? నూతనత్వమంటే వ్యక్తి యొక్క జీవితంతో బాటు వాని గుణాతిశయములు వాని యొక్క జ్ఞానము వాని జీవిత విధానము పూర్తిగా ఆధునీకరణము కావలెను. అప్పుడే దైవత్వము మానవుని నూతన విధానములోనడిపొంచబలదు. ఇందుకు ఉదా||మోసగాడైన యాకోబును దేవుడు విడిచి పెట్టక వానికి ఇశ్రయేలు అను నామ కరణము జేసి అతని నుండి నూతనమైన 12 గోత్రాలతో కూడిన ఇశ్రాయేలు అను సంఘమును సృష్టించినాడు. అలాగే నర హంతకుడైన మోషేను దేవుడు అతని హత్యా దోషము నుండి విడిపించి తన జనాంగానికి నాయకునిగా నియమించాడు. అలాగే గాడిదలు కాసెడి సౌలును ఆ గాడిదల కాపరత్యము నుంచి తప్పించి ఇశ్రయేలుకు రాజుగా నియమించాడు. అలాగే దావీదు జీవితంలో కూడా గొఱ్రెలకాపరిగ వున్న దావీదును తన జనాంగానికి మహారాజుగాను అలాగే నూతన నిబంధన కాలములో సౌలుగా వుండి నర హంతకుడుగా క్రీస్తు విరోధిగను కఠిన హృదయుడుగా వున్న సౌలును దేవుడు మొత్తి పౌలుగా మార్చి గొప్ప అపోస్తలునిగా తీర్చి దిద్దినాడు. అలాగే ఏసు ప్రభువు చేసలను పట్టుచున్న జాలరులకు వారి జీవితము నుండి మార్పు గలుగ జేసి నూతన నిబంధనకు సాక్షులుగను రచయితలు గాను అపోస్తలులుగాను ప్రతిష్టించాడు.

        ప్రియ పాఠకులారా! నేటి మన జీవితములో గతించి పోయిన పాత సంవత్సరముల నుండి మార్పు జెంది నూతనత్వము పొందుటకు మనము చేయుచున్న కార్యములెట్టివి? మన తీర్మానమే విధముగా వున్నది. ఈ నూతన సంవత్సరములో మన జీవితములో ఇహ లోక సంబంధముగ మన నిర్ణయాలు మన యొక్క ఆశయములుఏ రూపముగ వున్నాయో రాబోవు సంవత్సరమునకు ఏ విధమైన కార్యక్రమాలు చేపేందుకు మనము సిద్ధపడవలసి వున్నదో అందుకు కావలసిన సిద్ధపాటు మన కెటువంటిదో మనమే నిర్ణయము చేసికోవలసియున్నది. రానున్న నూతన సంవత్సరములో కాలముతో బాటు మానవ జీవితమైన మన జీవితము కాలముననుసరించి వున్నదా? లేక దైవత్వాన్ని అనుసరించి వున్నదా లేక లోకాశలను అంటి పెట్టుకొని దీని సంబంధమైన చింతనలతో వున్నదా? ఎట్లున్నది? కాలముతో బాటు మానవుల బుద్ధి కూడా మారవలెను. మనము రూపాంతరము పొంది  మన కార్యాచరణ కూడా రూపాంతరము పొంది మన స్వభావములు మారుటయే గాక మన కార్యములు కూడా నూతనత్వం పొంది కేవలము మానవత్వానికేగాక దైవత్వానికి ప్రీతి కరమగునట్లుగా  మన జీవిత విధానము వుండ వలెను. ప్రభువు మనలను ఆశీర్వదించి కాపాడును గాక!

        కీర్తన 17:15 నేనైతే నీతి గల వాడనై నీ ముఖ దర్శనము  చేసెదను. నేనే మేల్కొనునపుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును.

        దేవుడు తన పోలికగా నరుని సృజించెను. దేవుని యొక్క ఆత్మ మానవుని పోలియున్నది. ఆయన యొక్క వెలుగు తేజోవంతుడైన మానవుని పోలికగా ఆత్మ రూపొంది మనకు దర్శనము ఇచ్చుచుండును. అనగా దేవుడు మానవాకారము మరియు మానవుని అత్యధిక పర్సనాలిటి (సంపూర్ణ మూర్తిత్వము) తో ఆయన మానవుని దృక్పధంలో కనపట్టుచుండును. పరిశుద్ధులైన యోగులు భక్తులు నిరంతరము దేవుని ఆత్మను చూడగల్గుదురు.

        కీర్తనలు18-10 ''కెరూబు మీద ఎక్కి'' ఆయన యెగిరి వచ్చెను.

        ''కెరూబు'' అనగా (ఎగిరే విమానము) పుష్పక విమానము వంటిది. అందు దేవుడు కూర్చునుటకు ఆసనము ఉండును, కెరూబు ఎగిరి వచ్చు ఆసనము.

        హిందువులకు చిలుక కొయ్య, మంత్ర దండము మొదలగునవి ఉపయోగించు అలవాటు ఎట్లు వచ్చెను?

        మోషే కాలములో మోషే చేత ఇత్తడి సర్ప్నమును దేవుడు ఎత్తించెను మోషే చేతికి మహిమ గల కఱ్ఱయు, బెత్తమును ఉండి, వాటి చేత దైవ కార్యములను మోషే నెరవేర్చు చుండెను. మోషే తల వెంట్రుకలు గడ్డము పెంచుటయే ఆ కాలము నాటి దైవ ప్రతిష్టితులందురు అట్లే చేయుచుండిరి. మోషే తన దైవ నిబంధన కఱ్ఱతో సముద్రమును రెండుగా చీల్చెను.

        ఆ నాడు దేవుడు పాత నిబంధనలోని అత్యద్బుత ఆశ్చర్యకరకార్యములను ఇపుడు సైతానుడు బూటకముగా మోసముతో వేషధారణతో మాత్రమే చేయిస్తున్నాడు. ఆనాటి ప్రవక్తలు దైవేచ్చలతో కూడుకున్న వారైతే, ఈనాడు ఇవి ధరించువారు లోకమాయలతో సైతాను ఇచ్చలతో, శరీరేచ్చలతో నిండి అత్యధిక మోసము చేస్తున్నారు.

        పాత నిబంధన కాలములో ద్రాక్షారసము ప్రవక్తలు త్రాగుతారు. ఇపుడు బంగియాకు పొగతో తృప్తి పడి జనాన్ని మభ్యపెడుతున్నారు. అపుడు దేవుని మహిమ ఎగ బ్రాకినది. ఇపుడు సైతాను క్రియలు ఎగబ్రాకినవి. ఇప్పటి యోగి బంగి ఆకు త్రాగి కండ్లు ఎఱ్ఱబడి భయంకరముగా  కామ క్రోధావేశములతో నిండి గడ్డము పెంచి పిశాచి రూపమునకు మారుగా ఉన్నాడు.

        కీర్తన 127:3 కుమారులు 'యెహోవా అన్నుగహించు స్వాస్థ్యము వారి కుమార్తెల విషయమేమి?

        గర్భఫలము యెహోవా అన్నుగహించు బహుమానము మరి యెహోవాను ధిక్కరించు వారికి కలుగు గర్భఫలము ఎవరి బహుమానమగును? సైతానుదా? దేవునిదా? లేక నరుని వలన ఏర్పడినదా?

        ఒకటవ సమూయేలు1-19-20 ఎల్కానా తన భార్యయైన హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞా.కము చేసికొనెను. కనుక హన్నా గర్భము ధరించెను''.

        దేవుని కుమారుడు ఆదాము మాత్రమే. దేవునికి కుమార్తె లేదు. హవ్వ ఆదాము యొక్క ప్రక్కటెముక నుండి తీయబడినది. భూమి మీద కుమారులే ఆయన అనుగ్రహించిన స్వాస్థ్యము. ఆదిలో పురుషుని నుండియే స్త్రీ పుట్టినది. కాని స్త్రీ నుండి పురుషుడు పుట్టలేదు. కాన యెహోవా దృష్టిలో పురుషుడే ప్రధానుడు. దేవుని చేత చేయబడిన పురుషుని, సైతాను దాసురాలైన స్త్రీ పాపములోనికి ఈడ్చుట వలన దేవుని యొక్క గౌరవమును ఆయన ఉన్నత స్థానమును పోగొట్టుకొనినది.

        పురుషుడు స్త్రీ ని కూడినంత మాత్రాన గర్భోత్పత్తి జరగదు. అయితే వారి కలయికను గూర్చి దేవుడు జ్ఞాపకము చేసుకొన్నపుడే గర్బోత్పత్తి జరుగుచున్నది. అందుకు నిదర్శనముగ పైన వివరించ బడిన సమూయేలు చరిత్రయే తార్కాణము. జీవముగల దేవుడు జ్ఞాపకము చేసుకొన్న యెడల గొడ్రాలైనను బిడ్డలు కనును.

        అయితే యెహోవాను ధిక్కరించు వారి విషయములో కూడా దేవుడు దుష్టులను సహితము జ్ఞాపకము చేసికొనుచున్నాడు. వారి బిడ్డలు అమాయికులు గదా! వారికి పాపపుణ్యాలు ఏమి తెలుసును? దుష్టుని కడుపున పుట్టిన బిడ్డ దుష్టుడే ఎట్లగును? సజ్జనుడు కాకూడదా! అందువలన ఆయన నీతిమంతుల కైనను అవినీతి పరులకైనను బిడ్డలను దయ చేయుచు వారు వీరను భేదము లేక ఎండవానలను కురిపించు చున్నాడు. సృష్టి కర్తను మరచి అన్య దేవతలను ఆరాధించు వారు మాత్రము తమకు తెలియకయే అమాయికులై దేవుడని భావించుచు ఆరాధించు చుండుటవలన దేవుడు వారిని కూడా క్షమించుచు గర్భఫలము దయచేయుచున్నారు.

                . ఆయుస్సు

        కీర్త 21:4 ఆయుస్సునిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అనుగ్రహించి యున్నావు. సదా కాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయ చేసి యున్నావు.

        తల్లి గర్భము నుండి శిశువు బయట పడిన తక్షణమే ఆత్మ అందులో ప్రవేశించును. ఆత్మ శరీరములో ప్రవేశించుటకు పూర్వమే దేవుడు దాని కాలనిర్ణయ పరిమితి అనగా ''ఆయుస్సు'' ఎంత కాలము శరీరములో ఉండవలయునన్నది చెప్పి ప్రవేశపెట్టును. ఈ ఆయుస్సు పరిమితిలో నిర్ణయము దేవునికి ఆ ఆత్మకు తప్ప ఇతరులకు గాని తాను నివసించు ఆ శరీరమునకు గాని తెల్పుట నిషేధము. ఇది పరలోక మర్మములలో ఒకటి. ఆత్మ శరీరములు కలిసి మొరపెట్టగా దేవుడు కరుణించి ఆయుస్సు పెంచవచ్చును లేక దేవుడు తన కోపముచేత తగ్గించ వచ్చును. దేవుడు తొలుత చెప్పిన పరిమితికి ఒక్క క్షణము కూడా ఆత్మ శరీరమందుండుటకు వీలు లేదు.                కీర్తన 34:1 ఇందలి అబీమెలెకు ఎవరు? అబ్రహాము కాలములో ఆది 20:2ఈ అబీమెలెకు ఎవరు? అబీమెలెకు అనగా ''షైగం బర్‌ '' వీరు ఆ కాల పరిస్థిితులును బట్టి ఆ పదవితోనే ఒకరి తర్వాత ఒకరు వచ్చుచుందురు.

                 విడనాడుట

        కీర్తన 22:1 నాదేవా! నాదేవా! నన్నేల విడనాడితివి.

        ఇది దేవుని జనాంగమైన ఇశ్రాయేలునకు దేవుని చేత నియమింపబడిన రాజు, ప్రవక్త - కీర్తనా కారుడైన దావీదు ''దేవునికి చేసిన విజ్ఞాపన. అటువలెనే దైవ రూపము మానవ శరీరము ధరించినట్టి ఏసు ప్రభువు కూడా లోక నర కోటి యొక్క పాప పరిహారార్థ బలియాగము జరిగించు సందర్భములో సిలువ మీద మత్త 27:46 లో వలె : నా దేవా! నాదేవా! నన్నెందుకు చేయి విడిచితివి? అని పలికినట్లు నూతన నిబంధనలో చదువగలము.

        ప్రియ పాఠకులారా! ఈ రెండు మాటలు పలికినది ఇద్దరైనను వారుచేసిన విజ్ఞాపన ఒక్క దేవువికే! దావీదు మహారాజు దేవునికి విజ్ఞాపన చేస్తూ - ''నన్నేల విడనాడితివి అంటున్నాడు. దైవ కుమారుడైన క్రీస్తు, ''నన్నేల చేయి విడిచితివి'' అంటున్నాడు. విడనాడుట అంటే ఏమిటి? తెలిపికోవలసియున్నది.

ఇందులో మొదటిగా దేవుడు విడనాడిన దెవరిని? దేవుడు తన స్వహస్తముతో తనఆత్మతో రూపొందించిన ఆది నర జంటను ఆధికముగా ప్రేమించి వారినిమిత్తమై కొన్ని వేల ఎకరముల ఏదేను అను సుందర వనమును రూపొందించి వారికి ఆట వస్తువులుగా పక్షి జాలము జంతు జాలము, వన్య మృగములు, సర్పములు వగైరాలను వుంచి వివిధరకములైన ఫల వృక్షములు వారి యొక్క ఆహారార్థమై సృష్టించి మంచు, వర్షము, వేడి గాడ్పులు, వగైరాలు లేకుండా ప్రశాంతమైన అన్ని వేళలా ఒకే రీతిగా అనగా పగలు రాత్రి రెండింటికిని నర జంట భయపడకుండునట్లు భయానక వాతావరణము లేని స్థితిలో రూసొందించిన నర జంటను నిషేధ పలభక్షణము ద్వారా సంక్రమించిన దైవ ఆజ్ఞాతి క్రమ క్రియను బట్టి నర జంటను తోట నుండి వెళ్ళ గొట్టి నరులకు తన సన్నిధిలో వున్న స్వాస్థ్యమును పొందు ఆధికారమును లేకుండా జేసి తోటనుండి వారిని విడనాడినాడు. ఇది దేవుడు మొట్ట మొదటగా నరులతో వున్న సంబంధమును విడగొట్టుకున్న ప్రధమ క్రియ.

        అయితే నరజంటను చేయి విడువ లేదు. వారి పట్ల ఆయన కనికరించి నర జంటకు చర్మపు దుస్తులు తొడిగించినట్లుగా చదువగలము. దీనిని బట్టి నర జంటను ఆయన చేయి విడువలేదు. ఆ విధముగా చేయి విడువ లేదనుటకు మరియొక్క సాక్ష్యాధారమేమిటంటే ఆదాము భార్య సంతానవతియై పిల్లలను కంటూ - ''యెహోవా దయ వలన నేను సంతాన వంతురాలనైతినని చెప్పుటలో దేవుడు వారిని చేయి విడువ టేదు. అని తెలియుచున్నది. అలాగే హేబేలు యొక్క హత్య నేరమును బట్టి కయీనును భూమి మీదనుండ కుండ దేశదిమ్మరిగా తిరుగుదువని శపిస్తూ కయీను యొక్క క్రియా కర్మను దేవుడు కయీనును విడనాడినను, ఆయన చేయి మాత్రముకయీనును విడనాడలేదు. ఎందుకంటే కయీను వీపు మీద ఎవరును చంపకుండునట్లు దేవుడు తన చేతితో ఒక గుర్తు వేసినట్లు చదువగలము. ఇందును బట్టి దేవుడు కయీనును విడనాడినాడే గాని చేయి విడువ లేదు.

        అటు తర్వాత ఆది 6: లో నరులు భూమి మీద విస్తరించి పాపమును ప్రబలచేయుచున్నపుడు భూమి మీద వున్నటువంటి జన భారము పాప భారమునకు దేవుడు తాను నరులను  సృష్టించి నందులకు సంతాపపడి, నరుల దోషమును బట్టి జల ప్రళయమున కప్పగించి విడనాడినాడు. అయితే ఆనాటి జన కోటిలో తన విశ్వాసుల జాబితాలో నోవహు అతని కుటుంబాన్ని మాత్రము విడనాడకుండా చేయి విడవకుండా తన నమూనాలో తన అజమాయిషీలో తన ప్లాను ప్రకారము తన నిబంధన ప్రకారము ఓడను తయారు చేయించినాడు. ఈ ఓడ నిర్మాణం కార్యక్రమములో నోవహు ఒక సాధనముగా వాడబడినప్పటికి నోవహు యొక్క చేతిని పట్టుకున్న వాడు దేవుడే! అందు వలన నోవహు యొక్క కుటుంబాన్ని ఆయన చేయి విడువలేదు. ఇక సొదమ గొమర్రా పట్టణ నాశన సందర్భములో దేవుడు జరిగించిన దహన కాండలో సొదమ గొమర్రా పట్టణాలలో ఆయన విడనాడినప్పటికి లోతు అను విశ్వాసిని మాత్రము చేయి పట్టి నడిపించాడు. సొదమ గొమర్రా పట్టణాలకు కలుగు నాశనము నుండి వారిని తప్పించినాడు.  ఈ విధంగా సొదమ గొమర్రా పట్టణాలను దేవుడు విడనాడబడినను లోతును లోతు కుమార్తెలను ఆయన చెయ్యి విడువక యుండినట్లు ఈ వేద భాగములో చదువగలము.

        అలాగే దేవుడు తన జనాంగమైన ఇశ్రాయేలు విషయములో వారు అవిధేయులై దేవునికి ఆయాపకరముగా వారు ప్రవర్తించినపుడు ఆయన ఐగుప్తీయులకు ఫిలిష్తీయులకు అప్పగించి విడనాడినట్లు చదువగలము. అయితే ఆయన చెయ్యి మాత్రమువారిని పట్టుకొనివుండినది. అందుకు ఋజువు ఇశ్రాయేలు విషయములో వారి మీద పరిపాలన చేయుటకు రాజులను ప్రవక్తలను న్యాయాధిపతులను, యాజకులను, నియమించుటలో దేవుడు తన చేతితో ఆ పని జరిగించినట్లుగా ఈ క్రింది వేదభాగముల ద్వారా తెలిసికొందము.

        మొట్ట మొదటిగా ఇశ్రయేలుకు రక్షణ కర్త ఇశ్రాయేలు 12 మంది కుమారులలో ఒకడైన యోసేపు తన అన్నల నుండి విడదీయబడి వారి యొక్క కఠిన వైఖరికి, వారి యొక్క ద్వేషానికి వారి యొక్క క్రోధాది గుణములకు బలియై గోతిలో పడ ద్రోయబడి  నాశనకరమైన స్థితిలో వుండగా యోసేపు అన్నలు తనను విడనాడినను, దేవుని యొక్క హస్తము యోసేపును చావు గోతిలో నుండి లేవనెత్తి ఫల భరితమైన సస్యశ్యామల దేశమగు ఐగుప్తునకు తన హస్తముతో దేవుడు నడిపించి, అక్కడ యోసేపునకు కలిగిన శోదనలు బాధలు చెరసాల శిక్ష వగైరాలలో హెచ్చించి రాజుకు కలిగిన స్వప్నముల ద్వారా స్వప్న భావాలను వాటి మర్మాలను, ఫలితాలను రాజునకు వివరించి ఐగుప్తు అంతటి మీద అధికారియై ప్రభువుగాను జీవించాడంటే యోసేపును తన తండ్రి అన్నదమ్ములు లోకము విడనాడినను దేవుడు అతని చేతిని పట్టుకొని వుండబట్టి రాజ్యమేలినాడు.

        మోషే జనన కాలములో మోషే యొక్క తల్లి దండ్రి ఆనాటి ఐగుప్తు ప్రభుత్వము మోషేను చెయ్యి విడిచింది. అందుకు సాక్ష్యము మోషేను కనిన తల్లి బాలుడైన మోషేను జమ్ము పెట్టిలో పెట్టి నైలు నదిలో పెట్టి చేయి విడువగా దేవుడు మోషే చేతిని పట్టుకొని ఇశ్రాయేలీయులకు ప్రభువుగాను పరిపాలకుడుగాను గవర్నరుగాను, ప్రవక్తగాను, నాయకుని గాను ఏర్పరచుకొనుటకు మోషేను చెయ్యి విడువక ఫరో కుమార్తె యొక్క హృదయాన్ని చలింపజేసి కఠిన వైఖరి గల్గిన రాజు కుమార్తె యొక్క హృదయాన్ని మార్చి ఆమెనే ఈ పిల్లవానికి దాదిగాను, మోషే తల్లిని ఆ పిల్ల వానికి బాలుడైనమోషేకు పోషకురాలిగాను చేసి ఆదుకున్నాడు.

        ప్రియ పాఠకులారా: విన్నారుగదా: దేవుని యొక్క చేతి ప్రభావము. ఇంకను మోషేకు దేవుడు తనను ప్రత్యక్షపరచుకొంటూ తన జనాంగమునకు ప్రవక్తగా మోషేను నియమిస్తూ -తన జపపాంగమునేలుటకు కావలసిన జాగ్రత్తలు ఇశ్రాయేలుకు ప్రత్యర్ధులైన ఐగుప్తు ప్రధానులతో మెలగవలసిన విధానమును వారి చెర నుండి ఇశ్రాయేలును నడిపించుటకు కావలసిన జ్ఞానమును యోగ్యతలను మోషేకు దేవుడు బోధించి తన చేతిని కఱ్ఱగా మోషేకు అందించినాడు. ఈ కఱ్ఱ ప్రభావముతో మోషే ఐగుప్తును ఐగుప్తు జనాంగమును ఐగుప్తు పరిపాలకులను, ఐగుప్తు మంత్రగాళ్ళను కలవరపరచి ఆశ్చర్యచకితులుగా జేసి దైవ శక్తిని గూర్చి ఋజువు పరచి దైవత్వాన్ని మోషే తన పవిత్ర జీవితంలో ను తన హస్తముల తోను మహిమ పరిచాడు.

        ప్రియ పాఠకులారా! దేవుడు మోషేకు అనుగ్రహించిన ఒక ప్రత్యేక వరమేమిటంటే మోషేను తన చేతితో పట్టుకోవడమే గాకుండా-మోషే ముఖమును తన వెలుగుతో నింపి మోషే ముఖమును ఇశ్రాయేలు చూడలే నటువంటి స్థితిలో మోఫే యొక్క రూపాన్ని మలచినాడు. ఈ విధముగా మోషేను తన చేతితో నడిపించిన దేవుడు మోషేను చేయి విడువక ఎడబాయక మోషే వెనుకగా వుండి అతనికి తోడైయుండినట్లు గాను, మోషేకు ముందు నడిచి మార్గ రక్షణగా వుండినట్లు వేదంలో చదువగలము. ఇందుకు సాక్ష్యాధారము ఎఱ్ఱ సముద్రాన్ని పాయలుగా జేసి సముద్ర మధ్యమున ముందు మోషే వెనుక జనాంగము పైన దైవ మేఘము ఈ విధముగా ఆయన చెయ్యి పట్టి నడిపించినట్లు వేదంలో చదువగలము. ఈ విధముగా 40 సంవత్సరాలు దేవుడు మోషేను ఎడబాయక చేయి విడువక మోషేతో జీవించినట్లు వేద రీత్యా మనము తెలిసికోగలము.

        ఇక న్యాయాధిపతిగా రూపించబడిన సంసోను దేవుని యొక్క హస్తము ఆదుకొని ఏ ఆయుధము లేకుండా సింహాన్ని చీల్చడము, గాడిద దవడ ఎముకను ఆయుధముగా వాడి ఫిలిష్తీయుల హతమార్చుట, షిలిష్తీ పట్టణము యొక్క ముఖ ద్వారాలను ఊడబెరుకుట వంటి ఆశ్చర్యమైన శక్తివంతమైన, మానవ శక్తికి అభేద్యమైన కార్యములను చేయిస్తూ-సంసోను యొక్క చేతిని బట్టి ఆనాటి ఇశ్రాయేలు విరోధులైన ఫలిష్తీయ జనాంగమును హతమార్చినట్లు చదువగలము. ఈ సందర్భములో న్యాయా 13-1 లో ఇశ్రాయేలీయులు యెహోవా పట్ల దోషులుకాగా దేవుడు వారిని 40 సంవత్సరములు ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. అంటే వారిని విడనాడినాడు. తన చేయి విడనాడినట్లు చదువగలము.

        అలాగే యెజిబేలుకు భయపడి ఆరణ్య ప్రదేశములో బదరీ వృక్షము క్రింద పరుండిన ఏలియాను తన దూత చేత రొట్టె నీళ్ళ బుడ్డిని అనుగ్రహించి, ఆ రొట్టె ఆ నీటి బలముతో 40 దివారాత్రులు ఏలియాను తన పరిశుద్ధ పర్వతమైన యోరేబుకు నడిపించినట్లు యెహోవా తన చేతితో ఏలియాను బలపరచిన విధానమును చదువగలము. యెహోవా చేతి చలవ వలెనే అనగా ఆయన చెయ్యి పట్టి నడిపించ బట్టే గాడిదలు కాచుకొనెడి సౌలు ఇశ్రాయేలుకు రాజయ్యాడు. అయితే తన పూర్వీక స్థితి మరచి తన రాచరికాన్ని బట్టి గర్వించిన సౌలును దేవుడు విడనాడక, అతడు సోదె అడిగి మరణానికి గొయ్యి త్రవ్వుకున్నాడు. దావీదు విషయములో బాలుడైన దావీదుకు యెహోవా తోడైయుండి దావీదు హస్తమును సట్టుకొని బలిష్టుడైన గొలియాతును సంహరించిన విధానాన్ని చదువగలము.

        ఈ విధముగా పాతనిబంధన కాలములో అనేకులను నడిపించిన యెహోవా హప్తము తన మహత్కార్యాల ద్వారా అజ్ఞానులైన ఆ నరకోటికి ఎన్నో క్రియలు కనపరచగా దేవుని హస్త ప్రభావమును తెలిసికొని కూడా ఆయనను మహిమ పరచని జనాంగము పట్ల విసిగిన దేవుడు తానే నర రూపములో తన కుమారుని ఈ లోకానికి పంపి ఆయన చెయ్యి పట్టి నడిపిస్తూ తన మహత్కార్యాలను చూపుటకు ఏసు క్రీస్తు లను తన కుమారుని హస్తమును పట్టి ఆయనను నీటి మీద నడిపించాడు. శిష్యులతో కూడా ఏసు క్రీస్తు దోనెలో వుండగా భీకరమైన తుఫాను సముద్ర ఘోషతో కూడిన భయంకరమైన అలలు దోనెలోకి నీరు వచ్చినప్పటికిని దోనెను మునగనీయక తనకుమారుని బట్టి ఏసు క్రీస్తును ఆయన శిష్య కోటిని కాపాడినాడు.ఆయన హస్తము ఏసు క్రీస్తును పట్టియుండబట్టే ఏసు ప్రభువును తాకిన వారు, ఏసు ప్రభువుచేతి స్పర్శను పొందిన వారు, ఆయన వాక్కు యొక్క శబ్దము విన్న వారికి గ్రుడ్డి వారికి చూపు, రోగులకు స్వస్థత, మృతులకు జీవము, చెవిటి వారికి వినికిడి, మూగ వారికి వాక్కు అపవిత్రాత్మ పట్టిన వారికి విడుదల, పామరులకు జ్ఞానము దైవ వాక్యమునకు ప్రభావము కలిగి యున్నట్లు ఏసు క్రీస్తు ప్రభువు యొక్క చరిత్రలో ఆయన చేసిన మహత్కార్యములను బట్టి తెలిసికోగలము.

        ఇందును బట్టి దేవుడు యావత్‌ నరకోటికి తెలియబరచిన హెచ్చరిక కాక షరత్తు ఏమిటంటే యెహా 1:12 లో వలె తన్ను ఎందరంగీకరించిరో తననామమందు విశ్వాసముంచిన వారికందరికి దేవుని పిల్లలగుటకు అదికారమనుగ్రహించెను. యోహా 3:16 దేవుడు లోకమునెంతో ప్రేమించెను. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను. మరియు ఏసు ప్రభువు తన బోధలో తన శిష్య కోటి నుద్దేశించి, ''తండ్రి యందు నేను నాయందు తండ్రియు ఏకమై యున్నాము'', అని అనుటలో ఏసు చేతిని దేవుడు దేవుడు చేతిని ఏసు చేయి ఒకరి చెయ్యి ఒకరు పట్టి యుండ బట్టే ఏసు ప్రభువు ఈ లోకములో శోధనలు వేదన శ్రమలు, బాధలు గాయములు, అన్నిటిని సహించి మరణించి మహిమ పునరుత్థానము పొందినట్లు మనము గ్రహించవలసి యున్నది.

        చిత్రమేమిటంటే లోక నర, పాప పరిహారార్థము, తన కుమారుడైన ఏసు క్రీస్తు బలి యాగము చేయ వలసిన ప్రణాళిక దేవుని యొద్ద నుండగా అనగా దేవుడు తన ప్రవక్త చేత ప్రవచింప జేసిన ప్రవచనాలను బట్టి ఏసు క్రీస్తును దేవుడు చెయ్యి విడిచి మరణానికప్పగించి ఆయనను మహిమ లేని వానినిగా చేసి - నరులు చూస్తుండగా ఆయనను సమాధి చేపినట్లుగానే ఒక తెరను వేసి ఆ తెరను చీల్చుకొని మహిమ పునరుత్థానముతో యేసుక్రీస్తు సమాధిని బ్రద్ధలు చేసుకొని మహిమాన్వితుడైనపుడు సకల జనులు ఆయన యొక్క పునరుత్థాన దర్శన భాగ్యము పొందినారు.

        ప్రియ పాఠకులారా! ఏసు క్రీస్తు బలి యాగము చేయు సందర్భములో సిలువ శిక్షననుభవించుచు తాను పల్కిన మాటలలో ఒక మాట :- నా దేవా! నా దేవా! నన్నెందుకు చెయ్యి విడిచితివి? దేవుడు మన కోసము ఏసు ప్రభువును చేయి విడిచాడు. కాని విడనాడలేదు. మరణానికి అప్ప చెప్పిన క్రీస్తును దేవుడు చేయి విడువలేదు. ఆయనను తన వుడి ప్రక్కన తన మహిమలో తన సింహాసనము మీద కూర్చుండ బెట్టుకున్నట్లు సెఫను దర్శనమును యోహాను దర్శనములో చదువగలము. ఈ నాటికిని క్రీస్తును నమ్మిన విశ్వాసులకు ఇట్టి దర్శన భాగ్యాలు ఇట్టి కొన్ని సన్నివేశాలున్నట్లు తెలియు చున్నది.

        కనుక ప్రియ పాఠకులారా! దేవుడు ఎవరిని విడనాడడు. ఎవరిని చేయి విడువడు. దేవుడు లోకమును రక్షించుటకు లోకమును లోకస్థులను పోషించుటకు అభివృద్ధి పరచుటకును, మరి ఈ లోకస్థులను సృష్టించినాడే గాని విడనాడుటకు కాదు, చేయి విడుచుటకు కాదు. ఇపుడు మనము మొదట నుండి ఒక సారి జరిగిన కాలము నుండి నేటి వరకు దేవుడు విడనాడి చేయి విడిచి జరిగించిన క్రియా కర్మలు తెలిసి కొని యున్నాము. కాని ఆయన ఎడబాయడు అనిన సత్యాన్ని మరియు విడనాడుట అనగా చిరస్థాయిగా విడిచి పెట్టుట అని అర్థము. కనుక దేవుడు పై విధముగా విడనాడినాడు. చేయి విడిచినాడు. ఈ రెండు జరిగియున్నవి. కాని ఆయన ఎడబాయనట్లుగా ఈ క్రింది వేద సాహిత్యాల సంఘటనల ద్వారా తెలిసికోగలము.

        మొట్ట మొదట ఆదాము హవ్వలను తోట నుండి వెళ్ళగొట్టి విడనాడినాడు. అయినను ఆయన వారిని ఎడబాయలేదు. ఎట్లనగా వారి దిసమొల సిగ్గును మరుగుపరచుటకు చర్మపు చొక్కాయిలను వారికి తొడిగించినట్లు చదువగలము.ఈ చర్మపు చొక్కాలన్నవి నరుని సృష్టించిన సృష్టికర్త తన ఆత్మను నరునిలో వుంచిన విధిని బట్టి ఏనాటికి వారిని ఎడబాయడని ఈ సంఘటన ద్వారా మనము తెలిసికోవలసియున్నది.

        అలాగే నర కోటి యొక్క దోషమును బట్టి యావద్‌ నర కోటిని సృష్టించి నాశనము చేయు సందర్భములో అనగా సృష్టిని జలప్రళయం ద్వారా తుడిచి వేయు సందర్భములో తన ప్రేమకు పాత్రులైన విశ్వాస నరుల కుటుంబాన్ని అనగా తన యందు భయ భక్తులు గల వాడైన నోవహు అతని కుటుంబాన్ని తన దృక్పధానికి పవిత్రముగా ఎంచబడిన ఎన్నికయిన పశు పక్ష్యాదులను ఎడబాయక వారి కోసము బహు పటిష్టమయిన ఓడను నిర్మింప చేసి, అందులో తన పవిత్ర జీవ కోటిని, నర కోటిని వుంచి ప్రళయ జలముల మీద నడిపించి వారిని ఎడబాయకుండా కాపాడినట్లు వేదములో చదువగలము.

        అటు తర్వాత నర హంతకుడైన మోషేను తన జనాంగమునకు నాయకునిగా చేసి తన ఇల్లంతటిలో నమ్మకస్థునిగా దేవుడు ప్రవచించినట్లును 40 సంవత్సరములు మోషే నెడబాయక ఆదుకున్నట్లు వేదములో చదువగలము. అలాగే అబ్రహాము కుమారుడైన ఇస్మాయేలు శారా ప్రబోధము ద్వారా అబ్రహాము హాగరును, ఆమె కుమారుడైన ఇస్మాయేలును వెళ్ళగొట్టినపుడు హాగరును జల బుగ్గ దగ్గర ఆ బిడ్డను పడ వేసి దేవునికి బహు వేదనతో మొఱ పెట్టగా యెహోవా హాగరునుద్దేశించి ఓదార్చి, ఆ బిడ్డను కూడా ఆశీర్వదించెదనని వాగ్ధానము చేసి ఇస్సాకు సంతానమైన యాకోబు నుండి తీసి రూపించిన 12 గోత్రాల వలె ఇస్మాయేలులలో కూడా 12 గోత్రాలను సృష్టించి ఇస్సాకు సంతానము వలె ఇస్మాయేలు సంతానాన్ని కూడా ఆశీర్వదించి ఆదుకున్నాడు.

        అలాగే సంసోను అతని యొక్క దైవ వ్యతిరేక హేయ క్రియలను బట్టి అనగా దైవ చట్టమును వ్యతిరేకించి చేసిన క్రియలను బట్టి దేవుడు అతనిని చేయి వదిలినను అంటే విడనాడినను సంసోను అంధుడై దాగోను ఆలయములో దేవునికి ప్రలాపించి విజ్ఞాపన చేసినపుడు అతని పట్ల కనికరించి దేవుడు సంసోను యొక్క కోరిక మేరకు ఫిలిష్తీయుల  సంహారమునకు సంసోనును బలపరచి దాగోను గుడిని అందులోను ఫిలిష్తీయ జనాంగమును సమూలముగా నాశనము చేసి సంసోనును అన్యుల చెర నుండి తప్పించి తన సన్నిధికి పిలుచుకున్నాడు.

        అలాగే దావీదు విషయములో దావీదు దేవుని యందు భయ భక్తులు గలిగి సింహాసనాన్ని దేవునికి ఇచ్చి తాను మాత్రము నామమాత్రుడై పరిపాలన చేయుచుండగా ఇట్టి విశ్వాస్యతకు దేవుడు దావీదును అభినందించి ఆశీర్వదించి యుద్ధములలోను శతృమూకల పోట్లాటలలోను సింహముల నుండి, ఎలుగు బంట్ల నుండి మహా ప్థూలకాయుడైన గొలియాతు నుండి దావీదును దేవుడు తన చేతితో నడిపి విజయాన్ని కలిగించి ఎడబాయక ఆదుకున్నాడు. ఇందుకు  దాఖలా ఏమంటే లూకా 1:32 మరియమ్మకు దర్శనమిచ్చిన గాబ్రియేలు దూత కన్యకయైన మరియతో మాట్లాడుతూ నీవు పరిశుద్ధాత్మ శక్తితో గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదువు. ఆయన సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఈ దైవ వాక్కువలె యేసు ప్రభువుకు  ఈ దావీదు యొక్క సింహాసనమును స్వాస్థ్యముగ ఈయబడును. అని ఈ దేవ దూత చే చెప్పబడుటన్నది దావీదు కున్న దేవునికున్న ప్రేమ బంధమెంత పటిష్టమైనదో ఎంత స్థిరమైనదో ఎంత దృఢమైనదో మనమొక సారి జ్ఞాపకము చేసికోవలసియున్నది.

        అలాగే యోనా విషయములో యోనాను దేవుడు తన యొక్క ముఖ్య ప్రవక్తగా తన నమ్మకమైన సేవకునిగా రూపొందించి ఏర్పరచి యోనాకు ఒక విధి ధర్మాన్ని అనగా నిమ్రోదు పరిపాలనలో వున్న నీనెవె పట్టణము యొక్క భారమైన పాప భూయిష్టమును అవిశ్వాసమును దైవత్వమును పూర్తిగా ఎరుగని స్థితిలో వున్న అజ్ఞాన నర కోటికి దైవత్వము చేత జరుపబడు మహోపద్రవముతో పంభవించు మహోగ్రతను గూర్చిన సువార్త ప్రకటించమని ఆ యొక్క బాధ్యతను యోనా ప్రవక్తకు అప్పగించి నీనెవె పట్టణమునకు వెళ్ళమనగా యోనా దైవ హెచ్చరికను పెడ చెవిని పెట్టి దైవత్వమునకు వ్యతిరేకమైన మరియొకమార్గము అనగా దేవుడు వెళ్ళమన్న స్థలమునకు ప్రతిగా అనగా దైవ వ్యతిరేకముగా వెరొక మార్గములో ప్రయాణించాలని తన చిత్తానుసారముగా నీనెనేకు ప్రతిగా తర్షీషు నట్టణమునకు వెళ్ళే ఓడను ఎక్కుట. అటు తర్వాత దేవుడు యోనా విషయములో అతనిని విడనాడి అతనిని బట్టి ఓడను ఓడలో వున్న సరుకును; ఓడ నావికులను కలవరపరచి వారిని విడనాడి; దేవుడు విడనాడుటకుదాఖలాగా ఓడ నావికులు చీట్లు వేసినపుడు చీటీ యోనా మీద రావడము దేవుడు యోనాను విడనాడినందుకు దాఖలాగా ఇందులో మనము గ్రహించవలసి  యున్నది. మరియు ఓడలో నుండి అతనిని సముద్రములో పడవేయుటన్నది దేవుడు యోనాను చేయి విడిచినట్లును మనము గ్రహించగలము. అయితే దేవుడు యోనాను ఎడబాయలేదు. ఎట్లంటే మత్స్య రూపములో సముద్ర జలాలలో పడిన యోనాను నోట కరుచుకొని దేవుడు యోనాను ఎక్కడకు వెళ్ళమన్నాడో అదే స్థలమునకు అద్దరి చేర్చినాడు. మరియు యోనాకు ఎండ దెబ్బ తగలకుండా చెట్టు ఒకటి పుట్టించి గొడుగు పట్టినట్లుగా యోనాపట్ల దేవుడికున్న ప్రేమను మనము తెలిసికోగలము.

        అలాగే దానియేలు విషయములో ఆనాటి రాజులు దానియేలును విడనాడివారు. ప్రభుత్వము దానియేలును చేయి విడిచింది. దీనికి దాఖలా నిర్దోషియైన దానియేలును దోషిగా చేసి సింహాల బోనులో పడవేసినారు. అయితే దానియేలును దేవుడు  ఎడబాయలేదు. సింహాలలో తన ఆత్మను వుంచి వాటి నోళ్ళు మూయించెను. కనుక ఆకలితో వున్నను సింహాలకు ఆకలిలేకుండా చేసి దానియేలుతో తమ కౄరత్వమును  మరచి కుక్కల వలె ఆడుకొను వాతావరణాన్ని సృష్టించినాడు. ఇక మెషగు, షధ్రగు,అబిద్నగోలు జీవితాలలో నెబుకద్నెజరు రాజు తనను బాధించాలని తన విగ్రహాన్ని పూజింపమని వారిని శాసించగా రాజు యొక్క ఆజ్ఞను ధిక్కరించిన మెషగు, షద్రగు, అబిద్నగోలు అను వారిని మండుచున్న అగ్ని గుండములో పడ వేయు శిక్షకు గురి చేయగా అనగా నెబుకద్నెజరు రాజు ముగ్గురు విశ్వాసులను పట్టి ఆగ్రహించి వారిని విడనాడి అగ్నిపాలు చేయగా అగ్నిలో నాలుగవ వ్యక్తిగా వుండి మెషగు షద్రగు ఆబిద్నగోలుతో సంచరిస్తూ వారిని అగ్ని వాసనగాని, అగ్ని వేడి గాని, గాయములు గాని, చివరకు వెంట్రుకలు కాలుటగాని, లేకుండా వారి శరీరములు వారి వస్త్రములు ప్రకాశములై మిక్కిలి కాంతితో ధగధగలాడుచున్న ఆ సందర్భమునకు రాజు విభ్రాంతి నొంది యెహోవాయే దేవుడని కీర్తించి ఒప్పుకున్నాడు.

        ప్రియ పాఠకులారా! ఆ విధముగా పాత నిబంధన చరిత్రలో దేవుడు విడనాడినను చేయి విడిచినను ఎడబాయక తన బిడ్డలను ఆదుకున్నాడు. అయితే ఆయన కుమారుడు మన రక్షకుడైన ఏసు క్రీస్తు నూతన నిబవధనలోను అపోస్తలుల యుగములోను నేటి విశ్వాసుల యుగమైన ఈ తరములోను ఏసు ప్రభువు తన బిడ్డలను విడనాడలేదు. దీనికి సాక్ష్యము యోహా 14:16-18 మీ యిద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆదరణకర్త సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. ఆయన మీతోకూడా నివజించును. మీలో వుండును. మిమ్మును అనాధలుగా విడువను మీ యొద్దకు వత్తును'' అనుటలో ఏసు ప్రభువు తండ్రి వలె విడనాడుట గాని చేయి విడుచుట గాని ఎడబాయుట గాని ఆయన ఎప్పుడు ఎక్కడ ఆయన జీవిత చరిత్రలో లేదు. ఆయన ఈ లోకములో తన శిష్య కోటితో జీవించిన కాలములో చేసిన వాగ్ధానమే! యోహాను 14:18 లో ఈ వాగ్థానమిట్లున్నది. మిమ్మును అనాధలుగా విడువను, మీ యొద్దకు వత్తును. అనుట 15:4లో నా యందు నిలిచి యుండుడి. నేను మీ యందు నిలిచి యుందును. 14:1లో దేవుని యందు విశ్వాస ముంచుచున్నారు. నా యందును విశ్వాసముంచుడి. ప్రకీస్తు నందున్న వాడు నూతన సృష్టి పై మాటలన్నియు దైవ కుమారుడైన ఏసు క్రీస్తు తన విశ్వాసులైన బిడ్డలతో వుండి మనలను విడనాడక చేయి విడువక, మనలను ఎడబాయక మనలో తాను - తనలో మనము ఐక్యమైయుండు రీతిని ప్రత్యక్షముగా బోధిస్తున్నాడు.

        ప్రియ పాఠకులారా! ఈ విధముగా ఎడబాయని రక్షకుని మన హృదయమందును మన తలంపులందును మన గృహములందును, మన శరీర ఆత్మీయ జీవితాలయందును తన స్శాధీన మందుంచుకొని తన మహిమతో మనలను నడిపించి ఆశీర్వదిస్తున్నట్లు, నేటి క్రైస్తవ జీవితములో వున్న మనకు మన సాక్ష్యానుభవములో అనుభవించియున్నాము.

        ఇప్పటి వరకు దేవుని ఆత్మ - క్రీస్తు ఆత్మల యొక్క  విడనాడని చేయి విడువని ఎడబాయని వివరాలను గూర్చి తెలిసికొని యున్నాము. ఇపుడు పరిశుద్ధాత్మ దేవుడు తన విశ్వాసుని విడనాడునా? చేయి విడుచునా? ఎడబాయునా? అనిన విషయాన్ని గూర్చి మనము తెలిసికొందము.

        ప్రియ పాఠకులారా! ఈ సందర్భములో లూకా1:35 లో దూత కన్యకయైన మరియతో పరిశుద్దాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రియ పాఠకులారా! ఇది పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు పట్ల జరిగించిన ఆశ్చర్యకరమైన క్రియ, ఈ విధముగా పరిశుద్ధాత్ముడు కన్యక గర్భములో శిశు రూపమును నిర్మించి ఆ శిశువును తన శక్తి తన జ్ఞానముతో బాలుడైన ఏసును యౌవ్వనునిగా ఎదిగించి, ఆయనకు బాప్తిస్మ కార్యక్రమము జరిగినపుడు పరిశుద్ధాత్మ పావురము రూపంలో ఆయన మీద వ్రాలుట, ఇవన్నియు పరిశద్ధాత్ముడు  ఏసు ప్రభువు చేతిని పట్టుకొనుట ఆయనను ఎడబాయకుండుటను గూర్చిన వివరములైయున్నవి.

         ఆ విధముగా పరిశుద్ధాత్ముని యొక్క ప్రభావ మూలమున పరిశద్దాత్మ దేవుడు ఏసు క్రీస్తు యొక్క హస్తమును పట్టియున్నందువలన ఏసు ప్రభువు శరీరమంతయు తుదకు ఆయన ధరించిన అంగీలోను ఈ పరిశుద్ధాత్మ శక్తి వుండి,  ఏసు ప్రభువు చూపుల ద్వారా జక్కయ్య యొక్క పాప జీవితము మారి నూతన జీవితము పొంది నూతన విశ్వాసులు నూతన స్వభావము నూతన మనస్సును నూతన ఆత్మను పొందినట్లు జక్కయ్య చరిత్రను గూర్చి మనము తెలిసికోగలము. అలాగే ఆయన చేతి స్పర్శ వలన చనిపోయిన విధవరాలి కుమారుని శవమును ముట్టినపుడు సజీవుడాయెను. అలాగే ఆయన చేతితో అనేక రోగులను ముట్టి స్వస్థపరచినట్లును ఆయన పాద పూజ ద్వారా మగ్థలేన అను మరియ తన పాప జీవితమును కడుగుకొని ఆయన పాద కాంతికి పవిత్రురాలై నట్లును, అలాగే ఆయన అంగీ అంచును తాకి 12 ఏండ్లు రక్తస్రావము రోగి స్వస్థురాలైనట్లును ఆయన వాక్‌ శబ్ధమునకు రోగములు తొలిగిపోవుట పంచభూతములు శాంతించుట, గెరాసీనుల దగ్గర సేన అను దయ్యముల పమూహము తాము పట్టిన వ్యక్తిని వదిలి పోవుట వగైరా శక్తి వంతమైన స్వస్థత క్రియలు ఆశ్యర్య కర క్రియలు జరిగివున్నవి. అలాగే ఆయన హస్త స్పర్శమూలమున ఐదు రొట్ట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మంది ఆకలిని తీర్చి 12 గంపలకు మిగిల్చినట్లుగా కూడా చదువగలము.

        ఇంత గొప్పగా ఏసు ప్రభువును వాడుకున్న దేవుడు ఆయన బాప్తిస్మము పొంది ఆత్మ చేత అరణ్యమునకు నడిపించినపుడు అపవాది చేత శోధింపబడుచుండెను. ఈ శోధనలో నిలువబడి అపవాదిని గెలుచు శక్తి పరిశుద్ధాత్మ వలన ఏసు భ్రువునకు కలిగినట్లు మనము తెలిసికొనవలెను.

        ఈ విధముగా ఏసు ప్రభువును చేయి విడువకుండా ఆయా సమయాలలో మరియు నిత్యము ఎడబాయక ఆదుకున్న దేవుడు ఏసు ప్రభువు బలి యాగము చేయు సందర్భములో ఆయన చేయివిడిచినట్లు ఏసు ప్రభువే స్వయముగా నా దేవా! నా దేవా! నన్నెందుకు చేయివిడిచితివి? అని పల్కినాడు. ఆయనను దేవుడు ఎందుకు చేయివిడిచాడు. అనిన మాటకు జవాబు యెష 53:10 అతనిని నలుగ గొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అను మాట జవాబైయున్నది. అనగా లోక నరకోటి యొక్క పాప పరిహారార్థము బలియాగము కొరకు దేవుడు ఏసు క్రీస్తును ఈ లోకమునకు పంపెను'', అను మాట అనగా మానవ కోటి మీద దేవుని కున్న ప్రేమ యొక్క మోతాదు కన్న కొడుకు కంటె ఎక్కువ అని తేల్చి ప్రకటించుటకు క్రియా మూలకంగా కనపరచుచు సిిలువ మీద తన కుమారుని విడనాడినట్లు చేయి విడిచినట్లు ఎడబాసినట్లు తెలియు చున్నది.

        ప్రియ పాఠకులారా! ఈ నగ్న సత్యాన్ని గ్రహించిన మనము మన పట్ల దేవుని కున్న ప్రేమ యొక్క విలువను జ్ఞాపకము చేసికొని, దేవుడు తన స్వంత కుమారుని సహితము మన ప్రేమ కొరకు బలిజేశాడంటే దేవుని యొక్క ప్రేమ లోకము మీద ఎంత అధికముగా వున్నదో యోహా3:16 లో చదువగలము. దేవుడు లోకము నెంతో ప్రేమించెను. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందుపట్లు ఆయన అనుగ్రహించెను. ఈ విధముగా తన ప్రేమను కనపరచిన, వెల్లడి పరచిన దేవుని యొక్క ప్రేమను మనము పొందాలంటే మనము ఆయన ఈ లోకమునకు పంపిన తన కుమారుని చేతులు మనము పట్టుకొనవలెను. ఆ విధముగా పట్టుకుంటే మనలను ఏసు క్రీస్తు తండ్రి రాజ్యమునకు చేర్చగలడు. ఈ మాటను వాగ్దాన పూర్వకముగా యోహా 14:6 లో ఏసు ప్రభువు స్వయముగా నేనే మార్గము - సత్యము - జీవమును నాద్వారానే తప్ప మరి ఎవడును తండ్రి యొద్దకు రానేరడు. అను మాట మనము గ్రహించవలసి యున్నది.

        ప్రియ పాఠకులారా! ఈ విధముగా మార్గమును సత్యమును జీవమును నైయున్న క్రీస్తు యొక్క చేతిని మనము పట్టుకుంటే మనకొరకు గాయపరచబడిన ఆయన హస్తము మనలను విడనాడదు, ఎడబాయదు, ఏసు ప్రభువును పరిశుద్ధాత్మ దేవుడు తాత్కాలికముగా విడనాడి ఎడబాసినప్పటికిని, దైవ నిర్ణయము ప్రకారము మూడవ దినమున ఆయన మరణ పునరుత్థానము పొందుటకు ఈ పరిశుద్ధాత్మయే ఆధారమైనట్లు అనగా లోక రక్షణార్థము మరణమైన యేసు యొక్క శరీరమును మహిమ శరీరముగా మోక్షారోహణము చేయుటకు మూలధారమైన కారకుడు ఈ పరిశుద్ధాత్ముడే!

        కనుక ప్రియ పాఠకులారా! ఏసు క్రీస్తు ఈ లోకములో జీవించి యున్నపుడు నరులను ఆదుకొనుటకు దేవుని యొద్దనుండి ఆదరణ కర్తయగు ఆత్మ అపోస్తలులను ఆవరించి జ్ఞానమిచ్చి దైవ రాజ్యసువార్తను లిఖింపచేసి వారు పొందిన ఆత్మ శక్తిని బట్టి అనేక ఆశ్చర్య క్రియలను జరిగించి పరిశుద్ధాత్మకు మహిమ కరముగా జీవించినారు. ఈ విధముగా పరిశుద్ధ గ్రంధ లేఖన భాగములనురచించిన అపోస్తలులను ఈ పరిశుద్ధాత్ముడు ఎడబాయకుండా వారి ప్రయాణాలలోను యాత్రలలోను చెరలోను, శ్రమలలోను, లేమిలోను కష్టములలోను వారిని ఆదుకొని వారిని తన వద్దకు చేర్చుకొని వారి చరిత్రను భూమి మీద స్థిరపరచినవాడు ఈ పరిశుద్ధాత్ముడే! ఆనాటి నుండి నేటటి వరకును ప్రతి క్రైప్తవ విశ్వాపితోను ఈ  పరిశుద్ధాత్ముడు వుండి వారిని జీవ మార్గములో నడిపిస్తున్నాడు.

        కనుక నేటి తరమైన మనకు నాలుగు చేతుల రక్షణ వున్నది. నాలుగు చేతుల ఆదరణ ఉన్నది. నాలుగు చేతుల సహాయమున్నది. ఆ చేతులేమంటే దేవుని చెయ్యి 2. గాయపడిన ఏసు ప్రభువు హస్తము 3. పరిశుద్ధాత్మయొక్క బలమైన హస్తము 4. పరిశుద్ధులైన అపోస్తలుల హస్తముల ద్వారా విరచితమైన లేఖన భాగములు. ఈ నాలుగు చేతులు క్రైస్తవ విశ్వాసిని పట్టుకొనుట బట్టి, నేటి క్రైస్తవ జీవితములో మనము విశ్వాస వీరులుగ జీవించవలసిన భాగ్యమున్నది. ఆమెన్‌!

        23:1-2 దావీదు కీర్త 23:1-2 యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ జేయును శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును.

        ప్రభువు నందు ప్రియమైన వారలారా! ఈ మూడు వచనములలో మూడు నిబంధనలు మిళితమై యున్నట్లు మనము గ్రహించవలసి యున్నది. యిందులో  మొదటిది యెహోవా నా కాపరి ఎట్లనగా ఏదేను వనములో నర జంటను కాచినాడు. జల ప్రళయంలో నోవహు ఓడను కాచినాడు. అబ్రహామును కాచినాడు. మోషేను ఇశ్రాయేలును కాచి కాపాడెను. యుద్ధములో ఇశ్రాయేలులను కాపాడెను. సమస్తములోను ఆయన కాపాడెను.

        ఇశ్రాయేలను తన జనాంగమునకు లేమి అనగా కొదువ లేకుండా జేసెను. పచ్చిక గల చోట ఆయన పరుండ జేయుచున్నాడు. అనిన వేదభాగమునకు యేడు సం||లు కరువులో యోసేపును ఫరో సంపద అన్నిటి మీద అధికార మొసంగి తన జనాంగమునకు పుష్కలమైన ఆహారాన్ని అందించెను. దావీదు మహారాజు ఏలుబడిలో తన ప్రజలకు ఏలాంటి చింత చీకులేని అపజయంబెరుగని  జీవితాన్ని అనుగ్రహించినాడు.  ఇశ్రాయేలు జనాంగమునకు మన్నాను పూరేళ్ళను కురిపించెను. ఇంక శాంతి కరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించెననుటకు అర్థము: ఇశ్రాయేలు దప్పిగొనగా బండ నుండి నీరు రప్పించెను. సంసోను దప్పిగొనగా ఏటిని పాయగా చీల్చి అతని దప్పిక తీర్చెను. ఇష్మాయేలు విషయములో నేల నుండి జలధారలు రప్పించెను. ఇస్సాకు కొరకు కన్యాన్వేషణగా యెలియాజరు వెళ్ళినపుడు అతనికిని ఆతని పరివారమునకును ఒంటెలకును రిబ్కా చేత దప్పిక తీర్పించెను. దేవుని శక్తి చేతనే అంత మందికి ఆమె నీరు చేది పోయగల్గింది.

        ప్రభువు నందు ప్రియ పాఠకులారా!  యెహోవా నాకాపరి అను పై  వేద వచనమును మనము ఆత్మీయముగా ధ్యానిస్తే యిందులో గొప్ప పరమార్ధమున్నది. రాజ్యము పరిపాలన ఆధిపత్యము రధములు, గుఱ్ఱములు, గొప్ప సైనికబలగము, రౌతులు, అనేక మంది భార్యలు ఉపపత్నులు, దాసదాసీ జనాంగము, లెక్కలేని భోెగ భాగ్యాలతో తుల దూగుచూ బహు  పటిష్టమైన సైనిక కాపుదలలో వున్న దావీదు మహారాజు తన సర్వస్వాన్ని త్యజించుకొని, తనకున్న లోక పంబంధమైన కాపుదలను విస్మరించియెహోవాను తన కాపరిగా ప్రవచించుచున్నాడు. మరియు తనకేదియు కొరతలేదని కూడా వివరిస్తున్నాడు. ఈ విధముగా ఒక మహారాజు ప్రవక్త కీర్తనాకారుడు ప్రవచిస్త్తుండగా ఆధునిక యుగములో నరులైన మనకు దేవుని కాపుదలకు బదులుగా అంగరక్షకులు పోలీసులు, కుక్కలు వగైరాలను కాపరులుగా పెట్టుకొని జీవించుటన్నది నేటి నర జీవితములో దైవ కాపుదల అన్నది లేనట్లే మనకు తెలియు చున్నది. ఈ కాపుదల అన్నది లోకస్థులు క్రైస్తవ విశ్వాసులలోనె గాక సంఘములలో కూడా లోపించుచున్నది.

        యెషయా 40:4 లో గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువులో గొర్రె పిల్లలను చేర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును'', అనుటలో క్రైస్తవ బిడ్డలైన మనము దేవుని యొక్క గొర్రెల మందగా రూపించబడియున్నాము. ఆయన యొక్క బాహువుతో గొఱ్ఱెలైన మనలను తన అక్కున చేర్చుకొని కాపాడునని, ఈ విధముగా కాపాడుటలో గొఱ్ఱెలనే గాక గొఱ్ఱెల దొడ్డిని గొఱ్ఱెలకున్న సమస్యలను వాటి ఆరోగ్యస్థితి గతులను ఆలోచిస్తూ గొఱ్ఱెల యొక్క యావద్‌ చింతనను బరువు బాద్యతలను ఆయన మోయుచుండునని ఇందులోని భావము.

        యెషయా 40:4 లో పాలిచ్చు  వాటిని ఆయన మెల్లగా నడిపించును'', అనుటలో దైవత్వమునకు ప్రీతికరము గాను ఆయన ఆత్మీయ ఆకలి దప్పిక తీర్చు విశ్వాసి యొక్క జీవితమునకు ఆయన తృప్తి చెందిన వాడై ప్రత్యేకముగా ఆ గొర్రె వంటి విశ్వాసిని అతని కుటుంబాన్ని తన సారధ్యములో నడిపించునని భావము. ఈ విధముగా రూపించబడిన గొఱ్రెల మందకు దేవుడు కాపరి. మందయైన సంఘమును షలభరితము చేయుటకు పొట్టేళ్ళు పొట్టేళ్ళ పిల్లలు - గొర్రెలు గొర్రె పిల్లలు వగైరా విధములుగా విభజించి యున్నాడు. ఇందులో గొర్రెల మందయను సంఘమును ఫల భరితముగా కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళుగా సంఘ పెద్దలనేర్పరచు కొనియున్నాడు. ఈ పొట్టేళ్ళ యొక్క పటిష్టత వాటి ఎదుగుదల వాటి యొక్క బలాధిక్యతలను బట్టి గొఱ్ఱెల మందకు ఫలవంతమైన జీవితమున్నదని మనము గ్రహించాలి. అంటే గొఱ్ఱెల మంద సంఘము, పొట్టేళ్ళు సంఘ పెద్దలు , గొర్రెపిల్లలు సంఘములో సంఘకార్యక్రమాలలోను సంఘ పెద్దలతో సంఘ కాపరితో సహకరించి సంఘ సేవా ధర్మమును జరిగించుట కేర్పరచబడిన యువకులు. ఇక సంఘకాపరి యొక్కబాధ్యత క్రియారూపముగా యోహా 10:లో సంఘకాపరికున్న బరువు బాధ్యతలు, నాలుగు రకములైన గొర్రెల సంతానమును నడిపించు బాధ్యత గొర్రెల యొక్క ఆత్మీయ జీవిత ఎదుగుదల  గొర్రెల దొడ్డికి అధిపతియైన దేవుని యొక్క సన్నిధికి గొర్రెలకాపరి అనగా సంఘ కాపరి ఒప్పగించవలసిన బాద్యత లెన్నియోవున్నవి. దీన్ని గూర్చి యోహాను 10లో వివరించబడిన విధానాన్ని మనము చదువు కొందము. ముందుగా కీర్తన 23:2లో గొర్రెల కాపరి యొక్క మొట్ట మొదటి పని. పచ్చిక గల చోట్ల ఆయన గొర్రెలను మేపును'. అనుటలో సంఘస్ధులైన గొర్రెలకు ఆత్మీయ ఆహారమును అనగా జీవాహారమైన దేవుని యొక్క వాక్యములను అందించుట దైవ వాక్య పఠనము, తత్సంబంధ బోద దాన్ని గూర్చిన వివరములు - బహుగా తేట తెల్లముగా సులభశైలిలో సంఘమై యున్న గొర్రెలకు ఆత్మీయ ఆకలిని తీర్చు విధానములో ఈ ఆత్మీయ పచ్చిక ద్వారా సంఘకాపరి సంఘమున కున్న ఆత్మీయ ఆకలిని తీర్చవలసిన వాడై యున్నాడు.

         ఈ విధముగ పచ్చిక మేపి నట్టి గొర్రెలకు దప్పిక కలుగక మానదు. గొర్రెలకు కలుగు దప్పికను గొర్రెల కాపరి సముద్ర తీరమునకు కాక నదీ తీరమునకు కాక చెరువులలో కాక, ప్రశాంతమైనటువంటి తేట నీరు గల పిల్ల కాలువలు సరస్సులు మడుగులు వగైరాల ద్వారా గొర్రెల యొక్క దప్పికను సంఘ కాపరి తీర్చును. అలాగే సంఘకాపరి సంఘము అనే గొర్రెలకు శాంతి కరమైన ప్రార్థనా సన్నిధికి నడిపించి ప్రార్థనా సహవాసములో మనసుకు నెమ్మది ప్రశాంతత కలుగునట్లు సంఘైక్యతతో కూడిన ప్రార్థనా కార్యక్రమములను జరిగించవలసిన వాడై యున్నాడు. యిందును బట్టి, కాపరి మొదటిగా గొర్రెల మందయైన సంఘమునకు ఆత్మీయ ఆహారముగ దేవుని వాక్యమును, 2వదిగా ఆత్మీయ దాహముగా ప్రార్థనా జలమును సంతృప్తిగా యిచ్చి సంఘాభివృద్ధికి ఎదుగుదలకు మార్గదర్శిగా వుండి సంఘస్థుల యొక్క ప్రాణమునకు ఆత్మకును అనగా లోక రీత్యా శరీరమునకు, పరలోక రీత్యా ఆత్మకును విశ్రాంతి కలుగజేయు వాడునైయున్నాడు. అంటే ఆత్మీయముగా విశ్వాసి - నేను దేవుని బిడ్డను - నేను దైవ విశ్వాసిని - నేను ప్రభువును చూడగలను. ప్రభువు నాతో వున్నాడు. నేను ఆయనతో వున్నాను. అనిన ధైర్యమును శారీరరీత్మ లోక సంబంధమైన భూత ప్రేత పిశాచములను గూర్చి భయము, దొంగలు హంతకులు వగైరాలు', లోక సంబంధమైన తుఫాను  భూకంపము అతివృష్టి, అనావృష్టి వగైరా రుగ్మతలు అంటవు. అనిన ధైర్యాన్ని కలిగిచి దైవ విశ్వాసులతో కూడిన పరిచర్యలో పాలు పొంది శారీర రీత్యా నెమ్మది పొందుటకు కాపరి బాధ్యుడైయున్నాడు.

        అంతే గాకుండా కీర్త 23:3 తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు', అనుటలో దేవుని నామము మొదట యెహోవా నామము. రెండవదిగా ఆయన కుమారుడును నజరేయుడైన ఏసు క్రీస్తు యొక్క నామము. అటు తర్వాత అపొస్తలుల ద్వారా లోక నర కోటిని పవిత్ర పరచ  క్రియ జరిగించిన పరిశుద్ధాత్ముని నామము. ఈ మూడు శక్తివంతములైననామములతో కాపరి నీతి మార్గములో సంఘమును నడిపించుటకుగొర్రెల మందయైన విశ్వాస సంఘమును నీతి మార్గములో నడిపించు బాధ్యుడైయున్నాడు. ఈ విధముగా నడిపించుటలో యోహా 10:4 ఆయనతన స్వంత గొర్రెలు. వాటికి ముందుగా నడచును '' , అనుటలో సంఘమునకు ముందుండి సంఘ కార్యక్రమములు, సువార్త సేవ  దైవారాధన కార్యక్రమములు సంఘము యొక్క ఆత్మీయ సమస్యల పరిష్కారములో సంఘస్థులలోఅనగా గొర్రెల మందయైన సంఘ బిడ్డలలో కలుగు అనారోగ్యములు, కలతలు వేధనలు బాధలు శోధనలు వగైరాలు సంభవించినపుడు వారి గృహాలను  దర్శించి వారి శ్రేయస్సును గూర్చి ప్రార్ధించి వారి ఆత్మీయ జీవితమును చక్కబరచి నడిపించుటకు మూలకారకుడై యున్నాడు. సంఘములో జరుగు ప్రతి కార్యక్రమములోను ఏసు క్రీస్తు వలె ముందుండి జరిగించుటకు బాధ్యుడై యున్నాడు.

        మరియొక విశేషమేమిటంటే యోహా 10:3 లో గొఱ్ఖెలు అతని స్వరము వినును, '' అనుటలో కాపరి యొక్కబోధను ప్రసంగాలను ఆత్మాకర్షణతో కూడిన విధానములో ప్రసంగించినపుడు సంఘమెంతయో ఆశక్తితో వింటుదని ఇందులోని భావము.

ఇక యోహా 10:4 లో గొర్రెలు అతనిని వెంబడించును'', అనుటలో ఆత్మావేశముతో ఆత్మ దేవుని యొక్క చిత్తానుసారంగా వేద వాక్యముననుసరించి దైవాకర్షణతో ప్రసంగించు సంఘకాపరి యొక్క స్వరమును విన్నటువంటి సంఘము కాపరిని వెంబడించుచు, అతని యొక్క ప్రతి అవసరమును స్థితి గతులు పరామర్శించుచు కాపరిని అంటి పెట్టుకుని వుంటుందని ఇందులోని భావము.                          ప్రియ పాఠకులారా! యోహా 10:7 లో గొర్రెలు పోవు ద్వారము క్రీస్తు. కనుక ఈ ద్వారములో గొర్రెలను నడిపించు కాపరి ఏసువలె సంఘమునకు సమర్పించ బడినవాడును. ఏసు క్రీస్తు వలెనె సంఘమునకు ప్రాణము పెట్టువాడును ఏసు వలె సంఘము యొక్క  బాగోగులను విచారించువాడు గాను సంఘస్థుల హృదయాలలో కాపరి యిక్క ఆత్మీయ రూపము, కాపరి యొక్క హృదయాలలో కాపరి యొక్క ప్రతి ఆత్మ యొక్క ఆత్మీయ జీవిత విధానములో ఎల్లప్పుడు ముద్రితమైయుండవలెను.

        క్రైస్తవ సంఘము గొర్రెల మందకు పోల్చుటలో గొర్రెె అమాయికమును పరిశుద్ధమును నిష్కపట జంతువు గనుక ఆ జంతువు రూపమునకు దైవ కుమారుడైన ఏసు క్రీస్తు కూడా లోకమునకు పరిచయమయ్యాడు. యోహా1:29 లోక పాపమును మోయు దేవుని గొర్రె పిల్లయని లోకానికి యోహాను పరిచయము చేశాడు. యెషయా గ్రంధములో యెషయా ప్రవక్త - వధకు తేబడిన గొర్రెయు బొచ్చు కత్తిరించు వాని యెదుట మౌనియైన గొర్రె వలె అభివర్ణించి యున్నాడు.

        ప్రియ పాఠకులారా! గొర్రెల యజమానికి గొర్రెల కాపరికి గొర్రెలకు ఈ విధముగా అన్యోన్య సంబంధబాంధవ్యాలు ఆత్మీయ బంధములు ఇమిడి యున్నవి. అయితే నేటి క్రైస్తవ సంఘములలోను శాఖలలోను మరి ముఖ్యముగా కాపరులలో స్వార్థము, ధనాపేక్ష, నేత్రాశ, ప్రబలి సంఘకాపరియైన వాడు దేవుడు తనను సంఘమునకు కాపసరిగా నియమించి యున్నాడను బాధ్యతను విస్మరించి యోహోవా నా కాపరి'', అను మాటకు బదులుగా నేనే ఈ సంఘమునకు కాపరి. నేనే అనగా అహము సూచిస్తున్నది. సంఘము అను గొర్రెల మందకులేత పచ్చిక వంటి ప్రశస్తమైన దైవిక ఆత్మీయ ఆహారమును సంఘమునకు అందించుటకు బదులుగా కాకమ్మ కథలు, ముసలమ్మ ముచ్చటులతో కూడిన, దైవత్వమునకు వేద సాహిత్యానికి వ్యతిరేకమైన బోధను చేస్తూ, దైవ వాక్యములను లోక సంబంధమైన వాటికి జతపరచుచు పచ్చని పచ్చికగా వున్న ప్రశస్తమైన దైవ వాక్యమును చవి సారము లేని ఎండుగడ్డిగా మార్చి, ఎండుగడ్డి వంటి సారము లేని బోధను చేయుచూ అట్టి బోధద్వారా గొర్రెల మందయైన సంఘమును బలహీన పరచుచున్నాడు.

        శాంతి కరమైన జలముల యొద్దకు ప్రార్ధథనా సహవాసములో ప్రార్ధనా స్థలమునకు నడిపించవలసిన సంఘ కాపరి సంఘమును కోర్టుకు నడిపిస్తున్నాడు. లోక సంబంద న్యాయ స్థానములకు నడుపుచున్నాడు. సంఘస్థుల యొక్క శారీర ఆత్మీయ జీవితాలకు నెమ్మది కలిగించవలసిన కాపరి దేవుని నామమునకు వ్యతిరేకముగా తన నామములో తన పేరును బట్టి తన ఇష్టానుసారంగా లోక సంబంధమైన న్యాయ వాదులు అనగా లాయర్ల మార్గములో నడిపిస్తున్నాడు. ఇందు వలన గొర్రెల మందచెదర గొట్టబడి, గొర్రెల మందయైన క్రైస్తవ సంఘములు చెదరి పచ్చికయను దైవ వాక్యము మీదను శాంతికరమైన జలము అను దైవ ప్రార్థన మీదను, అయిష్టత గల్గి తమ తమ ఇష్ట ప్రకారముగా నానా సంఘములలో చేరి నానా విధములైన శారీర ఆత్మీయ రుగ్మతలకు లోనై ఆత్మీయ జీవితములో పతనము పొంది, పంఘమునకును దైవత్వమున కును ఇట్టి పతనావస్థలో సంఘమును దిగజార్చిన కాపరులకు దేవుడిచ్చు ప్రతి ఫలము. ఇర్మియా 23:1-2 యెహోవా వాక్కు ఇదే! నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయుచుచెదర గొట్టు కాపరుటకు శ్రమ. మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారద్రోలితిరి. మీ దుష్క్రియలనుబట్టి మిమ్మును శిక్షింపబోవుచున్నాను.

        10. యెహోవా మందిరము

        పాఠక మహాశయులారా! పదియవ కీర్తనలో వున్న పరమార్థాన్ని చర్చించుకున్నాము. ఇపుడు 23వ కీర్తనలో వున్న అమూల్యమైన ఆత్మీయ జ్ఞానాన్ని గూర్చి తెలిసికోవలసి యున్నాము. ఈ 23వ కీర్తన మొదటి వచనములో యెహోవా, నా కాపరి'', అని కీర్తనాకారుడు అనుటలో ఎంతో గొప్ప ఆశక్తికరమైన ఆత్మీయ మర్మములు అణగారియున్నట్లు తెలిసికొందము. ఈ కీర్తన రచయితయైన దావీదు మహారాజు - మొట్టమొదటి వచనంలో - యెహోవా నా కాపరి'', అనుటలో ఈయనకున్నటువంటి లోక పంబంధమైన కాపరులను గూర్చి మనము ప్రస్తావించుకుంటే - దావీదు మహారాజుకు - మంత్రులు సామంత్రులు, గొప్పవీరులైన అశ్వయోధుల, రధములు సైన్యాధిపతులు, దండ నాయకులు దాస దాసీ జనము పరివారము అంగరక్షకులు వగైరాలు అనేక వేల మంది తనకుండగా యింతటి ఐశ్వర్యవంతుడైన దావీదు 'యెహోవా' నా కాపరి'', అనుటలో చదివే మనకు విడ్డూరంగా లేదా? ఈ సందర్భములో పౌలు చెప్పిన మాట ''క్రీస్తు కొరకు లోకమును నేను పెంటతో సమానంగా ఎంచుచున్నానంటాడు.'' ఈ మాటను ఈ సందర్భములో క్రియా మూలకంగా పాత నిబంధన చరిత్రలో దావీదు నిర్థారించుకున్నాడు. తనకున్న ఐశ్వర్యమును త్యజించి తన రాజ్య భోగములను విసర్జించి మహారాజైన దావీదు యొక్క నిర్ణయములో ఎంతో గొప్ప సమర్పణాయుతమైన తీర్మానమున్నట్లు మనము గ్రహించాలి.

        నిజమే! యెహోవా, దావీదు యొక్క రాజ్యమునకును అతని జీవితానికిని బాల్యమునుండి ముదిమి వరకు కాపరిగా వుండకపోతే దావీదు  

        చిగురు నుండి  ఏసు అను దైవ కుమారుడు పుట్టుటకు యోగ్యత వుండేది కాదు.  దావీదు యొక్క జీవితంలో దేవుడే  దావీదుకు కాపరిగా వుండి ఆయనను నడిపించినట్లు పసి ప్రాయంలో దావీదు గొర్రెల మందను మేపు చుండగా  ఒకమారు సింహము మరొక మారు ఎలుగుబంటి దాడిచేసిన సందర్భములో గొర్రెలకు కాపరియైన బాలుడైన దావీదునకు - దావీదు నెదుర్కొన్న సింహము ఎలుగుబంటుల నుండి గొర్రెలకు విమోచన, దావీదుకు రక్షణ కల్పించి దావీదునకు దావీదు గోత్రాలకును దేవుడే కాపరియైనట్లు వేదంలోని ఈ భాగము ఋజువుపరచుచున్నది.  అదేవిధంగా దావీదునకు తన కుమారుడైన అబ్షలోము ద్వారా సంక్రమించిన యుద్ధంలో దేవుడు దావీదునకు కాపరిగా వుండకుండినట్లయితే అబ్షాలోము  చావడు.  దావీదు యొక్క రాజ్యము మరల ఏర్పడేది కాదు.

        ప్రియపాఠకులారా!  ఇదే కీర్తనలలో 80:1 ఇశ్రాయేలునకు కాపరీ! చెవియొగ్గుము.  మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైనవాడా! ప్రకాశింపుము.  ''ఇశ్రాయేలు కాపరి'', అనుటలో దావీదున కును దావీదు జనాంగమునకు ఇశ్రాయేలుకును దేవుడు కాపరి. అయినను దావీదునకు దేవుడు ప్రత్యక్షంగా కాపరియైనట్లు దావీదు పల్కిన 23వ కీర్తనలోని మొదటి మాట ఋజువు పరచుచున్నది.  ఈ విధంగా దేవుడు తన జనాంగమునకు కాపరిగా వున్నందువల్లనే  నాటి దేవునిజనాంగమైన ఇశ్రాయేలు దైవోగ్రతకు పాత్రులై నశించిపోయినను దేవుని యొక్క కాపరత్వానికి సాదృశ్యంగా నేటికిని వారు నిలచియున్నారు.  

        ఇక రెండవ మాటను గూర్చి తెలుసుకొందము.  నాకు లేమికలుగదు'' అనుటలో యెహోవాను తమకు దేవుడుగా కలవారు ధన్యులు'', అను వాక్యము యొక్క నెరవేర్పయియున్నది.  యెహోవాను తమకు దేవుడుగా కలిగిన ఇశ్రాయేలు దైవ పక్షంగా అనేక యుద్ధాలు చేసి విజయాలు సాధించారు.  యెహావాను తనకు దేవుడుగా జేసుకొన్న అబ్రహాము రెండు జనాంగాలకు తండ్రి అయ్యెను.  అదే విధంగా ఇస్సాకుకుమారుడైన యాకోబుః - దైవ కుమారుడైన ఏసుక్రీస్తు జన్మకు పితామహుడయ్యాడు.  వీరందరూ లేమిని ఎరుగని వారై నిశ్చితంగా ధైర్యసాహసాలతో లోకములో జీవించి పరిశుద్ధ గ్రంధ చరిత్రలో లిఖించబడినారు.  యోహోవాను నమ్మి ఆయనను దేవునిగా మహిపరచి లేమి లేకుండా జీవించుట అనగా దారిద్య్రము అవమానము, నిరర్దకమైన జీవితములో జీవించనివారు.  లేమిని ఎరుగని వారు అబ్రహము, ఇస్సాకు యాకోబు మోషే అహరోను యెహోషువా గిద్యోను ఏలియా ఎలీషా ఇంకా ఇంకా ఎందరో రాజులు ప్రవక్తలు ఘనమైన జీవితాన్ని జీవించియున్నారు.  ఇది లేమిలేని జీవితానికి మాదిరి.

        ఇక రెండవ వచనముః- పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును. పచ్చిక ఫలభరితమైన జీవితమునకును కరువులేని జీవితమునకును ధన్యకరమైన జీవితమునకును మాదిరి.''పచ్చిక గల చోట్ల పరుండుట'', అనుటలో ఈ పచ్చికన్నది ఆత్మీయార్ధములో ఆత్మీయాహారమైన దేవుని వాక్యము ప్రసంగించు స్థలములలో వినిపించు స్థలములలో ఆయనతన విశ్వాసుని నివసింపచేయు చున్నాడు.  అని దీని భావము.  పచ్చిక సువార్త-పచ్చిక గల చోటు సువార్తను ప్రకటించు సంఘము.  శాంతికరమైన జలములు శాంతియుత వాతావరణంలో ఆత్మీయ దప్పికను దీర్చు స్థలము అనగా దేవుని మందిరము అని భావము.  కనుక దేవుని మందిరానికి ఆయన నడిపిస్తున్నాడని మనము గ్రహించాలి.

        ఇక నాల్గవదిగ నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు.  ప్రియపాఠకులారా! మనలోని జీవాత్మకు ప్రశాంతత నెమ్మది మనోల్లాసము కలుగవలెనంటే లోకసంబంధమైన వస్తు సముదాయములు వాయిద్యములు మత్తుపదార్ధములు ఇవ్వలేవు.  ఒక్క దైవ సన్నిధియే ఇందుకు యోగ్యకరమైన వరము.  కనుక దైవ సన్నిధియే భక్తుని యొక్క జీవాత్మకు అలసటను దీర్చు స్ధలము.  ఆయన సన్నిధి అట్టి జీవాత్ముని దేవుడు తన నామము ''తననామము''అనుటలో ఏసు నామములో ఈ సందర్భములో యోహా 1:12 తన నామమందు విశ్వాసముంచిన వారికందరికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.  మరియు ఈ నామముననే తప్ప మరి ఏ నామమునను రక్షణ లేదు.  అదియే ఏసు నామము. అదియే నీతిమార్గమున నడిపించు నామము.

        గాడాంధకారపు లోయలలో నేను సంచరించినను,''అనుటలో హంతకుల మధ్య జీవితము అంధకారమయమైన అడివిలోని జీవితము పాపభూయిష్టమైన ఈ లోకసంబంధమైన బార్లు, క్లబ్బులు, లాడ్జీలు,వేశ్యగృహాలు చీకటిలో జరిగించు, అల్లరి ఆటపాటలతో కూడిన స్థలములలో సంచరించుట అనగా అట్టి జీవితంలో వుండు వారితో సహవసించుట.  ఇట్టి వాతావరణం వల్ల కలుగు అపాయాలను యెహోవా కాపరత్వములో వున్న జీవికి ఎటువంటి భయములేదు'' అనుటలో రాజగు నెబుకద్నెజరు దానియేలును చీకటి అంధకారమయమైన సింహాల గుహలో పడవేసినపుడు దేవుడతనికి కాపరియై యుండి, సింహాల నోర్లు మూయించి నట్లు వేదంలో చదువగలము. యాకోబు కుమారుడైన యోసేపును అతని అన్నలు గోతిలో పడవేయగా ఆ అంధకారగోతిలో దేవుడతనిని కాపాడినాడు.  ఇశ్రాయేలును రాత్రికాలములో ఫరోసైన్యము తరుముచుండగా యెహోవా దేవుడు వెలుగు స్తంభంగా వారికి మార్గమును చూపించి నిరూపించాడు.  ఇది గాడాంధకారలోయకు చిహ్నము.

        ''నీవు, నాకు తోడైయుందువు'' నిజమే! ఆయన తోడైయుండబట్టి పాతనిబంధన కాలములో మానవ జాతికి రక్షణ మనుగడ అనుగ్రహించబడింది. నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్నాదరించును'', అనుటలో ఇశ్రాయేలును ఆదరించింది. మోషే చేతిలోని కర్ర అహరోను యొక్క దండము''. బాలుడైన దావీదును రక్షించినది దేవుడతనికి ఇచ్చిన వడిసెలు రాళ్లు అను దండము సంసోను ఆయన దండము-గిద్యోనుకు దేవుడను గ్రహించిన కుండలు దివిటీలు దేవుడను గ్రహించిన రక్షణ. అదే విధంగా నేటి క్రైస్తవుల మని చెప్పుకుంటున్న మనకు ఆయన వాక్యము, ఆయనను గూర్చిన ప్రార్ధన ఆయన అనుగ్రహించిన దుడ్డు కర్రయు దండములైయున్నవి.  ఈ విధముగా దేవుని దుడ్డుకర్ర దండములచేత ఆదరించబడిన నాటినుండి నేటి వరకును దేవుడు జరిగించిన క్రియలు మన జీవితంలో మన ఆత్మీయ మేళులకు ఆయుధములైయున్నవి.                        5.నా శతృవుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచెదవు'', అనుటలో ప్రియపాఠకులారా! శతృవునుండి రక్షణ కలుగాలంటే శతృవుల యొక్క అహందెబ్బతినాలంటే ఒక వ్యక్తి జీవితంలో తన ఆత్మీయ స్ధైర్యంతో దైవత్వం యొక్క కృపా కటాక్షములను పొందవలసిన అవసరత ఎంతయో వున్నది.  ఈ నా శతృవుల యెదుట నాకు భోజనము సిద్ధపరచుదువు. అను ఈ వాక్య నెరవేర్పు ఏసుప్రభువు పంచిన 5 రొట్టెలు రెండు చేపలు 5 వేలమందికి ఇంకొకసారి 7 రొట్టెలు కొన్ని చిన్నచేపలు నాలుగు వేలమందికి పంచిన సంఘటన ఈ సందర్భంలో మనము ధ్యానించవలసియున్నది.

        ఏసుప్రభువు పంచిన రొట్టెలు అప్పటికప్పుడు తయారుచేసినవి కావు.  ప్రభువు బోధను వినుటకు వచ్చిన జనసమూహమును గూర్చి సిద్ధముచేసినవి కావు.  ఒక చిన్నవాడు తన యొక్క స్వంతానికి తెచ్చుకున్న రొట్టెలవి.  ఏసు ప్రభువు యొక్క మహిమోన్నత కార్యము తిలకిస్తున్న జనాంగము ఆకలి దప్పులెరుగని స్ధితిలో వుండి అలసటగొని యుండగా ధర్మవిరోధి, పరిశుద్ధునికి శతృవైన అపవాది యొక్క శోదనకు లోబడకుండ వుండుటకై ఏసుప్రభువు చుట్టు కలయచూచి  తన్నావరించియున్న జనాంగము పై కనికరించి అప్పటికప్పుడు ఆ జన సందోహంలో విచారించి, ఒక చిన్నవాని యొద్దనున్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు స్త్రీలు పిల్లలుగాక 5 వేలమందికి పంచి 12 గంపలు మిగిల్చినట్లు ఈ సందర్భములో మనము చదువగలము.

        అయితే ధర్మవిరోధియు ఈ లోకాధిపతియు, వాయుమండలాధిపతియునైన సాతానుడు ఇట్టి క్రియను చేయనేరడు.  ఈక్రియ ఒక్క దైవత్వానికి సాధ్యము.  మరియు ఏలియాకు యెజెబెలు శతృవైయుండగా అట్టి శతృవుకు భయపడి ఏలియా బదరీ వృక్షము క్రింద పరుండి యుండగా దేవుడు కాకోలముల చేతను తన దూత చేతను ఆహారమును సిద్ధపరచినట్లు వేదంలో చదువగలము.  అదే విధంగా కరువు కాలంలో సారెపతులో ఏలియాకు ఆహారమిచ్చిన విధవరాలి గృహాన్ని ఏలీయా యొక్క క్షుద్భాదను కొరత లేకుండా జేసినట్లు వేదంలో చదువగలము.  మరియు ఇశ్రాయేలీయులు ఆకలిగొన్నప్పుడు మోషే ప్రార్థించిన వెంటనే మన్నాను వర్షింపజేసినట్లును మాంసము కావాలని మోషే ప్రార్ధించునపుడు పూరేళ్ళను కురిపించినట్లు వేదంలో చదువగలము.  ఇవన్నియు కూడా శతృవు కన్నుల ఎదుటనే దేవుడు తన బిడ్డలకు సిద్దపాటు చేసిన ఆహారవసరత లైయున్నవి.

        నూనెతో నా తల అంటియున్నావు.  ప్రియపాఠకులారా!   నూనె అన్నది దేహమునకు ఆత్మకును అవసరమైయున్నది.  దేహసంబంధంగా నూనె అంటుకోవడమన్నది అభ్యంగన స్నానము బాలింతల స్నానము, పసిబిడ్డల స్నానమునకు ఉపయోగకారిగా వున్నది.  అయితే దేవుడు అంటిన నూనె పాత నిబంధన కాలంలో సమూయేలు ఏలియా యెహోషువా యెషయా ఎలీషా వగైరా ప్రవక్తలు చేత రాజులను పరిశుద్ధులను క్రొత్త తైలంతో అభిషేకించినట్లు వేదంలో చదువగలము. నూనెతో తల అంటుటన్నది మానవ జీవితంలో ఆత్మీయ స్థితిలో చాలా ప్రాధాన్యత వహించియున్నది.  నేటికిని ఈ నూనెను అంటి అభిషేకించుట రోగిగా వుంటే ప్రార్ధించుటయు, దేహనికి మర్ధించుట జరుగుచున్నది.

        ప్రియపాఠకులారా!  నూనె లేకపోతే మన జీవితం కూడా చమురులేని దీపము వంటిది.  నూనె లేకపోతే క్రీస్తులేని సంఘము, నూనె అన్నది లేకపోతే క్రీస్తులేని క్రైస్తవ గృహము, నూనె అన్నది లేకపోతే నామ క్రైస్తవ జీవితము పదిమంది కన్నెకల విషయము మనమాలోచిస్తే ఐదుగురు నూనెగల కన్యకలు 5గురు నూనెలేని కన్యకలుగా వివరించబడియున్నది. 5గురికి నూనెవున్నది.  సిద్ధివున్నది. దివిటీ వున్నది. ఐదుగురిలో నూనెలేదు.  వెలుగని దీపము చమురులేని సిద్దె'' - ఇందులోని పరమార్ధము నూనె అన్నది పరిశుద్ధాత్మకు ముంగుర్తు.  పరిశుద్ధాత్మన్నది లేకపోతే క్రైస్తవ విశ్వాసి యొక్క విశ్వాస జీవితము మృతము అనగా కళావిహీనము, వెలుగని స్థితి అన్నది గ్రహింపవలెను.  అదే విధంగా నూనె గల స్ధితి అంటే పరిశుద్ధాత్మను కలిగియున్న స్థితి. ఇది విశ్వాసిని పరిశుద్ధునిగా జేసి దేవునికి యోగ్యకరమైన జీవితంలో నడిపిస్తూ దైవత్వంలో ఐక్యపరచుచున్నది.  కనుక నూనెతో నాతల అంటియున్నావు.  అనగా నీ పరిశుద్ధాత్మను నాలో వుంచియున్నావు.  అని అర్ధము.

        ఇక నా గిన్నె నిండి పొర్లుచున్నది. దీని పరమార్ధము గిన్నె విశ్వాసియొక్క హృదయము. గాబ్రియేలు యొక్క శుభవచనము వినగానే మరియమ్మలోని గిన్నె పరిశుద్ధాత్మ యొక్క ప్రభావమున పొంగి పొరలింది.  గాబ్రియేలు దూత ద్వారా శుభవచనాన్ని విన్నమరియలోని జీవాణువులు పరిశుద్ధాత్మ ప్రభావం చేత పొంగి పొరలి ప్రభువు యొక్క జన్మకు కావలసిన జీవాణువులు సృష్టించి  సంతానోత్పత్తికి మూలకారణమైంది.  మరియమ ఎలీసబేతమ్మను దర్శించినప్పుడు మరియమ్మ దర్శనం ద్వారా ఎలిజిబేతు గర్భంలోని శిశువు గంతులేసినట్లుగా వేదములో వివరించబడ ియున్నది.  లోక రక్షకుడైన ప్రభువు యొక్క కృపామహిమలు పొందిన మరియమ్మ యొక్క దర్శనంతో ఎలిజిబేతు కూడా ఈ పరిశుద్ధాత్మ అనే తైలాను భూతిని పొంది పరవసించగా -''ఈ పరవశ ప్రభావంలో ఎలీసబేతు గర్భంలోని శిశువు కూడా గంతులేసినట్లు చదువగలము.  ఇది స్త్రీ గర్భంలో దైవ ప్రభావము అను నూనె పొంగి పొరలుచున్నదనుటకు సాదృశ్యము.

        ప్రియపాఠకులారా!  ఈనాడు మనలో మన గిన్నె నిండి పొరలుటకు పరిశుద్ధాత్మ తైలమును పొందుటకు మనము ప్రయాసపడుచున్నామా?  దావీదు మహరాజు తన గిన్నె నిండి పొర్లుచున్నది.  అనగా తన హృదయము ఉప్పొంగుచున్నదంటున్నాడు.  హృదయము ఉప్పొంగాలంటే నిరాడంబర జీవితము. నిస్వార్ధ జీవితము విధేయత వినయము భక్తి, మేళవించిన జీవితము జీవించాలి.   అట్లు జీవితం జీవించాలంటే మన హృదయమనే గిన్నెను ఏసు నామములో శుభ్రపరచుకోవాలి. ఏసుప్రభువు వాగ్ధానం చేసిన రీతిగా బాప్తిస్మమిచ్చు యోహాను ఎన్నో ఇబ్బందులుపడి అరణ్య ప్రదేశంలో తిరుగుచు ఒంటె రోమముల బట్టలు తేనెమొదలగు ఆహారంతో జీవించినను ప్రభువు నెరిగిన తర్వాత ప్రభువు యొక్క బాప్తిస్మపు కార్యాన్ని నెరవేరుస్తూ ఏసు ప్రభువు రాకడకు మార్గంగా ఈ లోకంలో జీవించి తన జీవితమును అంతం చేసికున్నాడు.   క్రీస్తు విశ్వాసంలో జీవించి -కీస్తులో బాప్తిస్మము పొంది జీవిస్తున్న మనకు మన హృదయమనే గిన్నెలో పరిశుద్ధాత్మ తైలాభిషేకము లేకపోతే మనము ఆత్మ సంబంధులము కాలేము.

        నేను బ్రతుకు దినములన్నియు కృపాక్షేములే నా వెంటవచ్చును.  ప్రియపాఠకులారా!  ఈ చివరి వాక్యంలోని మొట్టమొదటి వచనము, ||నేను బ్రతుకు దినములన్నియు'', అనుటలో ఎఫేసి 2:1లో విధంగా మీ అపరాధములు చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైయుండగా, ఆయన క్రీస్తుతో బ్రతికించబడిన మనము '' అని అర్ధము ఇది నిజ క్రైస్తవ జీవితములో వున్న యదార్ధత.

        ప్రియపాఠకులారా!  క్రైస్తవులమైన మనము బాప్తిస్మము పొందక పూర్వము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవారమైయున్నా మన్న సంగతి మనము గ్రహించాలి.  ఆ విధంగా చనిపోయిన మనలనుఏసు తన యొక్క దూతలచేత స్వాగతం పలుకుచు పునరుత్ధానమును జీవమును నేనే! నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును.  బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికిని చనిపోడు.  అన్నట్లుగా క్రీస్తులో బ్రతుకుచున్న మనము ఆయనలో వేరు పాతుకొని స్ధిరంగా జీవించాలంటే, ఆయన కృప ఆయన రక్షణ ఆయన క్షేమకరమైన సన్నిధి ఎల్లప్పుడు మనవెంట వుంటుంది.

        తత్‌ ప్రభావ మూలమున చివరి వచనం: చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేతును! అనుటలోయెహోవా మందిరము అనగా దైవ సన్నిధి దేవాలయములో ప్రతి నిత్యము వేద పారాయణము ప్రార్ధన, భక్తుల చేత బోధకుల చేత సత్యదేవుని యొక్క వాక్య ప్రసంగాలు వినుట, దైవ మందిరం లోనే వివిధరీతులుగా జీవితకాలమును గడపుటన్నది.  ఇందులోని సారాంశము.  ఈ విధంగా దైవత్వానికి అంకితమై పోయినవారు  పాత నిబంధనలో సమూయేలు తల్లి హన్న, సమూయేలు ప్రవక్తలు దేవుని ధర్మశాస్త్రమైన మందనమును ఆరాధించి తత్పంబంధమైన నిబంధనలను నెరవేర్చి మందసంలోని సిద్ధాంతం ప్రకారంగా వారి వారి జీవితాలను, ధన్యము చేసి కొంటూ జీవించిన భక్తులు యోబునుండి చదివినట్లయితే ఈ జాబితాలో చాలామంది మనకు లెక్కలో నిలుస్తారు.  నూతన నిబంధనలో ఏసు ప్రభువు మరియు ఆయన శిష్యులు.  

                11.దండము

        23వ దావీదు కీర్తనః నీ దండము ఏది? ఆయనకు విధేయులమైయున్నందున అది రక్షణః  '' అవిధేయులమైన అది సర్పముగా కాటువేయును. కాబట్టి రక్షణ కర్తగాని శిక్షకుడు గాని సృష్టించువాడు గాని పోషించువాడుగాని లయపరచువాడుగాని నాశనముచేయువాడుగాని, సృష్టికర్తయే.  ఈయనలో అన్ని శక్తులు మిళితమైయున్నవి.  అందువల్లనే ఈ జీవాత్మయైన ఆదినరజంటను పరిశోధించుటకు మొదట ఈయన వారికి దండముగా వుండి ఆ తర్వాత వారీయనను లక్ష్య పెట్టుదురో లేదో యను పరీక్షకు వారిని గురిచేయగా సరస్వభావమెరిగి సర్పము ద్వారా నాశనకర పుత్రునిచే వారితో సంభాషణ జరిపించి, పరీక్షలో వారు అపజయులైనందున వెళ్ళగొట్టినట్లును నాటినుండి నేటివరకు ఈ యొక్క నాశన కరపుత్రుడు వాని ప్రభావం నరకోటిలో విస్తరించి, వాని రూపములను వివిధ భంగిమలలో నరగృహములలో చిత్రపటముల రూపమునను ఊరి వెలుపల తోటలలో దిబ్బలలో స్మశాన వాటికలలోన మట్టి పుట్టలలో నివసించు ఈ సర్పము అను రూపము భయాందోళన జీవితమును జరుపుచుండగా నరులు దానిని వదిలిపెట్టక ఒక వైపు అదికాటువేయునని, దాని విషము ప్రమాదకరమైనదని తెలిసియు కూడా మృత్యుకారకమైన ఆ సర్పమునకు కొలువు చేయుటలో నరుని యొక్క బలహీనత ఎంత దిగజారిపోయియున్నదో యిందును బట్టి పాఠకులు గ్రహించవలసియున్నది.

        దేవుడు శోదకుడు కాదు.  పరీక్షకుడు, రక్షకుడు, పోషణకర్త, ప్రాణదాత శక్తిసంపన్నుడు. అయితే శోధకుడు మాయగాడును మరణ పాత్రుడును, అవినీతిపరుడును అబద్దమునకు అశుభములకును కారకుడైయుండి నాశనకర మార్గమునకు మార్గ దర్శియైయున్నాడు.  ఇందువల్లనే జీవములోని కంటే మరణములోనికి పోవు జనసంఖ్య నానాటికి పెరుగుచున్నది.  యిందును బట్టి, దేవుని జీవాత్మ పొందిన నరుని యొక్క జ్ఞానము ఎంతో ప్రభావవంతమైయుండి కూడా మంచి చెడ్డల తెలివినిచ్చు నట్టి వృక్షమును తెలుసుకోగలిగినాడు గాని జీవ వృక్షాన్ని తెలుసుకోలేక పోయినాడు.  నరులు తిన్న ఫలవృక్షము జీవవృక్షము రెండును ఆ తోటమధ్యలోనే వున్నవి.  యిందునుబట్టి జీవమును మరణమును నీ ఎదుట బెట్టినానని గ్రంధములో వ్రాయబడియున్నది. ద్వితియో 30:15

        అయితే దేవుడు జీవ వృక్షము కనుగొనలేకపోయిన నరునికి జీవ వృక్షము యొక్క మర్మమును ఒక జీవమునకు సాదృశ్యపరచి దైవ సంబంధిగా వున్న నరుడు వృక్ష సంబంధిగా మారి వృక్ష సంబంధమైన ఆకులతో మానసంరక్షణ చేసికొనగా నరుని అజ్ఞానమును బలహీనతను గుర్తించిన దేవుడు వ్యక్తిగత  భావముతో నరునికి జీవ వృక్ష మర్మమును అనగా జీవవృక్షముగా తోట మధ్యలో తీర్చబడియున్న క్రీస్తు యొక్క మర్మమును వ్యక్తిగతముగా నరునికి చూపుచు వృక్ష సంబంధంగా నా దైవత్వమును క్రీస్తును గుర్తించలేకపోయినావు గాని, దేహ సంబంధముగా నా యొక్క రక్షణను గుర్తించినట్లు చర్మపు చొక్కాయిలతో ఆ నరజంటకు మాన సంరక్షణ నరులు చేసిన దోష పరిహారార్ధం పాప పరిహార రక్షణ వగైరా మర్మములను క్రియా రూపకముగా దేవుడు వివరించినట్లు చర్మపు చొక్కాయిల మర్మము విశదీకరించుచున్నది.

        అయితే సంపూర్ణ దైవత్వంలోను దైవ నిర్వహణలోను జీవిస్తున్న నరునికి దైవ వ్యతిరేకతయను క్రియకు ప్రేరేపించిన శక్తి దైవ సృష్టిగా వుంటేనే తప్ప లోక సృష్టికది అసాధ్యము.  నరుని యొక్క పతనమునకు దైవ సృష్టియే కారణమని బైబిలునందు వివరించబడి యున్నది.  దేవుడు చేసిన భూజంతువులలో సర్పము  యుక్తిగలదై యుండెను.   ఈ సర్పమును ఈ విధముగా చేసినది దేవుడే గదా! నాశనకరపుత్రుని సృష్టించింది కూడా ఆయనే.  కనుక దేవుడు తన సృష్టియైనట్టి నరుని పరీక్షించుటకు సౌలు వద్దకేవిధంగా యెహోవా వద్దనుండి దురాత్మవచ్చినదో అదే విధంగా ఆదాము విషయములో అతని పరిశోధించుటకు కూడా దేవుని యొక్క దురాత్మ సర్పము నావరించి క్రియ చేసినట్లుగా తెలియుచున్నది.

        దేవుడు చేసిన భూజంతువులలో సర్పమునకు యుక్తి అనుగుణము లేనట్లయితే అది కూడా ఆదామువంటి జ్ఞానము గలిగియుండి హవ్వనుద్దేశించి జాగ్రత్త! దేవుడు తినవద్దన్న పండ్లను తినకండి.  మీరు చస్తారు మనకంతా సృష్టికర్తదేవుడే కాబట్టి ఆయన ననుసరించి మనమంతా నడుచుకోవాలని హితబోధజేసెడిది.  ఇందును  బట్టి చూడగా దేవుడు నరులను ప్రత్యేకంగా పరీక్షించుటకు ఆయన పరోక్షంగా సర్పమును వాడినట్లు తెలియుచున్నది.యోబును  శోదించుటకు తన సన్నిధానమునుండియే అపవాదిని పంపెను. పైగా అతనిని శోదించుటకు అవకాశము అధికారము కూడా ఇచ్చాడు.  అదే విధంగా దావీదును పరిశోదించుటకు తన వద్దనుండి ఒక దురాత్మను సౌలు మీదకు పంపెను.

        పాఠక మహాశయులారా! యిందును బట్టి మనమాలోచిస్తే దేవుడు దగ్గర ఏడుగుణములున్నట్లు అవి ఏడు శక్తులుగా ఏర్పడినట్లును మనము గ్రహించగలము.  అవి ఏమనగా 1. పుట్టింపగలడు 2.పోషించగలడు 3.పరీక్షింపగలడు 4. శిక్షింపగలడు 5 రక్షింపగలడు 6.చంపగలడు 7.బ్రతికించగలడు.  ఇట్టి క్రియను నరులమైన మనమీద జరిగిస్తున్నట్లు మనము గ్రహించవలసియున్నది. నరుని పుట్టించిన వాడాయనే. పోషించువాడాయనే, పరిశోదించువాడాయనే కాపాడువాడాయనే. రోగమును పుట్టించువాడాయనే. రోగము నుండి కాపాడు వాడాయన.ే అట్టి రోగముతో చంపగల వాడాయనే. చనిపోయిన నరుని ఆత్మను తన సన్నిధికి చేర్చుకొనువాడాయనే.  యిందును బట్టి పౌలు దేహమును చంపువానికి భయపడకుడి! కానీ దేహమును ఆత్మను కూడా నశింపజేయు శక్తిగలవానికి భయపడమన్నాడు.

        ప్రసంగం నెం: ధ్యానము-కీర్తన 25:

        మూల వాక్యము కీర్త 23-1 ''యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు''.

        ప్రియసంఘమా!  లోకములో వున్న ఏభాష ఎట్లున్నను తెలుగు భాషలో మాత్రము కాపరము-కాపరత్వమునకు  అనేక అర్ధాలు స్ఫురింపజేసే మాటలుండుట మన మెరిగిన సత్యమే, కాపరియని కావలి కాపలాదారుడు పర్యవేక్షకుడు నడిపించువాడు వగైరా పేర్లు ఈ కాపరత్వానికి అనుకరించే మాటలున్నవి.  కాని ఇందులో కావలికి కాపరికి తేడాలున్నవి.  వారు చేయు ఈ రెండు మాటలు ఒకటిగ అర్ధాలు వివరిస్తున్నను, కాని కాపరియొక్క క్రమము వేరు, కావలి వానిలో ఉన్న క్రమము వేరు.  అందుకే కీర్తనాకారుడైన దావీదు మహారాజు ''యెహోవా నాకాపరి'' అనుటలో ఒక మహారాజు దైవాత్మను పొందినవాడు దైవ కార్య నెరవేర్పు కలిగినవాడు, దైవత్వములో ఒక ప్రధాన స్ధానాన్ని పొందినవాడు, ఇశ్రాయేలుకు ప్రత్యేకంగా దైవత్వము చేత రాజుగా అభిషేకించబడిన గాయకుడు ప్రవక్తయు, మరియు విశేషమైన సైనికబలము రధములు అశ్వాలు, రౌతులు దాస దాసీలు రాణివాసము మహావైభవముతో కూడినటువంటి ఒక గొప్ప రాజు తనకు లక్షలమంది అంగరక్షకులు వీరోచితంగా పోరాడే భటులుండగా వారినందరిని కాదని యెహోవా నా కాపరి'', అంటున్నాడు.  ఈ మాట అంటున్నటువంటి దావీదు మహారాజు ఎవరికి కాపరి? ఇతనికి కాపరి దైవుడైతే ఇతని కాపరత్వము ఎవరి కోసరమున్నది? దావీదు యొక్క పూర్వీక చరిత్ర ఏమిటి? ఎలాంటి స్థితి నుండి రాచరికానికి వచ్చాడు? దావీదు ఒకప్పుడు ఎవరు? అంటే యెష్షయి యొక్క సంతానములో ఎనిమిదవ వాడైన దావీదు బాలుడైయుండి తండ్రి యొక్క గొర్రెలను కాయుచు, గొర్రెల కాపరిగా జీవించుచున్నట్లు మనకు తెలిసిన విషయమే,

        దావీదు మహారాజు చెప్పినట్లుగా యెహోవా తనకుకాపరియని'', అనుటలో బాల్యము నుండి దావీదు యొక్క'' యెహోవా దావీదుకు కాపరిగా వున్నట్లుగా ఈ క్రింది వేదసందర్భాలను బట్టి తెలిసి కొందము.  దేవుడు దావీదుకు ఎలాకాపరియో? ముందు మనము తెలిసికోవలసిన విషయమైయున్నది.  ఈ సందర్భములో మొదటి సమూ 16:10-13 వ్రాయబడిన వేద సారాంశ వివరణను పరిశీలిస్తాము.  బాలుడైన దావీదు యెష్షయి కుమారుడు. బాల్యము నుండి యెహోవా కాపరియై యున్నట్లు గాను, అయితే ఆ విషయము దావీదు ఎరుగక వుండినట్లును సమూయేలు చేత దావీదు అభిషేకించబడిన తర్వాత దావీదు జీవితములో యెహోవా కాపరియని ఇందును బట్టి ఋజువగుచున్నది.  అంతేగాదు గొర్రెలకు కాపరిగా వున్నను, దావీదుకు యెహోవా కాపరి-మనకెంత ఆశ్చర్యము. గొర్రెల కాపరికి యెహోవా కాపరియా? ఇది నమ్మదగిన విషయమేనా? అయితే క్రియా మూలకంగా ఋజువైయున్నది.  ఎలాగు? సమూయేలు చేత అభిషేకింపబడిన దావీదునకు దేవుని యొక్క పటిష్టమైన కాపుదల ఎలాంటిదంటే బాలుడైన దావీదు సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేక బలాధిక్యత చేత పల్కిన మాట మొదటి సమూ 17:26 జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వాని చంపి ఇశ్రాయేలీయులనుండి ఈ నిందతొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్దనిలిచిన వారిని అడుగుటయు-అందుకు వారు ఇట్లు ఉత్తరమిచ్చిరి.  అదేమిటి? 17:25 లో బహుమానమును గూర్చి ఈలాగు వ్రాయబడియున్నది.  ''వానిని చంపిన వానికి రాజు బహుగ ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తె నిచ్చి పెండ్లిజేసి, వాని తండ్రి ఇంటివారిని ఇశ్రాయేలులలో స్వతంత్రులుగా జేయును'', అంతేగాకుండా మీకాలు సౌలు కూతురు.  ఈ విధంగా దావీదుకు కాపరిగా దేవుడు ఉంటూ ఆరు మూరల జానెడు ఎత్తు వున్న ఆజాను బాహుడును యుద్ధప్రావీణ్యత కల్గినవాడును శూరుడును భీకరాకారమును, చూపరులకు దడ పుట్టించు శూరత్వము గల గొల్యాతు అను పిలిష్తీయుని సంహరించుటలో దావీదు యొక్క పోరాటములో యెహోవా యొక్క కాపరత్వము యెహోవా యొక్క శక్తి అతనికి ఆవరించకుంటే, యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించకపోతే, యెహోవా ఆత్మ దావీదు లోనే ప్రత్యక్షంగా క్రియజరిగించకపోతే యెహోవా నాకాపరి అని దావీదు అనుటకు ఆస్కారము లేదు.  అంతేగాక ప్రత్యక్షంగా దేవుడు దగ్గర వుండి, అది ఆయుధము కాదు సాధనము కాదు,అది ఆయుధాల జాబితాలో చేర్చబడదు.   పొలములో పిట్టలను తరుము వడిసెలతో ఆజానుబాహుడును పిలిష్తీయులకు అంగరక్షకుడైన శూరుని రాతితో కొట్టి హతమార్చుటన్నది దావీదునకు యెహోవా కాపరి కాకపోతే అది దావీదు యొక్క బలమా? దావీదు వయస్సు ఎంత? దావీదు చేయదగిన పని యేనా? అతని ఎత్తు అతని బలము అతని స్థితిఏమిటి? నిజముగా దావీదు గొల్యాతుతో పోరాడే సామర్ధ్యము కలవాడా? అంతేగాదు దావీదు గొల్యాతును చంపిన తర్వాత దైవ జనాంగము నినాదము చేయుచు-సౌలు వేలకొలదియు దావీదు పదివేలకొలదియు శతృవులను హతము చేసిరి'', అని ఇశ్రాయేలీయులు పిలిష్తీయులను జయించి వాయిద్యయుతంగా అనగా స్త్రీలు పురుషులు  కూడా ఏకమై సంబరములతో నాట్యములతో రాజైన సౌలును ఎదుర్కొని పాడిన పాటలో దావీదుకు కాపరియైన యెహోవా ఆనందించాడు.  యెహోవా జనమైన ఇశ్రాయేలు సంబరపడినారు.  

        అయితే దావీదుకు ముందు గాడిదల కాపరియై దిక్కుమొక్కులేని స్థితిలో తాను పోగొట్టుకొన్న గాడిదలను వెతుక్కొంటూ అన్నపానీయాలు మాని గాడిదల మీద తనకున్న బఆశను బట్టి సౌలు తిరుగు బోతుగావున్న సందర్భములో దావీదుకు కాపరియైయున్న యెహోవా సౌలునకు ఒక అవకాశం ఇచ్చాడు.  అదేమిటంటే మొదటి సమూ 9:15లో సౌలు అచ్చటికి రేపువచ్చునని యెహోవా సమూయేలుకు తెలియజేసెను.  ఎట్లనగా నా జనుల మొర్ర నాయొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించియున్నాను.  కాగా పిలిష్తీయుల చేతిలో నుండి నాజనులను విడిపించుటకై నాజనులైన ఇశ్రాయేలీయుల మీద వానిని అధికారిగా అభిషేకించుటకుగాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశమునుండి ఒక మనుష్యుని నీ వద్దకు రప్పించెదను.  సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి-ఇదిగో ఇతడే నాజనులను ఏలునని చెప్పెను'', ఈ విధంగా దైవత్వము చేత ఎన్నిక చేయబడిన మొట్టమొదటి రాజైన సౌలునకు యెహోవా కాపరియైయుండి తన ప్రవక్తయైన సమూయేలు చేత అభిషేకింపజేశాడు.  యెహోవా యొక్క కాపరత్వమును సౌలు నిలుపు కోలేక పోయాడు.  అందువలన యెహోవా కాపరత్వమునుండి సౌలు తొలగిపోయి లోకస్థుడై లోకులలో కలిసిపోయినందున, దేవుడు అభిషేకించి కాపరియైయుండినను బాలుడైన దావీదుకు బాల్యంనుండి కాపరియైయుండి ప్రతి విషయములోను దావీదునకు తోడుగా ఉన్నటువంటి దావీదును సౌలుకు సంభవించిన పిలిష్తీయ యుద్ధంలో బలంగా వాడి బలమైన దైవశక్తితో నిరాయుధునిగానే పిలిష్తీయ యోధుని చంపించుట దావీదుకుదేవుని కాపరత్వము ఎంత బలంగా వున్నదో ఋజువుపరచుచున్నది.  దావీదుకు దేవుని కాపరత్వమును గూర్చి సౌలు తెలిసికొని కూడా యెహోవాను అలక్ష్యము చేసి, దావీదుమీద పగబట్టి తన అల్లుడని యోచింపక దావీదును చంపుటకు బల్లెము విసిరాడంటే ఎంత శోచనీయము.  అట్టి క్రియద్వారా దేవుని కాపరత్వము దూరము కాగా దేవుని యొద్దనున్న దురాత్మసౌలును బలంగా ఆవరించింది.  సౌలు యొక్క ప్రతికుట్రలోను దావీదుకు తోడుగా ఉంటూ దావీదును నడిపించుచు - అటు తర్వాత ఇశ్రాయేలు యొక్క పరిపాలన నుండి  సౌలును విడగొట్టి అతనిని మరణానికి అప్పగించాడు.  సౌలు ఏ పిలిష్తీయుల మీద దావీదు ద్వారా విజయాన్ని సాధించాడో అదే పిలిష్తీయుల పోరాటములో సౌలు ఒకరు చంపకుండగనే తనకు తానే మరణాన్ని కోరుకొని తన ఆయుధాల మీద తాను పడిచచ్చాడు.  యెహోవా సౌలును విడిచాడు, ఆయన కాపుదల సౌలును వదలి పోయినట్లు ఇందును బట్టి మనకు తెలుస్తున్నది.  సౌలును వదలి దావీదును వెంబడించిందంటే, ఈ విధంగా దేవుడు దావీదుకు కాపరియైనట్లు మనకు తెలుస్తున్నది.

        ప్రియపాఠకులారా!  ఈ కాపరత్వమన్నది నానా విధాలుగ ఉన్నది.  ఆత్మకు కాపరి కావాలి శరీరానికి కాపరి కావాలి గృహానికి తోటకు కాపరికావాలి.  మందిరానికి కాపరికావాలి, వాహనానికి కాపరి కావాలి.  అలాగే ఒక కర్మాగారానికి కాపరి కావాలి.  బ్యాంకి ఖజనాకు కూడా కాపరి అవసరము.  అలాగే విశేషమైన ధనసంపాదన ఉన్న వానికి మూడు విధములైన కాపుదలలున్నవి.  1.అంగరక్షకులు 2.జాగిలం 3.తన ప్రతినిధిగ ఉంచుకొన్న గృహనిర్వాహకుడు.  అలాగే లోకరీత్యా దైవ సృష్టికి కూడా కాపరి అవసరము.  ఏదేనుకు ఆదాము; దేవుని యొక్క ఓడకు-నోవహు; దైవ జనాంగానికి మోషే కాపరి.  అయితే ప్రధాన కాపరి దేవుడు, సౌలు గాడిదల కాపరి, దావీదు గొర్రెల కాపరి.  ఈ విధంగా ప్రారంభమైన ఈ కాపరత్వము దినదిన ప్రవర్ధమానమై నూతన నిబంధనలో యోహా 10:11లో ప్రభువు చెప్పిన మాట -''నేను గొర్రెలకు మంచికాపరిని'', అనుటలో నేటి విశ్వాస జనాంగమైన మనకందరికి దైవకుమారుడు కాపరి.  ఈయన మామూలు కాపరికాడు.  ఈయన గొర్రెల కొరకు తన శరీరమును తన రక్తమును ఫణముగా పెట్టి, నేటి విశ్వాసులైన మనలను తన మందగా ఏర్పరచుకొన్న ప్రధాన కాపరి.  ఈ ప్రధాన కాపరి సంఘమైయున్న గొర్రెలకు శిరస్సయి యున్నాడు.  ఇందును గూర్చి ఎఫేసీ 5:25-27 -కీస్తు సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్ధోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువ బెట్టు కొవలెనని, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను''.

        కనుక ప్రియపాఠకులారా!   ఇపుడు మనము పేర్కొన్న కాపరుల అందరిలో ఈ కాపరికి అత్యున్నత ప్రాధాన్యత ఉన్నట్లు ఈ క్రింది వేదభాగాలు ద్వారా రూఢిగా మనము తెలిసికోగలము.  ఈయన కాపరి తనమన్నది స్వలాభము స్వనీతి స్శార్ధము ఆశావ్యామోహము తోకూడినది గాక ఘనమైన ప్రేమతోను పరిశుద్ధమైన ¦గుణగణాలతోను, శారీర సంబంధము గాక ఆత్మ సంబంధమైనదియు పరలోక పట్టణములో దైవ సింహాసనము దైవ రాజ్యము అయిన యెరూషలేము అను కూటమిని చేర్చు అత్యున్నతమైన ప్రాధాన్యత కల్గినదిగా ఈయన కాపరత్వం ఉన్నది.  ఇందును గూర్చి కొలస్స 1:13-18 చదివితే ఈయన కాపరత్వము లోని ఉన్నత విలువలు, పోషింపబడే గొర్రెల యొక్క ఆత్మీయ స్థితి గాని, వాటి సంబంధమైన శారీర ఆత్మీయ విధాన వివరణ ఈ విధంగా వ్రాయబడియున్నది.  ''ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులనుగా చేసెను.   ఆయన ''అనుటలో మన నిజమైన కాపరియైన యేసు ప్రభువు యొక్క తండ్రియైన దేవుడు-గొర్రెల మందగా తీర్చబడిన మన యొక్క విశ్వాస కూడికకు యజమానియై యున్నట్లును, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రధాన కాపరియైనట్లు ఈ మాటను బట్టి మనకు తెలుస్తున్నది.  పూర్వము అంధకార సంబంధమైన ఈ లోక మర్యాద ఆచారాలు ఇరుకులు ఇబ్బందులు బంధకాలు వేదనలు, చీకటి సంబంధమైన చెర-వీటితో ముడిపడిన మరణ బంధకము నుండి విడుదల చేసి, తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్యవారసులుగ చేసినట్లును, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కల్గినట్లును, ఈ కాపరి అదృశ్య స్వరూపుడై సర్వసృష్టికి ఆది సంభూతుడు అనగా సంఘమనే గొర్రెల మందల కేగాక ఈ లోకసృష్టి యావత్తుకును ఈయన కాపరియైయున్నట్లును, ఎందుకనగా 1:16 ఆకాశ మందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవి గాని - అదృశ్యమైనవిగాని, అవి సింహాసనము లైనను ప్రభుత్వము లైనను ప్రధానులైనను అధికారము లైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను'', అనగా ఈ కాపరికి అన్నిటియందు ప్రాముఖ్యతయై, సంఘము అనే విశ్వాసుల సావాసమునకు ఈయన శిరస్సయి యున్నట్లును, అంతేగాక మరణానికి లోనయ్యే జీవులకు జీవాన్ని ప్రసాదించి, జీవింపజేయు కాపరియైయున్నట్లును, ఈయన సంఘానికి సృష్టికిని-సృష్టములకును, అంతేగాక మృతులకును అనగా మరణము ద్వారా శరీరము విడిచిన ఆత్మలకును పునరుత్ధానమైయ్యే శరీరాలకు ఈయన ఆత్మ ద్వారా పునరుత్ధానం పొందే శరీరాలకు ఈయన కాపరియైయున్నట్లును, ఈయన పరలోక భూలోకమునకు సమాధానమునకు కాపరియైయున్నట్లును, ఈయనలో ప్రధానగుణము ప్రేమతో కూడినదియు, ఈ ప్రేమ నరులను పరిశోధించుటకు నిరీక్షణతో కూడినదియు, ఈ కాపరియొక్క ప్రేమను ఈ కాపరి యొక్క నిరీక్షణకు లోనుగావాలంటే, రక్షించబడిన పాపికి ఈయన యందు విశ్వాసము మూలమై యున్నట్లు తెలుస్తున్నది.

        కనుక ప్రియపాఠకులారా!   మనకు ప్రధాన కాపరియైన యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న అత్యధిక కృపను-సంఘము అనే గొర్రెలమైన మనము ఆయన వాక్యము అనే పచ్చిక; ఆయన ప్రార్ధన అనే జీవజలముతో పోషించబడి, ఆత్మీయ ఆకలిని ఆత్మీయ దప్పిక తీర్చుకొని, ఆత్మీయ విశ్రాంతిలోకి యోగ్యులుగా జీవించాలని, ఈ ప్రధాన కాపరియొక్క ముఖ్యోద్ధేశ్యమైయున్నది.  కనుక ప్రియపాఠకులారా!   కాపరి అను మూడు అక్షరాలలో ఇంత గొప్ప మర్మము ఉన్నట్లు పాఠకులు గ్రహించెదరుగాక!

                అంశముః-గిన్నెలు

        మూలము కీర్త 23:5 నాగిన్నె నిండిపొర్లుచున్నది ఏమిటా గిన్నె? ఏ విధంగా పొర్లుచున్నది? ఈ గిన్నె యొక్క రూపాంతరము లెవ్వి?  వేదరీత్యా తెలిసికొందము.  ప్రియసంఘమా మన భూలోక జీవితములో గిన్నె అను పాత్రకెంతో ప్రాముఖ్య మున్నది.  అట్లే మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ ప్రయోజనాలకు ఆత్మీయ మైన గిన్నె కూడా అవసరమైయున్నట్లు పై కీర్తన భాగము వివరిస్తున్నది.  భూసంబంధమైన గిన్నెబజారులో దొరకుతుంది.  అయితే పరలోకసంబంధమైన గిన్నె అది దొరకు స్ధలము దాని వివరములును గూర్చి వేదరీత్యా తెలిసికొందము.         

        (1)దేవాలయ సంబంధంగా చేయబడిన గిన్నెలు మొదటి రాజులు 7:40లో హీరాము చేసిన గిన్నె (2) బాబేలుకు దోచబడిన దేవాలయ పాత్రలు. రెండు రాజు 25:15 (3) అయోగ్యపరచబడి అపవిత్రం చేయబడిన గిన్నెలు దానియేలు 5: (4) దోచుకోబడిన గిన్నెలు తిరిగి దైవార్పితములుగ ప్రతిష్టింపబడుట ఎజ్రా 1:7-10 (5) మన్నా గల గిన్నె నిర్గ 16:13 ఇవి క్రీస్తుకు సాదృశ్యము. (6) యాకోబు యాకోబు కుమారులను పరీక్షార్ధంబుగ దాచబడిన గిన్నె మరియు యోసేపు గిన్నె ఆది 44:1-2 యోసేపు ఆ మనుష్యుల గోనెలు పట్టినంత ఆహారపదార్ధములతో వాటిని నింపి కనిష్టుని గోనె మూతిలో తన వెండిగిన్నెను పెట్టుమనెను''.  (7) సానదాయకునికి పోయిన ఉద్యోగమును మరల ఇప్పించిన గిన్నె ఆది 40:11 మరియు ఫరోగిన్నె నాచేతిలో వుండెను.  ఆద్రాక్షఫలములు నేనుపట్టుకొని ఫరోగిన్నెలో వాటిని పిండి అగిన్నె ఫరోచేతికిచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పెను'', (8) నెహెమ్యా గిన్నె; నేహ 1:11లో రాజులకు పానీయములందించి పరిచర్యచేసిన గిన్నె.(9) మత్త 26:39 నా తండ్రీ! సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్దనుండి తొలగిపోనిమ్ము, అయినను నాయిష్ట ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము అని ప్రార్ధించెను'', ఇది యేసుప్రభువు గొత్సెమెనెలో ప్రార్ధనజేయు సందర్భములో దేవుని దూత చేత అనుగ్రహింపబడిన శ్రమల పూరితమైన గిన్నె (10) లూకా 22:17-20 లో ప్రభువు వాగ్దానపు గిన్నె మరియు ఆ గిన్నెయే నూతన నిబంధన.

        కనుక ప్రియసంఘమా! మన మృదయమను గిన్నె పరిశుద్ధాత్మ శక్తితో  నింపబడి నిండి పొర్లుచున్నదా? లేదా? నాగిన్నె నిండి పారుచున్నదంటూన్నదా? ఏసుప్రభువు ఆనాడు విత్తిన గిన్నె పొంగి పొర్లి ప్రవహించి సువార్త రూపమున అందరిలోను ఆవరించి నూతన నిబంధన క్రైస్తవులుగా మారుస్తున్నది.  అయితే మన సంఘమను గిన్నె యొక్క స్థితి ఎట్లున్నది? ఉజ్జీవంతో పొర్లుచున్నాధా? లేక అణగిపోయి అడుగంటి వున్నదా? ఎట్లున్నది? ఈనాడు ఏసుప్రభువు యొక్క బల్లలో పాల్గొను మనము ఎరిగి ఆయన గిన్నెలో పౌలు పొందుచున్నామని ఎరిగి ఆయన నిబంధన జనుల మను విషయాన్ని మరువ కుందుము గాక! ఆమేన్‌.        

        భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవానే, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను.  ప్రవాహజలముల మీద దాని స్ధిరపరచెను'', కీర్త 24:1-2

        ప్రియపాఠకులారా!  దైవత్వములో సృష్టిని ఐదు విధాలుగ దైవత్వమన్నది విభజించియున్నది.  అందుకే దేవునికి పంచాక్షరుడుఅనగా ఐదు అక్షరాలు కలవాడు.  ఉదా|| యేసుక్రీస్తు ప్రభువు-సృష్టికర్త ఏడు అక్షరాలు కలవాడై సృష్టికర్తనుండి విభజింపబడి అనగా సృష్టికర్త నుండి రూపాంతరము చెందిన రెండవ వ్యక్తి-రెండు అక్షరాలు కలవాడు.  సృష్టిని ఆవరించి నిర్వాహకునిగ ఉన్నవాడు.  ఐదు అక్షరాలు కలవాడు-పరిశుద్దాత్మ-ఈయన పంచాక్షరుడు. అయితే యావద్‌సృష్టిని రూపించినవాడు ఉన్నవాడు అనగా యెహోవా మూడు-అక్షరములు కలవాడు.  ఇందును బట్టి లోనే సృష్టి యావత్తు జరిగించు ఆ యొక్క ప్రధాన శక్తిమంతుడు ఆయన సంపూర్ణుడు గనుక తాను జరిగించిన సృష్టికార్యముల నన్నింటిని ఎలాంటి లోపము కొరత ఎలాంటి తారతమ్యము లేకుండ సంపూర్ణంగానే ఈ లోక సృష్టిని జరిగించినట్లు ఆది 2:1  ఆకాశమును భూమియు వాటిలో వున్న సమస్తమును ఏడవదినములోగా సంపూర్తిజేసి ఏడవదినమున విశ్రమించెను; అని వ్రాయబడిన ప్రకారము దేవుడు జరిగించిన సృష్టి కార్యములో లోకాన్ని సంపూర్ణంగ సృష్టించాడు.  అలాగే లోకములోని నరులైన మనలను సంపూర్ణులుగానే చేశాడు.  ఎలాగంటే నరుల పట్ల దేవుడు జరిగించిన సంపూర్ణ క్రియలో సృష్టిలో దేనికిని ఏలాంటి వానికిని లేనట్టి ప్రత్యేకతను నరునిలో వుంచాడు.  ఎలాగంటే సృష్టి యావత్తు  దేవుని యొక్క వాక్శక్తి దైవ వెలుగు చేత రూపించబడి మలచబడి, దేవుని పిలుపుతో స్ధిరపరచబడింది.  కాని దాని పునాది నీళ్ళే.  అలాగే ఆకాశము అందులోని సమస్త సృష్టములు కూడా సంపూర్ణంగానే సృష్టించబడినవి.  అయినను ఆకాశశక్తులకు పునాది భూమి-భూమ్యాకర్షణను బట్టి అవి అన్నియును నిలిచియున్నవి. పంచభూతాలకు ఆదారము భూమి, నీటికి ఆదారము భూమి. అందుకే రెండవ పేతురు 3:-10లో ఈలాగు వ్రాయబడియున్నది.  ''అయితే ప్రభువు దినమున ఆకాశములు మహద్యనితో గతించి పోవును, పంచభూతములు  మిక్కుటమైన వేండ్రముతో లయమై పోవును భూమిమీద నున్న సమస్త కృత్యములు కాలిపోవును'', అని వ్రాయబడుటను బట్టి ప్రభువు యొక్క రాకడలో జరుగబోవు ఈయొక్క భయంకరమైన సంఘటనలకు కారణము - సృష్టిలోని సృష్టములలో ఒక దానికొకటి వున్న సంబంధబాంధవ్యాలు  ఆకర్షణలు ఆధారాలు అన్నియును కోల్పోయి ఒకదాని నుండి ఒకటి ప్రతికూలమై దైవోగ్రతకు గురియై తమకున్న సంపూర్ణతను కోల్పోయి, అసంపూర్ణత ధరించుకొని బుగ్గిపాలై శూన్యమై పోవునని ఇందులోని భావము.

        అందుకే ప్రియపాఠకులారా!   ఈ యొక్క పూర్వార్ధ మెరిగిన దావీదు తన కీర్తనలో ప్రవచిస్తూ భూమికి సంపూర్ణతఉన్నట్లును ఇది సృష్టి యొక్క పంచాక్షరిలో ఇది ప్రధానాంశమని గ్రహించి, భూమికి సంపూర్ణత దేవుడు ఇచ్చినట్లుగ ప్రవక్తయైన దావీదు గ్రహించాడు.  కాని దీన్ని గూర్చి ఆలోచించినట్లుగ చాలామంది క్రైస్తవ జీవితములో మనము చూస్తున్న భూమి యొక్క సంపూర్ణతన్నది దైవ చిత్తము దైవ ప్రణాళిక దైవ అనుగ్రహమును బట్టియు దైవ వాక్కును బట్టి ఉన్నట్లుగ ఇందునుబట్టి మనము గ్రహించాలి.  ఆవిధంగా సంపూర్ణత్వము ధరించుకొన్న భూలోకములో వున్నను  ఆ భూమిలో ఏర్పడిన భూలోకము దానిలోని నివాసులమైన మనము కూడా దైవసంబంధులమనియు ఈ వాక్యములోని రెండవ భాగము వివరించాడు.  ఇందును బట్టి యావద్‌ సృష్టి - సృష్టిలోని యావత్తు అందరు కూడా యెహోవా సంబంధులమే.  అయితే నరనిర్మాణములో మాత్రము దేవుడు ఒక ప్రత్యేకతను రూపించినట్లుగ క్రియ జరిగించి, తన మహిమను బయల్పరచినట్లు ఆది 2:7లో చదువగలము.  ఆయన వాక్కుతో గాక హస్తక్రియామూలంగా తన ఆత్మను నరునిలో ప్రవేశింపజేసి ఉంచినట్లుగ కూడాఈ వేదభాగములో వివరించబడియున్నది.  ఇందును బట్టి సృష్టిలో దేనికిని ఏ యొక్క జడపదార్ధమునకును భూతమునకును లేని ప్రత్యేకత నరునిలో ఉంచినట్లు రూఢిగా మనకు తెలుస్తున్నది.  సమస్తము ఆయనదే, ఆయన ఇష్టప్రకారము లోక చక్రాన్ని త్రిప్పుచున్నాడు.  నరుని యొక్క జీవిత చక్రము కూడా ఆయన హస్తంలో ఉంది.  నరుని యొక్క జనన మరణ స్థితి కూడా ఆయన ఎరిగియున్నాడు.  నరుని ఆయుస్సు కూడా ఆయన హస్తంలో వుంది, నరుని అంతము ఆయన చేతిలో వుంది.  అలాగే లోకము యొక్క అంతము లోకము యొక్క వినాశము లోక మనుగడ లోక అభ్యున్నతి సమస్తము ఆయన వశములో ఉన్నట్లుగ ఇందును బట్టి తెలుసుకోవాలి.  ఇంత గొప్ప అనంత విశ్వము కేవలము వాక్కుతో సృష్టించిన సృష్టికర్తయైన దేవుడు ఏడవ దినములోగా అనగా ఆరుదినములలో సంపూర్ణము చేశాడంటే వాస్తవమునకు ప్రియపాఠకులారా!   ఇది సాధ్యమా? సాధ్యమే, ఎందుకంటే దైవ సృష్టికి అసాధ్యము - లోక జ్ఞానమునకు ఇది అయోమయము-అంతుపట్టని విషయము. ఆత్మ సంబంధ జ్ఞానమును లోకము ఎంత ప్రయత్నించినను ఎంతో పోరాడినను ఎంత తలక్రిందులైనను లోకము యొక్క తరం కాదు.  దైవ జ్ఞానమును ఆకళింపు చేసుకొనే జ్ఞానము లోకానికి లేదు.  లోకము మట్టి, లోకము మాయ.  అందుచేత దైవత్వము అన్నది మహిమను కోరునే గాని మాయలను చేయదు.  లోకమునకు మాయలున్నవి గాని దైవత్వము మహిమను కోరును.  మాయలు చేసేవాడు దైవ విరోధి, మాయజాలము చేయువాడు దైవ విరోధి.  మాయజాలము చేయువాడు మాంత్రికుడు-మాంత్రికుని యొక్క జ్ఞానమునకు కేంద్రము-అలౌకిక శక్తి అనగా దైవత్వమునకు విరుద్దమైన ఆరాధన.  ఈ ఆరాధనన్నది మాయలు జరిగిస్తుందిగాని మహిమ అంటే ఏమిటో? ఎరుగదు.  మాయ అన్నది కండ్లకు భ్రమ కల్గిస్తుంది.  కాని మహిమ అన్నది నరునికి ప్రత్యక్షతను కనబరుస్తుంది.   వేదములో దైవ జనాంగానికి దేవుడు మాయగా కనబడలేదు గాని తన మహిమలో వారికి దర్శన మిచ్చి, భూలోకములో తానేర్పరచుకొన్న వ్యక్తులు చేయవలసిన ప్రణాళికా బద్దంగా జరిగించవలసినవి, వారు పాటించవలసిన విధులు, తన పక్షంగా నిర్వర్తించవలసిన క్రియాకర్మలను గూర్చి బహిరంగంగా ప్రత్యక్షంగా వారు చేయవలసిన క్రియాకర్మలను గూర్చి మాట్లాడియున్నాడు.  ఆ విధంగా తన యొక్క కార్యాచరణను గూర్చి వివరించి తన జనాంగానికి చేయవలసిన కార్యాలను గూర్చి ఎరిగిన విషయమే, పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా నూతన నిబంధనలో తనకుమారుని ద్వారా అపొస్తలుల యుగములో పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నో మహిమలు చేసిన దేవుడు-పరిశుద్ధాత్మ కాలము దాటింది, ఇది నిరీక్షణకాలము-ఈ చివరి కాలములో ఆయన నరులకు ప్రామాణికంగా విధించిన పరిశుద్ధగ్రంధముగాను, మందిరాలలో అపొస్తలుల యొక్క పరిచర్య ద్వారా పరలోక రాజ్యసువార్త  వారు ప్రవచించిన ప్రవచన సముదాయములను గ్రంధములుగ మలిచి, సృష్టి ఏర్పరచబడిన మొదటి నాటి నుండి నేటి వరకు దైవత్వము యొక్క పరిపూర్ణతను గూర్చి బయల్పరచుచున్నను, ఇప్పుడు మనమున్నది నేర్చుకొనేది కాదుగాని సర్వము ఎరిగి మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధగ్రంధమునకు దైవత్వము సంపూర్ణత అనుగ్రహించియున్నాడు గనుక మనము ఇపుడు సంపూర్ణులుగ జీవించాలి.   బైబిలు అనెడి టిక్కెట్టు చేత బట్టి మనము రెడీగా వుండాలి-దైవత్వమును పూర్తిగా ఎరిగిన వారే సంపూర్ణులు. దైవత్వమును గూర్చి ఎరిగియు ఆయనను మహిమపరచనివారు అసంపూర్ణులు.   నేటి విశ్వాసయుగములో సంపూర్ణులకంటే అసంపూర్ణులే ఎక్కువగ ప్రబలియున్నారు.  ఇందును గూర్చి పౌలు తిమోతికి వ్రాసిన పత్రిక 3:1-9 అంత్య దినములలో అపాయ కరమైన కాలములు వచ్చును.  పైకి భక్తిగల వారి వలెనుండి దైవశక్తిని ఆశ్రయించని వారు. కృతజ్ఞత లేనివారు ద్రోహులు. విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరించెడి వారగుదురు''.

        కీర్తన 25:1 యెహోవా! నీ దిక్కునకుచూచి నా ఆత్మను ఎత్తికొనుచున్నాను''. ప్రియపాఠకులారా! కీర్తనాకారుడు పై విధంగా ప్రవచించుటలోని అర్ధమేమి? పై వాక్యములో దేవుని తట్టు చూచుట ఏమిటి? ఆత్మను ఎత్తుకోవడమేమిటి? ఆత్మను ఎత్తుకొనుటకు అది ఆకారమా? ప్రత్యక్షంగా ఆత్మకు ఏదైనను రూపమున్నదా?  ఆత్మ ఏదైనను బరువైన పదార్ధమా? ఎత్తుకోవడమన్నది ఒక వస్తువు పట్ల నే అది పరిమితమైయున్నది.  దృశ్యమైన వస్తువును ఎత్తుచున్నాము గాని అదృశ్యములో వస్తువును ఎత్తికోవడమేమిటి? అయితే దిక్కు అంటే ఏమిటి? పై విధంగా మాట్లాడుచున్న వ్యక్తి నిస్సహాయుడా? నిరాధారంతో జీవించేవాడా? బీదవాడా? లేక ఏ సహాయమునకు నోచుకోని వాడా? పై మాట పల్కిన వ్యక్తి-మహారాజు ప్రవక్త దైవత్వముచే అభిషేకింపబడినవాడు.  దైవ జనునిగాను మహారాజుగాను దేవుని చేత ఎన్నికచేయబడిన వాడు మరియు దైవపక్షంగా దైవజనాంగముతో చేరి అనేక యుద్ధాలలో దేవుని మహిమ పరచుచు విజయాలు సాధించినవాడు.  అలాంటి మహారాజు పై విధంగా ప్రవచించుటలోని పరమార్ధం గుర్తించామా? అందును గూర్చి ఏనాడైనను ఆలోచించినామా? ఆ విషయాన్ని గూర్చి ఏనాడైనను తెలిసికోవాలని ప్రయత్నించామా?

        ప్రియపాఠకులారా!  దేవుడు ఈ యొక్క భూలోకము ఏర్పరచి ఈ భూలోకానికి కొన్ని మూలలను దిక్కులను సరిహద్దులుగా ఏర్పరచి ఈ భూగోళమునకు పునాదిని అగాధజలములను పునాదులుగ అనగా అగాధముతో కూడినట్టి జలముల మీద దీనిని నిలిపియున్నాడన్న సత్యాన్ని దీనికి ముందు వ్యాఖ్యానములో తెలిసికొనియున్నాము.  ఈ విధంగా ఏర్పరచబడిన ఈ భూమికి దేవుడు కొన్ని హద్దులు ఏర్పరచినాడు.  ఈ హద్దులను లోకరీత్యా దిక్కులని అంటున్నాము. ఇందులో తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు.  ఈ నాలుగు దిక్కులు-ఈ శాన్యము ఆగ్నేయము నైరుతి వాయవ్యము నాలుగు మూలలు.  మొత్తము మీద అన్నిటిని కలిపి దిక్కులనియే చెప్పినాడు.  

        దీనిని అష్టదిక్కులంటారు.  ఈవిధంగా అష్టదిక్కులను ఏర్పరచిన సృష్టికర్తయైన దేవుడు భూమిని అనాదిగ వదలలేదు.  భూమిని తన ఇష్టాను సారంగా ప్రవర్తించే స్ధితికి వదలలేదు.  ప్రతి దిక్కునకును దిక్పాలకుడైన దూతలను కాపలాగ ఉంచినట్లుగ ప్రకటన 7:1లలో ఈలాగు వ్రాయబడియున్నది.  ''భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవ దూతలు నిలిచియుండి, భూమిమీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టుమీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొనియుండగా చూచితిని'', అనుటలో దైవ సన్నిధిలో దేవుడు ఏర్పరచుకొన్నటువంటి దిక్కుల వివరాన్ని సూచిస్తున్నది.  ఇందులో దిక్పాలకుల వివరము వ్రాయబడియున్నది.  ఈ నాలుగు దిక్కుల పరిపాలకులు దేవదూతలేగాని నరులు కాదని ఇందును బట్టి తెలుస్తున్నది.

        అయితే కీర్తనాకారుడైన దావీదు మహారాజు ప్రత్యేకంగా దేవునికి మొర్రపెట్టుచు''యెహోవా! నీ దిక్కునకు చూచి నాఆత్మను ఎత్తికొనుచున్నాను'', అనుటలో దేవునికి కూడా ఈ దిక్కులలో ఒక దిక్కు ప్రాముఖ్యమైనదిగా ఇందులోని పరమార్ధము మనకు తెలుపుచున్నది.  ఈ మర్మాన్ని దావీదు కంటె ముందుగా దేవుడు మోషేకు బయల్పరచినాడు.  ఎందుకనగా ఆది కాండము  లగాయతు ఐదు కాండముల వరకు దేవుడు మోషే చేత వ్రాయించాడు.  దావీదు మహారాజు మోషే తర్వాతివాడు.  దావీదు కంటె ముందువాడు మోషే, ఆదికాండ చరిత్ర మోషేకు బయల్పరచినాడు.  కాబట్టి దేవుని దిక్కు తానెన్నుకున్న ప్రత్యేకమైన దిక్కు ఏదో మోషేకు బయల్పరచియున్నాడు.  అలా చెప్పి యుండబట్టియే ఆదికాండ గ్రంధకర్తయైన మోషే తన ప్రధమ వేదభాగములో లిఖిత పూర్వకంగా ఇందును గూర్చి వ్రాసియున్నాడు.  ఈ సత్యాన్ని గ్రహించిన వాడు నాటి కాలములో ఎవడును లేడు.  సృష్టిలో పరమాత్మ ఆదిలో తాను ఎన్నుకొన్న దిక్కును గూర్చి ఆ దిక్కు ఏదో వివరంగా  తెలుసుకొందము.  ఈ సందర్భములో ఆదికాండ  ఒకటి రెండవ మూడవ అధ్యాయములలో కొన్నివేదరచనల ద్వారా దేవుడు ఎన్నుకొన్న దిక్కులు ఆయన చేసిన ఆశ్చర్య క్రియలు, నరజీవితములోని ప్రారంభదశ, నరుని దేవుడు రూపించిన విధానము, నరుడు దైవసన్నిధిలో అనుభవించిన శ్రేష్టమైన ఈవులు-సంపద సౌభాగ్యము ఐశ్వర్యము, దైవత్వముతో సావాసమును గూర్చి దేవుడు ఏర్పరచుకొన్న వ్యక్తి ద్వారా తెలియుచున్నది.  దేవుడు తన నోటితో పలాని అనక పోయినను క్రియామూలకంగా ఆయనకు ప్రధానమైన దిక్కుగా తూర్పు దిక్కును ఏర్పరచుకొన్నట్లు ఇపుడు మనము వేదరీత్యా నేర్చుకొందము.   దేవుడు ప్రత్యేకంగా తన జనాంగంగా ఏర్పరచుకొన్న ఇశ్రాయేలు అలాగే ఆయనేర్పరచుకొన్న ప్రవక్తలు న్యాయాధిపతులు రాజులు వగైరాలు, అలాగే దైవజనాంగము ఆచరించవలసిన ఆకట్టడలు ధర్మశాస్త్రము కూడా దైవత్వము ద్వారా అనుగ్రహించబడిందే, ఇది మనమెరిగిన సత్యము.  దేవుడు తూర్పు దిక్కు తన యొక్క ప్రాముఖ్యమైన దిక్కుగా ఏర్పరచుకొన్నట్లు  ఆయన జరిగించిన క్రియాకర్మల సాక్ష్యంగా ఈ క్రింది ఋజువులున్నవి.  ఆది 1:16లో ఆయన భూమికి వెలుగు ఇచ్చుటకు రూపించిన పెద్దజ్యోతి అనగా సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు.  ఆ తర్వాత ఆయన వేసిన పరిశుద్ధవనము తూర్పు దిక్కుననే వేయబడింది.  అలాగే నరసృష్టిలో ఆది నరుని నిర్మాణము తూర్పుదిక్కుననే జరిగించాడు.  వానికి సాటి సహాయంగా నరుని నుండి తీయబడిన నారి తూర్పు దిక్కులోనే రూపించబడింది, దైవశక్తి నీతి-పరిశుద్దతలో తూర్పుదిక్కులో ఎంతోగొప్పగా క్రియ జరిగించింది.  ఇంకను తినవద్దని నిషేధించిన ఫలవృక్షము - జీవవృక్షము తూర్పు దిక్కుయైన ఏదేనులోనే మొలిచినవని వేదరీత్యా తెలియుచున్నది.

        సృష్టిలోని మూగజీవియైన సర్పము మానవ భాషతో మాట్లాడింది కూడా తూర్పు దిక్కు.  నరజంటను సర్పము మోసగించింది కూడా తూర్పు దిక్కు.  వాక్శక్తి ఇచ్చిన అపవిత్రాత్మ ప్రవేశము కూడా తూర్పుదిక్కుననే, భూజంతువైన సర్పము ఆవేశించి మాట్లాడింది ఈ తూర్పు దిక్కుననే, మనకు ఋజువుపరచుచున్నది.  తద్వారా నరులలో జరిగిన పాపప్రవేశము కూడా తూర్పు దిక్కులోనే జరిగింది. ఈ విధంగా పాప ప్రవేశము జరిగిన తర్వాత నరులపట్ల ఆగ్రహించి వారికి విధించినటువంటి తీర్పుతో కూడిన శిక్షకు కూడా మొట్టమొదటి న్యాయస్ధానము తూర్పు దిక్కు.  ఏదేను అను ఈ న్యాయస్థాన విచారణలో నరులకు భూమికి సర్పానికి దేవుడు విధించిన శిక్షకూడా తూర్పుదిక్కున నుండి నరజీవితానికి సంక్రమించిన తీపి చేదు ఫలాలు.  అయితే దేవుడు ఎన్నుకొన్న ఈ తూర్పు దిక్కు నరులకు సంక్రమించిన ఆస్థి-పాపము దాని జీతమైన మరణము.  అయితే దేవుని యొక్క ప్రణాళిక అంతటితో ఆగలేదు.  తాను ఏ సృష్టికి ఏ నరునికి ఘోరాతిఘోరమైన తరగనటువంటి స్థిరమైనటువంటి శాపాన్ని తత్ఫలితమైన మరణాన్ని పొందినారు.  అలాగే దేవుడు నరుల పట్ల తన మనస్సులో నొచ్చుకొని సంతాపపడి, తన యొక్క నిర్ణయాన్ని మార్చుకొని ఇంకొక నిబంధన అనగా పాతనిబంధన కాక నూతన నిబంధన అనేటటువంటి రెండవ ప్రణాళిక అంటే తూర్పు దిక్కుననుండి నరుల రక్షణార్థము నరులకు సంక్రమించిన శాపముతో కూడిన నిత్యనరకాగ్ని గుండముతో కూడిన మరణము నుండి విమోచించుటకు మరొక ప్రణాళిక రూపించి, ఈ ప్రణాళికను బట్టి దేవుడు జరిగించిన క్రియాకర్మలను గూర్చి వివరంగా తెలిసికొందము.  ఈ సందర్భములో మత్త 2:1-2 చదివితే దేవుడు తాను నూతన నిబంధనలో ఏర్పరచిన రక్షణార్ధమైన ప్రణాళికను గూర్చిన వివరాన్ని కూడా చదువగలము.  అనగా నాడు మొదటి నిబంధనలో నరులకు విధించిన ఘోరాతిఘోరమైన నరకాగ్ని శిక్షనుండి ఆయనేర్పరచుకున్న నూతన నిబంధన ప్రణాళిక ప్రకారము నూతన నిబంధనలో ఆయన ప్రణాళికలో దిక్కు కూడా తూర్పే.  ఇందును గూర్చి మత్త 2:1-2 లో మనము చదువగలము.  ఇందులోని వివరమేమనగా రాజైన హేరోదు దినములలో దేవుడు యేసు అను పేరుతో జన్మించిన తర్వాత ఆయనను దర్శించుటకు మొట్టమొదటి వ్యక్తులు తూర్పు దేశపు జ్ఞానులు.  వీరు తూర్పు దేశపు జ్ఞానులేగాని వారి పేర్లు వ్రాయబడలేదు.  వారు జ్ఞానులు అంతేగాక ఆ జ్ఞానులకు జ్ఞానోదయము కల్గించిన దైవకుమార నక్షత్రము కూడ తూర్పుదిక్కునే కనబడింది'', అని చదువగలము.  ఇందును గూర్చి జ్ఞానులు హేరోదుతో మాట్లాడిన మాటలలో ''యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి, ఆయనను పూజింపవచ్చితిమి'', అనుటలో ప్రియపాఠకులారా!  జ్ఞానులు తూర్పు దేశస్థులు, జ్ఞానులు చూచిన నక్షత్రము తూర్పు దిక్కుననే పుట్టింది.  నూతన నిబంధనలో మొట్టమొదటిగా పరిశుద్ధ ఆరాధన జరిగింది కూడా తూర్పే, ఈ ఆరాధన ప్రారంభోత్సవం జరిపిన వారు ముగ్గురు జ్ఞానులు తూర్పువారే, ఇందును బట్టి సత్యమైన ఆరాధన నిజమైన ఆరాధన జరుగుటకు మూలము తూర్పు దిక్కు అనగా నేటి మన ఆరాధన తూర్పు దిక్కుననుండి వచ్చింది గాని, మరి ఏ దిక్కునుండి వచ్చింది కాదు. కాబట్టి ఆదిలో దేవుని యొక్క  ప్రేమ ఆయన ఆశీర్వాదము ఆయన సాఫల్యములో వారసత్వము పునాది రాయియైన ప్రభువును గూర్చి లోకము గొప్పగా శ్లాఘిస్తుండగా లూకా 2:4-7 ఆయన జననమును గూర్చి వ్రాసిన విదానాన్ని గూర్చి ఆయన ఈ లోకములో ప్రసవించబడిన స్థలమును గూర్చి వ్రాయబడినట్లు యోసేపు ప్రజాసంఖ్యలో నమోదు చేయుటకు చేసిన ప్రయాణమును గూర్చి ఆ ప్రయాణములో పొందిన చేదుఅనుభవాలను గూర్చి, నిండు చూలాలైన మరియమ్మ యొక్కప్రసవ సమయములో లోకము ఆమె పట్ల చూపినటువంటి నిరాదరణ నిస్సహాయత నిరాశ్రయత వికృత వాతావరణము, కనీసము మంత్రసానిగాని ప్రసవ కేంద్రము గాని, ప్రసవ సమయములో చికిత్సకు సహకరించే వైద్యుడుగాని ఆ దినాలలో లేకపోవుట ఇవన్నియును చదువుచుంటే, నాడు క్రీస్తు పుట్టిన దినమును ఈనాడు లోకములో రాజులు ప్రధానులు వేదాంతులు పండితులు సహస్రాధిపతులు రాజ్యపరిపాలనచేసే మంత్రులు ప్రధానులు వారి యొక్క చరిత్రలుతో పోల్చుకుంటే సృష్టికంతకును ఆదియైన దైవ కుమారుని పుట్టుక దినము ఎంత హీనత్వములో ఉందో ఒకసారి మనము ఆలోచించాలి.

        ప్రియపాఠకులారా!  ఇపుడు మనము చదివిన ఈ వేదభాగములో ప్రధాన ఘట్టములో కొన్ని అమూల్యసత్యాలను తెలిసికొందము.  మొట్టమొదటగా కన్యమరియ యొక్క భర్తయైన యోసేపు తన యొక్క పౌరసత్వము పోగొట్టుకోక లోకరీత్యా నరులు పాటించు ప్రభుత్వచట్టానికి లోబడి విధేయించి, తన పౌరసత్వ విలువను హక్కును గూర్చి ఆసక్తిగల వాడై పట్టుదల గలవాడై నిండు చూలాలైన తన భార్య ఏమైనను నాటి వాతావరణములో సరియైన ప్రయాణ సాధనము వాహనము లేకపోయినను, అంటే ప్రియ పాఠకులారా!   నాటి దినములలో నేటి దినములలో వలె మోటారుకార్లు బస్సులు విమానాలు సాంకేతిక పరమైన అనేక ప్రయాణ సాధనాలు లేకపోయినను, నాటి కాలపరిస్ధితిని బట్టి సరియైన మార్గాలు రోడ్లు సరిలేనప్పటికిని, నాడు నరులు ప్రయాణించేటటువంటి వాహనాలలో వేగంగా వేళ్ళేలి వున్నవి. నిదానములో వెళ్లెలి ఖరీదైనవి వున్నవి.  అంతస్థులను బట్టి తమ విలువలు గౌరవాలు నిలుపుకొనే ప్రయాణ సాధనాలున్నవి.  అంటే ఒంటెలు గుర్రపు రధాలు ఏనుగుల అంబారి, ఖరీదైన గుర్రాలు కల్గినటువంటి వస్తువాహనాలు-నేటి కార్లు విమానాలకంటె అత్యధిక అలంకారాలతో అనగా వెండిబంగారులతో మలచిన రాజభోగాలతో అలరించబడే సకల సదుపాయాలుతో భూమిపై వెలసిన వాహనాలు రధాలు ఆదినాలలో వున్నవి.  ఎందుకనగా నాటి యెరూషలేము అత్యధికంగా గొప్ప పట్టణమైయుండి దైవ కుమారుడైన క్రీస్తును ఎరుగని స్థితిలో దైవకుమారుని తెలిసియు ఆయనను మహిమపరచక ధర్మశాస్త్రమును నామమాత్రంగా పాటించుచు, దైవ కుమారుని జననము ఎలాంటిదో ఏ విధంగా వుంటుందో పాతనిబంధనలో యెషయా ఇర్మియా ప్రవక్తల ప్రవచనాలను గూర్చిన వివరాలు తెలిసియు యెరూషలేము మనోనేత్ర అంధకారముతో దైవత్వమునకు దూరంగా ధర్మశాస్త్రముసుగును ధరించుకొని, నానావిధహేయ కార్యాలతో దైవత్వము పట్ల అలక్ష్యవైఖరిని ప్రదర్శించుచు నాటి యెరూషలేము నాటి పరిపాలన దాని జనాంగము అందులోని ప్రజలు ఒకటేమిటి? సమస్తమైన జనాంగము లోక వ్యామోహములో తమ పౌరసత్వము నిలుపుకొనుటకు ప్రజాసంఖ్యలో వ్రాయబడుటకు యెరూషలేము సంఖ్యలో తమ ముద్రపడాలని  యోసేపు కూడ తన ప్రయాణాన్ని వేగముతో కూడింది కాక అలంకారాలతో కూడిన వాహనము గాక రాజులు ఎక్కే వాహనము గాక సామంతులు ప్రయాణించే సకల విధ సౌఖ్యాలు సకల విధ అలంకారాలతో అలంకరించబడిన వాహనాలతో గాక నిరాడండరమును ఏ విధమైన అలంకారాలు లేనిదియు, అన్ని జంతువులలో హీనంగా ఎంచబడే గార్దబము మీద ఆయన నిండు చూలాలైన భార్యను ఎక్కించి తాను కాలినడకన ప్రయాణించినట్లుగ వేదములో లేదు.  ఇక్కడ రెండు సత్యాలు-దేవుని యందు భయభక్తులు గల్గి ఆయన కృపలో ఆయన యందున్న ఆత్మీయుడు ఎలాంటి భోగభాగ్యాలు అలంకారాలు సాధనాలు ఆధిక్యతలు కోరడని యోసేపు చరిత్రలో మొట్టమొదట మనము నేర్చుకోవాలి.  2వ దిగ దైవ కుమారునికి మాతృకగా దైవత్వము చేత నిర్ధారించబడిన మరియ తానెక్కిన గాడిదను గూర్చి ఆమె వీషన్మాత్రము సిగ్గుపడలేదు.  ఎందుకనగా తన భర్త నడిచే మార్గములో నిండు చూలాలు నడువ లేకపోయినను ఆ మార్గములో ఒక మూగ జీవి తనను మోయుటన్నది తన భాగ్యంగా ఎంచి, ఎన్ని మైళ్ళు ప్రయాణించిందో గాని మొత్తము మీద వారి ప్రయాణము. తామున్న గ్రామమునుండి పట్టణమునకు వెళ్ళినట్లును, ఆ గ్రామమునకు సంబంధించిన గలిలయలోని నజరేతు నుండి యూదయాలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళినట్లుగ లూకా 2:5లో వ్రాయబడియున్నది.  ఆ విధంగా వారు ఆ ఊరు చేరిన తర్వాత ఆమెకు ప్రసవ దినములు పరిపూర్తియైనందువల్ల తన తొలిచూలు కుమారునికని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్ధలము  లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను''.

        ప్రియపాఠకులారా!  ఇచ్చట అన్యుని సంగతి ఎలాగున్నను క్రైస్తవునికే చాలా అనుమానాలున్నవి.  తొలిచూలు కుమారుడు అంటే నేటి క్రైస్తవులలో మరియమ్మకు ప్రభువు పుట్టిన తర్వాత కూడా బిడ్డలున్నారనే వాదన క్రైస్తవులలో వ్యాపించి ఉంది.  మరియమ్మ యొక్క మలిచూలు బిడ్డలెవరో తెలిసికోవాలంటే ఒక్కటే మార్గము.  ఆ తొలిచూలు కుమారుని జనన విధానము తెలిసికోవాలి.  ఆమె క్రీస్తు ప్రభువును ఎక్కడ కనింది? దీనిని గ్రహించారా?  యోసేపుతో దావీదు ఊరికి వెళ్ళెటప్పుడు మార్గములో కనిందా? ఆమె ఎక్కిన గాడిద మీదనే మార్గమధ్యములో ప్రసవ క్రియ జరిగిందా? సత్రములో స్ధలము లేదు గదా! సత్రములో కన్నట్లు వ్రాయబడలేదు.  పోనీ మనము తెలిసికొన్న మూడు విధానాలలో పశువుల తొట్టిలో పుట్టినట్లు వ్రాయబడలేదు.  ఇక్కడ వ్రాయబడిన విషయమంతయును మరియు కుమారుని కని సత్రంలో స్ధలము లేక పోవుట వలన పశువులతొట్టిలో పరుండబెట్టెను''.  ఇచ్చట వివరించబడిన అంశాలు లూకా 2:11-14 దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు.  ఈయన ప్రభువైన క్రీస్తు.  దానికిదే మీకు ఆనవాలు.  ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని చెప్పుటలో ప్రియపాఠకులారా!  నిజంగా పశువుల తొట్టిలో ప్రభువు పుట్టిన వర్తమానము గొర్రెల కాపరులకు దైవ సందేశాన్ని వివరించిన దేవదూతతో కూడ ఉండి పల్కిన మాట - ''సర్వోన్నతమైన స్ధలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగును గాక! అని దేవుని స్తోత్రము చేయుట'', ఈ నావాదము వాస్తవానికి ప్రభువు పుట్టిన స్ధలములో చేయాలి.  కాని గొర్రెల కాపరుల దగ్గర చేయుట - ఇది క్రీస్తు జననమును గూర్చిన వివరము. ఇపుడు మనము చదువుకొన్న వేదభాగములో క్రీస్తు పలాని చోట పుట్టినట్లును, మరియమ్మ పలానిచోట ప్రసవించినదనుటకు దాఖలాలు లేవు.  అయితే ఆయన ఎక్కడ పుట్టినాడు? ఆయన చరిత్రకు పునాది స్థలమేది? ఆయనను వెల్లడిపరచేఆ పట్టణము పేరేమిటి? దానికి ఆ పేరు ఎలాగువచ్చింది? నవమాసములు గర్భమున మోసింది కన్నెకయైన మరియమ్మా! లేక సృష్టికర్తయైన దేవుడా? ఎవరులేక పోతే ఏలాగుపుట్టినాడా? ఏ స్ధలములో ఏతారీఖున ఏ సంవత్సరము ఏ దినమున పుట్టినాడు? ఆయన పుట్టిన స్ధలములో జరగని సంఘటనలు ఆయన జనన సంఘటనలు ఆయన జనన వార్త విన్పించిన స్ధలములో జరిగినట్టి దైవనిగూఢ సత్యములను గ్రహించవలసియున్నది.  ఇందును గూర్చి వివరంగా తెలిసికొందము.

        ప్రియపాఠకులారా!  పురుషుని ఎరుగని కన్యకయైన మరియమ్మ నవమాసములు గర్భమును మోసింది.  ఇది లోక సహజము.  అనగా లోకములో సహజంగా స్త్రీలు గర్భంధరించి నవమాసములు మోయుటన్నది మన మెరిగిన సత్యమే, మరియమ్మ లోకము ద్వారాను శరీరము ద్వారాను జరిగిన గర్భమన్న దాఖలాలు లేవు.   మరియమ్మ భర్త యోసేపు- యోసేపుకు పుట్టినట్లు దాఖలాలు లేవు.  మరియమ్మకు యోసేపు భర్తగా ఉండవచ్చునేమోగాని తొలిచూలు బిడ్డకు జన్మనిచ్చే యోగ్యత యోసేపుకు లేదు.  అంటే కన్యకయైన మరియమ్మ శరీర ఆత్మలను ఆమె యొక్క కన్య జీవితమును గుత్తకు తీసుకొన్న శక్తి వేరు - ఆ శక్తి యెషయా ప్రవచనములో వ్రాయబడియున్నది.  7:14 కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరుపెట్టును'' అని వ్రాయబడిన ప్రకారము దేవుని సన్నిధిలో క్రీస్తు జననానికి ఎన్నిక చేయబడిన కన్యక మరియమ్మ అని మనకు రూఢిగా తెలుస్తున్నది.

        ప్రియపాఠకులారా!   లూకాలో వ్రాయబడిన ఈ సువిశేషణములో 2:6లో వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండినట్లున్నది గాని ఆమె పురిటి నొప్పులు కలిగెనని ఆమె ప్రసవ వేదన పొందినట్లు వ్రాయబడలేదు.  ఎందుకంటే ఆమె పాపమెరుగని కన్య యొక్క గర్భము.  దైవత్వము చేత శారీర బీజము వేయబడిన గర్భము.  దైవ ప్రణాళిక నెరవేర్పునకు సాధనంగా ఏర్పరచుకొన్న గర్భము.  నూతన నిబంధనగ్రంధ నెరవేర్పునకు ఎన్నుకోబడిన గర్భము'', అట్టి గర్భము ధరించిన స్త్రీకి శిశుప్రసూతి జరగాలంటే మానవ ప్రమేయమన్నది అనవసరము.  ఎలాగంటే మరియమ్మకు ప్రసవ కాలములో లోకరీత్యా సహాయపడిన పురుషుడుగాని స్త్రీగాని వేదములో లేనట్లే, వైద్యులు లేరు మంత్రసానులు లేరు, ఇతరత్రా బంధువర్గము సహాయ సహకారాలు కూడా లేవు.  ఆమె కన్నట్లు గానే వ్రాయబడివుంది.  కన్యక గర్భము ధరించి కుమారుని కనుటన్నది లోకరీత్యా శరీర సంబంధమైతే శరీరులు ఆమెకు సహకరించే వారే, శిశువును ప్రసవించేటపుడు సకల పరిచర్యలు బరువుబాధ్యతలు ప్రసవకాలములో చేయవలసిన సమస్తకార్యాలు బాధ్యత వహించిన ఎవరైనను ఒక వ్యక్తియొక్క సహకారం కావాలి.  వ్యక్తి సహకారం లేకుండ శిశు ప్రసూతి జరుగుటన్నది కష్టసాధ్యము.  ఇందును గూర్చి లూకా 9:35 ఈయన నేనేర్పరచుకొనిన నాకుమారుడు ఈయన మాట వినుడని యొక శబ్ధము ఆమేఘములో నుండి పుట్టెను'', ఇందును బట్టి కన్యకయైన మరియమ్మకు పుట్టిన ఆ శిశువు దైవత్వము చేత నియమితుడైన వాడని లోకసంబంధికాడని, దైవసంబంధియే అని ఋజువగుచున్నది.  అటు తర్వాత మత్త 3:17లో ఈలాగు వ్రాయబడియున్నది. ''ఇదిగో, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని యొక శబ్ధము ఆకాశము నుండి వచ్చెను''.

        ప్రియపాఠకులారా!  ఈ రెండు ప్రవచనాలు కన్యకయైన మరియ యొక్క ప్రవచనములోని ప్రత్యేకతను వివరిస్తున్నవి.  మొదటిది కన్యకయైన మరియమ్మ గర్భములో యేసుక్రీస్తు జన్మించిక మునుపే దేవుడు తన కుమార జన్మకు ఆమెను ఎంపిక జేసి ఆమె ద్వారా తనకుమారత్వమును లోకానికి బహుకరించాలన్న ప్రణాళిక కూడా వుందని తెలియుచున్నది.  ఈయనను నేను కనియున్నాను'', అని దేవుడు చెప్పిన మాటను కూడా మనము చదువగలము.  కనుక దైవాత్మ కన్యలో క్రియజరిగించుటను బట్టి ఆమె లోకధర్మము చొప్పున నవమాసములు గర్భమున ధరించి ప్రసవించింది ఆమె కాదు దేవుడే - ''లోకము దేవునికిని - దేవునికి లోకము, ఆత్మ శరీరములు పరస్పరము విరోధములై యుండబట్టి దైవత్వములోని పై మర్మాన్ని లోకము గ్రహించక బెత్లెహేములో పుట్టినాడు,  సత్రములో పుట్టినాడు, పశువుల తొట్టిలో పుట్టినాడు'', అని నానారీతులుగ అనుమానిస్తున్నారు గాని, ఆయన జరిగించిన బలియాగ క్రియలో ఆయన తన ఆత్మను ఆకాశమునకును భూమికిని సంబంధించక మధ్యాకాశములో తండ్రికి అప్పగించినట్లును, అదే విధముగా ఆయన జన్మ కూడా జరిగింది.  ఆయన నరశరీరుడు కాదు.  నరుని యొక్క ఆత్మ కాదు.  ఆయన శరీరము భూసంబంధమైతే భూమి ఆయనకు తల్లిగా పరిచర్యచేసేది.  కాని లోకము ఆయనకు స్ధలము ఇవ్వలేదు.  ఇట్టి విషాద కరస్ధితిలో దైవ కుమారుడు జన్మించుటలో వున్నటువంటి పరమసత్యాన్ని ఈ సందర్భములో తెలిసికోవాలి.  మత్తయి 2:5లో ఈలాగు వ్రాయబడియున్నది.  యూదయ దేశపు బెత్లెహేమా! నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవుకావు.  ఇశ్రయేలు అను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును'', అని ప్రవక్త ద్వారా వ్రాయించిన ప్రవచనమును బట్టి ఆయన జన్మించిన స్ధలము యూదా దేశపు బెత్లెహేమే!  అంత మాత్రమే కాదు. లూకా 2:8లో ఈలాగు వ్రాయబడియున్నది.  '' ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారికి దర్శన మిచ్చి - ''ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను.  ''దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడని పల్కిందే గాని, ఏ విధంగా పుట్టినాడో? ఎందుకు పుట్టినాడు? ఆయనకు జన్మనిచ్చిన తల్లి యొక్క పూర్తి భోగట్టాగాని జన్మించిన బిడ్డయొక్క వివరాన్ని ఆ గొల్లలకు తెల్పుచు నేడు దావీదు పురములో రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు.  ఈయన ప్రభువైన క్రీస్తు'', ఇక్కడ కూడా మరియమ్మ  కన్నదని  గాని కన్యకయైన మరియ సత్రములో ప్రసవించిందని గాని దేవదూత చెప్పలేదు.  దేవదూత చెప్పింది-ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక తొట్టిలో పండుకొని యున్నట్లుగ చెప్పిందే గాని ఆ పశువుల తొట్టి పేరు చెప్పలేదు.  పూర్తి విలాసము ఆ సువార్తమానము దూత వినిపించినపుడు దేవుని మహిమ ప్రభావము దైవశక్తి, పరలోక దూత సైనిక సమూహము ఆ దూతలో కూడా ఉన్నటువంటి దూత సముదాయము మరియమ్మతో ఉన్నట్లుగాని పశువుల తొట్టి దగ్గర యోసేపు సమక్షములో ప్రసవించిన బిడ్డచుట్టు ఉన్నట్లు ఇందులో వ్రాయబడలేదు.  పరలోక సైనిక సమూహము దూత కూడ ఉండి సర్వోన్నతమైన స్ధలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని  దేవుని స్తోత్రము చేయుచున్నట్లున్నదే గాని, పశువుల పాకలో ఉన్న బిడ్డచుట్టు చేరి ఆ మాట అన్నట్లుగా కూడా వ్రాయబడలేదు.

        ప్రియపాఠకులారా!  ఇంతకును క్రీస్తు యొక్క జననములో మనము తెలిసికోవలసిన దైవ నిగూఢ రహస్యమేమిటంటే, ఆయన పుట్టిన స్ధలము జనుల మధ్యలో భూమికి ఆకాశమునకు సంబంధములేని స్ధితిలో ఆమె యొక్క జననము జరిగినట్లు తెలియుచున్నది.  ఈయనను కనింది నరులకు కూడ తెలియలేదు.  ఈయన దైవకుమారుడేగాని, మరియు విమోచకుడుగా దైవత్వము చేత ఏర్పరచబడిన వాడుగాను, పేదరికాన్ని అనుభవించుటకు ఈలోకానికి వచ్చాడు.  భూలోకములో వ్యాపించిన పాపము దాని నిత్య మరణ శిక్షనుండి తప్పించుటకు దేవుడేర్పరచుకొన్న యేసుక్రీస్తు రూపము అత్యంత ప్రాధాన్యత సంతరించుకొన్నదని మనము తెలిసికోవాలి.  ఈయన పుట్టినది ఆకాశములో ఈ నిత్యశక్తి తూర్పు దేశపు జ్ఞానులు తెలిసికొన్నారు.  వారు అభ్యసించిన నక్షత్ర శాస్త్రము వారికి క్రీస్తు యొక్క జననమును ఆకాశములో బయల్పరచింది.  తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి, ఆయనను పూజింపవచ్చితిమి'', అనుటలో ఆయన మరియమ్మ గర్భములో శిశువుగా అవతరించవచ్చునే గాని, ఆయన ఆకాశములో దేవుని యొక్క మహిమతో సృష్టించబడిన ఆత్మీయ కుమారుడు దైవ కుమారుడు దేవుడేర్పరచుకున్న కుమారుడు.  సకల నరులను మరణము నుండి జీవములోని నడిపించు సమర్ధుడు.  ఇది దైవ ప్రణాళిక మర్మమైయున్నది.  క్రీస్తు యొక్క జననమన్నది ఈ విధంగా లోకములో ఏర్పడింది.  అయితే ఈనాడు ఆయన ప్రతి పాపి యొక్క హృదయములో జీవిస్తున్నాడు.  మరియమ్మ తొమ్మిది నెలలు గర్భమున ధరించింది.  ఈనాడు ప్రతి విశ్వాసి ఆడమగ అను తేడా లేకుండ ప్రతి యొక్కరు క్రైస్తవ్యమును స్వీకరించిన ప్రతి విశ్వాసి ఆయనను గర్భము ధరించి, ప్రతినిత్యము మోస్తూ సువార్త రూపములో ఆయనను ప్రసవిస్తున్నాడన్న సత్యము ప్రతి యొక్కరు ముఖ్యంగా గ్రహించాలి.  మరియమ్మ గర్భమే యెహా 1:14 ఆ వాక్యము శరీర ధారియై, కృపా సత్యసంపూర్ణుడుగా మన మధ్య నివసించెను'', అని వ్రాయబడుటను బట్టి మరియమ్మ గర్భములో నవమాసములు నివసించి, పరిశుద్ధాత్మ శక్తితో నరా కృతిని ధరించి ఈ లోకములో దైవత్వము చేత ప్రసవించబడింది.  అలాగే మనము కూడ సువార్త గర్భమున ధరించి ప్రసవ వేదన పడు దినములు ఆసన్నమైంది.  మీ విషయమై నేను ప్రసవ వేదన పడుచున్నానని పౌలు అంటున్నాడు.  సువార్త ప్రకటించక పోతే నాకు శ్రమ.

                యెహోవా దిక్కు

        25వ కీర్తన (కాపుదల కొరకును క్షమాపణ కొరకును ప్రార్ధన) యెహోవా! నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తికొనుచున్నాము.  ప్రియపాఠకులారా!  యిందులోని పరమార్ధాన్ని మనము తెలిసికోవలసియున్నది.  మొట్టమొదటగా యెహోవా! నీ దిక్కునకు చూచి, ''ఆయన దిక్కు ఏది? క్రైస్తవ జీవితంలో వున్న మనము ఎప్పుడైన ఆయన దిక్కును ఎరిగి యున్నామా?  లోకరీత్యా భూగోళ శాస్త్రమును బట్టి భూమియొక్క దిక్కులను మన మెరింగి యున్నాము దాని ఎల్లలు కూడా మనము నడిపియున్నాము.  ఇది భూగోళ సంబంధమైనది.  లోక సంబంధమైనది.శారీర సంబంధమై యున్నది.

        అయితే భూమిని లోకమును సృష్టించిన సర్వశక్తిగల దేవుడైన యెహోవా దిక్కు ఏదో ఒక్క ఆత్మకు తప్ప శారీరమున కది అగమ్యము.  దేవుని దిక్కు ఏదో దావీదు మహారాజు తెలిసికొనియున్నాడు.  ఈ సందర్భములో మత్త 2:2 ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడవున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి.  హేరోదు రాజు అతని వారందరును కలవరపడిరి.  యిందులో తూర్పు దేశపు జ్ఞానులు తూర్పుదిక్కున నక్షత్రము ఆయన నక్షత్రంగా జ్ఞానుల చేత వివరించబడింది.  తూర్పు కాబట్టి యెహోవా యొక్క దిక్కు తూర్పే.  ఆయన తూర్పు దిక్కున వుండబట్టే లోకమునకు వెలుగునిచ్చు సూర్యుడు తూర్పున నుండియే ఉదయిస్తున్నాడు.  ఆయన తూర్పు దిక్కున వుండబట్టే తూర్పుదేశములోని వారికి తన కుమార జనన-మర్మమును ఆకాశములోని నక్షత్ర మూలంగా వివరించాడు.  తూర్పు దిక్కున పుట్టిన ఆ నక్షత్రాలు కూడా ఆయనే.

        కనుక ప్రియపాఠకులారా? ఈ కీర్తనలో దావీదు మాట్లాడుతున్న  రీతిని బట్టి నాదేవా! నీయందు నమ్మికయుంచియున్నాను. ''అనుటలో కూడా తూర్పు వానినిగా ఎంచమని ప్రాధేయపడి అభ్యర్ధిస్తున్నాడు.  ప్రియపాఠకులారా!  యెహోవా తూర్పు దిక్కు వాడని దావీదు కనుగొనబట్టే దావీదు వంశము  యూదా గోత్రములో దేవుడు కుమారత్వమును పొంది జన్మించినట్లు మనము గ్రహించవలసియున్నది.  యిందును బట్టి దావీదు వంశము యూదా గోత్రమన్నది.  తూర్పు దేశపు సంబంధులు.  కనుకనే తూర్పున పుట్టిన ఏసు యొక్క నక్షత్రము ధరించియున్న మనము తూర్పువారమేగాని పడమటివారము కాము. ఎట్లంటే దిన దినము ఏ విధంగా సూర్యుడు ఉదయిస్తూ ప్రకాశిస్తున్నాడో ఆ విధంగా క్రీస్తులో బాప్తిస్మము పొందిమనము దిన దినము క్రీస్తు యొక్క ఆత్మచేత మెరుగుపరచబడినవారమై నూతనత్వమును పొంది దైవత్వాన్ని మహిమపరచబడు వారముగా దేవుని చేత క్రీస్తు మూలంగా నియమించబడి యున్నాము.  మనమెంత మాత్రము పడమటి వారము కాము.  పడమటి వారు అనగా అస్తమించినవారు. ఆత్మీయంగా చచ్చినవారని అర్ధము.  కనుక ఈ మార్మాన్ని గ్రహించి దావీదు మహారాజు తన ఆత్మను తూర్పు దిక్కునకే ఎత్తుకొనుచున్నట్లును తూర్పు దిక్కున వున్న యెహోవా యందే తన నమ్మిక యుంచినట్లును తనను సిగ్గుపడ నియ్యక తన శతృవులకు భయపడనీయక తనను గూర్చి శతృవులకు సింహస్వప్నమగునట్లు అనగా భయకంపితులగునట్లుగా మరియు శతృవులే సిగ్గుపడునట్లుగా చేయమని దావీదు ప్రార్ధన.                రెండవదిగా '' నా శతృవులను నన్ను గూర్చి ఉత్సాహింపనియ్యకుము.''  ప్రియపాఠకులారా!  ఒక ఆత్మ పూర్ణుడైన విశ్వాసి ఆత్మలో పరిపూర్ణత పొంది ఆత్మ వశుడైయున్నంత కాలము అట్టి విశ్వాసిని గూర్చి దేవుడు ఉత్సహిస్తాడు.  అయితే అట్టి విశ్వాసి పతనావస్ధలో దిగజారినపుడు శతృవు ఉత్సహిస్తాడు. యిందుకు ఉదా|| సంసోను చరిత్రను తీసికొందాము.  సంసోనును దైవాత్మ ఆవరించి క్రియజరిగిస్తూ సంసోను యొక్క జననము దేవునికి ప్రతిష్ఠ చేయబడినందున సంసోను ధాటికి శతృవన్న సమస్యయే లేకుండా జీవించాడు.  మరియు ఏ ఆయుధము సాధనము వాహనము లేకయే సంసోను తన శతృవులైన సాతాను సమాసపు వారైన ఫిలిష్తీయులతో పోరాడి శతృవులకు సింహస్వప్నంగా తయారయ్యాడు.  తన్నావరించియున్న ఆత్మశక్తిని బట్టి సంసోను ఉత్సహిస్తూ శతృవులతో పోరాడినాడు.  కాని అట్టి ఆత్మవశుడైనట్టి దైవ ప్రతిష్ఠితుడు లోకమువైపును లోకములోని స్త్రీ విగ్రహము వైపు చూచి తన పురుషత్వాన్ని తన దైవత్వాన్ని తన్నావరించియున్న దేవుని ఆత్మ యొక్క విలువను కాలరాచి స్త్రీలోలుడై ఆత్మ వరమును పోగొట్టుకొని అంధుడై బంధీయై బానిసయై, అన్య దేవతాలయమైన దాగోను ఆలయంలో తన శతృవులైన ఫిలిష్తీయుల కంటికి ఎగతాళిచేయబడి అనగా వినోదించదగిన లేక హేళన చేయబడు సాధనంగా వాడబడినాడు.

        అదే విధంగా ఇశ్రాయేలు రాజైన సౌలు జీవితంలో గాడిదలు కాచుకొను సౌలును దేవుడు రాజుగా చేశాడు.  అయితే సౌలు తన రాచరికాన్ని నిలబెట్టుకొలేక దైవత్వాన్ని విసర్జించి అనగా తన ఆపద సమయంలో దేవుని విచారింపక సోదెకత్తెను విచారించి సోదెకెత్తెయొక్క మాటలను నమ్మి మరణానికి గురియై ఫిలిష్తీయుల దృష్టికి ఆట వస్తువుగ తన తలను కోట గుమ్మానికి విలాస వస్తువుగ అతని తల వాడబడింది.  అట్లే ఇశ్రాయేలు విషయంలో దేవుని పరిశుద్ధ జనాంగమైన ఇశ్రాయేలు దేవుని మాట విన్నందుకు దేవుని యందు లక్ష్యముంచనందు వల్ల దేవుడు వారిని ఐగుప్తీయుల చేతికిని ఫిలిష్తీయుల చేతికిని అప్పగించినపుడు ఇశ్రాయేలు జనాంగముపై తమ విరోధులు జయోత్సాహంతో నానారీతులుగా వారిని హింసించి కించపరిచినట్లు వేదంలో చదువగలము.  ఇందుకు కారణము ఆత్మీయ లోపమే.

        యిక నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గు నొందడు. ''ప్రియపాఠకులారా!  ఈ విషయంలో వేదరీత్యా కొందరిని గూర్చి తెలిసికొందము.  ''యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలము పొందుదురు'', అన్నట్లుగా అబ్రహాము విషయంలో దేవుని చిత్త ప్రకారం నడుచుటకు దైవాజ్ఞ కొరకు కనిపెట్టినాడు.  అదే విధంగా నోవహు 150 రోజులు మహజలప్రళయం మీద దేవుని కొరకు కనిపెట్టినాడు.  మహా జనాంగమైన ఇశ్రాయేలును దైవాజ్ఞ చొప్పున మోషే నడిపించాడు.  సమూయేలు తల్లి హన్నా గొడ్రాలై యుండి సంతాన సౌభాగ్యం కొరకు ప్రతి నిత్యం యెహోవా మందిరంలో కనిపెట్టి యుండి సంతాన సౌభాగ్యాన్ని పొందగలిగింది.  సమూయేలు కూడా దైవ చిత్తం కొరకు కనిపెట్టినాడు.  ఈ విధంగా దేవుడు కొరకు కనిపెట్టిన వారు ఇంకను చాలా మంది వున్నారు,

        ఇంక నూతన నిబంధన కాలంలో ఏసు జననము కొరకు కనిపెట్టిన వారిలో సుమియోను ఒకరు.  అదే విధంగా అపోస్తలులు పరిశుద్ధాత్మ రాక కొరకు కనిపెట్టినట్లు అపో 2:లో చదువగలము. కొర్నేలి విషయంలో యితను కూడా ధర్మ కార్యాలు దైవ సంబంధమైన ప్రార్ధనా కార్యాలు జరిగిస్తూ సత్యమైన దేవుని యొక్క జ్ఞానము కొరకు ఆయన సువార్త కొరకు కనిపెట్టినవాడుగా తనకు దర్శన మిచ్చి మాట్లాడిన దూత మాటల ద్వారా తెలియగలదు.  అదే విధంగా లోకాంత్యంలో క్రీస్తు రాక కొరకు వధువు సంఘం కూడా కనిపెట్టియుండవలసిన సమయ మాసన్నమై యున్నదని మనము గ్రహించాలి.  ఇట్లు కనిపెట్టుట అను క్రియ ద్వారా విశ్వాసికి సిగ్గు బిడియము అన్నది వుండదు అని కీర్తనాకారుని వివరణ.

        హేతువు లేకుండగనే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు.  యెహోవా! నీ మార్గములను నాకు తెలియచేయుము. నీ త్రోవలను నాకు తేట పరచుము.

        ''హేతువు లేకుండనే ద్రోహము చేయువారు.'' వీరెవరో మనము తెలుసుకోవాలి.  యోబు విషయంలో నిష్కారణంగా దేవుని ప్రేరేపించి శోధన కార్యమును జరిపిన సాతాను యోబు యొక్క సహనానికి యోబు యొక్క విశ్వాస పోరాటానికి దేవుని యొద్ద సిగ్గు పొందినాడు.  నిష్కారణంగా ఏదేను తోటలో దేవుని పరిశుద్ధ సన్నిధిలో వున్న నరజంట దైవాజ్ఞను మీరి దైవ ద్రోహులై సిగ్గు పొందిన వారై దేవుని స్వరము విని దేవుని ఎదుటకు వచ్చుటకు సిగ్గుపడినట్లు వేదంలో చదువగలము.  కనుక సంఘ ద్రోహులకును సువార్త ద్రోహులకును లోక సంబంధులకును సిగ్గు అను గుణము వుంటుందని యిందును బట్టి మనము గ్రహించాలి.

        యిక ''యెహోవా! నీ మార్గములను నాకు తెలియజేయును '' అనుటలో యెహోవా యొక్క మార్గము యదార్ధమైనదియు పరిపూర్ణమైనదియు నిర్భయమైనదియు నిరాటంకమైనదియు జీవయుతమైనదియు మరణము లేనిదియునై యున్నది.  ఆ మార్గమే క్రీస్తు '' నీ త్రోవలను నాకు తేటపరచుము'' అనుటలో ఈ సందర్భంలో నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగు, అన్నట్లుగా లోకమునకు వెలుగైయున్న క్రీస్తు ద్వారానే ఆయన మార్గము తేట తెల్లమగుచున్నది.

        ''నన్ను నీ సత్యము ననుసరింప చేసి నాకు ఉపదేశము చేయును'' ప్రియపాఠకులారా!   ఈ సత్యము క్రీస్తే!  ఈ సత్యాన్ని గూర్చి సాక్షిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు.  సత్యమైన ఉపదేశములు చేశాడు.  ఆ ఉపదేశమే సువార్త.  ఆ సువార్తయే ఈనాడు మన త్రోవలకు వెలుగు.  ఏసే రక్షణ కర్త.  ఆ నామమే సత్యము, జీవము, యదార్ధ మార్గమై యున్నది.

        ''యీ దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను.'' నిజమే! ఆనాటి దావీదే కాదు ఈనాటి క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనము కూడా ఆయన చిత్తాన్ని గూర్చి కనిపెట్టి యుండాలి.  ఆయన చిత్త ప్రకారము నెరవేర్చవలసిన వారమైయుండగా మన ఇష్టప్రకారంగా మన ఉద్దేశానుసారంగా ఆయన నడిపించాలని నరులైనటువంటి మనలో అనేకసార్లు ప్రయత్నిస్తుంటాము.  యోనాను దేవుడు తన చిత్తప్రకారం నడవమన్నాడు.  అయితే యోనా దైవాజ్ఞను వ్యతిరేకించి తన చిత్త ప్రకారం నడుచుటకు తీర్మానించుకొని తన చిత్త ప్రకారం తాను వెళ్ళే వక్ర మార్గానికి ప్రయాణించే ఓడనెక్కినాడు.  దేవుడు ఎక్కమన్న ఓడ నీనివే సట్టణపు ఓడ. అయితే యోనా ఎక్కిన ఓడ తర్ఫీషు ఓడ.  ఈ విధంగా యోనా ప్రతికూలించి దైవత్వమును వ్యతిరేకించి దేవుని కొరకు కనిపెట్టకుండ లోకం కొరకు లోక అవసరముకొరకు కనిపెట్టినాడు.  ఫలితము ప్రమాదంలో చిక్కుకొని సముద్రము పాలై; దైవోగ్రతకు గురియై దైవ చిత్త ప్రకారం నడిపించబడి దైవోద్దేశ్యంతో ఎన్నిక చేయబడియున్న నీనెవే పట్టణానికి యోనా చేర్చబడినాడు.

        ఇక యెహోవా! నీ కరుణాతి శయములను జ్ఞాపకము చేసికోమని'' అనుటలో దేవుని కరుణాతిశయము లేమిటో తెలిసికోవలసియున్నది.  ఆయన కరుణాతిశయము ఆది నరజంట దోషులైనపుడు దేవుడు వారిని తొట నుండి వెళ్ళగొట్టుచు వారి పట్ల కనికరించి వారికి చర్మపు దుస్తులు అనుగ్రహించినాడు.  అదే విధంగా సోదర హంతకుడైన కయీను విషయంలో కనికరించి కయీనును కనుగొని ఎవరును చంపకుండునట్లు గుర్తు వేశాడు.  అనేక మార్లు దైవ జనాంగమైన ఇశ్రాయేలులు వక్రమార్గములో ప్రవేశించి దైవత్వాన్ని మరిచినపుడు అనేక మార్ల దేవుడు వారిని కరుణించి వారి పట్ల అతిశయించినట్లు చదువగలము.

        ఇక కృపాతిశయములు అనగా ఇశ్రాయేలుకు మన్నాను కురిపించుట పూరేండ్లను వర్షింపచేయుట.  ఐగుప్తీయుల ఇశ్రాయేలును తరిమినపుడు సముద్రాన్ని చీల్చి                 తన జనాంగాన్ని నడిపించుట ఇవన్నియు కృపాతిశయానికి చిహ్నములు.  ఒక ఇవన్నియు పూర్వము నుండి వున్నవే గదా! అంటాడు.  నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసికొనకుము''. అనుటలో బాల్య పాపములన్నవి తెలిసీ తెలియక చేసిన నేరములు.  అతి క్రమములన్నవి బుద్ది పూర్వకంగా చేసేటటువంటి నేరాలు.  ఇందుకు తార్కాణములు తన దాసుడైన ఊరియా భార్య నాశించి బుద్ధిపూర్వకంగా  అతనిని చంపి అతని భార్యను దోచుటన్నది ఇది అతిక్రమము. ఇట్టివానిని క్షమించమని దైవత్వాన్ని అభ్యర్ధిస్తూ దావీదు చేసిన ప్రార్ధన.

        దేవా నీ కృపను బట్టి నీ దయచొప్పున జ్ఞాపకములో వుంచుకొనుము.  ప్రియపాఠకులారా! ఈ మాటలను దాగోను ఆలయంలో ఫిలిస్టీయుల మధ్య ఆట వస్తువుగ నుండిన అంధుడగు సంసోను కూడా తన చివరి గడియలో మాట్లాడియున్నాడు.  అదే విధంగా మహా సముద్రంలో తిమింగల గర్భంలో వున్న యోనా కూడా ఈ విధముగా మాట్లాడియున్నాడు.  నిజమునకు ఆయన కృప దయ చొప్పున మనము జీవిస్తే మన జీవితము ధన్యవంతంకాగలదు.  యెహోవా! ఉత్తముడును, యదార్ధవంతడనునై యున్నాడు.  యెహా 14:6లో ఏసుప్రభువు కూడా తన జన్మ రహస్యాన్ని వివరిస్తూ నేనే మార్గమును, సత్యమును,జీవమును నా ద్వారానే తప్ప మరి ఎవడును తండ్రి యొద్దకు రానేరడు.  కాబట్టి యెహోవా ఏసుక్రీస్తుగా అవతరించి తన మార్గములను గూర్చి ఆయన పాపులకు వివరించినట్లుగా నూతన నిబంధన చరిత్ర వివరిస్తున్నది.

        25:9 యెహోవా! ఉత్తముడును, యదార్దవంతుడునునై యున్నాడు.  ప్రియపాఠకులారా!  ఈ వాక్య రీతిగా యెహోవా! ఉత్తముడును యదార్ధవంతుడును'', అనుటలో దేవుడైన యెహోవా ఆది నుండి నరులకు మరుగు పరచినది ఏదియు లేదు.  ఆయన యదార్ధతను ఆయన ఉత్తమ  గుణాన్ని భూమి మీద వున్నటు వంటి సృష్టి క్షుణ్ణంగా బైల్పరచుచున్నది.  ఎట్లనగా జలనిధిలో గుప్తమై యుండి దుర్గంధపూరితమైన బురదతో కప్పబడిన భూమిని వెలికి తీసి దానిపై దేవుడు తాను వాక్శక్తితో సృష్టిక్రియను జరిగించి సృష్టములను చేసి, తాను సృష్టించబోవు నరుని గూర్చి ఆలోచించిన వాడై నర జీవితము యొక్క మనుగడకు కావలసిన ఏర్పాట్లు అనగా వాతావరణము గాలి, నీరు ఆహారము వగైరాలను గూర్చి తలచిన వాడై నరసృష్టికి ముందే నరుని యొక్క అవసరతలకు కావలసిన వన్నియు సృష్టించియున్నాడు.

        యివియైన పిమ్మట ఏదేనను ఒక పరిశుద్ద వనమును అనగా ఉత్తమమైన తోటను వేసి అందులో ఉత్తమమైన ఆహారమునకు యోగ్యమైన మరియు నర జీవితమునకు నిత్య జీవమిచ్చు జీవ ఫలములు గల వృక్షమును ఇంకను క్షుద్బాధ నివారణకు అవసరమగు ఫల వృక్షములను సృష్టించి ''నేల మట్టితో నరుని చేసి తన వలె ఉత్తమునిగ జీవించమన్నాడు.  యిదియే ఆయన ఉత్తమ గుణము.  అటు పిమ్మట నరుని వాక్కులో యదార్ధతను కోరినాడు.  అనగా చేసిన  తప్పును ఒప్పుకోమన్నాడు.  అయితే నరుడు అట్లుగాక తాను చేసినట్లు, పాపము నొప్పుకోక తన దోషాపరాధమును మరియొకరి మీదకు అనగా తన సాటి సహాయియైన స్త్రీ మీదకు నేరారోపణ చేసినాడు.  ఇందువల్ల ఉత్తముడైన యెహోవా దృష్టికి నరుడు యదార్ధవంతుడు కాలేకపోయాడు.  కాబట్టి ఉత్తముడును యదార్ధుడైన దేవుని సన్నిధిలో జీవించుటకు యోగ్యత లేక దైవ సన్నిధియెనౖు యేరేను నుండి తరిమివేయబడినాడు.

        అయినను దేవుడు ఉత్తముడు గనుక నరుని బలహీనతకు నొచ్చుకొని వారికి రక్షణ కవచములుగ తోలు దుస్తులను తొడిగినాడు.  యిది జరిగిన తర్వాత నర జంటలో ఉత్తమ యదార్ధ గుణములు లోపించినను వారి సంతతియైన కయీను హేబేలులలో కనపడు తుందేమోనని దేవుడు ఒకానొక శుభవేళ ఆదాము కుమారులైన కయీను హేబేలులను పరిశోధించుటకు ప్రేరేపించి వారిచేత బలి సమర్పణ ఆరాధనను జరిగించాడు. యిట్లు జరిగించు సందర్భములో హేబేలు 'సత్యవంతుడును ఉత్తమ గుణములు కలవాడై తన మందలో తొలిచూలును క్రొవ్విన వాటిని దేవునికి బలిగా అర్పించాడు. అదే విధంగా ఏబేలు అన్నయైన కయీను కూడా తన పొలము పంటలో ప్రధమ పనలను తెచ్చాడు.  అయితే దేవుడు హేబేలు బలిని అతని అర్పణను లక్ష్యముంచి దహించినట్లు అనగా ఉత్తముడు యదార్ధవంతుడు హేబేలు అని ఈ దహన క్రియ వల్ల నిరూపించినట్లు తెలియుచున్నది,  ఈ సందర్భంలో కయీను ద్వేషియై దేవుని మీద కోపించి తమ్ముని ద్వేషించి వానిని హత మార్చినపుడు హేబేలు రక్తము దేవునికి మొరపెట్టగా దేవుడు కయీనుకు ప్రత్యక్షమై ''నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? అని అడిగినప్పుడు , కయీను ఉత్తముడు, యదార్ధవంతుడును కాలేక అసత్యవాదిగా మాట్లాడుచు చేసిన తప్పును ఒప్పుకొనక నా తమ్మునికి నేను కావలి వాడనా? వానితో నాకేమి పని? అని బొంకిన మాటల ద్వారాను చేసిన క్రియా కర్మలను బట్టి కయీను కూడా ఉత్తముడును యదార్ధవంతుడును కాలేకపోవుటయే, నరజీవిత పతనావస్థకు నాంది యేర్పడినట్లు అప్పటి నుండి ఉత్తముడును యదార్ధవంతుడునైన దేవుని ఎదుట నుండి నరుడు నిలబడుటకు తావులేక పోయినట్లును వేదరీత్యా మనము గ్రహించవలసియున్నది.  అయినను దేవుడు ఉత్తముడును యదార్ధవంతుడును గనుక కయీనును కరుణించి అతనికి వీపున రక్షణార్థమైన గుర్తు వేసినట్లుగా కూడా వేదంలో చదువగలము.

        ప్రియపాఠకులారా!   నాటి నుండి నేటి వరకు కూడా ఉత్తముడైన నరుడు యదార్థవంతుడైన నరజీవియు లేడని రోమా 3:11లో చదువగలము.  నీతిమంతుడులేడు. ఒక్కడును లేడు.  గ్రహించు వాడెవడును లేడు.  దేవుని వెదకు వాడెవడును లేడు.  అందరును త్రోవదప్పి ఏకముగా పనికి మాలిన వారైరి.  మేలు చేయువాడు లేడు.  ఒక్కడైనను లేడు.  వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు.  వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది.  వారి నోటి నిండ శపించుటయు పగయున్నది.  రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి.  నాశనమును కష్ఠమును వారి మార్గములలో వున్నవి.  శాంతి మార్గము వారెరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు.

        25:8 కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును.  అనిన దానిని గూర్చి తెలిసికోగలము.  యోహా 14:6 నేనే మార్గము సత్యమును జీవమునై యున్నాను.  నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు.  కనుక యోహా 1:12 తన్నెందరంగీకరించిరో వారందరికి తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారము అను గ్రహించెను''. అనుటలో దేవుని యొక్క మార్గమైన క్రీస్తును ఎరిగియుంటేనే గాని నరులు నీతిమంతులు యదార్థవంతులు కాలేరనియు-సత్యము, జీవమునై యున్న ఆయన మార్గములో నడవలేరని మనము గ్రహించవలసియున్నది.  యిందును గూర్చి దేవుడు ప్రవక్తల ద్వారాను అపోస్తలుల ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను ఉపదేశించియున్నాడు.  అనగా తన ఉత్తమ యదార్ధమైన మార్గమును గూర్చినటువంటి దైవ నిగూఢ రహస్యములను తన ప్రతిరూపమైన క్రీస్తు ద్వారా పాపులకు ఉపదేశించి యున్నట్లు నూతన నిబంధన వేద చరిత్ర నిరూపిస్తున్నది.

                25:9 న్యాయ విధులను బట్టి ఆయన తన మార్గములను దీనులకు నేర్పును.  ప్రియపాఠకులారా!   ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు మత్త 5:3-10 చదివితే ఈ దీనులకు ఆయన నేర్పినట్టి విధానాలు మనకు తెలియగలదు.  అయితే పై దీనులు డబ్బులేని వారు కాదు.  కూటికి గుడ్డకు భూలోక అవసరతలకు వాచి యున్న వారు శరీర సంబంధమైన దీనులు అసలే కాదు.  లోక సంబంధమైన దీనులు అసలే కాదు.  ఆత్మ విషయమై నీతి నిమిత్తము వేదన పొందేటటువంటి మానవోత్తములని అర్ధము.  ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గెకొనుట'', అనుటలో ఆయన చేసిన నిబంధన ఏది? ఆయనచేసిన నిబంధన అదియే పాత నిబంధన.  ఆయన నియమించిన శాసనాలు మోషే కిచ్చిన రాతి పలకలు.  పది ఆజ్ఞలు గైకొను వారి విషయంలో అనగా ఆనాటి భక్త సందోహం జీవితాలలో ''యెహోవా త్రోవలన్నియు'', అనుటలో యెహోవా త్రోవలేవి?

        ఆయన త్రోవలన్నిటికి మూలము యోహా 1:14 ఆ వాక్యము శరీర ధారియై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యనివసించెను''. ఈయనే ఆయన త్రోవ.  యెహోవా త్రోవలన్నియు శరీరాకారంగా కృపా సత్యమయములై ఏసుక్రీస్తు అను పుణ్యావతారం ద్వారా బైల్పరచబడియున్నవి.  కనుక యెహోవా త్రోవలన్నియు కృపా సత్యమయములై యున్న వనుటకు పై వాక్యములు ఋజువులై యున్నవి.  ప్రియపాఠకులారా!  యెహోవా త్రోవలన్నియు కఠినములైనవియు అబద్ధీకులు అసత్యవాదులు విగ్రహారాధకులు, ఈర్ష్యా ద్వేషము, విగ్రహారాధన, వ్యభిచారం, వగైరా సంబంధములైనవి గాక విశాల సుఖాసన త్రోవలు గాక యిరుకును యిబ్బందియు నరుని యొక్క విశ్వాస పరీక్షా ర్థములై దేవుని చేత నిర్ణయించ బడినట్లు క్రీస్తు ద్వారా మనకు బైల్పరచబడియున్నవి.

        యిందును బట్టి ఏసు ప్రభువు తన శిష్య సందోహంతో మాట్లాడుచు మత్త 7:13-14 ఇరుకు ద్వారమున ప్రవేశించుడి.  నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమైయున్నది.  దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము యిరుకును ఆ దారి సంకుచితమైయున్నది.  దాని కనుగొనువారు కొందరే!  కనుక యెహోవా త్రోవలను కనుక్కొని అందులో నడవలెనంటే ఆయన కుమారుడైన క్రీస్తు నామమును ధరించి ఆయనను హృదయంలో చేర్చుకొని సంపూర్ణత్వం పొంది ఉత్తమ గుణ ములతోను యదార్ధమైన జీవితంలో జీవిస్తూ ఇటు జనాధరణ అటు దైవ సానుభూతి పొంది క్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించి క్రీస్తువలె సత్యవ్రతమును ఆచరించిన వాడు.  యెహోవా త్రోవలలో నడుచుటకు యోగ్యుడు,'' అని మనము గ్రహించవలసియున్నది.

        ''యెహోవా! నా పాపము బహు ఘోరమైనది.'' ప్రియపాఠకులారా!  ఈ మాటను దావీదు మహారాజు, పలుకుటలో ఈయన చేసిన బహు ఘోరమైన పాపమేదనగా తన సైనికుడును తనకు నమ్మకస్తుడును  తన యందు విశ్వాసియైనటువంటి; సత్యవంతుడు యదార్థవంతుడునైన ఊరియా యొక్క భార్యను స్నాన మాచరించు సమయంలో ఆమెను చూచుటయు, ఆ తర్వాత ఆమెను ఆసించుటయు ఆసించుటయే గాక భర్తలేని సమయంలో తన భటుల చేత ఆమెను రప్సించి ఆమెతో కూడి ఆమె గర్భవతియగునని ఎంచి ఆ నిందను తనపై వేసికోకుండా భర్తపైనే నెట్టాలని దురాలోచన చేసి; అంతియే గాకుండా తన యొక్క హేయ క్రియను ఎరుగనటువంటి ఊరియాను భార్యతో శయనించుటకు శత విధముల అతనిని ప్రోత్సహించి ప్రేరేపించినను అతడు రాజభక్తినిబట్టి దివాణంలోనే పడియుండగా తుదకు తన సర్వ సైన్యాధిపతితో సంప్రదించి నిర్దోషియైన ఊరియాను యుద్ధ మధ్యములో వుంచి చంపునట్టి ఏర్పాట్లు గావించి  అతను చనిపోయిన పిమ్మట అతని భార్యను తన దానినిగా చేసికోవడమన్నది ఈ బహు ఘోరమైనదావీదు యొక్క పాపము.

                ప్రియపాఠకులారా!  యెహోవా ధర్మశాస్త్రములో దావీదు చేసిన ఈ బహు ఘోరమైన పాపములోని నీచాతి నీచమైన విలువలను మనము గ్రహించపలసియున్నది.  దీనిని గూర్చి సమూయేలు గ్రంధముః రాజులు యుద్దము చేయవలసిన వసంత కాలంలో ఇశ్రాయేలీయులు యుద్ధరంగములో యుద్ధ సన్నిధులై యుండగా వారిని ప్రేరేపించి యుద్ద సన్నిధ్దులుగా చేసి వారితో కూడి యుద్ధ భూమిలో పోరాడవలసిన రాజైన దావీదు సైన్యాన్ని యుద్ధ భూమికి అప్పగించి, తన అంతఃపురములో చేరి వున్నత స్థలములో వున్న తన శయన మందిరంలో సంచరిస్తూ సుఖాసీనుడుగా వుండుటన్నది మొదటి తప్పు అనగా దైవ జనాంగముతో కూడి దైవ పక్షంగా యుద్ధము చేయవలసిన విధిని దావీదు అలక్ష్యపరిచాడు.  రెండవది వివస్త్రగా స్నాన మాచరించు స్త్రీని చూచుట రెండవ తప్పు.  ఆమెను మోహించుట మూడవ తప్పు.  ఆమెను ఆసించుట 4వ తప్పు.  ఆమెను బలవంతంగా చెరచుటన్నది ఐదవది.  ఆమె ఒకని భార్యయైయుండగా ఆమెను ఆశించుటన్నది దేవుని ధర్మశాస్త్రానికే విరుద్ధము.  ఆ స్త్రీని చెరచినటువంటి పాపమును కప్పిపుచ్చుకొనుటకు భర్త మీద ఆ దోషమును అంటగట్టుటకు ప్రయత్నించుట ఏడవ తప్పు.  నిష్కారణంగా అతనిని ఊరియాను యుద్ధరంగ మధ్యమమునకు పంపి ముందుంచి చంపించుటన్నది 8వ తప్పు.  ఆ విధంగా అష్ట గుణాలు వుండబట్టే ఈ అష్ట గుణములతో కూడి వున్న  పాపము కనుకనే యిది బహు ఘనమైనదిగా దావీదు తన నోట ప్రకటిస్తున్నాడు.  కనుక నీ నామమును బట్టి దానిని క్షమింపుము.'' అనుటలో మానవ లోకమే క్షమించరాని ఈ మహా పాపమును దావీదు దైవ సన్నిధిలో వుంచి క్షమాపణ కోరుచున్నాడు.

        ఇక 12 యెహోవా యందు భయభక్తులు గల వాడెవరో వాడు కోరుకొనవలసిన మార్గములను ఆయన వానికి బోధించును.  యెహోవా యందు భయభక్తులు గలవాడు.'' అనుటలో పై విధంగా అష్టగుణ మహాపాపమును చేసిన దావీదును దేవుడు క్షమించుటకు పై బలమైన కారణము 12వ వచనమందు విదితమగుచున్నది.  ఎట్లనగా పాపికి గాని సత్యవంతుడు గాని దోషి  గాని నిర్దోషి గాని దేవుని యందు  భయభక్తులు గలిగియున్నట్లయితే వాడు కోరుకొనవలసిన మార్గములను ఆయన బోధించును.'' అని బైబిలులోనే కొన్ని వాక్యాల ద్వారా తెలిసికోగలము.

        ప్రియపాఠకులారా!  12 ఏండ్ల రక్తస్రావపు స్త్రీ ఏసు ప్రభువు అంగీ అంచును ముట్టి స్వస్థరాలైనపుడు ఏసు ప్రభువు చెప్పిన మాటలు కుమారీ! విశ్వాసము నిన్ను స్వస్థపరచినది.  సమాధానము కలదానవై పొమ్ము.'' అనుటలో విశ్వాసమూలంగా దైవత్వాన్ని అంటినటువంటి విశ్వాసికేర్పడు మార్గము సమాధానకర మార్గములో ఆమెను పొమ్మని ఏసుక్రీస్తు బోధించినట్లుగా మనము చదువగలము.  యెహోవా 8:3-11 చదివితే వ్యభిచారము చేసిన స్త్రీని గూర్చి 11వ వచనంలో ఏసు ప్రభువు నేను నీకు శిక్షవిధించను.  నీవు వెళ్ళి యిక పాపము చేయకుమనుటలో ఆమె వున్నటువంటి పాప మార్గము నుండి ఆమె కోరుకొవలసిన నీతి మార్గములోకి ఆమెను వెళ్ళమన్నట్లుగా ఈ వాక్యములోని పరమార్ధము మరియు యోహాను 8:12 లో నేను లోకమునకు వెలుగును.  నన్ను వెంబడించువాడు  చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండును అనగా ఆయన మార్గము జీవము, కాంతి శాంతికరమైన మార్గము.

        25:13 అతని ప్రాణము నెమ్మదిగా నుండును.  అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును, నిజమే! ప్రియపాఠకులారా!  యాకోబు విషయంలో యాకోబు అన్నకు రావలసిన తండ్రి యొక్క ఆశీర్వాదాలను అపహరించి అన్నకు భయపడి పారిపోతూ ఆందోళన కరమైనట్టి తొట్రుపాటుతో కూడిన ప్రయాణంలో వుండగా దైవత్వంతో పోరాడి దైవాశీస్సులు పొంది, అటు తండ్రి దీవెనలు ఇటు దేవుని కృపకును పాత్రుడై తన ప్రాణమునకు నెమ్మది కలుగుటయే గాక ఇశ్రాయేలు అను ఒక బిరుదును పొందినాడు.  అతని సంతానము నాటి నుండి నేటి వరకు స్వతంత్రించుకొని ఇశ్రాయేలు అను దైవ జనాంగంగా బిరుదును పొంది, అట్టి జనాంగమైయున్న ఇశ్రాయేలును దేవుడు తన జనాంగంగా ఎంపిక చేయుటయే గాక ఇశ్రాయేలులోని 12 గోత్రాలలో ఒకటైన యూదా గోత్రము దావీదు వంశమును లోక నరకోటి రక్షణార్ధమై మనుష్య కుమారుని జన్మించుటకు కన్నెక నేర్పరచుకొని ఆమెలో నుండి లోకంలో జన్మించి, ఏసుక్రీస్తు అను పేరుతో లోక సంచారం చేసి తాను చేసిన బలియాగము ద్వారా అనేకుల హృదయాలను మార్చి అట్లు మార్చబడిన ఆత్మలను క్రైస్తవ విశ్వాసులుగా మార్చి, నేడు భూగోళాన్ని మొత్తాన్ని స్వతంత్రించు కొని విస్తరించియున్నట్లు ఈ వచనంలోని పరమార్ధం.  ఈ విధంగా విస్తరించి స్వతంత్రించుకున్న మొట్ట మొదటి జనాంగము క్రైస్తవులు.

        14. ఇక యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది.  ప్రియపాఠకులారా!  దేవుని మర్మము మొట్టమొదటగా తనయందు భయభక్తులు గల నోవహుకు తాను జరిగించబోవు జలప్రళయ మారణ హోమమును గూర్చి నోవహుతో చెప్పినట్లు మనము చదువగలము.  అదే విధంగా ఇశ్రాయేలు జనాంగమునకు నాయకునిగా ఎన్నుకొన్న మోషేకు యెహోవా తన మర్మములను తెలియచేసినట్లును అదే విధంగా నూరేండ్ల అబ్రహాము తొంభై యేండ్ల శారాల యొక్క వృద్ధాప్య జీవితంలోను ఆయన జరిగించిన మర్మముతో కూడిన సంతాన సౌభాగ్య క్రియ ఈ సందర్భంలో మనము తెలిసికోవలసియున్నది.  యెహోవా యందు భయభక్తులు కలిగియుండ బట్టే అబ్రహాము శారాలతో దేవుడు సంతాన వాగ్దానం చేసినట్లు చదువగలము.  యెహోవా యొక్క మర్మము.  ఇస్సాకు సంతానమైయున్న యాకోబు 12 గోత్రాలలో యూదా గోత్రము నుండి మరియు దావీదు వంశము నుండి తన కుమారుని యొక్క జన్మ చరిత్రకు పునాది వేసినట్లు వేదంలో రచించబడియున్నది.  అదేవిధంగా దేవుని యొక్క మర్మమును క్షుణ్ణంగా తెలిసికొన్నవారు మోషే నుండి దానియేలు వరుకును వారి చరిత్ర ద్వారా ఋజువగుచున్నది.

        ప్రియపాఠకులారా!  సంసోను జనన విషయంలో సంసోను యొక్క బలాధిక్యతలు దేవుని ఆత్మ ప్రేరేపణ శక్తికి మూలము దేవుని మర్మమైయున్నట్లును ఆ మర్మమును సంసోను గర్భములో  పడకమునుపే దేవుని దూత మానోహదంపతులకు ప్రత్యక్షమై కలుగబోవు శిశువునకు తలమీద మంగలి కత్తి రాకూడదనియు, అతడు మద్యమును వాడకూడదనియు పవిత్రునిగ జీవించవలసియున్నదనియు దేవదూత చేత సంసోను తల్లిదండ్రులకు దేవుడు తన  మర్మాన్ని వివరించియున్నాడు.  కనుక ఆయన యందు భయభక్తులు గల ప్రవక్తలు రాజులకు దీర్ఘ దర్శులకు అపోస్తలులకు దేవుడు తన మర్మమును బైల్పరచినట్లు వేదంలో చదువగలము.

        ఇక ''ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును.'' అని వ్రాయబడియున్నది.  నిజమే!  ఇశ్రాయేలు అను తన జనాంగమును క్రమబద్దము చేయుటకు దేవుడిచ్చిన శాసనములైన రాతిపలకలు ఈ నిబంధనలైయున్నవి.  ఈ నిబంధనల ప్రకారము నేటికిని ఇశ్రాయేలు జనాంగము వారి దైవికజీవితాన్ని కొనసాగిస్తున్నారు.  ఈ నిబంధనలను గూర్చి పాత నిబంధన నిర్గమ కాండంలో వివరంగా తెలిసికోగలము.

        యిక నా కను దృష్టి ఎల్లప్పుడు యెహోవా వైపునకే తిరిగియున్నది.'' అని అంటున్నాడు.  మన కను దృష్టి ఆయన వైపు వుండాలంటే నూతన నిబంధనలో లోక పాప నరకోటి పాప పరిహారార్ధం బలియాగము గావించుటకు ఎత్తబడిన ఏసు వైపే మన కను దృష్టి వుండవలెను.  యిది ప్రతి క్రైస్తవ విశ్వాసికి బాధ్యతయైయున్నది.  ప్రియపాఠకులారా!  దిక్సూచి యంత్రములోని ముల్లు ఎల్లప్పుడును ఉత్తరాన్నే సూచిస్తుంది.  అదే విధంగా ఆత్మ సంబంధులైన మనము ఆత్మ సంబంధియైన దైవ కుమారుని యొక్క నామము చేత ఆయన గురిపైనే మన దృష్టిని నిలుపవలసిన వారమైయున్నాము.

        ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును, అనుటలో కీర్తనాకారుడైన దావీదు జిగట మన్ను గల దొంగ ఊబి నుండి ఆయన నన్ను రక్షించాడు.  అని అంటున్నాడు.  ప్రియపాఠకులారా!   దొంగ ఊబియైనను వలయైనను ఉరియైనను మరణ పతనానికి సాంకేతికములైయున్నవి.  పౌలు సీలలను బంధకాల నుండి విడిపించిన వాడాయనే. పేతురు బందీయై యుండగా ఆయనను సంఘము యొక్క విజ్ఞాపన ద్వారా విడిపించిన వాడాయనే.

        కనుక లోకమను వల అను బంధకాల నుండి మన బంధకాలను తొలగించి మన ప్రాణములకు నెమ్మది కలుగచేయువాడు ఆయనే.  దానియేలు విషయంలో సింహాల బోను వల నుండి దానియేలును నడిపించాడు.  షద్రకు మెషగు అబెద్నగో అను వారిని అగ్ని వల నుండి తప్పించినాడు.  ప్రియపాఠకులారా!   తల వాకిట కట్టబడియున్న గాడిదపిల్లను విడిపించిన వాడాయనే.  సముద్రంలో తిమింగల గర్భము అను మరణ వల నుండి యోనాను తప్పించిన వాడు ఆయనే.

        ప్రియపాఠకులారా!  లోక సంబంధమైన మనకు కూడా అనేక బంధకాలున్నవి.  సంసారమనేది వల, మరణమనేది వల, వ్యాధి అనేది వల, లోక సంబంధమైన కోర్టు, కేసులు ఆస్థి నష్టాలు బ్యాంకి రుణాలు, దాయాదుల పోరు, సవతి పోరు, అత్త పోరు యివన్నియును వలలే!  యిట్టి వలలలో నుండి మనము విడిపించబడాలంటే ఆయన యందు భయభక్తులు కలిగియుండవలెను.  అట్లున్న పక్షంలో లోకము సాతాను లోకాధికారము, సాతాను శోధన అను వలలు నరుని ఏమియు చేయజాలవు.

        25:16 ''నేను ఏకాకిని, బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము '' ప్రియపాఠకులారా!  నిజానికి దావీదు ఏకాకికాడు.  ఆయనకు వేల సంఖ్యలో పత్నులు, ఉపపత్నులు, దాస దాసీ జనంబులు, పరివారము రధములు, రౌతులు, గుఱ్రములు, ఒంటెలు పరిచారకులు సైనికులు ఎంతో మంది సైన్యాధిపతులు వగైరాలున్న దావీదు నేను ఏకాకి నంటున్నాడు.  బాధపడు వాడనంటున్నాడు.  నిజమే ప్రియపాఠకులారా!   పాపము చేసినవాడు ఏకాకే! పాపము చేత  పీడించబడినవాడు కూడా ఏకాకే! ఈ చేదు అనుభవాలను తన జీవితంలో సౌలు చేత తరుమబడినపుడు తన కుమారుడైన అబ్షాలోము చేత తరుమబడినపుడును; పాపము చేత పట్టుబడి పశ్చాత్తాప్తుడై యున్న సమయమందును దావీదు మహారాజైనను ఏకాకే!  బాధింపబడిన వాడే ఆయినను దేవుడు దావీదునెంతో ప్రేమించి దైవాశీర్వాదము, దేవుని యొక్క కృప ఆయన నేత్రము దావీదు యొక్క జీవిత విధానాన్ని వీక్షించుచుండుట వల్ల దావీదు ఒంటరితనాన్ని దావీదు యొక్క దోషాపరాధాన్ని 17 వ వచనంలో విధంగా దావీదు యొక్క అతి విస్తారమైన హృదయ వేదనలను, దావీదు కలిగియున్న ఇక్కట్లులలో నుండి అతనిని విడిపించి గొప్ప చేసియున్నాడు.  తన కుమారుడైన అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేసినపుడు దావీదు ఏకాకియై యుండి దైవత్వానికి మొరపెట్టగా సాతాను ప్రభావ మూలముగ దేహ దారుఢ్యము సైన్యము సైనిక బలము అంగ బలములను ఆశ్రయించి అబ్షాలోము తండ్రియైన దావీదును తరిమినపుడు దావీదు దిక్కుమొక్కులేని ఒంటరి వాడాయెను.  యిట్టి ఒంటరి జీవితంలో బాధ వేదనను అనుభవించిన దావీదు మహారాజు యొక్క పాపములన్నిటిని క్షమించి అబ్షాలోము కున్న అంగబలము సైనిక బలము ఆయుధ బలమును బట్టి 19 వ వచనంలో దావీదు ప్రవచించిన రీతిగా తన కుమారుడు తనకు శతృవైయున్నను అతడు అనేకులుగా విజృంభించి కౄర ద్వేష ఈర్ష్య రాజ్యకాంక్షతో దావీదును తరిమి, దావీదు రాజ్యమును ఆక్రమించి దావీదు సింహాసనమును అధిరోహించుటయే గాక దావీదు జీవించి యుంటే తన కేనాటికైనా ముప్పుతప్పదని అబ్షాలోము దావీదును గూర్చి వేగుల ద్వారా విచారించు సమయములో వెదకు కాలంలో దావీదు దేవుని సన్నిధి శరణు జొచ్చి, తన ప్రాణమును గూర్చి తన పతనాన్ని గూర్చి పరితాపము నొందిన వాడై దైవ శరణు జొచ్చినట్లు ఈ కీర్తనలోని 20వ వచనం విశదపరచుచున్నది.

        ఇక 21వ వచనంలో ఇట్టి ఆశ్రయములలో నుండి దేవుని కొరకును ఆయన శక్తి కొరకును ఆయన ఆత్మ యొక్క బలము కొరకును దావీదు కనిపెట్టిన వాడైయుండి దైవత్వమును పొందాలంటే యదార్ధత నిర్దోషత్వము'' అను యోగ్యతలు అవశ్యమని ఈ యోగ్యతలు లేకపోతే దైవ సంరక్షణ శూన్యమని దైవత్వాన్ని అభ్యర్ధిస్తూ 22వ వచనంలో దేవా! ఇశ్రాయేలీయులను వారి బాధల నుండి విమోచించుమని ప్రార్దనా పూర్వకంగా ప్రాధేయపడుచున్నాడు.  ప్రియపాఠకులారా!  అబ్షాలోము తండ్రి రాజ్యాన్ని ఆక్రమించినపుడు ఒక దావీదుకే గాక దైవ జనాంగమైన ఇశ్రాయేలుకు కూడా దావీదును బట్టి బాధలు ఇక్కట్లు శతృ భీతి ప్రాప్తించినవి.  అట్టి తరుణంలో దావీదు పాడిన ఈ ప్రార్థనా గీతము దైవ సన్నిధికి విజ్ఞాపనగా చేరింది.  ప్రియపాఠకులారా!   ఒక్క దావీదునే గాక ఇశ్రాయేలు జనాంగమంతటికిని ఈ విపత్తు సంభవించినట్లు ఒక్క దావీదే గాక ఇశ్రాయయేలు జనాభా కూడా ఒంటరియైనట్లు అనగా రాజులేని జనాంగమై నానా విధములైన విపత్తులకు గురియైనట్లును, అట్టి విపత్తులలో నుండి ఇశ్రాయేలును నడిపించుటకు దావీదు చేసిన ఈ యొక్క ప్రార్థనా గీతము ఒక్క దావీదునకే గాక దైవ జనాంగమైన ఇశ్రాయేలుకును ఆనాటి ప్రజలకును విమోచనానికి నాంది పలికింది.

        కీర్త 26:6 నిర్దోషినని నా చేతులు కడుగుకొందును'', ఆదాము హవ్వలు చెట్టుతో పాపము చేసినపుడు చేతులతో ఆ ఫలములను అందుకొని నోట పెట్టుకున్నారు.  అందువలననే క్రీస్తుకు మునుముందుగా చేతులకే మేకులు దిగ గొట్టబడినవి.  పాప కార్యములలో చేతులకే ప్రాధాన్యత పొంది ఆ కార్యములు నెరవేర్చుచున్నవి.  కాన నా చేతులతో నేనేమి పాప కార్యము చేయలేదను సూచనగా చేతులు కడుగుకొనుటకు గుర్తుగా వున్నది.  మత్త 27:24 ఏసు ప్రభువు విషయంలో పిలాతు తాను తన చేతులతో ఏ పాపము చేయుట లేదని నిర్దోషిత్వమును తెలుపుటకే చేతులు కడుగుకొనెను.

                þþþ

        కీర్త 30:3 యెహోవా పాతాళములో నుండి నా ప్రాణము లేవదీసితివి.  నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి?

        పాతాళము, గోయి, సమాధి, ఈ మూడు పదములు ఒకే అర్థమును యిచ్చుచున్నవి.  జీవాత్మ శరీరమును వదలి పరమాత్మలో ఐక్యమగునపుడు ఈ స్థితి లభించును అనగా శరీరము అచేతనమై నిర్జీవమైయుండును.  ఈ ఒక్కొక్కపుడు శరీరము నందు ప్రాణముండి ఆత్మ నివసించుచుండియు, ఈ ఆత్మ శరీరములకు ఏ నిర్ణయము లేక కొన్ని అవాంతర లేకసందిగ్ధ లేక ప్రమాద పరిస్టితులలో పడినపుడు విరిగినలిగిన ఈ ఆత్మ జీవములకు ఉజ్జీవమిచ్చి నూతన జ్ఞానముతో నూతనోత్తేజముతో నడిపించును, లోకమునకు గాని, తన కుటుంబమునకు గాని, తానే గాని ఏ విధముగా గాని వ్యర్థుడైన వాడు ప్రాణముండియు శరీరముతో సమానమగును.  దైవ కారుణ్యము వలననే ప్రభావితుడు కావలెను.  కాని ప్రతి ప్రాణి దైవాత్మ యందు మనసు వుంచవలెను.

        కీర్తన 26:2 యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము.  నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము'',

        ప్రియ శ్రోతలారా!  పై వాక్యానుసారంగా పరిశీలన పరీక్ష పరిశోదన అన్నది ఆత్మకును శరీరానికిని ఇహ లోకరీత్యా పరలోక రీత్యా అవసరమనియు ఇది ఆయా సందర్భాలలో ఆయా రీతులుగ క్రియ జరిగిస్తున్నట్లు మొట్టమొదటగా మన భూలోక జీవితములో కొన్ని సందర్భాలను గూర్చి తెలిసికొందము.  మొట్టమొదటగా ఈ పరిశీలన అన్నది దేహరీత్యా ఆరోగ్యము చెడిన రోగియైన వానిని చికిత్స చేయుటకు పూర్వము వైద్యుడు నాడియని గుండె యొక్క చలనాన్ని నాలుకను నోటిని కన్నులను పరిశీలించును. రోగము యొక్క లక్షణాలు ఈ పరిశీలనలో అర్ధము గానపుడు రక్త పరీక్ష  మూత్ర పరీక్ష గల్ల పరీక్ష వగైరా పరీక్షలు ద్వారా రోగ విధానాన్ని గూర్చి పరీక్షిస్తాడు, పరీక్షావిధానములో ప్రయత్నించును.  అందుకు అర్ధముగాని పక్షములో మూడవదిగ ఎక్స్‌రేయను ఛాయాచిత్ర పరిశోధన ద్వారా రోగ పరిశోధన జేయును.  ఇది భూలోక వైద్యుని యొక్క రోగపీడితుడైన రోగిని గూర్చి రోగ విధానమును గూర్చి వైద్యుడు చేయు క్రియ.

        ఇక లోకరీత్యా విద్యావిధానములో ఉపాధ్యాయులు పాఠశాలలోని విద్యార్ధులను వారి విద్యాభ్యాసమును గూర్చి ముందు పరిశీలిస్తారు.  అనగా నెలసరి పిల్లల యొక్క విద్యా జ్ఞానమును గూర్చిన పరిశీలన.  రెండవది మూడు నెలల పరీక్ష ఆరు నెలల పరీక్ష సంవత్సరిక పరీక్ష అను మూడు పరీక్షల ద్వారా పిల్లల యొక్క జ్ఞానాభివృద్ధిని ఉపాద్యాయులు పరీక్షిస్తుంటారు.  అదే విధంగా శాస్త్రయుతంగా సైన్సు శాస్త్రమును పిల్లలకు బోధించుచు విద్యార్ధుల యొక్క పరీశీలనా జ్ఞానాన్ని సైన్సు ఉపాధ్యాయుడు పరిశోధిస్తాడు.  

        ఇక మూడవదిగ ఒక యంత్రాన్ని కనిపెట్టేటటువంటి శాస్త్రవేత్త ముందు యంత్రము యొక్క చలనాన్ని పరిశీలించును అనగా దాని గమనాన్ని అది పనిజేయు విధానము, పని జేయు కాలములో దానిలో నుండి వెలువడు శబ్ధము తిరిగేటటువంటి చక్రముల యొక్క వేగము ఆయా భాగములు చేయుచున్న క్రియా విధానాలను పరిశీలన చేస్తాడు.  ఆ తర్వాత ఈ యంత్రము చేత ఏయే పనులు చేయవచ్చునో ఈ యంత్రమునకు కొన్ని ఇతర భాగాలను చేర్చి వాటి ద్వారా నిత్యావసరతలో మానవుని కవసరమైన క్రియాకర్మలను జరిగించును. ఉదా|| ట్రాక్టరు చెక్రాలు గల్గి యంత్రయుతమైన వాహనము.  కాని ఆ వాహనములో కేవలము నరుడు ప్రయాణించలేడు. ఈ యంత్రమునకు వెనుక భాగములో నాగళ్ళు బిగించి నేలను దున్నిస్తారు.  అదే విధముగా నేలను గుల్ల జేసే వెనుక భాగాన్ని తగిలించి దున్నినటువంటి నేలను చదునుచేయిస్తారు.  అటు తర్వాత అదే ట్రాక్టరునకు విత్తనాలు చల్లెడి సాధనాన్ని బిగిస్తారు.  పంట నూర్చే సాధనాన్ని ట్రాక్టరు వెనుక భాగములో అమరుస్తారు.  ఇదంతయు అయిన తర్వాత పండిన ధాన్యాన్ని పొలము నుండి ఇంటికి చేర్చుటకును కుప్ప నురిపిన గడ్డిని రవాణా చేయుటకును ధాన్యాన్ని రైసుమిల్లుకు చేర్చుటకు ట్రాక్టరు వెనుక భాగమున ట్రయిలరు అను వేరొక బండిని బరువులు మోయుటకు అమరుస్తారు.  ఇంతకును ఇందులో పరమార్ధమేమిటంటే యంత్రము ఒక్కటే!  దాని ద్వారా నరుడు చేయు పరిశీలనలు అనేక రకములు కనుక ఇది లోక సంబంధము.

        ప్రియశ్రోతలారా!  ఆత్మ సంబంధము గాను పరలోకసంబంధముగాను  వున్న పరిశీలనలు పరీక్షలు పరిశోదనల యొక్క విధాన మెట్టిదో ఈ క్రియ జరిగించునది ఎవరో ఇట్టిక్రియల మూలముగా నరజీవితములో ఏర్పడిన బాగోగుల శారీరము గాను ఆత్మీయముగాను జరిగిన మంచిచెడులను గూర్చి బైబిలు వేదరీత్యా మనము తెలిసికొందము.  మొదటగా ఆది 6:11-12లో ఇది దేవుడు చేసిన పరిశీలన'', భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండుట, భూలోకము బలాత్కారంతో నిండి యుండుట'', అలాగే ఆది 18:10-13 చదివితే మమ్రేలోని సింధూర వనములో అబ్రహామును దేవుడు పరిశీలించి అబ్రహాము యొక్క ఆత్మీయ విశ్వాస విధానము యొక్క పరిమితిని పరిశీలించి పరీక్షించినట్లు తెలియుచున్నది.

        అదే విధముగా యోనా విషయంలో దేవుడు యోనా యొక్క భక్తిని విశ్వాస్వతను ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుటకు యోనాను ఆజ్ఞాపిస్తూ నీనెవే పట్టణమునకు వెళ్ళి దైవ రాజ్యమును గూర్చి ప్రకటిస్తూ నీనెవే పట్టణమునకు సంభవించబోవు దుర్గతిని గూర్చియు నినెవె పట్టణమును గూర్చి దేవునికున్న  ఉగ్రతను గూర్చి ప్రకటన జేయమన్నాడు.  కాని ఈ పరీక్షను ఖాతరు చేయక యోనా దైన ప్రణాళికను దైవోద్ధేశ్యానికి దైవ వాక్కునకు విధేయించక ప్రతికూలుడై దేవుడు వెళ్ళమనిన స్థలమును విడిచి దైవ పరీక్షలో నిలువ లేక వేరొక మార్గాన్ని ఎన్నుకున్నాడు.  అనగా దేవుని పరీక్షకెదురు తిరిగాడు.  దీని ఫలితము యోనా ఓడ యొక్క పతనానికిని ఓడకు సంభవించు చేటుకు కారకుడాయెను.  ఈ విధముగా దేవుడు యోనాకు పెట్టిన పరీక్షలో యోనా నిలువలేక మరణాన్ని  కోరుకొని ఓడ నాయకులను తనను ఎత్త్తి సముద్రములో పడవేయమన్నట్లు చెప్పుట.  అయితే యోనా మరణించి వుంటే నీనెవేే పట్టణము యొక్క ఆత్మీయ స్థితిని గూర్చి దేవుని ప్రణాళిక విచ్చిన్నమయ్యేది.  కాని దేవుడు సర్వశక్తిమంతుడు గనుక యోనా శరీరాన్ని సముద్రానికి అప్పగించక చేస గర్భానికి అప్పగించి, చేపగర్భములో యోనా మూడు దివారాత్రములు ప్రార్థనా యుతస్థితిలో దైవత్వాన్ని అభ్యర్థించి దేవుని పరీక్షలో దైవోద్ధేశ్య ప్రకారము నీనెవే పట్టణానికి చేర్చబడ,ి దైవ కార్య సాఫల్యతకును దేవుడు తనకు అప్పగించిన కార్యదక్షత సాధింపునకు యోగ్యుడై నీనెవే పట్టణ సువార్త ప్రకటన విషయములో విజయుడాయెను.

        ఈ విధముగా దేవుడు తన జనాంగమైన ఇశ్రాయేలీయులను కూడా వారి ఆత్మీయ జీవితాలను పరీక్షిస్తూ వారు తిరుగుబాటు జేయునపుడు వారిని మొత్తి అన్న పానాదుల విషయములోను మరియు ఇశ్రాయేలు జనమును అన్యులకు అన్యరాజులకు అప్పగించి పరీక్షించునపుడు ఇశ్రాయేలు కూడా అప్పుడప్పుడు తన అజ్ఞాన అవిశ్వాస జీవితాల మూలముగా దాపురించిన అనర్ధాలకు దైవ పరీక్షలో బుద్ధి తెచ్చుకొని దైవత్వము వైపు మరలినట్లు కూడా బైబిలు చరిత్ర వివరిస్తున్నది.  అట్లే ఆది 22:1-3 చదివితే అబ్రహామును పరిశోదించినట్లు తెలియుచున్నది.

        పరిశోధన అంటే జరిగిన కార్యము లేక ఒక భక్తుడు ఏదేని కార్యసిద్ధి కోసము ఇహలోక సంబంధంగా దైవత్వాన్ని అభ్యర్థించినపుడు దేవుడు భక్తుని యొక్క విశ్వాస పరీక్షార్ధము భక్తుని కిచ్చిన వరమును గూర్చి దేవుడు పరీక్షించుచున్నది కూడా బైబిలులో ఆయా సందర్భాలలో వివరించబడియున్నది  అందులో అబ్రహాము విషయములో కూడా ఇట్టి సందర్భమేర్పడింది.  ఎట్లంటే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహామా! నీకు ఒక్కడైయున్న నీ కుమారుడగు ఈసాకును మోరియా పర్వత శ్రేణిలో నేను చూపించబోవు స్థలములో దహన బలిగా అర్పించవలెను.  ఇది దేవుని యొక్క  పరిశోదన, అంటే విశ్వాస పరీక్ష అని కూడా మనము గ్రహించవలసి యున్నది.  ఈదైవ పరిశోదనలో అబ్రహాము కార్యసిద్ధియై  అబ్రహాము యొక్క దైవ పరిశోదన సందర్భములో విజయముడైనట్లు వివరిస్తున్నది.  అట్లే యోబును కూడా దేవుడు సాతాను కప్పగించి పరిశోదించినట్లు అట్టి పరిశోదనలో యోబు శారీరకముగాను ఆర్ధికముగాను ఆత్మీయముగాను గొప్ప పోరాటము పోరాడి సాతాను శోదన, దేవుని పరిశోధనను, లోకము యొక్క పరీక్షనుఎదుర్కొని నెగ్గి తన జీవితాన్ని సుఖాంతము జేసుకున్నాడు.         

        ప్రియశ్రోతలారా!  పరిశీలన పరీక్ష పరిశోధన శోధన ఈనాలుగింటిలో మూడు దేవునివి ఒకటి సాతానుది.  దేవుడు పరిశోధన జేయునపుడు సాతాను సమయాన్ని ఆసరాగా చూసుకొని శోధన కార్యాన్నికి పూనుకొంటాడు.  ఇందును గూర్చి యాకోబు పత్రిక 1:12-13 కనుక క్రైస్తవ విశ్వాసులమైన మనము మనమే దేని సమస్యలు అనివార్య పరిస్థితులు ఏర్పడినపుడు మనలను మనమే పరిశీలించుకొని పరీక్షించుకొని పరిశోధించుకొని మనకు సంభవించిన అనర్దాలు దైవిక మూలము గానులేక సాతాను మూలముగాను ఏదియు కానపుడు లోకము వలన అని మనలను మనమే పరిశీలించు కోవలసిన అవసరత వున్నది.   ఈ సందర్భములో మార్కు 4:37-40 చదివితే ఏసుప్రభువు తన శిష్యుల విశ్వాస పరీక్షార్ధము జరిగించిన ఈ క్రియ రక్షకుని యొక్క విశ్వాస పరిశోధనే గాని ప్రకృతి వైపరీత్యము అపవాది యొక్క శోదన కాదని ఋజువగుచున్నది.

        కనుక ప్రియశ్రోతలారా!  ప్రతి నరునికిని శారీర ఆత్మీయ విషయములో అనేక విధాలైన పరిశీలన పరీక్ష పరిశోధన, శోధన వగైరా ప్రభావ మూలమున ఎన్నో సమస్యలు సందర్భాలు ప్రమాదాలు ఉపద్రవాలు కల్గుచుండును.  అందులో ఈ నవనాగరిక యుగములో దేవుని యొక్క పరిశోధన అన్నది బహుముఖవ్యాప్తమై విశ్వాసులను ఆయా సందర్భాలను బట్టి పరీక్షలలోను పరిశోదన లోను దైవత్వమన్నది మానవ జీవితాన్ని పరిశోధిస్తున్నది.  ఈ పరిశోధన అన్నది క్రైస్తవ జీవితములో ధనము బంగారు వెండి ఐశ్వర్యము పదవి అధికారము డిగ్రీ వగైరా రూపములో వుంటుంది.  ఇట్టి సంఘటనలు జరిగినపుడు విశ్వాసికి చాలా మెళకువ అవసరము.  అననీయ సప్పీరాలు దేవునికి ఇస్తానని మొక్కుకొని తమ స్వంత పొలాన్ని అమ్మ చూపినపుడు దేవుడు వారిని పరీక్షిస్తూ అసలు ధరకంటే నాలుగంతలు ధరపలుకునట్లు దానిని ఆమ్మించి అననీయ సప్పీరాలు యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశోధించినాడు.  అయితే ఈ పరిశోధనలో మొదట అననీయ దైవార్పితమైన దానిని దొంగిలించి అబద్దము పల్కినాడు.  దీనికి సంబంధించిన ఫలితము మరణము.  అటు తర్వాత భర్త బాటలోనే భార్యకూడా నడిచి భర్తమాటలనే మాట్లాడి భర్తవలె దైవ సంపదను తస్కరించి మోసగించి, అబద్ధ మాడినందుకు భర్త యొక్క స్థలానికే మరణ మార్గములో చేర్చబడింది,  అట్లే నయమాను విషయములో దేవుడు గేహాజీని పరీక్షించినపుడు గేహాజీ బంగారు వెండి నాసించి కుష్ఠురోగి అయ్యాడు.                          ప్రియశ్రోతలారా!  అపో 5:1-5 చదివితే అననీయ సప్పీరాలు ఇద్దరును పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఏకమైనట్లు అందుకు ముందే పరిశుద్ధాత్మ దేవుడు అననీయ సప్పీరాల యొక్క హృదయ మర్మాన్ని ఎరిగిన వాడై-వీరు అబద్దము చెప్పెదరో, లేక నిజమే చెప్పెదరో పరిశోధించాలని పేతురు ద్వారా పొలము అమ్మిన డబ్బును దేవునికి అర్పణగా అననీయ సప్పీరాలు ఇవ్వవలెనని సంకల్పించి యుండగా అట్టి సంకల్పమును అపవాదిఅడ్డుకొన్నాడు.ఇది సాతాను జరిగించిన క్రియ.  పరిశోధన దేవునిది శోధన సాతానుది.  పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా మాట్లాడుట, పేతురులో వున్న పరిశోధనను ఆసరాగా తీసుకొని అననీయా సప్పిరాలను శుద్ధాత్ముని యొక్క శక్తిని మహిమను గ్రహింపలేక పతనావస్థకు దిగజారియున్న అననీయ దంపతులను దేవుని పరిశోధిస్తూ దైవార్పితము కావలసిన అర్పించబడవలసిన ధనమును కొంత దొంగిలించి దాచుకొనేటట్లుగా సాతాను యొక్క శోధన కార్యము జరిగినది.  ఈ శోధనకార్యములో పరిశుద్ధాత్ముడు అననీయ సప్పీరాలను పరిశోధించిన పరిశోధన కంటె సాతాను కల్పించిన శోధన అననీయ దంపతుల విషయములో విజయాన్ని సాధించింది.  తత్ఫలితము అననీయ దంపతులకు దేవుడు విధించిన తీర్పు మరణము.        

        కనుక ప్రియపాఠకులారా!  మన ఇహలోక జీవితములో మనము దేవుని చేత పరిశోధించబడుచున్నామని పరిశీలించబడుచున్నామని పరీక్షించబడుచున్నామని మనము ముఖ్యంగా గ్రహించవలెను.  మనలను ఆయన పరిశీలించి పరిశోధించునపుడు మనము కూడా ఆయనను గూర్చి పరిశోధించవలెననిన సత్యాన్ని మరువకూడదు.  ఇందునుబట్టి యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలిసికొనుడి.  యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడు.  ఆయన సమీపములో వుండగా  ఆయన బోధకు చెవియొగ్గుడి, ఆయన ఆశ్చర్య కార్యాలను పరిశీలించుడి.  ఇవన్నియు విశ్వాసులమైన మనము  దైవత్వమును గూర్చి పరిశోధించవలసిన వేద వాక్యములు.  కనుక దేవుడు మనలను పరీక్షించి పరిశీలించి పరిశోధించినపుడు విశ్వాసులమైన మనము కూడా కీర్త 1:లో వలె మనము కూడా ఆయన పరిశుద్ధగ్రందములోని వేదసాహిత్యాలను పరిశీలించి వాటిని గూర్చి పరీక్షించి దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను గూర్చి పరిశోధించవలసిన వారమైయున్నాము.  ఇది క్రైస్తవ జీవితానికెంతో అవసరయైయున్నది.  ఆమేన్‌.

                పరిహారము

        ఇక 32వ కీర్తనను గూర్చి ధ్యానించుకొందము.  తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు.  ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు.

        ప్రియపాఠకులారా!  పై రెండు వచనములను గూర్చి ధ్యానించుకొందము.  యిందులో మొదటిది.  తన అతిక్రమములకు పరిహారము అన్న దానిని గూర్చి కయీను తాను చేసిన సోదర హత్యను బట్టి తాను చేసిన అతిక్రమమును బట్టి దైవసన్నిధిలో కయీనులో వున్న అతిక్రమము ఎటువంటిదంటే ఈర్ష్య, ద్వేషము, అసూయ,కక్ష, క్రోధము, ఈ ఐదు గుణములు చేరి కయీనును అక్రమానికిని తత్సంబంధమైన పాప క్రియకును కయీనును ప్రేరేపించినవి.  హేబేలును బట్టి కయీనును దేవుని శాపమును బట్టి ''నా దోష శిక్ష నేను భరించరానంత గొప్పది,'' అనుటలో కయీనులో కలిగిన పరివర్తన యొక్క విలువ గుర్తించగలము.  మానవ స్వభావముతో కాక దైవ స్వభావముతో మన మాలోచించినట్లుయితే మానవునికి క్షమాపణ అనుగుణము అంత సులభ సాధ్యము కాదు.  దైవత్వమునకు క్షమించుటకును శిక్షించుటకును అధికారమున్నది.  కనుక కయీనులో కలిగిన ఈ పరివర్తనకు దేవుడతని పట్ల కనికరించి ''ఎవడును అతనిని చంపకుండునట్లు కయీనులోని అతిక్రమమును ఇతను చేసిన సోదర హత్య అను పాపమునకును ప్రాయశ్చిత్తం పొందిన కయీను యొక్క మార్పును బట్టి దైవత్వం చేత ఒక ముద్రను పొందినట్లు చదువగలము.

        అదే విధంగా ఏసు ప్రభువు కూడా మార్కు 2:లో కపెర్నహోమ్‌ నగరమునకు వచ్చినపుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటయైనను స్థలము లేకపోయెను.  కనుక కొందరు పక్ష వాయువు గల మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయనను చేరలేక ఆయన వున్న చోటికి పైగా యింటి కప్పు విప్పి నందుచేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి.  యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా!  నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పుట.  అటు తర్వాత వచనములో వానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నా'' అనుట, వెంటనే వారి ఎదుట నడిచిపోవుట'' అన్నది ఈ పక్షవాయువు గల రోగిగా వున్న వ్యక్తి చేసిన పాపము అతనిని మంచము పట్టించి కదలని స్థితిలో వుంచి దేహంలో ఒకవైపు భాగమంతయు స్సర్శలేని విధంగాను చలనంలేని విధంగా చేసినపుడు,యేసు ప్రభువు ఆ రోగి నుద్దేశించి కుమారుడా!  నీ పాపములు క్షమించబడియున్నవి'', అనుటలో అతని పాపముల వల్లనే అతనికి ఆ పక్షవాయువు అనిన రోగము ప్రాప్తించెనని అట్టి పాపములకు ప్రాయశ్చిత్తము జరిగితేనే స్వస్థత అను క్రియ జరుగగలదని ఏసు ప్రభువు ప్రత్యక్షంగా పక్షవాయువు స్వస్థతను జరిగించినట్లు తెలియుచున్నది.

        పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగిన నాడే పాపం వల్ల వచ్చిన రోగము మరణము అనే వాటి నుండి విమోచన విడుదల కలుగుతుంది అని మనము గ్రహించాలి.  పాపమునకు ప్రాయశ్చిత్తం జరుగకపోతే దైవ చట్టమును అతిక్రమించి దావీదు మహారాజు చేసిన ఘోరాతి ఘోరమైన పరస్త్రీ  అపహరణ, ఆ స్త్రీని అపహరించుటయే కాక ఆమెను చెరిపి ఆమె భర్తను హత్య చేయించుట నేరము నుండి తాను ప్రలాపించి ఎంతో బాధతో ఉపవాసములతో దైవత్వమును గూర్చి ప్రలాపించి, ఏడ్చి మొరపెట్టుచు తనకు కలిగిన ఘోరాపరాధమును మన్నించి, తన మూలంగా తనకు ఆ ఊరియా భార్యయైన బత్షెభాకు పుట్టిన బిడ్డకు వచ్చిన తన అతిక్రమమును బట్టి కల్గిన రోగము మరణకరమైన తాపమును గూర్చి దేవునికి మొరపెట్టి ఏడ్చినాడు.  అయితే ఆ శిశువును దేవుడు మొత్తి చంపినాడు.  అనగా దావీదు చేసిన అతి క్రమములకు పరిహారముగా దేవుడు ఆ బిడ్డను తీసుకున్నాడు.  యిక దావీదు చేసిన పాపమునకు దావీదుప్రాయశ్చిత్వం చేసుకున్నాడు.  ఎట్టంటే శిశువు అస్వస్థతగా వున్నప్పుడు దావీదు ఉపవాసంతో బట్టలు చింపుకొని ధూళి చల్లుకుంటూ  ప్రలాపించి ఏడ్చి ప్రార్ధించాడు.  తాను చేసిన ఘోర పాపాన్ని గూర్చి అంగలార్చినాడు.  అందుకు ప్రాయశ్చిత్తంగా దేవుడు దావీదుకు బదులు శిశువును తీసుకున్నాడు.  యిది దావీదు పాపమునకు ప్రాయశ్చిత్తము.  అట్టి సందర్భములో దావీదు మహారాజు ధన్యత్వం పొందినవాడై చనిపోయిన బిడ్డను గూర్చి యింక చింతించక స్నానము చేసి బట్టలు ధరించి రాజ భోజన మాచరించినట్లు వేదంలో చదువగలము. అనగా దైవసన్నిధిలో పరిహారమును ప్రాయశ్చిత్తమును పొందినట్లుగా తన్నుతానెంచుకున్నాడు.

        ''యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడినవాడు'', అనుటలో యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడిన మొట్టమొదటివాడు హనోకు.  కనుకనే దేవునితో నడిచాడు.  దేవుడతనిని కొనిపోయాడు.  అటు తర్వాత రెండవ నిర్దోషి నీతిమంతుడు నోవహు.  ఈ తరము వారిలో నీవేె నా యెదుట నీతిమంతుడవుగా కనపడుచున్నావు''.  అని దేవుడు అంటాడు.  కనుకనే జల ప్రళయ మారణ హోమము నుండి తప్పించబడినాడు..  మరి యొక్క నిర్దోషి ఎవరంటే యోబు.  యోబు తన క్రియలలో ఎట్టి దోషము చేయనివాడు.  మరియు దైవత్వం చేత యదార్ధవంతుడుగా బిరుదులు పొందినాడు. నూతన నిబంధనలో యోహా 8:4-11 వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ విషయంలో శాస్త్రులు పరిసయ్యులు ఆమె వ్యభిచారియని ఏసు యెదుట నిలువబడి ఏసు యొక్క తీర్పును గూర్చి ఆయననుశోదిస్తూ అడిగిన విధానంలో ఏసు ప్రభువు చెప్పిన మాట - ''మీలో పాపము చేయనివాడు రాయి వేయవచ్చు'', అని వారితో చెప్పినపుడు వారా మాట విని పెద్దవారు వెళ్ళుటలో ఏసు ఒక్కడును ఆ స్త్రీయు నిలువబడియుండగా ఏసు  చెప్పిన మాట అమ్మా!  నేనును నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి యిక పాపము చేయకుము అని ఆమెతో చెప్పుట అనగా దైవత్వము చేత వ్యభిచార స్త్రీ నిర్దోషిగా తీర్పు పొందింది.

        ప్రియపాఠకులారా!  ఒకరిపై సులభంగా నేరారోపణ, నిందారోపణ చేయుమనము ఒకరి పాపమును ఒకరి అపరాధమును సులభంగా వేలు పెట్టి చూపు మనము, ఒకరిని చులకనగా మాట్లాడు మనము, ఆత్మీయ స్థితిని గూర్చి ఏనాడైనా పశ్చాత్తాపము ప్రాయశ్చిత్తము పొంది నిర్ధోషుల జాబితాలో ఏనాడైనను ఎంచబడియున్నామా?  మనము నిర్దోషులుగా ఎంచబడాలంటే అది దైవ నిర్ణయమై యున్నది.  మానవ చట్టాలు మానవ నిర్ణయాలు మానవ తీర్పులు మనుష్యుల మీద ఆదారపడి మనుష్యులు యిచ్చు సాక్ష్యమును బట్టి వకీళ్ళ వాదనలను బట్టి పోలీసు రిపోర్టులు వారి సాక్ష్యమును బట్టి దోషిని కూడా నిర్దోషిగాను నిర్దోషిని దోషిగాను తీర్పు చెప్పుట నేటి యుగంలో సర్వసాధారణంగా జరుగుచున్న క్రియ.  నరుల చేత నిర్దోషిగా ఎంచబడుటన్నది  ఏనాటికైనా శ్రేయస్కరం కాదు.  పలుమారులు ఒక వ్యక్తిని నిర్దోషిగా నిర్దోషివి అన్నపుడు ''నేను దోషం చేసినను నిర్దోషి జాబితాలో వుంటుందని ఆ వ్యక్తి రహస్య పాపాలు చేయుటకు ఉపక్రమించును.  ఎందుకనగా నిర్దోషి అనిన బిరుదు తనకంటగట్టబడింది.  కనుక రహస్యమందు చేయు పాపములను కప్పి పుచ్చుకొనుటకు  ప్రయత్నించును.  అయితే పైన వివరించబడిన బైబిలులో వున్న వ్యక్తులు దేవుడైన యెహోవా చేతను ఆయన రూపమైన ఏసు ప్రభువు చేతను నిర్దోషులుగా తీర్చబడియున్నారు.  కనుకనే వారు తమ పాప బంధకముల నుండియు రోగ బంధకములనుండి మరణ బంధకముల నుండియు విమోచించబడి తీర్పులోకి రాక ప్రాయశ్చిత్తము పరిహారము పొందియున్నారు.

        యిక రెండవ చివర ఆత్మలో కపటములేని వారు ధన్యులు'', అనుటలో ఆత్మలో కపటమన్నది యాకోబు సంతానంలో యోసేపునకును నయమాను యొక్క కుష్టు రోగమును విమోచించిన ఎలీషాకును నూతన నిబంధన కాలంలో ఏసు ప్రభువు, ఆయనేర్పరచుకున్న 12 మంది శిష్యులలోను, దైవ రాజ్యం కొరకు ప్రాణ త్యాగం చేసిన హత సాక్షులు వేద సాక్షులులోను ఈ యొక్క ఆత్మ కపటము లేనట్లుగాను, యిట్టి కపట వర్తనం లేనందు వల్లనే పరలోకంలో వున్న దేవుని యొక్క యెరూషలేము అను పట్టణ పునాదులు 12 మంది అపోస్తలుల నామధేయాల మీదను దాని అలంకరణలు వేద సాక్షులుహత సాక్షుల యొక్క చరిత్రల మీదను రూపించబడినట్లు మనము గ్రహించాలి.  ఆ విధంగా నిష్కపటమైన జీవితంలో జీవించిన ఆ మహాభక్తులు జీవిత చరిత్రలు యిహము నందు గ్రంధ రూపములోను పరము నందు దైవ సన్నిధిలోను, నేటికిని లేఖనముల ద్వారా ధన్య వంతములైనట్లు వారి జీవితాలు కూడా ధన్యకరములైనట్లు యిట్టి ధన్యకర జీవితమునకు యెహోవా దేవుని యొక్క సన్నిధికి ఆయన కుమారుడైన ఏసు ప్రభువు  యొక్క దృష్టి  మూలమైయున్నట్లు మనము గ్రహించవలసియున్నది.

        ఏసు క్రీస్తు ద్వారా ధన్యతను పొందాలంటే మత్త 5:3-11 యెహోవా చేత ధన్యత పొందాలంటే కీర్త 84:4 ఆయన మందిరంలో నివసించాలి.  నిత్యము ఆయనను స్తుతించాలి.  ఆయన వల్ల బలము నొందాలి.  ఆ తర్వాత కీర్త 128 యెహోవా యందు భయభక్తులు గలిగి ఆయన త్రోవలలో నడుచువారు ధష్యులు.

        నేను మౌనినైయుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్త ధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి.  ప్రియపాఠకులారా!  దావీదు తన జీవితంలో మౌన ప్రార్ధనాను భవమును కూడా పొందినట్లు అనంతరము ప్రార్థనాశక్తి చేత ఉపవాసం చేత నీరసించినట్లు, దైవత్వానికి విజ్ఞాపన చేసి మొరపెట్టగా కంఠస్వరం కూడా నీరసించినట్లు ఇట్టి నీరసము వలన నరములు, ఎముకలు కూడా పటుత్వాన్ని కోల్పోయినట్లు యిందులోని భావము.  ఊరియా భార్యకు పుట్టిన శిశువు యొక్క జబ్బు నిమిత్తము స్వస్థతనుగూర్చి యెహోవాకు దావీదు చేసిన ప్రార్ధన యొక్క విలువ ఈ వాక్యములో ప్రకటిత మగుచున్నది.  అనగా దావీదు చేసిన  మౌన ప్రార్ధన-యాకోబు'', దేవునితో చేసిన పోరాటమునకు సమకాలికమై యాకోబు వలె దావీదు కూడా మౌన ప్రార్థనా పోరాటం పోరాడి దినముల పర్యంతము ఉపవాస వ్రతమాచరించి బలహీనపడి దివారాత్రులు బరువైన దేవుని హస్తమును మోయలేక నీరసించినట్లు ఈ మూడు నాలుగు వచనములలోని భావము వివరిస్తున్నది.

        ప్రియ పాఠకులారా!  ఐదవ వచనంలో నా దోషమును కప్పుకోక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని.  యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు ననుకొంటిని.  నీవు నా పాప దోషమును-'' దావీదు దైవ సన్నిధిలో చేసిన పాపమును లోక చట్టమునకు వ్యతి రేకములును లో ప్రభుత్వాలు క్షమించరానివైయున్నవి.  కాని దావీదు మహారాజు తాను చేసిన దోషములు తన పాపములను మరణ బంధకాలలో వున్న తన బిడ్డలోక వైద్యులకు కాక లోక సంబంధమైన చికిత్సలకు కాక లోకసంబంధమైన వ్యాధి పరిశోధనతో కూడినది కాక, దైవ సన్నిధిని దేవుని ముఖ కాంతిలో తన పాపములను గూడా బాహాటంగా దేవుడు దావీదు చేసిన క్షమించరాని పాపమును క్షమించి ఏడవ వచనంలోవలే దావీదునకు దాగుచోటుగాను శ్రమలో నుండి రక్షించు నిలయముగాను విమోచన కలిగించుటకు రక్షకునిగానునీతిని ఉపదేశించుటకు ఉపదేశకుడు గాను, నడుపవలసిన మార్గమును బోధించుటకు బోధకుడిగాను అందుకు అవసరమైన నీతిని బోధించుటకు ఆలోచన కర్తగాను ఏడు, ఎనిమిది వచనాలలో వివరించబడి యున్నది.  ఏలీయాకు దాగుచోటు  దేవుడే ! శ్రమలలో నుండి అతనిని విడిపించాడు.  దేవుడు తన దూత చేత ఉపదేవము చేసి ఏలీయా నడువ వలసిన మ్గామును బోధించెను.  యెజెబేలుకు భయపబి ఏలీయా పారిపోవగా ఏలీయాకు దేవుడు దర్శనమిచ్చి నడవవలసిన మార్గమును ఉపదేశించాడు.

        ఇక :9: బుద్ది జ్ఞానములేని గుఱ్రమువలెనైనను కంచరగాడిదవలెనైనను వుండకుడి అని అంటున్నాడు.  వాటిని నీవద్ద కళ్ళెంతో బింగింపవలెను గుఱ్ఱమునకును కంచర గాడిదకును బుద్ది జ్ఞానము కలుగాలంటే దాని నోటకిి కళ్ళెము అవసరమై వున్నది.  ప్రియ పాఠకులారా!   జ్ఞానము వివేకము కలిగిన మనిషికి కూడా నోటికి కళ్ళెము వాడుకోవలసియున్నది.  నోటి మాటలవలనేె నరుడు చెడుచున్నాడు.   నోటి మాటల వల్లనే నరుడు చెడినాడు.  నోటి మాటలే నరునికి పాపము తెప్పించాయి.  నోటి మాటలే పాత నిబంధనకాలంలో యుద్ధాలు రేపసినవి.  నోటి మాటలే లోకమంతటికి నేడు రక్షణకు మూలమైయున్నది.  నోటి మాటలే వేదాలైయున్నవి.  అనగా దేవుడు ప్రవక్తల నోటి నుండి పలికినమాటలే నేడు వేదాలైయున్నవి.  దేవుని మాటలే పరిశుద్దంగా వ్రాయబడినవి.  దేవుని నోటి మాటల చేతనే సృష్టి యావత్తును చేశాడు.  నోటి మాటల ద్వారా పాపం ఏదెనులో నరుని శాసించాడు,  అయితే నరుని నోరు ఊరుకోలేదు.  నోటి ద్వారా తెచ్చుకున్నాడు.  నోటికి కళ్ళెము పెట్టుకొనే స్థితికి దిగజారిపోయాడు.

        ప్రియ పాఠకులారా!  నరకోటి యొక్క నోటికి దైవ చట్టమన్నది వారును, కళ్ళెమన్నది ఆయన హెచ్చరికయై యున్నది.  యిందువల్ల భక్తిహీనులకు అనేక వేదనలు కలిగి నాశనానికి గొయ్యి త్రవ్వుకున్నారు.  నోటి మాటల ద్వారానే అననీయ సప్పీరాలు మరణాన్ని చవిచూచారు.  కనుక 10 వచనంలో వలె యెహోవా యందు నమ్మికయుంచువారిని కృప అవరించుచున్నది.  అంటున్నాడు.  యిందులోని పరమార్ధం, దైవ ధ్యానంలో నిమగ్నమై దేవుని యందు నమ్మికయుంచి తమ జీవిత బాటను ఎవడైతే నిర్మించుకుంటాడో అట్టి వానిని దేవుని కృపయైన క్రీస్తు యొక్క ప్రేమ ఆవరించుటన్నది సత్యము, కాపాడునన్నది యదార్దము.

        కనుకనే 11వ వచనంలో నీతిమంతులారా!  యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, యదార్ధహృదయులారా!  మీరందరును ఆనందగానము చేయుడి'',  ఈ వచనంలో నీతిమంతులెవరు?  నీతిమంతులు యెహోవాను బట్టి ఎట్లు ఉల్లసించి సంతోషించినారు? యదార్ధ హృదయులు ఏవిధంగా ఆయనను గూర్చి ఆనందగానము చేశారు?

        నీతిమంతులుః- ఆదికాండములో దెవుడెన్నుకున్న నోవహు -'' ఈ తరము వారిలో నీవె నా యెదుట నీతిమంతుడవుగా అగపడుచున్నావు  నీ కొరకు నీ యింటివారి కొరకును ఓడను సిద్ధము చేసికొనుము.

        ప్రియ పాఠకులారా!  దేవుడు మొట్టమొదటిగా భూమి మీద నరులలో నీతిమంతునిగా నోవహునే సంబోధించాడు.  ఎందుకంటే నోవహు నరులను బట్టి గాక లోకాన్ని బట్టే గాక లోకం యొక్క ఆచారాన్ని బట్టి గాక తుదకు తన బంధువర్గము తన అల్లుళ్ళను కూడా లెక్కచేయలేదు.  నోవహు బ్రతికిన దినములన్నియు యెహోవాను బట్టి సంతోషిస్తూ అతను అతని కుటుంబము జలప్రళయానికి ముందును జలప్రళయం జరిగినపుడును; జలప్రళయం జరిగిన తర్వాత కూడా మొట్టమొదటగా తన యింటి యందును ఆ తర్వాత నీళ్ళమీద ఓడ యందును, జల ప్రళయానంతరం ఓడ నిలిచిన ఆరారాతు పర్వతాలను మీదను యెహోవాను బట్టి సంతోషించి, తనను తన కుటుంబాన్ని దైవ ప్రణాళికానుసారంగా తాను నిర్మించిన ఓడను-ఓడలోని జీవరాసులను కాపాడిన దేవునికి కృతజ్ఞతగా ఓడలో వున్న పశుపక్ష్యాదులలోకొన్నిటిని దహన బలిగా అర్పించి ఉల్లసించినట్లు నోవహు చరిత్ర ఋజువుపరచుచున్నది.

        యింక రెండవ నీతిమంతుడు నూతన నిబంధన కాలంలో మత్త 1:19 లో కన్నెకయైన మరియ భర్తయైన యోసేపు ఆయన నీతిమంతుడైయుండి దైవత్వం చేత హెచ్చరిక చేయబడి తన నీతిని దైవత్వానికి వెల్లడించి దైవ కుమారునికి పితృ సమానునిగా ఎంచబడినాడు. దైవ కుమారునికి తండ్రిగా జీవించాలంటే దైవత్వంలో ఎంత నీతి గుప్తమైయున్నదో అంత నీతి దేవుని బిడ్డను కానుకగా పొందిన స్త్రీపురుషులకు వుండకపోతే అట్టి వారిలో దేవుడు నరావతారమెత్తుట వ్యర్థమే!  యోసేపు నీతిమంతుడు గనుక తన నీతి మూలమున అటు దైవత్వాన్ని మరియ యొక్క మానవత్వాన్ని ఇటు భూలోకాన్ని గాని దూషించలేక ఖిన్నుడైయుండి కలవరపడినపుడు దైవదూత యొక్క మాటల చేత జ్ఞానోదయం పొందిన వాడై ఉత్సహించి ఉల్లసించినాడు.  ఇక లూకా 2:25-32 చదివితే సుమియోను విషయంలో నీతిమంతుడుగాను భక్తిపరుండైయుండి ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుచు పరిశుద్ధాత్మ వశుడై బాలయేసును హస్తమందు ఎత్తికొని ప్రతిజ్ఞ చేయు యోగ్యతను పొంద గలిగినాడంటే ఎంత మహాభాగ్యమో మాన మాలోచించవలస ియున్నది.   ప్రియ పాఠకులారా!     నీతిమంతుడు యెహోవా ను బట్టి సంతోషించు విధమును ఉల్లసించిన విధానాన్ని బైల్పరచుచున్నది.

        యిక యదార్ధ హృదయులారా!  మీరందరు ఆనందంగానముచేయుడి'', అనుటలో యదార్ధ వంతుడెవరో మనము తెలిసికోవలసియున్నది.  యోబు దైవత్వమును విసర్జించని వాడు, దేవుని చేత యదార్ధవంతుడును యదార్ధముగల హృదయునిగా ప్రవచించబడినవాడు.  యిక రెండవ యదార్ధ వంతుడు కనుకనే ఏసు ప్రభువును దావీదు కుమారుడుగా పిలుచుటకు యోగ్యుడాయెను.

        ప్రియపాఠకులారా!   ఏసు క్రీస్తు యదార్ధుడైనందువల్లనే ఏసుక్రీస్తు జన్మను బట్టి దావీదు యదార్ధుడుగా ఎంచబడినాడు.  పాపియైన వాడు యదార్ధుడే విధంగా అయ్యాడన్న సంశయం కలుగక మానదు.  దీనికి జవాబు బైబిలులో ఆదికాండంనుండి నూతన నిబంధన అపోస్తలుల కార్యములు అటు తర్వాత  రాకడ కాలం ఇప్పటి వరకు ఇట్టి వారు అనగా యదార్ధ వంతులు వున్నారనుటకు ఋజువులు వున్నవి.  మొట్టమొదటి దావీదు కీర్తన 15:1-2  చదివితే యదార్ధమైన జీవితాన్ని సత్యమైన జీవితాలను గూర్చిన సాక్ష్యము మనకు తెలియగలదు.  యదార్ద హృదయము గనుకనే యోబు తన కష్టంలోను శోధనలోను దేహ బాధలోను శ్రమలలోను యిరుకులోను, యిబ్బందులలోను, దేహం మీద కలిగిన బాధాకరమైన వ్రణములతోను తానుండవలసిన సుఖాసనములను విడిచి బూడిద కుప్పలో కూర్చుని చిల్లపెంకుతో గీరుకొనే నికృష్టమైన స్ధితిలో ఈషణ్మాత్ర మధైర్యపడక ధైర్యంతో పై అరిష్టాల నెదుర్కొని విజయుడై ముందు కంటె రెండింతలు ఐశ్వర్యాన్ని శోధన అనంతరం పొందినాడు.

        అట్లే దావీదు మహారాజు తన యదార్ధ హృదయంతో దైవాత్మ సహకారమును పొంది దేవుని బిడ్డలకు రాజై దైవ విరోధులతో పోరాడి దేవుని ప్రజలకు విజయాన్ని చేకూర్చి దైవాత్మ ఆవేశంలో దేవుని దశాజ్ఞల మందసం నూరేగిస్తూ పరవశించి తంబుర సితార మేళ తాళ నాదములతో దేవుని గూర్చి ఆనంద గానం చేసినట్లు వేదంలో చదువగలము.  కొర్నేలి ఒక పెద్ద పటాలమునకు శతాధిపతియైయుండి తన ఇహలోక పదవిని అల్పముగా ఎంచి దైవత్వాన్ని గూర్చి ప్రార్థనలు ధర్మ కార్యాలు చేస్తూ అనుదినము తన కుటుంబ సమేతంగా యదార్ధ హృదయముతో ప్రార్దనతో ఆనందగానము చేసినట్లును తన్మూలంగా దేవుని యొక్క దూత దర్శనం పొందగలిగినట్లును  తన్మూలంగా తర్వాత దైవత్వమును సంపాదించుటకు హితోపదేశము పొందినట్లును ఈ వేద భాగంలో చదువగలము.

        ప్రియ పాఠకులారా!  ఈ అంశమును చదువుచున్న మనమే జాబితాలో యే ఆనందంలో యే మనో స్ధితిలో యే విశ్వాసములో యెట్టి నిరీక్షణలో యెట్టి సిద్దపాటులో వున్నామో, మనలను మనమే పరిశోధించుకోవాలి.  అంటే నీతిమంతులమైయుండి యెహోవా ప్రతి రూపమైన ఏసు యొక్క నామములో సంతోషించి ఉల్లంఘించువారి జాబితాలో వున్నామో? ఆయన సన్నిధిలో యదార్ధ హృదయములమై క్రమము తప్పక దైనిక సేవానంద సావాసంతో కూడి ఆనంద గానం చేయువారి జాబితాలో వున్నామా? యివి రెండును కాకపోతే సినిమాలు, టివీలు చూచెడివారి కూటమిలో వున్నామా? దేవునిలో వున్నామా? లేక మనకున్న కష్టములు వేదనలు అనారోగ్యతలను బట్టి దేవుని అభ్యర్ధించుటకు బదులుగా ఆయనకు విజ్ఞాపన చేయుటకు బదులుగా ఆయన నామాన్ని దూషిస్తూ ఆయనకు వ్యతిరేక నినాదాలు చేస్తున్నామా? ఏ స్థితిలో వున్నాము?

                రుచి చూచుట

        కీర్తన 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికోనుడీ! ఈ రుచి ఏమిటి? ఇది శారీర సంబంధమా? ఆత్మ సంబంధమా? ఇది లోక సంబంధమైనదా'', పరలోక సంబంధమైనదా?

        ప్రభువు నందు ప్రియసోదరీ!సోదరా!  యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుటకు ఈ రుచిలో కూడా త్రిత్వమున్నది. అందులో 1.ఆత్మీయము 2.యదార్ధత 3. జ్ఞానము అనగా వివేకము సర్వసాధారణంగా మనము లోకరీత్యా ఒక వంటను గాని ఒక  పదార్ధమును గాని తయారు చేయునపుడు అందులో వున్నటువంటి ఆ మధురానుభూతిని అనగా దాని యొక్క గుణాతిశయమేమిటో రుచి చూస్తుంటాము.  ఇది ప్రతి వంటవాడును.  ప్రతి గృహములోను ప్రతి యొక్కరు రుచి చూచునట్టి క్రియ.  లోకరీత్యా ఎన్నియో సందర్భాల్లో ఈ రుచులను మనము అనుభవించుచున్నాము.  చూస్తున్నాము.  రుచి చూచినపుడు ఏదైన లోపమున్నట్లయితే ఆ పదార్ధములో వున్న రుచిని చెడనివ్వక మరెక్కువ రుచిని కల్గించుటకు దానిని తయారు చేయుటకు ప్రయత్నిస్తాము.

        అదే విధంగా దేవుడు ఆదిలో లోకసృష్టిని జేసినపుడు ప్రత్యేకంగా తాను సృష్టించిన నరుని తన ఆత్మతో తన జీవముతో నింపి వాని స్వభావమును చవిచూచినాడు.  రుచిచూచినాడు.  కాని దేవుడు రుచి చూచినంతలో మానవుడు ఆయన రుచికి ఆగలేక పోయి భూసంబంధమైన వస్తువు ద్వారా మిళితమై తనలో వున్నటువంటి దేవునికి ప్రీతికరమైన రుచిని నరుడు చెడగొట్టుకొని దేవుని యొక్క రుచికి ఇష్టుడు గాలేకపోయెను.  ఇందుకు కారణము భూఫలమును రుచి చూచుటయే.  అయితే ఎంతో గొప్ప గుణాతిశయములతో నరుని యొక్క జన్మను గూర్చి ఆసించిన దేవుని యొక్క సంకల్పము.  నరుడు తానే స్వయంగా చెడగోట్టుకొనుటలో దేవుడు నొచ్చుకొని రుచికరమైన జీవితమును కోల్పోయిన నరుని పట్ల దేవుడు జాలిపడి చెడిపోయిన నరజీవితమును తనకు రుచికరముగ మార్చుటకు మరియొక్కసారి సంకల్పించి తానే ఈ లోకమునకు నరాకృతిలో వచ్చి నరుల యొక్క స్వభావములను పరిశోధించి రుచి చూచి కలుషితమైయున్న నరజీవితాన్ని దేవునకి రుచికరముగ మార్చుటకు కానా లోని పెండ్లి విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చుట, చనిపోయిన వానిని సజీవునిగ లేపుట.  అపవిత్రాత్మలు పట్టినవారు కుష్టురోగులు అంధులు వికలాంగులు వగైరా లోపములతో కూడిన నరజీవితాలను తన విశ్వాసము లోనికి మరల్చుటకును తత్ప్రభావమున దేవుడు తాను ఉత్తముడని నరులు తెలిసికొనుటకు ఆసించి ఏసుక్రీస్త్తను నామధేయముతో అదృశ్యుడై తనను రుచి చూడమన్నాడు.

        మరియు తనకు రుచికరమైనటువంటి అనగా తన పరిశోధనలో ఉత్తములని ఎంచిన విశ్వాసులతో ప్రవచిస్తూ మీరు లోకమునకు ఉప్పయి వున్నారు.  ఉప్పునిస్సారమైతే అది లోకము చేత త్రొక్కబడును.  ప్రభువు నందు ప్రియమైన వారలారా!    మీరు లోకమునకు ఉప్పయి వున్నారనుటలో ఏసుప్రభువు తానేర్పరచుకున్న బిడ్డలను అనగా తన విశ్వాసంలో నిలిచిన బిడ్డలను ఆయన పరిశోధించి షడ్రుచులలో ఒకటైన ఉప్పుకు పోల్చి అనగా ఒక వంటపదార్ధము ఎంత రుచికరముగ వున్నను ఎంత ఖరీదైన వస్తువులతో తయారు చేసినను అందులో ఉప్పు అన్నది లేకపోతే ఎవరును దానిని తినుట కిచ్చగించరు. తినలేరు కూడా.

        ఏసుప్రభువు దృష్టికి మనము మన విశ్వాసజీవితము ఉప్పువలె రుచికరమును ప్రీతికరమైన వస్తువుగ ప్రభువు దృష్టికిని ఆయన యొక్క రుచికిని మనము యోగ్యము కావాలి.  ఇట్టి యోగ్యతను మనము పొందాలంటే, ''ఉప్పు సముద్రపు నీటి నుండి తీయబడిన ఘనపదార్ధము.  ఇది లోకరీత్యా చాలా  చౌకబారు పదార్ధము.  అన్ని వస్తువులలోను ఉప్పంత చౌక ఏదియు లేదు.  కాని దీని విలువ గొప్పది.  అదే విధంగా మానవ జీవితము కూడా దైవ దృష్టికి దైవసన్నిధికి ఉప్పుగా ఎంచుటలో ''ఉప్పు జలరాశినుండి ఉత్పన్నమైనట్లు నరుడు నేలమంటి నుండి నిర్మితుడైనాడు.  మరియు నరునికి నేలకు ఏ విధంగా సంబంధబాంధవ్యాలున్నాయో అదే విధంగా సముద్రపు నీటికిని ఉప్పుకును అంత సమీపబంధుత్వమున్నట్లు మనము గ్రహించగలము.  మానవ జీవితమునకు  మట్టి  ఏ విధంగా ఆధారమైయున్నదో అనగా మానవ జీవితము నేలను ఆదరువుగా జేసికొని దీని ఫలసాయముల మీదను దీనిపై గృహనిర్మాణము యొక్క ఆలోచనలతోను దీనిని విస్తరించి సంపొయిచుకోవాలని దీనిపై తన వంశము తన పేరు ప్రతిష్ఠలు సుస్ధిరంగా వుండాలని నరుడు కలకంటున్నాడు.  ఈ విధంగా  కలకంటు నరుడు ఆహార రీత్యా ఉప్పుతో కూడిన వంటకాలను శారీరేచ్ఛలను బట్టి భూమి యొక్క వైభోగాలను రుచిచూచుచు రసాను భూతిని పొందుచున్నాడు.  అయినను దీనికి తృప్తి లేదు. ఈ సందర్భంలో బైబిలులోని కొందరు వ్యక్తుల జీవితములను మనము పరిశీలించితే దేవుడు నరులను రుచి చూచి తెలిసికొన్న రీతి నరులు దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలిసికొన్న రీతి చదువగలము.

        యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలిసికొన్న నరుల జాబితాః- హానోకుః- ఇతను దైవత్వాన్ని చవిచూచి సారముగల జీవితాన్ని జీవించి నిస్సారమైన ఈ లోకాన్ని విడిచి నిత్య  సార ఫలసాయమైన దైవరాజ్యానికి దేవునితో కూడా కానిపోబడెను.  ఇక్కడ దేవుడు ఉత్తముడని హానోకు రుచిచూచినాడు.  హానోకు ఉత్తముడని దేవుడు రుచి చూచి గ్రహించెను.  అదే విధంగా నోవహు ఆతని కుటుంబము ఆది 6:   బహుగా విస్తరించిన జన సందోహముతో భూమి మోయలేనంత విపరీతమైన  జన కోటితో నోవహును ఆతని కుటుంబము మాత్రము దేవుని దృష్టికి నీతిమంతులుగా తీర్చబడి నందువల్ల దేవుడు నోవహు రుచి చూచి నీవు ఒక్కడివే నాయెదుట నీతిమంతుడవుగా వున్నా వనుటలో దేవుని యొక్క భక్తి పారవశ్యములో నోవహు లోక నాశనాన్ని గూర్చి దేవుడు తనతో చెప్పిన విషయాన్ని నోవహు విశ్వాసంతో ప్రకటించుట. దైవ ప్రణాళిక ప్రకారం దేవుడిచ్చిన నమూనాలను బట్టి నోవహు జేసిన ఓడ వీటిని బట్టి మనము గ్రహిస్తే నోవహు కూడ దేవుడు ఉత్తముడని రుచి  చూచి తెలిసికొని జలప్రళయమను లోక నాశనము నుండి రక్షింపబడెను.  ఇంక లోతు విషయము మనము గ్రహిస్తే లోతు ఒక్కడే దైవత్వాన్ని రుచి చూచినట్లున్నది గాని ఆతని కుటుంబీకులు ఆ రుచిని అనుభవించలేక పోయినట్లు లోతు భార్య ఆతని అల్లుండ్ర జీవితము మనకు వివరిస్తున్నది.  లోతు యొక్క విశ్వాసంలో భార్య నడువనందువల్లనే లోకసంబంధమైన ఉప్పుగా మారి ఉప్పు స్ధంభమై నిస్సారమైన స్థితిలో పనికిమాలిన జీవితములో పాతరవేయబడినది.

        అటు తర్వాత దేవుడు తనజనాంగమైన ఇశ్రాయేలీయులకు నాయకుని నియమించుటకు మోషేను ఉత్తముడని ఎన్నిక జేసినట్లు  మనము చదువగలము.మోషే కూడా దేవుడు ఉత్తముడని రుచిచూచి నలబై సంవత్సరములు దైవాజ్ఞప్రకారంగా దైవ విధేయుడై తన ఇహలోక జీవితాన్ని దైవ జనాంగముపై నాయకత్వాన్ని నిర్వహించెను.  ఇంక ఏలియా యోహాను అబ్రహాము ఇస్సాకు యాకోబు సమూయేలు దావీదు సొలొమోను ఎజ్రానెహెమ్యా పాత నిబంధన కాలం నాటి ప్రవక్తలు  యెషయా ఇర్మియా మొదలగువారు.

        ఇంక క్రొత్త నిబంధన కాలంలో మరియమ్మ యోసేపులు.  ఆమె భర్తయైన యోసేపు నీతి మంతుడైయుండెను.  కనుక  ప్రభువును రుచిచూచి యున్నాడు. దేవుడు ఉత్తముడని రుచి చూచి యుండ బట్టే.  పరిశుద్ధాత్మ వలన నీవు గర్భవతివి అగుదువు అని దూత మరియమ్మతో చెప్పినపుడు.  ఇదిగో ప్రభువు దాసురాలను.  ఆయన మాట చొప్పున నాకు జరుగును గాకయని తన సమ్మతిని వ్యక్తము జేసినందున ప్రభువు ఈలోకమునకు వచ్చుటకు మార్గమేర్పడినది.  అట్లుగాక ప్రభువు ఆత్మ యొక్క రుచి ఎరుంగని స్త్రీలైతే లోక అపవాదు గల్గించు ఈ గర్భము నాకు అక్కరలేదని ఖండితంగా జెప్పి ఈ విషయము యెహోవాకు తెలియజేయండని తమ అసమ్మతిని వ్యక్తము జేసేవారు.  ఆ రోజులలో రాజాంతః పురములలోను శాస్త్రులు సమరీయులు పరిసయ్యుల ఇండ్లలో ఎందరో కన్నెకలుండగా ప్రభువు మరియమ్మను ఎన్నుకొనుటలో ఆమె ప్రభువు దాసురాలు.  ఆమె శరీర ఆత్మలు ప్రభువుకే అంకితము జేసి కొన్నదని ఇందును బట్టి మనకు ఋజువగుచున్నది.  యోహాను 15:7-8 వీరు శిష్యులు. ఆయనతో వున్నవారు.  ఆయన ప్రేమించినవారు.  ఆయన సోదరులు అగుచున్నారు.  మరియమ్మకు క్రీస్తు తర్వాత మరల బిడ్డలను కన్నదా? అనిన అంశమును గూర్చి నాచే ప్రచురించబడిన '' కంఉఖ ఐజుఙ|ంఏష్ట్ర ఞ కంఉఖ ఖంఊకజూష్ట్ర'' అను పుస్తకమును చదివి యదార్ధతను గ్రహించుదురు గాక!

        స్త్రీలు కనిన వారిలో యోహానంతటి నీతిమంతుడు ఎవరు లేరని ప్రభువు వాక్కును బట్టి మనకు అర్ధమగుచున్నది.  కాబట్టి బాప్తిస్మమిచ్చు యోహాను యేసు ప్రేమించిన మార్ద మరియలు 12 ఏండ్ల రక్త స్రావరోగి ఏసుప్రభువు యొక్క అంగీ అంచును తాకి ఏసుప్రభువు ఉత్తముడని తెలిసికొన్నది.  ఆమె చేసిన క్రియను బట్టి ఏసు ప్రభువు ఆమె యొక్క విశ్సావమును రుచి చూచి ఆమ్మా! నీ విశ్వాసవము గొప్పది.  సమాధానము గలదానివై పొమ్మన్నాడు.  ఇవ్విధంబుగ ఆమె స్వస్థురాలైనది.  సమరయ స్త్రీని యేసుప్రభువు దాహనకు అడిగి రుచి చూచినాడు.  ఆమె యొక్క గుణాతిశయములను ఆమె యొక్క దుర్భల జీవితాన్ని రుచి చూచి వివరించగా ఏసు ప్రభువు యొక్క మహిమా ప్రభావయుతమైన మాటలను సమరయస్త్రీ  రుచి చూచి ఆయనను ప్రవక్తగా తెలిసికొనింది.  లూదియా పౌలు బోధలను విని ప్రభువు ఉత్తముడని రుచిచూచి తెలిసికొని ఆయన యొక్క మధురానుభూతిని అనుభవించింది.  అదే విధంగా ప్రభువు ప్రతిష్టించిన 12 మంది అపోస్తలులు వేద సాక్షులు హతసాక్షులు ప్రభువు వుత్తముడని రుచి చూచి తమ జన్మను తరింప సార్ధకము చేసికొన్నారు.

        ప్రభువు నందు ప్రియసోదరీ!సోదరా!  నేటి మన జీవితమెట్లున్నది? దైవ దాసుల ద్వారా అనేకులైన బోధకుల ద్వారా ఉజ్జీవ సభల మూలముగాను, ఆలయములలో జరిగే ఆరాధన సందర్భాల్లోను రేడియోల ద్వారాను బోధలు వింటున్నాము.  మరియు ఏసు ప్రభువు ఆచరించిన పరిశుద్ధ బల్లను ఆచరిస్తు ఆయన శరీర రక్తములను రొట్టె ద్రాక్షరసములతో పొల్చి ఆరగిస్తు ఆయననారాధిస్తున్న మనము ఏసు ప్రభువు ఉత్తముడని ఆయనకు రూపము నిచ్చిన యెహోవా ఉత్తముడని వారిద్దరితో ఏకీభవించి క్రియజరిగిస్తున్న ఆదరణ కర్తయగు పరిశుద్దాత్ముడని ఏనాడైన మన జీవితములో రుచి చూచి తెలిసికొనియున్నామా?  లేక తెలిసికొనుటకు ప్రయత్నిస్తున్నామా? లేక ఆయన రుచిని ఎరుగకున్నామా?  ఆయననురుచి చూడాలంటే మోకరించి ప్రార్ధించాలి. మరియు ఆయన నిబంధనలను పాటించాలి.  ఆయనను పోలి జీవించాలి.  ఆయన దాసుల సావాసములో ఎదగాలి. అపుడే ఆయన రుచిని మనము తెలిసికొనగలము.  మరియు మనము ఆయనను గూర్చి తెలిసికొని రుచి చూచిన విధానాన్ని ఇతరులకు ఆయన లోని రుచిని సువార్త రూపంగా ఇతరులకు కూడా ఎరింగించి మరపాలి.  ఇతరులను కూడా ఆయనను రుచి చూచునట్లును మన ఇరుగు పొరుగునకు కూడా ఆయన యొక్క రుచిని వివరించి ప్రకటించి వారిని ఆత్మ రాజ్య సంబంధులుగా మార్చాలి.  అపుడే దేవుడు త్తముడని మనము రుచి చూచినందుకు ఇవి దాఖలాలుగా ఏర్పడగలవు.  లేకపోతే మార్కు 7:6  ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని, వారి హృదయము దూరంగా ఉన్నది.  మానవులు కల్పించిన పద్ధతులతో వ్యర్థంగా నన్ను ఆరాధించుచున్నారు.  కనుక మన జీవితము ఫలశూన్యము కాగలదు.

        37-12 భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంప చూతురు.  ప్రియపాఠకులారా! వేదంలో యిట్టి భక్తిహీనుతతో కూడియున్న భక్తి పరులను పొంచియుండి చంపజూచిన వారలలో ఉదా||మెర్దుకై సంబంధీకులను సమూలంగా నిశ్శేషంగా చంపాలని కుట్రపన్ని రాజశాసనాన్ని సృష్టించి పొంచియుండి చంపచూచిన ఆమాను యొక్క చరిత్ర ఈ సందర్భంలో మన మాలోచిస్తే ప్రత్యేకంగా తన యింటి వాకిట మెర్దుకయ్యను చంపాలని ఉరికంబాన్ని నాటి సమయం కొరకు పొంచినాడు.  కాని అతను అతని యింటి వారు ఆ ఉరికంబంలో చంపబడినారు.  ఇక దావీదు సౌలు విషయంలో దావీదు పదివేల మంది సౌలు వెయ్యి అనిన నినాదమునకు సౌలు ఖిన్నుడై దురాత్మ ఆవేశితుడై నీతిమంతుడైన దావీదును చంపాలని ఈటె చేతపట్టుకొని పొంచి సమయాన్ని బట్టి పొడవజూచినాడు.

        అయితే కీర్త 37:33లో వలె వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు.  అనగా పై భక్తి హీనులకు నీతిమంతులైన మొర్దెకైను, దైవజనాంగమైన యూదులను ప్రవక్తయైన దావీదును అప్పగింపలేదు.  ఇక వారు విమర్శకు వచ్చినపుడు దేవుడు వారిని దోషులుగా ఎంచడనుటలో ఒకానొక విమర్శదినమున అహష్వేరోషు తమ సంస్ధానపు తాకీదులు జారీజేయు అధికారి చేత విమర్శకు ఆజ్ఞ ఇచ్చి ఏయే సందర్భాలలో ఎవరు ఏయే కార్యాలు జేశారో క్షుణ్ణంగా విచారించినపుడు రాజైన అహష్వేరోషును సంహరించాలని బిగ్తాను తెరెషు అనువారిని దోషులుగా వారిని ఉరిదీయించుట.  ఇట్టి విపత్తు నుండి కాపాడిన మొర్దెకైను రాజ వస్త్రాలతో రాజ అశ్వము మీద రాచమర్యాదలతో పురవీధులలో ఊరేగించు సన్మానమును-రాజును చంపి తాను రాజు కావాలని హామాను పన్నిన కుట్రను బట్టి హామానుకు అతని ఇంటివారికిని ఉరిశిక్ష విధింపజేయుట.

        ఇక రెండవదిగ దావీదు విషయములో దావీదు పై ఈర్ష్యబూని దావీదును సంహరించాలని పొంచియుండిన దురాత్మ ఆవేశితుడైన సౌలుకు ఇశ్రాయేలీయులకును పిలిష్తీయులకును యుద్ధదినములు సంభవించగా - అట్టి యుద్దగడియలలో దేవుడు పిలిష్తీయులను బలపరచి సౌలుపై యుద్ధానికి రేపినపుడు సౌలు దైవ జనాంగానికి అధిపతియైన దేవునివిచారించక ఎన్డోరు సోదెకత్తెను ఆశ్రయించి సోదై చెప్పించుకున్న ఫలితానికి దేవుడే తీర్పు దీర్చి సౌలుకు మరణశిక్ష విధింపజేసి - సౌలు మరణానంతరం ఆతని రాజ్యాన్ని దావీదుకు ఇచ్చుట.

        ఇట్లు జరుగుటలో 34వ వచనములో యెహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము.  ఆయన మార్గాల ననుసరించుము'', అనిన ప్రవచనాన్ని మొర్దెకై నెరవేర్చినాడు. ఎస్తేరు నెరవేర్చింది.  దావీదు మహారాజు నెరవేర్చాడు. ఎట్లంటే అహష్వేరోషుకు భార్యయైనంత మాత్రాన ఎస్తేరు యెహోవా కొరకు కనిపెట్టుకొనుటన్నది విడువలేదు.  నిత్యమును తన ప్రార్థన విజ్ఞాపనల ద్వారా తనకు రాచరిక మనుగ్రహించిన దేవుని స్తుతిస్తూ ఘనపరచుచు ఆయన కొరకు కనిపెట్టుకొనియుండినట్లును అదే విధంగా మొర్దెకై తన జనాంగానికి కీడు తలపట్టిన నరులను గూర్చి రాజశాసనాలను గూర్చి యెహోవాకు విన్నవిస్తూ ఆయన కొరకు కనిపెట్టుకిని దైవమార్గాన్ని అనుసరించాడు.  అంతేగాని లోకసంబంధమైన రాజమార్గాన్ని అనుసరింపలేదు.  అదే విధంగా సౌలులో విజృంభించిన సాతాను యొక్క ఆవేశితుడైన సౌలు క్రియలను గూర్చి దావీదు జంకకుండ యెహావా కొరకు కనిపెట్టుకొనుచు సౌలునుగూర్చి యెహోవాకు విజ్ఞాపన ప్రార్థన చేశాడు.  యెహోవా మార్గములో నడిచాడు.  అందువల్ల సౌలు రాజ్యం దావీదుకు సంక్రమించింది.  దావీదు తన పరిపాలనయంతటిని కూడా యెహోవా మార్గములో జరిగించాడు.

        ప్రియపాఠకులారా!  ఇట్లు ప్రవర్తించిన ఈ ముగ్గురు అనగా ఎస్తేరు మొర్దెకై దావీదు భూమిని స్వతంత్రించు కున్నట్లు దేవుడు వారిని హెచ్చించాడు.  ''భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించునన్నట్లు పై ముగ్గురు దైవ కృపలో హెచ్చించబడినారు.  రాణి ఎస్తేరు దైవానుగ్రహం పొంది రాజు ప్రేమకు ప్రియురాలై రాజుకు బదులుగా తానే రాజ్యాన్ని పరిపాలించింది.  యూదులకున్న మరణ శాసనాన్ని రద్దు చేయించింది.  యూదులకు రక్షణ యిచ్చింది.  హామానును ఉరిదీయించింది.  అదే విధముగా మొర్దెకై హెచ్చించబడి దైవానుగ్రహం పొంది రాజుదయకు పాత్రుడై రాజ సంస్థానములో గొప్ప పదవిలోకి హెచ్చించ బడినాడు.  అదే విధంగా దావీదు మహారాజు సౌలు మరణానంతరం దేవుని చేత హెచ్చించబడి గొప్ప మహారాజును కీర్తనాకారుడుగాను ప్రవక్తగాను నూతన నిబంధనలోని ఏసు ప్రభువు యొక్క జన్మకు వంశ వృక్షముగాను మరియు పరలోకములో ఆయనకొక సింహాసనమున్నట్లుగా లూకా 1:32లో వలె భూలోకములో దేవుని సింహాసనాన్ని అధిష్టించునంత హెచ్చించబడినాడు.  భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించు'' ననిన ప్రవచనాను సారంగా ఈ పైవారు హెచ్చించబడినారు.

        37:34లో నాల్గవ చరణం:- భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు'', అనుటలో భక్తిహీనులు అనగా దేవుని ఎరుగని దైవత్వంలో జీవించని వారు, దైవమర్యాద శూన్యులైన వారు.  భక్తి హీనులనగా హామాను సౌలుః- వీరు తమ భక్తిహీనతనుబట్టి యెహోవాను విసర్జించి లోకాన్ని స్నేహించిన హామానుయొక్క పతనాన్ని నిర్మూలతను అనగా మరణాన్ని కన్నులారా చూచినారు.  అదేవిధంగా సౌలు యొక్క మరణాన్ని దావీదు మహారాజు ప్రత్యక్షంగా చూచి తన అనుభవంలో దేవుని యొక్క శక్తి ప్రభావమును ఆయనతీర్పులను ఆయనలో వున్నటువంటి శక్తిని తన అనుభవములో పొందగల్గినాడు.

        37:35 భక్తి హీనుడు ఎంతో ప్రబలియుండుట నేనుచూచితిని'' ప్రియపాఠకులారా!   ఈ వాక్యమునకు సరియైన నిర్వచనము హామాను రాజగు అహష్వేరోషు సంస్థానములో రాజు ప్రక్కన తన కొరకు ప్రత్యేకంగా ఒక ఆసనాన్ని వేయించుకొని హెచ్చించబడినాడు.  మరియొక విషయమేమిటంటే-''అది మొలిచిన చోటనే విస్తరించి వర్ధిల్లియుండె''ననుటలో హామాను యొక్క నిర్ణయమే  రాజు నిర్ణయము.  హామానును మించి రాజు ఏ పని చేసేవాడు కాదు.  హామాను ఇష్టప్రకారమే యూదులను నిర్మూలించాలని అహష్వేరోషు మరణ శాసనాన్ని యూదా జాతి నిర్మూలనకు పుట్టించాడు.  ఆమాను మాటకేదియు తిరుగులేదు.  ప్రతి విషయములో ఆమాను యొక్క సలహాలేనిదే అహష్వేరోషు వుండేవాడు కాదు.  ఈ విధంగా అహష్వేరోషు సంస్ధానంలో మొలిచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు వర్దిల్లియుండినట్లు ఈ యొక్క ప్రవచనముయొక్క ఉదాహరణ.

        ఇక 36లో - అయినను ఒకడు ఆ దారిన పోయిచూడగా  వాడు లేకపోయెను '' అనుటలో హామాను  ఏరాజునైతే ఆశ్రయించి ఏరాజునైతే ప్రేరేపించి  ఏ రాజు యొక్క అనుగ్రహాన్ని సంపాయించి కుయుక్తిగా ప్రవర్తించి కుత్సిత స్వభావముతో తనకు తన ఇంటివారికి ఆస్థిని సంపదను కూర్చుకొని రాజునే అంతము జేసి రాజసింహాసనమును కూడా ఆక్రమించాలని చివరి ఆలోచనలోకి వచ్చికుట్ర చేయగా దైవచిత్తము మరియొక్క విధంగా క్రియజరిగించి వానిని అంతము జేసినట్లును వానినేగాక వాని జనాంగాన్ని సమూలంగా నాశనం చేసినట్లు హామాను యొక్క వంశమే నిర్మూలమైనట్లు  వేదములో చదువగలము.

        37:37 నిర్దోషులను కనిపెట్టుచు యదార్ధవంతులను చూడుము '' అంటున్నాడు.  నిర్దోషులు దేవుని ఎదుట నిర్దోషులుగా ఎంచబడినవారు.  మొట్టమొదటివాడు హేబేలు రెండవ వాడు హానోకు (3) యోబు (4)యోసేపు . ప్రియపాఠకులారా!   బైబిలులో ఇంకా అనేకులు నిర్దోషులున్నారు గాని వారిని గూర్చి వ్రాయాలంటే ఈ పుస్తకము చాలదు.  నిర్ధోషులను కనిపెట్టుము '', అనుటలో హేబేలు నిర్దోషియే, హేబేలు యొక్క నిర్దోషి రక్తము దేవునికి మొరపెట్టినది.  హానోకు యొక్క నిర్దోషత్వము ఆతని ప్రవర్తనను బట్టి హానోకు దేవునితో సశరీరుడుగా నడిచి వెళ్ళినాడు.  భూమికి కనుమరుగైనాడు. నేటికిని వీరి చరిత్రలు పరిశుద్ధగ్రంధంలో వున్నవి.

        ఇకమూడవ నిర్దోషి యోబుః- సాతానుతో దేవుడు సవాలు జేయునంత నిర్దోషత్వము ఇతనిలో వున్నట్లు వేదములో చదువగలము'', నా సేవకుడైన యోబును గూర్చి నీవు ఆలోచించుము.  అతడు యదార్ధవంతుడైయుండి, భూమిలో అంతటి వాడెవడును లేడన్నట్లుగా సాక్ష్యము పొందియున్నాడు. ''అనుటలో యోబు యొక్క నిర్దోషత్వమెంత బలమైనదియో మన మొక్కసారి జ్ఞాపక జేసికోవలసియున్నది.  ఇతడు నిర్దోషియేగాక యదార్ధవంతుడు కూడానైయున్నాడు.  అదే విధంగా పై ఇరువురు అనగా హేబేలు హానోకులు కూడా యదార్ధవంతులుగా వున్నట్లు మనము గ్రహించవలసియున్నది.

        ఇక 4వ వాడు యోసేపుః- నిర్దోషుడు, యదార్ధవంతుడు గనుకనే - యాకోబు కుమారుడైన యోసేపు దైవత్వం చేత హెచ్చించబడి భూలోక సంబంధమైన ఫరో యొక్క రాచరికములో ప్రత్యేకమైన స్ధానాన్ని పొంది అటు దేవుని చేతను ఇటు లోకనాధుల చేతను ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాడు.  ఇంక ''సమాధాన పరచువారి సంతతి నిలుచును''. అనుటలో సమాధానకర జీవితము జీవించిన వారిలో యాకోబు సంతతి; యాకోబు దేవుని చేత పొందిన సమాధానమును బట్టి ఆయన సంతతిలో నుండి వచ్చిన దావీదు.  సొలొమోను వగైరాలు.  దైవత్వములో వారు అప్పు డప్పుడు తొట్రిల్లునపుడంతను తమ ఆరాధన బలిక్రియల చేత దేవుని క్షమాభిక్ష వేడి సమాధానపడుచు జీవించినందువల్లనే దేవుడు కూడా దేవుని కుమారుడైన క్రీస్తు ఈ లోకములో దావీదు కుమారుడుగా పిలువబడి దైవత్వానికిని మానవత్వానికిని వున్న విరోధమును తొలగించాడు.  అందు వలన క్రీస్తు యొక్క బిడ్డల సంతతి నాటికిని నేటికిని నిలిచి విస్తరించియున్నది.

        ఇక 38 వ వచనము బట్టి ''ఒక్కడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు-భక్తి హీనుల సంతతి నిర్మూలమగును''.  అనుటలో నిజదైవత్వమెరుగని విగ్రహారాధికులు వారి భక్తిహీనత నశించి నేటి ఆధునిక యుగములో దైవ వాక్యప్రచారమునకు అనగా సువార్త సేవకు అనేక విధములైన పద్ధతులు నెలకొని అనగా బోధకుల ద్వారాను రేడియోల ద్వారా టివిల ద్వారా, సినిమాల ద్వారాను  కరపత్రాల ద్వారాను మైకుల ద్వారాను వివిధ రీతులుగా సువార్త ప్రబలియున్న ఈ దినాలలో విగ్రహారాధికులును, నిలుకడలేనటువంటి భక్తి గలవారును అన్యజనాంగములు క్రమేణా నశించి వారి ఆరాధనలను మార్చుకొని జీవముగల క్రైస్తవ బిడ్డలుగ ఎదుగుచున్నట్లు ప్రత్యక్షంగా నేటి క్రైస్తవ జీవితం ద్వారా మనకు తెలియుచున్నది.

        39 యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము.   బాధకలుగునప్పుడు ఆయనే వారి కాశ్రయ దుర్గము''. అంటున్నాడు.  నిజమే!  నీతిమంతులకు ఆయన రక్షణ ఇవ్వ కపోతే భూలోకములోని పాపికి భూలోకములోని నీతిమంతునికి రక్షణ లేదు. పాపి మారితేనే గాని నీతిమంతుడుగా ఎంచబడడు.  దావీదు మహారాజు నీతిమంతుడేగాని ఆయన కీర్త 51:5లో నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించె''నంటున్నాడు.  ఇందునుబట్టి చూడగా దావీదు వంటి ప్రవక్తలో కూడా ఒకప్పుడు అవి నీతి అన్నది, అపరాధమన్నది, పాపమన్నది క్రియజరిగించినట్లు మనము గ్రహించాలి.  దావీదు మహారాజుకు బాధకల్గినపుడు ఆయనయెహోవానే తనకు రక్షణాధారము తనకు బలమైన దుర్గము గావించుకొని ప్రార్ధనా జీవితములో జీవించాడు గాని ఇతర దేవతలను ఆశ్రయించలేదు.  దావీదుకు కల్గిన బాధలలోను శ్రమలలోను దేవుడే ఆయనకు ఆశ్రయమిచ్చి ఆదరించినట్లు వేదములో చదువగలము.

        ఇంక 40లో యెహావాయే వారికి సహాయుడై వారిని రక్షించును.  వారు యెహోవాను శరణుజొచ్చియున్నారు.  కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును''.   ఈ సంధర్భములో 23వ కీర్తన చదివినట్లయితే ఇందుకు సరియైన జవాబు మనకు దొరకును.  యెహోవా నా కాపరి ....చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేతును''.

                4.మంచి చెడు

        ప్రియపాఠకులారా!   37వ కీర్తనలోని దావీదు యొక్క మంచి చెడు అనుభవాలను గూర్చి వ్రాయబడిన కీర్తన భాగము.  యిది రెండు తెగల వారికి సంబంధించి  వ్రాయబడియున్నది.  అనగా నీతి మంతులు, భక్తిహీనులు లేక చెడ్డవారు.  నీతిమంతులు దేవుని దేవుని పక్షమువారు, భక్తిహీనులు సాతాను సమాజపు వారని మనము గ్రహించాలి.  ఈ కీర్తనలో మొట్టమొదటగా చెడ్డ వారిని చూచి నీవు వ్యసన పడకుము.  దుష్కార్యములు చేయువారిని గూర్చి మత్సరపడకుము అంటున్నాడు.  చెడ్డవారెవరో? దుష్కార్యములు చేయు వారెవదో వేదరీత్యా మనము తెలిసికోగలము.  చెడ్డవారుః- వీరు కయీను మార్గాన నడిచిన వారు.  అనగా ఆది 6: దైవ కుమారులై యుండి నరుల కుమార్తెలతో లౌకిక సంబంధము లేర్పరచుకొని గాంధర్వవిధిని స్త్రీ పురుషులలో దేవుని బిడ్డలను పాడు చేసిన వారు.  ఈ చెడ్డవారి ద్వారా భూమి మీద చెడుతనము పాపము విస్తరించినట్లు చదువగలము.        

        ఈ చెడ్డవారి మూలంగా దేవునికి బాధకోపము ఉగ్రత కలిగింది.  ఈ చెడ్డవారే దైవ జనాంగమైన ఇశ్రాయేలీయుల మీదికి పిలిష్తీయులు ఐగుప్తీయులు ఆరామీయులు మిద్యానీయులు వగైరా నామధేయాలతో విజృంభించి దైవ జనాంగమైన ఇశ్రాయేలీయుల మీద చెలరేగి యుద్దములు చేసి వారిని నానా హింసలు పాల్జేసి వారిచేత నానా రకములైన చాకీరిలు చేయించుకొని దైవత్వాన్ని ద్వేషించి వారి యొక్క హస్త క్రియలైన దేవతలకు వారు దాసులగుటయే గాక దైవ జనాంగమైన ఇశ్రాయేలీయులను కూడా వారి విగ్రహారాధనను ఆరాధించుటకు బలాత్కరించినవారు.  యిట్టి చెడ్డ వారి జాబితాలో యెజిబేలు ఆమోను, నెబుకెద్నెజరు వగైరా పరిపాలకులు చేర్చబడియున్నారు.

        యిక దుష్కార్యములు చేయువారు ఈ సందర్భంలో 14వ కీర్తనగాని 53వ కీర్తనగాని చదివినట్లయితే ఈ దుష్కార్యములను చేయువారిని గూర్చి తెలిసికోగలము.  ఈ దుష్కార్యములు చేసిన వారి జాబితాలో కయీను అబ్షాలోము, దురాత్మపూర్ణుడై సోదెకు వెళ్ళిన సౌలు, పరస్త్రీవ్యామోహంలో తన భటుని హతమార్చిన దావీదు,  క్రైస్తవ జనాంగమును బంధించుటకును హతమార్చుటకును అధికార పత్రము నడిగిన సౌలు, ఏసుప్రభువును యూదుల కప్పగించిన యిస్కరి యోతు యూదా.  యింకను దైవ ప్రవక్తలను హింసించి బంధించి అక్రమమైన తీర్పులకు గురిచేసి మరణ శిక్ష విధించిన ప్రభుత్వాలు కూడా ఈ దుష్కార్యాలు చేసిన వారి జాబితాలో వున్నవి.

        యిందులో వ్యసన పడుట అనగా చింతించుట లేక బాధపడుట మత్సర పడుట అనగా ద్వేషమును పెంచుకొనుట లేక పగబట్టుట, యిక అట్టి  వారికి కలుగు ఫలితాలెట్లుంటాయో యిందులో మొదటగా వ్యసనపడుట ఏసుప్రభువు గెత్సెమనే వనములో లోకము అందలి జనబాహుళ్యంలో విస్తరించియున్న పాపము దుష్కార్యములను గూర్చి ఆయన వ్యసన పడుటను గూర్చి తాను జరిగించబోవు బలియాగము యొక్క ప్రభావమును ఆత్మ దృష్టిలో వీక్షించి లూకా 22:44లో వలె ఆయన వేదన పడి ఆత్రంగా ప్రార్ధించినట్లు ఆయన చెమట గొప్ప రక్తబిందువులుగ నేలబడుట చదువగలము.  యిక లోకము యొక్క పాప భూయిష్ట వాతావరణమును బట్టి ఏసు ప్రభువు పొందిన వ్యసన ప్రభావము.

        యిక దుష్కార్యములు చేయువారు.  ప్రియపాఠకులారా!  ఈ జాబితాలో దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయుల మీద పగబట్టి మత్సరపడి అనగా ద్వేషమును పెంచుకొని వారిని సమూలంగా అనగా నిశ్శేషంగా వధించాలని వారి యొక్క బీజమే భూమి మీద కనబడకూడదని పగ బూని క్రియ జరిగించిన హామానుకు - హామాను వంటి కఠినులైన పిలిష్తీయులు ఐగుప్తీయులు మిద్యానీయులు ఆరామీయులు వగైరా జనాంగములు విస్తరించి దైవ జనాంగమైన ఇశ్రాయేలీయులతో ఎడతెగని పోరాటములు  సలిపి కీర్త 37:2లో వలె గడ్డివలె వారు వారి వంశాంకురములు సమూలంగా ఎండిపోయినట్లును, పచ్చని కూరలవలె, వేషధారణ, విగ్రహారాధన, కపటోపాయాలతో కూడిన వారి యొక్క రాజ్యాంగ చట్టాలతో రాజ్యాలను పరిపాలించిన ప్రభువులు వాడిపోయి నట్లును, వారి సంతు భూమి మీద నుండి కొట్టివేయబడినట్లును మనము చదువగలము.  వారి పట్టణాలుకూడా వేదంలో ఉత్పరింపబడినవే గాని నేటి యుగంలో అవి శిధిలమై నామమాత్రంగా నిలిచియున్నట్లు బాబేలు, ఎరికోసమరయ, గాజా, ఆష్షూరు, వగైరా చారిత్రాత్మకమైన పట్టణాల చరిత్రలు నిరూపిస్తున్నాయి.

        యిక మూడవ వచనముః-యెహోవాయందు నమ్మికయుంచి మేలు చేయుము.  యిట్లు చేసినవారు మొదటివాడు అబ్రహాము, రెండవ వాడు యోబు 3 దావీదు ఇక క్రొత్త నిబంధన కాలంలో కొర్నేలి.  యిట్టివారు యెహోవాయందు నమ్మికయుంచి మేలు జరిగించినవారు.  యిక ఏసునందు నమ్మిక యుంచి మేలు చేసినవారు క్రొత్తనిబంధన కాలంలో పేతురు, యోహానులు, పౌలు, యాకోబు వగైరాలు. రక్తస్రావపు స్త్రీ, మార్త, మరియలు విశ్వాసమును బట్టి లాజరు బ్రతికింపబడుట.  యిట్టి విశ్వాసులు చేసిన మేలు వారి వరకేగాకుండా వారి దేశమందు వారునివసించిన కాలంలో సత్యాన్ని అనుసరించి నట్లుగానుయెహోవాను బట్టి సంతోషించినట్లుగాను ఆయన ద్వారా  హృదయవాంఛనలను తీర్చుకొన్నట్లును వేదములో పాతనిబంధనలో హన్నా యొక్క హృదయ వాంఛను బట్టి దేవుని దయ వలన సమూహేలును ప్రసవించుట దావీదు హృదయవాంఛను బట్టి ఇశ్రాయేలుకు రాజుగా నియమింపబడుట.  మోషే యొక్క హృదయవాంఛను బట్టి ఇశ్రాయేలుకు కలిగిన శ్రమలు ఆహార కొరత దప్పిక దీర్చబడుట.

        ఈ విధంగా మన మార్గాలను దేవునికి అప్పగించినట్లయితే మనమాయనను నమ్ముకున్నట్లయితే ఆయన మన కార్యాలను నెరవేర్చగలడని, అంతియే కాకుండా ఆయన వెలుగువలె మన నీతిని హృయ శుద్దిని బట్టి మద్యాహ్నం వలె మన నిర్దోషత్వాన్ని వెల్లడి చేయగలడు.  అంతియేగాక ఆయన సన్నిధిలో ఆయన ఎదుట లోక సంబంధమైన వ్యర్ధపు మాటలను ఉచ్చరింపక వ్యర్ధమైన ఆలోచనలను జేయక లోకసంబంధమైన వ్యసనములకు తావీయక మౌనంగా వుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుట శ్రేయస్కరము.  తన స్వజ్ఞానంతో వర్ధిల్లువానిని చూచి వ్యసన పడకుము.  '' అనగా చింతించవద్దు.  దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసన పడకుము.  దురాలోచనలు అంటే పరస్త్రీ వ్యామోహము, యితరుల సంపద నాశించుట తన మిత్రుని చెరపజూచుట, తన పొరుగు వాని వస్తువును దొంగిలించుట, అక్రమార్జనకును కపటోపాయాలతో కూడిన ప్రయత్నములు నెరవేర్చుకొనగోరు వానిని చూచి చింతపడవద్దు.  నీ సహానమును సర్వజనానికి కనబడనీయాలి.  కోపమును ఆగ్రహమును విసర్జించాలి.  వ్యసన పడుటన్నది కీడుకుకారణము.  ఎట్లంటే హేబేలు యొక్క బలిని దేవుడు లక్ష్యముంచి దానిని దహించాడని తన బలిని అలక్ష్యంచేశాడని కయీను వ్యసనపడినాడు.  అది కయీను కీడుకే కారణమైంది.  దావీదు పదివేలు సౌలు వెయ్యి అన్నందుకు సౌలు వ్యసనపడినాడు.  దాని ఫలితము దురాత్మ అతనిని ఆవరించింది.  అందుకు ప్రతిగా ఈటెనెత్తుకొని తన సంబంధియైన దావీదును హత మార్చుటకు సిద్ధపడినాడు.

        ఇక కీడు చేయువారు నిర్మూలమగుదురు. నిజమే ప్రియపాఠకులారా!   దావీదును చంపుటకు కుమారుడైన అబ్షాలోము యుద్ధసన్నిద్ధుడై తండ్రియైన దావీదు నెదుర్కొని అతని చంపాలని తన వాహనంపై బైలుదేరాడు.  అయితే పితృద్రోహిగా తయారైన అబ్షాలోమును అతనెక్కిన కంచర గాడిద అతనిని మరణానికి అప్పగించగా అతడు నిర్మూలమయ్యాడు.  అదే విధంగా ఇశ్రాయేలు చట్టమునకును ధర్మశాస్త్రమునకును విరుద్ధంగా ప్రవర్తించి ఇశ్రాయేలు రాజైన సౌలు యుద్ధసమయములో ప్రార్ధనాయుతంగా దేవునికి విజ్ఞాపన చేసి ఆయన కొరకు కనిపెట్టి ఆయన అనుగ్రహమును పొందవలసిన వాడైయుండగా ఎందోలులో సోదెకత్తెను విచారించి దాని ద్వారా తన భవిష్యత్తు నభ్యర్ధించి సోదెనడుగగా అతడు తనకు తానే నిర్మూలమై మరణానికప్పగించుకొని దిక్కులేని చావు మరియు అతని కుటుంబంతో సహా ఈ మరణాన్ని చవి చూచినాడు.

        అయితే దావీదు మహారాజు తన పరిపాలనలోను తన నిత్య దిన చర్యలలోను తన కర్తవ్యాలలోను తానుచేయు ప్రతి పనికొరకు దేవుని కొరకు దైవాజ్ఞకై కనిపెట్టినాడు.  అందువల్ల దావీదు ''మహారాజై ప్రవక్తగాను, కీర్తనాకారుడుగాను, లోక రక్షకుడైన దేవుని కుమారుడైన ఏసుప్రభువునకు వంశపురుషుడుగాను దైవత్వం చేత ఎన్నుకోబడినాడు.  దీని ఫలితమే ఎరికో ద్వారం దగ్గర గృడ్డి బిక్షకుడు ఏసు నుద్దేశించి దావీదు కుమారుడా! నన్ను కరుణింపుము అన్నాడంటే దావీదు మహారాజు దేవుని కొరకు కనిపెట్టినాడు.  ఆయన, కుమారుడు మన రక్షకుడైన ఏసుక్రీస్తు తన తండ్రియొక్క చిత్తాన్ని  నెరవేర్చుటకు ఆయన కొరకు కనిపెట్టినాడు.  ఏసుప్రభువు శిష్యులైన పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టినారు.  నేటి తరము వారమైన మనమైతే తండ్రియైన దేవుని కొరకును, ఆయన కుమారుడైన ఏసు ప్రభువు కొరకును పరిశుద్ధాత్మ దేవుని కొరకును, వీరు ముగ్గురు రాబోవు రాకడ కొరకు కనిపెట్టవలసిన వారమైయున్నాము.  యిది ప్రతి యొక్క నరజీవుని యొక్క ప్రధాన కర్తవ్యమైయున్నది.

        37:10 యిక కొంత కాలమునకు భక్తి హీనులు లేకపోవుదురు.  వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు?  అనుటలో వీరెవ్వరు? ప్రియపాఠకులారా!  పాత నిబంధన కాలంలో ఈ భక్తి హీనులు పిలిస్టీయ, ఐగుప్తీయ, ఆరామీయులు మిద్యామీయులు వగైరా విగ్రహారాధిక సంబంధింతములు నిజదైవత్వమునకు దూరులైనటువంటి జనాంగమే ఈ భక్తిహీనులను, పాత నిబంధన కాలంనాటి దైవ.జనాంగమే ఈ భక్తి హీనులు.  ప్రపంచానికి జన బాహుళ్యమునకు కనుమరుగైనట్లు మనము గ్రహింపగలము.  యిప్పుడు క్రీస్తును విశ్వసించిన క్రైస్తవులు ఒకప్పుడు అన్యులే!  ఇంతెందుకు? క్రైస్తవులమైన మన పూర్వీకులు కూడా అన్యులేగాని వారి భక్తి హీనత నుండి మనము విడింపించబడిన వారమై పరిశుద్ధ సావాసంలో పరిశుద్ధ ఆరాధనలో భాగస్వాములై యున్నాము.  మరియు క్రీస్తు దేహము అను సంఘములో అంగములైయున్నాము.  అయితే మన పూర్తీకుల విగ్రహాలను ఆరాధించిన మన పూర్వీకులు వారు ఆరాధించిన విగ్రహాలు నేడు మన తరంలో వున్నాయా?  అవి కనబడవు కదా?

        37:11 ఇక దీనులు భూమిని స్వతంత్రించు కొందురంటాడు'', ఈ సందర్భంలో మత్త 5:3 చదివితే ఈ దీనులు శారీర సంబంధులు కారు.  లోకంలో జీవించి ఆత్మ సంబంధమైన వాటి నన్వేషిస్తూ తత్సంబంధమైన ఆలోచనలు ఆసక్తి కార్యకలాపాలు సాగించిన వారు, అనగా ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు. అట్టి ధన్యత పొందినవారు భూమిని స్వతంత్రించుకొందురంటాడు. మరియు మత్త 5:3లో పరలోక రాజ్యం కూడా వారిదేనంటాడు. యిందును బట్టి యిహమందును పరమందును వారికి ప్రాధాన్యత వున్నట్లు గ్రహించాలి.

        బహు క్షేమము కలిగి సుఖించెదరనుటలోః- పాత నిబంధనలో యోసేపు యొక్క పదకొండు మంది అన్నదమ్ములు కరువుకాటకాలలో చిక్కుకొని క్షామ పీడితులై యుండగా వారి రక్తసంబంధియు వారి సహోదరుడైన యోసేపు ఐగుప్తులో క్షేమకరమైన ఆశీర్వాదకరమైన, దైవత్వమునకు ప్రీతికరమైన రాజుకు ప్రాణప్రదమైన, లోకానికి దైవత్వానికి ప్రీతి కరమైన జీవితాన్ని జీవించుటకు కాక తన సోదరులకు ఆశ్రయమయ్యాడు.  అదే విధంగా నూతన నిబంధన కాలంలో దీనులైన ఏసుప్రభువు శిష్యులు ప్రభువును నమ్మి ప్రభువుతో కూడా భూమిపై సంచారం చేసి ప్రభువు కృపలో ఆయన కాపుదలలో నిర్భయమైన క్షేమకరమైన జీవితం ఆకలి దప్పులు లేని జీవితం జీవించారు.

        ఇక 12వ వచనంలో భక్తి హీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేయుదురు.  వారిని చూచి పండ్లు కొరుకుదురు'', అనుటలో నీతిమంతుడైన హేబేలు దైవత్వానికి ప్రీతికరమైన జీవితం జీవించుటలో అతని అన్నయైన కయీనుకు హేబేలు మీద అసూయతో ద్వేషం ఏర్పడి అతని చంపాలని దురాలోచన చేసి పండ్లు కొరికి నట్లుగా వేదంలో చదువగలము.  దావీదుకు కలిగిన ఐశ్వర్యమును గూర్చి సౌలు ద్వేషమును బూనిన వాడై దావీదును చంపాలని దురాలోచన చేసి ఈటెను విసురుటకూడా ఈ సందర్భములో మనము అనుకొనవలసిన సంఘటన.  ఏసుప్రభువు యొక్క మహత్కార్యములు ఆయన చేసిన అద్భుతములకును ఆయన మాట్లాడిన మాటలకును శాస్త్రులు పరిసయ్యులు యూదా ప్రవిష్టులు ఈ పరిశుద్దుని మీద ఈర్ష్యబూని, ఆయన నేవిధంగా చంపాలని దురాలోచనచేసినట్లును ఆయనను చంపుటకు పండ్లుకొరికినట్లును వేదంలో చదువగలము.  ఈ విధంగా సౌలు కూడా క్రైస్తవులను చంపుటకును వారిని బందించుటకును దమస్కులోని ప్రభుత్వాల అధికారులతో సంప్రదించి దురాలోచన చేసి క్రైస్తవులను ప్రత్యేకంగా శిక్షించుటయేతమ ధ్వేయమైనట్లుగా పండ్లు కొరికినాడు.

        ఇక 13వ వచనంలో వారి కాలము వచ్చు చుండుట ప్రభువు చూచుచున్నాడు.  వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు.''అనుటలో పాత నిబంధన కాలంలో కయీను పశ్చాత్తాపపడినాడు.  యోసేపు అన్నలు యోసేపును గూర్చి పశ్చాత్తాపపడినారు.  దావీదును గూర్చి సౌలు సిగ్గుపడినాడు.  ఏసుప్రభువును సిలువ మరణానికి అప్పగించిన యూదులలో మార్పు గలిగింది.  సౌలు మూర్చనొంది పౌలుగా మార్చబడినాడు.  ప్రియపాఠకులారా!  ఈ విధంగా వారి కాలాలలో వారు పొందినపతనాన్ని బట్టి ప్రభువు వీక్షించి వారిని చూచి ఆయన నవ్వుతూవున్నాడు.

        ఇక 14లో దీనులను దరిద్రులను షడద్రోయుటకై యదార్ధముగ ప్రవర్తించువారిని చంపుటకై భక్తి హీనులు కత్తి దూసి యున్నారు.  విల్లెక్కుపెట్టియున్నారు. '' అనుటలో లోకాశలకు దూరమై నిరాడంబర జీవితము నిరాహార జీవితము జీవిస్తూ శారీరేచ్ఛలను చంపుకొని ఆత్మీయ వికసింపులో అదృశ్యదేవుని ఐశ్వర్యాలను పొందగోరువారు.  ఇట్టివారు లోకరీత్యా శారీర సంబంధంగా ఎటువంటి ఆభరణాలు గాని అలంకారాలు గాని ముస్తాబులు '' ఇక గృహ విషయంలో వస్తు వాహనాలను సినిమాల విషయాలలోను నిషేధించుకొని యదార్ధంగా అనగా దేవుడు ఆత్మ గనుక ఆయనను దృశ్యంగా కాక ఆత్మతోను సత్యముతోను పూర్ణ విశ్వాసముతోను ఆరాధించు స్వభావసిద్ధులైన వారు.  ఈ విధంగా ప్రవర్తించువారిని చంపుటకు భక్తి హీనులు కత్తిదూసి యున్నారు.  విల్కెక్కుపెట్టియున్నారు అని అంటున్నాడు.  అనగా పై గుణాతిశయములు గల వారికి ఈ లోక సంబంధమైన మరియు ఈ లోకాధికారియైన అపవాది విరోధి.  కనుక వాడిగల తన కత్తిని వారిని ఆత్మీయంగా పతనం చేయుటకు విల్లును వుంచియున్నాడు.  అనగా అపవాది తన సంబంధులైన నరులను యదార్ధవంతులను అసత్యవాదులుగా మార్చుటకు తన వారిచేత క్రియ జరిగిస్తాడని భావము.  మరి ఇట్టి వారికి జరుగు సన్మానమేమిటంటే'' వారి కత్తి వారి హృదయములో దూరును.  వారి విండ్లు విడవబడును.'' అనుటలో హామాను, మొరెకయను ఉరి ఎత్తాలని తన యింటి ఎదుట ఉరి కంబమును నాటించాడు.  అయితే తీర్పు సమయంలో ఆ ఉరి కంబము హామానునే ఉరి ఎత్తింది.  ఆహాబు రాజు యెజేబేలుతో చేరి నాబోతును నిష్కారణంగా చంపించినాడు. అయితే అదే శిక్ష అదే నాబోతు యొక్క తోటలో ఎజిబేలుతో ఆహాబు వారి రక్తమును కుక్కలు నాకునట్లుగా యిరువురును యుద్దరంగంలో చనిపోయారు.  - యిది శాపమరణము, వారి రాజ్యాలు పాడైనవి.  తండ్రియైన దావీదును పదవీచ్యుతునిగా చేసి చంపాలని యుద్ధసన్నిధుడై అబ్షాలోము విలనమ్ములు, కత్తి కటార్లుతో సన్నిధుడై తండ్రిని చంపుటకు విల్లెక్కుపెట్టగా అదే వింటితో అబ్షాలోము మరణాన్ని కప్పగించబడి చంపబడినట్లు అబ్షాలోము చరిత్ర ద్వారా ఋజువగుచున్నది.  ప్రియపాఠకులారా!  చెరవపకురా చెడెదవు అన్నట్లుగా కత్తి పట్టుకున్నవాడే కత్తితోనే నశిస్తాడని క్రీస్తు యొక్క ప్రవచన సామెత ఈ సందర్భంలో మనము గ్రహించవలసియున్నది.

        నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధికంటే శ్రేష్టము. '' అని ప్రవచనం 16వ వచనంలో వ్రాయబడియున్నది.  నిజమే!  నీతిమంతునికి ధనాశగాని, లోకాశగాని నేత్రాశగాని స్త్రీ వ్యామోహం గాని లేక తనకుకలిగియున్న కొద్ది కలిమితో దేవుని మహిమ పరచుచు దైవాశీర్వాదాన్ని బట్టి తరగునటువంటి సంపదను నిర్విచారమైన జీవితమును అనుభవిస్తాడు.  సారెపతులోని విధవరాలు నీతిమంతుడైన ఏలీయాకు అతిధ్యమిచ్చి గొప్ప క్షామములో ఆహార సమస్యను తీర్చుకోగలిగింది.  అదే విధంగా ఎలీషా విధవరాలైనటువంటి స్త్రీ యింట ఆమెకున్న ఋణబంధమునుండి ఆమెను విమోచించుటకుజరిపిన క్రియ అనగా తన యింట్లో వున్న ఒక్క పాత్రలోని నూనెను అనేక పాత్రలలో నింపి ప్రవక్త యొక్క మహత్కార్యానికి యోగ్యురాలైనట్లు మనము చదువగలము.

        ప్రియపాఠకులారా!  నూతన నిబంధన కాలంలో ఏసు ప్రభువు యొక్క సువార్త సంచారంలో ప్రభువును ఆవరించియున్న జన సందోహమునకు ఒక చిన్నబాలుని దగ్గర వున్న ఐదు రొట్టెలు రెండు చేపలు కొద్దిపాటివి.  వాస్తవానికి ఐదువేలమందికి ఆ రొట్టెలు సరిపోవునా?  బాగుగా తింటే ఒక్కడికే ఆ రొట్టెలు సరిపోవును.  అటువంటిది పెద్ద పెద్ద హోటళ్ళలో అనగా బహు మంది భక్తి హీనులున్నటువంటి ధన సమృద్ధితో కూర్చబడిన భోజనశాలలకంటె ఏ భోజనశాల తీర్చలేని ఆహార కొరతను ఈ ఐదురొట్టెలు తీర్చినవి.  యిందును బట్టి చూడగా ఐదువేలమందికి ఏ హోటలు భోజన సదుపాయము చేయలేదు.  అయితే నీతిమంతుడైన ఆ చిన్నబాలుని చేతనున్న రొట్టెలు అనేక వేలమందికి ఏసుక్రీస్తు యొక్క పంపకంలోకి ఆశీర్వారకరములై మహిమాన్వితములై ఐదువేల జనాభా ఆకలిని తీర్చుటయే గాక యింకను 12 గంపలు మిగిల్చినవి.

        వేదంలో బలహీనులుగా వుండి బహు ధన సమృద్ధి కలిగి యున్నవారు వారిని వారి కలిమినిగాని వారి ధన సమృద్ధి గాని వారి ఆయుధ సంపత్తిగాని వస్తువాహనాలుగాని దాసదాసీ జనాంగములు పనికి రాకుండా పోయినట్లు గొలియాతు చరిత్ర, అందము ఐశ్వర్యములు గల అబ్షాలోము చరిత్ర ఫిలిష్తీయులు చరిత్ర, నెబుకెద్నెజరు, యెజెబేలు చరిత్ర బైలుపరచుచున్నది.  ఈ విధంగా భక్తి హీనులు బాహువులు విరువబడియున్నవి.

        అయితే నీతిమంతులకు యెహోవా సంరక్షకుడు గనుక యోబు సంపద విస్తరించింది.  యాకోబు ఐశ్వర్యవంతుడయ్యాడు.  అబ్రహాము గొప్పదైవ విశ్వాసియై అనేక విశ్వాస జనాంగములకు తండ్రి అయ్యాడు.  ఇస్సాకు   గాని ఇస్మాయేలును గాని సమూయేలును గాని దావీదును గాని బాల్యము నుండి పోషించి సంరక్షించినవాడును, వారిని బలాఢ్యులుగాను ఐశ్వర్యవంతులుగాను ప్రవక్తలుగాను కీర్తనాకారుడును రాజులుగాను ప్రతిష్టించి సంరక్షించినట్లు 17వ వచనంలో చదువగలము.

        యింక 37:18 వచనంలోని భావమును తెలిసికొందము.  నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు.  ప్రియపాఠకులారా!  ఈ సందర్భంలో వేదంలో నిర్దోషులైన వారిని గూర్చి తెలిసికొనగలము.  ఆదాము రెండవ కుమారుడు నిర్దోషి,  అతడర్పించిన బలికూడా నిర్దోషమైనది.  హేబేలు కూడా నిర్దోషియే. అట్లు నిర్దోషియై నిష్కల్మషమైన పవిత్రమైన బలిని దేవుని కర్పించినందువల్లనే దేవుడు హేబేలు బలిని గుర్తించి దాని యందు లక్ష్యముంచాడు.  అదే విధంగా జల ప్రళయానంతరము నోవా అర్పించిన పవిత్ర దహన బలియొక్క  హోమమును ఆఘ్రాణిస్తూ, నీతి మంతుడైన నోవహును దేవుడాశీర్వదించాడు.  యాకోబు 12 మంది కుమారులలో యోసేపు నీతిమంతుడైయుండుటవల్లనే యోసేపు యొక్క చర్యలను యెహోవా గుర్తించి అతని శీల మును ప్రవర్తనను అతని నీతిని గుర్తించి, ఫరో వల్లను ఫరో భార్యవల్లను వచ్చే ఉపద్రవాలనుండి తప్పించి అతనిని హెచ్చించి ఫరో సంస్థానమంతటి మీద అధికారిగా నియమించింది.

        యిక నూతన నిబంధనలో కన్నెకయైన మరియ యొక్క భర్త కూడా నీతిమంతుడై యుండి దేవుని యందు భయభక్తులు గల వాడగుటను బట్టియే యేసు ప్రభువు జన్మకు కారకుడయ్యాడు.  వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును.  ''అనుటలో ప్రియపాఠకులారా!  అబ్రహాము ఏనాడో చనిపోయాడు.  యాకోబు ఏనాడో కాలము చేశాడు.  అట్లే దావీదు కూడా కీర్తిశేషుడయ్యాడుగాని వారి స్వాస్థ్యమైన ఇశ్రాయేలు జనాంగము నాటినుండి నేటి వరకు లోకములో జీవించి విస్తరించి ఫలభరితమైన జీవితంలో శతృవుకు సింహస్వప్నంగా వున్నారు.

        అదే విధంగా దేవుని కుమారుడు మన రక్షకుడైన ఏసు ప్రభువు యొక్క నిర్దోష నిష్కల్మష గుణమును బట్టి ఆయన స్ధాపించిన భూలోకంలోని దైవ రాజ్యము యొక్క ప్రభావము నానాటికి విస్తరించి బహుముఖ వ్యాప్తిచెందియున్నది.  నేడు ప్రపంచ జనాభాలో ప్రథమ స్ధానము పొందియున్నది.  యిక ఆపత్కాలంలో వారు సిగ్గునొందరు'', అంటున్నాడు.  నిజమేః ఇశ్రాయేలీయులు ఫరో యెదుట సిగ్గుపడలేదు.  మోషే అహరోనులు లోకంతోను లోకనాథులతోను దైవ విరోధులతోను జంకకొంకు లేకుండా వీరోచితంగా పోట్లాడి అపజయ మెరుంగక అవమానము పొందక వారి యొక్క జీవితాలను ధన్యవంతం చేసికొన్నారు.  అదే విధంగా దేవుని యొక్క నీతిని వెల్లడిచేయుటకు ఆనాటి పాత నిబంధన కాలంలో నాటి ప్రవక్తలు రాజులు న్యాయాధిపతులు మరియు  నూతన నిబంధన కాలంలోని ఏసు శిష్యులైన అపోస్తలులు హతసాక్షులు వేదసాక్షులు సిగ్గుపడకుండా ప్రభువు యొక్క సువార్తను బహు ధైర్యంగా ప్రకటించారు.  మరియు ఆపత్కాలమందు అనగా యుద్ధ సమయాలలోను ప్రమాదాలలోను కూడా సిగ్గుపడనివారు.  యోనా తన కొచ్చిన ఉపద్రవాలలో ధైర్యంగా దైవత్వాన్ని గూర్చి సాక్ష్యమిచ్చి ఆపదను ప్రమాదమును మరణాన్ని జయించాడు.

        కరువు దినములలో వారు తృప్తిపొందుదురు.'' అనుటలో ఏడేండ్ల కరువులో యోసేపు తన 11 మంది సోదరులకును ఐగుప్తునకు అన్యరాజ్యాలుగా వున్న సామంత రాజ్యాలన్నిటికిని ఆ కరువు కాలమందు ఏడేండ్లు ఎటువంటి ఆహార కొరత నీటికొరత, పశువుల మేత గొర్రెల మేత కొరత లేకుండా తన జీవితాన్ని తానున్న ఐగుప్తు ప్రజల జీవితాన్ని తృప్తిగా అనగా సమృద్దిగా లోటేలేని జీవితంలో జీవించారు.  అట్లే ఏలీయా మూడున్నర సంవత్సరము వర్షమును కురువనీయకుండా చేసినపుడు దేశమునకు సంభవించిన కరువు దినములలో ఏలీయాకు సారెపతులోని విధవరాలు ఆశ్రయమిచ్చి కరువు దినములు పూర్తియగువరకు విధవరాలు; విధవరాలి మనుమడు వారితో బాటు ఏలీయా పస్తులేని తృప్తిగలిగిన జీవితము అనుభవించారు.

        యిక భక్తి హీనులు నశించి పోదురు,''అనుటలో పాత నిబంధన నుండి నూతన నిబంధన యుగాంతంలో  వున్న మన తరముల వరకును నశించిపోయిన భక్తిహీనుల చరిత్ర లెక్కకు మించియున్నది. అనగా కీర్తిశేషులైన భక్తిపరుల నెంచగలముగాని నశించిన బక్తిహీనులను గూర్చి లెక్కించాలంటే మానవ ఊహకే అతీతము. అందును బట్టి యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలివుందురు.  అంటున్నాడు  37:20 దీని అర్ధము దైవత్వాన్ని వ్యతిరేకించి దేవుని మీద తిరుగబడి నాశనకరమైన మార్గాలలో భక్తిహీనమైన జీవితంలో వున్న సహోదరుల జీవితము మేత భూములలో మొలిచిన వత్తుగా పెరిగిన సొగసైన గడ్డి బీడు వంటిది.  అని అర్ధము.  మందలు పశువులు జంతువులు వగైరా మేయు సందర్భంలో ఆ మేత భూములు కనబడకుండా సమూలంగా తమ పచ్చని కళను పోగొట్టుకొని కళావిహీనులమగునట్లుగా భక్తహీనుల జీవితము వారి కలిమి వారి ఐశ్వర్యమును పొగవలె కనబడకుండా పోవును.  వారి స్వాస్థ్యమునకు నిలకడ కలిగిన వారసులు కూడా వుండరు.  మరియు వారి స్వాస్థ్యము అన్యుల కాశ్రయమగును.  అనగా అన్యులు తినివేయుదురు లేక ప్రభుత్వ పరమగును.  అట్టి వారికి భూమి మీద చరిత్ర గాని కీర్తి గాని శూన్యము.  మరియు భక్తి హీనులు అప్పుచేసి తీర్చలేదంటాడు.  నిజమే! భక్తిహీనులు తమకు సంభవించు ఆపత్కాలములలో అనారోగ్యములలోను అక్కరలలోను దైవత్వానికి మ్రొక్కుకొని బాకీపడి తీర్చకుండుటయు, పౌర జీవితంలో వారు చేసేటటువంటి ఋణములను తీర్చక అలక్ష్యంగా జీవించుటయు నేటి నర సమాజములోని సాధారణ విషయము.

        నీతి మంతులు దాక్షిణ్యం కలిగి ధర్మమిత్తురంటున్నాడు.  ప్రియపాఠకులారా!  కొర్నేలి యొక్క జీవితము యిందుకు మనకు ఉదహరణగా తీసికొందము.  యితడు క్రీస్తు, నెరుగక పోయినను తన నీతిని ప్రార్ధనా ధర్మకార్యాల ద్వారా తన యొక్క నీతి క్రియాకర్మలను బట్టి దేవుని యందు భయభక్తులు గల వాడుగ ఎంచబడినాడు.  ఇట్టి జీవితంలో వున్న కొర్నేలిని దేవుడు దృష్టించి తన దూత ద్వారా దైవత్వాన్ని ఎరిగే మార్గాన్ని ఉపదేశించాడు.

        యెహోవా ఆశ్రయమును పొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు.  యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారెవరో ముందుగా మనము తెలిసికోగలము.  ప్రియులారా!  ఆది దేవుడు తొలుత నిర్మించిన నరజంటను ఆశీర్వదించి మీరు బహుగా ఫలించి విస్తరించి భూమిని నింపి దానిని ఏలుడి అని దీవెన లిచ్చాడు.  అయితే ఆ ఆశీర్వాదమును నరజంట నిల్పుకోలేక శపించబడిన వారైనారు. ప్రియులారా!  దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు.  అబ్రహాము సంతానమైన ఇస్సాకు ఇస్మాయేలును యిరువురును నేడు యావద్‌ ప్రపంచాన్ని నాటినుండి నేటి వరకు భూమిని స్వతంత్రించుకొనియున్నారు.  వారి సంతానంగానే క్రైస్తవులమైన యూదులైన ఇశ్రాయేలీయులు.  ఇస్మాయేలులైన మహమ్మదీయ సోదరుల యొక్క జీవిత చరిత్రలు వారి సంతానంగానే నిరూపిస్తున్నాయి.

        ఇక ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు''. అనుటలో దేవుడు శపించిన మొట్టమొదటి సంఘటన ఏధేనులో ప్రారంభమైంది.  దేవుడు మొట్టమొదటిగా నరజంటను శపించాడు. ఆ తర్వాత సర్పాన్ని శపించాడు.  భూమిని శపించాడు.  సృష్టిని శపించాడు.  తన్మూలంగా జంతుజాలములలో వైరుధ్యము వాతావరణం కలుషితము, మానవులలో అశాంతి అనైక్యత జంతుజాలములలో ఒకదానితో నొకదానికి పోట్లాటలు ఏర్పడినవి.  యిక రెండవదిగా ఆదాము కుమారుడైన కయీనును దేవుడు శపించాడు.  శాపగ్రస్థమైన కయీను సంతానం విస్తరించగా జలప్రళయంతో వారిని నిర్మూలించాడు.

        యిక నూతన నిబంధన కాలంలో దైవ రూపమైన ఏసు ప్రభువు యొక్క శాపవచనముల ననుసరించి యెరూషలేమా! యెరూషలేమా! ప్రవక్తలను చంపుచూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచుండుదానా? ఇదిగొ మీ యిల్లు మీకువిడవబడియున్నది.  నీలోనున్న నీ పిల్ల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి యుండని దినములు వచ్చుచున్నవి.  లూకా 19:43 మత్త 23:38 యిది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాకని చెప్పువరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను.  యేసు శాపము వలన నిర్మూలమైనట్లు వేదంలో చదువగలము.

        ప్రియ పాఠకులారా!  నేటికిని మనము శాపగ్రస్థమైన భూమి మీద జీవిస్తున్నామన్న సత్యాన్ని మరువకూడదు.  ఈ శాపగ్రస్థ భూమి మీద జీవించే ప్రతి ప్రాణియు శాపగ్రస్థమైనవే.  నేటి తరము వారమైన మన జీవితాలు కూడా క్రీస్తు నెరుగక జీవిస్తే శాపగ్రస్థమైన జీవితాలని గుర్తించాలి.   దేవుని శాపమూలంగా ఇశ్రాయేలుకు సంభవించిన ఉపద్రవమును బట్టి నేడు కూడా ఇశ్రాయేలు సంపూర్ణ స్వాతంత్య్ర జీవితాన్ని అనుభవించలేకున్నారు.  దేవుని యొక్క శాపమూలమున అన్యరాజులు అంతరించి పోయారు.  దేవుని శాపమూలమున చైనా, రష్యా, హంగేరి వియత్నాం వంటి నాస్తిక రాజ్యాలు భూకంపాలకును అగ్నిపర్వతాల ప్రేలుళ్ళకు తుఫానులకు గురియై యెహోవా దేవుడని యేసుక్రీస్తు రక్షకుడని గుర్తించేటటువంటి స్థితికి వచ్చి తమ దేశాల్లో  నిషేధించిన క్రైస్తవ్యాన్ని  తీరుగా బహాటంగా స్వాతంత్య్రంగా ఉజ్జీవంగా ఆరాధనలను బహిరంగ సేవను జరిపించుటకు ప్రభుత్వాలే ఆజ్ఞలు జారి చేసి ముందుకు వచ్చాయంటే  దైవత్వంలో వున్న ప్రభావమొట్టిదో మనము గ్రహించాలి.  దైవత్వంలో వున్న శక్తి ఎటువంటిదో మనము తెలిసికోవాలి.

        37:23లో ఒకని నడత యెహోవా చేతనే స్ధిరపరచబడుననుటలో హానోకు దేవునితో నడిచాడు.  దేవుడు ఆయనను నడిపించుకుపోయారు. దేవుడు నోవహుతో సంభోదిస్తూ ఈ తరము వారిలో నీ వొక్కడవే నా యెదుట నీతిమంతుడవనుట, సాతానుతో దేవుడు సవాలు చేస్తూ యోబు అంతటి సత్పురుషుడు లేడని యోబును గూర్చి ప్రశంసించుట; విశ్వాసమును బట్టి అబ్రహాము నడిచిన నడత, విశ్వాసమునుబట్టి పట్టుదలను బట్టి యాకోబు నడిచిన నడతలను మనము గ్రహిస్తే నోవహు ఆనాటి జనాభాను సమూలంగా నాశనం చేస్తూ దేవుడు నీతిమంతుడైన నోవహును బట్టి దేవుడు పునఃనరకోటిని భూమి మీద స్ధిరపరచాడు.  అబ్రహాము యొక్క విశ్వాసమును బట్టి అబ్రహాము యొక్క సంతానమును అబ్రహము యొక్క విశ్వాసమును వెంటాడిన వారిని విశ్వాసులుగా స్ధిరపరచియున్నాడు.  దైవత్వంలో విశ్వాసపూరితమైన వీరోచిత పోరాటమును సలిపిన యాకోబును దేవుడాశీర్వదించి ఇశ్రాయేలు అను పేరుతో దేవుడు స్థిరపరిచాడు.

        వారి ప్రవర్తన చూచి ఆయన సంతోషించు '', ననుటలో యెహోవా మందిరంలో బాల్యము నుండి మందిర పరిచారకుడుగా సేవ జరిగించిన సమూయేలును గూర్చి యెహోవా ఆనందించునట్లును, శోదనను జయించి యోబు అనగా సాతానును ఓడించిన యోబును గూర్చి యెహోవా ఆనందించినట్లును, నూతన నిబంధన కాలంలో కొర్నేలి యొక్క ధర్మ కార్యాలు ఆయన భక్తి ప్రార్థనలను గూర్చి ఆనందించినట్లును వేదంలో మనము చదువగలము.  ఈ విధంగా దేవుడు నరునిలో నుండి ఆశించినది వెండి, బంగారము, కాయా కర్పూరనైవేద్యాలు కాదు గాని వారి ప్రవర్తనయే! ఆయన ఆనందకరమైన అర్పణయని బలియని మనము గ్రహించాలి.

        ప్రియపాఠకులారా!  యెహోవా అతని చెయ్యి పట్టుకొని యున్నాడు.  కనుక అతను నేలను పడినను లేవలేకయుండడు అనిన 37:24 వచనాన్ని గూర్చి ధ్యానిస్తాము.  నా సేవకుడైన యాకోబు నేనేర్పచకున్న ఇశ్రాయేలు నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను పట్టుకొని యున్నాను.  నిన్ను ఆదుకొనువాడను నేనే.  ఈ మాటలను యెషయా ద్వారా దేవుడు ప్రవచించుటలో దూతను పంపి సొదమ పట్టణము నుండి చెయ్యి పట్టుకొని నడిపించి కాపాడినవాడు యెహోవాయే.  ఆయన చెయ్యి పట్టి నడిపించకుంటే లోతు జీవితము వ్యర్థమయ్యేది.  అదే విధంగా బాలుడైన సమూయేలును ఆయన హస్తంతో పోషించబట్టియే ప్రవక్త ఆయ్యాడు.  అదే విధంగా యాకోబును అతని కుమారులను నడిపించియున్నాడు.  ఆయన నడిపించబట్టే యాకోబు ఇశ్రాయేలు అయ్యాడు.  అతని జనాంగమును చెయ్యిపట్టి సముద్రమునుండి దాటించాడు.  యోర్ధాను వంటి నదిని దాటించాడు.  ఇశ్రాయేలు యొక్క దప్పికను దీర్చాడు మన్నాను కురిపించాడు.  యిది యెహోవా హస్తము ఇశ్రాయేలీయులపట్ల కలిగించిన బలమైన క్రియ.  అదే విధంగా రాజులను ప్రవక్తలను యాజకులను ఆయన చెయ్యి పట్టి నడిపించినట్లును పరిశుద్ధ గ్రంథములో దానియేలు విషయంలో మోషే అహరోనులు ఏలీయా యెహోషువా, ఎలీషా వగైరాల చరిత్రలు ఋజువు పరచుచున్నవి.

        అతడు నేలను పడినను లేవనెత్తక యుండడు'', అనుటలో యోబు సాతాను యొక్క శోధన పరీక్షలో శోధనకు నిల్చినవాడై బాధింపబడి నేలను పడి బూడిద కుప్పలో కూర్చుండి యుండుట యెహోవా చూచినప్పుడు అతనిని మరల పైకి లేపి మునుపటికంటే శోధనను జయించిన తర్వాత యోబు యొక్క జీవితంలో విశేషమైన సంపదను దేవుడను గ్రహించినట్లు వేదంలో చదువగలము.  దావీదు కూడా సౌలు యొక్క ఉగ్రతకు దాగినను దేవుడతనినిసౌలు యొక్క ఉగ్రత నుండి కాపాడి లేవనెత్తినట్లు చదువగలము.  అదే విధంగా అన్నదమ్ముల కుట్రచేత గోతిలో పడద్రోయబడిన యాకోబు కుమారుడైన యోసేపు విషయంలో అతనిని గోతిలో వుంచక, గోతినుండి లేవనెత్తి వేరొక దేశీయులకు అప్పగించబడి గొప్ప రాజగృహమునకు చేరి అనగా ఐగుప్తు ఫరో యొక్క సంస్థానంలో యెహోవా యొక్క హస్త ప్రభావమూలమున రాచ రికము ననుభవించాడు.

        25 నేను చిన్నవాడనై యుంటిని.  ఇప్పుడు ముసలివాడనైయున్నాను'', అనుటలో దావీదు మహారాజు బాలుడై యుండి దేవుని దృష్టికి అభిషిక్తుడాయెను.  బాలుడైయుండి గొఱ్ఱెల మందలను మేపుచు మంద మీద దాడిచేసిన ఎలుగుబంటిని సింహాన్ని చంపినాడు.  అదే విధంగా బాలుడైయుండి,  యుద్ధకవచాలుగాని, ఆయుధాలుగాని లేక యుద్ధరంగంలో పిలిష్తీయ మహాసైన్యమునకు పట్టుగొమ్మయైన గొలియాతును సంహరించాడు.  ఇది బాలుడైన దావీదు చేసిన క్రియ.  అయితే ముసలివాడైన  దావీదు మహారాజు చేసిన పనియేమిటంటే దైవత్వాన్ని స్తుతిస్తూ దైవచిత్త ప్రకారం జీవించి నూతన నిబంధన కాలంలో పుట్టబోవు క్రీస్తునకు పితామహుడయ్యాడు.

        అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచి యుండలేదని అంటున్నాడు.  నిజమే పాత నిబంధన కాలంలో నోవహు భిక్షమెత్తలేదు.  మోషే భిక్షమెత్తలేదు.  అయితే సాతాను యొక్క కుతంత్రం వలన కపటోపాయం వలన పతనమైన ఇశ్రా యేలీయులు ఐగుప్తు చెరలోనుండి తమను విడిపించమని మరియు తమకు ఆహారం కావాలని మాంసం కావాలని, దేవుని భిక్షమడిగినారే గాని లోకాన్ని గాని లోక జనాంగాలను గాని భిక్షమడిగినట్లు వేదంలో లేదు.

        ప్రియపాఠకులారా!  అపో 3:లో శృంగారమను దేవాలయ ద్వారము వద్దనున్న చీలమండల రోగి భిక్షకుడు, ఎరికో ద్వారము దగ్గరనున్న గ్రుడ్డివాడు భిక్షకుడు, ఐదు మంటపాల కోనేటి దగ్గర నున్న రోగులు భిక్షకులు, పదిమంది కుష్ఠురోగులు భిక్షకులు, వీరు ఈ దశలో వుండుటకు కారణము. దేవుని యెరుగని స్థితి.

        కనుక ప్రియపాఠకులారా!  నీతిమంతుడు విడువబడుటన్న విషయంలో ఆదాము నీతిమంతుడే అతడు తప్పుచేసి దేవుని ఎదుట పాపం చేయగా దేవుడు ఆదామును తోటనుండి వెళ్ళగొట్టినను అతనిని అనాదిగా వదలక - ఆదాము దంపతులకు చర్మపు చొక్కాయిలు తొడిగించి నట్లుగా వేదంలో చదువగలము.  నీతిమంతుడైన హానోకు లోకము చేత విడువబడిన వాడే గాని దైవత్వంలో అతడు విడువబడలేదు.  దేవుని చేత కొనిపోబడి లోకానికి కనుమరుడైనాడు.

        యిక విచిత్రమైన విషయమేమిటంటే దేవుని బిడ్డలు దయాళులైయుండి అప్పు యిచ్చుదురంటాడు.  ప్రియపాఠకులారా!  ఈ అప్పు అన్నది ఏమిటో క్షుణ్ణంగా మనము తెలిసికోవలసియున్నది.  మొట్టమొదట దేవునికి నరుడువున్నటువంటి ఋణానుబంధమేమిటో మనము తెలిసికోవలసివున్నది.  యావద్‌ సృష్టిని చేసిన దేవుడు సృష్టితో బాటు సమస్త సదుపాయములు గల ఏదేనను విశాల వనమును ఆకాశ పక్షులను సముద్రపు మత్స్యములను సముద్రములో సంచరించువాటిని, వీటన్నిటితోబాటు తన జీవాత్మ నిచ్చి నీతి పరిశుద్ధతతో జీవించమని హెచ్చరించిన దేవునికి నరుని యొక్క ఋణానుబంధమెటువంటిదో ఒక్కసారి చదువరులు ఆలోచించారా?   దేవునికి నరులు వున్నటువంటి ఋణము జన్మాంతరానికి కూడా తీరదు గాని ఆ ఋణానుబంధమును కాయా కర్పూర బలులు ధూపదీప నైవేద్యాలతో తీర్చుకోవాలని నరుడు తపన పడుచున్నాడు.  యిది చాలక బొట్టుకట్టు, వస్త్రాలంకరణ, తలలోని  నీలాలలో మార్పులు, పిలక కొప్పు, జులపాలు వగైరా, రుద్రాక్షలు తులసి కొయ్యపూసలు, గాజుపూసలు వగైరాలతో దండలు అలంకరణ, నామాలు పట్టె వర్దనాలు వగైరాలతో తన దేహాన్ని చిత్ర విచిత్రమైన అలంకారాలతో నరుడు అలంకరించుకొని బాహ్యంగా పాపపు శరీరంతో-అదృశ్యంలో వున్న ఆత్మ దేవుని యొక్క ఐశ్వర్యా శీర్వాదాలను పొందాలని ఆతృతపడుచున్నాడు.  యిట్టి క్రియల వల్ల దైవత్వంలో విరోధమేగాని శక్తితో సంపాయించుకొనుట అసాధ్యము. దైవత్వమును మెప్పించుకొనునట్టి ఆత్మీయ ఫలాలు నరునిలో లేకపోతే వేషధారణవల్ల జపతపాదులవల్ల వ్రతములు, నోములు, ఉపవాసములు వీటి ద్వారా దైవిక సంపదను దోపిడీ చేయాలని ప్రయత్నించుట జీవాత్మయైన నరునికి ఏనాటికైనను ముప్పు.

        అప్పుయిచ్చు విషయంలో ఈ లోకంలో ఎవరికైన మనము అప్పు యిచ్చినామంటే అప్పును తీసుకొన్నవాడు అప్పును తీర్చాలి.  అట్లు తీర్చగలిగితే అప్పుతీసుకోవాలి.  అయితే ఆత్మపరులైన దైవ భీతిగలిగి దయాళులై యున్న వారి ద్వారా పుచ్చుకోవాల్సిన అప్పు ఏమిటంటే దేవుని యొక్క వాక్యమే!  దైవోద్ధేశ్యమన్నది జీవాత్ముడైన నరునికి అమూల్యమైన తరగని ధనము.  యిట్టి ఆత్మీయ ధనమును ఒకరి ద్వారా ఉపదేశింపబడి పొందిన మనము మన యిరుగు పొరుగు కూడా ఈ ధనాన్ని అప్పుగా యివ్వవలెను.  అనగా నేర్చుకొన్న వాక్యంలోని పరమార్ధాన్ని బోధించాలి.  యిది ప్రతి విశ్వాసికిని ఋణమును'', దీన్ని పంచకపోతే శ్రమయు కలదని భావించి తప్పని సరిగా దీనిని పంచవలెను. ప్రియపాఠకులారా!  సువార్త ప్రకటించకపోతే నాకు శ్రయయని పౌలు అంటున్నాడు.  సువార్త వినకపోతే మనకు శ్రయమని మనము గుర్తించవలెను.  విన్న సువార్తను విశ్వాసియైనవాడు యిరుగు పొరుగునకు పంచకపోతే లేక అప్పుగా యివ్వకపోతే వారికిని వారి సంతానమునకు తీరని లోటైయుంటుంది.  కనుక అట్టి అప్పును యిరుగుపొరుగునకు వాక్యరూపముగాను ప్రార్ధనా రూపంగాను లేక తమకు తోచిన రీతిగా దృశ్యంగా ద్రవ్యరూపంగా వస్తురూపంగా గాని సలహారూపంగాని వస్త్రరూపంగాని యిచ్చిన వారు వారి యొక్క సంతానములు వారి ఇహలోక జీవితము ఆశీర్వాదకరములై యుండునని యిందు మూలంగా గ్రహించాలి.

        యిక 37:27వ వచనంలో కీడు చేయుటమాని మేలు చేయుము.  అనుటలో కీడు అన్నది ఏమిటో దాని వల్ల కలుగు భయంకర అనర్ధాలను గూర్చి ముందు మనము తెలుసుకోవాలి.  కయీను తమ్మునికి కీడుచేసి తరగని శాపమును సంపాయించుకొని దేశ దిమ్మరియైనాడు.  యాకోబు కుమారులు తన సహోదరుడైన యోసేపునకు కీడు చేసి గొప్ప క్షామానికిని దైవత్వానికిని వ్యతిరేకమైన  ద్రోహ కార్యమును చేసి నీతిమంతుని అమ్మిదైవోగ్రతకు పాత్రులై కరువు కాటకాలలో నీరు ఆహారము లేక అలమటించారు.  అబ్షాలోము తండ్రికి కీడు చేయాలని మరణాన్ని సంపాయించుకున్నాడు.  గేహాజీ శపిత వస్తువులను ఆసించి కుష్ఠురోగియై కీడు సంపాయించుకున్నాడు.  అహాబు రాజు నాబోతు ద్రాక్షతోట కోసం అక్రమంగా అన్యాయంగా నాబోతును చంపించి కీడు చేసి కుక్కల పాలయ్యాడు.  హామాను మొర్దెకై విషయంలో యూదుల జాతిని నిశ్శేషంగా అంతము చేయాలని సంకల్పించి కీడుదలచి అన్యాయపు మరణశాసనాన్ని రాజుచేత సృష్టించి రాజముద్రికతో నిశ్శేషంగా దైవ జనాంగాన్ని నిర్మూలించాలని సంకల్పించి వారితో బాటు మొర్దెకైను ప్రత్యేకంగా ఉరి ఎత్తించాలని తన యింటి వాకిటనే ఉరికంబమును నాటించాడు.  ఫలితము హామానును హామాను యింటి వారిని అదే ఉరి కంబం మీద వ్రేలాడ దీసినట్లు వేదంలో చదువగలము.

        యిక ఈ వాక్యంలో రెండవభాగముః  నీవు నిత్యము నిలిచెదవు'', అనుటలో చనిపోయినను కీర్తిశేషులై నేటికిని వారి పేర్లు జీవించుచున్న జనాభాలో నిలిచియున్నదంటే వారు చేసిన సత్క్రియలను, వారు జరిగించిన ధర్మకార్యాలు దైవత్వంలో వారు పొందిన ప్రాధాన్యత మహిమను మనము గ్రహించాలి.  యిట్టి వారి జాబితాలో పరిశుద్ధ గ్రంథములోని ప్రవక్తలు  న్యాయాధిపతులు రాజులు దీర్ఘ దర్శులు, నూతన నిబంధనలో అపోస్తలులు హత సాక్షులు వేద సాక్షులు యాజకులు, బోధకులు, నీతి మార్గంలో నడిచిన వీరులు నారీమణులు ప్రవక్తలు వగైరాలు. వారి చరిత్రలు నేటికిని గ్రంధరూపంగా విరచితములై నేటి తరము వారైన మనకు మన ఇహపర జీవితాలకు ఆదర్శములును మార్గోపదేశములునై సజీవములుగా ఆదర్శములుగా ప్రబోధింస్తున్నాయంటే నీతిమంతుడుగా వున్న నీతి యొక్క ప్రభావమెట్టిదో మనము గ్రహించాలి.  యిట్టి వారు అమరజీవులు అనగా చనిపోయినను బ్రతికి వున్న వారి జాబితాలో చేర్చబడినారు.

        ఏలయనగా ''యెహోవా న్యాయమును ప్రేమించువాడు.  ఆయన తన భక్తులను విడువడు.  ప్రియపాఠకులారా!  ఈ 37:28వ వచనంలో న్యాయమును ప్రేమించినాడు''.  అనుటలో దైవత్వమే న్యాయముతో కూడియున్నపుడు ఇక దేవుడు న్యాయవంతుడు కాకపోవుటేమిటి? సృష్టికి న్యాయము దీర్చుటకు దేవుడు సృష్టిలో న్యాయాన్ని స్థాపించాలని సృష్టిలో న్యాయానికి పునాది వేసి అన్యాయస్థులకు తన రాజ్యంలో ప్రవేశము యివ్వక, నీతిని బట్టి న్యాయమును బట్టి పాత నిబంధన కాలంనుండి నూతన నిబంధన కాలం వరకును, నూతన నిబంధన కాలంనుండి ఈ అంత్యకాలంలోను దేవుడు జన సందోహం నుండి కోరేది న్యాయమే!  న్యాయవంతుని నాలుకలోను, అతని హృదయంలోను అతని కుటుంబములోను, అతని పనిలోను అతని నడతలోను  దేవుడు తన ప్రత్యక్షతను కన పరచుచుంటాడు.  యిందుకు ఉదా|| సొలోమోను దేవుని యొక్క జ్ఞానంతో ఇతను తన రాజ్యంలో అనేకులకు న్యాయము దీర్చి వారి వారి సమస్యలను దీర్చినట్లు వేదంలో చదువగలము. అహాబు విషయంలో అతను నాబోతును యెజిబేలు ప్రేరేపణ చేత అన్యాయంగా చంపినపుడు దైవ ప్రవక్తయైన ఏలీయా తీర్పు చెప్పుచూ ఆహాబు చేసిన అన్యాయమునకు జరుగు శిక్షను వివరించియున్నాడు.  అనగా నాబోతు ఏ స్థలములో హతం చేయబడినాడో అదే స్థలములో అహాబు అతని భార్య యెజెబేలు రక్తమును కుక్కలు చవిచూస్తాయని తీర్పు.  అదేవిధంగా అహష్వేరోషు సంస్థానంలో దైవ జనాంగమైన యూదుల సంహారమును గూర్చిన అన్యాయపు తీర్పునకు ఆమోను రాజుచేత శాసింపచేసిన అన్యాయపు తీర్పు రాజశాసనము అనగా యూదులను సమూలంగా నాశనం చేయుటకు తాఖీదును సృష్టించగా ఆయన మాటలను విని అహాష్వేరోషు రాజు లిఖించి ముద్రించిన రాజశాసనాన్ని గూర్చి యూదా జనాంగము  మరియు అహష్వేరోషు పట్టపు రాణియైన ఎస్తేరు ఆమె దాసీ జనాంగము  మొర్దెకై  దేవునికి చేసిన ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలు, వారి ప్రార్థనలను విన్న దేవుడు రాజు యొక్క అన్యాయపు శాసనాన్ని గూర్చి విచారించి అన్యాయస్థుడైన హామానును చంపించి న్యాయమైన చట్టాన్ని పునర్నిర్మించి సంహారక చట్టాన్ని రద్దుపరచినట్లు దేవుని యొక్క న్యాయము యొక్క ప్రభావము బైల్పరచబడియున్నది.  ఈ విధంగా దేవుడు న్యాయమును ప్రేమించువాడు గనుక ఆయన తన భక్తులను న్యాయమైన తీర్పుతో విడువక, వారెన్నటికిని తొట్రిల్లకుండులాగున తన కాపుదలను వారికి అను గ్రహించును.

        ప్రియపాఠకులారా!  ఇక భక్తిహీనుల సంతానము నిర్మూలమగు'', ననుటలో ఆదిలో ఆదాము యొక్క ప్రథమ కుమారుడు కయీను యొక్క భక్తీ హీన సంతతి యైన జనాంగము దేవుని ఉగ్రతకు గురియై జల ప్రళయం ద్వారా పూర్తిగా నిర్మూలమయ్యారు.  ఇక శేషించిన జనము తమ భక్తిహీనతవల్ల దేవుని దూతలను మానభంగంచేయాలని యత్నించి దేవుని యొక్క కోపాగ్నికి గురియై, పై నుండి అగ్ని గంధకములు వర్షింపబడి నాశనమైనట్లు కూడా లోతు చరిత్రను బట్టి తెలియుచున్నది.  ఈ విధంగా భక్తిహీనుల సంతానము నిర్మూలమైనను భక్తిహీనత అనిన గుణము భూమి మీద నిలిచియే యున్నది.  అయినను దాని యొక్క ప్రభావము కుక్క గొడుగుతో సమానము అనగా ఎండవస్తే వుండదు.  ఇశ్రాయేలీ జనాంగంపై కత్తిదూసిన పిలిష్తీయ వగైరా భక్తిహీనులు సమూలంగా తుడిచివేయబడినట్లు  ఫిలిష్తీయ చరిత్ర ద్వారా తెలియుచున్నది.

        యిక  నీతిమంతులు భూమిని స్వతం త్రించుకొందురు.  ప్రియపాఠకులారా!  ఇక నూతన నిబంధన కాలంలో దేవుని నీతియై యున్న క్రీస్తు యొక్క ప్రభావము వల్ల నీతిమంతులుగా తీర్చబడిన క్రైస్తవ జనాంగము ప్రపంచము మొత్తం మీద తమ పరిపాలనలో వుంచుకొని స్వాతంత్య్ర జీవితం జీవించుచున్నట్లు నేటి ఆధునిక యుగంలో క్రైస్తవ విశ్వాసుల యొక్క క్రీస్తు విశ్వాసం ద్వారా కలిగిన జ్ఞానా తిశయంతో కూడిన పరిపాలన ఈ వాక్యము ఋజువు పరచుచున్నది.  ప్రియపాఠకులారా!  క్రైస్తవ వేదము ప్రబలియున్న ప్రపంచంలోని ఏడు ఖండాలలో క్రైస్త వాఙ్మయాన్ని గాని క్రైస్తవ చట్టాన్ని గాని, నియమాలను గాని ఆచారాలను గాని నాగరికతనుగాని శాస్త్ర జ్ఞాన ప్రభావంను గాని అడ్డుకొని నిలువ గలిగిన ఏ రాజ్యము లేదు.  కమ్యూనిస్టు దేశాలైన రష్యా, హంగేరి కొరియా, చైనా వంటి నాస్తిక దేశాలు కూడా నేడు దేవుని నీతియైన క్రీస్తు ననుసరించుటకు పూనుకున్నట్లుగా-నేటి కమ్యూనిస్టుల యొక్క మార్పును గూర్చిన వార్తా పత్రికలలో వెలువడుచున్న వాస్తవాలను గూర్చి మనము చదువుచున్నాము.

        కనుక నీతిమంతులు భూమిని స్వతం త్రించుకొందురు. వారు నిత్యము దానిలో నివ సింతురు,''అనుటలో అనేక పురాతనమైన క్రైస్తవ మందిరాలు దేవాలయాలు, స్థూపాలు సమాధులు మరియు పూర్వీక దైవ జనాంగమైన ఇశ్రాయేలీయులు యూదయా హెబ్రియా జనసందోహమును గూర్చి వ్రాయబడిన చరిత్రలు వారు ఈ లోకంలో విడిచి పోయినటువంటి సంపద వారి యొక్క  యుగంలో వదలి పోయిన ఇతిహాసములు శాసనములు పరిపాలనా మర్మములు నేటికిని భూమి మీద సాక్ష్యార్థంగా నిలిచియున్నవి.  ఈ విధంగా చనిపోయినను అమరత్వమును పొంది జీవించువారిలో ఈనాటికిని ఆదాము బ్రిడ్డి ఆరారాతు కొండలు, పాలస్తీనాదేశము,, సొలోమోను మంటపాలు, సంసోను సమాధి, అబ్షాలోము సమాధి అబ్రహాము సమాది, యాకోబు ప్రతిష్టించిన బేెతేలు ఏలియా తిరిగిన స్థలాలు, ఏసు పుట్టిన బెత్లెహాము పాలస్తీనా ఆయన తిరిగిన స్థలాలు, ఆయన మరణించి పునరుద్ధానుడైన సమాధి, 12 మంది అపోస్తలుల యొక్క జీవిత చరిత్రలు దైవారాజ్యమును గూర్చి క్రీస్తుకు సాక్షులుగా నిలబడి క్రీస్తు రాజ్యము గూర్చి పోరాడి ఆనాటి అన్యాయపు అక్రమ పాలకుల యొక్క చిత్ర విచిత్రమైన శిక్షలకు గురియై, భౌతిక శరీరాన్ని వదలి వెళ్ళిన వారి చరిత్రలు హతసాక్షులు అర్చ్యశిష్టులు చరిత్రలు, వేద సాక్షులు చరిత్రలు నేటికిని భూమిని స్వతంత్రించుకొని కొన్ని తరముల నుండి తరతరాలు తెలుసుకొవాల్సిన అమూల్యమైన విజ్ఞాన సత్యాలను బోధిస్తున్నవి.  

        ఇక నీతిమంతుని నోరు జ్ఞానమును గూర్చి వచించును.  ప్రియపాఠకులారా!   ఈ లోకంలో ప్రధమ నీతిమంతుడు మరియు దేవుని నీతియై క్రియ జరిగించువాడు యేసే!  భూమిలో పెరిగియున్న అజ్ఞానమును గూర్చి దేవుని నీతియైన క్రీస్తు తన వాక్కులతో జ్ఞానాన్ని గూర్చి ఎన్నియో శుభవాక్యాలు ప్రవచించియున్నాడు.  ఆదియే సువార్త.  ఈనాటికిని యేసు ప్రభువు స్థాపించి వెళ్ళిన క్రొత్త నిబంధన అను యుగము ద్వారా లేక శకము ద్వారా దేవుని యొక్క నీతి జన బాహుళ్యంలో ప్రత్యక్షంగా బైల్పరచబడియున్నది.  యిందుకు మూలము క్రీస్తే-క్రీస్తు ద్వారానే ఆయన స్థాపించిన నూతన నిబంధన కాలంలో ఏసు ప్రభువు భూమి మీద సంచారం చేసిన దినములలో నీతికి ప్రతిరూపమైయున్న ఏసు క్రీస్తు ఆనాటి రాజులు, యూదా ప్రవిష్టులలో నీతిని న్యాయాన్ని ప్రతిష్టించాలని ఆశించి, ఎన్నో మహత్కార్యాలు అద్భుత క్రియలు దైవత్వం యొక్క శక్తి ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూపించాడు.  ఇందుకు కారణము ధర్మశాస్త్రము అను మూడాచారమునుఅడ్డుగా వుంచుకొని అక్రమమైన తీర్పులు అన్యాయమైన నిందారోపణలు చేయుచు, తమ వరకు తామే నీతిమంతులమని అనుకుంటూ శాస్త్రులు పరిసయ్యులు యాజకులు సద్దూకయులు ప్రధానులు, రాజులు తమను గూర్చి తామే నీతిమంతులమని సరిపెట్టుకుంటూ తప్పు చేసిన వారిని వేలుపెట్టి జూపిస్తూ వారికి అన్యాయపు తీర్పుల నిచ్చి కొరడా దెబ్బలు రాళ్ళ దెబ్బలు ఉరిదీయుట లేక జంతువులతో పోరాడుట లేక బానిసలుగా ఊడిగాలు చేయించుకొనుట వగైరా కఠిన శిక్షలకు వారిని గురి చేసేవారు.  యిందును బట్టి దేవుడు నూతన నిబంధనయను నొక కాలము నేర్పరచి నీతికి ప్రతి రూపమె,ౖ తన కుమారుడైన ఏసు ప్రభువు ద్వారా జ్ఞానమును గూర్చి న్యాయాన్ని గూర్చి సకల జనకోటికి ప్రకటింప చేశాడు.  ఎట్లంటే లూకా 1:36 లో మరియమ్మతో మత్త 2:లో యోసేపుతోను, లూకా 5:8లో గొల్లలతోను దేవుడు తన న్యాయమును గూర్చి ప్రకటించినట్లు నూతన నిబంధనలో చదువగలము.  యింకను సౌలుగా వున్న పౌలు విషయంలో దేవుడు ఆకాశవాణి ద్వారా అపోస్తు 9:10 అననీయతో మాట్లాడిన మాటలలోని పరమార్ధము దేవుని యొక్క నీతియుతమైన న్యాయమును గూర్చిన ప్రకటన ఎట్టిదో ఋజువుకాగలదు.  అనగా దేవుని యొక్క న్యాయము అననీయకు బైల్పరచబడింది.  దేవుని యొక్క న్యాయము యోసేపుకు దేవదూత ద్వారా బైల్పరచబడింది.  మరియమ్మ యొక్క కన్యాత్వమునకు మెచ్చిన దేవుని యొక్క న్యాయోద్ధేశ్యము కన్య మరియకు దేవదూత ద్వారా బైల్పరచబడింది.  అదేవిధంగా భూమి మీద నరుల పాపములను విమోచించి వారిని కాపాడుటకు రక్షకుడు పుట్టియున్నాడన్న నీతియుతమైన వాక్కును గూర్చి దూత చేత గొల్లలకు ప్రకటించబడింది.  ఇట్లు ప్రకటించిన గ్రంధమే పరిశుద్ధ గ్రంథము

        ఇక 31లో పై విధంగా న్యాయమైన తీర్పును ప్రకటించునదియే ధర్మశాస్త్రము.  ఆ ధర్మశాస్త్రము రూపాంతరము పొంది పరిశుద్ధ గ్రంధమైనది.  ఈ ధర్మశాస్త్రమునకు గ్రంధకర్త దేవుడైన యెహోవా!  ధర్మశాస్త్రము రూపాంతరము పొందిన తర్వాత దైవ ప్రతిరూపమైన ఏసు క్రీస్తు ద్వారా మెరుగుపరచబడి, అనగా లోటుపాట్లను సరిదిద్ధి రాతిపలకలుగా వున్న శాసన పుస్తకంగా రూపొందించబడి చిత్రవిచిత్రమైన రీతులలో సకల ప్రదేశాలలో సకల జనాంగమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని, ఆయా భాషలలో ఆయా రీతులలో ఆయా పద్దతులననుసరించి రూపొందించబడిన ఆలయములలో దైవత్వం చేత ప్రతిష్టించబడి, సమర్పణా జీవితంలో వున్న బోధకుల ద్వారా ప్రతి విశ్వాసి హృదయంలో పరిశుద్ధ గ్రంధ వేదవాక్య రూపంగా వారి వారి హృదయాలలో భద్రపరచబడుచున్నది.  కనుక నిజమైన క్రైస్తవ విశ్వాసిగా రూపొందించబడినవాని జీవితము చలించదు, తప్పటడుగులు వేయడు, అతను కదల్చబడడు, అతని అడుగులు జారవు అనగా మరియొక మార్గానికి మరలడు. ఒకవేళ బలహీనులై అవిశ్వాసంలో కొట్టుమిట్టాడుచూ వున్న ఇరుగుపొరుగు సోదరులను కూడా యిట్టివాడు తన భక్తి విశ్వాసమూలమున తన నీతియుత ప్రవర్తన ద్వారా జారిపడు వారిని లేవనెత్తి తప్పటడుగులు వేయువారిని వేదవాక్యముఅను దండంతో నింపి నీతి న్యాయ మార్గాలలో నడిపించగలడు.  యిట్టివాడే నీతిమంతుల జాబితాలో చేర్చబడుటకు యోగ్యులు.  వీరి నీతి వారు చనిపోయినను భూమి మీద జీవించి క్రియజరిగించును.

        37:32 భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపచూతురు.  ప్రియపాఠకులారా!  వేదంలో యిట్టి భక్తిహీనతతో కూడియున్న భక్తి పరులను పొంచియుండి చంపజూచిన వారలలో ఉదా|| మొర్ధెకై సంబంధీకులను సమూలంగా నిశ్శేషంగా చంపాలని కుట్రపన్ని రాజశాసనాన్ని సృష్టించి పొంచియుండి చంపచూచిన హామాను యొక్క చరిత్ర ఈ సందర్భంలో మన మాలోచిస్తే హామాను ప్రత్యేకంగా తన యింటి వాకిట మొర్ద్దెకయ్యను చంపాలని ఉరి కంబాన్ని నాటి సమయం కొరకు పొంచినాడు.  కాని అతను అతని యింటి వారు ఆ ఉరికంబంలో చంపబడినారు.  ఇక దావీదు సౌలు విషయంలో దావీదు పదివేల మంది సౌలు వెయ్యి అనిన నినాదమునకు సౌలు ఖిన్నుడై దురాత్మ ఆవేశితుడై నీతిమంతుడైన దావీదును చంపాలని ఈటె చేత పట్టుకొని పొంచి సమయాన్ని బట్టి పొడవజూచినాడు.

                నిరీక్షణ

        ప్రియపాఠకులారా!  కీర్త43:5లో నా ప్రాణమా!  నీవేల కృంగియున్నావు?  నాలో నీవేల తొందరపడుచున్నావు?  అని అంటున్నాడు.  క్రుంగిన ప్రాణానికి తొందరపాటు కలిగిన ప్రాణానికి రెండింటికిని ఒకటే మార్గమున్నది.  ఈ వాక్యములో దేవుని యందు నిరీక్షణ యుంచుము.  అనిన మాట ఇందుకు మార్గమైయున్నదన్నట్లుగా తెలియుచున్నది.

        మానవ జీవితంలో నిరీక్షణకు ఒక ప్రత్యేక స్థానమున్నది.  నిరీక్షణ అంటే అర్ధము కనిపెట్టుట.  ఈ కనిపెట్టుట అనే స్వభావమునకు చాలా సత్ఫలితాలున్నట్లు మనము తెలిసికోవలసియున్నది.  మన పితరుడైన అబ్రహాము సంతానహీనుడై యుండి విశ్వాసముతో దేవుని కొరకు కనిపెట్టి వృద్ధాప్యములో సంతానవంతుడైనట్లుగాను, ఆ సంతానమే ఈసాకు అను పేరుతో జన్మించి విస్తారమైన దైవ జనాంగమునకు తండ్రియైనట్లు వేద రీత్యా మనము చదువగలము.  యిందుకు కారణము అబ్రహాము దేవుని కొరకు నిరీక్షించినాడు.  కనుక అబ్రహాము యొక్క నిరీక్షణ విశ్వాసపూరితమైనదిగ మనము తెలిసికోవలసియున్నది.

        ప్రియపాఠకులారా!  (1) తీతు 2:11-13 సమస్త మనుష్యులకు రక్షణ కర్తయైన దేవుని కృప ప్రత్యక్షమై మన భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రధమైన  నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడనుమన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు   చూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.  అబ్రహాము యొక్క నిరీక్షణ ఇట్టి కోవలోకి చెంది అతని జీవితములో క్రియ జరిగించినట్లు మనము తెలిసికోవలసియున్నది.

        (2) యిక రోమా 5:2-3లో దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనన్నది విశ్వాసి అతిశయమునకు కారణమైయున్నది.  ఇట్టి నిరీక్షణ ద్వారా అనగా దేవుని మహిమను గూర్చి కనిపెట్టుట ద్వారా మోషే దైవశక్తితో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు.  దేవుని మహిమలో పాలుపొందినాడు. (3) లూకా 2:25లో సుమియోను అను యెరూషలేములోని నివాసియగు నీతి భక్తి గలవాడైన వృద్ధుడు ఇశ్రాయేలు యొక్క ఆదరణ అనగా ఏసు క్రీస్తు పుట్టుక కొరకు కనిపెట్టుకొనియున్నాడు.  యిట్లు కనిపెట్టుటకు అతనిని బలపరిచినది అతనిని ఆవరించిన పరిశుద్ధాత్మ ఇట్టిఆత్మ కుమ్మరింపుతో కూడిన నిరీక్షణ వలన సుమియోను దేవుని కుమారుడైన క్రీస్తును చూచు వరకు మరణించడని పరిశుద్ధాత్మ చేత తెలుపబడినట్లు తెలియుచున్నది.

        (4) అదృశ్యమైన వాటిని గూర్చిన నిరీక్షణ. ఈ సందర్భములో రోమా 8:25 అదృశ్యమైన ఆత్మ సంబంధమైన వాటిని కనిపెట్టుట.        

        (5) రెండు పేతురు 3:11-13 నీతియుతమైన కొత్తాకాశము క్రొత్తభూమి కొరకు కనిపెట్టుట (6) రోమా 8:19 దేవుని కుమారుని రాక కొరకు సృష్టి కూడా ఆశతో కనిపెట్టుచున్నది.  (7) క్రైస్తవులమైన మన యొక్క మంచి మరణము అనగా నిత్య జీవముగల మరణము కొరకు కనిపెట్టవలసియున్నది.  ఈ సందర్భములో మొదటి థెస్స 4:13 నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మా కిష్ఠము లేదు.  అని పౌలు వివరించియున్నాడు.

        ప్రియమైన వారలారా!  అయితే నిరీక్షణ ఆధారమేది? అంటే రోమా 15:13 కాబట్టి నిరీక్షణ ఆధారము దేవుని యందు విశ్వాసము నీతి భక్తి, పరిశుద్ధాత్మ శక్తి ముఖ్యమని తెలియుచున్నది.  హన్న తన ప్రార్థనా శక్తి భక్తి విశ్వాస్యతల మూలముగా నిరీక్షణ ద్వారా ప్రవక్తయైన సమూహేలును కన్నది.  తన కుమారుడు గొప్ప ప్రవక్త కావాలని యాజకుడు కావాలని ఆశించి, బిడ్డపాలు విడిచిన వెంటనే వానిని మందిరాని కప్పగించి, వాని ఆత్మీయ జీవితము కోసము దైవాత్మ శక్తి కొరకు కని పెట్టింది. అలాగే ఎస్తేరు తన భక్తి విశ్వాసతలను బట్టి దేవుని చిత్తము కొరకు కనిపెట్టి రాణియైనది.  జక్కయ్య తన శారీర జీవితాన్ని వదిలి తన ఇహలోక జీవితానికి స్వస్థి పలికి మనుష్యుల కొరకు కనిపెట్టక మేడి చెట్టెక్కి ప్రభువు కొరకు కనిపెట్టి ఆయన దర్శనము ద్వారా తనలో వున్న సమస్త దుష్టత్వాన్ని లయపరచుకొనుటయే గాక, ఏసుప్రభువు ద్వారా అబ్రహాము కుమారుడుగా బిరుదు పొందినాడు.  అలాగే ఎంతోమంది క్రీస్తు విశ్వాసులు ప్రభువు కొరకును ఆయన కార్యము కొరకును కనిపెట్టి ధన్యులైనారు.

        నేటి క్రైస్తవులమైన మనము మన నిరీక్షణ వేేటి కోసమున్నది. దృశ్యమైన ఈ లోక సంబంధ వృత్తి పదవుల కోసమా? లేక అదృశ్యములో వున్న అదృశ్యపరమ తండ్రి యొక్క నిత్య జీవయుతమైన వైభవము కోసమా? మరి దేనికోసము? అందుకే పౌలు భక్తుడు కొలస్స 3:1 క్రైస్తవులను హెచ్చరిస్తూ ''మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అదృశ్యమైన వాటినే వెదకమంటున్నాడు.  మనము కూడా మన జీవితములో ప్రభువు యొక్క కార్యము ఆయన చిత్తము, రానున్న ఆయనరాకడ, ఆయన నిత్య రాజ్య వైభవము కోసము నిరీక్షణ కలిగియుండాలని మనము తెలిసికొందము గాక!  కనుక ఇట్టి ఆత్మీయ మర్మములను గ్రహించిన మనము మన ప్రాణములను విసుకనీయక క్రుంగక దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించాలని ప్రభువు కోరుచున్నాడు ఆమెన్‌.

        

కీర్త 49:14 అంధకారమందు దుర్మార్గులు ఏలెదరు.  బ్లాక్‌ మార్కెట్‌, వ్యభిచారము, దొంగతనము మొదలైనవి ఉదయమున అనగా సూర్యుని వెలుగు నందు నీతిమంతులు దుష్టులపై అధికారము చేయుచు వారి నేెలుదురని అనగా సూర్యోదయ కాలమున దుష్టులకు సమయము కాదు కనుక నీతిమంతుడు తన కార్యకలాపములను సాగించునని అర్థము.

        కీర్త 51:7 హిస్సోపుతో నా పాపము పరిహరింపుము.  అనగా నీ పరిశుద్ధత తోనే నన్ను పవిత్రపరుచుము.        

        కీర్త 68:11 స్త్రీలు బలిపీఠమెక్కి ప్రకటించుట నిషేధమే గాని, స్త్రీలు ప్రత్యేకముగా వీధులలో కుటుంబ ములతో ప్రత్యేకముగా గాని గుంపులుగా గాని వాక్యము ప్రకటించుటలో తప్పులేదు.  పాత నిబంధనకాలములో పురుషులు ఎక్కువగా వంట భూములందు, జీవరాసులు మేపుట యందును అనేక మంది గ్రామముల వారీగా పట్టణముల వారీగా సైనిక సందోహముగా నిలువబడి యుండుట వలన పురుషులకు దేవుని వాక్యము ప్రకటించుటకు వీలుకాలేదు.  కాని పాత నిబంధన కాలములో స్త్రీలే ఎక్కువగా దేవుని వాక్యము ప్రకటించుచున్నారు.  క్రొత్త నిబంధన కాలములో అమ్మగార్లు, పెంతికోస్తు సంఘ స్త్రీలు మిగతా సంఘస్థులలో కొందరు ఇప్పుడు కూడా వాక్యమును బోధించుచున్నారు.  వాక్యమును బోధించు పురుషులు ఇప్పుడు అత్యధికముగా వున్నందువలన స్త్రీలకు అంత పనిలేదని భావించవచ్చును.

        కీర్త 45:8-17 యిది మరియమ్మ గారిని గూర్చి చెప్పబడియున్నది. ''తరములన్నిటను ఆమె నామము జ్ఞాపకములంటుంది.  జనములు సర్వకాలము కృతజ్ఞతాస్తుతులు చెల్చించుదురు;

        కీర్త 47:5 దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను.  బూర ధ్వనితో యెహోవా ఆరోహణమాయెను.

        యెహోవా దేవుడు తన ప్రజలతో మాట్లాడి వారికి హిత బోధలు చేసి తిరిగి ఆయన తన మోక్ష సామ్రాజ్యమునకు వెళ్ళిపోవుటలో గల ఆయ నయొక్క సంపూర్ణత్వమును గూర్చి వారి దర్శనములను బట్టియు ఆయన ఆ విధముగా ఆరోహణమైనట్లుగా చూపినారు.

        అంశముః-ముందు చూపు

        పఠనము కీర్తన 48 మూలముః- హెబ్రీ 12:1-2 లో మనము కూడా ప్రతిభారమును, సుళువుగా చిక్కుల బెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట వుంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.

        ప్రియవిశ్వాసులారా!  విశ్వాస జీవితంలో వున్న మన ఆత్మీయ స్థితికి ముందుచూపు ఎంతో అవసరమనే విషయాన్ని వేదములో ఈ క్రింది వేదభాగాల ద్వారా తెలిసికోగలము.  ఈ సందర్భంలో ఆది 18లో అబ్రాహాము యొక్క విశ్వాస జీవితములో ఆది 19:12లో లోతు జీవితములోని లోపాలను గ్రహించగలము.  లోతు అమాయికుడు.  దైవ విశ్వాసిగా వుండినను తన కుటుంబాన్ని క్రమశిక్షణలో వుంచుకొనే సమర్థతలేని వాడైనట్లు ఆది 19:14లో అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి అయినవాడు.  మరియు పెళ్ళి చేయకుండానే అల్లుళ్లను ఇంటవుంచుకొనుటన్నది పెద్ద పాపము.  ఇందులో లోతు భార్య పాత్ర ఎక్కువగా వున్నది.  పెండ్లికాకుండగానే పరాయి మగవారిని  అల్లుళ్ళుగా చెప్పుకుంటున్న జీవితమెంత అసహ్యకరమో మనము గ్రహించవలసియున్నది.  కనుక లోతు దంపతులలోని ఈ లోపమును దేవుడు గ్రహించియున్నను లోతు యొక్క అమాయిక మరియు అశక్తికరమైన జీవితమునకు దేవుడు జాలిపడి అతని కుటుంబము పట్ల కనికరించినట్లు ఆది 19:1-3లో చదువగలము.  ''ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదమ చేరునప్పటికి లోతు సొదమ గవిని యొద్ద కూర్చుండియుండెను.  లోతు వారిని చూచి వారి నెదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము జేసి, నా ప్రభువులారా!  దయచేసి మీ దాసుని యింటికి వచ్చి రాత్రివెళ్ళబుచ్చి కాళ్ళుకడుగుకొనుడి, మీరు పెందలకడలేచి మీత్రోవను వెళ్ళవచ్చుననెను.  అందుకువారు-ఆలాగు కాదు, నడివీధిలో రాత్రివెళ్ళబుచ్చెదమని చెప్పిరి.  అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి.  అతడు వారికి విందుజేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము జేసిరి.

        అయితే దైవోగ్రతన్నది లోతును ఎగతాళి చేయు అల్లుళ్ళను తప్పించి, లోతును అతని భార్యను కుమార్తెలను నిరపాయస్థలమునకు నడిపించుటకు క్రియజరిగించినట్లు ఆది 19:15-18లో చదువగలము.  అయితే ఈ విలువను దైవ ప్రేమను లోతు భార్య పొందలేకపోవుట శోచనీయము.  ఎందుకంటే ఆది 1:24-25 లో దేవుడు గంధకము ఆగ్నిని కురిపించినపుడు దేవుని ఆజ్ఞమీరిన లోతు భార్యవెనుదిరిగి ఉప్పుస్థంభమైనట్లు ఆది 19:27లో చూడగలము.  సామె 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లుకట్టును.  మూడురాలు తన చేతులతో తన యిల్లు ఊడబెరుకును ,''అని చెప్పబడిన రీతిగా లోతు భార్య జీవితము అంతమైనట్లు తెలియుచున్నది.

        ఈ విధంగా లోతే దైవోగ్రతనుండి తప్పించ బడినప్పటికిని అతడు ఆది 19:30 -38 లోవలె మద్యమునకు దాసుడై స్త్రీ పాపము జేసి మోయాబీయులకు మూలపురుషుడైన మోయాబునకును అమ్మోలీయులకు మూల పురుషుడైన బెన్నమ్మికిని తండ్రియైనట్లు లోతు చరిత్రలో తెలియుచున్నది.  కనుక ప్రియసోదరీ!  సోదరా మన విషయంలో కూడ మన వరకే గాక కుటుంబమంతయు దైవత్వంలో జీవించాలి.  క్రీస్తును గురియందు పెట్టుకొని ఈలోకజీవితం జీవించాలి.  అప్పుడే లోకాన్ని జయించగలము.

        దేవుని యొక్క నీతిని బైల్పరచిన దెవరు? బైల్పరచుచున్న దెవరు?  ఈ నగ్నసత్యమును కీర్త 50:6లో ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది.

        ప్రియపాఠకులారా!  నిజానికి దేవుని యొక్క నీతిని వెళ్లడిపరచుటకు దైవ రూపములో వున్న మనుష్యుడే బాధ్యుడైయున్నాడు.  దేవుని యొక్క నీతిని వెల్లడిపరచుటకు గాను దేవుడు ప్రత్యేకించి నరుని-సృష్టిలోని అన్ని జీవరాసులతో బాటు గాక ప్రత్యేకంగా వాక్కు ద్వారా వివరిస్తూ ఆది 1:26 ''మన పోలిక మన స్వరూపము చొప్పున నరులను చేయు దుము''.  అన్నట్లుగ వ్రాయబడియున్నది.  ఆయన పోలిక అన్నది ''నీతి పరిశుద్ధత అనగా నీతితో పరిశుద్ధతతో దైవత్వమును గూర్చి దైవ క్రియాసంకల్పమును గూర్చి దేవుని నీతిని గూర్చియు దేవుని యొక్క నీతిలో భాగస్వామియైన నరుడు దేవుని గూర్చి ప్రకటించవలసియున్నది.  దేవుడు నర నిర్మాణంలో ఆశించినటువంటి ఆశయము కూడా ఇదియే!  తన పోలిక తన స్వరూపంలో చేయబడిన నరుడు దేవుని గుణాతిశయములు గల్గి దేవుని ఆత్మానుసారంగా దైవ క్రియా సంకల్పమును గ్రహించినవాడై దేవుని యొక్క నీతిని ఆయన మహత్కార్యాములను ప్రకటించవలసియున్నది.  అయితే ఇందుకు విరుద్ధంగా మానవత్వానికి బదులు ఆకాశము దేవుని నీతిని వెల్లడి పరచుచున్నది.  ఇది ఎంతో శోచనీయమైన విషయము.

        దేవుడు తాను నరుల నుండి ఆశించి నటువంటి నీతి అనుగుణము అంతరించి పోగా ఆ నీతిని నరులలో నుండుట మంచిది కాదని, ఆకాశానికి  నీతిని ఎక్కించి కీర్త 2:4లో ఆకాశమందు ఆసీనుడై నరుల యొక్క అవినీతికి నవ్వుతు యెషయా 1:2లోవలె ఆకాశమా!  ఆలకించుము-భూమీ!  చెవి యొగ్గుము-నేను పిల్లలను పెంచి గొప్పవారిని గా జేసితిని.  వారు నా మీద తిరుగబడియున్నారు''.  అనగా బొత్తిగా నీతిని కోల్పోయారు.

        ప్రియపాఠకులారా!  దేవుని యొక్క నీతిని ఆకాశ మేవిధంగా తెలియజేసిందో తెలిసికొందము.  నర సృష్టిలో ఆదాము కయీను ఇరువురి సంతతిలోని జనాంగములు నీతి మాలిన పనులు జేయుచు చట్టమునకు దైవత్వమునకు మనస్సాక్షికి విరుద్ధమైన క్రియలను జరిగిస్తూ దైవత్వాన్ని మరచి నీతిని విస్మరించి, అవినీతిగా పూర్తిగా హృదయాన్నిచ్చి క్రియ జరిగించగా దేవుని యొక్క నీతి ఉగ్రరూపము దాల్చి నలబై దివారాత్రాలు ప్రచండమైన ధారపాతమైన వర్షాన్ని కురిపించి, ఆ దినములలో దేవుని చేత తాత్కాలికంగా నీతిమంతుల జాబితాలో చేర్చబడిన ఒక్క నోవహు కుటుంబాన్ని మినహాయించి దైవ సృష్టిని యావత్తును పూర్తిగా ఈ నీతి తుడిచి వేసింది.  మరియు దైవ జనాంగమైన ఇశ్రా యేలీయులకు నాయకుడైన మోషేకు సీనాయి పర్వతము మీద దర్శనమిచ్చి రెండు ఱాతిపలకలను ఈ నీతి అన్నది ధర్మశాస్త్ర రూపంగా మోషేకిచ్చి ఆ ఱాతిపలకలకు అనుగుణ్యమైన సిద్ధాంతాలతో నీతిలోనే బ్రతుకమని దైవత్వం శాసించింది.  ఈ శాసనాలు పది-ఈ పదింటినీ ఆచరిస్తే దేవుని నీతిని నెరవేర్చినట్లు. అయితే ఈ పదింటిలో కనీసము నరకోటి సక్రమంగా ఆచరించలేకపోయారు.ఈ ధశాజ్ఞల శాసనానికి దేవుని మందసమని దేవుని ధర్మశాస్త్రమని మోషే ధర్మశాస్త్రమని, బిరుదులున్నవి.  ఏది ఏమైనను ఆనాటి జనాంగము దీనిని ఆచరించలేక పోయారు.

        ఇట్లుండగా నూతన నిబంధనకాలంలో ఆకాశము దేవుని యొక్క నీతిని బైల్పరచిన విధానమును గూర్చి ఈ క్రింది వేదభాగాల ద్వారా మనము తెలిసికోగలము.  కన్నెకయైన మరియకు దేవుని యొద్దనుండి అనగా ఆకాశము నుండి దిగివచ్చిన గాబ్రియేలు అను దేవదూత వాక్కులు మరియతో మాట్లాడుచు లూకా 1:27లో దేవుని చేత పంపబడుట ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని చెప్పుటలో దేవుడు నూతన నిబంధన కాలంలో స్త్రీ గర్భం నుండి నీతిని భూమిమీదకు స్థాపించినాడు.  ఎందుకంటే ఆదిలో భూగర్భం నుండి నీతిని ప్రతిష్టిస్తే ఆ నీతి దైవ సన్నిధిలో నిలువలేక నీతికి రూపమైన మట్టి శరీరము తన మట్టి స్వభావమును బైల్పరచుచు అవినీతికి ఆలవాలమైంది.  అందుచేత రెండవ విడతగా స్త్రీ గర్భం నుండి లోకసంబంధమైన అనగా మానవయుతమైన నీతి గాకుండ తన ఆత్మ అణువు సంబంధమైన నీతికి శారీరము నిచ్చి దానిని మహిమ శరీరంగా మార్చుచు మహిమతో కూడిన నీతిని ఆనాటి అవినీతి పరులైన జనులమధ్య ప్రతిష్టించినాడు.   ఈ నీతియే యోహాను సువార్త 1:4-5లోవలె ఆయనలో జీవముండెను''. అనగా జీవయుతమైన నీతి.  ఆ జీవము మనుష్యులకు అనగా ఈ నీతి వెలుగు సంబంధమైనది.  ''చీకటి దాని గ్రహింపకుండెను''.  అనగా పాడైన లోకమునకు అవినీతి అంధకారముతో వున్న లోకమునకు ఈ నీతి యొక్క వెలుగు అవగాహన కాలేదు.  అందువల్ల ఈ నీతిని అలక్ష్యముజేసి దానిని ఆర్పినారు.  అయినను మానవశక్తికి అసాధ్యమైన ఈ నీతియను ఏసుక్రీస్తు మానవుల చేత సమాధి చేయబడినను మహిమాన్విత పునరుత్ధానమును పొంది ఆకాశంలోనే వున్నట్లుగ వేదములో మనము చదువగలము.  ఈ సందర్భంలో లూకా  2:8-9ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో వుండి రాత్రివేళ తమమందను కొనుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను.  ప్రభువు మహిమ వారి చుట్టు ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి'', అనగా ప్రభువు యొక్క వెలుగు వారి మధ్య ప్రకాశించుట వారు భయపడుటన్నది ఇక్కడ సారాంశము.  ఇది నీతి యను దేవుని వెలుగు యొక్క ప్రభావము.

        మరియొక విషయమేమిటంటే మత్త 2:2 యూదుల రాజుగ పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింపవచ్చితిమని అన్నప్పుడు ఆ నక్షత్రము ఆకాశంలో కనపడినట్లు అంతేగాకుండ మత్త 2:9లోవలె ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము దేవుని నీతియగు క్రీస్తు జన్మించిన చోటికి మీదుగా వచ్చినిలుచువరకు ఆకాశంలో నడిచినట్లు ఈ వేదభాగంలో చదువగలము.  కనుక ప్రియపాఠకులారా!  దేవుని యొక్క నీతిని గూర్చి ఆకాశము పై విధంగా బైల్పరచుచున్నది.  అయితే ఈనాడు ఆనీతియైయున్న క్రీస్తు సువార్తను ప్రకటించుటకు మనమేవిధంగా నీతిని ఆచరిస్తున్నాము.  ఏ విధంగా నీతిని ప్రకటిస్తున్నాము.  దైవ రాజ్యమునకు మొదటి సోపానము నీతి రెండవది పరిశుద్ధత.  ఇపుడు మనము నీతిని గూర్చి నేర్చుకున్నాము.  పరిశుద్ధత అంటే ఏమిటో నేర్చుకున్నట్లయితే మానవ స్వరూపంలో యదార్ధంగా దేవుడు ఊహించిన రెండు గుణాలు యొక్క వివరము పూర్తికాగలదు.  మొదటిది ఆయన స్వరూపము అనగా నీతి రెండవది ఆయన పోలిక అనగా పరిశుద్ధత.  ఈ రెండు ఆయన పోలికలు ఆయన నీతి-ఆయన పరిశుద్ధత.

        కీర్తన 50:7-14 వాక్యములను గూర్చిన వేద వ్యాఖ్యానముః- ప్రభువునందు ప్రియమైన వారలారా!  ఎనిమిదవ వచనములో నీబలుల విషయమై నేను నిన్ను గద్దించుట లేదు.  అనుటలో ఈయనకు బలులు అక్కరలేదు.  కాని బలి అనునది ఆయనే చేశాడు నరులను గూర్చి ఆయనే తొలిబలి దేవుడేచేయించాడు.  కాని ఆయన బలికోరలేదు.  ఆయన ఏజంతువునైతే బలిగా జేసి తొలిరక్తమును భూమిమీద ఏదేనులో ప్రోక్షించాడో అదేవిధమైన బలిక్రియను హేబేలు తెలియని రీతిగా జరిపినాడు.  ఆ దినములలో కయీను హేబేలులను తనకు బలులు కావాలని కోరినట్లు గ్రంధములో లేదు గాని ఆదాము తొలినరజంట సంతానమైన కైను ఆతని సోదరుడు హేబేలు వారి చిత్తానుసారముగ వారు బలియాగము చేసినట్లును అట్టి బలివల్ల దేవుని ఆశీర్వాదమునకు బదులు ఒకనికి మరణము ఒకనికి దైవ శాపము సంభవించింది.  తొమ్మిదవ వచనంలో నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేళ్ళ నైనను నేను తీసికొనను అని దేవుడన్నాడు.  అయితే అబ్రహాము ఆది 18:లో మమ్రే దగ్గర దేవునికి మందలోనుండి పశువును దెచ్చి వధించి విందును సిద్ధము చేయగా త్రిశక్తియైన యెహోవా ముగ్గురు వ్యక్తులుగా ఆ యొక్క పశుమాంసమును ఆరగించి, అబ్రహాము భార్యయైన శారాకు సంతానవరమును ప్రసాధించినట్లు తెలియుచున్నది.  దేవుడెందుకు పశుమాంసమును తిన్నట్లు? అను ప్రశ్న మనకు గలుగక మానదు.  దేవుడు తన బిడ్డల చిత్త వృత్తి ప్రకారం వారు ఆనబెట్టిన విషయములో తొలగిపోవువాడు కాదు.  అనుటకు అనగా నరుల మీద దేవుని కున్న ప్రేమను వెల్లడి చేయుటకు ఆది సంభూతుడైన పరమాత్ముడు నరుని యొక్క మనో తృప్తికి మరియు మనోల్లాసమునకై నరస్వభావముతో అబ్రహాముకు అతి ప్రియమైన అతిధివలె వ్యవహారించి, ఆ పశువును బలగాకాక భోజన పదార్ధంగా ఆరగించి దానితో బాటు పాలువెన్నరొట్టెలను జేర్చితాను తృప్తి పడినట్టుగా అబ్రహామునకు కృతజ్ఞతను వెళ్ళబుచ్చు విధముగా మీదటికి నేను మరల వచ్చెదను.  ఆమె కుమారుని కనునని సంతానవరమును అనుగ్రహించెను.  దేవుడు ఇచ్చట తాను తృప్తి పడినట్లుగా తానిచ్చిన వరము ద్వారా బైలుపరచినాడు.  దేవుడు మనకు చేసిన మేళ్ళను బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించుట న్యాయము గాని దేవుడు మనకు కృతజ్ఞత తెలుపుట అనుచితమైన విషయము.

        నీ మందలో నుండి పొట్టేళ్ళనైనను తీసికొనను.  పొట్టేళ్ళ రక్తము నేను త్రాగుదునా?  అని దేవుడు వచించాడు. నిజమే. ఆత్మ జ్ఞానంతో మనము ఆలోచిస్తే అబ్రహాము మందలోని పొట్టేళ్ళను దేవుడు కోరక దాని రక్తము త్రాగక అబ్రహాము ఏకైక సంతానమైన ఇస్సాకును కోరి) అబ్రహామును పరీక్షించి పందెం పెట్టాడు.  ఈ పందెంలో అబ్రహాము ఇస్సాకునే బలిఇచ్చుటకు సిద్ధపడగా దేవుని పందెంలో జయశీలుడైన అబ్రహాము యొక్క విశ్వాసక్రియకు మెచ్చి పరమాత్ముడైన యెహోవా తనమందలోని పొట్టేలును బహుకరించాడు. ఈ పొట్టేలులో దాగియున్న భవిష్యద్‌ దైవ ప్రణాళికా మర్మముః యెషయా ప్రవచించిన విధంగా 7:14 కన్నెక గర్భం ధరించి కుమారునికనును.  ఆయనకు ఇమ్మానుయేలని పేరుపెట్టుదురు.  ఆయన తన ప్రజల రక్షణార్ధము రాజ్యభారమును వహించును.  అని ప్రవచించినాడు.  ఆదరణకర్త-బలవంతుడైన దేవుడు ఆయనకు తోడైయుండును.  యోహాను 1:29లో ఇదిగో లోకపాపమును అన్నట్లుగా యెహోవా అబ్రహాముకు దేవుడు ఈ పొట్టేలును పొదలో ఇరికించాడు.  దీని అర్థమేమంటే లోకములోని సాతాను సమాజమైన బలురక్కసి ప్రజల యొక్క చెరలో తన కుమారుడైన క్రీస్తు తగులుకొని లోకపాపుల యొక్క దోషనివారణార్ధం బలియాగము చేయవలసియున్నది.  ఆ బలిచేయునది అట్టి కౄరశిక్షవిధించువారు కూడా నీలోనుండి వచ్చిన జనాంగమే అన్నట్లుగా చూపించాడు.  అబ్రహాము ఆ విషయమును గుర్తించక యెహోవా ఇచ్చాడనే విశ్వాసంతో సనాయాసంగా నరకినాడు.  అట్టి ఆ గొర్రె పిల్ల క్రిస్మస్‌ దినాల్లో పుట్టుచున్నది.  అబ్రహాము  కుమారుని విడిపించాడు .  ఇస్సాకు సంతతియైన జనాంగము చేయబోవు దోషక్రియల మూలముగ దేవుని కుమారుడైన క్రీస్తు ఈ విధంగా బలిగావలసి వచ్చునను మర్మమును అబ్రహాముకు  దేవుడు వెలువరించుచున్నట్లుగా ఈ మర్మం తెలుపుచున్నది.  

        పద్నాలుగవ వచనం :- దేవునికి స్తుతి యాగము చేయుము.  అయితే నరులు చేసిన బలి యాగము మాటేమిటి? బలియాగము ద్వారా దేవుడే పలుకలేదా? అపొస్త 17:30    ఆ అజ్ఞానకాలమందైతే దేవుడు చూచిచూడనట్లుండెను.  ఇప్పుడైతే తన కుమారుడైన లోకపాపమును మోసిన దేవుని గొర్రె పిల్లయైన క్రీస్తు అనగా దేవుని మందనుండి అనగా నరులు వధించిన పశువులు పొట్టేళ్ళు వగైరా జంతువుల బలులను దేవుడు చూచి చూడనట్లుగా వారిని క్షమించి యూరకుండినట్లును అట్టి బలుల యొక్క తీవ్రతకు విసిగిన దేవుడు మనోక్షోభను పొంది నరులపై సానుభూతితో మరియు యెహాను 3:16లోవలె దేవునికి నరులపై వున్నప్రేమను బటి,్ట ఈ తరములో ప్రతిచోట ప్రతి ప్రదేశములో ప్రతి రాష్ట్రములో ప్రతి ఖండములో ప్రతి దేశములో-ప్రపంచ యావత్తులో వున్న నరకోటి అంతట మారు మనస్సు పొందాలని ఇక నరుని యొక్క బలితో ప్రమేయము లేకయే, నరకోటి పాప పరిహరార్ధం ఒక్కసారే సంపూర్ణబలిగా తన మందలోని పొట్టేలైన ఏసు ప్రభువును బలిజేసి బలియాగమును నిషే ధించాడు.  ఇపుడు స్తుతి యాగమును కోరుచున్నాడు గనుక ఇపుడు నరుడు దేవుని మహిమ పర్చాలంటే కీర్తన 50:23లోవలె కనుక ఇపుడు స్తుతియాగము చేయువాడు దేవుని మహిమ పరచి సంపూర్ణత్వము పొందునట్లు దైవ వాక్యవివరణ యైౖయున్నది.

        అయితే ఆదికాండ 8:21 అధ్యాయంలో దేవుడు జలప్రళయానంతరము రక్షించబడిన నోవహు దేవునికి ఓడలోని పశుపక్ష్యాదులను బలియర్పించగా-ఆ బలిని దేవుడు అఘ్రా ణించి ఇక మీదట నరులను బట్టి భూమిని శపించనన్నట్లుగా వ్రాయబడియున్నది. మరి దీని అర్ధమేమిటో తెలిసికొందము.

        ఒక మనిషి తన గృహములో మామూలుగా భోంచేయు ఆహారము కంటె విందు భోజనము చేయునపుడు భోజనానంతరము పాయసము వగైరా తీపి పదార్ధములు అరటిపండు తాంబూలము వగైరా జీర్ణయుత పదార్ధమును ఆరగించునట్లు దేవుడు నోవహుపట్ల జరిగించిన క్రియ ఊహాతీతమైన, దేవుని క్రియామర్మములను ఎరుగని మనము ఋజువుపరచుచున్నది.

        ఆది 6:1-6లోవలె నరుల హేహ్యక్రియలు దేవునికి రోత పుట్టించుటయే గాక ఆయనలో ద్వేషమును పుట్టింపగా దేవుడు తన సృష్టియైన ఈ లోకమును-లోకములోని జీవరాసులను నరులను సమస్తముల మొత్తమును ఆరగించి, దేవుడు సృష్టించిన సృష్టి యావత్తును తన ఉదరములో చేర్చుకొని తృప్తినొంది శాంతించగా-ఈ విధంగా సృష్టిని ఆరగించిన దేవుడు భూక్తాయాసమును పొందించి శాంతించి లోక సృష్టిలో తనకు అతిధులు లేనందున అట్టి వారు న్నారేమోయని తల పోసి, నోవహు అతని కుటుంబమును ఆతనితోనున్న భగవద్‌ సృష్టియైన పశుపక్ష్యాదులు జ్ఞప్తికి రాగా అతనితో నున్న జీవరాసులను ఓడనుండి ఆది 8:18-20లోవలె వారిని బైటకు రప్పించగా నోవహు కృతజ్ఞతతో దేవునికి అర్పించిన బలి ఆది 8:21లో వలె ఆయనకు సంపూర్ణత్వమును కల్గించగా ఆ వరకు జలప్రళయం వల్ల లోకసృష్టి నాశనమగుచున్న సమయములో దేవునికది దుర్వాసనగా వుండునట్లును, నోవహు అర్పించిన బలి కొద్దిపాటి దైనను దేవునికి ప్రీతికరమైనట్లు ఆయన నోవహును ఆశీర్వదించెను.  ఈ సందర్భములో ఆది 9:8-10 దేవుడు నోవహుతో చేసిన నిబంధన చాలాగొప్పడై యున్నది.  ఈ నిబంధన ప్రకారము దేవుడు పశుబలిని నిరోధించగా నాశనము చేయనని నరునికిని దేవునికిని ఈ నిబంధన ప్రకారం పరమాత్ముడు ఏ ప్రాణిని కోరడు.  ఈ బలియనునది నాశనము చేయుటయేగదా!

        అబ్రహాము వద్ద వాని ప్రీతినిమిత్తం  భోజనంగా ఆరగించాడు గాని బలిగా కాదు. ఇందును బట్టి ఏసు తనబోధలో నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. అయితే మరి క్రీస్తు లోకపాపపరిహారార్ధంగా గొర్రెపిల్లగా వధింపబడుటలో అర్థమేమిటో మనము గ్రహించవలసియున్నది.   కీర్తన 50:9లో విధంగా మనమందలనుండి పొట్టేళ్లు ఆయన కోరలేదు గాని మనమందలోని పొట్టేళ్ళను మనమనఃప్రీతికొరకు మన పూర్వీకులు అర్పించుటను బట్టి, ఈ అర్పణలకు దేవుడు సంతాపము పొంది మన యెడల జాలిపడి, తన మందలోనుండి కొద్ది పొట్టేళ్ళను మన కౄరత్వానికి మన అజ్ఞానానికి మన అపరాధములకు మనపాపాలకు మన ద్వేషాలకు, మన విగ్రహారాధనకు బలిచేసినట్లు ఈ క్రిందిరెఫరెన్సుల ద్వారా తెలిసికొనగలము.  1.హేబేలు అర్పించిన బలి 2. కైను అర్పించిన బలి ఈ రెంటిలో హేబేలు అర్పణముపై దేవుడు లక్ష్యముంచి కయీను అర్పణను తృణీకరించినట్లు తెలియుచున్నది.  ఈ ఇరువురు అర్పించిన అర్పణలు రెండునుఒక్క దేవునికే కయీను శాకాహారమును హేబేలు మాంసాహారమును దేవునికి నైవేధ్యంగా చేయగా వారి స్వభావములను బట్టి దేవుడు బలిని ఆఘ్రాణించియున్నాడు. ఎందుకనగా కయీనుస్వభావం మంచిదికాదు.  ఎందుచేతనంటే సర్పము యొక్క ప్రధమ ఫలము కయీను అయియున్నాడు.  ఎట్లనగా సర్పవాక్కులు విని ఏదేను నుండి భ్రష్టత్వము పొందిన అవ్వకు తొలి సంతానము కైను.  సర్పస్వభావము ఈతనిలో తొలిబీజము (పగ-ఓర్వలేనితనము) వేసినది.  దీని ప్రభావ మూలమున కయీను సంపూర్ణ హృదయముతో దేవునికి బలి అర్పించినట్లుగాలేదు.  ఆలాగు అర్పించి యున్నట్లయితే కయీను అర్పణలను కూడా దేవుడు లక్ష్యముంచేవాడే, కైను మొదట ఆదామునకు సాదృశ్యుడుగా హవ్వనుండి జన్మించినట్లు తెలియుచున్నది.  మరి రెండవ వాడైన హేబేలు ఏసు ప్రభువునకు సాదృశ్యముగా వుండినట్లును ఆయన అర్పించిన బలిని ఏసుప్రభువు వధించబడిన గొర్రెపిల్లకు అనగా హేబేలు వధించిన గొర్రె లోక పాప పరీహారార్ధం ఏసుకు సాదృశ్యంగా వధించినట్లు తెలియుచున్నది.  రెండవ ఆదామైన క్రీస్తుకు హేబేలు సాదృశ్యముగా ఏసుప్రభువు చేసిన బలియాగమునకు హేబేలు చేసిన బలి సాదృశ్యముగా నున్నది.

        ఆయన మందలోనుండి మన కొచ్చిన పొట్టేళ్ళ వివరములుః- ఆదిలో ఆదాముఅవ్వల రక్షణార్ధంబుగ ఆయన వధించి తొడిగిన పొట్టేలు చర్మమర్మము.  రెండవది హేబేలు బలి.  హేబేలు చంపబడడము.  ఈయన దేవుని మందలోని వాడు.  అబ్రహాము వధించిన పొట్టేలు కూడా దేవుని మందలోనిదే.  నేడు క్రీస్తు పండుగలో బాలజేసువుగా పుట్టిన క్రీస్తు కూడా ఆయన మందలోని వాడే.  ఆయనకుబాప్తిస్మం ఇచ్చుటకు పుట్టిన యోహాను కూడా ఆయన మందలోనివాడే.  ఆయన ఏర్పరచుకున్న ఇశ్రాయేలుకూడా ఆయన మందయే.

        యెషయా! 44:1 నా సేవకుడైన యాకోబూ! నేను ఏర్పరచుక్ను ఇశ్రాయేలూ!  నా మాట వినుము.  కాని ఆయన ఏర్పరచుకున్న ఇశ్రాయేలు జనాంగము కూడా ఆయన మందయే.  ఆయన ఏర్పరచుకున్న పండ్రేండు మంది మారాలి.  మన హృదయం మారాలి.  మన గుణాలు మారాలి.  ఆచారాలు మారాలి.  దేవునికి ప్రీతికరముగ జీవించాలి.  కనక నేటి తరమైన మనము దేవునికి స్తుతిస్తూ-స్తుతి యాగమును అర్పించాలి. అపోస్తలులు కూడా ఆయనమందలోని పొట్టేళ్ళు, మన కొరకు ఈయబడిన వీరు లోక పరిపాలకుల క్రోధావేశములకు నిర్దాక్షిణ్యంగా వధించబడినారు.  అటు తర్వాత హతసాక్షులు అటు తర్వాత విశ్వాసులు కాబట్టి మన మందలోవి ఆయన కిచ్చి చింతాక్రాంతులగుటయు దుఃఖపడుటయు రోధించడము అనునది కూడదు.  ఎందుకంటే మనుష్యులందరి రక్షణ కొరకు ఒక్కసారే ఏసుప్రభువు బలిగా వధించబడినాడు.  గనుక మనమిక మీదట దేనికి జంతుబలి అర్పణలు చేయుటకూడదు.  ఎందుకనగా మనుష్యులందరు ఒక్కసారే మరణించాలి.  అను దైవ సిద్దాంతం ననుసరించి సమస్తమానవకోటి పాపనివారణార్థం దేవుడే తన మందలోని ఏసు క్రీస్తును బలి అర్పించి, ఒకేనిరీక్షణలో మనలను వుంచి యున్నాడు గనుక క్రైస్తవ విశ్వాసులైన మనము జంతుబలి ఆచారమును ఆచరింపకూడదు.  అందుకే ఆయనన్నాడు ''నీ యింట నుండి కోడెనైనను నీమందలో నుండి పొట్టేళ్ళ నైనను నేను ఆశించనంటున్నాడు.  ప్రతి సమయములోను ప్రతి సంఘములోను ఆయనను మనము జ్ఞాపకార్ధంగా దేవుని మరదలోని పొట్టేలును మనం రొట్టే ద్రాక్షరసంగా సాదృశ్యపరచి ఆయనను జ్ఞాపకం చేసికొంటూ మాంసమును రక్తమును ఆరగిస్తున్నాము.  ఇట్లున్న మన జీవితములో మార్పేమిటి? మన ప్రవర్తనలు

        నరుని మరణానంతరము నరుని ఆత్మకు దైవసన్నిధానములో ''మోక్షము-నరకము'' అను స్థానములున్నవా?  ఇది మనకెట్లు ఋజువగును?  

        నరుని మరణానంతరము నరుని యొక్క ఆత్మ దైవసన్నిధానమునకు వెళ్ళినపుడు అక్కడ జరుగనైయున్న తీర్పు  ను గూర్చి మత్తయి 25:31 లో వివరించబడి యున్నది.  భూమికి పునాది వేయబడిక ముందే అనగా అది పాత నిబంధన కాలము.   భూమికి పునాది వేయబడి నరసందోహము విస్తరించి పాపమును విస్తరింపజేయగా సృష్టికర్తయైన దేవుడు అట్టి జనాంగముపై విసిగి తానుగా ఏర్పరచుకున్న ప్రత్యేకమైన ఇశ్రాయేలు అను జనాంగమునుండి మత్తయి 2:5లో వలె లోకము పుట్టినది మొదలు అనగా ఇశ్రాయేలీయులనుండి క్రీస్తు పుట్టినది మొదలు, క్రీస్తు అను పదము ఒక రాజ్యమునకు ఒకలోకమునకును పరిమితమైయున్నది.  అంతేగాని ఇది మతము గాదు.  క్రైస్తవజనాంగము ఒక మతసంబంధము గాదు.  దానికి కులము లేదు.  అందుకే దైవ సువార్తను రాజ్యసువార్తని మత్త 24:14 వివరించియున్నారు.  ఇందువల్ల  చనిపోయిన ఆత్మ రెండవకొరింధీ 5:10 లో వలె నరుడు జరిగించిన క్రియలు అవి మంచివైనను చెడ్డవైనను దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయ పీఠము ఎదుట నిలబడవలసిన వారమైయున్నాము.  ఇప్పుడైతే ఈ ఆత్మ క్రీస్తులో దాచబడియున్నది.  ఏలయనగా మీ జీవము క్రీస్తులో దాచబడియున్నది.  ఇపుడు నూతన నిబంధన కాలములో బాప్తిస్మము పొందిన ప్రతి విశ్వాసుని ఆత్మ క్రీస్తులో భధ్రపరచబడి యున్నది.  ఎఫె¦సీ 2:10  నరకము మోక్షము లేకపోయినట్లయితే ఏసు ప్రభువు తన బోధలో తన చుట్టు ఆవరించి యున్న జన సందోహామునకు ధనవంతుడు లాజరు కధను చెప్పియుండడు.  మరియు యోహాను 14.2-5 ప్రకారంగా ఏసు చెప్పిన వాగ్దానం ఋజువైయున్నది.  రెండవ కొరింధీ 5:1-10  ప్రకటన 20:11-15 భూమ్యాకాశములు పాపభూయిష్టములైనవి.  అందువల్ల అవి పారిపోయినవి అనగా బడిదొంగలవలె.  యెషయా 1:2 ఆకాశము భూమి ఈరెండే మనలను గూర్చి సాక్ష్యమిచ్చును ఎందుకంటే మనము ఏ పనిచేసినను భూమి మీదనే, ఎక్కడ తిరిగినను భూమియు ఆకాశమండలమును ఇవి రెండును గమనించుచుండును జలములను ఆయన సాక్ష్యముగా పెట్టలేదు.

        ప్రకటన 21:2 మొదటి ఆకాశము మొదటి భూమి గతించెను.  అనగా అవి లయమైపోవునని అర్ధము.  తమ మృతులను అప్పగించి అవి అదృశ్యమైపోవును.

        ప్రసంగము మూలవాక్యము కీర్త 51:5 ప్రభువునందు ప్రియసోదరీ! సోదరులారా!   సాధారణముగ మనకు కలుగు బాధలు శోధనలలో స్త్రీని - ఆదిలోని హవ్వచేసిన పాపాన్ని గూర్చి వాపోతుంటాము. అయితే పురుషుడు పవిత్రుడా?  శోధనలలో పడలేడా? ఆదిలో దేవుడు ఆది 2:18లో వలె నరునికి సాటి సహాయముగా స్త్రీని చేసెను.  కనుక ఈ స్త్రీ అన్ని వేళల్లోను పురుషుని అంటిపెట్టుకొని అతని పనులలో సహకారిగా వుండాలి.  కాని ఆది 3:1లో స్త్రీ భర్తకు దూరమై ఒంటరియై యుండి సర్పము అను సాతానుకు అవకాశమిచ్చి ఆది ఆది 3:6లో వలె నిషేధఫలభక్షణము చేయుటయేగాక భర్తను కూడా దోషిగా చేసినది.  అయితే ఆ స్త్రీ భర్తతోనే వుంటే ఇట్టి ఉపద్రవమునకు గురియగునది కాదు.  ఇట్టి దైవ వ్యతిరేకతమూలముగ హవ్వగర్భము కూడా కలుషితమైనట్లు మనము కయీను యొక్క కౄరస్వభావక్రియల మూలమునను గ్రహించుచున్నాము.

        అయితే సాతానునకు పురుషుడు లోబడడా?  అనునది మనము గ్రహించవలసియున్నది.  2వ సమూ 11:1-4లో దావీదుకు జరిగిన సంఘటన మనము గ్రహిస్తే ఇటు హవ్వ అటు కయీను వంటి రెండు గుణములు గల్గి దేవుని దశాజ్ఞలలో మూడింటిని అనగా నీ పొరుగు వాని పొత్తు గాని, భార్యను గాని ఆశింపకుము, నరహత్య చేయవద్దు, వ్యభిచరించుట అను ఆజ్ఞాతి క్రమము జేసినట్లు తెలియుచున్నది.  దావీదు చేయవలసిన పనియేమి?  ఆయన ఎక్కడ వుండాలి? ఆయనను ఇశ్రాయేలు అను తన జనమునకు దేవుడు మహారాజుగాను ప్రవక్తగాను, కీర్తనీయునిగాను నియమించియుండగా దావీదు యుద్ధములో సైన్యమునకు సహాయుడుగాను వీరుడుగాను సైన్యములకు నిర్వాహకుడుగాను వుండవలసియుండగా యెరూషలేములో మేడమీద ఒంటరియై యుండుటనునది.  ఆదిలో హవ్వ ఆదామును విడిచి ఒంటరిగా వుండుటను గుర్తింపుచేయుచున్నది.  అక్కడ ఆమెను ఏ అపవిత్రాత్మ శోధించిందో అదే ఆత్మ ఇక్కడ దావీదును శోధించి తన సాటి సహాయకుడు నమ్మక పాత్రుడైన ఊరియా యొక్క మాంగల్యఫలమును ఆకర్షణీయంగా చూపించి దానిని అనుభవింపజేసి-ఆదోషము నుండి తప్పించుకొనుటకు సద్దర్మపరాయణుడైన ఊరియాను హత్యజేయించుట,'' అను కయీను స్వభావమునకు దిగజార్చి  2వ సమూ 11:14-19 లో  సాతాను తన క్రియ జరిగించినట్లు తెలియుచున్నది.  ఇట్టి సమయములో 2వ సమూ 12:7లో విధముగా సాతాను చేత దైవ జ్ఞాన హెచ్చరిక నొందిన దావీదు 2వ సమూ 12:17లో కీర్త 51:5 విధముగా దేవునికి మొరపెట్టుచు తన జన్మయే పాప భూయిష్ఠమని, తాను పుట్టిన గర్భము పాపకూపమని అంగలార్చుచు ప్రభువా!  నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెనని విజ్ఞాపన చేస్తున్నాడు.  నిజమే!  మనము పాపములేనే పుట్టియున్నాము.  యోహా 8:24లో ఏసు ప్రభువు చెప్పినట్లు మనము పాపములోనే యుండి మనము చనిపోతున్నాము.  ఆది 3:12లో ఆదాము స్త్రీ మీద పాపమును మోపినట్లుగా దావీదు రాజు కూడా స్త్రీ మీదనే తన పాపమును మోపుచున్నట్లు తెలియుచున్నది.  చిత్రమేమిటంటే ఆదిలో సాతాను చెట్టుమీది ఫలమును చూపి హవ్వను శోధిస్తే - దావీదు యెరూషలేము లోని మేడనెక్కించి మేడమీది నుండి దావీదును దృష్టిని దిగువ భాగమునకు మళ్ళించి, ఊరియా మాంగల్యఫలమైన స్నానమాచరించు స్త్రీని చూపి శోధించినట్లు తెలుస్తున్నది.

         మరియ యొక్క వందనవచనము వినగానే ఎలిసబేత్‌ గర్భములోని శిశువు గంతులు వేయుటకు కారణమేమి?

        యోహా 1:6 దేవుని యొద్ద నుండి పంపబడిన మను ష్యుడుండెను''.  అతని పేరు యోహానుః  యెహాను దేవుని చేత పంపబడినవాడు.  మరియ గర్భములో పరిశుద్ధాత్మ నర రూపమునకు బీజము వేసియున్నాడు.  దేవుని ఆత్మయైన పరిశుద్ధాత్మ యొక్కయు ఆత్మ ఫలము ఆకర్షించబడి దేవుని చేత పంపబడిన మనుష్యుడైన ఎలీసబేత్‌ గర్భములోని శిశువు గంతులు వేయుటకు కారణమైనది.

        కీర్త 51:5 నేను పాపములో పుట్టినవాడను-పాపములోనే నాతల్లి నన్ను గర్భమునధరించెను.

        ప్రియపాఠకులారా!  పై వేదవాక్యమును ప్రవక్తయు కీర్తనాకారుడును మరియు మహారాజైన దావీదు దేవునికి చేసిన విజ్ఞాపన ఇది.  ఇట్టి తగ్గింపు జీవితవిధానాన్ని అవలంభించి దావీదు తన అనుభవములో దైవసన్నిదిలో లూకా1:32లో ఒక సింహాసనాన్ని పొందియున్నట్లు కన్యకయైన మరియతో దేవదూత చెప్పిన మాటలను మనము చదువగలము.  ఇట్లే కొందరి జనన విధాన చరిత్రలను వేదరీత్యా తెలిసికొందము.                ఇందులో మొదటగిగ ఆదాముఃఆది 2:7లో ఆదాము మట్టిలో పుట్టినవాడు.  మట్టిలోనే అతని తల్లియైన భూమి అతనిని గర్భమున ధరించింది.  ఫలితము ఇతను నరసృష్టికి ఆది అయ్యాడు.  (2) హవ్వ ఆది 2:21 దైవాత్మ సంభూతుడైన పురుషునిలో నుండి పుట్టినది.  ఎముక మాంసముతో ఆదాము ఈమెను గర్భమున ధరించియున్నాడు.  ఈమె పరిశుద్ధుని చేత పవిత్రముగా దైవాత్మ చేత రూపించబడింది.  ఈమె నుండి జన్మపాపము ప్రారంభము. గర్భధారణ ప్రారంభము, జీవము గల ప్రతివానికి ఈమె తల్లి (3) ఇస్సాకుః ముసలితనములో పుట్టినవాడు.  ముసలివానికి ముసలితల్లి ఈమెను గర్భమున ధరించింది.  దీని ఫలితము దేవుని జనాంగమైన ఇశ్రాయేలుకు పితామహుడయ్యెను.  నేటికిని ఇతని సంతానము సాక్ష్యార్ధంగ నిలిచింది.  (4) యోబు నేను నా తల్లి గర్భము నుండి దిగంబరిగ వచ్చితిని.  అంటున్నాడు.  అనగా ఏమియులేని స్థితిలో తల్లి గర్భము నుండి పుట్టినాడు.  అయితే యోబు ఏమియు లేని వానిగ లోకములో జీవించలేదు.  యోబు యదార్దవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలవాడును, చెడు తనము విసర్జించిన వాడునైయుండి దైవసన్నిధిలో గొప్పగ హెచ్చించబడినవాడు.

        (5) ఇక యేసు విషయములో లూకా 1:34-35  పురుషుని ఎరుగని పవిత్రురాలు.  కన్య గర్భములో దేవుని చేత రూపించబడి పరిశుద్ధాత్మ శక్తిలో ఆయన తల్లి ఆమెను గర్భమున ధరించింది.  ఫలితము ఈయన సకల నరకోటికి రక్షకుడును పాపవిమోచనకుడును యెహా 14:6లో ముక్తికి మార్గము  సర్వ సృష్టికి ఆరాధ్యుడైయున్నాడు.  (6) క్రైస్తవులమైన మన విషయములో యెహా 3:5లో ఆత్మ మూలము గాను నీటి మూలముగాను - మన తల్లి సంఘము గర్బమున ధరించి మనలను ప్రసవించియున్నది.  ఫలితము గలతీ 3:27 విధముగా క్రీస్తులో వుండి క్రీస్తును మనము ధరించుకొనియున్నాము.  అంటే ఈతరము నరకోటిలో ఒక పరిశుద్ధ దేవుని బిడ్డలుగా రూపించబడియున్నాము.  ఇది ఈతరము వారమైన మనకు దేవుడనుగ్రహించిన మహాభాగ్యము.

        ప్రియపాఠకులారా!  ఇపుడు ఆరు జన్మలను గూర్చి మనము తెలిసికొనియున్నాము. ఈ ఆరు జన్మలులోను ప్రతి యొక్కటియు భూసంబంధమైనవియే!  అనగా దైవసన్నిధిలో నరుని యొక్క జనన విదానము ఎన్ని అంచలుగా క్రియ జరిగించిందో ఇపుడు మనము నేర్చుకొనియున్నాము.  అయితే ఏడవ జన్మ ప్రతి నరునికి వున్నది.  ఈ ఏడవ జన్మ అన్నది నారీ గర్భము నుండి గాక భూగర్భము నుండి జల గర్భము నుండి ప్రసవింపబడు దినములు ఆ సన్నమైయున్నవి.  అందుకే రోమా 8:22 సృష్టి ప్రసవ వేదన పడుచున్నదని వ్రాయబడి యున్నది.  ఈ ప్రసవ వేదన దేని కోసము? ఎవరి కోసము?  ఎప్పుడు అనిన దానిని గూర్చి మనము తెలిస ికొందము.

        భూమి ఆదామును కన్నది ఆదాము హవ్వనుకన్నాడు.  హవ్వనరులకు జన్మనిచ్చింది.  ఇస్సాకు రెండు జనాంగంగములను కన్నాడు.  యోబు నీతిని కన్నాడు.  ఏసు ప్రభువు సంఘమును కన్నాడు.  సంఘము క్రైస్తవులమైనమనలను కన్నది.  అయితే మనము మన యొక్క మంచి చెడు క్రియలమూలముగా రెండు విధములైన సంతానాలకు జన్మనిస్తున్నాము.  యాకోబు 1:1-5 దురాశ గర్భము ధరించి పాపమునుకనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటున్నది.  మత్త 3:8 మారుమనస్సుకు తగిన ఫ్ధలములను ఫలించుడి'', నీతి ఫలములు ఫలించక పోతే చెడు మార్గములో పోతే కవలపిల్లలను ప్రసవించెదము.  అవియే పాపము, మరణము.

        కీర్త 78:70-72 యాకోబుకు ఇశ్రాయేలునకు తరువాత వాడు దావీదు ఈయన వారిని అనగా వెనుకటి వారిని ఏలుటకు మేపుటకు గొర్రెల దొడ్లలో నుండి దావీదును పిలుచుటలో అర్ధమేమి?

        యాకోబు ఇశ్రాయేలీయుల సంతానమును దేవుడు ఆశీర్వదించియున్నాడు.  కనుక ఈ జనాంగము అంతయు యాకోబు. ఇశ్రాయేలీయుల రక్తబాంధవ్యముతో నిండియున్నది.  కాబట్టి దేవుడు వారి శరీరములనుండియు లేక వారి ముద్ర ధరించిన జనాంగమును మేపుటకు ఏలుటకు దేవుడు దావీదును పిలిచెను'',

                16. న్యాయ విధులు

        మూలము కీర్తన 72:1-4 ప్రియపాఠకులారా!   పై కీర్తన భాగములోని తొలి రెండు వచనములను గూర్చి ధ్యానించుకొందము.  యిందులో మొదటిది రాజునకు నీన్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయమనుట అనిన వానిని గూర్చి ముందుగా మనము తెలిసికోవలసియున్నది.

        ప్రియపాఠకులారా!  రాజ్యము రాజు అన్నది ఏర్పడినది మొదట సౌలునకు ఆ తర్వాత దావీదునకునుదేవుని యొక్క ధర్మశాస్త్ర విధులు బైలు  పరచబడియున్నవి.  అనగా దేవుని దశాజ్ఞల యొక్క మందసములోని దశాజ్ఞలే.  ఈ న్యాయ విధులు, వీటిని తూ.చా తప్పకుండా పరిపాలించిన రాజులు మొదట ప్రవక్తలలో మొదటి వాడైన మోషే రాజులలో సౌలు-దావీదు ఈ విధులను ఆచరించి యున్నారు.  ఇశ్రాయేలు అను దైవ జనాంగమును పరిపాలించిన రాజులు నామ మాత్రముగా వారు రాజులుగాను, పరిపాలకులుగా వుండి సింహాసనాన్ని  రాజ్యాంగ చట్టములను, ప్రజలకు విధించిన శాసనములు వగైరాలు అన్నిటిని అమలు పరచుటలో దైవాజ్ఞాను సారముగా దైవ చిత్తానుసారముగా అమలు జరిపి యుద్ధాలు సంభవించిన, దేశము మీదికి ఏదైనా అరిష్టము వచ్చినను, ఏదైన ఒక ఉగ్రత సమస్య ఏర్పడినపుడు దేవునికి మొరపెట్టి ఆయన చిత్తమేమిటో తెలిసికొని పరిపాలన సాగించినారు.  ఆనాటి రాజులు యుద్ధములో కూడా వారు యెహోవా దేవుని తమ ప్రక్కన వుంచుకొని యుద్ధరంగములో కూడా దైవ ఆజ్ఞానుసారము పోరాటము సాగించినట్లుగా కూడా బైబిలులోని పాత నిబంధనలో కొంతమంది రాజుల యొక్క పోరాటములు ఉదా|| దైవ చిత్తానుసారముగా దేవుని తమ వద్ద వుంచుకొని పోరాడిన వీరులు మోషే యెహోషువా ఏలియా సౌలు దావీదు సాలొమోను వగైరాలు. వీరందరును దేవుని చిత్తానుసారము ఆయన న్యాయవిధులను బట్టి యుద్ధము చేసి యున్నారు.  మరియు విజయులైనారు.  ఈ విధముగా రాజులను చట్టాలను రాజులు పరిపాలించవలసిన విధానాలను వారు కట్టు పట్టణాలకు నమూనాలను, వారు చేయవలసిన ధర్మ కార్యాలను గూర్చి ఆయా సందర్భాలలో దేవుడే స్వయముగా తానే తెలియచేసినట్లు వేదములో మనము చదువగలము.

        ఈ విధముగా రాజునకు విధి నిర్వహణ కార్యమును గూర్చి వివరించినట్లు యిక రెండవదిగ రాజ కుమారునికి నీ నీతిని తెలియజేయుట అన్నట్లు దావీదు కుమారుడు సొలొమోనుకు మొట్టమొదటగ దేవుని యొక్క నీతి వెల్లడియై యున్నట్లు సొలొమోను చరిత్రలో మనము చదివితే తెలిసికొనగలము.  యిందులో మొదటిగా సొలొమోను తనకున్న యావత్‌ సంపదను గొప్ప సైన్యాలను రాచరికాన్ని, గుర్రములు, రౌతులు, రధములు వగైరా లేలుటకు తనకున్న జ్ఞానము చాలక దేవుని జ్ఞానము అడిగినట్లుగా వేదములో వివరించబడియున్నది.  దేవుడు సొలొమోనుకు జ్ఞానమునే గాక రాజ్యమును పరిపాలించుటకు నీతిని కూడా నొలొమోనుకు అనుగ్రహించియున్నాడు.  సొలొమోను నీతిని బట్టి నీతి మంతుడు గాబట్టి నీతితో తన రాచరికాన్ని నిలబెట్టుకొన్నాడు.  తన నీతిని అనేకులకు వెల్లడి పరచియున్నాడు.  సొలొమోనులో వున్న నీతి గొప్పదిగా ఎంచబడుటకు కారణము.  దేవుడు ఆయనకు అను గ్రహించియున్న జ్ఞానమే మూలమని మనము తెలిసికోవలెను.

        నీతితో పరిపాలన చేసిన రాజులలో మొదటివాడు దావీదు, రెండవవాడు అతని కుమారుడైన సొలొమాను.  సొలొమోను యొక్క నీతి దేవుని యొక్క న్యాయ విధుల ననుసరించి న్యాయము తీర్చినట్లు కూడా యిద్దరి స్త్రీలు ఒక బిడ్డతో ఏర్పడిన సమస్యను దైవ జ్ఞానముతో న్యాయ తీర్పు దీర్చినట్లు సొలొమోను యొక్క పరిపాలన కాలములోని సంఘటనను గూర్చి బైబిలులో మనము చదువగలము.  యిది దేవుడు రాకుమారుల కిచ్చిన అధిక్యత తలాంతులు.

        యిక మూడవ వచనములో నీతిని బట్టి పర్వతములును చిన్నకొండలును ప్రజలకు నెమ్మది పుట్టించును'', అనుటలో ఆది 7:లో సంభవించిన మహా జల ప్రళయము ద్వారా జరుగు నాశనమునకు ఆనాటి తరము వారిలో నోవహును నీతిమంతునిగా తీర్చినాడు.  ఎందుకంటే ఆనాటి తరము వారిలో నోవహు నీతిమంతుడును.  ఆనాటి మహా పర్వతాలలో జల ప్రలయానంతరము ఆరారాతు కొండల మీద నిలచిన ఓడ అబ్రహాము విశ్వాస పరీక్షకు మోరియా పర్వతము బైబిలు చరిత్రలో నీతికి నిలబడియున్నవి.  అలాగే యోరేబు పర్వత ప్రాంతములో గొఱ్రెలు మేపుచున్న మోషేను దేవుడు నీతిమంతుడిగా మార్చుటకు పిలుపు నిచ్చియున్నాడు.  అలాగే దేవుని యొక్క నీతికి ఆధారమైన ధర్మశాస్త్రమును సకల జనకోటికి అనుగ్రహించుటకు సీనాయి పర్వతము దశాబ్ధాల రాతి పలకలను ధర్మశాస్త్రమును దేవుడు తన జనాంగమునకు సీనాయి పర్వతము నుండి ధర్మశాస్త్రము ననుగ్రహించినట్లు తెలియుచున్నది.  అలాగే కర్మెలు వగైరా పర్వతముల యొక్క చరిత్ర కూడా నీతిని బట్టి క్రియ జరిగించియున్నట్లు కర్మెలు పర్వతముల మీద ఏలియా అర్పించిన బలి దేవుని యొక్క నీతిని బహిరంగ పరచుచున్నది.  యిది పర్వతములను గూర్చిన వివరము.

        చిన్నకొండలు ఏ విధముగా నీతిని బట్టి ప్రజలకు నెమ్మది కలుగచేయునో మనము తెలిసికొందము.  ప్రియపాఠకులారా!  కీర్త 15:లో యెహోవా నీ గుడారములో అతిధిగా వుండదగిప వాడువడు?  నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవ్వడు?  అని వివరించబడియున్నది.  యిందును బట్టి చూస్తే పర్వతాలలోను కొండలలోను పరిశుద్ధమైనవి అపరిశుద్ధమైనవి, పవిత్రమైనవి, అపవిత్రమైనవి వున్నట్లుగ తెలియుచున్నది.  యెహోవా పరిశుద్ధ పర్వతమంటే పాత నిబంధనలో ఆయన దర్శనమిచ్చిన యోరేబు, సీనాయి, అబ్రహాముకు విశ్వాస పరీక్ష చేసిన మోరియా అనగా యెహోవా పర్వతము అని మోరియా పర్వతమునకు ఆ పేరున్నది.  ఇక ఏలియా యొక్క బలిని దహించిన కర్మేలు పర్వతము ఆయన పరిశుద్ధ పర్వతముల జాబితాలో చేర్చబడినను లూకా 2:14సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకుభూమి మీద సమాధానము'', అనుటలో చిన్న కొండలు పర్వతములు గాక అంతకంటే కూడా సర్వోన్నతమైన  స్థలమున్నట్లు వేద రీత్యా తెలియుచున్నది.  ఈ సర్వోన్నతమైన స్థలము సర్వమునకు ఉన్నతము '', అనుటలో సృష్టిలో అంతకంటె ఎత్తయిన స్థలమని అర్ధమిస్తున్నది.

        సృష్టికి మూలకారకుడైన దేవుడు తాను చేసిన సృష్టిలో నివసించువాడు కాడు.  ఎందుకంటే ఒక యిల్లు కట్టిన స్వంతదారుడైన యజమానుడు తన ఒక్కని కొరకే సర్వమును నిర్మించుకొని యిండ్లు పొలములు, తోటలు యింకను అనేకరకములైన కట్టడాలను వివిధ రకములైన నిర్మాణములను నిర్మించినను, తానొక్కడే ఈ యొక్క సంపద నను భవించడు.  తాను సృష్టించుకొన్నసమస్త సృష్టములను వాటి యొక్క ఫల సాయములను అనుభవించుటకు ఇల్లాలు, పిల్లలు యిక యితరత్ర బంధువర్గమును కూడా తన వారసత్వములో వుంచుకుంటాడు.  అలాగే సృష్టికర్తయైన దేవుడు  యావద్‌ సృష్టిని తన ఒక్కని కొరకు ఏర్పరచుకొనక తన హస్తముతో తన పోలికలో చేయబడిన నరులమైన మన కనుగ్రహించి సృష్టిలోని పర్వతములు కొండలు, సరస్సులు, నదులు, గడ్డి బీడులు, పొలములు, జంతుకోటి, పక్షి సముదాయములు, ఫలవృక్షములు, వివిధ రకములైన వృక్షములు చివరకు సముద్రములో వున్న మత్స్యములు వరకు అనుభవించునట్టి వారసత్వాన్ని నరులమైన మన కనుగ్రహించియున్నాడు.

        అయితే ఇవన్నియు మన కిచ్చిన దేవుడు తాను సృష్టి అంతటి మీద అధికారులుగ నియమించిన నరకోటిని రక్షించుటన్నది సంభవించినప్పుడు ఆయన భూమి మీద వున్నట్టి పర్వతముల మీద దర్శన మిచ్చి మాట్లాడినాడు.  ఆయననీతి ఆయన వలెనే కొండల మీద నివసించినట్లు దేవుని నీతియై  ఏసు క్రీస్తు అను పేరున నరావతారముతో అవతరించి ఒలీవల కొండ మీద నివసించి, ఈ లోకములో తనకు ఇల్లు లేదన్న ట్లుగా తాను సర్వోన్నతుడైన దేవుని కుమారునిగా ఎంచబడునట్లు ఏసుక్రీస్తు ఈ లోకములో జీవించినంత కాలము కొండమీద ప్రసంగము, కొండమీద నివాసము, కొండమీద రూపాంతరము తుదకు ఏసు క్రీస్తు శోధింపబడిన కాలములో ఆయనను ఎత్తయిన కొండమీదకు తీసుకు వెళ్ళినాడు.  ఈ విధముగా దేవుని యొక్క నీతి కొండ మీద నివాసము చేసినట్లును దైవ ప్రణాళికానుసారము దైవ చిత్తానుసారము దైవ కుమారుడైన ఏసు క్రీస్తు లోక నరకోటి యొక్క పాప పరిహారార్ధము బలియాగము చేయు సందర్భములో కూడా ఆయనను కపాలము అను కొండమీద సిలువ వేసినట్లు వేదములో చదువగలము.  యివి చిన్న కొండల చరిత్ర.

        ప్రియపాఠకులారా!  పర్వతముల మీద దైవ దర్శనము ద్వారా పాత నిబంధన కాలములో దైవ జనాంగమునకు నెమ్మది ఆదరణ సమస్యాపరిష్కారము లేక ఉపద్రవాల మూలముగా కలిగిన అరిష్టాల వలన పరిష్కార విధానము దేవుని యొక్క నీతి వివరించింది.  అలాగే యిది పెద్ద దేవుని యొక్క పెద్ద నీతి యిక చిన్న దేవుడైన ఏసు క్రీస్తు యొక్క నీతి చిన్నకొండల మీద తెలిసికొనియున్నాము.

        కీర్త 72:4 ప్రజలలో శ్రమ నొందు వారికి అతడు న్యాయము తీర్చును.  ఇప్పుడు దేవుని యొక్క నీతి నరావతారియై లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాతావరణ సంబంధమైన లేక జన్మ నుండియే సంభవించిన రోగము, అంగవైకల్యము అరిష్టము వగైరాలను చక్కబరచవలెనంటే, లోకమువలన గాని లోకస్థుల వలన గాని లోక సంబంధమైన ఏ విగ్రహ దేవతా గాని చేయలేనటువంటి ఆశ్చర్యకరమైన మహిమాన్వితమైన క్రియల ద్వారా దేవుని నీతియైయున్న ఏసు క్రీస్తు శ్రమలను అనుభవించిన అనేకులకు మరియు అనేకుల పట్ల జరిగించిన అద్భుత కార్యములు మత్తయి మార్కు లూకా యోహాను సువార్తలలో మనము చదువగలము.  యిందులో ప్రదమముగా శ్రమ నొందువారికి ఆయన న్యాయము తీర్చును'', అని వ్రాయబడి యుండుటలో 12 ఏండ్ల రక్త స్రావము గల స్త్రీ యొక్క శ్రమ 12 ఏండ్లుగా అనుభవించినట్లు ఆమె వ్యాధి యొక్క కాలము ప్రకటిస్తున్నది.  అలాగే పుట్టినది మొదలు గ్రుడ్డివాడైనటువంటి ఒకడు తన యొక్క అంధత్వము చేత దీర్ఘకాలముగా శ్రమ నొందినట్లు తెలియుచున్నది.  వ్యభిచారములో పట్టుబడిన స్త్రీ న్యాయ తీర్పు కోసము యూదులు యేసును శోధిస్తు ఆమెను ఈడ్చుకొని వచ్చి ఆయన ముందుంచి ఱాళ్ళతో కొట్టి చంపవలసిన శ్రమలో ఆమెను తప్పించిన విధానము.  38 ఏండ్లుగా బెతెస్థా కోనేటి దగ్గర రోగిగా వున్న వాని విషయములో అతడు పొందిన శ్రమ, సమరయ స్త్రీ అనేక మంది భర్తలతో పొందిన శ్రమ బాధల విషయములో ఏసు ప్రభువు వాక్కు ద్వారా తీర్చబడిన న్యాయము అనుగ్రహించబడిన ఆరోగ్యము నెమ్మది స్వస్థత ఈ వాక్యపు నెరవేర్పయియున్నది.

        ప్రియపాఠకులారా!  ఈనాటికి కూడా మన శ్రమలలో మన సమస్యలలో మన బాధలలో మన శోధనలలో మన వ్యాధులలో ప్రభువుకు విజ్ఞాపన చేసి ,ఆయన ద్వారా మన సమస్త అక్కరలను తీర్చుకొనుటకు ఆయన సమర్దుడు.

        కీర్త 72:4 బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలుగగొట్టును. ప్రియపాఠకులారా!  ఈ వాక్యము రెండు బాగములుగా వున్నది.  యిందులో మొదటిది బీదల పిల్లలు వీరెవరు?  బాధపెట్టువారు ఎవరు?  అన్నది మనము తెలిసికోవలసియున్నది.  బీదల పిల్లలు వీరెవరు? ప్రియపాఠకులారా!  ఈ సందర్భములో లూకా 6:21 బీదలైన మీరు ధన్యులు. దేవుని రాజ్యము మీది బీదలు అనగా పరలోకము రాజ్యము నిమిత్తము తమ సర్వస్వమును వదలుకొని లోకమును పెంటగా ఎంచుకొని లోకస్థులతో సుఖభోగములనుభవించుట కంటె దైవ రాజ్యము నిమిత్తము దేవుని కొరకు లోకసంబంధమైన దారిద్య్రము ననుభవిస్తూ పరలోక సంబంధమైన ధనమును పొందుటకు ఆశపడువారు అనగా దైవ విశ్వాసులు, దైవ రాజ్యము నిమిత్తము తమ శరీరములను సజీవయాగముగా సమర్పించుకొన్నవారు.

        యిట్టి బీదల జాబితాలో చేర్చబడినవారు మొట్టమొదటిగ ఏసు ప్రభువు శిష్యులు.  వీరు తమ చేపల వలలను, దోనెలను,సముద్ర జీవితాన్ని చేపల వ్యాపారాన్ని సమస్తమును తమ సంపదకు స్వస్థి చెప్పి పరమ రక్షకుని వెంబడించిన వారు.  మరియు వీరి బోధల ద్వారా మార్చబడిన దైవ విశ్వాసులు వీరు బీదలు వీరు లోక సంబంధమైన బీదలు, అయితే పరలోక రాజ్యము యొక్క వారసత్వాన్ని సంపదగా పొందిన వారు.  యిట్టి వారికోసము దైవరాజ్యములో గొప్పసంపద మానవ నేత్రమునకు వాని యొక్క ప్రణా ళికలకును గోచరము గాని చెరగని తరగని సంపద వున్నట్లు మనకు తెలియుచున్నది.

        యిక రెండవ భాగములో ఇట్టి బీద పిల్లలను బాధపెట్టువారు వీరెవరు? అంటే సాతాను సమాజము లేక లోక సంబంధులు లోకానికి అంకితమైన వారు లోక సంపదయే మహాభాగ్యముగా భావిస్తూ లోకానికంకితమై లోక సంపద అధికారము ధన దాహము రాజ్య కాంక్ష, అహంకారముతో కూడుకొన్నవారు యిట్టి వారు క్రీస్తుకు విరోధులు, వీరు దైవ రాజ్య సంబంధులు కారు, వీరు దైవ విశ్వాసులను బాధపెట్టువారు. పాత నిబంధనలో ఫరో, ఫిలిష్తీయులు; అయితేనూతన నిబంధనలో క్రైస్తవ విశ్వాసులను బాధించిన హేరోదు నీరో హిట్లర్‌ యిక వివిధ రకములైన హిందూ-ముస్లిమ్‌ రాజులు.

        అయితే క్రైస్తవులను బాధపెట్టిన వారిలో మొట్టమొదటివాడు సౌలు ప్రియపాఠకులారా!  క్రైస్తవులను చంపుటకును బంధించుటకును హింసించుటకును తనకు సర్వాధికారములు యివ్వమని డమస్కులోని పరిపాలకుల యొద్ద తాను అధికారాన్ని కోరినట్లును దాన్ని పొందుటకు అతడు బైలుదేరి ప్రయాణిస్తుండగా అపో 9:3 దమస్కు దగ్గరకు వచ్చినపుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టు ప్రకాశించెను.  అప్పుడతడు నేల మీద పడి సౌలా!సౌలా!  నీవేల నన్ను హింసించుచున్నావని తనతో - ఒక స్వరము పలుకుటన్నదియు, అట్టి సమయములో సౌలుకు సంబంధించిన అంధత్వము అయోమయ స్థితి దిక్కులేని వాతావరణము గూర్చిన స్థితి ఈ అధ్యాయములో చదువగలము.  ఈ విధముగా అధికారము పదవి శూరత్వము కఠినత్వము అంగరక్షకులు గుర్రములు డాలు కత్తి శిరస్త్రాణము వగైరా అధిక్యతలను కోల్పోయి అంధుడై, తన అనుచరుల చేత చెయ్యి పట్టుకొని డమస్కులోనికి నడచుటన్నది ఈ అధ్యాయములోని ప్రధాన ఘట్టముగా వివరించబడియున్నది.  డమస్కులోని దైవ విశ్వాసియైన అననీయ అను ప్రభువు యొక్క శిష్యుడు నివసిస్తున్నట్లును అతనికి దర్శన మందు ప్రభువు కనబడి మాట్లాడిన విధానము యిదే అధ్యాయములో మనము చదివితే, దర్శన మందు కనబడిన ప్రభువునకును అననీయకును జరిగిన సంభాషణ మనకు తెలియగలదు. యిది బీదలైన క్రైస్తవ బిడ్డలను బాధపెట్టిన వారిని నలుగగొట్టిన విధానమైయున్నది.

        యిక కీర్త 72:5లో సూర్యుడు నిలుచు నంత కాలము, చంద్రుడు నిలుచునంత కాలము తరములన్నిటను భయభక్తులు కలిగియుందురు.  ప్రియపాఠకులారా!   సూర్య చంద్రులు ఎవరన్నది మనము తెలిసికోవలసియున్నది.  సాధారణముగా లోకమునకు వెలుగిచ్చుటకు ఏర్పరచబడిన సూర్య చంద్రాదులను గూర్చియే  బైబిలునకు బాహ్యముగా గొప్పగా చెప్పుకుంటు మన పూర్వీక స్థితికి తగినట్లుగా జీవించినాము.  సూర్యుడొక దేవుడని మనము నమస్కారము చేసిన మన పూర్వీకులున్నారు.  చంద్రుడొక దేవుడని చంద్రుడు ఉదయించు కాలమున నెల పొడువు అని చంద్రువు పూర్ణ గోళముగా కనబడినపుడు పౌర్ణమి అని, కనబబని దినములలో అమావాస్య అని వగైరా రీతులుగా సూర్య చంద్రాదులను గూర్చి శ్లోకములు పద్యములు ఎన్నో యితిహాసములు, వివిధ వర్ణనలతో కూడిన కావ్యాలను రచించి మూఢాచారముతో మూఢ భక్తితో మూఢ వైఖరితో మూఢ సాంగ్యములతో మన పూర్వీక జీవితములో ఆచరించి యున్నాము.  నేటి క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనలో కూడా నెలపొడవును పౌర్ణమిని పాడ్యమిని అమావాస్యను చంద్రో దయాన్ని వీటికి సంబంధించిన గ్రహణాలను పాటించువారు లేకపోలేదు.  దైవ సంపూర్ణత పొంది పూర్తి విశ్వాస జీవితములో వున్న క్రైస్తవులమని చెప్పుకొన్న మనము మనలో కొందరు ఈ సాంగ్యాలను పాటించుచునేవున్నారు. అమావాస్య నాడు పెళ్ళి జరిపించే క్రైస్తవులరుదు, అమావాస్యనాడు కన్యాన్వేషణకు వెళ్ళువారు కూడా అరుదే! అలాగే ఈ సూర్య చంద్ర గోళాలకు గ్రహణము పట్టినపుడు కూడా లోక సాంగ్యాలతో తలమునకలయ్యే క్రైస్తవులు లేకపోలేదు.  యిక అన్యులను గూర్చి మనము చెప్పనక్కరలేదు.

        ప్రియపాఠకులారా!  మన పూర్వీక జీవితములో మనము దేవుళ్లుగా భావించిన సూర్య చంద్రులు మేఘములు క్రమ్ముకొన్నప్పుడు కాంతి హీనతను పొందును.  మరి అమా వాస్యనాడు చంద్రుడు కనబడనే కనబడడు. వర్ష మేఘములు ఆవరించినపుడు సూర్యచంద్రాదులు ఇద్దరు కనబడరు.  తుఫాను వాతావరణమైతే ఈ సూర్య చంద్రాదు లిరువురు భూలోక నివాసులైన మనలను పెనుతుఫాను కప్పగించి సముద్రపు ఉప్పెనకు ఏటి వరదలకు లోకాన్ని చీకటి మయముచేయును.                                                  యిపుడు పరిశుద్ద గ్రంధములోని 72వ కీర్తనలో సొలోమోను వ్రాసిన ఈ కీర్తనలోని సూర్య చంద్రాదులు ఆకాశమునందలి జ్యోతుల కాపు.   ఈ సూర్య చంద్రాదులు యిరువురును నీతికి నిధులును జ్ఞానానికి ప్రకాశమును, లోకానికి జ్ఞానోదయమును సృష్టికి రక్షణకర్తలను, మానవ మరణ శాపానికి విమోచకుడైన క్రీస్తుకు సూచనగా వున్నవి.  మొట్టమొదట సూర్యుని గూర్చి మనము ధ్యానించుకొందము.  కీర్త 119.:105 నీ వాక్యము నా పాదములకు దీపము నాత్రోవలకు వెలుగు'', అనియు ఏసు ప్రభువు యోహాను సువార్తలో తనను గూర్చి సంబోధిస్తూ 8:12 'నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండును', ప్రకటన 12:1 లో సూర్యుని ధరించుకొన్న స్త్రీ,  ఈ స్త్రీ క్రీస్తు రక్తముతో కడుగబడిన పరిశుద్ధ సంఘమైన వధువు.  ఈమె ధరించుకొన్నటువంటి సూర్యుడు నీతి సూర్యుడు ఈ నీతి సూర్యుడు క్రీస్తు ఎట్లంటేె ఎఫెసీ 5:23 క్రీస్తు సంఘమునకు శిరస్సయి యున్నలాగున'', అనుటలో సంఘము అను స్త్రీకి వెలుగు నిచ్చువాడు నీతి సూర్యుడు అని మనము గ్రహించవలసియున్నది.

        యిక చంద్రుడు నిలుచునంత కాలము ఈ చంద్రుడెవరు? ప్రకటన 12:1లో సూర్యుని ధరించుకొన్న స్త్రీ ఆమె పాదముల క్రింద వున్న చంద్రుడును క్రీస్తే! అనగా సంఘము అను వధువుకు పునాది క్రీస్తు.   ఎట్లంటే మొదటి కొరింధీ 3:11 వేయబడినది తప్ప మరి యొక పునాది ఎవడును వేయనేరడు.  ఈ పునాది ఏసు క్రీస్తే!  కనుక పునాదియైన వాడు ప్రారంభకుడు.  కనుక ఈ పునాది ఏసుక్రీస్తు ఇప్పుడు సూర్యుడు చంద్రుడు యిరువురి యొక్క బ్రతుకు కూడా మానవుల చేత శాస్త్రజ్ఞానమును బట్టి బట్టబయలై సూర్యుడు దేవుడు కాదు.  చంద్రుడు దేవుడు కాదు.  రెండును రెండు గ్రహాలని వాటిలోని వాతావరణము సృష్టి కార్యములను పరిశోధించుటకు నరుడు రాకెట్లు ద్వారా ఉపగ్రహాలు ద్వారా పరిశోధిస్తున్నట్లు నేటి మన భూలోక శాస్త్రము వివరిస్తున్నది.  కనుక ఈ సూర్య చంద్రాదులు నిలుచునంత కాలము అనగా నీతి సూర్యుడు నీతి చంద్రుడు అయిన ఏసు క్రీస్తు యొక్కసువార్త ప్రకారము ఈ భూమిపై విస్తరించి నిలిచి క్రియ జరిగించునంతకాలము అనగా దేవుని సువార్తకు చెవినిచ్చి విశ్వాసులై ఆత్మ పరిపూర్ణత పొందిన విశ్వాసులు భూమ్మీద వున్నంత కాలము నూతన నిబంధన అను క్రీస్తు శకము క్రియ జరిగించినంత కాలము, ఏసు క్రీస్తు ప్రభువు కార్చిన రక్తము ద్వారా రూపించబడిన సంఘము పరిశుద్ధతను పొంది ఆత్మవశమై విశ్వాస జీవితములో వున్నంత కాలము, తరముల వరకు జనులు దైవ విశ్వాసులును భక్తులును, వాక్యము నందు ఆసక్తియు ప్రార్ధనాది క్రియలలో ఆసక్తి కరముగా పాల్గొని ప్రభువును మహిమపరిచే బిడ్డలు ప్రశాంతతో జీవించెదరనని ఇందులోని భావము.

        కీర్త 72:6 గడ్డకోసిన బీటుమీద వానవలెను.  భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును. గడ్డికోసిన బీడు అంటే ఏమిటి?  భూమిని తడుపు మంచి వర్షము అంటే ఏమిటి?  అన్నది మనము తెలిసికోవలసియున్నది.  ప్రియపాఠకులారా!  గడ్డికోసిన బీడు నశించిన ఇశ్రాయేలుకు ఇది సాదృశ్యము.  ఈ గడ్డికోతన్నది ఎందుకు సంభవించిందో కూడా మనము తెలిసికోవలసియున్నది.  పాత నిబంధన కాలములో పచ్చని గడ్డివంటి ఇశ్రాయేలు జీవితము దేవుని కృపావర్షముతోను ఆయన ఆత్మకుమ్మరింపు ద్వారా ఆయన మహత్కార్యాల ద్వారా ఎంత గొప్పచరిత్రను సాధించింది.  పాత నిబంధన కాలములో కూడా పచ్చని ఇశ్రాయేలు జీవితము అప్పుడపుడు స్వజ్ఞానము చేతను దైవ వ్యతిరేకత గుణములను బట్టి అవిశ్వాసమునుబట్టి అన్యజనుల సావాసమును బట్టి దేవుని కోపాగ్నికి గురియై అన్యరాజుల చేత కోయబడి మరల తమయొక్క తప్పిదములకు పశ్చాత్తాపము పొంది దైవ సహకారములను కోరి ప్రార్థించినపుడు మరల దేవుడు కనికర వర్షమును ఈ యొక్క ఇశ్రాయేలు అను గడ్డి భూముల మీదకురిపిస్తూ వారి జీవితములను నూతనముగా చిగురింప జేయుచు పచ్చని జీవితాలననుగ్రహించినట్లు పాత నిబంధన చరిత్రలో ఇశ్రాయేలు యొక్క జీవితమును గూర్చిన వేద భాగములు ప్రకటిస్తున్నవి.  అందుకే దావీదు మహారాజు తన 23వ కీర్తనలో యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.  పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండచేయుచున్నాడు' అనుటలో ఈ పచ్చిక గల చోట్ల అన్నది దైవ జనాంగమైన ఇశ్రాయేలు దావీదుకున్న అధిపత్యాన్ని సూచిస్తున్నది అనగా పచ్చిక బీడైన తన జనాంగమైన ఇశ్రాయేలును దావీదు రాజు వశములో దేవుడు వుంచియున్నాడన్న విషయాన్నిఈ కీర్తన భాగములోని వచనాలు బైల్పరస్తున్నవి.

        ప్రియపాఠకులారా!  యిట్టి పచ్చని గడ్డి బీడైన ఇశ్రాయేలు జీవితము పతనావస్థలో వుండగా ఈ గడ్డి బీడైయున్న ఇశ్రాయేలు దేశమైయున్న పాలస్తీనులో మత్త 2:1-5లో వివరించిన రీతిగా గడ్డికోసిన బీడువలె వున్న ఇశ్రాయేలు దేశమైయున్న యూదయా దేశపు బెత్లెహేములో యూదులకు రాజుగా అనగా కోయబడి శేషించియున్న  యూదా జనాంగమునుద్దరించుటకు దేవుని యొక్క జీవితమును పునరుద్ధరించుటకును ప్రపంచ వ్యాప్తంగా ఇశ్రాయేలు యొక్క కృపావర్షము పరిపూర్ణత నొంది శిశురూపము దాల్చి యూదా జాతికి చెందిన కన్నెకయైన మరియ గర్భములో జన్మించిన గడ్డికోసిన బీడువంటి, పాడైన ఇశ్రాయేలు యొక్క దైనందిన జీవితాన్ని ఇశ్రాయేలు దేవుడైన సత్య దేవుని యొక్క మహత్కార్యాలను ఖండ ఖండాలలో ప్రకటిస్తూ సువార్త వాహినిగా ధారపాత వర్షరూపముగా ఇశ్రాయేలు యొక్క ఔన్న త్యాన్ని పాలస్తీనా భూమిని తడుపునటువంటి ఫలభరిత వర్షముగా అనేకదేశములకు ఆదర్శకరమైన జీవితాన్ని ప్రబోధించుటకు ఈనాటి క్రైస్తవ జీవితములో అన్యదేశములైన మన దేశము పైనను మన భూముల పైనను మరియ మానవ హృదయమైన మనహృదయ క్షేత్రములలోను ఆయన వర్షము సువార్త రూపముగా ధారపాతముగా వర్షించి కఠినమై పాడై యున్నటువంటి నరుల యొక్క హృదయ భూములను తడిపి అలనాడు గెత్సెమేనులో ఆయన కార్చినటువంటి రక్తపు చెమట కపాల కొండలో ఆయన కార్చినటువంటి సిలువ రక్తముతో తడుపబడిన భూమి ఈనాడు సువార్త వాహినితో అనేక పట్టణాలలో అనేక గ్రామాలు అనేక స్థలములలో మందిరములను సంఘ ఆలయములను నిర్మించుకొని సస్యశ్యామలముగా వున్నదంటే దేవుని యొక్క జలధారయైన క్రీస్తు.  ఈ వర్షము ఆయన కార్చిన చెమటే మానవ జీవితానికి నిత్య జీవము.

        ప్రియపాఠకులారా!  యోహా 4:లో ప్రభువు సమరయ స్త్రీతో మాట్లాడుచూ ఈ నీరు త్రాగు ప్రతివాడు మరల దప్పిక గొనును, నేనిచ్చు  నీరు త్రాగువాడెన్నటికిని దప్పిగొనడు'', అనుటలో ఆకాశములో మేఘమండలము ద్వారా వర్షించు నీరు త్రాగు ప్రతి వానికిని నిత్యము దప్పిక నీటిపై వ్యామోహాము నీరుకు సంబంధించిన సమస్యలుండును.  అయితే ఏసు యొక్క కృపావర్షములో ఆయన వర్షింపచేయు ఆత్మీయ జలములతో తన హృదయ క్షేత్రమును తడుపుకొన్న ప్రతి విశ్వాసికిని లోక సంబంధమైన దప్పిక వుండదని యిందులోని భావము.

        కీర్త 72:7 అతని దినములలో నీతిమంతులు వర్థిల్లుదురు,'అనుటలో ప్రియపాఠకులారా!  ఏసు ప్రభువు యొక్క జన్మానంతరము ఆయన పుట్టుకలోనే ఆయన నక్షత్రముతో పాటు నీతిమంతులు కూడా ఉదయించినారు.  యిందులో మొదటివారు అమాయికులైన గొల్లలు; ఆ తర్వాత ముగ్గురు జ్ఞానులు సాంబ్రాణి బోళము బంగారు వీటితో బాలజేసువును ఆరాధించునారు.  గొల్లలు స్తుతించినారు.  ఇక్కడనుండి నీతిమంతుల యొక్క ఆరాధన ప్రారంభమైనది.  నీతిమంతుల యొక్క జాబితాకు కూడా పునాది ఏర్పడినది.  ఈ విధంగా ఏసు ప్రభువు పుట్టుకతో రూపించబడిన నీతిమంతులు.  ఆయన యౌవ్వనుడై సువార్త పునాది వేసిన కాలములో ఆయనేర్పరచుకున్న 12 మంది అపోస్తలులు కూడా ఈ నీతిమంతుల జాబితాలో చేర్చబడియున్నారు.  ఎట్లంటే వారు రాజ్య సువార్తకు సాక్షులును పరలోక పట్టణానికి 12 పునాదులైనట్లు వేదములో చదువగలము.  

        ఈ విధముగా విస్తరించినట్టి ఈ యొక్క నీతిమంతుల జనాభా ఏసు ప్రభువు మరణ పునరుత్థాన అనంతరము బహు ముఖ వ్యాప్తముగా విస్తరించి యావద్‌ ప్రపంచము నలముకొని ప్రపంచములో ఏడు ఖండాలలో వ్యాపించి వర్ధిల్లుచున్నదనుటకు నిదర్శనముగా అనేకులైన ఆత్మసంబంధులైన విశ్వాసులు దేవుని ప్రజవున్నారనుటకు క్రియా రూపముగా క్రైస్తవ సంస్థలు మదర్‌ థెరిస్సా వంటి సేవాపరులు, సైఫను వంటి హత సాక్షులు నేటి నవనాగరిక యుగములో వివిధ సాధనముల ద్వారా సంచార సువార్తను ఆలయముల ద్వారా సుస్థిర ఆరాధన మందిరములను, యివి గాక గ్రామ సువార్త నిత్య సువార్త వగైరా సువార్తల రూపముగా ప్రార్థనాదికార్యములను నిర్వర్తిస్తూ నిందారహితులుగా వున్న జనాంగములు లేకపోలేదు.  అపో 10:    లో కొర్నేలి కూడా యిట్టి నీతిమంతుల జాబితాలో వున్నాడు.  అలాగే ఎంతో మంది భక్తులు తమ జీవితాలను సజీవయాగముగా శారీరాత్మలతో సమర్పించుకొని కీర్తిశేషులై వారు చనిపోయినను సమాధులు రూపముగా దైవికముగా తమ యొక్క ఆత్మీయ జివితాన్ని చరిత్రాత్మకంగా నిరూపించుకొన్న వ్యక్తుల జీవితాలు కూడా వున్నవి.  ఈ కోవలో వున్న ఫ్రాన్సీస్‌ జేవియర్‌, జాన్‌ బాస్కో, సెయింట్‌ ఆంతోని, ఇమాకులేట్‌ వగైరాలు.        

                యెహావా పాత్ర        

        కీర్త 75:8 యెహోవా చేతిలో ఒక పాత్ర యున్నది.  అందులోని ద్రాక్షరసము పొంగుచున్నది.  అది సంబారముతో నిండియున్నది.  ఆయన దానిలోనిది పోయుచున్నాడు.  భూమి మీదనున్న భక్తిహీనులందరును మడ్డితో కూడ దానిని పీల్చి మ్రింగివేయుదురు.

        ప్రియపాఠకులారా!          ఈ సందర్భములో ప్రకటన 14:10లో వివరించబడిన రీతిగా ఏమియు కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలలో పోయబడిన దేవుని కోపము అను మద్యమే ఈ యెహోవా చేతిలో వున్న పాత్ర అందులోని ద్రాక్షరసము.  ఈ ద్రాక్షరసము అను ఉగ్రత రగులుకొని తీవ్రతరమై ప్రచండమైన తీవ్రతతో ఉప్పొంగిన ఉగ్రత.  ఈ ద్రాక్షరసమనెడి దేవుని కోపము, '' అను మద్యము తొలుత ఇశ్రాయేలు మీద క్రియ జరిగిస్తూ అనేక విధమైన తెగుళ్ళ చేతను నాశనకరమైన క్రియల ద్వారా తన ఉగ్రతను భూమి మీద క్రుమ్మరించి ఆ ఉగ్రత అను మద్యమును అవిధేయులు, దైవ వ్యతిరేకులైన వారికి త్రాగించి-వారిని నాశనముచేసినట్లు వేదములో చదువగలము.  యిట్టి సంఘటనలో మొట్టమొదటిగా ఆయన చేతిలో వున్న దైవోగ్రత పాత్రనుండి క్రుమ్మరింపబడి దైవ కోపముతో పోయబడిన మద్యము జలప్రళయమును సృష్టించి సంబారముతో అనగా యావద్‌ సృష్టిని  ముంపునకు గురిచేసి 150 దినములు భూమి మీద విస్తరించి పొంగి ప్రవహించినట్లు, ఆప్రవాహము భూమి మీద నున్న భక్తి హీనులందరు దానిలో మునిగి నశించినట్లు యిందులోని ఒక విధమైన పరమార్ధమును గ్రహించవలసియున్నది.

        మరియొక నాశనము యెహోవా చేతిలో వున్న పాత్ర అనగా ఆయన ఉగ్రతాపాత్ర. ద్రాక్షరసము అనగా ఏసు యొక్క రక్తము ఆయన కడరా బోజన సమయములో పై కెత్తిన పాత్రయే!  యెహోవా చేతిలో వున్న పాత్రలోని పరమార్ధమును వివరిస్తున్నది.

        ప్రియపాఠకులారా!  ఈ రెండు ప్రవచన ములలోను రెండు విధములైన పరమార్ధములను మనము గ్రహించవలసియున్నది.  యెహోవా చేతిలోని పాత్రలో కోపము అనుమత్తుతో కూడిన మరణ తుల్యమైన మద్యము.  అలాగే లూకా 22:20లో ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తమువలనైన క్రొత్త నిబంధన మరియు 17 ఆయన గిన్నెనెత్తు కొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసికొని మీలో పంచుకొనుడి.  యిక మీదట దేవుని రాజ్యము వచ్చువరకు నేను ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుచున్నాను.

        ప్రియపాఠకులారా!  ఏసుపలికిని ఈ రెండు మాటలలో రెండు పరమార్ధములు వివరిస్తున్నవి.  ఈ రెండు వేద వాక్యములకు ప్రతిగా యెహోవా చేతిలో వున్న పాత్ర అందులోని ద్రాక్షరసము పొంగుట అది సంబారముతో నిండియుండుట.  ఈ మూడు వాక్యాలు మూడు విధములైన పరమార్ధములను మనకు భోదించుచున్నవి. ఏసు ప్రభువు గిన్నెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ద్రాక్షరసము త్రాగనని నిషేధించుకున్నాడు.  ఆ విధముగానే ఈ గిన్నె మీ కొరకు చిందింపబడు క్రొత్త నిబంధన అన్నాడు.  ఈ రెండు వచనములు యిప్పుడు భూమిమీద నెరవేరుచున్నవి.  ఎట్లంటే ఏసు ప్రభువు ఈ లోకములో శారీరధారియై నరుల మధ్య జీవించినపుడు ద్రాక్షరసము త్రాగినట్లే ఈ వాక్యము వివరిస్తున్నది.  ఎట్టంటే యికమీదట దేవుని రాజ్యము వచ్చువరకు నేను ద్రాక్షరసము త్రాగను, ''అనుటలో ఆ గడియవరకు ఆయన తన శిష్యులతో ద్రాక్షరసాన్ని వాడినట్లే వున్నది.  అయితే ఆయన పట్టుకొనిన ద్రాక్షరసపు గిన్నెను ఆయన అభివర్ణిస్తూ''ఈ గిన్నె మీ కొరకుచిందింపబడుచున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన అనగా ఆయన వాడిన ద్రాక్షరస పాత్రము ఆయన హస్తంలో పైకెత్తబడిన తర్వాత ఆయన హస్తములోని ద్రాక్షరసము రూపాంతరము పొంది ప్రభువు యొక్క బలియాగానికి చిహ్నంగా మారి లోకనరకోటి పాపపరిహారార్ధము కొరకు ఆయన చిందించబోవు రక్తమునకు అది సమతుల్యమై నూతన నిబంధన గ్రంథమునకు అదియే సారూప్యమైనట్లు అందులోని పరమార్ధము.  ఈ రెండు వచనములు దైవ కుమారుని యొక్క వాగ్దానమునకును లోక నరుల పట్ల ఆయనకున్ను ప్రేమకును నూతన శకమును స్థాపించుటకు పునాదియైయున్నట్లును ఆ యొక్క పాత్ర - పాత్రలోని ద్రాక్షరసము వివరము తెలుపుచున్నది.

        అయితే యెహోవా చేతిలో వున్న పాత్ర అందులోని ద్రాక్షరసము గూర్చి మనము ఈ సమయములో ధ్యానించ వలసియున్నది.  ఏసు ప్రభువు ఎత్తిన పాత్రలో ద్రాక్ష రసము పొంగలేదు.  అది సంబారముతో నిండలేదు.  దానిలో మడ్డిలేదు.  అయినను అది దైవకుమారునియొక్క నిష్కళంక పవిత్రమైన బలియాగమునకు మాదిరియైనది.  అయితే యెహోవా చేతిలో పాత్రలోని ద్రాక్షరసము పొంగుట సంబారముతో నిండుట, మడ్డి కూడా కలిగియున్నట్లును ఈ వాక్యములోని వివరము తెలుపుచున్నది.  దేవుని పాత్ర ఉగ్రతతోను దేవుని ద్రాక్షరసము కోపముతోను అది బహు తీవ్రతరమైన దైవ చిత్తాన్ని నెరవేర్చుచు సృష్టిని లయపరచుచు లోక నాశనానికి క్రియ జరిగించినట్లు ఈ వాక్యములో మనము చదువుచున్నాము.

        ప్రియపాఠకులారా!  యెహోవా చేతిలోని పాత్ర లోనికి లోకము మీద ఆయన ఆగ్రహించినపుడెల్ల ఆ పాత్రను కుమ్మరించినట్లు కొన్ని సందర్భములను బట్టి మనము వేదరీత్యా తెలిసికొందము.  మొట్టమొదటి కుమ్మరింపు జల ప్రళయము రెండవది సాదమ గొమర్రాల నాశనము (3) ఏడు తెగుళ్ళు(4)యోబు విషయములో ఆయన యొక్క ఆస్థిని పాడు చేయుట (5) పిలిష్తీయుల నాశనము (6) దైవ వ్యతిరేకులైన ఇశ్రాయేలుపై దేవుని క్రుమ్మరించిన తాపకరమైన విషపూరిత సర్ప ప్రయోగము. (7) ఐగుప్తులో తొలిచూలు సంహారము. (8) ఏలీయాను బట్టి ఆహాబు పరిపాలనలో దేవుడు సృష్టించిన క్షామము అను కరువు పాత్ర (9) యోనా నిమిత్తము తర్షీషు ఓడమీద దేవుడు క్రుమ్మరించిన ఉగ్రత పాత్ర.  (10) కర్మేలు సర్వతము మీద ఏలీయా దహించిన దేవుని అగ్ని (11) ప్రభువు రాకడలో లోకము మీద సృష్టి యావత్తు మీద పంచభూతాల మీదను సముద్రము మీదను ఆకాశము మీదను క్రుమ్మరించబడు దేవుని యొక్క ఉగ్రత పాత్ర (12) ఆది సర్పము మృగము అబద్ధ ప్రవక్త నాశనపుత్రుడు అంత్య క్రీస్తు అను పేరుగల సాతాను అతని అనుచరులను అతని సంబంధులైన నరులకును వుంచబడిన మత్త 25:41 అప్పుడాయన ఎడమ వైపు వారిని చూచి శపించబడిన వారాలారాః  నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి,'' ఇది చివరి పాత్ర.

        ప్రియపాఠకులారా!  భూమి పుట్టినది మొదలుకొని నేటివరకు వేదరీత్యా కొన్ని పాత్రలు దేవుని పాత్రలు కొన్నివున్నవి.  ప్రియపాఠకులారా!  ఈ విధముగా యెహోవా చేతిలోని పాత్ర అందులోని మద్యము, ఏసు ఎత్తిన పాత్ర అందులోని ద్రాక్షరసము రక్తముగా మారుట అవి జరిగించిన క్రియలు లోకములో బహుగా విస్తరించి క్రియ జరిగించినట్లు నేటి మన క్రైస్తవ జీవితములో మనము తెలిసికోగలము.  అయితే ప్రకటన 16:లో దేవుని కోపముతో నిండిన ఏడు పాత్రలు ఏమిటో మనము తెలిసికోవలసియున్నది.  ప్రక 14:8 మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబు లోను కూలిపోయెను.  ఇది బబులోను జనములకు త్రాగించిన పాత్ర.        

        ప్రియపాఠకులారా!  యిందులో ప్రకటన 16:1లో దేవుని కోపముతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పినట్లు వ్రాయబడియున్నది.  ఈ ఏడుగురు దూతలు మోసిన ఈ ఏడు పాత్రలు ఏకమై కీర్త 75:8లోని మొదటి వచనములో వలె యెహోవా చేతిలోని ఒక పాత్రగా వున్నట్లు మనము గ్రహించవలెను.  అయితే ఆ పాత్రలో సప్తగుణములు అనగా దేవుని యొక్క సప్త ఉగ్రతలు మిళితమై యున్నట్లును దేవుడు సృష్టికర్తగనుక ఆయన ఒక్కడే ఆ ఏడు ఉగ్రతలను ఏకము చేసి ఒక పాత్రగా తన దగ్గర వుంచుకొన్నట్లును, నాశన కాలములో అనగా లోకమునుశిక్షించు సమయములో ఈ పాత్రలోని ఏడు ఉగ్రతలను వాటిని భరించుటకును, ప్రయోగించుటకును ఏడుగురు దూతలను నియమించినట్లు ఈ వాక్యపరమార్ధము వివరిస్తున్నది.

        అలాగే ఏసు ప్రభువు భూమి నుండి పైకెత్తబడినపుడు ఒక్క దైవ కుమారునిగా ప్రధాన కాపరిగా రక్షకునిగా అపోసల్తునిగా దేవునిచేత నియమించబడి శ్రమలో వుండగా తన శ్రమలను సిలువలోని బలియాగ వేదనను ఏడు మాటలలో విధించి ఏడు విధములుగా పలికి ఏడవ మాటతో కూడా విశ్రాంతిలో ప్రవేశించినట్లు ఏసు ప్రభువు యొక్క బలియాగ క్రియ మనకు వివరిస్తున్నది.

        యెహోవా ఎత్తిన పాత్ర కడరా భోజన సమయములో ఏసు క్రీస్తు పైకెత్తిన పాత్ర, ఈ ఏడుగురు దూతలు చేత బుచ్చుకున్న ఏడు పాత్రలను గూర్చిన వివరాన్ని ఈ సందర్భములో మనము తెలిసికోవలసియున్నది.  యిందులో మొదటిది యెహోవా చేతిలోని పాత్ర-దేవునికి ఎదురు తిరిగి తిరుగుబాటుచేసి పాప విస్తరణ జరిగించిన జనకోటిని వారి మూలముగా లోకమునకు కలిగిన అపవిత్రతను దహించుటకు యెహోవా చేతిలోని పాత్ర ఉగ్రత పాత్రయైయున్నది. యిక రెండవదిగా ఏసు చివరి బల్ల సందర్భములో పైకెత్తిన పాత్ర దేవుని ఉగ్రతనుండి జనకోటిని రక్షించుటకును యావద్‌ జనకోటికి సంభవించియున్న శాపయుతమైన పాపమరణ శిక్షనుండి విమోచించుటకును రక్త క్రయముగాను మరియు నూతన నిబంధన అను రెండవ గ్రంధమునకు పునాదిగాను, ఈ రక్త పాత్రములోని ద్రాక్షరసము-ఆ పాత్రను పట్టుకున్న ప్రభువు యొక్క హస్తక్రియ ఆయన మాటలాడిన మాటలు ఋజువు పరచుచున్నది.

        యిక మూడవదిగా 16:1 లో దేవుని కోపముతో నిండిన ఏడు పాత్రలను ఏడుగురు దేవదూతలు భూమ్మీద కుమ్మరించుటకు ఆజ్ఞ పొందియున్నట్లు వివరిస్తున్నది.  దేవునికున్న ఏడు కోపములేమిటో ముందుగ మనము తెలిసికోవలసియున్నది.  ఆయనలో వున్న ఏడు కోపములలో ప్రథమ కోపము రోమా 1:22 అవివేక హృదయులు జ్ఞానులమని చెప్పుకొనుచూ  బుద్ది హీనులైరి. అక్షయుడగు దేవుని మహిమను మనుష్యులు, పక్షులు, జంతువులు, యొక్క ప్రతిమలుగా మార్చిరి.  యిట్టి కారణమును గూర్చి దేవుని మొదటి కోపము.  రెండవ ఉగ్రతః 1:25 దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా స్పష్టమును పూజించి సేవించుట (3) 1:26-27 వారి స్త్రీలు సహితము స్వాభావిక ధర్మమును విడుచుట, అటువలె పురుషులు అవాచ్యమైనది చేయుచూ ఒకరి యెడల నొకరు కామతప్తులగుట''ఈహేతువు చేత వారు తమ హృదయముల దురాశలననుసరించి పరస్పరము అవమాన పరచు కొనునట్లు దేవుడు వారిని అపవిత్రత అను ఉగ్రతను కుమ్మరించుట.  ఇది మొదటి పాపమునకు యిచ్చినది. రెండవ దానికి తుచ్ఛమైన అభి లాషలకు వారిని అప్పగించుట.  మూడవ పాపమునకు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించెను.

        ప్రియపాఠకులారా!  ఈ విధముగా ఆది కాండములో ఆయా సందర్భములను బట్టి తెగుళ్ళ చేతను పెద్దపెద్ద భయంకర చెడ్డ పుండ్లచేతను సర్పముల చేతను; నానా విధములైన రోగముల చేతను కరువుల చేతను కరువుల చేత మొత్తియున్నాడు.  కాని ప్రకటన 16లోని ఏడుగురు దూతల చేతులలో ఉన్న ఏడు పాత్రలలోని దేవుని ఉగ్రత ఏ రూపములో వున్నదో ఇది భవిష్యత్తులో జరుగబోవు వివరము'

        ప్రియపాఠకులారా!  ఆలయము అనగా దేవుని యొక్క సమ్ముఖము.  ఆ విధముగా ఆయన సముఖము నుండి మొదటి దూత వచ్చి తన పాత్రను భూమ్మీద కుమ్మరించగా కౄరమృగము యొక్క ముద్రగల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయువారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను.'' అనుటలో కౄరమృగము ముద్ర అనగా లోక సంబంధమైన అధికారము  పదవి అంతస్థు అక్రమార్జనము వగైరాలతో కూడిన ముద్రగల వారికి అట్టివారు లోక సంబంధమైన సృష్టములకు ''తమకు హోదా అధికారము అనుగ్రహించే ప్రభుత్వాలకు దాని సంబంధమైన చట్టములననుసరించి పాటించి వాటిని తమ సిద్ధాంతములుగా భావించి లేక విధులుగా భావించి ప్రవర్తించే వారికి బాధకరమైన చెడ్డపుండు అనగా అది దేహసంబంధమైన వ్రణముగాని దేహ అంతర్భాగములో ఏర్పడు క్యాన్సరుగాని లేక తీరనటువంటి మానసిక గాయముగాని అనగా అవమానము లేక భ్రష్టత్వము.                 యిక రెండవ దూత తన పాత్రను సముద్రములో  కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటి దాయెను.  అందువలన సముద్రములోని జీవ జంతువులన్నియు చచ్చెను. ''అనుటలో ప్రియపాఠకులారా!  రానున్న భవిష్యత్తులో యిప్పుడున్న సముద్రము కలుషితమై రంగును రుచిని జీవాన్ని కోల్పోయి జరుగనున్న యుద్ధముల ద్వారా చమురు బావుల నుండి స్రవించు యింధనముల ద్వారా పెట్రోలు కిరోసిన్‌, డీజలు, క్రూడ్‌ ఆయిలు వగైరా తైలాదులు మూలముగా కలుషితమై సముద్రము తన యొక్క జీవాన్ని రుచిని కోల్పోతుందని, అందులోని జీవరాసులు ఈ తైలాదుల ద్వారా జనించే విషవాయువు మూలమున నాశనమగునని యిందులోని భావము.

        మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను, యిందుకు మాదిరిగా గడిచిన సంవత్సరము మహమ్మదీయ రాజ్యమైన కువైట్‌ను బట్టిన ఇరాక్‌ దాని మిత్ర దేశాలకు, అమెరికాకు దాని మిత్ర దేశాలకు సంభవించిన యుద్ధములో ఈ రాజకీయాలు చమురు బావులను పేల్చివేసి అందులోని చమురును గొట్టముల ద్వారా సముద్రములోనికి వదలి సముద్రములోని జంతుజాలములను చంపుటకును సముద్ర నీటిని అపవిత్రము చేసిన విషయము మనమెరిగినదే! అది రామన్న దేవుని ఉగ్రతకు ఈ క్రియ మాదిరి.

        ప్రియపాఠకులారా!  నేటికిని పరిశుద్ధమైన నీరు లోక నరునికి కరువైయున్నది.  ప్రకృతిగాని, అగ్ని, నీరు కలుషితమైయున్నందువలననే నేటి నర జీవితములో అనేకరకములైన దేహ సంబంధిత అనారోగ్యములు జబ్బులు రుగ్మతలు ఏర్పడియున్నవి.  పట్టణ ప్రాంతాలలో పరిశుద్ధమైన నీరు దొరకుటకూడా అరుదే!  ఎందుకంటే నీళ్ళను ట్యాంకులలో నింపి అందులో మందులను కలిపి ప్రజోపయోగకరముగా వాడుచున్నారు.  ' ఈ నీరు వాడుకలో వున్నప్పటికిని దేహమునకు అరోగ్యవంతముకాదు.  అలాగే పట్టణాలలో డ్రైనేజీలను పేరుతో జలధారలు పట్టణ నడిబొడ్డులో ప్రవహిస్తూ బురదకంపు భరింపరాని దుర్గంధము తద్వారా అంటురోగాలు ఏర్పడుచున్నవి.  దీని ద్వారా దోమ ఈగ రోగ సూక్ష్మ జీవ సందోహములు విస్తరించి నరరక్తములను కలుషితము చేయుచున్నవి.  యిది ప్రభువు రాకడలో జరుగబోవు మూడవ దూత కుమ్మరించబోవు మూడవ పాత్ర యొక్క ఉగ్రతలోని మాదిరి.

        నాల్గవ దూత తన పాత్రను సూర్యుని మీదకుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారమీయబడెను.  ప్రియపాఠకులారా!   దీనిని దేవుడు నేటికిని క్రియారూపముగా వేడి గాడ్పులు వడదెబ్బ తీవ్రతాపము అనుబాధలతో మొత్తుచున్నట్లు వార్తాపత్రికలలో మనము వేసవి కాల వాతావరణ పరిణామాలను తీవ్రతను ఆయా ప్రదేశాలను బట్టి టి.వి.లలో రేడియోలలో కూడా వింటున్నాము.  వడదెబ్బతో  ఎంతోమంది చనిపోవుచున్నారు.  యిది నాలుగవ దూత సూర్యుని మీదకు కుమ్మరించబోవు పాత్రలోని దహన కాండయొక్క మాదిరి క్రియ.

        5వ దూత తన పాత్రను ఆ కౄరమృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను.  నిజమే! ప్రియపాఠకులారా!   జరగబోవునట్టి ఈ క్రియకు మాదిరిగా నేడు లోక ప్రభుత్వాలలో పరిపాలనా విధానాలలో రాజ్యాంగ చట్టాలు వాటి అమలు విషయములలోను ఈ చీకటి విలయతాండవము చేయుచున్నది.  ఎట్లంటే నల్లధనము బ్లాక్‌ మార్కెట్టు చీకటి కార్యకలాపాలు; నరులు వెలుగును విడిచి చీకటిని కోరుకోవడము యివన్నియు రానున్న ప్రభువు రాకడలో లోకరాజ్యము అనుభవించబోవు చీకటిని గుర్తుచేయుచున్నది.  దీని ద్వారా మనుష్యులు మారరని మరెక్కువగా హృదయ కాఠిన్యతను పొంది దేవుని దూషిస్తూ నాస్తికులుగాను హేతువాదులుగాను కౄరులుగాను ఒకరియెడల నొకరు ద్వేషులుగా వుండిదైవత్వానికి పూర్తిగా వ్యతిరేకులగుదురని భావము.  యిప్పటి స్థితి దానిని జ్ఞాపకము చేయుచున్నది.  యిపుడే దేవుని దూషించే వారున్నారు.  నాస్తికులున్నారు. హేతువాదులున్నారు.ఉగ్రవాదులున్నారు. అనేకులైన దైవ వ్యతిరేకులున్నారు.

        ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచునట్లు దాని నీళ్ళు ఎండిపోయెను! ప్రియపాఠకులారా!   ఆదిలో దేవుడు ఏదేను వనములో వర్షముతో ప్రమేయము లేకుండా తన మహిమతో ఏదేనులో ప్రవహింపచేసిన నదియే ఈ యూఫ్రటీసు, ఏదేను తూర్పు దిక్కు అలాగే నూతన నిబంధనలో మత్తయి 2:2లో ఏసు ప్రభువు యొక్క జనన వార్తను లోకమునకు చాటిన నక్షత్రము యొక్క దిక్కు తూర్పే? ఏసు ప్రభువు యొక్క పుట్టిన స్థలమును కనుగొని ఆయనను పూజింపవచ్చిన జ్ఞానుల యొక్క దేశము తూర్పే! దైవ సన్నిధానములో తూర్పున కింత ప్రాధాన్యత వున్నది.  ఈ ప్రాధాన్యతను ఈనాటికి కూడా మనకు వెలుగిచ్చు సూర్య గ్రహము ప్రతినిత్యము తూర్పు దిక్కున ఉదయించి పడమటి దిక్కున అస్తమిస్తున్నది.  యిది ప్రత్యక్షముగా దైవత్వము జరిగించు మహత్తర క్రియయైయున్నది.  యిందునుబట్టి చూడగా ప్రకృతి మనుగడ-సృష్టి నిర్మాణము నరసృష్టి జన్మ రహస్యము సమస్త జీవులకు జీవాధారము.  తూర్పు దిక్కులోవున్నది.

        ఎట్లంటే దేవుడు ఆదిలో వేసిన తోట తూర్పు దిక్కే!  తోటలోని జీవరాసులను సృష్టించినది కూడా తూర్పే!  తోటలోని నరుని నివాసము జీవమును తూర్పే!  ఈ విధముగా ప్రాధాన్యత వహించిన ఈ తూర్పు దిక్కులో జలరాసులు కూడా అనగా సముద్ర అగాధములు కూడా వున్నాయి.  యిన్ని వున్నప్పటికిని ఈ సర్వ సృష్టిని లయపరచుటకు దేవుడు తన కోపముతో నిండిన పాత్రను భూమి మీద కుమ్మరించుటకు ఆరవ దూతకు అధికారము ననుగ్రహించియున్నాడు.  యిట్టి తూర్పు దిక్కున సముద్రము దాని నదులు జలరాశులు ఎండిపోవుచు రాజుల మార్గము సిద్ధపరచబడునట్లు ఎండిన నేలగా మారునని ఈ యొక్క వేద వాక్య సారాంశము.  అంటే దేవుడు తన ఉగ్రత అనే పాత్రలోని కోపము ఒక దిక్కు ఒక స్థలము ఒక ప్రదేశము అనిగాక నాలుగు దిక్కులు నలుమూలలు తన దూతల చేత దహన కాండను జరిగించునని యిందులోని భావము.

        ప్రకటన 16:17 యిక ఏడవ దూత తన పాత్రను వాయుమండలము మీద క్రుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పు స్వరము, మెరుపులు, ఉరుములు, భయంకర భూకంపము పట్టణములు కూలిపోవుట పెద్ద వడగండ్లు మనుష్యుల మీదపడెను.  అవడగండ్లు దెబ్బలను బట్టి దేవుని ధూషించిరి.  ప్రియపాఠకులారా!   దేవుని యొక్క ఉగ్రత సప్తవిధములుగా సప్తశక్తులతో భూమి మీద క్రియజరిగిస్తూ లోక నాశన క్రియను జరుపబోవు చున్నట్లు యెహోవా చేతిలోని పాత్ర యొక్క ప్రభావమైయున్నది.  ఈ నాశనమునుండి తప్పించబడి దీని నుండి రక్షణ పొందాలంటే ప్రతివ్యక్తి కూడా ఏసు ప్రభువు యొక్క పాత్రలోనిది త్రాగవలసియున్నది.  యెహోవా తన పాత్రను కుమ్మరించక పూర్వమే ప్రియసోదరా!  ప్రియసోదరీ! ఏసు ప్రభువు మనకు రక్షణగా అనుగ్రహించిన రక్షణ పాత్ర అనగా కీర్త 116:13 లో విధంగా రక్షణ పాత్రయనగా ఆయన సువార్త '' అను రక్షణార్థమైన పాత్రలోని ఆత్మీయహార పానీయమును ఆరగించి యెహోవా ఉగ్రత పాత్ర మూలముగా కలుగు వినాశనమునుండి మనము మన వారు మన శారీర ఆత్మీయ బలహీనతలనుండి శక్తిపొందిన వారమై, మెలకువ నిరీక్షణ కలిగిన స్థితిలో దైవ రాజ్య వారసులమగుదుము గాక!

                ప్రసిద్ధుడు

        కీర్తన 76:1-2 ప్రియపాఠకులారా!   అసాపు వ్రాసిన ఈ వచనమును గూర్చి ధ్యానించుకొందము.  ఇందులో యూదాలో దేవుడు ప్రసిద్ధుడు'', అనుటలో యూదాలో దేవుడు ప్రసిద్ధుడైతే యూదులు ఎందుకు దైవ కుమారుని తృణీకరించారు? యూదులు ఎందుకు దైవత్వముపై తిరుగుబాటు చేశారు? యూదాలో దేవుడు ప్రసిద్ధుడైతే యూదులు ఎందుకు ఆయనను మహిమపరచలేక పాశవిక హృదయంతో జీవించారు?  అనిన విషయాన్ని గూర్చి మనము తెలిసికొందము.  అయితే దేవుడు పక్షపాతికాడు.  తన జనాంగమయిన యూదులను దేవుడు ఎంతో ప్రేమించాడు. వారిని ఎన్నో సందర్భములలో ఎన్నో శ్రమలలో శతృభయాలలో ఆహార కొరతలు మాంసపు కొరతలు అన్యుల చెరలోను వగైరా సమస్తమైన వాటినుండి కాపాడినాడు.  యింకను యూదాలో దేవుని యొక్క ప్రసిద్ధికి నిజరూపము ధర్మశాస్త్రము తానెన్నుకున్న యూదా జనాంగముల చేత యాజమాన్యము వగైరాలు.

        యెహోవా దేవుడు పాతనిబంధన కాలంలో ప్రపంచములో అనేక జనాంగములు అనేక రకములు అనేక జాతుల నరులు విస్తరించియుండగా ప్రత్యేకించి యూదులనే తన జనాంగముగా ఎన్నుకొని యూదులలో నుండి తన దైవిక ప్రత్యక్షతను లోకానికి చాటుచున్న యూదయ గోత్రము యూదా జనాంగము యూదా దేశము యూదుల పరిపాలనలో ప్రపంచ నరకోటిలో ఆసియా ఖండ మధ్య భాగములో తనకంటూ దేవుడు జనాంగాన్నిఏర్పరచుకొని ఆయనమహి మను లోకానికి అగుపరచినట్లు పాత నిబంధన చరిత్రలో చదువగలము.  ఈ నాటికిని యెహోవా అను నామము ఇశ్రాయేలుకు స్వాస్థ్యమైయున్నది.  యెహోవా ధర్మశాస్త్రము యూదులకు ఆచరణీయమైన వేదమైయున్నది. ఈ విధముగా తన జనాంగముతో లోకములో క్రియ జరిగించినదేవుడు ఆయనేమో ప్రసిద్ధుడుగా వుండి లోకమంతటను వ్యాపించియున్నాడు.  గాని ''యెహోవా తమకు దేవుడు కాగలజనులు ధన్యులు,'' అనిన ధన్యతను యూదులు పోగొట్టుకొని వారి అజ్ఞానము వారి పాశవిక హృదయ స్వభావముల చేత దైవత్వముపై తిరుగు బాటు చేయుచూ దైవ వ్యతిరేకులై, తమ యొక్క ఆత్మీయ జీవితములో శారీర జీవితములో అనేక సాధకబాధకాలకు గురియై తమ అవిధేయత చేత తమ దేవుని యొక్క శక్తిని ప్రభావమును మహిమను ఎరిగి కూడా ఆయనను ప్రసిద్ధిచేయనందువలన వారి జనములు అల్పమైనది, వారి పరిపాలన అంతరించింది.

        ప్రియపాఠకులారా!  అయితే వారిని ఏర్పరచుకున్నదేవుడు అల్పుడుకాలేదు.  కొద్ది వాడు కాలేదు.  వ్యర్థుడు కాలేదు.  ఆయన ప్రసిద్ధుడై యూదయా జాతిలో వేసిన తన పునాదిని యావత్‌ ప్రపంచములో విస్తరింపచేయుటకు, అవిశ్వాసులైన ఇశ్రాయేలీయుల పట్ల ఆయన కినుక వహించి ఇశ్రాయేలును తప్పించి ఇశ్రాయేలీయులలో ఆయన నామము గొప్పచేయబడుటకై తన జనాంగమున ఇశ్రాయేలీయులకు విధిగ తన హస్త లిఖితమైన ధర్మశాస్త్రమును అనుగ్రహించి, దానిని ఆచరించుటలో కఠిన వైఖరిని అవలంబించి ఇశ్రాయేలులో యెహోవా అను తన నామమును గొప్ప చేసికొన్నట్లు మనకు తెలియును.

        యిక రెండవ వచనములో షాలేములో ఆయన గుడారమున్నది.'' అనుటలో పాత నిబంధన కాలములో జీవించిన విశ్వాసులందరు కూడా మందిరములు కట్టి దేవుని మహిమపరచలేదు.  ఆ విధముగా మందిరాలు కట్టి తనను మహిమపరచమన్నట్లుగా ఆయన తన జనాంగమును శాసించలేదు.  ప్రియపాఠకులారా!  అబ్రహాము నుండి ఆదికాండ అంత్యము వరకు జీవించిన విశ్వాసులందరిని కూడా దేవుడు గుడారపు జీవితములో నడిపించినాడు.  అబ్రహాము గుడారములలో జీవించిన వాడే! ఇస్సాకు అలాగుననే జీవించాడు. యాకోబు జీవితము అటువంటిదే!  ఇశ్రాయేలు  యొక్క 12గోత్రాలు కూడా గుడారములో జీవించినవే!  ఈ విధముగా గుడారపు జీవితములో వున్నటువంటి ఇశ్రాయేలు జీవితములను ఇశ్రాయేలులో దావీదు వంశములో యూదా గోత్రములో దావీదు సంతానములో ఒకడైన సొలొమోను చేత సీమోను అనబడు యెరూషలేములో ఆయన ఆలయమును నిర్మించుకున్నాడు.  అయినను ఆ ఆలయము పడగొట్టబడింది.  ఈనాడు  ఆ ఆలయము పడగొట్టబడి ఆ ఆలయము దాని వైభోగము ఆత్మీయమైన స్థితిలో వికసించి ప్రభావితమై ఒక్క ఇశ్రాయేలు మీదనే గాక, అన్యులమైన నేటి విశ్వాసులమైన మన ఆత్మీయ జీవితములో లోకమందంతట వున్న జనాభాలో విస్తరించి విశ్వాసమందిరాలుగ కట్టబడి క్రైస్తవ మందిరము లేక చర్చి అను పేరుతో విస్తరించి యున్నాము.  ఈ ఆలయము రూపాంతరము పొంది విస్తరించి బహుముఖ వ్యాప్తమై లోక మందంతటను విస్తరించి యూదా దేవుని యొక్క ప్రసిద్ధిని లోకనరుల పట్ల ఆయన రూపొందించిన ప్రణాళికను ఆయన రాజ్యపు ఘనతను ఆయన సింహాసనము ఆయన ప్రభావము, ఆయన మహిమను ప్రపంచమందంతట ప్రకటిస్తు ఆయనను కీర్తిస్తూ ఘనపరచుచు మహిమపరచుచు అనేక హృదయములలో సీయోను మందిరాలును-''ప్రభువును ఎరుగని వారికి వారు ఎరుగునట్లు ప్రతి అన్యుని హృదయములో షాలేము వంటి గుడారములు రూపొందించబడినవె,ౖ గుడారజీవితములో వున్న విశ్వాసులను విశ్వాసములో స్థిరులుగా చేసిఅనగా దైవ మందిరాలుగ ప్రతి యొక్క విశ్వాసి హృదయాన్ని ప్రతిష్టించియున్నట్లు మనము గ్రహించవలసియున్నది.

        కనుక యూదాలో ప్రసిద్ధియైన దేవుడు ఇశ్రాయేలీయులలో తన నామమును గొప్పగా చేసికొని ఘనపరచుకొన్న దేవుడు, షాలేములో గుడారములు వేయించిన దేవుడుసీయోనులో మందిరాన్ని కట్టించిన దేవుడు, ఆయనప్రభావము ఆయన ఘనత ఆయన మహిమ ఈనాడు లోకమందంతట విస్తరించి ఫలించి బహు ముఖ వ్యాప్తమై ప్రతి విశ్వాసి జీవితములో-ఆత్మీయ జీవితములో ప్రతి విశ్వాసి యొక్క హృదయమును ఆలయముగా రూపించి, 'అట్టి హృదయ ఆలయములో తన నివాసమును ఏర్పరచుకొనియున్నాడు.

        యెహోవాగా వున్న దేవుడు ఇశ్రాయేలులో జీవించి ఇశ్రాయేలులోనే తన నామమును గొప్ప చేసికొని యున్న ప్పటికిని, ఇశ్రాయేలు యొక్క అవిశ్వాస దైవ వ్యతిరేక అతిక్రమ స్థితికి ఖిన్నుడైతన రూపమును తననామమును మార్చుకొని దేవుడు అను నామమునకు ప్రతిగా రక్షకుడు అను పేరుతో నర రూపములో నరుల మధ్య అన్యులమైన మనలను మనతో కలసి జీవించి, మనవలె రక్తమాంసయుత దేహమును ధరించి దేవుడు అను నామముగాక మనుష్యకుమారుడు అనునామముతో క్రియ జరిగించి ఎన్నో అద్భుతములు చేసి, యావద్‌ నరకోటికి దాపురించి యున్న శాప మరణ ఘోరాతి, ఘోరమైన దైవోగ్రతనుండి విమోచించుటకు రక్షకునిగా అవతరించి ఈ లోకములో తన యొక్క ప్రేమను సర్వ జనులకు బయల్పరచినట్లు తెలియుచున్నది.

        కనుక ప్రియపాఠకులారా!  ఒకప్పుడు దేవుడు యూదాలో ప్రసిద్ధుడు, ఒకప్పుడు ఇశ్రాయేలీయులలో ఆయన నామము గొప్పది.  ఒకప్పుడు  షాలేములో ఆయన గుడారము వుండి వుండవచ్చును. సీయోనులో ఆయన ఆలయము వుండినది.  అయితే ఈనాడు అదే దేవుడు త్రినామ ధారియై తన ప్రసిద్ధిని లోక మందంతటనుకనబరచియున్నాడు.  ఈనాడు అట్టి త్రినామ ధారియైన దేవుని మహిమపరచుటయు, ఘనపరచుటయు ప్రసిద్ధి చేయుటకు నేటి విశ్వాసులమైన మనయొక్క బాధ్యత యైయున్నది.

                నోటిమాటలు

        కీర్త 78:1- నా జనులారా!  నా బోధకు చెవి యొగ్గుడి నా నోటి మాటలకు చెవియొగ్గుడి.

        ప్రియపాఠకులారా!  ఈ మాటలలోని భావము మొదటిగ మనము తెలిసికోవలసియున్నది.  ఈ మాట సృష్టికర్తయైన దేవుడు తాను సృష్టించిన జనులతో ఆయన బోధకు చెవియొగ్గమంటున్నాడు.  ఆయన బోధ ఏమిటి?  మొట్టమొదట ఆయనే చేసిన బోధ ఎటువంటిది?  తర్వాత సృష్టిలో విస్తరించిన జనులలో ఆయన చేసిన సందర్భయుతమైన బోధేది?  వగైరా వివరములనుగూర్చి మనము తెలిసకోవలసియున్నది.

        మొదట తాను సృష్టించిన నరునిలో తాను నిర్మించిన వృక్షసముదాయముతో కూడిన వనమును చూపుచూ ఆదామా!  నీవు ఈ తోటలోని చెట్ల ఫలములన్నిటిని తినవచ్చును.  అయితే ఈ తోటమధ్యలో వున్న మంచి చెడ్డల తెలివినిచ్చు ఈ వృక్ష ఫలములను నీవు తినకూడదు.  నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు.  యిది దేవుడు తొలి నరునికి అనగా ఆది నరునికి మొట్టమొదటిగ చేసిన బోధ, ఆదాము ఈ బోధకు చెవియొగ్గినాడు. కాని కుడి చెవిలో ఉన్న దేవుని బోధకు ప్రతిగా ఆదాముకు ఎడమచెవియైయున్న నారీ బోధద్వారా నాశనానికి గొయ్యి త్రవ్వుకున్నాడు.  అనగా మరణానికి గొయ్యి త్రవ్వుకున్నాడు.

        అటుతర్వాత నరుని యొక్క దైవ వ్యతిరేకతనుబట్టి నరజంటలో విస్తరించిన జనాభావారితో బాటు పాపము బహుముఖములుగా ప్రబలియుండగా-దేవుడు నరులను వారితో బాటు సర్వసృష్టిని జలప్రళయముతో తుడిచి వేయుటకు ఏర్పరచుకున్న ప్రణాళికతో ఆనాటి నరకోటిలో దైవత్వముకు అనుకూలించు విధేయించు కుటుంబమును ఎన్నుకొని, ఆ కుటుంబ యాజమానితో దేవుడు తన ప్రణాళికను గూర్చి బోధిస్తూ-''నీకొరకును, నీ యింటి వారి కొరకును ఒక ఓడను తయారుచేసికొనుము'', అనుట ఈ బోధకు నోవహు చెవియొగ్గ దైవ చిత్తమును ఆయన ప్రణాళికను ఆయన ఆజ్ఞాపించిన ఓడ నిర్మాణ క్రియను గూర్చిన నమూనాను కార్యరూపముగా నెరవేర్చి అనగా దేవుని యొక్క బోధను బట్టి ఓడనిర్మాణముగావించి, ప్రచండ జల ప్రళయనాశనములో తన్ను తాను తన కుటుంబాన్ని రక్షించుకోగలిగినాడు.

        యిక రెండవవాడుగ అబ్రహాము విషయములో అబ్రహాము తన జీవిత కాలమంతయు దేవుని బోధకు ఆయన సిద్ధాంతాలకు చెవినిచ్చి తన కుమారుని సైతము దహన బలిగా దేవునికి అర్పించుటకు వెెనుదీయని విశ్వాసమును కనపరచి నేటి విశ్వాస నరకోటికి తండ్రి ఆయెను లేక యావద్‌ విశ్వాస నరకోటికి తండ్రి ఆయెను.  అటుతర్వాత మోషే విషయములో దేవుడు మోషేను పిలిచి తన జనాంగమైన ఇశ్రాయేలును గూర్చిన బలహీనతలను గూర్చి మోషేకు వివరించి మోషేను, తన జనాంగమునకు నిర్వాహకునిగాను నాయకునిగాను అధిపతిగాను నియమించి తన బోధననుసరించి ఇశ్రాయేలుపై అధిపత్యం వహించుటకు మోషేతో దేవుడు తన రాజ్యాంగ చట్టములను బోధించి ధర్మశాస్త్రము అనుపేరుతో పది ఆజ్ఞలను దేవుడు తన స్వహస్తముతో ఱాతి పలకలపై వ్రాసి వాటిని ఆచరణలో పెట్టుటకు మోషే చేతికిచ్చి ఆచరించమనగా దైవ బోధకు చెవినిచ్చిన మోషే తన యవ్వన కాలమంతయు దేవుని బోధకు చెవినిచ్చి దైవ ప్రజల నాయకునిగా జీవించి తన కంటూ ఒక గొప్ప చరిత్రను వేదములో సృష్టించుకొన్నాడు.

        ఇక దావీదు విషయములో దావీదు దేవుని యొక్క బోధకు చెవినిచ్చి రాజ్య పరిపాలన చేశాడు.  దావీదు కుమారుడైన సొలోమోను విషయములో సొలోమోను చేత దేవుడు తనకంటూ ఒక మందిరమును కట్టుటకు సొలోమోనుకు తాను చేసిన బోధను బట్టి సొలోమోను దేవుని బోధకు చెవినొగ్గి యెరూషలేము ఆలయ నిర్మాణ కార్యక్రమానికి నిర్మాణకుడాయెను.  అలాగే ఏలీయా యెషయ యిర్మియా వగైరా ప్రవక్తలు ఆయన బోధకు చెవినిచ్చి పాత నిబంధన గ్రంధములో ప్రవక్తలుగాను పాత నిబందన లేఖన భాగములకు రచయితలుగా దేవునిచేత ఏర్పరచ బడినారు.

        ప్రియపాఠకులారా!  దేవుడు తన జనాంగమైన ఇశ్రాయేలును గూర్చి వారి నుద్దేశించి ప్రత్యక్షముగాను పరోక్షముగాను చేసిన బోధలు ఇశ్రాయేలు జనాంగము వినుటకు మాత్రము విన్నారు.  కాని వారి హృదయాలు గ్రహింపలేక వారి చెవులు దురదగలిగినవై దైవ బోధను అలక్ష్యము చేసి అనేక సార్లు శ్రమలపాలయ్యారు.  యిది పాత నిబంధన కాలములో యెహోవా దేవుని బోధకు చెవినొగ్గిన పరిశుద్ధ్ధుల పవిత్ర చరిత్ర.        

        ఇక కీర్త 78:1 నా నోటి మాటలకు చెవియొగ్గుడి'' అని ప్రవచనము  ప్రకటిస్తున్నది.

        ప్రియపాఠకులారా!  దేవుడు ఆత్మ ఆయన శరీరికాడు.  నరులకు వున్నట్లుగా ఆయనకు దృశ్యమైన ఆకారము లేదు.  దేవుడు నరుడైతే ఆయనకు నరులకు వలె సకల అవయవములు వుండేవి.  కాని ఆయన నరుడు కాదు.  అయితే ఈ వాక్యములో నా నోటి మాటలకు చెవియొగ్గుడి'', అనుటలో దేవుడి యొక్క నోరు ఎవరు?  అంటే క్రీస్తు;  ఎందుకంటే దేవుని యొక్క రూపము శరీరాకారముగా క్రీస్తు యొక్క ప్రత్యక్షతలో కనబడుచున్నది.  కనుక ఆయన నోటి మాట అంటే దేవుని నోరు అయిన క్రీస్తు యొక్క మాటలకు చెవియొగ్గుట, ఈ సందర్భములో క్రీస్తు యొక్క మాటలకు చెవియొగ్గిన వారెవరో వేదరీత్యా నూతన నిబంధనలో ఈ క్రింది వేదభాగాల ద్వారా చదువగలము.

        మొట్టమొదటిగా కానాలోని పెండ్లి గృహములో అయోగ్యముగ వాకిటపడియున్న రాతి బానలు నీళ్ళతో నింపబడి ఏసు యొక్క మాటలకు తన్మయత్వము పొంది ఆ పరవశములో ఆయన మాటల యొక్క ప్రభావ మూలమున వాటిలో వున్నటువంటి నీళ్ళను ద్రాక్షరస మాధుర్యాన్ని అనుభవాన్ని  రూపాన్ని సృష్టించినవి.  ఏసు ప్రభువు చేసిన ఈ కార్యములో బానలలో పోయబడింది నీరేగాని మరి ఏ యితర ద్రవ పదార్ధము గాదు.  అందులో ద్రాక్షరస పండ్లు గాని లేక ద్రాక్ష సంబంధమైన కషాయముగాని మిళితము కాలేదు.  అందులో పోయబడినవి నీళ్ళే అయితే ఆ బానలలోని నీళ్ళను దైవ కుమారుడు యోహా 2:8లో మీరు యిప్పుడు ముంచి విందు ప్రదాని యొద్దకు తీసుకొని పొమ్మని చెప్పగా ఆ నీళ్ళు ద్రాక్షరసము అయినది.  అది త్రాగిన వారికి మత్తును కైపును కలిగించినట్లుగా ఈ వేద భాగములోని వివరణ.   కనుక దేవుని నోటిమాట విన్న బానలు బానల లోని నీళ్ళు రూపాంతరము పొందినవి.  ఒక పెళ్ళి పరిశుద్ధ కార్యము యొక్క అవసరతను తీర్చినవి.

        అలాగే లూకా 10:38-40 చదివితే ఆయన ప్రయాణమై పోవుచుండగా ఒక గ్రామములో మార్త అను స్త్రీ ఆయనను తన యింట చేర్చుకొనెను. ఆమె సహోదరి మరియ ఏసు బోధ వినుచున్నట్లును మార్త విస్తారమైన పని పెట్టుకొన్నందున నాకు సహాయము చేయుటకు ఆమెతో చెప్పమనెను.  అందుకు ప్రభువు మరియనుగూర్చి సాక్ష్యమిచ్చుచు మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను.  అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు.'' అని ఆమెతో చెప్పుట, ఏసు ప్రభువు యొక్క మాటలు విన్న మరియ దైవ రాజ్యమునకు వారసురాలైనది.  అపో 16:14 లూదియా అను దైవభక్తి గల స్త్రీ ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు, ప్రభువు ఆమె హృదయమును తెరచెను.  కనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచి ఆమెయు ఆమె యింటి వారలును బాప్తిస్మము పొందినట్లు వ్రాయబడియున్నది.

        ప్రియపాఠకులారా!  దేవుని నోరు క్రీస్తు అయితే యిపుడు ఈ లేఖన భాగము రీత్యా క్రీస్తు యొక్కనోరు పౌలు అని మనము గ్రహించవలసియున్నది.  చెరసాల నాయకుడు పౌలు సీలలనుద్దేశించి అయ్యలారా!  రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను?  అని అన్నపుడు పౌలు సీలలు చెప్పిన మాట, ప్రభువైన ఏసు నందు విశ్వాస ముంచుము.  అపుడు నీవును నీ యింటి వారును రక్షణ పొందుదురు'',  అని చెప్పుచు అతనికిని అనగా ఆ చెరసాల నాయకుని అతని  యింటిలోని వారందరికిని దేవుని వాక్యమును బోధించుట. ఈ బోధ విన్నచెరసాల నాయకుడు ఆయన యింటివారు బాప్తిస్మము పొంది ప్రభువు నంగీకరించుట యిందుకు కృతజ్ఞతగా చెరసాల నాయకుడు చెరసాలలో వున్న పౌలు సీలలను తన యింటికి తీసికొని వచ్చి వారికి భోజనమును పెట్టి దేవుని మీద విశ్వాసము పెట్టినవాడై తన యింటి వారందరితో ఆనందించుట.  యిది దేవుని నోటి మాటలకు చెవినొగ్గిన ఆత్మీయ ఫలభరితమైన స్థితి.

        మంచములో వున్న పక్షరోగిని తన మాటలతో స్వస్థునిగ చేసి మంచమెత్తుకొని నడువమనుట.  38 ఏండ్ల నుండి వ్యాధి గల మనుష్యుని ఏసు ఆజ్ఞాపించినపుడు ఏసు మాటలు విన్న ఆ దీర్ఘ రోగి స్వస్థత నొంది పరుపెత్తుకొని నడుచుట.  యిది ఆయనమాట విన్న రోగికి స్వస్థత.  అలాగే ఆయన మాటలు విన్న గుడ్డి వానికి చూపు, ఆయన మాటలు విన్న కుంటి వానికి నడక ఆయనమాటలు విన్న చనిపోయిన శవమునకు జీవము, ఆయన మాటలు విన్న ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు బహుగా విస్తరించి ఐదువేల మంది ఆకలిని దీర్చి 12 గంపల రొట్టె ముక్కలను మిగుల్చుట.

        అలాగే ఏసు ప్రభువు మాటలు విన్న పొట్టివాడైన జక్కయ్య అబ్రహాము కుమారునిగ బిరుదు పొందుట.  అలాగే ఏసు ప్రభువు మాటలు విన్నగెరాసీనులనబడిన సమాధుల తోటలోని అపవిత్రాత్మలు ఆ రోగిని వదిలి వెళ్ళి పోవుట.  గెరాసీనుల వద్ద వున్న భూత రోగి యొక్క వరము మార్కు 5:5లో తెలియగలదు.  ఆయన మాటలు విన్న జాలరులు ఆయన శిష్యులు ఆయ్యారు. ఆయన మాటలు అధికముగ విన్న ఆయన శిష్యులే అపోస్తలులయ్యారు.  ఆయన మాటల యందు లక్ష్యముంచి ఆయన మాటలకు చెవియొగ్గి ఆయన అడుగు జాడలలో నడిచిన అపోస్తలులు పరమ యెరూషలేము అను మహా పట్టణానికి 12 పునాదులయ్యారు.

        యిక ఉపమానము - నా నోరు తెరచి ఉపమానము చెప్పెదను.

        ప్రియపాఠకులారా!  దేవుని బోధ దేవుని నోరైన ఏసు క్రీస్తు మాటలను గూర్చి తెలిసికొనియున్నాము.  యిప్పుడైతే నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదనని ప్రభువు అంటున్నాడు.  పై వాక్యములో ఆయన నోటి మాటలు '', అనుటలో దేవుని నోరు ఏసు క్రీస్తు అని తెలిసికొనియున్నాము.  యిప్పుడు దేవుని నోరైన ఏసు క్రీస్తు నోరు తెరచి చెప్పిన ఉపమానము లేమిటో వేదరీత్యా తెలిసికొందము.        

        దేవుని నోరైన ఈ లోకములో నరరూపములో అవతరించి సంచరించిన దినములలో ఆయన చెప్పిన ఉపమానములు మొట్టమొదటిగా తప్పిపోయిన గొఱ్ఱె; విత్తు వానిని గూర్చి ఉపమానము, గురుగులను గూర్చిన ఉపమానము, ఆవ గింజయు, పులిసిన పిండిని గూర్చి ఉపమానము, ముత్యములు ధనములను గూర్చిన ఉపమానము;  ద్రాక్షతోటలోని పనివారలను గూర్చి; యిద్దరు కుమారులను గూర్చిన ఉపమానము, ద్రాక్షతోటను గూర్చిన ఉపమానము.  పెండ్లివిందును గూర్చి, పొగొట్టుకొనిన నాణెము, నమ్మకమైన దాసుడు,భృత్యుడైన దాసుడు, అను వారిని గూర్చి, పదిమంది కన్యకల గూర్చిన ఉపమానము; పది తలాంతులను గూర్చిన ఉపమానము ఎడతెగక ప్రార్థించుట, అర్థరాత్రి వచ్చిన స్నేహితుని గూర్చిన ఉపమానములు, మంచి సమరయుడు,  ఆవగింజ పులిసిన పిండిని గూర్చిన ఉపమానము, పెండ్లి విందును గూర్చిన ఉపమానము, తప్పిపోయిన కుమారుడు, ధనవంతుడు లాజరు ఇవి ఉపమానములు ఇవి దేవుని నోరైన ఏసు ప్రభువు ప్రవచించి విశ్వాసులకు బోధించిన ఉప మానములు.

        యిక పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియచెప్పెదను.''అనుటలో ఈ గూఢ వాక్యములు ఏమిటో పాత క్రొత్త నిబంధనలలో ఈ క్రింది వేదభాగముల ద్వారా దేవుడు యావద్‌ నరకోటికి బైల్పరచినట్లు మనము చదువగలము. ప్రియపాఠకులారా!  ఈ గూఢ వాక్యములన్నవి దేవుడు మొట్టమొదటిగా తానేర్పరచుకున్న విశ్వాసులకును ప్రవక్తలకును భక్తులకును యాజకులకును రాజులకును తెలియపరచినట్లు మనము తెలిసికొందము.

        మొట్టమొదటిగా ఈ గూఢ వాక్యములు అనగా లోక సృష్టి ఏదేను నిర్మాణము, నరసృష్టి అటు తర్వాత ప్రవేశించిన పాపము దాని మూలముగా విస్తరించిన జల ప్రళయయుతమైన మారణ హోమము.  ఈ మారణ హోమము సందర్భములో దేవుడు ఎన్నుకొన్న నీతిమంతుని కుటుంబము యొక్క రక్షణాయుతమైన చరిత్ర, అటు తర్వాత పునఃసృష్టి - పునఃసృష్టిలో విస్తరించిన జనుల యొక్క వివరములు మరలా భూమి మీద విలయ తాండవమాడిన పాపము-దాన్ని గూర్చి దేవుడు తన యొక్క ఎన్నికలో స్థిరపరచిన లోతు జీవితము అటు తర్వాత విశ్వాస పరీక్షలో నిలబడి విధేయుడైైన అబ్రహాము యొక్క చరిత్ర.  అక్కడ నుండి అబ్రహాము సంతానమైన ఇస్సాకు-ఇస్సాకు సంతానమైన యాకోబు ఏశావులు వారి జీవిత చరిత్ర యాకోబు దేవునితో పోరాడి ఇశ్రాయేలు అను పేరుతో 12 గోత్రాలకు తండ్రి అగుట.

         ఈ విధముగా ఇశ్రాయేలు నుండి ఏర్పడిన 12 గోత్రములు దైవ జనాంగమైన అనగా దేవుడు ఎన్నుకున్న ప్రజగా భూమిపై ఎన్నికచేయబడినవారు కూడా దేవునియందు అవిశ్వాసులు కాగా వారిలో యోసేపు తన అన్నల యొక్క ఒక గోత్రీకుడైన యోసేపును అతని అన్న దమ్ములు కౄరముగ హింసించి బానిసగా ఇష్మాయేలులకు అమ్మగా వారు అతనిని ఐగుప్తునకు అమ్ముట ఈ విధమైన పితృ, సోదరఘాతకులైన ఇశ్రాయేలుల అపరాధములనుబట్టి దేవుడు ఆగ్రహించి ఐగుప్తురాజైన ఫరోకు స్వప్న రూపముగా ఏడు బలిసిన ఆవులు ఏడు బక్కచిక్కిన ఆవులుగాను, ఏడు బలిసిన వెన్నులు ఏడు పీలవెన్నులుగాను వాటి వివరములును దేశము మీదకు ఇశ్రాయేలు నిమిత్తము దేవుడు పంపబోవు ఏడు సంవత్సరములు భయంకర కరువునకు సూచనలుగా స్వప్నదర్శనములో కనబరచుటయు ఆ కలలు గన్న ఐగుప్తు రాజు వాటి భావములను యోసేపు ద్వారా తెలిసికొన్నవాడై యోసేపు యొక్క చిత్తాను సారము సంభవించబోవు ఏడు సంవత్సరములు భయంకర కరువునకు ముందుగా దేశము మీదకు రాబోవు భయంకర కరువునుండి సంరక్షణార్థము పాడిపంటను కూడ బెట్టి ఏడు సంవత్సరముల కరువునుండి తన జనాంగమును తన రాజ్యమును కాపాడుకున్న విధానములు, అటు తర్వాత యోసేపు యొక్క రెండవ ఐగుప్తు సామ్రాజ్య పరిపాలన అనగా ఫరో యొక్క రెండవ సింహాసనము రెండవ రధము మీద ఆసీనుడై ఫరో యొక్క సమస్త సంపదకు అధిపతిగాను వారసునిగాను నియమించిన చరిత్ర.

        ప్రియపాఠకులారా!  ఇవన్నియు కూడా దేవుని మొదటి ప్రవక్తయైన మోషేకు ముందు జరిగిన లోక చరిత్ర.  లోక సంబంధమైన గూఢమైన దైవ క్రియాకర్మలు, మరియు జన జీవితము యొక్క చరిత్రను దేవుడు మోషేకు వివరించి మోషే చేత ఆది కాండము నుండి ఈ పంచ కాండముల గ్రంధకర్తగా మోషేను నియమించి దేవుడు ప్రత్యక్షంగా వ్రాయించినట్లుగా పాత నిబందనలో ఐదు కాండముల చరిత్ర వివరిస్తున్నది.

        యిందులో నూతన నిబంధనలో రాబోయే క్రీస్తును గూర్చి కూడా మోషే చేత దేవుడు వ్రాయించి యున్నాడు.  ఆ మాట ఏమిటంటే ఆది 49:11-24 నిర్గమ కాండము లగాయతు సంఖ్యాకాండము వరకు జరిగిన బలి ఆరాధనలలో ఆనాటి జనాంగము దేవునికి బలి అర్పించు సందర్భములో బలి ఆచరించు గుఢారములో ఏర్పరచబడిన బలిపీఠము  పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము, వాకిట ఉంచబడిన గంగాళము బలి పీఠము మీద ఉంచబడు ఉపకరణములు అనగా బల్ల పొంగని రొట్టెలు వధించబడు బలిపశువు, బలిచేయు యాజకుడు వీరందరూ కూడా నూతన నిబందనలో రాబోయే క్రీస్తుకు ముంగుర్తులై యున్నట్లుగా వివరించబడియున్నది. అలాగే అబ్రహాము ఇస్సాకునకు దహన బలిగా అర్పించుటకు సమాధాన యుక్తమైన సందర్భములో అబ్రహాము యొక్క విశ్వాసమునకు దేవుడు మెచ్చి ఇస్సాకును ప్రతిగా దేవుడు చూపిన పొదలో తగుల్కొన్న పొట్టేలు, నూతన నిబంధనలో లోక నరకోటి పాప పరిహారార్థము బలిగాబోవునట్టి క్రీస్తునకు సాదృశ్యమైయున్నట్లు మనము చదువగలము.

        ప్రియపాఠకులారా!  దేవుడు తన గూఢ వాక్యాలను మోషేకు తెలియజేయుటయే గాక మోషే చేత ఈ ఐదు కాండములు రచింపచేశాడు.  తెలియచెప్పిన గూఢ వాక్యాల యొక్క యదార్ధ చరిత్ర.  ఈభాగ్యము ప్రప్రధమముగా దేవునిచేత మోషేకు గలిగింది.  ఎట్లంటే దేవుడు స్వయముగా దగ్గర వుండి నిరక్షరాశ్యుడును  నోటి మాంద్యము గలవాడైన మోషేకు అక్షర జ్ఞానమును ఆత్మీయ జ్ఞానమును ప్రవచన జ్ఞానమును వ్రాయుటకు నేర్పును కలిగించి జరిగించిన క్రియ.  దేవుడు మోషేకు గూఢ వాక్యాలను తెలుపుటయే గాక వాటిని స్వయముగ ఆచరింపజేయుటకు ఆత్మీయతను జ్ఞానమును శక్తిని ప్రసాదించినట్లు మోషే చరిత్రను బట్టి మనము తెలిసికొనగలము.        

        అలాగే రెండవ దేవుని యాజకుడు ప్రవక్తయును నూతన నిబందన కాలమునకు చరిత్రకును మూలకారకుడైన ఏసు క్రీస్తు ప్రభువుల వారు కూడా పూర్వకాలపు అనగా తన పితరుల కాలములో జరిగిన కార్యమును గూర్చి నిగూఢ సత్యాలను తాను ప్రేమించిన శిష్యులకును తనను వెంబడించు జనాంగమునకును అప్పుడప్పుడు బైల్పరచినట్లు వేదరీత్యా తెలిసికొందము.  యిందులో ప్రప్రధమముగా మత్త 13:34 నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను లోకము పుట్టినది మొదలుకొని మరుగుచేయబడిన సంగతులను తెలియచెప్పెదను'', అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు ఏసు ఈ సంగతులనన్నిటిని ఉపమాన రీతిగా బోధించెను.  ఉపమానము లేక వారేమియు బోధింపలేదు.

        లూకా 21:5-6 కొందరు అందమైన రాళ్ళతోను అద్భుతములతోను శృంగారింపబడియున్నదని దేవాలయము గూర్చి మాట్లాడుచుండగా ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే వాటిలో రాతిమీద రాయి యుండకుండా అవి షడద్రోయబడు దినములు వచ్చి యున్నవి.  ఇది ఏసు యొక్క శరీరమును గూర్చిన మరణ పునరుత్థానములను గూర్చిన మర్మము.

        యెహా 6-35 జీవాహరము నేనే,  నా యొద్దకు వచ్చువాడు,   ఏ మాత్రము ఆకలి గొనడు, నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పికగొనడు.  6-55 నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము.  యెహా 14:2-11 నా తండ్రి యింట అనేక నివాసములు కలవు. మీకు స్థలము సిద్ధపరచవెళ్ళుచున్నాను.  15:1-11 ద్రాక్షవళ్ళిని నేను తీగలు మీరు.  నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. యెహాను 16-25 ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని.  తండ్రిని గూర్చి స్పష్టముగా తెలియచెప్పు గడియవచ్చుచున్నది.  17:25 నీతి స్వరూపుడవగు తండ్రీ! లోకము నిన్ను ఎరుగలేదు.  నేను నిన్నెరుగుదును.  యెహా 16-7 నేను వెళ్ళి పోవుట వలన మీకు ప్రయోజనము నేను వెళ్ళిన యెడల ఆదరణకర్త మీ యొద్దకురాడు.  నేను వెళ్ళని యెడల ఆయనను మీ యొద్దకు పంపుదును.  ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును.  ఇది కుమారుని ద్వారా దేవుడు బైల్పరచిన గూఢవాక్యములు.  

        ఏసు క్రీస్తు లోకపాప పరిహారార్ధము మరణము పొంది మహిమ పునరుత్ధానముతో ఆరోహణమైన పిమ్మట అపోస్తలులను ఆవరించిన పరిశుద్ధాత్ముడు అపోస్తలుల ద్వారా ప్రవచించుటయేగాక లేఖనముల రూపముగా అనగా మత్తయి, మార్కు లూకా, యోహాను సువార్తల మూలముగాను, అపోస్తలుల కార్యములు అని అపోస్తలుల  గ్రంధమును; అలాగే యోధుడుగా వున్న సౌలును అనగా లోక సంబంధి క్రైస్తవహింసకుడైన సౌలును పౌలుగా మార్చి ఎనిమిది సంఘములకు లేఖలను వ్రాయించి అటు తర్వాత అదే అపొస్తలుడైన పౌలు చేత తిమోతికి వ్రాయించిన రెండు పత్రికలు, తీతునకు వ్రాయించిన పత్రిక, యాకోబు వ్రాసిన పత్రిక, పేతురు వ్రాసిన రెండు  పత్రికలు యోహాను వ్రాసిన మూడు పత్రికలు, యూదా వ్రాసిన పత్రిక, చివరిగా యెహాను వ్రాసిన ప్రకటన గ్రంధము ఇవన్నియు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నూతన నిబంధన కాలములో అపోస్తలుల కాలములలో జరిగినవి. అటు తరువాత లోకాంత్యములో ఇక సంభవించ నున్న సంగతులనుగూర్చి వ్రాసినట్లు వేదములో చదువగలము.

        ప్రియపాఠకులారా!  యిది దేవుడు త్రివిధ దశలలో మూడు కాలములలో లోకమునకు బైల్పరచిన గూఢమైన వాక్యములైయున్నవి.  ఈ విధముగా తన మర్మములు బైల్పరచి తన యధార్ధతను లోకమునకు చాటి చెప్పిన దేవునికి నేటి యుగములో వున్న విశ్వాసులమైన మనము కూడా ఆయన ఎదుట నిష్కపటులుగాను పవిత్రులుగాను యధార్ధులుగాను సత్యవంతులుగాను జీవించవలసిన విధి ఎంతో వున్నది.

        కనుక నా జనులారా!  నా బోధకు చెవి యొగ్గుడి, నా నోటి మాటలకు చెవి యొగ్గుడి, నేను నా నోరు తెరచి ఉపమానము, చెప్పెదను పూర్వ కాలపు గూఢవాక్యములను తెలియజెప్పెదను అను కీర్త 78:1-2 పరమార్ధములోని మర్మము యొక్క వివరణను అనగా దేవుడు బైల్పరచిన సత్యములను మన హృదయములందును మన తలంపుల యందును, మన నిత్య ఇహలోక జీవితములోను, వాటిని గైకొనుచు సృష్టికర్తయైన దేవునికి ప్రీతికరమైనఆయనకు మహిమ కరమైన మన జీవితమునకు ధన్యవంతమైన ఆశీస్సులను పొందుదము గాక! ఆమేన్‌.

        కీర్త 78:70-72 యాకోబుకు ఇశ్రాయేలునకు తరువాత వాడు దావీదు ఈయన వారిని అనగా వెనుకటి వారిని ఏలుటకు మేపుటకు గొర్రెల దొడ్లలో నుండి దావీదును పిలుచుటలో అర్థమేమి?

        యాకోబు ఇశ్రాయేలీయుల సంతానమును దేవుడు ఆశీర్వదించియున్నాడు.  కనుక ఈ జనాంగము అంతయు యాకోబు ఇశ్రాయేలీయుల రక్తబాంధవ్యముతో నిండియున్నది.  కాబట్టి దేవుడు వారి శరీరముల నుండియు లేక వారి ముద్ర ధరించిన జనాంగమును మేపుటకు ఏలుటకు దేవుడు దావీదును పిలిచెను;

                ==

        కీర్తనలు 81:9 ''అన్యుల దేవతలలో ఒకటియు నీకుండ కూడదు, అన్యుల దేవతలలో ఒకదానికిని నీవు పూజ చేయకూడదు''.

        అయితే ఇందలి అర్ధము మన దేవతలు ఉండవచ్చుననియు, మన దేవతలలో అనగా యెహోవా దేవుని సంబంధ దేవతలలో దేనికైన పూజ చేయవచ్చుననియు ఇందలి భావము.  అనగా యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ, దేవదూతలు, యేసు క్రీస్తు, ఆయన ఈ లోకమునకు వచ్చుటకు మార్గమైన మరియమ్మగారు, సకల అర్చ్యష్టులు, హత సాక్షులు, మొదలగువారి నందరిని మనము ఆదర్శముగా దైవ సేవలో బాగస్ధులుగా, దేవుని రాజ్యవారనులుగా, దేవుని ఒకే కుటుంబమందగా మనము వీరిలో ఎవరినైనను ఆరాధించుటకు అవకాశము ఉన్నది.  ఎందుకనగా వీరందరు జీవముగల దేవునితో అంటకట్టబడి బహుగా ఫలించుచున్నారు.        

        నేను ద్రాక్షవళ్ళిని నాతో అంటకట్టబడువారు నేను ఫలించిన ఫలంబులనే ఫలించుదురని ప్రభువు చెప్పినట్లే ప్రభువునానుకొనియున్న ప్రభువులో ఐక్యమైన ఏ ఆత్మను మనము స్మరించినను, ఆరాధించినను సత్ఫలితములు అద్భుత స్వస్థతవరములు పొందగలము.

        విగ్రహారాధన తప్పా?ఒప్పా?

        పూర్వము పాములు కరచినందుకు తమ హస్తముతో చేయబడిన ఇత్తడి సర్పమును దూచి రక్షణ పొందమన్నాడు దేవుడు.

        ఇపుడు మనిషి పాపములో వడినందున మనిషినే చూచి రక్షణ పొందవలయునని దేవుడు మనిషిగానే జన్మించాడు.  ఆ మనిషియైన యేసు విగ్రహములను , ఫోటోలను చూచి మనస్సు మార్చుకొని రక్షణ పొందుటలో తప్పు ఏమియులేదు కాని అన్య దేవతా విగ్రహములనుగాని, స్వరూపములనుగాని ఏర్పరచుకోకూడదు.  వాటికి మ్రొక్కకూడదు.  మన తండ్రి ఫోటోను మనము చూచి తలంచుకొని గౌరవించినట్లే, మన పాపములకొరకు ప్రాణము పెట్టిన మన తండ్రియైన యేసుని స్వరూపములను గౌరవించి తలంచి, ఆరాధించుట తప్పులేదు.  అయితే యేసు ప్రభువు విగ్రహమును పెట్టుకొని ఆరాధించలేదు.  ఎందుకంటే ఆయనయే దేవుడు కాబట్టి, జీవ గ్రంధము ద్వారాను, స్లీవద్వారాను లోబడనొల్లని ప్రజలు, మారుమనస్సు నొందని ప్రజలు యేసు విగ్రహమును ఆయన వడిన పాటుల పటముల ద్వారా చూచి యైనను మనస్సు మార్చుకోవలెను గదా!  కాబట్టి యేసుని విగ్రహమును ఆరాధించుటలో తప్పులేదు.

        కీర్త 82:6 మీరు దైవములనియు, మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను.  అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు!

        దేవుడు చిరంజీవి యైనట్లు చిరంజీవిగా దాదాపు వెయ్యి సంవత్సరములు ఆదాము జీవించాడు.  హేబేలు రక్తము దేవునితో బాంధవ్యము కలిగి ఆయన దగ్గరకు వెళ్ళింది. అబ్రహాము దేవునితో విహరించెను!  యాకోబు దేవదూతతో పోట్లాడి జయించెను.  యోసేపు భవిష్యత్‌ కరువుగల సంవత్సరములను బట్ట బయలు జేసెను.  ఆ భయంకర పరిస్థితి నుండి జనులను తప్పించెను.  మోషే గొప్ప జనాంగమును పోషించుచు క్రమశిక్షణను బోధించుచు జనములను నడిపించుటయే గాక విరోధులకు బుద్ధి చెప్పి వారిని సమూలముగ అణచివేసెను!   సంసోను తన స్వంతహస్తముల తోనే వేలకొలది జనములను హతము జేసెను.  ఇవన్నియు దైవములనబడువారు చేయు పనులు దైవమునందు ఐక్యమై మానవ మాత్రులు చేసిన పనులు కాబట్టి ఈ మానవులు కూడా దైవములైనారు.  వారి హస్తముల చేత చేయబడినట్లు ఋజువులున్నవి.  కాబట్టి నీతి గలిగి సర్వోన్నతుని ఆత్మతో కట్టుబడియుండు ప్రతినరుడు సర్వోన్నతుని కుమారులుగా ఎంచబడుదురు.  ఎందుకంటే నరుడై జన్మించిన ఏసు దేవుని కట్టడను ఈ భూమిమీద నెరవేర్చినందున దేవుడు ఆయన యందు నివసించి దేవునితో సమానుడాయెను.  మనము కూడా దేవునితో సమానస్థులము కావాలంటే లేక సర్వోన్నతుని కుమారులుగా ఎంచబడాలంటే మనము కూడా దేవుడు మనకు ఇచ్చిన నిబంధనలను సర్వము నెరవేర్చుచు ఆత్మ త్యాగముకల్గి స్వార్థపరత్వము లేకుండవలెను.  ఇట్లున్నను దుష్టులు చనిపోయినట్లే సజ్జనులు చనిపోవుదురు.  చనిపోవుటన్నది మానవుల కందరికి ఒక్కటే, మోషే చనిపోయినట్లే దావీదు చనిపోయాడు సంసోను వీరందరు చనిపోయినట్లే మనము చనిపోవుట జరుగుచున్నది.

        అయితే ఏసుక్రీస్తు మనము చనిపోయినట్లే అనగా ఆ దొంగలు చనిపోయినట్లే చనిపోయాడు.  కాని కించిత్‌ దోషము అవలక్షణము లేని పరమ పరిశుద్ధుడు. కాబట్టి మరల తన ప్రాణము తాను పొంది పరమునకు వేంచేయగల్గినాడు.  మానవులమైన మనకు ఆ పరమ సద్గుణములు లేవుగదా!  ఆదాము స్త్రీకి లొంగి పాపము జేసెను.  నోవహు త్రాగి దిగంబరియై మత్తుడై పడియుండెను.  లోతు తనకుమార్తెలు తనతో చేయు తప్పుడు తనము ఎరుగలేక పోయెను.  మోషే యెహోవా దేవుడు ఇచ్చు జలరాశిపై అపనమ్మకము పొంది అవిశ్వాసియై దేవుని కోపమునకు శాపమునకు గురి అయ్యెను.  శాంసన్‌ వేశ్యాలోలుడయ్యెను, అబ్రహాము తన భార్యను చెల్లెలని బొంకుటయే గాక భార్యకు దాసుడై తన దాసి కుమారుని అడవికి పంపెను.  ఇలాంటి పాతకములలో ఏసు క్రీస్తు ఎలాటి దోషము చేసియున్న వాడు కాదు.  కట్టకడకు శరీర సుఖములకై పెళ్ళికూడా చేసికొనక దేవుడై మహిమతో ప్రకాశించి స్థిరత్వమును పొందెను;

        మూలవాక్యముః కీర్తన 85:10  కృపా సత్వములు కలసికొన్నవి.  నీతి సమాధానములు ఒక దాని నొకటి ముద్దుపెట్టుకొన్నవి.  ప్రభువునందు ప్రియమైన వారలారా!  పై వేదవాక్యములోని తొలివచన భాగములో కృపాసత్వములు కలసికొన్నవని వ్రాయబడియున్నది.  ఎక్కడ? ఎప్పుడు? ఏ విధముగ? ఎందుకు? అందుమూలముగ భూమిపై జరిగినట్టి క్రియాసంకల్పమెట్టిదో మనము తెలిసికోవలసియున్నది.

         కృపాసత్యములు కలిసికొన్నవి.  ఎక్కడ అనిన దానికి నిర్వచనము ''కన్నెకయైన మరియమ్మను దేవుని యొక్క కృప ఆవరించి ఆమెలోని యదార్ధ జీవితమును అనగా ఆమె హృదయములో వున్నటువంటి దైవవిశ్వాసము అను సత్యమును ముద్దు పెట్టింది.  అప్పుడు సత్వమన్నది నరాకృతిలో పిండోత్పత్తిని కల్గించినట్లు లూకా 1:29-31 సత్వమన్నది హృదయమునుండి చలించి కన్నెగర్భంలో చొచ్చి కృపతో ఐక్యమై శిశురూపమున నవమాసములు ఎదిగి ఒక శుభదినమున భూమిపై జనించగా కీర్తన 85:11 భూమిలో నుండి సత్యము మొలుచును.  అనిన ప్రవచనాన్ని నెరవేర్చినట్లు ఈ సందర్భమున మనము గ్రహించగలము.  ''భూమిలో నుండి సత్యము మొలుచును'' అన్నదియే ఈ ప్రవచననెరవేర్పును ఇదే 11వ వచనంలో రెండవ భాగము ''ఆకాశము నుండి నీతి పారచూచును''.  అనగా దీని భావము మత్తయి 2:1-2 ఈ నీతి అన్నది నక్షత్ర రూపమును దాల్చి ఆకాశంలో దేదీప్యమానముగా ప్రకాశించునట్లుగను, ఈ మర్మమును తూర్పు దేశజ్ఞానులు ముగ్గురు గ్రహించినట్లు మనము ఈ వేద భాగములో చదువగలము.  

        ప్రభువునందు ప్రియసోదరీ! సోదరా!  భూమిలో నుండి మొలిచిన సత్వము యొక్క దైవ విలువను మర్మములను దైవోద్ధేశ్యములను దేవుని రాజ్యమునకు భూమిపై శంకుస్థాపన కార్యక్రమమునకు గూర్చిన మర్మములను ఈ జ్ఞానులు తెలియజేసిన విధానమును గూర్చి మత్తయి 2:5లో మనము చదువగలము.  ఎట్లనగా యూదయా దేశపు బెత్లెహేమా!  నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవుగావు.  ఇశ్రాయేలు అను నా ప్రజ నీలోనుండి వచ్చునన్న ప్రవచన నెరవేర్పును భూమిలోనుండి జనించిన (మొలిచిన) సత్వమను క్రీస్తు యొక్క మర్మము.  ఆకాశంలో నక్షత్ర రూపమున నీతియైన క్రీస్తు యొక్క కాంతిని; అందులోని ప్రభావమును దైవశక్తిః ముగ్గురు జ్ఞానులకు శాస్త్రయుక్తముగా వివరించియున్నట్లు; హేరోదుతో జ్ఞానులు సంభాషించిన విధానము మనకు వివరిస్తున్నది.  ఇది నీతి సత్యము యొక్క ఆంతర్యము.

        ప్రభువునందు ప్రియమైన వారలారా!  ఇప్పటికి మనము కృపాసత్యములు కలుసుకొన్న విధానము అట్లు కలుసుకొన్నపుడు అవి పొందిన రూపాంతరమును గూర్చి అట్లు రూపాంతరము పొందిన స్థలములను గూర్చి దానిని గ్రహించినటువంటి జ్ఞానులను గూర్చి అట్లు కృపయు సత్యమును భూమిపై కల్గియున్నట్లు చేయుటలోని దేవుని యొక్క ప్రవచన నెరవేర్పును గూర్చి తెలిసికొన్నాము.  ఇంక 85:10 రెండవ అంశమైన నీతి సమాధానముఒకదానినొకటి ముద్దుపెట్టుకొన్నవి'', అనుటలో వీటిని గూర్చి వేద భాగ రీత్యా తెలిసికోగలము.                

        ప్రభువునందు ప్రియమైన వారలారా!  లూకా 2:13-14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానము కలుగును గాక!  అన్నవిధంబుగ దేవుని నీతియై యున్న క్రీస్తు  రూపము నరులమైన మనకును సృష్టికర్తయైన దేవునికిని వున్న దోషపూరిత క్రియాకర్మలైన విరోధమును బట్టి అనగా నరుడు దైవ వ్యతిరేకియై జరిగించిన పాప క్రియనుబట్టి నరునిలో వున్నట్టి ''నీతి సత్యము'' అంతరించి పోయి సంవత్సరము మాసము వారముదినము సమయము గడియయని తలచక, అన్ని సమయములందును అన్నివేళలయందును అన్ని కాలములందును అన్ని స్థలము లందును దేవునికి వ్యతి రేకియైయున్న మన నర జీవితము అనగా దైవత్వముతో మనకున్న ఎడబాటునకు దేవునితో మనలను సమాధాన పరచుటకు ఒక సమాధానకర్త అవసరమై యున్నట్లుఈ వచనభాగములోని మర్మమును మనము ఆత్మీయ జ్ఞానంతో గ్రహించవలసియున్నది.

        ఎట్లనగా ఒక నరుడు అతడు అతిరధుడుగాని మహారధుడుగాని ముఖ్య మంత్రిగాని ప్రధాన మంత్రిగాని, కలెక్టరుగాని గవర్నరు గాని డాక్టరు గాని లేక ఆఫీసరుగాని దోషియై న్యాయస్థానమున నిలువబడవలసి వచ్చినపుడు అతని వాగ్మూలమును అనగా అతను మాట్లాడుటకు న్యాయస్థాన మంగీకరించదు.  అతని తరపున మాట్లాడుటకు ఒక న్యాయవాది అవసరము. ఇది లోక రాజ్యాంగ న్యాయ స్థానచట్టము.  ఇట్లు ఏర్పరచబడిన న్యాయవాది ప్రభుత్వ న్యాయస్థానమునకు ప్రభుత్వ న్యాయాధికారికిని  (జడ్జికిని) నేరము చేసిన ముద్దాయికిని మధ్యవర్తిగా వుంటున్నాడు.

        అదే విధంగా పరలోక రాజ్యమునకును పరలోక రాజ్యన్యాయాధికారియైన తండ్రియైన దేవునికి అనగా సర్వసృష్టికి ఆది సంభూతుడై సర్వోన్నతమైన స్థలములోని మోక్ష సామ్రాజ్యమునకు అధిపతియై, సర్వ సృష్టికిని న్యాయాధికారియై యున్న పరమాత్మునికిని భూలోక నివాసియై దైవాను గ్రహమును పోగొట్టుకొని ఈలోక అస్థిర సామ్రాజ్యము లోని పదవులకును భోగభాగ్యములకును ఇందులోని ధనము కనకము కొంతనిధి నిక్షేపముల నాసించి జీవాత్మననుగ్రహించిన,  ఆది దేవుని యొక్క అనుగ్రహమును కోల్పోయి పాపిగా మారిన పాపశరీరుడైన నరునికిని ఇహ మందుగాని పరమందుగాని పాతాళమందుగాని, మధ్యవర్తిగా అనగా న్యాయవాదిగా వాధించుటకు దోషియైన నరునికి రక్షణ గల్గించుటకు నకిలీ (డూప్టికేట్‌) న్యాయవాదులు చాలామంది మందిరాలు గాలిగోపుర నిర్మితమైన ఆలయాలు కట్టించుకొని దైవోగ్రతకు గురియై జలప్రవాహములో మునుగకుండ ఎతైైన కొండలలో ఆలయాలు కట్టించుకొని చిత్రవిచిత్రములైన నామధేయములతోను హోదాలతో డిగ్రీలతో విభూది రేఖలు కుంకుమ గంధం నామకోపులతో ఏకనామము ద్వినామము త్రినామము సింధూరమను నామధేయములతో నెత్తిన పట్టెవర్ధనాలు పెట్టుకొని, ఆలయ గర్భములో అచేతనంగా పడియుండిః ఈనకిలీ లాయర్లు పూజార్లను తమ గుమాస్తాలుగా పెట్టుకొని ఊరిలో వారిని నానా తిప్పలు పెట్టిః-తక్కెట్లో మోసము పాలలో  నేతిలోకల్తీ బియ్యము పప్పులో కల్తీ వెండి బంగారులో కల్తీ రాగిలో కల్తీ, తుదకు రోగులు సేవించే మందుల్లో కల్తీ సారాయి బ్రాందీలలో కల్తీ ఇట్టి కల్తీల మూలంగా మితిమీరిన ధనార్జన చేసిన దోషులు తీరని రోగాన్ని తగిలించుకొని లేక నేర పరిశోధక ప్రభుత్వాది కార్లకు పట్టుబడి, కేసుల్లో ఇరుక్కొని బాధపడుచు లేక సరియైన కట్నమీయలేదని భార్యను వేధించి అయిపుసాయుపు లేక సందుచూచి కిరోసిన్‌ పోసి భోగిపండుగవలె తగులబెట్టిన నేరాన్నుండి తప్పించుటకు; నకిలీనోట్లు కొట్టి ప్రభుత్వానికి పట్టుబడి ఆ కేసు నుండి తప్పించుటకు; గ్రామములో పార్టీలు పెట్టి పార్టీలలో తన ప్రతి పక్షానికి చెందిన వ్యక్తిని చంపించి, ఆ నేరాన్ని తన మీద మోపకుండ చేయమనియు లాటరీ టిక్కెట్లు నెంబరు తనకు రావాలని ఇంకా ఎన్నో చిత్రవిచిత్రములైన నేరాలతో మిళితమై దోషులైన భక్తులను తన సన్నిధికి రప్పించుకొని మొట్టమొదటగా కొబ్బరికాయ కర్పూర హారతి ధూపదీప ఫల పుష్ప తాంబూలాదులను పీజుగా వసూలు జేసి ఈ నకిలీ లాయర్లు వారి నెత్తిన శఠగోపం పెట్టించి అభయమిచ్చి వారిగోడువిని వారిలో జొరబడి స్వామీ! నా కీడు కొట్టివేయబడితే నీకు నిలువు దోపిడి ఇస్తామని వెయిన్నూట పదహార్లు హుండీలో వేస్తామని 130 కొబ్బరికాయలు కొట్టుతామని కేజీకర్పూరమిస్తామనిబంగారు ఇచ్చెదనని నీ పేరట చావిడి కట్టిస్తానని, నాకు పుట్టబోవు బిడ్డలకు నీపేరు పెట్టుకొంటానని ఎట్టి పరిస్థితులలోను నీ మ్రొక్కులు చెల్లించక మాననని; ఒకవేళ అని వార్య పరిస్థితులలో నీ మ్రొక్కు చెల్లించలేకపోతే అపరాధపు వడ్డీతో సహా నీ మ్రొక్కుబడి చెల్లిస్తానని ఆ నకిలీ వకీలుకు భక్తుడైన ఈ ముద్దాయి విన్నవించుకొనగాః- అన్ని హంగులున్నను కనుచూపు కదలిక వాక్కు జీవము లేని ఆ వకీలు తన్నావరించియున్న అలౌకిక శక్తి మూలమున వానిని ఆకర్షించి, ఆతను ఇచ్చెదనన్న దానికి ప్రతిగా వానితలను వాని ఇంటిలోని వారి తలలను బోడిజేయించి సన్నాయి మేళాలతో పురవీధులలో వారిని ఊరేగించుట, ఇట్టివి నేడు మన కన్నుల ముందు జరుపుచున్న ఘనకార్యాలు చూస్తున్నాము.

        యౌవ్వనులు మొదలుకొని కురువృద్ధుల వరకును ఈ వకీలు దేవుళ్ళను ఆశ్రయించి, స్వామీ!  నా ఆయుష్కాలాన్ని పెంచండి.  సంతాన వరాల్ని ఇవ్వండి.  కుమార్తెకు పెండ్లి అయ్యేట్లు చెయ్యండి.  మంచి సంబంధాన్ని మాకు దయచేయండి.  మంచి కట్నం వచ్చే పిల్లను మావానికి ఏర్పాటుజేయండి.  మావాడికి మంచి కట్నంతో పెళ్ళి జరిగించితే వివాహానంతరము వధూవరులను నీ యొక్క దర్శనానికి తీసుకొని వచ్చి వారి చేత నీ మ్రొక్కులుచెల్లిస్తాను.   నా పెద్ద కోడలు గర్భాన కాయకాచితే ఆ బిడ్డ చేత నీ హుండీలో ముడుపులు చెల్లిస్తాను.  తప్పిపోయిన మాగేదె మరల ఇల్లు జేరేటట్లు జేస్తే గేదె ఖరీదులో నాలుగవవంతు నీకు చెల్లించెదను.  ఈ సంవత్సరము మాకయ్యలు బాగుగా పండితే నీ పేరట అన్నదానము సమారాధనలు జరిపిస్తాను. అని చిత్రవిచిత్రమైన అజ్ఞాన కోరికలను ఈ ముద్దాయిలైన భక్తులు కోరుట, నేటి నరకోటిలో సహజమైన క్రియగా చలామణియగుచున్నది.

        ఈ నకిలీ మధ్యవర్తులు దేవుళ్ళుగా చెలామణియగుచున్న ఈ శక్తులు అనేకులుగా భూమిపై వెలసి అనేక నామధేయాలతో భూమిపై వున్నప్పటికిని, నరుని అపరాదునిగాను దోషునిగాను హంతకునిగాను ఘోరపాపిగాను మార్చి క్రియ జరిగించుట మొట్టమొదటి శిక్ష. ఈ నకిలీ వకీళ్ళకు వున్నట్లు; సర్వసృష్టికి తీర్పరి మరియు ప్రధాన న్యాయవాధి లోకానికిని దైవత్వానికిని మధ్యవర్తిః మత్తయి 25:41 అపుడు ఏసు ప్రభువు ఎడమవైపు వుండు వారిని చూచి శపించబడిన వారలారా!  నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచిన నిత్యనరకాగ్నిలోనికి పోవుడి'', ఏసు ప్రభువు చేత జరుగబోవు తీర్పులో ఈ నకిలీ వకీళ్ళు దేవుళ్ళుగా చెలామణియగుచున్న ఈ లోక సంబంధ దేవతలకునుః ఇక్కడ ఫిర్యాదు దారులైన భక్త కోటికిని జరుగబోవు సన్మానమును గూర్చి పై వేదభాగములో మనము చదువగలము.

        ప్రభువునందు ప్రియసోదరీ!సోదరా!  భూమికిని పాతాళమునకును ఆకాశమునకును మధ్యాకాశమునకును సమస్త సృష్టికిని తీర్పు దీర్చు దినమొక్కటున్నదనియు, ఇట్టి తీర్పు తీర్చు అధికారము క్రీస్తు పొందియున్నట్లు గను అయితే తండ్రియైన దేవుడు న్యాయాదికారిగా సింహాసనాసీనుడై సకల మానవాళికిని తీర్పు తీర్చుటకుః  అధికారము యేసుక్రీస్తు ప్రభువు దేవుని చేత పొందియున్నాడని ఖురానె షరీఫ్‌లో మహమ్మద్‌ ప్రవక్త కూడా రచించియున్నాడు. తీర్పు అనంతరము శిక్ష సన్మానముల విషయములో సమస్తాధికారములు కుమారుడైన క్రీస్తునకును అప్పగించినట్లు మనము వేదరీత్యా తెలుసుకొనగలము.                                ప్రభువునందు ప్రియసోదరీ!సోదరా!  ఇందును బట్టి మనము గ్రహించవలసిన దేమిటంటే దేవుడు నీతిమంతుడు గనుక ఆయన ముందు లోకములో నీతిమంతుడుగా తీర్చబడిన వాడు క్రీస్తే, గనుక లోకాంత్యమున దేవుని యొక్క రాకడ సందర్భంలో దేవుని యొక్క మార్గమునకు ముందు క్రీస్తు నడచునట్లు ఈ వేద వాక్యము మనకు వివరిస్తున్నది.  ఈ సందర్భంలో కీర్తన 85:13 మనముధ్యానిస్తేః  నీతి ఆయనకు ముందు నడచును. ఆయన అడుగుజాడలలో అది నడచును.  దైవత్వంలో నీతి సమాధానము-కృప-సత్యము ప్రేమ.  ఇవి ఐదును ఆయనలో మిళితమైయున్నవి.  కనుక అవినీతిగాని అశాంతిగాని నిర్దాక్షిణ్యముగాని అసత్యముగాని ఆయనమార్గములలో ఆయన ఆలయములలో ఆయన నివాసములలో ఆయన ప్రేమించిన జనకోటిలో ఆయనేర్పరచుకున్న మధ్యవర్తియైన క్రీస్తులో లేనట్లు ఈ క్రింది వేదాంశములద్వారా మనము గ్రహించవగలము.   ఆది 1:27 మన పోలికలో మన స్వరూపము చొప్పున నరులను చేయుదమని దేవుడనుటలో ఆదిలోనే దేవుడు నరునికి సంపూర్ణ స్వాతంత్య్రముతో కూడిన స్వేచ్ఛా జీవితమునునిత్యానంద జీవితము యదార్ధ నిష్కపట జీవితము దైవత్వంతో సమతుల్యమైన జీవితాన్ని దైవత్వంతో ముఖాముఖిగ సంభాషించు యోగ్యతను ప్రసాధించాడు.

        అట్టి మహిమానందకరమైన జీవితమునుండి నరుడు దైవత్వం పై తిరుగుబాటు జేసి పతనము కాగా తన చేజేతుల నరుని జేసి వానికి సంభవించిన ఆ యొక్క ఘోరశాపమునకు దేవుడే పశ్చాత్తాప్తుడై రెండవ నరునిగ అతిపవిత్రుడునుసత్యవంతుడును నిష్కల్మషుడు నిష్కపటి నిర్దోషి యైన తన కుమారుని ఈ లోకానికి పంపి ఆయనను తనకు మధ్యవర్తిగా జేసికొని లోకమునకును తనకును వున్న వైరాన్ని ఉపసంహరించుకొని, నరులతో సమాధానపడుటకు క్రీస్తును మధ్యవర్తిగాను నరులకును దేవునికి మధ్య వర్తియు న్యాయవాదిగాను దేవుడు నియమించినట్లు ఈ వేదభాగములలోని మర్మములు మనకు వివరిస్తున్నవి.  కాబట్టి రోమా 14:16 లో వివరించిన రీతిగా దేవుని రాజ్యము భోజనము పానము కాదుగాని-నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునైయున్నది.  దేవుడు నరుల గుండా అభిలషిస్తున్న ముఖ్యోద్దేశ్యమేమిటంటే ''నరులు క్రీస్తు ద్వారా తనతో సమాధాన పడవలెనని కాంక్షిస్తున్నాడేగాని, దేవుని చేత ఏర్పరచని వారును, దైవత్వములో ఎన్నికలేని వారును, తన శక్తి ప్రభావ మహిమలను ప్రకటించని వారిని అనగా తన సువార్తను ప్రకటించని వారిని మధ్య వర్తులుగాను , సమాధాన కర్తలనుగాను దేవుడెంచు కొనలేదు.  గనుక రెఫ  - - - - మీరు అన్యజనులైయున్నపుడు మూగ విగ్రహాలను ఆరాధించుటకు ఎటుబడితే అటునడిపించబడితిరని మీకు తెలియునని పౌలు వక్కాణించి యున్నాడు.

        కనుక ప్రభువునందు ప్రియసోదరీ!సోదరా!  క్రైస్తవులమని పిలువబడుచున్న మనకు దేవుడు ఒక్కడే!  ఆత్మ ఒక్కటే! బాప్తిస్మము ఒక్కటే! నిరీక్షణ ఒక్కటే, మధ్యవర్తి ఒక్కడే!  మన విశ్వాసము కూడా ఒక్కటే, మన సావాసము  కూడా ఒక్కటే!  అపుడే మనలో మరియు మనతో-నీతియు కృపయు-సత్యము సమాధానము,  నడచునని ఈ వేద భాగము మనకు వివరిస్తున్నది.  ప్రభువు మనలనుఆశీర్వదించి కాపాడును గాక!

        సత్యము-అసత్యము. మూలకీర్తన 85:10 కృపాసత్యములు కలిసికొన్నవి.  నీతి-సమాధానాలు ఒక దాని నొకటి ముద్దుపెట్టుకొన్నవి.  భూమిలో నుండి సత్యము మొలుచును.  ఆకాశములో నుండి నీతి పారచూచును.

        సత్యానికి మూలమేది? సహోదరీ! సహోదరులారా! సత్యము అన్నది మంచినే చూపిస్తుంది. సత్యములో దేవుని సమాధానము యదార్ధత నిర్మలత అమాయికత పరిశుద్ధత ఇవి మిళితమై యుంటేనేగాని సత్యము అనే బీజమునకు జీవము ఎదుగుదల ఉండదు.  సత్యము ఎదగాలంటే దానికి ప్రార్థనన్నది నీరు.  దైవధ్యానమన్నది ఎరువు-అంటే ఆహారము.  సత్యమునకు క్షేత్రము పరలోకము సత్యమునకు మాగాణి-మానవహృదయము.  హృదయమనే భూమిలోనే సత్యమునకు  సరియైనటువంటి అనగా సారవంతమైనటువంటి సాధన యుతమైన సవ్యమైన క్రమమైన సత్యమునకు ఆదియైన దేవుని యొక్క సముఖంలో ప్రాముఖ్యత ఉన్నది.  లోకములో నరులైన మనము సత్యాన్ని గూర్చి అన్వేషించలేక అనగా సత్యమును అన్వేషించేటటువంటి జ్ఞానము నరులలో లేక లోకము దాని యొక్క ఆశయాలు వాటికి తోడు అలౌకిక శక్తుల ప్రభావము, లోకసంబంధమైన దృశ్యమైన వస్తు సముదాయాలు నరుని యొక్క మనస్సును సత్యము వైపు మరలకుండ ఆ సత్య మునకు ముందు ', అను అక్షరాన్ని జోడించి అసత్యమునకు మార్చి క్రియ  జరిగించుటయే దైవ ఆజ్ఞాతిక్రమముగా ఎంచబడినది.  ఈ దైవ ఆజ్ఞాతిక్రమమన్నది ఆదిలో ఏదెను అను తోటనుండి ప్రారంభమైంది.  కాని అసత్యమునకు ముందు మొట్టమొదటగా భూమిమీద ప్రతిష్టించబడింది సత్యము.  సత్యం ద్వారానే లోకసృష్టి జరిగింది. సత్యవంతుడైన దేవుడు సత్యం నుండి, సత్య సంబంధమైన వాక్కులో ఉన్న జీవం ద్వారా సమస్త సృష్టిని జీవంతో నింపాడు. ఈ జీవమన్నది భూమి మీదను జలముల మీదను ఆకాశము పైనను గ్రహనక్షత్రాదులలోను వాతావరణ విషయంలోను, ఏదెను వన నిర్మాణంలోను ఈ సత్యము సరియైనటువంటి పంధాలో క్రియ జరిగించింది.  ఈ సత్యమును బట్టియే బీజంలేకుండనే సర్వసృష్టియు సత్యంలోనుండియే ఆవిర్భవించింది.  ఇందును బట్టియే యేసు క్రీస్తు తన వాక్కుతో యెహా 14:6 నేనే మార్గము సత్యము జీవమునై యున్నానంటున్నాడు.  కనుక సత్యమున జీవమున్నది.  అనగా సత్యవాక్కులోని జీవ ఆధీనము నుండి జీవమే సృష్టికి బీజమైయుండి యావద్‌సృష్టియు ఆ జీవము నుండి ఉత్పన్నమైనట్లు మనము తెలుసుకోవాలి.

        కనుక దేవుని బిడ్డలారా!  ఇట్టి సత్యవాక్కుల సముదాయమే గ్రంధమైనట్లును-పరిశుద్ధ గ్రంధమన్నది సత్యవేదమని కూడ చెప్పవచ్చును.  అనగా సర్వేశ్వరుని యొక్క సత్యవాక్కే భూగర్భంలోను భూమిమీదను భూమికి ఉపరితలంమీద, ఆమీదట వాయుమండలంలోను, అటు తర్వాత శూన్యమండలంలోను, సూర్య చంద్ర నక్షత్రమండలాలలోను, ఆకాశవిశాలంలోను క్రియ జరిగించినట్లుగా అనగా సమస్త సృష్టిని ఈ మండలాలలో ఈ సత్యమన్నది తన జీవ వాక్కుతో సృష్టినిర్మాణ కార్యం జరిగించినట్లుగ తెలుస్తున్నది.  అందుకే మన మూల  పఠనంలో కీర్తనాకారుడు 8:10లో కృపాసత్యములు కలుసుకొన్నవి''.   అని వ్రాసియున్నాడు.  కృపా సత్యము కలసికొనుట అంటే దేవుని యొక్క అనుగ్రహము ఆయనలో ఉన్న సత్యప్రభావము రెండును ఏకమై భూమితో ఏకీభవించబట్టి, యావద్‌ భూమి మీద సృష్టికార్యం జరిగించిన దేవుడు-భూగర్భం నుండి తీసిన మట్టితో సత్యమునకు ఆదియైన సర్వేశ్వరుడు తన సత్యజీవయుతమైన శ్వాసను, తాను చేసిన నరుని రూపము అనగా తన పోలిక తన స్వరూపములో ఆది 1:26-27 లోవలె చేయాలని సంకల్పించిన దేవుని యొక్క జీవము మరియు ఆత్మ ప్రవేశింపజేసినందున నరుడు జీవాత్మ ఆయెనని వేదము వివరిస్తున్నది.

         అయితే పాఠకులారా!  దేవుని యొక్క సత్యమార్గములో సృష్టి-సృష్టిలోని జీవరాసులు, పంచభూతాలు గ్రహాలు సూర్యచంద్ర నక్షత్రాదులు తమతమ క్రియాకర్మలను సత్యవాక్కుననుసరించి సత్యవాక్కు విధించిన క్రమములో ఆయన నిర్దేశించిన పరిధిలో పయనిస్తూ  తమ దినచర్యలను క్రమము తప్పకుండ పాటిస్తున్నాయి.  అయితే సత్యము జీవము ఆత్మ ఈ మూడింటితో రూపించబడిన నరుడు మాత్రము పై వాటి కంతటికిని మరియు సృష్టికర్తకును వ్యతిరేకియై కృతజ్ఞత హీనుడై అవిధేయుడై ఈ అనంత విశ్వంలో జీవిస్తున్నాడు.  ఇందును బట్టి నరజీవితానికి పునాది సత్యమే.  నర జీవితమునకు ఆధారము సర్వేశ్వరుని యొక్క జీవమే; కనుక సత్యము జీవము ఆత్మతో ప్రతిష్టించబడిన ఈ నరుడు సకల సృష్టములలోను అత్యధిక స్ధానాన్ని పొందియున్నాడు.  ఇందును గూర్చి కీర్తనాకారుడు కీర్తన 8:5లో ''దేవుని కంటె వానిని కొంచెము తక్కువ వానిగా చేసియున్నావు.  మహిమా ప్రభావాలతో వానికి కిరీటమును ధరింపజేసియున్నావు.  నీ చేతి పనులమీద వానికి అధికారమిచ్చి యున్నావు.  ఎట్లనగా గొర్రెలనన్నిటిని ఎడ్లనన్నిటిని అడవిమృగాలను ఆకాశ పక్షులను సముద్రమత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటిని వాని పాదముల క్రింద నీవు వుంచి యున్నావు'', ఇందును బట్టి నరుడు సత్యం చేతను-సత్యంలో ఉన్న జీవంతోను ప్రతిష్టితుడై ఈ లోక యాత్రను సాగిస్తున్నాడన్నట్టి విషయాన్ని మనము జ్ఞాపకముంచుకోవాలి, నమ్మాలి. ఈ విధంగా సత్యంమీద ప్రతిష్టించిన దైవత్వంపై మనం విశ్వాసముంచాలి.  మోక్ష రాజ్య ప్రవేశానికి అనగా సత్యదేవుని సన్నిధిచేరుటకు అర్హతను ఈ దేహంతో ఆత్మతోను సత్యంతోను వివేకంతోను సత్యదేవుని ఆరాధిస్తూ సత్యరాజ్య ప్రవేశానికి అర్హులముగా మారాలి-ఇది యెహోవా మాటలు.  (యావేసందేశము)  ఈ విధంగా సత్యమును జీవమును ఈ అనంత విశ్వం యొక్క నిర్మాణ విధానమును తృణీకరించి, సత్యదేవుని అసత్యునిగా జేసి,  ప్రవర్తించిన నరుల యొక్క జీవితాన్ని గూర్చి రోమా పత్రికలో అపొస్తలుడైన పౌలు వ్రాసిన మాట 1:20-25 ఈ సందర్భంలో పఠిస్తే సత్య-అసత్యమును గూర్చిన వివరాలు తెలియగలదు.  మరియు సత్యారాధన ఏదో అసత్యమైన ఆరాదన ఏదో కూడా వివరము తెలియగలదు.

        దేవుని బిడ్డలారా!  ఈ రోమా ప్రభుత్వమే మన నాధుడైన యేసు క్రీస్తుకు అన్యాయపు తీర్పువిధించి మరణ సమాధిలో ఉంచింది.  అయితే క్రీస్తు ప్రభువు మరణ విజయుడై పునరుత్థానుడై మోక్షరోహణం చేసిన తదుపరి రోమా సంఘమే మొట్టమొదటగా క్రీస్తును గురించి నానా విదమైన పరిశోధనల ద్వారా అపొస్తలుల యొక్క సువార్తను వినేటటువంటి యోగ్యతను క్రైస్తవ మతాధిపతులకు కేంద్రంగా కూడా ఈ రోమా పురి కేంద్రంగా ఉంది.  ఈనాడు భూమి మీద విస్తరించిన క్రైస్తవ సంఘాలు అనేకం ఈనాడు ఉండవచ్చును.  కాని అవి నానా పేర్లతో ఉన్నాయి, నానా విధ ఆచారాలు పాటిస్తాయి.  నానావిధ సంస్థలు వెలసియున్నవి.  నానా రకాల క్రైస్తవ ఆచారాలు సాంగ్యాలు జరిపే క్రైస్తవులున్నారు. స్వస్థపరచే వరంకలవారున్నారు.  వ్యాధులు బాగుచేసే వారున్నారు.   ప్రార్థన ద్వారా ఎన్నో ఘనవిజయాలు సాధించే వారున్నారు. దేవుడు కూడా అట్టి క్రియలను చేయిస్తున్నారు.  నేడు స్త్రీలలో మదర్‌ తెరిస్సా; నేటికిని గోవాలో ఉన్న శౌరివారి యొక్క భౌతిక కాయము.  వీరుగాక అపొస్తలులుగ పిలువబడే పేతురునుండి చివరివాడైన యెహాను వరకును అనేకులు అపొస్తలులున్నారు.  అపొస్తలుల చరిత్రలున్నాయి.  కాని సంఘచరిత్రను గూర్చిన ప్రస్తావన వచ్చినప్పుడు క్రైస్తవ సంఘాలకు కేంద్రస్థానము రోమా పురియే.  ఎందుకంటారా? చదువరులకు ఇది విడ్డూరంగా కనపడవచ్చును.  దైవ జనాంగమైన ఇశ్రాయేలులలోనుండి రక్షకుడైన యేసు క్రీస్తు ఈ లోకంలో జన్మించిన చరిత్ర మనకు తెలిసిందే, ఇది ఒక డిసెంబరు నెలలో మాత్రమే పాటిస్తున్నారు.  ఈ డిసెంబరు నెలలో మాత్రమే ఇశ్రాయేలును గూర్చి, పాలస్తీనులో ఆయన దర్శనార్ధం జ్ఞానులను గూర్చి ఆజ్ఞానులు దర్శించిన నక్షత్రమును గూర్చి డిసెంబరు నెలలో ఆ నక్షత్రం చూచి దర్శించిన ముగ్గురు రాజులు ప్రయాణించి ప్రవేశించిన హేరోదును గూర్చి, గొల్లలకు దూత వివరించిన వర్తమానమును గూర్చి డిసెంబరు నెలలో దాదాపు మొదటి తేదీ నుండి ఆ నెల 31వ తేదీవరకు కూడా ఇందును గూర్చిమనం ధ్యానిస్తూ రక్షకుని గూర్చి నినాదాలు చేస్తూ పాటలు పాడుచు, యెరూషలేము మందిరపాటలు ఇశ్రాయేలును గూర్చిన ప్రవచనాలు క్రిస్మస్‌ తాతను గూర్చిన విషయాలు, క్రిస్మస్‌ తాత వేషమును దరించి గృహదర్శనము చేయుట పాటలు పాడుట.  ఇవన్నియు కూడా క్రీస్తు జననాన్ని గూర్చి లోకానికి చాటే వివరాలు.  అనగా భూలోకంనుండి మొలిచిన సత్యమును గూర్చిన సత్యసు విశేషణము-ఇది క్రీస్తు సువిశేషణము.  ఈ విధంగా కీర్తనాకారుడు రచించిన 85:11లో భూమిలోనుండి సత్యము మొలుచును.  ఆకాశములో నుండి నీతిపారచూచును'', అని వ్రాయబడిన ప్రకారం ఇది క్రిస్మస్‌ పండుగ సందర్భములో చూచి రాసినటువంటి లోకమెరిగిన సత్యము-సత్య సువార్తను గూర్చిన వివరము.  ఈ సందర్భంలో అనగా ఈ కీర్త 85:11 లో వివరించబడిన వాక్యమును గూర్చిన సత్యసువార్తగా మనం భావించాలి.  అంటే భూమిలో కన్యకయైన మరియమ్మ గర్భంనుండి సత్యమునకు ఆదియైన సర్వేశ్వరుడు నర రూపంతో అవతరించుటకు కన్యమరియ గర్భంలో శిశువుగ ఆవిర్భవించి, నవమాసములు నిండిన తర్వాత లోకధర్మము ననుసరించి బాలజేసువుగ అవతరించాడు.  ఈ బాలజేసువే దేవుని యొక్క సత్యము.  ఈయన జన్మించిన ఆ దినములలో జ్ఞానులకు ఆకాశంలో కనబడిన నక్షత్రము నీతి. ఆ నీతియే ముగ్గురు జ్ఞానులకు దర్శనమిచ్చి వారిని సత్యమునకు-సత్యస్వరూపుడైన బాలజేసువుయొక్క రూపమును పొందేటటువంటి భాగ్యమును ఆ నక్షత్రము నీతిగాను ప్రకాశించింది.  ఇందును బట్టి మనం గ్రహించవలసిన దేమిటనగా కన్యగర్భములోని సత్యము లోకములో నరుడు సత్య మార్గమును కనుగొనుటకు సత్యమార్గంలో పయనించుటకు ఈ సత్యవాక్కులను పాటించుటకును, సత్యారాధనను సర్వేశ్వరుడు ఆత్మ గనుక ఆత్మతోను సత్యముతోను వివేచనతోను ఆరాధించాలి'', అనే ప్రవచనానుసారంగా ఈ క్రీస్తు పుట్టుకన్నది మనకు బోధిస్తున్నది.  క్రిస్మస్‌ అనగా క్రీస్తును ఆరాధించుట అని అర్ధము.

        కనుక ప్రియపాఠకులారా!  దేవుని బిడ్డలారా!  మనం లోకంలో ఆచరించుచున్న ఈ పండుగలలో ఈ పండుగ అతి ప్రాముఖ్యమైనది.  సత్యమైనది.  సత్యమార్గమునకు చేర్చునది.  సత్యారాధనతో కూడినది.  అసత్యమునుండి మనలనుతప్పించునది.  ఈ సత్య మార్గమును అన్వేషించిన అనేకులు అపొస్తలులు గాను హతసాక్షులుగాను వేదసాక్షులుగాను విశ్వాసులుగాను, దైవ శక్తిసంభూతులుగాను ఈ సత్యమన్నది చేసియున్నది.  అనగా ఈ సత్యమే ఒక ఆత్మగా ఉండి అపొస్తలుల చేత అనేక అద్భుత కార్యాలు చేయించినట్లు రక్షణ వేదములో అపొస్తలుల కార్యములలో చదువగలము.  కనుక క్రీస్తు పుట్టుక ఆయన ఎదుగుదల ఆయన దైవరాజ్యమును గూర్చి చేసిన సువార్త ప్రకటన ఆయనను అనుసరించిన శిష్యులు ఆయన ద్వారా స్వస్థత పొందినవారు. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన బయల్పరచిన సత్యసువార్తను గూర్చిన మర్మము.  ఈ విధంగా భూలోక యెరూషలేము నుండి సత్యదేవుని యొక్క ప్రభావము జ్ఞానము ఆ సత్యము అన్నది బయల్పరచిన ఎన్నో సాహిత్యాలు పరలోక మర్మాలు, నర జీవితంలో పాటింపవలసిన విధులు నిర్వహణ వగైరాలన్నియు భూలోకానికి ఉపదేశింపబడినవి.  అప్పటి వరకు యాజకులు ప్రధాన యాజకులు మతప్రవిష్టులు శాస్త్రులు పరిసయ్యులు అను వారు బాలజేసువు యొక్క జీవిత చరిత్రలో ప్రధానమైన ప్రధమ స్థానమును వహించినట్లుగ నూతన నిబంధన మనకు వివరిస్తున్నది.  ఈ విధంగా అగ్రస్థానం వహించిన వీరందరు యేసు క్రీస్తు శరీర యుతంగా బలియాగం చేసిన అనంతరం అపొస్తలుల కార్యాలు ప్రారంభించిన లగాయతు నేటి యుగంలో వారందరు కనుమరుగయ్యారు.  యాజకులు ఏమయ్యారు?  వారందరులేరు. ఈ ఆధిపత్యాలను సత్యమన్నది నాటి మత ప్రవిష్టుల యొక్క అధికారాలను వాటి విలువలను మార్చివేసి, నేడు పౌలు తన లేఖనంలో ప్రవచించిన రీతిగా ఇపుడు వేద పరంగా క్రియజరిగిస్తున్న వారిని గూర్చి మొదటి కొరింధీ 12:4-11 వ్రాయబడినటువంటి లేఖన భాగాన్ని గూర్చి ముందుగా తెలిసికొందము.

        కనుక  ప్రియపాఠకులారా!  పై వివరించబడిన వేదభాగములో వివరించబడిన కార్యములన్నియు సత్యములైయున్నట్లును, అసత్యమే దేవుడై లోకాధిపత్యం చేయుచున్నట్లుగ మనం తెలిసికోగలము.  పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి దైవకార్యార్దం నియమించబడిన వారును, ధర్మశాస్త్రకాలంలో దైవ కార్యం కొరకు నియమించబడిన వారును, నూతన నిబంధన క్రీస్తుకాలంలో దైవపరంగా నియమించబడిన వారును ,అపొస్తలుల కాలంలో దైవ పరిచారకులుగా నియమించబడిన వారై ఆయా కాలములను బట్టి  సమయాలను బట్టి వారు జరిగించే క్రియాకర్మలను బట్టి సత్యదేవుడు వారిని నియమించిన విధానమునుబట్టి ఈ క్రింది విధంగా సత్యాన్వేషణ ద్వారా తెలిసికోగలము.  పాత నిబంధనలో మొట్టమొదటి ఏర్పరచుకొన్నవాడు ఆదాము దేవుని హస్తక్రియయైయుండి దేవుడు వేసిన వనమునకు అధికారిగాను దానిని సేద్యపరచువానిని గాను దాన్ని కాపలాకాయు వానిని గాను నియమించాడు.  అతడు ఏకాకిగా ఉన్నాడని సాటి సహాయంగా ఒక స్త్రీని సృష్టించాడు.  ఆదిలో సత్యదేవుని యొక్క సత్యక్రియ అనగా దేవుడు పక్షపాతికాడు.  నేలమంటితో నరుని చేసి తన జీవమును తన ఆత్మను అందులో ఉంచాడు.  ఇది దేవుడు యావద్‌ సృష్టి ఏలుబడికి నరుని నిర్మించిన క్రియ. అయితే ఈ క్రియలో నరుడు దైవత్వమునకు వ్యతిరేకియై, దైవక్రమాన్ని తప్పి వక్రమార్గంలో మళ్ళినందుకు దేవుడు అతనికిచ్చిన ఆధిపత్యమును తొలగించి అతనినే గాకుండా అతనిని ఏతోటనైతే ఇచ్చి ఏలమన్నాడో ఆ తోటను కూడా లోకానికి మరుగుపరచాడు.  అటు తర్వాత యాజకుడు లేకుండగానే మొట్టమొదటి ఈ తొలి నరుని సంతానమైన ఇద్దరు బిడ్డలను యాజకులను చేసి బలిక్రియకు పునాది వేశాడు.  ఇది కూడ అపజయం పాలైనదంటే ఒకడు హతుడు మరియొకడు హంతకుడయ్యాడు.  ఇది జరిగిన అనంతరం దేవుడు సత్యవంతుడు గనుక, సత్యంతో ప్రకాశించువాడు గనుక నరులలో హృదయాలను పరిశోధించి, నాటి నరకోటి యావత్తు కలుషితమై పాపము పండించి విస్తరించినందున నాటి జనాంగములో తన నిర్ణయంలో నోవహు అను నీతిమంతుని ఎన్నుకొన్నాడు.  కనుక నీతికి నోవహు వారసుడయ్యాడు.  ఇతని నీతిని బట్టి నీతిమంతుని కుటుంబంగా నిర్ణయించి పునఃసృష్టి నిర్మాణంలో ఈ యొక్క నీతిమంతుని కుటుంబాన్ని పునఃలోకము లోని జనవిస్తరణకు మూలంగా చేశాడు.  అలాగే ఇతని రక్షణలో ఇతని పరిధిలో ఉన్న జంతుజాలము పక్షిజాలములు వగైరాలన్నింటిని పునఃసృష్టినిర్మాణం కొరకు వాడినాడు.

         ఈ విధంగా దేవుడు తన ఎన్నికలో లోతు తర్వాత నరుల యొక్క విశ్వాస పరీక్షలో నెగ్గిన అబ్రహామును విశ్వాసుల తండ్రిగా ప్రకటించబడినాడు.  అటు తర్వాత యదార్ధమైన క్రమంతప్పని జీవితమును సత్యమును పాటించిన యోబును దేవుడు అతనిని యదార్థతకు మూలపురుషునిగ ఎంపిక చేశాడు.  ఈ విధంగా దేవుడు ప్రత్యక్షంగా తన నిర్ణయంతో తన ఆత్మతో తన సత్యపరిధిలో మోషేను ప్రవక్తగాను నాయకునిగాను, అహరోనును యాజకునిగాను నియమించడం జరిగింది.  ఇక ఇక్కడ నుండి ధర్మశాస్త్ర యుగం వరకును యుగసమాప్తి వరకు యాజకులు ప్రధాన యాజకులు ప్రవక్తలు రాజులు సైన్యాధిపతులు వగైరాలు లోకపరిపాలనలో ప్రాదాన్యత వహించారు.  అంటే మోషే ప్రవక్త.  అహరోను ప్రధాన యాజకుడు, సమూయేలు ప్రవక్త ఏలియా ఎలీషా యెషయా ఇర్మియా వగైరా ప్రవక్తలు, దావీదు మహారాజు సాలొమోను మహారాజు మరియు జ్ఞానియై లోకములో జ్ఞానయుతంగా ప్రసంగిగాను జ్ఞానిగాను వేదచరిత్రలో స్థానాన్ని సంపాయించాడు.  పాత నిబంధన కాలం గతించి క్రీస్తుకాలం వచ్చిన తర్వాత క్రీస్తు లోకంలో జీవించిన కాలంలో ఆయన చేత ఎన్నుకొనబడిన వారు ఆయన శిష్యులుగా పిలువబడిరి.  అయితే యేసు క్రీస్తు వారిని శిష్యులు అనుపేరుతో వదలివేయక వారిని కాళ్ళు కడిగి జలాభిషేకంతో అపొస్తలులుగ ప్రతిష్టించాడు.  అపొస్తలులు అనగా పంపబడినవారు. ఇందును బట్టి క్రీస్తు చేత లోకానికి పంపబడిన వారే-ఈ అపొస్తలులు.  వీరి బోధలచే మలచబడి, క్రీస్తు యొక్క జీవితానికి సాక్షులుగా నిలబడి లోక అన్యాయ తీర్పునకు నానా చిత్రహింసలపాలై అన్యాయపు తీర్పుతో మరణశిక్ష విధించబడిన వారైనను వీరు ఆచరించిన సత్యమార్గము ప్రభావము శక్తివంతమైనది గనుక ఆ సత్యమన్నది వదలక వీరు దేహాన్ని చాలించి వెళ్ళిపోయినను వీరి ఆత్మీయ ఫలితాలు భూమిమీద విస్తరించి, వీరి పేరు మీద మందిరాలు గుళ్ళు గోపురాలు నిర్మితమై నేటికిని ప్రపంచమందంతటను వారి పేర్లు మీద క్రియ జరిగిస్తూ వీరి చరిత్రను లోకానికి చాటుచు క్రీస్తులో వారు అనుభవించినటువంటి ఆత్మీయ అనుభవాలు. తత్సంబంధంగా వారు చేసిన మహిమకార్యాలు నేటికిని యావద్‌ ప్రపంచంలో ఆయా దేశాలలో విశ్వవిఖ్యాతి దైవత్వంలో ప్రగతిని సాధిస్తూ వున్నటువంటి ఈ తరుణంలో ఈ భూలోకములో ఎన్నో విశాలసామ్రాజ్యాలు విజ్ఞాన యుతమైనటువంటి మరియు ఆధునిక జ్ఞానంతో అష్టైశ్వర్యాలు ప్రగతిని సాధిస్తున్న దేశాలెన్నో ఉన్నను ప్రత్యేకించి దైవ వేదంలో రోమా పట్టణం ఒక ప్రత్యేకస్ధానాన్ని సంతరించుకొన్నది.

        ప్రియదేవుని బిడ్డలారా!  దైవ సువార్తకు నాంది మరియు సౌలు పాపియై దైవపరచర్య చేయుటకు తొలిమెట్టు పాదం మోపిన స్థలం ఈ రోమా  పట్టణమే, ఎలాగంటే అపొస్తలుల కార్యాలు 10:లో మొట్టమొదటిగా సువార్తకు ఆదియైన వాడు రాయప్ప (పేతురు) అని చెప్పవచ్చును.  ఎందుకంటే రోమా పట్టణానికి కేంద్రమైన ఇటలీ సామ్రాజ్యంలో ఇటలీ పటాలంలో అనగా సైనిక సముదాయంలో మొట్టమొదటగా కొర్నేలియను భక్తి పరుని దేవుని ఆత్మ దర్శనమిచ్చి అతడున్నట్టి లోకసంబంధమైన అనగా నిజ దైవసత్యాన్ని ఎరుగని స్థితిలో ఆ పటాలంలో శతాధిపతియైన కొర్నేలి అష్టైశ్వర్యాలు సకల భోగాలు పేరు ప్రఖ్యాతులు నాటి ఇటలీ దేశంలో విశేషమైన పలుకుబడి, ఆనాటి ఇటలీ సైన్యంలో ఒక ప్రధాన స్థానమును పొంది ఆయన యొక్క ఆజ్ఞకుగాని తన మాటకు గాని హోదాకు గాని తనకు ఇవ్వబడిన అధికారమునకు తిరుగులేని జీవితాన్ని జీవిస్తుండగా ఒక వేదాంతికి గుణింతాలు నేర్పినట్లుగా సర్వేశ్వరుడు కొర్నేలియను ఆ శతాధిపతికి భక్తి దానధర్మాలు దైవ ప్రార్థన వగైరాలను ఓనమాలుగ నేర్చినట్లును, ఆ విదంగా ఓనమాలుతో శక్షణ పొందుచున్న కొర్నేలి ఆత్మీయ జీవితం దినదిన ప్రవర్థమానమై నాటి రోమా సామ్రాజ్యం యొక్క విది  నిర్వహణను జరిగిస్తూ మరియొక వైపు దాన ధర్మాలు ప్రార్థనాది క్రియలను సాగిస్తూ తన యొక్క ఆత్మీయ జీవితం యొక్క సువాసనన్నది, దైవ లోకంలో వెదచల్లబడినపుడు దేవుడు పగలు మూడుగంటల వేళ తన దూతను అతని యొద్దకు పంపి కొర్నేలికి కల్గించిన దైవ దూత దర్శనము-ఆ దర్శనం ద్వారా కొర్నేలికి ఇచ్చిన అభయ వాక్కులు అనగా ''నీ ప్రార్థనలును నీ ధర్మకార్యాములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగ చేరినవి.  ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి, పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించుము'', అనుటలో ఇటలీ సామ్రాజ్యమునకు కేంద్రమైన రోమా పట్టణములో దైవ పరిచర్య జరిగించుటకు రాయప్పను ఎన్నుకొన్నట్లుగా ఇందును బట్టి మనకు తెలుస్తున్నది.  

        అయితే దేవుని బిడ్డలారా!  రాయప్పకు ఇటలిలో దైవ పరిచర్యచేయుటన్నది ఏహ్యంగా భావించాడు.  అయితే దేవుని యొక్క ఆత్మ పేతురుకు నాలుగు చెంగులు దుప్పటిలో నాలుగు విధాలైన జీవరాసులతో నింపి పై నుండి మిద్దెమీదనున్న పేతురుకు దర్శనం ద్వారా చూపించినపుడు పేతురు యొక్క మనోస్థితి మనము తేటతెల్లంగా చదువగలము.  ప్రభువు ఆత్మ పేతురును రాయప్పా! నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్ధమతనికి వినబడెను.  అందుకు రాయప్ప-వద్దు ప్రభువా!  నిషిద్దమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడును తినలేదని చెప్పగా-దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరల 2వ మారు చెప్పుట.  ఇట్లు ముమ్మారు అంగీకరించనందున ఆ పాత్ర ఆకాశానికి ఎత్తబడింది.  దీని యొక్క భావమును కొర్నేలి పంపించిన మనుష్యుల ద్వారా రాయప్ప గ్రహించుటవలన వారితో కూడా వెళ్ళి మనుష్యులను రప్పించి మరునాడు కైసరయలో ఇటలీ పట్టణములో ఒక ప్రదేశమైన కైసరయలో ప్రవేశించగా రాయప్ప రాక కొరకు బంధువులతోను ప్రాణస్నేహితులను పిలిపించుకొని రాయప్ప కొరకు కనిపెట్టియున్నట్లును, రాయప్ప లోపలికి ప్రవేశించగానే కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీదపడి నమస్కారము చేసినట్లును, అందుకు పేతురు నేను కూడ నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు అతని ఇంటకూడియుండుటచూచి మాట్లాడిన మాట - అన్యజాతి వానితో సహవాసము చేయుటయైనను అట్టి వానిని ముట్టుకొనుట యైనను యూదునికి ధర్మము కాదని మీకుతెలియునని చెప్పెను.  అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని యైనను అపవిత్రుడనియైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించియున్నాడు'', అనుటలో దేవుని బిడ్డలారా!  ఇందును బట్టి యూదుడు దైవసన్నిధిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపబడినట్లు తెలుస్తున్నది.  అనగా యూదుని విషయంలో మనము యూదునికి సమవారసులము కాము అని ఇందును బట్టి మనకు అర్థమగుచున్నది.  అయితే దైవ సన్నిధానంలో ఏమనుష్యుడు నిషేధింపదగినవాడు కాదన్న సత్యాన్ని గ్రహించుటకు ఈ రోమా సామ్రాజ్యమన్నది జ్ఞానోదయం కల్గించాలని ఇందును బట్టి తెలుస్తున్నది.  అనగా దేవుని యొక్క సత్యము మొట్టమొదట రోమాలో బయల్పరచబడింది.  యొప్పేలో మొట్టమొదట దూత ద్వారా పేతురునకు దుప్పటివంటి పాత్ర ద్వారా దేవుని యొక్క సమానత్వమును ప్రభువు దర్శనము ఆ దర్శన భావాన్ని కనుక్కోలేక పోయాడు.  అయితే ఆ దర్శనం యొక్క యదార్ధతను అనగా సత్యమును గూర్చిన ఫలము ఇటలియాలోని అనగా రోమా సామ్రాజ్యంలో ఈ శతాధిపతి గృహంలో పేతురునకు దేవుని ఆత్మ జ్ఞానోదయం కల్గించినట్లుగ తెలుస్తున్నది.  కాబట్టి పేతురు మాట్లాడుచు నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియు చెప్పక వచ్చితిని, ఎందు నిమిత్తము నన్ను పిలువ నంపితిరో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పెను.  అందుకుకొర్నేలి తన దర్శనమును గూర్చి రాయప్పకు వివరించాడు.  

        కొర్నేలి వివరంగా చెప్పిన మాటలను బట్టి పేతురును పిలిపించి నట్టి కారణాన్ని గ్రహించి పేతురు పల్కిన మాట 10:34 దేవుడు పక్షపాతికాడని నిజముగా  గ్రహించి యున్నాను.  ప్రతి జనములోను ఆయనకుభయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయనఅంగీకరించును.  యేసు క్రీస్తు అందరికి ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధాన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురని కొర్నేలి ఇంట సువార్తను ప్రకటించుటను బట్టి, యేసు క్రీస్తు ప్రధాన అపొస్తలుడైన పేతురు ప్రప్రధమంగా యేసు క్రీస్తు యొక్క సత్య సువార్తను ప్రకటించబడిన స్థలము రోమా సామ్రాజ్యమని ఇందును బట్టి మనకుతెలుస్తున్నది.  10:44 పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను.  సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడ వచ్చిన విశ్వాసులందరు పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సయితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి.  ఏలయనగా వారు భాషలతో మాటాలాడుచు దేవుని ఘనపరుచుచుండగా వినిరి.  అందుకు పేతురు-మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను వీళ్ళకు ఆటంకము చేయగలడా? అని చెప్పి యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను.  అటు తర్వాత తమ యొద్ద కొన్ని దినములు ఉండవలెనని పేతురును కొర్నేలి కుటుంబీకులు వేడుకొన్నారు.

        ప్రియమైన దేవుని బిడ్డలారా!   ఇందును బట్టి చూడగా సువార్త ప్రకటనకు బాప్తిస్మమునకు పునాది కూడా ఈ రోమా పట్టణమునుండియే ప్రారంభమైనట్లుగా ఇందును బట్టి తెలుస్తున్నది.  ఇక ఇంత గొప్ప వరము జరిగించిన రాయప్ప అపొ 11:1లో అన్యజనులును దేవుని వాక్యము నంగీకరించిరని అపొస్తలులును యూదయ యందందతటనున్న సహోదరులును విన్నప్పుడు పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు-నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనగా ఈ వాదోపవాదంలో పేతురు యొప్పేలో మేడమీద తనకుకల్గిన దర్శనమును గూర్చి వారికి వివరించి, కొర్నేలి పంపిన మనుష్యులు అచ్చటికి రాగా వారితో వెళ్ళి దైవ కార్యమును గూర్చి వారితో మాట్లాడినపుడు వారు ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు అన్యులకు  కూడా సమానవరము అనుగ్రహించి యుండగా-దేవుని అడ్డగించుటకు నేనేపాటివాడను అని చెప్పగా వారు ఆ మాటలు విని మరేమి అడ్డము చెప్పక-అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్ధమైన మారు మనస్సు దయచేసియున్నాడని చెప్పుకొని దేవుని మహిమపరచిరి.  ఇది రోమాలో జరిగిన పరిచర్య తత్సంబంధమైనటువంటి సత్కార్యములు. రోమా సామ్రాజ్యము ఈ విధంగా దైవత్వము యొక్క దేవుని ఉగ్రతలో భాగస్వామియై యుండి, అపొస్తలుడైన పేతురు ద్వారా సువార్త భాగ్యమునకు నోచుకొనగా ఈ విధంగా రోమాలో సువార్త పరిచర్య జరుపుటకు ప్రారంభించబడింది.  రోమావలెనే మక్కబీయుల (గ్రీకుల) సామ్రాజ్యము కూడా క్రైస్తవ్యమునకు ప్రతికూలమైనను ఈ రెండు దేశాలలో క్రైస్తవ్యము ఆరంభించబడింది.

        యెరికో ద్వారం దగ్గర త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు మత్త 20:30 యేసు ఆ మార్గాన వెళ్ళుచున్నాడని విని దావీదు కుమారుడా!  మమ్ము కరుణించమని కేకలు వేశారు.  ఆయన దావీదు కుమారుడు ఎట్లయ్యాడు?  దీనిని గూర్చి రోమా 1:7లో ఈ విధంగా వ్రాయబడియున్నది.  ''యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానంగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను''.

        మొట్టమొదట భూమిమీద స్థాపించబడిన తిరుసభ ఏదెను వనము.  తండ్రి పరమాత్మ-జీవాత్మ ఆదాము హవ్వలు.  నారి అనగా దేహము.  ఆ తర్వాత నరులు దైవ ఆజ్ఞాతిక్రమం చేయుటను బట్టి ఈ తిరుసభ వక్రించింది,  లోక సంబంధంగా వికటించింది.  దీనికి కారకుడు సర్పము.  అటుతర్వాత దేవుడు తన మరు ప్రయత్నంలో స్థాపించిన తిరుసభ యాకోబు యొక్క సంతానము.  యాకోబు సంతానంలో దేవుడు తాను తండ్రిగా ఉండి యెరూషలేము అను పట్టణమును కేంద్రంగా చేసుకొని తానేర్పరచుకొన్న ఇశ్రాయేలు అను జనాంగమునకు తండ్రియైయుండి తాను అనుగ్రహించిన ధర్మశాస్త్రమైన రాతిపలకలు ఈ మూడును ఏకీభవించుట ద్వారా - ఇది పాతనిబంధన కాలంనాటి తిరుసభగా ఏర్పడినట్లును, మొట్టమొదటి తిరుసభ ఏదెను వనంలోని దేవుని కూడికయే మొట్టమొదటి తిరుసభ 2వది ఇశ్రాయేలు జనముతో ధర్మశాస్త్ర సిద్ధాంతాలతో దేవుడు నరులతో కలిసి జీవించిన కలయిక 3వది దేవుడు తన కుమారుడును మన రక్షకుడైన, యేసు క్రీస్తు తల్లియైన కన్యకయైన మరియను పరిశుద్ధాత్ముడు ఆవరించుటను బట్టి నూతన నిబంధన తిరుసభ - పరి శుద్ధాత్ముడు తండ్రి-ఆయన రూపించిన ఆయనకుమారుడైన క్రీస్తు కుమారుడు.  ఆయన ఆవరించిన కన్యకయైన మరియ.  4వది క్రీస్తు స్థాపించిన సభ.  క్రీస్తు-సంఘము-వధువు సంఘములు; ఈ కాలంలో వరుడుగా క్రీస్తు -వధువుగా సంఘము.  ఆయన విశ్వాసులుగ ఆయనను సంరక్షకునిగ అంగీకరించి ఆయన పుత్రులుగ జలబాప్తిస్మం ద్వారా నిర్ధారించబడిన వారు. గలతీ 4:26 విశ్వాసులకు తల్లి పై నున్న యెరూషలేము.        

        5వ తిరుసభ వాక్యము-వాక్యము ద్వారా కట్టబడిన సంఘము.  ఈ సంఘములో చేరినట్టి బిడ్డలు-ఇక 6వ తిరుసభ ప్రకటన 21:2 పరలోకము నుండి దిగివచ్చే యెరూషలేము అను సంఘము.  తద్వారా మధ్యాకాశంలో జరిగే గొర్రెపిల్ల వివాహా మహోత్సవము.  ఆ మహోత్సవానికి ఈ లోకంనుండి పిలువబడిన వారు.  7వ తిరుసభః- దేవుడు దైవనివాసము-ప్రజలు, ఇది లోకవినాశన అనంతరము నూతనంగా ఏర్పడేది.  ఇది ఈ లోకసంబంధమైనదిగాక, ఈ తిరుసభ ఏర్పరచబడు కాలంలో భూమ్యాకాశాలు నూతన పరచబడుట-ఇది నిత్యజీవయుతమైన సభ ఇందులో చెడునకు అబద్దమునకు అసత్యమునకు అన్యాయానికి అక్రమానికిని, ఈర్ష్యాద్వేషాలకును ఉపద్రవాలకును స్థానంలేదు.  ఇది నిత్య జీవయుతమైన సభ.  ఈ తిరుసభలోని సభ్యులకు ఆకలి దప్పులుండవు.  ఇపుడు భూమిమీదనున్న విందు వినోదాలుండవు వేదన యుండదు దుఃఖముండదు మరణముండదు, పండ్లుకొరుకుట ఉండదు.  చింతాభయం అసలుండదు, సముద్రము కానరాదు.  ఆకలిదప్పులుండవు గనుక పాపముండదు నిద్ర ఉండదు.  ఇట్టి పవిత్రమైన నిష్కల్మషమైన నిత్య సమాధాన కరమైన తిరుసభలో మనము చేరుటకు యోగ్యత పొందాలి.  ఇట్టి తిరుసభ కొరకు నిరీక్షించాలి.  ఇందులో చేరుటకు సిద్దపాటు కలిగియుండాలి-ఇది శారీరులతో కూడిందికాదు.  ఇది ఆత్మీయమైన తిరుసభ ఇందును గూర్చి పాత నిబంధన ఆది 18:1లో ఎండవేళ మమ్రేదగ్గర సింధూర వనంలో అబ్రహామునకుదేవుడు తన తిరు సభ యొక్క విధానమును గూర్చిన మర్మమును ప్రత్యక్షంగా బయల్పరచినాడు.  అబ్రహాము గుడారములో ఆతిధ్యము కొరకై దర్శనమిచ్చిన దేవుడు త్రిత్వంలో కనబడుట-ఇది తిరుసభకు మాదిరియైయున్నది.  అనగా తిరుసభ యొక్క విశిష్ఠతను కనబరుస్తున్నది-లేక ప్రకటిస్తున్నది.  అబ్రహాము గుడారములో ఈ తిరుసభకు ఆతిధ్యమిచ్చాడు.  ఈ తిరుసభ ద్వారా నూరు సంవత్సరాలుగల అబ్రాహాము తిరుసభకు ఇచ్చిన  ఆతిధ్యము ద్వారా ఇచ్చిన ఫలమును అబ్రహాము పొందుటను బట్టి భార్యయైన శారాతొంబయి సంవత్సరాల వయస్సులో కానుపులేని ఫలహీనమైన గర్భము ఫలవంతమగుటయేగాక అబ్రహామునకు వంశోద్దారకుని ప్రసాదించింది, ఈనాడు అబ్రహాము యొక్క గొప్ప స్థానము తన గృహంలో కూడిన తిరుసభ యొక్క ప్రభావం ద్వారా తండ్రి అయ్యాడు.  అంతేగాక ఈ లోకరక్షకుడు ఆయన వంశంలో అవతరించాడు.  ఇది అతని గుడారంలో కూడిన తిరుసభ ఆరగించిన విందు యొక్క ప్రభావము.

        శ్రీ సభ-స్త్రీ సభ :- ఈ శ్రీ సభకు స్థాపకుడెవరు?  యేసు క్రీస్తు ఈ శ్రీ సభ అన్నది యేసు క్రీస్తు.  సిలువవేయబడినపుడు రోమాయోధులు ఆయన ప్రక్కన పొడిచినపుడు, ఆయన ప్రక్కనుండి స్రవించిన రుధిర జలం ద్వారా రూపించబడినదే ఈ శ్రీసభ.  ఆదిలో తొలినరుడైన ఆదాము ప్రక్కటెముక నుండి స్త్రీ ఏలాగు అవతరించిందో అలాగే 2వ ఆదామైన యేసు క్రీస్తు మరణనిద్రలో ఉండగా ఆయన ప్రక్కనుండి, నాటి ఆదాము ఎముకలో నుండివలె గాక దైవకుమారుని ప్రక్కలో బల్లెపుపోటు నుండి స్రవించిన రక్తజలము శ్రీ సభగా మారింది.

        అయితే దేవుని బిడ్డలారా!  ఆదిలో నారి ఎముక మాంసము నుండి తీయబడింది.  ఇందులో రక్తం లేదు.  ఈ సత్యాన్ని నిద్రనుండి లేచిన ఆదాము ఇట్లనెను.  నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము నరునిలోనుండి తీయబడింది గనుక నారి, ''అందుకే నేడు సంఘములలో శ్రీసభకు ఒక ప్రత్యేక స్థానం ప్రభువు ఇచ్చియున్నాడు.  ఈ శ్రీ సభ అన్నది నానా విధనామ ధేయాలుండవచ్చునుగాని దాని అసలు పేరు శ్రీసభ.  ఇక శ్రీ అనే మాట లోకసంబంధమైనది. ఎలాగంటే ఈ శ్రీ అనే అక్షరం పాతనిబంధన నూతన నిబంధన అపొస్తలుల కాలము పరిశుద్ధాత్మ కాలము ఎక్కడను వేదములో శ్రీవాడబడలేదు.  ఏ వ్యక్తికిని ఎలాగనగా రాజులకు గాని ప్రవక్తలు యాజకులు వేదసాక్షులు, దీర్ఘదర్శులు, పునీతులైన వారికిగాని వేదంలో శ్రీ అని వాడబడలేదు. పునీతుడు అనేవాడబడింది.  పునీతుడు పంపబడినను పవిత్రుడని అపొస్తలుడు పంపబడిన వాడు.  ఈ పంపబడుటన్నది లోకస్థుల చేత గాక దైవాత్మ అభిషేకంతో దైవ ప్రతిష్టతమూలంగా లోకంలో దైవ రాజ్యం మీద ఫలప్రదమైన అధికారం పొందినారు.  దైవ రాజ్య సంబంధమైన  వర్తమానమును ప్రకటించుటకు దేవుని చేత పంపబడినారు.  ఇట్టివారినే అపొస్తలులు; ప్రభువు యొక్క సంఘములో ఈ అపొస్తలులనబడు వారికి ప్రభువు తండ్రి కాగా-వీరు ఒకరికొకరు సోదరులై యున్నారు.  ఈ సోదరత్వం ప్రభువులోనే గాని లోకసంబంధం కాదు, లోకంలో అనేక వావివరసలున్నాయి. దైవత్వంలో వావివరుసలు లేవు.  కనుక దైవత్వంలో వాడబడిన పదము సహోదరులు.  అందుకే సౌలును అననీయ సంబోధిస్తూ సౌలా!  సహోదరా!  నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు-నీవు దృష్టిపొంది, పరిశుద్ధాత్మ తోనింపబడునట్లునన్ను పంపియున్నాడని చెప్పెను.  అపొ 9:17 అపుడు అతని కన్నుల నుండి పొరలవంటివిరాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను''.  ఇట్టి సహోదరవరసలు దైవత్వంలో ఉన్నటువంటి సంఘీభావమును గూర్చిన వివరణ.  ఈ శ్రీ అనేది వ్యక్తిని శ్రీశ్రీ అనటం మూడు మార్లు వాడుటగాని లోకరీత్యా దేహసంబంధమైన ఆధిక్యతలు గౌరవమర్యాదలు కొరకు శరీరరీత్యా వాడబడే అక్షరము.  అంతేగాని దైవత్వంలో లేదు.  ఇది లోకసంబంధమైన అధికారులకు వేదాంతులకు ఐశ్వర్యవంతులకు ప్రభుత్వ ఉద్యోగస్థులకు మంత్రులకు లోకసంబంధమైన మత బోధకులను అనగా అన్యులను, సహోదరుడు శేఖర్‌రెడ్డి సహోదరి మరియమ్మ మాట్లాడుతుంది.  ఈ మాట ఉపన్యాసవేదికల లోనేగాని  క్రీస్తు బలిపీఠంమీద  శ్రీ అను మాట వాడబడదు.  లోకరీత్యా సాంస్కృతిక కార్యక్రమాలలో సభావ్యక్తులను రాజకీయాలలో ఉపన్యాసకులను లోకసంబంధముగా గౌరవించబడే మాట శ్రీ అన్నది.  అయితే స్త్రీ అంటే ఆడ అని అర్ధము.  యేసు ప్రభువు శ్రీ సంతానం కాదు గాని స్త్రీ సంతానము.  ఆయన వంశాంకురాలలో ఎవరిని శ్రీ అని వాడలేదు.  ఆయన పురుష సంతానం కాడు. ఆది 3:15లో ఇందును గూర్చి ఈ సందర్భంలో సర్పంతో మాట్లాడిన మాట ఏదనగా నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగచేసెదను'', అనుటయే నేటి లోకనరకోటి యైన మనమందరము పురుషసంతానము.  యేసు క్రీస్తు పురుషుని ద్వారా పుట్టిన వాడు కాదు.  కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా కన్యకయైన మరియమ్మ గర్బంలో జన్మించుటలో దావీదు కుమారుడుగాను పరిశుద్దాత్మ ఆవరింపు పరిశుద్ధాత్మ శక్తి యొక్క నింపుదల మరియు సర్వోన్నతుని శక్తి తోడై ఈ రెంటితో కన్యక గర్భంలో దేవుని కుమారుడుగా రూపించబడియున్నాడు.  కనుక ఆయన ఏ విధంగా ''ఆత్మ పురుషుని ద్వారా రూపించబడి పాప పురుషునికి అనగా బాహ్యపురుషునికి అతని అలవాట్ల్లకు అతని ఆలోచనలకు సుదూరుడై తండ్రి ప్రణాళికను ఆయన ఉద్దేశ్యమును ఆయన కర్తవ్యమును నెరవేర్చాడు.  అలాగే యేసు ప్రభువును ఏ తండ్రి ఆత్మ రూపించాడో ఆ తండ్రి ద్వారా తన తండ్రి మార్గంలో తన వలె మనము పయనించాలని సృష్టికర్తయైన దేవుని ద్వారా ఈ లోకానికి పంపబడిన వాడై యావద్‌నరకోటిని దైవ రాజ్యానికి నడిపించుటకు, ఈ లోకంలో ఆయన మార్గంగా ఉన్నట్లు యోహాను 14:6లో మనము చదువగలము.  ''నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే తప్ప ఎవడును తండ్రియొద్దకు రాడు.

        సత్యమంటే ఏమిటి? సత్యమైన సంఘమేది?

        కీర్తన 85:10 కృపా సత్యములు కలుసుకున్నవి.  నీతి సమాధానములు ముద్దుపెట్టుకొన్నవి.  భూమిలోనుండి సత్యము మొలచును.  ఆకాశమునుండి నీతిపారచూచును.  మరియ గర్భములో పరిశుద్ధాత్మ నర రూపము నేర్పరచుట.  పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును.  సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును.  పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.  ఇవియే కృపాసత్యములు.  అనగా కృపాసత్యములు రెండును నరరూపమును దాల్చినవి.

        నీతి-సమాధానములు ఒక దానినొకటి ముద్దుపెట్టుకొన్నవి'', ఎక్కడ? లూకా 3:21 యేసు బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్దాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి వచ్చెను'', సమాధానము -పరిశుద్ధాత్మః నీతి మీద సమా ధానము వ్రాలింది.

        ''భూమిలో నుండి సత్యము మొలచును'', అయితే ఆ వరకు భూమిమీద సత్యము ఏర్పడలేదా?పుట్టలేదా? రోమా 3:11 నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు గ్రహించిన వాడులేడు.  దేవుని వెదకిన వాడు లేడు.  ఏకముగా అందరును పనికి మాలిన వారైరి.

        నీతి లేకపోతే సత్యము లేదు.  అందువలన భూమిలోనుండి సత్యము మొలిచే దశ ఏర్పడింది.  సత్యము అనగా ఏసు క్రీస్తు ఇదిగో, కన్యక గర్భవతియై కుమారుని కనును; ఈ విధముగా భూమి మీద సత్యము పుట్టింది.  అందుకు సాక్షులుః  యోహాను సువార్త 1:6-8 దేవుని యొద్దనుండి పంపబడిన మనుష్యుడు యోహానుః అతడు ఆవెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను.  యోహా 1:9 నిజమైన వెలుగు ఇది సత్యమైన వెలుగు.  ఈ సత్యమునకు సాక్షిగా నిలిచినవారు.  బాప్తిస్మమిచ్చు యోహాను'', ఏసు క్రీస్తు శిష్యులలో ఒకడైన యోహానుః ఆయన ప్రతిష్టించినవాడు.  యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1:1-4 ఈ సత్యమును గూర్చిన రెండవ సాక్ష్యము తెలియగలదు.ఆది నుండి ఉన్నజీవవాక్యమును విని కన్నులారా చూచి నిదానించి కనుగొని చేతులతో తాకి చూచి, తండ్రి యొద్దనుండి ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును గూర్చి సాక్ష్యమిస్తున్నాము.  మన సావాసము తండ్రితోను ఆయన కుమారుడైన క్రీస్తుతోను కూడా ఉన్నది.

                ==

        కీర్తన 86:10 అన్యజనులెవరు? నీవు సృష్టించిన అన్యజనులందరును నీ సన్నిధిని నమస్కారము చేయుదురు.  ప్రభువునందు ప్రియమైన వారలారా!  నేటి మన క్రైస్తవాలయాల్లో ఆరాదన జరుగు సమయాల్లో దైవ వాక్యం దారిన పోయే అన్యుని ఆకర్షించి ఆలయ వాకిట నిలబడి దేవుని స్వరమునకు చెవినిచ్చి తన్మయత్వం పొందు సందర్భంలో నూతన వ్యక్తిని చూచిన సంఘసోదరులు ఆ వ్యక్తిని పరామర్శించి నీవు రక్షణ పొందినావా?  అని అడిగి నీకు ప్రభువు పిలుపు పాలుపంపులు లేకపోతే నీకు రక్షణలేదు''.  అని మా ఆలయ ప్రదేశ కార్యకలాపములలో నీకు పాలుపంపులు లేవని ఆవ్యక్తిని నిలదీసి అడుగునట్టి క్రైస్తవ సంఘాలు కొన్ని వున్నవి.

        బోధకుని నోటనుండి వచ్చిన దైవస్వరము ఎంత మధురముగా ఆకర్షణీయంగా వున్నదో ఆత్మీయత్వంలో ఆ యొక్క మాధుర్యంబును అనుభవించుచున్న అన్యసోదరునికి సంఘపెద్దలిచ్చు సలహాలు పచ్చికాకరకాయ రసము వలె చేదును పుట్టించునట్లు తయారై ఆతనిని అన్య జీవితములోనే లంగరు వేయునట్లు చేయుచున్నది.  అదే సంఘములో పై వాక్యమును గూర్చి బహుఘాటుగా మైకులు లేక పెద్దగా ఉచ్చరిస్తూ ఆ వాక్యం గూర్చి గంటల తరబడి ప్రసంగిస్తారు.  ఈ సందర్భములో మనము ఆత్మీయమైన గొప్పదైవసత్యమునుగుర్తించినట్లయితే మనము నిజంగా క్రైస్తవ్యములో వున్నామా?  అనిన ప్రశ్న మనము వేసికుంటే మనమీద మనకే రోత.  దావీదు చెప్పిన మాటే ఏసు ప్రభువు కూడా తన బోధలో మీకంటె అన్యులును వేశ్యలును పరలోకరాజ్యం చేరుదురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వేదములో చదువగలము.  ఈ అన్యవేశ్యలెవరో మనము తెలిసికోవలసియున్నది.

        అన్యుడు అనగా పొరుగువాడు.  లూకా 10:27-37  చదివినట్లయితే ఏసు చెప్పిన మంచి సమరయుని ఉపమానములో ఈ మంచి సమరయులు నేటి నర సమాజములో అన్యులలోనే కనపడుచున్నట్లుగాను క్రైస్తవుల్లో ఈ ప్రేమ ఆదరణ అనునది క్షీణిస్తున్నట్లును గోచరమగుచున్నది.  లూకా 19:19 లో జక్కయ్య విషయములో చూస్తే జక్కయ్య అన్యుడే ఏసు ప్రభువు ప్రక్కన ఆయన ముద్ర పొందిన శిష్యులే ఆయన ప్రక్కనుండియే ఆయన క్రియను గుర్తించలేకపోయినారు.  అనగా ఆయన యందు విశ్వాసముంచలేకపోయినారు.  జక్కయ్య జీవితము క్రీస్తుకు అన్యుడు.  క్రైస్తవ్యమునకును పొరుగువాడు. దైవత్వమునకు కూడా పొరుగువాడే.  దేవుని ఎరుగని వాడు. అట్టి వానిలో ఏసును మనసారా చూడాలని విశ్వాసము గల్గుట, ఏసుయొక్క మాటకు చెట్టు దిగి ఆయనను ఆలింగనము చేసుకోవడం. అలనాడు కీర్తన గ్రంధము లోని దావీదు వివరించిన నీవు సృష్టించిన అన్యజనులు నీ సన్నిధిని నమస్కారము చేయుదురు.  జక్కయ్య నెరవేర్చినాడు.  రక్తస్రావరోగి ఈమె అన్యురాలైయుండి లూకా 8:47 తాను ఇక రహస్యముగా వుండలేెనని గ్రహించి ఆమె ప్రజలందరి ఎదుట తన స్వస్థతను గూర్చి సాక్ష్యమిచ్చెను.

        నేటి క్రైస్తవ సమాజములో క్రైస్తవ్యులైన మనము వ్యక్తి గతముగా ప్రభువు సన్నిధిని గూర్చిన మేళ్లను గూర్చి బహిరంగంగా సంఘం ఎదుటను అన్యుల ఎదుటను ప్రకటించుటకు సాహసించుచున్నామా?  అన్యులైతే బాహటంగా క్రీస్తును గూర్చి సంకోచం లేకుండ బహిరంగంగా క్రీస్తును గూర్చి క్రైస్తవ కూటమిలో చెప్పగల్గుచున్నారు.  ఈ సందర్భములో యెహాను 4:28-32-39-42 అన్యురాలు తనలో జీవించుటయే.  అన్యజనులైన సమరయులు ఆయన యందు విశ్వాసముంచారు.  ఆయనను చేర్చుకొన్నారు.  నిజముగా లోకరక్షకుడని నమ్మారు.  కొర్నేలి అన్యుడే.  అయితే తన ప్రార్థనలు తన భక్తి కార్యముల ద్వారా ప్రతినిత్యం ప్రభువుకు నమస్కరించి ప్రభువు దూత యొక్క ఆగమనమును చూచి దూతతో సంభాషణ చేయగల్గినాడు.  అపోస్తః 16:14      ఊదారంగుపొడి అమ్ముకొనే తుయతైర స్త్రీ-కుడివైపున సిలువ వేయబడిన దొంగ పేద విధవరాలు.

        ప్రభువులో మరల్చుకొని మనస్సు కఠిన హృద యులైన అన్యులసంగతి ఏమిటి? అందరు క్రైస్తవులైతే ఎట్లా? అన్యజనులును వుండాలి. అప్పొజిషన్‌ వుండాలి.  ఇట్టి పనులు చేస్తే మీరేం క్రైస్తవులు అని అడుగు వారుండాలి.

                7.యుగములు

        కీర్తనలు 90:2 యుగయుగములు నీవే దేవుడవు.  క్రైస్తవ సాహిత్యములో యుగములన్నవి  వున్నవా? వుంటే అవి ఏవిధంగా వున్నవి?  మొట్టమొదటగా నిష్కల్మషయుగముః- ఇది ఆదాము పుట్టుకనుండి అనగా దేవుడు వేసిన ఏదేను తోటలో వున్న అప్పటి వాతావరణము జంతుజాలముల ఐక్యత సమిష్ఠి జీవనము అనగా ఇప్పటి కౄరమృగాలును సాధు జంతువులును కలసి ఐక్యతతో జీవిస్తూ వాటితో బాటు నేలమంటితో సృష్టించబడిన ఆదామనెడి నరజంటయొక్క పుట్టుక, అతను పాపములో పడకమునుపు యున్న మధ్యకాలము.  ఇక్కడ నరునిలోగాని జంతుజాలములోగాని పగద్వేషము కౄరత్వము వంచనము అనైక్యత మోసము నాగరికత అనునది లేక నరులు కూడా జంతుజాలములతోబాటు దిగంబరులుగా జీవిస్తూ ఆది 1:26-27 లో వలె భూలోక సంబంధంగా నరుని జన్మ వున్నను దేవునితో సమాన వారసత్వమను  యోగ్యతను పొంది అనునిత్యము దైవ సన్నిధిలో ఆదాము తన జీవితమును గడుపుచు దైవత్వంతో సంభాషిస్తూ దేవునికి ప్రీతికరముగాను ఏదేనను ఆయన సన్నిధికి యోగ్యకరముగాను దిగంబరిగాను పంచభూతముల ప్రభావమునకు అతీతుడుగాను నిశ్చింతగా జీవిస్తూ సంచరించిన కాలము.  నిష్కల్మషకాలము.  అనగా ఆదాము పాపములో ప్రవేశింపకమునుపుకాలము.

        రెండవది మనస్సాక్షి యుగముః-ఇది ఆదామునకు వివేకజ్ఞానమును కల్గించుటకు సర్పము చేత ప్రబోధింపబడి అనగా ఆది 3:1 నిషేధ ఫలములు  తినినది లగాయతు దైవ వ్యతిరేకియై దేవుని చేత ఏదేను నుండి వెడల గొట్టబడి దైవసన్నిధిని పోగొట్టుకొని సతీసమేతంగా జీవించి ,దిగంబరత్వమును తెలిసికొని దేవుడు ఒసంగిన చర్మపు దుస్తులను తొడిగి జంతుజాలములలో అనైక్యతను ప్రకృతితో తనకున్నట్టి సంబంధ బాంధవ్యములను పంచభూతములతో విరోధమును వన్యప్రాణులకు శత్రువుగాను రూపాంతరము పొంది తన భార్యయైన హవ్వను కూడి ఆమె ద్వారా కయీను హేబేలను ఇద్దరు కుమారులను కని, ఒకానొకదినమున వారు దేవునికి బలియాగమునకు పునాదులు వేసి బలిక్రియను జరిగించి హేబేలు అర్పించిన బలిని దేవుడు లక్ష్యపెట్టగా కయీను దైవత్వం మీద అసూయపడి ఓర్వలేని స్వభావం గలవాడై తమ్మునిపై పగబట్టి వానిని చంపి నరహంతకునిగా దేవుని చేత నిర్ణయించబడి శాపగ్రస్థుడై, తన శాపమునకు పరివర్తన జెంది దేవుని చేత రక్షణ గుర్తును వేయించుకొని తానొక ఊరుగట్టి తానొక జనాంగమునకు తండ్రియై అనగా నరులకుమార్తెలు అను జనాంగమునకు ఆది సంభూతుడైనట్టును ఆదాము ఆ తర్వాత అనేకులైన కుమారులు కుమార్తెలను కని దైవసన్నిధానములో దేవుని కుమారులుగా ఉచ్చరింపబడినట్లును ఇట్లు ఈ రెండు వర్గాలలో ఐక్యత గల్గి పరస్పరము ప్రేమ అనుబంధము చేత ఆకర్షింపబడ,ి అలౌకిక క్రియల ద్వారా ఒకరినొకరు కామాతురత చేత కామక్రీడలను విస్తరింపజేసి తన్మూలముగ పాపపు జనాంగమను ఒక జన సందోహమును సృష్టించి, దైవదృష్టికి వ్యతిరేకముగాను దేవుని పట్ల కృతజ్ఞత లేని వారుగాను తిరుగుబాటు చేయువారుగా ఏర్పడి యుండి జలప్రళయమను మహోగ్రతకు సిద్ధపడి యుండిన కాలము.

        3.మానవ భరణ యుగముః- జలప్రళయము మొదలుకొని అబ్రహామునకు పిలుపువచ్చిన కాలము.  జలప్ర ళయానంతరము నోవహు ఓడనుండి  నూతన సృష్టి ప్రారంభమై అనగా ఆ ఓడలోని జీవరాసులు దానితో బాటు నరులు విస్తరించి, లోతు అబ్రహాము కాలము. అబ్రహామా! అబ్రహామా! అబ్రహామును దేవుడు పిలచుట అబ్రహామును సమస్త విధములుగ దేవుడు ఆశీర్వదించుట ఇది భరణము.  ఇస్సాకుకు ప్రతిగా భరణము-తన వాగ్దానము. పొదలో తగుల్కొన్న పొట్టేలును చూపుట.  ఇది రాబోవు క్రీస్తునకు ముంగుర్తెయున్నది.  శారా అబ్రహాములకు ఇస్సాకును అనుగ్రహించుట.  ఇస్సాకు బలిసంఘటనలు.  పొట్టేలును అనుగ్రహించుట.  యుగయుగములు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా నియమించుట.  ఆతని సంతానమును ఆకాశనక్షత్రాలు ఇసుక రేణువులవలె విస్తరించునని ఆశీర్వదించుట.  ఇసుక రేణువులంటే ఇష్మాయేలీయులు ఆకాశనక్షత్రాలంటే క్రైస్తవులు. నాటి ఇశ్రాయేలీ సంఘము నేటి క్రైస్తవ భక్తకోటి.

    వాగ్దానయుగము మరియు ధర్మశాస్త్రయుగముః-

        ఇది మోషేను పిల్చిన దినము లగాయతు ధర్మ శాస్త్రమునకు ముందు కాలము వరకు అనగా మోషే జననము.  ఆతనికి తప్పిన మరణగండము.  ఆ సమయమున ఫరో కుమార్తె యొక్క సంరక్షణలో ఎదుగుదల, ఆ తర్వాత ఐగుప్తీయుని హత్యజేసి పారిపోవుట.  గొర్రెల కాపరిగా మారిమందను మేపుట.  తన సమీపము లోని పొదనుండి దేవుని పిలుపును విని దైవాకర్షితుడై దేవుని చేత పిలువబడి, దైవ జనాంగమునకు ప్రవక్తగాను నాయకుడు గాను యజమానుని గను దేవుని చేత ఏర్పరచబడి, నియమించబడి ఇశ్రాయేలను దేవుని యొక్క ఆజ్ఞానుసారం నడిపించి దేవుని ధర్మశాస్త్రము వరకు మోషేకు దేవుడనుగ్రహించిన వాగ్దానముల కాలము నిర్గమ 3:14.

        ధర్మశాస్త్రయుగముః- ఇది సీనాయి పర్వతము దగ్గర మోషేకు దేవుడు ధర్మశాస్త్రము ఇచ్చినప్పటినుండి అనగా పది ఆజ్ఞలు, తదనుగుణ్యంగా ఇశ్రాయేలు జనాంగము జీవితము యొక్క కట్టుబద్రతలు క్రమశిక్షణతో కూడిన అరణ్యములో ప్రయాణాలు మన్నా ఆహారము భుజించుట, మాంసము కొరకు సణిగి పూరేళ్ళ వర్షముతో మాంసాబీష్టమును నెరవేర్చుకుంటూ అనేక మార్లు తండ్రియైన దేవుని ఆయన సృష్టించిన ధర్మ శాస్త్రాన్ని వాని నిబంధనలనుండి తొలగి, అనేక మార్లు అన్యులైన ఐగుప్తీయులకును ఫిలిష్తీయులకును వారి యొక్క కుటిల స్వభావము వలన దేవుని చేత అప్ప గింపబడుచు మరల దైవత్వాన్ని తెలిసికొని, తమ మార్గములను సరిచేసుకొనుటకు ప్రయత్నించుచు పలుమార్లు దేవుని విసిగిస్తుండగా దేవుడు తన ప్రవక్తల ద్వారా యేసను రక్షకుని యొక్క జనన మరణ పునరుత్థానములను గూర్చి యేసు జననమునకు ముందు వరకును జరిగించిన కాలము.  ఏసు సిలువ మరణము ముందు వరకు జరిగిన కాలము.  అనగా ధర్మశాస్త్రమును ఆచరించుచు క్రీస్తు నెరుంగని కాలము.  పై రెండు కాలములు మోషేను పిల్చుట.  మోషే ధర్మశాస్త్రము  రాజ్యమేలుట.  ఈ రెండు యుగములు ఒక్కటిగానే భావించవలెను.

        5.కృపాయుగము- అనగా క్షమాపణ యుగముః- యేసు సిలువ మరణము నుండి ఆయన రాకడవరకు వున్న కాలము.  లూకా 12:10 యేసుకు వ్యతిరేకముగా మాట్లాడిన క్షమాపణగలదుగాని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన క్షమాపణ లేదు.

        6.అంధకారయుగముః- క్రీస్తు చనిపోయి పునరుత్థానుడైన తర్వాత అపొస్తలుల మీద ఆత్మదిగివచ్చి పరిశుద్ధాత్మ క్రీస్తు ఆత్మ రెండును క్రియ జరిగిస్తూ వుండిన మధ్యకాలమును అంధకార యుగము.  రెండవ కొరింధీ 4:4 ఇందును బట్టి అపోస్తలులను చంపుట.  క్రీస్తు జనన మరణ రహస్కాలెరుగని అనగా యోహాను 1:14లో వలె ఆ వాక్యము శారీర ధారిగా మన మధ్య నివసించెను'', యోహా 1:10 క్రీస్తును అంగీకరించని కాలము అంధకారయుగము.

7.సౌభాగ్యయుగముః- వెయ్యేండ్ల పరిపాలన మత్త 25:31-46 తీర్పు.

ప్రసంగాంశముః-జ్ఞానహృదయముః-

        మూలముః- కీర్త 90:12 లో మాకు జ్ఞాన హృదయము కల్గునట్లు జేయుము.  యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.  (యోబు 28:28) సొలోమోను రాజ్యమునకు వచ్చిన వెంటనే జ్ఞానము కొరకు దేవుని అడుగుకొన్నాడు.  అయితే లోకసంబంధమైన ఐశ్వర్యము, ఘనతను సొలొమోను అడుగకపోయినను దేవుడతనికి బుద్ది వివేకము గల హృదయముతో బాటు ఐశ్వర్యము ఘనత నిచ్చాడు.  1 రాజు 9:13 దేవుని యొక్క జ్ఞానము క్రీస్తు బుద్ది విజ్ఞాన సర్వసంపదలు ఆయన యందే గుప్తమైయున్నవి కొలసై 3:2 కనుక క్రీస్తును కల్గియున్నవాడు జ్ఞానము కల్గియున్నవాడు.  క్రీస్తును హృదయంలో చేర్చుకొంటే నీవు జ్ఞానవంతురాలవులేక జ్ఞానవంతుడవు.  జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును.  సామె 14:1 జ్ఞానముగల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును 10:1 కనుక యాకోబు 1:5 లోవలె మనలో ఎవరికైనా  జ్ఞానము కొదువగా యున్న యెడల దేవుని ప్రార్థనా పూర్వకంగా అడగాలి.

        సాలొమోను దేవుడు తనకిచ్చిన జ్ఞానము ద్వారా ఈ లోకములోని సర్వము అనగా ఆస్థిపాస్థులు విద్య ఆడంబర వస్తు వాహనములు వగైరాలన్ని వ్యర్ధమని గ్రహించాడు.  ఈ లోకము శాశ్వతము కాదనియు నిత్యత్వము కొరకు మనము సిద్దపడవలెనని గ్రహించుటయే నిజమైన జ్ఞానము.  ఈ లోకజ్ఞానముః- అధికంగా ఆస్థిని కూడబెట్టుట, గొప్ప పదవి సంపాదించుటలోను, గొప్ప విద్యావంతుడగుటకును, నానా విదములైన బిరుదులు సంపాదించాలనుకొనుటను గూర్చి నరుని చింతాక్రాంతుని జేస్తున్నది.  ఇందును గూర్చి విస్తారమైన విద్యాభ్యాసము చేయుట దేహమునకు హానికరమని ప్రసంగి 12:12లో వ్రాయబడియున్నది.  ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చినదిగాక భూసంబంధమైనదియు, ప్రకృతి సంబంధమై నదియు, దయ్యముల జ్ఞానము వంటిదియునైయున్నది.

        అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది.  తర్వాత సమాధానకరమైనది, మృదువైనది; సులభముగా లోబడునది; కనికరములతోను, మంచిఫలముల తోను నిండుకొనినది.  పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునైయున్నది. యాకో 3:15-16లో విధంగా దైవజ్ఞానము యొక్క విలువలను గూర్చి దైవ వాక్యము వివరిస్తున్నది.

        ప్రియ సంఘమా? మన జ్ఞానమెట్లున్నది? లోక సంబంధమా?పరలోక సంబంధమా? ఏ జ్ఞానముతో .జీవిస్తున్నము? ప్రభువా! మాకు జ్ఞానహృదయమిమ్ము అని అడుగుదము. ఆమేన్‌.

        కీర్తన 91:1 మహోన్నతుని చాటున నివసించినవాడే-సర్వశక్తిని నీడను విశ్రమించువాడు'',

        ఈ ప్రసంగమునకు ప్రారంభ పలుకులుః- ఇందులో మొట్టమొదటగ మహోన్నతుని చాటున నివసించి ఆయన చాటుచేసుకొని జీవించి  తద్వారా పొందిన ఫలితాలు ఉన్నత విలువలు - చరిత్రలో వారి కున్నటువంటి ప్రాధాన్యతయును, తాను మహోన్నతుని చాటున నివసించుట తాత్కాలికమా? లేక స్వల్పమైనదా? అలాగే సర్వశక్తుని నీడన జీవించిన వానికి గల్గిన విషయములో కూడా జరిగిన సంఘటనలు ఆధిక్యతలు ఫలితాలు ఏలాంటివి?అన్నది కూడా వివరంగా తెలిసికొందము.

        ప్రియమైన క్రైస్తవ పాఠక మహాశయులారా!  ఇంతవరకు అనేకమైన వ్యాఖ్యానాలు అనేకమైన అంశాలు పరిశుద్ధ గ్రంధవాక్యవివరాలు పరమార్థాలను గూర్చి నానా విధాలుగ వివరించియున్నాను.  మనము వాటిని పాటించి మన జీవితమును ప్రభువులో గడుపుచు జీవిస్తున్నాము.  అయితే పై వాక్యములో మహోన్నతుని చాటున - సర్వశక్తుని నీడన, అని ఈ రెండు భాగాలుగ కీర్తనాకారుడు విభజించుటలో మహోన్నతుడెవరు? సర్వశక్తిమంతుడెవరు?  మహోన్నతుని చాటున విశ్రమించిన వాడెవరు? సర్వశక్తుని నీడన నివసించిన వాడెవరు?  ఈలాంటి వారు వేదమునకు బాహ్యంగా కాకుండ వేదము ననుసరించి వేదానికి కట్టుబడి జీవించిన వారు ఎవరో అన్నది కూడా వేదరీత్యా తెలిసికొందము.  ఈ విధంగా జీవించిన వారు పరిశుద్ధ గ్రంధములో పాత నిబంధనలోను నూతన నిబంధనలోను ఉన్నారా?  ఉన్న వారు ఏ విధమైన ఆధిక్యతలు పొందినారు?  ఈ పూర్తి వివరాలు మన మిపుడు తెలసికొందము.

        ప్రియపాఠకులారా!  మహోన్నతుడన్నబిరుదును పొందినవాడు మొట్టమొదట దేవుడును, అలాగే సర్వశక్తుడుగా పిలువబడేవాడు ఒక అమూల్యమైన వ్యక్తియన్న సంగతిని మరువకూడదు.  భూమి దైవత్వమును మరచి దైవహస్త నిర్మితులైన మనలను, మట్టి పాత్రులైన మనలనుమట్టిలో కలిసిపోయే మనలను, సరియైన ఆత్మ విశ్వాసము లేని మనలను, భూమి తన వారినిగ చేసుకొని తన చాటులో తన నీడలో వాడిన సంఘటనలు వేదరీత్యా రెండు నిబంధనలలోను వివరంగా తెలసికొందము.  అయితే దేవుడు తానే మహోన్నతుడనియు, తానే శక్తిమంతుడనియు తన మహిమను క్రియామూలకంగా నిరూపిస్తూ తనను తాను ప్రత్యక్ష్షీకరణ చేసుకొన్న సంఘటనలు పాత నిబంధన నూతన నిబంధనలో కొన్ని సందర్భాలున్నట్లు ఈ యొక్క ప్రసంగములో పూర్తిగా తెలిసికొందము.

        ప్రియపాఠకులారా!   మొట్టమొదట సర్వశక్తుని చాటున నివసించినవాడు ఆదాము అను తొలినరుడు, ఆదాము అనగా ఆది నరుడు.  ఇతడు మహోన్నతుడు సర్వోన్నతుడైన దేవుని యొక్క సహాయసహకారాలు ఆయన యొక్క కృపాఐశ్వర్యాలు ఆయన సావాసము ఆయనతో సహజీవనము చేస్తూ ఆయన చాటులోనుండి జీవించినపుడు ఏ సమస్య ఏ బాధ ఏ చింత ఏ విధమైనటువంటి సమస్య లేకుండ ఆకలి అన్నదేమిటో? దప్పికన్నది ఏమిటో జబ్బు అన్నదేమిటో రోగమన్న దేమిటో ఏమియు ఎరుగని స్థితిలో మొదట ఒంటరిగాను ఆ తర్వాత దేవుడు తనకు  సాటి సహాయిగా తనకు అనుగ్రహించిన స్త్రీతోకూడా తనతో జతపరచుకొని మహోన్నతుని చాటున నివసిస్తూ చిత్తశుద్ధితో జీవించాడు.  ఈ విధంగా మహోన్నతుని చాటున జీవించిన తొలినరుని యొక్క నిత్యజీవనము సర్వశక్తుని చేత చేయబడిన నీడయైన ఏదెను వనములో చింతచీకు నిరాక్షేపణ నిక్షేపణ నిత్యమహదానందంగా జీవించాడు.  ఈ విధంగా మహోన్నతుని చాటున నివసించే మహాభాగ్యము సర్వశక్తుని నీడలో విశ్రమించే ఐశ్వర్యము నరుడు ఎక్కురోజులు నిలుపుకోలేక పోయాడు.  ఒకానొకదినమున లోకము సర్పము ఈ రెండింటి చాటున నీడన చేరే దుర్దశకు దిగజారే సందర్భము ఏర్పడింది.  ఎందుకనగా సర్పబోధ ద్వారా భూమి నరులను నిషేధ ఫలభక్షణము ద్వారా దైవ వ్యతిరేకులుగ చేయుటకు దేవుడు తినవద్దన్న చెట్టు-దాని ఫలము రెండును చేరి నరజీవితమును పాపకూపమునకు గురిజేశాయి.  ఇట్టి జీవితములో  ఆది నరజంట జీవితము మంచినరములతో కూడిన వల ఇది నరజీవితానికి సిద్ధపరచబడింది.  అయితే వలన్నది నిషేధఫలము.  ఈ వలలో ఇరికించేందుకు సహకరించింది భూజంతువైన సర్పము.

        కనుక ప్రియపాఠకులారా!  నేటి నరజీవితములో మనము గ్రహించవలసింది ఏమిటంటే - ''వల-నిషేధఫలము-దీనిని అల్లిబిగించిన బోయవాడు అంటే ఆది ఘటసర్పమైన సాతాను''.

              మహోన్నతుడు                

        91 వ కీర్తనలోని వివరములు యిందులో మొదటిదిగా మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్త్తుని నీడను విశ్రమించువాడు, ''అనుటలో ఈ మహోన్నతుడెవరు?  ఈయన చాటేమిటి? ఈయన నీడ ఏమిటి?  అందులో వున్న విశ్రమము ఎట్టిదో తెలిసికోగలము.

        ప్రియపాఠకులారా!  మహోన్నతుడనుటలో ఈ సృష్టికి ఆది సంభూతుడు లేక సృష్టికర్తఅయిన వాని చాటున'', అనుటలో ఈయన ఱెక్కల క్రింద ఆయన నీడ తూర్పు దిక్కున ఆయన వేసిన ఏదేను వనములో విశ్రమించిన ఆదాము యొక్క చరిత్ర.  ఈ సందర్భములో తలిసికొనదగినది. ఆదాము మహోన్నతుని చాటున నివసించినంత వరకు, సర్వశక్తుని, నీగను విశ్రమించినంత కాలము పటిష్ఠమైనదైవ కాపుదల, నిర్భయమైనటువంటి జీవితము, ఉల్లాసకరమైన మరియు స్వేచ్ఛాయుతమైన జీవనము చేసినట్లు ఈ మొదటి వచనములో అర్ధమగుచున్నది.

        ఇదే విధంగా ఇశ్రాయేలు జనాంగము కూడా దేవుని జనాంగమైయుండి యెహోవా యొక్క ఱెక్కల క్రింద ఆయన చాటున ఆయన కాపుదలలో తమ జీవితాలను గడుపుకున్నారు.  ఇశ్రాయేలు జనాంగము యెహోవా యొక్క రెక్కల క్రింద జీవించినంతకాలము, లోకసంబంధంగాను, ప్రకృతి సంబంధంగాను రాత్రి అగ్ని స్థంభముగాను చేతనైన రుగ్మతలు వగైరా లేవియు వారినంటలేదు. ఆయనవారిని పగలు మేఘ స్థంభంగాను రాత్రి అగ్నిస్థంభము గాను తన నీడను ననుగ్రహించియున్నాడు.

        అదే విధంగా యెహోవా యొక్క ఱెక్కల క్రింద ఏసు నామములో పరిశుద్ధాత్మ శక్తితో జీవించిన పేతురును లోకము హేరోదు రూపంలో బంధించగా దేవుని దూత పేతురును బంధకాల నుండి విడిపించి అతనిని ఊరిగవిని వరకు నడిపించినట్లు చదువగలము.  ఇట్లు మహోన్నతుని చాటున నివసించినవారు పాతనిబంధనలో మోషే ఏలియా యెహోషువ ఎలీషా సమూయేలు వంటి ప్రవక్తలు; సంసోను యెప్తా గిద్యోను వంటి వీరులు, సౌలు దావీదు సొలోమోను వంటి రాజులు.  నూతన నిబంధనలో ఏసు ప్రతిష్టించిన అపొస్తలులు వేద సాక్షులు హత సాక్షులు వగైరాలు. నేటి తరములో క్రైస్తవ విశ్వాసులైన మనకు కూడా ఈ యొక్క అధిక్యత వున్నట్లు గ్రహించాలి.

        యిక రెండవదిగా ఆయనే నా కాశ్రయము, నాకోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను.  ప్రియపాఠకులారా! ఒక విశ్వాసి యొక్క హృదయ పూర్వకమైన ప్రత్యక్ష సాక్ష్యమైయున్నది.  ఈ సాక్ష్యములో ఆయనే నాకు ఆశ్రయమనుటలో ఆయననుఆశ్రయించిన వారికే కొరతయు ఏలోటు లేదు ఆయన ఆశ్రయంలో వున్న వారికి అలౌకిక శక్తులవల్ల గాని, భూ సంబంధమైన విరోధ వల్ల గాని ప్రకృతి సంబంధమైన రూపములవల్లగాని వాతావరణం ద్వారాను యేర్పడు కలుషితము మరెక్కువగా మరణ భయంగాని లేదని ఋజువగుచున్నది.

        ప్రియపాఠకులారా!  ఆశ్రయమనగా శరణార్థులకు నిలయము అనగా బాధపడు వారికి తాత్కాలిక నిలయము.  ఈ యొక్క ఆశ్రయము ఉదా|| ఇది వరద బాధితులు, అగ్నిబాధితులు, నిరాశ్రయులు వగైరా, ఇక కోటః-యిది దేశ రక్షణకు శతృవుతో పోరాడుటకు అతి కీలకమైన ప్రాముఖ్యత వహించిన స్థలముగా భావించాలి.  కోటతోనే దేశమునకు  కావలసిన పటిష్ఠత యిమిడియున్నది.  సైనిక సమాచారములకును యుద్ధ రంగములో జరుగు పోరాటములకును సైనిక శాసనములను జారీచేయుటకును, ఈ కోట కేంద్రమైయున్నది.  దేవుడు కూడా ఎత్తయిన కోటగా వుండి అందులో కొండమీది కోటగా వుండి దశాజ్ఞలు అను శాసనాలను తన జనాంగమైన ఇశ్రాయేలుకు జారిచేసినట్లు ఆ యొక్క శాసనములు దైవ హస్తంతో ఱాతి పలకల మీద వ్రాయబడిన హెబ్రూ భాషలో నరజీవునికి అర్ధమగునట్లు విశదీకరింపబడిన తొలి శాసనాలు అంతకు ముందు దేశాన్నిగాని పట్టణాన్ని గాని, రాష్ట్రాన్ని గాని పరిపాలించేందుకు రాజులేడు దేవుడే కోటగా వుండి తనలో నుండి జారీచేయబడిన ఈ యొక్క శాసనముల ప్రకారం నేడు లోకమంతయు వీటిననుసరించి ప్రపంచంలోని ఆయాదేశాలను పరిపాలిస్తున్నట్లు మనము గ్రహించాలి.  ఆనాడు మోషేకు దేవుడనుగ్రహించిన పలకలలోని శాసనములు.  ఈ నాటికిని అవి ప్రతిదేశములోను ప్రభుత్వ శాసనాలుగా అనగా సర్కారు ఉత్తరువులుగా పట్టాలుగా చెలామణి యగుచున్నది.  ఆనాడు ఇశ్రాయేలీయులకు దేవుడు కోటగా వుండబట్టే మన పితరుల తరమునుండి మనదేశము నేలిన రాజులు లేక ప్రపంచంలో ఆయా దేశాలను పరిపాలించిన ప్రభువులు దైవత్వాన్ని అనుసరించి, వారి వారి చిత్తానుసారంగా కోటలను నిర్మి ంచుకొని రాజ్యాలేలినట్లు నేటికిని మద్రాసులో జార్జికోట హైద రాబాదులో గోల్కొండ కోట, డిల్లీలో ఎఱ్ఱకోట, విజయ నగరంలో క్రిష్ణదేవరాయల కోట, తంజావూరులో ఆనాటి ప్రభువులు పరిపాలించిన కోట, నెల్లూరులో మనుమసిద్ధి రాజుల కోట వగైరా కోటల చరిత్రలు ఋజువుపరచుచున్నవి.  లోకసంబంధమైన ఈ కోటలు నేడు శిధిలమై రాజులులేని కోటలుగా వున్నాయి.

        అయితే 91వ కీర్తనలో కీర్తనాకారుడు వర్ణించిన కోట జీవముగలదై అనేకులకు రక్షణయిచ్చునటువంటి సర్వోన్నతమైన కోటగాను, సర్వశక్తులకు అతీతమైన శక్తిగల కోటగాను పటిష్ఠమైన కోటగాను; నిన్న నేడు రేపు సజీవమైన కోటగాను, ముల్లోకములో మనుగడకును దేవదూతల కార్యక్రమాలకును సృష్టి యొక్క కాలచక్రము యొక్క పరిభ్రమణమునకు ఆధారమైన కోటగాను సకల జీవులకును ఉత్తర మిచ్చు ప్రభావ పూరితమైన కోటగాను దావీదు అభివర్ణించినట్లు తెలియుచున్నది.'' యిక నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. '' యిది ఆశ్రయమును కోటను గూర్చిన సాక్ష్యమునైయున్నది.

        యిక మూడవది వేటగాని ఊరిలోనుండి ఆయన నిన్ను విడిపించును.'' అనుటలో వేటగాడు ఎవరు?  వేటగాని యొక్క గుణలక్షణములు ఏవనగా పక్షులను జంతువులను మాటువేసి ఉచ్చు ఉరి వల లేక ఆయుధము ప్రయోగించి జీవులను పట్టుకొనుటయేవాని వృత్తి, యిదే విధంగా లోకంలో జింకలు లేళ్ళువంటి జీవితంలో వున్న నరజీవితంలో విశ్వాస జీవితంలో దైవ సన్నిధిలో దైవ మందిరంలో పాటలతోను సంకీర్తనలతోను దైవాత్మోజ్జీవంతో దైవ సంబంధమైన బోధలలో లీనమై గంతులువేయు విశ్వాసులను, అపవాది అను వేటగాడు చిత్ర విచిత్రమైన ఉరి వలలు ఉచ్చులు ప్రయోగించి మన విశ్వాస జీవితాలను పాడుచేయుటకు ప్రయత్నిస్తున్నాడు.  ఇతని మాయలో ఎంతో మంది పతనమైపోతున్నారు.  మనము చూస్తున్నాము.  యిది అపవాది యొక్క ఉరివల్ల కలుగు ఫలితము.

        యిక నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును,''నాశనకరమైన తెగులు యిది అపవాది యొక్క మాయ వలలో తగుల్కొని దోషులైన వారికి దేవుడు రప్పించు నాశనకరమైన ప్రళయమే ఈ నాశనకరమైన తెగులు లేక దేవుని ఉగ్రత,'' నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును.  అటు అపవాది యొక్క మాయ వలలో తగుల్కోకుండా దైవత్వాన్ని లేక సిలువ అను గురిని ముక్కు సూటిగా వుంచుకొని విశ్వాస జీవితంలో జీవించినాడు ఈ నాశనకరమైన తెగులునుండి ఆయన నిన్ను తప్పిస్తాడని దీని భావము.

        యిక నాల్గవదిగా ఆయన తన రెక్కలలో నిన్ను కప్పును.'' ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును,'' అనుటలో దేవునికి రెక్కలున్నాయా?  ఆయన పక్షియా?  అన్నటువంటి సందేహము కలుగక మానదు.  దేవదూతలకు రెక్కలున్నవి.  వారు ఎగురుగలరనుటకు కూడా సందర్భాలు లేకపోలేదు.  ప్రియపాఠకులారా!  యిందుకు ఉదా|| మానవ జీవితాన్నే కొన్ని సంఘటనలు మనము తీసుకొందము.  మానవునికి రెక్కలు రెండు చేతులు '' ఈ రెండు చేతులతో మానవుడు రెక్కలుగల విమానాన్ని తయారుచేశాడు.  రెక్కలతో విమానం ఎగురుచున్నది గాని, రెక్కలతో నరుడెగురుటలేదు.  రెక్కలుగల విమానంలో నరుడు ప్రయాణిస్తున్నాడు.  అందులో విమానాన్ని తయారు చేసినవాడు ఒక్కడు కాడు.  అనేక మంది ప్రయాణించే వసతిగల విమానాలు కూడా వున్నవి.  యిది కాక ఎలికాఫ్టర్లను రాకెట్లను సృష్టించి ఖండాంతరములలో ప్రయాణిస్తున్న గ్రహాలలో చేరుటకు కూడా నరుడు సన్నిద్దమై ప్రయాణించగల జ్ఞానాన్ని నరుడు సంపాదించినట్లు చూస్తున్నాము.

        ఈ సందర్భంలో యంత్రముల సాంకేతిక శాస్త్రములు దృశ్యమైయున్న మరలు మేకులుతోగాక ప్రత్యక్షంగా మహిమ శరీరంతో అన్ని గృహాలకు అలవాలమైయున్న పరలోకమునకును యిట్టి జ్ఞానియైన నరుడు మొదటి కొరింధీ 15:43-44 లో వలె ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేవబడును.  మృతుడై విత్తబడి అనగా పూడ్చబడి మహిమగల వాడుగ లేపబడుననియు బలహీనమైన వాడుగ విత్తబడి బలమైనదిగా లేవబడును.  ప్రకృతి సంబంధంగా విత్తబడి ఆత్మ సంబంధంగా లేవబడుననియు వివరింపబడియున్నది.  మరి యిట్టు లేపబడిన ఈ నరుడు మొదటి థెస్స 4:16 లో ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును.  క్రీస్తు నందుండి మృతులైనవారు మొదటలేతురు అన్నట్లుగా లేపబడి ప్రభువు నెదుర్కొనుటకు ఈ జీవుడు ఎటువంటి వాహనము లేక పయనిస్తాడని వేదంలో వివరింపబడియున్నది.  మరి యిట్టి సందర్భంలో దైవత్వం యొక్క కుడి ఎడమ హస్త ప్రభావములు పునరుజ్జీవులైన ఈ యొక్క నరకోటికి రెక్కలుగా బహూకరించబడి ప్రభువు దర్శనార్ధం ఆకాశగమనం చేయునట్లుగా యిందులోని భావము.  ఈ విధంగా తన రెక్కలతో మనలను కప్పు ప్రభువు ఆయన యొక్క కృప ప్రతి వ్యక్తికిని అనుగ్రహించబడి యున్నదనుట కెట్టి సందేహము లేదు.                                                         ప్రియపాఠకులారా!  ప్రతి నరునికిని తెలియనిరీతిగా యిట్టి రెక్కల నిచ్చుటకు సర్వశక్తుడైన ప్రభువు సాధ్యుడైయున్నాడు.  దేవదూతలకు రెక్కలున్నపుడు దేవుని ఆత్మతో నింపబడిన మనకు ఆయన రెక్కల సహాయం లేకుండా వుంటుందా?  తప్పక వుంటుందనియే మనము గ్రహించాలి.  ప్రియపాఠకులారా!  మన రెక్కలు కదల్చి మనము యిహలోక యాత్ర సాగిస్తున్నాము.  పక్షులు వాటి రెక్కలను కదిలించి వాటి ఆహారాన్ని అవి సంపాధించుకొంటున్నవి.  దేవదూతలు వాని రెక్కలను కదిలించి భూలోకనివాసులకు సహాయపడుతూ పూర్వీక దినాలలో దేవుని యొక్క ఉద్దేశ్యాలను ఆయన ప్రణాళికను గూర్చిన వివరాలను దైవ విశ్వాసులకు ప్రత్యక్షంగా వివరించినట్లు, పాత నిబంధనకాలంలోను క్రొత్త నిబంధన ప్రారంభంలోను అపోస్తలుల కార్యాలలోను కొన్నిసందర్భాల్లో మనము చదువగలము.

        దేవ దూతల కంటే దేవుడు నరులమైన మనల నధికంగా ప్రేమించినాడు.  యిందునుబట్టి యోహా 3:16 లో దేవుడు లోకమునెంతో ప్రేమించెను.  అంతేగాని దేవుడు దేవదూతల నెంతో ప్రేమించినాడన్న వార్త ఎక్కడను లేదు.  ప్రియపాఠకులారా!  ఈ విధంగా ఆయన తన రెక్కలు అనగా తన సహాయము తన దూతల సహాయంతో మనలను కాపాడుచున్నట్లు యోబు యొక్క చరిత్ర యిందుకు సాదృశ్యమైయున్నది.  యోబును గూర్చి సాతానుడు దేవునితో మాట్లాడునపుడు యోబు యొక్క సంపదకు నీవు కంచెవేసియున్నావు. అని అంటాడు.  ఆ కంచెయే ఆయన రెక్కల కాపుదల, ఆయన ఱెక్కల క్రింరనే యోబు కాశ్రయం దొరికింది.  ఈ విధంగా దేవుడు తన రెక్కలతో ఇశ్రాయేలు జనాంగమును కప్పి వారికి చలి వర్షము మంచు, మరణము శతృ బాధ, వాతావరణ కలుషితము, పిశాచ బాధ లేకుండను నడిపించినట్లు వేదంలో చదువగలము.  ఆయనరెక్కలతో కప్పినందు వల్లనే దావీదు మహారాజు అపజయాన్ని చవి చూడకుండా రాజుగాను వీరునిగాను, కీర్తనాకారునిగాను ప్రవక్తగాను ఏసు ప్రభువు జన్మకువంశాంకురముగాను వెలుగొందినాడు.

        ఆయన సత్యము-కేడెమును డాలునైయున్నది.  ప్రియపాఠకులారా!  ఆయన సత్యము అనుటలో దేవుని యొక్క సత్యము క్రీస్తు!  ఎట్లనగా యోహా 1:14 ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను.  కనుక దేవుని వాక్యమైయున్న సత్యస్వరూపుడుగా లోకములోఅవతరించినందున ప్రతి క్రైస్తవ బిడ్డకు లేక దైవ విశ్వాసికి ఆయనకేడెము రక్షణ యనగా రక్షకుడను విమోచకుడునైయున్నట్లు ఈ వచనములోని ఆత్మీయార్థము మనము గుర్తించాలి.  

        యిక 5వ వచనములో -' ''రాత్రివేళ కలుగు భయమునకైనను '' అనగా భూత ప్రేత పిశాచాదుల ద్వారాను విష సర్పాదుల ద్వారాను విష కీటకముల ద్వారాను, దొంగలవల్లను హంతకుల వలన కలుగు భయమునకును పగటి వేళ ఎగురు బాణమునకైనను, '' అనుటలో ఎండశోష అనగా వడదెబ్బ దైవత్వమునకు విరోధియైన అపవాది ప్రయోగించు పరోక్షమైన సూటిపోటు మాటలు, అపహాసకులు యొక్క హేళన వచనములు, యిరుగు పొరుగు యొక్క దూషణ సంభాషణములు శతృవుని యొక్క కుతంత్రములు వగైరాలు, చీకటిలో సంచరించు తెగులు అనగా రాత్రిపూట మంచు వల్లగాని లేక వాతావరణ కలుషితం వల్లగాని, దోమల వల్ల గలుగు బాధలు మశూచి అతిసార వ్యాధియొక్క రోగముల సూక్ష్మజీవుల యొక్క తాకిడియైనను, మధ్యాహ్నమందు పాడుచేయు రోగం'', అనుటలో ఆహార దోషము జలదోషము అల్పాహార దోషము వగైరాల మూలంగా కలుగు అనర్ధాలకు దైవ విశ్వాసికి భయము లేదని దీని భావము.

        ప్రియపాఠకులారా!  సర్వసాధారణంగా నరజీవునికి ప్రభుత్వ సంబంధంగా కలుగు ఉపద్రవములు మధ్యాహ్నమే కోర్టు కచ్చేరీలలో తీర్పులుగాని, వైద్యులు మలమూత్రాదులను రక్తమును పరీక్ష చేయు సమయం మధ్యాహ్నమే, వైద్యులు రోగులను పరీక్షచేయు సమయం కూడా మధ్యాహ్నమే! రోగము యొక్క లక్షణాలను పరీక్షించు సమయము కూడా మధ్యాహ్నమే! ఈ వివరాన్ని యేసు ప్రభువు ప్రత్యక్షంగా తన మరణ కాలంలో నిరూపించాడు.  ముండ్ల కిరీటమును తలపై పెట్టి మొత్తుట.  ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టుట, గొల్గాతా అను స్థలమునకు సిలువ మోసి కొని వెళ్ళుటయు మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన ప్రాణం విడుచుట జరిగినది.

        రాత్రివేళ గల్గు భయముః- ఏసు ప్రభువు గెత్పెమనే వనంలో తాను చేసిన చివరి ప్రార్థనలో ఆకాశం నుండి రక్తపాత్రమును తప కందించి త్రాగమన్నట్లుగా ప్రభువుకు కలిగిన దర్శనాల్లో మొట్టమొదటిగా ఏసు ప్రభువు మత్త 25:38లో మరణ మగునంతగా నా ప్రాణము దుఃఖంలో మునిగియున్నది.'' అనుటలో దైవ కుమారుడు తాను లోకమునకు అప్పగింపబడబోవు రాత్రి పొందిన భయమును అటు తర్వాత దేవుని యొక్క దూత ఆయనను బలపరచుట అనిన దానిని గూర్చి ఈ వేద భాగంలో చదువగలము.  యిది రాత్రివేళ గలిగిన భయము.

        యిక పగటి వేళ ఎగురు బాణమునకైనను', అనుటలో మార్కు 15:26లో ఆయనను పగలు తొమ్మిది గంటలప్పుడు సిలువవేసి ఎత్తి ఆ సిలువను ప్రతిష్టించినట్లు దీని భావము.  అనగా పగటి వేళ ఆయనను బాణములవంటి మేకులతో గ్రుచ్చి సిలువ వేయు ఘోరాతి ఘోరమైన సంఘటన.'' చీకటిలో సంభవించు తెగులుః-ఏసు ప్రభువు పట్టుబడిన రాత్రి యూదులకు యేసు క్రీస్తు నప్పగించుటకు యూదా యిస్కరియోతు-యూదా జనాంగమునకు ముందుగా ప్రభువునకు తెగులుగా దాపురించి ఆయనను పట్టించుటకు తిరిగాడు.  మధ్యాహ్నమందు పాడు చేయురోగముః- ఈ సందర్భములో యెషయా గ్రంధంలో చదివితే ఏసు ప్రభువు భరించిన మన మరణకరమైన వ్యాధి చింత వ్యసనములను గూర్చి తెలియగలదు.  ఈ రోగముల చేత ప్రభువు క్షుద్భాద, దప్పిక మరణవేదన ఎండ వేడి వగైరా బాధలు అనుభవించినట్లును అయినను ఆయన భయపడక ఆయన ప్రక్కను ఆయన కుడి ప్రక్కను వేలకొలది జనాభా ఆయనను గూర్చి విమర్శిస్తుండగా-ఇటులోకము తోను అటు అదృశ్యమైయున్న అంధకార శక్తులతోను దురాత్మ సమూహాలతోను, మరణంతోను థీరోచితంగా ఏసు ప్రభువు పోరాడి తనువును చాలించి 9వ వచనంలో వలె యెహోవా నీవే నా ఆశ్రయము,'' అని మహోన్నతమైన దేవుని నీకు నివాస స్థలముగా చేసికున్నావు? అన్నట్లు ఆయన తండ్రి నివాసమునకు చేరాడు.  చేరినటువంటి ప్రభువు అశాంతితో కొట్టుమిట్టాడుచున్న మనలనుగూర్చి 10వ వచనంలో వలె నీకు అపాయమేమియు రాదు.  ఏ తెగులును నీ గుడారమునకు సమీపించదంటున్నాడు నిజమే! నేటి మానవ జీవితము చిత్ర విచిత్రమైన ప్రమాదములతోను హత్యలతోను ఆత్మహత్యలతోను దినదినగండంగా సంక్రమించి యున్నది,  ఇట్టి అపాయం నుండి రక్షణ కావాలంటే ప్రభువు తప్ప వేరే ఆశ్రయం లేదు.

        ఏ తెగులు నీ గుడారమును సమీపించ దంటున్నాడు.'' ప్రియపాఠకులారా!  పాత నిబంధన కాలంలో వుండిన జబ్బులు నూతన నిబంధన కాలంలో లేవు.  నూతన నిబంధన కాలంలో వున్న జబ్బులు యుగాంతకాలమైయున్న ఈ దినములలో లేవు.  ఉదా|| పాత నిబంధనలో షుగరు లేదు,  బి.పి లేదు.  ఎయిడ్స్‌ జబ్బు లేదు స్త్రీ వ్యాధులు లేవు.  గుండెపోటులేదు.  పాతనిబంధన కాలంలో వున్నదంతయు ఒక్కటే తెగుళ్ళు.   దేవుడు ప్రత్యక్షంగా నరుని మొత్తి చంపుట.  యిందుకు దృష్టాంతం ఉజ్ఞా మరణము, ఇశ్రాయేలీయుల మీద పాముల ప్రయోగము, సర్పకాటుకు గురియై అనేకులు చచ్చుట బొబ్బర్లు వ్రణములు, కురుపులతో బాధలు, మిడతల దండు పంటలు నాశనము చేయుట, అనావృష్టి కరువు కాటకాలు వగైరాలు, నూతన నిబంధన కాలంలో పంటలకు తెగుళ్ళు వున్నట్లు లేదు.  రాచకురుపు క్యాన్సర్‌ లేదు.  చక్కెర వ్యాధి లేదు.  ఉబ్బసం లేదు. అయితే స్త్రీ జబ్బులు వ్యభిచార సంబంధమైన రోగాలు ఉదా|| రక్తస్రావము గల స్త్రీ దయ్యము పట్టినవారు, గెరాసీనుల దగ్గర సేన అనుదయ్యము పట్టిన వాని యొక్క సంఘటన కుష్టురోగము ఏసు ప్రభువు స్వస్థపరచుట, పక్షవాతముః- ఇది పాత నిబంధన కాలంలో లేదు.  పోలియో పాత నిబంధన కాలంలో లేదు.  అయితే నూతన నిబంధన కాలంలో దీనికి బీజము వేయబడింది.  బెతెస్థా దగ్గర 38 ఏండ్ల వ్యాధిగ్రస్థుడు యిందుకు ఋజువు.

        నూతన నిబంధన కాలంలో లేని జబ్బులు ప్రభువు రాకడకు సమీపమైయున్న నేటి యుగంలో నరకోటిని పీడిస్తున్నాయి.  చర్మ వ్యాధులు బి.పి, షుగరు, క్యాన్సరు, హృద్రోగము, అతిమూత్ర వ్యాధి అతిసారవ్యాధి, లేత వయస్సులోనే దృష్టిని కోల్పోవుట, రక్తమలము వగైరాలు. ప్రియపాఠకులారా!  యివన్నియు వరుసగా తరమునుండి తరమునకు మారుచున్నటువంటి తెగుళ్ళు యివి నరులకే గాకుండా పశుపక్ష్యాదులను పాడిపంటలకును దాపురించి బహుముఖంగా వ్యాప్తి చెంది వైద్యులకు ఔషధాలకును అలవిగాని రీతిలో విస్తరించి వ్యాపించియున్నవి.  గొర్రెలకు ముసలము, పడిసెపు జబ్బు, ఱొంప పశువులకు గాలి కుంటుపారుడు,  వాతము పిప్పికొమ్ము వగైరా రోగములు, పంటపొలాలలో దోమపోటు మిడతలు పురుగుకాటు.  యింకను వివిధమైన రకాలతో కూడినటువంటి జబ్బులు; కోళ్ళకు అనేక రకములుగా నాశనకరమైన తెగుళ్ళు నేటి యుగంలో ప్రావీణ్యత పొందియున్నవి.

        యిందును బట్టి ప్రభువు సెలవిచ్చుమాటేమిటంటే ''మహోన్నతుని యొక్క నామమును అనగా దేవుని నివాస స్థలంగా ఆయన కుమారుడైన ఏసు క్రీస్తును రక్షణ కర్తగా ఏర్పరచుకొని వుంటే పై జాడ్యాలేవియు కూడా విశ్వాసియొక్క గృహాన్ని అంటవు.  అతని దొడ్డిలోని గొర్రెచావదు.  అతని ద్రాక్షతోటకు తెగులురాదు.  అతని గోధుమ చేలలో గురుగులు పెరుగవు.  కొట్టులోని ధాన్యము తరుగదు.  తొట్టిలోని ద్రాక్షరసమైపోదు.  కుండలోని నూనె తరుగదు.  ఈ సందర్భంలో సారెపతులోని విధవరాలు ఏలీయా కాశ్రయమిచ్చి ధన్యురాలైన సంఘటనను దృష్టాంతముగా తీసికోవచ్చు.

        (11) నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయననిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును? ప్రియపాఠకులారా!  నేడు నరుడు సంచరించుచున్న మార్గాలు నరునికే తెలియుటలేదు.  ఏయేమార్గాలలో వారు పయనిస్తున్నారో వారికే అర్థము కాక పయనిస్తూ నాశనాన్ని మరణాన్ని లేక ప్రమాదాన్ని శిక్షను తెచ్చుకుంటున్నారు.  మోషే ఇశ్రాయేలును నడిపించినపుడు దేవుడు వారి మార్గాలన్నిటిలో తన దూతను కాపలావుంచి తాను మేఘ స్థంభంగాను అగ్ని స్థంభంగాను నడిపించినట్లు యిశ్రాయేలు చరిత్ర మనకు ఋజువు పరచుచున్నది.  ఏలీయా యొక్క మార్గములో దేవుడు ఏలీయాకు తోడై నడిపించాడు.  గిద్యోను యొక్క మార్గంలో దేవుడు గిద్యోనుకు తోడైనాడు.   సంసోను యొక్క మార్గంలో శతృ సంహార సమయంలో తన ఆత్మతో దేవుడు సంసోనును నడిపించాడు.  అయితే సంసోను దేవుని మార్గంలో నడిచి దేవుని విసర్జించి పాపమునకు పట్టుబడి అంధుడై బంధీయై దైవానుగ్రహం కోల్పోయి లోకం చేత ఎగతాళి చేయించుకున్నాడు,  అయితే నేటి తరము వారమైన మన మార్గాలలో ఆయన మనలను కాపాడుటలో, ఆయన ప్రతి నామమైన ఏసు నామములో మనలను నడిపిస్తూ, తన దూతలతో సంరక్షించి తనను నమ్మిన బిడ్డల పాదములకెటువంటి కళంకము రాకుండ తన చేతుల మీద ఎత్తినడిపించును.        

        యిక 13వ వచనంలో నీవు సింహాలను నాగుపాములను త్రొక్కెదవు.  అనుటలోను కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు.  అనుటలోను సింహములుః- మీ విరోధియగు అపవాది గర్జించు సింహము'. సాతాను యొక్క కుతంత్రములను క్రియలను విసర్జించెదవు. నాగుపాములు'', అనుటలో ఈర్ష్యాద్వేషులైన నరుల యొక్క కపటోపాయముల నుండి తప్పించబడి సందర్భానుసారంగా వాటిని లయపరచెదవని భావము.  కొదమ సింహములు అనగా అపవాది యొక్క బిడ్డలు అనగా దురాత్మల సమూహములు నీ జోలికి రావు.  భుజంగములు అనుటలో సర్పసంతానము అనగా అపవిత్రాత్మల వల్ల గాని దుష్ట జనాంగములను కాని అణచి వారిపై అధికారము వహించుట.  ఈ సందర్భంలో యాకోబు కుమారుడైన యోసేపు చరిత్రను మనము మననంచేసికొంటే-ఈ సింహము ఫరో,'' భుజంగములు పాములు-ఐగుప్తీయులు. దేవుడు తన బిడ్డయైన యోసేపు చేత ఫరో ఇంటిని అనగా సింహాన్ని - '' సింహపు సంస్థానాన్ని, ఐగుప్తీయులైన సర్వ సంతానాన్నిపరిపాలించి నట్టు మనము గ్రహించగలము.                యిక 14లో అతడునన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను.'' అనుటలో ఈ సందర్భంలో కీర్త 103 ఒకసారి మనము జ్ఞాపకముచేసికొన్నట్లయితే యిది ఋజువు కాగలదు.  ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను.  ఇశ్రాయేలు వంశస్థులకు తన ప్రియులను కనపరచెను.  యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృపయుగ యుగములుండును.  పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మన కంతదూరపరచియున్నాడు.

        అతడు నా నామమును నెరిగిన వాడు గనుక నేనతన్ని ఘనపరచెదను.  ప్రియపాఠకులారా!  ఆయన నామము నెరిగి ఆయన నామమును ఘనపరచిన వారిని గూర్చి ఈ సందర్భములో మనము వేద రీత్యా తెలిసికోగలము.  ఉదా|| పేతురు యోహానులు పగలుమూడు గంటల వేళ చీల మండల రోగిని శృంగార ద్వారము వద్ద ఏసు నామమున నడిపించుటన్నదియు పౌలు సీలలు బంధీలైయుండగా వారిని బంద విముక్తులుగా చేసి ఏసు నామములో పౌలుసీలలను బంధించిన చెరసాల నాయకుని క్రైస్తవ విశ్వాసిగా మార్చిన సంఘటన.  ఏసు ప్రభువు ఎన్నుకొన్న 12 మంది జాలరులు క్రీస్తు నామము నెరిగిన వారుగ ఏసు ప్రభువు ప్రతిష్టించి వారిని అపోస్తలులుగా యేర్పరచి, పరలోక పట్టణాలకు 12 పునాదులుగా వారి నామములను లిఖించి యున్నట్లు ప్రకటన గ్రంథంలో చదువగలము.  ఈ విధంగా ప్రభువు చేత ప్రతిష్టించబడిన వీరు ఇహమందును పరమందును దైవత్వం చేత వారి నామములను ఘనపరచబడియున్నట్లు చదువగలము.        

        అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను,'' నిజమే సంసోను అంధుడై బంధీయై పిలిష్తీయ దేవతయైన దాగోను ఆలయంలో తనకు కలుగు పరాభవమును  గూర్చి విలపిస్తూ ఆ గుడికి ఆధారమైన రెండు స్థంభాలను పట్టుకొని దేవునికి జేసిన విజ్ఞాపన మొర దేవుని యొద్దకు చేరినపుడు దేవుడు సంసోను ప్రార్థనకు ప్రత్యత్తరంగా క్రియామూలంగా ఆ గుడిని పడగొట్టి పిలిష్తీయులను సమూలంగా నాశనం చేయుట, గొడ్రాలైయున్న హన్న పుత్ర సంతానమును గూర్చి దేవునికి మొరపెట్టగా అందుకు ప్రతిగా సమూయేలును దేవుడనుగ్రహించుట, అబ్రహాము చేసిన విజ్ఞాపనలకు దేవుడు జవాబిచ్చుట.  శ్రమలలో ఇశ్రాయేలు జనాంగము చేసిన విజ్ఞాపన మొరలను దేవుడాలకించి క్షేమకరమైన వాతావరణంలో నడిపించుట.  శ్రమలలో అనగా గిద్యోను మిద్యానీయుల చేత శ్రమ పొంది దాగుగొనగా దేవుడు ప్రత్యక్షంగా గిద్యోనును పిలిచి మిద్యానీయులతో యుద్దమునకు సన్నిద్ధునిగా చేసి అతని మార్గమంతటిలో దేవుడు అతనికి తోడైయుండుట.

        పౌలు పొందిన శ్రమలలో దేవుడు అతనికి తోడైయుండి నడిపించాడు.  ఈ శ్రమ అన్నది వ్యాధివల్లగాని, చాకిరీవల్లగాని శోధనవల్లగాని వాతావరణము వలన గాని కలుగవచ్చును.  యోనాకు కలిగిన శ్రమలలో అనగా తుఫానులో యోనాను నడిపించాడు.

        ఇక అతని విడిపించి అతనిని గొప్ప చేసెదను'', అనుటలో తిమింగలము నోటనుండి యోనాను విడిపించి గొప్ప ప్రవక్తగా చేశాడు.  యెజెబేలు యొక్క ఉపద్రవము నుండి ఏలియాను కాపాడి మరణం లేకుండా తన వానినిగా చేర్చుకున్నాడు.  యోసేపు తన అన్నల యొక్క కపటోపాయమునకు గురియై కట్టబడి ఇస్మాయేలులకు అమ్మబడి శ్రమల బారి పడినపుడు ఇస్మాయేలీయులుల నుండి విడిపించి ఫరో యింటికి చేర్చి అతనిని గొప్ప జనాంగంగా చేశాడు అనగా హెచ్చించాడు.  పేతురు చెరసాలలో సంకెళ్ళతో బంధించబడి మరణ శిక్షకు సమీపస్తుడైయుండగా సంఘము చేసిన ప్రార్థన విజ్ఞాపనలను బట్టి అతని సంకెళ్ళను తెంపి అతనిని గొప్ప చేసినట్లుగా వేదంలో చదువగలము.  మోషే ఐగుప్తీయుని చంపి ఐగుప్తీయుల చేత తరుమబడి తన మామగారి యింటచేరి మందను కాయుచూ గొర్రెల మందలో ఒక జీవిగా బంధీయై యుండగా అతనిని పిలిచి తన మహాసైన్యమునకు అధిపతిగా నియమించాడు.

        ఇక చివరిగా 16వ వచనం-''దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను'' నిజమే!  పై విధంగా దైవత్వం చేత నడిపించబడిన దైవ విశ్వాసులైన పాత నిబంధన నాటి ప్రవక్తలు రాజులు న్యాయాధిపతులు నూతన నిబంధనలోని అపోస్తలులు హత సాక్షులు వేద సాక్షులు వగైరాలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వారిని సజీవులుగానే నేటికిని జన బాహుళ్యమునకు ప్రకటింపచేస్తున్నాడు.

        ప్రియపాఠకులారా!  మోషే లేడు కాని అతని చరిత్ర నేటికిని ఆయా స్థలములలో ప్రతి నోట ప్రవచింపబడుచున్నది.  అతని ధర్మశాస్త్రమును గూర్చిన వివరాలు నేటికిని ప్రకటిత మగుచున్నవి.  అదేవిధంగా యెహోషువ వంటి ప్రవక్తలు లగాయతు మలాకి ప్రవక్త వరకును -''ఏసు క్రీస్తు మొదలుకొని యోసేపు మరియమ్మలు; ఏసు ప్రభువు ప్రతిష్టించిన 12 మంది అపోస్తలులు, వారి లేఖనానుసారంగా జీవించిన విశ్వాసులు హతసాక్షులు, వేద సాక్షులు వగైరాలు, ఈ నాటికి లేరు.  అయినను వారు దీర్ఘాయుష్మంతులై సజీవుల లెక్కలో చేర్చబడి నేడు ప్రతి క్రైస్తవ మందిరంలో ఆరాధన సమయంలో పరిశుద్ధ బలిపీఠాల మీద వారు సజీవులై యున్నట్లు లేఖన భాగాలు ప్రవచనాలు ప్రకటిస్తున్నాయి.

        యిక చివరిగా నా రక్షణ అతనికి చూపించెదను''. అనుటలో యిట్టి ప్రవచనాల ద్వారా తత్సంబంధమైన ప్రసంగాల ద్వారాను, ప్రసంగీకుల యొక్క సావాసం ద్వారాను ప్రార్థనలోను; ప్రార్థనాసావాసంలోను జీవించే విశ్వాసులకు తప్పకుండా దేవుని రక్షణ వుంటుందని యిందును బట్టి మనము గ్రహించాలి.  యిది విశ్వాసియొక్క విధి.

                స్తుతించుట

        కీర్త 92:1-3 యెహోవాను స్తుతించుట మంచిది.  మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను - ''ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వర మండలములోను గంభీర ధ్వని గల సితారా తోను ప్రచురించుట మంచిది.

        ప్రియపాఠకులారా!  పై వేద భాగములో వివరించబడిన కీర్తన భాగములోని మూడు వచనాలు మూడు మంచి క్రియలను గూర్చి వివరిస్తున్నాయి.  అనగా దైవ సన్నిధిలో నరుడు ఆశీర్వదించబడాలంటే నీతిమంతుడుగా తీర్చబడాలంటే, దైవత్వమునకు ప్రీతికరముగా జీవించాలంటే మూడు మంచి కార్యాలు చేయవలసియున్నది.  యిందులో మొదటిది యెహోవాను స్తుతించుట, 2) మహోన్నతుడైన దేవుని నామమును కీర్తించుట, 3)విశ్వాసముతో ఉదయము రాత్రి ప్రభువునుగూర్చి ప్రకటించుట. ఈ మూడు విధములైన మంచి కార్యాలు గూర్చి పై వేద భాగ ప్రవచనాలు వివరిస్తున్నాయి.

        ప్రియపాఠకులారా!  ఈ విధముగా త్రివిధ సత్కార్యముల ద్వారా జీవాత్ముడైననరుడు తాను ఆత్మ సంబంధుడైన నరునిగా జీవించి ఆత్మ దేవుని యొక్క సన్నిధిలో తన విశ్వాస్యతను బట్టి నీతిమంతుని ఎన్నికచేయబడు ధన్యత వున్నదని వేదరీత్యా కొందరి జీవితాలను గూర్చి మనము తెలిసికొందము.  దేవుడు ఆది కాండము ఆరు మరియు ఏడు అధ్యాయములలో జరిగించిన సృష్టి నాశన క్రియాసందర్భములో ఆనాటి ప్రపంచ యావద్‌ నరకోటిలో నోవహు అను ఒకనిని నీతిమంతునిగా ఎంపికచేసినట్లు ఆది 7:1లో చదువగలము.  అదేమనగా ఈ తరమువారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచితిని. '' అని దేవుడు ప్రత్యక్షముగా నోవహు ను ఎంపికచేసిన విధము.  అలాగే విశ్వాస్యతను బట్టి అప్పటి వరకునరసృష్టిని యావద్‌ భూమిపై యున్న జీవరాసిని జలప్రళయముతో తుడిచి వేయుటకు సంకల్పించినపుడు, నోవహు యొక్క విశ్వాస గుణమును బట్టి నోవహును తన పునః సృష్టికి అనగా జల ప్రళయముతో నాశనమైన అనంతరము జరుగబోవు నూతన సృష్టికి ఆదిగాను వారసునిగాను, యావద్‌ నరసృష్టికి పునాదిగాను నియ మించాడు.

        అలాగే దేవుడు అబ్రహామును పరిశోధించి విశ్వాస పరీక్షలో విజయాన్ని సాధించిన అబ్రహామును దీవిస్తూ విశ్వాసులకు తండ్రిగా ఎంపిక చేసినట్లుగా అబ్రహాము చరిత్ర ఋజువుపరచుచున్నది.  అలాగే యోబు విషయములో దేవుని యందు భయభక్తులు గలవాడును నీతిమంతుడునైయున్న యోబు వంటివాడు.  లేడని సాతానుతో సవాలుచేసిన దేవుడు యోబు యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశోధించి సాతానుపరీక్షలో వుంచగా, యోబు తన విశ్వాసము నీతిని బట్టి సాతానుతో పోరాడి జయించి దేవుని చేత మరెక్కువగా దీవించబడినట్లును, ఆవరకు తనకున్న దానికంటే రెండంతలు సంపద అధికముగలవాడైనట్లును మరెక్కువగా దీవించబడినాడు.  కనుక ప్రియపాఠకులారా!  యెహోవాను స్తుతించి యిపుడు మనము చదివిన దేవుని బిడ్డలు వారి వారి జీవితాలలో విశ్వాసము ద్వారా విజయాన్ని సాధించారు.

        యిక ''యెహోవాను కీర్తించుట.'' ఈ కీర్తించుటన్నది మోషే నుండి ప్రారంభమైంది.  మోషే యెహోవా నామమును అనగా దేవుని నామమును  నిర్గమ 15లో వ్రాయబడిన మోషే కీర్తన ఈ సందర్భంలో మనము చదవాలి.  దేవుడు తన జనాంగము పట్ల చేసిన అద్భుత కార్యాలను గూర్చి మోషే ఇశ్రాయేలులతో చేరి పాడిన కీర్తన ఆది కాండంలోను; యెహోవాను గూర్చి గానము చేసెదను........గుఱ్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను...........ఆయన ఫరో రధములను అతని సేనను సముద్రములో పడద్రోసెను. నీ నాసికా రంధ్ర ఊపిరి వలన నీళ్ళు రాసిగా కూర్చబడెను.  నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమున వారిని నిలువబెట్టెదవు.  యెహోవా నిరంతరము ఏలువాడు.

        కనుక ప్రియులారా!  మన శ్రమల కాలములో వేదనపడుచూ ఏడుస్తూ అన్న పానాదులు మాని అంగలార్చితే అందువల్ల ప్రయోజనములేదు.  అది పిరికితనమే అందుకేయాకోబు పత్రిక 5:13లో ఈ విధంగా వ్రాయబడియున్నది.  శ్రమ సంభవించెనా అతడు ప్రార్థన చేయవలెను.  సంతోషము కలిగెనా కీర్తనలు పాడవలెను.  రోగియైయున్నాడా!  వానిని ప్రభువు నామమున నూనెవ్రాసి ప్రార్థన చేయవలెను.  యిపుడు మోషేకు ఇశ్రాయేలు జనాంగమునకును జరిగిన దేవుని మూలముగా కలిగిన సంతోష కార్యములను బట్టి ఇశ్రాయేలీయులు మోషే ఉభములు చేరి కీర్తనలు  పాడినారు.  అనగా దేవుని క్రియలను కీర్తించారు.  తమ పట్ల దేవునికున్న వాత్సల్యతను బట్టి శ్లాఘించారు.  కనుక ప్రియపాఠకులారా!  ఇపుడు రెండు మంచి కార్యములను దేవుడి పట్ల జరిగించుటను బట్టి మనము నేర్చుకొని యున్నాము.  అనగా యెహోవాను స్తుతించుట.  ఇది నోవహు అబ్రహాము యోబు చరిత్రలలో వివరించబడి సార్థకమైనది.  మోషే ఇశ్రాయేలీయుల చరిత్ర ద్వారా కీర్తించుటను గూర్చి తెలిసికొన్నాము.

        ఇక మూడవదిగా దైవ విశ్వాస్యతను గూర్చిన సత్యమును వాయిద్యముల ద్వారాను లేక శ్రావ్యమైన కంఠస్వరము ద్వారాను గేయరూపముగాను దేవుడు మనపట్ల జరిగించిన గొప్ప కార్యములు ఆశ్చర్య క్రియలు మనపట్ల ఆయన ఏర్పరచిన రక్షణ వగైరా వాటిని గూర్చి యితరులకు సాక్ష్యమిస్తూ పాటల ద్వారాను సంకీర్తనల ద్వారాను ప్రకటించవలసిన విధి క్రైస్తవులమైన మనకు భాధ్యత ఎంతయినా వున్నది.

        ఈ విధముగా మూడు విధములైన మంచి దైవ ఉద్ధేశ్యములను నెరవేర్చిన పక్షములో ఆ విశ్వాసికున్నట్టి ఘనత ఈ కీర్తనలోనే మనము తెలిసికొందము.  ఈ సందర్భములో 93:12లో ''నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వవేయుదురు.'' అని వ్రాయబడియున్నది.  ప్రియపాఠకులారా!  ఖర్జూరపు చెట్టు ఎడారి ప్రాంతములలో ఒయాసిస్సుల దగ్గర మొలకెత్తి ఎడారి తుపానులకు సుడిగాలులకు తీక్షణ ఎండవేడిమి నరులు పాదము మోపుటకు కూడా వీలులేని ప్రదేశములో వేడికి యిసుక తుపానులకు సుడిగాలులకు తట్టుకొని నరుల ప్రమేయము లేక అనగా నరుల చేత ఎటువంటి సేద్యానికి ఫలసాయానికి నోచుకోక; తనకు తానే ఎదుగుచూ పటిష్టంగా వుండి ఎన్నటికిని కదలకుండా కొన్ని వందల సంవత్సరములు ఈ ఖర్జూరపు చెట్టు తన ఫలితాన్ని యిస్తూ నూతనంగా మరల మొలకెత్తుతుంది.  ఒక్క మాటలో చెప్పాలంటే దీనికి మరణ భయంలేదు. పతనావస్థలేదు.  మొవ్వవేస్తుంది.  అనగా మొలకెత్తుతుంది.  ఎట్టి వాతావరణమైన యిది తట్టుకోగలదు.   యిట్టి వృక్షము విశ్వాసముతో నీతిమంతుడుగా తీర్చబడిన వానికి మాదిరిగా దైవ వాక్యము దీనిని గూర్చి ప్రవచించుటలో దేవుని చేత నీతిమంతుడుగా తీర్చబడే వానికి శ్రమలు వేదనలు, బాధలు, యిరుకు యిబ్బందులు సంభవిస్తాయి.  ఈ ఖర్జూరపు చెట్టువలె  నీతిమంతునికి కూడా సంభవించునని, అయినను తన విశ్వాసమును బట్టి ఒయాసిస్సు దగ్గర వున్న ఖర్జూరపు చెట్టు వలె నీతిమంతుడు కదలక దేవునికి మధురాతి మధురమైన ఆత్మీయ ఫలాలతో దేవుని తృప్తిపరచును.

        యిక రెండవదిగా లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు.  ప్రియపాఠకులారా!   మొదటిది ఖర్జూరపు చెట్టు మొవ్వ,''యిక దేవదారు వృక్షముః- ఏపుగా నిటారుగా ఆకాశమంటే రీతిలో ఎదుగుతుంది.  యిందును బట్టి దైవ విశ్వాసములో ఆయనను స్తుతించి కీర్తించి ప్రచురించే బిడ్డకు ఎదుగుదల వుంటుందే గాని తరుగుదల వుండదని ఈ రెండవ చెట్టు ద్వారా మనము తెలిసికోవలసియున్నది.  చిత్రమేమిటంటే ఎడారి ప్రదేశములో ఒయాసిస్సుల దగ్గర నాటబడింది - ఖర్జూరపు చెట్టు లెబనానులోని పర్వత ప్రదేశాలలో నాటబడి ఎదిగేది దేవదారు చెట్టు. అయితే దైవ విశ్వాసియైనటువంటి దేవుని బిడ్డను గూర్చి వాక్యములో బహు శ్రేష్టమైన మాట వ్రాయబడియున్నది.

        ప్రియపాఠకులారా!  మనమొకసారి మరల ముందుకు వెళ్ళుదుము. ఒయాసిస్సుల దగ్గర ఖర్జూరపు చెట్టు మధ్య మొవ్వవేసి ఫలభరితమై వర్థిల్లితే, లెబనానులోని పర్వతశ్రేణుల మీద దేవదారు వృక్షము ఎదిగితే-''దేవునిబిడ్డ యెహోవా మందిరములోని దేవుని ఆత్మ ఆవరింపును బట్టి ఆ దైవ మందిర ఆవరణ ప్రభావమూలముగా వర్థిల్లును.  92:14-15లో వలె తమకు ఆశ్రయదుర్గమైన యెహోవా యదార్ధతను కీర్తిస్తు ఆయనలో  ఏ చెడు తనము లేదని ఆయనను గూర్చి ప్రచురము చేయుటకు వారు ముసలితనమునందు కూడా యవ్వనులవలె చిగురిస్తారు.  అనగామొవ్వ వేయుదురు.  ఈ విధముగా జీవించే ఈ విశ్వాస వీరులు వారి యొక్క చిగురు అను నూతనత్వమును బట్టి ''క్రీస్తు ఏసు నందున్న వారు నూతన సృష్టి'' అనిన వాక్య రీతిగా వీరు దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో సారముగలిగిన వారై పచ్చగా అనగా ప్రకాశవంతముగా వెలుగు సంబంధులుగా దేవుని యొక్క రాయబారులుగా ఆకాశ నక్షత్రాలవలె ప్రకాశించెదరు.  ఈ సందర్భములో పచ్చగా అనగా కీర్త 1:3 లో వలె నీటి కాలువల యోరనాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును యిది యిందులోని భావము.  ప్రభువు మనలను ఆశీర్వదించి కాపాడునుగాక.

        -        -        -

        కీర్త 103:5 పక్షిరాజు యౌవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండనట్లు-మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు''.

        పక్షిరాజైన గరుత్మంతునికి అనగా గ్రద్దకు మానవునకు కొన్ని పోలికలు వున్నవి.  వెనుక చూపులేకుండ తీక్షణమైన ముందుచూపుతోనే అనగా తన కోర దృష్టితో కోడిపిల్లలనుఎంత దూరములో వున్నను, ఎవరి అండనవున్నను, తన దృక్ఫదము మార్చుకోేక ఎట్లు తన్నుకొనిపోయి తన ఆహారమును సిద్ధపరచుకొనునో-అట్లే దుష్టుడు స్వార్థపరుడు అయిన మానవుడు తన మనోవాంఛ సిద్ధికొరకు వెనుకదిరిగి తన అంతరాత్మ గద్దింపునకు వెనుదిరగక అనగా మనస్సు మార్చుకొనక తన బలీయమైన పశువాంఛలకు ఎవరి అండలో వున్నను కాలదన్ని తమ దురాశలను తీర్చుకొనుచున్నారు.  పక్షిరాజు తన యౌవ్వన బలము చేత అనగా ఱెక్కల దృఢత్వము చేత ఎంత ఎత్తులోనైనను ఎగిరి తన ఆహారమును ఆ చోట గుర్తించి కనుగొనుచున్నదో-అట్లే మానవుడు తన దురాశను తమ దుర్వ్యామోహమును తీర్చుకొనుటకెంత దూరమైనను ఆలోచన చేసి, పయనించి తమ దారికి తెచ్చుకొనుచున్నారు.  పక్షిరాజు తల్లిచాటులో గృడ్డులోని పిల్లను తన్నుకొనిపోయి చీల్చునట్లు అపుడే యవ్వనము అడుగుడి-అడుగిడనట్టి యవ్వనస్థులను అనగా మానసిక శరీర సంపూర్ణ వికాసము పరిపూర్ణముగా అందుకోలేనట్టి తల్లిదండ్రుల చాటున ఉండదగిన యౌవ్వన ఆరంభకుల యందు విషబీజములను నాటి, వారి శరీర మానసిక ఆధ్యాత్మిక వికాసమును చీల్చివేసి సంఘదురేచ్ఛేలకు - సంఘ దురాచారములకు, తాము చేయు మోస కృత్యాలకు వారిని బలిచేయుచున్నారు.  

        కృపను గూర్చి వర్తమానము

         మూలము కీర్తన 103.8  యెహోవా దీర్ఘశాంతుడు కృపాసమృద్ధి గలవాడు''.

        ప్రియపాఠకులారా!  దైవత్వములో ఎన్నో గుణగణాలను గూర్చి తెలిసికొనియున్నాము.  అట్టి గుణములలో అతి ప్రాముఖ్యతను సంతరించుకొన్నది కృప అనుగుణము. ఇది దేవుని ద్వారా తప్ప మరెవరి ద్వారాను దొరకునది కాదు.  ఈ కృప అన్నది దృశ్యమైనది కాదు.  ఇది ఆత్మ సంబంధమై అదృశ్యములో గుప్తమైయున్న గుణము.  ఇది దేవుని వద్దనుండి ఈ కృపను వరంగా పొందవలసిందే గాని, మరి ఏ విధంగాను దీనిని పొందుటకు వీలులేదు.  ఈ లోకసృష్టి యావత్తు మీదను దేవుడు తన కృపను కుమ్మరించి యుండబట్టియే ఈ సృష్టికి మనుగడ వున్నది.  మనము వ్యక్తులుగా జీవిస్తున్నాము.  దేవుని యొక్క కృప ఆదిలో అనగా పాత నిబంధన కాలములో అందరికి దేవుని చేత అనుగ్రహింపబడలేదు గాని వేదరీత్యా కొందరికే ఈ దేవుని కృప పొందుటన్నది సంభవించింది.

        ప్రియపాఠకులారా! ఆదిలో ఏదెను వనములో ఆది నరజంట జీవితము పై దేవుని యొక్క మహిమ ఆయన క్రియ ఆయన హస్తస్పర్శ, ఆయన ప్రేమ ఆయన రక్షణ, ఆయన సన్నిధానము ఇవి ఆది నరజంట జీవితములో క్రియ జరిగించాయి.  గాని ఆ నరజంట దేవుని కృపను పొందలేక పోయారు. దేవుని యొక్క కృపను పొందిన వారిలో మొట్టమొదటి వాడు యోబు  ప్రియపాఠకులారా! పాఠకులకు ఒక సందేహము కలుగవచ్చును.  ఆదాము కాలము నుండి యోబు కాలము వరకున్న జనాంగములో హానోకు నోవహు అబ్రహాము లోతు మోషే యెహోషువ వంటి ప్రవక్తలకు దేవుని యొక్క కృప లేదా?  ఒక్క యోబు కేనా? ఈ కృప అనుగ్రహించబడింది?  అనిన సందేహము కలుగవచ్చును.

        ప్రియపాఠకులారా! ఆదిలో దేవుడు ఆది నరజంటకు తనసన్నిధిని ప్రసాదించాడు.  తన మహిమలో వారిని నడిపించాడు.  తన ఆత్మీయ అనుభవాన్ని కూడా వారికి చవిచూపించాడు. ఈ విధంగా దేవుడు ఆది నరజంట పట్లను, వారి ఆత్మీయ జీవితములోను ఎన్నో మేలుకార్యాలు జరిగించినప్పటికిని జీవాత్ములైన నరుల జీవితాలను పరిశోధన వాతావరణము ఉంచినందున ఆపరిశోధన కాలము పూర్తి అయ్యేంతవరకు తన కృపను గూర్చి వారికి వెళ్ళడించలేదు గాని, తన సన్నిధిని వారితో వుంచాడు.

        ప్రియపాఠకులారా! దేవుని కృప పాతనిబంధన కాలములో ఆదాములగాయతు ఇస్సాకు వరకు గుప్తంగా క్రియజరిగించింది, అనగా దేవుడు తన మహిమను తన ఐశ్వర్యమును తన నడుపుదలను తన యొక్క ఆత్మీయతను ఆదికాండము అనగా సృష్టి ప్రారంభము నుండి ఇస్సాకు కాలమువరకు వెల్లడిపరచలేదు, గోప్యంగా వుంచాడు.  ఆదాము దేవుని మహిమను ఆయన ఆత్మలో ఒక భాగమును, ఆయన వేసిన వనములో జీవించు యోగ్యతను, ఆయన చేతి పనియైయుండి-ఆయన జీవము ఆయన ఆత్మ పూరించబడిన వాడేగాని, ఆయన కృపలో జీవించినవాడు కాదు, ఈ కృపను గూర్చిన మర్మము దేవుడు నరులకు బహుగోప్యంగా వుంచినట్లు తెలుస్తున్నది.  దేవుని కృపలో నానావిధ తలాంతులును వరాలును గుప్తమై యున్నట్లుగా ఈ సందర్భము లో మొదటి కొరింథీ 12:4-11లో కృపావరములు నానా విధములుగా వున్నవి గాని ఆత్మ ఒక్కటే'', మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే, నానా విధ కార్యములు కలవుగాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ది వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మ అనుసరించిన జ్ఞాన వాక్యమును, మరియొకనికిని ఆ ఆత్మ వలన విశ్వాసమును, మరియొకరికి ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరియొకనికి అద్భుత కార్యాలు చేయు శక్తియు, మరియొకనికి నానా విధ భాషలును, మరియొకనికి భాషల అర్ధము చెప్పుశక్తియు అనుగ్రహింపబడియున్నది.  అయినను వీటన్నిటిని ఆత్మ వలననే యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి యిచ్చుచు కార్యసిద్ధికలుగ చేయుచున్నాడు.

        ప్రియపాఠకులారా! దేవుని యొక్క కృపలో దాగియున్నటువంటి తలాంతులు వరములను గూర్చి మనమిప్పుడు తెలసికొనియున్నాము.  ఇపుడు మనము కృపను గూర్చి వివరంగా తెలిసికొందము.  దేవుడు తన  కృపను గోప్యంగా వుంచి నరులను పరిశోధించినట్లుగ ఈ క్రింది వేద భాగాల ద్వారా తెలిసికొందము.

        ప్రియపాఠకులారా! దేవుడు తన వనములో ఉంచిన ఆది నరజంటను నిషేధఫలము ద్వారా పరీక్ష పెట్టి నరులయొక్క బలహీనతను తెలిసికొన్నాడు.  అంతేగాని తన కృపను వారికి అనుగ్రహించలేదు.  అలాగే ఆది నరజంటకు పుట్టిన సంతానకాలంలో కూడా దేవుని యొక్క కృపలేదు.  హనోకు దేవునితో నడిచినాడేగాని ఆయన కృపలో జీవించిన వాడు కాదు.  అలాటే ఆది 7:లో దేవుడు ఎన్నుకొన్న నోవహు కూడా దేవుని చేత నీతిమంతుడుగ ఎన్నిక చేయబడినాడుగాని,దేవుడు తన కృపను నోవహుకు ఇచ్చినట్లుగా నోవహు చరిత్రలో వ్రాయబడలేదు. ఒక లోతు విషయములోనైతే నేమి అబ్రహాము విషయములోనైతేనేమి ఇస్సాకు విషయములోనైతేనేమి దేవుడు తన కృపను గూర్చి వెల్లడి పరచుటగాని తన కృపను వారికి అనుగ్రహించినట్లుగాని లేదు.  అయితే దేవుని కృపను పొంది, ఆ కృప ద్వారా ఫలభరితమైన జీవితమును యావద్‌ సృష్టిలో ఒక ప్రత్యేక స్థానమును సంతరించుకొన్న యోగ్యతను; అంతేగాక దేవుని మహిమ పరచేటటువంటి అర్హతను పొందిన దైవ కృప అనుభూతిని పొందినవాడు ఇస్సాకు కుమారుడైన యాకోబు.

        ప్రియపాఠకులారా! యాకోబుకు మాత్రమే దేవుడు తన కృపను అనుగ్రహించియున్నాడు.  యాకోబుతో దేవుడు చేసిన వాగ్దానము ''పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నీకు తొలగిపోదు'', ఇది దేవుడు యాకోబు తో చేసిన కృపను గూర్చిన వాగ్దానము.

        ప్రియపాఠకులారా! కీర్తన 103:11లో కృప యొక్క ఆధిక్యతను గూర్చి వ్రాయబడియున్నది.  భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది'', అయితే ఆయన యందు భయభక్తులు గల్గినవారెవరు? అన్న వ్యక్తులను గూర్చి మనము వేదములో పరిశోధిస్తే మొట్టమొదటివాడు యాకోబు ఇతను దేవుని యందు భయభక్తులు గల్గి దేవునితో ఒక రాత్రికాలమున తెల్లవారులు పోరాడి విజయాన్ని సాధించి, తన యొక్క ఆత్మీయ జీవితమును తన నామధేయాన్ని కూడా మార్చుకొని ఇశ్రాయేలుగా పిలువబడినాడు.  అంతేగాకుండ దేవుని కృప ఇశ్రాయేలును ఆవరించబట్టి ఇశ్రాయేలునుండి 12 మంది కుమారులను వారి నుండి 12 గోత్రాలను 12 వంశాలను అంతేగాకుండ వారి ద్వారా లక్షల జనాభా ఈ భూమిపై అవతరించినట్లు, వారి అందరికి దేవుని యొక్క కృప మెండుగా వుండినట్లును, దేవుని కృపా మహిమలో భాగస్వాములగుటను బట్టి ఆ జనాంగము విశ్వాసముతో జన బాహుళ్యములో జీవించుటను బట్టి దేవుని మహిమను చవిచూచారు.  అనిన సత్యాన్ని తెలిసికోవాలి.

         ఇక దేవుని కృప అనుగ్రహించబడిన రెండవ వ్యక్తి యోబు.  ప్రియపాఠకులారా!   యోబు విషయములో దేవుని యొక్క కృప ఎలాగున్నదంటే శోధకుడైన సాతానుకే శోధించుటకు అలవిగాని రీతిలో దేవుని యొక్క కృప క్రియ జరిగిస్తున్నది.  ఇందును గూర్చి యోబు గ్రంధము 1:8-10లో అపవాదికిని దేవునికిని జరిగిన సంభాషణః- నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా?  అతడు యదార్ధవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు.  భూమి మీద అతని వంటి వాడెవడును లేడు.  అని అడుగగా అపవాది-యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయెనా?  నీవు అతనికి అతని ఇంటివారికిని అతనికి కల్గిన సమస్తమునకును చుట్టు కంచెవేసితివిగదా?  నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్థి దేశములో బహుగా విస్తరించి యున్నది''. అనుటలో యోబుపట్ల దేవుని యొక్క కృప ఎంతబలముగా ఆవరించియున్నదో ఇందును బట్టి మనకు అర్థమగుచున్నది.  యోబు 42:10లో యోబు యొక్క ఐశ్వర్యము సాతాను యొక్క శోదనకాలము తదనంతరము కూడా రెండంతలుగా అభివృద్ధి చెందినట్లు వ్రాయబడియున్నది.

        అయితే ప్రియపాఠకులారా! ఇశ్రాయేలుపట్ల దేవుని యొక్క కృప సుస్థిరమైనది ఫలభరితమైనది తరగనిది లయముగానిది.  ఎందుకంటే నాటి దైవ కృపతో రూపించబడిన ఇశ్రాయేలు నాటితోనే నశించి అంతము కాకుండ, వారు విస్తరించి నేటికిని ప్రపంచ అగ్రరాజ్యాలను సవాలు చేసే స్థితిలో అభివృద్ధిలో వున్నారంటే దేవుని కృప వారి పట్ల ఎంత బలంగా క్రియ జరిగిస్తున్నదో గ్రహించాలి.  ఇది దేవుని యొక్క కృపను పొందిన పురుషుల చరిత్ర.  ఇక స్త్రీలలో లూకా 1:30లో కన్యకయైన మరియ దైవ కృపకు పాత్రురాలై దైవ పుత్రునికి జన్మనిచ్చి ధన్యురాలైంది.  కనుక ఈ కృప యొక్క ఫలితమే క్రీస్తు యొక్క జననము.

        ప్రియపాఠకులారా! దేవుని యొక్క కృప అంటే ఏమిటి?  దేవుని యొక్క కృపలో వున్న నిజమైన నిగూఢసత్యము క్రీస్తే!  అని, కన్యకయైన మరియతో గాబ్రియేలు మాట్లాడిన మాట మనకు ఋజువు''. మరియా!  భయస్థుడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి''.  అనుటలో దేవుని వలన క్రీస్తును ధరించియున్నావు.  అని అర్థము.  దేవదూత యొక్క హక్కునుబట్టి పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతియై దేవుని యొక్క కృపను నవమాసములు మోసి ప్రసవ దినములు సమీపించినపుడు ఆ కృపను భూమి మీద ప్రసవించింది.  యేసు క్రీస్తు దేవుని యొక్క కృప అనుటకు ఋజువు'', ఆయన జన్మ కాలములో ఆకాశములో కనబడినట్టి ఆ నక్షత్రము ఋజువు పరచియున్నది.  ఆవిధంగా భూమిమీద జన్మించిన దేవుని యొక్క కృపయైన క్రీస్తును మొట్టమొదట జ్ఞానులు దర్శించి శిశురూపములో ఉన్న ఆ కృపను కనుగొని కానుకలు బోళము బంగారు సమర్పించి  ఆరాధించారు.  ఈ విధంగా భూమి మీద దేవుని యొక్క కృప దినదిన ప్రవర్థమానమై విస్తరించి, ఏకత్వములో జీవించక అనేకులను తన శిష్యులగా చేసికొనుటకు ఈ కృప భూమిపై సంచారము చేస్తూ పన్నెండు మందిని తనకు ప్రతినిధులుగా ఏర్పరచుకొన్నది.  ఇక్కడనుండి క్రీస్తు కృప జరిగించుట ప్రారంభమైంది.  కనుక క్రీస్తు కృపను గూర్చి తెలిసికొందము ఎఫెసీ 1:9 ఆయన తన దయాసంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆకృపను మన యెడల విస్తరింపజేసెను.  ఇందును బట్టి దేవుని యొక్క కృప క్రీస్తయియున్నట్లు మనకు వివరంగా తెలుస్తున్నది.  ఎందుకంటే కొలస్స 1:15-20 మనము చదివినట్లయితే దేవుని యొక్క కృపయైన క్రీస్తు యొక్క ఆధిక్యతను గూర్చి ఇందులో సవివరంగా వ్రాయబడియున్నది.  ''ఆయన అదృశ్య దేవుని స్వరూపియైసర్వసృష్టికి ఆది సంభూతుడైయున్నాడు.  ఏలయనగా ఆకాశమందున్నవియు, భూమియందున్నవియు దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింసబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను.ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.  సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను.  ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువ రక్తము చేత సంధిచేసి, ఆయన ద్వారా సమస్తమును అవి భూలోక మందున్న వైనను, పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభీష్టమాయెను'',

        కనుక ప్రియపాఠకులారా! ఇంత గొప్ప మర్మము దేవుని కృపయైన క్రీస్తు వలన బయల్పరచబడు చుండగా ఇట్టి దైవ కృపయైన క్రీస్తును గర్భవతియై నవమాసములు మోసి నవమాసములు నిండిన తర్వాత లోకపాపపరిహారార్థము తన తొలిచూలు దైవకుమారుని అర్పణగా అర్పించుటలో దేవుని కృపయైన క్రీస్తును కన్నతల్లి ధన్యురాలుగా నేటికిని ఆమె యొక్క చరిత్ర సార్థకమైయున్నది.  ఇందును గూర్చి మరియమ్మ ప్రవచించినట్లు లూకా 1:49 లో మరియ పల్కిన మాట ''సర్వ శక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్నుధన్యురాలని యందురు'',  ఆయన నామము పరిశుద్ధము-ఇది క్రీస్తు కృపను గూర్చి బయల్పరచబడిన నిగూఢసత్యము.  ఈ విధంగా దేవుని కృపయైన క్రీస్తు తానేర్పరచుకొన్న శిష్యులలో తన కృపను పంచి వారందరిని లోకములో దైవ రాజ్యము కొరకు కాళ్ళు కడిగి ప్రతిష్టించి, తనబల్లలో పాలిపంపులు, అనుగ్రహించుటలో ఇట్టి క్రియ ద్వారా క్రీస్తు తన కృపను, తానేర్పరచుకొన్న శిష్యకోటికి నిష్పక్షపాత వైఖరిలో పంచిపెట్టినట్లు యేసు క్రీస్తు మరణ పునరుత్థానుడై మహిమతో తన శిష్యకోటికి కనబడి వారికిచ్చిన అభయ వాక్కులు మత్త 28:19-20 లో చదివితే ఆయన ఇచ్చిన అధికారము అభయము మనకు క్షుణ్ణంగా తెలియగలదు'', కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏయే సంగతులు ఆజ్ఞాపించితినో వాటనన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.  ఇదిగో నేను యుగసమాప్తివరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను'', అటు తర్వాత దేవుని కృపయైన క్రీస్తు యొక్క ఆత్మ తన శిష్యకోటిని ఆవరించి క్రీస్తు చేసిన అద్భుత కార్యాలు ఆయన శిష్యులు కూడా చేసినట్లుగ పేతురు యోహాను విషయాలలో మనకు తెలుసును.  అనగా పేతురు చేసిన అద్భుతాలు రోగులను స్వస్థపరచుట, మృతులను సజీవులుగా లేపుట, క్రీస్తు యొక్క ప్రధాన అపొస్తలులుగ ఎంచబడుట.  కనుక దేవుని కృపయైన క్రీస్తు ద్వారా ప్రభువు యొక్క శిష్యులు ఆయన యొక్క వారసులుగాను ప్రతినిధులుగాను అపొస్తలులుగ ఏర్పరచబడి అపొ 20:24 దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు'', కనుక అపొస్తలుల ద్వారా నేటి విశ్వాసుల మైన మనకు అనుగ్రహించబడిన దేవుని యేసు కృపయే సువార్త అనగా సువార్త దేవుని యొక్క కృప యొక్క క్రీస్తు-దేవుని యొక్క కృపయైయున్నాడు.  ఆ కృప సువార్తయైయున్నది.  కృపాసువార్త రెఫః సువార్త అనగా వాక్యము యెహా 1:14 ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా జన బాహుళ్యములో జనుల మద్య జీవించి, క్రియ జరిగించింది.  కనుక సమస్తమును దేవుడు తన కృపయైన క్రీస్తులో  గుప్తపరచియున్నట్లుగ ఇందుమూలముగా గ్రహించ వలసియున్నది.  ఇందునుబట్టి దేవుని యొక్క కృప నేటి విశ్వాసుల మైన మనకు అనుగ్రహించబడకపోతే మన విశ్వాసము వ్యర్ధమే! మన భక్తి వ్యర్థమే!  మన ఆరాధన వ్యర్థమే, మన ఆత్మీయ జీవితము వ్యర్థమే!  అందుకే పౌలు అంటున్నాడు.  ఎవనియందైనను  క్రీస్తు ఆత్మ లేకపోతే  వాడు ఆయన వాడు కాదు. కనుక ప్రియపాఠకులారా!  క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.  గలతీ 3:27 లో వ్రాయబడుటలో దేవుని కృపలో బాప్తిస్మము పొందిన మనము దేవుని కృపయైన క్రీస్తును ధరించుకొని యున్నామన్న సత్యాన్ని ఈ వాక్యము మనకు బోధిస్తున్నది.  అందుకే పౌలు ఫిలేమోనుకు లేఖను వ్రాస్తూ 1:3లో ఈ క్రింది విధంగా ఆశీర్వచనాలు పలికినాడు''. మన తండ్రియైన దేవుని నుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు కృపయు సమాదానమును మీకు కలుగునుగాక!

        కనుక ప్రియపాఠకులారా! నేటి మన క్రైస్తవ జీవితములో మన ఆరాధన కార్యక్రమాల ముగింపులో సంఘకాపరి సంఘమును ఆశీర్వదిస్తూ పలికే ఆశీర్వాదపలుకులు ఈ క్రింది విధంగా ఉంటాయి''.  తండ్రియైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీకెల్లప్పుడును తోడై యుండునుగాక! '' అనుటలో తండ్రియైన దేవునిలో ప్రేమ ఉన్నది. ఎందుకనగా యోహా 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కనుక దేవుడు ప్రేమామయుడని తెలుస్తున్నది.  ఇక దైవ కుమారుడైన క్రీస్తు దేవుని కృపయైయున్నాడు.  కనుక ఆయన కృప మన కెల్లరికి మనతో కూడా ఎల్లప్పుడు వుండుట అవశ్యము.  ఇది కృపను గూర్చిన వివరణ.  ఇందును బట్టి దైవత్వములో మొదటిది ప్రేమ 2వది కృప అనగా మానవునిపై దేవునికున్న ప్రేమను తన కృప ద్వారా మనకు వెల్లడిపరచుచున్నాడు.  అనగా దేవుడు నేటి నరులమైన మనకు తన ప్రేమతో బాటు కృపను కూడ అనుగ్రహించి యున్నట్లు ఇందును బట్టి మనకు తెలుస్తున్నది.  అంతేగాకుండ వీరిరువురుతో సర్వలోకము సమాధాన పరచబడాలంటే వీరిరువురితో లోకము-లోకముతో వీరిరువురును సమాధానకర స్థితిలో వుండాలంటే పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసులలో ఏర్పడే అన్యోన్యసహవాసము అతి ప్రధానమై యున్నట్లు ఇందును బట్టి మనకు తెలుస్తున్నది.  సహోదరులలో అన్యోన్య సహవాసము లేకున్నట్లయితే పరిశుద్ధాత్మ తో వారి సావాసము కలుగుటన్నది అసంభవము.  కనుక సహోదరులు ఐక్యతగల్గి జీవిస్తేనే అట్టకూటమిలో పరిశుద్ధాత్మ కూడా ఆవరించి క్రియజరిగిస్తాడు. పై విధంగా దైవత్రయములోని త్రివిధక్రియల మూలంగా జీవాత్ముడైన  నరుని యొక్క జీవితములో శాంతి సమాధానము ఆరోగ్యము, లోక అరిష్టాల నుండి పిశాచక్రియలనుండి విమోచన రక్షణ కాపుదల ఎల్లప్పుడు ఉండి-అట్టివాని జీవితము దైవత్వమునకు యోగ్యమును మానవత్వమునకు ఆదర్శమునై యుండి దైవసన్నిధిలో జ్యోతిగ ప్రకాశిస్తాడు.

        అంశముఃకృపః-

         కీర్త 103:1118 భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా వున్నదో-ఆయన యందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా వున్నది.  ఆయన కృప యుగయుగములు నిలుచును.        

        ప్రియపాఠకులారా!         ఇంతవరకు మనమెన్నో విషయాలు నేర్చుకొనియున్నాము.  ఎన్నోవేదసాహిత్యాలు మనము చుదువుచున్నాము.  వాటిని గూర్చిన పరమార్థమును మననము  జేసికొంటున్నాము.  అలాగే దైవసన్నిధిలో అతిముఖ్య పాత్ర వహించిన దేవుని కృపను గూర్చి ఇపుడును మనము తెలసికొందము.  అందుకే రెండవ కొరింధీ 12:9లో పౌలు మహాశయుడు-''నా కృప నీకుచాలును'', బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ప్రభువు తనతో చెప్పినట్లుగా వివరించియున్నాడు.

        ప్రియపాఠకులారా! లోకరీత్యా మనము సాటి నరుల ద్వారా కనికరమును దయను సహకారాన్ని సహాయాన్ని పొందగలుగుచున్నాము.  కాని కృప అన్నది నరుని ద్వారా లభ్యమయ్యేది కాదు.  కృప అను వరమునకు చాలా ప్రాముఖ్యత వున్నది.  సర్వ సాధారణముగ లోకరీత్యా క్రైస్తవులమైన మన జీవితములో ఆదివారపు ఆరాధనలలో ఆరాధన కార్యము ప్రసంగకార్యము కానుకల కార్యక్రమము అయిన తర్వాత చివరిప్రార్థనానంతరము సంఘఫాదరీ! లేక కాపరి సంఘమును దీవిస్తూ-తండ్రియైన దేవుని ప్రేమ, ప్రభువైన ఏసు క్రీస్తు కృప పరిశుద్ధాత్ముని అన్యోన్యసహవాసము మీ అందరిమీద నుండును గాక!  అని అనుట మనము వింటున్న సాదారణపు దీవెన మాటలు.

        ప్రియపాఠకులారా! పై దీవెనెలో తండ్రియైన దేవుని ప్రేమ-ప్రభువైన ఏసు క్రీస్తు కృప'', అనుటలో కృపకున్న ప్రాధాన్యత ఏమిటో మనము తెలిసికొందము.  మొదటిగ యోహాను 3:16 దేవుడు లోకము నెంతో ప్రేమించెనని వ్రాయబడియున్నది.  ఇందునుబట్టి  పాదిరీ నోటినుండి వచ్చిన మొదటి మాట -''తండ్రియైన దేవుని ప్రేమ మనకు వెల్లడియగుచున్నది.  తండ్రియొక్క ప్రేమ కేవలము ఒక వ్యక్తి మీదనే గాదు లోకమంతటిమీద ఆయన ప్రేమ కనబడుచున్నది.

        ప్రియపాఠకులారా!  తండ్రియైన దేవుడు లోకము మీద ఒక్కప్రేమను మాత్రమే గాక లోకమునకు పాప మరణమను మహోప్రదవమునుండి తప్పించుటకు  లోకమునకు అనుగ్రహించిన నరాకృతిలో నరులమద్య నివసించిన ఏసు క్రీస్తు ప్రభువే దేవుని కృపయైయున్నాడు.  ఇందుకు ఋజువు యోహా 1:14లో మనము చదివితే తేటతెల్లముగా గలదు.  అదేమిటంటే'' ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణడుగా మనమధ్యనివసించెను'', అనుటలో ఆదిలో వాక్యమైయున్న దేవుడు తన ప్రేమను లోకమునకు కనపరచుటకై వాక్యరూపమైయున్న తన రూపము ద్వారా లోకమును తన వైపు ఆకర్షించుటకు అనగా త్రిప్పుకొనుటకు, లోకస్థులకు తనకృపను వెల్లడిచేయుటకు - కృప అన్నది కంటికి కనబడనిది గనుక కృప అను వరము అన్నది సృష్టములు గ్రహించలేవు గనుక, దైవాత్మలో భాగస్వామియైన జీవాత్ముడైన నరుడు దాన్ని గ్రహించగలడు గనుక తన కృపకు నరరూపాన్ని ఇచ్చి అనగా శరీరమును ఇచ్చి, అంతేగాకుండ కృపతో కూడా సత్యమును జోడించి భూమిపె  నరాకృతిలో వెలిసిన కృపను సత్యసంపూర్ణునిగ జేసి నరుల మధ్య నరాకృతిలో సంచరింపజేశాడు.  ఇదియే దేవుడు నరులకు అనుగ్రహించిన కృపావరము యొక్క వివరణ.                చిత్రమేమిటంటే పరిశుద్ధగ్రంథమంతటిలో దేవుని యొక్క కృపను పొందినవారు-ఎవరయ్యా!  అంటే యెష 54:10లో పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు.  యెష 54:8 నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును.  ప్రియపాఠకులారా!  ఇది తండ్రియైన దేవుడు ఒక పట్టణమునకు అనుగ్రహించిన ఆదరణ వాక్కులు.

        ప్రియపాఠకులారా!  దేవుని కృపను కృపను పొందినవారెవరు? దేవుని కృపను పొందుటకు ఎట్టి అర్హతలు కావలెను? దేవుని యొక్క కృప పాతనిబంధన కాలములో ఏ విధముగా క్రియజరిగించింది? నూతన నిబంధన కాలములో ఏ విధముగా క్రియ జరిగించింది?  అపోస్తలుల కాలములో ఏవిధముగా క్రియజరిగించింది?  నేటి ఆధునిక యుగమైన అంత్యకాలములో అనగా ప్రభువు రాకడ సమయములో దేవుని కృప జరిగించు పని ఏమిటో మనము తెలిసికోవలసియున్నది.  ఇప్పుడు   పై వాటిని గూర్చి సక్రమంగా మనము వేదరీత్యా తెలిసికొందము.        

(1)దేవుని కృపను పొందిన వారెవరు?

        ప్రియపాఠకులారా!  ఆదాము లగాయతు అబ్రహాము వరకు దేవుని కృపను పొందిన వారులేరు.  ఈ మాట పాఠకులకు విడ్డూరంగా లేదా?  అవును విడ్డూరమే?  ఆదాము దేవుని ఆత్మను పొందిన వాడు.  దేవుని కృపను పొందలేదు. అలాగే ఆదామునకు సాటిసహాయముగా దేవుడు నిర్మించిన స్త్రీకూడా -దేవుడు ఆదాము పట్ల కనికరించి అనుగ్రహించిన జంటగా స్త్రీ వున్నది గాని దేవుని కృపను బట్టి ఆ స్త్రీ నిర్మింపబడలేదు.  దేవుడు హనోకును తనతో తీసికొని వెళ్ళినపుడు హానోకు దైవ విశ్వాసముతో దైవమార్గంలో దేవునితో నడువగల్గినాడంటే ఆయన కృపను బట్టి నడిచిన వాడు కాదు.

        అలాగే లోతు విషయములో ఆలోచిస్తే లోతు దేవుని యొద్దనుండి పంపబడిన దూతల ద్వారా సొదమ పట్టణము నుండి రాగలిగి నాడే గాని ఆయన కృప ద్వారా వచ్చిన వాడుకాదు.  లోతు దేవుని ద్వారా పొందినది కనికరము గాని కృపకాదు.  అలాగే అబ్రహాము విశ్వాసము ద్వారా తన యొక్క క్రియాకర్మలను బట్టి దైవత్వము ఎదుట యదార్ధ ప్రవర్తన గల్గి జీవించుటను బట్టి దైవాశీర్వాదాలు పొందినాడేగాని కృప పొందలేదు.  ఈ విధముగా పాత నిబంధన కాలములో ప్రవక్తలు గాని రాజులు గాని దీర్ఘదర్శులుగాని దేవుని ఏర్పాటులోను ఆయన ఆత్మావేశము ద్వారా లోకములో జీవించారే గాని ఆయన కృపను బట్టి జీవించిన వారు కాదు. మోషే అహరోనులు కూడా దైవ మార్గములో నడిచారేగాని దైవ కృపలో నడిచిన వారు కాదు.  ఎందుకంటే ఇశ్రాయేలు దప్పిక దీర్చుటకు మోషేను దేవుడు తాక మనిన బండ యొక్క పరమార్థాన్ని మోషే గ్రహించలేక పోయాడు.  ఆ బండ దేవుని కృపయైన క్రీస్తునకు సాదృశ్యమైయున్నది.  అనేకుల దప్పికను దీర్చింది, వారి నీటి కొరతను కూడా దీర్చింది.  అట్టి దేవుని కృప బండ రూపములో వున్న సంగతిని మోషే గ్రహించలేకపోయాడు.  ఇందునుబట్టి 12 మంది గోత్రీయులైన ఇశ్రాయేలుకు దేవుని యొక్క కృప బాహ్యంలో వుండి క్రియ జరిగించింది.  అనగా వారిలో కృపలేదు.  ఏ విధముగా ఐగుప్తు ఫరో చెరనుండి వారు విడుదల పొంది ఎఱ్ఱ సముద్రము దాటునపుడు దేవుని యొక్క కృప-పగలు మేఘస్థంభము గాను రాత్రి అగ్ని స్థంభము గాను సంచరించినట్లున్నదే గాని - వారిని ఆవరించినట్లుగా లేదు.  పాత నిబంధన కాలమంతటిలోను దేవుని యొక్క కృప భూమిమీద నరాకృతిలో సృష్టింపబడుటకు దావీదు వంశము-ఇశ్రాయేలు 12 గోత్రాలలో యూదాగోత్రము - ఈ గోత్రీకురాలైన కన్యకయైన మరియ అను ఈ ఒక్క స్త్రీనే దైవ కృపను గర్భము దాల్చుటకు నవమాసములు మోయుటకును, ఆ విధముగా మోసిన ఆ కృప భూమిపై నరాకృతిలో ప్రసవింపబడుటకును ఆ విధముగా ప్రసవింపబడిన ఆ యొక్క బాల రూపమును తన పాలతో పెంచి పోషించుటకును, ఆ కృపయైన నరాకృతికి తాను తల్లిగా లోకములో ఏర్పడుటన్నది, దేవుని యొక్క ప్రణాళిక దేవుని చిత్తమైయున్నట్లు లూకా 1:30-34 లో ఈ విధముగా మనము చదువగలము.  మరియా! భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి,  కుమారుని కని ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువు''. అందును బట్టియే నేటి ప్రపంచములోని సకల నరకోటిలో అన్నితరములవారును ఆమెను లూకా 1:49 లో వలె ధన్యురాలుగా ఎంచబడియున్నది.

        ఈ విధముగా దేవుని కృప మరియమ్మ ద్వారా భూమిమీద వెలసింది.  నరరూపములో అవతరించి విమోచకునిగ రక్షకునిగ ఏర్పడింది.  ఎపె 2:4-8 దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై యుండినపుడు సైతము మన యెడల చూపిన తన మహప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను.  కృప చేత మీరు రక్షింపబడియున్నారు.  క్రీస్తు ఏసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహోదైశ్వర్యము చేత పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను'', కృప చేతనే రక్షింపబడియున్నాము.  కృప అన్నది దేవుని వరము. ఈ కృపావరమును గూర్చి 1కొరింధీ 12:4-11 వ్రాయబడిన లేఖన భాగములో కృపావరములు నానా విధములుగా వున్నవి గాని ఆత్మ ఒక్కడే!  పరిచర్య నానావిధములు గాని ప్రభువు ఒక్కడే!  ఆత్మ మూలముగ బుద్ధి వాక్యము, ఆత్మ ననుసరించి జ్ఞానవాక్యము ఆత్మవలన స్వస్థపరచువరము అద్భుతములు చేయు శక్తి అనుగ్రహించుచున్నాడు'', అని వ్రాయబడివున్నది.

                వెదకుట                

        మూలముః- కీర్తన 105:4 యోహావాను వెదుకుడి, ఆయన బలమును సన్నిధిని వెదకుడి, యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయన సమీపములో నుండగా ఆయనను వేడుకొనుడి. యెష 55:6

        ప్రియపాఠకులారా!  యిందులో మొదటిదిః యెహోవాను ఆయన బలమును ఆయన సన్నిధిని వెదకమని వ్రాయబడియున్నది.  రెండవదిగా యెహోవా దొరకు కాలములో ఆయనను వెదకమని ఆయన సమీపములో వుండగా వేడుకొనమని ప్రవచింపబడియున్నది.  యిందులో యెహోవాను వెదకుటకు మొదట ఆచరించవలసిన విధానమును మనము తెలిసికోవలసియున్నది.  వేదరీత్యా యెహోవాను వెదకినవారు ప్రవక్తలు తప్ప మామూలు జనాభా కాదు.  అంటే యెహోవాను వెదకిన మొట్టమొదటి ప్రవక్త మోషే.  ఈయన దైవ జనాంగమైన ఇశ్రాయేలు పక్షముగా వుండి వారి యొక్క అవసరతలను వారి సమస్యలను తీరుస్తూ దేవుని చిత్తానుసారముగా దైవ మార్గాన్ని అన్వేషిస్తూ ఆయన వాక్కు కొరకు కనిపెట్టుచూ దేవుని వెదకినట్లు వేదములో చదువగలము.

        యిందులో ఒక అమూల్యమైన విషయమేమిటంటే మోషే దేవుని వెదుకక పూర్వము దేవుడు తన జనాంగమునకు సంభవించిన శ్రమలు ఐగుప్తు దాస్యపు చెరనుండి విడిపించుటకు యోగ్యుడైన వ్యక్తిని దేవుడు వెదకినాడు.  అయితే దైవ ప్రయత్నమన్నది బహు సులభముగా కార్యరూపము దాల్చింది.  ఎట్లంటే దేవుడు తన జనాంగ రక్షణార్థము  అన్నివిధముల యోగ్యత కలిగిన వ్యక్తిని కోరుకున్నాడు.  తాను అనుకున్న వ్యక్తి పరిశుద్ధ పర్వతమైన యోరేబును సమీపించి గొర్రెల మందను మేపుటన్నది దేవుని ప్రయత్నములో తొలి విజయమునకు నాంది పల్కింది.  అటు తరువాత యెహోషువా సమూయేలు ఎలీషా వగైరాల విషయములో మొట్టమొదటగా దేవుడు వీరిని వెదకినట్లును అటు తర్వాత ప్రతి విషయములోను ఈ ప్రవక్తలు దేవుని పిలుపును దైవ ఆజ్ఞను గూర్చిన విచారణ చేసినట్లు వేదములో చదువగలము.  ఈ విధముగా దైవత్వమును అన్వేషించిన వీరి జీవితాలలో గొప్ప చరిత్రను సంతరించుకొన్నారు.

        ఇక యెహోవా బలమును వెదకిన వారిలో మొట్టమొదట గిద్యోను, యెహోవా బలము మూలముగా గిద్యోను ఏ ఆయుధము లేకుండా కుండదివిటి బూర''వీటి ద్వారా లెక్కకు యిసుక రేణువులవలె మించిన మిద్యానీయుల సైన్యమును ఎదుర్కొని వారిని చిన్నాభిన్నము చేసి చంపినట్లు న్యాయాధిపతుల గ్రంధములో చదువగలము.  యిది యెహోవా బలాధిక్యతను గూర్చిన వివరము.  మరి ఎక్కువగా చెప్పాలంటే ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు సంభవించిన యుద్దాలలో యెహోవా యొక్క బలము.  ఇశ్రాయేలు పక్షము వహించి వారికి విజయాన్ని చేకూర్చినట్లుగా వేదములో చదువగలము. ప్రియపాఠకులారా!  యిది యెహోవా బలాధిక్యతను గూర్చిన వివరము.

        యిక ఆయన సన్నిధిని వెదకుటః- యెహోవా సన్నిధిని నిత్యము వెదకిన వారిలో ప్రధముడు మోషే-మోషే' నిత్యము దేవుని యొక్క సన్నిధిలో గడిపినట్లు ఒకే మారు 40 దినములు ఇశ్రాయేలుకు కనుమరుగై సీనాయి కొండమీద దేవుడు మోషేతో సంభాషించినట్లు చదువగలము.  యెహోవా సన్నిధిని నిత్యము వెదకిన వారిలో మోషే ప్రధముడు, యోబు రెండవ వాడు అహరోను మూడవ వాడు.  ఆయన సన్నిధిని నిత్యము కనిపెట్టిన స్త్రీలలో మొదటిగా హన్నా ఆయన సన్నిధిలో వెదికి ఆయనతో పోరాడి విజయాన్ని సాధించిన ఘనత యాకోబుకు ప్రాప్తించింది.

        ప్రియపాఠకులారా!  యెహోవా సన్నిధిలో ఆయన యొక్క ప్రభావ మహాత్యములను లోక సంబంధమైన కలిమి బలిమి గాక దైవాశీర్వాదము కొరకు కేవలము ఆత్మ సంబంధమైన కలిమి నాసించి విజయుడైనట్టివాడు యాకోబు.  బైబిలులో పాత నిబంధనలోని భక్తుల చరిత్రలలో యాకోబు చరిత్ర ఆశీర్వాదకరమైనది.  ధన్యవంతమునైయున్నది.  ఎట్లంటే దేవుడు యాకోబుకు యిచ్చిన ఆశీర్వాదము అది పాత నిబంధనలో సమసిపోక నూతన నిబంధనలోను అపోస్తలుల కాలములోను పరిశుద్థాత్మ యుగములోను నేటి ఆధునిక యుగములోను యాకోబు చరిత్రకు సాక్ష్యాధారముగా ఇశ్రాయేలు అను పేరు చిరస్థాయిగా ఒక ప్రత్యేకమైన రాజ్యముగా మన మద్యవున్నది.  నేటికిని నాటి యాకోబు యొక్క సంతానము ఇశ్రాయేలుగా దైవత్వము చేతఎన్నిక చేయబడి యెహోవా దేవుని యొక్క ప్రత్యేక జనాంగమనుటకు సాక్ష్యాధారముగా మన మధ్య వున్నది.  ఈ విధముగా ఆయన సన్నిదిని వెదకి ఆయన సన్నిధిలో ఆయన ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా మొరపెట్టి కార్యసాఫల్యత జరిగించుకొన్న జనాంగముగ ఇశ్రాయేలు వున్నది.

        ప్రియపాఠకులారా!  పాత నిబంధన నాటి కాలములో ధర్మశాస్త్రయుగములో ప్రవక్తలుగాని రాజులు గాని చక్రవర్తులుగాని న్యాయాధిపతులుగాని దైవత్వమును మొట్టమొదట విచారిస్తేనే తప్ప తమంతట తాము స్వజ్ఞానముతో ఏ పనిగాని ఏ తీర్పు గాని ఏ కార్యమును గాని జరిగించే పద్దతి లేదు.  ప్రతి విషయములోను దేవుని సన్నిధానమును ఆనాటి జనాంగము అభిలషించెడివారు.  దేవుని సన్నిధిగా పరిశుద్ధ గుడారము అందులోని బలిపీఠము, సన్నిధి బల్ల, సన్నిధి రొట్టెలు సన్నిది అర్పణలు, సన్నిధి కానుకలు సన్నిధిలో ఆరాధన వగైరా రీతులుగ దైవారాధన కార్యక్రమాలు జరిగించెడి వారు.  దేవుని సన్నిధియంటూ ప్రత్యేకముగా వెదకుచు అందుకు అనువైన స్థలములో గుడారమును నిర్మించి అందులో దేవుని సన్నిధియంటూ ఒక ప్రత్యేకమైన స్థలమును ఏర్పరచి అందులో కూర్చుండి దైవ సన్నిధిగా భావించి అందులో నుండి దైవ విజ్ఞాపన చేసెడివారు.        

        ఈ విధముగా దేవుని సన్నిధిని నిత్యము కోరిన వారిలో మొట్టమొదటిగా హనోకు, యితడు నిత్యము దేవుని సన్నిధిని కోరి దేవునితో నడిచి దైవ సావాసములో దైవాన్వేషణలో తన జీవితాన్ని గడుపుతూ శారీరాత్మలతో దేవుని చేత కొనిపోబడి అనగా ఆకాశమునకు ఎత్తబడి నరులకు కనుమరుగైనట్లుగా ఆదికాండములో హనోకు చరిత్ర వివరిస్తున్నది.  యిది దేవుని సన్నిధిని కోరి సత్సంబంధమైన ఆత్మీయ ఫలితాలను లోక సంబంధమైన అక్ష్యతలను పొందిన వారి యొక్క వివరము.        

        ఇక యెహోవా దొరకు కాలము నందు ఆయనను వెదక మంటున్నాడు.  యెహోవాను వెదకిన వారిలో మొట్టమొదటి వారిలో హేబేలుః- ఇతను దేవుడే తన కిచ్చినటువంటి పశుపక్ష్యాదులలో నిష్కపటమైన నిర్మలమైన మనోస్థితిలో దైవ ప్రత్యక్షత పొందాలని అనగా ఆయనను చూడాలని తన బలిని ఆయన స్వీకరించాలని తన ప్రధమ పశుగణ అర్పణల ద్వారా యెహోవాను వెదకినాడు.  యిక రెండవవాడు దైవత్వాన్ని కనుగొనాలని దైవాశీర్వాదాలు పొందాలని ఆయన బిడ్డగా లోకములో ఎన్నిక కావాలని ఆయనను వెదకి ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకొన్నట్లు సమూయేలు నెహెమ్యా దానియేలు వగైరాల చరిత్ర వేదములో సాక్ష్యాధారముగా వున్నది.

        నిజమైన వెలుగు దాని ప్రభావము

        కీర్తన 116-12 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయన కేమి చెల్లింతును? ప్రభువునందు ప్రియమైన వారలారా!  పై వేదభాగమును గూర్చి మనము ధ్యానించుటకు ముందు మనము మన పితరులు మనకేమి చేసిరో మనము మన బిడ్డల కేమి చేస్తున్నాము? అన్న దానిని గూర్చి ఒక్క సారి ఆలోచించవలసియున్నది.

        మన పితరులు మనకు ఇల్లు పొలము స్థలము విద్య ఉద్యోగము వస్తువాహనాలు ఆభరణాలు బ్యాంకిలో దాచిన ధనము వీటన్నిటితో బాటు మనము చేసే ఉద్యోగము.  అటు తర్వాత వివాహము వగైరా రూపములుగా కార్యములు మనకు చేసియున్నారు.  ఏమిలేని భిక్షగాడు కూడా తన బిడ్డలకు తాను అడుక్కొని తిను భిక్షాపాత్ర తనజోలె తన చేతికర్ర ఇచ్చి తన మరణ కాలంలో ఊరిలో అడుక్కొని తినడానికి మార్గమేమిటో తన బిడ్డలకుపదేశించి ఏయే స్థలాలో? ఏయే సందర్భాలలో ఏవిధంగా ధర్మదాతలను మబ్యపెట్టి వారి హృదయాలను కరగించి ధనార్జన చేయాలో అన్న దానిని ఉపదేశించి నేర్పించి తన జన్మను సార్ధకం చేసికొంటున్నాడు.  మనము కూడా మన బిడ్డలకు ఆరోగ్యము విద్య బ్రతుకుదెరువు కావలసిన గృహవసతిః లోకములో వంశగౌరవమర్యాదలు కాపాడుటకు కావలసిన పరిజ్ఞానము నేర్పి బిడ్డలను విద్యావంతులుగాను ఉద్యోగస్థునిగాను ఆరోగ్యవంతులుగాను గుణవంతులు గాను వుండుటకు మరియు వంశ మర్యాదలు దేశము యొక్క కీర్త్తిని నిలబెట్టుటకు సంతానవంతులుగాను పరువు ప్రతిష్ఠలు గలవారిని గానుః బ్రతికినంత కాలము పితరులు చేసిపోయిన మేళ్ళు తలపోసుకుంటు వారి జీవన యాత్రను సాగించువారుగాను చేస్తున్నాము.

        అయితే యావద్‌ సృష్టికిని సృష్టి కర్తయైన దేవుడు తన బిడ్డలైన యావద్‌ ప్రజాకోటికిని ఏమిజేసినాడు?  అన్న దానిని గూర్చి మనము తెలిసికోవాలంటే మన వయసు మన జ్ఞానము మన ఆయుష్కాలము కూడా గ్రహించలేనంత ఆధిక్యతను  పొందియున్నది. ప్రభువునందు ప్రియ సోదరీ!సోదరా!  ఒక్క కుటుంభంలోని  తల్లిదండ్రులు తమకు కలుగబోవునట్టి కొద్దిపాటి సంతాన మనుగడకెన్నో పగటికలలుకని ఎన్నోరీతులుగా గాలి మేడలు ఱాతిమేడలు భవనాలు తోటలు పొలాలు ఇవిగాక, వస్తువాహనాలు ఆభరణాలు లక్షలకొలదీ బ్యాంకిలో నిల్వవేసిన ధనాన్ని తమ సంతానం కోసం స్వాస్థ్యంగా ఏర్పాటుజేస్తున్నాము.

        అయితే లోకము అంతటిమీద విస్తరించి యున్న జన బాహుళ్యమునకు తండ్రియైన దేవుడు తన బిడ్డలైన నరులకు ఏదో చేశాడని దైవ వాక్యము వివరిస్తున్నది.  కీర్తన 116-12 మరియు కీర్తన 103:2 నా ప్రాణమా!  యెహోవాను సన్ను తుంచుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము.  అని వున్నది.  సోదరా!సోదరీ!  పై వాక్యముల వివరణను బట్టి యెహోవా జేసిందేమి? ఆయన చేసిన ఉపకారాలేమి? ఇవి కేవలము వాక్కు రూపంగా వున్నాయా? లేక క్రియా రూపంగా వున్నాయా?  మరి ఈ విధంగా క్రియ జరిగించిన దేవుని పట్ల మనమేవిధంగా కృతజ్ఞత చూపాలి.  ఆయననేవిధంగా పూజించాలి.  ఆయనకు మనము చేయవలసిన సత్కారమేమి?  ఆయన పట్ల మనము చూపవలసిన కృతజ్ఞత ఏమి?  ఆయననుమనము పూజించాలనియా? లేక ద్వేషించాలా?  అయితే మనమేమిచేస్తున్నాము?  మన ఆశయాలు మన ప్రయాసలు మన ఆరాధనలు మన ఆచారాలు ఏయే రీతులుగా క్రియజరిగిస్తున్నవి.  ఇంతకు ఆయన చేసిన మేళ్ళు ఉపకారాలు ఏయే రూపాలుగా వున్నాయి?  అట్టి దేవుని పట్ల మనము ప్రవర్తించవలసిన విధానమెట్టిదో వేదవాక్యముల ద్వారా తెలిసికోగలము.

        ప్రభువునందు ప్రియమైన వారలారా!  దేవుడు చేసిన మొట్టమొదట క్రియ జలరాసులలో గుప్తమై యుండి జడపదార్ధముగ నిరాకారముగ శూన్యముగా వున్న భూమిని ఒక ఆకారంగా ఏర్పరచి వాక్కుతోనే దేవుడు తన క్రియాసంకల్పమును సృష్టి పై జరిగించినట్లు ఆదికాండ మొదటి అధ్యాయంలో మనము చదువగలము.  అటు తర్వాత నరనిర్మాణములో దేవుడు కేవలము వాక్కుతో గాక తన స్వహస్తములతో క్రియ జరిగించి నరులమైన మనలను తన సన్నిహితులుగాను తన రాజ్యవారసులుగాను తన ఆత్మలో భాగస్వాములుగాను జేయనెంచి భూమితో లౌక్యమేర్పరచుకొని అట్లు భూమిలో నుండి తీయబడిన మట్టితో తన హస్తములతో నరాకృతిని చేసి అట్లు తీయబడిన ఆ ప్రతిమను తన స్వాస్థ్యమన్నట్లుగా ఆ ప్రతిమ యొక్క నాసికారంధ్రములలో తన జీవాత్మను ఊది నరనిర్మాణము గావించుటన్నది నరుని పట్ల దేవునికున్న ప్రేమ ఎంత గాఢమైనదో అన్న విషయాన్ని ఆదికాండ రెండవ అధ్యాయం ఋజువుపరచుచున్నది. అంతియే గాక తన హస్తనిర్మితుడైన నరుని కొరకు తాను ఉచితంగా అనుగ్రహించిన వాతావరణము ఆహ్లాద కరమైన ఉద్యానవనమగు ఏదెను తన సృష్టిలోని వాని మనోల్లాసము కొరకు తాను సృష్టించిన పక్షిజాలము జంతుజాలము మృగసందోహము వృక్షజాలము ప్రశాంతమైన వాతావరణము వీటన్నిటికంటె అమూల్యమైన తన సన్నిధి నుంచుటనునది మానవుని పట్ల దేవునికున్న ప్రేమ యొక్క విలువ ఋజువుపరచుచున్నది.  ఈ విధంగా చేసిన దేవుడు తన సృష్టియైన నరుని ఒంటరిగా విడిచిపెట్టక వాని కొరకు ఒక జంటను గూడ ఏర్పరచి, ఆ నరజంట దైవ ఉద్యానవనమైన ఏదేనులో విహరించు సందర్భమును దేవుడు చూచి ఎంతో సంబరపడిపోయినట్లు కూడా మనము గ్రహించవలసియున్నది.  ఇది యెహోవా మన పట్లజేసిన తొలికార్యము.

        ఇక రెండవ కార్యముః ఇట్లు దేవుని ప్రేమలో వున్న నరజంట కృతజ్ఞత లేనివారై సర్పవిశ్వాసులుగా మారి దోషులు కాగా దేవుడు నరజంటను శపించి, తన స్వాస్థ్యము లోనుండి వారిని వెళ్ళగొట్టు సందర్భంలో కూడా నరునిపట్ల తన కున్న ప్రేమను చంపుకొనలేక చర్మపు దుస్తులతో నరుల నలంకరించి, రానున్న నూతన నిబంధన కాలంలో ఆ నరజంట మూలంగా విస్తరించు నరకోటి పాప పరిహారార్థం తాను బలిపశువుగా వధించబడి భవిష్యత్తు లోని నరకోటి యొక్క పాపమునకు పరిహారముఃపాపికి రక్షణ; అపవాది సామ్రాజ్యమునకు అపజయము గల్గించెదనని జరిగించిన వాగ్దానక్రియగా ఈ చర్మపు దుస్తుల యొక్క రహస్యము ఇందులో అణగారియున్న దైవనిగూఢ సత్యక్రియ నిరూపిస్తున్నది.

        ప్రభువునందు ప్రియసోదరీ!సోదరా!  దేవుని యొక్క క్రియ మానవుని క్రియవలె మాటలతోను మాయలతోను మోసము టక్కరితోను కూడినదికాదు.  ఆయన ఏదైతే చెప్పినాడో అది చేశాడు.  మనము ఏదైతే చెప్తున్నామో అది చేయలేక పోవుచున్నాము.  మనము దేనిని గూర్చియైతే వాగ్దానం చేస్తామో దానిని నెర వేర్చలేకపోవుచున్నాము.  దేవుడట్లు కాదు.  వాక్కుతోనే సృష్టిని చేశాడు.  క్రియ ద్వారా మనిషిని చేశాడు.  ఆది నరజంటకు చేసిన వాగ్దానం ద్వారా వాగ్దాన  పుత్రుని అనుగ్రహించాడు.  ప్రవక్తల నోట పల్కించిన వాక్కుల ద్వారా నరకోటిలో విజృంభించిన పాపమునకు తానొక రక్షకుడుగ ఈ లోకములో జన్మించి,వాక్కులతో దయ్యాలను రోగాలను వికలాంగత్వమును పక్షరోగులను భూత బాధితులను బాగుపరచి క్రియలద్వారా ఆ కార్యమును నెరవేర్చి జయశీలుడుగా ఈ లోకములో నరులమైన మనమధ్య జన్మించి మనవలె నరరూపములో తన దైవత్వమును పరలోక సామ్రాజ్యము యొక్క భోగభాగ్యములను పరలోక సింహాసనమును దేవదూతల పరిచర్యలను ఐశ్వర్యాన్ని ఒదలుకొని, మట్టి నరుల మధ్య జేరి తాను మట్టి శరీరుడనిపించుకొనక మహిమ శరీరుడుగా అనగా పరమాత్ముని యొక్క సృష్టిగా పురుషుని ప్రమేయము లేకుండః దైవ వాక్యబీజము ద్వారా తానొక నరరూపమును పొందిః లోకమాలిన్య మంటకుండ ఏ దోషము ఏ యొక్క చిన్నలోపము లేక తనమీద నేరారోపణ చేయుటకు కూడా నరుల కెలాంటి అవకాశమీయక క్రియజరిగించి,''ఆదిలోని ఏదేను వనములో నరునికి చేసిన వాగ్ధానం చొప్పున నరదోషమును భరించి, నరుడు పొందవలసిన పాపమరణమును పొంది,నరులమైన మనకు చేసిన వాగ్దానములనన్నిటిని నెరవేర్చి కృతార్థుడై, రెండవ రాకడయను పేరుతో తిరిగిరానైయుండి మధ్యాకాశంలో తిష్టవేసి తాను సాగించిన బలియాగం ద్వారా తనను విశ్వసించిన విశ్వాసుల యొక్క సంఖ్య ఏ పాటిదో అనగా తన్నెందరంగీకరించెరోయని; తన జననమునకును తన చరిత్రకును తన మరణానికినితన పునరుత్థానానికిని మరియు దైవత్వానికిని విలువనిచ్చి విశ్వసించి ప్రతినిత్యము ప్రార్థన ఇరుగు పొరుగు ప్రేమ సావాసములతో రక్షణ సువార్త ద్వారా తమ జన్మలను సార్థకము చేసికొన్న జీవాత్మలను గూర్చి విచారించబోవు దినమొకటున్నదని మనము గ్రహించవలసియున్నది.

        యెహోవా మనకు చేసిన కార్యములలో మొదటిది పాతనిబంధన; ఇందులో ఆదికాండములో మొదటి భాగమును గూర్చి మనము నేర్చుకొన్నాము.  ఇంక రెండవ భాగంలో తనకంటు ఇశ్రాయేలను జనాంగము నేర్పరచి వారికి తన మహత్కార్యములను వివరించి, దశాజ్ఞలను రాతిపలకలతో కూడిన మందసమును అనుగ్రహించి  మందసమును తన మహిమతో నింపి క్రియజరిగించినట్లు వేదములో మనము చదువగలము.  ఇంక ప్రవక్తల ద్వారాను న్యాయాధిపతుల ద్వారాను ఆనాటి అజ్ఞానపు రాజులకు ఆయన కనుపరచిన మహత్కార్యములను గూర్చి గ్రంథములో మనము చదువగలము.  ఉదా|| కర్రను పాముగా నూర్చుట.  ఏడు తెగుళ్ళు. సముద్రము మధ్యలో ఆరిన నేల నేర్పరచి తన జనాంగమును నడిపించుట, గాడిద దవడ ఎముకతో  సంసోను చేత వెయ్యిమందిని చంపించుట.  ఆయుధము లేకుండ సింహాన్ని చీల్చించుట.  దాగోను ఆలయమును పడగొట్టించి కొన్ని వేలమంది జనాభాను హతము చేయించుట.  ఏలియా అను ప్రవక్త చేత అగ్ని లేకయే బలివస్తువులను తానే అగ్నియై దహించుట వగైరాలు.  ఈ విధంగా పాతనిబంధన వేదము ఆదినుండి అంతము వరకెన్నియో కార్యములు దేవుడు చేసినట్లు పాతనిబంధన చరిత్ర మనకు ఋజువుపరచుచున్నది.

        ఇంక క్రొత్త నిబంధన కాలంలో దేవుడైన యెహోవా తానే కుమారునిగా అవతార మెత్తి స్త్రీ గర్భమునుండి నర రూపముతో జన్మించి, నరులైన మన పూర్వీకుల మధ్య దైవత్వమును గూర్చి దేవరాజ్యాన్ని గూర్చి దైవ ప్రణాళికను గూర్చి సత్యమైన మార్గాన్ని గూర్చి అశాశ్వతమైన లోకాన్ని గూర్చి అస్థిరమైన నర జీవితమును గూర్చి దేవుని యొక్క సంకల్పాన్ని గూర్చి బోధించి, నరులను జీవయుతమైన మార్గమునకు మరల్చుటకు ఏసు రూపములో దేవుడు చేసిన క్రియలు అద్భుతములు ఆశ్చర్యకరములు యదార్థములై యున్నవి.  దేవుడు ఏసు రూపమున చేసిన క్రియలు నూతన నిబంధన గ్రంథములో నాలుగు సువార్తలలో మనము చదువగలము.

        ఇంకను యెహోవా మనపట్ల చేసిన కార్యమెటువంటిదంటే మన పాపములు మన దోషములు అపరాధముల నిమిత్తము-పాప పరిహారార్థబలిగా తన కుమారుని అప్పగించి, కౄరులు అజ్ఞానులు పనికి మాలిన వారైన నరులమైన మన పూర్వీకులకు ఆయనను అప్పగించి వారు చేయు ప్రతిఘోరాతిఘోరమైన క్రియకు తలవంచి అన్యాయపు తీర్పును పొంది ఘోరమైన శిక్షననుభవించి మరణించి పునరుత్థానుడై తన చరిత్రకు సాక్షులుగా తాను కాళ్ళు గడిగిన శిష్యులను హతసాక్షులను వేదసాక్షులనబడు విశ్వాసకోటి ద్వారా వారి చరిత్ర ద్వారా, నేటి తరము వారమైన మనలను హెచ్చరిస్తుండగా ''యెహోవా చేసిన కార్యము కొరకు మనమేమి చేయాలి?  యెహోవా చేసిన ఉపకారములకై నేనాయన కేమి చెల్లింతును?  అన్న ప్రశ్న ఈనాటికి మిగిలియున్నది.

        మొట్టమొదటిగా కీర్తన 116:13 యెహోవా రక్షణ పాత్రయైన ఏసను జీవవాక్యమును విశ్వసించి రోమా 10:9 ఏసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని హృదయమందు విశ్వసించి యెహోవా రక్షణ పాత్రయైన మరియు జీవవాక్యమైన క్రీస్తు యొక్క సువార్తను చేత బటి,్ట యెహోవా నామమున ప్రార్థన జేసి సమస్త నరకోటికిని సమస్త స్థలములలోను ఆయన సువార్తను ప్రకటించి, యెహోవా మనకు చేసిన మేళ్ళను బట్టి ఆయన పరిచర్య ద్వారా మన జన్మను సార్థకము చేసుకొని ఆయన పరిచర్య అనగా అనేక ఆత్మలను ఆయన రాజ్యవారసులుగా చేయుటకు కృషి జరిగించినప్పుడే మనము యెహోవా చేసిన కార్యములకు కృతజ్ఞత కలవారముగా ఆయన సన్నిధిలో ఎన్నికకాగలము. ఆమేన్‌.

        పరమ తండ్రియైన దేవుని ప్రేమ-ప్రభువైన ఏసు క్రీస్తు వారి కృపయు పరిశుద్దాత్మ దేవుని అన్యోన్య సహవాసము అను ఆశీర్వాదము లో వున్నటువంటి పరమార్థముతో కూడిన వివరమే ఈ యొక్క సాహిత్యమును గూర్చిన వివరము.

        కీర్తన 116:12 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయన కేమి చెల్లింతునుః

        ఆది 1:1-2 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.  భూమి నిరాకారముగాను శూన్యముగాను వుండెను.  దేవుని ఆత్మ జలములపై అల్లలాడుచుండెను''.

        రెండవ కొరింధీ 8:9 మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు గదా!  ఆయన ధనవంతుడైయుండియు-మీరు తన దారిద్య్రము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయెను.

        ప్రియపాఠకులారా!  పై రెండు వాక్యములు రెండు విధములైన దైవక్రియాకర్మలను గూర్చి వివరిస్తున్నవి.  సృష్టికర్త ఒక్కడే!  అనగా దేవుడు ఒక్కడే!  ఆయన ఎందుకుగా త్రిత్వమును పొంది మూడుగా విభజింపబడియున్నాడో ఆ త్రిత్వాన్ని నరులైన మన పట్లకూడా కనబరచి, దైవత్రిత్వములో వున్నటువంటి రహస్యాన్ని నరశరీరులమైన మనమీద కూడా బైల్పరచినట్లు వేదరీత్యా మనము తెలిసికోవలసియున్నది.

        దైవత్రిత్వముః ఆత్మ-జీవము-శరీరము అనగా ఆది 1:2లో వివరించబడిన రీతిగా దేవుడు ఆత్మ-రెండవదిగ ఆ ఆత్మ యొక్క రూపము- నరరూపము దాల్చి కన్యలోనుండి జన్మించుట ఇది శరీరము. (3) నరుని జీవింపజేయు ఆత్మః ఇది దేవుని త్రిత్వములో మూడవది-ఇదియే పరిశుద్ధాత్మః దీనిని మొట్టమొదట ఆది 2:7లో దేవుడు ప్రయోగాత్మకముగా తాను రూపించిన నరరూపంలో నాసికా రంధ్రములో ఈ జీవాత్మను ఊదినట్లు వేదములో   చదువగలము.  

        ప్రియపాఠకులారా!  ఏ గ్రంథము కూడా బైల్పరచినట్టి గొప్ప సత్యాన్ని పరిశుద్ధగ్రంధము బైల్పరచుచున్నది.  అదేమిటంటే సర్వసృష్టికి ఆది సంభూతుడైన సృష్టికర్తయైన దేవుని యొక్క ఆత్మ చీకటి అంధకార జలములపై నిరాకారము శూన్యమును నైన భూమి కొరకు అల్లలాడినట్లు అనగా నిరాకారమైన సృష్టికోసము తహతహలాడినట్లు వివరించబడియున్నది.  ఇది దేవుని యొక్క ప్రధమ తాపత్రయము.

        ఇక రెండవదిః దేవుని యొద్ద దేవుని సంకల్పములో వున్న క్రీస్తుని యొక్క ఆత్మ అనగా వాక్యమైయున్న దేవుని ఆత్మ యోహా 1:14 లోవలె కృపాసత్యసంపూర్ణత్వమును పొంది శారీర ధారిగా ఈ లోకానికి వచ్చుటకు కారణముఃమన మూల వాక్యము రెండవ కొరింధీ 2:9లోవలె వున్నది.  ఈ రెంటిని గూర్చి వివరముగా తెలిసికొందము.

        ప్రియపాఠకులారా!  పై రెండు విధములుగ లోకములో క్రియజరిగించిన దైవశక్తి తన క్రియాకర్మలవలన సఫలీకృతము పొందినదా?  ఫలితాన్ని సాధించిందా?  విజయాన్ని పొందినదా?  అపజయాన్ని పొందినదా? అనిన దానిని గూర్చి మనమిపుడు తెలుసుకోబోవుచున్నాము?  పై మొట్టమొదటి వాక్యానికి జవాబు యోహా 3:16లో దేవుడు లోకము నెంతో ప్రేమించెను.  దేవుని యొక్క ప్రేమయే సృష్టినిర్మాణమునకు కారణమైంది.  నిరాకారమైన భూమి-శూన్యమైన భూమి చీకటి అంధకార జలనిధిలో వున్న భూమి వెలుగును చూడగల్గి దైవత్వము చేత సృష్టిఅలంకరణకు నోచుకొనినది.  అంతేగాకుండ దేవుని మహిమపరచుటకు దైవ ప్రణాళికలో ప్రతిష్టించబడింది.  దేవుని ఆత్మ సృష్టి నిర్మాణము కొరకు జలాల మీద అల్లలాడింది.  ఎపెసీ 1:1-7 నశించిన నరజీవితమును వెదకి రక్షించుటకు క్రీస్తు ఆత్మ సిలువలో తన స్వరక్తమిచ్చి అల్లలాడిందిః

        ప్రియపాఠకులారా!  దైవసంకల్పములో అనగా ఆది దేవుని యొక్క ప్రణాళికలో సృష్టికర్తయైన దేవుడు కేవలము తన యొక్క సంతృప్తి కొరకేగాక, తన  సృష్టియైయున్న ఈ భూమి తనను మహిమపరచి దినదినాభివృద్ది చెందాలని దేవుని యొక్క ఆశయము.  భూమియే గాకుండ అనగా సృష్టి యేగాకుండ తాను స్వహస్తములతో రూపొందించిన నరుడు కూడా దేవుని మహిమపరచాలని ఆయన ప్రధానోద్ధేశ్యము.  ఈ ఉద్ధేవ్యములో దేవుడు తనకంటూ ఎన్నుకొన్న ఒక జనాభావున్నట్లు ఆ జనాంగమే ఇశ్రాయేలు అను దేవుని జనమైనట్లు వేదములో చదువగలము.

        కనుక భూమ్మిద దేవునిగా రాజ్యము దేవుని జనాంగమన్నది పాత నిబంధనలో ఏర్పడినట్లు చదువగలము.  ఆ విధముగా దైవ జనాంగమునకు ప్రప్రధమముగ ఎన్నుకోబడిన ప్రవక్త మోషే.  దేవుడు ఏ విధముగా తన పరలోక రాజ్యము యొక్క భోగభాగ్యాలు వైభోగములను సంపదను దూత గణము పరిచర్యను విస్మరించి ఇశ్రాయేలు అను తన జనాంగమునకే, తాను వారిమీదనున్న ప్రేమకొద్దీ వారిని పగటిపూట వెలుగు స్థంభముగాను రాత్రిపూట అగ్నిస్థంభముగాను నడిపించినట్లు వేదములో చదువగలము.  అనగా దేవుడు తన యొక్క రాజ్య సంపదను దానియొక్క స్థితిగతులను యోచింపక కేవలము తన బిడ్డలమీదనే తన యొక్క దృష్టినుంచినట్లు చదువగలము.

        ఈ విధముగా దేవుడు తన జనాంగమును తాను కాయుటయే గాక తన జనాంగము యొక్క నిర్వాహకత్వమునకు మోషవంటి ప్రవక్తలను అహరోను వంటి యాజకులను గిద్యోను వంటి న్యాయాధిపతులను నియమించి ఆ ప్రవక్తలతోను ఆ యాజకులను బట్టి ఆ న్యాయాధిపతులను బట్టి తాను కూడా వారిలో వుండి క్రియజరిగించాడు.  అట్టి దైవ క్రియలో పాలుపంపులు పొందినట్టి ప్రవక్తలు లేకపోలేదు.  అట్టివారిలో మోషే ఏలియా ఎలీషా యెషయా ఇర్మియ దానియేలు వగైరాలు.  వీరందరు దైవ మార్గములో నడిచి దైవత్వమునకు యోగ్యకరముగా మహిమ కరముగా తమ చరిత్రలను సార్థకపరచుకొన్నారు.  ఇది సృష్టికర్తయైన దేవుడు తానెన్నుకున్న జనాంగముపట్ల కనబరచిన ఉచిత ప్రేమ.  మరియు తనను నరులు మహిమపరచాలని ఘనపరచాలని వారి స్తుతుల మీద తాను ఆసీనుడు కావాలని దేవుడు ఆసించిన విధానము.  ఇది ఆది దేవుడు నరుల పట్ల కనబరచిన ప్రేమః

        ఈ ప్రేమకు కారణమేమిటంటే అదృశ్యములో వున్నటువంటి ఆత్మ-తత్సంబంధమైన రాజ్యము ఆయన క్రియాకర్మలను ఆయన సృష్టియు మరియు దృశ్యమైయున్న ఈ అనంత విశ్వము.  అదృశ్యములో వున్నట్టి సృష్టికర్తను స్తుతించుటకును కీర్తించుటకును ఆయనను మహిమపరచుటకును దేవుడు రూపించినట్లు ఆయన సంకల్పమైయున్నది.  అంటే యావద్‌ సృష్టి-సృష్టికర్తయైన ఆత్మకు విధేయత భక్తి విశ్వాసము కనబరచి ఆయన ఈవులు పొందుటకు ప్రతినిత్యము ఆయనను ధ్యానము చేయవలసిన విది.  ఈ సృష్టికిని-సృష్టిలోని నరకోటికిని వున్నది.  ఎందుకంటే నరశరీరములో దేవుడు తన ఆత్మను వుంచినందువలన జీవాత్మననుగ్రహించిన పరమాత్మకు నిర్జీవమైన శరీరమునకు జీవమిచ్చిన పరమాత్మునికి ఋణస్థుడై యున్నది.  ఈ ఋణాన్ని దేవుడు అనుగ్రహించిన శరీరముతో ఆ ఆత్మ అనుగ్రహించిన హృదయశుద్ధితోను పవిత్రమైన ఆత్మతోను తప్ప దైవ సృష్టిలోని సృష్టముల ద్వారా అనగా కాయ కర్పూరములు ఫల పుష్ప నైవేద్యాలు బలులు వెండి బంగారములతో కాక దేవుడు ఏవిధముగా ఆత్మయైయున్నాడో ఆ విధముగా ఆత్మ ద్వారానే పరమాత్ముని యొక్క జ్ఞానసిద్ధిని ఆత్మశుద్ధిని ధన్యతను పొందగలము.  అనగా మొదటి పేతురు 1:18లో వలె మన పితృపారంపర్యమైన వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగానముల వంటి క్షయవస్తువుల చేత  మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తముచేత నిర్దోషమును నిష్కళంకమైన గొర్రెపిల్లవంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి.  అని మనము ఎరిగియున్నాము.  కనుక ఆయనను సృష్టము ద్వారా కాక ఆయన అనుగ్రహించిన ఆత్మ ద్వారా ఆత్మ సంబంధమైన ప్రభువు యొక్క ఋణమును తీర్చుటకు బాధ్యులమైయున్నాము.

        అలాగే తండ్రి కుమార దేవుళ్ళ క్రియాకర్మల విధానము నరకోటిపై వారికున్న ప్రేమమమకారమును బట్టి నరులపట్ల వారు జరిగించిన మేళ్ళను బట్టి దేవునికి మనము చెల్లించవలసిన ఋణమును గూర్చిన మర్మము చెల్లించు విధానమును గూర్చి ఎరిగించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉపాధ్యాయుడు గాను అధ్యాపకుడు గాను కార్య సాధకుడు గాను వున్నాడు.  కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మల పోలె పరిశుద్ధాత్మకు కూడా మనము ఋణస్థులమే! ఎందుకనగా కుమారుడైన దైవత్వమును లోకమునకు ఎరుక పరచిన వాడు మరియు ఆయనను గూర్చి ప్రకటించినవాడు ఆయనను గుర్తించిన వాడు ఆయనను రూపించినవాడు పరిశుద్ధాత్ముడే!  ఈ సందర్భములో లూకా 1:35లో కన్యకయైన మరియతో దూత చెప్పిన మాటలు మనకు ఋజువులు.  అది సత్యము అని స్థిరపరచినది మత్త 3:16-17లో దేవుని ఆత్మ ధృవీకరించినట్లు చదువగలము.

        అంతేగాక ఏసు ప్రభువు లోక పాపపరిహారార్థము బలియాగక్రియ జరిగించి చనిపోయి పునరుత్థానుడై ఆరోహణుడైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తాను కూడా నరులపై తన ప్రేమను కనబరచుచు, ఏసు ప్రభువు ప్రతిష్టించినఅపోస్తలులను అంతేగాకుండ వారితో కూడా వున్న అన్యులను కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించి భాషలతో మాట్లాడించినట్లు చదువగలము.  అయితే ఏసు ప్రభువు  శిష్యులను మాత్రము స్థిరముగ సంపూర్ణముగ ఈ పరిశుద్ధాత్మ ఆవరించబట్టి వారు నూతన నిబంధన అనుగ్రంధమునకు రచయితలుగ పరిశుద్ధాత్మ దేవుని చేత నియమితులైనట్లు మనము సంపూర్ణముగ గ్రహించవలసియున్నది.

        కనుక ప్రియపాఠకులారా!  దైవత్వము యొక్క ఋణాన్ని పాత నిబంధన కాలములోని హనోకు షేతు నోవహు అబ్రహాము వగైరా విశ్వాసులును మోషే యెహోషువ ఏలియా ఎలీషా వంటి వగైరా ప్రవక్తలును దేవుని ఋణమును కాస్తాకూస్తో తీర్చారు.  అట్లే దేవుని కుమారుడైన ఏసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చి లోకమునకు అమ్ముడై పోయిన మనలను లోకదాస్యము నుండి సాతానుయొక్క బంధకాలను విడిపించుటకు తన శరీరరక్తములను క్రయముగా అర్పించి నరకోటికున్న  పాపము దాని ప్రతిఫలమైన మరణము ఈ రెంటినుండి విమోచించాడు.  అంటే లోకమునకు అమ్ముడై పోయి లోక బానిసలుగ వున్న మనలను లోకసంబంధమైన ఋణము నుండి తన శారీర రక్తమును క్రయముగా ఇచ్చికొన్నాడు  అనగా విడిపించాడు.

        అలాగే పరిశుద్ధాత్మ దేవుడు-దేవుని వాక్యానికి ఋణపడివున్న మన ఆత్మీయ జీవితాలను ఆత్మ సంబంధముగా మనకున్న ఆకలిని దప్పికను తీర్చుటకు అనగా సత్యదేవుని ఎరుంగువిధానము ఆయనను ఆరాధించు పద్ధతి మన కెరింగించి సత్యమును చూపి మరణ మార్గమునుండి జీవమార్గమునకు నడిపించిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అపూర్వమైన ఉపకారమునకు నేటి నరులమైన మనమేవిధముగా ఆ ఋణమును చెల్లించుకొనగలము.  అంటే ఆయన మన కెరింగించిన దైవ రాజ్య సువార్త మర్మములను దైవ రాజ్యమును గూర్చిన సత్యములను, సత్యదేవుని ఆరాధించు విధానముః  నిజమైన దేవుడెవరు?  నిజమైన ఆరాధన ఏది? అనిన నగ్నసత్యాన్ని నిజమైన దేవుడెవరు? ఆయన లోకములో జరిగించిన త్రివిధములైన క్రియాకర్మల చరిత్ర.  ఆయన మానవుని పట్ల జరిగించిన తాను కనబరచిన తన ఉచితమైన ప్రేమ అనురాగమును గూర్చి అనేకులైన అన్యులకు అనగా సత్యదేవుని ఎరుగనటువంటి అజ్ఞానులకు జ్ఞానోపదేశము చేయవలసిన విధి-నేడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వేద సత్యాలను పరిశుద్ధగ్రంధ వేదరూపముగా చేతబట్టిన మనకు తత్సంబంధ సాహిత్యమును ఎరిగియున్న మనకు, సత్యవాక్యమును ప్రకటించవలసిన ఋణాను బంధము ఒకటున్నదని ఇందు మూలముగా మనము గ్రహించవలసియున్నది.  కీర్త 116:12 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయకేమి చెల్లింతును?  కాబట్టి మనము ఆ త్రియైక దేవునికి ఋణపడియున్నాము.                                 అంశము-కట్లు

        మూలము-కీర్తన 116:16లో నీవు నాకట్లు విప్పియున్నావు'', దావీదు పాపములో పుట్టాడు - పాపములో పెరిగాడు, పాపములో జీవించాడు.  ఆలాంటి పాపపు కట్లను దేవుడు త్రెంచి వేశాడు.  కనుకనే దావీదు 116వ కీర్తనలో వ్రాశాడు.  దావీదు వలె మనము కూడా పాపులము.  రోమా 3:25 మనము కూడా దావీదువలె ప్రభువును క్షమాపణ కోరితే ఆయన మనలను క్షమించుటకు సిద్ధంగా వున్నాడు.  లోకరీత్యా మనకున్న కట్లు 1.మత్త 21:2లో కట్టబడిన గాడిద-ఇది మన పూర్వీక స్థితి.  లోకము-దానివ్యసనాలు ఆచారాలు చట్టములలోని మన జీవితాలనుండి అనగా బానిసపు కట్లు నుండి విమోచించి, తన గొర్రెలలో చేర్చి తన రక్షణలో తన మార్గములో నడిపించి తనమందలో చేర్చి సంరక్షిస్తున్నాడు.  3.రోగపుకట్లు 1.కుష్టురోగము-స్వస్థత 2.38 ఏండ్లనుండి బెతెస్థాకోనేటి దగ్గర పడకన పడియున్న రోగిక,ి పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుచున్న స్త్రీకి స్వస్థత. (4) పక్షరోగికి స్వస్థత ఇందును గూర్చి యెషయా ప్రవక్త ఆయన మన రోగములను భరించెనని క్రీస్తును గూర్చి యెష 53:4లో ప్రవచించాడు.

        లాజరు మరణపు కట్ల వివరము 1.సమాధిలో వున్నాడు. 2.వాసన కొడుతున్నాడు 3.పేత వస్త్రాలతో కట్టబడియున్నాడు.  ఆలాంటి స్థితిలో నుండి యేసు లాజరును పునరుత్థానునిగా లేపాడు.  ప్రియసంఘమా!  ఒకప్పుడు మన స్థితి కూడా పై విధంగా ఉండగా ఎఫెసి 2:1లో వలె మనలను క్రీస్తు ద్వారా బ్రదికించాడు.

        ప్రసంగముః-పఠనముః-

 కీర్తన 116:1-7 మూలవాక్యము లూకా 19:1-10 లో జక్యయ్య 11:10లో వలె ఏసును వెదకినాడు.  అయితే జక్కయ్య ఈ లోకసంబంధంగా లూకా 15:20లో విధముగా ప్రభువునకు దూరముగా యున్నాడు.  అనగా తప్పిపోయిన కుమారుని వలె తన క్రియల ద్వారా దూరముగా యున్నాడు.  జక్కయ్యను చెట్టెంక్కించినది జక్కయ్య యొక్క విశ్వాసమే.  అనగా ''ఏసే'' ప్రకటన 3:20 లోవలె ''ఏసు'' జక్కయ్య యొక్క హృదయపు తలుపులను తట్టాడు.  జక్కయ్య తెరచాడు.  జక్కయ్యతో ఏసు ఏసుతో జక్కయ్య కలిసి భోంచేశారు.  యేసు జక్కయ్య హృదయంలో మొదట బస ఏర్పరచుకొన్నట్లు జక్కయ్య పొందిన పాప పశ్చాత్తాపము తెల్పుచున్నది.  విశ్వాసుల తండ్రియైన అబ్రహాము కుమారునిగా గుర్తింపబడినాడు సోదరీ! సోదరా!  మనము ఏ విధంగా గుర్తింపబడియున్నాము.                        ప్రసంగముః-

        కీర్తన 118:20 లో ఇది యెహోవా గుమ్మము.  నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు.  నీతిమంతులు అనగా ఎవరు?  ఎఫెసీ 2:5 గలతీ 5:24 గలతీ 3:27 ఎఫెసీ 2:6లో కృపచే రక్షింపబడినవారు.  మత్తయి 5:1-10 రోమా 5:1 లో విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడినవారు.

ప్రసంగము-కొండలు,పర్వతశ్రేణులు-వాటివైపు కన్ను లెత్తిచూచుట.  

        మూలము కీర్త 121:1-2 ప్రియపాఠకులారా!  క్రీస్తు విశ్వాసులారా!  క్రైస్తవేతరులారా! ఆత్మసంబంధులారా! కీర్తనాకారుడు పై విధంగా మాట్లాడుటలో-కొండలు తట్టు కన్ను లెత్తుటయేమిటి?  యావద్‌ సృష్టికి నిర్మాణకుడైన దేవుడు భూమిమీద గాక కొండలలో వున్నాడా?  కొండల తట్టు నరుడు కన్నులెత్తవలసిన అవసరత ఏముంది? అంటే కొండగాని పర్వతము గాని ఉన్నతమైన స్థలము, సర్వోన్నతమైన స్థలము.  ఇందును గూర్చి లూకా 2:13-14 వెంటనే పరలోక సైన్యసమూహము ఆ దూతతో కూడవుండి-''సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కల్గునుగాక!  అని దేవుని స్తోత్రము చేయుచుండెను'', అని దైవత్వమును గూర్చి స్తుతించుటను బట్టి కొండలలో వున్నట్టి దేవుని యొక్క మహిమను చూచి పొందిన దైవ జనుల చరిత్రను గూర్చి వారి పట్ల దేవుడు జరిగించిన మహిమాన్విత క్రియలను గూర్చి వివరంగా తెలిసికొందము.  ఈ సందర్భములో మొట్టమొదటిగ కొండమీద దర్శనమిచ్చి మొట్టమొదటి నీతి కుమారునిగ దేవునిచేత నిర్ధారించబడిన వ్యక్తియే నోవహు.  దేవుడు మాట్లాడిన మాటలు అతనితో చేసిన నిబంధన ఆది 8:4లో ''ఓడ అరారాతు కొండల మీద నిలిచెను'', దేవుడు తన  నమూనాతో తన జ్ఞానముతో తన ప్రణాళికను బట్టి నీతిమంతుని చేత ఓడచేయించుటన్నది ఆయన మహిమ కార్యమును లోకానికి చాటుచున్నది.

        ప్రియపాఠకులారా!  నేడు ఓడను తయారు చేయాలంటే ఎంతో వడ్రంగి పనితనము కావాలి.  కొయ్య చెక్కడము వాటిని సైజుక్రమంగా అమర్చుకోవడము. ఆ విధంగా వాడేపనిముట్టు, ఱంపము సుత్తి ఉలి తోపుడు కొలకర్ర ఇవన్నియు నాటి నోవహు కాలములో లేవు.  ఓడను నిర్మించే సాంకేతిక పరమైన జ్ఞానము లేదు.  ఓడ ఎటువంటిదో చూచే జ్ఞానము కూడా అప్పటి వాతావరణమును బట్టి అది అసాధ్యము'', అని అనుకున్నట్టి దేవుడు నోవహును శాసిస్తూ ఓడను తయారు చేయవలసిన విధానము వాడవలసిన కొయ్యను గూర్చి చెప్పినాడు, దాని నిర్మాణములో తీసుకోవలసిన జాగ్రత్తలు.  తలుపులు ద్వారబంధము కిటికీలు.  వగైరాలను గూర్చి చెప్పినాడే గాని ఓడను తయారుచేయుటకు కావలసిన పనిముట్లు నోవహుతో చెప్పినట్లు లేదు.  అయితే ఏ జ్ఞానముతో 300 మూరల పొడుగును 50 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును మూడు అంతస్థులు గలదిగ నిర్మించాడో-ఏ సాంకేతిక జ్ఞాన శాస్త్రంతో నిర్మించాడో సుదీర్ఘంగా ఆలోచిస్తే మన బుద్ధికి అంతు దొరకదు.  కాని దైవత్వము మాత్రము అది సాద్యమేనని ఆ ఓడ జలప్రళయంలో ఆ ఓడ పయనించి అరారాతు పర్వతముల మీద నిలిచింది.  నీళ్ళు తగ్గి ఆరిన నేల కనబడిన తర్వాత నోవహుతో చేసిన నిబంధనను గూర్చి ఈ వేదభాగములో చదువగలము.  ఇందును బట్టి సర్వోన్నతమైన స్థలములలో దేవుని యొక్క మహిమయు అందునుబట్టి నోవహుకు కల్గిన ధన్యత ఆశీర్వాదము-మరొక నరసృష్టిని సృష్టించేసామర్ధ్యము కల్గినదంటే ప్రియపాఠకులారా!  నేడు మనము ఆదాము సంబంధులము కాదుగాని రెండవ సృష్టికి ఆదియైన నోవహు సంబంధులమేనని ఒప్పుకోక తప్పదు.  ఇందును బట్టి పునఃసృష్టికి మూలపురుషుడు నోవహు.  ఇది సర్వోన్నతమైన స్థలములలో దేవుడు తన విశ్వాసుల పట్ల జరిగించిన మహిమ క్రియకు సాక్ష్యము నోవహు ఓడ.  ఇది సర్వోన్నతమైన స్థలములలో తనలోని నీతికి వారసుడుగ తన చేత తీర్చబడిన వ్యక్తికి తాను అనుగ్రహించిన ఫలభరితమైన జీవితమునకు సాక్ష్యమైయున్నది.

        ఇక 2వది ఆది 22:2లో దేవుడు అబ్రహామును పరిశోధించి జరిగించిన విశ్వాసపూరితమైన బలియాగములో ఆయన కనబరచిన మహిమలో ముఖ్యాంశములు-ఒక్కగానొక్క కొడుకును అబ్రహాము నేలమీద గాక, గుడా రములో కాక అబ్రహాము వున్న ప్రదేశములో గాక మూడు దినములు నడిచేటంతటి దూరములో అబ్రహామును, అతని కుమారుని వారితో బాటు అబ్రహాము దాసులను నడిపించి మోరియా పర్వతమునకు అబ్రహామును అతని కుమారుడైన ఇస్సాకును మాత్రమే అనగా అబ్రహాము వెంట దాసులు గాని, కట్టెలుమోసిన గాడిదను గాని ఆ మోరియా పర్వతమును ఎక్కనీయక కేవలము అబ్రహాము అతని కుమారుడు మాత్రమే రావాలని ఆలాగున వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినపుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెల మీద నుంచెను.  అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తిపట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి పిలిచి, ఆచిన్న వాని మీద చెయ్యి వెయ్యకుము.  నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్యవెను తీయలేదు.  ఇంత గొప్ప త్యాగము చేయుటకు సాహసించిన నీవు దేవుని యందు భయభక్తులు గలవాడవని దేవుని చేత తీర్పుదీర్చబడినాడు.  ఆ సమయంలో అబ్రహాము కట్టెలను పేర్చి చేయతలపెట్టిన దహనబలి వ్యర్థమై పోతుందని నిరాశకలుగగా అబ్రహాము యొక్క లోటును స్థితిని గ్రహించిన దేవుడు పొదలో కొమ్ములు తగులు కొనియున్న ఒక పొట్టేలు వెనుకతట్టున కనబడెను.  అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను.  నిర్మానుష్యంగా వున్న ఆ స్థలములో ఏ జీవియు నివసించుటకు వీలులేని నీళ్ళులేని స్థలము ఆహారము లేని స్థలము నిర్మానుష్యమైన స్థలములో ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు తన మహిమకు రూపము నిచ్చి పొదలో తగుల్కొన్న పొట్టేలును అబ్రహాము దృష్టికి కనబరచి బలిసంపూర్ణము చేసుకోగలిగినాడంటే భవిష్యత్తులో యావద్‌ నరకోటికి సంభవించిన పాప నరకాగ్ని గుండము నుండి దైవ శాపమునుండి విమోచించుటకు ఈ పొట్టేలే - దైవత్వము యొక్క రూపాంతరంగా తన శారీర బలియాగము ద్వారా లోకానికి సుస్థిరమైన విమోచన, ఈ పొట్టేలు ద్వారా ఏసు క్రస్తు బలియాగమునకు సాదృశ్యముగా ప్రత్యక్షంగా అబ్రహామునకు కనబరచినాడు. అయితే దేవుని యొక్క భావాన్ని నాటి దినములలో అబ్రహాము గ్రహించగల్గినట్లు లేదు.  అబ్రహాము జ్ఞానికాడు, వేదాంతికాడు.  కాని వేదమును ఆచరించాడు.  వేదమైన దేవుని చట్టానికి విధేయించిన వాడుగాను దేవుని యొక్క అనుగ్రహములో పాలిభాగస్తుడై, ఆ విధంగా మోరియా కొండపై తన విశ్వాసియైన అబ్ర హామునకు కనబరచిన మహత్కార్యాలు మహిమాన్విత క్రియయైయున్నది.

        ఇంక 3వది యోరేబు, నిర్గ 3:1-5 వ్రాయబడిన వేద భాగములో మోషే అను నాలుక మాంద్యము గల వ్యక్తిని నిరక్ష్యరాస్యుడు, ఐగుప్తీయుని చంపి హంతకుడుగ ముద్ర పొందిన వాడు, దైవత్వమును గూర్చి పూర్తిగా తెలియని వాడు.  ఐగుప్తులోని నైలునదిలో జమ్ము పెట్టెలో దిక్కు మొక్కులేకుండ చివరకు కన్నతల్లి చేత కూడా విడువబడి కేకలు పెట్టుచున్న బాల్యజీవితమును అనుభవించిన మోషే జమ్ము పెట్టెలో నీళ్ళలో దొరికిన వాడైనందున అట్టి పేరుపెట్టినారు.    చాలా సంవత్సరములు అనేకమైన చేదు అనుభవాలు పొందిన మోషే తాను చేసిన పాపమును బట్టి ఆ హత్యద్వారా లోకరీత్యా కలుగబోవు ఉపద్రవ శిక్షను బట్టి భయపడిన వాడై దేవుని పర్వతమైన యోరేబునకు గొర్రెలు మేపుకొంటూ వచ్చుటయు, ఆ సమయములో మోషేను దేవుడు అగ్నిజ్వాల దర్శనములో ప్రత్యక్షమై మోషేకు తన దర్శనమిచ్చి మాట్లాడిన మాటలు-తన గొప్ప జనాంగమైన ఇశ్రాయేలుకు మోషేను ప్రవక్తగ నియమిస్తూ తన్ను గూర్చి ప్రత్యక్ష పరచుకొని ఇశ్రాయేలు ఐగుప్తులో అనుభవించుచున్న శ్రమలను వారి అనుభవాలను వారి ఆయాసకరమైన జీవితమును గూర్చి ప్రయోగాత్మకంగా దేవుడు తన పర్వతమైన యోరేబులో ఒక పొద ద్వారా ఆపొద మండుచున్నను కాలిపోలేదు.  ఈ ఆశ్చర్యాన్ని గూర్చి మోషే ఎటూ తోచక అయోమయ స్థితిలో ఆశ్చర్యకర రీతిలో కంగారుపడి చూస్తుండగా దేవుని స్వరము మోషేను పిలిచి, మోషే, మోషే అని రెండుసార్లు పేరుపెట్టి పిలిచి తన ప్రత్యక్షతననుగ్రహించి తానేర్పరచుకొన్న జనాంగానికి అతనిని ప్రవక్తగా నియమించుట ఈ కొండలో జరిగిన దైవ కార్యము.

        (4) ప్రియపాఠకులారా!  ఇదే మోషేకు నిర్గ 34:1లో సీనాయి కొండమీద దేవుడు ముఖాముఖిగా మాట్లాడుచూ మోషేకున్నటువంటి దైవభక్తిని దైవభీతిని దైవత్వమునకు విధేయించిన జ్ఞానమును బట్టి దేవుడు మోషేతో మాట్లాడుటను మోషే తన ప్రియునిగ తన ప్రేమ పాత్రునిగ చేసికొని పదిశాసనాలుగల రెండు రాతిపలకలను అనగా థర్మశాస్త్రము నిచ్చుట.  ఇది సీనాయి కొండమీద జరిగిన దైవ మహిమాన్విత క్రియ.

        5వదిః-మొదటి రాజు 18:20లో దేవుడు తన ప్రవక్తయైన ఏలియా ప్రార్థన ద్వారా నిప్పులేకనే దహనబలిని దహించి తన మహిమను వెల్లడి పరిచెను. అనగా బలిపీఠము దానిమీద కట్టెలు బలిపశువు, ఇవి అన్నియు నీళ్ళతోవుండగా  దేవుడు తన మహిమ ద్వారా ఏలియా కట్టిన బలిపీఠము లోని వస్తువులను పూర్తిగా నీటితో సహా తన అగ్నితో దహించి తన మహిమను బయల్పరచెను.  ఇది కర్మెలు పర్వతముపై జరిగిన క్రియ.

        6వదిః-నూతన నిబంధనలో దైవకుమారుడు-మన రక్షకుడైన క్రీస్తు లూకా 9:28 వ్రాయబడిన లేఖన భాగములో కొండమీద రూపాంతరము పొందిన వివరము.   ఆయన వస్త్రములు మెరయుట, ఆయనతో బాటు లోకమునుండి గతించిపోయిన ఇరువురు మోషే ఏలియాలు అనువారుండుట.  ఈ దృశ్యము చూచిన ఆయనేర్పరచుకొన్న శిష్యులు ఏసు ప్రభువు యొక్క ప్రకాశమానమైన రూపము ఆయనతో కూడా వున్నట్టి మోషే - ఏలియాల యొక్క రూపములు, వారు మాట్లాడు కొన్న విషయమును, ఆ తర్వాత ఆకాశమునుండి దేవుని యొక్క స్వరము మాట్లాడిన విధము-ఈయన నేర్పచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్ధము ఆ మేఘములో నుండి పుట్టెను.  ఇది దేవుని యొక్క మహిమ కాదా?

        7వదిః- ఇక ప్రియపాఠకులారా!  మన రక్షకుడును పాపవిమోచకుడును, దైవ సంభూతుడైన ఏసుక్రీస్తు లూకా 22:39లో దైవ సంకల్పము ఆయన ప్రణాళిక నెరవేర్పును బట్టి ప్రభువు ఈ లోకము విడిచి వెళ్ళే సందర్భములో చివరి గడియలలో గెత్సెమనే అనే ఒలీవల కొండమీద ఆయన ప్రార్థనా పూర్వకంగా మాట్లాడి చేసిన విజ్ఞాపన ప్రార్థన పూర్వక పోరాటము, రక్తము చెమట బిందువులుగా స్రవించి ఆ కొండ ప్రదేశము తడిపింది.  ఇక్కడ ఆయన చేసిన ప్రార్థనా పోరాటములో చెమట రక్త బిందువులుగా నేలను తడిపింది.  అనగా మన దేహముతో జరిగించిన పాపము నిమిత్తము ఆయన దేహములోని రక్తమును చెమటగా మార్చి అది మామూలు చెమట కాదు. రక్తపు చెమట అనిన వివరాన్ని దేవుని యొక్క మహిమగా తనకుమారుని చెమట బిందువుల పరమార్థాన్ని వెల్లడిపరచియున్నాడు.

        కనుక ప్రియపాఠకులారా!  కొండల తట్టు నా కన్నులు ఎత్తుకొనుచున్నాను'', అని కీర్తనాకారుడు అనుటలో కొండలలో దర్శించిన ఆది దేవుని యొక్క మహిమాన్విత ఉన్నత కార్యాములను, ఆకార్యముల ద్వారా దేవుడు కనబరచిన మహిమను దైవ జనులు దేవుని చేత బహుగా ఆశీర్వదింపబడినారు. అయితే ఈ సాహిత్యములోని మాటలు వినుచు, చూస్తున్న మన కన్నులు దేనిని చూస్తున్నాయి.  లోకములో వున్న అస్థిరమైన నాశనమై క్షయమైపోయే సంపదనా? లేక లోక మాయలతో కూడిన కార్యక్రమాలనా? దైవ రాజ్యమునకు చేర్చలేని సంపదనా?  దేనిని మనకన్నులు చూస్తున్నాయి.

        ప్రియపాఠకులారా!  పాత నిబంధనలో లోతు భార్య వెనుక వైపుచూచి లోకాన్ని చూచి ఉప్పు స్థంభమైంది.  కనుక ఈ సత్యాన్ని గ్రహించిన పాఠకులు మన కన్నులను సర్వోన్నతుడైన దేవుని-ఆయన కుమారుడు మన రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రభువువైపును ఆయన మన కొరకు అనుభవించిన ఘోరాతిఘోరమైన శిక్షను కనబరచే సిలువ మార్గమున సిలువను మోస్తూ ఆయనను అనుసరించాలి.  అప్పుడే ప్రభువు మహిమలో మనము పాలివారము కాగలము. ఆమేన్‌.

                        సహాయము

        కీర్తన 121:1 కొండలతట్టు నాకన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును.  ప్రియపాఠకులారా!  నేటి నరకోటి యావత్తును మనుష్యుల తట్టు ఆకాశపు వైపు  సముద్రాలను, సముద్ర జలాల తట్టును అడవులను వగైరాలను దృష్టించుచున్నారు.  కాని మూఢ భక్తులైన వారు నిజమైన దైవత్వాన్ని ఎరుగనివారు లోక సంబంధమైన కొండలలో దేవుని చూడాలని ఆశిస్తున్నారు.  కాని వారు చూచే దేవుళ్ళు జీవముగల వారు కారు.  అక్కరకు ఆదుకొను దేవుళ్ళు కారు.  అయితే కొండల తట్టు నా కన్నులెత్తుచున్నానని కీర్తనాకారుడంటున్నాడు.  ఈయన కన్నులెత్తి చూచే కొండలేవో వాటిని గూర్చిన పరమార్థమేమిటో వాటి చరిత్రలను గూర్చి ఆయా కొండలలో దైవ సహాయమే విధంగా లభించిందో దైవత్వమన్నది ఏయే కొండలలో ఏయే రూపముగా క్రియ జరిగించిందో నిజమైన విశ్వాసి ఏ కొండలవైపు తన కన్నులెత్తి చూడాలో మనము వివరంగా తెలిసికోగలము.

        యిందులో 1:అరారాతుః- ఇది నేటికిని అలనాటి జలప్రళయం యొక్క మహోపద్రవాన్ని ఆ జలప్రళయం ప్రపంచాన్ని ఆవరించిన లోతును మానవ ప్రపంచానికి చూపుచున్నది.  మొట్టమొదటిగా దేవుడు ఈ అరారాతు కొండలమీద నోవహుతో మాట్లాడి నోవహు యొక్క బలిని ఆస్వాదించాడు.  ఈ కొండల మీదనే దేవుడు నోవహును సంబోధించి యిక మీదట నరులను బట్టి భూమిని శపించను, జలములు భూమి మీదకు రావు.''అని నరునికిని దైవత్వానికిని వాగ్దానము జరిగిన పర్వతములు, ఆ వాగ్దానమునకు చిహ్నంగా ఆకాశమున యింద్రధనస్సు సూచనగా వుండుట.  ఈ పర్వతమునజరిగిన మొట్టమొదటి క్రియ.

        రెండవది మోరియాః- యిది దేవుడు విశ్వాసిని పరీక్షించుట కేర్పరచుకున్న పర్వతశ్రేణి, ఈ పర్వతము మీద దేవుడు విశ్వాసియైన అబ్రహామును పరిశోధించి అబ్రహాము యొక్క ప్రగాఢమైన విశ్వాసమునకు నిల్చినవాడై అనగా దేవుని మీదనున్న విశ్వాసమును బట్టి తన ఒక్కానొక్క కుమారుని కూడా చంపవెనుదీయని అబ్రహాము యొక్క విశ్వాసమునకు ముగ్దుడైన దేవుడు నూతన నిబంధన కాలంలో జన్మించబోవు క్రీస్తునకు సాదృశ్యముగా అబ్రహాముకు పొదలోని పొట్టేలును ప్రత్యక్షపరచిన స్థలము.  ఈ పర్వత శ్రేణిలో అబ్రహామును ఆశీర్వదించి రెండు జనములకుతండ్రిగా అతనిని దీవించుట యిచ్చట జరిగిన క్రియ.

         యిక మూడవది యోరేబుః- దేవుడు తన జనాంగమైన ఇశ్రాయేలుకు సంభవించిన శ్రమలను వీక్షించిన వాడై వారి యొక్క దాస్యము అను కాడినుండి అనగా వారు ఐగుప్తీయుల దాస్యమునుండి భయంకర పరిపాలనలో నిస్వాతంత్య్ర స్థితిలో దైవత్వాన్ని అభిలషించి, వారు చేసిన ప్రార్థన విజ్ఞాపనలను విన్న దేవుడు వారి యందు కనికరించి అట్టి జనాంగమును దాస్యమునుండి విడిపించుటకు మోషేను పిలిచిన కొండ, మండుతున్న పొదరూపమున దర్శనమును మోషేకనుగ్రహించి ఇశ్రాయేలు అను తన జనాంగమునకు నాయకునిగా మోషేను పిలిచిన స్థలము.

        సినాయిః నిర్గమ 20:1-17 చదివితే ఇశ్రాయేలుకు దేవుడు కట్టడిచేసిన పరిశుద్ధ పర్వతము అనగా దశాజ్ఞులు అనుగ్రహించిన పర్వతము.  యెజెబేలుకు భయపడి చెట్టుక్రింద విడిదియై యుండగా దేవదూత రొట్టె నీళ్ళ బుడ్డిని ఏలీయాకు యిచ్చి అతని చేత భోజనము చేయించిన తర్వాత నలభై దినాలు  ప్రయాణించి, ఆ శక్తితో యోరేబుకు చేరినట్లుగా చదువగలము కూడా.  ఈ విధంగా ప్రతి యొక్క కొండమీద ఒక్కొక్క మహత్కార్యమును నరకోటికి జ్ఞానోదయమును రక్షణయు నిబంధనలు యేర్పరచిన దేవుడు.  ''తానే కుమారత్వమును ధరించి ఈ లోకంలో - ''నక్కలకు బొరియలు ఆకాశపక్షులకు గూండ్లు కలవు గాని మనుష్య కుమారునకు తలవాల్చుకొనుటకు స్థలములేదంటూ తన కేంద్రంగా అనగా పరలోక రాజ్యాన్ని భూమి మీద స్థాపించుటకు కేంద్రంగా మరియు కార్యాలయంగా గెత్సెమనే అనే ఒక ఒలీవ కొండను, ఆయన తన రాజ్య ప్రణాళికకు కేంద్రంగాను ప్రార్థనా స్థలముగాను వాడినట్లు వేదంలో చదువగలము. మరియు తన తండ్రికిని తనకును అనుదినము తన తండ్రికి తాను చేసిన ప్రతి క్రియను దినచర్యగా ఏసు ప్రభువు విజ్ఞాపన ద్వారా విన్నవించిన వనమే ఈ ఒలీవ కొండ. మరియు యేసుప్రభువు తన చివరి రాత్రి రక్తపు చమటను స్రవింపజేసిన కొండలు. నేడు యావద్‌ నరకోటికి చరిత్రాత్మకంగా పరమరక్షకుడైన ఏసు ప్రభువునకును లోకనివాసులైన మనకును ఈ కొండ సమాధాన కొండయై నిలిచియున్నట్లు పూర్వీకంలో దావీదు మహారాజు కూడా ఈ కొండమీద విశ్రమించినట్లు వేదంలో చదువగలము.

        ప్రియపాఠకులారా!  యిక ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల సీయోను కొండమీద నిలిచియున్నదంటున్నాడు.  సీయోను కొండ అన్నది పరమ నివాసమైన దేవుని కొండ, సీయోను లో నుండి యెహోవా నిన్నాశీర్వదించును'' అంటున్నాడు.  సీయోను అనగా దేవుని యొక్క సర్వోన్నతమైన స్థలము.  ఏసు ప్రభువు కూడా సీయోనురాజుగా అభివర్ణింపబడినట్లు -'' ఎట్లంటే ఏసు ప్రభువు గాడిద పిల్లనెక్కి సీయోను కుమారీ, ఇదిగో, నీరాజు! గాడిద పిల్లనెక్కి ఆసీనుడై వచ్చుచున్నాడు,'' అనుటలో సీయోను కొండ కున్నటువంటి ప్రాధాన్యతెట్టిదో మనము గ్రహించవలసియున్నది.

        కనుక ప్రియపాఠకులారా!  యిట్టి సీయోను రాజు జన్మించిన వేళ ఆకాశ సైన్యము గాన ప్రతి గానములతో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అన్నట్లు వేద వివరణ.  సర్వోన్నతమైన స్థలములు అంటేపైన ఉదహరించినట్టి కొండలు ఈ ఏడు కొండలలో దేవుడు మహిమపరచబడినాడు.  యిట్లు ఈ ఏడు కొండలయొక్క దైవ క్రియానుభూతిని పొందినవిశ్వాసులకు చెప్పబడిన మాటేమిటంటే ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమనుటలో మనము దేవునికి యిష్టులమై యోగ్యకరమైన జీవితం జీవిసే- మనకునుమన కుటుంబ జీవితాలకును మన ఇహలోక జీవితాలకును సమాధానము నిత్యసంతోషముంటుందని, యిట్టి సంతోషానుభూతిని పొందుచున్న గృహాలకు తప్పకుండా యెహోవా వల్లనే మీకు సహాయము జరుగగలదని యిందులోని పరమార్థము.  అయితే ఆయన ఎవరు? ఆయన భూమ్యాకాశాలనుఅనగా యావద్‌ సృష్టిని సృష్టించి ఈ సృష్టికి కర్తయైయ్నుట్లు రెండవ వచనంలో చదువగలము.

        (3) ఆయన నీ పాదములను తొట్రిల్లనీయడు'' యిందుకు ఋజువు పగలు మూడు గంటలవేళ శృంగారమను దేవాలయ ద్వారము దగ్గర చీలమండల రోగిని పాదములను త్రొటిల్లనీయకుండా నడిపించుట.  ఏసు ప్రభువు పక్షరోగిని నడిపించుట, బెతెస్థా కోనేటి దగ్గర 38 ఏండ్లనుండి పడియున్న రోగిని పరుపెత్తుకొని పొమ్మని నడిపించుట.  దైవ జనాంగమైన ఇశ్రాయేలీయులకు భయపడి గానుగ చాటున దాగి గోధుమలను దుల్లగొట్టునటువంటి గిద్యోనును శూరునిగా బలాఢ్యుడుగాను సంబోధించి, యుద్దమునకు బలపరచి సంసిద్ధుని జేసి ఆయత్త పరచి వాని పాదములు త్రొటిల్లకుండా నడిపించుట,బాలుడైన దావీదు పాదములను త్రొటిల్లనీయకుండా పిలిష్తీయ యుద్దరంగంలో బలాడ్యుడైన గొలియాతును నెదుర్కొనుటకు బాలుడైన దావీదు పాదాలను పటిష్టంగా నడిపించి పరుగెత్తించి గొలియాతును సంహరింపచేయుట.  ఈ విధంగా దేవుడు తన భక్తుల యొక్క పాదములను త్రొటిల్లకుండ నడిపించినట్లును, యింకను సువార్త ప్రకటించు వారి పాదములెంతో సౌందర్యవంతముగా జేసినట్లు వేదంలో చదువగలము.

        యిక నిన్ను కాపాడువాడు కునకుడు.' అనుటలో సృష్టిలోని జీవరాశులలో కునుక కుండా నిద్రపోకుండ వున్న జీవి ఏదియులేదు.  అట్లుండుటకు సృష్టిలో ఏ ప్రాణికిని సాద్యపడదు.  సృష్టికర్తయైన దేవునికి తప్ప శరీరయైన ప్రతి యొక్కరికిని నిద్ర అవసరమైయున్నది.  అయితే సృష్టికర్తయైన దేవుడు తన జనాంగమైన ఇశ్రాయేలీయులను పగలు మేఘ స్థంభముగాను రాత్రి అగ్ని స్థంభమును ఏర్పరచి నడిపించినట్లు వేదంలో చదువగలము.  యాకోబుతో దేవుడు తెల్లవార్లు పోట్లాడినట్లుగా తెలియుచున్నది.  కనుక ప్రియపాఠకులారా!  కునుకుట జోగుట, నిద్రమత్తు గాఢ నిద్ర, మగత నిద్ర వగైరాల నిద్రలు మానవునికే గాని మహేశ్వరునికి లేదన్నది-ఈ సందర్భములో మనము గ్రహించవలసియున్నది.

        121:4 మరియొక మాటేమిటంటే 'ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడుఅంటున్నాడు.  కునుకకుండా నిద్రపోకుండా తన బిడ్డలను పోషించి సంరక్షించువారు యెహోవాయేనని ఈ వేదవాక్యము ఋజువు పరచుచున్నది.  నిజమే!  ఇశ్రాయేలు దేవుని యొక్క గుణాతిశయములలో ఆయనకున్న లక్షణములలో ప్రధమమైనది మెలకువ, ఆయన మెలకువతో వుండియే ఈ లోక సృష్టి సృష్టికార్యాలయాలను జరిగించాడు.  ఆయన లోని మెలకువ సృష్టి లోకములోని జంతు జాలములు, పశు పక్షి, వృక్షాదులు వీటితో బాటు నరుని భూత భవిష్యత్‌ వర్తమాన కాలాలనెరింగిన వాడై బహు జాగరూకతతో తాను తూర్పు దిక్కున వేసిన ఏదేనను వనమును దేవుడు చాలా మెలకువతో కాపాడుచూ, నరజంటను తన క్రమ శిక్షణలో వుంచుకొని వారిని బహురీతులుగా హెచ్చరిస్తూ, తన చిత్తానుసారం వారిని కాపాడుచూ తన వలె వారిని కూడా కునుకుడు నిద్ర అను గుణములు లేక జీవింపచేసినట్లు ఏదేను చరిత్ర ద్వారా మనకు తెలియుచున్నది.  దేవుడు కలుగ చేస్తేనేతప్ప ఆదాము నిద్రపోయినట్లుగా లేదు.

        ప్రియపాఠకులారా!  దైవ లీలలు చాలా ఆశ్చర్యకరములు ఆయన అనుకుంటే నిద్రావస్థకల్గించగలడు.  లేదనుకుంటే తన బిడ్డలకు కునుకు నిద్ర లేకుండా చేయగలడు. అయితే సాతాను క్రియలు సమస్తమును అజ్ఞానముతోను అంధకారముతోను నిద్రావస్థతో నిండియుండుననుటకును ఈ క్రింది సందర్భాలు నిదర్శనాలు అనగా సాతాను సంబంధులు నిద్రాసక్తులును నిద్రబోతులనుటకు ఋజువులు, యిందులో సంసోను విషయంలో సాతాను డెలైలా ద్వారా సంసోనును, ఆకర్షించి తన్నావరించిన స్త్రీరూపము ద్వారా అతనికి మోహావేశములను కలిగించి దైవ ప్రతిష్ట అను వరమును సైతము మరిచి పోవునంత చేసి స్త్రీ తొడలపై అతనికి నిద్ర కల్పించి తన జడలలోని బలమును హరించి శత్రువుల కప్పగించి మరణపాత్రునిగ చేసినట్లు తెలియుచున్నది.   యోనా విషయంలో దైవాజ్ఞను మీరి దేవుడు వెళ్ళమన్న నీనెవె పట్టణపు ఓడను ఎక్కించవలసిన వాడు తర్ఫీదు ఓడనెక్కినాడు.  ఈ తర్ఫీదు ఓడ సాతాను సంబంధీకులైన తూరు రాజుల యొక్క సొత్తు.  ఈ ఓడలో దేవుని ప్రవక్తయైన యోనా ఎక్కిన వెంటనే ఓడను ఆవరించిన సాతాను యోనాను ఆవరించి కల్గించిన క్రియ నిద్రావస్థ. ఓడ అడుగు భాగాన యోనా గాఢనిద్రలో వుండుటన్నది సాతాను క్రియ అని గుర్తించాలి.

        ప్రియపాఠకులారా!  నూతన నిబంధనలో ఏసు ప్రభువు యూదుల కప్పగింపబడబోవు రాత్రి కొండ క్రింద శిష్యుల నుంచి తానేకాంతంగా కొండ మీదకెక్కి మెలకువతో తండ్రికి విజ్ఞాపన చేసి మృత్యువుతో పోరాడినాడు.  అయితే  కొండ క్రిందనున్న శిష్యులు కునికినిద్రించారు.  ప్రియపాఠకులారా!  ఈ నిద్రావస్థ అనగా నిద్రబోతు తన మన్నది అకారణంగా అనవసరంగా సాతాను కల్పించు శారీర సంబంధమైన క్రియ. కనుగ గాఢ నిద్ర సోమరి తనంతో కూడిన నిద్ర సాతాను సంబంధములు  ప్రియపాఠకులారా!  షూషను కోటలో యూదుల పట్ల జరిగిన వారిని గూర్చి జారీచేయబడిన శాసనముల మూలంగా యూదులకు సంభవించిన మారణ హోమ తాకీదును రద్ధుపరచుటకు షూషను కోట రాణియైన ఎస్తేరు ఆమెతో కూడ నున్న దాసదాసీ జన పరివారము మెర్దుకై వగైరాలు నిద్రపోయి వుంటే రాజాజ్ఞ అమలు పరచబడియుండెడిది.  అయితే వారు మెలకువగల్లి నిద్రను నిరోధించి చేేసిన ప్రార్థనా కూడిక ఫలితంగా రాజాజ్ఞ రాజ శాసనము రద్దయింది.

        ప్రియపాఠకులారా!  నిద్ర అన్నది సమస్త అనర్థాలకు మూలము.  నిద్ర రోగులకును చంటి బిడ్డలకును వృద్దులకే పరిమితంగాని దైవ సేవకులకు ప్రార్థనా పరులకు ఆత్మ సంబంధులకు యాజకులకు నిద్రన్నది మరియు గాఢనిద్ర, సోమరి తనము యివి పనికి రావు.  శారీరత్వమును బట్టి మానవునికి నిద్ర అవసరముగాని నిద్రకే ప్రాధాన్యత యివ్వడమన్నది శ్రేయస్కరము కాదు.

        ఇశ్రాయేలు అను దైవ జనాంగమునకు సంభవించిన ఇక్కట్లలో ఇశ్రాయేలు పట్ల దేవుడైన యెహోవాకునికి నిద్రించివుంటే లేక ఆజనాంగము నిద్రా సక్తులుగా వుంటే మోషే నాయకత్వమెంత బలహీనంగా వుండేదోగదా?   ఇశ్రాయేలు జనాంగము మెలకువతో వుండబట్టే వారిని మెలకువతో నిడింపించబట్టే నాటి ఇశ్రాయేలు సంతతి నేడు లోకంలో జీవించియున్నది.  నిద్రావస్థలో జీవించకపోబట్టే నాటి ప్రవక్తలు రాజులు న్యాయాధిపతులు ప్రవచనాలను వ్రాయుటగాని దైవత్వాన్ని దేవుని కన్నులారా జూచి, ఆయనతో మాట్లాడుటగాని ఆయన చిత్తాను సారంగా నడుచుటకూడా జరిగింది.  యిందును బట్టి చూడగా సృష్టికి సృష్టిలోని జీవరాసులకు నిద్ర అవసరము.  కాని సృష్టికర్తకు మెలకువ అవసరమైనట్లు తెలియుచున్నది.

        121:5-6 నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా వుండును''.  అనుటలో కుడి ప్రక్కన ఆయన నీడలో మనమున్నామంటే మత్త 25:33 తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును.  మనము ఆయన కుడి ప్రక్కలో వుండాలి.  అట్లుంటే ఆయన మేపు గొర్రెలుగా వుండగలము.

        పగలు ఎండదెబ్బ ఇదియే వడదెబ్బ-''ఎండ వేడిమి వల్లన కలుగు అనర్థము మరియొక్క అర్థమేమిటంటే ఆయన ఉగ్రత ఆయన శిక్ష ఆయన పంపించుతెగులు నీకు తగులదని భావము.  మరియు నీతి సూర్యుడైన యేసు క్రీస్తు యొక్క ప్రభావమూలమున నకిలీ వెలుగైన సాతాను యొక్క అగ్ని బాణము నీకు తగులదు.  అనగా సాతాను శోదనలు అంటవని అర్థము.  ఇక రాత్రి వెన్నెల దెబ్బ అనుటలో వెన్నెల యిచ్చువాడు చంద్రుడు.  ఈ చంద్రుడు పండు వెన్నెల నిచ్చేది ఒక్క నెలలో కొన్ని దినములు మాత్రమే.  అయితే నీతి చంద్రుడైన యేసు యొక్క ఉగ్రత నీకు తవులకుండా ఉండాలంటే నీతిచంద్రుడైన  క్రీస్తు యొక్క వెన్నెల కాంతి ఈనీ హృదయంలో వెలుగవలెను.  అట్లుంటే సృష్టిలోని చంద్రుని మూలంగా వచ్చెడి అనర్ధాలు అనగా అనవసరమైన అసందర్భమైన వ్యభిచారము హత్య దోపిడి వగైరా సంఘటనలు జరుగవు.  యివి రాత్రి కార్యములు, పక్షరోగికి ఈ రాత్రి వెన్నెలన్నది నిషేధమైయున్నది.  అయితే నీతి సూర్యుడైన క్రీస్తులో జీవిస్తే ఆయన కాంతి మూలమున ఏ అనర్థాలు తన బిడ్డలకు కలుగదని భావము.

        ఇకః 7: ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును.  ఆయన నీ ప్రాణము కాపాడును.  ఈ విధంగా అపాయాలనుండి ప్రమాదాలనుండి యెహోవాచే కాపాడిబడిన వారు ఆయన చేత ప్రాణమును కాపాడుకొన్న వారును వేదంలో పాత నిబంధనలో మొట్టమొదటి వాడు హానోకు :2: నోవహు :3: అబ్రహాము లోతు, మోషే యెహోషువా, ఎలీషా, ఇశ్రాయేలు వగైరాలు, క్రొత్త నిబంధన కాలంలో పేతురు యోహానులు, అపోస్తలులు వేద సాక్షులు వగైరాలు యిందుకు తార్కాణము.

        :8: 'ఇది మొదలుకొని నిరంతరము, నీరాక పోకల యందు యెహోవా నిన్ను కాపాడును,'' అనుటలో రాకపోకలలో దేవుడైన యెహోవా ఆయన శక్తియైన ఏసు ప్రభువు - ఆయన యొక్క నిర్వాహకుడైన పరిశుద్ధాత్ముడు' నాటి నుండి నేటివరకు విశ్వాస జీవితంలో అనేకులను అనేక రీతులుగా వారి మార్గాలలోను వారి ప్రయాణాలలోను వారి సంపదలను వారి కుటుంబాలను, వారి శారీర ఆత్మీయ జీవితాలను వారి చరిత్రలను దేవుడు తన స్వహస్తములతో సృష్టించి నేటికిని వారు అమర జీవులై జీవించియున్నట్లుగ ప్రతి విశ్వాసికి కను విప్పుగలుగునట్లు వేద రూపముగా పరిశుద్ధగ్రంధములోను సువార్త రూపముగాను వారి చరిత్రలను బయల్పర్చుచున్నాడు.  వారిని ఆదర్శములో వుంచుకొని నేటి విశ్వాసులైన మనలను పలు రీతులుగా హెచ్చరిస్తున్నాడు.  ఈ హెచ్చరికయే నేటి సువార్త సేవ.

        కీర్త 121:5 కుడి ప్రక్కన యెహోవా ఉన్నయెడల ఎడమ ప్రక్కన సైతాను వుండునా?

        ''మన కుడి ప్రక్కన మనకు యెహోవా తొడైయున్నపుడు మనకు ఎడమ ప్రక్కన కాదు గదా! మరి ఆ ప్రాంతములలో ఎక్కడను వుండడు.  యెహోవా కుడి ప్రక్కన యుండగా పరిశుద్ధ గ్రంథము చేతబట్టి బహుగా బోధించి వచ్చిన సమయమునందు ముందుగనే సైతానుడు తన ఇంటి యందలి భార్యలో చేరియుండును.  అందువలననే ఆమె భర్తతో నీవు స్వస్థత కొరకు ప్రార్థించి ఇచ్చిన ఆ తీర్థము నూనె త్రాగి ఆమెకు ఇంకా రోగము ఎక్కువైనది.  ఇంకనైనను చాలించరాదా!  ఈ ప్రార్థనలు అనును.  అపుడు ఇంటికి వచ్చిన ఆమె పెనిమిటి ఈ శోదన ఏమిటి ప్రభువా!  అని మొర్రపెట్టినపుడు ఆమెలో యున్న సైతానుడు జంకి భయపడి నా మాటలు నీ కెందుకులే!  నీ వెనకటికి తెలుస్తుంది''. అని ఆ మాటలు అప్పటికి సరిపెట్టుకొని, కాసేపు వుండి మరల నీ పెద్దకుమారుడు సినిమాకు పోవలెనని గొనుగుచున్నాడు.  ఒక్కసారియైన వాడి కోరిక తీర్చి ఆ ప్రక్కింటి వారితో కూడా సినిమాకు పంపించరాదా!  అని సణుగుకొనును. తాను ఇంతకు మునుపె'' అల్లరి చిల్లరితోకూడిన ఆటపాటలందు ప్రొద్దు పుచ్చకూడదని బాహాటముగా బోధించి రావడము, తన ఇంటిలోనే తన కుమారుడు సినిమాకు పోవలెయునని పట్టుపట్టడము, ఇటువంటి విషయములు కొన్ని చూడగా దేవుడు వుంటున్న ప్రాంతములు వదలి మానవులను నీడగా-ఆ ప్రక్క ప్రక్కలే అదును చూచుకొని వచ్చుచు పోవుచు నీడగా మూలమూలలలో నక్కి పై విధంగా శోధిస్తుంటాడు. అంతే గాని దేవుడు కుడిప్రక్కవుంటే, ఎడమ ప్రక్క సైతానుడు ఎట్టి పరిస్థితిలలోను వుండడు.  కాని పై విధంగా దేవుడు లేని అదను చూచి నక్కి నక్కి మూలలు చేరి శోధిస్తుంటాడు.

                నిరంతరము

        కీర్తన 121:8 ఇది మొదలు కొని నిరంతరము నీరాక పోకలయందు యెహోవా నిన్ను కాపాడును,''

        ప్రియపాఠకులారా!  ఇంత వరకును కుడి ఎడమలలో ముందు వెనుకలలోను ఉన్న దైవసత్వములను గూర్చి తెలిసికొనియున్నాము.  ఇపుడు నిరంతరము దేవుడు మనకు తోడై యుండి, యెహోవా నిన్ను కాపాడును'', అనిన మాటను గూర్చియు, ఏ విధంగా నిరంతరము తన భక్తులను కాపాడుచు పోషిస్తున్నాడో వగైరా విషయాలను గూర్చి ఇపుడు తెలిసికొందము.        

        నరునితో నిరంతరము దేవుడు నివసించాడు-అను మాటకు ఋజువు మొట్టమొదట ఏదెను వనము-ఈ ఏదెను వనములో మొట్టమొదట నరుడు ఏకాకియైయుండి సాటినరుడన్నటువంటి సహాయమును ఎరుగనివాడై, ఏకాంతములో  ఆతోటలో వున్న జంతుజాలము పక్షిజాలములతో ఒక జీవిగా జీవించాడు.  అట్టి స్థితిలో దేవుడు నరునితో నిరంతరము తన యొక్క వెలుగు తన ప్రసన్నతను తన దర్శనమును తన స్వరమును అనుగ్రహించినట్లు ఏదెనులోని చరిత్ర వివరిస్తున్నది.  అట్టి స్థితిలో నరుడు నిర్భయుడును నిశ్చింత కలవాడును స్వతంత్రుడు నైయుండి దైవత్వంతో ముఖాముఖిగ జీవించే యోగ్యత పొందియున్నాడు.  ఇది తొలి నరునికి దేవుడు అనుగ్రహించిన ధన్యత.  అటు తర్వాత దేవునితో నడిచినవాడు హనోకు-హనోకు తాను బ్రతికిన దినములన్నియు దైవత్వముతో సావాసము కలిగి నిరంతరము దేవునితో నడిచిన వాడుగ వేదములో వ్రాయబడియున్నది. ఈ విధంగా హనోకు మూడువందల ఏండ్లు దేవునితో నిరంతరము నడిచినట్లు వ్రాయబడియున్నది.  ఈ విధంగా దేవునిచే నడిపింపబడిన హనోకు - దేవుని చేత కొనిపోబడి భూమికి కనుమరుగయ్యాడు.  ఇక ఇక్కడనుండి దేవుని హస్తముతో నిరంతరము నడిపింపబడిన వారి జాబితా-నోవహు లోతు అబ్రహాము మోషే ఏలియా ఎలీషా వగైరాలు.

        నెహెయ్యా 9:5-9 లో లేవీయులైన యాజకులు ప్రవచించిన మాట-''నిలువబడి, నిరంతరము మీకు దైవుడైయున్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగు స్తోత్రము చేసిరి.  సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక, నీవే, అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు.  ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది.  దేవా!  యెహోవా! అబ్రహామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు  అను స్థలమునుండి ఇవతలకు అతని రప్పించి అతనికి అబ్రహాము అను పేరు పెట్టినవాడవు నీవే, అతడు నమ్మకమైన మనస్సుగల వాడని ఎరిగి, కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయలు యోబూసీయులు గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చునట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే, నీవు నీతి మంతుడవై యుండి నీ మాట చొప్పున జరిగించితివి.  ఐగుప్తులో మాపితరులు పొందిన శ్రమను నీవు చూచితివి, ఎఱ్ఱ సముద్రము నొద్ద వారి మొరను నీవు వింటివి'', ఈ విధంగా వ్రాయబడిన వేద భాగములో నిరంతరము దేవుని స్తుతించిన వారికున్న ఘనత, నిరంతరము దేవుని చేత పోషింపబడే వారికున్న ధన్యత, నిరంతరము దైవిక తొడ్పాటు ఉన్నట్టి విశ్వాసికి ఉన్న ఆశీర్వాదము వగైరాలను గూర్చి ఈ వేదభాగాల ద్వారా మనము తెలిసికొనుచున్నాము.  ఇది నిరంతరము దైవత్వము పట్ల నరుడు ప్రవర్తించే విధానమైయున్నది.  కీర్త 45:6 లో ఈ విధంగా వ్రాయబడి యున్నది.  '' దేవా! నీ సింహాసనము నిరంతరము నిలుచును'',

        కనుక ప్రియపాఠకులారా!  నిన్న - నేడు - రేపు '' ఏకరీతిగా అనగా నిరంతరము అనగా పగలనక రేయనక వెలుగు అనక చీకటి అనక వర్షమనక ఎండనక ఎల్లప్పుడు నిరంతరము అనుక్షణము ఆదుకొనే శక్తి దైవత్వములో ఉన్నదని ఈ కీర్తన భాగములోని ప్రవచనము వివరిస్తున్నది.  ఆకాశములోని దేవుని సింహాసనము నిరంతరము అనగా చిరస్థాయియైయున్నదని దీని భావము. మత్త 24:35 ఆకాశము భూమియు, వాటి క్రియలు గతించును గాని నా మాటలు నిరంతరము నిలుచును'', కీర్తన 136 వేదభాగం చదివితే దేవుని యొక్క నిరంతరమైన కృప ఏ విధంగా లోకము పట్ల క్రియ జరిగిస్తున్నదో వివరంగా తెలియగలదు.  ఆవిధంగా మోషేను బట్టి దేవున యొక్క సహాయసహకారాలు నిరంతరము ఇశ్రాయేలులకు లభ్యమైంది.  అయితే నేటి ప్రభువు రాకడ దినములైన ఈ దినములలో కూడా దేవుడు త్రిత్వములో నిరంతరము క్రియ జరిగిస్తున్నట్లు మన విశ్వాస జీవితములో నేడు చూడగల్గుచున్నాము.

        ప్రియపాఠకులారా!  పాత నిబంధన కాలములోని దేవుడు నిరంతరము తన బిడ్డలకు దేవుడైయుండి కాపాడినాడు.  ఆలాగే నూతన నిబంధన కాలములో క్రీస్తు-రోగులను వికలాంగులను అపవిత్రాత్మలతో బాధింపబడిన వారిని వగైరాలకు ఆయను తోడైయుండి వారిని బాగుపరచు బడుటయేగాక, చనిపోయిన వారిని కూడా పునరుజ్జీవులుగా చేసినట్లు నూతన నిబంధనలోని చరిత్ర మనకు వివరిస్తున్నది.  అయితే పరిశుద్దాత్మ దేవుడు-యేసుప్రభువు ప్రతిష్టించిన అపొస్తలులకు నిరంతరము తోడైయుండి, వారు  చెరలో బందీలైనపుడు విడుదలను, ప్రార్థనా కాలములో దర్శనరూపంగా ప్రత్యక్షతలను అనుగ్రహించి అపొస్తలులకు పరిశుద్ధాత్మతోడైయుండునట్లుగాను మరియు ఆయా సమయ సందర్భాలలో సంభవించిన సంకటములలో అపొస్తలులకు తోడైయుండి దర్శనముల ద్వారా వారి సమస్యలను పరిష్కరించుటలోను, నిరంతరము తన ప్రసన్నతను వారి పట్ల చూపినట్లు వేదములో చదువగలము.

        ప్రియపాఠకులారా!  ఒక్కమాటలో చెప్పాలంటే మోషేకు నలుబది సంవత్సరాలు దైవ జనాంగముతో నిరంతరము తోడై యుండి నడిపించిన వాడు దేవుడే, అపొస్తలులకు నిత్యము తోడై యుండి వారిని ఈ సందర్బంలో మత్త 28:18-20 పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఈయబడియున్నది.  కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చుచు-నేను మికు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.  ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను'', అనగా నిరంతరము అపొస్తలులతో ఉన్నట్లు క్రీస్తు చేసిన వాగ్దానమును ఈ వేదభాగములో చదువగలము.  ఇది త్రిత్వముతో సృష్టికర్తయైన దేవుడు యుగయుగములు తన పేరు పెట్టబడిన జనాంగమునకు నిరంతరము తోడై యున్నట్లు ఇందును బట్టి తెలుస్తున్నది.

        కనుక క్రైస్తవ విశ్వాసులమని చెప్పుకొంటున్న నేటి తరము వారమైన మన జీవితాలలో మన దేవుడు మనకు నిరంతరము తోడైయున్నాడన్న సత్యాన్ని గ్రహించిన వారమై నిరంతరము ఆయన సన్నిధిలో నిరంతరము ఆయన సావాసములో నిరంతరము ఆయన మందిరములో నిరంతరము ఆయన కృప కొరకు కనిపెట్టుచు ఆయనను ధరించుకొని, నిత్య రాజ్య వారసత్వమును పొందుటకు యోగ్యతను సంపాదించుకొందము గాక!

                కునుకు నిద్ర

        కీర్త 121:3-4 నిన్ను కాపాడు వాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు.

        ప్రియపాఠకులారా!  పై వేద వాక్యమును గూర్చి మనము ధ్యానించుకొందము.  ఈ వాక్యములో రెండు పరమార్థములు యిద్దరు వ్యక్తులను గూర్చి వివరించబడినట్లు తెలియుచున్నది.  యిందులో నిన్ను కాపాడువాడు  కునుకడు'', అనుటలో నిన్ను అనగా ఎవరిని గూర్చి ఈ మాట? ఇశ్రాయేలును కాపాడిన శక్తి ఎవరు?  ఈ రెంటిని గూర్చి తెలిసికొందము.

        యిందులో మొట్టమొదటిగా ఇశ్రాయేలును కాపాడిన వాడు యెహోవా!  నిజమే ఈ వాక్య రీతిగా ఆయన కునుకలేదు.  నిద్రపోలేదు.  ఎందుకంటే ఐగుప్తు దాస్యపు చెరనుండి ఇశ్రయేలును విడిపించిన సందర్భములో తన జనాంగమైన ఇశ్రాయేలును నడిపిస్తూ వగలు మేఘ స్థంభముగాను రాత్రి అగ్ని స్థంభముగాను వారితో వుండినట్లు వేదములో చదువగలము.  అనగా ఆరవ వచనరీతిగా ఎండ దెబ్బ నుండియు, రాత్రులలో వెన్నెలవలె కాంతియుతమైన వెలుగు రూపములో తన జనాంగముతో నడిచినట్లు వేదములో చదువగలము.  ఈ విధముగా ఇశ్రాయేలు విషయములో దేవుడు తన కాపుదలను తన జనాంగమునకు వుంచినాడు.

        అయితే యెహోవా దేవుడు కునుకుట గాని నిద్రపోవుట గాని జరిగియున్నదా? అనిన దానిని గూర్చి మనము తెలిసికోవలసియున్నది.  ప్రియపాఠకులారా!   ఈ నిద్ర అనిన గుణము  దైవ సృష్టిలో లేనే లేదు.  దేవుని పరిశుద్ధ వనమైన ఏదేనులో ఏ జీవియు నిద్ర పోయినట్లుగా లేదు.  అలాగే రాత్రి పగలు వలె ఏక రీతిగా చీకటన్నది లేకుండా కాంతివంతముగా వుండినట్లు వేదములో చదువగలము.  అనగా చీకటికి ఏ మాత్రమును స్థానము లేకుండా దివారాత్రమన్నది లేక దేవుని యొక్క కాంతి సృష్టిని ఆవరించి క్రియ జరిగించిన మూలాన్ని చీకటికి స్థానము లేకుండా పోయినట్లు తెలియుచున్నది.  దేవుడు సృష్టి క్రియ యావత్తును ఆరు దినములలో జరిగించి ఏడవ దినమున తాను జరిగించిన క్రియా కర్మలనుండి విశ్రాంతి పొంది సంపూర్ణుడైనట్లు తెలియుచున్నది.

        ప్రియపాఠకులారా!  ఒక వ్యక్తి తాను జరిగించిన క్రియా కర్మలలో సంపూర్ణత్వము పొందాలంటే ఆ సంపూర్ణత అన్నది విశ్రాంతిగా మారుతున్నది. ఈ విశ్రాంతియే నిద్ర ఆదిలో దేవుడు సృష్టి జరిగిన తర్వాత ఏడవదినమున విశ్రమించాడు.  ఈ విశ్రమించుట అనగా కునుకుట నిద్రపోవుటకాక అనగా కొంత ఉపశమనము పొందినాడు.   అందుచేతనే తన జనాంగమైన ఇశ్రాయేలులపై తాను శాసించిన పది ఆజ్ఞలలో ఆయన విశ్రాంతి దినమును ఆచరించుటన్నది ఒక చట్టముగా చదువగలము.  ఈ నిబంధన ఏమిటంటే ఆరు దినములు పనిచేసి ఏడవ దినమన్నది నీ దేవుడైనా యెహోవాకువిశ్రాంతి దినమును పరిశుద్ధ పరచబడిన దినమును నిబంధన  దినముగా దాని నేర్పరచియున్నాడు.

        అలాగే ప్రియపాఠకులారా!  యోబు విషయములో కూడా దేవుడు యోబును బాధించుటకు సాతానుకు అవకాశమిచ్చి యోబు విషయములో తానుకునికినాడు.  ఆయన మెలకువగావుంటే ఆయన పూనుకుంటే సాతానుకు ఛాన్సు ఎక్కడిది?  అలాగే విశేషమైన నరకోటి ద్వారా సృష్టికి సంభవించిన పాపపు కళంకము విస్తరించి దైవత్వమునకు చోటు లేని సమయములో దేవుడు లోకమును సృష్టిని ప్రచండ జలముల కప్పగించి జలప్రళయ నాశనముతో క్రియ జరిగిస్తూ ఆయనకునికినట్టును, ఈ కునుకులనుండి ఆయన మేల్కొని నోవహును అతని యింటి వారిని జ్ఞాపకము చేసుకొన్నట్లు వేదములో చదువగలము.  అనగా తాను కునికినట్టి ఆ కునుకునుండి ఆయన తేరుకొని నోవహు యొక్క ఇహలోక జీవితాన్ని జ్ఞాపకమునకు తెచ్చుకొన్నట్లు చదువగలము.  యిందును బట్టి దావీదు మహారాజు 23వ కీర్తనలో యెహోవా నాకాపరి అన్నట్లు చదువగలము.  గొప్ప చక్రవర్తి జ్ఞాని ప్రవక్త ఐశ్వర్యవంతుడు దైవ జనాంగముమీద ప్రభువును, సకలైశ్వర్యాలు భోగ భాగ్యాలు సైతము రధములు గుఱ్రములు రౌతులు ఆయుధ సంపత్తి పటిష్ఠమైన సైనిక కాపుదల వున్న మహారాజైన దావీదు వాటన్నిటిని విసర్జించి తన యొక్క ఇహపరలోక జీవితము అనగా శారీర ఆత్మీయ జీవితాలకు యెహోవాను కాపరిగ చేసుకొని 23వ కీర్తనలో వ్రాశాడంటే నిజమే!  ఇశ్రాయేలును కాపాడువారు ప్రభావంతుడు ప్రతిభావంతుడు, రోషము గలవాడును అపజయమెరుగని వాడును, దీర్ఘ శాంతుడును దయా సముద్రుడును యైయుండినట్లు దావీదు మహారాజు భావించియున్నట్లు తెలియుచున్నది.

        యిక ఆయన కుమారుడైన ఏసు క్రీస్తు ఆయన లోని రెండవ దైవత్వమన్నది మనలను కాపాడుటకు కునుకలేదు.  నిద్రపోలేదు.  అన్నట్లుగ కీర్త 121:4లో వివరించబడియున్నది.  ప్రియపాఠకులారా!   ఈయన కునుకలేదు నిజమే.  ఎక్కడ మార్కు? మార్కు 4:37 ఈ సంఘటనలో ప్రభువు కునికినాడు.  ఎందుకు కునికినాడు?  అనిన విషయాన్ని మనము ఆలోచనచేస్తే కునుకుటకు ముందుగా ఆ సంఘటనను గూర్చి మనము ధ్యానించవలసియున్నది.  ఇక్కడ పెద్ద తుఫాను రేగి అలలు దోనె మీద కొట్టినందున దోనె నీళ్ళతో నిండిపోయెను.  ప్రచండమైన తుఫాను సముద్ర ఘోష ఉరుములు మెరుపులు వువ్వెత్తున లేచి భీకరమైన అలలు కల్లోలిత వాతావరణములో ఒక చిన్న దోనెలో వున్న ప్రభువు కునికి నిద్రపోవుట చదు  వరులైన మనకే ఆశ్చర్యముగా వుంటుంది. మామూలు వ్యక్తిగ వుండి చెవుడు మూగ మతి భ్రమణము వున్నవ్యక్తి కూడా ఆ వాతావరణములో గావుకేకలు పెట్టును. కాని సర్వ సృష్టికర్తయైన శక్తిమంతుడైన దైవాంశ సంభూతుడైన శక్తి-ఆదోనెలో కునుకుటన్న దేమిటో మనము ఆత్మీయముగా ఆలోచిస్తే ఏసు ప్రభువు ఆయనేర్పరచుకున్న శిష్యుల యొక్క ఆత్మీయ స్థితి ఎట్టున్నది?  వీరు మెలకువగల్గిన స్థితిలో వున్నారా?  దైవత్వములో విశ్వాస హృదయముతో ఉనానఆ? దేవుని మరిచి ఉన్నారా? నిజముగా తనకు దైవాంశంగా గ్రహించగలిగిన స్థితిలో తన శిష్య కోటి వున్నారా?  అనిన పరీక్ష కోసము కునికినాడు.  ఒక రకముగా చెప్పాలంటే ఏసు ప్రభువు తన శిష్యులకు పెట్టిన ప్రారంభ పరీక్షయే!   ఈ కునికి పాటు.

        యిక ఆయన నిద్రపోయినాడా! అని మనము ఆలోచిస్తే అవును నిద్రపోయినాడు.  ఎట్లంటే మన పాపముల నిమిత్తము లోకముతోను పాపముతోను మరణముతోను పోరాడినాడు.  ఈ పోరాటములో దేవుడు ఏ విధముగా ఆరు దినములు క్రియజరిగించి ఏడవదినమున విశ్రమించినాడో అలాగే ఈయన కూడా తన బలియాగ సందర్భములో సిలువ మీద ఆరు మాటలు మాట్లాడి, ఏడవ మాటతో తన ఆత్మను తండ్రికప్పగించి తన శరీరమును భూగర్భములో వుంచి, తాను జరిగించిన శారీర సంబంధిత శ్రమల పూరిత బాధకరమైన పోరాటములో సమాధిలో శారీరముగా నిద్రించినాడు.

        అయితే ఈయన మరణించలేదు.  మూడవ దినమున తానున్న నిద్రనుండి మేల్కొన్నాడు.  చిత్రమేమంటే శారీరముగా ఏసు ప్రభువు నిద్రించినను ఆత్మను తండ్రికి అప్పగించి మెలకువతోనే వుండినట్లు గ్రహించవలసియున్నది.  లోకనరులైన మనలను అదే ప్రభువు నేను లోకమును జయించిన ప్రకారము మీరును లోకమును జయించియున్నారు'', అనుటలో ఈ మాట కునికే వారిని నిద్రపోయేవారిని అనగా నిద్రాసక్తులకును  ఈ మాట అనువర్తించదని మనము గ్రహించగలము.  కాబట్టి పాత నిబంధన నూతన నిబంధన  ఈ రెండును చెప్పేమాట ఈ కీర్తన 121:4 వివరిస్తున్నది.  ఏమంటే ఏసు క్రీస్తుకు కునుకలేదు. నిద్రపోలేదు.  యెహోవా దేవుడు కునుకులేదు.నిద్రపోలేదు.  యెహోవా దేవుడు కునికినది ఎందుకు? ఆయన నిద్రించిన దెందుకు?  తన భక్తుడైన యోబు యొక్క విశ్వాస పరీక్షకు; ఆయన తాను జరిగించిన రూపొందించిన యావద్‌ సృష్టి మంచిదైనట్లుగా సృష్టి కార్యము ద్వారా సంతృప్తి పొందిన తన క్రియల మూలముగా విశ్రాంతిని పొంది సంపూర్ణత్వమును పొందినాడు.  అలాగే ఏసు ప్రభువు యొక్క దైవ క్రియాకర్మలును తన శిష్యకోటి యొక్క విశ్వాస పరీక్ష మూలముగ దోనెలో కునుకుటయు; అలాగే లోకనర కోటి పాప పరిహారార్థం తాను జరిగించిన బలియాగ సందర్భములో తాను ఆత్మను తండ్రికి అప్పగించి, ఆత్మీయముగ మెలకువ శారీరమును భూగర్భంలో వుంచి విశ్రాంతితో కూడిన తాత్కాలిక నిద్ర శారీరమునకు కలిగించుటచేత, ఏసు ప్రభువు కూడా తండ్రియైన దేవునివలె తన ప్రణాళికను పూర్తి చేసి సంపూర్ణతను పొంది సజీవునిగా మన మద్య మనకు రక్షకునిగా గొఱ్ఱెలకు కాపరిగాను సకల విశ్వాసులకు ఆత్మీయ స్థితిలో - ఆత్మ వికసింపుకు మూలకర్తగాను దైవ విశ్వాస దైవ రాజ్యములో చేరుటకు మార్గముగాను స్థిరపరచబడియున్నాడు.  ఆమేన్‌.

దేవుని తట్టు చూచుట         .

                :123వ కీర్తనః

        ప్రియపాఠకులారా!  నరులమైన మన జీవిత ములోని మర్మమేమిటంటే దైవ సృష్టియైన నరుడు దేవునిచే నిర్మితుడై దైవాత్మ అను అదృశ్య శక్తి జీవాత్మగా పొందియుండి, శరీరము అను ఉపగ్రహంలో అమర్చబడి భూగోళం మీద సంచరించుచున్న వాడే జీవాత్ముడైన నరుడు, ఒక్క మాటలో చెప్పాలంటే భూగోళం మీద సంచరిస్తూ చిత్ర విచిత్రమైన క్రియా కర్మలు చేస్తూ తన శరీర జ్ఞానంతో అనేక విధములైన నాగరికతతో కూడిన క్రియలు నానా భాషలు ఆరాధనలు మతములు పరిపాలన అధికారులు బీదరికాలు గొప్ప అంతస్థులు దేశాంతరములలో ఖండాతరములలో ప్రయాణించగల భూగోళ శాస్ర ్తజ్ఞానంతో ప్రియ పాఠకులారా! కూడిన క్రియలు చేస్తూ మానవ ప్రపంచానికి ఆశ్చర్యకరంగా నరుని యొక్క జీవతమున్నది.  ప్రియపాఠకులారా!  యింత అధిక్యతను భూగ్రహం మీద సంపాయించిన నరుడు దైవ సృష్టికి ఆయన సృష్టించిన రాకెట్‌ అనగా ఉపగ్రహమైయున్నాడు.  ఉపగ్రహము యొక్క శరీర మెట్టిదో నరుని శరీరము అట్టిదే! ఉపగ్రహములోని సాంకేతిక జ్ఞానము మాలమున నిర్మించబడిన యంత్రాల శక్తి ఎంతగొప్పదో అంతకంటే వెయ్యి రెట్లు దేవుడు నర శరీరమను ఉపగ్రహంలో వుంచిన తన జీవాత్మ యొక్క ప్రభావము గొప్పదని మనము గ్రహించాలి.  ఈ నగ్న సత్యాన్ని కనుక్కొన్న వానిని గూర్చి హెబ్రీ 11:12-13 విశ్వాసుల తండ్రియైన అబ్రహామును గూర్చి చదువగలము.

        ప్రియపాఠకులారా!  భూగ్రహం మీద నర శరీరము యాత్రచేస్తుంటే నరశరీరంలో వున్న జీవాత్మయు శారీర జ్ఞానము రెండును సమైక్యమై యితర గ్రహాల లోకి వెళ్ళుటకు ఇహలోక సంబంధ సాంకేతిక జ్ఞానంతో రాకెట్లు ఉపగ్రహాలు సృష్టించి వాటిలో పయనించి, గ్రహాంతరాళమును పరి శోధించుటకు ప్రయత్నిస్తున్నట్లు నేటి నరులు ప్రయత్నించు చంద్రమండల యాత్ర, గ్రహాలను పరిశోధించుట నక్షత్రాలను సూర్య మండల పరిశోధన వగైరాలను గూర్చినటువంటి మర్మాన్ని తెలిసికోవాలని ప్రయత్నిస్తున్నాడేగాని, తాను భూమిమీద పరదేశిననియు అస్థిరుడననియు ప్రతి నరునికిని తన కంటూ ప్రత్యేకించబడిన హెబ్రీ 11:16 అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును, కోరుచున్నారు.  అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు.  ఏలయనగా ఆయనవారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరచియున్నాడు.' లోవలె ప్రత్యేకమైన పట్టణము దేవుడు నిర్మించియున్నట్లు యోహా 14:1-2 లో ఏసు ప్రభువు చెప్పిన మాటల ద్వారా తెలియుచున్నది.  తండ్రి యింట అనేక నివాసములుకలవు.  ప్రతి నరుడును ఈ మర్మాన్ని ఎరుగక ప్రతి ఇహలోక స్థలములు స్థిరములని వాటిపై దృష్టించియున్నాడు.  ఈవిధంగా భూలోకమునుండి యితర గ్రహాలలో ప్రవేశించుటకు నరుడు ప్రయత్నిస్తున్నాడేగాని 'సర్వ గ్రహాలకు నక్షత్రాలకు సృష్టికి అది సంభూతుడై ఆకాశంలో ఆసీనుడై యున్న వానిని గూర్చి ఆలోచించక తలంచకయు అయోగ్యుడుగా వున్నాడు.

        తన రక్షణానుభవంలో దావీదు మహారాజు తన్ను గూర్చి దేవునికి మొరపెట్టుకొంటూ తన సంపదను తనకున్న రాచరికాన్ని భోగభాగ్యాలను అంతఃపురములు రధములు అశ్వములు, వగైరాల తట్టుచూడక ఆకాశమందు ఆసీనుడైయున్న ప్రభువును గూర్చి ఎలుగెత్తి నీతట్టునా కన్నులెత్తుచున్నాను అంటున్నాడు.  ప్రియపాఠకులారా!  అంత గొప్ప భోగ భాగ్యాలతో కూడిన దావీదు మహా రాజునకు దృశ్యంలో ఎన్నో తనకు సంతోషమిచ్చునట్టి మద్యములు మగువలుమంది మార్భలము వుండగా కనబడనటువంటి ఆదృశ్యశక్తియైయుండి ఆకాశమందు ఆసీనుడైయున్న వానిని గూర్చి పట్టుదలతో అడుగుచున్నాడు.  నీ తట్టు నాకన్నులెత్తుచున్నాను.  ప్రియపాఠకులారా!  దావీదు తన సర్వస్వము తట్టుచూడక ఆకాశం తట్టు తన కన్నులెత్తుటలో అర్దమేమో ఒక్కసారి మనము. ధ్యానించు కొందము.  ఆయన తట్టు కన్నులెత్తబట్టే అబ్రహాముకు పొదలో తగుల్కొన్న పొట్టేలు కనబడింది. ఆయన తట్టు చూడబట్టే తొంబై ఎండ్ల శారా సంతానంవంతురాలైంది.  ఆయన తట్టు కన్నులెత్త బట్టే యాకోబు వీరోచిత పోరాటం పోరాడి ఇశ్రాయేలు అయ్యాడు.  దావీదు శతృవును జయించి మహారాజని పించుకున్నాడు.  మరియు దావీదు గొప్ప కీర్తనా కారునిగాను ప్రవక్తగాను అభివర్ణించబడినాడు.

        ప్రియపాఠకులారా!  :2: దాసుని కన్నులు తమ యజమాని చేతి తట్టును దాసి కన్నులు తమ యజమానిరాలి చేతి తట్టును, చూచునట్లు, అనుటలో ఎంత ధనమున్నను ఎంత ఐశ్వర్యమున్నను పదవులు అంతస్థులున్నను భూమి మీద నున్న నరుడు దాసుడే! ఎందుకంటే ఈ దాస్యమన్నది కడుపు కక్కుర్తికి లోక సంబంధమైన అవసరతలుతీర్చుటకు పరిమితమైయున్నది.  కనుక భూలోకం మీద  నున్న ప్రతి నరుడును ఏదో ఒక రూపంలో భూమికి దాసుడే.  ఇట్టి దాసులు తమ కైశ్వర్యమిచ్చి ఆయువునిచ్చి పోషిస్తున్న దేవుని వైపుకన్నులెత్తి చూచుటన్నది సమంజసము న్యాయము యోగ్యమునైయున్నది.

        యిక దాసీకన్నులు ఈ దాసీ ఎవరు? నిర్గమ కాండములో ఫరో యొక్క రాజ్యాధికార చట్ట ప్రకారం యూదుల బిడ్డలను చంపాలి అను చట్టము ఆ దినములలో అమలులో వుండేది.  ఆ దినములలో మోషే తల్లి గర్భము నుండి ప్రసవింపబడినప్పుడు అతనిని పాలిచ్చి పెంచుటకు తల్లికి యోగ్యత లేకపోయింది.  అయితే ఆ బిడ్డయొక్క అంద చందాలను బట్టి ఫరో యింటికి ఈమె దాసీగా నియమించబడుట ఈ సందర్భములో గమనార్హము.  యిట్టి దాసియైన మోషే తల్లి కుమారుని బట్టి ఫరో కుమార్తె యొక్క అనగా యజమానురాలి యొక్క చేతితట్టు చూస్తూ ఆమె అదుపాజ్ఞలలో ఆమె యిచ్చునట్టి జీత భత్యాలుతో కాలము వెళ్ళబుచ్చింది.  యిది లోకసంబంధమైన చూపు.

        అయితే మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులాయన తట్టు చూచుచున్న వనుటలో-అబ్రహాము శారాల విషయంలో ఆది 18 లో దేవునికి ఆతిధ్యమిచ్చిన సందర్భంలోవారి భోజన పదార్ధాలను వారి గృహాన్ని అనగా గుడారాన్ని దేవుని కప్పగించి అబ్రహాము గుడారంలో అతిధులు విందారగించు సందర్భంలో చేతులు కట్టుకొని అతిధులు ఆరగించుచుండగా వారి వైపు చూస్తు నిలుచున్నట్లు వేదంలో చదువగలము. అతిది సత్కారమే మహా భాగ్యంగా ఎంచిన అబ్రహాము యొక్క దాంపత్య జీవితంలో అతిధులు ఆరగించి నంత వరకును అబ్రహాము చేతులు అతిథుల యొక్క భోజన కార్యాలను  తిలకిస్త్తున్నారేగాని మరొక రకంగా ప్రవర్తించలేదు.  అదే విధంగా సంసోను కూడా తన ఆపద కాలములో అనగా తన శతృవులైన పిలిష్తీయులు తనను చంపుటకు సమీపించినపుడు యెహోవా కనికరము ఆయన బలము ఆయన శక్తి కొరకు సంసోను కన్నులు వీక్షిస్తుండేవి.  అట్టి సందర్భాలలో దేవుని ఆత్మ సంసోను నావరించి శతృ సంహారం జరిగించినట్లు వేదంలో చదువగలము.  మరియు ఆనాటి ప్రవక్తలు రాజులు జ్ఞానులు దేవుని యొక్క ఆదేశం కొరకును ఆయన నిర్ణయం కొరకు కనిపెట్టుకొనియుండి దైవ నిర్ణయానుసారంగా తమ క్రియలను జరిపించెడివారు.

        యిక :3: యెహోవా మేము అధిక తిరస్కారము పాలైతిమి,' అనుటలో సాలు పరిపాలనలో ఇశ్రాయేలీయులపై పిలిష్తీయులు దండెత్తి వచ్చినపుడు పిలిష్తీయ వీరుడైన గొలియాతు ఇశ్రాయేలు సైన్యమును చూచి నలబై దినములు  వారితో సవాలు చేస్తూ దైవ జనాంగమైన ఇశ్రాయేలును తిరస్కరించాడు.  అయినను ఇశ్రాయేలులు అతిని తిరస్కారమునకు తల యొగ్గవలసివచ్చింది.  యిట్లుండగా అహాంకారులు సాదయుగర్విష్టుల తిరస్కారము మా మీదికి అధికముగా వచ్చియున్నదనుటలో అహంకారుల నింద అనాటికి ప్రవక్తలను నిందించి రాళ్ళతో కొట్టి చంపువారి విషయములోను, గర్విష్టులైన అబ్షాలోము యెజిబేలు ఫరో వగైరాల అలక్ష్య జీవితం ఇశ్రాయేలు మీద అదికంగా ఆ దినములలో క్రియ జరిగించింది.  అట్లే నూతన నిబందన కాలంలో ఏసు ప్రభువును కూడా యూదులు తిరస్కరించి అలక్ష్యంచేసి ఆయన మీద నిందమోపి ఆయనను ఒక నేరస్థునిగా చేసి మాకుమ్మడిగా ఆయనను గూర్చి విజృంబించి పిలాతు దగ్గర 'సిలువవేయుము, సిలువ వేయుము'అంటూ నినాదాలు చేసినట్లు క్రీస్తు విషయంలో మనము నూతన నిబంధనలో చదువగలము. అదే విధంగా ఏసు క్రీస్తు పునరుత్థానుడైన అనంతరము ఆయనేర్పరచిన అపోస్తలులు కూడా ఇదే విధంగా అహంకారుల నిందలకు తిరస్కారాలకు గురియై చంపబడినారు.

        యిక 4వ వచనములో మమ్మును కరుణింపుము'', అనుటలో ఆపదలలోను మరణ బంధకాలలోను, వ్యాధి బంధకాలలోను, పిశాచి బంధకాలలోను, లోకనాధుల బంధకాలలోను సమస్తమైన బంధకాలనుండి విమో చింపగలు గుటకు శక్తిమంతుడు దేవుడేనని-యిట్లు కరుణించి విమోచించుటకును, విమోచింపబడిన వారిని  తన కరుణతో కాపాడు శక్తి సంపన్నుడైనవాడు.  దేవుడేనని యిందు మూలముగా మనము గ్రహించాలి.        

                ఆలయము        

        కీర్తన 127:1 యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే!

        ప్రియపాఠకులారా!  ఆరాధన బలిపీఠములను గూర్చి మనము తెలిసికొనియున్నాము.  ఇపుడు దేవుని ఆలయమంటే ఏమిటో? అదే విధంగా కట్టాలో ఏ విధంగా కట్టితే దానికి మనుగడశ్రేయస్సు అభివృద్ధి వుంటుందో అనిన సంగతి మనము గ్రహించాలి.  లోకరీత్యా మనము మన గృహమును కట్టుకొనేటప్పుడు ఒకరిచేత అనగా సర్వేయరు ప్లానింగ్‌ ఇన్‌స్పెక్టర్లు లేక వాస్తు శాస్త్రజ్ఞులు వీరెవరు గాక పోయినను ఇల్లు కట్టేటటువంటి అనుభవము నైపుణ్యత గల పెద్దలను విచారించి వారి సలహా ప్రకారం మన ఇహలోక నివాసాలను అనగా మన యొక్క అవసరతకు మన కుటుంబానికి కావలసిన గృహాన్ని కట్టుకుంటున్నాము.  ఇది మానవ సంబంధమైనది.

        ఇక దైవ సంబంధమైన గృహాన్ని కట్టాలంటే లోకస్థులైన మనుషులను లోకసంబంధులైన వాస్తు శాస్త్రజ్ఞులను విచారించుట లేక వారి సలహాలను కోరుట అను చితమని చెప్పాలి.  ఎందుకంటే దేవుని ఆలయమనగా దేవుని యొక్క ఇల్లు.  దేవుని యొక్క ఇల్లు కట్టాలంటే దేవునినే విచారించాలి.  దేవునిని అడగాలి.  దైవ నిర్ణయాన్ని కోరవలెను అనగా దేవుని ప్రార్థించి ఆయన యొక్క జవాబును పొందవలెను.  ఆ జవాబు పొందాలంటే దాని కొరకు ప్రార్థించాలి.  ప్రార్థనలో దేవుడు ఇచ్చే జవాబే ఆలయం కట్టుకొనుటకు ఆయన ఇచ్చే అనుమతి. ఈ అనుమతి లేకుండ కేవలము నరుడు తన చిత్తానుసారంగా ప్రవర్తించి ఆలయం కట్టితే అందులో కలహాలు కక్ష్యలు బైలుదేరి ఆలయంలోని సంఘస్థులలో పార్టీలు సంఘపెద్దలలో భేదాభిప్రాయాలు పెరిగి కొట్లాటలు పార్టీలు కాక తప్పదు.  ఒక వేళ ఇది ఏదియు లేకపోయినా ప్రకృతి వైపరీత్యానికి బలియై మందిరాలే  కూలిపోయే సంఘటనలు జరుగుచున్నవి.  ఇందుకు కారణము దైవ నిర్ణయాన్ని మానవుడు కోరకపోవుటయే.

        మొట్టమొదటగా దేవుడు పాత నిబంధన కాలంలో తన నిర్ణయాన్ని నోవహు కిచ్చాడు.  నోవహు కట్టిన ఓడ గృహము దేవుని యొక్క నమూనా-దేవుని ప్రణాళిక -దేవుని ప్లాను దేవుడే దానికి చుక్కాని, దేవ దూతలే దానికి తెడ్డు వేశారు.  ఆ ఓడ దేవుని చిత్తానుసారం చేయబడబట్టే - మహాజల ఉపద్రవాలలో అగాధజలములమీద నూటయాభై దినములు తేలినిలబడగల్గింది.  అంతియే గాక నేటికిని అరారాతు పర్వతాలమీద నిలిచియున్నట్లు చరిత్ర వున్నది.  ఇది దైవచిత్తానుసారమైన ఆలయ నిర్మాణ ప్రభావము.  ఇక దేవుని నిర్ణయం లేకుండానే కట్టిన నిర్మాణలేవిధంగా తారుమారైందో ఆదికాండంలో బాబేలు గోపురం చరిత్ర మనకు ఋజువుపరచు చున్నది.  కొన్ని సందర్భాలలో నేటికిని దైవ మందిరాలను నిర్మించే టటువంటి పెద్దలు విదేశీ సహాయము స్వదేశీయుల సలహాలు సంఘపెద్దల నిర్ణయాలు వీటిని పాటిస్తున్నారే గాని ప్రార్థన విజ్ఞాపన పూర్వకంగా దేవుని ప్రార్థించి అడిగి ఆయన నిర్ణయాన్ని పాటించే వ్యక్తులు లేరనే చెప్పాలి.

        ప్రియపాఠకులారా!  ఎప్పుడో ఆది 7:లో కట్టబడిన ఓడ ఈనాటికిని సాక్షాత్తుగా నిలబడి మానవుని యొక్క భక్తిని వాని నీతిని అనగా దేవుని చిత్తానుసారంగా నడిచిన వాని ప్రతిభను, దేవుని యొక్క మహిమను సర్వోన్నత స్థానములో తాను నిలబడి అనగా కొండమీద నిలిచిన గృహముగా వుండి దేవుని మహిమార్థం నిలిచింది.  నిజదైవత్వమన్న దేమిటో దైవత్వంలో అణగారియున్న నిజత్వాన్ని దైవత్వానికి నీతిమంతుని పట్ల వున్న ప్రేమానురాగాన్ని చాటి చెప్పే స్థితిలో ఈ ఓడ గృహము నిలబడివుంది.

        ప్రియపాఠకులారా!  క్రైస్తవ్యము ఎరుగని మన భారతదేశంలో ఆదిలో క్రైస్తవ్యాన్ని నెలకొల్పి మనకు బోధించి క్రీస్తు రాజ్య సువార్తను ప్రకటించుటకు ఆనాటి తెల్ల దొరలు చేసిన ప్రయత్నము బహుముఖ వ్యాప్తియై దేవుని ఆత్మ యొక్క ఉజ్జీవము వలన పాశవిక స్వభావంగల ఆటవిక జనాంగానికి కూడా పరిశుద్ధమైన ఆరాధనను గూర్చిన జ్ఞానమును, పరిశుద్ధదేవుని గూర్చినటువంటి ఆయన మర్మాలను సిద్ధాంతాల నెరింగించి వారు చేసినటువంటి అనర్ఘళ  సేవలో దైవతోడ్పాటు దైవిక సంబంధమైన వాస్తు కూడా  వారు కట్టిన ఆలయాలలో వెల్లివిరిసి వుండబట్టి వారు చనిపోయినను వారి చరిత్రలు నిలిచియున్నట్లుగా వారి పేర్లమీద నిర్మింపబడిన క్రైస్తవాలయాలు నేటికిని నిలిచియుండి నేటి క్రైస్తవ జీవితాలకవి నిలయాలుగా వున్నాయి.  మరియు ఆరాధన మందిరాలుగా వున్నాయి.  మరి ఈనాడు ఆ మందిరాలలో బాల్యక్రైస్తవ జీవితాలు జరుపుకొంటున్న మనము స్వచ్చంద సువార్త ద్వారా విశ్వసించిన అన్యుల జీవితాన్ని గూర్చి మనలను మనమే ఒక సారి పరిశోధించుకోవాల్సి వస్తున్నది.  నాటి తెల్లదొరలు కట్టినటువంటి మందిరాలకు అనుబంధంగా ఈనాడనేక క్రైస్తవమందిరాలు అనేకమైన నామధేయాలతో అనేక శాఖమందిరాలుగా రూపించబడియున్నవి.  వీటిని గూర్చి మనము తెలిసికోగలము.

        దైవ ఆలయమన్నది మొట్టమొదట దేవుడే కట్టించినాడు.  దేవుడు దేవాలయాన్ని కట్టించక పూర్వము మానవులకు దైవాలయాన్ని కట్టాలని నిర్ణయము జ్ఞానము లేదు.  ఎట్లంటే మొట్టమొదటగా దేవుడు సొలొమోను చేత ఈ ఆలయమును కట్టించినట్లు వేదములో మనము చదువగలము.  అంతకుముందు దేవాలయమన్నది గుడార రూపంలో వుండి ఆయా సందర్భాలు ఆయా సంఘటనలను బట్టి పూజాది కార్యక్రమాలకు బిల్వార్పణలు వగైరా ఆరాధనలకు గాను దైవచిత్తానుసారంగా ఆయన ప్రేరేపణను బట్టి అబ్రహాము మొదలుకొని ఆ తర్వాత వచ్చిన ప్రవక్తలు గుడారాలలోనే ఈ యొక్క దైవారాధన చేస్తూ వచ్చారు.  ఒక రకంగా ఈగుడారములను సంచార ఆరాధ నాలయాలనవచ్చును. ఎందుకంటే పలానిచోట పలాని స్థలమని నిర్ణయం లేకుండ ఆనాటి విశ్వాసులు వారి చిత్తానుసారంగా దైవ నిర్ణయమును బట్టి - హెచ్చరికను బట్టి ఏర్పాటును బట్టి ఈ గుడార మందిరాలు కట్టబడి దైవారాధన స్థలాలుగా ఎన్నిక చేయబడినవి.

        నిజమైన మందిరము అన్ని హంగులలోను సకల రీతులైన వైభోగములతో కట్టబడినది యెరూషలేములోని ఆలయము.  ఇది దైవిక ఏర్పాటులో దేవుని ఎన్నికలో దేవుని నమూనాతో ఆయన యొక్క నిర్ణయానుసారంగా ఆయన చెప్పిన కొలతలతో కట్టబడింది.  దీనికి పూర్వము ఇట్టి ఆలయాన్నినిర్మించాలని దావీదు ఉద్దేశ్యము కలవాడై యెహోవాకు ఆరాధన మందిరాన్ని కట్టాలని సంకల్పించినపుడు దేవుని ఆత్మ దావీదును హెచ్చరించి - దేవుని యొక్క ఆలయాన్ని కట్టుటకు దావీదు అసమర్ధుడనియు దక్షత సమర్థత యోగ్యత జ్ఞానము గలవాడు సొలొమోను అని దావీదు కాలంలో దేవుడు దావీదుతో చెప్పినట్లు వేదంలో మనము చదువగలము.

        ప్రియపాఠకులారా!  మారుమూల గ్రామాలలో నేటి క్రైస్తవ విశ్వాసులైన మనము కొన్ని నెలలు వాక్యపరిచర్యజేసిన తర్వాత  మన చిత్తానుసారంగా సంఘస్థుల సలహాలను బట్టి సులభముగా పాకవేసి దానిని చర్చి అంటున్నాము.  చర్మి అన్న మాటకు సరియైన అర్థము సరియైన నిర్వచనము ఏమిటో ఎరుగని స్థితిలో మనము చర్చీలు కట్టేస్తున్నామంటే - మన చేత కట్టబడిన దైవనిర్ణయం లేని మానవ నిర్ణయంతో కూడిన మందిరాలు ఎక్కువ కాలము నిలువలేక కక్షలు కలహాలు స్వార్ధాలకు నిలయమై పాడగుచున్నవి.  ఇందుకు కారణము మన స్వార్థము-స్వార్థపరుడును పక్షపాతియు స్వలాభపరుడును పదవీ వ్యామోహితుడైన బలహీనుడైన నరుడు నిష్పక్షపాతి, నిస్వార్థపరుడు యదార్థుడు అయిన బలవంతుడైన దేవునికి అనగా సృష్టికర్తయైన దేవునికి మందిరాలు కట్టితే అందులో  అపో 17:24-25 జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.  ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక, తనకేదైనను కొదువయున్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు'', లోవలె అవి దైవమందిరాలుగా వుండలేవని పై వాక్యమును బట్టి మనము గ్రహించాలి.

        మనము నిష్పక్షపాతముగాను సత్యము గాను సావాసము లోను దైవ భీతి వినయము విధేయత ఆయన నిర్ణయము ప్రార్థన ఐక్యత-ఒకరియెడల ఒకరికి ప్రేమానురాగాలు ఎల్లప్పుడు దైవత్వమును గూర్చి శ్రద్ధాసక్తులు కల్గియుండి ఐక్యత గల్గి జీవించినట్లయితే ప్రక 21:3 లో వలె - ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా వున్నది.  ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై యుందురు.  దేవుడు తానే వారి దేవుడై యుండి వారికి తోడైయుండును; అనగా మన జీవితము మనతోను మనము కట్టిన మందిరాలతోను వుండి, ఆయన మనతో కాపురముండి మన మాయన ప్రజలై యుండి ఆయన మనకు దేవుడై యుండి తోడుగా వుండును.  అదియే నిజమైన జీవముగల దేవుని మందిరము.  అట్లుగాకుంటే అది నామ క్రైస్తవ మందిరము.  లేక అంత్య క్రీస్తు మందిర మనబడును.

        ప్రియపాఠకులారా!  క్రైస్తవాలయమును కట్టుటకు చాలా ఏకాగ్రత అవసరము.  ఒక అన్య దేవతాలయము సులభంగా కట్టవచ్చును. ఎందుకనగా ఇది సత్యదేవునికి విరుద్ధమైనది.  లోకసంబంధమైన దానికి యోగ్యమైనది గనుక దీనికి కావలసిన ధన సహాయములు వస్తు సహాయములు విరాళరూపంగా కోకొల్లలుగా ఇవ్వబడుతుంది.  దీనికి ఒక నిర్ణయమంటూలేదు.  దీని నిర్ణయమంతాను గ్రామపెద్దలు పూజారి యొక్క సలహాలు ఏర్పాటు-జ్యోతిష్కుల ముహుర్తాలు లగ్నాలు, వాస్తు శాస్త్రరీత్యా యిది కట్టబడుతుంది.

        అయితే క్రైస్తవ మందిరం కట్టుటలో ఇవేవియు అక్కరలేదు.  అంటే మానవుల యొక్క సలహాలు దయాదాక్షిణ్యాలు ఏర్పాట్లు లగ్నాలు వాస్తు శాస్త్రాలతో పనేలేదు.  ఉన్నదంతయు ఒక్కటే!  దేవుని అడుక్కోవడము, దేేవుని యొక్క సహాయము, దేవుని ఏర్పాటు, దేవుని ఎన్నిక.  ఇది మానవ ప్రమేయం లేకుండ జరిగేపని.  మానవుడు కేవలం ఒక సాధనం మాత్రంగా ఇందులోవాడబడుతాడు.

        ప్రియపాఠకులారా!  ఇంత గొప్పమర్మము జీవము గల దేవుని ఆలయం కట్టుటలో వుండగా చాలా మంది క్రైస్తవ సోదరులు ఆలయం కట్టుటన్నది బహుసులభంగాను నోటి మాటలతో అంచనా వేస్తుంటారు.లోక సంబంధమైన అన్యదేవతాలయాలు కట్టాలంటే శ్రమేలేదు.  ప్రతిపని చకాచకాసాగిపోతుంది.  అయితే క్రైస్తవాలయాన్ని కట్టేటపుడు-అన్యుల అభ్యంతరాలు గ్రామస్థుల ఆటంకాలు, ఇవేవిలేనపుడు సాటి క్రైస్తవుడే అడ్డు తగిలి ఆటంకాలు కల్పిస్తుంటాడు.  ఇన్ని శ్రమలు పడి ఆలయాన్ని కట్టినను ఆ మందిరమునకు బల్ల కుర్చీ ఇచ్చిన వాళ్ళు వాటిమీద తమ పేర్లు వేయమంటారు.  ప్యాన్లు ఇచ్ని వారు ఆ ఱెక్కమీద తమ పేరు వేయమంటాడు.  అదే విధంగా ట్యూబ్‌ లైట్లు మైకులు యిచ్చిన వారు కూడ మైక్‌ బూరమీద వారి పేరు వేయమంటారు.

        ఈ విధంగా చర్చీలలో తమ పేర్లు వేయించు కోవడములో ఒక విచిత్రమైన మాట చివర జోడించబడుతుంది.  అదేమిటంటే ఫలా వారి ధర్మము లేక ఫలాని వారి కానుక లేక పలాని వారి సహాయముఅని చివరన వ్రాస్తారు. ఇది చాలా విచారకరమైన విషయము. సృష్టి యావత్తును సృష్టించి, సృష్టి లోని సకల జీవరాసులకు వాటితో బాటు ఒట్టి వాడును మట్టి వాడైన నరునికి గాలి నీరు ఆహారమిస్తున్న దేవుడు నిస్సహాయుడా?  దిక్కులేని వాడా? కట్టబడిన మందిరం కూడా దిక్కులేని దేవునికి కట్టించినట్లేనా? దిక్కులేని వారము మనమా? దేవుడా? గుడిలో తిరిగే పంకా-గుడిలో కూర్చున్న నరునికే గాలి విసురుతుంది. కాని దేవునికి ఆగాలి అవసరమా? గాలిని సృష్టించిన దేవుడు అట్లే కుర్చీ బల్లనుమనుష్యలు వాడుచున్నారుగాని - దేవుడు వచ్చి కూర్చుంటాడా?  ఆయనకు కుర్చీ బల్లకు గతి లేదా?  మరి బల్ల కుర్చీమీద ఫలాని వారి ధర్మమని వ్రాయుటలో అర్థమేమిటి?  ఇక ట్యూబ్‌ లైట్‌ కావాలసింది సంఘంలో వున్నటువంటి ప్రజానికానికి అనగా ఆలయంలోకి వచ్చే ప్రజానీకానికి - దేవుని కెందుకు ఆయన లైట్లకు గతిలేని వాడా? ప్రపంచానికంతకు వెలుగు యిచ్చు సూర్యగోళమును సృష్టించిన దేవునికి వెలుతురు కొదువా?  మరి ఆట్యూబ్‌ లైట్‌ ఫలాని వారి ధర్మమేమిటి?

        మరీ విడ్డూరమేమిటంటే సంఘాలయాన్ని ఎవరో ఒకరు కట్టిస్తే - వారి పేరు ఆ సంఘ ముఖద్వారంలో వ్రాస్తారు, ఇది మరీ విడ్డూరము.  కట్టబడింది క్రీస్తు మందిరము కాదా?  ఆ సంఘముఖ ద్వారంలో కీర్త శేషులైన పలాని వారి చేత ఈ మందిరము ఫలాని తారీఖున పలాని నెల సంవత్సరంలో కట్టబడింది అని వ్రాయుటలో ఈ మందిరం చనిపోయిన వారి కొరకా? లేక బ్రతికిన వారిని ఘనపరచుకోవడమా?  దేవుని కోసమా?  ఎవరి కోసం ఈ మందిరము కట్టినట్లు? ఇందుకోస మేసంఘాలయాలు దెబ్బ తింటున్నవి.  పార్టీలై ముక్కచెక్కలగుచున్నవి.  విశ్వాసాన్ని కోల్పోవుచున్నవి.  అపవాదికి నిలయాలగుచున్నవి.  అంత్య క్రీస్తు ఆగమనానికి స్వాగతము పల్కుచున్నవి.  ఇట్టి సందర్భంలో దైవ వాక్యమిచ్చు హెచ్చరిక ప్రక 3:15-18 నీ క్రియలు నేనెరుగుదును- నేను నిన్ను నా నోటనుండి ఉమ్మి వేయనుద్దేశించుచున్నాను.  నీ దిసమెల సిగ్గుకనపడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుమని నీకు బుద్ది చెప్పుచున్నాను.

        ఆలయ పీఠాల మీ వ్యక్తిపూజ అనగా దేేవునికి చెందవలసిన స్తోత్రము - మహిమ - ఘనత ఆరాధనకు ముందుగా వ్యక్తులకిచ్చి వారి సేవను గూర్చి వారి ప్రయాణాలను గూర్చి వారు తిరిగిన విదేశాలను గూర్చి వారి ఘనతను వారికున్న స్తోమతలను గూర్చి విద్యార్హతలను గూర్చి డిగ్రీలను గూర్చి ఏకరువు పెట్టి వర్ణించుటయు ఇందువల్ల ఆలయము దైవ మహిమను కోల్పోవుటకు ప్రధమ చిహ్నము.  ఇంకను విడ్డూరమేమిటంటే పూలహారాలుతో వారిని సన్మానించుట, గుడి పీఠంమీద వారిని సన్మానించుట,వారికి శాలువలు కప్పుట, వారిని స్తుతిస్తూ వారిని గూర్చి వర్ణించబడిన పాటలతో వారి ఔదార్యం కొరకు ప్రాకులాడుటన్నది క్రైస్తవ రాజ్యానికే అది గొడ్డలి పెట్టు-ఈ సందర్భంలో.......... ఈ లోకంలో ఘనముగా ఎంచబడునని దేవుని సృష్టికి అసహ్యము.

        కాబట్టి  ప్రియపాఠకులారా!  మన జీవితాలలో మన బిడ్డల జీవితాలలో స్వచ్చంద సువార్త మూలకంగా వ్యక్తికంటె ముందు దైవత్వానికి ప్రాధాన్యత నిచ్చి దైవ చిత్తానుసారంగా-ఇరుగు పొరుగుతో సఖ్యత సహోదరప్రేమ సమాధాన మనుబంధము ఐక్యత గల్గి ప్రభువుకు సన్ని హితులమెనౖ మన యొక్క ఆలయాలను మన ఆలయాలలో జరిగే అవకతవకలను సరిదిద్ది - సంఘ పెద్దలకు సంగస్థులకు కనువిప్పు కల్గించి, దైవత్వమునకు ఒప్పిదమైన ఆరాధనకు యోగ్యకరమైన మందిరాలుగా మన శరీరాలను మనము ఆరాధించే దైవ మందిరాలను అందులోని ఆరాధనను దైవచిత్తానుసారంగా ఆయన ఆత్మోజ్జీవాను సారంగా జరుపుకొందుము గాక!  అంతేగాని మన ఉజ్జీవం మన మెహర్భానం మన చిత్తానుసారం మన నిర్ణయాలను సారం కాదు.

        కీర్తన 127:3 కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానముః మరియొక మాటః  యోహా 3:16 దేవుడు లోకమునెంతో ప్రేమించెను.

        ప్రియసంఘమా!  దేవునికి లోకము మీద నున్న ప్రేమ ఎట్టిదో ఇపుడు మనము తెలిసికొందము.  లోకరీత్యా లోక ప్రభుత్వాలు తాము అభిమానించిన వారికి బంగారు వెండి పాత్రలు పతకాలు వస్తు రూపములో ధనము వగైరా జీవము లేని చలనము లేని వస్తువులను బహూకరిస్తున్నది.  అయితే దేవుడిచ్చెడి స్వాస్థ్యము బహుమానమును గూర్చి మనము ఈ సందర్భములో తెలిసికోవలెనుః యెష 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను''.   ఎవరి ద్వారా? యెహోవా అను గ్రహించు స్వాస్థ్యమై తనకుమారుడైయున్న కన్యగర్భము నుండి పుట్టిన లోక రక్షకుడైన ప్రభువైన క్రీస్తు.  ఇది సృష్టికర్తయైన దేవుడు ఒకానొక కాలమున ఈ దినములలో మన కిచ్చిన బహుమానము.

        అయితే ఈ బహుమానమునకున్న ఆధిక్యతలు ఐదుః  వీటిని గూర్చి తెలిసికొందము.  మొట్టమొదటిగా దేవుని ద్వారా అనుగ్రహించబడిన కుమారుడు లూకా 2:11-12 లో వలె రక్షకుడు మరియు ప్రభువైన క్రీస్తు.  మత్త 3:17లో కుమారుడుః  దైవాత్మ మూలముగా స్త్రీ గర్భము నుండి రూపించబడి కొలస్స 2:9లో వలె తాను దేవుని సర్వపరిపూర్ణతను శారీరఆకారముగ పొందినవాడు.  ఇట్టి మహనీయుని భుజముల మీద వున్న రాజ్యభారము లూకా 4:18లో ప్రభువు ఆత్మ నామీద నున్నది.  బీదలకు సువార్త ప్రకటించుటకు, చెరలో నున్న వారికి విడుదల, గృడ్డివారికి చూపు, నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హిత వత్సరము ప్రకటించుటకును ఆయననన్ను పంపియున్నాడు'', ఇది ఆయన భుజముల మీద నున్న రాజ్యభారము.

        ఇక ఆయన కియ్యబడిన ఐదు ఆధిక్యతలు ఐదు బిరుదులు.  1.ఆశ్చర్యకరుడు అనుటలో కానాలో పెళ్ళియింట నీటిని ద్రాక్షారసముగా మార్చుట.  ఐదు రొట్టెలు రెండు చేపల పంపకములో ఐదు వేలమందికి పంచి 12 గంపలు మిగుల్చుట.  ఇది ఆయన చేసిన ఆశ్చర్యకార్యము.  చనిపోయిన లాజరును బ్రతికించుట.  ఇట్టి ఆశ్చర్యకార్యములెన్నియో చేశాడు (2) ఆలోచన కర్తః- నరుల యొక్క హృదయాలోచనలు ఎరిగినవాడు.  ఈయన ఆలోచన శక్తి ప్రభావమున వ్యభిచారములో పట్టుబడిన స్త్రీకి ధర్మశాస్త్రము ద్వారా విధింపబడవలసిన శిక్షను ఈయన ఆలోచన మూలముగా రద్దు పరచి ఆ స్త్రీకి న్యాయాన్ని చేకూర్చినాడు.  ఈయన ఆలోచనయుతమైన తీర్పును బట్టి ఆ స్త్రీ రాళ్ళతో కొట్టవలసిన యూదులు తమ రాళ్ళను పడవేసి తమను గూర్చి తాము తీర్పు తీర్చుకొని వెళ్ళిపోయారు.  ఇట్టి తీర్పు యుతమైన క్రియద్వారా రాళ్ళుతో కొట్టి చంపబడవలసిన స్త్రీకి ప్రాణరక్షణ కల్గింది.  ఇందుకు కారణము ఆలోచన కర్తయగు ప్రభువే!  ఈయన ఆలోచన మూలముగా భూమిమీద తానేర్పరచుకున్న అపొస్తలుల ద్వారా దైవ రాజ్యమును గూర్చి ప్రకటింపజేసి నూతన నిబంధనయను క్రీస్తు రాజ్యమును స్థాపించాడు.  ఈయన ఈ రాజ్యము నేటికిని విస్తరింపబడి ప్రతి ఆత్మకును రక్షణాయుతమైన మార్గమును బోధిస్తున్నది.  ఇది ప్రభువు యొక్క ఆత్మ చేత రూపించబడిన ఆలోచనా క్రియాశక్తి.

        (3) బలవంతుడైన దేవుడుః- అనుటలో గెరాసీనుల దేశములో సమాధులలో వాసము చేయు సేన వేల సంఖ్యలో అపవిత్రాత్మలు పట్టిన వానిని స్వస్థపరచిన సంఘటన, ఏసు యొక్క బలమును శక్తిని ఋజువుపరచుచున్నది.  మరియు తుఫాను విషయములో ఆయన గాలిని గద్దించి సముద్రమును నిమ్మళింపజేయుటలో ఆయనకున్న వాక్శక్తి ప్రభావము ఆయన యొక్క తత్సంబంధమైన బలమును ఋజువుపరచుచున్నది.  ఇందును బట్టి ఆయన బలవంతుడైన దేవుడు.

        ఇక (4) నిత్యుడగు తండ్రిః- మత్త 28:20లో ప్రభువు తన శిష్యులకు చేసిన వాగ్దానము ఈనాడు మనతో నెరవేరుస్తున్నాడు.  ఆయన నిత్యము మనలో మనతో వుండుటను బట్టి క్రీస్తు విశ్వాసములో వుండగల్గుచున్నాము.

        (5) సమాధాన కర్తః- కొలస్స 1:20 లో విధముగ ఆయన సమస్తమును ఆయన ద్వారా దేవునితో సమాధాన పరచబడవలెనని దేవుని యొక్క సంకల్పము.

        కనుక ప్రియ సంఘమా!  దైవత్వమునకు మనకు సఖ్యత ఏర్పడాలంటే క్రీస్తు ద్వారానే ఆ సమాధాన క్రియ జరుగవలసియున్నదేగాని మరి ఎవని ద్వారా దేవునితో సమాధానము పడలేము.  ఇపుడు మూలవాక్యములోని రెండవ భాగము.''దేవుడు లోకమునెంతో ప్రేమించెను. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివానికి నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అని ప్రవచించిన విధముగా ఈనాడు దేవుని అద్వితీయ కుమారునిగా పుట్టిన ఏసు క్రీస్తు ప్రభువు యొక్క పుట్టిన పండుగను ఆత్మతోను సత్యముతోను వివేకముతోను విశ్వాసముతోను ప్రతివాడును ఆరాధించవలసిన సమయమైయున్నది.అలాగు ప్రభువును మనము ఆత్మీయముగా ఆరాధిస్తే ప్రతి విశ్వాసియు నశింపక నిత్య జీవము పొందుటకు నరావతారుడైన క్రీస్తు మనకు మధ్యవర్తిగా వుండి తన రెండవ రాకడలో తన వారినిగా మనలను దేవునితో సమాధాన పరచునని ఇందులోని భావము.

        కనుక లూకా 2:14లోవలె సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానము కలుగును గాక!  అన్నట్లుగా సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన క్రీస్తును మనము ఘనపరచినట్లయితే తండ్రియైన దేవుని మనము మహిమ పరచిన వారమగుదుము.  అపుడే మన జీవితాలలో శాంతి సమాధానము సహవాసము దైవత్వముతో కలయిక దైవత్వములో ఐక్యత వగైరా సదవకాశాలు ఏర్పడునుః  ఇది క్రీస్తు పుట్టుక పండుగలో గుప్తమైయున్న దైవ రహస్యము.

                కుమారులు

        కీర్తన 127:3-4 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము, యౌవ్వన కాలమునందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు.

        ప్రియపాఠకులారా!  పై రెండు వాక్యములు కుమారుల యొక్క అంతస్థును విలువను ఆధిక్యతలను ఘనతను చాటుచున్నవి.  పై వాక్యరీతిగా కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యమైనపుడు కుమార్తెల మాటేమిటి?  అయితే యవ్వన కాలమునందు పుట్టిన కుమారులు అని వ్రాయబడియున్నది. అయితే యవ్వన కాలము నందు పుట్టిన కుమార్తెల మాటేమిటి?  మరియొక్క మాట యవ్వన కాలము నందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములా? కుమారులైతే బలవంతుని చేతిలోని బాణములా! మరి యింకేదైననా?  అనిన దానిని గూర్చి మనము తెలిసికొందము.

        ప్రియపాఠకులారా!  బైబిలులోని ప్రతి వాక్యము, అనేక విధ దైవ మర్మాలతో పరమార్థాలతోను వున్నదన్న సంగతి తెలిసికోవలసియున్నది.  ఆదిలో దేవుడు సృష్టి కార్యము యావత్తును సంపూర్ణము చేసిన తర్వాత అంటే సృష్టిలో ప్రతి జీవిలోను మగ ఆడను సృష్టించాడు.  అవి జీవములే.  వాటిలో మానవత్వము లేదు.  అంటే నరసృష్టి నిర్మాణములో దేవుడు మొట్టమొదటిగా చేసింది కుమారులే? ఎట్లనగా దేవుని యొక్క ఆత్మతో రూపించబడింది.  మొట్టమొదట కుమారుడే!  అలాగే భూమి కన్నది కూడా మొట్టమొదట ఈ కుమారుడే ఆదాము.  మొట్టమొదటిగా దేవుడు ఆదామును భూమికి స్వాస్థ్యముగా ఏర్పరచినాడు.  అలాగే భూమి కనిన నరుడైన ఆదామును తన వారసునిగ కనింది.  ఈ వారసత్వమన్నది దేవుని చేత అనుగ్రహింపబడిన ఏదేను వన స్వాస్థ్యము.

        ఇట్లుండగా భూమికిని దేవుని యొక్క జీవవాయువుకును జన్మించిన దైవ కుమారునికి భూమి మీద స్త్రీ లేదు.  అనగా ఆడఅన్నటువంటిది నరజాతిలో లేదు.  అసలు నర జాతి అన్నది లేదు.  నరుడు ఒక్కడే?  అట్టి వాతావరణములో ఆది 2:7లో వలె జీవాత్ముడైన నరునిలో నుండి అతని ఎముక మాంసముతో రూపించబడినట్టి స్త్రీ నారియైంది.  ఈ విధముగా నరుని నుండి జన్మించిన నారి యొక్క పాపమును బట్టి బైబిలులో పాత నిబంధనలో స్త్రీకి ప్రాధాన్యత లేకుండా పోయింది.  ఎందుకంటే ఆదాము దేవుని కుమారుడు. హవ్వ ఆదాము కుమార్తెయేగాని దేవుని  కుమార్తెకాదు.  ఆ మర్మాన్ని ఆదామే ప్రత్యక్షముగా ఆది 2:21-23 లో గాఢనిద్రలో దేవుడు జరిగించిన స్త్రీ నిర్మాణ క్రియను, గాఢనిద్రనుండి మేల్కొనిన ఆదాము గ్రహించి మాట్లాడిన మాటలు యిందుకు ఋజువులై యున్నవి.  అదేమిటంటే, ''నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము యిది నరుని నుండి తీయబడెను.  కనుక నారి అనబడును'' ఇందును బట్టి నరుడు దైవ సన్నిధికి దేవుని యొక్కబలిపీఠమునకు ఆయన సముఖములో మాట్లాడుటకు పూజాది కార్యములు జరిపించుటకు వారసుడై యున్నాడు.

        అయితే స్త్రీ వారసత్వాన్ని దైవ సృష్టియైన భూజంతువైన సర్పము యొక్క మాటలకును దాని రూపమునకు ఆకర్షింపబడి లోక సంబంధియైనది.  కనుక ఆది 6:లో క్షుణ్ణముగా వివరించబడియున్నది.  నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినపుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.  ప్రియపాఠకులారా!  స్త్రీలకున్న విలువ యిక్కడ నుండి పూర్తిగా బలహీనపడినట్లు యిందును బట్టి మనకు తెలియుచున్నది.  పై వాక్యములో రెండు తెగల వారిని గూర్చి వివరించబడినది.  1. దేవుని కుమారులు 2. నరుల కుమార్తెలు దేవుని కుమారులు పురుషులు నరుల కుమార్తెలు స్త్రీలు 'కనుక కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని దైవ వాక్యము ప్రవచిస్తున్నది.  కాని కుమార్తెలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని వ్రాయబడలేదు.  ఏదేను వనము కుమార్తె వలన చెడింది.  ఆది 6:లో భూమి మీద పాపము విస్తరించుటకు నరులకుమార్తెలే కారకులైనట్లుగా వివరించబడియున్నది.  అలాగే యోసేపు చెరసాల పాలగుటకు  స్త్రీ యొక్క ద్వేషమే కారణము.  అలాగే సంసోను యొక్క ఆత్మీయ జీవితము పతనమగుటకు కారణము స్త్రీయే!  ఇందును గూర్చి దైవ వాక్యము స్త్రీని గూర్చి ప్రవచించక పురుషునికే దర్శనమిస్తూ పురుషునికే తన యొక్క ప్రణాళిక కార్యక్రమమును గూర్చి దూత ద్వారా వివరించినట్లు వేదములో అక్కడక్కడ చదువగలము.

        ఈ విధముగా పాత నిబంధన కాలములో కుమారులకున్న ప్రాధాన్యత బహు ముఖంగా దేవుని సన్నిధిలో ఎంపిక చేయబడింది.  దేవుడు జలప్రళయముతో లోక సృష్టిని తుడిచివేయు సందర్భములో నోవహు భార్యకు కాక నోవహుకు ప్రత్యక్షంగా సాక్షాత్కరించి తన సృష్టి ప్రణాళికను వివరించి అందునుండి రక్షించుకొను నిమిత్తము రూపించవలసిన ఓడ యొక్క నమూనాను, తీసుకొనవలసిన జాగ్రత్తలను వగైరాలను గూర్చి జలప్రళయమునకు ముందే హెచ్చరించాడు.  కాని నోవహు భార్యతో దేవుడు మాట్లాడలేదు.  అలాగే ఆది 5:22లో విధముగా దేవుడు తనతో హనోకును తీసికొని వెళ్ళినట్లున్నది గాని హనోకు కుటుంబాన్ని హనోకు భార్యను తీసుకొని వెళ్ళినట్లుగా వ్రాయబడలేదు.  అలాగే దేవుడు తన పిలుపులో అబ్రహాముకు దర్శనమిచ్చి అతనిని హెచ్చించి అతనికి దేవుని పట్లనున్న విశ్వాసమును గూర్చినట్టి పట్టుదలను అభినందించినాడేగాని శారాను గూర్చి దేవుడు శారాకు దర్శనమిచ్చి శారాతో మాట్లాడినట్లులేదు.  శారాతోనీ వెందుకు నవ్వినావని అనలేదు.  నీ భార్యయైన శారా నవ్వనేల? అని అబ్రహాముతో అన్నాడు. ఆది 18:13

        ఈ విధముగా పాత నిబంధన కాలములో అనేకులైన పురుషులతో దేవుడు మాట్లాడిన దాఖలాలున్నవి.  అయితే ఈ విధముగా క్రియ జరిగించిన  దేవుడు ఒకానొక దినమున స్త్రీ జాతి పట్లపశ్చాత్తాప్తుడై, ఆదిలో పురుషుని గర్భమునుండి స్త్రీని చేసిన నేరానికి ప్రాయశ్చిత్తంగా అదే స్త్రీ గర్భములో నరునికి బదులుగా తానే స్వయంభవుడై అనగా తనకు తానే రూపించుకొన్నవాడై, భూగర్భము నుండి ఏ విధముగా తొలి నరుని రూపించాడో ఆ నరునికి సాటి సహాయమును గూర్చి ఏ విధముగా ఆది నరునికి స్త్రీని రూపించాడో అంటే దేవుని కుమారుడైన ఆదాము పరిశుద్దుడు, అతని గర్భములో నుండి రూపించబడిన స్త్రీ పరిశుద్దురాలే!  వీరిద్దరును పరిశుద్ధస్థితిలో వుండాలని దేవుడు ఆశించాడు, ఆయన సంకల్పము కూడా అదే!  అయితే ఈ యిరువురు ఒకరి వెంబడి ఒకరు పాపములో పడినారు.

        ఈ విధముగా పరిశుద్ధులు పాపులుగా మారిన నేరానికి దేవుడు కూడా పాప మెరుగని కన్యకలో అనగా వ్రత భంగము మానభంగముగాని, నిష్కళంకమైన కన్యకలో పరిశుద్ధునిగా జన్మించి లోకము చేత పాపిగా దోషిగా తీర్పు పొంది పతనావస్థలో దిగజారిన దేవుని కుమారుడైన పురుషుని కొరకును; నరుల కుమార్తెయైన స్త్రీ జాతి కొరకును ఉభయులకు సంక్రమించిన పాపముతత్సంబంధ ఉపద్రవమునుండి విమోచన కలిగించుటకు ఈయన లూకా 1:35 పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును.  సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును.  కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.  కనుక పై వాక్యమును బట్టి పురుషుడు దైవ కుమారుడుగ దైవ సన్నిధిలో ఎన్నిక చేయబడ ియున్నాడు.  యిపుడు అనగా ఈ నూతన నిబందన యుగములో మరియు ప్రభువు రాకడ సమీపమగుచున్న ఈ అంతిమ కాలములో క్రీస్తు యొక్క బలియాగము ద్వారా దేవుడు నరనారులకిరువురికిని స్వాతంత్య్రము సహవాసము అన్యోన్యత అనుగ్రహించియున్నాడు.  ఎట్లంటే యిందుకు ఋజువు యోహాను 12:14లో ఏసు మాట్లాడిన మాట సీయోను కుమారీ? భయపడకుము.  యిదిగో నీ రాజుగాడిద పిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు.  యిందును బట్టి స్త్రీకి కూడా సంఘములో ఒక స్థానము క్రీస్తు ద్వారా నేడు యివ్వబడినట్లుగా మనము గ్రహించవలెను.

        నేటి క్రైస్తవ మందిరాలలో ప్రార్థనా కార్యక్రమములో స్త్రీ పురుషులు సమానంగా వాడబడుచున్నారు.  సంఘ పరిచర్యలో స్త్రీలు కూడా సువార్తీకురాండ్రుగాను బోధకులుగాను వాడబడుటన్నది జరుగుచున్నది.  అంతేగాకుండా సంఘములో పురుషులకంటే స్త్రీలే ఎక్కువగా కనబడుచున్నారు.  అంతేగాకుండా ప్రకటన 21:2 మరియు 9లో యోహానుకు కలిగిన దర్శనములో యెరుషలేము అను సంఘమును స్త్రీకి పోల్చి-ఆ స్త్రీ గొఱ్ఱెపిల్లయైన క్రీస్తుకు భార్యయైనట్లుగా అభివర్ణించబడియున్నది.  యిందును బట్టి చూడగా స్త్రీ జాతికివున్న కళంకము పాపము శాపము వగైరా అరిష్టలన్నియుకూడా క్రీస్తు ద్వారా పరిహరించబడినట్లు తెలియుచున్నది.

        కనుక ప్రియపాఠకులారా!  యిపుడు కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము.  అయితే నూతన నిబంధన కాలములో కుమార్తెలు దైవ కుమారుడైన ఏసు క్రీస్తుకు కుమార్తెలు' ఈ మాటను ఏసు ప్రభువు స్వయముగా తన మరణావస్థలో కూడా సిలువ క్రింద నిలుచున్న తన శిష్యునికి ప్రభువు యిచ్చిన బహుమానము తన తల్లినే!  ఈ విధముగా కుమారుల యొక్క స్వాస్థ్యముః  కుమార్తెల యొక్క బహుమానము; దైవ సన్నిధిలో ఆయా సందర్భాలను బట్టి ఆయా రీతులుగా ఏర్పడినవి.

                గర్భఫలము

మూలము కీర్తన 127:3-5 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే.  యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటివారు.  వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ధన్యుడు.  అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు''.

        ప్రియపాఠకులారా!  ఇంతవరకు దిగంబరత్వం ప్రసవ వేదన ప్రసవము గూర్చి తెలిసికొనియున్నాము.  ఇపుడు గర్భఫలం అనగా గర్భం ద్వారా భూమిపై ప్రసవింపబడిన దేవుడు అనుగ్రహించు సంతాన సౌభాగ్య శారీర ఫలములను గూర్చి వేదరీత్యా తెలిసికొందము.  ఇందులో మొదటగా కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము'', అనుటలో దేవుడు అనుగ్రహించు పుత్ర సంతాన ఫలములలో కుమారులకు ఒక ప్రత్యేకత కుమార్తెలకు ఒక విధమైన స్థానాన్ని అనుగ్రహించినట్లుగ పై వాక్యము తెల్పుచున్నది.  కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము'', అనుటలో పాత నిబంధన కాలంలోనే గాక నేటి కాలములో కూడా మగవానికి ఒక ప్రత్యేకత ఉంది.  కుటుంబ వ్యవస్థలలో ప్రతి విషయము అధికారము వారసత్వపు హక్కు ప్రతి కార్యములోను ప్రాధాన్యత ఉన్నట్లు నేడు కూడా ఆ విధంగా తండ్రి యొక్క ఆస్థిలో కుమారులకు హక్కు అనుభవాలు, తండ్రి యొక్క  సంపాదనలో పాలిభాగస్థుల విషయాలలోను, ఆస్థుల పంపకాలలోను భూమి పంపకాలలోను, తండ్రిచేస్తున్న ఉద్యోగములో ఆయన మరణించినను తండ్రి ఉద్యోగ వారసత్వము కూడా ప్రభుత్వ పరంగా ఉద్యోగ వారసత్వపు హక్కు కూడా నేటి దినాలలో ప్రత్యక్షంగా మన మెరిగిన విషయమే, ఈ విధంగా తండ్రి యొక్క సంపదల మీదనేగాక తమ పితరుల యొక్క వంశావళిలో కూడా పురుషసంతానానికి ఒక ప్రత్యేకత ఉంది.  రాజుల కాలంలో రాజు యొక్క పట్టాభిషేకము రాజు సింహాసనాన్ని అదిష్టించే యోగ్యత కుమారునికేగాని కుమార్తెకు లేదు.  ఆలాగే పరిశుద్ధగ్రంధంలో కూడా కుమారులకున్నటి ప్రాధాన్యత కొన్ని సందర్భాలను గూర్చి తెలిసికొందము.  సృష్టిలో దైవత్వమునకు భూమికి ఉభయులు కన్న సంతానము ఆదాము.  ఆలాగే ఆదాము హవ్వల తొలిగర్భఫలము కయీను. అబ్రహాము పుత్రులైన ఇస్సాకు ఇష్మాయేలు ఇరువురు కూడా దేవుడనుగ్రహించిన స్వాస్థ్యమే. ఇందును గూర్చి వివరంగా తెలిసికొందము.

          ఆదికాండ 2:7లో ఈ విధంగా వ్రాయబడియున్నది.  మొట్టమొదట దేవుడు లోకానికి అనుగ్రహించిన కుమారుడు ఆదాము.  ఇతడు స్త్రీ గర్భమునుండి గాక దేవుని యొక్క ఆత్మ దైవహస్తంతో రూపించబడి దైవ జీవము ఆత్మతో ప్రతిష్టించబడి లోక సృష్టికి తొలి కుమారుడుగ లోక స్వాస్థ్యమునకు మొట్టమొదటి వారసుడుగ దైవత్వంచేత నిర్దారించబడినాడు.  కాని దేవుడు తనకు అనుగ్రహించిన వారసత్వపు హక్కును తన దైవ ఆజ్ఞాతిక్రమణ క్రియ ద్వారా కోల్పోయి దైవ స్వాస్థ్యమైన ఏదెను నుండి తరుమబడినాడు.  ఇది మొట్టమొదటి కుమారుడుగా అవతరించిన వాని దౌర్భాగ్య స్థితి.  2వదిగ దేవుడు శారీరసబంధంగా లోకానికిఅనుగ్రహించిన 2వ స్వాస్థ్యమును గూర్చి ఆది 4:1 ఆదాము భార్యయైన హవ్వ కయీనునికని-యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను; గర్భఫలములలో మొట్టమొదటి గర్భఫలం దేవుని యొక్క స్వాస్థ్యము ఆదామైతే 2వదిగా తొలి స్త్రీ గర్భఫలము స్త్రీ గర్భం ద్వారా జనించిన వారిలో ప్రధమ ఫలము కయీను.  ఆదాము ఏ విధంగా దైవ వ్యతిరేకియై  తన స్వాస్థ్యాన్ని కోల్పోయాడో ఆలాగే ఆదాము కుమారుడైన కయీను కూడా తన జ్యేష్ఠత్వపు ప్రాధాన్యతను తన హృదయ బలహీనతను బట్టి కలుషితమైన ఆత్మీయ స్థితిని బట్టి కోల్పోయాడు.  తత్ఫలితంగా ఆదాము దైవ స్వాస్థ్యం నుండి తరుమబడగా కయీను చేసిన నేరానికి దైవత్వం చేత శపించబడి దేశద్రిమ్మరిగా మారినాడు.  

        ఇక అబ్రహాము కుమారులైన ఇద్దరు జ్యేష్ఠులలో అనగా ఇస్సాకు ఇష్మాయేలీయులలో తండ్రి ఒక్కడైనను తల్లులు ఇరువురు.  ఇద్దరు దేవుని  యొక్క స్వాస్థ్యాలే,  ఇద్దరి తల్లులు కూడా వేర్వేరుగా విభాగించబడినను అనగా ఒకామె పెండ్లి భార్య, హాగరు దాసిగా ఉన్నను ఇద్దరి స్త్రీలకు సమానమైనటువంటి వారసత్వ హక్కులు ప్రసాదించినట్లు అబ్రహామునకు హాగరు ద్వారా పుట్టిన తొలి కుమారుడు అదే అబ్రహాము శారా ద్వారా పుట్టిన తొలి కుమారునకును వారి వారి ఆత్మీయ స్థితులను బట్టి తండ్రియొక్క స్వాస్థ్యాన్ని దేవుడు అనుగ్రహించియున్న ఈ ఇద్దరి బిడ్డల స్వాస్థ్యం ఎలాంటిదంటే-లోకసంబంధమైనదిగా ఒకరిని పరలోకసంబంధమైనదిగా మరొకరిని, ఇద్దరి వారసత్వాలకు వారి జీవితాలను ఏర్పరచినట్లు ఈ క్రింద వివరించబడిన వేదభాగాల రీత్యా తెలిసికొందము.  అబ్రహాము దంపతులకు వృద్దాప్యంలో అబ్రహాముకు 100 సంవత్సరాల ప్రాయము 90 సంవత్సరాల వయస్సులో శారాకు జనించిన ఇస్సాకు తండ్రి యొక్క స్వాస్థ్యాన్నికే గాక దైవ రాజ్యము భూమిమీద స్థాపించబడుటకు వారసత్వాన్ని దైవరాజ్య స్వాస్థ్యము భూమి మీద విస్తరింపబడుటకు అబ్రహాము  కుమారుడైన ఇస్సాకు హక్కుదారుడైనట్లును ఇస్సాకు నుండి ఇశ్రాయేలు అను దైవ జనాంగము దైవ కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము-ఈ కుమారులు ఇశ్రాయేలు జనాంగమే, అలాగే అబ్రహాము దాసియైన హాగరు కన ఫలాన్ని కూడా ఫలభరితం చేసినట్లును అతనికి కూడా అబ్రహాము యొక్క జీవనోపాధిలో భాగస్వామ్యముగా జేసి అబ్రాహాము జీవితములో వారసునిగా చేశాడు.  ఇస్సాకు అనంతరము 12 గోత్రాలుగా దైవ జనం విస్తరించిన విధంగానే ఆలాగే హాగరు నందు పుట్టిన ఇష్మాయేలును కూడా 12 గోత్రాల సమవారసత్వపు హక్కు, నాటి ఇస్సాకు వలెనే దేవుడు అనుగ్రహించాడు.  నేడు ప్రపంచ వ్యాప్తంగా ఇస్సాకు సంతానము ఇష్మాయేలు యొక్క సంతానము రెండును ప్రపంచంలో ప్రాముఖ్యమైన జనాంగంగా సృష్టికర్తయైన దేవుని యొక్క ప్రతినామాలుగ సృష్టికర్త దేవుని యొక్క వారసులుగా భూమిమీద ఈనాటికి నిలబడియున్నారంటే ఇది దేవుడు తనకుమారులకు అనుగ్రహించిన స్వాస్థ్యపు హక్కని చెప్పక తప్పదు.  ఇది యెహోవా అనుగ్రహించిన కుమారుల యొక్క స్వాస్థ్యం యొక్క ఆధిక్యతను గూర్చిన వివరము.  ఇక్కడనుండి దేవుడు యాకోబు కుమారులను ఇశ్రాయేలుగా బిరుదునిచ్చి ఒక యాకోబునకే గాక యాకోబుకన్న 12 మంది కుమారులను 12 గోత్రాలు ఇశ్రాయేలుగా దేవుని కుమారులుగా పిలువబడినట్లు వేద వివరణ.  

        ఈ విధంగా యెహోవా అనుగ్రహించిన ఈ స్వాస్థ్యములు దినదిన ప్రవర్థమానములై వీరి నుండి యాజకులు ప్రవక్తలు రాజులు ప్రధానులుశాస్త్రులు వేదపండితులు దైవజనులు, దైవత్వంతో ముఖాముఖిగా మాట్లాడి ఎన్నో ఘనకార్యాలు సాధించిన ఆత్మసంబంధులు - వీరందరితో బాటు దేవుడే కుమారత్వం ధరించి, నరకోటికి సంక్రమించిన పాపము శాపము మరణం నుండి రక్షణార్థమై ఇశ్రాయేలు అనబడు ఇశ్రాయేలు స్వాస్థంలోనే ఆయన ఈ లోకంలో అవతరించి, లోక రక్షకుడుగ సకల నరకోటికి ప్రభువుగ ఈనాటి అన్యులైన మనకు పూజ్యుడుగా ఆరాధించదగినవాడుగాను ప్రపంచమందంతటను తన యొక్క చరిత్రను తన రాజ్యమహిమను, తాను ఈ లోకములో నరావతారంలో జరిగించిన మహిమాన్విత క్రియలను గూర్చి నరకోటికి బయల్పరచి తద్వారా యేసు క్రీస్తు అందరికి ప్రభువు అన్న ఆధిక్యతను పొందినాడు, ప్రియపాఠకులారా!  ఇది కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అనుటకు నానా విధ ఆధారాలతో కూడిన ప్రత్యక్ష ఋజువులై యున్నది.

        ఇక గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము'', అనుటలో ఇది స్త్రీజాతికి చెందినటువంటి మాట, దైవ ప్రవచనం స్త్రీని గర్భఫలం అనుటలో గొప్ప పరమార్థమున్నది.  స్త్రీని గర్భఫలం అనుటకు కారణం స్త్రీ జన్మయే గర్భం ద్వారా సంతాన సౌభాగ్యమంతయు గర్భధారణ తత్సంబంధంగా అనేకులకు జన్మనిచ్చే సాధనంగా దేవుని చేత స్త్రీ సృష్టించబడినట్లు స్త్రీ జన్మ యొక్క వివరణయైయున్నది.

        ప్రియపాఠకులారా!  స్త్రీ జన్మ అన్నది ఫలవంతమైన జన్మ అనగా ఫలించే జన్మ.  ఒక విధంగా చెప్పాలంటే స్త్రీ యొక్క గర్భము సారవంతమైన ఫలభరితమైన భూమి అని చెప్పవచ్చును.  అలాగే పురుషజన్మ అన్నది ఫలభరితమైన జీవయుతమైన పటిష్టమైన బీజమని అనవచ్చును.  స్త్రీ గర్భంలో పురుష బీజం వేయబడినపుడు పురుష బీజానికి రూపము ఆకారము ఇచ్చి సకల విధ హంగుల రూపించి, దినదిన ప్రవర్థమానమై స్త్రీ గర్భంలో వేయబడిన ఈ బీజము నానావిధ రూపాంతరం పొంది, నవమాసములు నిండిన తర్వాత చక్కని ఆకారము లోకానికి ఉపయోగకరమైన జ్ఞానయుతమైన 3వ వ్యక్తికి జన్మనిచ్చేది పురుషబీజము-స్త్రీ గర్భము.

        ప్రియపాఠకులారా!  మనము తల్లిదండ్రి లేకుండ జన్మించుట లేదు.  తండ్రి బీజం ద్వారా తల్లి గర్భంలో నవమాసములు నానా విధహంగులతో ఒక వ్యక్తిగా రూపించబడి ఈ లోకములో జన్మించినట్లు తెలిసిన విషయమే.  ఒక నరుడు నారి ఫలించాలంటే కేవలము శరీరసంబంధ ప్రమేయము అవసరమైందే గాక దైవానుగ్రహం కూడా అవసరమైయున్నట్లు వేదములో బహుకాలము అబ్రహాము సంతానం లేనివాడును, శారా తొంబయి ఏండ్లు దాటి స్త్రీ ధర్మము ఉడిగి పండుముసలి తనంతో ఉండినపుడు అబ్రహాము శారా లోకములో శారీర మర్యాదను భూలోక మర్యాద శారీర స్థితిని ఎంతో కాలంగా స్త్రీపురుషుల కలయిక కలిగి యుండవచ్చును.  వారి శారీర ప్రయత్నాలు వ్యర్థమైనట్లును గర్భధారణ ప్రసవము అన్నదేమిటో ఎరుగక అబ్రహాము భార్య జీవించింది.  అలాగే నూరు సంవత్సరాల అబ్రహాము ఇక తనకు సంతానం కల్గునా? అన్న ప్రశ్న తనకు కల్గి తన దురదృష్టానికి చింతించినట్లు వేదములో చదువగలము.  అయితే ఒకానొకదినాన దేవుని వాగ్దానమును బట్టి ఆది 18:లో అబ్రహాము దేవునికి ఆతిధ్యము ఇచ్చిన సంధర్భంలో మీదటికి ఈ కాలమున నీ యొద్దకు వచ్చెడి సందర్భములో నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కల్గును అని దేవుడు చేసిన వాగ్దానమును బట్టి నాటి పండుముదుసలులైన ఆ వృద్ధదంపతులలో మానవ బీజంతో బాటు దైవవాక్‌ బీజం కూడా మిళితమె,ౖ ప్రపంచంలో ఇశ్రాయేలు అనుజనకూటమికి మూల పురుషుడుగా ఇశ్రాయేలు అను ఇరువది లక్షల జనభాకు తండ్రిగా ఉండెడి కుమారుని అబ్రహాము దైవానుగ్రహంతో పొందగల్గినాడు.  ఆ విధంగా దేవుడు అనుగ్రహించిన కుమారుడు అబ్రాహాము దైవ స్వాస్థ్యమని దేవుని యొక్క వారసుడుగాను భూలోకంలో దేవుని రాజ్య స్థాపనకు వ్యాప్తికి ప్రధముడుగాను అనగా ఆది పురుషుడుగాను దేవునిచేత నియమించబడినాడు.  ఇందును బట్టి యాకోబు కుమారులైన 12 మంది 12 గోత్రాలుగ ఏర్పడి భూమిమీద దైవరాజ్యమునకు స్థాపనకు 12 గోత్రాలు 12 రాళ్ళుగా దైవత్వము చేత ప్రతిష్టించబడి 12 గోత్రాలుగా ఏర్పరచబడి 12 గోత్రాల వారిగా వారి వారి విధులను బట్టి క్రియ జరిగించాయి.  12 గోత్రాలు ఒకే కార్యానికి వాడబడలేదు.  నానా విధ పరిచర్యలలో ఈ 12 గోత్రాలు వాడబడినాయి.  వీరి నుండి ప్రపంచంలో యాజకత్వము అన్నది ప్రవక్తల ఆధిపత్యము రాజుల పరిపాలన                         మతాధిపతులు వేదవిద్వాంసులు జ్ఞానులు దైవ జనులు.  నూతన నిబంధనలో అపొస్తలులు హతసాక్షులు వగైరాలు లోకమందంతట నానారీతులుగ విస్తరించి, వీరి ద్వారా నేడు వీరి పరిచర్య దినదిన ప్రవర్థమానమై మారిన నేటి నవనాగరిక యుగములో సువార్తీకులు బోధకులు సంఘకాపరులు వేదవిద్వాంసులు అబిషక్తులు మతాధిపతులు మతోద్దారకులు ఒకరేమిటి? సకల విధ పరిచర్యలలో వాడబడుటకు వారి నుండి అనేకులు ఆవిర్భవించారు.  ఒక్కమాటలో చెప్పాలంటే దేవుడు ఆదామునకును అతనికి అనుగ్రహించిన కుమారుల జీవితాలన్నవి పరిశుద్ధగ్రంధ వేదములో రెండు నిబంధనలకును నానా విధలోకచరిత్రకు కారణమైయున్నది.  వీరి ద్వారా శకాలు ఏర్పడినవి.  యుగాలు ఏర్పడి కాలములు సంవత్సరాలు నెలలు వారములు దినాలు ఏర్పడినవి.  లోకములో జరిగే ప్రతి కార్యక్రమానికిని మూల కారకులు అబ్రహామునకు దేవుడు అనుగ్రహించిన కుమారులే; క్యాలెండర్లు మార్చబడుటగాని, సెలవుదినంగా ఆదివారం ప్రకటింపబడుటగాని విశ్రాంతి దినమును శనివారం నిర్ధారింపబడుట ఏమి, దైవ కుమారుని బలియాగమునకు జ్ఞాపికగా గల శుక్రవారమన్నదే నేటి క్రైస్తవ ఆచారంలో పరిశుద్ధదినాలుగ ఏర్పడుటన్నది దేవుడు అనుగ్రహించిన కుమారుల యొక్క స్వాస్థ్యమే.

        ఇక గర్భఫలమన్నది ఆయన ఇచ్చు బహుమానమన్నాడు.  ఇది ఎవరెవరికి కల్గింది? స్త్రీకి గర్భఫలం అనుగ్రహించకపోతే స్త్రీ జన్మ గొడ్డుపోతు జన్మయే అనగా గొడ్రాలి జీవితమే గొడ్రాలైన శారా గర్భం ఫలించింది.  హాన్నాకు, మనోహభార్యకు ఫలవంతమైన ఫలింపచేసిన వాడు దేవుడే,  గొడ్రాలైయున్నట్టి రిబ్కా గర్భమునకు ఫలితాన్ని ఇచ్చిన వాడు దేవుడే, నూతన నిబంధనలో కన్యకయైన మరియగర్భమును ఫలింపజేసినవాడు దేవుడే, యాజకుడైన జకరియా భార్య గొడ్రాలైయుండగా ఫలింపజేశాడు.

        ప్రియపాఠకులారా!  ఇపుడు ప్రవచించిన ప్రతి గర్భఫలం కూడా స్త్రీకి కాకుండ పురుషునికి జన్మ నిచ్చింది.  వీరందరు కుమారులనే కన్నారు.  హవ్వ మొట్టమొదట కన్న కుమారుడు కయీను,  అబ్రహాము భార్య శారా కన్న కుమారుడు ఇస్సాకు.  అలాగే హన్నా గర్భం ఫలించి సమూయేలునుకనింది.  మానోహ భార్య గొడ్రాలై యుండగా ఆమె గర్భాన్ని ఫలవంతం చేసి మహాబలవంతుడైన సంసోను ఆమెలో జన్మించాడు.  ఆ విధంగా రిబ్కాలో యాకోబు ఏశావు ఇద్దరి మగ సంతానానికి జన్మనిచ్చింది.  గొడ్రాలైన జకరియా భార్య ఎలీసబెతు గర్భం ధరించి బాప్తిస్మమిచ్చు యోహానును కనింది, ఇది నరసంబంధమైన మరియు సృష్టిసబంధమైన భూ సంబంధమైన సంతానాలను గూర్చిన గర్భ స్వాస్థ్యము గర్భఫలమును గూర్చిన సంపూర్ణ వివరణ.

        ఇక ప్రభువు రాకడ సమీపమై ఈ లోకం అంతరించే కడవరి దినాలలో ఈ ప్రసవవేదనన్నది నాటివలె గాకఈ స్వాస్థ్యము గర్భఫలమన్నది వికృత రూపం దాల్చింది.  క్రైస్తవ్యం విస్తరించియున్న ఈ దినాలలో క్రైస్తవులుగా పిలువబడే వారి సంతానాలలో కూడా కుమారుల యొక్క స్వాస్థ్యమన్నది నాగరికత అన్నది శృతిమించి వివిధ వికృత రూపాలు ధరించి క్రైస్తవులమైన మనము క్రీస్తు యొక్క రాజ్యమునకును ఆయన సావాసమునకు వారసుల మన్న సత్యాన్ని విస్మరించి, లోక సంబంధస్వాస్థ్యాలు లోక వైభోగాలు ఆడంబరాలు ఆధిక్యతలు ఘనతలు వీటిని స్వాస్థ్యంగా పొందాలన్న తలంపులో చాలా కుటుంబాలున్నవి.  పేరుకు క్రైస్తవులుగా ఉన్నను క్రైస్తవ విశ్వాసులమని చెప్పుకొంటున్న వారి యొక్క మగసంతానం క్రీస్తు మార్గం వదలి అన్యుల మార్గంలో అన్యుల పద్దతులలో ఏకీభవించి అన్యులమని చెప్పుకొంటూ అనగా క్రీస్తును ఎరుగమని క్రైస్తవులము కామని ప్రభుత్వ ఉద్యోగాలలో స్వాస్థ్యం పొందాలని క్రియ జరిగించుట.  ఆ విధంగా భూలోక ఉద్యోగ స్వాస్థ్యాన్ని పొందుటకు క్రైస్తవులు సహితం క్రైస్తవ సంతానాలు తాము క్రైస్తవులము కామని, తమని గూర్చి తాము బహిరంగంగా సర్టిఫికేట్ల ద్వారా కులధృవీకరణ, మతపరమైన జాతిపరమైన శాకాపరమైన హీనత్వానికి పాల్పడి దైవరాజ్య స్వాస్థ్యమునకు అయోగ్యులై దేవుని మహిమను క్రీస్తు యొక్క ప్రభావమును ఎరిగియు, ఆయనను మహిమపరచుటకు బదులు లోకస్థులతో చేతులు కలిపి లోక పదవులు ఉద్యోగాలు బ్యాంకుల ద్వారా లబ్ధిపొందాలని తద్వారా అంతస్థులతో కూడిన భవనాలకు నిర్మాణాలకు ప్రాకులాడుచు పరలోక స్వాస్థ్యం పొందుటకు బదులు భూలోక స్వాస్థ్యాన్ని ఆశించుటెంత సబబో సత్‌ క్రైస్తవులు ఆత్మీయ దృక్పధంలో ఆలోచించవలసియున్నది.

        పాత నిబంధన కాలములో అన్యులతో సావాసము అన్యులతో పొత్తు అన్యుల భోగభాగ్యాలు, అన్యుల తిండిని ఆశించి, నాయకుడు ప్రవక్తయైన మోషేను విసిగించి, అనేక మార్లు తిరుగుబాటుజేసి ఐగుప్తు యొక్క భోగభాగ్యాలు ఆహార విలువలు వారు చవిచూచిన చేదు అనుభవాలు మనమెరిగిన విషయమే.  ఆ విధంగా నేటి క్రైస్తవ  విశ్వాసులైనటువంటి మన జీవితాలలో ఇదే విధమైన క్రియను అపవాది కలిగిస్తుండగా-నేటి క్రైస్తవ విశ్వాసులైన మనము మన జీవితాలు పరలోక దేవుని యొక్క స్వాస్థ్యం పొందగల యోగ్యత నేటి క్రైస్తవులైన మనలో ఉన్నదా? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము.  ఈ దైవిక స్వాస్థ్యం పొందే యోగ్యత మనకు మనకుమారులకు ఉన్నదా?  కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యానికి అర్హతలేమిటి?  అన్నది నేటి క్రైస్తవ్యము ఆలోచించుటలేదు.  ఈ సందర్భంలో 15వ కీర్తన మనము ధ్యానిస్తే యెహోవా అనుగ్రహించిన కుమారులకున్న స్వాస్థ్యపు విలువలు ఇందులో మనకు తెలియగలదు.  అందుకు సంబంధించిన సర్టిఫికేట్లు ఇందులో వివరంగా ఉన్నవి.  యధార్థమైన ప్రవర్తన నీతిననుసరించుట నిజము పలుకుట, యెహోవాయందు భయభక్తులు కల్గి పొరుగువారిని తనవలె ప్రేమించి మేలుచేయుట వగైరాలు.

        నూతన నిబంధనకాలంలో దైవ జనాంగమైన ఇశ్రాయేలు కంటె దేవుని కుమారులుగా అన్యులు దైవ రాజ్యమునకు ఆయన స్వాస్థ్యానికి పౌరసత్వం పొందిన అన్యులను గూర్చి మనము తెలిసికొందము.  యేసు ప్రభువు తన 12 మంది శిష్యులను ఏర్పరచుకోక పూర్వము వారు అన్యులే, అనగా క్రీస్తు ఎవరో?  ఎలాంటివాడో ఎవరి కుమారుడో?  క్రీస్తులో వున్న ప్రత్యేకతలు ఎలాంటివో ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఆయన పుట్టుక ఏమిటో? ఆయన యొక్క రాకడమర్మమేమిటో? వగైరా విషయాలు ఎరిగిన వారు కారు. ఆయనను ప్రభువు మాటకు విధేయించి ఆయన పిలుపు అందుకొని తమ దోనెలు తమ చేపలు పటువలలు వారి సాంసారిక జీవితాలు వారి కుటుంబాలు వారి రక్త సంబంధులు సమస్తమువదలి వెంబడించారు.  ఆ విధంగా వెంబడించిన వారే 12 మంది శిష్యులు.  వారు ప్రభువు మార్గంలో నడిచి ప్రభువు మహిమార్దంగా అద్భుతాలు సూచక క్రియలు, ఆయనలో వున్న దైవత్వము సమస్తమును ఎరిగి తమ జీవితాంతం వరకు ఆయనను వెంబండించి పరలోక పట్టణానికి 12  పునాదులయ్యారు.  ఇది దైవ కుమారుల యొక్క నిజస్వాస్థ్యమిది.  పాతనిబంధనలో కూడా దేవుడేర్పరచుకొన్న ఇశ్రాయేలులలో కూడా 12 గోత్రాలున్నవి.  144 వేలమంది ఒక పెద్ద సమూహము ఇది యెహోవా కుమారులకు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యమన్నది సరియైన నిర్వచనము.

        అయితే ప్రియపాఠకులారా!  ఇపుడు భూమి ప్రసవించిన కుమారులు కుమార్తెల ద్వారా విస్తరించిన జనాభా దైవత్వమును ఎరిగియు మహిమపరచని కృతజ్ఞత లేని జనాంగము ద్వారా విస్తరించిన నానా విధ దుష్టత్వము కఠినత్వము ద్వేషము పగ పదవీ వ్యామోహము, దైవత్వమును ఎరిగియు ఆయనను మహిమపరచక పోవునట్టి ఈనాటి జనాభాను కల్గియున్న ఈ భూమి పాపభారం మోయలేక ప్రసవవేదన పడుతున్నది.  ఇది సృష్టికిని నరులకు చివరి ప్రసవ వేదన కాలము.  ఈ ప్రసవ వేదన అనంతరము నీతిమంతులు పరిశుద్ధులు కాక దైవ వ్యతిరేకతను అపరిశుద్ధతను అక్రమాన్ని అవిధేయత అను ఫలాలను భూమి తన గర్భ భారమును మోస్తున్నందున ఈ భూమి ప్రభువు రాకడలో మహా భయంకరమైన ప్రసవ వేదనతో దైవోగ్రత మూలంగా  సంభవించు అగ్నితో నామ రూపాలు లేకుండ ఈ భూమి దహించబడే సమయముంటుందని 2 పేతురు పత్రిక 3:10-13 పై విధంగా ఇప్పుడున్నట్టి సృష్టి భూసంబంధమైన పాపము వల్ల ప్రసవ వేదన పొంది మృతమై స్థితిలో నిర్జీవమై చరిత్రహీనమై పోతుంది.  జనాభా లేకుండ తొలగించ బడుతుంది.  ఇపుడున్నట్టి ఈ సృష్టి కూడా పాపము మోయలేక పాపముతో బాటు భూమియులయమై మృతమై పోవు కాలము సమీపమై యున్నందున నేటి విశ్వాసుల మైన మనము స్త్రీగాని పురుషుడు గాని పొందవలసిన ప్రసవ వేదన ఒకటున్నది.  అదేమనగా దైవరాజ్య సువార్త యొక్క వ్యాప్తి కొరకును నశించుచున్న ఆత్మలను నాశనం నుండి రక్షించి, అట్టి ఆత్మలను దైవత్వమునకు అప్పగించుటయు, ఆ విధంగా మార్చబడిన ఆత్మీయులతో సావాసము కల్గి శారీర సంబంధ లోక సంబంధ ప్రసవ వేదన గాక, దైవ రాజ్యమును గూర్చి ఆయన సావాసము ఆయన రాకడకు ఆయన  ప్రసన్నతకు ఆయన మహిమను గూర్చియు ఆయన మహిమగల రాజ్యం చేరుటకు, ఆసక్తితో తండ్రి సమయం కొరకు విశ్వాసులమైన మనమందరము స్త్రీగాని పురుషుడుగాని ప్రసవ వేదన పొందవలసిన దినాలు సమీపించియున్నవి. అదేమనగా 2వపేతురు 3:12లో ఈ విధంగా వ్రాసియున్నాడు''.  ఆకాశములు రవులు కొని లయమై పోవునట్టి పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టి దేవుని దినపురాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు,మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై యుండవలెను'', ఇది విశ్వాసులమైన మనలో ప్రసవ వేదన పుట్టించుటకు పౌలు మాట్లాడిన మాటలు.  ఈ మాటల ద్వారా నేటి విశ్వాసులమైన మనము ఆత్మీయ ప్రసవ వేదన పొంది, నూతన భూమి నూతన ఆకాశం కొరకు కనిపెట్టవలసిన వారమై యున్నాము.  ఇందును బట్టి చూడగా ఇపుడున్న భూమికిని-భూమి మీద నరులకును ప్రసవ వేదన ఉన్నదని రూఢిగా తెలిసికొనియున్నాము.

        ప్రియపాఠకులారా!  అపొస్తలుడైన పౌలు పురుషుడైయుండి ప్రభువు నామములో అనేకుల  ఆత్మలను మార్చుటయు, అనేకులకు దైవ రాజ్య సంబంధ సువార్తను ప్రకటించుట అనేకులను ప్రభువు విశ్వాసులుగా మార్చుటకు తాను ప్రసవ వేదన పొందినట్లును తన పత్రికలలో వివరించి యున్నాడు.  ఇందును బట్టి చూడగా ఈ ప్రసవ వేదన ఆత్మకున్నది శరీరానికున్నది, భూమికిఉన్నది.  ఆకాశానికి జలాలకు కూడా ఉన్నదని ఈ క్రింది అంశాలనుబట్టి తెలిసికోగలము.  ఇపుడు మనము ముగింపు దశలో ప్రసవ వేదనను గూర్చిన ముఖ్యాంశాలుః- మొదట దేవుని ఆత్మఆది 1:2లో సృష్టి నిర్మాణమునకై చీకటి జలాల మీద అల్లలాడి సృష్టిని కనుటకు పొందిన ప్రసవ వేదన.  అటు తర్వాత నిరాకారసృష్టి దైవ వాక్కుద్వారా గర్భం ధరించి వేటికది విడువడుట.  చీకటి అగాధజలాలలో నుండి ఆకాశము భూమి జలములు ఒకదానినొకటి ప్రసవించాయి. ఆ విధంగా ప్రసవించబడిన సృష్టిని దైవ వాక్కు అలరించిన విధానము ఆది 1:లో ఆరు రోజుల ఈ సృష్టి నిర్మాణములో భూమ్యాకాశాలు జలములు ప్రసవ వేదన పొంది, జలములలో మత్స్యములు భూమి మీద వృక్షసంపద జంతు జాలము పక్షులు మృగాలు కీటకాలు చివరిగా నరుడు.  అలాగే జలములు ప్రసవ వేదన పొంది మత్స్యములు మహామత్స్యములు జలసంబంధమైన జీవులను కన్నవి.  అలాగే ఆకాశము ప్రసవవేదన పొంది గ్రహాలను నక్షత్రాలను కన్నవి.  అలాగే వాయువు ప్రసవ వేదన పొంది అనేక జంతుజాలములకు ప్రాణవాయువుననుగ్రహించింది.  ఈ ప్రాణవాయువు ద్వారా సృష్టికి అనుగ్రహించబడిన శక్తి-ఇది లోకసంబంధమైంది.  దైవాత్మ పొందిన ప్రసవవేదనన్నది సృష్టి నిర్మాణానికేయని తెలిసికొన్నాము.  అటు తర్వాత దేవుడు తన ఆత్మ ద్వారా నేల మన్నుతో నరుని నిర్మించి తన జీవాత్మ ద్వారా వానిని కన్నాడు.  అలాగే నరుడు మత్తుతో గాఢనిద్రావస్థలో మరులు కొల్పబడి గర్భం ధరించి తన ఎముకద్వారా స్త్రీనికన్నాడు. ఈ రెండు క్రియలలో నర నారులకు ప్రసవ వేదన అంటే ఎరుగరు.  నరులకు సృష్టికిని ప్రసవ వేదన ఏర్పడుటకు కారణము నరుల యొక్క దైవ ఆజ్ఞాతిక్రమము.  నరనిర్మాణ క్రియకు ముందుగాను నర నిర్మాణము తర్వాత గాని ప్రసవ వేదన సృష్టి పొందలేదు.  నరుడు పొందలేదు.  ప్రసవ వేదన ఎలాంటిదో నాటి సృష్టి ఎరుగదు.  దైవ శాపము మూలంగా ఈ ప్రసవ వేదనన్నది సృష్టికి ఏర్పడింది.  ఈ ప్రసవ వేదనలో రెండు ఫలితాలున్నవి.  1.ప్రసవ వేదన లేనిదే ఒక జీవికి జన్మలేదు, ప్రసవం లేనిదే ఒక జీవి యొక్క జీవితమునకు ఫలింపులేదు.  కనుక ప్రసవించుటన్నది ప్రతి జీవిలోను ఫలభరిత జీవితానికి నాందియైయున్నది.  ప్రసవమన్నది ఎరుగని జీవి గొడ్డుబోతు జీవితము అనగా ఫలహీనమైన జీవితము.  ఇందును బట్టి చూడగా ప్రసవ వేదన ఫలింపు అన్నది శరీరులకున్నది అభివృద్ధి ఉన్నది.  ప్రసవ వేదన ద్వారా ప్రసవింపబడిన జీవికి వారసత్వమున్నది-దైవ స్వాస్థ్యమున్నది, దైవ సన్నిధిలో ఒక ప్రత్యేకమైన స్థానమున్నట్లు వేదరీత్యా కొన్ని ఘట్టాలలో తెలిసికొందము.  ఆదినారి ప్రసవ వేదన పొంది కన్న ఇద్దరి కుమారులలో ఒకడు శాపగ్రస్థుడు మరొకడు దైవత్వానికి యోగ్యుడు.  అయితే ఇరువురును చరిత్రహీనులయ్యారు.  అనగా ఒక మరణం చవిచూచాడు.  2వ వాడు శాపగ్రస్థుడయ్యాడు.  ఆ తర్వాత శాపగ్రస్థుని ద్వారా ప్రసవ వేదన పొంది సంతాన సౌభాగ్యం పొందిన ఈ భూమి దైవత్వానికి అయోగ్యకరంగా క్రియ జరిగించి, శాపగ్రస్థుడైన నరుని బట్టి విస్తరించిన పాపము ఆవరింపగా ఆ పాపఫలితాన్ని బట్టి ఈ అనంత విశ్వాసికి గర్భము పాప భూయిష్ఠమైనందున జలప్రళయంలో దైవోగ్రతను బట్టి మరణాన్ని కనింది.  ఆ విధంగా మరణాన్ని కన్న ఈ భూమి  మరణించిన జనాభాతో బాటు ఇది కూడా మృతమైందిగానే చెప్పవచ్చును.  అయితే నోవహు ఓడలో దేవుడు ఉంచినటువంటి నోవహు కుటుంబము ఆకుటుంబముతో బాటు ఆ ఓడలో ఉండిన జీవకోటి ,వీటితో నింపబడిన ఓడ గర్భం ధరించి ఒకానొకదినాన దైవ వాక్కును బట్టి ప్రసవించవలసిన దినమేర్పడి యుండగా ఆ విధంగా ఆ ఓడ సమస్త జీవులతో చీకటి ప్రవాహజలముల మీద ప్రసవ వేదన పడినట్లు ఒకానొక శుభదినమున, దైవ చిత్తము దైవ ఆజ్ఞానుసారము అరారాతు పర్వతాల మీద నిలచి అది నోవహు కుటుంబాన్ని అతనితోబాటు అందులోని జీవరాసులను కూడా ప్రసవించినట్లు వేదవివరణ ఈ ప్రసవ వేదనలో అతి ప్రాముఖ్యమైన ఘట్టము.

         చిత్రమేమిటంటే 370 దినాలు ఈ ఓడ అగాధ చీకటిజలాలమీద తేలియాడుచు ఓడలోని నోవహు కుటుంబము గాని జంతుజాలముగాని గర్భందాల్చి ప్రసవ వేదన పొంది సంతానాభివృద్ధి పొందినట్లు వేదంలో వ్రాయబడలేదు.  అలాగే జంతుజాలము కూడా గర్భవేదన పొంది ప్రసవ వేదన పొంది సంతానాభివృద్ది చెందియుంటే ఓడ సరిపోయేది కాదు.  అందువల్ల ఓడ దైవానుగ్రహమును బట్టి ఎంతో మందిని తనలో ఇముడ్చుకొని ప్రవాహజలముల మీద తిరిగి దైవ చిత్తము ప్రకారంగా అరారాతు పర్వతాల మీద నిలచి తద్వారా తాను ప్రసవ వేదన పొంది తనలో ఉన్న జీవులను దైవ సన్నిధానంలో ప్రసవించినట్లు వేదములో చదువగలము.  ఇది నోవహు నీతి జీవితములో జరిగిన ప్రసవ వేదనతో కూడిన దైవమర్మముతో కూడిన ఘట్టమైయున్నది.  ఈ విధంగా నరులు-నరులను బట్టి రూపించబడిన సృష్టి ఇరువురును దైవ సన్నిదిలో పనికి మాలిన స్థితిలో ఉండగా స్త్రీకి ఇచ్చిన శిక్షను తానేపొంది ఇశ్రాయేలు అను జనాభాను గర్భం ధరించి ప్రసవ వేదన పొంది ఆ వరకు యాకోబు అను మోసకరమైన నామము నుండి దేవుని పేరు పెట్టబడిన వారిని తానేర్పరచుకొని ప్రసవించినట్లును, దేవుడు తాను కనిన కుమారులు 12 గోత్రాలు 22 లక్షల జనాభాయని వేదములో చదువగలము.  కాని సంతానము కూడా నిష్ప్రయోజనమై దైవత్వంపై తిరుగుబాటు చేస్తూ దైవిక మర్మము దైవత్వంలో అణగారియున్న ప్రేమను తమపట్ల జరిగించు ఆశ్చర్య క్రియలను, దేవునికి తమ పట్లఉన్న అత్యధిక ప్రేమను తిరస్కరించి దైవత్వంపై తిరుగుబాటు చేసి దైవత్వమును ద్వేషించి దోషులు కాగా దేవుడు వారికి ఇచ్చిన శిక్షను మనము వేదరీత్యా ఎరిగిన సత్యమే!

        ఇట్లుండగా దేవుడు ప్రసవ వేదన పొందకుండ నూతన నిబంధన కాలంలో ఆ ప్రసవ వేదనను తానేర్పరచుకొన్న కన్యకయైన స్త్రీని తన కుమారత్వమునకు జన్మనిచ్చుటకు ఆమెను ఏర్పరచుకొని ఆమెకు తన ఆత్మతో గర్బం ధరింపజేసి ప్రసవ వేదన కల్పించి దైవ కుమారుని ప్రసవించుటన్నది నూతన నిబంధనలోని చరిత్ర.   కన్యకయైన మరియ నిండు చూలాలై ప్రసవ వేదన పొందినపుడు, ఆమె ప్రసవ వేదనను లోకము గుర్తించలేదు.  ప్రసవ వేదన పొంది శిశువును ప్రసవించే సమయములో లోకములో ఆమెకు ఏ విధమైన ఆదరణలేదు, లోకము ఆమెను గుర్తించలేదు.  ఇందును  గూర్చి లూకా 2:1-7 చదివితే దేవుడు తన కుమారునికి జన్మనిచ్చుటకు తానేర్పరచుకున్న కన్యకకు కల్పించిన గర్భవేదన, లోకము యొక్క నిరాదరణ ఆమెకు ప్రధానం చేయబడిన యోసేపు అనునీతిమంతుని యొక్క శీలము.  అతనికి దేవుడు అనుగ్రహించిన సహనము ప్రసవ వేదన పొందుచున్న కన్యకకు తోడుగా యోసేపు  కూడా పొందిన ప్రసవ వేదన అనగా తన భార్యయైన మరియకు కాన్పు సమయములో లోకములో కావలసిన స్థలాన్ని ఎన్ను కోవడములో అతడు చేసిన శ్రమ నాటి దినమున పరమరక్షకుని జన్మమునకు లోకము చేసిన అలక్ష్యము నిరాదరణ నిస్సహాయత కనపరచిన కఠినత్వము, నాటి లోకపరిపాలకుల స్వార్థము ద్వేషము, యూదుల రాజుగా అవతరించిన శిశువును అంతం చేయుటకు చేసిన ప్రయత్నాలు ఈ ఘట్టములో ప్రసవ వేదన కల్గించిన కొన్ని ముఖ్యమైన క్రియాకర్మలను గూర్చి తెలిసికొందము.  కన్యకయైన మరియ ప్రసవ వేదన పొందినపుడు లోకసంబంధమైన సహాయసహకారాలు లేవు.  అలాగే ఆమెను బెత్లెహేమునకు వాహనం మీద ఎక్కించుకొనిపోయినపుడు యోసేపునకును కల్గిన ప్రయాస ప్రయాణముతో కూడిన వేదన అంతములేనిది, అలాగే నాటి పరిపాలకుడైన హేరోదు జ్ఞానుల ద్వారా లోక రక్షకుని జన్మవార్తను వినినపుడు అసూయ ద్వేషము స్వార్థము కౄరత్వము కఠినత్వము నయవంచకము, క్రీస్తు విషయంలో ఐదు విధములైన ప్రసవ వేదన పొందినట్లు మత్త 2: హేరోదు రాజు ఈ సంగతి విన్నపుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరును కలవరపడిరి.  కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చి-క్రీస్తుఎక్కడ పుట్టునని వారిని అడిగెను'', ఈ విధంగా దుర్గుణాలను గర్భం ధరించిన హేరోదు తీవ్రమైన ప్రసవ వేదన పొంది మత్త 2:16లో వలె బెత్లెహేములోను దాని సకల ప్రాంతాలలోనురెండు సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయస్సు గల మగ పిల్లలనందరిని వధించెను'', అనగా ఇతను గర్భం ధరించి కన్నది మరణము.  కన్య మరియ గర్భం ధరించి నిత్యజీవనమును కన్నది-ఆయన లోకరక్షకుడు.  నాటి హేరోదు గర్భం ధరించి నరకాగ్ని గుండములో పడవేయబడు మరణశిక్షను కన్నాడు.  ఈవిధంగా దైవ సంబంధమైన ప్రసవ వేదన భూసంబంధమైన ప్రసవ వేదన సాతాను సంబంధమైన ప్రసవ వేదన భూమిపై క్రియ జరిగించింది.  అక్రమము విస్తరించి పాపము మూడు పాదాలతో నడిచింది.

        ప్రియపాఠకులారా!  ఈ వ్యాఖ్యానంలో ఈ ఘట్టము చదువుచున్న పాఠకులైన మీరు సువార్తను గర్భం ధరించి, తద్వారా ప్రసవ వేదనను పొంది క్రైస్తవ్యంలో ఒక ఆత్మను ప్రసవించి ప్రభువునకు అర్పించే ప్రసవ వేదన చదువరివైన నీకున్నదా?  ప్రసవ వేదనన్నది ఏయేరూపంగా ఏయేరీతులలో ఏయే విధంగా ఏయేమార్గాలలో క్రియజరిగించిందో ఇంతవరకు తెలిసికొన్నాము.  అయితే ప్రభువు అనుగ్రహించిన క్రైస్తవులకున్న ప్రసవ వేదన ఎలాంటిది?  అంటే మందిరానికి వెళ్ళి గువ్వవలె కూర్చుని మన వరకు మనకే రక్షణ అనుకుంటే చాలదు.  మన వరకు మనము క్రైస్తవులము అనుకున్నంత మాత్రాన మన క్రైస్తవ్యం సార్థకం కాదు.  అట్టి క్రైస్తవ్యము మృతమైనది. అట్టి క్రైస్తవ్యము నామ క్రైస్తవ్యవము అట్టి క్రైస్తవ్యమునకు మనుగడలేదు విలువలేదు-అది నులివెచ్చని క్రైస్తవ్యము, దైవ దృష్టికి నిరుపయోగమైన క్రైస్తవ్యము.  క్రైస్తవ్యంలో ఒక వ్యక్తి గర్భం ధరించి ప్రసవ వేదన పొందుచున్నాడంటే అతనుకనే ఆత్మ   ప్రసవించే గుణాలు ఎలాంటి వంటే కన్య మరియ గర్భం ధరించి ఎలాంటి శిశువును కన్నదో, అలాంటి విశ్వాస పూరితమైన క్రైస్తవ్యాన్ని ప్రభువులో ప్రసవ వేదన పొంది ప్రభువునకు యోగ్యకరమైన ఫలాన్ని ప్రసవించాలి.  అట్టి ప్రసవ వేదనలన్నవి సత్ఫలితాలిస్తాయి.

        ప్రియపాఠకులారా!  యేసు ప్రభువు కూడా తాను ఈ లోకము నుండి వెళ్ళవలసిన సమయమాసన్నమైనపుడు లూకా 22:39-44 వ్రాయబడిన వేదభాగంలో ప్రభువు పొందిన ప్రసవ వేదనను గూర్చి తెలిసికొందము. ''ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులును ఆయన వెంట వెళ్ళిరి,'' లోకములో తలవాల్చుకొనుటకు ఎలాంటి స్థలము లేని పరమరక్షకుడు తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళినపుడు ఆయనతో కూడా ఆయన శిష్యులును వెళ్ళినట్లును, ఆ విధంగా వెళ్ళిన సందర్భంలో యేసు-మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్దనుండి రాతి వేత దూరము వెళ్ళి మోకాళ్ళూని చేసిన ప్రార్థనకు పరలోకంనుండి యొక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచిన విధానము.  ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేసెను.  ఇది దైవ కుమారుడు లోకరక్షణార్థం లోక పాపశాపవిమోచనార్థం, యావద్‌ నరకోటికి దేవుడనుగ్రహించు రక్షణార్థం దైవ కుమారుడు పొందిన ప్రసవ వేదన.  ఈ ప్రసవ వేదనలో ఆయనలోనుండి స్రవించిన చెమట రక్త బిందువులుగా మారినట్లు చదువగలము.  ఇది దైవ కుమారుడు పొందిన ఆత్మల సంపాదనకై  ఆత్మీయమైన ప్రసవ వేదన.  ఈ ప్రసవ వేదన ద్వారా ప్రభువు నరులు పొందవలసిన శిక్షను నరులు పొందవలసిన మరణాన్ని నరులకు రావలసిన భయంకర తీర్పు వగైరాలను ప్రసవించి, వాటిని హతమార్చి అనగా జయించి లోకరీత్యా సమాధిచేయబడినాడు.  కాని సమాధి కూడా దైవ కుమారుని గర్భం ధరించి ప్రసవ వేదన పొంది తనకుతానే పాతాళ మార్గమును తెరచి దైవ కుమారుని మహిమతో తనలోనుండి పునరుత్థానుడగుటకు ప్రసవించినట్లు వేదరీత్యా ఇదే లూకా 24:6లో చదువగలము.

        ఇందును బట్టి ప్రియపాఠకులారా!  ఈ యొక్కనవనాగరికయుగంలో దైవ కుమారుడు ఈ లోకములో కన్యకలో పుట్టడము ఆమె ప్రసవ వేదన పడడము ఇవన్నియును జరిపోయినవి-ఇక జరుగవు.  ఈయుగములో చివరితరంవారిగా మిగిలియున్న మనకు మన నిమిత్తము ఇపుడున్న భూలోకము అనుభవించబోవు ప్రసవవేదన - ఈ ప్రసవ వేదన మరల జనాన్ని సృష్టములను జీవులను నరకోటిని ప్రసవించుటకు కాదు గాని, ఇది దైవోగ్రత మూలంగా లోకానికి సంభవించబోవు మరణవేదన అనగా నాశనకరమును బూడిదెయు దుమ్ములో దుమ్ముగా మారిపోయేటటువంటి నాశనంతో కూడిన దైవోగ్రత కార్యానికి ఇపుడున్నట్టి ఈ భూమి దీనిమీద ఉన్నటువంటి కృత్యములు జీవరాసులు వృక్షాలు పర్వతాలు లయమై పోగా వాటితో బాటు భూమి కూడా బొగ్గయి మాడిపోయేదినము ఆసన్నమైయున్నది.  ఆదినము మహాభయంకరమైన దినము.  దేవుడు మొట్టమొదట లోకాన్ని సృష్టించిన దినము పరిశుద్ధమైనది, దైవత్వం చేత రూపించ బడింది.  దేవుని మహిమార్థంగా స్వయంభవత్వం పొంది, సర్వసృష్టాలు సకల జీవరాసులుసకల వృక్ష సంపదకు జన్మనిచ్చింది.  అయితే నేడు విస్తరించి యున్నటువంటిది అది చేయు అక్రమము అన్యాయము, దైవత్వము ఓర్వలేనట్టి పాపము విస్తరించియుండగా నరుల యొక్క విస్తారమైన దోషాపరాధములను బట్టి నరులనిమిత్తంగా శపించబడిన ఈ భూమి అపవాదితో ఏకమై జరిగించిన క్రియాకర్మలను బట్టి నరుని జ్ఞానం దినదిన ప్రవర్థమానమై నరునిలో దైవ జ్ఞానమునకు బదులు లోకము తన జ్ఞానాన్ని ఇచ్చి, దైవ శాసనంతో శాస్త్రరీత్యా ఆత్మీయంగా ఎదుగవలసిన నరజీవితాన్ని లోకము దాని ఇచ్చలు దాని సంపద, లోకము దాని యొక్క ఆధిక్యతలు, ఆకర్షణల ద్వారా నరులు ఆత్మీయత కోల్పోయి శారీర జ్ఞానంతో లోకముతో చేతులు కలిపి, లోకాధిపత్యం కోరి లోక పరిపాలన అధికారము కొరకు వ్యామోహితుడై దైవత్వమును దైవ చిత్తమును దైవ ప్రణాళికను దైవ నిబంధనను దైవ విధులను, విస్తరించి లోకచట్టాలను లోకవిధులను లోకాధిపత్యమునకు బంధీకృతుడై ప్రతివాడును రోమా 3:23లో వలె అనగా ''ఏ భేదమును లేదు.  అందరును పాపము చేసేదేపుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు''. అని ప్రవచనాన్ని బట్టి నేడు అన్యుడని క్రైస్తవుడని, విశ్వాసియని అవిశ్వాసియని, జాతిభేధము కులబేధము వర్గ బేధము భాషా బేధము లేకుండ, సకల నరకోటి తమ యొక్క దోషస్థితిని బట్టి ఈ భూలోకము దైవోగ్రతకు గురియై, అగ్నిలో దహంచబడే భూలోక వినాశనమునకే నేడు నరులు కారకులైయున్నారు.

        ప్రియపాఠకులారా!  ఆత్మ సంబంధముగాను దైవ భీతితోను క్రైస్తవ సావాసములోను ఆత్మీయంగా సిద్ధపాటు గల్గి వాక్యధ్యానము ప్రార్థన ఈ రెంటితో మలచబడి జీవించువాడు నేడు దాదాపు లేడనియే చెప్పవచ్చును.  ఎందుకనగా దైవ వాక్యము కీర్తన 14:2-3లో విధంగా వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమోయని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను. వారందరు దారి తొలిగి బొత్తిగా చెడియున్నారు.  మేలుచేయు వారెవరును లేరు, ఒక్కడైనను లేడు.  ఆలాగే రోమా 3:11లో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు.  గ్రహించు వాడెవడును లేడు, దేవుని వెదకు వాడెవడును లేడు.  అందరును త్రోవదప్పి ఏకముగా పనికిమాలిన వారైరి'', అన్న ప్రవచనం ప్రకారము నేటి దినాలలో నరులలో విస్తరించిన లోక శాస్త్రజ్ఞానమన్నది దైవత్వాన్ని మరిపించి లోకాన్ని వాని దృష్టియందుంచి, దేవుడు లేడని దృశ్యమైన ఈ యొక్క లోకమే దేవుడని, ప్రభువు రాకడ ఒట్టిదని ప్రకటన గ్రంధంలోని దర్శన భాగ్యాలన్నియును కల్పనాకధలన్న స్థితికి దిగజారియున్నారు.  ఇది పరిపక్వం పొందే దశ ఎర్పడియున్నది.  ఆ విధంగా ఇది పరిపక్వమైనపుడు, చెట్టులో పండిన పండు ఏ విధంగా నేలమీద పడుతుందో అలాగే లోకము లోకస్థులు అనగా లోక పాపము లోకస్థుల పాపము రెండును పరిపక్వమై, లోకములో లోకస్థులు కూడా లయమైపోవు సమయ మాసన్నమైయున్నట్లును, ఈ విధంగా నాశనము కొరకు లోకము లోకస్థులు పాప భారములో ప్రసవ వేదన పడుచున్నట్లు, ఈ ప్రసవ వేదనకు అంతము దైవసన్నిధిలో ఉన్నది.  ఇందును బట్టి ఈ ప్రసవ వేదన అనంతరము దేవుడు ఇపుడున్నట్టి సృష్టి ఇవన్నియును ఇట్లు లయమై పోయిన తర్వాత జరుగబోవు పర్యవసానమేమనగా లోకము వల్ల నరుల వల్ల సంక్రమించిన పాపమన్నది నరునిలోను లోకములోను ప్రసవ వేదనకల్గింపగా, ఆ తర్వాత సంభవించేది మరణవేదన అనగా ఏడ్చు పండ్లు కొరుకుట అంగలార్పురోదన వగైరాలు.  అలాగే జలాలు కూడా లోకము లోకస్థులు చేసిన దోషాపరాధములను బట్టి సముద్రము ప్రకటన 21:2-3 మొదటి ఆకాశము మొదటి భూమియు గతించి పోయెను.  సముద్రమును ఇకనులేదు'', అనుటలో ప్రియపాఠకులారా!  నరుని యొక్క దోషాపరాధములను బట్టి భూమికే గాక ఆకాశమునకును జలాలకును మరణవేదన ఉన్నట్లుగ ఇందులో చదువగలము.  ఎందుకనగా ఆకాశములో ఉన్న వన్నియును కూడా దైవోగ్రత మూలంగా దహించబడే దినము ఒక్కటున్నదని 2వ పేతురు 3:10-13 చదివితే ఏయే సృష్టములు లయమై పోతాయో ఏయే సముద్రాలు దహించబడునో ఏయే సృష్టాలకు అంతమున్నదో ఆ తర్వాత జరుగబోయేది ఏమిటో వివరంగా వ్రాయబడియున్నది.   మొట్టమొదటి శిక్ష ఆకాశానికే దేవుడు విధించుచున్నట్లుగ ఈ వేదభాగములో మనము చదువగలము.  ''అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును.  ఆదినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న సమస్త కృత్యములు కాలిపోవును, అని వ్రాయబడిన ప్రకారము నరదోషము మూలంగా సృష్టికి నాశనము కలుగబోవుచున్నట్లు ఇందును బట్టి మనకు తెలుస్తున్నది.  అనగా ఇపుడున్న  ఆకాశము జలములుభూమి యావత్తును ప్రసవ వేదన పొంది నాశనాన్ని కనబోవుచున్నట్లు ఇందును బట్టి మనము గ్రహించవలసియున్నది.

        అయితే దేవుని యొక్క ప్రణాళిక ఆయన సంకల్పము మాత్రము మరియొక లోక నిర్మాణము ద్వారా నెరవేరుతుందని కూడా ప్రకటన 21:3లో మనము చదువగలము.  ఇపుడున్న భూమి నాశనమై పోగా దేవుడు సృష్టించు మరొక భూమి ఈ లోకసంబంధం గాక పరలోక సంబంధమై పరలోకం నుండి దిగివచ్చునట్లును, అందులో మరణమైనను దుఃఖమైనను పండ్లుకొరుకుట ఏడ్పులు మోసమైనను నాశనమైనను వేదన యైనను కపటమైనను ద్వేషమైనను, ఎలాంటి నీచ వాతావరణ లేక ఎల్లప్పుడు దైవసన్నిధిలో నరులు నిశ్చింతగా ప్రభువు సింహాసనం వద్ద జీవించే భాగ్యం కలుగుతుంది.  ప్రసవ వేదన లేదు గర్భం అన్నది లేదు వివాహం లేదు.  గర్భధారణ ప్రసవ వేదన సంతానోత్పత్తి  లేవు.  కోట్లాటలు లేవు మోసంలేదు దుఃఖము లేదు. దొంగలు లేరు.  భయంలేదు దిగులులేదు, ప్రకృతి సంబంధ ఉపద్రవాలు లేవు.  ఇప్పుడున్నట్టి అరిష్టాలు లేవు.  ఔషధం లేదు కరెంటు లేదు కిరసనాయలు గొర్రెల పిల్లయైన క్రీస్తు యొక్క వెలుగులో నివసించే భాగ్యముతో నిత్యము శాంతము సమాధానంతో ఆత్మీయ జీవితం జీవించే మహాభాగ్యం ఉన్నదన్న సత్యాన్ని మనము గ్రహించి తాత్కాలిక మాయతో కూడిన భూలోక రాజ్య సంపద పదవులు, దీని భోగభాగ్యాలు ఆశించక రాబోయే రారాజైన ప్రభువు యొక్క రాజ్యం ప్రవేశించే యోగ్యత పొంది, ఆయన ప్రసన్నత కొరకు ఆయన ఎంపిక కొరకును ఆయన స్వాస్థ్యం కొరకును, నేటి క్రైస్తవులమైన మనము ప్రసవ వేదన పొంది అనేక ఆత్మలను ప్రభువు కొరకు సంపాదించి అనగా అనేక ఆత్మలను కొని ప్రభువు  యొక్క సన్నిధికి అనగా ప్రభువు బిడ్డలుగా న్రభువు పక్షంగా వారిని అప్పగించి, శరీరంతో ఉన్నప్పుడే మన విశ్వాసజీవితములో ధన్యులమగుదుము గాక!

                సీయోను                

        కీర్తన 132:13-14 యెహోవా సీయోనును ఏర్పరచుకొనియున్నాడు.  తనకు నివాస స్థలముగా దానిని కోరుకొనియున్నాడు.  నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును.

        ప్రియపాఠకులారా!  దేవుడు కొన్ని ముఖ్యమైన స్థలములను తాను సృష్టించిన ఈ భూమి మీద తననివాస స్థలములుగా ఏర్పరచుకొనియున్నట్లు వేద రీత్యా మనము తెలిసికొందము.  మొట్టమొదటిగా దైవత్వము లోక సృష్టికి పూర్వము భూమి మీద తనకు నివాస స్థలమంటూ లేదు.  అయితే లోక స్రృష్టి అనంతరము ప్రారంభములో తన హస్త నిర్మితుడైన నరునితో ఈ ఏదేనులో నరునితో దేవుడు నివసించిన స్థలము ఏదేను.  ఈ ఏదేనులో నరునితో సఖ్యతగా నిత్య సమాధానముతో ప్రశాంత వాతావరణములో పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధ స్థితిలో దైవ నరుల నివాసము ఏదేను లో గొప్పగా సాగింది.  అయిత లౌకిక శక్తి యొక్క ప్రమేయమును బట్టి నరజీవితము కలుషితమై నందువలన దేవుడు నరుని తోటనుండి తరిమివేసి ఆ తోటను మూసివేసి నరునికిని తనకునున్న సంబంధ బాంధవ్యాలను త్రెంపుకొన్నట్లు వేదములో చదువగలము.

        అటు తర్వాత తాను శాసించిన నరుని పట్ల దేవుడు సానుభూతిని కలిగి రెండవ నివాసముగ తోటలు ప్రవాహములు కాక తాను సృష్టించిన జనుల మధ్యనే తానేర్పరచుకున్న ఇశ్రాయేలు తనకు నివాసముగాను తనకు స్వాస్థ్యముగాను ఏర్పరచుకున్నాడు.  అయితే ఈ జనము కూడా ఆయన మీద తిరుగుబడినారు.  అందుకు దేవుడు ఆగ్రహించి తన ప్రజలను అన్యులైన ఐగుప్తీయుల కప్పగించి నట్లు ఆ విధముగా దేవుడు తన జనాంగము నుండి వేరై యోరేబు అను కొండను తన నివాస స్థలముగా చేసుకొన్నట్లు నిర్గమ 3:1లో ఈ విధముగా ఈ యోరేబు అన్నది దేవుని పర్వతముగా అనగా దేవుని నివాసముగా వున్నట్లు ప్రవచించబడియున్నది.  ఈ యోరేబు నుండియే దేవుడు మోషేతో మాట్లాడినాడు.  ఈ యోరేబు కొండలో శతృ భీతి చేత కలత పొందిన ఏలియాకు ఆశ్రయము కల్పించినాడు.  యిది దేవుని యొక్క మూడవ నివాసము.

        యిక నాలుగవ నివాసము ఆది 35:14 ఈ బేతేలే బెత్లెహేము ఈ బెత్లెహేము యోరూషలేము.  ఈ యెరూషలేములో దావీదు కుమారుడైన సాలోమోను చేత దేవుడు కట్టించిన మందిరము దేవుని నివాసముగా వేదంలో చదువగలము.  ఈ విధముగా నాలుగవ స్థలంగా ఈ యెరూషలేము ఆలయమును కేంద్రంగా చేసికొని ఇశ్రాయేలీయుల పట్ల ప్రభుత్వ పరిపాలన చేశాడు.  అనగా ఇశ్రాయేలుకు సంభవించిన ఆపదలు అవాంతరాలు సమస్యలు యుద్ధభయము వగైరాలలో వారికి ముందు నిలిచి దేవుడు యుద్ధము చేసినట్లు దావీదు విషయములోను గిద్యోను విషయములోను యెహోషువా మోషే విషయములోను; సోలోమోను పరిపాలనలోను వగైరా జీవితాలలో వారి సంఘటనలలో జరిగిన పోరాటాలు విజయావకాశములను గూర్చి మనము వేదములో చదువగలము.  ఇది దేవుడు యెరూషలేమును నాలుగవ స్థానముగా వుంచుకొని తన భక్తుల పట్ల జరిగించిన క్రియా కర్మలు.

        నరకోటి విస్తరించి వారితో బాటు పాపము భూమి మీద ప్రబలినపుడు నరుల యొక్క క్రూరత్వము కఠినత్వము వారి అజ్ఞానము మనోంధకారమునకు సంతాపపడిన దేవుడు ఐదవ నివాసముగా కన్యక గర్భములో నవ మాసములు జీవించి నర రూపములో అవతరించి, ఆరవ నివాసముగా పాప భరిత జనాంగము మధ్య నివసించాడు.  ఈ కాలములో  దేవునికి దేవుని కుమారునికిని భూమి మీద నివాసము లేదు. ఎట్లంటే ఏసు ప్రభువే తన బోధలో 'నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూండ్లు కలవు. మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకు స్థలము లేదనుట''.

        ప్రియపాఠకులారా!  దేవుడు భూమి మీద నివసించిన నివాసములు అద్భుతమైనవి ఆశీర్వాదకరమైనవి.  అయితే ఈ ఆరవ స్థానమైన పాపపు జనాంగము మధ్య నివసించునపుడు అనేక అవాంతరములకు అనేక విమర్శలకు అనేక దూషణలకు అనేక హేళనలకు కూడ ఆయన గురి అయ్యాడు.  ఈ ఆరవ నివాసమే దేవునిచే రూపించబడియాకోబు చేత ప్రతిష్టించబడిన యెరూషలేము.  ఈ యెరూషలేమే దేవుని కుమారుని దూషించి విమర్శించి నిర్దోషియైన ఆయనపై అనేక నిందలు అపరాధములు మోపి ఆయనను దోషిగా నిర్ధారించి సిలువ శిక్షకు గురిచేసింది కూడా ఈ యెరూషలేమే! అందుకు దైవ కుమారుడైన ఏసు క్రీస్తు సిలువ మోయు సందర్భములో యెరూషలేములోని స్త్రీలు ఆయనను గూర్చి దుఃఖించగా యెరూషలేము కుమార్తెలారా!  నా నిమిత్తము ఏడవకుడీ! అనుటలో ఆనాటి యెరూషలేమును గూర్చి ప్రభువు వ్యాకుల పడి రోధించిన మాట లేమిటంటే యెరూషలేమా? యెరూషలేమా? ప్రవక్తలను చంపుచూ నాయొద్దకు వచ్చువారిని రాళ్ళతో కొట్టుచూ వుండు దానా? ' అనుటలో యెరూషలేము యొక్క ఆత్మీయ స్థితి ఎంత బలహీనముగాను ఎంత ఆధోగతిలో వున్నదో ప్రభువు మాటలలోని భావము వివరిస్తున్నది.

        ప్రియపాఠకులారా!  ఏసు ప్రభువు ఈ లోకములో జీవించినంత కాలము ఏసు పుట్టిన కాలములో దైవ కుమారుని యొక్క నివాసము యూదా దేశము బెత్లేహేము దావీదు పురముగా పిలువబడింది. ఆయన ఈ లోకములో ఎత్తబడు సందర్భములో ఏసు యెరూషలేములో గాడిద నెక్కి ప్రవేశించు సందర్భము మత్త 21-5 ఇదిగో నీ రాజు సాత్వికుడై చిన్న గాడిద నెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు.  సీయోను కుమారితో చెప్పుడీ! అనుటలో ఈ సీయోను అన్నది ఏసుప్రభువు యొక్క శారీర రక్తములకు సాక్షిగా వున్నట్లు తెలియుచున్నది.  అందుకే యెష 28:16 సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే! అది పరిశోధింపబడినది, మూలకు తల రాయియైయున్నది.  కనుక దేేవుని చేత పునాదిగా వేయబడిన క్రీస్తు అను ఈ రాయికి ప్రతిష్టస్థానము సీయోను.  యిక్కడ నుండియే పరలోక దైవ రాజ్యము యొక్క సువార్త వ్యాపకమునకు ప్రపంచము నందు నలుదిశలును సువార్త ప్రకటన జరిగి కోటాన కోట్ల ఆత్మలను సంపాయించుటకు ఈసీయోను త్రియైక దేవుని నివాస స్థలముగా వున్నది,  క్రీస్తు ద్వారా ఆయనేర్పరచుకొనియున్న తన రాజ్యమహిమను కూడా యిక్కడనుండియే ఆయన కనపరచినట్లు తెలియుచున్నది.  కనుక భూమి మీద దేవుడేర్పరచుకొన్న ఏడవ స్థానము చివరి స్థానము  లోకాంత్యమునకు ఋజువుగా పిలువబడిన స్థానము.  ఈ సీయోనులో నుండి మహిమపునరుత్ధానుడై అహరోహణుడైన క్రీస్తు రాకకు ఆయన మహిమ పునరుత్దాన అనంతరము ఆయన రెండవ రాకడకు ఈ సీయోను అన్నది సాక్షిగా వున్నట్లు మనము గ్రహించవలసియున్నది.

        భూలోకములో ఈ విధముగా ఒక ఉన్నత స్థానమును సంపాదించుకొన్న ఈ సీయోను భూలోకములో వలెనే పరలోకములో కూడా పరమ యెరూషలేము అని పరమ సీయోను అని పరమ కానాకు అని ఉన్నతమైన నామములను కలిగియున్నట్లు వేదములో చదువగలము.

        ప్రియపాఠకులారా!  భూలోకములో ఏ రాజ్యమునకు పట్టణమునకు ఏ స్థలమునకు ఇట్టి ప్రాధాన్యత లేదని మనము గుర్తించవలసియున్నది.  పరమ అను పేరుతో ఏ పట్టణములోని ఏ దేశముగాని ఏ తీర్థ స్థలముగాని లేదు.  అంటే పరమ నెల్లూరు పరమ తిరపతి అనిగాని లేదు.

        కీర్తన 133 సహోదరులు ఐక్యత కలిగినివసించుట ఎంతమేలు?  ఎంత మనోహరము? అది తలమీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ తైలము వలెనుండును.  సీయోను కొండలమీదికి దిగివచ్చు హెర్మోను మంచువలెనుండును.  ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చియున్నాడు''.        

        ప్రియపాఠకులారా!  పై కీర్తన భాగంలోని మూడు వాక్యాలు మూడు పరమసత్యాలను ఏడు ఆత్మీయ ఫలాలనుతద్వారా విశ్వాసికి కలిగే గొప్ప మేళ్ళను గూర్చి వివరిస్తున్నది.  ఇందులో మొట్టమొదట విశ్వాసికి ఇవ్వబడిన ప్రాధాన్యత సహోదరుల ఐక్యత 2వది ఆ ఐక్యతలో జీవించినపుడు కలుగు మేళ్ళు అందులో ఉన్న ఆత్మీయ అనుభూతి.  అట్టి అనుభూతిని గూర్చి కీర్తనాకారుడు వ్రాసిన 2వ వచనంలో ఒక యాజకుని ప్రతిష్థత కార్యంలో అతనిని అభిషేకించే సందర్భంలో-ఆ యాజకుని అభిషేకించే వ్యక్తి తలమీద పోసే అభిషేకతైలము-ఆ తైలమునకున్న ప్రత్యేకత, ఆ తైలములో ఉన్నట్టి సువాసన.ఆ తైలంలో ఉన్నట్టి తన్మయత్వము శాంతి సమాధానంతో కూడిన అనుభూతి.  ఆ విధంగా లోకములో పరిమళ భరితమైయుండుటయే గాక ఆకాశం నుండి కొండల మీదికిదిగి వచ్చే మంచు.  ఇది ఆకాశ సంబంధము-పరిశుద్ధాత్మ యొక్క ఆవరింపునకు చిహ్నముగ ఉన్నట్లును, ఆవిధంగా ఆత్మీయ అనుభూతి ఆత్మాభిషేకంతో కూడిన సహోదరుల యొక్క సావాసము దైవత్వము యొక్క ఆశీర్వాదము దైవత్వము యొక్క నిత్య జీవమును దేవుని యొక్క మహిమను దైవానుగ్రహాన్ని దైవ కాపుదలను కలిగిఉంటుందన్న సత్యాన్ని-కీర్తనాకారుడు ఈ మూడు వచనాలలో ఇమిడియున్నట్లు మనము ఆత్మీయంగా ఇందులోని భావము స్ఫురింపజేస్తున్నది.  ఇందును గూర్చి మనము క్లుప్తంగా వేదరీత్యా తెలుసుకొందము.

        ఇందులో మొట్టమొదట ఈ సహోదరుల ఐక్యతన్నది పాత నిబంధనలోకంటె నూతన నిబంధనలో అపొస్తలుల కాలంలో జరిగినట్లు ఈ సహోదరుల ఐక్యతవల్ల కల్గిన ఆత్మీయ ఫలాలు ఈ సందర్భంలో అపొ 2:1-7 ఇదియే, ఇందులోని కొన్ని సంఘటనలు మనకు ప్రత్యేకంగా కనబడుచున్నవి.  ''పెంతెకొస్తను పండుగ దినము వచ్చినపుడు అందరు ఒకచోట కూడియుండిరి'', ఇది సహోదరుల ఐక్యతను గూర్చిన వివరము అనగా అందరు ఒకచోట కూడియుండుటన్నది లోకసబంధంగా కాక దైవసంబంధంగాను శరీర సంబంధంగా కాక ఆత్మ సంబంధం గాను, స్వార్థంతో గాక నిస్స్వార్థము నిష్కపట హృదయంతో పరిశుద్ధ స్థితిలో తమ యొక్క శారీర ఆత్మలను దేవునికి సమర్పించుకొని అంతేగాక క్రీస్తు బయల్పరచిన ప్రధానమైన ఆజ్ఞ మార్కు 12:31 నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమించమనుట, ఒకరితో ఒకరు ఐక్యమై ఈ విధంగా కూడియున్న వారందరు ఒకే ప్రేమ ఒకే మనస్సు ఒకే ఆత్మీయత ఒకే విశ్వాసముతో నిష్కపట హృదయంతో కూడియున్న ఈ సహోదరుల ఐక్యత మూలంగా జరిగిన సంఘటన ఏమిటంటే,'' అప్పుడు వేగంగా వీచుబలమైన గాలివంటి యొక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండియున్న ఇల్లంతయునిండెను.  మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ అందరు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడినట్లు వ్రాయబడియున్నది.  ఇది సహోదరుల ఐక్యత ద్వారా కలిగిన గొప్ప పరిశుద్ధాత్మ క్రియ, అంతేగాకుండ ఆ కాలంలో నాటి అపొస్తలులు కూడియున్న ఆ స్థలంలో వున్నట్టి భక్తిగల యూదులు అపొస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ జరిగించిన ఈ క్రియను బట్టి కలవరపడి అనేకులు విభ్రాంతి నొంది ఆశ్చర్యపడినట్లును  పరిశుద్ధాత్మ శక్తితో ఆ ప్రదేశ మంతయు తేజోమయమైనట్లును వేదంములో చదువగలము.  ఇందును బట్టి మనమూల వాక్యంలో వ్రాయబడిన ప్రకారము సహోదరుల ఈ ఐక్యత ద్వారా మేళ్ళు కూడా జరిగినట్లు ఇదే అపొస్త 2:42 లో వ్రాయబడిన లేఖన భాగంలో ''వీరు అపొస్తలుల భోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి.  అప్పుడు ప్రతివానికి భయము కలిగెను.  మరియు అనేక మహత్కార్యాలు  సూచక క్రియలు అపొస్తలుల ద్వారా జరిగెను.  విశ్వసించిన వారందరు ఏకముగా కూడి తమకు కలిగినంతయు సమిష్టిగా ఉంచుకొనిరి.  ఇదియు గాక వారు తమ చరస్థిరాస్థులు అమ్మి, అందరికిని వారివారి అక్కరల కొలది పంచి పెట్టిరి.  మరియు వారేకమనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి''.  ఈ వివరాలన్నియును కూడా అపొస్తలుల కార్యాలు 2:42-47 లో చదువగలము.  ఇది సహోదరుల ఐక్యత ద్వారా కలిగిన మేలు.  అది వారి జీవితాలలో కల్గించిన మనోహరమైన వివరము.  ఈ కూడిక బోధ దీని వలన కల్గిన సావాసములో ఐక్యతన్నది ప్రార్థన రొట్టె విరచుట ప్రార్థన చేయుట ఈమూడును మేళ్ళు.                   ఇక మనోహరము 2:45లో వారు తమ చర స్థిర ఆస్థులను అమ్మి అందరికిని వారి వారి అక్కరలకొలది పంచిపెట్టుట మరియు వారెేకమనస్సుతో ప్రతి దినము  దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు ప్రజలందరివలన దయపొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయంతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి.  ఇవి దీని వల్ల కల్గిన సత్ఫలితాలు.  ప్రభువు రక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండుటయే మనోహారము అన్నది ఆశీర్వాదకరమైనది, నిత్యజీవమునకు సోపానము.  అనగా శాశ్వత జీవమునకు ఇది నాంది,  ఈ ఐక్యత లేనందువల్ల యాకోబు కుమారులు 12 మంది సహోదరులు ఐక్యతతో జీవించాల్సిన విధి దేవుడు వారికి నియమించియుండగా ఆది 49:1-2 యాకోబు తన కుమారులను కూడిరండి-కూడివచ్చి ఆలకించుడి'', అని భోధించాడు.  అనగా ఐక్యతగల్గి జీవించండి అంటున్నాడు. యాకోబు తన 12 మంది కుమారులకు బోధించిన మూల పాఠము నూతన నిబంధనలో ప్రభువు ఏర్పరచుకొన్న అపొస్తలులు కూడా ఈ ఐక్యత పాటించారు.  చిత్రమేమిటంటే యాకోబు కుమారులు తమ సహోదరులలో ఒకనిని ద్వేషించి తన్ని అమ్మివేశారు.  అలాగే నూతన నిబంధనలో ప్రభువుతో కూడా సావాసములో ఉన్న 12 మందిలో ఒకడు దైవ కుమారుడైన ప్రభువుని అమ్మివేశాడు.  ఇందును బట్టి యాకోబు కుమారులు 12 మందిలో తమ సహోదరుడైన యోసేపును ఇష్మాయేలులకు అమ్మి దైవాశీర్వాదము దైవ అనుగ్రహాన్ని కోల్పోయినందున వారికి అనేక చేదు అనుభవాలు చవిచూచారు.  అలాగే యేసు ప్రభువు 12 మంది శిష్యులలో ఒకడు దైవకుమారుని ముప్పది వెండి నాణెములకు యూదులకు అమ్మి తీరని పాపమును కొని తెచ్చుకొని శాపగ్రస్థుడై తన్ను తాను హత్యజేసికొనే ఘోరాతిఘోరమైన శిక్షకు గురియై చరిత్ర హీనుడయ్యాడు.  ఇది సహోదరుల ఐక్యతలో ఎవడైనను ఆ ఐక్యత సావాసమునుండి వీడి పోయినపుడు అనగా తొలగిపోయినపుడు అతడు శాపగ్రస్థుడును, దైవాశీర్వాదము నిత్యజీవము దైవవరమును కోల్పోయి నికృష్టుడై కాలగతులలో కలిసి పోవునని ఇందులోని భావము.

        కనుక ప్రియపాఠకులారా!  సహోదరుల ఐక్యతలో ఉన్నటువంటి మేలు మనోహరాన్ని గూర్చి పాత నిబంధన నూతన నిబంధనలో కొన్ని సందర్భాలు తెలిసికొన్నాము.  ఈనాడు సంఘాలు ఐక్యత లేదు.  భిన్నబిన్నమై అన్నీ ఉన్నాయి.  సంఘాలలో ఐక్యత లేదు పొందిక లేదు సావాసము లేదు, మనోహర జీవితము లేదు.  ప్రతి వానికి ఏదో యొక ఆత్రుత, సహోదరుల ఐక్యత విచ్చిన్న మగుటకు కారణము నేత్రాశ స్వార్థము అహంభావము  వ్యామోహము  వగైరా గుణాలను బట్టి సంఘాలలో కలతలు సమస్యలు తలెత్తి సంఘకార్యక్రమాలకు అడ్డుబండలుగ సంఘాలలో సంఘనిర్వాహకులు జీవించుచున్నారంటే కారణము సహోదరులలో ఐక్యత లోపించినట్లే, ఈ ప్రసంగము పర్ణించుచున్న సహోదరుడా!  ఏ స్థితిలో సంఘ శ్రేయస్సును కోరుచున్నావు?  సంఘ ఐక్యతను కోరుచున్నావు?  సంఘసావాసమును అభిలషిస్తున్నావా? సంఘములో ఏకీభవించి ప్రభువు కార్యక్రమాలను శ్రద్ధతో జరిగించే స్థితిలో నీవున్నట్లయితే నీలో నిజంగా సహోదర ఐక్యత సావాసమన్నది బలపడి, నీకు అనేక మేళ్ళు అనేకమైన శుభములు కల్గును.  అలాగాకుండ నీలో వేరే విధమైనటువంటి సంఘ వ్యతిరేకమైన స్వభావ గుణములున్నట్లయితే యేసు నామములో తొలగించుకొని, సంఘశ్రేయస్సుకోసము  సంఘఐక్యత కోసము సంఘాభివృద్ధి కోసం పాటుపడి, ప్రభువు యొక్క శాశ్వత జీవము పొందేందుకు ప్రయాసపడాలని ఆశీర్వాదము శాశ్వత జీవం పొందాలని నా ఆకాంక్ష. ప్రభువు మిమ్ములను కాపాడి దీవించును గాక!

        అంశము ''ముందు - వెనుకలుః-

        కీర్తన 139:5 వెనుకను ముందును నీవునన్ను ఆదరించియున్నావు''- నీ చేయి నా మీద ఉంచియున్నావు'',

        ప్రియపాఠకులారా!  కుడిఎడమలలో ఉన్నటువంటి మంచి చెడు అనుభవాలను గూర్చి నిగూఢ సత్యాలను ప్రయోగాత్మకంగా దైవ కుమారుడైన క్రీస్తు వివరించినట్టి వివరణలతో తెలిసికొనియున్నాము.   కుడివైపున ఉన్న ఘనత కుడివైపున ఉన్న దేవుని యొక్క ప్రత్యేకతను కూడా తెలిసికొనియున్నాము.  ఇపుడు ముందు-వెనుకలు, లో ఉన్నటువంటి మంచిచెడు అనుభవాలను గూర్చి తెలిసికొందము.  పై కీర్తన భాగములో వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావని కీర్తనాకారుడు అనుటలో దేవుడు వెనుకను ముందును ఆవరించు క్రియలో ఉన్న నిగూఢ సత్యాన్ని వేదరీత్యా తెలిసికొందము.  మొట్టమొదట దేవుడు వేసిన ఏదెను వనములో ఆయన నిద్రించిన నరుని తన ఆత్మతో ఆవరించి అష్టదిగ్భందనన్నది గావించాడు.  అనగా ఏ దిక్కులో నుండి గాని కీడు గాని రుగ్మత గాని తెగులు గాని అపరిశుద్ధత గాని కలుగకుండ దేవుడు తాను వేసిన నిర్మించిన తోటకును నరునికిని పటిష్టమైన కాపుదల నుంచి, తన సన్నిధిని అన్ని వేళలలోను ఆవరింపజేశాడు.  ఈ విధంగా వెనుక ముందులే గాకుండ నరజీవితంలోని అన్ని దిశలలోను అన్ని స్థితులలోను దేవుని యొక్క ఆవరింపన్నది వుండినది.  ఒక్కమాటలో చెప్పాలంటే నరశరీర నిర్మాణములో ఆయన యొక్క మహిమ ఉన్నట్లుగా వేదరీత్యా మనకు తెలిసిన విషయమే.  ఈ విధంగా నరుని యొక్క జీవితము పూర్తిగా ఆవరించియున్న దేవుడు అనగా నరుని లోనే నివాసముండిన దేవుడు నరుడు చేసిన దైవాజ్ఞాతిక్రియను బట్టి ఏదెను వనము నుండి ఆతని తరిమివేశాడో- ఆ విధంగా నరదేహమునుండి కూడా బాహ్యంగా దూరమయ్యాడు.  అంటే నరునిలో ఉన్న దేవుడు నరుడు పాపముచే అంటుపడగా వాని నుండి తొలిగిబాహ్యంగా నరునిపట్ల క్రియజరిగిస్తూ వచ్చాడు.                          ఇందులో మొట్టమొదటగా ఆదాము సంతానాలలో దేవుడు హనోకునకు ముందు వెనుకల అనగా ఇటు లోక సంబంధంగాను దేహసంబంధంగాను అటు పరలోక సంబంధంగాను తోడైయుండి హనోకు తో ముందు వెనుకలు దేవుడు నడిస్తే-దేవునితో కూడ భూమిమీద హనోకు నడిచి దైవమహిమలోజీవించి శరీరంతో దేవునిచే పరమునకు కొనిపోబడి నరులకు కనుమరుగయ్యాడు.  ఇది నర జీవితంలో మొట్టమొదటగ దేవుడు నరునితో ముందు వెనుకల నడిచి తన రక్షణ వలయంలోకి కొనిపోబడిన చరిత్ర.  ఇక్కడ నుండి దేవుడు నరునిలో గాక నరునితో ఉండి ముందువెనుకల జరిగించిన క్రియాకర్మలను గూర్చి వేదరీత్యా కొందరి భక్తుల యొక్క చరిత్ర ద్వారా తెలిసికొందము.  

        ఆది 6:లో లోకము చెడియున్నపుడు దేవుడు తాను ఎన్నుకొని నీతిమంతుడుగా ప్రకటించిన భక్తుని దేవుడు తాను జరిగించబోవు జలప్రళయ మారణహోమమునుండి కాపాడుటలో ఒక నూతనమైన విధానమైన పోకడలో నోవహు అతని కుటుంబమునే గాకుండ తాను రూపించబోవు పునఃసృష్టిని కూడా మూడంతస్థులుగల ఓడ గృహంలో ఉంచి ప్రత్యేకంగా తానే ఆ ఓడగృహము యొక్క తలుపును మూసి, అందులోని సృష్టములకు నరులకు ఎలాంటి రుగ్మతలు వాతావరణ కలుషితము దేహబలహీనతలు అన్న పానాల సమస్యలు లేకుండ సమస్త కొరతలను తీర్చుచు,  జలముల మీదనున్న ఓడ గృహము మీదను గాడాంధకార చీకటిలో ఏర్పడిన భీకర వాతావరణములో తన భక్తుడైన నోవహును ముందువెనుకలు  లేక నలుదిక్కులు వచ్చే ఉపద్రవము నుండి కాపాడేందుకు నోవహు కుటుంబము యొక్క ఒంటరి జీవితములో దేవుడు ఆవరించకపోతే, ప్రియపాఠకులారా!  మహాపర్వతాలే మునిగిపోయి అల్లకల్లోలంగా,  భూమి సముద్రము ఏకమైయున్న పరిస్థితులు. పూర్వము భూమి ఏ పరిస్థితిలో ఆది 1:2లో భూమి ఏ విధంగా జల సముద్రములో ఉండిందో అదే స్థితిలో నాటి నరుల యొక్క దౌర్భాగ్యత దైవ వ్యతిరేకత పాపక్రియలనుబట్టి నరులను-నరులతో బాటు భూమిని ముంచివేసినపుడు భూమి ముందు వెనుకలు నలుదిక్కులు ఏవియు కూడా లోక రీత్యా ఆదుకోలేకపోయినవి.  అయితే నీతిమంతుడు గా ఎంచబడిన అతని కుటుంబము లోనే దేవుడు ముందు వెనుకలలో జాగ్రత్తగా నడిపిచుటకు ఆ ఓడకు చుక్కాని లేకపోగా దేవుడే ఆత్మీయ దేవుని ఆత్మ చుక్కానిగా నోవహు ఓడ గృహాన్ని నడిపించింది.  చిత్రమేమంటే ఆదిలో దేవుని ఆత్మ చీకటి అగాధ జలముల మీద అల్లలాడినట్లుగా వేదములో ఆది 1:2లో చదువగలము ఆ విధంగా ఈ ఓడ కూడా చీకటి అగాధజలముల మీద భూమికి మారుగా అల్లలాడు చుండింది.  ఆదిలో చీకటి అగాధ జలముల మీద దేవుని ఆత్మ సృష్టి నిర్మాణమునకై అల్లలాడింది.  అయితే ఈ ఓడ పునఃసృష్టి నిర్మాణంలో అగాధజలముల మీద దేవుని ఆత్మ అల్లలాడినట్లుగానే దైవ చిత్తాన్ని ఈ ఓడ కూడా దేవుడు జరిగించబోవు పునఃసృష్టి నిర్మాణకార్యక్రమములో అగాధజలముల మీద చీకటిలో అల్లలాడింది.  ఇందును బట్టి దేవుని యొక్క ఆత్మ ముందు వెనుకలలో ఆవరించిన విధానములో ఒక విధమైయున్నది.  అందుకే కీర్త 139:5లో కీర్తనాకారుడైన దావీదు-''వెనుకను ముందును నీవు నన్ను ఆదరించి యున్నావు'', నీ చేయి నా మీద ఉంచి యున్నావు'', అలాగే ఈ ఓడను కూడా ఈ ఆత్మ వెనుకముందు ఆవరించి ఆయనహస్తమును ఓడపై ఉంచగా బహుభారమును అనగా సృష్టిలో ఉన్నట్టి జంతుజాలమును-వాటి సంబంధ ఆహారమును పానీయము, ఆలాగే నరుని జీవితానికి కావలసిన ఆహార పానీయాలు బహుభారమును ఇందును బట్టి బహుభారమైన అగాధ జలములకు సుడిగాలులకు తలక్రిందులు కావచ్చునుగదా!  యెహోవా హస్తము ఆ ఓడ మీద నుంచినందువలన అది నీళ్ళమీద అటుఇటు అల్లలాడినను తాపీగా నడిచింది.  నలుబది దివారాత్రులు భయంకర వర్షపాతమునకు ప్రచండ జలాలమీద ఈ ఓడ తాపీగా కదలకుండ తలక్రిందులు గాకుండ నడిచింది.  ఈ ఓడ ప్రయాణంలో ముందు వెనుకలలో దేవుని యొక్క మహిమ ఆయన వెలుగు ఆవరించి నడిపించగా ఆయన బలమైన హస్తము  ఓడపై భాగాన ఉంచినందున ఓడలో జీవరాసులు గాని నోవహు కుటుంబముగాని ఎలాంటి ఒడిదుడుకులు కలుగలేదు.  ఇంకను ఆ ఓడ ప్రయాణం ద్వారా వాతావరణంలో అందులోని జంతుజాలమునకు గాని మనుష్యులకు ఎలాంటిఅనారోగ్య సంబంధ వికారము, దేహ బాధలు వగైరా లేవియు లేక సాపీగా సమిష్టిగా సంతోషంగా ఆరోగ్యంగా ఆ ఓడలో జీవించగల్గినారు.  అంతేగాక దేవుని యొక్క ఆత్మ ఆ ఓడను నడుపుటకు యాంత్రికముగా పనిచేసినట్లు ఇందును బట్టి మనకు తెలుస్తున్నది.

        ఆ ఓడ వెనుక ముందు చుక్కాని గాను వెనక యంత్రంగా ఉండి దేవుని ఆత్మ క్రియ జరిగించింది.  అందును బట్టి ఓడ - ఓడ గర్భం లోని జంతుజాలము పక్షిజాలము, అందులోని నరులు క్షేమకరమైన స్థితిలో ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆ మహాజలప్రళయంలో అగాధజలముల మీద సంచరించారు.

        ప్రియపాఠకులారా!  ఒక ప్రయాణ సాధనమునకు ముందుకును సందర్భానుసారంగా వెనుకకను ప్రయాణించే అనుకూలతను ఆ వాహనమును తయారు చేసిన శాస్త్రజ్ఞుడు లేక వ్యక్తి కల్గిస్తున్నాడు.  ఉదా|| మోటారు కారు ముందుకు వెళ్ళగలదు, వెనుకకు రాగలదు.  అయితే విమానము సైకిలు వగైరాలు వెనుకకు రాగలదు.  అలాగే రైలు, ఓడ ముందు వెనుకకు రాలేవు.  వాటికి ముందు గమనము చేయు శక్తి ఉన్నది గాని వెనుకకు వచ్చే అనుకూలత లేదు.  అలాగే దైవిక తోడ్పాటులో కూడా కొన్ని సందర్భాలలో నరుని ముందుకు మాత్రమేనడిపిస్తూ అతని వెనుక తట్టును ఆవరించి ఉజ్జీవింజేసే శక్తి పరమాత్ముని కున్నది.  ఉదా||సంసోను విషయంలో సంసోనును దేవుని యొక్క ఆత్మ సందర్భానుసారంగా ప్రేరేపించినపుడు అతడు సింహాన్ని చీల్చాడు.  ఏ ఆయుధము లేకుండ పచ్చిగాడిద దవడ ఎముకతో వెయ్యి మంది పిలిష్తీయులను హత్యచేశాడు.  అలాగే అంధుడై దాగోను ఆలయములో రెండు స్థంభాలను పట్టుకొని ఊపి ఆ ఆలయమును నేలమట్టమును గావించుటయే గాక అందులోని పిలిష్తీయ జనాంగమును నిశ్శేషంగా వధించాడు.  ఈ విధంగా ముందు వెనుకలలో దేవుని యొక్క ఆత్మ తన విశ్వాసులను తన భక్తులను ఆవరించి క్రియ జరిగించిన సందర్భాలు ఉదాహరణగా కొన్నిటిని గూర్చి తెలిసికొందము.  ఆనాటి ఇశ్రాయేలులు అనే దైవజనాంగ విషయములో దేవుడు ఐగుప్తు చెరనుండి వారు పోవు సందర్భంలో వారిని పగలు మేఘ స్థంభంగాను రాత్రి అగ్నిస్థంభంగాను ముందు వెనుకలు ఆవరించినడిపించినట్లు చదువగలము. నిర్గ 13:21

        అలాగే ప్రియపాఠకులారా!  న్యాయా 6:11-15 లో గిద్యోను దేవుని పేరట చేసిన యుద్ధాలలో దేవుడు గిద్యోను యొక్క చిన్న సైన్యమునకు ముందు వెనుకల నావరించి మిద్యానీయులను నిశ్శేషంగా యుద్ధంలో చంపించి గిద్యోనుకు విజయవంగల్గించగా-ముందు  వెనుకల నుండి యుద్ధం జరిగించగా గిద్యోను యొక్క విజయము యెహోవా విజయమని నినాదము దైవజనాంగము చేశారు.  అలాగే దావీదు చేసిన యుద్ధాలలో దావీదు విజయము యెహోవా విజయమని దావీదు యొక్క సైన్యాలు నినాదాలు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే యుద్ధము యెహోవాదే, విజయము యెహోవాదే, బాలుడైన మోషే నిరాదరణగ నైలునదిలో జమ్ముపెట్టెలో పెట్టి తల్లి వదలివేయగా బాలుడైన మోషేను దేవుడు ముందు వెనుకల ఆవరించి యుండుటను బట్టి ఫరోకుమార్తె అజమాయిషీలో పెంచబడుటకును తన కన్నతల్లియొక్క సంరక్షణలోను పెంచబడుటకును, తనను కన్నటువంటి తల్లియొక్క పాలతో పెంచబడునట్లును-ముందు ఐగుపుయైన ఫరోకుమార్తె, వెనుక తన తల్లియైన హెబ్రీస్త్రీ - ఇరువురి ద్వారా పోషింపబడుటలో మోషేకు దేవుడు ముందు వెనుకల ఆవరించి జీవిత బాధ్యతను వహించినట్లు తెలుస్తున్నది.  అనగా మోషే జీవితమునకు యెహోవా కాపరి, మోషే యొక్క పోషకత్వమునకు లోకస్థులైన స్త్రీలు పరిచారకులు.  ఆత్మీయమైనటువంటి జ్ఞానంతో ఇందులోని సత్యమును మనము గ్రహించగలము.

         అలాగే యాకోబు కుమారుడైన యోసేపు యొక్క జీవితములో యోసేపు బాలుడైయున్నపుడు తన సోదరులు అతనిపై ఈర్ష్యా ద్వేషము కలిగి అతనిని లక్ష్యపెట్టక అతనిని హేళనతోను విమర్శలతోను మానసికంగాను బాధించినట్లును, అయితే యోసేపు తన అన్నదమ్ముల పట్ల సహనంతో , వ్యవహరించినట్లును, యోసేపు లోని మంచిని అతని యొక్క పరిశుద్ధతను అతనికున్న దైవజ్ఞానమును గూర్చి అతని సోదరులు ఈర్ష్య చెందిన వారై ఒకానొక దినమున నయవంచకంతో యోసేపును తమ వెంట తీసుకొని వెళ్ళి నీళ్ళు లేని గోతిలో పడవేసి చంపుటకు ఆలోచించినపుడు, యోసేపునకు దేవుని హస్తము ముందు వెనుకలు ఆవరించి యుండుటను బటి యోసేపును చంపుటకు ప్రయత్నించిన  వారి యొక్క ఆలోచనలను చెడగొట్టి వారి ఆలోచనలను  మార్చి తారుమారు చేసినపుడు వారి సోదరులలో ఒకడు అతన్ని చంపుటవలన ప్రయోజనం లేదని, దూరమునుండి వచ్చు ఇష్మాయేలులకు అతన్ని అమ్మి సొమ్ము చేసుకోవడం లాభదాయకమన్న ఆలోచనను దేవుడు వారిలో పుట్టించగా-ఆవిధంగా అందరును ఒకనిర్ణయానికి వచ్చి ఇష్మాయేలులకు అతనిని అనగా దేవుడు యోసేపునకు ముందు వెనుకల తోడైయుండి అతనిని నడిపించి ఇష్మాయేలుల వద్దనుండి ఐగుప్తు పోతీఫరో అను ఒక అధికారి యోసేపును కొని తన ఇంట చేర్చుకొన్నపుడు, యోసేపుకు ముందు వెనుకల ఆవరించియున్న దేవుని యొక్క తోడ్పాటును బట్టి పోతి ఫరో గృహంబహుగా దేవుని చేత ఆశీర్వదింపబడి బహుఫలవంతమై పోతీ ఫరో యొక్క జీవితము ధన్యవంతంకాగా మరియొక వైపు యోసేపు రాజసంరక్షక సేనాధిపతియైన ఐగుప్తులో వాని ఇంట కల్గిన ధన్యత '', అతనికి ముందు వెనుకలలో యెహోవాతోడైయుండుటను బట్టి ఈ క్రిందివిధంగా  ఆ ఐగుప్తుని ఇంట ఆ ధన్యతలను సంపాదించుకొన్నాడు.  ఆది 39:1-6 యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనే పొలములో నేమి అతనికి కలిగిన సమస్తము మీద నుండెను.  అతడు తనకు కలిగిన దంతయును యోసేపు చేతికి అప్పగించి, తాను ఆహారము తినుట తప్ప తనకు ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాదు'',

        ఆ తర్వాత సాతాను పోతిఫరో భార్యను పట్టినాడు.  ఏవిధంగ? యోసేపు రూపవంతుడును సుందరుడనైయుండుట చూచి పోతిఫరో భార్య అతనిపై కన్నువేసి తనతో శయనించు మనుటలో ప్రియపాఠకులారా!   ఇక్కడ యోసేపునకు ముందు వెనుకల ఆవరించిన యెహోవా మహిమ అంటే ఆయన బలమైన హస్తమును చూచి సాతాను కన్నెర్రజేసి పోతిఫరో భార్యను ఆవరించి యోసేపుకు వ్రతభంగం చేయుటకు అనగా యోసేపులోని దైవ నియమమును చెడగొట్టి, దైవ రక్షణ వలయమునుండి తప్పించ ప్రయత్నించుటకు సుందరాంగియైన ఫరో భార్యను ఆకర్షించి యోసేపును ఆమెతో శయనింపజేయుటకు ప్రయత్నించాడు.  అయితే యోసేపు నీతిమంతుడును, దేవుని యందు భయభక్తులు గలవాడును-దైవాత్మ సంరక్షణలో ఉండుటను బట్టి పోతీ ఫరో భార్యయొక్క మాటలను తిరస్కరించి పలికినమాటలు ఆది 39:8-9లో చదువగలము.  ''నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెనుగదా!  నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు.  ఈ ఇంటిలో నాకంటె పైవాడు లేడు.  నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక యుండలేదు.   కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను''

        ప్రియపాఠకులారా!  ఇక్కడ సాతానుడు పోతీ ఫరో భార్యద్వారా పెట్టిన అగ్నివంటి శోధనలో అతడు ఆ శోధనలో పడకుండ తప్పించుకొనగా సాతానుడు తన పట్టువిడువక ఫరో భార్యను ఆవరించి, ఆమె చేత అసత్యఆరోపణ చేయిస్తూ మాట్లాడిన మాటల వలన జరిగిన సంఘటనలో యోసేపు సాతాను ద్వారా చెరలో బందీయైనపుడు కూడా యోసేపునకు దేవుడు తోడైయుండి అతనియందు చెరసాల నాయకునికి కనికరం కల్గించినట్లు చదువగలము''.  చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలనందరిని యోసేపునకు అప్పగించెను, వారు అక్కడ ఏమి చేసెరో అదంతయు అతడే చేయించును అతడు చేయునది యావత్తును యెహోవా యోసేపునకు తోడైయుండిసఫలమగునట్లు చేసెను; ఇది యోసేపునకు దేవుడు ముందు వెనుకలనుండి నడిపించిన విధానము.  అదే విధంగా ప్రియపాఠకులారా!  ఆనాటి ప్రవక్తలను రాజులను న్యాయాధిపతులను  దీర్ఘదర్శులను  యాజకులను కూడా సృష్టి కర్త దేవుడైన యెహోవా ముందు వెనుకల నుండి ఆవరించి నడిపించినట్లుగ పాత నిబంధన గ్రంధంలో చదువగలము.                ఇక నూతన నిబంధనలో ముందు వెనుకలలో దేవుని చేత నడిపించబడినట్టి విశ్వాసులను గూర్చి తెలుసుకొందము.  ఇందులో యేసు క్రీస్తు జనన కాలములో యెహోవా దూత కన్యకయైన మరియకు దర్శన మిచ్చి పల్కిన మాట లూకా 1:26-35 లో వ్రాయబడిన లేఖన భాగములో క్రీస్తు జన్మించుటను గూర్చిన వివరముల లోని ముఖ్యాంశాలు'', గబ్రియేలను దేవదూత మరియను చూచి పల్కిన మాటలు.  దయాప్రాప్తురాలా!  నీ కుశుభము, ప్రభువు నీకు తోడైయున్నాడు'', మరియమ్మ యొక్క కన్య జీవితములో ప్రభువు హస్తముతోడైయుండి, ఆమె కన్యత్వమునకు కళంకము రాకుండ ''ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును- ఆయనకు ఇమ్మానుయేలని పేరుపెట్టుదువు'', అను ప్రవచనమును బట్టి, ఆ  కన్యకను లోకానికి తెలియజేస్తూ ఆమె యొక కన్యత్వమును కాపాడుచు ఆమె యొక్క పురుషునికి ప్రధానము చేయబడినను, యోసేపు  ఆమె యొక్క కన్యాత్వమునకు భంగపాటు కలుగనీయక దేవుని యొక్క హస్తము ప్రభువు యొక్క ఆత్మయు - పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును; ఇందును బట్టి మరియ యొక్క జీవితములో ముందు వెనుకల ఆవరించి యుండుటవలన దైవ కుమారునికి జన్మ ఇవ్వగల్గింది.  అంటే కన్యకయైన మరియను దేవుడు దేహరీత్యా ఆత్మ రీత్యా కూడా ఆమెకు తన యొక్క రక్షణ అనుగ్రహించి , ఆమె యొక్క ఆత్మీయతను శీలమును రెండింటిని కాపాడుచు,అటు తర్వాత ఆమె గర్భవతియై శిశువునుకన్నపుడు ఆమెకును-ఆమెతో బాటు శిశువునకును, ఆమె భర్తయైన నీతిమంతుడైన యోసేపునకును తన మహిమలో స్థానమిచ్చి, ఆనాటి పరిపాలకుడైన హేరోదునుండి రక్షణ కల్గించాడు.  ఆనాటి జ్ఞానులు గొల్లలు ద్వారా భూమి మీద మొట్టమొదటి సారిగా సత్యదేవుని ఆరాధించు విధానమును దేవుడు ప్రయోగాత్మకంగా మానవాళికి తెలిపి, తన ఘనతను తన మహిమనుతన ప్రభావమును తన వ్యక్తిత్వమును - సర్వలోకానికి ప్రకటించినట్లు నూతన నిబంధన వేదచరిత్ర మనకు వివరిస్తున్నది.   యేసు క్రీస్తు దేవుని యొక్క శక్తియు జ్ఞానమును వెలుగును జీవమును సత్యమునై యుండి తానేర్పరచుకొన్న శిష్యకోటిని తనతో నడిపించాడు.  ఇందును బట్టి తండ్రియైన దేవుడు పాత నిబంధనకాలములో తన జనాంగమును ముందు వెనుకల నుండి నడిపించినట్లు వేదం వివరిస్తుండగా-ఆయన కుమారుడును మన రక్షకుడైన ప్రభువైన క్రీస్తు తన శిష్యకోటిని తనతో కూడనడిపించినట్లు తాను వారితో నున్నట్లు తనతో వారున్నట్లును నూతన నిబంధన వేద చరిత్ర నిరూపిస్తున్నది.  ఇదియేసుక్రీస్తు లోకములో జీవించిన నాటి చరిత్ర.  

        అయితే లోక నరకోటి పాపనివారణార్థం దైవ కుమారుడైన క్రీస్తు బలియాగం చేసి మరణించి మహిమ పునరుత్థానుడై తన తండ్రి యొద్దకు వెళ్ళు సందర్భంలో మత్త 28:20లో యేసు ప్రభువు తన శిష్యకోటికి చేసిన వాగ్దానము ''నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని చేసిన వాగ్దానమును బట్టి అపొస్తలులతో యేసు క్రీస్తు తన ఆత్మ ద్వారా ముందు వెనుకలనుండి వారిని నడిపించినట్లు అపొస్తలులు చేసిన సూచక క్రియలు మహత్కార్యాలు మనకు ఋజువు పరచుచున్నవి.  ఉదా|| పేతురు యోహానులు చీలమండల రోగిని నడిపించుట, పేతురు నీడను తగులుట వలన అనేకులైన రోగులు స్వస్థత పొందుట, చనిపోయిన వారిని బ్రతికించుట, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుట.  అలాగే అపొస్తలుడైన పౌలు చనిపోయిన వారిని బ్రతికించుట. రోమా మొదలుకొని ఎనిమిది సంఘాలకు దైవాత్మ ఆవేశముతో వ్రాసిన లేఖలు-ఇవన్నియు దైవాత్మ-ముందు వెనుకలనుండి నడిపించబట్టియే ఇట్టి మహత్కార్యాలు వీరు చేయగల్గినారు. అయితే నేటి యుగాంతంలో రానైయున్న ప్రభువు రాకడ సందర్భంలో దేవుడు ముందు వెనుకలనుండి నడిపిస్తూ తాను మహిమ పరచబడుచు తన విశ్వాసులను కాపాడుచున్నట్టి కుటుంబాలు ఉన్నాయా?  అనిన ప్రశ్న నేడు మనకు కలుగకమానదు.

        ప్రియపాఠకులారా!  ఆ దినములలో ప్రవక్తలను యాజకులను గౌరవించి, వారి యందు లక్ష్యముంచి వారి యొక్క చిత్తానుసారంగా నడిచిన విశ్వాసులను వారి కుటుంబాలను దేవుడు కాపాడుచు వారిని తన రక్షణ వలయములో ఉంచి, వారిని వారి కుటుంబాలను వారి చిరచర ఆస్థులను, వారి ఐశ్వర్యాలకును తాను ముందు వెనుకల ఉండి మరియు చుట్టును కంచెవలె ఆవరించి సంరక్షించి పోషించినట్లు యోబు చరిత్రలో ఇందును గూర్చి 1:10లో సాతాను ప్రత్యక్షంగా దేవునితో చెప్పిన మాట.  ''నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కల్గిన సమస్తమునకును చుట్టుకంచె వేసితిని గదా!  నీవు అతని చేతిపనిని దీవించుట చేత అతని ఆస్థి దేశములో విస్తరించియున్నది'', అనుట ఇది శోదకుడు ప్రత్యక్షంగా దేవుని యొక్క ఆవరింపును గూర్చి ఇచ్చిన ప్రత్యక్ష సాక్ష్యము.  అలాగే దేవుడు హనోకును తనతో తీసుకొని వెళ్ళిన సందర్భంలో ఆది 5:23-24 లో హనోకు విషయములో ఆయుష్కాలము 365 ఏండ్లు-దేవుడు అతనితో నడచుటను బట్టి హనోకు యొక్క శారీర జీవితము లోకానికి కనుమరుగైంది.

        ప్రియపాఠకులారా!  నేడు క్రైస్తవ విశ్వాసులమని చెప్పుకొంటున్న మనము పరిశుద్ధాత్మ ఆవేశము గలవారము అని యెహోవా దేవుని సాక్షులమనియు, యేసు క్రీస్తును అనుసరించి నడుస్తున్నామని చెప్పుకొనుచున్న మనము మన జీవితములో ప్రభువుతో నడుచుచున్నామా? లేక ఆయన మనతో నడుస్తున్నాడా?  ప్రభువును గురుత్వంలో ఉంచుకొని ఆయన యందు లక్ష్యముంచి, ఆయనను అనుసరించి నడుస్తున్నామా! ఆయన మనలను తన ముందుంచుకొని తన చిత్త ప్రకారము నడిపిస్తున్నాడా? ఇవేమియు కాకపోతే లోకము యొక్క మెప్పు దాని యొక్క పదవులు దాని అధికారాలు పొందాలని వాటిపై లక్ష్యముంచి వాటియందు గురి ఉంచి, ప్రభువును వెనక్కు నెట్టి మన జీవితములో మనము ఈ లోకములో జీవిస్తున్నామా? లోకము దాని యొక్క ఐశ్వర్యాలు లోక పరిపాలన - దాని యొక్క అధికారాలు ఉన్నత పదవులు వీటి మీద మన దృష్టి ఉన్నదా? ఏ రీతిలో మన యొక్క ఆత్మీయ స్థితి ఉన్నది.  ఏవిధమైన పోకడలో మన దేహస్థితి ఉన్నది? మానవులుగా వున్న మనము మనస్సాక్షిని కలిగియున్న మనము దేవుని ఆత్మను పొంది యున్నామన్న విశ్వాసము ఉన్న మనము దేవునితో నడిచే స్థితిలో ఉన్నామా? లేదా? ఆయన మనతో నడిచే యోగ్యతను పొందియున్నామా?        

        ఆ కాలమందైతే ప్రతిపాపిని దేవుడు తన రక్షణ వలయంలో ఉంచి తనతో నడిపించాడు.  కయీను పాపి హంతకుడు.  అయినను దేవుడు కయీను వీపుపై ఒక గుర్తువేసి అతనిని నడిపించాడు.  మోషే పాపి నర హంతకుడు అయినను దేవుడు తన జనాంగమైన ఇశ్రాయేలుకు మోషేను నాయకునిగా ప్రతిష్టించాడు.  అబ్రహాము పాపి ఎలాగంటే భార్యమాటలు విని తన దాసియైన హాంగరు శీలాన్ని చెరచుటయే గాక ఆమెను సంతానవంతురాలుగజేసి  ఆ బిడ్డను తల్లిని ఇరువురిని భార్య మాటను బట్టి నిర్ధాక్షిణ్యంగా తరిమి వేయుటలో ఇది మానభంగ నేరము.  అయినను దేవుడు అబ్రహామును ఆశీర్వదించి అతనిని విశ్వాసులకు తండ్రిగా చేశాడు.  దావీదు పాపి ఎలాగంటే తన సైన్యంలో ఒక సైనికుడును తనయందు అధికెమైన వినయవిధేయతలు కలిగి రాజుగా కాక దేవునిగా భావించి ప్రవర్తించిన ఊరియా అను ఒక సైనికుని భార్యను మోహించి ఆమె శీలమును చెరచుటయే గాక ఆ నేరమును తన పై వేసికోక ఆమె భర్తపై వేయాలని ప్రయత్నించి, విఫలుడై, యుద్ధరంగంలో కపటోపాయంతో చంపించిన నేరమును బట్టి దావీదు మూడు విధములుగ దైవ చట్టమును అతిక్రమించిన వాడైనాడు.  అంటే 1.పొరుగువాని భార్యను ఆశించుట 2వది నిర్దోషియైన ఆమె భర్తను చంపి హంతకుడుగా మారుట 3వది ఆ స్త్రీని చెరచి ఆ నేరమును తనపై వేసికొనక ఆమె భర్తమీదనే ఆ నేరమును వేయ ప్రయత్నించాడు.  ఈ విధంగా త్రివిధనేరమును బట్టి దైవసన్నిధిలో దోషి అయ్యాడు.  అయినను దేవుడు దావీదును శిక్షింపక దావీదు చేసిన నేరమును బట్టి అతనికి కల్గిన సంతానమును బట్టి దావీదునకు బుద్ధి నేర్పి, దేవుడు తన వానినిగా చేసికొని ప్రవక్తగాను కీర్తనాకారునిగాను మహారాజుగాను చేసి, దావీదుకు ఇచ్చిన ఆశీర్వాదకరమైన జీవితములో దావీదు చెసిన యుద్ధాలలో గాని బలియాగములలో గాని దేవుని స్తుతించుటలోగాని ఘనపరచుటలోగాని చూపినటువంటి ఉచిత ప్రేమ ఎంతో గణనీయమైనది.

        ప్రియపాఠకులారా!  ఈ విధంగ దేవుడు పాత నిబంధన కాలములో దోషియైన వాడు విరిగి నలిగిన హృదయముతో దైవత్వమును అభ్యర్థించి, తన దోషములకు పశ్చాత్తాపము పొంది ప్రాయశ్చిత్తం జరిగించుకొన్నప్పుడు అట్టి వానిపట్ల దేవుడు కనికరించి జరిగించినటువంటి ఆశ్చర్య కార్యాలు పాత నిబంధన వేదములో ఎన్నో మనము చదివి తెలిసికోగలము.  ఇక నూతన నిబంధనలో నరావతారంలో అవతరించిన దేవుడు రాత్రింబగళ్ళు ప్రత్యక్షంగా కలిసి జీవించాడు.  ఇట్టి స్థితిలో కూడా దేవుడు పాపులనే ప్రేమించాడు.  అంతేగాకుండ తన ప్రవచనాలలో మత్త 9:12-13 రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు.  అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని ప్రభువు పల్కిన మాటలు ఈ సందర్భములో గమనార్హము.

        ప్రియపాఠకులారా!  ఇందునుబట్టి నీతిమంతుని కంటెను పాపితో దేవునికి ఎక్కువ సన్నిహితసంబంధం ఉన్నట్లు యేసు క్రీస్తుగా అవతరించిన దేవుడు జరిగించిన సజీవబలియాగము అను సిలువ మరణ క్రియ అన్నది పాపిపట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమను ఋజువుపరచుచున్నది.  క్రీస్తు మరణ పునరుత్థాన అనంతరము యేసుక్రీస్తు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు కూడా యేసు క్రీస్తు శిష్యులను ఆయన వారిని ప్రతిష్టించగా వారి యొక్క ఆత్మీయ స్థితి రూపాంతరము చెంది, వారు అపొస్తలులుగా పిలువబడినపుడు వారి అపొస్తలత్వములో పరిశుద్ధాత్మ దేవుడు వారితో ఉండి క్రియజరిగించినట్లు అపొ 2:1 నుండి మనము చదువగలము.  ఈ విధంగా క్రియ జరిగించిన పరిశుద్ధాత్ముడు అపొస్తలులను వదలక వారి బోధను విన్నటువంటి వారిని కూడా సౖెెఫను లాంటివారిని, హతసాక్షులుగా చేసి వారి ద్వారా లోకమునకు సత్యదేవుని గూర్చిన మర్మమును ప్రకటించి, ఆ విధంగా ప్రకటించుటయే గాక, భూమి మీద దేవుని సంఘమునకు అనగా దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ క్రియ ద్వారా అవతరించిన జనకూటమియే క్రైస్తవ సంఘము.  ఈ విధంగా కట్టబడి దినదిన ప్రవర్థమానమై పరిశుద్ధాత్మ ఆవేశంతో బహుముఖంగా వ్యాప్తి చెంది, నేడు లోకములో వ్యాప్తి చెందియున్న క్రైస్తవ సంఘాలకు ముందు వెనుకల ఆవరించిన వాడు పరిశుద్ధాత్మ - ఈ పరిశుద్ధాత్ముడు లేనిదే సంఘానికి జీవం లేదు.  అది సంఘమే కాదు.

        ప్రియపాఠకులారా! నేడు విస్తరించియున్న దేవుని సంఘము అనగా దైవరాజ్యము, ఆయన సువార్త విస్తరించుటకు కారణభూతుడు పరిశుద్ధాత్ముడే, ఈ పరిశుద్దాత్మ ద్వారానే పూర్వకాలంలోని ఘండముల తోను పక్షి ఈకలతోను సిరాతోను, సరియైన కాగితము లేక అచ్చువేయు అవకాశంలేక అనగా ప్రింటింగ్‌ ప్రెస్సులు లేక యంత్రసాంకేతిక జ్ఞానమెరుగని ఆ దినములలో వలె గాక, నేడు పరిశుద్ధాత్మ క్రియ ద్వారా సకల సదుపాయాలు ఒనగూడి సకల విధమైననానావిధ అవకాశాలు ఏర్పడియున్న ఈ దినములలో సువార్త అతి త్వరిత గతిని వ్యాపించి-భూమి ఆకాశము సముద్ర మార్గాలలో ఈ సువార్త పరిశుద్దాత్మ ద్వారా ప్రయాణంచేసి దేశదేశాలలో మందిరాలు సత్యదేవునికి కట్టబడి, ఆరాధనలు జరుగుచున్నాయంటే అందుకు కారణం - కట్టబడిన క్రైస్తవ సంఘాలకు ముందు వెనుకలలో ఈ పరిశుద్ధాత్మ ఆవరించియుండబట్టియే సువార్త బహుగా బహుముఖ వ్యాప్తంగా విస్తరించి ప్రబలియున్నది.  అనిన విషయాన్ని మనము గ్రహంచాలి.

                కుమారులు కుమార్తెలు                        కీర్తన 144:12 నా కుమారులు ఎదిగిన మొక్కలు నాకుమార్తెలు నగరులకై చెక్కిన మూలకంబాలు.  కీర్తన 127:3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము(అనగా) స్త్రీ ఆయన ఇచ్చు బహుమానము.

        ప్రియ సంఘమా!  ఈ కీర్తన భాగములు రెండు విధములైన ఆశీర్వాదములు దేవుని చేత నరులకివ్వబడినట్లు తెలియుచున్నది.  యిందులో 1.స్వాస్థ్యము 2.బహుమానము మరి రెండు ముఖ్య విషయములేమిటంటే కుమారులు గర్భఫలములు రెండింటిని అనుగ్రహించువాడు దేవుడే! దేవుడనుగ్రహించు ఈ రెండు విధములైన సంపదలలో నరుని పాత్ర ఎంత వరకున్నదో కూడా మనము తెలుసుకోవలెను.  కుమారులు గాని, గర్భఫలముగాని రెండింటిని మొట్టమొదట దేవుడు' ఆ తర్వాత దైవ కృపను పొందిన నరుడు కారకులైయున్నారు.  అంటే దైవ చిత్తము ఆయన సంకల్పము ఆయన కృప లేనిదే గర్భ స్వాస్థ్యము గాని గర్భఫలముగాని లోకము పొందుట అసాధ్యము.  ఈ విషయాన్ని దేవుడు అబ్రహాము ద్వారా లోకానికి బైల్పరచియున్నట్లు ఆదికాండము ద్వారా చదువగలము.

        శారాముసలిది అబ్రహాము ముసలివాడు.  శారాగర్భము ధరించే వయస్సు లేదు. శార పటుత్వము లేదు.  సంతానోత్పత్తి పొందేటటువంటి గర్భఫలాధిక్యతలు లేవు.  శారా బిడ్డను కనే నాటికి ఆమె వయస్సు 90 సంవత్సరములు.  శారాకు గర్భము నిచ్చిన అబ్రహాము వయస్సు 100 సంవత్సరాలు.  మానవ ధర్మము శారీర పరిణామమును బట్టి మనము ఆలోచిస్తే గర్భములో శిశువును పుట్టించునటువంటి శారీర దారుఢ్యము అబ్రహామునకు లేదు.  గర్భమును మోసే స్థితి శారాకులేదు.

        మరియొక మాట 127 కీర్తన 4లో యవ్వన కాలమునందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు' అనుటలో కుమార్తెలమాటేమిటి? అంటే యౌవ్వన కాలమునందు పుట్టిన కుమారులకు ఎంత ప్రాధాన్యతవున్నది. ఎట్లంటే యవ్వనుడైన మోషే తన యౌవ్వనత్వాన్ని లోకానికి కాక దైవత్వానికి ధారపోశాడు.  యవ్వనుడైన యోసేపు తన ఆత్మీయ జీవితమును చావు గోతిలోనుండి పైకి లేపి రక్షించి లోక సంబంధియై ఫరో భార్యకు కాక ఐగుప్తు యొక్క సకల సంపదలకు వారసునిగా అనగా ఫరో యొక్క స్వాస్థ్యమునకు హక్కుదారునిగా జీవించి ఫో తీఫరు భార్య యొక్క దుషప్రియ తలంపును త్యజించి ఫరో రెండవ సింహాసనానికిని రెండవ రధానికిని వారసుడాయెను.

        ఈ విధముగా బలవంతుడైన దేవుని చేతిలో బాణములుగ వాడబడిన కుమారత్వము యొక్క వివరమిది.  యిందులో ఒకరు ఇశ్రాయేలు 12 గోత్రాలకు వారసుడాయెను.  రెండవ వాడు ఈ 12 గోత్రాల జనాభాను దైవ చిత్తానుసారముగా నడిపించుటకు యాజకుడును ప్రవక్త యునైయ్యాడు.  మరియు దేవుని యిల్లయిన ఇశ్రాయేలుకు వారసుడాయెను.  దేవుని ఇంటిమీద మోషే నమ్మకస్థుడాయెను.

        యిక కుమార్తెల విషయము తీసికొంటే యెప్తా కన్న కుమార్తె యెప్తాకు దేవుడిచ్చిన బహుమానము. ఆయన నగరుకు లోక రీత్యా మలచబడిన, దైవత్వమునకు ఆయన సన్నిధికిని ఆయనలో జీవించుటకు ఆయన సమర్పించుకున్న మూల స్థంభము యెప్తాకుమార్తె' న్యాయాధి 11:36 తండ్రి చిత్తాన్ని దైవ సంకల్పాన్ని నెరవేర్చింది, అలాగే న్యాయాధి 4:4-5 దెబోరా ఈమె ప్రవక్తి.

        కనుక సత్క్రైస్తవ కుటుంబములో దేవుడు అనుగ్రహించు సంతానములలో ' మంచిచెడు'ఫలములు ఇట్లున్నవి.  అందులకే బాలుడు లేక బాలిక నడువవలసిన త్రోవను వారికి చూపుము.  వారు పెద్ద వారైనపుడు దాని నండి తొలగిపోడు. ' అనిన సిద్దాంతాన్ని బట్టి క్రైస్తవ మర్యాదలు క్రైస్తవ ఆచారములో దైవ చట్టరీత్యా కుమార్తె పుట్టిన పండుగ జరుపుకొను మన సోదరి గృహములో మనము కూడుకొనుట కాదు.  కాని, ' దైవత్వములో దైవ మార్గములో దైవ చిత్త ప్రకారము బిడ్డల భవిష్యత్తును గూర్చిన ప్రణాళికను ఈ విధమైన పుట్టిన పండుగ కార్యక్రమముతో సంఘ సహవాసము, వేద పారాయణము వేద బోధ, ప్రార్థన వగైరా కార్య క్రమములతో పుట్టిన పండుగను జరుపుకొంటున్న సోదరి యొక్క కుటుంబమెంత ధన్యకరమైనదని మనము తెలిసికోవలసియున్నది.

         దేవుని స్తుతించెదవరు?                

        ప్రియ పాఠకులారా!    ఈ ప్రశ్నకు జవాబు కీర్త 148:1-4 లో చదువగలము. ''ఆయన దూతలు ఆకాశనివాసులు సూర్యచంద్రులు, కాంతిగల నక్షత్రాలు, పరమాకాశము, ఆకాశము పైనున్న జలములు ఆయనను స్తుతించుచున్నట్లుగ మనము ఈ కీర్తన భాగంలో చదువగలము.

        ప్రియ పాఠకులారా!    మానవ నిమిత్తము దేవుడేర్పరచిన ఈ సృష్టి దేవుని మహిమ పరచుచు ఆయనను స్తుతించి ఘనపరచుచున్నది.  అయితే వీటి యొక్క ఫలాన్నిఅనుభవిస్తున్న నరుడు తనకు సకల విదములైన వనరులను అనుగ్రహించి నరుని ఇహలోక జీవితమునకు భూమి మీద సకలమును సమకూర్చిన దేవుని నరుడు స్తుతిస్తున్నాడా? అనిన ప్రశ్న ఈనాడు మనకు మిగిలియున్నది.  వాస్తవానికి సృష్టికంటె కూడా దేవున స్తుతించుటన్నది నరునికే బాధ్యతయైయున్నట్లు మనము గ్రహించవలసియున్నది.

        ప్రియ పాఠకులారా!    నేటి నరలోకంలో ఈ బాధ్యతను గుర్తెరింగి సృష్టికర్తను యదార్ధంగా అనగా ఆత్మతోను వివేకంతోను విశ్వాసంతోను వెదకి స్తుతించేటటువంటి స్థితిలో నరుడు వున్నట్లయితే నేటి ఆధునిక ప్రపంచంలో తుపానులు వడగండ్లు సుడిగాలులు భూకంపాలు తెగుళ్ళు నాశనాలు హఠాన్మరణాలు దోపిడీలు హత్యలు మానభంగాలు అరాచకాలు ఉగ్రవాదత్వము, మాన ఊహా కందని రోగాలు కలుగవు.  ఇవన్నియు భూమి మీద క్రియజరిగస్తున్నాయంటే అందుకు కారణము - నరుడు దేేవుని స్తుతించక పోవుటయే!  ఇందును గూర్చి దైవ వాక్యము మార్కు 7:6లో - ఈ ప్రజలు పెదవులతో దేవుని ఘనపరచెదరుగాని వారి హృదయము దూరముగా వున్నది.  వారు, మానవులు కల్పించిన పద్దతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు.'' అనుటలో యదార్థంగా దేవుని స్తుతించేవారు ఆరాధించేవారు లేరనియే తెలియుచున్నది.  అందును బట్టియే పై ఉదహరించిన కష్టనష్టాలు తెగుళ్ళు అన్నియు భూగ్రహానికే పరిమితమై యున్నది గాని, ఆకాశమునకు గాని ఆకాశంలో వున్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాదులకు ఇట్టి దుర్ధశ కలుగలేదని మనకు రూఢిిగ తెలియగలదు.

        ప్రియ పాఠకులారా!    స్తుతించుటన్నది నేటి నాగరిక యుగంలో మంత్రులను జమీందారులను భూస్వాములను ప్రభుత్వాధికార్లలోను, సంఘపెద్దలలోను ఇంకనూ రాజకీయ నాయకులలోను ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు వగైరాలలో ఈ క్రియ పరిమితమైయున్నదే గాని, అదృశ్యంలో ఉండే దేవునిస్తుతించే వారు అరుదైనట్లుగ తెలియుచున్నది.  ఎందుకంటే మనుష్యులు తమ యొక్క పండుగను పబ్బాలను అవసరతలను స్వకార్యములను నెరవేర్చుకొనుటకు లోకసంబంధులైన లోకనాధులైన నరులను తెగపొగుడుచు వర్ణించుచు వారి యొక్క గుణగణాలను వారియొక్క ఘనకార్యాలను వారి యొక్క పూర్వీకులు బ్రతికిన బ్రతుకులను వారి యొక్క నిజస్థితిని గూర్చి తెగపొగిడి వారేదేవుళ్ళు అని వారిలోనే దేవుడున్నాడని భ్రమపెట్టి వారిని దైవోగ్రతకు గురిజేయుటయే గాక తాము కూడా అట్టి దైవోగ్రతకు గురియై ఉభయ భ్రష్టత్వం పొందెదమన్న పరిస్థితిని మరిచిపోవుచున్నారు.  ఇది నేటి మానవుని యొక్క నిజస్థితియైయున్నది.

        అయితే దేవుని యొక్క చిత్తమెట్లున్నదంటే మానవుల ద్వారా స్తుతించబడి తాను మహిమ పొందాలని ఆయన కోరు కుంటున్నాడు.  అయితే మానవలోకము ఇందుకు విరుద్దంగా వుండి సృష్టికర్తకు బదులుగా సృష్టిని సృష్టిలోని సృష్టములను మహిమపరచే హీనస్థితికి దిగ జారుచున్నది.  ప్రియ పాఠకులారా!  మనము స్తుతించవలసిన దెవరిని? అనిన జ్ఞానము నేటి తరములో కూడ లేకపోవుటన్నది శోచనీయము.  ఈనాడు కూడా దైవ సృష్టియైన ఎద్దును కోతిని ఏనుగును పులిని పందిని గోవును చెట్టును చచ్చిన వాని సమాధిని నరులు స్తుతించి ఆరాధిస్తున్నారేగాని సజీవుడైన దేవుడెవరో సజీవుడైన దేవుని యొక్క సత్య రూపమేదో ఆయననే విధంగా స్తుతించి ఆరాధించవలనో కూడా ఎరుగని స్థితిలో నరుడు వున్నాడు.  కాబట్టి దేవుడు ఆయన దూతల ద్వారా యెష 6:3లో సైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్దుడు పరిశుద్దుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది.  అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములపై ఆయన ఆసీనుడై యున్నట్లు వ్రాయబడియున్నది.  కనుక దేవుని యొక్క ప్రస్తుత స్థితి ఆరాధన అన్నది దేవ దూతలలో పరిమితమై యున్నట్లు మనకు తెలియుచున్నది.

        దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురుచూచునది ఎవరు? రోమా 8:19లో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టివిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది'', అనుటలో నేటి సృష్టికిని విస్తరిస్తున్న జనాభాను పోషించుట వారికి కావలసిన వాతావరణమును సారవంతమైన భూమిని ఇచ్చుటకు సృష్టి ప్రతికూలమై దైవత్వం కొరకు ఎదురుచూచుచు, దేవుడు కల్గించబోవు నాశనమునకు గురిగాకుండ జన సందోహము మూలమున తనకున్న వేదన బాధ వాతావరణ కలుషితము, నరుని యొక్క నిస్సారతను బట్టి అనేక వేదనలకు గురియై దైవత్వం చేత సర్వనరకోటి నిర్మూలించబడి, తాను నూతన త్వం పొందాలని అట్లు నూతనత్వం పొందాలంటే తనను సృష్టించిన ప్రభువు ప్రత్యక్షం కావాలని కోరుకుంటు దైవ ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురుచూస్తున్నట్లు తెలియుచున్నది.

              యేసు ఎవరికి రక్షకుడు?                

        ప్రియ పాఠకులారా!    ఈ సందర్బములో మొదటి తిమోతి 4:10 మనుష్యులందరికి రక్షకుడును మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడైన జీవముగల దేవునియందు మనము నిరీక్షణనుంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాడుబడుచున్నాము'', కనుక ఏసు ప్రభువు మనుష్యులందరికిని రక్షకుడును విశ్వాసులకు  మరెక్కువ రక్షకుడుగా వున్నట్లును మనము గ్రహించాలి.

        చివరిగా ఒక మాట

ప్రభువునందు సహోదరీ సహోదరులారా!  

  1. ఈ పుస్తకమును చదువుచున్న మీకు ఏమైన అనుమానాలు ఉన్నట్లయితే,
  2. ఈ పుస్తకములోని సారాంశములో లోపమును మీరు గ్రహించినట్లయితే,
  3. దీనిలో విభాగములు పూర్తిగా వివరించనట్లు మీరు గ్రహించినట్లయితే,
  4. పవిత్ర గ్రంథమునకు వ్యతిరేకమైన అంశములు మీరు ఇందులో చూచినట్లయితే,
  5. మీ హృదయము నుండి ఈ అంశమును కలిపిన మరింత బాగుండునని ఆలోచన వచ్చినట్లయితే, ''దయవుంచి నాకు వ్రాయండి.'' (email: FaithScope@thamu.com)

        దీని వలన, మేము మీ యొక్క సహాయ సహకారాల వల్ల తరువాత ముద్రణలో ఈ పుస్తకము అన్ని కోణాలలో అందముగా తీర్చిదిద్ది అందించగలము. ఆమేన్‌.

శేఖర్ రెడ్డి గారు వ్రాసిన పుస్తకములు: 

  1. ఏడు అను సంఖ్యలోని సర్వసంపూర్ణత  
  2. లోకానికి బైబిల్‌ సవాల్‌ - పార్ట్‌ 1-5
  3. మరణము తరువాత  
  4. నా ప్రభువు తల్లి
  5. ఏదెనులోని దైవప్రణాళిక  
  6. సున్నతి - బాప్తిస్మము  
  7. దేవుని దూతలు - వారి పరిచర్యలు
  8. జేసునాథుని దివ్య వాక్కులు  
  9. ప్రవక్తల ప్రవచనములు - పరమార్థములు  
  10. ప్రకటన గ్రంథ రహస్యములు ఇప్పుడు మీ చేతిలో
  11. పరమగీతము
  12. సాటి సహాయిని

వీటిని మీరు www.FaithScope.com ద్వారా ఉచితముగా పొంద వచ్చును.